Activities calendar

03 February 2017

21:59 - February 3, 2017
21:58 - February 3, 2017
21:56 - February 3, 2017
21:50 - February 3, 2017

పాట్నా : పంజాబ్‌, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పంజాబ్‌లో శిరోమణి అకాళిదల్, బిజెపి కూటమి, కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గోవాలో కూడా అధికారంలో ఉన్న బిజెపికి ఆప్‌ గట్టి పోటీనిస్తోంది.
పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు 
పంజాబ్‌, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు రేపు జరిగే పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు గాను 11 వందల 45 మంది పోటీ పడుతున్నారు. కోటి 98 లక్షల 79 వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ 22 వేల 615 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 
పోలీసులు కట్టుదిట్టమైన భద్రతలు 
పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి రెండు రోజుల ముందు పేలుడు సంభవించడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టారు. ఎన్నికలను శాంతియుతంగా జరపడానికి 2 వందల కంపెనీల ఆర్మీ బలగాలను రంగంలోకి దింపింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది.
పంజాబ్‌లో త్రిముఖ పోటీ 
పంజాబ్‌లో శిరోమణి అకాళిదల్, బిజెపి కూటమి, కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. రాష్ట్రంలో శిరోమణి అకాళిదల్, బిజెపి కూటమి గత పదేళ్లుగా అధికారంలో ఉంది. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అకాళిదల్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్‌, ఆప్‌ల నుంచి అధికార పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది. 
గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ 
గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. గోవాలో బిజెపి అధికారంలో ఉంది. బిజెపికి ఆప్‌, కాంగ్రెస్‌ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు అధికారంలో ఉన్న మోది ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారాయి.

 

21:45 - February 3, 2017

ఢిల్లీ : పార్లమెంట్‌ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. సీనియర్‌ పార్లమెంట్‌ సభ్యుడు అహ్మద్‌ మృతిని పట్టించుకోకుండా బడ్జెట్‌ ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ లోక్‌సభలో కాంగ్రెస్‌ ఆందోళన చేసింది. అహ్మద్‌ మృతిపై సరైన సమాచారం ఇవ్వలేదని, దీనిపై న్యాయ విచారణ జరపాలని రాజ్యసభలో సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు.
సభను అడ్డుకున్న కాంగ్రెస్‌ సభ్యులు  
ముస్లింలీగ్‌కు చెందిన ఎంపీ, మాజీ కేంద్రమంత్రి, సీనియర్‌ పార్లమెంట్ సభ్యుడు అహ్మద్‌ మృతిపై లోక్‌సభలో గందరగోళం నెలకొంది. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టేప్రయత్నం చేయగా, కాంగ్రెస్‌ సభ్యులు సభను అడ్డుకున్నారు. 
మరణవార్తను ప్రకటించడంలో కుట్రలు 
సీనియర్‌ పార్లమెంట్‌ సభ్యుడైన ఇ.అహ్మద్‌ మరణాన్ని పరిగణలోకి తీసుకోకుండా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం దారుణమని, ఆయన మరణవార్తను ప్రకటించడంలో కుట్రలు జరిగాయని...  సీనియర్‌ నేతను ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. దీనిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది.
తృణమూల్‌ సభ్యులు హంగామా 
లోక్‌సభ ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ అరెస్టుకు నిరసనగా తృణమూల్‌ సభ్యులు కూడా హంగామా చేశారు. గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్‌ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. అనంతరం లోకసభను సోమవారానికి వాయిదా వేశారు.
మృతి సమాచారాన్ని గోప్యంగా ఉంచడం చాలా సిగ్గుచేటు : ఏచూరి  
అటు రాజ్యసభలోనూ సీనియర్‌ ఎంపి అహ్మద్‌ మృతి అంశాన్ని సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి ప్రస్తావించారు. అహ్మద్‌ మృతిని ప్రకటించకుండా గోప్యంగా ఉంచారన్న సమాచారం ఉందని, ఇది చాలా సిగ్గుచేటని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అహ్మద్‌ మృతికి సంబంధించిన సమాచారంపై విచారణ జరిపి అసలు నిజం బయట పెట్టాలని ఏచూరి డిమాండ్‌ చేశారు.
పార్లమెంట్ లో అహ్మద్‌కు గుండెపోటు
పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా అహ్మద్‌కు గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. అదేరోజు రాత్రి ఆయన కన్ను మూశారు. ఫిబ్రవరి 1న అహ్మద్‌ మృతికి సంతాపంగా బడ్జెట్‌ను ఒకరోజు వాయిదా వేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. విపక్షాల డిమాండ్‌ను తిరస్కరించిన స్పీకర్‌ బడ్జెట్‌ను కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న విపక్షాలు కేంద్రంపై దాడికి దిగాయి.

 

సేవింగ్ అకౌంట్స్ పై ఆంక్షలు ఎత్తివేస్తాం : శక్తికాంత్ దాస్

ముంబై : సేవింగ్ అకౌంట్స్ పై ఆంక్షలు త్వరలోనే ఎత్తివేస్తామని..శక్తికాంత్ దాస్ తెలిపారు. రీమానిటైజేషన్ దాదాపు పూర్తి అయిందన్నారు. వారానికి రూ.24 వేలు డ్రా చేసిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని చెప్పారు. 

 

21:32 - February 3, 2017
21:23 - February 3, 2017

నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ కీర్తిసురేష్ లు నటించిన 'నేను లోకల్' సినిమా ఈరోజు విడులైంది. త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్, దిల్ రాజ్ ప్రొడక్షన్ లో ఈ సినిమా తయారయింది. ఈ సినిమా ఫస్ట్ నుంచి ఇండస్త్రీలో హాట్ టాఫిక్ గానే ఉంది. 
మరి సినిమా పూర్తి రివ్యూను వీడియోలో చూద్దాం...

 

21:06 - February 3, 2017
20:58 - February 3, 2017

ఢిల్లీ : రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణ పనులు కొనసాగుతున్నాయని కేంద్ర రైల్వేమంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. 25 రైల్వేస్టేషన్‌లను ఎయిర్‌పోర్టులకన్నా అందంగా తీర్చి దిద్దుతామని బిజెపి సభ్యుడు సత్యనారాయణ జటియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. స్వచ్ఛ రైల్ అభియాన్‌లో భాగంగా గత రెండేళ్లలో 25 వేల బయో టాయ్‌లెట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 30 వేల బయో టాయ్‌లెట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సురేష్‌ ప్రభు వివరించారు. రైళ్లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నటు మంత్రి తెలిపారు.

 

20:54 - February 3, 2017

కామారెడ్డి : బ్యాంకు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామ రైతులకు శాపంలా మారింది. న్యాయబద్ధంగా ప్రభుత్వ హామీలు పొందాల్సిన వారు పొందలేకపోతున్నారు. అధికారుల తప్పిదానికి తాము బలైపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. 
రైతులు తీవ్ర ఇబ్బందులు 
అధికారుల నిర్లక్ష్యంతో కామారెడ్డి జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేటల రైతులకు రైతు రుణమాఫీ అందడంలేదు. వీరంతా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో రుణం తీసుకున్నారు. అయితే బ్యాంకు అధికారుల తప్పిదం వల్ల రైతులకు రుణం మాఫీ కావడంలేదు. దీంతో కొత్తగా రుణం దక్కక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 
రైతుల పేర్లను రుణమాఫీ జాబితాలో చేర్చని బ్యాంకు అధికారులు 
రుణం ఇచ్చిన అధికారులే భూములకు సంబంధించిన రికార్డులు సరిగా లేవని.. మరికొన్ని ఇతర కారణాలు చూపి ఆయా గ్రామాలకు చెందిన రైతుల పేర్లను రుణమాఫీ జాబితాలో చేర్చలేదు. దీంతో మొదటి, రెండు విడతలోనూ వారికి రుణమాఫీ అమలుకాలేదు. రుణమాఫీలో తమకు జరిగిన అన్యాయంపై రైతులు పలుమార్లు ప్రజావాణీలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ,బ్యాంకు అధికారులు 1067 మంది రైతుల భూముల రికార్డులు, పాసుపుస్తకాలను పరిశీలించారు. పరిశీలనలో  531 మంది మాత్రమే రుణమాఫీకి అర్హులని తేల్చారు. వారికి మొత్తం 1.34 కోట్ల రుణం మాఫీ చేయాల్సి ఉండగా.. అందూలోనూ నిబంధనలన్ని పరిశీలించి రైతులకు కేవలం 28,94,731 రూపాయల రుణమాఫీ కావాలని తేల్చారు. 
మాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బంది 
లింగంపేట రైతులకు సంబంధించిన దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు మాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. తమ రుణాలు ఎందుకు మాఫి కావడం లేదో చెప్పాలని రైతులు రైతులు సంవత్సరకాలంగా బ్యాంకు చుట్టు తిరుగుతూనే ఉన్నారు. మరోవైపు తహశీల్దారు కార్యాలయంతో పాటు ఆర్డివో, కలెక్టరేట్ వద్దకు వెళ్లి తమ గోడు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. రుణమాఫీకి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపే సమయంలో అప్పటి బ్యాంకు అధికారులు చేసిన పొరపాట్లే దీనంతటికీ కారణమని రైతులు వాపోతున్నారు. రుణమాఫీ జాబితా తయారీ సమయంలో వేరే బ్యాంక్ మేనేజర్ ఉన్నారని.. తాను వచ్చాక ఈ సమస్య గురించి ఎమ్మార్వోతో చర్చించానని.. రైతులకు నష్టం కలిగించే ఉద్దేశం తమకు లేదని బ్యాంకు మేనేజర్ సబీయుద్దీన్ తెలిపారు. 
కొత్త రుణాలు ఇవ్వని బ్యాంకర్లు 
రుణమాఫీ జరగకపొవటంతో బ్యాంకర్లు రైతులకు కొత్త రుణాలను ఇవ్వటం లేదు.  పెట్టుబడులకు అవసరమైన అప్పు ఇవ్వమని అడిగితే ముందు పాత బాకీ కట్టమంటున్నారని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. అలాగే తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

20:48 - February 3, 2017

ఢిల్లీ : టీఎంసీ లోక్‌సభ ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ అరెస్టుపై రాజ్యసభలో ఆందోళన వ్యక్తమైంది. టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఒబ్రయిన్‌ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. అలాగే పెద్ద నోట్ల రద్దు కారణంగా చనిపోయిన వారికి సంతాపం ప్రకటించాలని అంశంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 
 

20:45 - February 3, 2017

ఈనెల 5న ఢిల్లీకి అఖిలపక్షం....

హైదరాబాద్ : ఈనెల 5న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లనుంది. 6న ప్రధాని మోడీని కలవాలని నిర్ణయించారు. 5న ఢిల్లీకి రావాల్సిందిగా అన్ని పార్టీలకు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసదుద్దీన్, లక్ష్మణ్, రమణ, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డిలకు
ఆహ్వానం పలికారు. గత అసెంబ్లీ సమావేశాలు, ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తానని సీఎం కేసీఆర్ అన్నారు. 

 

20:40 - February 3, 2017

హైదరాబాద్ : ఈనెల 5న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లనుంది. 6న ప్రధాని మోడీని కలవాలని నిర్ణయించారు. 5న ఢిల్లీకి రావాల్సిందిగా అన్ని పార్టీలకు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసదుద్దీన్, లక్ష్మణ్, రమణ, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డిలకు
ఆహ్వానం పలికారు. గత అసెంబ్లీ సమావేశాలు, ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తానని సీఎం కేసీఆర్ అన్నారు. 

20:33 - February 3, 2017

రాజమండ్రి : తినడానికి తిండి లేదు... తాగడానికి నీరు లేదు... రాకపోకలకు దారి లేదు...రోగమొస్తే వైద్యం లేదు.. చదువుకుందామంటే బడి లేదు...ఏజెన్సీలో గిరిజనులు కనీస అవసరాలు తీరక అల్లాడుతున్నారు... పట్టించుకునే వారే లేక నానా అవస్థలు పడుతున్నారు. 
పొట్టపోషణ కోసమే నానా పాట్లు 
అడవినే నమ్ముకున్న ఆదివాసీలు దీనావస్థలో కాలం గడుపుతున్నారు. రోజూ పొట్టపోషణ కోసమే నానా పాట్లు పడుతున్నారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని దేవీపట్నం మండలం తున్నూరు పంచాయతీలోని చింతలగూడెం, మామిడివలస, బడికుంట గ్రామాల్లోని గిరిజనులు అర్ధాకలితో జీవిస్తున్నారు. ఈ గ్రామాలలో కోయదొర, కొండరెడ్డి తెగలకు చెందిన వారు జీవిస్తున్నారు. వీరికి అటవీ ఉత్పత్తులను అమ్ముకోవడం ద్వారా వచ్చే ఆదాయమే జీవనాధారం. అయితే నాగరికుల మోసాల కారణంగా, వీరు చాలీచాలని ఆదాయాన్ని మాత్రమే పొందుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కనీస సదుపాయాలు కరువు
తున్నూరు పంచాయతీలోని చింతలగూడెం, మామిడివలస, బడికుంట గ్రామాలకు ఇప్పటి వరకూ సరైన రోడ్డు సదుపాయం లేదు. అటవీ మార్గం గుండా కొండలు..వాగులు దాటుకుంటూ కాలినడకనే ఈ గ్రామాలకు చేరుకోవాలి. ఈ మూడు గ్రామాలలో మొత్తం 115 కుటుంబాలకు చెందిన గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. ఇక గ్రామాల్లోనూ కనీస సదుపాయాలు లేవు. తాగునీటి కోసం బడికుంట, మామిడివలసలలో ఒక్కో చేతిపంపు, చింతలగూడెంలో రెండు చేతి పంపులు మాత్రమే ఉన్నాయి. అవి పనిచేయకపోతే వాగుల్లోని కలుషిత నీరే వీరికి ఆధారం. 
నిత్యావసరాలకు పది కిలోమీటర్ల దూరం...  
తున్నూరు పంచాయతీలోని చింతలగూడెం, మామిడివలస, బడికుంట గ్రామాల్లో ఐదు వందల మంది జనాభా ఉన్నా.. ఇక్కడ కనీసం పాఠశాల, అంగన్‌వాడీ సెంటర్‌ కూడా లేవు.. అంగన్‌వాడీ సెంటర్‌ కూడా లేదు. పిల్లలని చదివించాలన్నా.. నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండమొదలు గ్రామానికి వెళ్లాలి. అలాగే  వైద్య సదుపాయాలూ కానరావీ గ్రామాల్లో. దీంతో చిన్నపాటి జ్వరానికైనా.. రోగులను మంచాలపై మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకువెళ్తున్నారు. 
ప్రజలకందని ప్రభుత్వ పథకాలు 
ప్రభుత్వం అందిస్తున్న ఏ పథకాలు ఈ గ్రామాల ప్రజలకు అందడం లేదు. అలాగే వ్యవసాయం పేరుతో ఐటీడీఏ ద్వారా కల్పిస్తున్న సదుపాయాలు.. రాయితీలు ఇక్కడి గిరిజనులకు దక్కడం లేదు. అలాగే వితంతువులు.. వృద్ధులకు పింఛన్‌లు అందడం లేదు. గృహ నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఇళ్లు.. సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. అలాగే ఈతపల్లి గ్రామ సమీపంలో వర్షాకాలంలో వాగు రోడ్డుకు అడ్డంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మూడు గ్రామాలతో పాటు..దాదాపు 26 గ్రామాలకు సంబంధాలు తెగిపోతున్నాయి. వాగుపై వంతెన నిర్మిస్తే ఇబ్బందులు తొలగిపోతాయి. కానీ అధికారులు పట్టించుకోవడంలేదని గిరిజనులు వాపోతున్నారు. అలాగే ఆకూరు చింతలగూడెం మధ్య రోడ్డు నిర్మించి...గిరిజన సహకార సంస్థ సబ్‌ డిపో ఏర్పాటు చేస్తే రేషన్‌ కష్టాలు తీరుతాయంటున్నారు. అభివృద్ధికి నోచుకోని ఈ గ్రామాల పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ సారించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

 

20:27 - February 3, 2017

అనంతపురం : కూడేరు మండలం జల్లిపల్లిలో మహిళను చితకబాదిన సర్పంచ్‌ నాగరాజును కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని ఎమ్మెల్యే వైసీపీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ సర్పంచ్‌ అయినందుకే నాగరాజుపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ దాడిని వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు, మహిళాసంఘాలు జిల్లా ఎస్ పీ రాజశేఖర్‌ బాబును కలిశారు. అంతకుముందు మహిళా సంఘాలు నగరంలో ర్యాలీ చేపట్టాయి. సర్పంచ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశాయి. ఏపీలో టీడీపీ అధికారంలోకివచ్చాక మహిళలపై దాడులు పెరిగిపోయాయని... వైసీపీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. 

20:20 - February 3, 2017

విశాఖ : రైల్వే జోన్‌ అంశంపై తాను లేవనెత్తిన  ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిందన్నారు రాజసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌. రైల్వేజోన్‌ అంశంపై పరిశీలనకు రైల్వే మంత్రిత్వశాఖ ఓ కమిటీని నియమించనట్టు సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు. రైల్వేజోన్‌తోపాటు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని తాను కోరినట్టు టీజీవెంకటేశ్‌ చెప్పారు. 

20:18 - February 3, 2017

చిత్తూరు : తిరుపతి రెడ్డి అండ్‌ రెడ్డి కాలనీలో... చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ కుమార్తె మాధవిలత, ఎక్సైజ్‌శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ బంధువు దీపక్‌కు మధ్య ఓ వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. వాహనానికి సైడ్‌ ఇచ్చే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను కులం పేరిట దూషించాడంటూ.. ఎంపీ కుమార్తె రోడ్డుపై బైఠాయించింది. దీపక్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది.

 

20:15 - February 3, 2017

అనంతపురం : ఆస్తికోసం కన్నకొడుకు ఘాతుకానికి తెగబడ్డాడు. కన్న తండ్రిని 15రోజులపాటు ఇంట్లోనే నిర్బంధించాడు. అనంతపురం జిల్లా కదిరిలో ఈ ఘటన జరగింది. బాధితుడు యూసుఫ్‌కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు.. యూసుఫ్‌ తన ఆస్తిని కూతుళ్లకు రాసిస్తాడని కొడుకు సందేహించాడు. తండ్రి బయటకు రాకుండా ఇంట్లోనేఉంచి తాళం వేశాడు. స్థానికుల ఫిర్యాదుతో అక్కడికివచ్చిన పోలీసులు తండ్రిని విడిపించారు. కొడుకును అదుపులోకి తీసుకున్నారు.

20:11 - February 3, 2017

హైదరాబాద్ : అనారోగ్యానికి గురై కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని స్పష్టం చేశారు కిమ్స్‌ వైద్యులు. దాసరి ఆరోగ్యంపై వారు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఇంకా వెంటిలెటర్‌ సహాయంతోనే దాసరి శ్వాస తీసుకుంటున్నారని.. మరో 3రోజుల పాటు ఐసీయూలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. 

 

20:06 - February 3, 2017

నల్గొండ : ఆదాయం వస్తున్నా.. నిర్వహణ మాత్రం అంతంతమాత్రమే.. స్వామి దర్శనం కోసం వెళ్తే.. అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యమే. భక్తుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ.. అందినకాడికి దండుకోవడమే అక్కడి అధికారుల విధి. ఇది చెర్వుగట్టులోని ఆలయం వద్ద జరుగుతున్న అవినీతి తంతు. ఆలయ ఉత్సవాల వేళ.. అక్కడి పరిస్థితిపై టెన్‌ టీవీ రిపోర్ట్. 
చెర్వుగట్టు ఆలయ బ్రహ్మోత్సవాలు
నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టులో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఆలయానికి వెళ్లే భక్తులకు చేదు అనుభవమే మిగులుతుంది. స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు.. అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. భక్తుల కోసం ఇక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. తాగడానికి నీరు లేదు.. సరిపడా వసతి గదులు లేవు... బట్టలు మార్చుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. సరిపడా మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో అవస్థలుపడుతున్నారు. ఇక్కడ కోనేరు దుర్వాసన వెదజల్లుతుంది. అలాగే లడ్డూ ప్రసాదాన్ని అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు.
వివిధ ఫీజుల రూపంలో వడ్డన
అంతేగాకుండా ఆలయంలో వివిధ ఫీజుల రూపంలో భారీగా వసూలు చేస్తున్నారు. దుకాణదారులు కొబ్బరికాయలను.. నీళ్ల ప్యాకెట్లను ఉన్న రేట్ల కంటే ఎక్కువ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని.. వాహనాల పార్కింగ్‌కు అధికంగా వసూలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ఆలయంలో చెత్తచెదారం తొలగించకపోవడంతో అపరిశుభ్రంగా ఉందని విమర్శిస్తున్నారు. అలాగే దేవస్థానం పరిధిలోనే యథేచ్ఛగా గుట్కా విక్రయాలు సాగుతున్నాయని చెబుతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.  
ఏటా 8 నుంచి 10 కోట్ల రూపాయల ఆదాయం 
ఈ దేవస్థానానికి ఏటా 8 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరుతోంది.  ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసింది. కానీ ఈ ఆదాయాన్ని రాజకీయనాయకులు.. అధికారులు పంచుకుని భక్తులకు మొండి చేయి చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 30 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా.. అందులో చాలామంది పనికి డుమ్మా కొడుతున్నారని.. ఏళ్ల తరబడి ఉండడంతో వారు ఆడిందే ఆటగా సాగుతుందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. 

 

20:01 - February 3, 2017

హైదరాబాద్ : కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న దర్శకరత్న దాసరిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాసరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్వాసకోశ సంబంధ సమస్యతో... గత 4 రోజులుగా దాసరి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

19:58 - February 3, 2017

పెద్దపల్లి : ఓపెన్‌కాస్ట్‌ గనుల వల్ల కాంట్రాక్టర్లకే ప్రభుత్వం మేలు చేకూర్చుతుందన్నారు టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరుగుతున్న రెండో అంతర్జాతీయ గని కార్మికుల సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్‌ కోదండరాం.. మైనింగ్‌ పాలసీని ప్రభుత్వం తుంగలో తొక్కి కొందరి స్వార్థం కోసం పాలసీలను మారుస్తున్నారని విమర్శించారు. ఈనెల 22న జరిగే నిరుద్యోగ యువకుల ర్యాలీని విజయవంతం చేయాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు దాదాపు 30 దేశాల నుండి విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. 

 

19:56 - February 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కోటి ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయన్నారు మంత్రి హరీష్‌రావు. ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టినా...కోర్టుల్లో కేసులు వేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విపక్షాలు..ప్రజల పక్షం ఉన్నారో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. 

19:52 - February 3, 2017

ఫ్రాన్స్ : పారిస్‌ నగరం ఓ సైనికుడు జరిపిన కాల్పులతో ఉలిక్కిపడింది. పారిస్‌లోని ప్రఖ్యాత లౌరీ మ్యూజియం వద్ద... ఓ గుర్తు తెలియని వ్యక్తి.. కత్తితో దాడికి ప్రయత్నించడంతో... సైనికుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అనంతరం.. లౌరీ మ్యాజియం వద్ద భారీగా బలగాలను మోహరించారు. అయితే ఇది టెర్రరిస్ట్ దాడి కాదని... సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని.. ఆదేశ అంతర్గత భద్రత విభాగం పేర్కొంది. కాల్పుల్లో గాయపడ్డ వ్యక్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 

 

రామోజీరావును మర్యాదపూర్వంగా కలిసిన సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ఏపీ సీఎం చంద్రబాబు మర్యాదపూర్వంగా కలిశారు. రామోజీరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. 

సైరస్ మిస్త్రీ పిటిషన్ కొట్టివేత

ఢిల్లీ : నేషనల్ కంపెనీ లా అప్పిల్లేట్ ట్రిబ్యునల్ సైరస్ మిస్త్రీ పిటిషన్ ను కొట్టివేసింది. ఈనెల 6న జరగనున్న టాటా సన్స్ ఈజీఎంను వాయిదా వేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది.

 

19:42 - February 3, 2017

హైదరాబాద్ : ప్రజలు తాగేందుకు నీళ్లు దొరక్క అవస్థలు పడుతుంటే అగ్రరాజ్యాలతో పోటీ పడతానంటూ బాబు చెప్పడం హస్యాస్పదంగా ఉందని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో క్షీణిస్తున్న ఏపీకి సిక్స్‌ ప్యాక్స్‌ తెప్పిస్తాననే తరహాలో ఏపీ సీఎం మాట్లాడటం దారుణమన్నారు. ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా చూస్తామన్న వెంకయ్య.. బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒక్క రూపాయైనా అదనంగా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కడంలో వెంకయ్య, చంద్రబాబులు అవిభక్తకవలలని భూమన విమర్శించారు.

 

19:38 - February 3, 2017

గుంటూరు : ఏపీలో డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆధార్‌ అనుసంధానం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కే.ఈ కృష్ణమూర్తి అన్నారు. రాజధాని 29 గ్రామాల్లోని రైతులు రిజిస్ట్రేషన్ కోసం వారి గ్రామాల్లోనే సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి.. రైతులకు క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వడం సంతోషకరమైన విషయమన్నారు. డబుల్‌ రిజిస్ట్రేషన్ జరగకుండా 22బీ చట్టాన్ని రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 

 

19:33 - February 3, 2017

ఢిల్లీ : కేంద్రం ప్రజాస్వామ్య హక్కులను కాల రాస్తోందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్లమెంట్‌ సమావేశాలలో ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశ పెట్టనీయకుండా సభను వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆయన.. ఏన్డీఏ ప్రభుత్వం కుట్ర పూరితంగా సభను వాయిదా వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 26న వైసీపీ ఎంపీలను విశాఖలో అడ్డుకోవడంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 

 

18:51 - February 3, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని ఇల్లందులో దారుణం జరిగింది. వంద రూపాయల కోసం ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఇల్లందులోని సంజయ్‌నగర్‌లో చోటుచేసుకుంది. అమీద్‌ అనే వ్యక్తి మరొకరితో కలిసి ఓ మద్యం దుకాణంలో మద్యం తాగారు. అయితే అమీద్‌ గతంలో ఇవ్వాల్సిన 100 రూపాయలు ఇవ్వాలని మద్యం షాపు యజమాని హసీనా నిలదీసింది. అయితే ఆ డబ్బులు గతంలోనే ఇచ్చానని అమీద్‌ అనడంతో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వావాదం జరిగింది. అక్కడే ఉన్న హసీనా అల్లుడు తీవ్ర ఆగ్రహంతో అమీద్‌పై ఇటుకరాయితో దాడి చేశాడు. దీంతో అమీద్‌ తలకు తీవ్రగాయమైంది. వెంటనే స్పందించిన స్థానికులు..అమీద్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అమీద్‌ షా మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితుల కోసం గాలిస్తున్నారు. 

 

18:24 - February 3, 2017

చిత్తూరు : తిరుమల రథసప్తమి వేడుకల్లో అపృశతి చోటుచేసుకుంది. పుష్కరిణిలో పడి మహిళ మృతి చెందారు. గుర్తు తెలియని మహిళగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

దాసరి ఆర్యోగం నిలకడగానే ఉంది : వైద్యులు

హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావు హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. దాసరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అనార్యోగంతో దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 

తిరుమల రథసప్తమి వేడుకల్లో అపశృతి

చిత్తూరు : తిరుమల రథసప్తమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పుష్కరిణిలో పడి మహిళ మృతి చెందారు. గుర్తు తెలియన మహిళగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. 

మిడ్ మానేరు ప్రాజెక్టుపై మంత్రి హరీశ్ రావు సమీక్ష

హైదరాబాద్ : మిడ్ మానేరు ప్రాజెక్టుపై మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. భక్తరామదాసు ప్రాజెక్టు స్ఫూర్తితో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. 

 

17:49 - February 3, 2017

ఢిల్లీ : నీట్‌లో ఎంట్రన్స్ ఎలిజిబులిటీ క్రైటీరియా తగ్గించాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కేంద్రాన్ని కోరారు. ఆయన ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, బండారు దత్తాత్రేయ, ఎమ్ సీఐ చైర్మన్‌ జేసీ మెహతాను కలిశారు.. నీట్‌ పీజీ పరీక్షలో తెలుగు రాష్ట్రాలనుంచి చాలా తక్కువమంది అర్హత సాధించారని.. ఆయన జేపీ నడ్డా దృష్టికి తెచ్చారు. ఎంట్రన్స్ ఎలిజిబులిటీ క్రైటీరియా తగ్గించాలని వారికి విజ్ఞప్తి చేశారు. 

 

17:45 - February 3, 2017

సంగారెడ్డి : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సంగారెడ్డికి రావాల్సిన ప్రభుత్వ వైద్య కళాశాల సిద్ధిపేటకు తరలించడంపై వీరి మధ్యం మాటా మాటా పెరుగుతోంది. కళాశాల ప్రతిపాదన పత్రాలతో జగ్గారెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈమేరకు జగ్గారెడ్డి 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. సర్కార్‌ తీరు సరైంది కాదన్నారు.

 

17:38 - February 3, 2017

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ న‌యీం కేసులో పొలిటిక‌ల్, పోలీస్ బాస్‌ల లింక్‌ల‌ను ప్రభుత్వమే కావాల‌ని దాచి పెడుతుందని మాజీ ఎంపీ హనుమంతరావు ఆరోపించారు. మీడియాలో పోలీస్ బాస్‌ల లింక్ బ‌హిర్గతమైనా ప్రభుత్వానికి  క‌న‌బ‌డ‌టం లేదా అని ప్రశ్నించారు. ఈ కేసులలో నిజాలు బ‌య‌టికి రావాలంటే సీబీఐ విచార‌ణకు జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. 

 

17:34 - February 3, 2017

కర్నాటక : బెంగళూరులో కాల్పుల ఘటన కలకలం రేపింది. నగర శివారులో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నగర వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఎం.శ్రీనివాస్‌, ఆయన డ్రైవర్‌పై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనివాస్ ప్రయాణిస్తున్న కారు.. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగిన సమయంలో ఈ ఘటన జరిగింది. శ్రీనివాస్‌ పై హత్యానేరంతో పాటు ఇతర కేసులు విచారణలో ఉన్నాయి. 2013లో ఓ కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు. కాల్పుల ఘటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించి సోదాలు నిర్వహిస్తున్నారు.

 

17:29 - February 3, 2017

చెన్నై : తమిళనాడు ఎన్నోర్‌ పోర్టు తీర ప్రాంతంలోని సముద్రంలో నల్ల చమురును తొలగించే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు తీరానికి తెట్టులా చేరుకుంటున్న 72 టన్నుల ఇంధనాన్ని బయటకు తీశారు. చమురును తొలగించే పనులు మరో మూడు రోజుల పాటు కొనసాగనున్నాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఉత్తర చెన్నయ్‌ తీరంలోనే 90 శాతం నల్ల చమురు  తేరుకుపోయిందని తెలిపాయి. సముద్రంలో చమురు తెట్టు ఎక్కడెక్కడ తేరుకుపోయిందో గుర్తించేందుకు కోస్ట్‌గార్డు హెలిక్యాప్టర్‌ ఏరియల్‌ సర్వే జరుపుతోంది. తీరానికి చేరుకుంటున్న ఇంధ‌నాన్ని తొలిగించేందుకు కోస్ట్‌ గార్డ్‌ సిబ్బందితో పాటు స్వచ్ఛంద వాలంటీర్లు రంగంలోకి దిగారు. వీరికి సహాయంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులు, మత్స్యకారులు కూడా చేతులు కలిపారు. యంత్రాల కన్నా మనుషులు చేస్తున్న క్లీనింగే ఎఫెక్టివ్‌గా ఉందని చెబుతున్నారు. 5 రోజుల క్రితం రెండు కార్గో నౌక‌లు ఢీకొన్న ఘటనలో టన్నుల కొలది నల్ల చమురు స‌ముద్రం పాలైన విషయం తెలిసిందే.

దాసరిని పరామర్శించిన సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావును కిమ్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. దాసరి ఆరోగ్యంపై బాబు ఆరా తీశారు. దాసరి ఆర్యోగ పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

 

17:17 - February 3, 2017

ఢిల్లీ : దేశంలో పెరుగుతున్న డిజిటల్‌ లావాదేవీలకు అనుగుణంగా బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోని అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌ ఈ అంశాన్ని లేవనెత్తారు. బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ సరిగా విస్తరించకపోవడంతో డిజిటల్‌ లావాదేవీలకు అంతరాయం కలుగుతున్న అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమాధానం చెబుతూ... డిజిటల్‌ లావాదేవీలకు అనుగుణంగా బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను విస్తృతం చేస్తున్నామన్నారు. 
 

17:13 - February 3, 2017

ఢిల్లీ : పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారు. టీఎంసీ సభ్యుడు సౌగతరాయ్‌ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద నోట్లు రద్దు చేస్తూ గత నవంబర్‌ 8న ఆర్ బీఐ తీసుకున్న నిర్ణయంపై ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే హక్కు కానీ, దీని స్థానంలో బిల్లు ప్రవేశపెట్టే అధికారం కానీ ప్రభుత్వానికి లేదని వాదించారు. సౌగత రాయ్‌ వాదాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తిప్పికొట్టారు. 

 

17:05 - February 3, 2017

ఢిల్లీ : రెండు ఓడలు ఢీ కొన్న ప్రమాదంలో చెన్నై పోర్టు పరిసరాల్లో సముద్రంలో చమురు ఒలికిపోయిన తెట్టు కట్టిన అంశంపై లోక్‌సభలో ప్రభుత్వం ప్రకటన చేసింది. సముద్రంలో పేరుకుపోయిన చమురు తెట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టిన విషయాన్ని నౌకాయాన శాఖ సహాయ మంత్రి పీ రాధాకృష్ణన్‌ సభ దృష్టికి తెచ్చారు. ప్రక్షాళన రెండు రోజుల్లో పూర్తవుతుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు సభ దృష్టికి తెచ్చారు. 
 

16:58 - February 3, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కమీషన్లు దండుకుంటోందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ ఆత్మ అయిన కేవీపీ రామచంద్రరావుకు చెందిన కంపెనీకు సాగునీటి ప్రాజెక్టులు పనులు కట్టబెట్టారని విమర్శించారు.  తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారందరూ ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉన్నారని.. రాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యమకారులను విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

 

 

విశాఖలో డిజిధన్ మేళా కార్యక్రమం

విశాఖ : నగరంలో డిజిధన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, ఎపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, మంత్రులు గంటా శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. 

గోద్రా అల్లర్ల కేసులో 28 మందిని నిర్ధోషులుగా తేల్చిన గాంధీనగర్ కోర్టు

గుజరాత్ : గోద్రా అల్లర్ల కేసులో గాంధీనగర్ కోర్టు 28 మందిని నిర్ధోషులుగా తేల్చింది. ఆధారాలు లేవని 28 మందిని నిర్ధోషులుగా కోర్టు ప్రకటించింది. 

13:47 - February 3, 2017

భారత్ లో గర్భస్రావాల కారణంగా ఏడాదికి లక్ష మంది స్త్రీలు చనిపోతున్నారు.. 2017 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ తయారీలో మహిళల ప్రాధాన్యత..బీసీసీఐకి కొత్త పాలకులను సుప్రీం నియమించింది..బల్గేరియాలో అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో తెలుగు అమ్మాయి చోటు సంపాదించింది..షీ టీమ్ మగవారికి కూడా రక్షణగా నిలవడం..భారత మహిళల్లో రక్తహీనత ప్రధాన సమస్యగా ఉంది..ఈ వార్తల గురించి మరింత తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా - పొన్నం..

హైదరాబాద్ : యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా ప్రభుత్వం అడ్డుకోవడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ లో ఇసుక దందా వెనుక సీఎం బంధువు ఉన్నారని ఆరోపించారు. సీఎం బంధువు సంతోష్ భాగస్వామ్యం ఉన్న గోల్డ్ మైనింగ్ సంస్థ ఇసుకను కొల్లగొడుతోందని పొన్నం వ్యాఖ్యానించారు. చీఫ్ సెక్రటరీకి విజ్ఞప్తి చేసినా అక్రమ రవాణా ఆగడం లేదన్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలన్నారు.

13:35 - February 3, 2017
13:33 - February 3, 2017

భద్రాద్రి : సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర 110వ రోజుకు చేరుకుంది. భద్రాద్రి జిల్లా కొత్తగూడె జిల్లాలో కొనసాగుతోంది. అశ్వారావుపేట, అచ్యుతాపురం, మందలపల్లి, గంగారం, ముష్టిబండ ప్రాంతాల్లో పాదయాత్ర జరుగుతోంది. పాదయాత్ర బృందానికి అడుగడుగునా జనాలు నీరాజనాలు పడుతున్నారు. అశ్వరావుపేటలో ఉన్న వ్యవసాయ కళాశాలను బృందం సందర్శించింది. బృంద రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు విన్నవించారు. ఈ సందర్భంగా తమ్మినేనికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలు పేర్కొన్నారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

వంద కోసం ఘర్షణ..ఒకరు మృతి..

భద్రాద్రి : ఇల్లందు సంజయ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. బెల్ట్ షాపులో రూ. 100 కోసం ముగ్గురు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. హమీద్ భాషా అనే వ్యక్తి మృతి చెందాడు.
 

నయీం కేసు..సీబీఐకి అప్పగించాలి - వీహెచ్..

హైదరాబాద్ : నయీం కేసులో పోలీసులు, రాజకీయ నాయకుల లింకులను ప్రభుత్వ ఎందుకు దాస్తోందని టి.కాంగ్రెస్ నేత వీహెచ్ పేర్కొన్నారు. నయీం లింకులపై మీడియాలో వచ్చినా స్పందన లేదని, కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

13:27 - February 3, 2017
13:22 - February 3, 2017

రామగుండం : చిన్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను మూసివేయాలన్న కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ నిర్ణయం రామగుండంలోని జెన్‌కో పవర్‌ హౌస్‌కు శాపంగా మారింది. సెంట్రల్‌ ఎలక్ట్రసిటీ అథారిటీ ఆదేశాలతో ఈ కేంద్రంలో పని చేస్తున్న కార్మిక కుటుంబాల్లో కల్లోలం మొదలైంది. మెడపై వేలాడుతున్న మూసివేత కత్తి ఎప్పుడు ఊడిపడుతుందో అన్న ఆందోళనతో కార్మికులు ఉన్నారు. రెండు వందల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంలోపు ఉన్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను మూసివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ తీసుకున్న నిర్ణయం తెలంగాణలోని తొమ్మిది యూనిట్ల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. వీటిలో రామగుండం చిన్న తరహా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కూడా ఉంది. దీంతో కార్మికుల గుండెల్లో గుబులు మొదలైంది.

కాగితాలకే సామర్థ్యం పెంపు..
కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ ఆదేశాల ప్రకారం రెండు వందల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంలోపు ఉన్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను మూసివేయడమైనా చేయాలి లేదా వీటి సామర్థ్యాన్ని 600 నుంచి 800 మెగావాట్లకు పెంచాలి. 1972 జూన్‌ 16 నుంచి ఉత్పత్తి ప్రారంభించిన రామగుండం బీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఉత్పత్తి ఇప్పటి వరకు 62.5 మెగావాట్లుగానే ఉంది. భవిష్యత్‌లో రెండువేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో విస్తరించేందుకు వీలుగా మొదట్లో 600 ఎకరాల భూమిని సేకరించారు. దీని విస్తరణకు ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోపోవడంతో ఉత్పత్తి సామర్థ్యం పెంపు కాగితాలకే పరిమితమైంది.

పరోక్షంగా వందలాది మందికి ఉపాధి..
రామగుండం బీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. దీలో 300 మంది ఉద్యోగులు, 150 మంది అధికారులు, మరో వంద మంది ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కేంద్రం విస్తరణపై పాలకులు ఇచ్చిన హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ 500 మెగావాట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. 2009లో 660 మెగావాట్లకు విస్తరించేందుకు పంపిన ప్రణాళికలు పర్యావరణ కారణాలతో బుట్టదాఖలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మార్పులేకపోవడంతో కార్మికులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

వెలుగులు ప్రసారించాలి..
తెలంగాణ ఉద్యమ సమయంలో రామగుండం బీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని విస్తరిస్తామని టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. భద్రాద్రిలో కూడా ఇలాంటి విద్యుత్‌ కేంద్రం మూతపడే ప్రమాదం ఉందని ముందుగానే పసికట్టిన ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో 800 మెగాట్ల సామర్థ్యంతో విస్తరించేలా సాధించుకున్నారు. కానీ రామగుండం కేంద్రం విస్తరణ మాత్రం అతీగతీ లేదు. ఈ కేంద్రాన్ని మూసివేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. విద్యుత్‌ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణ వేలకోట్లు వెచ్చించి పొగురు రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ఇస్తున్న ప్రాధాన్యత రామంగండం వంటి మీని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల విస్తరణకు చర్యలు తీసుకోపోవడంతపై విమర్శలకు తావిస్తోంది. దశాబ్దాల నుంచి వెలుగులు నింపుతున్నఈ కేంద్రం సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ తీసుకున్న మూసివేత నిర్ణయానికి బలికాకముందే మరో పదికాలాల పాటు వెలుగులు ప్రసరించేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

13:17 - February 3, 2017

ఢిల్లీ : బ్యాంకు రుణాలకు సంబంధించి ఎన్డీయే - యూపీఏ మధ్య తాను ఒక ఫుట్ బాల్ లా మారారని కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విటర్ లో ట్వీట్ చేశారు. బ్యాంకు రుణాలకు సంబంధించిన అంశంలో తాను పూర్తిగా ఇరుక్కపోయాయని, కానీ ఇందులో ఎవరూ రిఫరీ లేరని పేర్కొన్నారు. మాల్యాకు 9వేల కోట్ల రుణాలు ఇప్పించడంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరం సహకరించారని బీజేపీ ఆరోపించింది. నిధుల దుర్వియోగానికి పాల్పడిందని సీబీఐ అభియోగాలు మోపడం ఒక జోక్ అని, యూపీఏ తనకు మధ్య సీబీఐ పేచి పెడుతోందని ఇంతకుముందు పేర్కొన్న సంగతి తెలిసిందే. 9వేల కోట్ల రుణాలు తీసుకున్న మాల్యా లండన్ కు పారిపోయిన సంగతి తెలిసిందే.

13:09 - February 3, 2017
13:08 - February 3, 2017

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు త్వరలోనే అందరి ముందుకు వస్తారని సినీ నటుడు, ఎంపీ చిరంజీవి పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని చిరంజీవి పరామర్శించారు. చిరుతో పాటు అల్లు అరవింద్, వి.వి.వినాయక్ లు కూడా ఉన్నారు. పరామర్శించిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. హుషారైన దాసరిని చూస్తున్నామని, చాలా సంతోషంగా ఉందన్నారు. దాసరి ఆసుపత్రిలో చేరిన అనంతరం జరిగిన పరిణామాలపై భయాందోళనలకు గురయ్యామని తెలిపారు. దాసరి మానసిక స్థైర్యం ఒక ఎత్తు అని, మందులు మరొక ఎత్తు అని వైద్యులు పేర్కొన్నారని తెలిపారు. వైద్యులు చేస్తున్న వైద్యం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. తాను నటించిన సినిమా 'ఖైదీ నెంబర్ 150’ కలెక్షన్ల వివరాలు చెప్పడం జరిగిందని, త్వరలో ఓ సభను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు దాసరికి తెలపడం జరిగిందన్నారు. ఇందుకు ఖచ్చితంగా రావాలని కోరడం జరిగిందని, ఇందుకు ఖచ్చితంగా వస్తానని లెటర్ పై రాయడం జరిగిందన్నారు.

ప్రత్యేక హోదాపై ప్రైవేటు మెంబర్ బిల్లు..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రైవేటు మెంబర్ బిల్లును వైసీపీ ప్రవేశ పెట్టింది. ఈ బిల్లును ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రవేశ పెట్టారు.

శ్రీవారికి వైభవంగా వాహన సేవలు..

చిత్తూరు : తిరుమలలో రథసప్తమిని పురస్కరించుకుని వాహనసేవలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం సూర్యప్రభ..చినశేష వాహన సేవలపై శ్రీవారు దర్శనమిచ్చారు. 11 నుండి 12గంటల వరకు గరుడ వాహనంపై ఊరేగారు.

దాసరిని పరామర్శించిన చిరు..

హైదరాబాద్ : కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శకుడు దాసరి నారాయణ రావును నటుడు చిరంజీవి, అల్లు అరవింద్, దర్శకుడు వి.వి.వినాయక్ పరామర్శించారు.

 

 

12:37 - February 3, 2017

నయీం ఘటనపై విచారణ జరిపించాలి - నారాయణ..

గుంటూరు : గ్యాంగ్ స్టర్ నయీంతో సీఎం చంద్రబాబు నాయుడు, వైఎస్ తో సహా అందరి ముఖ్యమంత్రులకు సంబంధాలున్నాయని సీపీఎం జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.

12:25 - February 3, 2017

గుంటూరు : గ్యాంగ్ స్టర్ నయీంతో సీఎం చంద్రబాబు నాయుడు, వైఎస్ తో సహా అందరి ముఖ్యమంత్రులకు సంబంధాలున్నాయని సీపీఎం జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. డీజీపీలు, హోం మంత్రులతో సహా పోలీసుల్లో చాలా మందికి నయీంతో లింకులున్నాయన్నారు. ఇతగాడి వ్యవహారాలు సీఎం కేసీఆర్ కు తెలియనవి కావని, పోలీసులు - రాజకీయ నాయకులతో సంబంధాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా ఉందని, ఇలాంటి నయీంలు రాకుండా ఉండాలంటే సమగ్ర విచారణ జరిపించాలని.దోషులను శిక్షించాల్సిందేనంటూ నారాయన పేర్కొన్నారు.

12:20 - February 3, 2017

ఢిల్లీ : కరవు..వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలను పంపడంలో జరుగుతున్న జాప్యంపై రాజ్యసభలో ఆందోళన వ్యక్తమైంది. వైపరీత్యాలు సంభవించిన మూడు నుండి ఆరు నెలల వరకు కూడా బృందానలు పంపకపోవడంతో రాష్ట్రాలు నష్టపోతున్నాయని కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ పేర్కొన్నారు. ఆయన రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రకృతి వైపరీత్యాల అంచనాకు రాష్ట్రాలు కోరిన 15 రోజుల్లో కేంద్ర బృందాలను పంపాలని డిమాండ్ చేశారు. నష్టం జరిగిన ఆరు నెలలకు కేంద్ర బృందాన్ని పంపడం తగదన్నారు.

12:16 - February 3, 2017

ఢిల్లీ : ఎయిర్ సెల్ - మ్యాక్సిస్ కేసులో దయానది మారన్ సోదరులకు సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై ఈడీ సవాల్ చేసింది. ప్రత్యేక కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎయిర్ సెల్, మ్యాక్సిస్ కేసులో అటాచ్ చేసి మారన్ ఆస్తులను విడుదల చేయవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో వారిపై సిబిఐ, ఈడీ మోపిన అభియోగాలను సి ప్రత్యేక కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దయానిధి మారన్, కళానిధి మారన్, ఆయన భార్య కావేరి కళానిధి, సౌత్ ఆసియా ఎఫ్ఎం లిమిటెడ్ ఎండీ కే. షణ్ముగం, రెండు కంపెనీలపై రెండు వేర్వేరు కేసుల్లో వచ్చిన ఆరోపణలు రుజువుకాలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. ఎయిర్‌సెల్‌ను మలేషియాకు చెందిన మ్యాక్సిస్‌కు విక్రయించాలని దయానిధి మారన్‌ ఒత్తిడి చేసినట్లు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

12:09 - February 3, 2017

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అధికార పక్షంపై విపక్ష సభ్యులు తీవ్ర విమర్శలు చేయడంతో లోక్ సభలో తీవ్రగందరగోళం నెలకొంది. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు వేశారు. మరోవైపు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం నడించింది. తమ ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యసభ నుంచి టీఎంసీ వాకౌట్ చేసింది. దీనితో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

12:03 - February 3, 2017

నెల్లూరు : గతేడాది పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ ఎక్కువగా వాడుతున్నారని, అయినా విద్యుత్ కోతలు లేకుండా చేశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని కొడవలూరు (మం) రాచర్లపాడులోని కిసాన్ సెజ్ లో పవన విద్యుత్ పరికరాల కర్మాగారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. ఉదయ్ పథకం కింద రూ. 8256 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, రాబోయే పది సంవత్సరాల్లో 18వేల మెగావాట్ల ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. పెట్టుబడులకు అనుకూలంగా ఏపీ రాష్ట్రాన్ని మలిచినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

ముంబై ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం..

ముంబై : ఓ ప్రయాణీకుడి వద్ద ఎయిర్ పోర్టు అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యాక్యూమ్ క్లీనర్ లో 1.235 కిలోల బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు.

కిమ్స్ ఆసుపత్రికి రానున్న బాబు..

హైదరాబాద్ : కిమ్స్ ఆసుపత్రికి మధ్యాహ్నం 1.30గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శకుడు దాసరి నారాయణ రావును పరామర్శించనున్నారు. అనంతరం రామోజీరావును కూడా బాబు పరామర్శించనున్నారు.

ఓయూలో ఉద్రిక్తత..

హైదరాబాద్ : ఓయూలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఎల్, డీఎల్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ భవన్ ముట్టడికి ఓయూ విద్యార్థులు బయలుదేరారు. ఓయూ పీఎస్ వద్ద విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నయీం కేసును సీబీఐకి అప్పగించాలి - నారాయణ..

హైదరాబాద్ : నయీం కేసును సీబీఐకి అప్పగించాలని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. బడ్జెట్ లో పెద్దలకు మాత్రమే పెద్దపీఠ వేశారని, ఎంతకాలం అధికారంలో ఉంటుందో తెలియని ఎన్డీయే ప్రభుత్వం ఎదుట చంద్రబాబు మోకరిళ్లుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కేంద్రం నుండి సాధించింది ఏమీ లేదన్నారు.

విశాల్ పై సస్పెన్షన్ ఎత్తివేత..

చెన్నై : నటుడు విశాల్ పై ఉన్న సస్పెన్షన్ ను నిర్మాతల మండలి ఎత్తివేసింది. మద్రాసు హైకోర్టులో తమిళ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది.

11:35 - February 3, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో అధికారులు పరుగులు తీశారు. అకౌంట్స్ డిపార్ట్ మెంట్ లో మంటలు అంటుకున్నాయి. ఫర్నీచర్ తో పాటు కొన్ని కీలక ఫైల్స్ అగ్నికి ఆహుతయ్యాయని తెలుస్తోంది. పొగ దట్టంగా వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు శకటాలతో చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు సమాచారం.

రాష్ట్రపతి భవన్ లో ఫైర్ ఆక్సిడెంట్..

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అకౌంట్స్ సెక్షన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఐదు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.

11:29 - February 3, 2017

నెల్లూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితం కొడవలూరు (మం) రాచర్లపాడులోని కిసాన్ సెజ్ లో పవన విద్యుత్ పరికరాల కర్మాగారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. సొలార్ కరెంట్ ఉత్పత్తిని పెంచాలని అనుకుంటున్నట్లు, 3616 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. అందులో 975 మెగావాట్ల సొలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి ఉందన్నారు. 9794 సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయాలని భావించి ప్రయోగాత్మకంగా నిర్వహించగా చేసిన దీనికి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. వ్యాపారానికి అనుకూలమైన రాష్ట్రాల్లో ఏపీ ద్వితీయ స్థానంలో ఉందని, ట్రంప్ వచ్చిన తరువాత అమెరికాలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని, ఉన్నఫళంగా తీసేయడం కరెక్టు కాదన్నారు. ఇన్సెస్టర్ మీట్ లో 282 వేల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయని, కొన్ని అమలు కావాల్సినవి ఉన్నాయన్నారు. 8లక్షల ఉద్యోగాల కోసం ఎంవోయూలు చేయడం జరిగిందన్నారు. ఇటీవలే విశాఖలో జరిగిన పార్ట్ నర్ షిప్ లో 665 ఎంవోయూలు, 10.54 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎంవోయూలు కుదుర్చుకోవడం జరిగిందని తెలిపారు. దీనివల్ల 22 లక్షల ఉద్యోగాలు వస్తాయని కానీ కొంతమంది ఉద్యోగాలు రావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారని బాబు పేర్కొన్నారు.

లోక్ సభ వాయిదా..కొనసాగుతున్న రాజ్యసభ..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్ సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. మరోవైపు రాజ్యసభ సమావేశం కొనసాగుతోంది. విపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నాయి.

11:11 - February 3, 2017

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి 'నారా లోకేష్' మంత్రివర్గంలోకి రానున్నారా ? కొన్ని రోజులుగా లోకేష్ ఏపీ మంత్రివర్గంలో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి. టిడిపి పొలిట్ బ్యూరోలో ఇప్పటికే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీరణలో భాగంగా లోకేష్ కు కేబినెట్ బెర్త్ కేటాయించనున్నారని, ఏప్రిల్, మే నెలల్లో ముహూర్తం ఖాయమైందని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి. లోకేష్ పదవిపై కుటుంబపరంగానూ బాబుపై ఒత్తిడి ఉందని సమాచారం. ఇదే ఒకవేళ నిజమైతే లోకేష్ పాత్ర ఇక అధికారికంగా మారనుంది. ఇలా చేయడం వల్ల రాజ్యాంగేతర ముద్ర చెరిపేయాలని బాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు అంశాలపై మంత్రులతో లోకేష్ అంతర్గత మంతనాలు జరిపినట్లు సమాచారం. మంత్రివర్గంలో యువ భాగస్వామ్యం పెంచాలంటూ కొందరు నేతలు సూచనలు చేసినట్లు టాక్. సమాచార, సినిమాటోగ్రఫి, టూరిజం వంటి శాఖలపై లోకేష్ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. దానికంటే ముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఎంసీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.

10:59 - February 3, 2017
10:54 - February 3, 2017

'రానా దగ్గుబాటి' తో 'ప్రభాస్' రెండు కోట్లు బేరం..'బాహుబలి' సినిమాతో మంచి స్క్రీన్ మేట్స్ గా మారిపోయిన 'ప్రభాస్’, ‘రానా'లు మరో అడుగు ముందుకేసి తమ సినిమాల్లో తమకున్న ఫ్రెండ్షిప్ ని చాటుతున్నారు. ’ప్రభాస్' ఈ పేరు వినగానే గుర్తొచ్చే నెక్స్ట్ వర్డ్ డార్లింగ్ ...అందర్నీ ప్రేమగా చిరునవ్వుతో డార్లింగ్ అని పిలిచే 'ప్రభాస్' తనతో 'బాహుబలి'లో లాంగ్ జర్నీ చేసిన 'రానా'ని ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు అనటానికి ఇదొక ఉదహారణ. 'రానా' కొత్త సినిమా 'ఘాజి' 1971 లో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధవాతావరణం నేపధ్యంలో నిర్మించిన చిత్రం. ఈ సినిమా ఇండియస్ ఫస్ట్ అండర్ వాటర్ ఫిలిం. ఇందులో హీరో పాత్రని 'రానా' చేయగా హీరోయిన్ గా 'తాప్సి' చేశారు. 'రానా' సోలో హీరో గా చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. 'బాహుబలి' సినిమాలో కూడా 'ప్రభాస్'తో పోటీపడి నటించి మంచి మార్కులే కొట్టేసాడు రానా.

పివిపి ప్రొడక్షన్..
పివిపి ప్రొడక్షన్ హౌస్ తో సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న 'ఘాజి' సినిమా అటు యాక్షన్ ఎలెమెంట్స్ తో ఇటు దేశభక్తి తో ఉంటూ హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుందని విశ్లేషకుల అంటున్నారు. టాలీవుడ్ లో పరిణామాలు పూర్తిగా మారుతూ వస్తున్నాయి. ప్రొడ్యూసర్స్ ఇక్కడి కలెక్షన్ల తో పాటు అబ్రాడ్ కలక్షన్ల మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ మధ్య రిలీజ్ ఐన తెలుగు సినిమాలు అన్ని యు ఎస్ మార్కెట్ లో వసూళ్లు కురిపించినవేజ. 'ఖైదీ నెంబర్ 150’,’ గౌతమిపుత్ర శాతకర్ణి', 'శతమానంభవతి' ఇలా సంక్రాంతి కి రిలీజ్ ఐన సినిమా లు ఇక్కడ వసూళ్లతో పాటు అక్కడ కూడా డాలర్స్ కురిపించాయి. అంత ఇంపార్టెంట్ ఉన్న యు ఎస్ మార్కెట్ మీద హాలీవుడ్ స్టాండర్డ్ ఉన్న 'రానా' సినిమా కచ్చితంగా వసూళ్ల వర్షం కురిపిస్తుందని టాక్. యు వి క్రియేషన్స్ కి పరోక్షంగా బ్యాక్ బోన్ ఐన 'ప్రభాస్' ఈ 'ఘాజి' సినిమా యు ఎస్ రైట్స్ ని రెండు కోట్లకి కొనేశారు. అంటే ఇప్పుడు 'రానా' నటించిన 'ఘాజి' సినిమాని యు ఎస్ లో ప్రెసెంట్ చేయబోయేది యు వి క్రియేషన్స్ అన్నమాట.

10:44 - February 3, 2017

'అల్లు అర్జున్' కొత్త సినిమాకి కొత్త కష్టాలు వచ్చాయి. సినిమా మొదటి నుండి మైంటైన్ చేస్తున్న సస్పెన్సు ఒక్క సరిగా బ్రేకప్ అయి మల్లి పాచ్అప్ అయింది. ఈ సంఘటనతో అల్లుఅర్జున్ తో పాటు సినిమా యూనిట్ మొత్తం షాక్ కి గురి అయింది. 'అల్లు అర్జున్' కెరీర్ స్టార్టింగ్ నుండి తన ప్రతి సినిమా లో వైవిధ్యమైన కథను ఎంచుకుంటూనే, ఆ కధలోని పాత్రను కూడా వైవిధ్యంగా ప్రెసెంట్ చేస్తున్నాడు. సినిమా సినిమాకి తన స్టైల్ ని మార్చుకుంటూ స్టైలిష్ స్టార్ అనిపించుకుంటున్నాడు. మన ఈ తెలుగు స్టైలిష్ స్టార్ కి మలయాళంలో కూడా మార్కెట్ బాగానే ఉంది.

హరీష్ శంకర్ డైరెక్షన్..
'హరీష్ శంకర్' డైరెక్షన్ లో క్రియేట్ అవుతున్న స్టైలిష్ ఎంటర్టైనర్ 'డి జె’ 'దువ్వూరి జగ్గన్నాథం' సినిమా టైటిల్ తోనే అలోమోస్ట్ తెలుగు ఆడియన్స్ ని ఎక్ పెక్టషన్స్ లోనికి నెట్టిన ఈ సినిమా లుక్ గురించి 'అల్లు అర్జున్' చాల జాగర్తలు తీసుకున్నాడు. కొత్తగా కనిపించడానికి తన హెయిర్ స్టైల్ ని మార్చేసి గడ్డం కూడా పెంచేసాడట. అల తెలుగు ఆడియన్స్ కి కొత్త లుక్ ని థ్రిల్ గా ప్రెసెంట్ చెయ్యటానికి ప్లాన్ చేసిన ఈ మెగా హీరో తన లుక్ ని సోషల్ మీడియాలో కానీ నెట్ వరల్డ్ లో కానీ రిలీజ్ చెయ్యొద్దని గట్టిగా చెప్పేశాడంట. సెట్ లో అందరూ విన్నారు కానీ ఎలా లీక్ అయిందో తెలియదు కానీ స్టైలిష్ గెట్ అప్ లో ఉన్నడి 'బన్నీ' ఫోటో ఒకటి నెట్ లో హల్ చల్ చేసింది. ఈ వార్త విన్న వెంటనే షాక్ ఐన అల్లు అర్జున్, హరీష్ శంకర్ లు తమ పీ ఆర్ టీం ని రంగం లోకి దింపి ఆ ఫోటో ని డిలీట్ చేయించారంట.

10:38 - February 3, 2017

ఇండస్ట్రీ లో నెంబర్ వన్ లిస్ట్ లో పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు 'పవన్ కళ్యాణ్' అండ్ 'మహేష్ బాబు'. వారితో యాక్ట్ చేసే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా చాల హ్యాపీ గా ఫీల్ అవ్వాల్సిందే.. అలాంటి ఆఫర్ ని రిజెక్ట్ చేసింది ఒక డేరింగ్ అండ్ బ్యూటీ హీరోయిన్. 'రకుల్ ప్రీత్ సింగ్' ఈ పేరు వింటే చాలు అందం అభినయం రెండు గుర్తొస్తాయి. 'నాన్నకు ప్రేమతో', 'సరైనోడు', 'ధ్రువ' వంటి హిట్స్ ని 2016 లో తన ఖాతాలో వేసుకున్న 'రకూల్ ప్రీత్ సింగ్' ఇప్పుడు టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్. కమర్షియల్ సినిమాకి కావలిసిన హంగుళ్ళున్న నటి 'రకుల్' అలాంటి నటిని దర్శక నిర్మాతలే కాదు హీరోలు కూడా తమ సినిమాల్లో నటింప చెయ్యాలి అనుకోటం సహజమే కదా. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో 'మహేష్ బాబు' నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమా లో ఫస్ట్ హీరోయిన్ కోసం 'రకుల్ ప్రీత్ సింగ్' ని అప్రోచ్ అయ్యారు. బట్ ఈ బ్యూటీ యాక్ట్రెస్ డేట్స్ ఖాళీ లేవని చెప్పటంతో 'సమంత'ను తీస్కోటం జరిగింది. 'మహేష్' తో పాటు 'సమంత', 'కాజల్ అగర్వాల్' నటించిన 'బ్రహ్మోత్సవం' శ్రీకాంత్ అడ్డాల మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.

బిజీగా ఉన్న రకూల్..
అప్పుడు 'మహేష్ బాబు' సినిమాకి నో చెప్పిన 'రకుల్' ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' సినిమాకి కూడా అదే ఆన్సర్ ఇచ్చింది. 'కాటమారాయుడు' పోస్టర్ కి వస్తున్న రెస్పాన్స్ 'పవన్ కళ్యాణ్' ఫిలిం మేకింగ్ స్పీడ్ పెంచింది. ప్రస్తుతం 'కాటమరాయుడు' తరువాత చెయ్యబోయే 'పవన్' సినిమా లో నటించటానికి తనకి టైం లేదని క్లియర్ గా చెప్పేసింది 'రకుల్ ప్రీత్ సింగ్'. ప్రస్తుతం 'రకుల్ ప్రీత్ సింగ్' కెరీర్ ని పక్క ప్లానింగ్ తో ముందుకు తీసుకువెళ్తుందనే చెప్పాలి. 'మహేష్ బాబు', 'మురుగదాస్' కాంబినేషన్ తో పాటు 'సాయి ధరమ్ తేజ్', 'బెల్లంకొండ శ్రీనివాస్’, 'నాగచైతన్య' ప్రాజెక్ట్స్ కూడా ఓకే చేసేసింది. ఇలా మూడు నాలుగు సినిమాలతో బిజీ గా ఉంది. డేట్స్ కుదరక పోవటంతో 'పవన్ కళ్యాణ్' సినిమాకి నో చెప్పినట్టు సమాచారం.

గాంధీ భవన్ ఎదుట కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళన..

హైదరాబాద్ : గాంధీభవన్ ఎదుట కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు రూల్స్ క్రమబద్ధీకరణ చర్యలకు కాంగ్రెస్ అడ్డుపడుతోందని మండిపడుతూ ఈ ఆందోళన నిర్వహించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్టు చేశారు.

నెల్లూరులో బాబు..

నెల్లూరు : జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. కొడవలూరు (మం) రాచర్లపాడులోని కిసాన్ సెజ్ లో పవన విద్యుత్ పరికరాల కర్మాగారాన్ని ప్రారంభించారు. అనంతరం పరిపాలన భవనాన్ని సీఎం బాబు ప్రారంభించనున్నారు.

గాంధీ విగ్రహం వద్ద టీఎంసీ నిరసన..

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట టీఎంసీ ఎంపీలు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసన చేశారు.

10:26 - February 3, 2017
10:24 - February 3, 2017

హైదరాబాద్ : ఇంటింటి నుంచీ చెత్త సేకరిస్తాం - తడి పొడి చెత్తను వేరు చేయాలంటూ హడావుడి చేసింది గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌. ఇందుకోసం ఇంటింటికి రెండు చెత్తబుట్టలు పంపిణీ చేయడంతో పాటు 2వేల ఆటోలనూ సమకూర్చింది. మరి ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాల్సిన ఆటోలు ఎక్కడ? ఎన్నిఆటోలు రోజూ చెత్తసేకరించే పనిలో ఉన్నాయి? మిగిలిన ఆటోలు ఎక్కడున్నాయి? హైదరాబాద్‌ నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగా కార్యాచరణ చేపట్టింది. జీహెచ్‌ఎంసీ మహా ఉద్యమంలా తడి- పొడి చెత్తసేకరణకు పూనుకుంది. నగరంలోని 21 లక్షల కుటుంబాల చెత్తను తడి - పొడి రూపంలో సేకరించడానికంటూ 44 లక్షల బుట్టలనూ పంపిణీ చేసింది. అంతేకాదు ఇంటింటి నుంచి చెత్త సేకరణ కోసం 2000 ఆటోలను సైతం సమకూర్చింది. ప్రతి సర్కిల్‌లో ఒక్కో ఆటోకు 600 నుంచి 800 ఇళ్లను కేటాయించారు.

చెత్త సేకరణలో ఆటో రిక్షాల అలసత్వం..
చెత్త సేకరణకు బుట్టలు పంపిణీ చేయడం ఆటోలను సమకూర్చడం వరకు బాగానే ఉంది. ఎన్నో కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఆటోలన్నీ పనిలో ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. హౌజ్‌ హోల్డర్స్ నుంచి చెత్తను సేకరించడంలో మాత్రం ఆటోలు అలసత్వం వహిస్తున్నాయి. ప్రతి రోజూ నాలుగు వందల నుంచి 800 ఆటోల వరకు అసలు ఫీల్డ్‌కే రావడం లేదు. అంటే 1200 నుంచి 1600 ఆటోలు మాత్రమే చెత్త సేకరణ పనిలో ఉన్నాయి. ఇక సెలవు రోజుల్లో అయితే ఆటోల హాజరు మరీ తక్కువగా ఉంటోంది. ఆదివారాలు, పండుగ రోజుల్లో అయితే 900 నుంచి 1000 ఆటోలే చెత్త సేకరిస్తున్నాయి. సెలవు దినాల పేరుతో రెండు మూడు రోజులు ఆటోలు డుమ్మా కొట్టినా అడిగే నాధుడు లేడు. ప్రధానంగా ఖైత్లాపూర్‌, నాగోల్‌, జియాగూడ, యూసఫ్‌గూడ, ఇమ్లీబన్‌ , ట్యాంక్‌ బండ్‌ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రాలకు వచ్చే ఆటో టిప్పర్లు పెద్ద సంఖ్యలో విధులకు గైర్హాజరవుతున్నాయి.

సంకల్పం మంచిదే..
చెత్త రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న జీహెచ్‌ఎంసీ సంకల్పం మంచిదే. కానీ అనుకున్న లక్ష్యాలు అమలవుతున్న తీరుపై మాత్రం పర్యవేక్షణ చేయకపోవడం మూలంగా సమస్యలేర్పడుతున్నాయి. ఆటో రిక్షాలను నామినల్‌గా డౌన్‌పేమెంట్‌తో లబ్దిదారులకు కేటాయించింది బల్దియా. ప్రతి నెల వాటికి 1.8 కోట్ల రూపాయల ఈఎంఐ చెల్లిస్తోంది. అంటే ఏడాదికి 22 కోట్లు ఖర్చు చేస్తోందన్నమాట. ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు ఆటోరిక్షాలన్నీ చెత్తసేకరణలో ఉండేలా చూడాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీదే. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుంది.

10:11 - February 3, 2017

సంక్రాంతి బరిలో భారీ పోటి తరువాత.. బాక్సాఫీస్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన ఇండస్ట్రీ ప్రముఖులు ఫిబ్రవరిలో వరుస రిలీజ్ లకు రెడీ అవుతున్నారు. మీడియం రేంజ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో నెలంతా థియేటర్లు కళకళలాడనున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి నెల సినిమాలకు అన్ సీజన్ గా భావిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం ఈ అన్ సీజన్ లోనే యంగ్ హీరోలు బరిలో దిగుతున్నారు. ముందుగా ఫిబ్రవరి 3న రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాని హీరోగా తెరకెక్కుతున్న 'నేను లోకల్' తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన 'కనుపాప' సినిమా కూడా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ ఇద్దరు స్టార్ మంచి ఫాంలో ఉండటంతో రెండు సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

బరిలో సూర్య..
చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో 'సూర్య' కూడా ఇదే సీజన్ లో బరిలో దిగుతున్నాడు. ఫిబ్రవరి 9న 'సింగం3’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఆ మేరకు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడ్ పెంచాడు. 'సింగం' సీరీస్ లో గత చిత్రాలు ఘన విజయం సాధించటంతో ఈ మూవీపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

నాగార్జున..
కింగ్ 'నాగార్జున' మరోసారి భక్తాగ్రేసరుడిగా నటించిన 'ఓం నమో వేంకటేశాయ’ ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో 'నాగార్జున' వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడు హథీరాం బాబాగా కనిపించనున్నాడు. 'అన్నమయ్య’, 'శ్రీరామదాసు’, 'శిరిడి సాయి' లాంటి డివోషనల్ సక్సెస్ లు సాధించిన కాంబినేషన్ కావటంతో 'ఓం నమోవేంకటేశాయ' సక్సెస్ పై చిత్రయూనిట్ తో పాటు ప్రేక్షకులు కూడా నమ్మకంగా ఉన్నారు.

మంచు మనోజ్..
అదే రోజు 'మంచు మనోజ్' మాస్ అవతారంలో కనిపిస్తున్న 'గుంటూరోడు' సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చాలా రోజులుగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న 'మనోజ్' ఈ సారి ఎలాగైన సక్సెస్ కొట్టాలన్న కసితో ఈ సినిమా చేశాడు. 'మనోజ్' సరసన 'ప్రగ్యా జైస్వాల్' హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది.

రానా..
'రానా' నేవీ కమాండర్ గా నటిస్తున్న 'ఘాజీ' సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 1971లో భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో అదృశ్యమైన సబ్ మెరైన్ 'ఘాజీ' కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీవీపీ సినిమాస్ భారీ బడ్జెట్ తో రూపొందించింది.

రాజ్ తరుణ్..
అదే రోజు 'రాజ్ తరుణ్' హీరోగా తెరకెక్కిన 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో 'రాజ్ తరుణ్' పెంపుడు కుక్కల దొంగగా కనిపించనున్నాడు. వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

సాయి ధరమ్ తేజ..
ఫిబ్రవరిలో ఆఖరి శుక్రవారం అయిన 24న కూడా సినిమా సందడి కొనసాగుతోంది. మెగా హీరో 'సాయిధరమ్ తేజ్' హీరోగా తెరకెక్కిన 'విన్నర్' ఫిబ్రవరి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో యువ నటుడు 'నిఖిల్' హీరోగా తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ 'కేశవ'ను కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

జీహెచ్ఎంసీ అధికారిపై దూసుకెళ్లిన అంబులెన్స్..

హైదరాబాద్ : జీడిమెట్లలో విధులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ అధికారి ప్రభాకర్ రెడ్డిపై అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈఘటనలో తీవ్రగాయాలైన ప్రభాకర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు.

నాగాలాండ్ లో తీవ్ర ఉద్రిక్తతలు..

ఢిల్లీ : నాగాలాండ్ లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు ఎత్తివేయాలని కోహిమా, దిమాపూర్ లో గిరిజన ప్రజలు నిరసనకు దిగారు. ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందారు. ఆగ్రహంతో ఇళ్లు, వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అస్సాం రైఫిల్స్ రంగంలోకి దిగింది. కోహిమాలో 144 సెక్షన్ విధించారు.

కొనసాగుతున్న చమురు తొలగింపు..

చెన్నై : తమిళనాడు తీర ప్రాంతంలో చమురు తొలగింపు కొనసాగుతోంది. రెండు కార్గో నౌక‌లు ఢీకొన‌డంతో ఇంధ‌నం స‌ముద్రం పాలైంది. సముద్రంలో పేరుకుపోయిన నల్ల చమురును క్లీన్‌ చేసేందుకు కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే 60 టన్నుల ఆయిల్‌ను సముద్రం నుంచి సేకరించిన సంగతి తెలిసిందే.

09:31 - February 3, 2017

పంజాబ్ : రేపు జరగనున్న పోలింగ్ కు పంజాబ్ సిద్ధమైంది. చివరి గంటల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ పార్టీలు అంతిమ ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దగ్గర డబ్బులు, మద్యం పంచిపెట్టినట్టుగానే పంజాబ్ లో డ్రగ్స్ ను పంచిపెడుతున్నారు. అకాలీదళ్, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోటీ రసవత్తరంగా వుంది. పంజాబ్ లో వున్నది 117 అసెంబ్లీ, 13 లోక్ సభ స్థానాలే అయినా అన్ని ప్రధాన పార్టీలకు ఇది కీలకంగా మారుతోంది. అకాలీదళ్, బిజెపి, కాంగ్రెస్, ఆప్, బిఎస్పీ ఈ అయిదు పార్టీలు పంజాబ్ లో అదృష్టాన్నీ పరీక్షించుకుంటున్నాయి. తొలిసారి త్రిముఖ పోటీ జరుగుతోంది. గత పదేళ్ల అకాలీదళ్, బిజెపి పాలనకు గట్టి సవాల్ ఎదురవుతోంది. అకాలీదళ్ అధికారం మీద దాదాపు ఆశలు వదిలేసుకుంది. అన్ని సర్వేలూ ప్రభుత్వ వ్యతిరేకతనే సూచిస్తున్నాయి. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రత్యర్థుల మీద చీలితే తప్ప, తాము గట్టెక్కడం కష్టమన్న భయం అధికార కూటమిని వెన్నాడుతోంది. నిరుద్యోగం, మాదకద్రవ్యాలు, అవినీతి పంజాబ్ లో ప్రధాన ప్రచారాంశాలవ్వడంతో అధికార కూటమి ఉక్కిరిబిక్కిరవుతోంది.

ఆగ్రహావేశాలతో నిరుద్యోగులు..
పంజాబ్ లో గత పదేళ్ల అకాలీ పాలనలో దాదాపు 20వేల ఫ్యాక్టరీలు మూతపడడంతో నిరుద్యోగ యువత ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. మరోవైపు డ్రగ్స్ స్వైర విహారం చేస్తుండడం, డిప్యూటీ సిఎం సుక్బీర్ సింగ్ బాదల్ బామ్మర్దికే డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ గత నెల రోజుల్లోనే 2.63 టన్నుల డ్రగ్స్ ను పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు, మద్యం పంచినట్టుగానే పంజాబ్ లో డ్రగ్స్ పంచిపెడుతున్నారు. నెలకోసారి ఎన్నికలొస్తే బాగుంటుందని డ్రగ్స్ బానిసలు భావిస్తున్నారంటే అది ఎంత భయంకర వ్యసనంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. బాదల్ కుటుంబ సభ్యుల అండదండలు లేకుండా ఇక్కడ వ్యాపారం చేయడం కష్టమన్న భయం వ్యాపార వాణిజ్యవర్గాల్లో ఏర్పడి పోయింది.

2014లో..
డిప్యూటీ సిఎం సుక్బీర్ సింగ్ బాదల్ కి మామూళ్లు ఇవ్వకుండా ఎవ్వరూ వ్యాపారం చేసుకోలేని వాతావరణం అక్కడ నెలకొంది. అకాలీదళ్ మీద వ్యతిరేతక 2014 లోక్ సభ ఎన్నికల్లోనే స్పష్టంగా కనిపించింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా వీచినా, పంజాబ్ లో మాత్రం ఆ గాలి కనిపించలేదు. 13 లోక్ సభ స్థానాలుంటే అకాలీదళ్, బిజెపి కలిసి గెల్చుకుంది కేవలం 6 సీట్లే. అప్పుడే కొత్తగా రంగంలోకి దిగిన కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ఏకంగా నాలుగు స్థానాలు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపర్చింది. దేశ వ్యాప్తంగా చావుదెబ్బతిన్న కాంగ్రెస్ ఇక్కడ మూడు స్థానాలతో ఫర్వాలేదనుపించుకుంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో అధికార అకాలీదళ్, ప్రతిపక్ష కాంగ్రెస్ భారీగానే ఆప్ కి ఓట్లు సమర్పించుకున్నాయి.

చీలిన ఓట్లు..
2012లో 42 శాతం ఓట్లు సాధించిన అకాలీదళ్ 2014లో 35 శాతానికే పరిమితమైంది. అంటే ఏడు శాతం ఓట్లు కోల్పోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఓట్లు కూడా 40 నుంచి 33 శాతానికి పడిపోయాయి. కాంగ్రెస్ కి కూడా 7శాతం ఓట్లు తగ్గాయి. 2014లోనే తొలిసారి బరిలోకి దిగిన ఆప్ 24 శాతం ఓట్లు సాధించి, బిజెపి, కాంగ్రెస్ లకు ముచ్చెమటలు పట్టించింది. 2012లో 68 అసెంబ్లీ స్ధానాలు గెలుచుకున్న అకాలీదళ్, బిజెపి బలం 2014 లోక్ సభ ఎన్నికల్లో 45 సెగ్మంట్ లకే పరిమితమైంది. కాంగ్రెస్ పరిస్థితీ దిగజారింది. 2012లో 46 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ 2014లో 37 సెగ్మెంట్ లలో మాత్రమే పై చేయి సాధించింది. 2012లో అసలు సీన్ లేనే లోని ఆప్ 2014 ఎన్నికల్లో 33 సెగ్మెంట్ లలో మెజార్టీ సాధించింది. మరో ఏడు చోట్ల రెండో స్థానంలో నిలిచింది. అకాలీదళ్ నుంచి 45శాతం, కాంగ్రెస్ నుంచి 35 శాతం, బిఎస్పీ లాంటి ఇతర పార్టీల నుంచి 20శాతం ఓట్లను ఆప్ చీల్చుకున్నట్టు 2014 ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది.

ఆప్ కు మైనస్..
2014 ఎన్నికలు ఇచ్చిన కిక్కుతో పంజాబ్ లో పాగా వేసేందుకు ఆప్ గట్టి ప్రయత్నాలే చేసింది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఒక దశలో క్రికెటర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పంజాబ్ లో క్యాంపెయిన్ చేశారు. అయితే, గత జూన్ నుంచి ఆప్ ని బ్యాడ్ పిరియడ్ వెన్నాడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం, పార్టీ ముఖ్య నేతల మధ్య మనస్పర్ధలు, సిద్ధూతో డీల్ కుదరకపోవడం లాంటి పరిణామాలు ఆప్ కు మైనస్ గా పరిణమించాయి.

అమరీందర్ సింగ్..
ఆప్ నీరసిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ వేగంగా పావులు కదుపుతూ, వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేశారు. ఇవే తనకు ఆఖరి ఎన్నికలంటూ సెంటిమెంట్ బాణాలేశారు. మరోవైపు ఇతర పార్టీలకు చెందిన నాయకులను చేరదీశారు. బిజెపికి దూరమైన సిద్ధూకు వెల్ కమ్ చెప్పారు. దీంతో పంజాబ్ లో కాంగ్రెస్ కి అనుకూల వాతావరణం ఏర్పడ్డట్టు సర్వేలు సూచిస్తున్నాయి. పంజాబ్ లో మాల్వా, మాఝా, దోబా ప్రాంతాలున్నాయి. 69 స్థానాలున్న మాల్వా రీజియన్ లో ఆప్ గట్టి పట్టు సాధించింది. 25 స్థానాలున్న మాఝాలో కాంగ్రెస్ గాలి వీస్తోంది. 23 స్థానాలున్న దోబాలను ప్రాంతంలోనూ కాంగ్రెస్ దే పై చేయిగా కనిపిస్తోంది. 69 స్థానాలున్న మాల్వాలో ఆప్ గెలుచుకునే స్థానాలే కీలకం కాబోతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే మాఝా, దోబాలను క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా మాల్వాలోనూ సత్తా చాటాల్సి వుంటుంది.  పంజాబ్ లో 58శాతం మంది సిక్కులు, దాదాపు 39శాతం మంది హిందువులున్నారు. అయితే ఆప్ కి బలమైన సిక్కు నాయకుడు లేడు. 32శాతం వున్న దళితుల మీదనే ఆప్ ప్రధానంగా దృష్టి పెట్టింది. బిఎస్పీ కి పట్టున్నది దళితుల్లోనే. 20 నుంచి 25శాతం వున్న బీసీలు, 21 శాతం వున్న జాట్ సిక్కులు ఎవరి వైపు మొగ్గుతారన్నది ఆసక్తికరమే.

09:25 - February 3, 2017

చిత్తూరు : మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్లవద్దని..నిబంధనలు పాటించాలని చెబుతున్నా కొంతమంది డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ప్రైవేటు హెటెక్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. బెంగళూరు నుండి విజయవాడకు హెటెక్ బస్సు వెళుతోంది. చంద్రగిరి మండలం తొండవాడ వద్దనున్న మలుపు వద్ద చిత్తూరుకు వెళుతున్న లారీని బస్సు ఢీకొంది. వెంటనే రోడ్డుపక్కకు ఒరిగిపోయింది. దీనితో బస్సులో ఉన్న ఇద్దరు మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిని రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మితిమీరిన వేగంతో బస్సు ప్రయాణించడం వల్ల ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.

09:21 - February 3, 2017

శ్రీకాకుళం : ఇవాళ రథసప్తమి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లోని అన్ని దేవాలయాలు వేడుకలకు సిద్ధమయ్యాయి. సూర్య జయంతిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలు జరుపుతారు. తిరుమల, శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో రథసప్తమి వేడుకులు ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగుతున్నారు. ఉదయం 9 గంటలకు చినశేషవాహనంపై దర్శనమివ్వనున్నారు. సూర్యాస్తమయం వరకు మొత్తం ఏడు వాహనాలపై శ్రీవారు ఊరేగుతారు. రథసప్తమి సందర్భంగా తిరుమలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

శ్రీకాకుళంలో..
శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆదిత్యుని సన్నిధిలో రథసప్తమి వేడుకులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి వేడుకలను ప్రారంభించారు . దేశంలోనే పూజలు జరిగే ఏకైక సూర్యదేవాలయం కావడంతో సూర్యజయంతి వేడుకల్లో పాల్గొనడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులతో క్యూలైన్లన్ని కిక్కిరిశాయి. భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

09:20 - February 3, 2017

భద్రాద్రి: ఎర్రజెండా చేతబట్టి.. పల్లెపల్లెలో చైతన్యాన్ని నింపుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 109 రోజులు పూర్తి చేసుకుంది. పాదయాత్ర బృందానికి అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తోంది. భారత దేశంలోనే ఇంతవరకు ఎవరూ చేపట్టని సుదీర్ఘ పాదయాత్రను తాము చేపట్టామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అనేక పల్లెల్లో బీఎడ్‌ చేసిన అమ్మాయిలు కూడా కూలీ పనులకు వెళుతున్నారని, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు నానా అవస్థలు పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తమకు ఇప్పటి వరకు 34 వేల దరఖాస్తులు వచ్చాయని, కేసీఆర్‌ ఇచ్చిన హామీలపై సవాల్‌ విసిరినా సమాధానం చెప్పకుండా..పిరికిపందల్లా పారిపోయారని తమ్మినేని ఆరోపించారు. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా... 23 జిల్లాల్లో.. మొత్తం 2800 కిలోమీటర్లు సీపీఎం మహాజన పాదయాత్ర చేసిందని ఆయన చెప్పారు.

సామాజిక న్యాయం ఏదీ - జాన్ వెస్లీ..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సామాజిక న్యాయం జరగడం లేదని పాదయాత్ర బృందం సభ్యుడు జాన్‌వెస్లీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు కుట్ర పన్నుతున్నారని జాన్‌వెస్లీ ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జాన్‌వెస్లీ హెచ్చరించారు.

109వ రోజు..
సామాజికన్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న మహాజన పాదయాత్ర 109 రోజులు పూర్తి చేసుకుంది. 109వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అంకంపాళెం గ్రామంలో ప్రారంభమైన పాదయాత్ర.. కొత్తూరు, పార్కలగండ, పెద్దగొళ్లగూడెం, మల్కారం, రాచూరుపల్లి, జమ్మిగూడెం, కేశప్పగూడెం, ఓట్లపల్లి, అశ్వారావుపేట గ్రామాల్లో పర్యటించింది. పశ్చిమగోదావరి జిల్లా సీపీఎం నేతలు, కార్యకర్తలు తమ్మినేని బృందానికి మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణరాజు తమ్మినేని బృందానికి సంఘీభావం తెలిపారు. అంకంపాళెంలో గిరిజన ఆశ్రమపాఠశాల, బాలికల జూనియర్‌ కాలేజీని పాదయాత్ర బృందం సందర్శించింది. గర్ల్స్‌ కాలేజీ విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

09:17 - February 3, 2017

హైదరాబాద్ : చిన్న కారణాలకు తీవ్ర మనస్తాపానికి గురై జీవితాలను మధ్యలోనే తుంచేసుకుంటున్నారు. టీచర్ మందలించిందని..తోటి స్నేహితులు అవమానించారని..ఇలా ఏదో ఒక కారణంతో చిన్న వయస్సులోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఎర్రగడ్డలో ఇలాంటి ఘటనో ఒకటి చోటు చేసుకుంది. నందానగర్‌లో 12 ఏళ్ల బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్లాస్‌రూంలోకి సెల్‌ఫోన్‌ తెచ్చుకుందని 8వ తరగతి విద్యార్థిని రవళికను స్కూల్‌ టీచర్ మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవళిక ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రవళిక మృతితో తల్లిదండ్రులు గుండెలావిసేలా రోదిస్తున్నారు.

08:42 - February 3, 2017

పాలు..బెల్లం అనేది గొప్ప కలయిక. రుచికరమైన మరియు కెలరీలు..ఐరన్..సోడియం, పొటాషియం తదితర విటమిన్స్ ఇందులో ఉంటాయి.

  •  
  • బెల్లంకు అనీమియా ఎదుర్కొనే శక్తి వుంది. మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను వాడవచ్చు.
  • మహిళలకు రుతుక్రమంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • ఎముకలను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది.
  • జీర్ణక్రియను, మెటాబలిజమ్ ను మెరుగుపరుస్తుంది.
  • అనారోగ్యాల‌ను క‌లిగించే వైర‌స్‌లు, బాక్టీరియాలను దరి చేరనీయదు. ప‌లు ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
  • పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు.
  • రోజూ వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అంతేకాదు, కీళ్లు దృఢంగా మారుతాయి.
  • బెల్లం క‌లిపిన వేడి పాల‌ను తాగడం వ‌ల్ల వాటిలో ఉండే పోష‌కాలు అంది జుట్టు కాంతివంతంగా మారుతుంది. వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. చుండ్రు పోతుంది.

అఖిలేష్..రాహుల్ రోడ్ షో..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం అఖిలేష్ యాదవ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఆగ్రాలో ఈ రోడ్ షో జరగనుంది.

08:11 - February 3, 2017

దేశవ్యాప్తంగా లక్ష మందికిపైగా ఉన్న మెడికల్‌ సేల్స్‌ రిప్రజంటేటీవ్స్‌ నేటి నుండి సమ్మెకు దిగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై టీజేఏసీ సమరశంఖం పూరించింది.. ఈ నెలాఖరులోగా ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చలో వీరయ్య (నవ తెలంగాణ ఎడిటర్), రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), గోవర్దన్ రెడ్డి (టీఆర్ఎస్), రాజు భట్ (మెడికల్ రిప్రజెంటివ్) అభిప్రాయాలు తెలిపారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

వైభవంగా రథసప్తమి వేడుకలు..

చిత్తూరు : తిరుమలలో వైభవంగా రథ సప్తమి వేడుకలు జరుగుతున్నాయి. తిరువీధుల్లో సూర్యప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగుతున్నారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. మొత్తం ఏడు వాహనాలపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

07:30 - February 3, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' చిత్రం టీజర్ ఎప్పుడు విడుదలవుతుందా ? పవర్ స్టార్ ను ఎప్పుడు చూద్దామా అని అభిమానుల ఎదురుచూపులకు తొందరలోనే తెరపడనున్నాయి. 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అనంతరం 'పవన్' నటిస్తున్న 'కాటమరాయుడు'పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో..శరత్ మరార్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మార్చి 29న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ నిర్ణయించిన తేదీ కంటే ముందుగానే చిత్రం విడదలయ్యే అవకాశాలున్నట్లు టాక్. ఇదిలా ఉంటే టీజర్ మాత్రం ఇప్పటి వరకు విడుదల కాకపోవడం పట్ల అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. టీజర్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఫిబ్రవరి 4వ తేదీన 4 గంటలకు 'కాటమరాయుడు' చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. ‘పవన్' సరసన 'శృతి హాసన్' హీరోయిన్ గా నటిస్తోంది.

ఖమ్మంలో అడుగు పెట్టనున్న పాదయాత్ర..

ఖమ్మం : నేడు జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర అడుగు పెట్టనుంది. గత కొన్ని రోజులుగా పాదయాత్ర జరుపుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే.

తుళ్లూరులో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం..

గుంటూరు : అమరావతిలోని తుళ్లూరులో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రారంభించనున్నారు.

07:07 - February 3, 2017

ఈసారి బడ్జెట్ లో వ్యవసాయానికి రైతులకు అగ్రప్రాధాన్యత ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు, వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు 58,663 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాబోయే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమని ప్రకటించారు. అయితే, నిజంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా ఈ బడ్జెట్ వుందా? తాజా బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఇచ్చిందెంత? ఈ బడ్జెట్ రైతులకు ఎలాంటి ఉపశమనాలు కలిగించింది? ఏయే అంశాల్లో నిరాశ పరిచింది? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో రైతు సంఘం నేత సాగర్ విశ్లేషించారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

06:45 - February 3, 2017

విశాఖపట్టణం : నిన్నటిదాకా సీఐఐ భాగస్వామ్య సదస్సుతో సందడిగా మారిన విశాఖ ..ఇపుడు మరో ఈవెంట్‌కు రెడీ అయింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న విశాఖ ఉత్సవ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుస కార్యక్రమాలతో విశాఖ నగరం సందడిగా మారుతోంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న విశాఖ ఉత్సవ్‌కు సాగర నగరం సిద్ధమైంది. నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మొదట జనవరి మొదటి వారంలోనే విశాఖ ఉత్సవ్ నిర్వహించాలని అనుకున్న అధికారులు.. ఈ-గవర్నెన్స్ సదస్సు, సీఐఐ భాగస్వామ్య సదస్సుల కారణంగా ఉత్సవ్‌ వాయిదా పడుతూ వచ్చింది. మూడు రోజుల పాటు జరిగే 'విశాఖ ఉత్సవ్‌' కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. రామకృష్ణా బీచ్‌, ఏపిఐఐసి గ్రౌండ్, వుడా పార్క్ కేంద్రాలుగా జరగనుంది. ఉత్సవ్ ప్రధాన వేదికను బీచ్‌లో సిద్ధం చేస్తున్నారు.

మ్యూజికల్ నైట్..
ఇప్పటికే ముంబయికి చెందిన ఈవెంట్ సంస్ధ ప్రధాన వేదిక పనులను ప్రారంభించింది. శుక్రవారం ఉదయం ఈ ఉత్సవం అట్టహాసంగా ప్రారంభం కానుంది. విశాఖ ఉత్సవ్‌లో కార్యక్రమాలన్ని రామకృష్ణా బీచ్‌లోనే జరగనున్నాయి. వుడా పార్క్ దగ్గర మాత్రం ప్లవర్ షో ఏర్పాటు చేసారు. గతంలో కూడా ప్లవర్ షోకు విశేష స్పందన రావడంతో ఈ సారి అదే ప్రాంతంలో విశాఖ ప్రతిబింబాలను ఏర్పాటు చేసారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఏర్పాట్లను స్వయంగా పరిశీస్తున్నారు. పర్యాటకులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున తరలివచ్చే అవకాశాలు ఉన్నందున... ప్రత్యేకంగా ఉత్సవాల కోసం స్పెషల్ బస్సులు నడుపనున్నట్టు మంత్రి చెప్పారు. విశాఖ జిల్లా సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉత్సవాల నిర్వహణకు అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో తొలి రోజు పాప్ సింగర్ బాబా సెహగల్ సంగీత కార్యక్రమం, చివరి రోజున సినీ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ బృందంతో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రెజిల్‌ కార్నివాల్‌ స్ఫూర్తిగా వివాఖ ఉత్సవ్‌ను నిర్వహించడానికి అన్ని హంగులు సిద్ధం చేస్తున్నారు.

06:44 - February 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై టీజేఏసీ సమరశంఖం పూరించింది.. ఈ నెలాఖరులోగా ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించింది. కొద్దినెలలుగా టీఎస్‌ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ వస్తున్న తెలంగాణ జేఏసీ ఇప్పుడు పోరుబాట పట్టింది.. నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా సమావేశమైన టీ జేఏసీ... పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ నెల 22న హైదరాబాద్ లో నిరుద్యోగులతో నిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించినట్లు జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ తెలిపారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్‌ వరకు ఈ ర్యాలీ ఉంటుందన్నారు.

కోదండరాం ఆవేదన..
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఉద్యోగుల భర్తీ జరగడం లేదని కోదండరామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల 7 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని.. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 15 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసిందన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని.. ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే నిరుద్యోగుల నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు కోదండరామ్‌ తెలిపారు. టీజాక్ నేతలపై ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కోదండరాం ఆరోపించారు.. పోలీసుల వేధింపులకు భయపడేది లేదని కోదండరాం తేల్చిచెప్పారు. సమావేశం తర్వాత నిరుద్యోగ నిరసన ర్యాలీ పోస్టర్‌ను టీ జాక్‌ ఆవిష్కరించింది. ర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ ఇప్పటికే జేఏసీ నేతలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

06:33 - February 3, 2017

విజయవాడ : ఆంధ్రుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ఏపీ రాజధాని పరిపాలన నగరాన్ని నిర్మించాలని సీఎం చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఈనెల 22న లండన్‌కు చెందిన మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్స్‌ తుది డిజైన్‌లను సమర్పిస్తారని.. అదే రోజున డిజైన్‌లను ఖరారు చేయాలని సూచించారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఆర్డీఏ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అత్యంత కీలకమైన పరిపాలన నగరం నిర్మాణ అంతర్జాతీయ ప్రమాణాలతో సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్స్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ ప్రతినిధులతో ఈనెల 22న సీఎం సమావేశం కానున్నారు. అమరావతి నిర్మాణంపై వెలగపూడిలోని తన కార్యాలయంలో చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్షించారు. నార్మన్‌ ఫోస్టర్స్‌ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స ద్వారా చర్చించారు. పరిపాలనా నగరంలో నిర్మించే ప్రభుత్వ భవనాల ఆకృతులు వినూత్నంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో, ఉత్తమంగా ఉండాలని సూచించారు. భవన నిర్మాణాల్లో భారతీయ, ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద ప్రతిబింబించేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈ విషయంలో చరిత్రకారులు, పురావస్తు నిపుణులు, సాహితీవేత్తలు, చలనచిత్ర, కళారంగాల ప్రముఖులతోపాటు అన్ని వర్గాలను సంప్రదించి... సమన్వయం సాధించే బాధ్యతను పరకాల ప్రభాకర్‌కు అప్పగించారు.

అందర్నీ భాగస్వాములు చేయాలన్న బాబు..
అమరావతి రూపకల్పన, నిర్మాణంలో ఆర్కిటెక్ట్‌ నిపుణులు, విద్యార్థులతోసహా రాష్ట్ర ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజా రాజధానిలో అన్ని వర్గాలూ సంతోషంగా జీవించేలా ఉత్తమ సూచనలను చేసిన వారికి బహుమతులను అందించాలన్నారు. అమరావతిలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ తక్కువ ఉండేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతిలో 2019 జాతీయ క్రీడోత్సవాలను నిర్వహించాలన్న లక్ష్యం సాకారమయ్యేందుకు వీలుగా... క్రీడానగరాన్ని నిర్మించాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. 2018 నాటికి స్టేడియం, ఎరీనాలను నిర్మించాలని ఆయన సూచించగా, స్పోర్ట్స్‌ సిటీలో స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌ ఏర్పాటుకు ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చిందని అధికారులు తెలిపారు.

2019 కల్లా పూర్తి..
గత రెండేళ్లలో అమరావతి నిర్మాణంలో సాధించిన మైలురాళ్లను, 2018 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డుకు సంబంధించి జాతీయ రహదారుల విభాగంతో ఈ నెల 28న ఒప్పందం చేసుకోబోతున్నట్లు చెప్పారు. అమరావతిలో ప్రభుత్వోద్యోగుల కోసం దాదాపు 3,165 నివాసాలతోపాటు విభాగాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి మొత్తం 4 వేల 750 కోట్లతో రూపొందించిన అంచనాలను అధికారులు ముఖ్యమంత్రి ముందు ఉంచారు. అందమైన ఆర్థిక నగరంగా 2018 నాటికి అమరావతిని తీర్చిదిద్దుతామని, దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వ భవనాల నిర్మాణ షెడ్యూల్‌ను ప్రకటించారు. అసెంబ్లీని జీ ప్లస్‌ 3 విధానంలో నిర్మిస్తామని, 2018 అక్టోబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. హైకోర్టును జీ ప్లస్‌4లో విధానంలో నిర్మిస్తామని, 2019 ఏప్రిల్‌ కల్లా పూర్తి చేస్తామన్నారు.

అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు..

శ్రీకాకుళం : అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు క్షీరాభిషేకం నిర్వహించారు.

8వ తరగతి విద్యార్థిని బలవన్మరణం..

హైదరాబాద్ : ఎర్రగడ్డ నందానగర్ లో 12 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. క్లాస్ రూంలో సెల్ ఫోన్ తెచ్చుకుందని రవళికను టీచర్ మందలించింది. రవళిక ఎనిమిదో తరగతి చదువుతోంది. తీవ్రమనస్థాపానికి గురైన రవళిక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ప్రైవేటు బస్సు బోల్తా..ఇద్దరు మృతి..

చిత్తూరు : చంద్రగిరి (మం) తొండవాడ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

నెల్లూరులో పర్యటించనున్న బాబు..

నెల్లూరు : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కొడవలూరు (మం) రాచర్లపాడులోని కిసాన్ సెజ్ లో పవన విద్యుత్ పరికరాల కర్మాగారం, పరిపాలన భవనాన్ని సీఎం బాబు ప్రారంభించనున్నారు.

సాగరతీరంలో విశాఖ ఉత్సవ్..

విశాఖపట్టణం : నేటి నుండి సాగరతీరంలో విశాఖ ఉత్సవ్ జరగనుంది. గురువారం దీనికి సంబంధించిన ట్రయల్స్ జరిగాయి. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

తిరుమలలో నేడు రథసప్తమి వేడుకలు..

చిత్తూరు : తిరుమలలో నేడు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. సప్త వాహనాలపై స్వామి వారు ఊరేగనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగియనున్నాయి.

Don't Miss