Activities calendar

02 February 2017

21:30 - February 2, 2017

కేరళ : కొట్టాయం యూనివర్సిటీ మెడికల్‌ కాలేజీలో దారుణం జరిగింది. తన ప్రేమను తిరస్కరించిన ఓ వైద్య విద్యార్థినిపై ఆదర్శ్‌ పెట్రోలు పోసి తాను కూడా నిప్పంటించుకున్నాడు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కొల్లామ్‌ జిల్లా నిందకరకు చెందిన ఆదర్శ్‌, వైద్య విద్యార్థిని ప్రేమించుకున్నారు. కానీ అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ ప్రేమను అంగీకరించలేదు. దీంతో అమ్మాయి అదర్శ్‌కు దూరంగా ఉంటోంది. దీంతో యువతిపై కసిపెంచుకున్న ఆదర్శ్‌..తరగతి గదిలోనే అమ్మాయిపై పెట్రోలు పోశాడు. ఈ హఠాత్‌ పరిణామానికి భయపడ్డ యువతి క్లాసు రూము నుంచి బయటకు పరుగులు తీశారు. ఆదర్శ్‌ యువతి వెంటపడి పట్టుకుని నిప్పంటిచాడు. ఆ తర్వాత తాను కూడా నిప్పంటించుకున్నాడు. కాలిన గాయాలతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తోటి విద్యార్థుల ముందే ఘటన చోటు చేసుకుంది.

21:29 - February 2, 2017

హైదరాబాద్ : ఇండియాతో టెస్ట్ మ్యాచ్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌ జట్టు హైదరాబాద్‌ చేరుకుంది. బంగ్లాదేశ్‌ నుంచి విమానంలో శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్న జట్టు సభ్యులు కట్టుదిట్టమైన భద్రత మధ్య నగరానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 9నుంచి హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు బంగ్లాదేశ్‌ ఏ మేరకు పోటీ ఇస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

21:28 - February 2, 2017

ఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో మాజీ కమ్యూనికేషన్ల మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌లకు భారీ ఊరట లభించింది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో వారిపై సిబిఐ, ఈడీ మోపిన అభియోగాలను సి ప్రత్యేక కోర్టు కొట్టేసింది. దయానిధి మారన్, కళానిధి మారన్, ఆయన భార్య కావేరి కళానిధి, సౌత్ ఆసియా ఎఫ్ఎం లిమిటెడ్ ఎండీ కే. షణ్ముగం, రెండు కంపెనీలపై రెండు వేర్వేరు కేసుల్లో వచ్చిన ఆరోపణలు రుజువుకాలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. ఎయిర్‌సెల్‌ను మలేషియాకు చెందిన మ్యాక్సిస్‌కు విక్రయించాలని దయానిధి మారన్‌ ఒత్తిడి చేసినట్లు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

21:27 - February 2, 2017

ఢిల్లీ : పంజాబ్‌, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 4న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. పంజాబ్‌లో 117 స్థానాలు, గోవాలో 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్‌, గోవా రాష్ట్రాల్లో అకాళిదల్, బిజెపిలు అధికారంలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడంతో త్రిముఖ పోటీ నెలకొంది. అధికారం కోసం అకాళిదల్, బిజెపి, కాంగ్రెస్‌, ఆప్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

కేజ్రీపై రాహుల్ ఫైర్..
పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌పై మండిపడ్డారు. పంజాబ్‌ వ్యతిరేక శక్తులకు కేజ్రీవాల్‌ మద్దతుగా నిలిచారని ఆరోపించారు. సంగ్రూర్‌ ఎన్నికల సభలో రాహుల్‌ ప్రజలను  ఉద్దేశించి మాట్లాడుతూ...కొన్నిరోజుల కిందట బాంబు పేలుళ్లలో ఆరుగురు చనిపోయారు. ఆ పేలుళ్లకు కారణమైన శక్తులకు కేజ్రీవాల్‌ మద్దతిస్తున్నారు. ఎవరైతే పంజాబ్‌ను నాశనం చేశారో... ఆ శక్తులే మళ్లీ హింసకు ప్రేరేపిస్తూ తలెత్తుకు తిరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్‌ . పంజాబ్‌లో అధికారంలో ఉన్న అకాలీదళ్‌-బీజేపీ కూటమి ప్రజాసంక్షేమం కన్నా సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నదని ఆరోపించారు. ఓ మాజీ మిలిటెంట్‌ నివాసంలో బస చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇవాళ చివరిరోజు.

హైదరాబాద్ చేరుకున్న బంగ్లాదేశ్ జట్టు..

హైదరాబాద్ : ఇండియాతో టెస్ట్ మ్యాచ్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌ జట్టు హైదరాబాద్‌ చేరుకుంది. బంగ్లాదేశ్‌ నుంచి విమానంలో శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్న జట్టు సభ్యులు కట్టుదిట్టమైన భద్రత మధ్య నగరానికి చేరుకున్నారు.

శుక్రవారం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ప్రారంభం..

గుంటూరు : రాజధాని పరిధిలో రేపు 4 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ప్రారంభిస్తామని డిప్యూటి సీఎం కేఈ వెల్లడించారు. తుళ్లూరు, మందడం, ఉండవల్లి, అనంతవరంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు.

 

మెడికల్ సేల్స్ రిప్రంజటేటివ్స్ సమ్మె..

ఢిల్లీ : దేశవ్యాప్తంగా లక్ష మందికిపైగా ఉన్న మెడికల్‌ సేల్స్‌ రిప్రజంటేటీవ్స్‌ రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నారు.

21:19 - February 2, 2017

విశాఖపట్టణం : జిల్లా యలమంచిలిలో దారుణం జరిగింది. యువకుడి వేధింపులు భరించలేక బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రేగుపాలెం గ్రామానికి చెందిన అనపర్తి పావనిప్రియాంకకు, ఆర్మీ ఉద్యోగి నర్సింగరావుతో 8 నెలల క్రితం పెళ్లి చూపులు జరిగాయి. అయితే అతని చెడు ప్రవర్తన తెలుసుకున్న పావని ప్రియాంక తల్లిదండ్రులు పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నారు. ఇది నచ్చని నర్సింగరావు ప్రియాంకపై కక్ష పెంచుకున్నాడు. అప్పటికే అతను సేకరించిన అమ్మాయి ఫోటోలతో బ్లాక్‌మెయిల్‌ చెయ్యడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ప్రియాంక తన తల్లిదండ్రులకు చెప్పినా.. వారు సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో విసిగి వేసారిన ప్రియాంక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక విజయవాడ నోవా కాలేజీలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పంజాబ్..గోవాలో ముగిసిన ఎన్నికల ప్రచారం..

ఢిల్లీ : పంజాబ్‌, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 4న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. పంజాబ్‌లో 117 స్థానాలు, గోవాలో 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

21:15 - February 2, 2017

విజయవాడ : రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిపెట్టింది. వెలగపూడిలోని సచివాలయంలో బడ్జెట్‌ రూపకల్పనపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ టక్కర్‌, ఆర్థిక, ప్రణాళిక శాఖ అధికారులు పాల్గొన్నారు. బడ్జెట్‌ కేటాయింపులు ప్రాధాన్యతాక్రమంలో ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వ విభాగాలను మరింత పటిష్టపరచాలన్నారు.. సుస్థిర అభివృద్ధి కోసం 15 శాతం వృద్ధిరేటు రావడానికి కృషి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, పోర్టులు, అంతర్గత జలరవాణా రంగాల్లో కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టడానికి కృషి చేయాలని సూచించారు. ఆర్థిక, ప్రణాళిక శాఖలు కలిసి కూర్చొని సమ్మిళిత వృద్ధిపై చర్చించాలని తెలిపారు.

నార్వే దేశాన్ని గీటురాయిగా తీసుకోవాలని సూచన..
కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం సహాయం అందిస్తున్న పథకాలను సద్వినియోగ పరచుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. కేంద్రం అమలుచేస్తున్న 73 పథకాలతో మన లక్ష్యసాధనను నిర్దేశించుకోవాలని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 33శాతంగాఉన్న హార్టికల్చర్‌ ఆదాయాన్ని 60శాతానికి తీసుకువెళ్లాలన్నారు చంద్రబాబు. నాన్‌ పెర్ఫార్మింగ్‌ డిపార్ట్‌మెంట్ల్‌లను చైతన్యవంతంచేసి లక్ష్యాలను నిర్దేశించాలని వివరించారు. మానవాభివృద్ధి సూచికకు కేరళను, ప్రపంచస్థాయిలో నార్వే దేశాన్ని గీటురాయిగా తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. బడ్జెట్‌ రూపకల్పనపై సమీక్ష తర్వాత మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌, ఇతర అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతి అభివృద్ధిలో మైలురాళ్లను సీఎంకు అధికారులు వివరించారు. గ్రీన్‌ఫీల్డ్‌ నగరాలైన నయా రాయ్‌పూర్‌, పుత్రజయలకు ధీటుగా అమరావతి నిర్మాణం జరగాలని సీఎం ఆదేశించారు. మొదటి విడత 2018నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని సీఎంకు అధికారులు తెలిపారు.

21:13 - February 2, 2017

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ కేబినెట్‌ భేటీ కొనసాగింది. మూడు గంటలకు పైగా చర్చించిన కేబినెట్‌ దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 38 టీఎంసీల నుంచి 60 టీఎంసీలకు పెంచారు. అలాగే.. తుపాకుల గూడెంలో బ్యారేజీ నిర్మాణం, మల్కాపూర్‌లో 10 టీఎంసీలతో రిజర్వాయర్‌ నిర్మించాలని నిర్ణయించారు. వీటితోపాటు సబ్ ప్లాన్ అంశం, బడ్జెట్ రూపకల్పన, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నీతి అయోగ్ ప్రతిపాదనలపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పలు ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 7860 కోట్లతో గంధమల్ల, మల్లన్న సాగర్, కొండపాక, బస్వాపూర్ ప్రాజెక్టులకు రివైజ్డ్ అనుమతులు ఇవ్వాలని.. ఈ మొత్తాన్ని రుణంగా తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే దేవాదుల లిప్ట్‌ ఇరిగేషన్‌ సామర్థ్యాన్ని 38 టీఎంసీల నుంచి 60 టీఎంసీలకు పెంచారు.

4800 పోస్టుల భర్తీ..
కంతనపల్లి బ్యారేజీకి బదులుగా తుపాకులగూడెం వద్ద 2 వేల 121 కోట్లతో బ్యారేజీ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేవాదుల కింద వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం మల్కాపూర్‌లో 10 టిఎంసిలతో ఓ రిజర్వాయర్‌ నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రామప్ప రిజర్వాయర్‌కు 1101 కోట్లు కేటాయించారు. మిషన్ భగీరథలో 4800 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జైళ్లలో సంస్కరణలు..
జైళ్లలో తీసుకురావల్సిన సంస్కరణలపై హోంమంత్రి నాయిని అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కేటీఆర్‌, ఈటల, ఇంద్రకరణ్‌రెడ్డి, సభ్యులుగా ఉండనున్నారు. అలాగే కరీంనగర్‌ ఎల్‌ఎండీ వద్ద ఫిషరీస్‌ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయించారు. 2487 లాంగ్వేజ్ పండిట్స్‌ను 1047 పిఈటిలను స్కూల్ అసిస్టెంట్స్‌గా అప్ గ్రేడ్ చేస్తూ కేబినెట్‌లో నిర్ణయించారు. వీటితోపాటు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం, సబ్ ప్లాన్ అంశం, బడ్జెట్ రూపకల్పన, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నీతి అయోగ్ ప్రతిపాదనల పై కేబినెట్‌పై ప్రధానంగా చర్చించారు.

హైకోర్టులో 'గౌతమిపుత్ర శాతకర్ణి'పై పిటిషన్..

హైదరాబాద్ : హైకోర్టులో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా పిటిషన్ పై విచారణ జరిగింది. పాత పిటిషన్ లో మార్పులు చేస్తూ మరో కొత్త పిటిషన్ దాఖలైంది. కొత్త పిటిషన్ ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఏపీ ప్రభుత్వం నోటీసులు అందుకుంది. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

జైళ్ల శాఖలో సంస్కరణలపై కేబినెట్ సబ్ కమిటీ..

హైదరాబాద్ : జైళ్ల శాఖలో తీసుకరావాల్సిన సంస్కరణలపై హోం మంత్రి నాయినీ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ నియమితమైంది. కేటీఆర్, ఈటెల, ఇంద్రకిరణ్ రెడ్డిలు సభ్యులుగా ఉండనున్నారు. యాసిడ్ దాడులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించేలా గతంలో ఉన్న చట్టంలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. నేరస్తులకు పది ఏళ్ల నుండి జీవితకాలం శిక్ష విధించే అవకాశం ఉందని సమాచారం. నేరస్తులకు విధించిన జరిమాన డబ్బులను బాధిత కుటుంబాలకు అందచేసే విధంగా చట్టంలో మార్పులు తీసుకరానున్నారు.

తుళ్లూరులో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ప్రారంభం..

విజయవాడ : రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలపై డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి సమీక్ష నిర్వహించారు. రాజధాని పరిధిలో తుళ్లూరు, రేపు 4 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ప్రారంభిస్తామన్నారు. తుళ్లూరు, మందడం, ఉండవల్లి, అనంతవరంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లాలోని నాలుగు నీటి పారుదల ప్రాజెక్టులు మార్చిలోగా సిద్ధం కానున్నాయన్నారు. నాలుగు ప్రాజెక్టులను సీఎం ప్రారంభిస్తారని, ముచ్చుమర్రి నుండి పూర్తిస్థాయిలో నీరందిస్తామని పేర్కొన్నారు.

వేములవాడలో టాస్క్ ఫోర్స్ దాడులు..

రాజన్న సిరిసిల్ల : వేములవాడలో ట్రావెల్స్ కార్యాలయాలపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కేపీ ట్రావెల్స్, శ్రీనివాస ట్రావెల్స్ లో 14 పాస్ పోర్టులు, రూ. 68 వేలు, 1000 డాలర్లు, 5 వీసాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి - సీపీఎం..

అనంతపురం : పెనుగొండ మండలంలో కార్ల కంపెనీ బలవంతపు భూ సేకరణనను ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. కార్ల కంపెనీకి భూములివ్వని గిరిజనులు తేల్చిచెప్పినా బలవంతంగా ఒప్పించేందుకు చూడడం చట్ట వ్యతిరేకమని, ప్రభుత్వ చర్యతో చనిపోయిన బాలు నాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాబు నాయక్ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియాతో సహా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సూచించారు.

20:41 - February 2, 2017

ఎంపీ కొడ్కు గానీ ఎమ్మెల్యే కొడ్కుగానీ.. వాళ్లకు ఎంత పవరుంటది..? ఆళ్ల అయ్యకున్న అధికార పవరంత.. వీళ్లకు బల్పు, మదం మస్తీ లెక్క రూపాంతరం చెందుతదిగదా..? అగో అట్లనే ఒక ఎంపీ కొడ్కుకు గూడ తోపు మోతెవరి అని ఫీలైపోయి... ఏకంగ పోలీసోళ్ల మీదికే ఫైటింగుకు వొయ్యిండు.. ఇగ ఎంపీ కొడ్కాయే ఏం జేస్తరు పోలీసోళ్లు..? గీ ముచ్చట చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

20:39 - February 2, 2017

కంచం పొద్దు పెద్దమన్సులు చాలమందే ఉన్నరు ఇగో ఇయ్యాళ ఇద్దరు కాకీబట్టలేస్కున్న నయింలు దొర్కిండ్రు..శరణం గశ్చామి సీన్మ పంచాది ఇంతా ఇంతా ముదుర్తనే ఉన్నది..? మొన్నటి ఓపెనింగైన భక్తరామదాసు ఎత్తిపోతల పత్కం కథ..మన ఆంధ్రా ఆణిముత్యం చంద్రాలు సారు ఏ ఏశం గట్టినా మస్తు సూటబుల్ అయితడు..? ఎంపీ కొడ్కు గానీ ఎమ్మెల్యే కొడ్కుగానీ.. వాళ్లకు ఎంత పవరుంటది..? పోలీసోళ్లు గప్పట్ల పెద్ద ఎన్ కౌంటర్ జేశి బుజాలు సర్సుకుంటే.. ఇప్పుడు మావోయిస్టులు మందుపాత్ర వేల్చి పోలీసోళ్ల భర్తం బట్టిండ్రు..జనం ఓట్లు ఎందుకు కేశిండ్రు పార్టీల లీడర్లకు..? అభివృద్ధి జేస్తరేమో ఆపదల ఆదుకుంటరేమో అనేది పాత ముచ్చట.. నదులళ్లుండే మొసలి కమ్యునిటీ హాలుకొచ్చింది.. కడప జిల్లా పులివెందులకాడున్న అయ్యప్పస్వామి గుడి.. రంగనాథస్వామి గుడి మీద దొంగలు దాడి..గిసొంటి ముచ్చట్ల కోసం చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

20:26 - February 2, 2017

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌లో ఉన్న లోపాలను సవరించి, కొత్త నిబంధనలను తయ్యారు చెయ్యాలని మేధావులు డిమాండ్‌ చేశారు. 'ఎస్సీ ,ఎస్టీ సబ్ ప్లాన్ అమలు- సూచనలు -ప్రతిపాదనలు' అనే అంశాలపై సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సెంటర్‌ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ నుంచి మల్లెపల్లి లక్ష్మయ్య, సీపీఐ నేత గుండ మల్లేశం హజరయ్యారు. సబ్ ప్లాన్ నిధులను నేరుగా ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజేన్సిలకు అప్పగించి ఖర్చుకాని నిధులను మరుసటి సంత్సరం బడ్జెట్‌లో కలపాలన్నారు. అంబెద్కర్ స్టడి సర్కిళ్లను మరింత బలోపేతం చేసి అన్నిజిల్లాలకు విస్తరించాలని మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు.

20:24 - February 2, 2017

విజయవాడ : ఫిక్కీ భాగస్వామ్యంతో ప్రైవేట్‌ పాఠశాలలపై ప్రత్యేక విధానం రూపొందిస్తున్నామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రైవేట్ విద్యావిధానంలో లోపాల్ని సవరించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రైవేట్‌ స్కూళ్లలో సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని విమర్శించారు. పాఠశాలల్లో ఎలాంటి సదుపాయాలు కావాలి? మౌళిక వసతులు, కరిక్యులమ్‌, ఫ్యాకల్టీవంటి అంశాలపై ఫిక్కీ అధ్యయనం చేస్తుందని ప్రకటించారు.

20:20 - February 2, 2017

చెన్నై : తమిళనాడు తీర ప్రాంతంలో సముద్రం బ్లాక్‌ సీని తలపించింది. రెండు కార్గో నౌక‌లు ఢీకొన‌డంతో ఇంధ‌నం స‌ముద్రం పాలైంది. సముద్రంలో పేరుకుపోయిన నల్ల చమురును క్లీన్‌ చేసేందుకు కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే 60 టన్నుల ఆయిల్‌ను సముద్రం నుంచి సేకరించారు. తమిళనాడులోని ఎన్నోర్‌ పోర్టు సమీపంలో శనివారం రెండు కార్గో నౌక‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో టన్నుల కొలది నల్ల చమురు స‌ముద్రం పాలైంది. మెరీనా, ఈలియ‌ట్ బీచ్‌ల‌కు భారీ మొత్తంలో ఇంధ‌నం తెట్టు కొట్టుకు వ‌చ్చింది. రామ‌కృష్ణ న‌గ‌ర్ బీచ్ వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చెన్నై నుంచి సుమారు 35 కిలోమీట‌ర్ల విస్తీర‌ణంలో ఆయిల్ విస్తరించి ఉంది. సముద్రంలో చమురు తెట్టు ఎక్కడెక్కడ పేరుకుపోయిందో గుర్తించేందుకు కోస్ట్‌గార్డుకు చెందిన హెలిక్యాప్టర్‌ గాలింపు చర్యలు చేపట్టింది.

రాజ్యసభలో కనిమొళి..
తీరానికి తెట్టులా చేరుకుంటున్న ఇంధ‌నాన్ని తొలిగించేందుకు కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది రంగంలోకి దిగింది. వీరికి సహాయంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులు, మత్స్యకారులు కూడా చేతులు కలిపారు. చమురుతో కూడిన ఇసుకను బస్తాల్లో నింపుతున్నారు. మొత్తం 60 టన్నుల ఆయిల్‌ను సముద్రం నుంచి సేకరించారు. మరోవైపు DMK సభ్యురాలు కనిమొళి ఈ అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు. పోర్టు అధికారులు, తీరప్రాంత గస్తీదళానికి మధ్య సమన్వయం లోపించడంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడిందని ఆందోళన వెలిబుచ్చారు.

సహకరిస్తున్న శాఖలు..
నల్లచమురు తెట్టు ప్రభావం ఒక్క ప్రాంతంలోనే అధికంగా ఉందని, అంతగా భయపడాల్సిన పని లేదని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని తెలిపింది. నల్ల చమురు ప్రభావానికి జలచర జీవులకు భారీ నష్టం కలిగింది. ఆయిల్‌తో పాటు చనిపోయిన చేపలు, తాబేళ్లు, నీటిపాములు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. ఈ ప్రభావం మత్స్యకారులపై కూడా పడింది. సముద్రంలో చేపలు చచ్చిపోయాయని పుకార్లు రావడంతో కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సముద్రంలో టన్నుల కొద్ది నల్లచమురు పేరుకుపోవడంపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలో నుంచి ఆయిల్‌ను వేరు చేయడానికి అన్ని శాఖలు సహకరిస్తున్నాయి.

20:15 - February 2, 2017

నిజామాబాద్ : ఈతరాక చెరువులో మునిగి ఇద్దరు పిల్లలు మృత్యువాతపడ్డారు.. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పాతంగల్‌లో జరింది.. అభాది గ్రామానికి చెందిన సాయికుమార్, అప్సర్‌ స్నానం చేసేందుకు పాతంగల్‌ పెద్ద చెరువులోకి దిగారు.. ఈత రాకపోవడంతో ఇద్దరు చిన్నారులు చనిపోయారు.. పిల్లలు తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.. చెరువు ఒడ్డున బట్టలుచూసిన పోలీసులు ... జాలర్ల సహాయంతో మృతదేహాలను బయటకుతీశారు..

20:13 - February 2, 2017

ఢిల్లీ : అమరావతి పర్యావరణ అనుమతుల పిటిషన్‌పై నేషనల్‌ గ్రీన్ ట్రిబ్యునల్‌ విచారణ చేపట్టింది.. రాజధాని నిర్మాణానికి పర్యావరణ అనుమతులు సక్రమంగా లేవంటూ NGTలో మాజీ ఐఏఎస్ E.A.S.శర్మ పిటిషన్‌ వేశారు. 10వేల 600 ఎకరాలు మంపుకు గురయ్యే అవకాశముందని ప్రభుత్వమే ప్రకటించిందని.. పిటిషనర్‌ తరపు న్యాయవాది ట్రిబ్యునల్‌ దృష్టికి తెచ్చారు.. ముంపు ప్రదేశంలో కేవలం 5 ప్రాజెక్టులకు మాత్రమే అనుమతి ఉన్నా... 56 ప్రాజెక్టులు చేపడుతున్నారని వాదించారు.. పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదావేశారు.

20:11 - February 2, 2017
20:10 - February 2, 2017

కడప : ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ కడపలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాయచోటి, ఇడుపుల పాయ ఎంపీపీలు, జడ్పీటీసీలతో జగన్ భేటీ అయ్యారు. ఇడుపాలపాయలోని గెస్ట్ హౌస్ లో ఈ భేటీ జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిని గెలిపించాలని జగన్ సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్ నాథ్ పాల్గొన్నారు.

19:52 - February 2, 2017

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం నేతలు విమర్శించారు. సుందరయ్య కళా విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో 'రైతు ఆత్మహత్యలు - సుప్రీంకోర్టు ఆదేశాలు' అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో సారంపల్లి మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు. 1997 నుండి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మూడు లక్షల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఉమ్మడి ఏపీలో గత 20 ఏళ్లలో లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని రైతు సంఘం నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని, 2014 జూన్ నుండి ఇప్పటి వరకు 2450 మంది బలవంతంగా ప్రాణాలు విడిచినట్లు జాతీయ నేరాల బ్యూరో రిపోర్టు తెలిపిందన్నారు. రైతు ఆత్మహత్యలపై ఆరు లక్షల రూపాయల పరిహారం ఇస్తామన్న పాలకులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని విమర్శించారు.

19:46 - February 2, 2017

హైదరాబాద్ : చిత్తశుద్ధి లేని ప్రకటనల కంటే పని చేసి చూపితేనే నాయకుడి సమర్థత తెలిసిపోతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక నేత మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. నగరంలో మాదిగ విద్యార్థుల మహాదీక్షలు జరుగుతున్నాయి. దీక్షా ప్రదేశాన్ని సందర్శించిన నేత మందకృష్ణ మాదిగ టెన్ టివితో మాట్లాడారు. వర్గీకరణకు చట్టబద్ధత కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపుతానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారని, కేసీఆరన్ నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. సమస్య పరిష్కారంలో కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే స్వయంగా ఢిల్లీకి వెళ్లాలని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్యపై మొసలి కన్నీరు కార్చొద్దని హితవు పలికారు. ఎస్సీ వర్గీకరణకు డిమాండ్ చేస్తూ రాష్ట్రం వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాలు, యూనివర్సిటీల వద్ద ఎంఎస్ఎఫ్ దీక్షలు చేస్తున్నట్లు మందకృష్ణ పేర్కొన్నారు.

19:39 - February 2, 2017

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడలను గొర్రెలతో అంటూ సీపీఐ నేత నారాయణ పోల్చారు. వీరిని గొర్రెలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తయారు చేసుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ ఏం చెప్పినా చంద్రబాబు..వెంకయ్యలు గొర్రెల్లా తలాడిస్తున్నారని విమర్శించారు. నోట్ల రద్దు వల్ల 50 రోజుల్లో నల్లధనం ఉన్నవారంతా తెల్లవారిలా మారిపోయారని విమర్శించారు. మోడీ ఏం చెప్పినా ఇద్దరూ తలాడిస్తున్నారని పేర్కొన్నారు.

19:33 - February 2, 2017

హైదరాబాద్ : నయీంతో బయటపడ్డ ఫోటోల్లోని ఆఫీసర్లకు గ్యాంగ్‌స్టర్‌కు ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా బంధం పెనవేసుకుంది. ఈ బందాన్ని క్యాష్ చేసుకున్నారు. అదే సమయంలో నయీం కూడా అధికారాన్ని ఈజీగా వాడేసుకున్నాడు. ఇలా అంతా కలిసి దొరికింది దోచేశారన్న ఆరోపణలున్నా ఎక్కడా ఆధారాలు లేవు. ఎంతైనా మాస్టర్‌ మైండే కదా... ఎంత చేసినా తప్పు చేసినవాడు ఎక్కడో ఒకచోట దొరికిపోతాడన్నది వాస్తవం...ఆ వాస్తవాలనే వెలుగులోకి తీసుకువచ్చింది 10 టీవీ. ఇంతకాలం ఆల్బమ్‌లోని ఫోటోలను బయటకు రాకుండా మేనేజ్ చేసుకున్నా...వెలుగులోకి తీసుకువచ్చింది 10 టీవీ.

పోలీసుల వంచన..
ఐపీఎస్‌ వ్యాస్ ను హతమార్చిన నాటి మావోయిస్టు..ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి ఏకంగా పోలీసుల పంచనే చేరాడు.. నయీం ఇస్తున్న సమాచారంతో ఎన్నో ఎన్‌కౌంటర్లు...ఎన్నో సంచలనాలు సృష్టించిన కొందరు పోలీసులు పతకాలు సాధించారు..ప్రమోషన్లు కొట్టేశారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఎన్నో అరాచకాలు ఉన్నాయి. పోలీసులతో చెలిమి చేసిన నయీం మాత్రం దందాలు చేయడం మొదలుపెట్టాడు. అధికారాన్ని అడ్డంగా వాడుకున్నాడు. పోలీసులను ఎప్పటికప్పుడు తనకు అనుకూలం చేసుకుని అరాచకాలు సృష్టించాడు. ఇవన్నీ బయటకు రాలేదు. కాని నయీం చేస్తున్న అకృత్యాలు మాత్రం అప్పుడప్పుడు బయటకు వచ్చినా కొన్ని మాత్రమే కేసులయ్యాయి. బయటకు చూసేందుకు నయీంపై కేసులు పెడుతున్నట్లే ఉన్నా. అతని కోసం గాలిస్తున్నట్లు ఉన్నా లోలోపల మాత్రం పోలీసులు టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు ఉన్న నయీం పోలీసు ఆఫీసర్లతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్న చట్టం దృష్టిలో అబ్‌స్కాండింగ్.

అడిషనల్ ఎస్పీ..
తెలంగాణా పోలీసుల్లో లిస్ట్‌ చూస్తే చాంతాడంత ఉంటుంది. నయీంతో సంబంధాలు కొనసాగిస్తూ అండగా ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఇందులో కీలక సన్నిహితుడిగా పేరున్న అడిషనల్‌ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు నిత్యం టచ్‌లో ఉండేవాడని తెలుస్తోంది. ఇక మరో పోలీసు ఉన్నతాధికారి శ్రీనివాసరావు నయింకు దగ్గరగా ఉంటూ మావోయిస్టుల ఏరివేత పేరుతో ఎస్.ఐ. నుంచి ప్రమోషన్లు కొట్టేసి అదనపు ఎస్పీ స్థాయికి చేరారు...ఇక మరో ఉన్నతాధికారి చంద్రశేఖర్...కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ సెల్‌ లో ఉన్నప్పుడు నయీంకు ఎలాంటి సహకారం అందించారన్నది చెప్పాల్సిన అవసరం లేదేమో. వీరంతా ఎప్పటికప్పుడు నయీంతో డిన్నర్‌లు..లంచ్‌లు ఏర్పాటు చేసుకుని కలుసుకునేవారని ఆ ఫోటోలే చెబుతున్నాయి..అయితే వారంతా డిన్నర్ చేస్తున్న సమయంలో కూడా నయీంపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు ఉన్నాయి...ఇక మరో అధికారి ట్రాఫిక్ సి.ఐ.గా పని చేస్తున్న వెంకట్ రెడ్డి...ఇతను నయీంకు డిగ్రి కాలేజ్ మెట్.. ఈ బాల్య బంధంతోనే ఈయన ఎన్నో అపరేషన్లు నయింతో కలిసి చేశారు. ఇక సి.ఐ.తిరుపతన్న భువనగిరిలో ఎప్పుడు నయిం వెళ్లిన ఆయనే షల్టర్ ఏర్పాటు చేసేవారు. వినాయకుని పూజలు ఏర్పాటు చేసిన సమయంలో ఎప్పుడూ పాలు పంచుకునేవారు...ఇలా పోలీసులతో రకరకాల సంబంధాలు పెట్టుకుని..వారి నీడలో నయీం ఎన్నో అరాచకాలు చేశాడు...ఎన్నో హత్యలకు పాల్పడ్డాడు.

ప్రత్యర్థుల సమాచారం నయీంకు...
నయీం పోలీసులతో సంబంధాలను ఇష్టారాజ్యంగా వాడుకున్నాడు. తన ప్రత్యర్థుల్లో వణుకుపుట్టించేలా వారి కాల్‌డేటా.. సిగ్నల్‌ ట్రాకింగ్‌ ద్వారా సమాచారం తెలుసుకుని ఎప్పటికప్పుడు వారిని బెదిరింపులకు గురిచేసి దోచేసుకున్నాడు...ఇలా పూర్తిస్థాయిలో సహకారం అందించిన ఆఫీసర్లతో విందులు..వినోదాలు కూడా చేసుకునేవాడు. పోలీసులకు కావాల్సిన సమాచారం అందిస్తూ తన పని చక్కబెట్టుకున్నాడు. కలకలం రేపుతున్న నయీంతో బయటపడ్డ ఫోటోల పై పోలీసు బాస్‌లు విచారణకు సిద్దమయ్యారు...బయటకు వచ్చిన ఫోటోలు మార్ఫింగ్ చేసినవా లేక నిజమేనాన్నది తెలుసుకునే పనిలో పడ్డారు. ఇందుకుగాను శాస్త్రీయంగా తెలుసుకునేందుకు ఆ ఫోటోలను ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌కు పంపించే యోచనలో ఉన్నారు.

19:29 - February 2, 2017

హైదరాబాద్ : నయూం కేసులో కొత్త ట్విస్ట్. ఆ అరాచకశక్తితో కలిసి దిగిన పోలీసు ఆఫీసర్ల ఫోటోలు బయటపడటం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకాలం ఏం లేదంటూ కొట్టిపారేసిన వారంతా ఇప్పుడు నోళ్లు వెళ్లబెట్టారు..ఫలానా అధికారులతో నయీంకు సంబంధాలున్నాయని తెలిసినా ఆధారాలు లేవు..కాని ఇప్పుడు బయటపడ్డ ఫోటోలతో మాత్రం కలకలం రేపుతోంది. గ్యాంగ్‌స్టర్‌ నయీం... నయీంతో పోలీసులకు ముందు నుంచి సంబంధాలన్న విషయాన్ని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వస్తున్నా తాజాగా బయటపడ్డ ఫోటోలు మాత్రం కలకలం రేపుతున్నాయి. నయీంతో విందులు..వినోదాల్లో పాల్గొన్న పోలీసు అధికారుల ఫోటోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో నయీంతో వారు ఉన్న ఫోటోలు డిపార్ట్‌మెంట్‌లో రచ్చగా మారుతోంది.

ఆందోళన..
గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత బయటకు వచ్చిన ఎన్నో విషయాల్లో పోలీసులకు..పొలిటీషియన్లకు సంబంధాలపై ఆందోళన కలిగించింది. అయితే ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి లోతుగా శోధించారు. నయీం సంబంధించిన ఆస్తులు.. అరాచకాలను బయటపెట్టారు. నయీంతో కలిసి దందాలు చేసినవారిని జైలుకు తరలించారు. ఇంతవరకు బాగానే ఉన్నా నయీంతో పోలీసులకు సంబంధాలు.. రాజకీయ ప్రముఖులతో గ్యాంగ్‌స్టర్‌కు ఉన్న లింకులపై దుమారం రేపింది. అయితే ఈ విషయంలో కాస్త అటు..ఇటుగా వ్యవహరించిన సిట్‌ బృందాలు చివరకు హైకోర్టులో పోలీసులకు..పొలిటీషియన్లకు నయీంతో సంబంధాలు లేవంటూ అఫిడెవిట్ దాఖలు చేసింది. దీంతో ఎన్నో ఆరోపణలున్న అధికారులు..రాజకీయులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా బయటపడ్డ పోలీసులతో నయీం ఫోటోలు మాత్రం మళ్లీ అరాచకాలకు అండగా ఉన్న అధికారుల గుండెళ్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయనడంలో సందేహం లేదు.

ఎంతో సమాచారం రావడంతో సిట్..
వేలాది కోట్ల రూపాయలు దందాలతో సంపాదించాడని గ్యాంగ్‌ స్టర్‌ నయీంకు రాజకీయ, పోలీసుల అండదండలు దండిగా ఉన్నాయనేది బహిరంగ రహస్యం..అయితే వీటిలో మాత్రం ఎక్కడా ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారనేది కూడా వాస్తవమే...పోలీసులు చేయలేని పనులు నయింతో చేయించారనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి..అదే సమయంలో నయీం కూడా పోలీసుల అవసరాలను అడ్డుపెట్టుకుని దందాలు చేశాడన్నది నిజమే...ఇలా పెనవేసుకున్న గ్యాంగ్‌స్టర్, పోలీసుల బంధంతో ఎన్నో అరాచకాలు జరిగాయి. గ్యాంగ్‌స్టర్‌ ఎన్ కౌంటర్ తర్వాత 15 మంది పోలీసుల హస్తం ఉందని సిట్ దర్యాప్తులో తెల్చింది...అందుకు సిట్ ను బలోపేతం చేస్తూ.. అడిషనల్ డి.జి. అంజనీ కుమార్ కు బాధ్యతలు ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో...హైకోర్టులో ప్రభుత్వం తన వైఖరి అఫిడవిట్ రూపంలో వేయడంతో ఈ కేసులోని లోగుట్టుల కథలన్నీ కంచికి చేరినట్లయింది.

19:26 - February 2, 2017

మెగా మూవీ అంటే ఫ్యాన్స్‌కు పండగే పండగ. అలాంటిది మెగాస్టార్‌, పవర్‌ స్టార్‌ కాంబినేషన్‌లో మూవీ వస్తుందంటే ఇక చెప్పనక్కర్లేదు. చిరు, పవన్‌తో మల్టీస్టారర్‌ చిత్రానికి ప్లాన్‌ చేశారు సినీ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిచబోతున్నారు. ఒకరు బ్రేక్‌ డ్యాన్సులతో రఫ్‌ ఆడిస్తారు...మరొకరు ఫవర్‌ ఫుల్‌ పంచ్‌ డైలాగులతో కేకపుట్టిస్తారు. వారే అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్‌ కల్యాణ్‌.. ఇప్పటికే టాలీవుడ్‌ను షేక్‌ చేసిన ఈ అగ్రహీరోలు..మల్టీస్టారర్‌ మూవీకి రెడీ అవుతున్నారు.

మల్టీస్టారర్..
తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త మల్టీస్టారర్‌ చిత్రానికి తెరలేవబోతోంది. ఖైదీ నెంబర్‌ 150 మూవీతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి.. కలెక్షన్ల సునామీ సృష్టించి మరోసారి తన సత్తా చాటాడు. 150 మూవీ కిక్‌తో మాంచి ఊపుమీదున్న చిరు....తమ్ముడు పవన్‌తో కలిసి మల్టీస్టారర్‌ మూవీకి రెడీ అయ్యాడు. నిర్మాత అశ్వనీదత్‌తో కలిసి మెగా బ్రదర్స్‌మూవీని నిర్మిస్తున్నట్లు టి. సుబ్బరామి రెడ్డి తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కథ కూడా ఓకే అయిందని, త్వరలోనే సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్లనున్నామని అధికారికంగా చెప్పేశారు సుబ్బరామిరెడ్డి.

చిరకాల కోరిక..
మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కలిసి మల్టిస్టారర్‌ చేస్తే చూడాలన్న ప్రేక్షకుల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరనుంది.
ఖైదీ నంబర్‌ 150 ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో చిరంజీవితో ఓ సినిమా చేస్తానని సుబ్బరామిరెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి కూడా మంచి కథ వస్తే తాను పవన్‌ కళ్యాణ్‌తో మల్టిస్టారర్‌లో నటించేందుకు సిద్ధమని తన మనసులో మాట బయటపెట్టాడు. అటు సుబ్బరామిరెడ్డి, ఇటు చిరంజీవి చెప్పిన కొన్ని రోజులకే...తమ్ముడు పవన్‌తో అన్నయ్య మల్టీస్టారర్‌ మూవీకి సిద్ధం కావడం టాలీవుడ్‌లో హాట్‌ టాఫిక్‌గా మారింది.

19:23 - February 2, 2017

విజయవాడ : నేవీ సిబ్బంది చేసిన అద్భుత విన్యాసాలు బెజవాడ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మూడు రోజుల పాటు జరిగే నేవీ షో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజున జరిగిన అద్భుత విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. పిల్లలు..పెద్దలు..ఈ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయండి.

19:22 - February 2, 2017

హైదరాబాద్ : సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు గంటల పాటు కొనసాగిన సమావేశంలో బడ్జెట్ రూపకల్పనతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పలు ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 • కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 7800 కోట్లతో గంధమల్ల, మల్లన్న సాగర్, కొండపాక, బస్వాపూర్ ప్రాజెక్టు లకు రివైజ్డ్ అనుమతులు.
 • దేవాదుల లిప్ట్‌ ఇరిగేషన్‌ సామర్థ్యాన్ని 38 టీఎంసీల నుంచి 60 టీఎంసీలకు పెంచడం. దేవాదుల కింద వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం మల్కాపూర్‌లో 10 టిఎంసిలతో ఓ రిజర్వాయర్‌ నిర్మాణానికి ఆమోదం.
 • తుపాకులగూడెం వద్ద 2 వేల 121 కోట్లతో బ్యారేజీ నిర్మాణానికి ఆమోదం
 • 2487 లాంగ్వేజ్ పండిట్స్‌ను 1047 పిఈటిలను స్కూల్ అసిస్టెంట్స్‌గా అప్ గ్రేడ్.
 • 25 పిహెచ్‌సిలలో 60 ఖాళీ పోస్టుల భర్తికి గ్రీన్ సిగ్నల్.
 • మహబూబ్‌నగర మెడికల్ కళాశాలలో 260 పోస్టుల భర్తికి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్.
 • రామప్ప రిజర్వాయర్‌కు 1120 కోట్లు కేటాయింపు.
 • మిషన్ భగీరథలో 4800 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్.
 • సబ్ ప్లాన్ అంశం, బడ్జెట్ రూపకల్పన, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నీతి అయోగ్ ప్రతిపాదనల పై ప్రధానంగా చర్చించారు.
19:18 - February 2, 2017

గుంటూరు : రాజధాని భూముల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. తుళ్లూరు కేంద్రంగా ఇప్పటికే రిజిస్ట్రార్‌ ఆఫీసుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజధాని ప్రాంతంలో మొత్తం 3 రిజిస్ట్రేషన్‌ ఆఫీసులు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముద్దొచ్చినపుడే చంకన ఎక్కాలన్న సామెతను ఏపీ ప్రభుత్వం చక్కగా అనుసరిస్తోంది. ఇప్పటికే భూముల అమ్మకంద్వారా వచ్చిన మూలధన ఆదాయంపై ట్యాక్స్‌ మినహాయింపు పొందిన రైతులు సంతోషంలో ఉన్నారు. ఇదే అదనుగా ఏపీ ప్రభుత్వం రాజధాని గ్రామాల్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

మెట్టరైతులకు 1300 గజాల చొప్పున ప్లాట్లు..
శుక్రవారం నుంచి ప్లాట్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల్లోని మొత్తం 22వేల మంది రైతులు.. 34వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. దీనికి పరిహారంగా జరీబు భూములు ఇచ్చిన రైతులకు 1450 గజాలు, మెట్ట రైతులకు 1300 గజాల భూమిని ప్లాట్ల రూపంలో ఇప్పటికే ప్రభుత్వం అప్పగించింది. మొత్తం 29 గ్రామాల్లో ఇఫ్పటి వరకు 90 శాతం ప్లాట్ల పంపిణీని సీఆర్‌డీఏ అధికారులు పూర్తి చేశారు.

ప్లాట్‌కు పూర్తి హక్కుదారు కావాలంటే రిజిస్ట్రేషన్‌ తప్పని సరి..
అయితే రైతులకు కేటాయించిన ప్లాట్ల సమాచారాన్ని మ్యాప్ లో చూపించారు. అలాగే ప్లాట్ పొందిన వారికి అధికారికంగా ప్రోవిజినల్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే సీఆర్‌డిఏ ఇచ్చిన ప్రోవిజనల్స్ ను ఉపయోగించి ఎలాంటి లావాదేవీలు చేసుకోవడానికి గాని, తమ కుంటుంబ సభ్యుల పేరు రిజస్ట్రేషన్ చేసుకోవడానికి గాని వీలుండదు. కేవలం ప్లాట్ ఓనర్ హక్కు దారుడుగా మాత్రమే ఉంటాడు. అయితే రైతులు తమ ప్లాట్లకు పూర్తి హక్కు దారు కావాలంటే మాత్రం వారు ప్రభుత్వానికి ఇచ్చిన భూముల ఒరిజినల్ పత్రాలను అప్పగించి సీఆర్డీఏకి రిజిస్ట్రేషన్ చేస్తే.. వెంటనే ప్లాట్లు రైతు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

20గ్రామాల్లో ప్రారంభంకానున్న 3 రిజిస్ట్రార్‌ ఆఫీసులు.
ప్రస్తుతం ప్లాట్ల పంపిణీ దాదాపుగా పూర్తి కావడంతో ఇప్పుడు రిజిస్ట్రేషన్లను అధికారికంగా ప్రారంభించబోతున్నారు. రాజధాని ప్రాంతంలోని 20 గ్రామాలకు మొత్తం మూడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ప్రారంభించబోతున్నారు. తుళ్లూరు, మందడం, అనంతవరం ప్రాంతాల్లో మూడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో రిజిస్ట్రార్ ఆఫీసు పరిధిలో 6 నుండి 7 గ్రామాలను చేర్చనున్నారు. దీనిలో భాగంగా మొదటిగా తుళ్లూరులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును ప్రారంభించబోతున్నారు. శుక్రవారం నుంచి తుళ్లూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభం అవుతందని, రైతులు వారి వారి ప్లాట్లను నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్థానిక ఎమ్మేల్యే శ్రవణ్ కుమార్ అంటున్నారు. మరోవైపు పన్ను మినహాయింపు 2సంవత్సరాలే ప్రకటించినందున ప్లాట్లను ఎపుడు అమ్ముకున్నా రైతు నష్టపోకుండా ట్యాక్స్‌ మినహాయింపు 10సంవత్సరాలకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ గల్లా జయదేవ్‌. దీనికోసం తాను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానంటున్నారు.

ప్లాట్లలో గజం ధర ఎంతో తేల్చని ప్రభుత్వం..
అయితే ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సీఆర్ డిఏ ..గజం ధర ఎంత అనేది మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. వాస్తవానికి అధికారికంగా భూమిని అమ్ముకోవాలంటే ప్రభుత్వం నిర్ణయించిన గవర్నమెంట్ వాల్యూయేషన్ ఉంటుంది. దాని ప్రకారం ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రైతులకు ఇచ్చిన ప్లాట్లు అన్ని గజాల్లోకి మారిపోయాయి. గజం భూమి ధర ఇంత అని ప్రభుత్వం ప్రకటిస్తే దానిని బట్టి రిజస్ట్రేషన్ చేసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకుంటామని తుళ్లూరు రైతులు అంటున్నారు.

కనిపించని డ్రైనేజీ, తాగునీరు, అండర్‌గ్రౌండ్‌ కేబుల్స్‌..
మరోవైపు రిజస్ట్రేషన్ కోసం హడావిడి చేస్తున్న సీఆర్‌డీఏ అధికారులు .. మౌలిక సదుపాయాలను మాత్రం గాలికొదిలేశారు. ఇప్పటి వరకు నేలపాడు, శాఖమూరు గ్రామాల్లో మాత్రమే మట్టి రోడ్లు వేసి వదేలేశారని, ఇంకా డ్రైనేజీ, త్రాగునీరు,అండర్ గ్రౌండ్ కేబుల్స్ వంటి వాటిని ఎప్పుడు వేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. క్యాపిటల్‌ గెయిన్‌పై ట్యాక్స్‌ మినహాయింపుతో సంతోషంలో ఉన్న రైతులకు.. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభుత్వం చేస్తున్న హడావిడి మింగుడు పడటంలేదు. భూమి ధరలు తేల్చకుండా.. మౌలిక సదుపాయలు కల్పించకుండా.. అంతా వరిపొట్టుమీద ఇల్లలికే తతంగాన్ని అమలు చేస్తున్నారని రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

18:24 - February 2, 2017
18:23 - February 2, 2017

దాసరి హెల్త్ బులెటిన్ విడుదల..

హైదరాబాద్ : దాసరి నారాయణ రావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో దాసరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దాసరి ఆరోగ్యం మెరుగుపడిందని, డయాలిసిస్ అవసరం లేకుండా చికిత్సకు స్పందిస్తున్నారని దాసరకి వెంటిలెటర్స్ ద్వారా చికిత్స కొనసాగుతోందన్నారు. 3,4 రోజుల్లో సాధారణ స్థితికి వస్తారని కిమ్స్ వైద్యులు వెల్లడించారు.

 

17:36 - February 2, 2017

హైదరాబాద్ : ఈ నెల 22న నిరుద్యోగుల నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ తెలిపారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్‌ వరకు ఈ ర్యాలీ ఉంటుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఉద్యోగుల భర్తీ జరగడం లేదని కోదండరామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల 7 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని.. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 15 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసిందన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని.. ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే నిరుద్యోగుల నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు కోదండరామ్‌ తెలిపారు. 2014లో 1.07వేల ఖాళీలున్నాయని, తరువాతి కాలంలో 30 వేల దాకా ఖాళీలు వచ్చాయని, రాబోయే కాలంలో మరిన్ని ఖాళీలు వస్తాయన్నారు. జూన్ నాటికి 1.50 వేల ఖాళీలు ఏర్పడుతాయని, దాదాపు 2.07 వేల ఖాళీలకు గాను ఇప్పటి వరకు 15 వేల పోస్టులను భర్తీ చేశారని విమర్శించారు.

17:27 - February 2, 2017
17:12 - February 2, 2017

రాజధాని నిర్మాణ పిటిషన్లపై ఎన్జీటీలో విచారణ..

ఢిల్లీ : ఏపీ రాజధాని నిర్మాణ పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు సక్రమంగా లేవని పిటిషనర్ ఈఎఎస్ శర్మ పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు అక్రమంగా మంజూరు చేశారని పిటిషనర్ తరపున న్యాయవాది ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. 10600 ఎకరాలు ముంపునకు గురవుతుందని ప్రభుత్వమే ప్రకటించిందని, ముంపు ప్రదేశంలో కేవలం ఐదు ప్రాజెక్టులకు మాత్రమే అనుమతి ఉందని కానీ 56 ప్రాజెక్టులు చేపడుతున్నారని న్యాయవాది పేర్కొన్నారు. తదుపరి విచారణ రేపటికి ఎన్జీటీ వాయిదా వేసింది.

నియోజకవర్గాల నేతలతో జగన్ భేటీ..

కడప : ఇడుపుల పాయ ఎస్టేట్ లో నియోజకవర్గాల వారి నేతలతో వైసీపీ నేత జగన్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు.

 

తెలంగాణకు రూ. 29వేల కోట్ల ఆదాయం - దత్తాత్రేయ..

హైదరాబాద్ : 30 సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు రూ. 29 వేల కోట్ల ఆదాయం వచ్చిందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. పన్నుల ద్వారా తెలంగాణకు ప్రతి నెలా రూ. 1000 కోట్లు వస్తున్నాయని, ఎన్నికలు, కార్మిక చట్టాల సంస్కరణలు వేగవంతమయ్యాయన్నారు.

ఆర్థిక, ప్రణాళిక శాఖల అధికారులతో చంద్రబాబు భేటీ..

విజయవాడ : ఆర్థిక, ప్రణాళిక శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. బడ్జెట్ పై బాబు కసరత్తు జరిపారు. ఔట్ కమ్ బేస్డ్ బడ్జెట్ ను రూపొందించాలని, ప్రభుత్వ విభాగాలను మరింత పటిష్టం చేయాలని సూచించారు. సుస్థిర అభివృద్ధి కోసం సమ్మిళిత వృద్ధిపై చర్చించి 15 శాతం వృద్ధి రేటు రావడానికి కృషి చేయాలన్నారు. పన్నుల ద్వారా వచ్చిన నిధులే అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతోందని, కేటాయింపులు ప్రాధాన్యత క్రమంలో ఉండాలన్నారు. జాతీయ రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, పోర్టులు తదితర అంశాల్లో కేంద్రం నిధులను ఎక్కువగా ప్రయత్నించాలన్నారు.

16:33 - February 2, 2017

కర్ణాటక : మానవత్వానికే మచ్చ తెచ్చిన ఓ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలుడు రోడ్డుపై యాక్సిడెంట్‌కు గురై కొట్టుకుంటుంటే జనం మొబైల్‌తో క్లిక్‌ అనిపించారే తప్ప -సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న సోయి లేకపోవడంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కొప్పళకు చెందిన అన్వర్ ఇంటి నుంచి రోడ్డుపై సైకిల్‌పై వెళ్తుండగా ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. రోడ్డుపై అడ్డంగా పడిపోయిన అతడిపై నుంచి బస్సు వెళ్లడంతో పొట్ట, కాళ్లు, నడుము నుజ్జు నుజ్జయ్యాయి. తలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్పృహలోనే ఉన్న అన్వర్ తనను కాపాడామని కేకలు వేశాడు. పరుగున వచ్చిన జనం అన్వర్‌ చుట్టూ చేరారు. అర్జెంట్‌గా ఆసుపత్రికి తీసుకెళ్లే బదులు మొబైల్‌ ఫోన్‌తో ఫోటోలు తీస్తూ సమయాన్ని వృథా చేశారు. 20 నిముషాలు సమయం అక్కడే గడచిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. సమయానికి వైద్యం అందితే అన్వర్‌ బతికి ఉండేవాడని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

16:32 - February 2, 2017

చిత్తూరు : శుక్రవారం తిరుమలలో రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సూర్యోదయం నుంచి చంద్రదయం వరకు శ్రీవారి తిరుమాడ వీధుల్లో సప్త వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున 5.30 గం.లకు సూర్యప్రభ వాహనంతో రథసప్తమి మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా తిరుమల జేఈవో శ్రీనివాసరాజు టెన్ టివితో మాట్లాడారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

16:30 - February 2, 2017

విజయవాడ : నగరంలో మహిళా మిత్ర, మహిళా రక్షక్‌లను కమిషనర్‌ ప్రారంభించారు.. విజయవాడలో మహిళల రక్షణకు మహిళామిత్ర, మహిళా రక్షక్ టీంలను ఏర్పాటుచేశామని.... పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ ప్రకటించారు... స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక మార్పును తెచ్చేందుకు ఈ ప్రత్యేక టీంలు పని చేస్తాయని చెప్పారు..

16:28 - February 2, 2017

హైదరాబాద్ : 'శరణం గచ్ఛామి' సినిమా విడుదలపై వివాదం ముదురుతోంది. హైదరాబాద్‌ గాంధీనగర్‌ లోని సెన్సార్‌ బోర్డు కార్యాలయాన్ని తెలంగాణ స్టూడెంట్‌ యూనియన్‌ ముట్టడించడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శరణం గచ్ఛామి చిత్రంలో ఏ మతాన్ని కించపరిచే సన్నివేశాలు లేవని.. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

16:25 - February 2, 2017

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తే చూడాలని అనుకుంటున్న అభిమానుల కోరిక త్వరలో తీరనుంది. వీరిద్దరి కలయికలో ఈ ఓచిత్రం రూపొందనుంది. దీనికి సంబంధించిన విషయాలను నిర్మాత, ఎంపీ సుబ్బిరామిరెడ్డి వెల్లడించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని పేర్కొన్నారు. ఓ కథను త్రివిక్రమ్ వెల్లడించారని, చిత్రానికి సంబంధించిన విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు.
ఇటీవలే చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ చిత్రం 'కత్తి' రీమెక్ ను వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'రామ్ చరణ్' ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు 'పవన్ కళ్యాణ్' కూడా పలు చిత్రాలకు సైన్ చేస్తున్నారు. ‘కాటమరాయుడు' చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఉగాది కానుకగా ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పవన్..చిరంజీవి హీరోలుగా వస్తున్న ఈ చిత్రంపై పలు విషయాలు తెలియాల్సి ఉంది.

 

చిరు..పవన్ హీరోలుగా చిత్రం..

హైదరాబాద్ : చిరంజీవి, పవన్ కళ్యాణ్ హీరోలుగా ఓ సినిమా రూపొందిస్తున్నట్లు టి.సుబ్బిరామిరెడ్డి పేర్కొన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని, త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతుందన్నారు.

16:11 - February 2, 2017
16:05 - February 2, 2017

రాష్ట్రంలో 1.07 ఖాళీలు..

హైదరాబాద్ : ఫిబ్రవరి 22వ తేదీన టీజేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ జరగనుంది. నిరసన ర్యాలీ పోస్టర్ ను ప్రొ.కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టి.ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.07 లక్షల ఖాళీలున్నాయని, ప్రభుత్వం 15 వేల ఖాళీలు మాత్రమే భర్తీ చేసిందని పేర్కొన్నారు. ఉద్యోగాల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని, పోలీసులు జేఏసీ నేతలను వేధిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ తీరుపై చట్టపరమైన చర్యలకు వెనుకాడమని హెచ్చరించారు.

15:39 - February 2, 2017

హైదరాబాద్ : ఉపాధి వేటలో గల్ఫ్‌ బాట పట్టి మోసపోయిన బాధితురాలు భవాని సురక్షితంగా స్వదేశానికి చేరుకుంది. గల్ఫ్‌లో నరకయాతనను అనుభవించిన ఆమె.. 10TV, పోలీసుల సంయుక్త సహకారంతో సేఫ్‌గా ఇండియాకు తిరిగొచ్చింది. అక్కడ తనను చిత్రహింసలకు గురిచేసేవారని భవాని తన అనుభవాలను 10Tvతో పంచుకుంది. పూర్తి అవగాహనతో పాటు.. కుటుంబ సభ్యుల సహకారం లేకుండా ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఈ సందర్భంగా డీసీపీ సుమతి సూచించారు. అక్కడ తనను నానా ఇబ్బందులకు గురి చేశారని, ప్రతిరోజు తనను కొట్టి భౌతికంగా చిత్రవధ చేసేవారని బాధితురాలు 10Tvతో తన అనుభవాలను పంచుకుంది. ఎంత పని చేసినా.. కనీసం తిండి కూడా సరిగా పెట్టేవారు కాదని, మంచినీళ్లతో కడుపు నింపుకుని రోజులు వెల్లదీశానని బాధితురాలు 10TV స్టూడియోలో తన ఆవేదనను వ్యక్తం చేసింది.

అవగాహనతో ప్రయత్నం చేయాలి - డీసీపీ..
విదేశాలకు వెళ్లాలనుకునే మహిళలు పూర్తి అవగాహనతో ప్రయత్నం చేయాలని, కుటుంబ సభ్యుల సహాకారంతో నిర్ణయం తీసుకోవాలని నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి సూచించారు. విదేశాల్లో ఉన్న లొసుగుల్ని ముందుగానే అంచనా వేయాలని, ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని డీసీపీ సూచించారు. ఇండియన్‌ ఎంబసీ గురించిన సమాచారాన్ని దగ్గర ఉంచుకోవాలని, ఎదైనా సమస్యలు తలెత్తినప్పుడు వారితో సంప్రదిస్తే పరిష్కారం లభించే అవకాశం ఉందని డీసీపీ తెలిపారు.

ప్రజల్లో అవగాహన కల్పించాలి..
ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు పూర్తి వివరాలు తెలుసుకుని, నమ్మకం కుదిరాకే నిర్ణయం తీసుకోవాలని పీవోడబ్ల్యూ సంధ్య సూచించారు. విదేశాలకు వెళ్లేవారి జాబితా, వివరాలు సమగ్రంగా పొందుపరిచి ఎంబసీలో, ప్రభుత్వం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. విదేశాలకు పని కోసం వెళ్లేవారు...ఇండియన్‌ ఎంబసీ వివరాలు తమ వద్ద ఉంచుకోవాలని సంధ్య సూచించారు. బాధితులు ధైర్యంగా ముందుకు వస్తేనే ఇలాంటి నేరాలను అరికట్టే అవకాశం ఉందని బేటీ బాచావో బేటీ పడావో రాష్ట్ర కన్వీనర్‌ గీతామూర్తి అభిప్రాయపడ్డారు. మోసాలకు తావు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.
ఎంతో మందిని మోసం చేస్తున్న శ్రీనివాస్‌, విఠల్‌ లాంటి గల్ఫ్‌ ఏజెంట్లను కఠినంగా శిక్షించాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. గల్ఫ్‌లో చిత్రవధకు గురైన భవానిని ఇండియాకు చేరుకునేలా కృషి చేసిన 10TV బృందానికి సర్వత్రా ప్రసంశలు వెల్లువెత్తాయి.

15:36 - February 2, 2017

విజయవాడ : రాజధాని ప్రాంతంలో దళితులు ఉండకూడదని భావిస్తున్నారా? అంటూ సీఆర్డీఏ, మున్సిపల్‌ అధికారులపై ఎస్సీ,ఎ స్టీ కమిషన్‌ మెంబర్‌ కమలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములిచ్చినవారి కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి 2వేల ఐదు వందల రూపాయలివ్వాలని చట్టం చెబుతుంటే కుటుంబానికి 2వేల ఐదు వందలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.. ప్రభుత్వం పాలన చేయ్యాలని... ఇలా అన్యాయం చేయొద్దని మండిపడ్డారు. మిగతావారికి ఇచ్చినట్లుగానే దళితుల భూములకూ ప్యాకేజీ అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకూ రాజధాని ప్రాంతంలోని దళిత రైతులకు ఏం చేశారో పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు.

15:33 - February 2, 2017

హైదరాబాద్ : ‘శరణం గచ్చామి' సినిమాను సెన్సార్ బ్యాన్ చేయడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే సినిమాను విడుదల చేయాలని డిమాండ్ వస్తున్నాయి. కుల వ్యవస్థను ప్రశ్నిస్తూ ఈ సినిమాను తీశారు. కానీ సెన్సార్ బోర్డు దీనిని బ్యాన్ చేసింది. దీనిపై టీఎస్ యూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం గాంధీనగర్ లో ఉన్న సెన్సార్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సినిమాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. అభ్యంతకర సన్నివేశాలను కట్ చేయాలి కానీ ఏకంగా సినిమానే బ్యాన్ చేయడం సబబు కాదని విద్యార్థులు పేర్కొన్నారు. రాజ్యాంగంలో అంబేద్కర్ పేర్కొన్న అంశాలను మాత్రమే సినిమాలో పొందుపర్చడం జరిగిందన్నారు. తెలంగాణకు సంబంధించిన వారు సినిమాను తీయడం ఇష్టం లేని వారు దీనిని అడ్డుకుంటున్నారని వారు పేర్కొన్నారు. చిత్రంలో ఏ మతాన్ని కించపరచలేదని, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.

15:29 - February 2, 2017

అనంతపురం : భూ సేకరణ ఓ రైతు ప్రాణం తీసింది. మొత్తం భూమి పోతుందనే ఆవేదనతో అతని గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన పెనుగొండ మండలంలో చోటు చేసుకుంది. ఈ మండలంలో పరిశ్రమ కోసం ప్రభుత్వం భూ సేకరణ జరుపుతోంది. అందులో భాగంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ధర నిర్ణయంపై ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జేసీ లక్ష్మీకాంతం, ఎమ్మెల్యే పార్థసారధి, ఆర్డీఓ రామ్మూర్తిలు హాజరయ్యారు. అమ్మవారుపల్లి, యర్రమంచి రైతులు కూడా సమావేశానికి వచ్చారు. అందులో బాలు నాయక్ అనే రైతు కూడా ఉన్నాడు. ఇతనికి ఆరున్నర ఎకరాల భూమి ఉంది. మూడున్నర ఎకరాల భూమి ఇంతకు ముందు కియో కార్ల కంపెనీ కోసం ప్రభుత్వం తీసుకుంది. మిగిలిన మూడెకరాల భూమి ప్రస్తుతం సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పొలం మొత్తం భూ సేకరణలో పోతుందని కలత చెందిన బాలు నాయక్‌..సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోనే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెనుగొండ ఎమ్మెల్యే పార్థసారధి స్పందించారు. ప్రభుత్వ తరపున రెండు లక్షల రూపాయలు, ఒక ఇల్లు ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీనిచ్చారు. గతంలో పరిశ్రమల కోసం నాలుగు వేల ఎకరాలను తీసుకున్నారని, బలవంతంగా భూ సేకరణ జరుపుతున్నారని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సెన్సార్ బోర్డును ముట్టడించిన టీఎస్ యూ..

హైదరాబాద్ : గాంధీనగర్ లో ఉన్న సెన్సార్ బోర్డును టీఎస్ యూ విద్యార్థులు ముట్టడించారు. ‘శరణం..గచ్చామి' సినిమాను వెంటనే విడుదల చేయాలని కోరుతూ వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వెంటనే అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు.

15:11 - February 2, 2017

సీఆర్డీఏ అధికారులపై కమలమ్మ ఆగ్రహం..

విజయవాడ : అమరావతిలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ పర్యటించారు. దళిత రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని సీఆర్డీఏ అధికారులపై కమలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో దళితులు ఉండకూడదా అంటూ మండిపడ్డారు. తక్షణమే 41 జీవోను రద్దు చేయాలని, అందరిలాగే దళితుల భూములకు ప్యాకేజీ అమలు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు రాజధాని ప్రాంత దళిత రైతులకు ఏం చేశారో పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జైట్లీ బడ్జెట్ ఫెయిల్ - నారాయణ..

విజయవాడ : జైట్లీ బడ్జెట్ ఫెయిల్ అయ్యిందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ఎన్ఆర్ఐలకు ఎలాంటి భరోసానివ్వలేదని, పోలవరం రైతులకు కూడా క్యాపిటల్ గెయిన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ వల్ల నల్లదనం ఉన్నవారంతా తెల్లదొరలుగా మారరని, ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు, వెంకయ్యలను మించిన వారు లేరని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడాలని, 2019లో మోడీకి ఓటమి తప్పదని పేర్కొన్నారు.

14:35 - February 2, 2017
14:33 - February 2, 2017

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ, సినీ నాయకులు ఆసుపత్రికి తరలివస్తున్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ మురళీ మోహన్ తో పాటు పలువురు దాసరిని పరామర్శించారు. దాసరి కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై దత్తాత్రేయ ఆరా తీశారు. దాసరి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో ఎంతో మందికి దాసరి అవకాశం కల్పించారని, ఆయన త్వరగా కోలుకోవాలని ఎంపీ మురళీ మోహన్ తెలిపారు.

14:24 - February 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. సీఎం కేసీఆర్ సమావేశానికి హాజరు కానున్నారు. మొత్తం 14 అంశాలపై కీలక చర్చ జరగనుంది. చర్చించిన అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సవరణ ముసాయిదా బిల్లు...సుధీర్, చెల్లప్ప కమిషన్ల నివేదికలు...సాగునీటి పారుదల శాఖకు చెందిన 9 అంశాలు..సమావేశంలో చర్చించనున్నారు. అంతేగాకుండా ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై చర్చించి కేబినెట్ ఆమోదించనుంది. కీలకమైన అంశాల ఎజెండాతో సమావేశం కొనసాగుతోంది. మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో ఖాళీ పోస్టుల భర్తీపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మార్చిలో ప్రవేశ పెట్టే బడ్జెట్..తేదీని ఖరారును చేయనుంది. బీసీ రెసిడెన్షియల్ కాలేజీల్లో నెలకొన్న పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

14:20 - February 2, 2017

అనంతపురం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విషయం మరిచిపోయిన ఓ సర్పంచ్ మహిళను విచక్షణారహితంగా కొట్టాడు. మహిళను కొడుతున్న వీడియో బయటకు రావడం కలకలం రేపుతోంది. వెంటనే సర్పంచ్ పదవి నుండి అతడిని తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...తన ఇంటి ఎదుట ట్యాంక్ కట్టవద్దని కూడేరులో నివాసం ఉండే సుధా అనే మహిళ గ్రామ సర్పంచ్ నాగరాజును వేడుకుంది. ట్యాంకు కట్టవద్దని అన్న సుధపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాగరాజు కాలితో ఇష్టమొచ్చినట్లుగా తన్నాడు. అతనితో పాటు జన్మభూమి కమిటీ సభ్యుడు కూడా దాడి చేశాడు. పక్కనే ఉన్న ఇతరులు దాడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కానీ సర్పంచ్ ఏ మాత్రం వినకుండా మహిళను విచక్షణారహితంగా కొట్టాడు. వెంటనే బాధితులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన సర్పంచ్ కు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై బాధితులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని సుధ పేర్కొంది. మహిళా సంఘాలతో డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిన సుధ దాడిపై ఫిర్యాదు చేశారు.

సర్పంచ్ ను అరెస్టు చేయాలి...
బాధ్యాతయుతమైన పదవిలో ఉండి మహిళపై ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలు భానుజా పేర్కొన్నారు. టెన్ టివితో ఆమె మాట్లాడారు. వెంటనే సర్పంచ్ ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళను కొట్టడం బాధాకరమని, వెంటనే సర్పంచ్ ను అరెస్టు చేయాలని ఐద్వా నాయకురాలు సావిత్రి డిమాండ్ చేశారు. ఆమె టెన్ టివితో మాట్లాడారు. మహిళలకు అండగా ఉంటామని ఎస్పీ పేర్కొన్న తరువాత ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

14:15 - February 2, 2017

హైదరాబాద్ : మగువలు బ్యాంగిల్స్ అంటే ఎంతో మక్కువ చూపిస్తూ వుంటారు. అంతే కాదు ఈ బ్యాంగిల్స్ ట్రేండ్ కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ వుంటాయి. మరి లెటెస్ట్ బ్యాంగిల్ ఏంటో చూడానుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:10 - February 2, 2017

హైదరాబాద్: చిన్నారుల జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. బడికి వెళ్లాల్సిన వయస్సులో బండెడు చాకిరీతో చదువుకు దూరం అవుతున్నారు. పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దాల్సిన బాల్యం బరువైన పనులతో బండబారుతోంది. ఆటపాటలు, కేరింతలతో సాగాల్సిన వారి జీవితం హోటళ్లలో, ఇటుక బట్టీల్లో, కిరాణా షాపుల్లో, పాచి పనులతో చిన్నారుల బాల్యం కునారిల్లుతోంది. 2016 విద్యా సంవత్సరంలో స్కూల్లో డ్రాపౌట్స్ పై మానవి ప్రత్యేక కథనం. మరి మీరూ చూడాలనుకుంటే ఈవీడియోను క్లిక్ చేయండి.

బడ్జెట్ నిరాశపరిచింది - జైపాల్ రెడ్డి..

హైదరాబాద్ : మోడీ బడ్జెట్ నిరాశపరిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజల్లో ఆశలు రేపిన మోడీ గాలి తీసిన ట్యూబ్ లా మారారని విమర్శించారు. మోడీ తీరుతో దేశం తీవ్రంగా నష్టపోతోందని, రాజకీయ పార్టీల విరాళాల సంస్కరణలతో ఉపయోగం లేదన్నారు. పార్టీలు అభ్యర్థులకు డబ్బులివ్వడం కాదు..అభ్యర్థులే పార్టీలకు డబ్బులు ఇస్తున్నారని పేర్కొన్నారు.

దాసరిని పరామర్శించిన మురళీ మోహన్..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆరోగ్య మెరుగుపడుతోందని ఎంపీ మురళీ మోహన్ పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో దాసరిని పరామర్శించిన మురళీ మోహన్ మీడియాతో మాట్లాడారు. దాసరికి వెంటిలెటర్ ను తొలగించారని, రెండు, మూడు రోజుల్లో దాసరిని జనరల్ వార్డుకు తరలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపు ఫిలింనగర్ దైవ సన్నిధానంలో దాసరి పేరిట పూజలు చేస్తామన్నారు.

13:42 - February 2, 2017
13:41 - February 2, 2017
13:40 - February 2, 2017

భద్రాద్రి : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న మహాజన పాదయాత్ర..భద్రాద్రి జిల్లాలో 109వ రోజు పలు గ్రామాల గుండా సాగుతోంది. కొత్తూరు, పార్కలగండ, పెద్దపల్లిగూడెం, మల్కారం, కేశప్పగూడెం, ఊట్లపల్లి, రాచూరుపల్లి, జమ్మిగూడెం, అశ్వారావుపేటలో పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర సాగుతున్న గ్రామాల్లో స్థానిక సమస్యలను పాదయాత్ర బృందం అడిగి తెలుసుకుంటోంది. అయితే పోడుభూముల్లో వ్యవసాయం చేసుకోకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని గిరిజనులు పాదయాత్ర బృందం సభ్యులకు గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు.

13:36 - February 2, 2017

ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం మీడియాపై పడిందన్న అంశపై రాజ్యసభలో చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌ ఈ అంశాన్ని లేవనెత్తారు. పత్రికల సర్క్యులేషన్‌ పడిపోయిందని, పూర్వకాలం నుంచి అమల్లో ఉన్న ప్రభుత్వ ప్రకటనల జారీ విధానాన్ని మార్చాలని రాపోలు సూచించారు. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం మీడియా రంగంపై పండిందన్న వాదాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని సభ దృష్టికి తెచ్చారు.

13:34 - February 2, 2017

ఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్ష మందికిపైగా ఉన్నమెడికల్‌ సేల్స్‌ రిప్రజంటేటీవ్స్‌ రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నారు. వీరి సర్వీసు స్థితిగుతులు గురించి ప్రభుత్వం పట్టించుకోవడంతో సమ్మె చేయాల్సి వస్తోందని సీపీఎం సభ్యుడు తపన్‌ సేన్‌ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్‌ రిప్‌ల సర్వీసులు మెరుపరిచేందుకు చట్టం చేసినా నియమ, నిబంధనలు రూపొందించని అంశాన్ని సభ దృష్టికి తెచ్చారు. కార్మిక మంత్రిత్వ శాఖ నిర్వాహకంతో వీరి పరిస్థితి ఘోరంగా మారిందన్నారు.

13:31 - February 2, 2017

ఢిల్లీ:చెన్నై ఓడ రేపు సమీపంలో రెండు ఓడలు ఢీ కొన్న ప్రమాదంపై రాజ్యసభలో ఆందోళన వ్యక్తమైంది. జీరో అవర్‌లో డీఎంకే సభ్యురాలు కనిమొళి ఈ అంశాన్ని ప్రస్తావించారు. పోర్టు అధికారులు, తీరప్రాంత గస్తీదళానికి మధ్య సమన్వయం లోపించడంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడిందని ఆందోనళ వెలిబుచ్చారు. ఇరవై టన్నలు ఆయిల్‌ ఒలికిపోవడంతో మత్ససంపద నాశనమవుతోందని సభ దృష్టికి తెచ్చారు. 35కి.మీ. మేర పర్యావరాణపై ప్రభావం చూపుతోందని కనిమొళి ఆందోళన వ్యక్తం చేశారు.

13:29 - February 2, 2017

తమిళనాడు : చెన్నై సముద్రం నల్ల సముద్రాన్ని తలపిస్తోంది. ఐదు రోజుల క్రితం ఎన్నోర్‌ సమీపంలో రెండు ఓడలు ఢీకొట్టిన ఘటనలో 40 టన్నుల బ్లాక్‌ ఆయిల్‌ సముద్రంలో ఒలికిపోయింది. దీంతో చెన్నయ్‌ సముద్ర తీరంలో 35 కిలోమీటర్ల మేర ఆయిల్‌ సముద్రంలోకి వ్యాపించింది. ఆర్‌కె నగర్‌ కుప్పం బీచ్‌ వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హై ప్రెషర్‌ సూపర్‌ సుకర్‌ పంప్‌ ద్వారా ఆయిల్‌ నీటిని బయటకు పంపించే యత్నం చేస్తున్నారు. ఆయిల్‌ ప్రభావంతో మత్స్య సంపదకు తీరని నష్టం కలిగింది. ఆయిల్‌తో పాటు చచ్చిన చేపలు ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయి. వీటితో పాటు తాబేళ్లు, నీటి పాములు కూడా చచ్చిపోయాయి. సహాయక సిబ్బంది దాదాపు 15 టన్నుల ఆయిల్‌ను సముద్రం నుంచి తీయగలిగారు. పర్యవరణానికి ముప్పు కలుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

13:27 - February 2, 2017

హైదరాబాద్: ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో మళ్లీ అలజడి మొదలయ్యింది. ఏవోబీలో మావోయిస్టులు మళ్లీ విరుచుకుపడ్డారు. సాలూరు-కొరాపుట్‌ రహదారిలోని సుంకిఘాటీ ముంగరు భూమి గ్రామం వద్ద ఒడిశా రాష్ట్ర సాయుధ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరతో పేల్చివేశారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు చనిపోగా..మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో 40 మంది జవాన్లు ఉన్నారు. మావోయిస్టుల దాడితో ఏవోబీ మళ్లీ వేడెక్కింది. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.

సరిహద్దుల్లో చాలాకాలం తర్వాత ...

సరిహద్దుల్లో చాలాకాలం తర్వాత మావోయిస్టులు పెద్దఎత్తున పోలీసులపై దాడి చెయ్యడంపై ఒక్కసారిగా సరిహద్దుల్లో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఏవోబీలో గతేడాది అక్టోబర్‌ 24న జరిగిన రాంగూడ ఎన్‌కౌంటర్‌లో 30 మంది సహచరులను కోల్పోయిన మావోయిస్టులు ఈ సంఘటనకు ప్రతీకారం తీర్చుకోడానికి కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా సుంకి ఘాటీని అనువుగా చేసుకుని పోలీసులపై ఒక్కసారిగా దాడిచేసి పోలీసులను మట్టుపెట్టారు. ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీ కార్యదర్శిగా పద్మ నియామకం తర్వాత సరిహద్దుల్లో మావోయిస్టులు మెల్లగా కార్యకలాపాలు విస్తృతం చేశారు. రాంగుడ ఎన్‌కౌంటర్‌ తర్వాత పార్టీలో ఉన్న మిగతా కేడర్‌ మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా భారీ విధ్వంసానికి మావో అగ్రనాయకత్వం వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. దీన్ని అమలు చేయడానికి మావోయిస్టులు 3 నెలలుగా చాపకింద నీరులా తమ కార్యకలాపాలు సాగించారు. రాంగుడ ఎన్‌కౌంటర్‌ అనంతరం మావోయిస్టుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న నిఘా విభాగం మావోయిస్టుల మౌనం వెనుక పెద్ద విధ్వంసమే దాగిఉందని..దీనిని ఎదుర్కోడానికి అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో పోలీసులకు హెచ్చరికలు జారీచేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దులోని విశాఖ జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి ముంచంగిపుట్టు మండలంలోని రెండు ప్రాంతాల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర్లు గుర్తించి వెలికితీశారు. తాజాగా మావోయిస్టుల విధ్వంసంతో అప్రమత్తమైన పోలీసులు ఆంధ్రా- ఒడిశా సరిహద్దులను జల్లెడ పడుతున్నారు. పోలీసు వాహనాన్ని పేల్చిన ఘటనకు పాల్పడి తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు విశాఖ మన్యంలోని అన్ని పోలీసుస్టేషన్లను అప్రమత్తం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. రాజకీయ నాయకులు, అధికారుల పర్యటనల్లో జాగ్రత్తలు తీసుకోవాలని..సూచించారు.

బాధితులను పరామర్శించిన విశాఖ ఎస్పీ...

ఏఓబీ సరిహద్దు ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా పొట్టంగి పోలీసు స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఒడిశా రాష్ట్ర సాయుధ పోలీసు విభాగానికి చెందిన ఐదుగురు అసిస్టెంట్‌ డ్రైవర్లు మందుపాతర పేలుడు ఘటనలో గాయపడ్డారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను విశాఖ జిల్లా SP రాహుల్‌దేవ్‌ శర్మ పరామర్శించారు. వీరికి అందుతున్న వైద్య సహాయం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ఘటన తర్వాత రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తత ప్రకటించినట్టు రాహుల్‌దేవ్‌ శర్మ చెబుతున్నారు.

13:24 - February 2, 2017

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ -17 లో ఏపికి పచ్చిదగా జరిగినా.. సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించడం హేయమైన చర్య అని నేతలు అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం గురించి,మెట్రో రైలు నిర్మాణం, తెలంగాణ లో ఎయిమ్స్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండా చేశారు. నోట్ల రద్దు పై ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా బడ్జెట్ లో ఎలాంటి ఊసే లేదు. ఇలాంటి అంశాలపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో కాంగ్రెస్ బెల్లయ్య నాయక్, బిజెపి నేత ప్రసన్న, సీపీఎం నేత బాబూరావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్: కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రాంరంభం కానుంది. బడ్జెట్‌ సమావేశాలే ప్రధానంగా ఎజెండా భేటీ కొనసాగనుంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సవరణలపై మంత్రులు చర్చించనున్నారు. అంతేకాకుండా నిన్న జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై కూడా మంత్రివర్గం చర్చించనుంది.

 

13:17 - February 2, 2017

తెల్లారి లేచింది మొదలు..రాత్రి పడుకొనే వరకు ఉరుకుల పరుగులతోనే గడిచిపోతుంది. దీనితో కొంతమంది ఆరోగ్యాన్ని అసలు పట్టించుకోరు. అనారోగ్య సమస్యలు ఏర్పడడంతో వైద్యుల దగ్గరకు పరుగెడుతుంటారు. కొన్ని ఆరోగ్య నియమాలు..కొన్ని చిట్కాలు పాటిస్తే అనారోగ్య సమస్యలు దరి చేరవు.

 • విరేచనాలు..కడుపులో మంట..తలనొప్పి..నోటిపూత..కంటి చూపుకు 'మునగాకు' ఔషధంగా పనిచేస్తుంది.
 • మునగాకును ఉపయోగించడం ద్వారా రక్తంతో పాటు కిడ్నీలను శుద్ధి అవుతుంది.
 • క్యారట్ జ్యూస్ ప్రతి రోజు తాగితే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. చర్మం నిగనిగలాడుతుంది.
 • వేసవిలో ముల్లంగి తీసుకోవాలి. శరీరానికి చలవ చేయడమే కాకుండా డీ హైడ్రేషన్ నుండి కాపాడుతుంది. ముల్లంగిలో విటమిన్ ఎ,సి, ఇ, యాంటీ యాక్సిడెంట్స్ వంటి న్యూట్రీషన్స్ ఉన్నాయి.
 • మధుమేహ వ్యాధి గ్రస్తులు ఉదయం పది కరివెపాకులను నమిలి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
 • మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధ పడే వారు తరచుగా క్యాప్సికంను తీసుకోవాలి.
 • దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.
 • అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గుతాయి.
 • అజీర్తి వలన వచ్చే కడుపునొప్పికి నిమ్మరసంలో అల్లం కలిపి తాగితే నొప్పి తగ్గుతుంది. అసిడిటీ వల్లైతే లెమన్ టీ తాగడం ఉత్తమం.
 • భోజనం చేసిన తర్వాత, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసి ఉప్పు కలిపిన నీటిని నోట్లోపోసి పుక్కిలించాలి. తద్వారా దంత సమస్యలు రావు. పంటి నొప్పి ఉన్నచోట లవంగతైలం పూయాలి.
 • మెడ నొప్పికి..ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవాళ్ళు మధ్య మధ్యలో కాస్త అటూ ఇటూ తిరిగితే కాస్త ఉపశమనం కలుగుతుంది.
 • బరువులు ఎత్తేటప్పుడు వంగి ఎత్తకుండా ఒక కాలి మీదకూర్చుని బరువు ఎత్తితే మెడ పై భారం పడదు.
 • విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులు రావు. జామపండు, కమలాపండు మొదలైనవి దానిలో సి విటమిన్ ఉంటుంది.
 • వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్‌జ్యూస్, క్యాబేజ్‌సూప్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి. 
13:08 - February 2, 2017
12:57 - February 2, 2017

టాలీవుడ్ 'ప్రిన్స్' గా పేరొందిన నటుడు 'మహేష్ బాబు'. ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా 'మహేష్' అందం మాత్రం చెక్కుచెదరడం లేదు. గ్లామరస్ కు సీక్రెట్ ఏంటీ అని కొన్ని సందర్భాల్లో పలువురు అడిగినా చిరునవ్వుతో సమాధానం చెబుతుంటాడు. కానీ అతని గ్లామరస్ సీక్రెట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 'మహేష్' అత్యంత ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. అందులో భాగంగా విదేశాలకు కూడా వెళుతుంటాడని టాక్ వినిపిస్తోంది. విదేశాల్లో బాడీకి 'డీటాక్సినేషన్' చేయించుకుంటాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా 'మహేష్' మలేసియాకు వెళ్లనున్నట్లు అక్కడ 'డీటాక్సినేషన్' చేయించుకోనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. డీటాక్సినేషన్ అంటే...శరీరంలో ఉన్న మలినాలు..వ్యర్థాలను వైద్య ప్రక్రియ ద్వారా తొలగించుకోవడం అంటారు. ప్రతి సంవత్సరం ఇలా 'మహేష్' ఈ చికిత్స చేయించుకుంటాడని..ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం కాబట్టే..కుర్రాడిలా కనిపిస్తున్నాడంటూ వార్తలు వెలువడుతున్నాయి. 'మహేష్' ప్రస్తుతం 'మురుగదాస్' మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

12:42 - February 2, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ కంటే ముందుగానే చిత్రం విడుదలవుతోందని టాక్ తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో..శరత్ మరార్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. హైదరాబాద్ లో ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 29న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ నిర్ణయించిన తేదీ కంటే ముందుగానే చిత్రం విడదలయ్యే అవకాశాలున్నట్లు టాక్. రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నట్లు, దీనితో షూటింగ్ పూర్తయినట్లేనని తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా 'కాటమరాయుడు' ప్రచార చిత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ చిత్ర టీజర్ మాత్రం ఇంతవరకు రిలీజ్ కాలేదు. త్వరలోనే టీజర్ ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. 

12:36 - February 2, 2017

ఆఫ్టర్ లాంగ్ టైం 'షారూఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్' మరోసారి కలిసి కలిసి నటించబోతున్నారట. సల్లూభాయ్ న్యూ మూవీలో బాద్ షా కీ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. 21ఏళ్ల గ్యాప్ తరువాత ఈ బడా స్టార్స్ ఒకే ప్రేమ్ లో కనిపించబోతుండడంతో బాలీవుడ్ లో ఈ న్యూస్ సెన్సేషన్ అవుతోంది. బాలీవుడ్ లో మాస్ స్టార్ గా 'సల్మాన్ ఖాన్' కి, క్లాస్ స్టార్ గా 'షారుఖ్ ఖాన్' కి ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఈ మధ్య 'షారుఖ్' హవా కాస్త తగ్గింది కానీ ఒకప్పుడు బాద్ షా క్రేజ్ చూస్తే బాలీవుడ్ కి పిచ్చేక్కేసింది. ఇక 'సల్మాన్' ఇమేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఆయన యావరేజ్ సినిమాలు కూడా ఈజీగా బిలియన్ కలెక్షన్లను రాబట్టుతాయి. ఇంతటి స్టార్ డబ్ ఉన్న ఖాన్స్ 21ఏళ్ల తరువాత కలిసి నటించబోతుండడం బాలీవుడ్ లో వెరీ స్పెషల్ గా మారింది. 'షారూఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్' చివరగా 1995లో వచ్చిన 'కరణ్ అర్జున్' మూవీలో సోదరులుగా కలిసి నటించారు. ఆ తరువాత ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవలతో చాలా కాలం మాట్లాడుకోలేదు.

కరణ్ అర్జున్..
అయితే కొంతకాలంగా 'సల్మాన్', 'షారూఖ్' మాట్లాడుకుంటున్నప్పటికి కలిసి సినిమా మాత్రం చేయలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఖాన్స్ ఒకే సినిమాలో నటించబోతున్నారు. అది కూడా 'సల్మాన్' సినిమాలో 'షారూఖ్' కీ రోల్ లో నటిస్తుండడం బీటౌన్ లో సెన్సేషన్ న్యూస్ గా మారింది. 'సల్మాన్ ఖాన్' హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో 'ట్యూబ్ లైట్' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1962లో చైనా, ఇండియా యుద్ధం కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో 'షారూఖ్' ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లు టాక్. బాద్ షా ఏంట్రీతో సినిమా ఓ రేంజ్ వెళుతోందని తెలుస్తోంది. 21ఏళ్ల తరువాత 'సల్మాన్'-'షారూఖ్' కలిసి నటించనుండడంతో 'ట్యూబ్ లైట్' సినిమాపై బాలీవుడ్ లో అంచనాలు ఆకాశనంటుతున్నాయి. ఈ చిత్రంలో 'సోహైల్ ఖాన్' తో పాటు చైనీస్ నటి 'ఝుఝు' కూడా నటిస్తోంది. 'ట్యూబ్ లైట్' ను జూన్ 25న రిలీజ్ చేసేందకు ప్లాన్ చేస్తున్నారు. 

వేశ్య గృహాల్లో దోపిడీ..7గురు విద్యార్థులు అరెస్ట్

హైదరాబాద్: కూకట్ పల్లి కేపీహెచ్ బీ కాలనీలో వేశ్య గృహాల్లో దోపిడీకి పాల్పడుతున్న ఏడుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు వెంకట వంశీ కిరణ్, నాగేంద్రబాబు, టి.సాయికిరణ్, కేతిరెడ్డి, ప్రనిథరెడ్డి, సాయితేజతో పాటు ఏ1 గంగరాజును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

12:30 - February 2, 2017

తమిళ హీరో 'అజిత్' పై టాలీవుడ్ బాహుబలి 'రానా' ప్రశంసల వర్షం కురిపించాడు. కండలు తిరిగి ఉన్న 'అజిత్' లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటోంది. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న 'అజిత్'..'వివేగం' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ పోస్టర్ పై 'రానా' స్పందించాడు. 'వావ్..వావ్..వావ్..ఔట్ స్టాడింగ్..అందరికీ మీరు స్పూర్తి..వృత్తి పట్ల ఈ పోస్టర్ అంకిత భావాన్ని తెలియచేస్తోంది' అంటూ 'రానా' ట్వీట్ చేశారు. 'అజిత్' కు ఇది 57వ సినిమా. సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ ఒకేసారి విడుదల చేశారు. 'బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్' అనేది ట్యాగ్‌లైన్ తగిలించారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. శివ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో 'కాజల్', 'అక్షర హాసన్' హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

బడ్జెట్ లో ఆంధ్రులకు ముష్టి వేశారు: చలసాని

విజయవాడ: బడ్జెట్ లో ఆంధ్రులకు ముష్టి వేశారని ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనవాస్ ఆరోపించారు. కేంద్రం దగాను ప్రజల్లోకి తీసుకెళ్లాం అని తెలిపారు. విభజన చట్టం అంశాలను ఎందుకు అమలు చేయడం లేదు, బడ్జెట్ లో రాజధాని నిర్మాణం కోసం పై కేటాయించలేదు, పోర్టుల విషయంలో తీరని అన్యాయం జరుగుతున్నా ఒక్క నాయకుడు మట్లాడకపోవడం సిగ్గు చేట్టన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 10 నుంచి ఇచ్ఛాపురం నుండి హిందూపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చలసాని తెలిపారు.

ఆర్థిక శాఖ పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: ఆర్థిక శాఖ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సీఎస్ ఎస్ .పి టక్కర్ పాల్గొన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

కమలమ్మకు దళిత రైతుల ఫిర్యాదు

విజయవాడ: జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యురాలు కమలమ్మను రాజధాని ప్రాంత దళిత రైతులు కలిశారు. తమ పట్ల వివక్ష చూపుతున్నారని దళిత రైతులు ఫిర్యాదు చేశారు.

మంత్రి పోచారంతో జర్మన్ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్: మంత్రి పోచారంతో జర్మన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై చర్చిస్తున్నట్లు సమాచారం.

11:47 - February 2, 2017

సౌదీ అరేబియా, దుబాయ్‌, మస్కట్‌... దేశం ఏదైనా... అక్కడ పొట్ట కూటి కోసం తెలుగు వాళ్లు పడుతున్న బాధలు మాత్రం వర్ణనాతీతం. ఉపాధి వేటలో గల్ఫ్‌ ఏజెంట్ల చేతిలో చిక్కి నిండా మోసపోతున్నారు. ముఖ్యంగా ఇంటిపని, వంటిపని కోసం గల్ఫ్‌ బాట పడుతున్న మహిళల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. గల్ఫ్‌లో అడుగుపెట్టిన తొలిరోజు నుంచి నానా చిత్రహింసలకు గురవుతున్నారు. వారికి జరిగిన నష్టం ఏంటో తెలుసుకునే లోపే.. కట్టు బానిసలుగా మసలుకోవాల్సి రావడం నిజంగా దుర్భరం. బానిస సంకెళ్లు విదిల్చుకుని భారత్‌కు రావాలంటే..మాత్రం అనేక అడ్డంకులు ఎదుర్కోక తప్పడం లేదు. అదే కోవలోకి విశాఖకు చెందిన భవానీ కథ.

వంట మనిషిగా...

వంట మనిషిగా ఓ ఇంట్లో పనికి కుదిరిన భవానికి అక్కడ అన్నీ కష్టాలే. పనిచేసే ఇంట్లో తొమ్మిది మంది మగవాళ్లు, ముగ్గురు ఆడవాళ్లు ఉండేవారు. ప్రతిరోజు ఆమెను నానా ఇబ్బందులు పెట్టారు. ప్రతిక్షణం చిత్ర హింసకు గురైన భవాని.. ఎలాగొల ఒకరోజు తన తల్లి లక్ష్మికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. తనను నానా హింసలకు గురిచేస్తున్నారని, తనను చంపేస్తారని రోదించింది. తనను ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని వేడుకుంది. విషయం తెలుసుకున్న భవాని తల్లి తెలిసిన వారందినీ తన కూతురుని రక్షించాలని కోరింది.

వైజాగ్ పోలీసులను ఆశ్రయించిన భవానీ తల్లి...

భవాని తల్లి వైజాగ్‌ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పారు. కానీ.. కేసుకు సంబంధించిన మొత్తం వ్యవహారం హైదరాబాద్‌లో జరగడంతో.. హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాలని అక్కడి పోలీసులు సూచించారు. దీంతో హైదరాబాద్‌ చేరుకున్న భవాని బంధువులు నేరుగా 10 టివి ని ఆశ్రయించారు. జరిగిన విషయం తెలుసుకున్న 10టివి బృందం బాధితురాలిని ఇండియాకు రప్పించే పనిలో పడింది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి....

ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 'విదేశాలలలో స్త్రీలు- భద్రత' అనే అంశంపై చర్చను చేపట్టింది. ఈ చర్చలో నార్తో జోన్ డీసీపీ సుమతి , భవానీ గల్ఫ్ బాధితురాలు, సంధ్యా పీవోడబ్ల్యు నేత, గీతా మూర్తి బేఠీపడావో.. బేఠీ బచావో నేత, మల్లేష్ (టిఆర్ ఎస్ నేత), జాకీర్ హుస్సేన్, గల్ఫ్ బాధితుడు(కరీంనగర్) పాల్గొన్నారు. వారు ఎలాంటి అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

11:44 - February 2, 2017

హైదరాబాద్: సౌదీ అరేబియా, దుబాయ్‌, మస్కట్‌... దేశం ఏదైనా... అక్కడ పొట్ట కూటి కోసం తెలుగు వాళ్లు పడుతున్న బాధలు మాత్రం వర్ణనాతీతం. ఉపాధి వేటలో గల్ఫ్‌ ఏజెంట్ల చేతిలో చిక్కి నిండా మోసపోతున్నారు. ముఖ్యంగా ఇంటిపని, వంటిపని కోసం గల్ఫ్‌ బాట పడుతున్న మహిళల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. గల్ఫ్‌లో అడుగుపెట్టిన తొలిరోజు నుంచి నానా చిత్రహింసలకు గురవుతున్నారు. వారికి జరిగిన నష్టం ఏంటో తెలుసుకునే లోపే.. కట్టు బానిసలుగా మసలుకోవాల్సి రావడం నిజంగా దుర్భరం. బానిస సంకెళ్లు విదిల్చుకుని భారత్‌కు రావాలంటే..మాత్రం అనేక అడ్డంకులు ఎదుర్కోక తప్పడం లేదు.

ఉపాధి వేటలో మోసపోయిన మహిళ

విశాఖకు చెందిన ఈమె పేరు భవాని. రమేష్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న భవానీకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. తాగుడుకు బానిసైన రమేష్‌ కొంతకాలానికి మరణించడంతో ఒక్కసారిగా భవాని జీవితంలో కుదుపులు మొదలయ్యాయి. జీవిత నావను ముందుకు నడిపేందుకు..ఇద్దరు ఆడపిల్లలను సాకేందుకు సౌదీలో వంటమనిషిగా పని చేసేందుకు వెళ్లింది. రెండేళ్లు అక్కడ పనిచేసిన భవాని కాంట్రాక్ట్‌ ముగియడంతో మళ్లీ ఇండియాకు వచ్చింది. ఇండియాకు వచ్చిన భవానికి గాజువాక శ్రీను అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. భవాని బలహీనతను ఆసరాగా చేసుకున్న శ్రీను సౌదీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. తెలిసిన మిత్రుడు హైదరాబాద్‌లో ఉన్నాడని చెప్పి భవానిని హైదరాబాద్‌ రమ్మన్నాడు. సౌదీలో నెలకు 20 వేల జీతం అని చెప్పడంతో.. తన పిల్లల భవిష్యత్‌ కోసమైనా సౌదీకి వెళ్లాలని నిర్ణయించుకుంది భవాని. వెనుకా ముందు ఆలోచించకుండా శ్రీను మాటలు నమ్మి హైదరాబాద్‌ వచ్చింది.

కుటుంబ అవసరాల కోసం సౌదీ వెళ్లాలని ...

కుటుంబ అవసరాల కోసం సౌదీ వెళ్లాలని హైదరాబాద్‌ వచ్చిన భవాని.. హైదరాబాద్‌లో రైలు దిగగానే బోయినిపల్లి శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసింది. శ్రీను ఆమెను తన ఆఫీసుకు తీసుకెళ్లి... సౌదీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. విఠల్‌ అనే మరో వ్యక్తిని పరిచయం చేశాడు. భవాని బలహీనతను ఆసరాగా చేసుకున్న విఠల్‌ ఆమెను మూడు రోజులు హైదరాబాద్‌లో ఉంచి ఆ తర్వాత సౌదీకి పంపించాడు.

వంట మనిషిగా ఓ ఇంట్లో ...

వంట మనిషిగా ఓ ఇంట్లో పనికి కుదిరిన భవానికి అక్కడ అన్నీ కష్టాలే. పనిచేసే ఇంట్లో తొమ్మిది మంది మగవాళ్లు, ముగ్గురు ఆడవాళ్లు ఉండేవారు. ప్రతిరోజు ఆమెను నానా ఇబ్బందులు పెట్టారు. ప్రతిక్షణం చిత్ర హింసకు గురైన భవాని.. ఎలాగొల ఒకరోజు తన తల్లి లక్ష్మికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. తనను నానా హింసలకు గురిచేస్తున్నారని, తనను చంపేస్తారని రోదించింది. తనను ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని వేడుకుంది. విషయం తెలుసుకున్న భవాని తల్లి తెలిసిన వారందినీ తన కూతురుని రక్షించాలని కోరింది.

భవాని తల్లి వైజాగ్‌ పోలీసులను ఆశ్రయించి...

భవాని తల్లి వైజాగ్‌ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పారు. కానీ.. కేసుకు సంబంధించిన మొత్తం వ్యవహారం హైదరాబాద్‌లో జరగడంతో.. హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాలని అక్కడి పోలీసులు సూచించారు. దీంతో హైదరాబాద్‌ చేరుకున్న భవాని బంధువులు నేరుగా 10 టివి ని ఆశ్రయించారు. జరిగిన విషయం తెలుసుకున్న 10టివి బృందం బాధితురాలిని ఇండియాకు రప్పించే పనిలో పడింది.

పోలీసులు, 10టివి సాయంతో హైదరాబాద్‌ చేరుకున్న బాధితురాలు

సమస్య నేపథ్యం... జరిగిన అన్యాయం..... చేయాల్సిన న్యాయం ఇవే 10టివి ముందున్న తక్షణ కర్తవ్యాలు. అన్నింటికంటే ముఖ్యంగా సౌదీలో ఉన్న భవానిని సేఫ్‌గా హైదరాబాద్‌ వచ్చేలా చేయడం. దీన్ని ఎంతో ఛాలెంజ్‌గా తీసుకున్న 10టివి బాధితురాలికి అండగా నిలిచేలా చర్యలు చేపట్టింది.

ఈ కేసు మొత్తానికి మూలం శ్రీనివాస్‌....

ఈ కేసు మొత్తానికి మూలం శ్రీనివాస్‌. మొదట శ్రీనివాస్‌ ఉన్నాడా..? ఉంటే ఎక్కడ ఉన్నాడు..? అతని ఫోన్‌ నెంబర్లు పనిచేస్తున్నాయా..? ఒకవేళ ఫోన్‌లో సంప్రదిస్తే సరైన సమాచారం వస్తుందా..? అన్న ప్రశ్నలకు మాత్రం అంతే లేదు. ఎలాగొలా శ్రీనివాస్‌ వాడుతున్న ఫోన్‌ నెంబర్‌ తెలుసుకుని 7337579326 నెంబరుకు ఫోన్ చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఆ తర్వాత మరో నెంబర్‌ 9542808555 నెంబర్‌కి ఫోన్ చేస్తే హాలో అనగానే కాల్‌ కట్‌ చేశాడు శ్రీనివాస్‌. దీంతో ఫోన్‌ నెంబర్ల ఆధారంగా శ్రీనివాస్‌ అడ్రస్‌ కనుక్కున్నారు 10టివి ప్రతినిధులు.

దుబాయిలో ఉన్నటువంటి విఠల్‌తో మాట్లాడితే ...

ఇక దుబాయిలో ఉన్నటువంటి విఠల్‌తో మాట్లాడితే ఏదైనా సమాచారం తెలుస్తోందన్న ఉద్దేశంతో ...అతనికి ఫోన్‌ చేశారు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. శ్రీనివాస్‌ దగ్గర భవానిని లక్షాయాభై వేలకు కొన్నానన్న సమాధానం వచ్చింది. అంతేకాదు.. లక్షా యాభై వేలిస్తే భవానిని ఇండియాకు పంపిస్తానని విఠల్‌ చెప్పడంతో.. టెన్‌ టీవీ ప్రతినిధి పోలీసులకు సమాచారం అందించారు. లక్షా యాభై వేలిస్తే భవానిని పంపిస్తానని చెప్పిన బైట్‌ వాడాలి ( బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ విఠల్‌తో మాట్లాడిన ఫోన్‌ సంభాషణ )

బోయిన్‌పల్లి సీఐ కిరణ్‌ ఆధ్వర్యంలో...

భవాని విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నార్తో జోన్ డీసీపీ సుమతి ఈకేసుపై స్పందించారు. కేసును ఛేదించేందుకు బోయిన్‌పల్లి సీఐ కిరణ్‌ ఆధ్వర్యంలో గల్ఫ్‌ ఏజెంట్‌ శ్రీనివాస్‌ను పోలీసు స్టేషన్‌కు రప్పించారు. సౌదీలో ఉన్న విఠల్‌కు శ్రీనివాస్‌తో ఫోన్‌ చేయించి తక్షణమే భవానిని హైదరాబాద్‌ పంపించాలని చెప్పడంతో విఠల్‌ భవానిని హైదరాబాద్‌ పంపించే ఏర్పాట్లు చేశాడు. మొత్తానికి పోలీసుల సాయంతో.. 10టీవి బృందం భవానిని సేఫ్‌గా హైదరాబాద్‌కి తీసుకొచ్చేలా అన్ని ప్రయత్నాలు చేసింది.

గల్ఫ్‌ ఏజెంట్‌గా అనేక మోసాలకు పాల్పడ్డ శ్రీనివాస్‌...

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం, పైడిమడుగు గ్రామానికి చెందిన శ్రీనివాస్‌.. గల్ఫ్‌ ఏజెంట్‌. గతంలో గల్ఫ్‌ ఏజెంట్‌గా శ్రీనివాస్‌కు చాలా పరిచయాలే ఉన్నాయి. ఈ పరిచయమే తర్వాత అతన్ని మోసాలు చేసేలా ప్రేరేపించాయని 10TV పరిశోధనలో వెల్లడైంది.

నివాస్‌... వివిధ గల్ఫ్‌ దేశాలకు వీసాలు ఇప్పించే వాడు.

గల్ఫ్‌ ఏజెంట్‌గా.. శ్రీనివాస్‌... వివిధ గల్ఫ్‌ దేశాలకు వీసాలు ఇప్పించే వాడు. అక్కడి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించే వ్యవహారాలు చేస్తూ.. జనాలకు కుచ్చుటోపి పెట్టేవాడు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లేవారిని టార్గెట్‌ చేసుకుని మోసాలకు పాల్పడేవాడు. నాలుగేళ్ల క్రితం శ్రీనివాస్‌పై దాడి చేసేందుకు బాధితులు ప్రయత్నించారు. ఇలా అప్పటి నుంచి ఇప్పటివరకు తరచుగా బాధితులు అతనితో గొడవలకు దిగడంతో శ్రీనివాస్‌ తన మాకాంను హైదరాబాద్‌కు మార్చాడు.

మళ్లీ పాత దందానే ...

హైదరాబాద్‌లో ట్రావెల్స్‌ వ్యాపారం మొదలుపెట్టిన శ్రీనివాస్‌.. అది కూడా సక్సెస్‌ కాకపోవడంతో... మళ్లీ పాత దందానే చేయసాగాడు. ఈ క్రమంలోనే భవాని అతనికి చిక్కింది. భవానిని ఎలాగైనా ఉద్యోగం పేరుతో నమ్మించి.. అమ్మేయాలని పన్నాగం పన్నాడు. అనుకున్నట్లుగానే భవాని అతని మాటలు నమ్మి హైదరాబాద్‌ రావడంతో... శ్రీనివాస్‌ ఆమెకు ఏ మాత్రం అనుమానం రాకుండా.. విఠల్‌ నుంచి డబ్బులు తీసుకుని ఆమెను సౌదీ పంపించాడు. అసలు విషయం తెలియని భవాని అక్కడికి వెళ్లి అనేక కష్టాలు అనుభవించింది. మొత్తానికి భవానిని హైదరాబాద్ చేర్చడంలో 10టివి చేసిన ప్రయత్నం సఫలం కావడంతో... సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

గుజరాత్ తీరంలో 3 పాకిస్థాన్ బోట్లు పట్టివేత....

గుజరాత్: కచ్ లోని సర్ క్రిక్ వద్ద సముద్ర తీరంలో 3 పాకిస్థాన్ బోట్లను కోర్టుగారు అధికారులు పట్టుకున్నారు.

రాజ్యసభ సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ : రాజ్యసభ సమావేశాలు ప్రారంభం అయ్యింది. నిన్న లోక్ సభలో బడ్జెట్ ను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

నిజామాబాద్ జిల్లా పోతంగల్ లో విషాదం

నిజామాబాద్: కోటగిరి మండలం పోతంగల్ లో విషాదం నెలకొంది. ప్రమాద వశాత్తు చెరువులో పడి సాయికుమార్, అప్పర్ అనే ఇద్దరు బాలురు మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

10:29 - February 2, 2017

చిత్తూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేణిగుంట మండలం వెదుళ్లచెరువు దగ్గర కారు-లారీ ఢీ కొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాపడ్డారు. క్షతగాత్రులు పరిస్థితి విషమంగా ఉంది. మృతులు హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తూ వెదుళ్ల చెరువు మలుపు టైర్ల లోడుతో వెళ్తున్న లారీ కోయంబత్తూరు నుండి గుంటూరు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రాథమిక సమాచారాన్ని బట్టి కారు డ్రైవర్ అప్రమత్ంగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు.

ఏఓబీ వద్ద పోలీసుల కూంబింగ్

విశాఖ : ఏఓబీ వద్ద పోలీసుల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. నిన్న ఒడిశాలో మావోయిస్టుల ల్యాండ్ మైన్ పేల్చడంతో అప్రమత్తమైన జిల్లా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తోంది.

గన్నవరం ఎయిర్ పోర్టులో దట్టంగా పొగమంచు

కృష్ణా: గన్నవరం ఎయిర్ పోర్టులో పొగమంచు దట్టంగా అలుముకుంది. దీంతో ఎయిరిండియా ట్రూజెంట్ విమానాలు గాల్లోనే చక్కర్లు కొటింట.. అనంతరం విమానాలు ల్యాండయ్యాయి.

జమ్మూ-కశ్మీర్ లో భారీ పేలుళ్లకు కుట్ర.. భగ్నం

హైదరాబాద్: జమ్మూ-కశ్మీర్ లో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. జమ్మూ-కశ్మీర్ హైవేపై అమర్చిన ఐఈడీని జవాన్లు నిర్వీర్యం చేశారు. పోలీసుల సహకారంతో పేలుళ్ల కుట్రను జవాన్లు భగ్నం చేశారు.

 

8న కృష్ణా నదీ బోర్డు భేటీ..

హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి వివాదంపై చర్చించేందుకు ఈనెల 8న కృష్ణా నదీ యాజమాన్యబోర్డు ప్రత్యేక సమావేశం జరగనుంది. నాలుగు అంశాలపై చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్‌ కేటాయింపు కంటే ఎక్కువనీటిని వాడుకుందని తమకు రబీ అవసరాలు, తాగునీటికి 25 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరింది. దీనితో బోర్డు ఏకీభవించలేదు. ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి నీటివాటాలపై స్పష్టత ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.

నేడు టీఎస్ కేబినెట్ భేటీ...

హైదరాబాద్: నేడు తెలంగాణ కేబినెట్‌ భేటి కాబోతోంది. కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలతో పాటు, రానున్నబడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రధానంగా చర్చించనుంది. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టంలో మార్పులు చేర్పులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కూడా మంత్రులు సమీక్ష చేయనున్నారు.

09:29 - February 2, 2017

విశాఖ : సౌదీ అరేబియా, దుబాయ్‌, మస్కట్‌... దేశం ఏదైనా... అక్కడ పొట్ట కూటి కోసం తెలుగు వాళ్లు పడుతున్న బాధలు మాత్రం వర్ణనాతీతం. ఉపాధి వేటలో గల్ఫ్‌ ఏజెంట్ల చేతిలో చిక్కి నిండా మోసపోతున్నారు. ముఖ్యంగా ఇంటిపని, వంటిపని కోసం గల్ఫ్‌ బాట పడుతున్న మహిళల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. గల్ఫ్‌లో అడుగుపెట్టిన తొలిరోజు నుంచి నానా చిత్రహింసలకు గురవుతున్నారు. అలా సౌదీలో చిక్కుకుపోయి అష్టకష్టాలు పడ్డ ఓ మహిళను పోలీసుల సహాయంతో 10టీవీ కాపాడింది.

ఉపాధి వేటలో జీవితాన్ని బలిపెట్టిన భవాని ...

విశాఖకు చెందిన భవాని అనే మహిళను మాయమాటలు చెప్పి సౌదీకి విక్రయించాడు గల్ఫ్‌ ఏజెంట్ శ్రీనివాస్‌. భర్త చనిపోయి, ఆసరా లేక ఇద్దరు ఆడపిల్లలను సాకేందుకు సౌదీ బాట పట్టింది భవానీ. వంట మనిషిగా ఓ ఇంట్లో పనికి కుదిరిన భవాని అక్కడ అష్టకష్టాలు పడింది. పనిచేసే ఇంట్లో తొమ్మిది మంది మగవాళ్లు, ముగ్గురు ఆడవాళ్లు ఉండేవారు. ప్రతిరోజు ఆమెను నానా ఇబ్బందులు పెట్టారు. ప్రతిక్షణం చిత్ర హింసకు గురైన భవాని.. ఎలాగొల ఒకరోజు తన తల్లి లక్ష్మికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. తనను నానా హింసలకు గురిచేస్తున్నారని, తనను చంపేస్తారని రోదించింది. తనను ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని వేడుకుంది. దీంతో బాధితురాలి బంధువులు 10టీవీని ఆశ్రయించారు. భవానిని సౌదీ నుంచి ఇండియాకు రప్పించేందుకు 10టీవీ తనవంతు కర్తవ్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గల్ఫ్‌ ఏజెంట శ్రీనివాస్‌ ఆచూకి కనుక్కొని, ఆ తరువాత భవానీ ఎక్కడుందో తెలుసుకుంది. నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి సహాయంతో భవానీని సురక్షితంగా హైదరాబాద్‌కు తీసుకురాగలిగింది 10 టీవీ.

లారీ - కారు ఢీ : ముగ్గురి మృతి

చిత్తూరు : రేణిగుంట మండలం వెదుళ్ల చెరువు వద్ద కారు ప్రమాదం జరిగింది. లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.

నయీంతో పోలీసులతో దిగిన ఫోటోలు

హైదరాబాద్: '10టివి' చేతిలో గ్యాంగ్ స్టార్ నయీంతో పోలీసులు దిగిన ఫోటోలు సంచలనం రేపుతున్నాయి. డీఎస్సీ మద్దిపాటి శ్రీనివాసరావు, భువనగిరి వినాయకుడి వద్ద సీఐ తిరుపతన్నతో కలిసి దిగిన ఫోటోలు కలకలం రేపుతున్నాయి. పోలీసులతో కలిసి లంచ్‌లు, డిన్నర్‌లు చేసి నయీం ప్రత్యర్థులను చంపేందుకు పోలీసుల సహకారం తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యర్థుల ఫోన్‌ ట్రాకింగ్‌ చేసి నయీంకు చేరవేశారని ఆధారాలు సేకరించిన సిట్‌ కొద్ది రోజులుగా నయీం కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఫొటోలు బయటకు రావడంతో పోలీస్‌శాఖలో కలకలం రేగుతోంది.

09:05 - February 2, 2017

విజయనగరం : గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో మళ్లీ అలజడి మొదలయ్యింది.. సాలూరు- కొరాపుట్‌ రహదారిలోని సుంకి ఘాటీ ముంగరు భూమి గ్రామం వద్ద ఒడిశా రాష్ట్ర సాయుధ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరతో పేల్చిన ఘటనలో 7గురు జవాన్లు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ వ్యాన్ కు సంబంధించిన శకలాలు 25 అడుగుల ఎత్తులో చెట్టుపై చిక్కుకోవడం చూస్తే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో వుందో ఊహించవచ్చు. వ్యాన్ లోని పోలీసుల దుస్తులు, ఆహారం చిందరవందరగా, చెల్లాచెదురుగా పడిపోయాయి. అమాంతం గాల్లోకి లేచిన వ్యాన్ ఓ చెట్టును ఢీ కొట్టి, దగ్గర్లోని లోయలో పడిపోయిందని సాక్షులు చెబుతున్నారు. దీంతో వ్యాన్ తునాతునకలైంది. పేలుడు చీకటి పడిన తరువాత చోటుచేసుకోవడానికి తోడు సంఘటనా స్థలంలో భారీ గొయ్యి ఏర్పడడం, కల్వర్టు కూలిపోవడంతో సహాయకచర్యలకు అంతరాయం కలిగిందని పోలీసులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక, రహదారి పునరుద్ధరణ చర్యలు చేపట్టామని వారు వెల్లడించారు. ఇది జాతీయ రహదారి 21 కావడంతో రాకపోకలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

08:52 - February 2, 2017

నల్గొండ : పోలీసులకు గ్యాంగ్ స్టార్ నయీంకు ఉన్న సంబంధాలు ఒక్కోక్కటి వెలుగుచూస్తున్నాయి. వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన నయీంతో పోలీసు, రాజకీయ ప్రముఖులతో ఎలాంటి సంబంధాలు లేవని సిట్ హైకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నయీం దందాకు సహకరించిన పోలీసుల వ్యవహారాలు బట్టబయలు చేస్తున్న కొన్ని ఫోటోలు బట్టబయలయ్యాయి. సుమారు 16 మంది పోలీసు ఉన్నతాధికారులు నయీంతో విందువినోదాలు చేస్తున్న ఫోటోలు బహిర్గతమయ్యాయి. ఈ ఫోటోలు పోలీసుల చేతికి చిక్కినప్పటికీ సిట్ అధికారులు ఆ ఫోటోలలో వున్న వారిని పక్కకి తప్పించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా డీఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావుతో పాటు నయీం కలిసి ఉన్న ఫొటోలు బయటపడ్డాయి. భువనగిరి వినాయకుడి వద్ద సీఐ తిరుపతన్న, నయీం కలిసి దిగిన ఫొటో సంచలనం రేపుతున్నాయి. పోలీసులతో కలిసి లంచ్‌లు, డిన్నర్‌లు చేసి నయీం ప్రత్యర్థులను చంపేందుకు పోలీసుల సహకారం తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  నయీం పోలీసు అధికారుల సాయంతోనే గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడని, బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు లేవని ఈ ఫోటోలు పేర్కొంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. విపక్షాలు సీబీఐ విచారణ కోరున్నప్పటికీ ప్రభుత్వం నిరాకరించడం, నయీం ఇళ్లపై దాడులు చేస్తున్న సందర్భంగా పట్టుబడ్డ నగదు, నగలు, డాక్యుమెంట్లను గోల్ మాల్ చేయడానికేనని బాధితులు ఆరోపిస్తున్నారు.

నేటి నుంచి'స్వచ్ఛ సర్వేక్షణ్'

హైదరాబాద్: నగరంలో స్వచ్ఛతా ప్రమాణాలు పరిశీలించేందుకు నేటి నుంచి కేంద్ర కమిటీ పర్యటించనుంది. ఉదయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాకు చెందిన త్రిసభ్య కమిటీ బల్దియా కార్యాలయానికి రానుంది. కమిటీ పరిశీలించాల్సిన ప్రాంతాల వివరాలు కేవలం అరగంట ముందే కేంద్రం నుంచి వీరికి జాబితా అందనుంది. దేశంలోని 500 పట్టణాలు, నగరాల మధ్య జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో ఈ సర్వే ఫలితాలే మన ర్యాంకును నిర్ణయిస్తాయి. నాలుగో తేదీ వరకు ఈ కమిటీ నగరంలో పర్యటించనుంది.

మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఖరారు.

హైదరాబాద్: భారత ప్రధాని మోదీ ఇజ్రాయ్‌ల్‌ పర్యటన ఖరారైంది. జూన్‌ లేదా జులైలో తొలిసారిగా ఇజ్రాయెల్‌లో ఆయన పర్యటించనున్నారని ఆదేశంలోని భారత రాయబారి పవన్‌కపూర్‌ పేర్కొన్నారు. మోదీ పర్యటన భారత్‌ ఇజ్రాయెల్‌ మధ్య రక్షణ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించేందుకు దోహదపడనుందన్నారు. ‘భారత్‌లో తయారీ’లో భాగంగా రక్షణకు సంబంధించిన కీలక యూనిట్లను భారత్‌లో నెలకొల్పే అంశంపై చర్చలు జరిగే అవకాశాలున్నాయన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ చాలా సాధారంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

06:57 - February 2, 2017

హైదరాబాద్: మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ లు రేపు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టబోతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు కార్మిక సంఘాలు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాయి. ఇంతకీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ దేశ వ్యాప్త సమ్మెకు కారణం ఏమిటి? ఈ సమ్మె సందర్భంగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? దేశీయ ఫార్మాస్యూటికల్ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ఆన్ లైన్ లో మందుల అమ్మకాల వల్ల జరుగుతున్న మంచి చెడులేమిటి ? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

06:55 - February 2, 2017

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. 2-1 తేడాతో సిరీస్‌ను గెలిచింది. బెంగళూరులో జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్‌ను కోహ్లీసేన చిత్తు చేసింది. 75 రన్స్‌తో విక్టరీ సాధించి సిరీస్‌ను గెలిచింది. యువ బౌలర్‌ చాహల్‌ 6 వికెట్లతో చెలరేగి ఇంగ్లాండ్‌ నడ్డి విరచడంతో అతనికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇక మ్యాస్‌ ఆఫ్‌ సిరీస్‌ అవార్డు బుమ్రాకు దక్కింది. ఇంగ్లాండ్‌పై భారత్‌ మూడు ఫార్మాట్లలోనూ విజయం సాధించింది.

ఏకపక్షంగా ముగిసిపోయిన మ్యాచ్...

తుది కంటా హోరాహోరీగా సాగుతుందునుకున్న మ్యాచ్‌ కాస్తా.. ఏకపక్షంగా ముగిసిపోయింది. టెస్టు, వన్డేలతో పాటే టీ20 సిరీస్‌ కూడా టీమ్‌ఇండియా సొంతమైంది. ఇంగ్లాండ్‌తో పోరును ఓ అద్భుత విజయంతో ముగించింది టీమ్‌ఇండియా. బ్యాటుతో సీనియర్లు, బంతితో కుర్రాళ్లు చెలరేగిపోయిన వేళ.. సిరీస్‌లో చివరిదైన మూడో టీ20లో భారత్‌ 75 పరుగుల తేడా ఘనవిజయం సాధించింది. దీంతో కనీసం టీ20 సిరీస్‌నైనా గెలుచుకుని స్వదేశానికి వెళ్లాలన్న ఇంగ్లాండ్‌ ఆశ నెరవేరలేదు. ఇంగ్లాండ్‌ను టెస్టుల్లో 4-0తో చిత్తు చేసిన భారత్‌.. వన్డేలు, టీ20లు రెండింట్లోనూ 2-1తో ఓడించింది. చేతిలో 8 వికెట్లుండగా 42 బంతుల్లో 86 పరుగులు చేయడం ఇంగ్లాండ్‌ లాంటి జట్టుకు పెద్ద కష్టమేమీ కాదనే అనుకున్నారంతా. ఐతే 14వ ఓవర్లో మోర్గాన్‌, రూట్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు చాహల్‌. అక్కడి నుంచి ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ సైకిల్‌ స్టాండునే తలపించింది.

15 నిమిషాలు.. 21 బంతులు.. 8 వికెట్లు.. 8 పరుగులు..

15 నిమిషాలు.. 21 బంతులు.. 8 వికెట్లు.. 8 పరుగులు.. మూడో టీ20లో భారత బౌలర్లు చాహల్, బుమ్రా బౌలింగ్ విన్యాసానికి తార్కాణం ఇది.బంతిని ముట్టుకోవడానికి కూడా భయపడిన వేళ.. ఇంగ్లీష్ జట్టును పేక మేడలా కూల్చేశారు. ఒకరు బంతిని బొంగరంలా తిప్పితే.. మరొకరు వేగానికి తెలివిని జోడించాడు. ఫలితంగా ఆఖరి టీ20లో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

06:54 - February 2, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న విభ‌జ‌న స‌మ‌స్యల ప‌రిష్కారానికి ముంద‌డుగు ప‌డింది. చర్చల ద్వారానే సమస్యలు తొలగిపోతాయని నమ్మిన రెండు రాష్ట్రాలు.. ఈ దిశగా త్రిసభ్య కమిటీలను నియమించాయి. సదరు కమిటీలు ఇవాళ తొలిసారిగా గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో స్నేహపూర్వకంగా భేటీ అయ్యాయి.

ఇకపై కలిసి కూర్చుని చర్చించుకోవాలి...

రాష్ట్ర విభ‌జ‌న తర్వాత తలెత్తిన స‌మ‌స్యల‌ పరిష్కారం దిశగా, రెండు తెలుగు రాష్ట్రాలూ ప్రయత్నాన్ని ముమ్మరం చేశాయి. ఈ అంశంపై రెండు రాష్ట్రాలూ నియమించుకున్న త్రిసభ్య కమిటీలు.. బుధవారం గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో తొలిసారిగా భేటీ అయ్యాయి. సుమారు గంట‌పాటు ఇరు రాష్ట్రాల కమిటీలూ కలిసి కూర్చుని పలు అంశాలపై చర్చించుకున్నాయి. విభ‌జ‌న స‌మ‌స్య ఏదైనా.. ఇకపై కలిసి కూర్చుని, సుహృద్భావ వాతావరణంలో చర్చించుకుని పరిష్కరించుకోవాలని, ఈ కమిటీలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

రాబోయే సమావేశాల్లో నిర్దిష్ట అజెండాతో చర్చించుకోవాలని...

ఇక రాష్ట్ర విభ‌జన నాటి నుంచి పెండింగ్ లో ఉన్న స‌మ‌స్యల ప‌ట్ల త్రి స‌భ్య క‌మిటీ భేటిలో చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. రాబోయే సమావేశాల్లో నిర్దిష్ట అజెండాతో చర్చించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తదుపరి భేటీని రాజ్‌భవన్‌లోనే ఈనెల 9న నిర్వహించాలని ఇరు రాష్ట్రాల కమిటీలు తీర్మానించాయి. తి ముఖ్యమైన కొన్ని సమస్యలకు రెండు లేదా మూడు భేటీల్లో పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఈ రెండు కమిటీలూ వ్యక్తం చేశాయి. కోర్టులకు వెళ్లి సమస్యలు సాగదీసుకునే కన్నా, సామరస్య పూర్వక చర్చలతోనే వాటిని పరిష్కరించుకోవాలని తాము భావిస్తున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. చర్చల క్రమంలో, ఓ రెండు మూడు సమావేశాలను ఏపీ రాజధానిలో ఏర్పాటు చేయాలని యనమల గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. త్తంగా విభ‌జ‌న స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించుకోవడానికి ఇరు రాష్ఱ్రాలు ముందుకు రావడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

06:52 - February 2, 2017

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ దేశ అభివృద్ధికి బాటలు వేస్తుందని ప్రధానమంత్రి మోదీ కితాబిచ్చారు... వ్యవసాయ, గ్రామీణ, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారని మెచ్చుకున్నారు..బడ్జెట్‌పై పాలపక్షం ప్రశంసలు కురిపిస్తుండగా... ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌మాత్రం విమర్శలు గుప్పించింది.. ఎలాంటి విజన్‌ లేకుండా బడ్జెట్‌ రూపొందించారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు.. బడ్జెట్‌ కేటాయింపులు సరిగాలేవని సీపీఎం కేంద్ర కమిటీ విమర్శించింది...ఈ బడ్జెట్‌తో ప్రజలపై భారం మరింత పెరుగుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు..అధికారపార్టీ బడ్జెట్‌ అద్భుతం అని చెప్పుకుంటున్నా... పేదలకు ఒరిగిందేమీలేదని విపక్షాలు మండిపడుతున్నాయి.. కొత్త సీసాలో పాతసారాలా ఉందని విమర్శిస్తున్నాయి..

06:52 - February 2, 2017

హైదరాబాద్: నేడు తెలంగాణ కేబినెట్‌ భేటి కాబోతోంది. కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలతో పాటు, రానున్నబడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రధానంగా చర్చించనుంది. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టంలో మార్పులు చేర్పులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కూడా మంత్రులు సమీక్ష చేయనున్నారు.

రాష్ర్ట బడ్జెట్‌పై మంత్రుల సమక్షంలో శాఖల వారీగా వరుస సమీక్షలు....

మార్చిలో జరిగే రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలే ప్రధాన ఎజెండాగా సచివాలయంలో తెలంగాణ మంత్రి మండలి భేటి కానుంది. ఈ భేటిలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చించనున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి వివిధ రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కేంద్రం ఆశించిన మేర సాయం చేయడం లేదని, ముందు నుంచి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగానే... తాజా బడ్జెట్‌లోనూ అదే స్పష్టమైందని ప్రభుత్వం భావిస్తోంది. సెంట్రల్‌ బడ్జెట్‌, దాని ప్రభావంపై ఆర్థిక శాఖతోపాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కేబినెట్‌ భేటీ తర్వాత రాష్ర్ట బడ్జెట్‌పై మంత్రుల సమక్షంలో శాఖల వారీగా వరుస సమీక్షలు నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సవరణలపై చర్చించనున్న మంత్రులు...

ఈ బడ్జెట్ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దళిత, గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో మైనార్టీల సామాజిక స్థితిగతులను అధ్యాయనం చేసి, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి చెల్లప్ప కమిషన్ అందజేసింది. అయితే... గత శీతకాల అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిని చట్టబద్ధం చేయాలని ప్రణాళిక రూపొందించినా... సాధ్యపడలేదు. కానీ, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో దీని బిల్లును ప్రవేశపెట్టి.. చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు.. బీసీ కమిషన్‌ ప్రజాభిప్రాయ సేకరణపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. వీటితో పాటు నిరుద్యోగుల సమస్యలు, రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అపరిషృత సమస్యలపై, నీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ వంటి ప్రధాన అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. మొత్తానికి కేబినెట్‌లో తీసుకునే నిర్ణయాలపై ఆయా వర్గాల ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

06:48 - February 2, 2017

హైదరాబాద్: ఊరించారు.. ఉసూరుమనిపించారు. కేటాయింపులు ఘనంగానే జరిపారు.. కానీ అడుగడుగునా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలనే ప్రాతిపదికగా తీసుకున్నారు. ఇదీ, కేంద్ర ఆర్థికమంత్రి పార్లమెంటుకు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ తీరు. నిరుటితో పోలిస్తే, బడ్జెట్‌ సైజు బాగానే పెరిగినా.. నిధుల కేటాయింపుల్లో మాత్రం పెద్దమనసు చూపలేదు. అంకెలగారడీతో అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన జైట్లీ.. ప్రజాక్షేత్రంలో నిరసనలనే ఎదుర్కొంటున్నారు.

2017-18 వార్షిక బడ్జెట్‌ను...

2017-18 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సుమారు 21 లక్షల 47 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌లో.. రక్షణ రంగానికే పెద్దపీట వేశారు. దాదాపు 2 లక్షల 74 వేల కోట్ల రూపాయలను రక్షణ రంగానికి కేటాయించారు.

గ్రామీణ భారతానికి పెద్ద పీట వేస్తున్నట్లు...

గ్రామీణ భారతానికి పెద్ద పీట వేస్తున్నట్లు ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు. రైతుల ఆదాయాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు స్థాయికి చేరుస్తామన్న జైట్లీ, పంటల బీమా పథకానికి 13వేల కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే డెయిరీల అభివృద్ధికి మాత్రం 80వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతోపాటే, అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో మినీ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని, రైతులకు భూసార పరీక్షలు, పంటల వృద్ధి తదితర అంశాల్లో ఈ ల్యాబ్‌లు ఉపకరించేలా తీర్చిదిద్దుతామన్నారు. స్థూలంగా, వ్యవసాయ, అనుబంధ రంగాలకు 1 లక్షా 87 వేల 23 కోట్లు ఖర్చుచేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

గ్రామీణులకు పని కల్పించే ఉపాధిహామీ పథకానికి ...

గ్రామీణులకు పని కల్పించే ఉపాధిహామీ పథకానికి 48 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక సాగునీటి సౌకర్యాల కోసం 40వేల కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. గ్రామీణాభివృద్ధి మంత్రం పఠించిన జైట్లీ.. పల్లెపల్లెకూ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. దీనికోసం పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి 3 లక్షల 96 వేల 135 కోట్లు కేటాయిస్తున్నట్లు అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.

యూపీఎన్నికలను దృష్టిలో ఉంచుకుని...

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బడ్జెట్‌ద్వారా, బీజేపీపై ఉన్న బ్రాహ్మణ ముద్రను చెరిపేసే ప్రయత్నం చేశారు జైట్లీ. పైగా ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు వరాల జల్లు కురిపించారు. బీసీల అభ్యున్నతికి 52,393 కోట్లు కేటాయించిన జైట్లీ, గిరిజనులకు 31,920 కోట్లు, మైనారిటీలకు 4,195 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వెనుకబడిన కులాలకు 4 వేల కోట్లతో నైపుణ్యాభివృద్ధికి సంకల్ప నిధి ఏర్పాటు చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. మహిళలకూ ఊరట కలింగచే ప్రయత్నం చేశారు. మహిళా సాధికారత కోసం 500 కోట్ల మహిళా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ముద్రా రుణాల కోసం 2 లక్షల 44 వేల కోట్లు, గర్భిణుల ఆస్పత్రి ఖర్చులకు 6 వేల నగదు బదిలీ వంటి వరాలను ప్రసాదించారు. గృహ రుణాలిచ్చే బ్యాంకులకు జాతీయ హౌసింగ్‌ బ్యాంక్‌ ద్వారా 20 వేల కోట్ల రుణం ఇవ్వాలని నిర్ణయించినట్లు జైట్లీ చెప్పారు.

ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజనకు...

ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజనకు 19,100 కోట్లు, ప్రధాని ఆవాస్‌ యోజనకు 23 వేల కోట్లు, గ్రామజ్యోతి యోజనకు 4,300 కోట్లు, అంత్యోదయ యోజనకు 2,500 కోట్లు కేటాయిస్తున్నట్లు అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలుగా కాకుండా రంగాల వారీగా బడ్జెట్‌ను రూపొందించినట్లు జైట్లీ తెలిపారు. ఈ బడ్జెట్‌లో, జైట్లీ, వేతన జీవులకు ఉపశమనం కల్పించారు. ఇంతవరకూ రెండున్నర లక్షల రూపాయలున్న పన్ను మినహాయింపు పరిధిని, మూడు లక్షల రూపాయలకు పెంచారు. అదే విధంగా, ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయమున్న వారు చెల్లించాల్సిన పన్ను శాతాన్ని పది నుంచి ఐదుకి తగ్గించారు. 50 లక్షల నుంచి కోటి రూపాయలు ఆదాయం ఉన్నవారికి 10 శాతం పన్ను, కోటికి పైగా ఆదాయం కలిగివారికి 15 శాతం సర్‌చార్జి విధించనున్నట్లు జైట్లీ ప్రకటించారు. 5 కోట్ల ట‌ర్నోవ‌ర్ లోపు ఉన్న కంపెనీల‌కు ఒక‌ శాతం కార్పొరేట్ ప‌న్నుమిన‌హాయింపు, అమ‌రావ‌తి వాసుల‌కు మూల‌ధ‌న లాభాల ప‌న్ను మిన‌హాయింపు. అమ‌రావ‌తి భూస‌మీక‌ర‌ణ‌లో స‌హ‌క‌రించిన రైతుల‌కు ప‌న్ను మిన‌హాయింపు ఇస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు.

సాధారణ బడ్జెట్‌లోనే రైల్వేకు కేటాయింపులు,,,

కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌ జైట్లీ లోక్సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. ఈసారి బడ్జెట్‌ పలు మార్పులు కనిపించాయి. 93 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి నెలాఖరులో కాకుండా ఫిబ్రవరి మొదటిరోజే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కూడా ఓ విశేషం.

ఈ ఏడాది బడ్జెట్‌లో లక్షా 31 వేల కోట్లు...

రైల్వేలకు ఈ ఏడాది బడ్జెట్‌లో లక్షా 31 వేల కోట్లు కేటాయించారు. రైల్వే అభివృద్ధి పనులకు గాను కేంద్రం 55 వేల కోట్లు సాయం చేయనుంది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసేందుకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు గాను లక్ష కోట్లు కేటాయించారు.

ఐఆర్‌సీటీసీ రైల్వే టికెట్లపై సర్వీస్‌ ట్యాక్స్‌ను పూర్తిగా తొలగింపు....

నగదు రహిత లావాదేవిలను ప్రోత్సహించేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్‌ చేసుకునే రైల్వే టికెట్లపై సర్వీస్‌ ట్యాక్స్‌ను పూర్తిగా తొలగించారు. రైల్వే స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. కాలుష్యం తగ్గించేందుకు 2019 నాటికి అన్ని రైళ్లల్లో బయో టాయ్‌లెట్స్‌ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నది లక్ష్యం. 7 వేల రైల్వే స్టేషన‍్లలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు.

2020 నాటికి బ్రాడ్‌గేజ్‌ లైన్లలో మానవ రహిత రైల్వే క్రాసింగులు...

2020 నాటికి బ్రాడ్‌గేజ్‌ లైన్లలో మానవ రహిత రైల్వే క్రాసింగులు పూర్తి చేయనుంది. 25 స్టేషన్లను ఆధునీకికరించనున్నటు జైట్లీ తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 3 వేల 5 వందల కి.మీ కొత్త రైల్వే లైన్లకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల కోసం ప్రత్యేకంగా రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో నూతన మెట్రో రైల్వే విధానాన్ని ప్రకటించనున్నారు. మెట్రో రైలు మార్గాల ఏర్పాటులో ప్రయివేటురంగానికి పెద్దపీట వేయనున్నారు. రైల్వే బడ్జెట్‌ అంటే ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకునేవారు. ఈసారి రైల్వేను సాధారణ బడ్జెట్‌లో కలిపేయడంతో దాని ప్రత్యేకతను కోల్పోయింది. కొత్తరైళ్ల ప్రస్తావన లేకుండానే జైట్లీ మమ అనిపించారు. ప్రత్యేక విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ రైల్వే జోన్‌కు ఈసారి కూడా మోక్షం దొరకలేదు.

Don't Miss