Activities calendar

04 February 2017

22:39 - February 4, 2017

ఆడుతూ..పాడుతూ.. చదువుతూ జీవితాన్ని హాయిగా వెల్లదీయాల్సిన ఓ ఇరవై ఏళ్ల కుర్రాడిలో.. రాక్షసం పెరిగింది.  పగబట్టిన నాగులా మారాడు. ఆకలేసిన మృగంగా వేటాడాడు. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే పదుల సంఖ్యలో వచ్చే బుల్లెట్లున్న తుపాకులను చూసి భయపడలేదు. సాయుధ పోలీసులు డేగ కళ్లలో వేటాడినా దొరకలేదు. వాడి లక్ష్యం మాత్రం నెరవేర్చుకున్నాడు. పక్కా ప్లాన్ తో వచ్చి పంజా విసిరాడు. అతను ఫ్యాక్షనిస్టు కాడు.. నేర చరిత్ర ఉన్నవాడు అంతకన్నా కాదు.. నరనరాన జీర్జించుకున్న పగతో రగిలిపోయాడు. రక్తపాతం సృష్టించాడు. యావత్ పోలీసు విభాగానికి సవాల్ గా మారిన ఒకే ఒక్కడు... నాలుగేళ్లు ఓ పల్లెకు నరకం చూపించాడు.. ఇప్పటికీ వాడి పేరు చెబితే చాలు ఆ పల్లే చిగురుటాకుల వణుకుతోంది. ఇదీ కథకాదు... రియల్ స్టోరీ... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

22:17 - February 4, 2017
22:15 - February 4, 2017
22:13 - February 4, 2017

సౌతాఫ్రికా : శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య వన్డే మ్యాచ్‌లో క్రికెటర్లకు తేనెటీగలు చుక్కలు చూపించాయి.. జోహెన్నస్‌బర్గ్‌లో టాస్‌ నెగ్గిన సఫారీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.. శ్రీలంక ఆటగాళ్లు బ్యాటింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.. ఈ కీటకాల గుంపును చూసిన ప్లేయర్లు, అంపైర్లతో సహా అందరూ కిందపడుకుని తమను తాము రక్షించుకున్నారు..

 

22:10 - February 4, 2017

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఒక్కటవుతున్నాయి. మరోవైపు ట్రంప్‌ నిర్ణయం వల్ల ఏడు ముస్లిం దేశాలకు చెందిన లక్ష వీసాలు రద్దయ్యాయి.
ట్రంప్‌ నిర్ణయాలపై నిరసనలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రపంచమంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రష్యాతో ట్రంప్‌ స్నేహం చేయడాన్ని అమెరికా మిత్రదేశాలు కస్సుబుస్సు మంటున్నాయి.  మాల్టా రాజధాని వలెటాలో జరిగిన యూరోపియన్‌ యూనియన్‌ సదస్సులో ట్రంప్‌ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పలు తీర్మానాలు చేశాయి. రష్యాతో అమెరికా జతకట్టడం ప్రమాద ఘంటికలను మోగిస్తోందని ఈయూ నేతలు అభిప్రాయపడ్డారు.
ట్రంప్‌ను అడ్డుకోకుంటే యూరప్‌ మనుగడకే ముప్పు : ఫ్రాంకోయిస్‌ హోలాండే
ట్రంప్‌ను అడ్డుకోకుంటే యూరప్‌ మనుగడకే ముప్పని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండే హెచ్చరించారు. యూరప్‌ దేశాలు.. అమెరికా, రష్యాలపై ఆధారపడటం మానుకొని, సొంతగా రక్షణ, వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు.
ట్రంప్ ఆదేశాల‌ను వ్యతిరేకిస్తున్న ఫెడరల్‌ న్యాయమూర్తులు  
మరోవైపు ముస్లిం శ‌ర‌ణార్థుల‌కు ప్రవేశాన్ని ర‌ద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాల‌ను అమెరికాలోని చాలామంది ఫెడరల్‌ న్యాయమూర్తులు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ట్రంప్‌ ఆదేశాలను నిలిపివేయాలని ఫెడరల్‌ జడ్జి జేమ్స్‌ రాబర్ట్‌ ఆదేశించారు. మాతృదేశాన్ని రక్షించుకోవడానికి ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్దమైనదేనని వైట్‌హౌజ్‌ సమర్థిస్తోంది. ఫెడరల్‌ జడ్జి తీర్పుపై అమెరికా అటార్ని జనరల్‌ సమీక్షించనున్నారు.
లక్షమంది వీసాలు రద్దు
ట్రంప్ ఆదేశాల వల్ల ఏడు ముస్లిం దేశాలకు చెందిన లక్షమంది వీసాలను రద్దు చేసినట్లు సమాచారం. అలెగ్జాండ్రియా కోర్టులో వేసిన పిటిషన్‌పై స్పందించిన ఓ అటార్నీ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే గ్రీన్‌కార్డ్‌ హోల్డర్స్‌ను మాత్రం అనుమతించినట్లు పేర్కొన్నారు. సిరియా, ఇరాన్‌, ఇరాక్‌, యెమెన్‌, లిబియా, సొమాలియా, సుడాన్ దేశాల ముస్లిం శ‌ర‌ణార్థుల‌ను అమెరికాలో అడుగు పెట్టనీయకుండా ట్రంప్‌ నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే.

 

21:59 - February 4, 2017
21:56 - February 4, 2017

పనాజి : గోవా, పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు. గోవాలో రికార్డ్ స్తాయిలో 83 శాతం పోలింగ్ నమోదవ్వగా, పంజాబ్ లో 70 శాతంగా నమోదైంది. గత ఎన్నికల్లో గోవాలో 81 శాతం నమోదైంది. అయితే పంజాబ్‌లో గతంలో... 78.6 శాతం పోలింగ్‌ రికార్డయింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తిచేసినట్టు ఈసీ ప్రకటించింది. ఫలితాలను ఈనెల 11న ప్రకటించనున్నారు.

 

21:54 - February 4, 2017

హైదరాబాద్ : దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్‌ వైద్యులు తెలిపారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన దాసరికి రెండు రోజుల క్రితం వైద్యులు సర్జరీ చేసి వెంటిలేటర్‌పై ఉంచారు. అప్పటి నుంచి దాసరిని ప్రముఖులు పరామర్శిస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు సినీ నటుడు కృష్ణం రాజు దాసరిని పరామర్శించారు. ఆయన త్వరగా కోల్కొవాలని ఆకాంక్షించారు.

 

21:51 - February 4, 2017

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని... మంత్రి కేటీఆర్‌ తెలిపారు.. అభివృద్ధి కార్యక్రమాలన్నీ 24నెలల్లో కార్యరూపం దాలుస్తాయని స్పష్టం చేశారు.. సిరిసిల్ల, వేములవాడకు రైలు మార్గం వస్తుందని జిల్లా పర్యటనలో కేటీఆర్‌ పర్యటించారు. 34 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.. పోలీసు క్రీడాభవనాన్ని ప్రారంభించిన మంత్రి... కొద్దిసేపు షటిల్ ఆడారు.. కలెక్టర్‌ కార్యాలయంలోని చేనేతలక్ష్మి స్టాల్‌లో బట్టలు కొనుగోలు చేశారు..

 

21:46 - February 4, 2017

హైదరాబాద్ : ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌లో నిధుల అమలుపై ... ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కమిటీ సమావేశం వాయిదా పడింది. కడియం నేతృత్వంలో జరిగిన భేటీకి టీడీపీ, కాంగ్రెస్ సభ్యులెవరు హాజరుకాలేదు. దారిమళ్లిన నిధుల అమలుపై స్పష్టత ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేసింది. అయితే ప్రతిపక్ష సభ్యులకు ఎస్సీ, ఎస్టీలపై చిత్తశుద్ధి లేదని కడియం తీవ్రస్థాయిలో స్పందించారు.
సబ్‌ప్లాన్‌కు ప్రగతి పద్దుపేరుతో కొత్త ప్రతిపాదనలు
తెలంగాణలో అమలౌతున్న సబ్‌ప్లాన్‌కు ప్రగతి పద్దుపేరుతో కొత్త ప్రతిపాదనలకు టీఎస్‌ ప్రభుత్వం సిద్ధమైంది.. ఇందులోభాగంగా సబ్ ప్లాన్‌లో సవరణలు, భవిష్యత్ ప్రణాళికలపై సర్వశిక్షా అభియాన్‌లో ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. మంత్రి కడియం శ్రీహరి, చందూలాల్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీకి మంత్రి జగదీశ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు.. సబ్‌ప్లాన్‌పై చర్చించిన నేతలు... ఈ చట్టానికి కేటాయించిన నిధుల్ని క్రమపద్దతిలో ఖర్చయ్యేలా ప్రణాళికలు తయారు చేయాలని తీర్మానించారు.. నిధులు మిగిలితే వచ్చే ఏడాది సబ్‌ప్లాన్‌లో ఈ డబ్బు కలిసేలా ప్రతిపాదన చేశామని కడియం తెలిపారు.
సబ్‌ప్లాన్‌పై ప్రభుత్వం కాలయాపన : సీపీఎం
అయితే సమావేశం పేరుతో ప్రభుత్వం సబ్‌ప్లాన్‌పై కాలయాపన చేస్తోందని సీపీఎం విమర్శించింది. ఇప్పటికే మూడు సమావేశాలు పూర్తయ్యాయని... ఇంకా ఎజెండా ఖరారు చేయలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించారు.. కనీసం ఆ వివరాల్ని బయటకు ఇవ్వలేదంటూ సమావేశంనుంచి వాకౌట్‌ చేశారు. అటు ఈ సమావేశానికి టీడీపీ, కాంగ్రెస్‌ సభ్యులు రాలేదని... కడియం తీవ్రంగా స్పందించారు.. తమ హయాంలో దారిమళ్లిన నిధుల విషయం బయటకు వస్తుందనే మీటింగ్‌లకు హాజరుకాలేదని ఆరోపించారు. ఈ నెల 9న సమావేశం తర్వాత సబ్‌ప్లాన్‌పై స్పష్టత ఇస్తామని ప్రకటించారు.

మహిళపై దాడి చేసిన మధుకర్ రెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

చిత్తూరు : బెంగళూరులో ఏటీఎంలో మహిళపై దాడి చేసిన మధుకర్ రెడ్డిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మదనపల్లిలో మధుకర్ రెడ్డిని పట్టుకున్నామని ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఓ కేసులో శిక్ష అనుభవిస్తూ జైలు నుంచి పారిపోయారు. మధుకర్ రెడ్డిపై మొత్తం 5 కేసులు ఉన్నాయన్నారు.
 

21:03 - February 4, 2017
21:02 - February 4, 2017
21:00 - February 4, 2017
20:55 - February 4, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్‌ వివిధ రకాల పూలతో కనువిందు చేస్తోంది.. 140రకాల గులాబీల్ని ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.. ఈ గార్డెన్‌లో ఉద్యానోత్సవ్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించారు.. మొఘల్‌ గార్డెన్‌లోని పూలను రాష్ట్రపతి వీక్షించారు.. ప్రణబ్‌ ముఖర్జీ, సువ్రా ముఖర్జీ గులాబీ రకాలు గార్డెన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.. రేపటి నుంచి మార్చి 12వరకూ ఈ గార్డెన్‌ను ప్రజలకు అందుబాటులోకి ఉంచనున్నారు.. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం 4గంటలవరకూ మొఘల్‌ గార్డెన్‌నుచూసే అవకాశం ఇచ్చారు.. ఈ గార్డెన్‌కు సోమవారం సెలవు ప్రకటించారు.. గత ఏడాది ఉద్యానోత్సవ్‌కు దాదాపు 6లక్షలమంది ప్రజలు హాజరయ్యారు..

 

20:54 - February 4, 2017

హైదరాబాద్ : కూకట్ పల్లి జెఎన్ టీయూలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి మంటలు రావడంతో.. విద్యార్థులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది... అరగంట పాటు ప్రయత్నించి... మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఉన్నతాధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో...జరిగిన ఆస్తినష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

20:51 - February 4, 2017

హైదరాబాద్ : దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్‌ వైద్యులు తెలిపారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన దాసరికి రెండు రోజుల క్రితం వైద్యులు సర్జరీ చేసి వెంటిలేటర్‌పై ఉంచారు. అప్పటి నుంచి దాసరిని ప్రముఖులు పరామర్శిస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు సినీ నటుడు కృష్ణం రాజు దాసరిని పరామర్శించారు. ఆయన త్వరగా కోల్కొవాలని ఆకాంక్షించారు.

 

20:46 - February 4, 2017

హైదరాబాద్ : షెడ్యూల్‌ కులాల వర్గీకరణకు సంబంధించి అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామని..... తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అన్నారు. వర్గీకరణకోసం కాంగ్రెస్‌ పార్టీ కొన్నేళ్లుగా కృషి చేస్తోందని చెప్పారు.. 2004లో తాము శాసనసభలో తీర్మానం కూడా చేశామని గుర్తుచేశారు.. వర్గీకరణ కోసం గత అసెంబ్లీ సమావేశాల్లో సంపత్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు సభను స్తంభింపజేశారని చెప్పారు..

 

20:40 - February 4, 2017

అనంతపురం : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో షాక్‌ తగిలింది. బాలకృష్ణ పీఏ శేఖర్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపిస్తూ నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీలతో పాటు 11 మంది ఎంపీటీసీలు రాజీనామా చేశారు. బాలకృష్ణ పీఏ శేఖర్‌ లంచాలతో వేధిస్తున్నాడని వారు ఆరోపించారు.  రేపు టీడీపీ అసంతృప్త నేతలంతా హిందూపురంలో సమావేశం కావాలని నిర్ణయించారు. తాజా పరిణామాలపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారోనని స్థానిక నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

20:37 - February 4, 2017

ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లిలో సీపీఎం పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. పాదయాత్ర బృందానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. స్థానిక సమస్యలపై వినతిపత్రాలిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర బృందానికి దాదాపు 34వేల వినతిపత్రాలు అందాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:00 - February 4, 2017

హైదరాబాద్ : పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు టీజర్ రిలీజైంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో పవన్ సరసన శృతి హసన్ నటిస్తోంది. గోపాలా గోపాలా మూవీ డైరెక్టర్ కిశోర్ కుమార్ పార్థసాని... ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

 

19:55 - February 4, 2017

పశ్చిమగోదావరి : 'మన వస్తువు ఏదైనా పోయినా..,ఎవరైనా కనిపించకుండా పోయిన సాధారణంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాం’.. కానీ జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషన్‌లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పీఎస్ లో ఉంచిన ఆటో మాయమైంది. దొంగలు తెలివిమీరిపోయారు.. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోఉంచిన ఆటోనే ఎత్తుకెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకుచెందిన దుంగపు వెంకటరమణ ఆటోను గత ఏడాది జులైలో అధికారులు సీజ్‌ చేశారు.. ఈ ఆటోను జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు.. ఫైన్‌ కట్టడంలో ఆలస్యంచేసిన రమణ తాజాగా ఆ డబ్బు చెల్లించాడు.. రశీదు తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కువచ్చిన అతనికి ఆటో కనిపించలేదు.. ఆటోలేదన్న విషయం తెలుసుకున్న పోలీసులు దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.. అయితే పోలీస్‌ స్టేషన్‌లోనే వాహనాలకు సెక్యూరిటీ లేకుంటే బయట పరిస్థితి ఏంటని రమణ పోలీసుల్ని ప్రశ్నిస్తున్నాడు..

19:51 - February 4, 2017

కడప : ఎర్రచందన స్మగ్లర్లపై కడప జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలో మూడు వేరు వేరు ప్రాంతాల్లో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు నిర్వహించిన దాడులలో 31 మంది తమిళ స్మగ్లర్లతో పాటు ముగ్గురు కావలి ఆర్టీసీ డీపోకు చెందిన డ్రైవర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.1 టన్నుల ఎర్రచందనం దుంగలతో పాటు 18 సెల్‌ ఫోన్లు, స్కార్పియో, టాటా సుమోను స్వాధీనం చేసుకున్నారు.

 

19:45 - February 4, 2017

హైదరాబాద్ : టీడీపీ యువనేత లోకేశ్‌ను మంత్రికంటే ఎక్కువగానే వాడుకుంటున్నారని... ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా ఆరోపించారు. మంత్రి కాకపోయినా ఐఏఎస్, ఐపీఎస్ లతో రివ్యూలు జరుపుతున్నారని విమర్శించారు. లోకేశ్‌ ఎస్‌ అంటేనే ఫైళ్లపై సంతకాలవుతున్నాయని మండిపడ్డారు.. ఈ నెల పదిన గుంటూరులో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తామని రఘువీరా ప్రకటించారు.. విభజన హామీలపై కేంద్ర, రాష్ట్ర తీరును మోటార్‌ సైకిల్‌ యాత్ర ద్వారా ఎండగడతామని స్పష్టం చేశారు.

 

19:41 - February 4, 2017

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు 5 గంటల సమయం పడుతుంది.

 
 

నెల్లూరు జిల్లాలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు

నెల్లూరు : జిల్లాలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. చేజర్ల మండలం అదూరుపల్లి, చిత్తలూరులో 2 సెకన్ల పాటు భూమి కంపింది. స్థానికులు భయాందోళనలో ఉన్నారు.

19:28 - February 4, 2017

లక్నో : ఎస్పీ, కాంగ్రెస్‌లు అవకాశవాద పొత్తు కుదుర్చుకున్నాయని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ అసెంబ్లీ ఎన్నికల సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఎస్పీ, కాంగ్రెస్‌, మాయావతిలను స్కాంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఎస్‌ అంటే సమాజ్‌వాది పార్టీ, సి అంటే కాంగ్రెస్, ఎ అంటే అఖిలేష్, ఎం అంటే మాయావతిగా పేర్కొన్నారు. స్కాం పార్టీలు కావాలో...బిజెపి కావాలో తేల్చుకోవాలని సవాల్‌ విసిరారు.కర్ణాటకలో కాంగ్రెస్‌ మంత్రి దగ్గర 150 కోట్ల నల్లధనం దొరికినా మంత్రివర్గం నుంచి తొలగించకపోవడం వెనక కారణమేంటని ప్రశ్నించారు. తాను అధికారంలో ఉన్నంతవరకు అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

19:17 - February 4, 2017

భద్రాద్రి కొత్తగూడెం : అదో ప్రభుత్వ ఆస్పత్రి. 9 ఏళ్ల క్రితం ప్రభుత్వ పెద్దలు లాంఛనంగా ప్రారంభించారు. వైద్యం కోసం గిరిజనులు కిలోమీటర్లు నడిచిపోవాల్సిన అవసరం లేదని ఉపన్యాసాలు ఇచ్చారు. గిరిజనుల ఆరోగ్యానికి మేము రక్షగా ఉంటామని హామీలు గుప్పించారు. కాలం గిర్రున తిరగింది. 9 ఏళ్లు గడిచాయి. మరి ప్రభుత్వ పెద్దలు అనుకున్నట్టు అక్కడ గిరిజనులకు వైద్యం అందుతోందా? వైద్యం కోసం వారు కిలోమీటర్లు నడిచే బాధ తప్పిందా? తెలుసు కోవాలంటే వాచ్‌ దిస్‌ స్టోరీ..
పేషెంట్లు లేక వెలవెల
చూస్తున్నారుగా... పేషెంట్‌లు లేక ఈ ఆస్పత్రి ఎలా వెలవెలపోతోందో. పేషెంట్‌లు రావాలంటే మరి డాక్టర్లు ఉండాలిగా.  ఈ ఆస్పత్రిలో డాక్టర్లు ఎవరూ ఉండరు.  ప్రభుత్వం కేటాయించినా డాక్టర్లు విధులకు హాజరవ్వడం లేదనుకుంటున్నారేమో.. అసలు ప్రభుత్వం ఈ ఆస్పత్రికి వైద్యులనే కేటాయించలేదు.  అందుకే వైద్య పరికరాలు, బెడ్‌లు  ఇలా నిరుపయోగంగా పడి ఉన్నాయి.
ఇప్పటి వరకు వైద్యులను కేటాయించని సర్కార్‌
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి ఇది.  ఈ భవన నిర్మాణానికి 2002లో నాటి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. పనులన్నీ పూర్తి చేసుకోవడంతో 2007లో నాటి ఆరోగ్యశాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ ప్రారంభించారు. 30 పడకల ఆస్పత్రిగా అప్‌డ్రేగ్‌ కూడా చేశారు. ఈ పీహెచ్‌సీని  ప్రారంభించి 9ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వైద్యులనే ఏర్పాటు చేయలేదు.
గిరిజనుల పట్ల సవతితల్లి ప్రేమ కనబరుస్తోన్న ప్రభుత్వం
30పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడంతో స్థానిక గిరిజనులంతా సంతోషించారు.  సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా తమ ప్రాంతంలోనే  వైద్యసేవలు చేయించుకోవచ్చని  సంబరపడ్డారు. కానీ ఆ తర్వాతే తెలిసింది ప్రభుత్వం తమపట్ల సవతితల్లి ప్రేమ కనబర్చిందని. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా ఈ ఆస్పత్రి వైపు కన్నెత్తి చూసిన నేతలే లేరు. తెలంగాణ రాష్ట్రం సిద్దించి...  టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టి రెండున్నర ఏళ్లు గడిచినా నేటికీ పట్టించుకున్న నాధుడే లేడు.
కిలోమీటర్ల కొద్దీ వైద్యం కోసం గిరిజనుల నడక
9ఏళ్లుగా వైద్యులు లేకపోవడంతో ఏచిన్న అనారోగ్యం వచ్చిన ఇక్కడి గిరిజనులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్తున్నారు.  ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.  వైద్యం కోసం వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.  అంతేకాదు..  వైద్యం కోసం సుదూరంలోని  కొత్తగూడెం, వైరా, ఖమ్మం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తరచూ పాము, కుక్కకాటుకు గురవుతున్న గిరిజనులు
జూలూరుపాడు మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో తరచూ ఇక్కడి గిరిజనులు తరచూ పాము, కుక్కకాటుకు గురవుతుంటారు. అతిసార, కలరాతోపాటు సీజన్‌ వ్యాధులు, విషజ్వరాలకు బలవుతుంటారు. ఏళ్లతరబడి అంతుచిక్కని రోగాలతో గిరిజనులు చనిపోతుంటే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి జూలూరుపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.
 

 

18:58 - February 4, 2017

నిజామాబాద్ : పసుపుకు మద్దతు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారు. మద్దతు ధర కల్పిస్తామన్న పాలకులు వాటి ఊసే ఎత్తడం లేదు. దీంతో మార్కెట్‌ మాయాజాలంలో చిక్కి పసుపు రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి పసుపు రైతును నిండా ముంచుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో దిగాలు చెందుతోన్న పసుపు రైతులపై 10టీవీ ప్రత్యేక కథనం..!
దుంపకుళ్లు తెగులు సోకడంతో పడిపోయిన దిగుబడి
పసుపు సాగుకు నిజామాబాద్‌ జిల్లా పెట్టింది పేరు. తెలంగాణలోనే పసుపు అత్యధికంగా ఈ జిల్లాలోనే సాగవుతోంది. ఈ ఏడాది జిల్లాలో 29,400 ఎకరాల్లో పసుపును రైతులు సాగు చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈ ఏడాది పసుపు దిగుబడి తగ్గింది. ఈసారి కురిసిన అధిక వర్షాలతో పసుపుకు దుంపకుళ్లు తెగులు సోకాయి. దీని ప్రభావం దిగుబడిపై తీవ్రంగా పడింది. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చినెలలో పసుపు తవ్వే రైతులు.. దుంపకుళ్లు తెగులు సోకిన కారణంగా ఈసారి జనవరిలోనే తవ్వారు. దీంతో ఎప్పుడూ ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పసుపు.. ఈసారి 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు.
పసుపుకు మార్కెట్‌లో లభించని మద్దతు ధర
ఆరుగాలం శ్రమించి... పసుపుపంటను సాగుచేసి తీరా ఆ పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే అక్కడ మద్దతు ధర లభించడం లేదు. క్వింటాళ్లుకు 6వేల రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదు. నాలుగు సంవత్సరాల క్రితం క్వింటాకు 17వేలు పలికిన పసుపు ఇప్పుడు 6వేల ధర పలుకుతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తాము పెట్టిన పెట్టుబడులే రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పసుపు రైతును నిండాముంచుతున్న వ్యాపారాలు
పసుపుతో మార్కెట్‌కు వచ్చిన రైతులను వ్యాపారులు నిండా ముంచుతున్నారు. వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి 6వేల రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు పసుపును అమ్ముకోవాల్సి వస్తోంది.
ధర మాత్రం అన్ని మార్కెట్ల కంటే తక్కువ
నిజామాబాద్‌ జిల్లాలో సాగయ్యే పసుపుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడి పసుపు నాణ్యతలో పేరుగాంచింది. మహారాష్ట్ర, తమిళనాడులో పండిస్తున్న పసుపుకంటే ఇక్కడి పసుపుకే డిమాండ్‌ ఎక్కువ. కానీ ధర విషయానికి వస్తే మాత్రం ఇతర మార్కెట్ల కంటే తక్కువకే కొనుగోలు చేస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతుల డిమాండ్‌
మార్కెట్‌ మాయాజాలం నుంచి తమను గట్టెక్కించడానికి ప్రభుత్వం తక్షణమే పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు.. పసుపు వ్యాపారుల నిలువు దోపిడీకి చెక్‌ పెట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

 

నేవి విన్యాసాలు అద్భుతం : సీఎం చంద్రబాబు

కృష్ణా : విజయవాడలో నౌకాదళ విన్యాసాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. నేవి విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. దేశభక్తి పెంచేలా నేవీ షో సాగిందన్నారు. విజ్ఞానం,వినోదం, సాహసంతో కూడుకున్న విన్యాసాలని అభివర్ణించారు.

18:43 - February 4, 2017

విజయవాడ : ఇన్నాళ్లకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నూతన శోభను సంతరించుకోబోతోంది. అభివృద్ధితోపాటు పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు స్టేడియం వేదిక కాబోతోంది. ఇందుకోసం శరవేగంగా నిధులు సమకూర్చి... సకల సౌకర్యాలతో అంతర్జాతీయ స్టేడియంగా మలిచేందుకు ఏర్పాట్లు వేగవంతం కానున్నాయి.
అంతర్జాతీయ స్టేడియంగా రూపాంతరం
విజయవాడ బందరులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతర్జాతీయ స్టేడియంగా రూపాంతరం చెందబోతోంది. 50 కోట్ల వ్యయంతో ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. నిధుల విడుదలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతగా 11 కోట్లు, రెండో విడతలో 39 కోట్ల నిధులు మంజూరు చేయనున్నారు. స్పోర్ట్స్ ఇన్ చార్జ్ శ్రీధర్ ఆధ్వర్యంలో గోల్ఫ్ డిజైన్ అండ్ టర్ఫ్ కేర్ సంస్థ సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులు స్టేడియాన్ని నిశితంగా పరిశీలించారు.
తొలివిడతలో స్టేడియం అభివృద్ధి పనులు
తొలివిడతలో స్టేడియం అభివృద్ధి పనులను చేపడతారు. గ్యాలరీ రూఫ్, 137 మీటర్ల విస్తీర్ణంలో పిచ్, ఫ్లడ్ లైట్ల ఏర్పాటుకు 11 కోట్లు కేటాయించారు. 2017 మార్చి 10వ తేదీ నాటికి స్టేడియం పనులను పూర్తి చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి మూడో వారంలో సినీ తారలతో సెలబ్రిటీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ నిర్వహణకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఐజీఎంసీ స్టేడియం స్వరూపం సమూలంగా మారిపోనుంది. రాజధాని అవసరాల తగ్గట్టు ఆధునీకరిస్తారు. రెండో విడతలో మంజూరయ్యే 39 కోట్లతో స్టేడియం ముందుభాగంలో ప్రస్తుతం ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ స్థానంలో కొత్తగా ఐదంతస్తుల భవన సముదాయం నిర్మించనున్నారు. క్లబ్, అత్యాధునిక హంగులతో ఈ కొత్త భవనాన్ని నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొదటి విడత పనులు పూర్తయ్యలోపు రెండో విడత ప్రణాళికకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సిద్ధం చేయాల్సిందిగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్ కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
త్వరితగతిన క్రికెట్ మ్యాచ్ లు
త్వరితగతిన అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ మ్యాచ్ లు జరపాలని, స్టేడియం ప్రాంగణంతోపాటు, స్టేడియం లోపల, బయట నూతన సొబగులు తీసుకురావాలని ఉన్నతస్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియం, విజయవాడ బందరులోని ఇందిరాగాంధీ స్టేడియంలో అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ లు జరిపితే ప్రజలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడా సంఘాలకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గతంలో ఇందిరా గాంధీ స్టేడియాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వీలైనంత త్వరగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరిగేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

 

18:38 - February 4, 2017

జగిత్యాల : ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. ఆపదలో ఆస్పత్రికి వచ్చిన వారిని వైద్యులు చిన్నచూపు చూస్తున్నారు. రక్షించండి మహాప్రభూ అని వేడుకుంటుంటే.. ప్రాణాలు హరించివేస్తున్నారు. జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది.
రోగికి సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం
ఇదిగో చూశారా. రోగికి సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం చేస్తున్నాడు. వైద్యులు లేక సెక్యూరిటీ గార్డ్‌ అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేస్తున్నాడునుకుంటే పొరపాటు. ఇదిగో పక్కనే డాక్టరమ్మ ఉంది. ఈమె తీరు చూస్తేంటే.. సీనియర్‌ డాక్టర్‌ వైద్యం చేస్తుంటే జూనియర్‌ డాక్టర్‌ పరిశీలిస్తున్నట్లుగా ఉంది.
జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఘటన
ఈ ఘటన జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకువస్తే సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం చేశాడు. పక్కనే డాక్టర్‌ ఉన్నా కూడా కనీసం ఆమె రోగిని తాకకపోవడం విడ్డూరం.
డాక్టర్‌, ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్‌
గతంలో కూడా సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఆకస్మిక తనిఖీలు చేసి.. ఒక డాక్టర్‌తో పాటు.. ఇద్దరు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. అయినా సిబ్బంది తీరులో మార్పు రాలేదు. ఎలాంటి అర్హతలు లేని సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం చేయడంతో.. రోగికి ఏదైనా ఎవరు బాధ్యత వహిస్తారు పలువురు ప్రశ్నిస్తున్నారు.
గర్బిణికి వైద్యం చేసిన నర్సు
రెండు రోజుల క్రితమే గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లికి చెందిన గర్భిణికి నర్సు వైద్యం చేయడంతో.. పాప మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి ఘటనలో చోటు చేసుకుంటున్నా.. ఇప్పటికీ వైద్యుల తీరులో మాత్రం ఇంకా మార్పు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.  
ప్రజల ప్రాణాలంటే చులకన
ప్రజలందరికీ ఆరోగ్యం అందిస్తాం.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించుకునే విధంగా తీర్చుదిద్దుతామని ప్రభుత్వం ఒక పక్క చెబుతుండగా.. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యులు కనీసం ట్రీట్‌మెంట్‌ చేయించకుండా.. సెక్యూరిటీ గార్డ్‌ చేత వైద్యం చేయిస్తున్నారంటే.. ప్రజల ప్రాణాలంటే వారికి ఎంత చులకనో అర్ధమవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

 

18:30 - February 4, 2017

నల్గొండ : భారీ జలాశయం మధ్యలో కాకతీయలు కాలంనాటి పురాతన చారిత్రక దేవాలయం అది. శాతవాహనులు, పశ్చిమ చాళుక్యులు, పల్నాటి రాజుల ఆనవాళ్లకు నిలువెత్తు నిదర్శనం. ప్రాజెక్టు నిర్మాణంతో వందల ఏళ్లనాటి చారిత్రక అవశేషాలు నీటిలో మునిగిపోగా.. కొన్నింటిని మాత్రమే మ్యూజియంలో భద్రపర్చారు. వీటన్నింటికి సజీవ సాక్షంగా జలాశయం మధ్యలో 'ఐలాండ్' మాదిరిగా దర్శనమిస్తుంది 'ఏలేశ్వరం గుట్ట'.
సాగర్ జలాశయం మధ్యలో 'ఏలేశ్వరం గుట్ట'
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం మధ్యలో కొలువైన ప్రాంతమే 'ఏలేశ్వరం గుట్ట'. ఇక్కడికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ మార్గంలో వెళ్లాలి. లేదంటే చందంపేట మీదుగా కృష్ణా బ్యాక్ వాటర్ నుంచి ఏలేశ్వరం వెళ్లొచ్చు. ఇది పూర్తిగా కొండలు, గుట్టలు దాటుకొని దాదాపు 15 కిలోమీటర్లకు పడవలపై సాహసోపేతంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ ప్రయాణం మధురానుభూతిని మిగుల్చుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు.
ఘన చరిత్రకు నిలువెత్తు సజీవసాక్ష్యం 'ఏలేశ్వరం'
ఘన చరిత్రకు నిలువెత్తు సజీవసాక్ష్యం 'ఏలేశ్వరం'. అత్యంత అరుదైన 'కాత్యాయనీ సహిత మల్లిఖార్జునస్వామి' ఆలయాలు కొలువైన కొండ ప్రాంతం ఇది. చారిత్రక పూర్వయుగం నుంచి శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండీలు, పశ్చిమ చాళుక్యులు, కాకతీయులు, పల్నాటి బ్రహ్మనాయుడు వరకు అలనాటి రాజ్యాల రాచరికపు ఆనవాళ్లకు నిలువెత్తు నిదర్శనం. సముద్రాన్ని తలపించే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ జలాశయం మధ్యలో కొండల్లో ఏకైక అతిపెద్ద గుట్టగా, ద్వీపంలా దర్శనమిస్తోంది.
ప్రభుత్వం టూరిజం స్పాట్‌గా గుర్తించాలని డిమాండ్‌
శాతవాహనుల కాలంలో నాగార్జునుడి బౌద్ధ విద్యాలయంతో శ్రీపర్వతంగా ఇక్ష్వాకుల పరిపాలనలో 'విజయపురి'గా ఎన్నో చారిత్రక ఆనవాళ్లను తన సన్నిధిలోనే నీటిలో నిక్షిప్తం చేసుకొంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న 'ఏలేశ్వర మల్లన్నస్వామి' ఇన్నాళ్లుగా పాలకులకు కనిపించడకపోవడం గమనార్హం. తెలంగాణ ఏర్పడిన తర్వాత అయిన ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా గుర్తిస్తారని స్థానికులు భావించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
గుట్టను సందర్శించిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్
ఏలేశ్వరం గుట్ట అభివృద్ధి కోసం తనవంతు ప్రయత్నం ప్రారంభించారు స్థానిక శాసనసభ్యులు రవీంద్రకుమార్. స్థానిక నాయకులతో పాటు.. మీడియా ప్రతినిధులతో కలిసి సుమారు ఒకరోజంతా గుట్టను సందర్శించారు ఎమ్మెల్యే. ఏలేశ్వరం గుట్టపై కొలువైన మల్లిఖార్జునుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతానికి రోప్ వేతో పాటు లాంచీల ఏర్పాటుకు కృషి చేస్తానని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఏలేశ్వరంపై గత ప్రభుత్వాలు అంతగా చొరవ చూపలేదనే చెప్పాలి. కనీసం తెలంగాణ ప్రభుత్వమైనా చొరవ చూపాలంటూ భక్తులు కోరుతున్నారు.

 

18:18 - February 4, 2017

కృష్ణా : విజయవాడలో ట్రాఫిక్‌ కష్టాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని చేధించేందుకు వాహనదారులు నానా పాట్లు పడుతున్నారు. రాజధాని ప్రాంతంగా మారిన తర్వాత అంతకంతకు ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతోంది. ట్రాఫిక్‌ సమస్యతో నగర రహదారులపై రోడ్డు ప్రమాదాలు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.
విజయవాడలో పెరుగుతోన్న ట్రాఫిక్‌ రద్దీ
బెజవాడలో వాహనాల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. రాజధాని ప్రాంతం కావడంతో వీఐపీల తాకిడి.. పోలీస్ సిబ్బంది కొరత వెరసి వాహనదారులకు శాపంగా మారుతోంది. నగరంలో సుమారు 15 లక్షల జనాభా ఉండగా.. అదే స్థాయిలో వాహనాలున్నాయి. వీటికి తోడు ప్రతిరోజు లక్షలాది వాహనాలు నగరానికి వచ్చిపోతూ ఉంటాయి. రోజూ నగరంలో 2 లక్షల ద్విచక్ర వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. అయితే.. రహదారులు మాత్రం పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా పెరగడం లేదు.  రాజధానిగా మారిన తరువాత వాహనాల సంఖ్య మరింత  పెరగడం వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. విజయవాడలో ప్రతి సంవత్సరం 400లకు పైగా రోడ్డు ప్రమాదాలు నమోదు కావడం కలవరం రేపుతోంది.
రోడ్లు విస్తరించకపోవడంతో పెరిగిన ట్రాఫిక్‌ సమస్య
నగరంలోని 5వ నెంబరు రహదారి, మ్యూజియం రోడ్డు, నక్కల రోడ్డు, డోర్నకల్ రోడ్డు, పాతబస్తీ రోడ్డులు విస్తరించకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య మరింత జఠిలమైంది. నాలుగు రోడ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్‌ శిథిలావస్థకు చేరినా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సిగ్నలింగ్ వ్యవస్ధ లోపించటంతో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.
ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలి..
పోలీస్‌ అధికారులకు చలాన్ల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంపై లేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ లేకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని.. ఇందుకు సిబ్బంది కొరత కారణమంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు, అధికారులు స్పందించి బెజవాడలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించి.. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.

 

18:12 - February 4, 2017

హైదరాబాద్ : నీళ్ల కోసం ఆడవాళ్లే కాదు... ప్రభుత్వాలు కూడా గొడవలు పడుతున్నాయి. మాకే ఇవ్వాలంటూ ఎవరికీ వారు పోటీ పడుతున్నారు. లేఖలు మీద లేఖలు రాసి నీళ్లు దక్కించుకోవాలని చూస్తున్నాయి. అదనపు నీటి కేటాయింపులు కోసం పట్టుబడుతున్నాయి.
కృష్ణా నీళ్లు కోసం పోటీ పడుతున్న ఏపీ, తెలంగాణ
కృష్ణా బేసిన్‌లో ఇప్పటి వరకు కేటాయించిన నీళ్లు పోగా మిగిలినవన్నీ తమవేనంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుబడుతున్నాయి. దీనికోసం రెండు ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ఏపీ కేటాయింపునకు మించి వాడుకుందని తెలంగాణ, ఇప్పటికే తెలంగాణ వాటా పూర్తయిందని ఏపీ కృష్ణా బోర్డుకు లేఖలు కూడా పంపించాయి.
నీటిని ఏపీ అదనంగా వాడుకుందన్న తెలంగాణ
రబీ, తాగునీటి అవసరాలకు 25 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్‌ మూడు రోజుల కిందట కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. అలాగే కేటాయించిన దానికంటే ఏపీ 25 టీఎంసీలు నీటిని ఎక్కువగా వాడుకుందని...లేఖలో పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే కేటాయించి వినియోగించుకోని నీటిని ఇవ్వడంతోపాటు అదనంగా 16 టీఎంసీలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీర్‌ కూడా బోర్డుకు లేఖ రాశారు.
అదనంగా నీళ్లు కేటాయించాలని ఏపీ లేఖ
గుంటూరు, ప్రకాశం జిల్లాలో పంటలను కాపాడటానికి మూడో తడి నీటిని ఇవ్వాల్సి ఉందని, దీనికోసం కుడి కాలువకు 12 టీఎంసీలు కేటాయించాలని ఏపీ ఓ లేఖలో... సాగర్ ఎడమ కాలువ కింద ఆంధ్రప్రదేశ్‌లోని రెండు, మూడో జోన్‌ ఆయకట్టు కోసం 1.76 టీఎంసీలు మాత్రమే ఇచ్చారని మిగిలిన నీటితో పాటు అదనంగా నాలుగు టీఎంసీలు విడుదల చేయాలని మరో లేఖలో పేర్కొంది. తెలంగాణ ఇప్పటికే 4.34 టీఎంసీలు అదనంగా వాడుకుందని.. ఆ రాష్ట్రానికి ఇంకేమీ విడుదల చేయాల్సిన అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు సమస్యను పరిష్కరించడానికి 8వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

 

దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దాసరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

16:35 - February 4, 2017

కడప : చంద్రబాబుకు ప్రాజెక్టులపై కంటే.. కాంట్రాక్టుల మీద వచ్చే కమీషన్ల మీదే ఆసక్తి ఎక్కువని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మండిపడ్డారు. పైడిపాలెం రిజర్వాయర్‌ను వైఎస్‌ జగన్‌ పరిశీలించారు. పైడిపాలెం రిజర్వాయర్‌లో 80 శాతం పనులు వైఎస్‌ఆర్‌ హయాంలో పూర్తి చేస్తే, అంతా తానే చేశానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. 300 కోట్లు ఖర్చు పెడితే ఈ పాటికి రాయలసీమ సస్యశ్యామలమయ్యేదని జగన్‌ అన్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు పనులపై విచారణ జరిపేందుకు కానిస్టేబుల్‌ చాలు అని జగన్‌ ఎద్దేవా చేశారు. 

 

16:34 - February 4, 2017

చిత్తూరు : శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. యాగశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. యాగశాల పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన అందరిని కలచివేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

శ్రీకాళహస్తి ఆలయ యాగశాలలో మంటలు

చిత్తూరు : శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. యాగశాలలో మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

16:24 - February 4, 2017

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టంలో పొందుపర్చాల్సిన అంశాలపై ప్రజాప్రతినిధుల సమావేశంలో చర్చించామని మంత్రి కడియం తెలిపారు. ఈ నెల 10న మరోసారి సమావేశం కావాలంటూ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ రెండు వర్గాలకు కేటాయించిన డబ్బుని ఏడాది చివర్లోగా ఖర్చుపెట్టాలని... గ్రీన్‌ ఛానల్‌ ద్వారా నిధులు విడుదల చేయాలన్న రూల్‌ను చట్టంలో పెట్టాలని భావిస్తున్నామని చెప్పారు.. 

 

16:11 - February 4, 2017


హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే అభివృద్ధికి కేంద్రం బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని రైల్వే అధికారులు తెలిపారు. బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు. రైల్వే బడ్జెట్‌ను తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్‌లో విలీనం చేసింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలో నూతన రైల్వే లైన్ల సర్వేకు, అభివృద్ధి పనులకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన నిధుల వివరాలను అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులకు అధికంగా నిధులు కేటాయించారు. 
ఏపీ, తెలంగాణలో 4 రైల్వే క్రాసింగ్‌లకు రూ.19 కోట్లు 
ఏపీ, తెలంగాణలో 4 రైల్వే క్రాసింగ్‌లకు రూ.19 కోట్లు కేటాయించారు. అలాగే బొల్లారం, ముకుంద్‌ మధ్య 235 కి.మీ రైల్వేలైన్‌ డబ్లింగ్‌ సర్వే.. కాజీపేట-బలార్షా , కాజీపేట-విజయవాడ మధ్య నాలుగో లైన్‌ సర్వేలు చేపట్టనున్నారు. విజయవాడ-అమరావతి-గుంటూరు మధ్య 106 కి.మీ లైన్‌కు రూ.2,680 కోట్లు.. రాజమహేంద్రవరం యార్డు అభివృద్ధికి రూ.27.2 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. 
రాయనపాడులో షెడ్‌ నిర్మాణానికి రూ.8.7 కోట్లు 
రాయనపాడులో షెడ్‌ నిర్మాణానికి రూ.8.7 కోట్లు..  తిరుపతిలో విశ్రాంతి గది నిర్మాణానికి రూ.7కోట్లు.. తెలంగాణలోని మౌలాలి వద్ద ఈఎంయూ కార్‌షెడ్‌కు రూ.5.86 కోట్లు కేటాయించారు. ఏపీలోని గూడూరు వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జికి రూ.2.7కోట్లు.. విజయవాడ-గుడివాడ లైన్‌ మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించేందుకు రూ.130కోట్లు.. గుంటూరు- తెనాలి రైల్వేలైన్‌ డబ్లింగ్‌కు రూ.36 కోట్లు.. కాజీపేట-విజయవాడ మూడో లైన్‌కు రూ.100 కోట్లు.. విజయవాడ-గూడూరు మధ్య మూడో లైన్‌కు రూ.100 కోట్లు బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది.
హిందూపురం-చిత్రదుర్గ మధ్య నూతన రైల్వే లైన్‌ సర్వే.. 
అలాగే  హిందూపురం చిత్రదుర్గ మధ్య నూతన రైల్వే లైన్‌ సర్వే.. కొండపల్లి-కిరండోల్‌ మధ్య నూతన రైల్వేలైన్‌ సర్వేకు అనుమతి ఇచ్చింది. మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వేలైన్‌ ఏర్పాటుకు సర్వే చేపట్టనుంది. విజయవాడ-నిడదవోలు రైల్వేలైన్‌ డబ్లింగ్‌కు రూ.122 కోట్లు..  సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌కు రూ.50కోట్లు.. గుత్తి-ధర్మవరం రైల్వేలైన్‌ డబ్లింగ్‌కు రూ.75కోట్లు కేటాయించింది. పెద్దపల్లి-కరీంనగర్‌-నిజామాబాద్‌ నూతన రైల్వే లైన్‌కు రూ.25కోట్లు.. జగ్గయ్యపేట-మేళ్లచెరువు-జాన్‌పహాడ్‌ మార్గానికి రూ.79 కోట్లు.. మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ రైల్వేలైన్‌కు రూ.300 కోట్లు ఇచ్చింది. 
తిరుచానూరు రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి రూ.6కోట్లు
తిరుచానూరు రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి రూ.6కోట్లు.. అక్కన్నపేట మెదక్‌ రైల్వే లైన్‌కు రూ.196కోట్లు..  విజయవాడ-కాజీపేట, రేణిగుంట, గుత్తి బైపాస్‌లకు రూ.135 కోట్లు.. కాకినాడ-పిఠాపురం రైల్వే మార్గానికి రూ.150కోట్లు.. ఓబులాపురం-కృష్ణపట్నం రైల్వేలైన్‌కు రూ.100కోట్లు కేటాయించారు. మరోవైపు గుంతకల్‌-కల్లూరు రైల్వేలైన్‌ డబ్లింగ్‌కు రూ.52కోట్లు.. మంచిర్యాల-పెద్దపల్లి మూడో లైన్‌కు రూ.100 కోట్లు.. యాదాద్రి-ఘట్‌కేసర్‌ ఎంఎంటీఎస్‌ రైలు విస్తరణకు అదనంగా రూ.16కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. బడ్జెట్‌లో దక్షిణమధ్య రైల్వే అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన నిధుల పట్ల రైల్వే అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

15:50 - February 4, 2017

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారిమళ్లాయని..ఆ నిధుల్ని తిరిగి సబ్‌ప్లాన్‌లో చేర్చాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల అమలుపై ఇవాళ జరిగిన సబ్‌ కమిటీ సమావేశానికి హాజరైన రాజయ్య..దారిమళ్లిన నిధులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంతవరకు సమావేశాల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రూ. 25వేల కోట్ల నిధులు దారిమళ్లాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.17వేల కోట్ల నిధుల్ని దారి మళ్లించిందన్నారు. నిధులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంతవరకు సమావేశాలను బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.

 

15:46 - February 4, 2017

కడప : జిల్లాలోని పులివెందులలో వైఎస్సార్‌సిపి అధ్యక్షడు వైఎస్‌ జగన్‌ పర్యటించారు. నెలరోజుల క్రితం ఆర్టీసీ సంస్థ నిర్లక్ష్యం కారణంగా 150 గొర్రెలు, ఇద్దరు వ్యక్తులు చనిపోయిన యాదవ కుటుంబాలను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. చంద్రన్న భీమా పథకం కింద ఒక్కో గొర్రెకు 7వేలు రూపాయలు ఇవ్వడంతో పాటు చనిపోయిన వ్యక్తులకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ చంద్రబాబు ఇవ్వకపోతే తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపు నష్టపరిహారాన్ని ఇస్తామన్నారు జగన్‌. అలాగే పులివెందులలో రోడ్డుపక్కన ఉన్న సంపులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు చనిపోయిన బాధిత కుటుంబాలను వైఎస్‌ జగన్ కలిసి పరామర్శించారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు చంద్రన్న భీమా పథకం కింద 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని జగన్ డిమాండ్ చేశారు. 

 

15:39 - February 4, 2017

పనాజీ : గోవాలో రికార్డు స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదు కాగా.. పంజాబ్‌లో మందకొడిగా సాగుతుంది. ఇప్పటి వరకు గోవాలో అత్యధికంగా 53 శాతం నమోదైంది. పంజాబ్‌లో 35 శాతం పోలింగ్‌ నమోదు అయింది. ఇరు రాష్ట్రాల్లో ఆప్,  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పంజాబ్‌లోని 117 స్థానాలు, గోవాలో 40 స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతుంది.  ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అలాగే గోవాలో 1,642 పోలింగ్ కేంద్రాలు, పంజాబ్‌లో 22,615 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా మార్చి 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు పంజాబ్‌, గోవా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి మోదీ విజ్ఞప్తి చేశారు. కాగా 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో 79 శాతం, గోవాలో 82.2 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సారి కూడా అంతే స్థాయిలో పోలింగ్ నమోదు కావచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

 

ముస్లింలకు రిజర్వేన్లను వ్యతిరేకిస్తూ కె.లక్ష్మణ్ సంతకాల సేకరణ

సంగారెడ్డి : ముస్లింలకు రిజర్వేన్లను వ్యతిరేకిస్తూ సంగారెడ్డిలో కె.లక్ష్మణ్ సంతకాల సేకరణ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ జరుపుతామని చెప్పారు. అంబేద్కర్ ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్..ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెస్తున్నారని విమర్శించారు. 

ఔట్ సోర్సింగ్ నర్సుల ఆందోళనపై మంత్రి లక్ష్మారెడ్డి స్పందన

హైదరాబాద్ : ఔట్ సోర్సింగ్ నర్సుల ఆందోళనపై మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. సాయంత్రం 4 గంటలకు నర్సులను చర్చలకు ఆహ్వానించారు.

 

15:05 - February 4, 2017

ధర్మవరంలో కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం మోసం

తూ.గో : ధర్మవరంలో కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం మోసం చేసింది. కాకినాడ దేవా బ్యాంక్ లో రూ.27 కోట్లు లోన్ తీసుకుని తిరిగి చెల్లించకుండా యాజమాన్యం తప్పించుకుంటోంది.

 

గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్

చంఢీఘర్ : గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పంజాబ్ లో మ.ఒంటి గంట వరకు 35 శాతం పోలింగ్ అయింది. గోవాలో మ. ఒంటి గంట వరకు 53 శాతం పొలింగ్ అయింది.

 

చమురు ఘటనపై విచారణ -గడ్కరి..

న్యూఢిల్లీ: చెన్నై తీరానికి కొట్టుకువ‌స్తున్న చ‌మురు తెట్టు ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తెలిపారు. బంగాళాఖాతంలో రెండు ర‌వాణా నౌక‌లు ఢీకొనడంతో చమురు తీర ప్రాంతాల‌కు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.

 

13:34 - February 4, 2017

ఖమ్మం : భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో కొనసాగిన పాదయాత్ర ఖమ్మం జిల్లాకు చేరుకుంది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో ఈ పాదయాత్ర జరుగుతోంది. 111వ రోజు సత్తుపల్లి, గంగారం మీదుగా ప్రారంభమైన పాదయాత్ర సత్తుపల్లి, కిష్టారం, లంకపల్లి, మండాలపాడు, వీఎం బంజరలో పాదయాత్ర జరగనుంది. పోడు భూముల్లో గిరిజనులు వ్యవసాయం చేయకుండా ప్రభుత్వం అడ్డుకొంటోందని పాదయాత్ర బృంద సభ్యురాలు రమ పేర్కొన్నారు. ఆమె టెన్ టివితో మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:30 - February 4, 2017

విజయవాడ : కల్తీ దొంగలు పట్టుబడుతూనే ఉన్నారు. ఆహారపదార్థాలను కల్తీ చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నా వీరి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా విజయవాడలో కల్తీ నెయ్యి, నూనె తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వనస్పతి, పామాయిల్ తో నెయ్యి తయారీ చేస్తున్నట్లు, స్వచ్చమ, నందిని, వాసవి, బాలాజీ పేరిట నూనె తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. అంతేగాకుండా తవుడు ఆయిల్ తో దీపపు నూనెలు కల్తీ చేస్తున్నారని పోలీసులు నిర్ధారించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

13:25 - February 4, 2017

వెబ్ సైట్లు..యాప్ లపై కేంద్రం కొరఢా..

ఢిల్లీ : 50 వెబ్ సైట్లు, యాప్ లపై కేంద్రం కొరడా ఝులిపించింది. జనాల వ్యక్తిగత సమాచారాన్ని 38 వెబ్ సైట్లు చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. 12 యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

13:20 - February 4, 2017

ఢిల్లీ : పంజాబ్‌, గోవాలలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గోవాలో రికార్డు స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదు అవుతుండగా పంజాబ్‌లో మందకొడిగా పోలింగ్ సాగుతుంది. ఇప్పటి వరకు గోవాలో అత్యధికంగా 34 శాతం నమోదైంది. పంజాబ్‌లో 14 శాతం పోలింగ్‌ నమోదు అయింది. ఇరు రాష్ట్రాల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పనాజిలో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ గోవాలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు అవుతుందని..విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్‌లోని 117 స్థానాలు, గోవాలో 40 స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతుంది. ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అలాగే గోవాలో 1,642 పోలింగ్ కేంద్రాలు, పంజాబ్‌లో 22,615 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా మార్చి 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు పంజాబ్‌, గోవా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి మోదీ విజ్ఞప్తి చేశారు. కాగా 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో 79 శాతం, గోవాలో 82.2 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సారి కూడా అంతే స్థాయిలో పోలింగ్ నమోదు కావచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

 • పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు గాను 11 వందల 45 మంది పోటీ పడుతున్నారు.
 • కోటి 98 లక్షల 79 వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
 • ఇందుకోసం ఈసీ 22 వేల 615 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
 • అసెంబ్లీ ఎన్నికలతో పాటు అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది.
 • గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. 251 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
 • గోవాలో బిజెపి అధికారంలో ఉంది. బిజెపికి ఆప్‌, కాంగ్రెస్‌ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
 • నోట్ల రద్దు నిర్ణయం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు అధికారంలో ఉన్న మోది ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారాయి.
13:13 - February 4, 2017
13:12 - February 4, 2017
13:09 - February 4, 2017

హైదరాబాద్ : కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్ర అధికారులు లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద వచ్చే నిధుల్లో రాష్ట్ర వాటాపై అధికారులు బడ్జెట్‌ పేజీలు తిరగేస్తున్నారు. సెంట్రల్‌ నుంచి వచ్చే నిధులను ఆసరాగా చేసుకుని.. రాష్ట్ర బడ్జెట్‌ను కూర్పు చేయాలన్న సీఎం ఆదేశంతో శాఖల వారిగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. భారీ పథకాల నిర్మాణం, నోట్ల రద్దుతో తెలంగాణ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడింది. బడ్జెట్‌లో తెలంగాణాకు నిధులు కేటాయించకపోవడంతో నిరాశే మిగిలిందని ముఖ్యమంత్రే మంత్రివర్గ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఆర్థిక స్థిరత్వం ఏర్పడ్డాకా పథకాలను స్పీడప్ చేద్దామని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే వివిధ శాఖల గ్రాంట్‌ కింద రావాల్సిన వాటాలు ఉంటాయి కాబట్టి వాటి వివరాలు అందిన వెంటనే శాఖాపరమైన బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

సమీక్షా సమావేశాలు..
సీఎం ఆదేశాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ శాఖకు ఎంత ప్రయోజనం కలిగిందో లెక్కలు చూసే పనిలో పడ్డారు. వివిధ పథకాల ద్వారా వచ్చే వాటాల వివరాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రహదారుల, భవనాల, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయా శాఖల అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్‌ను పరిశీలించి అందులో రాష్ట్రాలకు పథకాల కింద కేటాయించిన మొత్తాలను సాధించే విధంగా కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. కేటాయింపుల్లో సింహభాగాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే మంత్రి జోగు రామన్న అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ కేంద్ర పథకాలకు కేటాయించిన నిధులపై సమీక్షించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో బడ్జెట్‌ కేటాయింపుల గురించి చర్చించారు. వీలైనంత వరకు పెద్దెత్తున నిధులును సాధించేందుకు పక్కాగా కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్ల కోసం బడ్జెట్‌ కేటాయింపులను అధికారులకు మంత్రికి వివరించారు. ఈ మేరకు తెలంగాణాకు రూ.767 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందని, దానికి తగ్గట్టు ప్రతిపాదనలు రూపొందించినట్టు అధికారులు ఆయన తెలిపారు. ఇవే కాకుండా అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కోరేందుకు మంత్రులు సిద్దమవుతున్నారు. ఈ మేరకు నివేదికలు కూడా అందించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అదనపు నిధులు పొందాలని చూస్తున్నారు.

13:06 - February 4, 2017

తూర్పుగోదావరి : కాకినాడలో సినీతార కాజల్ అగర్వాల్ సందడి చేసింది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా..కాకినాడ స్థానిక భానుగుడి సెంటర్ JNTU వరకూ..సూర్యా గ్లోబల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కె రన్ లో ఆమె పాల్గొంది. ఏపి డిప్యూటి సీఎం చినరాజప్ప సహా..పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రోజువారి జీవన శైలి ఆహారపు అలవాట్లను నియంత్రించడం ద్వారా..క్యాన్సర్ బారినపడకుండా ఉండొచ్చని సినీనటి కాజల్ అన్నారు. హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ..క్యాన్సర్ వ్యాధికి నివారణ ఒక్కటే..మార్గమని తొలిదశలో వ్యాధిని గుర్తించడం ద్వారా చికిత్స అందించవచ్చన్నారు.

టి.టిడిపి సీనియర్ నేతల భేటీ..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టి.టిడిపి సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ప్రభుత్వం విఫమైన అంశాలు, భవిష్యత్ కార్యాయచరణపై చర్చిస్తున్నార.

నర్సుల సమ్మెపై మంత్రి లక్ష్మారెడ్డి స్పందన..

హైదరాబాద్ : ఔట్ సోరింగ్ నర్సుల సమ్మెపై మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. సాయంత్రం 4గంటలకు చర్చలకు ఆహ్వానించారు. సమస్యలు పరిష్కరించాలని వారం రోజులుగా నర్సులు సమ్మె చేపడుతున్న సంగతి తెలిసిందే.

సత్తుపల్లికి చేరుకున్న పాదయాత్ర..

ఖమ్మం : సత్తుపల్లి సీపీఎం మహాజన పాదయాత్ర చేపట్టింది. టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సంఘీభావం తెలిపారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని, ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుల రద్దు వల్ల వేల కోట్లు వృథా చేస్తున్నారని విమర్శించారు.

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్..

హైదరాబాద్ : వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 3 జీ మొబైల్ ఇంటర్నెట్ ఛార్జీలను నాలుగు రెట్లు తగ్గించింది. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 36 కే 1జీబీ, రూ. 291 ప్లాన్ కింద 8జీబీ డేటాను అందించనుంది.

బాబుకు నారాయణ లేఖ..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. యూనివర్సిటీ కోసం విజయనగరం జిల్లా కొత్తవలస (మం) రెల్లి మధుర అప్పన్నదొరపాలెంలో భూ సేకరణ సరికాదన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా భూ సేకరణ అన్యాయమని, పంటలు పండిస్తున్న గిరిజన కుటుంబాలు వీధిన పడుతాయని, గిరిజనలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలని సూచించారు.

బీజేపీ కా సఫాయి హో జాయేగా - లాలూ..

బీహార్ : గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ పరాజయం చెందడం ఖాయమని, ఓటింగ్ సరళిని బట్టి చూస్తే అర్థమౌతోందని లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు.

బెంగళూరు ఏటీఎం నిందితుడి అరెస్టు..

చిత్తూరు : మూడేళ్ల కింద బెంగళూరులోని ఓ ఏటీఎం లో యువతిని హత్య చేసిన నిందితుడిని చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు.

12:39 - February 4, 2017

చిత్తూరు : బెంగళూరులో ఓ ఏటీఎంలో ఓ యువతిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన మీకు గుర్తుండే ఉంటుంది కదా.. 2013 సెప్టెంబర్ నెలలో ఈ ఘటన చోటు చేసుకుంది. షట్టర్ వేసి బలవంతంగా డబ్బులు వసూలు చేయాలని అనుకోవడం..యువతి ప్రతిఘటించడంతో కత్తితో మెడ..ముఖంపై దాడి చేసి అత్యంత కిరాతకంగా దాడి చేశాడు. ఈ ఘటన జరిగి మూడేళ్లు అవుతోంది. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపులు చేపట్టారు. కర్నాటక ప్రభుత్వం నిందితుడిపై రూ. 12 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. చిత్తూరు జిల్లాలోని నిమ్మలపల్లి మండల వాసిగా తెలుస్తోంది.

మదనపల్లిలో అరెస్టు..
తాజాగా ఇతను చిత్తూరు జిల్లాకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు మదనపల్లిలో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. నిందితుడిపై అనేక నేరాలు నమోదైనట్లు సమాచారం. హత్య అనంతరం చిత్తూరు జిల్లాకు వచ్చినట్లు, హత్య అనంతరం అనంతపురంలో డబ్బులు కూడా విత్ డ్రా చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఓ మర్డర్ కేసులో ఐదేళ్ల పాటు కడప సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఇతను పరారయ్యాడు. అనంతరం బెంగళూరులో చేసిన హత్యతో ఇతడు మరోసారి తెరమీదకు వచ్చాడు. మదనపల్లిలో ఓ కేసు ఉన్నట్లు తెలుస్తోంది. కడప, చిత్తూరు జిల్లా పోలీసులు కర్నాటక పోలీసులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆదివారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

12:30 - February 4, 2017

హైదరాబాద్ : సర్వశిక్ష అభియాన్‌ కార్యాలయంలో జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య బహిష్కరించారు. ఈ సమావేశం తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన జరుగుతుంది. అయితే టీఆర్‌ఎస్‌ హాయాంలో పక్కదారి పట్టిన సబ్‌ప్లాన్‌ నిధులు లెక్కతేల్చాలని సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. నిర్ధిష్టమైన ప్రణాళిక, నిధులపై అధికారిక సమాచారాన్ని ఆయన కోరారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల సమావేశాలతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కోసం పోరాడిన మేధావులు, రాజకీయ పార్టీల.. సలహాలు తీసుకోకుండా చట్టంలో మార్పులు చేపట్టోద్దని రాజయ్య అన్నారు.

12:28 - February 4, 2017

కర్ణాటక : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి ఎస్‌ఎం కృష్ణ బిజెపిలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఎస్‌ఎం కృష్ణ త్వరలోనే బిజెపిలో చేరనున్నారని కర్ణాటక బిజెపి చీఫ్‌ యడ్యూరప్ప తెలిపారు. అయితే ఆయన ఎప్పుడు చేరుతారనే తేదీని ఇంకా ఖరారు చేయలేదన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ గతవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ వర్కింట్‌ కమిటీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్‌ దెబ్బతీసిందని కృష్ణ పేర్కొన్నారు. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్‌ఎం కృష్ణ చేరిక తమకు లాభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.

12:27 - February 4, 2017

ఢిల్లీ : పంజాబ్‌, గోవాలలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గోవాలో రికార్డు స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదు అవుతుండగా పంజాబ్‌లో మందకొడిగా పోలింగ్ సాగుతుంది. ఇప్పటి వరకు గోవాలో అత్యధికంగా 34 శాతం నమోదైంది. పంజాబ్‌లో 14 శాతం పోలింగ్‌ నమోదు అయింది. ఇరు రాష్ట్రాల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పనాజిలో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ గోవాలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు అవుతుందని..విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్‌లోని 117 స్థానాలు, గోవాలో 40 స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతుంది. ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అలాగే గోవాలో 1,642 పోలింగ్ కేంద్రాలు, పంజాబ్‌లో 22,615 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా మార్చి 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు పంజాబ్‌, గోవా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి మోదీ విజ్ఞప్తి చేశారు. కాగా 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో 79 శాతం, గోవాలో 82.2 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సారి కూడా అంతే స్థాయిలో పోలింగ్ నమోదు కావచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

సమావేశాన్ని బహిష్కరించిన సున్నం రాజయ్య..

హైదరాబాద్ : ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధుల సమావేశాన్ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య బహిష్కరించారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల సమావేశం పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. టీఆర్ఎస్ హయంలో దారిమళ్లిన సబ్ ప్లాన్ నిధులు లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. మేధావులు, రాజకీయపార్టీ ల సలహాలు తీసుకోకుండా చట్టంలో మార్పులు చేపట్టవద్దన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళఙక, నిధులపై అధికారిక సమాచారం ఇస్తేనే సమావేశానికి హాజరౌతానని పేర్కొన్నారు.

 

12:12 - February 4, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. జయలలిత మృతి అనంతరం పన్నీర్ సెల్వం సీఎం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పీఠం కదులుతున్నట్లు తెలుస్తోంది. జయ కీలక స్నేహితురాలు శశికళ ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగిన వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీని గుప్పిట్లో పెట్టుకున్న శశికళ సీఎం పదవిని అధిరోహించడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీకి సంబంధించిన నేతలు..ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలతో భేటీ జరిపారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే శాసనసభా పక్ష సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. శశికళను సీఎంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ తో పాటు మరో ఇద్దరు సీఎంవో కార్యదర్శులు రాజీనామా చేశారు. శశికళ అంటే వీరికి గిట్టదని, అందులో భాగంగానే వీరు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వీరి రాజీనామాను సీఎం పన్నీర్ సెల్వం ఆమోదించారు. మరి శశికళ సీఎంగా అవతరిస్తారా ? లేదా ? అనేది రేపటితో తేలిపోనుంది.

ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధుల సమావేశం..

హైదరాబాద్ : సర్వశిక్ష అభిమాన్ కార్యాలయంలో కడియం అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధుల సమావేశం జరుగుతోంది. సమావేశానికి కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.

కడపలో జగన్ పర్యటన..

కడప : జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన కొనసాగుతోంది. పులివెందుల నియోజకవర్గంలో ప్రమాదాల్లో చనిపోయిన వివిధ బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు చంద్రన్న బీమా కింద రూ. 5 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పబ్లిసిటీ కోసం పాకులాడుతోందని, పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. చంద్రన్న బీమా కొంద రూ. 5 లక్షలు ఇస్తామని ప్రకటించి రూ. 3లక్షలతో సరిపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

తాడేపల్లిలో మత్స్యకారుల ఆందోళన..

పశ్చిమగోదావరి : తాడేపల్లిలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. తమ ఇళ్లను తొలగించే ప్రయ త్నం చేస్తున్నారని నరిసన వ్యక్తం చేస్తున్నారుర. తాడేపల్లి తహశీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళుతున్న మత్స్యకారులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

బూత్ వద్దకు వచ్చిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ..

అమృత్ సర్ : పంజాబ్ లో పోలింగ్ కొనసాగుతోంది. అమృత్ సర్ లోని ఓ బూత్ వద్దకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేరుకున్నారు.

 

యూపీలో కాల్వలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలోని గోరారి ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు మురుగుకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6 పిల్లలకు గాయాలయ్యాయి.

 

ఓటు హక్కును వినియోగించుకున్న హర్బజన్..

పంజాబ్ : టీమిండియా క్రికెటర్ హర్బజన్ సింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత రెండు పార్టీలుండేవని, ప్రస్తుతం మూడు పార్టీలు ఉండడంతో ఓట్లు చీలే అవకాశం ఉందని హర్బజన్ వ్యాఖ్యానించారు.

శశికళ భవిష్యత్ పై ఊహాగానాలు...

చెన్నై : రేపు ఏఐడీఎంకే శాసనసభా పక్షం కీలక సమావేశం జరగనుంది. శశికళ భవిష్యత్ పై ఊహాగానాలు వెలువడుతున్నాయి. రేపటి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈనెల 8 లేదా 9న చిన్నమ్మ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. రాత్రి ప్రభుత్వ సలహాదారు శీలా బాలకృష్ణన్, మరో ఇద్దరు సీఎంవో కార్యదర్శులు రాజీనామా చేశారు. సీఎం పన్నీర్ సెల్వం రాజీనామాలను ఆమోదించారు. అకస్మిక రాజీనామాలపై స్టాలిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

11:24 - February 4, 2017
11:22 - February 4, 2017

హైదరాబాద్ : బిషప్ ఇంటి ఎదుట ఓ యువకుడు చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. గోపాలపురం పీఎస్ పరిధిలో ఉన్న మేరీ చర్చీకి సమీపంలో ఉన్న బిషప్ ఇంటి వద్ద యువకుడు కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ లు లభ్యమయ్యాయి. తెల్లవారుజామున మేరీ చర్చి వద్ద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు బిషప్ ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ విధులు నిర్వహిస్తున్ సెక్యూర్టీ గార్డులు అడ్డుకున్నారు. మంటల్లో యువకుడు కాలిపోయాడు. సుమారు 80 శాతం కాలడంతో యువకుడు అక్కడికక్కడనే మృతి చెందాడు. పంచనామా నిర్వహించిన పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువకుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

11:13 - February 4, 2017

ఢిల్లీ : గోవా..పంజాబ్ రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. గోవాలో 7గంటలకు..పంజాబ్ లో 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కానీ గోవాలో ఓటింగ్ శాతం అధికంగా నమోదవుతుండడం విశేషం. కానీ పంజాబ్ లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఈవీఎంలు మొరాయిస్తుండడంతో పలు సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్నట్లు సమాచారం. ఉదయం 10.30గంటల వరకు 12 శాతం ఓటింగ్ నమోదైంది. పంజాబ్ లో 117 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 1145 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

గోవాలో..
మరోవైపు గోవాలో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 10.30గంటల వరకు 17 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. 40 నియోజకవర్గాల్లో 250 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1642 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి పనాజీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దిగంబర్ కామత్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో 82 ఓటింగ్ శాతం నమోదైందని, ఈసారి మాత్రం 85 శాతం పోలింగ్ నమోదు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. గోవా ఎన్నికల ఫలితాలు మార్చి 11న వెలువడనున్నాయి.
దీనిపై పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

పంజాబ్ లో మందకొడిగా పోలింగ్..

ఢిల్లీ : పంజాబ్ లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. గోవాలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతోంది. 10.30గంటల వరకు పంజాబ్ లో 12 శాతం, గోవాలో 17 శాతం నమోదైంది.

చమురు తొలగింపునకు సమయం - కనిమొళి..

చెన్నై : సముద్రతీరంలో పేరుపోయిన చమురును తీయడానికి రెండు..మూడు రోజుల సమయం చాలదని డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. చమురును తొలగించడానికి వారాలు పట్టవచ్చన్నారు.

 

బీజేపీలో ఎస్ఎం.కృష్ణ ?

కర్నాటక : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎస్.ఎం.కృష్ణ బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా ? అనేది తెలియడం లేదు. కానీ ఆయన పార్టీలో చేరుతారని కర్నాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఓ జాతీయ ఛానెల్ తో వ్యాఖ్యానించారు.

పంజాబ్ లో రికార్డు శాతం ఓటింగ్..

పంజాబ్ : రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. 10.30గంటల వరకు రికార్డుస్థాయిలో 12 శాతం పోలింగ్ నమోదైంది.

10:41 - February 4, 2017

హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించడం పట్ల ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీని అఖిలపక్షం కలువనుంది. 5వ తేదీన ఢిల్లీకి రావాలని ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు సీఎం కేసీఆర్ లేఖలు రాశారు. ఈ సందర్భంగా టెన్ టివితో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఎస్సీ వర్గీకరణ సాధ్యమేనని, కేంద్రం సానుకూలంగానే ఉందన్నారు. రెండేళ్ల క్రితమే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళితే బాగుండేదన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

గ్రేటర్ హైదరాబాద్ పై సమీక్ష..

సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి రంగారెడ్డి కలెక్టర్, వాటర్ బోర్డు, ట్రాఫిక్, ట్రాన్స్ కో, రెవెన్యూ, హౌసింగ్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

10:35 - February 4, 2017

సైఫాబాద్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : నగరంలోని సైఫాబాద్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లకడీకపూల్ లోని థామస్ కుక్ ట్రావల్స్ కార్యాలయంలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. కార్యాలయం దగ్ధం కావడంతో లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు.

10:31 - February 4, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు బిషప్ ఇంటి ఎదుట ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. జీసస్..జీసస్..అంటూ వెంట తెచ్చుకున్న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అక్కడిక్కడనే మృతి చెందాడు. బిషప్ ఇంటిలోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూర్టీ గార్డులు అడ్డుకున్నారు. వెంటనే జీసస్..జీసస్..అంటూ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అడ్డుకొనేందుకు గార్డులు ప్రయత్నించారు. 108 ఫోన్ చేసినా లాభం లేకపోయింది. అప్పటికే అతను మృతి చెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బిషప్ ఇంటి ఎదుట యువకుడు సూసైడ్..

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిషప్ ఇంటి ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది.

10:24 - February 4, 2017

ఢిల్లీ : గోవా..పంజాబ్ రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. అమృత్ సర్, జలంధర్ తదితర ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా కొనసాగుతోంది. ఈవీఎంలు సరిచూసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని తెలుస్తోంది. ప్రజలు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా తరలివస్తున్నారు. గోవాలో ఏడు గంటలకు..పంజాబ్ లో 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పంజాబ్ లో 10 శాతం, గోవాలో రికార్డుస్థాయిలో 15 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. సాయంత్రం వరకు ఇరు రాష్ట్రాల్లో భారీ ఓటింగ్ శాతం నమోదవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పంజాబ్, గోవా రాష్ట్రాల్లో అభ్యర్థులు, పలువురు నేతలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 • పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు గాను 11 వందల 45 మంది పోటీ పడుతున్నారు.
 • కోటి 98 లక్షల 79 వేల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
 • ఈసీ 22 వేల 615 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
 • అసెంబ్లీ ఎన్నికలతో పాటు అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది.
 • పంజాబ్‌లో శిరోమణి అకాళిదల్, బిజెపి కూటమి, కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
 • రాష్ట్రంలో శిరోమణి అకాళిదల్, బిజెపి కూటమి గత పదేళ్లుగా అధికారంలో ఉంది. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అకాళిదల్‌ తీవ్రంగా శ్రమిస్తోంది.
 • కాంగ్రెస్‌, ఆప్‌ల నుంచి అధికార పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది.
 • గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.
 • గోవాలో బిజెపి అధికారంలో ఉంది.
 • బిజెపికి ఆప్‌, కాంగ్రెస్‌ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
 • నోట్ల రద్దు నిర్ణయం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు అధికారంలో ఉన్న మోది ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారాయి.
10:21 - February 4, 2017

అమెరికా : అధ్యక్షుడు ట్రంప్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఏడు దేశాల (ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమెన్) ముస్లింల రాకపై నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. పౌరులను అమెరికాలో 90 రోజుల పాటు, సిరియా శరణార్థులను 120 రోజుల పాటు తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ట్రంప్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. దీనితో ప్రపంచ వ్యాప్తంగా భారీగా నిరసనలు..ఆందోళనలు పెల్లుబికాయి.

కోర్టుల స్టే..
ట్రంప్‌ ఆదేశాల అమలును నిలిపివేస్తూ అమెరికా జిల్లా కోర్టు స్టే విధించింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిరాకరించిన వారు.. తమదేశంలోకి రావొచ్చంటూ కెనడా ఆహ్వానం పలికింది. ఆదేశాల అమలు నిలిపివేస్తూ అమెరికా జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్‌ ఆదేశాలను వ్యతిరేకిస్తూ అమెరికా పౌర హక్కు సంఘం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యూయార్క్‌లోని ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు బ్రూక్లిన్‌ ఫెడరల్‌ జడ్డి యాన్‌ డొనెల్లి స్టే విధించారు. తాజాగా ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ పై సియాటిల్ కోర్టు స్టే విధించింది. దేశ వ్యాప్తంగా ఈ ఆదేశాలు అమలౌతాయని కోర్టు పేర్కొంది. ఏడు దేశాల ముస్లింల రాకపై నిషేధం తాత్కాలికంగా నిలిపివేశారు.

విశ్లేషణ..
ఈ అంశంపై ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణసాయిరాం విశ్లేషణ చేశారు. 'అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ప్రవాసులను నిరోధిస్తూ జీవో జారీ చేశారు. తాజా ఉత్తర్వులు కీలకంగా భావించాల్సి వస్తుంది. దీనిపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంది. తాజా ఉత్తర్వులపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు కోర్టుకు వెళ్లారు. హైకోర్టు..సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఫెడరల్ కోర్టుకు ఉంటాయి. కాంగ్రెస్..సెనెట్..ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా ? లేదా ? అనేది ఫెడరల్ కోర్టు చూస్తుంది. ఈ కోణంలో చూస్తే తాజా తీర్పు కీలకంగా మారింది. జాతీయ భధ్రత రక్షణ నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశామని ప్రభుత్వం పేర్కొంటుంటే మతపరమైన నేపథ్యంలో ఆదేశాలు జారీ చేశారని వాదనలు వినిపిస్తున్నాయి’. అని పేర్కొన్నారు.

ట్రంప్ ఆదేశాలపై కోర్టు స్టే..

అమెరికా : అధ్యక్షుడు ట్రంప్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ పై సియాటిల్ కోర్టు స్టే విధించింది. దేశ వ్యాప్తంగా ఈ ఆదేశాలు అమలౌతాయని కోర్టు పేర్కొంది. ఏడు దేశాల ముస్లింల రాకపై నిషేధం తాత్కాలికంగా నిలిపివేశారు.

శ్రీవారి సేవలో ఏపీ స్పీకర్ కోడెల..

చిత్తూరు : ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సభాపతికి టిటిడి అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

09:48 - February 4, 2017

జీవితంలో తమకంటు ఇల్లు ఉండాలని భావిస్తుంటారు. భవిష్యత్ లో మంచి అభివృద్ధి అయ్యే స్థలంలో ఇల్లు ఉండాలని తమ స్థోమతకు తగిన ఇళ్లు ఎక్కడ లభిస్తుందని ఆరా తీస్తుంటారు. అహర్నిశలు శ్రమించి డబ్బులు కూడబెట్టుకుని ఇల్లు కొనుక్కొంటుంటారు. హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో 111 జీవో అనుమానాలు..శాంతారామ్ కన్ స్ట్రక్షన్ ప్రాజెక్టుల వివరాలు..పెద్ద నోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది ? తదితర రియల్ వ్యాపారం గురించి తెలుసుకోవాంటే వీడియో క్లిక్ చేయండి.

గోవా..9 గంటల వరకు 15 శాతం పోలింగ్..

గోవా : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. గోవాలో 40 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 251 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9గంటల వరకు నార్త్ గోవాలో 16 శాతం, సౌత్ గోవాలో 14 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తంగా 15 శాతంగా నమోదైంది.

09:25 - February 4, 2017

విశాఖపట్టణం : 'విశాఖ ఉత్సవ్‌' పేరుతో విశాఖలోని ఆర్కేబీచ్‌లో నిర్వహిస్తోన్న వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. చిన్నారుల విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలు, డ్యాన్స్‌లు, పాటలతో బీచ్‌ సందడిగా మారింది. ఈ ఉత్సవాలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభించారు. శుక్రవారం మొదలైన ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగనున్నాయి. విశాఖ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఉత్సవాల ప్రారంభ సూచకంగా కేంద్రమంత్రి వెంకయ్యతోపాటు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథ్‌రెడ్డి, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ బెలూన్లను ఎగరవేశారు.

ఏపీకి కొత్త ప్రాజెక్టులు..
విశాఖ ఉత్సవ్‌ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్నివాల్‌ను వెంకయ్య భేరీ మోగించి ప్రారంభించారు. కార్నివాల్‌ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. విశాఖ ఉత్సవ్‌ సందర్భంగా కళాకారులు, క్రీడాకారులు, విద్యార్ధులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో చిన్నారుల కరాటే, స్కేటింగ్‌ విన్యాసాలు, రింగ్‌ ఆటలు, బాక్సింగ్‌, టెన్నిస్‌ క్రీడాకారుల ప్రదర్శనలు అదుర్స్‌ అనిపించాయి. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఏపీని కేంద్రం ప్రత్యేకంగా చూస్తోందని వెంకయ్య అన్నారు. విభజన చట్టంలో ఉన్నవి, లేనివి కూడా అమలు చేస్తున్నామన్నారు. దేశంలో ఏరాష్ట్రానికి ఇవ్వని విధంగా అనేక కొత్త ప్రాజెక్టులు, సంస్థలు, పరిశ్రమలను ఏపీకి మంజూరు చేశామని చెప్పారు. విశాఖ ఉత్సవ్‌లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి.

09:12 - February 4, 2017

ఢిల్లీ : గోవా, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గోవాలో 40 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 251 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పంజాబ్ లో 117 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 1145 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గోవాలో ఉదయం 7గంటలకు..పంజాబ్ లో ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆయా అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.

పంజాబ్...
అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్షంలో కాంగ్రెస్, ఆప్ పార్టీలకు ఈ ఎన్నికలు పరీక్షగా జరగనున్నాయి. పంజాబ్ లో శిరోమణి అకాలీదల్, కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పంజాబ్ లో 94 స్థానాల్లో శిరోమణి అకాళీదల్, 23 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంటే 112 స్థానాల్లో ఆప్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ మొత్తం స్థానాల్లో అభ్యర్థులు నిలిపింది. అన్ని పార్టీలు నువ్వా..నేనా అని తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఆయా పార్టీల సీఎం అభ్యర్థులు ఒకే స్థానం నుండి పోటీ చేస్తుండడం గమనార్హం.

గోవా..
గోవా రాష్ట్రంలో మొత్తం 40 స్థానాలకు గాను పోలింగ్ జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఆప్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఓటింగ్ సరళిని చూస్తే మందకొడిగా సాగుతోందని తెలుస్తోంది. పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రజలు ఎలాంటి తీర్పునివ్వనున్నారో చూడాలి.

బూత్ 66లో మొరాయించిన ఈవీఎం..భారీ క్యూ..

పంజాబ్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. జలంధర్ లో బూత్ నెంబర్ 66లో ఈవీఎం మొరాయించడంతో క్యూలో జనాలు వేచి చూస్తున్నారు.

111వ రోజు సీపీఎం పాదయాత్ర..

ఖమ్మం : జిల్లాలో 111వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభమైంది. సత్తుపల్లి, కిష్టారం, లంకపల్లి, మండాలపాడు, వీఎం బంజరలో పాదయాత్ర జరగనుంది.

సబ్ జైలు ఖైదీ మృతి..

జగిత్యాల : సబ్ జైలు ఖైదీ జీవన్ సింగ్ మృతి చెందాడు. కడుపునొప్పి రావడంతో సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జీవన్ సింగ్ మృతి చెందాడు.

ఈవీఎంల మొరాయింపు..

పంజాబ్ : రాష్ట్రంలో 117 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. కొన్ని పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు తెలుస్తోంది. జలంధర్ లోని బూత్ నెంబర్ 66 ఈవీఎం మొరాయించింది. అమృతసర్ లోని 124-125 బూత్ లలో ఈవీఎంలు మొరాయించడంతో 40 నిమిషాల ఆలస్యం జరుగుతోంది.

08:11 - February 4, 2017

ఢిల్లీ : మొదటి దశ ఎన్నికల్లో భాగంగా గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గోవాలో ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా పంజాబ్ రాష్ట్రంలో ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పంజాబ్, గోవా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత పోలింగ్ కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కానుందని తెలిపారు. గోవాలో 40 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 251 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పంజాబ్ లో 117 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 1145 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు గాను 11 వందల 45 మంది పోటీ పడుతున్నారు. కోటి 98 లక్షల 79 వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ 22 వేల 615 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

పంజాబ్..గోవా...
పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి రెండు రోజుల ముందు పేలుడు సంభవించడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టారు. ఎన్నికలను శాంతియుతంగా జరపడానికి 2 వందల కంపెనీల ఆర్మీ బలగాలను రంగంలోకి దింపింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది. పంజాబ్‌లో శిరోమణి అకాళిదల్, బిజెపి కూటమి, కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. రాష్ట్రంలో శిరోమణి అకాళిదల్, బిజెపి కూటమి గత పదేళ్లుగా అధికారంలో ఉంది. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అకాళిదల్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్‌, ఆప్‌ల నుంచి అధికార పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది.

గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. గోవాలో బిజెపి అధికారంలో ఉంది. బిజెపికి ఆప్‌, కాంగ్రెస్‌ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు అధికారంలో ఉన్న మోది ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారాయి.

08:03 - February 4, 2017

లోక్ సభ, రాజ్యసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు పెద్ద పెట్టున నినాదాలు చేశాయి. లోక్ సభలో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వదదకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. సీనియర్ పార్లమెంట్ సభ్యుడు ఇ.అహ్మద్ మరణాన్ని పరిగణలోకి తీసుకోకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టడం దారుణమని, ఆయన మరణవార్తను ప్రకటించడంలో కుట్రలు జరిగాయని ఆరోపిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిపుత్రులకు సరైన తిండి..బట్ట కరువైందని 'నవ తెలంగాణ' పత్రికలో వార్త వచ్చింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణపై ఆరో తేదీన ప్రధాన మంత్రితో భేటీ కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు అఖిలపక్షాన్ని కూడా ఆహ్వానించారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (సామాజిక విశ్లేషకులు), ప్రకాష్ రెడ్డి (బీజేపీ), మహేష్ (టి.కాంగ్రెస్), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి.

పఠాన్ కోట్ లో బారులు తీరిన ఓటర్లు..

ఢిల్లీ : పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. పఠాన్ కోట్ లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు బారులు తీరారు.

కాసేపట్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

ఢిల్లీ : కాసేపట్లో పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పంజాబ్ లో 117 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 1145 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

07:42 - February 4, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా పేరును..ప్రచార చిత్రం ఇంకా విడుదల కాకపోవడంపై 'ప్రిన్స్' అభిమానులు నిరుత్సాహానికి గురయినట్లు తెలుస్తోంది. కానీ చిత్ర బృందం మాత్రం షూటింగ్ పైనే దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. ప్రచార చిత్రంతో పాటు..పేరునూ ప్రకటిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని జూన్ 23వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

గోవాలో అధిక శాతం పోలింగ్ - పారికర్..

పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాసేపటి క్రితం ప్రారంభమైన పోలింగ్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత పోలింగ్ కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కానుందని తెలిపారు.

గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం..

ఢిల్లీ : గోవా, పంజాబ్ రాష్ట్రాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. గోవాలో 40 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 251 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పంజాబ్ లో 117 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 1145 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పనాజీలో ఓటు హక్కు వినియోగించుకొనేందుక క్యూలో నిలుచున్నారు.

ఓటింగ్ లో పాల్గొనాలని మోడీ పిలుపు...

ఢిల్లీ : పంజాబ్, గోవా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

విశాఖ ఉత్సవ్..రెండో రోజు..

విశాఖపట్టణం : నేడు రెండో రోజు విశాఖ ఉత్సవ్ కార్యక్రమం జరగనుంది. శుక్రవారం అట్టహాసంగా ఉత్సవ్ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

 

ఆదిలాబాద్ లో జోగు రామన్న..గద్వాల జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన..

ఆదిలాబాద్ : నేడు జిల్లాలో మంత్రి జోగురామన్న పర్యటించనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటింనున్నారు.

కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన..

హైదరాబాద్ : నేడు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన చేయనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

పెద్దపల్లిలో హరీష్ పర్యటన..

హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. గోదావరిఖనిలో పెద్దంపేట - అంతర్గామ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను హరీష్ రావు ప్రారంభించనున్నారు.

06:54 - February 4, 2017
06:51 - February 4, 2017

ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి రాగానే దూకుడు ప్రదర్శిస్తున్నాడు. హెచ్‌-1 బీ వీసాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ట్రంప్‌ నిర్ణయాలతో భారత్‌లోని ఐటీ కంపెనీలకు గడ్డుకాలం మొదలైందనే చెప్పుకోవాలి. అంతేకాదు.. హెచ్-1 బీ వీసాలున్న వారి లైఫ్ పార్ట్‌నర్‌కి వర్క్ పర్మిట్ రద్దు చేసే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిర్ణయం గనుక తీసుకుంటే.... అమెరికాలో ఉద్యోగం చేయాలనుకున్న వారి ఆశలు అడియాశలైనట్టే..! అమెరికాలో చదువులను పూర్తి చేయాలని, అక్కడే ఉద్యోగం చేయాలని చాలామంది ఇష్టపడుతుంటారు. ఇప్పుడు వారి ఆశలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నీళ్లు చల్లుతున్నారు. ట్రంప్‌ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలతో యావత్‌ ప్రపంచమే ఆందోళన చెందుతోంది. పొరుగుదేశం మెక్సికోతో కయ్యం పెట్టుకోవటం దగ్గర నుంచి పర్యావరణానికి నష్టం కలిగించే చమురు ప్రాజెక్టులపై ఒబామా విధించిన నిషేధాన్ని తొలగించటం వరకూ.. అమెరికాలోని ఇతర దేశాల వృత్తినిపుణులు తరలిరాకుండా హెచ్‌ 1 బీ వీసా చట్టానికి సవరణలు ప్రతిపాదించడం దగ్గర్నుంచి.. ఏడు ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు అమెరికాకు రాకుండా నిషేధించటం వరకూ ట్రంప్‌ సృష్టించిన హంగామా అంతాఇంతా కాదు.

వీసాలో మార్పులు..
తాజాగా హెచ్-1బీ వీసాలో మార్పులు చేస్తూ భారతీయ ఉద్యోగులకు నిద్ర కరువు చేశారు ట్రంప్‌. హెచ్-1బీ వీసాపై అమెరికాకు వచ్చే విదేశీయుల కనీస వేతనం లక్షా 30 వేల డాలర్లు ఉండాలనీ, అంతకంటే తక్కువ వేతనం ఉన్న విదేశీయులను తొలగించి వారి స్థానంలో అమెరికన్లను నియమించాలనేది ప్రస్తుతం హెచ్-1బీ వీసాలో పేర్కొన్న మార్పులు. అమెరికా ప్రతినిధుల సభలో ఉన్న ఈ బిల్లు పాస్ అయితే ఎన్నారైలకు, హెచ్-1బీ వీసాపై వెళ్లిన వారిలో మెజారిటీ భారతీయులకు తిప్పలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో హెచ్-1బీ వీసాతో ఉన్న భారతీయులందరూ ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. వీరితోపాటు అమెరికా పౌరసత్వం పొందిన ఎన్నారైలు కూడా భయాందోళనల్లో ఉన్నారు.

చైనీయుల తరువాత భారతీయులే అధికం..
అత్యంత ప్రత్యేకమైన పరిజ్ఞానం గల విదేశీ ఇంజినీర్లను అమెరికా ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఉద్దేశించిన విధానమే హెచ్ 1 బీ వీసా. ఫీజు పెంచడం ద్వారా హెచ్ 1 బీ వీసా కింద విదేశీ ఇంజినీర్ల వలసల నియంత్రణకు ట్రంప్ ప్రభుత్వం తీసుకునే చర్యలపై అమెరికాలోని ఐటీ కంపెనీలు, ప్రత్యేకించి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న భారత ఐటీ కంపెనీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. తాజాగా ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన హెచ్ 1 బీ వీసా చట్ట సవరణ ప్రకారం ఐటీ కంపెనీలు తొలుత అమెరికన్ ఇంజినీర్‌ను నియమించుకోవాలి. ఒకవేళ విదేశీ సిబ్బందిని నియమించుకోవాల్సి వస్తే అత్యంత అధిక వేతనం చెల్లించాలి. అమెరికాకు వలసలను కట్టడి చేస్తూ.. ఆ దేశస్తులకు ఉద్యోగ భద్రత, కార్మికులకు రక్షణ కల్పించడం కోసం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్నా అంతర్జాతీయంగా చాలా ఎఫెక్ట్‌ పడేలా కనిపిస్తోంది. అమెరికాలో విద్యాభ్యాసం, ఉద్యోగాలు చేస్తున్న వారిలో చైనీయుల తర్వాత భారతీయులే అత్యధికులుగా ఉన్నారు. ఇప్పుడు వీరంతా ట్రంప్‌ నిర్ణయం ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.

ఆశలు అడియాశలేనా ?
చదువులు పూర్తైన తరువాత వర్క్‌ వీసా అవకాశాలు మెరుగ్గా ఉండటంతో భారతీయులు అమెరికా వర్శిటీల వైపు ఆకర్షితులవుతున్నారు. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ విద్యార్థులు ఓపీటీని మూడేళ్ల వరకూ పొడిగించుకుని అక్కడే ఉంటున్నారు. అయితే.... ఇప్పుడు ఓపీటీ పొడిగింపు, కాలాన్ని తగ్గించాలని ట్రంప్‌ సర్కారు భావిస్తోంది. అదే జరిగితే.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న 1,65,918 మంది విద్యార్థుల భవిష్యత్‌ ఆశలు అడియాశలు అయినట్టే..!

06:46 - February 4, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కాంట్రాక్ట్‌ లెక్చరర్ల ఆందోళన కాంగ్రెస్‌వైపు తిరిగింది.. ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌పై హస్తం పార్టీ వైఖరి చెప్పాలంటూ లెక్చరర్లు గాంధీభవన్‌ముందు హంగామా చేశారు.. ఈ నిరసనపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా స్పందించారు.. అధికార పార్టీ ఉచ్చులోపడొద్దని సూచించారు.. కాంట్రాక్ట్‌ లెక్చరర్ల నినాదాలతో గాంధీ భవన్‌ దద్దరిల్లింది.. హైదరాబాద్‌లో లెక్చరర్ల ఆందోళన కీలకమలుపు తిరిగింది.. తమ ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌పై కాంగ్రెస్‌ వైఖరేంటో చెప్పాలంటూ గాంధీభవన్‌ ముందు లెక్చరర్లు ధర్నాకు దిగారు.. గాంధీభవన్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలంటూ లెక్చరర్లు కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వివిధ రకాలుగా నిరసన తెలుపుతున్నారు.. అయితే ఇదే సమయంలో నిరుద్యోగ జేఏసీ కూడా పోరుబాట పట్టింది.. ఉద్యోగాలను రెగ్యులర్‌ చేస్తే తమకు నష్టమంటూ నిరుద్యోగ జేఏసీ వాదిస్తోంది.. దీనిపై కోర్టులో పిటిషన్‌ కూడా వేసింది.. ఈ ఉద్యమానికి విద్యార్థి నేత, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మానవతా రాయ్‌ సహకారం అందిస్తున్నారు.

స్పందించిన కాంగ్రెస్..
స్వయంగా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధే రెగ్యులరైజేషన్‌కు వ్యతిరేకంగా నిరసనబాటపట్టడం కాంట్రాక్ట్‌ లెక్చరర్లలో ఆగ్రహం పుట్టించింది.. అసలు హస్తం పార్టీ క్రమబద్దీకరణకు అనుకూలంగా ఉందా? వ్యతిరేకంగా ఉందా? చెప్పాలంటూ లెక్చరర్లు గాంధీభవన్‌ముందు ధర్నా చేపట్టారు. లెక్చరరర్ల నిరసనపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది.. అధికార పార్టీ ఉచ్చులోపడి తమను నిందిస్తున్నారని ఆరోపించింది. మొదటినుంచీ ఉద్యోగుల క్రమబద్దీకరణకు తమ పార్టీ మద్దతు ఇచ్చిందని... కాంగ్రెస్‌ నేత మల్లు రవి గుర్తుచేశారు.. ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయనందుకు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందిపోయి తమ కార్యాలయంముందు ధర్నా చేయడమేంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తానికి లెక్చరర్ల నినాదాలతో రెండుగంటలపాటు గాంధీభవన్‌ దగ్గర హైడ్రామా నడిచింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి.. ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్‌ చేశారు.

06:43 - February 4, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలోని దళిత, గిరిజనులకు మేలు చేయాలనుకుంటే ఇప్పుడున్న చట్టానికి సరైన సవరణలు చేయాలని దళిత, గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. కేసీఆర్‌ సర్కార్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తే అడ్డుకునేందుకు దళితులంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరముందని ఎస్సీ, ఎస్టీ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని దళిత, గిరిజన సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో అమలులో ఉన్న ఎస్సీ, ఎస్టీ చట్టం పేరు మార్చి.. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధిగా పేరు మార్చాలనుకోవడం సరైంది కాదని హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. సబ్‌ప్లాన్‌ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్రలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత, గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పావులుగా వాడుకుంటున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. 2009-14 మధ్య కాలంలో 25 వేల కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లగా.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో 17 వేల కోట్లు పక్కదారి పట్టాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మోసం చేయాలని చూస్తున్న కేసీఆర్..
దేశవ్యాప్తంగా దళిత గిరిజన సంఘాలు కేంద్ర బడ్జెట్‌లో వాటా కోసం పోరాటం చేస్తున్న తరుణంలో.. సబ్‌ప్లాన్‌ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు గిరిజన సంఘం నేత శ్రీరాంనాయక్‌. దళితులను కేసీఆర్‌ మోసం చేయాలని చూస్తున్నారన్నారు వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకట్‌. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని.. ఈ ఆర్థిక సంవత్సరంలో నిధులు ఖర్చు కాకుంటే వచ్చే బడ్జెట్‌లో వాటిని ఖర్చు చేయాలని ఆయన సూచించారు. దళితులను మోసం చేసిన కేసీఆర్‌పై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌. అధికార పార్టీకి చెందిన దళిత, గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కేసీఆర్‌కు భజనపరులుగా మారిపోయారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను ఇష్టమొచ్చినట్లు దారి మళ్లించకుండా అందరూ సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరముందని నేతలు అభిప్రాయపడ్డారు.

06:40 - February 4, 2017

కడప : ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట ప్రతిపక్షనేత జగన్ సొంతజిల్లాపై సీరియస్‌గా దృష్టి సారించారు. తిరుగులేని ఆధిపత్యాన్ని మరోమారు రుజువు చేసుకునేందుకు నడుం బిగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పర్యటనలో జగన్‌ కడప జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులను పార్టీలోకి రప్పించుకుంటున్నారు. కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతో సమావేశమవుతున్నారు. గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నాయకులు తిరిగి సొంత గూటికే చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చాలామంది జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. వైఎస్‌ జగన్‌ కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. టీడీపీకి చెందిన ఆరుగురు ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తన బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

రంగంలో జగన్..
దీంతో జగన్ స్వయంగా రంగంలోకి దిగి ప్రజలతో మమేకమవుతున్నారు. టీడీపీ యువనేత లోకేశ్ సమక్షంలో గతంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కడప నగరపాలక సంస్థకు చెందిన ఆరుగురు కార్పొరేటర్లు ఇప్పుడు సొంతగూటికి చేరుకున్నారు. ఇడుపులపాయలో నిర్వహించిన సమావేశంలో ఈ ఆరుగురు కార్పొరేటర్లు వైసీపీలో చేరారు. ఇటు ఖాజీపేట మండలానికి చెందిన టీడీపీ ఎంపీటీసీలు ఆరుగురు, ఒక జెడ్పీటీసీ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు డబ్బులతో రాజకీయం చేస్తున్నారని, వైసీపీ ప్రజాప్రతినిధులను అంగడి సరుకుల్లా కొనుగోలు చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరు పనిచేయాలని జగన్ వైసీపీ కార్యకర్తలకు, పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మొత్తంగా కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తీవ్రమైందని చెప్పొచ్చు.

06:38 - February 4, 2017

ఢిల్లీ : పంజాబ్‌, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పంజాబ్‌లో శిరోమణి అకాళిదల్, బిజెపి కూటమి, కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గోవాలో కూడా అధికారంలో ఉన్న బిజెపికి ఆప్‌ గట్టి పోటీనిస్తోంది. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు గాను 11 వందల 45 మంది పోటీ పడుతున్నారు. కోటి 98 లక్షల 79 వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ 22 వేల 615 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

పంజాబ్ లో..
పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి రెండు రోజుల ముందు పేలుడు సంభవించడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టారు. ఎన్నికలను శాంతియుతంగా జరపడానికి 2 వందల కంపెనీల ఆర్మీ బలగాలను రంగంలోకి దింపింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది. పంజాబ్‌లో శిరోమణి అకాళిదల్, బిజెపి కూటమి, కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. రాష్ట్రంలో శిరోమణి అకాళిదల్, బిజెపి కూటమి గత పదేళ్లుగా అధికారంలో ఉంది. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అకాళిదల్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్‌, ఆప్‌ల నుంచి అధికార పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది.

గోవాలో..
గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. గోవాలో బిజెపి అధికారంలో ఉంది. బిజెపికి ఆప్‌, కాంగ్రెస్‌ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు అధికారంలో ఉన్న మోది ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారాయి.

గోవా, పంజాబ్ రాష్ట్రాలకు ఎన్నికలు..

హైదరాబాద్ : నేడు గోవా, పంజాబ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. గోవాలో 40 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 251 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పంజాబ్ లో 117 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 1145 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్..నైజీరియన్ల వీరంగం.

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నైజీరియన్లు వీరంగం సృష్టించారు. బ్రీత్ ఎనలైజర్ కు సహకరించకుండా పోలీసులపై నలుగురు నైజీరియన్లు చేయి చేసుకున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..

హైదరాబాద్ : ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఫిల్మ్ నగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో తనిఖీలు నిర్వహించారు.

Don't Miss