Activities calendar

22 January 2017

22:49 - January 22, 2017
22:48 - January 22, 2017
22:46 - January 22, 2017
22:44 - January 22, 2017
22:41 - January 22, 2017
22:39 - January 22, 2017
22:38 - January 22, 2017
22:37 - January 22, 2017

యాదాద్రి : తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. దేవాలయానికి చేరుకున్న రోశయ్యకు  అర్చకులు, అధికారులు  పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పూజలు ముగించుకున్న తర్వాత ఈవో గీతారెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు. అర్చకులు రోశయ్యను ఆశీర్వదించారు. 

22:33 - January 22, 2017

నిజామాబాద్ : మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్యపై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని.. అలాగే ఏసీబీ డీఎస్పీని, కాంట్రాక్టర్ రాములును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నల్గొండ ఎమ్మెల్మే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో వెంకటేశ్వర్లు మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. నిజాయితీ గల అధికారులను ప్రభుత్వం కాపాడాలని సూచించారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. వారి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. 

 

22:29 - January 22, 2017

సిద్ధిపేట : గజ్వేల్ పట్టణ వాసులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న సొంత ఇంటికల నెరబోతున్నదని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇందులో భాగంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో డబుల్‌ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి హరీష్‌రావు భూమి పూజ చేశారు. వంద కోట్ల రూపాయలతో 1200 ఇండ్ల నిర్మాణం చేయనున్నట్లు హరీష్‌రావు తెలిపారు. అత్యాధునికి సౌకర్యాలతో ఈ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఇంటి కొరకు ఎవరూ పైరవీలు చేయరాదని, అర్హులైన పేదలకే ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. 

 

22:26 - January 22, 2017

హైదరాబాద్ : దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వామపక్షాలు కదం తొక్కాయి. దళితుల హక్కుల సాధన కోసం వామపక్షాలు, ప్రజాసంఘాలన్నీ ఏకమై దళితులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శంఖారావాన్ని పూరించాయి. ఇందిరా పార్కు వేదికగా జరిగిన దళిత హక్కుల సాధన సభలో దళితులపై జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ..వాటిని ఎదుర్కొనేందుకు లాల్, నీల్ జెండాలు ఏకం కావాలని పిలుపు నిచ్చారు. 
ఎర్రజెండాలు, అంబేద్కరిస్టులు ఏకమవ్వాలి : ఏచూరి
దళిత హక్కుల సాదనకై, కులవివక్ష, దళితలపై దాడులకు వ్యతిరేకంగా.. ఇందిరా పార్కు వద్ద దళిత హక్కుల సాధన సభ జరిగింది. సీపీఎం, సీపీఐ, దళిత, గిరిజన, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సభకు వేలాదిగా తరలి వచ్చారు. రోహిత్ మరణంపై నిజాలు బయట పెట్టకుండా.. కుట్ర చేస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ఆరోపించారు. యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎస్సీ రిజర్వేషన్లను వ్యవహారం తెరపైకి తెచ్చారన్నారు. దళితులకు రిజర్వేషన్లు ఉండకూడదనేది ఆర్ ఎస్ఎస్ సిద్ధాంతం అని ఆయన అన్నారు. దళిత హక్కుల సాదనకై ఎర్రజెండాలు, అంబేద్కరిస్టులు ఏకమై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 
ఏబీవీపీ దాడుల కారణంగానే రోహిత్ మృతి : సురవరం
దళితలుపై దాడులు ఎందుకు జరుగుతున్నాయని సీపీఐ జాతీయ ప్రదాన కార్యదర్శి సురవరం సుదాకర్ రెడ్డి ప్రశ్నించారు. రోహిత్ ఆత్మహత్య వెనుక ఎవరున్నారని,.ఏబీవీపీ దాడుల కారణంగా రోహిత్ మరణించాడని అన్నారు. తెలంగాణలో దళితులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్నా సీఎంలు మాత్రం కాలేదన్నారు. ఇందిరాపార్క్‌ వేదికగా జరిగిన ఈ సభకు వివిధ జిల్లాల నుంచి వామపక్ష, దళిత, గిరిజన, సామాజిక సంఘాల కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. తమ హక్కుల్ని సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని... సభకు తరలివచ్చిన నేతలంతా ముక్తకంఠంతో నినదించారు. 

 

22:16 - January 22, 2017

హైదరాబాద్ : నగదు రహిత లావాదేవీలపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రేపటిలోగా నివేదిక ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలపై మధ్యంతర నివేదికను మంగళవారం ప్రధాని మోదీకి ఇవ్వనున్న నేపత్యంలో బ్యాంకర్లతో చర్చించారు. ఏపీలో ప్రస్తుతం 41 శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో 60 శాతానికి పైగా డిజిటల్ లావాదేవీలు జరగాలని, బయోమెట్రిక్ పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. 

 

22:11 - January 22, 2017

విజయనగరం : జిల్లా కూనేరు దగ్గర జరిగిన హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుకు పెద్ద కుట్ర ఉండొచ్చిన  రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఘటనా స్థలం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేని చెబుతున్నారు. 
ప్రమాదం వెనుక కుట్ర..? 
విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు దగ్గర జరిగిన హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చని రైల్వే శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఘటన జరిగిన ప్రదేశం  మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోందని చెబుతున్నారు. రిపబ్లిక్‌ డే దగ్గర పడుతున్న సమయంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని  అధికారులు అనుమానిస్తున్నారు. 
అనుమానిత పరికరాలు స్వాధీనం 
ప్రమాద స్థలంలో లభ్యమైన కొన్ని అనుమానిత పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే అధికారుల అనుమానాలకు ఇవి బలం చేకూరుస్తున్నాయి.  ప్రాథమికంగా పోలీసులు మావోయిస్టుల దుశ్ఛర్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తుకు  ఆదేశించింది. రైల్వే భద్రతా కమిషన్‌ విచారణ జరుపుతారు. పోలీసులు స్వాధీనం చేసుకున్నఅనుమానిత పరికరాలను రైల్వే భద్రతా కమిషనర్‌ పరిశీలిస్తారు. దర్యాప్తుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని భావిస్తున్నారు. పట్టాలు రెండు చోట్ల కోసి ఉన్నట్టు గుర్తించారు. భారీ విధ్వంసం సృష్టించేందుకు మావోయిస్టులు పట్టాలను కోశారా ? లేక  పట్టాలు విరిగాయా ? అన్న విషయం దర్యాప్తులో తేలుతుందని చెబుతున్నారు. అర్థరాత్రి ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే, తమ అనుమానాలకు  మరింత బలం చేకూరుతుందోని రైల్వే అధికారులు చెబుతున్నారు. 
రైలు ప్రమాదంపై పలు అనుమానాలు 
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్పూర్‌లో జరిగిన ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాద దుశ్ఛర్య ఉందని పోలీసులు, ఎన్ఐఏ అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం వెనక... తీవ్రవాదులు ఉన్నారా ... లేక ఉగ్రవాదులు ఉన్నారా.. అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. అటు రాష్ట్ర పోలీసులతోపాటు, రైల్వే భద్రతా కమిషనర్‌ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చిన తర్వాత  కానీ  ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం లేదు.

 

22:01 - January 22, 2017

హైదరాబాద్ : తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ లో భాగంగా హైదరాబాద్, గద్వాల్ ల మధ్య జరిగిన కబడ్డీ పోటీల్లో హైదరాబాద్ జట్టు గెలుపొందింది. హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. 

 

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

హైదరాబాద్ : అల్వాల్ వెంకటాపురంలో విషాదం నెలకొంది. ఇంట్లోని సంపులో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. 

 

ఉత్కంఠపోరులో ఇంగ్లండ్ గెలుపు

కోల్ కతా : భారత్, ఇంగ్లండ్ ల మధ్య జరిగిన మూడో వన్డే లో ఇంగ్లండ్ గెలుపొందింది. ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ విజయం సాధించింది. 5 పరుగులు తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. మూడు వన్డేల సీరీస్ ను 2...1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్

కోల్ కతా : భారత్, ఇంగ్లంగ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 316 పరుగుల వద్ద కేదార్ జాదవ్ (90) ఔట్ అయ్యాడు. 

 

ఏడో వికెట్ కోల్పోయిన భారత్

కోల్ కతా : భారత్, ఇంగ్లంగ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 291 పరుగుల వద్ద జడేజా (10) ఔట్ అయ్యాడు. 

ఆరో వికెట్ కోల్పోయిన భారత్

కోల్ కతా : భారత్, ఇంగ్లంగ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 277 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా (55) ఔట్ అయ్యాడు. 

హార్దిక్ పాండే హాఫ్ సెంచరీ

కోల్ కతా : భారత్, ఇంగ్లంగ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో హార్దిక్ పాండే హాఫ్ సెంచరీ చేశాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 

 

20:25 - January 22, 2017

ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు మాటలు రాసిన బుర్రా సాయిమాధవ్ తో 10 టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు మాటలు రాయడానికి అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పలు అసక్తికరమైన విషయాలు తెలిపారు. హీరోలను బట్టి ... పాత్రలో లీనమై మాటలను రాసానని చెప్పారు. సీన్ లో కంటెంట్ ఉండాలన్నారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం....

 

20:17 - January 22, 2017

హైదరాబాద్ : ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు డి. రాజా ఆరోపించారు. దళితులపై దాడులకు ఆర్‌ఎస్ఎస్సే కారణమన్నారు. మోదీ ప్రభుత్వాన్ని సైతం ఆర్‌ఎస్‌ఎస్‌ శాసిస్తోందని ధ్వజమెత్తారు.  దళితులకు, ఆదివాసీలకు  భారత్‌లో న్యాయం జరుగడం లేదన్నారు. వారి హక్కుల అమలులో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, మైనార్టీలకు  సామాజిక ఆర్దిక, రాజకీయ రంగాల్లో అందిస్తోన్న ప్రోత్సాహకాలేంటో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ధోనీ ఔట్

కోల్ కతా : భారత్, ఇంగ్లండ మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 173 పరుగుల వద్ద యువరాజ్ సింగ్ (25) ఔట్ అయ్యాడు. 

20:04 - January 22, 2017

వరంగల్ : తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఖమ్మం, సిద్ధిపేట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సిద్ధిపేట్ విజయం  సాధించింది. 11 పాయింట్స్ తేడాతో ఖమ్మం పై సిద్ధిపేట్ గెలుపొందింది. ఖమ్మం 20 పాయింట్లు, సిద్ధిపేట్ 31 పాయిట్లు సాధించింది. హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీలు జరుగుతున్నాయి.

19:49 - January 22, 2017

ఢిల్లీ : భారత్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కొత్త ఏడాదిలో శుభారంభం చేసింది. మలేసియా మాస్టర్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ బాడ్మింటన్‌ టైటిల్‌ను సైనా కైవసం చేసుకుంది. ఇవాళ హోరాహోరీగా సాగిన ఫైనల్లో థాయిలాండ్‌ క్రీడాకారిణి చొచువాంగ్‌పై 22-20, 22-20 తేడాతో వరుస సెట్లలో గెలుపొందింది. గతేడాది రియో ఒలింపిక్స్ తరువాత గాయం కారణంగా పలు టోర్నీలకు దూరమైన సైనా.. ఎట్టకేలకు తన పూర్వపు ఫామ్ ను అందుకుంటూ టైటిల్ గెల్చుకుంది. 
 

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

కోల్ కతా : భారత్, ఇంగ్లండ మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 133 పరుగుల వద్ద యువరాజ్ సింగ్ (45) ఔట్ అయ్యాడు. 

 

19:38 - January 22, 2017
19:34 - January 22, 2017

హైదరాబాద్ : మన విద్యావ్యవస్థలో లోపాలు మరోసారి బట్టబయలయ్యాయి. ప్రాథమిక విద్య దయనీయ స్థితిలో ఉందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. పదో తరగతి విద్యార్థులు.. రెండో క్లాస్‌ వాచకాలను కూడా చదవలేని దుస్థితిలో ఉన్నారంటూ నివేదికలు వెల్లడిస్తున్నాయి.      
విద్యావ్యవస్థపై దేశ వ్యాప్తంగా సర్వేలు
విద్యా వ్యవస్థపై ప్రథమ్‌ అనే స్వచ్ఛంద సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అనేక నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా తెలంగాణాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే హయ్యర్‌ క్లాస్‌ విద్యార్థులు  కనీసం కూడికలు.. తీసివేతలు చేయలేని పరిస్థితి ఉందంటూ ప్రథమ్‌ అనే స్వచ్ఛంద సంస్థ వార్షిక విద్యాస్థాయి నివేదికలో  పేర్కొంది. కనీసం నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా కలిగిలేరని స్పష్టం చేసింది. 
కనీస వసతులు లేని స్కూళ్లు అనేకం
తెలంగాణాలో తొమ్మిదిలో జిల్లాలోని...గ్రామీణ ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు. కనీస వసతులు కూడా లేని స్కూళ్లు అనేకం ఉన్నాయని .. ఐదో తరగతి విద్యార్థుల్లో  60శాతం మంది రెండో తరగతి పుస్తకాలను సరిగ్గా చదవలేని పరిస్థితి ఉందని సర్వేలో తేలింది. అలాగే  ప్రైవేటు స్కూల్లో చదివే 40 శాతం మంది విద్యార్థులు.. కూడా కింది తరగతుల పాఠాలను  చదవలేకపోయారని... 28శాతం మంది అసలే పుస్తకాలు చదవలేకపోయారని అసర్ నివేదికలో పేర్కొన్నారు. అయితే విద్యార్థుల వైఫల్యాలకు ఉపాధ్యాయులను  బాధ్యులను చేయడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇటువంటి ఫలితాలు వస్తున్నాయని వారు అంటున్నారు. విద్య కోసం ప్రభుత్వం సరిగ్గా నిధులు కేటాయించడం లేదని..ఆరోపిస్తున్నారు. 
పెరుగుతున్న డ్రాపౌట్ల సంఖ్య
రాష్ట్రంలో 60 కంటే తక్కువ విద్యార్థులన్న పాఠశాలల సంఖ్య పెరిగిందని.. నివేదికల్లో స్పష్టం చేశారు. ఇటువంటి పాఠశాలల సంఖ్య 2010లో 17.2 శాతం, 2012లో 18శాతం, 2014లో 19.7శాతం, 2016లో 26.5 శాతానికి పెరిగిందని అసర్‌ నివేదికలో తెలిపారు.  ఆరేళ్ల నుంచి 14ఏళ్ల వయసున్న విద్యార్థులు 2.2శాతం మంది అసలు పాఠశాలకే వెళ్లడం లేదని... 15 ఏళ్ల  పైబడిన వారు 11.2శాతం మంది బాలురు... 12.8శాతం మంది బాలికలు బడికి దూరంగా ఉన్నారని  నివేదికలో వెల్లడించారు. ఈ మధ్య కాలంలో విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సర్వేల ద్వారా అర్థమవుతుంది. ఈ విషయంలో కరీంనగర్‌ టాప్‌లో ఉందని.. ఆదిలాబాద్‌ లాస్ట్‌ ప్లేస్‌లో ఉందని కూడా నివేదికల్లో పేర్కొన్నారు.  

 

19:30 - January 22, 2017

నిర్మల్ : నేటి రోజుల్లో వ్యవసాయమే దండుగ అనుకునే రైతులకు నిర్మల్‌ జిల్లాకు చెందిన ఓ అన్నదాత వారిలో ఆశలు చిగురింపజేస్తున్నాడు. పండ్ల తోటల పెంపకంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అసలు సాగుకే పనికిరావు అనుకున్న చౌడు భూముల్లో పండ్ల తోటలను పెంచుతూ.. అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. సేంద్రీయ ఎరువుల సహాయంతో ఆపిల్‌బేర్‌ పండ్లను పండిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు దేవ్‌రాజ్‌ అనే రైతు. సాగుకే పనికి రావు అనుకున్న చౌడు భూముల్లో పండ్ల తోటల వైపు దృష్టి పెట్టి.. అధిక ఆదాయం పొందుతున్నాడు ఈ రైతు. 
పండ్ల తోటల పట్ల దేవ్‌రాజ్‌ పాటిల్‌ ఆకర్షణ 
ఇతని పేరు దేవ్‌రాజ్‌ పాటిల్‌. ఊరు నిర్మల్ జిల్లా కుబిర్ మండలం సిర్పెల్లీ గ్రామం. దేవ్‌రాజ్ పాటిల్‌ వ్యాపారం నిమిత్తం మహారాష్టలోని కొంకణ్‌ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పండించే పండ్ల తోటల పట్ల ఆకర్షితుడయ్యాడు. రకరకాల పండ్ల తోటల పెంపకంతో గణనీయమైన ఆదాయం పొందుతున్న అక్కడి రైతులను చూసి... తన ప్రాంతం వారికి కూడా ప్రయోగాత్మకంగా చేసి చూపించాలన్న ఆలోచనే దేవ్‌రాజ్‌కు ఇప్పుడు గుర్తింపు తెచ్చిపెడుతోంది. 
తెలంగాణ ఆపిల్ బేర్‌
నిర్మల్‌ జిల్లాలో తెలంగాణ ఆపిల్ బేర్‌ను మొదటిసారిగా పరిచయం చేసిన దేవ్‌రాజ్‌.. ఆశించినంత దిగుబడులు పొందుతూ అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. తనకున్న చౌడుభూముల్లో ఉన్న రాళ్లూ, రప్పలను తొలగించి.. పండ్ల తోటల పెంపకం చేపట్టాడు. ఎరువులు వాడకుండా.. కేవలం సేంద్రీయ ఎరువుల సహాయంతో వివిధ రకాల పంట్ల తోటలను పెంచుతూ.. అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. పోషక, ఔషధ గుణాలున్న ఆపిల్ బేర్ మొక్కలను నాటిన ఏడాదిలోనే కొతకు రాగ.. ఈ సారి అధిక దిగుబడులు రావడంతో దేవ్‌రాజ్‌ పాటిల్‌ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. 
ఈ పంట పట్ల రైతులు ఆసక్తి 
దేవ్‌రాజ్‌ అధిక ఆదాయం పొందుతుండటంతో బైంసా ప్రాంత రైతులందరూ ఈ పంట పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. తనలాగే రైతులందరూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఆపిల్ బేర్‌ నారును కూడా తయారు చేసి పంపిణి చేస్తున్నారు. ఒక్కో చెట్టుకు ౩౦ నుండి 50 కిలోల వరకు పండ్ల దిగుబడి వస్తోందని, ఏడాది రెండుసార్లు కొతకు వస్తోందంటున్నారు దేవ్‌రాజ్‌. అంతేకాదు.. ఫలితాన్ని ఆశించకుండా కేవలం తమ గ్రామస్తులకే 20 రూపాయలకు కేజీ అమ్ముతున్నాడు. వాళ్లు మాత్రం కేజీకి మార్కెట్‌లో దాదాపు 40 నుంచి 50 రూపాయలు అమ్ముకుని..  ఉపాధి పొందుతున్నారు. చౌడు భూముల్లో పండ్లు పండవని అన్న రైతులందరూ ఇప్పుడు దేవ్‌రాజ్‌ను అభినందిస్తున్నారు. ఇదొక కొత్త ప్రయోగం అంటున్నారు వ్యవసాయశాఖ అధికారులు. హైబ్రీడ్ రకాలైన జామ, సితాఫల్‌, రామ్‌ఫల్, దానిమ్మ, సపోటా లాంటి రకరకాల పండ్ల మొక్కలను కూడా పెంచుతున్నారు. ఏ మాత్రం పనికి రాణి భూమిని పండ్ల తోటలుగా చేసి.. రైతులందరికీ దేవ్‌రాజ్‌ పాటిల్‌ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

 

19:22 - January 22, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమం నుంచి ముఖ్యమంత్రి వరకు తనకంటూ ప్రత్యేక స్థానం సంపాధించుకున్న కేసీఆర్ తన జీవిత చరిత్ర రాయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. రాజీయ జీవితం ప్రారంభం నుంచి  తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతోపాటు సీఎంగా ప్రజలకు చేస్తున్న సేవల వరకు అన్ని విషయాలు దీనిలో ఉండేలా చూడాలని భావిస్తున్నారు. ఆటో బయోగ్రఫీ రాయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 
కేసీఆర్‌ విలక్షణమైన రాజకీయవేత్త
ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలక్షణమైన రాజకీయవేత్త. ఎమ్మెల్యేగా, మంత్రిగా, తెలంగాణ ఉద్యమం నేతగా, ముఖ్యమంత్రిగా అన్నింటా రాణించి ప్రజల మన్ననలు అందుకుంటున్న కేసీఆర్‌ ఇప్పుడు తన జీవిత చరిత్ర రాయాలని నిర్ఱయించుకున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంతోపాటు సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని స్వయంగా ప్రజల ముందుకు తేవాలని భావిస్తున్నారు. తన జీవిత చరిత్రకు అక్షరరూపం ఇచ్చే అంశంపై సన్నిహితులతో చర్చించారని సమాచారం. కేసీఆర్‌కు అత్యంత దగ్గరగా ఉండే కొందరు నేతలు జీవిత చరిత్ర విషయాన్ని చాలాసార్లు ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించారు. అయితే అప్పట్లో దాటవేసిన కేసీఆర్‌, ఇప్పుడు బయోగ్రఫీ రాయాలని స్థిర  నిర్ణయానికి వచ్చారు. 
జీవిచరిత్ర సొంతంగానే రాయాలని కేసీఆర్‌ నిర్ణయం 
కేసీఆర్‌ సొంతంగానే జీవిచరిత్రను రాయాలని నిర్ణయించుకోవడం ఆసక్తిరేపుతోంది. పుట్టుక, విద్యాభ్యాసం, రాజకీయ ప్రస్థానం నుంచి తెలంగాణ ఉద్యమానికి ముగింపు పలికే వరకు అన్ని విషయాలు దీనిలో ఉండేలా  చూస్తారు. ఉద్యమంలో చోటుచేసుకున్న పరిణామాలకు ప్రధాన్యత ఇస్తారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను ప్రస్తావిస్తారు. ఉద్యమం సందర్భంగా   రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో రాజకీయ పార్టీలు అనుసరించిన వైఖరిని కూడా వివరిస్తారు. ఇంతవరకు బయపెట్టని కొన్ని అంశాలను కూడా జీవిత చరిత్రలో ప్రస్తావించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలుగు సాహిత్యంపై మంచిపట్టున్న కేసీఆర్‌.. తన ఆటో బయోగ్రఫీని పడికట్టు పదాల పవర్‌ పంచ్‌తో తీసుకొస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలా మంది  రాజకీయ ప్రముఖులు రాసుకున్న జీవిత చరిత్రలు సంచలనాలనకు కేంద్ర బిందువుగా మారిన నేపథ్యంలో కేసీఆర్‌ ఆటో బయోగ్రఫీ ఎలా ఉంటుందో అన్న అంశం రాజీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. 
 

కోహ్లీ ఔట్

కోల్ కతా : భారత్, ఇంగ్లండ మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 102 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (55) ఔట్ అయ్యాడు. 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు

చిత్తూరు : మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ

కోల్ కతా : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. 54 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ జరుగుతోంది. 
  

18:59 - January 22, 2017
18:56 - January 22, 2017

హైదరాబాద్ : ప్రజాస్వామిక సమాజ నిర్మాణంలో సోషల్ మీడియా అవసరముందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో కాచిగూడలో సోషల్ మీడియా అవగహన సదస్సు నిర్వహించారు. సోషల్ మీడియాను ఉపయోగించుకునే నైపుణ్యం పెంపోందించుకునే లక్ష్యంతో టీజేఏసీ ఈ సమావేశం ఏర్పాటుచేసింది. ఈ విభాగంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఈ విషయంపై అవగాహన కల్పిస్తారని కోదండరాం తెలిపారు. 

 

18:53 - January 22, 2017

నిజామాబాద్‌ : రోజురోజుకు స్థానిక సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం.. నిధులు కేటాయించకపోవడంతో గ్రామాలు.. పల్లెల్లో అభివృద్ధి పనులు జరగడం లేదు. ఇప్పటికైనా దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.  
జడ్పీ వైపు కన్నెత్తి చూడని జడ్పీటీసీలు
గతంలో ఓ వెలుగు వెలిగిన నిజామాబాద్‌ జిల్లా పరిషత్ ఇప్పుడు ఆ ప్రాభవాన్ని కోల్పోయింది. పాలనలో కలెక్టరేట్ తర్వాత అంతటి ప్రాధాన్యం జిల్లా పరిషత్‌కు ఉండేది. నిత్యం సభలు.. సమావేశాలతో జడ్పీ సందడిగా ఉండేది. ప్రస్తుతం జడ్పీ కళ తప్పింది. జడ్పీటీసీలు సైతం సమావేశాలకు తప్ప జడ్పీ వైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానిక సంస్థలలో భాగమైన జిల్లా, మండల పరిషత్‌లు క్రమంగా నిర్వీర్యమైపోతున్నాయి. రానున్న కాలంలో అవి రద్దయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రెండున్నరేళ్లుగా జడ్పీ నిధుల్లో కోత
గడచిన రెండున్నర సంవత్సరాలలో జిల్లా మండల పరిషత్‌లకు కేటాయించిన నిధుల్లో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు భారీగా కోత పెట్టాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బీఆర్ జీఎఫ్‌ను  పూర్తిగా నిలిపివేయగా... 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు జమ చేస్తున్నారు. ఎంఆర్ఆర్ నిధులను కూడా రాష్ట్రం వీరికి ఇవ్వడం లేదు. అలాగే గతంలో జీనరేజీ చార్జీలను జడ్పీ జనరల్‌ ఫండ్‌కు జమ చేసేవారు. ఇప్పుడు ఆ నిధులు నేరుగా రాష్ర్ట ప్రభుత్వ ఖాతాల్లో జమ అవుతున్నాయి.  దీంతో అభివృద్ధి పనులు చేపట్టలేక గ్రామాలలో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని జడ్పీటీసీ సభ్యులు  వాపోతున్నారు.   
ఎమ్మెల్యేలదే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల కేటాయింపు బాధ్యత
ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కేటాయింపుల్లో పూర్తి బాధ్యతలను ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇచ్చింది. జిల్లా, మండల పరిషత్‌లకు పాలక వర్గాలు లేని సమయంలో ప్రభుత్వం ఓ ప్రత్యేక జీవో తీసుకొచ్చి.. అప్పట్లో అధికారుల పాలన కొనసాగించింది. అయితే కొత్త పాలక వర్గాలు కొలువుదీరి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఆ జీవోను రద్దు చేయలేదు. అదే జడ్పీటీసీలకు శాపంలా మారింది. చిన్న చిన్న పనులకు సైతం నియోజకవర్గ ఎమ్మెల్యేల ఆధారపడాల్సి వస్తోంది.  గ్రామాల్లో సమస్యలు తీరకపోవడంతో జడ్పీటీసీలు గ్రామాలకు వెళ్లలేకపోతున్నారు. రెండున్నరేళ్లలో జడ్పీటీసీలకు ఒక్కొక్కరికి కనీసం 5లక్షలు కూడా రావడం లేదు.  
ఐదంచెల వ్యవస్థకు మంగళం పాడేందుకు ప్రభుత్వం యోచన
స్థానిక సంస్థలో ఉన్న ఐదంచెల వ్యవస్థకు మంగళం పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో మాదిరిగానే మూడంచెల వ్యవస్థను తీసుకుని రావాలని యత్నిస్తోంది. అందుకే జిల్లా, మండల పరిషత్‌లను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నారన్న విమర్శలున్నాయి.

 

18:48 - January 22, 2017

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేసిన విమర్శలపై బహిరంగ చర్చకు రావాలని ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎంకు టీఆర్ఎస్‌ పార్టీని విమర్శించి నైతిక హక్కులేదని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇప్పటికీ కూడా చిన్న, చితకా సంఘాలను రెచ్చగొట్టి అనవసరమై ఉద్యమాలు చేయిస్తున్న సీపీఎంకు.. తెలంగాణలో మాట్లాడే హక్కులేదన్నారు. 

 

18:40 - January 22, 2017

చెన్నై : తమిళనాడు జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. జలికట్టు ఆడుతుండగా.. గిత్తలను ఆపలేక ఇద్దరు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పుదుకొట్టై జిల్లాలో ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:38 - January 22, 2017

విజయనగరం : జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జగదల్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ కొమరాడ మండలం కూనేరు సమీపంలో పట్టాలు తప్పింది. శనివారం  రాత్రి 11.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 37 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. 
రైలు ప్రమాదం.. 37 మంది మృతి
అర్ధరాత్రి..రైలు వేగంగా దూసుకెళ్తోంది. అప్పటికే కొందరు గాఢ నిద్రలో ఉన్నారు. మరికొందరు రైలెక్కారు. కొద్ది క్షణాల్లోనే తమ గమ్యస్థానాలకు చేరేవారు. ఒక్కసారిగా రైళ్లో భారీ కుదుపుతో..అంతా హడలెత్తిపోయారు. అలజడి,  అరుపులు, కేకలు. ఏమయిందో తెలియదు. కళ్లు తెరువకుండానే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 37 మందిని హిరాఖండ్‌ రైలు పొట్టన పెట్టుకుంది. 
మృతుల కుటుంబాల్లో చీకటి 
విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన రైలు ప్రమాదం మృతుల కుటుంబాల్లో చీకటి నింపింది. జగదల్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటలకు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు పక్కకు పడిపోయాయి. ఇందులో ఒక ఏసీ, నాలుగు జనరల్‌, రెండు స్లీపర్‌ క్లాస్‌ బోగీలు  ఉన్నాయి. నాలుగు బోగీలు పక్క ట్రాక్‌పైనే వెళ్తున్న గూడ్స్‌ రైలుపై పడిపోయాయి. ఈ ఘటనలో 37 మంది మృతి చెందారు. 100 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.  అర్ధరాత్రి రెండున్నర గంటల సమయానికి 25 మృతదేహాలను వెలికితీశారు. పట్టాలు తప్పిన ఏడు బోగీల్లో ఎస్‌9 తీవ్రంగా దెబ్బతింది. జనరల్‌, ఎస్‌9 బోగీలు నుజ్జునుజ్జు కావడంతో  మృతుల సంఖ్య వీటి నుంచే పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌, పార్వతీపురం ప్రభుత్వాసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా  ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువమంది ఒడిశాకు చెందినవారేనని పోలీసులు చెబుతున్నారు.
సహాయక చర్యలు ముమ్మరం 
రైలు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే విశాఖ నుంచి అక్కడకు చేరుకున్న సహాయ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. బోగీలను కట్‌ చేసి మృతదేహాలను బయటకు తీశారు. డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ సహా 18 మంది రైల్వే అధికారులు, 8 మంది వైద్యులు ప్రమాద ప్రాంతానికి వెళ్లారు. రాయగఢ్‌, పార్వతీపురం ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్పీఎఫ్‌  సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రాయగఢ్‌ కలెక్టర్‌, జేసీ, విజయనగరం ఓఎస్‌డీ తదితరులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు ఆరా   
రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదస్థలిలో సహాయచర్యలు ముమ్మరం  చేయాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. మరోవైపు రైలు ప్రమాదంలో మృతిచెందిన వారికి రైల్వేశాఖ 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25వేల నష్టపరిహారం అందించనున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు.
రైలు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదస్థలంలో సహాయచర్యలు ముమ్మరం చేయాలని అధికారులు, పోలీసు శాఖను ఆదేశించారు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు పర్యవేక్షించాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో మాట్లాడామని.. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స  అందిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి మెడికల్ టీమ్స్‌ను రంగంలోకి దించామన్నారు. 
పలు రైళ్లు దారి మళ్లింపు, మరికొన్ని రద్దు   
విజయనగరం జిల్లా కొమరామ మండలం కూనేరు వద్ద జరిగిన హిరాఖండ్‌ రైలు ప్రమాద ఘటనతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లించగా... మరికొన్నింటిని రద్దు చేశారు.  ధన్‌బాద్‌ అలెప్పి ఎక్స్‌ప్రెస్‌, హతియా యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లను టిట్టాగఢ్‌-రాయ్‌పూర్‌-నాగ్‌పూర్‌ మార్గంలో, నాందేడ్‌-సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను కుర్దారోడ్డు-అంగుల్‌ మీదుగా మళ్లించారు.  సంబల్‌పూర్‌-నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌, రాయగడ-విశాఖపట్నం, విశాఖపట్నం-కోరాపుట్‌ ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. విజయవాడ-రాయగఢ ప్యాసింజర్‌ రైళ్లను విశాఖ వరకు కుదించారు.

 

18:30 - January 22, 2017

హైదరాబాద్ : ఆటో ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలితీసుకుంది. పాతబస్తీలో రోడ్డు ప్రమాదం జరిగింది. శంషేర్ గంజ్ ప్రాంతంలో ముందు టైరు ఊడిపోవడంతో అతివేగంగా వచ్చిన ఆటో రోడ్డుపై నడుస్తున్న జంగయ్య అనే హమాలిని బలంగా ఢీకొట్టింది.  దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:21 - January 22, 2017

రెండో వికెట్ కోల్పోయిన భారత్

కోల్ కతా : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (11) ఔట్ అయ్యాడు. 

18:16 - January 22, 2017
18:14 - January 22, 2017

హైదరాబాద్ : దళితులు, గిరిజనుల హక్కులను ఎన్డీయే ప్రభుత్వం కాలరాస్తోందని డాక్టర్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ విమర్శించారు. దళితుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందని విమర్శించారు. నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఇబ్బందులే ఇబ్బందులు పడ్డారని..కోటీశ్వరులకు మాత్రం ఏమీ కాలేదన్నారు. 

 

18:09 - January 22, 2017

చిత్తూరు : మదనపల్లి ఎక్సైజ్‌ సీఐ ప్రసాదరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్‌శాఖలో కానిస్టేబుళ్ల నుంచి కమిషనర్ల వరకు.. నెలనెలా లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఒక్కో అధికారికి ప్రతినెలా తప్పకుండా లంచాలు పంపాలని లేకుంటే... తమ జీతాలు నిలుపుదల చేసి... కమిటీలు వేసి వేధిస్తున్నారని ప్రసాదరెడ్డి ఆరోపించారు.

 

కూనేరు రైలు ప్రమాదం దురదృష్టకరం : పవన్ కళ్యాణ్

విజయనగరం : కూనేరు రైలు ప్రమాదం ఘటన దురదృష్టకరమని జనసేనాని, హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు. 

తొలి వికెట్ కోల్పోయిన భారత్

కోల్ కతా : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగలు వద్ద రహానే (1) ఔట్ అయ్యాడు. 

17:57 - January 22, 2017

విజయవాడ : రిపబ్లిక్‌డే వేడుకల సందర్భంగా ఈత కొట్టి గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కాలనుకున్న కానిస్టేబుల్ మృత్యు ఒడిలోకి చేరాడు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఈత సాధన చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. స్విమ్మింగ్‌ పోటీల్లో జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్న ఎస్ పీఎఫ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరావు జనవరి 26న రిపబ్లిక్‌డే వేడుకల సందర్భంగా గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఇవాళ కృష్ణానదిలో ఈత సాధన చేస్తుండగా ఆయన గుండెపోటుకు గురై మృతి చెందాడు. కానిస్టేబుల్ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

 

లంక రైతుల కన్నీళ్లు ఏపీకి మంచిదికాదు : పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణానది లంక రైతుల కన్నీళ్లు ఏపీకి మంచిదికాదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. మూలలంకలో 207 ఎకరాల మాగాణిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డ్ గా మార్చడం అన్యాయమన్నారు. పోలవరం నిర్మాణంపై ప్రతినెలా సమీక్షజరుపుతున్న ప్రభుత్వం ఈ సమస్యలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదన్నారు. 

 

 

17:30 - January 22, 2017

విజయనగరం : రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా తెలిపారు. విజయనగరం జిల్లాలో జరిగిన హీరాఖండ్ రైలు ప్రమాదంపై ఆయన స్పందించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు బెంగాల్ నుంచి నేరుగా ఘటనా స్థలానికి వెళ్తున్నారన్నారు. సహాయక చర్యల్లో రైల్వే అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందం పాల్గొంటున్నారని వెల్లడించారు. ప్రయాణికులను ప్రత్యేక రైలు ద్వారా సంభల్‌పూర్ మీదుగా భువనేశ్వర్ తరలిస్తున్నామన్నారు. మృతులకు రెండు లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 50వేల రూపాయలు, స్వల్ప గాయాలైన వారికి 25వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాల నుంచి విచారిస్తున్నామన్నారు. 

 

17:28 - January 22, 2017

విజయనగరం : జిల్లాలోని కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్‌ వద్ద జరిగిన రైలు ప్రమాదం ఘటనలో 9 మంది క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడ్డ వారికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు, స్థానిక ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. భద్రత ప్రమాణాలను మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని విమర్శించారు.

17:23 - January 22, 2017

విజయనగరం : కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్‌ దగ్గర హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ఘటనలో 37 మందికిపైగా మరణించారు. చాలా మంది గాయపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

భారత్ విజయలక్ష్యం 322 పరుగులు

కోల్ కతా : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో ఇంగ్లండ్ నిర్ణీత 50 వోవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. భారత్ విజయలక్ష్యం 322 పరుగులుగా ఉంది. 

17:11 - January 22, 2017

వంశధార ప్రాజెక్టు పనులను అడ్డుకున్న నిర్వాసితులు

శ్రీకాకుళం : హిరమందలంలో వంశధార జలాశయం పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాకే పనులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

కోల్ కతా : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 246 పరుగుల వద్ద మొయిన్ అలీ (2) ఔట్ అయ్యాడు.   

 

ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

కోల్ కతా : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 237 పరుగుల వద్ద బెయిర్ స్టో (36) ఔట్ అయ్యాడు.  

నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

హైదరాబాద్ : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 212 పరుగుల వద్ద బట్లర్ (11) ఔట్ అయ్యాడు. 

16:05 - January 22, 2017

విశాఖ : హీరాఖండ్‌ రైలు ప్రమాదంలో గాయపడిన వారికి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. 10 మందికి ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

హైదరాబాద్ : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 193 పరుగుల వద్ద మోర్గాన్ (44) ఔట్ అయ్యాడు.  

 

15:54 - January 22, 2017

శ్రీకాకుళం : ఏపీ సర్కార్‌పై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశధార నిర్వాసితుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని నేతలు నాయకులు ధ్వజమెత్తారు. వారికి కల్పించాల్సిన హక్కుల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. హిరమండలంలో జలాశయం పనులను అడ్డుకుని నిరసన తెలుపుతున్న వంశధార నిర్వాసితులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు.  ఆందోళనకారులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి, తప్పుడు కేసులు పెట్టడం బాధాకరమన్నారు. 

 

15:47 - January 22, 2017

శ్రీకాకుళం : హిరమందలంలో వంశధార జలాశయం పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాకే పనులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. వంశధార నిర్వాసితులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి... ఇప్పటికే ఎస్పి బ్రహ్మారెడ్డి - రెవిన్యూ, పోలీస్, వంశధార అధికారులతో సమీక్ష నిర్వహించారు... నిర్వాసితులతో అధికారుల చర్చలు విఫలం కావడం, పనులు నిలుపుదల చేయలేమని అధికారులు తేల్చిచెప్పడంతో నిర్వాసిత ప్రాంతీయుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది... పోలీసులు బలగాలు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం కేవియెట్ దాఖలు

ఢిల్లీ : జల్లికట్టు ఆర్డినెన్స్ కు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియెట్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా జల్లికట్టు ఆర్డినెన్స్ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని కేవియేట్ దాఖలు చేశారు. 

 

15:41 - January 22, 2017

ఎస్పీ...కాంగ్రెస్ పొత్తు ఖరారు

లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ...కాంగ్రెస్ పొత్తు ఖరారు అయింది. కాంగ్రెస్ కు 105 సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకారం తెలిపింది. 298 స్థానాల్లో ఎస్పీ పోటీ చేయనుంది. 

 

13:56 - January 22, 2017

హైదరాబాద్ : ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందిరాపార్కు వద్ద దళిత హక్కుల సాధన సభ జరుగుతోంది. సీపీఎం, సీపీఐ, దళిత, గిరిజన, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సభలో సురవరం పాల్గొని ప్రసంగించారు. మనుధర్మ శాస్త్రానికి..దళితులపై దౌర్జన్యాలకు సంబంధం ఉందన్నారు. దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు..పోరాటాలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయన్నారు. వర్ణాశ్రమ వ్యవస్థ వచ్చిందని చెబుతుంటారని, పంచమం అనేది లేదని వారు చెబుతున్నారన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని, 66 సంవత్సరాలు అయినా ఎందుకు దాడులు జరుగుతున్నాయనే దానిపై ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా ఆలోచించాలన్నారు. చుండూరు కారంచెడులో జరిగిన ఘటన అందరికీ తెలిసిందేనని, మహారాష్ట్రలో ఓ దళిత కుటుంబాన్ని సజీవ దహనం చేశారని..గుజరాత్ లో చనిపోయిన గోవుల చర్మాన్ని వలుస్తున్న దళితులను కొట్టి సోషల్ మీడియాలో పెట్టారన్నారు. వృత్తి అంగీకరించకపోతే తప్పు..అంగీకరిస్తే తప్పు అనే విధంగా కొనసాగుతోందన్నారు. ఆర్ఎస్ఎస్ దాడుల కారణంగా పలువురు మృతి చెందారని, దాడులు కూడా జరిగాయన్నారు. సంఘ పరివార్, దీనికి వత్తాసుగా కేంద్రం..అఖిల విద్యార్థి పరిషత్ మైనార్టీ, దళితులపై దాడులు చేస్తున్నారని సురవరం తెలిపారు.

దళితులపై దౌర్జన్యాలు పెరిగాయి - ఏచూరి..

హైదరాబాద్ : మోడీ తెల్లగుర్రం ప్రస్తుతం పరుగెడుతోందని, దీనిని నీల్..లాల్ జెండాలు ఆపుతాయని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దళితులపై ప్రస్తుతం దౌర్జన్యాలు పెరిగిపోయాయని తెలిపారు. ఇందిరాపార్కు వద్ద దళిత హక్కుల సాధన సభ జరుగుతోంది.

13:45 - January 22, 2017

హైదరాబాద్ : మోడీ తెల్లగుర్రం ప్రస్తుతం పరుగెడుతోందని, దీనిని నీల్..లాల్ జెండాలు ఆపుతాయని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దళితులపై ప్రస్తుతం దౌర్జన్యాలు పెరిగిపోయాయని తెలిపారు. ఇందిరాపార్కు వద్ద దళిత హక్కుల సాధన సభ జరుగుతోంది. సీపీఎం, సీపీఐ, దళిత, గిరిజన, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సభలో ఏచూరి పాల్గొని ప్రసంగించారు. 'జై భీమ్..లాల్ సలాం' నినాదం వెనుక పెద్ద అర్థముందని, దీనిపై అనేక చర్చలు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా సభలు నిర్వహించడం జరుగుతోందని, ఇక్కడ దళిత హక్కుల సాధన అనే పేరు పెట్టుకున్నారని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో ఐక్యతను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు కొనసాగుతుందన్నారు. రోహిత్ వేముల సూసైడ్ లో ఎంక్వయిరీ కమిటీ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని, ఆర్టీఐలో ఈ అంశం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. వైస్ ఛాన్స్ లర్ ఏ రకంగా హింస పెట్టారో అనేక విషయాలు బయటకు రానివ్వడం లేదన్నారు. రిజర్వేషన్ లను రద్దు చేయాలని ఆర్ఎస్ఎస్ నేత మన్మోహన్ వైద్య ప్రకటించారని, యూపీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. దళితులపై దౌర్జన్యాలు పెరుగుతున్నాయని, ఇది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమన్నారు. దళితులకు రిజర్వేషన్ ఉండవద్దని ఆర్ఎస్ఎస్ పేర్కొంటోందని, గో రక్ష పేరిట దళితులపై దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రజాపోరాటాలు తప్ప మినహా ఇతర మార్గం లేదని నిర్ణయించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. సుప్రీం, హైకోర్టుల్లో దళితులు లేరని, వీరిని సమాజం నుండి పక్కకు పెట్టాలని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో జరుగుతోందన్నారు. గాంధీ బొమ్మను తీసేసి మోడీ కూర్చొన్నారని, దళితులపై కాకుండా పేద ప్రజలపై ఆర్థిక దౌర్జన్యం జరుగుతోందన్నారు. ట్రిపుల్ తలాక్ అంటూ మైనార్టీలపై దాడులు జరుపుతున్నారని, ఢిల్లీ ఎన్నికల్లో మొదటి తలాఖ్..బీహార్ లో రెండో తలాఖ్..యూపీలో జరిగే ఎన్నికల అనంతరం మూడో తలాఖ్ జరుగుతుందని అభివర్ణించారు. మోడీ సర్కార్ సంపన్నుల కొమ్ము కాస్తోందని, సంపన్నులు బ్యాంకుల నుండి 11 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారని పేర్కొన్నారు. లాల్..నీల్ జెండాలు కలిసి పోరాటం చేయాలని, హక్కులు సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఏచూరి స్పష్టం చేశారు.

దళిత హక్కుల సాధన సభ ప్రారంభం..

హైదరాబాద్‌ : ఇందిరాపార్కు వద్ద దళిత హక్కుల సాధన సభ ప్రారంభమైంది. సీపీఎం, సీపీఐ, దళిత, గిరిజన, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతోంది. ఈ సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇతర నేతలు హాజరయ్యారు.

13:17 - January 22, 2017

విజయనగరం : హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కొమరాడ (మం) కూనేరు రైల్వేస్టేషన్ వద్ద హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్ తో సహా ఏడు బోగీలు పట్టాలు తప్పడంతో 37 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జగదల్ పూర్ నుండి భువనేశ్వర్ కు రైలు వెళుతోంది. విద్రోహ చర్య ఉందని రైలు అధికారులు భావిస్తున్నారు. రైలును కూల్చేందుకు విద్రోహుల కుట్ర పన్నారా ? రైలు పట్టాను విరిచారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు.
మరోవైపు ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయకచర్యల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ధ్వంసమైన బోగీలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. బోగీలను ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఇంకా మృతదేహాలు ఉన్నాయా ? లేదా ? అనేది తెలుస్తుంది. ఘటనా ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రికల్ వైర్లు, పోల్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతుల్లో విజయనగరం జిల్లాకు చెందిన 7గురు ఉన్నారని, ఇతరులు ఛత్తీస్ గడ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది.

13:13 - January 22, 2017

ఉత్తర్ ప్రదేశ్ : ఎన్నికలకు కొద్ది రోజులే సమయం మిగిలి ఉంది. దీనితో ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని ఎస్పీ పార్టీ యోచిస్తోంది. సీఎం అఖిలేష్..తండ్రి ములాయం సింగ్ యాదవ్ ల మధ్య వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్పీ మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పొత్తు అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 403 స్థానాల్లో కాంగ్రెస్ కు 105 సీట్లు కేటాయించినట్లు సమాచారం. లక్నో జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో అఖిలేష్ సతీమణి, కీలక నేతలు హాజరయ్యారు. ములాయం సింగ్ యాదవ్, శివ్ పాల్ యాదవ్ లు మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం. ఇక ప్రజలను ఆకట్టుకొనే విధంగా మేనిఫెస్టోను తయారు చేశారు. అధికారంలోకి వచ్చిన అనంతరం మెరుగైన పాలన చేశామని, అధికారం కట్టబెడితే మరింత మెరుగైన పాలన అందిస్తామని అఖిలేష్ మేనిఫెస్టోలో వెల్లడించారు. బలహీన వర్గాలు, మహిళలకు మెనిఫేస్టోలో ప్రాధాన్యం అందించారు. అందులో భాగంగా ఓటర్లకు పలు వరాలు కురిపించారు. రైతులకు కోసం స్మార్ట్ ఫోన్ లు ఉచితం అందచేస్తామని హామీనిచ్చారు. సీనియర్ సిటిజన్లకు వృద్ధాప్య ఫించన్లు, గృహాలు నిర్మిస్తామని, పేద మహిళలకు ఫ్రెషర్ కుక్కర్ లు, కోటి మందికి వెయ్యి రూపాయల పెన్షన్ అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని పెంచడానికి ఆసుపత్రుల నిర్మాణం, ప్రాథమిక విద్యను అందించానికి స్కూళ్ల నిర్మాణం చేస్తామని అఖిలేష్ మేనిఫెస్టోలో వెల్లడించారు. మరి ఈ మేనిఫెస్టోపై ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయో ? ఇతర పార్టీల మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

జల్లికట్టుపై సుప్రీంలో కేవియట్ దాఖలు..

ఢిల్లీ : జల్లికట్టు ఆర్డినెన్స్ కు సంబంధించి సుప్రీంకోర్టులో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా జల్లికట్టు ఆర్డినెన్స్ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని కేవియేట్ లో పేర్కొంది.

12:52 - January 22, 2017

భద్రతా బలగాలు..తీవ్ర వాదుల మధ్య కాల్పులు..

అరుణాచల్ ప్రదేశ్ : చంగ్ లాంగ్ లోని జైరాంపూర్ సమీపంలో భద్రతా బలగాలు, తీవ్ర వాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు జవాన్లు మృతి చెందగా ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి.

జల్లికట్టు ప్రారంభం..

చెన్నై : తమిళనాడులో పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం చేయాలని, చట్టం చేయాలని మధురై జిల్లా ఆళంగవల్లూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

12:22 - January 22, 2017
12:21 - January 22, 2017
12:20 - January 22, 2017

విజయవాడ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై విరుచకపడ్డారు. పోలవరం..అమరావతి అంశాలపై సుదీర్ఘంగా ట్వీట్స్ చేశారు. సర్కార్ పై పలు ప్రశ్నలు సంధించారు. ఆయన ట్విట్టర్ లో ఎలాంటి అంశాలు ట్వీట్ చేశారో 'రైతుల కన్నీరు క్షేమదాయకం కాదు..పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణా నది లంక భూముల రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్ కు క్షేమదాయకం కాదు. పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉన్న మూలలంకలోని 207 ఎకరాల మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డ్ గా మార్చడం ఎంతవరకు న్యాయమో ప్రజా ప్రతినిధులు చెప్పాలి.

ట్రాన్ ట్రాయ్..
తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన పోలవరం గుత్తేదారు కంపెనీ ట్రాన్ ట్రాయ్ అడ్డగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డు గా మార్చేస్తే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో అన్న వివేకం కూడా చూపకపోతే ప్రజాప్రతినిధును ఏమనుకోవాలి. ? పోలవరం నిర్మాణ ప్రగతిపై నెలకోమారు సమీక్ష జరుపుతున్న సర్కార్ ఈ సమస్యపై ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదు.

నష్టపరిహారం..
భూముల సేకరణకు ముందు ఎంత మేరకు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో..అంతే ఇవ్వాలి. పట్టా రైతులకు ఒకలా..లంక భూముల రైతులకు మరోలా వివక్షత పాటించడం మంచిది కాదు. ఒకవేళ ఈ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకపోతే వాటిని సాగుభూములుగానే రైతులకు వదిలేయాలి.

లంక భూములు..
అమరావతిలో కృష్ణ నది లంక భూముల రైతుల బాధను సమాజ వికాసాన్ని కాంక్షించే వారు అర్థం చేసుకోవాల్సి ఉంది. తాము దళితులం అయినందు వల్లే తాము నష్టపరిహారం చెల్లింపులో వివక్షకు గురవుతున్నామని ఆ ప్రాంత రైతులు ఆవేదనతో ఉన్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. ఈ భూముల రైతులు తమ వారు కదా...లేదా కాంట్రాక్టర్ కు ఇబ్బందనా ? గత్యంతరం లేని రైతులు తగిన నష్టపరిహారం చెల్లించమని అడిగితే వారి మొర ఎందుకు వినరు. పోలవరం రైతులు ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయారు. ఇది అన్యాయం అడిగితే పోలీసులతో కేసులు పెట్టించి వారి నోరు మూయిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇకనయినా వారికి న్యాయం చేయండి.

గ్రీన్ ట్రిబ్యునల్..
అసలు గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం నది పరివాహకంలో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకున్నదో లేదో స్పష్టత లేదు. ఈ భూములను తీసుకని ఏమి చేస్తారో ముందుగా ప్రజలకు లేదా కనీసం రైతులకైనా తెలియచేయాలి’. అని ట్వీట్స్ చేశారు.

ఏపీ ప్రభుత్వంపై పవన్ ట్వీట్..

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వంపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పోలవరం, అమరావతి అంశంపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు.

11:59 - January 22, 2017

అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి లాంటి భక్తి రస చిత్రాలను అందించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో మరో భక్తి రస చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పరమ భక్తుడు హథీరాం బాబా జీవితకథ ఆధారంగా 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం తెరకెక్కింది. హథీరాం బాబాగా నాగార్జున నటించారు. పలు హిందీ సీరియల్స్ లో..శ్రీ మహావిష్ణువు, కృష్ణుడు, శ్రీరాముడి పాత్రల్లో కనిపించిన 'సౌరభ్ రాజ్ జైన్' వెంకటేశ్వర స్వామిగా నటించారు. ఇప్పటి వరకు బుల్లి తెరమీదే కనిపించిన ఈ ఉత్తరాది నటుడు 'సౌరభ్' టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా 'సౌరభ్' తో టెన్ టివి ముచ్చటించింది. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానని, వెంకటేశ్వర స్వామిగా నటించడం చాలా ఆనందంగా ఉందని తెలియచేశారు. పూర్తి విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ మృతులు వీరే..

విజయనగరం : హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 37 మంది దుర్మరణం చెందారు. ఇందులో 18 మంది మృతుల పేర్లను రైల్వే అధికారులు వెల్లడించారు. ఎం.కృష్ణ (35), పి.శ్రీను (25), బి.కమల (50), గాయత్రి సాహూ (14), విష్ణు ప్రసాద్ సాహూ, సుభాష్ సీహెచ్ సాహూ (60), శుభభారతి సాహూ, దిలీప్ కార్ రౌత్ (51), టి.కె.మైంజ్ (45), సోము అన్నమ్మ, రాజన్ నాయక్ (18), పి.పోలి (35), జషోద పండిట్, రామ్ ప్రసాద్ పండిట్, ఎస్.రేణుక, కె.రేవతి (16), మండలల్ బల్ రామ్, తపన్ కుమార్ ప్రధాన్ లున్నారు.

11:39 - January 22, 2017

ఉత్తర్ ప్రదేశ్ : ఎన్నికలకు దగ్గర పడుతున్నాయి. పార్టీలు వ్యూహ రచనలో మునిగిపోతున్నాయి. అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్నాయి. కానీ ఎస్పీ - కాంగ్రెస్ పార్టీల మధ్య సమీకరణాలు మారుతున్నాయి. ఆదివారం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు తెలుస్తోంది. 403 స్థానాల్లో 298 స్థానాల్లో ఎస్పీ పోటీ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తు విషయంలో మొదట కాంగ్రెస్ కు ఎస్పీ కొన్ని షరతులు పెట్టింది. చివరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జోక్యం చేసుకోవడంతో 105 సీట్లను ఇవ్వడానికి ఎస్పీ అంగీకరించిందని సమాచారం. తొలుత 110 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ కోరింది. ఇదిలా ఉంటే కాసేపట్లో అఖిలేష్‌ యాదవ్‌ ఎన్నికల ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు.

11:35 - January 22, 2017

విజయనగరం : శనివారం అర్ధరాత్రి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అర్ధరాత్రి హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది..హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 37 మంది దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన కొమరాడ (మం) కూనేరు రైల్వేస్టేషన్ వద్ద చోటు చేసుకుంది. ఇంజిన్ తో సహా ఏడు బోగీలు పట్టాలు తప్పింది. జగదల్ పూర్ నుండి భువనేశ్వర్ కు రైలు వెళుతోంది.

37 మంది మృతులు..
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 37కు చేరింది. . జగదల్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్‌ వద్ద పట్టాలు తప్పింది. శనివారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు జరిగిన ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరింది.మరో 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ 9 బోగీ నుజ్జు నుజ్జు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ప్రయాణీకులు నిద్రలో..
రైలు ప్రమాద క్షతగాత్రులను, పార్వతీపురం, విజయనగరం ఆస్పత్రులతోపాటు, విశాఖ కేజీహెచ్ కి కూడా తరలించారు. ఒక ఏసీ, రెండు స్లీపర్‌ క్లాస్‌, నాలుగు జనరల్‌ బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులంతా నిద్రలోకి జారుకున్న సమయంలో రైలు ఒక్కసారిగా కుదుపులకు గురైంది. కళ్లు తెరిచేలోగానే అక్కడంతా హాహాకారాలు చోటు చేసుకున్నాయి. ఎటు చూసినా ఆర్తనాదాలే వినిపించాయి. ఏం జరిగిందో తెలియని పరిస్థితి. మెల్లగా తేరుకున్న తర్వాత తాము ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పిందని తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

హెల్ప్ లైన్స్..
క్షతగాత్రులు ఆర్తనాదాలు, హాహాకారాలతో ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం నెలకొంది. బోగీల్లో మృత దేహాలు ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న విశాఖ డీఆర్ఎం చంద్రలేఖ రైల్వే అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి ప్రత్యేక రైలులో ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. పట్టాలు తప్పిన హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ పక్కనే ఆగివున్న గూడ్స్‌ రైలుపై ఒరిగిపోవడంతో ప్రమాద తీవ్రత తప్పింది. రైల్లో ఉన్న ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు ద్వారా విశాఖ, విజయనగరం చేరవేస్తున్నారు. బాధితుల కోసం విజయనగరం రైల్వే స్టేషన్‌లో అధికారులు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు.

సహాయక చర్యల్లో అధికారులు..ప్రజలు..
అంతా నిద్రలోకి జారుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ప్రమాద ఘటన గురించి సంగతే తెలియని పరిస్థితి. దీంతో క్షతగాత్రులకూ ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తర్వాత సమాచారం అందుకున్న పరిసర ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తీవ్రంగా గాయాలపాలైన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చిన్నపాటి గాయాల పాలైన వారిని కూనేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేసి అనంతరం అక్కడి నుంచి పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అసలు ఎంతమంది చనిపోయారో తెలుసుకోలేనంతగా జనరల్‌ కంపార్ట్‌మెంటు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. రాయగఢ్‌, పార్వతీపురం ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పార్వతీపరం ఆసుపత్రికి 18 మందిని తీసుకురాగా అందులో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గీతాంజలి మహంతి, నీలిమ మిస్రో, భగవాన్‌ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వీరు ఒడిశా ప్రాంతానికి చెందివారు. బొబ్బిలి సమీపంలోని కోమటిపల్లికి చెందిన మరల శంకరావు, ఎస్‌.శ్రీనివాసరావు గాయాలపాలైనవారిలో ఉన్నారు.

ఆరా తీసిన సురేష్ ప్రభు..
విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద సంభవించిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదస్థలిలో సహాయచర్యలు ముమ్మరం చేయాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.

11:31 - January 22, 2017

భూపాలపల్లి : కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు.. తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అటకెక్కించిన కేసీఆర్‌ సర్కార్‌.. ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమైందని తమ్మినేని విమర్శించారు. భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న మహాజన పాదయాత్ర ఇప్పటికి 97 రోజులు పూర్తి చేసుకుంది. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తమ్మినేని దుయ్యబట్టారు. గొర్ల కాపరులకు ఎంతో చేశామని ఆర్భాటపు ప్రకటనలిస్తున్న ఈ ప్రభుత్వం.. వారికి ఎలాంటి సాయం అందజేయలేదని తమ్మినేని విమర్శించారు.

కేసీఆర్ కు లేఖ..
ఎస్సీ, ఎస్టీ సమస్యలపై తమ్మినేని వీరభద్రం గళమెత్తితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని పాదయాత్ర బృందం సభ్యులు నగేష్ విమర్శించారు. తక్షణమే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను వెనుకబడిన గ్రామాల అభివృద్ధి కోసం వినియోగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీపీఎంపై విమర్శలు మంత్రి హరీష్‌రావు అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు చెబితే టీఆర్‌ఎస్‌ పాలకులు జీర్ణించుకునే స్థితిలో లేరని నగేష్‌ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి..ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌పై రూల్స్‌ రూపొందించాలని నగేష్‌ డిమాండ్ చేశారు. ఎర్రజెండా చేతబట్టి..పల్లెపల్లెలో చైతన్యాన్ని నింపుతోన్న సీపీఎం మహాజన పాదయాత్ర 97రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తోంది. 97వ రోజు తమ్మినేని బృందం ఘనపురం, వెల్దుర్తిపల్లి, బుద్దారం, కేశవరం, నార్సాపురం, పాపాయపల్లి, బండారుపల్లి, ములుగు గ్రామాల్లో పర్యటించింది. జర్నిలిస్టుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

ఎస్సీ - కాంగ్రెస్ పొత్తు ఖరారు..

ఉత్తర్ ప్రదేశ్ : ఎస్పీ -కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తులు ఖరారయ్యాయి. కాంగ్రెస్ కు 105 సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకారం తెలిపింది.

11:10 - January 22, 2017

తెలంగాణ పాటకు పుట్టినిల్లు. ప్రజాచైతన్య గీతాల ఏరువాక. ఇక్కడ ఎందరో గేయరచయితలు నిబద్ధతతో రచనలు చేస్తున్నారు. ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నారు. అలాంటి వారిలో కర్నాటి రఘురాం గౌడ్ ఒకరు. ఆయన ఎన్నో రచనలు చేశారు. సమాజంలోని అనేక అంశాలపై పుస్తకాలు రాశారు. గేయరచయిత కర్నాటి రఘురాం గౌడ్ ఇంకా ఎలాంటి పాటలు..పుస్తకాలు రాశారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

 

11:09 - January 22, 2017

చెన్నై : జల్లికట్టుపై ఇంకా ఆందోళనకారులు పట్టు వీడడం లేదు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి డిమాండ్ కు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకరావడం..వెంటనే ఆమోద ముద్ర వేయడం జరిగిపోయాయి. దీనితో జల్లికట్టు క్రీడ జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆందోళనకారులు మాత్రం ఈ ఆర్డినెన్స్ పై సంతృప్తి చెందడం లేదు. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం చూపాలని, జల్లికట్టు నిర్వాహణకు ప్రత్యేక చట్టం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం ఉదయం అలంగానల్లూరులో సీఎం పన్నీర్ సెల్వం చేతుల మీదుగా జల్లికట్టు క్రీడలను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆందోళనకారులు నిరసన తెలియచేయడంతో సీఎం పన్నీర్ సెల్వం తిరగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాశ్వత పరిష్కారం చూస్తామని, ఆందోళన విరమించాలని సీఎం కోరినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. దీనితో సీఎం పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. డిండిగల్ లో జరిగే జల్లికట్టు ప్రారంభించేందుకు పన్నీర్ సెల్వం వెళ్లినట్లు తెలుస్తోంది.
కొంతమంది మాత్రం మెరీనా బీచ్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఆర్డినెన్స్ కేవలం కొన్ని నెలల పాటే అమల్లో ఉంటుందని, చట్టబద్ధత కల్పిస్తేనే బాగుంటుందని పేర్కొంటూ ఆందోళన చేస్తున్నారు. జల్లికట్టుపై సోమవారం నాడు జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

సీఎం పన్నీర్ సెల్వం అడ్డుకున్న ఆందోళనకారులు..

చెన్నై : మధురైలో జరగాల్సిన జల్లికట్టు వాయిదా పడింది. ఆందోళనకారులు సీఎం పన్నీర్ సెల్వంను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాశ్వత పరిష్కారం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

10:57 - January 22, 2017

సాహిత్యం సామాజిక చైతన్యానికి ఉపయోగ పడుతుంది. వివిధ చారిత్రక సందర్భాలకు ఆధారాలను అందిస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన కవులు రచయితలు ఎందరో ఉన్నారు. తెలుగు సాహిత్యంలో ఎందరో కథారచయితలు అద్భుతమైన కథలను రాస్తున్నారు. అరుదైన కథలు సృష్టిస్తున్నారు. వారిలో కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ ఒకరు. ఆయన కార్గిల్ కథలు పేరుతో కథానికా సంకలనాన్నివెలువరించారు. తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలను చేపట్టి తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ పై మరిన్న విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

రైల్వే ప్రమాదంపై మోడీ దిగ్ర్భాంతి..

ఢిల్లీ : హిరాఖండ్ రైల్వే ప్రమాదంపై ప్రధాన మంత్రి మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.

కస్తూర్భా ఆశ్రమ విద్యార్థిని సూసైడ్..

విశాఖపట్టణం : అచ్యుతాపురంలో కస్తూర్భా ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని వెంకటలక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

10:30 - January 22, 2017

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద దళిత హక్కుల సాధన సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. సీపీఎం, సీపీఐ, దళిత, గిరిజన, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ప్రకాష్‌ అంబేద్కర్‌ లు హాజరు కానున్నారు.
అడుగడుగునా అవమానం.. దళితులు, బలహీన వర్గాలపై వరుస దాడులు. ప్రతిక్షణం కులవివక్ష, అణగారిన వర్గాలపై అణచివేత. ఈ ధోరణిని నిరసిస్తూ...దళితులపై దాడులను అరికట్టేందుకు పోరాటం ఒక్కటే మార్గమని సీపీఎం, సీపీఐ, దళిత, సామాజిక సంఘాలు నిర్ణయించాయి. అందుకోసం ఇవాళ హైదారాబాద్‌-ఇందిరాపార్క్‌ వద్ద భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించేకు పిలుపునిచ్చాయి. దళిత హక్కుల సాధన సభ పేరిటి నిర్వహించనున్న ఈ సభకు సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, ప్రకాష్‌ అంబేద్కర్‌ హాజరుకానున్నారు. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా భారీ ఎత్తున దళిత హక్కుల సాధన సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22న హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయా పార్టీలు, సంఘాల నేతలు తెలిపారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులను అరికట్టాలన్న డిమాండ్‌తో.. సీపీఎం, సీపీఐ, దళిత, గిరిజన, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సభ జరగనుంది.

10:26 - January 22, 2017
10:13 - January 22, 2017

చిత్తూరు : తమిళుల కళ నెరవేరింది. తమిళ తంబీల ఆందోళనకు ప్రభుత్వాలు దిగొచ్చాయి. సాధారణ క్రీడ కోసం రాష్ట్ర ప్రజలు రోడ్డెక్కడం చరిత్రలో ఇదే మొదటిసారి అని పలువురు పేర్కొంటున్నారు. దీనితో జల్లికట్టు క్రీడను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గత ఐదు రోజులుగా మెరీనా బీచ్ లో ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. కేవలం 50 మంది ప్రారంభమైన పోరాటం లక్షల మందికి చేరుకుంది. దీనితో తమళనాడు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దేశ ప్రధాని వద్దకు వెళ్లి ఆర్డినెన్స్ తేవాలని సీఎం పన్నీర్ సెల్వం కోరారు. ఈ నేపథ్యంలో శనివారం కొద్ది గంటల్లోనే ఆర్డినెన్స్ కు ఆమోదం లభించింది. దీనితో తమిళులు సంబరాలు జరుపుకున్నారు. అలంగానల్లూరులో జల్లికట్టు నిర్వాహణ ఏర్పాట్లు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేతుల మీదుగా ఈ జల్లికట్టు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కానీ కొంతమంది మాత్రం ఇంకా మెరీనా బీచ్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఆర్డినెన్స్ కేవలం కొన్ని నెలల పాటే అమల్లో ఉంటుందని, చట్టబద్ధత కల్పిస్తేనే బాగుంటుందని పేర్కొంటూ ఆందోళన చేస్తున్నారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

రైలు ప్రమాద మృతులకు ఎక్స్ గ్రేషియా..

ఢిల్లీ : విజయనగరం కొమరాడ మండలం కూనేరు వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతి చెందిన వారికి రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేల నష్టపరిహారం అందించనున్నట్లు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు.

09:48 - January 22, 2017

విజయనగరం : హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కొమరాడ (మం) కూనేరు రైల్వేస్టేషన్ వద్ద హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్ తో సహా ఏడు బోగీలు పట్టాలు తప్పడంతో 25 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జగదల్ పూర్ నుండి భువనేశ్వర్ కు రైలు వెళుతోంది. అర్ధరాత్రి కావడం..అందరూ గాఢ నిద్రలో ఉండడంతో ఏమి జరిగిందో తెలియరాలేదు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 35 మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా మరిన్ని మృతదేహాలున్నాయని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భారీ క్రేన్ సహాయంతో పక్కకు ఒరిగిన బోగీలను పక్కకు తరలిస్తున్నారు. ఇరుక్కపోయిన బోగీలను గ్యాస్ కట్టర్ ల సహాయంతో తొలగిస్తున్నారు. మృతి చెందిన వారిలో 17 మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్, ఒరిస్సా ప్రాంతాలకు చెందిన వారుగా తెలుస్తోంది.

09:39 - January 22, 2017
09:38 - January 22, 2017

చెన్నై : తమిళల ఉద్యమం ఫలించింది..ఒక క్రీడ కోసం తమిళ ప్రజలు రోడ్డెక్కారు..సంప్రదాయపరంగా వచ్చే ఈ క్రీడపై నిషేధం ఎత్తివేయాలంటూ ఐదు రోజులుగా పోరాటం జరిపారు. వీరి పోరాటానికి ప్రభుత్వాలు దిగాల్సి వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు క్రీడ ప్రారంభం కానుంది. దీనితో ఒక్కసారిగా అందరి దృష్టి తమిళనాడు వైపు మళ్లింది. ఆర్డినెన్స్ రావడంతో తమిళ తంబీలు మెరీనా బీచ్ లో సంబరాలు చేసుకుంటున్నారు. అలంగానల్లూరులో జల్లికట్టు నిర్వాహణ ఏర్పాట్లు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేతుల మీదుగా ఈ జల్లికట్టు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కానీ కేవలం ఆర్డినెన్స్ కాకుండా చట్టబద్ధత కల్పించాలంటూ తమిళ తంబీలు డిమాండ్ చేస్తున్నారు.

కాసేపట్లో జల్లికట్టు ప్రారంభం..

చెన్నై : జల్లికట్టు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలంగానల్లూరులో జల్లికట్టు నిర్వాహణ ఏర్పాట్లు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేతుల మీదుగా ఈ జల్లికట్టు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

 

09:21 - January 22, 2017

విజయనగరం : అర్ధరాత్రి..అటవీ ప్రాంతం..ఏం జరిగిందో తెలియరాలేదు. ఆపై ఒక్కసారిగా పెద్ద కుదుపు..ప్రాణాలు రక్షించుకోవడానికి ఒకరిపై ఒకరు పడిపోయారు..హాహాకారాలు..భీతావహ దుస్థితి..నిద్రలోనే అనంతలోకాలకు...ఇదంతా హిరాఖుండ్ రైల్వే బోగీలు తప్పడంతో ఏర్పడిన పరిస్థితి. ఈ ప్రమాదంలో 33 మంది మృత్యువాత పడ్డారు. చాలా మందికి గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా సమాచారం తెలియడంతో సహాయక చర్యలు ఆలస్యంగా మొదలయ్యాయి. గాయపడిన వారిని పార్వతీపురం, విశాఖ ఆసుపత్రులకు తరలించారు. కేజీహెచ్ కు ఏడుగురు, రాయగఢ్ ప్రభుత్వాసుపత్రికి 32 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.
వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తీరుపై కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఆరా తీశారు. ఈస్ట్ కోస్ట్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి సురేష్ ప్రభు అధికారులను ఆదేశించారు. విజయనగరం, రాయగడ్ కలెకర్టు, సీఆర్పీఎఫ్ కమాండెంట్ మనోజ్ ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

రైలు ప్రమాదంపై బాబు విచారం..

విజయవాడ : విజయనగరం జిల్లాలో హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో పలువురు మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందచేయాలని వైద్యులకు సూచించారు.

పట్టాలు తప్పిన హిరాఖండ్ ఎక్స్ ప్రెస్..రైళ్లు రద్దు..

విజయనగరం : హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైళు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. సంబల్‌ పూర్‌ -నాందేడ్‌ ఎక్స్‌ ప్రెస్‌, రాయగడ - విశాఖపట్నం, విశాఖపట్నం - కోరాపుట్‌ ప్యాసింజర్‌ రైల్ సర్వీసులను రద్దు చేశారు.

08:10 - January 22, 2017

హైదరాబాద్ : కార్పొరేట్‌ ఆస్పత్రి కాటుకు మరో అభాగ్యురాలు బలైంది. నీరసంగా ఉందని ఆస్పత్రిలో.. కాళ్లూ చేతులూ కోల్పోవాల్సి వచ్చింది. ఆసుపత్రి వైద్యులు ఎక్కించిన రక్తం వల్ల.. ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో.. కుందనాల బొమ్మ అవిటిదైపోయింది. ఇప్పటికే ఒక చేతిని తీసేసిన వైద్యులు.. ఇప్పుడు రెండు కాళ్లూ మరో చేతినీ తొలగిస్తే తప్ప ఆ అమ్మాయి బతకదని నిర్ధారించారు. దీంతో కూతురు బతుకుతుందో లేదోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. 17 ఏళ్ల అమ్మాయి పేరు వైష్ణవి. నాచారానికి చెందిన ఈ అమ్మాయి సికింద్రాబాద్‌ కస్తూర్బా కాలేజీలో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతోంది. చదువుల్లోనూ.. ఆటపాటల్లనూ చురుగ్గా ఉండే వైష్ణవి.. ఇటీవల కొంత నలతగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆమెను నాచారంలోని ప్రసాద్‌ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. వైష్ణవిని పరీక్షించిన వైద్యులు.. ఆమె బలహీనంగా ఉందని.. ఓ యూనిట్ రక్తం ఎక్కించాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు వైష్ణవి, జనవరి 2వ తేదీన ఆస్పత్రిలో అడ్మిట్‌ అయింది.

రక్తం ఎక్కించే ప్రయత్నాలు..
వైష్ణవికి రక్తం ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే ఎంతకీ రక్తం ఆమె దేహంలోకి వెళ్లలేదు. అయినా వైద్యులు బలవంతంగా ఆమెకు రక్తం ఎక్కించారు. రక్తం ఎక్కించేప్పుడు దురద, మంట ఉందని వైష్ణవి ఏడ్చింది. అయినా వైద్యులు పట్టించుకోలేదు. రక్త స్రావం జరిగింది. ఒక్క రోజులోనే చేయి వాచింది. దీంతో ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం చేసుకున్న ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు చేతులెత్తేశారు. ఆమెను మరో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ కుడి చేయి తీసివేశారు. 15 రోజుల తర్వాత.. ఇప్పుడు వైష్ణవి శరీరంలోని మిగతా భాగాలకూ ఇన్ఫెక్షన్‌ సోకిందని, ఉన్న ఒక్కచేతితో పాటు, రెండు కాళ్లూ తీసేస్తే తప్ప ఆమె బతకదని తేల్చి చెప్పారు. దీంతో వైష్ణవి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

కనువిప్పు కలిగేనా..
కార్పొరేట్ వైద్యుల నిర్లక్ష్యం విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రసాద్ ఆస్పత్రి వైద్యుల మీద మెడికల్ కౌన్సిల్‌కుకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. తమ బిడ్డలాంటి పరిస్థితి మరొకరికి రాకుండా ఉంటాలంటే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ హెచ్‌ఆర్సీకీ ఫిర్యాదు చేశారు. అటు నాచారం పోలీస్ స్టేషన్ లోనూ వైద్యుల నిర్లక్ష్యంపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు 120 యూనిట్ల రక్తం ఎక్కించినా వైష్ణవి ప్రమాదపు అంచులోంచి బయటపడటం లేదు. నాచారంలో ఉన్న ఇల్లు అమ్మి 25 లక్షలు ఖర్చు చేసినా.. వైష్ణవి బతుకుతుందో లేదో తెలియడం లేదు. బతికినా రెండు కాళ్లూ, చేతూలు లేకుండా తల, మొండెంతోనే జీవితాంతమూ నరకయాతన అనుభవించాల్సిన దయనీయ స్థితి. నిర్లక్ష్యపు వైద్యం ద్వారా.. కుందనపు బొమ్మను అవిటిదానిగా మార్చేసిన వైద్యులపైనా.. ప్రసాద్‌ ఆసుపత్రిపైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు యావే తప్ప.. పేషెంట్ల వెతలు పట్టించుకోని ఇలాంటి వైద్యులకు కనువిప్పు కలిగేలా ఆ శిక్ష ఉండాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

నేడు దళిత హక్కుల సాధన సభ..

హైదరాబాద్‌ : ఇందిరాపార్కు వద్ద ఆదివారం దళిత హక్కుల సాధన సభ జరగనుంది. సీపీఎం, సీపీఐ, దళిత, గిరిజన, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ప్రకాష్‌ అంబేద్కర్‌ లు హాజరు కానున్నారు.

08:05 - January 22, 2017

హైదరాబాద్ : అడుగడుగునా అవమానం.. దళితులు, బలహీన వర్గాలపై వరుస దాడులు. ప్రతిక్షణం కులవివక్ష, అణగారిన వర్గాలపై అణచివేత. ఈ ధోరణిని నిరసిస్తూ...దళితులపై దాడులను అరికట్టేందుకు పోరాటం ఒక్కటే మార్గమని సీపీఎం, సీపీఐ, దళిత, సామాజిక సంఘాలు నిర్ణయించాయి. అందుకోసం ఇవాళ హైదారాబాద్‌-ఇందిరాపార్క్‌ వద్ద భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించేకు పిలుపునిచ్చాయి. దళిత హక్కుల సాధన సభ పేరిటి నిర్వహించనున్న ఈ సభకు సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, ప్రకాష్‌ అంబేద్కర్‌ హాజరుకానున్నారు.

ఇందిరాపార్కు..
దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా భారీ ఎత్తున దళిత హక్కుల సాధన సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22న హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయా పార్టీలు, సంఘాల నేతలు తెలిపారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులను అరికట్టాలన్న డిమాండ్‌తో.. సీపీఎం, సీపీఐ, దళిత, గిరిజన, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, అంబేద్కర్‌ మనువడు ప్రకాష్‌ అంబేద్కర్‌, దళిత సంఘాల నేతలు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయని, గోరక్ష దళాల పేరుతో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టి వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు.


ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ప్రకారం నిధులు..
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ప్రకారం నిధులు కేటాయించి, పూర్తిగా ఖర్చు చేయాలని.. దళిత, గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి పంపిణీ చేయాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని సూచించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోస ఇందిరాపార్కు వద్ద నిర్వహించే బహిరంగ సభకు అన్ని వర్గాల వారు హాజరుకావాలని కోరారు. ఇప్పటికే దళిత, మైనారిటీ దాడులపై జాతీయ స్థాయిలో వామపక్ష, సామాజిక సంఘాలతో కలిసి పోరాటం చేస్తున్నామని, ఇందిరాపార్కు వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని వక్తలు కోరారు.

07:39 - January 22, 2017
07:29 - January 22, 2017
07:26 - January 22, 2017

మక్కా : ఇండియా,ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఇన్‌స్టంట్‌ వన్డే సిరీస్‌ క్లైమాక్స్‌ దశకు చేరుకుంది. మూడు వన్డేల సిరీస్‌లోని ఆఖరాటకు ఇండియన్‌ క్రికెట్‌ మక్కా ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌ విజయం సాధించిన కొహ్లీ అండ్‌ కో క్లీన్‌స్వీప్‌పై కన్నేయగా ఆఖరి మ్యాచ్‌లో అయినా నెగ్గి తీరాలని ఓయిన్‌ మోర్గాన్‌ సారధ్యంలోని ఇంగ్లీష్‌ టీమ్‌ పట్టుదలతో ఉంది. పూణే వన్డేలో పవర్‌ ఫుల్‌ ఫెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన కొహ్లీ అండ్‌ కో...కటక్‌ వన్డేలో పెద్ద సంచలనమే సృష్టించింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్‌ నుండి గట్టి పోటీ ఎదురైనా ఏ మాత్రం తడబడకుండా సంచలన విజయాలు నమోదు చేసింది. కోల్‌కతా వన్డేలోనూ నెగ్గి సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయాలని విరాట్‌ ఆర్మీ తహతహలాడుతోంది. అనుభవజ్ఞులు, హార్డ్‌ హిట్టింగ్‌ బ్యాట్స్‌మెన్‌తో భారత జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ ఎప్పటిలానే పటిష్టంగా ఉంది. తొలి వన్డేలో కొహ్లీ, జాదవ్‌ ఫైటింగ్ సెంచరీలతో నెగ్గిన టీమిండియా...సెకండ్‌ వన్డేలో సీనియర్లు యువరాజ్ సింగ్‌ , ధోనీ ధూమ్‌ ధామ్‌ ఇన్నింగ్స్‌తో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

రాణిస్తున్న బ్యాట్స్ మెన్స్..
మొన్నటి వరకూ బ్యాటింగ్‌ లైనప్‌లో కొహ్లీ రాణించడం మీదనే ఆధారపడ్డ భారత జట్టు...ప్రస్తుతం యువీ,ధోనీ వంటి అనుభవజ్ఞలులైన ఆటగాళ్లు తిరిగి ఫామ్‌లోకి రావడంతో మిడిలార్డర్‌ సైతం బలంగా ఉంది. రెండు వన్డేల్లోనూ దారుణంగా విఫలమైన ధావన్‌ గాయంకారణంగా మూడో మ్యాచ్‌కు దాదాపుగా దూరమయ్యాడు. దీంతో అజింక్య రహానే, మనీష్‌ పాండేలలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. భారీ స్కోర్లు నమోదు చేసినా బౌలర్లు కలిసికట్టుగా రాణించడం మీదనే భారత జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయనడంలో అనుమానం లేదు. మరోవైపు ఓయిన్‌ మోర్గాన్‌ సారధ్యంలోని ఇంగ్లీష్‌ టీమ్‌ మాత్రం డైలమాలో ఉంది. రెండు మ్యాచ్‌ల్లోనూ పోరాడి ఓడిన ఇంగ్లండ్‌ జట్టు ప్రస్తుతం వన్డేల్లో అత్యంత ప్రమాదకరమైన జట్టు. ఎంతటి భారీ స్కోర్‌నైనా చేధించగల సత్తా కలిగిన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ఇంగ్లీష్‌ టీమ్‌...బౌలింగ్‌లో మాత్రం అంత పదునుగా లేదు.

బ్యాటింగ్ లైనప్ పటిష్టం..
జాసన్‌ రాయ్‌, జో రూట్‌, జో బట్లర్‌,మొయిన్‌ అలీ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో పాటు ఓయిన్‌ మోర్గాన్‌ సైతం గాడిలో పడటంతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ భారత్‌కు ధీటుగా ఉంది. ఇక ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆల్‌రౌండర్లు బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ ఓక్స్‌ ఇంగ్లీష్‌ జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో సందేహం లేదు. ఇరు జట్ల బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉండటంతో కోల్‌కతా వన్డేలోనూ టాస్‌ నెగ్గిన జట్టు ముందుగా బౌలింగ్‌ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్‌ వన్డేలో నెగ్గి సిరీస్‌ సొంతం చేసుకున్న ఇండియన్‌ టీమ్‌ను ఓడించాలంటే ఇంగ్లండ్‌ జట్టు అంచనాలకు మించి రాణించాల్సిందే. మరి ఈడెన్‌ గార్డెన్స్‌లో నెగ్గి సిరీస్‌ను విజయంతో ముగించే జట్టేదో తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్‌ చేయాల్సిందే..

రైలు ప్రమాదంపై సురేష్ ప్రభు సమీక్ష..

మహిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఆరా తీశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులతో రైల్వే మంత్రి సురేష్ ప్రభు సమీక్ష జరిపారు.

07:12 - January 22, 2017

విజయనగరం : జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జగదల్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న హిరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్‌ వద్ద పట్టాలు తప్పింది. శనివారం రాత్రి 11.30 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో 32 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. S9 బోగీ నుజ్జు నుజ్జు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను, పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రితోపాటు, విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఒక ఏసీ, రెండు స్లీపర్‌ క్లాస్‌, నాలుగు జనరల్‌ బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులంతా నిద్రలోకి జారుకున్న సమయంలో రైలు ఒక్కసారిగా కుదుపులకు గురైంది. కళ్లు తెరిచేలోగానే అక్కడంతా హాహాకారాలు చోటు చేసుకున్నాయి. ఎటు చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఏం జరిగిందో తెలియని పరిస్థితి. మెల్లగా తేరుకున్న తర్వాత తాము ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పిందని తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. క్షతగాత్రులు ఆర్తనాదాలు, హాహాకారాలతో ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం నెలకొంది. బోగీల్లో మృత దేహాలు ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న విశాఖ డీఆర్ఎం చంద్రలేఖ రైల్వే అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి ప్రత్యేక రైలులో ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. పట్టాలు తప్పిన హిరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ పక్కనే ఆగివున్న గూడ్స్‌ రైలుపై ఒరిగిపోవడంతో ప్రమాద తీవ్రత తప్పింది. రైల్లో ఉన్న ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు ద్వారా విశాఖ, విజయనగరం చేరవేస్తున్నారు.

ఆసుపత్రిలో క్షతగాత్రులు..
ఇరుక్కపోయిన మృతదేహాలను తీసేందుకు గ్యాస్ కట్టర్ లతో బోగీలను తొలగిస్తున్నారు. 32 మంది మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఇంకో మృతదేహాన్ని తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బోగీల్లో ఇంకా మృతదేహాలున్నాయా ? అనేది తెలియరావడం లేదు. పార్వతీ పురం ఆసుపత్రిలో 42 మందికి..రాయ్ గఢ్ ఆసుపత్రి లో10-15 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

హెల్ప్ లైన్ నెంబర్లు..
రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. విజయనగరం హెల్ప్ లైన్ నెంబర్స్ 8331,83332, 83333, 83334, విజయనగరం బీఎస్ఎన్ఎల్ హెల్ప్ లైన్ నెంబర్స్ : 08922-221202, 221206, రాయ్ గఢ్ బీఎస్ఎన్ఎల్ హెల్ప్ లైన్ నెంబర్స్ 06856-223400, రాయ్ గఢ్ బీఎస్ఎన్ఎల్ హెల్ప్ లైన్ నెంబర్స్ : 09439741181, 09439741071, 07681878777.

కొనసాగుతున్న సహాయక చర్యలు..

విజయనగరం : హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 33 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

06:44 - January 22, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాల బాట పట్టాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఆందోలన కార్యక్రమాలకు వ్యూహాలు రచిస్తోంది. తమ పోరాటాన్ని సీఎం నియోజకవర్గం గజ్వేల్‌ నుంచే ప్రారంభించాలని పార్టీ నిర్ణయించింది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ పార్టీల వైఖరిపైనా చర్చించిన నేతలు టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసే ఏ శక్తులతోనూ కలిసేది లేదని తేల్చి చెప్పింది. హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆ పార్టీ నేతలు పలు నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం తామే అంటోంది టీ-టీడీపీ. ప్రతిపక్షంగా కొనసాగుతున్న కాంగ్రెస్‌.. ఈ ప్రభుత్వంపై పోరాటం చేసేలా లేదని టీడీపీ భావిస్తోంది. అధికార పార్టీతో అంటకాగుతున్న ఏ పార్టీతోనూ సంబంధాలు పెట్టుకునేది లేదని పరోక్షంగా బీజేపీకి హెచ్చరికలు జారీ చేసింది. పొత్తుల విషయంలో బీజేపీ జాతీయ విధానం ప్రకటించిన తర్వాత దానిపై స్పందిస్తామని టీ టీడీపీ నేతలు స్పష్టం చేశారు.

విస్తృత స్థాయి సమావేశం..
తాజాగా జరిగిన టీడీపీ తెలంగాణ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర కమిటీతో పాటు పొలిట్‌బ్యూరో, అనుబంధ సంఘాల నేతలు, పార్టీ జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలపై నేతలు సమీక్ష నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ధీటుగా ఎదుర్కొనే అంశంపై నేతలు చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికల నిర్వహణను సమర్ధంగా చేపట్టాలని ఈ సమావేశం నిర్ణయించింది.

బహిరంగసభలు..
సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు, పార్టీ కేడర్ కు శిక్షణా శిబిరాలు నిర్వహించడం, గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీల నిర్మాణం, కేడర్‌ను నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలని టీటీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజాసమస్యలపై కేడర్‌ను ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. రైతు ఆత్మహత్యల్ని నివారించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం.. ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం దారుణమని సమీక్షా సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి హామీలపైనా చర్చించారు. అటు విద్యార్థుల ఫీజు బకాయిల అంశంపైనా చర్చించిన నేతలు వీటిపై వరుస ఉద్యమాలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సీఎం, మంత్రుల నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బహిరంగ సభలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు.

ఉద్యమ కార్యాచరణ..
మొదట సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లో సభను నిర్వహించాలని నిర్ణయించిన టీటీడీపీ నేతలు అటు మంత్రుల నియోజకవర్గాల్లో కూడా సభలు ఏర్పాటు చేసి విరుచుకుపడాలని నిర్ణయించారు. పార్టీ అనుబంధ సంఘాలు కూడా వారి రంగాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టాలని సూచించారు. మహిళా విభాగం డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై, యువత, విద్యార్థి విభాగాలు నిరుద్యోగం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరాటాలకు సిద్ధం కావాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణలో పార్టీ ఆవశ్యకతను, సిద్ధాంతాలను ఈతరం యువతకు వివరించాలని నిర్ణయించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు టీటీడీపీ ప్రజా క్షేత్రంలోకి వెళ్లబోతోంది. కేసీఆర్‌ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు..టీడీపీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.

06:41 - January 22, 2017

విజయవాడ : జల్లికట్టు ఉద్యమం ఏపీలో ప్రత్యేక హోదా నినాదాన్ని నిద్రలేపుతోంది. సుప్రీంకోర్టు కాదన్నా పట్టుబట్టిన తమిళనాడు ప్రజలు.. జల్లికట్టుపై ఆర్డినెన్స్‌ను తెచ్చుకున్నారు. తమిళుల పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదాపై ఉద్యమించాలని అన్ని పార్టీల నేతలు ముక్కకంఠంతో పిలుపునిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరు సాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. తమిళనాడులో జల్లికట్టు తరహాలో.. ఏపీలోనూ హోదాపై సమైక్య పోరాటం సాగించాలని అన్ని పార్టీల నేతలు సూచిస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ అమలుకు ప్రభుత్వమే ముందుండి పోరాటం సాగించాలని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. సుప్రీంకోర్టే జల్లికట్టును వద్దని చెప్పినా.. తమిళులు పట్టుబట్టి మూడ్రోజుల్లో ఆర్డినెన్స్ తెప్పించుకున్నారని కేవీపీ గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మనం ఆ మాత్రం చేయలేమా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పార్టీలు సమిష్టిగా ఉండాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతు కూడగట్టాలని లేఖలో చంద్రబాబును కోరారు కేవీపీ.

పవన్ ట్వీట్..
జల్లికట్టు ఉద్యమంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. జల్లికట్టు ఉద్యమం ఆంధ్రులకు స్ఫూర్తిదాయకమంటూ ట్వీట్‌ చేశారు. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలన్నారు. ఈ విషయంలో రాజకీయ నేతలు రాజీపడినా తాను పడబోనని స్పష్టం చేశారు. జల్లికట్టుపై ఆర్డినెన్సు జారీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తుందన్నారు. తమిళనాడులో జల్లికట్టు సాధించడంలో ప్రతిపక్షాలతో పాటు అధికారిక పక్షం కూడా పోరాడిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. అయితే ఏపీలో ప్రత్యేక హోదాపై టిడిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని మధు విమర్శించారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు వెనక్కి తగ్గారని అందువల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. ఇప్పటికైనా తమిళనాడులోని జల్లికట్టు ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలని మధు డిమాండ్ చేశారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్‌ సాధించిన తీరును ఏ రీతిలో పొగుడుతున్నారో.. అదే రీతిలో ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని రాజకీయాలకు అతీతంగా నేతలు పిలుపునిస్తున్నారు. ఇదే స్పూర్తితో ఏపీ నాయకులు ముందుకు వెళ్తారో లేదో వేచి చూడాలి.

06:39 - January 22, 2017

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్‌ పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్నారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొని భారత్‌ తిరిగివస్తూ మార్గమధ్యంలో జూరిచ్‌లో ప్రవాస తెలుగు సంఘం సభ్యులతో భేటీ అయ్యారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్‌ ఒక్కటేని చెప్పిన చంద్రబాబు... ప్రవాసులు స్వదేశానికి, సొంత రాష్ట్రానికి సేవలు చేయాలని కోరారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొని స్వదేశం చేరుకున్నారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన వివిధ కొర్పొరేట్‌ దిగ్గజ సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న సానుకూల పరిస్థితులను వివరించారు. కొన్సి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.

విదేశాల్లో విజయాలు సాధిస్తున్న తెలుగువారు..
దావోస్‌ పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగివస్తూ చంద్రబాబు బృందం జూరిచ్‌లో నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ సభ్యులతో భేటీ అయ్యింది. వివిధ దేశాలకు చెందిన తెలుగు ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సాంకేతికంగా ఎన్‌ఆర్‌ఐలు సాధిస్తున్న విజయాలను ప్రస్తావించిన చంద్రబాబు... విదేశాల్లో సాధించిన విజయాలతో సంపాదించిన సొమ్ముతో స్వదేశానికి ఉపయోగపడేలా వ్యాపారం చేయాలని కోరారు.

ఏపీ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ..
రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, సాధించిన అభివృద్ధి గురించి ఏపీకి చెందిన ప్రవాస భారతీయులకు చంద్రబాబు వివరించారు. అలాగే ఏపీ బ్రాండ్‌బ్యాండ్‌ సర్వీస్‌, వృద్ధిరేటులో దేశం కంటే రాష్ట్ర సగటు ఎక్కువగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌ను టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేసిన అంశాన్ని ప్రవాసులకు వివరించారు. విదేశాల్లో ఉంటున్న తెలుగువారు సేవా భావంతో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని కోరారు. ఎక్కడ ఉన్నా జరుగుతున్న రాజకీయ పరిణామాలను తెలుసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉంటే స్థానిక రాజకీయాల్లో పాల్గోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున్న ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఏపీకి చెందిన ఎన్‌ఆర్‌ఐలకు చంద్రబాబు వివరించారు.

06:16 - January 22, 2017

విజయనగరం : ఘోర దుర్ఘటన..గమ్యస్థానాలకు చేరుకోకముందే అనంతలోకాలకి వెళ్లిపోయారు. ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మిన్నంటుంతోంది. హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 33 మంది దుర్మరణం చెందారు. సుమారు వంద మందికిపైగా గాయాలపాలయ్యారు. జగదల్ పూర్ నుండి భువనేశ్వర్ కు ఎక్స్ ప్రెస్ రైలు వెళుతోంది. కొమరాడ మండలం కూనేరు వద్దకు చేరుకున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఏం జరిగిందో తెలిసే లోపే క్షణాల్లో బోగీలు ఒకదానికొకటి ఇరుక్కపోయాయి. గాఢ నిద్రలో ఉన్న వారందరూ ఏం జరిగిందో తెలియరాలేదు. ఎస్8, ఎస్ 9 బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒక ఏసీ, రెండు స్లీపర్, నాలుగు జనరల్ బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతి చెందిన వారి కుటుంబీకులు..గాయాలపాలైన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానిక చేరుకున్నారు. విశాఖ డీఆర్ఎం చంద్రలేఖ సహాయక చర్యలు చేపట్టారు. గాయాలైన వారిని పార్వతీపురం, విశాఖ ఆసుపత్రులకు తరలించారు. తమ వారి జాడ తెలియక ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టాలు ఎలా తప్పిందో వివరాలు తెలియరావడం లేదు.

నేడు జల్లికట్టు ప్రారంభం..

చెన్నై : తమిళ ప్రజల ఉద్యమం ఫలించింది. జల్లికట్టు వివాదానికి తెరపడింది. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఆదివారం తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు క్రీడ ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం అళంగనలూర్‌లో జెండా వూపి జల్లికట్టు క్రీడను ప్రారంభించనున్నారు.

పట్టాలు తప్పిన హిరాఖండ్ ఎక్స్ ప్రెస్..హెల్ప్ లైన్ నెంబర్లు..

హైదరాబాద్ : హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 25 మంది మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. విజయనగరం హెల్ప్ లైన్ నెంబర్స్ 8331,83332, 83333, 83334, విజయనగరం బీఎస్ఎన్ఎల్ హెల్ప్ లైన్ నెంబర్స్ : 08922-221202, 221206, రాయ్ గఢ్ బీఎస్ఎన్ఎల్ హెల్ప్ లైన్ నెంబర్స్ 06856-223400, రాయ్ గఢ్ బీఎస్ఎన్ఎల్ హెల్ప్ లైన్ నెంబర్స్ : 09439741181, 09439741071, 07681878777.

పట్టాలు తప్పిన వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్..

తిరుపతి : తిరుపతి రైల్వేస్టేషన్ లో వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ ఇంజిన్ సహా 2 బోగీలు పట్టాలు తప్పాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పట్టాలు తప్పిన హిరాఖండ్ ఎక్స్ ప్రెస్..25 మంది మృతి..

విజయనగరం : కొమరాడ (మం) కూనేరు రైల్వేస్టేషన్ వద్ద హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్ తో సహా ఏడు బోగీలు పట్టాలు తప్పడంతో 25 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జగదల్ పూర్ నుండి భువనేశ్వర్ కు రైలు వెళుతోంది.

Don't Miss