Activities calendar

29 January 2017

21:27 - January 29, 2017

ఆస్ట్రేలియా ఓపెన్‌ మెన్స్‌ సింగిల్‌ టైటిల్‌ను రోజర్‌ ఫెదరర్‌ దక్కించుకున్నారు. ఐదేళ్ల తర్వాత రోజర్‌ ఫెదరర్‌ గ్రాండ్‌ స్లామ్‌ ఛాంపియన్‌గా నిలిచారు. స్పెయిన్ బుల్‌ రఫెన్‌ నాదల్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఆరేళ్ల తరువాత తలపడిన ఇద్దరు... గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. తొలిసెట్, మూడోసెట్ ఫెదరర్ గెలవగా రెండు, నాలుగు సెట్లు నాదల్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఫలితం తేలడానికి ఐదవ సెట్ ఆడాల్సి వచ్చింది. చివరకు 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో ఫెదరర్‌ విజయం సాధించాడు. ఐదేళ్ల తరువాత ఫెదరర్ మళ్లీ గ్రాండ్‌ స్లామ్ అందుకున్నాడు. ఫెడ్డీకిది 18వ గ్రాండ్‌స్లామ్.

21:24 - January 29, 2017

కృష్ణా : జిల్లా నందివాడ మండలంలో భూ ఆక్రమణలపై సీపీఎం పోరుబాటపట్టింది. భూముల్ని ఆక్రమించి చేపల చెరువులు తవ్విన అక్రమార్కులపై సమరశంఖం పూరించింది. ఫిబ్రవరి 5లోపు భూముల్ని తిరిగి ఇచ్చివేయాలని... లేకపోతే తామే స్వాధీనం చేసుకొని దళితులకు అప్పగిస్తామని హెచ్చరించింది. కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. చట్టవిరుద్దంగా చేపల చెరువులు తవ్వుతూ స్థానికుల జీవితాల్లో చీకటి నింపుతున్నారు కొందరు అక్రమార్కులు. ఆక్వా మాఫియా ఆగడాలు పెరిగిపోవడంతో స్థానికులు అక్కడే బతకలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా నందివాడ మండలంలో ఈ ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 33వేల ఎకరాల్ని ఆక్రమించి చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేశారు. ఇందులో దేవాలయాల భూములు, అసైన్డ్, డ్రైనేజీ, ఇరిగేషన్‌, రెవెన్యూ భూములు ఎక్కువగా ఉన్నాయి. దళితుల భూములు 165 ఎకరాలుగా కాగా... దేవాదాయ శాఖవి 6వేల ఎకరాలున్నాయి.

పనిలేక వలసలు పోతున్న పేదలు..
మండలంలో వేలాది ఎకరాలు చేపల చెరువులుగా మారడంతో స్థానికులకు కష్టాలు మొదలయ్యాయి. సాగు, తాగునీటికి తీవ్రస్థాయిలో కొరత ఏర్పడింది. పైగా చేపల చెరువులతో వచ్చే కాలుష్యం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. చెరువుల నుంచి వచ్చే వ్యర్థాలు, వాసనతో వివిధ రకాల జబ్బులు సోకాయి. పచ్చిక లేక పశువులు బతకలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 80శాతం భూములు చేపల చెరువులుగా మారడంతో పేదలకు ఉపాది కరువైంది. ఉన్నచోట పని దొరక్క... వేరే మార్గంలేక చాలామంది నిరుపేదలు వలసబాటపట్టారు. వలసలు పెరిగిపోవడంతో స్థానికంగా జనాభా పూర్తిగా తగ్గిపోయింది. గతంలో ఇక్కడ 2 ఎంపీటీసీ స్థానాలుండగా జనాలు లేక ఇప్పుడు ఒక్క ఎంపీటీసీ స్థానమే మిగిలింది.

తిరగబడిన ఇలపర్రు ప్రజలు..
ఇలపర్రులో ఈ నరకయాతన భరించలేక స్థానికులు తిరగబడ్డారు. తమ భూముల్ని లాగేసుకొని. కనీసం ఇక్కడ బతికే అవకాశం కూడా లేకుండా చేస్తున్న అక్రమార్కులకు వ్యతిరేకంగా నిరసనలు మొదలుపెట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దగ్గరకు వెళ్లి తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. అయినా పట్టించుకునేవారే కరువయ్యారు. అయినా ధైర్యంగా పోరాడుతున్న బాధితులకు వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాటం సంఘం, సీపీఎం అండగా నిలిచాయి. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులుతో పాటు రాష్ట్ర నేతలు ఈ చేపల చెరువుల్ని పరిశీలించారు. బాధితుల తరపున పోరాటం చేస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 5లోగా ఈ భూముల్ని తిరిగి ఇచ్చివేయాలని లేకపోతే తామే స్వాధీనం చేసుకొని దళితులకు భూముల్ని అప్పగిస్తామని సీపీఎం హెచ్చరించింది.

21:17 - January 29, 2017

ఉత్తరప్రదేశ్‌ : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. సమాజ్‌వాదీ పార్టీ హస్తంతో దోస్తీ కట్టడంతో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లక్నోలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాను, రాహుల్‌ గాంధీ సైకిల్‌కు రెండు చక్రాల్లాంటి వాళ్లమని అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. తమ కలయికను గంగా, యమున సంగమంగా రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. యూపీలో ఎస్పీ, కాంగ్రెస్‌ కూటమి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు సంయుక్తంగా లక్నోలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎస్పీ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్‌ నేతలు భారీగా పాల్గొన్నారు. అనంతరం లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్‌, అఖిలేశ్‌ పోటాపోటీగా ఛలోక్తులు విసిరారు. తాను, రాహుల్‌గాంధీ సైకిల్‌కు రెండు చ‌క్రాల‌లాంటి వాళ్లమని అఖిలేష్ యాద‌వ్ అన్నారు. త‌మ‌ది ప్రజల కూట‌మ‌న్న అఖిలేష్‌ యాదవ్‌.. ఎస్పీ, కాంగ్రెస్ సంయుక్తంగా 300కుపైగా స్థానాల్లో గెలుస్తాయ‌ని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల‌ను ఒక్కచోటుకి చేరుస్తామ‌న్న ఆయన.. హస్తంతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇద్దరం క‌లిసి సోద‌ర‌భావం పెంపొందించ‌డానికి ప్రయ‌త్నిస్తామ‌ని తెలిపారు. ఎస్పీ, కాంగ్రెస్‌ కలయిక గంగా, యమునా సంగమమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. విభజించు.. పాలించు అన్న రాజకీయాలకు తాము దిమ్మదిరిగే సమాధానం చెబుతామని రాహుల్‌ చెప్పారు. యూపీ యువతకు కొత్త రాజకీయాలను అందిస్తామన్న ఆయన.. నియంతృత్వ ఆరెస్సెస్‌, బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసి పని చేయాలని నిర్ణయించామన్నారు. ములాయం ప్రచారంలో పాల్గొంటారా అని ప్రశ్నించ‌గా.. త‌మ‌కు పెద్దలంద‌రి ఆశీస్సులున్నాయ‌ని అఖిలేష్ అన్నారు. మరోవైపు ప్రియాంక ప్రచారం చేయ‌డం, చేయ‌క‌పోవ‌డం ఆమె ఇష్టమ‌ని రాహుల్ అన్నారు.

21:15 - January 29, 2017

పశ్చిమగోదావరి : జిల్లా కేంద్రంగా వైసీపీ దూకుడు పెంచింది. ద్వారకా తిరుమలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అధినేత జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సభలో టీడీపీ నేత కోటగిరి శ్రీధర్‌ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల వైసీపీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. టీడీపీ నేత కోటగిరి శ్రీధర్‌ వైసీపీలో చేరుతున్న సంధర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్‌ పాల్గొన్నారు. పార్టీ కండువా కప్పి శ్రీధర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. బహిరంగ సభలో జగన్‌ ఆవేశంగా ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వం నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో దుష్టచతుర్ముఖ పాలన కొనసాగుతుందని జగన్‌ మండిపడ్డారు.
చంద్రబాబు ప్రభుత్వంలో అసమర్థ, అసత్య పాలన సాగుతోందన్న జగన్‌.. చంద్రబాబు పాలనలో అవినీతి కారణంగా ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా రాజీనామా చేయకుండా మేనేజ్ చేసుకుంటున్నారన్న జగన్‌, రాజధాని భూములను స్విస్ ఛాలెంజ్ చేసి తనకు నచ్చిన సింగపూర్ వాళ్లకు కట్టబెట్టాడని జగన్‌ మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లను కొనసాగిస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు తన బినామీలను సబ్ కాంట్రాక్టర్లు గా పెట్టుకుంటున్నారని ఆరోపించిన జగన్‌.. రాష్ట్రం లో అంతా అవినీతి మయమేనన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో ప్రజలను మోసం చేసి ప్రత్యేక హోదాను పనంగా పెట్టి ప్రజల చెవుల్లో క్యాబేజీ పెట్టారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమానికి కృషి చేసేందుకే తాను వైసీపీలో చేరుతున్నట్లు, కోటగిరి శ్రీధర్‌ ఈ సందర్భంగా తెలిపారు.

ఖమ్మం జట్టు పరాజయం..

వరంగల్ : తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ పోటీల్లో 9వ రోజు ఖమ్మం జట్టుతో రంగారెడ్డి రైడర్స్ జట్టు ఢీకొంది. ఈ మ్యాచ్ లో రంగారెడ్డి 38 పాయింట్లు..ఖమ్మం జట్టు 23 పాయిట్లు సాధించాయి.

కరీంనగర్ - హైదరాబాద్ బుల్స్ మ్యాచ్ డ్రా..

వరంగల్ : తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి రీజియన్స్ టాప్ లో నిలవగా ద్వితీయ స్థానంలో హైదరాబాద్ బుల్స్ కొనసాగుతోంది. 9వ రోజు వరంగల్ జిల్లాలోని హన్మకొండ లో కరీంనగర్ కింగ్ జట్టుతో హైదరాబాద్ బుల్స్ పోటీ పడింది. ఆసక్తికరంగా జరిగిన ఈ పోటీ చివరకు డ్రా అయ్యింది. ఇరు జట్లు 34 పాయింట్లు సాధించాయి.

ఇందిరాగాంధీ విమానాశ్రయంలో కిలో బంగారం స్వాధీనం..

ఢిల్లీ : ఇందిరాగాంధీ విమానాశ్రయంలో కిలో బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అల్యూమినియం వైర్ల రూపంలోకి బంగారాన్ని మార్చి తీసుకువస్తుండగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఏపీ సర్కార్ పై జగన్ నిప్పులు..

పశ్చిమగోదావరి : ద్వారకా తిరుమలలో వైసీపీ బహిరంగసభ నిర్వహించింది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు. రాష్ట్రంలో దుస్టచతుర్ముఖ పాలన సాగుతోందని, ఏ భూములను వదిలి పెట్టడం లేదన్నారు. నచ్చినవాళ్లు అడిగితే కనకదుర్గమ్మ భూములూ ఇస్తారని, అమరావతిలో జరుగుతున్నవన్నీ తాత్కాలిక నిర్మాణాలే అని విమర్శించారు. సైబర్ గ్రిడ్, ఎర్రచందనమని అవినీతికి పాల్పడుతున్నారని, అభివృద్ధి పేరిట కాంట్రాక్టర్లకు కోట్లు కుమ్మరిస్తున్నారని ఆరోపించారు.

మోడీ గ్రాండ్ ప్రి టైటిల్ విజేత సింధు..

లక్నో : సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రి టైటిల్ విజేతగా పి.వి.సింధు నిలిచింది. మరిస్కా (ఇండోనేషియా)పై 21-13, 21-14 తేడాతో సింధు గెలుపొందింది.

18:59 - January 29, 2017
18:58 - January 29, 2017

ఒక మిడిల్ క్లాస్ స్థానం నుండి వచ్చి ఎంతో కష్టపడి చదువుకుని జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన..ఒక పట్టుదల ఉండి సన్ టెక్ ఎనర్జీ సిస్టం ప్రై.లి. సంస్థ ను స్థాపించి దిగ్విజయంగా ముందుకెళుతున్నారు. ఆయనే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ భవానీ సురేష్. గత దశాబ్దకాలం నుండి సోలార్ ఎనర్జీ సిస్టం వినియోగదారులకు చేరువై వారి మన్ననలు పొందుతూ దూసుకెళుతోంది. ఎన్నో ఉత్తమ సేవలు అందిస్తూ సోలార్ ఎనర్జీ సిస్టమ్ లో తనకంటూ స్థానాన్ని నిలుపుకొంటోంది. భవానీ సురేష్ తో టెన్ టివి ముచ్చటించింది. ఆయన జీవిత విశేషాలు..ఇతరత్రా విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

18:40 - January 29, 2017

సిద్ధిపేట : జిల్లాలో పోలీసుల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. సీపీ శివకుమార్ వేధిస్తున్నాడంటూ హుస్నాబాద్ సీఐ భూమయ్య ఆరోపణలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు వాహనం వాడవద్దని..కుర్చీలో కూర్చొవద్దంటూ మానసిక క్షోభకు గురి చేస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. శివకుమార్ ఎస్పీగా ఉన్న సమయంలో అవకతవకలపై ప్రశ్నించడం జరిగిందని దీనితో ప్రస్తుతం ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ లో పోలీసు అమరవీరులు స్మారక నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, వీటిపై ప్రశ్నించినందుకు వేధస్తున్నాడని భూమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

18:34 - January 29, 2017

ఛత్తీస్ గడ్ : పోలీసులకు..మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పురంగోల్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టులో మహిళ ఉన్నట్లు తెలుస్తోంది.

18:33 - January 29, 2017

ర్యాలీలో పాల్గొన్న అఖిలేష్..రాహుల్..

ఉత్తర్ ప్రదేశ్ : ఎన్నికల ర్యాలీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీపై రాహుల్ పలు విమర్శలు గుప్పించారు.

18:16 - January 29, 2017

కృష్ణా : దళితుల భూములను తిరిగి ఇచ్చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్ చేశారు. నందివాడ (మం) ఇలపర్రులో ఆయన పర్యటించారు. అక్రమణకు గురైన భూములను ఆయన పరిశీలించారు. ఆరు వేల ఎకరాలను ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ సర్కార్ స్పందించకపోవడంతో సీపీఎం రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా రాఘవులు టెన్ టివితో మాట్లాడారు. అక్రమణకు గురైన దళితుల భూములు వారికే ఇవ్వాలని, ఆక్రమించుకున్న భూములను ఫిబ్రవరి 5లోగా ఇవ్వకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని రాఘవులు హెచ్చరించారు. ఫిబ్రవరి 6న చేపల చెరువులను ఆక్రమించుకుంటామని, దళితులకు మేలు చేస్తామన్న సీఎం దళితుల భూములు ఆక్రమణకు గురైతే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళితుల భూములు వారికే ఇవ్వాలని సూచించారు.

18:15 - January 29, 2017

'కంచె’, 'మిర్చిలాంటి కుర్రోడు' వంటి తెలుగు సినిమాల్లో ప్ర‌గ్యా జైస్వాల్‌ తన సత్తా చాటుకున్నారు. తాజాగా భక్తిరసమైన చిత్రంలో నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్ లో 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం రూపొందింది. ఇందులో హథీరాం బాబాగా నాగార్జున నటిస్తున్నారు. ప్రగ్వా జైస్వాల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రగా జైస్వాల్ తో టెన్ టివి ముచ్చటించింది. ఆమె ఎలాంటి విశేషాలు తెలియచేశారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

ఫెదరర్ విజయం..

ఆస్ట్రేలియా : ఓపెన్ మె న్స్ సింగిల్ ఛాంపియన్ లో రోజర్ ఫెదరర్ విజయం సాధించాడు. ఫైనల్ లో నాదల్ పై 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో ఫెదరర్ గెలుపొందాడు.

11 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు..

కడప : జిల్లాలోని 11 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో హెడ్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తో సహా నలుగురు అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులున్నారు. 1.3 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పెద్దషాపూర్ వద్ద ఆటో బోల్తా..

శంషాబాద్ : పెద్దషాపూర్ లో వద్ద ఆటో బోల్తా కొట్టింది. పది మందికి గాయాలు కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తన కాన్వాయ్ ళో ఆసుపత్రికి తరలించారు. జాంగీర్ పీర్లదర్గా నుండి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వీరంతా బహదూర్ పురాకు చెందిన వారు.

కేసీఆర్ కు తమ్మినేని 85వ లేఖ..

భద్రాద్రి : కొత్తగూడెంలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. దుమ్ముగూడెం మండలంలో సాగునీటి సమస్య ఉందంటూ సీఎం కేసీఆర్ కు తమ్మినేని లేఖ రాశారు. ఇది 85వ లేఖ. గోదావరి ఒడ్డున ఉన్నప్పటికీ సాగునీటికి నోచుకోవడం లేదని, ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకం నిర్వహణ లోపం వల్ల శిథిలావస్థకు చేరుకుందన్నారు. ప్రగళ్లపల్లి వద్ద గోదావరి నదిపై కొత్త లిఫ్టు నిర్మిస్తే మండలంలోని 22 వేల ఎకరాలకు సాగునీరందుతుందని, ఈ ప్రాంతంలోని చెరువుకు మరమ్మత్తులు చేపట్టి సామర్థ్యాన్ని పెంచితే మరింత భూమి సాగులోకి వస్తుందన్నారు.

17:28 - January 29, 2017

హైదరాబాద్ : స్మార్ట్ సిటీస్ పేరిట కొన్ని ప్రాంతాలను..పట్టణాలను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారని తెలంగాణ అర్బన్ డెవలప్ మెంట్ ఫోరం కన్వీనర్ డీజీ నర్సింహరావు విమర్శించారు. పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వాల దగ్గర సమగ్ర ప్రణాళిక లేదన్నారు. ప్రభుత్వం - పట్టణాల అభివృద్ధి - పౌరుల పాత్ర అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. పట్టణ ప్రజలకు మెరుగైన తాగునీటి, రవాణా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టణాల సమగ్రాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి వాటి అమలుకు పోరాటం చేస్తామన్నారు. నగర పాలక సంస్థ విధులను విస్మరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మౌళిక వసతులు కల్పిలంచడం లేదని ప్రొ.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

17:17 - January 29, 2017

ఢిల్లీలో బీటింగ్ ద రిట్రీట్..

ఢిల్లీ : దేశ రాజధానిలో బీటింగ్ ద రిట్రీట్ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు.

ద్వారకా తిరుమలలో వైసీపీ బహిరంగసభ..

తిరుపతి : ద్వారకా తిరుమలలో వైసీపీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఈసభకు ప్రజలు పోటెత్తారు. కాసేపటి క్రితం ద్వారకా తిరుమలకు పార్టీ అధ్యక్షుడు జగన్ చేరుకున్నారు.

16:58 - January 29, 2017

హైదరాబాద్ : బీజేపీ- జన‌సేనల బంధానికి ప్రత్యేక హోదా బీటలు వేస్తుందా.. ? ప‌వ‌నిజంతో కమ‌లనాథులు తాడో పేడోకు రెఢీ అయ్యారా..? ఇక బీజేపీ- జనసేన దోస్తి కటీఫ్‌కు ముహుర్తమే తరువాయా..? ఇటీవల పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం బీజేపీ- జనసేనల మధ్య చిచ్చు పెడుతుంది. రెండున్నర సంవత్సరాల నుంచి మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ- జనసేన బంధానికి మెల్లగా బీటలు పడుతున్నాయి. ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీపై ప్రత్యక్షంగా పవన్ కల్యాణ్‌ విరుచుకుపడుతున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.

ఢిల్లీ నేతల ఆగ్రహం..
తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం మ‌రోసారి తెర‌పైకి వచ్చింది. ఈ నెల 26న విశాఖ ఆర్కే బీచ్‌లో నిరసన కార్యక్రమానికి యువత పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చారు. అయితే నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడుగు అడుగునా అడ్డుకోవడాన్ని పవన్ తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఏకంగా కేంద్రాన్ని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ప‌వ‌న్ తీరుతో బీజేపీ ఢిల్లీ నేతలు ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. పరిస్థితి ఇలాగే కొన‌సాగితే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశముందని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జనసేనాని స్పీడ్‌కు బ్రేకులు వేయాలని కాషాయ నేతలు చూస్తున్నారు. మొత్తానికి తాజా పరిణామాలతో... ఏపీకి ప్రత్యేక హోదా అంశం బీజేపీ- జనసేన మైత్రికి ఆటంకాలు సృష్టిస్తోందని.. త్వరలోనే రెండు పార్టీలు విడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

16:52 - January 29, 2017

అమెరికా : ఏడు ముస్లిం దేశాల నుంచి అమెరికాలోకి వలసలను నిషేధిస్తూ అధ్యక్షుడు టంప్‌ జారీ చేసిన ఆదేశాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొంపముంచే ట్రంప్‌ ఆదేశాలపై అటు అమెరికాతో పాటు, ఇటు ఇతర దేశాల్లో కూడా నిరసనలు మిన్నంటుతున్నాయి. ట్రంప్‌ ఆదేశాలు జారీ చేసిన వెంటనే అమెరికా పోలీసులు, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అమలు చేయడం ప్రారంభించడంతో ఇస్లామిక్‌ దేశాల నుంచి అమెరికా వస్తున్న పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రంప్‌ ఆదేశాలను అమెరికాలోని ప్రజాస్వామ్యవాదులు సహా ప్రపంచంలోని ప్రముఖులు తప్పుడుతున్నారు. మరోవైపు ట్రంప్‌ ఆదేశాల అమలును నిలిపివేస్తూ అమెరికా జిల్లా కోర్టు స్టే విధించింది.

ఏడు దేశాల ముస్లింల పౌరులు..
ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఆదేశాల అమలు నిలిపివేస్తూ అమెరికా జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్‌ ఆదేశాలను వ్యతిరేకిస్తూ అమెరికా పౌర హక్కు సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యూయార్క్‌లోని ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు బ్రూక్లిన్‌ ఫెడరల్‌ జడ్డి యాన్‌ డొనెల్లి స్టే విధించారు. ఈ ఆదేశాలపై ఫెడరల్‌ కోర్టులో సవాల్‌ చేసేందుకు ట్రంప్‌ సిద్ధమవుతున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇస్లామిక్‌ ఉగ్రవాద ప్రభావిత దేశాల పౌరులు అమెరికా రాకుండా చర్యలు తీసుకుంటానని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే అమల్లోకి తెచ్చారు. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఏడు దేశాల పౌరుల గుండెల్లో పిడుగులు...
వలసదార్ల ప్రవేశంపై ట్రంప్‌ విధించిన తాత్కాలిక నిషేధం వివాదాస్పదంగా మారుతోంది. అధ్యక్షుడి ఆదేశాలతో ఒకటికాదు, రెండుకాదు.. ఏడు దేశాల పౌరుల గుండెల్లో పిడుగులు పడినట్టు అయ్యింది. ఇరాన్‌, ఇరాక్‌, లిబియా, సుడాన్‌, యెమన్‌, సొమాలియాల నుంచి వలసలకు మూడు నెలల బ్రేక్‌ వేశారు. మన పొరుగుదేశం పాకిస్థాన్‌, అఫ్గనిస్థాన్‌, సౌదీ అరేబియాల నుంచి అమెరికా వచ్చే వారిని క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలన్న ఆదేశాలను పోలీసులు, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అమల్లోకి తెచ్చారు. విమానాశ్రయాలతోపాటు, అమెరికాలోని వీధుల్లో విదేశీయులను యక్ష ప్రశ్నలో వేధిస్తూ, సాధిస్తున్నారు. అమెరికా హోంలాండ్‌ విభాగం అధికారులు ఇంతవరకు 170 మందిని అడ్డుకున్నారు. వీరిని విమానాశ్రయాల్లోనే ఉంచారు.

ఎన్నికల ప్రచారంలో ఇస్లామిక్‌ దేశాలపై అక్కసు..
ట్రంప్‌కు మొదటి నుంచి ఇస్లామిక్‌ దేశాలపై ఏహ్యభావం ఉంది. ఇరాక్‌ యుద్ధం తర్వాత ఇది మరింత పెరిగింది. 2001 సెప్టెంబర్‌ 11న న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదుల దాడి తర్వాత ఇది ద్వేషంగా మారింది. అప్పటి నుంచి తన ఆక్రోషాన్ని వెళ్లగక్కేందుకు సరైన వేదికలు లేకపోవడంతో తన భావాలను లోలోపలే అణచివేసుకున్నట్రంప్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్ధిగా బరిలో నిలిచేందుకు ప్రైమరీ ఎన్నికల్లో, అభ్యర్థిత్వ ఖరారైతన తర్వాత అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ఇస్లామిక్‌ దేశాలపై తన అక్కసు వెళ్లగక్కారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అభాసుపాలయ్యారు కూడా. సొంత పార్టీ నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కొద్దిగా వెనక్కి తగ్గినట్టు కనిపించినా, ఆతర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. దీంతో రిపబ్లికన్‌ పార్టీ నేతలు తలలు బాదుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొంది, బాధ్యతలు చేట్టిన తర్వాత తనకు ఎదురులేదనుకున్న ట్రంప్‌ ఇస్లామిక్‌ దేశాల పౌరులు అమెరికా రాకుండా ఆంక్షలు విధిస్తూ తన అజెండాను అమల్లోకి తెచ్చారు.

నిషేధిత దేశాల జాబితాలో టర్కీకి మినహాయింపు..
ఇస్లామిక్‌ దేశాల పౌరులు అమెరికాలో రావడంపై ఆంక్షలు విధించే విషయంలో ట్రంప్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వ్యక్తిగతంగా ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు వ్యాపార సంబంధాలున్న దేశాలకు మినహాయింపు ఇచ్చారు. న్యూయార్క్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ట్విన్‌ టవర్స్‌పై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఈజిప్టు, లెబనాన్‌ దేశస్థులు కూడా ఉన్నారు. అలాగే ఉగ్రవాద దాడులతో టర్కీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ దేశాలతో ట్రంప్‌కు వ్యాపార సంబంధాలు ముడిపడి ఉండటంతో నిషేధం జాబితా నుంచి తప్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. తన నిర్ణయం వివాదాస్పదమైన వేళ, ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు ట్రంప్‌ ప్రయత్నించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, జర్మన్‌ చాన్సలర్‌ ఎంజెలా మెర్కెల్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే తదితరులతో ఫోన్‌లో మాట్లాడి తన నిర్ణయాన్ని తెలియజేశారు.

టెక్సాస్‌లో ఓ ప్రార్థనా మందిరాన్ని కాల్చివేసిన దుండగులు..
ట్రంప్‌ నిర్ణయం ఇటు అమెరికాతోపాటు, అటు ఇతర దేశాల్లో నిరసనలకు కారణమవుతోంది. ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే టెక్సాస్‌లోని ఓ ప్రార్థనా మందిరాన్ని దుండగులు కాల్చివేశారు. ట్రంప్‌ నిర్ణయాన్ని అమెరికా కార్పొరేట్లు తప్పు పడుతున్నారు. అధ్యక్షుడి నిర్ణయంపై నిరసన గళం విప్పారు. అమెరికా వసలవాదుల దేశమైనందుకు గర్వపడాలని ఫేస్‌ బుక్‌ సీఈవో బుకెర్‌ బర్గ్‌ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తే అమెరికా లాభపడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్‌ నిర్ణయంపై గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామిక్‌ దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశంపై నిషేధంతోపాటు, ఆంక్షలు విధించిన నేపథ్యంలో విదేశీ పర్యటనల్లో ఉన్న వంద మంది ఉద్యోగులు వెంటనే యూఎస్‌ చేరుకోవాలని ఆదేశించారు. అమెరికాలోకి ప్రతిభావంతులు రాకుండా ట్రంప్‌ నిర్ణయం అవరోధం కలిగిస్తుందని సుందర్‌ పిచయ్‌ ఆవేదన వెలిబుచ్చారు. ట్రంప్‌ నిర్ణయంపై పాకిస్థాన్‌ బాలికా విద్యా కార్యకర్త, నొబెల్‌ శాంతి పురస్కారం గ్రహీత యూసుఫ్‌ జాయ్‌ మలాలా తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం లండన్‌లో ప్రవాసం జీవితం గడుపుతున్న మలాలా.. ట్రంప్‌ నిర్ణయంతో తన గుండె పగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్‌ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రంప్‌ నిర్ణయంపై ఐక్యరాజ్య సమితి వలస విభాగం ఆందోళన వ్యక్తం చేసింది.

అమెరికా పౌరులు ఇరాన్‌ రాకుండా నిషేధిస్తాం..
ఏడు ఇస్లామిక్‌ దేశాల పౌరుల ప్రవేశంపై అమెరికా విధించిన నిషేధంపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. దీనికి ప్రతిగా అమెరికా పౌరులు ఇరాన్‌ రాకుండా నిషేధిస్తామని హెచ్చరించింది. ట్రంప్‌ నిర్ణయంపై వ్యక్తమవుతున్న నిరసనలు, ఆందోళనలు, హెచ్చరికలు, ప్రతి హెచ్చరికలు ఏ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.

ఆర్బీఐకి ఈసీ లేఖ..

ఢిల్లీ : ఆర్బీఐకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థుల నగదు డ్రా ఆంక్షలపై ఈసీ లేఖ రాసింది.

పార్ట్ నర్ షిప్ సదస్సు కాదు..గెట్ టు గెదర్ - బోత్స..

విశాఖపట్టణం : జిల్లాలో జరిగింది పార్ట్ నర్ షిప్ సదస్సు కాదని గెట్ టు గెదర్ అని వైసీపీ నేత బోత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. గత ఏడాది జరిగిన ఎంవోయూల్లో లక్ష ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్దమని, ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకునే రాక్షసుల్లా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. విశాఖను తానే అభివృద్ధి చేశానని చెబుతున్న చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో తాత్కాలిక కట్టడాలే కనిపిస్తున్నాయని, హోదా అని ఎవరైనా అంటే బాబు మండి పడుతున్నారని విమర్శించారు.

16:17 - January 29, 2017

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు 2016 సంవత్సరంలో పెద్దనోట్ల రద్దు అతి పెద్ద కుంభకోణమని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ కు చేరుకున్న ఆయన టి.కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తరువాత ప్రజలు కష్టాలు..ఇబ్బందులు పడుతున్నారని, వ్యాపారం జరగక చిన్న వ్యాపారులు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. దేశంలో వంద శాతం నగదు రహిత లావాదేవీలు చేస్తామని ప్రధాని చెబుతున్న మాటలు బూటకమని, వంద శాతం క్యాష్ లెస్ లావాదేవీలు ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాలేదన్నారు.

16:13 - January 29, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న కారణంగా ఢిల్లీ సీఎం పై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గోవాలో ఎన్నికల సభలో లంచాల వ్యాఖ్యలపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లేవుతుందని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ ఇలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని, పార్టీ రద్దు..గుర్తింపు రద్దు లాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. 'కాంగ్రెస్, బీజేపీలు ఓట్ల కోసం డబ్బులు పంచడానికి వస్తారు..కొత్త కరెన్సీ లో ఐదు వేలు ఇస్తామంటే..మీరు పదివేలు అడగండి..డబ్బు తీసుకుని ఆమ్ ఆద్మీకి ఓటు వేయండి' అంటూ ఎన్నికల సభలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దీనిపై ఈసీకి ఆయన వివరణ ఇచ్చారు. వివరణతో ఈసీ సంతృప్తి చెందకుండా కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

15:38 - January 29, 2017
15:36 - January 29, 2017

హైదరాబాద్ : ఆధునియ యుగంలో ప్రతొక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడం వల్ల దేశంలో బీపీ, షుగర్ రోగులు అధికమౌతున్నారని ప్రముఖ వైద్యులు గోపాలం శివనారాయణ పేర్కొన్నారు. జిందాబాద్ సంస్థ ఆధ్వర్యంలో బీపీ, షుగర్ పేషేంట్ల కోసం అంబేద్కర్ కాలేజీలో ఏర్పాటు చేసిన రెగ్యులర్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఆధునిక జీవన శైలి..ఒత్తిడి వల్లే బీపీ, షుగర్ వ్యాధులు వస్తున్నాయన్నారు. షుగర్ వ్యాధి వచ్చిన వారికి తక్కువ ఖర్చుతో పరీక్షలు చేయడం..మందులు ఇవ్వాలన్న ఉద్ధేశ్యంతో నగరంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

15:31 - January 29, 2017

కరీంనగర్ : జిల్లాలోని మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ లో తేనేటీగలు దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న పోచమ్మ దేవాలయం వద్ద బోనాలు పెట్టేందుకు ఆదివారం పలువురు వెళ్లారు. అదే సమయంలో తేనేటీగలు వీరిపై విరుచకపడ్డాయి. దీనితో 20 మందికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ముగ్గురిని మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

15:28 - January 29, 2017

పశ్చిమగోదావరి : మూలలంక రైతుల దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. ప్రభుత్వ బలవంతంపు భూ సేకరణను నిరిసిస్తూ జిల్లాలోని పోలవరం మండలం మూలలంక రైతులు నిరహార దీక్ష చేపట్టారు. వీరి డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి దీక్షను భగ్నం చేశారు. శనివారం రాత్రి పోలీసులు దీక్షా ప్రదేశానికి చేరుకుని బలవంతంగా రైతులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో రైతులు దీక్ష కొనసాగిస్తున్నారు. వైద్యానికి వారు నిరాకరిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్ష కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. మూలలంకలోని డంపింగ్ యార్డు కోసం స్థానిక రైతుల నుండి 203 ఎకరాలను బలవంతంగా సర్కార్ సేకరించింది. కానీ పరిహారం చెల్లించకపోవడంతో రైతులు దీక్షలకు దిగారు.

15:16 - January 29, 2017

లక్నో : కాంగ్రెస్..ఎస్పీ పొత్తు కుదిరింది. పొత్తుపై యూపీ సీఎం అఖిలేష్ యాదవ్..ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు సంతృప్తి వ్యక్తం చేశారు. వీరివురూ ఆదివారం మీడియాతో మాట్లాడారు. తాను రాహుల్ గాంధీ సైకిల్ కు రెండు చక్రాల్లాంటి వాళ్లమని అఖిలేష్ పేర్కొన్నారు. తమది ప్రజల కూటమి అని 300కు పైగా స్థానాల్లో గెలుపొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు గంగా - యమునల సంగమం వంటిదని రాహుల్ పేర్కొన్నారు. అభివృద్ధి, శాంతి, సంక్షేమం కోసమే పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. యూపీ నుండి దేశానికి ఓ సందేశం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.
యూపీలో 105 సీట్లకు కాంగ్రెస్, 298 సీట్లకు సమాజ్ వాదీ పార్టీలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. తమ ప్రత్యర్థులైన బీజేపీ, బీఎస్పీలను ఓడించాలంటే కాంగ్రెస్ తో పోత్తు కలిసొస్తుందని అఖిలేష్ అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.

చిత్తూరులో మూట కలకలం..

చిత్తూరు : శేషాపిరాన్ బీబీ మసీదులో ఓ మూట కలకలం సృష్టించింది. మసీదులోని స్మశానం శుభ్రం చేస్తుండగా ఓ మూట బయటపడింది. పోలీసులు మూటను పరిశీలిస్తున్నారు.

మీడియాతో అఖిలేష్, రాహుల్..

లక్నో : కాంగ్రెస్, ఎస్పీ పొత్తు అనంతరం యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు మీడియాతో మాట్లాడారు. ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు గంగా యమునల సంగమం వంటిదని రాహుల్ పేర్కొన్నారు. అభివృద్ధి, శాంతి, సంక్షేమం కోసమే పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. యూపీ నుండి దేశానికి ఓ సందేశం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.

 

మావోయిస్టులు..పోలీసుల మధ్య కాల్పులు..

ఛత్తీస్ గఢ్ : దంతెవాడ జిల్లా పురంగోల్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

14:33 - January 29, 2017
14:30 - January 29, 2017

ఢిల్లీ : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఆదివారం ఉదయం మన్ కీ బాత్ లో మోడీ ప్రసంగించారు. విద్యార్థులు ఏళ్ల తరబడి చదువుతుంటారని అంతే ఉత్సాహంగా పరీక్షలను ఎదుర్కొవాలన్నారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులు..తల్లిదండ్రులు..ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతారని, ఈ పరిస్థితుల నుండి బయట పడాలన్నారు. పరీక్షల సమయంలో ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని లేనిపక్షంలో పరీక్ష తప్పే ప్రమాదం ఉందన్నారు. అంతర్మథనమే విజయవంతమైన క్రీడాకారుల విజయ రహస్యమని, సచిన్ 20 ఏళ్ల పాటు తన రికార్డులను తానే అధిగమిస్తూ వస్తున్నారన్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ దేశానికి చేస్తున్న సేవలు మరువలేవన్నారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా రేపు ఉదయం 11గంటలకు మౌనం పాటించాలని, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించాలని మోడీ సూచించారు. కాశ్మీర్ లో మంచుచరియల్లో సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.

14:18 - January 29, 2017

అనంతపురం : పుట్టవర్తి నియోజకవర్గానికి చెందిన మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని.. పల్లెకు అబద్ధాల మంత్రిగా బిరుదు ఇవ్వచ్చని వైసీపీ నాయకులు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. నియోజవర్గంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఆయన చురుగ్గా పాల్గొంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలు పడుతున్నా మంత్రి పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి చేతకాని మంత్రి తమ నియోజకవర్గంలో ఉండడం ప్రజల దురదృష్టమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జగన్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. 

 

14:13 - January 29, 2017

భద్రాద్రి కొత్తగూడెం : సామాజిక తెలంగాణ సాధన కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేస్తున్న మహాజన పాదయాత్ర 105వ రోజుకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. జిల్లాలోని గంగోలు, సీతారామపురం, నర్సాపురం, తూరపాక, సన్నాయిగూడెం, ఏటపాక, భద్రాచలంలో సీపీఎం బృంద పాదయాత్ర చేస్తోంది. భద్రచాలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యతో కలిసి పిల్లలకు పోలియో చక్కలు వేశారు. పాదయాత్ర గ్రామాల్లో నిర్వహిస్తున్న సభల్లో.. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల మళ్లింపు అంశాన్ని తమ్మినేని వీరభద్రం ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

 

14:09 - January 29, 2017

కృష్ణా : నందివాడ మండలం ఇలపర్రులో ఆక్రమణకు గురైన పేదల భూములను సీపీఎం నేతలు బీవీ రాఘవులు, మధు పరిశీలిస్తున్నారు. ఇలపర్రులో దళితులు, పేదలకు చెందిన 165 ఎకరాల భూమిని చేపల చెరువుగా మార్చారు అక్రమార్కులు. పేదలకు చెందిన భూమిని పేదలకే అప్పగించాలని 150 రోజులుగా ఇలపర్రులో ఉద్యమం కొనసాగుతోంది. దీనికి రైతులు, వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఎం, కేవీపీఎస్‌ నేతలు మద్దతు తెలిపారు. పేదల భూములు పేదలకు ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

14:09 - January 29, 2017

జగిత్యాల : జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో గర్భిణీకి నర్సు ఆపరేషన్ చేసింది. దీనితో పసికందు మృతి చెందింది. ఈ విషాద ఘటన జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. గొల్లపల్లి మండలం మౌనిక పురుటినొప్పులతో శనివారం రాత్రి వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున వైద్యులు స్పందించకపోవడం..ఆపరేషన్ చేయడానికి రాక పోవడంతో అక్కడనే ఉన్న నర్సు ఆపరేషన్ చేసేందుకు సిద్ధమైంది. కొద్ది గంటల తేడాలోనే పసికందు మృతి చెందింది. విషయం తెలుసుకున్న మౌనిక కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని, డ్యూటీలో ఉన్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పేర్కొంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో వైద్యులు నిర్లక్ష్యంగా ఉంటుండడం వల్ల ఉన్నతాధికారులు పలువురిపై చర్యలు తీసుకున్నారు. మరి డ్యూటీలో ఉన్న వైద్యులపై చర్యలు తీసుకుంటారా ? లేదా ? అనేది చూడాలి.

14:05 - January 29, 2017

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో సీఎం చంద్రబాబు కేంద్రంతో కుమ్మక్కయ్యారని వైసిపి ఎంపీలు అన్నారు. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరిగే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రత్యేక హోదానే ప్రధాన ఎజెండాగా పోరాడుతామన్నారు వైసిపి ఎంపీలు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఎలాంటి అంశాలపై చర్చించాలన్న ఎజెండాతో వైసిపి పార్లమెంటరీ భేటీ జరిగింది. వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వైసిపి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వర ప్రసాద్‌, వైవీ సుబ్బారెడ్డి, భుట్టా రేణుక, మిథున్‌రడ్డి హాజరయ్యారు. 

 

14:00 - January 29, 2017

వివిధ సాహితీ వేదికల వేడుకల విశేషాలను వీడియోలో చూద్దాం... 

 

13:58 - January 29, 2017

సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది కవులు రచయితలు సామాజిక ప్రయోజనం ఆశించి సాహిత్య సృజన చేస్తున్నారు. అలాంటివారిలో గాటిమాలా రచయిత ఆస్ట్రియాస్ ఒకరు. నియంతల అసలు నైజాన్ని, భూమిపుత్రుల సంస్కృతిని, కష్టాలను నవలలుగా చిత్రించిన ఆస్ట్రియాస్ ప్రత్యేక కథనంతో పాటు బూర్గుల ప్రభాకర్ జనం పాట, వివిధ సాహితీ వేదికల వేడుకల సమాహారంగా ఈ వారం మీ ముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం.

నరహంతలు ధరాధిపతులైన వేళ , సమస్త ప్రపంచం వారి పాదాక్రాంతమైన వేళ ఒంటరి నిస్సహాయ రచయితలు కొందరు ఏటికి ఎదురీది తమ కలం బలంతో ఆ నియంతల్ని ఢీకొట్టారు. తమ సృజనాత్మక శక్తినే సైన్యంగా మలిచి తిరుగుబాటు ప్రకటించారు. అణచివేతలకు, క్రూరశిక్షలకు సిద్దపడి తమ గుండె ధైర్యాన్ని చాటారు. లాటిన్ అమెరికన్ దేశాలకు చెందిన అలాంటి రచయిత మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్ ని పరిచయం చేస్తున్నారు..ప్రముఖ కథకులు టైటానిక్ సురేష్.

ప్రపంచ సాహిత్యంలో నియంతల గురించీ, వారి ఆవిర్భావం, ఎదుగుదల, అణచివేత, నిరంకుశ ప్రవృత్తి, వారి ఉత్థాన పతనాల  ప్రస్ఠానాన్ని చిత్రిస్తూ ప్రతిభావంతమైన నవలలు కొన్ని వచ్చాయి. పాశ్చాత్య సాహిత్యంలో ఆ రచనా ధోరణిని  'డిక్టేటర్ నావెల్' అని పిలుస్తారు.  అలాంటి 'డిక్టేటర్ నావెల్' రచనా ధోరణికి  లాటిన్ అమెరికన్ సాహిత్యంలో అద్యుడు  మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్.  

అది కలా నిజమా? పౌరాణికమా, చారిత్రకమా? వచనమా, కవిత్వమా? గతమా, వర్తమానమా? కల్పనా, వాస్తవమా? జానపదమా, సర్రియలిజమా? మౌఖిక కథనమా, ఏదీకాని దిగంతాల స్వప్న సంభాషణా? ఇవన్నీ కల గలిసిన ఓ సరికొత్త శైలిలో లాటిన్ అమెరికన్ సాహిత్యంలోనే అత్యంత క్లిష్టమయిన ఆధునిక మహా కావ్య రచనకు పూనుకొన్నాడు  మిగ్యుల్  ఏంజెల్ ఆస్ట్రియాస్. అదే  మెన్ ఆఫ్ మైజ్ నవల ....    

 

హోదా కోసం పట్టుబడుతాం - వైసీపీ ఎంపీలు..

హైదరాబాద్ : వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, హోదా కోసం పార్లమెంట్ లో పట్టుబడుతామని వైసీపీ ఎంపీలు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ప్రైవేటు మెంబర్ బిల్లు ఈ సమావేశంలో చర్చకు వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

గర్భిణీకి డెలివరీ చేసిన నర్సులు..

జగిత్యాల : ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీకి నర్సులు డెలివరీ చేశారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు ఆపరేషన్ చేయడంతో పుట్టిన కొన్ని గంటల్లోనే శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు.

13:54 - January 29, 2017
13:53 - January 29, 2017

ఏపీ సర్కార్ కు రాఘవులు డెడ్ లైన్...

కృష్ణా : నందివాడ (మం) ఇలపర్రులో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పర్యటించారు. అక్రమణకు గురైన భూములను ఆయన పరిశీలించారు. అక్రమణకు గురైన దళితుల భూములు వారికే ఇవ్వాలని, ఆక్రమించుకున్న భూములను ఫిబ్రవరి 5లోగా ఇవ్వకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని రాఘవులు హెచ్చరించారు. ఫిబ్రవరి 6న చేపల చెరువులను ఆక్రమించుకుంటామని, దళితులకు మేలు చేస్తామన్న సీఎం దళితుల భూములు ఆక్రమణకు గురైతే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళితుల భూములు వారికే ఇవ్వాలని సూచించారు.

పంజాబ్ లో రూ. 6.6 కోట్లు సీజ్..

పంజాబ్ : రాష్ట్రంలో రూ. 6.6 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. ఓటర్లకు పంచేందుకు డబ్బును సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు నిర్ధారించారు.

 

మన్ కీ బాత్ లో మోడీ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్రసంగించారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా రేపు ఉదయం 11గంటలకు మౌనం పాటించాలని, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించాలని మోడీ సూచించారు. కాశ్మీర్ లో మంచుచరియల్లో సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. విద్యార్థులు ఏళ్ల తరబడి చదువుతుంటారని అంతే ఉత్సాహంగా పరీక్షలను ఎదుర్కొవాలన్నారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులు..తల్లిదండ్రులు..ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతారని, ఈ పరిస్థితుల నుండి బయట పడాలన్నారు.

13:50 - January 29, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌లో మరో బిగ్‌ వికెట్‌ పడింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, విదేశాంగశాఖ మాజీ మంత్రిగా పనిచేసిన ఎస్‌ ఎం కృష్ణ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి ఎస్‌ఎం కృష్ణ లేఖరాశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఎస్‌ఎం కృష్ణ బీజేపి గూటికి చేరనున్నట్లు సమాచారం. రాజీనామాపై వివరణ కోరగా..ఆదివారం స్పందిస్తానని కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పినట్లు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రిగా, విధానసభాపతి, కేంద్ర పరిశ్రమల సహాయ మంత్రి, విదేశాంగ వ్యవహారాల మంత్రి, మహారాష్ట్ర గవర్నర్‌, కేపీసీసీ అధ్యక్షుడిగా కృష్ణ పలు పదవుల్ని చేపట్టారు. అయితే విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి నాయకత్వాన్ని హఠాత్తుగా తొలగించినప్పటి నుంచి నాలుగేళ్లుగా పార్టీ క్రియాశీల రాజకీయాలకు కృష్ణ దూరంగా ఉన్నారు. 

 

ట్రంప్ నిర్ణయంపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై న్యూయార్క్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీసా ఉన్న వారిని అమెరికాలోకి అనుమతించాలని ఆదేశించింది. ట్రంప్ ఆదేశాలతో వీసా ఉన్నవారిని కూడా అధికారులు అడ్డుకున్నారు.

 

13:49 - January 29, 2017

ఛండీఘర్ : హరియాణాలో జాట్‌ వర్గీయులు ఆందోళన ఉద్ధృతం చేశారు. తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ 19 జిల్లాల్లో జాట్‌ వర్గీయులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. జాట్‌ల ఆందోళనలతో గురుగ్రామ్‌లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. 

 

సానియా జోడి పరాజయం..

ఢిల్లీ : ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్ లో సానియా జోడి పరాజయం చెందింది. 2-6, 4-6 తేడాతో స్పియర్స్ కోబల్ జోడి చేతిలో ఓటమి చెందారు.

13:44 - January 29, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పల్స్‌పోలియో కార్యక్రమం విస్త్రతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని రౌండ్‌ టేబుల్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 25వేల 725 బూతులను ఏర్పాటు చేశామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. 5ఏళ్లలోపు ఉన్న పిల్లలందరికి పోలియో చుక్కలను వేయించాలని మంత్రి తెలిపారు. 

 

13:41 - January 29, 2017

హైదరాబాద్‌ : నగరంలో నాలాల శుద్ధికి ప్రత్యేక కార్యక్రమం బల్దియా రూపొందించింది. 365 రోజులు నాలాల పూడిక తీయాలని నిర్ణయించింది. అవినీతికి తావులేకుండా.. నగరవాసులకు అసౌకర్యం కలగకుండా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమంటుంది జీహెచ్‌ఎంసీ.
నాలాల పూడికతీతకు రూ.30 కోట్ల ఖర్చు 
గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఉన్న నాలాల‌ శుద్ధికి ప్రత్యేక చ‌ర్యలు చేప‌ట్టింది బ‌ల్దియా.  నగర ప‌రిధిలోని దాదాపు వెయ్యి కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో మురుగు  కాలువ‌లు, వ‌ర్షపునీటి కాలువ‌లున్నాయి. వీటిలో మేజ‌ర్ నాలాలు 216 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.  పైప్‌లైన్ డ్రెయిన్లు,  చిన్న సైజు నాలాలు మరో 735 కిలోమీట‌ర్ల మేర విస్తరించి ఉన్నాయి.  ప్రతి ఏడాది వర్షాకాలానికి ముందు ఈ నాలాల పూడికతీత పనులు చేసేవారు. ఈ ప‌నుల కోసం ప్రతి ఏటా 25 నుంచి 30కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేస్తుంది బ‌ల్దియా. అయితే ప‌నుల అనంత‌రం మ‌ట్టిని నాలాల ప‌క్కనే వేయ‌డంతో వ‌ర్షం పడినప్పుడు ఆ మట్టి మళ్లీ నాలాల్లోకి కొట్టుకువచ్చేది. దీంతో ఆ డబ్బంతా వృథా అయ్యేది. 
పూడికతీత పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు 
మరోవైపు పూడికతీత పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చేది. వీటన్నింటిని ఆధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ఇక నుంచి ప్రతి రోజు నాలాల పూడికతీత పనులు చేపట్టాలని డిసైడ్ అయింది. దీంతో నాలాలు పొంగిపోర్లే ఇబ్బందులు తప్పుతాయని భావిస్తోంది.
పూడికతీత పనులకు రూ.30.18 కోట్లతో టెండర్లు
దాదాపు 1000కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్న మేజ‌ర్ నాలాలు, డ్రెయిన్లు,  చిన్న నాలాలు, పైప్ డ్రెయిన్ల పూడికతీత ప‌నుల‌కు 30.18కోట్ల రూపాయ‌ల‌తో టెండ‌ర్లు పిలిచారు బ‌ల్దియా అధికారులు. వీటిలో 216 కిలోమీట‌ర్ల పొడ‌వున ఉన్న మేజ‌ర్ నాలాల్లో  4,49,111 క్యూబిక్ మీట‌ర్ల పూడిక ఉంద‌ని అంచ‌నా వేయగా.. 735 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్న మైన‌ర్ డ్రెయిన్లు, పైప్ డ్రెయిన్లలో 3,33,780 క్యూబిక్ మీట‌ర్ల పూడిక ఉంద‌ని అధికారులు లెక్కలేశారు. ఈ ప్రణాళిక‌తో ఎప్పటిక‌ప్పుడు నాలాల పూడిక‌తీత పూర్తవ‌డ‌మే కాకుండా ప‌నుల్లో పార‌ద‌ర్శకత ఉంటుంద‌ని బల్దియా భావిస్తోంది. 

13:36 - January 29, 2017

ఢిల్లీ : అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో చరిత్ర సృష్టించింది. ఉమెన్స్‌ సింగిల్స్ టైటిల్ నెగ్గి మోడ్రన్‌ టెన్నిస్‌లో హిస్టరీ క్రియేట్‌చేసింది. జర్మన్ టెన్నిస్‌ క్వీన్‌ స్టెఫీగ్రాఫ్ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ రికార్డ్‌ను  బద్దలు కొట్టిన బ్లాక్‌ థండర్‌ ....ఆల్‌టైమ్‌ రికార్డ్‌పై కన్నేసింది. 7వ సారి ఆస్ట్రేలియా ఓపెన్‌ వింబుల్డన్ టైటిల్ సాధించిన మోడ్రన్‌ టెన్నిస్‌ క్వీన్‌ సెరెనావిలియమ్స్‌  గ్రాండ్ స్లామ్ రికార్డులపై 10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్......
చరిత్రను తిరగరాసిన సెరెనా
ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదనటానికి...సెరెనా విజయాలే నిదర్శనం. అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్...మోడ్రన్‌ మహిళా టెన్నిస్‌లో తన తర్వాతే ఎవరైనా అని నిరూపించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గి చరిత్రను తిరగరాసింది. లేటు వయసులోనూ లేటెస్ట్‌ రికార్డ్‌లు సాధిస్తూ...ప్రపంచ మహిళా టెన్నిస్ లో తనకు తానే సాటిగా నిలిచింది. ఉమెన్స్‌ సింగిల్స్‌ టైటిల్ ఫైట్‌లో అక్క వీనస్‌ విలియమ్స్‌ను ఓడించి ...ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపించుకొంది.
ఏకపక్షంగా ముగిసిన పోటీ 
రాడ్‌ లేవర్‌ ఎరీనా సెంటర్ కోర్ట్‌లో ముగిసిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా, కేవలం 84 నిముషాల్లోనే...వీనస్‌ను వరుససెట్లలో చిత్తు చేసింది. సెరెనా అంచనాలకు మించి అదరగొట్టడంతో, అక్కాచెల్లెళ్ల మధ్య హోరాహోరీగా సాగుతుందనుకున్న పోటీ కాస్తా...ఏకపక్షంగా ముగిసింది. వరుసగా 6-4, 6-4తో నెగ్గిన సెరెనా కెరీర్‌లో 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ సొంతం చేసుకుంది. 7వ సారి ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి సంచలనం సృష్టించింది. 
స్టెఫీ గ్రాఫ్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టిన సెరెనా 
గ్రాండ్‌స్లామ్‌ ఓపెన్‌ శకం ఆరంభమైన తర్వాత  22 టైటిల్స్‌తో ఇప్పటివరకూ టాప్‌ప్లేస్‌లో ఉన్న జర్మన్‌ టెన్నిస్‌ క్వీన్‌ స్టెఫీ గ్రాఫ్‌ రికార్డ్‌ను సెరెనా బద్దలు కొట్టింది. రెండుదశాబ్దాల తన టెన్నిస్ కెరియర్‌లో..1999లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ విజయం సాధించిన సెరెనా...35 ఏళ్ల వయసులో 23వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ నెగ్గి తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది.
రెండో స్థానంలో సెరెనా  
సెరెనా సాధించిన మొత్తం 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో... 7 ఆస్ట్రేలియన్, 7 వింబుల్డన్, 3 ఫ్రెంచ్, 6 అమెరికన్ ఓపెన్‌ టైటిల్స్ ఉన్నాయి.మహిళా టెన్నిస్ చరిత్రలో ఓపెన్‌ టోర్నమెంట్‌ శకంతో పాటు ఓవరాల్‌గా .....అత్యధికంగా మార్గారెట్ కోర్ట్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గితే...23 ఓపెన్‌ శకం గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌తో సెరెనా రెండో స్థానంలో నిలిచింది. 
ఒలింపిక్స్‌లో సైతం గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన సెరెనా 
గతంలో గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అత్యధికంగా విజయాలతో...ఆల్ టైమ్ గ్రేట్ మార్టీనా నవ్రతిలోవా రికార్డ్‌ బ్రేక్‌ చేసిన సెరెనా....ప్రస్తుత ఆస్ట్రేలియా ఓపెన్‌ విజయంతో గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో మాత్రమే కాదు...ఒలింపిక్స్‌లో సైతం గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన అరుదైన ఘనత సెరెనా విలియమ్స్‌కే సొంతం. 35 ఏళ్ల సెరెనా ఇదే జోరు కొనసాగిస్తే ప్రస్తుత సీజన్‌లో మార్గరెట్‌ కోర్ట్‌ 24 ఆల్‌ టైమ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ రికార్డ్‌ బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదనటానికి...సెరెనా విజయాలే నిదర్శనం అనడంలో అనుమానమే లేదు. 

 

13:24 - January 29, 2017

భద్రాద్రి కొత్తగూడెం : ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఇతర ప్రధాన సెంటర్లు, మొబైల్ కేంద్రాల ద్వారా పోలీయో కార్యక్రమం చేపట్టారు. పోలియో రహిత సమాజం చేపట్టడమే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. 

 

గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్ : గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ సీనియర్ నేత చిదంబరంతోపాటు ఎంపీలు, నేతలు హాజరయ్యారు. 

13:12 - January 29, 2017

మహబూబ్‌నగర్‌ : అడ్డాకుల దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం డ్రైవర్‌ మృతి చెందాడు. అడ్డాకులు టోల్‌ ప్లాజా దగ్గర ఆగివున్న రెండు బస్సులను వెనుక నుంచి వేగంగా వచ్చిన తమిళనాడుకు చెందిన డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న వోల్వో, హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న గరుడ ప్లస్‌ బస్సులు దెబ్బతిన్నాయి. డీసీఎం డ్రైవర్‌ శశికిరణ్‌ క్యాబిన్‌లో చిక్కుకుని మరణించాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ అనంతపురం డిపో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. మరో ఐదుగురు ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి.

 

13:09 - January 29, 2017

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టుల నిధుల్లో భారీగా కోత పడనుంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించామని చెబుతున్న ప్రభుత్వం.. అమల్లో మాత్రం మొండి చెయ్యి చూపుతోంది. తొమ్మిది నెలల గడిచిన తర్వాత కూడా కేటాయించిన బడ్జెట్‌లో నిధులు సగం కూడా ఖర్చు చేయకపోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల పనులు నత్తనడక నడుస్తున్నాయి.
అరకొర నిధులు 
తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నాం.. మన నీళ్ళు మనం సాధించుకుందాం.. అంటూ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే మా తక్షణ కర్తవ్యం అంటూ పదేపదే చెప్పుకొస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా 25000 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు జరిపినప్పటికీ నిధుల వినియోగం మాత్రం జరగలేదు.
గత వార్షిక బడ్జెట్ లో సాగునీటి రంగానికి 25 వేల కోట్లు 
గత వార్షిక బడ్జెట్ లో సాగునీటి రంగానికి 25 వేల కోట్లు కేటాయించింది రాష్ట్రప్రభుత్వం. అయితే డిసెంబర్‌ నెలాఖరుకు ప్రాజెక్టులపై 9వేల 700 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగింది. అంటే ఇప్పటి వరకు కేటాయించిన వాటిలో  కేవలం 40 శాతం కూడా ఖర్చు పెట్టలేక పోయింది కేసీఆర్‌ సర్కార్. వచ్చే బడ్జెట్ నాటికి మిగిలిన మూడు నెలల కాలంలో వేగంగా చెల్లింపులు జరిపినా 6 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టడం అసాధ్యమనేది అధికారుల వాదన.
నీటిపారుదల రంగానికి నిధులు తగ్గింపు ..?
ఫలితంగా గతానుభవంతో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో నీటి పారుదల రంగానికి నిధుల కేటాయింపులు తగ్గిస్తారనీ తెలుస్తొంది. వచ్చే బడ్జెట్ లో కేవలం 16వేల కోట్లు సరిపొతాయనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాన ప్రాజెక్టుల లెక్కలు చూసుకుంటే కరువు పీడిత మహబూబ్‌నగర్‌ జిల్లాకు తాగునీరు, సాగునీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నత్తనడక నడుస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌లో అత్యధికంగా 7వేల 810 కోట్లను ఈ ప్రాజెక్టుకు కేటాయించగా డిసెంబర్‌ నెలాఖరుకు కేవలం 440 కోట్లు మాత్రమే ఖర్చయింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సంవత్సరం కావస్తున్నా పనులు వేగం పుంజుకోలేదు.
నత్తనడక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు  
ఇక ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కూడా నత్తనడక నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కింద భూసేకరణకే ఎక్కువగా చెల్లింపులు చేసినట్టు తెలుస్తోంది. మూడు బ్యారేజీలు. పంప్‌హౌస్‌ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రస్తుత బడ్జెట్‌లో 6వేల 286 కోట్లు కేటాయించగా తొమ్మిది నెలల కాలంలో 3వేల 652 కోట్లు ఖర్చు పెట్టారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టుల కోసం 849 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు 640 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ప్రాజెక్టులను ఈ సంవత్సరం జూన్‌ నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి అంతంత మాత్రమే... 
లక్ష్యం ఎలా ఉన్నా ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి అంతంత మాత్రంగా ఉంది. నోట్ల రద్దు, నిధుల కొరత ఒక ఎత్తైతే. భూసేకరణ, అధికారుల నిర్లక్షం వెరసి తెలంగాణ ప్రాజెక్ట్ ల నిర్మాణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. మరిప్పటికైనా ప్రభుత్వం స్పందించి లొటుపాట్లు సరిచేయాలని నీటిపారుదల రంగ నిపుణులు కోరుతున్నారు. 

12:56 - January 29, 2017

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అక్కడి కోర్టుల నుండి మొదటి షాక్‌ తగిలింది. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల వారు అమెరికా రాకుండా ట్రంప్‌ విధించిన ఆంక్షలను ఆ దేశ న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్‌ ఆదేశాలపై ది అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి యాన్‌ డొనెల్లి విచారణ నిర్వహించి ఈ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం చట్టపరమైన దరఖాస్తు ఆమోదం, వీసాతో అమెరికాలో నివసించే శరణార్థులు, అమెరికాలో ప్రవేశించడానికి చట్టపరమైన అనుమతులు ఉన్న వ్యక్తులను పంపించి వేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతోపాటు ఇప్పటి వరకు ప్రభుత్వ కొత్త ఆదేశాల కారణంగా అరెస్టైన వారి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. 

 

12:53 - January 29, 2017
12:50 - January 29, 2017

కృష్ణా : జిల్లాలో కంచికచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. వి.కృష్ణారావు అనే వ్యక్తి మిక్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఇవాళ కాలేజీలో నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎగ్జామ్ కు ఇన్విజిలేటర్ విధులు నిర్వహించేందుకు వెళ్తున్నాడు. ఈనేపథ్యంలో మిక్ కాలేజీ సమీపంలో రోడ్డు దాటుతున్న వి.కృష్ణారావు పోలీసు స్టిక్కర్ తో ఉన్న కారు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ ను కంచికచెర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచాణ చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

తిరుమలలో అగ్ని ప్రమాదం....

చిత్తూరు : తిరుమలలోని వకులమాత పోటు విభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేశారు. పెను ప్రమాదం తప్పింది. 

 

12:31 - January 29, 2017

రేసులో వెనుకపడిపోయింది చెన్నై బ్యూటీ రెజీనా. కొత్త హీరోయిన్స్ ఆఫర్ల మీద ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంటే, చేతిలో ఒకే ఒక్క సినిమా ఉన్నఈ బ్యూటీ నెక్ట్స్ పోజిషియన్ ఏంటీ అనే డైలామాలో ఉంది. ప్రస్తుతం చేస్తున్న కొత్త సినిమాపైనే రెజీనా బోలెడు ఆశలు పెట్టుకుంది. మరి ఈ చెన్నై బ్యూటీ అంతగా హోప్స్ పెట్టుకున్న ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం...
అవకాశాల వేటలో వెనుకబడిన రెజీనా  
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఐదేళ్లు అవుతున్నా.. రెజీనా ఇంకా నెక్ట్స్ ఏంటి అనే పొజిషన్‌ అనే డైలామాలోనే వుంది. గ్లామర్ తో పాటు మంచి యాక్టింగ్ స్కీల్ ఉన్న ఈ బ్యూటీ పేట్ మాత్రం మారడం లేదు. తన తరువాత ఏంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ లాంటి యంగ్ హీరోయిన్లు ఆఫర్లతో దూసుకుపోతుంటే.. రెజీనా మాత్రం అవకాశాల వేటలో వెనుకబడిపోయింది. ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా చేస్తున్న ఈ బ్యూటీ ఆ సినిమా కెరీర్ ని టర్న్ చేస్తోందని హోప్స్ పెట్టుకుంది.
నక్షత్రంతో తనకు బ్రేక్ వస్తోందని రెజీనా పుల్ కాన్పిడెంట్  
రెజీనా కెరీర్‌లో పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, జ్యో అచ్యుతానందా హిట్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమాలన్ని సెకెండ్ స్టేజ్ మూవీస్. ఈ బ్యూటీ కి రవితేజ లాంటి స్టార్ తో పవర్ మూవీలో నటించింది. కానీ ఈ మూవీలోని రెజీనా క్యారెక్టర్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత ఈ చెన్నై చిన్నదానికి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం రాలేదు. దీంతో ఎన్ని సినిమాలు చేసిన కూడా హీరోయిన్ గా రెజీనా రేంజ్ మాత్రం పెరగలేదు. కానీ ఇప్పుడు తను చేస్తున్న నక్షత్రం మూవీతో హీరోయిన్ గా తనకు బ్రేక్ వస్తోందని రెజీనా పుల్ కాన్పిడెంట్ గా ఉంది. ప్రస్తుతం రెజీనా చేతిలో నక్షత్రం సినిమా ఒక్కటే వుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ స్టేజ్ కి చేరుకుంది. దర్శకుడిగా స్లంప్ లో ఉన్న కృష్ణవంశీ ఈ మూవీతో తనకు బ్రేక్ ఇస్తాడని రెజీనా నమ్మకంగా ఉంది.
హద్దులు లేకుండా రెచ్చిపోయిన రెజీనా...?  
హీరోయిన్లని గ్లామరస్‌గా చూపించడంలో ఈ దర్శకుడు స్పెషలిస్ట్. ఈ మూవీలో రెజీనాను కూడా కృష్ణవంశీ అద్భుతంగా ఎలివేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నక్షత్రంలో జమునారాణి క్యారెక్టర్‌ చేస్తున్న రెజీనా గ్లామర్ పరంగా కూడా హద్దులు లేకుండా రెచ్చిపోయినట్లు సమాచారం. మరి మూవీ హిట్టు అయితే కానీ ఈ తమిళ పిల్లకు తెలుగులో ఛాన్స్ లు రావనేది మాత్రం సత్యం. మరి కృష్ణవంశీ అయిన కోలీవుడ్ బ్యూటీ తలరాత మారుస్తాడో చూడాలి.

12:17 - January 29, 2017
12:15 - January 29, 2017

గుంటూరు : క్రమశిక్ష ణ కల్గిన పార్టీలో క్రమ శిక్షణారాహిత్యం బయటపడుతోంది. మంత్రుల స్థాయిలో ఉన్నా... వ్యవహార శైలి మాత్రం గాడి తప్పుతోంది. దీంతో ఆ పార్టీకి మరోసారి ప్రయోగాల షాక్‌ తగిలింది. టీడీపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు తెలుగు తమ్ముళ్లను సైతం కలవరపెడుతున్నాయి. 
గాడి తప్పిన క్రమశిక్షణ 
తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్. టిడిపిలో శిక్షణ పొందిన నేతలు, ఇతర పార్టీల్లో సైతం మంత్రులుగా చలామణి అయిన చరిత్ర వుంది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆ క్రమశిక్షణ గాడి తప్పుతోంది. ఇటీవల కాలంలో పార్టీలో సీనియర్లను కాదని, ఇతర పార్టీల నుండి వచ్చిన వలస నేతలను ప్రోత్సహించటంతో కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఇటీవల గుంటూరులో మంత్రి రావెల, జడ్పీ చైర్మన్ జానీమూన్ మధ్య వివాదం పార్టీకి ఊహించని నష్టాన్ని చేకూర్చించింది. టిడిపి సీనియర్లు కూడా ఈ విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
వివాదాలు సృష్టిస్తున్న నేతలు  
టిడిపిలోకి కొత్తగా వచ్చిన నేతలకు పదవులు కట్టబెట్టడంతో, పార్టీ మూల సిద్ధాంతం గురించి తెలియకుండా వివాదాలు సృష్టిస్తున్నారని అంటున్నారు. అనంతపురంలో జేసి బ్రదర్స్ తీరు కూడా టిడిపి క్రమశిక్షణపై ప్రభావం చూపుతోంది. జేసి సోదరులు తమకు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించటం, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విధంగా మారింది. ఇక రెండు రోజుల కిందట కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రత్యేక హోదాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కూడా పార్టీని ఇబ్బందులకు గురిచేసింది.
1999లోనూ ఇలాంటి సంఘటనలే... 
1999లో కూడా ఇలాంటి సంఘటనలే చోటుచేసుకున్నాయని పార్టీ సీనియర్లు అంటున్నారు. అప్పట్లో మాజీ పోలీస్ అధికారి విజయరామారావుకు టికెట్ కేటాయించటం, మంత్రివర్గంలో స్థానం కల్పిచటంతో టిడిపి నుండి కేసిఆర్ బయటకు వెళ్లటం.. టిఆర్ఎస్ పార్టీని స్థాపించటం జరిగాయని అంటున్నారు. ఆ సమయంలోనే టిడిపిలోని సీనియర్లను కాదని.. శనక్కాయల అరుణ, జాగర్లమూడి పద్మావతి, పుష్పలీల, సరస్వతిలతో పాటు మరికొందరికి మంత్రి పదవులను కేటాయించారు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో టిడిపి ఓటమిని ఎదుర్కోవలసి వచ్చిందని టిడిపి సీనియర్ల అంటున్నారు. ఇప్పుడు కూడా అలాంటి పొరపాట్లు పునరావృతం అవుతున్నాయని.. వాటిని సరిచేసుకోకుంటే మరోసారి ఇబ్బందులు తప్పవన్నది సీనియర్ల వాదన.
మరోసారి సీనియర్ల ప్రాధాన్యత 
అయితే గతంలో పార్టీకి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సీనియర్లతో చర్చించి, నిర్ణయాలు తీసుకునే వాళ్లని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని టిడిపి సీనియర్లు అంటున్నారు. ఇటీవల జరిగిన సమన్వయ కమిటి సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో సీనియర్లున్న నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు రావటం లేదని, వాళ్లని చూసి మిగిలిన వాళ్లు తమ వైఖరి మార్చుకోవాలంటూ చంద్రబాబు క్లాస్ పీకారు. ఈ నేపథ్యంలో టిడిపిలో మరోసారి సీనియర్ల ప్రాధాన్యత పెరిగినట్లైంది. రాబోయే రోజుల్లో సీనియర్ల విషయంలో, చంద్రబాబు వైఖరి మారే అవకాశం వున్నట్లుగా కనిపిస్తోంది.

 

12:06 - January 29, 2017

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై టీఆర్ ఎస్ ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వర్గాల కోసం కేటాయిస్తున్న ఉప ప్రణాళిక నిధులను పాలకులు ఇతర శాఖలకు మళ్లిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వల్లెవేస్తున్న దళిత జనోద్ధరణ కాగితాలకే పరిమితమైందన్న వాదనలు ఉన్నాయి. 
ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై సర్కారుకు కొరవడిన చిత్తశుద్ధి 
ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమానికి కేటాయిస్తున్న నిధులను ఇతర శాఖలకు మళ్లించకుండా చూసేందుకు ఈ వర్గాల సముద్ధరణ కోసం ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో ఈ ప్రణాళిక కింద కేటాయించిన నిధులు దారిమళ్లాయని, తమ సర్కార్‌... ఉప ప్రణాళిక నిధులన్నీ ఈ వర్గాల అభ్యున్నతికే ఖర్చు చేస్తుందని అసెంబ్లీ ఎన్నికల నుంచి పదేపదే చెబుతూ వస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పాలకులు అనుసరించిన బాటలోనే టీఆర్‌ఎస్‌ సర్కారు కూడా పయనిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
ఇతర శాఖలకు మళ్లించిన నిధులు రూ. 17 వేల కోట్లు 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ముప్పై నెలలు గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల ఖర్చకు సంబంధించి నిబంధనలే రూపొందించలేదన్న వాదనలు ఉన్నాయి. దీనిని బట్టి పరిశీలిస్తే సర్కారుకు ఈ వర్గాల సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో అర్థం చేసుకోవచ్చిన విపక్షాలు, ఎమ్మార్పీఎస్‌ వంటి ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దళితుల పై చూపించే శ్రద్ధ, అధికారంలోకి వచ్చిన తర్వాత కనపరచడంలేదన్న విమర్శలు  ఉన్నాయి.  
కేటాయింపులు గనం... ఖర్చు అంతంత మాత్రం 
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో భారీగానే నిధులు కేటాయిస్తున్నారు. అయితే... ఖర్చు మాత్రం ఇదే స్థాయిలో జరగడం లేదు. గత బడ్జెట్‌లో 24 వేల కోట్ల నిధులు కేటాయిస్తే, ఖర్చు చేసింది మాత్రం తొమ్మిది వేల కోట్ల రూపాయలేనని లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 17 వేల కోట్ల నిధులను ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లించినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానసపుత్రిక మిషన్‌ కాకతీయకు 7,500 కోట్లను మళ్లించారన్న విమర్శలున్నాయి. అలాగే మిషన్  భగీరథకు, రవాణ శాఖకు  మరో వెయ్యికోట్లు మళ్లించారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చకు కేసీఆర్‌ సరైన సమాధానం కూడా ఇవ్వకపోవడం విమర్శలకు  తావిస్తోంది. 
టీసర్కార్ ..కంటితుడుపు చర్యలు 
సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాన్ని బయటకు తీసేందుకు ఎమ్మార్పీఎస్‌ వంటి సంఘాలు ప్రయత్నిస్తున్న తరుణంలో విషయం తెలుసుకున్న కేసీఆర్‌.. ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులతో హడావుడిగా సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. నిధులు ఇతర శాఖలకు మళ్లించకుండా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు సవరణలు తీసుకొచ్చే అంశంపై అధ్యయనం కోసం మంత్రులు చందూలాల్‌, కడియం శ్రీహరి నేతృత్వంలో రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ  నిధులను వేర్వేరు శాఖల ద్వారా కాకుండా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారానే ఖర్చు చేయించే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ముప్పై నెలలుగా మిన్నకున్న ప్రభుత్వం ఇప్పుడు హడావుడి చేయడం కంటితుడుపు చర్యలే అన్న విమర్శలు ఉన్నాయి. 
ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ఉద్యమం 
ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల ఖర్చుపై ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ఉద్యమం తప్పదని అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో.... కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందో... లేక నిధుల సక్రమ 
వినియోగానికి చర్యలు తీసుకుంటుందో.. చూడాలి. 
 

ఇలపర్రులో పర్యటిస్తున్న బివి.రాఘవులు

కృష్ణా : జిల్లాలోని ఇలపర్రులో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పర్యటిస్తున్నారు. ఆక్రమణకు గురైన భూములను పరిశీలిస్తున్నారు. ఆయనతోపాటు కేవీపీఎస్ నేతలు ఉన్నారు. 

ప్రారంభమైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

హైదరాబాద్ : లోటస్ పాండ్ లోని కార్యాలయంంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైఎస్ జగన్, పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు హాజరయ్యారు. పలు అంశాలపై చర్చ జరుగనుంది. 

11:33 - January 29, 2017

భద్రాద్రి కొత్తగూడెం : ఎర్రజెండా చేతబట్టి..పల్లెపల్లెనూ చైతన్యవంతం చేస్తున్న సీపీఎం మహాజన పాదయాత్ర 104 రోజులు పూర్తి చేసుకుంది. తమ్మినేని బృందానికి అడుగడుగునా ప్రజల నుంచి ఘనస్వాగతం లభిస్తోంది. కేసీఆర్‌ పాలనపై తమలో గూడుకట్టుకున్న అసంతృప్తిని ప్రజలు తమ్మినేని బృందానికి వెలిబుచ్చుతున్నారు. 
ఎస్సీ, ఎస్టీ నిధుల్లో కోతకు యత్నం : సున్నం రాజయ్య  
ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ నిధుల్లో కోత పెట్టాలని చూస్తోందని.. ఇలాంటి ఎత్తుగడలను సాగనివ్వబోమని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్ర 104 వ రోజు ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు.  
నిరుద్యోగ సమస్యపై చర్యలేవి..? తమ్మినేని 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా.. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్‌..కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య వంటి హామీలను అటకెక్కించిన కేసీఆర్‌.. విద్యావ్యవస్థను మునుపెన్నడు లేని విధంగా భ్రష్టు పట్టించారని తమ్మినేని ధ్వజమెత్తారు. 
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న పాదయాత్ర
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 104 రోజులు పూర్తి చేసుకుంది. 104వ రోజు పాదయాత్ర బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆర్‌ కొత్తగూడెం, కుదునూరు, మామిడిగూడెం, రాళ్లగూడెం, సీతానగరం, బండిరేవు, పెద్దనల్లపల్లి, చిన్ననల్లపల్లి, బైరాగులపాడు, లక్ష్మినగర్‌లో పర్యటించింది. తమ్మినేని బృందానికి ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తోంది. తాలిపేరు ప్రాజెక్టు ఆధునీకరణ, వద్దిపేట వద్ద చెక్‌డ్యాం నిర్మించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. 

 

11:24 - January 29, 2017

నాగ్ పూర్ : ఫటా ఫట్‌ టీ 20 ఫార్మాట్‌లో  తిరుగులేని ఇండియా, ఇంగ్లండ్‌తో రెండో టీ20కి  సన్నద్ధమైంది. మూడు  మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో టీ20కి నాగ్పూర్‌లోని విధర్భ క్రికెట్‌  స్టేడియంలో రంగం సిద్ధమైంది. తొలి టీ 20 విజయంతో జోరు మీదున్న ఓయిన్‌ మోర్గాన్‌ సారధ్యంలోని ఇంగ్లీష్‌ టీమ్‌కు కొహ్లీ అండ్‌ కో సవాల్‌ విసురుతోంది.తొలి మ్యాచ్‌లో ఓడిన విరాట్‌ ఆర్మీ సెకండ్‌ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
టీమిండియా, ఇంగ్లండ్ లు రెండో మ్యాచ్‌కు సన్నద్ధం..
ట్వంటీ ట్వంటీ  మాజీ వరల్డ్‌ చాంపియన్స్‌ ఇండియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య సెకండ్‌ టీ 20కి నాగ్పూర్‌లోని విధర్భ క్రికెట్‌  స్టేడియంలో కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఫటా ఫట్‌ టీ20 ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా సంచలనాలకు మారుపేరైన ఇంగ్లండ్‌ జట్లు రెండో టీ 20  మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయి. 
తొలి మ్యాచ్‌లో టీమిండియాకు షాకిచ్చిన ఇంగ్లీష్‌ 
తొలి మ్యాచ్‌లో టీమిండియాకు షాకిచ్చిన ఇంగ్లీష్‌ టీమ్‌ సెకండ్ టీ 20లోనూ నెగ్గి సిరీస్‌ నెగ్గాలని తహతహలాడుతుండగా....విరాట్‌ ఆర్మీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టీమిండియా ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 2వ స్థానంలో ఉండగా ...ఇంగ్లండ్‌ జట్టు 6వ స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌పై  టెస్ట్‌ సిరీస్‌, వన్డే సిరీస్‌ నెగ్గిన విరాట్‌ ఆర్మీ ...టీ 20 సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌లో తేలిపోయింది. భారీ స్కోర్‌ నమోదు చేయలేకపోవడం,బౌలర్లు తేలిపోవడంతో కాన్పూర్‌ టీ 20లో  భారత జట్టు  అసలే మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో సిరీస్‌కు నిర్ణయాత్మకంగా మారిన నాగ్పూర్‌ టీ 20లో నెగ్గి సిరీస్‌ సమం చేయాలని కొహ్లీ అండ్‌ కో పట్టుదలతో ఉంది. 
సిరీస్ దక్కించుకోవాలని ఇంగ్లండ్ ధీమా 
తొలి టీ20లో అదరగొట్టిన ఇంగ్లీష్‌ టీమ్‌....రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ దక్కించుకోవాలని ధీమాగా ఉంది. టెస్ట్‌, వన్డే సిరీస్‌ ఓటమికి టీ 20 సిరీస్‌ విజయంతో బదులు తీర్చుకోవాలని ఇంగ్లండ్‌ జట్టు పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగనుంది.   
రికార్డ్‌లో.... ఇండియాపై ఇంగ్లండ్‌దే పై చేయి 
ఇక ఫటా ఫట్‌ టీ 20  ఫార్మాట్‌లో రెండు జట్ల మధ్య ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో.... ఇండియాపై ఇంగ్లండ్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 9 టీ20ల్లో పోటీపడగా.....ఇంగ్లండ్‌ 6  మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇండియా 3 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. 
ఇంగ్లండ్‌ను ఓడించడం భారత్ కు పెద్ద సవాల్‌ 
టీ20 ఫార్మాట్‌లో సొంతగడ్డపై తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన భారత జట్టుకు ఇంగ్లండ్‌ను ఓడించడం పెద్ద సవాల్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు.ప్రస్తుతం  టాప్‌క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌, హార్డ్‌ హిట్టర్లు, వండర్‌ ఆల్‌రౌండర్లతో పటిష్టంగా  ఉన్న ఇంగ్లండ్ జట్టు తొలి మ్యాచ్‌లో ఎంతలా ఆధిపత్యం ప్రదర్శించిందో అందరికీ తెలిసిందే. గత యేడాది టీ 20 వరల్డ్‌ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లీష్‌ టీమ్‌....ప్రస్తుతం చిట్టి పొట్టి ఫార్మాట్‌లో అత్యంత ప్రమాదకరమైన జట్టు అనడంలోనూ అనుమానమే లేదు.
టీమిండియా సిరీస్‌ సమం చేయగలుగుతుందా...? 
ట్రాక్‌ రికార్డ్‌ పరంగా చూస్తే ఇంగ్లండ్‌కు సిరీస్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నా....విరాట్‌ ఆర్మీ పూర్తి స్థాయిలో చెలరేగితే టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. సెకండ్‌ టీ 20లో నెగ్గి టీమిండియా సిరీస్‌ సమం చేయగలుగుతుందో లేదో మరి కొద్దిగంటల్లో తేలిపోనుంది. 

 

11:15 - January 29, 2017

ఢిల్లీ : స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌, స్పానిష్‌ బుల్‌ రఫాల్‌నడాల్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌కు గురిపెట్టారు. చిరకాల ప్రత్యర్ధుల మధ్య మెన్స్‌ సింగిల్స్‌ ఫైట్‌ రాడ్‌లేవర్‌ ఎరీనాలో రంగం సిద్ధమైంది. నడాల్‌ సెమీఫైనల్‌లో బల్గేరియన్‌ వండర్‌ గ్రిగర్‌ దిమిత్రోవ్‌పై చెమటోడ్చి విజయం సాధించి టైటిల్‌ రేస్‌లో నిలవగా...మరో సెమీఫైనల్‌లో ఫెదరర్‌ స్విస్‌ స్టార్‌ స్టానిలాస్‌ వావ్రింకాకు షాకిచ్చాడు. 9వ సారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌లో ఫెదరర్‌, నడాల్‌ అమీతుమీ తేల్చుకోనున్నారు. 
దూసుకుపోతున్న ఫెదరర్‌ 
స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌...ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ వేటలో దూసుకుపోతున్నాడు. హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫెడ్డీ సెమీస్‌లోనూ పోటీనే లేకుండా పోయింది. గాయం కారణంగా 7 నెలలు టెన్నిస్‌కు దూరమై, ఈ టోర్నీలో 17వ సీడ్‌గా బరిలోకి దిగిన ఫెదరర్‌....టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించి అందరినీ ఆశ్చర్యపరచాడు.  సెమీ ఫైనల్‌లో చెమటోడ్చి విజయం సాధించాడు. 
వావ్రింకాను చిత్తు చేసిన ఫెదరర్‌   
నాలుగు గంటల పాటు హోరాహోరీగా సాగిన పోరులో స్విస్‌ స్టార్‌ స్టానిలాస్‌ వావ్రింకాను చిత్తు చేశాడు. ఆఖరి వరకూ పోరాడిన వావ్రింకా...ఫెదరర్‌ అనుభవం ముందు మాత్రం తేలిపోయాడు. తొలి రెండు సెట్లను వరుసగా 7-5, 6-3తో నెగ్గిన ఫెడ్డీకి...మూడో సెట్‌ నుంచి వావ్రింకా గట్టి పోటీనిచ్చాడు. 6-1,6-4తో మూడు,నాలుగు సెట్లను సొంతం చేసుకున్న వావ్రింకా , ఫెదరర్‌కు సవాల్ విసిరాడు.
వావ్రింకా విఫలం
నిర్ణయాత్మక 5వ సెట్‌లో ఫెదరర్‌ జోరు ముందు వావ్రింకా విఫలమయ్యాడు. తన తనుభవాన్నంతా ఉపయోగించి ఆడిన రోజర్‌....వావ్రింకాకు అవకాశమే ఇవ్వలేదు. తన ట్రేడ్‌మార్క్‌ సెర్వ్‌,ఓలీ గేమ్‌తో చెలరేగిన రోజర్‌ 6-3తో 5వ సెట్‌ సైతం దక్కించుకుని ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 
గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్‌కు అర్హత సాధించడం 28వ సారి 
35 ఏళ్ల రోజర్‌ ఫెదరర్‌ గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్‌కు అర్హత సాధించడం ఇది 28వ సారి కావడం విశేషం. ఇప్పటికే 17 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ టెన్నిస్‌ ప్లేయర్‌గా వెలుగొందుతున్న ఫెదరర్‌ ....18వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్స్‌ చేరి అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు...తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని  ఫెదరర్‌ మరోసారి నిరూపించాడు.  

 

గుంటూరు జిల్లాలో ఒకరి అనుమానాస్పద మృతి

గుంటూరు : జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. చింతలతోపులో గురవయ్య అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. నిన్న మద్యం విషయంలో గురవయ్యతో మరో వ్యక్తి ఘర్షణ పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో మృతుడిది హత్యనా.. లేక ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతుడు ఇందుర్తి మండలం ఉప్పలపాడుకు చెందినవాడుగా గుర్తించారు. 
 

 

10:55 - January 29, 2017

గుంటూరు : జిల్లాలో విషాదం నెలకొంది. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. చింతలతోపులో గురవయ్య అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. నిన్న మద్యం విషయంలో గురవయ్యతో మరో వ్యక్తి ఘర్షణ పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో మృతుడిది హత్యనా.. లేక ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతుడు ఇందుర్తి మండలం ఉప్పలపాడుకు చెందినవాడుగా గుర్తించారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:43 - January 29, 2017

నల్లగొండ : జిల్లాలోని చండూరులో విషాదం చోటుచోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్‌ ప్రయాణికులను సురక్షితంగా ఉంచి తన ప్రాణాలు కోల్పోయాడు. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో మృతి చెందాడు. నల్లగొండ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా మార్గంమధ్యలో చండూరులో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బస్సును డ్రైవర్‌ విష్ణు పక్కకు ఆపాడు. వెంటనే విషయం గ్రహించిన తోటి ప్రయాణికులు కండక్టర్‌ కలిసి డ్రైవర్‌ విష్ణును హుటా హుటిన ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ బస్సు డ్రైవర్‌ విష్ణు మృతి చెందాడు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:47 - January 29, 2017

ఢిల్లీ : దేశంలోనే వివాదాస్పదమైన అయోధ్య రామమందిర నిర్మాణ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది బీజేపీ. యూపీలో అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని నిర్మిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో పాటు ప్రజలకు అనేక రాయితీలు ప్రకటిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 
సుప్రీంకోర్టు హెచ్చరికలను ఉల్లంఘిస్తున్న బీజేపీ 
మత, జాతి, కుల, భాషా ప్రతిపాదికన ఓట్లు అడగడం అవినీతి కిందకే వస్తుందని సుప్రీంకోర్టు చేసిన హెచ్చరికలను బీజేపీ ఉల్లంఘిస్తూనే ఉంది. మతపరమైన ఓట్ల కోసం బీజేపీ మరోసారి దిగజారి ప్రవర్తించింది. యూపీలో 14 ఏళ్ల పాటు అధికారానికి దూరమైన కాషాయపార్టీ.. ఈసారి ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టేందుకు నానా కుయుక్తులు పన్నుతోంది. అయోధ్యలో వివాదాస్పదమైన రామాలయ అంశం న్యాయస్థానంలో ఉన్నప్పటికీ పదేపదే అదే అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. రామాలయ నిర్మాణ అంశాన్ని బీజేపీ.. తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఈ ఎన్నికల్లో తమకు సంపూర్ణ ఆధిక్యత కట్టబెడితే రామ మందిరం నిర్మిస్తామని తెలిపారు. లోక్‌ కల్యాణ్‌ సంకల్ప పత్రం పేరుతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా.. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 
రామాలయ అంశాన్ని వదిలే ప్రసక్తే లేదు : వినయ్‌ కటియార్‌ 
అయోధ్య రామాలయ అంశం ఎప్పుడూ సజీవంగానే ఉంటుందని.. దానిని వదిలే ప్రసక్తే లేదని ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత వినయ్‌ కటియార్‌ స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఒకరి తర్వాత ఒకరు ఓట్ల కోసం పదేపదే మతపరమైన అంశాన్ని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
12వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత విద్య
ప్రస్తుతం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రామాలయ నిర్మాణంతో పాటు.. ప్రజలకు కొన్ని రాయితీలను ప్రకటించారు. పన్నెండో తరగతి వరకు ఉచిత విద్య, రైతులకు రుణమాఫీ, యువతకు వన్‌ జీబీ ఉచిత ఇంటర్నెట్‌తో ల్యాప్‌టాప్‌లు వంటి అంశాలను మ్యానిఫెస్టోలో చేర్చారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో 150 కోట్ల రూపాయల కేటాయింపు, ఐదేళ్లలో అన్ని ఇళ్లకు 24 గంటల విద్యుత్‌ సరఫరా వంటి అంశాలకు ఎన్నికల ప్రణాళికలో స్థానం కల్పించారు. మొత్తానికి యూపీలో పగ్గాలు చేపట్టేందుకు వివాదాస్పదమైన రామ మందిర నిర్మాణ అంశాన్ని బీజేపీ మరోసారి తెరపైకి తెచ్చింది. మరి ఈ అంశం బీజేపీకి ఎంతమేరకు కలిసివస్తుందో చూడాలి. 

 

09:43 - January 29, 2017

విజయవాడ : అక్కడ అక్వా మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువుల తవ్వకాలు జరుపుతూనే ఉన్నాయి. దళితులకు చెందిన వేల ఎకరాల భూములను.. అక్రమంగా చేపల చెరువులుగా మారుస్తున్న అక్రమార్కులు... అనేక మందిని రోడ్డున పడేలా చేస్తున్నారు. చేపల చెరువుల పుణ్యమా అని అనేక మంది వ్యవసాయ కార్మికులు, పేదలు ఉపాధి కోల్పోయి వలసబాట పడుతున్నారు. దళితుల భూములను దళితులకు ఇవ్వాలన్న డిమాండ్‌తో సీపీఎం బాధితులకు అండగా నిలుస్తోంది. 
రొయ్యలు, చేపల చెరువులు అక్రమ తవ్వకాలు 
ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీలో కొందరు అక్రమార్కులు.. వేల ఎకరాల భూముల్లో రొయ్యలు, చేపల చెరువులు తవ్వేస్తున్నారు.  కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్వా మాఫియా అడ్డగోలుగా రొయ్యలు, చేపల చెరువులను సాగు చేస్తోంది. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో దళితులు, పేదలకు సంబంధించిన 165 ఎకరాల భూముల్ని ఆక్వా మాఫియా ఏళ్ల తరబడిగా అనుభవిస్తోంది. దీంతో పాటు మరో 6వేల ఎకరాల ప్రభుత్వ, దేవాదాయ, రెవిన్యూ భూముల్ని సైతం ఆక్వా మాఫియా చేపల చెరువులుగా మార్చింది. 
భూపోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు 
నందివాడ మండలం ఇలపర్రులో దళితులు, పేదలు తమ భూములు తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా... అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో వ్యవసాయ, కార్మిక సంఘం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, సీపీఎం నాయకత్వంలో భూ పోరాటానికి సిద్ధమైంది. ఇలపర్రు గ్రామంలో దళితులు, పేదలు చేస్తున్న భూ పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 
ఇలపర్రు దళితులు పోరుబాట 
నిబంధనలకు వ్యతిరేకంగా చేపల చెరువులు ఏర్పాటు చేస్తున్న మాఫియాకు అధికారులు, పెత్తందారులు, పోలీసులు వంత పాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పేదల భూముల్ని మాత్రం ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గత్యంతరం లేక ఇలపర్రు దళితులు పోరుబాట పట్టారు. చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తోందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. 
పోరాటానికి సీపీఎం సంపూర్ణ సంఘీభావం 
ఇలపర్రు దళితులు, పేదలు చేస్తున్న పోరాటానికి సీపీఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఇప్పటికే ఇలపర్రు గ్రామంలో పర్యటించి అన్యాక్రాంతమైన దళితుల భూములను పరిశీలించారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా అన్యాక్రాంతమైన భూములను దళితులకు అప్పగించకపోతే ఫిబ్రవరి 6న భూములను ఆక్రమిస్తామని ప్రకటించారు. దళితుల భూముల సమస్యపై సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆదివారం ఇలపర్రులో పర్యటించనున్నారు. బాధితులతో చర్చించిన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నారు.  

 

09:37 - January 29, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ నర్సులు ఆందోళనబాట పట్టారు. తమను క్రమబద్ధీకరణ చేయాలంటూ నర్సులు కదం తొక్కారు. పది సంవత్సరాల నుంచి వైద్య రంగంలో సేవలందిస్తున్న తమకు రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన తీవ్రమవడంతో... పోలీసులు ధర్నాలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. 
ఆస్పత్రి బిల్డింగ్ పైకి ఎక్కి నిరసన 
తమ హక్కుల కోసం తెలంగాణ ఔట్ సోర్సింగ్ నర్సులు ఆందోళనబాట పట్టారు. ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నా తమను రెగ్యులరైజ్ చేయట్లేదని వాపోతున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ నర్సులు ఆస్పత్రి బిల్డింగ్ పైకి ఎక్కి నిరసన కార్యక్రమం చేపట్టారు. 
నర్సులతో చర్చించిన డిఎంఈ రమణి   
ప్రభుత్వం తరపున డైరెక్టర్ ఆఫ్‌ మెడికల్ ఎడ్యుకేషన్ రమణి నర్సులతో చర్చించారు. సమస్యలపై వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో చర్చిస్తామని ఆమె తెలిపారు. అయితే దీనిపై నర్సుల నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగానే మిగిలిపోవాల్సి వస్తుందన్న నర్సులు  
అనుభవం ఉన్నా ఉద్యోగాలకు అర్హత లేకపోవడంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగానే మిగిలిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 24 గంటలు ప్రజలకు సేవ చేస్తుంటే తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహిస్తున్నారు. తమ డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరిస్తున్నారు. 
ఆత్మహత్యలకు వెనకాడబోం : నర్సులు 
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 ఔట్‌సోర్సింగ్ నర్సులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారని వారికి లేని సమస్య తమకెందుకని  ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వెంటనే తమ సమస్య పరిష్కరించాలని.. లేనిపక్షంలో ఆత్మహత్యలకు కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు. 

 

09:27 - January 29, 2017

హైదరాబాద్ : ప్రత్యేక హోదా అంశంపై మంచి ఊపు మీదున్న వైసీపీ.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో వేడి పుట్టిస్తున్న హోదా అంశాన్ని పార్లమెంట్‌ సమావేశాల్లోనూ ప్రధాన ఎజెండాగా చేసుకోవాలని యోచిస్తోంది. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు ఈ రోజు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించబోతుంది. 
ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ సిద్ధమవుతోంది. మంగళవారం నుంచి మొదలుకానున్న సమావేశంలో అనుసరించాల్సిన విధానాలను పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈరోజు లోటస్‌పాండ్‌లో జరగనున్న పార్లమెంటరీ పార్టీ సమావేశంలో.. పార్లమెంట్‌లో పార్టీ అనుసరించాల్సిన వైఖరిని నిర్ణయించనున్నారు. గత రెండున్నరేళ్లుగా వైసీపీ తెరపైకి తెచ్చిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. దీంతో మరోసారి అవే అంశాలను పార్లమెంట్‌ సమావేశాల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. 
విభజన చట్టంలోని అంశాలపై కేంద్రంపై ఒత్తిడి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌ మరింత తీవ్ర రూపం దాలుస్తుండడంతో.. పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశాన్ని ఆయుధంగా మార్చుకోవాలని వైసీపీ యోచిస్తోంది. అదేవిధంగా విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల్లో ఇప్పటివరకు అమలుకు నోచుకోని అంశాలను సైతం పార్టీ గుర్తించింది. వీటిపై కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహం రచిస్తోంది. ఇందులో ప్రధానంగా ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్‌ కావాలన్న డిమాండ్‌ పెండింగ్‌లో ఉంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ సమావేశాల్లో రైల్వేజోన్‌ అంశంపై స్పష్టత తీసుకువచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిసైడ్‌ అయ్యింది. 
జగన్‌ మరింత దూకుడు 
ఇప్పటికే ప్రత్యేక హోదా అంశాన్ని ఆయుధంగా మలుచుకున్న వైఎస్‌ జగన్‌ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అవసరమైతే ఎంపీలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధమనే సంకేతాలను ఇచ్చారు. కలిసి వస్తున్న అవకాశాలతో దూసుకుపోతున్న వైసీపీ.. ఈ పార్లమెంట్‌ సమావేశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహం రచించబోతుంది. 

 

పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి లక్ష్మారెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

08:50 - January 29, 2017

గిరిజనుల అస్తిత్వం మీద హైందవం దాడి...నామ రూపాలు మారిన నాగోబా జాతర, తిరుపతి ఎంకన్నకు ఐదున్నర కోట్లు...ఆభరణాలు సమర్పించవోతున్న కేసీఆర్, చంద్రాలు సార్కు ఫేస్ బుక్ ల శ్రద్ధాంజలి...పోలీసు స్టేషన్ల బుక్సైన కేసుమాంజలి, ప్రెసు మీటింగుల కసిరిన వర్ల రామయ్య...మల్లన్నతోటి మనసుల మాటా ముచ్చట,వారసత్వ ఉద్యోగాలకు కండిషన్ అప్లై... సింగరేణిల మండుతున్న బొగ్గు బిడ్డలు, సీసీ కెమెరాలను మోసం జేసిన ఆడోళ్లు... నల్లకుంట కాడ ఇరైవ చీరలు మాయం, మళ్లీ గర్జించిన రాయలసీమ సింహం... బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంగతనం చేసిన ఎలుక...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

08:48 - January 29, 2017

విజయవాడ : ఏపీలో హోదా మంటలు చల్లారడం లేదు. ప్రత్యేక హోదా కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాల్సిందేనని ప్రజాసంఘాల నేతలు పిలుపునిస్తుంటే.. మరోవైపు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్వీట్ల యుద్ధంపై రాజకీయ నేతలు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. దీంతో ఏపీలో ప్రత్యేక హోదా సెగలు మంట పుట్టిస్తున్నాయి. 
ఉధృతమవుతున్న హోదా సెగలు  
ఏపీలో ప్రత్యేక హోదా సెగలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. ప్రత్యేక హోదా ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధకాండ ప్రయోగిస్తోందని  సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు మండిపడ్డారు. పోలీసులతో   ఉద్యమాన్ని అణచివేసేందుకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళన నిర్వహించుకుంటామంటే  ప్రభుత్వం అనుమతి ఎందుకు ఇవ్వలేదేని ఆయన ప్రశ్నించారు. విభజన హామీల అమలు కోసం భవిష్యత్‌లో ఉద్యమాన్ని  మరింత ఉధృతం చేస్తామని మధు హెచ్చరించారు. 
పవన్‌ మాటల్లో కాదు చేతల్లో చూపించాలి : బివి.రాఘవులు 
ప్రత్యేక హోదా ఆందోళనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాటల్లో కాదు చేతల్లో చూపించాలన్నారు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు. నోటికే కాదు చేతులకు, కాళ్లకు పనిచెప్పాలన్నారు. నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటే మరింత ప్రయోజనం ఉంటుందన్నారు రాఘవులు. 
రాజకీయాలకతీతంగా అందరూ కలవాలి : చలసాని
ప్రత్యేక హోదా సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు చలసాని శ్రీనివాస్‌. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు విశాఖలోని ఆర్కే బీచ్‌లో దీక్ష చేపడతామన్నారు. ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు, సినీనటులు స్పందించాలని చలసాని కోరారు. 
పవన్‌కల్యాణ్‌పై వెంకయ్యనాయుడు పరోక్ష విమర్శలు 
ఇక కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ..కొంతమందికి పనిలేక ట్విటర్‌పై కూర్చుంటున్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ఫాలోయింగ్‌ లేని ట్విటర్‌ పోస్టింగ్‌లు వృథాయేనని..ప్రధాని ట్విటర్‌లో లక్షలమంది ఫాలో అవుతున్నారని వెంకయ్యనాయుడు అన్నారు. 

 

08:43 - January 29, 2017

విశాఖ : 'నేను చెప్పిందే మీరు వినాలి.. నన్నేమీ ప్రశ్నించవద్దు..' ఇది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుగా కనిపిస్తోంది. ప్రజాసమస్యలను నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ.. ప్రజల పక్షాన పోరాడుతున్న 10టీవీపై చంద్రబాబు అసహనం ప్రదర్శిస్తున్నారు. తాజాగా జరిగిన రెండు ఘటనల్లోనూ సీఎం వైఖరి దీన్నే ప్రతిబింబిస్తోంది. 
ఏపీలోని పరిస్థితులతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి 
ఏపీ సీఎం చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కాపుల రిజర్వేషన్‌, రాజధానితో పాటు.. ఇతర ప్రాజెక్టులకు భూసేకరణ లాంటి అంశాల్లో ప్రతిపక్షాలు, ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ సమస్యలపై తనను ప్రశ్నించిన మీడియాపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 
భూ పంపిణీ అంశంపై ప్రశ్నించబోగా.. బాబు అసహనం 
నిన్న విశాఖలో సీఐఐ సదస్సు మీడియా సమావేశంలో చంద్రబాబు ఇదే విధంగా వ్యవహరించారు. ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలకు.. భూముల పంపిణీకి సంబంధించిన అంశంపై టెన్‌ టీవీ ప్రతినిధి ప్రశ్నించబోగా.. 10టీవీపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మైక్‌ పక్కవారికి ఇవ్వాలంటూ ఆదేశించారు. మీరు హిడెన్‌ అజెండాతో వ్యవహరిస్తున్నారంటూ తూలనాడారు. 
గుంటూరులో 10టీవీ రిపోర్టర్‌పై చిర్రుబుర్రులాడిన చంద్రబాబు
చంద్రబాబు నాయుడు టెన్ టీవీపై అసహనాన్ని వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. మూడు రోజుల క్రితం, గుంటూరులోనూ ఇదే తరహా కోపాన్ని ప్రదర్శించారు. ప్రత్యేక హోదాపై ప్రశ్నించినందుకు 10టీవీ రిపోర్టర్‌పై చిర్రుబుర్రులాడారు. లిమిట్స్‌ దాటొద్దంటూ హెచ్చరించారు. వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ ప్రశ్నిస్తే గట్టిగా చెప్పాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజల పక్షాన, ప్రజాసమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకు 10 టీవీ నిరంతరం కృషి చేస్తోంది. ఇలాంటి మీడియాపై పాలకులు అసహనం వ్యక్తం చేయడాన్ని ఎవరూ హర్షించరు. 

 

గుండె పోటుతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి

నల్గొండ : చండూరు వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందారు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
 

నేడు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్ : ఉదయం 11 గంటలకు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి మాజీ కేంద్రమంత్రి, ఆ పార్టీ జాతీయ సీనియర్ నేత చిదంబరం హాజరు కానున్నారు. 

 

నేడు గాంధీ ఆస్పత్రిని సందర్శించనున్న టీ.మంత్రులు

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిని నేడు మంత్రులు నాయిని నర్సిహ్మారెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులు సందర్శించనున్నారు. 

 

నేడు భారత్, ఇంగ్లండ్ రెండో టీ.20 మ్యాచ్

మహారాష్ట్ర : నేడు భారత్, ఇంగ్లండ్ ల మధ్య రెండో టీ.20 మ్యాచ్ జరుగనుంది. నాగ్ పూర్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

 

నేడు దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుంది. రాష్ట్రపతి భవన్ లో చిన్నారులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పోలియో చుక్కలు వేయనున్నారు. 
 

Don't Miss