Activities calendar

07 February 2017

ఆరోగ్య రక్ష పథకం విధి విధానాలు రూపకల్పన

గుంటూరు : ఆరోగ్య రక్ష పథకం విధి విధానాలు రూపకల్పన చేశారు. ఆరోగ్య రక్ష పథకంలో చేరే ప్రతి ఒక్కరు ఏడాదికి 1200 ప్రీమియం చెల్లించాలి. రూ.2 లక్షల వరకు ఉచిత వైద్యం సౌకర్యం కల్పించారు. 

 

22:01 - February 7, 2017
21:58 - February 7, 2017

ఢిల్లీ : పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడిన ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌ శివసేనలో చేరారు. ఆయనను గుజరాత్‌ పార్టీ నేతగా శివసేన ఎంపిక చేసింది. గుజరాత్‌ ఎన్నికల్లో పటేల్‌ సారథ్యంలో పార్టీ ఎన్నికల్లో పోటీచేస్తుందని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రే ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే ఏడాది గుజరాత్‌లో 182 స్థానాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కాకుండా విడిగా పోటీచేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. 

21:55 - February 7, 2017

చెన్నై : తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మెరీనా బీచ్‌ వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జయలలిత సమాధి వద్దకు పన్నీర్ సెల్వం ఒంటరిగా చేరుకున్నారు. సెల్వం మౌనంగా కూర్చున్నారు. అర్ధగంట నుంచి సమాధి వద్దే కూర్చున్నాడు. సమాచారం తెలిసిన... జయలలిత అభిమానులు మెరీనా బీచ్‌కు భారీగా తరలివస్తున్నారు. మొదటి నుంచి సెల్వం జయలలిత, పార్టీకి పరమ విధేయుడుగా ఉన్నాడు.  
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:50 - February 7, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్‌తోపాటు పలువురు కేంద్రమంత్రులను కేసీఆర్‌ ఆహ్వానించారు. పనిలో పనిగా  తెలంగాణ  అభివృద్ధినీ రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రానికి ఐఐఎంతోపాటు జిల్లాకో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేందమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను కేసీఆర్‌ కోరారు...
హస్తినలో బిజీబిజీగా సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హస్తినలో బిజీబిజీగా గడిపారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు.  మొదట రాష్ట్రపతి ప్రణబ్‌తో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఏప్రిల్‌లో జరుగనున్న ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు  రాష్ట్రపతిని ఆహ్వానించారు. శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. దీనికి ప్రణబ్‌  కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా... తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కేసీఆర్‌.. ప్రణబ్‌కు వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యధికంగా 19.5శాతం అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు.
మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో కేసీఆర్‌ భేటీ
కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తోనూ కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు జవదేకర్‌ను కేసీఆర్‌ ఆహ్వానించారు. తెలంగాణకు ఐఐఎం మంజూరు చేయాలని కేసీఆర్‌ కోరారు. జిల్లాకో నవోదయ, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓయూ అభివృద్ధికి నిధులు కేటాయించాలని జవదేకర్‌ను కేసీఆర్‌ కోరారు. కేసీఆర్‌ పర్యటనలో ఆయన వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితోపాటు పలువురు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉన్నారు. హస్తిన పర్యటనను ముగించుకున్న కేసీఆర్‌ సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.

 

21:46 - February 7, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. సిఎంగా శశికళ  రేపు లేదా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. శశికళ ముఖ్యమంత్రి కావడంపై సోషల్‌ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అమ్మ వారసురాలిని తానేనని సిఎంగా శశికళను ప్రజలు కోరుకోవడం లేదని జయలలిత మేనకోడలు దీప ప్రకటించారు. 
శశికళ ప్రమాణస్వీకారం వాయిదా
తమిళనాడులో శశికళ శాసనసభాపక్ష నేతగా ఎంపికవ్వడంతో పాటు పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం జరగాల్సిన శశికళ ప్రమాణస్వీకారం గవర్నర్‌ లేని కారణంగా వాయిదా పడింది. అయితే గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు బుధవారం చెన్నైకి రానున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించడంతో శశికళ ప్రమాణ స్వీకారం బుధ, గురువారాల్లో జరిగే అవకాశం కనిపిస్తోంది.
జయలలిత వారసురాలిని నేనే : దీప  
మరోవైపు దివంగత సిఎం జయలలిత వారసురాలిని తానేనని, అమ్మ తరఫున తాను రాజకీయాల్లోకి వస్తానని ఆమె మేనకోడలు దీప ప్రకటించారు. ఈ నెల 24న కొత్త పార్టీ పెడతానని తెలిపారు. శశికళ ముఖ్యమంత్రి కావాలనుకోవడం బాధాకరమని, దీనిని తమిళ ప్రజలు సహించరని చెప్పారు. జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో తాను పోటీచేస్తానని ప్రకటించారు. 
జయలలితది సహజ మరణం కాదు: పాండ్యన్ 
తమిళనాడు దివంగత సీఎం జయలలితది సహజ మరణం కాదని అన్నాడీఎంకే సీనియర్‌ నేత పి.హెచ్‌.పాండ్యన్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెపై విషప్రయోగం జరిగిందని ఆరోపించారు. జయలలితను తోసేయడంతో స్వగృహంలో కిందపడి ఆసుపత్రి పాలయ్యారని....శశికళ పాత్రపై దర్యాప్తు చేయాలని పాండ్యన్‌ డిమాండ్‌ చేశారు.
ప్రధాని మోదీకి శశికళ లేఖ
పాండ్యన్‌ ఆరోపణల నేపథ్యంలో అన్నాడీఎంకే అధినేత శశికళ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాశారు. తన ప్రమాణస్వీకారంలో జాప్యానికి కారణం వివరిస్తూ ఆమె లేఖరాసినట్లు సమాచారం. 
శశికళ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలని ప్రత్యర్థులు యత్నం 
మరోవైపు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని జోక్యం కోరాలని భావిస్తున్నారు. అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు.
ప్రమాణాన్ని అడ్డుకోవాలన్న పిటిషన్‌ నిలిపివేత
శశికళ అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి వచ్చేవారం తీర్పు వెల్లడించనుండడంతో శశికళ ప్రమాణాన్ని అడ్డుకోవాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో  శశికళ ప్రమాణ స్వీకారంపై న్యాయసలహా తీసుకునేందుకు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఢిల్లీ వెళ్లారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తమిళనాడులో రాజకీయ పరిణామాలను వివరించారు. శశికళ ముఖ్యమంత్రి కావడంపై సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేక వస్తోంది.

 

జయలలిత సమాధి వద్ద మౌనంగా కూర్చున్న పన్నీరు సెల్వం

చెన్నై : జయలలిత సమాధి వద్ద పన్నీరు సెల్వం మౌనంగా కూర్చున్నారు. జయ సమాధి వద్దకు సెల్వం ఒంటరిగా వెళ్లాడు.

21:14 - February 7, 2017
21:13 - February 7, 2017

ప్రొ.పురేంద్రప్రసాద్ తో 10 టీవీ సీవోవో సజ్జ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. 'భూమి చుట్టూ చంద్రుడు' అంశంపై ప్రొ.పురేంద్రప్రసాద్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:09 - February 7, 2017

గుంటూరు : అమరావతిని అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు అడుగులు పడుతున్నాయి. అన్ని రంగాల్లో ముందుండేలా ఏపీ రాజధానిని తీర్చిదిద్దుతున్నారు. అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు , కళాశాలల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
జాతీయ, అంతర్జాతీయ సిలబస్ బోధించే పాఠశాలల 
రాబోయే పదేళ్లలో రాజధాని జనాభా నాలుగు నుంచి ఏడు లక్షలకు చేరుతుందని, దీనికి అనుగుణంగా రాబోయే ఐదేళ్లలో అనేక జాతీయ, అంతర్జాతీయ సిలబస్ బోధించే పాఠశాలల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రిక్వస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌  పేర్కొంది. అత్యుత్తమ ప్రమాణాలతో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో  రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్‌ విడుదల చేసింది. ఈ మేరకు ఒక అంతర్జాతీయ బోర్డింగ్ స్కూల్, ఒక అంతర్జాతీయ డే స్కూల్, ఒక జాతీయ బోర్డింగ్ స్కూల్, మూడు జాతీయ డేస్కూళ్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు.  ఈ టెండర్లలో 16 బిడ్‌లు దాఖలుగా కాగా , ఎనిమిది సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. ప్రస్తుతం ఆయా సంస్థలు దాఖలు చేసిన బిడ్లు పరిశీలన దశలో ఉన్నాయి. సీఆర్డీఏ త్వరలో సంస్థలని ఎంపిక చేయనుంది.  
విజయ్ నిర్మాణ్ కంపెనీకి బిడ్‌ 
అంతర్జాతీయ బోర్డింగ్ స్కూల్‌కి విజయ్ నిర్మాణ్ కంపెనీ మాత్రమే బిడ్‌ దాఖలు చేసింది. అంతర్జాతీయ డేస్కూల్ కి పీహెచ్ఆర్ ఇన్వెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ, గ్లోబల్ స్కూల్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ బిడ్లు వేశాయి. జాతీయ బోర్డింగ్ స్కూల్ కి ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎస్ఆర్ఎం ట్రస్ట్, నలందా అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నికల్‌ ఎడ్యుకేషన్ సంస్థలు బిడ్‌లు వేశాయి. జాతీయ డే స్కాలర్ స్కూళ్ల ఏర్పాటుకి ఎస్ఆర్ఎం ట్రస్ట్, మహాత్మా ఎడ్యుకేషనల్ సొసైటీ, నలందా అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, పోదార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లు బిడ్లు దాఖలు చేశాయి. అలాగే జాతీయ డే స్కూళ్లు ఎనిమిది వేల చదరపు మీటర్లు, జాతీయ బోర్డింగ్ స్కూళ్లు 16 వేల చదరపు మీటర్లు, అంతర్జాతీయ డే స్కూళ్లు 16 వేల చదరపు మీటర్లు, అంతర్జాతీయ బోర్డింగ్ స్కూల్ 32 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ ప్రతిపాదన చేసింది. విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆ స్థాయి పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. రాజధానిలో ఇప్పటికే విట్, ఎస్ఆర్ఎం  వంటి ప్రైవేట్‌  యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించింది.

 

21:04 - February 7, 2017

కృష్ణా : జిల్లాలోని ఉయ్యూరు వీరమ్మతల్లి ఉత్సవంలో విషాదం చోటు చేసుకుంది. పెరాంటలమ్మ చెరువులో పడి మూడేళ్ల బాలుడు సుషాంత్ మృతి చెందాడు. పోలీస్ అవుట్ పోస్టు సమీపంలోనే ఈ ఘటన జరిగింది. సుషాంత్... విజయవాడ వాంబె కాలనీకి చెందినవాడిగా గుర్తించారు.  

20:34 - February 7, 2017

కర్నూలు : రవాణా రంగంలో పెంచిన చార్జీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జాతీయ కార్యవర్గసభ్యుడు ఎం.ఏ. గఫూర్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు.  ఈ ధర్నాలో పాల్గొన్న గఫూర్‌... కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వాహనాల రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల ఫీజులను కేంద్రం భారీగా పెంచి.... కార్మికులపై పెనుభారాన్ని మోపిందన్నారు.  చట్టసభల్లో ఎలాంటి బిల్లు ప్రవేశపెట్టకుండా మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం దారుణమని.. దీన్ని సీఐటీయూ వ్యతిరేకిస్తోందన్నారు. డ్రైవర్లకు ఉరితాడులాంటి రోడ్డు భద్రతా బిల్లు తేవడమే కాకుండా... వాహనాలపై ఆర్టీఏ చలానా ఫీజులు 10రెట్లు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ఆర్టీఏ ఫీజులను తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. 

 

20:29 - February 7, 2017

హైదరాబాద్ : తన తండ్రి ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తీసే సినిమాలో తానే హీరోగా నటిస్తానని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. సినిమా ఎలా తీయాలో, ఎక్కడ ముగించాలో తనకు తెలుసునని అన్నారు. హిందూపురం టీడీపీలో ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. పార్టీలో విభేదాలు సర్వసాధారణమని, చిన్న సమస్యలు ఏవైనా ఉంటే త్వరలో సర్దుకుంటాయని చెప్పారు. ఇకపై సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు. ఉదయం చంద్రబాబుతో భేటీ సమయంలోనూ.. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించినట్లు చెప్పారు. 

 

20:22 - February 7, 2017
20:20 - February 7, 2017

వరంగల్ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన గురుకుల నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ...వరంగల్‌లో వామపక్ష విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి.  హన్మకొండ పెట్రోల్‌ బంక్‌ నుంచి అశోక జంక్షన్‌ వరకు బీ.ఎడ్‌ విద్యార్ధులతో భారీ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం విద్యార్ధి సంఘ నేతలు, విద్యార్ధులు  మానవహారం నిర్మించి నిరసన తెలిపారు. గురుకుల పరీక్షను ఇంగ్లీష్‌తోపాటు ప్రాంతీయ భాషలోనూ నిర్వహించాలని కోరారు. డిగ్రీలో 60శాతం మార్కుల నిబంధనను  తొలగించాలని విద్యార్ధి నేతలు డిమాండ్‌ చేశారు.  రోడ్డుపై బైఠాయించిన విద్యార్ధులను  పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

 

20:17 - February 7, 2017

హైదరాబాద్‌ : జీడిమెట్ల సమీపంలోని ఫాక్స్‌ సాగర్‌ చెరువుకు మంచిరోజులు రానున్నాయి. పోలీసు ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారిణి ఐపీఎస్‌ తేజ్‌దీప్‌ కౌర్‌ సారధ్యంలో పోలీసులు చెరువును దత్తత తీసుకున్నారు. పోలీసులు, ఫారెస్ట్‌ అకాడమీ శిక్షణా సిబ్బంది, ఇంజనీరింగ్‌ విద్యార్థులు చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను శ్రమదానం చేసి తొలగించారు. 1897లో బ్రిటీష్‌ పాలకులు 482 ఎకరాల్లో ఫాక్స్‌ సాగర్‌ చెరువును నిర్మించారని.. అప్పట్లో మంచినీటి చెరువుగా ఉన్న ఫాక్స్‌సాగర్‌ నేడు విషతుల్యంగా మారిందని తేజ్‌దీప్‌కౌర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు చాలా వరకు కబ్జాకు గురైందని.. దీనికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.    

 

20:14 - February 7, 2017

హైదరాబాద్ : నేను రాను కొడకో సర్కారు దవాఖానాకు అనే మాట ఇప్పుడు అక్షరాలా నిజమవుతోంది. వైద్యుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల పర్యవేక్షణ లోపం రోగుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. ప్రభుత్వాస్పత్రులు పేదల యమపాశాలుగా మారుతున్నాయి.. వామ్మో ఇవేమీ దవాఖానాలు అని రోగులు ముక్కున వేలేసుకుంటున్నారు. 
పేదోడికి రోగమొస్తే ప్రభుత్వాస్పత్రికి పరుగు 
పేదవాడికి ఏ రోగమొచ్చిన వెంటనే ప్రభుత్వాస్పత్రికి పరిగెత్తాల్సిందే.. కాయ, కష్టం చేసుకుని బతికేవాళ్లు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేలకు వేల డబ్బులు పెట్టలేక ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఆస్పత్రుల్లో కనీస మౌలికసదుపాయాలు లేక, సరైన సేవలు అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పేరున్న ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల జరిగిన సంఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 
గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం...పసిప్రాణం బలి 
గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి విలవిల్లాడిన ఓ పసిప్రాణం మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. జనగాం జిల్లా కొడకండ్ల మండలం మైదంచెరువుతాండాకు చెందిన సాయిప్రవల్లిక జ్వరం వచ్చిందని ఆస్పత్రిలో జాయిన్ అయింది. పాపకు ట్రీట్‌ మెంట్‌ ఇచ్చే సమయంలో ఆస్పత్రి డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పురుగులతో కల్తీ అయిన సెలైన్‌ బాటిల్‌ను పాప ఒంట్లోకి ఎక్కించారు. దీంతో సాయిప్రవల్లిక తీవ్ర అస్వస్థతకు గురైంది. తప్పు తెలుసుకున్న గాంధీ ఆస్పత్రి వైద్యులు పాపకు గత రెండు నెలలుగా చికిత్స అందిస్తున్నారు. కాని..బ్లడ్‌లో సోకిన ఇన్ఫెక్షన్‌ ఎంతకీ తగ్గక పోవడంతో.. పాప నిన్న అర్ధరాత్రి మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యానికి తమ పాప బలైపోయిందని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. 
ఉస్మానియా ఆస్పత్రిలో వసతులు దారుణం
ఒకటా.. రెండా ఏకంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి ఇలాగే ఉంది. ఉస్మానియా ఆస్పత్రిలో వసతులు అత్యంత దారుణంగా ఉన్నాయి. రోగులకు సరిపడే వైద్యపరికరాలు, సదుపాయాలు లేవు. దీంతో అనేక మంది రోగులు మృత్యువాతపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆస్పత్రిలో ఐసీయూ వార్డ్‌లో ఆక్సిజన్ అందక ఐదుగురు రోగులు మరణించారనే వార్తలు వచ్చాయి. 
సరోజినీదేవీ కంటి ఆస్పత్రి..వైద్యుల నిర్లక్ష్యం
అలాగే సరోజినీదేవీ కంటి ఆస్పత్రిలో జరిగిన సంఘటన అయితే ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి సాక్షిగా నిలుస్తోంది. చూపు మందగించిందని వస్తే ఏకంగా చూపే పోయే పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గతేడాది మందుల వినియోగం వల్ల ఐదుగురికి కంటిచూపు పోయింది. 12 మంది కళ్లకు ఇన్‌ఫెక్షన్ వచ్చింది. 
నిలోఫర్‌ ఆసుపత్రి.. తీవ్ర రక్తస్రావం... బాలింతలు మరణం                        
తాజాగా ప్రతిష్టాత్మక నిలోఫర్‌ ఆసుపత్రిలో తీవ్ర రక్తస్రావంతో బాలింతలు మరణించిన ఘటన అత్యంత విషాదకరమైనది. వారం రోజుల వ్యవధిలో సిజేరియన్‌ ఆపరేషన్‌ జరిగిన 44 మందిలో ఐదుగురు కన్నుమూశారు. ప్రసవం అనంతరం రక్తస్రావాన్ని నివారించడానికి ఉపయోగించిన మందులు, ఇంజెక్షన్‌లు సరిగా పనిచేయకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. గతేడాది రక్తస్రావంతో ఒకరు చనిపోయారు. అలాగే శిశువుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి.                               
వైద్యులు, నర్సుల కొరత 
ఇక ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. సిబ్బందికొరత కారణంగా పీజీ విద్యార్థులు, నర్సింగ్‌ విద్యార్థులే గత్యంతరమవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని.. రోగుల చికిత్స పట్ల వైద్యులు నిర్లక్ష్యం వీడాలని.. సిబ్బంది నియామకం చేపట్టాలని.. అప్పుడే ప్రభుత్వాసపత్రులపై ప్రజలకు నమ్మకం కలుగుతోందని సామాజికవేత్తలు వెల్లడిస్తున్నారు. 

 

మార్చి 9న జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్ష వాయిదా

హైదరాబాద్ : మార్చి 9న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కారణంగా మార్చి 9న జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షను వాయిదా వేశారు. 

19:58 - February 7, 2017

ఢిల్లీ : ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు రావాలని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఇవాళ జవదేకర్‌ను కలిసి ఆహ్వానించారు.  తెలంగాణలో జిల్లాకో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని జవదేకర్‌ను కోరారు. తెలంగాణకు ఐఐఎం మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఓయూ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం కోరినట్టు టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు.  కేసీఆర్‌తోపాటు తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పలువురు ఎంపీలు జవదేకర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. 

 

ఆర్ ఆండ్ బీ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

విజయవాడ : ఆర్ ఆండ్ బీ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. సముద్ర తీరప్రాంతంలో బీచ్కారిడార్ కు ఆదేశించారు. 

19:50 - February 7, 2017

తూర్పుగోదావరి : ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు సరిగ్గా చదవడం లేదని, హోంవర్క్ చేయలేదని విద్యార్థులను చితకబాదుతున్నారు. తాజాగా విద్యార్థినిలు ఆలస్యంగా తయారయ్యారని...కరస్పాండెంట్ చితకబాదారు. విద్యార్థులు గాయపడ్డారు. రాజమండ్రి హోలిఏంజెల్స్‌ స్కూల్‌ ఆండ్ రెసిడెన్షియల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆలస్యంగా తయారయ్యారని... గిరిజన విద్యార్థినులను కరస్పాండెంట్‌ మధుసూదన్‌  చితకబాదాడు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. విద్యార్థినులను చితకబాదిన కరస్పాండెంట్‌పై చర్యలకు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. 
తల్లిదండ్రులు...
పిల్లలను బెల్టు, కర్రలతోటి పూర్తిగా చితకబాదారు. పిల్లలు స్కూల్ చుట్టూ పరుగెత్తారు. కొట్టవద్దని అమ్మాయిలు కరస్పాండెంట్ కాళ్లు కూడా పట్టుకున్నారు. కేవలం రెండు టాయ్ లెట్స్ ఉన్నాయని... అందుకే తయారవ్వడానికి ఆలస్యమైందని పిల్లలు చెబుతున్నారని తల్లిదండ్రులు చెప్పారు. 

 

19:35 - February 7, 2017

చిత్తూరు : హంద్రినీవా నది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది.  ఇసుక అక్రమ తరలింపుపై కలెక్టర్‌, ఎస్పీలకు  ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.  దీనిపై గతంలోనే విచారించిన న్యాయస్థానం... అధికారులు తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో  324 ట్రాక్టర్లు సీజ్‌ చేశామంటూ   కలెక్టర్‌, ఎస్పీ అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ మరోసారి విచారించిన హైకోర్టు.... జీవో -42 ప్రకారం ట్రాక్టర్లపై లక్ష రూపాయల ఫైన్‌ ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని ఆదేశించింది.  ఆపరేటర్లు , ట్రాక్టర్‌ యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.  వచ్చే వారంలోగా కఠిన చర్యలు తీసుకోకపోతే... భూగర్బశాఖ డైరెక్టర్‌ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

 

19:25 - February 7, 2017

కరీంనగర్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహదేవపూర్ మండలం అన్నారం మలుపు వద్ద 2 వాహనాలు అదుపుతప్పిన ఘటనలో... 40 మందికి గాయాలయ్యాయి. వీరిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:22 - February 7, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శశికళకు ప్రజలు ఓట్లు వేయరని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ అన్నారు. శశికళ సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదని తెలిపారు. తమిళనాడుకు నేడు దుర్ధినమన్నారు. జయలలిత మృతి వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:07 - February 7, 2017

ఢిల్లీ : బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్ట్‌కు టీమిండియా సన్నద్ధమైంది.  విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు బంగ్లాదేశ్‌పై సింగిల్‌ టెస్ట్‌లో ఆధిపత్యం ప్రదర్శించాలని పట్టుదలతో ఉంది. ఫిబ్రవరి 9నుంచి హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 
టీమిండియా సొంత గడ్డపై మరో సమరం 
టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా సొంత గడ్డపై మరో సమరానికి సన్నద్ధమైంది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లోనూ  విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించాలని తహతహలాడుతోంది. 
చోటు దక్కించుకొన్న ఆటగాళ్లు.... 
టెస్ట్ జట్టులో చోటు దక్కించుకొన్న ఆటగాళ్ళలో విరాట్‌ కొహ్లీ, మురళీ విజయ్‌,  కె ఎల్‌  రాహుల్, చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, కరుణ్‌ నాయర్‌, అభినవ్‌ ముకుంద్‌, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్‌ శర్మ,హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌,రవీంద్ర జడేజా, జయంత్‌ యాదవ్‌,అమిత్‌ మిశ్రా, ఉమేష్‌ యాదవ్‌ , భువనేశ్వర్‌ కుమార్‌ ఉన్నారు.
అభినవ్‌ ముకుంద్‌ కు అనూహ్యంగా చోటు 
సింగిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేసిన జట్టులో అభినవ్‌ ముకుంద్‌ అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. 2011లో టీమిండియా తరఫున టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన తమిళనాడు బ్యాట్స్‌మెన్‌ అభినవ్‌ ముకుంద్‌....ఆరేళ్ల తర్వాత తిరిగి చోటు దక్కించుకున్నాడు.ఇప్పటివరకూ 5 టెస్ట్‌లు ఆడిన ముకుంద్‌ 10 ఇన్నింగ్స్‌ల్లో 211 పరుగులు చేశాడు. అందరూ ఊహించినట్టుగానే ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. ఇంగ్లండ్‌తో ఆఖరి రెండు టెస్టుల్లో రాణించిన వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ పార్థీవ్‌ పటేల్‌కు జట్టులో చోటు దక్కలేదు. 
ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్ 
ప్రస్తుతం ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌ ర్యాంక్‌లో ఉండగా....బంగ్లాదేశ్‌ జట్టు 9వ స్థానంలో ఉంది. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ జట్టుతో 6 సార్లు పోటీపడిన భారత్‌ ....అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఫిబ్రవరి 9నుంచి హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.  టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు బంగ్లాదేశ్‌ కనీస పోటీ అయినా ఇస్తుందో లేదో చూడాలి. 

 

18:58 - February 7, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ విస్తరిస్తోందని రాజ్యసభలో వైసిపి సభ్యులు విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏపిలోని 13 జిల్లాలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉండడం ప్రమాద ఘంటికలను మోగిస్తోందని ఆయన హెచ్చరించారు. గత ఏడాది ఏపీలో 12 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదు కాగా...ఐదుగురు మృతి చెందారని తెలిపారు. ఈ సంవతర్సం జనవరి నెలలోనే 26 కేసులు నమోదు కాగా...ఆరుగురు మృతి చెందారని అన్నారు. వ్యాధి తీవ్రతను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

 

18:54 - February 7, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని రాజ్యసభలో సిపిఎం సభ్యులు తపన్‌ కుమార్‌ సేన్‌ ఆరోపించారు. ప్రయివేటీకరణ ద్వారా రిజర్వేషన్లను దెబ్బతీయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన ధ్వజమెత్తారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ప్రయివేటీకరణ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నష్టాల పేరిట కొన్ని సంస్థలను అమ్మకానికి పెట్టడం శోయనీయమన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఫూల్స్‌ చేస్తోందని తపన్‌సేన్‌ విమర్శించారు. 

 

18:49 - February 7, 2017

హైదరాబాద్ : తెలంగాణ పోలీస్ శాఖలో కొత్తలొల్లి పుట్టుకొచ్చింది.  రిటైర్డ్ అయినా అదే కొలువులో కొనసాగాలనే కోరిక అధికమవుతోంది. కీలకశాఖల్లో రీఎంప్లాయ్‌మెంట్‌ అవకాశాన్ని వినియోగించుకోడానికి.. మాజీ ఉద్యోగులు చాలామంది హైలెవల్లో లాబీయింగ్‌ నడుపుతున్నారు. దీనిపై లూప్‌లైన్‌లో ఉన్న సీనియర్‌ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు.  పాతకొలువుల్లోనే కొత్తగా తిష్టవేస్తున్నారని ఆక్రోశిస్తున్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో రీ ఎంప్లాయిమెంట్ రగడ మళ్లీ మొదలయింది.  మళ్లీ ఉద్యోగం ఇప్పించాలంటూ మాజీలు చాలా మంది  పోలీస్ బాస్‌ల కు , ప్రభుత్వానికి ఫైరవీలు పెట్టుకుంటున్నారు. 
కుర్చీలను వదలని రిటైర్డ్ ఉద్యోగులు
రీఎంప్లాయ్‌ మెంట్‌ స్కీమ్‌లో భాగంగా రిటైర్డ్‌ ఉద్యోగులు కొందరు  ..2002 నుంచి  కుర్చీలను ఖాళీచేయడంలేదు. వారిలో మరికొందరు  మళ్లీ తమను అదే ఉద్యోగంలో నియమించాలంటూ  తాజాగా ఫైరవీలు మొదలుపెట్టారు. దీనిపై లూప్‌లైన్లో ఉన్న అధికారులు మండిపడుతున్నారు. తమకూ ఓ అవకాశం ఇవ్వాలని ఉన్నతాధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. ఓవైపు కుర్చీలను వదలని మాజీలు.. మరోవైపు లూప్‌లైన్లో ఉన్న తాజాల లాబీయింగ్‌తో   తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌లో ఫైరవీల వేడి రగులుకుంది. 
సీనియర్ల సేవల పేరుతో అనర్హులకు మళ్లీ అవకాశమా..? 
అయితే కీలకమైప నిఘా, లా అండ్‌ అర్డర్‌ వ్యవస్థల్లో  మాత్రం రీఎంప్లాయ్‌మెంట్‌ తప్పదంటున్నారు పోలీస్‌ బాస్‌లు.  కాని ఈ విధానం.. కొందరు అనర్హులకు పునరావాసంగా మారిందని డిపార్ట్‌మెంట్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.  సీనియర్ల సేవల పేరుతో అనర్హులకు అవకాశం కల్పిస్తున్నారని లూప్‌లైన్లో ఉన్న ఉద్యోగులు వాపోతున్నారు.  తమకు అవకాశం కల్పిస్తే మెరుగైన ఫలితాలను చూపిస్తామంటున్నారు.  పైగా రిటైర్ అయిన వారికి  మళ్లీ పదవికట్టబెడితే అవినీతికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని  తమ అనుకూల బాస్‌ల దగ్గర గట్టిగా వాదిస్తున్నారు. 
గ్రూప్‌లుగా ఏర్పడి హైలెవల్లో ఫైరవీలు
ఈ ఉద్యోగ పొడగింపుల వ్యవహారంతో  డిపార్ట్‌మెంట్లో  గ్రూపిజం ఏర్పడింది. ఇప్పటికే  హైలెవల్లో లాబీయింగ్‌ చేస్తున్న వారు గ్రూప్‌ గా  ఏర్పడి.. ఎంతైనా ఖర్చుపెట్టుకుంటామని ఫైరవీకారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ తమ ఉద్యోగకాలన్ని  పొడగించాలని మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులకు విన్నపాలు పంపిస్తున్నట్టు సమాచారం.  సిటీ పోలీస్‌లో టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీగా కొనసాగుతున్న ఓ అధికారి కేంద్రంగా తాజాగా వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. సదరు అధికారిని కొనసాగించాలా ..లేదా కొత్తవారికి అవకాశం  కల్పించాల.. అనే దానిపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.  

 

18:44 - February 7, 2017

శ్రీకాకుళం : ఓ వైపు స్థానిక ఎమ్మెల్యే.. మరోవైపు మున్సిపల్ ఛైర్మన్.. ఇరువురి మధ్య మున్సిపల్ ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో విధులు నిర్వహించలేకపోతున్నామని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఇప్పుడిదే శ్రీకాకుళం జిల్లా పలాసలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 
ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి 
ఒకరు స్థానిక శాసనసభ్యులు.. మరొకరు మున్సిపల్ చైర్మన్.. ఇరువురి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీంతో శ్రీకాకుళం జిల్లా పలాస - కాశీబుగ్గ పురపాలక సంఘం ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పలాస ఎమ్మెల్యేగౌతు శ్యామసుందర శివాజీ, మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుల మధ్య తలెత్తిన భేధాభిప్రాయాలు ఇప్పుడు పురపాలక సంఘ అధికారులు, సిబ్బందిని ఇరకాటంలో పడేస్తోంది. చివరికి తమ బాధ్యతలను కూడా నిర్వహించలేని స్థితి నెలకొంది. తనకు తెలియకుండా ఏ ఫైల్ కదలకూడదని ఎమ్మెల్యే హుకుం.. దీనికి విరుద్ధంగా మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు ఆదేశాలు.. దీంతో ఎవరు మాట వినాలో అర్ధంకాక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఇన్ని పరిణామాల మధ్యలో తాము నలిగిపోతున్నామని కలెక్టర్‌, ఉన్నతాధికారులకు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.           
విపక్షాలు మండిపాటు
ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని విభేదాలకు చెక్‌ పెట్టాలని.. వీళ్ల గొడవల కారణంగా ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్సిపల్ పరిపాలన అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంమీద పలాస కాశీబుగ్గ మున్సిపాల్టి లో ఇరువురి నేతల మధ్య రగడ ఉద్యోగుల విధి నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

 

హైదరాబాద్ బయల్దేరిన సీఎం కేసీఆర్

ఢిల్లీ : సీఎం కేసీఆర్ హైదరాబాద్ బయల్దేరారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని కేసీఆర్ హైదరాబాద్ బయల్దేరారు. ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ లతో సమావేశం అయ్యారు. 

18:35 - February 7, 2017

తూర్పు గోదావరి : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్లు తయారైంది..తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ పరిస్థితి. పార్టీకి పెద్దదిక్కుల్లాంటి వారు ఎందరో ఉన్నా.. జిల్లా అధ్యక్షుణ్ణి ఎంపిక చేసుకోలేని దయనీయ స్థితిలో ఆపార్టీ వుంది. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రితో పాటు  16 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు.  ఇలా పెద్ద తలకాయలు ఎన్ని వున్నా ఆపార్టీకి జిల్లా అధ్యక్షుడు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  ఏడాదైనా పార్టీ జిల్లా అధ్యక్షుడి నియమాకం చేపట్టకపోవడానికి కారణాలేంటి..? ఏఏ అంశాలు టీడీపీకి అడ్డంకిగా మారాయి? వాచ్‌ దిస్‌ స్టోరీ. 
టీడీపీకి గట్టి బలమున్న జిల్లా తూ.గో 
టీడీపీకి గట్టి బలమున్న జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా ఒకటి. జిల్లాకు చెందిన ఎందరో నాయకులు రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పుతున్నప్పటికీ... పార్టీ జిల్లా శాఖకు అధ్యక్షుడు లేకపోవడం విశేషం. రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలున్న ఈ జిల్లాలో 19 సీట్లకు గానూ 14 స్థానాల్లో టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దీనికి తోడు జిల్లాకు  చెందిన చినరాజప్ప డిప్యూటీ సీఎంగానూ, సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రిగానూ ఉన్నారు. ముగ్గురు టీడీపీ ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్సీలు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందరున్నా.. దాదాపు ఏడాది కాలంగా జిల్లా అధ్యక్షుడే లేకుండా పార్టీ దిశానిర్దేశం లేకుండా సాగుతోంది.  
చిట్టిబాబు..హఠాన్మరణంతో జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ 
గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన పర్వత చిట్టిబాబు..హఠాన్మరణంతో జిల్లా అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడింది. చిట్లిబాబు మృతి చెంది ఏడాది దాటిపోతున్నా... పార్టీకి జిల్లా అధ్యక్షుడిని నియమించకపోవడంతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే, పార్టీ అధ్యక్ష పదవి విషయంలో జిల్లా నాయకులు రెండు ప్రాంతాలుగా విడిపోయారు. కోనసీమ, మెట్ట ప్రాంతాలుగా విడిపోయిన నేతలు, ఎవరికి వారు తమ ప్రాంతానికే జిల్లా అధ్యక్ష పదవి దక్కాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జెడ్పీ ఛైర్మన్‌ నామన రాంబాబు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అలాగే మెట్ట ప్రాంతం నుంచి డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజా పేరు తెరపైకి వచ్చింది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఈ ఖాళీని భర్తీ చేసే విషయంలో మౌనాన్ని ఆశ్రయించడంతో.. ఏడాదికాలంగా, టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి అలాగే ఖాళీగా ఉండిపోయింది. 
పార్టీ జిల్లా కార్యక్రమాల సమన్వయ బాధ్యతలు చినరాజప్పకు 
టీడీపీ జిల్లా అధ్యక్షుడి నియామకంపై అధిష్ఠానం పెదవి విప్పక పోవడంతో, పార్టీ జిల్లా కార్యక్రమాల సమన్వయ బాధ్యతలు చినరాజప్ప నిర్వహిస్తున్నారు. గతంలో రెండు దశాబ్దాలకు పైగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న చినరాజప్ప ఎలాగొలా నెట్టుకొస్తున్నప్పటికీ.. పూర్థిస్థాయి అధ్యక్షుడి లోటు మాత్రం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. తరచూ జిల్లా పర్యటనకు వస్తున్నప్పటికీ పార్టీ అధినేత.. జిల్లా అధ్యక్షుడి నియామకం పట్ల నాన్చివేత ధోరణి ప్రదర్శించడం పార్టీ శ్రేణుల్ని ఆశ్వర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధ్యక్షుడిని నియమించాలని టీడీపీ స్థానిక నేతలు పార్టీ అధినేత చంద్రబాబును కోరుతున్నారు. 

 

18:27 - February 7, 2017

సంగారెడ్డి : జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.  నారాయణఖేడ్‌ జెడ్పీటీసీ, ఎమ్మెల్యే మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది. అది అంతటితో ఆగక...  వ్యక్తిగత దూషణలకు దారితీసింది.  గొడవపడుతున్న సభ్యులను వారించాల్సిన జెడ్పీ చైర్‌ పర్సన్‌, కలెక్టర్‌ మౌనం వహించారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. 

 

18:25 - February 7, 2017

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఆదివారం విజయవాడలో జరిగిన ప్రధానోపాధ్యాయులు, ఎంఈవో, డీఈవో సదస్సులో రాబోయే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని చంద్రబాబు కోరడాన్ని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఉద్యోగుల సదస్సులో సీఎం అలా మాట్లాడటం సరికాదన్నారు. 2004 ఎన్నికల్లో ఉపాధ్యాయులను వేధించడం వల్లే తాను ఓడిపోయానని.. మరోసారి తాను అలా చేయనని చెప్పడం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనని మధు అన్నారు.

 

నయీం కేసు.. ఐదుగురిపై పీడీ యాక్టు కేసు నమోదు

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఐదుగురిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. 

 

18:11 - February 7, 2017

హైదరాబాద్ : గురుకుల పాఠశాల నోటిఫికేషన్‌ నిబంధనలపై నిరుద్యోగులు కదం తొక్కారు. మహిళలకు ఎక్కువశాతం సీట్లు కేటాయించడం, డిగ్రీలో ప్రథమస్థానంలో పాస్ కావాలన్న నిబంధనలను నిరసిస్తూ... ఓయూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్‌ నుంచి ఎన్ సీసీ గేటు వరకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు-పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఈనెల 22న ప్రొఫెసర్ కోదండరామ్ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలికి అన్ని విద్యార్థి సంఘాలు తరలివస్తాయని విద్యార్థి నాయకులు తెలిపారు.

 

కాబూల్ సుప్రీంకోర్టు భవనం ముందు ఆత్మహుతి దాడి

కాబూల్ : సుప్రీంకోర్టు భవనం ముందు ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. 

17:04 - February 7, 2017

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో సాయి ప్రవళ్లిక మృతి బాధాకరమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.  సెలైన్‌లో  బ్యాక్టీరియాపై విచారించామన్నారు.  ప్రవళ్లిక ఆరోగ్యం బాగాలేదని, ఆమెకున్న వ్యాధితో మరణిస్తుందని బెంగళూరు వైద్యులు ముందే చెప్పారని ఆయన గుర్తు చేశారు.  ప్రవళ్లిక తండ్రితో తనెప్పుడూ మాట్లాడలేదని, కంప్లైంట్‌ చేస్తే పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. నిలోఫర్‌ హాస్పిటల్‌లో బాలింతల మృతిపై  త్రిసభ్య కమిటీ వేశామన్న మంత్రి... రిపోర్ట్‌ వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.  తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి అనేక చర్యలు చేపట్టామన్న ఆయన... త్వరలోనే 17 హాస్పిటల్స్‌లో డయాలసిస్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
 

17:01 - February 7, 2017

ఖమ్మం : గిరిజనుల హక్కులను కాపాడాలని.. అటవీ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని పాదయాత్ర బృందం సభ్యులు ఆశయ్య అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 114వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం రామచంద్రాపురంలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండెపూడి, అనంతారం, గాంధీనగర్ తండా, తిప్పనపల్లి, రేపల్లెవాడ, తుంగారం గ్రామాల్లో ఇవాళ పాదయాత్ర కొనసాగనుంది. ఈమేరకు 10 టివితో ఆశయ్య మాట్లాడారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రసవత్తరంగా తమిళ రాజకీయాలు

చెన్నై : తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శశికళకు ప్రజలు ఓటు వేయరని జయలలిత మేన కోడలు దీపా పేర్కొన్నారు. శశికళ సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదన్నారు. తమిళనాడుకు నేడు దుర్ధినం అని అన్నారు. జయలలిత మృతి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

రసవత్తరంగా తమిళ రాజకీయాలు

చెన్నై : తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శశికళకు ప్రజలు ఓటు వేయరని జయలలిత మేన కోడలు దీపా పేర్కొన్నారు. శశికళ సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదన్నారు. తమిళనాడుకు నేడు దుర్ధినం అని అన్నారు. జయలలిత మృతి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

రసవత్తరంగా తమిళ రాజకీయాలు

చెన్నై : తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శశికళకు ప్రజలు ఓటు వేయరని జయలలిత మేన కోడలు దీపా పేర్కొన్నారు. శశికళ సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదన్నారు. తమిళనాడుకు నేడు దుర్ధినం అని అన్నారు. జయలలిత మృతి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

కరీంనగర్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహదేవ్ పూర్ మండలం అన్నారం మలుపు వద్ద వాహనాలు అదుపుతప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 40 మందికి గాయాలయ్యాయి. వీరిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. 

15:59 - February 7, 2017

తూర్పుగోదావరి : ఆటోలపై పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని, చదువుతో నిమిత్తం లేకుండా ట్రాన్స్ పోర్ట్ లైసెన్స్‌లు ఇవ్వాలని.. ఇలా పలు సమస్యలపై తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆటోవాలాలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

 

15:57 - February 7, 2017

జగిత్యాల : పది రూపాయల వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జగిత్యాల జిల్లా అంతర్గమ్‌ మండలంలో 10 రూపాయల కోసం అక్కాచెల్లెల్ల మధ్య వాగ్వావాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అక్క నాగలక్ష్మి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. నాగలక్ష్మి మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భోరున విలపించారు. హనుమంతు-లక్ష్మి దంపతులకు అర్చన-నాగలక్ష్మి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే నాగలక్ష్మి నిత్యం తల్లిదండ్రులతో కలిసి కూలీపనులకు వెళ్తుంది. అయితే 30 రూపాయల కూలీ డబ్బుల్ని నాగలక్ష్మి దాసుకుంది. అయితే అందులోంచి అర్చన 10 రూపాయలు తీసుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో నాగలక్ష్మి బావిలో దూకి ఆత్మచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

 

రాష్ట్రపతితో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ : ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలకు రావాలని రాష్ట్రపతి ప్రణబ్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రణబ్ ముఖర్జీకి సీఎం వివరించారు. 

15:40 - February 7, 2017

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సీఎం కేసీఆర్ ముగిసింది. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలకు రావాలని రాష్ట్రపతి ప్రణబ్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రణబ్ ముఖర్జీకి సీఎం వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అత్యధికంగా 19.5 శాతం అభివృద్ధి చెందిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆహ్వానంపై రాష్ట్రపతి ప్రణబ్ సానుకూలంగా స్పందించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

ప్రధానికి శశికళ లేఖ...

ఢిల్లీ : శశికళ ప్రమాణస్వీకారంపై  సస్పెన్స్‌  కొనసాగుతోంది. శశికళ సీఎం పదవి చేపట్టకుండా ఆదేశించాలని సుప్రీంలో దాఖలైన పిల్‌పై ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు గవర్నర్‌ చెన్నై పర్యటన రెండ్రోజులు వాయిదా పడింది. ఇటు స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే బృందం రేపు ప్రధానిని కలిసి శశికళ ప్రమాణస్వీకారంపై అభ్యంతరం తెలపనుంది. మరో వైపు శశికళ  కూడా ప్రధానికి లేఖ రాసింది. ప్రమాణస్వీకారం జాప్యంపై లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

15:03 - February 7, 2017

హైదరాబాద్ : బంగారు తెలంగాణ తెస్తానంటున్న సీఎం కేసీఆర్‌ .. ప్రజలకు చావుల తెలంగాణ చూపిస్తున్నారని కాంగ్రెస్‌ నేత మల్లురవి విమర్శించారు. హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రిని పార్టీ నేతలతో కలిసి సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులు మృత్యుకేంద్రాలుగా మారాయని విమర్శించారు. నీలోఫర్లో ఆపరేషన్ అంటే కైలాసానికి వీసా ఇచ్చినట్టే మల్లురవి విమర్శించారు. పేదవారికి వైద్యం చేయడానికి ప్రభుత్వ వైద్యులకు ఎక్కడలేని అసహనం వస్తుందని కాంగ్రెస్‌నేతలు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సర్కారీ వైద్యంపై దృష్టిపెట్టాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 20లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

 

14:55 - February 7, 2017

ఢిల్లీ : శశికళ ప్రమాణస్వీకారంపై  సస్పెన్స్‌  కొనసాగుతోంది. శశికళ సీఎం పదవి చేపట్టకుండా ఆదేశించాలని సుప్రీంలో దాఖలైన పిల్‌పై ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు గవర్నర్‌ చెన్నై పర్యటన రెండ్రోజులు వాయిదా పడింది. ఇటు స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే బృందం రేపు ప్రధానిని కలిసి శశికళ ప్రమాణస్వీకారంపై అభ్యంతరం తెలపనుంది. మరో వైపు శశికళ  కూడా ప్రధానికి లేఖ రాసింది. ప్రమాణస్వీకారం జాప్యంపై లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

 

భూకంప తీవ్రత ప్రాంతాల్లో సహాయక చర్యలు : ప్రధాని మోడీ

ఢిల్లీ : లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. నిన్న రాత్రి ఉత్తర భారత్ లో భూకంపం వల్ల నష్టం జరిగిందని ప్రధాని మోడీ అన్నారు. భూకంపం తీవ్రత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. రాహుల్ చెప్పినట్లు భూకంపం వచ్చి వెళ్లిపోయిందన్నారు. 

ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి : ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. పలు అంశాలపై సీఎం చర్చించారు.

 

 

13:35 - February 7, 2017

హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్సులుగా పని చేస్తూ తమను పర్మినెంట్ చేయాలని గాంధీ ఆసుపత్రిలో ధర్నాలు చేపట్టారు. అస్సలు వారి సమస్యలు ఏంటి? ఎప్పటి నుండి వీరు పని చేస్తున్నారు. ఇత్యాది అంశాలపై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్స్ ఉపేంద్ర, ఐద్వా నేత అరుణ జ్యోతి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

13:25 - February 7, 2017

లోక్ సభ: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం పై ప్రధాని మోదీ లోక్ సభలో మాట్లాడారు. నిన్న రాత్రి ఉత్తర భారత్ లో భూకంపం వల్ల నష్టం జరిగింది. భూకంప తీవ్రత ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామన్నారు. రాహుల్ చెప్పినట్లు భూకంపం వచ్చి వెళ్లిపోయింది అని ఎద్దేవా చేశారు. దేశానికి కాంగ్రెస్ కుటుంబం పాలన ఇచ్చిందని, ఎమర్జెన్సీ కాలంలో దేశాన్ని జైలుగా మార్చారన్నారు. ప్రజాస్వామ్యం కాపాడమని గొప్పలు చెబుతున్నారని తపేర్కొన్నారు. కాంగ్రెస్ కు ప్రజా శక్తి అంటే ఏంటో తెలియదన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మంది జైలుపాలయ్యారరాన్నరు. భారత్ లో ప్రజాస్వామ్యం బలంగా ఉంది. పేదవాడి కొడుకు కూడా ప్రధాని అయ్యారు. స్వాతంత్ర సంగ్రామంలో ప్రజలంతా కలిసి పోరాడారు. ప్రభుత్వం పిలుపు మేరకు కోటి 20 లక్షల మంది గ్యాస్ సబ్సిడీ వదులుకున్నారు. దేశాభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత 60 ఏళ్లుగా స్వచ్ఛత గురించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టడం బ్రిటన్ సాంప్రదాయం. కానీ దాన్ని మేము మార్చాం 90 ఏళ్లుగా వస్తున్న రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని కూడా మార్చాం. రైల్వే స్వయం ప్రతిపత్తికి ఎలాంటి ఢోకా లేదు. పేదల కోసం పోరాటం చేస్తాను... చేస్తూనే ఉంటనన్నారు. ఎన్నికల కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు.

13:20 - February 7, 2017

హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు భద్రతలేదని విమర్శించారు వైసిపి ఎమ్మెల్యే రోజా. టిడిపి అంతా తెలుగు దుర్యోదనుల పార్టీ అని..అలాంటి ప్రభుత్వంలో పోలీసులు కూడా సర్కార్‌కు తొత్తులుగా పనిచేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి అభద్రతా వాతావరణంలో విజయవాడలో నిర్వహించే మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు ఎలా విజయవంతం అవుతుందని రోజా ప్రశ్నించారు.

13:19 - February 7, 2017

చెన్నై : శశికళ ప్రమాణస్వీకారంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. శశికళ సీఎం పదవి చేపట్టకుండా ఆదేశించాలని సుప్రీంలో దాఖలైన పిల్‌పై ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు గవర్నర్‌ చెన్నై పర్యటన రెండ్రోజులు వాయిదా పడింది. ఇటు స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే బృందం రేపు ప్రధానిని కలవనుంది.

శశికళ సీఎం అవ్వడం ఇష్టంలేదు: పాండ్యన్

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై అన్నాడీఎంకే సీనియర్‌ నేత పి.హెచ్‌.పాండ్యన్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం నిర్వహించిన విలేకర్ల సమావేశంనిర్వహించారు.అమ్మది సహజమరణం కాదని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభా పక్షనేతగా శశికళ ఎదగటాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ‘శశికళ మమ్మల్ని మోసం చేసి ముఖ్యమంత్రి అవుదామనుకున్నారు.. మేము దీనిని వ్యతిరేకిస్తున్నాం.. శశికళ తమిళనాడు సీఎం కావడం ఇష్టంలేదని జయలలితే నాతో స్వయంగా చెప్పారు..’

12:21 - February 7, 2017

బాలకృష్ణ పీఏ తొలగింపు

అమరావతి: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు శేఖర్‌ వ్యవహారంపై పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్‌తో కలిసి ఈరోజు ఉదయం చంద్రబాబును కలిసి ఈ వ్యవహారంపై చర్చించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు శేఖర్‌ను విధుల నుంచి తొలగించాలని నిర్ణయించారు.

 

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ :12మంది మావోల మృతి

 ఛత్తీస్ గఢ్: నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. స్ఠానిక ఎస్సీ శెలువు పై వెళ్లిన నేపథ్యంలో అమ్మబేడ అటవీ ప్రాంతంలో 60 నుండి 70 మంది మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. తాత్కాలిక ఎస్పీ అభిషేక్ మీనా పక్కా సమాచారంతో మెరుపు దాడి చేసినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల వద్ద నుండి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అమ్మబేడ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

11:39 - February 7, 2017

ఛత్తీస్ గఢ్: నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. స్ఠానిక ఎస్సీ శెలువు పై వెళ్లిన నేపథ్యంలో అమ్మబేడ అటవీ ప్రాంతంలో 60 నుండి 70 మంది మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. తాత్కాలిక ఎస్పీ అభిషేక్ మీనా పక్కా సమాచారంతో మెరుపు దాడి చేసినట్లు సమాచారం. సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేస్తుండగా వారికి మావోయిస్టులు ఎదురు పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించారని చెబుతున్నారు. మరికొంతమంది కూడా గాయపడ్డారని, వారి పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియలేదని చెబుతున్నారు. ఇటీవల ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి 8 మంది జవాన్లు మరణించడంతో.. దానికి ప్రతీకారంగానే తాజా ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.

పఠాన్ కోట్ లో ఎన్ కౌంటర్

పంజాబ్ : పఠాన్ కోట్ లో ఎన్ కౌంటర్ జరిగింది. బమియాల్ సెక్టార్ లో భారత్ లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని బీఎస్ ఎఫ్ మట్టుబెట్టింది.

10:45 - February 7, 2017

ఢిల్లీ: రాజధాని రైతులకు క్యాపిటల్‌గెయిన్స్‌పై పన్ను మినహాయింపు ఇవ్వడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ను కలిసిన ఏపీ మంత్రులు కృజ్ఞతలు తెలిపారు. దాదాపు 60 మంది రైతులతోపాటు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేనిశ్రీనివాస్‌, ఎంపీ గల్లాజయ్‌దేవ్‌ తదితరులు వెంకయ్యను కలిశారు. మరోవైపు ఇవాళ కేంద్రం మంత్రి రాథామోన్‌సింగ్‌ను కలిసి రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్ట్‌లపై కూడా క్లీయరెన్స్‌ ఇప్పించాల్సిందిగా కోరతామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

10:43 - February 7, 2017

ఢిల్లీ :ప్యాకేజీ వల్ల హోదా కంటే ఎక్కువ నిధులు ఏపీకి వస్తాయన్నారు. రాజకీయ పరిజ్ఞానం, అవగాహన లేని వాళ్లు తనపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చురకలు అంటించారు. రాజధాని రైతులులకు క్యాపిటల్‌గెయిన్స్‌పై పన్ను మినహాయింపు ఇవ్వడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ను కలిసిన ఏపీ మంత్రులు కృజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ...ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాళ్లు.. ఆనాడు పార్లమెంట్‌లో కనీసం నోరు కూడా మెదపలేదని వెంకయ్యనాయుడు విమర్శించారు. హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా రాయితీలు ఏం ఇవ్వకూడదని 14వ ఆర్థికసంఘం నివేదిక ఇచ్చిందని.. అందుకే ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందన్నారు.

10:40 - February 7, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. గవర్నర్‌ అపాయంట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో.. అన్నాడీఎంకేలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. మరో వారంరోజుల్లో ఆక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో తీర్పు రానున్న నేపథ్యంలో శశికళకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదనే చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఇదే అదనుగా డీఎంకే రాజకీయంగా వ్యూహానికి పదును పెంచింది. డీఎంకే నేత స్టాలిన్‌ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశం కానున్నారు. పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న శశికళను సీఎం పీఠం ఎక్కకుండా అడ్డుకోవాలని కోరేచాన్స్‌ ఉందని డీఎంకే వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని కోరే అవకాశంకూడా ఉందంటున్నారు. ఇక శశికళ సీఎం పదవికి తగిన వ్యక్తి కాదని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.

కైలాష్ సత్యార్థి నోబెల్ మెడల్ చోరీ

హైదరాబాద్: నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరి జరిగింది. ఇంటి తాళాలు పగులగొట్టి కైలాష్ సత్యార్థి నోబెల్ మెడల్ ను దొంగలు ఎత్తుకెళ్లారు.

శశికళ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యం

చెన్నై: శశికళ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యం కానుంది. శశికళపై కోర్టు కేసు నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఆపధర్మ సీఎంగా కొనసాగాలని పన్నీర్ సెల్వంను గవర్నర్ కోరినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం లేదా రేపు గవర్నర్ చేరుకోనున్నారు. అన్ని అధికారిక కార్యక్రమాలను గవర్నర్ రద్దు చేసుకున్నారు.

10:26 - February 7, 2017

అనంతపురం :హిందూపురం టీడీపీ అసమ్మతి నేతలు ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణకు వారం రోజుల డెడ్‌లైన్‌ విధించారు..ఆలోపు బాలకృష్ణ తన వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్‌ను ఇక్కడి నుంచి పంపకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేయడంతో పాటు హిందూపురంలోని ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుటే నిరాహార దీక్ష చేస్తామంటూ అల్టిమేటం ఇచ్చారు. పీఏ కావాలో పార్టీ నేతలు కావాలో బాలకృష్ణనే నిర్ణయించుకోవాలంటూ తేల్చిచెప్పారు.

చర్చనీయాంశంగా మారిన హిందూపుం ఎపిసోడ్‌...

బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో హిందూపురం ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పీఏ శేఖర్ ఆడియో టేపు ఒకటి కలకలం సృష్టించడం.. నియోజకవర్గంలో అన్ని తానై వ్యవహరిస్తుండటంతో అసమ్మతి సెగ రాజుకొంది. చిలమత్తూరు, లేపాక్షి జడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ రాజీనామా చేశారు. పీఏ శేఖర్ కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణలు భారీ ర్యాలీకి సిద్ధమైనా... పోలీసులు 144 సెక్షన్ తో పాటు 30 యాక్ట్ ప్రయోగించారు.. పీఏ శేఖర్ ప్రోదల్బంతోనే పోలీసులు ఇలా వ్యవహరించారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై బాలయ్య పెద్దగా స్పందించలేదు. మరో వైపు దీనిపై చంద్రబాబు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి... బాలయ్య వ్యవహారం కావడంతో అనంతపురం జిల్లా పార్టీ నేతలు కూడా ఈ విషయంలో దూరంగా ఉంటున్నారు.

తమిళనాడులో మరో ఇద్దరు అధికారులపై వేటు

చెన్నై : తమిళనాడులో మరో ఇద్దరు అధికారులపై వేటు పడింది. మేనిఫెస్టో అమలు కోసం జయ నియమించిన మాజీ ఐఏఎస్ శాంతా షీలానాయర్ రాజీనామా చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీ సత్యమూర్తిని లీవ్ పై ప్రభుత్వం పంపింది.

ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు: వెంకయ్యనాయుడు...

ఢిల్లీ : ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని, ప్రత్యేక హోదా సాధ్యం కాదని... ప్రత్యేక హోదాకు మించిన సహాయాన్ని చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును అమరావతి రాజధాని రైతులు కలిశారు. బడ్జెట్ లో మూలధన రాబడిపై పన్ను మినహాయింపు కల్పించడంపై వెంకయ్య కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

09:27 - February 7, 2017

హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఇండియానుంచి కూడా రిక్రూట్‌ మెంట్లు జోరుగా చేస్తోందని జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. చెన్నైకేంద్రంగా సాగిన ఈ రిక్రూట్‌మెంట్లలో తమిళనాడు నుంచి 8 మంది, తెలంగాణ నుంచి ఒకరు ఐసిస్‌లో చేరినట్టు ఎన్‌ఐఏ తెలిపింది. సభ్యుల చేరికతోపాటు నిధులను కూడా పెద్దమొత్తంలో కలెక్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. 2016 లో అబుదాబీ పట్టుబడిన ముగ్గురు ఐసిస్‌ సానుభూతిపరుల విచారణ సందర్భంగా ఈ విషయాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. దీంతో ఐసిస్‌లో చేరిన వారు ప్రస్తుతం ఎక్కడున్నారు తెలుసుకునేందుకు నిఘావర్గాలు ప్రయత్నిస్తున్నాయి.

వేగంగా మారుతున్న తమిళ రాజకీయాలు

చెన్నై : తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. గవర్నర్‌ అపాయంట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో.. అన్నాడీఎంకేలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. మరో వారంరోజుల్లో ఆక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో తీర్పు రానున్న నేపథ్యంలో శశికళకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదనే చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఇదే అదనుగా డీఎంకే రాజకీయంగా వ్యూహానికి పదును పెంచింది. డీఎంకే నేత స్టాలిన్‌ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశం కానున్నారు.

09:24 - February 7, 2017

ఖమ్మం : గిరిజనులను పోడు భూముల నుంచి వెళ్లగొట్టాలని చూస్తే... ప్రభుత్వం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు రావాల్సిన వాటా రావాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. పాదయాత్ర ముగిసిన తర్వాత దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల అంశమై ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటై రెండున్నరేళ్లు దాటినా అట్టడుగు ప్రజల జీవితాలు ఇంకా మారలేదని తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం జరిగినప్పుడు సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. సామాజిక న్యాయం కోసం అందరూ కలిసి పోరాడదామని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆధ్వాన్న పరిస్థితిలోఉర్దూ మీడియం పాఠశాలలు....

రాష్ట్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలు ఆధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయని పాదయాత్ర బృందం సభ్యులు అబ్బాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్‌ భూములు అన్యాక్రంతం అవుతున్నా.. ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి చివరన ఉండటం వల్ల తమ కలేజీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆశ్వారావుపేట ప్రభుత్వ వ్యవసాయ కాలేజీ విద్యార్థులు ఆరోపించారు. కళాశాలలో మౌలిక వసతులు కూడా లేవని పాదయాత్ర బృందానికి సమస్యలు విన్నవించుకున్న అగ్రికల్చర్‌ కళాశాల విద్యార్థులు వాపోయారు.

113 రోజులు పూర్తి...

113 రో జులు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ నుంచి ప్రారంభమైన యాత్ర అన్నాడిగూడెం, నర్సింహారావుపేట, గార్ల ఒడ్డు, ఏల్కూరు, ఇమాన్‌నగర్‌, వినోభానగర్‌, జూలూరు పాడులో పర్యటించింది. తమ్మినేని బృందానికి వచ్చిన 35 వేల దరఖాస్తుల్లో.. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపైనే అధిక దరఖాస్తులు వచ్చాయి.

09:19 - February 7, 2017

హైదరాబాద్: డాక్టర్ల నిర్లక్ష్యానికి విలవిల్లాడిన ఓ పసిప్రాణం మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. వరంగల్‌జిల్లాకు చెందిన భిక్షపతి.. జ్వరంతో బాధపడుతున్న తన కూతురు సాయీప్రవల్లికను రెండు నెలల కిందట హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. పాపకు ట్రీట్‌ మెంట్‌ ఇచ్చే సమయంలో ఆస్పత్రి డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పురుగులతో కల్తీఅయిన సెలైన్‌ బాటిల్‌ను పాప ఒంట్లోకి ఎక్కించారు. దీంతో సాయిప్రవల్లిక తీవ్ర అస్వస్థతకు గురైంది. తప్పు తెలుసుకున్న గాంధీ ఆస్పత్రి వైద్యులు పాపకు గత రెండు నెలలుగా చికిత్స అందిస్తున్నారు. కాని..బ్లడ్‌లో సోకిన ఇన్ఫెక్షన్‌ ఎంతకీ తగ్గక పోవడంతో.. పాప నిన్న అర్థరాత్రి మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యానికి తమ పాప బలైపోయిందన్న తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. పాప చనిపోయిన విషయాన్ని రహస్యంగా ఉంచిన డాక్టర్లు..పోలీసు బందోబస్తు మధ్య పాప మృతదేహాన్ని వరంగల్‌ జిల్లాలోని ఆమె సొంతూరుకు తరలించారు.

09:16 - February 7, 2017

హైదరాబాద్: సర్కారు భూమి అమ్మేసిన సర్కారు లీడర్లు... ఇళ్లు కట్టుకున్నంక కూలగొడుతున్న పోలీసోళ్లు, ఆడోళ్ల సీట్లకెళ్లి లేసిన తమిళ తంబీ....అతర్జాతీయ ఆపద్ధర్మ సీఎం రాజీనామా, రణం రణం అయితున్న శరణం గచ్చామీ... జిల్లాలకు పాకిన బహుజన సిన్మాలడాయి, బాధితులమీదనే కేసులు పెట్టిన కాఖీలు...చీరాల కాడ సీత్వ పని చేసిన పోలీసులు, ఆరిపోయిన చెర్వుగట్టు అగ్నిగుండాలు.. ధూం ధాం అయితున్న గుట్ట జాతర, గొడ్డలి సుత్తెతోని హెయిర్ కటింగ్...గట్టిగ అయితే ఖతమే హిట్టింగ్ ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న మన ముందుచు వచ్చారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఇద్దరు ఉగ్రవాదులను చర్లపల్లి నుండి తీహార్ జైలుకు తరలింపు..

హైదరాబాద్: చర్లపల్లి జైలు నుంచి ఇద్దరు ఉగ్రవాద ఖైదీలను (అసదుల్లా అక్తర్, జియార్ ఉర్ రెహ్మాన్) తీహార్ జైలుకు ఎన్ఐఏ అధికారులు తరలించారు.

చెన్నై కేంద్రంగా ఐఎస్ఐఎస్ లో భారీగా చేరికలు

హైదరాబాద్:చెన్నై కేంద్రంగా ఐఎస్ ఐఎస్ లో కి 9మంది యుకులు చేరారు. చేరినవారిలో 8మంది తమిళనాడు వాసులు కాగా ఒకరు తెలంగాణ కు సంబంధించిన వ్యక్తి. ఎన్ఐఏ దర్యాప్తులో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.అబుదాబిలో ఉగ్రవాదుల విచారణలో ఈ విషయం వెల్లడయ్యింది. దీంతో ఐసిస్ లో ఎంత మంది చేరారు అనే అంశం పై ఎన్ఐఏ ఆరా తీస్తోంది.

ఢిల్లీలో దట్టంగా అలుముకున్న పొగమంచు

ఢిల్లీ : దేశరాజధానిలో పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా 22 రైళ్లు, 8 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

07:24 - February 7, 2017

హైదరాబాద్: కృష్ణా జిల్లా ఇలపర్రులో దళితులు భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల నిర్బంధకాండతో ఇలపర్రులో అలజడి రేగింది. సీపీఎం సహా ప్రజాసంఘాల నేతల అరెస్టులతో అట్టుడికింది. దళితుల భూములు వారికి అప్పగించేదాక తమ పోరాటం ఆగదన్నారు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. పోలీసులు వచ్చినా, సైన్యం వచ్చినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ నగేష్, టిడిపి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, సీపీఎం నేత రఘు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:07 - February 7, 2017
07:06 - February 7, 2017
07:05 - February 7, 2017

హైదరాబాద్: తెలంగాణ పోలీసుశాఖలో నియామకాలు ఒక్క అడుగు ముందుకు.. ఆరడుగులు వెనక్కు పడుతున్నాయి. కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలై ఏడాది గడుస్తున్నా.. ఇంతవరకు నియామకాలు చేపట్టలేదు. మరోవైపు కటాఫ్‌ మార్కుల ప్రకటించకపోవడంతో.. ఏం చేయాలో అర్థం కాక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

10 వేల కానిస్టేబుళ్లు, 516 ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ...

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు నియామకాల మోక్షం కలగడం లేదు. 10 వేల కానిస్టేబుళ్లు, 516 ఎస్సై ఉద్యోగాలకు ఏడాది క్రితం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఉద్యోగాలకు లక్షలాదిగా దరఖాస్తులు వచ్చాయి. అయితే.. సంస్కరణల నేపథ్యంలో రిక్రూట్‌మెంట్‌ విధానంలో అనేక మార్పులు చేశారు. కానిస్టేబుల్‌ పరీక్షలో మొదట రిటన్‌ టెస్ట్‌ నిర్వహించి.. ఆ తర్వాత ఫిజికల్‌ టెస్ట్‌ పెట్టారు. వీటిలో 80 వేల మంది అర్హత సాధించారు. మరోవైపు ఎస్సై ఉద్యోగానికి కూడా వ్రాత, ఫిజికల్‌ టెస్టులు నిర్వహించి.. ఫలితాలు ప్రకటించారు. అయితే.. ఫలితాలు వచ్చి రెండు నెలలైనా ఇంతవరకు నియామకాలు చేపట్టలేదు.

ఇప్పటివరకు ప్రకటించిన కటాఫ్‌ మార్కులు ...

ఇక నియామకానికి కట్‌ ఆఫ్‌ మార్కులు ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుందనే ఆశతో వేరే పరీక్షలకు సిద్ధం కావడం లేదు. ఫైనల్‌ రిజల్ట్స్‌ వస్తే వేరే పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరో 2 నెలలు పట్టే అవకాశం ఉంది. తాజాగా మహిళలకు పోలీసుశాఖలో 33 శాతం రిజర్వేషన్‌ కల్పించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇన్నాళ్లు సాధారణ రిజర్వేషన్‌కు అనుకూలంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. వీటిలో ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు త్వరగా నిర్ణయాలు తీసుకుంటే అనేకమంది అభ్యర్థులకు ఊరట లభిస్తుంది. ఇప్పటికైనా పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు.

07:01 - February 7, 2017

హైదరాబాద్: పార్టీ వ్యవహారాలు మీరే చూసుకోండి అన్న చంద్రబాబు వ్యాఖలు టీ-టీడీపీపై ఎలా ప్రభావం చూపించనున్నాయి ? దీనిపై సీనియర్ల అభిప్రాయమేంటి ? పార్టీ పూర్తి స్థాయి బాధ్యతలు ఎవరికీ దక్కనున్నాయి ? రేవంత్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తే సీనియర్లు సమర్ధిస్తారా ?

తొలుత ప్రతి శనివారం ప్రత్యేక సమావేశాలు

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి.. తెలంగాణలో పార్టీ వ్యవహారాలకు చంద్రబాబు క్రమక్రమంగా దూరమయ్యారు. తొలుత ప్రతి శనివారం తెలంగాణ తెలుగు తమ్ముళ్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు.. ఏపీ సచివాలయం అమరావతికి తరలివెళ్లడంతో ఆ మీటింగ్‌లకు అవకాశం లేకుండాపోయింది. దీంతో టీ-టీడీపీ వ్యవహారాలకు దూరమయ్యారు. కొద్దిరోజుల క్రితం వరకు నారా లోకేష్‌ టీ-టీడీపీ వ్యవహారాలు పర్యవేక్షించారు. అయితే.. తాజాగా ఏపీ మంత్రివర్గంలో లోకేష్‌ చేరనుండడంతో.. భవిష్యత్‌లో ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు. దీంతో టీ-టీడీపీ బాధ్యతలు పూర్తిగా ఎవరికైనా అప్పగించే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే టీ-టీడీపీ నేతలకు సూచించిన చంద్రబాబు .....

ఈ మధ్య చంద్రబాబు.. పార్టీని మీరే నడుపుకోండి అంటూ టీ-టీడీపీ నేతలకు సూచించడం కూడా దీనికి నిదర్శనంగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం టీ-టీడీపీ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్‌.రమణ ఉండగా.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి అన్నీ తానై చూసుకుంటున్నారు. అయితే పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలు రేవంత్‌రెడ్డికే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గతంలో రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు .....

అయితే.. ఒకానొక సమయంలో పార్టీలోని చాలామంది సీనియర్లు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పారు. వీరిలో ఎర్రబెల్లి లాంటి నేతలు పార్టీని వీడారు. ఇంకా మిగిలిన ఉన్న సీనియర్లు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే వీరిలో మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన తన పని తాను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేవంత్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తే ఎవరూ అడ్డుకునే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. దీంతో త్వరలోనే టీ-టీడీపీ పూర్తిస్థాయి బాధ్యతలు రేవంత్‌రెడ్డికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

06:58 - February 7, 2017

హైదరాబాద్‌: నగరంలో లో గూడు లేని పేదవారికి నీడ కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. రెవెన్యూ, మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేటీఆర్‌.. ఇళ్ల నిర్మాణానికి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. టెండర్లు పూర్తయిన దగ్గర వెంటనే పనులు ప్రారంభించాలని.. ఆ ప్రక్రియ పూర్తి కాని దగ్గర టెండర్లను ఫైనలైజ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఖాళీ స్థలాల గుర్తింపును వేగవంతం చేసి..

ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న ఖాళీ స్థలాల గుర్తింపును వేగవంతం చేసి.. ఇళ్ల నిర్మాణానికి అనువుగా ఉండే ప్రాంతాలతో సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులకు కేటీఆర్‌ సూచించారు. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఇళ్ల యూనిట్ల కోసం సీఎంతో మాట్లాడి పరిపాలనపరమైన అనుమతులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు స్థలాలు ఇచ్చేందుకు మురికివాడల్లో ప్రజలను ఒప్పించేందుకు ఎన్జీవోల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆశయాన్ని కాంట్రాక్టర్లకు వివరించి త్వరగా పనులు పూర్తి చేసేలా ఒప్పించాలన్నారు.

హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తే..

రాజధాని హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తే.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపై సానుకూల ప్రభావం ఉందన్నారు కేటీఆర్‌. ఇకపై డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు ఉంటాయన్నారు. ఇళ్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించిన ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతో తానే సమావేశమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నట్లు ప్రకటించారు. అయితే.. ఏడాది క్రితం హడావుడిగా శంకుస్థాపనలు చేసి.. ఇప్పటివరకు పనులు పూర్తి చేయకపోవడం పట్ల నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి తాజాగా మంత్రే స్వయంగా రంగంలోకి దిగుతానని ప్రకటించడంతో ఇప్పటికైనా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగుతుందో లేదో చూడాలి.

06:56 - February 7, 2017

హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో సీటు కోసం గులాబీదళంలో పోటీ పెరిగింది.

కాంగ్రెస్‌ మద్దతుతో గెలుపొంది టీఆర్‌ఎస్‌ పంచన చేరిన జనార్దన్‌రెడ్డి ....

టీఆర్‌ఎస్‌కు అనుంబంధంగా ఉన్న టీఎస్‌ పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాల్లో పెద్ద అసోసియేషన్‌గా గుర్తింపు పొందింది. గత ఎన్నికల్లో హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్‌ మద్దతుతో గెలుపొందిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఆ తర్వాత అధికార టీఆర్‌ఎస్‌ పంచన చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్‌ అనుబంధ ఉపాధ్యాయ సంఘంగా పేరు పొందిన పీఆర్‌టీయూను టీఆర్‌ఎస్‌కు అనుంబంధంగా మార్చారు. ఉపాధ్యాయ సంఘాన్ని కూడా టీఎస్‌ పీఆర్టీయూగా మార్చారు. కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం వచ్చే నెల 29తో ముగుస్తుంది. దీంతో మళ్లీ బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ మద్దతు కోరుతున్న హర్షవర్దన్‌రెడ్డి ...

మరోవైపు హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంపై టీఆర్‌ఎస్‌లోని మరికొందరు కూడా ఆశలు పెట్టుకున్నారు. వీరిలో హర్షవర్దన్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసిన హర్షవర్దన్‌రెడ్డి, తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే సిట్టింగ్‌గా ఉన్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. జనార్దన్‌రెడ్డి అభ్యర్థిత్వానికి టీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటిస్తే... హర్షవర్దన్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగితే ఓటు చీలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళ అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. కొద్దో గొప్పో ఓట్లు ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నీ తమ అభ్యర్ధులను బరిలో దించితే అప్పుడు తమకే లాభిస్తుందన్న ధీమా కూడా టీఆర్‌ఎస్‌ నేతల్లో కనిపిస్తోంది.

బాధ్యతలు తీసుకున్న మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌..

హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల బాధ్యతలు తీసుకున్న మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌.. జనార్దన్‌రెడ్డి అభ్యర్ధిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సీటుకు ఎవరిని పోటీకి పెట్టాలన్న అంశంపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

06:53 - February 7, 2017

అమరావతి :రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా రెండంకెల వృద్ధి సాధించామన్నారు.. సీఎం చంద్రబాబు... ఆన్‌లైన్‌ లావాదేవీలతో ఆదాయం క్రమంగా పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ కేటాయింపులకు సంబంధించి అధికారులతో జరిగిన రివ్యూలో చంద్రబాబు పలు సూచనలు చేశారు.

బడ్జెట్‌లో శాఖలవారీగా ఖర్చు, నిధులు కేటాయింపులపై చర్చ...

వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.. బడ్జెట్‌లో శాఖలవారీగా ఖర్చు, నిధులు కేటాయింపులపై చర్చించారు.. జీఎస్‌టీవల్ల రాబోయే రోజుల్లో రెవెన్యూ పెరుగుతుందని సీఎం స్పష్టం చేశారు.. పట్టణాల్లో ఆన్‌లైన్‌ లావాదేవీలతో పన్ను ఆదాయం క్రమంగా పెరుగుతోందని చెప్పారు.. కొత్త రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా రెండంకెల వృద్ధి సాధించామని

అధికారుల్ని ప్రశంసించారు.. కరవు పరిస్థితులున్నా సుస్థిర వృద్ధి సాధించే అవకాశముందని అభిప్రాయపడ్డారు.. పదిలక్షల పంట కుంటలు తవ్వించాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుందని... ఇందులో

40శాతం లక్ష్యాన్ని మనమే పూర్తిచేద్దామని అధికారులకు సూచించారు.. ప్రభుత్వ శాఖలన్నింటిలో జవాబుదారీతనం ఇంకా మెరుగుపడాలని సీఎం తెలిపారు..

కీ ఫెర్మామెన్స్ ఇండికేటర్స్, 15 సూత్రాల కుటుంబవికాసం....

కీ పెర్‌ఫామెన్స్ ఇండికేటర్స్, 15 సూత్రాల కుటుంబవికాసం, 10 అంశాలతో సమాజవికాసం, సుస్థిర వృద్ధి లక్ష్యాలు, వ్యవస్థీకృత మార్పులు, ఈ ప్రగతి అంశాలపై బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టామని సీఎం ప్రకటించారు.. స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్దత ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇంకా రైల్వేజోన్‌ ప్రకటనతో పాటు... రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు.కేంద్ర ప్రభుత్వ శాఖలు నేరుగా కేటాయించే నిధులపై అవగాహన పెంచుకోవాలని అధికారులకు సూచించారు.. సాధ్యమైనంత ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు..

తిరుపతి హాస్పిటాలిటీ ఇనిస్టిట్యూట్‌ పనుల్ని ప్రారంభించాలని ఆదేశం...

తిరుపతి హాస్పిటాలిటీ ఇనిస్టిట్యూట్‌ భవన నిర్మాణాల పనుల్ని వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు.. ప్రపంచంలోని వేగవంతమైన మార్పులకు అనుగుణంగా మానవ వనరుల విభాగంలో మార్పులు జరగాలని సూచించారు.. ఐటీలో ఎన్నో మార్పులొచ్చాయని... వీటికి అనుగుణంగా మానవ వనరుల్ని అభివృద్ధి చేసుకోవాలని వివరించారు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మానవ వనరుల శాఖ కార్యదర్శులు సమావేశం కావాలని సీఎం ఆదేశించారు.. విశాఖ భాగస్వామ్య సదస్సులో ఏఏ ప్రాంతంలో పరిశ్రమలు వస్తున్నాయో తెలుసుకోవాలని సూచించారు.. అక్కడి యువతీయువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలని సూచించారు.. పలు అంశాలపై అధికారులకు కీలక సూచనలిచ్చిన సీఎం... బడ్జెట్‌కు సంబంధించిన విషయాలపై అధికారులతో వివరంగా చర్చించారు.. ఈ సమావేశానికి పలువురు మంత్రులుకూడా హాజరయ్యారు..

బడ్జెట్‌పై అధికారులతో సీఎంచంద్రబాబు సమావేశం

అమరావతి :రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా రెండంకెల వృద్ధి సాధించామన్నారు.. సీఎం చంద్రబాబు... ఆన్‌లైన్‌ లావాదేవీలతో ఆదాయం క్రమంగా పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ కేటాయింపులకు సంబంధించి అధికారులతో జరిగిన రివ్యూలో చంద్రబాబు పలు సూచనలు చేశారు.

శశికళ ప్రమాణస్వీకారం వాయిదా

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడింది. మద్రాస్‌ యూనివర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో శశికళ ప్రమాణస్వీకారోత్సవానికి ఓ వైపు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి రాజ్‌భవన్‌ నుంచి ఎటువంటి అధికార ప్రకటన ఇంతవరకు రాలేదు. తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అందుబాటులో లేకపోవడంతో ప్రమాణస్వీకార కార్యక్రమం వాయిదా పడింది.

06:45 - February 7, 2017

చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న శశికళ ప్రమాణ స్వీకారోత్సవానికి మరికొంతకాలం నిరీక్షణ తప్పదు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఇవాళ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా... రాజ్‌భవన్‌ నుంచి అధికార ప్రకటన రాకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది.

జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నిందితురాలు

శశికళ ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడటానికి చాలా కారణాలున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తులు కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఈ కేసులో శశికళ కూడా నిందితురాలుగా ఉన్నారు. కొద్ది రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది. కేసు విచారణంలో ఉండగా శశికళతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదరయ్యే అవకాశం ఉన్నందున తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారని సమాచారం. ఈ కారణంగానే శశికళ ప్రమాణ స్వీకారానికి అధికార ప్రకటన వెలువడలేదని భావిస్తున్నారు. తమిళనాడు పర్యటనను కూడా విద్యాసాగర్‌రావు వాయిదా వేసుకున్నారు. మరోవైపు శశికళ ప్రమాణ స్వీకారాన్నినిలిపి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు కూడా విచారణకు రానున్న తరుణంలో... శశికళతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తే న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో... ఈ కార్యక్రమానికి రాజ్‌భవన్‌ నుంచి ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదని భావిస్తున్నారు.

శశికళకు సీఎం పీఠం ఎలా కట్టబెడతారు ? -....

ఇంకోవైపు తమిళనాడు రాజకీయ పరిణామాలను గమనిస్తున్న నెటిజన్లు శశికళపై భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం ఎలా కట్టబెడతారాంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. శశికళను ముఖ్యమంత్రిగా చేసే విషయంలో అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటే సహించేదిలేదని హెచ్చరిస్తున్నారు. శశికళకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టాలన్న అన్నా డీఎంకే శాసనసభా పక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు లేఖలు రాస్తామని సోషల్‌ మీడియాలో వెల్లడిస్తున్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ సైట్లలో శశికళ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఛేంజ్‌.ఓఆర్‌జీ ఆన్‌లైన్‌ పటిషన్‌ ప్లాట్‌ఫారంలో శశికళకు వ్యతిరేకంగా సంతకాలు .....

కొన్ని ఆన్‌లైన్‌ సైట్లలో శశికళకు వ్యతిరేకంగా నెటిజన్లు గళం ఇప్పుతున్నారు. ఛేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీ ఆన్‌లైన్‌ పిటిషన్‌ ప్లాట్‌ఫారం శశికళకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కూడా జరుపుతోంది. ఇప్పటికే 20 వేల మందికిపైగా ఈ ఆన్‌లైన్‌ పిటిషన్‌లో సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు శశికళకు ఏ అర్హత ఉందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. ఎన్నికల్లో తాము ఓటు వేసింది అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే పార్టీకేనని, శశికళకు కాదని తేల్చి చెబుతున్నారు. అవినీతి కుటుంబానికి తాము ఓట్లు వేయలేదని, వేయబోమని నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. శశికళ ముఖ్యమంత్రైతే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. శశికళ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఈ విషయాలు స్పష్టం చేస్తున్నాయి.

06:44 - February 7, 2017

ఢిల్లీ : భూప్రకంపనలతో ఉత్తర భారతదేశం వణికింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌ కేంద్రంగా.. సోమవారం రాత్రి 10.30 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, నోయిడా, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, చండీగడ్‌, పంజాబ్‌, హర్యానాలలో దాదాపు 30 సెకండ్లపాటు భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదయ్యింది. భూప్రకంపనల నేపథ్యంలో ప్రధాని మోదీ పరిస్థితులను సమీక్షించారు. ఉత్తరాఖండ్‌ అధికారులతో మాట్లాడారు. భూప్రకంపనలపై రాష్ట్రాల నుంచి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సమగ్ర నివేదిక కోరారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన రుద్రప్రయాగ్‌ చేరుకున్నాయి.

గాంధీ ఆసుపత్రిలో సాయి ప్రవల్లిక మృతి

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో 62 రోజులుగా చికిత్స పొందుతున్న సాయి ప్రవల్లిక మృతి చెందింది. గతంలో సాయి ప్రవల్లికకు గాంధీ ఆసుపత్రి సిబ్బంది పురుగులతో ఉన్న సెలైన్ ఎక్కించారు. దీని పై విచారణ నడుస్తుండగా సాయి ప్రవల్లిక మృతి చెందింది.

Don't Miss