Activities calendar

31 January 2017

22:16 - January 31, 2017

ఢిల్లీ : హైదరాబాద్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు మ్యాచ్‌ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. జాబితాలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, కరణ్‌ నాయర్‌, హర్దిక్‌ పాండ్య, వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌, అభినవ్‌ ముకుంద్‌ ఉన్నారు. తమిళనాడుకు చెందిన అభినవ్‌ ముకుంద్‌ ఆరేళ్ల తర్వాత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. మరోవైపు కీపింగ్‌ బాధ్యతలు నిర్వహించడానికి పార్థీవ్‌ పటేల్‌ను వెనక్కి నెట్టి సాహా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఉప్పల్‌ స్టేడియంలో టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. దీనికంటే ముందు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో జింఖానా మైదానంలో జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇండియా ఏతో బంగ్లాదేశ్‌ తలపడుతుంది. 

 

22:13 - January 31, 2017

హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం శ్వాసకోస సంబంధ సమస్యతో ఆయన కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో డయాలసిస్‌ చేశారు. వెంటిలేటర్‌పై దాసరికి చికిత్స అందిస్తున్న వైద్యులు..చెస్ట్ ఆపరేషన్ నిర్వహించి ఇన్‌ఫెక్షన్ తొలగించారు. దాసరి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ఆకాంక్షించారు. 
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స 
ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు...శ్వాసకోశ సమస్యలతో సికింద్రాబాద్‌ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో.. వెంటిలేటర్‌పై దాసరికి చికిత్స అందిస్తున్నారు. డయాలసిస్  నిర్వహించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుప‌త్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. దాస‌రి నారాయ‌ణరావు చికిత్సకు స్పందిస్తున్నార‌ని తెలిపారు. 
ఛాతీ భాగంలో శస్త్రచికిత్స 
అనంతరం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ నియంత్రించడానికి ఛాతీ భాగంలో వైద్యులు ఆపరేషన్ చేశారు. అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ వస్తోందని, వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తీసేశామని కిమ్స్‌ ఎండీ, సీఈవో డాక్టర్ బొల్లినేని భాస్కరరావు వివరించారు.  అన్నవాహికలో ట్యూబ్ వేసి క్లీన్ చేసి మెటల్ స్టంట్ వేశామని చెప్పారు. దాసరి ఆరోగ్యం నిలకడగా ఉందని.. రెండు మూడు రోజుల్లో కోలుకోడానికి ఆస్కారం ఉందని తెలిపారు. 
దాసరిని పరామర్శించిన ప్రముఖలు
అంతకుముందు కిమ్స్‌ ఆస్పత్రిలో దాసరి నారాయణరావును సినీన‌టులు మోహ‌న్‌బాబు, మంచు మనోజ్‌, జ‌య‌సుధ, దర్శక నిర్మాతలు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ప‌రామ‌ర్శించారు. దాస‌రి నారాయ‌ణరావు కోలుకుంటున్నార‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని మోహన్‌బాబు  అన్నారు. దాసరి నూరేళ్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని, అందరూ కూడా ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరారు. దాసరి నారాయణరావు త్వరగా కోలుకోవాలని ఇరు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

 

22:08 - January 31, 2017

హైదరాబాద్ : తెలంగాణ చేనేత సహకార సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు హీరోయిన్‌ సమంత అంగీకరించారు. చేనేత రంగానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌ బేగంపేటలోని మెట్రోరైల్‌ భవనంలో ఆమె మంత్రి కేటీఆర్‌ను కలిశారు. చేనేత సహకార సంస్థతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఆమెకు పోచంపల్లి చీరను బహూకరించారు. ఇటీవలే నిశ్చితార్ధం జరుపుకున్న సమంతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 

 

22:05 - January 31, 2017

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై పవర్‌ స్టార్‌ మరోసారి గళమెత్తారు. ఈసారి పెంచిన తన స్వరం ద్వారా.. టీడీపీకి దూరమవుతున్న సంకేతాలిచ్చారు. హోదా పోరులో కలిసి ఏ రాజకీయ పార్టీతోనైనా కలిసి పనిచేస్తానని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. 
పవన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు  
పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మరోసారి సంచలన వ్యాఖ్య చేశారు. ప్రత్యేక హోదా కోసం.. ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఈనెల 26న, హోదా దీక్షను ప్రభుత్వం భగ్నం చేశాక, ట్విట్టర్‌ ద్వారా దాన్ని ఖండించిన పవర్‌స్టార్‌, ఈ అంశంపై తాజాగా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 
పవన్‌ ను కలిసిన చేనేత కార్మికులు 
చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటానన్న పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు, చేనేత కార్మికులు మంగళవారం ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా, చేనేత కార్మికుల కష్టాలపై మాట్లాడుతూనే.. ప్రత్యేక హోదా అంశాన్నీ పవన్‌ కల్యాణ్‌ ప్రస్తావించారు. దిల్లీ నార్త్‌బ్లాక్‌లో కూర్చుని నిర్ణయాలు తీసుకునే వారే తెలివైన వారనే భ్రమల్లో నుంచి బయటకు రావాలని సూచించారు. ఇదే సమయంలో, ప్రత్యేక హోదాపై పోరాడే ఏ పార్టీతోనైనా తాను కలిసి పనిచేస్తానని పవన్‌ ప్రకటించారు. 
చేనేత కార్మికులకు అండగా ఉంటా : పవన్ 
చేనేత కార్మికులకు అన్నివిధాలా అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడతానని పవన్‌ కల్యాణ్ హామీ ఇచ్చారు. వచ్చే నెల గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగే చేనేత సత్యాగ్రహానికి రావాల్సిందిగా చేనేత సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తికి పవన్‌ సానుకూలంగా స్పందించారు. పవన్‌కు చేనేత సంఘాల నేతలు, చేనేత వస్త్రాలు బహుకరించి కృతజ్ఞతలు తెలియజేశారు. 
పవన్‌ తాజా వ్యాఖ్యలు కలకలం 
మొత్తం మీద ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్‌ కల్యాణ్‌ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ఆయన టీడీపీకి దూరమవుతూ.. విపక్ష వైసీపీకి దగ్గరవుతున్నారన్న భావనను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, పవన్‌ ప్రకటన, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు కారణం కావచ్చన్న వాదనా వినిపిస్తోంది. 

పార్లమెంట్ భవన్ లో అగ్నిప్రమాదం

ఢిల్లీ : పార్లమెంట్ భవన్ లో అగ్నిప్రమాదం జరిగింది. రూమ్ నెంబర్ 50లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలు భారీగా చెలరేగుతున్నాయి.  ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 12 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.  

 

21:53 - January 31, 2017

ఖమ్మం : తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చే వరకు విశ్రమించబోనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ నేతలు అడ్డంకులు ఎన్ని సృష్టించినా కోటి ఎకరాలకు సాగునీరు అందిచ్చి తీరుతామన్నారు. తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఖమ్మం జిల్లాలో నిర్మించిన భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్‌.. దాన్ని రైతులకు అంకితం చేశారు. ఖమ్మం జిల్లాలో 11 నెలల్లోనే నిర్మించిన భక్తరామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తిరుమలాలయ మండలంలోని ఎర్రగడ్డతండా దగ్గర కేసీఆర్‌  ప్రాజెక్టును ప్రారంభించి రైతులకు అంకితం చేశారు.
అప్పటి వరకు విశ్రమించేది లేదన్న కేసీఆర్‌
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని కేసీఆర్‌ అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కృష్ణా, గోదావరి నీటితో తెలంగాణ భూములను తడిపి తీరుతామన్నారు. టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌ నేతలు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి రాజకీయ భవిష్యత్‌ ఉండదనే ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారని  ఆరోపించారు. తన రక్తం ధారపోసైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.
ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే లక్ష్యం : మంత్రి హరీశ్‌రావు  
తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు భక్తరామదాసు ఎత్తిపోతల పథకమే  స్ఫూర్తిగా నిలుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇదే వేగంతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు.
పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులను ఘన సన్మానం
తిరుమలాయపాలెంలో జరిగిన  బహిరంగ సభలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య దంపతులను కేసీఆర్‌ ఘనంగా సన్మానించారు. మొక్కల పెంపకంపై రామయ్య దంపతులు చేస్తున్నకృషిని కొనియాడారు. 

 

21:47 - January 31, 2017
21:45 - January 31, 2017
21:44 - January 31, 2017

ఢిల్లీ : పార్లమెంట్‌ ఉభయ సభల నుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు...సాధించిన విజయాలను రాష్ట్రపతి వెల్లడించారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌, నల్లధనం, అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు సహకరించారని ప్రణబ్‌ పేర్కొన్నారు. సబ్‌కా సాథ్‌...సబ్‌కా వికాస్‌..లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్రపతి చెప్పారు.
ప్రత్యేక గుర్రపు బగ్గీలో పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతి 
పార్లమెంట్‌ ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించడానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి భవన్‌ నుంచి ప్రత్యేక గుర్రపు బగ్గీలో పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోది, కేంద్ర మంత్రులు తదితరులు స్వాగతం పలికారు.
కొత్త ఒరవడికి శ్రీకారం.. 
పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో ఉభయసభల నుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన పలు పథకాలు, సాధించిన విజయాలను ఉభయసభలకు వెల్లడించారు. సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను కలపడం ద్వారా ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని ప్రణబ్‌ తెలిపారు. సర్జికల్‌ దాడులు, అవినీతి, నల్లధన నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు అండగా నిలిచారని ప్రణబ్‌ పేర్కొన్నారు. భారత సైన్యం చూపించిన అసమాన ధైర్యసాహసాలకు జాతి యావత్తూ సెల్యూట్ చేసిందని చెప్పారు. 1.2 కోట్ల మంది స్వయంగా గ్యాస్‌ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకున్నారని రాష్ట్రపతి తెలిపారు. నిరంతర ఎన్నికలు అభివృద్ధికి అవరోధంగా మారిన విషయాన్ని ప్రణబ్‌ ప్రస్తావిస్తూ...పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై జాతీయ స్థాయిలో నిర్మాణాత్మక చర్చకు కేంద్ర ప్రభుత్వం తెరతీసిందన్నారు.  
స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కింద 3 కోట్ల టాయ్‌లెట్లు..
స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కింద 3 కోట్ల టాయ్‌లెట్లు నిర్మించడం జరిగిందని ప్రణబ్‌ తెలిపారు. లక్ష గ్రామాలు, 450 పట్టణాలు, 77 జిల్లాలు స్వచ్ఛతగా మారాయాని పేర్కొన్నారు. పొగలేని వంటగదులు ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ఇప్పటికే 1.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను ఇచ్చామని, ఈ సంవత్సరం మరిన్ని ఇస్తామని అన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద 5.6 కోట్ల మందికి రుణ సౌకర్యం కల్పించామని తెలిపారు. ఉజ్వల్ యోజన ప్రయోజనాలు 37 శాతం షెడ్యూల్ కులాలకు దగ్గరైనాయని అన్నారు. గ్రామజ్యోతి పథకంలో భాగంగా రికార్డు స్థాయిలో 11 వేల గ్రామాలకు కొత్తగా విద్యుత్‌ చేరిందన్నారు.
'సబ్‌ కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌' ప్రభుత్వ లక్ష్యం..
'సబ్‌ కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌' ప్రభుత్వ లక్ష్యమని ప్రణబ్‌ అన్నారు. దళితులు..మహిళలు.. రైతులు.. పేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. జన్‌ధన్‌ యోజన కింద పేదల కోసం 26 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగిందన్నారు. ప్రజలను డిజిటల్‌ లావాదేవీల వైపు మళ్లించేందుకు 20కోట్ల కంటే ఎక్కువ మందికి ప్రభుత్వం రూపే కార్డులు ఇచ్చిందని పేర్కొన్నారు. 3.66 కోట్ల మంది రైతులు బీమా గొడుగు కిందకు వచ్చారని, అనుకోని ఘటనలు ఏర్పడి పంట నష్టపోతే, 1.4 లక్షల కోట్ల విలువైన బీమా వీరికి అండగా ఉండనుందని ప్రణబ్‌ అన్నారు.

 

21:33 - January 31, 2017

2016...17 బడ్జెట్ ఆర్థిక సర్వే సమస్యలకు పరిష్కారం చూపలేదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యులు వి.శ్రీనివాస్ రావు, ఏపీసీసీ నేత తులసీ రెడ్డి, బీజేపీ అల్జాపూర్ శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఆశాజనంగా లేదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. నోట్ల రద్దుతో కేంద్రం తప్పు చేసిందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఆటో బోల్తా .. ఒకరి మృతి

నల్గొండ : చందంపేటం మండలం పోచంపల్లి సమీమంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

 

దాసరికి చెస్ట్ ఆపరేషన్ చేశాం: కిమ్స్ వైద్యులు

హైదరాబాద్ : దాసరి నారాయణరావుకు చెస్ట్ ఆపరేషన్ చేసినట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. ట్యూబ్ తో అన్నవాహికను క్లీన్ చేసినట్లు పేర్కొన్నారు. 

 

21:16 - January 31, 2017

ఢిల్లీ : 2016...17 ఆర్థిక సర్వే నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రప్రతి ప్రసంగం ముగిసిన తర్వాత వేర్వేరుగా జరిగిన లోక్‌సభ, రాజ్యసభ  భేటీల్లో ఈ నివేదికను ప్రవేశపెట్టారు. వృద్ధిరేటు అంచనాలు దీనిలో పొందుపరిచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదైనట్టు ప్రస్తావించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేశారు. 
ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన జైట్లీ 
2016...17 బడ్జెట్ ప్రతిపాదనలకు ప్రతిబింబమైన ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందుంచారు. ఈ సంవత్సరం స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 7.1 శాతంగా అంచనా వేశారు. వ్యవసాయ రంగంలో 4.1 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. ఇది గతేడాది కంటే 1.2 శాతం ఎక్కువ.  పారిశ్రామిక వృద్ధి రేటు 7.4 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గవచ్చని తాజా ఆర్థిక సర్వే సూచించింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్లే ఈ క్షీణత అని కూడా సర్వే తేటతెల్లం చేసింది. అయితే ఇది తాత్కాలికమేనని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు.   
ఆర్థిక సర్వే తయారు చేసిన అరవింద్‌ సుబ్రమణ్యన్‌ 
చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వయిజర్‌ అరవింద్‌ సుబ్రమణ్యన్‌ ఈ ఆర్థిక సర్వేను తయారు చేశారు. జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు 0.3 శాతంగా ఉంటుందన్న సంకేతాలను ఇచ్చిన ఆర్థిక మంత్రి.. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగే సమయం ఇదేనని, నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు.  వ్యవస్థలో నల్లధనంగా మిగిలిపోయిన మొత్తం వెలుగులోకి వస్తోందని, వెలుగులోకి వస్తున్న నల్ల డబ్బుతో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టవచ్చని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. 
డిజిటలైజేషన్‌తో ఖజానాకు రాబడి...?
డిజిటలైజేషన్‌తో కేంద్ర ఖజానాకు రాబడి పెరిగే అవకాశం ఉందని, కొత్త గృహాలు మధ్యతరగతికి అందుబాటులోకి రావడం అనేది నోట్ల రద్దు సాధించిన పెద్ద విజయమని తెలిపారు. జీఎస్టీ అమలైతే ప్రజల జీవన నాణ్యత పెరుగుతుందని అంచనా వేశారు.  జీడీపీ తగ్గినట్లు కనిపించినా..ఇది తాత్కాలికమేనని నివేదికలో స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయపు పన్ను పెరుగుతోందని, విదేశీ కంపెనీల పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లు నివేదికలో తెలిపారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా ఎన్నో సంస్థలు ఇక్కడికి వస్తున్నాయని, గతేడాది కాలంలో ఏడు ముఖ్యమైన సంస్కరణలు తీసుకొచ్చామని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. 
దేశాన్ని అభివృద్ధి పథంలో...
జీఎస్టీ, అవినీతి నిరోధక బిల్లు, పరపతి విధాన కమిటీ, ఆధార్ బిల్లు, విదేశీ పెట్టుబడుల సరళీకరణ, యుపీఐ, కార్మిక రంగ అభివృద్ధి వంటి సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు ఈ ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు వల్ల  స్వల్పకాలంలో ఇబ్బందులున్నప్పటికీ, దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయని సర్వే తేల్చింది.  

 

21:03 - January 31, 2017
21:02 - January 31, 2017
21:00 - January 31, 2017

విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా టీడీపీ ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ..కేంద్ర పథకాలకు ప్రధాని మోడీ ఫోటోను ముద్రించకుండా ప్రజలకు బీజేపీపై అపనమ్మకం కలిగేలా వ్యవహరిస్తోందని మండపడ్డారు. బీజేపీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందకుండా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ వైఖరిని వెంటనే విడనాడాలన్నారు. 

20:57 - January 31, 2017

విజయవాడ : అక్రమ రొయ్యల చెరువులతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు సీపీఎం అండగా ఉంటుందని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు భరోసా నిచ్చారు. రొయ్యల చెరువులతో ఇబ్బందులు పడుతున్న బాధితులతో విజయవాడ ఎంబీకేవీ భవన్‌లో రైతు సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అండదండలతో అక్రమ అక్వా చెరువులు విపరీతంగా తవ్వుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 6వ తేదీన ఇలపర్రు గ్రామంలోని అక్రమం రొయ్యల చెరువల తూములు పీకి వేస్తామని మధు హెచ్చరించారు. 

20:52 - January 31, 2017

కాకినాడ : చనిపోయిన భవన నిర్మాణ కార్మికురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కాకినాడలో సీఐటీయూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. లాఠీచార్జ్‌కి దారితీసింది.  కాకినాడ అశోక్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి యల్లమ్మ అనే కార్మికురాలు ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోయింది.  దీంతో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు  రోడ్డుపై బైఠాయించారు. రస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న   ఎమ్మెల్యే కొండబాబు  ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. స్పష్టమైన హామీని ఇస్తేనే ఆందోళన విరమిస్తామని కార్మికులు తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు కార్మికులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. 

 

19:40 - January 31, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగం కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కళ్లకు కట్టినట్లు ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఎంచుకున్న మార్గాన్ని రాష్ట్రపతి వివరించారన్నారు. 70కిపైగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను చాలా క్లుప్తంగా చెప్పారని వెంకయ్య అన్నారు.

 

19:36 - January 31, 2017

ఢిల్లీ : రేపటి బడ్జెట్‌ ప్రభుత్వ సంక్షేమానికి అద్దం పడుతుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. పేద ప్రజలకు మేలు జరిగే విధంగా బడ్జెట్‌ ఉంటుందన్న ఆయన.. దేశాభివృద్దే లక్ష్యంగా ప్రణాళికలు ఉంటాయన్నారు. ఆర్థిక శాఖ, రైల్వే బడ్జెట్‌లు ఒకే సారి ప్రవేశ పెట్టడం శుభసూచికమన్న సుజనా.. ఏపీ రాజధాని రైతులకు మేలు జరిగే విధంగా బడ్జెట్‌ ఉంటుందన్నారు. 

సుప్రీంకోర్టులో 'పెటా' పిటిషన్ పై విచారణ

ఢిల్లీ : వన్యప్రాణి సంరక్షణ బోర్డు 'పెటా' పిటిషన్ పైనా సుప్రీంకోర్టులో విచారణ చేపట్టారు. తమిళనాడు తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించేందుకు నిరాకరించారు. తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జల్లికట్టు నిరసనల్లో హింస చెలరేగడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతిభద్రతలు నెలకొల్పాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
 

 

తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ

అమరావతి : తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. వారం రోజుల్లో శాసనసభ, మండలి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 

బేంగపేట్ మెట్రో లైన్ భవన్ లో మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ : బేంగపేట్ మెట్రో లైన్ భవన్ లో మంత్రి కేటీఆర్ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో జీహెచ్ ఎంసీ కమిషనర్, మేయర్ బొంతు రామ్మోహన్, మెట్రో ఉన్నతాధికారులు, జలమండలి ఎండీ పాల్గొన్నారు. 

పవన్ కళ్యాణ్ ను కలిసిన చేనేత కార్మికులు

హైదరాబాద్ : చేనేత కార్మికులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. కార్మికులు పవన్ కు చేనేత వస్త్రాలు బహూకరించారు. 

 

దాసరి ఆరోగ్యం నిలకడగానే ఉంది : మంత్రి తలసాని

హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్యం నిలకడగానే ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.

18:48 - January 31, 2017
18:47 - January 31, 2017

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణలో సామాజిక న్యాయంపై కేసీఆర్‌ చర్చకు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్‌ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే తమ సవాల్‌పై చర్చకు సిద్ధమవ్వాలన్నారు. మహాజన పాదయాత్ర 107వ రోజు భద్రాద్రి జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన తమ్మినేని.. కేసీఆర్‌పై  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నేతలు తమపై అసత్య ఆరోపణలు చేసి.. చర్చలకు రాకుండా పిరికిపందల్లా పారిపోతున్నారని ఆరోపించారు. తక్షణమే కేసీఆర్‌, కేటీఆర్‌ తమ సవాల్‌పై  చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు.
 

దాసరికి డయాలసిస్‌, వెంటిలేటర్ ద్వారా చికిత్స : కిమ్స్‌ వైద్యులు

హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావుకు ప్రస్తుతం డయాలసిస్‌, వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్టు కిమ్స్‌ వైద్యులు తెలిపారు. దాసరి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. దాసరి మూత్రపిండాలు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని చెప్పారు. ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ చేయడానికి చెస్ట్‌ ఆపరేషన్‌ చేస్తున్నామన్నారు. ఆపరేషన్‌ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియజేస్తామన్నారు.

 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలు

హైదరాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న కిలో 109 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జెడ్డా నుంచి ఇద్దరు వ్యక్తులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. 

18:41 - January 31, 2017

హైదరాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న కిలో 109 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జెడ్డా నుంచి ఇద్దరు వ్యక్తులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీరిని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయడగా.. కిలో 109 గ్రాముల బంగారం లభ్యమైంది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

18:36 - January 31, 2017

తూర్పుగోదావరి : ఎట్టకేలకు పోలవరం ప్రాజెక్ట్‌లో కీలక పనులు ప్రారంభంకానున్నాయి. 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవు కలిగిన డ్యామ్ ప్రధాన గేట్ల డిజైన్‌కు కేంద్ర జలసంఘం ఇప్పటికే ఆమోదం తెలపడంతో ఈ గేట్ల ఏర్పాటే లాంఛనం కానుంది. ఫిబ్రవరి 1వ తేదీన డయాఫ్రమ్ వాల్, క్రస్ట్ గేట్ల నిర్మాణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. 
ఫిబ్రవరి 1న పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం
పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఫిబ్రవరి 1న పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జనవరి 29న జరగాల్సిన పోలవరం వర్చువల్ రివ్యూతోపాటు ప్రాజెక్ట్ లోని కీలక పనులను రద్దు చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ముహూర్తం ఖరారు చేశారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రాజెక్ట్ పనులు మొదలుకానున్నాయి. సీఎం చంద్రబాబు పూజా కార్యక్రమాల్లో పాల్గొని పోలవరం పనులను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. 
నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు 'ఎర్త్ కమ్ రాక్ ఫిల్' డ్యామ్‌ నిర్మాణం
సాగునీటి ప్రాజెక్ట్ లో నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వీలుగా 'ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌ను నిర్మించనున్నారు. ఈ ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ కు దిగువన రాతి పొరల్లో డయాఫ్రమ్ వాల్ ను నిర్మిస్తారు. ఈ డయాఫ్రమ్ వాల్ లో ఎటువంటి వంకర్లు ఉండకూడదు. పోలవరం ప్రాజెక్ట్ లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పొడవు 1.75 కిలోమీటర్లు ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ పోలవరం కావడం విశేషం. నిర్మాణ నైపుణ్యం కల్గిన జర్మనీకి చెందిన బావర్ సంస్థ సేవలను ఏపీ ప్రభుత్వం వినియోగించుకోనుంది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం కోసం రాతి పొరలు తగిలేదాకా ఒక్కోసారి 100 మీటర్లలోతుకూ వెళ్లాల్సి ఉంటుంది. రాతిపొర తగిలిన తర్వాత 5 మీటర్ల వరకు లోతుకు వెళ్లాలి. అనంతరం డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం జరగాలి. ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ స్ట్రాయ్ కు ఉప కాంట్రాక్ట్ సంస్థగా ఉన్న బావర్-ఎల్ అండ్ టీ జాయింట్ వెంచర్ ఈ డయా ఫ్రమ్ వాల్ నిర్మాణానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి యంత్ర సామాగ్రి సైతం సిద్ధం చేసి ఉంచారు. 
ప్రాజెక్ట్‌లో ప్రధానమైన మరో నిర్మాణం క్రస్ట్ గేట్లు
పోలవరం ప్రాజెక్ట్ లో ప్రధానమైన మరో నిర్మాణం క్రస్ట్ గేట్లు. 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు కల్గిన 48 క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి దేశంలోనే అతిపెద్దవి. ఈ గేట్లు పూర్తిగా హైడ్రాలజీ సిస్టమ్ తో కూడి రిమోట్ కంట్రోల్ తో పనిచేస్తాయి. ఈ గేట్ల కోసం 15,000 మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరం కానుంది. ఈ స్టీల్ ను నేరుగా సరఫరా చేసేందుకు బిలాయ్, విశాఖ స్టీల్ ప్లాంట్లు అంగీకరించాయి. ఈ పనులు ప్రారంభమైతే మిగిలిన పనులు కూడా ఒక్కోటిగా మొదలుకానున్నాయి. మొత్తంగా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

 

18:32 - January 31, 2017

హైదరాబాద్ : రహదారులు రక్తసిక్తం కాని రోజు ఉండదా? ఆహ్లాదరకరమైన ప్రయాణం తప్ప.. ఆర్తనాదాలు వినిపించని రోజు ఒకటుంటే ఎంత బావుంటుంది? ఇలాంటి ఆలోచనతో తెలంగాణ పోలీసులు.. జనవరి 31ని ప్రమాద రహిత రోజుగా జరుపుకోవాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా, దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలను ప్రారంభించేశారు. వాహనదారులు పాటించాల్సిన నియమ నిబంధనలపై ప్రచారం చేస్తున్నారు.  
రోడ్లు రక్తసిక్తం 
రాష్ర్టంలో రోడ్లు రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. తెలంగాణలో ఏటీకేడు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. చిన్నపొరపాటు గ్రహపాటుగా మారుతోంది. రెప్పపాటు అలసత్వానికి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యానికి నిండు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరెన్నో కుటుంబాల కడుపుకోతకు కారణమవుతున్నాయి. రోడ్డు సెఫ్టీ రూల్స్ ఎన్ని ఉన్నా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్నమైన ఆలోచన చేశారు రాష్ట్ర పోలీసులు. అవగాహనతోనే ప్రమాదాలకు చెక్‌పెట్టొచని భావించారు. జనవరి 31ని ప్రమాదాలు లేని రోజుగా మార్చేందుకు ప్రయత్నం ప్రారంభించారు. 
గంటకు 3 రోడ్డు ప్రమాదాలు...ఒకరు మృత్యువాత
తెలంగాణలో గంటకు 3 ప్రమాదాలు జరుగుతుండగా..ఒక్కరు మృతిచెందుతున్నారు. ఎంతో మంది వికలాంగులవుతున్నారు. ఏటా 7వేల మంది రాష్ట్రంలో మృత్యువాత పడుతుండగా.. దేశవ్యాప్తంగా లక్షా 50 వేల మంది మరణిస్తున్నారు. వీటిలో 50 శాతం ద్విచక్రవాహన ప్రమాదాలుంటున్నాయి. చనిపోతున్న వారు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వారే 50 శాతం ఉండటం.. ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న సంకల్పంతో..జనవరి 31ని యాక్సిడెంట్ ప్రీ డేగా ప్రకటించారు పోలీసులు. ఆ రోజు ద్విచక్రవాహన దారులు హెల్మెట్ పెట్టుకోవాలి. కారులో ప్రయాణించే వారికి సీట్ బెల్ట్ తప్పనిసరి..ఇలా రహదారి భద్రత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు, జనవరి 31న బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించి తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలపై హర్షం వ్యక్తమవుతోంది. 

 

కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్ ..

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు రాసిన స్క్రిప్టును చిదంబరం చదివారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో హాస్టళ్లలో సన్న బియ్యం సరఫరా చేసిందా..అని ప్రశ్నించారు. 40 ఏళ్ల పాలనలో బీడీ కార్మికులను ఎప్పుడైనా ఆదుకున్నారా.? అని నిలదీశారు. కొత్తగా ఏర్పడిన కొత్త జిల్లాల సంస్కరణలు కాంగ్రెస్ కు కనబడటం లేదా అని అడిగారు. దళితుల ఓట్లు దండుకున్నారు కానీ.. వారిని పట్టించుకున్నారా..? అన్నారు. 

ప్రతి ఇంటికి నల్లాలు ఏర్పాటు : సీఎం కేసీఆర్

ఖమ్మం : రాబోయే ఏడాదిలో తెలంగాణలోని ప్రతి ఇంటికి నల్లాలు ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. దళిత, గిరిజన, బీసీ విద్యార్థుల కోసం 501 రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.10 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని తెలిపారు. పేదల ఇంటికి రుణాలు 4 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. 17 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆటో, ట్రాలీలపై టాక్స్ ఎత్తివేశామని తెలిపారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునద్ధరించామని పేర్కొన్నారు. 

నేలకొండపల్లిలో భక్తరామదాసు మెమోరియల్ ఏర్పాటు : సీఎం కేసీఆర్

ఖమ్మం : నేలకొండపల్లిలో భక్తరామదాసు మెమోరియల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చాలా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఎన్నో విమర్శలు, అవమానాలను ఎదుర్కొని.. తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధింకున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మీ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. 

 

భక్తరామదాసు ప్రాజెక్టు ప్రారంభోత్సవం సంతోషకరం: సీఎం కేసీఆర్

ఖమ్మం : దేశచరిత్రలో అతి తక్కువ కాలంలో భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తి చేసామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. భక్తరామదాసు జయంతి రోజున ప్రాజెక్టును ప్రారంభించడం సంతోషకరమన్నారు. పాలేరు ప్రజలకు అభినందనలు తెలిపారు. తుమ్మల నాగేశ్వర్ రావు చాలా చురుకైన నాయకుడు అని అన్నారు. 

సీఎం చంద్రబాబును కలిసిన ఉద్యోగ జేఏసీ నేతలు

గుంటూరు : అమరావతిలో సీఎం చంద్రబాబును ఉద్యోగ జేఏసీ నేతలు కలిశారు. పలు అంశాలను సీఎంకు విన్నవించారు.

18:13 - January 31, 2017

ఖమ్మం : దేశచరిత్రలో అతి తక్కువ కాలంలో భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తి చేసామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. భక్తరామదాసు జయంతి రోజున ప్రాజెక్టును ప్రారంభించడం సంతోషకరమన్నారు. పాలేరు ప్రజలకు అభినందనలు తెలిపారు. తుమ్మల నాగేశ్వర్ రావు చాలా చురుకైన నాయకుడు అని అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్మించిన భక్తరామదాసు ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు. సీఎం స్వీచ్ ఆన్ చేసి నీటిని కిందకు వదిలారు. అనంతరం తిరుమలాయపాలెంలో నిర్వహించిన టీఆర్ ఎస్ బహిరంగసభలో సీఎం కేసీఆర్ పొల్గొని, ప్రసంగించారు. నేలకొండపల్లిలో భక్తరామదాసు మెమోరియల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చాలా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఎన్నో విమర్శలు, అవమానాలను ఎదుర్కొని.. తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధింకున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మీ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. 
ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్  
రాబోయే ఏడాదిలో తెలంగాణలోని ప్రతి ఇంటికి నల్లాలు ఏర్పాటు చేస్తామన్నారు. దళిత, గిరిజన, బీసీ విద్యార్థుల కోసం 501 రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.10 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని తెలిపారు. పేదల ఇంటికి రుణాలు 4 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. 17 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆటో, ట్రాలీలపై టాక్స్ ఎత్తివేశామని తెలిపారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునద్ధరించామని పేర్కొన్నారు. 
కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్ ..
కాంగ్రెస్ పార్టీ పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు రాసిన స్క్రిప్టును చిదంబరం చదివారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో హాస్టళ్లలో సన్న బియ్యం సరఫరా చేసిందా..అని ప్రశ్నించారు. 40 ఏళ్ల పాలనలో బీడీ కార్మికులను ఎప్పుడైనా ఆదుకున్నారా.? అని నిలదీశారు. కొత్తగా ఏర్పడిన కొత్త జిల్లాల సంస్కరణలు కాంగ్రెస్ కు కనబడటం లేదా అని అడిగారు. దళితుల ఓట్లు దండుకున్నారు కానీ.. వారిని పట్టించుకున్నారా..? అన్నారు. 
తొలిసారిగా రూ.1000 పింఛన్ ఇస్తుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విద్యుత్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి అవహేళన చేశారని తెలిపారు. ఇప్పుడు కరెంట్ కష్టాలు తీరిన మాట వాస్తవం కాదా అన్నారు. బహిరంగ సభలో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి సుధాకర్, ఇరిగేషన్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనుకున్న సమయం కంటే రెండు నెలల ముందే ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల ముఖాల్లో సంతోషం నింపింది రాష్ర్ట ప్రభుత్వం. 11 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టుతో పాలేరు నియోజకవర్గంలోని సుమారు 60 వేల ఎకరాలకు  సాగునీరు అందనుంది. ప్రాజెక్టు ప్రారంభంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

17:27 - January 31, 2017

హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావుకు ప్రస్తుతం డయాలసిస్‌, వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్టు కిమ్స్‌ వైద్యులు తెలిపారు. దాసరి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. దాసరి మూత్రపిండాలు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని చెప్పారు. ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ చేయడానికి  చెస్ట్‌ ఆపరేషన్‌ చేస్తామని తెలిపారు. ఆపరేషన్‌ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియజేస్తామన్నారు.  నిన్న స్వల్ప అస్వస్థతకు గురికావడంతో దాసరి కిమ్స్‌లో చేశారు. ఆయనకు కిమ్స్‌ వైద్యులు ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారు.

 

17:17 - January 31, 2017
17:16 - January 31, 2017
17:14 - January 31, 2017

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర సాధించిన చిత్తశుద్ధితోనే కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు చెప్పారు. తిరుమలాయపాలెంలో నిర్వహించిన టీఆర్ ఎస్ బహిరంగసభలో మంత్రి హరీష్ రావు పొల్గొని, ప్రసంగించారు. కోటి ఎకరాల మాగాణి సీఎం కేసీఆర్ కల అన్నారు. గత ప్రభుత్వాలు పది సం.లు అధికారంలో ఉండి ఒక్క ప్రాజెక్టును ప్రారంభించలేదని.. కానీ టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి.. పది నెలల కాలంలోనే భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అధికారులు, ఇంజనీర్లు అహర్నిశలు శ్రమించారని..వారికి ధన్యవాదాలు తెలిపారు. 2001లో కరీంనగర్ లో కేసీఆర్ టీఆర్ ఎస్ పార్టీ పెట్టినప్పుడు... ప్రజల కళ్లల్లో చూసిన వెలుగును మళ్లీ...భక్తరామదాసు ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ప్రజల కళ్లళ్లో ఆ వెలుగులు చూశానని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

టీఆర్ ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం

ఖమ్మం : తిరుమలాయపాలెంలో నిర్వహించిన టీఆర్ ఎస్ బహిరంగసభలో సీఎం కేసీఆర్ పొల్గొని, ప్రసంగించారు. దేశ చరిత్రలో అతి తక్కువ కాలంలో ప్రాజెక్టును పూర్తి చేసామని చెప్పారు. పాలేరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 

 

చిత్తశుద్ధితో కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి : మంత్రి హరీశ్ రావు

ఖమ్మం : తిరుమలాయపాలెంలో నిర్వహించిన టీఆర్ ఎస్ బహిరంగసభలో ఎంపీ పొంగులేటి సుధాకర్ పొల్గొని, ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధించిన చిత్తశుద్ధితోనే కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు 

సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని కోటి ఎకరాల మాగాణిగా మారుస్తారు : ఎంపీ పొంగులేటి

ఖమ్మం : తిరుమలాయపాలెంలో నిర్వహించిన టీఆర్ ఎస్ బహిరంగసభలో ఎంపీ పొంగులేటి సుధాకర్ పొల్గొని, ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం సాధించినట్లే సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని కోటి ఎకరాల మాగాణిగా మారుస్తారని అన్నారు. 

 

భక్తరామదాసు పాదాలను తాకనున్న కృష్ణమ్మ నీళ్లు : మంత్రి తుమ్మల

ఖమ్మం : భక్తరామదాసు జయంతి రోజున ప్రాజెక్టును ప్రారంభించుకోవడం సంతోషకరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కృష్ణమ్మ నీళ్లు భక్తరామదాసు పాదాలను తాకుతాయన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్టు ఇతర ప్రాజెక్టులకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. రాజకీయ లబ్ధి, పదవీకాంక్ష కోసం కొందరు భావదారిద్ర్యపు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. 

 

16:59 - January 31, 2017
16:52 - January 31, 2017

ఖమ్మం : భక్తరామదాసు జయంతి రోజున ప్రాజెక్టును ప్రారంభించుకోవడం సంతోషకరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కృష్ణమ్మ నీళ్లు భక్తరామదాసు పాదాలను తాకుతాయన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్టు ఇతర ప్రాజెక్టులకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. రాజకీయ లబ్ధి, పదవీకాంక్ష కోసం కొందరు భావదారిద్ర్యపు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. 

 

ఎల్లుండి మ.2 గం.టలకు తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్ : ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

ఏపీ ఆర్థిక పరిస్థితుల ప్రస్తావించకపోవడం నిరాశ : రామ్మోహన్ నాయుడు

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగంలో దేశ ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా వివరించారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితులు ప్రస్తావించకపోవడం నిరాశ కలిగించిందని చెప్పారు. విభజన నేపథ్యంలో ఏపీకి కేంద్రం సహాయం అందిస్తుందని... రాష్ట్రపతి ప్రసంగంలో ఉంటే బాగుండేదన్నారు. 

భక్తరామదాసు ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఖమ్మం : భక్తరామదాసు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కృష్ణా జలాలకు పూజలు చేశారు. 11 నెలల్లో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. 

16:03 - January 31, 2017

హైదరాబాద్‌ : నగరంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుంది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్నరాత్రి  స్వైన్‌ ఫ్లూతో రెండేళ్ల చిన్నారి ఆరూషి మృతి చెందింది. రసూల్‌పురాకు చెందిన చిన్నారి 26వ తేదీన ఆస్పత్రిలో చేరింది. కాగా మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. అలాగే ఆస్పత్రిలో ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూతో ఏడుగురు చనిపోయారు.  

16:00 - January 31, 2017

ఢిల్లీ : కేంద్రం రేపు ప్రవేశ పెట్టబోతున్న బడ్జెట్‌ స్వాగతిస్తున్నట్లు టీడీపీ ఎంపీలు తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన ఎంపీలు..  కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు అందేలా బడ్జెట్‌ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను కేంద్రం నెరవేర్చాలని టీడీపీ ఎంపీలు కోరారు. రైల్వే బడ్జెట్‌, ఆర్థిక బడ్జెట్‌ రెండు ఒకేసారి ప్రవేశ పెట్టడం ఆశాజనకంగా ఉంటుందన్నారు. 

 

15:56 - January 31, 2017

ఢిల్లీ : 2016..17 ఆర్థిక సర్వే నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రప్రతి ప్రసంగం ముగిసిన తర్వాత వేర్వేరుగా జరిగిన లోక్‌సభ, రాజ్యసభ  భేటీల్లో ఈ నివేదికను ప్రవేశపెట్టారు. వృద్ధిరేటు అంచనాలు దీనిలో పొందుపరిచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదైనట్టు ప్రస్తావించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేశారు. 
 

15:54 - January 31, 2017

ఢిల్లీ : పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై జాతీయ స్థాయిలో నిర్మాణాత్మక చర్చకు కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. నిరంతర ఎన్నికలు అభివృద్ధికి అవరోధంగా మారిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వంతోపాటు, మావనవనరులపై తీవ్ర పనిభారం పడుతున్న అంశాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు. రాజకీయ పార్టీలకు ప్రభుత్వమే ఎన్నికలు నిధుల సమకూర్చే అంశంపై కూడా జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సి ఉందన్నారు. ఈ అంశాల్లో తుది నిర్ణయం ఎన్నికల కమిషన్‌దేనని ప్రణబ్‌ చెబుతున్నారు. 
 

15:46 - January 31, 2017

కృష్ణా : విజయవాడ, గన్నవరం ఎయిర్‌పోర్ట్ దగ్గర  లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌ అయింది. లిక్విడ్‌ ఆక్సిజన్‌తో వెళ్తున్న లారీని... ట్యాంకర్ ఢీకొంది. దీంతో ఆ ప్రాంతమంతా  పెద్దఎత్తున గ్యాస్‌  వ్యాపించింది. దీంతో  వాహనదారులు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్రమబద్ధీకరిస్తున్నారు. మరిన్ని వీడియోలో చూద్దాం...

 

15:44 - January 31, 2017
13:50 - January 31, 2017

ఖమ్మం : భక్త రామదాసు ప్రాజెక్టును ప్రారంభించి సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. నిర్దేశించికున్న లక్ష్యానికంటే 2 నెలల ముందుగానే ప్రాజెక్టు పూర్తయ్యింది. దేశంలో ఇప్పటి వరకు అత్యంత వేగంగా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుగా భక్తరామదాసు ఎత్తిపోతల పథకం చరిత్రలో నిలిచిపోనుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్‌, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలాలకు సాగునీరు అందనుంది. మొత్తంగా 60వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.

పార్లమెంట్ లో కుప్పకూలిన మాజీ మంత్రి

ఢిల్లీ: కేర‌ళ‌కు చెందిన మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత ఈ అహ్మ‌ద్ ఇవాళ పార్ల‌మెంట్‌లోనే కుప్ప‌కూలారు. బ‌డ్జెట్ సెష‌న్ ప్రారంభ‌మైన కాసేప‌టికే, రాష్ట్ర‌ప‌తి ప్రసంగిస్తున్న స‌మ‌యంలో అహ్మ‌ద్ ఒక్క‌సారిగా అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. దీంతో ఆయ‌న‌ను వెంట‌నే స్ట్రెచ‌ర్‌పై బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. కేర‌ళ నుంచి లోక్‌స‌భ‌కు అహ్మ‌ద్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మ‌న్మోహ‌న్ ప్ర‌భుత్వంలో విదేశాంగ శాఖ స‌హాయ మంత్రిగా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఇండియ‌న్ యూనియ‌న్ ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా ఉన్నారు.

కేసీఆర్ కు దమ్ముంటే చర్చలకు రావాలి: తమ్మినేని సవాల్

కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో ఉన్న కేసీఆర్ దమ్ముంటే నాతో చర్చలకు రావాలని తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. టీఆర్ ఎస్ నేతలు మాపై ఆరోపణలు చేసి చర్చలకు రాకుండా పారిపోయారని తమ్మినేని విమర్శించారు.

దాసరి చికిత్సకు స్పందిస్తున్నారు: కిమ్స్ వైద్యులు

హైదరాబాద్: శ్వాసకోశ స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై ఆసుప‌త్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. దాస‌రి నారాయ‌ణ చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వారు అన్నారు. వెంటిలేట‌ర్ స‌పోర్ట్ ద్వారా ఆయ‌న‌కు కృతిమ శ్వాస అందిస్తున్నామ‌ని తెలిపారు. ఇన్‌ఫెక్ష‌న్‌ను అదుపుచేయ‌డానికి ఆయ‌న‌కు కొద్దిసేప‌ట్లో శ‌స్త్ర‌చికిత్స చేయ‌నున్న‌ట్లు చెప్పారు. ఆప‌రేష‌న్ త‌రువాత మ‌రోసారి బులిటెన్ విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు.

13:24 - January 31, 2017

కృష్ణా: ఇంబ్రహీంపట్నంలో నానో కాలేజ్ లో ఎంబీఏ చదువుతున్న విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. సూడాన్ కు చెందిన విద్యార్థి మహ్మద్ మైతోబ్ పై తోటి విద్యార్థి మహ్మద్ అల్లాదిన్ కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో మహ్మద్ మైతోబ్ మృతి చెందాడు. ఘర్షణ పడ్డ విద్యార్థు డ్రగ్స్ కు అలవాటు పడ్డారని, ఆ మత్తులో కత్తులతో పొడుచుకున్నారని ప్రాథమిక సమాచారం.

13:22 - January 31, 2017

హైదరాబాద్:ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అస్వస్తతకు గురయ్యారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో, ఆయనను హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇన్ఫెక్షన్ తొలగించేందుకు ఆపరేషన్ చేస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ అనంతరం హెల్త్ బులిటెన్ వెలువరించే అవకాశాలు కనపడుతున్నాయి.

13:10 - January 31, 2017

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. హెచ్ -1 వీసాల నిబంధనలు ఇక కఠినతరం చేస్తున్నారు. దీంతో భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీలకు గడ్డుకాలం ఏర్పడే అవకాశాలు కనిపిస్తోంది. హెచ్ 1 బీ వీసాలున్న వారి జీవిత భాగస్వామి వర్క్ పర్మిట్ రద్దు చేసే యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా 85 వేలకు పైగా హెచ్ 1 బీసాలను అమెరికా జారీ చేస్తోంది. దీంతో శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు.

12:57 - January 31, 2017
12:52 - January 31, 2017

ప్రారంభమైన లోక్ సభ సమావేశాలు

ఢిల్లీ: పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాష్ట్రపత్రి ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

12:37 - January 31, 2017
12:36 - January 31, 2017
12:27 - January 31, 2017

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని.. అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మోదీ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి చూసి ఓర్వలేక ప్రతిపక్షా నాయకులు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ...వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మన్మోహన్‌ సింగ్‌.. చిదంబరం దేశాన్ని అధోగతి పాలు చేశారని.. వారి మాటలకు విశ్వసనీయత లేదని అన్నారు.

12:25 - January 31, 2017

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని.. అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మోదీ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి చూసి ఓర్వలేక ప్రతిపక్షా నాయకులు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ...వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మన్మోహన్‌ సింగ్‌.. చిదంబరం దేశాన్ని అధోగతి పాలు చేశారని.. వారి మాటలకు విశ్వసనీయత లేదని అన్నారు.

12:23 - January 31, 2017

ఢిల్లీ :నల్లధనం.. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటం అసాధారణమైనదని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ప్రసంగించారు. నల్లధనం.. అవినీతి గణనీయంగా తగ్గాయని అన్నారు. సాధారణ బడ్జెట్‌ను... రైల్వే బడ్జెట్‌ను ఒకేసారి ప్రవేశపెట్టడం కొత్త సంప్రదాయమని ..ఇవి చరిత్రాత్మక సమావేశాలుగా ఆయన అభివర్ణించారు. ఇకపై రెండు బడ్జెట్‌లు కలిపే ఉంటాయన్నారు. సబ్‌ కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌ మన లక్ష్యమని ప్రణబ్‌ అన్నారు. మహిళలు.. రైతులు.. కూలీలు.. పేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.

 

11:52 - January 31, 2017

ఢిల్లీ : పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''తొలిసారి సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ విలీనమైంది. ఇది మారుతున్న చరిత్ర, అభివృద్ధికి సూచికగా తెలిపారు. 'సబ్ కే సాథ్.. సబ్ కా వికాస్' నినాదంతో దేశం ముందుడుగు వేస్తోందన్నారు. " సహనా వవతు సహనౌ భునక్తు..." సూక్తాన్ని చదివారు. గురు గోవింద సింగ్ 350వ జయంతి ఉత్సవాలను, రామానందచార్య సహస్త్ర జయంతి వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న వేళ, బ్రిటీష్ పాలకులు ఏర్పాటు చేసిన ఒక్కో సంప్రదాయాన్ని వీడి అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశంగా భారతావని పరిఢవిల్లుతోందని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికే స్ఫూర్తినిచ్చిన చంపారన్ సత్యాగ్రహానికి నేటితో వందేళ్లు నిండాయి. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.. అవినీతి, నల్లధనం నిర్మూలనలో ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించారు. 26 కోట్ల మందికి జన్ ధన్ ఖాతాలు తెరిచాం. ఇండియన్ పోస్టల్ చెల్లింపు బ్యాంకు ను ప్రారంభించాం. పేద దళిత పీడిత, రైతు, శ్రామిక యువత ప్రగతికి నూతన విధానాలు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, 5 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ల లక్ష్యం, ఇప్పటికే కోటి మందికి పంపిణీ చేశాం. దేశంలో 20 కోట్ల మేర ఎల్ ఈడీ బల్బులు పంపిణీ చేశాం. స్వచ్ఛ భారత్ లో భాగంగా 3 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం, సాగునీటి సౌకర్యం మరింత పెంచాలన్నదే లక్ష్యం అన్నారు. రబీలో సాగునీటి సౌకర్యం 6 శాతం పెరిగిందన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు, 3 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు రూపే కార్డులుగా మార్పు చేశాం. ఈ ఏడాది 20 లక్షల టన్నుల పప్పుధాన్యాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పివీ సింధు, సాక్షిమాలిక్, దీప కర్ణాకర్ ఔనత్యాన్ని పెంపొందించారు. ఎస్సీ,ఎస్టీ యువ పారిశ్రామిక వేత్తల కోసం రూ.460 కోట్లు ఖర్చు చేస్తున్నాం. సామాజిక అటవీ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాం. గిరిజన ప్రాంతాల్లో గనుల తవ్వకాన్ని గిరిజన సంఘాలకే ఇచ్చాం. మైనార్టీ వర్గాల విద్యార్థులకు స్కాలర్ షిప్స్, ఫెలో షిప్ లు మొత్తాన్ని పెంచాం. విద్యను మధ్యలోనే ఆపేసిన బాలబాలికల కోసం బ్రిడ్జి కోర్సులు ప్రారంభించా అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇంకా రాష్ట్రపతి ప్రసగం కొనసాగుతోంది.

11:33 - January 31, 2017

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. న్యూరో సర్జికల్ వార్డు ఎన్ ఎస్ ఈ ల115లో చికిత్స పొందుతూ... మూడు గంటలుగా అక్సిజన్ అందక నలుగురు రోగులు మృతి చెందారు. ఇంత జరుగుతున్నా ఆసుపత్రి సిబ్బంది వివరాలు వెల్లడించకపోవడం దారుణం.

ఆక్సిజన్ అందక చనిపోలేదు: ఆర్ ఎంఓ

సీరియస్ హెడ్ ఇంజూరి అవడం వల్ల వారు చనిపోయారని ఆర్ ఎంఓ తెలిపారు. సెంట్రల్ పైప్ ద్వారా బాధ్యుతలకు అక్సిజన్ అందిస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రికి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించామని చెప్తున్నా... అరకొర సౌకర్యాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉస్మానియాలో ఆక్సిజన్ అందక నలుగురు మృతి

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. న్యూరో సర్జికల్ వార్డు ఎన్ ఎస్ ఈ ల115లో చికిత్స పొందుతూ... మూడు గంటలుగా అక్సిజన్ అందక నలుగురు రోగులు మృతి చెందారు. ఇంత జరుగుతున్నా ఆసుపత్రి సిబ్బంది వివరాలు వెల్లడించకపోవడం దారుణం.

సబ్ కా సాథ్ వికాస్ ప్రభుత్వ లక్ష్యం:రాష్ట్రపతి

ఢిల్లీ : పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''తొలిసారి సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ విలీనమైంది. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికే స్ఫూర్తినిచ్చిన చంపారన్ సత్యాగ్రహానికి నేటితో వందేళ్లు నిండాయి. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.. అవినీతి, నల్లధనం నిర్మూలనలో ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించారు. 26 కోట్ల మందికి జన్ ధన్ ఖాతాలు తెరిచాం. ఇండియన్ పోస్టల్ చెల్లింపు బ్యాంకు ను ప్రారంభించాం అని పేర్కొన్నారు.

11:03 - January 31, 2017

ఢిల్లీ: నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటుకు వచ్చారు. సంప్రదాయ అశ్విక దళం వెన్నంటి రాగా, జోడు గుర్రాల బగ్గీపై ప్రణబ్ ప్రయాణం రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ వరకూ సాగింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ వద్దకు వచ్చిన ప్రణబ్ కు ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్లారు.

మన్మోహన్,చిందంబరం పై వెంకయ్య ఆగ్రహం

ఢిల్లీ :మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్‌, కేంద్ర‌ మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబ‌రం చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల వెంక‌య్య నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా ఉంద‌ని, దేశంలో కొత్త ఉద్యోగాలు, పెట్టుబ‌డులు ఎక్క‌డ ఉన్నాయని మ‌న్మోహ‌న్, చిదంబరం నిన్న‌ నిల‌దీసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన వెంక‌య్య నాయుడు ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ప్ర‌ధాన‌మంత్రి, ఆర్థిక మంత్రిగా ప‌నిచేసిన వారు అప్ప‌ట్లో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అధోగ‌తి పాలు చేశారని అన్నారు.

ఐసీయూలో దాసరి నారాయణరావుకు చికిత్స

హైదరాబాద్:ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అస్వస్తతకు గురయ్యారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో, ఆయనను హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.

కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ బస్సులకు నిప్పు

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌కు చెందిన రెండు బస్సులకు సోమవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో 15 లక్షల మేర ఆస్థినష్టం సంభవించినట్లు సమాచారం. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

10:29 - January 31, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని గంభీరావు పేట మండలంలో కాంగ్రెస్ పిలుపు మేరకు బంద్ కొనసాగుతుంది. నిన్న మంత్రి కేటీఆర్ పర్యటనలో ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రయత్నించగా వారిపై అక్రమ అరెస్ట్ లు లాఠీ ఛార్జికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

విద్యార్థుల మధ్య ఘర్షణ : ఒకరి మృతి

కృష్ణా: ఇంబ్రహీంపట్నంలో నానో కాలేజ్ లో బీటెక్ చదువుతున్న విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. సూడాన్ కు చెందిన విద్యార్థి మహ్మద్ మైతోబ్ పై తోటి విద్యార్థి మహ్మద్ అల్లాదిన్ కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో మహ్మద్ మైతోబ్ మృతి చెందాడు.

ఖమ్మం కు బయలుదేరిన కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం పర్యటనకు బయల్దేరారు. ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలం కొత్తూరు పంచాయతీ ఎర్రగడ్డ తండా వద్ద నిర్మించిన భక్తరామదాసు ప్రాజెక్టును సీఎం నేడు ప్రారంభించనున్న విషయం తెలిసిందే.

గంభీరావు పేట బంద్ కు కాంగ్రెస్ పిలుపు

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని గంభీరావు పేట బంద్ కు కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. నిన్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నందుకు అక్రమ అరెస్ట్లు, లాఠీ ఛార్జికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.

మేయర్ ను హెచ్చరించిన మంత్రి

నెల్లూరు: టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి నివాసంలో మంత్రి నారాయణ అధ్యక్షతన టిడిపి నాయకులు సమావేశం అయ్యారు. మేయర్ అజీజ్ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నేతలు ఫిర్యాదు చేశారు. పనితీరు మార్చుకోవాలని మేయర్ ను మంత్రి హెచ్చరించారు.

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం...

ఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో జరిగే ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత 2017-18 ఆర్థిక సర్వే నివేదికను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెడతారు. అనంతరం ఉభయ సభలను నేటికి వాయిదా వేస్తారు. పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ టీఎంసీ సభ్యులు ఇవాళ పార్లమెంటుకు గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.

09:32 - January 31, 2017

మహారాష్ట్ర : లాతూర్‌లో విషాదం చోటుచేసుకుంది.మహారాష్ట్ర: లాథూర్ ఇండ్రస్టియల్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆయిల్ పరిశ్రమలోని కెమికల్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లి విషవాయువులు పీల్చడంతో 9మంది కార్మికులు మృతి చెందారు.ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తకు ఆదేశించింది.  మొదటగా కొందరు కార్మికులు ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లారు. వారు ఎంతకి తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడాల్సిందిగా మరికొంత మంది కార్మికులను అధికారులు పంపారు. వీరుసైతం తిరిగిరాలేదు. దీంతో పరిశ్రమల అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి అందరూ అపస్మారక స్థితిలో పడిఉన్నారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లుగా తెలిపారు.

09:29 - January 31, 2017

p { margin-bottom: 0.21cm; }

చిత్తూరు : తిరుపతిలో స్వైన్‌ ఫ్లూ కలకలం రేగింది. స్విమ్స్‌లో స్వైన్‌ఫ్లూతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మూత్రపిండాల వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఆయనకు... స్వైన్‌ ఫ్లూ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. కాగా మృతుడు కొర్లకుంట వాసిగా గుర్తించారు.

స్విమ్స్ లో స్వైన్ ఫ్లూతో ఒకరి మృతి

చిత్తూరు : తిరుపతిలో స్వైన్‌ ఫ్లూ కలకలం రేగింది. స్విమ్స్‌లో స్వైన్‌ఫ్లూతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మూత్రపిండాల వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఆయనకు... స్వైన్‌ ఫ్లూ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. కాగా మృతుడు కొర్లకుంట వాసిగా గుర్తించారు.

09:26 - January 31, 2017

కొత్తగూడెం : సీఎం కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు సంతృప్తితో లేరని తమ్మినేని ఆరోపించారు. పదండి ముందుకు.. పోదాం పోదాం అంటూ ఎర్రజెండా చేతబట్టి సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 106 రోజులు పూర్తి చేసుకుంది. 106వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక, రెడ్డిపాలెం, బూర్గంపాడు, మోరంపల్లి బంజారా, పినపాక, నాగారం, జగన్నాథపురం గ్రామాల్లో పర్యటించింది.

దారుణంగా విద్యా, వైద్య పరిస్థితులు...

రాష్ట్రంలో విద్యావైద్య పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం లేదని తమ్మినేని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పట్టనట్లు వ్యవహరిస్తున్న కేసీఆర్‌, కేటీఆర్‌ తక్షణమే ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు.

టీఆర్ ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న తమ్మినేని....

గ్రామగ్రామాల్లో జరుగుతున్న సభల్లో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను తమ్మినేని ఎత్తిచూపుతున్నారు. పాలక వర్గాలు పెట్టుబడిదారులకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నారని తమ్మినేని ఆరోపించారు. తెలంగాణ వచ్చిందన్న సంతోషం ప్రజలకు ఎంతో కాలం మిగల్లేదని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం రావడంలో తప్పు లేదని, పాలకుల బుద్ధిలోనే తప్పులున్నాయని తమ్మినేని ఆరోపించారు. కమీషన్ల కోసమే కేసీఆర్‌ ఉన్న బిల్డింగ్‌లను కూలగొట్టి మళ్లీ కట్టిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు పాలకులను ప్రశ్నించే హక్కుందని, ప్రజలు ప్రశ్నిస్తేనే ప్రభుత్వాలు పనిచేస్తాయని తమ్మినేని అన్నారు.

ఏ ఒక్క హామీని నెరవేర్చని కేసీఆర్.....

కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తమ్మినేని అన్నారు. తునికాకు కార్మికులకు బోనస్‌ చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

విషయవాయువులు పీల్చి 9మంది మృతి

మహారాష్ట్ర: లాథూర్ ఇండ్రస్టియల్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆయిల్ పరిశ్రమలోని కెమికల్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన ఏడుగురు కార్మికులు విషవాయువులు పీల్చడంతో 9మంది మృతిచెందారు. మొదటగా కొందరు కార్మికులు ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లారు. వారు ఎంతకి తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడాల్సిందిగా మరికొంత మంది కార్మికులను అధికారులు పంపారు. వీరుసైతం తిరిగిరాలేదు. దీంతో పరిశ్రమల అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి అందరూ అపస్మారక స్థితిలో పడిఉన్నారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లుగా తెలిపారు.

ఢిల్లీలో దట్టంగా పొగమంచు

ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దట్టంగా కురుస్తున్న పొగమంచుతో పరిసర ప్రాంతాలు అగుపించని కారణంగా పలు ప్రయాణ సర్వీసుల్లో ఆలస్యం చోటుచేసుకుంది. 34 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా మరో 6 రైళ్ల వేళల్లో అధికారులు మార్పులు చేశారు. అదేవిధంగా ఏడు అంతర్జాతీయ విమానాలు, ఆరు దేశీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.

09:07 - January 31, 2017

హైదరాబాద్:బుల్లితెరపై తనదైన ముద్ర వేసుకుని,అనేక స్టేజ్ షోస్ కి కూడా యాంకరింగ్ చేసింది లాస్య. అయితే మూడు రోజుల క్రితం తన ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయిందని లాస్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇది తన సినిమా ప్రమోషన్ లో భాగం అని అందరు భావించారు. కాని తర్వాత మంజునాథ్ అనే మరాఠీ అబ్బాయితో నిశ్చితార్దం జరుపుకున్న ఫోటోలని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. త్వరలోనే వారి వివాహం జరగనుందని లాస్య తెలిపింది.

08:49 - January 31, 2017

హైదరాబాద్: తెలంగాణ సర్కార్ మీద జేఏసీ గుస్సా...వినమ్రంగా విమర్శించిన కోదండరాం., చేపపిల్లల పైకం గోల్ మాల్ గోవిందం...కమీషన్ నొక్కేసిన కారుగుర్తు లీడరు, పెద్దపల్లి ఎంపీ సార్ కు పెద్ద కష్టం.....మళ్ల సీటు వస్తదో లేదో... కేసీఆర్ ఇష్టం. కాకీ వనంలో ఉన్న పంచాదీ మొక్క...పెద్ద సార్ మీద చెయ్యాలే ఎంక్వయిరీ పక్కా, నెత్తిమీద పొయ్యి పెట్టిన సాధనా సూరుడు....సొప్పబెన్న మంచంలో కూర్చున్న కళాకారుడు, గుట్టలమీద కొలువైన గణపతి బొమ్మగాయం....చారిత్ర్మక దేవుణ్ణి చెరబట్టిన ప్రకృతి ప్రేమికులు అంటూ వేడి వేడి విషయాలను తన స్టైల్లో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చాడు. అవి ఏంటో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:28 - January 31, 2017

హైదరాబాద్: హోదా అనేది ముగిసిన అధ్యాయం, హైదరాబాద్ ప్రత్యేక హోదాతో ఎదిగిందా? అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. హోదా కంటే ప్యాకేజీకి చట్టబద్ధత కోసం పోరాడాలని టిడిపి చెబుతోంది. నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి ఎలాంటి నిధులు కేటాయిస్తారు? హోదాకు సమానమైన సాయం చేస్తామని కేంద్రం చెబుతుండగా... ఏపీ లో విపక్షాలు ప్రత్యేక హోదా కోసం పోరాడటం ఎంత వరకు సబబు? హోదా వల్ల లాభమా? ప్యాకేజీ వల్ల లాభమా? విశాఖ లో రైల్వే జోన్ ఎందుకు ప్రకటించలేదు? ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు హోదా ఇస్తామని చెప్పి.. ఆ మాటలను ఎందుకు మార్చారు? ఇప్పటి వరకు హోదా ఇచ్చిన రాష్ట్రాలు అభివృద్ధి కాలేదా? ఈ అంశాలపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ నగేష్, వైసీపీ నేత కొణిజేటి రమేష్ , టిడిపి నేత ఆనంద్ బాబు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

డ్రగ్స్ అక్రమ రవాణా.. ఆరుగురు అరెస్ట్...

హైదరాబాద్: డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు ఆఫ్రికన్లున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో జాయింట్ ఆపరేషన్‌ను నిర్వహించి 370గ్రాముల కొకెయిన్‌తోపాటు రూ.46వేల నగదు, 12 సెల్‌ఫోన్లు, కారు, బైకును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

రంజిత్‌ సిన్హాకు సుప్రీంలో చుక్కెదురు

ఢిల్లీ: సీబీఐ మాజీ చీఫ్‌ రంజిత్‌ సిన్హాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బొగ్గు కుంభకోణంలో ఆయన ప్రమేయంపై సీబీఐ దర్యాప్తుపై స్టే విధించాలని రంజిత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. బొగ్గు కుంభకోణంలో రంజిత్‌ ప్రమేయంపై దర్యాప్తు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆయన తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

మాజీ మిలిటెంట్‌ ఇంట్లో సీఎంకేజ్రీవాల్

హైదరాబాద్: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం రాత్రి మాజీ మిలిటెంట్‌ ఇంట్లో బస చేశారనే వార్త తీవ్ర దుమారం రేపుతోంది. పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేజ్రీవాల్‌ ఖలిస్థాన్‌ కమాండో ఫోర్స్‌(కేసీఎఫ్‌) మాజీ మిలిటెంట్‌ గురిందర్‌ సింగ్‌ ఇంట్లో ఉన్నారని సమాచారం. దీంతో పంజాబ్‌లోని ప్రత్యర్థి పార్టీల నేతలు కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

యడ్లపాడులో ఇద్దరు చిన్నారుల సజీవ దహనం

గుంటూరు: యడ్లపాడు ఎర్రచెరువు కాలనీ వద్ద సంభవించిన అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సజీవదహనమయ్యారు. ప్రమాద వశాత్తూ రెండు పూరిగుడిసెలు దగ్ధం కావడంతో బేబి(7), కోకిల(2) సజీవదహనమయ్యారు.

06:56 - January 31, 2017

ఢిల్లీ : నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెడతారు. బడ్జెట్ తొలి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి. మలివిడత సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 12 వరకు జరుగుతాయి.

అస్త్రశస్త్రాలతో సన్నద్ధమయిన విపక్షాలు...

పార్లమెంటు బడ్జెట్‌ భేటీకి అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమయ్యాయి. ఈ సమావేశాలు వాడీవేడీగా జరుగనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు జరుగనున్న ఈ సమావేశాలను ఓటర్లకు సందేశాలు పంపే వేదికగా ఉపయోగిచుకోవాలని అధికార, ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కీలకమైన జీఎస్టీ బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా తృణమూల్‌ రెండు రోజుల పాటు పార్లమెంట్‌కు హాజరు కాకూడదని నిర్ణయించింది. తదనంతర పరిణామాలపై సభను స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయి.

సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే శాఖకు కేటాయింపులు...

92 ఏళ్లుగా రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది నుంచి రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశ పెట్టడాన్ని కేంద్రం తొలగించింది. సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే శాఖకు కేటాయింపులుంటాయి. రైల్వేకు 2017-18 కి గాను1.4 లక్షల కోట్ల నిధులను బడ్జెట్‌లో కేటాయించే అవకాశం ఉందని రిసెర్చ్‌ ఫ్రమ్‌ క్రిసిల్‌ పేర్కొంది.సాధారణ బడ్జెట్‌లో అరుణ్‌జైట్లీ రైతులను కరుణించే అవకాశం ఉంది. నోట్ల రద్దు తర్వాత రైతులు ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం-వారికి ఊరట కలిగించేలా పలు రాయితీలు ప్రకటించొచ్చు. బ్యాంకింగ్‌ రంగంలో విదేశి పెట్టుబడుల శాతాన్ని 49 శాతానికి పెంచే అవకాశం ఉంది.

జూలై ఒకటవ తేదీ నుంచి జిఎస్‌టిని అమలు చేసే దిశగా...

జూలై ఒకటవ తేదీ నుంచి జిఎస్‌టిని అమలు చేసే దిశగా కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టింది. సేవా పన్ను 16 నుంచి 18 శాతానికి పెంచే వీలుంది. సర్వీస్‌ టాక్స్‌ పెరిగినట్లయితే సామాన్య ప్రజలకు కష్టాలు తప్పవు. హోట్‌ల్‌, ఫోన్‌ బిల్లు, విమాన టికెట్లు తదితర వస్తువుల ధరలు పెరుగుతాయి.

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

ఢిల్లీ : పార్లమెంటు లైబ్రరీ హాలులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నేతలు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా నోట్ల రద్దుపై బడ్జెట్‌ సమావేశాల్లో చర్చ జరగాల్సిందేనని వివిధ పార్టీలు ఈ సమావేశంలో పట్టుబట్టాయి. అలాగే ప్రత్యేక హోదా అంశంపై కూడా సమావేశాల్లో చర్చ జరగాలని ఈ భేటీలో పాల్గొన్న వైసీపీ ఎంపీలు కోరారు. ఇవాళ ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాల్లో.. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఎకనామిక్‌ సర్వేను ఆర్థికమంత్రి ప్రవేశపెట్టనున్నారు.

06:51 - January 31, 2017

ఖమ్మం: భక్తరామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణపనులు 2 నెలల కిందటే పూర్తయ్యాయి. భక్తరామదాసు జయంతి రోజైన జనవరి 31న ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు నీటిపారుదలశాఖ అధికారులు నిర్ణయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాజెక్టును ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నారు.

16 ఫిబ్రవరి 2016న కేసీఆర్‌ శంకుస్థాపన.....

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం అంటేనే ఏళ్ల తరబడి సాగే కార్యక్రమమని ముద్ర పడింది. కానీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన 11 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి 2016 ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. 2017 మార్చిలోగా నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ నిర్దేశించికున్న లక్ష్యానికంటే 2 నెలల ముందుగానే ప్రాజెక్టు పూర్తయ్యింది. దేశంలో ఇప్పటి వరకు అత్యంత వేగంగా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుగా భక్తరామదాసు ఎత్తిపోతల పథకం చరిత్రలో నిలిచిపోనుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

60వేల ఎకరాలకు సాగునీరు...

భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్‌, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలాలకు సాగునీరు అందనుంది. మొత్తంగా 60వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

నేడు భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ప్రారంభం

ఖమ్మం : జిల్లాలోని భక్తరామదాసు ప్రాజెక్టు ప్రారంభానికి రెడీ అయ్యింది. భక్తరామదాసు జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా పాలేరు నియోజకవర్గంలోని 60 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

06:48 - January 31, 2017

హైదరాబాద్: రాష్ర్టంలో రోడ్లు రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. తెలంగాణలో ఏటీకేడు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. చిన్నపొరపాటు గ్రహపాటుగా మారుతోంది. రెప్పపాటు అలసత్వానికి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యానికి నిండు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరెన్నో కుటుంబాల కడుపుకోతకు కారణమవుతున్నాయి. రోడ్డు సెఫ్టీ రూల్స్ ఎన్ని ఉన్నా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్నమైన ఆలోచన చేశారు రాష్ట్ర పోలీసులు. అవగాహనతోనే ప్రమాదాలకు చెక్‌పెట్టొచని భావించారు. జనవరి 31ని ప్రమాదాలు లేని రోజుగా మార్చేందుకు ప్రయత్నం ప్రారంభించారు.

గంటకు 3 ప్రమాదాలు ..

తెలంగాణలో గంటకు 3 ప్రమాదాలు జరుగుతుండగా..ఒక్కరు మృతిచెందుతున్నారు. ఎంతో మంది వికలాంగులవుతున్నారు. ఏటా 7వేల మంది రాష్ట్రంలో మృత్యువాత పడుతుండగా.. దేశవ్యాప్తంగా లక్షా 50 వేల మంది మరణిస్తున్నారు. వీటిలో 50 శాతం ద్విచక్రవాహన ప్రమాదాలుంటున్నాయి. చనిపోతున్న వారు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వారే 50 శాతం ఉండటం.. ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న సంకల్పంతో..జనవరి 31ని యాక్సిడెంట్ ప్రీ డేగా ప్రకటించారు పోలీసులు. ఆ రోజు ద్విచక్రవాహన దారులు హెల్మెట్ పెట్టుకోవాలి. కారులో ప్రయాణించే వారికి సీట్ బెల్ట్ తప్పనిసరి..ఇలా రహదారి భద్రత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు, జనవరి 31న బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించి తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలపై హర్షం వ్యక్తమవుతోంది.

06:46 - January 31, 2017

తిరుమల : అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తూంచర్లకు చెందిన మహాత్మ, వరలక్ష్మిల కుమార్తె నవ్యశ్రీ, కుమారుడు హర్షవర్ధన్‌తో కలసి శనివారం తిరుమల వచ్చారు. గదులు లభించకపోవడంతో మాధవం యాత్రి సదన్‌లోని ఐదో నంబర్‌ హాలులో లాకర్‌ తీసుకున్నారు. రాత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లి ఆదివారం ఉదయం 6 గంటలకు తిరిగి యాత్రి సదన్‌కు చేరుకున్నారు. కుటుంబమంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి నిద్రిస్తున్న నవ్వశ్రీపై దుప్పటితో ముసుగేసి కిడ్నాప్‌ చేశాడు. ఉదయం 8 గంటల తర్వాత నిద్రలేచిన తల్లిదండ్రులకు బిడ్డ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. యాత్రిసదన్‌ లోపల, వెలుపల గాలించినా చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ మునిరామయ్య, సీఐ వెంకటరవి ఘటనాస్థలానికి చేరుకుని యాత్రిసదన్‌-2లోని సీసీ కెమెరా రికార్డులను పరిశీలించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులకు మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలంలో చిన్నారి ఆచూకీ లభించింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన బాలాస్వామిగా గుర్తించారు.

06:43 - January 31, 2017

ఢిల్లీ:లిక్కర్‌కింగ్‌ విజయ్‌ మాల్యాకు భారీగా రుణాలు ఇప్పించడంలో యూపీఏ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని బిజెపి ఆరోపించింది. మాల్యాకు రుణాలు మంజూరు చేయించడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వ్యక్తిగతంగా సహకరించారని బిజెపి ప్రతినిధి సంబిత్‌ పాత్ర ఆరోపించారు. 2011-2013 మధ్య మాల్యా మన్మోహన్‌, మాజీ ఆర్థికమంత్రి చిదంబరంకు రాసిన లేఖలను మీడియా ముందు విడుదల చేశారు.. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు బ్యాంకులు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని మాల్యా విజ్ఞప్తి చేసినట్లు లేఖలో ఉంది. పాత రుణాలను చెల్లించకున్నా, మాల్యాకు మాత్రం ప‌దే ప‌దే రుణాలు ఇస్తూ వెళ్లార‌ని ఆయ‌న ఆరోపించారు. బిజెపి ఆరోపణలను కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. ఎన్నికల స్టంట్‌గా కాంగ్రెస్‌ కొట్టిపారేసింది. మాల్యా బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌ పారిపోయిన విషయం తెలిసిందే.

06:42 - January 31, 2017

ఢిల్లీ: బడ్జెట్‌కు ముందు కేంద్రంపై కాంగ్రెస్‌ దాడికి దిగింది. భారతదేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిద‌రంబ‌రంతో క‌లిసి ఆయ‌న ఓ ఆర్థిక డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. మాల్యాకు మద్దతిచ్చారని బిజెపి చేసిన విమర్శలపై మన్మోహన్‌ స్పందించారు. పారిశ్రామికవేత్తలు పిఎంఓ కార్యాలయానికి లేఖలు రాస్తుంటారని, వాటిని సంబంధిత శాఖలకు పంపడం జరుగుతుందన్నారు. ఆ లేఖల్లో ఎలాంటి తప్పిదం లేదని చట్టాన్ని అతిక్రమించేలా లేవని ఆయన స్పష్టం చేశారు. కొత్త ఉద్యోగాలు.... కొత్త పెట్టుబ‌డులు ఎక్కడ ఉన్నాయని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కేంద్రాన్ని ప్రశ్నించారు. అంకెల గారడీతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని ఆయన మండి పడ్డారు. ప్రభుత్వాలు ఆశావాహంగా ఉండాల‌ని, నిజ‌మైన ప‌రిస్థితి ఆధారంగా బ‌డ్జెట్ అంచ‌నాలు రూపొందించాలన్నారు.

06:40 - January 31, 2017

హైదరాబాద్: రేపు కేంద్ర బడ్జెట్ రాబోతోంది. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్ కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. విద్యారంగం అభివృద్ధికి బడ్జెట్ లో చేసే ప్రతిపాదనలే కీలకం. దురదృష్టవశాత్తు మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తుండడం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. కేంద్ర బడ్జెట్ లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్ లలో 30 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలన్న డిమాండ్స్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే బోయే బడ్జెట్ నుంచి విద్యారంగం ఆశిస్తున్నదేమిటి? విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నదేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నూరు మహమ్మద్ గారు 10 టీవీ విజయవాడ స్టూడియోకి వచ్చారు. వారు ఏఏ అంశాను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

Don't Miss