Activities calendar

27 January 2017

21:33 - January 27, 2017
21:32 - January 27, 2017

హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌లో పలుచోట్ల మంచు చరియలు విరిగి పడడడంతో మృతుల సంఖ్య 15కి చేరింది. ఈరోజు మరో నాలుగు శవాలు వెలికి తీశారు. సహాయక బృందాలు మంచు చరియల్లో చిక్కుకున్న ఏడుగురిని సురక్షితంగా బయటకు తీశారు. గత మూడురోజులుగా 5 ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడ్డాయి. మృతుల్లో సైనికులతో పాటు పౌరులు కూడా ఉన్నారు. తాజాగా బనిహాల్‌ వద్ద మంచు చరియ విరిగిపడింది. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. హిమపాతం కారణంగా శ్రీనగర్‌-జమ్ముకశ్మీర్‌ జాతీయ రహదారిని మూసేసారు.

21:31 - January 27, 2017

చెన్నై :జల్లికట్టుపై నిషేధానికి వ్యతిరేకంగా మెరీనా బీచ్‌లో వారం రోజుల పాటు నిర్వహించిన ఆందోళనను పక్కదోవ పట్టించే ప్రయత్నం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనలో అరాచక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించేందుకు యత్నించాయని కొన్ని చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది.

ఒసామా బిన్‌ లాడెన్‌ చిత్రపటాలు ...

సంఘవిద్రోహ శక్తులు నల్లజెండాలను ప్రదర్శించి పరిస్థితిని మరింత దిగజార్చేందుకు యత్నించారు. మరికొందరు ఒసామా బిన్‌ లాడెన్‌ చిత్రపటాలు పట్టుకుని గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని నినాదాలు చేశారు...మరి కొందరు ప్రత్యేక తమిళనాడు నినాదాలు చేశారు. ఈ విషయాలను అసెంబ్లీ సాక్షిగా తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ప్రతిపక్షనేత స్టాలిన్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. విద్రోహ శక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు. అరాచక శక్తులకు సంబంధించిన ఆధారాలను తమిళనాడు పోలీసులు సేకరించారని.... సంఘ విద్రోహ శక్తులను గుర్తించి త్వరలోనే అరెస్ట్‌ చేస్తారని పన్నీర్‌ సెల్వం అసెంబ్లీకి తెలిపారు.

21:25 - January 27, 2017

హైదరాబాద్: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేసినప్పటికీ.. ఇంకా ఆ వర్గాల్లో పేదరికం పోలేదని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై ప్రగతిభవన్లో అఖిలపక్షంతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సబ్‌ప్లాన్‌ నిధుల అమలు తీరుపై..

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సబ్‌ప్లాన్‌ నిధుల అమలు తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్లో అఖిలపక్ష నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు అజ్మీరా చందూలాల్, జగదీష్ రెడ్డి, సీఎస్‌ ఎస్పీ సింగ్, మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు. తొలుత సమావేశానికి హాజరైన వారందరితో కలిసి సీఎం కేసీఆర్‌ భోజనం చేశారు. ఆ తర్వాత సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి..

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేసినప్పటికీ..ఇంకా ఆ వర్గాలలో పేదరికం పోలేదని ఈ కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అందరం కలిసి ఆలోచించి విధానం రూపొందించుకొని.. దానిని పకడ్బందీగా అమలు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు దేశంలోనే అత్యధికంగా ఉందని..ఈ ఫలితం పేదరికం నిర్మూలన కోసం ఉపయోగపడాలన్నది తమ లక్ష్యమని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది...

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందుకోసం రెసిడెన్షియల్ స్కూల్స్‌తో పాటు డిగ్రీ రెసిడెన్షియల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ కార్యక్రమం ఎప్పటి నుంచి అమలుల్లో ఉన్నా.. అసైన్డ్ భూముల్లో వ్యవసాయం జరగడం లేదని,.ఈ పరిస్థితుల్లో మార్పు రావాలన్నారు సీఎం. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం.. ఆ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులతో ఓ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకోవాలని సీఎం సూచించారు. అన్ని పార్టీల సభ్యులుండే ఈ కమిటీ సిఫారసులను ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు.

పట్టణ, సెమీ అర్బన్‌, గ్రామీణా ప్రాంతాల్లో ఉండే....

పట్టణ ప్రాంతాల్లో ఉండే ఎస్సీ, ఎస్టీల కోసం ఒక ప్రణాళిక, సెమీ అర్బన్‌లో ఉండే ఎస్సీ, ఎస్టీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు ఇలా మూడు ప్రాంతాల్లో నివసించే వారి జీవన స్థితిగతులు వేర్వేరుగా ఉంటాయి. ఈ మూడు ప్రాంతాల వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అఖిలపక్షం నేతలకు సీఎం సూచించారు. దళితులకు మూడెకరాల భూ పంపిణి నిరంతర కార్యక్రమమని.. దీన్ని తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు సీఎం. ఏదేమైనా ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో పేదరికం పోవాలి. అదే లక్ష్యం కావాలని సీఎం కేసీఆర్‌ అఖిలపక్షం నేతలకు సూచించారు.

21:21 - January 27, 2017

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ ఏటా రెండంకెల వృద్ధిరేటు నమోదు చేస్తోందని.. ఇది జాతీయ సగటు కంటే అధికమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. విశాఖలో రెండు రోజుల పాటు జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సును అరుణ్‌జైట్లీ ప్రారంభించారు. ఈ సదస్సుకు..సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు. తొలిరోజు 4లక్షల 25వేల కోట్ల పెట్టుబడులు వెళ్లువెత్తాయి.

ఘనంగా ప్రారంభమైన సదస్సు....

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సదస్సులో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎంపీ సుజనా చౌదరి, సీఎస్‌ ఎస్పీ టక్కర్‌, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానం...

సీఐఐ సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌ ఏటా రెండంకెల వృద్ధిరేటు నమోదు చేస్తోందని..ఇది జాతీయ సగటు కంటే అధికమన్నారు. సులభతర వాణిజ్యంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని..ఇక్కడ పెట్టుబడులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో ఏపీ వృద్ధిరేటు ఏటా 4-5శాతం మేర పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జాతీయ సగటు కంటే ఏపీ వృద్ధిరేటు అధికం ...

ప్రపంచ దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయన్నారు కేంద్రమంత్రులు. అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని వారు సూచించారు. అభివృద్ధి విషయంలో రాష్ర్టాల మధ్య పోటీ వాతావరణం పెరిగిందన్నారు.

గతేడాది 927 ఎంఓయూలు ఒప్పందాలు ...

విశాఖ నగరం దేశంలోనే అద్భుత నగరమని..దీన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని.. గతేడాది 927 ఎంఓయూలు కుదరగా.. అందులో 659 ఎంఓయూలను ఆమోదించామన్నారు. వీటి ద్వారా 2 లక్షల 82వేల పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత భారత్‌లో అవకాశాలు పెరిగాయన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో తొలిరోజు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వివిధ రంగాల ప్రముఖులు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, సీఐఐ ప్రతినిధులు, కంపెనీల ప్రతినిధులు పాల్గొని కీలక అంశాలపై చర్చించారు.

21:17 - January 27, 2017

హైదరాబాద్: మరో నిరసన కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. మొన్న జల్లికట్టు ఉద్యమంలో పోలీసులు జరిపిన దాడి, నిన్న ఆంధ్రలో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని మాట తప్పిన కేంద్రప్రభుత్వ తీరుపై శాంతియుత నిరసనకు వెళ్తున్న యువతను, విద్యార్థులను అరెస్టు చేయడం వంటివి దక్షిణ భారతీయులకు చాలా బాధ కలిగించిందన్నారు. అందుకు నిరసనగా మార్చిలో విశాఖ ఆర్కే బీచ్‌లో దక్షిణభారతీయుల శాంతియుత నిరసన జరపాలని నిర్ణయించినట్టు పవన్ ట్వీట్ చేశారు.

 

ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సవరణ చేయాలి:కేసీఆర్

హైదరాబాద్: ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సవరణ చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు.ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ రూపొందించాలని, ఒక ఏడాది నిధులు ఖర్చు కాకపోతే మరో ఏడాదికి బదలాయించే పద్ధతి అవలంభించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు వేర్వేరు శాఖల ద్వారా కాక ఈ రెండు శాఖల ద్వారానే ఖర్చు చేయాలి. ఎస్సీ వర్గీకరణ చేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఢిల్లీకి అఖలపక్షాన్ని పంపుతామన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఏం కావాలోఈ వర్గాల నుంచి వచ్చిన ప్రతినిధులే నిర్ణయించాలి.

బాసరలో పెరిగిన భక్తుల రద్దీ....

ఆదిలాబాద్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారి ఇష్ట దినం, అమావాస్య ఒకే రోజు రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలి వచ్చారు. మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భక్తులు బాసరకు వచ్చారు.

ట్రాఫిక్ పోలీసుపై చేయి చేసుకున్న మందుబాబులు

హైదరాబాద్ : మాసాబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్‌పై తాగుబోతులు వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ట్రాఫిక్ పోలీసుపై చేయి చేసుకున్నారు. అక్కడికి చేరుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు తాగుబోతులను అదుపులోకి తీసుకున్నారు. తాగుబోతుల గొడవతో ఫ్లైఓవర్‌పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

20:55 - January 27, 2017

హైదరాబాద్: బాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడిగా కీర్తి గడించిన సంజయ్‌ లీలా బన్సాలీపై దాడి జరిగింది. జైపూర్‌ లో 'పద్మావతి' సినిమా షూటింగ్ జరుగుతోంది. జైగఢ్ కోట వద్ద అల్లావుద్దీన్ ఖిల్జీ, రాణి పద్మావతి ప్రేమాయణంలో చోటుచేసుకునే కొన్ని సన్నివేశాలను సంజయ్ లీలా భన్సాలీ చిత్రీకరిస్తున్నారు. ఇంతలో షూటింగ్ స్పాట్ లోకి దూసుకొచ్చిన రాజ్ పుత్ కార్ణి సేన కార్యకర్తలు దర్శకుడి చెంపలు వాయించి, ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. రాజ్ పుత్ రాణిని హీనంగా చూపిస్తున్నారని, అల్లావుద్దీన్ ఖిల్జీతో రాణి పద్మావతి ప్రేమాయణం జరిపినట్టుగా చరిత్రను వక్రీకరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య ప్రేమాయణం సన్నివేశాలు తొలగించి, జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో సినిమా యూనిట్ మొత్తం బిత్తరపోయింది. కాగా, ఈసినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ రణ్ వీర్ సింగ్, రాణి పద్మావతిగా అతని ప్రేయసి దీపికా పదుకొనే నటిస్తున్నారు. 'పద్మావతి' భర్తగా షాహిద్ కపూర్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీపై దాడి

జైపూర్: బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న పద్మావతి మూవీ షూటింగ్‌కి వ్యతిరేకంగా కర్నిసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పద్మావతి చిత్రంలో చారిత్రాత్మక అంశాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించిన కర్నిసేన కార్యకర్తలు..జైగఢ్ కోట వద్ద జరుగుతున్న షూటింగ్‌ను అడ్డుకున్నారు. రణ్‌వీర్ సింగ్, దీపికాపదుకొనే, షాహిద్‌కపూర్ కాంబినేషన్‌లో పద్మావతి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీగా కనిపించనుండగా, దీపికాదుకొనే రాణి పద్మావతి పాత్రలో, షాహిద్ కపూర్ రతన్‌సింగ్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ -టాయిలెట్స్‌ను ప్రారంభించిన బొంతు

హైదరాబాద్: చార్మినార్ దగ్గర ఈ టాయిలెట్స్‌ను జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫిసియుద్దీన్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... చార్మినార్‌ను చూసేందుకు నిత్యం లక్షలాది మంది పర్యాటకులు వస్తారు. చార్మినార్ వద్ద ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం శుభపరిణామం. చార్మినార్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరముంది.

18:40 - January 27, 2017

కృష్ణా: గన్నవరం ఎయిర్ట్ లో 5గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.వీరు కాశ్మీర్ కు చెందిన జావిద్, అహ్మదార్, అమీరాహ్ పాల్, పవాలాహ్ బట్, బషీర్ అహ్మద్ గా గుర్తించారు. గన్నవరం ఎయిర్ పోర్టులో బాండ్, డాగ్ స్వ్కాడ్ తనిఖీలు చేపట్టారు.

హెచ్ సీఏ ఎన్నికల కేసు సింగిల్ బెంచ్ రిఫర్

హైదరాబాద్: హైకోర్టులో హెచ్ సీఏ ఎన్నికల కేసుపై విచారణ జరిగింది. కేసును యాక్టింగ్ చీఫ్ జస్టిస్ కు సింగిల్ బెంచ్ రిఫర్ చేసింది. క్రికెట్ పోటీల నేపథ్యంలో వచ్చే నెల 9లోపు నిర్ణయం వెల్లడించాలని కోర్టును హెచ్ సీఏ సభ్యులు కోరారు.

18:21 - January 27, 2017

కొత్తగూడెం :ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణలోని అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆరోపించారు. సామాజిక న్యాయం లక్ష్యంగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తోంది. 103 వ రోజు పాదయాత్ర బృందం మణుగూరు, మల్లేపల్లి, శివలింగాపురం, పెద్దిపల్లి, మిడిచిలేరు, ఏగడా, చర్ల, సత్యనారాయణపురం గ్రామాల్లో పర్యటించింది. తమ్మినేని బృందానికి ప్రజలు తమ సమస్యలను వెల్లబోసుకుంటున్నారు. కమీషన్లు వచ్చే ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన కేసీఆర్‌ సర్కార్‌..ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని తమ్మినేని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. తెలంగాణ రాకముందు ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయో..ఇప్పుడు అలానే ఉన్నాయని విమర్శించారు.

18:17 - January 27, 2017

హైదరాబాద్: విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని బయటకు తీస్తూ వారి ప్రతిభకు మరింత పదును పెట్టేందుకు విద్యా సంబంధిత కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో వారి భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయి...అందులో భాగంగానే కొత్తపేట లోటస్‌ల్యాప్‌ పబ్లిక్‌ స్కూలు ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్-2017 నిర్వహించారు..చిన్నారుల నుంచి వారిలో ప్రతిభను బయటకు వెలికితీస్తూ తయారు చేసిన పలు రకాల విద్యా సంబంధిత ప్రోగ్రామ్స్‌కు మంచి స్పందన వచ్చింది...స్కూలు డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా.. విద్యతో పాటు డిజిటలైజేషన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలు.. తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ..ఇలా ఎన్నో రకాల చిత్రాలను ఇందులో ప్రదర్శించారు...విద్యార్థులు చేసిన వాటిని వీక్షించిన పలువురు ప్రశంసించారు...

18:13 - January 27, 2017

విజయనగరం : మంచు కొండలు విరిగిపడి జవాను నాగరాజు మృతితో అతని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.. నిరుపేద కుటుంబానికిచెందిన నాగరాజు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం గ్రామానికి చెందినవాడు.. ఏడేళ్లక్రితం ఆర్మీలో చేరాడు.. ఉద్యోగంవచ్చినప్పటినుంచి తమ్ముడు, చెల్లెళ్ల చదువుకు డబ్బు పంపుతూ ఉండేవాడు.. ఎనిమిదినెలల క్రితం నాగరాజు అనూషను వివాహం చేసుకున్నాడు.. వివాహం జరిగి ఎనిమిది నెలలైనా గడవకముందే మృత్యుఒడికి చేరిపోయాడు.. నాగరాజు మృతివార్తను తెలుసుకున్న కుటుంబసభ్యులంతా కన్నీరుమున్నీరవుతున్నారు.

18:11 - January 27, 2017

హైదరాబాద్: మహారాష్ట్రలో బిజెపి, శివసేనల మధ్య పొత్తు తెగిపోయిన నేపథ్యంలో ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌పవార్‌ బిజెపికి అండగా నిలిచారు. స్థానిక మున్సిపల్‌ ఎన్నికల తర్వాత శివసేన బిజెపి ప్రభుత్వం నుంచి వైదొలిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బిజెపి ఎన్సీపికి దగ్గరవుతోంది. గత కొన్నేళ్లుగా కలిసి పనిచేసిన బిజెపి-శివసేన కూటమి విడిపోవడం బాధాకరమని శరద్‌ పవార్‌ అన్నారు. ఇకపై బిజెపితో కలిసి మహారాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనేది లేదని శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. పాతికేళ్లుగా కూటమిలో ఉండి తాము నష్టపోయామని ఠాక్రే అన్నారు. మార్పు అనేది సహజమని...మాతో ఎవరు కలిసి వస్తే వారితో ముందుకు వెళ్తామని మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ పేర్కొన్నారు.

 

18:10 - January 27, 2017

ఢిల్లీ: పంజాబ్‌లో 70 శాతం యువకులు డ్రగ్స్‌ మత్తులో జోగుతున్నారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే డ్రగ్స్‌పై కఠిన చట్టాన్ని తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్‌ రహిత పంజాబ్‌గా మారుస్తామన్నారు. పంజాబ్‌లోని మజిథ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ బాదల్‌ పాలనపై నిప్పులు కక్కారు. బాదల్‌ పాలనలో పంజాబ్‌ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. బాదల్‌ అవినితి పాలనకు ప్రధాని మోది అండగా నిలిచారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ పేరును రాహుల్‌ ప్రకటించారు.

18:08 - January 27, 2017

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. అందరూ చూస్తుండగానే పెర్త్‌లోని స్వాన్‌ నదిలో విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో లించ్‌ అనే సీనియర్‌ పైలట్‌తో పాటు ఎండా కాక్రవతి అనే మరో కో పైలట్‌ మృతి చెందినట్లు సమాచారం. పెర్త్‌లోని స్వాన్‌ నదిపై ఎయిర్‌ షో నిర్వహిస్తున్న సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లించ్‌కు పురాతన విమానాలు నడపడం అంటే చాలా ఇష్టమని.. మృతి చెందిన పైలట్లు ఇండోనేషియా వాసులని పోలీసులు తెలిపారు.

18:06 - January 27, 2017

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఇవాళ ప్రగతి భవన్‌లో.... ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో వందశాతం గుణాత్మకమైన మార్పు రావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌ నేపథ్యంలో దళిత, గిరిజన ఉప ప్రణాళికకు కేటాయింపులపై నేతలతో చర్చించారు. ఈ భేటీకి రాష్ట్రమంత్రులు కడియం శ్రీహరి, చందూలాల్‌, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ దళిత, గిరిజన ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేశారు.

18:04 - January 27, 2017

హైదరాబాద్: నల్లగొండలో కాంట్రాక్టర్‌ నుంచి రూ.6లక్షలు లంచం తీసుకుంటూ..ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రమణనాయక్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మారెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాను హైదరాబాద్‌లో ఉండడంతో లక్ష్మారెడ్డికి మనీ ఇవ్వాలని రమణనాయక్‌ ఫోన్‌లో ఆదేశించాడు. దీంతో కాంట్రాక్టర్ లక్ష్మారెడ్డికి మనీ ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గత ఆగస్టులో జరిగిన కృష్ణా పుష్కరాల్లో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేసిన రమణనాయక్‌ .. అందుకు 18 లక్షల రూపాయల లంచం డిమాండ్‌ చేశాడు.

తగ్గుముఖం పట్టిన పసిడి

ఢిల్లీ: బంగారం ధర వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టింది. పది గ్రాముల బంగారం రూ.400 తగ్గి రూ.29,150కి చేరుకుంది. డిమాండ్‌ లేమి కారణంగా వ్యాపారులు బంగారాన్ని కొనుగోలు చేయకపోవటంతో ధర పడిపోయింది. ఇదే బాటలో వెండి కూడా తగ్గుముఖం పట్టి రూ.41,000 దిగువకు చేరుకుంది. కేజీ వెండి ధర రూ.550 తగ్గి రూ.40,950కి చేరుకుంది.

'ఎస్టీ గురుకులం'లో 28 మంది విద్యార్థులకు అస్వస్థత

సంగారెడ్డి: జిల్లాలోని సిర్గాపూర్ ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఆహారం కలుషితమై 28 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయ్యాయి. స్పందించిన అధికారులు విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

16:14 - January 27, 2017
16:13 - January 27, 2017

తూ.గో: యానాం రీజెన్సీ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగి నేటికి ఐదేళ్లు గడిచింది. దీంతో అనేకమంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీని తెరిపిస్తామని నేతలు హామీలు ఇచ్చినా నేటివరకు కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఫ్యాక్టరీ తెరుచుకుంటుందన్న ఆశ నానాటికీ సన్నగిల్లుతోంది. ఇదిలావుంటే ఘటనకు కారణమంటూ అనేకమంది కార్మికులపై కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతుండడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

పూర్వ వైభవాన్ని కోల్పోయిన యానాం.....

సరిగ్గా ఐదేళ్ల క్రితం యానాంలోని రీజెన్సీ కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అదుపుతప్పి తీవ్ర విధ్వంసానికి దారితీసింది. దీంతో యానాం ప్రాంతం పూర్వ వైభవాన్ని కోల్పోయింది. యానాం చుట్టుపక్కల రీజెన్సీ టైల్స్‌ ప్రధాన కర్మాగారం కావడంతో.. కార్మిక హక్కుల కోసం ప్రారంభమైన పోరాటం.. చివరకు పోలీసులు ఉక్కుపాదం మోపడంతో వివాదంగా మారింది. కార్మిక నాయకుడు మురళీమోహన్‌ పోలీసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోవడంతో పాటు.. ఫ్యాక్టరీ వైస్‌ ప్రెసిడెంట్‌ హత్యకు గురి అయ్యాడు.

కోర్టుల చుట్టూ తిరుగుతున్న కార్మికులు ....

అదంతా గతం. కానీ.. అప్పటినుంచి ప్రభుత్వాలు కార్మికులను వేధిస్తోంది. ఘటనకు కారుకులంటూ పలువురిని కేసుల్లో ఇరికించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. దీంతో అనేకమంది యానాం నుంచి వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న పాండిచ్చేరి కోర్టుకు తిరగాల్సి వస్తోంది. అసలే ఫ్యాక్టరీ మూతపడి ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఇదో పెను భారంగా మారింది. కేసులను పరిష్కరించి.. ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీలు గుప్పించిన నేతలు ఆ విషయాన్నే విస్మరించడంతో కార్మికులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కార్మిక కేసులను తొలగించాలని.. ఉపాధి లేక అవస్థలు ఎదుర్కొంటున్న కార్మికులను ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

రోడ్డున పడ్డ అనేకమంది....

ఈ ఫ్యాక‌్టరీలో యానాం చుట్టుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ ప్రజలకు కూడా ఉపాధి లభిస్తుండేది. ప్రస్తుతం ఇది మూతపడడంతో అనేకమంది రోడ్డునపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దృష్టి సారించి ఈ ఫ్యాక్టరీని తెరిపించాలని పలువురు కోరుతున్నారు.

16:10 - January 27, 2017

శ్రీకాకుళం : చదువుకోవాలనే ఆశ ఉన్నా.. ఆర్థికంగా తోడ్పాటు లేని పరిస్థితి వారిది. అలాంటి అభ్యర్థులకు అండగా నిలిచింది ఐటీడీఏ. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన అభ్యర్థులకు ఐటీడీఏ ఉచితంగా గ్రూప్‌-2 శిక్షణ అందిస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఈ విధానానికి అనూహ్య స్పందన వస్తోంది.

గిరిజన యువతకు ఐటీడీఏ అద్బుత అవకాశం...

శ్రీకాకుళం జిల్లాలో గిరిజన యువతకు ఐటీడీఏ అద్బుత అవకాశం కల్పిస్తోంది. గ్రూప్‌-2 కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు ఐటీడీఏ ఉచిత కోచింగ్‌ అందిస్తోంది. పాతపట్నం, సీతంపేట యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో గ్రూప్‌-2కు సిద్దమవుతున్న 220 మంది గిరిజనులకు ఐటీడీఏ శిక్షణ అందిస్తోంది. దీన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించేందుకు అభ్యర్థులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారి శ్రీకాకుళం జిల్లాలో రెండు చోట్ల గ్రూప్‌-2 అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. దీన్ని అభ్యర్థులంతా సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఆన్‌లైన్‌ తరగతులు ...

ఈ శిక్షణా కేంద్రంలో బీటెక్‌, బీఈడీ, ఎమ్మెస్సీ, బీఎస్సీ, పీజీ స్థాయి విద్యను అభ్యసించిన అభ్యర్థులు సైతం కోచింగ్‌ తీసుకుంటున్నారు. నిపుణులైన స్టడీ సర్కిల్‌ అద్యాపకులు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూ యువతకు ప్రోత్సాహం అందిస్తున్నారు. మారుమూల గ్రామాల నుండి వచ్చిన తమకు ఐటీడీఏ ఉచితంగా ట్రైనింగ్‌ ఇవ్వడం సంతోషంగా ఉందని అభ్యర్థులంటున్నారు. గ్రూప్‌-2లో తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మంచి స్పందన....

శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ పరిధిలో చేపట్టిన ఈ శిక్షణకు అభ్యర్థుల నుంచి మంచి స్పందన కనబడుతోంది. ఇదే విధానాన్ని రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏ పరిధిలో చేపబడితే గిరిజన విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరే అవకాశం కనిపిస్తోంది.

16:08 - January 27, 2017

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు జలమండలి శుభవార్త అందించింది. నగర వాసులకు ఇప్పటివరకు రోజు తప్పించి రోజు కాకుండా ప్రతిరోజు త్రాగునీటిని సరఫరా చేసేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో జలమండలి బోర్డు పరిధిలో ఉన్న 167 బస్తీల్లోని 57,625 కనెక్షన్లకు ప్రతిరోజు నీటిని అందిస్తామన్నారు జలమండలి ఎండీ దానకిషోర్‌. బస్తీలకు సరఫరా చేసిన తర్వాత నగరం మొత్తానికి విస్తరిస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు 6 గంటల నుంచి 9గంటల లోపుల ఒక గంటసేపు నీటిని సరఫరా చేస్తామని జలమండిలి ఎండి దానకిషోర్‌తో తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

16:06 - January 27, 2017
16:04 - January 27, 2017

హైదరాబాద్: వైద్యరంగంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ సేవలు విస్మరించలేనివని తెలంగాణ వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యాపార దృక్పథంతో కాకుండా మానవతా దృక్పథంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నీలిమ హాస్పిటల్స్ అదనపు బ్లాక్‌ని ఆయన ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం నూతన బ్లాక్‌ను నిర్మించామని సంస్థ యాజమాన్యం తెలిపింది.

15:59 - January 27, 2017

హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే... ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్‌ నాయుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. బలవంతంగా క్యాస్‌లెస్‌ లావాదేవీలను అమలు చేస్తున్నారని... అన్నారు. ప్రజల ఇబ్బందులను తొలగించాలని... రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

15:58 - January 27, 2017

విశాఖ : పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏపీలో ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పనితీరుతోనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఏది సాధించాలన్నా.. కష్టపడి పని చేయాల్సిందే అన్నారు. నోట్ల రద్దు తర్వాత భారత్‌లో అవకాశాలు పెరిగాయన్నారు. రాష్ట్ర వృద్ధిరేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని... గతేడాది భారత్‌ వృద్ధిరేటు 7.5శాతంగా ఉంటే.. ఏపీ వృద్ధిరేటు 10.99 శాతంగా నమోదైందని తెలిపారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో.. ఏపీలో పెట్టుబడి అవకాశాలను వివరించారు.

15:55 - January 27, 2017

విశాఖ: గాజువాక క్రైం పీఎస్‌లో కలకలం చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం వచ్చిన గంగాధర్‌ అనే యువకుడు... గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల వేధింపుల వల్లే గంగాధర్ ఆత్మహత్యాయత్నం చేశాడని.. బంధువులు ఆరోపిస్తున్నారు.

15:53 - January 27, 2017

హైదరాబాద్‌: నగరంలో గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూతో మరొకరి మృతిచెందారు. గాంధీలో చికిత్సపొందుతున్న బీబీనగర్‌కు చెందిన 10నెలల చిన్నారి ఇవాళ మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మరణాలు ఆరుకు చేరాయి. మరోవైపు చార్మినార్‌కు చెందిన మరో బాలుడు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో గాంధీలో చేరాడు.

ఏసీబీకి చిక్కిన ఆర్ డబ్ల్యూఎస్ ఈ రమణ నాయక్

నల్గొండ: కాంట్రాక్టర్ నుంచి రూ.6లక్షలు లంచం తీసుకుంటూ ఆర్ డబ్ల్యూఎస్ ఈ రమణ నాయక్ ఏసీబీకి పట్టుబడ్డాడు.

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం: కేసీఆర్

హైదరాబాద్: ప్రగతి భవన్ లో ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ కి కాంగ్రెస్ నుండి భట్టివిక్రమార్క,నంది ఎల్లయ్య, గీతారెడ్డి, సీపీఎం నుంచి సున్నంరాజయ్య, టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, నిధుల కేటాయింపు పై చర్చను చేపట్టారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికి పార్టీలకతీతంగా పని చేయాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ వర్గాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నానని పేర్కొన్నారు.

'5 నుండి స్వచ్ఛ తెలంగాణ క్రికెట్ టోర్నీ'

హైదరాబాద్: ఫిబ్రవరి 5న ఎల్బీ స్టేడియంలో స్వచ్ఛ తెలంగాణ క్రికెట్ టోర్నీ జరుగనుంది. క్రికెట్ పోటీల జెర్సీలు, లోగోలను ఇవాళ జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆవిష్కరించారు. జీహె

కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి అమ‌రేంద‌ర్ సింగ్ :రాహుల్ గాంధీ

హైదరాబాద్: పంజాబ్ సీఎం అభ్య‌ర్థి అమ‌రేంద‌ర్ సింగే అని కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు. ఇవాళ ఆయ‌న మ‌జిత‌లో జ‌రిగిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. బాద‌ల్ కుటుంబం పంజాబ్ భ‌విష్య‌త్తును నిర్వీర్యం చేసింద‌ని ఆరోపించారు. గ‌తంలో పంజాబ్ దేశానికి అన్నం పెట్టింద‌ని, ఇప్పుడు బాద‌ల్ కుటుంబ‌స‌భ్యులే దోచుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో డ్ర‌గ్స్ నిర్మూలిస్తామ‌న్నారు.

రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలపై నివేదిక ఇవ్వండి:సుప్రీం

ఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలకు కారణాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు రైతు ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక అందించాలని సుప్రీం నోటీసులు జారీ చేసింది. దేశంలోని రైతులకు సంబంధించి చాలా సున్నితమైన అంశం ఇది అని కోర్టు వ్యాఖ్యానించింది.

15:00 - January 27, 2017

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కాసేపట్లో ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. దళిత, గిరిజన ఉప ప్రణాళికపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో ఉపప్రణాళికకు కేటాయింపులపై ప్రజాప్రతినిధులతో కేసీఆర్ చర్చించనున్నారు.

14:32 - January 27, 2017

స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్ సౌత్ మొత్తంపై కాన్సట్రేషన్ చేస్తున్నాడు. మాలీవుడ్ లో స్టార్ స్టేటస్ దక్కించుకున్నబన్నీ ఇప్పుడు తమిళ మార్కెట్ పై కూడా పట్టు సాధించాలని ప్లాన్ చేస్తున్నాడు. సౌత్ స్టార్ అనిపించుకోవడానికి ఈ అల్లువారబ్బాయి భలే స్కెచ్ వేశాడు. సౌత్ వైజ్ గా మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి బన్నీ వేసిన ఆ ప్లాన్ ఏంటో ఈ స్టోరీ చూడండి.
టాప్ 5 హిట్స్ లో చోటు 
గతేడాది సరైనోడుతో అల్లుఅర్జున్ కెరీర్ పరంగానే కాకుండా ఇండస్ట్రీ టాప్ 5 హిట్స్ లో చోటుదక్కించుకున్నాడు. తెలుగులో 80కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సరైనోడు మాలీయాళంలో సైతం కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం మాలీవుడ్ లో ఏకంగా 9కోట్లు వసూల్ చేసిందంటే మాలీయాళంలో స్టార్ గా బన్నీ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. సరైనోడు మాత్రమే కాదు బన్నీ ప్రతి మూవీ కూడా అక్కడ భారీ వసూల్ రాబట్టుతోంది. మాలీయాళంలో స్టార్ స్టేటస్ సాధించిన స్టైలీష్ స్టార్ ఇప్పుడు తమిళం మార్కెట్ పై కూడా పట్టు సాధించి సౌత్ స్టార్ అనిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకు బన్నీ స్కెచ్ వేశాడులేండి.
దువ్వాడ జగన్నాధం మూవీలో బన్నీ
అల్లుఅర్జున్ ప్రస్తుతం దువ్వాడ జగన్నాధం మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సమ్మర్ రిలీజ్ కానుంది. దీన్ని తరువాత ఆయన రెండు బైలింగ్వల్ మూవీస్ చేయడానికి కమిట్ అయ్యాడు.తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో ఓ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేసేశాడు స్టైలిష్ స్టార్. ఈ మూవీ ద్వారా కోలీవుడ్ లో పాగా వేయాలన్నది బన్నీ టార్గెట్. అధికారికంగా ప్రారంభం కూడా జరుపుకున్న ఈ చిత్రం డీజే రిలీజైన తరువాత సెట్స్ పైకి వెళ్లుతోందని తెలుస్తోంది.స్టార్ డైరెక్టర్ గా లింగుస్వామి తమిళంలో మంచి క్రేజ్ ఉంది. ఈ దర్శకుడితో కోలీవుడ్ లో లాంచ్ అయితే అక్కడి మార్కెట్ పై గ్రిప్ వస్తోందని బన్నీ మంచి ప్లాన్ వేశాడు. 
విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సినిమా 
లింగుస్వామి తరవాత కూడా తమిళ ఇండస్ట్రీపై పట్టున్న విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సినిమా చేయాలని అల్లుఅర్జున్ భావిస్తున్నాడు. విక్రమ కుమార్ తెలుగులో కంటే ముందు తమిళంలోనే డైరెక్టర్ మంచి గుర్తింపు పొందాడు. గత ఎడాది సూర్యతో 24 మూవీ చేసి అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో సైతం సక్సెస్ అందుకున్నాడు. లింగుస్వామితో సినిమా తరువాత విక్రమ్ కుమార్ మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు దర్శకులతో చేయనున్న సినిమాలకు సంబంధించి తెర వెనక  సన్నాహాలు స్పీడ్ గానే జరుగుతున్నాయట. ఈ దర్శకులతో చేయనున్న సినిమాలు తమిళంలో కనుక హిట్టు అయితే బన్నీ సౌత్ స్టార్ గా ఫేం అయినట్లే.

 

14:25 - January 27, 2017

గుంటూరు: వరకట్న వేధింపులు తాళలేక మెడికో విద్యార్థిని బేబీ లక్ష్మీ ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం అమలాపురంలో మెడికో చేస్తున్న లక్ష్మీకి... ఏడాది క్రితం గుంటూరుకు చెందిన డా.సాయికృష్ణతో వివాహమైంది. వివాహమైన రెండోరోజు నుంచే అత్తింటివారి వేధింపులతో బాధపడుతోంది. ఇవాళ ఆత్మహత్యాయత్నం చేసిన లక్ష్మిని.. గుంటూరు ఆస్పత్రికి తరలించారు.

14:23 - January 27, 2017

విజయవాడ : నగరంలో కమ్యూనిస్టులు కదం తొక్కారు. హోదా ఆందోళనలో అరెస్టులను ఖండిస్తూ నిరసన ధర్నాకు దిగారు. ప్రత్యేక హోదా సాధనపై నిరసన ధర్నాకు దిగిన సీపీఎం నేతలు.. చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని.. ఎన్నికల హామీలను మోదీ, చంద్రబాబు తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రత్యేక హోదా అడుగుతున్న ప్రజలపై ఉక్కుపాదం మోపుతూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు.

 

14:22 - January 27, 2017

గుంటూరు : నగరంలో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు మిన్నంటుతున్నాయి. వైసీపీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

14:20 - January 27, 2017

హైదరాబాద్: పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మ‌న్మోహ‌న్‌సింగ్‌ ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నెర‌వేర్చాలని ఎంపీ కేవీపీ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి కేవీపీ లేఖ రాశారు. జ‌ల్లికట్టు పోరాటం నుంచి స్ఫూర్తిని తీసుకోవాల‌ని తాను రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా.. దాన్ని ప‌ట్టించుకోలేద‌న్నారు. ప్రత్యేక హోదా, 2018లోపు పోల‌వ‌రం ప్రాజెక్టుని పూర్తి చేయ‌డం, ఆర్థిక లోటు భ‌ర్తీ, విశాఖ‌కు ప్రత్యేక రైల్వే జోన్..మొత్తం 10 అంశాలను లేఖలో ప్రస్తావించానని పేర్కొన్నారు.

14:18 - January 27, 2017

పాలకొల్లు : కేంద్రంతో విబేధిస్తే అభివృద్ధిలో వెనకబడిపోతామన్నారు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాసరావు. ప్రస్తుతం రాష్ట్రమున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో షార్ట్‌ఫిల్మ్స్‌ చిత్రోత్సవాలను మంత్రి కామినేని ప్రారంభించారు. స్వర్ణభారతి ట్రస్ట్‌ ద్వారా 20 వేల మంది ఉపాధి పొందుతున్నారని..వెంకయ్యనాయుడిపై పవన్‌ ఆరోపణలు చేయడం తగదన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణంలో కేంద్ర సహాయం ఎంతో అవసరమన్నారు.

14:17 - January 27, 2017

మాహిళ వార్తల సమాహారం.. మానవి న్యూస్. మహిళల అక్రమ రవాణా ముఠా పట్టించిన ఇద్దరు బాలికల సహసాలకు సంబంధించిన వార్తతోపాటు మరిన్ని వార్తలను ఇవాళ్టి మానవి న్యూస్ అందింస్తుంది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.... 

14:11 - January 27, 2017
14:09 - January 27, 2017

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తో 10టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్ గురించి వివరించారు. కాన్ఫరెన్స్ ద్వారా మహిళలకు ధైర్యం వస్తుందన్నారు. సదస్సు వల్ల ఏపీపై ఎలాంటి ఆర్థిక భారం పడదని తెలిపారు. సమావేశాల చివరి రోజు మహిళా సాధికారతపై డిక్లరేషన్ చేయనున్నట్లు చెప్పారు. మహిళలు శక్తివంతంగా, సమర్థవంగా ముందుకు వస్తే.. వారికి సీట్లు కేటాయించే అవకాశం వస్తుందన్నారు. ఇకపై నిర్వహించే ఏ కార్యక్రమం అయినా.. కొత్త అసెంబ్లీ భవనంలోనే జరుగుతాయని తెలిపారు. మరిన్ని వివరానలు వీడియోలో చూద్దాం...

 

14:04 - January 27, 2017

ఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని అమలు చేయాలని కేవీపీ రామచంద్రరావు కోరారు. ప్రత్యేహోదాపై రాష్ట్రపతికి ప్రణబ్ ముఖర్జీకి ఆయన లేఖ రాశారు. విభజన హామీలు నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంలో హోదా అంశం చేర్చాలని విన్నవించారు. విభజన చట్టం అమలుపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకుంటే వక్ర భాష్యాలు చెప్పారన్నారు. 

 

13:57 - January 27, 2017
13:55 - January 27, 2017
13:40 - January 27, 2017

ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు... ఆకట్టుకున్న శకటాలు, గవర్నర్ ను గిచ్చిన హన్మంతన్న... రాష్ట్రంల బీసీ జనాబా ప్రకటించాలని డిమాండ్, జూపార్క్ అయితున్న ఉస్మానియా దావఖానా...పిల్లులకు ట్రీట్ మెంట్.. వంటి పలు అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం..

 

13:31 - January 27, 2017

విజయవాడ : ప్రజా ఉద్యమాలపై సీఎం చంద్రబాబు ఉక్కుపాదం మోపుతున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాతోపాటు పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని విజయవాడలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రకటిత ఎమెర్జీ అమలవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని చెప్పారు. ప్రజా ఉద్యమాలపై సీఎం చంద్రబాబు ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం పిరికిపంద ప్రభుత్వంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. 'ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం కాదని...మీ అధ్యాయం ముగుస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వానికి నూకలు చెల్లుతున్నాయని.. నిరంకుశతత్వాన్ని ఎదుర్కొంటామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై చర్చించనున్నారు. 

 

13:16 - January 27, 2017

మరికాసేపట్లో కృష్ణ జింక వేట కేసు విచారణ

రాజస్థాన్ : మరికాసేపట్లో జోధ్‌పూర్‌ కోర్టులో కృష్ణ జింక వేట కేసు విచారణ జరగనుంది. సల్మాన్‌ ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌, టబు, సోనాలి బింద్రే, నీలమ్‌, దుష్యంతగ సింగ్‌, దినేష్‌ గన్‌ వేర్ విచారణకు హాజరుకానున్నారు. నటీనటుల నుంచి తుది వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేయనుంది. 

13:05 - January 27, 2017

రాజస్థాన్ : మరికాసేపట్లో జోధ్‌పూర్‌ కోర్టులో కృష్ణ జింక వేట కేసు విచారణ జరగనుంది. సల్మాన్‌ ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌, టబు, సోనాలి బింద్రే, నీలమ్‌, దుష్యంతగ సింగ్‌, దినేష్‌ గన్‌ వేర్ విచారణకు హాజరుకానున్నారు. నటీనటుల నుంచి తుది వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేయనుంది. 1998లో హమ్‌ సాత్‌ సాత్‌హై షూటింగ్‌ సమయంలో కృష్ణ జింకను నటీనటులు వేటాడినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే 51 మంది సాక్షులలో 28 మందిని న్యాయస్థానం విచారించింది. జనవరి 25న కోర్టుకు హాజరుకావడంపై మినహాయింపు కోరుతూ ఇవాళ కోర్టుకు బాలీవుడ్‌ నటులు హాజరుకానున్నారు. 

 

గుంటూరులో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు

గుంటూరు : ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు మిన్నంటుతున్నాయి. వైసీపీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. 
 

 

13:00 - January 27, 2017

గుంటూరు : ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు మిన్నంటుతున్నాయి. వైసీపీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:58 - January 27, 2017

హైదరాబాద్ : అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. మద్దతిచ్చినప్పుడు అవసరం లేని రాజకీయ అనుభవం ప్రత్యేక హోదా అడిగితే వచ్చిందా అని టీడీపీ, బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలను పరిష్కరిస్తారనే బీజేపీకి, టీడీపీకి మద్దతిచ్చానని, అధికారంలోకి వచ్చాక రెండు పార్టీలు ఇచ్చిన హామీలను గాలికొదిలేశాయని విమర్శించారు.
రాష్ట్రం విడిపోవడానికి యువతే కారణం 
ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ర్టాలుగా విడిపోవడానికి ముఖ్య కారణం యువతే అన్నారు పవన్‌ కల్యాన్‌. తెలంగాణలో బంగారు 
తెలంగాణను సాధిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన నాయకులు... ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తోందన్నారు. 
ఏపీలో టీడీపీ ప్రభుత్వం లేదు..
ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం లేదన్నారు పవన్‌. ఏపీలో మీని బీజేపీలా ప్రభుత్వం తయారైందన్నారు పవన్‌ కల్యాన్‌. ఏపీ ప్రత్యేక హోదాపై వెంకయ్య నాయుడు, చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు. ప్రజలు అంటే ఆటలుగా ఉందా..? అని వెంకయ్య నాయుడును ప్రశ్నించారు. వెంకయ్య నాయుడు స్వర్ణ భారతి ట్రస్టుపై పెట్టిన దృష్టి ప్రజా సమస్యలపైగానీ, ఏపీ సమస్యలపై గానీ దృష్టిపెడితే... బాగుండేదన్నారు. 
కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు 
రామమందిరం అంశాన్ని తీసుకుంటున్నారుగానీ, ఏపీలోని 4 కోట్ల ప్రజల సమస్యను ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారని కేంద్రంపై మండిపడ్డారు పవన్‌ కల్యాణ్‌. అడ్మినిస్ర్టేషన్‌, రాజకీయ అనుభవం కారణంగానే ఎన్నికల ముందు చంద్రబాబుకు తాను మద్దతు ఇచ్చానని చెప్పారు. ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకెళ్లకపోవడం చంద్రబాబు నైతిక తప్పు అన్నారు. దాన్ని ఆయన సరిదిద్దుకోవాలన్నారు. హోదాపై చంద్రబాబు మాటా మారుస్తున్నారని అన్నారు. సీఎంను కంప్రమైజ్‌ కావాలని ఎవరూ ఒత్తిడి చేశారో ఏపీ ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
భయపెట్టి పరిపాలన సాగిస్తానంటే ఎలా..?
భయపెట్టి పరిపాలన సాగిస్తానంటే ఎలా అని కేంద్రాన్ని ప్రశ్నించారు పవన్‌ కల్యాణ్‌. పోలీసుల ద్వారా ప్రజా ఉద్యమాలను ఎవరూ కూడా అణిచి వేయలేరని అన్నారు. మోదీపై నమ్మకంతో.. ప్రేమతో గెలిపించారని అన్నారు. తన కుటుంబాన్ని వదులుకోని ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు పవన్‌. 
అర్ధరాత్రి పూట ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇచ్చారు
అర్ధరాత్రి పూట ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబును ప్రశ్నించారు పవన్‌ కల్యాణ్‌. వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఇష్టానుసారంగా మాట్లాడితే.. దక్షిణాది రాష్ర్టాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. ప్రజలు బానిసలుగా కనిపిస్తున్నారేమోగానీ, వారే గనుక తిరగబడితే పరిస్థితి మరోలా ఉంటుందని కేంద్రాన్ని హెచ్చరించారు. 
సుజనా చౌదరి.. ఏ స్ఫూర్తితో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారు.. ? 
జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకుని కోళ్లపందాలు, పందుల పందాలు ఆడుకోవాలని సుజనా చౌదరి అనడం.. కోట్లాదిమంది 
ప్రజల మనోభావాలను కించపరచడం కాదా అని పవన్ ధ్వజమెత్తారు. ఏ స్ఫూర్తితో ఆయన బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారో సమాధానమివ్వాలన్నారు. ఇన్ని లోపాలు పెట్టుకున్న వ్యక్తికి ప్రజలను ప్రశ్నించే అర్హతే లేదన్నారు. చేతనైతే హోదా కోసం పోరాటం చేయాలని..పోరాడేవారిని మాత్రం వెనక్కి లాగొద్దన్నారు పవన్‌. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సుజనా చౌదరి, రాయపాటిపై వచ్చిన ఆరోపణలపై ఎక్స్‌పర్ట్‌ కమిటీ వేయాలన్నారు. 

 

12:51 - January 27, 2017
12:50 - January 27, 2017

హైదరాబాద్ : ఒకరు జన్మనిచ్చిన అమ్మకోసం.. మరొకరు జన్మభూమికోసం.. నిరంతరం శ్రమించారు. అమ్మకష్టాన్ని తప్పించడానికి ఒకరు  యంత్రాన్నే రూపొందిస్తే.. మరొకరు పచ్చదనం కనుమరుగై కుమిలిపోతున్న భూమాతకు.. కోటిమొక్కలతో చలువపందిళ్లు వేశారు. నలుగురికీ మార్గదర్శులుగా నిలిచిన చింతకింది మల్లేశం.. దర్పల్లి రాములుకు కేంద్రం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. 
కోటిమొక్కలు నాటిన దర్పల్లి రామయ్య...
పురాణరాముడు వనవాసానికి వెళితే.. ఈ పర్యావరణ రాముడు వనాలనే తనదగ్గరకు తీసుకొచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటిమొక్కలు నాటిన దర్పల్లి రామయ్య...ను అందరూ వనజీవి రామయ్య అని గౌరవంగా పిలుచుకుంటారు. 
భూమికి కోటిమొక్కల చలువపందిళ్లు 
పచ్చదనం కరువై పొగలు.. సెగలు కక్కుతున్న భూమికి కోటిమొక్కల చలువపందిళ్లు వేశాడు.. ఈ వనజీవి రామయ్య. మొక్కలు నాటడమే జీవిత ధ్యేయంగా  మార్చుకున్నాడు. ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య ..ఇదిగో ఇలా ఎక్కడ ఖాళీ జాగా కనబడినా మొక్కలు నాటేస్తాడు. అంతరిస్తున్న ఏన్నో మొక్కలు, చెట్లను భవిష్యత్‌ తరాలకు అందిస్తున్నాడు. ఇప్పటి తరం మర్చిపోయిన చెట్లు, మొక్కలను పేర్లు రామయ్యకు బాగాతెలుసు. వేసవిలో వివిధరకాల విత్తనాలు సేకరించి.. మొక్కలు పెంచుతాడు.. తర్వాత వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటుతుంటాడు..ఇలా ఇప్పటికే కోటిమొక్కలకు పైగా నాటిన రామయ్యకు 1995లోనే కేంద్రప్రభుత్వం  వనసేవా అవార్డుతో సత్కరించింది. యూనివర్సల్‌ గ్లోబల్‌పీస్‌ అనే సంస్థ గౌవర డాక్టరేట్‌ను కూడా ప్రకటించింది. పచ్చని చెట్లతో భూమిని మొత్తాన్ని పొదరిల్లులా మార్చాలనుంది.. అంటుంటారు ఈ వనజీవిరామయ్య
చేనేత తల్లుల ముఖాల్లో నవ్వులు పూయించిన మల్లేశం
యాదాద్రిజిల్లా ఆలేరుమండలం శారాజీపేటకు చెందిన చింతకింది మల్లేశం.. పూటగడవని పేదరికాన్ని అనుభవించాడు. కుటుంబం గడవడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తన మాతృమూర్తిని చూసి తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా అమ్మకష్టాన్ని పోగొట్టాలని ఏడేళ్లపాటు శ్రమించాడు. చేనేత తల్లుల ముఖాల్లో నవ్వులు పూయించాడు. ఒక చేనేత చీరను తయారు చేయాలంటే.. ఇలా  ఈ పిన్నుల పీటపై ఒకటి కాదు రెండు కాదు  18వేల సార్లు కండెల చుట్టూ దారాన్ని తిప్పాల్సి ఉంటుంది. చీరలు నేస్తేనే గాని నాలుగువేళ్లూ నోట్లోకి వెళ్లని పరిస్థితిలో మల్లేశం మాతృమూర్తి ఇలా నిరంతరం శ్రమించేది. చేతులు లాగుతున్నాయి బిడ్డా.. అంటున్న అమ్మను చూసి తల్లిడిల్లిపోయేవాడు మల్లేశం. ఎలాగైనా అమ్మపడుతున్న  కష్టాన్ని తొలగించాలి..! ఏదో ఒకటిచేయాలి..! అని నిరంతరం మనస్సును పరుగులు పెట్టించేవాడు. అలాంటి ఆలోచన నుంచే ఈ ఆసుయంత్రం రూపుదాల్చింది అంటారు మల్లేశం. మామూలుపద్ధతిలో ఒకచీర నేయడానికి ఆరుగంటల సమయం పడితే.. లక్ష్మీఆసుయంత్రంపై  గంటన్నరలోగానే ఒక చీర నేసీ వీలుకలిగింది. ఏడేళ్ల పాటు శ్రమించి 2000వ సంవత్సరం తయారు చేసిన యంత్రానికి అమ్మపేరుమీదనే అక్ష్మీఆసుయంత్రం అని పేరుపెట్టాడు. దీంతో తన మాతృమూర్తి కష్టంతోపాటు వందలాది చేనేత తల్లుల యాతనను తప్పించడానికి మార్గం దొరికిందంటారు  పద్మశ్రీ చింతకింది మల్లేశం.   
ఆసుయంత్రాన్ని రూపకల్పన 
ప్రాథమిక విద్యను మధ్యలో మానేసిన చింతకింది మల్లేశం ఆసుయంత్రాన్ని రూపొందించి గ్రామీణ ఇంజనీర్‌గా మారితే.. ఏ ప్రతిఫలం ఆశించని వనజీవి రాములు.. తన పేరులోనే పకృతినంతా నింపుకుని నేలకు కోటిమొక్కలు పచ్చని తోరణాన్ని కట్టారు.  అతిసామాన్యులైనా.. అనితర సాధ్యమైన పనులతో నలుగురిచేత శబాష్‌ అనిపించుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌  అభినందనలు తెలిపారు.

 

12:44 - January 27, 2017

విజయవాడ : ఏపీ కేబినెట్‌లో కూడికలు, తీసివేతల పర్వం మొదలుకానుంది. మరో నెల రోజుల్లో కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈసారి కేబినెట్‌లో చినబాబుకు స్థానం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.
అధికార పగ్గాలు చేపట్టి జూన్‌ నాటికి మూడేళ్లు పూర్తి 
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టి జూన్‌ నాటికి మూడేళ్లు పూర్తి చేసుకోనుంది. అయితే ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన చంద్రబాబు.. వాటి పనితీరు,.. ప్రజలకు అందుతున్న విధానంపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై కూడా నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు.. వాటిని గతేడాది జరిగిన టీడీపీ ఎమ్మెల్యేల సమావేశంలో స్వయంగా సీల్డ్‌కవర్‌లో అందజేశారు. వ్యవహార శైలి సరిగా లేని నేతలు వారి తీరును మార్చుకోవాలని మూడు నెలల గడువు ఇచ్చారు. 
ముగియనున్న చంద్రబాబు ఇచ్చిన గడువు  
టీడీపీ నేతలకు చంద్రబాబు ఇచ్చిన గడువు ముగియనుంది. దీంతో మళ్లీ కేబినెట్‌ విస్తరణపై అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పలు వివాదాల్లో చిక్కుకున్న మంత్రులు,.. పనితీరు మార్చుకోని మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్‌ పీకారు. శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్ట్‌ నిర్వాసితుల ఆందోళనపై సీరియస్‌ అయిన చంద్రబాబు.. ఆందోళనలు ఉధృతం అయ్యే వరకు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో మంత్రి రావెల కిషోర్‌బాబు, జానీమూన్‌ వ్యవహారంపై కూడా చంద్రబాబు సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. 
ఆశావాహుల్లో మళ్లీ టెన్షన్‌ 
మార్చిలో కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో.. పార్టీలో కొందరు సీనియర్లకు, పార్టీ లైన్‌పై క్రమశిక్షణతో పని చేస్తున్న నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడంతో పాటు.. కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కూడా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసి.. మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. వచ్చే రెండేళ్లు కీలకం కానున్న నేపథ్యంలో.. మరోసారి ప్రజాదరణ పొందాలంటే కేబినెట్‌లో కొందరికి ఉద్వాసన పలకక తప్పదని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కొత్తగా కేబినెట్‌లో బెర్త్‌ల కోసం ఆశావాహుల్లో మళ్లీ టెన్షన్‌ మొదలైంది. మొత్తానికి ఏపీ కేబినెట్‌ విస్తరణ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరి అధినేత చంద్రబాబు ఎవరిపై వేటు వేస్తారు ? ఎవరికి అవకాశమిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. 

 

12:41 - January 27, 2017

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్స్‌ రూపకల్పనపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధమయ్యారు. ఇవాళ జరిగే ఈ సమావేశానికి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కొత్త బడ్జెట్ నేపథ్యంలో సబ్ ప్లాన్ లో మార్పులపై ప్రజాప్రతినిధులతో చర్చించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దళితులు, గిరిజనుల సబ్‌ప్లాన్స్‌ పై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ కొత్తపంథా ఎంచుకున్నారు. ప్రణాళిక రూపకల్పనలో   అధికారపార్టీతోపాటు.. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించడానికి సిధ్ధమయ్యారు.
ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్స్‌ ద్వారా జరిగిన అభివృద్ధిపై చర్చ
రాష్ట్రంలో ఇప్పటివరకు ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్స్‌ ద్వారా జరిగిన అభివృద్ధిని సమీక్షించనున్నారు సీఎం కేసీఆర్‌. దీనికోసం దళిత, గిరిజన ప్రజాప్రతినిధులతో చర్చించి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తామంటున్నారు.  శనివారం ప్రగతి భవన్ లో  వివిధ పార్టీల ఎస్సి, ఎస్టీ   ప్రజా ప్రతినిధులతో   భేటి కావాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన   పూర్తి స్ధాయి నివేదికను సిద్దం చేయాలని సీఎం అధికారుల కు అదేశించారు.
దళితుల సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపుపై విమర్శలు
దళితుల సబ్ ప్లాన్ నిధుల దారీ మళ్ళింపుపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో విమర్శలను  తిప్పికొట్టడానికే ప్రభుత్వం ఇపుడు ప్రత్యేక మీటింగ్‌ను ఏర్పాటు చేసిందనే అభిప్రాయాలు వస్తున్నాయి.  అసెంబ్లీలో సబ్‌ప్లాన్స్‌ పై ప్రత్యేక చర్చను హడావిడిగా పూర్తిచేశారని ప్రతిక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో అలర్టైన ప్రభుత్వం..దీని పై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధుల అందరితోనూ చర్చిస్తే.. విపక్షాలను సీఎం కేసీఆర్‌ కలుపుకుపోయారన్న మంచిపేరుతోపాటు.. దళిత, గిరిజన వర్గాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మైలేజీ దక్కుతుందనేది అసలు వ్యూహమని రాజకీయవర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. 

 

12:37 - January 27, 2017

భద్రాద్రి కొత్తగూడెం : కేసీఆర్‌ కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దేనికి సంకేతమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ప్రశ్నించారు. తమ్మినేని పాదయాత్రకు మద్దతుగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. తుపాకులతో కాల్చినా, లాఠీలతో కొట్టినా గిరిజనులు అడవి వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. 
రైతులకు కనీస నష్టపరిహారం ఇవ్వడం లేదన్న రాఘవులు  
ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాడే పద్ధతి సీపీఎం పార్టీదని, ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులకు కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వని పద్థతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. తమ్మినేని పాదయాత్రకు మద్దతుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూర్లబయ్యారంలో జరిగిన బహిరంగ సభలో రాఘవులు పాల్గొన్నారు. కేసీర్‌ కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా చోటివ్వక పోవడంపై రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఒక్కహామీ నెరవేర్చని టీ.ప్రభుత్వం : తమ్మినేని 
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడం లేదని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే..కేసీఆర్‌ కుటుంబం మాత్రం రాజభోగాలు అనుభవిస్తోందని ఆయన దుయ్యబట్టారు. మెజారిటీ ప్రజలైన బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉందని తమ్మినేని అన్నారు. గిరిజనులకు భూముల పట్టాలివ్వాలని, తుపాకులతో కాల్చినా, లాఠీలతో కొట్టినా గిరిజనులు పోడు భూముల్ని వదిలే ప్రసక్తే లేదని తమ్మినేని స్పష్టం చేశారు. 
ప్రజా సంక్షేమమే పరమావధిగా సీపీఎం పాదయాత్ర
ప్రజా సంక్షేమమే పరమావధిగా చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 102 రోజులు పూర్తి చేసుకుంది. 102 వ రోజు భద్రాదిలో పాదయాత్రబృందం పర్యటించింది. దుగినేపల్లి, శేగర్శల, జానంపేట, పాండురంగాపురం, ఐలాపురం, బయ్యారం క్రాస్‌రోడ్డు, సాంబయి గూడెం రామానుజవరం, తిర్లాపురం, మణుగూరులో పాదయాత్ర కొనసాగింది.  పాదయాత్ర బృందానికి సీపీఎం జిల్లా కార్యదర్శి కాసాని ఐలయ్య, మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్‌, సీపీఎం శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. విల్లంభులు, కోయడోలు ధరించిన ఆదివాసీ గిరిజనులు పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  భద్రాద్రి పవర్‌ప్లాంట్‌పై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. పవర్‌ప్లాంట్‌ నిర్వాసితులకు న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు.   సబ్‌ప్లాన్‌పై దళిత గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు తమ్మినేని మరో లేఖ రాశారు. 

 

12:30 - January 27, 2017

శ్రీకాకుళం : చదువుకోవాలనే ఆశ ఉన్నా.. ఆర్థికంగా తోడ్పాటు లేని పరిస్థితి వారిది. అలాంటి అభ్యర్థులకు అండగా నిలిచింది ఐటీడీఏ. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన అభ్యర్థులకు ఐటీడీఏ ఉచితంగా గ్రూప్‌-2 శిక్షణ అందిస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఈ విధానానికి అనూహ్య స్పందన వస్తోంది. 
గిరిజన యువతకు అద్బుత అవకాశం 
శ్రీకాకుళం జిల్లాలో గిరిజన యువతకు ఐటీడీఏ అద్బుత అవకాశం కల్పిస్తోంది. గ్రూప్‌ 2 కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు ఐటీడీఏ ఉచిత కోచింగ్‌ అందిస్తోంది. పాతపట్నం, సీతంపేట యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో గ్రూప్‌-2కు సిద్దమవుతున్న 220 మంది గిరిజనులకు ఐటీడీఏ శిక్షణ అందిస్తోంది. దీన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించేందుకు అభ్యర్థులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారి శ్రీకాకుళం జిల్లాలో రెండు చోట్ల గ్రూప్‌-2 అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. దీన్ని అభ్యర్థులంతా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ శిక్షణా కేంద్రంలో బీటెక్‌, బీఈడీ, ఎమ్మెస్సీ, బీఎస్సీ, పీజీ స్థాయి విద్యను అభ్యసించిన అభ్యర్థులు సైతం కోచింగ్‌ తీసుకుంటున్నారు. నిపుణులైన స్టడీ సర్కిల్‌ అద్యాపకులు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూ యువతకు ప్రోత్సాహం అందిస్తున్నారు. 
ఉచితంగా ట్రైనింగ్‌ 
మారుమూల గ్రామాల నుండి వచ్చిన తమకు ఐటీడీఏ ఉచితంగా ట్రైనింగ్‌ ఇవ్వడం సంతోషంగా ఉందని అభ్యర్థులంటున్నారు. గ్రూప్‌-2లో తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ పరిధిలో చేపట్టిన ఈ శిక్షణకు అభ్యర్థుల నుంచి మంచి స్పందన కనబడుతోంది. ఇదే విధానాన్ని రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏ పరిధిలో చేపబడితే గిరిజన విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరే అవకాశం కనిపిస్తోంది. 

 

12:25 - January 27, 2017

యానాం : యానాం రీజెన్సీ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగి నేటికి ఐదేళ్లు గడిచింది. దీంతో అనేకమంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీని తెరిపిస్తామని నేతలు హామీలు ఇచ్చినా నేటివరకు కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఫ్యాక్టరీ తెరుచుకుంటుందన్న ఆశ నానాటికీ సన్నగిల్లుతోంది. ఇదిలావుంటే ఘటనకు కారణమంటూ అనేకమంది కార్మికులపై కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతుండడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 
పూర్వ వైభవాన్ని కోల్పోయిన యానాం
సరిగ్గా ఐదేళ్ల క్రితం యానాంలోని రీజెన్సీ కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అదుపుతప్పి తీవ్ర విధ్వంసానికి దారితీసింది. దీంతో యానాం ప్రాంతం పూర్వ వైభవాన్ని కోల్పోయింది. యానాం చుట్టుపక్కల రీజెన్సీ టైల్స్‌ ప్రధాన కర్మాగారం కావడంతో.. కార్మిక హక్కుల కోసం ప్రారంభమైన పోరాటం.. చివరకు పోలీసులు ఉక్కుపాదం మోపడంతో వివాదంగా మారింది. కార్మిక నాయకుడు మురళీమోహన్‌ పోలీసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోవడంతో పాటు.. ఫ్యాక్టరీ వైస్‌ ప్రెసిడెంట్‌ హత్యకు గురి అయ్యాడు. 
కోర్టుల చుట్టూ తిరుగుతున్న కార్మికులు 
అదంతా గతం. కానీ.. అప్పటినుంచి ప్రభుత్వాలు కార్మికులను వేధిస్తోంది. ఘటనకు కారుకులంటూ పలువురిని కేసుల్లో ఇరికించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. దీంతో అనేకమంది యానాం నుంచి వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న పాండిచ్చేరి కోర్టుకు తిరగాల్సి వస్తోంది. అసలే ఫ్యాక్టరీ మూతపడి ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఇదో పెను భారంగా మారింది. కేసులను పరిష్కరించి.. ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీలు గుప్పించిన నేతలు ఆ విషయాన్నే విస్మరించడంతో కార్మికులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కార్మిక కేసులను తొలగించాలని.. ఉపాధి లేక అవస్థలు ఎదుర్కొంటున్న కార్మికులను ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 
ఫ్యాక‌్టరీతో గ్రామ ప్రజలకూ ఉపాధి 
ఈ ఫ్యాక‌్టరీలో యానాం చుట్టుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ ప్రజలకు కూడా ఉపాధి లభిస్తుండేది. ప్రస్తుతం ఇది మూతపడడంతో అనేకమంది రోడ్డునపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దృష్టి సారించి ఈ ఫ్యాక్టరీని తెరిపించాలని పలువురు కోరుతున్నారు. 

 

12:19 - January 27, 2017

హైదరాబాద్ : ఫిబ్రవరి మొదటివారంలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేయనున్నట్లు టీఎస్ పీఎస్ సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. రెండో వారంలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసి.. మార్చి మొదటి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నెలాఖరులోగా గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు.

 

12:16 - January 27, 2017

హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ తేనీటి విందుకు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు హాజరయ్యారు. ఇరు రాష్ర్టాల మంత్రులు, కాంగ్రెస్ నేత జానారెడ్డి, మాజీ గవర్నర్ రోశయ్య, రంగరాజన్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌తో పాటు ఉన్నతాధికారులు విందులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులకు గవర్నర్ దంపతులు సాదర స్వాగతం పలికారు. అందరినీ గవర్నర్‌ నరసింహన్‌ ఆప్యాయంగా పలకరించారు. 

 

ఎన్ టీఆర్ ట్రస్టు భవన్ లో టీటీడీపీ నేతలు భేటీ

హైదరాబాద్ : ఎన్ టీఆర్ ట్రస్టు భవన్ లో టీటీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఎల్.రమణ, రేవంత్ రెడ్డితోపాటు పలువురు హాజరయ్యారు. 

12:07 - January 27, 2017

విశాఖ : నగరంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం అయింది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సదస్సును ప్రారంభించారు. సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రెండు రోజులపాటు సదస్సు కొనసాగనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:03 - January 27, 2017

ఖమ్మం : తెలంగాణలో పెండింగ్‌ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి, టీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు సీఎం కేసీఆర్. రికార్డు స్థాయిలో 11 నెలల్లోనే భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తిచేసి రాష్ట్ర ప్రత్యేకతను చాటారని మంత్రులు, అధికారులను సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. భక్తరామదాసు జయంతి.. జనవరి 31న ప్రాజెక్టు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ అధికారులతో నిర్వహించిన రివ్యూలో ప్రకటించారు. 
11నెలల్లో ప్రాజెక్టు పూర్తి
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వం..రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయనాన్ని లిఖించింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకం రికార్డు స్థాయిలో 11నెలల్లో పూర్తికావడంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. భక్తరామదాసు ప్రాజెక్టు, ఇతరశాఖల పనితీరుపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి, టీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. రికార్డు స్థాయిలో 11 నెలల్లోనే భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. మంత్రులు, అధికారులు వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్ర ప్రత్యేకతను చాటారని సీఎం కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రులు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. 
జనవరి 31న ప్రాజెక్టు ప్రారంభం 
టీఆర్‌ఎస్‌ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. చిత్తశుద్ధి, అంకితభావం ఉంటే ప్రాజెక్టులు వేగంగా నిర్మించవచ్చని నిరూపించడానికి భక్తరామదాసు ప్రాజెక్టే పెద్ద నిదర్శనమన్నారు. భక్తరామదాసు జయంతి రోజు జనవరి 31న ప్రాజెక్టును ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా..జనవరి 31 నుంచి మూడు రోజుల పాటు నేలకొండపల్లిలో భక్తరామదాసు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.  
రెండు నెలల ముందే ప్రాజెక్టు పూర్తి 
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం అంటేనే ఏళ్ల తరబడి సాగే కార్యక్రమమనే అభిప్రాయం ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శంఖుస్థాపన చేసిన 11 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తిచేసి నీటిని విడుదల చేస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి 2016 ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. 2017 మార్చిలోగా నిర్మాఱం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అనుకున్న దానికంటే 2నెలలు ముందుగానే ప్రాజెక్టు పూర్తియింది. దేశంలో ఇప్పటివరకు అత్యంత వేగంగా నిర్మితమైన సాగునీటి ప్రాజెక్టుగా భక్తరామదాసు ఎత్తిపోతల పథకం చరిత్రలో నిలిచింది. పాలేరు నియోజకవర్గంలో నిత్యం నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్న తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్‌, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్ మండలాల పరిధిలోని 60వేల ఎకరాల భూమికి సాగునీరు అందనుంది. తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న విద్యుత్‌ రంగాన్ని రికార్డు సమయంలో గాడిలో పెట్టగలిగిందని అలాగే ఇంటింటికి నల్లా ద్వారా మంచినీళ్లిచ్చే మిషన్‌ భగీరథ పనులను కూడా అనుకున్న దానికంటే వేగంగా పూర్తిచేస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. 

 

ప్రారంభమైన సీఐఐ సదస్సు ప్రారంభం

విశాఖ : నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం అయింది. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ  పాల్గొన్నారు. రెండు రోజులపాటు సదస్సు జరుగనుంది.

11:27 - January 27, 2017

పశ్చిమగోదావరిలో కాలుష్యం పడగ విప్పిందని సీపీఎం జిల్లా కార్యదర్శి బలరామ్ అన్నారు. ఇవాళ్టి జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాలుష్య కాసారంగా మారుతోంది. పారిశ్రామిక వ్యర్థాలు, మున్సిపాల్టీల నిర్లక్ష్యం వెరసి సాగు, తాగునీటి వనరులను కాలకూటవిషంగా మార్చేస్తున్నాయి. గోస్తనీ నది, కొల్లేరు, మొగల్తూరు కాలువ, యనమదుర్రు డ్రెయిన్ అనేక జలవనరులు కలుషితమవుతున్నాయి. ఏలూరు, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు ఇలాంటి పట్టణాలకు తాగునీరందించే కాలువన్నీ ప్రమాదకర రసాయనాలతో నిండిపోతున్నాయి.  పచ్చని పొలాలు నాశనమవుతున్నాయి. పంటల దిగుబడి తగ్గిపోతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కేన్సర్ లాంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. నానాటికీ ప్రమాదకరంగా పరిణమిస్తున్న కాలుష్యానికి వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లాలో పోరాటాలు సాగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియలో చూద్దా.. 

11:23 - January 27, 2017

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు, టీ.కాంగ్రెస్ నేత రామ్ శర్మ పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేకహోదాపై టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిర్బంధం చేశారని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

సుజనా వ్యాఖ్యలపై పవన్ ఘాటైన స్పందన

హైదరాబాద్ : ప్రత్యేకహోదా కోసం విశాఖలో నిన్న యువత తెలిసిన నిరసన ఉద్యమంపై టీడీపీ ఎంపీ సుజానా చౌదరి చేసిన వ్యాఖ్యాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. చేతనైతే చేయూత నివ్వడండి... కానీ చేసేవారిని దయచేసి కించపరచకండని ఉచిత సలహా ఇచ్చారు. ఎవరి స్ఫూర్తిగా తీసుకుని బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారని సుజనా చౌదరి ప్రశ్నించారు. ఎందుకు బ్యాంకు రుణాలను చెల్లించడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేహోదా పోరు ఉధృతిని ఆపలేరని చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించే వరకు, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామన్నారు.

 

'వెంకయ్యనాయుడు... మీకు ప్రజలంటే లెక్కలేదా' : పవన్

హైదరాబాద్ : జనసేనాని పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 'వెంకయ్యనాయుడు... మీకు ప్రజలంటే లెక్కలేదా' అని అన్నారు. హోదా విషయంలో వెంకయ్యనాయుడు రకరకాల మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హోదాపై ఎన్నిసార్లు మాటమార్చుతారని పేరొన్నారు. ఒకసారి ఐదు సం. మరోసారి పది సం. ఇంకొకసారి 15సం.లు ప్రత్యేకహోదా ఇస్తామని రకరకాల మాటలు మాట్లాడారని చెప్పారు. 

టీడీపీ..మినీ బీజేపీ : పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్రీస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం మాట తప్పిందని విమర్శించారు. హోదాపై రోజుకోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ ఒంటెత్తుపోకడలకు పోతున్నారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం లేదని...మినీ బీజేపీ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ.. మినీ బీజేపీ లా తాయరైందని ఎద్దేవా చేశారు. 

11:06 - January 27, 2017
11:03 - January 27, 2017

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్రీస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం మాట తప్పిందని విమర్శించారు. హోదాపై రోజుకోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ ఒంటెత్తుపోకడలకు పోతున్నారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం లేదని...మినీ బీజేపీ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ.. మినీ బీజేపీ లా తాయరైందని ఎద్దేవా చేశారు. 'వెంకయ్యనాయుడు... మీకు ప్రజలంటే లెక్కలేదా' అని అన్నారు. హోదా విషయంలో వెంకయ్యనాయుడు రకరకాల మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
హోదాపై ఎన్నిసార్లు మాటమార్చుతారన్న పవన్ 
హోదాపై ఎన్నిసార్లు మాటమార్చుతారని పేరొన్నారు. ఒకసారి ఐదు సం. మరోసారి పది సం. ఇంకొకసారి 15సం.లు ప్రత్యేకహోదా ఇస్తామని  రకరకాల మాటలు మాట్లాడారని చెప్పారు. ఏపీని 12 గంటల్లో విడగొట్టారని.. అర్ధరాత్రి పూట ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర విభజన చట్టంలో ఏవో తప్పులున్నాయన్న అనుమానం కలుగుతుందన్నారు. వెంకయ్యనాయుడు.. స్వర్ణ భారతి ట్రస్టు కోసం పెట్టినంత మనుసు ప్రతేక్య హోదాపై పెట్టి ఉంటే ఇప్పటికే ఏపీకి ప్రత్యేకహోదా వచ్చి ఉండేదన్నారు. ప్రత్యేకహోదా ప్రసాదించడానికి 'మీరేమైనా దేవుళ్లా..మీరు కూడా ముషులే' అని బీజేపీ నేతలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. 'మేము... మీ బానిసలం..కాదు.. దేశ పౌరులం' అని అన్నారు. 'బానిసలు తిరగబడితే ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుందని' కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. కేంద్రంలో కూర్చుని ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం   సరికాదని హితవుపలికారు. రామ మందిరం అనే అంశం తీసుకున్నారు గానీ.. ఏపీ ప్రజల సమస్య.. ప్రత్యేకహోదా అంశాన్ని తీసుకోలేదని విమర్శించారు.
టీడీపీ ఓ మినీ బీజేపీ... 
సమస్యలను పరిష్కారిస్తారని బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇచ్చా..కానీ రెండేళ్లలో ఆ రెండు పార్టీలు ఇచ్చిన హామీలను మరిచిపోయాయని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం లేదని.. మినీ బీజేపీ ప్రభుత్వం ఉందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతానని తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా తనకు ఎవరితో శత్రుత్వం, విభేదాలు లేవని... వారు అనుసరిస్తున్న విధానాలు, పాలసీలపైనే తన వ్యతిరేకతని స్పష్టం చేశారు. విధానాల కోసం సొంత అన్నయ్యతో విభేదించి బయటికి వచ్చానని గుర్తు చేశారు. ప్రజలకు అవసరమైన కామన్ ఎజెండా అమలు కానప్పుడు తాను ఎందుకు వారి పక్షం ఉండాలని బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలను ఉద్ధేశించి మాట్లాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించని పక్షంలో తాను రోడ్లపైకి వచ్చి ఎందుకు నిరసనలు తెలపకూడదో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలన్నారు. భయపెట్టి పరిపాలిస్తాననడం తగదని హెచ్చరించారు. ఇప్పటికీ కాశ్మీర్ సమస్యను పోలీసులతోటి కంట్రోల్ చేయలేకపోయారని పేర్కొన్నారు. భయపెట్టి కాదు...పాలసీల ద్వారా ప్రజలను కంట్రోల్ చేయాలని సూచించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు మీడియా, ప్రొఫెసర్లు భయపడుతున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే... చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. భయపెడితే భయపడేది లేదని...అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు. ప్రభుత్వాలు ఎంతకు తెగిస్తే... తామూ అంతకు తెగిస్తామని.. ఉంటే ఉంటాం.. పోతే పోతామనే ధీమాతో పోరాటం చేస్తామని హెచ్చరించారు. 
సుజనా వ్యాఖ్యలపై పవన్ ఘాటు స్పందన
ప్రత్యేకహోదా కోసం విశాఖలో నిన్న యువత తెలిసిన నిరసన ఉద్యమంపై టీడీపీ ఎంపీ సుజానా చౌదరి చేసిన వ్యాఖ్యాలపై పవన్ తీవ్రంగా స్పందించారు. చేతనైతే చేయూత నివ్వడండి... కానీ చేసేవారిని దయచేసి కించపరచకండని ఉచిత సలహా ఇచ్చారు. ఎవరి స్ఫూర్తిగా తీసుకుని బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారని సుజనా చౌదరి ప్రశ్నించారు. ఎందుకు బ్యాంకు రుణాలను చెల్లించడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేహోదా పోరు ఉధృతిని ఆపలేరని చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించే వరకు, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామన్నారు.

అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకం : పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతానని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం లేదని...మినీ బీజేపీ లా తాయరైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కారిస్తారని బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇచ్చానని... అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో ఆ రెండు పార్టీలు ఇచ్చిన హామీలను మరిచిపోయారని చెప్పారు. 

 

08:39 - January 27, 2017

విశాఖ : ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హోదాకోసం గళం విప్పుతున్న వారిని హేళన చేయడంపై ఉద్యమకారులు మండిపడతున్నారు. సుజనా చౌదరి అటూ ఇటూ కాని రాజకీయనేత అని తీవ్రవిమర్శలు చేస్తున్నారు. 
సుజనా చౌదరి అంటే .. ఆడా మగా..? రాంగోపాల్ వర్మ 
చూశారా.. కేంద్రమంత్రి సుజనాచౌదరి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించేవాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. ఆయన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుజనా చౌదరిఅంటే .. ఆడా మగా.. అంటూ ట్విట్టర్లో రామ్‌గోపాల్ వర్మ కామెంట్‌ చేశాడు. ప్రత్యేకహోదాపై నోరుపారేసుకున్న సుజనానే పెద్ద రాజకీయ వరాహం.. అని సినీరచయిత చిన్నికృష్ణ మండిపడ్డారు.
సుజనా చౌదరి సుద్దపూసనా..? : జనం
ప్రజాఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన సుజనా చౌదరి మాత్రం సుద్దపూసనా అని జనం ప్రశ్నిస్తున్నారు. డబ్బుతో పదవులు కొనుకున్న ఆయన మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించనట్టే ఉందని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. యలమంచలి సత్యనారాయణ అలియాస్‌ సుజనాచౌదరి.. ఇపుడు కేంద్రంలో సైన్స్‌అండ్‌ టెక్నాలజీ మంత్రి. 2004లో టీడీపీ ఘోరపరాజయంతో కష్టాల్లో ఉన్న చంద్రబాబును అన్నివిధాల ఆదుకున్నారు. నారాలోకేష్‌ క్రియాశీలంగా లేని సమయంలో ఆర్థిక సహాయం అందించి  బాబుకు దగ్గరయ్యారు. దీంతో పార్టీలో సుజనా హవాకు అడ్డేలేకుండా పోయింది. 2014లో పార్టీ విజయం సాధించాక బాబు అండతోనే కేంద్రంలో మంత్రి పదవి కొనుక్కున్నారనే ఆరోపణలు  ఉన్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని సుజనా .. రాజ్యసభా సభ్యత్వంతో కేంద్ర మంత్రి కావడమే దీనికి రుజువు అంటున్నారు విమర్శకులు. 2016లో రాజ్యసభ టెర్మ్‌ ముగిసిపోవడంతో .. అటు కేంద్రంలో అరుణ్‌జైట్లీ.. ఇటు చంద్రబాబు సహకారంతో మళ్లీ పెద్దలసభకు ఎన్నిక కాగలిగారు. సుజనను మళ్లీ రాజ్యసభకు పంపించడం ఇష్టంలేక చినబాబు అడ్డుచెప్పినా.. సుజనా చక్రం బాగానే తిప్పేశారని అప్పట్లో పార్టీలోనే గుసగుసలు వినిపించాయి. 
వీధిరౌడీలా మాట్లాడారని ఉద్యమకారులు మండిపాటు 
కేంద్ర మంత్రిగా బాధ్యతాయుత పదవిలో ఉండి.. హోదా ఉద్యమంపై నోటికి వచ్చినట్టు వీధిరౌడీలా మాట్లాడారని ఉద్యమకారులు మండిపడుతున్నారు. తన వ్యాపార ప్రయోజనాలు ఆశించే సుజనా రాజకీయాల్లో ప్రాపకం సంపాదించారని విమర్శిస్తున్నారు. ఆయన వ్యాపారాలు కూడా ఫేర్‌గా ఏంలేవంటున్నారు. 2010లో హోస్టియా హోల్డింగ్‌ కంపెనీ తీసుకున్న రుణానికి సుజనాచౌదరికి చెందిన సృజనాయూనివర్సల్‌ ఇండస్ట్రీ షూరిటీగా ఉంది. ఈవిషయంలో హోస్టియాకంపెనీకి చెల్లించాల్సిన డబ్బును సుజనా నిర్లక్ష్యం చేశారు. దీనిపై అప్పట్లోనే హైకోర్టు నుంచి కోర్టుధిక్కరణ నోటీసులు అందుకున్న చరిత్ర సుజనాచౌదరిది అని రాజకీయప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఇక మంత్రిగారి కుమారుడు కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ.. కార్‌రేసులకు పాల్పడుతూ పలుమార్లు పోలీసులతో క్లాసులు పీకించుకున్నాడని జనం ఎద్దేవా చేస్తున్నారు. 
సర్వత్రా విమర్శలు 
కోట్లాది మంది ప్రజలను అవమానించేలా మాట్లాడ్డంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వ్యాపార, కుంటుంబ ప్రయోజనాలకోసం రాజకీయాలను వాడుకుంటున్న సుజనాచౌదరి లాంటి నాయకులు ఇంతకంటే గొప్పగా ఎలా మాట్లాడతారని ఏపీ ప్రజలు అంటున్నారు. 

 

'స్వచ్ఛ సర్వేక్షన్' కార్యక్రమంలో పాల్గొన్న బొంతు రామ్మోహన్

హైదరాబాద్ : ముసారాంబాగ్ లోని ఎస్ బిహెచ్ కాలనీలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ బొంత రామ్మోహన్ పాల్గొన్నారు. అధికారులు కనీస వసతులు ఏర్పాటు చేయడం లేదని మేయర్ కు స్థానికులు విన్నవించుకున్నారు.

 

అనకాపల్లి వద్ద వైసీపీ కార్యకర్తలు ఆందోళన

విశాఖ : అనకాపల్లి వద్ద జాతీయ రహదారిపై వైసీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. 

 

08:23 - January 27, 2017

హైదరాబాద్ : 'మీరు నోరు జారే కొద్దీ యువతను రెచ్చగొట్టినట్టేనని, సరే అలాగే కానివ్వండి'... అంటూ టీడీపీ నాయకులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ఇస్తు ట్వీట్ల మీద ట్వీట్లు చేసిన  జనసేనాని ఇవాళ కూడా తనదైన శైలిలో ట్వీట్లు చేశారు.  
టీడీపీ నేతలను టార్గెట్ చేసిన పవన్  
విశాఖలో ప్రత్యేక హోదా సాధన కోసం యువత చేస్తున్న ఆందోళనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌  మద్దతిస్తూనే ఉన్నారు. విశాఖకు వెళ్లకపోయనప్పటికీ ట్వీట్స్ ద్వారా పరిస్థితిపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా జనసేనాని ట్విట్టర్ వేదికగా టీడీపీ నాయకులను టార్గెట్ చేశారు. 
పాచిపోయిన లడ్డూలు ప్రజల చేతిలో పెడతారా? 
విభజనకు ముందు పంచభక్ష్యాలతో కూడిన హోదా ఇస్తామని మాట ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారని పవన్ ట్వీట్ చేశారు. రాష్ట్రాలకిచ్చే సాధారణ నిధులకు స్పెషల్ ప్యాకేజీ ముసుగు తొడిగారన్నారు. ఇంతచేసి రెండు పాచిపోయిన లడ్డూలు ప్రజల చేతిలో పెడతారా? అని ప్రశ్నించారు. 
ఎంపీ రాయపాటిని టార్గెట్‌ చేసిన పవన్  
ఈసారి ఎంపీ రాయపాటిని పవన్ టార్గెట్‌ చేశారు. పోలవరం కాంట్రాక్ట్‌ కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టకండి అంటూ ట్విటర్‌లో విరుచుకుపడ్డారు. వ్యాపార ధోరణి రాజకీయాలతో తెలంగాణ యువతకి కోపం తెప్పించి.. ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారన్న అపవాదు మొత్తం జాతికే తీసుకువచ్చారన్నారు. ప్రత్యేక హోదా కోసం మీరు పోరాటం చేయరు. చేసే వారిని చేయనివ్వరంటూ పవన్‌ మండిపడ్డారు. మీ దురాశలకు, డబ్బు, పదవి వ్యామోహాలకు భావితరాల భవిష్యత్‌ను పాడు చేసే హక్కు మీకు లేదని విరుచుకుపడ్డారు. 
సుజనా వ్యాఖ్యలకు బదులిచ్చిన పవన్ కల్యాణ్  
జల్లికట్టు స్ఫూర్తిపై కేంద్రమంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు. యువత పోరాట స్ఫూర్తిని సుజనా చౌదరి గారు పందుల పందాలతో పోల్చడం బాధాకరమని పవన్ ట్వీట్ చేశారు. ఇంక మీరు నోరు జారే కొద్దీ యువతను రెచ్చగొట్టినట్టేనని, సరే అలాగే కానివ్వండి అంటూ హెచ్చరించారు.
జనసేన కార్యకర్తలను విడిచిపెట్టాలన్న పవన్ 
ఇక చివరగా ప్రత్యేక హోదా కోసం పోరాట పటిమ చూపిన తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న, ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్న జనసేన కార్యకర్తలను ప్రతి ఒక్కరినీ.. బేషరతుగా విడిచిపెట్టాలని ఆయన ట్విట్టర్‌లో డిమాండ్‌ చేశారు. మనల్ని వెటకారం చేసే నాయకులను గుర్తుపెట్టుకోవాలని పవన్‌ ట్విటర్‌లో సూచించారు. ఇవాళ్టి పరిణామాలపై శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రెస్‌మీట్ పెడుతున్నాంటూ చివరి ట్వీట్ చేశారు. 

 

08:06 - January 27, 2017

విశాఖ : ప్రత్యేక హోదాపోరు రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. అన్నిజిల్లాల్లో విద్యార్థులు, యువత ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా జాతీయజెండాలను చేతబట్టి ప్రత్యేక హోదా నినాదాలతో హెరెత్తించారు. రాష్ట్రప్రయోజనాలను ముఖ్యమంత్రి కేంద్రం దగ్గర తాకట్టుపెట్టారని విపక్షనాయకులు మండిపడ్డారు.   ప్రత్యేకహోదా పోరుకు భయపడే.. నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
అనంతపురంలో 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు కొవ్వొత్తులను చేతబట్టి భారీ ర్యాలీ నిర్వహించారు.  విద్యార్థుల మద్దతుగా ప్రత్యేకహోదా సాధన సమితితోపాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు ర్యాలీలో పాల్గొన్నాయి. ఆంధ్రుల హక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు మోదీప్రభుత్వానికి తాకట్టుపెట్టారని నిరసనకారులు విమర్శించారు. 
ప్రకాశంలో 
ప్రకాశం జిల్లా చీరాలలో శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్న  వైసీపీ నాయకులను  పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులను అరెస్టు చేశారు.
తిరుపతిలో 
తిరుపతిలో విద్యార్థి యువత కదం తొక్కింది.. ప్రత్యేక హోదా నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. జాతీయజెండాలను చేతబట్టుకుని స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాల్సిందేనని నినాదాలు చేశారు. ర్యాలని చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. 
పశ్చిమగోదావరిలో 
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో హోదా నినాదాలు మిన్నంటాయి.  ర్యాలీ చేపట్టిన వామపక్షాల కార్యకర్తలను పోలీసులు  కర్కశంగా ఈడ్చిపడేశారు. సీపీఐ, సీపీఎం, న్యూడెమొక్రసీ నాయకులను అరెస్టు చేశారు. 
కడపలో
ఏపీకి ప్రద్యేక హోదా వెంటనే ప్రకటించాలని కడప జిల్లా పులివెందులతో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. విశాఖలో వైఎస్‌ జగన్‌ను అడ్డుకోవడంపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడిపిస్తున్నారని విమర్శించారు.
కదంతొక్కిన లెఫ్ట్‌ పార్టీల కార్యర్తలు 
ప్రత్యేకహోదా కోసం కడప జిల్లాలో లెఫ్ట్‌పార్టీల కార్యర్తలు కదంతొక్కారు. జిల్లావ్యాప్తంగా  వేలాది మంది కొవ్వొత్తులతో ప్రదర్శకు దిగారు. ఈసందర్భంగా వాపక్షాల నాయకులును పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నాయకుల అరెస్టుకు నిరసనగా వైసీపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు మోదీ భజనమాని .. ప్రత్యేకహోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

08:00 - January 27, 2017

విశాఖ : ఎయిర్‌పోర్టులో వైసీపీ కార్యకర్తల నిరసనపై సీఎం చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించారని బాబు విమర్శించారు. ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకే  కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేక పోయిందని బాబు స్పష్టం చేశారు. అందుకే స్పెషల్‌ స్టేటస్‌కు ఏమాత్రం తగ్గకుండా ప్యాకేజీకి కేంద్రాన్ని ఒప్పించామన్నారు. తుని ఘటనకు పాల్పడినవారే విశాఖలో మళ్లీ విధ్వంసం సృష్టించేందుకు యత్నించారు. రాష్ట్రాన్ని తగలబెడుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని బాబు హెచ్చరించారు. 

 

నేడు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : నేడు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అన్ని పార్టీల ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. 

 

నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళన

విజయవాడ : నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

Don't Miss