Activities calendar

30 January 2017

22:03 - January 30, 2017

ఢిల్లీ : బడ్జెట్‌కు ముందు కేంద్రంపై కాంగ్రెస్‌ దాడికి దిగింది. భారతదేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిద‌రంబ‌రంతో క‌లిసి ఆయ‌న ఓ ఆర్థిక డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. మాల్యాకు మద్దతిచ్చారని బిజెపి చేసిన విమర్శలపై మన్మోహన్‌ స్పందించారు. పారిశ్రామికవేత్తలు పిఎంఓ కార్యాలయానికి లేఖలు రాస్తుంటారని, వాటిని సంబంధిత శాఖలకు పంపడం జరుగుతుందన్నారు. ఆ లేఖల్లో ఎలాంటి తప్పిదం లేదని చట్టాన్ని అతిక్రమించేలా లేవని ఆయన స్పష్టం చేశారు. కొత్త ఉద్యోగాలు.... కొత్త పెట్టుబ‌డులు ఎక్కడ ఉన్నాయని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కేంద్రాన్ని ప్రశ్నించారు. అంకెల గారడీతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని ఆయన మండి పడ్డారు. ప్రభుత్వాలు ఆశావాహంగా ఉండాల‌ని, నిజ‌మైన ప‌రిస్థితి ఆధారంగా బ‌డ్జెట్ అంచ‌నాలు రూపొందించాలన్నారు. 

 

21:59 - January 30, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలపై చర్చించేందుకు రాజ్‌భవన్‌ వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 1న ఇరు రాష్ట్రాల ప్రతినిధుల భేటీకి గవర్నర్‌ నరసింహన్‌ ఆతిథ్యం ఇస్తున్నారు. విభజన నుంచి నానుతోన్న సమస్యలకు ఈ భేటీలోనైనా పరిష్కారం లభిస్తుందని ఇరు రాష్ట్రాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరపున చర్చించే అంశాల అజెండాను సీఎం కేసీఆర్‌ గవర్నర్‌కు అందించారు. 
ఇరు రాష్ట్రాల సీఎంలతో గవర్నర్‌ భేటీ 
రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న చాలా సమస్యలు ఇప్పటికీ కొలిక్కిరాలేదు.   ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ రెండు మూడుసార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యి... సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.  సీఎంల చొరవతో కొన్ని సమస్యలు పరిష్కారం అయినా.. చాలా వరకు అపరిష్కృతంగానే  ఉన్నాయి.  హైకోర్టు విభజన, నీటి పంపకం, 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన, సచివాలయ భవనాల అప్పగింత, ఉద్యోగుల బదిలీల్లాంటివి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
ప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు 
నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల మధ్య మాటలయుద్ధమే నడిచింది. ఇలా అయితే పరిష్కారం కావని భావించిన సీఎంలు.. తమ ప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, జి.వివేక్‌లతో కమిటీ వేయగా... ఏపీ సర్కార్‌ యనమల, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాస్‌తో కమిటీ నియమించింది. ఇక ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఈ కమిటీల ద్వారానే చర్చించుకోవాలని నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో ఫిబ్రవరి 1న తొలి భేటీ 
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు ఫిబ్రవరి 1న మొట్టమొదటి సారి గవర్నర్‌ సమక్షంలో భేటీ కావాలని నిర్ణయించాయి. ఇందుకోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నిపుణులతో డ్రాప్ట్‌ను సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు.   విభజన చట్టం ప్రకారం నీటి వాటాలతోపాటు.. కొత్తగా నిర్మించ తలపెట్టిన సచివాలయం ఏర్పాటు అవసరాలపై  కేసీఆర్‌  గవర్నర్‌తో చర్చించినట్టు సమాచారం. ఏపీకి కేటాయించిన భవనాలను తమకు అప్పగించాలని కోరినట్టు తెలుస్తోంది.
పరిష్కారం అయ్యే అవకాశం..!
బుధవారం జరిగే ఇరు రాష్ట్రాలకు చెందిన కమిటీల భేటీలో... ఉద్యోగులతో పాటు హైకోర్టు విభజన, సచివాలయం అప్పగింతపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. తొమ్మిది, పదవ షెడ్యూల్‌లోని సంస్థలపైనా చర్చించనున్నారు. మరికొద్ది రోజుల్లో పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న గవర్నర్‌ నరసింహన్‌కు రెండు రాష్ట్రాలు, వాటి సమస్యల మీద పూర్తి అవగాహన ఉండడం, ఆయన సమక్షంలోనే ఇరు రాష్ట్రాల ప్రతినిధులు భేటీ కావడం మంచి పరిణామమని ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు. ఇలాంటి సమావేశాల ద్వారా త్వరగా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

 

21:55 - January 30, 2017
21:54 - January 30, 2017
21:52 - January 30, 2017

హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. తమ రాష్ట్రానికి అధిక నిధులు దక్కుతాయని భావిస్తోంది. తాము పంపిన ప్రతిపాదనలకు ఈ బడ్జెట్‌లో మోక్షం లభిస్తుందని ఆశిస్తోంది. ఇంతకీ సెంట్రల్‌ బడ్జెట్‌పై తెలంగాణ  పెట్టుకున్న ఆశలు ఏమిటి ? టీఆర్‌ఎస్‌ ఎంపీలు  కేంద్రాన్ని కోరుతున్నది ఏమిటి? 
బడ్జెట్‌ సమావేశాలకు కేంద్రం సిద్ధం
బడ్జెట్ సమావేశాలకు వేళైంది. గత బడ్జెట్‌ సమావేశాల కంటే భిన్నంగా ఈ సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోంది. గతంలో రైల్వే, సాధారణ బడ్జెట్‌ పేరుతో వేర్వేరుగా బడ్జెట్‌లను కేంద్రం ప్రవేశపెట్టేది. కానీ ఈసారి జరిగే సమావేశాల్లో అంతా ఒకే విడతగా ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రానికి పెద్దపీట వేయాలని కోరుతున్న కేసీఆర్‌ సర్కార్‌  
ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలే పెట్టుకుంది. బడ్జెట్‌లో తమ రాష్ట్రానికి పెద్దపీట వేయాలని కేసీఆర్‌ సర్కార్‌ కోరుతోంది. నూతనంగా ఆవిర్భవించిన రాష్ట్రం కావడంతో అధిక నిధులు కేటాయించాలని  గులాబీ ఎంపీలు కేంద్రాన్ని కోరుతున్నారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రులనూ కలిశారు.  అంతేకాదు... తెలంగాణలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించాలన్న డిమాండ్‌ సైతం వారి నుంచి వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సన్నిహితంగా వ్యవహరిస్తుండడంతో  బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు మోక్షం లభిస్తోందన్న ధీమాను టీఆర్‌ఎస్‌ ఎంపీలు వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర హామీలను లేవనెత్తాలని నిర్ణయం
విభజన చట్టంలోని హామీల అమలుకు కృషి చేయాలని కేసీఆర్‌ తమ ఎంపీలకు పదేపదే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర పరిష్కరించాల్సిన అంశాలను లేవనెత్తాలని ఎంపీలు నిర్ణయించారు. ప్రధానంగా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నారు. మొత్తానికి కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ సర్కార్‌ భారీ ఆశలనే పెట్టుకుంది. మరి తెలంగాణ ప్రభుత్వ ఆశలను జైట్లీ  ఏమేరకు నెరవేర్చుతారో వేచి చూడాలి.

 

21:49 - January 30, 2017

ఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2017-18 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ 
మంగళవారం నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెడతారు. బడ్జెట్ తొలి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి. మలివిడత సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 12 వరకు జరుగుతాయి.
అధికార, ప్రతిపక్షాలు సన్నద్ధం
పార్లమెంటు బడ్జెట్‌ భేటీకి అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమయ్యాయి. ఈ సమావేశాలు వాడీవేడీగా జరుగనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు జరుగనున్న ఈ సమావేశాలను ఓటర్లకు సందేశాలు పంపే వేదికగా ఉపయోగిచుకోవాలని అధికార, ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కీలకమైన జీఎస్ టీ బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా తృణమూల్‌  రెండు రోజుల పాటు పార్లమెంట్‌కు హాజరు కాకూడదని నిర్ణయించింది. తదనంతర పరిణామాలపై సభను స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయి. 
92 ఏళ్లుగా ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్
92 ఏళ్లుగా రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది నుంచి రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశ పెట్టడాన్ని కేంద్రం తొలగించింది. సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే శాఖకు కేటాయింపులుంటాయి. రైల్వేకు 2017...18 కి గాను1.4 లక్షల కోట్ల నిధులను బడ్జెట్‌లో కేటాయించే అవకాశం ఉందని రిసెర్చ్‌ ఫ్రమ్‌ క్రిసిల్‌ పేర్కొంది.
రైతులకు ఊరట..?
సాధారణ బడ్జెట్‌లో అరుణ్‌జైట్లీ రైతులను కరుణించే అవకాశం ఉంది. నోట్ల రద్దు తర్వాత రైతులు ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం వారికి ఊరట కలిగించేలా పలు రాయితీలు ప్రకటించొచ్చు. బ్యాంకింగ్‌ రంగంలో విదేశి పెట్టుబడుల శాతాన్ని 49 శాతానికి పెంచే అవకాశం ఉంది. 
జూలై 1వ తేదీ నుంచి జిఎస్‌టి అమలు...? 
జూలై ఒకటవ తేదీ నుంచి జిఎస్‌టిని అమలు చేసే దిశగా కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టింది. సేవా పన్ను 16 నుంచి 18 శాతానికి పెంచే వీలుంది. సర్వీస్‌ టాక్స్‌ పెరిగినట్లయితే సామాన్య ప్రజలకు కష్టాలు తప్పవు. హోట్‌ల్‌, ఫోన్‌ బిల్లు, విమాన టికెట్లు తదితర వస్తువుల ధరలు పెరుగుతాయి.

 

21:37 - January 30, 2017

ప్రాజెక్టుల పేరిట రైతుల నుంచి అన్యాయంగా భూములు లాక్కుంటే ప్రతిఘటన తప్పదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈమేరకు టెన్ టివి ఆయనతో ఫేస్ టు ఫేస్ నిర్వహిచింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని కోరారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు... రాజకీయ వేదిక లాగా మారిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల మద్దతు పొందేందుకు సీఐఐ భాగస్వామ్య సదస్సులో సరైన ఒప్పందాలు జరగలేదన్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకు సదస్సు ఉపయోగపడే విధంగా ఉందన్నారు. సీఐఐ...ప్రయివేట్ సంస్థలతో కూడిన సంస్థ అన్నారు. ఈ సదస్సుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన ఫలితం రాలేదని చెప్పారు. ప్రజలను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. భాగస్వామ్య సదస్సులో ప్రయివేట్ పరిశ్రమలు వస్తాయని... ప్రజల అవసరాల కంటే.. ఎక్కడ, ఎక్కువ రాయితీలు వస్తాయని చూస్తాయని చెప్పారు. అయినా.. పరిశ్రమలు పెట్టేందుకు వీలున్నవారు ముందుకు రాలేదన్నారు. ఒకే పారిశ్రామిక వేత్త, ఒకే పరిశ్రమపై మూడు రాష్ట్రాల్లో ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎవరితో.. ఏం ఒప్పందాలు చేసుకున్నారో బయటపెట్టాలన్నారు. సీఎం... స్థాయికి తగిన పని చేయడం లేదని పేర్కొన్నారు. పరిశ్రమలకు వామపక్షాలు వ్యతిరేకంగా కాదని.. పరిశ్రమలు రావడాన్ని వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. అయితే అవి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణం మాట మరిచారని.. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడుతున్నారని చెప్పారు. రాజధాని కోసం రైతుల నుంచి భూములు తీసుకుని మెడికల్ కాలేజీ, వెంకటేశ్వర స్వామి దేవాలయం వంటి వాటికి కేటాయిస్తున్నారని మండిపడ్డారు. 2013 భూసేకరణ చట్టాన్ని నీరుగార్చుతూ భూములను సేకరిస్తున్నారని పేర్కొన్నారు. రైతు ప్రయోజనాలను తగ్గించేశారని చెప్పారు. రైతు ప్రయోజనాల కోసం ప్రభుత్వం పాటు పడితే తమ మద్దతు ఉంటుందని చెప్పారు. లేని ఎడల ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తే ఉద్యమిస్తామన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

తెలంగాణలో అంతరించిపోతున్న కాంగ్రెస్ : వేణుగోపాలాచారి

ఢిల్లీ : తెలంగాణలో నానాటికి కాంగ్రెస్ అంతరించిపోతుందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి అరువు తెచ్చుకున్న నాయకులతో విమర్శలు చేయిస్తూ ఉనికి కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు.

 

బీసీసీఐ ప్యానెల్ ప్రకటించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ : సుప్రీంకోర్టు బీసీసీఐ ప్యానెల్ ప్రకటించింది. కోర్టు బీసీసీఐ పాలక మండలిని ఏర్పాటు చేసింది.

 

20:16 - January 30, 2017
20:13 - January 30, 2017

నెల్లూరు : జిల్లాలో స్వైన్‌ ఫ్లూతో వ్యక్తి మృతి చెందాడు. కావలి మున్సిపాలిటీ వాటర్‌వర్క్స్‌లో పనిచేస్తున్న మోహన్‌రెడ్డి వారం క్రితం అస్వస్థతకు గురయ్యాడు. చెన్నైలోని విజయ ఆస్పత్రిలో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

19:30 - January 30, 2017

ఏలూరు : వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి పీతల సుజాత తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి జగన్‌ పెద్ద ఆటంకంగా తయారయ్యారని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిలో పుట్టి పెరిగిన జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమన్నారు. ఓర్వలేక తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు.

 

19:26 - January 30, 2017

కృష్ణా : రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. రైతులకు నీళ్లివ్వాల్సిందిపోయి... బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని పలు గ్రామాల్లో ఆ పార్టీ రైతు బరోసా యాత్ర చేపట్టింది. ఈ కార్యక్రమానికి జగన్‌ హాజరయ్యారు. నీరులేక ఎండిపోయిన పంటల్ని ఆయన పరిశీలించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఎక్కువగా ప్రయాణించే సీఎం చంద్రబాబుకు ఎండిపోయిన ఈ పంటలు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. రైతుల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.- 

 

19:22 - January 30, 2017

గుంటూరు : మహాత్మాగాంధీ 69వ వర్ధంతి సంధర్భంగా వెలగపూడి సచివాలయంలో జాతిపిత చిత్రపటానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ద్యానేశ్వరన్‌, ఎం.ములే, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వి.కె. యాదవ్‌ బాబును కలిశారు. 

 

ప్యాకేజీకి చట్టబద్దత 100 శాతం వచ్చి తీరుతుంది : సుజనా చౌదరి

గుంటూరు : మంగళవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ అనుసరించాల్సిన విధానంపై గుంటూరు జిల్లా వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. పదిహేను రోజుల్లోనే ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత తీసుకొచ్చి చూపిస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. ప్యాకేజీకి చట్టబద్దత 100 శాతం వచ్చి తీరుతుందన్నారు. రైల్వే జోన్, షెడ్యూల్ 9,10 నిధులు, ఎపీకి కేంద్రం నుంచి రావలసిన నిధులు, నోట్ల రద్దు వంటి పరిణామాలపై ముఖ్యమంత్రితో చర్చించామని తెలిపారు.

సీఎం చంద్రబాబుతో టీడీపీ ఎంపీలు భేటీ

గుంటూరు : మంగళవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ అనుసరించాల్సిన విధానంపై పదిహేను రోజుల్లోనే ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత తీసుకొచ్చి చూపిస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. ప్యాకేజీకి చట్టబద్దత 100 శాతం వచ్చి తీరుతుందన్నారు.

నెల్లూరులో స్వైన్ ఫ్లూ కలకలం

నెల్లూరు : జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. ఇవాళ స్వైన్ ఫ్లూతో ఒకరు మృతి చెందారు. స్వైన్ ఫ్లూ మహమ్మారితో జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు. 

19:02 - January 30, 2017

ఢిల్లీ : బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. కరెంట్‌ అకౌంట్‌ ఖాతాదారులకు ఊరటనిచ్చిది. ఏటీఎంల్లో క్యాష్‌ విత్‌ డ్రా పరిమితిని ఎత్తివేసిన ఆర్బీఐ.. ఫిబ్రవరి 1నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. సేవింగ్స్‌ ఖాతాదారులపై ఆంక్షలు యధావిధిగా కొనసాగనున్నాయి. త్వరలోనే సేవింగ్స్‌ ఖాతాదారులపై కూడా ఆంక్షలను ఎత్తివేసేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:00 - January 30, 2017

కరీంనగర్ : గతమెంతో ఘన చరిత్ర కలిగిన చేనేత పరిశ్రమ ఇప్పుడు నేత కార్మికుడికి కంటతడి పెట్టిస్తోంది. రోజంతా కష్టపడినా కడుపు నిండని పరిస్థితి. కుటుంబ పోషణ భారం అవుతుండటంతో కార్మికుడు విలవిల్లాడుతున్నాడు. పెద్దనోట్ల రద్దు వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టివేయడంతో నష్టాల ఊబిలో నుంచి చేనేత పరిశ్రమ ఒడ్డున పడే పరిస్థితి కనపడడం లేదు. కరీంనగర్ జిల్లాలో బోసిపోతున్న చేనేత పరిశ్రమపై 10టీవీ ప్రత్యేక కథనం..! 
ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్న చేనేత కార్మికులు
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో చేనేత పారిశ్రామిక, సహకార ఉత్పత్తి, విక్రయ కేంద్రానికి 67ఏళ్ల చరిత్ర ఉంది. అనాడు చేనేత పరిశ్రమ వందల మంది నేతన్నలకు ఉపాధి చూపింది. వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపడంతో ప్రస్తుతం చేనేత పరిశ్రమ కుదేలైంది. రోజంతా కష్టపడ్డా ఆదాయం లేకపోవడంతో నేతన్నలకు పూట గడవడం కష్టాంగా మారింది. దీంతో వారు ఉపాధి మార్గాలను వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
కార్మికులకు పని దొరకని పరిస్థితి
1949లో పల్లెర్ల లక్ష్మీపతి స్థాపించిన ఈ సంఘంలో ఎంతోమంది నేత కార్మికులకు ఉపాధి దొరికింది. 1983లో ఎన్టీ రామారావు ప్రవేశ పెట్టిన జనత వస్త్రాల ఉత్పత్తితో సంఘం వ్యాపారం ఊపందుకుంది. పరిశ్రమ ఆరంభంలో 1500 మంది కార్మికులతో కళకళలాడిన చేనేత సంఘం ప్రస్తుతం 221 మంది కార్మికులతో నెట్టుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్మికుల్లో కనీసం 120 మందికిపైగా పని లేదు. కరీంనగర్ జిల్లా పరిధిలోని రామడుగు, గంగాధర, చొప్పదండితో పాటు 37 గ్రామాలకు చెందిన కార్మికులు యారన్లు తీసుకెళ్లి, బట్టలను నేసి సంఘానికి అందించేవారు. ప్రస్తుతం క్యాష్ క్రెడిట్ ద్వారా యారన్, కూలీలకు డబ్బులు చెల్లిస్తూ.. పాలక మండలి సంఘాన్ని భుజాన వేసుకొని నడిపిస్తున్నారు. ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ కేంద్రంలో ఆరు నెలలుగా 60 లక్షల వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. 
ప్రస్తుతం నష్టాలను ఎదుర్కొంటున్న సంఘం
గతంలో ఆప్కో కొనుగోలు చేసిన వస్త్ర నిల్వలకు సరైన చెల్లింపులు చేయకపోవడంతో సంస్థ ఆర్ధికంగా నష్టాలను ఎదుర్కొంటోంది. నూతన వస్త్రం తయారీకి అవసరమైన యారన్ లేక, కార్మికుల వేతనాలు చెల్లించకలేక సంఘం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికీ ఆప్కో నుంచి 10 లక్షల బకాయిలు వస్తే సంస్థకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. నిల్వ ఉన్నవస్త్రాలను క్లియర్ చేసేందుకు డిస్కౌంట్ ప్రకటించినప్పటికీ కొనుగోలుదారుల నుంచి స్పందన లేదు. మరోవైపు పెద్దనోట్ల రద్దు నిర్ణయం వస్త్ర వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో... ప్రస్తుతం చేనేత పరిశ్రమ కొలుకునే పరిస్థితి కనపడడం లేదు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వమే ఆదుకోవాలని నేతన్నలు వేడుకుంటున్నారు. 
చేనేత వస్ర్తాలకు ఆదరణ కరువు
చేనేత వస్ర్తాలకు ప్రజల నుంచి కూడా ఆదరణ కరువవుతోంది. నేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం... పాలిస్టర్ వస్త్రాలను ఆర్డర్ ఇచ్చినప్పటికీ వాటి నుంచి సరైన ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చేనేత కార్మికులకు ఉపాధి చూపించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

అగ్రిగోల్డు బాధితుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : అగ్రిగోల్డు బాధితుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. భోగస్ బాధితుల అసోసియేషన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

18:44 - January 30, 2017

ఖమ్మం : రైల్వేస్టేషన్‌ సమీపంలో వ్యక్తి కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైల్వేస్టేషన్‌ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను మున్సిపల్ అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. దీన్నిషాపు యజమానులు అడ్డుకున్నారు. ఒకరు కిరోసిన్‌ పోసి నిప్పంటించుకునేందుకు యత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:29 - January 30, 2017

నిజామాబాద్ : రైల్వే బడ్జెట్‌ సమయంలో ఆశగా ఎదురుచూడడం.. చివరకు నిరాశ చెందడం ప్రజలకు నిత్యకృత్యంగా మారింది. అయితే.. ఈసారి ఎలాగైనా పెండింగ్‌ ప్రాజెక్టుల నిధుల సాధన కోసం ఎంపీలు కృషి చేయాలని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా ప్రజలు కోరుతున్నారు. మరి ఈ బడ్జెట్‌లోనైనా ప్రజల ఆశలు నెరవేరుతాయా ?.
రైల్వే బడ్జెట్‌లో తమకు అన్యాయం : జిల్లా వాసులు  
ప్రతిసారి రైల్వే బడ్జెట్‌లో తమకు అన్యాయం జరుగుతుందని నిజామాబాద్‌ జిల్లావాసులంటున్నారు. నాయకులు హామీలు ఇచ్చినా.. బడ్జెట్‌లో మాత్రం అందుకు అనుగుణంగా కేటాయింపులు జరగడం లేదంటున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన పలు రైలు మార్గాల డబ్లింగ్‌ వంతెనలకు నిధులు రాకపోవడంతో సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్‌-కామారెడ్డి, నిజామాబాద్‌-ముద్కెడ్‌ డబ్లింగ్‌ కోసం చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. సికింద్రాబాద్‌ నుండి ముద్కెడ్‌ వరకు 249 కిలోమీటర్ల దూరం ఉంది. డబ్లింగ్‌ కోసం 2013-14 బడ్జెట్‌లో మంజూరు లభించినా ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఆ తర్వాత బడ్జెట్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది. 
డబుల్‌ లైన్‌ లేకపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం 
సికింద్రాబాద్‌ నుంచి ముంబైకి ఈ మార్గంలో దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ నడుస్తుంది. అదేవిధంగా నిత్యం 56 రైళ్లు తిరుగుతుంటాయి. వీటికితోడు రవాణా రైళ్లు కూడా పెద్ద సంఖ్యలో నడుస్తున్నాయి. వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో బాసరలో సరస్వతి దేవాలయం, నాందెడ్‌లో గురుద్వార్‌, షిర్డీలో సాయిబాబా మందిరం ఉంది. దీంతో ఈ రూట్లో రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయితే అందుకు తగినట్లు రైళ్లను పెంచినా.. డబుల్‌ లైన్‌ లేకపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 
ముందుకు సాగని సర్వే  
ఇక వెనకబడిన ప్రాంతాలైన బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాలకు రైల్వే సదుపాయం, బోదన్‌ నుండి కర్నాటకలోని బీదర్‌ దాకా రైల్వేలైన్‌ కోసం ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతూనే ఉన్నారు. అయితే రైల్వే లైన్‌ కోసం 2015 రైల్వే బడ్జెట్‌లో ప్రకటన వెలువడినా.. నిధులు కేటాయించకపోవడంతో సర్వే ముందుకు సాగడం లేదు. 
పలు చోట్ల బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్‌ 
అదేవిధంగా డిచ్‌పల్లి నుండి ఆర్మూర్‌, నిర్మల్‌ ఆదిలాబాద్‌ వరకు అక్కడినుండి నాగ్‌పూర్‌కు రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ ఉంది. మరోవైపు జాతీయ రహదారిపై రైల్వే క్రాసింగ్‌ల వద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టకపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల బ్రిడ్జిలు నిర్మించాలనే డిమాండ్‌ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. డబ్లింగ్‌తో పాటు కొత్త లైన్లకు నిధులు కేటాయింపు జరిగితే జిల్లాకు ప్రయోజనం ఉంటుందని ప్రజలంటున్నారు. నిధుల కేటాయింపు కోసం ఎంపీలు కృషి చేయాల్సిన అవసరముందంటున్నారు. 
పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలి.. 
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆర్మూర్‌ ...ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌కు కేంద్రం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బృందానికి రైల్వేమంత్రి సురేష్‌ప్రభు ఖచ్చితమైన హామీ ఇవ్వడంతో త్వరలోనే ఈ లైన్‌ పూర్తి అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు నిధులు తీసుకువచ్చేందుకు ఎంపీలు మరింత కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

 

ఖమ్మం రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉద్రిక్తత

ఖమ్మం : రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను మున్సిపల్ అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. దీన్నిషాపు యజమానులు అడ్డుకున్నారు. ఒకరు కిరోసిన్‌ పోసి నిప్పంటించుకునేందుకు యత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. 

 

18:19 - January 30, 2017

హైదరాబాద్ : స్వచ్చ్ సర్వేక్షణ్ లో భాగంగా హైదారాబాద్ గచ్చిబౌలి డివిజన్ లో తడి చెత్త, పొడి చెత్త అవగాహన ర్యాలీ నిర్వహించారు. గోపన్ పల్లి, ఏన్.టి.అర్ కాలనీల్లో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ సాయిబాబా పర్యటించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంలో ప్రజలు భాగస్వామం కావాలని పిలుపునిచ్చారు. 

 

17:49 - January 30, 2017

నల్లగొండ : దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పై తేనెటీగలు దాడి చేశాయి. జిల్లాలోని గాజుపేట గుహలను సందర్శించేందుకు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తన అనుచరులతో కలిసి వెళ్లారు. టార్చ్ లైట్లను వేసుకుని గుహలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఆ వెలుతురుకు తేనె టీగలు ఒక్కసారిగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తోపాటు అతని అనుచరులపై దాడి చేశాయి. ఈఘటనలో ఎమ్మెల్యేతోపాటు మరో 15 మందికి గాయాలయ్యాయి. రవీంద్రకుమార్ ముఖంపై, చెంప కుడి వైపున గాయాలయ్యాయి. మరికొంతమంది కళ్లపై గాయాలయ్యాయి. గాయపడిన అనుచరులకు స్థానిక ప్రాథమిక కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ను దేవరకొండ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

17:40 - January 30, 2017
17:39 - January 30, 2017

హైదరాబాద్ : ఆశా వర్కర్ల జీతాలను పెంచాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదని.. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆశా వర్కర్ల జీతాలను కేంద్రం పెంచాకా..ఆ వేతానికి కొంత శాతం జీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకోవాలన్నారు. ప్రజలు ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో పడొద్దని సూచించారు. ఇతర పార్టీల ఉచ్చులో పడి 'మీ భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని' మనవి చేసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు. 

 

17:32 - January 30, 2017

అమెరికా : ఏడు ముస్లిం దేశాలపై ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పాకిస్తాన్‌పై కూడా ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. త్వర‌లోనే ఆంక్షల లిస్టులో పాకిస్థాన్ కూడా చేర‌బోతోంద‌ని వైట్‌హౌజ్  స్టాఫ్ చీఫ్ రీన్స్ ప్రీబ‌స్ వెల్లడించారు. సిరియా, ఇరాన్‌, ఇరాక్‌, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాల‌ పౌరులను అమెరికాలో అడుగుపెట్టకుండా ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం సరైనదేనని వైట్‌హౌజ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ దేశాలతోనే ఉగ్రవాదం విస్తరిస్తోంద‌ని ట్రంప్ బ‌లంగా భావిస్తున్నట్లు ప్రీబ‌స్ తెలిపారు. పాకిస్థాన్‌లాంటి మ‌రికొన్ని దేశాలతో కూడా ఇలాంటి స‌మ‌స్యలే ఎదుర‌వుతున్నాయ‌ని, భ‌విష్యత్తులో వాటిపై కూడా నిషేధం విధించే అవ‌కాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. ట్రంప్‌ బ్యాన్‌ చేసిన ఏడు దేశాలను గత ఒబామా ప్రభుత్వం ప్రమాదకర దేశాల జాబితాలో పెట్టినట్లు వైట్‌హౌజ్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు పాకిస్తాన్‌కు ట్రంప్ వీసాలు నిలిపేయడాన్ని విపక్షనేత ఇమ్రాన్‌ఖాన్ సమర్థిస్తున్నారు. క‌నీసం అలా అయినా పాకిస్తాన్‌ను అభివృద్ధి చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అభిప్రాయపడ్డారు. 

 

'సిద్ధిపేటలోనే అభివృద్ధి..వేరే ప్రాంతం దొరకలేదా'..

సంగారెడ్డి : సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై టి.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, హరీష్ రావులిద్దరూ అభివృద్ధిని సిద్ధిపేటకే పరిమితం చేశారని పేర్కొన్నారు. అభివృద్ధి చేయడానికి మరో ప్రాంతం దొరకలేదా ? దీనిని ప్రశ్నించని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దద్దమ్మలు అని విమర్శించారు. కేసీఆర్..హరిష్ లు జిల్లాలో అడుగు పెడితే అడ్డుకుంటామన్నారు. సంగారెడ్డికి రావాల్సిన మెడికల్ కాలేజీని మంత్రి హరీష్ రావు సిద్ధిపేటకు తరలించుకపోయారని, భవిష్యత్ లో మెడికల్ కాలేజీ కోసం పోరాటాలు చేస్తామన్నారు.

17:25 - January 30, 2017

తమిళనాడు : చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేలూరు సమీపంలోని రాణిపేటలో ఉన్న ఓ ప్రైవేటు కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో దాదాపు పది కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. రసాయనాలను రీసైకిలింగ్‌ చేసే క్రమంలో అగ్ని  ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

 

ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తాం - సుజనా..

విజయవాడ : అమరావతిలో టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత తీసుకొస్తామని, వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే చేసుకోవచ్చని ఎంపీ సుజనా పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన అన్నింటిపై ప్రశ్నిస్తామని, గతంలో చెప్పినవన్నీ తీసుకొచ్చామన్నారు. ప్యాకేజీకి చట్టబద్ధత కూడా తెచ్చి చూపిస్తామన్నారు.

దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం -చిదంబరం..

ఢిల్లీ : స్టేట్ ఆఫ్ ఎకానమి పేరిట కాంగ్రెస్ బుక్ రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పాల్గొనాన్రఉ. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, రేటింగ్ ఏజెన్సీలు భారత రేటింగ్ ను తగ్గించాయని చిదంబరం పేర్కొన్నారు.

ఖాతాదారులకు గుడ్ న్యూస్..

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుతో గత కొద్ది రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులకు ఆర్బీఐ తీపి కబురు అందించింది. ఏటీఎంలలో ఒకేసారి రూ. 24వేలు డ్రా చేసుకోవడానికి అనుమతినిచ్చింది. అలాగే కరెంటు ఖాతాలపై విత్ డ్రా పరిమితిని ఎత్తివేసింది. కానీ సేవింగ్ ఖాతాలపై విత్ డ్రా పరిమితి కొనసాగనుంది. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి రానున్నాయి.

17:22 - January 30, 2017

ఢిల్లీ : నోట్ల రద్దు అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకి లేవనెత్తుతామని సీపీఐ రాజ్యసభ పక్షనేత డీ రాజా అన్నారు. పలు రాష్ట్రాల్లో కరువు, అన్నదాతల ఆత్మహత్యలు, దళితులపై దాడులు, జల వివాదాలపై చర్చకు పట్టుపడతామని చెప్పారు. 5 రాష్ట్రాల ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్‌ వాయిదా వేయాలని అఖిలపక్ష సమావేశంలో కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. 

 

17:11 - January 30, 2017

నల్గొండ : కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ప్రభుత్వాన్ని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కోరారు. ఈ రైల్వే బడ్జెట్‌లోనైనా మౌళిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని సూచించారు. నల్లగొండ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దు ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవన్నారు.

 

ఎమ్మెల్యేపై తేనేటీగల దాడి..

నల్గొండ : జిల్లాలోని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పై తేనేటీగలు దాడి చేశాయి. ఎమ్మెల్యేలతో పాటు 15 మందికి గాయాలయ్యాయి. గాజుపేట గుహలను సందర్శించేందుకు అనుచరులతో వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ముగిసిన ఉపాధి హామీ మండలి సమావేశం..

హైదరాబాద్ : ఉపాధి హామీ పథకం మండలి సమావేశం ముగిసింది. ఉపాధి కోసం నమోదు చేసుకున్న వారికి 60 శాతం పనిదినాలు తప్పక కల్పించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. వికలాంగులకు 100 రోజులతో పాటు రాష్ట్రం తరపున మరో 50 పనిదినాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. హరితహారం నర్సరీలకు 100 రోజులకు మించి కూడా ఉపాధి హామీ వేతనాలు చెల్లిస్తామన్నారు.

17:00 - January 30, 2017

ఢిల్లీ : ఏపీకీ ప్రత్యేక హోదా లేదనడం ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటని వైసీపీ ఎంపీ మేకపాటి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం హోదా అంశాన్ని తుంగలో తొక్కారని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. చట్టంలో ఉన్న అంశాలకు చట్టబద్ధత ఏంటని జైట్లీ స్వయంగా చెబుతున్నారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఆ జవాన్లు ఇకలేరు...

జమ్మూ కాశ్మీర్ : మాచిల్ సెక్టార్ లో మంచుకొండల కింద చిక్కుక్కున్న ఐదుగురు జవాన్లు మృతి చెందారు. గత శనివారం జవాన్లపై మంచుకొండలు కూలిన సంగతి తెలిసిందే.

16:56 - January 30, 2017

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా రాదని..ప్రత్యేక ప్యాకేజీనే హోదాగా ఊహించుకోవాలని టీడీపీ ఎంపీ తోట నరసింహం అన్నారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం చట్టబద్ధత కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాలు సహకరించాలని.. హోదాను రాజకీయం చేయడం తగదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించాలని అఖిలపక్ష సమావేశంలో కోరామన్నారు. ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఏపీకి కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:54 - January 30, 2017
16:45 - January 30, 2017

కృష్ణా : జిల్లాలోని ఎ. కొండూరు మండలం కంబంపాడు మదర్‌ థెరీసా అనాధాశ్రమంలో అమానుషం జరిగింది. అక్రమాలను ప్రశ్నించినందుకు హాస్టల్ వార్డెన్ ఘాతుకానికి పాల్పడ్డాడు. విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మదర్‌ థెరీసా అనాధాశ్రమంలో చెప్పినమాట వినలేదంటూ వార్డెన్‌ వెంకటేశ్వరరావు ప్రవీణ్ అనే విద్యార్థిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. విద్యార్థి శరీరం 70 శాతానికి పైగా కాలిపోయింది. అతని పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థికి తల్లిండ్రులు లేరు. బాలుడు అనాథ. దీంతో అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం వారి ఫిర్యాదును తీసుకోలేదు. మరోవైపు ప్రవీణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్డెన్ చెబుతున్నారు. కాగా హాస్టల్ లో వార్డెన్ చేస్తున్న అక్రమాలను ప్రశ్నించినందుకు విద్యార్థిపై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

16:36 - January 30, 2017

మహారాష్ట్ర : పూణెలో దారుణం జరిగింది. హింజ్‌వాడి ఉన్నరాజీవ్‌గాంధీ ఇన్ఫోటెక్‌ పార్క్‌లో ఉన్న  ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌లో మహిళా సాప్ట్‌వేర్‌ కే రశీలా రాజు ఇంజనీర్‌ దారుణ హత్యకు గురయ్యారు. రశీలా రాజు వర్క్‌ స్టేషన్‌లోనే ఈ ఘోరం జరిగింది. బెంగళూరులోని తన బృందం సభ్యులతో ఆన్‌లైన్‌లో చాటింగ్‌ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. కంప్యూటర్‌ వైరుతో గొంతునులిమి  చంపేశారు. హత్యకు గురైన రశీల రాజుది కేరళ. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

16:15 - January 30, 2017

ఢిల్లీ : మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ఆధ్యాత్మిక గురువు ఆసారాంకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆసారాంకు బెయిల్‌ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మెడికల్‌ గ్రౌండ్‌ ఆధారంగా బెయిలు మంజూరు చేయాలని ఆసారాం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆయన అనారోగ్యానికి సంబంధించిన ఎయిమ్స్‌ బోర్డు మెడికల్‌ రిపోర్టు ఆధారంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఆసారాంకు బెయిల్‌ ఇవ్వాల్సినంత అనారోగ్యం ఏమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంఆర్‌ఐ పరీక్ష నిర్వహించడానికి ఆసారాం స్వయంగా ముందుకు రాలేదని కోర్టు తెలిపింది. మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆసారాం బాపు గత మూడేళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు.

 

16:13 - January 30, 2017

ఢిల్లీ : లిక్కర్‌కింగ్‌ విజయ్‌ మాల్యాకు భారీగా రుణాలు ఇప్పించడంలో యూపీఏ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని బిజెపి ఆరోపించింది. మాల్యాకు రుణాలు మంజూరు చేయించడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వ్యక్తిగతంగా సహకరించారని బిజెపి ప్రతినిధి సంబిత్‌ పాత్ర ఆరోపించారు. 2011-2013 మధ్య మాల్యా మన్మోహన్‌, మాజీ ఆర్థికమంత్రి చిదంబరంకు రాసిన లేఖలను మీడియా ముందు విడుదల చేశారు..  కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు బ్యాంకులు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని మాల్యా విజ్ఞప్తి చేసినట్లు లేఖలో ఉంది. బిజెపి ఆరోపణలను కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. ఎన్నికల స్టంట్‌గా కాంగ్రెస్‌ కొట్టిపారేసింది. మాల్యా బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌ పారిపోయిన విషయం తెలిసిందే.

 

16:08 - January 30, 2017

తమిళ తంబీలు మళ్లీ 'నయనతార'కే కిరీటం కట్టబెట్టారు. కేరళ బ్యూటీపై తమ ప్రేమను కోలీవుడ్ ఆడియన్స్ మరోసారి చాటుకున్నారు. తంబీల లవ్ కి ఫిదా అయిన ఈ ముద్దుగుమ్మ మురిసిపోతోంది. మీ సపోర్ట్ ఎప్పటికి గుండెల్లో పెట్టుకుంటానని తంబీలను ముద్దుచేస్తోంది. సౌత్ లో హీరోయిన్స్ కి మూడు పదలు దాటాయంటే కెరీర్ క్లోజ్ అయినట్లే. అయితే ఈ మధ్య కొంతమంది హీరోయిన్స్ మాత్రం 30ఏళ్లు దాటిన క్రేజీ ఛాన్స్ లు అందుకుంటూ తమ హవా నడిస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ లో 'నయనతార' వెర్రీ స్పెషల్ అని చెప్పాలి. 34ఏళ్లు దాటిన ఈ బ్యూటీకి కోలీవుడ్ లో పోటీ ఇచ్చే హీరోయిన్ లేదని చెప్పాలి. తమిళంలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తున్న కూడా తంబీలు మాత్రం 'నయన్' అంటే పడిచచ్చిపోతున్నారు. కేవలం ఈ బ్యూటీ బ్రాండ్ మీదనే అక్కడ సినిమాలు ఆడుతున్నాయంటే అతియోశక్తికాదు. అందుకే తమిళ తంబీలు మరోసారి ఈ బ్యూటీ నెత్తిన కిరీటం పెట్టి మరీ తమ ప్రేమ చాటుకున్నారు.

నయన్ ఉద్వేగం..
ఆన్ స్క్రీన్ పై కోలీవుడ్ లో తిరుగులేని హవా సాగిస్తున్న 'నయనతార' ఆఫ్ స్క్రీన్ లో కూడా తన క్రేజ్ ఏంటో చూపించింది. మోస్ట్ డిజైరబుల్ విమన్ ఆఫ్ చెన్నై గా కిరీటాన్ని 'నయన్' మరోసారి దక్కించుకుంది. కేరళ బ్యూటీ ఈ ఘనతను సాధించడం ఇది రెండోసారి. గతేడాది ఇదే ఈ అవార్డ్ ని అందుకున్న 'నయన్' కి తమిళ ఆడియన్స్ వరుసగా ఇలా రెండోసారి అగ్రస్థానం కట్టబెట్టడం విశేషమని చెప్పాలి. స్టార్ హీరోయిన్ గా 'నయనతార'కు సౌత్ మొత్తం మంచి డిమాండ్ ఉంది. అయితే కోలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు ఇందుకు ఈ అవార్డే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎన్ని వివాదాలు చుట్టి ముట్టిన పర్సనల్ లైఫ్ లో ఎంత డిస్ట్రబ్ అయిన కూడా అవేవీ 'నయన్' కెరీర్ పై ప్రభావం చూపకపోవడం హీరోయిన్ గా 'నయన్' కేపబులిటీకి నిదర్శనం. తనను మరోసారి విమన్ ఆఫ్ చెన్నైగా ఎంపిక చేయడంపై 'నయన్' ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. వరుసగా రెండుసార్లు సపోర్ట్ చేసిన ప్రతిఒక్కరికి థ్యాంక్స్ చెప్పిన 'నయనతార', మీ ప్రేమతో ఇప్పుడున్న స్థానం కంటే మరింత ఉన్నతమైన స్థానం అందుకోవడానికి ప్రయత్నిస్తానంటూ ఉద్వేగంగా ట్వీట్ చేసింది.

16:05 - January 30, 2017

ఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగిస్తారు. వచ్చే నెల 1న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2017-18 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. పార్లమెంటు బడ్జెట్‌ భేటీకి అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమయ్యాయి. ఈ సమావేశాలు వాడీవేడీగా జరుగనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు జరుగనున్న ఈ సమావేశాలను ఓటర్లకు సందేశాలు పంపే వేదికగా ఉపయోగిచుకోవాలని అధికార, ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కీలకమైన జీఎస్ టీ బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్, ఎస్ పీ, బీఎస్పీలు సిద్ధమవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై సభను స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయి. 

 

బీసీసీఐ ప్యానెల్ ను ప్రకటించిన సుప్రీం..

ఢిల్లీ : బీసీసీఐ ప్యానెల్ ను సుప్రీంకోర్టు ప్రకటించింది. నలుగురు సభ్యులతో కూడిన అడ్మినిస్ట్రేటివ్ ప్యానెల్ ను కోర్టు ఏర్పాటు చేసింది. మాజీ కాగ్ వినోద్ రాయ్, రామచంద్ర గుహ, విక్రమ్ లిమాయే, డయానా ఎడ్జులి సభ్యులుగా నియమించింది.

ఐపీపీబీ ప్రారంభానికి రిజర్వ్ బ్యాంక్ ఒకే..

ముంబై : ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ)ని ప్రారంభించడానికి తపాలాశాఖకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. ప్రణాళిక ప్రకారం సేవలు ప్రారంభిస్తామని ఓ ప్రకటనలో తపాలా శాఖా పేర్కొంది.

16:00 - January 30, 2017

హైదరాబాద్‌ : బండ్లగూడ ఇంద్రప్రస్త కాలనీలో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి క్రేన్‌ కుప్పకూలడంతో పద్మ అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. వాచ్‌మెన్‌ భార్య సాలమ్మ అనే మరో మహిళకు తీవ్రగాయాలు కాగా...వెంటనే చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

 

బాబుతో టిడిపి ఎంపీల భేటీ..

విజయవాడ : అమరావతి సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో టిడిపి ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బాబుతో భేటీ అయిన వారిలో ఎంపీలు సుజనా, గల్లా జయ్ దేవ్, మురళీమోహన్ తదితరులున్నారు.

యనమలతో రావెల భేటీ..

గుంటూరు : మంత్రి యనమలతో మంత్రి రావెల భేటీ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు ఎక్కువ నిధులు ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరినట్లు రావెల పేర్కొన్నారు. సబ్ ప్లాన్ ను పారదర్శకంగా అమలు చేయడం జరుగుతోందన్నారు.

స్పందించిన బన్సాలీ సంస్థ..

ముంబై : 'పద్మావతి' చిత్రంపై రాజ్ పుత్ ల నిరసనల నేపథ్యంలో బన్సాలీ నిర్మాణ సంస్థ స్పందించింది. సినిమాలో రాణి పద్మావతి, అలావుద్దీన్ ఖిల్జి మధ్య ఎటువంటి శృంగార దృశ్యం, సన్నివేశం ఉండదని సంస్థ స్పష్టం చేసింది. ఇదే వివాదంపై కర్ణిసేన నేతలు స్పందించారు. సినిమా రిలీజ్ కు ముందుక సినిమా సమీక్షకు అంగీకరించాలని, పద్మావతి పేరును కూడా మార్చాలని ప్రతిపాదించింది.

15:57 - January 30, 2017

విజయవాడ : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తనను అరెస్ట్ చేయడానికి పోలీసులు రెక్కి నిర్వహిస్తున్నారని..ఆ అవసరం వారికి లేదని జైలుకు రమ్మంటే వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తనపై పెట్టిన కేసుల విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడిన ముద్రగడ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఉద్యమాలను చంద్రబాబు అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాపు జాతికి న్యాయం చేయడం కోసం శాంతియుత మార్గంలో ఆమరణ దీక్ష చేపడుతున్నానన్నారు.  

15:55 - January 30, 2017

చిత్తూరు : తిరుమలలో కిడ్నాపైన చిన్నారి నవ్య ఆచూకీకోసం పోలీసులు గాలిస్తున్నారు. పాపను దుండగుడు ఎత్తుకెళ్లిన సీసీ ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. నిందితుడు పసుపు రంగు టీ షర్ట్, బ్లూ  కలర్‌ ప్యాంట్‌ వేసుకున్నాడు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పాపకోసం వెతుకుతున్నారు. అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం తుంచర్ల గ్రామానికి చెందిన దంపతులు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నాక తన ఇద్దరు పిల్లలతో మాధవ నిలయంలో పడుకున్నారు. తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయం చూసిన దుండగుడు నవ్య అనే పాపను భుజంపై వేసుకొని, దుప్పటికప్పుకొని ఎత్తుకెళ్లాడు. పోలీసు జాగిలాల సహాయంతో నిందితున్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాగిలాలు తిరుపతికి వెళ్లే జీఎన్‌టీ టోల్‌గేట్‌వరకూ వెళ్లి ఆగిపోయాయి. దీనిని బట్టి నిందితుడు చిన్నారిని బస్సులో తీసుకొని వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పాప కనిపిస్తే 94407 96772, 90007 00105కి ఫోన్‌ చేయాలని పోలీసుల విజ్ఞప్తి మరన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:43 - January 30, 2017

హైదరాబాద్ : పన్ను వసూళ్ల అధికారాన్ని కేంద్ర, రాష్ట్రాల మధ్య విభజించాలన్న జీఎస్ టీ కౌన్సిల్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఐఆర్ ఎస్ అధికారులు నల్లబ్యాడ్జీలో నిరసన పాటించారు. ఆదాయపన్ను శాఖతోపాటు, కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖకు చెందిన ఐఆర్ ఎస్ అధికారులు ఆందోళనలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఆదాయపన్ను శాఖ, కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌  శాఖల కార్యాయాలయాల్లో పని చేస్తున్న ఇండియన్‌ రెవెన్యూ సర్వీసు అధికారులు  నిరసన పాటించారు. బషీర్‌బాగ్‌లోని సెంట్రల్‌ ఎక్సైజ్‌ కార్యాలయంలో ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పన్ను వసూళ్ల అధికారన్ని కేంద్ర, రాష్ట్రాల మధ్య  విభజించాలన్న జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోపోతే ఉద్యమాన్ని ఉధృతం  చేస్తామని నేతలు హెచ్చరించారు. వచ్చే నెల 3న ఢిల్లీలో ఐఆర్‌ఎస్‌ అధికారుల సారథ్య సంఘం భేటీ కానుంది. భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నారు. 

 

మదర్ థెరిస్సా ఆశ్రమంలో అమానుషం..

కృష్ణా : జిల్లాలోని ఎ.కొండూరు మండలం కంబంపాడు మదర్ థెరీసా అనాథాశ్రమంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రవీణ్ అనే అనాథ విద్యార్థిపై వార్డెన్ వెంకటేశ్వరరావు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలు కావడంతో రహస్యంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

విలీనం దిశగా వోడాఫోన్..ఐడియా..

ఢిల్లీ : టెలికాం కంపెనీలు ఐడియా, వొడా ఫోన్ విలీనం దిశగా అడుగులేస్తున్నాయి. విలీనానికి సంబంధించి ఐడియాతో వొడాఫోన్ చర్చలు జరుపుతున్నాయి. భారతీయ మార్కెట్ లో ఉన్న తీవ్ర పోటీని తట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని వొడాఫోన్ సంస్థ వెల్లడించింది. విలీన వార్తలతో 3.5 శాతం వోడాఫోన్ షేర్లు పెరిగాయి.

దేవినేని ఉమకు హరీష్ లేఖ..

హైదరాబాద్ : ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు తెలంగాణ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. పులిచింతల రిజర్వాయర్ లో క్రస్ట్ లెవల్ వరకు నీటిని ఉంచాలని హరీష్ రావు కోరారు. పులిచింతల బ్యాక్ వాటర్ ఆధారంగా నడుస్తున్న 8 లిఫ్టుల పరిధిలోని రైతులను ఆదుకొనేందుకు నీటిమట్టంను క్రస్ట్ లెవల్ వరకు కొనసాగించాలని కోరారు.

'హోదా' రాదు..ప్యాకేజీయే 'హోదా' - ఎంపీ తోట నర్సింహం..

ఢిల్లీ : బడ్జెట్ సమావేశాల్లో కేంద్రానికి టిడిపి సంపూర్ణ సహకారం ఉంటుందని ఎంపీ తోట నర్సింహం పేర్కొన్నారు. ఏపీలో రైల్వేకు అదనపు నిధులు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని..ప్రత్యేక ప్యాకేజీనే ప్రత్యేక హోదాగా ఊహించుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాలకంటే మెరుగ్గా ఏపీకి నిధులు వస్తున్నాయని, కేంద్రం ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రవేశ పెట్టే బిల్లులకు టిడిపి మద్దతుంటుందని వెల్లడించారు.

15:09 - January 30, 2017

ఈ ఎడాది మోస్ట్ అవెటెడ్ మూవీస్ 'రోబో' ఒకటి. టెక్నికల్ వండర్ తెరకెక్కుతునన్న ఈ మూవీ షూటింగ్ ఫినిసింగ్ స్టేజ్ కి చేరుకుంది. దర్శకుడు శంకర్ లాస్ట్ షెడ్యూల్ ని భారీ ఎత్తున్న ప్లాన్ చేసినట్లు సమాచారం. 'రోబో 2' టీజర్ రిలీజ్ కి ముహుర్తం కూడా ఖారారు చేశారు. 'రజనీకాంత్' ఫ్యాన్స్ తో పాటు యావత్తు ఇండియన్ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'రోబో2'. 'రోబో' కి సీక్వెల్ గా తెరకెక్కుతుండడంతో పాటు బాలీవుడ్ స్టార్ 'అక్షయ్ కుమార్' విలన్ గా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే దర్శకుడు శంకర్ ఈ మూవీని టెక్నికల్ వండర్ గా నిలబెట్టాడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాడు. మేజర్ షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ని శంకర్ భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నాడట.

చివరి షెడ్యూల్..
చెన్నైలోని మహాబలేశ్వరంలో 'రోబో' చివరి షెడ్యూల్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రెండు భారీ సెట్స్ ను సిద్ధం చేస్తున్నారట. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ మొదలవనున్నట్లు సమాచారం. హీరో..విలన్, హీరోయిన్ కి సంబంధించిన ముఖ్యమైన సీన్స్ ని షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి చివరిలోగా షూటింగ్ కంప్లీట్ చేసి, తమిళ సంవత్సరం సందర్భంగా ఏప్రిల్ 14 న టీజర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇక మే నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసేలా శంకర్ ప్రణాళికలు సిద్దం చేసినట్లు సమాచారం.

300 కోట్ల బడ్జెట్..
సుమారు 300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాను దీపావళి కానుక రిలీజ్ చేసేందుకు శంకర్ అండ్ టీం కష్టపడుతోంది. 'అమీజాక్సన్' హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో 'రజనీకాంత్' డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. 'రోబో' సినిమా తరువాత సౌత్ సూపర్ స్టార్ చేసిన మూడు సినిమాలు బాక్సాపీసు వద్ద బోల్తా కొట్టాయి. ఈ క్రమంలో 'రోబో' సీక్వెల్ తో రజనీ మరోసారి మెస్మరైజ్ చేయడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ కాన్పిడెంట్ గా ఉన్నారు. చిట్టి రోబో సంచనాలు క్రియేట్ చేసిన సౌత్ సూపర్ స్టార్ ఈ సీక్వెల్ తో ఎలాంటి రికార్డ్స్ బద్దలుకొడుతాడో చూడాలి.

15:03 - January 30, 2017

మంచు పెద్ద బాబు విష్ణు రిస్క్ చేస్తున్నాడు. తన మార్కెట్ కి మించిన భారీ సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 45కోట్ల భారీ బడ్జెట్ తో పౌరాణిక చిత్రానికి ప్రయత్నం చేస్తున్నాడు. స్టోరీ మీదున్న నమ్మకంతోనే ఈ సాహసం చేస్తున్నాని చెప్పుతున్నాడంట. 'మోహన్ బాబు' వారసుడిగా ఏంట్రీ ఇచ్చిన 'మంచు విష్ణు' హీరోగా నిలదొక్కుకోవడానికి ఇప్పటికి అష్టకష్టాలు పడుతున్నాడు. అరకొర హిట్స్ తో కెరీర్ ని నెట్టుకోస్తున్న ఈ మంచు హీరో తన రేంజ్ కి మించిన సాహసం చేయబోతున్నాడు. హీరోగా 'విష్ణు' మార్కెట్ 15కోట్లలోపే ఉంటుంది. అది కూడా గత ఎడాది 'రాజ్ తరుణ్' తో కలిసి నటించిన 'ఆడోరకం ఈడోరకం' మూవీ సాధించింది. అంటే 'విష్ణు'పై పది కోట్ల బడ్జెట్ పెడితే సేఫ్ లేకపోతే మొదటికే మోసం వస్తోంది. అలాంటిది ఈ మంచుబాబు స్వయంగా 45కోట్లతో తనపై తనే సాహసం చేయబోతున్నాడు.
భక్త కన్నప్ప రీమేక్ గురించి కొంతకాలంగా టాలీవుడ్ చర్చ జరుగుతోంది. 'కృష్ణం రాజు' 'ప్రభాస్' హీరోగా ఈ సినిమా తీయాలనుకున్నారు. కానీ ఇంతలోనే తనికెళ్ల భరణి, సునీల్ ని హీరో పెట్టి ఈ చిత్రం తెరకెక్కించాలని ప్రయత్నం చేశాడు. కానీ 'సునీల్' ఈ సాహసానికి జంకడంతో భరణి ఈ స్టోరీని మంచు కాంపౌండ్ కి తీసుకెళ్లాడు. భక్తకన్నప్ప స్టోరీ విన్న 'విష్ణు' వెంటనే ఈ సినిమా చేస్తానంటూ కన్ ఫర్మ్ చేశాడు. ఇదంతా ఆరునెలల కిందట విషయం.

త్వరలోనే సెట్స్ కి..
అయితే లేటేస్ట్ గా 'విష్ణు' అతి త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించాలని ఉత్సాహం చూపిస్తున్నాడు. 'విష్ణు' 'లక్కున్నోడు' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న మంచు హీరో 45కోట్లతో భక్తకన్నప్పకు సన్నాహాలు చేస్తున్నట్లు క్లారిటి ఇచ్చాడు. అయితే ప్రస్తుతం తన మార్కెట్ రేంజ్ ఇంత లేదని ఒప్పుకున్న విష్ణు, కొన్ని సినిమాలకు బడ్జెట్ లిమిట్స్ చూసుకోవద్దని చెప్పుతున్నాడు. భక్తకన్నప్ప స్టోరీ కూడా ఆ కోవకే చెందుతుందని, ఈ సినిమా స్టోరీ విన్నప్పుడే విష్ణుకు తన రేంజ్ కి మించిన సినిమా అనిపించిదట. అయితే స్టోరీ మీదున్న నమ్మకంతోనే ఈ సాహసం చేస్తున్నాడట. ప్రస్తుతం స్టోరీ బోర్డ్ దశలో ఉన్న త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. తనికెళ్ల భరణి కథ మాత్రమే అందిస్తున్నారని, దర్శకుడు ఎవరనేది ఇంకా కన్ ఫర్మ్ చేయలేదని 'మంచు' హీరో స్పష్టం చేశాడు. మొత్తానికి 'విష్ణు' రేంజ్ పెంచుకోవడానికి రేంజ్ కు మించిన బడ్జెట్ పెడుతున్నాడు.

14:57 - January 30, 2017
14:55 - January 30, 2017
14:39 - January 30, 2017

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్ లో నిలదీస్తామని వైసీపీ ఎంపీలు అన్నారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఆల్ పార్టీ సమావేశానికి ఆ పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ హోదాతోపాటు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, పార్టీ ఫిరాయింపులపై నిలదీస్తామని చెప్పారు. ప్రత్యేకహోదాకు ఏదీ ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలకు రాయితీలు వస్తాయని పేర్కొన్నారు. ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యేలను మార్కెట్ లో వస్తువుల్లాగా కొనుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

 

14:29 - January 30, 2017

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రంగంలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 1న ఇరు రాష్ట్రాల మంత్రులతో గవర్నర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అంశాల వారీగా విభజన సమస్యలపై చర్చించనున్నారు. గవర్నర్ తో సమావేశానికి ఏపీ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు హాజరు కానున్నారు. ఈ సమావేశంతోనైనా ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కారమైతాయో లేదో చూడాలి మరి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

లోకేష్ తో ముగిసిన టిడిపి ఎంపీల భేటీ..

గుంటూరు : లోకేష్ తో టిడిపి ఎంపీల భేటీ కాసేపటి క్రితం ముగిసింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

కోర్టుకు హాజరైన రాహుల్..

మహారాష్ట్ర : ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసులో భివాండి కోర్టుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. తదుపరి విచారణనను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.

కోదండరాంపై ఎంపీ సుమన్ విమర్శలు..

హైదరాబాద్ : ప్రొ.కోదండరాంపై మళ్లీ ఎంపీ బాల్క సుమన్ పలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కబంధ హస్తాల్లో కోదండరాం చిక్కుకున్నారని, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కోదండరాం విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ కాంట్రాక్టు పనులన్నీ టెండర్ల ద్వారానే పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు.

వలసలపై చట్టంలో లోసుగులు - ఎంపీ సీతారాం నాయక్..

హైదరాబాద్ : రాజకీయాల్లో వలసలు సాధారణమేనని, వలసలపై చట్టంలోనే లొసుగులున్నాయని ఎంపీ సీతారాం నాయక్ పేర్కొన్నారు. ఇతర పార్టీల నేతలు తమతో టచ్ లో ఉన్నారని గతంలో జరిగిన వలసల గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

మావోయిస్టు సానుభూతి పరుల లొంగుబాటు..

ఛత్తీస్ గడ్ : బస్త్ర్ ఐజీ ఎస్ఆర్ పీ కల్లూరి ఎదుట మావోయిస్టు సానుభూతి పరులు 195 మంది లొంగుబాటయ్యారు. లొంగిపోయిన వారిలో 25 మంది మహిళలున్నారు.

13:36 - January 30, 2017

హైదరాబాద్: 2017 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే 'పద్మ' అవార్డుల్లో మహిళలు విరసి మెరిశారు. పద్మాఅవార్డులు వరించిన మహిళలతో ఈ నాటి ' స్ఫూర్తి' మన ముందుకు వచ్చింది. దానికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

13:28 - January 30, 2017

హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై గవర్నర్‌ నరసింహన్‌తో చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాసేపటి క్రితమే రాజ్‌భవన్‌ వెళ్లారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలైన భవనాల అప్పగింతపై తెలంగాణ రాష్ట్రం తరపున మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో ఎంపీ వివేక్‌, మంత్రి జగదీష్‌రెడ్డి సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఇక ఏపీలో మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రి అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాస్‌లు సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఫిబ్రవరి 1న తొలిసారిగా ఈ అంశాలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల తరపున సభ్యులు రాజ్‌భవన్లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌తో చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్ వెళ్లారు.

13:26 - January 30, 2017

హైదరాబాద్: గుంటూరు టిడిపి కార్యాలయంలో టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో పార్టీ అధినేత చంద్రబాబు చర్చించనున్నారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అంశంపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించనున్నట్లు సమాచారం.

13:24 - January 30, 2017

అనంతపురం : జిల్లాలోని డి హీరేహళ్‌ మండలం సిద్ధాపురం గ్రామ సమీపంలో అనుమానాస్పందంగా ఓ చిరుత మృతిచెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, పోలీసులు కలిసి ఘటనా స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. చిరుత ఎలా మృతిచెందిందన్న దానిపై ఇంకా వివరాలు తెలియలేదు.

13:22 - January 30, 2017

తూ.గో : విధ్వంసానికి ఏడాది గ‌డుస్తోంది. ఒక్క ఘ‌ట‌న‌తో ఏపీ రాష్ట్రమంతా ఉలిక్కిప‌డేలా చేసిన ఉద్యమం నేటికి కొన‌సాగుతోంది. రాజ‌కీయంగా అధికార‌, ప్రతిప‌క్షాల మ‌ధ్య పెద్ద చ‌ర్చకు దారితీసిన తునిలో ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్ విధ్వంసానికి ఏడాది గ‌డిచిపోయింది. అయినా.. ఇప్పటికీ ఆనాటి ఉద్యమ ప్రకంప‌న‌లు మాత్రం ఆగ‌లేదు. తుని దుర్ఘట‌న‌కు ఏడాది పూర్తవుతున్న సంద‌ర్భంగా 10టీవీ ప్రత్యేక కథనం.

గ‌త ఏడాది జ‌న‌వ‌రి 30...

గ‌త ఏడాది జ‌న‌వ‌రి 30న తూర్పుగోదావరి జిల్లా తునిలో ముద్రగడ పద్మనాభం సారథ్యంలో నిర్వహించిన బ‌హిరంగ‌ స‌భ‌కు ఏపీ రాష్ట్ర న‌లుమూలల నుంచి వేల సంఖ్యలో కాపులు హాజ‌ర‌య్యారు. వివిధ పార్టీల నేత‌లు కూడా పాల్గొన్నారు. అయితే... అనూహ్యంగా తుని స‌భలో ముద్రగ‌డ తీసుకున్న నిర్ణయం పెనుదుమారం రేపింది. రైల్‌, రాస్తారోకో చేయాల‌ని ఆయ‌న చేసిన ప్రక‌ట‌న‌తో యువ‌త రెచ్చిపోయారు.ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి సాగించిన విధ్వంసం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. మొత్తం ట్రైన్‌ను త‌గుల‌బెట్టడం, పోలీస్‌స్టేష‌న్ మీద దాడి, మీడియా సిబ్బందిని గాయ‌ప‌ర‌చ‌డం వంటి అనేక అరాచ‌కాలు జ‌రిగాయి.

సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు...

ఈ ఘటన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. తుని ఘటనకు బాధ్యులైన వారిని విడిచిపెట్టే ప్రస‌క్తే లేద‌ని హెచ్చరించారు. అయితే... కేసు వ్యవ‌హారం మాత్రం ఇప్పటికీ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. సీఐడీ ఆధ్వర్యంలో సాగుతున్న ద‌ర్యాప్తులో సుమారు 70 కేసులు న‌మోదు చేశారు. దాదాపు అన్ని కేసుల్లోనూ ముద్రగ‌డ ప‌ద్మనాభం ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆ త‌ర్వాత ముద్రగ‌డ ఆమ‌ర‌ణ దీక్ష చేయ‌డం, దానికి దిగ‌వ‌చ్చిన ప్రభుత్వం 9 నెల‌ల్లో మంజునాథ క‌మిష‌న్ రిపోర్ట్‌తో కాపుల‌కు న్యాయం చేస్తామ‌ని చెప్పడం, ఆ త‌ర్వాత కేసుల్లో నిందితులు కొంద‌రిని అరెస్ట్ చేయ‌డం వంటి అనేక వ్యవ‌హారాలు న‌డిచాయి. అరెస్టులు చేయగానే ముద్రగ‌డ మ‌రోసారి రాజ‌మ‌హేంద్రవ‌రం ఆస్పత్రిలోనే దీక్ష చేయ‌డంతో అరెస్టుల ప‌ర్వానికి తెర‌ప‌డింది. రైల్వేఅధికారులు కూడా నోటీసులు జారీ చేసి ఒకసారి విచార‌ణ మాత్రం జ‌రిపారు. కాపుల‌ను బీసీల‌లో చేర్చాల‌నే డిమాండ్ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. కేసుల విచార‌ణ కూడా ముందుకు సాగిన దాఖ‌లాలు లేవు. మొత్తంగా తుని విధ్వంసం ఏపీ చ‌రిత్రలో ఓ చెర‌గ‌ని మ‌చ్చగా మిగిలిపోయిందని చెప్పొచ్చు.

13:19 - January 30, 2017

కొత్తగూడెం :ప్రత్యేక రాష్ట్రం రావడంతో తప్పులేదని, పాలకుల బుద్ధిలోనే తప్పు ఉందని తమ్మినేని విమర్శించారు. సామాజిక తెలంగాణ సాధన కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో జరుగుతున్న పాదయాత్ర 106వ రోజుకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. సారపాక, రెడ్డిపాలెం, బూర్గంపాడు, మోరంపల్లి బంజారా, పినపాక, నాగారం, జగన్నాథపురం గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు. గ్రామగ్రామాన జరుగుతున్న సభల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను తమ్మినేని వీరభద్రం ఎత్తి చూపుతున్నారు. పాలకవర్గాలు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ వచ్చిందన్న సంతోషం ప్రజలకు ఎంతోకాలం మిగలేదన్నారు.

త్వరలో గవర్నర్ తో ఏపీ, తెలంగాణ మంత్రుల భేటీ..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ తో ఏపీ, తెలంగాణ రాష్ట్ర మంత్రులు త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుండి మంత్రి యనమల నేతృత్వంలో అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాస్ లు, తెలంగాణ నుండి మంత్రి హరీష్ రావు నేతృత్వంలో వివేక్, జగదీష్ రెడ్డి లు భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాలపై నెలకొన్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

12:42 - January 30, 2017

ఖమ్మం:గొంతుకెండిన మెట్టభూముల్లో జలసిరులు తెస్తోంది..తెలంగాణ సర్కార్‌. ఖమ్మంజిల్లాల్లో భక్తరామదాసు ప్రాజెక్ట్‌ను రికార్డు టైంలో పూర్తిచేసి..ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపను భక్తరామదాసు జయంతి సందర్భంగా..ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అనుకున్న దానికంటే 2నెలలు ముందుగానే ప్రాజెక్టు పనులు పూర్తికావడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం స్పీడ్‌ గా పూర్తిచేస్తోంది. ఖమ్మంజిల్లాలో 60వేల ఎకరాలను సస్యశ్యామలం చేసే భక్తరామదాసు ప్రాజెక్ట్‌నుంచి నీటిని విడుదల చేసింది.

60 వేల ఎక‌రాల‌కు పైగా స్థిర‌మైన ఆయ‌క‌ట్టు ఉండే విధంగా....

ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో నీళ్లు లేక బీడు భూములుగా మారుతున్న పోలాలను పచ్చని మాగాణాలుగా మార్చేపనిని త్వరితగతిన పూర్తిచేస్తోంది తెలంగాణ సర్కార్‌. 60 వేల ఎక‌రాల‌కు పైగా స్థిర‌మైన ఆయ‌క‌ట్టు ఉండే విధంగా, 5 టీఎంసీల నీటిని లిప్టు చేసేందుకు భ‌క్తరామ‌దాసు ప్రాజెక్టు మొద‌లుపెట్టారు. గతఏడాది ఫిబ్రవ‌రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాప‌న చేశారు. ఒకే ఏడాదిలో ప‌నులు మొద‌లుపెట్టి, ప‌రిపాల‌న‌ప‌ర‌మైన అనుమ‌తులు సాధించ‌డం, భూసేక‌ర‌ణ చెయడం , టెండ‌ర్లు పిలిచి ప‌నులు కూడా అంతే వేగంగా పూర్తిచేయడంతో అనుకున్న దానికంటే ముందుగానే నీటివిడుదలకు సిద్ధం చేశారు.

పాలేరు రిజర్వాయర్‌ బ్యాక్ వాట‌ర్ ను ఎత్తిపోతలద్వారా ...

పాలేరు రిజర్వాయర్‌ బ్యాక్ వాట‌ర్ ను ఎత్తిపోతలద్వారా 17 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న తిరుమలాయ‌పాలెం మండ‌లంలోని మ‌హ్మదాపురం దగ్గర కాలువలో వ‌ర‌కు నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి కాలువలో పోస్తారు. ఇందుకోసం కూసుమంచి మండ‌లం దుబ్బతండా ద‌గ్గర పంపుహౌస్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే పైపు లైన్ పనులు పూర్తికావొచ్చాయి. పంపుహౌస్ ప‌నులు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి. భ‌క్తరామ‌దాసు, సీతారామా ఎత్తిపోథ‌ల ప‌థ‌కాల‌ను ఇంట‌ర్ లింక్ చేసే ప్ర‌తిపాధ‌న కూడా ఉంద‌న్న మంత్రుల ప్ర‌క‌ట‌న‌తో ఇక క‌రువు త‌మ ద‌రికి రాద‌ని సంతోషిస్తున్నారు. భ‌క్తరామ‌దాసు ఎత్తిపోథ‌కం సాగ‌ర్ జ‌లాల‌తో చేప‌ట్టారు.. సీతారామ ఎత్తిపోథ‌ల ప‌థ‌కం గోదావ‌రి జలాల మీద చేపట్టారు. ఇటు కృష్ణా అటు గోదావ‌రి జ‌లాలు వ‌స్తే రెండు పంట‌ల‌కు ఢోకా ఉండ‌దని అధికార వర్గాలు అంటున్నాయి.

గవర్నర్ తో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీన ఏపీ మంత్రులతో నరసింహన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. విభజన సమస్యల పరిష్కారానికై గవర్నర్ జోక్యం చేసుకోనున్నట్లు సమాచారం. 

12:39 - January 30, 2017

హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ 69వ వర్థంతి కార్యక్రమం హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్‌లో ఘనంగా జరిగింది. వర్థంతి కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. గాంధీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అన్ని మతాలకు చెందిన గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

 

బాలుడిపై తోటి స్నేహితుల వేధింపులు..

హైదరాబాద్ : మలక్ పేట జమాల్ ఖాన్ లో బాలుడిని తోటి స్నేహితులు వేధింపులకు గురి చేశారు. బాలుడిని నగ్నంగా వీడియో తీసిన స్నేహితులు వేధింపులకు పాల్పడ్డారు. చాదర్ ఘాట్ పీఎస్ లో బాలుడి తండ్రి ఫిర్యాదు చేశారు.  

టి.టిడిపి నేతల భేటీ..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో తెలంగాణ టిడిపి సీనియర్ నేతలు భేటీ అయ్యారు. మంత్రుల నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. 

12:36 - January 30, 2017

ఢిల్లీ:: జాతిపిత మహాత్మాగాంధీ 69వ వర్థంతి సందర్భంగా దేశ ప్రజలు ఆ మహనీయునికి నివాళులర్పించారు. ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో ఉన్న గాంధీ సమాధిపై పలువురు ప్రముఖులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తదితరులు ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

తిరుపతిలో కిడ్నాపైన చిన్నారి కోసం గాలింపులు..

తిరుమల : మాధవ నిలయంలో నిన్న కిడ్నాప్ కు గురైన చిన్నారి నవ్యశ్రీ కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ మునిరామయ్య ఆధ్వర్యంలో డాగ్ స్వ్కాడ్ తో తనిఖీలు జరిపారు. మాధవ నిలయం నుండి జీఎంసీ టోల్ గేట్ వరకు వెళ్లి ఆగింది. జీఎంసీ టోల్ గేట్ నుండి వెహికల్ లో చిన్నారిని తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

12:34 - January 30, 2017

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గాంధీ వర్థంతి సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశంలోని అన్ని ట్రాఫిక్‌ కూడళ్లలోఉదయం 11 గంటలకు వాహనాలను నిలిపివేసి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. వాహనచోదకులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విభజన సమస్యల పరిష్కారానికై గవర్నర్ జోక్యం..

ఢిల్లీ : విభజన సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రంగంలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఇరు రాష్ట్రాల మంత్రులతో గవర్నర్ భేటీ కానున్నారు. అంశాల వారీగా విభజన సమస్యలపై చర్చించనున్నారు. గవర్నర్ తో సమావేశానికి ఏపీ నుండి మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు హాజరు కానున్నారు. 

12:32 - January 30, 2017

హైదరాబాద్ : బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న ప్రజలపై కారు దూసుకెళ్లింది. దీంతో రోడ్డుపై నిలపడ్డ 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో కారు బ్రేక్ లు ఫెయిల్ అవడం వల్ల కారును అదుపు చేయలేకపోయినట్లు డ్రైవర్ చెప్తున్నారు. మొత్తానికి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరో వైపు క్షతగాత్రులను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

12:29 - January 30, 2017

హైదరాబాద్: ఫ్రాన్స్‌కు చెందిన 23ఏళ్ల ఇరిస్‌ మిట్టెనరి ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌గా ఎంపికైంది. ఫిలిప్పైన్స్‌లో జరిగిన విశ్వసుందరి పోటీల్లో హోస్ట్‌ స్టీవ్‌ హార్వే.. మిస్‌ ఫ్రాన్స్‌ ఇరిస్‌ను విజేతగా ప్రకటించారు. గతేడాది విశ్వసుందరి కిరీటం సొంతం చేసుకున్న ఫిలిప్పైన్స్‌ భామ పియా వుట్జ్‌బక్‌ ఇరిస్‌కు కిరీటం అలంకరించారు. ఈ పోటీల్లో తొలి రన్నరప్‌ మిస్‌ హైతి రక్వెల్‌ పెలిస్సైర్‌, రెండో రన్నరప్‌గా మిస్‌ కొలంబియా ఆండ్రియా తొవర్‌ నిలిచారు. మిస్‌ యూనివర్స్‌ ఇరిస్‌ ఫ్రాన్స్‌ ఉత్తర ప్రాంతంలోని లిల్లే పట్టణంలో జన్మించారు. డెంటల్‌ సర్జరీలో డిగ్రీ చేశారు. క్రీడలు, ప్రయాణాలు చేయడంతో పాటు ఫ్రెంచ్‌ వంటకాలు చేయడం ఆమె అభిరుచి. ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన రోహ్మిత హరిమూర్తి చాలా వెనుకబడిపోయారు. ఆమెకు టాప్‌ 13లో కూడా స్థానం దక్కలేదు.

12:27 - January 30, 2017

ఢిల్లీ:పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగిస్తారు. పార్లమెంటు సజావుగా నిర్వహించేందుకు వీలుగా ప్రతిపక్షాల సహకారం తీసుకునేందుకు ప్రభుత్వం అఖిలక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి పార్లమెంటులోని అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు. టీఎంసి మాత్రం ఈ భేటీకి గైర్హాజరు కావాలని నిర్ణయించుకుంది. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సాయంత్రం 7 గంటలకు పార్టీ ఫ్లోర్‌ లీడర్లతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి ప్రధాని మోదీ కూడా హాజరుకున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం ప్రవేశపెట్టే బడ్జెట్‌ను బహిష్కరించాలని టీఎంసీ నిర్ణయించుకుంది.

సచివాలయంలో యనమల సమావేశం..

విజయవాడ : అమరావతి సచివాలయంలో బడ్జెట్ పై వివిధ శాఖల మంత్రులు..అధికారులతో మంత్రి యనమల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏడుగురు మంత్రులు హాజరయ్యారు. 

అపోలో వద్ద కారు బీభత్సం..

హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని ఆపోలో వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. జనాలపైకి దూసుకెళ్లడంతో 9 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

నీరు - ప్రగతిపై బాబు టెలికాన్ఫరెన్స్..

విజయవాడ : 'నీరు - ప్రగతి' పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి ఎద్దడి ప్రాంతాలకు నీరు ప్రగతి ఓ భరోసా కార్యక్రమమని, ఉపాధి హామీకి కేటాయించిన రూ. 6వేల కోట్ల బడ్జెట్ ను పూర్తిగా వినియోగిస్తే వచ్చే ఏడాది రూ. 7వేల కోట్లు సాధించగలుగుతామన్నారు. కేంద్రం నుండి మరో రూ. 2500 కోట్లు రానున్నాయని వీటితో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. పంట కాల్వలు, డ్రెయిన్ల మరమ్మత్తులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా, సాగునీటి సంఘాలు, జన్మభూమి కమిటీలను భాగస్వామ్యం చేయాలన్నారు. 

కాసేపట్లో అఖిలపక్ష సమావేశం..

ఢిల్లీ : కాసేపట్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాలకు సహకరించాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరనుంది. 

గాంధీ విగ్రహానికి బాబు నివాళులు..

విజయవాడ : అమరావతి సచివాలయంలో గాంధీ విగ్రహానికి సీఎం చంద్రబాబు నాయుడు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. 

బాపు ఘాట్ వద్ద నివాళులు..

హైదరాబాద్ : మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని బాపూ ఘాట్ వద్ద పలువురు నివాళులర్పించారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, పలువురు మంత్రులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. 

రెండు నిమిషాల పాటు మౌనం..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా రెండు నిమిషాల పాటు మౌన ప్రదర్శన జరిగింది. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈ ప్రదర్శన జరిగింది. రెండు నిమిషాల పాటు ప్రభుత్వ కార్యాలయాలు...పాఠశాలలు ఇతర ప్రదేశాల్లో మౌన ప్రదర్శన చేపట్టారు. 

10:56 - January 30, 2017

క‌డ‌ప : జిల్లాలోని జ‌మ్మల‌మ‌డుగులో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌రణం పాల‌య్యారు. వేగంగా వ‌స్తున్న కారు అదుపు త‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డ‌ిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా మ‌రో ఇద్దరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నద‌ర్యాప్తు చేస్తున్నారు. అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. మృతుల‌ను అశ్వ‌త్థామ‌, తుల‌సీరామ్‌, గోవ‌ర్థ‌న్‌లుగా గుర్తించారు.

కాసేపట్లో మౌన ప్రదర్శన..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉదయం 11గంటలకు మౌన ప్రదర్శన జరగనుంది. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. రెండు నిమిషాల పాటు ప్రభుత్వ కార్యాలయాలు...పాఠశాలలు ఇతర ప్రదేశాల్లో మౌన ప్రదర్శన చేపట్టనున్నారు. 

స్పీకర్ అధ్యక్షను భేటీకానున్న అఖిలపక్షం

ఢిల్లీ : ఈ రోజు సాయంత్రం 7 గంటలకు లోక్ సభ స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కానుంది. ఈ సమావేశానికి టీఎంసీ గైర్హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్కు గైర్హాజరు కావాలని కూడా నిర్ణయించింది. ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో బడ్జెట్ ను కేంద్రం ప్రవేశ పెట్టనుంది.

10:47 - January 30, 2017

అక్కినేని ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. గత కొద్ది రోజులుగా 'నాగ చైతన్య' 'సమంత' వివాహంపై వస్తున్న వార్తలకు ఇక ఫుల్ స్టాప్ పడినట్లే. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఘనంగా ఆదివారం జరిగింది. వీరిద్దరూ గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమకు 'నాగ్' దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎంగేజ్ మెంట్ తేదీని ఖరారు చేయలేదు. 'నాగ చైతన్య' ఎంగేజ్ మెంట్ కు ముందుగానే 'అఖిల్' నిశ్చితార్థం జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 'నాగ చైతన్య' 'సమంత' లు ఒకరినొకరు ఉంగరాలు మార్చుకున్నారు. వీరిద్దరూ కలిసిన ఫొటోలు సామాజిక మాధ్యామాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేడుకల్లో శ్యామ్ బంగారు వర్ణం అంచు కలిగిన తెలుగు చీరలో దర్శనమిచ్చింది. ముంబాయికి చెందిన డిజైనర్ క్రేషా బజాజ్ ఈ చీరను డిజైన్ చేశారు. కానీ ఈ చీరలో 'సమంత' ప్రేమ దాగి ఉంది. 'సమంత' కటిన చీర అంచును బాగా గమనిస్తే అందులో ' ఏమాయ చేశావే' చిత్రంలోని సన్నివేశం నుండి ఇటీవలే జరిగిన 'అఖిల్' నిశ్చితార్థంలో దిగిన ఫ్యామిలీ ఫొటో వరకు దృశ్యాలు కనిపిస్తుండడం విశేషం. దీనికి సంబంధించిన ఓ వీడియో యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. 

బాపులపాడు మండలంలో జగన్ పర్యటన

కృష్ణా : బాపులపాడు మండలంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. బొమ్మలూరులో ఎండిన పంట పొలాలను జగన్ పరిశీలిస్తున్నారు.

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

ఢిల్లీ: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

మహాజన పాదయాత్ర..106వ రోజు..

ఖమ్మం : సీపీఎం మహాజన పాదయాత్ర 106వ రోజుకు చేరుకుంది. నేడు సారపాక, రెడ్డిపాలెం, బూరంపాడు, మోరంపల్లి బంజారా, పినపాక, నాగారం, జగన్నాథపురంలో పాదయాత్ర కొనసాగనుంది. 

10:24 - January 30, 2017

విజయవాడ: వైసీపీ అధినేత జగన్ అవినీతి, అక్రమాస్థుల కేసులో జైలుకెళ్లినా జగన్ కు ఇంకా బుద్ధి మారలేదని అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరం అని మంత్రి దేవినేని ఎద్దేవా చేశారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ప్రతి కార్యక్రమంపై జగన్ బురజల్లుతున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకుజగన్ చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులపై ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ వుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 28వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామని... పోలవరం ఎస్టిమేషన్లు పెంచేశారని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపి కేవీపీ కూడా పోలవరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ఏం చేసిందోమరోసారి ఆలోచించాలని గుర్తు చేశారు.

జగన్ వి దుర్మార్గపు మాటలు - ఉమ..

విజయవాడ : జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దుర్మార్గమైన మాటలు కట్టబెట్టాలని సూచించారు. విజయవాడలో సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులకు రూ. 28వేల కోట్ల రూపాయలు అందచేసే ప్రయత్నం జరుగుతోందని, ప్రాజెక్టు ఎస్టిమేషన్లు పెంచేశారంటూ జగన్ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లినా జగన్ కు బుద్ధి రాలేదని విమర్శించారు. గత ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరు హామీలుఇచ్చారని, అందులో నాలుగో హామీ పోలవరం ప్రాజెక్టు సంబంధించిందన్నారు.

ఇన్ఫోసిస్ టెక్కీ హత్య

పూణె : ఇన్ఫోసిస్ టెక్కీ రసీలా హత్యకు గురైంది. ఇన్ఫోసిస్ కార్యాలయంలో కంప్యూటర్ వైర్ ను గొంతుకు బిగించి దుండగుడు హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సెక్యూర్టీ గార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు రసీలా కేరళ వాసిగా గుర్తించారు. 

కాసేపట్లో అఖిలపక్షం..హాజరు కానున్న మోడీ..

ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి జైట్లీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం అఖిలపక్ష భేటీ జరగనుంది. ఈ సమాశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్షాన్ని మోడీ కోరనున్నారు. 

కడ్తాల్ లో రోడ్డు ప్రమాదం..

రంగారెడ్డి : కడ్తాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతులు అచ్చంపేట మండలం బల్మూరు వాసులుగా గుర్తించారు. 

దేశ రాజధానిలో దట్టంగా పొగమంచు..

ఢిల్లీ : దేశ రాజధానిలో దట్టంగా పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా 28 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 10 రైళ్ల వేళల్లో మార్పులు చేయగా ఒక రైలును రద్దు చేశారు. 

ఋద్వేల్ లో దారి దోపిడి..

రంగారెడ్డి : రాజేంద్రనగర్ పరిధిలోని ఋద్వేల్ దారిదోపిడి జరిగింది. లారీ డ్రైవర్ పై దాడి చేసి రూ. 3వేలు, సెల్ ఫోన్, లారీ బ్యాటరీని దుండగులు ఎత్తుకెళ్లారు. లారీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మఠంపల్లిలో కార్డన్ సెర్చ్...

సూర్యాపేట : మఠంపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 40 బైక్ లు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా విక్రయిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు.

 

అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో బాలుడు అదృశ్యం..

అనంతపురం : ప్రభుత్వాసుపత్రిలో బాలుడు అదృశ్యమయ్యాడు. సీసీ టీవీ ఫుటేజ్ లో బాలుడిని మహిళ ఎత్తుకెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

వేములవాడకు పోటెత్తిన భక్తులు..

సిరిసిల్ల : వేములవాడ ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం భారీగా భక్తులు తరలివస్తుండడంతో స్వామి వారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. 

ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న డిప్యూటి సీఎం..

హైదరాబాద్ : నేడు సర్వశిక్ష అభియాన్ బిల్డింగ్ లో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో డిప్యూటి సీఎం భేటీ కానున్నారు.

 

09:38 - January 30, 2017

'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తరువాత 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో 'పవన్' సరసన 'శృతి హాసన్' మరోసారి నటిస్తోంది. సినిమాకు సంబంధించిన టీజర్ పై పలు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. జనవరి 26వ తేదీన టీజర్ విడుదలవుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. త్వరలోనే టీజర్ విడుదలవుతుందని, ఆ తేదీని తొందరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ట్విట్టర్ ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేటలోని సప్త ప్రాకారయుత దుర్గాభవానీ మాత ఆలయంలో 'కాటమరాయుడు' సందడి చేశారు. చిత్రానికి సంబంధించిన షూటింగ్ అక్కడ జరిగింది. పవన్ తో పాటు శృతి హాసన్..ఇతర నటీ నటులు పాల్గొన్నారు. 'పవన్' వస్తున్నారని తెలుసుకున్న స్థానిక ప్రజలు షూటింగ్ ప్రదేశానికి భారీగా తరలివచ్చారు. ఈసందర్భంగా వారితో 'పవన్' కరచాలనం చేశారు. ఉగాది కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. 

భక్త రామదాసు కీర్తనలపై కళాకారుల నృత్యాలు

భద్రాద్రి :రాముడు నడియాడిన భద్రాచలం పుణ్యక్షేత్రం నాట్య కళాకారులతో పరవశించిపోయింది. పవిత్ర గోదావరి నది తీరాన వెయ్యి మంది చిన్నారులు నృత్యాభిషేకం చేశారు. భక్త రామదాసు కీర్తనలపై చిన్నారులు చేసిన నృత్యాలు చేసి తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సాధించాయి. వచ్చే ఏడాది ఐదు వేల మందితో కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సాధించేందుకు ప్రయత్నిస్తామంటున్నారు

పార్లమెంట్‌ సమావేశాలకు సిద్ధమైన వైసీపీ

హైదరాబాద్: పార్లమెంట్‌ సమావేశాల్లో ఏపీ ప్రత్యేక హోదాపై మరోసారి గళమెత్తాలని వైసీపీ నిర్ణయించింది.. టీడీపీ కారణంగానే రాష్ట్రానికి హోదా దక్కడంలేదని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు... అధికారపార్టీని ఇరుకునపెట్టేందుకు ఢిల్లీలో తమ వాణిని గట్టిగా వినిపించాలని తీర్మానించారు. లోటస్‌పాండ్‌లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సభ్యుల భేటీలో.. పార్లమెంటు బడ్దెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. విభజన హామీ చట్టంలోని హామీలు నెరవేర్చాలంటూ పార్లమెంట్‌లో గట్టిగా పట్టుబట్టాలని ఆ పార్టీ అధినేత జగన్‌ నేతలకు సూచించారు..

రాజేంద్రనగర్‌లోని గాంధీనగర్‌లో దారుణం

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని గాంధీనగర్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య సాయమ్మను భర్త రాజు గొంతునులిమి హత్య చేశాడు. అడ్డుకోబోయిన స్థానికులను కత్తితో బెదిరించిన రాజు సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

09:33 - January 30, 2017

హైదరాబాద్: ఏడు ముస్లిం దేశాల నుంచి అమెరికాలోకి వలసలను నిషేధిస్తూ అధ్యక్షుడు టంప్‌ జారీ చేసిన ఆదేశాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొంపముంచే ట్రంప్‌ ఆదేశాలపై అటు అమెరికాతోపాటు, ఇటు ఇతర దేశాల్లో కూడా నిరసనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు ట్రంప్‌ ఆదేశాల అమలును నిలిపివేస్తూ అమెరికా జిల్లా కోర్టు స్టే విధించింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిరాకరించిన వారు.. తమదేశంలోకి రావొచ్చంటూ కెనడా ఆహ్వానం పలికింది.

ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం...

ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఆదేశాల అమలు నిలిపివేస్తూ అమెరికా జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్‌ ఆదేశాలను వ్యతిరేకిస్తూ అమెరికా పౌర హక్కు సంఘం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యూయార్క్‌లోని ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు బ్రూక్లిన్‌ ఫెడరల్‌ జడ్డి యాన్‌ డొనెల్లి స్టే విధించారు. ఈ ఆదేశాలపై ఫెడరల్‌ కోర్టులో సవాల్‌ చేసేందుకు ట్రంప్‌ సిద్ధమవుతున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇస్లామిక్‌ ఉగ్రవాద ప్రభావిత దేశాల పౌరులు అమెరికా రాకుండా చర్యలు తీసుకుంటానని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే అమల్లోకి తెచ్చారు. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఏడు దేశాల పౌరుల గుండెల్లో పిడుగులు....

వలసదార్ల ప్రవేశంపై ట్రంప్‌ విధించిన తాత్కాలిక నిషేధం వివాదాస్పదంగా మారుతోంది. అధ్యక్షుడి ఆదేశాలతో ఒకటికాదు, రెండుకాదు.. ఏడు దేశాల పౌరుల గుండెల్లో పిడుగులు పడినట్టు అయ్యింది. ఇరాన్‌, ఇరాక్‌, లిబియా, సుడాన్‌, యెమన్‌, సొమాలియాల నుంచి వలసలకు మూడు నెలల బ్రేక్‌ వేశారు. మన పొరుగుదేశం పాకిస్థాన్‌, అఫ్గనిస్థాన్‌, సౌదీ అరేబియాల నుంచి అమెరికా వచ్చే వారిని క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలన్న ఆదేశాలను పోలీసులు, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అమల్లోకి తెచ్చారు. విమానాశ్రయాలతోపాటు, అమెరికాలోని వీధుల్లో విదేశీయులను యక్ష ప్రశ్నలో వేధిస్తూ, సాధిస్తున్నారు. అమెరికా హోంలాండ్‌ విభాగం అధికారులు ఇంతవరకు 170 మందిని అడ్డుకున్నారు. వీరిని విమానాశ్రయాల్లోనే ఉంచారు.

ఎన్నికల ప్రచారంలో ఇస్లామిక్‌ దేశాలపై అక్కసు .....

ట్రంప్‌కు మొదటి నుంచి ఇస్లామిక్‌ దేశాలపై ఏహ్యభావం ఉంది. ఇరాక్‌ యుద్ధం తర్వాత ఇది మరింత పెరిగింది. 2001 సెప్టెంబర్‌ 11న న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదుల దాడి తర్వాత ఇది ద్వేషంగా మారింది. అప్పటి నుంచి తన ఆక్రోషాన్ని వెళ్లగక్కేందుకు సరైన వేదికలు లేకపోవడంతో తన భావాలను లోలోపలే అణచివేసుకున్నట్రంప్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్ధిగా బరిలో నిలిచేందుకు ప్రైమరీ ఎన్నికల్లో, అభ్యర్థిత్వ ఖరారైతన తర్వాత అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ఇస్లామిక్‌ దేశాలపై తన అక్కసు వెళ్లగక్కారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అభాసుపాలయ్యారు కూడా. సొంత పార్టీ నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కొద్దిగా వెనక్కి తగ్గినట్టు కనిపించినా, ఆతర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. దీంతో రిపబ్లికన్‌ పార్టీ నేతలు తలలు బాదుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొంది, బాధ్యతలు చేట్టిన తర్వాత తనకు ఎదురులేదనుకున్న ట్రంప్‌ ఇస్లామిక్‌ దేశాల పౌరులు అమెరికా రాకుండా ఆంక్షలు విధిస్తూ తన అజెండాను అమల్లోకి తెచ్చారు.

ట్రంప్‌ ఆర్గనైజేషన్‌తో వ్యాపార సంబంధాలున్న దేశాలకు మినహాయింపు.....

ఇస్లామిక్‌ దేశాల పౌరులు అమెరికాలో రావడంపై ఆంక్షలు విధించే విషయంలో ట్రంప్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వ్యక్తిగతంగా ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు వ్యాపార సంబంధాలున్న దేశాలకు మినహాయింపు ఇచ్చారు. న్యూయార్క్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ట్విన్‌ టవర్స్‌పై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఈజిప్టు, లెబనాన్‌ దేశస్థులు కూడా ఉన్నారు. అలాగే ఉగ్రవాద దాడులతో టర్కీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ దేశాలతో ట్రంప్‌కు వ్యాపార సంబంధాలు ముడిపడి ఉండటంతో నిషేధం జాబితా నుంచి తప్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. తన నిర్ణయం వివాదాస్పదమైన వేళ, ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు ట్రంప్‌ ప్రయత్నించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, జర్మన్‌ చాన్సలర్‌ ఎంజెలా మెర్కెల్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే తదితరులతో ఫోన్‌లో మాట్లాడి తన నిర్ణయాన్ని తెలియజేశారు.

టెక్సాస్‌లో ఓ ప్రార్థనా మందిరాన్ని కాల్చివేసిన దుండగులు .....

ట్రంప్‌ నిర్ణయం ఇటు అమెరికాతోపాటు, అటు ఇతర దేశాల్లో నిరసనలకు కారణమవుతోంది. ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే టెక్సాస్‌లోని ఓ ప్రార్థనా మందిరాన్ని దుండగులు కాల్చివేశారు. ట్రంప్‌ నిర్ణయాన్ని అమెరికా కార్పొరేట్లు తప్పు పడుతున్నారు. అధ్యక్షుడి నిర్ణయంపై నిరసన గళం విప్పారు. అమెరికా వసలవాదుల దేశమైనందుకు గర్వపడాలని ఫేస్‌ బుక్‌ సీఈవో బుకెర్‌ బర్గ్‌ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తే అమెరికా లాభపడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్‌ నిర్ణయంపై గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామిక్‌ దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశంపై నిషేధంతోపాటు, ఆంక్షలు విధించిన నేపథ్యంలో విదేశీ పర్యటనల్లో ఉన్న వంద మంది ఉద్యోగులు వెంటనే యూఎస్‌ చేరుకోవాలని ఆదేశించారు. అమెరికాలోకి ప్రతిభావంతులు రాకుండా ట్రంప్‌ నిర్ణయం అవరోధం కలిగిస్తుందని సుందర్‌ పిచయ్‌ ఆవేదన వెలిబుచ్చారు. ట్రంప్‌ నిర్ణయంపై పాకిస్థాన్‌ బాలికా విద్యా కార్యకర్త, నొబెల్‌ శాంతి పురస్కారం గ్రహీత యూసుఫ్‌ జాయ్‌ మలాలా తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం లండన్‌లో ప్రవాసం జీవితం గడుపుతున్న మలాలా.. ట్రంప్‌ నిర్ణయంతో తన గుండె పగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్‌ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రంప్‌ నిర్ణయంపై ఐక్యరాజ్య సమితి వలస విభాగం ఆందోళన వ్యక్తం చేసింది.

అమెరికా పౌరులు ఇరాన్‌ రాకుండా నిషేధిస్తాం ......

ఏడు ఇస్లామిక్‌ దేశాల పౌరుల ప్రవేశంపై అమెరికా విధించిన నిషేధంపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. దీనికి ప్రతిగా అమెరికా పౌరులు ఇరాన్‌ రాకుండా నిషేధిస్తామని హెచ్చరించింది. ట్రంప్‌ నిర్ణయంపై వ్యక్తమవుతున్న నిరసనలు, ఆందోళనలు, హెచ్చరికలు, ప్రతిహెచ్చరికలు ఏ పరిణమాలకు దారితీస్తాయో చూడాలి.

09:27 - January 30, 2017

హైదరాబాద్: కెనాడాలో దారుణం జరిగింది. క్యూబెక్‌ నగరంలోని ఇస్లామిక్‌ సాంస్కృతిక కేంద్రంపై ముగ్గురు సాయుధులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అస్పత్రికి తరలించారు. ఇస్లామిక్‌ సాంస్కృతిక కేంద్రంలో ప్రార్థనలు జరుగుతున్న సయమంలో సాయుధులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఈ ప్రాంతం రక్తమోడింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు ఇస్లామిక్‌ సాంస్కృతిక కేంద్రంలో 40 మంది ఉన్నారు. ప్రార్థనా మందిరంలోకాల్పులు జరిపన ముగ్గురు సాయుధుల్లో ఇద్దర్ని క్యూబెక్‌ సిటీ పోసులు అరెస్టు చేశారు.

కెనడామసీదులో కాల్పులు: 5గురు మృతి

హైదరాబాద్: కెనాడాలో దారుణం జరిగింది. క్యూబెక్‌ నగరంలోని ఇస్లామిక్‌ సాంస్కృతిక కేంద్రంపై ముగ్గురు సాయుధులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అస్పత్రికి తరలించారు. ఇస్లామిక్‌ సాంస్కృతిక కేంద్రంలో ప్రార్థనలు జరుగుతున్న సయమంలో సాయుధులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఈ ప్రాంతం రక్తమోడింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు ఇస్లామిక్‌ సాంస్కృతిక కేంద్రంలో 40 మంది ఉన్నారు. ప్రార్థనా మందిరంలోకాల్పులు జరిపన ముగ్గురు సాయుధుల్లో ఇద్దర్ని క్యూబెక్‌ సిటీ పోసులు అరెస్టు చేశారు.

సాగర్‌ ఎడమ కాల్వలోపడిన ముగ్గురు : ఇద్దరు గల్లంతు

నల్లొండ : జిల్లాలోని నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వలో ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు జారిపడ్డారు. ఇందులో ఇద్దరు గల్లంతుకాగా..ఒకరిని లారీ డ్రైవర్‌ రక్షించాడు. గల్లంతైనవారు 24 ఏళ్ల నానాజి, 40 ఏళ్ల లచ్చుగా గుర్తించారు. గల్లంతైన వారిది తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సువరం వాసులుగా గుర్తించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు విస్త్రతంగా కొనసాగుతున్నాయి.

09:25 - January 30, 2017

నల్లొండ : జిల్లాలోని నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వలో ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు జారిపడ్డారు. ఇందులో ఇద్దరు గల్లంతుకాగా..ఒకరిని లారీ డ్రైవర్‌ రక్షించాడు. గల్లంతైనవారు 24 ఏళ్ల నానాజి, 40 ఏళ్ల లచ్చుగా గుర్తించారు. గల్లంతైన వారిది తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సువరం వాసులుగా గుర్తించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు విస్త్రతంగా కొనసాగుతున్నాయి.

09:08 - January 30, 2017

'జనతా గ్యారేజ్' సక్సెస్ అనంతరం 'జూనియర్ ఎన్టీఆర్' నెక్ట్స్ సినిమా ఏంటీ ? ఆయన చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు ? హీరోయిన్స్ ఎవరు ? తదితర వివరాలు తెలుసుకొనేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. అంతేగాకుండా 'జూనియర్ ఎన్టీఆర్' చిత్రంపై సోషల్ మీడియాలో తెగ కథనాలు కూడా వచ్చాయి. వీటికి 'కళ్యాణ్ రామ్' చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'బాబి' దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో 'ఎన్టీఆర్' ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నాడని..ఇందుకు ముగ్గురు హీరోయిన్ల అన్వేషణ జరగుతోందని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 'కాజల్' తో పాటు మరో ఇద్దరు కేరళ కుట్టిలు 'నివేదా థామస్', 'అనుపమా పరమేశ్వరన్' 'ఎన్టీఆర్' తో నటించే బంఫర్ ఛాన్స్ లు కొట్టేశారని పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసినట్లు టాక్. వారిలో ఒకరు 'రాశీఖన్నా' కాగా మరొకరు 'నివేద థామస్'. మూడో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోందంట. ఎన్టీఆర్ - బాబీ మూవీ ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసి జూన్ నాటికి సినిమాను రిలీజ్ చేయాలని నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావిస్తున్నారట. 'అదుర్స్' లో డ్యూయల్ రోల్ చేసిన యంగ్ టైగర్ ఇప్పుడు త్రిబుల్ రోల్స్ చేస్తుండడం విశేషం. 

07:21 - January 30, 2017

హైదరాబాద్: ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని విమర్శిలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అనుకున్నట్టుగానే వారికి చెందుతున్నాయా? ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఆ నిధులు ఖర్చు పెడుతున్నారా?, దళితులకు మూడెకరాలు ఇస్తామన్న హామీ ఏమైంది. ఎస్సీ,ఎస్టీల పై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై 'న్యూస్ మార్నింగ్' లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ, టిఆర్ ఎస్ నేత తాడూరు శ్రీనివాస్, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చను జరిగిందో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

07:03 - January 30, 2017

హైదరాబాద్: నాగపూర్‌లో భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కోహ్లిసేన 5 పరుగుల తేడాతో విజయపతాకాన్ని ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 139 పరుగులు చేసి... ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌ చివరి ఓవర్‌ బూమ్రా అద్భుతం చేసి.. విజయాన్ని అందించాడు.

భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో...

ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడుతూ ఆఖరి నిమిషం వరకు నువ్వానేనా అన్నట్లు భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. మ్యాచ్‌పై ఆశలు కోల్పోయిన వేళ యార్కర్ కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా సూపర్ బౌలింగ్‌తో విజృంభించడంతో కోహ్లీ సేన.. ఇంగ్లండ్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి సిరీస్ ఆశలను నిలుపుకొంది.

ఇంగ్లండ్‌పై 5 పరుగుల తేడాతో ఇండియా గెలుపు....

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 5 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే బెంగళూరులో వచ్చే నెల 1న జరుగుతుంది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో భారత్‌కు అద్భుత విజయాన్నందించిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. రూట్, స్టోక్స్ బ్యాటింగ్‌తో మ్యాచ్‌పై ఆశలు కోల్పోయిన సమయాన వెటరన్ నెహ్రాతో కలిసి బుమ్రా మ్యాజిక్ చేశాడు. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 8 పరుగులు అవసరమైన దశలో తొలిబంతికే రూట్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలో పడేశాడు. మ్యాచ్ ఇక్కడే మనవైపునకు తిరిగింది. ఆ తర్వాత ప్రమాదకర బట్లర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగు ఇచ్చి భారత్‌ను గెలిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లు మరోసారి కాన్పూర్ తరహా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగడంతో టీమ్‌ఇండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగుల స్కోరు నమోదు చేసింది. ఫిబ్రవరి 1న జరగబోయే ఆఖరి మ్యాచ్‌లో సిరీస్ విజేత ఎవరో తేలనుంది.

5 పరుగుల తేడాతో భారత్ విజయం

హైదరాబాద్: నాగపూర్‌లో భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కోహ్లిసేన 5 పరుగుల తేడాతో విజయపతాకాన్ని ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 139 పరుగులు చేసి... ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌ చివరి ఓవర్‌ బూమ్రా అద్భుతం చేసి.. విజయాన్ని అందించాడు.

పెద్ద నోట్ల రద్దు 2016లోనే అతి పెద్ద కుంభకోణం:చిదంబరం

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు 2016లోనే అతి పెద్ద కుంభకోణమని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన టి. కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలపై మండిపడ్డారు. కేసీఆర్‌ హామీలను గాలికి వదిలి సొంత కలలు నెరవేర్చుకుంటున్నారని ఆరోపించారు.

06:59 - January 30, 2017

అమరావతి :పార్లమెంట్‌ సమావేశాల్లో ఏపీ ప్రత్యేక హోదాపై మరోసారి గళమెత్తాలని వైసీపీ నిర్ణయించింది.. టీడీపీ కారణంగానే రాష్ట్రానికి హోదా దక్కడంలేదని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు... అధికారపార్టీని ఇరుకునపెట్టేందుకు ఢిల్లీలో తమ వాణిని గట్టిగా వినిపించాలని తీర్మానించారు. లోటస్‌పాండ్‌లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సభ్యుల భేటీలో.. పార్లమెంటు బడ్దెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. విభజన హామీ చట్టంలోని హామీలు నెరవేర్చాలంటూ పార్లమెంట్‌లో గట్టిగా పట్టుబట్టాలని ఆ పార్టీ అధినేత జగన్‌ నేతలకు సూచించారు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోవడంవల్లే అభివృద్ధి కుంటుపడుతోందని... వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు..

హోదాకోసం పోరుబాటపట్టిన వైసీపీ ఇప్పటికే వివిధ రకాలుగా నిరసనలు తెలిపింది.. హోదాపై నిరసనలు కొనసాగిస్తూనే పునర్విభజనచట్టంలోని అన్ని హామీల అమలుపై కూడా దృష్టిపెట్టాలని నేతలు భావిస్తున్నారు.. హోదాతో పాటు.. రైల్వేజోన్‌ ఏర్పాటును కూడా కీలక అంశంగా చూస్తున్నారు. స్థానికంగా ఆందోళనలు చేస్తూనే కేంద్రంతో పాటు టీడీపీపై కూడా ఒత్తిడి పెంచాలన్న వ్యూహంతో వైసీపీ ముందుకు సాగుతోంది. ద్విముఖవ్యూహంతో వ్యవహరించే దిశగా పావులు కదుపుతోంది.

అది గెట్‌ టు గెదర్‌ పార్టీ : బొత్స సత్యనారాయణ

హైదరాబాద్: విశాఖలో జరిగింది భాగస్వామ్య సదస్సు కాదని.. అదో గెట్‌ టు గెదర్‌ పార్టీ అన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. దేశంలో పెట్టిన పెట్టుబడులే లక్ష కోట్లకు దాటలేదని.. మరి ఏపీలో పది లక్షల కోట్ల పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పది లక్షల కోట్లకు బదులు ... 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్టు చంద్రబాబు చెప్పుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాడుతామని బొత్స తేల్చిచెప్పారు.

06:56 - January 30, 2017

హైదరాబాద్: విశాఖలో జరిగింది భాగస్వామ్య సదస్సు కాదని.. అదో గెట్‌ టు గెదర్‌ పార్టీ అన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. దేశంలో పెట్టిన పెట్టుబడులే లక్ష కోట్లకు దాటలేదని.. మరి ఏపీలో పది లక్షల కోట్ల పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పది లక్షల కోట్లకు బదులు ... 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్టు చంద్రబాబు చెప్పుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాడుతామని బొత్స తేల్చిచెప్పారు.

తిరుమలలో చిన్నారి కిడ్నాప్‌

p { margin-bottom: 0.21cm; }

తిరుమల : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో చిన్నారి కిడ్నాపైంది.. అనంతపురం జిల్లాకు చెందిన పాప తల్లిదండ్రులు రాత్రి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.. రూం దొరక్కపోవడంతో మాధవ నిలయంలో పడుకున్నారు.. కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి చిన్నారి కనిపించలేదు.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజ్‌ పరిశీలించారు.. ముసుగు ధరించిన ఓ వ్యక్తి పాపను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.. దుండగుడి కోసం గాలిస్తున్నారు..

06:55 - January 30, 2017

తిరుమల : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో చిన్నారి కిడ్నాపైంది.. అనంతపురం జిల్లాకు చెందిన పాప తల్లిదండ్రులు రాత్రి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.. రూం దొరక్కపోవడంతో మాధవ నిలయంలో పడుకున్నారు.. కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి చిన్నారి కనిపించలేదు.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజ్‌ పరిశీలించారు.. ముసుగు ధరించిన ఓ వ్యక్తి పాపను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.. దుండగుడి కోసం గాలిస్తున్నారు..

06:50 - January 30, 2017

అమరావతి:నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంతో ఆ గ్రామ రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఏమీ లేని ఆ గ్రామం ఇప్పుడు హైటెక్‌ సొబగులు అద్దుకుంటోంది. ఏపీ రాజధాని గ్రామాలైన మందడం, మల్కాపురంలో ఒకప్పుడు రాజకీయ పార్టీల సమావేశాలు, సభలకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేసేవాళ్లు. కానీ.. ఇప్పుడు ఆ గ్రామాల్లో పెద్ద పెద్ద హోర్డింగులు వెలుస్తున్నాయి. హైదరాబాద్‌లాంటి మెట్రో నగరాలకు తీసిపోని విధంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామాలు రాజధానిగా మారడం.. మరోవైపు సచివాలయం నిర్మించడంతో.. ప్రైవేట్‌ యాడ్‌ ఏజెన్సీలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నాయి. వీటి నిర్మాణం కోసం భారీ క్రేన్‌లను ఉపయోగిస్తున్నారు.

అన్నీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలే ...

ఇక్కడ ఏర్పాటు చేస్తున్న హోర్డింగులపై దాదాపు అన్నీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలే దర్శనమిస్తున్నాయి. ఈ హోర్డింగులపై తమ ప్రకటనలు ఇచ్చేందుకు రాజకీయ నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మార్గంలో ముఖ్యమంత్రితో పాటు.. మంత్రులు, అధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో హోర్డింగ్‌లపై యాడ్స్‌ ద్వారా వారి దృష్టిలో పడవచ్చని నేతలు భావిస్తున్నారు. అందుకే ఈ హోర్డింగ్‌లపై ప్రకటనలు ఇచ్చేందుకు నేతలు ముందుకు వస్తున్నారు.

చిన్న చిన్న బిల్డింగ్‌లపై భారీ ఎత్తున హోర్డింగులు...

ఇక గ్రామాల్లో వెలుస్తున్న హోర్డింగులకు నిబంధనలు పాటించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొన్ని కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చిన్న చిన్న బిల్డింగ్‌లపై భారీ ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. హోర్డింగుల ఏర్పాటుకు సరైన ప్రమాణాలు పాటించకపోతే వర్షాకాల సమయంలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముందంటున్నారు. అయితే.. హోర్డింగుల ఏర్పాటు కోసం భవన యజమానులకు యాడ్‌ ఏజెన్సీ కంపెనీలు ఏడాదికి లక్షన్నర రూపాయలు అద్దె చెల్లిస్తున్నాయి. దీంతో భవిష్యత్‌లో ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేయని స్థల యజమానులు.. భవనాలపై హోర్డింగుల ఏర్పాటు చేసుకునేందుకు అవకాశమిస్తున్నారు. అయితే.. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేనప్పటికీ.. మెట్రో పట్టణాల మాదిరిగా హోర్డింగులు ఏర్పాటు చేయడం విచిత్రంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.

06:47 - January 30, 2017

భద్రాద్రి: ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రంలోని మిథిలా స్టేడియంలో.. భక్త రామదాసు కీర్తనలపై విద్యార్థినులు చేసిన నృత్యాలు ఎందరినో ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సొంతం చేసుకున్నాయి.

ఏడాది వెయ్యి 10 మంది చిన్నారులతో నృత్యం...

గత మూడేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తొలుత 500 మందితో, రెండవ సంవత్సరం 900 మంది కళాకారులతో నృతం చేసి రికార్డ్‌ సాధించగా.. ఈ ఏడాది వెయ్యి 10 మంది చిన్నారులతో నృత్యం చేసి రికార్డ్‌ సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన కళాకారులు పాల్గొన్నారన్నారు. భద్రాచలం కీర్తి ప్రతిష్టలు యావత్‌ ప్రపంచానికి తెలియజేయడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది ఐదు వేల మంది కళాకారులతో హైదరాబాద్‌లో కార్యక్రమాన్ని చేపట్టి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

06:45 - January 30, 2017

విజయవాడ: చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ఎలా ఆనందంగా గడుపుతున్నారో. సండేను తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు కదూ. ఈత అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నదిలో స్విమ్‌ చేస్తూ ప్రెండ్స్‌తో సరదాగా గడిపితే వచ్చే మజాయే వేరు. అసలు విషయమేంటంటే... ఎప్పుడూ బిజీబిజీగా గడిపే విజయవాడ వాసుల కోసం ఆక్వా డెవిల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఈత పోటీలను నిర్వహించింది. క్రిష్టానది రివర్‌ క్రాసింగ్‌ పేరుతో ఈ కాంపిటీషన్‌ నిర్వహించింది. అక్కడి సందడే ఇదంతా.

ఐదేళ్ల చిన్నారులు మొదలుకొని 70ఏళ్లు పైబడిన వృద్ధులూ....

ఈత పోటీల్లో పాల్గొనేందుకు విజయవాడ వాసులు చాలా మందే వచ్చారు. ఐదేళ్ల చిన్నారులు మొదలుకొని 70ఏళ్లు పైబడిన వృద్ధులూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. యువతీ యువకులు ఉత్సాహంగా కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్‌ చేశారు. ఇక వికలాంగులు సైతం తామేమీ తక్కువ కాదంటూ పోటీలో పాల్గొన్నారు.

ఈ పోటీలను కలెక్టర్‌ బాబు ప్రారంభించారు....

కృష్ణా నదిలో నిర్వహించిన ఈ పోటీలను కలెక్టర్‌ బాబు ప్రారంభించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈత ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆపద సమయంలో ఇతరులను కాపాడుతుందని కలెక్టర్‌ చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. అక్వా డెవిల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వైస్‌ చైర్మన్‌ గోకరాజు గంగరాజు ఈత పోటీలను పర్యవేక్షించారు. తమ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎంతోమంది ఈతగాళ్లను తయారు చేశామన్నారు. పోటీల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని క్రీడాకారులు తెలిపారు. వృద్దాప్యంలోనూ స్విమ్‌ చేయడం వల్ల తమ అనారోగ్య సమస్యలు తగ్గుతాయని పోటీల్లో పాల్గొన్న వృద్ధులు తెలిపారు.ఇలాంటి పోటీలతో ఈతపై అందరికీ ఆసక్తి పెరుగుతోందని ఆక్వాడెవిల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు.

06:41 - January 30, 2017

హైదరాబాద్: మరో రెండు రోజుల్లో కేంద్ర బడ్జెట్ రాబోతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వస్తున్న బడ్జెట్ కావడంతో విభిన్న వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్ పెట్టడం సంప్రదాయం కాగా, ఈ సారి ఫిబ్రవరి ఫస్టనే బడ్జెట్ పెడుతున్నారు. ఈ సారి రైల్వే బడ్జెట్ విడిగా పెట్టడం లేదు. ప్రణాళిక, ప్రణాళికేతర, రైల్వే ఈ మూడింటిని కలిపి ఒకే బడ్జెట్ గా పెడుతున్నారు. సామాన్యులకు ముఖ్యంగా రైతులకు మేలు జరగాలంటే వచ్చే బడ్జెట్ ఎలా వుండాలి? ఈ బడ్జెట్ నుంచి రైతు సంఘాలు ఆశిస్తున్నదేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మాట్లాడేందుకు ఏఐకెఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:38 - January 30, 2017

హైదరాబాద్: అక్కినేనివారి అబ్బాయి నాగచైతన్య... తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనదైన ముద్ర వేసిన అందాల భామ సమంత నిశ్చితార్థం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్‌.కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలకి చెందిన బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో నాగచైతన్య, సమంత ఒకరికొకరు ఉంగరాలు తొడిగారు. సమంతకి ఉంగరం తొడిగాక నాగచైతన్య ఆమెని మురిపెంగా ముద్దాడారు. పెళ్లి కళతో సిగ్గులొలికింది సమంత. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకొని, త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్న అఖిల్‌ అక్కినేని- శ్రియ భూపాల్‌ జోడీ ఈ వేడుకకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చైతూ, సమంతల పెళ్లి త్వరలోనే హైదరాబాద్‌లో జరగబోతోంది.

Don't Miss