Activities calendar

26 January 2017

21:38 - January 26, 2017
21:18 - January 26, 2017

హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం గాంధేయ పద్ధతిలో శాంతియుతంగా క్యాండిల్‌ లైట్‌ ర్యాలీ చేస్తుంటుంటే.. చంద్రబాబు సర్కార్‌ నిర్ధాక్షిణ్యంగా విద్యార్థులను, యువతను అరెస్ట్‌ చేసిందని వైసీపీ అధినేత జగన్‌ మండిపడ్డారు. ఆర్కేబీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీ కోసం వెళ్లిన తనను ఎయిర్‌ పోర్టులోనే అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని జగన్‌ పిలుపునిచ్చారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

21:16 - January 26, 2017

విశాఖ : ప్రశాంత విశాఖ సాగర తీరం.. అరెస్టులతో తెల్లవారింది. ప్రత్యేక హోదా కోసం ఆర్కే బీచ్‌కు వచ్చేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టులోనే ప్రతిపక్ష నేత జగన్‌ను నిర్బంధించగా.. ఇతర నేతలను విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. జగన్‌ను ఎయిర్‌ పోర్టు నుంచి బయటకి రానీయకుండానే.. తిరిగి హైదరాబాద్ పంపారు.

ఆందోళనలతో మిన్నంటిన విశాఖ...

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో.. విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి. ఆర్కేబీచ్‌లో నిర్వహించ తలపెట్టిన మౌనదీక్షకు జనసేన, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపునిచ్చింది.

విశాఖ ఎయిర్‌పోర్టులో హైడ్రామా ...

విశాఖ ఎయిర్‌పోర్టులో హైడ్రామా చోటుచేసుకుంది. ఆర్కే బీచ్‌ క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు నిర్బంధించారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ జగన్‌ మొదట రన్ వేపై బైఠాయించారు. జగన్‌ వెంట పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు.

పోలీసులపై జగన్ మండిపాటు....

ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు రానివ్వకపోవడంతో.. జగన్‌ పోలీసులపై మండిపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పనిచెబుతానని హెచ్చరించారు.జగన్‌తో చర్చలు జరిపిన పోలీసు అధికారులు... జగన్‌ బృందాన్ని హైదరాబాద్‌ విమానం ఎక్కించి తిరిగి వెనక్కి పంపించారు. మరోవైపు విమానాశ్రయం బయట ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైసీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. శాంతి భద్రతల సమస్యతోనే... జగన్‌ను తిరిగి హైదరాబాద్ పంపినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఎయిర్‌పోర్టుకు కిలోమీటరు దూరం వరకు నిషేధాజ్ఞలు...

జగన్‌ రాక నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టుకు కిలోమీటరు దూరం వరకు నిషేధాజ్ఞలు విధించారు. ఎయిర్ పోర్టు పరిసరాల్లో వైసీపీ నాయకుల్ని, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల అదుపులో చలసాని....

ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖ ఆర్కేబీచ్‌కు వచ్చిన చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో.. పలువురు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి కోసమే తాము ఈ ర్యాలీ చేపట్టామని చలసాని తెలిపారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో నిరసన తెలియజేసేందుకు వచ్చిన మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు తనకు ఉందని హర్షకుమార్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విశాఖ ఆర్‌కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం యువత చేపట్టే మౌనదీక్షకు సినీ హిరో సంపూర్ణేష్‌ బాబు మద్దతు ప్రకటించారు. విశాఖ ఎయిర్‌పోర్టు చేరుకున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారంతా అన్నదమ్ముల్లా కలిసుంటున్నారని.. వారికి ఏ సమస్య వచ్చినా నా మద్దతు ఉంటుందని సంపూర్ణేష్‌బాబు తెలిపారు. మొత్తానికి హోదా డిమాండ్‌లతో విశాఖ వేడెక్కింది. అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక హోదా కోసం కదిలిరావడం.. వారి ఉద్యమానికి బలం పెరిగిందనడంలో.. సందేహం లేదు.

మానసిక వికలాంగురాలిపై 3 నెలలుగా సామూహిక అత్యాచారం..

నల్గొండ: మాడుగులపల్లి మండలం కుక్కడంలో దారుణం జరిగింది. మానసిక వికలాంగురాలిపై 3 నెలలుగా ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితరురాలు అనారోగ్యంతో ఈ ఘోరం బయటపడింది.

రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు: జగన్

హైదరాబాద్: సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు వైసీపీ పిలుపునిచ్చింది. ప్రత్యేకహోదాను చంద్రబాబు లాంటి వారు నీరుగారుస్తుంటే ప్రత్యేక హోదా కోసం అందరం ఒక్కటవుదామని జగన్ సూచించారు. హోదా కోసం చంద్రబాబును గట్టిగా ఎదుర్కొందాన్నారు. తమిళనాడు జల్లికట్టు ఉద్యమానికి ముగ్దులమయ్యాం అని జల్లికట్టు ఉద్యమం ఐక్యతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. జాబ్ రావాలంటే బాబు పోవాలని చెప్పారు.

విశాఖలో పరిస్థితి ప్రశాతం: సీపీ యోగానంద్

విశాఖ : నగరంలో పరిస్థితి ప్రశాతంగా ఉందని సీపీ యోగానంద్ తెలిపారు. మొత్తం మీద 400 ల మందిని అరెస్ట్ చేశామన్నారు. శాంతిభద్రతల గురించి జగన్ కు వివరించామని, వెనక్కి వెళ్లి పోయవాల్సిందిగా జగన్ కోరినట్లు తెలిపారు. దీంతో జగన్ హైదరాబాద్ కు వెళ్లిపోయారని పేర్కొన్నారు.

'రన్ వైపు కూర్చోవడం జగన్ కు మామూలే'

హైదరాబాద్ :రన్ వైపు కూర్చోవడం జగన్ కు మామూలే అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాయి. ఇరు రాష్ట్రాల గవర్న నిర్వహించిన 'ఎట్ హోం' కార్యక్రమంలో పాల్గొన్నా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ విందు అనంతరం విశాఖకు చంద్రబాబు వెళ్లనున్నారు. విశాఖ లో రాత్రి 9.30 గంటలకు చంద్రబాబు మీడియా సమావేశం పెట్టనున్నారు.

18:29 - January 26, 2017

హైదరాబాద్: ఏపీ కి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో యువత ముందుకు వచ్చి విశాఖ ఆర్కే బీచ్ లో శాంతియుతంగా ఆందోళన చేపట్టేందుకు పిలుపునిచ్చింది. దీనికి జనసేన, వామపక్షాలు, వైసీపీ పార్టీ లు మద్దతు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ నేతలను అరెస్ట్ చేసి, విశాఖ లో ఎమర్జెన్సీని తలపించేవిధంగా పోలీసులను మోహరించారు. ఇది ఎంత వరకు కరెక్టు. ఇదే అంశంపై 'టెన్ టివి'లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, వైసీపీ నేత లక్ష్మీపార్వతి, టిడిపి నేత మాల్యాద్రి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

జగన్ ను హైదరాబాద్ కు పంపిన పోలీసులు

విశాఖ: విశాఖ ఎయిర్ పోర్టులోని వి.ఐ.పి లాంజ్ జగన్ తో పోలీసులు అధికారులు చర్చలు జరిపిన అధికారులు ఎయిర్ పోర్టు నుండే తిరిగి హైదరాబాద్ కు పంపినట్లు సమాచారం.

18:18 - January 26, 2017

విశాఖ: ప్ర‌త్యేక హోదా కోసం విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకి చేరుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బృందాన్ని పోలీసులు అడ్డుకోవ‌డంతో ఆయ‌న అక్క‌డే బైఠాయించి ఆందోళన చేపట్టారు. దాదాపు గంటకు పైగా ఈ ఆందోళన జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కు, పోలీసులకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుంది. మరో వైపు ఎయిర్ పోర్టు బైట వైసీపీ నేతలు కొవ్వొత్తు వెలిగించి జగన్ కోసం నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రాజ్ భవన్ లో తేనీటి విందు

హైదరాబాద్: రాజ్ భవన్ లో తేనీటి విందు ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానకి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వీరితో పాటు టీఎస్ స్పీకర్ చారి, ఏపీ మండలి ఛైర్మన్ చక్రపాణి, మంత్రులు నాయిని, హరీష్, జగదీష్, ఈటెల, జోగు, లక్ష్మారెడ్డి, మాజీ గవర్నర్ రంగరాజన్, రాజీశ్ శర్మ, జానారెడ్డి, రోశయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

గుంటూరు : వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

సాయంత్రం రాజ్ భవన్ లో 'ఎట్ హోమ్'

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజు మరోసారి కలుసుకోనున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ నరసింహన్ తన నివాసం రాజ్ భవన్ లో ఈ సాయంత్రం 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఇప్పటికే విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు పలువురు ఏపీ మంత్రులు హాజరుకానున్నారు.

17:02 - January 26, 2017
16:48 - January 26, 2017
16:46 - January 26, 2017
16:45 - January 26, 2017

హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం పోరాట పటిమ చూపిన తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. నిన్న, ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్న జనసేన కార్యకర్తలను ప్రతి ఒక్కరినీ.. బేషరతుగా విడిచిపెట్టాలని ఆయన ట్విటర్‌లో డిమాండ్‌ చేశారు. మనల్ని వెటకారం చేసే నాయకులను గుర్తుపెట్టుకోవాలని పవన్‌ ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు.

16:42 - January 26, 2017

విశాఖ : ప్రత్యేక హోదా సాధన కోసం ఆర్కేబీచ్‌కు వచ్చిన చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో.. పలువురు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి కోసమే తాము ఈ ర్యాలీ చేపట్టామని చలసాని తెలిపారు.

16:41 - January 26, 2017

విశాఖ : ప్రత్యేహోదా కోసం ఆర్కే బీచ్ లో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ ఎయిర్ పోర్టు కు చేరుకున్న వైసీపీ నేత జగన్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగన్ రన్ వే పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. జగన్ తో పాటు ఎంపి వైవీ సుబ్బారెడ్డి, అంబటిరాంబాబు తదితరులు ఉన్నారు

16:38 - January 26, 2017

శ్రీకాకుళం : రణస్థలం వద్ద సీపీఎం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక హక్కుల వేదిక కార్యక్రమంలో పాల్గొని తిరిగి రైల్వేస్టేషన్ కు వెళ్తుండగా పోలీసులు అడ్డగించి బలవంతంగా అరెస్ట్ చేశారు. మధు అరెస్టును వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మధును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

రణస్థలం వద్ద సీపీఎం మధు అరెస్ట్

శ్రీకాకుళం : రణస్థలం వద్ద సీపీఎం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక హక్కుల వేదిక కార్యక్రమంలో పాల్గొని తిరిగి రైల్వేస్టేషన్ కు వెళ్తుండగా పోలీసులు అడ్డగించి బలవంతంగా అరెస్ట్ చేశారు. మధు అరెస్టును వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మధును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

గోల్కొండలో డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్: గోల్కొండలో మైఖేల్ అనే నైజీరియన్ నుండి 13 గ్రాముల కొకైన్, 6 గ్రాముల హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైఖేల్ అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

మేడ్చల్: ఘటకేసర్ యమునపేట్ లో విషాదం నెలకొంది. క్వారీ గుంతలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు అవినాష్, చరణ్ గా గుర్తించారు.

16:22 - January 26, 2017

విశాఖ : ప్రత్యేహోదా కోసం ఆర్కే బీచ్ లో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ ఎయిర్ పోర్టు కు చేరుకున్న వైసీపీ నేత జగన్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగన్ రన్ వే బైఠాయించి ఆందోళన చేపట్టారు. జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, అంబటిరాంబాబు, ఎంపి వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.

విశాఖ ఎయిర్ పోర్టు లో జగన్ నిర్భంధం

విశాఖ : ప్రత్యేహోదా కోసం ఆర్కే బీచ్ లో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ ఎయిర్ పోర్టు కు చేరుకున్న జగన్ ను పోలీసులు నిర్బంధించారు. దీంతో జగన్ రన్ వే పై ఆందోళన చేపట్టారు.

పోలీసుల అదుపులో చలసాని శ్రీనివాస్

విశాఖ : ఏపీకి ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేస్తూ యువకులు చేపట్టిన దీక్షకు మద్దతుగా బీచ్ లో ర్యాలీ చేపట్టిన ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ చేరుకున్న జగన్

హైదరాబాద్: ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఆర్కేబీచ్ లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వైసీపీ అధినేత జగన్ విశాఖకు చేరుకున్నారు.

మంచు, కొండచరియలు విరిగిపడి 10మంది జవాన్లు మృతి

జమూకశ్మీర్‌: గందేర్‌బాల్, బండిపొరా జిల్లాలో గురెజ్ సెక్టార్‌ పరిధిలో మంచు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన సైనికుల సంఖ్య 10కి చేరింది. గురెజ్ సెక్టార్‌లో సైనిక శిబిరంపై మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఆర్మీ సిబ్బంది ఇప్పటివరకు ఆరుగురు జవాన్లను రక్షించారు. మంచు చరియల్లో కూరుకుపోయినట్లు గుర్తించిన ఆరుగురు జవాన్లను ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగించి సురక్షితంగా కాపాడారు. మంచు చరియలు విరిగిపడిన ప్రాంతంలో ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తుంది.

15:41 - January 26, 2017

అనంతపురం : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు అనంతపురంలో మౌనదీక్షకు దిగారు. క్లాక్ టవర్ సమీపంలోని గాంధీ విగ్రహం ఎదుట ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి మౌనదీక్ష చేపట్టారు. దీక్షకు సంఘీభావంగా విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. కేంద్రం వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

15:40 - January 26, 2017

కృష్ణా : విజయవాడలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం యువత నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఐద్వా, డీవైఎఫ్‌ఐ సంఘాలు కూడా మద్దతు పలికాయి. ఈ మేరకు శాంతియుత ప్రదర్శనలో పాల్గొన్న ఐద్వా నాయకురాలని.. సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

15:37 - January 26, 2017

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. విశాఖపట్నంలో యువత చేపడుతున్న నిరసనకు మద్దతుగా విజయవాడలో జనసేన నేతలు శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఉద్యమాన్ని అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జనసేన నేతలు ఆరోపించారు.

15:35 - January 26, 2017

హైదరాబాద్: విశాఖ తీరం ఎమర్జెన్సీని తలపిస్తోంది. ప్రత్యేక హోదా ఆందోళనల నేపథ్యంలో విశాఖలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 144 సెక్షన్‌ను విధించారు. ఆర్కే బీచ్‌లో అదనపు బలగాలను మోహరింప చేశారు. పలుచోట్ల చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి.. వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. యువతను ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు. అటు విజయవాడ, తిరుపతిలోను ప్రత్యేక హోదా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం ఆర్కే బీచ్‌లో జరగనున్న క్యాండిల్‌ ర్యాలీలో ఆయన పాల్గొనున్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం యువత చేపడుతున్న నిరసన కార్యక్రమంలో జగన్‌ భాగంకానున్నారు. అయితే ఎయిర్‌ పోర్టులోనే జగన్‌ను అరెస్ట్ చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు.

15:34 - January 26, 2017

హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎంపీ రాయపాటిని టార్గెట్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టకండి అంటూ ట్విటర్‌లో విరుచుకుపడ్డారు. వ్యాపార ధోరణి రాజకీయాలతో తెలంగాణ యువతకి కోపం తెప్పించి.. ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారన్న అపవాదు మొత్తం జాతికే తీసుకువచ్చారన్నారు. ప్రత్యేక హోదా కోసం మీరు పోరాటం చేయరు.. చేసే వారిని చేయనివ్వరంటూ పవన్‌ మండిపడ్డారు.

ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు:టీఎస్ పీఎస్సీ

హైదరాబాద్: ఫిబ్రవరి మొదటివారంలో గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. రెండో వారంలో గ్రూప్-2 ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు. మార్చి మొదటి వారంలో ఇంటర్క్వూలు నిర్వహిస్తామని చక్రపాణి పేర్కొన్నారు. ఈ ఏడాది 10వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. మరో వారంలో తొలి విడతగా 6వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

పరవాడ వద్ద జగన్ అరెస్ట్

విశాఖ : ప్రత్యేక హోదా కోసం విశాఖలో జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనటానికి వచ్చిన పరవాడ వద్ద జగన్ కాన్వాయ్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు తిరుపతి, విజయవాడల్లో కూడా వైసీపీ ఆందోళనలు తీవ్రతరమయ్యాయి.

28వరకు ఆందోళలకు అనుమతి లేదు:డీజీపీ

విశాఖ : నగరంలో ఈనెల 28వ తేదీ వరకు ఎలాంటి ఆందోళనలు, నిరసనలకు అనుమతి లేదని డీజీపీ సాంబశివరావు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిపబ్లిక్ డేసందర్భంగా ఏటా చేసినట్లే భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామన్నారు. ప్రత్యేక హోదా కోసం నిరసన తెలపాలంటే విశాఖకే రావాల్సిన అవసరం లేదని.. ఎవరి ప్రాంతంలో వారు చేసుకోవచ్చని సూచించారు. ఆందోళనల పేరుతో విశాఖ పేరు ప్రతిష్ఠలు దిగజార్చే చర్యలు మానుకోవాలన్నారు.

14:37 - January 26, 2017

ప్రతి గణతంత్ర దినోద్సవానికి సాహసాలు ప్రదర్శించే బాలలను ఎంపిక చేసి అవార్డులు ఇవ్వడం జరుగుతూవుంటుంది. అలాగే 2017 సంవత్సరానికి గానూ అత్యంత సాహసం ప్రదర్శించి రెండు దేశాలకు మధ్య జరుగుతున్న మహిళల అక్రమ రవాణా ముఠాను పట్టించిన ఇద్దరు బాలికలు తేజస్విత, శివానీలకు మావని అభినందనలు తెలుపుతుంది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...
 

 

14:30 - January 26, 2017
14:28 - January 26, 2017
14:26 - January 26, 2017
14:25 - January 26, 2017
14:23 - January 26, 2017
14:14 - January 26, 2017

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై ట్వీట్లతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీటెక్కిస్తున్నారు. లడ్డూల మీద, అవి అమ్మే వ్యాపారులు, తినేవారి మీద చులకన భావన లేదన్నారు. అడగకుండ చేతిలో పాచిపోయిన లడ్డూలు పెట్టేవారి మీదే తమకు అసహనం ఉందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

14:07 - January 26, 2017

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేకహోదాపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రిన్స్ మహేష్ బాబు టార్కెట్ గా ట్వీట్స్ చేశారు. జల్లికట్టుకు మహేష్ బాబు మద్దతు ఇచ్చారని.. ప్రత్యేకహోదాపై ఎందుకు స్పందించడం లేదన్నారు. ఆంధ్రుల జీవన పోరాటమైన ప్రత్యేకహోదాపై సైలెంట్ ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రం పట్ల పవన్ కు ఉన్న బాధ్యత మహేష్ కు లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:55 - January 26, 2017

విశాఖ : వైజాగ్ ఎమర్జెన్సీని తలపిస్తోంది. విశాఖ ఆర్కేబీచ్‌లో ఇవాళ యువత మౌనదీక్ష చేపట్టింది. మౌనదీక్షకు జనసేన, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు మద్దతు తెలిపాయి. వైసీపీ కొవ్వొత్తుల ప్రదర్శనలో వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు. ఆందోళనల నేపథ్యంలో విశాఖలో భద్రత కట్టుదిట్టం చేశారు. విశాఖలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పలుచోట్ల చెక్‌పోస్ట్‌ లు ఏర్పాటు చేసి.. వాహనాల తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి నుంచి ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:50 - January 26, 2017

కృష్ణా : బెజవాడలో ప్రత్యేక హోదా సాధన కోసం బ్యారేజ్ రోడ్‌లో యువత తలపెట్టిన నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా యువత నిరసనకు దిగుతామని హెచ్చరించడంతో పోలీసులు కూడా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. విజయవాడకు వచ్చే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. విజయవాడ పోలీస్‌కమిషనరేట్‌ పరిధిలో..144 సెక్షన్ విధించిన పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని పోలీసులు చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:36 - January 26, 2017

చిత్తూరు : తిరుపతి ఎస్వీ వర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యేక హోదా కోరుతూ యువత చేపట్టిన ఆందోళనకు వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి కుమారుడు మద్దతు తెలిపారు. పోలీసులు ఈ ఆందోళనకు అనుమతి లేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని యువతకు సూచించారు. పోలీసులు ఖాళీ చేయించేందుకు యత్నించడంతో తోపులాట జరిగింది. భూమన కరుణాకరరెడ్డి కుమారుడు సహా పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:33 - January 26, 2017

విశాఖ : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఓ యువకుడు భవనం ఎక్కి నిరసన తెలిపాడు. వెంటనే కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారుడిని కిందకు దింపేందుకు యత్నిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:27 - January 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఖైదీలకు క్షమాబిక్ష అందని ద్రాక్షలా మారింది... క్షమాబిక్షపై రెండు రాష్ట్రాల సీఎంల హామీలు ప్రసంగాలకు మాత్రమే పరిమితమయ్యాయి.. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న ప్రభుత్వాలు క్షమాబిక్షపై మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు.. దీంతో ఖైదీలు ఎప్పుడు బయటకువస్తారో తెలియక వారి కుటుంబసభ్యులు ఇంకా వేయికళ్లతో ఎదురుచూస్తూనే ఉన్నారు.
జీవిత ఖైదీలకు మరోసారి నిరాశ 
జైలులో మంచి ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలకు మరోసారి నిరాశే మిగిలింది..... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండున్నరేళ్లయినా ఇప్పటివరకూ ఖైదీల క్షమాబిక్షపై ప్రభుత్వం కనికరం చూపలేదు.. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారి రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు 2012లో క్షమాబిక్ష కింద 430మంది ఖైదీలు విడుదలయ్యారు.. ఇందులో చర్లపల్లినుంచి 74మంది ఉన్నారు.. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో క్షమాబిక్షను అప్పటి ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు.. దీంతో దాదాపు 3వేల మంది ఖైదీలు ఇంకా జైళ్లలోనే మగ్గిపోతున్నారు.. 
ఏడేళ్లు జైలు శిక్ష అనుభవిస్తేనే క్షమాబిక్షకు అవకాశం
అయితే ప్రభుత్వ ఉద్యోగుల హత్య, యాసిడ్ దాడుల కేసుల్లో ఖైదీలకు క్షమాబిక్ష ఉండదు... మిగతా నేరాలు చేసినవారు క్షమాబిక్ష కింద విడుదలయ్యే అవకాశం ఉంటుంది.. పైగా క్షమాబిక్ష కింద బయటకు రావాలంటే ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించి ఉండాలి.. అలాగే జైలులో మంచి ప్రవర్తన, క్రమశిక్షణ కలిగిఉండాలి.. ఈ నిబంధనలప్రకారం రెండు రాష్ట్రాల్లో 12వందల మంది ఖైదీలు క్షమాబిక్షకు అర్హులని అధికారులు తేల్చారు.. ఇందులో తెలంగాణలోని జైళ్లనుంచి 800మంది ఖైదీలున్నారు.
ఖైదీల క్షమాబిక్షపై సీఎం కేసీఆర్‌ కసరత్తు 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఖైదీల క్షమాబిక్షపై సీఎం కేసీఆర్‌ కసరత్తుకూడా చేశారు.. రాష్ట్ర ఆవిర్భావంరోజు విడుదల చేస్తామని ప్రకటించారు.. ఈ హామీ అమల్లోకి రాలేదు... కనీసం ఆగస్టు 15కైనా విడుదల కావచ్చని ఖైదీలు ఆశలు పెట్టుకున్నారు.. అప్పుడూ సర్కారు ఈ విషయంపై దృష్టిపెట్టలేదు.. అక్టోబర్‌ 2కైనా జైలు జీవితం నుంచి విముక్తి లభిస్తుందనుకున్న ఖైదీలకు నిరాశే మిగులింది. ఇప్పటికే ఆరుసార్లు క్షమాబిక్షకు అవకాశంవచ్చినా సర్కారు స్పందించలేదు.. దీంతో జైలు గోడల మధ్య సత్ప్రవర్తన కల్గిన ఖైదీలు మగ్గిపోతునే ఉన్నారు.

 

13:18 - January 26, 2017

కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని వక్తలు కోరారు. ఇదే అంశంపై నిర్వహించిన ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో లోక్ సత్తా నేత శ్రీనివాస్, టీడీపీ నేత చందు సాంభశివరావు, వైసీపీ కరణ ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే, సీఐటీయూ నేత ఎంఎ.గఫూర్ పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేకహోదా కోసం సీఎం చంద్రబాబు పోరాడాలని..కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్యాకేజీ అనేది మోసమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తోందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:50 - January 26, 2017

కొత్త జిల్లాల్లోని సమీప మండలాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బి.ప్రసాద్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన ఇవాళ్టి జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'కొత్త జిల్లాల ఏర్పాటు ఉపాధి హామీ పథకం కూలీలకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. సమీప మండలాల్లో ఉపాధి హామీ అమలు చేయొద్దంటూ ప్రభుత్వం నిర్ణయించడం కూలీల పాలిట శాపంగా మారుతోంది. దీంతో తెలంగాణలో ఉపాధి హామీ పథకం కూలీలు పోరుబాట పడుతున్నారు. ఈ నెల 30న చలో ఈజీఎస్ ఆఫీసు ఆందోళనకు సిద్ధమవుతున్నారు'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:37 - January 26, 2017

ఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2017 సంవత్సరానికి గానూ.. కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 20 మంది ప్రముఖులను పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులూ ఉన్నారు. 
2017 సం. పద్మాలు  
2017 సంవత్సరం పద్మాలు వికసించాయి. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన పలువురు ప్రముఖులకు కేంద్రం ప్రభుత్వం పద్మ పురష్కారాలను ప్రకటించింది. మొత్తం ఏడుగురికి పద్మవిభూషణ్‌ వరించగా.. మరో ఏడుగురు ప్రముఖులు పద్మభూషణ్‌ అవార్డులకు ఎంపికయ్యారు. మొత్తం 75 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ప్రముఖ గాయకుడు కె.జె.ఏసుదాసు, సద్గురు జగ్గీవాసుదేవ్‌, శరద్‌పవార్‌, మురళీమనోహర్‌జోషి, సుందర్‌లాల్‌ పట్వా, ప్రొఫెసర్‌ ఉడిపి రామచంద్రరావు, పీఏ సంగ్మా పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. అయితే వీరిలో సుందర్‌లాల్‌ పత్వా, పీఏ సంగ్మాలకు మరణానంతరం పద్మవిభూషణ్‌లు ప్రకటించడం విశేషం. 
పద్మ భూషణ్‌ అవార్డులకు ఎంపికైన వారు వీరే... 
పద్మ భూషణ్‌ అవార్డులకు ఎంపికైన వారిలో విశ్వమోహన్‌భట్‌, ప్రొఫెసర్‌ దేవి ప్రసాద్‌ ద్వివేది, తెహెంతన్‌ ఉద్వాడియా, రత్న సుందర్‌ మహారాజా, స్వామి నిరంజన్‌ నందా సరస్వతి, చో.రామస్వామి, వీరితో పాటు ప్రిన్సెస్‌ మహాచక్రి సిరింధోర్న్‌ అనే విదేశీయుడు కూడా ఉన్నారు. 
75 మందికి పద్మశ్రీ అవార్డులు
వివిధ రంగాల్లో సేవలందించిన మరో 75 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. వీరిలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఒలింపిక్‌ మెడల్‌ గెలిచిన సాక్షిమాలిక్‌, జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌, డిస్కస్‌ త్రోయర్‌ వికాస్‌గౌడ, హాకీ టీమిండియా కెప్టెన్‌ పీఆర్‌ శ్రీజేష్‌ ఉన్నారు. ఎన్నారైలలో ఎయిడ్స్‌పై పరిశోధనలు చేస్తున్న డాక్టర్‌ సునితి సాల్మన్‌, సురబ్‌హార్‌ ఆర్టిస్ట్‌ ఇమ్రత్‌ఖాన్‌, నేపాల్‌కు చెందిన అనురాధా కొయిరాలాలను పద్మశ్రీ వరించింది.  
పద్మాపురష్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలు 
పద్మాపురష్కారాలకు ఎంపికైన వారిలో తెలుగు తేజాలూ ఉన్నారు. తెలంగాణకు చెందిన ఎక్కా యాదగిరి, త్రిపురనేని హనుమాన్‌ చౌదరి, డాక్టర్‌ మహ్మద్ అబ్దుల్ వహీద్‌, చంద్రకాంత్ పత్వా, దరిపల్లి రమేష్‌లను పద్మశ్రీ అవార్డులు వరించాయి. కోటి మొక్కలు నాటిన ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్యకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. చేనేత ఆసుయంత్రం రూపొందించిన చింతకింది మల్లేశంకు పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. తనకు పద్మశ్రీ అవార్డు రావడంపై చింతకింది మల్లేశ్‌ అనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కలరియట్టు నిపుణురాలు కోటేశ్వరమ్మను పద్మశ్రీ అవార్డులు వరించాయి. 
పద్మవిభూషణ్‌ 
కె.జె.ఏసుదాసు ( కేరళ ) 
సద్గురు జగ్గీవాసుదేవ్‌ (తమిళనాడు)
శరద్‌పవార్‌ (మహారాష్ట్ర)
మురళీమనోహర్‌జోషి (ఉత్తరప్రదేశ్‌ )
సుందర్‌లాల్‌ పట్వా (మధ్యప్రదేశ్‌)
ప్రొఫెసర్‌ ఉడిపి రామచంద్రరావు (కర్నాటక) 
పీఏ సంగ్మా (మేఘాలయ)  
పద్మభూషణ్‌
విశ్వమోహన్‌భట్‌, ప్రొఫెసర్‌ దేవి ప్రసాద్‌ ద్వివేది, తెహెంతన్‌ ఉద్వాడియా
రత్న సుందర్‌ మహారాజా, స్వామి నిరంజన్‌ నందా సరస్వతి
చో.రామస్వామి, ప్రిన్సెస్‌ మహాచక్రి సిరింధోర్న్‌   

 

12:25 - January 26, 2017

గుంటూరు : వచ్చే నెలలో జరగబోయే ఉమెన్‌ పార్లమెంటరీ సదస్సును వైభవంగా నిర్వహించాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించామని... మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు.. పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తిచేసేలా చేపట్టే చర్యలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు.. శాతకర్ణి సినిమాకు వందశాతం వినోదపన్ను మినహాయింపుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిందని స్పష్టం చేశారు.
ఫిబ్రవరిలో జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు
విజయవాడలో జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఫిబ్రవరిలో జాతీయ మహిళా సదస్సును ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గ భేటీలో తీర్మానించారు... అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. 
కృష్ణపట్నం అభివృద్ధి...వాటాదారుల ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం
చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లోని కృష్ణపట్నం అభివృద్ధికోసం వాటాదారుల ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. పురపాలక సంస్థల్లో పారిశుధ్యానికి మామూలు పద్దతిలో కాంట్రాక్ట్‌లు ఇవ్వాలని నిర్ణయించింది.. 57 మున్సిపాలిటీల్లో వ్యర్థాలనుంచి విద్యుత్‌ ఉత్పత్తికి లీజు పద్దతిలో భూమి ఇవ్వాలని మంత్రివర్గ భేటీ తీర్మానించింది..
నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటలను కలిపి నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణకోసం కేబినెట్‌ ఓకే చెప్పింది.
స్విస్‌ చాలెంజ్‌ విధానం అనుసరించాలని తీర్మానం
కొత్త అద్దె నియంత్రణ బిల్లు అసెంబ్లీలో పెట్టేందుకు గవర్నర్‌ అనుమతి తీసుకోవాలని నిర్ణయించింది.. ఏలూరు మున్సిపాలిటీని స్మార్ట్ సిటీగా మార్చేందుకు స్విస్‌ చాలెంజ్‌ విధానం అనుసరించాలని కేబినెట్‌ తీర్మానించింది.. అనంతపురం జిల్లా ఆలూరు, తాళ్లపాలెంలో సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌కు 4వేల 18 ఎకరాలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. శాతకర్ణి సినిమాకు వందశాతం వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది.

12:16 - January 26, 2017

విజయవాడ : ప్రత్యేక హోదాపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. జల్లికట్టు స్పూర్తితో ఉద్యమించాలని నేతలు ముక్కకంఠంతో హోదాపై ఉద్యమానికి నాంది పలుకుతున్నారు. నిరంతర పోరాటానికి పార్టీలకు ఆతీతంగా సిద్ధమవుతున్నారు. హోదానే లక్ష్యంగా పోరుబాట పడుతున్నారు. జిల్లాల వారీగా ఆందోళనలు, నిరసనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయ నాయకులతో పాటు యువత, మేధావులు హోదాపై పోరుకు సై అంటున్నారు. 
యువత పోరుబాట 
ఏపీలో ప్రత్యేక హోదా వేడెక్కింది. ఉద్యమానికి రాజకీయ పార్టీలతో పాటు యువత కూడా పోరు బాట పడ్డింది. రాష్ర్ట్రానికి ప్రత్యేక హోదానే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ రచిస్తున్నారు. 13 జిల్లాల్లో ఆందోళనకు కార్యరూపం దాల్చుతున్నారు. జల్లికట్టు ఉద్యమమే స్పూర్తిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. మేధావులతో పాటు ప్రజలు పోరాటానికి సై అంటున్నారు. హోదాపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. 
ఆమ్‌ ఆద్మీ నేతల దీక్ష భగ్నం 
ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు బస్టాండ్‌ నుంచి శ్రీహరి నగర్‌ వరకు ర్యాలీ చేసిన నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆమరణ దీక్షకు అనుమతి లేదంటూ పోలీస్టేషన్‌కు తరలించారు.
చంద్రబాబుది రెండు నాలుకల దోరణి : వైసీపీ  
చంద్రబాబుది రెండు నాలుకల దోరణిని అని వైసీపీ నేతలు అన్నారు. ప్రత్యేక హోదాను అడ్డుకునేందుకు బాబు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 144 సెక్షన్‌ విధించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఉద్యమాన్ని అణచివేయాలని కుట్ర : రామకృష్ణ 
చంద్రబాబు, వెంకయ్య తమ రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయాలని కుట్ర పన్నుతున్నారని సీపీఐ ఎపీ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైజాగ్‌ ఆర్కే బీచ్‌లో యువత చేపట్టబోయే మౌన దీక్షను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. పోలీసుల చేత అక్రమంగా ఆరెస్టు చేయిస్తూ ప్రభుత్వం దమన కాంఢను కొనసాగిస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా రిపబ్లిక్‌ డే సందర్భంగా విశాఖ కేంద్రంగా ప్రత్యేక హోదాపై ఉద్యమం ఉధృతం కానుంది. ప్రతిపక్ష పార్టీలతో సహా విద్యార్ధి సంఘాలు సైతం ఆర్కే బీచ్‌లో ఆందోళనకు సిద్ధమయ్యాయి. దీనిని ప్రభుత్వం ఎలా ఎదుర్కోంటుందో వేచి చూడాలి. 

 

12:07 - January 26, 2017
12:04 - January 26, 2017

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రశ్నించినందుకు ఏపీ చంద్రబాబుకు కోపం వచ్చింది. ప్రత్యేక హోదాపై ప్రశ్నించినందుకు 10 టివిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చానెల్ పై తన అక్కసును వెళ్లగక్కారు. 'నన్ను ప్రోవోక్ చేస్తున్నావా' అంటూ 10 టివి రిపోర్టర్ పై బాబు చిర్రుబుర్రులాడారు. క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ ప్రశ్నిస్తే గట్టిగా చెప్పాల్సి వస్తుందని.. ఇంతటితో వదిలేయాలని వార్నింగ్ ఇచ్చారు. లిమిట్స్ దాటొద్దంటూ రిపోర్టర్ ను హెచ్చరించారు. 

11:40 - January 26, 2017
11:35 - January 26, 2017
11:34 - January 26, 2017

హైదరాబాద్ : నగరంలో 68 వ గణతంత్ర దినోత్సవ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని గవర్నర్ నిరసింహన్ ఆవిష్కరించారు. అమర జవాన్లకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:28 - January 26, 2017

ఢిల్లీ : హస్తినలో 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ పథ్ లో జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా అబుదాబి యువరాజు మహ్మద్ జహేద్ హాజరయ్యారు. తేజస్ యుద్ధ విమాన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ ఆయుధ సత్తా ప్రదర్శిస్తున్నాయి. తొలిసారిగా కవాతులో యూఏఈ జావాన్లు పాల్గొన్నారు. అమర జవాన్లకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. 
వివిధ రాష్ట్రాల శకటాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:24 - January 26, 2017

ఢిల్లీ : హస్తినలో 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణతంద్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా అబుదాబి యువరాజు మహ్మద్ జహేద్ హాజరయ్యారు. తేజస్ యుద్ధ విమాన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ ఆయుధ సత్తా ప్రదర్శించనుంది. తొలిసారిగా కవాతులో యూఏఈ జావాన్లు పాల్గొన్నారు. ప్రధాని మోడీ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. 

 

11:16 - January 26, 2017

విశాఖ : ఆర్కే బీచ్ లో ఇవాళ యువత మౌన దీక్ష చేపట్టనుంది. జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మౌన దీక్షకు మద్దతు తెలిపాయి. వైసీపీ కొవ్వొత్తుల ప్రదర్శనలో వైఎస్ జగన్ పాల్గోనున్నారు. ఆందోళన నేపథ్యంలో విశాఖలో భద్రత కట్టుదిట్టం చేశారు. విశాఖలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. బీచ్ రోడ్ లో ప్రత్యేక నిఘా ఉంచారు. అదనపు బలగాలను మోహరించారు. పలు చోట్ల చెక్ పోస్టుల ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బీచ్ రోడ్ లో పోలీసులు మార్నింగ్ వాకర్స్ ను సైతం అనుమతించలేదు. అర్ధరాత్రి నుంచే ముందుస్తు అరెస్టులు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

డబుల్ డిజిటల్ గ్రోత్ సాధించాం : గవర్నర్

విజయవాడ : అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కృషి చేద్దామని గవర్నర్ నరసింహన్ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో సమస్యలున్నా..డబుల్ డిజిటల్ గ్రోత్ సాధించామని తెలిపారు. మున్సిపల్ స్టేడియంలో 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. జాతీయ పతకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 

11:11 - January 26, 2017

విజయవాడ : అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కృషి చేద్దామని గవర్నర్ నరసింహన్ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో సమస్యలున్నా..డబుల్ డిజిటల్ గ్రోత్ సాధించామని తెలిపారు. మున్సిపల్ స్టేడియంలో 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. జాతీయ పతాకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించామని తెలిపారు. 12.23 శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పారు. డిజిటల్ అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. పట్టిసీమను రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. పట్టిసీమతో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. సంక్షేమ రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. 2018 జూన్ లోగా వంశధార ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. సాంకేతికతతో రాష్ట్ర ముందుకెళ్తోందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రాజ్ పథ్ లో జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ప్రణబ్

ఢిల్లీ : హస్తినలో 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ పథ్ లో జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా అబుదాబి యువరాజు మహ్మద్ జహేద్ హాజరయ్యారు. తేజస్ యుద్ధ విమాన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ ఆయుధ సత్తా ప్రదర్శించనుంది. తొలిసారిగా కవాతులో యూఏఈ జావాన్లు పాల్గొన్నారు. 

పరేడ్ గ్రౌండ్ లో 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ : నగరంలో 68 వ గణతంత్ర దినోత్సవ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని గవర్నర్ నిరసింహన్ ఆవిష్కరించారు. అమర జవాన్లకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్నారు.  

ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఢిల్లీ : హస్తినలో 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణతంద్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా అబుదాబి యువరాజు మహ్మద్ జహేద్ హాజరయ్యారు. తేజస్ యుద్ధ విమాన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ ఆయుధ సత్తా ప్రదర్శించనుంది. తొలిసారిగా కవాతులో యూఏఈ జావాన్లు పాల్గొన్నారు. 

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ నరసింహన్

విజయవాడ : మున్సిపల్ స్టేడియంలో 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. జాతీయ పతకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ శకటాల ప్రదర్శించారు. 

10:34 - January 26, 2017

విజయవాడ : మున్సిపల్ స్టేడియంలో 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. జాతీయ పతకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ శకటాలను ప్రదర్శించారు. 

 

 

10:29 - January 26, 2017

విజయవాడ : ప్రత్యేక హోదాపై ఏపీ నేతలు స్వరం పెంచారు. జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకొని హోదాపై పోరుకు సిద్ధమయ్యారు. పార్టీలను ఏకం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఒక్కటైన యువత ప్రత్యేక హోదా ఉద్యమానికి నాంది పలుకుతున్నారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపేందుకు ఏపీ ప్రజలు సన్నద్ధమవుతున్నా.. వాటికి అనుతిచ్చేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. దీంతో రిపబ్లిక్‌ డే రోజున విశాఖ సాగరతీరంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది. 
ఉద్యమం ఉధృతం 
ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో వివిధ రూపాల్లో ఉద్యమం ఉధృతం కానుంది. రిపబ్లిక్‌ డే సంధర్భంగా పోరాటాన్ని సాగించేందుకు ఉద్యమకారులు సిద్ధమవుతున్నారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్విస్తామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు జల్లికట్టు తరహాలో ఉద్యమం నిర్వహించాలని పవన్‌ పిలుపునిచ్చారు. వీటికి పోలీసుల అనుమతి లేకపోవడంతో విశాఖలో టెన్షన్‌ పెరిగిపోయింది. ఎలాంటి పరిస్థితులు ఏర్పాడుతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
నేడు ఆర్ బీచ్ లో అందోళన
జనవరి 26వ తేదీన విశాఖ నగరంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని యువత, విద్యార్ధులకు జన సేన నేత పవన్ కళ్యాణ్‌ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని తొలుత ప్రభుత్వం లైట్ గా తీసుకున్నా.. ఒక వైపు పవన్ కళ్యాణ్‌ ట్విట్లు చెయ్యడం మరో వైపు టీడీపీ, బీజేపీ మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా కోసం బీచ్ లో చెపట్టే అందోళనకు మద్దతు ఇవ్వడమే కాకుండా విడివిడిగా కార్యచరణ ప్రకటించాయి. సీపీఐ, సీపీఎం పార్టీలు బీచ్ లో కార్యక్రమాలు చెపడతామని ప్రకటించగా పవన్ కళ్యాణ్‌ అభిమానులు తమ కార్యచరణ ప్రకటించారు. అయితే నిన్నటి వరకు బీచ్ లో కార్యక్రమాలు చేపట్టడానికి అనుమతులు లేవని ప్రభుత్వం చెబుతూ వస్తుంది. ప్రత్యేక హోదా వల్ల వచ్చే మేలు ఏమిటో చెప్పాలని వితండ వాదం చేస్తోంది. దీనికి తోడు స్వయంగా రాష్ర్ట డీజీపీ సాంబశివరావు విశాఖ లో 26వ తేదీన జరిగే  కార్యక్రమాలకు అనుమతులు లేవని చెప్పడం జరిగింది.
వైసీపీ... కొవ్వోత్తుల ర్యాలీ
ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక హోదాపై బీచ్ రోడ్డులో వైసీపీ అధ్వర్యంలో జరిగే కొవ్వోత్తుల ర్యాలీలో స్వయంగా పాల్గొంటానని స్పష్టం చేశారు. దీంతో ఒక్క సారిగా వాతావరణం వేడెక్కింది. ఇదే సమయంలో వైసీపీతో పాటుగా సీపీఎం, సీపీఐ పార్టీలు, ఇతర విద్యార్ధి సంఘాలు విడివిడిగా బీచ్ రోడ్ లో ఆందోళన చేయాలని నిర్ణయించాయి. అయితే వైసీపీ నిర్వహిస్తున్న క్యాండిల్ ర్యాలీ అనుమతి కోసం పోలీసులను అశ్రయించగా జిల్లా యంత్రాంగం తిరస్కరించింది. జనవరి 26న అందోళనలు, నిరసనలకు దిగడం సరికాదని విశాఖ పోలీస్‌ కమిషనర్ యోగానంద్‌ అన్నారు.. నిఘా వర్గాల నుంచి ఇప్పటికే పలు హెచ్చరికలు వచ్చాయని అందుకని తాము ఎవ్వరూ వచ్చినా ర్యాలీలు, సదస్సులకు అనుమతులు ఇచ్చే ప్రస్తకే లేదని తేల్చి చెప్పారు.
అనుమతులివ్వక పోయినా ర్యాలీ చేసి తీరుతాం : బొత్స
అనుమతులు ఇవ్వక పోయినా ర్యాలీ చేసి తీరుతామని వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. జనవరి 26న తాము నిరసనకు దిగడం లేదన్న ఆయన.. కేవలం రాష్ట్రానికి వెలుగు నిచ్చే ప్రత్యేక హోదాను ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. ఏం జరిగినా తాము మాత్రం కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అటు ప్రత్యేక హోదాపై జరుగుతున్న ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో.. రేపు, ఎల్లుండి నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్‌ భద్రతకు చాలా మంది వెళ్లిపోనున్నారు. దీంతో ఏదైన అవాంఛనీయ సంఘటన జరిగితే పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. 

 

10:25 - January 26, 2017

హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నారా...? ఇప్పటికే ముష్కరులు శ్రీలంక నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి చొరబడ్డారా..? తెలంగాణలో ఇండియన్‌ ముజాహిదీన్‌, సిమీ కార్యకర్తలను స్వీపర్‌సెల్స్‌గా ఉపయోగించేందుకునే అవకాశాలున్నాయా..? తాజాగా కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గాల హెచ్చరికలతో వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. 
ఉగ్రవాదులు ప్రతీకార దాడులు : కేంద్ర ఇంటిజెన్స్ వర్గాలు 
రిపబ్లిక్‌ డే ఉత్సవాల సందర్భంగా ఉగ్రవాదులు ప్రతీకార దాడులు జరిపే అవకాశం ఉందని కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గాల హెచ్చరించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ముష్కరులు చొరబడ్డారని, ఏ క్షణాన ఎలాంటి ముప్పునైనా తలపెట్టవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేశాయి. భద్రతకు సవాల్‌ విసిరేలా ముష్కరులు బాంబులు పేల్చడం, విధ్వంసం సృష్టించడం వంటి చర్యలకు పాల్పడవచ్చని ఇప్పటికే ఐబీ హెచ్చరించింది. ఇండియన్‌ ముజాహిదీన్‌, సిమి కార్యకర్తలను స్వీపర్‌సెల్స్‌గా వాడుకుని విధ్వంసం సృష్టించవచ్చన్న హెచ్చరికలు చేసింది. ఇప్పటికే ముష్కరులు వైజాగ్‌, రాజమంట్రి ఓడరేవుల ద్వారా హైదరాబాద్‌ చేరుకున్నారని కూడా నిఘా వర్గాలు తెలిపాయి. 
హైదరాబాద్ లో హైఅలర్ట్‌ 
దిల్‌షుక్‌నగర్‌ బాంబు పేలుళ్ల నిందితులకు ఇప్పటికే ఉరిశిక్ష ఖరారు కావడంతో.. ప్రతకార దాడులకు పాల్పడేలా ముష్కరులు ప్లాన్‌ చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. నిఘా హెచ్చరిక నేపథ్యంలో నగరంలో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ఏమైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే 100 నెంబర్‌కు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేశారు.  
విధ్వంసం సృష్టించే అవకాశం..
ఉగ్రమూకలు ఈ సారి పెంపుడు జంతువులకు బాంబులు అమర్చి, వాహనాలతో ఢికొట్టి విధ్వంసం సృష్టించే అవకాశం ఉందన్న సమాచారంతో పో లీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అనుమానస్పద ప్రాంతాల్లో వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.  

 

10:23 - January 26, 2017

ఢిల్లీ : గణతంత్ర దినోత్సవ సంబరాలకు భారత్ ముస్తాబైంది. గల్లీ గల్లీలో ఎగరటానికి మువ్వన్నెల జెండాలు రెడీ అయ్యాయి. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఉత్సవాలకు భారతీయులు సిద్ధమయ్యారు. మరోవైపు దాడులకు తెగపడేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారనే ఇంటెలిజెన్స్‌ నివేదికల నేపథ్యంలో.. దేశంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక ప్రధాన నగరాల్లో గణతంత్ర వేడుకలకు పటిష్ట భద్రత కల్పించారు. 
"రాజ్యాంగ పరిషత్‌" ఆవిర్భావం
1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం మాత్రమే సిద్ధించింది. బ్రిటీష్ పాలకులు రూపొందించిన చట్టాలతోనే పాలన సాగేది. మనకంటూ నియమ నిబంధనలు ఉండాలని, ఓ రాజ్యాంగం కావాలని మేధావులు ఆకాంక్షించారు. ఆ ఆలోచన ఫలితమే "రాజ్యాంగ పరిషత్‌" ఆవిర్భావం. 1946 డిసెంబర్ 9న జరిగిన మొట్ట మొదటి సమావేశంలో డాక్టర్ సచ్చిదానంద సిన్హా  తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత డిసెంబర్ 11న జరిగిన సమావేశంలో డాక్టర్ బి. రాజేంద్రప్రసాద్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 
26న రాజ్యాంగం అమల్లోకి.. 
న్యాయకోవిదుడైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు రాజ్యాంగ ముసాయిదా తయారీ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల అనంతరం భారతదేశంలో రాజ్యాంగం రూపుదిద్దుకుంది. 1949 నవంబర్ 26నే భారత రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగాన్ని ఆమోదించింది. కానీ రాజ్యాంగం జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. 1930 జనవరి 26న మొదటిసారి పూర్ణ స్వరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు. దీంతో ఆ తేదీకి ఉన్న చారిత్రక స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి తెచ్చారు. 
రాజ్యాంగం పవర్ ఫుల్‌
మనదేశంలో ఖురాన్, బైబిల్, భగవద్గీత కంటే రాజ్యాంగమే పవర్ ఫుల్‌. రాజ్యాంగానికి కట్టుబడే ఉండాలి. అందుకే స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవం పేరుతో ఏటా రెండు జెండా పండగలను జరుపుకునేందుకు యావత్భారతం ఏకమవుతుంది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మువ్వన్నెలా జెండా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. 
దేశరాజధాని ముస్తాబు
త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు దేశరాజధాని ముస్తాబైంది. అయితే.. దేశంలో ముష్కరులు చొరబడ్డారనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో.. ఢిల్లీ సహా హైదరాబాద్, ముంబై, లక్నో, కోల్‌కతా నగరాల్లో భద్రతను పెంచారు. 

 

నేడు భారత్, ఇంగ్లండ్ తొలి టీ..20 మ్యాచ్

కాన్పూర్ : నేడు భారత్, ఇంగ్లండ్ తొలి టీ..20 మ్యాచ్ జరుగనుంది. కాన్పూర్ లో సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు విజయవాడలో పోలీసుల ఆంక్షలు

కృష్ణా : నేడు విజయవాడలో పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆంక్షలు విధించారు. 

నేడు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలు

విజయవాడ : నేడు మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గోనున్నారు. 

Don't Miss