Activities calendar

06 February 2017

21:30 - February 6, 2017

ఢిల్లీ:సహారా గ్రూప్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సహారా చిట్‌ఫండ్‌ కేసుకు సంబంధించి ముంబైలోని 39 వేల కోట్ల విలువ చేసే ఆంబే వ్యాలీ ఆస్తులను అటాచ్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. సహారా గ్రూప్‌ చీఫ్‌ సుబ్రతారాయ్‌ ఇంకా చెల్లించాల్సిన 14 వేల 779కోట్ల బకాయిల కోసం ఈ ఆస్తులను వేలం వేయాలని కోర్టు సూచించింది. ఫిబ్రవరి 20 నాటికి సమస్యాత్మకంగా లేని ఆస్తుల జాబితా అందజేయాలని కోర్టు సహారా గ్రూప్‌ను ఆదేశించింది. సెబీకి 14,779కోట్లు చెల్లించడానికి సహారా 2019 జులై వరకు గడువు కోరింది. డబ్బు తిరిగి చెల్లించడం కోసం గతంలో కోర్టు ఇచ్చిన విధివిధానాల్లో భాగంగా సెబీకి సహారా గ్రూప్‌ 600కోట్లు చెల్లించింది. సుబ్రతారాయ్‌ డబ్బులు చెల్లిస్తున్నంత కాలం ఆయనను జైలుకు పంపమని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. సుబ్రతారాయ్‌ గతేడాది మే నుంచి పెరోల్‌పై బయట ఉంటున్న విషయం తెలిసిందే.

21:28 - February 6, 2017

ఢిల్లీ: ప్రధాని మోది చెప్పినట్లుగా నోట్ల రద్దుతో నల్లధనం, అవినీతి, ఉగ్రవాదం తగ్గకపోగా మరింత పెరిగాయని రాజ్యసభలో సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఏచూరి మాట్లాడారు. నోట్ల రద్దు కారణంగా వందకు పైగా మృతి చెందిన విషయంపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. పైగా పెద్ద యజ్ఞం జరిగినపుడు ఆహుతి జరుగుతుందని నిర్వచించడం శోచనీయమన్నారు. డిమానిటైజేషన్‌ తర్వాత రైతులు, కూలీల పరిస్థితి దుర్భరంగా మారిందని ఏచూరి అన్నారు. గత మూడు నెలల్లో టూవీలర్స్‌ అమ్మకాలు 35 శాతం పడిపోయాయని... బెనారస్‌ చీరలకు ప్రసిద్ధి చెందిన ప్రధాని నియోజకవర్గం వారణాసిలో చీరల ధరలు సగానికి పడిపోయాయని ఏచూరి చెప్పారు.

21:27 - February 6, 2017

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనక వస్తున్న వదంతులపై చెన్నై అపోలో ఆసుపత్రి స్పందించింది. మీడియా సమావేశం ఏర్పాటు చేసి జయకు జరిపిన చికిత్సా వివరాలను వైద్యుల బృందం వెల్లడించింది.

కార్డియాక్‌ అరెస్ట్‌కు వారం రోజుల ముందు వరకు...

కార్డియాక్‌ అరెస్ట్‌కు వారం రోజుల ముందు వరకు జయలలిత సంజ్ఞలతో మాట్లాడారని మన మాటలను కూడా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారని ...ఆమెకు ప్రత్యేక చికిత్స జరిపిన బ్రిటన్‌ వైద్యుడు రిచర్డ్‌ బేల్ తెలిపారు. జ‌య‌కు సంబంధించి ఎటువంటి అవ‌యవాల‌ను తొలిగించ‌డం కానీ, మార్పిడి చేయడం కానీ జ‌ర‌గ‌లేద‌న్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌ 22..

గత ఏడాది సెప్టెంబర్‌ 22న జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారని...శ్వాస తీసుకోవడం కష్టంగా మారిన విషమ పరిస్థితుల్లో జయలలితను ఆసుపత్రికి తీసుకొచ్చారని వైద్యులు వివరించారు. ఆసుపత్రిలో ఆమె చాలారోజులు మాట్లాడని స్థితిలోనే ఉన్నారని తెలిపారు. జయ తీవ్రమైన డయాబెటిక్స్‌తో బాధ పడ్డారని... ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఊపిరి సమస్య ఉత్పన్నమయ్యాయని.. సెపిసిస్‌ వల్లే ఆమె అవయవాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు నిర్ధారించారు. ఇన్‌ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉన్నందు వ‌ల్లే జ‌య‌ను వెంటిలేట‌ర్‌పై పెట్టాల్సి వ‌చ్చింద‌న్నారు. డిసెంబర్‌ 5న జయలలిత కార్డియాక్‌ అరెస్ట్‌కు గురయ్యారని.... 24 గంటల పాటు ఎక్మోపై చికిత్స చేసినా ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు.

ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందువల్లే ...

జయ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందువల్లే ఇతరులను లోనికి అనుమతించలేదని వైద్యులు తెలిపారు. జయ మృతి అంశంలో ఎటువంటి కుట్ర జరగలేదని స్పష్టం చేశారు. ట్రీట్‌మెంట్‌ను సిసిటీవీ కెమెరాలో తీయడం సరికాదని వైద్యులు తెలిపారు. జయలలితకు చికిత్స విషయంపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాలేదన్నారు. సన్నిహితులతో మాట్లాడే విషయాలు ఆమె గోప్యతకు సంబంధించినవని, అందుకే తాము వినలేదన్నారు. చికిత్సకు సంబంధించిన రోజువారీ వివరాలను శశికళ, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి తెలిపినట్టు వెల్లడించారు.

21:19 - February 6, 2017

కృష్ణా : నందివాడ మండలం ఇలపర్రు గ్రామం రణరంగాన్ని తలపించింది. ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుంటామన్న దళితుల ప్రకటనతో పోలీసులు నిర్బంధాన్ని పెంచారు. గ్రామంలో భారీగా పోలీసుల్ని మోహరించి కర్ఫ్యూను తలపింపజేశారు. ఇలపర్రు చుట్టుపక్కల గ్రామాల్లో 144 సెక్షన్‌, ఆక్రమిత భూములవద్ద 145 సెక్షన్‌ను ప్రయోగించారు. గ్రామంలోకి ఎవరూ రాకుండా నిషేధాజ్ఞలు విధించారు.

ఆక్రమణకుగురైన తమ భూముల్ని...

ఆక్రమణకుగురైన తమ భూముల్ని తిరిగి ఇప్పించాలంటూ 140రోజులుగా దళితులు పోరాడుతున్నారు.సీపీఎం, కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల అండతో, తమ భూముల స్వాధీనానికి యత్నించిన దళితులను పోలీసులు అడ్డుకున్నారు. ఇలపర్రుకు వస్తున్న సీపీఎం, కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులనూ పోలీసులు నిరోధించారు. గుడివాడలోనే ఏపీ సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు సహా పలువురి నేతలను లారీలోకి ఈడ్చిపారేశారు. సుమారు 200 మందిని అరెస్ట్ చేసి గుడివాడ, నందివాడ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

సీపీఎం కార్యకర్తలు రాస్తారోకో ...

పోలీసుల తీరుకు నిరసనగా సీపీఎం కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. దళితుల భూములు దళితులకు అప్పగించేదాక తమ పోరాటం ఆగదని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. పోలీసులు వచ్చినా, సైన్యం వచ్చినా భూములు స్వాధీనం చేసుకుని తీరుతామన్నారు. అరెస్టులు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు.

అరెస్టును కృష్ణా జిల్లా సీపీఎం నేతలు...

దళితులు, ఆందోళనకారుల అరెస్టును కృష్ణా జిల్లా సీపీఎం నేతలు తీవ్రంగా ఖండించారు. 165 ఎకరాలే కాదు 4 మండలాల్లో ఉన్న అసైన్డ్‌భూములను స్వాధీనం చేసుకుని పెత్తందార్ల జాతకాలు బయటపెడతామని వారు హెచ్చరించారు. ప్రజా ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్థానిక రైతులు హెచ్చరించారు.

ఖండించిన 10వామపక్ష పార్టీలు...

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఆర్‌ రఘు సహా ఇతర నేతల అరెస్ట్‌ను 10 వామపక్ష పార్టీలు ఖండించాయి. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అని మండిపడ్డాయి. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయడంతో పాటు దళితుల భూములను తిరిగి వారికి అప్పగించాలని డిమాండ్ చేశాయి. 

21:15 - February 6, 2017

హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. ముందు ప్రకటించినట్లుగా... గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గురుకులాల్లో 7వేల 306 పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 4వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని టీఎస్ పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఐదు గురుకుల సొసైటీలకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది..

21:13 - February 6, 2017

చెన్నై :తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళా నటరాజన్‌ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మద్రాస్ యూనివర్సిటీ సెంట్రల్‌ హాలులో ఆమె ఉదయం ఎనిమిదిన్నరకు సిఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆదివారం జరిగిన అన్నాడిఎంకే శాసనసభ పక్ష సమావేశంలో శశికళను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. శశికళ తమిళనాడుకు మూడో మహిళా ముఖ్యమంత్రి అవుతారు. మరోవైపు శశికళ ప్రమాణం చేయకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.

ఎన్నో సవాళ్లు....

తమిళనాడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న శశికళకు పెను సవాళ్లు ఎదురుకానున్నాయి. ఆమెకు స్వాగతం పలికే సవాళ్లలో మొట్టమొదటిది ఆమె శాసనసభకు ఎన్నిక కావటం. దీంతో పాటు ప్రతిపక్షాన్ని జయ స్థాయిలో దీటుగా ఎదుర్కొనవలసి ఉండటం ప్రతిష్టాత్మకం కానుంది. రెండు నెలలుగా సీఎంగా ఉన్న పన్నీర్‌ సెల్వం పొందిన ప్రజాదరణ..ఇప్పుడు ఆమెకు ఇబ్బందికరంగానే పరిణమించే అవకాశం ఉంది. జయ మృతి తర్వాత నెలకొన్న సానుభూతి నేపథ్యంలో ఇంతకాలం ఆచితూచి అడుగేసిన ప్రతిపక్షం ఏదో విధంగా అధికార పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

శశికళ ఎన్నికను అంగీకరించేది లేదంటున్న ప్రతిపక్షం...

శశికళ ఎన్నికను అంగీకరించేది లేదని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఇప్పటికే స్పష్టం చేయడంతో.. భవిష్యత్‌లో ప్రతిపక్షం నుంచి వ్యతిరేకత తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. శశికళను జయ స్థానంలో ఎన్నుకున్న రోజును..తమిళనాడు చరిత్రలో చీకటి రోజుగా ఇప్పటికే డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ అభివర్ణించారు. ఈ తరుణంలో ప్రత్యర్థి వర్గాలు వేలెత్తి చూపని విధంగా పరిపాలన సాగించడం ఆమెకు నల్లేరు మీద నడకేం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సవ్యంగా పరిపాలన సాగిస్తున్న పన్నీరుసెల్వాన్ని ...

సవ్యంగా పరిపాలన సాగిస్తున్న పన్నీరుసెల్వాన్ని హఠాత్తుగా మార్చడంలో అర్థం లేదని బీజేపీ నాయకులు స్పష్టం చేయడంలో... ఆ పార్టీకి చూడా శశికళ సీఎం పదవి చేపట్టడం ఇష్టం లేదన్న చర్చ జరుగుతోంది. తొలి నుంచి పన్నీరు సెల్వానికి మద్దతు తెలిపి సహకరిస్తున్న కేంద్రం నుంచి అదే విధమైన మద్దతు సంపాదించడం శశికళకు పెను సవాలు కానుంది. జయలలిత మృతి ప్రకటన వెలువడే కొన్ని గంటల ముందు అపోలో ఆసుపత్రిలో శశికళకు అనుకూలంగా ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించారని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి జోక్యంతో పన్నీర్‌సెల్వం బాధ్యతలు స్వీకరించారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో శశికళ పట్ల బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

గెలవడం అంత సులువు కాదు. ...

జయలలిత మృతితో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్‌ నియోజకవర్గంలో పోటీ చేసి గెలవడం అంత సులువు కాదు. ప్రతిపక్షాలతో పాటు పార్టీలోని వ్యతిరేక వర్గం నుంచి కూడా శశికళకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటికి తోడు ఆర్కేనగర్‌ నుంచే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న దీప అనుచరగణం నుంచి కూడా శశికళలకు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. వీటికి తోడు జయ మరణం వెనుక శశికళ హస్తం ఉందన్న ఆరోపణలను విశ్వసిస్తున్నవారూ ఉన్నారు. వారి నుంచి కూడా ఎదురయ్యే వ్యతిరేకత శశికళకు మరో సవాలుగా మారనుంది. వీటన్నింటికి తోడు వారం రోజుల్లో అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

18:34 - February 6, 2017

అమరావతి ఏపీ కేబినెట్‌లో కూడికలు, తీసివేతల పర్వానికి రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై ఎనిమిది నెలలుగా జరుగుతున్న ప్రచారాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈనెల 9 లేదా 10 తేదీల్లో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖాయమైంది. మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేబినెట్‌లో మార్పులు చేర్పులకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న ఆయన.. ఈసారి పార్టీలో సీనియర్లకు పెద్దపీట వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రావెల, పల్లె, మృణాళినికి పొంచి వున్న గండం!

మంత్రులు రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాథరెడ్డి, మృణాళినిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ జాబితాలో మొదట పీతల సుజాత పేరు వినిపించినా.. ఆమె పనితీరును మెరుగు పర్చుకోవటంతోపాటు, జిల్లాలోనూ రాజకీయంగా పట్టు సాధించటంతో తన మంత్రి పదవిని కాపాడుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా టిడిపి సీనియర్లు గాలి ముద్దుక్రిష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ళ నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావుకు చోటు కల్పిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కేబినెట్‌లో లోకేష్‌ ఎంట్రీకి పచ్చజెండా ఊపిన చంద్రబాబు ...

ఇక ఏపీ మంత్రివర్గంలోకి నారా లోకేష్ ఎంట్రీ ఎప్పుడన్న ఊహాగానాలకు అధినేత చంద్రబాబు ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో క్రీయశీలకంగా వ్యవహరిస్తున్న లోకేష్‌ను...మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. కొంతకాలంగా లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. కొందరు మంత్రుల విషయంలోనూ ప్రభుత్వ వ్యవహారాల్లోనూ లోకేశ్ చురుకైన పాత్రనే పోషిస్తున్నారు. ఇందువల్ల లోకేశ్‌పై రాజ్యాంగేతర శక్తి అన్న ముద్ర పడడంతోపాటు ప్రతిపక్షాల నుంచి విమర్శలూ ఎదురవుతున్నాయి. ఈనేపథ్యంలో చినబాబును కేబినెట్‌లోకి తీసుకుని పూర్తిస్థాయి అధికారిక పగ్గాలు అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లోకేష్‌కు మున్సిపల్,ఐటి శాఖలను కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఏపి కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారుకావడంతో..ఆశావాహుల్లో ఉత్తేజం..పదవి గండం ఉన్నవారిలో నిస్తేజం నెలకొంది. ఏదీ ఏమైనా కొత్త కేబినెట్ కూర్పు ఎలా వుంటుందన్న విషయం సర్వాత్రా ఉత్కంఠ రేపుతోంది.

 

 

18:32 - February 6, 2017
18:30 - February 6, 2017

విశాఖ : సరదా సరదా కార్యక్రమాలు, పోటీలు, డ్యాన్స్‌లు, పాటలు, కామెడీ స్కిట్‌లతో విశాఖ ఉత్సవ్ అందరినీ అలరించింది...... మూడురోజులపాటు కొనసాగిన ఉత్సవం.. స్థానికుల్లో మరువలేని అనుభూతిని మిగిల్చింది. పలువురు కళాకారులు తమ ప్రతిభతో ఆహూతులను ఆకట్టుకున్నారు. వివిధ ప్రాంతానుంచివచ్చినవారుకూడా విభిన్న ప్రదర్శనలతో అలరించారు.

వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి విశాఖ పురస్కారాలు..

తొలిసారి వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి విశాఖ పురస్కారాలను ప్రదానం చేశారు.. ఈ అవార్డును నృత్యకళాకారిణి మంజు భార్గవికి మంత్రి గంటా శ్రీనివాసరావు అందజేశారు.. స్మార్ట్ సిటీగా మారుతున్న నగరంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషాన్నించిందని అన్నారు..

అందరినీ కట్టిపడేసిన స్కృతిక కార్యక్రమాలు..

విశాఖ ఉత్సవ్‌ ముగింపు కార్యక్రమాలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ కట్టిపడేశాయి... అనూప్‌ రుబెన్స్‌ మ్యూజికల్‌ పర్‌ఫామెన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. రూబెన్స్‌ సినిమా పాటల్ని పాడుతూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు..జబర్దస్త్ షో ఫేం షరీఫ్‌, రాకేశ్ కామెడి స్కిట్స్‌ అందరినీ నవ్వించాయి..ముగింపు ఉత్సవంలో మంత్రులు కామినేని, పత్తిపాటి, రావెల కిశోర్‌ బాబు పాల్గొన్నారు..  

మంజునాధన్ కమిషన్ ఎదుట ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం

ప్రకాశం: ఒంగోలు మంజునాధన్ కమిషన్ ఎదుట ప్రెటోల్ పోసుకుని ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. కాపులను బీసీల్లో చేర్చవద్దని డిమాండ్ చేస్తున్నారు.

 

రవాణా శాఖలో బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష

హైదరాబాద్: టీఎస్ రవాణా శాఖలో బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద భూములపై చంద్రబాబు కన్ను: జగన్

అనంతపురం : గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద భూములపై చంద్రబాబుకు కన్నుపడిందని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా రిజర్వాయర్ వద్ద భూములను పరిశ్రమలకు కేటాయిస్తారా? అని ప్రశ్నించారు. ఇక్కడ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు బినామీల పేరుతో వందలాది ఎకరాలున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. మేం అధికారంలోకి రాగానే రైతుల భూములను రైతులకు తిరిగి ఇస్తానన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పై కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ ఎంసీలోని వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని ఖాళీ స్థలాలను గుర్తించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు నిధుల కొరత లేదని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు అధికారులు తీసుకున్న చర్యలు వివరాలు సేకరించామని, టెండర్లు పూర్తయిన చోట పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఇళ్లనిర్మాణానికి అనువుగా ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాల నివేదిక తయారు చేయాలన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ స్థలాలను ఇళ్ల నిర్మాణాలకు ఇవావ్లని కేంద్రాన్ని కోరాలన్నారు.

18:24 - February 6, 2017

ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ నుండి వైదొలగిన సున్నం రాజయ్య

హైదరాబాద్:: సున్నం రాజయ్య (సీపీఎం ఎమ్మెల్యే) సీపీఎంపార్టీ, ప్రభుత్వ ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ నుండి వైతొలుగుతున్నట్టు ప్రకటించారు. దళిత,గిరిజన సంఘాలు,,అఖిల పక్షపార్టీలు,మేదావులతో చర్చించిన తరువాతే చట్టం పై ప్రభుత్వ కమిటీ చర్చించాలని డిమాండ్ చేశారు.

17:44 - February 6, 2017

కరీంనగర్‌ :జిల్లాలో ఓ రవాణాశాఖ అధికారి ఏసీబీ వలలో చిక్కారు. జమ్మింకుట కొత్తపల్లిలో లోని ఆర్టీవో అధికారి గౌస్‌బాబా ఇళ్లలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. అటు జిల్లాకేంద్రం కొత్తగూడెంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈసోదాల్లో పలు అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గౌస్‌బాబా ప్రస్తుతం భద్రాచలం ఆర్టీవో గా విధులు నిర్వహిస్తున్నారు.

17:42 - February 6, 2017

నిజామాబాద్: అక్కరకు రాని చుట్టాల్లా మారారు నాయకులు. అవసరం ఉన్నపుడు బుచ్చన్నా.. అని నోరారా పిలిచిన నోళ్లు ఇపుడు సైలెంట్‌ అయ్యాయి. తెలంగాణ కోసం రేయింబవళ్లు ఉద్యమాల్లో పాల్గొని లాఠీదెబ్బలు తిన్న మ్యాతరిబుచ్చయ్య.. ఇపుడు చావుబతుకుల్లో సాయంకోసం ఎదురు చూస్తున్నాడు.

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బుచ్చన్న...

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి చెందిన మ్యాతరి బుచ్చన్న తెలంగానా ఉద్యమంలొ చురుగ్గా పాల్గొన్నాడు. ధర్నాలు ,రాస్తారోకొలు, ఆందోళనలు ఇలా పలు విధాలుగా ఉద్యమంలో పాల్గొన్నాడు. నాయకుల పిలుపునందుకుని ఎక్కడికంటే అక్కడికి తన ఊరి జనాన్ని తీసుకుపోయాడు. కాని..రాష్ట్రం వచ్చింది.. కుర్చీలెక్కినోళ్లు కులాసాగా గడుపుతున్నారు. ఆరోజు తనను ఉద్యమానికి ఉపయోగించుకున్న లీడర్లు కనీసం పలకరించడానికి కూడా రావడంలేదని బుచ్చయ్య వాపోతున్నారు. తెలంగాణ వస్తే తన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఆసక్తితొ ఉద్యమం చేశానని.. కాని.. తీరా రాష్ట్రం వచ్చి కుర్చీలెక్కినోళ్లు తనను మర్చిపోయారని బుచ్చన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కిందపడిపోయి వెన్నెముక దెబ్బతిన్న బుచ్చన్న ..

మ్యాతరి బుచ్చన్నకు బార్య సుజాత ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు ఉన్నారు. వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల పొలం సాగు చేసుకుంటు బుచ్చన్న తన కుటుంబాన్ని పొషించుకుంటు తెలంగాణా ఉద్యమంలో పాల్గొంటున్న సమయంలో ఓ రోజు నిద్రలోనే కాళ్లూ చేతులు పడిపోయాయి. మాటకూడా రాకుండా పోయింది. అప్పటి నుంచి ఉన్న రెండెకరాల పొలం అమ్మి లక్షల రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులన్నీ తిరిగాడు. కాని ప్రయోజనం కనిపంచలేదు. చివరికి హైదరాబాద్‌ నిమ్స్‌లో చేరాడు. బీపీ ఎక్కువై మెడవెనుక వెన్నెముకలో నరాలు దబ్బతిన్నాయన్న నీమ్స్‌డాక్టర్లు.. ఆపరేషన్‌కు మూడు లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. ఇప్పటికే చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోవడంతో.. చేసేదిలేక.. నెలరోజుల కిందట ఉస్మానియా ఆస్పత్రిలో చేరినా అక్కడ సరైన వైద్యం అందక అవస్థలు పడి.. ఆశలు వదులుకుని ఇంటికి చేరుకున్నామని బుచ్చన్న కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబ పోషణకోసం బీడీలు చుడుతున్న భార్య....

భర్త మంచానికే పరిమితం కావడం.. పిల్లలు చిన్నవారు కావడంతో కుటుంబ పొషణ భారం మొత్తం భార్య సుజాత పై నే పడింది. బీడీలు చుడుతూ వచ్చిన అరకొర కూలీ డబ్బులతోనే ..కుటుంబం గడపుతూ భర్తకు వైద్యం చేయిస్తోంది. ఇలా నాలుగు సంవత్సరాలుగా తల్లిపడుతున్న బాధలు చూడలేక ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కొడుకు ఊరిలోనే డప్పుకొడుతూ తల్లికి ఆసరాగా ఉంటున్నాడు.

ఉద్యమానికి వాడుకున్నారు.. తర్వాత మర్చిపోయారు....

ఉద్యమ సమయంలో తనపై తెగ ప్రేమను ఒలబోసిన నాయకులు..ఇపుడు పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నాడు బుచ్చన్న. నా పరిస్థితిని మీరైనా ముఖ్యంత్రికి కనిపించేలా చూపించండి సారూ అని బుచ్చయ్య కన్నీరు పెట్టుకుంటున్నాడు.

 

ఉపాధ్యాయ పోస్టులను అప్ గ్రేడ్ చేసిన ఏపీ సర్కార్

విజయవాడ: మున్సిపల్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులను ఏపీ సర్కార్ అప్ గ్రేడ్ చేసింది. 281 భాషా పండితులు, 190 పీఈటీ పోస్టులకు పదోన్నతులు, ఎంఈవో పోస్టుల భర్తీకి వయోపరిమితిని ప్రభుత్వం తొలగించింది. ఎంఈవో పోస్టులకు 50 ఏళ్ల వయోపరిమితిని కూడా తొలగించింది. ప్రభుత్వ నిర్ణయంపై యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

రేపు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం

చెన్నై: రేపు ఉదయం 11 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ న‌ట‌రాజ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయనున్నారు. ఆమె మద్రాస్ యూనివర్సిటీ హాల్‌‌లో ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని అన్నా డీఎంకే తెలిపింది. ఆమెతో పాటు కొందరు మంత్రులతో కూడా గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణం స్వీకారం చేయిస్తార‌ని పేర్కొంది. 

17:04 - February 6, 2017

హీరో మహేశ్‌బాబుకు సమన్లు

హైదరాబాద్: హీరో మహేశ్‌బాబుకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. తన నవల కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశాడని రచయిత చంద్ర కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారణకు స్వీకరించిన కోర్టు మహేశ్ బాబుతో పాటు డైరెక్టర్ కొరటాల, నిర్మాత నవీన్‌లకు సమన్లు జారీ చేసింది. మార్చి 3న కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

16:55 - February 6, 2017

హైదరాబాద్: హీరో ప్రిన్స్ మహేశ్‌బాబుకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. తన నవల కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశాడని రచయిత చంద్ర కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారణకు స్వీకరించిన కోర్టు మహేశ్ బాబుతో పాటు డైరెక్టర్ కొరటాల, నిర్మాత నవీన్‌లకు సమన్లు జారీ చేసింది. మార్చి 3న కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

16:52 - February 6, 2017

హైదరాబాద్: ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి అలిస్టర్ కుక్ తప్పుకున్నాడు. ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్ ను 0-4తో కోల్పోయిన వెంటనే రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు కుక్ ప్రకటించాడు. 2012లో ఇంగ్లండ్ కెప్టెన్ గా నియామకమైన కుక్ ఇప్పటి వరకు 59 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇంగ్లీష్ జట్టుకు అత్యధిక టెస్టుల్లో నాయకత్వం వహించిన ఘనత కుక్ దే. తన కెప్టెన్సీలో 2013, 2015లో యాషెస్ సిరీస్ లను గెలుపొందడం కుక్ సాధించిన గొప్ప విజయాలుగా చెప్పుకుంటారు. 2010-2014 మధ్యకాలంలో 69 వన్డేలకు కూడా కుక్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా కుక్ మాట్లాడుతూ, ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణమని చెప్పాడు. ఇకపై కూడా టెస్టు ప్లేయర్ గా కొనసాగుతూ, కొత్త కెప్టెన్ కు సహాయసహకారాలు అందిస్తానని చెప్పాడు. 

ఢిల్లీలో సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ 3 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు. ఉస్మానియా యూనివర్శిటీ శతజయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్ ను ఆహ్వానించనున్నారు. అంతే కాకుండా విభజన హామీలు, పెండింగ్ సమస్యలపై కేంద్ర మంత్రులు రాజ్ నాథ్, జైట్లీను సీఎం కేసీఆర్ కలిసి చర్చించనున్నారు.

రూ.3900 కోట్ల విలువైన సహారా ఆస్తులు జప్తు

ఢిల్లీ: సహారా ఆస్తులను సుప్రీం కోర్టు జప్తు చేసింది. సహారా సంస్థకు చెందిన రూ.3900 కోట్ల విలువైన ఆస్తులను సుప్రీం కోర్టు అటాచ్ చేసింది. మొత్తం బకాయిలు చెల్లించే వరకు అంబేవ్యాలీ, పెణే ప్రాపర్టీస్ ను జప్తు చేయాలని ఆదేశించింది. ఈ నెల 20 లోగా జప్తు చేసిన ఆస్తుల జాబితా ఇవ్వాలని ఆదేశించింది. సుబ్రతోరాయ్ కి 2 వారాలు పెరోల్ ను సుప్రీం పొడిగించింది.

ఎన్టీఆర్‌ పాత్రలో నేనే నటిస్తా-నందమూరి బాలకృష్ణ

కృష్ణా : ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై సినిమా తీస్తానన్నారు ఆయన తనయుడు, హీరో బాలకృష్ణ. ఎన్టీఆర్‌ పాత్రలో తానే నటిస్తానని కూడా ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాపై పరిశోధన జరుగుతోందని... అతి త్వరలోనే తెరకెక్కించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.  కృష్ణా జిల్లా నిమ్మకూరులో నారా లోకేష్‌తో కలిసి పర్యటించిన బాలకృష్ణ... గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. హిందూపురం, నిమ్మకూరు తనకు రెండూ సమానమేనని తెలిపారు. నా పీఏ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని... క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవన్నారు బాలయ్య. 

16:33 - February 6, 2017

చెనై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అందించిన చికిత్సపై ఎట్టకేలకు అపోలో వైద్యులు స్పందించారు. మీడియా ముందు వారు మాట్లాడుతూ... జయకు అందించిన వైద్యంపై వస్తున్న ఆరోపణలను కొట్టి పారేశారు. జయలలితకు అత్యుత్తమ వైద్య చికిత్సను అందించడం జరిగిందని స్పష్టం చేశారు. జయలలితను విషమ పరిస్థితుల్లో ఆసుపత్రికి తీసుకొచ్చారని... ఆసుపత్రిలో ఆమె చాలారోజులు మాట్లాడని స్థితిలోనే ఉన్నారన్నారు. జయ తీవ్రమైన డయాబెటిక్స్‌తో బాధ పడ్డారని... ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆమె అవయవాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. జయ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందువల్లే ఇతరులను లోనికి అనుమతించలేదన్నారు. ట్రీట్‌మెంట్‌ను సిసిటీవీ కెమెరాలో తీయడం సరికాదని లండన్‌ వైద్యుడు రిచర్డ్‌ బాలె తెలిపారు. గుండెపోటు రావడంతోనే జయలలిత కన్ను మూశారన్నారు.  

16:32 - February 6, 2017

యూపీ :సమాజ్‌వాది పార్టీలో తండ్రీ కొడుకుల మధ్య కొనసాగిన సంక్షోభానికి తెరపడ్డట్లే కనిపిస్తోంది. కొడుకు పట్ల ములాయం మెత్తబడ్డారు. యూపీ సిఎం అభ్యర్థిగా అఖిలేష్‌ యాదవే ఉంటారని ఆయన ప్రకటించారు. తమ కుటుంబంలో ఎలాంటి వివాదాలు లేవన్నారు. రేపటి నుంచి ఎస్పీ తరపున అఖిలేష్‌ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. శివపాల్‌ యాదవ్‌ కొత్త పార్టీ పెట్టరని కూడా ములాయం స్పష్టం చేశారు. శివపాల్‌ ఆవేశంలో ప్రకటించారని తెలిపారు. పాత విషయాలు మరచిపోయి అఖిలేష్‌ వెంటే ఉంటానన్నారు. కాంగ్రెస్-ఎస్పీ అలయెన్స్‌ తరపున ప్రచారం చేస్తానని ములాయం చెప్పారు. 

16:31 - February 6, 2017

ఢిల్లీ: ముస్లిం లీగ్‌ నేత ఇ. అహ్మద్‌ మృతిపై పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. కేరళకు చెందిన ఎంపీలు నల్లటి రిబ్బన్‌ కట్టుకుని నిరసన తెలిపారు. ఎంపీ ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పాల్గొన్నారు. అహ్మద్‌ మృతిపై ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్‌ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. మరోవైపు ఇ.అహ్మద్‌ మృతిపై చర్చించాలని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌, ఆర్‌ఎస్‌పీ నేత ఎన్‌.కె. ప్రేమ్‌చంద్రన్‌లు లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. సీనియర్‌ పార్లమెంటేరియన్‌, మాజీ కేంద్ర మంత్రి అహ్మద్‌ మృతిపై సరైన సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

16:28 - February 6, 2017

విజయవాడ : సత్యనారాయణపురం రవీంద్ర భారతి పబ్లిక్‌ స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తరగతి గదుల నుండి విద్యార్థులు పరుగులు తీశారు. సకాలంలో విద్యార్తులు బయటకు రావడంతో... ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. 

16:27 - February 6, 2017

కృష్ణా : ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై సినిమా తీస్తానన్నారు ఆయన తనయుడు, హీరో బాలకృష్ణ. ఎన్టీఆర్‌ పాత్రలో తానే నటిస్తానని కూడా ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాపై పరిశోధన జరుగుతోందని... అతి త్వరలోనే తెరకెక్కించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో నారా లోకేష్‌తో కలిసి పర్యటించిన బాలకృష్ణ... గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. హిందూపురం, నిమ్మకూరు తనకు రెండూ సమానమేనని తెలిపారు. నా పీఏ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని... క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవన్నారు బాలయ్య. 

16:24 - February 6, 2017

హైదరాబాద్: ఏపీ, తెలంగాణలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్స్, 2 టీచర్స్ స్థానాలు, తెలంగాణలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ఈ నెల 13న విడుదల కానుంది. ఫిబ్రవరి 20 వరకు నామినేషన్ స్వీకరిస్తారు. మార్చి 9న ఎన్నికలు, 15న కౌంటింగ్ జరగనుంది. మార్చి 18తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. 

లోకేష్ కు మున్సిపల్, ఐటీ శాఖ!

అమరావతి : ఏపీ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు దాదాపు ఖరారైంది. ఈనెల 9 లేదా 10న కేబినెట్‌ విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ విస్తరణలో నారాలోకేష్‌కు మంత్రి పదవి దాదాపు ఖరారైంది. ఆయనకు ఐటీ, మున్సిపల్‌ శాఖలు కేటాయించవచ్చని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేబినెట్ రేసులో కళా వెంక్రటావు, సోమిరెడ్డి, ధూళిపాళ్ల, భూమా, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, కల్వపూడి శివ, ఆనంద్‌బాబు కూడా ఉన్నారు. ప్రస్తుత కేబినెట్లో కొందరి పనితీరుపై బాబు అసంతృప్తితో ఉన్నారు. కొందరు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించే అవకాశముంది.  

16:22 - February 6, 2017

అమరావతి : ఏపీ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు దాదాపు ఖరారైంది. ఈనెల 9 లేదా 10న కేబినెట్‌ విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ విస్తరణలో నారాలోకేష్‌కు మంత్రి పదవి దాదాపు ఖరారైంది. ఆయనకు ఐటీ, మున్సిపల్‌ శాఖలు కేటాయించవచ్చని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేబినెట్ రేసులో కళా వెంక్రటావు, సోమిరెడ్డి, ధూళిపాళ్ల, భూమా, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, కల్వపూడి శివ, ఆనంద్‌బాబు కూడా ఉన్నారు. ప్రస్తుత కేబినెట్లో కొందరి పనితీరుపై బాబు అసంతృప్తితో ఉన్నారు. కొందరు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించే అవకాశముంది.  

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

హైదరాబాద్: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి అరకిలో బంగారం, 1.5 కిలోల వెండీ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

సీరియస్ ఇన్ఫెక్షన్ వల్లే జయమృతి

చెన్నై: మాజీ సీఎం దివంగత జయలలిత చెన్నైలోని అపోలో ఆసుప్రతికి తీసుకొచ్చినప్పుడు జయకు సీరియస్ ఇన్ఫెక్షన్ ఉందని చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్ బీలే చెప్పారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. విషమ పరిస్థితుల్లో ఆమెను హాస్పిటల్ కు తీసుకొచ్చారని తెలిపారు. ఇన్ఫెక్షన్ తో శరీరంలోని అవయవాలు దెబ్బతిన్నాయని తెలిపారు. చికిత్సకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందించడం అనేది హాస్పిటల్ నియమ నిబంధనలకు సంబంధించిన విషయమని చెప్పారు. జయ మరణంపై ఎందరిలోనో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, జయకు వైద్య . జయకు అందించిన చికిత్స వివరాలను వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. తెలంగాణ లో ఒకటి, ఏపీలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల జరగనుంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 ఉపాధ్యాయ సాధనాలకు ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 13 శాసనమండలి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ తుదిగడువు ఫిబ్రవరి 20 వరకు నామినేషనల్ పరిశీలన 21, ఉపసంహరణ 23 జరుగుతుంది. మార్చి 9న మండలి ఎన్నికల పోలింగ్, మార్చి 15న కౌంటింగ్ జరగనుంది.

15:49 - February 6, 2017

బక్సర్ రైల్వే స్టేషన్ సమీపంలో బాంబు పేలుడు..

బీహార్: ముఘల్ సరాయ్, పాట్నాల మధ్య ఉన్న బక్సర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు మధ్యాహ్నం ఈ బాంబు పేలుడు సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.

ముంబై ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం..

ముంబై : ఆర్థిక రాజధాని ముంబై ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా అధికారులు స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఓ ప్రయాణికుడు రెండు సిలిండర్ ఆకారం గల బంగారు వస్తువులకు నల్లరంగు పూత పూసి స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మార్కెట్ లో వీటి విలువ సుమారు రూ.31,68,780గా ఉంటుందని ఏఐయూ అధికారులు తెలిపారు.

15:42 - February 6, 2017

హైదరాబాద్: ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇలా అంశాలపై ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శారదా రెడ్డి వివరించారు.పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:36 - February 6, 2017

హైదరాబాద్: చదివింది సైన్స్ విద్య.. బాలసాహిత్యంపై ఆసక్తి.. మరో వైపు పెయింటింగ్స్.. ఆమె లో విభిన్న కోణాలు ప్రతిబింబిస్తాయి. మంచి భర్త, ముచ్చటైన పిల్లలు. పొదరిల్లువంటి చక్కని జీవితం. కానీ ఇవన్నీ ఆమెకు తృప్తినివ్వలేదు. మాతృభాషపై ఆసక్తి, ప్రేమ ఆమెను బాలసాహిత్యం వైపు నడిచేలా చేసింది. మాతృభాష పట్ల మమకారాన్ని చాటుతూ..చిన్నారుల్లో తెలుగు భాష పట్ల అవగాహన పెంచుతున్న ఓ మహిళ కథనంతో ఈ నాటి స్ఫూర్తి మన ముందుకు వచ్చింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:24 - February 6, 2017
15:09 - February 6, 2017

కృష్ణా :గుడివాడ ఇలపర్రులో అరెస్ట్‌చేసిన సీపీఎం నాయకులు, కార్యకర్తలను వన్‌టౌన్‌ పోలీస్టేషన్ తరలించారు. అరెస్టులకు నిరసనగా పోలీస్‌స్టేన్‌లోనే సీపీఎం నాయకులు ,దళితులు ధర్నాకు దిగారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దళితుల భూముల్లో తవ్విన చేపల చెరువులను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. తాను మారానని చెబుతున్న చంద్రబాబు దళితులు, పేదవర్గాలను పీడిస్తున్నాడని సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

14:40 - February 6, 2017

హైదరాబాద్: బాలింత మరణాలకు కారణం కనుగొనేందుకు ఉన్నతస్థాయి వైద్య నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు నీలోఫర్‌ ఆస్పత్రి ఉన్నతాధికారులు చెప్పారు. వారంరోజుల్లో కారణాలను విశ్లేషించి నివేదిక అందిస్తారని చెబుతున్నారు. వైద్యబృందం నివేదక అందేవరకు ఆస్పత్రిలో ఎలాంటి ఆపరేషన్లు జరగవని డాక్టర్లు తెలిపారు. 

14:38 - February 6, 2017

హైదరాబాద్: నీలోఫర్‌ ఆస్పత్రిలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. రోగుల బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

14:37 - February 6, 2017

హైదరాబాద్: ఐటీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లోని జినోమ్‌వ్యాలీ సదస్సులో మాట్లాడారు. ఈసందర్భంగా పలువురు ఫార్మాకంపెనీల చైర్మన్లకు అవార్డులు అందజేశారు. జాన్సన్ అండ్ జాన్సన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ తోపాటు .. వాల్డ్‌వైడాఫ్‌ ఫార్మా డాక్టర్ పౌల్ స్టోఫెల్స్, ప్రొఫెసర్ కుర్త్ ఉర్తాచాంద్‌లకు జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు . ఈసదస్సుకు మఖ్య అతిధిగా హాజరైన కేటీఆర్‌ రాష్ట్రంలో ఫార్మాంరగం అభివృద్ధిపథంలో దసుకుపోతోందన్నారు. 

14:36 - February 6, 2017

గుంటూరు : నగరంలో ఏర్పాటు చేసిన మోడల్‌ పోలీస్‌స్టేషన్‌లను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనంగా ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్‌స్టేషన్‌లను సీఎం పరిశీలించారు. చాలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేశారని... దీంతో నేరాలు తగ్గుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అలాగే సామాన్యులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి.. పోలీసులపై దౌర్జన్యం చేయడానికి ఇక అవకాశం ఉండదని ఆయన అన్నారు.

14:34 - February 6, 2017

అనంతపురం :ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత జగన్‌ మాటల తూటాలు పేల్చారు. బాబుకు రైతులంటే ప్రేమ లేదని విమర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టులు కడితే వేస్ట్‌ అని .. మనసులో మాట పేరుతో పుస్తకం రాసుకున్న చంద్రబాబుకు ఇపుడు రైతుల మీద ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందని జగన్‌ ప్రశ్నించారు. 

14:31 - February 6, 2017

హైదరాబాద్: శ్రీకాకుళంజిల్లా రాజంలో ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్‌ కూడలి వద్ద లోలపేటకు చెందిన వజ్రపుదేవి అనే విద్యార్థిని మృతి చెందింది. దీనిపై ఆగ్రహించిన స్టూండెంట్స్‌ ధర్నాకు దిగారు. రోడ్డు వెడల్పు చేయకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర్న చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు ఫ్లెక్సీలు ధహనం చేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

తమిళ రాజకీయాలపై కమల్, అశ్విన్ ట్వీట్స్..

చెన్నై: తాజా త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై సినిమా స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, క్రికెట‌ర్ అశ్విన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. జయ మరణం అనంతరం అతలాకుతంగా మారిన తమిళ రాజయాలపై ప్రముఖులు ట్వీట్లు చేయడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 

విమానాన్ని ఢీకొట్టిన పక్షి..

న్యూఢిల్లీ: ఓ విమానాన్ని పక్షి డీకొట్టింది తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే భోపాల్ నుంచి న్యూఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది. విమానంలో ప్రయాణిస్తున్న 122 మంది క్షేమంగా ఉన్నట్లు ఎయిర్ ఇండియా వెళ్లడించింది. 

13:45 - February 6, 2017
13:44 - February 6, 2017
13:41 - February 6, 2017

విజయవాడ : ఏపీ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూములను అధికారికంగా స్వాధీనం చేసుకునేందుకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. పరిహారం కింద కేటాయించిన ప్లాట్ల అభివృద్ధి, సమస్యలు కొలిక్కి రాకుండానే రైతుల నుంచి భూములు చేజిక్కించుకునేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది.
అభివృద్ధికి నోచుకోని..
రాజధాని రైతులకు పరిహారం కింద ఇచ్చే ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని 2016 జూన్ 25న ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తొలుత నేలపాడు గ్రామస్తులకు, ఆ తర్వాత ఒక్కో గ్రామానికి ప్లాట్లు కేటాయిస్తూ వచ్చారు. ప్లాట్ల కేటాయింపు ప్రారంభించి సుమారు ఎనిమిది నెలలు కావస్తున్నా ప్లాట్లు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. నేలపాడు గ్రామంలో ప్లాట్ల అభివృద్ధి కార్యక్రమాన్ని మాత్రమే ప్రారంభించారు. మిగిలిన ఏ ఒక్క గ్రామంలో కనీసం ప్లాట్ల కోసం లే అవుట్లు వేయలేదు. ఆ గ్రామాల్లో ఎప్పుడు లే అవుట్లు వేస్తారో తెలియని పరిస్థితి. మొదట లేఅవుట్లు వేసి త్వరాత ప్లాట్లు అభివృద్ధి చేయాల్సి ఉంది. 
తీవ్ర అన్యాయం..
అనంతరం ప్లాట్లు పూర్తిస్థాయిలో రైతుల చేతికొచ్చే అవకాశం ఉంది. అయితే ఇవేవీ చేయకుండానే ప్రభుత్వం ఏకంగా రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. రైతుల భూములు రిజిస్ట్రేషన్ చేశాక, ఆ తర్వాత ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తామంటే రైతులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంటుందనే అనుమానం రైతుల్లో వ్యక్తమవుతోంది. 
ఐదు జోన్లు.. 
ఏప్రిల్ లోగా ప్లాట్లకు పెగ్ మార్కింగ్ చేసి, వాటికి హద్దులను నిర్థారించేందుకు వీలుగా రాజధాని గ్రామాలను 5 జోన్లుగా విభజించి, వేర్వేరు సంస్థలకు ఈ పనులను అప్పగించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్లాట్లను నిర్ణీత ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ఆ తర్వాత గెజిట్ లో ప్రకటించి, వాటిపై రైతుల అభిప్రాయాలను తీసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. వీటిని పరిశీలనలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 
భవిష్యత్తులో ఆ ఇబ్బంధి.. 
మరోవైపు ఒకే రెవెన్యూ నెంబర్ లో ఒక రైతుకు వేర్వేరు ప్లాట్లు ఉంటే వాటన్నింటికీ కలిపి ఒకే డాక్యుమెంట్ ఇస్తే భవిష్యత్తులో వాటిని విడివిడిగా అమ్ముకోవాలన్నా, అభివృద్ధి చేసుకోవాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయని, ఏ ప్లాట్ కు ఆ ప్లాట్ కు ప్రత్యేకంగా డాక్యుమెంట్ ఇవ్వాలని రైతులు కోరారు. అలాగే రాజధాని ప్రాంతంలోనూ, ఎల్పీఎస్ లే అవుట్లలోనూ సీఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగే పనులన్నీ సీఎం చంద్రబాబు చెబుతున్న విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఇటీవల నేలపాడులో చేపట్టిన పనులు నాసిరకంగా జరగడాన్ని రైతులు ప్రస్తావించారు. ఇదే ధోరణి కొనసాగితే అమరావతి ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా తమ ప్లాట్లకు ధరలు తగ్గిపోతాయని రైతులు చెబుతున్నారు. 
పరిమితి రెండేళ్లే.. 
ఇదిలా ఉంటే.. కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపును కేవలం రెండేళ్లకే పరిమితం చేయకుండా ప్లాట్లను తాము తొలిసారిగా ఎప్పుడు అమ్ముకున్నా వర్తించేలా చూడాలని రాజధాని రైతులు గుంటూరు ఎంపీ రాయపాటిని అభ్యర్థించారు. ఇదే అంశంపై రాష్ట్రానికి చెందిన ఎంపీలు, కేంద్రమంత్రులను కలిసి.. 'నిరవధిక మినహాయింపు' లభించేలా చేయాలని రైతులు కోరుతున్నారు.

13:35 - February 6, 2017
13:33 - February 6, 2017

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. స్వైన్ ఫ్లూ కేసులు 9కి చేరినట్లు వైద్యులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. మరో నలుగురికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు పేర్కొన్నారు. స్వైన్ ఫ్లూ రోగులకు ప్రత్యేక వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్వైన్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు వీడియోలో చూడండి.

13:28 - February 6, 2017
12:57 - February 6, 2017

కృష్ణా : జిల్లాలో జరుగుతున్న దళితుల భూపోరాటంపై ప్రభుత్వం పోలీసలును  ఉసిగొల్పుతోంది.  నాగవరప్పాడులో భూపోరాటం చేస్తున్న దళితులకు సంఘీభావం ప్రకటించినన సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధుతోపాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.  అరెస్టులతో దళితుల భూపోరాటాన్ని ఆపలేరని సీపీఎం నేతలు తేల్చి చెబుతున్నారు. మరింత ఉదృతంగా ఉద్యమిస్తామంటున్నారు.

12:54 - February 6, 2017

ప్రకాశం : జిల్లాలో పోలీసుల కర్కశానికి ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడన్న నెపంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ మాల్యాద్రిని కందుకూరు మండలం గుడ్లూరు పోలీసులు చికతబాదారు. అనుమతి ఉన్న ప్రాంతం నుంచే ఇసుక తరలిస్తున్నానని మల్యాద్రి చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఖాకీల లాఠీ దెబ్బలకు మాల్యాద్రి ఆస్పత్రిపాలయ్యాడు. మరిన్ని వివరాలు వీడియోలో చూడండి..

12:51 - February 6, 2017
12:45 - February 6, 2017
12:43 - February 6, 2017
12:39 - February 6, 2017

ఢిల్లీ: దేశ రాజధానిలో కాల్పులు కలకలం రేపాయి. ఢిల్లీ మెట్రోప్లేస్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర  నేరస్తులు- పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అక్బర్‌ అనే నేరస్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన నేరస్తుడు అక్బర్‌ను ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడిన మిగిలిన నేరస్తులు పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. 

12:37 - February 6, 2017

కృష్ణా : జిల్లా నందివాడ మండలం ఇలపర్రులో టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.. గ్రామంలో భారీగా పోలీసుల్ని మోహరించారు.. ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుంటామన్న దళితుల ప్రకటనతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు.. ఇలపర్రు చుట్టుపక్కల గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించారు.. ఆక్రమిత భూములవద్ద 145 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.. ఇలపర్రులో పోలీసుల చెక్‌పోస్ట్ ఏర్పాటుచేశారు. గ్రామానికి ఎవరూ రావొద్దని ఆదేశించారు. ఇంటింటినీ తనిఖీ చేస్తూ. ఆధార్‌కార్డుతోనే బయటకు రావాలని గ్రామస్తులకు ఆంక్షలు పెడుతున్నారు. ఆక్రమణకుగురైన తమ భూముల్ని తిరిగి ఇప్పించాలంటూ 140రోజులుగా దళితులు పోరాటం చేస్తున్నారు.. వీరి ఉద్యమానికి సీపీఎం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం అండగా నిలిచింది.. మరిన్ని వివరాలు వీడియోలో చూడండి..

12:33 - February 6, 2017

కరీంనగర్‌ : జిల్లాలో ఓ రవాణాశాఖ అధికారి ఏసీబీ వలలో చిక్కారు. జమ్మింకుట కొత్తపల్లిలో లోని ఆర్టీవో అధికారి గౌస్‌బాబా ఇళ్లలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈసోదాల్లో పలు అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గౌస్‌బాబా ప్రస్తుతం భద్రాచలం ఆర్టీవో గా విధులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు వీడియలోలో చూద్దాం.. 

12:31 - February 6, 2017

కర్నూలు : ఓ వ్యసనం ముగ్గురుని చంపేసింది. ఆనందాలు వెళ్లి విరాయాల్సిన పెళ్లి పందిట విషాదం చోటు చేసుకుంది. నంద్యాల మండలం బిల్లాపురంలో  పెళ్లి విందు సందర్భంగా చీఫ్‌లిక్కర్‌ తాగిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దిరి పరిస్థితి సీరియస్‌గా ఉంది.  మృతులు కృష్ణయ్య, పుల్లయ్య, గురువయ్య బిల్లాలపురానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం. 

 

12:22 - February 6, 2017

హైదరాబాద్‌ : నీలోఫర్‌ ఆస్పత్రిలో బాలింతల మరణాలు ఆందోళనకరంగా మారాయి. మందులు వికటించడంతో గత వారంరోజుల్లో 12 మంది మహిళలు మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి మరో మహిళ మృతి చెందడంతో మృతురాలి బంధువులు ఆగ్రహించారు. ఆస్పత్రి సిబ్బందిపై దాడిచేసి చితకబాదారు. మరోవైపు ఆస్పత్రిలో ఆపరేషన్స్‌ అన్నీ నిలిచిపోయాయి. మొత్తం మూడు ఆపరేషన్‌ టేబుళ్లు ఉండగా ప్రస్తుతం ఒకటి మాత్రమే అందుబాటులో ఉండటంతో.. అత్యవసర ప్రసవ ఆపరేషన్లకు ఆటంకంగా మారిందని డాక్టర్లు అంటున్నారు. మరిన్ని వివరాలు వీడియోలు చూద్దాం..

12:18 - February 6, 2017

 హైదరాబాద్ : ఆఫ్గనిస్థాన్‌ ను మంచుతుఫాను  ముంచేస్తోంది. మంచు చరియలు విరిగిపడడంతో గత మూడు రోజుల్లో 100మందికి పైగా మృత్యువాత పడ్డారు. మంచుతుఫాను కారణంగా కాబూల్‌ పరిసరప్రాంతాల్లో వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దేశ ఈశాన్య ప్రాంతంతోపాటు పలు ప్రావిన్సుల్లో రోడ్డుమార్గాలు పూర్తిగా బంద్‌ అయ్యాయి. నిత్యవసరాల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫ్గన్‌ సైన్యం సహాయ కార్యక్రమాలు అందిస్తోంది. ఇటు ఉత్తర పాకిస్తాన్‌లోనూ మంచు బీభత్సం కొనసాగుతోంది. పెషావర్‌ నుంచి  మారుమూల ప్రాంతాలకు వెళ్లే రోడ్డు మార్గాలు మూసుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.  

12:15 - February 6, 2017

ఖమ్మం : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తెలంగాణలో చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 112 రోజులు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పాదయాత్ర 3000  కిలోమీటర్ల మైలురాయిని దాటింది. మూడు వేల కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా తల్లాడలో సీపీఎం ఫైలాన్‌ను ఆవిష్కరించారు.  
ఎర్రజెండా చేతబట్టి.. పల్లెపల్లెలో కదం తొక్కుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఇప్పటికే 112 రోజులు పర్యటించిన పాదయాత్ర బృందం.. మూడు వేల కిలోమీటర్లు దాటిన సందర్భంగా ఖమ్మం జిల్లా తల్లాడలో సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యులు వి. శ్రీనివాసరావు భారీ ఫైలాన్‌ను ఆవిష్కరించారు. 
ఎక్కడి సమస్యలు అక్కడే.. 
డెబ్బై ఏళ్లుగా ఎలా పరిపాలన చేశారో.. కొత్త రాష్ట్రంలోనూ అలాగే పాలిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు.  టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని తమ్మినేని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాలు ఏ మాత్రం మారలేదని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం సవాల్‌ను కూడా స్వీకరించలేని స్థితిలో కేసీఆర్‌ సర్కార్‌ ఉందని, ప్రజా సమస్యలపై చర్చకు రమ్మంటే ఈ ప్రభుత్వం తోకముడిచిందని తమ్మినేని విమర్శించారు. 
దేశ చరిత్రలోనే రికార్డు.. 
ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా  సీపీఎం పాదయాత్ర కొనసాగుతోందని, ఇది దేశ చరిత్రలోనే ఓ రికార్డని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నున్నా నాగేశ్వరావు అన్నారు. యాత్ర పూర్తయ్యే వరకు ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టాలని నున్నా నాగేశ్వరావు డిమాండ్‌ చేశారు. ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే ప్రజల నుంచి ఆందోళన ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. 112వ రోజు తమ్మినేని బృందం ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి, రామకృష్ణాపురం, ఎన్‌ఎస్పీ సెంటర్‌, కల్లూరు, మంచూరు తండా, నోతన్‌కల్‌, అంజనాపురం, తల్లాడలో పర్యటించింది. 

12:08 - February 6, 2017
12:07 - February 6, 2017

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు పోరుబాట పట్టారు. జనవరి 19, 29, 30 తేదీలలో వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ఆర్టీసీ కార్మికులు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర మహాదీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు పాల్గొనబోతున్నారు. కేంద్రం విడుదల చేసిన టాక్సీ పాలసీ, ఎంవి యాక్ట్ సవరణ బిల్లు, రాష్ట్ర బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయల గ్రాంటుతో పాటు కార్మికుల ఎదుర్కొంటున్న మరికొన్ని ప్రధాన సమస్యలే ఎజెండా మహాదీక్ష చేపడుతున్న ఎస్ డబ్ల్యుఎఫ్ నేతలు చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికులు మహాదీక్ష చేపట్టడానికి దారితీసిన కారణాలు, ప్రభుత్వాలు, యాజమాన్యాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాళ్టి జనపథంలో చర్చించేందుకు ఎస్ డబ్ల్యుఎఫ్ నేత విఎస్ రావు గారు 10టీవీ స్టూడియోకి వచ్చారు. ప్రేక్షకులు అడిగన సందేహాలకు ఆయన సమాధానాలు, పరిష్కార మార్గాలు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చూడాలి.

11:57 - February 6, 2017
11:54 - February 6, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలోని మానవవనరుల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల అభివృద్ధికి పదేళ్ల కాలానికి ప్రణాళికలు రూపొందిచాలని కోరారు. పదేళ్ల తర్వాత జిల్లాలు ఎలా ఉండాలో రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తే ఆ ప్రకారం పని చేద్దామని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. 
సక్సెస్ మంత్ర..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికార నివాసం ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. సుమారు ఎనిమిది గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. జిల్లా అభివృద్ధికీ తీసుకోవాల్సిన చర్యలపై దిశా, నిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్లు అంకితభావంతో పని చేయడంతోపాటు, అందరు సిబ్బంది ఇదే విధంగా విధులు నిర్వహించేలా చూస్తే అన్ని రంగాల్లో సత్ఫలితాలు సాధించవచ్చని కేసీఆర్‌ సూచించారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర సాధన, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథం కార్యక్రమాలను ఉదహరించారు. ప్రజలను భాగస్వామనులు చేస్తే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని కలెక్టర్లకు వివరించారు. 

75 శాతం వృధా..
రాష్ట్రంలోని మానవవనరుల సద్వినియోగం అంశాన్ని కేసీఆర్‌ ప్రధానంగా ప్రస్తావించారు. జనాభాలో 50 శాతంపైగా  ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎస్సీలు గ్రామాల బయట, గిరిజనులు తండాలు, గూడేళ్లో ఉంటుంటే, మహిళలు వంటింటికే పరిమితమైన అంశాలను కలెక్టర్ల దృష్టికి తెచ్చారు. దీంతో 75 శాతంపైగా మానవ వనరలు వృధా అవుతున్న విషయాన్ని కేసీఆర్‌ ప్రస్తావించారు. విలువైన మానవవనరులను సద్వినియోగం చేసుకోని దేశం భారత్‌ ఒక్కటేనని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసారన్ని నొక్కి చెప్పారు. రాష్ట్రంలోని మావన, సహజ వనరులు సద్వినియోగానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. 

స్వయం ఉపాధి దిశగా యువతను ప్రోత్సహించాలి 
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కేసీఆర్‌ ఆదేశించారు. స్థానికంగా ఇళ్లు నిర్మించుకునేవారికి పనులు అప్పగించాలని సూచించారు. బీడీ కార్మికులు, చేనేత కార్మికుల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని కోరారు. ప్రభుత్వ హాస్టళ్లు, ఆస్పత్రుల్లో కనీస వసతుల కల్పనకు ప్రాధాన్య ఇవ్వాలని సూచించారు. అలాగే రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించేలా చూడాలని కోరారు. యువత స్వయం ఉపాధి పథకాలు చేపట్టేడంతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రములు స్థాపించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉన్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపితే బడ్జెట్‌లో చేరుస్తామని వివరించారు. 
జీవన ప్రమాణాల స్థాయిపై స్టడీ ..
జిల్లాల్లో పాలన వికేంద్రీకరణ జరిగిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కేసీఆర్‌... ఆదేశించారు. ప్రజానుకూలంగా పాలన ఉండాలని సూచించారు. ప్రతి కుటుంబంలోని ప్రజల జీవన స్థితిగతులను అధ్యయనం చేయాలని కోరారు. పేదల అభ్యన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసేందుకు వీరి జీవనప్రమాణాలు ఎలా ఉన్నాయో స్టడీ చేయాలని ఆదేశించారు. కొత్త జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న కలెక్టర్లను ప్రశంసించిన కేసీఆర్‌... పాలనలో ఇంకా వేగంగా స్థిరత్వం రావాలని కోరారు. 

లోక్ సభ వాయిదా..

న్యూఢిల్లీ : లోక్ సభ నేటి మధ్యాహ్నం 12గం.ల వరకు వాయిదా పడింది. ఉభయ సభలు 11 గం.లకు ప్రారంభయ్యాయి. ఎంపీ అహ్మద్ మృతిపై చర్చించాలని సభ్యులు పట్టుపట్టారు. దీంతో సభను గంటసేపు వాయిదా వేస్తున్నాట్లు స్పీకర్ ప్రకటించారు.

అడ్డంగా దొరికిపోయారు..

నల్లగొండ : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని కేతెపల్లి మడలం త్రిపురారంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఏడు క్వింటాళ్ల ఇరవై కిలోల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి నిందితున్ని పోలీసు స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నారు. 

ఆమె సీఎంగా పనికిరారు..

చెన్నై : జయ అనంతరం తమిళ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. అన్నాడీఎంకేలోనే పొరపొచ్చాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎంపీ శశికళ పుష్ప ఆ పార్టీ అధినేత్రి ముఖ్యమంత్రి వీకే శశికలపై బహిరంగ విమర్శలు చేశారు. నేర చరిత్ర కలిగిన శశికలకు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి అర్హత లేదని మండిపడ్డారు. 

తిరుమలలో అల్లు అర్జున్..

తిరుమల : హీరో అల్లు అర్జున్ కుటుంబం శ్రీవారిని దర్శించుకుంది. నేటి ఉదయం వీఐపీ దర్శన సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది అల్లువారి ఫ్యామిలీకి ప్రత్యేక స్వాగతం పలికారు.

Don't Miss