Activities calendar

21 January 2017

22:25 - January 21, 2017
22:22 - January 21, 2017

కేరళ : ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థల కారణంగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ తీవ్రంగా నష్టపోతుందని ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో 24వ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని కేరళ సీఎం పినరాయి విజయన్‌ ప్రారంభించారు. ప్రపంచీకరణ, కేంద్రప్రభుత్వ కార్పొరేట్ విధానాలతో ప్రభుత్వరంగ సంస్థలకు ఏర్పడుతున్న ముప్పుపై విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆలిండియా సీఐటీయూ వైస్‌ ప్రెసిడెంట్‌ ఏకే పద్మనాభన్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

 

22:16 - January 21, 2017

పంజాబ్‌ : లూథియానాలో దారుణం జరిగింది. 9ఏళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా టీనేజర్ హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని ఆరుముక్కలుగా నరికివేశాడు. బాలుడి రక్తంతాగి గుండెను స్కూల్‌లో పడేశాడు.

22:13 - January 21, 2017

నిజామాబాద్ : ఏసీబీకి చిక్కడంతో మనస్తాపానికి గురైన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వెంకటేశ్వర్లు ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఓ కాంట్రాక్టర్‌ నుంచి 20వేలు లంచం తీసుకుంటుంగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన వెంకటేశ్వర్లు  అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకాడు.  తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చగా... చికిత్స పొందుతూ చనిపోయాడు.  వెంకటేశ్వర్లు చనిపోయారన్న వార్త తెలుసుకున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు...  ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఏసీబీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  దీంతో ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త  పరిస్థితులు ఏర్పడ్డాయి.  ఏసీబీ అధికారుల వేధింపులతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. తక్షణమే కాంట్రాక్టర్‌ను, ఏసీబీ అధికారులను అరెస్ట్‌ చేయాలన్నారు.  వెంకటేశ్వర్లు మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

22:08 - January 21, 2017

హైదరాబాద్ : ముస్లింలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. 40 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ఇస్లామిక్‌ సెంటర్‌, కన్వెన్షన్ హాల్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మణికొండలోని ఆరు ఎకరాల వక్ఫ్ స్థలంలో రూ.కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ఇస్లామిక్ సెంటర్‌కు త్వరలో తానే శంఖుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. ముస్లింలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేసే వేదికగా ఇస్లామిక్ సెంటర్ ఉపయోగపడాలని, దీనికోసం డిజైన్‌లు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. వీటితో పాటు ఇమామ్, మౌజమ్ గౌరవ భృతిని వేయి నుంచి 1500 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. అంతే కాకుండా ముస్లింలకు ప్రత్యేక ఐటీ సెజ్‌తో పాటు.. ఉర్దూలో డీఎస్ సీ నిర్వహించాలని నిర్ణయించారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పరీక్షను ఉర్ధూ భాషలో కూడా నిర్వహించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉర్ధూలో చదివే విద్యార్థులున్నారని, వారి సౌలభ్యం కోసం ఉర్ధూలోనూ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరారు.

 

22:05 - January 21, 2017

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన ముగిసింది. జ్యూరిచ్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు..తన పర్యటనను ముగించుకొని భారత్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇవాళ అర్థరాత్రి 12.15 నిమిషాలకు చంద్రబాబు ఢిల్లీకి చేరుకోనున్నారు. అంతకు ముందు జ్యూరిచ్‌లో పర్యటించిన చంద్రబాబు..జ్యూరిచ్‌లో తెలుగు కమ్యూనిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రవాస ఆంధ్రులంతా కలసికట్టుగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు చంద్రబాబు. ఏ దేశంలో ఉన్నా..స్థానిక రాజకీయాల్లో పాలు పంచుకునే స్థాయికి ప్రవాసాంధ్రులు ఎదగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 

22:02 - January 21, 2017

హైదరాబాద్ : జల్లికట్టు ఉద్యమంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. జల్లికట్టు ఉద్యమం ఆంధ్రులకు స్ఫూర్తిదాయకమంటూ ట్వీట్‌ చేశారు. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలన్నారు. ఈ విషయంలో రాజకీయ నేతలు రాజీపడినా తాను పడబోనని స్పష్టం చేశారు.  జల్లికట్టుపై ఆర్డినెన్సు జారీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తుందన్నారు.  కులమతాలకు  అతీతంగా తమిళులంతా ఏకమై జల్లికట్టు కోసం నినదించడం స్ఫూర్తిదాయకమన్నారు.  మెరీనా బీచ్‌లో లక్షలాది మంది ఆందోళన చేపట్టినా ఎలాంటి అసాంఘిక చర్యలు జరుగకపోవడం హర్షణీయమన్న పవన్‌..   తమిళులు సంఘటిత శక్తి, అహింసాయుత పద్దతి తనను కదలించాయన్నారు.   

 

21:59 - January 21, 2017

చెన్నై : తమిళ ప్రజల ఉద్యమం ఫలించింది. జల్లికట్టు వివాదానికి తెరపడింది. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. రేపు తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు క్రీడ ప్రారంభం కానుంది. జల్లికట్టును పునరుద్ధరించాలంటూ గడిచిన ఐదు రోజులుగా తమిళ ప్రజలు చేసిన ఉద్యమం ఫలించింది. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌ను ఆ రాష్ట్ర ఇంఛార్జి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆమోదించడంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.
జల్లికట్టు క్రీడను ప్రారంభించిన సెల్వం
ఆదివారం ఉదయం 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం అళంగనలూర్‌లో జెండా వూపి జల్లికట్టు క్రీడను ప్రారంభించనున్నారు. వారి వారి జిల్లాల్లో ఆయా మంత్రులు ప్రారంభించనున్నారు. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌ ముసాయిదాలో కొద్దిపాటి మార్పులతో  కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఆమోదించాయి.  ఈ ఆర్డినెన్స్‌ ద్వారా జంతుహింస నిరోధక చట్టాన్ని సవరించి, అందులోని 'పర్‌ఫామింగ్‌ యానిమల్స్‌' జాబితా నుంచి ఎద్దులను తొలగిస్తారు. ఈ ఆర్డినెన్స్ను జనవరి 23 నుంచి జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
జల్లికట్టు నిషేధిస్తూ సుప్రీంకోర్టు 2014లో తీర్పు
జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు 2014లో ఇచ్చిన తీర్పుపై తమిళ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. మధురై జిల్లా అలంగానల్లూరులో మొదలైన విద్యార్థుల నిరసన హోరు చెన్నై మెరీనా తీరాన్ని తాకి ఓ మహోద్యమంలా వ్యాపించింది. గత ఐదు రోజులపాటు మెరీనా బీచ్‌ వద్ద విద్యార్థులు, యువకులు భారీ సంఖ్యలో చేరుకొని తమ నిరసనను శాంతియుతంగా తెలిపారు. జల్లికట్టు నిరసనకు సినీ పరిశ్రమతో పాటు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. శుక్రవారం తమిళనాడులో ఒకరోజు బంద్‌ పాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించేలా ఒత్తిడి చేసి విజయం సాధించడంలో తమిళ ప్రజలు సఫలీకృతమయ్యారు. జల్లికట్టుకు కోలీవుడ్ మద్దతు ఇవ్వడాన్ని పెటా తప్పుపట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నటుడు సూర్య పెటాకు నోటీసులు ఇచ్చారు. సినిమాల ప్రచారానికే జల్లికట్టుకు మద్దతు ఇస్తున్నారని పెటా ఎలా చెబుతుందని ప్రశ్నించారు. ఎద్దుల కళ్లల్లో కారం పోసి, మద్యం తాగించి హింసిస్తున్నారంటూ పెటాతోపాటు జంతు పరిరక్షకులు జల్లికట్టును వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
సాంప్రదాయంగా కొనసాగుతోన్న క్రీడ
పొంగల్‌ సందర్భంగా జల్లికట్టును నిర్వహించడం వేలాది సంవత్సరాలుగా తమిళనాడులో సాంప్రదాయంగా కొనసాగుతోంది. తమిళుల గొప్ప సాంప్రదాయాన్ని తాను ఎంతో గౌరవిస్తున్నానని, తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని ప్రధాని మోది ట్వీట్‌ చేశారు. జల్లికట్టు నిర్వహణపై ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదించడంతో యువతలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

 

21:43 - January 21, 2017

సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధుతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా చాపలు, రొయ్యల చెరువులు ఏర్పాటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకాలను జరుపుతున్నారని తెలిపారు. అక్వా సాగు అన్ని నిబంధనలను తుంగలో తొక్కి సాగు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క జీవో పాటించకుండా
చాపల తవ్వకాలు చేపడతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా చాపలు, రొయ్యల చెరువులను విస్తరిస్తున్నారని పేర్కొన్నారు. మురుగు కాల్వ లేకుండా చెరువును మార్చరాదని సూచించారు. చాపలు, రొయ్యలు చెరువులకు మురుగు కాల్వను నిర్మించాలన్నారు. శుద్ధి చేసిన నీటిని మాత్రమే బయటికి వదలాలని సూచించారు. చెరువుల తవ్వకాల వల్ల రైతులు తమ పంట పొలాలను కోల్పోనున్నారని చెప్పారు. పచ్చని పంట పొలాలు నాశనం కానున్నాయి. సారవంతంమైన భూముల్లో రొయ్యల చెరువులను ఏర్పాటు చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిబంధలను ఉల్లంఘించి నిర్మించిన చాపల చెరువులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కాలుష్య కారక పరిశ్రమలను తీసుకొస్తుందని మండిపడ్డారు. మత్స్య సంపద దెబ్బతింటుందన్నారు. కాలుష్యకారక పరిశ్రమలను నెలకొల్పుతున్నారని తెలిపారు. ప్రభుత్వం విచక్షణ రహిత పద్ధతులను అవలంభిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ నడక తప్పుదారిలో ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్ పీటీసీలు చెరువుల అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంగించి అగ్రకులస్తులు ఆక్వాసాగు విస్తరింపును కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రజా బలం ముందుకు ఎవరైనా తలవంచాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా పరిణమించే అవకాశాలున్నాయన్నారు. విచ్చలవిడిగా ఆక్వా విస్తరణ జరుగుతోందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి జిల్లా కలెక్టర్లు చాపల చెరువులకు అనుమతిస్తున్నారు. పది ఎకరాలకు అనుమతి తీసుకుని.. ఇరవై ఎకరాల్లో అక్వా సాగు చేస్తున్నారని ఆరోపించారు. వంద ఎకరాల అక్వా సాగులో కేవలం ఇరవై ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉందన్నారు. విధ్వంసాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఎదుర్కోవాలని పిలుపిచ్చారు. అధికారంలో ఉన్నామన్న ధీమాతో నిరంకుషంగా వ్యవహరిస్తుందన్నారు. రేపు విజయవాడలో అక్వాసాగు బాధితుల సదస్సు జరుగనుంది. రొయ్యల సాగు అక్రమ చెరువులను అరికట్టాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:21 - January 21, 2017

హైదరాబాద్ : తమిళ తంబిలు సంప్రదాయం కోసం రోడ్డెక్కారు. మనం మన హక్కుల కోసం రోడ్డెక్కలేమా..? వాళ్ల పోరాటానికి కేంద్రం దిగి వచ్చింది.. మన ఉద్యమ కేక కేంద్రానికి వినిపించదా...? ఎనాళ్లీ అచేతనం..! ఇంకెన్నడు ప్రత్యేక హోదా సాధించేది..:!! ఇవీ ఇప్పుడు ఏపీలోని ప్రతిఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు.
జల్లికట్టు కోసం ఏకమైన తమిళనాడు
తమిళనాడు రాష్ర్ట ప్రజలు జల్లికట్టు కోసం కలిసికట్టుగా పోరాడారు. రాష్ట్రాన్ని ఐదు రోజుల పాటు స్తంభింపజేశారు. చివరికి కేంద్రం మెడలు వంచారు. జల్లికట్టును అనుమతిస్తూ కేంద్రం నుంచి ఆర్డినెన్సును సాధించుకుంటున్నారు. మరి ఏపీ ప్రజలు, నాయకులు ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తున్నట్లు..?
ప్రత్యేక హోదా ఏపీ ప్రజలకు చట్టబద్ధ హక్కు..!
జల్లికట్టు ఓ సంప్రదాయం క్రీడ మాత్రమే.. దానిని సుప్రీంకోర్టు కాదన్నందుకు.. తమిళనాడులో యువత రగిలింది.. కానీ, ప్రత్యేక హోదా ఏపీ ప్రజలకు చట్టబద్ధ హక్కు..! కానీ, దిక్కులు పిక్కటిల్లేలా ఉద్యమ స్ఫూర్తి ఏదీ..?  కేవలం సంప్రదాయాన్ని సరికాదు అన్నందుకు తమిళ ప్రజలు, అన్ని పార్టీలు, సినిమా వాళ్లు తమిళనాట ఉద్యమంలోకి వచ్చారు. కానీ ఏపీ నాయకులకు, సినీ ప్రముఖలకు ప్రత్యేక హోదాపై ఆరాటం ఏదీ..?
అధికారంలోకి వచ్చాక హామీని మరిచిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నామంటూ అప్పటి ప్రధాని మన్మోహాన్ సింగ్ ప్రకటించారు. 2014 ఎన్నికల ప్రచార సమయానికి.. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇవ్వటంలో ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెడతామని ప్రగల్బాలు పలికారు నరేంద్ర మోడీ. వెంకయ్యనాయుడు రాజ్యసభలో ప్రస్తావించడం వల్లే ప్రత్యేక హోదా హామీ చోటు చేసుకుందని డబ్బా కొట్టారు. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు చెప్పినట్లు.. ప్రత్యేక హోదా సాధ్యం కాదు.. ప్రణాళిక సంఘం రద్దయిపోయింది.. నీతి అయోగ్ పరిశీలనలో ఉందంటూ కొద్ది రోజులు మాయ చేసే ప్రయత్నం చేసింది కేంద్రం. కొద్ది రోజుల కిందట ప్రత్యేక హోదా సాధ్యం కాదు.. దానికి మించి ప్రత్యేక సాయం పేరుతో ప్యాకేజీ ఇస్తామంటూ కొత్త పల్లవి అందుకొంది.
ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు సాధించలేకపోతున్నారు..?
ఇదే ప్రత్యేక హోదా డిమాండ్ గనుక తమిళనాడుకు ఇచ్చి ఉంటే.. అక్కడ పరిస్థితి ఇలానే ఉండేదా..? ఏపీలో చేతకాని రాజకీయ నాయకత్వం తెలుగు ప్రజలను చేతకాని వారిలా కేంద్రం ముందు నిలబెట్టింది. తమిళనాడులో జల్లికట్టు ఉండాల్సిందేనంటూ పెను ఉప్పెనలా ప్రారంభమైన ఉద్యమంపై కేంద్రం దిగివచ్చి.. జల్లికట్టుని తమిళనాడు రాష్ట్ర సంప్రదాయంగా గుర్తిస్తామన్నంత వరకు వచ్చింది. ఆందోళనతో అదిరిపోయిన సీఎం పన్నీర్ సెల్వం కూడా ఆందోళనకారుల వాయిస్‌కే పెద్దపీట వేశారు. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు..? నిధులివ్వలేనప్పుడు రెక్కలు విరిచేశారంటూ హడావుడి చేసిన చంద్రబాబు.. కేంద్రంతో సామరస్య పూర్వకంగా పోవాలని నిర్ణయించుకోవడం ఏపీ రాష్ట్ర హక్కులను కాలరాయడం కాదా..?
ప్రత్యేక హోదాపై పెద్దగా పోరాటం చేయని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ
ప్రత్యేక హోదా దోషులు కచ్చితంగా బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలే.! కానీ, గట్టిగా ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీ నేత జగన్ కూడా.. ఏదో తూతు మంత్రం చందంగా నాలుగైదు సెంటర్లలో ప్రత్యేక హోదా సభ పేరుతో హడావుడి చేసి.. ఇప్పుడా సంగతే ఎత్తడం లేదు. జన సేనానంటూ బయలుదేరిన పవన్ కల్యాణ్.. ప్రత్యేక హోదా మన హక్కు అంటూ సభలైతే పెట్టారు గానీ.. బలమైన ఉద్యమానికి ఆయనా సిద్ధంగా లేరు. ప్రత్యేక హోదా కావాలంటూ కాంగ్రెస్ పార్టీ, లెప్ట్ పార్టీలు ఆందోళన బాట పట్టినా.. నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా... కేవీపీ లాంటి వాళ్లు ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లు పెట్టి కదిలించినా.. ఎవ్వరూ కదలడం లేదు.. మెదలడం లేదు.. మిగతా పార్టీలు కలిసి రాకపోవడంతో కాంగ్రెస్, లెప్ట్ పార్టీలు ఒంటరే అవుతున్నాయి.
ఎనాళ్లీ అచేతనం..! ఇంకెన్నడు ప్రత్యేక హోదా సాధన?
మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావోస్తోంది. వాళ్లు మూడు రోజుల్లో సాధించినది.. ఏపీ నాయకులు, ప్రజలు మూడు సంవత్సరాల్లో సాధించుకోలేకపోయారు.  అక్కడ జల్లికట్టు అనే సంప్రదాయం కోసం... పార్టీలకతీతంగా నేతలు ఒకటయ్యారు. సిని పరిశ్రమకు చెందిన వాళ్లు కూడా రంగంలోకి దూకారు. కానీ, ఏపీ సినిమా ప్రముఖలకు ఎప్పుడూ మిలియన్ లెక్కలే తప్ప... ఎన్నో మిలియన్ల ప్రజలకు లబ్ది చేకూర్చే ప్రత్యేక హోదా డిమాండ్‌పై మాత్రం మాట్లాడరు. పొరుగు రాష్ట్రం సమస్యపై ట్వీట్లతో ఫీట్లు చేస్తారు గానీ... తెలుగువారి సమస్యపై మాత్రం పెదవి విరవరు. ఏంటీ దౌర్భాగ్యం..? ఏన్నాళ్లీ అచేతనం..? ఇప్పటికైనా నేతలు రాజీ పడటం మానేసి.. రాజీలేని పోరాటం చేయాలి..! ప్రత్యేక హోదాను సాధించాలి. ఈ క్రమంలో తమిళుల జల్లికట్టు ఉద్యమం ద్వారా స్ఫూర్తిని నింపుకోవాలి.

 

21:12 - January 21, 2017

వరంగల్ : తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయింది. హన్మకొండలోని జవహర్ స్టేడియంలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. నల్గొండ, వరంగల్ జట్ల మధ్య కబడ్డీ మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరకు నల్గొండ పై వరంగల్ విజయం సాధించింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:31 - January 21, 2017

వరంగల్ : తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయింది. మంత్రి పద్మారావు పోటీలను ప్రారంభించారు. హన్మకొండలోని జవహర్ స్టేడియంలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. మొదటగా కరీంనగర్, రంగారెడ్డి జట్ల మధ్య కబడ్డీ మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరుగా సాగింది. చివరకు కరీంనగర్ జట్టుపై రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ కు సంబంధించిన పూర్తి మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ ఆత్మహత్య

నిజామాబాద్ : జిల్లాలో విషాదం నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో మనస్థాపం చెందిన వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

తాటిపూడి రిజర్వాయర్ లో కానిస్టేబుల్ గల్లంతు

విజయనగరం : తాటిపూడి రిజర్వాయర్ లో కానిస్టేబుల్ గల్లంతయ్యాడు. ఉదయం కొట్టుకుపోయిన మహిళ మృతదేహాన్ని బయటకు తీసేందుకు కానిస్టేబుల్ సింహాచలం రిజర్వాయర్ లోకి దిగి గల్లంతయ్యాడు.

జల్లికట్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : జల్లికట్టుపై జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు. జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తిదాయకమన్నారు.

 

19:57 - January 21, 2017

జల్లికట్టు ఉద్యమం సాధించిన విజయంపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నగేష్ కుమార్, సీఐటీయూ నేత గఫూర్, బీజేపీ నేత అద్దేపల్లి శ్రీధర్ పాల్గొని, మాట్లాడారు. జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎపికి ప్రత్యేకహోదా కోసం పోరాడాలన్నారు.

19:38 - January 21, 2017

భూపాలపల్లి : పాలమూరు జిల్లా..ఈ జిల్లా పేరు వినగానే మనకు వలసలు గుర్తుకొస్తాయి. బ్రతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకొని ఊరుగాని ఊళ్లకు పాలమూరు ప్రజలు వలసలు వెళ్తుంటారు. ఇక గొర్లకాపర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. గొర్రెల పోషణకోసం ఒకటి కాదు రెండు కాదు..వందల కిలోమీటర్ల దూరం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. పాలమూరు జిల్లా నుంచి భూపాలపల్లి జిల్లాకు వలసవచ్చిన గొర్లలకాపర్లు 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ దుస్థితిని వివరించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:30 - January 21, 2017

సంగారెడ్డి : కలెక్టర్‌ కార్యాలయంలో 10టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. సంగారెడ్డి జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీపీఆర్‌వో వై.యామిని ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. 10టీవీ ప్రజాగొంతుకగా పనిచేస్తోందని.. ప్రజా సమస్యలను వెలికితీయడంలో ముందుందని వారు ప్రశంసించారు. భవిష్యత్‌లోనూ ప్రజాసమస్యలే అజెండాగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ఆకాంక్షించారు.

 

19:25 - January 21, 2017

చెన్నై : జల్లికట్టుకు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ పడింది. జల్లికట్టుకు ఆర్డినెన్స్‌ జారీ చేసేందుకు తమిళనాడు రాష్ట్ర ఇంచార్జ్‌ గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆమోదం తెలిపారు. దీంతో జల్లికట్టు పోటీలకు ఉన్న అడ్డుంకులన్నీ తొలగిపోయాయి. రేపు ఉదయం 10 గంటలకు మధురై జిల్లా ఆలంగానల్లూరులో జల్లికట్టు పోటీలను సీఎం పన్నీరు సెల్వం ప్రారంభించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:22 - January 21, 2017

హైదరాబాద్‌ : కార్పొరేట్ ఆస్పత్రి భాగోతం బయటపడింది. మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. జ్వరంతో ఆస్పత్రిలో చేరిన యువతికి వైద్యులు కుడి చేయి తొలగించారు. వైష్ణవి అనే యువతి జ్వరంతో రావడంతో నాచారంలోని ప్రసాద్‌ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు రక్తం ఎక్కించడంతో యువతికి ఇన్‌ఫెక్షన్‌ అయ్యింది. దీంతో వైష్ణవి కుడి చేయిని వైద్యులు తొలగించారు. తర్వాత రెండు కాళ్లు, మిగిలిన చేయి కూడా తొలగించాలని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు యువతిని అపోలో ఆస్పత్రికి తరలించారు. కూతురు కోసం ఇళ్లు అమ్ముకున్న దంపతులు 25లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురుకు ఇలా అయ్యిందని తమకు న్యాయం చేయాలని తండ్రి డిమాండ్‌ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:02 - January 21, 2017

ఢిల్లీ : నియంత్రణ రేఖ దాటి పొరపాటున పాక్‌ భూభాగంలోకి వెళ్లిన భారత జవాను చందు బాబూలాల్ చౌహాన్‌ను విడుదల చేస్తున్నట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. చందును వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించింది. మానవీయ కోణంలో చందును భారత్‌కు అప్పగించిన్నట్లు పాకిస్తాన్‌ తెలిపింది. మహారాష్ట్రకు చెందిన 22 ఏళ్ల చందు రాష్ట్రీయ రైఫిల్స్‌లో పనిచేస్తున్నాడు. చందు బాబూలాల్‌ సర్జికల్‌ స్ట్రయిక్స్‌లో పాల్గొనలేదు. డ్యూటీలో ఉన్న చందు-గత ఏడాది సెప్టెంబర్‌లో సరిహద్దు దాటడంతో పాకిస్తాన్‌కు చిక్కాడు. ఇరుదేశాల డిజిఎంవోల సమావేశం అనంతరం చందుకు విముక్తి లభించింది.

 

18:59 - January 21, 2017

హైదరాబాద్ : దశాబ్దం గడుస్తున్నా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు ముందుకు కదలడంలేదు. మరోవైపు ప్యాకేజీ పనులకు భూసేకరణ చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మొదలుపెట్టిన ఈ పనులు ఇంకా నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాజెక్టుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందనే విమర్శులు వినిపిస్తున్నాయి.
అడుగడుగునా నిర్లక్ష్యం?
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జలయజ్ఞం పథకం కింద ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు జాడలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు చేపట్టి దశాబ్దం గడుస్తున్నా ఇంతవరకు పనులు ఓ కొలిక్కి రాలేదు. టన్నెల్ పనులే ఇంకా కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు భూసేకరణ పనులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.  
ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందోనన్న ఆందోళన
తెలంగాణ ఏర్పడి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులు ఒక అడుగు కూడా ముందుకు పడలేదని స్థానికులు, రైతులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు రీడిజైన్ చేయాలని ప్రభుత్వం భావించడంతో ఇక ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందోనన్న ఆందోళన మొదలైంది. ఎస్ ఆర్ సీపీ బ్యాక్ వాటర్ ఆధారంగా ప్రాణహిత-చేవెళ్ల 20,21,22 ప్యాకేజీ పనులకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సారెస్పికి వచ్చే వరద నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలోని పంట పొలాలకు అందించేందుకు ప్రాజెక్టు డిజైన్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ ప్యాకేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఎస్ ఆర్ సీపీ బ్యాక్ వాటర్ ద్వారా 3.5లక్షల ఎకరాలకు సాగునీరు
ఎస్ ఆర్ సీపీ బ్యాక్ వాటర్ ద్వారా 3.5లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్ణయించారు. నిజామాబాద్ అర్బన్ రూరల్ ఆర్మూరు, బాల్కొండ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల కోసం ఈ ప్యాకేజీలను నిర్మించాలనుకున్నారు. బినోల వద్ద మూడు పంప్ హౌజ్ ల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. ఈ పంపుల నుంచి 2100 క్యూసెక్కుల నీటిని విడుదలచేయాలని రంగం సిద్ధంచేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పనులు ముందుకు కదలడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులపై నిర్లక్ష్యం వీడి త్వరతగతిన ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.

 

18:54 - January 21, 2017

హైదరాబాద్ : అడుగడుగునా అవమానం.. దళితులు, బలహీన వర్గాలపై వరుస దాడులు. ప్రతిక్షణం కులవివక్ష, అణగారిన వర్గాలపై అణచివేత. ఈ ధోరణిని నిరసిస్తూ...దళితులపై దాడులను అరికట్టేందుకు పోరాటం ఒక్కటే మార్గమని సీపీఎం, సీపీఐ, దళిత, సామాజిక సంఘాలు నిర్ణయించాయి. అందుకోసం ఈ నెల 22న హైదారాబాద్‌-ఇందిరాపార్క్‌ వద్ద భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించేకు పిలుపునిచ్చాయి. దళిత హక్కుల సాధన సభ పేరిటి నిర్వహించనున్న ఈ సభకు సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, ప్రకాష్‌ అంబేద్కర్‌ హాజరుకానున్నారు.
దళిత హక్కుల సాధన సభ
దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా భారీ ఎత్తున దళిత హక్కుల సాధన సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22న హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయా పార్టీలు, సంఘాల నేతలు తెలిపారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులను అరికట్టాలన్న డిమాండ్‌తో.. సీపీఎం, సీపీఐ, దళిత, గిరిజన, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి,  అంబేద్కర్‌ మనువడు ప్రకాష్‌ అంబేద్కర్‌, దళిత సంఘాల నేతలు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయని, గోరక్ష దళాల పేరుతో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టి వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు.
సభకు అన్ని వర్గాల వారు హాజరు కావాలి
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ప్రకారం నిధులు కేటాయించి, పూర్తిగా ఖర్చు చేయాలని.. దళిత, గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి పంపిణీ చేయాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని సూచించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు  నిధులు కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోస ఇందిరాపార్కు వద్ద నిర్వహించే బహిరంగ సభకు  అన్ని వర్గాల వారు హాజరుకావాలని కోరారు. ఇప్పటికే దళిత, మైనారిటీ దాడులపై జాతీయ స్థాయిలో వామపక్ష, సామాజిక సంఘాలతో కలిసి పోరాటం చేస్తున్నామని, ఇందిరాపార్కు వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని వక్తలు కోరారు.

 

18:50 - January 21, 2017

హైదరాబాద్ : ఏపీ టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. కృష్ణా జిల్లాకు ఎమ్మెల్యే కోటాలో ఒక స్థానం దక్కే ఛాన్స్‌ ఉండటంతో.. ఆ ఒక్క సీటు కోసం పోటీ పెరుగుతోంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్‌ను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఏపీలో మండలి ఎన్నికల కోలాహాలం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎన్నికల కోలాహలం మొదలైంది. గవర్నర్‌ కోటా, ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయుల కోటా నుంచి 23 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. మార్చిలో జరగనున్న ఎన్నికలకు.. ఎమ్మెల్యేల కోటా నుంచి టీడీపీకి 5 నుంచి 7 స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే స్థానాలు లేనందునా..ఎమ్మెల్యే కోటాలో జిల్లాకు ఒక సీటు కేటాయించవచ్చని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆ ఒక్క సీటు ఎవరిని వరిస్తుందనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముద్దరబోయినకు సీటు ఇవ్వడంతో నొచ్చుకున్న బచ్చుల
కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, అర్బన్ మాజీ అధ్యక్షుడు నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బచ్చుల అర్జునుడు, నాగుల్ మీరాకు టీడీపీ అధినేత చంద్రబాబు తగిన న్యాయం చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల వరకు నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు బచ్చుల అర్జునుడుకి అప్పగించారు. చివరి నిమిషంలో ఆ సీటును కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయినకు ఇచ్చారు. ఈ పరిణామాలతో నొచ్చుకున్న బచ్చుల అర్జునుడుని ఎమ్మెల్సీ సీటు ఇస్తామని ముఖ్య నేతలు సముదాయించారు.
పొత్తు ఒప్పందంలో బీజేపీ వశమైన సీటు
బచ్చుల అర్జునుడు తర్వాత ఎమ్మెల్సీ రేసులో నాగుల్ మీరా పేరు వినిపిస్తోంది. టీడీపీ కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. విజయవాడ అర్బన్ నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. 1999లో మీరా టీడీపీ గుర్తుపై విజయవాడ పశ్చిమ నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. 2004, 2009 ఎన్నికల్లో మీరాకు పశ్చిమ సీటు దక్కలేదు. 2014 ఎన్నికల్లో ఎంపీ కేశినేని నాని ఆ సీటు ముస్లిం కోటాలో మీరాకు ఇద్దామని పట్టుబట్టారు. దీనికి చంద్రబాబు కూడా సానుకూలత వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో బీజేపీతో కుదిరిన పొత్తుతో ఆ సీటు కమలం పార్టీ వశమైంది. నాగుల్ మీరాకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  
పార్టీ హామీతో సిట్టింగ్‌ స్థానాన్ని వదులుకున్న వెంకటరమణ
ఇక ఎమ్మెల్సీ రేసులో కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పేరు వినిపిస్తోంది. కైకలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు కొన్ని కారణాలతో ఆ సీటు దక్కలేదు. పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లిపోయింది. వెంకటరమణకు భవిష్యత్తులో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. పెనమలూరుకు చెందిన అడ్వొకేట్ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌కు స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు పార్టీలోని ముఖ్య నేతల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఈ ముగ్గురిలో నాగుల్ మీరా లేదా గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ సీటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.

 

18:38 - January 21, 2017

హైదరాబాద్ : పేదలు, సామాన్యులను చంపడానికేనా మావోయిస్టులు ఉన్నది అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. అవినీతిని అంతం చేయడానికి పుట్టుకొచ్చామని చెప్పుకునే మావోయిస్టులు.. దమ్ముంటే అవినీతి ఎమ్మెల్యేలను కాల్చి చంపాలని సవాల్‌ విసిరారు. అవినీతి అడవుల్లో లేదని.. ప్రజల మధ్య ఉందని సోము వీర్రాజు అన్నారు. కొంతమంది మావోయిస్టులు బెదిరింపుల ద్వారా వచ్చిన డబ్బులను అడవుల్లోని డంపుల్లో దాస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.

 

18:35 - January 21, 2017

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ నేత ఆనం వివేకనందరెడ్డి విరుచుకుపడ్డారు. జగన్‌ రాష్ర్టానికి పట్టిన దరిద్రమని.. గుడ్లగూబలా మారి రాష్ర్ట నాశనాన్ని కోరుకుంటున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అవుతానంటూ రెండేళ్లుగా రాష్ర్టంలో కాకిలా తిరుగుతున్నాడంటూ దుయ్యబట్టారు. జగన్ లాంటి గుడ్లగూబ  అమరావతిలో పర్యటిస్తే కొత్తరాష్ట్రానికి అరిష్టమన్నారు.

 

నాచారం ప్రసాద్ ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్ : నాచారంలోని ప్రసాద్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళ్తే వైద్యులు కుడి చేయి తొలగించారు. ఆస్పత్రిలో చేరిన వైష్ణవికి వైద్యులు రక్తం ఎక్కించడంతో ఇన్ ఫెక్షన్ అయింది. దీంతో ఆమె వైద్యులు కుడి చేయి తొలగించారు. బాధితురాలు ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పుడు రెండు కాళ్లు మిగిలిన చేయి కూడా తొలగించాలని వైద్యులు అంటున్నారు.

 

17:36 - January 21, 2017

తూర్పుగోదావరి : కోనసీమలో అన్నదాతల పొట్ట కొట్టే ప్రయత్నం జరుగుతోంది. రొయ్యల చెరువుల పేరుతో ముంచుకొస్తున్న ప్రమాదంతో తీర ప్రాంతంలోని రైతుల్లో తీవ్ర అలజడి రేకెత్తుతోంది. సాగును నమ్ముకున్న త‌మ‌కు అన్యాయం చేస్తారా అంటూ రైతులు ఉద్యమబాట పడుతున్నారు. అన్నదాతల ఉద్యమానికి ఎర్రదండు కూడా బాసటగా నిలుస్తోంది.
విధ్వంసాన్ని ఖండిస్తున్న అన్నదాతలు
పచ్చని కోనసీమలో రొయ్యల చెరువుల పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని అన్నదాతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పంటపొలాలను చెరువులుగా మార్చేస్తారా అని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. బడాబాబుల ధనదాహానికి తమను సమిధలుగా మారుస్తారా అని  మండిపడుతున్నారు.
చెరువుల అక్రమ తవ్వకాలపై ఆందోళనలు
ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లరేవు నుంచి మలికిపురం వరకు అనేక మండలాల ప్రజలు అక్రమ చెరువుల తవ్వకాలపై ఆందోళనలు సాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే అనుమతుల్లేని చెరువులపై ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.
రైతుల ఆందోళనకు అండగా సీపీఎం
పచ్చటి పొలాల్లో రొయ్యల చెరువుల తవ్వకాలకు వ్యతిరేకంగా స్థానిక రైతులు సాగిస్తున్న ఆందోళనకు సీపీఎం దన్నుగా నిలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమంగా తవ్వేస్తున్న చేపల,రొయ్యల చెరువులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు పరిశీలించారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్రమంగా చేపలు, రొయ్యల చెరువులు తవ్వుతుండడాన్ని గుర్తించారు. పర్యావరణానికి విఘాతం కలిగేలా చెరువుల తవ్వకాలు చేపడుతున్నారని మధు నేతృత్వంలోని బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 6 లోగా పేదల  భూములను తిరిగి అప్పగించాలంటూ..చేపల చెరువులు తవ్వుకుని అనుభవిస్తున్న నిర్వాహకులకు అల్టిమేటం జారీ చేశారు.
చోద్యం చూస్తున్న అధికారులు : వామపక్షాలు
పచ్చని కోనసీమ కనుమరుగయ్యేలా.. కాలుష్యం జనజీవనాన్ని విచ్ఛిన్నం చేసేలా.. సేద్యంపై జీవనం సాగించేవారి ఉపాధికి విఘాతం కలిగేలా అక్రమార్కులు వ్యవహరిస్తున్నా... మత్స్య, రెవెన్యూ శాఖ అధికారులు చోద్యం చూస్తుండడాన్ని వామపక్ష నేతలు ఆక్షేపిస్తున్నారు. ఏపీ సర్కార్‌ అక్రమ చెరువులపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్మిస్తామని హెచ్చరిస్తున్నారు. మొత్తమ్మీద, కోనసీమకు చీడలా పట్టిన చెరువుల తవ్వకాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే..ఈ ప్రాంతం ఉనికినే కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. 

17:27 - January 21, 2017

తూర్పుగోదావరి : రొయ్యల చెరువుల రాకతో కోనసీమ అందాలు మసిబారుతున్నాయి. పచ్చటి పల్లె వాతావరణం మధ్య ఆహ్లాదంగా జీవించిన ప్రజల బతుకులు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. వ్యవసాయానికి భూములు, తాగేందుకు మంచినీరు లేక జనం విలవిలలాడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి కోనసీమ అందాల్ని మసిబారిస్తున్నది ఎవరు? ప్రభుత్వమా..? దళారీ వ్యవస్థనా?
శాపంగా మారిన రొయ్యల చెరువు సాగు
ఉభయ గోదావరి జిల్లాల్లో రొయ్యల చెరువు సాగు ఆ ప్రాంత వాసుల పాలిట శాపంగా మారుతోంది. రొయ్యల సాగు పేరుతో మొదలైన లాభాల వేటలో కొందరి ప్రయోజనాల కోసం ఎందరో రైతుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. అదే సమయంలో ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచిన ప్రాంతంలో ధాన్యానికి కటకటలాడే పరిస్థితి వచ్చే ప్రమాదముందన్న వార్తలు ఆందోళనకల్గిస్తున్నాయి. సముద్రతీరంలో సాగాల్సిన ఉప్పునీటి చెరువుల సాగు చివరకు డెల్టాలోని అన్ని మండలాలకు వ్యాపిస్తోంది. ఫలితంగా తాగునీటి ఎద్దడి కూడా తప్పదన్న చేదు నిజాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
రొయ్యల చెరువులతో కాలుష్యం
రొయ్యల చెరువుల కాలుష్యంతో గుక్కెడు నీటి కోసం జనం అల్లాడిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. మంచినీటి చెరువులు ఇప్పటికే ఉప్పమయం కాగా.. భూగర్భం నుంచి తోడుకునే నీటిని కూడా తాగేందుకు పనికిరాని స్థితికి చేర్చేశారు. ఇప్పటికే ఆయిల్‌ కంపెనీల ఏర్పాటుతో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు కాలుష్యంగా మారిపోయాయి. దీంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అధికారులు నిర్లక్ష్యం
వందల ఎకరాల్లో అనుమతులు లేకుండా చేపల చెరువుల పేరుతో చెరువులను తవ్వుతున్నా.. అధికారులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు.. అక్రమదారులు ఇచ్చే మామూళ్లలో జోగుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లా అధికార యంత్రాంగం ముడుపుల మత్తును వదిలించి.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని.. చెరువుల తవ్వకాలను అడ్డుకోవాలని రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 

17:21 - January 21, 2017

తూర్పుగోదావరి : ఆంధ్ర అన్నపూర్ణ..కంటతడి పెడుతోంది. రొయ్యల చెరువుల పేరుతో జరుగుతున్న విధ్వంసం చూసి పచ్చని నేల రోదిస్తోంది. ధాన్యాగారంగా పేరుగాంచిన ప్రాంతంలో పంటలు పండించేందుకు కూడా భూమి దొరకని దుస్థితి నెలకొంది. రైతులకు రొయ్యల సాగు ఎరవేసి వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. అక్రమంగా చెరువులు తవ్వుతున్నా..అధికారులు మాత్రం ముడుపుల మత్తులో జోగుతున్నారు.
ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కోనసీమ
ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కోనసీమ. పుడమితల్లి పచ్చ చీర కట్టిందా అనిపించేలా ఎటుచూసినా పచ్చదనంతో కళకళలాడుతోంది. చల్లటి పిల్లగాలులు, తీరం పొడవునా కనిపించే పచ్చని కొబ్బరి చెట్లు ప్రకృతి ప్రేమికులను రారమ్మని ఆకర్షిస్తాయి. ఆ పక్కనే  పంట కాలువల సవ్వడులు. ఇలా వర్ణిస్తూ పోతే కోనసీమ అందాల గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది.
కాలుష్య సీమగా కోనసీమ
అలాంటి కోనసీమ..ఇపుడు చెరువుల మాఫియా కోరల్లో చిక్కుకుని కాలుష్య సీమగా మారిపోతోంది. దేశానికే ధాన్యాగారంగా పేరుగాంచిన ప్రాంతాన్ని రొయ్యల చెరువుల పేరుతో ఛిద్రం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూకబ్జాదారులు చెలరేగిపోతూ..ఇష్టారాజ్యంగా చెరువులు తవ్వుతూ పచ్చటి పొలాలను అదృశ్యం చేసేస్తున్నారు. పచ్చటి అందాలతో కళకళలాడాల్సిన వరిపొలాలు  ప్రాంతాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. పచ్చటి పొలాలు కనమరుగు కావడాన్ని పర్యావరణ ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
రొయ్యల చెరువులను అక్రమ తవ్వకం
ఉభయ గోదావరి జిల్లాలో ఇటీవల రొయ్యల చెరువులను అక్రమంగా తవ్వడం సర్వసాధారణ అంశంగా మారిపోతోంది. రైతుల నుంచి కొన్న దానికి తోడు.. కబ్జా చేసిన పొలాలనూ అక్రమార్కులు చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో రొయ్యలు, చేపల చెరువులను అక్రమంగా తవ్వేస్తున్నా అడ్డుకునే నాథుడే కరవయ్యాడు. రెవిన్యూ, ఫిషరీస్‌ అధికారులు చోద్యం చూస్తుండటంతో.. అక్రమార్కుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. పంటపొలాలకు అతి చేరువలోని సాగునేలలు చేపలు, రొయ్యల చెరువులుగా మారిపోతుంటే.. సేద్యాన్నే నమ్ముకున్న రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తామూ సేద్యపు భూమిని చెరువులుగా మార్చడమో లేక పొలాన్ని బీడుగా వదిలేయడమో చేయక తప్పని పరిస్థితి దాపురించిందన్నది రైతుల ఆవేదన. తూర్పుగోదావరి జిల్లాలోని 16 తీర ప్రాంత మండలాలతో పాటు కోనసీమలోని అన్ని మండలాల్లో ఇదే తంతు కొనసాగుతోంది.  
ధనార్జనే ధ్యేయగా చెలరేగిపోతున్న అక్రమార్కులు
అటు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి, నరసాపురం, వీరవాసరం, మొగళ్తూరు, కాళ్ల, గణపరం, మండలాలతో పాటు కొల్లేరులోని భీమడోలు, ఏలూరు మండలాల్లో రొయ్యల చెరువుల తవ్వకాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకున్నా వేల ఎకరాల్లో ఇష్టారాజ్యంగా చెరువులను తవ్వేస్తున్నారు. వనామీ రొయ్యలు కేజీ వెయ్యి దాకా పలుకుతుండటంతో.. అక్రమార్కులు పంటపొలాలను చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. వాస్తవానికి చేపల చెరువులు తవ్వాలంటే మత్స్యశాఖతో పాటు వ్యవసాయ, మైనింగ్‌, వాటర్‌, పొల్యూషన్‌, విద్యుత్‌ శాఖల అనుమతి తప్పనిసరి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించదు. నిబంధనలకు నీళ్లొదిలేసి ధనార్జనే ధ్యేయగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.

 

జల్లికట్టు ఆర్డినెన్స్ కు అమోదం

తమిళనాడు : జల్లికట్టుకు ఆర్డినెన్స్ కు అమోదం లభించింది. తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగరరావు జల్లికట్టుకు ఆర్డినెన్స్ కు అమోదం తెలిపారు. రేపు ఉదయం 10గంటలకు సీఎం పన్నీరు సెల్వ జల్లికట్టును ప్రారంభించనున్నారు.

 

గవర్నర్ నరసింహన్ ను కలిసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. శాసనసభ సమావేశాలు జరిగిన విధానంపై చర్చించారు.

16:58 - January 21, 2017

వాషింగ్టన్‌ : అమెరికా 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఒబామా కేర్‌ పథకంపై తొలి వేటు వేశారు.  ఎన్నికల సమయంలో ఒబామాకేర్‌ను రద్దుచేస్తానని పలుమార్లు హామీ ఇచ్చిన విధంగానే ఆయన తొలి సంతకం ఆ ఫైల్‌పైనే చేశారు. ట్రంప్‌ ప్రమాణస్వీకారోత్సవం ముగిసిన తర్వాత ఓవల్‌ కార్యాలయానికి వెళ్లి 'ఎఫర్డబుల్‌ కేర్‌ యాక్ట్‌'పై సంతకం చేసినట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి ఒబామా 2009లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా 2 కోట్ల మంది అమెరికన్లు లబ్ది పొందారు. ఒబామా కేర్‌ వల్ల వివిధ విభాగాలు, ఏజెన్సీలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

16:29 - January 21, 2017

విజయనగరం : జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ అస్తవ్యస్తంగా మారింది. రహదారుల విస్తరణలో ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఎనిమిది రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు

విజయనగరంలో రోడ్ల విస్తరణకు మున్సిపల్‌ అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిది కొత్త రోడ్లను మంజూరు చేసింది. వీటిలో మూడు రోడ్ల విస్తరణ పనులు మున్సిపాలిటీ చేపట్టగా, ఉడా మూడు రోడ్లు, ఆర్అండ్‌బీ రెండు రోడ్ల విస్తరణ పనులు చేపట్టాయి. అయితే రోడ్ల విస్తరణలో అధికారుల్లో స్పష్టత లేకుండా పోయింది. ఒకసారి 60 అడుగులని, మరోసారి 80 అడుగులు అంటూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. అలాగే అంబటి సత్రం జంక్షన్ నుంచి కొత్తపేట నీళ్ల ట్యాంకు వరకు జరిగే రోడ్డు విస్తరణకు సంబంధించి 198 ఆక్రమణలను తొలగించాల్సి ఉండగా, ఇంతవరకు కేవలం 40 మాత్రమే తొలగించారు. మిగిలిన వారిలో కొంతమంది కోర్టును ఆశ్రయించగా, మరికొంతమంది పరిహారం విషయంలో ముందుకు రావడం లేదు.
పెట్రోల్ బంక్‌ తొలగింపుపై తర్జనభర్జన
విజయనగరం పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఓ పెట్రోల్‌ బంక్‌ కారణంగా రోడ్డు విస్తరణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. గంట స్తంభం నుంచి రాజీవ్ క్రీడా మైదానం మీదుగా విస్తరణ చేపట్టిన రోడ్డు మార్గంలో పెట్రోల్‌ బంకు ఉంది. విస్తరణలో భాగంగా ఈ పెట్రోల్ బంకును కూడా తొలగించాల్సిఉంది. అయితే రోడ్డు విస్తరణకు అడ్డు వచ్చిన షాపులను.. ఆంజనేయస్వామి ఆలయాన్ని కూడా అధికారులు తొలగించారు. పెట్రోల్‌ బంక్‌ను మాత్రం తొలగించలేదు. బంక్‌ తొలగింపుపై పెట్రోల్ సంస్థ నుంచి అనుమతి రావడం లేదని.. దీనిపై లేఖ రాశామని అధికారులు అంటున్నారు. అయితే పెట్రోల్‌ బంక్‌ స్థానికంగా ఉన్న అధికార పార్టీ కీలక నేతది కాబట్టే తొలగించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం పైనుంచి ఆదేశాలు రానందు వల్లే పనులు ఆగిపోయానని చెబుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజా సంఘాల నేతల విమర్శలు
రహదారుల విస్తరణ పనుల్లో...అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అలాగే ఇళ్లు..షాపుల తొలగింపులో బాధితులకు సరైన పరిహారం అందించడం లేదని.. ఆరోపిస్తున్నారు. పేదవాళ్లకు ఒక న్యాయం..పెద్ద వాళ్లకు ఒక న్యాయాన్ని అనుసరిస్తున్నారని విమర్శించారు. కేవలం అధికారుల అలసత్వం కారణంగానే పనుల్లో జాప్యం జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం, పాలకవర్గం రోడ్ల విస్తరణలో ఎటువంటి వివక్ష చూపకుండా, స్పష్టమైన సమాచారంతో ముందుకు వెళ్లి, రోడ్ల విస్తరణ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

 

16:24 - January 21, 2017

హైదరాబాద్ : రాజధాని కోసం ఇంకెన్ని ఎకరాలు సమీకరిస్తారో చెప్పాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానిలో దళితుల భూములకు ఇచ్చే పరిహారంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ధ్వజమెత్తారు. అమరావతి నిర్మాణం కోసం తీసుకొచ్చిన స్విస్‌ చాలెంజ్‌ ఓ లోపభూయిష్టమైన విధామన్నారు. ప్రజాధనాన్ని దోచుకునేందుకే స్విస్‌ విధానాన్ని ఏపీ ప్రభుత్వ పెద్దలు తీసుకొచ్చారని విమర్శించారు. రాజధాని భూములపై జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు ముందు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

16:14 - January 21, 2017

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అయ్యారు. బిందెడు పాలలో విషం చుక్కలా జగన్ తయారయ్యారని మండిపడ్డారు. విజయవాడలో రౌడీయిజాన్ని ప్రవేశపెట్టాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులు రాకుండా చేసేందుకు గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఏపీని అతలాకుతలం చేయాలని జగన్ చూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు కనుసైగ చేస్తే జగన్ విజయవాడ రాలేరని చెప్పారు.

 

16:05 - January 21, 2017

హైదరాబాద్ : 30 నెలల పరిపాలనలో టీ.ప్రభుత్వం వ్యవసాయానికి ఎలాంటి పాలసీ ప్రకటించలేదని టీ.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఇవాళ ఆ పార్టీ రాష్ర్ట కార్యవర్గం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవడానికి సర్కార్‌ ఎలాంటి విధానాన్ని ప్రకటించలేదన్న విమర్శించారు. శాసన సభ సమావేశాల్లో రైతులకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ఏ మాత్రం ప్రయత్నం చేయలేదని భవిష్యత్‌ కార్యాచరణపై నాయకులు చర్చించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 80 శాతం వ్యవసాయం మీద ఆధార పడ్డ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

 

సీఎం చంద్రబాబుకు మావోయిస్టుల ముప్పుందన్న కేంద్రహోంశాఖ

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుకు మావోయిస్టుల ముప్పు ఉందని కేంద్ర హోంశాఖ ఏపీ పోలీస్ శాఖను అప్రమత్తం చేసింది. చంద్రబాబుకు భద్రత పెంచాలని ఏపీ పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. సీఎం సెక్యూరిటీ విభాగాన్ని బలోపేతం చేయాలని.. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది. చంద్రబాబు సెక్యూరిటీ కోసం అదనంగా మరో ఎన్‌ఎస్‌జీ బృందాన్ని కేటాయిస్తున్నట్లు పేర్కొంది.

 

15:46 - January 21, 2017

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుకు మావోయిస్టుల ముప్పు ఉందని కేంద్ర హోంశాఖ ఏపీ పోలీస్ శాఖను అప్రమత్తం చేసింది. చంద్రబాబుకు భద్రత పెంచాలని ఏపీ పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. సీఎం సెక్యూరిటీ విభాగాన్ని బలోపేతం చేయాలని.. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది. చంద్రబాబు సెక్యూరిటీ కోసం అదనంగా మరో ఎన్‌ఎస్‌జీ బృందాన్ని కేటాయిస్తున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా...డిడోగ్ జోడీ విజయం

హైదరాబాద్ : ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా...డిడోగ్ జోడీ విజయం సాధించింది. తొలి రౌండ్ లో స్లెజిమండ్..పెవిక్ జోడీపై 7...5, 6...4 తేడాతో గెలుడోపొందారు.

తమిళనాడులో కొనసాగుతున్న జల్లికుట్టు ఆందోళనలు

చెన్నై : తమిళనాడులో జల్లికుట్టు ఆందోళనలు కొనసాగుతున్నాయి. జల్లికట్టుకు మద్దతుగా డీఎంకే నేతలు స్టాలిన్, కనిమొళి ఒక రోజు దీక్ష చేపట్టారు. మెరినాబీచ్ లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. జల్లికట్టుకు అనుమతించాకే ఆందోళన విరమిస్తామని పట్టుపట్టారు. 

 

13:42 - January 21, 2017

భూపాలపల్లి :ఎస్సీ, ఎస్టీ సమస్యలపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గళమెత్తితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని పాదయాత్ర బృందం సభ్యులు నగేష్ తెలిపారు. సీపీఎంపై విమర్శలు మంత్రి హరీష్‌రావు అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీపీఎం చేపట్టిన మహాజనపాదయాత్ర 97వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది.

13:40 - January 21, 2017

చిత్తూరు : పుత్తలమిట్టు మండలం పేటమిట్ట గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. అమర్‌రాజా బ్యాక్టరీ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూటే మంటలకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఫ్యాక్టరీలో 20మంది కార్మికులు చిక్కుకున్నట్లు అంచనావేస్తున్నారు. మంటలార్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

13:39 - January 21, 2017

విజయవాడ :జల్లికట్టు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదాపై ఉద్యమించాలంటూ సీఎం చంద్రబాబుకు లేఖరాశారు.. రాజ్యసభ సభ్యుడు KVP... జల్లికట్టు అంశం న్యాయస్థానం పరిధిలోఉన్నప్పటికీ... కేంద్రం తప్పించుకునే అవకాశమున్నాకూడా తమిళులు అనుకున్నది సాధించారని గుర్తుచేశారు.. మూడురోజుల్లో తమిళ ప్రజలు జల్లికట్టును సాధించారని.... మూడేళ్లయినా విభజన చట్టం అమలులో ఎందుకు వెనకబడిపోతున్నారని విమర్శించారు.... న్యాయంగా రావాల్సినదానికోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడంలేదని ప్రశ్నించారు.. ఇప్పటికైనా కళ్లుతెరిచి సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడేందుకు పార్టీలకు అతీతంగా కదులుదామని సూచించారు.. తమిళ సోదరుల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుదామని కోరారు.. ఈ పోరాటానికి చంద్రబాబు నాయకత్వం వహించాలని విజ్ఞప్తి చేశారు..

13:37 - January 21, 2017

అమరావతి :ఏపీలో శుద్ధి రాజకీయాలు మొదలయ్యాయి. టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా అధినేతలు తిరిగిన ప్రాంతాలను శుద్ధి చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో వైసీపీ అధినేత జగన్‌ పర్యటిస్తున్నారు. జగన్ పర్యటనతో రాజధాని ప్రాంతం అపవిత్రమైందంటూ టీడీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు సచివాలయం రోడ్డును పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. సచివాలయం రోడ్డులో సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీతో పసుపు నీళ్లు చల్లుకుంటూ... మల్కాపురం కూడలి వద్దకు చేరుకుని.... మానవహారం నిర్వహించారు. జగన్ పర్యటనను నిరసిస్తూ... రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి, రైతులను రెచ్చగొట్టడానికి జగన్ పర్యటనలు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. మరోవైపు జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వని పోలీసులు అదే సచివాలయం రోడ్డులో టీడీపీ నాయకులు ర్యాలీలు, రోడ్ల శుద్ధి కార్యక్రమాల చేపట్టినా పోలీసులు పట్టించుకోలేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీపై వైసీపీ శ్రేణులు కూడా శుద్ధి కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు ప్రయాణించే రహదారి అపవిత్రమైందంటూ శుద్ధి కార్యక్రమం చేపట్టారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రకాశం బ్యారేజీకి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

జగన్ కు రాజకీయ పరిపక్వత లేదు: అనం

హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ కు రాజకీయ పరిపక్వత లేదని ఆనం వివేకానంద రెడ్డి ఆరోపించారు. సీఎం అవుతానని జగన్ కాకిలా అరుస్తున్నాడని, రాష్ట్రానికి జగన్ గుడ్లగూబలా తయారయ్యాడు అని ఎద్దేవా చేశాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు.

నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం పై ఏసీబీ దాడి

నిజామాబాద్: మున్సిపల్ కార్యాలయం పై ఏసీబీ దాడి చేసింది. కాంట్రాక్టర్ నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లును ఏసీబీ పట్టుకుంది.

బిజెపి ఎమ్మెల్యే సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

రాజమండ్రి : బిజెపి ఎమ్మెల్యే సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలు, సామాన్యులను చంపడానికా నక్సలైట్లు ఉంది. అవినీతిని అంతం చేయడానికి నక్సలైట్లు పుట్టుకొచ్చామంటారు. దమ్ముంటే నలుగురు అవినీతి ఎమ్మెల్యేలను కాల్చి చంపాలని సవాల్ విసిరారు. అవినీతి అడవుల్లో లేదని, ప్రజల మధ్య ఉందని తెలిపారు.

కనిగిరి మదర్సా నిర్వాహకులు అరెస్ట్

ప్రకాశం: కనిగిరి మదర్సాపై 10 టివిలో ప్రసారమైన కథనాలకు స్పందించి మదర్సా నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో 10 టివికి స్థానికులు అభినందనలు తెలిపారు.

ఉండవల్లిలో వైసీపీ-టీడీపీ నేత మధ్య ఘర్షణ

గుంటూరు : ఉండవల్లిలో వైసీపీ-టీడీపీ నేత మధ్య ఘర్షణ జరిగింది. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు రోడ్ల శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బద్వేల్‌లో ఏసీబీ అధికారులకు చిక్కి మరో చేప

కడప :బద్వేల్‌లో ఎక్సైజ్‌ సీఐ హిమబిందు లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. తరచూ తనిఖీలు చేయకుండా ఉండేందుకు.. 54 వేల రూపాయలు లంచం డిమాండ్‌ చేయడంతో.. వైన్స్‌ షాపుల యాజమానులు ఏసీబీని ఆశ్రయించారు. హిమబిందుకు వైన్స్‌ షాపుల యాజమానులు లంచం ఇస్తూ ఉండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హిమబిందు ఆస్తులను కూడా సోదా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఏసీబీ అధికారులు.

 

12:40 - January 21, 2017

కడప :జిల్లాలో చౌటుపల్లి గ్రామంలోకి గండికోట జలాశయం నీరు పోటెత్తింది. గండికోట జలాశయం నీరు గ్రామంలోకి రాకుండా నిర్మించిన తాత్కాలిక కరకట్ట తెగడంతో గ్రామంలోకి భారీగా నీరు చేరింది. దీంతో 100కు పైగా ఇళ్లు నీటమునిగాయి. ఇళ్లు నీటమునగడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి ఉధృతి దాటికి గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. తక్షణమే సహాయచర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

 

12:39 - January 21, 2017

విజయనగరం : జిల్లాలో తాటిపూడి రిజర్వాయర్‌ గేటు విరిగిపోవడంతో దిగువ ప్రాంతానికి భారీగా నీరు ప్రవహిస్తోంది. నీటి ప్రవాహ ధాటికి ఒక గిరిజన మహిళ నీటిలో కొట్టుకుపోయింది. నీటి ప్రవాహ దాటిని కట్టడి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

12:32 - January 21, 2017

తూ.గో: కాతేరు గ్రామ పంచాయతీ నిధులు ఓ అవినీతి అధికారి ఖాతాలో చేరాయి. 34 వేల జనాభా ఉన్న కాతేరును రాజమండ్రి కార్పొరేషన్‌లో విలీనం చేసి ఓ ప్రత్యేక అధికారి పాలనలో ఉంచారు. దీంతో గ్రామం అభివృద్ధి చెందుతుందని.. ప్రజలు ఆశపడ్డారు. కానీ దీనికి విరుద్ధంగా ప్రత్యేక అధికారే నిధులను స్వాహా చేసి.. ప్రజలను మోసం చేశాడు.

అభివృద్ధి నిధులు నెలనెలా తన ఖాతాలోకి వేసుకున్న రామకృష్ణ...

పింఛన్‌ల కోసం.. గ్రామంలోని పలు అభివృద్ధి పనులు కోసం... నెల నెలా వచ్చే నిధులను ప్రత్యేక అధికారి రామకృష్ణ తన ఖాతాలోకి జమ చేసుకున్నాడు. ఇలా కోటి 30 లక్షల రూపాయలను కాజేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ జరిపి.. రామకృష్ణను సస్పెండ్‌ చేశారు. ఓ డివిజనల్‌ అధికారిని చార్జి మెమో జారీ చేశారు. అయితే దీనిపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవినీతి అధికారులను సస్పెండ్‌ చేసి వదిలేస్తున్నారని.. కాజేసిన సొమ్మును రికవరీ చేయడం లేదని విమర్శిస్తున్నారు.

నిధుల గోల్‌మాల్‌తో సమస్యల నిలయంగా మారిన గ్రామం....

నిధులు గోల్‌మాల్‌తో.. గ్రామం సమస్యల నిలయంగా మారింది. రోడ్లన్నీ చెత్తచెదారంతో నిండి పోయాయి. వీధుల్లో లైట్లు లేవు.. కార్మికులకు జీతాలు లేవు.. పించన్ల మీదే బతుకు వెళ్లదీసే వితంతువులు.. వృద్ధులు..వికలాంగులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రత్యేక అధికారి దోచుకున్న కోటి 30 లక్షలను రికవరీ చేయాలని గ్రామస్థులు పట్టుబడుతున్నారు. సస్పెన్షన్‌తో.. మెమోల జారీతో వదలిపెట్టకుండా ఇలాంటి వారిని తీవ్రంగా శిక్షించాలని కోరుతున్నారు.

నిధులు స్వాహా చేసి సత్యప్రసాద్ సస్పెండ్ ...

గతంలో కూడా ఇలానే అప్పటి గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్యప్రసాద్‌ నిధులు స్వాహా చేసి సస్పెండ్ అయ్యాడు. గ్రామ పంచాయతీలో సాగుతున్న ఈ అక్రమాలకు ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి అండదండలు ఉన్నాయని.. అందుకే ఇవి కొనసాగుతున్నాయని గ్రామస్థులు అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి: మాయావతి

లక్నో: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని మాజీ సీఎం మాయావతి ఆరోపించారు. ములాయం సింగ్ యూపీలో నాటకాలు ఆడుతున్నారని.. తండ్రీ కొడుకులు కలిసి శివపాల్ ను బలిచేస్తున్నారని పేర్కొన్నారు. యూపీలో కాంగ్రెస్ వెంటిలేటర్ పై ఉందని, కాంగ్రెస్ కు ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. యూపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, ఎస్పీ ప్రభుత్వం దోపిడీదారులకు, నేరస్తులకు కొమ్ము కొస్తోందన్నారు. బీఎస్పీని అణగదొక్కే కుట్రలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు.

లొంగిపోయిన కర్ణాటక ఎమ్మెల్యే బాలకృష్ణ

కర్ణాటక : ఎస్ఐ, సీఐ లను అసభ్యపదజాలంతో దూషించిన కేసులో కర్ణాటకలోని మాగడి ఎమ్మెల్యే బాలక‌ృష్ణ ఒకటవ జేఎంఎఫ్ సీ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసు విషయమై తనను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారన్న విషయం తెలుసుకున్న బాలకృష్ణ తన లాయర్ తో కలిసి నిన్న కోర్టుకు వెళ్లి లొంగిపోయారు.

కాసేపట్లో టి.టిడిపి కార్యవర్గం భేటీ...

హైదరాబాద్: కాసేపట్లో తెలుగుదేశం తెలంగాణ రాష్ర్ట కార్యవర్గం భేటీ కాబోతోంది. భవిష్యత్‌ కార్యాచరణపై నాయకులు చర్చించనున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ర్ట సమస్యలు, ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పార్టీ నాయకులు చేస్తున్న పోరాటాలపై చర్చించనున్నారు. మరోవైపు టీడీపీ పార్టీ అనుబంధ విభాగాల పనితీరుపై కూడా చర్చించనున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఎలా ముందుకెళ్లాలి అనేదానిపై చర్చించనున్నారు.

11:45 - January 21, 2017

హైదరాబాద్: క్షణికావేశంతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతోసహా ఆత్మహత్య చేసుకుంది.. ఈ ఘటన సికింద్రాబాద్‌ మల్కాజ్‌గిరిలో జరిగింది... గౌరి అనే వివాహితన తన ఇద్దరు కొడుకులు సాయితేజ, నాగరాజుతోసహా రైలు కింద పడింది.. ముగ్గురిపైనుంచి రైలు దూసుకెళ్లడంతో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. పూర్తివివరాలను సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

11:42 - January 21, 2017

విజయవాడ : టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. ఫ్యాన్సీ నెంబర్ కోసం ఓ యువకుడిని బెదిరింపులకు పాల్పడ్డారు. కృష్ణాజిల్లా ఉయ్యూరు రవాణా అధికారి కార్యాలయంలో హల్‌చల్‌ చేశారు. నంబర్‌ కోసం పోటీపడిన యువకుడిని అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించారు. నీ అంతుచూస్తామని బండబూతులు తీట్టారు. అయితే తాను ఫ్యాన్సీ నంబర్‌ కోసం పోటీపడలేదని.. ఈ వివాదాన్ని వైసీపీ నేతలే రగిలించారని రాజేంద్రప్రసాద్‌ అంటున్నారు. వెలగపూడిలో ఎమ్మెల్యే అఖిలప్రియను అడ్డుకుని.. మీడియాకు చిక్కిన వైసీపీ నాయకులు .. దాన్నికప్పిపుచ్చుకోడానికే ఇపుడు నన్ను టార్గెట్‌ చేశారంటున్న రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే వినాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

11:39 - January 21, 2017

తిరుపతి : తిరుమల శ్రీవారిని నమో వెంకటేశయా సినిమా యూనిట్‌ దర్శించుకుంది. చిత్ర దర్శకులు రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అక్కినేని దంపతులకు, రాఘవేంద్రరావుకు అందజేశారు. నమో వెంకటేశయా సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చామన్నారు హీరో నాగార్జున. నమో వెంకటేశయా మూవీని దర్శకులు రాఘవేంద్రరావు అద్భుతంగా చిత్రీకరించారని అన్నారు. ఫిబ్రవరి 10వ తేదీన సినిమాను విడుదల చేస్తామని రాఘవేంద్రరావు చెప్పారు.

11:37 - January 21, 2017

హైదరాబాద్: ఒకసారి పులి పంజా విసిరిందంటే.. ఎలాంటి జీవైనా ప్రాణాలు కోల్పోవాల్సిందే. అంతటి శక్తిమంతమైన పులిని ఒక చిన్న బాతు ఆటాడించిందంటే నమ్మగలరా? వినడానికి విడ్డూరంగా ఉంది కదూ! కానీ చిన్న బాతు పులికి దొరకకుండా నీటిలో కాసేపు ఆటపట్టించింది. బాతును పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా దొరకకుండా పులి ఆశలను అడియాసలు చేసింది. ఈ పులి.. బాతు ఆటలో చివరికి బాతే నెగ్గి పులికి ముచ్చెమటలు పట్టించింది. పులి రాజా ఆధిపత్యం అడవిలోనే తప్ప.. నీటిలో కాదని నిరూపించింది. ఆస్ట్రేలియాలోని సింబియో వైల్డ్‌లైఫ్‌ పార్క్‌లో ఈ సంఘటన జరిగింది.

11:35 - January 21, 2017

ఢిల్లీ: పంజరంలో బందీగా ఉన్న ముస్లిం యువ‌తి న‌గ్న చిత్రాన్ని ట్విట్ట‌ర్‌లో పోస్టు చేస్తూ.. జైరా(దంగల్ హీరోయిన్) ప‌రిస్థితి కూడా ప్ర‌స్తుతం ఇలా ఉంద‌ని కేంద్ర‌మంత్రి విజ‌య్ గోయ‌ల్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. క్రీడ‌ల మంత్రి ట్వీట్‌కు జైరా ఘాటుగా స్పందించింది. ఆ బొమ్మ‌కీ, త‌న‌కీ ఉన్న సారూప‌త్య‌త ఏమిటో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని పేర్కొంది. బుర‌ఖా ధ‌రించిన ముస్లిం మ‌హిళ‌లు అందంగానే కాదు, స్వేచ్ఛ‌గా కూడా ఉంటారనే విషయం మంత్రికి తెలియ‌జేయాల‌నుకుంటున్నానంటూ ఘాటుగా బ‌దులిచ్చింది.

విరిగిన తాటిపూడి రిజర్వాయర్ గేటు

విజయనగరం : తాటిపూడి రిజర్వాయర్ గేటు విరిగిపోయింది. దీంతో దిగువ ప్రాంతానికి భారీగా రిజర్వాయర్ నీరు ప్రవహిస్తోంది. ప్రవాహ ధాటికి గిరిజన మహిళ నీటిలో కొట్టుకుపోయింది.

పాకిస్థాన్ లో బాంబు పేలుడు :12మంది మృతి

హైదరాబాద్: పాకిస్థాన్ లోని కుర్రం ఏజెన్సీలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

దీక్ష చేపట్టిన డీఎంకే నేతలు స్టాలిన్, కనిమొళి

చెన్నై: జల్లికట్టుకు మద్దతుగా చెన్నైలో డీఎంకే నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. డీఎంకే నేత స్టాలిన్‌, కనిమొళి, పలువురు పార్టీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. ద్రవిడ సంస్కృతిని గౌరవించి జల్లికట్టుకు అనుమతివ్వాలని కార్యకర్తలు నినాదాలు చేశారు.

కొనసాగుతున్న 'జల్లికట్టు' ఆందోళనలు...

చెన్నై : తమిళనాడులో జల్లికట్టు నిర్వహణకు ఇవాళ సాయంత్రం కేంద్రం ఉత్తర్వులు జారీచేసే అవకాశముంది.. ప్రజల ఆందోళనతో వెనక్కితగ్గిన కేంద్రం జల్లికట్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఆర్డినెన్స్‌ ఫైల్‌ను రాష్ట్రపతికి పంపింది.. తమిళ ప్రజల సంప్రదాయాలను గౌరవించే ఆర్డినెన్స్‌ తెస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.. తమిళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు చేపట్టామంటూ ట్వీట్‌ చేశారు.. మరోవైపు జల్లికట్టుకోసం తమిళనాడులో ఇంకా ఆందోళనలు హోరెత్తిపోతూనేఉన్నాయి.. జల్లికట్టుకు అడ్డంకులన్నీ తొలగిపోయేవరకూ నిరసన విరమించేదిలేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు..

సౌదీలో ఉగ్రవాది సయ్యద్‌ జకీర్ అరెస్ట్

p { margin-bottom: 0.21cm; }

హైదరాబాద్: సౌదీలో ఉగ్రవాది సయ్యద్‌ జకీర్ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన జకీర్‌ను సౌదీలో అరెస్ట్ చేసి ఢిల్లీ పంపారు రియాద్‌ పోలీసులు. ఢిల్లీలో జకీర్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. జకీర్‌ సౌదీలో ఐసిస్‌ తరఫున యువకులకు శిక్షణ ఇస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

10:47 - January 21, 2017

కృష్ణా : టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. ఫ్యాన్సీ నెంబర్ కోసం ఓ యువకుడిని బెదిరింపులకు పాల్పడ్డారు. కృష్ణాజిల్లా ఉయ్యూరు రవాణా అధికారి కార్యాలయంలో హల్‌చల్‌ చేశారు. నంబర్‌ కోసం పోటీపడిన యువకుడిని అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించారు. నీ అంతుచూస్తామని బండబూతులు తీట్టారు.

లేబర్ వాడికి ఎందుకు అంటూ ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు....

ఉయ్యూరులో వాహనానికి ఫ్యాన్సీ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ అనుచరులు వీరంగం చేశారు. టెండర్ నుంచి తప్పుకోకపోతే ఎత్తేస్తామని, ఎమ్మెల్సీ వాహనానికే పోటీ వచ్చేటంతటోడివా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. తనలాంటి వీఐపీలకే ఇలాంటి నెంబర్స్ అవసరం కానీ, లేబర్ వాడికి ఎందుకు అంటూ ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టెండర్ నుంచి తప్పుకోవాలని వినయ్‌కుమార్‌పై బెదిరింపులు....

ఫ్యాన్సీ నెంబర్ కోసం ఉయ్యూరు ఆర్టీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ 16డీడీ 7777 నెంబర్ కోసం ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. ఒకరు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరుడు ప్రవీణ్‌కుమార్ కాగా, మరోవ్యక్తి పేరు వినయ్‌కుమార్. ఫ్యాన్సీ నెంబర్ తమకే దక్కాలంటూ ఎమ్మెల్సీ అనుచరులు రెచ్చిపోయారు. ఆర్టీవో కార్యాలయం వద్దకు ఇరువర్గాలు రావడంతో ఆ ఫ్యాన్సీ నెంబర్ తమ వాహనానికే దక్కాలని, టెండర్ నుంచి తప్పుకోవాలని వినయ్‌కుమార్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ తతంగాన్ని రవివర్మ అనే వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించడానికి యత్నించాడు. అనుచరులు ఫోన్ కలుపగా ఫోన్లోనే ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, రవివర్మను దుర్భాషలాడారు.

తన గ్యాంగ్‌ బెదిరింపులను వాట్సప్‌లో పెడతావా అని బండబూతులు....

రాజేంద్రప్రసాద్‌ అనుచరుల బెదిరింపులను బాధితుడు వాట్సప్‌లో పెట్టడంతో ..ఇక ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ గట్టుతెగిన గోదారిలా ఫోన్లోనే నోటికి పనిచెప్పారు. నాకే అడ్డుతగులుతావా.. నువ్వెంత.. నీలెక్కెంత.. అని మాటలతో రెచ్చిపోయారు. మర్యాదగా నంబర్‌ వదులుకోవాలని ఫోన్‌లోనే బెదిరించారు.

వైసీపీ నేతలే వివాదాన్ని రాజేశారు- రాజేంద్రప్రసాద్‌.....

అయితే తాను ఫ్యాన్సీ నంబర్‌ కోసం పోటీపడలేదని.. ఈ వివాదాన్ని వైసీపీ నేతలే రగిలించారని రాజేంద్రప్రసాద్‌ అంటున్నారు. వెలగపూడిలో ఎమ్మెల్యే అఖిలప్రియను అడ్డుకుని.. మీడియాకు చిక్కిన వైసీపీ నాయకులు .. దాన్నికప్పిపుచ్చుకోడానికే ఇపుడు నన్ను టార్గెట్‌ చేశారంటున్నారు. ఫ్యాన్సీ నెంబర్‌ కోసం తన నోటి దురుసుతో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ బెదిరింపుల వివాదంలో చిక్కుకున్నారు. మరీ ఈ కథ ఎటూ మలుపు తిరుగుతుందో వేచిచూడాలి

10:39 - January 21, 2017

హైదరాబాద్: స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ దేవరకొండ బస్తీలో పర్యటిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను ఏవిధంగా వేరుచేయాలి.. బస్తీని ఏవిధంగా క్లీన్‌గా ఉంచుకోవాలో మేయర్ వివరిస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ ర్యాకింగ్స్‌లో హైదరాబాద్ ముందు వరుసలో నిలవాలంటే ప్రజలు స్వచ్ఛతను పాటించాలని పిలుపునిచ్చారు.

10:36 - January 21, 2017

చెన్నై : తమిళనాడులో జల్లికట్టు నిర్వహణకు ఇవాళ సాయంత్రం కేంద్రం ఉత్తర్వులు జారీచేసే అవకాశముంది.. ప్రజల ఆందోళనతో వెనక్కితగ్గిన కేంద్రం జల్లికట్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఆర్డినెన్స్‌ ఫైల్‌ను రాష్ట్రపతికి పంపింది.. తమిళ ప్రజల సంప్రదాయాలను గౌరవించే ఆర్డినెన్స్‌ తెస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.. తమిళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు చేపట్టామంటూ ట్వీట్‌ చేశారు.. మరోవైపు జల్లికట్టుకోసం తమిళనాడులో ఇంకా ఆందోళనలు హోరెత్తిపోతూనేఉన్నాయి.. జల్లికట్టుకు అడ్డంకులన్నీ తొలగిపోయేవరకూ నిరసన విరమించేదిలేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు.. మెరీనా బీచ్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాలు దీక్షలు కొనసాగిస్తున్నాయి...

అమెరాన్ బ్యాటరీ కంపెనీలో అగ్నిప్రమాదం

చిత్తూరు: పూతలపట్టు మండలం పేటమిట్టలోని అమెరాన్ బ్యాటరీ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

09:46 - January 21, 2017

రైలుకిందపడి ఇద్దరు కొడుకులతో తల్లి ఆత్మహత్య

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలో గల మల్కాజ్‌గిరి రైల్వేస్టేషన్ వద్ద విషాదం సంఘటన చోటుచేసుకుంది. రైలు కిందపడి ఓ తల్లి తన ఇద్దరు కొడుకులతో సహా ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఫిబ్రవరి 7న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్: ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నట్లు బ్యాంక్ ట్రేడ్ యూనియన్లు తెలిపాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు తదనంతరం పరిస్థితులను చక్కదిద్దడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. డీమోనిటైజేషన్ సమయంలో విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయాలన్నారు. ఆర్‌బీఐ ఎదుట గానీ లేదా ఆ సమీప పరిసర ప్రాంతాల్లో గానీ ధర్నాలు చేపట్టనుననట్లు చెప్పారు. పోస్టర్లతో ప్రచారం, సామూహిక నిరసన కార్యక్రమాల నిర్వహణ తదితర చర్యలతో తమ నిరసనను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

09:40 - January 21, 2017

హైదరాబాద్: తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాల్లో మార్పు వచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు అవుతుందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సామాజిక న్యాయమే లక్ష్యంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర..96వ రోజు భూపాలపల్లిజిల్లాలోని పలు గ్రామాల గుండా సాగింది. మహాజన పాదయాత్ర బృందానికి స్థానిక ప్రజలు మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు.

సామాజిక న్యాయమే లక్ష్యంగా..

సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న మహాజన పాదయాత్ర..96వ రోజు భూపాలజిల్లాలోని పలు గ్రామాల గుండా ముందుకు సాగింది. లక్ష్మారెడ్డిపల్లి, చెల్పూరు, మంజూర్‌నగర్‌, భూపాలపల్లి, బస్వరాజుపల్లి గ్రామాల్లో కొనసాగింది.

సంఘీభావంగా వివిధ పార్టీల నేతలు ...

సీపీఎం మహాజన పాదయాత్ర బృందానికి సంఘీభావంగా వివిధ పార్టీల నేతలు పాదయాత్రలో పాల్గొన్నాయి. భూపాలపల్లి టిడిపి జిల్లా అధ్యక్షులు గండ్ర సత్యనారాయణ, వైసిపి జిల్లా అధ్యక్షులు కిషన్‌ మహాజన పాదయాత్రకు మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాల్లో మార్పు వచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు అవుతుందని తమ్మినేని ఈ సందర్భంగా అన్నారు. దళితులకు 3 ఎకరాలు పంపిణీచేస్తామన్న ప్రభుత్వం..దళితుల నుండే బలవంతంగా భూములను లాక్కొంటుందని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా లేఖ....

భూపాపల్లి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. భూపలపల్లి కేటీపీపీ నిర్వాసితులకు వెంటనే పునరావాసం కల్పించాలని..అలాగే అందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని లేఖలో డిమాండ్‌ చేశారు.

09:37 - January 21, 2017

హైదరాబాద్‌ : నగరంలో కాకతీయ టెక్నో స్కూల్స్ నిర్వహించిన కాకతీయ ఖేల్ ఉత్సవ్-2017 ముగింపు వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. తెలంగాణలోని 60 స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు ఖేలోత్సవ్‌లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ సీతారాంరెడ్డి, దీపా భాస్కర్ రెడ్డి, మిస్టర్ యూనివర్స్ రాజుయాదవ్ విజేతలకు బహుమతలు ప్రదానం చేశారు.

చదువుతో పాటుగా విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలి- సీతారాంరెడ్డి

2007 లో కాకతీయ టెక్నో స్కూల్స్ ప్రస్థానం ప్రారంభమైంది. ఈ ప్రస్థానంలో ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దింది కాకతీయ టెక్నో స్కూల్స్. విద్యార్థులకు కేవలం చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలనే ఉద్దేశ్యంతో తమ సంస్థలో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామని కాకతీయ టెక్నో స్కూల్ ఛైర్మన్ సీతారాంరెడ్డి తెలిపారు.

క్రికెట్, కబడ్డీ, ఖోఖో, చెస్ పోటీల నిర్వహణ

ఖేలోత్సవ్ పేరుతో తెలంగాణలోని 60 స్కూల్స్ విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, చెస్ పోటీలను నిర్వహించామని సంస్థ డైరెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు.

చదువుతో పాటు క్రీడలు కూడా మఖ్యమే .. దీపా భాస్కర్ రెడ్డి

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా మఖ్యమేనని ముఖ్య అతిథిగా హాజరైన దీపా భాస్కర్ రెడ్డి అన్నారు. ఖేల్ ఉత్సవ్‌ను నిర్వహించిన కాకతీయ స్కూల్స్ యాజమాన్యాన్ని మనస్పూర్తిగా ఆయన అభినందించారు. ఖేల్ ఉత్సవ్‌ను చక్కగా వినియోగించుకుని క్రీడల్లో రాణించాలని మిస్టర్ యానివర్స్ రాజుయాదవ్ విద్యార్థులకు సూచించారు.

మా ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు- విద్యార్థులు

చదువే కాకుండా క్రీడలకు కూడా తమ కాకతీయ టెక్నో స్కూల్స్ యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తుందని విద్యార్థులు తెలిపారు. తమ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో రాష్ట్ర స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తూ రాణిస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఖేలోత్సవ్‌తో కాకతీయ టెక్నో స్కూల్ విద్యార్థులు నూతన ఉత్సాహాంతో ముందుకు సాగాలని స్కూల్స్ యాజమాన్యాలు, అతిధులు అభిలాషించారు.

09:32 - January 21, 2017
09:32 - January 21, 2017

హైదరాబాద్ : సౌదీలో ఉగ్రవాది సయ్యద్‌ జకీర్ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన జకీర్‌ను సౌదీలో అరెస్ట్ చేసి ఢిల్లీ పంపారు రియాద్‌ పోలీసులు. ఢిల్లీలో జకీర్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. జకీర్‌ సౌదీలో ఐసిస్‌ తరఫున యువకులకు శిక్షణ ఇస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

07:31 - January 21, 2017

హైదరాబాద్: తెలంగాణ లో సాగు నీటి పారుదలకుబడ్జెట్ లో భారీ కోత విధించింది. భారీనీటి ప్రాజెక్టులు కట్టడం సాధ్యమేనా? ట్రంప్ తీసుకుకోనున్న నిర్ణయాలు భారత్ ఎలాంటి ప్రభావాలు పడే అవకాశం ఉందా! అమెరికా అధ్యక్షుడు ట్రంప్... తెలంగాణ సీఎం కేసీఆర్ కు పోలిక ఉందా? ఇత్యాది అంశాలపై 'న్యూస్ మార్నింగ్'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్, కాంగ్రెస్ నేత కోస్తా శ్రీనివాస్, టిఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

06:57 - January 21, 2017

హైదరాబాద్: 2017 ఉమ్మడి ఎంట్రన్స్ పరీక్షలకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఈసారి కూడా ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూ కి అప్పగించింది ప్రభుత్వం. అంతేకాకుండా యూనివర్శిటీలన్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి కామన్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది ఉన్నత విద్యామండలి. మరోవైపు ఓయూ వందేళ్ల పండగకు ముందే ఖాళీలను భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తోంది.

కామన్ ఎంట్రన్స్ టెస్టులు షురూ...

తెలంగాణ రాష్ట్రంలో కామన్ ఎంట్రన్స్ టెస్టులకు గంట మోగింది. ఉన్నత విద్యామండలి వారం క్రితమే సెట్స్‌ ఎగ్జామ్స్‌కి షెడ్యూల్ విడుదల చేసింది. అయితే రాష్ట్రంలో నిర్వహించే సెట్లకు తాజాగా కన్వీనర్లను ప్రకటించారు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి. మే 6న జేఎన్‌టీయు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సెట్ కి కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ గోవర్దన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇక ఎంసెట్ బాధ్యతల్ని రిజిస్ట్రార్ ప్రొ.యాదయ్యను కొనసాగించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్‌ సెట్‌ను ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించనుంది. ఇక ఐసెట్ నిర్వహణ బాధ్యతల్ని కాకతీయ యూనివర్శిటీకి అప్పగించారు. లాసెట్‌కి కూడా కాకతీయ యూనివర్శిటీకే అప్పగించారు. పీజీ ఈసెట్ బాధ్యతల్ని ఉస్మానియా యూనివర్శిటీకి అప్పగించారు. ఈ విద్యాసంవత్సరం ఎడ్‌సెట్ అడ్మిషన్లు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో వచ్చే అకడమిక్ ఇయర్ ఎడ్‌సెట్ నిర్వహించడం పట్ల అనుమానాలు వ్యక్తం చేసారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందువల్ల నిర్వహణపై నిర్ణయం తీసుకోలేదన్నారు.

యూనివర్శిటీలన్నీ ఒకేతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు ...

ఇక రాష్ట్రంలో ఉన్న యూనివర్శిటీలన్నింటిని ఒకే తాటిపైకి తెచ్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తోంది. దాంట్లో భాగంగా కమిటీ తొలి సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఈ భేటీలో కామన్ అడ్మిషన్ల నిర్వహణ సాధ్యాసాద్యాలపై చర్చించారు. అందరూ వీసీల అంగీకారం మేరకే ఈ నిర్ణయానికి వచ్చామని.. విద్యార్ధుల చాయిస్‌ను బట్టి సీట్లు కేటాయింపు ఉంటుందన్నారు చైర్మన్‌ పాపిరెడ్డి. మరోవైపు ఈసారి కొత్తగా పీఈసెట్, ఈసెట్‌లను ఆన్‌లైన్లో నిర్వహించేందుకు ఓయూ అంగీకరించిందని చైర్మన్‌ పాపిరెడ్డి ప్రకటించారు. ప్రైవేటు వ్యక్తులకు బాధ్యతలు ఇవ్వకుండా వర్శిటీ అధికారులే పూర్తి బాధ్యతలు తీసుకోనుందన్నారు.

టీచింగ్ పోస్టుల ఖాళీలపై దృష్టి...

రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్శిటీల్లో టీచింగ్ పోస్టుల ఖాళీలపై కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్శిటీలో శతాబ్ది ఉత్సావాలు ఉన్నందున ఆలోపే ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మండలి చైర్మన్ స్పష్టం చేశారు.

06:53 - January 21, 2017

హైదరాబాద్: భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించేందుకు ఇవాళ టీ-టీడీపీ రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో లక్ష్యాలను సాధించిన టీడీపీ.. రాష్ట్రంలో బలోపేతం వైపు అడుగులు వేస్తోంది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో, బయట చేస్తున్న పోరాడుతున్న తీరుపై చర్చించనున్నారు.

8 లక్షల మంది సభ్యత్వం .....

తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు టీ-టీడీపీ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 8 లక్షల మందితో పసుపు దళం ఏర్పాటు చేసుకుంది. ఇక బూత్‌స్థాయి నుండి మండల, నియోజకవర్గాలు, జిల్లాల స్థాయి వరకు పూర్తి స్థాయి కమిటీలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం నేతలు ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలపై తాము చేస్తున్న పోరాటాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

అనుబంధ విభాగాల పనితీరుపై చర్చ .....

ఇక పార్టీలోని అనుబంధ విభాగాల పనితీరుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎలాంటి పోరాటాలు చేయాలన్న అంశంపై రాష్ట్ర కార్యవర్గం ప్రణాళిక రూపొందించనుంది. తెలుగు యువత ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఆందోళనలు చేసేందుకు వ్యూహం రచిస్తోంది. అలాగే మహిళల విభాగంలో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై టీఎన్‌ఎస్‌ఎఫ్‌, రైతు సమస్యలపై తెలుగు రైతు విభాగాల ఆధ్వర్యంలో చేసే పోరాటాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

పూర్వ వైభవం కోసం అడుగులు...

మొత్తానికి తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకునేందుకు టీ-టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అలాగే పార్టీ అనుబంధ విభాగాలతో పాటు.. కార్యకర్తలను సుశిక్షుతులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు టీ-టీడీపీ నేతలు.

06:48 - January 21, 2017

ప్రకాశం : కిడ్నీ బాధితులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వైసీపీ అధినేత జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా జగన్‌ పర్యటించారు. నిన్న రాజధాని గ్రామాల్లో పర్యటించిన ఆయన.. నేడు ప్రకాశం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. పీసీ పల్లిలో కిడ్నీ బాధితులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. గత రెండు సంవత్సరాల్లో 424 మంది కిడ్నీ సమస్యలతో చనిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. 2500 మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని జగన్‌ చెప్పారు.

పీసీపల్లి కిడ్నీ బాధితులతో జగన్....

జిల్లాలోని పీసీ పల్లిలో పర్యటించిన ఆయన.. కిడ్నీ బాధితులను పరామర్శించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారి వివరాలను జగన్‌ అడిగి తెలుసుకున్నారు. బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డయాలసిస్‌ ఏర్పాటులో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. కిడ్నీ సమస్యతో చనిపోయిన వారికి 10లక్షల రూపాయల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. డయాలసిస్ బాధితులకు నెలకు 10వేల రూపాయలు ఆస్పత్రి ఖర్చులు ఇవ్వాలన్నారు.

వైవీ సుబ్బారెడ్డి 12 లక్షల రూపాయలు ఇచ్చినా...

కనిగిరిలో డయాలసిస్‌ ఏర్పాటుకు వైవీ సుబ్బారెడ్డి 12 లక్షల రూపాయలు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఒక్కొ డయాలసిస్‌కు కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే అవుతుందన్న ఆయన.. మూడు డయాలసిస్‌లకు డబ్బులు కేటాయించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీరుగారుతున్న ఆరోగ్యశ్రీ.....

పేదలకు పాలిట వరప్రదాయిని ఆరోగ్య శ్రీ నీరుగారిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్య శ్రీలో ఉచిత వైద్యం అందించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. తాగు నీటి మూలాలపై దృష్టి పెట్టకపోతే కిడ్నీ సమస్యలు నయం కావని.. వీలైనన్ని ప్రాంతాల్లో సురక్షిత తాగు నీటి వసతులు కల్పించాలన్నారు.

కిడ్నీ బాధితులను పట్టించుకోరా : జగన్

ప్రకాశం : కిడ్నీ బాధితులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వైసీపీ అధినేత జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా జగన్‌ పర్యటించారు. నిన్న రాజధాని గ్రామాల్లో పర్యటించిన ఆయన.. నేడు ప్రకాశం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. పీసీ పల్లిలో కిడ్నీ బాధితులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.

06:43 - January 21, 2017

హైదరాబాద్: దేశం కోసం పోరాడిన మాజీ సైనికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. త్వరలోనే సైనికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో తెలంగాణకు చెందిన మాజీ సైనికులు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. సైనికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

06:41 - January 21, 2017

హైదరాబాద్: దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. అంతర్జాతీయ ఆర్థిక సదస్సు సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన.. పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతున్నారు. మాస్టర్‌ కార్డు ఇంటర్నేషనల్‌ మార్కెట్స్‌ ప్రెసిడెంట్‌ ఏన్‌కేన్స్‌తో బాబు సమావేశమయ్యారు. విశాఖ ఫిన్‌టెక్‌ కేంద్రంలో మాస్టర్‌ కార్డు టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఏన్‌ కేన్స్‌కు చంద్రబాబు సూచించారు. దీనిపై ఏన్‌ కేన్స్‌ సానుకూలంగా స్పందించారు. ఎయిర్‌ బస్‌ సీఈవోతో కూడా ఏపీ సీఎం సమావేశమయ్యారు. మరోవైపు భారత్‌ పారిశ్రామిక దిగ్గజం రాహుల్‌ బజాజ్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు.

దావోస్ లో కొనసాగుతున్న బాబు పర్యటన...

హైదరాబాద్: దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. అంతర్జాతీయ ఆర్థిక సదస్సు సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన.. పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతున్నారు. మాస్టర్‌ కార్డు ఇంటర్నేషనల్‌ మార్కెట్స్‌ ప్రెసిడెంట్‌ ఏన్‌కేన్స్‌తో బాబు సమావేశమయ్యారు. విశాఖ ఫిన్‌టెక్‌ కేంద్రంలో మాస్టర్‌ కార్డు టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఏన్‌ కేన్స్‌కు చంద్రబాబు సూచించారు. దీనిపై ఏన్‌ కేన్స్‌ సానుకూలంగా స్పందించారు. ఎయిర్‌ బస్‌ సీఈవోతో కూడా ఏపీ సీఎం సమావేశమయ్యారు. మరోవైపు భారత్‌ పారిశ్రామిక దిగ్గజం రాహుల్‌ బజాజ్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు.

జల్లికట్టు క్రీడకు తొలిగిన అవరోధాలు

చెన్నె : తమిళులు పోరాటం ఫలించింది. తమిళుల ఉద్యమానికి కేంద్రం తలోగ్గి జల్లికట్టుకు జై కొట్టింది. తమిళనాడు సర్కార్ పంపిన ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో మెరీనా బీచ్ వద్ద వేలాది మంది తమిళులు సంబరాలు జరుపుకున్నారు.

06:39 - January 21, 2017

చెన్నె : తమిళులు పోరాటం ఫలించింది. తమిళుల ఉద్యమానికి కేంద్రం తలోగ్గి జల్లికట్టుకు జై కొట్టింది. తమిళనాడు సర్కార్ పంపిన ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో మెరీనా బీచ్ వద్ద వేలాది మంది తమిళులు సంబరాలు జరుపుకున్నారు.

జల్లికట్టుకు మద్దతుగా హోరెత్తిన నిరసనలు ....

జల్లికట్టుకు మద్దతుగా గత కొంత కాలంగా నిరసనలు హోరెత్తాయి. జల్లికట్టు లక్ష్యంగా తమిళులు ఏ పార్టీకి సంబంధం లేకుండా యువతరమే స్వచ్ఛందంగా ముందుకు కదిలింది. వీరికి అన్ని తమిళ వర్గాలు మద్దతు పలికాయి. దీంతో ఉద్యమం తాడోపెడో అనే స్థాయికి చేరింది. ద్రవిడ సంస్కృతిలో జలకట్టుకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. దాదాపు 3500 ఏళ్ల కిందట తమిళనాడులో జల్లికట్టు జరిగిందనడానికి ఆధారాలు లభ్యమయ్యాయి. నీలగిరి జిల్లాలో కరిక్యూర్ అనే గ్రామం వద్ద తవ్వకాల్లో లభ్యమైన శిలాపలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు ఉన్నాయి. ఇవి 3500 ఏళ్ల నాటివి అని ఆర్కియాలజిస్టులు గుర్తించారు. అలాంటి జల్లికట్టును ఇప్పుడు నిషేధిత క్రీడగా ప్రకటించడంపై తమిళ సమాజం మండిపడుతోంది.

జల్లికట్టుపై నిషేధాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు ....

ఇక తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. చైన్నై మెరీనా బీచ్‌లో గత కొద్దిరోజులుగా ఆందోళన చేపట్టారు. మెరీనా బీచ్ ఆందోళనలో తమిళ సినీ ప్రముఖలు రజనీకాంత్, సూర్య, అజిత్ సహా పలువులు నటులు పాల్గొని యువతకు సంఘీభావం తెలిపారు.

జ‌ల్లిక‌ట్టు అంశంపై స్పందించిన సుప్రీంకోర్టు .....

జ‌ల్లిక‌ట్టు అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. జ‌ల్లిక‌ట్టు నిషేధంపై మ‌రో వారం రోజుల వ‌ర‌కు ఎటువంటి మ‌ధ్యంత‌ర ఆదేశాలు ఇవ్వబోమ‌ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జ‌ల్లిక‌ట్టు స‌మ‌స్యను ప‌రిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చ‌ర్చిస్తున్నాయ‌ని, దీనిపై నిర్ణయాన్ని ఓ వారం రోజుల పాటు వాయిదా వేయాల‌ని సుప్రీంకోర్టును కోరినట్లు అటార్ని జనరల్‌ ముకుల్‌ రస్తోగి తెలిపారు.

ఆర్డినెన్స్ కేంద్రానికి పంపిన తమిళ సర్కార్..

జల్టికట్టుపై నిరసనలు ఉధృతమవుతున్న క్రమంలో తమిళనాడు ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. జల్లికట్టు వివాదంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే చొరవ చూపాలని నిర్ణయించుకుంది. జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్ చేసి తమిళనాడు సర్కార్ కేంద్రానికి పంపింది. కేంద్రం కూడా ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. ఈరోజు సాయంత్రం వరకు రాష్ట్రపతి ఆమోదం పొంది.. ఆర్డినెన్స్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

06:36 - January 21, 2017

హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేశారు. ట్రంప్‌ చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షుడిగా మైక్‌ పెన్స్‌ ప్రమాణస్వీకారం చేశారు. శ్వేతసౌధంలో జరిగిన ఈ చారిత్రక సన్నివేశాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులతో పాటు లక్షలాది మంది తరలివచ్చారు.

స్పాట్‌.. 200117-167

ప్రమాణ స్వీకారం అనంతరం...

ప్రమాణ స్వీకారం అనంతరం మాజీ అధ్యక్షుడు ఒబామాతో ట్రంప్‌ కరచాలనం చేసి ప్రజలకు అభివాదం చేశారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షులు, దేశ త్రివిధ దళాల అధికారులు హాజరయ్యారు. అంతకుముందు ట్రంప్‌నకు ఎనిమిదేళ్లపాటు అమెరికాకు అధ్యక్షుడిగా సేవలందించిన ఒబామా.. ఆయన సతీమణి మిషెల్‌ సాదరస్వాగతం పలికారు.

ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్..

ప్రమాణం చేసిన అనంతరం దేశాధ్యక్షుడి హోదాలో ట్రంప్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నేటి నుంచి దేశంలో ప్రజాపాలన తిరిగి వచ్చిందని.. వాషింగ్టన్‌ నుంచి ప్రజలకు అధికారాన్ని బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. అమెరికా గమ్యాన్ని మనమంతా కలిసి నిర్ణయిద్దామని పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేసేందుకే అధికారం ఉందన్నారు. మనదంతా ఒకే దేశం- ఒకే హృదయం అని పేర్కొన్నారు.

అమెరికన్లకే తొలి ప్రాధాన్యత....

దేశమే అందరికీ తొలి ప్రాధాన్యం కావాలని.. అన్నింటా అమెరికన్లకే తొలి ప్రాధాన్యత ఉండాలని ట్రంప్‌ చెప్పారు. అమెరికా ప్రజలకు ప్రయోజనం కలిగేలా ప్రతీ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అమెరికన్ల చేతుల మీదుగానే అమెరికా పునర్‌ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైనవారు.. ఇక ఎంతోకాలం నిరీక్షించాల్సిన అవసరం లేదన్నారు. ఐకమత్యంగా ఉంటే అమెరికాను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. వర్ణమేదైనా అందరిలో దేశభక్తి నిండి ఉందని ఉద్ఘాటించారు. సవాళ్లను ఎదుర్కొంటూ విజయవంతంగా ముందుకు సాగుదామన్నారు. మానవాళికి పెనుభూతంగా అవతరించిన ఉగ్రవాదాన్ని భూమిపై నుంచి పూర్తిగా నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా శ్వేత సౌధంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

జున్‌ 14, 1946లో ఫ్రెడ్‌ ట్రంప్‌ జననం...

డొనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌ జున్‌ 14, 1946లో ఫ్రెడ్‌ ట్రంప్‌- మేరీ అన్నా మెక్‌లాయిడ్‌ దంపతులకు రెండో సంతానంగా న్యూయార్క్‌లో జన్మించారు. ట్రంప్‌ తండ్రికి జర్మనీతో.. తల్లికి స్కాట్లాండ్‌తో మూలాలున్నాయి. ట్రంప్‌ బాల్యం, విద్యాభ్యాసమంతా న్యూయార్క్‌లోనే గడిచింది. ట్రంప్‌ న్యూయార్క్‌ మిలటరీ అకాడమీలో హైస్కూలు విద్య పూర్తి చేశారు. 1968లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వాటర్‌లూన్‌ స్కూల్‌ నుంచి ఆయన అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.

ట్రంప్‌ ఆర్గనైజేషన్‌గా...

1971లో ట్రంప్‌ తమ కుటుంబానికి చెందిన ఎలిజబెత్‌ అండ్‌ సన్స్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార పగ్గాలను స్వీకరించారు. ఆ సంస్థ పేరును ది ట్రంప్‌ ఆర్గనైజేషన్‌గా మార్చేసి కార్యాలయాన్ని మాన్‌హట్టన్‌కు షిఫ్ట్‌ చేశారు. 1978లో అక్కడ గ్రాండ్‌ హయత్‌ హోటల్‌ను నిర్మించారు. అమెరికాలోనే పలు ప్రముఖ భవనాలు ట్రంప్‌ నిర్మించారు. వీటిల్లో ట్రంప్‌ ఓషన్‌ క్లబ్‌, ట్రంప్‌ టవర్‌, సెంట్రల్‌ పార్క్‌లోని వూల్మాన్‌ రింక్‌ హోటల్‌ చెప్పుకోదగ్గవి. ప్లాజా హోటల్‌, అట్లాంటిక్‌ సిటీలోని తాజ్‌మహల్‌ కేసినోలను కొనుగోలు చేశారు. రియల్‌ ఎస్టేట్‌తో పాటు ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ అమెరికా వ్యాప్తంగా సుమారు 18 గోల్ఫ్‌కోర్సులను నిర్వహిస్తోంది. ట్రంప్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లు, సైక్లింగ్‌ వంటి వాటికి స్పాన్సర్‌గా వ్యవహరించారు.

ట్రంప్‌ కేవలం క్రీడలనే కాదు అందాల పోటీలను కూడా..

ట్రంప్‌ కేవలం క్రీడలనే కాదు అందాల పోటీలను కూడా అద్భుతంగా ప్రమోట్‌ చేశారు. 1996 నుంచి 2015 వరకు మిస్‌ యూనివర్స్‌, మిస్‌ యూఎస్‌ఏ, మిస్‌టీన్‌ యూఎస్‌ఏ పోటీలను ఆయన ప్రమోట్‌ చేశారు. 2004 నుంచి 2015 వరకు ఎన్‌బిసి టీవీ రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2016లో ఫోర్బ్‌ లిస్ట్‌ ప్రకటించిన అత్యంత ధనవంతుల జాబితాలో ట్రంప్‌ 324వ స్థానంలో నిలిచారు.

2000 సంవత్సరం నుండి రాజకీయాలు...

2000 సంవత్సరంలో ఆయన రిఫార్మ్స్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి నామినేషన్‌ వేసి ఉపసంహరించుకున్నారు. 2012లో రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించారు. పలు ప్రయత్నాల అనంతరం 2015 జూన్‌ 16న 2016 అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. 2016 నవంబర్‌8న జరిగిన ఎన్నికలలో ట్రంప్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

ముగ్గురిని పెళ్లాడిన ట్రంప్...

ట్రంప్ ముగ్గురిని పెళ్లాడారు. ఇద్దరికి విడాకులిచ్చారు. ప్రస్తుత భార్య మెలినియ యుగోస్లోవియాకు చెందిన మహిళ. 1820 నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రథమ మహిళలలో మెలినియ ట్రంప్ మొదటి విదేశియురాలు కావడం గమనార్హం.

ప్రతిచోటా నిరసన సెగలు...

అభ్యర్థిత్వ రేసు నుంచి ఎన్నికల్లో సంచలన విజయం వరకు ప్రతిచోటా ఆయనకు నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. ఆఖరికి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా మినహాయింపేమీ కాదు. ఓవైపు ఎంతో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం జరుగుతుండగా.. మరోవైపు ఆందోళనకారులు ట్రంప్‌ మాకొద్దూ అంటూ నిరసనలు చేపట్టారు. అనేక ప్రాంతాల్లో నల్ల దుస్తులు ధరించి ర్యాలీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

వాషింగ్టన్, న్యూయార్క్‌తో పాటు దేశంలోని పలుచోట్ల ...

వాషింగ్టన్, న్యూయార్క్‌తో పాటు దేశంలోని పలుచోట్ల ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికన్లు నిరసన తెలిపారు. పలుచోట్ల భారీ సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులు ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పలు ప్రాంతాల్లో నల్లదుస్తులు ధరించి అనేక బిల్డింగ్‌ల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి... పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

న్యూయార్క్‌లో జరిగిన ర్యాలీలో హాలీవుడ్‌ నటులు ...

న్యూయార్క్‌లో జరిగిన ర్యాలీలో హాలీవుడ్‌ నటులు పాల్గొన్నారు. ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్‌ దేశానికి ఓ చెడ్డ ఉదాహరణ అని హాలీవుడ్‌ నటుడు రాబర్ట్‌ డి నీరో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి మనం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నామని మైఖేల్‌ మూర్‌ అన్నారు. పరిస్థితి అనుకున్న దాని కన్నా ప్రమాదకరంగా ఉండవచ్చని.. అయితే వారికన్నా మనం ఎక్కువ సంఖ్యలో ఉన్నామన్నారు. ఓవైపు ట్రంప్‌ ప్రమాణ స్వీకారం.. మరోవైపు వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భారీ భద్రత మధ్య ట్రంప్‌ శ్వేతసౌదానికి చేరుకున్నారు.

అట్టహాసంగా ట్రంప్ ప్రమాణస్వీకారం.

p { margin-bottom: 0.21cm; }

హైదరాబాద్: అమెరికాయే ముందు అనేది తన పాలన మంత్రమని అగ్రరాజ్య నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అమెరికా 45వ అధ్యక్షునిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేశాడు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులతో పాటు.. లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు.

పట్టాలు తప్పిన రాణిఖేత్‌ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ వద్ద రాణిఖేత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. రైలుకు చెందిన 10 బోగీలు ఈ ఘటనలో పట్టాలు తప్పాయి.

Don't Miss