Activities calendar

19 January 2017

22:04 - January 19, 2017
21:54 - January 19, 2017

హైదరాబాద్ : అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ సర్కారు ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీలో కూలంకషంగా చర్చించి.. సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇస్తామని మంత్రి తెలిపారు. చేపలు, గొర్రెల పెంకందారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 

 

21:52 - January 19, 2017

హైదరాబాద్ : అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌ కార్యాలయాలు నిర్మించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే డిజైన్లు ఖరారు చేసి టెండర్లు పిలవాలన్న ఆయన.. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ప్రజలు, అధికారులకు సౌకర్యంగా ఉండేలా అన్ని వసతులతో కార్యాలయాలు నిర్మించాలని కేసీఆర్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల నిర్మాణాలపై ఆయన ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, సీఎస్ ఎన్పీ సింగ్, సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు హాజరయ్యారు. 

 

రెండో వన్డేలో భారత్ విజయం..

కటక్ వన్డే : భారత్ ఇంగ్లంగ్ మధ్య జరిగిన రెండో వన్డే లో భారత్ విజయం సాధించింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై గెలుపొందింది. మూడు వన్డే సీరీస్ లో భారత్ 2..0 ఆధిక్యంలో ఉంది. 

 

ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

కటక్ వన్డే : భారత్ ఇంగ్లంగ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే లో ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 354 పరుగుల వద్ద మోర్గాన్ (102) ఔట్ అయ్యాడు. 

21:43 - January 19, 2017

పాత పాలమూర్ల అభివృద్ధి పడావు...హామీలిచ్చి నీటికి రెండో తద్దినం, ఆంధ్ర రాష్ట్ర జనానికి చంద్రన్న కానుక... కరెంటి ఛార్జీల పెంపుతోని వెన్నెల, పన్నీరును పగవట్టిన సోషల్ మీడియా.... తమిళనాడులో జల్లికట్టు, రెండు పెళ్లిళ్లు.. మూడు పుస్తెలతాళ్లు.... కడప మాజీ ఎమ్మెల్యే కొడుకు కాపురం, సిద్దిపేట రోడ్ల మీద ట్రాఫిక్ వాలంటర్లు... నిబంధనలు తప్పితే పోలీసు అయ్యే చాన్స్, వేటగాళ్ల ఉచ్చులవడ్ద చిరుతపులి....ఆల్సంగొచ్చిసూచిన అటవీ అధికారులు, కుక్కపిల్లను కిడ్నాప్ చేసిన కోతి... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...
 

21:29 - January 19, 2017

నెల్లూరు ప్రజావైద్యశాల డా.బ్రహ్మారెడ్డితో 10టివి సీవోవో ఎస్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. 'ఆర్యోగం..ఎమర్జెన్సీ' పై చర్చించారు. ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని విస్మరిస్తున్నాయన్నారు. స్టంట్ల ధరలను వినియోగదారుడు, ప్రభుత్వం నిర్ణయించలేదన్నారు. రక్త నాళాలు సన్నబడకుండా ఏం చేయాలని డాక్టర్లు చెప్పరు.. కానీ రక్తనాళాలు సన్నబడ్డాక వైద్యం చేస్తారు. సమాజం ఎంత దౌర్భాగ్యంగా మారితే.. కార్పొరేట్ వైద్యం అంత దౌర్భాగ్యంగా మారుతుందని చెప్పారు.  40వేల స్టంట్ ను కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షన్నరకు వేస్తున్నారని తెలిపారు. డాక్టర్లు సింపుల్ విషయాలు చెప్పకుండా డబ్బులు ఖర్చు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఇంజక్షన్ వేయడంలో 50 మెళకువలుంటాయని చెప్పారు. తల్లికి బిడ్డపై ప్రేమ ఉండాలి, బిడ్డకు పాలు ఇవ్వాలనే కోరిక ఉంటే.. తల్లికి పాలు పడుతాయని తెలిపారు. ప్రజా సంక్షేమంపై పెట్టే ఖర్చును ప్రభుత్వం అనవసరపు ఖర్చుగా భావిస్తుందని పేర్కొన్నారు. వైద్యాన్ని ప్రభుత్వం కార్పొరేట్ వైద్యశాలలకు వదిలేస్తున్నారు. ఇన్స్యూరెన్స్ కంపెనీ నష్టానికి పని చేయదు.. లాభానికి పని చేస్తోంది. రోగం నయం చేయడం కన్న రోగ నిరోధం మిన్నా అని అన్నారు. ప్రతి పౌరుడికి ప్రథమ చికిత్స చేయడం రావాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు డాక్టర్లకు టార్గెట్లు పెడుతున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

కటక్ వన్డే : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. 304 పరుగుల వద్ద వోక్స్ (5) ఔట్ అయ్యాడు. 

 

ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

కటక్ వన్డే : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 299 పరుగుల వద్ద మొయిన్ అలీ (55) ఔట్ అయ్యాడు. 

 

21:05 - January 19, 2017

విశాఖ : అతనో సబ్‌ఇన్‌స్పెక్టర్‌... అతనికి తెలిసిన ఓ అమ్మాయి కన్పించడం లేదు..వెతకాల్సింది పోయి ఆమె ఫ్రెండ్‌ను వెతకడం మొదలుపెట్టాడు.. ఆమె ఫోన్ చేసి ..ఆ తర్వాత అడ్రస్ తెలుసుకుని అమ్మాయి చనిపోయిందని..కేసు పెట్టిస్తానంటూ బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు.. చివరకు ఆ పోలీసు కటకటాలపాలయ్యాడు...
విశాఖలో పోలీస్‌ లైంగిక వేధింపులు కలకలం
విశాఖలోని కంచరపాలెంలోని కప్పరాడ రాంజీ ఎస్టేట్‌లో ఓ యువతి నివాసముంటుంది...స్థానిక డాబా గార్డెన్స్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తోంది...అయితే ఈమె స్నేహితురాలు వారం రోజులుగా కన్పించడం లేదు...ఆ విషయంలో ఆమె కలవరపడుతుండగా   ఈ కేసులో విజయవాడలో పనిచేస్తున్న ఎస్పీఎఫ్‌ రిజర్వ్‌ ఎస్‌ఐ జీవీఎన్‌ ప్రసాద్‌ ఎంట్రీ ఇచ్చాడు...ఆ యువతి చనిపోయింది...అందుకు కారణం నువ్వే...నీవే చంపేశావంటూ బెదిరింపులకు దిగాడు...
బెదిరింపులకు దిగిన ఎస్సై 
అంతే అప్పటివరకు బెదిరింపులకు దిగిన ఎస్సై ప్రసాద్ అర్ధరాత్రి సమయంలో నేరుగా యువతి ఇంటికి చేరాడు..వస్తూనే కేసు పెడతానని...జైలుకు పంపిస్తానంటూ హెచ్చరిస్తూనే ప్రసాద్‌ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు...భయంతో ఆమె ఆ దుర్మార్గుడి నుంచి బయటపడింది...అయినా మర్నాడు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు..చివరకు ఆ యువతి స్థానికుల సాయంతో కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది...వెంటనే పోలీసులు స్పందించి రిజర్వ్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వేధింపుల కేసు నమోదు చేసి పోలీసులు ప్రసాద్‌ను అరెస్టు చేశారు... వివరాలు ఆరా తీస్తున్న పోలీసులు ప్రసాద్‌ గురించి తెలుసుకుంటున్నారు.

 

ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం అమలు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. నిర్ణీత సమయంలో పథకాన్ని పూర్తి చేసి పల్లెలను తాగునీటి సమస్య నుంచి విముక్తి చేస్తామని చెప్పారు. 

20:55 - January 19, 2017

విజయవాడ : జగన్ అజ్ఞాని అని... చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా వైసీపీ అధినేత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై బురద జల్లే ప్రయత్నం జగన్‌ చేస్తున్నారని దేవినేని ఆ్రగహం వ్యక్తం చేశారు. జగన్‌ మానసిక స్థితి సరిగ్గాలేక ఆరోపణలు చేస్తున్నారని దేవినేని చెప్పారు. 

 

స్వైన్ ఫ్లూపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష

హైదరాబాద్ : స్వైన్ ఫ్లూపై అధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ అదుపులోనే ఉందని తెలిపారు. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. 

 

20:48 - January 19, 2017

దావోస్ : దావోస్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబు బిజిబిజీగా గడుపుతున్నారు. పలువురు కంపెనీల అధిపతులతో భేటీ అవుతూ రాష్ట్రంలోపెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు. నాల్గవరోజు పర్యటనలో భాగంగా జపాన్‌కు చెందిన కుమియుమి సంస్థ అధిపతితో చర్చలు జరిపారు. సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని కుమియుమి సంస్థకు సూచించారు. రాష్ట్రంలో టెక్నాలజీ సహాయంతో పాలన సాగిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఫైళ్లను డిజిటలైజ్ చేసి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చామని.. రియల్ టైమ్ మేనేజ్‌మెంట్‌తో ఎప్పటికప్పడు తాజా సమాచారాన్ని అందిస్తామన్నారు.

 

20:41 - January 19, 2017
20:40 - January 19, 2017

అమెరికా : అగ్రరాజ్యపు అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా 45వ అధ్యక్షుడిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం, తొలిసారిగా వైట్‌ హౌస్‌లోకి అధ్యక్షహోదాలో కాలు మోపనున్నారు ట్రంప్‌. అమెరికా సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ట్రంప్‌ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 
అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అందరి అంచనాలనూ తల్లకిందులు చేస్తూ... విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం.. శ్వేత సౌధంలోకి అడుగుపెట్టనున్నారు. బరాక్‌ ఒబామా పదవీ కాలం ముగిసిన ఉత్తర క్షణమే ట్రంప్‌ అధ్యక్ష పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు. 
ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్న అమెరికన్‌ ప్రముఖులు
ట్రంప్‌ పదవీస్వీకార ప్రమాణోత్సవానికి డెమొక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌, మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ డబ్ల్యూ బుష్‌, జిమ్మీ కార్డర్‌లతో పాటు భారతీయ అమెరికన్లు సహా వేలాది మంది హాజరుకానున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ట్రంప్ ఎన్నికల నినాదాన్ని ప్రమాణ స్వీకారోత్సవానికి థీమ్‌గా నిర్ణయించారు. వాషింగ్టన్ డీసీలో జరిగే ఈ కార్యక్రమానికి కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయడంతో పాటు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ఆర్లింగ్టన్ నేషనల్ సిమెటరీ వద్ద ట్రంప్ దివంగత సైనికులకు నివాళి అర్పించడంతో కార్యక్రమాలు మొదలవుతాయి. నేషనల్ మాల్ వద్ద ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. యువ కొరియోగ్రాఫర్ సురేశ్ ముకుంద్ శిక్షణలో తర్ఫీదైన 30 మంది కళాకారులు, తమ ప్రదర్శనతో అలరించనున్నారు. 
ప్రమాణం చేయించనున్న అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
మధ్యాహ్నం 12గంటలకు ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం అధ్యక్షుడి హోదాలో ట్రంప్‌ తొలిసారి ప్రసంగిస్తారు. ఉపాధ్యక్షుడిగా మైక్‌ పెన్స్‌ కూడా ఈ కార్యక్రమంలోనే ప్రమాణం చేస్తారు.  కాపిటల్‌ భవనంలోని స్టాచ్యువరీ హాల్‌లో అధికార విందుకు ట్రంప్‌ హజరవుతారు. ఆ తర్వాత ట్రంప్‌ కోసం ప్రత్యేకంగా అధునాతన హంగులతో తయారు చేసిన లీమోసైన్‌ కారును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పెన్సిల్వేనియా ఎవెన్యూ మార్గంలో అధ్యక్ష ప్రమాణ స్వీకార కవాతు శ్వేతసౌధానికి చేరుకుంటుంది. ఈ కవాతు మార్గంలో 3వేల మంది పోలీసులు, 7వేల మంది భద్రతా బలగాలు మోహరిస్తాయి. 
ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు నిరసనకారులు వ్యూహాలు 
దేశాన్ని పునర్నిర్మిస్తామనని అధ్యక్షుడిగా ఎన్నికైన మరుక్షణమే ట్రంప్‌ ప్రకటించారు. మరోవైపు ట్రంప్‌ ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసేందుకు నిరసనకారులు వ్యూహాలు రచిస్తున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా మహిళలు భారీ ర్యాలీ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. 

 

20:29 - January 19, 2017
20:27 - January 19, 2017

అనంతపురం : కార్లపరిశ్రమ పెడతామంటే.. పిల్లలకు ఉద్యోగాలొస్తాయని ఆశపడ్డారు. జీవనాధరమైన పంటభూములను అప్పగించారు. కాని సంవత్సరాలు గడుస్తున్నా ఫ్యాక్టరీ రాకపోగా..కొత్తగా ఇంకా భూములు కావాలంటూ ఊళ్లోకి వచ్చిన అధికారులపై రైతులు తిరగబడ్డారు. తమ భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం అమ్మవారుపల్లి లో రైతన్నల గోడుపై టెన్‌టీవీ ఫోకస్‌ ..
అనంత అన్నదాతలు ఆక్రోశం
జీవనాధరామైన భూములను లాక్కుంటున్నారని అనంత అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. భూ సమీకరణకు వచ్చిన అధికారులపై భగ్గున మండిపడ్డారు. కార్లపరిశ్రమ పెట్టి.. ఉపాధి కల్పిస్తామని చెప్పిన మాటలు విని తమ బతుకు దెరువును కూడా కాదని భూములు అప్పగిస్తే.. సంవత్సరాలు గడుస్తున్నా ఫ్యాక్టరీ  పెట్టలేదని అనంతపురం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్లప్యాక్టరీ రాకపోగా.. కొత్తగా మళ్ళీ భూములు కావాలంటూ వచ్చిన రెవెన్యూ అధికారులపై పెనుగొండమండలం అమ్మవారుపల్లి జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నభూమికాస్తా మీరు తీసుకుంటే మే ఎట్టా బతకాలని ఆవేదన చెందుతున్నారు. 
రైతులు ఆగ్రహం 
బలవంతంగానైనా భూములు ఇవ్వాలని అధికారులు బెదిరించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా భూమలు లాక్కుంటే చావుతప్ప మరో మార్గం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. అధికారుల తీరుపై అటు రైతు సంఘం నాయకులు కూడా మండిపడుతున్నారు. భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు
బతుకుదెరువే లేకుండా పోయింది... 
ఉద్యోగాలు కల్పిస్తామన్న సర్కారు మాటలు నమ్మి భూములిస్తే.. ఇప్పుడు బతుకుదెరువే లేకుండా పోయిందిని అమ్మవారుపల్లి రైతులు ఆవేదన చెందుతున్నారు. సర్కార్‌ బలవంతం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అనంత అన్నదాతలు తేల్చి చెబుతున్నారు. 

 

20:05 - January 19, 2017

తూర్పుగోదావరి : రాజమండ్రిలో 10టివి క్యాలెండర్‌ను మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు ఆవిష్కరించారు. ప్రజల పక్షాన పనిచేస్తున్న10టివికి ఒక ప్రత్యేక స్థానం ఉందని ఆయన అన్నారు. ప్రజలకు మరింత చేరువలో ఉంటూ మరిన్ని మంచి వార్తలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. 

 

20:00 - January 19, 2017

కడప : జిల్లాలో దారుణం జరిగింది. టీవీ రిమోట్‌ ఓ విద్యార్ధిని ప్రాణం తీసింది. సీరియళ్ల ప్రభావంతో బాలిక తనువు చాలించింది. టీవీ రిమోట్‌ కోసం అక్కతో గొడవ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వేకోడూరు మండలం తంబిళ్లవారిపల్లెకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్ధిని శ్రీలక్ష్మీ టీవీ రిమోటో కోసం అక్కతో గొడవ పడింది. అక్క టీవీ రిమోట్‌ ఇవ్వకపోవడంతో మనస్తాపంతో శ్రీలక్ష్మీ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమ్తితం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పరిస్థితి విషమించి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

కటక్ వన్డే : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది.   
173 పరుగుల వద్ద స్టోక్స్ (1) ఔట్ అయ్యాడు. 

 

ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు

గుంటూరు : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను వైసీపీ కార్యకర్తలు అడ్డకున్నారు. వెలగపూడి సచివాలయానికి వెళుతుండగా బైకులపై దూసుకొచ్చిన వైసీపీ కార్యకర్తలు కారును అడ్డుకున్నారు. కారు అద్దాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వైసీపీ ఆందోళనతో అఖిలప్రియ సచివాలయానికి వెళ్లకుండానే వెనుదిరిగారు. గన్‌మెన్‌ల సహాయంతో బయటపడ్డానని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. 

19:24 - January 19, 2017

గుంటూరు : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను వైసీపీ కార్యకర్తలు అడ్డకున్నారు. వెలగపూడి సచివాలయానికి వెళుతుండగా బైకులపై దూసుకొచ్చిన వైసీపీ కార్యకర్తలు కారును అడ్డుకున్నారు. కారు అద్దాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వైసీపీ ఆందోళనతో అఖిలప్రియ సచివాలయానికి వెళ్లకుండానే వెనుదిరిగారు. గన్‌మెన్‌ల సహాయంతో బయటపడ్డానని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:19 - January 19, 2017

కరీంనగర్ : జిల్లాలో టీఆర్‌ఎస్ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జిల్లాలోని ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. దీంతో కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన విభేదాలపై  ప్రత్యేక కథనం..  
ఎమ్మెల్యే రమేష్ బాబుపై బోడిగె శోభ తీవ్ర అసహనం
కరీంనగర్‌ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జిల్లాల విభజనతో ఈ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు తీరు పట్ల చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే బోడిగె శోభ తీవ్రఅసహనం వ్యక్తంచేస్తున్నారు.  బోయినపల్లి మండలం ఉప మార్కెట్ యార్డు నిర్మాణం ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణమని కార్యకర్తలు భావిస్తున్నారు.  బోయినపల్లి ఉప మార్కెట్ యార్డు.. వేములవాడ మార్కెట్ యార్డు పరిధిలోకి వచ్చినప్పటికి  నియోజకవర్గం మాత్రం చోప్పదండి లో ఉంది. దీంతో యార్డుల్లో పాలనపరమైన అంశాల్లో ఒకరి మీద ఒకరు పైచేయి సాధించడంలో మునిగిపోయారు. 
నా విషయాల్లో రమేష్‌బాబు అడ్డుతగులున్నారని శోభ ఆరోపణ
బోయినపల్లి మండల కేంద్రంలో కొంత కాలంగా వ్యవసాయ మర్కెట్ నిర్మాణం, రైతులకు తగిన వసతులను కల్పించడానికి ఎమ్మెల్యే శోభ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నానికి ఎమ్మెల్యే రమేష్ బాబు ఆటంకాలు కలిగిస్తున్నారనేది శోభ  ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మార్కెట్ యార్డు నిర్మాణం వద్దంటు రమేష్ బాబు ప్రభుత్వ పెద్దలకు లిఖిత పూర్వకంగా లేఖ రాయడం, మార్కెట్ కు సంబందించిన పాలనపరమైన అంశాలు, గోదాంల ప్రారంభ విషయంలోనూ రమేష్‌బాబు అడ్డుతగులుతున్నారని ఆమె చెబుతున్నారు. 
అయోమయంలో కార్యకర్తలు 
గతంలో వేములవాడ మార్కెట్ కమిటి డైరెక్టర్ల నియామాకాలకు సంబంధించి ఇద్దరి మధ్య విబేధాలు రావడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. నేతల మధ్య విభేదాలతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఇకనైనా పార్టీ అధిష్టానం ఈ విషయంలో కలుగుజేసుకుని ఇద్దరి మధ్య విభేదాలకు పుల్‌స్టాప్ పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. 

 

19:09 - January 19, 2017

వనపర్తి : తెలంగాణలో తొలి ఫిషరీస్‌ కాలేజీ ఏర్పాటుదిశగా అడుగులుపడుతున్నాయి... వచ్చే విద్యాసంవత్సరంనుంచి తరగతులు మొదలయ్యేలా వేగంగా పనులు సాగుతున్నాయి... వనపర్తి జిల్లాలో 25మంది విద్యార్థులతో తొలిబ్యాచ్‌ ప్రారంభం కాబోతోంది.. 
పెబ్బేరులో ప్రారంభం కానున్న కాలేజీ
మత్స్య సంపద అభివృద్ధిపై ప్రత్యేకదృష్టిపెట్టిన తెలంగాణ ప్రభుత్వం... ప్రణాళికప్రకారం ముందుకుసాగుతోంది.. ఫిషరీస్‌ కళాశాల ఏర్పాటుద్వారా ఈ రంగంలో పరిశోధనలు పెంచడందిశగా చర్యలుచేపట్టింది.. తెలంగాణలో ముందుగా రెండు ఫిషరీస్‌ కాలేజీల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.. ఇందులో మొదటిది వనపర్తి జిల్లా పెబ్బేరులో ప్రారంభంకాబోతోంది.. వచ్చే విద్యాసంవత్సరంలో తరగతులు మొదలయ్యేలా అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. జూరాల క్వార్టర్స్ లో తాత్కాలికంగా తరగతులు నిర్వహించనున్నారు.. 25మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్‌ స్టార్ట్‌ చేసేదిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి... 
మహాభూపాల సముద్రం సమీపాన కళాశాల ఏర్పాటు
మహాభూపాల సముద్రం సమీపాన కాలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. చేపల్ని పెంచడం... వాటికిసోకే వ్యాధులు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలు... చేపలు వేగంగా... ఆరోగ్యవంతంగా ఏదిగేందుకు పరిశోధనలు జరిపేలా సౌకర్యాలు కల్పించనుంది.. కాలేజీకోసం 86కోట్ల రూపాయల్ని కేటాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.. మొదటిఏడాది 33కోట్ల రూపాయల్ని విడుదలచేయనుంది.. అలాగే రెండో సంవత్సరం 30కోట్ల 63లక్షలు... మూడో ఏడాది 7కోట్లు... నాలుగో ఏడాది 7కోట్ల 46లక్షలు... ఐదో సంవత్సరం 8కోట్ల 21లక్షల రూపాయల్ని కాలేజీ నిర్మాణం... నిర్వహణకోసం మంజూరుచేయనుంది.. కళాశాల నిర్మాణంకోసం ఇప్పటికే 25ఎకరాల స్థలాన్ని కేటాయించింది.. వనపర్తి, జోగులాంబ జిల్లాలకు అనువుగా ఉండేలా ఈ కాలేజ్‌ను ఏర్పాటుచేయబోతున్నారు. అనుకున్న ప్రకారం కాలేజీ మొదలయ్యేలా అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.. పనుల్ని వేగంగా పూర్తిచేస్తున్నారు.

 

19:04 - January 19, 2017

వరంగల్ : ఏళ్లు గడుస్తున్నాయి.. ప్రభుత్వాలు మారుతున్నాయి.. అయినా అన్నదాతల తలరాత మాత్రం మారడంలేదు.. అవే సమస్యలు.. అవే కష్టాలు ఈ యాసంగిలోనూ స్వాగతం పలికాయి.. అన్నీ ముందే సిద్ధంచేశామన్న ప్రభుత్వ మాటలు నీటి మూటలే అయ్యాయి.. పంట రుణాలు అందక, పంట బీమాపై అవగాహన లేక సతమతమవుతున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోతూ రబీ పంటకు సిద్ధమవుతున్న వరంగల్‌ జిల్లా రైతులపై ప్రత్యేక కథనం. 
నత్తనడకన పంట రుణాల మంజూరు 
వరంగల్‌ జిల్లాలో పంట రుణాల మంజూరు ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నచందంగా ఉంది. అన్నదాతల పంట రుణాలపై ఘనంగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో అరకొరగా.. మరికొన్ని ప్రాంతాల్లో అసలే రుణాలు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరంగల్ రూరల్ జిల్లాకు 949 కోట్ల రూపాయల రుణాలు అవసరముంటే కేవలం 424 కోట్ల రూపాయాలు మాత్రమే రైతులకు మంజురయ్యాయి. ఇక వరంగల్ అర్భన్ జిల్లాలో 727 కోట్ల రూపాయాల రుణాలు రైతులకు ఇవ్వాల్సి వుండగా 328 కోట్లు మాత్రమే అందించారు. 50 శాతం రైతులకు రుణాలు మంజురే కాలేదు. మరోవైపు గతంలో తీసుకున్న రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకు అధికారులు కొత్త రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. రబీ పంటకోసం రుణాలు ఇచ్చేందుకు తమను పట్టించుకొనే నాథుడే కరువయ్యాడని అన్నదాతలు వాపోతున్నారు. 
వడ్డీ వ్యాపారుల ధనదాహానికి రైతుల విలవిల
ప్రభుత్వమిచ్చే రుణాల కోసం ఆగితే రబీ పంట సమయం కూడ ముగిసిపోతుంది. దీంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకతప్పడం లేదు. యాసంగి సాగుకోసం వడ్డీ వ్యాపారుల నిలువుదోపిడీ చేస్తున్నా మౌనంగా భరిస్తున్నారు. పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలు రైతన్న గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. 
రైతన్నలు ఆవేదన 
ఇక పంట బీమాపై ఏ మాత్రం తమకు అవగాహన లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలతో పంట నష్టపోతున్నా..అప్పుల ఊబిలో కూరుకుపోతూ వ్యవసాయం చేయాల్సి వస్తోందంటున్నారు. వరినాట్లు వేసేందుకు కూలీ ధరలు రెండింతలు పెరిగిపోయాయని.. ఇంతా చేస్తే తమకు మిగిలేది ఏమి లేదంటున్నారు. మరోవైపు రబీ పంట సాగుకోసం రైతులను అన్ని రకాలు ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 
రైతులకు అవగహన కల్పించడంలో విఫలం 
ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన కార్యక్రమంపై రైతులకు అవగహన కల్పించడంలో వ్యవసాయాధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట రుణమాఫీతో పాటు బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

 

18:59 - January 19, 2017

హైదరాబాద్ : బీమారంగ కంపెనీల వాటాలను అమ్మే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ .. బషీర్‌బాగ్‌లోని యునైటెడ్‌ ఇండియా ఇన్స్యూరెన్స్‌ ఆఫీస్‌ దగ్గర ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.  ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను బలోపేతం చేయకుండా.. ప్రైవేట్‌పరం చేయడానికి ప్రయత్నించడం దారుణమని ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాజు అన్నారు. వాటాల అమ్మకాల నిర్ణయం వెంటనే ఉపసంహించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.    

 

18:57 - January 19, 2017

భూపాలపల్లి : గిరిజనులపై ప్రేమనటిస్తూనే .. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ద్రోహం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్ర లో భాగంగా భూపాలపల్లిజిల్లాలోని పలు గ్రామాల్లో ఆయన మాట్లాడారు. మహాజన ప్రాదయాత్ర ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికే అన్నారు. గిరిజనులకు భూములు దక్కకుండా కేసీఆర్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. బొగ్గుగని కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

 

18:53 - January 19, 2017

రంగారెడ్డి : పశు సంక్రాంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా పశుసంత కనుల పండువగా జరుగనుంది. జాతీయస్థాయి గేదెల జాతర ఘనంగా జరగనుంది.  దీనికోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.  
అన్ని రాష్ట్రాల పశువుల క్రయవిక్రయాలు
రంగారెడ్డి జిల్లా.. గండిపేట్‌ మండలం... నార్సింగి గ్రామంలో రేపటి నుంచి పశువుల జాతర పెద్దఎత్తున జరగనుంది. ఈ జాతరను పెద్దఅంగడి... పశు సంక్రాంతి అని కూడా అంటారు.. ఈ జాతరలో దాదాపు అన్ని రాష్ట్రాల గేదెల క్రయవిక్రయాలు జరుగుతాయి. రైతులు తమ దగ్గర ఉన్న ఆవులు, గేదెలు, ఎద్దులను ఇక్కడ విక్రయించడం.. వాటి స్థానంలో కొత్తవి కొనడం చేస్తుంటారు. ఇక్కడ పంట చేతికొచ్చిన ఆదాయంతో కొంతమంది కొత్త పశువులను కొంటారు. నష్టపోయిన రైతులు తమ నష్ట నివారణకు పశువులను విక్రయిస్తారు. 
పశువుల జాతర
కులికుతుబ్ షాహీ రాజుల కాలం నుంచి ప్రతి ఏటా సంక్రాంతి పండుగ అనంతరం ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.  ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి శుక్రవారం లేదా రెండో శుక్రవారం ఈ సంత జరుగుతుంది. తొలుత కులికుతుబ్ షాహీ రాజులు.. తర్వాత అసన్ జాహీలు, నిజాం ప్రభువులు ఈ ఆచారాన్ని కొనసాగించారు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంతను నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా దీనికోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సంతలో గేదెలు..ఆవులు..ఎద్దుల ప్రదర్శన
పదిహేను రాష్ట్రాలకు  చెందిన రైతులు, డైయిరి ఫాం ఓనర్లు , పశువుల వ్యాపారులు వారి గేదెలు, దున్నపోతులు, ఆవులు, ఎడ్లను ఈ మేళాలో ప్రదర్శిస్తారు. గేదెలను బాగా మేపి.. అందంగా తయారుచేసి ఈ సంతకు తెస్తుంటారు. అయితే మార్కెట్‌ను పంజాబ్, హర్యాణ, గుజరాత్‌ గేదెలే డామినేట్ చేస్తాయి. క్రయవిక్రయాలలో అవే ప్రధాన భూమిక పోషిస్తాయి. ఒక్కో గేదె 50 వేల రూపాయల నుంచి లక్షలకు పైగా పలుకుతుంది. గతేడాది గుజ్జర్ అనే గేదె ఒక లక్ష డెబ్బైవేల రూపాయలకు పైగానే అమ్ముడుపోయింది. నోట్ల రద్దు నేపథ్యంలో ఈ ఏడాది పశు సంక్రాంతి ఏ విధంగా సాగుతుందో.. అనే ఆందోళన.. ఆసక్తి అందరిలో నెలకొంది. మార్కెట్‌పై నోట్ల రద్దు ప్రభావం ఎంతోకొంత ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

 

18:51 - January 19, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు చేసి రెండు నెలలు దాటినా ఇప్పటికీ విత్‌ డ్రాలో నిబంధనలు విధించడంపై మహిళా కాంగ్రెస్‌ నిరసన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని వనస్థలిపురం రైతు బజారు వద్ద ధర్నా చేశారు. రాహుల్‌ గాంధీ పిలుపు మేరకు ఆందోళనకు దిగినట్లు టి. కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. 

18:39 - January 19, 2017

టీడీపీ బీసీ సెల్ కార్యనిర్వహకుడు కేవీ శ్రీనివాసులుపై హత్యాయత్నం

హైదరాబాద్ : టీడీపీ బీసీ సెల్ కార్యనిర్వహకుడు కేవీ శ్రీనివాసులుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. గుడిపల్లి మండలంలో కారులో వెళ్తున్న దుండగులు శ్రీనివాసులును వెనుక నుంచి ఢీకొట్టారు. 

17:46 - January 19, 2017

కృష్ణా : విజయవాడ దుర్గగుడిపై వంతెన పనులు ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. 2016 డిసెంబర్ నాటికి ఫ్లై ఓవర్ పనులు ముగిస్తామని హామీలైతే చేశారే తప్పా ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చలేదు. శాఖల అలసత్వం కారణంగా దుర్గగుడి ప్లై ఓవర్ పనులు మరింత ఆలస్యం కానున్నాయి. 
తూతూ మంత్రంగా ఫ్లై ఓవర్ పనులు 
విజయవాడ నగరానికి మణిహారంగా భావిస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులు తూతూ మంత్రంగా కొనసాగుతున్నాయి. సోమా కన్‌స్ట్రక్షన్ కంపెనీ వంతెన పనులను తలకెత్తుకోవడమే కాకుండా ఎనిమిది నెలల్లో నిర్మించేలా డీల్ కుదుర్చుకుంది. నేటికీ పనులు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో ఈ ఏడాది జూన్ మాసానికి పనులు పూర్తవుతాయాయని సందేహాలు కలుగుతున్నాయి. 
పనుల్లో అంతులేని నిర్లక్ష్యం 
పనుల్లో అంతులేని నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. దీంతో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్లై ఓవర్‌ ఎప్పటికి పూర్తి చేస్తారనే వేచిచూపులు ప్రజలకు తప్పడం లేదు. రూ.447.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్లై ఓవర్ పనులకు 2015 డిసెంబర్ లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఫ్లై ఓవర్ నిర్మాణంతో పాటు నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులను చేపట్టిన 'సోమా' కంపెనీ.. 2016 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. భూ సేకరణ జాప్యం, అధికారుల నిర్లక్ష్యం తీరుతో ఎనిమిది నెలల్లో పూర్తి కావాల్సిన పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. 
ప్రారంభానికి నోచుకోని అప్రోచ్ పనులు 
దుర్గగుడి ముందు 2.55 కిలోమీటర్ల పొడవునా ఫ్లై ఓవర్ కోసం 51 పిల్లర్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 45 పిల్లర్లు పూర్తి చేశారు. మిగిలిన వాటిలో కృష్ణానదిలో 3, కాలువలో 2, రహదారిపై ఒక పిల్లర్ కోసం పనులు చేపట్టాల్సి ఉంది. ఫ్లై ఓవర్ అప్రోచ్ పనులు ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. కనీసం నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తే హైదరాబాద్, భద్రాచలం, మైలవరం వైపు వెళ్లే వాహనాలకు సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ పనుల ఆలస్యం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, రైల్వేస్టేషన్ కు రావాల్సిన బస్ లు, ఇతర వాహనదారులు నానా హైరానా పడుతున్నారు. ఫ్లై ఓవర్ ను వేగవంతం చేసి ఉపశమనం కల్గించాలని వాహనదారులతో పాటు స్థానికులు కోరుతున్నారు.

 

17:41 - January 19, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో క్యాన్సర్‌ వ్యాధిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును, హెల్త్‌ క్యాంపును సినీ నటి గౌతమి ప్రారంభించారు. సుజాతనగర్‌ మండలంలో గ్రెస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ హరిప్రసాద్‌, డాక్టర్‌ చినబాబూ, శాసన సభ్యులు జలగం వెంకటరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యమని.. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని గౌతమి అన్నారు. 

 

ఇంగ్లండ్ విజయలక్ష్యం 382 పరుగులు

కటక్ వన్డే : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ నిర్ణీత 50 వోవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయలక్ష్యం 382 పరుగులుగా ఉంది. 

17:35 - January 19, 2017

కామారెడ్డి : జిల్లా రైల్వే స్టేషన్‌ దగ్గర పది కిలోల మత్తుపదార్థాన్ని.. పోలీసులు పట్టుకున్నారు. దానిని సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  రూట్‌ వాచ్‌ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన కురుమూర్తి గౌడ్‌ను ఎక్సైజ్‌ అధికారులు తనిఖీ చేసి.. ఆయన దగ్గర ఉన్న పది కిలోల ఆల్ఫాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆల్ఫాజాలం ఏడు లక్షల విలువ చేస్తుందని.. వీరిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో ఉత్తల గ్రామ కేంద్రంగా ఈ వ్యాపారం సాగుతుందని చెప్పారు.

 

17:33 - January 19, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కుటుంబ కనుసన్నల్లోనే అసెంబ్లీ సెషన్‌ నడిచిందని ఆరోపించారు. ప్రభుత్వమంటే  కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు మాత్రమేనా అని రేేవంత్‌ ప్రశ్నించారు.  సీఎం చేతుల్లో మంత్రులందరూ తోలుబొమ్మలయ్యారని ఎద్దేవాచేశారు. సభ ప్రశాంతంగా జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్‌.. రైతుల సమస్యలపై స్పందించనేలేదన్నారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి ఆరాటపడుతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.  

 

17:29 - January 19, 2017

నెల్లూరు : సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సమాజ్‌వాదీ , కాంగ్రెస్‌లు కుంభకోణాలతో దేశాన్ని అభివృద్ధిలో వెనక్కునెట్టాయన్నారు. అభివృద్ధే ప్రధాన ప్రచారంగా రాబోయే ఐదురాష్ట్రాల ఎన్నికల్లోకి వెళ్లుతున్నామని వెంకయ్య చెప్పారు. 

 

ధోనీ ఔట్

కటక్ వన్డే : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 358 పరుగుల వద్ద ధోనీ( 134) ఔట్ అయ్యాడు. 
 

ఐదో వికెట్ కోల్పోయిన భారత్

కటక్ వన్డే : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 323 పరుగుల వద్ద కేదార్ జాదవ్ (22) ఔట్ అయ్యాడు. 

17:07 - January 19, 2017

ఢిల్లీ : కాన్పూర్‌ రైలు ప్రమాదానికి సంబంధించిన కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేయనుంది. ఈ కేసును తమకు బదిలీ చేయాలంటూ ఎన్‌ఐఏ హోంమంత్రిత్వ శాఖను రాతపూర్వకంగా తెలియజేసింది. దీంతో ఈ కేసును కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 150 మంది మృతి చెందారు. ఈ ఘటన వెనక ఉగ్రవాద హస్తముందని స్థానిక పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఐఏ ఈ కేసును టేకప్‌ చేయనుంది. 2016లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న 112 మందిని ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. ఇందులో 64 మందిపై జిహాదీ పేరిట సాగించే ఉగ్రవాద కేసులు నమోదయ్యాయి.

 

17:03 - January 19, 2017

ప్రకాశం : బుద్ధుడు నడయాడిన నేల ... బుద్ధుని శిఘ్యలు నివసించిన గ్రామం.. ఇదేక్కడో కాదండీ ప్రకాశం జిల్లాలోని జమ్మలమడక గ్రామం ...ఈ గ్రామంలో తాజాగా క్రీ.పూ 1 వ శాతబ్దం నాటి ఓ బుద్ధ విగ్రహాం వెలుగులోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని బౌద్ధక్షేత్రాలపై మరింత ఆసక్తి పెరుగుతోంది. పురావస్తు శాఖ పరిశోధనలు జరిపితే ఎన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. 
జమ్మలమడకలో బుద్ధుని ఆనవాళ్లు 
ప్రకాశం జిల్లా కనిగిరి మండంల బుడ్డాయిపల్లి అనే గ్రామం సమీపంలో జమ్మలమడక అనే ఓ కుగ్రామంలో తాజాగా బుద్ధుని ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. క్రీ.పూ 1 శతాబ్ధం నాటి బుద్ధుని విగ్రహం ఈ ప్రాంతంలో కనుగొన్నారు. గ్రామంలోని పోలేరమ్మ తిరునాళ్లు జరిగే ప్రాంతంలో గుడి అభివృద్ధి కోసం పరిసరాలను శుభ్రం చేస్తుండగా ఈ  బుద్ధ విగ్రహాం బయటపడింది.   
బుద్ధుని బోధనలే బౌద్ధమతంగా వ్యాప్తి 
ప్రపంచానికి శాంతిని, సత్యాన్ని, అహింసను బోధించిన బుద్ధుని బోధనలే బౌద్ధమతంగా వ్యాప్తిలోకి వచ్చాయి. ప్రపంచంలోని అతీ ప్రాచీనమైంది బౌద్ధ మతం ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు వ్యాప్తి చెందింది.  అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, శాలిహుండము, చిన్నగంజాం, ఘంటశాల, బట్టిప్రోలు, చందేవరం, మోటుపల్లి మొదలైనవన్ని ప్రముఖ బౌద్థ క్షేత్రాలు. ఇప్పుడు వీటిలో తాజాగా జమ్మలమడక గ్రామం చేరింది.  
బుద్ధుని పేరుతో వెలిసిన బుద్దాయిపల్లి 
తాజాగా బుద్ధ విగ్రహం బయటపడిన జమ్మల మడకగ్రామం  పూర్వం మరో బౌద్ధక్షేత్రంగా విరాజిల్లిందని చరిత్రకారులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ బౌద్ధ బిక్షువులు  నివసించారని చెబుతున్నారు. పాలేరు నదీ ఒడ్డున ఈ గ్రామం ఉండటంతో ఇక్కడే బౌద్ధ బిక్షువులు సంచరించారని చరిత్రకారులు చెబుతున్నారు..అందుకే ఈ ప్రాంతం బౌద్ధక్షేత్రంగా మారిందంటున్నారు.  సమీపంలోని బుడ్డాయిపల్లి గతంలో బుద్దాయిపాలెం గ్రామమని కాలక్రమంలో బుడ్డాయిపల్లిగా మార్పు చెందిందంటున్నారు. పురావస్తు శాఖ ఇక్కడ పరిశోధనలు చేస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని చరిత్రకారులు చెబుతున్నారు. 
గతంలో బౌద్ధ బిక్షువులు సంచారం 
గతంలో ఈ గ్రామంలో బౌద్ధ బిక్షువులు సంచరించారని తమ పూర్వీకులు కథలుగా చెప్పేవారని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పుడు బుద్ధుని విగ్రహాం బయటపడటం నిజంగా సంతోషంగా ఉందంటున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
జమ్మలమడకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి : గ్రామస్తులు
అరుదైన పురాతన బుద్ధవిగ్రహం బయటపడిన ఈ ప్రాంతంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడంతో పాటు జమ్మలమడక గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

 

ధోని సెంచరీ

కటక్ వన్డే : భారత, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండ్ వన్డే మ్యాచ్ లో ధోనీ చేశాడు. 106 బంతుల్లో సంచెరీ పూర్తి చేశాడు. వన్డే కెరీర్ లో ధోనీ పదో సెంచరీ పూర్తి చేశాడు. 

 

150 పరుగుల మార్కును చేరుకున్న యువరాజ్

కటక్ వన్డే : భారత, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండ్ వన్డే మ్యాచ్ లో యువరాజ్ చెలరేగి అడుతున్నాడు. 150 పరుగుల మార్కును చేరుకున్నాడు.

 

16:46 - January 19, 2017

మహబూబ్ నగర్ : ఏదైనా ఊరు పరిస్థితిని తెలుసుకోవాలంటే ఆ ఊరు చెరువును చూస్తే చాలు.. చెరువు నిండుగా ఉంటే ఊరు సస్యశామలంగా ఉన్నట్లు.. ఇప్పుడు ఇదే సూత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం పాటిస్తోంది. ఇందుకోసం మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలోని చెరువులు జలకళ తెచ్చుకునేలా కృషిచేస్తోంది. 
పాత మహబూబ్‌నగర్ జిల్లా కరవుకు కేరాఫ్ అడ్రస్‌.. 
తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయను ప్రతిష్టాత్మకంగా పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి గ్రామంలోని చెరువులు నిండుకుండలా ఉండేలా చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడిప్పుడే పథకం లక్ష్యం నెరవేరుతున్నట్లు కనిపిస్తోంది. పాత మహబూబ్‌నగర్ జిల్లా కరవుకు కేరాఫ్ అడ్రస్‌.. జిల్లాలోని కరవును తరిమికొట్టేందుకు గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో జిల్లా వాసులు అనేక ప్రాంతాలకు వలసవెళ్లేవారు. ఇక్కడి ప్రజలు పాలమూరు కూలీలుగా బాగా ఫేమస్‌.. 
రైతుల్లో ఆనందం 
అయితే ఇదంతా గతం.. మిషన్ కాకతీయ పథకంతో ఇప్పుడు నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్‌ జిల్లాలలోని ప్రతి చెరువు జలకళతో దర్శనిమిస్తుండడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నీటిని చెరువుల్లో నింపుతున్నారు. ఈ చెరువుల కింద 22వేల ఎకరాల్లో యాసంగి పంట సాగవుతోంది. మొత్తమ్మీద మిషన్ కాకతీయ కింద చెరువులన్ని జలకళను సంతరించుకున్నాయి. ప్రతి సంవత్సరం 20శాతం చొప్పున ఐదు సంవత్సరాలలో చెరువులన్నింటిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 

 

16:41 - January 19, 2017

సిద్ధిపేట : ట్రాఫిక్‌ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు కొత్త రకమైన శిక్ష వేశారు. ట్రాఫిక్స్‌ రూల్స్‌ పాటించని యువకులను అదుపులోకి తీసుకుని.. కౌన్సెలింగ్‌ నిర్వహించి.. వారిని ట్రాఫిక్‌ వాలంటీర్‌గా మారుస్తున్నారు. దీంతో వారు కొన్ని గంటలపాటు వాహనాలపై వెళ్లే  వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనల గురించి.. భద్రత గురించి తెలియజేస్తున్నారు. కాగా ప్రమాదాలను తగ్గించడానికి.. ఈ కార్యక్రమం చేపట్టినట్టు పోలీస్‌ కమిషనర్‌ చెప్పారు.

 

16:37 - January 19, 2017

చిత్తూరు : తిరుమలలో జుగుప్సాకర ఘటన చోటుచేసుకుంది. టిడిపి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అన్నప్రసాదంలో జెర్రీ వచ్చింది. ఒకటో యాత్రికుల సముదాయం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తుండగా ప్రసాదంలో జెర్రీ కనపడింది. ప్రసాదాన్ని తినేక్రమంలో జెర్రీని చూసి భక్తుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేల ప్రసాదాన్ని చిన్నపిల్లలు తెలియకుండా తింటే... పరిస్థితి ఎంటనీ ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులను వివరణ అడగ్గా ప్రసాదం వడ్డిస్తున్నప్పుడు చెట్టుపై నుంచి జెర్రీ పడిందని అధికారులు అంటున్నారు. మరిన్ని వీడియోలో చూద్దాం.... 

 

16:19 - January 19, 2017

కడప : గండికోట దగ్గర పైప్‌లైన్ల లీకేజీతో విలువైన నీరు వృధాగా పోతోంది. పులివెందులకు నీరందించేందుకు ఈ నెల 11న సీఎం చంద్రబాబు ఈ పైప్‌లైన్లను ప్రారంభించారు. వారం రోజులు కూడా పూర్తికాకముందే పైప్‌లైన్‌ల మధ్య పగుల్లొచ్చాయి. కాంట్రాక్టర్‌ నాసిరకంగా పనులు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 

16:16 - January 19, 2017

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సంచలనం

సిడ్ని : ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సంచలనం చోటుచేసుకుంది. రెండో రౌండ్ లో డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్ ఓడారు. 117 వ ర్యాంకర్ డెనిస్ ఇస్తోమిక్ చేతిలో జకోవిచ్ ఓటమి పాలయింది. 7..6, 5..7, 7...6, 6...4 తేడాతో జకోవిచ్ పై ఇస్తోమిక్ గెలుపొందారు. 

యువరాజ్ సింగ్ సెంచరీ

కటక్ వన్డే : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో యువరాజ్ సింగ్ సెంచరీ చేశాడు.  98 బంతుల్లో సంచెరీ పూర్తి చేశాడు. వన్డేల్లో 14 వ సెంచరీ చేశాడు. 

 

యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీ

కటక్ వన్డే : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీ చేశాడు. 52వ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 

ప్లాంటా ప్రొడక్ట్ బయో ఉత్పత్తుల కంపెనీపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు

గుంటూరు : ప్లాంటా ప్రొడక్ట్ బయో ఉత్పత్తుల కంపెనీపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేశారు. కల్తీ బయో ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అంకిరెడ్డిపాలెంలోని గోడౌన్ తోపాటు గుంటూరు ఆర్.అగ్రహారంలో షాపు సీజ్ చేశారు. రూ.3 కోట్లు నకిలీ బయో ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ యజమాని హన్మంతరావు పరారీలో ఉన్నారు. 

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.13 లక్షల విలువైన 467 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

దావోస్ లో నాలుగోరోజు సీఎం చంద్రబాబు బృందం పర్యటన

హైదరాబాద్ : దావోస్ లో నాలుగోరోజు సీఎం చంద్రబాబు బృందం పర్యటిస్తోంది. మోర్గాన్ స్టాన్లీ సంస్థ స్టాటజీ హెడ్ మ్యాక్స్ న్యూకిర్ చెన్ తో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలో వనరులు, అవకాశాలపై మ్యాక్స్ కు వివరించారు. సంక్షేమం, అభివృద్ధి, సాంకేతికత వినియోగంపై చర్చించారు. 

 

అజారుద్దీన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : అజారుద్దీన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్ సీఏ మరో బెంచ్ లో ఉన్న గత పిటిషన్లను తేల్చిన తర్వాత అజారుద్దీన్ పిటిషన్ ను పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. హెచ్ సీఏ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణపై అజారుద్దీన్ పిటిషన్ వేశారు. 

14:52 - January 19, 2017

గుంటూరు : రాజధాని మాస్టార్ ప్లాన్ రెడీ అయిందో లేదో డౌటే..? అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. అమరావతి గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నారు. రైతుల సమస్యలు అడిగితెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అభ్యంతరాలు ఉంటే చెప్పమన్నారు.. చెప్పితే ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. బలవంతంగా భూములను ఎవరు తీసుకోమన్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

 

రైతులకు అండగా వైసీపీ : జగన్

గుంటూరు : అమరావతి గ్రామాల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. రైతులకు అండగా వైసీపీ ఉంటుందని భరోసా ఇచ్చారు. బలవంతంగా ఎవరు భూములను తీసుకోమన్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని మాస్టార్ ప్లాన్ రెడీ అయిందో లేదో డౌటే..? అని ఎద్దేవా చేశారు. 

అమరావతి గ్రామాల్లో జగన్ పర్యటన

గుంటూరు : అమరావతి గ్రామాల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించారు. రైతుల సమస్యలు అడిగితెలుసుకుంటున్నారు. అభ్యంతరాలు ఉంటే చెప్పమన్నారు.. చెప్పితే ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు.  

 

ఏపీ బడ్జెట్ పై మంత్రి యనమల షెడ్యూల్..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2017-18 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పై ఆర్థిక మంత్రి యనమల కసరత్తులు ప్రారంభించారు. ఆయా శాఖలకు ఎంత బడ్జెట్ కేటాయించాలి ? డిమాండ్స్ సాధ్యసాధ్యాలను ఆయన పరిశీలించనున్నారు. 

కాజీపేట రైల్వే కోర్టుకు చేరుకున్న కిషన్ రెడ్డి..

వరంగల్ : కాజీపేట రైల్వే కోర్టులో విచారణకు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కేసీఆర్ మాత్రమే చేయలేదని, నేనెక్కడినే చేశారని కేసీర్ చెబుతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రాన్ని విమర్శించడం సరికాదని విమర్శించారు. 

అజహరుద్దీన్ పిటిషన్ పై విచారణ..

హైదరాబాద్ : క్రికేటర్ అజహరుద్దీన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్ సీయూపై మరో బెంచ్ లో ఉన్న గత పిటిషన్లను తేల్చిన తరువాత అజహరుద్దీన్ పిటిషన్ ను పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణనను బుధవారానికి వాయిదా వేసింది. 

13:45 - January 19, 2017

సంపాదించే అండ లేని ఒంటరి పేద మహిళలకు ఆర్థిక చేయూతనందించే కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒంటరి జీవితం గడుపుతున్న పేద మహిళలకు జీవన భృతిగా నెలకు రూ. వెయ్యి చొప్పున అందించాలని టి.సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శాసనసభ సాక్షిగా సీఎం కేసీఆర్ ఓ ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ప్రారంభం కానుంది.
మరి ఇది ప్రకటనలకే పరిమితమౌతుందా ? అమలు జరుగుతుందా ? అనే దానిపై 'మానవి' వేదిక చర్చ చేపట్టింది. ఈ చర్చలో హైమావతి (ఐద్వా నేత), గీతా మూర్తి (భేటీ బచావో..భేటీ పడావో రాష్ట్ర కన్వీనర్) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. వారు ఎలాంటి సూచనలు..సలహాలు అందించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:40 - January 19, 2017

వరంగల్ : సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర 95వ రోజుకు చేరుకుంది. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటన కొనసాగుతోంది. పాదయాత్ర బృందానికి గ్రామస్తులు ఘన స్వాగతం పలుకుతున్నారు. చెన్నాపూర్, రేగొండ, బాగెర్తిపేటలో బృందం పర్యటించనుంది. భౌగోళిక తెలంగాణ రాష్ట్రం మాత్రమే వచ్చిందని సామాజిక తెలంగాణ రాలేదని పాదయాత్ర బృంద సభ్యుడు ఆశయ్య టెన్ టివికి తెలిపారు. ఇప్పటి వరకు 900 గ్రామాలపైనా పాదయాత్ర బృందం పర్యటించిందన్నారు. కులసంఘాలను, నాయకులను సీఎం కేసీఆర్ మభ్య పెడుతున్నారని, ఎన్నో కులాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, వృత్తులు దెబ్బతింటున్నాయన్నారు. ఇంకా ఏమి మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:34 - January 19, 2017

చిత్తూరు : జిల్లాలో పెద్ద పెనుప్రమాదం తప్పింది. ఓ బస్సు బోల్తా కొట్టడంతో ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన చంద్రగిరి (మం) బాకరాపేట ఘాట్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. గురువారం ఉదయం రాయచోటి నుండి ఆర్టీసీ బస్సు బయలుదేరింది. పీలేరు, రాయచోటి మీదుగా తిరుపతికి రావాల్సి ఉంది. అతి ప్రమాదకరంగా ఉండే బాకరాపేట ఘాట్ వద్దకు చేరుకోగానే బస్సు బోల్తా కొట్టింది. బస్సులో ఉన్న ప్రయాణీకులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపుకు పడితే బస్సు లోయలోకి పడి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఇదిలా ఉంటే ఘటన గురించి ప్రయాణీకులు మీడియాతో మాట్లాడారు. రాయచోటికి వచ్చిన అనంతరం తీవ్రంగా తలనొప్పి వేస్తుందని డ్రైవర్ పేర్కొన్నాడని, మందులు వేసుకున్న అనంతరం బస్సును నడిపాడని తెలిపారు. కానీ మార్గమధ్యంలో తలనొప్పి తీవ్రమయ్యిందని డ్రైవర్ తెలిపాడని పేర్కొన్నారు. చివరకు తలనొప్పి తీవ్రం కావడంతో బస్సును అదుపు చేయలేకపోవడంతో బోల్తా కొట్టిందన్నారు. 

13:28 - January 19, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2017-18 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పై ఆర్థిక మంత్రి యనమల కసరత్తులు ప్రారంభించారు. ఆయా శాఖలకు ఎంత బడ్జెట్ కేటాయించాలి ? డిమాండ్స్ సాధ్యసాధ్యాలను ఆయన పరిశీలించనున్నారు. గతంలో ఎంత బడ్జెట్ కేటాయించారు ? ప్రస్తుత సంవత్సరానికి ఎంత బడ్జెట్ కేటాయించాలనే దానిపై విధి విధానాలను పరిశీలించనున్నారు. అందులో భాగంగా షెడ్యూల్ ను ప్రకటించారు. ఈనెల 23 నుండి 25వ తేదీ వరకు యనమల వరుస భేటీలు నిర్వహించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు..ఉన్నతాధికారులతో యనమల సమీక్షలు నిర్వహించనున్నారు.

  • 23వ తేదీన వ్యవసాయ, వేర్ హౌసింగ్, పశుసంవర్థక, మత్స్య, వెనుకబడిన సంక్షేమం, సాంఘీక శాఖ, గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, కార్మిక ఉపాధి, హోం శాఖ..
  • 24వ తేదీన పంచాయతీ రాజ్, ఉపాధి హామీ, గ్రామీన మంచినీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, మున్సిపల్ పట్టణాభివృద్ది, జలవనరులు, సమాచార, మైనార్టీ సంక్షేమం, ఐటీ శాఖ..
  • 25వ తేదీన పౌరసరఫరా, వైద్య, ఆరోగ్యం, మానవ వనరులు, విద్య, ప్రణాళిక, పర్యావరణం, అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, పరిశ్రమలు, దేవాదాయ శాఖలపై మంత్రి యనమల సమీక్షలు చేయనున్నారు. 
13:13 - January 19, 2017

ఢిల్లీ : జల్లికట్టుపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కోరారు. జల్లికట్టుపై కొనసాగుతున్న వివాదంపై ప్రధానితో చర్చించేందుకు సీఎం పన్నీర్ ఢిల్లీకి వచ్చారు. ప్రధాని మోడీతో పన్నీర్ భేటీ అయ్యారు. సమావేశ వివరాలను సీఎం పన్నీర్ మీడియాకు తెలియచేశారు. జల్లికట్టు వివాదంపై రాష్ట్రంలో కొనసాగుతున్న పరిణామాలపై ప్రధాని దృష్టికి తీసుకొచ్చానని తెలిపారు. వివాదం మరింత ముదరకముందే ఓ నిర్ణయం తీసుకోవాలని, త్వరగా నిర్ణయం తీసుకోకుంటే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ప్రధానికి తెలియచేసినట్లు తెలిపారు. నిషేధం తొలగించేలా ఆర్డినెన్స్ తీసుకరావాలని కోరినట్లు, జల్లికట్టు వివాదంపై అన్నాడీఎంకే చీఫ్ శశికళ కూడా ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. కరవుపై కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని, బృంద నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీనిచ్చారని తెలిపారు.
మరోవైపు జల్లికట్టు వివాదంపై ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు రోజుల నుండి మెరీనా బీచ్ లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనలకు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర స్పందన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

జల్లికట్టు వివాదంపై సుప్రీం స్పందన..

ఢిల్లీ : జల్లికట్టు ఆందోళనలపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పిటిషనర్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. 

మాల్యాకు రుణ రికవరీ ట్రిబ్యునల్ షాక్..

ఢిల్లీ : విజయ్ మాల్యాకు రుణ రికవరి ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. రుణాల వసూళ్లకు తదుపరి ప్రక్రియ చేపట్టేందుకు రుణ రికవరీ ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది.

 

బాకరాపేట ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా..

తిరుపతి : చంద్రగిరి (మం) బాకరా పేట ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో 30 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిని రుయా ఆసుపత్రికి తరలించారు. 

కర్నూలులో రెచ్చిపోయిన ఛైన్ స్నాచర్లు..

కర్నూలు : ఛైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బస్టాండులో ప్రయాణీకురాలి వద్ద 6 తులాల బంగారం, వెంకటరమణ కాలనీలో ఓ మహిళ నుండి గోల్డ్ ఛైన్ ను స్నాచర్లు అపహరించారు. 

గవవర్నర్ ను కలిసిన ఘంటా చక్రపాణి..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి కలిశారు. టీఎస్పీఎస్సీ వార్షిక నివేదికను గవర్నర్ కు అందచేశారు. 

జల్లికట్టుపై పీఎంఓ ప్రకటన..

ఢిల్లీ : జల్లికట్టుపై పీఎంఓ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు సంస్కృతిపై ప్రధానికి అపారమైన గౌరవం ఉందని, న్యాయస్థాన పరిధిలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని తెలిపింది. తమిళనాడు రాష్ట్రానికి కేంద్ర బృందం వెళుతుందని, బృందం అందచేసే నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తమిళనాడు రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాల సహకారం అందిస్తుందని పీఎంఓ వెల్లడించింది.

యూపీ రోడ్డు ప్రమాదంపై మోడీ దిగ్ర్భాంతి..

ఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్ ఎటా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందడంపై భారత ప్రధాని న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గాయాల‌యిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. స్కూల్ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 25 మంది విద్యార్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. 

12:23 - January 19, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు కేంద్రం నుండి ఎలాంటి హామీనివ్వలేదు. రాష్ట్రంలో జల్లికట్టు వివాదం ముదురుతోంది. గత మూడు రోజులుగా మెరీనా బీచ్ లో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీకి పయనమయ్యారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. జల్లికట్టుపై ఆర్దినెన్స్ తీసుకరావాలని కేంద్రం సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. అంతేగాకుండా కరవు..నీటి ఇబ్బందుల తదితర అంశాలపై ప్రధానికి పన్నీర్ వినతిపత్రం ఇచ్చారు. ఈ భేటీ అనంతరం పీఎంఓ నుండి ఓ ప్రకటన వెలువడింది. జల్లికట్టు వివాదాన్ని ప్రధాని దృష్టికి పన్నీర్ సెల్వం తీసుకొచ్చారని పేర్కొంది. తమిళనాడు సంస్కృతిపై ప్రధానికి అపారమైన గౌరవం ఉందని, న్యాయస్థాన పరిధిలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని తెలిపింది. తమిళనాడు రాష్ట్రానికి కేంద్ర బృందం వెళుతుందని, బృందం అందచేసే నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తమిళనాడు రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాల సహకారం అందిస్తుందని పీఎంఓ వెల్లడించింది. జలికట్టును 2014లో సుప్రీం నిషేధించిన సంగతి తెలిసిందే. పీఎంఓ ప్రకటన అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

12:15 - January 19, 2017
12:07 - January 19, 2017

ఢిల్లీ : జల్లికట్టు..ఆర్డినెన్స్ తీసుకొస్తారా ? కేంద్రం ఎలా స్పందిస్తుంది ? ప్రస్తుతం తమిళనాడులో రాష్ట్రంలో ప్రధాన చర్చగా మారింది. జల్లికట్టుకు అనుమతినివ్వాలంటూ విద్యార్థులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. మెరీనా బీచ్ లో గత మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అంతేగాకుండా పలువురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై నుండి ఢిల్లీకి రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేరుకున్నారు. కాసేపటి క్రితం భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్ తీసురావాలని మోడీని పన్నీర్ కోరారు. సంక్రాంతి పండుగ నుండి మొదలైన ఆందోళన పరిణామాలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. కళాశాలల బంద్..ప్రజా జీవనం స్తంభన..స్తంభించిన రవాణా..ఇతరత్రా విషయాలను మోడీకి వివరించినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున..కొద్ది రోజుల్లో వచ్చే తీర్పు గురించి నిరీక్షించాలని, దీనిపై ఓ కమిటీ వేసేందుకు సిద్ధమని మోడీ చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని వేచి చూసిన ఆందోళనకారులు ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

11:54 - January 19, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కీలక పనులు ప్రారంభం కానున్నాయి. 16 మీటర్ల వెడల్పు, 21 మీటర్ల పొడవు కలిగిన డ్యామ్ ప్రధాన గేట్ల డిజైన్ కు కేంద్ర జలసంఘం ఈ నెల 16న ఆమోదం తెలపడంతో ఈ గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టున్నారు. ఈనెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణానికి సంబంధించి కీలక పనులను జనవరి 29వ తేదీన ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. డ్యామ్ గేట్ల తయారీ, కాంక్రీట్ పనులకు ఎలాంటి అవరోధం లేకుండా సాఫీగా సాగేలా బిల్డింగ్ ప్లాంట్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు, సిబ్బంది కోసం ఆధునిక వసతులతో క్వార్టర్ల నిర్మాణాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు.

తయారీ ఏజెన్సీని ఎంపిక చేయనున్న జలవనరుల శాఖ..
పోలవరం ప్రాజెక్ట్ గేట్ల తయారీ కోసం 16,000 నుంచి 17000 మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరం కానుంది. ఉక్కు అవసరాల కోసం బిలాయ్, విశాఖ ఉక్కు కర్మాగారాలతో జల వనరుల శాఖ నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే నాణ్యతతో కూడిన స్టీల్ ను సరఫరా చేసేందుకు ఈ రెండు కర్మాగారాల యాజమాన్యాలు అంగీకరించాయి. డ్యామ్ గేట్ల తయారీలో నైపుణ్యం కల్గిన కన్నయ్యనాయుడు రూపొందించిన డిజైన్లకు కేంద్ర జల సంఘం సమ్మతి తెలపడంతో తయారీ ఏజెన్సీని జలవనరుల శాఖ ఎంపిక చేయనుంది.

పోలవరం 2018 మొదటి దశ పనులు ప్రారంభం..
2018 నాటికి పోలవరం మొదటి దశను పూర్తి చేసేందుకు వీలుగా ఈ పనులు ప్రారంభం కానున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ చెబుతున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు 29వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు నదీ పరీవాహక ప్రాంతంలోని ఇసుక తిన్నెలపై 'గైడింగ్ వాల్' పనులు నాలుగింట మూడొంతలు పూర్తయ్యాయి. మిగతా పనులు త్వరితగతిన పూర్తిచేయనున్నారు. గోడ నిర్మాణ పరికరాలను, యంత్రాలను జర్మనీకి చెందిన బావర్ సంస్థ ఇప్పటికే సిద్ధం చేసింది.ఈ నెల 23 నాటికి సామాగ్రి విశాఖ ఓడరేవుకు, 25వ తేదీ నాటికి పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరనున్నాయి. చిల్లింగ్ ప్లాంట్ నిర్మాణం పనులు కూడా జనవరి 29న ప్రారంభిస్తారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తైతే సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నందున వారికోసం అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న క్వార్టర్ల పనులు కూడా 78 శాతం మేర ఇప్పటికే పూర్తయ్యాయి. 

ఢిల్లీకి చేరుకున్న పన్నీర్ సెల్వం..

ఢిల్లీ : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపటి క్రితం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పన్నీర్ సెల్వం 

11:41 - January 19, 2017

గుంటూరు : లంక గ్రామాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన కొనసాగుతోంది. రాజధాని ప్రాంత రైతుల సమస్యలను తెలుసుకోవడానికి గురువారం ఉదయం జగన్ గన్నవరం చేరుకున్నారు. అనంతరం ఆయన లంక గ్రామాలకు పయనమయ్యారు. తాడేపల్లి గూడెం హైవే వద్ద జగన్ ను రాజధాని రైతులు కలిశారు. ఈసందర్భంగా వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. రైతులనుద్దేశించి జగన్ ప్రసంగించారు. భూ సేకరణ పూర్తయినా పనులు ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. బలవంతంగా భూములు సేకరిస్తున్నారని, 300 ఇళ్లు కూలుస్తున్నారని తెలిపారు. రూ. 15 కోట్లు పలికే భూమికి ముష్టివేసిన విధంగా రూ. 30 లక్షలు ఇస్తున్నారని విమర్శించారు. రైతులకు వైసీపీ అండగా ఉంటుందని జగన్ వెల్లడించారు. ప్రస్తుతం మంగళగిరి మీదుగా నిడమర్రుకు చేరుకుంటారు. అక్కడ ఐదు గ్రామాలకు చెందిన రైతులతో జగన్ ముచ్చటించనున్నారు. మరోవైపు పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీనితో ఆయా ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 

11:37 - January 19, 2017

విశాఖపట్టణం : తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆర్పీఎఫ్ ఎస్ఐ పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఆ ఎస్ఐని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కోరిక తీర్చాలంటూ ఎస్ఐ జీవీకే ప్రసాద్ వేధిస్తున్నాడని కప్రాడకు చెందిన ఓ మహిళ ఆరోపిస్తోంది. తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ కేసులో ఉన్నావు..కోరిక తీర్చలేని పక్షంలో పలు పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ ఎస్ఐ హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారా ? లేదా ? అనేది తెలియడం లేదు. 

11:17 - January 19, 2017

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత విషాదకరమైన ఈఘటనలో 22 మంది విద్యార్థులు మృతి చెందారు. మృతుల్లో ఎల్ కేజీ విద్యార్థులు..ఇతర తరగతుల విద్యార్థులున్నారు. వివరాల్లోకి వెళితే..అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో స్కూళ్లను మూసివేయాలని అక్కడి విద్యాశాఖ ప్రకటించింది. దీనితో గత మూడు రోజులుగా స్కూల్స్ బంద్ ఉన్నాయి. కానీ గురువారం ఉదయం ఆలీఘడ్ ప్రాంతంలో ఉన్న జేఎస్ పబ్లిక్ స్కూల్ ను తెరిచారు. స్థానిక గ్రామాల నుండి చదువుకొనే విద్యార్థులు బస్సులో స్కూల్ కు వెళుతున్నారు. హైవేపై వెళుతున్న బంగాళదుంపల లోడ్ తో వెళుతున్న లారీ స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీనితో 22 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీజీపీ సహాయక చర్యలు చేపట్టారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గాయపడిన విద్యార్థుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మూసి ఉన్న స్కూల్ ను ఎందుకు తెరిచారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రుల రోదనతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది.

ఖేలో ఇండియా జాతీయ క్రీడలు ప్రారంభం..

నెల్లూరు : ఏపీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఖేలో ఇండియా జాతీయ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. క్రీడలకు కేంద్రం అధిక ప్రాధాన్యతనిస్తోందని, క్రీడలపై మరింత అవగాహన కోసం ఖస్త్రల్ అని తెలిపారు.

 

ఢిల్లీకి పాకిన జల్లికట్టు ఆందోళన..

ఢిల్లీ : జల్లికట్టు ఆందోళన ఢిల్లీకి తాకింది. మద్దతు దారులు ఆందోళన నిర్వహించారు. తమిళనాడు హౌస్ ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.

10:58 - January 19, 2017

ఢిల్లీ : యోగా గురువు బాబా రామ్‌దేవ్ కుస్తీపోటీలోనూ త‌న స‌త్తా చాటారు. ఢిల్లీలో జరిగిన ప్రొ రెజ్లింగ్ లీగ్ ప్రచార బౌట్లో 2008 ఒలింపిక్ ర‌జ‌త ప‌త‌క విజేత స్టాద్నిక్‌తో త‌ల‌ప‌డి మ‌ట్టిక‌రిపించారు. ఆండ్రీ స్టాడ్నిక్‌ను తనతో తలపడి గెలవాల్సిందిగా బాబా రాందేవ్ సవాలు విసిరారు. ఈ బౌట్‌లో 12-0 పాయింట్లతో ఒలింపిక్ ప్లేయర్‌ను బాబా రాందేవ్‌ ఓడించారు. నాలుగు పాయింట్లతో ఖాతా తెరచిన రాందేవ్, వరుస పాయింట్లు సాధిస్తూ 7-0 ఆధిక్యంలోకి వెళ్లి.. బౌట్ ముగిసేసరికి మరో ఐదు పాయింట్లు సాధించారు. మ్యాచ్ ముగియగానే రాందేవ్‌ను విన్నర్‌గా ప్రకటించగానే భారత్ మాతా కి జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.

 

10:56 - January 19, 2017

వరంగల్ : పదండి ముందుకు.. పోదాం పోదాం.. అంటూ... ఎర్రజెండా చేతబట్టి కదం తొక్కిన సీపీఎం మహాజన పాదయాత్ర 94 రోజులు పూర్తి చేసుకుంది. తమ్మినేని బృందానికి పల్లెపల్లెలో అపూర్వ స్వాగతం లభిస్తోంది. కేసీఆర్‌ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా... ప్రజలికిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని మరిచిన కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలను వంచించిందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీల మాటేమిటని తమ్మినేని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యావ్యవస్థ అస్తవ్యస్థం అయినా..ఈ ప్రభుత్వం ఏం పట్టనట్లు వ్యవహరించడం దారుణమని ఆయన అన్నారు. చేనేత కార్మికులకు పెన్షన్‌లు ఇవ్వాలని, వారికి హెల్త్‌కార్డులిచ్చి ఆదుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క పాదయాత్రలో పాల్గొని తమ్మినేని బృందానికి మద్దతు తెలిపారు. అసెంబ్లీని వేదికగా చేసుకుని కేసీఆర్‌ ప్రభుత్వం అబద్దాలను ప్రచారం చేస్తున్నారని సీతక్క అన్నారు. కేసీఆర్‌ ఫామ్‌ హౌజ్‌లో ఉండి కలలు కంటూ.. ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె విమర్శించారు. సీపీఎం మహాజన పాదయాత్ర 94 రోజులు పూర్తి చేసుకుంది. 94వ రోజు పాదయాత్ర బృందం వరంగల్‌ రూరల్ జిల్లాలోని నేరుకుల్ల, పత్తిపాక, శాయంపేట, మైలారం, జోగంపల్లి, పెద్దకోడెపాక, పరకాలలో పర్యటించింది. తమ్మినేని పాదయాత్రకు భూపాలపల్లి మాజీ జెడ్పీ ఛైర్మన్‌ గండ్ర సత్యనారాయణ, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

10:53 - January 19, 2017

విజయవాడ : లంక గ్రామాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటిస్తున్నారు. బుధవారం గన్నవరం చేరుకున్న జగన్ నేరుగా లంక గ్రామాలకు చేరుకున్నారు. అక్కడ అసైన్డ్ భూముల రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడారు. తమ భూమి తీసుకుంటే ఎక్కడ బతకాలని ఓ రైతు ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాడు. ఇక్కడ పర్యటన అనంతరం జగన్ నేడుమర్రుకు చేరుకుంటారు. రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. సమీప గ్రామాల్లో భూ సేకరణ ద్వారా భూమిని తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనితో రాజధానికి భూమి ఇవ్వమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు. రెండు సంవత్సరాల నుండి ఎవరూ కూడా అధికారులు, నేతలు పినమాక గ్రామానికి రాలేదని ఓ రైతు టెన్ టివికి తెలిపారు. భూమి తీసుకొన్న అనంతరం ఇచ్చే వాటిపై ఏ అధికారి హామీనివ్వలేదన్నారు.

లంక గ్రామాల్లో జగన్ పర్యటన..

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ లంక గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బుధవారం గన్నవరం చేరుకున్న జగన్ నేరుగా రాజధాని ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడారు.

మోడీకి ఒబామా ఫోన్..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా నిన్న రాత్రి ఫొన్ చేశారు. ఇరు దేశాల మధ్య ఒప్పందాల పురోగతి, సహకారంపై చర్చించారు. ఒప్పందాల సహకారంపై ఒబామాకు మోడీ ధన్యవాదాలు తెలియచేశారు.

ఎస్పీఎఫ్ ఎస్ఐ అరెస్టు..

విశాఖపట్టణం : మహిళను వేధించారనే ఆరోపణలతో విజయవాడకు చెందిన ఎస్ పీఎఫ్ ఎస్ఐ జీవీకే ప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజులుగా మహిళను జీవీకే ప్రసాద్ వేధిస్తున్నాడు. నిన్న రాత్రి కప్రాడలోని మహిళ ఇంటి వద్దకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

10:12 - January 19, 2017

ఖమ్మం : పోలీసులను టార్గెట్ చేస్తూ అమర్చిన మందుపాతర పేలి గ్రామస్తులు మృతి చెందారు. ఈవిషాద ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది. తమపై దాడి జరుగుతుందని భావించిన మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. శుక్రవారం ఉదయం పనుల కోసం పలువురు వెళుతున్నారు. ఒక్కసారిగా మందుపాతర పేలింది. దీనితో నలుగురు మహిళలు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సంఘటనకు తామే బాధ్యత వహిస్తామని గ్రామస్తులకు మావోయిస్టులు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గాయాలైన వారిని నారాయణపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయాలైన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మగవారు ఉన్నారు.

10:05 - January 19, 2017
09:52 - January 19, 2017

కరీంనగర్ : పతంగుల పండుగంటే ఆనందాల మేళవింపు. ఆకాశమే హద్దుగా ఎగిరే పతంగులు తెలియని అనుభూతిని కల్గిస్తాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ గాలి పటాలతో సందడిచేసేవారే..కానీ మారుతున్న కాలంతో పతంగుల పండుగ కనుమరుగు అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సంస్కృతి సంప్రాదాయల పండుగకు జీవం పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం...పర్యాటక శాఖ ఆధర్యంలో కైట్ ఫెస్టివల్ కు శ్రీకారం చుట్టింది . ఇందుకు కరీంనగర్ జిల్లా కేంద్రం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు వేదికగా మారింది. తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న కైట్ ఫెస్టివల్‌కు కరీంనగర్ జిల్లాలో అనూహ్యస్పందన లభించింది. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అంగరంగా వైభవంగా జరిగింది. 30 దేశాలకు చెందిన విదేశీ కైట్ రైడర్స్ భారీ పతంగులను మైదానంలో ఎగురవేస్తూ సందడి చేశారు. ఆకాశమే హద్దుగా ఎగుర వేసిన పతంగులు ప్రతి ఒక్కరిని అలరించాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు.

ఫస్ట్ టైమ్..
కరీంనగర్‌లో మొదటి సారి నిర్వహించిన కైట్ ఫెస్టివల్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. రెండు దశాబ్దల క్రితం కరీంనగర్ జిల్లాలో పతంగుల పండుగను నిర్వహించేవారు. కాలక్రమేణ ఈ వేడుకలు కనుమరుగవడంతో చాలా ఏళ్ల తరువాత తిరిగి జిల్లాలో పతంగులు సందడి మొదలైంది. మనదేశంలో జరిగే పతంగుల పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని విదేశీ కైట్ రైడర్స్ అంటున్నారు. అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న పతంగుల ఉత్సవానికి ప్రత్యేకత ఉంది. బాలికలను విద్య వైపు ప్రోత్సహిస్తూ ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్లాలన్న భావస్పూర్తితో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం బాలికల విద్యకు పెద్దపీట వేస్తూ... ఈ కైట్ ఫెస్టివల్‌ని ప్రచార కార్యక్రమంగా ఉపయోగించుకున్నట్లుగా స్థానిక మేయర్ అంటున్నారు. పతంగుల వేడుకతో పండుగ వాతవరణం నెలకొంది. ఈ సందర్బంగా చేనేత, తెలంగాణ వంటకాలకు సంబంధించిన స్టాళ్ల తో పాటు సాంస్కృతిక కార్యాక్రమాలను ఏర్పాటు చేశారు.

09:42 - January 19, 2017

హైదరాబాద్ : కాలాపత్తర్ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మోది కాలనీ, మక్కా కాలనీలో తనిఖీలు జరిగాయి. సౌత్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రౌడీ షీటర్ అయూబ్ అనుచరులు ఇద్దరితో పాటు 10 మంది నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. సరైన పత్రాలు లేని 45 బైక్ లను సీజ్ చేశారు.

 

కాలాపత్తర్ లో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : కాలాపత్తర్ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మోది కాలనీ, మక్కా కాలనీలో తనిఖీలు జరిగాయి. సౌత్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రౌడీ షీటర్ అయూబ్ అనుచరులు ఇద్దరితో పాటు 10 మంది నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. సరైన పత్రాలు లేని 45 బైక్ లను సీజ్ చేశారు.

కాలాపత్తర్ లో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : కాలాపత్తర్ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మోది కాలనీ, మక్కా కాలనీలో తనిఖీలు జరిగాయి. రౌడీ షీటర్ అయూబ్ అనుచరులు ఇద్దరితో పాటు 10 మంది నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు.

09:25 - January 19, 2017

చెన్నై : జల్లికట్టు..అక్కడి ప్రజలకు సెంటిమెంట్ గా మారిపోయింది. జల్లికట్టు పై ఉన్న నిషేధం ఎత్తివేయాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీనితో రాష్ట్రం ఉద్యమం అట్టుడికిపోతోంది. ఈ ఆందోళనతో పన్నీర్ సెల్వం సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
లక్షలాది మంది విద్యార్థులు మెరీనా బీచ్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు. మూడు రోజులుగా ఆందోళన జరుగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులపై వాటర్ బాటిళ్లు విసరడంతో అక్కడి నుండి వారు వెళ్లిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీకి పయనమవుతున్నారు. తమ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు అందరూ అనుకూలంగా ఉన్నారని, దీనిపై ఆర్డినెన్స్ తీసుకరావాలని ప్రధాన మంత్రి మోడీని సెల్వం కోరనున్నారు. మరోవైపు తమిళనాడు ఎంపీలు సైతం ఢిల్లీ బాటపట్టనున్నారు. రాష్ట్రపతి, ప్రధానిని ఎంపీలు కలువనున్నారు. జల్లికట్టు నిషేధం ఎత్తివేయాలని ఎంపీలు కోరనున్నారు. మరి నేతల విజ్ఞప్తులు..విద్యార్థుల ఆందోళనకు కేంద్రం దిగొస్తుందా ? లేదా ? అన్నది వేచి చూడాలి.

కొనసాగుతున్న జల్లికట్టు వివాదం..

చెన్నై : జల్లికట్టుపై వివాదం కొనసాగుతూనే ఉంది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని మూడు రోజుల నుండి మెరీనా బీచ్ లో విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. వీరి ఆందోళనకు సినీ, రాజకీయ నేతలు మద్దతు పలుకుతున్నారు.

ఢిల్లీలో దట్టంగా పొగమంచు...

ఢిల్లీ : హస్తినలో దట్టంగా పొగమంచు అలుముకుంది. 4 అంతర్జాతీయ, 13 దేశీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు వల్ల 28 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 4 రైళ్ల వేళల్లో మార్పులు చేయగా 3 రైళ్లు రద్దు చేశారు.

09:15 - January 19, 2017

కాశ్మీర్ : ఉగ్రవాదులు ఇంకా చొరబడుతూనే ఉన్నారు. తాజాగా జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఎల్ వోసీకి అతి సమీపంలో ఉన్న బందిపోర జిల్లా మొహల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా వర్గాల సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ బలగాలు గాలింపులు చేపట్టారు. గాలింపుల్లో ఒక ఉగ్రవాది ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాదిని పట్టుకొనే ప్రయత్నం చేశారు. ఇది చూసిన ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు.

ఉగ్రవాదిని హతమార్చిన భారత బలగాలు..

కాశ్మీర్ : ఉత్తర్ కాశ్మీర్ లో లష్కర తోయిబా ఉగ్రవాదిని భారత బలగాలు హతమార్చాయి. ఈ ఘటన బందిపోరు జిల్లా హైజన్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

09:12 - January 19, 2017

తెలంగాణ అసెంబ్లీ శీతాలకాల సమావేశాలు ముగిశాయి. అధికార టీఆర్ఎస్ తాను రచించిన వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. . సభలో పట్టు విడుపులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతిపక్షాల దూకుడుకు బ్రేక్‌లు వేసిందని పలువురు పేర్కొంటున్నారు. శీతాకాల సమావేశాలు సజావుగా ముగిశాయన్న సంతోషంతో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పాలక టీఆర్‌ఎస్‌ తన రాజకీయ ఎత్తుగడలను అనుకున్నట్టు అమలు చేసిందా ? మరోవైపు పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ ఎదుట ఉర్జిత్ పటేల్ హాజరయ్యారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రాకేష్ (టీఆర్ఎస్), విద్యాసాగర్ (టిడిపి), మహేష్ గౌడ్ (కాంగ్రెస్), ప్రకాష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి.

09:08 - January 19, 2017

స్కీమ్ వర్కర్లు రేపు దేశవ్యాప్త సమ్మె చేయబోతున్నారు. అంగన్ వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజనం వర్కర్లు, ఆశా వర్కర్లు, సాక్షర భారత్, సర్వశిక్షా అభియాన్, ఉపాధి హామీ పథకం సిబ్బంది ఇలా 60 రకాల స్కీమ్ లలో పనిచేస్తున్నవారే స్కీమ్ వర్కర్లు. ఉద్యోగ భద్రత లేకపోవడం, సమాన పనికి సమాన వేతనం లభించకపోవడం లాంటి సమస్యలు వీరిని వెన్నాడుతున్నాయి. రేపు స్కీమ్ వర్కర్లు దేశ వ్యాప్త సమ్మె చేపట్టడానికి కారణం ఏమిటి? ఈ సమ్మె సందర్భంగా స్కీమ్ వర్కర్లు కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో స్కీమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ధనలక్ష్మి విశ్లేషించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

09:07 - January 19, 2017

ఢిల్లీ : ఇండియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఇన్‌స్టంట్‌ వన్డే సిరీస్‌లోని రెండో వన్డేకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. కటక్‌లోని స్టేడియంలో రంగం సిద్ధమైంది. తొలి వన్డేలో సంచలన విజయం సాధించిన కొహ్లీ అండ్‌ కో ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు ఓయిన్‌ మోర్గాన్‌ సారధ్యంలోని ఇంగ్లీష్‌ టీమ్‌ సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఇండియా,ఇంగ్లండ్‌ రెండో వన్డేకు కటక్‌లో రంగం సిద్ధమైంది. బారాబతి స్టేడియంలో మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న సిరీస్‌ నిర్ణయాత్మక సెకండ్‌ వన్డేకు ఇరు జట్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయి. ఓవైపు తొలి వన్డేలో సంచలన విజయం సాధించిన కొహ్లీ అండ్‌ కో ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు ఓయిన్‌ మోర్గాన్‌ సారధ్యంలోని ఇంగ్లీష్‌ టీమ్‌ సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. తొలి వన్డేలో 351 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించిన భారత జట్టు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.ధావన్‌,యువరాజ్, ధోనీ వంటి సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా....కొహ్లీ, జాదవ్‌ ఫైటింగ్ సెంచరీలతో టీమిండియా విజయం సాధించింది.కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్న కొహ్లీ మీదనే భారత జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ ఆధారపడటం భారత జట్టు విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలు సైతం ఉన్నాయి.

హోరాహోరీ తప్పదా..
ఓపెనర్లు రాహుల్‌,ధావన్‌,యువరాజ్, ధోనీ స్థాయికి తగ్గట్టుగా రాణిస్తే భారత జట్టుకు తిరుగుండదు. తొలి మ్యాచ్‌లో అంతగా ప్రభావం చూపలేకపోయిన భారత బౌలర్లు.....రెండో వన్డేలో అయినా గాడిన పడకపోతే కష్టమే. ఉమేష్‌ యాదవ్‌ స్థానంలో భువనేశ్వర్‌ చోటు దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.ఒక్క మార్పు మినహా పూణే వన్డేలో ఆడిన జట్టుతోనే భారత్‌ బరిలోకి దిగనుంది. మోర్గాన్‌ నాయకత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు ప్రస్తుతం వన్డేల్లో అత్యంత ప్రమాదకరమైన జట్టు. ఎంతటి భారీ స్కోర్‌నైనా చేధించగల సత్తా కలిగిన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ఇంగ్లీష్‌ టీమ్‌...బౌలింగ్‌లో మాత్రం అంత పదునుగా లేదు. పూణే వన్డేలో 350 పరుగుల భారీ స్కోర్‌ చేసినా....ఇంగ్లండ్‌ జట్టు బౌలింగ్‌ ఎటాక్‌ అంతగా ప్రభావం చూపలేకపోయింది. జాసన్‌ రాయ్‌, జో రూట్‌, జో బట్లర్‌,మొయిన్‌ అలీ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ భారత్‌కు ధీటుగా ఉంది. ఇక ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల హార్డ్‌హిట్టింగ్‌ ఆల్‌రౌండర్లు బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ ఓక్స్‌ ఇంగ్లీష్‌ జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో అనుమానమే లేదు. ఇరు జట్ల బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉండటంతో కటక్‌ వన్డేలో టాస్‌ నెగ్గిన జట్టు ముందుగా బౌలింగ్‌ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్‌ వన్డేలో నెగ్గి భారత్‌ సిరీస్‌ సొంతం చేసుకుంటుందా....లేక ఇంగ్లండ్‌ జట్టు అంచనాలకు మించి రాణించి సిరీస్‌ను సమం చేస్తుందో లేదో చూడాలి. ఓవరాల్‌గా కటక్‌ వన్డేలోనూ ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు.

09:06 - January 19, 2017

చెన్నై : తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టును అనుమతించాలని చేపట్టిన నిరసన ఉగ్రరూపం దాల్చింది. మెరీనా బీచ్‌లో భారీగా తరలివచ్చిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేంద్రం జోక్యం చేసుకుని జ‌ల్లిక‌ట్టుపై నిషేధాన్ని ఎత్తివేసేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని పన్నీర్‌సెల్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పన్నీర్‌ సెల్వం గురువారం ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్ధృత రూపం దాల్చింది. చెన్నైలోని మెరీనా బీచ్ నుంచి మధురై, కోయంబత్తూర్‌ వరకు ఆందోళన కొనసాగింది. జల్లికట్టు ఆందోళకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్థులు నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. పలువురు సినీ నటీనటులు కూడా తమ మద్దతు తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి చెన్నై మెరీనా బీచ్‌ వద్దకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం పన్నీరు సెల్వం జల్లికట్టు ఆందోళనపై రాష్ట్ర డీజీపీతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్‌ జారీచేసేవిధంగా కేంద్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపుతామని, ఆందోళన విరమించాలని పలువురు మంత్రులు కోరినప్పటికీ ఫలితం కనిపించ లేదు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయడానికి తమిళనాడు రాష్ట్ర ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం సమావేశమయ్యే అవకాశం ఉంది. పొంగల్‌ పండగ ముగిసినా జల్లికట్టును నిర్వహించలేదన్న ఆగ్రహం యువతలో చల్లారలేదు. జల్లికట్టు వేళ ఏళ్ల నాటి క్రీడ. పొంగల్ రోజున తమిళ గ్రామాల్లో జల్లికట్టు క్రీడను ఆడడం సర్వసాధారణం. బలమైన ఎద్దును లొంగదీసుకునే క్రమంలో అటు ఎద్దులకు, ఇటు యువకులకు అనేకసార్లు తీవ్ర గాయాలవుతాయి. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. జల్లికట్టులో ఎద్దులను హింసకు గురిచేయటంపై 2004 నుంచీ పెటా తదితర జంతుసంరక్షణ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది.

09:01 - January 19, 2017

విజయవాడ : ఏపీలో విద్యుత్ వినియోగదారులకు త్వరలో పవర్ షాక్ తగలనుంది. ఏప్రిల్ నుంచి రూ.850 కోట్ల మేర చార్జీలు పెంచేందుకు వీలుగా విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం నుంచి కూడా అనుమతి రావడంతో ఆంధ్రప్రదేశ్ నియంత్రణ మండలికి ఈ ప్రతిపాదనలు వెళ్లాయి. ఏపీఈఆర్సీ ఓకే చెబితే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల పిడుగు పడటం ఖాయంగా కనిపిస్తోంది.గృహ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ చార్జీల రూపంలో భారం పడనుంది. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్) కొత్త విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించాయి. డిస్కమ్ లు ఏపీఈఆర్సీకి 2017-18 వార్షిక ఆదాయం, అవసర నివేదికలను ఇప్పటికే అందచేశాయి. ఇందులో రెండు డిస్కమ్ లకు కలిపి 7,177 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నట్టు పేర్కొన్నాయి. అయితే సబ్సిడీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ తగ్గించాలనే సూచనలు వెళ్లినట్టు తెలుస్తోంది. విద్యుత్ చార్జీల పెంపు 4-5 శాతానికి అటు ఇటుగా ఉండొచ్చు. డిస్కమ్స్ బలోపేతంపై కేంద్రంతో కుదుర్చుకున్న ఉదయ్ ఒప్పందంలో కూడా 5 శాతం మేర చార్జీలు పెంచుతామని సర్కార్ ప్రతిపాదించింది. 2017-18 సంవత్సరానికి 7,177 కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో వార్షిక ఆదాయ అవసర నివేదికను ఇంతకు ముందే డిస్కమ్స్ సమర్పించడంతో వినియోగదారులపై విద్యుత్ చార్జీల పిడుగుపడనుంది.

స్థిర ఛార్జీలు..
విద్యుత్ చార్జీలకు తోడు ప్రతినెలా స్థిర చార్జీని వినియోగదారుల నుంచి డిస్కమ్స్ వసూలు చేస్తాయి. ఈ స్థిర చార్జీల పెంపుదలను కోరుతూ ప్రతిపాదనలు సిద్ధంచేసి ఉంచారు. గృహ రంగంతోపాటు పరిశ్రమలు, తదితరాలకు నెలకు రూ.55.12 పైసల చొప్పున స్థిర చార్జీని ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న అభిప్రాయానికి డిస్కమ్స్ వచ్చాయి. విద్యుత్ చార్జీల పెంపు జరిగితే సామాన్యుల మరింత భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల పరిశ్రమ వంటి వాటికి ప్రస్తుత ధర యూనిట్ రూ.4.75 పైసలు కొనసాగించాలని భావిస్తున్నాయి. గృహరంగం, వాణిజ్యం, పారిశ్రామిక, కుటీర పరిశ్రమలు ఇలా రకరకాల విభజనల పేరిట విద్యుత్ చార్జీలను పంపిణీ సంస్థలు ప్రతిపాదిస్తున్నాయి. ఈ మేరకే చార్జీలు వసూలు చేస్తున్నాయి. కేంద్ర సూచనను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఈ తరగతులను గృహరంగం, వ్యవసాయం, పరిశ్రమలు, సంస్థలు ఇలా నాలుగు విభాగాలుగా విభజించి చార్జీలు విధించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సన్నద్ధం అవుతున్నాయి.

08:46 - January 19, 2017

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో సమస్యల పరిష్కారకర్తగా గుర్తింపు తెచ్చుకున్న మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వ్యూహరచనకే పరిమితమయ్యారా... కీలక నేతల మధ్య ఆధిపత్య పోరుతో హరీశ్‌ ప్రాధాన్యత తగ్గిందా... పద్దెనిమిది రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో హరీశ్‌రావు తెరవెనుకకే పరిమితమయ్యారన్న అంశంపై ఇప్పుడు టీఆర్ఎస్ నేతల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు... తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్‌ఎస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సమస్యలకు తరుణోపాలు, సంక్షోభాలకు పరిష్కారాలు సూపించడంలో చాలా సందర్భాల్లో కీలక పాత్ర పోషించార్న పేరు ఉంది. అటువంటి నేత ఈసారి జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వ్యూహరచరనకే పరిమితమైన విషయంపై పార్టీలో చర్చ సాగుతోంది.

పదిహేను అంశాలపై లఘు చర్చ..
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కొంత మంది మంత్రుల మాదిరగానే హరీశ్‌రావు తన శాఖకు సంబంధించిన అంశాలపై సమాధానాలు ఇచ్చి సంతృప్తి పడాల్సి వచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పదిహేను అంశాలపై స్వల్వ వ్యవధి చర్చ జరిగింది. పదహారు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో వివిధ అంశాలపై జరిగిన చర్చల్లో మంత్రి కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి మినహా, మిగిలిన ఏ మంత్రి కూడా పాల్గొనే అవకాశం దక్కలేదు. మిషన్‌ భగీరథ, టీఎస్‌ ఐ పాస్‌, పురపాలక సంఘాలపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చే అవకాశం కేటీఆర్‌కు దక్కింది. అయితే మిషన్‌ భగీరథపై జరిగిన చర్చల్లో ప్రతిపక్షాలు పైచేయి సాధించడంతో మంత్రి కేటీఆర్‌ సహా, అధికార పక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ఈ అంశంపై చర్చ జరిగిన సమయంలో హరీశ్‌ సభలో లేకపోయినా, విషయం తెలుసుకున్న వెంటనే సభకు వచ్చి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చేశారు.

అసెంబ్లీలో చర్చకు రాని మిషన్‌ కాకతీయ..
తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్‌ కాకతీయను అమలు చేయడంతో హరీశ్‌రావు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ఈ అంశం అసెంబ్లీలో చర్చకు కూడా రాలేదు. ఈ అంశాన్ని అజెండాలో చేర్చిన రోజు మరో కీలకమైన అంశం తెరపైకి రావడంతో మిషన్‌ కాకతీయ పక్కకు పోయింది. శాసనమండలిలో మాత్రం చర్చ జరిగింది. ఈ విషయాలన్నింటనీ దగ్గర నుంచి పరిశీలిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు... అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో హరీశ్‌ ప్రాధాన్యత తగ్గుతూ, క్రమంగా కేటీఆర్‌ ప్రాముఖ్యత పెరుగుతోందన్న చర్చ ప్రారంభమైంది.

మత్స్యశాఖ, ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌..
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక పాత్ర పోషించారు. హరితహారం, కల్యాణలక్ష్మి, జాతీయ రహదారులు, గృహనిర్మాణం, మత్స్యశాఖ, ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌, సంక్షేమ పథకాలు, వ్యవసాయం వంటి అంశాలపై జరిగిన చర్చల్లో ఆయా శాఖ మంత్రులు కన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌... అన్నీ తానై వ్యవహరించారు. సమావేశాలు జరిగినన్ని రోజులూ, శాసనసభా వ్యవహారాల మంత్రిగా హరీశ్‌రావు.. అసెంబ్లీ నిర్వహణకే పరిమితం కావాల్సి వచ్చిందన్న చర్చ సాగుతోంది.

 

08:45 - January 19, 2017

హైదరాబాద్ : పోలవరం, అమరావతి భూ నిర్వాసిత రైతులకు అండగా ఉంటానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సమస్య పరిష్కారానికి మంత్రులతో మాట్లాడుతానని... అప్పటికీ పరిష్కారం కాకుంటే ప్రజాఉద్యమానికి దిగుతానని హెచ్చరించారు. పరిస్థితి అంతవరకు వెళ్లకుండా ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని కోరారు. పోలవరం, అమరావతి భూ నిర్వాసిత రైతులు బుధవారం పవన్‌ను కలిసి వారి సమస్యలను పవన్‌కు మొరపెట్టుకున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో పోలవరం ప్రాజెక్ట్‌ బాధితులు, అమరావతి భూ నిర్వాసిత రైతులు కలిశారు. మట్టి డంపింగ్‌ పేరిట తమ నుంచి 203 ఎకరాల భూమిని అధికారులు బలవంతంగా సేకరిస్తున్నారని పోలవరం మండలంలోని మూలలంక గ్రామస్తులు పవన్‌కు విన్నవించారు. వారి సమస్యలను పవన్‌తో మొరపెట్టుకున్నారు. అధికారులపై ఫిర్యాదు చేశారు. కోర్టు తీర్పులను చూపించినా అధికారులు లెక్కచేయడం లేదని, తమ భూములను బలవంతంగా లాక్కొంటున్నారని కన్నీరు పెట్టుకున్నారు. డంపింగ్‌ కోసం దగ్గర్లోని బీడు భూములను చూపించినా అధికారులు అటువైపు చూడకుండా.. మూడు పంటలు పండే తమ భూములనే లాక్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మూల లంక..
మూలలంక గ్రామస్తుల సమస్య పరిష్కారం కోసం రాష్ట్రమంత్రులతో మాట్లాడుతానని పవన్‌ వారికి హామీనిచ్చారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ప్రజా ఉద్యమంలోకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ తర్వాత అమరావతిలోని లంక గ్రామాలకు చెందిన ఎస్సీ రైతులు పవన్‌తో భేటీ అయ్యారు. తమకు 1450 గజాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. ఇప్పుడు అధికారులు మాటమారుస్తున్నారని పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు. భూ నిర్వాసితులకు పరిహారం అందించడంలో అన్యాయం జరుగుతోందని పవన్‌ అన్నారు. లంక గ్రామాల రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. త్వరలోనే లంక గ్రామాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితి తెలుసుకుంటానని చెప్పారు. జనసేన పార్టీ నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకున్నానని.. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోనని స్పష్టం చేశారు. పోలవరం, అమరావతి భూ నిర్వాసితుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పవన్‌ కోరారు. ప్రభుత్వ స్పందనను బట్టి రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని పవన్ పేర్కొన్నారు.

08:11 - January 19, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టామన్న సంతృప్తితో కాంగ్రెస్‌ శాసనభా పక్షం ఉంది. చాలా అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ అనుభరాహిత్యాన్ని ఎత్తిచూపిన విషయాలను ప్రస్తావిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ తీరు మార్చుకోపోతే వచ్చే సమావేశాల్లో తమ తడాకా చూపిస్తామని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో గతంలో కంటే భిన్నంగా జరిగాయి. ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మధ్య వాడీవేడీ చర్చ సాగింది. అన్ని విషయాల్లో పైచేయి సాధించేందుకు అధికార పక్షంచేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయగలిగామన్న ఆత్మసంతృప్తితో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం ఉంది.

కొత్త చట్టమా.. ఉన్న చట్టానికి సవరణా .. అంటూ నిలదీశాం..
ముఖ్యంగా నాలుగు అంశాల్లో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తమకున్న అనుభవాన్ని రంగరించి పోయడంతో భూసేకరణ చట్టంపై చర్చ సందర్భంగా ప్రభుత్వ ఆత్మరక్షణలో పడిందన్న వాదాన్ని వినిపిస్తున్నారు. కొత్త చట్టమా, ఉన్న చట్టానికి సవరణా అంటూ నిలదీయడంతో సమాధానం చెప్పలేక ప్రభుత్వం నీళ్లు నమిలిందన్న వాదాన్ని లేవనెత్తున్నారు. ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రైతుల రుణమాఫీ, పంటనష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు విషయాల్లో అప్రభుత్వ అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలను కాంగ్రెస్‌ సభ్యులు ఎత్తి చూపారు. రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను ఇతర అవసరాలకు మళ్లించిన తీరుపై సర్కార్‌ను నిలదీసిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మిషన్‌ భగీరథ అమల్లో జరుగుతున్న అవినీతి ఎండగట్టి, సర్కార్‌ కళ్లు తెరిపించాని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ పై జరిగిన చర్చలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో తమ వ్యూహం బెడిసికొట్టిందన్న వాస్తవాన్ని సీఎల్‌పీ అంగీకరిస్తోంది. ఈ అంశంపై బయట చూపిన దూకుడును సభలో ప్రదర్శించలేకపోయామని చెబుతున్నారు.

భట్టి విక్రమార్క ప్రశ్నలతో ఇరకాటంలో పడ్డ సభాపతి..
అసెంబ్లీలో విపక్షాల పట్ల స్పీకర్‌ మధుసూదనాచారి వివక్ష చూపారన్నది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఆరోపణ. ఈ విషయాన్ని ఎత్తిచూపామని చెబుతున్నారు. అవసరమైతే స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టడానికి కూడా సిద్ధమంటూ ఒత్తిడి తేవడంతో అటు ప్రభుత్వ వైఖరితో పాటు, సభాపతి తీరు మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టీఎస్‌ ఐ పాస్‌పై చర్చ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌కు స్పీకర్‌ మైక్‌ ఇవ్వడం తమకు బాగా లాభించిన అంశాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్నారు. దీనిపై తమ సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క ... తన ప్రశ్నలతో సభాపతిని ఇరకాటంలో పడేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తాన్ని అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షంగా తమ పాత్రను సమర్థవంతంగా నిర్వంచగలిగామన్న సంతృప్తితో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు.

08:02 - January 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాలకాల సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ తాను రచించిన వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసింది. ప్రతిపక్షాలను పూర్తిగా కట్టడిచేసి తన అధిపత్యాన్ని నిరూపించుకుంది. సభలో పట్టు విడుపులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతిపక్షాల దూకుడుకు బ్రేక్‌లు వేసింది. దీంతో శీతాకాల సమావేశాలు సజావుగా ముగిశాయన్న సంతోషంతో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పాలక టీఆర్‌ఎస్‌ తన రాజకీయ ఎత్తుగడలను అనుకున్నట్టు అమలు చేసింది. పద్దెనిమిది రోజులపాటు జరిగిన భేటీలో ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడే విధంగా వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసింది. దీంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో సంతోషం కనిపిస్తోంది.

అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలనుకున్న విక్షాలు..
భూసేకరణ బిల్లు, ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌ అంశాల్లో మినహా, మిగిలిన విషయాల్లో ఎక్కడా ఇబ్బందులు ఎదురు కాలేదు. ఏ అంశలో కూడా ప్రతిపక్షాలది పైచేయి కాదాన్న వ్యూహంతో వ్యవహరించింది. అధికార పక్షాన్ని ఇరుకునపెటాలని విపక్షాలు అనుకున్నాయి. దీంతో ప్రతిపక్షాలు సూచించిన అంశాలనే ముందుగా చర్చించేందుకు అంగీకరించి, విపక్షాల కాళ్లకు బంధం వేసేలా చేసింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రైతాంగ సమస్యలు, నయీం ఎన్‌కౌంటర్‌ వంటి సున్నితమైన అంశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుసరించిన వ్యూహంతో ఎటువంటి సమస్యలు లేకుండానే అధికార పక్షం బయటపడగలిగింది. అధికారపక్షంగా ఆధిపత్యం చెలాయించకుండా చాలా అంశాల్లో ప్రతిపక్షాల సూచనలకు విలువ ఇచ్చిన సందర్భాన్ని హరీశ్‌రావు గుర్తు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు దేశానికే ఆదర్శవంతగా నిలుస్తాయన్న ఆశాభావం టీఆర్‌ఎస్‌ నేతల్లో కనిపిస్తోంది.

 

07:53 - January 19, 2017

గుంటూరు : పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి.. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అనుమతి లేదని పోలీసులు చెబుతుంటే.. పర్యటించి తీరుతామని వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. నేటి నుంచి వైసీపీ అధినేత జగన్‌ పర్యటన నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మరోసారి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికే జగన్ పర్యటనకు సిద్ధమయ్యారంటూ మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ పర్యటనతో టిడిపిలో కలవరం మొదలైదంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రతిదాడి చేస్తున్నారు. రాజధాని పరిధిలోని కృష్ణానది లంకల్లో ఉన్న అసైండ్‌ భూముల రైతుల సమస్యలపై జగన్‌ ప్రధానంగా దృష్టిపెట్టారు. సాధారణ రైతులకు ఇస్తున్న ప్యాకేజీని తమకు వర్తింపజేయడానికి సీఆర్‌డీఏ అధికారులు ఒప్పుకోవడంలేదని అక్కడి రైతులు వాపోతున్నారు. సమస్యలను వైసీపీ అధినేత జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు . దీంతో రాజధాని గ్రామాల్లో పర్యటించడానికి జగన్‌ సిద్ధమవడంతో అధికార -ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. జగన్‌ తీరుపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. రాజధాని నిర్మాణాన్ని జగన్ అడ్డుకునేందుకు రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శిస్తున్నారు.

ఘాటుగా రియాక్ట్..
మంత్రుల విమర్శలపై వైసీపీ నేతలు ఘాటుగా రియాక్ట్‌ అవుతున్నారు. రాజధాని ప్రాంతంలో జగన్‌ పర్యటిస్తే.. భూముల కేటాయింపులో తమ బండారం బయటపడుతుందనే టీడీపీ నేతలు, మంత్రులు భయపడుతున్నారని ఎదురు దాడికి దిగుతున్నారు. మరోవైపు జగన్‌ పర్యటనకు పోలీసులు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. వెలగపూడిలో సచివాలయలం ఉండడం, ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఉద్యోగులు అందరూ అక్కడి నుంచే పాలన సాగిస్తుండడంతో ఈ ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు, ఉద్రిక్తతలు జరిగే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేమంటున్నారు. ఒకవేళ జగన్ పర్యటించాలనుకుంటే తాము సూచించిన ప్రకారమే వెళ్లాలని పోలీసులు తేల్చి చెబుతున్నారు. ఇదిలావుంటే రాజధాని గ్రామాల్లో టీడీపీ తెగ హడావిడి చేస్తోంది. జగన్‌ పర్యటించే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జెండాలు, ప్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. అటు వైసీపీ నాయకులు కూడా పోటాపోటీగా బ్యానర్లు కట్టేస్తున్నారు . దీంతో రాజధాని గ్రామాల్లో రాజకీయవాతావరణం టెన్షన్‌గా మారింది.

ఢిల్లీలో పర్యటించనున్న మంత్రి కామినేని..

విజయవాడ : నేడు, రేపు ఢిల్లీలో ఏపీ మంత్రి కామినేని పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు అందాల్సిన నిధులపై అధికారులతో చర్చించనున్నారు.

రాజధాని ప్రాంతాల్లో నేడు జగన్ పర్యటన..

హైదరాబాద్ : ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యలు తెలుసుకోనున్నారు.

నేడు టీఎస్ మహిళా కాంగ్రెస్ ఆందోళనలు.

హైదరాబాద్ : నోట్ల రద్దుతో ప్రజల కష్టాలకు నిరసనగా నేడు కలెక్టరేట్ల ఎదుట టీఎస్ మహిళా కాంగ్రెస్ ఆందోళనలు చేయనుంది.

మోడీని కలువనున్న పన్నీర్ సెల్వం..

చెన్నై : భారత ప్రధాని నరేంద్ర మోడీని సీఎం పన్నీర్ సెల్వం కలువనున్నారు. జల్లికట్టు పై నిషేధం తొలగించేలా ఆర్డినెన్స్ తీసుకోవాలని మోడీని సెల్వం కోరనున్నారు.

రాష్ట్రపతి, ప్రధానిని కలువనున్న తమిళనాడు ఎంపీలు..

ఢిల్లీ : నేడు రాష్ట్రపతి, ప్రధానిని తమిళనాడు ఎంపీలు కలువనున్నారు. జల్లికట్టు నిషేధం ఎత్తివేయాలని ఎంపీలు కోరనున్నారు.

Don't Miss