Activities calendar

28 January 2017

21:42 - January 28, 2017

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం వెల్లువలా కొనసాగింది. విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన భాగస్వామ్య సదస్సులో రెండో రోజూ పెట్టుబడుల ధమాకా కొనసాగింది. తొలిరోజు కంటే మలిరోజు భారీగా అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

ఏపీలో రహదారుల నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు చేస్తాం-గడ్కరీ

విశాఖలో రెండోరోజు జరిగిన సీఐఐ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రంపై వరాలు జల్లు కురించారు. ఏపీలో రహదారుల నిర్మాణానికి తమ హయాంలో లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నం పోర్టు దేశంలో అతి పెద్ద ఓడరేవుగా ఉందని..పోర్టు అభివృద్ధికి 6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాన్ని,..సాధ్యమైనంత త్వరగా మొదలు పెడతామన్నారు గడ్కరి.

గతేడాది కన్నా పారిశ్రామిక వేత్తల్లో పెరిగిన ఉత్సాహం...

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడంలో గతేడాది కన్నా పారిశ్రామిక వేత్తల్లో ఉత్సాహం పెరిగిందన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రం పెట్టుబడులకు మెరుగైన ప్రాంతమని భావించడమే ఇందుకు కారణమన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఇప్పటికే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నామని.. భవిష్యత్‌లో ప్రపంచంలోనే టాప్‌ టెన్‌లో నిలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

టూరిజంశాఖలో మొత్తం 69 సంస్థలు, 7,237 కోట్ల ఒప్పందాలు...

రెండో రోజు సదస్సులో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. టూరిజంశాఖలో మొత్తం 69 సంస్థలు, 7,237 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీని ద్వారా సుమారుగా 62,321 మందికి ఉపాధి ల‌భించ‌నుంది. జీఎస్‌ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్ధ 1400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఫీడ్ బ్యాక్ ఇన్‌ఫ్రా 600 కోట్లతో అమ‌రావ‌తిలో థీమ్ పార్క్ ఏర్పాటుకు అవగాహన కుదుర్చుకుంది.

సీఆర్డీఏ పరిధిలో 1 లక్షా 29 వేల కోట్ల విలువైన 62 ఒప్పందాలు...

సీఆర్డీఏ పరిధిలో 1 లక్షా 29 వేల కోట్ల విలువైన 62 ఒప్పందాలు శనివారం కుదిరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అందులో రచన సాయి ఇన్‌ఫ్రాటెక్‌ 2500 కోట్ల పెట్టుబడులు. ఈ సంస్థ పెట్టుబడులతో 15వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌-5వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ పెట్టుబడులతో 2వేల మందికి ఉపాధి కల్పన లభించనుంది. షాపూర్జీ -పల్లోంజీ 6వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. ఈ పెట్టుబడులతో 10వేలమందికి ఉపాధి లభిస్తుంది. టాటా పవర్‌ కంపెనీ- 12,500 కోట్ల పెట్టుబడులకు సిద్ధమైంది. SRM యూనివర్సిటీ పెట్టుబడులతో 6,365 మందికి ఉపాధి లభించనుంది.

మొత్తం 665 సంస్థలతో ఒప్పందాలు ..

మొత్తంగా చూసుకుంటే 665 సంస్థలతో రాష్ర్ట ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంట్లో ఎన‌ర్జీ-47, CRDA-62, మైనింగ్ 50, ఫుడ్ ప్రాసెసింగ్-177, టూరిజం-69, ఐటీశాఖ-67, రోడ్లు మ‌రియు భ‌వ‌నాలు-1, యానిమ‌ల్ హ‌జ్బెండ‌రీ-1, APTIDCO-14, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌-3, టెక్స్ టైల్స్-8, ఉన్నత విద్య-9, ఎక‌నామిక్ డెవ‌ల‌ప్‌మెంట్‌బోర్డు-66 ఇలా మొత్తం 665 ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వివిద దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో కుదుర్చుకుంది. వీటి ద్వారా 10కోట్ల 50 లక్షల విలువైన పెట్టుబ‌డులు రాష్ట్రానికి వస్తాయ‌ని..వీటివ‌ల్ల 22 ల‌క్షల మందికి ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

4 లక్షల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని...

గతేడాది జ‌రిగిన సీఐఐ స‌మ్మిట్‌లో 4 లక్షల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని... వాటి వ‌ల్ల దాదాపు 8 లక్షల మందికి ఉపాధి కలిగిందని ప్రభుత్వం తెలిపింది. రాబోయే రోజుల్లో రాష్ట్రం డ‌బుల్ డిజిట్ గ్రోత్‌ను రాష్ట్రం సాధిస్తుందని..ప్రత్యేక హోదా లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకంవల్లే ఇదంతా సాధ్యమైందన్నారు సీఎం. మ‌రోవైపు పెట్టుబ‌డులు పెడుతున్న ప్రతి సంస్థకు భూములను అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతో రానున్న రోజుల్లో పేదల దగ్గర నుంచి భూములు పోయే అవ‌కాశం కూడా క‌నిపిస్తుంది.

21:38 - January 28, 2017

హైదరాబాద్: విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వివిధ దేశాలకు వెళ్తున్న వారి పర్యవేక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. విదేశాల్లో భారత రాయబార కార్యాలయాలను బలోపేతం చేయాలని.. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి తగిన సహకారం అందించాలని సీఎం కోరారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి దానేశ్వర్‌ మూలే ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ వ్యవహారాల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్తున్న ఎన్‌ఆర్‌ఐలకు సేవలందించేందుకు హైదరాబాద్‌లో విదేశా భవన్‌ను నిర్మించాలని అందుకోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వరంగల్‌లో పాస్‌పోర్టు సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరగా..తప్పకుండా ఏర్పాటు చేస్తామని దానేశ్వర్ మూలే ప్రకటించారు.

21:35 - January 28, 2017

కడప : జిల్లా రాజంపేటలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సు- బైక్ ఢీకొనడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి మృతికి నిరసనగా ఆర్టీసీ బస్సును ధ్వంసం చేసి విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థుల ఆందోళనకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అమరానాథ్ రెడ్డి మద్దతు తెలిపారు .

21:34 - January 28, 2017

హైదరాబాద్: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మళ్లీ వివాదాస్పద రామమందిరం అంశాన్ని ముందుకు తెచ్చింది. ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న రామ మందిరాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. రాజ్యాంగానికి లోబడి సాధ్యమైనంత త్వరగా రామ మందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చింది. ఈఎన్నికల్లో తమకు సంపూర్ణ ఆధిక్యత కట్టబెడితే రామ మందిరం నిర్మిస్తామని ప్రచారం చేస్తున్న యూపీ కమలనాథులు, ఈ అంశాన్ని మ్యానిఫెస్టోలో చేర్చారు. లోక్‌ కల్యాణ్‌ సంకల్ప పత్రం పేరుతో బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా.. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. పన్నెండో తరగతి వరకు ఉచిత విద్య, రైతులకు రుణమాఫీ, యువతకు వన్‌ జీబీ ఉచిత ఇంటర్నెట్‌తో ల్యాప్‌టాప్‌లు వంటి అంశాలను మ్యానిఫెస్టోలో చేర్చారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో 150 కోట్ల రూపాయల కేటాయింపు, ఐదేళ్లలో అన్ని ఇళ్లకు 24 గంటల విద్యుత్‌ సరఫరా వంటి అంశాలకు ఎన్నికల ప్రణాళికలో స్థానం కల్పించారు.

మైనార్టీ వెల్ఫేర్ స్కూళ్లకు పోస్టుల మంజూరు...

హైదరాబాద్: రాష్ట్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలకు 4,137 రెగ్యులర్ పోస్టులు, 692 పొరుగు సేవల పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు నియామక ప్రక్రియను టీఎస్‌పీఎస్సీకి అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలిలా ఉన్నాయి. ప్రిన్సిపల్‌లు-118, జూనియర్ లెక్చరర్లు-1110, పీజీటీ-1140, టీజీటీ-1010, పీఈటీ-124, పీడీ-130, లైబ్రేరియన్స్- 130, స్టాఫ్‌నర్స్-125, క్రాఫ్ట్ ఆర్ట్స్, మ్యూజిక్ ఇన్‌స్ట్రక్టర్లు-125, సీనియర్ అసిస్టెంట్స్-125. మూడు విద్యా సంవత్సరాల్లో ఈ 4,137 రెగ్యులర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

గవర్నర్ గా పీబీ ఆచార్య బాధ్యతలు స్వీకరణ

హైదరాబాద్: అరుణాచల్‌ప్రదేశ్ ఇన్‌ఛార్జీ గవర్నర్‌గా పీబీ ఆచార్య బాధ్యతలు స్వీకరించారు. నాగాలాండ్ గవర్నర్ వి. షణ్ముగనాథన్ రాజీనామాతో పీబీ ఆచార్య బాధ్యతలు చేపట్టారు. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజిత్ సింగ్ పీబీ ఆచార్యతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో గల దర్భర్ హాల్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా సాదాసీదాగా గడిచిపోయింది.

 

ఎయిర్ పోర్ట్ లో 5కోట్ల విలువైన కొకైన్ పట్టివేత...

చెన్నై: చెన్నై ఎయిర్ పోర్టులో రూ. 5 కోట్ల విలువైన కొకైన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా ఎస్‌సీబీ అధికారులు దక్షిణాఫ్రికా జాతీయురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 1.075 కేజీల కోకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ. 5 కోట్లుగా సమాచారం.

ఐదుగురు సైనికులు సురక్షితం..

జమ్మూ కశ్మీర్‌ : కుప్వారా జిల్లాలో ఇవాళ కొండ చరియలు విరిగిపడి ఐదుగురు సైనికులు మంచు చరియల కింద చిక్కుకున్న ఐదుగురు సైనికులు సురక్షితంగా బయటపడ్డారు. నేడు సైనికులు మంచు చరియల్లో కూరుకుపోగానే సహాయక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. ఐదుగురిని రక్షించగలిగారు. కాగా, సరిహద్దు రేఖ వెంట కొన్ని రోజుల క్రితమే రెండు సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనల్లో సుమారు 15 మంది మృతిచెందారు. గురేజ్ సెక్టార్‌పై మంచుచ‌రియ‌లు విరిగిప‌డడం వ‌ల్ల సుమారు 10 మంది సైనికులు మృతించెందారు. స‌హాయ‌క చ‌ర్య‌ల ద్వారా అక్క‌డ ఆరుగుర్ని ర‌క్షించారు.

అమరావతికి భారీ పెట్టుబడులు

విశాఖ : రాజధాని అమరావతిలో భారీగా పెట్టుబడులు రానున్నాయి. సీఐఐ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఒప్పందాలు చేసుకుంది. 665 ఎంవోయూలు, రూ. 10.54 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 22.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో 62 ఎంవోయూలు, రూ. 1.29 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

18:02 - January 28, 2017

హైదరాబాద్: సికింద్రాబాద్‌ తాడ్‌బండ్‌ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం వేగాంగా వచ్చి డివైడర్ ను ఢీ కొట్టింది. బైక్ పై వెళ్తున్న ముగ్గురు ఎగిరి పడటంతో వెనుక వస్తున్న లారీ వారి మీదు వెళ్లింది. దీంతో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో విద్యార్థి గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. మృతులు అనిరుధ్‌, విశ్వలుగా గుర్తించారు. క్షతగాత్రుడు అఖిల్‌. వీరింతా సికింద్రాబాద్‌ నారాయణ కాలేజీకి చెందిన వారు.

17:59 - January 28, 2017

హైదరాబాద్: ఎస్సీ,ఎస్టీల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఈ వర్గాలకు కోసం తీసుకొచ్చిన ఉప ప్రణాళిక నిధుల్లో 17 వేల కోట్ల రూపాయలను టిఆర్ఎస్ ప్రభుత్వం దారిమళ్లించిందని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం కింది ఈ వివరాలను రాబడుతున్నామని, వచ్చిన తర్వాత ప్రభుత్వ నిజస్వరూపాన్ని బయటపెడతామని మందకృష్ణ పేర్కొఆన్నరు. మరిన్ని వివరాలకు ఈ వీడియోను క్లిక్ చేయండి..

17:56 - January 28, 2017

చెన్నై ఎయిర్ పోర్టులో కొకైన్ స్వాధీనం..

చెన్నై : ఎయిర్ పోర్టులో 1.75 కేజీల కొకైన్ ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సౌతాఫ్రికా నుండి చెన్నైకి తరలిస్తున్న సౌత్ ఆఫ్రికా మహిళను అధికారులు అరెస్టు చేశారు.

 

16:43 - January 28, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' నటించిన 'ఖైదీ నెంబర్ 150' కలెక్షన్లలో దూసుకపోతోంది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కొన్ని సంవత్సరాల తరువాత వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళ సినిమా 'కత్తి' సినిమాను రీమెక్ గా ఈ చిత్రం రూపొందింది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్' నిర్మాతగా వ్యవహరించారు. విడుదలైన కొన్ని రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్లి కొత్త చరిత్ర సృష్టించింది. చిరు డ్యాన్సులు..ఫైట్లు..నటనతో తనలో స్టామినా ఏమాత్రం తగ్గలేదని 'చిరు' నిరూపించాడు. దీనితో అభిమానులు చిత్రం చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బాక్సాపీసు వద్ద రికార్డులు తిరగరాస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి 'చిరంజీవి, 'వివి వినాయక్', 'రామ్ చరణ్'..పలువురు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

16:42 - January 28, 2017
16:40 - January 28, 2017

హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయమన్నారు తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ. కోర్టు తీర్పుతోనైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరవాలని ఆయన అన్నారు. అప్పులబాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల మరణాలను ప్రభుత్వం వక్రీకరిస్తోందని షబ్బీర్‌ ఆర్ అలీ మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉండటం దురదృష్టకరమన్నారు.

16:39 - January 28, 2017

పెద్దపల్లి : భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆకస్మికంగా పర్యటించారు. మంథని మండలం గుంజపడుగు, సిరిపురం గ్రామాల్లో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్ట్‌ల పంప్‌హౌస్‌ పనులను పరిశీలించారు. భూనిర్విసితులు ఆందోళన చేస్తారన్న ఉద్దేశంలో మంత్రి పర్యటనను గోప్యంగా ఉంచారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్ట్‌ల కింద భూములు కోల్పోయిన రైతులకు ఇంకా పరిహారం చెల్లించలేదు. మంత్రి పర్యటన వివరాలు ముందుగానే వెల్లడైతే నిర్వాసితులు మంత్రి వద్దకు వచ్చి పరిహారం అంశంపై నిలదీస్తారన్న భయంతోనే హరీశ్‌ పర్యటన వివరాలు ఎవరికీ తెలియకుండా ఉంచారని చెబుతున్నారు. దీనిపై హరీశ్‌ వివరణ కోరగా పర్యటన వివరాలు తెలిస్తే ఫ్లెక్సీలు, బ్యానర్లతో హడావుడి చేస్తున్నారని, దీనికి దూరంగా ఉండేందుకే సమాచారం వెల్లడించలేదని చెప్పారు.

16:37 - January 28, 2017

విశాఖ : ప్రత్యేక హోదా సాధన కోసం రిపబ్లిక్‌ డే కోసం..నిర్వహించిన నిరసన ర్యాలీకి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వస్తే బాగుండేదని చలసాని శ్రీనివాస్‌ అన్నారు. వైఎస్‌ జగన్‌ విశాఖ ఎయిర్‌పోర్టులోనే దీక్ష కొనసాగిస్తే బాగుండేదని చలసాని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు విశాఖలోని ఆర్కే బీచ్‌లో దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం..చేస్తున్న ఏ కార్యక్రమానికైనా..రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు, సినీనటులు స్పందించాలని పిలుపునిచ్చారు.

సీఐఐ సదస్సు..665 ఎంవోయూలు..

విశాఖపట్టణం : సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కొనసాగుతోంది. రెండో రోజు భారీగా పె ట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఇప్పటి వరకు 665 ఎంవోయూలు జరిగాయి. రూ. 10.50 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. కొత్త ఉప్పందాల వల్ల 22.50 లక్షల మందికి ఉపాధి దొరకనుంది. సీఆర్డీఏ పరిధిలో రూ. 1.29 లక్షల కోట్ల విలువైన 62 ఒప్పందాలు చేసుకున్నాయి.

16:35 - January 28, 2017

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మరో ప్రజా వ్యతిరేక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రోడ్ల నిర్మాణం కోసం ఎస్సీ, ఎస్టీలు నివాసం ఉంటున్న ఇళ్లను తొలగించడానికి రంగం సిద్ధంచేసింది. దీంతో రాజధాని ప్రాంత గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

16:33 - January 28, 2017

హైదరాబాద్: గ్రాండ్‌స్లామ్ ఓపెన్ శ‌కంలో సెరెనా విలియ‌మ్స్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయ‌ర్‌గా నిలిచింది. ఇవాళ జ‌రిగిన ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను గెలిచిన సెరెనా టెన్నిస్ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఓపెన్ ఎరాలో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌ టైటిళ్లు గెలిచిన టెన్నిస్ ప్లేయ‌ర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఫైన‌ల్లో రెండవ సీడ్ సెరెనా 6-4, 6-4 స్కోర్‌తో 13వ సీడ్ వీన‌స్‌పై అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఓపెన్ శకంలో 22 టైటిళ్లు సాధించిన స్టెఫీ గ్రాఫ్ రికార్డును బ్రేక్ చేసింది సెరెనా. మ‌హిళ‌ల సింగిల్స్ చరిత్రలో ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ మార్గరేట్ కోర్ట్ 24 టైటిళ్లు గెలిచి టాప్‌లో ఉంది. కానీ ఆమె అమెచ్యూర్‌, ప్రొఫెష‌న్ శ‌కాల‌కు క‌లిపి ఆ రికార్డును న‌మోదు చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ను సెరీనా గెలవడం ఇది ఏడో సారి.

16:30 - January 28, 2017

విజయవాడ : ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో పున్నమి, భవానీ ఘాట్‌లు వేదికగా ఈ విన్యాసాలు జరగనున్నాయి. మొదటి రెండు రోజులు నావికాదళం విశిష్టతలు, ప్రత్యేకతలను నగర ప్రజలకు తెలియజేస్తారు. 4వ తేదీన కృష్ణానదిపై విన్యాసాలు ప్రజలకు కనువిందు చేయనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చంద్రబాబు సూచన మేరకు బెజవాడలో ఈ విన్యాసాలను ఏర్పాటు చేసిన నావికాదళ అధికారులు.. రాజధాని పేరు మార్మోగేలా విన్యాసాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక విన్యాసాల కోసం ఈనెల చివరిలో మూడు రోజులపాటు రిహార్సల్స్‌ జరగనున్నాయి. కృష్ణానదిపై చేయనున్న విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటాయని అధికారులంటున్నారు.

5వ తేదీన నేవీ బ్యాండ్‌ ప్రదర్శన ...

ఇక విన్యాసాల్లో భాగంగా 5వ తేదీన నేవీ బ్యాండ్‌ ప్రదర్శన ఉంటుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బ్యాండ్‌ను ప్రదర్శిస్తారు. అలాగే యువతను నావికా రంగం వైపు ఆకట్టుకునే విధంగా ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కృష్ణానది తీరంలో ఎయిర్‌షో నిర్వహించగా..

ఇప్పటికే కృష్ణానది తీరంలో ఎయిర్‌షో నిర్వహించగా.. తాజాగా నేవీ విన్యాసాలు నిర్వహించబోతున్నారు. భవిష్యత్‌లోనూ ఈ తరహా కార్యక్రమాలు చేపట్టేందుకు కృష్ణాజిల్లా యంత్రాంగం సిద్దమవుతోంది. మొత్తానికి త్వరలోనే ఏపీ రాజధాని నగర ప్రజలకు నేవీ విన్యాసాలు కనువిందు చేయనున్నాయి.

16:15 - January 28, 2017

అమరావతి : పోలవరం ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్ సంస్థకు వద్దన్నా డబ్బులిచ్చేస్తోంది ఏపీ ప్రభుత్వం . తట్టెడు మట్టికూడా తీయకుండా కాంగ్రెస్‌ సర్కార్‌ వెయ్యికోట్లు ఇచ్చేస్తే.. తాజాగా టీడీపీ ప్రభుత్వం పాత అప్పుల్ని పట్టించుకోకుండా.. ఉదారంగా వందల కోట్లరూపాయలు ఇచ్చేస్తోంది. బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ జేబుల్లోకి సబ్‌కాంట్రాక్ట్‌ల పేరుతో వందకోట్లను గుమ్మరిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.

రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్‌పై చంద్రబాబు ప్రేమ..!

ఎంపీ రాయపాటికి చెందిన కాంట్రాక్ట్‌ సంస్థ ట్రాన్స్‌ ట్రాయ్‌ పై చంద్రబాబు ప్రభుత్వం కొండంత నమ్మకాన్ని ప్రదర్శిస్తోంది. పాత అడ్వాన్సులను దిగమింగేసిన సంస్థకు మళ్లీ మళ్లీ నిధులు గుమ్మరిస్తోంది. సబ్‌కాంట్రాక్ట్‌ల పేరుతో వందకోట్లను ట్రాన్స్‌ట్రాయ్‌ జేబుల్లో పెడుతోంది టీడీపీ ప్రభుత్వం.

2013లో ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు రూ.1000కోట్లు

పోలవరం నిర్మాణ కాంట్రాక్ట్‌ను ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ దక్కించుకుంది. ఈ కంపెనీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందినది. అటున్నరాయిని ఇటు పెట్టకుండానే.. 2013లోనే అప్పటి కాంగ్రెస్‌ప్రభుత్వం ఏకంగా వెయ్యికోట్లను ట్రాన్స్‌ట్రాయ్‌ జేబులో పెట్టేసింది. రాష్ట్ర విభజన అనంతరం.. మారిన రాజకీయ పరిణామాలతో రాయపాటి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం.. తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకోవడం జరిగిపోయాయి. నిజానికి పనులు చేయని ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన చంద్రబాబు ప్రభుత్వం .. ఆ పని చేయకపోగా.. కొత్తగా సబ్‌కాంట్రాక్ట్‌లకు అనుమతించింది. రాయపాటితో విడదీయరాని బంధాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా సబ్‌కాంట్రాక్ట్‌లను నియమించి.. వారికి కోట్లరూపాయలను కూడా ఉదారంగా మంజూరు చేస్తోంది.

మైదుకూరు టీడీపీ ఇన్‌చార్జ్‌కు రూ.142.88కోట్ల సబ్‌కాంట్రాక్ట్‌

పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీలో రూ.142.88 కోట్ల పనులు మైదుకూరు టీడీపీ ఇన్చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ కు, కుడి కాలువకు సంబంధించి ఏడో ప్యాకేజీలో రూ.252 కోట్ల పనులను బొల్లినేని శీనయ్యకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. ఇదే తరహాలో పోలవరం హెడ్ వర్క్స్ పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు.

ఈపీసీ నిబంధనలు తుంగలోతొక్కి సబ్‌కాంట్రాక్ట్‌లకు అనుమతి

నిజానికి ఈ సబ్‌కాంట్రాక్ట్‌లు అప్పగించేముందు ప్రధాన గుత్తేదారుకు ముట్టచెప్పిన మొబిలైజేషన్ అడ్వాన్స్ వసూలు చేయాల్సి ఉంది. కానీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్ మెంట్ అండ్ కన్ స్ట్రక్షన్ నిబంధనలను తుంగలో తొక్కి మరీ ..సబ్ కాంట్రాక్టర్లకు పని ఆధారిత బయానాగా కోట్లరూపాయలు ముట్టచెప్పేందుకు ఏపీ కేబినెట్ తీర్మానించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అయినా ఇవేమీ పట్టించుకోని పాలకులు.. 2018 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామంటున్నారు. నిబంధనలన్నీ పక్కనపెట్టేసి..ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో కోట్లాది రూపాయలను కట్టబెట్టడంపై వెనుక భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

16:11 - January 28, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చేనేత కార్మికులు బలవంతంగా ప్రాణాలు విడుస్తున్నారు. ఉద్యమ కాలంలో కేసీఆర్‌ చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఘనమైన చరిత్రకలిగిన మన చేనేతను కాపాడుతామని సీఎం కేసీఆర్‌ నిత్యం చెబుతున్నా.. నేతన్నలు దైన్యంగానే జీవితాలను వెళ్లదీస్తున్నారు.

మారని నేతన్నల బతుకులు .....

కేసీఆర్‌ సర్కార్‌ ఎన్ని తియ్యటి మాటలు చెబుతున్నా.. నేతన్నల బతుకు చిత్రం ఏమాత్రం మారడం లేదు. తెలంగాణలో దాదాపు 12 లక్షలకు పైగా పద్మశాలీ కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. చేనేత వృత్తిపై దాదాపు 15 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఏడు వేల మంది సొసైటీల కింద పని చేస్తుండగా.. మిగతావారు స్వతంత్రంగా చేనేత పనులు చేస్తున్నారు. రాష్ట్రంలో 50 వేల పవర్‌లూమ్స్‌ ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 39 వేల పవర్‌లూమ్స్‌ ఉన్నట్లు గుర్తించారు. మిగిలినవి నల్లగొండ, వరంగల్‌, గద్వాల, నారాయణపేట ప్రాంతాల్లో ఉన్నాయి. ఎన్ని కష్టనష్టాలు ఉన్నప్పటికీ.. ఈ వృత్తిని వదులుకోలేక నేతన్నలు అందులోనే కొనసాగుతూ ఇబ్బందులు పడుతున్నారు.

టెస్కోని పటిష్టం చేయాలని డిమాండ్‌ ...

కష్టాల్లోఉన్న చేనేత రంగాన్ని కాపాడడ్డానికి వెంటనే చర్యలు చేపట్టాలని కార్మికసంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దీనికోసం తక్షణమే రాష్ట్ర చేనేత సహకార సంఘం..టెస్కోని పటిష్టం చేయాలంటున్నారు. మిల్లు బట్టలకు ధీటుగా ఎదగడానికి చేనేత రంగానికి చేయూత నివ్వాలంటున్నారు.

చేనేత చైతన్యయాత్రకు సిద్ధం...

చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయేందుకు, చేనేత చైతన్య యాత్ర చేపట్టేందుకు కార్మికసంఘం నేతలు సిద్దమౌవుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజోలిలోనుండి నల్లగొండ జిల్లా పోచంపల్లిలో వరకూ యాత్ర చేయనున్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి నానాటికీ దిగజారుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని,గత బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించలేదనే విమర్షలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చేనేత కార్మిక సమస్యలపై స్పందించి ... వచ్చే బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాలని చేనేతకార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

16:08 - January 28, 2017

విజయవాడ: ప్రత్యేక హోదా చుట్టు తిరుగుతున్న ఏపీ రాజకీయాలు వైసీపీ నేతలకు కొంత ఊరటనిస్తోంది. అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ఇదే సరైన అస్త్రంగా భావిస్తున్న వైసీపీ.. క్యాడర్‌లో మనోస్థైర్యాన్ని నింపుతున్నామన్న భావన కన్పిస్తోంది. హోదా సాధ్యమయ్యేది కాదంటూ అధికార పార్టీ సహా కేంద్ర పెద్దలు కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో హోదా అంశాన్ని ప్రజా ఉద్యమంగా మలిచేందుకు దాదాపు రెండున్నరేళ్లుగా జగన్మోహన్ రెడ్డి స్కెచ్ వేస్తున్నారు.

జగన్, పవన్ హోదా ఉద్యమంలో పోటీ...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హోదా అంశాన్ని తెరపైకి తేవడంతో జగన్, పవన్ హోదా ఉద్యమంలో పోటీ పడుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. పవన్ కు సినీ గ్లామర్ కూడా కలిసి రావడంతో జగన్ దాన్ని అధిగమించేందుకు రాజకీయంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఏపీలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీ అన్ని జిల్లాల్లో విజయవంతం కావడం.. జగన్ పాల్గొంటున్న విశాఖలో ఉద్రిక్తతకు దారి తీయడం తమకు రాజకీయంగా కలిసి వచ్చే అంశంగానే ప్రతిపక్ష పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు.

ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎండగట్టడంలో...

ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎండగట్టడంలో పై చేయి సాధించామన్న భావన ప్రతిపక్ష పార్టీలో కనిపిస్తోంది. ఇదే ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీపై మరింత దూకుడు పెంచే పనిలో ప్రతిపక్ష పార్టీ నేతలు పడ్డారు.

16:05 - January 28, 2017

కడప : పులివెందుల యెడుగూరి సందింటి వారి ఫ్యామిలీకి పెట్టని కోట. పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు ఆ కుటుంబ సభ్యులు పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది యాభై ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఇందులో వైఎస్ రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి ఎంత కీలకమో.... వారి కుటుంబ సభ్యులు కూడ అంతే కీలకం. వైఎస్ ముఖ్యమంత్రిగా రాజధానిలో ఉంటే.. పులివెందుల పట్టు ఏ మాత్రం సడలకుండా చూసేది మాత్రం ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి. ఆ తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి.. వైఎస్ మనోహర్ రెడ్డిలు ఆ పాత్ర నిర్వహించారు. అందుకే పులివెందుల పంచాయితీ నుంచి ఎంపీ స్థాయి వరకు వైఎస్ కుటుంబసభ్యులే ఉంటారు.

వైఎస్ మరణం తర్వాత...

వైఎస్ మరణం తర్వాత వారి కుటుంబంలో పొరపొచ్చాలు మొదలయ్యాయి. వైఎస్ మరణంతో ఖాళీ అయిన పులివెందుల నాటి నుంచి వైఎస్ వివేకా ఎమ్మెల్యేగా... వదిన విజయమ్మకు పోటీగా బరిలో దిగారు. అయితే.. ఆయనకు అప్పుడు డిపాజిట్టు కూడా దక్కలేదు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబం... వైఎస్ వివేకా కుటుంబాల మధ్య కొన్నాళ్లు మాటలు.. అసలే లేకుండా పోయాయి. ఆ తర్వాత మనసు మార్చుకుని వైఎస్ వివేకా కుటుంబంతో కలిసి పోయారు. ఆ తర్వాత ఇప్పుడు అలాంటి విబేధాలే వైఎస్ కుటుంబంలో చెలరేగాయి. వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి పార్టీకి దూరం అవుతారన్న ప్రచారం జిల్లాలో జోరందుకుంది. ప్రస్తుతం వైఎస్ మనోహర్ రెడ్డి భార్య వైఎస్ ప్రమీలమ్మ పులివెందుల మున్సిపల్ చైర్మన్ గా ఉంది. అయితే మున్సిపాల్టీలో ఇతర వైఎస్ కుటుంబ సభ్యుల జోక్యం పెరిగి.. చైర్మన్ గా ఉన్న మనోహర్ రెడ్డి, ప్రమీలమ్మ మాటకు విలువ తగ్గడంతో మనోహర్ రెడ్డి అలక పాన్పు ఎక్కినట్టు జిల్లాలో చెప్పుకుంటున్నారు. ఇటీవలే మున్సిపల్ కమీషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దీని వెనుక కూడ వైఎస్ కుటుంబంలోని కొందరి పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.

ఇతరుల జోక్యం పెరగడాన్ని సహించని వైఎస్ మనోహర్ రెడ్డి...

మున్సిపాల్టీలో ఇతరుల జోక్యం పెరగడాన్ని సహించని వైఎస్ మనోహర్ రెడ్డి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారని జిల్లాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి వద్దకు కూడ వెళ్లారని ప్రచారం జరిగింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన కుటుంబ సభ్యులు మనోహర్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం వివేకా అభ్యర్థిగా బరిలో ఉన్న నేపథ్యంలో కుటుంబ విభేధాలు పార్టీకి నష్టం కలిగిస్తుందని వైసీపీ నేతలు ముందు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

వైఎస్ మనోహర్ రెడ్డి ప్రస్తుతం పార్టీకి దూరమైనా...

వైఎస్ మనోహర్ రెడ్డి ప్రస్తుతం పార్టీకి దూరమైనా... పార్టీ మారుతారనే వాదనను వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. టీడీపీతో అసలే కలవరని చెబుతున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్న మనోహర్ రెడ్డిని తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల మీద పార్టీ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు.

16:02 - January 28, 2017

వరంగల్ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు...ఆకలి బాధలను సైతం తీర్చుతామంటున్నారు ఇక్కడి అధ్యాపకులు. తాము పనిచేస్తున్న కళాశాలలో ఏ ఒక్క విద్యార్థి ఆకలితో ఉండకూడదని సంకల్పించారు. వారు పనిచేస్తున్న ప్రభుత్వ కళాశాలలో సొంతఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి శ్రీకారం చుట్టారు.

విద్యనభ్యసిస్తున్న 250 మంది పేద విద్యార్థులు ...

ఈ కాలేజీ వరంగల్ శివారులోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల. కొన్నేళ్లుగా ఈ కాలేజీలో చాలా మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్, సెంకడ్ ఇయర్ కలిపి మొత్తం 250 మంది విద్యార్థులు సైన్స్ అండ్ ఆర్ట్స్ కోర్సులను అభ్యసిస్తున్నారు. ఈ కళాశాలలోచాలా మంది విద్యార్థులు నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే.

మధ్యాహ్నం తర్వాత కళాశాలలో కనిపించని విద్యార్థులు....

చదువుకునేందుకు కాలేజీ వచ్చే విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత కాలేజీలో కనిపించరు. పరీక్ష ఫీజులు కట్టుకునేందుకు చాలా మంది విద్యార్థులు కూలీ పనికి వెళుతుంటారు. మధ్యాహ్నం కాలేజీకి లంచ్ బాక్స్ తెచ్చుకోకుండా కూలీ పనికి వెళ్లే వారు. దీంతో విద్యార్థుల చదువులు అరకొరగానే సాగుతుండేవి. ఇది గమనించి కాలేజీ అధ్యాపకులు..విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు వారి కడుపు నింపేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసి వారు కూలీ పనులకు వెళ్లకుండా ఆపగలిగారు. ఈ కళాశాలలో పనిచేస్తున్న 18 మంది అధ్యాపకులు, సిబ్బంది తమ సొంత డబ్బులతో విద్యార్థులకు మధ్యాహ్నా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. వారానికి సరిపడ మెనూను తయారు చేసి దాని ప్రకారం విద్యార్థులకు భోజనం పెడుతున్నారు.

ప్రతి ఏడాది వార్షిక పరీక్షలు జరిగే 3 నెలల పాటు మధ్యాహ్న భోజనం...

ప్రతి ఏడాది వార్షిక పరీక్షలు జరిగే మూడు నెలల పాటు మధ్యాహ్న భోజన పథకంను నడిపిస్తున్నామంటున్నారు కళాశాల ప్రిన్సిపాల్. మధ్యాహ్న భోజనం కోసం కళశాల అధ్యాపకులు, సిబ్బంది సహకారం అందరికి ఆదర్శమంటున్నారు. తమ కళాశాలలో మధ్యాహ్న భోజనంను అమలు చేయడంతో పిల్లల హాజరు శాతం బాగా పెరిగిందని ప్రిన్సిపల్ చెబుతున్నారు. రంగశాయిపేట ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులు ఉదారంగా ఆలోచించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీన్ని స్పూర్తిగా తీసుకొని ఇతర ప్రభుత్వ కళాశాలలో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించవచ్చు.

15:58 - January 28, 2017

విజయవాడ : విశాఖ వేదికగా మొదలైన ప్రత్యేక హోదా మలి దశ ఉద్యమం .. టీడీపీ, వైసీపీ, జన సేన పార్టీలను ఎలా ప్రభావితం చేయబోతోంది?.. ట్విట్టర్ ప్రకటనలకే పరిమితమవుతున్న పవన్ ప్రజల్లోకి వస్తారా?... జగన్ కు ఇక హోదానే ఎజెండా కాబోతుందా?.. టీడీపీ పరిణామాలను ఎలా ఫేస్ చేయబోతోంది?..

ప్రత్యేక హోదాపై కలిసికట్టుగా పార్టీలు కలిసి పోరాడేందుకు ..

జల్లి కట్టు .. ప్రత్యేక హోదాపై కలిసికట్టుగా పార్టీలు కలిసి పోరాడేందుకు స్ఫూర్తినిచ్చింది..... ప్రత్యేక హోదాపై గతంలో బంద్‌లు, ఆందోళనలు జరిగినా.. కేంద్రం ఇవ్వమని తేల్చేసిన తర్వాత.. ప్రతిపక్షం వైసీపీతో పాటు కొన్ని పార్టీలు ప్రత్యేక హోదాపై బలమైన ఉద్యమాన్ని నిర్మించలేకపోయాయి.. మధ్యలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లు ద్వారా కొంత చర్చకు అవకాశం కల్పించినా.. కేంద్రం అది ద్రవ్య బిల్లంటూ అంశాన్ని పక్కదారి పట్టించేసింది.. వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళనలు , సదస్సులు నిర్వహిస్తున్నా.. ప్రధాన పార్టీలు కలిసి రాకపోవడంతో ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతం కాలేదు... ఆ తర్వాత తమిళనాడులో జల్లి కట్టును సాంప్రదాయంగా కొనసాగించడంపై సీఎం నుంచి సినీ రంగం వరకు చూపిన పోరాట పటిమ.. తెలుగు ప్రజలను కదిలించింది..

అరెస్టులు, నిర్భందాల ద్వారా అడ్డుకట్ట వేసే ప్రయత్నం ...

విశాఖ వేదికగా రామకృష్ణ బీచ్ సాక్షిగా ఉద్యమ శంఖం పూరించాలనుకున్న యువత స్పూర్తికి బాబు సర్కార్ అరెస్టులు, నిర్భందాల ద్వారా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పలు పార్టీలుకు సంబంధించిన నేతలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్భందంలో పెట్టి, అరెస్టుల పర్వానికి తెరలేపింది... అయినా ఆందోళనలు ఆగలేదు..

కాంగ్రెస్ పార్టీ అనంతపురం లో మౌన దీక్ష చేపట్టింది.. విశాఖలో నిరసన తెలిపేందుకు వెళ్లిన జగన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.. దీంతో ఆగ్రహించిన వైసీపీ నేతలు విశాఖలో రన్ వే పై బైఠాయించడంతో పరిస్థితి వేడెక్కింది... ఇప్పటికే జూన్ లో తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ అల్టిమేటం కూడా ఇచ్చారు... మరో వైపు జనసేన అధినేత పవన్ కూడా కేంద్రం రాష్ట్రం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు....

ప్రత్యేక హోదాతో పారిశ్రామిక రాయితీలు వస్తాయా? అంటున్న చంద్రబాబు...

తాజా పరిణామాలు చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరి తయారైంది.. ప్రత్యేక హోదా తో పారిశ్రామిక రాయితీలు వస్తాయా .. ఆధారాలు చూపండంటూ వ్యాఖ్యానించడం.. ప్రత్యేక హోదాలో చెప్పినవన్నీ.. ప్రత్యేక ప్యాకేజీలో ఉన్నాయని అందుకే ఒప్పుకున్నానని బాబు చెప్పుకొచ్చారు.. కానీ అదే సందర్బంలో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత లేదని ఆయనే చెబుతున్నారు.. దీని కోసం పోరాడితే తానూ కలిసివస్తానని బాబు ప్రకటిస్తున్నారు..... పోరాడే వాళ్లను ప్రోత్సహించకుండా.. కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారన్న అపవాదును ఆయన మూటగట్టుకున్నారు.. ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని గట్టిగా అడగలేరు.. కేంద్రం చంద్రబాబు అంతగా పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది.. అలా అని ఇక్కడ ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్న విపక్షాలను సమర్ధిస్తే.. వాళ్లు రాజకీయం మైలేజ్ పొందుతారు... దీంతో ఉద్యమకారులను అణిచివేయాలనే ఆయన వ్యూహాం రాజకీయంగా ప్రజల్లో టీడీపీ గ్రాఫ్ పలుచనయ్యేలా కనిపిస్తోంది. దీంతో ఏం చేయాలో బాబుకు పాలుపోవడం లేదు.. అందులోనూ కొన్ని మీడియా ఛానెళ్లపై అసహానం, సుజనా చౌదరి వంటి నేతల వ్యాఖ్యలు.. బాబును మరింత ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి....

పవన్‌ను పల్లెత్తు మాట అనని జగన్‌....

యువత జగన్ వలలో పడ్డారని తెలుగు దేశం నేతలు వ్యాఖ్యానించారు.. అయితే జగన్ వలలోనే టీడీపీ పడినట్లుందని విశ్లేషకులంటున్నారు.. విశాఖలో పరిణామాలు.. జగన్‌ అరెస్టు, తిరిగి హైదరాబాద్ పంపించేయడం తో జగన్ కు కొంత మైలేజ్ అయితే వచ్చింది.. అయితే ఈ మైలేజీను ప్రత్యేక హోదా సాధన దిశగా జగన్ ఎలా మల్చుకుంటారనేది ఆయన రాజకీయ చతురతపై ఆధారపడి ఉంటుంది.. గతంలోనూ ప్రత్యేక హోదాపై దీక్షలు నిర్వహించన ఆయన.. కొంత కాలం మిన్నకుండిపోయారు.. అందులోనూ ఇదే డిమాండ్ తో పవన్‌ కళ్యాణ్‌ స్వంతంగా ప్రజల్లోకి రావడం యువతలో కొంత మద్దతు కనిపిస్తుండటం జగన్ శిబిరంలో అలజడికి కారణమైంది.. అదే సమయంలో పవన్ పై ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఆ వర్గం ఓట్లు పోతాయన్న భయం. పైగా వైఎస్‌ కాలం నుంచి వారిలో పెద్ద భాగం ఆ కుటుంబంతోనే వున్నారు. కనుక ఇప్పుడు వారిని దూరం చేసుకోకూడదు. అందుకే వైసీపీ నేతలెవ్వరూ పవన్ పై పల్లెత్తు మాట అనడం లేదు. పవన్ బిజెపిని ఎక్కువుగా టార్గేట్ చేసుకుంటే.. జగన్ మాత్రం టీడీపీని టార్గెట్ చేసుకున్నారు..

ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా ...

ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని గత అక్టోబర్ లో జగన్ ప్రకటించారు.. కానీ ఈ సారి స్పష్టంగా జూన్ లో అంటూ ప్రకటించారు... మరి ప్రజల్లోకి హోదా ఎజెండాతో ప్రజల్లో ఎలా దూసుకుపోతారనేది చూడాలి.. ఎందుకంటే ఇప్పటికే జగన్ కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న.. ఎస్పీ ఓటు బ్యాంకును దెబ్బకొట్టేందుకు బాబు అండ్ టీం వ్యూహాలు పన్నుతోంది. అలాగే రాయలసీమలో జగన్ కు అండగా ఉన్న రెడ్లను .. జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్లను ఉపయోగించి విభజించే ప్రయత్నం చేస్తోంది.. ఒక వైపు పవన్ స్పీడు మరోక వైపు చంద్రబాబు వ్యూహాలతో ఏం చేయాలో తెలియక తికమక పడుతున్న జగన్ కు హోదా అంశం ఖచ్చితంగా కొత్త అస్త్రమే... విశాఖ బీచ్ సమావేశానికి, పవన్ తో పాటు జగన్ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది.. రానున్న రోజుల్లో ఈ రెండు శక్తులు హోదా అంశంపై ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాయో లేదో చూడాలి..

టీడీపీ నేతలపైనే స్వరం పెంచిన పవన్‌...

ఇక పవన్ విషయానికోస్తే... కేంద్రంపై ధ్వజమెత్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని సుతిమెత్తగా వదిలేస్తారు. వైసీపీ మాత్రం టీడీపీనే టార్గెట్ చేస్తోంది.. అదో పెద్ద తేడా. అయితే గత రెండు రోజులుగా సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలపైనే పవన్ స్వరం కొంత పెంచారు.. మీరు పోరాడరు.. మేం పోరాడితే అణిచివేస్తారంటూ డైరెక్టుగా చంద్రబాబుపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.. గతంలో ఎంపీలపై మాట్లాడిన ఆయన.. ఈ సారీ సుజనాచౌదరి, రాయపాటిపై ఎటాక్ కు దిగారు.. అయితే జల్లి కట్టును స్ఫూర్తిగా తీసుకోవాలంటూ పవన్ ట్వీట్లతోనే మళ్లీ ప్రత్యేక హోదా మలిదశ ఊపందుకొన్న మాట వాస్తవం.. అయితే విశాఖ లో నిరసనలు హజరవుతాని ముందు చెప్పి.. తర్వాత రాలేనంటూ పవన్ ప్రకటించడంపై యూత్ లో అసంతృప్తి రగిల్చింది.. ఒక మీడియా సమావేశంతో ఆయన ముక్తాయింపు ఇచ్చుకున్నా... ట్వీట్లతో కాదు పవన్ ప్రజల్లోకి వచ్చి పోరాడాలంటూ వస్తున్న విమర్శ.. ఖచ్చితంగా పవన్ గుర్తించాల్సిందే... జగన్ పవన్ ను పోటీ గా ఫీలవుతున్నారేమో గానీ.. పవన్ మాత్రం అలా ఫీలయినట్లుగా కనిపించడం లేదు...

వైసీపీ, జనసేన మధ్య ఉన్న వైరుధ్యం టీడీపీ కి అవకాశం గా ఉండేంది..

మొన్నటి వరకు వైసీపీ, జనసేన మధ్య ఉన్న వైరుధ్యం టీడీపీ కి అవకాశం గా ఉండేంది.. అయితే ఇప్పుడు జగన్ , పవన్ ఇద్దరూ ప్రత్యేక హోదా అజెండాపై మాట్లాడుతున్న నేపథ్యం.. టీడీపీ కి సంకటమే.. ఈ పరిస్థితే రాష్ట్రంలో రాబోయో రాజకీయ పరిణామాలు వేడేక్కుతున్నాయనడానికి సంకేతమని రాజకీయ విశ్లేషకులంటున్నారు... పవన్ ఫ్యాక్టర్ బలపడితే.. వైసీపీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది.. ఒక వేళ జగన్ బలపడితే.. జనసేనాని వ్యూహాం ఎలా ఉంటుంది.. వీరిద్దరు బలపడకుండా .. ప్రజలను మెప్పించడానికి బాబు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరం....

15:54 - January 28, 2017

హైదరాబాద్: సినిమా స్టార్లు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేయనున్నట్టు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ఫిబ్రవరి -5న ఎల్‌బీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుందని చెప్పారు. గ్రేటర్‌లో పాలకమండలి ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా స్వచ్ఛ హైదరాబాద్‌కు మరింత ప్రచారం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. మహిళకు, పురుషులకు వేర్వేరుగా మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా క్రికెట్‌ మ్యాచ్‌ లోగోలను, జర్సీలను ఆయన సినీస్టార్స్‌, కార్పొరేటర్లతో కలిసి విడుదల చేశారు. పురుషుల సినీస్టార్స్‌ టీమ్‌కు హీరో శ్రీకాంత్‌, కార్పొరేటర్ల టీమ్‌కు శ్రీనివాస్‌రెడ్డి నాయకత్వం వహిస్తారు. ఇక మహిళా కార్పొరేటర్ల బృందానికి విజయలక్ష్మి, సినీస్టార్స్‌ బృందానికి హీరోయిన్‌ సంజన నేతృత్వం వహించనున్నారు.

15:52 - January 28, 2017

హైదరాబాద్: చారిత్రాత్మక కట్టడం చార్మినార్‌ దగ్గర ఏర్పాటు చేసిన మహిళా టాయిలెట్స్‌ను నగర మేయర్ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించారు. నగరంలోనే మొదటి సారిగా ఎలక్ట్రానిక్‌ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేసినట్టు మేయర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరంలో వెయ్యి పబ్లిక్‌ టాయిలెట్స్‌ అవసరం అవుతాయని.. ఇప్పటికే 900 టాయ్‌లెట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పౌరసేవల కల్పనలో వివిధ కంపెనీలు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు.

15:50 - January 28, 2017

విజయవాడ : బీజేపీకీ మేకప్ వేసుకున్న వారు అవసరమేమో కానీ తమ పార్టీలో అందమైన హృదయం ఉన్నవారు ఉన్నారని ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ వ్యాఖ్యలకు నిరసనగా ఏపీ మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ప్రియాంకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కటియార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని.. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటున్నా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

15:48 - January 28, 2017

జమ్ము-కశ్మీర్‌ : కప్వారా జిల్లాలో తీవ్ర హిమవత్పాతంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మంచుచరియల్లో చిక్కుకున్న ఐదుగురు జవాన్లలో ముగుర్ని రక్షించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. హిమవత్పాతంతో కుప్వారా ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచార వ్యవస్థ చిన్నాభిన్నమైంది. సహాయ చర్యలు ముమ్మరంగా కొసాగుతున్నాయి.

నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై కేసు నమోదు..

హైదరాబాద్ : జీవో నెంబర్ 42 ను ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై కేసు నమోదు చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో 188, 418, 420 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.

అక్వా ఫుడ్ ఫ్యాక్టరీని తరలించాలి - సీపీఎం..

పశ్చిమగోదావరి : తుందుర్రులో అక్వా ఫుడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం జరిగింది. ఫిబ్రవరి 5వ తేదీలోపు ఫ్యాక్టరీని వేరే చోటుకు తరలించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. ప్రభుత్వం వైఖరిని తెలపకపోతే ఐదో తేదీ తరువాత ఉద్యమం తీవ్రతరం చేస్తామని సీపీఎం హెచ్చరించింది.

15:37 - January 28, 2017

కొబ్బరి తినడం వల్ల దగ్గు..ఇతర సమస్యలు వస్తాయని చాలా మంది ఊహించుకుంటుంటారు. కానీ కొబ్బరి తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. కొబ్బరిలో మంచి గుణాలెన్నో ఉన్నాయి. కొబ్బరిలో పోషక పదార్థాల గని ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటుంటారు.
కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరి ముక్కలు, కొబ్బరితో చేసిన కుకీస్ ఇలా కొబ్బరితో చేసిన ప్రతీదీ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
కొబ్బరిలో లభించే కొవ్వులు శక్తిని ఇస్తాయి.

  • కొబ్బరిలో లభించే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్లు కేలరీలు కరిగించడంలో తోడ్పడతాయి.
  • వంద గ్రాముల కొబ్బరిని ఆహారంగా తీసుకుంటే శరీరానికి 354 కేలరీల శక్తి లభిస్తుంది.
  • 150 కేలరీల శక్తినిచ్చే మేర అంటే 50 గ్రాముల కొబ్బరిని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి.
  • పచ్చికొబ్బరిని తింటే బరువు తగ్గడమే కాదు.. అది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
  • పాలు వచ్చే కొబ్బరిని రోజుకు ఒక కాయ చొప్పున తింటే ఎంతో మంచిది.
  • ప్రతి రోజు విడిగా తినడం కుదరని వారు కూరల్లో పొయ్యి మీద నుంచి దించే ముందు చల్లుకొని తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
  • శారీరకంగా ఎక్కువ అలసటకు గురయ్యేవారు పచ్చి కొబ్బరిని తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది.
  • కొబ్బరి వల్ల థైరాయిడ్ సమస్యలు కూడా అదుపులో ఉంటాయి.
15:21 - January 28, 2017

ఎప్పుడు దెయ్యం, రక్తచరిత్ర అంటూ ఆడియన్స్ ని ఇరిటేట్ చేసే కాంట్రావర్శీ రామ్ గోపాల్ వర్మ ఈసారి ఫీల్ గుడ్ మూవీ చేయబోతున్నాడట. బ్యూటీపుల్ అంటూ బ్యూటీపుల్ టైటిల్ తో ట్వీటర్ దర్శకుడు ఓ మూవీకి సన్నాహాలు చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అలీయాభట్ తెలుగు హీరో కాంబోలో వర్మ ఈ మూవీకి ప్లాన్స్ చేస్తున్నాడు. వర్మ బ్యూటీపుల్ మూవీ విశేషాలేంటో ఈ స్టోరీ చూడండి.  రామ్ గోపాల్ వర్మ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే సినిమాలు తీయడం ఎప్పుడో మరిచిపోయాడు. కాంట్రావర్శీలు, ట్విట్టర్ కామెంట్స్ తో కాలక్షేపం చేస్తున్న ఈ దర్శకుడు సక్సెస్ పుల్ స్టోరీ రాయడం కోసం మాత్రం టైం కేటాయించలేకపోతున్నాడు. అందుకే చాలాకాలంగా ఆయన డి గ్రేడ్ మూవీస్ డైరెక్టర్ గా పడిపోయాడు. ఈ విషయం గమనించనంతలేనంతగా వర్మ ట్వీటర్ తో టైం పాస్ చేస్తున్నాడు. వంగవీటి గొప్ప సినిమా అంటూ సొంతడబ్బా కొట్టుకోవడానికి ప్రయత్నించిన వర్మకు మరోసారి షాక్ తగిలింది. అయిన కూడా తన పంథా అనదే అన్నట్లు వ్యవహరించే వర్మ ఈసారి ఓ బ్యూటీపుల్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం వర్మ సర్కార్ మూవీ థర్డ్ పార్ట్ సర్కార్ 3ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈమూవీ రిలీజ్ కి రెడీ గా ఉంది. ఈ సినిమా తరువాత ఆయన బ్యూటీపుల్ టైటిల్ తో బాలీవుడ్ లో ఓ రోమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించాలని భావిస్తున్నాడట. అలీయాభట్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో తెలుగు హీరో జీనియస్ ఫేం హవీష్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే..సెట్స్ పైకి..
త్వరలోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని వర్మ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎప్పుడు దైయ్యాలు, రక్తపాతాలు అంటూ ఆడియన్స్ ని బోర్ కొట్టించిన వర్మ ఇప్పుడు బ్యూటీపుల్ అనే సినిమా చేస్తుండడంతో బీటౌన్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. దీనికి తోడు ఈ సినిమాలో అలియాభట్ హీరోయిన్ గా నటిస్తుండడంతో ఈ మూవీపై బాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యే చాన్స్ లు కనిపిస్తున్నాయి. దర్శకుడిగా పూర్తిగా దిగజారిపోయిన వర్మ చాలా కాలం తరువాత బ్యూటీపుల్ లాంటి పాజిటివ్ అండ్ ఫీల్ గుడ్ టైటిల్ పెట్టడం ఆడియన్స్ కి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే వర్మ ఆటిట్యూడ్ తెలిసివాళ్లు మాత్రం బ్యూటీపుల్ అనే టైటిల్ పెట్టినంత మాత్రన సినిమాను అద్భుతంగా తీస్తాడని అనుకోవడానికి వీలులేదంటూ సెటైర్స్ వేస్తున్నారు. అన్నట్లు దర్శకుడిగా వర్మ మీద సిని జనాలకు ఎప్పుడో ఇంప్రెషన్ పోయింది. ఏదైనా అద్భుతం చేస్తే తప్పా ఒకప్పటి రామ్ గోపాల్ వర్మను ఆడియన్స్ చూడడం కష్టమే.

15:16 - January 28, 2017

నగరంలో సంచరిస్తున్న కిలాడీలు..సంచరిస్తున్న కిలాడీలు..చీరల దుకాణాల్లో చోరీలు..షారూ ఓనర్లు జర భద్రం...

మహానగరంలో చాలాకాలం తరువాత మాయలేడీలు బయటకొచ్చారు. కొన్నాళ్ల క్రితం వరుసగా తెలుగు రాష్ట్రాల్లో చీరల చోరీమణుల గుట్టు బయటపడడంతో జాగ్రత్తపడ్డారు. మళ్లీ మహానగరంలోని ఓ దుకాణంలో దొరికింది దోచేశారు. చీరల షాపులను ఎంచుకుని చాకచక్యంగా నొక్కేస్తుంటారు. కొనుగోలు చేసినట్లు షాపు యజమానిని నమ్మించారు. మాటల్లో పెట్టి మూడు లక్షల విలువైన చీరలను దొంగిలించారు. చోరీ అనంతరం విషయం తెలుసుకున్న షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు కిలాడీల కోసం గాలిస్తున్నారు.

14:54 - January 28, 2017

'మహేష్ బాబు' కెరీర్ లో 'శ్రీమంతుడు' సినిమా వెరీ స్పెషల్ అని చెప్పాలి. బాక్సాఫీసు వద్ద న్యూ రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ నటుడిగా ప్రిన్స్ కి జాబ్ శాటిఫెక్షన్ ఇచ్చిందని ప్రిన్స్ చాలా సార్లు చెప్పాడు. హీరోగా 'మహేష్' కి ఇంతటి పేరు తీసుకొచ్చిన 'శ్రీమంతుడు' ఇప్పుడు ఆయనను కోర్టు మెట్లు ఎక్కిస్తోంది. అవును 'శ్రీమంతుడు' సినిమాలో నటించినందుకు ఈ స్టార్ హీరోపై కేసు నమోదైంది. పక్కా కమర్షయల్ సినిమాలు చేసే 'మహేష్ బాబు' తొలిసారి సోషల్ కంటెంట్ ఉన్న 'శ్రీమంతుడు' సినిమా చేసి భారీ విజయం అందుకున్నాడు. ఓ ధనవంతుడి కొడుకు సొంత ఊరిని దత్తతకు తీసుకుని డెవలప్ చేసే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద వందకోట్ల కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో నటించినందుకు ఇండస్ట్రీ వాళ్లతో పాటు చాలా మంది 'మహేష్' పై ప్రశంసలు కురిపించారు. హీరోగా 'మహేష్ బాబు'కు ఇంతటి పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చిన 'శ్రీమంతుడు' సినిమా ఇప్పుడు ఓ అపవాదుని కూడా తెచ్చిపెట్టింది.

కోర్టులో కేసు వేసిన రచయిత..
'శ్రీమంతుడు' సినిమా 'మహేష్ బాబుని మరో మెట్లు ఎక్కించడంతో పాటు ఇప్పుడు కోర్ట్ మెట్లు ఎక్కించబోతోంది. దర్శకుడు కొరటాల దర్శకత్వంలో 2015లో రిలీజైన ఈ మూవీ స్టోరీ వివాదంగా మారింది. ఈ వివాదం దర్శకుడు కొరటాల శివతో పాటు హీరో 'మహేశ్ బాబు'కు తలనొప్పిగా మారింది. 'శ్రీమంతుడు' సినిమా కథ తనదేనని, కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఒక వారపత్రికలో 2012లో తాను రాసిన సీరియల్ నే కాపీ కొట్టి 'శ్రీమంతుడు' సినిమాగా తెరకెక్కించారని సదరు రచయిత కోర్ట్ లో కేసు వేశాడు.

నష్టపరిహారం ఇప్పించాలని అంటున్న రచయిత..
తాను రాసిన చచ్చేంత ప్రేమ సీరియల్ ని కాపీ కొట్టి సినిమాగా చేసి హిట్టు కొట్టారని కనుక తనకు న్యాయం చేయాలని రచయిత శరత్ చంద్ర ఎడాది కిందట కేసు వేశాడు. రచయిత చేసిన ఫిర్యాదును పరిశీలించిన నాంపల్లి కోర్టు తాజాగా సినిమా హీరో 'మహేశ్ బాబు'కు..చిత్ర దర్శకుడు కొరటాల శివలను కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రచయిత చేసిన ప్రైవేటు ఫిర్యాదుతో మహేష్ బాబు, కొరటాల శివపై ఐపీసీ 120బీ కాపీరైట్ యాక్ట్ లోని సెక్షన్ 63 కింద కోర్టు కేసు నమోదు చేసి కోర్ట్ కి హాజరు కావాలని ఆదేశించింది. మరి రచయితకి నష్టపరిహారం చెల్లించి ఈ కేసు నుంచి 'శ్రీమంతుడు' టీం బయటపడుతుందేమో చూడాలి.

14:36 - January 28, 2017

యాదాద్రి : భువనగిరి మండలం రాయగిరి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు సాయిగణేష్‌, చరణ్ మృతిచెందారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు జనగామ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

14:33 - January 28, 2017

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు సబ్‌ ప్లాన్ అమలు చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు కాంగ్రెస్ సీనియర్‌ నేత వీ హన్మంతరావు. సబ్‌ ప్లాన్‌కు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచి బీసీ ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఓటు బ్యాంకులో అత్యధిక శాతం ఉన్న బీసీల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.

14:32 - January 28, 2017

బోధన్ : నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఆస్తులను కొల్లగొట్టడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు తెలంగాణ టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు... నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వమే ఓపెన్‌ చేసి.. నడిపించాలని డిమాండ్‌ చేశారు.

14:30 - January 28, 2017

హైదరాబాద్: బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్లు, వ్యాపార కేంద్రాలు, సంద‌ర్శన స్థలాలు, ప్రభుత్వ ఆసుప‌త్రులు జ‌న‌స‌మర్థమైన ఇత‌ర అన్ని ప్రాంతాల్లో తాగునీటి వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో బాటిల్ లేదా వాట‌ర్ ప్యాకేట్ పై ఉన్న ధ‌ర‌ కంటే ఎక్కువ ధ‌ర‌కు నీటిని అమ్ముతున్నారు. ఇక స‌మ్మర్‌ లో అయితే కూల్ వాట‌ర్ కి ఎక్కువ రేటు వ‌సూలు చేసేవారు మ‌న‌కు ద‌ర్శనమిస్తుంటారు. చిన్న చిన్న ప‌ట్టణాల నుండి న‌గ‌రాల వ‌ర‌కు త్రాగు నీటి వ్యాపారం పెరిగిపోతుంది. లీట‌ర్ వాట‌ర్ బాటిల్ 20రూపాయ‌ల‌నుండి 25రూపాయ‌ల‌కు అమ్ముతున్నారు. ఇంత ధ‌ర‌లు భ‌రించ‌లేని వారు త‌మ దాహార్తిని తీర్చుకోవ‌డానికి ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌స్యను గ‌ట్టెక్కించడానికి గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ప్రత్యేక ప్లాన్ చేస్తున్నారు అదికారులు.

హైద‌రాబాద్ లో ఉన్న జ‌న‌స‌మ్మర్థవంత‌మైన ప్రాంతాల్లో ...

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో ఉన్న జ‌న‌స‌మ్మర్థవంత‌మైన ప్రాంతాల్లో కేవ‌లం ఒక్క రూపాయికే లీట‌ర్ త్రాగునీటిని అందించాల‌ని డిసైడ్ చేశారు అదికారులు. సామాన్యులంద‌రికి అందుబాటులో ఉండేలా కేవ‌లం ఒక్కరూపాయికే లీట‌ర్ కూల్ వాట‌ర్ అందించేందుకు సిద్దమ‌య్యారు. ఇప్పటికే ఇందిరా పార్కు వ‌ద్ద జ‌న‌జ‌ల్ అద్వర్యంలో హైద‌రాబాద్ మెట్రో వాట‌ర్ బోర్డు ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తోంది. ఇక్కడ ప్రతి రోజు 100 నుండి 150 మంది ఈ సౌక‌ర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందిరాపార్కుకు వ‌చ్చే సంద‌ర్శకుల‌తో పాటు ధర్నా చౌక ద‌గ్గర్లోనే ఈ మిష‌న్ అందుబాటులో ఉండ‌టంతో ధర్నాలు, దీక్షల స‌మ‌యాల్లో 500 మంది 600మంది వర‌కు రూపాయికే లీట‌ర్ నీటిని త్రాగుతున్నారంటున్నారు నిర్వహ‌కులు.

ఇక గ్రేట‌ర్ ప‌రిధిలో 250 ప్రాంతాల్లో ఎనీటైమ్ వాట‌ర్...

ఇక గ్రేట‌ర్ ప‌రిధిలో 250 ప్రాంతాల్లో ఎనీటైమ్ వాట‌ర్ యంత్రాలను స‌మాకూర్చడానికి ప్రణాళిక‌లు త‌యారు చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా బ‌ల్దియా, జ‌ల‌మండ‌లి విభాగాలు సంయుక్తంగా జ‌న‌జ‌ల్ సంస్థతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అయితే స్థానికులు అవ‌స‌రాల‌ను బ‌ట్టి 500 నుంచి వెయ్యి లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని కూడా ఒక్కసారి తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. దూరప్రాంతంనుండి వ‌చ్చే ప్రయాణికులు, త్రాగునీటి కోసం డ‌బ్బులు ఎక్కువ ఖ‌ర్చు చేయ్యలేని వారు తక్కువ డ‌బ్బుల‌తో స్వచ్ఛమైన తాగునీరు పొందవచ్చు. ఈ యంత్రాల్లో జియోలైట్‌ మినరల్‌ సాంకేతికత, రివర్స్‌ ఆస్మోసిస్, అల్ట్రా వయోలెట్‌ ఫిల్ట్రేషన్ వంటి సౌక‌ర్యాలు ఉండ‌టంతో ఎలాంటి బ్యాక్టీరియా ద‌రిచేర‌దు. ప్రజలు భారీగా ఉండే ప్రాంతాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రిల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రద్దీ ప్రాంతాల తర్వాత సిటీలో ప్రతి చోట ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

14:27 - January 28, 2017

ఖమ్మం : రోడ్ల వెంట తిరిగి మొక్కలు నాటుతుంటే చూసేవాళ్లు మొక్కల పిచ్చోడని అవమానించారు. ఆయనా ఎన్ని అవమానాలు ఎదురైనా వాటిని తట్టుకొని మొక్కలే తన ప్రాణంగా భావించి బాల్యం నుంచి మొక్కలు పెంచటమే తన వ్నత్తిగా చేసుకున్నాడు. అలా తన ఐదు సంవత్సరాల వయస్సు నుంచి నేటి వరకు కోటి మొక్కలకు పైగా నాటాడు. ఖమ్మం జిల్లా ఎం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్యను వనజీవి రామయ్య అని పిలుస్తుంటారు. వనజీవి రామయ్య సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు కు ఎంపిక చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు.

సీఐఐ సదస్సులో పాల్గొన్న గడ్కరి..

విశాఖపట్టణం : సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కొనసాగుతోంది. సదస్సులో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జలరవాణాకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు, పంజాబ్ ఎన్నికల అనంతరం బకింగ్ హామ్ కెనాల్ పనులు ప్రారంభిస్తామన్నారు. 

13:56 - January 28, 2017
13:47 - January 28, 2017
13:45 - January 28, 2017
13:44 - January 28, 2017
13:41 - January 28, 2017

టి.కాంగ్రెస్ పై ఎంపీ బూర ఆగ్రహం..

హైదరాబాద్ : టి. కాంగ్రెస్ పై ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన ఆవేదనను ప్రజల ఆవేదనగా తెలియచేస్తోందని, అవినీతి, కాంగ్రెస్ అవిభక్త కవలలని విమర్శించారు. కేసీఆర్ ది రావుల పాలన అనడం దారుణమని, ఉద్యమాన్ని నడిపినప్పుడు కేసీఆర్ కులం గుర్తుకు రాలేద అని ప్రశ్నించారు. పదేళ్లలో కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతమందిని గొప్ప నేతలను చేసిందన్నారు. 2019లో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని, కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదని విమర్శించారు.

13:39 - January 28, 2017

పవన్ పై వెంకయ్య పరోక్ష విమర్శలు..

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ పై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పరోక్ష విమర్శలు గుప్పించారు. జల్లికట్టుపై వాస్తవాలు గుర్తించి మాట్లాడితే బాగుంటుందని, జల్లికట్టును 2011లో యూపీఏ ప్రభుత్వం నిషేధించిందన్నారు. జల్లికట్టు ఆర్డినెన్స్ తెచ్చింది బీజేపీ అని, ప్రాంత విధ్వేషాలు రెచ్చగొట్టడం పద్ధతి కాదన్నారు. ఏమీ చేయకుండా ట్విట్టర్ లో రాజకీయాలు చేస్తున్నారని, దేశం అంతా ఒక్కటన్నదే బీజేపీ లక్ష్యమన్నారు.

రైతు ఆత్మహత్యలపై సుప్రీం తీర్పు హర్షణీయం - షబ్బీర్..

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని, ఈ తీర్పుతోనైనా కేసీఆర్ కళ్లు తెరవాలని టి.కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ వ్యాఖ్యానించారు. రైతు ఆత్మహత్యలను వక్రీకరిస్తున్నారని, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని తెలిపారు. రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం మాట తప్పిందని, రైతు ఆత్మహత్యలకు టీఆర్ఎస్ బాధ్యత వహించాలని సూచించారు.

మంచుకొండల కింద చిక్కుకున్న జవాన్లు..

జమ్మూ కాశ్మీర్ : మాదిల్ సెక్టార్ లో మంచుకొండలు విరిగిపడుతూనే ఉన్నాయి. తాజాగా విరిగిన కొండల కింద ఐదుగురు జవాన్లు చిక్కుకపోయారు. వీరిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఏపీలో మహిళా పార్లమెంటరీయన్ల సదస్సు...

విజయవాడ : మహిళా పార్లమెంటరీయన్ల సదస్సు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సదస్సులో 10వేల మంది విద్యార్థినిలు పాల్గొనున్నారు. ఇందుకు మహిళా వాలంటీర్ల ఎంపికకు కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వేయి మంది వాలంటీర్లను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంపికైన వాలంటీర్లకు పోలీసు శాఖతో రెండు రోజుల పాటు శిక్షణ ఇప్పిస్తామని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. సదస్సుకు వచ్చే విద్యార్థినిలకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.

 

13:26 - January 28, 2017
13:19 - January 28, 2017

హైదరాబాద్ : తమను రెగ్యూలరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఔట్‌ సోర్సింగ్‌ నర్సులు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి భవనం పైకెక్కి నిరసన తెలిపారు. వూయ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. 
మేము చేస్తున్న డిమాండ్‌ న్యాయమైందే... 
తమది కూడా 24 గంటల సర్వీసు కాబట్టి తమను పర్మినెంట్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఔట్‌ సోర్సింగ్‌ నర్సులు కోరుతున్నారు. తాము చేస్తున్న డిమాండ్‌ న్యాయపరమైందంటున్నారు. సమస్య పరిష్కారం కోసం గతంలో చాలాసార్లు వైద్యశాఖ ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా.. ఎలాంటి ఫలితం లేదంటున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, వైద్యాధికారులు తమకు న్యాయం చేస్తామని చెప్పారని, ఇప్పుడు మాట మారుస్తున్నారని ఔట్‌ సోర్సింగ్‌ నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ కూడా తమ సమస్యను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సమస్య పరిష్కారం కావాలనే ఆందోళన చేస్తున్నామని, రోగులకు ఇబ్బందులు కల్గించాలని తమ ఉద్దేశం కాదని చెబుతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. హామీ ఇచ్చే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. పదేళ్లుగా తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా 300 మంది నర్సులు ఔట్‌ సోర్సింగ్‌ విధానం కింద పని చేస్తున్నారు. వీరంతా తమను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:12 - January 28, 2017

వరంగల్ : యువతలో స్కిల్ డెవలప్ మెంట్ కోసం కృషి చేస్తున్న చంద్రశేఖర్ సబ్బవరపు పౌండేషన్‌కు చాలా మంది సహాయసహకారాలు అందించడం మంచి పరిణామామని నిట్ డైరెక్టర్ జిఆర్సీ రెడ్డి అన్నారు. వరంగల్ లో చంద్రశేఖర్ సబ్బవరపు పౌండేషన్ మైల్ స్టోన్ ఆఫ్ దౌంసడ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. పౌండేషన్ స్థాపించిన రెండేళ్లలో 1000 మందికి ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వడం ఆనందంగా ఉందని సంస్థ డైరెక్టర్ తెలిపారు. 

 

13:05 - January 28, 2017

విజయవాడ : ప్రత్యేక హోదా ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధకాండ ప్రయోగిస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు మండిపడ్డారు. విజయవాడలో జర్నలిస్టు సంఘాలు నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన పాల్గొని, మాట్లాడారు. పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసేందుకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన నిర్వహించుకుంటామంటే ప్రభుత్వం అనుమతి ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. హోదా కోసం జరుగుతున్న  ఉద్యమంలో యువత భాగస్వాములవుతుండడంతో ప్రభుత్వంలో వణుకు మొదలైందన్నారు. ప్రభుత్వం లాఠీలతో ఉద్యమాన్ని అణచివేయాలనుకుంటే అది అవివేకమే అవుతుందని పేర్కొన్నారు. విభజన హామీల అమలు కోసం భవిష్యత్‌లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మధు హెచ్చరించారు. 

 

సీఐఐ సదస్సు..టూరిజంలో సంస్థలతో 98 ఎంవోయూలు..

విశాఖపట్టణం : రెండో రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. రెండో రోజు నాలుగు ప్లీనరీ సమావేశాలు, రూ. 5లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సదస్సు జరుగుతోంది. తాజాగా టూరిజంలో వివిధ సంస్థలతో 98 ఎంవోయూలను ఏపీ ప్రభుత్వం కుదుర్చుకుంది. ఎంవోయూల ద్వారా రూ. 12వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని తెలుస్తోంది.

హోదాపై నిరసన అడ్డుకోవడం దారుణం -సీపీఎం..

విజయవాడ : హోదాపై నిరసనను అడ్డుకోవడం దారుణమని ఏపీ సీపీఎం నేత మధు పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో ఏపీలో ఆందోళనలు..నిరసనలు పెరిగాయని, గత ఎన్నికల్లో టిడిపి, బిజెపిని బలపరిచిన వారు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రాజధానిలో ప్రభుత్వం బలవంత భూ సేకరణ చేస్తోందని, వ్యవసాయంపై టిడిపి ప్రభుత్వం దాడి చేస్తోందని పేర్కొన్నారు.

 

12:56 - January 28, 2017

చిత్తూరు : చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు ధ్వజమెత్తారు. ప్రత్యేక ప్యాకేజీతో హోదా కన్నా ఎక్కువే ఇచ్చారని టీడీపీ పెద్దలు మాట్లాడటం దారుణమన్నారు. తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. హోదా ఉద్యమాన్ని ప్రతిపక్షాలకే పరిమితం చేయకుండా ప్రభుత్వం ఉద్యమించాలన్నారు. ప్రత్యేక హోదా ఇస్తున్నారని మొన్నటివరకు బీజేపీ, టీడీపీ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించాయని..ఇప్పుడు అడ్డసవాళ్లు విసరడం మానుకోవాలని హితవుపలికారు.

 

12:51 - January 28, 2017

నల్గొండ : జిల్లాలో దారుణం జరిగింది. అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సమాజంలో ఆడ పిల్లగా పుట్టడం నేరమైపోయింది. ఆడపిల్లలపై వివక్ష మరోసారి బయటపడింది. కన్నకూతురిని అల్లారుమద్దుగా పెంచాల్సిన తల్లిదండ్రులే కాలయములయ్యారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో పసికందును తల్లిదండ్రులే చంపేశారు. చందంపేట మండలంలో జరిగింది. మూడవత్ శారదకు ఇప్పటికే ఇద్దరు ఆడపల్లిలు, ఒక బాబు ఉన్నారు. ఇటీవలే దేవరకొండ ఆస్పత్తిలో ఆమెకు మరోపాప  జన్మించింది. తల్లి, కూతురు ఆరోగ్యంగా ఉండడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. 26న పాపకు వాంతులు వస్తున్నాయని మళ్లీ ఆస్పత్రికి పాపను తీసుకొచ్చారు. వైద్యులు చికిత్స అందించి పంపించారు. ఈనేపథ్యంలో ఇంటికి వచ్చిన అనంతరం ఆరు రోజుల పసికుందును తల్లిండ్రులే హత మార్చారు. గుట్టుచప్పుడు కాకుండా దహనం కూడా చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

నర్సింగ్ విద్యార్థులతో చర్చలు..

హైదరాబాద్ : నర్సింగ్ విద్యార్థులతో గాంధీ ఆసుపత్రి సూపరిటెండెంట్, డీఎంఈ చర్చలు జరుపుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో నర్సింగ్ విద్యార్థులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎం, డీఎన్ఎంలను పర్మినెంట్ చేయాలని ఆసుపత్రికి భవనం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

పులిచింతల వద్ద తెలంగాణ రైతుల ఆందోళన..

గుంటూరు : పులిచింతల వద్ద తెలంగాణ రైతులు ఆందోళన చేపట్టారు. పులిచింతల బ్యారేజీ నుండి దిగువకు నీటిని విడుదల చేయవద్దని రైతులు బైఠాయించారు.

వసంత్ విహార్ లో బాంబు కలకలం..

ఢిల్లీ : వసంత్ విహార్ ప్రాంతంలో బాంబు కలకలం సృష్టించింది. వసంత్ విహార్ ప్రాంతాన్ని ఖాళీ చేయించి పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. సంఘటనా ప్రదేశానికి ఎన్ఎస్ జీ బృందం చేరుకుంది.

12:21 - January 28, 2017

'హృతిక్ రోషన్' కూడా రెజ్లర్ గా నటించబోతున్నాడు. అయితే ఈ హీరో డిఫరెంట్ గా పారా ఓలంపిక్ రెజ్లర్ గా ప్రయోగం చేస్తున్నాడని బాలీవుడ్ టాక్. పారా ఓలంపిక్స్ లో ఇండియాకు గోల్డ్ మెడల్ అందించిన రెజ్లర్ రియల్ లైఫ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుందట. బాలీవుడ్ ప్రయోగాల బాటపట్టింది. అంతేకాదు అక్కడ స్టోర్స్ బ్యాక్ డ్రాప్ లో మూవీస్ తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా తెగ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. గత ఎడాది ధోనీ రియల్ లైఫ్ స్టోరీతో ధోనీ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక బడా స్టార్స్ అయిన 'సల్మాన్ ఖాన్' 'సుల్తాన్’, 'అమీర్ ఖాన్' 'దంగల్' లో స్ట్పోర్స్ ప్లేయిర్ గా నటించారు. ఇద్దరు స్టార్స్ రెజ్లర్స్ గా బాక్సాఫీసు ని షేక్ చేశారు. ఇప్పుడు 'హృతిక్ రోషన్' ఇంకాస్త డిఫరెంట్ గా గుడ్డి, చెవిటి రెజ్లర్ గా కనిపించబోతుండడం విశేషం.

కాబిల్ లో హృతిక్..
'హృతిక్' న్యూ మూవీ 'కాబిల్' ఈ నెల 25న రిలీజ్ అయ్యింది. ఈ స్టార్ హీరో ఇందులో పుట్టి గుడ్డివాడిగా నటించాడు. 'హృతిక్ రోషన్' లాంటి బడా కమర్షయల్ స్టార్ అంధుడిగా నటించాడు అంటే పెద్ద ప్రయోగం అనే చెప్పాలి. అయితే ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన చిత్రంగా దర్శకుడు తీర్చిదిద్దాడు. 'కాబిల్' తరువాత కూడా 'హృతిక్' మరో ఎక్స్ పెరిమెంట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడట బీటౌన్ లో వినిపిస్తోంది. ఈ సారి చెవిటి, మూగ రెజ్లర్ గా నటించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. గూంగా పహిల్వాన్ గా పిలుచుకునే వీరేంద్ర సింగ్ యాదవ్ లైఫ్ స్టోరీతో సినిమా చేసేందుకు హృతిక్ రోషన్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. పారా ఒలింపిక్స్ లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించిన ఈ రెజ్లర్ పుట్టుకతో చెవిటి-మూగ వాడు. ఓ టెలివిజన్ షో కోసం వెళ్లినపుడు గూంగా పహిల్వాన్ ను కలిసిన హృతిక్.. అతని లైఫ్ స్టోరీ విశేషాలు తెలుసుకోని సర్ ప్రైజ్ అయ్యాడట. కమర్షియల్ మూవీకి కావాల్సిన హంగులన్నీ ఈ పారా ఒలింపిక్ రెజ్లర్ జీవితంలో ఉన్నాయని భావించిన హృతిక్ అతడి లైఫ్ స్టోరీలో నటించేందుకు గ్రాండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్స్ అందరూ ఇలా రియల్ లైఫ్ స్టోరీస్ పై ఫోకస్ చేస్తుండడం విశేషం. మరి పారా ఓలంపిక్ రెజ్లర్ గా 'హృతిక్' ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

12:15 - January 28, 2017

మెగా తనయుడు 'రామ్ చరణ్' కొత్త తరహా కథలతో పాటు భిన్నమైన దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. కొత్త సినిమాల కోసం 'చెర్రీ' ఎంచుకున్న దర్శకులే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. 'ధృవ' సినిమాతో 'రామ్ చరణ్' కొత్త దారిలోకి వచ్చేశాడు. రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేస్తాడన్న ముద్రను చెరిపేసుకుని, తాను కూడా వైవిధ్యమైన సినిమాలు చేసి మెప్పించగలనని 'ధృవ'తో రుజువు చేశాడు. ఈ సినిమా మంచి ఫలితం రాబట్టడంతో చెర్రీ ఇక వైరటీ స్టోరీస్ తో పాటు విభిన్నమైన దర్శకులతో పని చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే తన నెక్ట్స్ మూవీని సుకుమార్ లాంటి విలక్షణ దర్శకుడితో చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సుకుమార్ తో చేయనున్న సినిమాలో 'చెర్రీ' లుక్ తో పాటు క్యారెక్టర్ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందని వినికిడి.

సుకుమార్ తో..
సుకుమార్ తో 'రామ్ చరణ్' చేయనున్న సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను దసరా రిలీజ్ చేసేందుకు మెగా తనయుడు ఫర్ పెక్ట్ ప్లానింగ్ తో ముందుకు వెళ్లుతున్నట్లు సమాచారం. అయితే చెర్రీ - సుకుమార్ తో పాటు మరో భిన్నమైన దర్శకుడితో మరో సినిమాకి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతి రిలీజైన 'శాతకర్ణి'తో సక్సెస్ పాటు ఎన్నో ప్రశంసలను దర్శకుడు క్రిష్ అందుకున్నాడు. ఈ సినిమా చూసిన 'చెర్రీ' ఈ దర్శకుడితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అనుకున్నదే తడువుగా 'క్రిష్' కి కూడా నెక్ట్స్ మూవీ చేద్దామని కబురు పంపినట్లు సమాచారం. ఇందుకు దర్శకుడు క్రిష్ నుంచి కూడా పాజిటివ్ ఆన్సర్ వచ్చినట్లు వినిపిస్తోంది.

రాయబరి..
దర్శకుడు క్రిష్, రామ్ చరణ్ తో 'రాయబరి' సినిమాను తీసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకు ముందు ఈ దర్శకుడు ఈ స్టోరీని వరుణ్ తేజ్ తో చేసేందుకు ప్రయత్నించాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 'రాయబరి' అప్పుడు పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఇదే స్టోరీ చరణ్ వద్దకు తీసుకెళ్లినట్లు టాక్ . రాయబరి స్టోరీకి ఫిదా అయిన చెర్రీ సుకుమార్ మూవీ తరువాత చేద్దామని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కెబోయే ఈ సినిమా అక్టోబర్ లో స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోగా క్రిష్, వెంకటేష్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. మొత్తానికి క్రిష్, చరణ్ ది డిఫరెంట్ కాంబినేషన్ అనే చెప్పాలి.

12:09 - January 28, 2017

ఆన్ స్క్రీన్ లవర్స్ 'నాగచైతన్య', 'సమంత' రియల్ లైఫ్ పార్టనర్స్ గా మారబోతున్న సంగతి తెలిసిందే. పెద్దల పర్మిషన్ కూడా ఉండడంతో వెడ్డింగ్ బెల్స్ కి ముందే ఈ జంట ఆఫ్ స్క్రీన్ పిచ్చా పాటి రోమాన్స్ తో రెచ్చిపోతున్నారు. ఆల్ రెడీ డేటింగ్ చేస్తున్న ఈ యంగ్ జోడి షికార్లు కోడుతూ ఆ ఫోటోస్ ని ఫోస్ట్ చేస్తూ ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. టాలీవుడ్ లో ఈ జనరేషన్ ఆన్ స్క్రీన్ బెస్ట్ జోడి ఎవరంటే కచ్చితంగా 'నాగచైతన్య’, 'సమంత' అనే చెప్పాలి. తొలి సినిమా 'ఏం మాయ చేశావే'తోనే ఈ జోడి ఆడియన్స్ పై చెరగని ముద్ర వేశారు. ఆ సినిమాలో హాట్ హాట్ రోమాన్స్ తో యూత్ కి పిచ్చేక్కించిన ఈ జంట త్వరలో పెళ్లిచేసుకోబోతున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా చాటు మాటుగా ప్రేమించుకున్న 'చైతూ’, 'శ్యామ్' ఇప్పుడు పబ్లిక్ రోమాన్స్ చేస్తూ సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబల పెద్దల అంగీకారం కూడా ఉండడంతో ఈ జంట పెళ్లికి ముందే కాపురం పెట్టేసింది. అంతేకాదు కారులో షికారు చేస్తూ సినిమా ప్రేమికుల్ల తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ ఏడాదిలో పెళ్లి...
'నాగచైతన్య’, 'సమంత' ఈ ఎడాదిలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఎలాగు పెళ్లి చేసుకోవడం ఖాయం అయింది కాబట్టి ఈ జంట హద్దులు లేని లవ్ బర్డ్స్ అయిపోయారు. తమ లవ్ ని అందరికి తెలిసేలా తమ పర్సనల్ పిక్స్ ని పోస్ట్ చేస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. అకేషన్ ఉన్నా లేకున్నా సరదాగా బయటకు వెళ్లిన ఫొటోస్ ని కూడా ఈ జంట ఎప్పటికప్పుడు మీడియాతో పంచుకుంటూ మురిసిపోతున్నారు. బాలీవుడ్ సిని లవ్ జంటల మాదిరి చైతూ, శ్యామ్ టాలీవుడ్ లో హాట్ హాట్ లవ్ స్టోరీతో ఇండస్ట్రీని హీటెక్కిస్తున్నారు. నాగచైతన్య ఫాదర్ నాగార్జున కూడా ఈ యంగ్ జోడి లవ్ స్టోరీ చూసి మురిసిపోతుండడం విశేషం.

తెర బయట కూడా..
తెలుగు పరిశ్రమలో హీరో హీరోయిన్స్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంఘటనలు చాలా తక్కువే. అందులో పెద్ద ఫ్యామిలీస్ లో మరీ తక్కువ అనే చెప్పాలి. అయితే అక్కినేని ప్యామిలీ హీరోలకు రోమాంటిక్ స్టార్స్ అనే ఇమేజ్ ఉంది. అయితే ఇమేజ్ ని అక్కినేని హీరోలు ఆఫ్ స్క్రీన్ లో కూడా నిజం చేస్తుండడం విశేషం. నాగార్జున కూడా అమలను ఇలాగే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నాగచైతన్య, సమంతను పెళ్లి చేసుకుంటుండగా, చిన్న కొడుకు అఖిల్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. మొత్తానికి అక్కినేని హీరోలు తెరమీద తెర బయట కూడా రోమాంటిక్ కింగ్స్ గా హంగామా చేస్తున్నారు.

12:05 - January 28, 2017

చిత్తూరు : నిరంకుశత్వ పాలన ఎంతో కాలం సాగదని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. గతంలో ఇందిరా గాంధీకి సాధ్యం కాలేదని.. ఇప్పుడు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులకు కూడా సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల అవసరాలను ప్రశ్నించేటప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం ప్రజాస్వామ్యమని... నిర్బంధం ప్రయోగించడం నిరంకుశత్వమని అన్నారు. నిరంకుశత్వంతో ముందుకు వెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయన్నారు. నిరంకుశత్వంతో ముందుకుపోవడం ఇందిరా గాంధికే సాధ్యం కాలేదని.. వీళ్లకు కూడా సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు నిరంకుశ ధోరణి ఎక్కువవుతందని చెప్పారు. తాము చేసే చర్యలకు ప్రజల ఆమోదం పొందలేనివారు పోలీసులపై ఆధారపడతారని.. అదే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారని తెలిపారు. అది చంద్రబాబుకు మంచిదికాదని హితవు పలికారు. వంశపారంపర్యం బూర్జువపార్టీలకు అలవాటన్నారు. అది ఛేదింంచాల్సింది పోయి... తమ గొప్పతనం చూడండని సీఎం చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. కుటుంబ పాలన, పోలీసు పాలనతోటి ముందుకు కెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నాడని.. దాని చిహ్నమే ఇదన్నారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారని తెలిపారు.

 

12:04 - January 28, 2017

అవకాశాలు లేక ఖాళీగా ఉన్న హీరోయిన్ 'అంజలి'కి జాక్ పాట్ తగిలింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోందనుకున్న 'అంజలి'కి ఇక్కడ అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఈ బ్యూటీ తెలుగులో చేసిన సినిమాలు దాదాపు సక్సెస్ లు గా నిలిచాయి. అయిన కూడా ఎందుకో ఈ తెలుగు భామకు మాత్రం విరివిగా అవకాశాలు మాత్రం రాలేదు. గత ఎడాది 'బాలకృష్ణ'కి జోడిగా నటించిన 'డిక్టేటర్' తో పాటు 'సరైనోడు' సినిమాలో 'బన్నీ' తో బ్లాక్ బస్టర్ సాంగ్ లో అలరించింది. ఈ రెండు సినిమాల తరువాత 'అంజలి'కి తెలుగులో మరో అవకాశం రాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ చెన్నైకి చెక్కేసింది. కానీ అక్కడ కూడా అంతంత మాత్రంగా వస్తున్న అవకాశాలతో కెరీర్ ని లాగిస్తోంది. అయితే ప్రస్తుతం 'అంజలి'కి మలయాళంలో ఓ గోల్డెన్ ఆఫర్ తగలడం విశేషం.

మమ్ముట్టితో...
తెలుగులో పూర్తిగా ఛాన్స్ లు తగ్గిన 'అంజలి' ఇతర ఇండస్ట్రీస్ పై ఫోకస్ చేస్తోంది. చెన్నయ్ కి మకాం మార్చి, మొదట్లో తనను ఆదరించిన కోలీవుడ్ మీద దృష్టి పెట్టింది. కానీ అక్కడ కూడా 'అంజలి'కి అరకొర అవకాశాలే వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మకి ఓ భారీ ఆఫర్ వచ్చింది. మలయాళ బిగ్ స్టార్ 'మమ్ముట్టి'తో నటించే గోల్డెన్ చాన్స్ 'అంజలి'ని వరించింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహిత రామ్ దర్శకత్వం వహిస్తుండడం మరో విశేషం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరి తమిళం, తెలుగులో అవకాశాలు లేక డల్ అయిన 'అంజలి' కెరీర్ ని మలయాళ ఇండస్ట్రీ అందుకుంటుందో చూడాలి.

పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి - బి.వి.రాఘవులు..

చిత్తూరు : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని సీపీఎం నేత బీవీ రాఘవులు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పక్షాలు ఒకే తాటిపైకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని, భవిష్యత్తులో మరెన్నో ఉమ్మడి పోరాటాలు వస్తాయని తెలిపారు.

11:41 - January 28, 2017

భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్ర బడ్జెట్‌లో కులాల వారిగా వాటా రావాలని, అలా చేయడానికి కేసీఆర్‌ ప్రభుత్వం ముందుకు రావడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కరించడంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీవ్రంగా విఫలమైందని తమ్మనేని ధ్వజమెత్తారు. 
కమీషన్లు వచ్చే ప్రాజెక్టులపై కేసీఆర్‌ దృష్టి 
ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణలోని అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  ఆరోపించారు. కమీషన్లు వచ్చే ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన కేసీఆర్‌ సర్కార్‌..ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని తమ్మినేని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. తెలంగాణ రాకముందు ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయో..ఇప్పుడు అలానే ఉన్నాయని తమ్మినేని విమర్శించారు. కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తమ్మినేని దుయ్యబట్టారు. 
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై కుట్ర 
రాష్ట్రంలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలను కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారికోసమే ఈ యాత్ర సాగుతోందని తమ్మినేని అన్నారు. పోరాడి సాధించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై కూడా కుట్ర జరుతోందని తమ్మినేని ఆరోపించారు. 
సామాజిక న్యాయం లక్ష్యంగా పాదయాత్ర
సామాజిక న్యాయం లక్ష్యంగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తోంది. 103 వ రోజు పాదయాత్ర బృందం మణుగూరు, మల్లేపల్లి, శివలింగాపురం, పెద్దిపల్లి, మిడిచిలేరు, ఏగడా, చర్ల, సత్యనారాయణపురం గ్రామాల్లో పర్యటించింది. తమ్మినేని బృందానికి ప్రజలు తమ సమస్యలను వెల్లబోసుకుంటున్నారు. 

 

11:33 - January 28, 2017

త్వరలో జగిత్యాలలో ఈఎస్ఐ ఆసుపత్రి - దత్తాత్రేయ..

జగిత్యాల : కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ జిల్లాలో పర్యటించారు. త్వరలో జగిత్యాలలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని, కొత్త జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ ఏర్పడాలంటే కేంద్ర పథకాలను అమలు చేయాలని సూచించారు.

తిరుపతిలో స్వైన్ ఫ్లూ కలకలం..

తిరుపతి : స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. రుయాలో స్వైన్ ఫ్లూ లక్షణాలతో పద్మ అనే మహిళ మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన పెంచలయ్య, చిత్తూరు జిల్లాకు చెందిన చెంగమ్మకు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. రుయా ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు.

రెండో రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సు..

విశాఖపట్టణం : రెండో రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. రెండో రోజు నాలుగు ప్లీనరీ సమావేశాలు, రూ. 5లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సదస్సు జరుగుతోంది.

పసికందును చంపేసిన తల్లిదండ్రులు..

నల్గొండ : చందంపేట (మం) పోల్యానాయక్ తండాలో దారుణం చోటు చేసుకుంది. నాలుగో కాన్పులో ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు దారుణానికి ఒడిగట్టారు. తల్లిదండ్రులు ముడావత్ శారద, మంగ్తలు పసికందును చంపేశారు. పోలీసుల విచారణలో నిందితులు నిజాన్ని వెల్లడించారు.

'హోదా' రాకపోయినా రూ. 50వేల కోట్ల పెట్టుబడులు'..

విశాఖపట్టణం : ప్రత్యేక హోదా రాకపోయినా రాష్ట్రానికి రూ. 50వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, గతేడాది రెండు లక్షళ మందికి ఉపాధి లభించందని మంత్రి యనమల పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంటూ రాజకీయం చేయడం తగదని, కేంద్ర బడ్జెట్ తరువాత రాష్ట్రానికి కావాల్సినవి అడుగుతామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుల విమర్శలు అర్ధరహితమని తెలిపారు.

గాంధీలో నర్సింగ్ విద్యార్థుల ఆందోళన..

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో నర్సింగ్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎం, డీఎన్ఎంలను పర్మినెంట్ చేయాలని ఆసుపత్రికి భవనం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

11:03 - January 28, 2017

రంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నకూతురిపై తల్లి దాష్టీకానికి పాల్పడింది. కూతురుని కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి కడతేర్చాలనుకుంది. జిల్లాలోని ఫరూఖ్‌నగర్‌ మండలం చిత్తగూడెంలో పిండి పారపోసిందన్న కారణంతో 9 ఏళ్ల కూతురుపై కన్నతల్లి కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. చిన్నారిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:52 - January 28, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతోంది. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో నిమ్స్‌లో చికిత్స పొందారు. ప్రస్తుతం ఇంట్లో ట్రీట్‌మెంట్‌ పొందుతున్నారు.  స్వైన్‌ఫ్లూ లక్షణాలతో  ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో రోగులు చేరుతున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. స్వైన్‌ఫ్లూతో ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే నెలరోజుల్లో ఆరుగురు చనిపోయారు. 100 మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు డాక్టర్లు చెబుతున్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో 12 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ఫ్లూ పూర్తిగా అదుపులో ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇటు కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోనూ స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తిరుపతిలోనూ స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:18 - January 28, 2017

బ్రిటీష్ నటుడు సర్ జాన్ హర్ట్ (77) ఇక లేరు. ఆయన తుదిశ్వాస విడిచారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ నటుడు గతకొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. 1940, జనవరి 22వ తేదీన జన్మించారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఏలియన్, ఎలిఫెంట్ మ్యాన్, హెర్క్యులస్, ది మిడ్ నైట్ ఎక్స్ ప్రెస్ తదితర సినిమాలలో ఆయన నటించారు. రెండు సార్లు ఆయన ఆస్కార్ కు నామినేట్ అయ్యారు. అనేక సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి ఎందరో అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా సినీ ప్రేమికులను అలరించారు. ఆయన సేవలను గుర్తించిన బ్రిటీష్ రాణి ఆయనకు 'సర్' సత్కారాన్ని అందించారు. ఆయన మృతి చెందారన్న విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, పలువురు రాజకీయవేత్తలు సంతాపం తెలిపారు.

కూతురికి నిప్పంటించిన తల్లి..

రంగారెడ్డి : ఫరూఖ్ గనర్ మండలం చింతగూడెంలో దారుణం చోటు చేసుకుంది. పిండి పారిపోసిందన్న కారణంతో ఓ తల్లి కిరోసిన్ పోసి నిప్పంటించింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

నటుడు సర్ జాన్ హర్ట్ కన్నుమూత..

ఢిల్లీ : ప్రముఖ బ్రిటీష్ నటుడు సర్ జాన్ హర్ట్ (77) తుది శ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు.

సీపీఎం మహాజన పాదయాత్ర 104వ రోజు..

భద్రాద్రి : సీపీఎం మహాజన పాదయాత్ర 104వ రోజుకు చేరుకుంది. నేడు ఆర్.కొత్తగూడెం, కుదులూరు, మామిడిగూడెం, రాళ్లగూడెం, సీతానగరం, బండిరేవు, పెద్దనల్లబెల్లి, చిననల్లబెల్లి, బైరాగులపాడు, లక్ష్మీనగర్ లలో పాదయాత్ర కొనసాగనుంది.

చంద్రగిరి వద్ద పోలీసుల కూంబింగ్..

తిరుపతి : చంద్రగిరి కోట వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 25 మంది కూలీలు పరారయ్యారు.

 

09:31 - January 28, 2017

హైదరాబాద్‌ : నగర శివారు రాజేంద్రనగర్‌లోని హిమాయత్‌సాగర్‌ టోల్‌గేట్‌ దగ్గర విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా గుట్కాను తరలిస్తున్న రెండు లారీలను విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. గుల్బర్గా నుంచి హైదరాబాద్‌కు గుట్కా తరలిస్తున్నట్టు గుర్తించారు. సుమారు 30 లక్షల విలువైన గుట్కాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్‌ చేసిన లారీలను రాజేంద్రనగర్‌ పీఎస్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:15 - January 28, 2017

కళాశాలలోని టాయిలెట్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మరుగుదొడ్లలోకి వెళ్లే వారు ప్యాంటు విడిచి అక్కడనే ఉన్న లుంగీ కట్టుకోవాలంటూ కళాశాల పేర్కొనడం గమనార్హం. ఏకంగా ఓ సర్క్యూలర్ నే జారీ చేసింది. తమిళనాడు కోయంబత్తూరులో కోవైపుదూరులో వీఎల్ బీ జానికి యమ్మాళ్ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల ఉంది. కళాశాల మరుగుదొడ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నఓట్లు 24.01.2017వ తేదీన ఓ సర్క్యూలర్ జారీ చేసింది. ఇందుకు కారణం కూడా పేర్కొంది. కొందరు విద్యార్థులు టాయిలెట్ లో పెట్టిన ఓ ఫైర్ క్రాకర్ వల్ల ఓ లెక్చరర్ గాయపడ్డాడని పేర్కొంది. అందువల్ల టాయిలెట్స్ కు వెళ్లే వారు ప్యాంటు విప్పి లుంగీ కట్టుకొని వెళ్లాలని సూచించింది. కళాశాల జారీ చేసిన సర్క్యూలర్ తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళాశాల నిర్వాకంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరి కళాశాల వెనక్కి తగ్గుతుందా ? లేదా ? అనేది చూడాలి.

09:01 - January 28, 2017

వారంతాపు సెలవులు..ఎంచక్కా సినిమాకు వెళ్లి...ఏదైనా హోటల్ లో భోజనం చేసి ఇంటికి వచ్చే వారు చాలా మందే ఉంటారు. ఎందుకంటే బిజీ బిజీగా గడుపుతూ ఉండేవారు ఒక్క రోజు కుటుంబసభ్యులతో గడుపుతుంటారు. కానీ సినిమా..రెస్టారెంట్ కు వెళ్లే వారికి ఓ చేదు వార్త త్వరలోనే వినబడబోతుందంట. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్ లో 'సేవా పన్ను' మరింత పెంచుతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మల్టీఫ్లెక్స్ లలో సినిమాలు..రెస్టారెంట్ లో ఆహారం..విమానాల్లో ప్రయాణం..ఇలాంటివన్నీ ఖరీదు కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు సెస్‌లతో కలిపి సేవాపన్ను 15 శాతం వరకు ఉన్న సంగతి తెలిసిందే. ఇది మరో 0.5 నుంచి 1 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
2015-16 లో సేవా పన్నును ప్రభుత్వం సవరించింది. 12.36 గా ఉన్న పన్నును 14 శాతం చేసింది. దీనికి 0.5 శాతం స్వచ్చ భారత్ అంటూ సెస్ కలిపింది. 2016-17 లో కృషి కళ్యాణ్ సెస్ పేరిట మళ్లీ 0.5 శాతం కలిపింది. దీనితో మొత్తం 15 శాతానికి చేరుకుంది. ఇప్పుడు దీనికి ఒక శాతం కలుపుతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆగాల్సిందే.

08:51 - January 28, 2017

సిద్దిపేట : జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులు అన్నాచెళ్లెళ్ల ప్రాణాలను బలితీసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై అన్నాచెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని అక్కన్నపేట మండలం జనగాంలో తల్లిదండ్రులతో పాటు అన్నాచెల్లెలు రాజు, స్వరూప ఉంటున్నారు. స్వరూపకు వివాహం అయింది. ఆమె భర్త దుబాయ్ లో ఉంటున్నాడు. దీంతో ఆమె పుట్టింట్లో ఉంటుంది. అన్నాచెల్లెలు ఇద్దరూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అన్న రాజు బిల్డింగ్ పై నుంచి పడడంతో తీవ్రగాయాలై గత కొద్దిరోజులుగా మంచానికే పరిమితమయ్యారు. ఆర్థిక పరిస్థితులు వారిని చుట్టుముట్టాయి. వయో భారమైన తల్లిదండ్రులు కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీంతో మనస్తాపం చెందిన రాజు, స్వరూపలు నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స నిమిత్తం వారిని కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడంతో నిన్న సాయంత్రం అన్న రాజు మృతి చెందగా, అర్ధరాత్రి స్వరూప మృతి చెందారు. వీరి మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.  

 

08:30 - January 28, 2017

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం పరాకాష్టకు చేరిందని వక్తలు అన్నారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు ఎస్.వినయ్ కుమార్, వైసీపీ అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీ, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి దినకర్, బీజేపీ నేత రఘునాథ్ బాబు పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. విఫక్షాలు ఏమైన కార్యక్రమాలు తలపెడితే ప్రభుత్వం ముందస్తుగానే నేతలను అరెస్టు చేస్తుందని తెలిపారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పరాకాష్టకు చేరిందన్నారు. ఏపీలో రాబోయే ఎన్నికలపై ప్రత్యేకహోదా అంశం ప్రభావం చూపుతుందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కేస్లాపూర్ లో నాగోబా జాతర ప్రారంభం

ఆదిలాబాద్ : కేస్లాపూర్ లో నాగోబా జాతర ప్రారంభం అయింది. సంప్రదాయ పూజలతో మెస్రం వంశీయులు జాతరను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, మంచిర్యాల కలెక్టర్లు బుద్ధప్రసాద్, కర్ణన్ పాల్గొన్నారు. జాతర 4 రోజులపాటు కొనసాగనుంది.

 

ఢిల్లీలో దట్టంగా అలుముకున్న పొగమంచు

ఢిల్లీ : హస్తినలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఒక రైలును రద్దు చేశారు. 2 అంతర్జాతీయ, 8 దేశీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 

ఆర్థిక ఇబ్బందులతో అన్నాచెల్లెలు ఆత్మహత్య

సిద్ధిపేట : జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో అన్నాచెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో అన్నాచెల్లెలు నిన్న ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. 

 

07:54 - January 28, 2017
07:51 - January 28, 2017

చండీఘర్ : పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌ పార్టీని మునిగే నావగా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాజకీయ స్వార్థానికి యువతను వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు బాదల్‌ అవినితి పాలనకు ప్రధాని మోడీ అండగా నిలిచారని రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు.    
కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన మోడీ 
పంజాబ్‌ ఎన్నికల తేదీ సమీపిస్తుండండంతో ప్రచారం జోరందుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోది జలంధర్‌లో జరిగిన బహిరంగ సభల్లో కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేశారు. రాజకీయస్వార్థం కోసం కొందరు పంజాబ్‌ యువతను బద్నాం చేస్తున్నారని... ప్రధాని మోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. పంజాబ్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయ‌త్నిస్తున్న వారికి త‌గిన బుద్ది చెప్పాల‌ని యువతకు పిలుపునిచ్చారు. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావగా మోది అభివర్ణించారు.  అధికారం కోసం అర్రులు చాస్తున్న కాంగ్రెస్‌ పొత్తులు పెట్టుకుందని విమర్శించారు. బాద‌ల్ మ‌ళ్లీ సీఎం కావాల‌ని పంజాబ్ కోరుకుంటున్నట్లు మోడీ తెలిపారు.
బాదల్‌ పాలనపై రాహుల్‌ విమర్శలు
పంజాబ్‌లోని మజిథ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బాదల్‌ పాలనపై నిప్పులు కక్కారు. పంజాబ్‌లో 70 శాతం యువకులు డ్రగ్స్‌ మత్తులో జోగుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే డ్రగ్స్‌పై కఠిన చట్టాన్ని తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్‌ రహిత పంజాబ్‌గా మారుస్తామన్నారు. బాదల్‌ పాలనలో పంజాబ్‌ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. బాదల్‌ అవినితి పాలనకు ప్రధాని మోది అండగా నిలిచారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ పేరును రాహుల్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 4న పంజాబ్‌ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బిజెపి, అకాళీదళ్‌, కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

హిమాయత్ సాగర్, టోల్ గేట్ వద్ద విజిటెన్స్ దాడులు

రంగారెడ్డి : హిమాయత్ టోల్ గేట్ వద్ద విజిటెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు లారీల్లో తరలిస్తున్న గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

07:42 - January 28, 2017

రాజస్థాన్ : కృష్ణ జింక వేట కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, టబు, సోనాలీ బింద్రే, నీలిమ జోధ్‌పూర్ కోర్టు ఎదుట హాజరయ్యారు. కృష్ణ జింక వేట కేసులో సల్మాన్, సైఫ్, టబు, సోనాలీ ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది. తాను అమాయకుడినని...ఈ కేసులో తప్పుడు ఆరోపణలతో ఇరికించారని కోర్టు ముందు సల్మాన్‌ వాపోయాడు. జనవరి 18న అక్రమ ఆయుధాల కేసులో సల్మాన్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 1998లో హమ్ సాత్ సాత్ హై కౌన్ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్‌తోపాటు మిగతావారిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 

 

07:26 - January 28, 2017

ఢిల్లీ : రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని... కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జపాన్ పర్యటన నుంచి వచ్చిన కేటీఆర్.. ఢిల్లీలో జైట్లీతో సమావేశమయ్యారు. వచ్చే బడ్జెట్‌లో ఎయిమ్స్‌కు నిధులు కేటాయించాలని కోరినట్టు తెలిపారు. అలాగే సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌కు ఆర్థికంగా మద్దతు ఇవ్వాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

 

07:23 - January 28, 2017

హైదరాబాద్ : దేశంలో నోట్లరద్దు భ్రమలు తొలగిపోయాయని... సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. నగరంలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో 'నోట్ల రద్దు పర్యవసానాలు' అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాఘవులు హాజరై, మాట్లాడారు. మొదటినుంచి కమ్యూనిస్టులుగా నోట్ల రద్దును వ్యతిరేకించామని గుర్తుచేశారు. డీమోనిటైజేషన్‌ మంచి ఫలితాలు ఇస్తుందని హామీ ఇచ్చిన కేంద్రం... వచ్చే బడ్జెట్‌లో ఆ ఫలాలను ప్రజలకు అందేలా పథకాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు తర్వాత ఎంత డబ్బు బ్యాంకులకు చేరిందో... నల్లధనం ఎంత రద్దయిందో ప్రభుత్వం చెప్పలేకపోతోందని విమర్శించారు. ఈ లెక్కలు కూడా చెప్పలేని ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు ఎలా నిర్వహించగలుగుతుందని ప్రశ్నించారు.

 

07:19 - January 28, 2017

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో జనాలకు సమస్యలు తెచ్చిన ప్రధాని మోడీకి.. ఆయనకు మద్దతిస్తున్న కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందని కాంగ్రెస్‌ హెచ్చరించింది.. మోదీ కార్పొరేట్‌ మాఫియా కనుసన్నల్లో పాలన సాగిస్తుంటే రాష్ట్రంలో కాంట్రాక్టుల కమిషన్‌లతో కేసీఆర్‌ ఫ్యామిలీ దండుకుంటోందని మండిపడింది. జనవేదన సమ్మేళనం వేదికగా ఇద్దరిపై విమర్శలతో హస్తం నేతలు విరుచుకుపడ్డారు. 
హైదరాబాద్‌లో జనావేదన సమ్మేళనం 
నోట్ల రద్దుపై వివిధ రకాలుగా నిరసనలు కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ... తాజాగా.. హైదరాబాద్‌లో జనావేదన సమ్మేళనం చేపట్టింది.. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రతినిధులు డీకే శివకుమార్‌, కొప్పుల రాజుతోపాటు.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర నేతలు, పార్టీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.. మోదీ అనాలోచిత నిర్ణయంతో సామాన్యుడికి ఆర్థిక స్వాతంత్ర్యంలేకుండా పోయిందని... శివకుమార్‌ మండిపడ్డారు..
కార్పొరేట్‌ మాఫియా చేతిలో మోడీ పాలన 
కార్పొరేట్‌ మాఫియా చేతిలో మోడీ పాలన కొనసాగుతోందని... ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలు పట్టించుకోకుండా కేసీఆర్‌ మోదీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్ల కమీషన్లతో కేసీఆర్‌ కుటుంబం కోట్లు దండుకుందని ఆరోపించారు.
ఎంపీ కవితపై షబ్బీర్‌ అలీ విమర్శలు 
జనావేదన సమ్మేళనంలో ఎంపీ కవితపై విమర్శలు గుప్పించారు షబ్బీర్‌ అలీ.. కలెక్టర్లతో గులాంగిరీ చేయించుకుంటూ కవిత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌ నేతలు... నోట్ల రద్దుపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని తీర్మానించారు. ఫిబ్రవరి 6నుంచి వారం రోజులపాటు ప్రతి నియోజకవర్గంలో జనావేదన పంచాయితీల పేరుతో సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు.

 

నేడు టీఅంసెబ్లీ హక్కుల కమిటీ సమావేశం

హైదరాబాద్ : ఉదయం 11.30గం.లకు తెలంగాణ శాసనసభ హక్కుల కమిటీ సమావేశం జరుగనుంది. నోటీసులు అందుకున్న సభ్యుల వివరణలపై చర్చించనున్నారు. కమిటీ తుది నివేదికను ఖరారు చేయనుంది. 

జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపుకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్ : జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు కోసం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

నేడు ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం

హైదరాబాద్ : నేడు ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై కమిటీ తుది నివేదికను ఖరారు చేయనుంది. 

నేటితో ముగియనున్న సీఐఐ సదస్సు

విశాఖ : సీఐఐ భాస్వామ్య సదస్సు నేటితో ముగియనుంది. 181 కంపెనీలు ఒప్పందాలపై సంతకాలు చేసుకోనున్నాయి. నిన్న సదస్సు ప్రారంభం అయింది. కేంద్రఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సదస్సును ప్రారంభించారు. 

Don't Miss