Activities calendar

20 January 2017

21:56 - January 20, 2017

బ్రాహ్మణుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : బ్రాహ్మణుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. బ్రాహ్మణ సంక్షేమానికి సొసైటీ ప్రారంభించాలన్నారు. బ్రాహ్మణ సదన్ నిర్మాణాన్ని ప్రారంభించాలని తెలిపారు.

 

బద్వేల్ ఎక్సైజ్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

కడప : బద్వేల్ లో ఎక్సైజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రూ.48 వేల లంచం తీసుకుంటూ ఎక్సైజ్ ఎస్ హిమబిందు పట్టుబడింది. 

జల్లికట్టు ఆర్డినెన్స్ కు కేంద్రం ఆమోదం

ఢిల్లీ : జల్లికట్టు ఆర్డినెన్స్ కు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. తమిళనాడు పంపిన ఆర్డినెన్స్ ను కేంద్రం ఆమోదించింది.  పంపింది. జల్లికట్టు ఆర్డినెన్స్ కేంద్రం రాష్ట్రపతికి పంపనుంది. జల్లికట్టు ఆర్డినెన్స్ తో మెరీన బీచ్ లో సంబరాలు అంబరాన్నంటాయి.

బహదుర్ పురాలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : బహదుర్ పురాలో అగ్నిప్రమాదం సంభవించింది. పాత టైర్ల గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నాయి.

మరికొద్దిసేపట్లో ట్రంప్ ప్రమాణస్వీకారం

వాషింగ్టన్ : మరికొద్దిసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమెరికా 45 వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

21:35 - January 20, 2017

ఫార్మసిటీ పంచాయితీ లేవట్టిన జేఏసీ.. పేదోళ్ల భూములల సర్కారు కోదండం, బూతులు తిడుతున్న ఎమ్మెల్సీ బాబు.. మా మల్లన్న తాతజెప్పిండు జవాబు, సిద్దిరామయ్యకు ప్రతిపక్షమైన కాకులు... కర్నాకటలనే కాదు.. కేరళాల ఒడవని పగ, పోలీసోల్లకు సినిమా సూపెట్టిన పెద్ద సారు... మిగతాయి జూసి చేయగాల మరి పోరు, తిరుమల ఎంకన్న ప్రసాదంల జెర్రీ.. దేవుడే ఎంక్వరీ చేయాలే మరీ, రాజన్నగుడిల మధుగానికి బరితపూజ... ఆడామే రమ్మంటే పోలీసొళ్లొచిండ్రు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

21:24 - January 20, 2017

వాషింగ్టన్ : మరికొద్దిసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమెరికా 45 వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ట్రంప్ కోసం అధునాతన హంగులతో లీమోసైన్ కారు సిద్ధమైంది. కవాతులో 3 వేల మంది పోలీసులు, 7 వేల మంది భద్రతా బలగాలు పాల్గొన్నారు. మరో ట్రంప్ ప్రమాణస్వీకారాన్ని నిరసిస్తూ పలు చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసులు వారిని చెదరగొడుతున్నారు. 

 

21:14 - January 20, 2017

ట్రంప్ ప్రమాణస్వీకారంపై 10 టివి డిబేట్ నిర్వహిచింది. ఈ కార్యక్రమంలో విశ్లేషకులు పూర్ణచంద్రశాస్త్రీ, పద్మజా షా ( ప్రొఫెసర్ ఇన్ జర్నలిజం ఫ్రం ఉస్మానియా యూనివర్సిటీ)లు పాల్గొని, మాట్లాడారు. భిన్నవాదనలు వినిపించారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:08 - January 20, 2017

బీసీ సంక్షేమ శాఖపై మంత్రి జోగు రామన్న సమీక్ష

హైదరాబాద్ : బీసీ సంక్షేమ శాఖపై మంత్రి జోగు రామన్న సమీక్ష చేశారు. బీసీ హాస్టల్స్, గురుకుల స్కూళ్లు, స్టడీ సర్కిల్స్, భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి 119 గురుకులాల్లో తరగతులు ప్రారంభించేందుకు తాత్కాలిక భవనాలను వెంటనే ఎంపిక చేయాలన్నారు. 

ఉగ్రవాద సానుభూతిపరుడి అరెస్టు

హైదరాబాద్ : రియాద్ లో హైదరాబాద్ కు చెందిన ఉగ్రవాద సానుభూతిపరుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన సయ్యద్ జకీర్ ను పోలీసులు భారత్ కు పంపారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు జకీర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. బీజేపీ నేతల హత్య కుట్ర కేసులో జకీర్ నిందితుడుగా ఉన్నాడు. 

 

20:55 - January 20, 2017

ఢిల్లీ : నోట్ల రద్దుతో దేశంలో ఏర్పడ్డ నగదు కొరత ప్రభావం త్వరలోనే సమసి పోనుందని రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ భరోసా ఇచ్చారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ముందు హాజరైన పటేల్‌ ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అనుమానిత డిపాజిట్లపై ఆదాయపు పన్ను శాఖ, ఫైనాన్సియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ లాంటి ప్రత్యేక ఏజెన్సీలు దర్యాప్తు జరుపుతున్నాయని ఉర్జిత్ పేర్కొన్నారు. జీడీపీపై నోట్ల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని... దీర్ఘకాలంలో నోట్ల రద్దు సానుకూల ప్రభావమే చూపుతుందన్నారు. బ్యాంకులు, సర్వీసు ప్రొవైడర్లతో చర్చలు జరిపి ఆన్‌లైన్‌ లావాదేవీల ఛార్జీలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉర్జిత్ తెలిపారు.

 

20:53 - January 20, 2017

లక్నో : యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తుపై ప్రకటన వెలువడక ముందే ఎస్పీ 191 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో అఖిలేష్‌ యాదవ్‌ బాబాయ్‌ శివపాల్‌ యాదవ్, ఆజంఖాన్‌ల పేర్లు కూడా ఉన్నాయి. గ‌త నెల‌లో త‌న తండ్రి ములాయం విడుద‌ల చేసిన జాబితానే మార్చి అఖిలేష్ విడుద‌ల చేశారు. ములాయంసింగ్‌ యాదవ్‌ అఖిలేష్‌కు ఇచ్చిన 38 మంది అభ్యర్థుల జాబితాలో నుంచి 12 మంది పేర్లను తొలగించారు. శివపాల్‌ యాదవ్‌ సొంత నియోజకవర్గమైన జస్వంత్‌నగర్, రాంపూర్‌ నుంచి ఆజంఖాన్ పోటీ చేయనున్నారు. ఎస్పీ ప్రకటించిన జాబితాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన 7 సీట్లు ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్‌ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌-ఎస్పీల మధ్య పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోపార్టీ ఆర్‌ఎల్‌డితో పొత్తు ప్రసక్తే లేదని ఎస్పీ ఇప్పటికే తేల్చి చెప్పింది.

 

20:47 - January 20, 2017

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనం ఈనెలాఖరుకు పూర్తవుతుందని ఏపీమంత్రి నారాయణ అన్నారు. నిర్మాణంలో ఉన్న  తాత్కాలిక అసెంబ్లీ, శాసనమండలి భవనాలను ఆయన ఇవాళ పరిశీలించారు. పనుల పురోగతిపై ఇంజనీర్లను  అడిగి తెలుసుకున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఈనెలాఖరుకు పూర్తయితే మంచిరోజు చూసుకుని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

 

సుప్రీంకోర్టులో బీసీసీఐ కేసు విచారణ

ఢిల్లీ : సుప్రీంకోర్టులో బీసీసీఐ కేసు విచారణ జరిగింది. 9 మంది పేర్లతో ఓ జాబితాను ఏజీ కోర్టుకు అందజేసింది. జాబితా పెద్దగా ఉందని కోర్టు తిరస్కరించింది. సభ్యుల సంఖ్య ఎంత ఉండాలనేదానిపై వచ్చే బుధవారంలోగా నిర్ణయం వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది. బీసీసీఐ అధ్యక్షకార్యదర్శుల తొలగింపుపై పునరాలోచించాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టును కోరారు.

19:42 - January 20, 2017

విశాఖ : ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖాపెట్టి కోట్లాది రూపాయలు తీసుకున్నట్టు తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రత్యూష కంపెనీ డైరెక్టర్‌ పరుచూరి భాస్కర్‌రావు అన్నారు. తాము ఆ భూమిని 2005లోనే కొన్నామని చెప్పారు. రెవెన్యూ అధికారుల తప్పిదంతో సర్వేనంబర్లు మారాయని.. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు.  తనపై కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

19:38 - January 20, 2017

నెల్లూరు జిల్లాలో భారీగా ఐసిఐసిఐ ఏటీఎం కార్డుల లభ్యం

నెల్లూరు : 3వ మైలు వద్ద రోడ్డు పక్కన ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం కార్డులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు సంచుల్లో తెచ్చి వీటిని పడేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఏటీఎం కార్డుల్లో వ్యాలిడ్ తేదీ లేదు. దీంతో ఫేక్ ఖాతాల పేరిట భారీగా అవకతవకలు జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. 

కనిగిరిలో దారుణం

ప్రకాశం : కనిగిరిలోని ఓ మదర్సాలో దారుణం వెలుగుచూసింది. వాటర్‌ ట్యాంకర్‌ పగులగొట్టారని ఆరోపణలతో టీచర్.. 10 మంది విద్యార్థులకు వాతలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కళ్లల్లో ఉల్లిరసం పోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 

19:19 - January 20, 2017

నెల్లూరు : 3వ మైలు వద్ద రోడ్డు పక్కన ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం కార్డులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు సంచుల్లో తెచ్చి వీటిని పడేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఏటీఎం కార్డుల్లో వ్యాలిడ్ తేదీ లేదు. దీంతో ఫేక్ ఖాతాల పేరిట భారీగా అవకతవకలు జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:16 - January 20, 2017

కృష్ణా : 10టీవీ 2017క్యాలెండర్‌ ఆవిష్కరణ విజయవాడలో ఘనంగా జరిగింది. ఆంధ్రరత్న భవన్‌లో ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.  ప్రజలకు వాస్తవాలను అందించడంలో 10టీవీ ఎప్పుడూ ముందుంటుందని పద్మశ్రీ అన్నారు. ప్రజాపోరాటాకు 10టీవీ అండగా నిలుస్తోందన్నారు.  10టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజా హక్కుల కోసం నిలబడుతోన్న 10టీవీ అందరూ ఆదరించాలని ఆమె కోరారు.

 

19:13 - January 20, 2017

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియపై దాడి ఘటన రాజకీయరంగు పులుముకుంది. టీడీపీ, వైసీపీకి చెందిన నేతల మధ్య విమర్శ, ప్రతివిమర్శలకు దారి తీసింది. అఖిలప్రియపై అసలు దాడే జరుగలేదని వైసీపీ నేతలు చెబుతుండగా.. . సీపీ టీవీ ఫుటేజే దాడి జరిగిందనడానికి సాక్ష్యమని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ తనపై జరిగిన దాడిపై జగన్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.  మహిళలంటే ఆయనకు గౌరవం లేదా అని నిలదీశారు. 
ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాఫిక్‌ 
టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియపై వైసీపీ కార్యకర్తల దాడి ఘటన ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాఫిక్‌ అయ్యింది. ఈ దాడిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.  అఖిలప్రియపై జరగని దాడిని జరిగినట్లుగా టీడీపీ నేతలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు.  ఈ ఘటన జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని.. ఎలాంటి దాడిగాని, గొడవగాని జరుగలేదన్నారు.  అఖిలప్రియపై అసలు దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని, అలాంటి నైజం కూడా తమది కాదని  స్పష్టం చేశారు. రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే టీడీపీ నేతలు చౌకబాబు ఆరోపణలు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.
అంబటి వ్యాఖ్యలపై స్పందించిన అఖిలప్రియ 
అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అఖిలప్రియ తీవ్రంగా స్పందించారు.  అసలు దాడే జరుగలేదని అంబటి చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. వైసీపీ జెండాలు పట్టుకుని తాగి ఉన్న కొందరు తన కారుపై దాడి చేశారని చెప్పారు. దాడి దృశ్యాలు సీపీ ఫుటేజీల్లో స్పష్టంగా ఉన్నా.. వైసీపీ నేతలకు అవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా తన కారు అద్దాలు పగులగొట్టేందుకు  వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారన్నారు.  దాడి ఘటనపై ఇప్పటి వరకు జగన్‌ ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. అసలు మహిళలంటే జగన్‌కు గౌరవం లేదా లేక దాడులను ప్రోత్సహిస్తున్నారా అని  మండిపడ్డారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ దాడి కేసును పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అందులోని దృశ్యాల్లో నిందితులను గుర్తించి వైసీపీకి చెందిన 8 మందిని అరెస్ట్‌ చేశారు.

 

19:03 - January 20, 2017

ప్రకాశం : కనిగిరిలోని ఓ మదర్సాలో దారుణం వెలుగుచూసింది. వాటర్‌ ట్యాంకర్‌ పగులగొట్టారని ఆరోపణలతో టీచర్.. 10 మంది విద్యార్థులకు వాతలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కళ్లల్లో ఉల్లిరసం పోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:48 - January 20, 2017

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు...లేఅవుట్లపై బల్దియా దృష్టిసారించింది.  నిత్యం వినిపిస్తున్న ఆరోపణలతో పాటు...ఇటీవల అసెంబ్లీలో సైతం ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాయి. నానక్‌రామ్ గూడాలో 11 మంది కూలీల ప్రాణాలను బలిగొంది కూడా అక్రమ నిర్మాణమే...దీంతో కూల్చివేతలపై గ్రేటర్ అధికారులు వేగం పెంచారు. 
పుట్టుగోడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలు
జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకు అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని అటూ ప్రభుత్వం...ఇటు బల్దియా ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్‌గా ఉంది. గడిచిన కొద్ది నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రమాదాలకు కారణమైన అన్ని నిర్మాణాలు అక్రమ నిర్మాణాలే కావడం విశేషం. ఓల్డ్ సిటి మొదలుకొని ఇటీవల నానక్‌రామ్‌ గుడా ఘటన వరకు పదుల సంఖ్యలో కూలీలు తమ ప్రాణాలు కోల్పోయారు.   
జీహెచ్ఎంసీ దిద్దుబాటు చర్యలు
లేఅవుట్ రెగ్యులరైజేషన్, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 28 తరువాత ఎలాంటి అక్రమ నిర్మాణం చేపట్టినా సహించేది లేదని ప్రకటించింది. మరోసారి ఇలాంటి అవకాశం ఉండదంటూ తేల్చి చెప్పింది. అయినప్పటికీ గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. వీటిపై వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినా వాటిపై చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ అధికారులు అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రజల నుంచే కాకుండా ప్రతి పక్షాల నుంచికూడా తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో బల్డియా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. 
అక్రమ నిర్మాణాల కూల్చివేత 
జీహెచ్ఎంసీ దృష్టికి వచ్చిన అక్రమ నిర్మాణాలన్నింటిని అధికారులు కూల్చివేస్తున్నారు. హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఏర్పాటు చేసిన లేఅవుట్ నిర్మాణాలను కూల్చివేశారు. అక్కడే ఏర్పాటు చేసిన ప్రైడ్ ఇండియా ఆఫీస్‌ను సైతం సీజ్ చేశారు. అయితే అక్రమ నిర్మాణాలకు ప్రధాన కారణం రాజకీయ నేతలే అన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. వారి అండతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. 

18:45 - January 20, 2017

సిద్ధిపేట : 10టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.  10టీవీ ప్రజాసమస్యలను వెలికితీయడంలో ముందుందని...  భవిష్యత్‌లోనూ ఇదే ఒకవడి కొనసాగించాలని కలెక్టర్‌ సూచించారు.  ఆడపిల్లల భద్రత గుర్తు చేస్తూ 10టీవీ క్యాలెండర్‌ తీసుకురావడం అభినందనీయమన్నారు. 

 

18:42 - January 20, 2017

హైదరాబాద్ : కొమ్ములు తిరిగిన ఎద్దులు, దుమ్ము రేపే దున్నపోతులు, పాలిచ్చే పాడి ఆవులు, డప్పుల దరువులు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేల సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుండి తరలి వచ్చిన మేలు రకం పశువులు. ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా...? మన హైటెక్‌ నగర శివారు ప్రాంతమైన నార్సింగిలోనే. అట్టహాసంగా జరుగుతున్న పశు సంక్రాంతిపై ప్రత్యేక కథనం...
పశువుల సంత
ప్రతి ఏడాది సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం జరిగే పశువుల సంతను పశు సంక్రాంతిగా పిలుచుకుంటారు. ఈ వేడుకలు దాదాపు 150 ఏళ్ళ నుండి కొనసాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. పశువుల అమ్మకాలు, కొనుగోళ్ల కోసం దేశం నలుమూలల నుంచి రైతులు తరలివస్తారు. ఇక్కడ అన్ని రకాల జాతుల గేదెలు, గిత్తలు అందుబాటులో ఉంటాయి. 
ఒక్కో గేదె ధర 50వేల నుంచి రూ.3లక్షలు 
సంతలో చూసేందుకు, అమ్మకాలు-కొనుగోళ్లు జరిపేందుకు... వివిధ ప్రాంతాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. ఒక్కో గేదె ధర 50వేల నుంచి 3లక్షల రూపాయల వరకు పలుకుతోంది. సంతను చూసేందుకు అటు రైతులతో పాటు శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ తో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వచ్చారు. వివిధ రకాల పశువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నార్సింగ్ పశువుల సంతకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తానని మండలి చైర్మన్ అన్నారు. ప్రభుత్వంతో చర్చించి మార్కెట్ అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సంతపై పాత నోట్ల రద్దు ప్రభావం  
పాత నోట్ల రద్దు ప్రభావం సంతపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంతలో పశువులకు అవసరమైన సామాగ్రిని అమ్మేందుకు దుకాణాలు వెలిశాయి. అయితే సరైన సౌకర్యాలు లేక... వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దూరప్రాంతం నుంచి పశువులను విక్రయించేందుకు వచ్చిన తమకు సరైన సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు కోరుతున్నారు. 
నార్సింగిలో పశు సంక్రాంతి కల 
వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడకు పశువులు రావడంతో నార్సింగిలో పశు సంక్రాంతి కల ఉట్టిపడుతోంది. ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రత్యేక దృష్టి పెడితే పశు సంక్రాంతి ఇంకా బాగా నిర్వహిస్తామని నిర్వహకులు చెబుతున్నారు.

 

18:39 - January 20, 2017

భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల్లో మార్పు వచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు అవుతుందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సామాజిక న్యాయమే లక్ష్యంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర.. భూపాలజిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా భూపాలపల్లి కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం..తెలంగాణ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. దళితులకు 3 ఎకరాలు పంచిస్తాన్న ప్రభుత్వం..దళితుల నుండే బలవంతంగా భూములను లాక్కొంటుందని విమర్శించారు. 

 

18:27 - January 20, 2017

చెన్నై : జల్లికట్టుపై నిరసనలకు మద్దతుగా తమిళనాడులో బంద్‌ పాటిస్తున్నారు. సినీపరిశ్రమతో పాటు అన్ని వర్గాలు బంద్‌లో పాల్గొన్నాయి. జల్లికట్టుపై రెండు రోజుల్లో శుభవార్త చెబుతామని సిఎం పన్నీర్‌ సెల్వం హామీ ఇచ్చినప్పటికీ నిరసనకారులు ఆందోళన విరమించడం లేదు. మరోవైపు జల్లికట్టుపై వారం రోజుల పాటు తీర్పు ఇవ్వొద్దని కేంద్రం చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
తమిళనాడులో బంద్‌  
సాంప్రదాయ జల్లికట్టుపై నిషేధాన్ని తొలగించాలని మెరీనాబీచ్‌లో జరుగుతున్న నిరసనలకు మద్దతురా తమిళనాడులో బంద్‌ పాటిస్తున్నారు. మ‌రోవైపు జ‌ల్లిక‌ట్టు నిర‌స‌న‌ల‌కు అన్నిపార్టీలు మ‌ద్దతు తెలిపాయి.  ప్రధాన ప్రతిపక్షం డిఎంకె రైలు రోకో నిర్వహించింది. మంబాలమ్ రైల్వే స్టేషన్‌లో స్టాలిన్‌, ఎగ్‌మోర్‌ స్టేషన్‌లో కనిమొజి, దయానిధి మారన్‌లు రైలురోకోలో పాల్గొన్నారు. రైల్ రోకోలో పాల్గొన్న డీఎంకే నేత స్టాలిన్‌ను ముంద‌స్తు జాగ్రత్తగా అరెస్టు చేశారు. జల్లికట్టుపై అఖిలపక్ష భేటి నిర్వహించాలని డిఎంకె డిమాండ్‌ చేసింది. 
అన్ని వర్గాల నుంచి మద్దతు 
బంద్‌కు పార్టీల కతీతంగా అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. విద్యాసంస్థలు, థియేటర్లు మూతపడ్డాయి. ప్రయివేటు వాహనాలు నడవలేదు. సినీపరిశ్రమ షూటింగ్‌లు నిలిపివేసి ఆందోళనలో పాల్గొంది. నదిగర్‌ సంగంలో జరుగుతున్న ఆందోళనలో రజనీకాంత్‌ పాల్గొన్నారు. ధనుష్‌, అజిత్‌, సూర్య తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. 
జ‌ల్లిక‌ట్టు అంశంపై స్పందించిన సుప్రీంకోర్టు 
జ‌ల్లిక‌ట్టు అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. జ‌ల్లిక‌ట్టు నిషేధంపై మ‌రో వారం రోజుల వ‌ర‌కు ఎటువంటి మ‌ధ్యంత‌ర ఆదేశాలు ఇవ్వబోమ‌ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జ‌ల్లిక‌ట్టు స‌మ‌స్యను ప‌రిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చ‌ర్చిస్తున్నాయ‌ని, దీనిపై నిర్ణయాన్ని ఓ వారం రోజుల పాటు వాయిదా వేయాల‌ని సుప్రీంకోర్టును కోరినట్లు అటార్నిజనరల్‌ ముకుల్‌ రస్తోగి తెలిపారు.
ఆందోళన విరమించాలి : సిఎం పన్నీర్‌ సెల్వం 
జల్లికట్టును నిర్వహించేందుకు రెండు మూడురోజుల్లో ఆర్డినెన్స్‌ తెస్తామని...ఆందోళన విరమించాలని సిఎం పన్నీర్‌ సెల్వం నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. జ‌ల్లిక‌ట్టుపై చ‌ట్టం రూపొందించేందుకు కావాల్సిన అన్ని అంశాల‌పై రాజ్యాంగ నిపుణుల‌తో స‌వివ‌రంగా చ‌ర్చించామ‌న్నారు. జ‌ల్లిక‌ట్టు కావాలంటూ ముసాయిదా స‌వ‌ర‌ణ‌ను రూపొందించామ‌ని, దాన్ని కేంద్ర హోంశాఖ‌కు కూడా పంపామ‌ని తెలిపారు.
రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిని అన్నాడీఎంకే ఎంపీలు
మరోవైపు జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్డినెన్స్‌ తేవాలని కోరుతూ అన్నాడిఎంకే ఎంపీలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసారు. ఆర్డినెన్స్‌ ఆమోదం కోసం 45 మంది ఎంపీలు శనివారం రాష్ట్రపతిని కలవనున్నారు. నిరసనకారులు మాత్రం పట్టు వీడడం లేదు...మెట్టు దిగడం లేదు...ప్రభుత్వం మాటల్లో చెప్పడం కాదని...చేతల్లో చూపేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

 

జగన్ పై మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం

విజయవాడ : వైఎస్ జగన్ పై మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కావాలనే ప్రభుత్వంపై బురదజట్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ నెలకోసారి వచ్చి రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజధాని రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 

వ్యవసాయరంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత : ఈటెల

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ 3 శాతం ఎక్కువన్నారు. దేశాభివృద్ధిలో నాబార్డు పాత్ర కీలకమన్నారు. 

17:54 - January 20, 2017

ఢిల్లీ : ప్రముఖు బాలీవుడ్‌ హీరో.. ఇటీవల రాసిన ఆత్మకథ ఖుల్లం ఖుల్లా బాలీవుడలో సంచలనం రేకెత్తిస్తోంది. తన తొలి చిత్రం బాబీకి ఫిలింఫేర్‌ అందుకోవడానికి..అప్పట్లో డబ్బులు చెల్లించానని రిషీకపూర్‌ వెల్లడించారు. పాక్‌ నటులపై నిషేధం, డింపుల్‌ విషయంలో సంజయ్‌తో మనస్పర్థలపై రిషీకపూర్‌ మనసు విప్పి మాట్లాడారు. ఎన్డీటీవి నిర్వహించిన ద టౌన్‌హాల్‌ కార్యక్రమంలో రిషీకపూర్‌ పలు ఆసక్తి కర విషయాలను వెల్లడించారు. 
రిషికపూర్‌..ఆత్మకథ సంచలనం 
రిషికపూర్‌.. ఖుల్లం ఖుల్లా. ఎక్కడ చూసినా ఇప్పుడీ రెండు మాటలే వినిపిస్తున్నాయి. ఖుల్లం ఖుల్లా పేరిట ప్రముఖ బాలీవుడ్ హీరో రాసిన ఆత్మకథ సంచలనం రేకెత్తిస్తోంది. 1973లోనే తొలిచిత్రం బాబీకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అందుకోవడానికి అప్పట్లో డబ్బులు చెల్లించానని రిషీకపూర్‌ ప్రకటించడం దరిమిలా బాలీవుడ్‌ అవార్డులు చర్చనీయాంశమయ్యాయి. 
సంచనాలకు కేంద్ర బిందువు 
ప్రముఖ బాలీవుడ్‌ హీరో రిషీకపూర్‌ ఖుల్లం ఖుల్లా పేరుతో రాసిన ఆత్మకత సంచనాలకు కేంద్ర బిందువుగా మారింది. సినీ రంగ ప్రవేశం చేసిన తొలిరోజుల్లో ఎన్నో ఒడిదుడుకులు, అవాంతరాలను ఎదుర్కొన్నానని ఎన్డీటీవీకి  ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషికపూర్‌ వెల్లడించారు. 1973లోనే 30 వేల రూపాయలు అయితే..అదే అవార్డు ఇప్పుడు కొనుగోలు చేయాలంటే ఎంతవుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొందరైతే... 6.19 లక్షలు అవుతుందని లెక్కలేసి మరీ తేల్చిచెబుతున్నారు. ఒక్క ఫిలింఫేర్‌ అనేముంది...? ఆ మాటకొస్తే... అన్ని అవార్డులూ అందుకొనేవే అని చెప్పేవారు ఆనాడూ ఉన్నారు.. ఈనాడూ ఉన్నారు. కాకపోతే రిషీకపూర్ లాంటి వారు కొంచెం బయటికి అనేస్తారని చెవులు కొరుక్కుంటున్నవారు లేకపోలేరు. 
ఆ మాటలు మరో సంచలనం
అమితాబ్‌ బచ్చన్‌ అగ్రస్థానానికి ఎగబాకిన నిచ్చెనలను తమ లాంటి నటులు మెట్లయ్యారని ఖుల్లంఖుల్లా పుస్తకం విడుదల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన రిషీకపూర్‌ మీడియాతో అనడం మరో సంచలనం. ధర్మేంద్ర  లేకుండా షోలే, వినోద్‌ ఖన్నా తాను లేకుండా అమర్‌ అకర్‌ అంథోనీ, శశికపూర్‌ లేకుండా దీవార్‌, శతృఘ్నసిన్హా లేకుండా దోస్తానా చిత్రాలు ఎలా రూపొందుతాయని రిషీకపూర్ ప్రశ్నించారు. 
రాజ్‌కపూర్‌ జీవితంపై సినిమా తీస్తే బాగుంటుందన్న రిషీకపూర్‌ 
తన తండ్రి గొప్ప షోమ్యాన్‌గా సుప్రసిద్ధుడైన రాజ్‌కపూర్‌ జీవితంపై సినిమా తీస్తే బాగుంటుందని రిషీకపూర్‌ అభిప్రాయపడ్డారు. జీవితంలో తానెన్నో ఒడిదుడికుల్ని ఎదుర్కొన్నానని, చాలా మంది తానేదో సిల్వర్‌ స్పూన్‌ నోట్లో పెట్టుకుని పుట్టానని అనుకుంటారని రిషీకపూర్‌ అన్నారు. 
ఖుల్లం ఖుల్లాలో సంచలన, వివాదాస్పద విషయాలు 
రిషీకపూర్‌ తన ఆత్మకథ ఖుల్లం ఖుల్లాలో ఎన్నో సంచలన, వివాదాస్పద విషయాలకూ చోటిచ్చారు. హీరోయిన్లతో తనకు ఎఫైర్స్‌ ఉన్నట్లు పుకార్లు రావడం, వాటిపై తన భార్య నీతు స్పందన గురించి కూడా ఈ పుస్తకంలో ఉటంకించారు. వివాహం కాకముందు బాలీవుడ్‌ హీరోయిన్‌ టీనా మునిమ్‌తో ఎఫైర్‌ ఉన్నట్లు మరో హీరో సంజయ్‌దత్‌ అనుమానించాడని రిషీకపూర్‌ పేర్కొన్నారు. అప్పట్లో టీనా సంజయ్‌ పట్ల ఆకర్షితురాలైందని కూడా వెల్లడించారు. మీడియా ఈ విషయం గురించి ప్రస్తావించలేదని, కానీ కొందరు బాలీవుడ్‌ ప్రముఖులు మాత్రం టీనాతో తనకు సీక్రెట్‌ ఎఫైర్‌ ఉందని భావించేవారని రిషీ తెలిపారు. ఈ విషయం తెలియగానే ఓ రోజు సంజయదత్‌, గుల్షన్‌ గ్రోవర్‌తో కలిసి తనతో గొడవ పడటానికి నీతూ ఇంటికి వచ్చారని రిషీకపూర్‌ వెల్లడించారు. ఇద్దరి మధ్య గొడవ కాకుండా నీతూ పరిష్కారం చేసిందని కూడా తెలిపారు. తనకు, టీనాకు మధ్య ఎఫైర్‌ లేదని, ఈ పుకార్లు నిరాధారమని, కేవలం కో స్టార్‌లుగా స్నేహంగా ఉంటారని, సంజయ్‌కు నీతూ చెప్పి నమ్మించడంతో వివాదం ముగిసిపోయిందని గుర్తు చేసుకున్నారు.  ఆ తర్వాత ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా తాను, సంజయ్‌ నవ్వుకునే వాళ్లమని రిషీకపూర్‌ తెలిపారు. ఈ సంఘటన జరిగాక నీతూ, తాను వివాహం చేసుకున్నామని, తమ పెళ్లికి తన హీరోయిన్‌లు అందరూ వచ్చారని రిషీకపూర్ వెల్లడించారు. 
టీనా.. తన పాత్రకూ ఎంతో అందాన్ని తెచ్చిందన్న రిషీ కపూర్ 
తనతో తెరను పంచుకున్న టీనా... తన పాత్రకూ ఎంతో అందాన్ని తెచ్చిందని ఇప్పటికీ ప్రేక్షకులు అంటుంటారని రిషీకపూర్‌ తెలిపారు. కార్జ్‌ సినిమాలో టీనా తనతో నటించడాన్ని ఎప్పటికీ మరిచపోలేనని రిషీకపూర్ అన్నారు. ఇద్దరి మధ్య స్నేహ బంధాన్ని అప్పట్లో కూడా అపార్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. డింపుల్‌ రింగ్ విషయంలో రాజేష్‌ఖన్నాకు తనకు బేదాభిప్రాయం వచ్చిందని రిషీకపూర్‌ అంగీకరించారు.   
డింపుల్‌ కపాడియాతో రిషీ కపూర్ కు ఎఫైర్‌ ఉందని పుకార్లు 
పెళ్లయిన తర్వాత డింపుల్‌ కపాడియాతో తనకు ఎఫైర్‌ ఉందని పుకార్లు వచ్చాయని రిషీకపూర్‌ పుస్తకంలో రాశారు. తనపై నీతూకు నమ్మకం ఉందని, ఈ విషయం గురించి ఆమె ఆందోళన చెందలేదని తెలిపారు. డింపుల్‌ తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని తెలిపారు. తామిద్దరం బాబీ సినిమాలో నటించామని, తర్వాత సాగర్‌ సినిమా చేశామని వెల్లడించారు.  
నా జీవితం డాక్యుమెంట్‌ రూపంలో ఉండాలన్న రిషీ కపూర్ 
తన జీవితం ఓ డాక్యుమెంట్‌ రూపంలో ఉండాలన్న ఉద్దేశంతోనే ఖుల్లం ఖుల్లం పుస్తకం రాసినట్లు.. బాలీవుడ్‌ నటుడు రిషీకపూర్‌ స్పష్టం చేశారు. బీఫ్‌ తినడం అనేది వారి వారి వ్యక్తిగత విషయమని, కళాకారులకు సరిహద్దులుండవని, పాక్‌ కళాకారుల నిషేధంపై స్పందించారు. పలు పబ్లిక్‌ సంస్థలు, ప్రదేశాలకు గాంధీ, నెహ్రూల పేర్లు పెట్టడంపై రిషీకపూర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 
ఎవరి ఆహారపు అలవాట్లు వారివి 
ఎవరి ఆహారపు అలవాట్లు వారికుంటాయని, బీఫ్‌ తినడం తినక పోవడం అనేది వ్యక్తి గత విషయమని రషీకపూర్‌ అభిప్రాయపడ్డారు. ఈ దేశంలో ప్రతివ్యక్తి సెంటుమెంటును గౌరవించాలని ఆయన వ్యాఖ్యానించారు. కానీ..జంతువులకు హింసించిడం అనేది ఆక్షేపణీయమని ఆయన అన్నారు. ఎవరి జీవితాన్ని కాలరేసే హక్కు.. ఎవరికీ లేదని, ప్రతి జీవిని జీవించనీయాలని సూచించారు. 
పాక్‌ నటీనటుల నిషేధంపై రిషీకపూర్ స్పందన 
పాక్‌ నటీనటులపై నిషేధంపై బాలీవుడ్‌ నటుడు రిషీకపూర్ స్పందించారు. ఎన్డీటీవీ ఇంటర్వూ సందర్భంగా పాక్‌ కళాకారుల నిషేధం అంశంపై ఓ యువతి అడిగిన ప్రశ్నకు రిషీకపూర్‌ జవాబిచ్చారు. కళాకారులంతా ఒకే కుటుంబం అని, నటీనటులకు, కళాకారులకు సరిహద్దులుండవని అన్నారు. పాకిస్థాన్‌ కళాకారులు కూడా తన కుటుంబ సభ్యుల వంటి వారని, వారిని తన కుటుంబ సభ్యులుగానే భావిస్తానని రిషీకపూర్ తెలిపారు. నటీనటుల విషయంలో రాజకీయం చేయడం తగదని అభిప్రాయపడ్డారు. 
మోదీ చరకా వడకడం సమంజసమే : రిషీకపూర్‌ 
ఖాదీ ప్రమోషన్‌ కోసం ప్రధాని మోదీ చరకా వడకడం.. సమంజసమేనని రిషీకపూర్‌ అన్నారు. గాంధీ స్థానంలో మోదీ ఫొటో పెట్టడం తప్పేం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఖాదీ ప్రమోషన్‌ కోసం ప్రధానిగా ఆ మాత్రం చేస్తే తప్పేముందని రిషీకపూర్‌ ప్రశ్నించారు. 
గాంధీ, నెహ్రూల పేర్లు పెట్టడం ఏంటని రిషీకపూర్‌ ఆవేదన 
దేశంలోని ప్రముఖ ప్రదేశాలు, ఎయిర్‌పోర్టులు, బస్‌స్టేషన్‌లకు.. పబ్లిక్‌సంస్థలకు గాంధీ, నెహ్రూల పేరు పెట్టడంపై రిషీకపూర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎందరో గొప్పవారు, మహానీయులున్నారని, పబ్లిక్‌ సంస్థలు, ప్రదేశాలకు వారి పేర్లు ఎందుకు పెట్టరని ఆయన ప్రశ్నించారు. బిర్లా, టాటాలు కూడా దేశానికి ఎంతో చేశారని రిషీకపూర్‌ అభిప్రాయపడ్డారు. ఎంతో మంది దేశానికి ఎంతో సేవ చేశారని, వాళ్లందరిని వదలి గాంధీ, నెహ్రూల పేర్లు పెట్టడం ఏంటని రిషీకపూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 
నేను మ్యూజికల్‌ రొమాంటిక్‌ హీరోగా కొనసాగానన్న రిషీకపూర్ 
యాక్షన్‌ సినిమాల హవా నడుస్తున్న రోజుల్లో తాను మ్యూజికల్‌ రొమాంటిక్‌ హీరోగా కొనసాగినట్లు రిషీకపూర్‌ తెలిపారు. బాబీ సినిమా తనకు మంచి హిట్‌ ఇచ్చిందని, అదే సమయంలో సినీ పరిశ్రమలోనే ఆ సినిమా ఓ గొప్ప చిత్రంగా మిగిలిపోయిందని చెప్పారు. యాక్షన్‌ సినిమాల ప్రభావాన్ని తట్టుకుని నిలిచేందుకు తనకు 25 సంవత్సరాలు పట్టించని రిషీ వెల్లడించారు. నటుడిగా చాలా బిజీగా ఉన్న సమయంలో తన భార్య ఎంతో బాధ్యతాయుతంగా ఇంటిని, పిల్లల్ని చూసుకుందని ఈ సందర్భంగా రిషీకపూర్ తన భార్య నీతూ గురించి తెలిపారు. 
లేడీస్‌ డ్రెస్‌ ధరించాల్సి వచ్చిందన్న రిషీకపూర్ 
తనకు రాజకీయాలు తెలియవని, తనకు తెలిసిందల్లా సినిమా, సినిమా నిర్మాణం అని రిషీకపూర్ చెప్పారు. సినిమాలే తన వృత్తి అని వ్యాఖ్యానించారు. తానెంతో సంతోషంగా ఉన్నానని అన్న రిషీకపూర్ ఓ సినిమాలోని ఓ హన్సినీ అనే పాటలో లేడీస్‌ డ్రెస్‌ ధరించాల్సి వచ్చిందని తెలిపారు. ఎవరి ఆహారపు అలవాట్లు వారికుంటాయని, బీఫ్‌ తినడం తినక పోవడం అనేది వ్యక్తి గత విషయమని రషీకపూర్‌ అభిప్రాయపడ్డారు. ఈ దేశంలో ప్రతివ్యక్తి సెంటుమెంటును గౌరవించాలని ఆయన వ్యాఖ్యానించారు. కానీ..జంతువులకు హింసించిడం అనేది ఆక్షేపణీయమని ఆయన అన్నారు. ఎవరి జీవితాన్ని కాలరేసే హక్కు.. ఎవరికీ లేదని, ప్రతి జీవిని జీవించనీయాలని సూచించారు. తనకు రాజకీయాలు తెలియవని, తనకు తెలిసిందల్లా సినిమా, సినిమా నిర్మాణం అని రిషీకపూర్ చెప్పారు. సినిమాలే తన వృత్తి అని వ్యాఖ్యానించారు. తానెంతో సంతోషంగా ఉన్నానని అన్న రిషీకపూర్ ఓ సినిమాలోని ఓ హన్సినీ అనే పాటలో లేడీస్‌ డ్రెస్‌ ధరించాల్సి వచ్చిందని తెలిపారు. 

 

17:40 - January 20, 2017

విజయవాడ : విదేశీ కార్పొరేట్‌ సంస్థల లాభాల కోసమే మోడీ ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రవేశపెట్టిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. అహంకారపూరితంగా మాట్లాడుతున్న పేటీఎం సీఈఓ శర్మపై మధు ఫైర్‌ అయ్యారు. పేటీఎంను సీఎం చంద్రబాబు పోత్సహించడంపై ఆయన మండిపడ్డారు. స్వదేశీ సంస్థల ద్వారానే నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని మధు డిమాండ్‌ చేశారు. నగదు రహిత లావాదేవీల్లో విదేశీ సంస్థలను నిషేదించాలన్నారు. 
 

 

17:35 - January 20, 2017

హైదరాబాద్ : జనమంతా చూస్తుండగానే తనపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. కారు అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించారన్నారు. అసలు దాడే జరుగలేదని అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని చెప్పారు. ఆయన  దాడిని ఖండించి ఉంటే హుందాగా ఉండేదన్నారు. ఓ మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో ఫుటేజీల్లో దాడి దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ఈ ఘటనపై జగన్‌ ఎందుకు మాట్లాడలేదన్న ఆమె.. ఆయనకు మహిళలంటే గౌరవం లేదా అని ప్రశ్నించారు.   

 

17:30 - January 20, 2017

భూపాలపల్లి : మంత్రి హరీష్ రావు మాటలకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. హరీష్‌ రావు మాటలు ఆక్రోశంతో మాట్లాడినట్టే ఉన్నాయని... ఆలోచనతో మాట్లాడినట్లు లేవని తమ్మినేని అన్నారు. అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం సొంత డబ్బా ప్రచారం చేసుకుందని...వాస్తవాలు వెలుగులోకి రావడంతో వారికి మింగుడు పడటం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలపై తాను రాసిన వ్యాసం చదివి హరీష్‌ రావుకు ఆగ్రహం వచ్చిందని...అందుకే హరీష్‌ రావుకు మింగుడు పడక అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీలు ఎక్కడా అమలు చేయడం లేదని విమర్శించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు.. మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు అనే పదం లేకుండా చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌... తరువాత దానిని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. 

 

16:56 - January 20, 2017

గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల సమావేశం..

హైదరాబాద్ : గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు. నోట్ల రద్దుకు నిరసనగా 27న తలపెట్టిన జనం ఆవేదనపై చర్చిస్తున్నారు.

16:48 - January 20, 2017

హైదరాబాద్ : ర్యాష్ డ్రైవింగ్‌.. మద్యంతాగి వాహనం నడపడం వంటి కారణాలో విలువైన ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. మందుబాబులకు ఎన్ని విధాల చెప్పినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ మరోసారి మందుబాబులకు, మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. గోషామహల్‌ ట్రాఫిక్ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రాఫిక్స్‌ ఏసీపీ భద్రేశ్వర్‌ తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆయన తెలిపిన విషయాలను వీడియోలో చూద్దాం...   

స్టేట్ క్రెడిట్ సెమినార్ 2016-17 సదస్సు..

హైదరాబాద్ : స్టేట్ క్రెడిట్ సెమినార్ 2016-17 సదస్సులో సీఎస్ ఎస్పీ సింగ్ పాల్గొన్నారు. నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ అంశాలు బాగున్నాయని, అగ్రికల్చర్, ఇతర రంగాల్లో నా బార్డు సేవలు అభినందనీయమన్నారు. నా బార్డ్ ప్రభుత్వ పథకాలకు సహకారం అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కరవు నివారణకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇరిగేషన్ రంగంలో మార్పులతో మత్స్యరంగంలో మంచి మార్పులొస్తున్నాయన్నారు.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 274 పాయింట్లు నష్టపోయి 27,034 సెన్సెక్స్ ముగియగా 86 పాయింట్లు నష్టపోయి 8,349 నిఫ్టీ ముగిసింది.

ఫిబ్రవరి 7న బ్యాంకు ఉద్యోగుల సమ్మె..

ఢిల్లీ : ఫిబ్రవరి 7వ తేదీన బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. సమ్మెలో ఏఐబీఈఏ, ఏఐబీఓఏలు పాల్గొననున్నాయి. నోట్ల రద్దు కారణంగా విత్ డ్రాయల్ పై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రూ. కోటికి మించిన మొండి బకాయిల వివరాలు వెల్లడించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.

హరీష్ మాటలకు తమ్మినేని కౌంటర్..

భూపాలపల్లి : మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలకు సీపీఎం కౌంటర్ ఇచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. హరీష్ మాటలు ఆక్రోశంతో మాట్లాడినట్లు ఉన్నాయని, ఎన్నికల హామీలు ఎక్కడా అమలు చేయడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం సొంత డబ్బా ప్రచారం చేసుకుందని, సమావేశాలపై తాను రాసిన వ్యాసం వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చిందని తెలిపారు. అందుకే హరీష్ రావుకు మింగుడు పడక అబద్ధాలు చెబుతున్నారంటూ పేర్కొంటున్నారని తమ్మినేని పేర్కొన్నారు.

16:25 - January 20, 2017

హైదరాబాద్ : స్కీం వర్కర్లు అయిన అంగనవాడీ, ఆశావర్కర్లు , సెకండ్‌ ఏఎన్‌ఎంలు , సర్వశిక్షా అభియాన్‌, మధ్యాహ్నభోజన పథకంలో పనిచేస్తున్న వారు దేశవ్యాప్తంగా పోరుబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిపారు. ఆ సంఘం నేత జె.వెంకటేష్ మాట్లాడుతూ స్కీం వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. వారికి 18 వేలు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన ఈఎస్ ఐ, పీఎఫ్ ఇవ్వాలన్నారు. బడ్జెట్ లో స్కీం వర్కర్లకు 5 శాతం వాటా కేటాయించాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పొత్తుపై ఎస్పీతో కాంగ్రెస్ మల్లగుల్లాలు..

లక్నో : ఎస్పీతో పొత్తుపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ప్రియాంక గాంధీతో రాహుల్ గాంధీ అంత్మరథనం చేస్తున్నారు. పొత్తు ఖరారు కాకముందే 191 అభ్యర్థులతో అఖిలేష్ తొలి జాబితా ప్రకటించడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ కోరిన 9 స్థానాల్లోనూ ఎస్పీ అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం. 54 సీట్లతో సమాజ్ వాదీ బేరం మొదలు పెట్టింది. 85కి మించి ఇవ్వలేమని సంకేతాలు పంపుతోంది. మరిన్ని సీట్ల కోసం కాంగ్రెస్ పట్టుబడుతోంది. కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవం తాకట్టుపెట్టలేమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ పేర్కొన్నారు.

16:20 - January 20, 2017

హైదరాబాద్ : కృష్ణా నీటి పంపకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. కృష్ణా ట్రిబ్యునల్‌ బోర్డు కాస్తా చంద్రబాబు ట్రిబ్యునల్‌ బోర్డుగా మారిపోయిందన్నారు. చంద్రబాబు యధేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతున్నా కేసీఆర్‌ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ మోడీ భజన మానుకొని కృష్ణా జలాలపై దృష్టి సారించాలన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. 

 

చెప్పుల్లో బంగారం..

కోల్ కతా : హౌరా రైల్వే స్టేషన్ లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. చెప్పుల్లో పెట్టి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. రూ. 8.3 కోట్ల విలువైన 28 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

టి.డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాల పెంపుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫైలుపై సంతకం చేశారు. వేతనం రూ. 21,000 నుండి రూ. 31,500కు పెంచారు.

15:45 - January 20, 2017

బడ్జెట్‌ అనే పదం బౌగెటీ అనే ఫ్రెంచి పదం నుంచి ఏర్పడింది. దాని అర్థం సంచీ. ఢిమాక్‌ అనే అర్థిక వేత్త బడ్జెట్‌ అంటే ఒక నిర్ణీత కాలంలోని ఆదాయ వ్యయాల సమతూకమైన అంనచా అని నిర్వచించారు. భారత ప్రభుత్వం లేక ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సబంధించిన ఆర్థిక సంవత్సరపు అంచనా వేయబడిన ఆదాయ వ్యయాల ద్రవ్య పట్టికే బడ్జెట్‌ అని భారత ర్యాజ్యాంగంలో వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమౌతున్నారు. అందులో భాగంగా గురువారం 'హల్వా' వంటకంలో జైట్లీ, అధికారులు పాల్గొన్నారు. 2017-18 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపాదిస్తున్న మూడో పూర్తి స్థాయి బడ్జెట్‌.

బడ్జెట్ పత్రాలు సిద్ధమయ్యాక...
ఈ బడ్జెట్ పత్రాలు సిద్ధమయ్యాక పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో 'హల్వా' హడావుడి మొదలవుతుంది. చివరి అంకం ఈ మిఠాయితో ఆరంభం అవుతుంది. ప్రింటింగ్ కు పంపించే ముందు బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన అధికారులందరూ 'హల్వా' తింటారు. ఇది తిన్న తరువాత బడ్జెట్ పత్రాలను ముద్రించడంలో నిమగ్నమౌతారు. అత్యంత కట్టుదిటమైన భద్రత మధ్య ఈ పత్రాలను ప్రింటింగ్ చేస్తారు. బడ్జెట్ పత్రాలు మాత్రం పార్లమెంట్ లోని నార్త్ బ్లాక్ లోని ఒక ప్రత్యేకమైన ముద్రాణాలయంలో వీటిని ముద్రించడం జరుగుతుంది. బడ్జెట్ పత్రాల్లోని సమాచారం ఏ మాత్రం లీక్ కాకుండా జాగ్రత్త పడుతారు. అత్యాధునిక సౌకర్యాలతో హాల్ ఉంటుంది. ఆర్థిక శాఖకు చెందిన 100 మందికి పైగా అధికారులు పార్లమెంటులో ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం ముగిసే వరకు బడ్జెట్‌ ముద్రణ జరుగుతున్న ప్రెస్‌లోనే బస చేయాల్సి ఉంటుంది. కుటుంబసభ్యులతో సంబంధం లేకుండా ఉండాలి. అందుకే వారికి తీపి తినిపించడం ప్రధాన లక్ష్యం. ఈ సమయంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఫోన్ లో కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. బడ్జెట్ పత్రాల సమాచారం తెలియకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

15:36 - January 20, 2017
15:34 - January 20, 2017

ప్రకాశం : కిడ్నీ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. జిల్లాలో ఆయన పర్యటించారు. పీసీ పల్లిలో కిడ్నీ బాధితులను జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కిడ్నీ సమస్య ఉన్న పేదలకు వైద్యం అందడం లేదన్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని విమర్శించారు. కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. డయాలసిస్ లకు డబ్బులు కేటాయించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఎంపీ గ్రాంట్లు ఉన్నా డయాలసిస్ సెంటర్లు పెట్టడం లేదని విమర్శించారు. తన పర్యటన ఉందని తెలుసుకుని ప్రభుత్వం డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు జీవోలు జారీ చేసిందని చెప్పారు. మూడు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బాబు మీద వత్తిడి తెస్తేనే స్పందిస్తారని చెప్పారు.  

 

ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగారుస్తున్నారు - జగన్..

ప్రకాశం : పీసీ పల్లిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటించారు. కిడ్నీ వ్యాధులను జగన్ పరామర్శించారు. కిడ్నీ సమస్య ఉన్న పేదలకు వైద్యం అందడం లేదని, ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరు గారుస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.

దసరాకు తెలంగాణ చలన చిత్ర అవార్డులు..

హైదరాబాద్ : ఈ దసరాకు తెలంగాణ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం చేయనున్నామని మంత్రి తలసాని వెల్లడించారు. త్వరలో అవార్డుల పేరు, గుర్తు ఖరారు చేస్తామన్నారు. ఆన్ లైన్ ద్వారా వచ్చే ఆదాయం ఎఫ్ డీసీకే అని తెలిపారు.

విద్యార్థులతో భన్వర్ లాల్ ముఖాముఖి..

వరంగల్ అర్బన్ : ఓటు హక్కు అంశంపై విద్యార్థులతో భన్వర్ లాల్ ముఖాముఖి నిర్వహించారు. ఓటర్ల నమోదుకు త్వరలో నోటిఫికేసన్ జారీ చేస్తామని, ఓటు విలువ తెలియచేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డబ్బు..మద్యానికి లొంగకుండా ఓటు వేయాలన్నారు.

14:52 - January 20, 2017
14:51 - January 20, 2017

తూర్పుగోదావరి : రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో ఈ సంవత్సరం కూడా చేయూత కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన గట్టి సత్యనారాయణ గడచిన 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. పర్వదినాలను పేదలూ ఘనంగా జరుపుకోవడమే లక్ష్యంగా సత్యనారాయణ ఈ ఏడాది కూడా పేదలకు కొత్త దుస్తులు పంపిణీ చేశారు. పేదలంతా పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నదే తమ చేయూత లక్ష్యమని, అందుకే ఇటీవలి సంక్రాంతి రోజున వెలుగుబంద గ్రామంలో చేయూత కార్యక్రమాన్ని నిర్వహించామని సత్యనారాయణ తెలిపారు. 

 

14:50 - January 20, 2017

మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఉంటేనే అంత శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే మానసిక ఆందోళన మొదలవుతుందో అప్పటి నుండే అనేక సమస్యలు వస్తుంటాయి. వీటిని సైకోస్మోటిక్ డిజార్డర్స్ అంటారు. కొన్ని శ్వాస సంబంధిత వ్యాధులు కూడా దీనికి కిందకే వస్తాయి. నిత్యం మనం ఎదుర్కొనే టెన్షన్ నుండి గట్టెక్కాలంటే మానసిక ప్రశాంత అవసరం. ఈ ప్రశాంత మందులు షాప్ లో దొరకవు..డబ్బులతో కొనేది కాదు. విపరీతమైన కోపం ఉండడం వల్ల పలు సమస్యలు ఎదురవుతుంటాయి. కోపం..ఒంటరితనం, ఒత్తిడి వంటివి కొన్నిసార్లు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నిద్రలేమి..కడుపునొప్పికి కారణమౌతాయి. కొన్ని నమ్మకాలు..నెగటివ్ ఆలోచనలు, భావోద్వేగాలు ఈ నొప్పులకు కారణమౌతాయి.
ఇలాంటి సమస్యలు వచ్చిన సమయంలో మందుల జోలికి వెళ్లకుండా అందుకు కారణం ఏంటనీ ప్రశాంతంగా ఆలోచించాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. యోగా..మెడిటేషన్ వంటివి చేస్తే ఫలితాలు కనబడుతాయి. మానసిక ప్రశాంతతనే కాకుండా శారీరకంగా ఫిట్ నెస్ ను పెంచుతుంది. యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుండి వ్యర్ధాలు బయటికి నెట్టబడతాయి. చర్మం కాంతివంతం అవుతుంది. బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. మెదడు , గుండె , ఊపిరితిత్తులు , కాలేయం , కిడ్నీలు , ఇంకా అంతర్గత అవయవాల్లో రక్త ప్రసరణ మెరుగుపడి అవయవాలు సక్రమంగా పని చేస్తాయి.

14:47 - January 20, 2017

హైదరాబాద్ : జల్లికట్టు నిషేధంపై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు ట్విట్టర్‌లో స్పందించారు. జల్లికట్టు విషయంలో తమిళులు చూపించిన ఐక్యత తనకు సంతోషానిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా తమ సాంప్రదాయాల కోసం తమిళ విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటం అభినందనీయమన్నారు. 

14:45 - January 20, 2017

ఢిల్లీ : జల్లికట్టు సమస్య రెండురోజుల్లో పరిష్కారమయ్యే అవకాశముందని.... డీఎంకే ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈమేరకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్‌ జారీ చేయాలని కోరారు. జల్లికట్టు కొనసాగించేందుకు కేంద్రం చొరవచూపాలని విజ్ఞప్తి చేశారు.  

 

14:40 - January 20, 2017

చెన్నై : జల్లికట్టు నిషేధంపై తమిళనాడు అట్టుడుకుతోంది. జల్లికట్టు నిషేధంపై తమిళనాడులో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ర్ట వ్యాప్తంగా బంద్‌, ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, యువత నుంచి పుట్టుకొచ్చిన ఈ ఉద్యమానికి కోలీవుడ్‌ దిగ్గజాలు మద్దతు పలుకుతున్నారు. ప్రత్యక్షంగా వచ్చి ఆందోళనలో పాల్గొంటులున్నారు. ఓ వైపు విద్యార్థుల నినాదాలు, మరో వైపు సినీ ప్రముఖుల రాకతో మెరీనా బీచ్‌లో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. బీచ్‌లో ఆందోళనలు  కొనసాగుతున్నాయి. తమిళ సినీ పరిశ్రమ ఆందోళనకారులకు మద్దతుగా నిలిచింది. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరో వైపు రెండ్రోజుల్లో తమిళ ప్రజలు శుభవార్త వింటారని ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రకటించారు. జల్లికట్టుపై తీర్పును సుప్రీంకోర్టు వారం రోజులు వాయిదా వేసింది. 
 

ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు..

హైదరాబాద్ : ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. టీఎస్ ఎంసెట్ కన్వీనర్ గా జేఎన్ టియూ ప్రొ.యాదయ్య, ఈసెట్ కన్వీనర్ గా ప్రొ.గోవర్ధన్, టీఎస్ పీసెట్ కన్వీనర్ గా ఓయూ ప్రొ.సత్యనారాయణ, టీఎస్ పీజీ సెట్ కన్వీనర్ గా ఓయూ ప్రొ.సాహిదా సవిదా బేగం, టీఎస్ ఐసెట్ కన్వీనర్ గా కేయూ ప్రొ.ఓం ప్రకాశ్, టీఎస్ లాసెట్ కన్వీనర్ గా కేయూ ప్రొ. ఎన్ వీ రంగారావులు నియమితులయ్యారు.

బాబుకు భయం పట్టుకుంది- జగన్..

ప్రకాశం : జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటిస్తున్నారు. కిడ్నీ బాధితుల సమస్యలు తెలుసుకొనేందుకు పర్యటిస్తున్నారు. పీసీ పల్లిలో కిడ్నీ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బాబు మీద వత్తిడి తెస్తేనే స్పందిస్తారని పేర్కొన్నారు. తన పర్యటన తెలుసుకుని సర్కార్ స్పందించి జీవోలు జారీ చేశారని..డయాలిసీస్ సెంటర్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఎంపీ గ్రాంట్లు ఉన్నా డయాలిసీస్ సెంటర్లు పెట్టడం లేదని విమర్శించారు.

నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న రజనీ..

చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా జల్లికట్లు నిషేధం ఎత్తివేయాలంటూ నిరసనలు..ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

13:36 - January 20, 2017

వరంగల్ : అటవీభూములను సాగుచేసుకుంటున్న గిరిజనులకు హక్కుపత్రాలు ఇవ్వాలని గిరిజన విద్యార్థినేత శోభన్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. అటవీ భూములపై గిరిజనులకు హక్కులేదని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను శోభన్‌నాయక్‌ తీవ్రంగా ఖండించారు. భూపాలపల్లి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర బృందంలో శోభన్‌నాయక్‌ పాల్గొన్నారు. 96వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర భూపాలపల్లిలో కొనసాగుతోంది. చెల్పూరు, మంజూర్‌నగర్‌, భూపాలపల్లి, బస్వరాజుపల్లిలో పాదయాత్ర బృంద సభ్యులు ఉత్సాహంగా పర్యటిస్తున్నారు. సింగరేణిలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని శోభన్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. భూములు కోల్పోయిన వారికి 2013 చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించి.. ఇంటికొక ఉద్యోగం కూడా ఇవ్వాలని శోభన్‌ నాయక్‌ డిమాండ్ చేశారు.

రోడ్లపై పసుపు నీళ్లు చల్లిన టిడిపి నేతలు..

వెలగపూడి : వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటించిన రాజధాని గ్రామాల రోడ్లపై టిడిపి నేతలు పసుపు నీళ్లు పోశారు. మంగళగిరి (మం) నిడమర్రు రోడ్డును పసుపు నీళ్లతో నాయకులు శుద్ధి చేశారు. జగన్ రాకతో రాజధాని ప్రాంతం అపవిత్రమైందని పేర్కొన్నారు. 

13:34 - January 20, 2017

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యది వన్‌మ్యాన్‌ షోనే అని.. అలాగే మహాజనపాదయాత్రలోనూ తమ్మినేని వీరభద్రంది వన్‌మ్యాన్ షోనే అని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఆయన టీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన శూన్యమన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పనితీరు గురించి మాట్లాడుతూ సీపీఎంపై తీవ్రస్థాయిలో హరీష్‌ విరుచుకుపడ్డారు. ప్రజలను రెచ్చగొడుతూ సీపీఎం రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పేదల పార్టీ అని చెప్పుకునే సీపీఎం ఎన్నడూ పేదల కోసం పాటుపడింది లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ్మినేని సొంత నియోజకవర్గంలో ఆ పార్టీకి కనీసం డిపాజిట్స్ కూడా దక్కలేదన్నారు.

జగన్ పై సోమిరెడ్డి విమర్శలు..

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ పై టిడిపి నేత సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు. రెండేళ్లలో రాజధాని ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందని, త్వరలో రాజధాని నిర్మాణం ప్రారంభం కాబోతోందన్నారు. అఖిల ప్రియ కారును జగన్ రౌడీలను పెట్టి అడ్డగించారని తెలిపారు. పార్టీ మారిన వారిపై జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని, జగన్ కూడా పార్టీ మారారని గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. 

13:32 - January 20, 2017

చెన్నై : జల్లికట్టు నిషేధంపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పందించారు. ఆందోనకారులకు మద్దతుగా నిలిచి.. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జల్లుకట్టు నిషేధంపై తమిళనాడు రాష్ర్టం అట్టుడుకుతోంది. రాష్ర్ట వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ అండగా నిలిచింది.

13:25 - January 20, 2017

ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి 2' సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టిన 'రాజమౌళి' ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. 'బాహుబలి' తొలి భాగం బిజినెస్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు సెకెండ్ పార్ట్ 'బాహుబలి2' అంతకు మించిన సంచనాలను సృష్టించేలా కనిపిస్తోంది. మొదటి పార్ట్ ఊహాలకు కందని స్థాయిలో సక్సెస్ కావడంతో, ఈ ద్వితీయ భాగానికి విపరీతమైన హైప్ క్రియేట్ అవుతోంది. సినిమాకు సంబంధించిన విశేషాలను 'రాజమౌళి' ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి కూడా రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో తనదైన స్టైల్లో ఒక్కొక్కటిగా ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కౌంట్ డౌన్ ప్రారంభమైందని ట్వీట్ చేశారు. 100డేస్ టు బాహుబలి 2 అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జైపూర్‌లో జరగబోయే ఓ లిటరేచర్ ఫెస్టివల్లో తమ నవలని తొలిసారి రిలీజ్ చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్ లు ప్రధాన పాత్రలు పోషించారు. 

జల్లికట్టు నిషేధంపై త్వరలో నిర్ణయం - అనీల్ దావే..

ఢిల్లీ : జల్లికట్టుపై ఉన్న నిషేధంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి అనీల్ దావే వెల్లడించారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. 

12:47 - January 20, 2017

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో విషాదం..

హైదరాబాద్ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలో విషాదం చోటు చేసుకుంది. ఎక్సల్ వోవెన్ సాక్స్ కంపెనీలోని డ్రైనేజీలో పడి ఇద్దరు కార్మికులు అజయ్ సింగ్, విజయ్ సింగ్ మృతి చెందారు. మృతులు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

జల్లికట్టు నిషేధంపై స్పందించిన పవన్..మహేష్..

హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు నిషేధంపై టాలీవుడ్ నటులు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు స్పందించారు. జల్లికట్టు, కోడిపందాలపై నిషేధం ద్రవిడ సంస్కృతి, సమగ్రతపై దాడి అని పవన్ ట్వీట్ చేశారు. దక్షిణ భారతదేశంపై కేంద్రం వైఖరికి ఇదే నిదర్శనమని, మన సంస్కృతి, పశువులు, మాతృభూమిపై తనకు గౌరవం ఉందన్నారు. ఈ విషయంలో తమిళుల ఐక్యత సంతోషాన్ని ఇచ్చిందని మహేష్ బాబు పేర్కొన్నారు. తమ సంప్రదాయాల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. 

సీపీఎంపై మరోసారి టి.సర్కార్ ఆక్రోశం..

హైదరాబాద్ : సీపీఎం పార్టీపై మరోసారి ప్రభుత్వం ఆక్రోషం వెళ్లగక్కింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ జరిగిన తీరుపై సీపీఎం విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సీఐటీయూను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని అక్కసు వెళ్లగక్కారు. 

ఇండీహుడ్ ఫిలిం కార్నివాల్ ప్రతినిధులతో తలసాని భేటీ..

హైదరాబాద్ : ఇండీహుడ్ ఫిలిం కార్నివాల్ సభ్యులతో మంత్రి తలసాని సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సమాచార శాఖ కార్యదర్శి, కమిషన్ నవీన్ మిట్టల్ కూడా హాజరయ్యారు. 

జశ్వంత్ నగర్ స్థానం నుండి శివపాల్ యాదవ్ పోటీ..

ఉత్తర్ ప్రదేశ్ : సమాజ్ వాదీ పార్టీ 191 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. ఇందులో జశ్వంత్ నగర్ స్థానం నుండి శివపాల్ యాదవ్ పోటీ చేయనున్నారు. 

12:13 - January 20, 2017

హైదరాబాద్: పెద్ద నోట్లు రద్దుచేసి ఎంత నల్లధనం వెనక్కితెచ్చారో చెప్పాలని... తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. నోట్ల రద్దుతర్వాత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు.. ఇప్పటికీ నగదు డ్రాలో ఆంక్షలు కొనసాగుతున్నాయని... వీటిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ధర్నా చేపట్టారు.. హైదరాబాద్‌లోని RBI ఎదుట నిరసన తెలిపారు.. ఈ ఆందోళనలో ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, దానం నాగేందర్‌ పాల్గొన్నారు..

 

రాజ్ నాథ్ ఇంటికి ఏఐఏడీఎంకే ఎంపీలు..

ఢిల్లీ : ఏఐఏడీఎంకే ఎంపీలు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. జల్లికట్టు నిషేధం ఎత్తివేతపై ఆయనతో చర్చించనున్నారు.

 

జల్లికట్టు..కోళ్ల పందాలకు పవన్ మద్దతు..

హైదరాబాద్ : జల్లికట్టు, కోళ్ల పందాలకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. జల్లికట్టు జంతు హింస అంటూ ప్రకటించిన కేంద్రం బీఫ్ ఎగుమతులపై నిషేధం విధించాలని ట్వీట్ చేశారు. 

కాసేపట్లో 2017 సెట్స్ ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు..

హైదరాబాద్ : కాసేపట్లో 2017 సెట్స్ ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లను ఉన్నత విద్యా మండలి ప్రకటించనుంది. 

ఆర్బీఐ ఎదుట టి. కాంగ్రెస్ ధర్నా..

హైదరాబాద్ : నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆర్బీఐ ఎదుట తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఉత్తమ్, జానా, షబ్బీర్, దానం నాగేందర్, కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మెంబర్ అనీల్ శాస్త్రీ తదితరులు పాల్గొన్నారు. 

పేటీఎంలకు వ్యతిరేకంగా సీపీఎం ఆందోళన...

విజయవాడ : పేటీఎంలకు వ్యతిరేకంగా సీపీఎం ఆందోళన నిర్వహించింది. వ్యాపార లావాదేవీలకు చంద్రబాబు పేటీఎంను కోరడాన్ని పేటీఎం సీఈవో వ్యాఖ్యలకు నిరసనగా సీపీఎం నిరసన వ్యక్తం చేసింది. పేటీఎం, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేసింది. చంద్రబాబు విదేశీ కార్పొరేట్లకు లాభం కలిగించేందుకు నగదు రహిత లావాదేవీలు ప్రోత్సాహించడాన్ని ఖండిస్తున్నట్లు సీపీఎం పేర్కొంది. పేటీఎం ద్వారా వ్యాపార లావాదేవీలను అడ్డుకుంటామని సీపీఎం నేత మధు హెచ్చరించారు. 

మూడో రౌండ్ లో సానియా..

మెల్ బోర్న్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ లో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా - చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బరా స్టికోవా జోడి మూడో రౌండ్ లోకి ప్రవేశించింది. 

11:43 - January 20, 2017

హైదరాబాద్  :సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు, ఏపీలో నిర్వహించే కోడి పందేలకు సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తన మద్దతు ప్రకటించారు. జల్టికట్టుపై నిషేధాన్ని ద్రవిడ సంస్కృతి, సమగ్రతపై దాడిగా ఆయన అభివర్ణించారు. దక్షిణ భారతదేశాన్ని కేంద్రం ఎలా చూస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. తమిళనాడులో సినిమా చిత్రీకరణ సమయంలో దక్షిణ భారతాన్ని ఎలా అణచివేస్తున్నారో చూశానని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. తనకు సంస్కృతి, మాతృభూమిపై ఎనలేని గౌరవముందన్నారు. తన పొలంలో జీవామృతాన్ని వినియోగించి సాగు చేస్తున్నానని.. గోశాలలో 16కు పైగా ఆవులున్నాయని తెలిపారు.

11:41 - January 20, 2017

ఢిల్లీ: మరోవైపు జల్లికట్టుపై తీర్పును సుప్రీంకోర్టు వారంరోజులపాటు వాయిదావేసింది.. ఇప్పుడు తీర్పు ఇస్తే తమిళనాడులో శాంతిభద్రతలు అదుపుతప్పే అవకాశముందని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది.. కేంద్రం విజ్ఞప్తితో సుప్రీంకోర్టు తీర్పు వాయిదావేసింది..

యూపీ స్కూల్ బస్సు ప్రమాద ఘటనలో కేసులు..

ఉత్తర్ ప్రదేశ్ : ఎటా ప్రాంతంలో స్కూల్ బస్సుకు జరిగిన ప్రమాదంలో ఇద్దరు విద్యాశాఖాధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్కూల్ యాజమాన్యం, ట్రక్, బస్సు డ్రైవర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

పోలీసు కస్టడీలోకి స్టాలిన్..విడుదల..

చెన్నై : డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జల్లికట్టుపై నిషేధం తొలగించాలని డిమాండ్ చేస్తూ రైల్ రోకో నిర్వహించారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విడుదల చేశారు. 

జల్లికట్టు తీర్పు వాయిదా..

ఢిల్లీ : తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. జల్లికట్టుపై తీర్పును సుప్రీంకోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది. తీర్పు ఇస్తే తమిళనాడు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుందని కేంద్రం వాదించింది. 

11:11 - January 20, 2017

అమరావతి : ఎమ్మెల్యే అఖిలప్రియపై దాడి యత్నం కేసులో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తుళ్లూరుకు చెందిన వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నిన్న వెలగపూడి వెళ్తుండగా అఖిలప్రియపై దాడికి వైసీపీ కార్యకర్తలు యత్నించారు. అఖిల ప్రియ కారు అద్దాలు ధ్వంసం చేసేందుకు యత్నించారు. గన్‌మెన్‌ల సహాయంతో ఎమ్మెల్యే అఖిల ప్రియ బయటపడ్డారు. 

11:08 - January 20, 2017

అమరావతి : ఏపీ శాసన మండలి ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. దీంతో అధికార టీడీపీలో రాజకీయ హడావుడి మొదలైంది. నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు ప్రారంభించడంతో టీడీపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

గవర్నర్‌ కోటా నుంచి చక్రపాణి, రెడ్డప్పరెడ్డి ...

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో శాసన మండలిలోని 23 మంది సభ్యులు పదవీకాలం ముగియనుంది. వీరిలో గవర్నర్‌ కోటా నుంచి ఎంపికైన మండలి చైర్మన్‌ చక్రపాణితోపాటు రెడ్డప్పరెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యేల ఓట్లతో ఎన్నికైన మండలి వైస్‌ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య, కాంగ్రెస్‌కు చెందిన మహ్మద్‌ జానీ, చంగల్‌ రాయులు, సుధాకర్‌బాబుతోపాటు, టీడీపీకి చెందిన కావలి ప్రతిభా భారతి పదవీకాలం పూర్తవుతుంది. అలాగే స్థానిక సంస్థల నుంచి మండలికి ఎన్నికలైన మెట్టు గోవిందరెడ్డి, సీ నారాయణరెడ్డి, బొడ్డు భాస్కరరామారావు, నరేశ్‌కుమార్ రెడ్డిల పదవీకాల మార్చితో ముగుస్తుంది. అంగర రామ్మోహన్‌రావు, మేకా శేషుబాబు, విశ్వప్రసాద్‌, వాకాటి నారాయణరెడ్డిల పదవీల కాలం కూడా మర్చితో పూర్తవుతుంది. పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ముగ్గురు, ఉపాధ్యాయ స్థానాల నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్సీలతో కలుపుకుని మొత్తం 23 ఖాళీలు ఏర్పడుతున్నాయి.

టీడీపీలో ఆశావహుల ప్రయత్నాలు ....

ఖాళీ అయ్యే శాసనమండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. దీంతో అధికార టీడీపీలో ఆశావహులు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వైపీసీ, కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన నేతలంతా తమకు అవకాశం కల్పించాలని అధినేతను కోరుతున్నారు. పార్టీ కోసం కష్టపడినవారితో పాటు, సీనియర్లకు గత ఎన్నికల్లో స్థానం కల్పించారు. దీంతో ఈసారి యువతకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. వీరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోకేశ్‌ మండలికి ఎన్నికైతే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

సతీశ్‌రెడ్డి, మెట్టు గోవింద్‌రెడ్డి, బొడ్డు భాస్కరరామారావు ....

పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్సీల్లో కొందరు మరో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నుంచి కడప జిల్లాకు చెందిన సతీశ్‌రెడ్డి, అనంతపురం జిల్లా నుంచి మెట్టు గోవిందరెడ్డి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బొడ్డు భాస్కరరామారావు ఈ కోవలోకి వస్తారు. అంగర రామ్మోహన్‌రావు కూడా మళ్లీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశంలో చేరిన వాకాటి నారాయణరెడ్డి, నరేశ్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌బాబుతోపాటు, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నారాయణరెడ్డిలు తమకు కూడా మరో చాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి కడప నుంచి నారాయణరెడ్డిని బరిలో దింపాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నారాయణరెడ్డికి ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొనే సత్తా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంతెన సూర్యనారాయణ రాజు పేరు పరిశీలనలో ఉంది. గతంలో అవకాశం చేజారడంతో ఈసారి మంతెనకు చాన్స్‌ ఉందని ప్రచారం జరుగుతోంది.

మహిళల కోటాలో కావలి ప్రతిభా భారతి, శోభా హైమావతి ......

మహిళల కోటాలో కూడా ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారు. పదవీ కాలం పూర్తవుతున్న కావలి ప్రతిభా భారతితోపాటు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీ సీనియర్లలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, కరణం బలరాం, దివి శివరాం, వర్ల రామయ్య, జేఆర్‌ పుష్పరాజ్‌, గోనుగుంట్ల కోటేశ్వరరావు, బచ్చుల అర్జునుడు, నాగుల్‌ మీరా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రుద్రరాజు పద్మరాజు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జూపూడి ప్రభాకర్‌రావులు కూడా ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పడుతున్నారు. సామాజిక, ప్రాంతీయ, రాజకీయ సమీకరణలను పరిగణలోకి తీసుకుని సీట్లు కేటాయిస్తారు. వీరిలో ఎంతమందికి ఎమ్మెల్సీ సీటు వరిస్తుందో చూడాలి. 

11:04 - January 20, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ అత్యంత ప్రతిష్టాత్మకం. ఆ పార్టీకి ఆక్సిజన్ ఇవ్వగలిగే అవకాశం వున్న ఏకైక రాష్ట్రం పంజాబ్. శిరోమణి అకాలీ దళ్, బిజెపి పదేళ్ల పాలనపై పెల్లుబికుతున్న వ్యతిరేకత మీదనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అయితే, 2014 లోక్ సభ ఎన్నికల్లో 4 ఎంపి స్థానాలు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. ఆప్ కారణంగా తమ విజయావకాశాలు దెబ్బతింటాయన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్, ఆప్ చీల్చుకుంటే ముచ్చటగా మూడోసారి అధికారం తమదేనన్న భావనతో ఎస్ఏడి, బిజెపి నేతలున్నారు.

గత పదేళ్లలో పంజాబ్ లో అవినీతి..

గత పదేళ్లలో పంజాబ్ లో అవినీతి విపరీతంగా పెరిగింది. డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వ్యవసాయం దెబ్బతింది. నిరుద్యోగం పెరిగింది. 12వేల కోట్ల లోటుబడ్జెట్ రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. ఈ పదేళ్ల కాలంలో పంజాబ్ నుంచి 20వేల పరిశ్రమలు తరలిపోయాయి. డ్రగ్స్, ఇసుక, మద్యం, రవాణా మాఫియాలు చెలరేగిపోతున్నాయి. రకరకాల మాఫియాతో అధికార పార్టీ నేతలకు సంబంధాలుండడాన్ని పంజాబీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగా అధికార ఎస్ఏడి, బిజెపి పాలనపై ప్రజల్లో విముఖత పెరిగింది. అందుకే 2014 ఎన్నికల్లో పంజాబ్ లో మోడీ మ్యాజిక్ పనిచేయలేదు.

ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ...

ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ఈసారి గెలిచితీరాలన్న పట్టుదలతో పావులు కదుపుతోంది. బిజెపి, ఆప్ లకు చెందిన నేతలను చేరదీస్తోంది. ఇవే తనకు ఆఖరి ఎన్నికలంటూ కెప్టెన్ అమరీందర్ సింగ్ సెంటిమెంట్ బాణాలేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు డిప్యూటీ సిఎం సుక్బీర్ సింగ్ బాదల్ కంటే కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉత్తముడన్న అభిప్రాయం పంజాబీలలో ఏర్పడిపోయింది. ఆప్ ముఖ్యనాయకుడు దల్జీర్ సింగ్ కాంగ్రెస్ లో చేరారు. కొన్నాళ్ల క్రితమే బిజెపికి దూరమై, ఆవాజ్ ఏ పంజాబ్ సంస్థను స్థాపించిన మాజీ క్రికెటర్ సిద్ధూ కూడా కాంగ్రెస్ గూటికే చేరారు. పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకు డిప్యూటీ సిఎం పదవి, సతీమణి నవజ్యోత్ కౌర్ కి అమృతసర్ ఎంపి టిక్కెట్టు ఇచ్చే ఒప్పందం మేరకే ఆయన కాంగ్రెస్ లో చేరారు. 2004 నుంచి 2014 వరకు అమృతసర్ ఎంపిగా పనిచేసిన సిద్దూ అరుణ్ జైట్లీ కోసం ఆ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అకాలీదళ్ తో బిజెపి పొత్తు పెట్టుకోవడం ఆయన కు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో బిజెపి నుంచి బయటకువచ్చారు. ఒకదశలో ఆయన ఆప్ లో చేరడం ఖాయమన్న వాతావరణం కనిపించింది. కేజ్రీవాల్ తో డీల్ కుదరకపోవడంతో, ఆవాజ్ ఏ పంజాబ్ సంస్థను స్థాపించి, చివరకు కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో హుషారు పెరిగింది. సిద్ధూకి మంచి వక్తగా పేరుంది. ఇప్పుడు కాంగ్రెస్ కి ఆయనే స్టార్ క్యాంపెయినర్.

2012 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమితో ...

2012 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమితో కాంగ్రెస్ గట్టిగా తలపడింది. ఆ ఎన్నికల్లో అధికార ఎస్ఏడికి 56, దాని మిత్రపక్షం బిజెపికి 12 సీట్లు వస్తే, కాంగ్రెస్ 46 స్థానాల్లో విజయం సాధించింది. పంజాబ్ లో మొత్తం 117 స్థానాలున్నాయి. అధికారాన్ని అందుకోవాలంటే 59 సీట్లు సాధించాల్సి వుంటుంది. కోటీ 97 లక్షల మంది ఓటర్లున్న పంజాబ్ లో పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువ. 53 శాతం మంది యువ ఓటర్లున్నారు. వీరు ఎటువైపు మొగ్గుతారన్నది ఆసక్తికరం. ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కంటే, కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ వయస్సులో చిన్నవాడు. ఆయనకు 90 ఏళ్లయితే, ఈయనకు 75. ఆయన కంటే కాంగ్రెస్ లో కొత్తగా చేరిన సిద్ధూ ఇంకా యువకుడు. ఆప్ లో యువకులే వున్నా, సమర్ధుడైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. అయితే, ఆప్ సాధించే ఓట్ల శాతం కాంగ్రెస్ అదృష్టాన్ని పరీక్ష బోతోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ మధ్య తేడా 3శాతం లోపే వుంది. కాంగ్రెస్ కి 33శాతం ఓట్లు వస్తే, ఆప్ కి 30శాతం ఓట్లొచ్చాయి. ఎస్ఏడి 20శాతం, బిజెపి 9శాతం ఓట్లకే పరిమితమయ్యాయి. 

రతి అగ్నిహోత్రి దంపతులపై ఎఫ్ఐఆర్..

ముంబై : సినీ నటి రతి అగ్నిహోత్రి దంపతులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రూ. 49 లక్షల విద్యుత్ చౌర్యానికి పాల్పడినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

స్కూల్ బస్సు బోల్తా..

జగిత్యాల : కొడింమ్యాల (మం) చింతలపల్లిలో స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. స్టీరింగ్ విరగడంతో బస్సు బోల్తా పడింది. నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. 

మాదాపూర్ లో రూ. 10లక్షల పాతనోట్ల లభ్యం..

హైదరాబాద్ : మాదాపూర్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ కారుల తరలిస్తున్న రూ. 10 లక్షల పాతనోట్లు లభ్యమయ్యాయి. బెదిరించి రూ. 8లక్షలను కానిస్టేబుళ్లు లాక్కెళ్లారని డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. దీనితో ఆ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. 

ఆందోళనలో పాల్గొన్న త్రిష..

చెన్నై : జల్లికట్టుపై వివిధ ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న ఆందోళనలో సినీ నటి త్రిష పాల్గొన్నారు. గతంలో జల్లికట్టు నిషేధాన్ని సమర్థించడంతో తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. 

10:20 - January 20, 2017

దరాబాద్ : గోవాలో త్రిముఖ పోటీ జరుగుతోంది. అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ లకు కొత్తగా రంగంలోకి దిగిన ఆప్ గట్టి సవాలు విసురుతోంది. గోవాలో ఆప్ కే కాస్త మొగ్గు వున్నట్టు సర్వేలు సూచిస్తున్నాయి. 40 అసెంబ్లీ స్థానాలు, రెండే రెండు లోక్ సభ స్థానాలున్న గోవా ఇప్పుడు కాంగ్రెస్, బిజెపిలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ఈ రెండు పార్టీలకు వెన్నుల్లో చలిపుట్టిస్తోంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బిజెపి, పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి సాధించుకునేందుకు కాంగ్రెస్, తొలి పాగా వేసేందుకు ఆప్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. గోవాలో కాంగ్రెస్, బిజెపి, ఆప్ లే కాకుండా మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, యునైటెడ్ గోవన్స్ డెమోక్రటిక్ పార్టీ, గోవా వికాస్ పార్టీ, ఎన్సీపీ, గోవా సురక్ష మంచ్ ఇలా రకరకాల పార్టీలున్నాయి. ఆ మాట కొస్తే 1990 వరకు మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఎంజీపీ తిరుగులేని శక్తిగా వుండేది. ఆ తర్వాత ఎంజీపీ బలహీన పడుతూ బిజెపి బలపడుతూ వచ్చింది.

ఆర్ఎస్ఎస్ నాయకుడు సుభాష్ వెలింగకర్, కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవాలో బిజెపికి బలమైన పునాదులు వేశారు. 2002లో బిజెపి అధికారంలోకి రాగా, 2007 కాంగ్రెస్, 2012లో తిరిగి బిజెపి అధికారంలోకి వచ్చాయి. మనోహర్ పారికర్ కేంద్ర కేబినెట్ లోకి వెళ్లడంతో ఆయన స్థానంలో లక్ష్మీకాంత్ పర్సేకర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

గోవాలో గట్టి పట్టున్న ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ చీఫ్ సుభాష్ వెలింగకర్ గత ఏడాది బిజెపికి పెద్ద షాకిచ్చారు. గోవా సురక్షా మంచ్ పేరుతో కొత్త సంస్థను స్థాపించి, బిజెపికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు ప్రభుత్వం నిధులివ్వడం నిలిపివేయాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. అయితే, గోవా రాష్ట్రంలో 26శాతం వున్న కేథలిక్ లను మచ్చిక చేసుకునే వ్యూహంతో ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ వ్యవహరిస్తున్నారు. ఒకవైపు సుభాష్ వెలింగకర్ దెబ్బకు విలవిలాడుతున్న సమయంలోనే మరోవైపు ఎంజిపి కూడా బిజెపికి దూరమైంది. ఎంజిపి, జీఎస్ఎం లకు శివసేన కూడా తోడైంది. ఈ మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదుకానీ బిజెపి విజయావకాశాలకు గండి కొట్టడం ఖాయం.

మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పంజాబ్ తో పాటు గోవా రాష్ట్రం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. తరచూ రాష్ట్రాన్ని సందర్శిస్తూ బలమైన శక్తిగా ఆవిర్భవించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తన సత్తా చాటాలన్న పట్టుదలతో గత 6 నెలలుగా ఆప్ తీవ్రంగా శ్రమిస్తోంది. జైళ్ల శాఖలో ఐజీగా పనిచేసిన ఎల్విస్ గోమ్స్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. గోవాకు ప్రత్యేక హోదా ఇస్తామన్న నినాదంతో ఆప్ దూసుకెళ్తోంది. 2012 ఎన్నికల్లో ఇదే నినాదంతో బిజెపి విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చడంతో బిజెపి మీద వ్యతిరేక వ్యక్తమవుతోంది. అయితే, గోవా హౌసింగ్ బోర్డు ఎండిగా పనిచేసిన రోజుల్లో ఎల్విస్ గోమ్స్ అవినీతికి పాల్పడ్డారంటూ ఏసిబి నోటీసులివ్వడంతో ఆప్ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.

గోవా కాంగ్రెస్ పార్టీలో యథాప్రకారం ముఠా కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, పిసిసి అధ్యక్షుడు ఫాలిరో మధ్య విబేధాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, బిజెపి ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు లాభిస్తాయన్న ఆశతో ఆప్ వుంది. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఈ రెండు పార్టీల మధ్య చీలి తామే లాభపడతామన్న అంచనాతో బిజెపి నేతలున్నారు. ఫిబ్రవరి 4న 11 లక్షల మంది ఓటర్లు తీర్పు చెప్పబోతున్నారు. గోవాలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఓటర్ల సగటు సంఖ్య 30 వేలు. త్రిముఖ పోటీలో 10 వేల ఓట్లు సాధిస్తే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే చాన్స్ వుంది. గోవాలో 66శాతం మంది హిందువులు కాగా, 26 శాతం మంది క్రిస్టియన్ లు, 8 శాతం మంది ముస్లింలున్నారు. 61శాతం మంది కొంకణి భాష మాట్లాడతారు. గత ఎన్నికల్లో బిజెపి వైపు మొగ్గిన క్రిస్టియన్ లు ఈసారి ఆప్ వైపు మొగ్గుతున్నట్టు కనిపిస్తోంది. మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వలసవచ్చిన ఓటర్లూ గణనీయంగానే వున్నారు. స్థానిక సంస్కృతి, మాదక ద్రవ్యాలు ప్రధాన ప్రచారాంశాలవుతున్నాయి. 

10:17 - January 20, 2017

విశాఖ : ఉక్కు నగరవాసులు కొత్త అనుభూతిని పొందుతున్నారు. ఎగిసిపడే అలలతో ఎప్పుడూ ఉధృతంగా ఉండే సముద్రాన్ని చూసి ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ను ప్రజలు గడుపుతుంటారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి మారిపోయింది. గత కొద్ది రోజులుగా సముద్రం ప్రశాంతంగా మారింది. ఎప్పుడూ నగరం వైపు దూసుకువచ్చే సముద్ర కెరటాలు.. ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాయి. దీంతో అలల కింద ఉన్న అందాలను చూసి ప్రజలు కొత్త అనుభూతిని పొందుతున్నారు. ఆర్కే బీచ్‌ నుంచి రుషి కొండ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఈ అందాలను వీక్షించేందు నగరవాసులు బీచ్‌కు క్యూ కడుతున్నారు. 

10:13 - January 20, 2017

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలు యధేచ్చగా జరుగుతున్నాయి. వేల ఎకరాల్లో అనధికారికంగా చేపల చెరువులు వెలుస్తున్నాయి. దీంతో పర్యావరణానికి, స్థానిక ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారింది. ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేస్తూ చేపల చెరువుల తవ్వకాలు జరుపుతున్న వైనంపై 10 టీవీ ప్రత్యేక కథనం.

చేపల చెరువుల సాగులో రాజకీయనాయకులు .....

ఏపీలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ, పేదల భూములు చేపల చెరువులతో ఆక్రమణకు గురవుతున్నాయి. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలలో వేలాది ఎకరాలు చేపలు, రొయ్యల చెరువులుగా మారిపోయాయి. గతంలో సొంత భూముల్లోనే ఈ తవ్వకాలు సాగేవి. రానురాను పెట్టుబడిదారులు ఈ కల్చర్‌లోకి వచ్చేశారు. రాజకీయ నాయకులు సైతం వేలాది ఎకరాలు సాగు చేయడానికి రంగప్రవేశం చేశారు. దీంతో ఆక్రమణలు పెరిగాయి. ప్రభుత్వ, పేదల భూములు సైతం ఆక్రమణలకు గురవుతున్నాయి.

.గో జిల్లా వ్యాప్తంగా అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలు...

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పాములపర్రు, పాలకోడేరు మండలం మోగల్లు, విస్సా కోడేరు, గొల్లల కోడేరు, నిడమర్రు మడంలం అడవికొలను, పాలకోడేరు మండలం కోరుకొల్లు, పెనుమంట్ర మండలం పాలమూరు, జుత్తిగ, ఆకివీడు మండలం అప్పారావుపేట, పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామాల్లో వేలాది ఎకరాలను అక్రమంగా తవ్వేస్తున్నారు. దీంతో వేలాది మంది రైతులు, స్థానిక ప్రజలు నష్టపోతున్నారు. కృష్ణా జిల్లా నందివాడ, కలిదిండి మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. ఈ ఆక్రమణలు పాల్పడుతున్న వారు ప్రజాప్రతినిధులే కావడంతో అధికారులు సైతం నోరు మెదపని పరిస్ధితి ఏర్పడుతోంది. పేదల భూముల్లో అక్రమంగా చేపల చెరువులు తవ్వకాలపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.

కృష్ణా జిల్లా ఇలపర్రులో 165 ఎకరాల పేదల భూముల ఆక్రమణ....

కృష్ణా జిల్లా నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలో సుమారు 165 ఎకరాల పేదల భూముల్ని పెద్దలు ఆక్రమించి చేపల చెరువులుగా మార్చేశారు. ఏళ్ల తరబడి ఈ భూములన్ని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. దీనిపై స్థానిక పేదలు తమ భూములు తమకే ఇవ్వాలని పోరాటానికి దిగారు. ఈ పోరాటానికి సీపీఎం వ్యవసాయ కార్మిక సంఘం మద్దతుగా నిలిచింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆధ్వర్యంలో సీపీఎం బృందం ఇలపర్రులో ఆక్రమణలకు గురైన పేదల భూములను పరిశీలించింది. ఫిబ్రవరి 6 వ తేదీలోగా ఆక్రమించిన భూముల్ని పేదలకు ఇవ్వకపోతే తాము ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని మధు ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అక్రమ చేపల చెరువుల తవ్వకాలపై దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పేద భూముల్లో చేపల చెరువులు తవ్విన పెద్దలపై చర్యల తీసుకోవాలని కోరుతున్నారు. 

10:08 - January 20, 2017

చెన్నై : వరుస ఆందోళనలు, నిరసనలతో తమిళనాడు అట్టుడికిపోతోంది .. జల్లికట్టుపై నిషేధం తొలగించాలంటూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌ పిలుపుకు భారీ స్పందన వస్తోంది.. బంద్‌తోపాటు... వివిధరకాల నిరసనలద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై స్థానికులు ఒత్తిడి పెంచుతున్నారు.. బంద్‌లోభాగంగా విద్య, వ్యాపారసంస్థల్ని స్వచ్చందంగా మూసివేశారు.. యువతీ యువకులు, స్థానికులు వేలాదిమంది జల్లికట్టుకు మద్దతుగా రోడ్డెక్కారు.. మెరీనా బీచ్‌ ఆందోళనకారులతో నిండిపోయింది.. తమిళ సినీ పరిశ్రమకూడా జల్లికట్టు ఆందోళనలకు మద్దతు ప్రకటించింది.. జల్లికట్టువద్దంటూ వ్యాఖ్యలుచేసిన సినీనటి త్రిషకూడా తన రూట్‌ మార్చేశారు.. సంప్రదాయాల్ని కొనసాగించాలంటూ నిరసనల్లో పాల్గొన్నారు.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్ రెహమాన్‌ ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు.. జల్లికట్టుకు మద్దతుగా ఈ దీక్ష మొదలుపెట్టారు.. అటు జల్లికట్టు కొనసాగించాలంటూ డీఎంకే నేతలు, కార్యకర్తలు చేపట్టిన రైల్‌ రోకో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.. స్టాలిన్‌ నేతృత్వంలో ఎగ్మోర్‌ రైల్వేస్టేషన్‌లో బారికేడ్లను తొలగించి రైళ్లను అడ్డుకునేందుకు నేతలు ప్రయత్నించారు... స్టాలిన్‌తోపాటు పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.. మరోవైపు అన్నా డీఎంకె కూడా జల్లికట్టుకోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.. జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్‌ తెచ్చేవిధంగా ప్రయత్నిస్తున్నామని సీఎం పన్నీర్‌ సెల్వం ప్రకటించారు.. రెండురోజుల్లో ఆర్డినెన్స్‌ వచ్చేలా చూస్తున్నామని తెలిపారు.. రేపు రాష్ట్రపతినికలిసి ఆర్డినెన్స్‌కోసం విజ్ఞప్తి చేస్తామని స్పష్టం చేశారు.. ప్రజలు ఆందోళన విరమించాలని కోరారు.. కాంగ్రెస్‌ నేతలుకూడా జల్లికట్టుకు మద్దతుగా నిరసనలు చేపట్టారు

అఖిల ప్రియ దాడి యత్నంలో వైసీపీ కార్యకర్తల అరెస్టు..

గుంటూరు : టిడిపి నేత అఖిల ప్రియపై జరిగిన దాడి ఘటనలో తుళ్లూరుకు చెందిన వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అఖిలప్రియ కారు అద్దాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. నిన్న అఖిల ప్రియ వెలగపూడి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

నిరసనలు వీడాలి - సెల్వం..

చెన్నై : జల్లికట్టుపై కొనసాగుతున్న నిరసనలను వీడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పిలుపునిచ్చారు. ఆర్డినెన్స్ పై ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

తమిళనాడులో కొనసాగుతున్న బంద్...

చెన్నై : తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జల్లికట్టుపై నిషేధం తొలగించాలంటూ విద్యార్థులు..పలువురు రాజకీయ నేతలు ఆందోళన చేపట్టారు. నేడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. బంద్ కు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, కళాశాలలు, స్కూళ్లు బంద్ పాటిస్తున్నాయి. 

10:04 - January 20, 2017

హైదరాబాద్ :అగ్రరాజ్యపు అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా 45వ అధ్యక్షుడిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం, తొలిసారిగా వైట్‌ హౌస్‌లోకి అధ్యక్షహోదాలో కాలు మోపనున్నారు ట్రంప్‌. అమెరికా సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ట్రంప్‌ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

శ్వేతసౌధంలో....

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అందరి అంచనాలనూ తల్లకిందులు చేస్తూ... విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం.. శ్వేత సౌధంలోకి అడుగుపెట్టనున్నారు. బరాక్‌ ఒబామా పదవీ కాలం ముగిసిన ఉత్తర క్షణమే ట్రంప్‌ అధ్యక్ష పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు.

ట్రంప్‌ పదవీస్వీకార ప్రమాణోత్సవానికి....

ట్రంప్‌ పదవీస్వీకార ప్రమాణోత్సవానికి డెమొక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌, మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ డబ్ల్యూ బుష్‌, జిమ్మీ కార్డర్‌లతో పాటు భారతీయ అమెరికన్లు సహా వేలాది మంది హాజరుకానున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ట్రంప్ ఎన్నికల నినాదాన్ని ప్రమాణ స్వీకారోత్సవానికి థీమ్‌గా నిర్ణయించారు. వాషింగ్టన్ డీసీలో జరిగే ఈ కార్యక్రమానికి కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయడంతో పాటు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ఆర్లింగ్టన్ నేషనల్ సిమెటరీ వద్ద ట్రంప్ దివంగత సైనికులకు నివాళి అర్పించడంతో కార్యక్రమాలు మొదలవుతాయి. నేషనల్ మాల్ వద్ద ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. యువ కొరియోగ్రాఫర్ సురేశ్ ముకుంద్ శిక్షణలో తర్ఫీదైన 30 మంది కళాకారులు, తమ ప్రదర్శనతో అలరించనున్నారు.

ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.....

మధ్యాహ్నం 12గంటలకు ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం అధ్యక్షుడి హోదాలో ట్రంప్‌ తొలిసారి ప్రసంగిస్తారు. ఉపాధ్యక్షుడిగా మైక్‌ పెన్స్‌ కూడా ఈ కార్యక్రమంలోనే ప్రమాణం చేస్తారు. కాపిటల్‌ భవనంలోని స్టాచ్యువరీ హాల్‌లో అధికార విందుకు ట్రంప్‌ హజరవుతారు. ఆ తర్వాత ట్రంప్‌ కోసం ప్రత్యేకంగా అధునాతన హంగులతో తయారు చేసిన లీమోసైన్‌ కారును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పెన్సిల్వేనియా ఎవెన్యూ మార్గంలో అధ్యక్ష ప్రమాణ స్వీకార కవాతు శ్వేతసౌధానికి చేరుకుంటుంది. ఈ కవాతు మార్గంలో 3వేల మంది పోలీసులు, 7వేల మంది భద్రతా బలగాలు మోహరిస్తాయి.

ట్రంప్‌కు వ్యతిరేకంగా మహిళలు భారీ ర్యాలీ...

దేశాన్ని పునర్నిర్మిస్తామనని అధ్యక్షుడిగా ఎన్నికైన మరుక్షణమే ట్రంప్‌ ప్రకటించారు. మరోవైపు ట్రంప్‌ ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసేందుకు నిరసనకారులు వ్యూహాలు రచిస్తున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా మహిళలు భారీ ర్యాలీ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. 

10:00 - January 20, 2017

వయస్సు ఏదైనా కండరాల నొప్పులతో బాధ పడుతున్నారు. మారుతున్న జీవన శైలికి దీనికి ముఖ్య కారణమని చెప్పవచ్చు. నడుం..కండరాల నొప్పుల నుండి విముక్తి పొందాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

  • బరువైన వస్తువులను ఎత్తే సమయంలో చేతులతో కాకుండా యంత్రాలతో ఎత్తడం మంచిది. ప్రమాదాలను అరికట్టడమే కాకుండా నొప్పులు రాకుండా ఉంటుంది.
  • పనిముట్లు వాడే సమయంలో చేయి..మణికట్టు భంగిమ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
  • తరచూ వాడే వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి. ఒకే వస్తువు కోసం పలుమార్లు తిరగడం వల్ల నరాలపై ఒత్తిడి కలుగ చేస్తుంది.
  • వెన్ను భాగం నిటారుగా ఉండేలా పనిచేయాల్సి ఉంటుంది. తరచూ వెన్నెముకను వంచడం..మెలితిప్పడం ప్రమాదాలకు దారి తీస్తుంది.
  • నేల మీద కూర్చొని పనిచేయాల్సి వస్తే కాళ్లు మడిచి..మోకాళ్లు నేలకు ఆనుకుని ఉండేటట్లు కూర్చొవాలి. అంతేగాకుండా వెన్నెముక నిటారుగా ఉంచే ప్రయత్నం చేయాలి.
  • నిలబడి పనిచేయాల్సి వచ్చినప్పుడు ప్రతి అరగంటకొకసారి భంగిమను మార్చుకొంటే ఉపయోగం.
  • నిలబడి పనిచేసేటప్పుడు రెండు కాళ్ల మధ్య దూరం రెండు భుజాల మధ్య ఉన్నంత ఉండాలి. దీనితో మోకాళ్లు, అరికాళ్ల నొప్పులు రావు.
  • ఉద్యోగం..మరేవైనా విధులు..ఇంటి పనిచేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు. 
09:59 - January 20, 2017

హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంతంలో వైసీపీ నేత జగన్ పర్యటన అనేక ఆంక్షల మధ్య సాగింది. రాజధాని గ్రామాల్లో పర్యటించిన ఆయన.. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు చోట్ల పోలీసులు ఆంక్షలు నడుమ రాజధాని గ్రామాల్లో జగన్‌ రోడ్‌ షో కొనసాగింది. ఎందుకు విపక్షాల పర్యటనలో అధికార పార్టీ ఆంక్షలు విధిస్తోంది? ప్రభుత్వం భయపడుతోందా? రాజధాని నిర్మాణానికి ఎంత భూమి కావాలి? రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ చేయబోతోందా? ఈ అంశంపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి, టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. వీరి చర్చలో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

09:58 - January 20, 2017

కొన్ని సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ 'చిరంజీవి' సినిమా 'ఖైదీ నెంబర్ 150' సినిమాకు అభిమానులు..ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తమిళంలో వచ్చిన 'కత్తి' సినిమాను వివి వినాయక్ రీమెక్ చేసిన సంగతి తెలిసిందే. 'చిరు'కు 150వ చిత్రం కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. చిత్రం విడుదల అనంతరం భారీగా కలెక్షన్లు సాధిస్తూ దూసుకపోతోంది. రిలీజ్ తరువాత సరికొత్త రికార్డ లను సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఏకంగా వంద కోట్ల క్లబ్ లో నిలవడంతో మెగా కాంపౌండ్ తో పాటు 'చిరు' అభిమానుల సంతోషాలకు అవధులు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలని 'మెగా' ఫ్యామిలీ యోచిస్తున్నట్లు టాక్. భారీ విజయోత్సవ వేడుకను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో రూ. 8కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో విశాఖలో భారీ ఎత్తున విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా మెగా హీరోల సక్సెస్ మీట్ లు విశాఖలో నిర్వహించిన నేపథ్యంలో అదే సెంటిమెంట్ ను కొనసాగించాలని అనుకుంటున్నట్లు టాక్. అధికారికంగా ఓ ప్రకటన వెలువడాల్సి ఉంది. 

09:57 - January 20, 2017

హైదరాబాద్:కొత్త జిల్లాలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సకల సౌకర్యాలతో అన్ని ఆఫీసులు ఒకే ప్రాంగణంలో ఉండేవిధంగా డిజైన్లు రూపొందించి, టెండర్లు పిలిచే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మినహా.. మిగిలిన 28 జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు నిర్మించాలని సమీకృత జిల్లా కార్యాలయాల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ల ప్రాంగణంలోనే అన్ని ఆఫీసులు ....

పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలను పునర్విభజించిన తెలంగాణ సర్కార్‌ ఇప్పుడు సమీకృత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ల ప్రాంగణంలోనే అన్ని ఆఫీసులు ఉండేందుకు వీలుగా, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో డిజైన్లు రూపొందించాలని నిర్ణయించారు. ఇవి పూర్తైన వెంటనే ఆమోదం తీసుకుని జిల్లా కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాల నిర్మాణానికి టెండర్లు పిలవాలని ప్రతిపాదించారు. వీటి నిర్మాణానికి వచ్చే బడ్జెట్‌లో నిధుల కేటాయించాలని నిర్ణయించారు.

గాలి, వెలుతురు ధారళంగా ప్రసరించేలా డిజైన్లు ....

జిల్లా పోలీసు, అగ్నిమాక ఆఫీసులు మినహా, మిగిలిన అన్ని కార్యాయాలు ఒకేచోట ఉండేలా స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయాల్లో ప్రతి గదికి దారాళంగా గాలి, వెలుతురు ప్రసరించేలా డిజైన్లు రూపొందిస్తారు. పచ్చదనం ఉట్టిపడేలా ల్యాండ్‌ స్కేప్‌ గార్డెన్లు, వాకింగ్‌ ట్రాక్‌లు, పార్కింగ్‌ ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. అధికారులు, ఉద్యోగులు, ప్రజల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు, క్యాంటీన్లు, భోజనశాలలు, బ్యాంకు, ఏటీఎం, మీ సేవా కేంద్రాలు ఉండేలా డిజైన్లు రూపొందించాలని నిర్ణయించారు. అలాగే రికార్డులు భద్రపరిచేందకు ప్రత్యేక గదులు, స్ట్రాంగ్‌ రూములు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌, జనరేటర్‌ రూము, అగ్నిమాపక శకటం ఉండేలా ఆఫీసులు నిర్మిస్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాల పర్యటనలకు వచ్చినప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించడంతోపాటు, వివిధ వర్గాలతో భేటీ అయ్యేందుకు వీలుగా కాన్ఫరెన్స్‌ హాళ్లు కొత్త కలెక్టరేట్లలో ఉండాలని కేసీఆర్‌ ఆదేశించారు.

తమిళనాడు పోలీసు కార్యాలయాల నమూనాపై అధ్యయనం ....

పరేడ్‌ మైదానంతోపాటు, సమావేశ మందిరం ఉండే విధంగా జిల్లా పోలీసు కార్యాలయాలను ప్రత్యేకంగా నిర్మిస్తారు. తమిళనాడులో జిల్లా పోలీసు కార్యాలయాల నమూనాలను అధ్యయనం చేసేందుకు డీజీపీ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆ రాష్ట్రంలో పర్యటించి, నివేదిక ఇవ్వాలని కేసీఆర్‌ ఆదేశించారు. పోలీసులు నేర భాష మార్చుకోవాలని సూచించారు. క్రైమ్‌ మీటింగ్‌ పేరు కూడా చేంజ్‌ చేయాలి కోరారు. వ్యతిరేక భావం వచ్చే పదాల స్థానంలో సానుకూలంగా ఉండే ప్రత్యామ్నాయ పదాలను ఉపయోగించాలని నిర్దేశించారు. పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో సానుకూల ధృక్పథం ఏర్పడాలన్నది కేసీఆర్‌ ఆకాంక్ష.

09:57 - January 20, 2017

ముదురు భామ 'శ్రియ'కు మరో క్రేజీ ఛాన్స్ దక్కినట్లు వినిపిస్తోంది. మరోసారి కలిసి నటిద్దామంటూ ఓ సీనియర్ స్టార్ ఈ బ్యూటీకి గోల్డెన్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. 'శ్రియ' ఏజ్ గ్రూప్ హీరోయిన్స్ అవకాశాల్లేక ఖాళీగా ఉంటే ఈ బ్యూటీ మాత్రం ఆడపాడపా క్రేజీ మూవీస్ లో నటిస్తూ ఇప్పటికి మాయ చేస్తోంది. ఢిల్లీ బ్యూటీ 'శ్రియ' 16 ఏళ్లకు పైగా లాంగ్ కెరీర్ కంటిన్యూ చేస్తోంది. మెగాస్టార్ నుంచి వెంకటేష్ వరకు పవన్ కళ్యాణ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు రెండు జనరేషన్స్ స్టార్స్ తో నటించిన క్రెడిట్ ని కూడా ఈ బ్యూటీ సొంతం చేసుకుంది. అయితే గత ఐదేళ్లుగా యంగ్ బ్యూటీస్ ఏంట్రీతో 'శ్రియ'కు చాన్స్ లు తగ్గాయనే చెప్పాలి. దీనికి తోడు ఏజ్ కూడా థర్టీ క్రాస్ కావడంతో ఈ బ్యూటీని సినిమాల్లో తీసుకోవడానికి స్టార్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అయితే ప్రత్యేకమైన సినిమాలకు మాత్రం దర్శకనిర్మాతలతో పాటు హీరోలు ఈ బ్యూటీ వైపే మొగ్గుచూపుతున్నారు. 'మనం', లెటేస్ట్ గా వచ్చిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. 'గౌతమిపుత్రకర్ణి'లో వశిష్టీ దేవిగా 'శ్రియ' పెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో 'శ్రియ' నటన పరంగా, గ్లామర్ పరంగా, ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కొన్ని సీన్స్ లో అయితే 'శ్రియ' నటనకు హ్యట్సాఫ్ అనే రీతీలో నటించింది.

చిరుతో కూడా ? 
'శాతకర్ణి' పిక్చరైజేషన్ సమయంలో 'శ్రియ' అద్భత నటనను గమనించిన 'బాలయ్య' మరోసారి కలిసి నటిద్దామంటూ బంఫర్ ఆఫర్ ఇచ్చాడట. అంతేకాదు ఈసారి పక్కా కమర్షియల్ మూవీ చేద్దామంటూ ఈ నందమూరి సీనియర్ స్టార్ 'శ్రియ'ను ఆనందంలో ముంచేశాడట. 'బాలకృష్ణ' నెక్ట్స్ 101వ చిత్రంగా 'రైతు' టైటిల్ తో మూవీ చేయడానికి ప్రిపేర్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే 'శ్రియ'కు అవకాశం ఇస్తాడనే ప్రచారం సాగుతోంది. నిజానికి 'చిరంజీవి', 'బాలయ్య', 'నాగర్జున', 'వెంకటేష్' లాంటి స్టార్స్ ఏజ్ 60 దాటాయి. ఈ ఏజ్ లో వీరు కుర్రహీరోయిన్స్ తో నటిస్తే పెద్దగా కెమిస్ట్రీ వర్కవుట్ కావడం లేదు. దీంతో 'శ్రియ', 'అనుష్క', 'నయనతార' లాంటి హీరోయిన్స్ తో నటించడానికే సీనియర్ స్టార్స్ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే 'బాలయ్య' 'శ్రియ'కు మరో చాన్స్ ఇస్తున్నాడేమో, అన్నట్లు పనిలో పనిగా 'చిరంజీవి' సరసన కూడా మరోసారి నటించే ఛాన్స్ ని 'శ్రియ'ని వరిస్తోందో చూడాలి.

09:56 - January 20, 2017

దావోస్ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి పలు కంపెనీల అధిపతులతో భేటీలు నిర్వహిస్తున్నారు.

కుమియమి సంస్థ అధ్యక్షుడితో బాబు భేటీ

కుమియమి అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ అధ్యక్షుడు యమజికితో భేటీ అయ్యారు. ఫండ్‌, టెక్నాలజీ, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ రంగాల్లో కుమియుమి సంస్థ ఆసక్తి కనబరిచింది. టెంపుల్ సిటీల అభివృద్ధిలో అనుభవమున్న కుమియుమి కంపెనీ తిరుపతి అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపినట్లు ఆయన తెలిపారు.

మెకెన్సీగ్లోబల్‌ సంస్థ ఛాన్సలర్‌ జోనాథన్‌ ఓజల్‌ తో బాబు చర్చలు ...

మెకెన్సీగ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛాన్సలర్‌ జోనాథన్‌ ఓజల్‌తో బాబు విస్తృతంగా చర్చించారు. రాజధాని అమరావతికి ఆర్థిక వనరులు, పెట్టుబడులు సమకూర్చడంలో మెకెన్సీ సంస్థ కీలక భూమిక నిర్వహించాలని బాబు కోరారు. భవిష్యత్‌ అంతా చైనా, భారత్‌లదే నని.. రానున్న మూడు నెలల్లోగా చైనానుంచి 20 వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషిచేస్తామన్నారు మెకెన్సీ ఛాన్సలర్‌ జోనాథన్‌ ఓజల్‌ అన్నారు.

మోర్గాన్‌స్టాన్లీ హెడ్‌ మాక్స్‌న్యూకిర్షన్‌తో చంద్రబాబు భేటీ

అటు మోర్గాన్‌స్టాన్లీ సంస్థకు చెందిన స్ట్రాటజీ హెడ్‌ మాక్స్‌ న్యూకిర్షన్‌ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో వనరుల అవకాశాలను మాక్స్‌కు చంద్రబాబు వివరించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు వ్యవసాయం, ఆరోగ్యరంగాల్లో టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని, మెరుగైన ఆలోచనలు, పరిష్కారాలు ఇస్తే స్వీకరిస్తామని చంద్రబాబు చెప్పారు. ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సీఎం రమేష్‌, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 

09:56 - January 20, 2017

సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఏ హీరో అయిన హ్యాపీగా ఫీలవుతాడు. కానీ ఇప్పుడు మన పాజిటివ్ రిజల్ట్స్ కోలీవుడ్ స్టార్ 'సూర్య'కి అడ్డుగా మారాయి. 'సూర్య' న్యూ మూవీ 'ఎస్ 3' రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ తమిళ అనువాదానికి మన సంక్రాంతి సినిమాల సక్సెస్ లు పెద్ద పంచ్ వేశాయి. దీంతో ఈ తమిళ తంబీ డైలామాలో పడిపోయాడు. సౌత్ స్టార్ సూర్య నటించిన 'సింగం 3' అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనవరి 26న 'సింగం 3' సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అనౌన్స్ చేశారు. నిజానికి ఈ మూవీ గత దీపావళికే రిలీజ్ కావాల్సింది. కానీ ఓ వైపు డిమానిటైజైషన్ తో పాటు మెగా కాంపౌండ్ స్నేహాం వల్ల ఈ మూవీని ఈ నెల లాస్ట్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు సంక్రాంతి సినిమాల రిజల్ట్స్ 'సూర్య' 'ఎస్ 3' మూవీకి బాగా దెబ్బేశాయి. ఏం చేయాలా అని సూర్య అండ్ టీం తలపట్టుకుంది. తమిళంలో ఆల్ రెడీ 'సూర్య' 'ఎస్ 3' మూవీకి సంబంధించిన థియేటర్స్ బుక్ అయ్యాయి. కానీ తెలుగులో మాత్రం ఈ మూవీకి థియేటర్స్ దొరకడం కష్టంగా ఉంది.

మూడు సినిమాలు హిట్..
ఈ సంక్రాంతి కనుగా తెలుగులో రిలీజైన మూడు సినిమాలు హిట్టు టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. మరో రెండు వారాల వరకు సంక్రాంతి సినిమాలను థియేటర్స్ నుంచి తీయడం కష్టమే. మంచి వసూల్ సాధిస్తుండడంతో ఈ సంక్రాంతి సినిమాలను కంటిన్యూ చేస్తున్నారు. ఇలాంటి టైంలో డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టమనే చెప్పాలి.  'సూర్య' సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉందని తెలిసిందే. దీంతో పాటు గత ఎడాది ఈ సౌత్ స్టార్ '24' ద్వారా మంచి విజయం అందుకున్నాడు. అంతేకాకుండా 'సింగం' సీరిస్ లో భాగం వచ్చిన మొదటి రెండు భాగాలు మాస్ ఆడియన్స్ ని ఓ రేంజ్ లో అలరించాయి. అదే విధంగా ఈ థర్డ్ పార్ట్ కూడా మాస్ ఆడియన్స్ ఉర్వుతలూగిస్తోందని 'సింగం' టీం భావిస్తోంది. హరి దర్శకత్వం వహించిన ఈ మూవీ థర్డ్ పార్ట్ లో 'అనుష్క' తో పాటు 'శృతిహాసన్' హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈమూవీకి తెలుగులో థియేటర్స్ ని ఎంత వరకు అడ్జెట్ చేస్తారనేదే చూడాలి.

09:55 - January 20, 2017

సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ 'చిరంజీవి' ఇంటికి సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. 'చిరు' నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఇటీవలే విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు 'పవన్' హాజరు కాకపోవడంపై సోషల్ మీడియాలో పలు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 'ఖైదీ..' చిత్రం విజయవంతం కావాలని..చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు 'పవన్ కళ్యాణ్' ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. తాజాగా బుధవారం 'చిరంజీవి' ఇంటికి 'పవన్' నేరుగా వెళ్లారు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. సినిమా గురించి మాట్లాడుకున్నారా ? లేక రాజకీయ సంగతులు మాట్లాడుకున్నారా ? అనేది తెలియరాలేదు. 

 

09:06 - January 20, 2017

చెన్నై :జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ చెన్నైలో జరుగుతున్న నిరసనకు సినీవర్గాల నుంచి భారీగా మద్దతు పెరుగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రహమాన్ కూడా మద్దతు తెలిపారు. తమిళనాడు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ నిరాహార దీక్ష చేపడతానని మైక్రో బ్లాగింగ్‌ వెబ్‌సైట్‌లో ట్వీట్‌ చేశారు. ఇప్పటికే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, కమల్‌హాసన్, ధనుష్‌, శృతి హాసన్, తదితర నటులు జల్లికట్టును సమర్థించిన విషయం తెలిసిందే.

07:16 - January 20, 2017

అమరావతి : ప్రభుత్వం వైఖరిని ఎండగడుతూ రాజధాని గ్రామాల్లో వైసీపీ అధినేత జగన్‌ రోడ్‌ షో కొనసాగింది. నిడమర్రు, లింగాయపాలెం గ్రామాల్లో ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజా రాజధానిని నిర్మించాలంటే వైసీపీ అధికారంలోకి రావాలని జగన్ అన్నారు.

రైతులతో ముఖాముఖి....

నిడమర్రులో రైతులతో జగన్‌ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెనుమాక, ఉండవల్లి, నవులూరు, ఎర్రబాలెం గ్రామాలకు తనను వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారని జగన్ మండిపడ్డారు. కమీషన్ల కోసం ఏపీ రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టారని ఆరోపించారు. 15 కోట్లు పలికే ఎకరం భూమికి రూ. 30 లక్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని జగన్ విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆక్షేపించారు.

లింగాయపాలెంలో...

నిడమర్రు నుంచి లింగాయపాలెం వరకు జగన్‌ రోడ్‌ షో నిర్వహించారు. అక్కడి రైతులతో కూడా వైసీపీ అధినేత ముఖాముఖి నిర్వహించారు. దళితుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని జగన్‌ మండిపడ్డారు. రైతుల భూములు లాక్కొని ఎక్కడా స్థలాలు కేటాయించలేదన్నారు. బలవంతంగా భూములు తీసుకోమన్న ప్రభుత్వం.. ఇప్పుడు దళితుల భూములను కూడా ప్రభుత్వ భూముల్లో కలిపేసి వారికి అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగాయపాలెం రైతులు జగన్‌ ముందు గోడును వెల్లబోసుకున్నారు. 

06:58 - January 20, 2017

హైదరాబాద్: జనరల్ ఇన్స్యూరెన్స్ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. కేంద్ర కేబినెట్ సమావేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వరంగంలోని 5 జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలలో 25శాతం వాటాలను విక్రయిస్తామంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ఓరియెంటల్ ఇన్స్యూరెన్స్, నేషనల్ ఇన్స్యూరెన్స్ తో పాటు జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఈ అయిదు కంపెనీల షేర్ల లిస్టింగ్ కు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ వల్ల కంపెనీల నిర్వహణ సామర్థ్యం మరింత పెరుగుతుందనీ, వ్యాపార వృద్ధి లాభాల మార్జిన్లు పెంచుకోవడం పై ఫోకస్ పెరుగుతుందని అరుణ్ జైట్లీ చెబుతున్నారు. వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం వైపు చూడకుండా స్వయంగా మార్కెట్ నుంచి నిధులు సమీకరించుకునే అవకాశం ఈ అయిదు కంపెనీలకు లభిస్తుందంటున్నారు అరుణ్ జైట్లీ. ఇందులో ఎంత నిజం వుంది? ప్రభుత్వరంగంలోని జనరల్ ఇన్స్యూరెన్స్ రంగంలో ప్రవేశపెడుతున్న ఈ సంస్కరణలు ఎలాంటి ఫలితాన్నిస్తున్నాయి? కేంద్ర కేబినెట్ నిర్ణయాలను జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగ సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆల్ ఇండియా ఇన్స్యూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేత కెవివిఎస్ఎన్ రాజు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను తెలియపరచారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

జకీర్ నాయక్ కు సమన్లు

హైదరాబాద్: వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్‌కు నేష‌న‌ల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సమన్లు జారీ చేసింది. జకీర్‌కు సంబంధించిన 78 బ్యాంకు అకౌంట్లపై ఎన్‌ఐఏ నిఘా పెట్టింది. జకీర్‌ సంస్థ రియ‌ల్ ఎస్టేట్‌లో సుమారు వంద కోట్ల వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు జాతీయ ద‌ర్యాప్తు సంస్థ పేర్కొంది. క‌శ్మీర్‌కు చెందిన వేర్పాటువేద నేత స‌య్యిద్ అలీషా గిలానీకి చెందిన రెండు బ్యాంక్ ఖాతాలపై కూడా నిఘా పెట్టిన‌ట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన సుమారు 12 కేసుల‌ను ప్రభుత్వం త‌మ‌కు అప్పగించిన‌ట్లు ఎన్ఐఏ తెలిపింది.

06:53 - January 20, 2017

హైదరాబాద్: యూపీ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటుపై నీలినీడలు కమ్మకున్నాయి. సీట్ల పంపకాలపై జరుగుతున్న చర్చల్లో ఎస్పీ, కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌డి పార్టీలు ఓ అవగాహనకు రావడం లేదు. దీంతో కాంగ్రెస్‌తోనే తమ అలయన్స్‌ ఉంటుందని ఎస్పీ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్‌ నందా స్పష్టం చేశారు. 3 వందలకు పైగా సీట్లలో ఎస్పీ పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ 125 సీట్లు డిమాండ్‌ చేస్తుంటే..ఎస్పీ 100 సీట్లు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తోంది. ఆర్‌ఎల్‌డిని కూటమిలో కలుపుకునేది లేనిది ఎస్పీ కాంగ్రెస్‌ పార్టీకే వదిలేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు కేటాయించిన వంద సీట్ల నుంచే ఆర్‌ఎల్‌డికి కూడా కేటాయించాల్సి ఉంటుంది. తమకు 30 సీట్లు ఇవ్వాలని అజిత్‌సింగ్‌ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో మహాకూటమి ఏర్పాటు అవుతుందా...లేదా అన్నది త్వరలో తేలనుంది.

06:51 - January 20, 2017

ఢిల్లీ సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ కుమార్‌ వర్మ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న ఏకే వర్మ ఒకటి లేదా రెండు రోజుల్లో సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపడతారు. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ముగ్గుర సభ్యుల కమిటీ సమావేశమై, ఈ పదవి కోసం పోటీలో ఉన్న 45 మంది ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలించి, వర్మ ను ఎంపిక చేసింది. 1979 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన వర్మ ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారు. ఈయన అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా, మిజోరం రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. గత డిసెంబర్‌ 2న ఏకే సిన్హా రిటైర్‌ కావడంతో ఖాళీ అయిన అప్పటి నుంచి ఖాళీగా ఉన్న సీబీఐ డైరెక్టర్‌ పోస్టును ఇప్పుడు భర్తీ చేశారు. 

సిబిఐ డైరెక్టర్ గా అలోక్ కుమార్ వర్మ

ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా ఢిల్లీ పోలీస్ చీఫ్ అలోక్‌కుమార్ వర్మ నియామకమయ్యారు. 1979 ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన అలోక్ వర్మను సీబీఐ చీఫ్‌గా నియమించే ప్రతిపాదనలకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. రెండేళ్లపాటు అలోక్ వర్మ సీబీఐ చీఫ్‌గా కొనసాగనున్నారు.

Don't Miss