Activities calendar

24 January 2017

21:33 - January 24, 2017

అమరావతి: వంశధార నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసంచేస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. నిర్వాసితులను కలిసేందుకు వెళ్తున్న నిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమూర్తిని శ్రీకాకుళంలో అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. అరెస్ట్ చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని మధు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పోలీసులతో పాలన సాగిస్తుందని.. ఉద్యమాలను అణచివేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

21:30 - January 24, 2017

అమరావతి: స్వైన్‌ ఫ్లూ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు స్వైన్‌ ఫ్లూ కేసులు వచ్చిన వెంటనే డీఎం అండ్‌ హెచ్ఓ లకు సమాచారం అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

21:28 - January 24, 2017

తూ.గో: కాపులను బీసీ జాబితాలో చేర్చాలంటూ... బుధవారం సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభం కానున్న దృష్ట్యా కోనసీమలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. స్థానికంగా సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 అమలు చేస్తూ.. ఎక్కడికక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అటు సత్యాగ్రహ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. అదనపు బలగాలు గ్రామాల్లో కవాతులు నిర్వహించడం, ఎలాంటి కార్యక్రమాలకు అనుమతులు లేవని , ప్రజలు సహకరించాలని పోలీసులు సూచిస్తున్నారు. ముద్రగడను, కాపు నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తామని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు.

21:21 - January 24, 2017

అమరావతి :తమిళుల జల్లికట్టు ఉద్యమం.. ఏపీలోనూ పోరాట స్ఫూర్తిని రగిలిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదాకోసం పోరాడే యవతకు మద్దతిస్తామని ఇప్పటికే ట్విట్టర్‌లో ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. తాజాగా యువతకు ప్రేరణ కలిగించేలా పాటలు కూడా విడుదల చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి దన్నుగా నిలిచేలా మొత్తం ఆరు పాటల అల్బంను రూపొందించిన పవన్‌ కల్యాణ్‌.. వాటిలో యువతరాన్ని ఉర్రూతలూగించే నాలుగు పాటల్ని విడుదల చేశారు.

తమిళ తంబీల తరహాలో...

తమిళ తంబీల తరహాలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడతామన్న యువత.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌ వేదికగా భారీ ఉద్యమానికి సన్నాహాలు చేస్తున్నారు. తమపై లాఠీలు విరిగినా ప్రత్యేక హోదాపై తమ ఉద్యమం అగదంటున్నారు ఏపీ విద్యార్థి జేఏసీ నేతలు. ప్రత్యేక హోదా కోసం యువతీ, యువకులు కదలి రావాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడే యువతకు దన్నుగా..

ప్రత్యేక హోదా కోసం పోరాడే యువతకు దన్నుగా నిలిచిన పవన్‌ బాటలోనే మరికొందరు సినీ హీరోలు మద్దతు ప్రకటించారు. హోదా కోసం జరిపే పోరాటానికి తమ మద్దతూ ఉంటుందని తాజాగా ట్విట్టర్‌లో స్పందించారు. హీరోలు సాయిధరమ్‌ తేజ, నాని, నవదీప్‌, మంచు విష్ణు, సంపూర్ణేష్‌ బాబు యువతకు మద్దతుగా ట్వీట్‌లు చేశారు.

ట్వీట్‌లతోనే సరిపెట్టకుండా.. ఆర్కే బీచ్‌లో జరిగే ....

అయితే.. సినీ హీరోలు, ప్రముఖులు ట్వీట్‌లతోనే సరిపెట్టకుండా.. ఆర్కే బీచ్‌లో జరిగే కార్యక్రమానికి స్వయంగా హాజరు కావాలని విద్యార్థి జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. మొత్తానికి విద్యార్థులు, సినీ, రాజకీయ వర్గాలు కదిలి వస్తుండటంతో.. ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమం మరోసారి ఉవ్వెత్తున ఎగిసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హోదా పోరు జోరందుకుంటున్న తరుణంలో..కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదాపై ఏమైనా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

21:19 - January 24, 2017

ఢిల్లీ: నోట్ల రద్దుపై అధ్యయనం చేసి తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన బృందం తమ మధ్యంతర నివేదికను ప్రధాని మోదీకి సమర్పించింది. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఈ బృందం ప్రధాని మోదీని కలిసి ఈ నివేదికను సమర్పించింది. డిజిటల్‌ కరెన్సీపై ఎలాంటి రుసుం వసూలు చేయకూడదని వీలైతే రాయితీ ఇవ్వాలని నివేదికలో సూచించారు. అలాగే.. స్మార్ట్‌ ఫోన్‌కు, బయోమెట్రిక్‌ డివైజ్‌కు వెయ్యి రూపాయల సబ్సిడీ ఇవ్వాలని కోరారు. డిజిటల్‌ లావాదేవీల్లో ఇన్సూరెన్స్‌ విధానం అమలు చేయాలన్నారు. వీటితో పాటు 50 వేల రూపాయల పైన డబ్బులు డ్రా చేస్తే క్యాష్‌ హ్యాండ్లింగ్‌ ఛార్జీలు వేయాలని నివేదికలో సూచించినట్లు చంద్రబాబు తెలిపారు. డిజిటల్‌ లావాదేవీలతో అవినీతి అంతమవుతుందన్నారు. పీఎంను కలిసిన వారిలో మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ అరవింద్ పనగరియా తదితరులు ఉన్నారు.

21:17 - January 24, 2017

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు... వృద్ధిరేటు అధికంగా ఉన్న రాష్ర్టాల లిస్టులో తెలంగాణ ఉందని గుర్తుచేశారు.. ఈ వృద్ధిరేటును ఉపయోగించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్ని వేగంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై ప్రగతి భవన్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టర్లు... ప్రభుత్వ ఉద్దేశ్యాలను అర్థంచేసుకొని సకాలంలో పనులు పూర్తిచేయాలని సూచించారు..

డిజిటల్ లావాదేవీలపై నివేదిక

ఢిల్లీ: డిజిటల్ లావాదేవీలపై ప్రధాని మోదీకి సీఎంల కమిటీ ప్రధానికి మోదీకి 11 పేజీల మధ్యంతర నివేదిక సమర్పించింది. ఏపీ, సిక్కిం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సీఎంలు డిసెంబర్ నాటికి 3వేల కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగేలా, డిసెంబర్ నాటికి 3వేల కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగేలా అన్ని బ్యాంకుల లావాదేవీలను పర్యవేక్షించేలా డ్యాష్ బోర్డు ఏర్పాటుచేయాలని సీఎం కమిటీ నిర్ణయిచింది. అన్ని బ్యాంకుల్లో మార్చి 31 నాటికి ఆధార్ తప్పని సరి చేయాలని సూచించింది.

రేపు ఏపీ మంత్రివర్గం భేటీ

విజయవాడ : రేపు ఉదయం 11గంటలకు ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది.26న విశాఖలో ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమాలు, ముద్రగడ దీక్ష, అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

18:51 - January 24, 2017

భూపాలపల్లి : సీపీఎం మహాజన పాదయాత్ర కు ప్రజల ఆదరణ అపూర్వం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్ తెలిపారు. ఎలాంటి అవరోధాలు లేకుండా మహాజనపాదయాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టెన్ టివితో మాట్లాడుతూ....పాదయాత్రను సమన్వయం చేసే బాధ్యతను పార్టీ తనకు అప్పగించినందు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ అభివృధ్ధి చెందాలంటే ఎలాంటి కార్యాచరణ ను అమలు చేయాలని అనే అంశాలను గత సంవత్సరంగా అనేక మంది మేధావులు, ప్రజాసంఘాలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించినపుడు అన్ని రాజకీయపార్టీలు, మేధావులు, సామాజిక సంఘాలను కలుపుకుని చేయాలని వారు సూచించారని స్పష్టం చేశారు. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని... వారి స్పందనే మమ్మల్ని ముందుకు నడిపిస్తోందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:42 - January 24, 2017

హైదరాబాద్ : పవన్‌దేశ్‌బచావో ఆల్చమ్‌ నుంచి మూడో విడుదలైంది. పవన్ ఖుషీ సినిమాలోని యే మేరా జాహా పాటను రిమిక్స్ చేశారు. 'I AM GIVING A ENIRE NATION TO DESH BACHO' నినాదాన్ని ప్రజలకు ఈ పాట ద్వారా వినిపించారు.

18:37 - January 24, 2017

హైదరాబాద్: ప్రత్యేక హోదాపై ఈనెల 26న విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగే నిర్వహించతలపెట్టిన నిరసనకు పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి లేదన్న డిజిపి సాంబశివరావు ప్రకటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖ బీచ్‌లో యువత శాంతియుత ఆందోళనకు ప్రభుత్వం అనుమతివ్వాలని ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య హక్కును ఎవరు హరించలేరని పవన్ హెచ్చరించారు.

ఢిల్లీలోని గఫర్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం...

హైదరాబాద్ : ఢిల్లీలోని గఫర్ మార్కెట్‌లో ఇవాళ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గఫర్ మార్కెట్‌లోని మూడు దుకాణాల్లో అగ్నిప్రమాదం జరగడంతో వాటిలోని సామాగ్రి కాలిపోయింది. దీంతో సమాచారమందుకున్న సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని 3 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

 

18:27 - January 24, 2017

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు ఎందుకు పెరుగుతున్నాయి..? డ్రాపౌట్స్ కు కారణాలు ఏంటి? విద్యావ్యవస్థ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకుంటోందా..? బడ్జెట్ లో 25శాతం ఎడ్యుకేషన్ కు కేటాయించాలి.ప్రాథమిక విద్యాను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందా? ఇత్యాది అంశాలపై చర్చను చేపట్టింది. ఈ చర్చలో అసర్ నివేదిక సమన్వయ కర్త బండారు రామ్మోహన్, పేరెంట్స్ అసోసియేషన్ నేత నాగటి నారాయణ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:23 - January 24, 2017

హైదరాబాద్: కొండ నాల్కకు మందేస్తే.. ఉన్న నాల్క ఊడినట్లైంది అతని పరిస్థితి. కాలు నొప్పితో సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళితే ఆపరేషన్‌ చేసి మొత్తం నడవకుండా చేశారని.. తమకు న్యాయం చేయాలని బాధితుడి బంధువులు ఆందోళనకు దిగారు. కాలునొప్పితో డిసెంబర్‌ 31న నటరాజ్‌ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. ట్రీట్‌మెంట్‌కు లక్షన్నర ఖర్చవుతుందన్న వైద్యులు ఆపరేషన్‌ చేశారు. అయితే ఆ ఆపరేషన్‌ ఫెయిల్‌ కావడంతో.. రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. తర్వాత మరోసారి ఆపరేషన్‌ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ మూడున్నర లక్షలు ఖర్చయ్యాయి. ఇప్పుడు డిశ్చార్జ్‌ చేస్తాం.. బయట ఫిజియోతెరఫీ చేయించుకోవాలని సూచిస్తున్నారని బాధితుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిజియోథెరఫీకి మరో రెండున్నర లక్షలు ఖర్చు కావచ్చని చెబుతున్నారని.. తమకు న్యాయం చేయాలని బాధితుడి బంధువులు కోరుతున్నారు.

18:20 - January 24, 2017

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సామాజిక తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని తమ్మినే పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ లక్ష్య సాధన కోసం సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేస్తున్న పాదయాత్ర కీలక మైలురాయిని అధిగమించింది. నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం 950 ఆవాసాల్లో 2,645 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం అడవుల్లో మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ వంద రోజుల్లో అనేక అనుభవాలు ఎదురయ్యాయి. 100 రోజులకు సంబంధించిన వివరాలను 'టెన్ టివి'తో పాదయాత్ర బృందం రధసారధి తమ్మినేని షేర్ చేసుకున్నారు. ఈ వివరాలు ఏంటో చూద్దాం.

ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం 2003లో మహాప్రస్థానం పాదయాత్ర ద్వారానే సాగు నీటి ప్రాజెక్టులు వెలుగులోకి వచ్చాయి. 2004 లో వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం  జలయజ్ఞం పేరుతో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ప్రారంభించారు. అంతకముందు సాగునీటి ప్రాజెక్టులకు లేని ప్రాధాన్యత 2004 నుండి ప్రారంభం అయ్యింది. మహప్రస్థానం పాదయాత్ర తరువాత ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను రాజకీయ పార్టీల ఎజెండాలోకి తీసుకురావడానికి మహాప్రస్థానం పాద యాత్ర ఉపయోగపడింది.

మహాజనపాదయాత్ర దానికి భిన్నమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండున్నరేళ్ల తరువాత పేదల్లో ఏరకమైనటువంటి మార్పు రాలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పధాన నడిపించడం ఏ మార్గాన సాగాలనే స్పష్టత ప్రభుత్వానికి లేదు. తెలంగాణ లో 93 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ కులాలకు సంబంధించిన వారు. తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని నిర్లక్ష్యం చేసింది. ఈ అంశంపై పాదయాత్ర జరగుతోంది. దీంతో రాష్ట్ర ఎజెండాను మార్చడానికి, రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమైన ఎజెండాను వెలుగులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతోంది. ఈ అంశంపై సంతృప్తి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్ర ను అడ్డగించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రజావ్యతిరేకత వస్తుందన్న భయంతో తర్వాత వెనక్కితగ్గింది. అభివృద్ధి పట్ల టీఆర్ ఎస్ పాలకులు చెబుతున్న అభివృద్ధి అంతా బూటకం. ప్రజల్లో ఈ ఎజెండా పట్ల పెద్ద ఆదరణ ఉంది. ప్రభుత్వం కూడా స్పందిచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ యాత్ర యొక్క సక్సెస్ అక్కడే ఉంది.

 అభివృద్ధి అంటే ఆ రాష్ట్రంలో ప్రజల జీవన కనీస అవసరాల్లో అభివృద్ధి ఉండాలి. పారిశ్రామిక అభివృద్ధి అన్నా పారిశ్రామిక విధాన రూపకల్పన అన్నా ఒక లక్ష్యం స్పష్టంగా ఉండాలి. అది యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఉండాలి. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం, లేదా మంత్రి కేటీఆర్ ఎన్ని వందల మందికి ఉద్యోగాలు కల్పించారో చెప్పాలి. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమో గానీ ఉన్న విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఈ సందర్భంగా సామాజిక సంఘాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. భవిష్యత్ లో ప్రజా సమస్యలపై మహా ఉద్యమం నిర్మిస్తామని స్పష్టం చేశారు.

17:55 - January 24, 2017

హైదరాబాద్: పవన్‌దేశ్‌బచావో ఆల్చమ్‌ నుంచి నాలుగో పాట విడుదలైంది. పవన్ గుడుంబా శంకర్ సినిమాలోని లే లే లే పాటను రిమిక్స్ చేశారు.

17:53 - January 24, 2017

హైదరాబాద్:ఏపీకి ప్రత్యేక హోదాపై ఈనెల 26న విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగే నిర్వహించతలపెట్టిన నిరసనకు పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి లేదనిడీజీపీ సాంబశివరావు చెప్పారు. అనుమతి కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని, సోషల్‌ మీడియాలో వచ్చే సందేశాల ఆధారంగా భద్రత కల్పించలేమని తేల్చి చెప్పారు. నిర్వాహకులు ఎవరైనా ముందుకొచ్చి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు మీడియా ప్రచారం కల్పించినా చర్యలు తప్పని హెచ్చరించారు.

17:51 - January 24, 2017

హైదరాబాద్: నగరంలో చెత్త ప్రదేశాలను ముగ్గులతో అందంగా తీర్చిదిద్దింది. తడి, పొడి చెత్తను వేరు చేసింది.. పాదయాత్రలు చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మరీ పరిశుభ్రతపై అవగాహన కల్పించింది. రెండేళ్లుగా స్వచ్ఛ హైదరాబాద్‌ కోసం బల్దియా కృషి చేస్తోంది. స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యమయ్యేనా? 'పోటీ -500'లో మేటిగా నిలిచేనా? తడి-పొడి సేకరణ తడబడుతోందా? ప్రజాభాగస్వామ్యం పక్కాగా ఉందా? ఈ అంశాలపై జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి తో టెన్ టివి లైవ్ షో నిర్వహించింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

17:49 - January 24, 2017

హైదరాబాద్: పరిశుభ్రతపై అందరికీ ఆసక్తిని..అవగాహనను కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా హైదరాబాద్‌ను చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహించింది. రాష్ట్ర ప్రథమ పౌరుడు నుంచి సాధారణ పౌరుల వరకు అందరినీ కార్యక్రమాలలో భాగస్వాములను చేసింది. ఈ మేరకు దేశంలో 500 స్వచ్చ నగరాలతో పోటీ పడుతుంది. స్వచ్ఛ సర్వేక్షన్‌ ర్యాంకింగ్‌కు సిద్ధమవుతుంది.

తడి, పొడి చెత్త సేకరణ చెత్తబుట్టల పంపిణీ....

నగరాన్ని క్లీన్‌ సిటీగా మార్చేందుకు బల్దియా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా తొలుత తడి, పొడి చెత్త వేరుచేయడానికి ప్రతి ఇంటికీ రెండు చెత్తబుట్టలు పంపిణీ చేసింది..చెత్త సేకరణకు రెండు వేల ఆటోలను అందజేసింది. రోడ్‌ సైడ్స్‌, వీధుల్లో చెత్త వేసే 116 ఓపెన్‌ గార్బెజ్‌ పాయింట్లను అధికారులు తొలగించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక బిన్స్‌ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో మళ్లీ చెత్త వేయకుండా.. ముగ్గులు వేయించడం... మొక్కలు నాటించే చర్యలు చేపట్టారు. దీంతో గతంలో పోలిస్తే నగరంలో వెయ్యి టన్నుల చెత్త సేకరణ పెరిగింది.

3,300 గృహాలకు టాయిలెట్ల నిర్మాణం....

నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలనలో భాగంగా 3వేల 3 వందల గృహాలకు వ్యక్తిగత టాయిలెట్లను నిర్మించారు. అలాగే 250 పబ్లిక్‌ టాయిలెట్స్‌కు మరమ్మతులు చేపట్టి...నిర్వహణలోకి తెచ్చారు. అలాగే రద్దీ ప్రదేశాలలో వంద ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రాంతాల్లో ఈ-టాయిలెట్ల తెచ్చేందుకు బల్దియా శ్రీకారం చుట్టింది. అలాగే సిటీలో అనధికారికంగా వెలుస్తున్న ఫ్లెక్సీలు...హోర్డింగ్‌లు.. కటౌట్లను జీహెచ్‌ఎంసీ నిషేధించింది.

75 నగరాలలో 19వ స్థానం ...

పరిశుభ్రత విషయంలో గత సంవత్సరం నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌..75 నగరాలలో 19వ స్థానం దక్కించుకుంది. ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షన్‌లో మెరుగైన ర్యాంక్‌ కోసం కార్పొరేషన్ ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో పౌరులను భాగం చేయడానికి బల్దియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఏపీ, తెలంగాణ పోలీసులకు రాష్ట్రపతి పోలీసు పతకాలు..

హైదరాబాద్ : రిపబ్లిక్ డేను పురస్కరించుకుని కేంద్రం రాష్ట్రపతి పోలీసు పతకాలను ప్రకటించింది. ఏపీలో ఇద్దరికి, తెలంగాణలో ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకాలు వరించాయి. 

గఫర్ మార్కెట్ లో ఫైర్ ఆక్సిడెంట్..

ఢిల్లీ: గఫర్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్‌లోని మూడు దుకాణాల్లో అగ్నిప్రమాదం జరగడంతో సామాగ్రి మొత్తం కాలిపోయింది. 

ఆర్కే బీచ్ లో నిరసనలకు అనుమతి లేదు - ఏపీ డీజీపీ..

విజయవాడ : ఎల్లుండి ఆర్కే బీచ్ లో నిరసనలకు అనుమతి లేదని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యాలయ ఇన్ ఛార్జీ ఈవో..

శ్రీకాకుళం : కవిటి పంచాయతీ కార్యాలయం ఇన్ ఛార్జీ ఈవో శ్రీధర్ రూ. 10,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 

కేపీహెచ్ బీలోని ప్రైమ్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్..

హైదరాబాద్ : కేపీహెచ్ బీలోని ప్రైమ్ ఆసుపత్రిలో దవుపాటి నరేష్ (26) అనే రోగి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. రూ. లక్ష చెల్లించాలని ఆసుపత్రి వైద్యులు డిమాండ్ చేశారని, బ్రెయిన్ డెడ్ అయినా చికిత్స చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ఎదుట నరేష్ బంధువులు ఆందోళన చేశారు. రోగికి ట్రీట్మెంట్ విషయంలో తమ తప్పు లేదని, బ్రెయిన్ కు గాయం కావడంతో ఆపరేషన్ చేయడం జరిగిందని వైద్యులు పేర్కొన్నారు. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 258 పాయింట్లు లాభపడి 27,375 వద్ద సెన్సెక్స్ ముగియగా 84 పాయింట్ల లాభంతో 8475 నిఫ్టీ ముగిసింది. 

బీసీసీఐ, ఏజీకి సుప్రీం ఆదేశాలు..

ఢిల్లీ : బీసీసీఐకి పాలకుల పేర్లను సూచించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈనెల 27లోగా సీల్డ్ కవర్ లో పేర్లు సమర్పించాలని బీసీసీఐ, ఏజీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది. 

అశ్వరావుపేటలో వ్యక్తిపై ఏపీ పోలీసుల దాడి..

భద్రాద్రి : అశ్వరావుపేటలో ఆంధ్ర పోలీసులు అరాచకం సృష్టించారు. ఓ కేసు విషయంలో చల్లా దశరథ్ అనే వ్యక్తిపై దాడి చేశారు. కాలు విరగడంతో దశరథ్ ను ఏపీ పోలీసులు వదిలేసి వెళ్లారు. 

పనగరియాతో బాబు భేటీ..

ఢిల్లీ : నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగరియాతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. డిజిటల్ లావాదేవీలపై మధ్యంతర నివేదికకు చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ తుదిరూపు ఇవ్వనుంది. 

26న ఏపీ కాంగ్రెస్ మౌన దీక్ష..

విజయవాడ : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. ఏపీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని, ఉద్యమానికి సోనియా, రాహుల్ సహకారం అందిస్తారని తెలిపారు. ఈనెల 26న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండా, నల్లబ్యాడ్జీలతో మౌనదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 

15:44 - January 24, 2017

హైదరాబాద్ : మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఆధునిక చికిత్స పద్దతుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

15:42 - January 24, 2017
15:41 - January 24, 2017

విజయవాడ: నగరంలో మరో కాల్‌మనీ కేసు నమోదయ్యింది. 20 లక్షల రూపాయల అప్పునకు 80 లక్షల మేర ఆస్తులు రాయించుకున్న వడ్డీ వ్యాపారి... ఇంకా డబ్బులు చెల్లించాలని దంపతులపై ఒత్తిడి చేశాడు. వ్యాపారి వేధింపులు తాలలేక విజయవాడ సీపీ సవాంగ్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

15:39 - January 24, 2017

భూపాలపల్లి : .తెలంగాణ సీఎం కేసీఆర్‌ తప్పుడు కేసులు పెడుతూ గిరిజనుల్ని వేధిస్తున్నారని... బృందాకరత్‌ ఆరోపించారు. సీపీఎం మహాజన పాదయాత్రవందోరోజుకు చేరింది.. భూపాలపల్లిలో పాదయాత్ర బృందానికి అపూర్వ స్వాగతం లభించింది.. ఐటీడీఏ ఏటూరునాగారం, రామన్నగూడెం, రాంనగర్‌, కమలాపురంలో కొనసాగుతున్న పాదయాత్రకు సీపీఎం జాతీయ నేత బృందాకారత్‌ హాజరయ్యారు.. పాదయాత్ర బృందానికి బోనాలు, డప్పు చప్పుల్లతో స్థానికులు స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా బృందాకరత్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ పెద్ద నేరస్తుడని... చట్టాన్ని ఉల్లంఘించి గిరిజన భూముల్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు.. ఎర్రజెండాలను ఆపాలంటూ ప్రకటనలు చేస్తున్నారని... ఇంతమంది ప్రజల అభిమానం పొందిన ఎర్రజెండాలను ఎవరు ఆపుతారని ప్రశ్నించారు..

జనసేన..దేశ్ బచావో మూడో సాంగ్..

హైదరాబాద్ : జనసేన 'దేశ్ బచావో' మూడో సాంగ్ విడుదలైంది. కాసేపటి క్రితం మొదటి, రెండు సాంగ్ లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడో సాంగ్ లో 'ఖుషి సినిమాలోని 'యే మేరా జహా' పాటతో రీమిక్స్ రూపొందించారు. ఈ సాంగ్ లో 'దేశ్ బచావో' అంటూ పవన్ నినాదాలిచ్చారు. 

15:37 - January 24, 2017

భూపాల పల్లి: ఇవాళ చరిత్రాత్మకమైన రోజన్నారు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌. సీపీఎం మహాజన పాదయాత్ర సామాన్యమైనది కాదని చెప్పుకొచ్చారు.. పాదయాత్ర బృందం వందరోజుల్లో వేలాదిమంది ప్రజలను కలుసుకున్నారని గుర్తుచేశారు.. గతంలో ఇన్నిరోజులు, ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర ఎప్పుడూ జరగలేదని తెలిపారు.. ఈ స్థాయిలో గ్రామ గ్రామాన పాదయాత్ర చేస్తున్న బృందానికి సలాం అని

ప్రశంసించారు..

 

15:34 - January 24, 2017

హైదరాబాద్: పవన్‌దేశ్‌బచావో ఆల్చమ్‌ నుంచి రెండో విడుదలైంది. నారాజు గాకురా అనే పేరుతో పాట రిలీజ్ అయింది. ప్రత్యేక హోదాపై రాజకీయ నాయకులు చెప్పిన మాటలు, రోహిత్ వేముల ఆత్మహత్య, జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ అరెస్టు సంఘటనలను ఈ పాటలో ప్రస్తావించారు.

విజయవాడలో కాల్ మనీ కేసు..

విజయవాడ : మరో కాల్ మనీ కేసు నమోదైంది. రూ. 20 లక్షల అప్పునకు రూ. 80 లక్షల మేర ఆస్తులను వడ్డీ వ్యాపారి రాయించుకుని ఇంకా డబ్బులు చెల్లించాలని బాధితుడిపై వ్యాపారి ఒత్తిడి చేశాడు. బాధితుల చంద్రశేఖర్, లావణ్య దంపతులు సీపీ సవాంగ్ ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ప్రకాశంలో కేంద్ర కరవు బృంద పర్యటన..

ప్రకాశం : జిల్లాలో కేంద్ర కరవు బృందం పర్యటిస్తోంది. కరవు బృందంతో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. జిల్లాలో కరవు పరిస్థితిపై కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. 

భక్తరామదాసు ట్రయల్ రన్ పరిశీలించిన తుమ్మల..

ఖమ్మం: భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్‌ను రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.

బీసీసీఐకి కొత్త పాలకులు వద్దన్న రోహత్గీ..

ఢిల్లీ : బీసీసీఐకి ఇప్పుడే కొత్త పాల‌కుల‌ను నియ‌మించ‌వ‌ద్ద‌ని సుప్రీంకోర్టును అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గీ కోరారు. ఈ నిర్ణ‌యాన్ని రెండు వారాలు వాయిదా వేయాల్సిందిగా అభ్య‌ర్థించారు. 

నామినేషన్ వేసిన రాజ్ నాథ్ సింగ్ తనయుడు..

ఉత్తర్ ప్రదేశ్ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. నోయిడా నుండి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు. నోయిడాలోనే కాకుండా రాష్ట్రంలో పువ్వు వికసించే విధంగా చేస్తామన్నారు. 

ఏటూరు నాగారంలో సీపీఎం బహిరంగ సభ..

భూపాలపల్లి : సీపీఎం మహాజన పాదయాత్ర 100 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏటూరు నాగారంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఈ సభకు ఆదివాసీలు వేలాదిగా తరలివచ్చారు. సభకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్, మాజీ ఎంపీ మిడియం బాబురావు, పాదయాత్ర రథసారధి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. 

కేసీఆర్ కు రేవంత్ లేఖ...

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అధికారులు, వ్యాపారులు కలిసి రైతులను ముంచుతున్నారని, అధికారులు, వ్యాపారుల కుమ్మక్కుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కందికి మద్దతు ధర రూ. 10 వేలు, రూ. 450 బోనస్ ఇవ్వాలని, కొడంగల్ లో కంది అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. 

ద్యావుడా సినిమాపై హైకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : 'ద్యావుడా' సినిమా విడుదల చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అభ్యంతరకర సన్నివేశాలతో సినిమా చిత్రీకరించారని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 

దేశ్ బచావో రెండో సాంగ్..

హైదరాబాద్ : జనసేన 'దేశ్ బచావో' రెండో సాంగ్ విడుదలైంది. కాసేపటి క్రితం మొదటి సాంగ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో జరిగిన సంభాషణలతో మొదలైంది. అనంతరం పాపులర్ సాంగ్...'మన రోజు మనకుంది' అంటూ పాటతో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై టీవీ ఛానల్స్ లో వచ్చిన వార్తలు..కన్హయ్య నినాదం....పవన్ డైలాగ్స్ తో పాటను రూపొందించారు. 

14:05 - January 24, 2017

'వర్కింగ్ ఉమెన్ పై ఒత్తిడిలు' అనే అంశంపై మానవి వేదిక చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జాహ్నవి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ శాంతి, ప్రొ.పద్మజ 
పాల్గొని, మాట్లాడారు. భార్యాభర్తలు తలొక పని చేయాలన్నారు. బరువు, బాధ్యతలను మహిళలు చాలా సక్రమంగా నిర్వహిస్తారని తెలిపారు. స్త్రీలు ఎక్కువ పనులు చేస్తారని తెలిపారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:57 - January 24, 2017
13:55 - January 24, 2017

డైరెక్టర్ వివి వినాయక్ తో 10టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన ఖైదీ నెంబర్ 150 సినిమా గురించి వివరించారు. చిరంజీవి 150 వ సినిమాను ఏ డైరెక్టర్ తీసిన ఠాగూర్ లాంటి సినిమా తీయాలని అనుకున్నానని తెలిపారు. ఈ సినిమాకు హీరోయిన్ ను అనుకున్నప్పుడు చిరంజీవికి కాజల్ పర్ ఫెక్ట్ అని భావించానని తెలిపారు. అయితే మొదటి ఆప్షన్ కాజల్, వీలుగాని పక్షంలో రెండో ఆప్షన్ అనుష్క అనుకున్నామని చెప్పారు. సినిమాలో ఐటెం సాంగ్ ఉండాలనే ప్లాన్ తనదే అని చెప్పారు. సినిమాలో తనకు అత్యంతగా నచ్చిన పాట 'మిమి..మిమి'.. అనే సాంగ్ అని తెలిపారు. ఆయన తెలిపిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వీడియోలో చూద్దాం...

13:46 - January 24, 2017

విశాఖ : ఆర్కే బీచ్‌లో భారత్ డైనమిక్స్ లిమిడెట్ అధ్వర్యంలో 5 కే రన్ జరిగింది.  రిపబ్లిక్ డేను పురస్కరించుకొనిని రన్ ఫర్ నేషన్ అనే థీమ్‌తో జరిగిన ఈ మారధాన్ ను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. జూనియర్స్, సీనియర్స్ విభాగంగా విడివిడిగా జరిగిన ఈ మారథాన్ రన్ లో దాదాపు 300 మంది పాల్గొన్నారు. 

 

13:44 - January 24, 2017

ఆర్కే బీచ్ లో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ..

విశాఖపట్టణం : 26వ తేదీన ఆర్కే బీచ్ లో వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనుంది. హోదాపై మాట్లాడే వారిని ప్రభుత్వ పెద్దలు చులకన చేస్తున్నారని, ప్రత్యేక హోదాపై రెండుసార్లు తీర్మానాలు చేసిన సీఎం ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని వైసీపీ నేత బోత్స ప్రశ్నించారు.

మొదటి ఓడీఎఫ్ జిల్లా రాజన్న సిరిసిల్ల..

రాజన్న సిరిసిల్ల : తెలంగాణలో మొదటి ఓడీఎఫ్ జిల్లా రాజన్న సిరిసిల్ల నిలిచింది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి లక్ష్యాన్ని అధికారులు సాధించారు. కలెక్టర్ కృష్ణ భాస్కర్ బృందాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆరోగ్య రంగంలో లక్ష్యాలను పెట్టుకుని పనిచేయాలంటూ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.

13:37 - January 24, 2017

విజయవాడ : దేశ్ బచావో మ్యూజికల్ ఆల్బమ్ ను జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఆల్బమ్ లోని తొలిపాటను పవన్ రిలీజ్ చేశారు. యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. దేశభక్తి, స్ఫూర్తిదాయకమైన పాటలు రూపొందించామని ఆయన తెలిపారు. దేశ రాజకీయ పరిస్థితులపై పాటలు ఉంటాయన్నారు. డీజే పృథ్వీ పాటలను రూపొందించారని తెలిపారు. ఆరు పాటలతో మ్యూజికల్ ఆల్బమ్ రూపొందించారు. ఈరోజు నాలుగు పాటలను పవన్ విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

13:26 - January 24, 2017

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. అందులో 'డీజే పృథ్వీ సాయి' ఒకరు. టాలీవుడ్ కు ఇతను సరికొత్త మ్యూజిక్ టేస్టును అందించాడు. రీమేక్ లే తెలిసిన నేపథ్యంలో ఇతను రీ ట్రాక్ రుచి చూపించాడు. ఇతను అతిచిన్న వయస్సు కావడం విశేషం. డబ్ స్టెప్ నేర్పి కొత్త నడకను అద్దాడు. తాజాగా 'పవన్' 'దేశ్ బచావో' అంటూ ఓ మ్యూజిక్ ఆల్బంను రూపొందించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని..అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు ద్వారా జనసేన తన గొంతుకను వినిపిస్తుందని జనసేన పేర్కొంటోంది. ఈ ఆల్బంకు డీజే పృథ్వీసాయి మ్యూజిక్ అందించారని స్వయంగా 'పవన్' ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. కాసేపటి క్రితం మొదటి సాంగ్ విడుదలైంది. 'తమ్ముడు' సినిమాలోని ఓ పాట..పవన్ డైలాగ్స్ తో కొత్తగా పాటను రూపొందించారు. గతంలో కూడా 'తమ్ముడు' సినిమాలోని ఫన్నీ డైలాగ్స్..ఇష్టమైన సన్నివేశాలు..వయ్యారి భామ పాటను వాడుకుని కొత్త ఆల్బమ్ ను క్రియేట్ చేశాడు. కనిపించే దృశ్యాలకు తోడు వినిపించే పాటలో ప్రత్యేకత ఉండడమే ఇతని హైలెట్.

13:25 - January 24, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో 10 టీవీ 2017 క్యాలెండర్‌ను ప్రముఖ సామాజిక వేత్త పాకల దుర్గప్రసాద్ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ భద్రాచలం శ్రీ సీతారాముల సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకుల మంత్రోఛ్చారణల మధ్య జరిగింది. క్యాలెండర్ చిన్నారుల స్వచ్ఛమైన నవ్వులతో అందంగా ఉందని దుర్గప్రసాద్ అన్నారు.  

 

13:23 - January 24, 2017

విజయవాడ : కాసేపట్లో దేశ్ బచావో మ్యూజికల్ ఆల్బమ్ విడుదల కానుంది. జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఆల్బమ్ ను విడుదల చేయనున్నారు. ఆరు పాటలతో రూపొందించిన మ్యూజికల్ ఆల్బమ్ రూపొందించారు. ఈరోజు నాలుగు పాటలను పవన్ విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:20 - January 24, 2017

ఢిల్లీ : పోలవరం పంచాయతీ గ్రామాలలో డంపింగ్‌పై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో విచారణ జరిగింది. అనుమతులు లేకుండా పోలవరం పంచాయతీ గ్రామాలలో మట్టిని డంపింగ్‌ చేస్తున్నారని పెంటపాటి పుల్లరావు పిటిషన్‌ దాఖలు చేశారు. 4 వందల ఎకరాలలో వ్యవసాయ భూములలో మట్టిని డంపింగ్‌ చేస్తున్నారని.. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని పిటిషనర్‌ వాదనలు వినిపించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి, పర్యావరణ శాఖకు, పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీకి, ఏపీ, ఒడిశా, చత్తీష్‌ఘడ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌జీటీ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం తెలిపాని ఆదేశించింది. 

 

'దేశ్ బచావో' మొదటి పాట విడుదల..

హైదరాబాద్ : 'దేశ్ బచావో' పేరిట జనసేన పాటలను విడుదల చేస్తోంది. ఈ రోజు నాలుగు పాటలను విడుదల చేయనుంది. కాసేపటి క్రితం మొదటి పాటను విడుదల చేసింది. ఈ పాటలో మొదట 'తమ్ముడు' సినిమాలోని ఒక పాట వినిపించింది. అనంతరం ఇటీవల సభల్లో 'పవన్' మాట్లాడిన మాటలను వీడియోలో వినిపించారు.

 

13:14 - January 24, 2017

హైదరాబాద్ : జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏపీకి ప్రత్యేకహోదా ఉద్యమానికి మద్దతు ఇచ్చేందుకు టాలీవుడ్ ముందుకు వచ్చింది. ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతు పెరుగుతోంది. జల్లికట్టు ఉద్యమం తరహాలో ఉద్యమించేందుకు సినీ తారాగనం సిద్ధమవుతున్నారు. ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 26న విశాఖ బీచ్ లో యువత నిరసన తెలిపితే మద్దతు ఇస్తానని జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. పవన్ ట్వీట్స్ కు హీరోలు సాయిధరమ్ తేజ్, నవదీప్, మంచు మనోజ్, సంపూర్ణేష్ బాబు, శివబాలాజీలు స్పందించారు. యువత ఉద్యమానికి అండగా ఉంటామని ప్రకటించారు. అయితే అగ్ర హీరోలు మాత్రం స్పందింకపోవడం గమనార్హం. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమానికి తమిళ సినీ పరిశ్రమ పూర్తిగా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. 

 

13:07 - January 24, 2017
13:03 - January 24, 2017

చెన్నై : జల్లికట్టుపై అసెంబ్లీ తీర్మానం చేసినా తమిళనాడులో ఉద్యమ సెగలు చల్లారడం లేదు. మెరినా బీచ్‌లో ఆందోళనలు  మిన్నంటుతున్నాయి. జల్లికట్టు ఆందోళనలపై పోలీసుల తీరును సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌ని ఖండించిన సినీ హీరో కమల్‌ హాసన్‌ ఖండించారు. ఆందోళనలపై పోలీసులు ద్వంద వైఖరి ప్రదర్శించారని పేర్కొన్నారు. చెన్నైలో హింస చెలరేగడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. జల్లికట్టును నిషేధించాలనడానికి కారణమే లేదని తెలిపారు. సంప్రదాయ క్రీడల నిషేధానికి తాను వ్యతిరేకమన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

కాపేపట్లో 'పవన్' మ్యూజిక్ ఆల్బం విడుదల..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'దేశ్ బచావో' పేరిట మ్యూజిక్ ఆల్బంను కాసేపట్లో విడుదల చేయనున్నారు. మొత్తం ఆరు పాటలుంటాయని, ఒక్కో సాంగ్ ప్రతి 45 నిమిషాలకు విడుదలవుతుందని ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

 

ఎన్జీటీలో పోలవరం పంచాయతీపై విచారణ..

ఢిల్లీ : పోలవరం పంచాయతీ గ్రామాల్లోని డంపింగ్ యార్డు పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. అనుమతులు లేకుండా మట్టిని డంపింగ్ చేస్తున్నారని పిటిషన్ దాఖలైంది. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని వాదించారు. కేంద్ర ప్రభుత్వానికి..కేంద్ర పర్యావరణ శాఖకు, నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు, పోలవరం ప్రాజెక్టు అథార్టీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

‘హోదా'కు హీరోల మద్దతు..

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ 'జనసేన' పిలుపునివ్వడంపై సినీ పరిశ్రమలోని పలువురు మద్దతు తెలియచేస్తున్నారు. ఉద్యమానికి అండగా ఉంటామని నటులు మంచు విష్ణు, నవదీప్, సాయి ధరమ్ తేజ, సంపూర్షేష్ బాబు మద్దతు తెలియచేశారు. పలువురు ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు.

12:26 - January 24, 2017

కడప : పులివెందుల నియోజకవర్గంలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన పాపను కడతేర్చాడు. అనంతపురం జిల్లా.. యాడీకి  మండలం కుందనకోటకు వెంకటకృష్ణమ్మకు ... లింగాలకు చెందిన ప్రతాపరెడ్డికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆరు నెలల క్రితం వీరికి పాపకూడా పుట్టింది. అయితే తరచూ తాగి భార్యను ప్రతాపరెడ్డి వేధిస్తుండేవాడు. ఇందులో భాగంగా రాత్రి ప్రతాపరెడ్డి తాగి వచ్చి..తన భార్యను గడ్డి తీసుకునే కొడవలితో దాడి చేసి...చంపాడు.. తన పాపను గొంతు నులిమి ప్రాణాలు తీశాడు.

 

'పవన్' నయా ట్వీట్స్...

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. కాసేపట్లో దేశ్ బచావో పేరిట మ్యూజిక్ ఆల్బంను విడుదల చేయనున్నారు. కాసేపటి క్రితం ట్విట్టర్ లో పవన్ ట్వీట్ చేశారు. ‘నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో అది నీ శరీర క్షేత్రంలో ధైర్యంలో చల్ల లేకపోతే అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే నీవు బానిసగానే ఉండిపోవడానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి..మేము పూల గుత్తులు వేలాడే వసంత రుతువులం కాదు వట్టి మనుష్యలం. దేశం మాకు గాయాలిచ్చినా నీకు మేము పువ్వులిస్తున్నాం.

12:17 - January 24, 2017

పశ్చిమగోదావరి : ఓ ప్రమాదం జరిగింది..అందులో ప్రముఖ వ్యాపారి భార్య చనిపోయింది..ఆమె చెల్లెలు ప్రాణాపాయం నుంచి 
బయటపడింది...ఆమె కోలుకుని మీడియా ముందుకు రావడంతో యాక్సిడెంట్ కాస్త ప్లాన్డ్‌ మార్డర్‌గా మలుపుతిరిగింది..ఈ హత్య ఎవరు చేయించారు..? ప్రమాదంగా చిత్రీకరించి ఆ ఇల్లాలిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది..???
గౌతమి మృతి కేసులో మలుపు 
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం దిగమర్రు ప్రాంతంలో ఆరు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన గౌతమి కేసు మలుపుతిరుగుతోంది... ఇది యాక్సిడెంట్ కాదని..పక్కా ప్లాన్‌తో చేసిన మర్డర్‌ అంటున్నారు ..దీంతో ఈ కేసుపై పోలీసులు దృష్టి సారించారు...ప్రమాదంలో మరణించిన గౌతమి చెల్లి పావని తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందింది.. ఆదివారం డిశ్చార్చ్‌ అయిన పావని నోరు విప్పడంతో వాస్తవాలు బయటపడుతున్నాయి...అయితే గౌతమి కేసులో పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు...
అతని మొదటి భార్యనే ఈ దారుణానికి కారణం..
నర్సాపురం చెందిన దంగేటి గౌతమితో పాటు ద్విచక్ర వాహనంపై చెల్లి పావని కూడా వెళ్లింది..ఈ క్రమంలోనే వారికి దిగమర్రు వద్ద కారు ఢీకొట్టింది..ఈ ప్రమాదంలో గౌతమి మరణించగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పావని ఆస్పత్రిలో చేరింది... ఐదు రోజుల తర్వాత కోలుకున్న పావని ఇంటికి చేరింది..అయితే ఆమె మీడియాతో మాట్లాడుతూ తన అక్క గౌతమి ప్రమాదంలో చనిపోలేదని..ఆ విధంగా చిత్రీకరించారంటూ చెప్పడంతో ఈ కేసు కొత్త మలుపుతిరిగింది...నరసాపురం మండలానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి బుజ్జితో ఏడాది క్రితం గౌతమి పెళ్లయింది...అతని మొదటి భార్య ఈ విషయమై ఇప్పటికే గౌతమిని పలుమార్లు బెదిరించిందని పావని చెబుతుంది...
గౌతమి కేసును నీరుగార్చేయత్నాలా..?
అయితే గౌతమి భర్త ప్రముఖ వ్యాపారి కావడమేగాకుండా అధికారపార్టీకి చెందిన ప్రముఖుల అండదండలున్నట్లు తెలుస్తోంది.. దీంతోఈ కేసును పక్కదోవ పట్టించి నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారన్న అనుమానాలున్నాయి...కారు విశాఖపట్నం నుంచి వచ్చిందని...అందులో ఒక్క డ్రైవర్ మాత్రమే ఉన్నాడని..అతను యాక్సిడెంట్ కావడంతో పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు.. అయితే ఇదంతా పక్కాగా జరిగిందని,నిజాలు వెలికితీసి తన కూతురి హత్యలో బాధ్యులను పట్టుకోవాలంటున్నారు మృతురాలు గౌతమి పేరెంట్స్...
అన్ని కోణాల్లో దర్యాప్తు 
ప్రమాదం కాదు..హత్యేనంటూ కోలుకున్న పావని చెబుతున్నదానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు..అయితే ఇందులో పెద్దవారి అండదండలున్నాయంటూ వస్తున్నదానిపై కేసు ఏ మలుపుతిరుగుతుందో చూడాల్సిందే.

 

12:15 - January 24, 2017

సినీ నటుడు, జనసేన అధినేత 'దేశ్ బచావో' అంటూ పిలుపునిస్తున్నారు. అందులో భాగంగా ఓ మ్యూజిక్ ఆల్బంను కూడ విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఆయన ట్విట్టర్ లో ట్వీట్స్ సంధిస్తున్నారు. జల్లికట్టు ఉద్యమ స్పూర్తిని తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. మెడలు వంచేందుకు కూడా సిద్ధమంటూ ఆయన ఉద్యమస్పూర్తిని రగిలిస్తున్నారు. ‘దేశ్ బచావో' పేరిట ఆయన ఓ మ్యూజిక్ ఆల్బం రూపోదించారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ను ఫిబ్రవరి 5న విడుదల చేయాలనుకున్నారని టాక్. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో పోస్టర్ ను ముందే విడుదల చేయాలని నిర్ణయించారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా’ కల్పించాలనే డిమాండ్ తో జనవరి 26వ తేదీన ఆర్కే బీచ్ లో శాంతియుత నిరసన తెలిపే వారికి జనసేన మద్దతినిస్తుందని పవన్ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యమ నినాదాన్ని ఆల్బం ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతుందని, అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు ఆల్బం ద్వారా జనసేన తన గొంతుకను వినిపిస్తుందని జనసేన పేర్కొంటోంది.

12:08 - January 24, 2017

తూర్పుగోదావరి : కాపు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కాపు సత్యాగ్రహ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు కోనసీమ అంతటా భారీగా మోహరించారు. రావులపాలెంలో పోలీసులు కవాతు నిర్వహించారు. పలుచోట్ల కాపు నేతలను ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. అమలాపురంలో నల్లా విష్ణు, తాతాజీలను హౌస్‌ అరెస్ట్‌లో ఉంచారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

షాక్ కు గురయ్యా - కమల్..

చెన్నై : ఆందోళనలో హింస చెలరేగడం షాక్ కు గురి చేసిందని సినీ నటుడు కమల్ హాసన్ పేర్కొన్నారు. జల్లికట్టుపై శాశ్వత పరిష్కారం చేయాలని, చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కమల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జీని ఖండిస్తున్నట్లు, పోలీసులు ద్వంద్వ వైఖరిని కనబరిచారన్నారు. సంప్రదాయ క్రీడల నిషేధానికి వ్యతిరేకమన్నారు.

12:01 - January 24, 2017

విజయవాడ : వంశధార ప్రాజెక్ట్‌ నిర్వాసితులను ప్రభుత్వం మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. వంశధార ప్రాజెక్ట్‌ వల్ల చాలామంది నిర్వాసితులవుతున్నారని.. వారి విజ్ఞాపనలను.. ఆందోళనను ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు రైతులకు సీఎం చంద్రబాబునాయుడు క్షమాపణ చెప్పడం రైతాంగాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా  నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

పవన్ పై అయ్యన్న విసుర్లు..

విశాఖపట్టణం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు పలు వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టుకు ప్రత్యేక హోదాకు సంబంధం ఉందా ఝ రిపబ్లిక్ డే నాడు ఎవరైనా నిరసన కార్యక్రమాలు చేస్తారా ? అని ప్రశ్నించారు. 'హోదా' పై ప్రధానితో పవన్ మాట్లాడాలని సూచించారు.

'సీఎం క్షమాపణలు నిర్వాసితులను మోసం చేయడమే'..

విజయవాడ : వంశధార ప్రాజెక్టులో రైతుల తిరుగుబాటుపై సీఎం క్షమాపణ చెప్పడం నిర్వాసితులను మోసం చేయడమేనని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. గతంలో రూ. 421 కోట్లు ఇస్తామని జీవో జారీ చేసినా ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదన్నారు. 2013 పునరావాసం చట్టం ప్రకారం పరిహారం పునరావాసం చెల్లించాకే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్నారు.

11:55 - January 24, 2017

హైదరాబాద్ : వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్లాన్‌లు రూపొందిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. 2019లో విజయమే లక్ష్యంగా అస్త్రశస్త్రాలన్నింటినీ సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో జోరుమీదున్న టీఆర్‌ఎస్‌కు కళ్లెం వేయాలంటే పక్కా ప్రణాళికతో వెళ్లాలన్న ఆలోచనతో జాగ్రత్తగా అడుగులువేస్తున్నారు. ఇలా చేస్తేనే గులాబీ బాస్‌కు జలక్‌ ఇవ్వగలమని నేతలు భావిస్తున్నారు.
టీ.జేఏసీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం
హస్తం నేతలు సరికొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే టార్గెట్‌గా సాగుతున్న టీ కాంగ్రెస్‌ నేతలు... రైతులు, విద్యార్థి గర్జనలతో జోరు పెంచారు. ఇలా ఆందోళనలు చేస్తూనే సర్కారుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి మద్దతు పలకాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఏకంచేసి సర్కారుపై ఒత్తిడి మరింత పెంచాలని చూస్తున్నారు. ఇలా చేయడం తమ పార్టీకి ప్రయోజనం కలుగుతుందని అంచనావేస్తున్నారు.. ఇందులో భాగంగా తెలంగాణ జేఏసీకి సపోర్ట్ ఇవ్వాలని నేతలు నిర్ణయించారు. సర్కారుతీరును ఎండగడుతున్న కోదండరాంకు బహిరంగంగానే మద్దతు తెలపాలని ఆలోచన చేస్తున్నారు.
అవసరమైతే టీడీపీకి కూడా మద్దతు
అయితే కోదండరాంకు మద్దతు తెలపడం ద్వారా కాంగ్రెస్‌ మరింత బలపడుతుందని టీ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. కోదండరాంకు కొత్త పార్టీ పెట్టేంత సంస్థాగత బలంలేదని... ఆయనకు అండగా నిలవడంవల్ల పార్టీకి వచ్చే నష్టం ఏమీలేదని నేతలు నమ్ముతున్నారు. ఇలా ఒక్క జేఏసీకేకాదు.. అవసరమైతే టీడీపీకికూడా సపోర్ట్‌ ఇవ్వాలని చూస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న మిగతాపార్టీలకు సపోర్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే సామాజిక తెలంగాణే లక్ష్యంగా పాదయాత్ర బాటపట్టిన సీపీఎంకు నేతలు మద్దతు ప్రకటించారు. ఇలా చేయడంద్వారా భవిష్యత్తులో కామ్రేడ్స్‌తో కలిసి పనిచేస్తామన్న సంకేతాలు ఇస్తున్నారు. సర్కారు వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు పక్కా స్క్రీన్‌ ప్లేతో ముందుకుసాగుతున్న నేతలు.. ప్రజాసమస్యలే ప్రధాన అంశంగా ముందుకు సాగుతున్నారు. అందరినీ కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 

 

వంశాధార నిర్వాసితుల పరిహారంలో డైలామా..

శ్రీకాకుళం : వంశాధార నిర్వాసితుల పరిహారం విషయంలో డైలామా నెలకొంది. పరిహారం చెక్కులు తీసుకొనేందుకు పాడలి, తూలుగు గ్రామస్తులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాపురంలో నిర్వాసితులకు పరిహారాన్ని మంత్రులు చేయనున్నారు.

11:49 - January 24, 2017

ప్రతి విద్యార్థికి ఉచితంగా పెట్రోల్ అందచేస్తారంట. మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు..అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీ ఇలాంటి హామీని గుప్పించింది. త్వరలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే కదా. అందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని పలు పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకొనేందుకు పలు హామీలను గుప్పిస్తున్నాయి. ఫిబ్రవరి 4వ తేదీన గోవాలో ఎన్నిక జరగనుంది. గోవాలో మొత్తం 37 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. అందులో భాగంగా గోవా ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ఫిబ్ర‌వ‌రి 4న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక‌ల మేనిఫెస్టోను కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా విడుద‌ల చేశారు. విద్యార్థులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించింది. లైసెన్స్ క‌లిగిన ప్ర‌తి విద్యార్థికి నెల‌కు 5 లీట‌ర్ల పెట్రోల్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అంతేగాకుండా ప్రజలకు సురక్షిత తాగునీటిని కూడా సరఫరా చేస్తామని హామీలను గుప్పించింది. మరి ఈ హామీలు ఎలా వర్కవుట్ అవుతాయో ? లేదో చూడాలి.

11:41 - January 24, 2017

ఢిల్లీ : ఐసిస్ భారత్ లో దాడులు పాల్పడేందుకు కొత్త పంథా ఎంచుకుందా.. బాంబులు పేల్చడం మాత్రమే కాదు... వీలునుబట్టి ఎలాగైనా విధ్వంసం సృష్టించడానికి ముష్కరులు ప్లాన్స్‌ వేస్తున్నారా.. ఇప్పటికే దేశంలో ఉన్న ఐసీస్‌ స్లీపర్‌ సెల్స్‌కు మెసేజ్‌లు అందాయా.. అంటే.. కేంద్ర నిఘా సంస్థలు ఇలానే అనుమానిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఏపీలో రైలు ప్రమాదం  ఉగ్రవాదుల చర్యగానే దర్యాప్తు సంస్థలుఅనుమానిస్తున్నాయి. 
ఏ ప్రమాదం జరిగినా ఉగ్రవాద చర్యగా అనుమానం 
దేశంలో ఏ చిన్న ప్రమాదమో...ప్రమాదకర సంఘటనో జరిగినా...ఇప్పుడు ఉగ్రవాద చర్యగానే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హీరా ఖండీ రైలు ప్రమాదం పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ. ఈ కోణంలోనే విచారణ మొదలు పెట్టింది. 
రైలు ప్రమాదంపై అనుమానాలు 
కాన్పూర్ వద్ద జరిగిన ప్రమాదం.. విజయనగంలో జరిగిన రైలు ప్రమాదాలు ఒకేలా ఉండటంతో ఎవరైనా కావాలనే పట్టాలను కట్ చేశారనే అనే అనుమానాలు తావిస్తున్నాయి. ఉగ్రకోణంలో వార్తలకు ఆరునెలల క్రితం ఐసిస్ సానుభూతి పరులను సంబాషన బలం చేకూరుతోంది. ఉగ్రవాదులు వాడిన టెక్నాలజీని కోడింగ్ డీ కోడింగ్ చేయగా మరిన్ని విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది. ఐసిస్ అధికార ప్రతినిధి అబు ముహామ్మద్ అదానీ.. ఏ6 నిందుతుడు యాసిర్ నయమతుల్లాకు ఏ4 నిందుతుడు హాబిబ్ మహ్మాద్ కీలక సమాచారం చేరవేసినట్టు ఎన్‌ఐఏ విచారణలో బయటపడినట్టు తెలుస్తోంది. 
పోలీసుల టార్గెట్ గా విధ్వంసాలు 
ఎన్‌ఐఏ విచారణలో ఉగ్రవాద సానుభూతిపరులు వెల్లడించిన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. పోలీసులను టార్గెట్ చేసుకోని విధ్వంసాలకు పాల్పడాలని ఐసిస్‌ నుంచి సూచనలు అందిందినట్టు వెల్లడికావడంతో .. ఇక నుంచి  కేవలం బాంబులతోనే కాదు.. చేతిలో ఏదుంటే దానినే ఆయుధంగా ఉపయోగించి బీభత్సం సృష్టించడానికి ప్లాన్స్‌ రెడీ చేసినట్టు  అసలు విషయాన్ని బయటపెట్టారు ముష్కరులు. 
హత్యలు, వాహనాలు దగ్ధం... సానుభూతి పరుల పాత్ర..! 
దేశ వ్యాప్తంగా సైన్యం. ఇంటిలిజెన్స్ పోలీసులతో పాటు.. విదేశీయులపై దాడులు చేయాలని ఐసిస్‌ హెడ్‌ మెసెజ్ పంపినట్టు వెల్లడయింది. రాళ్లతో తల మోది చంపడం, కత్తితో పొడవడం, కారుతో డీ కోట్టడం, ఎత్తైన ప్రాంతం నుంచి తోసివేయడం, ఇళ్లకు, కార్లకు నిప్పు పెట్టడం, వ్యవసాయ, బిజినెస్ ప్రాంతాలను ధ్వంసం చేయడం. ఎలా దొరికితే అలా అరాచకం సృష్టించాలని సానుభూతిపరులకు ఐసిస్ సమాచారం చేరవేసింది. ఉగ్రముష్కరుల మెసెజ్‌లపై ఎన్.ఐ.ఏ. అప్రమత్తం అయింది. గతంలో హైదరాబాద్ లో అధారాలు లభించని హత్యలు, వాహనాల దగ్ధం చేసిన కేసుల్లో ఉగ్రవాదుల సానుభూతి పరుల పాత్ర ఉంటుందని ఇపుడు అనుమానిస్తున్నారు. 
ఉగ్రవాదుల చర్యలతో పోలీసుల్లో  కలవరం                                     
మొత్తానికి ఎదీ ఉగ్రవాది చర్యనో ఎదీ సంఘటననో గుర్తించడం కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. పోలీసులకు ఉగ్రవాదుల చర్యలు ఎలా ఉండపోతున్నాయో కలవర పెడుతున్నాయి. ఎలాంటి కక్షలు లేకుండా.. పరిచయంలేని వ్యక్తులు ఉగ్రమూకలు వ్యక్తిగతంగా హత్యలకు పాల్పడితే ఆ నష్టం ఊహించని విధంగా ఉండబోతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అనుమానస్పద వస్తువులు కనిపిస్తేనే కాదు... ఏ వ్యక్తి పై అనుమానం వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. 

 

టీ హబ్ రెండో దశ పనుల్లో విషాదం..

హైదరాబాద్ : మాదాపూర్ టీ హబ్ రెండోదశ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ సమయంలో గోడ కూలిపోవడంతో బీహార్ కు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

ఎన్ సీసీ శిక్షణలో విషాదం..

మెదక్ : పాపన్నపేట (మం) కొత్తపల్లి జెడ్పీ హై స్కూల్ లో విషాదం చోటు చేసుకుంది. ఎన్ సీసీ విద్యార్థులకు స్విమ్మింగ్ లో శిక్షణ ఇస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందాడు.

ఢిల్లీలో షారూఖ్..

ఢిల్లీ : బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ఢిల్లీకి చేరుకున్నారు. ‘రాయిస్' చిత్ర ప్రమోషన్ లో భాగంగా దేశ రాజధానికి వచ్చారు. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో భారీగా అభిమానులు చేరుకున్నారు.

11:08 - January 24, 2017

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గందర్బల్‌ జిల్లా కింబర్స్‌ హదూరాలో ఇరువురి మధ్య హోరాహోరి కాల్పులు కొనసాగుతున్నాయి. నిఘా వర్గాల సమాచారంతో ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఇద్దరు ఉగ్రవాదులు ఈ కాల్పులకు తెగబడుతున్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:50 - January 24, 2017

ఢిల్లీ : నగరంలోని సౌత్‌బ్లాక్‌ ఆఫీస్‌లో సా. 6 గంటలకు ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. నగదు రహిత లావాదేవీల సాధ్య అసాధ్యాలపై ముఖ్యమంత్రుల కమిటీ నివేదికను ప్రధానికి ఇవ్వనున్నారు. దీనికంటే ముందు మధ్యాహ్నం 2 గంటలకు డిజిటల్ లావాదేవీలపై ఏర్పాటైన ముఖ్యమంత్రుల కమిటీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:40 - January 24, 2017

విజయవాడ : జనసేన అధినేత మరో అస్త్రం వేయనున్నారు. కాసేపట్లో దేశ్‌ బచావో మ్యూజికల్‌ ఆల్బమ్‌ను యూట్యూబ్‌ ఛానల్ ద్వారా విడుదల చేయనున్నారు. హత్యారాజకీయాలను ఫోకస్‌ చేస్తూ ఈ ఆల్బమ్‌ను రూపొందిచినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

10:34 - January 24, 2017

విజయవాడ : కృష్ణా నదిలో మారథాన్‌ ఈత పోటీలు అందరినీ అలరించాయి. ఆక్వాడెవిల్స్ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. పోటీల్లో 15మంది ఈతగాళ్లు దాదాపు 15 కిలోమీటర్లు ఈదారు. స్విమ్మింగ్‌పై జనాల్లో అవగాహన పెంచడం... యువతలో స్ఫూర్తి నింపేందుకు ఈ పోటీల్లో పాల్గొన్నామని వీరంతా తెలిపారు. త్వరలో అమరావతి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ మెగా మారథాన్‌ ఈత పోటీలు జరుపుతామని నిర్వాహకులు ప్రకటించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ బహుమతులు అందజేశారు. 

 

10:33 - January 24, 2017

భూపాలపల్లి : రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రెండున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఏ ఒక్క వర్గ ప్రజలు సంతోషంగా లేరని తమ్మినేని అన్నారు. 
ప్రభుత్వం నుంచి చేయూత లేదన్న తమ్మినేని
గొర్రెల, మేకల పెంపకందారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి చేయూత లభించడం లేదని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మాటల్లో కాకుండా.. చేతల్లో వారి కోసం నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని... ఆయన అన్నారు. వారి కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. ఓట్లేసి ఎన్నుకున్న పాలకులను ప్రశ్నించే హక్కు ప్రజలకుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. పేదలకు, విద్యార్థులకు, గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్‌ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని తమ్మినేని విమర్శించారు. 
హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం : నైతం రాజు 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని పాదయాత్ర బృందం సభ్యుడు, ఆదివాసీ గిరిజన సంఘం నేత నైతం రాజు ఆరోపించారు. ప్రభుత్వం ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తుందని.. ఇది సరికాదని నైతం రాజు అంటున్నారు. హక్కుల చట్టం ప్రకారం ఇప్పటికైనా గిరిజనులకు పట్టాలివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
పాదయాత్ర... 2600 కిమీ పూర్తి
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 99 రోజులు పూర్తి చేసుకుంది. 99వ రోజు తమ్మినేని బృందం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పస్రా, తాడ్వాయి, చిన్నబోయినపల్లిలో పర్యటించింది. 99వ రోజువరకు పాదయాత్ర మొత్తం 2600 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. గిరిజనుల పోడు భూములపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు.

 

సాయంత్రం మోడీతో బాబు భేటీ..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. సౌత్ బ్లాక్ లో సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. నగదు రహితల లావాదేవీల సాధ్య, అసాధ్యాలను ముఖ్యమంత్రుల కమిటీ నివేదికను ఆయనకు అందచేయనున్నారు.

ఉగ్రవాదులు..- భద్రతా దళాల మధ్య కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : గండెర్బల్ హదూర ప్రాంతంలో భద్రతా దళాలు - ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

కడపలో కేంద్ర కరవు బృందం పర్యటన..

కడప : జిల్లాలో కేంద్ర కరవు బృందం పర్యటన కొనసాగుతోంది. స్టేట్ గెస్ట్ హౌస్ లో కరవు ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. రామాపురం, సంభేపల్లి, రాయచోటి మండలాల్లో కరవు బృందం పర్యటించనుంది.

 

కాసేపట్లో 'దేశ్ బచావో ఆల్బం' విడుదల..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'దేశ్ బచావో' పేరిట ఓ ఆల్బంను విడుదల చేయనున్నారు. యూ ట్యూబ్ ఛానల్ లో దీనిని విడుదల చేయనున్నారు.

తొండుపల్లిలో గుప్త నిధుల తవ్వకాలు..

రంగారెడ్డి : శంషాబాద్ (మం) తొండుపల్లిలో గుప్త నిధుల కోసం బెంగళూరు ముఠా తవ్వకాలు జరిపింది. ఏడుగురు ముఠా సభ్యులపై గ్రామస్తులు దాడి చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీలో దట్టంగా పొగమంచు..

ఢిల్లీ : దేశ రాజధానిలో దట్టంగా పొగమంచు అలుముకుంది. 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా 9 రైళ్ల సేవల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. 9 దేశీయ, 11 అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ముద్రగడ పాదయాత్ర..టెన్షన్..

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాపు సత్యాగ్రహ పాదయాత్రను అడ్డుకొనేందుకు పోలీసుల సన్నాహాలు చేస్తున్నారు. కోనసీమ అంతగా భారీగా పోలీసులు మోహరించారు. రావులపాలెంలో పోలీసులు కవాతు నిర్వహించారు. పలు చోట్ల కాపు నేతల ముందస్తు అరెస్టు పర్వం కొనసాగుతోంది. అమలాపురంలో నల్లా విష్ణు, తాతాజి హౌస్ అరెస్టు చేశారు.

నకిలీ గుట్కా తయారీ గుట్టు రట్టు..

శ్రీకాకుళం : నకిలీ గుట్కా తయారీ ముఠా గుట్టురట్టైంది. ఇచ్చాపురం సరిహద్దులోని సుమాడీలో ఓ గోదాంలో 7 రకాల నకిలీ గుట్కా తయారీ దృశ్యాలను టెన్ టివి చిత్రీకరించింది.

09:54 - January 24, 2017

గుజరాత్ : షారూక్‌ ఖాన్‌ రయీస్‌ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. సినిమా ప్రచారంలో భాగంగా హీరో షారుఖ్‌ ఖాన్‌ ముంబై నుంచి ఢిల్లీకి రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారు. అయితే గత రాత్రి ఆగస్ట్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ముంబై నుంచి బయల్దేరారు. గుజరాత్‌లోని వడోదరకు చేరుకున్న షారుక్‌ ఖాన్‌ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. పోలీసులు జానాన్ని అదుపుచేయలేకపోయారు. దీంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 'రాయిస్‌' మూవీ రేపు విడుదల కానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:44 - January 24, 2017

అనంతపురం : జిల్లాలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు అయింది. సిండికేట్‌ బ్యాంక్‌కు సిబ్బంది తాళం వేయడం మరిచారు. యాడీకి మండల కేంద్రంలోని సిండికేట్‌ బ్యాంక్‌కు నిన్న సాయంత్రం విధులు పూర్తైన తర్వాత సిబ్బంది.. బ్యాంక్‌కు తాళాలు వేయకుండా వెళ్లిపోయారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. బ్యాంకు తలుపులకు ఎస్ ఐ కత్తి శ్రీనివాసులు బేడీలు వేశారు. విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపారు. అయినా ఇప్పటి వరకు అధికారులు, సిబ్బంది బ్యాంకు వద్దకు వెళ్లకపోవడం గమనార్హం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

09:39 - January 24, 2017

రాజా ది గ్రేట్. ఇది మాస్ రాజా 'రవితేజ' న్యూ మూవీ టైటిల్. ఆప్టర్ వన్ ఇయర్ మాస్ రాజా కొత్త సినిమాకి కమిట్ అయ్యాడు. త్వరలోనే ఈ కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ సినిమా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. 'బెంగాల్ టైగర్' సినిమా తరవాత 'రవితేజ' మరోసారి కెరీర్ పరంగా వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న 'కిక్ 2'డిజాస్టర్ కావడంతో పాటు 'బెంగాల్ టైగర్' సోసో గా ఆడడంతో మాస్ రాజా ఈ గ్యాప్ తీసుకున్నాడు. దీనికి తోడు ఎడాది గ్యాప్ లో ఎన్ని స్టోరీస్ విన్న కూడా ఈ మాస్ స్టార్ కి నచ్చలేదు. ఇలా అనుకోకుండానే 'రవితేజ' వన్ ఇయర్ సినిమా చేయకుండా ఖాళీగా వదిలేశాడు. అయితే ఈ గ్యాప్ ఆయన వరల్డ్ టూర్ వేసి తెగ ఎంజాయ్ చేశాడులేండి. ఇక వరల్డ్ టూర్ కూడా కంప్లీట్ కావడంతో మాస్ రాజా కొత్త సినిమా పనుల్లో నిమగ్నం అయినట్లు తెలుస్తోంది.

'దిల్' రాజు..
'రవితేజ' ఫైనల్ గా 'దిల్' రాజు నిర్మాణంలోనే కొత్త సినిమా చేస్తున్నట్లు వినికిడి. 'రాజా ది గ్రేట్' టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. గత ఎడాది వీరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల డీలే అయిన ఈ కాంబినేషన్ ఇప్పుడు ఫైనల్ అవ్వడం విశేషం. త్వరలో ఈ చిత్రం ముహుర్తం జరుపుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూ మూవీ పట్టాలెక్కడానికి దర్శకుడే కారణంగా కనిపిస్తోంది. నిజానికి గత ఎడాది 'దిల్' రాజు, 'రవితేజ' మూవీ చేయడానికి ప్లాన్ చేశాడు. కానీ మాస్ రాజా ప్లాప్స్ లో ఉండడంతో ఈ స్టార్ ప్రొడ్యూసర్ కాస్త రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య ఒప్పందం కుదరకపోవడంతో ఈ కాంబినేషన్ సైడైపోయింది. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఇద్దరినీ కన్విన్స్ చేసి ఈ సినిమాను మళ్లీ పట్టాలెక్కిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. 'ఫటాస్’, 'సుప్రీమ్' సినిమాలో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు కొట్టిన ఈ దర్శకుడు మాస్ రాజాతో చేయనున్న సినిమాను కూడా సక్సెస్ చేసి హ్యట్రిక్ దర్శకుడు అనిపించుకోవాలని ఆశపడుతున్నాడు. బహుశ ఈ చిత్రం మార్చి నుంచి రెగ్యూలర్ షూటింగ్ కి వెళ్లొచ్చని ఇన్ సైడ్ టాక్.

09:37 - January 24, 2017

నందమూరి నటసింహాం 'బాలకృష్ణ' వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' బాక్సాఫీసు వద్ద విజయవిహారం చేస్తోంది. తొలి నుంచే సూపర్ హిట్టు టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం 'బాలయ్య' కెరీర్ లో ది బెస్ట్ హిట్టు గా నిలిచిపోయింది. ఇప్పటికే ఆఫ్ బిలియన్ కలెక్షన్లను కొల్లగొట్టిన శాతకర్ణి ఫస్ట్ వీక్ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. సంక్రాంతి సందర్భంగా రిలీజైన 'బాలకృష్ణ' వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 'క్రిష్' దర్శకత్వం వహించిన చారిత్రాక చిత్రంలో 'శాతకర్ణి'గా 'బాలయ్య' నభూతో న భవిష్యతే ఆ స్థాయిలో నటించాడనే ప్రశంసలు జల్లు కురుస్తోంది. అంతేకాదు 'బాలయ్య' కెరీర్ లోనే ఈ చిత్రం రికార్డ్ స్థాయి కలెక్షన్లను రాబట్టుతోంది. సుమారు 50కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే బడ్జెట్ ని వెనక్కి రాబట్టినట్లు తెలుస్తోంది. 'లెజెండ్' మూవీ ఓవరాల్ కలెక్షన్లను 'శాతకర్ణి' జెస్ట్ వన్ వీక్ లో కలెక్ట్ చేయడం నందమూరి ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తోంది.

వరల్డ్ వైడ్..
వరల్డ్ వైడ్ గా మొదటి వారానికి గాను 'శాతకర్ణి' 60కోట్లకుపైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి ఆరు రోజులకు 30 కోట్ల షేర్ ని వసూల్ చేయడం విశేషం. ఓవర్సీస్ లో 'బాలయ్య' తొలిసారి 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో మిలియన్ డాలర్లు కలెక్ట్ చేశాడు. ఓవర్సీస్ లో ఇప్పటికే 7కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ నైజాంలో 6కోట్లు, సీడెడ్ 6.30 కోట్లు, నెల్లూరు 1.52 కోట్లు, గుంటూరు 3.54 కోట్లు, కృష్ణా 2.48 కోట్లు, వెస్ట్ గోదావరి 2.96 కోట్లు, తూర్పు గోదావరి 2.84 కోట్లు, ఉత్తరాంధ్ర 3.66 కోట్లు వసూళ్లు సాధించింది. పుల్ రన్ లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఈజీగా 70 నుంచి 80కోట్లు కొల్లగొట్టుతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కలెక్షన్ల వర్షం..
'శాతకర్ణి' మూవీ థియేటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంటే ఈ చిత్రం ట్రైలర్ నెట్ లో రికార్డ్ స్థాయి వ్యూస్ ని దక్కించుకుంటోంది. 'సమయము లేదు మిత్రమా... శరణమా రణమా'... యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ కి కిక్ ఇస్తోంది. ఈ ట్రైలర్ కు ఇప్పటివరకూ లక్ష లైక్స్ తో పాటు 72లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం. మొత్తానికి 'బాలయ్య' 'గౌతమిపుత్ర శాతకర్ణి' వందో సినిమాగా ఎంచుకుని గ్రేట్ సక్సెస్ కొట్టాడు.

09:36 - January 24, 2017

వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్ కుమార్, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, టీడీపీ నేత విజయ్ కుమార్ పాల్గొని, మాట్లాడారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని వాపోయారు. టీడీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు. రైతులకు పునరావాసం కల్పించి ఆ తర్వాత ప్రాజెక్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:35 - January 24, 2017

2017ఇండియన్ సిని ఇండస్ట్రీ కి సీక్వెల్ నామ సంవత్సరం కానుంది. ఈ ఎడాదిలో తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని ఇండస్ట్రీస్ లో సీక్వెల్స్ తెరకెక్కతుండడం విశేషం. పెద్ద హీరోలే కాదు చిన్న హీరోలు కూడా సీక్వెల్స్ పై ఫోకస్ చేస్తున్నారు. ‘ప్రభాస్' కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలియంది కాదు. దానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న 'బాహుబలి' రెండో పార్ట్ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఇయర్ మోస్ట్ వాటెండ్ 'బాహుబలి 2’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం కోసం ఒక్క తెలుగు పరిశ్రమనే కాదు కోలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలోని సిని ప్రియులు బాహుబలి రెండో పార్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.

రాజు గారి గదిలో నాగ్..
ఈ ఎడాదిలో రిలీజ్ కానున్న మరో సీక్వెల్ 'రోబో 2’. ఈ చిత్రం కోసం కూడా సిని లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 'రజనీకాంత్’, 'అక్షయ్ కుమార్' లాంటి హీరోలు నటించడం తో పాటు 'శంకర్' డైరెక్షన్ లో తెరకెక్కుతుండడంతో 'రోబో-2’ భాగం ఆసక్తిరేకెతిస్తోంది. రెండేళ్ల కిందట చిన్న చిత్రంగా రిలీజైన పెద్ద విజయం సాధించిన సినిమా 'రాజు గారి గది’. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్ లో 'నాగార్జున కీ రోల్ ప్లే చేస్తుండడం విశేషం. 'నాగ్' లాంటి బడా స్టార్ నటిస్తుండడంతో ఈ మూవీ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 'రాజు గారి గది' సీక్వెల్ కూడా ఈ ఎడాదిలోనే రిలీజ్ కానుంది.

ధనుష్..
తమిళంలో కూడా క్రేజీ సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. ముందుగా 'సింగం' సీరిస్ లో భాగంగా 'సూర్య' నటించిన 'సింగం-3’ భాగం త్వరలోనే రిలీజ్ కాబోతోంది. అదే విధంగా 'ధనుష్' కెరీర్ లో బిగెస్ట్ హిట్టుగా నిలిచిన 'వీఐపీ' మూవీకి రెండో భాగం రూపొందుతోంది. అయితే ఈ సీక్వెల్ దర్శకుడు మారాడు. 'ధనుష్' భార్య సౌందర్య 'వీఐపీ 2'కి దర్శకత్వ బాద్యతలు నిర్వర్తిస్తోంది. మరో విశేషమేమిటంటే డిజాస్టర్ అనిపించుకున్న 'కబాలి' మూవీకి సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని 'ధనుష్' నిర్మిస్తుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

కేరాఫ్ అడ్రస్..
వివాదాలతో ఆగిపోయిన 'కమల్ హాసన్' 'విశ్వరూపం 2’ చిత్రానికి కూడా ఈ ఎడాది మోక్షం లభించేలా కనిపిస్తోంది. ఇక బాలీవుడ్ లో కూడా ఈ ఎడాది సీక్వెళ్ల జోరు కొనసాగనుంది. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి మంచి సక్సెస్ సాధించిన 'హెరాపేరి' చిత్రానికి మూడో భాగం తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ని ఆగస్ట్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా 'సర్కార్’, 'రాజ్ సర్కార్' అంటూ టూ పార్ట్స్ తీసిన 'రామ్ గోపాల్' ఇప్పుడు 'సర్కార్ -3’ తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 17 రిలీజ్ కాబోతోంది. ఇలా 2017 సీక్వెల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారనుంది.

09:34 - January 24, 2017

మందుల ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నారని.. ప్రభుత్వ నియంత్రణ ఉండాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ నాయకులు రాజు భట్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ లు ఫిబ్రవరి 3న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టబోతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు కార్మిక సంఘాలు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాయి. ఇంతకీ మెడికల్  అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ దేశ వ్యాప్త సమ్మెకు కారణం ఏమిటి? ఈ సమ్మె సందర్భంగా మెడికల్ అండ్  సేల్స్ రిప్రజెంటేటివ్స్ ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? దేశీయ ఫార్మాస్యూటికల్ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ఆన్ లైన్ లో  మందుల అమ్మకాల వల్ల జరుగుతున్న మంచి చెడులేమిటి ? ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:33 - January 24, 2017

విజయనగరం : కూనేరు దగ్గర జరిగిన హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. ఎన్ ఐఏతోపాటు, ఏపీ సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్‌ నిపుణులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం వెనుక మావోయిస్టులు, ఉగ్రవాదుల ధ్వంస రచన ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. 
రైల్వే అధికారుల నుంచి సమాచారం సేకరణ 
చత్తీస్‌గడ్‌లోని జగదల్‌పూర్‌ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ వెళ్తున్న హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉండొచ్చని రైల్వే అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్ననేపథ్యంలో దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా దర్యాప్తుకు ఆదేశించాయి. హోం శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ.... ఎన్‌ఐఏ అధికారులు, ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో నేర పరిశోధన విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 
అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు 
ఢిల్లీ నుంచి విశాఖ, విజయనగరం మీదుగా కూనేరు చేరుకున్న ఆరుగురు సభ్యుల ఎన్‌ఐఏ బృందం ప్రమాద స్థలాన్ని క్షణ్ణంగా పరిశీలించింది. అక్కడ ఉన్న రైల్వే అధికారులతో చర్చించి, సమాచారం సేకరించింది. ఫోరెన్సిక్‌ నిపుణులతో కలిసి ఎన్‌ఐఏ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు. పట్టాలు విరగడానికి కారణాలను అన్వేషించారు.  ప్రమాదానికి కారణం నిర్లక్ష్యమా ? లేక   విద్రోహమా?  అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిర్లక్ష్యమైతే  ఏ స్థాయిలో, ఎక్కడ ఇది జరిగిందన్న అంశంపై లోతుగా పరిశీలిస్తున్నారు. విద్రోహమైతే  ఈ ప్రాంతంలో ప్రాబల్యం ఉన్న మావోయిస్టుల పన్నాగమా ? లేక ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదుల కుట్రా?... అన్న  కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్పూర్‌ దగ్గర గతేడాది నవంబర్‌లో జరిగిన ఇండోర్‌-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి ఐఎస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హీరాఖండ్‌ ఘటన అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఎన్‌ఐఏ అధికారులు నిర్ణయించారు. 
నేర పరిశోధనా విభాగం అధికారుల దర్యాప్తు 
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఏపీ నేర పరిశోధనా విభాగం అధికారులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. సీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ద్వారకాతిరుమలరావు, ఐజీ అమిత్‌ గార్గ్‌ కూనేరు రైలు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని ఘటన జరిగిన తీరుతెన్నులను పరిశీలించారు. ఇందుకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు.  కొన్ని ఆధారాలు సేకరించారు. అన్ని కోణాల్లో ఈ కేసును పరిశీలించేందుకు సీఐడీ ఆరు బృందాలను ఏర్పాటు చేసింది. హీరాఖండ్‌ రైలు ప్రమాదంలో విద్రోహం అంశాన్ని తోసిపుచ్చలేమన్న అభిప్రాయంతో సీఐడీ అధికారులు ఉన్నారు. పట్టాలు విరడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చన్న ప్రచారంలో నేపథ్యంలో విరిగిన పట్టాలను కూడా సీఐడీ బృందాలు పరిశీలించాయి. పట్టాలు ఎలా విరిగాయి, ముందుగానే ఎవరైనా కోశారా.. అన్న అంశాలపై  రైల్వే సిబ్బందితో ఆరా తీశారు.  పట్టాలు విరిగితే వంకర, టింకరగా ఉండాలికానీ, షార్ప్‌గా కోసినట్టుగా ఉండటాన్ని గమనించి.. దీనిపై రైల్వే అధికారులను ప్రశ్నించి సీఐడీ అధికారులు సమాచారం సేకరించారు. హీరాఖండ్‌ ఘటనపై రైల్వే భద్రతా కమిషనర్‌ విచారణకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌  జారీ చేసింది. 
బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్‌  
మరోవైపు ప్రతిపక్ష నేత జగన్‌ హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు. రైల్వే శాఖలో ప్రయాణికలు భద్రతా చర్యలు మెరుగుపడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.  ఈఘటన గాయపడి పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారికి కూడా జగన్‌ కలుసుకున్నారు. వీరికి అందిస్తున్న వైద్య సేవలు గురించి డాక్టర్లను  అడిగి తెలుసుకున్నారు.  క్షతగాత్రులు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని కోరారు.  

 

09:33 - January 24, 2017

బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ 'సోనమ్ కపూర్' ఫైనల్ గా తన డేటింగ్ పై క్లారిటి ఇచ్చింది. ఎస్ డేటింగ్ లో ఉన్నానంటునే అది నా పర్సనల్ అంటూ వార్నింగ్ ఇచ్చింది. బాలీవుడ్ బ్యూటీ అంతా హీరోలతో డేటింగ్ చేస్తుంటే, సోనమ్ మాత్రం ఓ విదేశీ బిజినేస్ మాగ్నెట్ తో పీకలోతు లవ్ లో మునిగితేలుతోందట. బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు ఉన్నా 'సోనమ్ కపూర్' మాత్రం కాస్త వేరు. సెలెక్టివ్ గా సినిమాలు చేయటంతో పాటు బాలీవుడ్ స్టార్స్ తో పెద్దగా ఆంటిముట్టనట్లు వ్యవహరిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో ఒక్కరిద్దరి స్టార్స్ తో లవ్ ఉన్నట్లు 'సోనమ్' గురించి వినిపించిన ఆ వార్తలు గాసిప్స్ గానే మిగిలిపోయాయి. లాంగ్ రన్ కెరీర్ మొయిన్ టేన్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరితోనో డేటింగ్ చేస్తోందని తెలుసుకోవాలని బాలీవుడ్ జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపారు. అయితే ఫైనల్ గా 'సోనమ్' డేటింగ్ విషయంపై క్లారిటి ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

షోలో పాల్గొన్న సోనమ్..
తాజాగా ఒక ప్రముఖ షోలో పాల్గొన్న 'సోనమ్' చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పి అందరిని షాక్ ఇచ్చింది. కొంతకాలంగా ఈ  భామ ఒక వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తుందన్న మాట వినిపిస్తోంది. కానీ అందుకు తగ్గ ప్రూవ్స్ ఏవీ లేకపోవడంతో గాసిప్ రాయుళ్లు తెగ గింజుకున్నారు.ఈ షో తో 'అనిల్ కపూర్' గారాల పట్టి నిజం చెప్పి సర్ ప్రైజ్ చేసింది. లండన్ కు చెందిన వ్యాపారవేత్తతో తాను డేటింగ్ చేస్తున్నట్లుగా ఒప్పేసుకుంది. అయితే ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేయాలని తన పర్సనల్ లైఫ్ కాంట్రావర్శీ చేయొద్దని వార్నింగ్ కూడా ఇచ్చింది. తన వ్యక్తిగత విషయాల్ని అందరికి చెప్పటం తనకు ఇష్టం లేదని, ఆ రిలేషన్ కు తాను చాలా వాల్యూ ఇస్తున్నట్లుగా ఒపెన్ అయింది మిగిలిన సంగతులు ఎలా ఉన్న, లవర్ గురించి మాత్రం మాట దాటేయకుండా ఓపెన్ గా చెప్పేయటం ఈ బ్యూటీకే చెల్లిందని చెప్పాలి. మిగత బాలీవుడ్ బ్యూటీస్  చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ కూడా మా మధ్య జెస్ట్ ప్రెండ్ షిప్ అని కొట్టిపారేస్తుంటే 'సోనమ్ కపూర్' మాత్రం డేటింగ్ లో ఉన్నానని చెప్పడం నిజంగా గ్రేట్ అని చెప్పాల్సిందే. అసలే న్యూ ష్యాషన్స్ తో కేక పెట్టించే ఈ బ్యూటీ డేరింగ్ అండ్ డాషింగ్ అని బాలీవుడ్ లో టాక్ కూడా ఉంది. ఇప్పుడు మరోసారి తన డేరింగ్ ఏంటో ప్రూవ్ చేసింది.

09:31 - January 24, 2017

విశాఖ : దేశంలొనే తొలిసారిగా అన్ని ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన మంత్రి.. విద్యా విధానంలో పటిష్టమైన మార్పులు తీసుకువస్తామన్నారు. ప్రవేశ పరీక్షలు జరిగిన వారం రోజులలోపే వాటి ఫలితాలు వెల్లడించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఏపీలో ఎడ్‌ సెట్‌ ఏప్రిల్‌ 19  జరుగుతుందన్న ఆయన.. ఫలితాలు అదే నెల 25లోపు వెల్లడిస్తామన్నారు. 

 

09:30 - January 24, 2017

విజయవాడ : చంద్రబాబు నోట క్షమాపణ వెలువడింది. వంశధార భూ నిర్వాసితులపై సర్కారీ దాష్టీకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో.. చంద్రబాబు.. సదరు ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు క్షమాపణ చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగానే పరిహారం అందజేయలేకపోయామని సీఎం అంగీకరించారు. పరిహారం చెల్లించడంలో జిల్లా అధికారుల తప్పిదం కారణంగా వంశధార నిర్వాసితులు ఆందోళనకు దిగారన్నారు. 
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం : చంద్రబాబు 
అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగానే వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందజేయలేకపోయామని ఏపీ సీఎం చంద్రబాబు.. వారికి క్షమాపణ చెప్పారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వంశధార నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు గతేడాది జూన్‌ 2న 450 కోట్ల రూపాయల విడుదలకు జీవో ఇచ్చినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. పరిహారం చెల్లించడంలో జిల్లా అధికారుల తప్పిదం వల్లే వంశధార నిర్వాసితులు ఆందోళనకు దిగారన్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు అన్నారు.  
ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంతో పూర్తి చేస్తాం : చంద్రబాబు 
రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను శరవేగంతో పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. భూ సేకరణ, నిధుల సమస్యలను అధిగమించి ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్ట్‌ భూసేకరణకే 27 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం లెక్కలు తేల్చిందని చంద్రబాబు అన్నారు. మూలలంక డంపింగ్‌ యార్డు బాధితులకు కూడా రైతులకు  ప్రకటించిన ప్యాకేజీ ఇస్తామని చంద్రబాబు తెలిపారు. కాంక్రీటు, డయాఫాం వాల్‌ పనుల్లో కొంత జాప్యం జరిగిందని సీఎం చెప్పారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. రాబోయే రోజుల్లో మడకసిర, కుప్పం, చిత్తూరుకు నీళ్లు తీసుకొస్తామని, ప్రతిపక్షాలు చీటికి మాటికి విమర్శించడం మాని నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. 

09:28 - January 24, 2017

విజయవాడ : జల్లికట్టుపై ఓ పట్టు పట్టి.. ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేలా చేసిన తమిళ ప్రజల ఉద్యమం.. ఏపీ ప్రజలకు స్ఫూర్తినిస్తోందా...? ఆంధ్రప్రదేశ్‌లోనూ జల్లికట్టు తరహాలో ఉద్యమం ఎగిసే అవకాశం ఉందా...? ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచేందుకు.. ఏపీ యువత ఇప్పటికే ఉద్యమ వ్యూహాన్ని ఖరారు చేసిందా..? తాజా పరిణామాలు చూస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది..! 
హోదా రగడ  
తమిళుల ఉద్యమానికి తలవంచిన సర్కారు 
సంప్రదాయ క్రీడను కాపాడుకునేందుకు ఎదురొడ్డి నిలిచిన తమిళుల ఉద్యమానికి అక్కడి సర్కారు తలవంచింది. వారి స్ఫూర్తి ఇప్పుడు తెలుగు యువతలోనూ రాజుకుంటోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం.. తమిళుల తరహాలోనే ఎందుకు పోరాడరాదు అన్న ప్రశ్న యువత మదిని తొలుస్తోంది. ఈక్రమంలో సాగరతీర ఉద్యమానికి అడుగులు పడుతున్న దాఖలాలూ కనిపిస్తున్నాయి. యువతకు దన్నుగా ఉంటామని జనసేనాని, వైసీపీ అధినేతా  చెప్పడంతో ఈ అంశంపై ఆసక్తి పెరుగుతోంది. 
ప్రత్యేక హోదా కోసం పోరాడాలి : పవన్  
ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిందిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ యువతకు సూచిస్తున్నారు. ఈ అంశంపై ఎవరైనా మౌనదీక్షకు దిగితే, తమ సేన మద్దతునిస్తుందని తెలిపారు. ఈమేరకు ఆయన యువతలో స్ఫూర్తిని నింపుతూ ట్వీట్లు చేశారు. తిడితే భరించాం, విడగొట్టి గెంటేస్తే సహించాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తిరగడతాం అని యువత కేంద్రానికి స్పష్టం చేయాలని పవన్‌ ట్వీట్‌ చేశారు. గాంధీజీని ప్రేమిస్తాం. అంబేద్కర్‌ ను ఆరాధిస్తాం. సర్దార్ పటేల్‌ కు సెల్యూట్ చేస్తాం. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం.. కానీ తల ఎగరేసె ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పోతే చూస్తూ కూర్చోమని, మెడలు వంచి కూర్చోబెడతామని పవన్‌ ట్విట్టర్‌లో హెచ్చరించారు. ఏపీ రాజకీయ నాయకులకు తెగువ, ఆత్మగౌరవం,  చిత్తశుద్ధి, జవాబుదారీతనం లేదని ఆయన విమర్శించారు.
పవన్‌ బాటలోనే జగన్ 
అటు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కూడా పవన్‌ బాటలోనే యువతకు దన్నుగా ఉంటామని ప్రకటించారు. ప్రత్యేక హోదా అంశంపై ఎవరు ఎలాంటి ఆందోళన చేపట్టినా తమ మద్దతు ఉంటుందన్న జగన్‌.. అలాంటి ఆందోళనల్లో పాల్గొనాల్సిందిగా పార్టీకి చెందిన యువతకు సూచించారు. ఈమేరకు ఆయనా ఓ ట్వీట్‌ చేశారు. 
జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు పోలికేంటీ ?: సీఎం చంద్రబాబు 
ప్రత్యేక హోదా అంశాన్ని.. జల్లికట్టు ఉద్యమంతో ముడిపెట్టడాన్ని.. ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు పోలిక ఏంటని ప్రశ్నించిన చంద్రబాబు, ఇలా మాట్లాడేవారికి పాలనానుభవం ఉందా అని ప్రశ్నించారు. 
ప్రత్యేకహోదా కోసం చర్చ జరగడం శుభపరిణామం : రామకృష్ణ
జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో చర్చ జరగడం...యువత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం శుభపరిణామమని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా కోసం సినిమా హీరోలు, హీరోయిన్‌లు ముందుకు వచ్చి ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా కోసం ఉద్యమించ వద్దనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. 
యువత తలపెట్టిన సభకు సీపీఐ పూర్తి మద్దతు 
ప్రత్యేక హోదా కోసం హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 25 న కాగడాల ప్రదర్శన చేపడుతున్నామని, 26 న వైజాగ్ లో యువత తలపెట్టిన సభకు సీపీఐ పూర్తి మద్దతు ఇస్తుందని రామకృష్ణ తెలిపారు. హోదాపై వెంకయ్యనాయుడు నోరు మెదపాలని లేకుంటే రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వబోమని రామకృష్ణ హెచ్చరించారు. అయితే..టీడీపీ మాత్రం ప్రత్యేక హోదాపై తమ వైఖరిలో మార్పులేదని చెబుతూనే ప్రత్యేక ప్యాకేజీ విషయంలో తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై పట్టుబట్టిన బీజేపీ, అధికారంలోకి రాగానే తమ హామీని నిలబెట్టుకోలేక పోయిందన్న వాదనను టీడీపీ వినిపిస్తోంది. 
హోదాపై ఉద్యమించేందుకు యువత సన్నాహాలు
మరోవైపు.. ఆర్కే బీచ్‌ వేదికగా ఈనెల 26 నుంచి హోదాపై ఉద్యమించేందుకు యువత సన్నాహాలు చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో విస్త్రత ప్రచారం జరుగుతోంది. ఈమేరకు, ఇప్పటికే స్థానిక యువజన సంఘాలు, బీచ్‌లో ధర్నాకు అనుమతి కోసం పోలీసు శాఖను సంప్రదించారు. వారి నుంచి వేచి చూడాల్సిందిగా సమాధానం వచ్చినట్లు యువజన సంఘాలు చెబుతున్నాయి. 26న రిపబ్లిక్‌డే కావడం, 27, 28 తేదీల్లో పారిశ్రామిక సదస్సు ఉండడంతో.. యువత ధర్నాకు పోలీసులు అనుమతించక పోవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. అయితే, తమది మౌనదీక్షే కాబట్టి, పోలీసులు అనుమతిస్తారన్న విశ్వాసంతో యువతీయువకులున్నారు. మరి తమిళతంబీల జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో రాజుకుంటున్న ప్రత్యేక హోదా ఆందోళన.. భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

 

సిండికేట్ బ్యాంకుకు తాళం వేయడం మరిచిన సిబ్బంది

అనంతపురం : జిల్లాలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు అయింది. సిండికేట్ బ్యాంకు సిబ్బంది విధులు ముగిసాయ సాయంత్రం బ్యాంకుకు తాళం వేయడం మరిచారు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు విషయన్ని గుర్తించారు. బ్యాంకు తలుపులకు ఎస్ ఐ కత్తి శ్రీనివాసులు బేడీలు వేశారు. 
 

07:47 - January 24, 2017

హైదరాబాద్‌ : నగరంలో స్వైన్‌ఫ్లూ పంజా విసురుతోంది. కొత్త సంవత్సరంలో ఇప్పటికే  ఈ మహమ్మారి ఐదుగురిని పొట్టనపెట్టుకుంది. ఇంకా స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే స్వైన్‌ఫ్లూ మరణాలు రోజురోజుకి పెరుగుతున్నా..ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికే గాంధి ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ముగ్గురు రోగులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది.
స్లైన్‌ఫ్లూ పంజా 
చలికాలం వచ్చిందంటే ప్రాణాంతక మహమ్మారి స్వైన్‌ఫ్లూ జనంపై పంజా విసురుతోంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే ఐదుగురిని మింగేసింది. గతేడాది స్వైన్‌ ఫ్లూ సోకి 17మంది ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో..స్వైన్‌ప్లూ పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే మరో ముగ్గురు రోగులు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం లక్ష్మయ్య అనే వ్యక్తి హెచ్‌1-ఎన్‌1 లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరి..రాత్రి వరకే చనిపోయారు. అతని వ్యాధి నిర్ధారణ కోసం ఇప్పటికే బ్లడ్‌ శాంపిల్‌ను పరీక్షలకు పంపినప్పటికీ ఇప్పటకీ ఇంకా రిపోర్టులు అందలేదు.  వ్యక్తి మరణించిన తరువాత కూడా టెస్ట్ రిపోర్టులు అందకపోవడంపై రోగి బందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
10 నెలల చిన్నారికి స్వైన్‌ ఫ్లూ 
మరోవైపు గాంధీలో బీబీనగర్‌కి చెందిన పది నెలల చిన్నారికి  స్వైన్‌ఫ్లూ పాజిటివ్ రావడంతో చిన్న పిల్లల వార్డులో వెంటిలేషన్‌పై చికిత్స పొందుతున్నాడు. చిన్నారి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని గాంధీ సూపరిండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. స్వైన్‌ఫ్లూ గాలిలో చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఒకరికి స్వైన్‌ఫ్లూ సోకితే..మరొకరికి త్వరగా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.  
స్వైన్ ఫ్లూ లక్షణాలతో మరో ముగ్గురు బాధితులు 
అయితే ఇంకా స్వైన్ ఫ్లూ లక్షణాలతో మరో ముగ్గురు బాధితులు చికిత్స పొందుతున్నారు. వారి బ్లడ్‌ శాంపిల్స్‌ పరీక్షలకు వెళ్లడంతో వారిని డిజాస్టర్ వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే వారిని స్వైన్‌ఫ్లూ వార్డుకి తరలిస్తారు. ముందు జాగ్రత్తలు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య పైన ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవు. గాంధీ ఆసుపత్రితోపాటు నిమ్స్‌, ఫీవర్ ఆసుపత్రిలో కూడా స్పైన్‌ఫ్లూ లక్షణాలతో రోగులు చికిత్స పొందుతున్నారు. 
ఏపీలో 7 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు 
మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఏపీలో ఇప్పటివరకు 7 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. చుట్టుపక్క రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుండడంతో ఆ ప్రభావం ఏపీపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఏది ఏమైనప్పటికీ..రోజురోజుకి స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతుండడం తీవ్ర కలవరం రేపుతోంది. స్వైన్‌ఫ్లూ విజృంభించకుండా రాష్ట్ర ఆరోగ్య శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉందని వైద్యులు సూచిస్తున్నారు. 

నేడు నిజామాబాద్ జిల్లాలో ఎంపీ కవిత పర్యటన

నిజామాబాద్ : నేడు జిల్లాలో ఎంపీ కవిత పర్యటించనున్నారు. పలు అభివద్ధి కచార్యక్రమాల్లో కవిత పాల్గొననున్నారు. 

 

నేడు ప్రధాని మోడీని కలవనున్న ఏపీ సీఎం చంద్రబాబు

ఢిల్లీ : నేడు ప్రధాని మోడీని ఏపీ సీఎం చంద్రబాబు కలవనున్నారు. సాయంత్రం 6 గంటలకు మోడీతో చంద్రబాబు భేటీ కానున్నారు. నగదు రహిత లావాదేవీలపై ప్రధానికి నివేదిక ఇవ్వనున్నారు. 

 

నేడు పనగారియాతో సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ : మధ్యాహ్నం 2 గంటలకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగారియాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. డిజిటల్ చెల్లింపుల మధ్యంతర నివేదికపై తుది కసరత్తు చేయనున్నారు.

 

 

Don't Miss