Activities calendar

23 January 2017

ఏపీ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్

విశాఖ: ఏపీ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ తేదీలను మంత్రి గంటా శ్రీనివాస్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్‌ 24 నుంచి 27 వరకు ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌) పరీక్షలు నిర్వహిస్తారు. 28న ఎంసెట్‌ (అగ్రికల్చర్‌) పరీక్ష ఉంటుంది. మే5న ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేస్తారు. ఎంసెట్‌తో పాటు ఎడ్‌సెట్, లాసెట్, ఈసెట్, ఐసెట్, పీజీసెట్ తేదీలను కూడా ప్రకటించారు. ఏప్రిల్‌ 19న ఎడ్‌సెట్‌, లాసెట్‌ పరీక్షలు నిర్వహించగా, మే 2న ఐసెట్‌, మే 3న ఈసెట్‌, మే 10, 11 తేదీల్లో పీజీ సెట్‌ నిర్వహిస్తారు. కాగా, ఇకపై జరిగే ప్రవేశ పరీక్షలన్నీ ఆన్‌లైన్లోనే జరుగుతాయని మంత్రి గంటా తెలిపారు.

21:24 - January 23, 2017

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం శనివారం రూపొందించిన ఆర్డినెన్స్‌ను ఆ రాష్ట్ర ఇంఛార్జి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆమోదించారు. అయినప్పటికీ ఆందోళన సద్దుమణగపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ స్థానంలో ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది.

గత ఆరు రోజులుగా శాంతియుతంగా సాగిన...

గత ఆరు రోజులుగా శాంతియుతంగా సాగిన జల్లికట్టు ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. గణతంత్ర దినోత్సవ వేడుకలు మెరీనా బీచ్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఖాళీ చేయాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని ఆందోళనకారులు తిరస్కరించారు. తమను బలవంతంగా ఖాళీ చేయిస్తే ఆత్మహత్యలకు పాల్పడతామని నిరసనకారులు హెచ్చరించారు. ఆందోళనకారులను చెదరగొట్టట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు మెరీనా బీచ్‌ సమీపంలోని ఐస్‌ హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలోకి చొరబడి అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టారు. సుమారు 50 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈరోడ్‌, అలంగానల్లూరులో కూడా పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఇరువర్గాల ఘర్షణల్లో వంద మంది గాయపడ్డారు.

లాఠీచార్జిని ఖండించిన పలువురు...

ఆందోళనకారులపై లాఠీచార్జి చేయడాన్ని పలువురు ఖండించారు. మెరీనా బీచ్‌లో ఆందోళనకారులను కలిసేందుకు రాఘవ లారెన్స్‌కు పోలీసులు అనుమతించలేదు. ఆర్డినెన్స్‌పై వారికి వివరించి ఖాళీ చేయించడమే తన ఉద్దేశ్యమని ఆయన తెలిపారు.

ఆందోళన విరమించుకున్నట్లు విద్యార్థి నేతలు ప్రకటన...

మరోవైపు తాము ఆందోళన విరమించుకున్నట్లు విద్యార్థి నేతలు ప్రకటించారు. ప్రస్తుతం బీచ్‌లో ఉన్నవారు విద్యార్థులు కారని స్పష్టం చేశారు. జల్లికట్టు ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడులో పరిస్థితిపై కేంద్రం సమీక్షించింది. అవసరమైతే కేంద్ర బలగాలను మోహరిస్తామని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.

21:22 - January 23, 2017

ఖమ్మం : జిల్లాలో రికార్డు సమయంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకం పూర్తైంది. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 307 కోట్ల రూపాయలతో వ్యయంతో 60వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో మొదలుపెట్టిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసిన ఏడాదిలోపే పూర్తవడం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. శంకుస్థాపన జరిగిన రోజు నుంచే పనులు యుద్ధప్రాతిపదికన జరుగడంతో అగ్రిమెంట్‌ ప్రకారం మార్చి 17 కంటే ముందే ప్రాజెక్టు పనుల్ని పూర్తిచేశారు ఇంజనీరింగ్‌ అధికారులు. 123 జీవో ప్రకారం 128 ఎకరాల భూమిని రికార్డు సమయంలో సేకరించడంతో పనులు శరవేగంగా సాగాయి. ఇవాళ ట్రయల్‌ రన్‌ ను విజయవంతంగా నిర్వహించిన అధికారులు... త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతలు మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

21:20 - January 23, 2017

ఢిల్లీ: త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఏపీకి సాయం పెంచాలని... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న... చంద్రబాబు... ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అయ్యారు. మంగళవారం జరిగే నీతి అయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు బాబు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లతో సహా పలు అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. డిజిటల్‌ లావాదేవీలపై నివేదిక సమర్పించే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. నగదురహిత లావాదేవీలకు సంబంధించి ఏర్పాటైన ముఖ్యమంత్రుల కమిటీకి సారథ్యం వహిస్తున్న చంద్రబాబు... రేపు సాయంత్రం ప్రధానికి మధ్యంతర నివేదిక సమర్పించనున్నారు.

21:18 - January 23, 2017

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు, అభివృద్ధి, సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్కసుమన్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు సమర్థవంగా ఖర్చు చేయాలి.....

రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేశారు. పేదరికంపై ప్రకటించిన యుద్ధంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ వర్గాల సంక్షేమ కార్యక్రమాలను పాదర్శకంగా అమలు చేయాల్సిన అంశాన్ని గుర్తు చేశారు. వీరి అభ్యున్నతికి ఎక్కువ నిధులు ఖర్చు చేయడంతో పాటు, ప్రభుత్వం తమకోసమే ఉందనే భరోసా కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. చేసిన ఖర్చులు వివరాలు ఈ వర్గాలకు తెలియకపోతే, ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తుందనే భావన కలిగే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కేసీఆర్‌ వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు సమర్థవంగా ఖర్చు చేయాలి....

ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి, ఖర్చు చేసేందుకు ఉప ప్రణాళిక తీసుకొచ్చిన విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఈ ప్లాన్‌ను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. ఈ ప్రణాళిక అమలుపై అధికారులు ప్రతినెలా సమీక్షించాలని ఆదేశించారు. మూడు నెలకోసారి మంత్రులు సమీక్షించాలని కోరారు. ఆరు నెలలకోసారి తాను స్వయంగా సమీక్షించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీల విద్యార్థులకు మంచి విద్య అందించేందుకు గురుకుల పాఠశాల ఏర్పాటు, విదేశీ విద్యాభ్యాసం కోసం ప్రవేశపెట్టిన ఉపకార వేతనాలు, ఆర్థిక మద్దతు కోసం అమలు చేస్తున్న పథకాలు తదితర అంశాలపై కేసీఆర్‌ సమీక్షించారు. సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపడాల్సిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ వర్గాలకు కేటాయించిన ప్రభుత్వ భూములు ఉపయోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ఎస్సీ,ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:కేసీఆర్

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల అభివృధ్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇవాళ ప్రగతిభవన్‌లో దళిత, గిరిజన ఉప ప్రణాళికపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుతీరుపై ప్రతినెలా సమీక్షించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వసతి గృహాలు బాగా మెరుగుపడాలి. దళితులకు మూడెకరాల భూపంపిణీ కొనసాగించాలని మంత్రులు, అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు.

అన్ని ప్రవేశపరీక్షలు ఆన్ లైన్లో : మంత్రి గంటా

విశాఖ:2017-18 విద్యా సంవత్సరంలో అన్ని ప్రవేశపరీక్షలు ఆన్ లైన్లో నిర్వహిస్తామని మంత్రిగంటా శ్రీనివాసరావు తెలిపారు. అన్ని ప్రవేశపరీక్షలను ఆన్ లైన్లో నిర్వహిస్తున్న మొదటి రాష్ట్రం ఏపీ అని గంటా పేర్కొన్నారు.

వంశధార నిర్వాసితులకు రేపు చెక్కుల పంపిణీ

అమరావతి: వంశధార నిర్వాసితులకు అన్యాయంపై సీఎం చంద్రబాబు సీరియస్ అవడంతో అధికార యంత్రాంగం కదిలింది. వంశధార నిర్వాసితులకు నష్టపరిహారం కింద ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. తక్షణం రూ. 43కోట్లు విడుదల చేసి నిర్వాసితులకు రేపు మంత్రులు దేవినేని, అచ్చెన్న లు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు సమాచారం.

20:57 - January 23, 2017
20:56 - January 23, 2017
18:49 - January 23, 2017

విజయవాడ : ప్రత్యేక హోదా సాధన కోసం ఈనెల 26వ తేదీన విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగే ఆందోళనకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏ రాజకీయ పార్టీ పోరాడిన దానికి సీపీఎం సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. హోదా కోసం ఏపీ ప్రభుత్వం కాలయాపన చేయకుండా ముందుండి పోరాడాలని మధు అన్నారు.

18:46 - January 23, 2017

విజయవాడ: ఏపీలో పెంచబోయే విద్యుత్ చార్జీల వల్ల ప్రస్తుతం ఉన్న పరిశ్రమల్లో 30 శాతం మూసివేయాల్సి వస్తుందని ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పట్లో కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని కూడా తేల్చిచెప్పింది. ఒకవైపు మిగులు విద్యుత్ ఉందంటూనే సామాన్య, మధ్య తరగతి ప్రజల నుంచి పరిశ్రమల వరకూ విద్యుత్ చార్జీలను భారీగా పెంచటం రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లటమేనంటున్న ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:43 - January 23, 2017

ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్‌ముందు అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు పంచాలంటూ నినాదాలు చేశారు.. తమకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. ఈ నిరసనకు సీపీఎం, సీపీఐ లు మద్దతు ప్రకటించాయి..

18:38 - January 23, 2017

హైదరాబాద్ :వచ్చే 9-10 నెలల్లో 2లక్షల 70వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఆలస్యం కావడంపై మంత్రి ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చేవిధంగా స్పల్ప మార్పులు చేశామని..దీంతో రాబోయే రోజుల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతమవుతుందన్నారు.

మార్చిలో ఏపీ బడ్జెట్ సమావేశాలు

విజయవాడ : మార్చిలో ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లుఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరిలో ఉన్నందువల్ల వాస్తవిక బడ్జెట్ ను రూపొందిస్తున్నామని, ఖర్చుల ఆధారంగా ఆయా శాఖలకు నిధులు కేటాయించనున్నామని చెప్పారు.

ఢిల్లీకి చేరిన సీఎం చంద్రబాబు

ఢిల్లీ: రేపు జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 6గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆయనతో ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. నగదు రహిత లావాదేవీలకు సంబంధించి ఏర్పాటైన ముఖ్యమంత్రుల సమావేశానికి సారథ్యం వహిస్తున్న చంద్రబాబు రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మధ్యంతర నివేదిక సమర్పించనున్నారు.

జల్లికట్టు బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం..

చెన్నై : జల్లికట్టు బిల్లుకు తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జల్లికట్టుపై శాశ్వత నిషేధాన్ని ఎత్తివేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు శాసనసభ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ మేరకు సీఎం పన్నీర్ సెల్వం జల్లికట్టు బిల్లును ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

17:29 - January 23, 2017
17:26 - January 23, 2017

ఢిల్లీ: 2017-18 బడెట్జ ను వాయిదా వేయాలన్న వ్యాజ్యాన్ని సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బడ్జెట్‌ సమర్పణను వాయిదా వేయాలని కోరుతూ న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

17:23 - January 23, 2017

హైదరాబాద్: భారత్‌లో దాడులు చేసేందుకు ఐసిస్ కొత్త పంథా ఎంచుకుంది. డిజిటల్‌ మేసేజ్‌ ద్వారా ఇండియాలోని కార్యకర్తలకు సమాచారం చేరవేస్తోంది. పోలీసులు, ఇంటెలిజెన్స్‌, సైనికులే లక్ష్యంగా దాడులకు పాల్పడాలని ఆదేశించింది. బాంబులు, బుల్లెట్స్‌ అందుబాటులో లేకపోతే వ్యక్తిగత దాడులకైనా దిగాలని సూచించారు. భారత్‌లో పర్యటిస్తున్న విదేశీయులను హతమార్చాలని కూడా ఆదేశించారు. ఎవరి సలహాలు, సూచనల కోసం వేచి చూడరాదని సూచించారు. ఈ ఆదేశాలన్ని ఐసిస్‌ అధికార ప్రతినిధి అబూ మహమ్మద్‌ అదానీ.. ప్రత్యేక డిజిటల్‌ డివైస్‌ ద్వారా సానుభూతిపరులకు వెల్లడించారు. ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేసిన యాసిర్‌ మహ్మదుల్లా, అబీబ్‌ మహమ్మద్‌ల వద్ద ఎన్‌ఐఏ ఈ వివరాలు సేకరించింది.

17:18 - January 23, 2017

హైదరాబాద్: వంశధార ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణ చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగా పరిహారం అందజేయలేకపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వంశధార నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు గతేడాది జూన్‌ 2న 450 కోట్ల రూపాయల విడుదలకు GO ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. పరిహారం చెల్లించడంలో జిల్లా అధికారుల తప్పిదం కారణంగా వంశధార నిర్వాసితులు ఆందోళనకు దిగారన్నారు. ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు చెబుతున్నారు.

17:16 - January 23, 2017

అమరావతి : కాపునేత ముద్రగడ పద్మనాభంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారని ముద్రగడను ప్రశ్నించారు. కాపుల అంశంపై ఓ వైపు మంజునాథ కమిషన్‌ విచారణ జరుపుతుందని..ఆ కమిషన్‌ నివేదిక ఇవ్వకముందే నిర్ణయం ఎలా తీసుకుంటామని ముద్రగడను ప్రశ్నించారు. చట్టాన్ని ఎప్పుడూ తీసుకోవద్దని..ఆనాడు ట్రైన్‌ను తగలపెట్టింది వాళ్లు కాదా అని ప్రశ్నించారు.

17:15 - January 23, 2017

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని... సీపీఎం ప్రకటించింది.. ఈ నెల 31లోపు హైదరాబాద్‌లో ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధంగాఉన్నామని... ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జీ నాగయ్య ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనిగారే రావాలంటే ఈ నెల 30న భద్రాచలంలో చర్చ చేపట్టాలని సూచించారు.. సామాజిక న్యాయమే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగిస్తామని నాగయ్య స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

17:13 - January 23, 2017

వెలగపూడి : ఏపీ తాత్కాలిక సచివాలయంలో పచ్చదనం పరిమళాలు గుభాళిస్తున్నాయి. రంగు, రంగుల పూల మొక్కలు, ఆకర్షణీయమైన ప్రత్యేక మొక్కలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. సచివాలయం, అసెంబ్లీ భవనాల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పచ్చదనం సచివాలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరిన్ని వివరాలకు ఈ వీడియోను క్లిక్ చేయండి...

17:12 - January 23, 2017

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీట్ల పంపకాల్లో ఎస్పీ-కాంగ్రెస్‌ల మధ్య ఓ అవగాహన కుదరకపోవడంతో ఇక పొత్తుకు తెరపడ్డట్లేనని సంకేతాలు వెలువడ్డ తరుణంలో ప్రియాంకాగాంధీ రంగంలోకి దిగారు. యూపీ సిఎం అఖిలేష్‌తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. ఎస్పీ వంద సీట్లకు మించి ఇచ్చేది లేదని భీష్మించింది. కాంగ్రెస్‌ 125 సీట్ల కోసం పట్టుబట్టింది. ప్రియాంక అఖిలేష్‌తో మాట్లాడి 105 సీట్లు ఇచ్చేలా ఒప్పించారు. మొత్తం 403 సీట్లకు గాను ఎస్పీ 298 సీట్లలో తన అభ్యర్థులను రంగంలోకి

యూపీ నుండి పొలిటికల్ కెరియర్...

ప్రియాంకాగాంధీ యూపీ నుంచి పొలిటికల్‌ కెరీర్‌ను ప్రారంభించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతవరకు రాహుల్‌ గాంధీ నియోజకవర్గం అమేథి, సోనియా నియోజకవర్గం రాయబరేలీ ప్రచారానికే ప్రియాంక పరిమితమయ్యారు. ఆమె గురించి పార్టీ నేతలు పార్టీలోనే చర్చించేవారు.. బహిరంగంగా ఎవరూ మాట్లాడేవారు కాదు. ఎస్పీతో అలయెన్స్‌పై పార్టీ పెద్దలు ఆజాద్‌తో పాటు పలువురు చర్చలు జరిపారు. పొత్తును ఫైనల్‌ చేయడంలో ప్రియాంకా పాత్ర ఎంతైన ఉందని ఆజాద్‌ స్వయంగా పేర్కొన్నారు. ఈ అంశంపైనే సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌ ట్విట్టర్‌లో ప్రియాంక పేరును ప్రస్తావించడం గమనార్హం.

ప్రత్యక్షంగా ప్రియాంకా గాంధీ..

కాంగ్రెస్‌ రాజకీయాల్లో ప్రత్యక్షంగా ప్రియాంకా గాంధీ పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రియాంకా ఆగమనం గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్‌కు శుభ శకునమేనని పార్టీ సీనియర్‌ నేతలు భావిస్తున్నారు. అఖిలేష్‌కు మెసేజ్‌లు పంపడం ద్వారా ఎస్పీతో కాంగ్రెస్‌ బంధం బలపడేట్లు ప్రియాంకా తన చతురతను చాటారు.

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రియాంకా మొదటి నుంచీ ఉత్సాహం..

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రియాంకా మొదటి నుంచీ ఉత్సాహాన్ని చూపుతున్నారు. పార్టీ నేతలను కలవడం, వారితో చర్చలు జరపుతూ వచ్చారు. 2014 లోక్‌సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నప్పటి నుంచి హస్తం పార్టీ ప్రియాంకా గాంధీ జపం మొదలైంది. యూపీ పంజాబ్‌ ఎన్నికల కాంగ్రెస్‌ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్‌ కిషోర్‌ సైతం ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ ప్రచారం చేయాలని ప్రతిపాదించినా అధిష్టానం అంగీకరించలేదు. 1999 ఎన్నికల్లో రాయబరేలీ నుంచి తల్లి సోనియాతో కలిసి ప్రియాంక ప్రచారం చేశారు.

17:09 - January 23, 2017

ఢిల్లీ : డైరీ గేట్‌ వ్యవహారంలో సిబిఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హాకు ఉచ్చు బిగుస్తోంది. బొగ్గు కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను కలుసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రంజిత్‌సింగ్‌పై విచారణ జరపాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సిబిఐ మాజీ స్పెషల్‌ డైరెక్టర్‌ ఎంఎల్‌ శర్మ నివేదిక ప్రకారం రంజిత్‌ సిన్హాపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నందున దీనిపై విచారణ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. సిబిఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా విజిటర్స్‌ డైరీని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ బయటపెట్టారు. ఇందులో కోల్‌, టూజీ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు రంజిత్‌సింగ్‌ను కలుసుకున్నట్లుగా డైరీలో ఉంది.

 

17:07 - January 23, 2017

హైదరాబాద్: కాన్పూర్‌లో జరిగిన రైలు దుర్ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. ఈ ఘటనకు ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఉగ్రవాద చర్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదని రైల్వేశాఖ తేల్చి చెప్పింది. రైలు ప్రమాదంగానే పేర్కొంది. రైల్వే ట్రాక్‌ల‌పై ప్రెష‌ర్ కుక్కర్ బాంబుల‌ను అమ‌ర్చి పేల్చిన‌ట్లు ఈ కేసులో అరెస్టైన నిందితుడు మోతిలాల్ పాశ్వాన్ ఏటిస్‌ పోలీసుల‌ ముందు వెల్లడించాడు. ఈ ప్రమాదం వెనుక‌ పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ హ‌స్తం ఉంద‌ని ఇంటెలిజెన్స్ వర్గాలు భావించాయి. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ఇండోర్‌-పాట్నా ఎక్స్‌ప్రెస్ ప‌ట్టాలు త‌ప్పిన దుర్ఘట‌న‌లో సుమారు 150 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి యూపీ ఎటిఎస్‌ పోలీసులు- మోతిలాల్‌తో పాటు ఉమాశంక‌ర్ ప‌టేల్‌, ముఖేశ్ యాద‌వ్‌ల‌ను అరెస్టు చేశారు. దీనిపై ఎన్‌ఐఏ కూడా విచారణ జరిపింది.

17:05 - January 23, 2017

మరోసారి భారత్‌కు ఎల్‌నినో ముప్పు తప్పేలా లేదని ప్రైవేట్‌ వాతావరణ సంస్థ స్కైమెట్‌ హెచ్చరిస్తోంది. 2014, 15 సంవత్సరాల్లో వర్షాలు కురవకుండా చేసిన ఎల్‌-నినో బెడద ఈ ఏడాది కూడా పొంచివుందని పేర్కొంది. దీనికారణంగా దేశంలో వర్షాలు తక్కువ కురుస్తాయని తెలిపింది.

సాధారణంగా ఎల్‌-నినో వెనుకాలే వచ్చే లా...

సాధారణంగా ఎల్‌-నినో వెనుకాలే వచ్చే లా-నినాతో వర్షాలు బాగా కురుస్తాయి. లా-నినా పసిఫిక్‌ జలాలను శీతలం చేస్తుండగా..ఎల్‌-నినో వేడిపుట్టిస్తుంది. గత డిసెంబర్లో లా-నినా అనుకూల పరిస్థితులు బలహీనపడ్డాయని వాతావరణ నమూనాలు సూచించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌, మే వచ్చేటప్పటికి తటస్థ వాతావరణం నెలకొంటుందని, తద్వారా ఏడాది రుతుపవన వర్షాలు సాధారణంగా ఉంటాయని అంచనా వేశాయి. సాధారణం కంటే అధికంగానే వర్షాలు కురవొచ్చని ఈ మోడల్స్‌ ద్వారా మొదట అంచనా వేశారు.. కానీ జనవరి మధ్యనాటికి ఎల్‌-నినో వస్తున్న సంకేతాలను అవి సూచిస్తున్నాయని స్కైమెట్‌ సంస్థ సీఈవో జతిన్‌సింగ్‌ వివరించారు. ఆరునెలల్లో పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశమున్నట్టు వాతావరణ నమూనాలు చెబుతున్నాయని.. ఇది నైరుతి రుతుపవనాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు.

జనవరి మధ్యనాటికి ఎల్‌నినో సంకేతాలను సూచిస్తున్న ఈమోడల్స్ ...

ఎల్‌-నినో ఆగమనంపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ కేజే రమేశ్‌ అన్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా..వర్షాలు సమృద్ధిగా కురవాలని అన్నదాతలు కోరుతున్నారు. ఎల్‌నినో ముప్పు నిజమే అయితే దేశంలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు.

17:03 - January 23, 2017

హైదరాబాద్: సమాజ్‌వాదీ కిసాన్‌ కోష్‌! సమాజ్‌వాదీ పెన్షన్‌ స్కీమ్‌! సమాజ్‌వాదీ స్మార్ట్‌ ఫోన్స్‌! సమాజ్‌వాదీ స్మార్ట్‌ విలేజెస్‌! సమాజ్‌వాదీ స్పోర్ట్స్‌ స్కూల్‌! ఇలా యూపీ ఓటర్లపై.. సమాజ్‌వాదీ పార్టీ హామీల వర్షాన్ని గుప్పించింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మేనిపెస్టోను విడుదల చేసిన సీఎం అఖిలేష్‌యాదవ్‌.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల పథకాలను ప్రకటించారు.

అభివృద్ధి పథకాలతోపాటు పలు ఉచిత హామీలు...

సమాజ్‌వాదీ పార్టీ తమ మేనిఫెస్టోలో అభివృద్ధి పథకాలతోపాటు పలు ఉచిత హామీలను గప్పించారు. సమాజ్‌వాదీ కిసాన్‌ కోష్‌! సమాజ్‌వాదీ పెన్షన్‌ స్కీమ్‌! సమాజ్‌వాదీ స్మార్ట్‌ ఫోన్స్‌! సమాజ్‌వాదీ స్మార్ట్‌ విలేజెస్‌! సమాజ్‌వాదీ స్పోర్ట్స్‌ స్కూల్‌ తదితర పథకాలను అమలు చేస్తామని ఆపార్టీ ప్రకటించింది.

32 పేజీలతో మేనిఫెస్టో రూపకల్పన...

పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ విడుదల చేశారు. 32 పేజీల మేనిఫెస్టోలో ములాయం, అఖిలేశ్‌ ఫొటోలు వేశారు. వేదికపై అఖిలేశ్‌తోపాటు ఆ పార్టీ సీనియర్‌ నాయకులు ఆసీనులయ్యారు. తొలిసారిగా ఈ కార్యక్రమంలో అఖిలేశ్‌ భార్య డింపుల్‌ కూడా పాల్గొన్నారు. విలేకరుల సమావేశం ముగిసిన కాసేపటికి ములాయం వచ్చారు. ములాయం వచ్చి అఖిలేశ్‌, ఆయన భార్య డింపుల్‌తో కలివిడిగా కనిపించారు. ఈసారి మేం చేసిన పనులే చెబుతాయ్‌ అనే నినాదంతో సమాజ్‌వాదీ ఎన్నికలకు వెళుతోంది.

బీజేపీ అభివృద్ధి నినాదానికి దీటుగా ఎస్పీ ఉచిత వరాలు ...

బీజేపీ అభివృద్ధి నినాదం అందుకున్న నేపథ్యంలో, మేనిఫెస్టోలో అభివృద్ధి పథకాలతోపాటు ఉచిత వరాల వర్షం కురిపించారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు సమాజ్‌వాదీ కిసాన్‌ కోష్‌ ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలూ విద్యుత్తు అందిస్తామని, సమాజ్‌వాదీ పింఛను పథకాన్ని విస్తరిస్తామని, మరో కోటి మందికి నెలకు వెయ్యి రూపాయల పింఛను ఇస్తామని ప్రకటించారు. 9-12 తరగతులు చదివే బాలికలకు ఉచితంగా సైకిళ్లు.. విద్యార్థులకు ల్యాప్‌ టాప్‌లు...పేద మహిళలకు కుక్కర్లు అందిస్తామన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో మళ్లీ మాదే అధికారం- అఖిలేశ్‌ ...

యూపీలో మళ్లీ తమదే అధికారమని, గత ఎన్నికల్లో 220 సీట్లే వచ్చాయని, ఈసారి 300 సీట్లు గ్యారెంటీ అని ముఖ్యమంత్రి అఖిలేశ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై, బీజేపీపై విమర్శలు కురిపించారు. చాలాసార్లు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేశారని తప్పుబట్టారు. బీఎస్పీని ఆయన విగ్రహాల పార్టీగా అభివర్ణించారు.

16:59 - January 23, 2017

అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న ట్రంప్‌ ఏ విధంగా గెలిచారో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు..! అందరూ ఆయన నోటిదురుసు కారణంగానే అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని అనుకుంటున్నారు. కానీ మరో నిజం కూడా దాగుందంటున్నారు బ్రిటన్‌ పరిశోధకులు. డోనాల్డ్‌ ట్రంప్‌ ముఖాకృతిని చూసే అమెరికా ప్రజలు ఓట్లు వేశారని అధ్యయనంలో వెల్లడించారు.

ట్రంప్‌లాగా ముఖం పొడుగు, వెడల్పుల నిష్పత్తి అధికంగా ఉండే ...

ట్రంప్‌లాగా ముఖం పొడుగు, వెడల్పుల నిష్పత్తి అధికంగా ఉండే ముఖాలకు ఈ లక్షణాలకు సంబంధం ఉంటుందట. అంతేకాదు.. అలాంటివారు నాయకులయ్యే అవకాశం కూడా ఎక్కువేనని వారు వెల్లడించారు. ఒక వ్యక్తి స్ర్తీనా లేక పురుషుడా అనే విషయం, ఆ వ్యక్తి ఎత్తు, ముఖ నిర్మాణ రీతి ఇవన్నీ ఆ వ్యక్తి లీడర్‌ అయ్యే అవకాశాలను ప్రభావితం చేస్తాయని కూడా పరిశోధకులు చెప్పారు. ట్రంప్‌ ముఖ కవళికలు అంటే పొడుగు-వెడల్పుల నిష్పత్తి అధికంగా ఉండే వయసుడిగిన వారు నాయకులయ్యే అవకాశం ఎక్కువని తమ పరిశోధనల్లో తేలిందని వివరించారు. సాధారణంగా ఇలాంటి ముఖకవళికలు ఉన్నవారు శక్తిమంతులుగా కనిపిస్తారని, వారిలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ కూడా ఎక్కువేనని, ఇలాంటివారి నాయకత్వంలో నడిచే సంస్థలు కూడా లాభాలబాటలో సాగుతాయని గతంలో చాలా పరిశోధనల్లో తేలిందని చెప్పారు.

ట్రంప్‌ తరహా ముఖకవళికలకు...

ట్రంప్‌ తరహా ముఖకవళికలకు- అనైతిక ప్రవర్తనకు, నమ్మకాన్ని సొమ్ము చేసుకునే లక్షణానిక సంబంధం ఉందని కూడా శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ప్రపంచమంతటా శాంతి నెలకొని ఉన్న సమయంలో ప్రజలు ఇలాంటివారికి ఓటేయరని.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నందునే ఆయన ఎన్నికయ్యారని విశ్లేషించారు. ట్రంప్‌ ముఖకవళికల తీరు రెండంచుల కత్తిలాంటిదని.. దానికున్న ఆధిపత్య తీరు వల్ల అంతర్జాతీయస్థాయిలో బేరసారాల్లో అమెరికాకు లాభం కలగవచ్చని, అదే సమయంలో అవతలివారికి చిర్రెత్తించి విదేశాంగ విధాన సంక్షోభానికి దారి తీసే అవకాశం కూడా లేకపోలేదని అభిప్రాయపడ్డారు. 'ద లీడర్‌షిప్‌' అనే త్రైమాసిక పత్రికలో ఈ విశ్లేషణ ప్రచురితమైంది.

సమయమనం పాటించండి: రజనీకాంత్

చెన్నై: జ‌ల్లిక‌ట్టు ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా మార‌డంతో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రంగంలోకి దిగారు. సమయమనం పాటించాలని కోరుతూ ఓ లేఖ విడుద‌ల చేశారు. అసాంఘిక శ‌క్తులు ఉద్య‌మంలోకి చేరాయ‌ని, ఇలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డి చెడ్డ‌పేరు తీసుకురావాల‌ని చూస్తున్న‌ట్లు ర‌జ‌నీ ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

చెన్నైలో కర్ఫ్యూ వాతావరణం

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మెరీనా బీచ్ వద్ద పీఎస్ కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. 200 బైకులు దగ్ధం అవగా, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. మెరీనా బీచ్ ను ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆందోళన కారులను పోలీసులు చితకబాదారు.

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

ఢిల్లీ: 2017-18 బడెట్జ ను వాయిదా వేయాలన్న వ్యాజ్యాన్ని సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బడ్జెట్‌ సమర్పణను వాయిదా వేయాలని కోరుతూ న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఆయిల్ ట్యాంకర్-బై ఢీ: ముగ్గురి

  మేడ్చల్ : కీసర మండలం తిమ్మాయిపల్లెలో ఆయిల్ ట్యాంక్ - బైక్ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులు మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన వలస కూలీలు అని తెలుస్తోంది.

 

తాత్కాలికంగా జల్లి కట్టు ఉద్యమం విరమణ

చెన్నై : త‌మిళ‌నాడులో వారం రోజులుగా శాంతియుతంగా చేస్తోన్న జ‌ల్లిక‌ట్టు ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించాలని ఉద్యమ సంఘాలు ప్రకటించాయి. ఈ ఉద్యమం హింసాత్మ‌క రూపు దాల్చిడంతో మెరీనా బీచ్ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా కొన‌సాగుతున్నాయి. జ‌ల్లిక‌ట్టు ఉద్యమాన్ని తాత్కాలికంగా విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. అయితే, కాసేప‌ట్లో తాము స‌మావేశ‌మై త‌మ‌ ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపాయి.

15:44 - January 23, 2017
15:41 - January 23, 2017

విజయనగరం : జిల్లాలోని మెరకముడిదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఒక వృద్ధుడు సజీవ దహనమయ్యాడు.

15:40 - January 23, 2017

హైదరాబాద్‌ :గచ్చిబౌలిలో నాలుగు రోజులపాటు జరిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 16 ఆల్‌ఇండియా టోర్నమెంట్‌ ఘనంగా ముగిసింది. వెయిట్‌ లిఫ్టింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌, బెస్ట్‌ పిజిక్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 13 రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ సర్కిల్‌ సీజీఎంటీ ఎల్‌.అనంతరామ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్‌జీఎం కె. రాంచందర్‌ హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అనంతరామ్‌ అన్నారు.

 

15:37 - January 23, 2017

అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు పోరాటం చేస్తామని వైసీపీ ప్రకటించింది. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల జీవన్మరణ పోరాటమని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. తమిళులు సంప్రదాయ జల్లికట్టు కోసమే పోరాడినప్పుడు, జీవన్మరణ సమస్య కోసం ఎంతకైనా పోరాడాల్సి ఉందన్నారు.

ఐడీఏ బొల్లారంలో నవదంపతులు ఆత్మహత్య

సంగారెడ్డి: ఐడీఏ బొల్లారంలో నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వైఎస్‌ఆర్ కాలనీలో నవదంపతులు నిర్మల్(25), మినతి(22)లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన నవదంపతులు ఒడిశా వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

14:36 - January 23, 2017

అమరావతి : ప్రత్యేక హోదాపై వైసీపీ అధినేత జగన్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ప్రత్యేక హోదా కోసం ఏ కార్యక్రమం జరిగినా తమ మద్దతు ఉంటుందని ట్విట్టర్‌లో వెల్లడించారు. యువత ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

14:35 - January 23, 2017

అమరావతి : జల్లికట్టు ఉద్యమం, ప్రత్యేక హోదాకు పోలికేంటో తనకు అర్థం కావట్లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన వారు విచిత్రంగా ఇప్పుడు తనకు లేఖలు రాస్తున్నారని.. ఆ లేఖలేవో ఆనాడే రాసి ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదన్నారు. కులాలు, ప్రాంతాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టడమే కొంతమందికి పనిగా మారిందన్నారు. గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? అభివృద్ధి జరుగుతుందా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడేవాళ్లకు పరిపాలన అనుభవం లేదని.. వారికి పంచాయతీ సర్పంచిగా చేసిన అనుభవమైనా ఉందా? అని నిలదీశారు.

14:33 - January 23, 2017

నెల్లూరు : జిల్లాలో మంజునాథ కమిషన్ పర్యటిస్తోంది. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై నగరంలోని టీటీడీ కల్యాణమండపంలో మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. మంజునాథ కమిషన్ కు వ్యతిరేకంగా పెద్దఎత్తున్న బీసీ సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. కాపులను బీసీల్లో చేర్చోద్దంటూ, చేర్చితే బీసీలు అన్ని విధాల నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశాయి. అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బీసీ సంఘం నేతలు. మంజునాథ కమిషన్ గోబ్యాక్.. అంటూ నినాదాలు చేశారు.

14:32 - January 23, 2017

విజయవాడ : అమెరికా నుంచి వచ్చిన ఓ ఎన్‌ఆర్‌ఐ...అనుకోని విధంగా మృత్యు ఒడికి చేరుకున్నాడు. అబ్బాయి పుట్టినరోజు వేడుకల కోసం వచ్చి...అనూహ్యంగా మృతి చెందాడు. విజయవాడలో.. ఓ సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ మరణం ...అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.

దిగ్భ్రాంతికి గురిచేస్తున్న ఎన్‌ఆర్‌ఐ మరణం....

మాజేటి భరత్ కుమార్‌ గుంటూరులోని మంగళగిరిలో జన్మించి...అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా సెటిల్‌ అయ్యాడు. నాలుగేళ్ల క్రితం విజయవాడ హనుమాన్‌ పేటకు చెందిన మహిళను వివాహం చేసుకుని...ఆమెతో కలిసి అక్కడకు వెళ్లిపోయాడు. తమ ఏడాది బాబు పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకోవాలని పదిరోజుల క్రితం విజయవాడకు వచ్చారు . జనవరి 22న బర్త్‌డే నిర్వహించాలని భావించి ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు. ఈలోగా అనుకోని సంఘటన చోటు చేసుకుంది...ఆకస్మికంగా భరత్‌కుమార్‌ కాలువలో శవమై తేలాడు.

20న అత్తమామల ఇంటికి వెళ్లిన భరత్‌....

బాబు బర్త్‌డే కోసం ఇండియా వచ్చిన భరత్‌ కుమార్‌... 20వ తేదీ శుక్రవారం వాళ్ల అత్తమామల ఇంటికి వెళ్లాడు. సాయంత్రం 4 గంటల సమయంలో తాను మంగళగిరి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. అనంతరం సాయంత్రం 5.30 గంటల సమయంలో తండ్రికి ఫోన్ చేసి తాను ఇచ్చిన డబ్బులో సగభాగాన్ని తన భార్య, బిడ్డకు అందజేయాలని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఎన్నడూలేని విధంగా తన కుమారుడు ఈ విధంగా మాట్లాడేసరికి తండ్రి కంగారుపడి విషయాన్ని అందరికీ తెలియజేశాడు. దీంతో రెండు కుటుంబాలు భరత్ కుమార్ కోసం ఆరా తీశారు. ఎక్కడా భరత్ కుమార్ ఆచూకీ లభ్యం కాలేదు.

21న గర్నవర్‌పేట పోలీసులకు ఫిర్యాదు....

భరత్‌ కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులకు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయన బ్యాగ్, చెప్పులు సీతమ్మపాదాల వద్ద లభ్యమయ్యాయి. దీంతో జనవరి 21వ తేదీ మధ్యాహ్నం విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కాలువలో మృతదేహం కనిపించింది. మృతదేహం భరత్ కుమార్ దేనని బంధువులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు భరత్ కుమార్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ అనుకోని ఘటనతో భార్య.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

మానసిక ఆందోళనతో బాధపడుతున్న భరత్...

అయితే భరత్‌ కుమార్‌ కొన్ని రోజులుగా మానసిక ఆందోళనతో బాధపడుతున్నట్టు.. పోలీసుల విచారణలో తేలింది.. ఆ మేరకు డాక్టర్‌ పట్టాభిరాం వద్ద కూడా కౌన్సెలింగ్‌ ఇప్పించినట్టు బంధువులు చెప్పారని పోలీసులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఏదిఏమైనా ఈ అనుకోని సంఘటన...అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వేడుకల కోసం వచ్చిన వ్యక్తి అనంతలోకాలకు చేరడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

జల్లికట్టు కు ప్రత్యేకహోదాకు పోలికేంటి?:చంద్రబాబు

అమరావతి : జల్లికట్టు ఉద్యమం, ప్రత్యేక హోదాకు పోలికేంటో తనకు అర్థం కావట్లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన వారు విచిత్రంగా ఇప్పుడు తనకు లేఖలు రాస్తున్నారని.. ఆ లేఖలేవో ఆనాడే రాసి ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదన్నారు. కులాలు, ప్రాంతాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టడమే కొంతమందికి పనిగా మారిందన్నారు. గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? అభివృద్ధి జరుగుతుందా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడేవాళ్లకు పరిపాలన అనుభవం లేదని.. వారికి పంచాయతీ సర్పంచిగా చేసిన అనుభవమైనా ఉందా? అని నిలదీశారు.

13:48 - January 23, 2017

'విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం నిర్ణయం తీసుకోవాలి'..

విజయవాడ : విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల రాష్ట్రంలో 30 శాతం పరిశ్రమలు మూత పడుతాయని..కొత్త పరిశ్రమలు రావని ఆంధ్రా ఛాంబర్స్ కామర్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల అనాలోచిత నిర్ణయాల వల్లే ఛార్జీల పెంచుతున్నారని పేర్కొన్నారు.

13:43 - January 23, 2017

పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకపోతున్నారు. వ్యాపార రంగంలో కూడా అడుగు పెడుతూ విజయాలు సాధిస్తున్నారు. వైవిధ్యమైన ఉత్పత్తులు చేస్తూ భిన్నంగా ఆలోచిస్తూ ముందుకెళుతున్నారు. వ్యాపారం అంటే అటుపోట్లతో పయనం..లాభ..నష్టాలు సమ్మిళతంగా ఉండడంతో ఎంతో ఆలోచించాల్సి ఉంటుంది. ఓపికగా ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ రంగంలో శైలజ అనే అతివ ఆత్మస్థైర్యంతో అడుగు పెట్టి విజయం సాధించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:37 - January 23, 2017

ఢిల్లీ : వామపక్ష ప్రభుత్వం కంటే మమత బెనర్జీ మరింత కఠినాత్మురాలని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సీఎంగా మమత బెనర్జీ అధికారంలోకి వస్తే అంతా బాగుంటుందని అనుకున్నానని, కానీ తన అంచనాలు తలకిందులయ్యాయని విమర్శించారు. అధికారంలోకి ఎవరు వచ్చినా పరిస్థితి మారడం లేదని అర్థమైందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తాను బలైయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్ లో ప్రభుత్వం మారితే అంతా బావుటుందని, అప్పుడు తాను రావచ్చని అనుకుంటున్నట్లు తస్లీమా పేర్కొనడం గమనార్హం.

13:27 - January 23, 2017

భూపాలపల్లి : తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పాదయాత్ర 99వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా ఈ రోజు తాడ్వాయి, చెన్నబోయినపల్లిలో పాదయాత్ర కొనసాగుతోంది. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆదివాసీలను అడవి నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తోందని, ఇది సరికాదని పాదయాత్ర బృంద సభ్యుడు నైతం రాజు పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. హరితహారం పేరిట బయటకు పంపిస్తున్నారని, పట్టాలు ఇప్పించే విధంగా కృషి చేయాలని విన్నవిస్తున్నారని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:22 - January 23, 2017

భూపాలపల్లి : సీపీఎం మహాజన పాదయాత్ర 99వ రోజుకు చేరుకుంది. జయశంకర్ జిల్లా భూపాలపల్లి లో పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతోంది. తాడ్వాయి, చెన్నబోయినపల్లిలో పాదయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా పాదయాత్ర రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడారు. గొర్రెల, మేకల పెంపకం దారులకు సహాయం అందడం లేదని తెలిపారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాటలు కాదు..చేతలు కావాలి..నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా ఈ విషయంలో ఓ పత్రం విడుదల చేయాలని సూచించారు.

 

టి.అసెంబ్లీలో వన్ మ్యాన్ షో - చాడ..

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వన్ మ్యాన్ షోగా నడిచిందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలుతున్నా పట్టించుకోవడం లేదని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు.

13:15 - January 23, 2017

విజయనగరం : హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు దుర్ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కుట్ర కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదమా ? లేక విద్రోహ చర్య ? అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. శనివారం అర్ధరాత్రి హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 39 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం సీఐడీ, ఎన్ఐఏ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. విరిగిన పట్టాలను పరిశీలించారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందా ? అనే దానిపై దృష్టి పెట్టారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:13 - January 23, 2017

విజయవాడ : ప్రత్యేక హోదా డిమాండ్ మళ్లీ తెరమీదకు వచ్చింది. 'హోదా’ కల్పించి తీరాల్సిందే అంటూ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు 'పవన్ కళ్యాణ్' ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఉద్యమానికి 'పవన్' నాయకత్వం వహిస్తారా ? అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఏపీకి సంబంధించిన దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న 'ప్రత్యేక హోదా' అంశం రాజకీయంగా వేడి రగిలే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా 'పవన్ కళ్యాణ్' విషయంలో ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, యువత మేల్కోవాలని...చూస్తూ ఊరుకోమని ఒక భావన ఏర్పరిచే ప్రయత్నం చేశారు. ఆర్కే బీచ్ లో యువత ఉద్యమం చేపడితే మద్దతిస్తామని 'పవన్' స్పష్టం చేయడం గమనార్హం. ఉద్యమానికి నాయకత్వం వహిస్తారా ? ఆర్కే బీచ్ వద్ద కూర్చొంటారా ? అనేది తెలియరావడం లేదు. తాజాగా ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ కూడా ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. హోదా విషయంలో జరిగే ఉద్యమానికి తమ మద్దతు తెలియచేస్తామని కాసేపటి క్రితం జగన్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. దీనితో హోదాపై మళ్లీ ఉద్యమం రగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళం..

నెల్లూరు : మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణలో గందరగోళం చోటు చేసుకుంది. కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

12:57 - January 23, 2017
12:54 - January 23, 2017

చెన్నై : జల్లికట్లుకు శాశ్వత పరిష్కారం చేయాలని, చట్టబద్ధత కల్పించాలంటూ చేస్తున్న ఉద్యమం పక్కదారి పట్టింది. మెరీనా బీచ్ లోని పీఎస్ కు ఆందోళనకారులు నిప్పు పెట్టడం..ఉద్యమకారులపై లాఠీఛార్జీ, భాష్పావాయు ప్రయోగం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పీఎస్ లో ఉన్న వాహనాలను ధ్వంసం చేయడం..వాహనాలకు నిప్పు పెట్టారు. దీనితో పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో 10 మందికి గాయాలయ్యాయి.
గత కొన్ని రోజులుగా మెరీనా బీచ్ వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థులను తరలించేందుకు పోలీసులు యత్నించారు. పోలీసుల చర్యను ఆందోళనకారులు తీవ్రంగా ప్రతిఘటించారు. సమీపంలో ఉన్న పీఎస్ కు నిప్పు పెట్టడంతో పరిస్థితి అదుపు తప్పింది. సంఘవిద్రోహ శక్తులు ఆందోళనలో పాల్గొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జల్లికట్టు ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు వాకౌట్ చేశాయి.

12:48 - January 23, 2017

సెర్ప్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ప్రారంభం..

హైదరాబాద్ : సచివాలయంలో మంత్రి జూపల్లి నేతృత్వంలో సెర్ప్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ప్రారంభమైంది. సీఎస్ ఎస్ పీ సింగ్, కమిషనర్ నీతూ ప్రసాద్ లు పాల్గొన్నారు.

మూలలంక సమస్యను పరిష్కరించాలని బాబు ఆదేశం..

అమరావతి : పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కు సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. మూలలంక వద్ద ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డు వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

12:28 - January 23, 2017

హైదరాబాద్ : పీవీ ఎక్స్ ప్రెస్ పై దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం ఎక్స్ ప్రెస్ హైవేపై యువతి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలికి వారు చేరుకున్నారు. తలకు బలమైన గాయాలు కావడంతో రక్తపు మడుగులో యువతి పడి ఉంది. కొద్దిదూరంలో చెప్పులు పడి ఉన్నాయి. పిల్లర్ నెంబర్ 77 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల విచారణలో కర్నాటకు చెందిన కావ్యశ్రీగా గుర్తించారు. మాదాపూర్ లోని డీఎల్ఎఫ్ లో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. కానీ ఈమె ఇక్కడకు ఎలా చేరిందనేది తెలియరావడం లేదు. నడిచే వారిని, ద్విచక్ర వాహనాలను ఎక్స్ ప్రెస్ పైకి అనుమతించరు. కానీ ఈమె అక్కడకు ఎలా వెళ్లింది ? కారులో నుండి మృతదేహాన్ని బయటకు విసిరారా ? లేక కారులో నుండే నూకేశారా ? అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పోస్టుమార్టం నివేదిక వస్తేనే నిజాలు తెలిసే అవకాశం ఉంది.

12:21 - January 23, 2017

గోపీకమ్మ ఈసారి పక్కా కాన్పిడెంట్ గా ఉంది. డ్యామ్ షూర్ గా సక్సెస్ ఖాయమంటోంది. ఎన్నో ఆశలతో బాలీవుడ్ బాట పట్టిన 'పూజా హెగ్డెకు మొదటి సినిమాతోనే అక్కడ దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. దీంతో బ్యాక్ టూ పెవిలియన్ అంటూ టాలీవుడ్ లో వచ్చిపడింది. అయితే ఈ బ్యూటీ ఆశలన్ని ఇప్పుడు 'డీజే' స్టార్ పైనే ఉన్నాయి. కచ్చితంగా తనకు 'డీజే' బాబు హిట్టు ఇస్తాడని నమ్ముతోంది. యంగ్ బ్యూటీ పూజా హెగ్డెకు ఎక్కడో సుడి ఉంది. లక్ అంటే ఈ బ్యూటీదే అని చెప్పాలి. సక్సెస్ అనేది లేకపోయిన కూడా భారీ ఛాన్స్ లు ఈ బ్యూటీని పలకరిస్తున్నాయి. కామన్ గా ఏ హీరోయిన్ కైనా మొదటి సినిమా ప్లాప్ అయితే అతికష్టం మీద మరో అవకావం వస్తోంది. అలాంటిది ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటితో పాటు ఆ తరవాత చేసిన మరో రెండు సినిమాలు కూడా డిజాస్టర్స్ గా నిలిచాయి. అయిన కూడా ఈ బ్యూటీ ప్రస్తుతం బడా సినిమాలో నటిస్తోంది. దీన్ని బట్టి పూజా హెగ్డెకు లక్ ఏ రేంజ్ లో ఉందో ఈజీగా చెప్పేయ్యొచ్చు.

గోల్డెన్ ఆఫర్..
మెగా హీరో 'వరుణ్ తేజ్' 'ముకుందా' సినిమాతో పూజా హెగ్డె తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమా సోసోగానే ఆడింది. కానీ ఆ సినిమాలోని గోపీకమ్మ సాంగ్ మాత్రం పాపులార్ అయింది. ఆ తరువాత అక్కినేని యంగ్ హీరో 'నాగ చైతన్య'తో 'ఓ లైలా కోసం' సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా బోల్తాకొట్టింది. అప్పుడే ఈ బ్యూటీకి ఓ బంఫర్ ఆఫర్ తగిలింది. 'మోహంజాదారో' మూవీ కోసం బాలీవుడ్ స్టార్ 'హృతిక్ రోషన్' తో నటించే గోల్డెన్ ఛాన్స్ రావడంతో టాలీవుడ్ కి టాటా చెప్పి బాలీవుడ్ చెక్కేసింది. అంతేకాదు ఈ మూవీతో 'పూజా' హీరోయిన్ గా తన తలరాత మారిపోతుందని అనుకుంది. కానీ సీన్ రివర్స్ అయింది. 'మోహంజాదారో' డిజాస్టర్ తో బీటౌన్ లో ఛాన్స్ లు రాలేదు. అయితే ఈసారి బ్యూటీకి 'అల్లు అర్జున్' రూపంలో గోల్డెన్ ఆఫర్ దక్కింది.

బన్నీ ఆదుకుంటాడా ?
ప్రస్తుతం 'పూజా హెగ్డె' స్టైలీష్ స్టార్ కి జోడిగా 'డీజే' మూవీలో నటిస్తోంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా సక్సెస్ మీదే పూజా కెరీర్ ఆధారపడి ఉంది.అందుకే ఈ మూవీపై ఈ బక్కపలుచని భామ బోలెడు ఆశలు పెట్టుకుంది. కచ్చితంగా బన్నీ తనకు హిట్టు ఇస్తాడని పూజా హెగ్డె కాన్పిడెంట్ గా ఉంది. హీరోయిన్స్ కి హిట్టు ఇవ్వడంలో మెగా కాంపౌండ్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 'మోహంజాదారో' సినిమా కోసం హృతిక్ రోషన్ తో చెట్టపట్టాలెసుకుని తిరిగిన ఈ బ్యూటీ ఇప్పుడు 'బన్నీ' స్వీట్ పర్సన్ అంటూ‌ 'బన్నీ' భజన చేస్తోంది. మరి 'బన్నీ' అయినా ఈ బ్యూటీ హిట్టు ఇచ్చి ఆదుకుంటాడా చూడాలి.

12:15 - January 23, 2017

విజయవాడ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు ట్వీట్లతో ఏపీ సర్కార్ పై విరుచుకపడుతున్నారు. గత కొన్ని రోజులుగా పలు అంశాలపై ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం..అమరావతి..రైతుల సమస్యలపై పవన్ ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం ఉదయం పలు ఘాటు ట్వీట్లు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆయన ట్వీట్ చేశారు. జల్లికట్టు తరహాలో జనవరి 26వ తేదీన ఆర్కే బీచ్ లో చేసే శాంతియుత ఆందోళనకు 'జనసేన' మద్దతిస్తుందని ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. .తాజాగా సోమవారం ఏపీ ప్రత్యేక హోదాపై 'పవన్' ఘాటు ట్వీట్లు చేశారు. ఆయన ట్వీట్ లో ఏమి పేర్కొన్నారంటే..
'తిడితే భరించాం..విడదీసి గెంటివేస్తే సహించాం..ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే తిరగబడతామనే విషయం ఆంధ్రా యువత కేంద్రానికి తెలియచేయాలి' అని ఘాటుగా ట్వీట్ చేశారు. 'గాంధీజిని ప్రేమిస్తాం..అంబేద్కర్ ను ఆరాధిస్తాం..సర్ధార్ పటేల్ కి సెల్యూట్ చేస్తాం..భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం..కానీ... తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పోతే చూస్తూ కూర్చొం..మెడలు వంచి కింద కూర్చొపెడుతాం' అంటూ రెండో ట్వీట్ చేశారు. దీనితో హోదాపై జనసేన పోరాట దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. విశాఖలో నిర్వహించే ఈ ఆందోళనకు పోలీసులు అనుమతినివ్వరని తెలుస్తోంది.

12:08 - January 23, 2017

చెన్నై : జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం, చట్టబద్ధత కల్పించాలని కోరుతూ చేస్తున్న ఉద్యమం పక్కదారి పట్టింది. గత కొన్ని రోజులుగా మెరీనా బీచ్ లో లక్షలాది మంది ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్కార్ తలవొంచి జల్లికట్టుకు ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. కానీ ఆందోళనకారులు ఏమాత్రం సంతృప్తి పడలేదు. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం చేయాల్సిందేనని, చట్టబద్ధత కల్పించేంత వరకు పోరాటం ఆగేది లేదని ఆందోళనకారులు తేల్చిచెబుతున్నారు. రిపబ్లిక్ డే సమీపిస్తుండడంతో మెరీనా బీచ్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మెరీనా బీచ్ కు వందలాది మంది పోలీసులు చేరుకున్నారు. తమను ఇక్కడి నుండి తరలించవద్దని ఆందోళనకారులు విజ్ఞప్తి చేసుకున్నారు. కానీ పోలీసులు వీరిని తరలించేందుకు యత్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. బీచ్ కు వెళ్లే మార్గాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి విద్యార్థులు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దూసుకొస్తున్న విద్యార్థులపైకి లాఠీఛార్జీ, బాష్పావాయు ప్రయోగం చేశారు. దీనితో పరిస్థితి అదుపు తప్పింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు మెరీనా బీచ్ పీఎస్ కు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

తమిళనాడు అసెంబ్లీ..
మరోవైపు తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభనుద్ధేశించి ఇన్ ఛార్జీ గవర్నర్ ప్రసంగించారు. జల్లికట్టు ఆందోళనకారులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా డీఎంకే, కాంగ్రెస్ వాకౌట్ చేశాయి. అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదని సీఎం పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. చట్టబద్ధత విషయంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆందోళన విరమించాలని సెల్వం సూచిస్తున్నారు.

మెరీనా పీఎస్ కు నిప్పు..

చెన్నై : గత కొన్ని రోజులుగా శాంతియుతంగా సాగుతున్న జల్లికట్టు నిషేధం ఎత్తివేత ఉద్యమం హింసారూపకంగా మారుతోంది. మెరీనా బీచ్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమకారులను బలవంతంగా తరలిస్తున్నారు. బీచ్ వైపుకు దూసుకొస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ, బాష్పావాయు ప్రయోగం చేశారు. పోలీసులను తీవ్రస్థాయిలో నిరసనకారులు ప్రతిఘటిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెరీనా బీచ్ వద్ద పోలీస్ స్టేషన్ కు ఆందోళనాకారులు నిప్పు పెట్టారు.

సైనా విజయంపై కేసీఆర్ హర్షం..

హైదరాబాద్ : మలేషియన్ మాస్టర్ గ్రాండ్ ప్రీ టైటిల్ ను సైనా నెహ్వాల్ గెలవడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మళ్లీ ఫామ్ లోకి వచ్చి విజయాల బాట పట్టిన సైనాను కేసీఆర్ అభినందించారు.

తమిళనాడు అసెంబ్లీ ప్రారంభం..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభనుద్ధేశించి ఇన్ ఛార్జీ గవర్నర్ ప్రసంగించారు. జల్లికట్టు ఆందోళనకారులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా డీఎంకే, కాంగ్రెస్ వాకౌట్ చేశాయి.

 

సచివాలయంలో డబుల్ బెడ్ం రూం ఇళ్లపై సమీక్ష..

హైదరాబాద్ : సచివాలయంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై మంత్రులు హరీష్ రావు, ఇంద్రకిరణ్ రెడ్డిలు సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.

11:43 - January 23, 2017

విజయనగరానికి ఎన్ఐఏ బృందం..

విజయనగరం : హిరాఖండ్ రైలు ప్రమాద ఘటనలో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. సోమవారం ఉదయం కూనేరు రైలు ప్రమాద ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

11:11 - January 23, 2017

విజయవాడ : ఆర్కే బీచ్ మరో మెరీనా బీచ్ గా మారుతుందా ? తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ మెరీనా బీచ్ లో లక్షలాది మంది యువకులు చేసిన పోరాటంపై ప్రభుత్వాలు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో వారి పోరాటంపై అందరి దృష్టి నెలకొంది. ఏపీకి 'ప్రత్యేక హోదా' పై కూడా అలాంటి పోరాటం ఎందుకు చేయకూడదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందులో భాగంగా ప్రధానంగా సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' ఘాటుగా ట్వీట్లు చేస్తున్నారు. జనవరి 26వ తేదీన ఆర్కే బీచ్ లో చేసే శాంతియుత ఆందోళనకు 'జనసేన' మద్దతిస్తుందని ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా సోమవారం ఏపీ ప్రత్యేక హోదాపై 'పవన్' ఘాటు ట్వీట్లు చేశారు. 'తిడితే భరించాం..విడదీసి గెంటివేస్తే సహించాం..ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే తిరగబడతామనే విషయం ఆంధ్రా యువత కేంద్రానికి తెలియచేయాలి' అని ఘాటుగా ట్వీట్ చేశారు. 'గాంధీజిని ప్రేమిస్తాం..అంబేద్కర్ ను ఆరాధిస్తాం..సర్ధార్ పటేల్ కి సెల్యూట్ చేస్తాం..భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం..కానీ... తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పోతే చూస్తూ కూర్చొం..మెడలు వంచి కింద కూర్చొపెడుతాం' అంటూ రెండో ట్వీట్ చేశారు. దీనితో హోదాపై జనసేన పోరాట దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

గుంతకల్ లో టెన్ టివి కథనంపై స్పందన...

అనంతపురం : గుంతకల్ రైల్వే స్టేషన్ లో సెంట్రల్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఫేక్ సర్టిఫికేట్ తో ఉద్యోగం పొందిన వ్యక్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.

పవన్ ఘాటు ట్వీట్లు..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరుసగా ఘాటు ట్వీట్లు చేస్తున్నారు. కాసేపటి క్రితం ఏపీ హోదాపై ట్వీట్ చేసిన పవన్ మరో ట్వీట్ చేశారు. ‘గాంధీజిని ప్రేమిస్తాం..అంబేద్కర్ ను ఆరాధిస్తాం..సర్ధార్ పటేల్ కి సెల్యూట్ చేస్తాం..భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం..కానీ... తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పోతే చూస్తూ కూర్చొం..మెడలు వంచి కింద కూర్చొపెడుతాం' అంటూ ట్వీట్ చేశారు.

10:24 - January 23, 2017

డిఫరెంట్ మూవీస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న 'నిఖిల్' మరో డిఫరెంట్ మూవీతో రెడీగా ఉన్నాడు. 'కేశవ' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ వావ్ అనిపిస్తోంది. ఈ న్యూమూవీకి సంబంధించిన స్టోరీని ముందే రివీల్ చేసి సినిమాపై హైప్ పెంచుతున్నాడు. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ హీరోగా 'నిఖిల్' కి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఒక్క 'శంకరాభరణం' తప్ప 'నిఖిల్' ఈ మధ్య కాలంలో చేసిన ఏ మూవీ కూడా ఆడియన్స్ ని నిరాశపరిచలేదు. గత ఎడాది రిలీజైన 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' సినిమా అయితే ఓల్ ఇండస్ట్రీకి స్వీట్ షాక్ ఇచ్చింది. డిమానిటైజైషన్ లో సైతం ఈ మూవీ 40కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరిని మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా మించిన డిఫరెంట్ కంటెంట్ తో మరో హిట్టు కోసం 'నిఖిల్' రెడీ అవుతున్నాడు.

ఫస్ట్ లుక్..
కుర్రహీరో 'నిఖిల్' నటించిన కొత్త మూవీ 'కేశవ' ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ మూవీ లుక్స్ చూస్తుంటే యాక్షన్ ఎంటర్టెయినర్ అనే విషయం అర్ధమవుతోంది. అయితే పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తే కిక్కే వేరు అంటూ బోల్డ్ లెటర్స్ లో వేసిన ట్యాగ్ లైన్ లోనే మూవీ స్టోరీ దాగుందని నిఖిల్ చెప్పుతున్నాడు. ఈ ట్యాగ్ లైన్ కి సంబంధించి అసలు ఈ యంగ్ హీరో టోటల్ స్టోరీ మొత్తం చెప్పేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసేశాడు. 'కేశవ' మూవీలో 'నిఖిల్' గుండె జబ్బుతో బాధపడే క్యారెక్టర్ లో కనిపిస్తాడట. అంతేకాదు అందరిలా కాకుండా ఈ సినిమాలో హీరోకి గుండె కుడివైపున ఉంటుందని 'నిఖిల్' షాకింగ్ విషయం చెప్పాడు. ఇలా కుడి వైపు గుండె ఉన్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదట, టెన్షన్ ఫీల్ అవకూడదు.

ఫైట్స్ కంపోజ్ చేసిన నిఖిల్..
ఏ మాత్రం ఎమోషన్ అయిన కోపం తెచ్చుకున్న దాని ఎఫెక్ట్ ఫిజికల్ గా చూపిస్తుందట. ఇలా అరుదైన జబ్బుతో బాధపడే హీరో ఓ ఆపరేషన్ మిషన్ లో పాల్గొంటాడట. తన ఎనీమిస్ పై పగ తీర్చుకోవడానికి కోపం తెచ్చుకోకుండానే ఆ మిషన్ ఎలా కంప్లీట్ చేశాడనేదే 'కేశవ' సినిమా స్టోరీ అని 'నిఖిల్' ఈ న్యూమూవీ స్టోరీ మొత్తం రివీల్ చేశాడు. ఈ చిత్రం ఈ యంగ్ హీరో లుక్స్ పరంగా కూడా మేకోవర్ చూపిస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీలోని ఫైట్స్ ని స్వయంగా 'నిఖిలే' కంపోజ్ చేశాడట. స్టోరీ వింటుంటేనే థ్ర్లిల్లింగ్ అనిపిస్తున్న ఈ మూవీ 'నిఖిల్' కెరీర్ లో మరో సూపర్ హిట్టుగా నిలిచినట్లే అనిపిస్తోంది.

10:20 - January 23, 2017

స్టార్ హీరోయిన్ 'నయన తార' కండీషన్స్ అప్లే అంటుంది. తను నటించాలంటే ముచ్చటగా మూడు కండిషన్స్ ని దర్శకనిర్మాతల తప్పని సరిగ్గా పాటించాల్సిందేనని ఈ కేరళ బ్యూటీ ఆర్డర్ పాస్ చేసింది. అసలే ముక్కుసూటిగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు ఇలా షరతులు పెట్టడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అవకాశాల కోసం తాపత్రయపడటం ఒక స్థాయి వరకే ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే అవకాశాలు కుప్పలు.. కుప్పలుగా వచ్చి పడుతుంటాయి. కేరళ కుట్టి 'నయనతార' డిమాండ్ ప్రస్తుతం ఇదే తీరులో ఉంది. ఆమె అడగకుండానే అవకాశాలు తన్నుకు వస్తున్నాయి. చేతి నిండా సినిమాలతో ఆమె వ్యవహారం ఇప్పుడో రేంజ్ లో ఉంది. తన తోటి హీరోయిన్స్ ఎప్పుడో ఫేడవుట్ అయిపోతే ఈ బ్యూటీ మాత్రం ఇప్పటికి సీనియర్ హీరోలు యంగ్ హీరోలు అనే తేడా లేకుండా అందరి పక్కన నటిస్తూ పుల్ బిజీగా ఉంది.

కోలీవుడ్..
కోలీవుడ్ లో నయనతార ఉంటే చాలు సినిమా హిట్టే అనే రేంజ్ కి చేరుకుంది. అంతేకాదు కుర్రహీరోలకు ఈ బ్యూటీ గోల్డెన్ హీరోయిన్ అని చెప్పాలి. చిన్న హీరోల సినిమాలకు ఈ బ్యూటీనే మొయిన్ అట్రాక్షన్. అంతేకాదు కోలీవుడ్ లో లేడి ఒరియెంటెడ్ మూవీస్ కోసం కూడా దర్శకులు ఎక్కువగా నయనతార మీదనే ఫోకస్ చేస్తున్నారు. ఇంత డిమాండ్ ఉంది కాబట్టే ఈ బ్యూటీ కనీసం ఆడియో ఫంక్షన్స్ కి రాకపోయిన ప్రమోషన్స్ రాకపోయిన కూడా దర్శకనిర్మాతలు సైలెంట్ గా ఉండిపోతున్నారు. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఈ బ్యూటీ మరో మూడు కండిషన్స్ ని పెట్టినట్లు తెలుస్తోంది.

కండీషన్స్..
'నయనతార' ముందు కండిషన్స్ చెప్పి దర్శకనిర్మాతలు ఒకే అన్నాకే స్టోరీ చెప్పమంటోందట. ఇంతకీ ఈ బ్యూటీ కండీషన్స్ ఏమంటారా, ఓవర్ ఎక్స్ పోజింగ్ ఉండకూడదట. స్విమ్ సూట్ కానీ బికినీ కానీ వేసుకోనని క్లారిటి ఇస్తోందట. మూడోవది నో లిప్ లాక్స్ అంటూ మూడు కండీషన్లు చెప్పుతోందట. అంతేనా తన పాత్ర గురించి వివరంగా తెలుసుకొని, అవసరమైతే మార్పులు చేర్పులు చెప్పటం. ఆమె చెప్పిన మార్పులకు దర్శకులు ఒకే అంటేనే మూవీకి సంతకం పెట్టుతుందట. ఇలాంటి షరతులు పెట్టుతున్న కూడా ఈ భామకు బోలెడు అవకాశాలు వస్తుండడం విశేషం. గాలి వీచినప్పుడు ఇలాగే ఉంటుందేమో మరి.

10:12 - January 23, 2017

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదాపై 'పవన్' పోరాటం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేస్తూ వేడి పుట్టిస్తున్నారు. జల్లికట్టు ఉద్యమం స్పూర్తిగా తీసుకుని 'హోదా'పై పోరాటం చేయాలని 'పవన్' పిలుపునిస్తున్నారు. జనవరి 26వ తేదీన వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో శాంతియుతంగా నిరసన తెలియచేసే యువతకు జనసేన మద్దతు తెలియచేస్తుందని 'పవన్' ట్వీట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం ఉదయం మరో ట్వీట్ సంధించారు. 'తిడితే భరించాం..విడదీసి గెంటివేస్తే సహించాం..ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే తిరగబడతామనే విషయం ఆంధ్రా యువత కేంద్రానికి తెలియచేయాలి' అని ఘాటుగా ట్వీట్ చేశారు.
ఇటీవలే ఏపీ ప్రత్యేక హోదా అంశంపై పలు సభలు నిర్వహించిన 'పవన్' కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు సంధించారు. ‘హోదా' కాకుండా 'ప్యాకేజీ’ అంటూ తెరమీదకు తీసుకొచ్చారు. దీనితో 'పవన్' రంగ ప్రవేశం చేసి పలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. మరోవైపు పోలవరం..అమరావతి అంశాలపై కూడా పవన్ ట్వీట్స్ చేశారు. ప్రస్తుతం చేసిన ట్వీట్ పై సర్కార్..మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి.

'హోదా'పై పవన్ మరో ట్వీట్..

హైదరాబాద్ : ఏపీ ప్రత్యేక హోదాపై సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. 'తిడితే భరించాం..విడదీసి గెంటివేస్తే సహించాం..ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే తిరగబడతామనే విషయం ఆంధ్రా యువత కేంద్రానికి తెలియచేయాలి' అని ట్వీట్ చేశారు.

హిందూపురంలో కేంద్ర కరవు బృందం పర్యటన..

అనంతపురం : హిందూపురంలో కేంద్ర కరవు బృందం పర్యటిస్తోంది. సెర్చికార్యాలయంలో అనంతపురం కరవుపై ఫొటో ఎగ్జిబీషన్ ను బృందం తిలకించింది.

నీటి కోసం రైతుల మధ్య ఘర్షణ..

అనంతపురం : పుట్లూరు చెరువు వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నీటి కోసం రెండు గ్రామాల రైతులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చెరువు వద్దకు రైతులు భారీగా తరలివస్తున్నారు.

09:59 - January 23, 2017

'లోకల్' కుర్రాడి ఏంట్రీ ఇవ్వబోతున్నాడు. గత ఎడాది హ్యట్రిక్ సక్సెస్ లతో హంగామా చేసిన నాని ఈ ఎడాది 'నేను లోకల్' అంటూ ఆడియన్స్ అలరించడానికి సిద్దంగా ఉన్నాడు. ట్రైలర్ తో అట్రాక్ట్ చేసిన ఈ 'లోకల్' కుర్రాడు పుల్ సినిమాతో థియేటర్స్ లో విజిల్స్ వేయించాలని ఉత్సాహపడుతున్నాడు. చూస్తుండగానే ఇంతింతై అన్నట్లు ఎదిగిపోతున్నాడు 'నాని’. హీరోగా ఈ ఇక నాని కోలుకోవడం కష్టమే అనే భారీ ప్లాప్స్ నుంచి స్టార్ రేంజ్ కి చేరుకున్నాడు. 'ఎవడే సుబ్రమణ్యం'తో మొదలైన విజయపరంపర రెండేళ్లుగా నిర్విరామంగా సాగుతునే ఉంది. అంతేకాదు 'భలే భలే మగాడివోయ్' సినిమా అనూహ్యమైన విజయం సాధించిన 'నాని' స్టార్ రేంజ్ కి చేరుకున్నాడు. ఇక గత ఎడాది హ్యట్రిక్ సక్సెస్ కొట్టి ఒకే ఎడాదిలో మూడు విజయాలు అందుకున్న ఈ జనరేషన్ హీరోగా 'నాని' స్పెషల్ క్రెడిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇలా విజయాల జోరు మీదున్న 'నాని' 'నేను లోకల్' మూవీ రిలీజ్ డేట్ ని కన్ ఫర్మ్ చేశాడు.

ఫిబ్రవరి 14..
'నేను లోకల్' సినిమా ఫిబ్రవరి 14 రిలీజ్ కాబోతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి 'సినిమా చూపిస్తా మామ' ఫేం త్రినాథ్ రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో 'నాని'కి జోడిగా 'కీర్తి సురేష్' నటిస్తోంది. 'నాని' - 'కీర్తి'ల జంట యూత్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఇక 'నాని' దిల్ రాజు కాంబినేషన్ లో పస్ట్ మూవీ కావడం, అదే విధంగా 'నాని' సినిమాకి దేవిశ్రీప్రసాద్ పస్ట్ టైం మ్యూజిక్ ఇవ్వడం స్పెషల్ అని చెప్పాలి. 'నేను లోకల్' ట్రైలర్ చూస్తే 'నాని' మరో సక్సెస్ ని సంకలో పెట్టేసుకున్నట్లే కనిపిస్తోంది. మామూలుగా పెద్ద హీరోల సినిమాలు వచ్చినపుడు మాత్రమే టీజర్లు ట్రైలర్లకు సంబంధించిన రికార్డులపై చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు 'నేను లోకల్' కూడా స్టార్ హీరోల సినిమాల ట్రైలర్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో వ్యూస్ తెచ్చుకుంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా ట్రైలర్ 1.5 మిలియన్ మార్కును అందుకోవడం విశేషం. దీన్ని బట్టే ఆడియన్స్ 'నాని' సినిమాపై ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే అర్ధం అయిపోతోంది. మొత్తంగా చూస్తే 'నేను లోకల్' పక్కా హిట్టు మూవీలా కనిపిస్తోంది.

 

09:56 - January 23, 2017

'మంచు మనోజ్ ' సీనియర్ స్టార్ తో పోటీకి సై అంటున్నాడు. అసలే సక్సెస్ లు లేని ఈ 'మంచు' బాబు వరుస సక్సెస్ ల్లో ఉన్న సీనియర్ స్టార్ తో పోటీ పడుతుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది . అయితే కంటెంట్ కాపాడుతుందని 'మంచు' హీరో కాన్పిడెంట్ గా ఉన్నాడు. 'మంచు మనోజ్' 'పోటుగాడు’, 'కరెంటు తీగ' సినిమాలతో రెండేళ్ల కిందట మంచి ఊపులో కనిపించాడు. కానీ గత ఏడాది 'శౌర్య’, 'ఎటాక్' సినిమాలు ఈ 'మంచు' హీరోని బాగా నిరాశపరిచాయి. 'శౌర్య'తో కొత్తగా ట్రై చేద్దామని ప్రయత్నించి ఫెయిలవడంతో ఈసారి తనదైన స్టయిల్ లో 'గుంటూరోడి'గా మాస్ మసాలా సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ 'గుంటూరోడి'పై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ మూవీని ఓ సీనియర్ స్టార్ మూవీకి పోటీగా రిలీజ్ చేస్తుండడమే అనుమానాలకు తావిస్తోంది. తాజా సమాచారం ప్రకారం 'గుంటూరోడు' ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తుందట.

భక్తిరసం..మాస్ మసాల..
ఇదే డేట్ కి 'నాగార్జున' 'ఓం నమో వెంకటేశాయ' కూడా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అసలే 'నాగ్' వరుస సక్సెస్ లతో పుల్ స్వీంగ్ లో ఉన్నాడు. దీనికి తోడు రాఘవేంద్రరావు లాంటి సీనియర్ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించడం కూడా 'నమో వెంకటేశాయా' సినిమాకు ప్లస్ పాయింట్. అయితే నాగార్జునతో బాక్సాఫీసు పోటీలో నిలుస్తున్నప్పటికి మంచు మనోజ్ తన సినిమా కంటెంట్ పై కాన్పిడెంట్ గా ఉన్నాడు. 'నాగార్జున' సినిమాతో 'మనోజ్' పోటీగా రావడానికి కాన్సెప్ట్ లే రీజన్ గా కనిపిస్తున్నాయట. 'నాగ్' మూవీ 'ఓం నమో వెంకటేశాయా' ఆధ్యాత్మిక భక్తి రస చిత్రం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే 'మనోజ్' 'గుంటూరోడు' మాత్రం పక్కా మాస్ మసాలా సినిమాగా తెరకెక్కింది. ఈ రెండు సినిమాలకు ఎక్కడ పోంతనే లేదు. ఈ కారణం వల్లనే 'మనోజ్' తన సినిమాపై కాన్పిడెంట్ గా ఉన్నాడట. అన్నట్లు రెండు సినిమాల్లో హీరోయిన్ గా 'ప్రగ్యా జైస్వల్' నటించడం విశేషం.

09:51 - January 23, 2017

అనుకున్నట్లుగానే 'ఖైదీ..’ వంద కోట్లు కొట్టేశాడు బాస్. మెగాస్టార్ చిరంజీవి బాక్సాపీసు వద్ద బిగ్ బాస్ అనే విషయాన్ని ప్రూవ్ చేశాడు. జెస్ట్ వన్ వీక్ లో మెగాస్టార్ వండర్ పుల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే కొన్ని చోట్ల 'బాహుబలి' రికార్డ్స్ ని బ్రేక్ చేసిన బాస్ మూవీ 'ఖైదీ నెంబర్ 150’ పుల్ రన్ లో నాన్ బాహుబలి రికార్డ్స్ ని చేరిపేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. మరి ఇప్పటి వరకు బాక్సాఫీసు వద్ద ఖైదీ దోచుకున్న లెక్కేంత..బాస్ ఈజ్ బ్యాక్, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా కాంపౌండ్ తో పాటు మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు. మరి ఓవర్ చేస్తున్నారనుకున్నారంతా. కానీ బాస్ ఈజ్ బ్యాక్ స్లోగన్ బాక్సాఫీసు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో 'ఖైదీ నెంబర్ 150’ వసూళ్లు చూస్తూ అర్ధం అవుతోంది. కేవలం ఆరు రోజుల్లో 100 కోట్లకు వసూల్ చేసి మెగాస్టార్ సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేశాడు. ఈ వసూళ్లను బట్టి ఇండస్ట్రీ కూడా బాస్ ఈజ్ బ్యాక్ అనాల్సిందే. 'చిరు' రీ ఏంట్రీ కోసం హంగామా చేస్తున్నారనుకునే వారంతా ఈ వసూళ్లను చూసి స్టార్ గా చిరంజీవి బాక్సఫీసు స్టామినాను చూసి సర్ ప్రైజ్ అవుతున్నారు.

సిక్స డేస్...
ఆరు రోజుల్లో వందకోట్ల వసూల్ అంటే మాములు విషయం కాదు. కేవలం చిరంజీవి బాక్సాఫీసు చరిష్మా వల్లే ఈ రికార్డ్ అనేది ఒప్పుకోవాల్సిందే. నేషనల్ మార్కెట్ ఉన్న బాలీవుడ్ స్టార్స్ అమీర్, సల్మాన్ సినిమాలు మాత్రమే నాలుగైదు రోజుల్లో వందకోట్లు కలెక్ట్ చేస్తాయి. అలాంటిది మెగాస్టార్ మూవీ ఆరు రోజుల్లో వందకోట్ల వసూల్ చేసిందంటే టాలీవుడ్ నిజంగా గర్వపడాల్సిందే. బాహుబలి లాంటి అసాధారణ సినిమాను మినహాస్తే పక్కా కమర్షియల్ సినిమాల్లో మాత్రం ఖైదీ నెంబర్ 150 గ్రేట్ రికార్డ్ దక్కించుకుంది. ఇక్కడే చిరు స్టామినా ఏంటో తెలుస్తుంది. సోమవారం నాటికి 'ఖైదీ నెంబర్ 150’ వరల్డ్ వైడ్ గా 106 కోట్లు వసూల్ చేసింది.

వరల్డ్ వైడ్ గా..
వరల్డ్ వైడ్ గా 106కోట్ల గ్రాస్ వసూల్ చేసిన ఖైదీ ఇప్పటికే 70 కోట్ల షేర్ మార్క్ ని దాటడం విశేషం.మార్కును దాటేయడం విశేషం. నైజాంలో రూ.14 కోట్లు, సీడెడ్లో 9.4 కోట్లు, నెల్లూరులో2.25 కోట్లు, గుంటూరులో 5.09 కోట్లు, కృష్ణాలో 3.78 కోట్లు, పశ్చిమ గోదావరిలో4.55 కోట్లు, తూర్పుగోదావరిలో 5.88 కోట్లు, ఉత్తరాంధ్రలో7.22 కోట్లు ఇలా ప్రతి ఏరియాలోనూ రికార్డు స్థాయిలో షేర్ సాధిస్తూ చిరు మూవీ బాక్సాఫీసు ప్రకంపనలు రేపుతోంది. అమెరికాలో ఇప్పటికే ఈ చిత్రం 2.15 మిలియన్ డాలర్లు సుమారు ఇండియన్ కరెన్సీలో 14కోట్లు వసూల్ చేసింది. పుల్ రన్ లో ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్ శ్రీమంతుడు ని బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రిపబ్లిక్ డే పాటు సండే వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడం కూడా చిరంజీవి సినిమాకి బాగా కలిసొచ్చే అంశం. మరి 'ఖైదీ’,'శ్రీమంతుడిని' క్రాస్ చేస్తాడో చూడాలి.

09:46 - January 23, 2017

మాజీ ప్రపంచ సుందరి 'ఐశ్వర్యరాయ్' తరువాత ఆ అదృష్టం లండన్ బ్యూటీ 'అమీజాక్సన్' కే దక్కిందట. అందుకే ఇంగ్లీష్ బ్యూటీ హార్డ్ వర్క్ చేస్తోందట. అచ్చొచ్చిన లక్ తో ఈసారి తన రాత మారిపోతోందని తెల్లపిల్ల కాన్పిడెంట్ గా ఉంది. ఇంతకీ 'ఐశ్వర్యరాయ్' తరువాత బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ కి మాత్రమే దక్కిన ఆ క్రెడిట్ ఏంటీ ? లండన్ బ్యూటీ అమీ జాక్సన్ సక్సెస్ లు లేకపోయినా కూడా బడా ఛాన్స్ లు మాత్రం వచ్చిపడుతున్నాయి. తెలుగులో 'రామ్ చరణ్' తో 'ఎవడు' సినిమాలో స్క్రీన్ షేర్ చేసిన ఈ బ్యూటీకి తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. అంతేకాదు ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకున్న శంకర్ తీసిన 'ఐ' సినిమా కూడా బోల్తాకొట్టింది. ఈ సినిమా ప్లాప్ అయిన కూడా ఈ గ్రేట్ దర్శకుడు వెంటనే తన నెక్ట్స్ మూవీ 'రోబో 2'లో మరోసారి హీరోయిన్ గా అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇలా శంకర్ మూవీలో రెండోసారి నటించే చాన్స్ ఆ ఇద్దరి హీరోయిన్స్ తరువాత తనకే దక్కిందని ఈబ్యూటీ ఇంగ్లీష్ బ్యూటీ తెగ మురిసిపోతోంది.

రోబో 2
దర్శకుడు శంకర్ సినిమా సినిమాకి కొత్త హీరోయిన్స్ ని తీసుకుంటాడు. ఆయన ఒకే హీరోయిన్ ని రెండు మూడు సార్లు రిపీట్ చేయడు. అలాంటిది 'ఐ' తరువాత వెంటనే 'రోబో 2’ కోసం 'అమీ జాక్సన్' రిపీట్ చేస్తున్నాడు. అయితే ఇలా ఇంతకు ముందు శంకర్ ఇద్దరు హీరోయిన్స్ ని మాత్రమే రిపీట్ చేశాడు. 'భారతీయుడు' సినిమా కోసం 'మనీషా కోయిరా'లను తీసుకున్న ఈ దర్శకుడు 'ఒకే ఒక్కడు' సినిమా కోసం రెండోసారి ఆ హీరోయిన్ ని రిపీట్ చేశాడు. ఆ తరువాత 'జీన్స్' సినిమా కోసం 'ఐశ్వర్యరాయ్' ని తీసుకున్న శంకర్ 'రోబో' కోసం 'ఐష్' ని మరోసారి రిపీట్ చేశాడు. మనీసాకోయిరాల, ఐశ్వర్యారాయ్ లను గ్యాప్ ఇచ్చి రిపీట్ చేసిన శంకర్ 'అమీజాక్సన్' కి మాత్రం వెంట వెంటనే సినిమాలు ఇచ్చాడు. శంకర్ మరోసారి ఇచ్చిన గ్రేట్ ఛాన్స్ కోసం ఈ ఇంగ్లీష్ చిన్నది బాగా హార్డ్ వర్క్ చేస్తోందట. సూపర్ స్టార్ 'రజనీకాంత్', బాలీవుడ్ స్టార్ 'అక్షయ్ కుమార్‌'తో శంకర్ తీస్తున్న భారీ మూవీ ‘2.0’లో ఎమీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ కోసం అమీ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుందట. అలాగే స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ ఫిట్ వుండడానికి వర్కవుట్స్ కూడా చేస్తోందట. మరి శంకర్ 'రోబో' సీక్వెల్ తో అయిన ఈ బ్యూటీకి బ్రేక్ ఇస్తాడో చూడాలి.

మెరీనా బీచ్..టెన్షన్..టెన్షన్..

చెన్నై : మెరీనా బీచ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు ఆందోళనకారులు..మరోవైపు పోలీసులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీచ్ కు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు పెట్టి ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.

09:25 - January 23, 2017

హైదరాబాద్ : నగరంలో స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి పలువురు మృత్యువాత పడుతున్నారు. నగరంలో పేరొందిన గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నాగర్ కర్నూలుకు చెందిన లక్ష్మయ్య (31) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనవరి నెలలో 5 గురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనితో వ్యాధిగ్రస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 11 మంది చికిత్స పొందుతున్నారు. చలి తీవ్రత అధికం కావడంతో వ్యాధి తీవ్రంగా విస్తరిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పోలీసులపైకి రాళ్లు రువ్విన స్మగ్లర్లు..

తిరుపతి : చంద్రగిరి (మం) శ్రీవారి మెట్టు సమీపంలోని లక్ష్మీపురం చెరువు వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులపైకి స్మగ్లర్లు రాళ్లు రువ్వారు. గాల్లోకి పోలీసులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి 50 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

 

దోపిడి చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్టు..

గుంటూరు : నగర శివారులలో ప్రేమ జంటలను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 20వ తేదీన అడవితక్కెళ్లపాడు వద్ద ప్రేమ జంటను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనితో తాడికొండ పీఎస్ కు చెందిన వెంకటస్వామి, పెదకాకాని పీఎస్ కు చెందిన నాగేశ్వర్ రావులను అరెస్టు చేశారు.

స్వైన్ ఫ్లూతో ఒకరి మృతి..

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ తో చికిత్స పొందుతూ నాగర్ కర్నూలు కు చెందిన లక్ష్మయ్య మృతి చెందాడు. ఈ లక్షణాలతో ఆసుపత్రిలో 11మంది చికిత్స పొందుతున్నారు.

సివిల్ ఏవియేషన్ అధికారులతో చర్చిస్తాం - అశోక్ గజపతి రాజు..

తిరుమల : శ్రీవారి ఆలయంపై నుండి విమానాలు వెళ్లకుండా పైలట్లకు సూచనలు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నామని, సివిల్ ఏవియేషన్ అధికారులతో చర్చించి నిర్ణయిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.

 

మెరీనా బీచ్ లో తీవ్ర ఉద్రిక్తత..

చెన్నై : మెరీనా బీచ్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీచ్ కు భారీగా చేరుకోవడంతో ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

 

కాంగ్రెస్ జాబితా విడుదల..

ఉత్తర్ ప్రదేశ్ : కాంగ్రెస్ జాబితాను విడుదల చేసింది. ఎస్పీతో పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 41 మంది జాబితాను విడుదల చేసింది.

09:22 - January 23, 2017

శ్రీకాకుళం : ఉద్దాన కిడ్నీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కిడ్నీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కిడ్నీ వ్యాధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనితో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎయిమ్స్ బృందం మూడు రోజులుగా ఇక్కడ పర్యటించి సమస్యలు తెలుసుకుంది. ఈ సందర్భంగా మంత్రి కామినేనితో టెన్ టివి ముచ్చటించింది. కిడ్నీ సమస్యలకు కారణం తెలియదని, వ్యాధి మూలాలను కనుక్కొనే సామర్థ్యం లేదని మంత్రి కామినేని పేర్కొన్నారు. ఇంకా ఏమి మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి...

09:21 - January 23, 2017

చెన్నై : జల్లికట్టు నిషేధంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అక్కడి ప్రజలు సంతృప్తి పడడం లేదు. వెంటనే జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం, చట్టబద్ధత కల్పించాలంటూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. మెరీనా బీచ్ లో గత కొన్ని రోజులుగా తమిళ తంబీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. జల్లికట్టుకు ఆర్డినెన్స్ తీసుక రావడం జరిగిందని, సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. కానీ ఆందోళనకారులు మాత్రం వినిపించుకోవడం లేదు. దీనితో సోమవారం మెరీనా బీచ్ వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. నిరసన కారులను అక్కడి నుండి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట..వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారి పోయింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చారని వెంటనే ఆందోళన విరమించి ఇక్కడి నుండి వెళ్లిపోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. శాశ్వత పరిష్కారం చేయాలని, చట్టబద్ధత చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆందోళనకారులు తేల్చిచెబుతున్నట్లు తెలుస్తోంది. జనవరి 26వ తేదీ సమీపిస్తుండడం..అంతకంటే ముందు ఇక్కడి ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. దీనితో లాఠీఛార్జీ చేసైనా సరే ఆందోళనకారులను ఇక్కడి నుండి పంపించాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

09:19 - January 23, 2017

ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరమీదకు వస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ జరిగిన పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని హోదాపై పోరాటం చేయాలని పలువురు పేర్కొంటున్నారు. దీనితో రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా విశాఖలో మౌన ప్రదర్శన చేయాలని యువకులు సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ అంశంతో పాటు లాల్..నీల్ జెండాలు కలిస్తే ప్రపంచాన్ని జయిస్తామని సీపీఎం నేత ఏచూరి పిలుపునివ్వడంపై టెన్ టివిలో ప్రత్యేక చర్చ జరిగింది. ఈ చర్చలో లక్ష్మీ పార్వతి (వైసీపీ), చలసాని (ఆంధ్రా మేధావుల అధ్యక్షుడు), దినకర్ (టిడిపి), తెలకపల్లి రవి (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హోదాపై వక్తలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

 

తిరుమాళ్లపల్లిలో ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు..

తిరుపతి : చంద్రగిరి (మం) తిరుమాళ్లపల్లి సమీపంలో ఓ చెరువులో అక్రమంగా దాచి ఉంచిన 50 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు.

మెరీనా బీచ్ కు చేరుకున్న పోలీసులు..

చెన్నై : జల్లికట్టు సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని, చట్టబద్ధత కల్పించాలంటూ ఆందోళనకారులు మెరీనా బీచ్ లో నిరసన కొనసాగిస్తున్నారు. ఆందోళనకారులను తొలగించేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

07:03 - January 23, 2017

తెలంగాణలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు చలికి గజగజ వణికిపోతున్నారు. కిటికీలు, తలుపులేని గదుల్లో నేల మీదే పడుకుంటున్న దృశ్యాలు అనేక హాస్టళ్లలో కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చద్దర్లు, రగ్గులు సరఫరా చేయకపోవడం, ఒకవేళ సరఫరా చేసినా నాణ్యతలేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విద్యా సంవత్సరం పూర్తి కావొస్తున్నా ఇంతవరకు యూనిఫాం పంపిణీ చేయలేదు. తెలంగాణలో సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై టెన్ టివి జనపథంలో తెలంగాణ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ విశ్లేషించారు. ఆయన ఎలాంటి సూచనలు..సమస్యలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి.

07:00 - January 23, 2017

కోల్‌కతా వన్డేలో భారత్‌ పోరాడి ఓడింది. మూడు వన్డేల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్‌.. మూడో వన్డేలో ఓటమి పాలైంది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 5పరుగుల తేడాతో విజయాన్ని చేజర్చుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సిన ఉండగా 10 పరుగులు మాత్రమే చేసి అయిదు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

భారత్ బ్యాటింగ్..
భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌... ఆదిలోనే రహానే ఒక్క పరుగు.., రాహుల్‌ 11 పరుగులు చేసి ఔట్‌ అయ్యారు. కెప్టెన్‌ కోహ్లీ 55 పరుగులు చేయగా.., యువరాజ్‌సింగ్‌ 45 పరుగులు చేశారు. వీరిద్దరూ ఔట్‌ అయిన తర్వాత ధోనీ 25 పరుగులతో పోరాడినా చేయాల్సిన పరుగులు భారీగా ఉండటంతో మిగతా వాళ్లపై భారం పడింది. ఇలాంటి సమయంలో హార్దిక్‌ 56 పరుగులు చేయగా.. జడేజా 10 పరుగులతో కలిసి కేదార్‌ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేసినా చివరి ఓవర్‌లో భారత్‌ ఓటమి పాలైంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ 3 వికెట్లు తీయగా.., వోక్స్‌ 2, బాల్‌ 2, విల్లే, ప్లంకెట్‌ తలో వికెట్‌ తీశారు.

ఇంగ్లండ్ బ్యాటింగ్..
అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లు రాయ్‌ 65 పరుగులు, బిల్లింగ్స్‌ 35పరుగులతో అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. వారిద్దరూ ఔటయ్యాక కెప్టెన్‌ మోర్గాన్‌ 43పరుగులు చేయగా., బెయిర్‌స్టో 56పరుగులతో రాణించారు. చివర్లో బెన్‌ స్టోక్స్‌ 57 పరుగులతో అద్భుతమైన అర్ధశతకం, వోక్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో హార్దిక్‌ 3 వికెట్లు తీయగా..జడేజా 2, బుమ్రా ఒక వికెట్‌ తీశారు. 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచి 3 వికెట్లు తీసిన ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కించుకున్నాడు. ఇక మొదటి వన్డేలో 120, చివరి వన్డేలో 90 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

06:38 - January 23, 2017

శ్రీకాకుళం : జిల్లాలో వంశధార ప్రాజెక్ట్ ప్రాంత నిర్వాహాకులు ఆందోళనను ఉధృతం చేశారు. వేలాది మంది ప్రజలు ఏకమై ప్రాజెక్ట్ పనులను అడ్డుకుంటున్నారు. తమకు ప్యాకేజీ విషయంలో స్పష్టత ఇచ్చిన తరువాతే ప్రాజెక్ట్ పనులను మొదలుపెట్టాలని స్పష్టం చేస్తున్నారు. సుమారు ఆరు వేల మంది గ్రామస్తులు వంశధార పనులను అడ్డుకుని.. ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లా హీరమండల పరిధిలోని వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులు ఆందోళనను ఉధృతం చేశారు. వేలాది స్థానికులు సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాదిగా కదిలిన స్థానికులు హిరమండల కేంద్రంలోని గొట్టా బ్యారేజీ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.

ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు..
వంశధార ప్రాజెక్ట్ కు తాము వ్యతరేకం కాదని.. కానీ ఇక్కడి నిర్వాసితులకు సరైన న్యాయం చేయకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ప్యాకేజీ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ప్రాజెక్ట్ పనులు చేస్తుండటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు ప్రాజెక్ట్ పనులను అడ్డుకుని తమ నిరసనలు తెలియజేసినప్పటికీ ప్రభుత్వం స్థానికులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ విషయంలో గతంలో ప్రభుత్వానికి, నిర్వాసితులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 2006 లో ప్రకటించిన విధంగా నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోందని ... అయితే ప్రస్తుతం మారిన పరిస్థితులు, భూముల ధరలను పరిగణలోకి తీసుకుని ప్యాకేజీ ప్రకటించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. విడవమంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం అన్న చందంగా వంశధార ప్రాజెక్ట్ వ్యవహారం మారింది. ప్యాకేజీ విషయంలో స్పష్టత ఇచ్చి పనులు చేసుకోమని నిర్వాసితులు డిమాండ్ చేస్తుంటే.. వారి మాటలకు విలువ ఇవ్వకుండా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. ప్రభుత్వ కవ్వింపు చర్యల నేపథ్యంలో జిల్లాలోని ప్రజా సంఘాలు, వామపక్షాల మద్దతుతో నిరసనలు మరింత ఉధృతం చేసేందుకు స్తానికులు సమాయత్తమవుతున్నారు.

06:35 - January 23, 2017

శ్రీకాకుళం : జిల్లా ఉద్దానంలో కిడ్ని బాధితులకు ఏపీ ప్రభుత్వం ఎయిమ్స్ బృందంతో పరీక్షలు చేయించింది. ఈ సమస్యకు మూలాలు కనుకున్నేందుకే.. ఈ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అయితే అసలు ఈ ప్రాంతంలో ఈ వ్యాధి ఎందుకొస్తుందో చెప్పలేమన్నారు కామినేని. అయితే బాదితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంకా ఎలాంటి అంశాలు మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

06:33 - January 23, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై పోరును టీజేఏసీ మరింత ఉధృతం చేసింది. సమస్యలపై ప్రజలను కదిలించేందుకు వినూత్నంగా ముందుకెళుతోంది. ప్రభుత్వ పనితీరుపై యూత్‌ను కదిలించేందుకు సోషల్‌ మీడియాను విస్తృతంగా వాడుకోడానికి రెడీ అయింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులు కోరాదన్న నిర్ణయంతో.. సోషల్‌ మీడియాను ఆయుధంగా ఉపయోగించడానికి రెడీఅయింది.

వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో టీజాక్‌ ప్రచారం..
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, గ్రామస్థాయిల్లో పర్యటనలుచేస్తున్న టీజాక్.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. కిందిస్థాయి నాయకత్వానికి సోషల్‌ మీడియా వినియోగంపై అవహన కల్పించడానికి శిక్షణాశిబిరాలను నిర్వహిస్తోంది. వాట్సప్, ఫేస్ బుక్, ట్విటర్ లాంటి అన్ని సోషల్ మీడియా అస్త్రాల ద్వారా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ఇప్పటికే ఓ వెబ్ సైట్ ను మొదలు పెట్టిన టీజాక్ త్వరలో ఓ మాసపత్రికను కూడా ప్రజల ముందుకు తేవాలన్న యోచనతో ఉంది. ప్రధాన మీడియాకు తోడు యూత్‌ను బాగా ప్రభావితం చేస్తున్న సోషల్‌ మీడియాను ఎంచుకున్న టీజాక్‌ .. ఇక ప్రభుత్వాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తామంటోంది.

తెలంగాణ జాగృతి క్రికెట్ ఫైనల్ మ్యాచ్..

హైదరాబాద్ : నేడు తెలంగాణ జాగృతి క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ లో మహబూబ్ నగర్ - హైదరాబాద్ జట్లు ఢీకొననున్నాయి.

నేడు భక్తరామదాసు ట్రయల్ రన్..

ఖమ్మం : జిల్లా కూసుమంచి మండలంలోని ఎర్రగడ్డ తండాలో కొత్తగా నిర్మిస్తున్న భక్తరామదాసు ప్రాజెక్టు ట్రయల్ రన్ నేడు జరగనుంది. సోమవారం రాత్రి ప్రాజెక్టులోని రెండు మోటార్లతో ట్రయల్ రన్ చేయనున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు.

విజయనగరంకు నేడు జగన్ రాక..

విజయనగరం : నేడు వైసీపీ అధ్యక్షుడు జగన్ జిల్లాకు రానున్నారు. కూనేరు రైలు ప్రమాద స్థలాన్ని ఆయన సందర్శించనున్నారు. అనంతరం బాధితులను పరామర్శించనున్నారు.

సీతావారిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం..

సూర్యాపేట : జిల్లాలోని గరిడెపల్లి మండలం సీతావారిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

నల్గొండలో సైకో వీరంగం..

నల్గొండ : జిల్లాలోని నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు..ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Don't Miss