Activities calendar

01 February 2017

21:32 - February 1, 2017

ఒడిశా : ఏవోబీలో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. భద్రతా బలగాల బస్సుపై మావోయిస్టులు దాడి చేశారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపూర్‌ జిల్లా సుంకి వద్ద మావోయిస్టులు మందు పాతర పేల్చారు. బస్సులో 40 మంది జవాన్లు ఉన్నారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.

 

21:28 - February 1, 2017

విశాఖపట్టణం : కేంద్ర బడ్జెట్‌ పై ఉత్తరాంధ్ర వాసులు మండిపడుతున్నారు. ఏళ్లతరబడి తమకు అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి నాయకులందరూ హామీలు ఇస్తున్నా... విశాఖ రైల్వేజోన్‌ అంశం ముందుకు సాగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీని కేంద్ర పాలకులు పదే పదే తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశాఖ వాసులు ఫైర్‌ అవుతున్నారు. ఈసారికూడా కేంద్ర బడ్జెట్‌లో తమ ప్రాంతానికి అన్యాయం చేశారని ఆగ్రహంగా ఉన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా విశాఖలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఆందోళనకారుల్ని అడ్డుకున్న పోలీపులు పలువురు సీపీఎం నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. రాజధాని రైతులకు న్యాయం చేసిన కేంద్రపాలకులు .. తమకు మాత్రం పదే పదే అన్యాయం చేస్తున్నారని ఉత్తరాంధ్ర వాసులు నిరసన ప్రకటిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులకు భూముల అమ్మకంపై వచ్చిన మూలధన ఆస్తులపై ట్యాక్స్‌లు లేకండా చేసిన కేంద్రం.. విశాఖ రైల్వేజోన్‌ అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదని మండిపడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత అలుసు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

దశాబ్ధాలుగా డిమాండ్..
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఆర్థిక జవసత్వాలు కలిగించే విశాఖ రైల్వే జోన్‌.. డిమాండ్‌ దశాబ్దాలుగా వస్తూనే ఉంది. తూర్పు రైల్వేలో భాగంగాఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని.. తమ ప్రాంతాన్ని ప్రత్యేక రైల్వే జోన్‌గా గుర్తిస్తే.. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధికి నోచుకుంటాయని అక్కడి ప్రజలు కోరుతున్నారు. అయితే.. పాలకులు ఎప్పటికపుడు హామీలు ఇవ్వడమే తప్పించి రైల్వే జోన్‌ అంశాన్ని మాత్రం తేల్చడంలేదు. అపుడు యూపీఏ హయాంలోనూ.. ఇపుడు ఎన్డీఏ పాలనలోనూ తమకు అన్యాయమే జరిగిందంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. విభజన చట్టంలో రైల్వేజోన్‌ అంశం ఉన్నా.. పాలకులు పట్టించుకోవడంలేదని..ప్రధాని మోదీ దగ్గర ముఖ్యమంత్రి లాలూచీ ఏంటో బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. పదే పదే అన్యాయం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఇక పోరు తప్పదని ఉత్తరాంధ్ర ప్రజలు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర అంటే చిన్నచూపు చూస్తున్న పాలకులకు తగినబుద్ధిచెబుతామంటున్నారు. వాపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించి.. విశాఖ రైల్వే జోన్‌పై తాడోపేడో తేల్చేస్తామంటున్నారు.

21:26 - February 1, 2017

విజయవాడ : కేంద్ర బడ్జెట్‌ ఏపీ రాజధాని గ్రామాల్లో ఆనందం నింపింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు మూలధనంపై ట్యాక్స్‌ మినహాయించడాన్ని రైతులు స్వాగతిస్తున్నారు. వెలగపూడిలో రైతులు స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు కేంద్రం పన్ను మినహాయింపునిస్తూ తీసుకున్న నిర్ణయం, ఈ ప్రాంత రైతుల్లో హర్షాన్ని నింపింది. మూలధనంపై పన్ను మినహాయింపునిస్తూ... ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడంతో రాజధాని గ్రామాల్లో రైతులు సంతోషంలో మునిగిపోయారు.

33 వేల ఎకరాలు..
రాజధానికోసం భూములివ్వడానికి ముందుకొచ్చిన రైతులు ..ఇప్పటికే 33వేల ఎకరాలను సీఆర్‌ఎడీఏ కు అప్పగించారు. దీంతో రాజధానికి పరిధిలోని 29గ్రామాల్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. చాలా మంది రైతులు తమ భూమిలో కొంత భాగాన్ని అమ్ముకున్నారు. అలా వచ్చిన లక్షలాది రూపాయలను బ్యాంకు అకౌంట్లలో దాచుకున్నారు. మరికొంతమంది మాత్రం పరిహారం కింద ప్రభుత్వం ఇస్తున్న ప్లాట్లను అమ్ముకుని సొమ్ముచేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. అయితే ట్యాక్స్‌ రూపంలో లక్షల రూపాయలు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళనతో .. తమకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబుతోపాటు కేంద్రానికి వినతి పత్రాలు సమర్పించారు రైతులు . దీనిపై కేంద్రం, ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించి.. రాజధాని ప్రాంత రైతులకు మూలధనంపై ఎటువంటి ట్యాక్స్‌ లు ఉండబోవని ప్రకటించడంతో రాజధాని గ్రామాల్లో రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజధానికోసం ఇక ముందు భూములివ్వడానికి ముందుకొచ్చే రైతులకు కూడా ట్యాక్స్‌ల మినహాయింపులు ఉంటాయంటున్నారు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ . మొత్తనికి జైట్లీ బడ్జెట్‌, మిగిలిన ప్రాంత ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిందో గానీ, తమకు మాత్రం మేలే చేసిందని రాజధాని ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

21:24 - February 1, 2017

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది.. బడ్జెట్‌పై టీడీపీ భిన్న స్వరాలు వినిపించింది. బీజేపీ నేతలు భేష్‌ అంటే, ప్రజలకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. కేంద్ర బడ్జెట్‌పై ఏపీ టీడీపీనుంచి భిన్న స్వరాలు వినిపించాయి.. బడ్జెట్‌ అద్భుతంగా ఉందని కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రశంసిస్తే... ఏపీకి నిరాశనే మిగిల్చిందని... ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ మినహాయింపుపై.. మంత్రి పత్తిపాటి హర్షం వ్యక్తం చేశారు.. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు తెలిపారు. జనరంజకమైన బడ్జెట్‌ అని కితాబిచ్చారు.. బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు... అన్ని వర్గాల ప్రజలకు అనువుగా కేటాయింపులు జరిగాయన్నారు.

ఏపీ వైసీపీ విమర్శలు..
ఇక బడ్జెట్‌లో క్లారిటీ లేదని వైసీపీ విమర్శించింది.. వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపుచేస్తామని ప్రకటించారని... ఏవిధంగా చేస్తారో స్పష్టత ఇవ్వలేదని ఆ పార్టీ నేత పార్థసారధి అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌పై వామపక్షాలుకూడా పెదవి విరిచాయి.. బడ్జెట్‌ అన్నివర్గాల ప్రజల్ని నిరాశపరిచిందని.. సీపీఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. ఏపీ ప్రజలకు ఈ బడ్జెట్‌లో మొండిచేయి చూపారని.. సీపీఐ నాయకులు విమర్శించారు. ప్రధాని మోదీ జిమ్మిక్కులు ఈబడ్జెట్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. బడ్జెట్‌ అయోమయంగా ఉందన్నారు.. ఏపీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కొలనుకుంట్ల శివాజి... ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం చూపించకపోవడంతో ఇది బడ్జెట్టేనా? అన్న సందేహం వస్తోందని విమర్శించారు.

తెలంగాణలో..
ఇక తెలంగాణలో కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ నేతలు ప్రశంసలు కురిపించగా... ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ బడ్జెట్‌ ఉందని కిషన్‌ రెడ్డి చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డికూడా సంతృప్తి వ్యక్తం చేశారు.. కేంద్ర నిధుల్ని తెలంగాణ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బడ్జెట్‌ కేటాయింపులపై కాంగ్రెస్‌ విమర్శలవర్షం కురిపించింది.. ఈసారి బడ్జెట్‌ కేటాయింపులు సరిగాలేవని.. తెలంగాణ కాంగ్రెస్‌ నేత పొంగులేటి ఆరోపించారు. మొత్తానికి బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలనుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది..

21:21 - February 1, 2017

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ అద్భుతంగా ఉందని పాలపక్షం ఆకాశానికెత్తేసింది.. అన్ని రంగాలకు కేటాయింపులు అదిరిపోయాయని ప్రశంసించింది.. అయితే ప్రతిపక్ష పార్టీలుమాత్రం బడ్జెట్‌పై పెదవి విరిచాయి.. ఇదేం బడ్జెట్‌ అంటూ విమర్శలు గుప్పించాయి.కేంద్ర బడ్జెట్‌ దేశ అభివృద్ధికి బాటలు వేస్తుందని ప్రధానమంత్రి మోదీ కితాబిచ్చారు. వ్యవసాయ, గ్రామీణ, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారని మెచ్చుకున్నారు. బడ్జెట్‌పై పాలపక్షం ప్రశంసలు కురిపిస్తుండగా... ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌మాత్రం విమర్శలు గుప్పించింది.. ఎలాంటి విజన్‌ లేకుండా బడ్జెట్‌ రూపొందించారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బడ్జెట్‌ కేటాయింపులు సరిగాలేవని సీపీఎం కేంద్ర కమిటీ విమర్శించింది...ఈ బడ్జెట్‌తో ప్రజలపై భారం మరింత పెరుగుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అధికారపార్టీ బడ్జెట్‌ అద్భుతం అని చెప్పుకుంటున్నా... పేదలకు ఒరిగిందేమీలేదని విపక్షాలు మండిపడుతున్నాయి.. కొత్త సీసాలో పాతసారాలా ఉందని విమర్శిస్తున్నాయి.

21:19 - February 1, 2017

ఢిల్లీ : సాధారణ బడ్జెట్‌లో భాగంగా కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రైల్వే భద్రత, పరిశుభ్రత, వసతులు, అభివృద్ధిపైనే జైట్లీ ఎక్కువ దృష్టి పెట్టారు. రైలు చార్జీలు పెంచకుండా జైట్లీ కరుణించారు. ఐఆర్‌సీటీసీ టికెట్ల‌పై స‌ర్వీస్ ఛార్జీలు ఎత్తివేయడం ప్రయాణికులకు ఊరట కలిగే అంశం. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌ జైట్లీ లోక్సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. ఈసారి బడ్జెట్‌ పలు మార్పులు కనిపించాయి. 93 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి నెలాఖరులో కాకుండా ఫిబ్రవరి మొదటిరోజే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కూడా ఓ విశేషం.

లక్షా 31వేల కోట్లు..
రైల్వేలకు ఈ ఏడాది బడ్జెట్‌లో లక్షా 31 వేల కోట్లు కేటాయించారు. రైల్వే అభివృద్ధి పనులకు గాను కేంద్రం 55 వేల కోట్లు సాయం చేయనుంది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసేందుకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు గాను లక్ష కోట్లు కేటాయించారు. నగదు రహిత లావాదేవిలను ప్రోత్సహించేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్‌ చేసుకునే రైల్వే టికెట్లపై సర్వీస్‌ ట్యాక్స్‌ను పూర్తిగా తొలగించారు. రైల్వే స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. కాలుష్యం తగ్గించేందుకు 2019 నాటికి అన్ని రైళ్లల్లో బయో టాయ్‌లెట్స్‌ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నది లక్ష్యం. 7 వేల రైల్వే స్టేషన‍్లలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు.

కోల్పోయిన ప్రత్యేకత..
2020 నాటికి బ్రాడ్‌గేజ్‌ లైన్లలో మానవ రహిత రైల్వే క్రాసింగులు పూర్తి చేయనుంది. 25 స్టేషన్లను ఆధునీకికరించనున్నటు జైట్లీ తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 3 వేల 5 వందల కి.మీ కొత్త రైల్వే లైన్లకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల కోసం ప్రత్యేకంగా రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో నూతన మెట్రో రైల్వే విధానాన్ని ప్రకటించనున్నారు. మెట్రో రైలు మార్గాల ఏర్పాటులో ప్రయివేటురంగానికి పెద్దపీట వేయనున్నారు. రైల్వే బడ్జెట్‌ అంటే ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకునేవారు. ఈసారి రైల్వేను సాధారణ బడ్జెట్‌లో కలిపేయడంతో దాని ప్రత్యేకతను కోల్పోయింది. కొత్తరైళ్ల ప్రస్తావన లేకుండానే జైట్లీ మమ అనిపించారు. ప్రత్యేక విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ రైల్వే జోన్‌కు ఈసారి కూడా మోక్షం దొరకలేదు.

21:18 - February 1, 2017

ఢిల్లీ : ఊరించారు.. ఉస్సూరనిపించారు. కేటాయింపులు ఘనంగానే జరిపారు.. కానీ అడుగడుగునా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలనే ప్రాతిపదికగా తీసుకున్నారు. ఇదీ, కేంద్ర ఆర్థికమంత్రి పార్లమెంటుకు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ తీరు. నిరుటితో పోలిస్తే, బడ్జెట్‌ సైజు బాగానే పెరిగినా.. నిధుల కేటాయింపుల్లో మాత్రం పెద్దమనసు చూపలేదు. అంకెలగారడీతో అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన జైట్లీ.. ప్రజాక్షేత్రంలో నిరసనలనే ఎదుర్కొంటున్నారు. 2017-18 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సుమారు 21 లక్షల 47 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌లో.. రక్షణ రంగానికే పెద్దపీట వేశారు. దాదాపు 2 లక్షల 74 వేల కోట్ల రూపాయలను రక్షణ రంగానికి కేటాయించారు. గ్రామీణ భారతానికి పెద్ద పీట వేస్తున్నట్లు ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు. రైతుల ఆదాయాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు స్థాయికి చేరుస్తామన్న జైట్లీ, పంటల బీమా పథకానికి 13వేల కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే డెయిరీల అభివృద్ధికి మాత్రం 80వేల కోట్ల రూపాయలు కేటాయించారు.

కృషి విజ్ఞాన కేంద్రాల్లో మినీ ల్యాబ్ లు..
దీంతోపాటే, అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో మినీ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని, రైతులకు భూసార పరీక్షలు, పంటల వృద్ధి తదితర అంశాల్లో ఈ ల్యాబ్‌లు ఉపకరించేలా తీర్చిదిద్దుతామన్నారు. స్థూలంగా, వ్యవసాయ, అనుబంధ రంగాలకు 1 లక్షా 87 వేల 23 కోట్లు ఖర్చుచేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. గ్రామీణులకు పని కల్పించే ఉపాధిహామీ పథకానికి 48 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక సాగునీటి సౌకర్యాల కోసం 40వేల కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. గ్రామీణాభివృద్ధి మంత్రం పఠించిన జైట్లీ.. పల్లెపల్లెకూ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. దీనికోసం పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి 3 లక్షల 96 వేల 135 కోట్లు కేటాయిస్తున్నట్లు అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.

ఎన్నికల నేపథ్యంలో..
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బడ్జెట్‌ద్వారా, బీజేపీపై ఉన్న బ్రాహ్మణ ముద్రను చెరిపేసే ప్రయత్నం చేశారు జైట్లీ. పైగా ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు వరాల జల్లు కురిపించారు. బీసీల అభ్యున్నతికి 52,393 కోట్లు కేటాయించిన జైట్లీ, గిరిజనులకు 31,920 కోట్లు, మైనారిటీలకు 4,195 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వెనుకబడిన కులాలకు 4 వేల కోట్లతో నైపుణ్యాభివృద్ధికి సంకల్ప నిధి ఏర్పాటు చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. మహిళలకూ ఊరట కలింగచే ప్రయత్నం చేశారు. మహిళా సాధికారత కోసం 500 కోట్ల మహిళా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ముద్రా రుణాల కోసం 2 లక్షల 44 వేల కోట్లు, గర్భిణుల ఆస్పత్రి ఖర్చులకు 6 వేల నగదు బదిలీ వంటి వరాలను ప్రసాదించారు. గృహ రుణాలిచ్చే బ్యాంకులకు జాతీయ హౌసింగ్‌ బ్యాంక్‌ ద్వారా 20 వేల కోట్ల రుణం ఇవ్వాలని నిర్ణయించినట్లు జైట్లీ చెప్పారు.

అమరావతి రైతులకు మినహాయింపు..
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజనకు 19,100 కోట్లు, ప్రధాని ఆవాస్‌ యోజనకు 23 వేల కోట్లు, గ్రామజ్యోతి యోజనకు 4,300 కోట్లు, అంత్యోదయ యోజనకు 2,500 కోట్లు కేటాయిస్తున్నట్లు అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలుగా కాకుండా రంగాల వారీగా బడ్జెట్‌ను రూపొందించినట్లు జైట్లీ తెలిపారు. ఈ బడ్జెట్‌లో, జైట్లీ, వేతన జీవులకు ఉపశమనం కల్పించారు. ఇంతవరకూ రెండున్నర లక్షల రూపాయలున్న పన్ను మినహాయింపు పరిధిని, మూడు లక్షల రూపాయలకు పెంచారు. అదే విధంగా, ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయమున్న వారు చెల్లించాల్సిన పన్ను శాతాన్ని పది నుంచి ఐదుకి తగ్గించారు. 50 లక్షల నుంచి కోటి రూపాయలు ఆదాయం ఉన్నవారికి 10 శాతం పన్ను, కోటికి పైగా ఆదాయం కలిగివారికి 15 శాతం సర్‌చార్జి విధించనున్నట్లు జైట్లీ ప్రకటించారు. 5 కోట్ల ట‌ర్నోవ‌ర్ లోపు ఉన్న కంపెనీల‌కు ఒక‌ శాతం కార్పొరేట్ ప‌న్నుమిన‌హాయింపు, అమ‌రావ‌తి వాసుల‌కు మూల‌ధ‌న లాభాల ప‌న్ను మిన‌హాయింపు. అమ‌రావ‌తి భూస‌మీక‌ర‌ణ‌లో స‌హ‌క‌రించిన రైతుల‌కు ప‌న్ను మిన‌హాయింపు ఇస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు.

వెంటిలెటర్ పై దాసరి - పవన్..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావును సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో దాసరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. పరామర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. దాసరి వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్నారని, రేపు వెంటిలెటర్ తొలగిస్తామని వైద్యులు పేర్కొన్నారని పవన్ తెలిపారు.

20:55 - February 1, 2017

మెగా మేనల్లుడు కోసం తమిళ హీరో విలన్ గా మారాడు. రీసెంట్ గా స్టార్ట్ అయిన 'సాయిధరమ్ తేజ్' కొత్త సినిమాలో కోలీవుడ్ హీరో విలన్ గా నటిస్తుండడం విశేషం.ఇంతకు ముందే తెలుగులో ఓ రాయివేసిన ఆ తమిళ హీరో, తేజు మూవీతో ఇక్కడే సెట్ అయివాలని ప్లాన్ చేస్తున్నాడు. 'సాయిధరమ్ తేజ్' చడీచప్పుడు లేకుండా కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. రైటర్ టర్న్ డైరెక్టర్ బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో మెగా మేనల్లుడు 'జవాన్’ అనే సినిమా చేయబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ తో ఘనంగా ఆరంభమైన ఈ చిత్రానికి డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. అంతేకాదు ఈ చిత్రంలో తమిళ హీరో విలన్ గా నటించబోతుండడం మరో విశేషం.

ప్రసన్నకు ఛాన్స్.
'జవాన్' సినిమా దర్శకుడు బి వియస్ రవి ఓపెనింగ్ రోజే కాస్ట్ అండ్ క్రూ వివరాలు తెలిపాడు. ఈ చిత్రంలో తమిళ హీరో 'ప్రసన్న' విలన్ గా నటిస్తున్నాడు. ఈయన ఎవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ 'స్నేహ' భర్తనే. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ 'ప్రసన్న'కు తమిళంలో అవకాశాలు రావడం లేదు. అందుకే తమిళ హీరో ప్రస్తుతం టాలీవుడ్ విలన్ గా రాణించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇంతకు ముందు ఆయన 'భాయ్' సినిమాలో 'నాగార్జున'కు తమ్ముడిగా నటించాడు. ఈ సినిమా ప్లాప్ కావడంతో 'ప్రసన్న'కు ఇన్నాళ్లకు మరో అవకాశం వచ్చింది.

విన్నర్..జవాన్..
మెగా కాంపౌండ్ హీరో సినిమా కావడంతో ఇక్కడ పేట్ మారిపోతోందని 'ప్రసన్న' భావిస్తున్నాడు. ఈ సినిమా కనుక హిట్టు అయితే ఆయనకు మెగా హీరోలు వరుసగా ఛాన్స్ లు ఇచ్చి ఎంకరేజ్ చేసినా చేస్తారు. త్వరలోనే షూటింగ్ కి వెళ్లనున్న ఈ చిత్రంలో 'సాయి ధరమ్ తేజ్ ' పక్కన్న 'మెహ్రీన్' కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మెగా హీరో నటిస్తున్న 'విన్నర్' కంప్లీట్ స్టేజ్ కి చేరుకుంది. త్వరలోనే ఈ మూవీ ఆడియోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'జవాన్' గా 'తేజ్' ఎలా కనిపించబోతున్నాడో చూడాలి.

20:51 - February 1, 2017

'రామ్ చరణ్' న్యూ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సుకుమార్ డైరెక్షన్ లో మెగా వారసుడు నటించబోతున్న కొత్త చిత్రం గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకుంది. 'చిరంజీవి' క్లాప్ కొట్టిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి పలువురు దర్శకులు హాజరైయ్యారు. అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ న్యూ ఫీల్మ్ ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు మారిపోయాయి. 'రామ్ చరణ్' కూడా రెగ్యులర్ ఫార్మూలా మూవీస్ కి చెక్ పెట్టినట్లే కనిపిస్తోంది. అందుకు 'ధృవ' సినిమాతోనే 'చెర్రీ' కొత్త రూట్ కి వెల్ కమ్ చెప్పాడు. 'ధృవ' సక్సెస్ కొత్త ఎనర్జీ నింపుకున్న 'చరణ్' ఇక మాస్ మాసాలా సినిమాలు కాకుండా సరికొత్త జోనర్ మూవీస్ చేయడానికి సిద్దమైయ్యాడు. అందుకు ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న కొత్త చిత్రం నాంది పలకనుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ సినిమా ఏ టైపులో ఉంటుందో కూడా అంచనా వేయలేకుండా ఉందని చెప్పాలి.


సుక్కు మెస్మరైజ్ చేస్తారా ?
చెర్రీ, సుక్కుల కొత్త చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. చెర్రీ రెండు బిందలు మోస్తున్న కావడి చూస్తుంటే ఈ మూవీ ఎంత డిఫరెంట్ గా ఉండబోతోందో అర్ధం అవుతోంది. ఏడేళ్ల పదేళ్ల కెరీర్ లో 'చెర్రీ' 'మగధీర’, 'ఆరెంజ్' తరువాత పక్కా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా కోసం మెగా వారసుడు లుక్ పరంగా మేకోవర్ చేయడం విశేషం. గుబురు గడ్డెంతో రామ్ చరణ్ లుక్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్ ని పక్కా పల్లెటూరి కుర్రాడి గెటప్ లో చూపించబోతున్నాడు. ఇంతకు ముందు చెర్రీ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం పల్లెటూరు నేఫథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రానికి ఈ చిత్రానికి ఎక్కడపోలికలు లేవనేది ఫస్ట్ లుక్ ని బట్టే తెలుస్తోంది. ఆన్ ఆఫిషియల్ టాక్ ప్రకారం ఈ చిత్రం పిరియడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు వినికిడి. మెత్రిమూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'సుమంత'ను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు డిఎస్పీ సర్వాలు సమాకురుస్తున్నాడు. చూస్తుంటే సుక్కు, చెర్రీ సెల్యూలాడ్ వండర్ కి ప్లాన్ చేసినట్లే కనిపిస్తోంది. మరి సుకుమార్ ఈసారైనా ఆడియన్స్ బ్రైన్ కి పరీక్ష పెట్టకుండా కాన్సెప్ట్ తో మెస్మరైజ్ చేస్తాడేమో చూద్దాం.

20:45 - February 1, 2017

బాలీవుడ్ బ్యూటీ 'అలియా భట్' మత్తేక్కిస్తోంది. అందాల ఆరబోతలో ఆరితేరిన ఈ సెక్సీ చిన్నది లేటేస్ట్ ఫోటో షూట్ తో పిచ్చేక్కిస్తోంది. ఓ మ్యాగ్జిన్ ఫోటో షూట్ కోసం అలియా అల్ట్రా మోడ్రన్ కాస్టూమ్స్ లో అదరహో అనిపిస్తోంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ 'అలియా భట్' సీనియర్ హీరోయిన్స్ సైతం అవాక్కైయ్యేలా చేస్తోంది. మొన్నటి మొన్న సెక్స్ పొజిషన్ గురించి ఫిల్టర్ చేయకుండా చెప్పి బాలీవుడ్ కి స్వీట్ షాక్ ఇచ్చింది. ఇప్పుడేమో ఈ లేత అందాల చిన్నది సెక్సీ బాడీని ఏ మాత్రం దాచుకోకుండా అందాల విందు భోజనం వండిస్తోంది. ఇప్పటికే అనేక ఘాటైన ఫోటో షూట్స్ చేసిన 'అలియా' లేటేస్ట్ గా అంతకు మించిన హాట్ హాట్ ఫోటో షూట్ చేసి బీటౌన్ బాబుల ఫోకస్ తన మీదకు తిప్పుకుంది.  అందాల ప్రదర్శనలో సైతం 'అలియా భట్' సినియర్ హీరోయిన్స్ ని మించి పోయింది. ఇప్పటికే ఈ బ్యూటీ చాలా సార్లు సింగిల్ పీస్, టూ పీస్ బికినీల్లో సందడి చేసింది. అయితే రీసెంట్ గా వోగ్ మేగజైన్ కోసం 'అలియా' చేసిన ఫోటో షూట్ వెరీ హాట్ హాట్ గా ఉంది. వెల్వెట్ బ్లాక్ బ్రా, సేమ్ కలర్ అండర్ వేర్ పైన రగ్గెడ్ డెనిమ్ జీన్స్ టాప్ లో 'అలియా' క్లీవేజ్ అందాలు యూత్ హిటెక్కిస్తున్నాయి. అమ్మడి గార్మెంట్స్ కి ఉన్న కట్స్ లోంచి తొంగిచూస్తున్న షోకులు ఆడియన్స్ మత్తులో ముంచడం ఖాయం.

కొంతకాలం సైలంట్..
గత ఎడాది 'అలియా భట్' ఎన్నో హోప్స్ పెట్టుకున్న 'డియర్ జిందగీ' అట్టర్ ప్లాప్ అయింది. దీంతో ఈ బ్యూటీ కొంతకాలంగా సైలెంట్ గా ఉంది. అయితే ఇప్పుడు ఈ హాట్ హాట్ ఫోటో షూట్ తో బాలీవుడ్ లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారింది. గ్లామర్ కి అల్ట్రా మోడర్న్ టచ్ ఇస్తూ ఎప్పటికప్పుడు ఆలియా రెచ్చిపోతున్న తీరుకు ఏదైనా కొత్త నిర్వచనం ఇవ్వాల్సిందే. ఇక సినిమాల విషయానికి వస్తే 'అలియాభట్' ప్రస్తుతం 'బద్రీనాథ్ కీ దుల్హనియా'లో 'వరుణ్ ధావన్' కి జోడిగా మరోసారి నటిస్తోంది. గతంలో వీరు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీ కోసం జతకట్టిన విషయం తెలిసిందే.

కిమ్స్ ఆసుపత్రికి పవన్ కళ్యాణ్..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావును పరామర్శించేందుకు పవన్ ఆసుపత్రికి వచ్చారు.

20:32 - February 1, 2017

జైట్లీ బడ్జెట్ ఏ సంకేతాలిచ్చింది? అంకెల గారడీ మాత్రమేనా? లేక ప్రజానుకూల అంశాలున్నాయా? కార్పొరేట్ పక్షమా లేక, సామాన్యుడి పక్షపాతమా?

వరాలా? వడ్డనలా? లేక సబ్సిడీలు ఎత్తేసే ప్రయత్నమా? మోడీ సర్కారు ఎవరి పక్షాన నిలిచిందో, ఈ బడ్జెట్ చెప్తోందా? డీమానిటైజేషన్ తర్వాత అతలాకుతలమైన దేశ ఆర్ధిక వ్యవస్థకు ఈ బడ్జెట్ ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయిందా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..ఉత్కంఠకు తెరపడింది. బడ్జెట్ వస్తుందంటే సామాన్యుడి నుండి కార్పొరేట్ వర్గాల వరకు అందరికీ ఆసక్తే. మోడీ సర్కారు ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఏ కబురు మోసుకొస్తుందోననే సస్పెన్స్ కు, ఆర్థికమంత్రి సూట్ కేస్ లో ఏముందోననే ఆత్రుతకు ముగింపు పడింది. మోడీ సర్కారు ప్రాధాన్యతలేంటో స్పష్టమౌతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి..
సంక్షేమ పథకాల పరిస్థితేంటి?
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. డీ మానిటైజేషన్.. దేశాన్ని గత నవంబర్ నుంచి అతలాకుతలం చేసి, దేశ ఆర్ధిక వ్యవస్థను ఊహించనంత దెబ్బకొట్టిన తర్వాత వచ్చిన ఈ బడ్జెట్ ఆ సమస్యలన్నిటినీ వదిలేసిందా? అసలు సమస్యలను పక్కనపెట్టి... పైపై మెరుగులతో సరిపెట్టిందా? సంక్షేమ పథకాల పరిస్థితేంటి? గత కొన్నేళ్లుగా ఏ ప్రభుత్వం ఉన్నా కేటాయింపుల్లో పెద్ద మార్పులేం లేవు.. బడాబాబులకు లక్షల కోట్ల పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు ప్రకటించే ప్రభుత్వాలు సామాన్యుడి సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నాయనటానికి ఎన్నో ఉదాహరణలు.. మరి తాజా బడ్జెట్ ఏం చెప్తోంది?

ఎవరి బాగోగుల కోసం...
ప్రభుత్వాలు ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నాయి? ఎవరి బాగోగుల కోసం ఈ పాలనా వ్యవస్థ నడుస్తోంది? నిజాలు తలక్రిందులై, వ్యవస్థ రివర్స్ లో నడుస్తుంటే ఇంతకంటే మంచి బడ్జెట్ లు ఎలా వస్తాయనే ఘాటు విమర్శలు వినిపిస్తున్నాయి. దేశ మంటే మట్టి కాదు.. మనుషులోయ్ అని భావించాల్సిన చోట.. పిడికెడు వ్యక్తుల ప్రయోజనమే జాతి ఉమ్మడి ప్రయోజనంగా ఆర్ధిక విధానాలు, బడ్జెట్ రూపకల్పనలు సాగుతున్నాయి. సామాన్యుడి ఆశలు చాలా చిన్నవి. బడుగు బతుకుల్లో కాస్తవెలుగు రావాలని ఎన్నో ఆకాంక్షలు. కానీ, అవి నెరవేరే మార్గాలు కనిపించని పరిస్థితి. మత్స్యన్యాయం లాగా చిన్న చిన్న చేపలనుపెద్ద చేపలను మింగే సంస్కృతిని ప్రోత్సహిస్తే దేశానికి అనేక కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు. చెప్పేవాటికి, చేసేవాటికి చాలా తేడా చూపుతున్నబడ్జెట్ ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది.

బడ్జెట్ ఆ ప్రభుత్వ విధానాలను చెప్తుంది...
ప్రజలముందుకొచ్చిన బడ్జెట్ ఆ ప్రభుత్వ విధానాలను చెప్తుంది. ఎవరి పక్షమో స్పష్టం చేస్తుంది. దురదృష్టవశాత్తూ దేశంలో 90శాతం ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన దేశ బడ్జెట్, పిడికెడు పెట్టుబడిదారులకు పట్టంకడుతోంది. వారి ప్రయోజనాలకోసం తపిస్తోంది. వచ్చీ రాగానే వాతలు పెట్టిన మోడి సర్కారు, అదే వరుసను కొనసాగిస్తోంది. కార్పొరేట్ రంగం కోసమే విధానాలు రూపొందిస్తూ ఓట్లేసిన కోట్లాది సామాన్యులను బోడి మల్లయ్యలుగా వదిలేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తాజా బడ్జెట్ ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

20:12 - February 1, 2017

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వరుసగా నాలుగోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఫిబ్రవరి నెల చివరిలో కాకుండా తొలి రోజునే 2017-18 బడ్జెట్ ను జైట్లీ ప్రవేశ పెట్టడం ద్వారా కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. అలాగే రైల్వే బడ్జెట్ ను కూడా సాధారణ బడ్జెట్ లో కలిపేయడం..ప్రణాళిక..ప్రణాళికేతర వ్యయం..లకు స్వస్తి పలకడం వంటి 2017 బడ్జెట్ కు నాంది పలికారు. పేదల బడ్జెట్ అని ప్రధాని మోడీ అంటుంటే ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కొత్తదనం ఈ అంశాలకు పరిమితమైయిందా ? భారతదేశ ఆర్థిక వ్యవస్థను తిప్పే కొత్త అంశాలు ఏవైనా ఉన్నాయా ?...జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై టెన్ టివిలో ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో ఎంవీ రాజేశ్వరరరావు (ఆర్థిక నిపుణులు, ప్యాఫ్సీ మాజీ సెక్రటరీ జనరల్), డి.పాపారావు (ఆర్థిక వేత్త), రాకేష్ రెడ్డి (బీజేపీ), రాపోలు ఆనంద భాస్కర్ (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు బడ్జెట్ పై ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి.

ప్రపంచంలో ఎత్తైన గేట్లు - బాబు..

విజయవాడ : రెండు సీజన్లలో డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయాలని, ప్రపంచంలో ఎత్తైన గేట్లు ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదలకు స్పిల్ వే నిర్మిస్తున్నట్లు, రైతులు తనపై విశ్వాసంతో భూములు ఇచ్చారన్నారు. రాజధాని రైతులకు మూలధనం లాభంతో పన్ను మినహాయింపు ఇచ్చిందని, ప్రధాని, ఆర్థిక మంత్రి జైట్లీకి అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోసం కొన్ని సిఫార్సులు చేసినట్లు బాబు పేర్కొన్నారు.

దాసరిని పరామర్శించిన కాల్వ శ్రీనివాస్..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఏపీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకుని దాసరిని పరామర్శించారు.

ఆర్థిక భారాలు పెరుగుతాయి - ఏచూరి..

ఢిల్లీ : బడ్జెట్ వల్ల ఆర్థిక భారాలు మరింత పెరుగుతాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. బడ్జెట్ ప్రకటనలకే పరిమితమయ్యేలా ఉందన్నారు. ధనికులకు లాభాలు పేదలకు భారాలు చేకూర్చేలా బడ్జెట్ ఉందన్నారు. రైతులకు రుణాలు ఇవ్వడం కాదని, రుణాలు తీర్చలేని స్థితి నుండి బయటకు తీసుకరావాలన్నారు. జాతీయ ఉపాధి పథకానికి నిధులను గత ఏడాది కంటే ఈ ఏడాది తక్కువగా కేటాయించారన్నారు.

19:32 - February 1, 2017

విజయవాడ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని...కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని అభినందినస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2017-18 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. న్యూ డైరెక్షన్ దిశగా వెళ్లడానికి దోహదం చేస్తుందని, మోడీ, జైట్లీని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులు ముందుకు రావాలని తాను పిలుపునిస్తే 35వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందన్నారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరడం జరుగుతుందని ఆనాడు హామీనిచ్చానని గుర్తు చేశారు. రైతులు ఏమైతే ఆశించారో దానిని కేంద్రం నెరవేర్చిందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ రెండు బిల్లులు తీసుకరావాల్సినవసరం ఉందన్నారు. పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు, గవర్నమెంట్ పేమెంట్స్ డిజిటల్ చేయాలని కోరడం జరిగిందని వీటితో పాటు మరికొన్ని బడ్జెట్ లో పొందుపరిచారని తెలిపారు.

18:58 - February 1, 2017

తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదని ప్రముఖ సినీ నటుడు నాగార్జున పేర్కొన్నారు. మోడ్రన్..కామెడీ..రోమాన్స్, యాక్షన్, ఎమోషనల్ సినిమాలు చేశానని, చిన్న వయస్సులో అక్కినేని, ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలు చూడడం జరిగిందన్నారు. ఆయన నటించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం త్వరలో విడుదల కానుంది. రాఘవేంద్రర రావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సందర్భంగా టెన్ టివి 'నాగార్జున' తో ముచ్చటించింది. చిత్ర విశేషాలతో పాటు పలు విషయాలను ఆయన వెల్లడించారు. మరి ఆయన ఎలాంటి అభిప్రాయాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి.

ఏవోబీలో పేల్చిన మందుపాతరలు..

ఢిల్లీ : ఏవోబీలో మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును టార్గెట్ చేస్తూ పేల్చారు. ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి.

18:39 - February 1, 2017
18:37 - February 1, 2017

గజ్వేల్ : విద్యార్ధులే రేపటి పౌరులని విద్యార్ధి దశ నుంచే స్టూడెంట్స్‌ అన్ని రంగాల్లో రాణించాలని సిద్ధిపేట పోలీసు కమిషనర్‌ శివకుమార్‌ అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌ పాఠశాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాలను ప్రారంభించారు. పాఠశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులను ఆయన ప్రశంసించారు...విద్యార్థులను తీర్చిదిద్దుతూ భావిభారత పౌరులుగా చేయాలని ఆయన పాఠశాల నిర్వాకులకు సూచించారు..ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ బి.వి పట్టాభిరాం, పాఠశాల కార్యదర్శి భండారు రాంఫణిధర్‌రావులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు...

 

18:35 - February 1, 2017

హైదరాబాద్ : విభజన సమస్యల పరిష్కారానికి కోర్టులు, అధికారుల చుట్టూ తిరగకుండా.. ఇరురాష్ట్రాలు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించుకున్నాయని ఏపీ, తెలంగాణ కమిటీ సభ్యులు యనమల రామకృష్ణుడు, హరీష్‌రావు అన్నారు. విభజన సమస్యల పరిష్కారానికై ఏర్పాటైన తెలంగాణ, ఏపీ త్రిసభ్య కమిటీ సభ్యుల సమావేశం రాజ్‌భవన్‌లో ముగిసింది. ఫిబ్రవరి 9న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తదుపరి సమావేశంలో విభజన చట్టంలోని అంశాలు, కార్యాలయాలు సిబ్బంది, తదితర అంశాలు చర్చించాలని.. హైదరాబాద్‌, అమరావతిలో రెండు చోట్ల..సమావేశం కావాలని నిర్ణయించామని తెలిపారు.

18:33 - February 1, 2017

విశాఖపట్టణం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశాఖ వాసులు ఫైర్‌ అవుతున్నారు. ఈసారీ కేంద్ర బడ్జెట్‌లో తమ ప్రాంతానికి అన్యాయం చేశారని ఆగ్రహంగా ఉన్నారు. విశాఖకు రైల్వే జోన్‌ ప్రకటించలేదంటూ విశాఖలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. రాజధాని రైతులకు న్యాయం చేసిన కేంద్రపాలకులు .. తమకు మాత్రం పదే పదే అన్యాయం చేస్తున్నారని ఉత్తరాంధ్ర వాసులు నిరసన ప్రకటించారు. సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేయగా.. ఆందోళనకారులను రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

18:32 - February 1, 2017
17:43 - February 1, 2017

హైదరాబాద్ : రైలు ప్రయాణీకుల భద్రతకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యతనిచ్చారని, రైల్ సంరక్ష కింద బడ్జెట్ లో రూ. లక్ష కోట్లు కేటాయించారని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ తో పాటు రైల్వే బడ్జెట్ (2017-18) ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు...2020 నాటికి మానవరహిత రైల్వే క్రాసింగ్ లను, 3500 కి.మీటర్ల మేర కొత్త రైల్వే జోన్లు ఏర్పాటును జైట్లీ ప్రకటించారని తెలిపారు. పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు, 2019 నాటికి అన్ని రైల్వే కోచ్ లలో బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే కొన్ని పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోందని తెలిపారు.

 

నల్లధనంపై పోరాటానికి చర్యలు - జైట్లీ..

ఢిల్లీ : నల్లధనంపై పోరాటానికి చర్యలు తీసుకుంటున్నట్లు దానిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించామని ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు. అభివృద్ధికి ఆస్కారమున్న వాటిపై దృష్టి పెట్టి వాటికి అనుగుణంగా బడ్జెట్ ప్రవేశ పెట్టామన్నారు. పన్ను చెల్లింపు దారులకు ఊరట కలిగించేలా బడ్జెట్ ఉందన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యతనిచ్చినట్లు, చెక్కుల రూపంలో విరాళాలు ఇస్తే నల్లధనం అనేది ఉండదన్నారు. ఆర్థిక వ్యవస్థను ఈ బడ్జెట్ బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

17:34 - February 1, 2017

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ చాలా బాగుందని టిడిపి లోక్ సభ పక్ష నేత తోట నర్సింహ పేర్కొన్నారు. 2017-18 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఎంపీ తోట నర్సింహ టెన్ టివితో మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజల కోసం సంస్కరణలు, మార్పులు చేశారని తెలిపారు. ప్రస్తుతమున్న ఆధునిక పద్ధతులను దృష్టి పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేశారని తెలిపారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

17:33 - February 1, 2017
17:31 - February 1, 2017

హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగ్గా ఉందని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. అనారోగ్యంతో ఆయన కిమ్స్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు పెరుగుతున్నాయి. బుధవారం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆపరేషన్ అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని పేర్కొన్నారు. ఆయనతో పాటు మీడియాతో సినీ నటుడు మోహన్ బాబు మాట్లాడారు. దాసరి ఆరోగ్యం బాగుండాలని ప్రతొక్కరూ ప్రార్థనలు చేయాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని షిర్డీకి తాను వెళుతున్నట్లు తెలిపారు.

17:19 - February 1, 2017

ఢిల్లీ : ఏపీకి రైల్వే జోన్ ప్రకటించాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పార్లమెంట్ లో 2017-18 బడ్జెట్ ను అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఇది ప్రయోగాత్మకమైన బడ్జెట్ అని అభివర్ణించారు. బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం నిరాశకు గురి చేసిందని, రైల్వే జోన్ ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి రావాల్సిన నిధులపై ప్రస్తావిస్తామని, రైల్వే జోన్, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు కేంద్ర నిర్ణయాల ద్వారా కేటాయించవచ్చన్నారు. రాజధాని రైతులకు తప్ప ..మిగతా విషయాల్లో అన్యాయం జరిగిందన్నారు. బడ్జెట్ లో ప్రస్తావన లేకున్నా నిధులు కేటాయించారని, ఏ రాష్ట్రానికి ఇలా చేస్తామని ప్రకటించలేదని తెలిపారు. వచ్చే సమావేశాల్లో వత్తిడి తీసుకొస్తామని తమ ప్రయత్నం తప్పకుండా చేస్తామన్నారు.

కేంద్ర బడ్జెట్ బాగుందన్న ఎంపీ జితేందర్..

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ బాగుందని ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రణాళిక కేటాయింపులను సభలో ప్రకటించే సంప్రదాయానికి కేంద్రం వీడ్కోలు పలికిందని, బడ్జెట్ సమావేశం తరువాత జైట్లీతో ప్రత్యేకంగా సమావేశమై తెలంగాణ ఎయిమ్స్ అంశంపై మంత్రితో మాట్లాడుతామన్నారు. కొత్త విధానం వల్ల సభలో తెలంగాణకు ఎయిమ్స్ పై మాట్లాడడం లేదని జైట్లీ పేర్కొనడం జరిగిందని, బడ్జెట్ లో ఎయిమ్స్ కు నిధులు కేటాయించినట్లేనని మంత్రి భరోసా ఇచ్చారన్నారు.

ప్రయోగాత్మక బడ్జెట్ - ఎంపీ రామ్మోహన్..

ఢిల్లీ : ఇది ప్రయోగాత్మకమైన బడ్జెట్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం నిరాశకు గురి చేసిందని, రైల్వే జోన్ ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి రావాల్సిన నిధులపై ప్రస్తావిస్తామని, రైల్వే జోన్, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు కేంద్ర నిర్ణయాల ద్వారా కేటాయించవచ్చన్నారు.

ప్రాణం తీసిన చిల్లరగొడవ..

హైదరాబాద్ : హయత్ నగర్ లో చిల్లర గొడవ ప్రాణం తీసింది. రూ. 4 చిల్లర కోసం పాన్ షాపు యజమాని నదీమ్ తో రాజేష్ అనే యువకుడు వాగ్వాదానికి దిగాడు. నలుగురితో కలిసి రాజేష్ ను నదీమ్ చితకబాదాడు. ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీసిన రాజేష్ లారీని ఢీకొని మృతి చెందాడు. సిసి టివి ఫుటేజ్ ఆధారంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

 

స్టాక్ మార్కెట్ లో జోష్..

ఢిల్లీ : స్టాక్ మార్కెట్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. 486 పాయింట్లు పెరిగి 28,142 వద్ద సెన్సెక్స్ ముగియగా 155 పాయిట్లు పెరిగి 8,716 వద్ద నిఫ్టీ ముగిసింది.

చాల మంచి బడ్జెట్ - టిడిపి ఎంపీలు..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై టిడిపి ఎంపీలు సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు, బడుగు బలహీన వర్గాల యువతకు ఉపయోగం ఉందని, గ్రామీణాభివృద్ధిలో భాగంగా డైరీకి ప్రాముఖ్యత ఇచ్చారని తెలిపారు. రాజధాని రైతులకు మూలధన పన్ను మినహాయింపు వల్ల 25 వేల మంది రైతులు లబ్ది పొందుతారని, రాజధాని నిర్మాణానికి బడ్జెట్ లో నిధులు అవసరం లేదని కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. ఏపీకి రైల్వే జోన్ పై కేంద్రంతో మాట్లాడుతామని మరోసారి చెప్పుకొచ్చారు.

16:36 - February 1, 2017

విజయవాడ : అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కేంద్రం ఊరట కల్పించడం పట్ల ఏపీ మంత్రి పత్తిపాటి హర్షం వ్యక్తం చేశారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కల్పించడం ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా జైట్లీకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఒక విధంగా పండుగ దినమని, సీఎం చంద్రబాబు నాయుడు ఏవైతే మాటలు ఇచ్చారో ఒక్కోక్కటిగా అమలవుతున్నాయని తెలిపారు.

రైతులది న్యాయమైన కోరిక - ఎమ్మెల్యే శ్రావణ్..
ఏపీ రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరులో బాణాసంచా కాల్చి రైతులు సంబరాలు జరుపుకున్నారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూ సమీకరణ ద్వారా రైతులు భూమి ఇచ్చారని, రైతులది న్యాయమైన కోరిక అని టెన్ టివితో ఎమ్మెల్యే శ్రావణ్ పేర్కొన్నారు.

వెలగపూడిలో రైతుల హర్షం..
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చిన రైతులకు క్యాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌ను రద్దు చేసింది. ఈ సందర్భంగా వెలగపూడి రైతులతో టెన్ టివి ముచ్చటించింది. రైతులకు మూలధనం ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు.

క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రద్దు..
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చిన రైతులకు క్యాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌ను రద్దు చేసింది. 2014 జూన్‌ 2 వ తేదీ నుంచి ఇది వర్తిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వాణిజ్య, నివాస స్థలాలు కేటాయిస్తోంది. వీటిని అమ్ముకునే వారి నుంచి క్యాపిట్‌ గెయిన్‌ టాక్స్‌ను వసూలు చేయరు.

16:31 - February 1, 2017

హైదరాబాద్ : కేంద్రం ప్రవేశ పెట్టిన 2017-18 బడ్జెట్ పై టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి పెదవి విరిచారు. అంకెల గారడీతో మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన ఎయిమ్స్ ను గుజరాత్ కు తరలించినా సీఎం కేసీఆర్ ప్రస్తావించరని, తెలంగాణ బీజేపీ, టీడీపీ ఏమి చేస్తుందో అర్థం కావడం లేదని విమర్శించారు. భక్త రామదాసు ప్రాజెక్టు ప్రారంభంలో సీఎం కేసీఆర్ ఎన్నో మాటలు మాట్లాడరని, కానీ బడ్జెట్ లో విభజన హామీల ఊసే లేదన్నారు.

16:21 - February 1, 2017

విశాఖపట్టణం : జిల్లా ప్రజలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ పై విశాఖకు మొండి చేయి చూపడం పట్ల సీపీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి 2017-18 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇందులో రైల్వే జోన్ పై ఎలాంటి ప్రకటన చేయకపోవడం పట్ల నేతలు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా విశాఖపట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. బడ్జెట్ నిరాశకు గురి చేసిందని, ప్రత్యేక హోదా అడిగితే విభజన చట్టంలో లేదని చెప్పారని, చట్టంలో ఉన్న రైల్వే జోన్ ఎందుకివ్వరని సీపీఎం నేత సూటిగా ప్రశ్నించారు. ఎంపీ హరిబాబు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఉన్న హామీలు ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొంటూ ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

రైల్వే జోన్ కోసం సీపీఎం ఆందోళన..

విశాఖపట్టణం : జిల్లా ప్రజలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ పై విశాఖకు మొండి చేయి చూపడం పట్ల సీపీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బడ్జెట్ లో రైల్వే జోన్ పై ఎలాంటి ప్రకటన చేయకపోవడం పట్ల నేతలు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా విశాఖపట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

ముగిసిన తెలంగాణ, ఏపీ త్రిసభ్య కమిటీ సభ్యుల సమావేశం..

హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ, ఏపీ త్రిసభ్య కమిటీ సభ్యుల సమావేశం ముగిసింది. విభజన చట్టంలోని అంశాలు, కార్యాలయాలు, సిబ్బంది తదితర అంశాలు చర్చించాలని నిర్ణయించినట్లు భేటీ అనంతరం మంత్రులు యనమల, హరీష్ రావు మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 9న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు, పెండింగ్ లో ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయన్నారు. హైదరాబాద్, అమరావతి రెండు చోట్ల సమావేశాలు నిర్వహించాలని వచ్చే సమావేశంలోగా రెండు రాష్ట్రాల ప్రతినిధులు ప్రతిపాదనలు గవర్నర్ కు సమర్పించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

రాజధాని రైతుల హర్షం..

విజయవాడ : ఏపీ రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరులో బాణాసంచా కాల్చి రైతులు సంబరాలు జరుపుకున్నారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూ సమీకరణ ద్వారా రైతులు భూమి ఇచ్చారని, రైతులది న్యాయమైన కోరిక అని టెన్ టివితో ఎమ్మెల్యే శ్రావణ్ పేర్కొన్నారు.

బడ్జెట్ నిరాశ - ఏపీ సీపీఎం..

విజయవాడ : కేంద్ర బడ్జెట్ నిరాశకు గురి చేసిందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. బడ్జెట్ లో ప్రత్యేక ప్యాకేజీపై ప్రస్తావన లేదని, పన్నుల భారం అయితే పెంచారు కానీ ప్రజలకు వరాలు మాత్రం ప్రకటించలేదన్నారు. కేంద్రంపై సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఒత్తిడి తేవాలని, రాష్ట్రానికి రావాల్సిన అంశాలను సాధించడానికి ప్రతిపక్షాలతో కలిపి సీఎం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.

15:58 - February 1, 2017

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. అందరూ ఊహించినట్టే జైట్లీ ఎన్నికల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఐదు రాష్ర్టాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వడ్డింపులు లేని బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. దాదాపు అన్ని రంగాలకు సమ ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. డిజిటలైజేషన్‌ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మూడు లక్షల పరిధి దాటే నగదు లావాదేవీలపై ఆంక్షలు విధించారు. రాజకీయ పార్టీలన్నింటినీ ఐటీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక ధరలు తగ్గే వస్తువులు..ధరలు పెరిగే వస్తువుల విషయానికి వస్తే..

ధరలు తగ్గేవి : రైల్వే ఈ టికెట్స్, వైద్య పరికరాలు, ఔషధాలు, సీసీ టీవీ కెమెరాలు, మౌలిక రంగంలో వాడే యంత్రాలు, వ్యవసాయ పనిమిట్లు, ఈ పాస్ యంత్రాలు, స్వైపింగ్ మిషన్లు, ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ ఫోన్ డేటా తదితరాలు.

ధరలు పెరిగేవి : సిగరేట్లు, బీడీలు, లగ్జరీ కార్లు, బైక్ లు, సరకు రవాణా, దిగుమతి చేసుకొనే వస్తువులు, సెల్ ఫోన్ లలో వాడే సర్క్యూట్ బోర్డు (పీసీబీ), ఎల్ ఈడీ లైట్లు.

 

15:40 - February 1, 2017

ఢిల్లీ : అరుణ్‌జైట్లీ బడ్జెట్‌పై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పెదవి విరిచారు. ఎలాంటి విజన్‌ లేకుండా బడ్జెట్‌ రూపొందించారన్నారు. రైతులు, యువతకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని యువతకు ఉపాధి కల్పనపై ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆరోపించారు. 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రధాని మోది ఇచ్చిన హామి ఇంతవరకు నెరవేరలేదని గుర్తు చేశారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, రుణ మాఫీపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌ 5 రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపేలా లేదని తెలిపారు. గతంలో ప్రకటించిన బుల్లెట్‌ రైలు ప్రతిపాదన ఏమైందని రాహుల్‌ ప్రశ్నించారు. ప్రధాన సమస్యగా ఉన్న రైల్వే భద్రతపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం శోచనీయమన్నారు.

15:38 - February 1, 2017

ఢిల్లీ : దేశంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయింపు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 57,676 కోట్ల కోటాయించగా, 2017-18లో దీనిని 64 వేల కోట్లకు పెంచారు. 2017-18 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. రాజకీయ పార్టీ విరాళాలకు చెక్‌ పెట్టే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. నగదు రూపంలో రెండు వేల రూపాయలకు మించి విరాళాలు తీసుకోకుండా ఆంక్షలు విధించింది. నల్లధనం నిరోధించేందు ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే చాలా మంది చెక్‌లు ఇవ్వడంలేదు. చెక్‌లు ఇస్తే తమ గుట్టు రట్టు అవుతుందన్న ఉద్దేశంతో నగదు ఇస్తున్నారు. రాజకీయ విరాళాల కోసం ఎలక్ట్రానిక్‌ బాండ్ల జారీ విధానాన్ని తీసుకొస్తున్నారు. విరాళాలు ఇవ్వదలచుకున్నవారు బ్యాంకుల నుంచి ఈ బాండ్లు కొనుగోలు చేయొచ్చు. ఈ మేరకు ఆర్‌బీఐ చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని పార్టీ ఏటా క్రమంతప్పకుండా ఆదాయపన్ను వివరాలు దాఖలు చేయాలన్న నిబంధన విధిస్తున్నారు.

15:37 - February 1, 2017

ఢిల్లీ : అందరూ ఊహించినట్టే జైట్లీ ఎన్నికల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఐదు రాష్ర్టాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వడ్డింపులు లేని బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. దాదాపు అన్ని రంగాలకు సమ ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. డిజిటలైజేషన్‌ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మూడు లక్షల పరిధి దాటే నగదు లావాదేవీలపై ఆంక్షలు విధించారు. రాజకీయ పార్టీలన్నింటినీ ఐటీ పరిధిలోకి తీసుకొచ్చారు. రెండు వేలకు మించిన విరాళాన్ని డిజిటల్‌ లేదా చెక్కు రూపంలోనే తీసుకోవాలని చెప్పారు. మధ్యతరగతి వర్గాలను కరుణించారు. 3 లక్షల వరకు ఆదాయం కలిగి ఉన్నవారికి పన్ను నుంచి మినహాయింపు నిచ్చారు. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయం కలిగి ఉన్నవారిపై 5 శాతం పన్ను విధించనున్నారు.

21 లక్షల 47వేల కోట్లు..
మొత్తం బడ్జెట్‌ కేటాయింపులు 21 లక్షల 47 వేల కోట్లు కాగా... రక్షణ రంగానికి 2 లక్షల 74 వేల 114 కోట్లు కేటాయించారు. శాస్త్ర,సాంకేతిక రంగానికి 2లక్షల 37వేల 435 కోట్లు కేటాయించినట్లు జైట్లీ తెలిపారు. రెవిన్యూ లోటు 2.1 శాతానికి తగ్గించారు. ఆదాయం కోటి దాటితే 15 శాతం సర్‌ఛార్జ్‌ విధించనున్నట్లు జైట్లీ తెలిపారు. గతంలో 10 శాతంగా ఉన్న ఆదాయ పన్నును 5 శాతానికి తగ్గించారు.

మధ్యతరగతి...
ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మధ్యతరగతి వర్గాలను కరుణించారు. 2.5 లక్షల వరకు ఆదాయం కలిగి ఉన్నవారికి పన్ను నుంచి మినహాయింపు నిచ్చారు. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయం కలిగి ఉన్నవారిపై 5 శాతం పన్ను విధించనున్నారు. 50 లక్షల నుంచి కోటి రూపాయలు ఆదాయం ఉన్నవారికి 10 శాతం పన్ను, కోటికి పైగా ఆదాయం కలిగివారికి 15 శాతం సర్‌చార్జి విధించనున్నట్లు జైట్లీ ప్రకటించారు.

ఏపీ అమరావతి రైతులకు..
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చిన రైతులకు క్యాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌ను రద్దు చేసింది. 2014 జూన్‌ 2 వ తేదీ నుంచి ఇది వర్తిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వాణిజ్య, నివాస స్థలాలు కేటాయిస్తోంది. వీటిని అమ్ముకునే వారి నుంచి క్యాపిట్‌ గెయిన్‌ టాక్స్‌ను వసూలు చేయరు.

వ్యవసాయం రంగం..
బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. కృషి విజ్ఞాన కేంద్రాల్లో మినీ ల్యాబ్‌ల ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ చెప్పారు. డెయిరీల అభివృద్ధికి 80వేల కోట్లు , ఉపాధి హామీ పథకానికి 48 వేల కోట్లు, పంటల బీమా పథకానికి 13 వేల కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. సాగునీటి సౌకర్యాల కోసం 40 వేల కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాబార్డుతో సహకార బ్యాంకుల అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు.

కుష్టు వ్యాధి..
2018 లోగా కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. వైద్య విద్య, ప్రాక్టీసుకు సంబంధించి పకడ్బంది చర్యలు చేపట్టనున్నట్లు జైట్లీ తెలిపారు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నట్లు జైట్లీ తెలిపారు. అందులో భాగంగా ఏటా ఐదు వేల పీజీ వైద్య సీట్లను పెంచుతున్నట్లు తెలిపారు. జిల్లా, మునిసిపల్ ఆసుపత్రుల్లో సరిపడా వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు జైట్లీ చెప్పారు. జార్ఖండ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో రెండు జాతీయ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఫార్మా, డ్రగ్స్‌ నియంత్రణకు చట్టానికి సవరణలు తేనున్నట్లు జైట్లీ ప్రకటించారు.

భారత్ ఆర్థిక వ్యవస్థ..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. గతేడాది మొదట్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 1 లక్షా 7 వేల కోట్ల నుంచి 1 లక్షా 45 వేల కోట్లకు పెరిగిందని జైట్లీ తెలిపారు. జనవరి 20 నాటికి విదేశీ మారక నిల్వలు 361 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ అంచనాల ప్రకారం 2017లో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్లనుందని ఆయన చెప్పారు. 

రైల్వే శాఖ..బడ్జెట్..
కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖకు లక్షా 31 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీనిలో ప్రభుత్వం 55 వేల కోట్ల రూపాయాల ఆర్థిక సహాయం అందిస్తుంది. మిగిలింది  రైల్వేలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రైల్వే భద్రత కోసం ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చ చేయాలని నిర్ణయించారు. 2020 నాటికి కాపలాలేని అన్ని లెవల్‌ క్రాసింగ్‌లను  తీసివేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడున్నర వేల కిలో మీటర్ల రైలుమార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ టిక్కెట్లు బుక్‌ చేసుకునే రైలు ప్రయాణికులకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ టికెట్ల బుకింగ్‌పై వసూలు చేస్తున్న సర్వీస్‌ చార్జీని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. నగదు రహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. సర్వీసు చార్జీల రద్దుతో  ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్‌ను ప్రస్తుతం ఉన్న 58 శాతాన్ని 68 శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 

యువత కోసం ఉపాధి..
యువత కోసం ఉపాధి చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. 2017-18 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. దేశవ్యాప్తంగా 100 ఇండియా ఇంటర్నేషనల్‌ స్కిల్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. ప్రత్యేక పథకం ద్వారా టెక్స్‌టైల్‌ రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రధానమంత్రి కౌసలా స్కీమ్‌ను దేశవ్యాప్తంగా 600 జిల్లాలకు విస్తరింపజేయనున్నట్లు జైట్లీ తెలిపారు.

మహిళా సంక్షేమానికి..
మహిళా సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 2017-18 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. మహిళల కోసం మోదీ సర్కార్‌ అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాలికా సమృద్ధి కోసం అనేక చర్యలు చేపడుతున్నట్లు జైట్లీ తెలిపారు. 14 లక్షల ఐసీడీఎస్‌ అంగన్‌వాడి కేంద్రాల్లో రూ. 500 కోట్లతో  మహిళా శక్తి  కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ తెలిపారు.  గ్రామీణ మహిళా సంక్షేమం కోసం డిజిటల్‌ లిటరసీ, స్కిల్‌ డెవలప్‌మెంట్ ట్రైనింగ్‌ కార్యక్రమాలు చేపడుతున్నట్లు జైట్లీ చెప్పారు. గర్భిణీలకు 6 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు.

రహదారులు..పార్టీల విరాళాలు..
దేశంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయింపు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 57,676 కోట్ల కోటాయించగా, 2017-18లో దీనిని 64 వేల కోట్లకు పెంచారు. 2017-18 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. రాజకీయ పార్టీ విరాళాలకు చెక్‌ పెట్టే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. నగదు రూపంలో రెండు వేల రూపాయలకు మించి విరాళాలు తీసుకోకుండా ఆంక్షలు విధించింది. నల్లధనం నిరోధించేందు ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే చాలా మంది చెక్‌లు ఇవ్వడంలేదు. చెక్‌లు ఇస్తే తమ గుట్టు రట్టు అవుతుందన్న ఉద్దేశంతో నగదు ఇస్తున్నారు. రాజకీయ విరాళాల కోసం ఎలక్ట్రానిక్‌ బాండ్ల జారీ విధానాన్ని తీసుకొస్తున్నారు. విరాళాలు ఇవ్వదలచుకున్నవారు బ్యాంకుల నుంచి ఈ బాండ్లు కొనుగోలు చేయొచ్చు. ఈ మేరకు ఆర్‌బీఐ చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని పార్టీ ఏటా క్రమంతప్పకుండా ఆదాయపన్ను వివరాలు దాఖలు చేయాలన్న నిబంధన విధిస్తున్నారు.

15:34 - February 1, 2017

ఢిల్లీ : మహిళా సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 2017-18 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. మహిళల కోసం మోదీ సర్కార్‌ అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాలికా సమృద్ధి కోసం అనేక చర్యలు చేపడుతున్నట్లు జైట్లీ తెలిపారు. 14 లక్షల ఐసీడీఎస్‌ అంగన్‌వాడి కేంద్రాల్లో రూ. 500 కోట్లతో మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ తెలిపారు. గ్రామీణ మహిళా సంక్షేమం కోసం డిజిటల్‌ లిటరసీ, స్కిల్‌ డెవలప్‌మెంట్ ట్రైనింగ్‌ కార్యక్రమాలు చేపడుతున్నట్లు జైట్లీ చెప్పారు. గర్భిణీలకు 6 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు.

15:32 - February 1, 2017

ఢిల్లీ : యువత కోసం ఉపాధి చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. 2017-18 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. దేశవ్యాప్తంగా 100 ఇండియా ఇంటర్నేషనల్‌ స్కిల్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. ప్రత్యేక పథకం ద్వారా టెక్స్‌టైల్‌ రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రధానమంత్రి కౌసలా స్కీమ్‌ను దేశవ్యాప్తంగా 600 జిల్లాలకు విస్తరింపజేయనున్నట్లు జైట్లీ తెలిపారు.

15:30 - February 1, 2017

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖకు లక్షా 31 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీనిలో ప్రభుత్వం 55 వేల కోట్ల రూపాయాల ఆర్థిక సహాయం అందిస్తుంది. మిగిలింది రైల్వేలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రైల్వే భద్రత కోసం ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చ చేయాలని నిర్ణయించారు. 2020 నాటికి కాపలాలేని అన్ని లెవల్‌ క్రాసింగ్‌లను తీసివేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడున్నర వేల కిలో మీటర్ల రైలుమార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ఆన్ లైన్ లో..
ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ టిక్కెట్లు బుక్‌ చేసుకునే రైలు ప్రయాణికులకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ టికెట్ల బుకింగ్‌పై వసూలు చేస్తున్న సర్వీస్‌ చార్జీని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. నగదు రహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. సర్వీసు చార్జీల రద్దుతో ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్‌ను ప్రస్తుతం ఉన్న 58 శాతాన్ని 68 శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

15:22 - February 1, 2017

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చిన రైతులకు క్యాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌ను రద్దు చేసింది. 2014 జూన్‌ 2 వ తేదీ నుంచి ఇది వర్తిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వాణిజ్య, నివాస స్థలాలు కేటాయిస్తోంది. వీటిని అమ్ముకునే వారి నుంచి క్యాపిట్‌ గెయిన్‌ టాక్స్‌ను వసూలు చేయరు.

15:20 - February 1, 2017

ఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మధ్యతరగతి వర్గాలను కరుణించారు. 2.5 లక్షల వరకు ఆదాయం కలిగి ఉన్నవారికి పన్ను నుంచి మినహాయింపు నిచ్చారు. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయం కలిగి ఉన్నవారిపై 5 శాతం పన్ను విధించనున్నారు. 50 లక్షల నుంచి కోటి రూపాయలు ఆదాయం ఉన్నవారికి 10 శాతం పన్ను, కోటికి పైగా ఆదాయం కలిగివారికి 15 శాతం సర్‌చార్జి విధించనున్నట్లు జైట్లీ ప్రకటించారు.

14:50 - February 1, 2017

2017-18 రైల్వే బడ్జెట్ రూ. 1,31,000 కోట్లు.

 • వికలాంగులకు అనుకూలంగా ఉండేలా 500 రైల్వే స్టేషన్లు.
 • ఐఆర్టీసీ ద్వారా బుక్ చేసే రైల్వే టికెట్లకు సర్వీస్ ట్యాక్స్ లేదు.
 • రైల్వే ప్రయాణీకుల భద్రతకు రూ. లక్ష కోట్లు కేటాయింపు.
 • రైల్వేలు, రోడ్లు, విమానయానికి రూ. లక్షా 31 వేల కోట్లు.
 • 2019 నాటికి అన్ని రైల్వేల్లో బయో టాయ్ లెట్స్
 • కొత్తగా 3,500 కిలోమీటర్ల రైల్వే లైన్లు.
 • కొత్త మెట్రోరైలు చట్టాన్ని తీసుకొస్తాం.
 • 2020 నాటికి మానవరహిత లెవల్ క్రాసింగ్ లు ఉండవు.
 • 3500 కి.మీటర్ల రైల్వే లైన్ల విస్తరణ.
 • 7వేల రైల్వే స్టేషన్ లలో సోలార్ విద్యుత్ వినియోగం.
 • రైల్వేలో ప్రయాణికుల భద్రతకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు,
 • ఆధ్యాత్మిక, పర్యాటకానికి ప్రత్యేకంగా రైళ్లు.
 • ఐఆర్ సీఓఎన్, ఐఆర్ సీటీసీ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు.
 • ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ కు రూ. 2.41 కోట్ల కేటాయింపు.
 • భారత్ నెట్ ప్రాజెక్టుకు రూ. 10 వేల కోట్ల నిధులు.
14:45 - February 1, 2017

బడ్జెట్ 2017-18 హైలెట్స్..
హైదరాబాద్ : 2017-18 బడ్జెట్ వచ్చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. తొలిసారి సాధారణ బడ్జెట్ తో కలిపి రైల్వే బడ్జెట్ సమర్పించారు. 17-18 బడ్జెట్ రూ. 21 లక్షల 47 వేల కోట్లుగా నిర్ణయించారు. నల్లధనంపై యుద్ధాన్ని ప్రకటించామని, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యవయాల విభజన ఉండదని మంత్రి జైట్లీ వెల్లడించారు. పారదర్శకతే తమ ధ్యేయమని, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగింద

 • మౌలిక రంగానికి రూ. 3,96,135 కోట్లు.
 • గృహ నిర్మాణ రంగానికి రూ. లక్షా 84వేల 632 కోట్లు.
 • గ్రామీణ విద్యుద్దీకరణ కోసం రూ. 4,814 కోట్లు.
 • గ్రామీణ వ్యవసాయ రంగానికి రూ. 1,87,223 కోట్లు.
 • రహదారుల నిర్మాణానికి రూ. 64వేల కోట్లు.
 • గిరిజనులకు రూ. 31, 920 కోట్లు.
 • వెనుకబడిన కులాలకు రూ. 52,393 కోట్లు.
 • మైనార్టీలకు రూ. 4,193 కోట్లు.
 • ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు రూ. 19,100 కోట్లు.
 • ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజనకు రూ. 23 వేల కోట్లు.
 • దీన్ దయాళ్ గ్రామ్ జ్యోతి యోజన కింద రూ. 4,814 కోట్లు.
 • అంత్యోదయ యోజనకు రూ. 2500 కోట్లు.
 • మైకో ఇరిగేషన్ కోసం రూ. 5వేల కోట్లు.
 • పోస్టాఫీసుల ద్వారా పాస్ పోర్టు దరఖాస్తుల స్వీకరణ.
 • రక్షణ రంగానికి రూ. 2లక్షల 74వేల కోట్లు.
 • సాగునీటి సౌకర్యం కోసం రూ. 40వేల కోట్లతో కార్ఫస్
 • జాతీయ ఉపాధి హమీ పథకానికి రూ. 48 వేల కోట్లు.
 • ఎస్సీల సంక్షేమానికి రూ. 52,393 కోట్లు.
 • ఎస్టీల అభివృద్ధికి రూ. 31,920 కోట్లు.
 • రూ. 3 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు.
 • రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 5 శాతం పన్ను.
 • రూ. 3 లక్షలకు మించి నగదు లావాదేవీలకు అనుమతి లేదు.
 • రాజకీయ పార్టీలకు నగదు విరాళం రూ. 2 వేలకే పరిమితం.
 • గృహాలకు రుణాలిచ్చే బ్యాంకులకు జాతీయ హౌసింగ్ బ్యాంకు ద్వారా రూ. 20 వేల కోట్లు కేటాయింపు.
 • పీవోఎస్, ఐరిస్ లీడర్, ఆధార్ యంత్రాలకు పన్ను తగ్గింపు.
 • క్యాపిటల్ గెయిన్స్ పరిధి రెండేళ్లకు కుదింపు.
 • 2025 నాటికి క్షయవ్యాధి నిర్మూలనకు చర్యలు.
 • చిన్న కంపెనీలకు 5 శాతం ఆదాయపు పన్ను తగ్గింపు.
 • రూ. 5 కోట్ల టర్నోవర్ లోపు ఉన్న కంపెనీలకు ఒక శాతం కార్పొరేట్ పన్ను మినహాయింపు.
 • ఫిల్టర్ సిగరేట్లపై అదనపు సుంకం.
 • పాన్ మసాలపై సుంకం 6 నుండి 9 శాతానికి పెంపు.
 • ఫిల్టర్ రహిత సిగరేట్లపై అదనపు సుంకం.
 • కింగ్ సైజ్ సిగరేట్లపై సుంకం పెంపు.
 • ఖైనీ, జర్దా, గుట్కాపై సుంకం 6 నుండి 12 శాతానికి పెంపు.
 • బీడీలపై సుంకం పెంపు.
 • భూసార పరీక్షలకు కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో మినీ ల్యాబ్ లు.
 • 63వేల ప్రాథమిక సహకార సంఘాలు కంప్యూటీకరణ.
 • రూ. 10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు.
 • నాబార్డుతో వ్యవసాయ సహకార సంఘాల అనుసంధానం.
13:48 - February 1, 2017

ఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ అని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన బడ్జెట్ పై మాట్లాడుతూ... బడ్జెట్ చదవు నుంచి ఆరోగ్యం వరకు ప్రతి అంశాన్ని పొందుపరిచామన్నారు. ఈబడ్జెట్ దేశాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. బడ్జెట్ లో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. బడ్జెట్ లో అసంఘటిత రంగ కార్మికులు భరోసా ఇచ్చామన్నారు. వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనకు ఈ బడ్జెట్ లో పెద్ద పీట వేశామని ప్రధాని పేర్కొన్నారు.

13:32 - February 1, 2017

హైదరాబాద్: సామాన్యులకు మాటలు.. సంపన్నులకు రాయితీలు కల్పిస్తూ, సామాన్యులకు నిర్ధిష్టంగా చేసింది ఏమీ లేదని సీపీఎం జాతీయ నేత శ్రీనివాసరావు విమర్శించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉందని కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో మంత్రి జైట్లీ ప్రవేశపెడుతూ తెలిపారు. జ2017-18 బడ్జెట్ రూ. 21 లక్షల 47కోట్లు, రక్షణ రంగానికి రూ. 2లక్షల 74వేల కోట్లు, మౌలిక రంగానికి రూ.3,961.135 కోట్లు, గ్రామీణ వ్యవసాయరంగానికి రూ.1,87,223 కోట్లు, జనవరి 20 నాటికి విదేశీ మారక నిల్వలు 361 బిలియన్ డాలర్లకు చేరాయని, ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2017లో అభివృద్ధి శరవేంగా దూసుకుపోతోంది. నోట్ల రద్దు, జీఎస్టీ లే పెద్ద వ్యవస్థగా తయారయిందని జైట్లీ తెలిపారు. ఈ బడ్జెట్ లో సామాన్యులకు పేర్కొన్న అంశాలు, సంపన్నులకు రాయితీలు .. సాధ్యాసాధ్యాలు ఈ అంశంపై 10 టివిలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆర్థిక రంగ నిపుణులు శిశికుమార్, రైల్వే ఎంప్లాయిస్ నేత శివకుమార్, బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ నేత , సీనియర్ విశ్లేషకులు నగేష్, సీపీఎం జాతీయ నేత వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆసక్తికరమైన చర్చను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

శుక్రవారానికి లోక్ సభ వాయిదా..

ఢిల్లీ: లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ఎంపీ ఇ.అహ్మద్‌ మృతి పట్ల లోకసభ సంతాపం ప్రకటించింది. అనంతరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన వెంటనే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను వాయిదా వేశారు.

దాసరిని పరామర్శించిన జగన్

హైదరాబాద్: తీవ్ర అస్వస్థతతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ రోజు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన జగన్... దాసరిని కలిశారు. ఆ తర్వాత ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దాసరి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ వెంట పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు నేతలున్నారు.

అమరావతి రైతులకు శుభవార్త...

న్యూఢిల్లీ: అమరావతి రైతులకు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శుభవార్త చెప్పారు. అమరావతి ప్రాంతంలో ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్ మినహాయింపు ఇస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు.

ఎస్సీల అభివృధ్ధి కి రూ.52వేల కోట్లు...

ఢిల్లీ: దేశంలోని ఎస్సీల అభివృద్ధికి 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.52వేల కోట్ల కేటాయింపు చేస్తున్నట్లు ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు. వీరితో బాటుగా మైనార్టీలు, వెనుకబడినవారికి, మహిళల కోసం రూ.2.44లక్షల కోట్ల రుణం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

రక్షణ రంగం.. కేటాయింపులు...

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేటి బ‌డ్జెట్‌ లో ర‌క్ష‌ణ రంగానికి ఈ ఏడాది 2.74 ల‌క్ష‌ల కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్ల‌డించారు. డిఫెన్స్‌కు చెందిన పెన్ష‌న‌ర్ల కోసం వెబ్ ఆధారంగా పెన్ష‌న్లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. త్రివిధ ద‌ళాల‌కు చెందిన వ్య‌క్తులు టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసేందుకు కేంద్రీకృత డిఫెన్స్ ట్రావెల్ సిస్ట‌మ్‌ను డిజైన్ చేశారు.

మహిళల, పిల్లల సంక్షేమ రంగానికి 1,84,362 కోట్లు :జైట్లీ

ఢిల్లీ: : మహిళల, పిల్లల సంక్షేమ రంగానికి పెట్టుబడులను 1,84,362 కోట్లకు పెంచామన్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్ప‌ష్టం చేశారు. ఇవాళ లోక్‌స‌భ‌లో కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆయ‌న ఈ అంశాన్ని వెల్ల‌డించారు. జార్ఖండ్‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లో ఎయిమ్స్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. రోడ్ల నిర్మాణం వేగం పెంచామన్నారు. ప్రతి రోజూ 133 కిలోమీటర్ల కొత్త రోడ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు.

నిజాయితీగా పన్నులు చెల్లిస్తే వేధింపులు ఉండవు :జైట్లీ

ఢిల్లీ : నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి వేధింపులు ఉండవని పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగంలో మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 10 కీలక అంశాలో ఈ బడ్జెట్ లో దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. అవి1. రైతుల ఆదాయం వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయడం.

2. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఉపాధిని కల్పించేలా మౌలిక వసతులు, పెట్టుబడులు.

3. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం నిర్ణయాలు.

4. పేదలు, బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం, వారికి గృహ నిర్మాణం.

5. ఉత్పాదకత, ప్రజల జీవనంలో క్వాలిటీ పెంచేలా ఇన్ ఫ్రాస్ట్రక్చచర్ రూపకల్పన.

2017లో ఆర్థిక వృద్ధి రేటు పెరిగే అవకాశం:జైట్లీ

ఢిల్లీ : 2017 లో ఆర్థిక వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. 2017-18 కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నోట్ల రద్దు, జీఎస్టీ సాహసోపేతమై నిర్ణయాలు అని తెలిపారు. నోట్ల రద్దు వల్ల దీరక్షకాలిక ప్రయోజనాలు అని, నోట్ల రద్దు వల్ల బ్యాంకులు బలోపేతం అయ్యాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులపై ఫోకస్ పెట్టామన్నారు. ముడిచమురు ధరల్లో ఒడిదుడుకులు ఎదురయ్యాయని, ముద్ర యోజన కింద పేదలు, మహిళలు, యువత, సీనియర్ సిటిజన్లు ఎంతో లబ్ధి పొందారు.

యువశక్తి ఆకాంక్షలు నెరవేర్చాలా బడ్జెట్ : జైట్లీ

ఢిల్లీ: బడ్జెట్‌ 2017-18ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే లోక్‌సభ సభ్యుడు అహ్మద్‌ మృతి పట్ల సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు బడ్జెట్‌ సమర్పణను వాయిదా వేయాలని కోరినప్పటికీ స్పీకర్‌ అనుమతించలేదు. అనంతరం జైట్లీ బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చాం. పెద్ద నోట్ల రద్దుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు. నల్లధనంపై యుద్ధాన్ని ప్రకటించాం. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల విభజన ఉండదు. పారదర్శకతే మా ధ్యేయం. ప్రభుత్వం పై ప్రజలకు నమ్మం పెరిగింది. గత రెండేళ్లలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం.

లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న జైట్లీ

ఢిల్లీ: లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెడుతున్నారు. తొలిసారిగా సాధారణ బడ్జెట్ తో పాటు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.

సభ వాయిదా వేయాలి: కాంగ్రెస్

ఢిల్లీ: ఎంపి అహ్మద్ మృతికి సంతాపంగా సభను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన స్పీకర్ కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో సభను వాయిదా వేయడం లేదని తెలిపారు. అయినా కాంగ్రెస్ సభ్యులో సభలో ఆందోళన చేపట్టారు. అయినా స్పీకర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని మంత్రి జైట్లీని కోరగా సభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.

టీడీపీలో చేరనున్న మహ్మద్ జానీ!

అమరావతి : త్వరలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ్మద్ జానీ టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం టిడిపి నేత కళా వెంకట్రావుతో చర్చ జరిపినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో సీఎం చంద్రబాబుతో జానీతో భేటీ కాన్నట్లు తెలుస్తోంది. మరో నేత చంగల్రాయుడు కూడా టిడిపిలో చేరుతున్నట్లు మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే: లోక్ సభ స్పీకర్

ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ యథాతథంగా ఉంటుందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. అనుకున్న సమయం ప్రకారం ఇవాళ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వర్గం కూడా బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఎంపీ అహ్మద్ మృతి పట్ల స్పీకర్ సంతాపం ప్రకటించారు.

పార్లమెంట్ కు చేరిన బడ్జెట్ పత్రాలు

ఢిల్లీ: ఆర్థిక శాఖ కార్యాలయం నుండి బడ్జెట్ పత్రాలు పార్లమెంట్ కు చేరుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్రపతి కార్యాలయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ఎంపి అహ్మద్ మృతికి సంతాపం తెలిపిన తరువాత బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రయత్నిస్తోంది. కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ లో ఆమోదం పొందిన తరువాత లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు.

సీబీఐ చీఫ్ గా అలోక్ వర్మ బాధ్యతలు

ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చీఫ్ అలోక్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. 1979 ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన అలోక్ వర్మ అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం రాష్ర్టాల్లో విధులు నిర్వర్తించారు. తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ (డీజీ)గా సేవలు అందించారు.

నేడు బడ్జెట్ యథాతథం

ఢిల్లీ: నేడు కేంద్ర బడ్జెట్ యథాతథంగా జరుగుతుందని అన్ని పార్టీలకు స్పీకార్యాలయం తెలియజేసింది. ఎంపి అహ్మద్ మృతి తో బడ్జెట్ వాయిదా పడుతుందేమోనని వచ్చిన వార్తలకు ఎట్టకేలకు తెరపడింది.

నేడు ఇంగ్లండ్ తో చివరి టీ 20

హైదరాబాద్: నేడు బెంగళూరు చిన్న‌స్వామి స్టేడియంలో జ‌ర‌గ‌నున్న చివ‌రి టీ20లో నెగ్గ‌డం ద్వారా ఈ టూర్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని కోహ్లీసేన భావిస్తోంది. అంతేకాదు, ఈ గెలుపుతో కోహ్లీ ఖాతాలో హ్యాట్రిక్ సిరీస్‌లు చేరుతాయి. మ‌రోవైపు ఈ మ్యాచ్‌లో నెగ్గ‌డం ద్వారా టీ20 సిరీస్‌ను ద‌క్కించుకుని ప‌రువు కాపాడుకోవాల‌ని మోర్గాన్ సేన భావిస్తోంది.

ఎంపీ అహ్మద్ మృతి.. ప్రధాని సంతాపం

ఢిల్లీ: ఎంపీ అహ్మద్ మృతికి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ఆయన సేవలను గుర్తుచేస్తూ కొనియాడారు. కేరళ రాష్ట్ర ప్రగతికి అదేవిధంగా ముస్లిం సమాజ అభ్యున్నతికి అహ్మద్ ఎంతగానో కృషిచేశారన్నారు. పశ్చిమాసియా దేశాలతో సంబంధాల విషయంలో ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.

 

రాష్ట్రపతి భవన్‌కు జైట్లీ

ఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ కొద్దిసేపటి క్రితం తన కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరారు. నేడు ఆయన పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందుకు ఆర్థికమంత్రి రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీగా వస్తోంది.

09:36 - February 1, 2017

మొహకవళికలతో.. కాదు కాదు కంఠంతో హాస్యం తెప్పించే హాస్య బ్రహ్మా పుట్టిన రోజు నేడు. ఈయన పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. బ్రహ్మానందం గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో 1956 ఫిబ్రవరి 1న జన్మించారు. అక్కడి శరభయ్య గుప్తా హిందూ హైస్కూల్‌లో చదువుతున్న సమయంలోనే సినిమా హీరోల్ని, నటుల్ని మిమిక్రీ చేసి అలరించేవారు. మనిషి కనిపించకపోయినా కంఠం వినిపిస్తే చాలా నవ్వులు పువ్వులే. సినిమా హిట్ కాకపోయినా కానీ బ్రహ్మానందం పాత్రలను మాత్రం మార్చిపోలేనివి. వైవిధ్యమైన పాత్రల్లో ఆయన అలరించిన విధానం అటువంటిది. అరగుండు, ఖాన్‌దాదా, నెల్లూరు పెద్దారెడ్డి, శాస్త్రి, చారి, హల్వారాజ్‌, ప్రణవ్‌, బాబీ, మెక్‌డోనాల్డ్‌ మూర్తి, పద్మశ్రీ.. ఇలా నవ్వుల జ్ఞాపకాలు. నేడు బ్రహ్మానందం పుట్టినరోజు జరుపుకొంటున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు.

బ్రహ్మానందం సత్తెనపల్లి సమీపంలో శరభయ్య గుప్తా హిందూ హైస్కూల్‌లో చదువుతున్న సమయంలోనే సినిమా హీరోల్ని, నటుల్ని మిమిక్రీ చేసి అలరించేవారు. ఎం.ఎ. చేసిన ఆయన పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలిలో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. విద్యార్థులకు పాఠాలు కథలుగా చెప్పి, జోక్స్‌వేసి నవ్వించేవారు. ఆయన పాఠం చెబుతుంటే.. తరగతి గది థియేటర్‌గా మారిపోయేది. ఆ జీతం సరిపోయేది కాదు కాబట్టి.. మిమిక్రీ ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు.

‘శ్రీతాతావతారం’ మొదటగా సినిమాలో అవకాశం దక్కించుకుని అందులో హీరో నరేష్‌ స్నేహితుల్లో ఒకరిగా నటించారు. అలా తన పుట్టినరోజు ఫిబ్రవరి 1న నరేష్‌తో కలిసి తొలి షాట్‌లో నటించారు. అలా మొదలైన ఆయన సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. స్వల్పకాలములోనే వివిధ భాషలలో 900 కి పైగా సినిమాలలో తన హాస్యంతో అలరించిన బ్రహ్మానందం గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించుకున్నారు.రేలంగి, అల్లు రామలింగయ్య తర్వాత హాస్యనటుల్లో ‘పద్మశ్రీ’ అందుకున్నది బ్రహ్మానందమే.

09:04 - February 1, 2017

హైదరాబాద్: గౌతమీపుత్ర శాతకర్ణి దర్శక నిర్మాతలు, పంపిణీదారుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డైరెక్టర్ క్రిష్, నిర్మాత వై.రాజీవ్ రెడ్డిల ఇళ్ళు, ఆఫీసులపై మంగళవారం దాడులు జరిపిన అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, బెబో శ్రీనివాస్ సుమారు 45 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తీశారు. అయితే ఈ సినిమా వసూళ్ళ వివరాలను రహస్యంగా ఉంచారు. ఈ చిత్ర నైజాం ప్రాంత హక్కులను కొన్న డిస్ట్రిబ్యూటర్ సుధాకర రెడ్డి ఇంటిలో సుమారు ఎనిమిది గంటల పాటు సోదాలు జరిగాయట. ఇదిలా ఉండగా ఇవి సర్వేలు మాత్రమేనని, దాడులు కావని ఐటీ వర్గాలు ఆ తరువాత తెలిపాయి. ఈ సినిమా వసూళ్ళకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి.

08:59 - February 1, 2017

హైదరాబాద్: తోబతోబ.. రత్తాలు రత్తాలు వంటి స్పెషల్‌సాంగ్స్‌తో టాలీవుడ్ ఆడియన్స్‌ని అలరించింది హీరోయిన్ లక్ష్మీరాయ్ ఎన్టీఆర్ న్యూప్రాజెక్ట్ 'జై లవకుశ'లోనూ ఐటమ్ సాంగ్ కి సెలెక్ట్ చేసినట్లు ఫిల్మనగర్ నుంచి అందుతున్న సమాచారం. మొదట కాజల్ ని తీసుకోవాలని చిత్ర యూనిట్ అనుకున్నప్పటికీ లక్ష్మీ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం.మరోవైపు లారెన్స్ చేస్తున్న ఓ తమిళ ఫిల్మ్‌లోనూ రాయ్ ఓ స్పెషల్‌గా సాంగ్ చేస్తున్నట్లు సమాచారం.

08:50 - February 1, 2017

భద్రాచలం : తెలంగాణలో సామాజిక న్యాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చకు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ నేతలు తమపై అసత్య ఆరోపణలు చేసి.. చర్చలకు రాకుండా పిరికిపందల్లా పారిపోతున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే కేసీఆర్‌, కేటీఆర్‌ తమ సవాల్‌పై చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు.

.ప్రజలకు చేసిందేమి లేదు...

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయినా..ప్రజలకు చేసిందేమి లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలు సంతోషంగా లేరని ఆయన అన్నారు. సామాజిక న్యాయంపై కేసీఆర్‌ చర్చకు రావాలని తమ్మినేని వీరభద్రం సవాల్‌ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే తమ సవాల్‌పై చర్చకు సిద్ధమవ్వాలన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు తమపై అసత్య ఆరోపణలు చేసి.. చర్చలకు రాకుండా పిరికిపందల్లా పారిపోతున్నారని ఆరోపించారు. తక్షణమే కేసీఆర్‌, కేటీఆర్‌ తమ సవాల్‌పై చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు.

వైద్య, విద్య సౌకర్యాలు లేక ......

రాష్ట్రంలో కనీస వైద్య, విద్య సౌకర్యాలు లేక పేదలు అలమటిస్తున్నారని, బంగారు తెలంగాణ అని చెబుతున్న కేసీఆర్‌ పేదలకు కనీస విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించడం లేదని తమ్మినేని ధ్వజమెత్తారు. పరిశ్రమలు స్థాపిస్తే ఉద్యోగాలు వస్తాయని.. అలా చేయకుండా కేసీఆర్‌ కాలం వెల్లబుచ్చుతున్నారని తమ్మినేని ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని రద్దు చేసే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు రాశానని తమ్మినేని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు కోసం అవసరమైతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని తమ్మినేని హెచ్చరించారు. తెలంగాణ పల్లెలను పలకరిస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 107 రోజులు పూర్తి చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తోన్న తమ్మినేని బృందానికి పల్లెపల్లెలో అపూర్వ స్వాగతం లభిస్తోంది.

వైభవంగా వసంత పంచమి వేడుకలు...

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వ‌సంతి పంచ‌మి వేడుకలు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. భక్తులు ఉద‌యాన్నే ఆల‌యాల‌కు చేరుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు. విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన దుర్గ‌మ్మ.. స‌రస్వ‌తీ అలంక‌ర‌ణ‌లో భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. బాస‌ర‌లోనూ వ‌సంత పంచ‌మి వేడుక‌లు వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. జ్ఞాన స‌ర‌స్వ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు బారులు తీరారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి మూడు గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. ఆల‌యంలో అక్ష‌రాభ్యాస కార్య‌క్ర‌మాలు జోరందుకున్నాయి.

కేంద్ర బడ్జెట్ వాయిదా పడే అవకాశం?!

హైదరాబాద్:ఇండియన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు, ఎంపీ ఇ. అహ్మద్(78) మృతి నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో ఎంపి అహ్మద్ కు సంతాపం ప్రకటించిన అనంతరం సభ రేపటికి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే 2016-17 బడ్జెట్ ఆర్థిక సర్వేను సభలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశ పెట్టారు కనుక బడ్జెట్ వాయిదా వేసే అవకాశం లేదని కూడా తెలుస్తోంది. దీనిపై స్పీకర్ సుమిత్రా మహాజన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

08:17 - February 1, 2017

హైదరాబాద్ :లోక్‌సభ ఎంపీ ఇ.అహ్మద్‌ మృతి కారణంగా బడ్జెట్‌ వాయిదా పడే అవకాశాలున్నట్లు వచ్చిన వార్తలను ఆర్థికశాఖ వర్గాలు తోసిపుచ్చాయి. ఆర్థికమంత్రి జైట్లీ ఈరోజు పార్లమెంటు బడ్జెట్‌ ప్రవేశపెడతారని స్పష్టం చేశారు. లోకసభ ప్రారంభం కాగానే ఇ.అహ్మద్‌ మృతికి సంతాపం తెలిపి.. తర్వాత జైట్లీ బడ్జెట్‌ ప్రవేశపెడతారని ఆర్థికశాఖ తెలిపింది.

 

నేడు కేంద్ర బడ్జెట్....

ఢిల్లీ: ప్రజలకు తాయిలాలు ఉంటాయా ? ఆదాయపన్ను పరిమితి పెంచుతారా ? డిజిటల్‌ లావాదేవీలకు రాయితీలు కల్పిస్తారా ? రైతు సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే సాధారణ బడ్జెట్‌ కాసేపట్లో ప్రజల ముందుకు రానుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఉదయం 11 గంటలకు ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో సమర్పించనున్నారు. తరువాత 11.30 గంటలకు రాజ్యసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గత సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ ప్రవేశపెట్టడం విశేషం. కాగా..

07:32 - February 1, 2017

హైదరాబాద్:హెచ్ -1బి వీసా వల్ల తెలుగు వారి పై ఎలాంటి ప్రభావం పడుతోంది.? ట్రంప్ నిర్ణయాలు ప్రపంచంలోనే ఆందోళనలు రేకెత్తిస్తున్నాయా? తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి గవర్నర్‌ నరసింహన్‌ మధ్యవర్తిత్వం వహించబోతున్నారు. ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిఆర్ ఎస్ నేత డాక్టర్ రాకేష్, ఏపీ టిడిపి నేత రామకృష్ణ ప్రసాద్, సీనియర్ విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:29 - February 1, 2017

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, పలువురు సీనియర్‌ నేతలు మాత్రమే ఎన్నికల ప్రచార ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ ప్రధాన కార్యకలాపాల్లో రాహుల్‌గాంధీ చొరవ ఎక్కువగా ఉండాలన్న ఉద్దేశంతోనే సోనియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా సోనియాగాంధీ పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరుకాలేకపోయారు. ఆ సమయంలో రాహుల్‌ పార్టీని ముందుకు నడిపించిన విషయం తెలిసిందే.

07:28 - February 1, 2017

చెన్నై: జల్లికట్టు క్రీడపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జల్లికట్టు చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వానికి జల్లికట్టుపై కొత్త చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. కొత్త చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇచ్చేందుకు తమిళనాడుకు ఆరు వారాల సమయం ఇచ్చింది. జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని ప్రభుత్వానికి సూచించింది. జల్లికట్టు ఆందోళన శాంతియుతంగా జరిగిందని, ఎవరూ చట్టాన్ని అతిక్రమించలేదని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

07:27 - February 1, 2017

పంజాబ్‌ : భటిండా నగరంలోని మౌర్‌ మండీలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్‌ ఎన్నికల ర్యాలీ సందర్బంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మారుతి ఆల్టో కారులో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాంబు పేలుడుతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు వెనక ఉగ్రవాదుల హస్తం ఉందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పేలుడు కలకలం రేపుతోంది.

07:26 - February 1, 2017

జగిత్యాల :వైద్యులు లేక సెక్యూరిటీ గార్డ్‌ అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేస్తున్నాడునుకుంటే పొరపాటు. ఇదిగో పక్కనే డాక్టరమ్మ ఉంది. ఈమె తీరు చూస్తేంటే.. సీనియర్‌ డాక్టర్‌ వైద్యం చేస్తుంటే జూనియర్‌ డాక్టర్‌ పరిశీలిస్తున్నట్లుగా ఉంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకువస్తే సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం చేశాడు. పక్కనే డాక్టర్‌ ఉన్నా కూడా కనీసం ఆమె రోగిని తాకకపోవడం విడ్డూరం.

సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు....

గతంలో కూడా సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఆకస్మిక తనిఖీలు చేసి.. ఒక డాక్టర్‌తో పాటు.. ఇద్దరు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. అయినా సిబ్బంది తీరులో మార్పు రాలేదు. ఎలాంటి అర్హతలు లేని సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం చేయడంతో.. రోగికి ఏదైనా ఎవరు బాధ్యత వహిస్తారు పలువురు ప్రశ్నిస్తున్నారు.

గర్బిణికి వైద్యం చేసిన నర్సు ....

రెండు రోజుల క్రితమే గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లికి చెందిన గర్భిణికి నర్సు వైద్యం చేయడంతో.. పాప మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి ఘటనలో చోటు చేసుకుంటున్నా.. ఇప్పటికీ వైద్యుల తీరులో మాత్రం ఇంకా మార్పు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించుకోవాలి అంటున్న ప్రభుత్వం.....

ప్రజలందరికీ ఆరోగ్యం అందిస్తాం.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించుకునే విధంగా తీర్చుదిద్దుతామని ప్రభుత్వం ఒక పక్క చెబుతుండగా.. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యులు కనీసం ట్రీట్‌మెంట్‌ చేయించకుండా.. సెక్యూరిటీ గార్డ్‌ చేత వైద్యం చేయిస్తున్నారంటే.. ప్రజల ప్రాణాలంటే వారికి ఎంత చులకనో అర్ధమవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

07:23 - February 1, 2017

అనంతపురం : హిందూపురం టీడీపీలో తీవ్ర వివాదం నెలకొంది. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్‌ వైఖరిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే పార్టీ వీడేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. శేఖర్‌ వ్యవహారశైలిపై సమావేశమైన తెలుగు తమ్ముళ్లు.. భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించారు.

ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్లిందంటే..

ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్లిందంటే.. హిందూపురంలో పీఏ శేఖర్‌ అయినా ఉండాలి.. లేదా తామైనా ఉండాలి అన్నంత సీరియస్‌గా మారింది. ఇంతకు తెలుగు తమ్ముళ్లకు బాలకృష్ణ పీఏ శేఖర్‌ మధ్య వివాదం ఏంటంటే.. టీడీపీకి కంచుకోట అయిన హిందూపురంలో నందమూరి వారసుడైన బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిస్తే తమ కష్టాలన్నీ తీరుతాయని ప్రజలు భావించారు. తెలుగు తమ్ముళ్లంతా కలిసి బాలకృష్ణను గెలిపించారు. అయితే తమ సమస్యలు తీరుతాయని భావించిన తెలుగు తమ్ముళ్లకు బాలకృష్ణ పీఏ శేఖర్‌ చెక్‌ పెడుతూ వస్తున్నాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు లంచాలు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు శేఖర్‌పై ఉన్నాయి.

గతంలోనూ శేఖర్‌ వైఖరికి విసుగు చెంది..

గతంలోనూ శేఖర్‌ వైఖరికి విసుగు చెందిన మండలస్థాయి నేతలు పార్టీని వీడారు. అయినా బాలకృష్ణ స్పందించలేదు. దీంతో టీడీపీ నేతలు.. భవిష్యత్‌ కార్యాచరణ కోసం లేపాక్షి మండలంలోని ఓ తోటలో సమావేశమయ్యారు. శేఖర్‌ వ్యవహారశైలిని మరోసారి బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. దీనిని బాలకృష్ణ పట్టించుకోకపోతే త్వరలోనే హిందూపురంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. మరి శేఖర్‌ వ్యవహారశైలిపై టీడీపీ సీనియర్‌ నేతలు గుర్రుగా ఉండడంతో వారిని శాంతపరిచేందుకు బాలకృష్ణ కానీ.. అధిష్టానం కానీ ఎలా ముందడుగు వేస్తుందో చూడాలి.

07:22 - February 1, 2017

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం శ్వాసకోస సంబంధ సమస్యతో ఆయన కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో డయాలసిస్‌ చేశారు. వెంటిలేటర్‌పై దాసరికి చికిత్స అందిస్తున్న వైద్యులు..చెస్ట్ ఆపరేషన్ నిర్వహించి ఇన్‌ఫెక్షన్ తొలగించారు. దాసరి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ఆకాంక్షించారు.

శ్వాసకోశ సమస్యతో కిమ్స్‌లో చేరిన దాసరి నారాయణరావు ...

ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు...శ్వాసకోశ సమస్యలతో సికింద్రాబాద్‌ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో.. వెంటిలేటర్‌పై దాసరికి చికిత్స అందిస్తున్నారు. డయాలసిస్ నిర్వహించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుప‌త్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. దాస‌రి నారాయ‌ణరావు చికిత్సకు స్పందిస్తున్నార‌ని తెలిపారు.

ఛాతీ భాగంలో శస్త్రచికిత్స ...

అనంతరం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ నియంత్రించడానికి ఛాతీ భాగంలో వైద్యులు ఆపరేషన్ చేశారు. అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ వస్తోందని, వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తీసేశామని కిమ్స్‌ ఎండీ, సీఈవో డాక్టర్ బొల్లినేని భాస్కరరావు వివరించారు. అన్నవాహికలో ట్యూబ్ వేసి క్లీన్ చేసి మెటల్ స్టంట్ వేశామని చెప్పారు. దాసరి ఆరోగ్యం నిలకడగా ఉందని.. రెండు మూడు రోజుల్లో కోలుకోడానికి ఆస్కారం ఉందని తెలిపారు.

పలువురు సినీ ప్రముఖుల పరామర్శ..

అంతకుముందు కిమ్స్‌ ఆస్పత్రిలో దాసరి నారాయణరావును సినీన‌టులు మోహ‌న్‌బాబు, మంచు మనోజ్‌, జ‌య‌సుధ, దర్శక నిర్మాతలు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ప‌రామ‌ర్శించారు. దాస‌రి నారాయ‌ణరావు కోలుకుంటున్నార‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని మోహన్‌బాబు అన్నారు. దాసరి నూరేళ్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని, అందరూ కూడా ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరారు.

07:19 - February 1, 2017

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొంకాలంగా పరిష్కారం కాకుండా నలుగుతోన్న సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు బుధవారం భేటీ కాబోతున్నాయి. రాజ్‌భవన్‌ వేదికగా.. గవర్నర్‌ మధ్యవర్తిత్వంతో ఈ కమిటీలు చర్చించబోతున్నాయి. కీలకమైన సమస్యలతోపాటు కేంద్రహోంశాఖ పరిష్కరించాల్సిన 9,10వ షెడ్యూల్‌లోని సంస్థలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. తమ వాదనలను బలంగా వినిపించేందుకు ఇరు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఏపీ సచివాలయ భవనాలు అప్పగింత, హైకోర్టు, ఉద్యోగుల విభజన, నీటి పంపకాలపై పట్టుబట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది. 9,10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన, ఆస్తుల విభజనతోపాటు ఇతర అంశాలపై ఏపీ ప్రభుత్వం వాదించాలని నిర్ణయించింది.

ఎట్‌హోం కార్యక్రమంలో భేటీకి తొలి అడుగు.....

రిపబ్లిక్‌ డే రోజున రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో ఇద్దరు సీఎంలతో గవర్నర్‌ ప్రత్యేకంగా చర్చించారు. చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. అది కూడా తన సమక్షంలో జరిగితే కేంద్రంతో మాట్లాడేందుకు వీలుంటుందని వివరించారు. దీంతో ఇరు రాష్ట్రాల ప్రతినిధుల భేటీకీ ఇక్కడే అడుగు పడింది.

ముఖ్యనేతలను చర్చలకు ఎంపిక చేసిన ఇరు రాష్ట్రాలు...

కీలక అంశాలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాలు తమ కమిటీలకు కీలక నేతలనే నాయకులుగా పెట్టాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డితోపాటు జి.వివేక్‌ చర్చల్లో పాల్గొంటున్నారు. ఇక ఏపీ నుంచి యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాస్‌లు హాజరవుతున్నారు. ఈ భేటీ బుధవారం 11.30కు మొదలు కానుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలు నిపుణులతో డ్రాప్ట్‌ను సిద్ధం చేశాయి. కేసీఆర్‌ సోమవారమే గవర్నర్‌ను కలిసి తన చిట్టాను అందించారు.

నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే నేతలు...

నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే నేతలు తమ సమస్యల పరిష్కారానికి చర్చల కోసం ముందడుగు వేయడం మంచి పరిణామమని ప్రజలు చెప్తొన్నారు. నేతలు పట్టుదలకు పోకుండా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరుతున్నారు. మరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ భేటీ జరుగుతుందో లేదో మరికొద్ది గంటల్లో తేలనుంది.

గవర్నర్ తో తెలుగు రాష్ట్రాల ప్రతినిధుల భేటీ

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి గవర్నర్‌ నరసింహన్‌ మధ్యవర్తిత్వం వహించబోతున్నారు. గవర్నర్‌ సమక్షంలో తొలిసారిగా ఇరు రాష్ట్రాల మంత్రుల స్థాయి కమిటీలు ఈరోజు రాజ్‌భవన్‌లో భేటీ అవుతున్నాయి. వివిధ సంస్థల విభజన, నీటి పంపకాలలాంటి సమస్యలపై ఇరు రాష్ట్రాలు ఒకే వేదికపై అభిప్రాయాలను పంచుకోబోతున్నాయి. చాలకాలంగా నానుతోన్న సమస్యలు ఈ భేటీతోనైనా ఓ కొలిక్కి వస్తాయా? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

06:49 - February 1, 2017

ఖమ్మం :తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణిగా మార్చే వరకు విశ్రమించబోనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ నేతలు అడ్డంకులు ఎన్ని సృష్టించినా కోటి ఎకరాలకు సాగునీరు అందిచ్చి తీరుతామన్నారు. తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఖమ్మం జిల్లాలో నిర్మించిన భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్‌.. దాన్ని రైతులకు అంకితం చేశారు.

11 నెలల్లోనే నిర్మించిన భక్తరామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టు....

ఖమ్మం జిల్లాలో 11 నెలల్లోనే నిర్మించిన భక్తరామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తిరుమలాలయ మండలంలోని ఎర్రగడ్డతండా దగ్గర కేసీఆర్‌ ప్రాజెక్టును ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని కేసీఆర్‌ అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కృష్ణా, గోదావరి నీటితో తెలంగాణ భూములను తడిపి తీరుతామన్నారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌ నేతల ఆరోపణలు...

టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌ నేతలు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి రాజకీయ భవిష్యత్‌ ఉండదనే ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. తన రక్తం ధారపోసైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.

భక్తరామదాసు ఎత్తిపోతల పథకమే స్ఫూర్తిగా....

తెలంగాణ ప్రాజెక్టులకు భక్తరామదాసు ఎత్తిపోతల పథకమే స్ఫూర్తిగా నిలుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇదే వేగంతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. తిరుమలాయపాలెంలో జరిగిన బహిరంగ సభలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య దంపతులను కేసీఆర్‌ ఘనంగా సన్మానించారు. మొక్కల పెంపకంపై రామయ్య దంపతులు చేస్తున్నకృషిని కొనియాడారు.

06:39 - February 1, 2017

ఢిల్లీ : పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో గుండెపోటుకు గురైన ఐయూఎంఎల్ ఎంపీ అహ్మద్‌ కన్నుమూశారు. ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నిన్న రాష్ట్రపతి ప్రసంగ సమయంలో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో వెనక వరుస సీట్లో కూర్చున్న అహ్మద్‌ స్పృహ తప్పిపడిపోయారు. రాష్ట్రపతి వైద్య బృందంలోని వైద్యులు ఆయనకు అత్యవసర సేవలు అందించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అహ్మద్‌ మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో విదేశాంగ, రైల్వే శాఖల సహాయమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం కేరళలోని మలప్పురం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

06:36 - February 1, 2017

ఢిల్లీ : 2016-17 బడ్జెట్ ప్రతిపాదనలకు ప్రతిబింబమైన ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందుంచారు. ఈ సంవత్సరం స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 7.1 శాతంగా అంచనా వేశారు. వ్యవసాయ రంగంలో 4.1 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. ఇది గతేడాది కంటే 1.2 శాతం ఎక్కువ. పారిశ్రామిక వృద్ధి రేటు 7.4 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గవచ్చని తాజా ఆర్థిక సర్వే సూచించింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్లే ఈ క్షీణత అని కూడా సర్వే తేటతెల్లం చేసింది. అయితే ఇది తాత్కాలికమేనని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు.

ఆర్థిక సర్వేను తయారు చేసిన అరవింద్‌ సుబ్రమణ్యన్‌...

చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వయిజర్‌ అరవింద్‌ సుబ్రమణ్యన్‌ ఈ ఆర్థిక సర్వేను తయారు చేశారు. జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు 0.3 శాతంగా ఉంటుందన్న సంకేతాలను ఇచ్చిన ఆర్థిక మంత్రి.. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగే సమయం ఇదేనని, నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. వ్యవస్థలో నల్లధనంగా మిగిలిపోయిన మొత్తం వెలుగులోకి వస్తోందని, వెలుగులోకి వస్తున్న నల్ల డబ్బుతో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టవచ్చని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.

డిజిటలైజేషన్‌తో కేంద్ర ఖజానాకు రాబడి పెరిగే అవకాశం ...

డిజిటలైజేషన్‌తో కేంద్ర ఖజానాకు రాబడి పెరిగే అవకాశం ఉందని, కొత్త గృహాలు మధ్యతరగతికి అందుబాటులోకి రావడం అనేది నోట్ల రద్దు సాధించిన పెద్ద విజయమని తెలిపారు. జీఎస్టీ అమలైతే ప్రజల జీవన నాణ్యత పెరుగుతుందని అంచనా వేశారు. జీడీపీ తగ్గినట్లు కనిపించినా..ఇది తాత్కాలికమేనని నివేదికలో స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయపు పన్ను పెరుగుతోందని, విదేశీ కంపెనీల పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లు నివేదికలో తెలిపారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా ఎన్నో సంస్థలు ఇక్కడికి వస్తున్నాయని, గతేడాది కాలంలో ఏడు ముఖ్యమైన సంస్కరణలు తీసుకొచ్చామని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.

సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో ...

జీఎస్టీ, అవినీతి నిరోధక బిల్లు, పరపతి విధాన కమిటీ, ఆధార్ బిల్లు, విదేశీ పెట్టుబడుల సరళీకరణ, యుపీఐ, కార్మిక రంగ అభివృద్ధి వంటి సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు ఈ ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు వల్ల స్వల్పకాలంలో ఇబ్బందులున్నప్పటికీ, దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయని సర్వే తేల్చింది.

ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ

ఢిల్లీ :2016-17 ఆర్థిక సర్వే నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రప్రతి ప్రసంగం ముగిసిన తర్వాత వేర్వేరుగా జరిగిన లోక్‌సభ, రాజ్యసభ భేటీల్లో ఈ నివేదికను ప్రవేశపెట్టారు. వృద్ధిరేటు అంచనాలు దీనిలో పొందుపరిచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదైనట్టు ప్రస్తావించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేశారు.

06:33 - February 1, 2017

ఢిల్లీ: ప్రజలకు తాయిలాలు ఉంటాయా ? ఆదాయపన్ను పరిమితి పెంచుతారా ? డిజిటల్‌ లావాదేవీలకు రాయితీలు కల్పిస్తారా ? రైతు సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే సాధారణ బడ్జెట్‌ కాసేపట్లో ప్రజల ముందుకు రానుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఉదయం 11 గంటలకు ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో సమర్పించనున్నారు. తరువాత 11.30 గంటలకు రాజ్యసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గత సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ ప్రవేశపెట్టడం విశేషం. కాగా.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెట్‌ ఎలా ఉండబోతుందోనన్న టెన్షన్‌ అందరిలోనూ ఉంది. మరోవైపు పెద్దనోట్ల రద్దుతో వ్యతిరేకత ఉంటే.. ప్రజలు మరిచిపోయేలా బడ్జెట్‌ నిర్ణయాలు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక రైల్వే బడ్జెట్‌ను విలీనం చేసిన తరువాత ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలు దృష్టి సారించారు. రైల్వేను సేఫ్‌ ట్రాక్‌లో నడిపించాలని చూస్తున్న కేంద్రం.. ఈసారి బడ్జెట్‌లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుందని తెలుస్తోంది. అలాగే ప్రజలపై చార్జీల భారం వేయకుండా.. ఆదాయం పెంచుకునేందుకు జైట్లీ ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిసింది.

కారులో సిలిండర్ పేలి ముగ్గురి మృతి

పంజాబ్: కారులో సిలిండర్ పేలిన ఘటన బటిండా పట్ణణపరిధిలోని మౌర్‌మండిలో చోటు చేసుకుంది. ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందగా..మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కిర్నామౌర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ లతీఫ్ అహ్మత్ తెలిపారు. ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పార్లమెంట్ భవన్ లో అగ్నిప్రమాదం....

న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలోని రూం నంబర్ 50లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని 12 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. కంప్యూటర్ యూపీఎస్ లో తలెత్తిన లోపం కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

తుదిశ్వాస విడిచిన ఇ. అహ్మద్

ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ, రైల్వేశాఖల సహాయ మంత్రిగా అహ్మద్ పనిచేశారు. కేరళలోని కన్నూర్ లో అహ్మద్ జన్మించారు. ప్రస్తుతం ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అహ్మద్ కొనసాగుతున్నారు. పొన్నై లోక్ సభ నుండి పార్లమెంట్ సభ్యుడిగా వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు.

Don't Miss