Activities calendar

25 January 2017

21:30 - January 25, 2017

ఢిల్లీ: నోట్ల రద్దు వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మందగించిందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు. ఈ ప్రభావం కొంత సమయం మేరకే ఉంటుందన్నారు. నల్లధనం, అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని చెప్పారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జాతి నుద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్తున్న ఆర్థిక వ్యవస్థగా పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మానవశక్తి కలిగిన రెండో అతి పెద్ద దేశమని రాష్ట్రపతి అన్నారు. అంతరిక్షంలో ఆరోస్థానంలో, పారిశ్రామికంగా పదో స్థానంలో ఆహార ఉత్పత్తిలో దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతుల స్థాయికి భారత్‌ చేరుకుందని ప్రణబ్‌ చెప్పారు. గత ఆరున్నర దశాబ్దాలుగా భారత ప్రజాస్వామ్యం స్థిరత్వం దిశగా పురోగతి సాధిస్తోందన్నారు. భారత్‌లో పేదరికం క్రమేణా తగ్గుతూ జీవన ప్రమాణం మెరుగుతోందని ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు.

21:13 - January 25, 2017

వెలగపూడి : వైసీపీ అధినేత జగన్‌మ్మోహన్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌ కోసమే ప్రశాంతమైన విశాఖ నగరంలో అలజడి రేపుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 27,28 తేదీల్లో విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగుతోందని.. నగరంలో అలజడి సృష్టించి రాష్ట్రానికి పెట్టుబడులు రానీయకుండా ఉండాలని జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అమాయకులైన యువకులను రెచ్చగొడుతున్నారని.. ప్రజలందరూ జగన్ మాయలో పడదని హెచ్చరించారు. నాకంటే సీనియర్లు, సమర్థులెవరు ఈ రాష్ట్రంలో లేరని.. రాష్ట్ర ప్రయోజనాలు తనకే బాగా తెలుసని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని పదే పదే అడుగుతున్నానని బాబు తెలిపారు.. బూతులు తిడితే పెద్ద నాయకులు అవ్వలేరన్నారు. . జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు సంబంధం ఏంటనీ మరోమారు ప్రకటించారు.

21:11 - January 25, 2017

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం ప్రధాన ప్రతిపక్షం మరింత దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రత్యేక ప్యాకేజీకే అధికార పార్టీ అంగీకరించి ఏపీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తోందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. హోదా సాధన ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జగన్‌ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే హోదా అస్త్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్న ప్రతిపక్ష పార్టీ రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంపైనే దృష్టి సారించి అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు స్కెచ్‌ వేస్తోంది.

మరింత దూకుడు పెంచిన జగన్

హోదా ఉద్యమాన్ని తీవ్రరూపం దాల్చేలా ఓ వైపు పవన్‌ కల్యాణ్‌.. చర్యలు చేపట్టిన దరిమిలా.. ప్రతిపక్ష వైసీపీ మరింత దూకుడు పెంచాలన్న యోచనలో ఉంది. దీనిలో భాగంగానే గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లాల్లో క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. హోదా ఉద్యమం కోసం తాను స్వయంగా విశాఖలో జరిగే క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొంటానని వెల్లడించారు. ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని జగన్‌ తీవ్రంగా తప్పబట్టారు. దమ్ముంటే ఏమైనా చేసుకోవచ్చని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

కేంద్ర ప్రభుత్వానికి మూడేళ్ల గడువు ఇస్తామని...

కేంద్ర ప్రభుత్వానికి మూడేళ్ల గడువు ఇస్తామని, అప్పటి వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లో కూడా కేంద్రాన్ని నిలదీస్తామని జగన్ తెలిపారు. అయినా కేంద్రం దిగిరాకపోతే తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జగన్‌ ప్రకటించారు. రాజీనామాలకు టీడీపీ ఎంపీలు కూడా కలిసి రావాలని జగన్‌ డిమాండ్‌ చేశారు.

జగన్ ఆరోపణలను ఖండించిన మంత్రి దేవినేని...

ప్రభుత్వంపై జగన్‌ చేసిన ఆరోపణలను మంత్రి దేవినేని ఉమ ఖండించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే చంద్రబాబుపై జగన్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డుపెట్టుకుని జగన్‌.. సీఎంపై ఆరోపణలు చేస్తున్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలన్నీ సాధించేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను...

విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను ఇస్తామని కేంద్రం ఒప్పుకుందని, అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ అన్నారు. సీఎం చంద్రబాబు కూడా దీనిపై ఢిల్లీలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని ఆయన తెలిపారు.

హోదా ఉద్యమంపై పట్టు బిగించేందుకు జగన్‌ పావులు ...

ఇటు.. హోదా ఉద్యమంపై పట్టు బిగించేందుకు జగన్‌ పావులు కదుపుతుంటే.. అటు... అధికార పార్టీ నేతలు జగన్‌పై విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర వినాశనాన్ని కోరుకునే వ్యక్తి జగన్‌.. ప్రతిపక్ష నాయకుడుగా ఉండటం దురదృష్టకరమని ప్రభుత్వ విప్‌ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. హోదా విషయంలో ఎవరి నుంచి స్ఫూర్తి పొందాలో వారి స్ఫూర్తి పొందుతామని జగన్‌ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కూడా ప్రత్యేక హోదా ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే..ఎంపీలు తమ డిమాండ్లకు పార్లమెంటులో మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

రిపబ్లిక్‌ డే సందర్భంగా హోదా ఉద్యమంపై ...

మొత్తానికి రిపబ్లిక్‌ డే సందర్భంగా హోదా ఉద్యమంపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం చూస్తే భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనన్న ఆసక్తి నెలకొంది.

హోదా కన్నా ప్యాకేజీతోనే ఎక్కువలాభం:చంద్రబాబు

వెలగపూడి : జల్లికట్టుకు, ప్రత్యేకహోదాకు సంబంధం ఏంటని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పోలవరం పూర్తయితే రాజకీయ మనుగడ ఉండదని ప్రతిపోఆలు భయపడుతున్నాయని బాబు ఎద్దేవా చేశారు. రిపబ్లిక్ డే రోజున నిరసనలకు పిలుపునివ్వడం సరికాదన్నారు. ప్రత్యేకహోదాపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాని మోదీ, జైట్లీని కోరినట్లు తెలిపారు. హోదాకు, పరిశ్రమల పోత్సాహకాలకు సంబంధం లేదన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతోనే ఎక్కువలాభం అని స్పష్టం చేశారు.

జైళ్ల తరలింపు ఆస్పత్రుల నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో జైళ్ల తరలింపు ఆస్పత్రుల నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వరంగల్ లో హెల్త్ యూనివర్శిటీతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఈఏడాదిలో నిర్మించాలని కేసీఆర్ తెలిపారు. వరంగల్ సెంట్రల్ జైలు, హైదరాబాద్ చంచల్ గూడ జైలు, రేస్ కోర్సును మరో చోటుకు తరలించాలని సూచించారు. ఆస్పత్రుల నిర్మాణానికి ఈ బడ్జెట్ లో అవసరమైన నిధులు కేటాయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా భద్రత పెంచాం: ఏపీ డీజీపీ

విజయవాడ: నిఘా సంస్థల హెచ్చరికల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా భద్రత పెంచామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల28 వరకు ఊరేగింపులు, సమావేశాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఆందోళన కార్యక్రమాల్లో అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదముందని నిఘా వర్గాలు సూచించాయని తెలిపారు. ఊరేగింపులు, సమావేశాల విజ్ఞప్తులపై 28 తర్వాతే పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. పార్టీలు, ఇతరులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.

నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: పరేడ్‌గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గ్రౌండ్‌లోకి ఎలాంటి వస్తువులను తీసుకురావద్దని తెలిపారు. నగరంలో 2700 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

నగదు రహితలావాదేవీలు పెరిగితే పారదర్శకత పెరుగుతుంది

ఢిల్లీ: నగదు రహితలావాదేవీలు పెరిగితే పారదర్శకత పెరుగుతుందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. బుధవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దేశ ప్రజలకు గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. దేశంలో పెద్దనోట్ల రద్దువల్ల తాత్కాలికంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించినప్పటికీ నగదు రహిత లావాదేవీల్లో పుంజుకుంటున్నామని నగదు రహితలావాదేవీలు పెరిగితే పారదర్శకత పెరుగుతుందని ఆయన అన్నారు. 130 కోట్ల జనాభాతో భారత్‌ బలమైన ప్రజాస్వామిక దేశంగా అవతరించిందన్నారు.

18:40 - January 25, 2017

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ చేస్తున్న ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ప్రత్యేక హోదా ఉద్యమంపట్ల సర్కార్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోరుతూ విద్యార్ధులు చేస్తున్న నిరసనకు అనుమతి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని నిలదీశారు. విజయవాడలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఉద్యమం, ప్రజాస్వామిక నిరసనలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దీంతో పాల్గొన్న నేతలంతా ప్రత్యేక హోదా ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్ట ప్రకటించారు. ఇదే అంశంపై 'టెన్ టివి' చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

ఏసీబీకి పట్టుబడ్డ చింతకొమ్మదిన్నె తహశీల్దార్

కడప: చింతకొమ్మదిన్నె తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడి చేసింది. రూ.5వేలు లంచం తీసుకుంటూ తహశీల్దార్ జహీర్ పట్టుబడ్డాడు.

పద్మ అవార్డు గ్రహీతలు వీరే..

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 2017 ఏడాదికి గానూ 89 మందికి పద్మ అవార్డులను ప్రకటించినప్పటికీ.. ఈ సారి భారతరత్న ఎవరినీ వరించలేదు. గతేడాది ఇద్దరికి భారతరత్నను కేంద్రం ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదికి 7 పద్మ విభూషణ్, 7 పద్మ భూషణ్, 75 పద్మ శ్రీ అవార్డులను ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 19 మంది మహిళలకు పద్మ అవార్డులు దక్కాయి. ఐదుగురు విదేశీయులు ఉన్నారు. ఆరుగురికి మరణానంతరం పద్మ అవార్డులు దక్కాయి. తెలంగాణకు చెందిన ఆరుగురికి పద్మ శ్రీ అవార్డులు వరించాయి.

 

పద్మ విభూషణ్

29న నాగచైతన్య,సమంత ల నిశ్చితార్థం

హైదరాబాద్: ఈనెల29న నాగచైతన్య,సమంత ల నిశ్చితార్థం నిశ్చితార్థ వేడుకను జరగబోతోంది. ఇప్పటికే ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అక్కినేని, కొణిదెల, భూపాల్‌, ప్రభు ఫ్యామిలీలతోపాటు ఇంకా పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరౌతున్నట్లు సమాచారం.

17:41 - January 25, 2017

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర 101వరోజు కొనసాగుతోంది.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సబ్ ప్లాన్‌ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని... పాదయాత్ర బృందం ఉపనేత జాన్‌ వెస్లీ ఆరోపించారు.. వెనకబడిన కులాలవారి జనాభా ప్రకారం బడ్జెట్‌ కేటాయింపులు జరపాలని డిమాండ్ చేశారు.. పాదయాత్రపై ప్రభుత్వ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ సవాల్‌కు సిద్ధంగా ఉన్నామని... చర్చకు మీరు రెడీయా అని ప్రశ్నించారు.. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

17:40 - January 25, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎన్నికల సందడి మొదలైంది. రాబోయే ఆరు నెలల్లో ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగనుండడంతో ఆశావహులు ప్రయత్నాల్లో మునిగిపోయారు. దీంతో ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో ఖాళీ కానున్న 7 ఎమ్మెల్సీ స్థానాలు....

ఈ ఏడాది తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీ స్థానాలు పెద్ద ఎత్తున ఖాళీ అవుతున్నాయి. దాదాపు 7 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం మండలి సభ్యుడు జనార్ధనరెడ్డి, శాసనసభ్యులకోటాలో పదవులు పొందిన గంగాధర్ గౌడ్, మాఘం రంగారెడ్డి,సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వీల పదవీ కాలం మార్చి నెలాఖరు నాటికి పూర్తికానుంది. ఇక హైదరాబాద్ లోకల్ బాడీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంఐఎం ఎమ్మెల్సీ హసన్ జాఫీ, నామినేటెడ్ కోటా సభ్యులుగా అవకాశం దక్కించుకున్న ఫరూక్ హూస్సేన్, డి. రాజేశ్వర్ పదవీ కాలం మేలో ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నికల్లో టీఆర్‌దే హవా...

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు టీఆర్‌ఎస్‌ దక్కించుకుంటోంది. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతుందని విశ్లేషకుల అంచనా. 7 స్థానాల్లో 6 స్థానాలు టీఆర్‌ఎస్‌ గెల్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.

టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి...

ఎమ్మెల్సీ పదవులు కోసం టీఆర్‌ఎస్‌లో అప్పుడే సందడి మొదలైంది. ఎమ్మెల్సీ పదవిపై చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారంతా అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. అధిష్టానం పెద్దల దగ్గర లాబీయింగ్‌ మొదలు పెట్టారు. సామాజిక వర్గీకరణలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఎమ్మెల్సీ పదవే లక్ష్యంగా అందివచ్చే ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్న ప్రస్తుత ఎమ్మెల్సీలు...

ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎం. రంగారెడ్డిలు మినహా మిగిలిన ఎమ్మెల్సీలంతా ఇతర పార్టీల నుంచి కారెక్కిన వారే. అధికార పార్టీ చెంతన ఉండడంతో వారందరికీ మరోసారి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలున్నాయని టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉద్యమ కాలంలో టీఆర్‌ఎస్‌లో చురుకుగా పనిచేసినవారు, ఇతర ఆశావహులు తమకు అవకాశం కల్పించాలని గులాబీ బాస్‌ను కలిసి కోరుతున్నారు. మరి కేసీఆర్‌ ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాల్సిందే.

17:37 - January 25, 2017

యాదాద్రి : భువనగరి జిల్లా అనంతారం వద్ద నురుగు కొండ ఇబ్బందులకు గురిచేసింది. మూసి నదిలో అంతెత్తున నురగ నీరు ప్రవాహిస్తోంది. దీంతో ఈ నురగ నీటిలో చెంగిచెర్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ముందు చక్రం దిగబడింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణీకులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

17:12 - January 25, 2017

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్

హైదరాబాద్‌ః శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ ప్రకటించారు. రేపటి గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఎయిర్‌పోర్టులో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణ సమయానికి రెండు గంటల ముందుగానే విమానాశ్రయంలోని భద్రతా తనిఖీల కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. జారీ చేసిన హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని, రద్దీకి అనుగుణంగా విమానాశ్రయ భద్రతను పెంచారు.

17:00 - January 25, 2017

చిత్తూరు : తిరుపతిలో నారాయణ పాఠశాల విద్యార్థి మనోజ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.. సప్తగిరి నగర్‌లోని నారాయణ పాఠశాల భవనంపై నుంచి దూకేశాడు.. ఈ విషయం గమనించిన పాఠశాల సిబ్బంది మనోజ్‌ను ఆస్పత్రికి తరలించారు.. అప్పటికే అతను చనిపోయాడు.. మనోజ్‌.... నారాయణ స్కూల్‌లో పదోతరగతి చదువుతున్నాడు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడని ఉపాధ్యాయడు మందలించడాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరో వైపు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

16:58 - January 25, 2017

తిరుపతి : తిరుమలలో మరోసారి అన్యమత ప్రార్థనలు కలకలం సృష్టించాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలో ఓ వ్యక్తి నమాజ్ చేశాడు. నమాజ్ చేస్తున్న వ్యక్తిని కలకత్తాకు చెందిన అమ్జాగా గుర్తించారు. టీటీడీ భద్రతా సిబ్బంది అతనని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

16:56 - January 25, 2017

విశాఖ: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలియజేయడం ప్రజల హక్కు అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ...ప్రత్యేక హోదా సాధనకై రేపు విశాఖ బీచ్‌లో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని వైసీపీ నేత బొత్స నారాయణ స్పష్టంచేశారు. ఆర్కే బీచ్ నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత జగన్ కూడా పాల్గొంటారని స్పష్టం చేశారు. 26వ తేదీ కాకుండా వేరే రోజు జరుపుకోమని పోలీసు అధికారులు చెప్పడం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 6 కోట్ల ఆకాంక్షను బ్యారికేడ్లు ఆపలేవని పేర్కొన్నారు.

16:52 - January 25, 2017

అమరావతి: తమిళనాడు జల్లికట్టుకు... ప్రత్యేక హోదాకు సంబంధం లేదన్నారు.... ఏపీ మంత్రి నారాయణ... విభజన చట్టంలోఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటూ.. కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.. ఈ విషయంపై సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి జైట్లీని కలిసి మరోసారి విజ్ఞప్తికూడా చేశారని చెప్పారు..

16:46 - January 25, 2017

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఉంటుందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు. ప్రాంతాలుగా విడిపోయినా కలిసిఉందామని తాము మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు. కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం కలిసి పోరాటం చేద్దామని ఆమె స్పష్టంచేశారు.

16:45 - January 25, 2017

అమరావతి :టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నేత..సీఎం చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లా నాయకులపై మండిపడ్డారు. వంశధార క్షేత్రస్థాయి పరిస్థితిని ఎందుకు అంచనా వేయలేకపోయారని ప్రశ్నించారు. మంత్రులు.. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నిలదీశారు. ముఖ్యంగా పార్టీలో క్రమశిక్షణ రాహిత్యంపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మంత్రి రావెల కిషోర్‌బాబు..గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌ వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన వీరికి క్రమశిక్షణ గురించి తెలియదా అని ప్రశ్నించారు. ఇక చిన్న..పెద్దా అని చూడబోనని.. తేడా వస్తే వేటు వేస్తానని చంద్రబాబు హెచ్చరించారు.

16:43 - January 25, 2017

యూపీ : బిజెపి ఎంపి వినయ్‌ కటియార్‌ ప్రియాంకా గాంధీని టార్గెట్‌ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకాగాంధీని ఆయన సెక్సీ నేతగా పేర్కొనడం వివాదస్పదంగా మారింది. ప్రియాంక అంత అందగత్తేమి కాదని...ఆమె కన్నా అందమైన మహిళా ప్రచార నేతలు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. వినయ్‌ కటియార్‌ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌-ఎస్పీ డిమాండ్‌ చేశాయి. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని...క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని వినయ్‌ కటియార్ స్పష్టం చేశారు. యూపీ ఎన్నికల ప్రచారంలో స్టార్‌ క్యాంపెనెయిర్‌గా ప్రియాంకాగాంధీని కాంగ్రెస్‌ ప్రకటించిన నేపథ్యంలో బిజెపి ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.

16:42 - January 25, 2017

విజయవాడ :ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. హోదా సాధనకై ఎందాకైనా ఉద్యమం చేస్తామని స్పష్టంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా కావాలన్న సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీకు ఒప్పుకోవడం దారుణమని మండిపడుతున్నారు. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తామని చెబుతున్నారు. హోదా ఉద్యమాన్ని నీరుగార్చితే రెట్టింపు స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఎస్ ఆర్ ఆర్ కాలేజీ, సిఆర్ ఆర్ కాలేజీ విద్యార్థులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:46 - January 25, 2017
15:40 - January 25, 2017

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదా ఉద్యమానికి పవన్ కల్యాణ్ నాయకత్వం వహించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు పవన్‌తో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పార్టీలకతీతంగా ప్రజలు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని రామచంద్రయ్య ఆరోపించారు.

15:38 - January 25, 2017

అమరావతి : ప్రత్యేక హోదా కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమాలను అణిచేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి శైలజానాథ్‌ ఆరోపించారు. హోదాను పక్కన పెట్టి ప్యాకేజీ కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు కాంగ్రెస్ తరపున పోరాటం కొనసాగిస్తామన్నారు. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా రేపటి నుంచి గాంధీ, అంబేడ్కర్ విగ్రహాల దగ్గర మౌనదీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.

 

15:36 - January 25, 2017

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో నిర్వహించిన రైల్‌రోకోకు సంబంధించిన కేసు విషయమై ఈరోజు ఎంపీ కవిత సికింద్రాబాద్‌ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో మొత్తం 14 మంది ఉన్నారు. ఈ సందర్భంగా కోర్టు పూర్వపరాలు పరిశీలించి కేసును కొట్టివేసింది. ఎర్రపార్టీ, పచ్చపార్టీలు తెలంగాణ రాకుండా ఉండేందుకు ప్రయత్నించారని.. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎంపీ కవిత అన్నారు.

15:34 - January 25, 2017

చిత్తూరు : కుప్పంలో పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ఓ యువతి అదృశ్యం కేసులో తమిళఅరసు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో పోలీసులు యువకుడిపై థర్డీ డిగ్రీ ప్రయోగించారు. దీంతో పోలీసులు దెబ్బలకు యువకుడు తీవ్రగాయాల పాలై కదలలేని స్ధితిలోకి చేరాడు. పోలీసులు తీరుకు నిరసనగా గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

గుంటూరు: వెలగపూడి లో ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి 638 ఎకరాలు, అనంతపురం జిల్లా 500 మె.వా సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు 4018 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం.

తిరుమలలో అన్యమత ప్రార్థనల కలకలం

తిరుపతి:తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రార్థనలు కలకలం రేపాయి. తాజాగా ఓ ముస్లిం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్దకు వెళ్లి...అక్కడ నమాజ్ చేశాడు. టీటీడీ భద టిటిడి భధ్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నమాజ్ చేసిన వ్యక్తి కోల్ కతాకు చెందిన అమీర్ అమ్జాగా తెలుస్తోంది.

రైల్వే కోర్టులో ఎంపి కవితకు ఊరట

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎంపీ కవితకు రైల్వే కోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో కార్యక్రమాలో పాల్గొన్న ఆమెపై కేసు నమోదైంది. దీనిపై బుధవారం విచారణ జరిపిన రైల్వేకోర్టు కేసులను కొట్టివేసింది.

కటియార్ వ్యాఖ్యలు భారత స్త్రీల పట్ల బిజెపి స్వభామే

ఢిల్లీ : బిజెపి ఎంపి వినయ్ కటియార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ యువరాణి ప్రియాంక గాంధీ స్పందించారు. నాపై వినయ్ కటియార్ వ్యాఖ్యలు భారత స్త్రీల పట్ల బిజెపి స్వభావాన్ని సూచిస్తుంది అని విమర్శించారు.

మాసబ్‌ట్యాంక్‌ చౌరస్తాలో ఉద్రిక్తత

హైదరాబాద్: నగరంలోని మాసబ్‌ట్యాంక్‌ చౌరస్తాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, బీసీ సంఘాలనేత ఆర్‌.కృష్ణయ్య పాల్గొన్నారు.ర్యాలీగా బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

నారాయణ స్కూల్ లో పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య

చిత్తూరు : తిరుపతి నగరం కపిలతీర్థం రోడ్‌లోని నారాయణ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మనోజ్‌కుమార్‌ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాల భవనం పైనుంచి మనోజ్‌కుమార్‌ కిందకు దూకాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని స్విమ్స్‌కు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు.

14:47 - January 25, 2017

'జోగిని వ్యవస్థ అంటే ఏమిటీ..? ' అనే అంశంపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా జోగిని వ్యవస్థ గురించి ఆసక్తరమైన విషయాలు తెలిపారు. మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు, వరకట్నాలు, కన్యాశుల్క వంటి అంశాలపై మాట్లాడారు. లాయర్ తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

14:41 - January 25, 2017

గుంటూరు : అమరావతిలో సోలార్‌ ప్యానల్స్‌ తయారీ జోరందుకుంది. సోలార్‌ వాడకంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించడంతో జనం కూడా సౌరశక్తి వస్తువులపై ఆసక్తి చూపుతున్నారు. సోలార్‌ పంపుల వినియోగంలో కృష్ణా జిల్లా టాప్‌లో రావడం అధికారుల్లో ఉత్సాహం నింపుతోంది. వీధి దీపాలను కూడా సోలార్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
సౌరశక్తి వినియోగం        
సౌరశక్తి వినియోగంలో ఏపీ దూసుకుపోతోంది.. ఇప్పటికే సోలార్‌ పంపుల వాడకంలో కృష్ణా జిల్లా దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది.. విద్యుత్‌ వాడకం పెరిగిపోవడంతో సోలార్‌ వస్తువుల్ని కొనేందుకు రైతులు, గృహ వినియోగదారులు, పారిశ్రామిక వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి .సోలార్‌ ప్యానల్స్‌ దాదాపు 25ఏళ్లపాటు సమర్ధవంతంగా పనిచేయడం... సోలార్‌ సిస్టంపై సర్కారు 30శాతం రాయితీ ఇవ్వడంతో ఈ వస్తువులను డిమాండ్ మరింత పెరుగుతోంది. 
సాప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి 
ప్రభుత్వం కూడా సాప్రదాయేతర ఇంధన వనరులను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టింది.. ఇప్పటికే సౌరశక్తిద్వారా పనిచేసే వీధిదీపాలను విజయవాడ నగరపాలక సంస్థలో ఏర్పాటుచేసింది. మరికొన్ని మున్సిపాలిటీల్లో కూడా సోలార్‌ స్ట్రీట్‌ లైట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు..
విద్యుత్‌ శక్తిగా సూర్యరశ్మి 
సోలార్‌ ప్యానల్స్‌ సూర్యరశ్మిని విద్యుత్‌ శక్తిగా మారుస్తాయి. ఏపీలో సోలార్‌ ప్యానల్స్‌ను సోల్‌టెక్‌ సంస్థ తయారుచేస్తోంది. నెడ్ క్యాప్ అధికారులు, ట్రాన్స్ కో అధికారులు కూడా సోల్ టెక్ సోలార్ ప్యానల్ తయారీని ధృవీకరించారు. అమరావతిలో ఇంతపెద్ద సోలార్ ప్యానల్ తయారీ సంస్థ ఏర్పాటుకావడం నవ్యాంధ్రప్రదేశ్ కు గర్వకారణమని నెడ్‌క్యాప్ అధికారులు అంటున్నారు. మొత్తానికి ఏపీలో సోలార్‌ ఉత్పత్తుల వాడకం పెంచేందుకు సర్కారు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని చూస్తోంది.

 

14:30 - January 25, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించింది. దీనికోసం సీఎం వివిధ శాఖల అధికారులతో సమాలోచనలు జరిపారు. గత బడ్జెట్‌లో తలెత్తిన లోపాలను పునారవృతం కాకుండా సమగ్ర బడ్జెట్‌ను రూపొందించడానికి ప్రయత్నం జరుగుతుంది.
మూడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం మూడో బడ్జెట్‌ను త్వరలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది.  గతానికి భిన్నంగా ఈసారి ఎస్టాబ్లిష్‌మెంట్ ఎక్స్‌పెండేచేర్‌, స్కీమ్‌ ఎక్సపెండేచేర్‌తో బడ్జెట్‌ రూపొందనుంది. ఈ మేరకు ప్లాన్‌.. నాన్‌ప్లాన్డ్ స్థానంలో.. క్యాపిటల్‌, రెవెన్యూ ఎక్స్‌పెండేచర్‌ పద్ధతిలో నిర్దిష్ట బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఫిబ్రవరి మొదటివారంలోపే వీలైనంత తొందరగా ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. దీంతో డిపార్ట్‌మెంట్లన్నీ బడ్జెట్‌ ప్రతిపాదనలపై  దృష్టి సారించారు.
ఈ ఏడాది మరింత పెరగనున్న బడ్జెట్‌
గత ఏడాది కంటే ఈ సంవత్సరం బడ్జెట్‌ పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది లక్షా 30 వేల 4 వందల 15 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. ఈ సారి ప్రభుత్వం సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది.  ఇందులో భాగంగా విద్య, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లకు, మత్స్యశాఖ, చేనేత, బీసీ, మైనార్టీ వెల్ఫేర్‌కు మరిన్ని నిధులు కేటాయించే ఛాన్స్‌ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్‌లో కుల వృత్తులకు నిధులు కేటాయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 
ఇరిగేషన్‌కు భారీగా నిధులు
ప్రాజెక్ట్‌ల కోసం నెలకు వెయ్యి కోట్లను ఖర్చు చేయనున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో  ఆర్థిక శాఖ ఇరిగేషన్‌కు భారీగానే నిధులు కేటాయించనుంది. ఈ సారి  ప్రధాన రంగాలకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి  కేజీ టూ పీజీ విద్యవిధానంలో భాగంగా నియోజకవర్గానికి బీసీ రెసిడెన్సియల్‌ స్కూళ్లు స్టార్‌ చేయబోతుంది. దీనికోసం కూడా నిధులు భారీగా కేటాయించనున్నారు. అలాగే వాటర్‌ గ్రిడ్‌, మిషన్‌ కాకతీయ, విద్యుత్తు, వ్యవసాయానికి, సంక్షేమ రంగానికి గత బడ్జెట్‌లో మాదిరిగానే ప్రయార్టీ ఇచ్చే చాన్స్‌. 
పొలిటికల్‌ కోణంలో కూడా రెడీ 
ఈసారి బడ్జెట్‌ ప్రజల కోణంలోనే కాక... పొలిటికల్‌ కోణంలో కూడా రెడీ కాబోతుంది. ఈ బడ్జెట్‌ తర్వాతే ఎలక్షన్‌ ఇయర్‌ ఎంట్రీ అవుతుండడంతో.. ఈ బడ్జెట్‌ ప్రజాకర్షకంగా ఉండాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రధాన పథకాలకు టాప్‌ ప్రయార్టీ ఇస్తూనే...సంక్షేమం, సంప్రదాయ శాఖలను కూడా స్థానం కల్పిస్తోంది.     

 

14:29 - January 25, 2017

అమరావతి : ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారపక్షం వేరు.. ప్రతిపక్షం వేరు కాదని.. ప్రజా సంక్షేమం కోసం అందరూ కృషి చేయాలని టీడీపీ నాయకుడు కాల్వ శ్రీనివాసులు అన్నారు. కానీ ఏపీ అభివృద్ధిని వైసీపీ నేత జగన్‌ అడ్డుకుంటున్నారని ఇది ఎంతో బాధాకరమని ఆయన అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేయడం ప్రతిపక్షాల బాధ్యత కూడా అన్నారు.

14:26 - January 25, 2017

గుంటూరు : మహిళా సాధికారత కోసం మూడు రోజులపాటు నిర్వహించే కాన్ఫరెన్స్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మహిళా నేతలు పాల్గొంటారని అన్నారు. వివిధ దేశాలకు చెందిన నేతలు కూడా కాన్ఫరెన్స్‌లో భాగమవుతారని కూడా చెప్పారు.  మహిళల అభివృద్ధి కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కాన్ఫరెన్స్‌లో చర్చించడం జరుగుతుందని అన్నారు.

 

14:22 - January 25, 2017

ఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం యువత చేయనున్న ఆందోళనపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పుకునే అధికారం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం కేంద్రం చేస్తోందని అన్నారు. ఏ రాష్ర్టానికీ ప్రకటించనన్ని ప్రాజెక్టులు ఏపీకి ప్రకటించామని చెప్పుకొచ్చారు.

14:19 - January 25, 2017

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అనంతపురం ఎస్‌కే యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ, వైసీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు క్లాసులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు ప్రజలను మోసం చేశాయని...విద్యార్థి నాయకులు అన్నారు.

14:18 - January 25, 2017

ఢిల్లీ: 2017 సంవత్సరం పద్మాలు వికసించాయి. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన పలువురు ప్రముఖులకు కేంద్రం ప్రభుత్వం పద్మ పురష్కారాలను ప్రకటించింది. మొత్తం ఏడుగురికి పద్మవిభూషణ్‌ వరించగా.. మరో ఏడుగురు ప్రముఖులు పద్మభూషణ్‌ అవార్డులకు ఎంపికయ్యారు. మొత్తం 75 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.

ప్రముఖ గాయకుడు కె.జె.ఏసుదాసు...

ప్రముఖ గాయకుడు కె.జె.ఏసుదాసు, సద్గురు జగ్గీవాసుదేవ్‌, శరద్‌పవార్‌, మురళీమనోహర్‌జోషి, సుందర్‌లాల్‌ పట్వా, ప్రొఫెసర్‌ ఉడిపి రామచంద్రరావు, పీఏ సంగ్మా- పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. అయితే వీరిలో సుందర్‌లాల్‌ పత్వా, పీఏ సంగ్మాలకు మరణానంతరం పద్మవిభూషణ్‌లు ప్రకటించడం విశేషం. పద్మ భూషణ్‌ అవార్డులకు ఎంపికైన వారిలో విశ్వమోహన్‌భట్‌, ప్రొఫెసర్‌ దేవి ప్రసాద్‌ ద్వివేది, తెహెంతన్‌ ఉద్వాడియా, రత్న సుందర్‌ మహారాజా, స్వామి నిరంజన్‌ నందా సరస్వతి, చో.రామస్వామి, వీరితో పాటు ప్రిన్సెస్‌ మహాచక్రి సిరింధోర్న్‌ అనే విదేశీయుడు కూడా ఉన్నారు.

మరో 75 మంది ప్రముఖులకు...

వివిధ రంగాల్లో సేవలందించిన మరో 75 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. వీరిలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఒలింపిక్‌ మెడల్‌ గెలిచిన సాక్షిమాలిక్‌, జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌, డిస్కస్‌ త్రోయర్‌ వికాస్‌గౌడ, హాకీ టీమిండియా కెప్టెన్‌ పీఆర్‌ శ్రీజేష్‌ ఉన్నారు. ఎన్నారైలలో ఎయిడ్స్‌పై పరిశోధనలు చేస్తున్న డాక్టర్‌ సునితి సాల్మన్‌, సురబ్‌హార్‌ ఆర్టిస్ట్‌ ఇమ్రత్‌ఖాన్‌, నేపాల్‌కు చెందిన అనురాధా కొయిరాలాలను పద్మశ్రీ వరించింది.

పద్మాపురష్కారాలకు ఎంపికైన వారిలో తెలుగు తేజాలూ ...

పద్మాపురష్కారాలకు ఎంపికైన వారిలో తెలుగు తేజాలూ ఉన్నారు. తెలంగాణకు చెందిన ఎక్కా యాదగిరి, త్రిపురనేని హనుమాన్‌ చౌదరి, డాక్టర్‌ మహ్మద్ అబ్దుల్ వహీద్‌, చంద్రకాంత్ పత్వా, దరిపల్లి రమేష్‌లను పద్మశ్రీ అవార్డులు వరించాయి. కోటి మొక్కలు నాటిన ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్యకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. చేనేత ఆసుయంత్రం రూపొందించిన చింతకింది మల్లేశంకు పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. తనకు పద్మశ్రీ అవార్డు రావడంపై చింతకింది మల్లేశ్‌ అనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కలరియట్టు నిపుణురాలు కోటేశ్వరమ్మను పద్మశ్రీ అవార్డులు వరించాయి.

 

పద్మవిభూషణ్‌

కె.జె.ఏసుదాసు ( కేరళ )

సద్గురు జగ్గీవాసుదేవ్‌ (తమిళనాడు)

శరద్‌పవార్‌ (మహారాష్ట్ర)

మురళీమనోహర్‌జోషి (ఉత్తరప్రదేశ్‌ )

సుందర్‌లాల్‌ పట్వా (మధ్యప్రదేశ్‌)

ప్రొఫెసర్‌ ఉడిపి రామచంద్రరావు (కర్నాటక)

పీఏ సంగ్మా (మేఘాలయ)

పద్మభూషణ్‌

విశ్వమోహన్‌భట్‌, ప్రొఫెసర్‌ దేవి ప్రసాద్‌ ద్వివేది, తెహెంతన్‌ ఉద్వాడియా

రత్న సుందర్‌ మహారాజా, స్వామి నిరంజన్‌ నందా సరస్వతి

చో.రామస్వామి, ప్రిన్సెస్‌ మహాచక్రి సిరింధోర్న్‌

 

(పద్మ భూషణ్‌ )

విశ్వమోహన్‌భట్‌, ప్రొఫెసర్‌ దేవి ప్రసాద్‌ ద్వివేది, తెహెంతన్‌ ఉద్వాడియా

రత్న సుందర్‌ మహారాజా, స్వామి నిరంజన్‌ నందా సరస్వతి, చో.రామస్వామి

ప్రిన్సెస్‌ మహాచక్రి సిరింధోర్న్‌ అనే విదేశీయుడు

75 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు

పద్మశ్రీ అవార్డులు

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఒలింపిక్‌ మెడల్‌ గెలిచిన సాక్షిమాలిక్‌

జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌, డిస్కస్‌ త్రోయర్‌ వికాస్‌గౌడ

హాకీ టీమిండియా కెప్టెన్‌ పీఆర్‌ శ్రీజేష్‌

డాక్టర్‌ సునితి సాల్మన్‌, సురబ్‌హార్‌ ఆర్టిస్ట్‌ ఇమ్రత్‌ఖాన్‌

నేపాల్‌కు చెందిన అనురాధా కొయిరాలాల

 

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన తెలుగువారు

ఎక్కా యాదగిరి ( తెలంగాణ)

త్రిపురనేని హనుమాన్‌ చౌదరి (తెలంగాణ)

డాక్టర్‌ మహ్మద్ అబ్దుల్ వహీద్‌ (తెలంగాణ)

చంద్రకాంత్ పత్వా (తెలంగాణ)

దరిపల్లి రమేష్‌ (తెలంగాణ)

వనజీవి రామయ్య (తెలంగాణ)

చింతకింది మల్లేశం (ఆంధ్రప్రదేశ్‌)

కోటేశ్వరమ్మ (ఆంధ్రప్రదేశ్‌ )

14:16 - January 25, 2017

హైదరాబాద్: రిపబ్లిక్‌ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. తెలంగాణ, ఏపీల్లో ముష్కరులు చొరబడ్డారని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐఎమ్‌, సిమి కార్యకర్తలను స్వీపర్‌సెల్స్‌గా ఉపయోగించే అవకాశం ఉందని కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. అటు ఢిల్లీలో, ఇటు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ ముమ్మర తనిఖీలు చేపట్టారు.

14:11 - January 25, 2017

విజయవాడ : కేంద్ర ప్రభుత్వానికి ఏపీని చంద్రబాబు తాకట్టుపెట్టారన్న జగన్‌ వ్యాఖ్యలపై...  మంత్రి దేవినేని ఉమా తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే చంద్రబాబుపై జగన్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎవరికీ తాకట్టు పెట్టబోమన్నారు.  ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డుపెట్టుకుని జగన్‌..  సీఎంపై నిందారోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలన్నీ సాధించేందుకు తెలుగు దేశం ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. 

 

31న భక్తరామదాసు ప్రాజెక్టు ప్రారంభం

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో నిర్మించిన భక్తరామదాసు ప్రాజెక్టు ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. రూ. 307 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 60 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.

14:04 - January 25, 2017

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదాపై ఏపీ వేడెక్కుతోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వరుస ట్వీట్లతో హీట్‌ పుట్టిస్తున్నారు. కేంద్రంలో ఉండే రాజకీయ నేతలకు ఆంధ్రులు బాసినలు కారని ట్వీట్‌ చేశారు. వ్యాపారలావాదేవీలు నడిపేవారు కేంద్రంలోని నేతలకు వంగివంగి నమస్కారాలు చేసినంత మాత్రాన ఆంధ్రులు బానిసలైనట్టు కాదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:00 - January 25, 2017
13:52 - January 25, 2017

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని సినీ నటుడు నాగబాబు అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే జనసేన పార్టీకి తన సంపూర్ణ  మద్దతు ఉంటుందన్నారు.  పవన్‌ కల్యాణ్‌ ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు.  రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీనిచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు.  రేపు జరిగే మౌనదీక్షకు తన మద్దతు ప్రకటించారు.
 

13:46 - January 25, 2017

విజయవాడ : ఏడాది తర్వాత మళ్లీ కాల్‌మనీ కేటుగాళ్లు బెజవాడలో పంజా విసురుతున్నారా..? బాధితుల డాక్యుమెంట్లు గుప్పిట్లో పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారా..? తాజాగా కమిషనరేట్‌కు వచ్చిన ఓ ఫిర్యాదు కాల్‌మనీ కేటుగాళ్ల జాడలను తెలియజేస్తుంది.. ఇంతకాలం కాల్‌మనీ గొడవలు తగ్గాయనుకుంటే మళ్లీ కేసు నమోదుతో కథ మొదటికొచ్చింది.
మళ్లీ బెజవాడలో కాల్‌మనీ వేధింపులు..
కొంతకాలంగా కాల్‌మనీ వ్యాపారులు స్తబ్దుగా ఉన్నా మళ్లీ పంజా విసురుతున్నారు..ఇప్పటికే ఎన్నో కాల్‌మనీ కేసులు పెట్టిన పోలీసులు వడ్డీ వ్యాపారులకు హెచ్చరికలు చేశారు..ఈ కేసులపై సీరియస్‌గా తీసుకుని కాల్‌మనీ వ్యవహారాన్ని నిర్మూలించారు..అయితే ఆ జాడలు ఇంకా ఉన్నాయని తేలింది.. తాజాగా మరో బాధితురాలు కాల్‌మనీ కేటుగాడిపై కేసు పెట్టేందుకు విజయవాడ కమిషనరేట్‌ను ఆశ్రయించింది...
వందకు 10 రూపాయల వడ్డీ...
బెజవాడలో మళ్లీ వడ్డీ వ్యాపారులు జూలు విధిలిస్తున్నారా...? తాజాగా కమిషనరేట్‌కు వచ్చి తన కష్టాన్ని చెప్పుకుని కేసు నమోదు చేయించిన బాధితురాలి మాటలను బట్టి చూస్తే కేటుగాళ్లు మళ్లీ చెలరేగుతున్నారని తెలుస్తోంది...రూపాయి అప్పు ఇచ్చి 10 రూపాయలు వసూలు చేసినా ఇంకా బకాయి చెల్లించాలని అప్పు తీసుకునే వారిని వేధింపు చర్యలకు పాల్పడుతున్నారు...
బాకీ తీర్చాలంటూ వేధిస్తున్న వడ్డీ వ్యాపారి..
బెజవాడ నగరానికి చెందిన లావణ్య, చంద్రశేఖర్ దంపతులు రామకృష్ణ అనే వడ్డీ వ్యాపారి దగ్గర తమ వ్యాపారం కోసం 20 లక్షలు అప్పు తీసుకున్నారు..దీని కింద ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తాకట్టుపెట్టారు..అయితే నోటి మాటగా రెండు రూపాయల వడ్డీ చెప్పిన వ్యాపారి మాత్రం అగ్రిమెంట్లో పది రూపాయలు రాసుకున్నాడు..ఇది తెలియని వారు డబ్బు చెల్లించినా వడ్డీ కింద తీసుకున్న రామకృష్ణ ఆస్తులు కూడా తీసుకున్నాడు.. ఇలా 80 లక్షల వరకు చెల్లించినా అప్పు తీరలేదంటూ ఒత్తిడి తెస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన కాల్ మనీ ప్రత్యేక విభాగం అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు...

 

13:41 - January 25, 2017

భూపాలపల్లి : సమున్నత లక్ష్యం.. అత్యున్నత ఆదర్శ ధ్యేయంతో... నిత్య చైతన్య ఝరిని సభ్యసమాజానికి పంచుతూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకుంది. వందో రోజు పాదయాత్ర మద్దతుగా సీపీఎం పొలిట్‌ బ్యూర్‌ సభ్యురాలు బృందాకరత్‌ పాల్గొన్నారు. గిరిజనులపై కేసీఆర్‌ వ్యవహరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రజలే కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 
అమాయక గిరిజనులపై కేసు పెట్టిన కేసీఆర్‌ : బృందాకరత్  
పోడు భూముల విషయంలో అమాయక గిరిజనులపై కేసు పెట్టిన కేసీఆర్‌.. కేంద్రం చేసిన చట్టాన్ని ధిక్కరించి పెద్ద నేరస్థుడయ్యాడని సీపీఎం పొలిట్‌బ్యూర్‌ సభ్యురాలు బృందాకరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారంలోని కొమురంభీం స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. హరిత హారం పేరుతో గిరిజనులను వేధిస్తున్న కేసీఆర్‌ కేంద్రం రూపొందించిన గిరిజన చట్టాన్ని ధిక్కరించిన కేసీఆర్‌  పెద్ద నేరస్థుడని ఆమె అన్నారు. వెంటనే హరితహారం కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రజల సమస్యలను తీర్చకుండా.. దగా చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. పాదయాత్ర బృందం వందరోజుల్లో వేలాదిమంది ప్రజలను కలుసుకుందని, ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర గతంలో ఎన్నడూ జరగలేదని ఆమె అన్నారు.  
మోదీ, చంద్రబాబు, కేసీఆర్‌ ఒకేలా వ్యవహరిస్తున్నారన్న బృందాకరత్ 
పోడు భూముల విషయంలో మోదీ, చంద్రబాబు, కేసీఆర్‌ అందరూ ఒకేలా వ్యవహరిస్తున్నారని ఆదివాసీ అధికార మంచ్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు ఆరోపించారు. సీపీఎం పాదయాత్రకు మద్దతుగా ఏటూరు నాగరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. 
సామాజిక న్యాయమే లక్ష్యంగా పాదయాత్ర : తమ్మినేని  
సంపూర్ణమైన సామాజిక న్యాయమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టామని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. సామాజిక న్యాయమంటే ఒక కులానికి సంబంధించింది కాదని స్పష్టం చేశారు. పదవుల్లోనే కాదు... బడ్జెట్‌లోనూ సమానవాటా కావాలని డిమాండ్ చేశారు.  అసమానత , అణచివేతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు.. అందరూ ఐకమత్యంగా పోరాడితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని తమ్మినేని అన్నారు. 
తన రికార్డును తానే బ్రేక్‌ చేసిన తమ్మినేని   
పాదయాత్ర చేసేది 9మంది అయినా.. వారిని వెనకనుండి నడిపించేది మాత్రం చాలా మంది ఉన్నారు. పాదయాత్రను పర్యవేక్షించడానికి అనేక కమిటీలు పనిచేస్తున్నాయి. మహాజన పాదయాత్ర 100 వరోజు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరునాగారం, రామన్నగూడెం, రాంనగర్‌, కమలాపూర్‌లో సాగింది. కమలాపూర్‌ ప్రాంతంలో గోదావరి తీరం వద్ద... పాదయాత్ర 2665 కిలోమీటర్లకు చేరడంతో.. తమ్మినేని గతంలో నెలకొల్పిన తన రికార్డును బ్రేక్‌ చేశారు.  

 

13:35 - January 25, 2017

తమిళనాడు : జల్లికట్టు హింసాత్మక ఘటనల వెనక పోలీసుల హస్తంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు మహిళను కొట్టినట్లు... ఆటోకు నిప్పు పెట్టిన విజువల్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. పోలీసుల తీరును ప్రముఖ నటుడు కమల్‌హసన్‌ తప్పుపట్టారు. జల్లికట్టుకు మద్దతుగా ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టే ప్రయత్నంలో చెన్నై పోలీసులు వ్యవహరించిన తీరు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. పోలీసులు పలు చోట్ల హింసాత్మక చర్యలకు పాల్పడ్డ దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పోలీసు ఆటోకు నిప్పంటిస్తున్నట్లు వీడియో క్లిప్  
పోలీసులను చూసి లోపలికి పరిగెడుతున్న ఓ మహిళను పోలీసు కొట్టినట్లు, మరో పోలీసు కూడా ఆమె వైపే వెళ్తున్నట్లుగా వీడియోలో ఉంది. మరో చోట ఓ పోలీసు ఆటోకు నిప్పంటిస్తున్నట్లు, ద్విచక్రవాహనాలను ధ్వంసం చేస్తున్నట్లు..ఆందోళనకారులను విచక్షణారహితంగా కొడుతున్నట్లు ఉన్న వీడియోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.
యువతపై లాఠీచార్జీని ఖండించిన కమల్ హాసన్  
వీటికి సంబంధించిన వీడియోను ప్రముఖ నటుడు కమల్‌హసన్ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. యువతపై జరిగిన లాఠీచార్జీని ఆయన ఖండించారు. పోలీసుల తీరు త‌న‌ను షాక్‌కు గురిచేసింద‌న్నారు. జంతు హ‌క్కుల‌పై త‌న‌కు అవ‌గాహ‌న లేద‌ని కమల్‌హసన్‌ అన్నారు. జల్లికట్టు సంస్కృతి ప‌రిర‌క్షణ కోసం జ‌రుగుతున్న ఉద్యమమని పేర్కొన్నారు.  జ‌ల్లిక‌ట్టుపై నిషేధం ప్రభుత్వ ద్వంద్వ వైఖ‌రికి నిదర్శనమన్నారు.  
వీడియోలపై స్పందించిన పోలీసులు  
సోషల్‌మీడియాలో వస్తున్న వీడియోలపై పోలీసులు స్పందించారు. ఈ వీడియోలు మార్ఫింగ్‌ చేసినవేనని చెప్పిన పోలీసులు ఆ తర్వాత ఈ ఫుటేజీలపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. జల్లికట్టు కోసం చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు సోమవారం బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ తమిళనాడు అసెంబ్లీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.

 

13:27 - January 25, 2017

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. డిసెంబర్‌ నాటికి ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. ఆర్థిక సంస్థల నుంచి 30 వేల కోట్ల రుణం లభించిన నేపథ్యంలో.. క్షేత్రస్థాయిలో పనులు వేగవంతంగా చేయాలన్నారు. దేశమంతా దృష్టి సారించిన ఈ పథకాన్ని పూర్తి చేసేందుకు.. ఈ 11 నెలల సమయం ఎంతో కీలకమన్నారు కేసీఆర్‌. 
మిషన్‌ భగీరథపై సమీక్షా సమావేశం 
ఇంటింటికి నల్లా నీళ్లు అందించే లక్ష్యంతో మొదలుపెట్టిన మిషన్‌ భగీరథను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మిషన్‌ భగీరథపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖలన్నీ సమన్వయం చేసుకుంటూ పనులను త్వరితగతిన  పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. సెగ్మెంట్లవారీగా సమీక్షించిన సీఎం.. ఇంటెక్‌ వెల్స్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, పైప్‌లైన్లు, విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణాల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
డిసెంబర్‌ నాటికి గ్రామాలకు నీళ్లు 
ఇక మిషన్‌ భగీరథలో ఇప్పటివరకు 19 ఇన్‌టెక్‌ వెల్స్‌లో 11 పూర్తి కాగా.. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఏడాది మార్చినాటికి పూర్తి కానున్నాయి. ఏప్రిల్‌ నుంచి ఈ వెల్స్‌ నీటిని పంప్‌ చేయనున్నాయి. అదేవిధంగా 50 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో మూడు పూర్తయ్యాయి. అలాగే 10 ప్లాంట్ల పనులు 75 శాతానికి పైగా పూర్తి కాగా... 11 ప్లాంట్ల పనులు 50 శాతం పూర్తయ్యాయి. పనులన్నీ ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి 3811 గ్రామాలకు మంచినీళ్లు అందించనున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. అలాగే డిసెంబర్‌ నాటికి మొత్తం గ్రామాలకు నీళ్లు అందించనున్నామని తెలిపారు. 
మిషన్‌ భగీరథ పనులు మరింత వేగవంతం చేయాలి
అయితే.. మిషన్‌ భగీరథ పనులను మరింత వేగవంతం చేయాలని,.. డిసెంబర్‌ నాటికి కాకుండా జూన్‌ వరకే పనులన్నీ పూర్తి చేయాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. జూన్‌ తర్వాత వర్షాలు కురిస్తే పనులు మరింత ఆలస్యం అవుతాయని.. అందువల్లే ముందుగానే పనులన్నీ పూర్తి చేయాలన్నారు. పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. సీఎం కార్యాలయం వెంటనే స్పందిస్తుందని కేసీఆర్‌ హెచ్చరించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు మిషన్‌ భగీరథ పనులను పరిశీలించాయని,.. నీతి అయోగ్‌ కూడా ప్రశంసించినట్లు కేసీఆర్‌ గుర్తుచేశారు. డిసెంబర్‌ నాటికి పనులన్నీ పూర్తి చేసేందుకు అధికారులంతా కష్టపడి పని చేయాలని సూచించారు. అదేవిధంగా ఈ పనుల్లో ముఖ్యమైన అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి పక్కా ప్రణాళికలు రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నిర్మించేలా చూడాలని సూచించారు. మొత్తానికి మిషన్‌ భగీరథపై సుదీర్ఘంగా సమీక్షించిన కేసీఆర్‌.. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

 

13:24 - January 25, 2017

తూర్పుగోదావరి : ఓ వైపు ఉద్యమ సన్నాహాలు.. మరోవైపు పోలీసుల కట్టడి చర్యలు. కాపుల సత్యాగ్రహ పాదయాత్ర నేపథ్యంలో కోనసీమలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పాదయాత్రకు అనుమతి లేదంటూ ముద్రగడ పద్మనాభంతో సహా పలువురు కాపు నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్టులు చేశారు. 
ఇదిలావుంటే.. ఆరు నూరైనా సత్యాగ్రహ పాదయాత్ర చేసి తీరుతామంటున్నారు కాపు నేతలు. 
కాపులను బీసీ జాబితాలో చేర్చాలంటూ...
కాపులను బీసీ జాబితాలో చేర్చాలంటూ... కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేటినుంచి సత్యాగ్రహ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇందుకోసం కాపు నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే.. పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు కోనసీమలో అప్రమత్తమయ్యారు. సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 అమలు చేస్తూ.. పాదయాత్రను అడ్డుకునేందుకు భారీ ఎత్తున బలగాలు మోహరించాయి. కాపు పాదయాత్రకు అనుమతి లేదని.. ప్రజలు సహకరించాలని పోలీసులు సూచిస్తున్నారు. 
ముద్రగడ పద్మనాభం హౌస్‌ అరెస్ట్‌ 
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. రావులపాలెంలో నిర్వహించ తలపెట్టిన పాదయాత్రకు బయల్దేరిన ఆయనను పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలో హిట్లర్‌ పాలన కొనసాగుతోందని.. ముద్రగడ మండిపడ్డారు. రిజర్వేషన్ల కోసం ప్రభుత్వానికి తమ ప్రాణాలు కావాలంటే ప్రాణత్యాగానికి సిద్దమన్నారు ముద్రగడ పద్మనాభం. 
తాతాజీ, ఆకుల రామకృష్ణారావు, నల్లా విష్ణుమూర్తి, పవన్‌లు అరెస్ట్‌
అదేవిధంగా కాపునేత, టీబీకే జేఏసీ కన్వీనర్‌ తాతాజీని, రావులపాలెంలో ఆకుల రామకృష్ణారావు, అమలాపురంలో నల్లా విష్ణుమూర్తి, నల్లా పవన్‌లను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. తాము శాంతియుతంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతుంటే.. ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తుందని కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
సత్యాగ్రహ యాత్ర చేస్తామంటున్న కాపు నేతలు 
కాపులకు బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌తో ముద్రగడ నాయకత్వంలో తీసుకున్న నిర్ణయంలో మార్పు లేదని, ఆరు నూరైనా సత్యాగ్రహ యాత్ర చేసి తీరుతామని కాపు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. భారీ ఎత్తున కాపు నాయకులు, కార్యకర్తలు ముద్రగడ ఇంటికి చేరుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా తమ డిమాండ్‌ను నెరవేర్చుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని కాపు నేతలు హెచ్చరిస్తుండగా.. చంద్రబాబు మాత్రం.. కమిటీ నివేదిక ఇంకా రాలేదని అంటున్నారు. మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. 

 

వంశధార నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి : మధు

విజయవాడ : వంశధార ప్రాజెక్టు నిర్మాణం భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టులు పనులు ప్రారంభించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విజయవాడలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పునరావాసానికి డబ్బు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలల్లో భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని పేర్కొన్నారు. బలవంతంగా భూమలను లాక్కునేందుకుయత్నిస్తున్నారని తెలిపారు. 24 గ్రామాలు ప్రాజెక్టులో మునిగిపోతున్నాయని చెప్పారు. మొదటగా గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి ఆ తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్నారు.

12:50 - January 25, 2017

విజయవాడ : వంశధార ప్రాజెక్టు నిర్మాణం భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టులు పనులు ప్రారంభించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విజయవాడలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పునరావాసానికి డబ్బు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలల్లో భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని పేర్కొన్నారు. బలవంతంగా భూమలను లాక్కునేందుకుయత్నిస్తున్నారని తెలిపారు. 24 గ్రామాలు ప్రాజెక్టులో మునిగిపోతున్నాయని చెప్పారు. మొదటగా గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి ఆ తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్నారు. పచ్చి అబద్ధాలు, తప్పుడు వాగ్ధానాలతో పోలీసుల అండతో ప్రభుత్వం పాలన సాగిస్తుందని విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం రేపు విశాఖ ఆర్ బీచ్ లో జరిగే యువభేరీకి పూర్త మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమంలో తాము కూడా పాల్గొంటామని చెప్పారు. కృష్ణా తీరంలో, బీచ్ లో కావొచ్చు ఎక్కడి ఏ ఉద్యమం చేసినా..తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

 

12:38 - January 25, 2017
12:37 - January 25, 2017
12:33 - January 25, 2017

హైదరాబాద్ : ఏపీ సర్కార్ పై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. విభజన సమయంలోనే ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. నిజంగా ప్రత్యేకహోదాలోని అన్ని అంశాలు మనకు అందాయా.. అని ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీతో అన్ని జరుగుతాయని చెప్పారు. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకే పారిశ్రామిక రాయితీలు వస్తాయన్నారు. ప్రత్యేకహోదా ఉంటేనే అన్ని రకాల రాయితీలు ఉంటాయన్నారు. 
చంద్రబాబు పెద్ద అబద్ధాల కోరు 
ప్రత్యేహోదాపై చంద్రబాబు మాట మార్చారని విమర్శించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఎపికి ప్రత్యేకహోదా కావాలన్నారు... ఇప్పుడేమో ప్రత్యేకప్యాకేజీ కోరుతున్నారని చెప్పారు. నోరు తెరిస్తే చంద్రబాబు అబద్ధాలు అడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పెద్ద అబద్ధాల కోరు అని విమర్శించారు. జాబ్ కావాలంటే బాబు రావాలి, ఇంటింటికి జావ్ రావాలంటే, రుణమాఫీ కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. 
హామీలను విస్మరించిన చంద్రబాబు 
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారని... ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం బాబు.. ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. పేరుకు మాత్రమే బాబు దాసోస్ వెళ్తున్నారని విమర్శించారు. చంద్రబాబు విదేశాలు తిరిగినంత మాత్రాన ఏ ప్రయోజనం లేదన్నారు. బాబు విదేశాలకు వెళ్లి విలాసవంతంగా గడిపివస్తాడని ఆరోపించారు. 
రాజధాని నిర్మాణంలో కుంభకోణాలు 
రాజధాని నిర్మాణంలో కుంభకోణాలు చేసుకున్నాయని చెప్పారు. ఏపీలో పాలనలో రాష్ట్రంలో బొగ్గు నుంచి ఇసుక వరకు, రాజధాని భూముల దాకా స్కాములే అని ఎద్దేవా చేశారు. విదేశీ పర్యటనలకు రూ.25 కోట్లు పటక్,  12 రోజులు పుష్కరాలకు రూ.11 కోట్లు ఫట్ అని అన్నారు.  టెంపరరీ సెక్రటేరియట్ అని అంటున్నాడని....ఏదైనా టెంపరరీ అంటున్నాడని చెప్పారు. బ్లాకు మనీతో చంద్రబాబు అడ్డగోలుగా దొరికిపోయాడని పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రి డబ్బులు ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికినా.. జైలుకు పోకుండా... సీఎం పదవికి రాజీనామా చేయకుండా కేంద్రంతో రాజీపడ్డారని ఆరోపిచారు. తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా సాధించేందుకు చంద్రబాబు ఏ ప్రయత్నమూ చేయలేదన్నారు. 
చంద్రబాబను జైలులో పెట్టాలి...
ఏపీకి ప్రత్యేకహోదా కోసం యువభేరీ లాంటి కార్యక్రమాలకు యువత పిలుపిప్తే వారిపై పీడీ యాక్టు కేసు పెట్టాలని ఆదేశిస్తున్నారని... పీడీ యాక్టు అంటే చంద్రబాబుకు తెలుసా..అని ప్రశ్నించారు. హోదా కోసం పోరు చేస్తుంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి...  కేసు పెట్టాలనడం దారుణమని.. తీవ్ర ఆక్షేపనీయమని అన్నారు. చంద్రబాబుపై టాడా కేసు పెట్టాలని.. జైలులో పెట్టాలన్నారు.  సీఎం హోదవాలో ఉన్న వ్యక్తి హోదా కోసం పోరాడాలని కానీ ఈ విధంగా మాట్లాడడం సబబు కాదన్నారు. ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రం ఒప్పుకోకపోతే మంత్రులతో రాజీనామా చేయించాలన్నారు. చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని ఆకాంక్షించారు. కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతించాలని కోరారు. అరెస్టులు చేసినా.... ఉద్యమం ఆగదని చెప్పారు. 
క్యాండిల్ లైట్ ర్యాలీలో నేను పాల్గొంటాను...  
క్యాండిల్ లైట్ ర్యాలీలో తాను కూడా ప్రత్యక్షంగా పాల్గొంటానని పేర్కొన్నారు. అర్థం చేసుకుని కొవ్వొత్తుల ర్యాలీలో చంద్రబాబు కూడా పాల్గొనాలని కోరారు. క్యాండిల్ లైట్ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరూ ఐక్యమత్యంగా పోరాడితేనే ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని చెప్పారు. 

 

11:37 - January 25, 2017

ఏపీ సర్కార్ పై జగన్ ఆగ్రహం

హైదరాబాద్ : ఏపీ సర్కార్ పై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించారని పేర్కొన్నారు. నోరు తెరిస్తే చంద్రబాబు అబద్ధాలు అడుతున్నాడని విమర్శించారు. 

ఇవాళ పద్మ పురస్కారాలను ప్రకటించనున్న కేంద్రం

ఢిల్లీ : నేడు పద్మ పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించనుంది. క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి పద్మ అవార్డు ప్రకటించే అవకాశం ఉంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కోచ్ గోపీచంద్ కు పద్మ పురస్కారం దక్కే ఛాన్స్ ఉంది. పద్మ అవార్డు రేసులో సాక్షి మాలిక్, రఘురామ రాజన్ లు ఉన్నారు. 

11:10 - January 25, 2017

ఢిల్లీ : నేడు పద్మ పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించనుంది. క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి పద్మ అవార్డు ప్రకటించే అవకాశం ఉంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కోచ్ గోపీచంద్ కు పద్మ పురస్కారం దక్కే ఛాన్స్ ఉంది. పద్మ అవార్డు రేసులో సాక్షి మాలిక్, రఘురామ రాజన్ లు ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

11:07 - January 25, 2017
11:02 - January 25, 2017

గుంటూరు : కాసేపట్లో అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ భేటీకి తొలిసారిగా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ హాజరుకానున్నారు. జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాల ప్రాధాన్యతను కోడెల వివరించనున్నారు. చంద్రబాబు దావోస్ పర్యటన విశేషాలు, ప్రత్యేకహోదా ఉద్యమాలపై చర్చించనున్నారు. నీరు..ప్రగతి, గృహ నిర్మాణం పురోగతిపై చర్చించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:00 - January 25, 2017

ఫలితాలిస్తున్న ఎర్రజెండోళ్ల పాదయాత్ర...సామాన్య జనం మీద సర్కారోళ్ల నజర్, నిరుద్యోగులను మోసం జేసిన లోకేషం.. జాబ్ మేళా పేరుతోటి బోగస్ కాల్ లెటర్లు, సమగ్ర కుటుంబ సర్వే బయటపెట్టాలే... తెలంగాణల బీసీ కులాలు పట్టుబట్టాలే, కేరళ సీఎంను మార్చేసిన కేంత్రమంత్రి....ట్విట్టర్ల పరువుతీస్కున్న పాశ్వాన్ సారు, బ్యాంకుకు తాళాలేయకుండనే ఎల్లిపోయిండ్రు...గస్తీదిరెగే పోలీసొలొచ్చి బేడీలేసిపోయిండ్రు, దయ్యంకొట్టిందని పోలీసోళ్లకు కంప్లైట్.. జన విజ్ఞాన వేదికొల్లువేయాలి టెంట్లు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

10:56 - January 25, 2017

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని వక్తలు కోరారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు, టీడీపీ నేత రామకృష్ణప్రసాద్, సీపీఎం నేత గంగారావు పాల్గొని, మాట్లాడారు.  ప్రత్యేకహోదా కోసం విశాఖ ఆర్ కే బీచ్ యువత తలపెట్టిన నిరసన కార్యక్రమం సబబే అని అభిప్రాయపడ్డారు. సీపీఎం మహాజన పాదయాత్రపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:55 - January 25, 2017

తెలంగాణ యూనివర్సిటీలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాతున్నాయని ఏఐఎస్ ఎఫ్ నేత శివరామకృష్ణ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించని జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతోంది. యూనివర్సిటీ విద్యను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా చెబుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఉస్మానియాతో పాటు తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలను అనేక సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణలో యూనివర్సిటీలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలేమిటి? యూనివర్సిటీ విద్య ఎందుకు నీరసిస్తోంది? యూనివర్సిటీ విద్యను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?... వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:37 - January 25, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి మరో చారిత్రాత్మక దిశగా అడుగులు వేయబోతుంది. ఇప్పటికే అతి తక్కువ సమయంలోనే తాత్కాలిక సచివాలయం నిర్మించి చరిత్ర సృష్టించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు అసెంబ్లీ భవనం నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసింది. 
అమరావతిలో మొదటి అసెంబ్లీ సమావేశాలు 
నవ్యాంధ్ర రాజధాని అమరావతి మరో చారిత్రాత్మక ఘటన దిశగా అడుగులు వేయబోతుంది. త్వరలోనే అమరావతిలో మొదటి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఇందుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. 
తేదీలను ఖరారు చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నం 
అసెంబ్లీ భవన నిర్మాణాలు తుది దశకు చేరుకోవడంతో శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా జరగాల్సిన శీతకాల సమావేశాలు కనీసం మూడు రోజుల పాటు నిర్వహించి.. అనంతరం కీలకమైన బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తలు చేస్తుంది. అసెంబ్లీలో ఉపయోగించే ఫర్నిచర్ మొత్తాన్ని అక్కడిక్కడే సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా టెంట్లు వేసి సభ్యులు కూర్చునే కుర్చీలు, టేబుల్స్ ను తయారు చేస్తున్నారు. 
ఇక నుంచి ఏపీ నుంచే పరిపాలన..!
ఫర్నీచర్ కు సంబంధించిన పనులు హైదరాబాద్‌కు చెందిన అర్నా ఇన్ ఫ్రా సొల్యూషన్ కంపెనీకి అప్పగించారు. కేవలం సభ్యులు కూర్చునే కుర్చీలు, టేబుల్స్ కోసమే కోటి రూపాయలను ఖర్చు చేస్తున్నారు. మొత్తమ్మీద అసెంబ్లీ సమావేశాలు సొంత గడ్డపై నుంచే నిర్వహించి.. ఇక నుంచి పరిపాలన అంతా ఆంధ్రప్రదేశ్‌ నుంచే జరపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.  

10:35 - January 25, 2017

ఖమ్మం : నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది.  అధికారులు, అధికార పార్టీ నాయకులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని లెఫ్ట్‌పార్టీల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీంతో అధికార, ప్రతిపక్షసభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అరుపులు, నినాదాలతో పురపాలక సమావేశంలో గందరగోళం నెలకొంది. 
సభలో గందరగోళం 
ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంతోపాటు.. నగరంలోని చేపల మార్కెట్‌ను  తరలించే ప్రతిపాదనకు  విపక్షసభ్యులు అభ్యంతరం చెప్పారు. పాలకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని వామపక్ష సభ్యులు హెచ్చరించారు. దీంతో అధికార ప్రతిపక్షసభులు నినాదాలతో సభ హెరెత్తింది. 
కార్మికుల అరెస్టుపై సమీనా అఫ్రోజ్‌ ఆగ్రహం 
మరోవైపు నగరపాలక సంస్థలో కార్మికుల అరెస్టుపై సీపీఎంపక్ష నాయకురాలు సమీనా అఫ్రోజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనాలను అమలు చేయాలని కోరినందుకే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. విపక్ష సభ్యులు మాట్లాడుతున్న సమయంలో అధికారపక్ష సభ్యులు అడ్డుతగలడంతో సభలో గందరగోళం నెలకొంది. మేయర్‌ ఎంత చెప్పినా సభ్యులు వినిపించుకోక పోవడంతో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సర్దిచెప్పారు. దీంతో సభాకార్యక్రమాలు సజావుగా సాగాయి.  

 

10:34 - January 25, 2017

హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు యువతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణ ఉద్యమంతో పార్టీకి దూరమైన యువతకు మళ్లీ చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో యువజన  వ్యూహాన్ని అమలు చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
టీఆర్‌ఎస్‌పై ఎక్కుపెట్టేందుకు అస్త్రశస్త్రాలు 
2019 అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ పార్టీకి దూరమైన వర్గాలన్నింటినీ తిరిగి దగ్గరకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌పై ఎక్కుపెట్టేందుకు అస్త్రశస్త్రాలు, ఆయుధాలు సిద్ధం చేసుకుంటోంది. 
యువతపై ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ 
గత ఎన్నికల్లో 18-25 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత కాంగ్రెస్‌కు ఓటేయలేదన్న విషయాన్ని గ్రహించిన పార్టీ నాయకులు, ఈసారి వీరిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. అలాగే 30-40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో కూడా చాలా తక్కువ మందే కాంగ్రెస్‌కు ఓటేశారు. ఈ వర్గాలు టీఆర్‌ఎస్‌కు చేరువయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వీరికి దగ్గరయ్యేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. 
యువజన సమస్యలపై పోరుబాట 
యువతంత్రాన్ని అమలు చేసేందుకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని రంగంలోకి దింపేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. యవజన సమస్యలపై పోరుబాటకు సిద్ధమవుతున్నారు. రాహుల్‌ కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉద్యోగ నియమాక ప్రకటనల జారీలో జరుగుతున్న జాప్యం, యూనివర్సిటీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల అజెండాలో ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థి గర్జన, యువజన శంఖారావం సభల నిర్వహణకు రాహుల్‌గాంధీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఐటీ విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయం 
మరోవైపు సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని యువతకు చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీ అనుసరించిన ఈ విధానం మోదీకి బాగా కలిసి వచ్చిందని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. సోషల్‌ మీడియాను ఉపయోగించుకునే క్రమంలో పార్టీ ఐటీ విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఎస్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ విభాగాల ఆధ్వర్యంలో యూనివర్సిటీల్లో సదస్సులు నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. యువతకు చేరువ అవ్వడం ద్వారా ఎన్నికలో మంచి ఫలితాలు సాధించవచ్చని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఈ దిశగా వీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. 

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్

విజయవాడ : ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమాల అణచివేత, శాంతియుత నిరసనలపై చర్చించనున్నారు. 

నేడు పెద్దపల్లి జిల్లాలో మంత్రి ఈటెల పర్యటన

పెద్దపల్లి : నేడు పెద్దపల్లి జిల్లాలో మంత్రి ఈటెల రాజేందర్ పర్యటించనున్నారు. పలు అభివద్ధి కార్యక్రామాలకు ఆయన శంకుస్థాపన చేశారు. 

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

హైదరాబాద్ : రవీంద్రభారతిలో ఉదయం 10.30 గంటలకు జాతీయ ఓటర్ల దినోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, భన్వర్ లాల్ పాల్గొననున్నారు. 

 

టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 దరఖాస్తులో సవరణలు

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 దరఖాస్తులో సవరణలు చేశారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు సవరణలకు గడువు ఇచ్చారు. 

టీటీడీ సమన్వయ కమిటీ సమావేశం

గుంటూరు : చంద్రబాబు నివాసంలో టీటీడీ సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. సంస్థాగత, ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ డ్యాష్ బోర్డు అంశాలపై చర్చించనున్నారు. 

నేడు జాతినుద్ధేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ప్రణబ్

ఢిల్లీ : రిపబ్లిక్ డే సందర్భంగా నేడు జాతినుద్ధేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించనున్నారు. 

Don't Miss