Activities calendar

05 February 2017

22:03 - February 5, 2017

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పైకోర్టులోనూ ఎదురుదెబ్బ త‌గిలింది. ఏడు దేశాల వారిపై వీసా నిషేధించాలన్న ప్రభుత్వ వినతిని ఫెడ‌ర‌ల్ అప్పీల్స్ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో సోమ‌వారం మ‌ధ్యాహ్నంక‌ల్లా స్టేట్ ఆఫ్ వాషింగ్‌టన్‌, ట్రంప్ ప్రభుత్వం తమ వాదనల్ని వినిపించాలని శాన్‌ఫ్రాన్సిస్కోలోని స‌ర్క్యూట్ అప్పీల్స్ కోర్టు ఆదేశించింది.. ముస్లిం ఆధిక్యత ఉన్న ఏడు దేశాల వాసులు అమెరికాలో అడుగుపెట్టకుండా 120 రోజులపాటు నిషేధం విధించే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు.. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.. ఫెడరల్‌ కోర్ట్ జడ్జ్‌ ట్రంప్‌ ఆదేశాలపై స్టే విధించారు.. దీనిపై అప్పీల్‌కు వెళ్లిన ప్రభుత్వానికి అక్కడా చుక్కెదురైంది.. ఫెడరల్‌ జడ్జ్‌ తీర్పుపై పైకోర్టు స్టే విధించడానికి నిరాకరించింది.. దేశంలో ఎవరు రావాలి? ఎవరు రాకూడదన్న అంశం పూర్తిగా అధ్యక్షుడికే ఉంటుందని కోర్టులో సోలిసిటర్‌ జనరల్ వాధించారు.. అతని వాదనతో కోర్టు విభేదించింది.. అయితే ఈ వీసాల నిషేధంపై న్యాయపోరాటం మరో వారంరోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.. 

 

22:02 - February 5, 2017

ఖమ్మం : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తెలంగాణలో చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 112 రోజులు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. మూడు వేల కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా తల్లాడలో సీపీఎం ఫైలాన్‌ను ఆవిష్కరించారు.  
భారీ ఫైలాన్‌ ఆవిష్కరణ 
ఎర్రజెండా చేతబట్టి.. పల్లెపల్లెలో కదం తొక్కుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఇప్పటికే 112 రోజులు పర్యటించిన పాదయాత్ర బృందం.. మూడు వేల కిలోమీటర్లు దాటిన సందర్భంగా ఖమ్మం జిల్లా తల్లాడలో సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యులు వి. శ్రీనివాసరావు భారీ ఫైలాన్‌ను ఆవిష్కరించారు. 
ఎక్కడి సమస్యలు అక్కడే : తమ్మినేని 
డెబ్బై ఏళ్లుగా ఎలా పరిపాలన చేశారో.. కొత్త రాష్ట్రంలోనూ అలాగే పాలిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని తమ్మినేని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాలు ఏ మాత్రం మారలేదని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం సవాల్‌ను కూడా స్వీకరించలేని స్థితిలో కేసీఆర్‌ సర్కార్‌ ఉందని, ప్రజా సమస్యలపై చర్చకు రమ్మంటే ఈ ప్రభుత్వం తోకముడిచిందని తమ్మినేని విమర్శించారు. 
ఇది దేశ చరిత్రలోనే ఓ రికార్డు : నున్నా నాగేశ్వరావు 
ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా సీపీఎం పాదయాత్ర కొనసాగుతోందని, ఇది దేశ చరిత్రలోనే ఓ రికార్డని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నున్నా నాగేశ్వరావు అన్నారు. యాత్ర పూర్తయ్యే వరకు ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టాలని నున్నా నాగేశ్వరావు డిమాండ్‌ చేశారు. ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే ప్రజల నుంచి ఆందోళన ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. 112వ రోజు తమ్మినేని బృందం ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి, రామకృష్ణాపురం, ఎన్‌ఎస్పీ సెంటర్‌, కల్లూరు, మంచూరు తండా, నోతన్‌కల్‌, అంజనాపురం, తల్లాడలో పర్యటించింది. 

 

21:53 - February 5, 2017

హైదరాబాద్ : కొత్త జిల్లాల ద్వారా ప్రభుత్వ పథకాలు మరింత సమర్ధవంతంగా అమలు కావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో మానవ వనరుల్ని గుర్తించి ప్రోత్సహించాలని కలెక్టర్లకు సూచించారు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.. ప్రతి కలెక్టర్‌ దగ్గర 5కోట్ల రూపాయలు ఉంచుతామని... సమస్యల పరిష్కారంకోసం ఈ డబ్బును వినియోగించుకోవాలని సూచించారు..
జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం 
హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్,  ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కనకయ్య, వెంకటేశ్వర్లు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులుకూడా పాల్గొన్నారు... కలెక్టర్లు బాగా పనిచేస్తున్నారని కేసీఆర్‌ ప్రశంసించారు.. ఆస్పత్రులు, ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించి అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని మెచ్చుకున్నారు.. ఇదే ఉత్సాహంతో పనిచేస్తే అనుకున్న లక్ష్యాల్ని చాలా త్వరగా సాధిస్తామన్న నమ్మకముందని కేసీఆర్‌ అన్నారు.
రాష్ట్రంలో అద్భుత మానవశక్తి 
తెలంగాణ రాష్ట్రంలో అద్భుత మానవశక్తి ఉందని కేసీఆర్‌ చెప్పారు... మానవ వనరుల్ని గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.. జనగామ - పెంబర్తిలో నగిషీ కళాకారులు, కరీంనగర్‌లో పిలిగ్రీ ఆర్ట్స్ కళాకారులు ప్రపంచ ప్రఖ్యాతి పొందారని గుర్తుచేశారు.. ఇక తెలంగాణ రాష్ట్రం 19.5 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే టాప్‌లోఉందని కేసీఆర్‌ గుర్తుచేశారు.. టిఎస్ ఐపాస్ చట్టం, నిరంతర విద్యుత్ సరఫరా తదితర కారణాల వల్ల ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులను కలెక్టర్లు అర్థంచేసుకుంటూ పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు..
రాష్ట్రంలో 25 లక్షల మంది యాదవులు
రాష్ట్రంలో 25 లక్షల మంది యాదవులున్నారని సీఎం చెప్పారు.. అయినా ప్రతీ రోజూ 500 లారీల గొర్రెలు రాష్ట్రానికి దిగుమతి కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో గొర్రెల పెంపకంకోసం ప్రత్యేక కార్యక్రమం అమలు చేయాలని... దీనికోసం అధికారులు సిద్ధం కావాలని సీఎం కోరారు.. అలాగే చేపల పెంపకం పెద్ద ఎత్తున జరగాలన్నారు కేసీఆర్‌.. చెరువులు, రిజర్వాయర్లు, బ్యారేజీలలో చేపల పెంపకానికి అనువైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
గ్రామాల్లో సెలూన్ల పరిస్థితి మారాలన్న కేసీఆర్‌
గ్రామాల్లో సెలూన్ల పరిస్థితి మారాలని కేసీఆర్‌ అన్నారు.. గ్రామాల్లో హైజనిక్ సెలూన్లు రావాలని సూచించారు... ఈ సెలూన్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని ప్రకటించారు.. అలాగే ఎస్‌సీలు, ఎస్‌టీలు, మహిళల్ని ప్రోత్సహించాలని సూచించారు.. వీరి అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.. దళితులకు ఏం కావాలో ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు..జిల్లాల వారిగా ఎస్సీ, ఎస్టీ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు.. బడ్జెట్ ప్రవేశ పెట్టేలోగా జిల్లాల నుంచి ప్రతిపాదనలు రావాలని సూచించారు. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిఉందని సీఎం స్పష్టం చేశారు.. వీరికోసం చేపట్టబోయే కార్యక్రమాల పర్యవేక్షణకు సీఎంవోలో ప్రత్యేక అధికారుల్ని ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు.

21:47 - February 5, 2017

చెన్నై : తమిళనాడులో శశికళ శకం మొదలైంది. అధికార పార్టీ అన్నాడీఎంకే శాసనసభపక్ష నేతగా శశకళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సీఎం పన్నీర్‌ సెల్వం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో...శశికళను పార్టీ శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదిస్తూ  ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించారు. పోయెస్‌  గార్డెన్‌లో శశకళతో సమావేశమైన పన్నీర్‌సెల్వం పదవీ బాధ్యతలు చేపట్టాలని కోరారు. అనంతరం సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా చేశారు. 
చిన్నమ్మకు పట్టం కట్టేందుకు రంగం సిద్ధం 
తమ్మిళనాట చిన్నమ్మకే పట్టం కట్టేందుకు రంగం సిద్ధం అయింది. అధికార పార్టీ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సీఎం పన్నీర్‌ సెల్వం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. శశికళనే శాసనసభాపక్షనేతగా ప్రతిపాదిస్తూ పన్నీరు సెల్వం ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించారు. 
గవర్నర్‌ కు తాజా రాజకీయ పరిణామాలు 
తాజా రాజకీయ పరిణామాలను గవర్నర్‌ కు అందజేయనున్నారు. ఇప్పటికే పోయిస్‌ గార్డెన్‌లో శశికళతో పన్నీరు సెల్వం సమావేశమై పదవీ బాధ్యతలు చేపట్టాలని కోరారు. పన్నీరు సెల్వం తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపించాల్సి ఉంది. ఇక శశికళ ప్రమాణస్వీకారం లాంఛనప్రాయమనే చెప్పాలి. మంచి ముహూర్తం చూసుకుని శశికళ ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. శశికళ పదవీ బాధ్యతలు చేపట్టేవరకు పన్నీర్‌ సెల్వం సీఎంగా కొనసాగుతారు. అయితే.. ఈ నెల 9, 10 తేదీల్లో మంచి ముహూర్తం ఉండటంతో ఆ రోజుల్లోనే శశికళ తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.  
శరవేగంగా రాజకీయ పరిణామాలు 
తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటీవల ప్రచారం జరిగినట్టుగా అధికార అన్నాడీఎంకేలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి, జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా సీఎం పన్నీరు సెల్వం రాజీనామా చేశారు.  అయితే.. శశికళ సీఎంగా బాధ్యతలు చేపట్టే విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 
పన్నీరు సెల్వం రాజీనామా 
తానే ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు.. మద్దతు కూడగడుతున్నట్లు, సీఎం పదవికి రాజీనామా చేసేందుకు పన్నీరు సెల్వం నిరాకరిస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఆయన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా రాజీనామా చేశారు. ఏదేమైనా ఇక సీఎంగా చిన్నమ్మకు లైన్‌ క్లియర్‌ కావడంతో... ఒకట్రెండు రోజుల్లో కొత్త ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నాడీఎంకె ఎమ్మెల్యేలు ఇప్పటికే గవర్నర్ విద్యాసాగర్‌రావుతో సమావేశానికి అనుమతి కోరారు. శశికళ తనను సీఎం పదవి చేపట్టాలని పన్నీర్ సెల్వమే ఒత్తిడి తెచ్చారని,  పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలని కోరింది కూడా ఆయనేనని, అందుకు ధన్యవాదాలని శశికళ చెప్పారు. అమ్మ జయలలిత ఆశయాలను నెరవేరుస్తానని శశకళ అన్నారు. మరోవైపు శశికళ సీఎం కానుండటాన్ని డీఎంకే పార్టీ నేత స్టాలిన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 

21:37 - February 5, 2017
21:30 - February 5, 2017

కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ : కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. అనాథ పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఒంటరి మహిళలను గుర్తించి భృతి చెల్లించాలని చెప్పారు. 

జయశంకర్ జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం...

జయశంకర్ : జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్, ఈటెల రాజేందర్ పలిమెల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు త్వరలో జాతీయ రహదారిని ప్రారంభిస్తామని చెప్పారు. మారు మూల ప్రాంతాల్లోనూ రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. 

21:18 - February 5, 2017

గవర్నర్ కు రాజీనామా లేఖ పంపిన పన్నీర్ సెల్వం

చెన్నై : పన్నీర్ సెల్వం తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే సీఎం పదవికి రాజీనామా చేశానని తెలిపారు.  

ప్రత్యక్ష రాజకీయాల్లో లేని శశికళ...

తమిళనాడు : శశికళ ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా కూడా ఎన్నికకాలేదు. జయలలితకు శశికళ చిరకాల స్నేహితురాలిగా ఉన్నారు. 

20:49 - February 5, 2017
20:46 - February 5, 2017

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్ సంస్థకు  కోట్ల రూపాయలు మంజూరు చేసిన టీడీపీ సర్కార్‌.. నిబంధనలకు విరుద్ధంగా సబ్‌కాంట్రాక్ట్‌ల రూపంలోనూ కోట్లాది   రూపాయలను దారాదత్తం చేస్తోంది. బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే.. సబ్‌కాంట్రాక్ట్‌ల పేరుతో కోట్లను గుమ్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
పనులు చేపట్టకుండానే కోట్ల రూపాయలు చేజిక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌  
పోలవరం నిర్మాణ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ ఎలాంటి పనులు చేపట్టకుండానే కోట్ల రూపాయలను చేజిక్కించుకుంది. అటున్న రాయిని ఇటు పెట్టకుండానే ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు 2013లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం.. వేయి కోట్లను ముట్టజెప్పింది. నిబంధనల ప్రకారం అయితే... ఎలాంటి పనులు చేయని ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థను ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టాలి. కానీ, రాయపాటి పార్టీ మారడంతో.. ఆయనకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీనికి తోడు కొత్తగా సబ్‌ కాంట్రాక్టులకు అనుమతించింది. సబ్‌ కాంట్రాక్ట్‌లను నియమించి.. వారికీ కోట్ల రూపాయలను ఉదారంగా మంజూరు చేస్తోంది. 
సబ్ కాంట్రాక్టర్లకు పోలవరం హెడ్ వర్క్స్ పనులు  
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీలో రూ.142.88 కోట్ల పనులు మైదుకూరు టీడీపీ ఇంఛార్జ్‌ పుట్టా సుధాకర్ యాదవ్ కు, కుడి కాలువకు సంబంధించి ఏడో ప్యాకేజీలో రూ.252 కోట్ల పనులను బొల్లినేని శీనయ్యకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. ఇదే తరహాలో పోలవరం హెడ్ వర్క్స్ పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. 
నిబంధనలకు విరుద్ధంగా సబ్‌కాంట్రాక్ట్‌లు 
వాస్తవానికి ప్రధాన గుత్తేదారుకు ముట్టచెప్పిన మొబిలైజేషన్ అడ్వాన్స్ వసూలు చేపట్టాలి. అలాంటివేమీ లేకుండానే ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్ స్ట్రక్షన్ నిబంధనలను తుంగలో తొక్కి మరీ ..సబ్ కాంట్రాక్టర్లకు పని ఆధారిత బయానాగా కోట్లరూపాయలు ముట్టచెప్పేందుకు ఏపీ కేబినెట్ తీర్మానించింది. నిబంధనలకు విరుద్ధంగా సబ్‌కాంట్రాక్ట్‌లు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడ్వాన్స్‌ రూపంలో కోట్లాది రూపాయలను అప్పగించడం వెనుక భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

 

20:36 - February 5, 2017

హైదరాబాద్ : ఏపీ రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవనం ప్రతిష్టాత్మకమైన సమావేశాలకు వేదిక కానుంది. ఈనెల  10,11,12 తేదీల్లో తొలిసారిగా జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుపై గవర్నర్‌  నరసింహన్‌, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌ గజపతిరాజు, బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపిచంద్‌ వీడియో సందేశాలు పంపారు. స్త్రీ శక్తి ఒక ముఖ్యమైన చిహ్నమని, ప్రేరణాత్మక అభ్యసమని గవర్నర్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాల్లో  మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి గొంతుక వినిపించాలన్నారు. కీలక రంగాల్లో ప్రతిష్టాత్మక భూమిక నిర్వహిస్తున్న మహిళలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించడం చాలా అవసరమని కేంద్రమంత్రి వెంకయ్య అన్నారు. అన్ని రంగాల స్త్రీలు  జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొని.. మహిళా సాధికారతపై అభిప్రాయాలు, ఆలోచనలు అందివ్వాలని కేంద్రమంత్రి  అశోక్‌గజపతిరాజు కోరారు. మహిళల సమస్యలు వెలుగులోకి తెచ్చేందుకు మహిళా నాయకత్వం చాలా అవసరమని బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపిచంద్‌ అభిప్రాయపడ్డారు. 

 

20:30 - February 5, 2017

విజయవాడ : ప్రమాదకరమైన వ్యక్తి దేశాధ్యక్షుడైతే..ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను చూస్తే అర్థం అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంచి నేత ఉంటే దేశమైనా, రాష్ట్రమైనా మంచిగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు.  ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో మన భారతీయులదే పైచేయని బాబు కొనియాడారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ కంపెనీల్లో సీఈవోలుగా ఉన్న సత్యనాదెళ్ల, సుందర్‌పిచాయ్‌లు భారతీయులేనని ఆయన గుర్తు చేశారు. 
అమెరికాలో గందరగోళం 
ఒక వ్యక్తి దేశాన్ని ఎంత భ్రష్టుపట్టిస్తాడన్నదానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపే ఉదాహరణ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమెరికాలో ఇప్పుడు గందరగోళంగా ఉందని, అతలాకుతలం అయిపోతుందని అన్నారు. విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీ ప్రాంగణంలో ఏపీ మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి నాయకుడు ఉంటే దేశం కానీ, రాష్ట్రం కానీ మంచి అభివృద్ధి చెందుతుందని అన్నారు. లేకపోతే దేశం, రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఉంటుందని అన్నారు. భారత దేశంలో ఎక్కడలేనటువంటి యువత మన సొంతమని, అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గిపోతుందని, ఒకప్పుడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన తాను ఇప్పుడు పిల్లల్ని కనండని చెబుతున్నానని ముఖ్యమంత్రి అన్నారు.
ఇండియన్స్‌కు కామన్‌సెన్స్ ఎక్కువ : సీఎం చంద్రబాబు
ప్రపంచంలో ఎవరికి ఏ సర్వీస్ కావాలన్నా అందించే శక్తి సామర్థ్యం ఒక్క భారత దేశానికే ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాంటి సర్వీసులు అందించాలంటే చదవు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. కామన్‌సెన్స్ అనేది ఇండియన్స్‌కు ఎక్కువ ఉందని, అందుకే క్లాస్ రూంలో చదువుకోకపోయినా ప్రపంచంలో రాణించగలుతున్నారంటే కామన్‌సెన్స్, పట్టుదల కారణమని అన్నారు. అలాగే పిల్లలకు మంచి చదవు అందించగలిగితే ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోని విధంగా భారత్ నెంబర్ వన్ దేశం అవుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో అన్ని వనరులు ఉన్నా చాలా ఇబ్బంది పడ్డామని, 16వేల కోట్ల అప్పుతో రాష్ట్రం వచ్చిందని, అయితే కష్టాలు శాశ్వతం కాదని, కష్టాలను అధిగమించి ముందుకు వెళతామనే నమ్మకం తనకు ఉందని చంద్రబాబు అన్నారు. ఉపాధ్యాయులు సరిగ్గా పనిచేస్తే ప్రైవేటు స్కూళ్లే ఉండవని బాబు అభిప్రాయపడ్డారు. 
ఏపీ అభివృద్ధికి కృషి : సీఎం చంద్రబాబు
రెండున్నరేళ్లుగా వినూత్నమైన పద్ధతిలో ఏపీ అభివృద్దికి కృషి చేస్తున్నానని, సమస్యలు పరిష్కరించుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఉపాధ్యాయులకు ఏ లోటు చేయలేదని బాబు అన్నారు. టీచర్ అనేవాళ్లు ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. సమాజంలో తల్లీ, తండ్రీ తర్వాత గురువేనని, ఆ గురువు స్థానాన్ని కాపాడాలని ఆయన అన్నారు.  

 

19:47 - February 5, 2017

కృష్ణా : పచ్చని పంటపొలాలతో కళకళలాడిన ఆ భూములు.. చేపల చెరువులుగా మారుతున్నాయి. నిత్యం సాగులో ఉండే దళితుల భూములు.. ఉప్పునీటి చెరువులుగా మారిపోతున్నాయి. చుట్టూ నీళ్లున్నా.. తాగేందుకు చుక్కబొట్టు లేక దళితులు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. పేదలు, దళితుల భూముల్లో చేపల, రొయ్యల పెంపకం చేపట్టి భారీ ఎత్తున లాభాలు గడిస్తున్న ఆక్వా మాఫియా.. యజమానులకు మాత్రం తీవ్ర నష్టం చేస్తోంది. కృష్ణా జిల్లాలో దళితుల భూముల్ని కొల్లగొట్టి.. వారి కడుపు కొడుతున్న చేపల చెరువుల పై స్పెషల్ స్టోరీ...! 
దళితుల పొట్ట కొడుతున్న పెత్తందారులు  
ఇదీ.. కృష్ణా జిల్లాలో ఆక్వా వ్యాపారులు, పెత్తందార్లు రెచ్చిపోతున్న తీరు. నందివాడ మండలం ఇలపర్రు గ్రామ పరిధిలో దళితులకు చెందిన 165 ఎకరాల అసైన్డ్‌ భూముల్ని కొందరు పెత్తందార్లు, ఆక్వా వ్యాపారులు ఆక్రమించి చేపల చెరువులుగా మార్చారు. దశాబ్దానికి పైగా దళితుల భూముల్లో ఆక్వా సాగు చేస్తూ కోట్లు గడిస్తున్న వ్యాపారులు.. దళితుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఇదే విషయమై కొంతకాలంగా పోరాటానికి దిగిన బాధితులు, దళితులకు సీపీఎం అండగా నిలుస్తూ వస్తోంది.  
దళితుల భూములపై పెత్తందారుల కన్ను 
ఇలపర్రు గ్రామ ఆయకట్టు 4,629 ఎకరాలు కాగా, అందులో చెరువులుగా మారినవి 4,429 ఎకరాలు. పట్టా భూమి 1800 ఎకరాలుంటే, అసైన్డ్ భూమి 2,300 ఎకరాలు. చాలాకాలంగా దళితులు సాగు చేస్తూ వస్తున్న 165 ఎకరాల భూములపై కొంతమంది పెత్తందారుల కన్నుపడింది. అంతే.. దళితులకు తెలియకుండానే తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని.. లీజు పేరిట ఆ భూముల్ని కాజేశారు. కొన్నాళ్లు లీజు డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చిన సదరు పెత్తం దారులు కాలక్రమంలో దళితుల భూముల్ని వారి కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. 
పెత్తందారులకు సహకరిస్తున్న అధికారులు  
పెత్తందార్ల మోసాలకు బలైన దళితులు.. చేసేది లేక న్యాయం కోసం ప్రభుత్వాన్ని, హైకోర్టును ఆశ్రయించారు. 2007లో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో ఎంజాయ్‌మెంట్ సర్వే చేయించారు. ఆ సర్వేలో పెత్తందారులకు అనుకూలంగా నివేదికలు ఇచ్చిన వీఆర్వో సైతం సస్పెన్షన్‌కు గురయ్యారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులు, న్యాయస్థానాల ఆదేశాలు దళితులకు అనుకూలంగా వచ్చాయి. అయినా.. అధికారులు మాత్రం పెత్తందారులకు సహకరిస్తూనే వస్తున్నారు. 
వ్యకాస, కేవీపీఎస్ నేతలపై అక్రమ కేసులు 
బాధితులకు అండగా నిలిచిన వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. కానీ... బాధితులు పెత్తందార్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినా.. పోలీసులు మాత్రం ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో గుడివాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే దీక్షలకు దిగారు. 
దళితుల పోరాటానికి సీపీఎం మద్ధతు 
దళితుల పోరాటానికి సీపీఎం మద్ధతునిచ్చింది. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఎం తూర్పు కృష్ణాజిల్లా కార్యదర్శి, పలువురు నేతలు బాధితులకు  భరోసా ఇచ్చి ఆ ప్రాంతంలో పర్యటించారు. ఫిబ్రవరి 6వ తేదీలోగా సమస్యను పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. సమస్యను పరిష్కరించి దళితులు, పేదలకు న్యాయం చేయాలని లేకపోతే భవిష్యత్‌లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని సీపీఎం నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

తమిళనాడు ప్రజలకు ఈరోజు బ్లాక్ డే : డీఎంకే

చెన్నై : తమిళనాడు ప్రజలకు ఈరోజు బ్లాక్ డే అని డీఎంకే పేర్కొంది. శశికళను ముఖ్యమంత్రిగా అంగీకరించమని తేల్చి చెప్పారు. శశికళకు రాజకీయ అనుభవం లేదన్నారు.  

 

తమిళ ప్రజల అభివృద్ధికి కృషి : సీఎం శశికళ

చెన్నై : తమిళ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని నూతన సీఎం శశికళ అన్నారు. అమ్మ సిద్ధాంతాల కోసం పని చేస్తానని చెప్పారు. శాసనసభాపక్ష నేతగా తనను సెల్వం ప్రతిపాదించారని తెలిపారు. 

 

డేవిస్ కప్.. న్యూజిలాండ్ పై భారత్ ఆధిక్యం

హైదరాబాద్ : డేవిస్ కప్ లో న్యూజిలాండ్ పై భారత్ 3...1 ఆధిక్యంలో ఉంది. రివర్స్ సింగిల్స్ తొలి మ్యాచ్ లో 7...5, 6...1, 6...0 తేడాతో టియర్ నెపై రాంకుమార్ రామనాథన్ విజయం సాధించారు. 

 

దశలవారీగా గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. దశల వారీగా గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు. లబ్ధిదారుల ఎంపికకు లాటరీ పద్ధతిని అనుసరించాలని తెలిపారు. వెటర్నరీ విద్యనభ్యసించిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పారు. ఆయా జిల్లాల సరిహద్దు రాష్ట్రాల నుంచి గొర్రె పిల్లలను కొనుగోలు చేయాలని సూచించారు.  

 

19:13 - February 5, 2017

హైదరాబాద్ : యూనివర్శిటీ కొన్నేళ్లుగా కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. సరైన నియామకాలు లేక వర్శిటీలో అధ్యాపకులు లేరు. దీంతో విద్యా ప్రమాణాల్లో నాణ్యాతా లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఓ వైపు నాక్‌ అక్రిడియేషన్‌ కోల్పోవడంతో పాటు... ఉద్యోగులు, విద్యార్థులు అనేక సమస్యలతో ఉద్యమబాట పడుతున్న పరిస్థితి నెలకొంది. 
ఎన్నో సంఘటనలు 
ఉస్మానియా యూనివర్సిటీ పేరు వింటేనే కళ్లముందు ఎన్నో సంఘటనలు కదలాడుతాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే ప్రతి అంశాలపై క్షణ క్షణం స్పందిస్తూ.. పిడికిలి బిగించే తత్వం, నిలదీసే ధైర్యం ఈ వర్సిటీ విద్యార్థుల సొంతం.  
కోటిమందికి పైగా విద్యార్ధులు విద్య అభ్యాసనం
ఉస్మానియా యూవర్సిటీలో ఇప్పటి వరకు కోటిమందికి పైగా విద్యార్ధులు విద్యనభ్యసించారు.  ఓయూ పరిధిలో మొత్తం 720 కళాశాలలు పనిచేస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేలమంది విద్యార్ధులు చేరుతుంటారు. ఓయూ తన వందేళ్ల చరిత్రలో ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంది. అయితే ఐదారేళ్ల నుంచి యూనివర్శిటీకీ సరైన నిధులు లేక అభివృద్ధి పనులు పూర్తిగా అటకెక్కిన పరిస్థితి ఉంది. సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. యూనివర్సిటీ భవనాలు, హాస్టల్‌ విద్యార్థుల సమస్యలు, ఎప్పుడు కూలుతాయో కూడా తెలియని భవనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 
ఒకప్పుడు 2 వేల ఎకరాలు...ఇప్పుడు 1500 ఎకరాలు
ఒకప్పుడు రెండువేల ఎకరాలకు పైగా ఉండే విశ్వవిద్యాలయం.. ఇప్పుడు 1500 ఎకరాలకు పడిపోయింది. యూనివర్సిటీ చుట్టుపక్కల స్థలాలు కబ్జాలకు గురికావడంతో పాటు.. ఆ కబ్జాల పర్వం రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వీటితో పాటు వర్శిటీలో చాలా ఏళ్లుగా నాన్‌బోర్డర్స్‌ సమస్య పీడిస్తోంది.  కొందరు విద్యార్ధులు చదువులు పూర్తయినా... వర్సిటీలోనే తిష్ట వేసి ఉండటంతో ఉన్న సదుపాయాలు అందరికీ సరిపోక ఇబ్బందులు పడుతున్నారు.  
తెలంగాణ ఉద్యమం..ఓయూ కీలక భూమిక 
1969 నాటి తెలంగాణ ఉద్యమం మొదలు.. మలిదశ ప్రత్యేక రాష్ట్ర పోరాటం వరకు కీలక భూమిక పోషించిన చరిత్ర ఓయూది. ఇప్పుడు అనేక  సమస్యలతో వర్సిటీ సతమతమవుతోంది. ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే యూనివర్శిటీ సమస్యలను పరిష్కరించి శతాబ్ధి ఉత్సవాలను నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి  డిమాండ్‌ చేశారు. 
సిబ్బంది జీతభత్యాలకు మెస్ బకాయిలు.. 
ఇటీవల కాలంలో 7కోట్ల రూపాయల మెస్ బకాయిలు విడుదలయితే.. వాటిని సిబ్బంది జీతభత్యాలకు మళ్లించారు. కొంతకాలంగా పాలకమండలి లేక అధ్యాపకుల నియామకాలు నిలిచిపోయాయి. వర్సిటీ పరమైన నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్నాయి. పాలకమండలి లేక.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోక అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వర్సిటీ భవితవ్యం ఏంటన్న ఆందోళన విద్యావేత్తలో పెరుగుతోంది. అనేక సమస్యల నడుమ శతాబ్ధి ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఉస్మానియా యూనివర్సిటీకి.. పూర్వ వైభవం ఒనగూరాలని.. విద్యార్థులు, అధ్యాపకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  మరి ఈ ప్రభుత్వం వర్సిటీ సమస్యలు తీర్చి... గత వైభవ ఘనకీర్తిని మూటగట్టడంలో ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి. 
 

19:04 - February 5, 2017

కృష్ణా : జిల్లాలో నందివాడ మండలం ఇలపర్రులో టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.. గ్రామంలో భారీగా పోలీసుల్ని మోహరించారు.. ఆక్రమిత భూముల్ని రేపు స్వాధీనం చేసుకుంటామన్న దళితుల ప్రకటనతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు.. ఇలపర్రు చుట్టుపక్కల గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించారు.. ఆక్రమిత భూములవద్ద 145 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.. ఇలపర్రులో పోలీసుల చెక్‌పోస్ట్ ఏర్పాటుచేశారు.. గ్రామానికి ఎవరూ రావొద్దని ఆదేశించారు.. ఇంటింటినీ తనిఖీ చేస్తూ... ఆధార్‌కార్డుతోనే బయటకు రావాలని గ్రామస్తులకు ఆంక్షలు పెడుతున్నారు.. ఆక్రమణకుగురైన తమ భూముల్ని తిరిగి ఇప్పించాలంటూ 140రోజులుగా దళితులు పోరాటం చేస్తున్నారు.. వీరి ఉద్యమానికి సీపీఎం, కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం అండగా నిలిచింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కలెక్టర్లతో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ : కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. సమస్యల తక్షణ పరిష్కారం కోసం కలెక్టర్లకు రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఏడాది లోపు కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలు పూర్తి కావాలన్నారు. అనాథ పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒంటరి మహిళలను గుర్తించి భృతి చెల్లించాలని పేర్కొన్నారు. 'మా ఊరు..మన ప్రణాళిక' కార్యక్రమం మరోసారి నిర్వహించాలని చెప్పారు. కలెక్టర్లు గ్రామ సందర్శనలో 
దళిత వాడలు, గిరిజన తండాలను పరిశీలించాలన్నారు. 

18:48 - February 5, 2017

హైదరాబాద్ : తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాల నిర్వహణకు సర్కార్‌ సమాయత్తమవుతోంది. ఉత్సవాలను ఏప్రిల్‌లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిచేందుకు కసరత్తు చేస్తోంది. అన్ని యూనివర్శిటీల వైస్ చాన్స్‌లర్లతోపాటు,.. పూర్వ విద్యార్థులూ పెద్దసంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరుకానున్నారు.  
కళాప్రదర్శనలు 
ఎందరో వీరులను..మరెందరో నాయకులను తీర్చిదిద్దిన ఉద్యమాల పురిటిగడ్డ..ఉస్మానియా యూనివర్సిటీ. ఈ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 26, 27 తేదీల్లో ప్రారంభం కానున్న ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని టీ.సర్కార్‌ సన్నద్ధం అవుతోంది. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కళాప్రదర్శనలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  
ఓయూ నుంచి తెలంగాణ ఉద్యమం 
ఉస్మానియా యూనివర్శిటీ నుంచే ప్రత్యేక రాష్ట్రం కోసం.. తెలంగాణ ఉద్యమం మొదలైంది.. విద్యార్థులు, అధ్యాపకులు ఈ ఉద్యమంలో కదం తొక్కారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు .. అప్పటి నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన ఎందరో ప్రముఖులు.. ఇక్కడే ఉద్యమ ఓనమాలు దిద్దారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేయడంలో ఉస్మానియా విద్యార్థులు పోషించిన పాత్ర ఎవరూ కాదనలేనిది.  
యూనివర్సిటీకి గొప్ప చరిత్ర
ఎన్నో పోరాటాలకే కాదు... విద్యార్ధులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలోనూ ఈ యూనివర్సిటీకి గొప్ప చరిత్రే ఉంది. ఎంతోమంది మేధావులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు, విప్లవ వీరులు, ఉత్తమ పార్లమెంటేరియన్స్‌నూ అందించింది. ఇక్కడ చదివిన ఎంతోమంది విద్యార్ధులూ దేశ విదేశాల్లో అనేక రంగాల్లో స్థిరపడ్డారు. అంతేకాదు.. వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీలోనూ ఉస్మానియా యూనివర్సిటీ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొంది. 
విశ్వవిద్యాలయం ఖ్యాతి ఘనంగా చాటాలని... 
ఉస్మానియాలో చదివి వివిధ రంగాల్లో ప్రఖ్యాతి చెందిన వారిపై ఓ పుస్తకాన్ని కూడా ప్రచురిస్తున్నారు. ఓయూ చరిత్రను భావి తరాలకు అందించేలా వీడియో రూపొందిస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. యూనివర్సిటీ ప్రారంభం నుంచి నేటి వరకు ప్రచురించిన వంద పబ్లికేషన్స్‌తో ఓ పుస్తకం తీసుకువచ్చి.. విశ్వవిద్యాలయం ఖ్యాతిని ఘనంగా చాటాలనీ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 

 

18:38 - February 5, 2017

హైదరాబాద్ : ఉద్యమాల పురిటి గడ్డగా పేరున్న ఉస్మానియా యూనివర్సిటీ.. ఎందరో ప్రముఖులను ఈ దేశానికి అందించింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు.. డాక్టర్లు, యాక్టర్లు మొదలుకుని.. ఎందరో రాజకీయ నేతలకు ఈ విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉంది. మేధావులకు నిలయంగా పేరున్న ఓయూ త్వరలోనే శతాబ్ది ఉత్సవాలను జరుపుకొనేందుకు సిద్ధమవుతోంది. ఎన్నో విశిష్టతలున్న ఉస్మానియా యూనివర్సిటీపై నిర్లక్ష్యపు నీలినీడలూ కమ్మకున్నాయి. ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీపై 10టివి స్పెషల్ ఫోకస్‌....! 
ఎందరో మేధావులను అందించిన ఓయూ 
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాలయంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రసిద్ధి. ఓయూలో చదవాలన్నది ప్రతి విద్యార్థి స్వప్నం. ఇక్కడ విద్యాభ్యాసం చేస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని విద్యార్థుల నమ్మకం. వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీలో ప్రత్యేక స్థానం సాధించిన ఘనత ఓయూ సొంతం. కవులు, గాయకులు, డాక్టర్లు, యాక్టర్లు.. వీరితో పాటు ఎందరో మేధావులను  ఈ దేశానికి అందించిన ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఉస్మానియా యూనివర్సిటీ. అంతేకాదు..సమకాలీన రాజకీయ నాయకుల్లో మరెందరో నేతలు ఈ విద్యాలయం నుంచే తమ భవిష్యత్తును  తీర్చిదిద్దుకున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు మొదలుకుని... ప్రముఖ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ వరకు.. అనేక మంది ప్రముఖులు ఉస్మానియా యూనివర్సిటీతో అనుబంధాన్ని పెనవేసుకున్నవారే. 
ఓయూలో చదవాలన్న ఆశయంతో ప్రణాళికలు 
మీరెక్కడ చదివారు.. అని ఎవరినైనా ఉన్నత విద్యావంతులను, అధికారులను ప్రశ్నిస్తే.. చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ అనే చెబుతుంటారు. అంతేకాదు.. స్కూల్‌, కాలేజీ విద్యార్జనలో ఉండగానే చాలా మంది విద్యార్థులు..ఓయూలో చదవాలన్న ఆశయంతో ప్రణాళికలు రచించుకుంటారంటే ఓయూకు ఉన్న పేరు, ప్రతిష్టలు..ప్రత్యేకత ఎలాంటిదో చెప్పకనే చెప్పవచ్చు. 
1917లో ఉస్మానియా యూనివర్సిటీ స్థాపన 
ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత పేరుందో... అంత చరిత్ర కూడా ఉంది. 1917లో 7వ నిజాం ప్రభువు మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌.. ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ఈ విద్యాలయం ఎందరో ప్రముఖులను దేశానికి అందిస్తూ వస్తోంది. అప్పటి నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన ఎందరో ప్రముఖులు ఇక్కడే ఉద్యమ ఓనమాలు శ్రీకారం చుట్టారు. స్వాతంత్ర్యానికి ముందు.. తర్వాత తెలంగాణ గడ్డపై జరిగిన ఎన్నో ఉద్యమాలకు ఈ యూనివర్శిటీ నాంది పలికింది. 
యూనివర్శిటీపై ప్రభుత్వాల ఉదాసీనత 
ఇంతటి ఘన చరిత్ర కలిగిన యూనివర్శిటీ రానూ రానూ ప్రభుత్వాల ఉదాసీనతకు గురవుతూ వచ్చింది. విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలతో పాటు నిధులు, వసతుల సమస్యలు పెరుగుతూ వచ్చాయి. అనేక సార్లు విద్యార్థులు సమస్యలపై పోరుబాట పడుతూనే ఉన్నారు. అయినా సమస్యలను పట్టించుకుని పరిష్కరించిన దాఖలాలు లేవు.  
ఒకవైపు పేరుకుపోయిన సమస్యలు.. 
ఒకవైపు పేరుకుపోయిన సమస్యలు.. మరోవైపు వందేళ్లకు చేరుకుంటున్న యూనివర్సిటీ. ఏప్రిల్‌ 26న ఉస్మానియా యూనివర్సిటీ నెలకొని వందేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకొనేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ నిధుల కొరత మాత్రం ఇంకా వేధిస్తూనే ఉంది. ఇప్పటికే నిధుల కొరత గురించి అటు కేంద్రానికి.. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి యూనివర్సిటీ అధికారులు ప్రతిపాదనలు పంపించినా ఫలితం లేకుండా పోయింది.  
ఉత్సవాలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ఆహ్వానం..?
మరోవైపు శతాబ్ధి ఉత్సవాలకు ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఆహ్వానించాలని సిద్ధమవుతున్నా.. నిధుల విషయంలో ప్రభుత్వాలు సానుకూలంగా లేకపోవడంతో యూనివర్సిటీ అధికారులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. ఉత్సవాల సమయం ముంచుకొస్తుండటంతో నిధుల కొరత కారణంగా నానా హైరానా పడుతున్నారు. 
సరైన సంఖ్యలో అధ్యాపకులు లేరు
సరైన సంఖ్యలో అధ్యాపకులు లేరు. ప్రతి ఏటా అనేక మంది ప్రొఫెసర్లు రిటైర్‌  అవుతున్నా..నియామకాలు మాత్రం చేపట్టడం లేదు. 2018 నాటికి ఉన్న ప్రొఫెసర్లందరూ పదవీ విరమణ చేయబోతున్నారు. కానీ ఇప్పటివరకు  డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టడం లేదు. దాదాపు సగానికి పైగా కాంట్రాక్టు అధ్యాపకులతోనే బోధన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎంతో కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్‌ చేయడం లేదు. చివరికి కొన్ని శాఖల్లో హెచ్‌వోడీలు కూడా కాంట్రాక్టు అధ్యాపకులే ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 
సంబరాల కోసం అనేక కమిటీల ఏర్పాటు 
యూనివర్శిటీ వందేళ్ల సంబరాల కోసం ఇప్పటికే అనేక కమిటీలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణకు కూడా నిధులు లేక యూనివర్సిటీ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తగినన్ని నిధులు విడుదల చేసి శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఎంతో పేరు ప్రతిష్టలు గల యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలను నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.  

 

18:25 - February 5, 2017

ఖమ్మం : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తెలంగాణలో చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 112 రోజులు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పర్యటిస్తున్న యాత్ర ఈ రోజు 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. మూడు వేల కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా తల్లాడలో సీపీఎం ఫైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు 10టివితో మాట్లాడారు. వారి మాటలను వీడియోలో చూద్దాం...

18:16 - February 5, 2017

హైదరాబాద్ : ఒకరు గోతులు తవ్వుతారు.. మరొకరు  పూడ్చేస్తారు. ఒకరు మొక్కలు నాటుతారు..మరొకరు వాటిని పీకేస్తారు. పచ్చదనం కోసం ప్రభుత్వం హంగామా చేస్తుంటే.. ఉన్న చెట్లనే అడ్డదిడ్డంగా నరికేస్తోంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌.  ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయ లోపంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. అధికారుల ఇష్టారాజ్యంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. 
పచ్చదనాన్ని హరిస్తున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ 
గ్రైటర్‌ హైదరాబాద్‌ ఇపుడు అస్తవ్యస్థ నగరంగా మారింది. రోడ్లన్నీ తవ్విపోస్తుండటంతో .. నగరం మొత్తం గోతులు, గొప్పులతో నిండిపోయింది. ఓవైపు పచ్చదనం పెంచడానికి ప్రభుత్వం పథకాలు రచించి కోట్లరూపాయలు ఖర్చుచేస్తుంటే.. ఉన్నచెట్లనే అడ్డంగా నరికేస్తున్నారు ఎలక్ట్రిసిటీ అధికారులు. 
ఇష్టారాజ్యంగా మారిన చెట్ల తొలగింపు
విద్యుత్‌ తీగలకు అడ్డొస్తున్న చెట్లను తొలగించే పనిని కాంట్రాక్టర్లకు  అప్పగించడంతో వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొట్టేసిన చెట్లను , కొమ్మలను ఇదిగో ఇలా ఫుట్‌పాత్‌లపైనే అడ్డదిడ్డంగా వదిలేస్తున్నారు. 
వందలాది చెట్ల నరికివేత 
ఇలా గ్రేటర్‌ పరిధిలో వందలాది చెట్లను నరికిపారేస్తున్నారు. నిజానికి విద్యుత్‌ లైన్లకు అడ్డొస్తున్న చెట్టను కొమ్మలు మాత్రమే కొట్టి ట్రిమ్‌చేయాలి. ఏడాదికి మూడుసార్లు ఇలా కొమ్మలను తొలగించాల్సి ఉంది. కాని మొత్తానికి చెట్లనే తొలగిస్తున్నారు.  పైగా ఎన్నిరోజులైనా వాటిని తొలగించకపోవడంతో.. నగరంలో జనం నడవడానికే చోటులేకండా  పోయింది. అటు స్వచ్‌ సర్వేక్షణ్‌ పేరుతో నగరంలో చెత్తాచెదారాన్ని తొలగిస్తున్న బల్దియా కు ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌ మెంట్‌ తీరు తలనొప్పిగా మారింది. 
నగరాన్ని నరకంగా మార్చుతున్న అధికారులు  
పైస్థాయి అధికారులు ఎన్నిసార్లు మీటింగులు పెట్టి.. డిపార్ట్‌మెంట్ల మధ్య సమన్వయం ఉండాలని సూచించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఏమార్పు కనిపించడంలేదు. చివరికి మంత్రులు కూడా కల్పించుకుని సూచనలిచ్చినా..'మాదారి మాదే అంటూ' అధికారులు నగరాన్ని నరకంగా మార్చేస్తున్నారు. 

 

17:45 - February 5, 2017

హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలంగాణలో స్కూల్ టైమింగ్స్ మారనున్నాయా? పొద్దున్నే లేచి స్కూల్‌కు వెళ్లేందుకు ఆపసోపాలే పడే పిల్లలకు కాస్త రిలాక్స్‌డ్ గా రెఢీ అయ్యే చాన్స్ దొరకబోతోందా? అంటే అవుననే అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠ‌శాల‌ల్లో  టైమింగ్‌ని మార్చాల‌ని విద్యార్ధుల త‌ల్లిదండ్రులు కోరిక మేరకు ప్రభుత్వ ఆ దిశగా అడుగులు వేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. 
ర్యాంకులే టార్గెట్‌ 
ర్యాంకులే టార్గెట్‌ మారిన చదువులతో చిన్నారుల జీవితాలు యాంత్రికంగా మారిపోయాయి. ఉద‌యం లేవ‌గానే, కిలోల కొద్ది పుస్తకాల బ్యాగులు భుజానికి త‌గిలించుకొని హడావిడిగా పాఠ‌శాల‌కు వెళ్లడం, సాయత్రం ట్యూష‌న్ లు ఇలా  కేజీ నుంచే విద్యార్ధుల జీవితం గజిబిజి గందరగోళంగా తయారవుతోంది.  
ఇక నుంచి 10గం.లకే స్కూల్ స్టార్ట్‌...? 
చిన్నారులకు కష్టాలమయంగా మారిన పాఠశాల జీవితాన్ని ఇష్టంగా మార్చేందుకు ఉన్న అవకాశాలను తెలంగాణ సర్కార్‌ పరిశీలిస్తోంది. తమ పిల్లల ఇబ్బందులను కొందరు తల్లిదండ్రులు సామాజిక మాధ్యమాల్లో ఏకరువు పెట్టడంతో.. మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బాల్యం సంతోషంగా సాగాలని ..వారిని ప్రెషర్‌ కుక్కర్‌లో పెంచే వాతావరణం మారాలని కేటీఆర్‌ ట్విటర్‌లో స్పందించారు. స్కూల్ టైమింగ్ మార్చాల‌ని పేరెంట్స్ చేసిన సూచ‌న‌పై స్పందించిన మంత్రి .. ఇక నుంచి 10గంటలకే స్కూల్ స్టార్ట్‌ చేయాలన్న దానిపై  సానుకూలత‌ వ్యక్తం చేశారు.
8గం.లకే ప్రారంభమైయ్యే పాఠశాలలతో పిల్లలు సతమతం 
8గంటలకే ప్రారంభమైయ్యే పాఠశాలలతో పిల్లలు సతమతం అవుతున్నారు. ఉదయం ఆరుగంటలకే మేల్కోవాల్సి రావడంతో...నిండా పదేళ్లయినా లేని చిన్నారులు నిద్రలేమితో బాధపడుతున్నారు. మానసిక ప్రశాంతత కరువై మానసికంగా కుంగిపోతున్నారు. కనీసం బ్రేక్‌ఫాస్ట్‌ చేయడానికి కూడా సమయం లేకపోవడంతో అనారోగ్యంపాలవుతున్నారని పేరెంట్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
యాజమాన్యాలు, తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం 
ప్రస్తుతం ఉదయం 8.30 నుంచి 9 గంటల లోపు పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ సమయాన్ని 9.30 నుంచి 10 గంటలకు మార్చాలని ప్రభుత్వ ఆలోచన వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అటు ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. అయితే తల్లిదండ్రుల్లో చాలామంది ఉదయం ఎనిమిదిన్నరకే ఉద్యోగాలు, పనులకు వెళుతుంటారని..ఆటైంలోనే పిల్లనను స్కూల్‌ బస్‌ ఎక్కించడానికి ఇష్టపడుతున్నారని స్కూల్‌ యాజమాన్యాలు అంటున్నాయి. ఈ విషయాలన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా ఇటు యాజమాన్యాలతో అటు తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. నిజానికి స్కూల్‌ టైమింగ్స్‌ మార్చాలని తల్లిదండ్రులు.. ప్రజాసంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ట్విట్స్ లో స్పందించడంతో పసివాళ్లపై ఒత్తిడి కొద్దిగానైనా తగ్గుతుందని తల్లిద్రండులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇలపర్రులో ఉత్కంఠ

కృష్ణా : నందివాడ మండలం ఇలపర్రులో ఉత్కంఠ నెలకొంది. రేపు ఆక్రమిత భూములపై పోరాటానికి దళితులు సిద్ధమయ్యారు. ఈ పోరాటానికి సీపీఎం, కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు తెలిపాయి. దళితుల భూపోరాటాన్ని నిరోధించడానికి ఇలపర్రుకు పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. 

 

ఇరిగేషన్ ప్రాజెక్టులపై జగన్ కు అవగాహన లేదన్న మంత్రి దేవినేని

విజయవాడ : ఇరిగేషన్ ప్రాజెక్టులపై జగన్ కు అవగాహన లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నం వృధా అనడం అవివేకమని ఎద్దేవా చేశారు. కడప జిల్లాకు కృష్ణా జలాలు తీసుకెళ్తే ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. కడప జిల్లాకు కృష్ణా జలాలు ఇచ్చిన ఘనత బాబుదే అన్నారు. తోటపల్లి ప్రాజెక్టును పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 

17:02 - February 5, 2017

హైదరాబాద్ : ఎస్సీల అభివృద్ధి కోసం మ‌నం ఎంతో చేశాం.. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేశాం.. అధిష్టానాన్ని కూడా ఒప్పించాం.. అయినా కానీ ఫలితం దక్కకుండా పోతుందా? మన క్రెడిట్‌ను టీఆర్ఎస్ కొట్టేస్తుందా? ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలను కలవరపెడుతున్న ప్రశ్న.. తెలంగాణలో మ‌రోసారి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం తెర‌పైకి వ‌చ్చింది. వ‌ర్గీక‌ర‌ణపై ప్రధానమంత్రి మోదీతో చర్చించడానికి సీఎం కేసీఆర్ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లనున్నారు. ఈ క్రెడిట్‌ను దక్కించుకోవడానికి అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.  ముఖ్యంగా తమ పోరాటాల వల్లే వర్గీకరణపై కేసీఆర్ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళుతున్నారని కాంగ్రెస్ భావిస్తోంది.
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు కాంగ్రెస్ మొద‌టి నుంచి మద్దతు
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు కాంగ్రెస్ పార్టీ మొద‌టి నుంచి మద్దతు పలుకుతూనే ఉంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2009లో అసెంబ్లీలో వ‌ర్గీక‌ర‌ణ చేయాలంటూ తీర్మానం చేసి యూపీఏ ప్రభుత్వానికి పంపింది. అయితే సుప్రీం కోర్ట్ తీర్పు.. దీనికి తోడు తెలంగాణ ఉద్యమం కార‌ణంగా వ‌ర్గీక‌ర‌ణ అంశం మరుగున పడిపోయింది. అయితే ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పోరాటాలు చేయడంతో ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. 
వర్గీకరణకు కేంద్రం సానుకూలం : వెంకయ్య
మరోవైపు ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కూడా సానుకూలంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీంతో సీఎం కేసీఆర్ వర్గకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అయితే ఈ క్రెడిట్‌ను త‌మ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ , బీజేపీలు ప్రయ‌త్నం చేస్తున్నాయ‌న్న అభిప్రాయం ఇప్పడు కాంగ్రెస్‌ నేతలను వెంటాడుతుంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. వ‌ర్గీక‌ర‌ణ‌కు పునాదులు వేసిన పార్టీగా తమకు రావాల్సిన మైలేజీ రాకుండా పోతోందేమోన‌న్న భ‌యం పార్టీ నేత‌ల‌ను పీడిస్తోంది. 
ఎస్సీ నేత‌లు, ఇత‌ర నేత‌ల‌తో ఉత్తమ్‌ భేటీ  
గ‌త రెండున్నరేళ్లలో వ‌ర్గీక‌ర‌ణ కోసం పార్టీ ప‌రంగా ఒక్కటంటే ఒక్క కార్యక్రమం చేయ‌లేదు. దీంతో ఈ అంశంపై కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. విమర్శలను ఎలా అధిగ‌మించాల‌న్న దానిపై చ‌ర్చించేందుకు సీనియ‌ర్ ఎస్సీ నేత‌ల‌తోపాటు, ఇత‌ర నేత‌ల‌తో  పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. 
వ‌ర్గీక‌ర‌ణ క్రెడిట్‌ కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు కార్యాచరణ 
త్వరలో జరగనున్న అఖిల‌పక్షం భేటీ త‌ర్వాత వ‌ర్గీక‌ర‌ణ క్రెడిట్‌ను తమ వాటాలో వేసుకునేందుకు కార్యాచరణ ప్రారంభించింది. హైద‌రాబాద్ వేద‌క‌గా ద‌ళితుల‌తో విజ‌య శంఖారావం పేరుతో భారీ బ‌హిరంగ స‌భను నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటుంది హ‌స్తం పార్టీ. మొత్తానికి త‌మ పోరాటాలతోనే వ‌ర్గీక‌ర‌ణ సాధ్యమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయనే సందేశం మాదిగల్లో తీసుకురావాలని భావిస్తోంది. 

16:55 - February 5, 2017

హైదరాబాద్ : బీసీ సబ్‌ప్లాన్‌ను బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడితెస్తామని.. తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలు విగ్రహాల్ని పార్టీపరంగా ఘనంగా జరుపుతామని  ప్రకటించారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. గ్రామస్థాయినుంచి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. సామాజిక తెలంగాణ సాధన కాంగ్రెస్‌ ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 

 

16:52 - February 5, 2017

హైదరాబాద్ : పరీక్షల సమయంలో పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచవద్దని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్‌ సంజీవయ్య పార్కులో విజయీభవ వాక్‌థాన్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కడియం మాట్లాడుతూ వారిని స్వేచ్ఛగా చదువుకోవడానికి అవకాశం కల్పించినప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. చదువెంత ప్రధానమో ఆదరణ కూడా అంతే ప్రధానమని విద్యావేత్త చుక్కా రామయ్య తెలిపారు. పేద దళితులు, గిరిజనులు, బాలికలు ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారని..వారికి ప్రతి ఒక్కరూ చేయూత అందివ్వాలన్నారు. 

 

కోర్టులో ట్రంప్ కు మళ్లీ చుక్కెదురు

అమెరికా : కోర్టులో ట్రంప్ కు మళ్లీ చుక్కెదురైంది. పలు దేశాల వలసవాదుల ప్రవేశంపై ఉత్తర్వుల నిలిపివేత అప్పీల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. 

 

చిల్లకల్లు హైవేపై డీసీఎం దగ్ధం

కృష్ణా : జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు హైవేపై డీసీఎంలో మంటలు చెలరేగాయి. డీసీఎం పూర్తిగా దగ్ధం అయింది. నలుగురు సురక్షితంగా ఉన్నారు. 

 

16:13 - February 5, 2017
16:09 - February 5, 2017

విజయనగరం : జిల్లాలోని పార్వతీపురం మండలం తాళ్లబురిడిలో ఉద్రిక్తత నెలకొంది. బోడికొండ గ్రానైట్‌ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. కోకర్ణ కంపెనీకి చెందిన మైనింగ్‌ యంత్రాలను ధ్వంసం చేశారు. 

 

15:55 - February 5, 2017

ఢిల్లీ : సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గురైయ్యారు. కేజ్రీవాల్‌కు ఒక్కసారిగా బాడిలో షుగర్ లెవెల్స్‌ పెరిగాయి. దీంతో ఆయన షుగర్‌ను తగ్గించే చికిత్స కోసం ఈనెల 7న బెంగళూరు వెళ్లనున్నారు. అక్కడ ఆయన సుమారు 12 రోజులపాటు ప్రకృతి చికిత్సాలయంలో గడుపనున్నారు. 12 రోజుల చికిత్స తర్వాత కేజ్రీవాల్‌ ఢిల్లీకి చేరుకోనున్నారు.

 

15:53 - February 5, 2017

గుంటూరు : దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెండు మోడల్ పోలీస్ స్టేషన్లను పోలీస్ ఉన్నతాధికారులు నిర్మించారు. గుంటూరులో నిర్మించిన ఈ స్టేషన్లను సీఎం చంద్రబాబు రేపు ప్రారంభిస్తారు. సిబ్బందికి డ్రెస్ కోడ్‌, మెడలో ఐడీ కార్డును ఇచ్చారు. పోలీస్ స్టేషన్లు సాఫ్ట్‌వేర్ కంపెనీలను తలపిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:46 - February 5, 2017

హైదరాబాద్ : పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం.. పాలనా వికేంద్రీకరణ లక్ష్యాలుగా ఏర్పడిన.. కొత్తజిల్లాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావాలని కలెక్టర్లుకు కేసీఆర్ సూచించారు. ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రతీ కుటుంబం జీవన స్థితిగతులను అధ్యయనం చేసి.. పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించాలన్నారు. సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు బాగా పనిచేస్తున్నారని ప్రశసించారు. 9.5శాతం వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణకు తొలిస్థానం దక్కిందన్నారు. 

అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం.. పాలనా వికేంద్రీకరణ లక్ష్యాలుగా ఏర్పడిన.. కొత్తజిల్లాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావాలని కలెక్టర్లుకు కేసీఆర్ సూచించారు. 

 

అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం.. పాలనా వికేంద్రీకరణ లక్ష్యాలుగా ఏర్పడిన.. కొత్తజిల్లాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావాలని కలెక్టర్లుకు కేసీఆర్ సూచించారు. 

 

ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం.. పాలనా వికేంద్రీకరణ లక్ష్యాలుగా ఏర్పడిన.. కొత్తజిల్లాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావాలని కలెక్టర్లుకు కేసీఆర్ సూచించారు. ప్రతీ కుటుంబం జీవన స్థితిగతులను అధ్యయనం చేసి.. పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించాలన్నారు. 

15:39 - February 5, 2017

అనంతపురం : జిల్లాలోని మడకశిర మండలం మేళ్లవాయిలో రైతులు వింత నిరసన తెలిపారు. రైతుల పొలాల్లోకి అనుమతి లేకుండా హైటెన్షన్‌ వైర్లు వేస్తున్న కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాన్ని రైతులు అడ్డుకున్నారు. వైర్లు పట్టుకుని రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమకు పరిహారం చెల్లించలేదని ఆరోపించారు. రైతులకు మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మద్దతు తెలిపారు. 

 

తమిళనాడు సీఎంగా శశికళ ఏకగ్రీవ ఎన్నిక

చెన్నై : తమిళనాడు సీఎంగా శశికళను ఎన్నుకున్నారు. అన్నాడీఎంకే శాసనసభా పక్షం శశికళను సీఎంగా ఎన్నుకుంది. శాసనసభాపక్ష సమావేశంలో శశికళ పేరును పన్నీరు సెల్వం ప్రతిపాదించారు. శాసనసభాపక్షం ఆమెను సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

15:30 - February 5, 2017

చెన్నై : తమిళనాడు సీఎం ఎవరనేది తేలిపోయింది. సీఎం పదవిపై ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు తమిళనాడు సీఎంగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం నేతృత్వంలో జరిగిన సమావేశంలో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు ఇంఛార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు తెలియజేయనున్నారు. ఆయన ప్రస్తుతం చెన్నైలో లేకపోవడంతో.. వచ్చిన తర్వాత ఈ తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేయనున్నారు. ..  చెన్నైలో పార్టీ శాసనసభా పక్ష నేత ఎంపికకోసం అన్నా డీఎంకే సమావేశం ఏర్పాటుచేసింది.. ఈ కార్యక్రమంలో  పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. శశికళను పార్టీ శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదిస్తూ పన్నీరు సెల్వం ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అంతా హర్షధ్వానాలు తెలిపి ఆమోదం తెలిపారు. ఇప్పటికే పోయిస్‌గార్డెన్‌లో సుమారు రెండుగంటల పాటు శశికళతో పన్నీర్‌ సెల్వం సమావేశమై పదవీ బాధ్యతలు చేపట్టాలని కోరినట్టు తెలుస్తోంది. పన్నీర్‌ సెల్వం రాజీనామా లేఖను ప్రస్తుతం గవర్నర్‌కు పంపించాల్సి ఉంది. ఈ నెల 9, 10 తేదీల్లో శశికళ సీఎంగా ప్రమాణస్వీకారం చేపట్టే అవకాశముంది.. అప్పటివరకూ పన్నీర్‌ సెల్వం సీఎంగా కొనసాగుతారు. శశికళ పార్టీలో రెండో వ్యక్తిగా ఉన్నారు. దివంగత జయలలితతో ఆమె సన్నిహితంగా ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీలో శశికళకు సభ్యత్వం కూడా లేదు. శశికళ సీఎం అవ్వడం డిఎంకేకు ఏమాత్రం ఇష్టం లేదు. శశికళకు... సీఎం అయ్యే అర్హత ఏమాత్రం లేదని స్టాలిన్ భావిస్తున్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చేశారు. 

 

15:22 - February 5, 2017

చెన్నై : తమిళ రాజకీయాలు ఉత్కంఠత రేపుతున్నాయి. రాష్ట్రంలో క్షణక్షణం రాజకీయాలు మారుతున్నాయి. శశికళతో భేటీ అనంతరం పన్నీర్‌ సెల్వం మంత్రులతో సమావేశమయ్యారు. ఇటు శశికళ కూడా మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో జరగబోయే అన్నాడీఎంకే శాసనభాపక్ష సమావేశంలో శశికళను సీఎంగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

తమిళనాడులో మారుతున్న రాజకీయాలు

చెన్నై : తమిళనాడులో క్షణక్షణం రాజకీయాలు మారుతున్నాయి. శశికళతో భేటీ అనంతరం పన్నీర్ సెల్వం సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులతో శశికళ వరుస భేటీలు అయ్యారు.

బోడికొండ గ్రానైట్ తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు

విజయనగరం : పార్వతీపురం మండలం తాళ్లబురిడిలో ఉద్రిక్తత నెలకొంది. బోడికొండ గ్రానైట్ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. మైనింగ్ యంత్రాలను ధ్వంసం చేశారు. 

కొనసాగుతోన్న అన్నాడీఎంకే శాసన సభాపక్ష సమావేశం

చెన్నై : అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్నారు. 

13:34 - February 5, 2017
13:32 - February 5, 2017

ఖమ్మం : సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 112వ రోజు వీఎమ్ మంజూరులో పాదయాత్ర కొనసాగింది. టేకుపల్లి, రామకృష్ణాపురం, కల్లూరు, నూతన్ కల్, అంజనాపురం, తల్లాడలో పాదయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా పాదయాత్ర బృంద సభ్యుడు రమణతో టెన్ టివి మాట్లాడింది. కులవృత్తుల వారు అనేక సమస్యలు పడుతున్నారని, కులవృత్తులు చేసుకొనే ప్రజలకు సకాలంలో రుణాలు మంజూరు కావడం లేదని తెలిపారు. దీనితో కులవృత్తులు అంతిరించుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో కులవృత్తులు అంతరించిపోతున్నాయన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:26 - February 5, 2017

విజయవాడ : ఒక ప్రమాదకరమైన వ్యక్తి దేశానికి అధ్యక్షుడైతే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ట్రంప్ ను చూస్తే అర్థమౌతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలోని లయోల కాలేజీలో డీఈవో, హెడ్ మాస్టర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ..మనిషి జీవితంలో విద్య అనేది ఎంతో ముఖ్యమైందని, విద్య ఉంటే ఎంతైనా సంపాదించవచ్చన్నారు. విద్యకు ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీల సీఈవోలు మన భారతీయులేనని పేర్కొన్నారు.

దళిత..గిరిజనుల అభివృద్ధికి నిధులు - కేసీఆర్..

హైదరాబాద్ : చేపల పెంపకానికి రిజర్వాయర్లు ఉపయోగించుకోవాలని, దళిత గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీల ప్లాన్ లు సిద్ధం చేయాలన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టేలోగా జిల్లాల నుండి ప్రతిపాదనలు రావాలని, రెసిడెన్షియల్ పాఠశాలలకు స్థల సేకరణ చేయాలన్నారు.

ఏపీకి జాతీయ విద్యాలయాలు - బాబు..

విజయవాడ : అమరావతిలో డీఈవో, హెడ్ మాస్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ...రాష్ట్రానికి జాతీయ విద్యాలయాలు తీసుకొస్తున్నట్లు, రాజధాని రైతులకు కేపిటల్ గెయిన్ ట్యాక్స్ కు కేంద్రం అంగీకరించిందని గుర్తు చేశారు. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో కరవు మాయమవుతుందని, పట్టిసీమను ఒక్క ఏడాదిలో పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు.

13:12 - February 5, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర శాసనసభపక్ష నేతగా శశికళ ఎన్నికవుతారా ? సీఎం పదవి నుండి పన్నీర్ సెల్వం దిగబోతున్నారా ? ముఖ్యమంత్రి పీఠంపై శశికళ కూర్చొబోతున్నారా ? అనే ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది. అక్కడి రాజకీయాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. ప్రతొక్క ఎమ్మెల్యేలందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని శశికళ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ కార్యాలయానికి 134 మంది ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. సమావేశానికంటే ముందు పార్టీ సీనియర్ నేతలు, మంత్రుల్లో కొందరు పోయస్ గార్డెన్ కు వెళ్లి శశికళతో చర్చించినట్లు తెలుస్తోంది.

అక్రమాస్తుల కేసు...
ముఖ్యమంత్రి పదవిపై శశికళ కన్నేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పలు వ్యూహాలు రచిస్తూ ముందుకెళుతున్నారు. దీనిపై శశికళ వ్యతిరేక వర్గం విభేదిస్తోంది. సుప్రీం కోర్టులో ఇంకా అక్రమాస్తుల కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో శశికళ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శశికళ వ్యతిరేక వర్గం ఈ అంశాన్ని సమావేశంలో లేవనెత్తుతారని తెలుస్తోంది. కేసు తీర్పు వచ్చిన అనంతరం నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం.

దీప..స్టాలిన్ స్పందన..
శశికళ సీఎం అధిష్టించే హక్కు లేదని, ప్రజలే నిర్ణయిస్తారని జయ మేనకోడలు దీప ఓ జాతీయ ఛానెల్ తో వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై స్టాలిన్ కూడా వ్యాఖ్యానించారు. 'శశికళ ముఖ్యమంత్రి కావడం ఏమిటి? తమిళనాడు ప్రజలు జయలలితను చూసి ఓటేశారు.. వారి కుటుంబ సభ్యులను కాదు.'స్టాలిన్ వ్యాఖ్యలు. చేశారు.

పన్నీర్ సెల్వం వ్యూహాలు..

శాసనసభాపక్ష సమావేశానికి సీఎం పన్నీర్ సెల్వం హాజరౌతారా ? లేదా ?అనేది తెలియరావడం లేదు. జల్లికట్టు ఉద్యమం..ప్రజల ఆకాంక్ష నెరవేర్చడంలో విజయం సాధించడం జరిగిందని, ప్రజల ఆశీస్సులు..పార్టీ ఎమ్మెల్యే మద్దతు ఉందని సెల్వం అనచురులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. సీఎం పదవి పొగొట్టుకోకుండా పన్నీర్ సెల్వం వ్యూహాలు రచిస్తున్నారు.

ఉత్తారాఖండ్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..

డెహ్రాడూన్ : ఉత్తారాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డెహ్రాడూన్ లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది.

12:51 - February 5, 2017

తెలంగాణలో అద్భుత మానవశక్తి - కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణలో అద్భుత మానవశక్తి ఉందని, మానవ వనరులను గుర్తించి ప్రోత్సాహించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉదయం 11గంటలకు కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. పరిపాలనా సౌలభ్యం..ప్రజలకు సౌకర్యం.. పాలనా వికేంద్రీకరణ లక్ష్యాలుగా ఏర్పడిన కొత్త జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావాలన్నారు. ప్రతి కుటుంబం జీవనస్థితిగతులను అధ్యయనం చేసి పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించాలన్నారు. సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు బాగా పనిచేస్తున్నారని, కలెక్టర్ల పనితీరు తనకు సంతోషాన్నిస్తోందన్నారు.

12:42 - February 5, 2017

తెలంగాణ అంటేనే ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు పుట్టినిల్లు. ఇక్కడ ప్రజల్లో చైతన్యం తెచ్చింది పాటంటే అందులో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. తెలంగాణా మట్టిపై ఎందరో గేయ రచయితలు పుట్టుకొచ్చారు. వారిలో ఒకరు నల్గొండ జిల్లాకు చెందిన బూర్గుల ప్రభాకర్ ఒకరు. ఆయన 150కి పైగా పాటలు రాశాడు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. ప్రజాగేయరచయిత బూర్గుల ప్రభాకర్ విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

12:32 - February 5, 2017

సాహిత్యం సమాజానికి దర్పణం పడుతుంది. ప్రజలకు వినోద విజ్ఞానాలను అందిస్తుంది. ప్రజా ఉద్యమాలకు ఆలంబనంగా నిలుస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారెందరో తెలుగు నేలపై ఉన్నారు. నవీన్ రాసిన అంపశయ్య నవలను చలన చిత్రంగా తీసిన ప్రముఖ నవలా కారుడు ప్రభాకర్ జైని. తెలుగు సాహిత్యంలో లక్ష్యం, గమ్యం, రూపాయలొస్తున్నాయి లాంటి నవలలు రాసిన ప్రభాకర్ జైని అంపశయ్య క్యాంపస్ పేరుతో ఒక చలన చిత్రం కూడా నిర్మించారు. దానికి భరతముని అవార్డు కూడా వచ్చింది. సామాజిక అంశాలను పదునైన కవితలుగా కథలుగా నవలలుగా అక్షరీకరించారాయన. నవలాకారుడు చిత్రదర్శకుడు ప్రభాకర్ జైని పై ప్రత్యేక కథనం తెసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:28 - February 5, 2017
12:26 - February 5, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళ అవబోతున్నారనే ప్రచారంపై స్పందనలు వ్యక్తమౌతున్నాయి. సీఎంగా పన్నీర్ సెల్వం చిరునవ్వు నవ్వితే..స్టాలిన్ ఘాటుగా స్పందించారు. జయలలిత మృతి అనంతరం సీఎంగా పన్నీర్ సెల్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీఎం పదవిని చేజిక్కించుకొనేందుకు శశికళ ప్రయత్నాలు చేపట్టారు. పదవిని కాపాడుకొనేందుకు పన్నీర్ సెల్వం వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం 134 మంది ఎమ్మెల్యేలు చెన్నైకి చేరుకున్నారు.

శాసనసభాపక్ష సమవేశం..
మరోవైపు సీనియర్ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పోయస్ గార్డెన్ లో ఉన్న శశికళతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ చర్చలో ఎలాంటి అంశాలు ప్రస్తావించాలి..ఏ అంశాన్ని విబేధించాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం పదవి కోల్పోవడానికి పన్నీర్ సెల్వం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలపై సెల్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పలువురు మద్దతు కూడగొట్టేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. కేంద్రం ఆశీస్సులతో పాటు దీప మద్దతు కూడగొటినట్లు తెలుస్తోంది.
జరుగుతున్న రాజకీయ పరిణామాలపై డీఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ స్పందించారు. పలు సెటైర్లు వేశారు. 'శశికళ ముఖ్యమంత్రి కావడం ఏమిటి? తమిళనాడు ప్రజలు జయలలితను చూసి ఓటేశారు.. వారి కుటుంబ సభ్యులను కాదు.'స్టాలిన్ వ్యాఖ్యలు. చేశారు.

12:24 - February 5, 2017

ఖమ్మం : మిర్యాలగూడ ధాన్యం పట్టుబడిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బీహార్ నుండి మిర్యాలగూడకు నాలుగేళ్లుగా అక్రమ దందా బయటపడింది. విషయం తెలిసినా విజిలెన్స్ అధికారులు చోద్యం చూసినట్లు తెలుస్తోంది. ఇటీవల విజిలెన్స్ జిల్లా ఎస్పీ భాస్కర్ రావును మిల్లర్లు ఏసీబీకి పట్టించడంతో అధికారులు ఈ విధంగా కసి తీర్చుకున్నట్లు కనబడుతోంది.
16 వేల టన్నుల ధాన్యాన్ని మిర్యాలగూడకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. గత నాలుగేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు, విష్ణు ట్రేడ్ తో దందా కొనసాగుతోందని తెలుస్తోంది. అక్రమంగా సరఫరా చేస్తున్న ధాన్యాన్ని అన్ని మిల్లులకు సరఫరా చేస్తున్నారు. బీహార్ లో పన్ను లేకపోవడం..ఏపీలో ఐదు శాతం పన్ను విధిస్తుండంతో అక్రమ దందాకు పాల్పడినట్లు తెలుస్తోంది.

12:16 - February 5, 2017

విజయవాడ : రానున్న రోజుల్లో ఏపీకి మరిన్ని యూనివర్సిటీలు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్ర లయోల కాలేజీ ప్రాంగణంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో చంద్రబాబు సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. విభజనలో పేర్కొన్న ఇనిస్టిట్యూట్స్ ను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని వర్సిటీలు రావాల్సినవసరం ఉందని, ట్రైబల్ యూనివర్సిటీకి రూ. 5 కోట్లు బడ్జెట్ లో పొందుపర్చడం జరిగిందన్నారు. టాప్ యూనివర్సిటీల్లో ఉన్న కొన్ని యూనివర్సిటీలు, పీపీపీ పద్ధతిలో కొన్ని యూనివర్సిటీలు రావడం జరుగుతోందన్నారు. వర్సిటీలు వస్తే ఏపీ త్వరలో నాలెడ్జ్ స్టేట్ గా మారుతుందని ఆకాక్షించారు. పాలన చేపట్టి రెండున్నర సంవత్సరాలే అయ్యిందని, హైదరాబాద్ లో పదేళ్లు ఉండే హక్కును మీకిస్తున్నట్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నా మళ్లీ ఇక్కడకే రావాల్సి ఉంటుందన్నారు. బస్సులో నుండే పాలన కొనసాగించానన్నారు. రాజధాని కట్టడం ఒక సవాల్..సంక్షోభం లాంటిదన్నారు. ఈ విషయంలో రైతులు త్యాగం చేయడం జరిగిందన్నారు. 35వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చారని బాబు తెలిపారు.

12:00 - February 5, 2017

ఒక భాషలో హీరోలుగా కనిపించిన తారలు ఇతర భాషల్లో విలన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా సౌత్ నటులు ఈ లిస్ట్ లో ముందున్నారు. పరభాషల్లో విలన్లుగా నటించడమే కాదు.. పరభాషా నటులను తమ సినిమాల్లో విలన్లుగా తీసుకుంటున్నారు. మరి ఈ కొత్త ట్రెండ్ సినిమాల్లో హల్ చల్ చేస్తోంది. సౌత్ నటులు కూడా హీరో విలన్ అన్న తేడా లేకుండా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ హీరోలు ఈ లిస్ట్ లో ఒక అడుగు ముందే ఉన్నారు. ఇప్పటికే ఆర్య, ఆది లాంటి హీరోలు నెగెటివ్ పాత్రల్లో ఆకట్టుకోగా తాజాగా మరో యంగ్ హీరో కూడా ఈ లిస్ట్ లో చేరబోతున్నాడు.

విశాల్..
కోలీవుడ్ హీరోగా నిర్మాతగా నడిగర్ సంఘం నేతగా దూసుకుపోతున్న విశాల్.. తనలోని మరో టాలెంట్ ను చూపించబోతున్నాడు. ఇన్నాళ్లు యాక్షన్ హీరో ఇమేజ్ తో ఆకట్టుకున్న విశాల్ త్వరలో సూపర్ స్టార్ సినిమాలో విలన్ పాత్రలో అలరించనున్నాడు. మలయాళ దర్శకుడు ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో విశాల్ హీరోగా నటించేందుకు అంగీకరించాడు. ఈ ఇద్దరు హీరోలకు తమ సొంత భాషలతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటంతో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఒకే సారి తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. తమిళ నాట హీరోగా సూపర్ ఫాంలో ఉన్న విశాల్, విలన్ రోల్ చేస్తుండటంతో ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఇన్నాళ్లు హీరోగా ఆకట్టుకు విశాల్ విలన్ రోల్ లో ఎలా అలరిస్తాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

తనీష్..
టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. హీరోలు గా ఫాం చూపించలేకపోయిన యువ కథానాయకులు విలన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తారకరత్న లాంటి వారు ఇప్పటికే నెగెటివ్ పాత్రల్లో సత్తా చాటగా ఇప్పుడు మరో యంగ్ హీరో తనీష్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో తనీష్ స్టైలిష్ విలన్ గా అలరించనున్నాడు.

నవీన్ చంద్ర..
అందాల రాక్షసి సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన మ్యాన్లీ హీరో నవీన్ చంద్ర కూడా విలన్ గా మారిపోయాడు. రఫ్ లుక్ లో కనిపించే ఈ యంగ్ హీరో నేచరుల్ స్టార్ నానీ కోసం ప్రతినాయక పాత్ర పోషించాడు. నాని, కీర్తి సురేష్ లు జంటగా త్రినాథ్ రావు నక్కిన దర్వకత్వంలో తెరకెక్కిన నేనులోకల్ సినిమాలో నవీన్ చంద్ర నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడు.

అక్షయ్ కుమార్..
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ యంగ్ హీరోస్ తో కలిసి నడుస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో సీక్వల్ 2.0 సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఓ ఉత్తరాది స్టార్ హీరో సౌత్ సినిమాలో అది కూడా విలన్ పాత్రలో నటిస్తుండటంతో రోబో సీక్వల్ మీద అంచనాలు పీక్ లో ఉన్నాయి.

చెన్నైకి చేరుకుంటున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు...

చెన్నై : రాష్ట్రానికి చెందిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చెన్నైకి చేరుకుంటున్నారు. కాసేపట్లో జరిగే శాసనసభాపక్ష సమావేశంలో వీరు పాల్గొననున్నారు.

మిర్యాలగూడ ధాన్యం పట్టుబడిన కేసులో కొత్త కోణం..

ఖమ్మం : మిర్యాలగూడ ధాన్యం పట్టుబడిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బీహార్ నుండి మిర్యాలగూడకు నాలుగేళ్లుగా అక్రమ దందా బయటపడింది. విషయం తెలిసినా విజిలెన్స్ అధికారులు చోద్యం చూసినట్లు తెలుస్తోంది. ఇటీవల విజిలెన్స్ జిల్లా ఎస్పీ భాస్కర్ రావును మిల్లర్లు ఏసీబీకి పట్టించడంతో అధికారులు ఈ విధంగా కసి తీర్చుకున్నట్లు కనబడుతోంది.

11:31 - February 5, 2017

టీమిండియా యాంగ్రీ యంగ్‌ గన్‌... విరాట్‌ కొహ్లీ సారధిగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్లలో సిరీస్‌ విజయాలు సాధించి కెప్టెన్‌గా చరిత్రను తిరగరాస్తున్నాడు. మూడు వారాల క్రితమే ఇండియా ఫుల్‌ టైమ్‌ కెప్టెన్‌గా ప్రమోట్‌అయిన విరాట్‌....అప్పుడే మాజీ కెప్టెన్‌ ధనా ధన్‌ ధోనీ రికార్డ్‌ను టార్గెట్‌ చేశాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఇండియన్ కెప్టెన్‌గా రికార్డ్‌ల మోత మోగిస్తున్నాడు. మూడు వారాల క్రితమే ఇండియా ఫుల్‌ టైమ్‌ కెప్టెన్‌గా ప్రమోట్‌అయిన విరాట్‌ అప్పుడే మాజీ కెప్టెన్‌ ధనా ధన్‌ ధోనీ రికార్డ్‌ను టార్గెట్‌ చేశాడు. ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్లలో సిరీస్‌ విజయాలు సాధించి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో టీ 20 సిరీస్‌లో కొహ్లీ బ్యాట్స్‌మెన్‌గా విఫలమైనా...కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు.ఒత్తిడిలో , ఓటమి ఖాయమనుకున్న దశలోకనూ భారత బౌలర్లను విరాట్‌ కొహ్లీ సమర్ధవంతంగా వినియోగించుకున్న తీరు విమర్శకులను సైతం ఆకట్టుకుంది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌ సాధించిన ఇండియన్ కెప్టెన్‌గా విరాట్‌కొహ్లీ అరుదైన రికార్డ్‌ నమోదు చేశాడు. అన్ని ఫార్మాట్లలో వరుసగా సిరీస్‌ విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా ధోనీ రికార్డ్‌ను విరాట్ సమం చేశాడు.

మూడు ఫార్మాట్లు..ఏడు సిరీస్ లు..
మూడు ఫార్మాట్లలో కలిపి గత 7 సిరీస్‌ల్లో విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. మరికొద్ది రోజుల్లో బంగ్లాదేశ్‌తో జరుగనున్న సింగిల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ సైతం నెగ్గితే విరాట్‌ కొహ్లీ....వరుసగా 8 సిరీస్‌ విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా ప్రపంచ రికార్డ్‌ సృష్టిస్తాడు. టెస్ట్‌ ఫార్మాట్‌లో కొహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా ఎంతలా ఆధిపత్యం ప్రదర్శిస్తోందో అందరికీ తెలిసిందే.బంగ్లాదేశ్‌తో ఆడనున్న ఏకైక టెస్ట్‌లో... ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్‌ టెస్ట్‌లో టీమిండియా..విజయం సాధిస్తే విరాట్‌ భారత కెప్టెన్‌గా చరిత్రను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి మూడు ఫార్మాట్లలోనూ విరాట్‌ కొహ్లీ...ఇదే స్థాయిలో భారత్‌ను ముందుండి నడిపిస్తే మరిన్ని రికార్డ్‌లు బద్దలవుతాయనడంలో సందేహమే లేదు.

11:27 - February 5, 2017

విజయవాడ : ఆర్టీసీ గ్యారేజ్ లో విషాదం చోటు చేసుకుంది. విధి నిర్వాహణలో ఉన్న మెకానిక్ పైకి బస్సు దూసుకెళ్లింది. అప్రెంటిస్ డ్రైవర్ బస్సు తీసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ గ్యారేజ్ లో మెకానిక్ గా సత్యనారాయణ పనిచేస్తున్నాడు. దుర్గారావు అనే వ్యక్తి అప్రెంటిస్ గా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆదివారం ఉదయం రిపేర్ చేసిన అనంతరం దుర్గారావు బస్సును తీసేందుకు ప్రయత్నించాడు. ముందుకెళ్లే బస్సు ఒక్కసారిగా వెనక్కి వెళ్లింది. వెనుకనే ఉన్న సత్యనారాయణ పైకి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడనే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పందించాయి. ఆర్టీసీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొంటున్నాయి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

11:23 - February 5, 2017
11:19 - February 5, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెన్నై తీరానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న చమురు తెట్టు పనులను ఆయన పర్యవేక్షించారు. గత వారం రోజుల కిందట రెండు పడవలు ఢీకొనడంతో వేల టన్నుల ఆయిల్ సముద్రం పాలైన సంగతి తెలిసిందే. దీనితో తీర ప్రాంతం కలుషితమై పోయింది. ఆయిల్ ను తొలగించేందుకు అధికారులు పనులు చేపట్టారు. మొత్తంగా 32 కిలోమీటర్ల చమురు తెట్టు పేరుపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం తీర ప్రాంతానికి సీఎం పన్నీర్ సెల్వం చేరుకున్నారు. తొలగింపు పనులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విస్తరించిన చమురు తెట్టును తొలగిస్తామని, జర్మనీ నుండి అత్యాధునిక పరికరాలను తెప్పిస్తున్నామని వెల్లడించారు.

కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం..

హైదరాబాద్ : జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.

11:11 - February 5, 2017

చెన్నై : తమిళనాడులోని అన్నాడీఎంకే రెండుగా చీలుతుందా ? సీఎం పదవిని చేజిక్కించుకోవడానికి దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ..ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి పన్నీర్ సెల్వం వ్యూహాలు రచిస్తున్నారు. దీనితో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటి వరకు సౌమ్యంగా ఉండే పన్నీర్ సెల్వం తన రాజకీయ చతురతను ప్రదర్శించే పని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం ఆశీస్సులు..జయ మేనకొడలు దీప మద్దతు పొందుతున్టన్లు..ప్రతిపక్ష పార్టీతో పన్నీర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు శశికళ కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎమ్మెల్యేల మద్దతు కూడగొట్టేందుకు శశికళ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు మద్దతివ్వాలని కొంతమంది ఎమ్మెల్యేలతో శశికళ మాట్లాడినట్లు, బెదిరింపులకు కూడా దిగినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. మధ్యాహ్నం ఏర్పాటు చేసే శాసనసభా పక్ష సమావేశంలో శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆమె ముఖ్యమంత్రి కాబోరని తమిళనాడు రాష్ట్ర మంత్రులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ కొద్ది రోజుల్లో తెరపడనుంది.

చెన్నై తీరానికి చేరుకున్న పన్నీర్ సెల్వం..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెన్నై తీరానికి చేరుకున్నారు. చమురు తెట్టు తొలగింపు పనులను ఆయన పర్యవేక్షించారు.

10:33 - February 5, 2017

అనంతపురం : హిందూపురం టీడీపీ ముసలం పుట్టింది. బాలకృష్ణ పీఏ శేఖర్ ఇందుకు కారణం. కార్యకర్తలు, అసమ్మతి నేతలతో వెళ్లవద్దంటూ బాలయ్య పీఏ శేఖర్‌ హుకుం చేయడం, స్థానిక సీనియర్లలో ఆగ్రహాన్ని రగిలించింది. ఇప్పుడు టీడీపీ నాయకులు, శేఖర్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. బాలయ్య పీఏ శేఖర్‌ వ్యవహారంపై.. టీడీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగుతున్న సీనియర్లు తీవ్రంగా ఆక్షేపణ చెబుతున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మినారాయణ తదితరులు శేఖర్‌ తీరుపై విరుచుకుపడుతున్నారు. శేఖర్‌ దూకుడును నియంత్రించకుంటే, పార్టీకి తీవ్రంగా నష్టం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. చిలమత్తూరులో శేఖర్ వ్యతిరేక వర్గీయులు నిరహార దీక్షకు పూనుకొవడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ముందు జాగ్రత్తలో భాగంగా పోలీసులు 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరాములు, అంబికా లక్ష్మీనారాయణ ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. పీఏ శేఖర్‌కు వ్యతిరేకంగా చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీలు రాజీనామా చేయడంతో వివాదం మరింత ముదిరింది. మొత్తం మీద ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్‌ చుట్టూ తిరుగుతున్న వ్యవహారం.. పటిష్ఠంగా ఉన్న హిందూపురం టీడీపీలో ముసలానికి కారణమవుతోంది. ఈ వివాదానికి బాలయ్య చెక్‌ పెడతారో లేదో వేచి చూడాలి.

భద్రాద్రి రామాలయ ఉద్యోగులకు మెమోలు..

భద్రాద్రి : భద్రాచలం రామాలయంలో ఇద్దరు ఉద్యోగులకు మెమోలు జారీ అయ్యాయి. స్వామివారి సేవలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి.

హిందూపురంలో 144 సెక్షన్..

అనంతపురం : హిందూపురం నియోజకవర్గంలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేశారు. బాలకృష్ణ పీఏ శేఖర్ వ్యవహారంపై రెండుగా తెలుగు తమ్ముళ్లు విడిపోయారు.

ఆర్టీసీ గ్యారేజ్ లో ప్రమాదం..ఒకరు మృతి..

విజయవాడ : ఆర్టీసీ గ్యారేజీలో ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు దూసుకెళ్లడంతో మెకానిక్ సత్యనారాయణ మృతి చెందాడు. అప్రెంటిస్ డ్రైవర్ బస్సును తీస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సిటీ బస్సులను ప్రారంభించిన చిన రాజప్ప...

తూర్పుగోదావరి : రాజమండ్రిలో ఆర్టీసీ సిటీ బస్సు సర్వీసులను హోం మంత్రి చిన రాజప్ప ప్రారంభించారు. శాటిలైట్ సిటీ, కోటిపల్లి బస్టాండు నుండి సర్వీసులు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

10:21 - February 5, 2017

చెన్నై : మెరీనా తీరంలో చమురు తెట్టు తొలగించడం సవాల్ గా మారింది. గత వారం రోజుల కింద రెండు పడవలు ఢీకొనడంతో వేల టన్నుల చమురు సముద్రం పాలైన సంగతి తెలిసిందే. అప్పటి నుండి చమురు తెట్టు తొలగిస్తున్నారు. నేవీ, కోస్ట్ గార్డ్, అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాలని అధికారులు భావించారు. అందులో భాగంగా జర్మని నుండి నిపుణుల బృందం చెన్నైకి రానుంది. రెండు పడవల్లో వచ్చే వీరు చమురు తెట్టు ఎంత మేర పేరుకపోయిందో నిర్ధారించనుంది. ఇదిలా ఉంటే తీర ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మత్స్యకారులు వృత్తిని కోల్పోయే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. చేపలు విషపూరితంగా తయారయ్యాయని, వీటిని తినవద్దని పుకార్లు షికారు చేస్తున్నాయి. చమురు తెట్టును తొలగించడానికి ఇంకా వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

10:19 - February 5, 2017

చెన్నై : తమిళనాడులో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తర ఘట్టానికి చేరుకున్నాయి. సీఎం పదవిని కాపాడుకోవడానికి పన్నీర్ సెల్వం..ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడానికి శశికళ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. వీరి వ్యూహాలతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జయలలిత మృతి అనంతరం సీఎంగా పన్నీర్ సెల్వం పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై జయ స్నేహితురాలు శశికళ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా సీఎం పదవిని చేజిక్కించుకోవడానికి శశికళ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. పార్టీని ఇప్పటికే గుప్పిట్లో పెట్టుకున్న శశికళ అందుకు తగినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం అన్నాడీఎంకే శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. చెన్నైకు రావాలని 132 మంది ఎమ్మెల్యేలకు శశికళ కబురు పంపించారు. కానీ సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో అధికారికంగా వెల్లడి కాలేదు. జరుగుతున్న పరిణామాల పట్ల సీఎం పన్నీర్ సెల్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవిని కాపాడుకోవడానికి పన్నీర్ సెల్వం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు జయ మేనకోడలు దీప మద్దతు తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. శాసనసభా పక్ష నేతగా శశికళను ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతోంది. కాసేపట్లో జరిగే ఈ సమావేశంలో ఏమి జరుగుతుందో చూడాలి.

దీప మద్దతు కోసం సెల్వం ప్రయత్నాలు !..

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. మేనకోడలు దీపను మద్దతు తీసుకోవడానికి పన్నీర్ సెల్వం సిద్ధమౌతున్నట్లు సమాచారం. కాసేపట్లో అన్నాడీఎంకే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.

09:23 - February 5, 2017

చిత్తూరు : మూడేళ్ల క్రితం బెంగళూరు ఏటీఎంలో మహిళపై దుండగుడి కిరాతకం అంతా ఇంతా కాదు. కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపడంతో.. నిందితుడి కోసం అటు కర్ణాటక, ఇటు ఏపీ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అయినా ఆ దుర్మార్గుడికి సంబంధించి చిన్న క్లూ కూడా దొరకలేదు. కానీ అనుహ్యంగా పోలీసులకు చిక్కాడు. ఐదేళ్ల క్రితం కడప సెంట్రల్‌ జైల్‌ నుంచి ప‌రారైన మధుకర్ రెడ్డే ఈ దారుణానికి తెగబడినట్లు తేల్చారు. రెండు రోజుల క్రితం ఓ చోరీ కేసులో ప‌ట్టుకున్న మధుకర్‌ రెడ్డిని విచారించ‌గా.. నివ్వెరపోయే విషయాలు వెలుగుచూశాయి.

చిత్తూరు జిల్లా దిగువపల్లిలో నివాసం..
చిత్తూరు జిల్లా తంబళపల్లె మండలం దిగువప‌ల్లికి చెందిన మధుకర్ రెడ్డి..2006లో మ‌ద్దలాపురం మర్డర్‌ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ సమయంలోనే 2011లో కడప జైలు నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ చేరుకున్నాడు. అఫ్జల్‌గంజ్‌లో కొడవలి కొనుగోలు చేసి జడ్చర్ల చేరుకున్నాడు. నారాయణ అనే వ్యక్తితో బార్‌లో గొడవపడ్డాడు. బయటకి రాగానే అతన్ని కొడవలితో కిరాతకంగా దాడిచేశాడు. జడ్చర్ల నుంచి ట్రైన్‌లో అనంతపురం జిల్లాలోని ధర్మవరం చేరుకున్నాడు. స్టేషన్‌కు సమీపంలో ఒంటరిగా ఉండే ఓ వృద్ధురాలి ఇంట్లో చోరీకి తెగబడ్డాడు. ఆమెను హతమార్చి బంగారు నగలు, డెబిట్‌కార్డుతో పారిపోయాడు. కదిరిలో 6 రోజులు గడిపి.. బెంగళూరు చేరుకున్నాడు. అక్కడి ఏటీఎంలో 2013 న‌వంబ‌ర్ 13న కార్పోరేషన్ బ్యాంకు ఉద్యోగి జ్యోతిపై కత్తితో పైశాచికంగా దాడి చేసి పారిపోయాడు. ఘటనపై మీడియా కథనాలు రావడంతో భయపడిపోయిన మధుకర్‌ రెడ్డి.. గుండు చేయించుకుని కేరళ వెళ్లిపోయాడు. సంవత్సరం తర్వాత చిత్తూరు జిల్లాకు చేరుకుని ఒంటరి మహిళలే లక్ష్యంగా చోరీలకు తెగబడ్డాడు. ఇటీవ‌ల మ‌ధుక‌ర్‌రెడ్డిని మ‌ద‌న‌ప‌ల్లెలో ఓ చోరీ కేసులో పోలీసులు అరెస్ట్‌చేశారు. చోరీ కేసుకు సంబంధించి పోలీసులు తమదైన శైలీలో విచారించగా..బెంగళూరు ఏటీఎంలో మహిళపై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మధుకర్‌ రెడ్డిపై 6 కేసులు ఉన్నాయ‌ని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ‌నివాస్ తెలిపారు. మిస్టరీగా మారిన కేసు మూడేళ్ల తర్వాత చిక్కుముడి వీడటంతో ఇటు ఏపీ, అటు కర్ణాటక పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

09:20 - February 5, 2017

ఖమ్మం : అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తాం.. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తాం అని చెప్పిన కేసీఆర్‌.. గిరిజనుల భూముల్ని లాక్కుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో పర్యటించిన తమ్మినేని పాదయాత్ర నిన్నటితో 111 రోజులు పూర్తి చేసుకుంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, కేసీఆర్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు కడు పేదరికంలో మగ్గుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానన్న సీఎం కేసీఆర్‌... ఉన్న భూములను లాగేసుకుంటున్నాడని తమ్మినేని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా ప్రజలకు కనీస విద్యా, వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని తమ్మినేని విమర్శించారు. 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీల బతుకులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది తమ పిల్లల్ని చదివించే పరిస్థితి కూడా లేదని తమ్మినేని అన్నారు.

సండ్ర మద్దతు..
సీపీఎం మహాజన పాదయాత్రకు మద్దతు తెలిపిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్‌ఎస్‌ పాలనపై మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం అమర వీరుల ఆశయాలను తుంగలో తొక్కిందని అన్నారు. కేసీఆర్‌ తన కుటుంబం, అనుచరుల కోసమే తెలంగాణ వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. ఇచ్చిన హామీలన్నింటిని విస్మరించారని సండ్ర విమర్శించారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంతో చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 111 రోజులు పూర్తి చేసుకుంది. 111వ రోజు తమ్మినేని బృందం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం, కిష్టాపురం, లంకపల్లి, మందాలపాడు, వియ్యంబంజారా గ్రామాల్లో పర్యటించింది. తమ్మినేని బృందానికి స్థానిక టీడీపీ, కాంగ్రెస్‌, ఎమ్మార్పీఎస్‌, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలిపారు.

తిరుమలలో మంత్రి కొల్లు రవీంద్ర..నటుడు రాజేంద్రప్రసాద్..

చిత్తూరు : తిరుమలలో శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు.

 

యూపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో..

ఉత్తర్ ప్రదేశ్ : బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అందరికీ వైద్యం..రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని..ఇతరత్రా హామీలు మేనిఫెస్టోలో పొందుపరిచింది.

112వ రోజు మహాజ పాదయాత్ర..

ఖమ్మం : వీఎం బంజర నుండి 112 వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. టేకుపల్లి, రామకృష్ణాపురం, కల్లూరు, నూతన్ కల్, అంజనాపురం, తల్లాడలో పాదయాత్ర కొనసాగనుంది.

తెహ్రీహౌస్ లో ఫైర్ ఆక్సిడెంట్...

ఉత్తరాఖండ్ : తెహ్రీ హౌస్ లో అగ్నిప్రమాదం సంభవించింది. హరిద్వార్ బడాబజార్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 14 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు.

08:12 - February 5, 2017

నీళ్ల మీద నిమ్షం శేపు కాళ్లు జేతులు గొట్టకుంట నిలవడాల్నంటే అయితదా మనతోని గజ ఈతగాళ్లు గూడ గుడ్లె తెలేస్తరు.. నీళ్ల మీద బుడ్డరాయే నిలవడది అసొంటి మన్షి కాళ్లు చేతుల ఆడియ్యకుంట.. పర్పుమీద వన్నట్టు వంటే దెబ్బకే అడ్గుకు వోతడు అనుకున్న నేను... కని సిద్దిపేట ఒకాయిన.. నీళ్ల మీద ఎంత ముద్దుగ వంటున్నడో సూడాలంటే వీడియో సూడుండ్రి..

 

08:11 - February 5, 2017

మాజీ స్వర్ణాంధ్ర జనులారా.. తాజా నవ్యాంధ్ర జనులారా..? ఇగ కాసుకోండ్రి..అబ్బా తెలంగాణల ప్రతిపక్షాలకు పనేంలేనట్టుంది.. గడ్కోపారి ప్రభుత్వాన్ని సమాధానం జెప్పుండ్రి సమాధానం జెప్పుండ్రి అని గిచ్చుతా ఉన్నరు..నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ సారు జర్ర కోపం మీదున్నడట..ప్రపంచంల అందరికి కంటె ఎక్వ విగ్రహాలు ఎవ్వలియి ఉన్నయ్ చెప్పుండ్రి..? దయ్యాన్ని జూశిండ్రా మీరు ఎన్నడన్నా..? నీళ్ల మీద నిమ్షం శేపు కాళ్లు జేతులు గొట్టకుంట నిలవడాల్నంటే అయితదా...ఇప్పుడు గుప్త నిధుల ముచ్చటొక్కటొచ్చింది.. మూడు రోజుల వట్టి ఒక గుడిలె కొంతమంది గడ్డపారలేశి తొవ్వుతా ఉన్నరు.. గిసొంటి ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి.

08:07 - February 5, 2017

ఢిల్లీలో రోడ్డు ప్రమాదం..

ఢిల్లీ : ఓ దేశ రిపబ్లిక్ ఎంబసీ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. కారు అతివేగంగా వచ్చి పోల్ ను ఢీకొంది. కారు ముందుభాగం నుజ్జునజ్జైంది. పోలీసులు విచారిస్తున్నారు.

07:54 - February 5, 2017

సినీ రంగంలో సెంటిమెంట్ లను ఫాలో అయ్యే వారు చాలా ఎక్కువ. కుర్ర హీరోలు సీనియర్ హీరోలు అన్న తేడా లేకుండా అందారు తనకు కలిసొచ్చిన టైటిల్స్ యాక్టర్స్ ని తమ నెక్ట్స్ మూవీస్ లో కూడా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుంటారు. కోలీవుడ్ టాప్ స్టార్ కూడా తన నెక్ట్స్ సినిమా విషయంలో అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడట. కొంతకాలం హిట్స్ కు దూరమైన అజిత్.. సక్సెస్ ట్రాక్ ఎక్కిన తరువాత వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నాడు. వరుసగా మాస్ మసాలా ఎంటర్ టైన్మెంట్స్ మాత్రమే చేస్తూ వస్తున్న అజిత్, కోలీవుడ్ నెక్ట్స్ సూపర్ స్టార్ తానే అనే రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తున్నాడు. అదే బాటలో తనతో రెండు సూపర్ హిట్ అందించిన శివ దర్శకత్వంలో మరో యాక్షన్ డ్రామాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సౌత్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

'వ' సెంటిమెంట్..
అజిత్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్‌ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఎక్కువ భాగం చిత్రీకరణను బల్గేరియాలో జరుపుకున్న ఈ సినిమా, ప్రస్తుతం చెన్నై శివారు ప్రాంతంలో వేసిన భారీ సెట్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్‌అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్‌ సంగీత బాణీలు కడుతున్నారు. సినిమాకు టైటిల్ నిర్ణయించాల్సిన సమయం వచ్చింది. టైటిల్ విషయంలో అజిత్ సెంటిమెంట్ ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. అజిత్ ఖాతాలో భారీ హిట్స్ గా నిలిచిన వాన్మతి, వాలి, విలన్, వరలారు, వీరం, వేదలం లాంటి సినిమాలన్ని 'వ'లోనే మొదలయ్యాయి. అదే సెంటిమెంట్ ను ఈ సినిమాకు కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న శివ, డైరెక్షన్ లో అజిత్ గతంలో రెండు సినిమాలు చేశాడు. వీరం, వేదలం ఈ రెండు సినిమాల పేర్లు కూడా 'వ' తోనే మొదలు కావటంతో మూడో సినిమాకు కూడా అదే అక్షరంతో మొదలయ్యే పేరును పెట్టాలని నిర్ణయించారు. అందుకే వ్యూహం, వివేకం, వదం లాంటి పేర్లను పరిశీలించారు. చివరకు 'వివేగం' టైటిల్ ను నిర్ణయించారు.

ఢిల్లీలో ఆలస్యంగా తిరుగుతున్న రైళ్లు..

ఢిల్లీ : దేశ రాజధానిని పొగ మంచు వీడడం లేదు. ఆదివారం భారీగా పొగమంచు అలుముకోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 34 రైళ్లు ఆసల్యంగా నడుస్తుండగా 12 రైళ్ల షెడ్యూల్ లో మార్పు చేశారు. ఒక రైళును రద్దు చేశారు.

07:39 - February 5, 2017

వాళ్ళది పేషన్, వాళ్ళది డిజైర్, వాళ్ళది డ్రీమ్. వాళ్లెవరో కాదు కొత్తగా సినిమా రంగం లోకి వెళ్లాలనే కళలు కంటూ కష్టపడుతున్న షార్ట్ ఫిలిం మేకర్స్. షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ యాక్టర్స్ నుండి ఫీచర్ ఫిలిం డైరెక్టర్స్, యాక్టర్స్ గా రాణిస్తున్నారు. సినిమా అనేది మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. అలాంటి సినిమాని చేరుకోవటానికి దారులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయ్ అని చెప్పాలి. సినిమా ఒక రంగుల కల, ఒక అద్భుత ప్రపంచం. ఆ ప్రపంచంలో తమ సత్తా చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు షార్ట్ ఫిలిం మేకర్స్. ఇలా తమ అడుగులని షార్ట్ ఫిలింలతో మొదలు పెట్టి పెద్ద సినిమాల వైపు పరిగెత్తించిన వారు ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీ ఒకప్పుడు అందని ద్రాక్ష. చేరుకోలేని ఊహరంగుల లోకం. ఎంతో కష్టపడితే కానీ కనీసం సినిమా ప్రపంచాన్ని అందుకోలేని పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సత్తా ఉండి ప్రయత్నంలో పర్ఫెక్షన్ ఉంటే ఫిలిం వరల్డ్ వెల్కమ్ చెప్పటానికి రెడీగా ఉంది. ఎక్కడైనా పాతనీరు పోయి కొత్త నీరు వస్తేనే మార్పు అనేది మొదలవుతుంది. అలాంటిది క్రియేటివ్ ఫీల్డ్ లో మార్పు అనేది చాల అవసరం కూడా. ఆ మార్పు తీసుకురావటానికి వేదిక గా మారుతున్నాయి షార్ట్ ఫిలిమ్స్.

స్పిరిట్ తో కంటిన్యూ..
స్క్రీన్ చిన్నదైతే ఏంటి స్కిల్స్ చూపించుకోటానికి ఇదే స్పిరిట్ తో కంటిన్యూ అవుతున్నారు నేటి యువ దర్శకులు. ఒక సినిమా తియ్యాలంటే ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి రెండు మూడు సినిమాలకి వర్క్ చెయ్యాలి ఆ తరువాత అస్సోసియట్ డైరెక్టర్ గా మరో రెండు సినిమాలకి కో డైరెక్టర్ గా మినిమం ఒక సినిమాకి వర్క్ చెయ్యాలి తరువాత మంచి కథ రాసుకొని ప్రొడ్యూసర్ వేట మొదలుపెట్టాలి. ఇదంతా జరిగి సినిమా తియ్యటానికి ఒక 3 నుండి 6 సంవత్సరాలు టైం పడుతుంది. ఇప్పుడున్న వేగానికి అంత ఓపిక, తీరిక రెండూ లేవు. ఉన్నదంతా ఒక్కటే అదే టాలెంట్. ఇక్కడ హంగులు ఆర్భాటాలు ఉండవు. పెద్దపెద్ద సెట్టింగ్స్ ఉండవు. పెద్ద టీం యూనిట్ మాటే ఉండదు. గట్టి కధ..మంచి డైలాగ్స్ తో ఉన్న స్క్రిప్ట్ పేపర్లు..యాక్టింగ్ ఇంటరెస్ట్ ఉన్న ఆర్టిస్ట్ లు. ఇవే షార్ట్ ఫిలిం మేకర్స్ వెపన్స్. సోర్స్ లు పెద్దగా లేకపోయినా కొన్ని షార్ట్ ఫిలింల అవుట్ పుట్ పెద్ద సినిమాలకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి.

పెద్ద సినిమాలు..
ఈ షార్ట్ ఫిలింలను వారధిగా చేసుకొని పెద్ద సినిమాలకి దూసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. నమ్ముకున్న కథను కష్టపడుతూ పూర్తి చేసి తామేంటో యూట్యూబ్ సాక్షిగా నిరూపించుకుంటున్నారు. ఫీచర్ ఫిలిం అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ మధ్య కొంత మంది నిర్మాతలైతే సినిమా తియ్యాలనుకునే కొత్త డైరెక్టర్లకి వారి వారి కథని షార్ట్ ఫిలింగా తీసి చూపించమని అడిగిన సందర్భాలు ఉన్నాయ్. ఈ షార్ట్ ఫిలిం మేకర్స్ సినిమాలో ఉన్న 24 క్రాఫ్ట్ ల పైన పట్టు సంపాదిస్తున్నారు. షార్ట్ ఫిలిం ధ్వారా తామేంటో నిరూపించుకొని పెద్ద సినిమాని ప్రజల నుండి తయారు చేస్తున్న ఫిలింమేకర్ ఫణింద్ర నరిశెట్టి "మంచి సినిమా డబ్బు నుండి పుట్టదు రగులుతున్న మెదడులోని చీకటి పొరలని చీల్చుకొని పుడుతుంది." అనే ఒకే ఒక మాటని నమ్మి క్రౌడ్ ఫండింగ్ అనే ఫార్ములాని అప్లై చేసిన పేషనేట్ ఫిలిం మేకర్ ఫణింద్ర. ఇతను పెట్టిన పేస్ బుక్ ఒక పోస్ట్ 24 గంటలలోపే 54 లక్షల రూపాయలను క్రౌడ్ ఫండింగ్ ద్వారా తెచ్చి పెట్టి ప్రజల డబ్బుతో సినిమా తీసేలా చేస్తుంది.

ఫణింద్ర నరిశెట్టి..
ఫణింద్ర నరిశెట్టి మొదట 22 నిముషాల బ్యాక్ స్పేస్ అనే షార్ట్ ఫిలిం తీసాడు. ఈ షార్ట్ ఫిలిం కంప్లీట్ గా ఐ ఫోన్ తో షూట్ చేసాడు. తరువాత 'మధురం' అనే లవ్ సబ్జెక్టు ని డీల్ చేసాడు. వన్ అవర్ డ్యూరేషన్ ఉన్న ఈ ఇండిపెండెంట్ ఫిలిం యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే ఫోర్స్ తో నటుడు బ్రహ్మనందం కుమారుడు గౌతమ్ హీరోగా 'మను' అనే ఫీచర్ ఫిలిం తీస్తున్నాడు. రీసెంట్ గా 'మను' ట్రైలర్ రిలీజ్ చేసి అందర్నీ ఆకర్షించాడు ఈ యంగ్ డైరెక్టర్.ఇలా పీపుల్ పల్స్ తో పీపుల్ ఫండ్స్ తో సినిమా తీస్తున్న డైరెక్టర్ ఒకరైతే తన సినిమాతో ఒక ట్రెండ్ నే సెట్ చేసిన షార్ట్ ఫిలిం డైరెక్టర్ మరొకరు. సినిమా హిట్ అవ్వటానికి పెద్ద స్టార్స్ అవసరం లేదు పెద్ద పెద్ద సెట్టింగ్స్ కూడా అవసరం లేదు అని ప్రూవ్ చేసాడు.

ప్రభాస్..
'పెళ్లిచూపులు' ఈ సినిమా ప్రెసెంట్ ట్రెండ్ లో తెలుగు సినిమా దారిని చాలా వరకు మార్చిందని చెప్పాలి. తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి హిట్ కొట్టడంలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గెలిచాడు. సైన్మా అనే షార్ట్ ఫిలిం ని తీసిన తరుణ్ భాస్కర్ చాల పకడ్బందీగా ప్లాన్ చేసుకొని 'పెళ్లిచూపులు' సినిమాని తెలుగు ఆడియన్స్ కి అందించి సినిమాతో పాటు మంచి టాలెంట్ ఉన్న నటీనటులను కూడా ఇచ్చారు. మొత్తానికి తక్కువ బడ్జెట్ తో తక్కువ పీరియడ్ లో స్క్రీన్ మీద ప్రెసెంట్ చేసి ఎక్కువ లాభాలు చూపించారు ఈ డైరెక్టర్. బాహుబలి 2 తరువాత ప్రభాస్ చేయనున్న ప్రాజెక్ట్ లలో ఒకటి డైరెక్టర్ సుజిత్ తో కూడా ఉంది. 'రన్ రాజా రన్' తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన డైరెక్టర్ సుజిత్ తన తరువాతి ప్రాజెక్ట్ యు వి ప్రొడక్షన్ లో చేయబోతున్నట్టు చెప్పారు. ఆ ప్రాజెక్ట్ లో హీరో గా ప్రభాస్ చేస్తుండటం ప్రాజెక్ట్ బడ్జెట్ 150 వరకు ఉండటం తెలిసిన విషయమే. బాహుబలి తరువాత ఎక్సపెక్టషన్స్ పెరిగిన హీరో ప్రభాస్ సుజీత్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా యాక్షన్ థ్రిల్లర్ అని అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ డం ఉన్న హీరో ని డైరెక్ట్ చేసే ఈ సుజీత్ ఎవరు అంటే మాత్రం అతనొక షార్ట్ ఫిలిం డైరెక్టర్ అనే సమాధానం వస్తుంది. వేషం తొక్కలో లవ్ అనే షార్ట్ ఫిలిం లు తీసిన డైరెక్టర్ సుజీత్. తరువాత యు వి క్రియేషన్ లో వచ్చిన రన్ రాజా రన్ సినిమాని డైరెక్ట్ చేసాడు. రన్ రాజా రన్ లో శర్వానంద్ ని కంప్లీట్ ట్రెండీ లవర్ బాయ్ లా చూపించిన సుజీత్ డైరెక్టర్ గా ఆడియన్స్ నుండి మంచి మార్కులే కొట్టేసాడు.

కథలో వైవిధ్యం..
మంచి కధలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఒక వర్గం ఆడియన్స్ ని ఏర్పరుచుకున్న హీరో నిఖిల్ నటించిన సూర్య vs సూర్య సినిమా ని డైరెక్ట్ చేసిన ఘట్టమనేని కార్తిక్ కూడా షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఏ ..ఇన్ఫినిటీ ఇన్విజిబుల్ ఫిష్ లాంటి షార్ట్ ఫిలిం తీసిన కార్తిక్ పెద్ద సినిమాలకి ప్రయత్నిస్తూ నిఖిల్ తో సూర్య vs సూర్య సినిమాని తెరకెక్కించాడు ఫీచర్ ఫిలిం డైరెక్టర్ గా మారాడు. ఇలా షార్ట్ ఫిలిం నుండి ఫీచర్ ఫిలిం కి వస్తున్న డైరెక్టర్ లు మంచి సినిమాలు తీస్తూనే ..తాము తీసే సినిమాల్లో కథ డిఫరెంట్ గా ఉండాలని జాగర్త పడుతున్నారు. హారర్ థ్రిల్లర్ కథతో ఎంట్రీ ఇచ్చిన మరో షార్ట్ ఫిలిం డైరెక్టర్ రాహుల్ సంకృత్యియన్. చిత్ర ఐ లవ్ యు అనే షార్ట్ ఫిలిం తో అవార్డు కొట్టి "ది ఎండ్" ఎన్ హారర్ థ్రిల్లర్ తో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు. కథలో వైవిధ్యం చూపించాడు ఈ యువ దర్శకుడు.

షార్ట్ ఫిలిం ల మార్చేస్తున్నారు మన తెలుగు డైరెక్టర్స్..
బేవార్స్, ఇంటర్వ్యూ లాంటి షార్ట్ ఫిలిం తీసి ప్రేమ ఇష్క్ కాదల్ అనే ఫీచర్ ఫిలింతో వచ్చిన పవన్ సాధినేని యూత్ ని ఆకట్టుకొని ఇప్పుడు నారారోహిత్ తో సావిత్రి అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ అందించిన మేర్లపాక గాంధీ కూడా మొదట షార్ట్ ఫిలిం తీసిన తరువాతనే ఫీచర్ ఫిలిం కి వచ్చారు. షార్ట్ ఫిలింలతో టాలెంట్ చూపిస్తున్న యంగ్ టాలెంట్ కి తెలుగు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా షార్ట్ ఫిలిం కాంపిటీషన్ పెట్టి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇలా షార్ట్ ఫిలిం నుండి ఫీచర్ ఫిలిం కి ట్రాక్ వేస్తున్న యంగ్ టాలెంట్ కి సపోర్ట్ గా పెద్ద డైరెక్టర్ లు కూడా కొన్ని షార్ట్ ఫిలిం లను తీసి ఇన్స్పైర్ చేస్తున్నారు. ఎంత పెద్ద డైరెక్టర్ ఐన తాను కమర్షియల్ గా తియ్యలేని స్టోరీలు కొన్ని ఉంటాయి. వాటిని ఆలా మరుగున పడిపోనివ్వకుండా షార్ట్ ఫిలింల మార్చేస్తున్నారు మన తెలుగు డైరెక్టర్స్.

ఆల్ ది బెస్ట్..
"ఏ డే ఇన్ ది లైఫ్ అఫ్ మంచుస్ లక్ష్మి ఫీట్ " అని రామ్ గోపాల్ వర్మ తీస్తే, లెటర్ అనే షార్ట్ ఫిలిం ని వంశీ తీశారు." ఐయామ్ థాట్ చేంజ్ " అనే షార్ట్ ఫిలింని సుకుమార్," డయింగ్ టు బి మీ" అని దేవ కట్ట తీశారు. ఏది ఏమైనా పెద్ద సినిమాకి షార్ట్ కట్ మాత్రం షార్ట్ ఫిలిమ్స్ అని నమ్మాల్సిందే. ఇవాళ్టి చిన్న సినిమాలే రేపటి పెద్ద సినిమాలు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమాకి న్యూ టాలెంట్ అవసరం. తెలుగు సినిమాలో మార్పు కోసం ఇండస్ట్రీ లో ఎలా ఐనా ఎంటర్ అవ్వాలని కసితో కష్టపడుతున్న షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ కి అల్ ది బెస్ట్.

07:21 - February 5, 2017

సినీ ఇండస్ట్రీలో రీసెంట్ గా ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. మూడే మూడు ఫ్రేమ్ లు నాలుగు మాటలు 47 సెకన్లు డ్యూరేషన్ ..కానీ ఆ ట్రైలర్ తీసుకువచ్చిన క్రేజ్ మాత్రం అంత ఇంత కాదు జస్ట్ 47 సెకన్స్ డ్యూరేషన్ లోనే ఒక మంచి లవ్ ఫీల్ ని అందించారు. సిల్వర్ స్క్రీన్ పైన కాసులు కురిపించే సబ్జక్ట్స్ చాలా వరకు లవ్ సబ్జెక్టులే. అలాంటి లవ్ ని స్క్రీన్ మీద ప్రెసెంట్ చెయ్యాలంటే ఆడియన్స్ పల్స్ తెలియాలి. పరుగెడుతున్న ట్రెండ్ ని ఫాలో అవ్వాలి. ఆ లవ్ లో డెప్త్ ని చూపించే టాలెంట్ ఉండాలి. అలాటి విజన్ ఉన్న డైరెక్టర్ మణిరత్నం ప్రెసెంట్ క్రెయేషనే 'కాట్రు వేళయిదై'.. అనే తమిళ్ సినిమాని తెలుగులో 'చెలియా' పేరుతో విడుదలకు సిద్ధం చేస్తున్నారు మణిరత్నం.

లవబుల్ డైరెక్టర్..
రోజా, బొంబాయి, దిల్ సే వంటి డిఫరెంట్ లవ్ స్టోరీస్ ని పర్ఫెక్ట్ గా ప్రెసెంట్ చేసిన మణిరత్నం గత కొన్ని చిత్రాలు 'గురు', 'కడలి' ట్రాక్ మిస్ ఐన మల్లి 'ఒకే బంగారం' సినిమాతో ట్రెండ్ పల్స్ ని ప్యాక్ చేసారు. 'నిత్య మీనన్', 'దుల్హార్ సల్మాన్', ఏ ఆర్ రహ్మాన్ ముగ్గురూ కలిసి 'ఒకే బంగారాన్ని' మణిరత్నం హిట్ అకౌంట్ లో వేశారు. ట్రెండీ కాన్సెప్ట్ లివింగ్ రిలేషన్షిప్ పై వచ్చిన 'ఒకే బంగారం' మణిరత్నంని మల్లొకసారి లవబుల్ డైరెక్టర్ ప్లేస్ ని పేర్మినెంట్ చేసింది.

విపరీతమైన క్రేజ్..
'చెలియా' ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ ఐన తరువాత విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. చాల తక్కువ డ్యూరేషన్ తో వచ్చిన ఈ ట్రైలర్ అందమైన లవ్ ఫీల్ ని ఆడియన్స్ కి అందించింది. 'చెలియా' సినిమాలో హీరో కార్తీ, హీరోయిన్ అదితి రావు. కధకు తగ్గట్టు పాత్రలు సెలెక్ట్ చేసుకునే హీరో కార్తీ, అటు బాలీవుడ్ లోను ఇటు తమిళ్ ఇండస్ట్రీలోను తన యాక్టింగ్ తో మెప్పిస్తున్న హీరోయిన్ అదితి రావు. వీరి ఇద్దరి కాంబినేషన్ తో పాటు ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ మాయాజాలం మరోసారి స్క్రీన్ మీద మణిరత్నం డైరైక్షన్ని సూపర్ హిట్ చెయ్యబోతున్నాయి అనటంలో నో డవుట్.

నేటి నుండి మొగల్ గార్డెన్స్ సందర్శన..

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ముఖర్జీ శనివారం వార్షిక ఉద్యానోత్సవాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్ లోని మొగల్ గార్డెన్స్ ను సందర్శించేందుకు ప్రజలకు ఆదివారం నుండి అనుమతినిస్తారు. మార్చి 12వ తేదీ వరకు రోజు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు సందర్శించవచ్చు.

సిరిసిల్లలో టీటీఎఫ్ మహాసభలు..

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో ఆదివారం నుండి సోమవారం వరకు విద్యామహసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్..

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలు వాహనాలను సీజ్ చేశారు.

నేడు విశాఖలో నేవీ బ్యాండ్..

విశాఖపట్టణం : నేవీ విన్యాసాల్లో భాగంగా 5వ తేదీన నేవీ బ్యాండ్‌ ప్రదర్శన జరగనుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బ్యాండ్‌ను ప్రదర్శిస్తారు. అలాగే యువతను నావికా రంగం వైపు ఆకట్టుకునే విధంగా ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

06:43 - February 5, 2017

ఢిల్లీ : పంజాబ్‌, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటలకు, పంజాబ్‌లో గంట ఆలస్యంగా 117 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఓటింగ్‌ జరిగింది. గోవాలో 83 శాతం, పంజాబ్‌లో 70 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే గోవాలో గతంలో కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యి రికార్డ్‌ సాధించింది. గత ఎన్నికల్లో 81.7 శాతం ఓటింగ్‌ నమోదు కాగా.. ప్రస్తుతం 83 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో నిలబడ్డవారికి టోకెన్లు ఇచ్చి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. పంజాబ్‌లో ఎలక్ట్రానింగ్‌ ఓటింగ్‌ మిషన్‌లలో సాంకేతిక అవాంతరాలు, చెదురుమదురు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈవీఎంలను భారీ భద్రత నడుమ స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు.

పంజాబ్ లో..
పంజాబ్‌, గోవా రాష్ట్రాలలో తొలిసారి ఆప్‌ పోటీ చేసింది. పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీదళ్‌-బీజేపీ కూటమి, కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ ఉంది. గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌, మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ నేతృత్వంలోని కూటమి పోటీలో ఉన్నాయి. రెండూ రాష్ట్రాలలోనూ తమ ఖాతాలను సాధిస్తామన్న ధీమాను ఆప్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పంజాబ్‌లో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. పంజాబ్‌లో జరుగుతున్న ఎన్నికలు స్థిరత్వానికి-మతోన్మాదం, తీవ్రవాదానికి మధ్య జరిగే ఎన్నికలని పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరిందర్‌సింగ్‌ అభివర్ణించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందన్నారు. ఆప్‌కు మంచి పట్టున్న మల్వా ప్రాంతంలో కూడా అత్యధిక మెజారిటీ సాధిస్తామన్నారు.

గోవాలో మహిళా ఓటర్లకు..
గోవాలో తొలిసారి మహిళా ఓటర్లకు పింక్‌ రంగులో ఉన్న టెడ్డీ బేర్‌లను ఎలక్షన్‌ కమిషన్‌ అందించింది. మహిళల్లో ఓటు వేసే తత్వాన్ని ప్రోత్సహించేందుకు టెడ్డీ బేర్‌లను పంపిణీ చేస్తామని ఈసీ ముందే ప్రకటించింది. ఇక గోవాలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులతో పాటు.. ప్రస్తుత ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్‌ పరసేకర్‌ కూడా పోటీలో ఉండడం విశేషం. ప్రస్తుతానికి నేతల భవిష్యత్‌ అంతా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

06:41 - February 5, 2017

అనంతపురం : హిందూపురం టీడీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతినిధిగా కొనసాగుతున్న శేఖర్.. ఈ విభేదాలకు కేంద్రంగా మారారు. కార్యకర్తలు, అసమ్మతి నేతలతో వెళ్లవద్దంటూ బాలయ్య పీఏ శేఖర్‌ హుకుం చేయడం, స్థానిక సీనియర్లలో ఆగ్రహాన్ని రగిలించింది. ఇప్పుడు టీడీపీ నాయకులు, శేఖర్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ శేఖర్‌ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. హిందూపురం టీడీపీ నాయకులు ప్రస్తుతం శేఖర్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయారు. పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తూ.. కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. శేఖర్‌ను భర్తరఫ్‌ చేయాలంటూ ఆయన వ్యతిరేక వర్గం డిమాండ్‌ చేస్తుంటే, ఆయన అనుకూల వర్గం.. ప్రత్యర్థులకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తోంది.

వీడియో..
నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు శేఖర్.. హిందూపురం నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిగా మారారన్నది ఆయన ప్రత్యర్థి వర్గం ఆరోపణ. ప్రతిదాంట్లోనూ కమీషన్‌లు వసూలు చేస్తున్నారని, కాదంటే బూతులు తిడుతూ బెదిరిస్తున్నారనీ అంటున్నారు. ఇటీవలే, శేఖర్ ఓ కాంట్రాక్టర్‌ను తిట్టారని చెబుతోన్న ఓ ఆడియో క్లిప్పింగ్‌ను, శేఖర్‌ వైరి వర్గం బహిర్గతం చేసింది.
బాలయ్య పీఏ శేఖర్‌ వ్యవహారంపై.. టీడీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగుతున్న సీనియర్లు తీవ్రంగా ఆక్షేపణ చెబుతున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మినారాయణ తదితరులు శేఖర్‌ తీరుపై విరుచుకుపడుతున్నారు. శేఖర్‌ దూకుడును నియంత్రించకుంటే, పార్టీకి తీవ్రంగా నష్టం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే బాలయ్య కూడా.. సావధానంగా చర్చించే ధోరణిలో కాకుండా, బెదిరించే ధోరణిలో మాట్లాడడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఎవరు ఏమనుకున్నా పీఏ శేఖర్‌కు వ్యతిరేకంగతా ఈనెల ఐదున అంటే, వచ్చే సోమవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని వీరు నిర్ణయించారు.

చంపేస్తానన్న కౌన్సిలర్..
మరోవైపు, అసంతుష్టులకు వ్యతిరేకంగా, శేఖర్‌ వర్గం పావులు కదపడం మొదలు పెట్టింది. పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకులు ఎవరూ.. శేఖర్‌కు వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో పాల్గొన వద్దని సూచించారు. బీసీ కార్పొరేషన్‌ చైర్మన్ రంగనాయకులు, మున్సిపల్ చైర్మన్ భర్త నాగరాజు తదితరులు పార్టీ శ్రేణులను కట్టడి చేసే పనిలో పడ్డారు. ఓ కౌన్సిలర్ అయితే, ఏకంగా ఎవరైనా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటే చంపేస్తానంటూ చిందులు తొక్కారు. హిందూపురంలో, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ కార్యకర్తలకు హుకుం జారీ చేశారు. పీఏ శేఖర్‌కు వ్యతిరేకంగా చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీలు రాజీనామా చేయడంతో వివాదం మరింత ముదిరింది. మొత్తం మీద ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్‌ చుట్టూ తిరుగుతున్న వ్యవహారం.. పటిష్ఠంగా ఉన్న హిందూపురం టీడీపీలో ముసలానికి కారణమవుతోంది. ఈ వివాదానికి బాలయ్య చెక్‌ పెడతారో లేదో వేచి చూడాలి.

06:37 - February 5, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసూఉకుంది. శంఖుమిట్ట కాటేజీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులు నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. నిద్రిస్తున్న భక్తులు మేల్కొని పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పారు. భక్తులకు ఎలాంటి అపాయం కలుగకపోయినా కాటేజీ గది మాత్రం స్వల్పంగా దగ్ధమైంది. గది కిటికీలు దగ్ధమయ్యాయి.

06:35 - February 5, 2017

విశాఖపట్టణం : నౌకదళం, సైన్యం పట్ల యువతలో స్ఫూర్తి నింపడానికి విన్యాసాలు దోహదపడుతాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌ వద్ద జరిగిన నౌకాదళ విన్యాసాలను సీఎం చంద్రబాబు సహా తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్‌ అడ్మిరల్‌ బిస్త్‌ తిలకించారు. నావికాదళ సిబ్బంది విన్యాసాలు అందర్ని ఆకట్టుకున్నాయి. ఈ విన్యాసాలకు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్‌ అడ్మిరల్‌ బిస్త్‌ హజరయ్యారు. విన్యాసాలు తిలకించేందుకు జనం పెద్దఎత్తున పున్నమి ఘాట్‌కు తరలివచ్చారు. దీంతో పున్నమి ఘాట్‌ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే విన్యాసాలు నిర్వహించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నౌకాదళం, సైన్యం పట్ల యువతలో స్ఫూర్తి నింపడానికి ఈ విన్యాసాలు దోహదపడతాయన్న బాబు.. విజ్ఞానం, వినోదం, సాహసం కలగలిపిన ప్రదర్శనే నౌకాదళ విన్యాసాలన్నారు. దేశభ‌క్తిని పెంపొందించేలా నేవి షో సాగింద‌న్నారు. భ‌విష్యత్తులో నేవీకి విశాఖ హెడ్‌క్వాట‌ర్స్‌గా ఉంటుంద‌ని బాబు చెప్పారు. విన్యాసాల్లో భాగంగా 5వ తేదీన నేవీ బ్యాండ్‌ ప్రదర్శన జరగనుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బ్యాండ్‌ను ప్రదర్శిస్తారు. అలాగే యువతను నావికా రంగం వైపు ఆకట్టుకునే విధంగా ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

06:33 - February 5, 2017

హైదరాబాద్ : కొత్తగా ఏర్పడిన జిల్లాల కలెక్టరేట్లకు భవన నిర్మాణ డిజైన్లను సీఎం కేసీఆర్‌ ఈరోజు ఫైనల్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త జిల్లాలతో పాటు.. పాత జిల్లాల కలెక్టరేట్లు కూడా ఒకే నమూనాలో ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. వీటితో పాటు అనేక కీలక అంశాలపై కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో నిర్వహించనున్న ఈ సమావేశంలో సాదా బైనామాలు, అసైన్డ్‌ భూములు, కలెక్టర్‌, జిల్లా పోలీసు కార్యాలయాలకు స్థలాల కేటాయింపు, ఎస్సీ సంక్షేమ విభాగానికి సంబంధించిన హాస్టళ్ల స్థితిగతులు, కుల వృత్తుల జీవన పరిస్థితులపై చర్చించనున్నారు. ఇక ప్రధానంగా కొత్త జిల్లా కేంద్రాలలో భవనాల నిర్మాణాలపై చర్చించనున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లా కేంద్రంలో స్థలాల ఎంపిక పూర్తయింది. మిగతా పనులపై చర్చించనున్నారు. అలాగే అధునాతన కలెక్టరేట్ల నిర్మాణనానికి సంబంధించి ఆర్‌ అండ్‌ బీ రూపొందించిన డిజైన్లపై కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేసీఆర్‌ ఫైనల్‌ చేయగానే అన్ని జిల్లా కేంద్రాలను ఒకే నమూనాలో నిర్మించనున్నారు.

దిశా నిర్ధేశం..
గొర్రెల పెంపకందారులు, మత్స్యకారుల జీవితాలలో కొత్త వెలుగును తేవడానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఏ విధంగా క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలుపరచాలనే విషయంపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా జిల్లాలోని యాదవుల స్థితిగతులపై కేసీఆర్‌ కలెక్టర్ల నుంచి నివేదిక కోరే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలవారీగా విభిన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కలెక్టర్లు అందించే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్నారు. అదేవిధంగా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి మరింత మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సమగ్ర చర్చ జరిగే అవకాశముంది. సాయంత్రం వరకు జరగనున్న ఈ సమావేశంలో వీటితో పాటు అనేక అంశాలపై చర్చించనున్నారు.

06:31 - February 5, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి వెళ్లాల్సిన అఖిలపక్షం పర్యటన కూడా వాయిదా పడింది. చివరి నిమిషంలో ప్రధాని అపాయింట్‌మెంట్‌ రద్దు చేసినట్లు సీఎం కార్యాలయానికి PMO సమాచారమిచ్చింది. ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఖరారైన తర్వాత మళ్లీ సమాచారమిస్తామని చెప్పడంతో.. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై రెండున్నరేళ్ల తర్వాత అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని కేసీఆర్‌ భావించారు. ఆదివారం ఢిల్లీ వెళ్లి.. సోమవారం ప్రధాని మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరారు. దీనికి పీఎంవో అంగీకరించడంతో ఢిల్లీ వెళ్లేందుకు కేసీఆర్‌ సిద్ధమయ్యారు. ఢిల్లీ రావాలని అఖిలపక్ష నేతలకు ఆహ్వానాలు కూడా పంపారు. ఢిల్లీకి వెళ్లేందుకు అందరూ సిద్ధమవుతున్న తరుణంలో మోదీ అపాయింట్‌మెంట్‌ క్యాన్సిల్‌ అయ్యిందంటూ పీఎంవో అధికారులు.. సీఎం కార్యాలయానికి మెసెజ్‌ పంపారు. అఖిలపక్షానికి అపాయింట్‌మెంట్‌ గురించి త్వరలో సమాచారమిస్తామని ప్రధాని కార్యాలయ అధికారులు తెలిపారు. దీంతో ఆఖరిక్షణంలో అఖిలపక్షం ఢిల్లీ టూర్‌ రద్దు అయ్యింది. పార్లమెంట్‌ సమావేశాలు, యూపీ ఎన్నికల నేపథ్యంలో అఖిలపక్షానికి ప్రధాని అపాయింట్‌మెంట్‌ రద్దు అయ్యినట్లు తెలుస్తోంది.

కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లిలో తుమ్మల పర్యటన..

హైదరాబాద్ : కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లిలో జిల్లాల్లో మంత్రి తుమ్మల పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

బంగ్లాతో వార్మప్ మ్యాచ్..

హైదరాబాద్ : భారత్ లో బంగ్లాదేశ్ ఆట షురూ కానుంది. జింఖానాలో నేటి నుండి రెండు రోజులు వార్మప్ మ్యాచ్ లో పొరుగుదేశం బరిలోకి దిగుతోంది.

తిరుమలలో అగ్నిప్రమాదం..

చిత్తూరు : తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శంఖుమిట్ట కాటేజీ 264వ గది వద్ద మంటలు చెలరేగాయి. భక్తులు నిద్రిస్తుండగా మంటలు చెలరేగాయి. మంటలు గదికి వ్యాపించడంతో భక్తులు పరుగులు తీశారు. గది కిటికీలు దగ్ధమయ్యాయి. మంటలను ఫైరింజన్ల సహాయంతో అదుపు చేశారు.

 

నేడు ఏఐడీఎంకే శాసనసభా పక్ష సమావేశం..

చెన్నై : నేడు ఏఐడీఎంకే శాసనసభా పక్షం కీలక సమావేశం జరగనుంది. శశికళ భవిష్యత్ పై ఊహాగానాలు వెలువడుతున్నాయి. నేటి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం..

హైదరాబాద్ : ఉదయం 11గంటలకు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.

Don't Miss