Activities calendar

08 February 2017

21:27 - February 8, 2017
21:26 - February 8, 2017

క్రికెట్ మ్యాచ్...స్నేహా టీవీపై 10 టీవీ విజయం

హైదరాబాద్ : సెవెన్ హెచ్ మీడియా ప్రిమియర్ లీగ్ లో భాగంగా 10 టీవీ, స్నేహా టీవీ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. స్నేహా టీవీపై 10 టీవీ విజయం సాధించింది. 69 పరుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ శ్రీనివాస్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు ఇచ్చారు. 

 

20:34 - February 8, 2017

ఎన్టీఆర్ జీవిత చరిత్రపై బాలయ్య బయోపిక్ సందర్భంగా లక్ష్మీ పార్వతితో 10 టివి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. వివాదాంశాల జోలికి బాలయ్య వెళ్తాడకోను.. వెళ్తే ఖచ్చితంగా ఆధారాలతో న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. సినిమాలో తనను విలన్ చేయాలని టీడీపీ నేతలు చూస్తున్నారని.. అసలు విలన్ చంద్రబాబు నాయుడు అని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను ఆమె మాటల్లోనే..
'ఎన్ టీఆర్ మహానుభావుడు.. ఆయన చరిత్రను పూర్తిగా చెబితేనే న్యాయం. చంద్రబాబు వెన్నుపోటే ఎన్టీఆర్ ను బాగా బాధ పెట్టిన ఘటన. ఆ విషయాన్ని సినిమాలో ప్రస్తావించకపోతే అర్థమే లేదు. నన్ను విలన్ గా ప్రస్తావిస్తారన్న అనుమానం ఉంది. టీడీపీ నేతల వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఏపీలో పాలన కుంటుపడింది. ప్రజలను ఏమార్చడానికే బాబు డైరెక్షన్ లో బాలయ్య ఎత్తుగడ ఇది. ఎన్టీఆర్ కు సంబంధించిన ఎవ్వరికి తెలియని ఎన్నో విషయాలు నాకు తెలుసు. బయోగ్రఫీ సందర్భంగా ఎన్నో అనుభవాలను ఆయన పంచుకున్నారు. నేనే బయోగ్రఫీని సినిమాగా తీద్దాం అనుకున్నాను. చంద్రబాబే జామతా దశమ గ్రహమంటూ ఎన్టీఆరే అన్నారు. ఇప్పటికే ఆ వీడియో క్లిప్పులే సజీవ సాక్ష్యాలు. చంద్రబాబును హీరోగా చూపిస్తే ఒప్పుకోను ఖచ్చితంగా నా ప్రస్తావన కూడా ఉండాలి. ఎన్టీఆర్ పార్టీ పెట్టి సీఎం ఎలా అయ్యారో చూపిస్తే అభ్యంతరం లేదు. నా బయోగ్రఫీ పుస్తకాలను ఇప్పటికే బాలయ్యకు ఇచ్చాను. నేనంటే బాలయ్యకు అభిమానమే. హరికృష్ణ, దగ్గుబాటి ఇలా ఎందరో బాబు బాధితులు. నేను పవర్ సెంటర్ పాలిటిక్స్ నడపలేదు. పవర్ సెంటర్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు లోకేష్ నడుపుతున్నది. నన్ను తెలుగు తల్లి అన్న సోమిరెడ్డి ఇప్పుడు విలన్ అంటున్నాడు. ఎన్టీఆర్ వివాహమాడిన వెంటనే నెల్లూరులో సోమిరెడ్డి. వేలాది మంది మహిళలతో నాకు సన్మానం చేశాడు. అధికారికంగా ఇప్పుడు నేనే ఎన్టీఆర్ భార్యను లక్ష్మీపార్వతిని తక్కువగా అంచనా వేయొద్దు. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. అనారోగ్యంపాలై ఎన్టీఆర్ ఇంట్లో ఉంటే కొడుకులు పట్టించుకోలేదు. ఒకానొక సందర్భంలో బాలయ్యపై ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు. బాబుతో కుటుంబ చేతులు కలపడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అనారోగ్యంతో ఉంటే పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కు కష్టకాలంలో అన్ని తానైయ్యాను. బాలకృష్ణ బయోపిక్ పై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఫైర్. చరిత్రను వక్రీకరించారో కోర్టు మెట్లు ఎక్కిస్తా'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కేంద్రమంత్రులను కలిసిన టీటీడీపీ నేతల బృందం

ఢిల్లీ : టీటీడీపీ నేతల బృందం కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్ర సమస్యలపై వెంకయ్యనాయుడు, రాధా మోహన్ సింగ్ తో చర్చించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఫిర్యాదు చేశారు. 

 

ఢిల్లీ బయల్దేరిన ఏఐడీఎంకే ఎంపీలు

చెన్నై : ఏఐడీఎంకే ఎంపీలు ఢిల్లీ బయల్దేరారు. రేపు రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసి తమిళనాడు అనిశ్చితిపై నేతలు చర్చించనున్నారు. 

19:48 - February 8, 2017

సీఎం చంద్రబాబుతో స్పీకర్ కోడెల సమావేశం

గుంటూరు : సీఎం చంద్రబాబుతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఉమెన్ పార్లమెంట్ పై చర్చించారు. 

సీఎంగా పన్నీర్ సెల్వంను కొనసాగించాలి : కమల్ హాసన్

తమిళనాడు : పన్నీర్ సెల్వం బాగానే పని చేస్తున్నారని హీరో కమల్ హాసన్ అన్నారు. సీఎంగా పన్నీర్ సెల్వంను కొనసాగనివ్వాలని సూచించారు.

 

రేపు యూనివర్సిటీ బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు

హైదరాబాద్ : రేపు యూనివర్సిటీ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. గురుకుల నోటిఫికేషన్ లోని అర్హతలు సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. డీఎస్సీ 2012 అర్హతల్నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. టెట్ ను అర్హతగా భావించి ప్రిలిమ్స్ ను ఎత్తివేయాలన్నారు. బంద్ తో పాటు రేపు గురుకుల దీక్ష చేపడతామని ఓయూ నిరుద్యోగ జేఏసీ కోటూరి మానవతారాయ్ అన్నారు. 

19:16 - February 8, 2017

గుంటూరు జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య

గుంటూరు : బాపట్ల అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళగిరికి చెందిన నాగజ్యోతి బాపట్ల అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ ఏజీడీఎస్‌ సెకండియర్‌ చదువుతోంది. ఈనేపథ్యంలో పురుగుల మందు తాగి మృతి చెందింది. అయితే మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

నోట్ల రద్దు నిర్ణయానికి మేం వ్యతిరేకం కాదు : ఏచూరి

ఢిల్లీ : నోట్ల రద్దు నిర్ణయానికి తాము వ్యతిరేకం కాదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకమన్నారు.

17:44 - February 8, 2017

చెన్నై : అన్నాడీఎంకేలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. మద్దతిచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుతునే యత్నంలో శశికళ వర్గం నిమగ్నమైంది. ఉదయం పార్టీ కార్యలయానికి వచ్చిన 130మంది ఎమ్మెల్యేలను బస్సుల్లో ఎక్కించి.. ఓ హోటల్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో శశికళ... రాష్ట్రపతి జోక్యం కోరుతోంది. 
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ లభిస్తే... 130 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం. అటు పన్నీర్ సెల్వం వర్గం... ముంబైకి వెళ్లి గవర్నర్‌ను కలివాలని నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు జయలలిత మృతి, తన రాజీనామాపై తొలిసారి పెదవివిప్పిన తమిళనాడు ఆపద్ధర్మ సీఎం ఓ. పన్నీర్‌ సెల్వంపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. కమల్‌ హాసన్‌, అరవింద స్వామి, ఖుష్బూ, గౌతమి తదితరులు పన్నీర్‌ సెల్వాన్ని ప్రశంసించారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:41 - February 8, 2017

హైదరాబాద్ : త్వరలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్డెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేయనుందా..? సామాజిక వర్గాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనుందా..? ఆర్థికశాఖ ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించిందా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. 
ఇప్పటివరకు మూడు బడ్జెట్లు 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం మూడు బడ్జెట్‌లను ప్రవేశపెట్టింది. ప్రతి బడ్జెట్‌లోనూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాలకే ఎక్కువ నిధులు కేటాయింపులు జరిగాయి. గత బడ్జెట్ లో ఒక్క మిషన్ కాకతీయ, నీటి పారుదల ప్రాజెక్టుల కోసం ఏటా 6 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. కేవలం ఒక్క శాఖకే ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించడంపై విమర్శలు తలెత్తాయి.
ఈసారి బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు అధికప్రాధాన్యత 
ఈసారి బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు అధికప్రాధాన్యత ఇవ్వనుంది. కులవృత్తులకు భారీ ఎత్తున నిధులు కేటాయించాలని సర్కార్‌ డిసైడ్ అయింది. ఇప్పటికే బీసీ సంక్షేమశాఖ అధికారులు దీనిపై ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. 2017-18 ఆర్థికసంవత్సరానికి 3637 కోట్ల రూపాయలతో ప్రాధమిక బడ్జెట్‌ను అధికారులు రూపొందించారు. ఇందులో  ఫెడరేషన్లు, కో ఆపరేటివ్ సోసైటిల ద్వారా నిధులు కేటాయించి కుల వృత్తులకు మరింత ప్రోత్సహం ఇవ్వాలని భావించింది. 
కుల వృత్తులకు ఫెడరేషన్ల వారిగా ప్రతిపాదనలు
కుల వృత్తులకు ఫెడరేషన్ ల వారిగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గీత కార్మిక ఫెడరేషన్‌కు 22.21 కోట్లు.. రజక కో ఆపరేటివ్ సొసైటి ఫెడరేషన్‌కు 62.03 కోట్లు.. తెలంగాణ బట్రాజు కో ఆపరేటివ్ ఫెడరేషన్‌కు 3.76 కోట్లు.. కృష్ణ బలిజ పూసల ఫెడరేషన్ కి 7.17 కోట్లు.. కుమ్మరి శాలివాహన కో ఆపరేటివ్ కి 17.92 కోట్లు.. మేదర ఫైనాన్స్ కార్పొరేషన్ కి 7.08 కోట్లు.. నాయి బ్రహ్మణ కో ఆపరేటివ్ ఫేడరేషన్ కి 42.5 లక్షలు.. అలాగే సగర కో ఆపరేటివ్ ఫెడరేషన్ కి 7.2 కోట్లు..వడ్డెర కో ఆపరేటివ్ ఫెడరేషన్ కి 12.40 కోట్లు .. వాల్మీకి బోయా కో ఆపరేటివ్ ఫెడరేషన్ కి 5.88 కోట్లు.. విశ్వ బ్రహ్మణ కో ఆపరేటివ్ కార్పోరేషన్ కి 19.77 కోట్లు.. సంచార జాతుల ఫెడరేషన్‌కు 6 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.  

ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో జనాభా రీత్యా అత్యధిక సంఖ్యలో ఉన్న వర్గాలను సంతృప్తి పర్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారని.. అయితే దీనికి కారణం సామాజిక తెలంగాణ నినాదంతో వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు నిత్యం అందోళన బాట పట్టడమే ప్రధాన కారాణమని అంటున్నారు అధికారులు. వీటితో పాటు ప్రత్యేకంగా చేపలు, గొర్రెలు మేకలు, పాల ఉత్పత్తి వంటి చేతి వృత్తులను అభివృద్ధి పరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అదాయ పరిమితులు పెరిగే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం అంచనావేస్తోంది. 
సామాజిక వృత్తులకు పెద్ద పీట 
మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఇన్నాళ్లకు సామాజిక వృత్తులు, ఆ వర్గాల ప్రయోజనాలకు పెద్ద పీట వేయాలని భావిస్తోంది. అయితే ఇది కేవలం ప్రతిపాదనల వరకే పరిమితం అవుతుందా లేక వాస్తవ రూపం దాలుస్తాందా అనేది వేచి చూడాల్సిందే.

17:26 - February 8, 2017

విశాఖ : ఉత్తరాంధ్రలో ఎన్నికల ఫీవర్‌ స్టార్ట్‌ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలలో జోష్‌ కనిపిస్తోంది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే టీడీపీ-బీజేపీ కూటమి మాత్రం ఇంతవరకూ అభ్యర్థిని ప్రకటించలేదు. 
13న  నోటిఫికేషన్‌
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది.13న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 20 నుంచి 23 వరకూ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 9 న పోలింగ్‌ జరుగుతుంది. మూడు జిల్లాలో 224 పోలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. మొత్తం ఉత్తరాంధ్రలో లక్షా 55 వేల 957 మంది ఓటర్లు ఉన్నట్టు చెప్పారు.  దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి పోలీసు అధికారులతో చర్చించినట్టు . ..ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని కలెక్టర్‌ చెప్పారు. 
పోటీ నుంచి తప్పుకున్న ఎంవీఎస్‌ శర్మ
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎంవీఎస్‌ శర్మ కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు పీడీఎఫ్‌ తరపున అజశర్మ పోటీ చేస్తున్నారు.  ఎంతోకాలంగా అజ శర్మ కార్మిక, ఉద్యోగుల, రైతుల, ఆదివాసీ , పర్యావరణ సమస్యలపై పనిచేస్తున్నారు. దీంతో ఈయనకు 290 ప్రజా సంఘాల మద్దతు లభిస్తోంది. ఉత్తరాంధ్రలో అనేక సమస్యలున్నాయని... రాష్ట్ర విభజన తర్వాత ఈ మూడు జిల్లాలు అభివృద్ధిలో మరింత వెనుకబడ్డాయని అజ శర్మ అన్నారు. 
బరిలో దిగని వైసీపీ
కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా యడ్ల ఆదిరాజు  పోటీలో నిలబడ్డారు.  వైసీపీ నుంచి ఇంతవరకూ ఎవరూ పోటీలో నిలబడతారు అనే విషయం చర్చకు రాలేదు. అయితే తమ క్యాడర్‌ నుంచి ఇతర  అభ్యర్థికి మద్దతు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. వీరితో పాటు లీడర్‌ దినపత్రిక ఎడిటర్‌ రమణమూర్తి స్వతంత్ర  అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 
టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై సందిగ్ధత
టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. గత రెండు ఎన్నికల్లో ఈ పార్టీలు తమ తరపున అభ్యర్థులను బరిలో దించలేదు. ఈసారి మాత్రం అభ్యర్థిని  ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇప్పటి వరకూ తమ అభ్యర్థి ఎవరనేది టీడీపీ, బీజేపీ నేతలు ప్రకటించలేదు. అయితే ఎమ్మెల్సీగా  రామకోటయ్య, మాధవ్‌ లాంటి  బీజేపీ నేతలు పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారు. దీంతో బీజేపీకే  ఎమ్మెల్సీ సీటు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల  ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఎవరికి వారు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

16:50 - February 8, 2017

'నాని' టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నాడు. వరుస సినిమాలతో దుమ్మురేపుతున్నాడు. ఒకే ఎడాది లో హ్యట్రిక్ హిట్స్ కొట్టిన హీరోగా సరికొత్త రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ పుల్ స్వీంగ్ లో ఉన్న ఈ హీరో దిల్ రాజు బ్యానర్ లో నటించిన 'నేను లోకల్' ఇటీవలే విడుదలై కలెక్షన్ల పరంగా దూసుకపోతోంది. సినిమా మాత్రం యావరేజ్ అని టాక్ తెచ్చుకుందని డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం ఎలాంటి నష్టం కలగలేదని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఫస్ట్ వారంలోనే రూ. 15 కోట్ల షేర్ రాబట్టినట్లు, చిన్న బడ్జెట్ తో రూపొందగా డిస్ట్రిబ్యూటర్లను మాత్రం సేఫ్ జోన్ లో పడేసింది. ‘భలే భలే మగాడివోయ్' తరువాత సెకండ్ మిలియన్ మార్క్ అందుకొనేందుకు 'నేను లోకల్' కొద్ది దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. తనకంటూ టాలీవుడ్ లో మినిమం మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నాడు. త్వరలో సినిమాలు విడుదలైన కలెక్షన్ల పరంగా 'నేను లోకల్' కు ఎలాంటి ఇబ్బంది ఉండదని టాలీవుడ్ టాక్.
'నాని' 'కృష్ణగాడి ప్రేమగాథ’, 'జెంటిల్ మేన్’, 'మజ్ను' లతో మూడు హిట్లు అందుకున్నాడు. ఒక్క సినిమాను రిలీజ్ చేయడానికే నేటి హీరోలు చాలా కష్టపడుతున్నారు. కానీ నాని మాత్రం నాన్ స్టాప్ గా సినిమాలు రిలీజ్ చేస్తూ ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. మూడు సినిమాలతో మూడు హిట్స్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు 'నేను లోకల్' కు వస్తున్న కలెక్షన్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నాడంట.

16:40 - February 8, 2017

ఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పారిశ్రామిక వేత్తలను మరోసారి నిరాశపరిచింది. త్రైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయాలేమీ తీసుకోలేదు. మార్కెట్లకు ఎలాంటి సర్ ప్రైజ్ లేకుండా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపోరేటు 6.25శాతంగా, రివర్స్ రెపో రేటును 5.75 శాతం ఉంచుతున్నట్టు పేర్కొంది. ఆర్‌బీఐ గవర్నర్‌ గా ఉర్జిత్‌ పటేల్‌  నేతృత్వంలో జరిగిన మూడో సమీక్ష సమావేశం. మెజారిటీ ప్రాతిపదికన రేట్ల నిర్ణయం తీసుకోడానికి  ఆరుగురు సభ్యులతో పరపతి విధాన కమిటీ ఏర్పడిన తరువాత ఇది మూడో సమావేశం. మరోవైపు వారంలో నగదు విత్ డ్రా పరిమితిని 50వేలకు పెంచుతూ ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

 

16:38 - February 8, 2017

ఇంట్లో వంట చేసే సమయం...లేదా ఇతరత్రా పనులు చేసే సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే పనులు తొందరగా అవడమే కాకుండా కొన్ని లాభాలు కలిగే అవకాశాలున్నాయి. మరి ఆ చిట్కాలు ఏంటో చూడండి...

 • వంట చేసే సమయంలో నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి చల్లాలి. ఇది నూనెను త్వరగా పీల్చేస్తుంది.
 • గుడ్లు ఉడకపెట్టిన తరువాత వాటి పెంకులు తీసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో కొంచెం ఉప్పు వేసి ఉడకనివ్వడం వల్ల పెంకులు త్వరగా వచ్చేస్తాయి.
 • పట్టుచీరలు ఉతికేటప్పుడు బకెట్‌లో కొంచెం నిమ్మరసం వేయడంవల్ల రంగు పోవు.
 • వంకాయ ముక్కలు కోయగానే వెంటనే నల్లబడుతుంటాయి. ఇలా నల్లగా ఏర్పడకుండా ఉండాలంటే ఒక స్పూన్ పాలు వేయాలి.
 • పసుపు నీటితో వంటగదిని శుభ్రం చేయడం వల్ల ఈగలు దరి చేరవు.
 • క్యాబేజీని ఉడికించే సమయంలో వాసన వస్తుంటుంది. వాసన రాకుండా ఉండాలంటే చిన్నం అల్లం ముక్క వేసి తేడాను గమనించండి.
16:35 - February 8, 2017

గుంటూరు : జిల్లాలోని తెనాలి మండలం కటెవరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీశ్రీ అనే వ్యక్తిని ఆర్మీ జవాను వెంకట్‌రెడ్డి హత్య చేశాడు. ఈ హత్య వెనకాల పొలం వివాదాలే కారణమని తెలుస్తోంది. 

16:32 - February 8, 2017

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కాటమరాయుడు' టీజర్ యూ ట్యూబ్ లో సంచనాలు నమోదు చేస్తోంది. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే అధికంగా టీజర్ ను తిలకించి రికార్డులు సృష్టిస్తోంది. 57 గంటల్లో 50 లక్షలకు పైగా వ్యూస్ సాధించి టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. చివరి దశలో షూటింగ్ ఉన్నట్లు టాక్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 'కాటమరాయుడు' సినిమాలో పాట అంటూ ఓ నెట్లో సందడి చేస్తోంది. సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ అని వార్తలు వెలువడుతున్నాయి. 'పవన్' ఇమేజ్ కు తగినట్లుగా పాటను రూపొందించారు. కానీ ఈ పాట చిత్రంలోనిది కాదని...ఆయన అభిమానులే రూపొందించారనే మరో టాక్ వినిపిస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ‘డాలీ' దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'పవన్' సరసన 'శృతి హసన్' హీరోయిన్ గా నటిస్తోంది.

16:31 - February 8, 2017

పశ్చిమగోదావరి : అక్రమ చెరువులకు ఇష్టానుసారం అనుమతులిస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. అక్రమంగా తవ్వుతున్న చేపల చెరువులకు వ్యతిరేకంగా ఏలూరు కలెక్టరేట్‌ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. అనుమతులిస్తున్న అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కరించకపోతే  మే నెలలో చెరువుల ధ్వంసం కార్యక్రమాన్ని చేపడాతమని హెచ్చరించారు.

 

16:17 - February 8, 2017

వరంగల్‌ : నిరుద్యోగుల సమస్యలపై 22న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ చేపడుతామని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్ తెలిపారు. ఈ మేరకు కోదండరామ్‌ 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. గురుకుల పోస్టులకు సంబంధించి 60 శాతం మార్కుల నిబంధనపై టీఎస్పీఎస్‌కి వినతిపత్రం ఇస్తామన్నారు. ఉద్యమంలో పోరాడిన వారిపై కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. 

కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం..

హైదరాబాద్ : జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో బోర్డు ఛైర్మన్ హల్దర్ నేతృత్వంలో కొనసాగుతోంది.

అబ్బన్న కాలనీలో వ్యక్తి అఘాయిత్యం..

తిరుపతి : అబ్బన్న కాలనీలో ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్య..కూతురిని కత్తితో పొడిచిన భర్త గొంతుకోసుకున్నాడు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా కూతురు..భార్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను రుయా ఆసుపత్రికి తరలించారు.

16:05 - February 8, 2017

చెన్నై : అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా తన పేరు ప్రకటించిన పన్నీర్‌సెల్వం..48 గంటల్లోపే మాట మార్చారని పార్టీనేత శశికళ విమర్శించారు. పన్నీర్‌ సెల్వం వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారో ప్రజలు గమనించాలని సూచించారు. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో శశికళ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 131 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శశికళ..పన్నీరు సెల్వం టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే వ్యతిరేకశక్తులతో పన్నీరు సెల్వం చేతులు కలిపారని శశికళ విమర్శించారు. అన్నాడీఎంకేను ఏ శక్తి విడదీయలేదని..ఇన్నాళ్లు జయలలిత కోసం జీవించానని..ఇకనుంచి అమ్మ ఆశయాల కోసం జీవిస్తానని శశికళ అన్నారు. ఈ విషయంలో వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పార్టీలో మోసం వారిని ఖచ్చితంగా గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని శశికళ స్పష్టం చేశారు. 

 

శశికళకు సీఎం అయ్యే అర్హత ఉందా - గౌతమి..

చెన్నై : శశికళకు సీఎం అయ్యే అర్హతలున్నాయా ? అని సినీ నటీ గౌతమి ప్రశ్నించారు. శశికళకు మద్దతు పలుకుతున్న వారంతా ఎన్నికలకు వెళ్లగలరా ? ప్రజా తీర్పు కోరగలరా ? అంటూ ప్రశ్నలు కురిపించారు. బలవంతంగా రాజీనామా చేయించారని సీఎం చెబుతుంటే ఎన్ని కుట్రలు జరిగాయో ఊహిస్తే ఆందోళన కలుగుతోందని, జయలలిత మరణం వెనుక నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తూ ఎమ్మెల్యేలే కొన్ని విషయాలు బయటపెడుతున్నారని, వాటిని ఎందుకు నమ్మకూడదో నిందితులు చెప్పాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. జయలలిత స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని స్పష్టం చేశారు.

మొదలైన క్యాంపు రాజకీయాలు..

చెన్నై : అన్నాడీఎంకేలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలను శశికళ వర్గం బస్సుల్లో గుర్తు తెలియని ప్రాంతానికి తరలించింది.

 

సీఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్ష..

గుంటూరు : సీఆర్డీఏ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. భూ సమీకరణ ద్వారా సేకరించిన స్థలాలకు లే అవుట్లను 3 దశల్లో అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బాండ్ల జారీ వంటి మార్గాల్లో నిధులు సేకరించాలని, తొలి విడతగా రూ. వేయి కోట్లకు బాండ్లు జారీ చేయాలన్నారు. మౌలిక వసతుల కల్పనకు త్వరలో టెండర్లు పిలవాలని సూచించారు.

జగ్జీవన్ రాం భవన్, కొమరం భీం భవన నిర్మాణాలపై కేసీఆర్ ఆదేశాలు..

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో బాబు జగ్జీవన్ రాం భవన్, కొమరం భీం భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు అనుమతి నేపథ్యంలో టెండర్లు పిలవాలని ఆదేశించారు. బాబు జగ్జీవన్ రాం (ఎస్సీ), కొమరం భీం (ఆదివాసీ) భవన్ లకు ఎకరం (ఒక్కో భవనం) చొప్పున మూడు ఎకరాల స్థలం కేటాయించారు.

ఏటీఎంలో నగదు విత్ డ్రా ఆంక్షలు ఎత్తివేత..

హైదరాబాద్ : ఏటీఎంలో నగదు విత్ డ్రా ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. సేవింగ్ ఖాతా నుండి ఈనెల 20 నుండి విత్ డ్రా పరిమితి రూ. 24వేల నుండి రూ. 50వేలకు పెంచారు. మార్చి 13 నుండి నగదు విత్ డ్రా పరిమితిని పూర్తిగా ఎత్తివేయనున్నట్లు వెల్లడించింది.

ద్రవ్యపరపతి విధానంపై ఆర్బీఐ సమీక్ష..

ముంబై : ద్రవ్యపరపతి విధానంపై ఆర్బీఐ సమీక్ష జరిపింది. కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉండనున్నట్లు, రెపో రేటు 6.25 శాతం యథాతథంగా వెల్లడించింది. రివర్స్ రెపో రేటు 5.75 శాతం యథాతథంగా పేర్కొంది. 2016-17 లో వృద్ధి రేటు 6.9 శాతం ఉంటుందని, 2017-18లో వృద్ధి రేటు 7.4 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.

కీలక వడ్డీ రేట్లు యథాతథం - ఆర్బీఐ..

ముంబై : కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉండనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. రివర్స్ రెపో రేటు 5.75 శాతం యథాతథంగా ఉండనుంది.

14:43 - February 8, 2017

బాలీవుడ్ నటుడు 'సంజయ్ దత్' కోసం 'రణబీర్' బరువు పెరగడం ఏంటీ ? సంజయ్ ఏమన్నా బరువు పెరగాలని సూచించాడా ? అని అనుకుంటున్నారా ? అదేమీ కాదు...సినిమాల్లో పాత్రకు అనుగుణంగా నటీ నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బయోపిక్ చిత్రాల విషయానికి వచ్చే సరికి హీరోలు సాహసాలు చేస్తుంటారు. ఇటీవలే బాలీవుడ్ లో పలు బయోపిక్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో 'అమీర్'..’సల్మాన్ ఖాన్' లు పలు ప్రయోగాలు చేశారు. తాజాగా 'సంజయ్ దత్' బయోపిక్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ‘సంజయ్' పాత్రను 'రణబీర్' పోషిస్తున్నాడు. ఇందు కోసం ఏకంగా 13 కిలోల బరువు పెరిగాడు. పాత్ర పోషణ కోసం బరువు పెరగడాలు..తగ్గాడాలు కామన్ అయిపోయింది. ఈ సినిమా షూటింగ్ జనవరి 17వ తేదీన మొదలైంది. సునీల్ దత్ పాత్రను పరేష్ రావల్ పోషిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల కోసం అనుష్క శర్మ, సోనమ్ కపూర్ లు ఎంపికైనట్లు తెలుస్తోంది.

బాలికా విద్యాభివృద్ది అధ్యయనానికి కమిటీ..

ఢిల్లీ : దేశంలో బాలికా విద్యాభివృద్ధి అధ్యయనానికి తెలంగాణ డిప్యూటి సీఎం కడియం అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కమిటీని నియమించింది. సభ్యులుగా అస్సాం మంత్రి హేమంత బిస్వా శర్మ, ఝార్ఖండ్ మంత్రి నీర్ యాదవ్, సభ్య కార్యదర్శిగా మంత్రిత్వ శాఖ డిప్యూటి సెక్రటరీ రీనారాయ్ లను నియమించింది. కమిటీకి ఏడాది కాలం కాల పరిమితిని నిర్ణయించింది.

 

నిర్ణయం తీసుకోని తమిళనాడు గవర్నర్..

ముంబై : చెన్నై పర్యటనపై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పోటాపోటీగా శశికళ, పన్నీర్ సెల్వంలు మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి పలు విమర్శలు..ఆరోపణలు చేసుకున్నారు..

నీలోఫర్ ఘటనపై విచారణ - రాహుల్ బొజ్జా...

హైదరాబాద్ : నీలోఫర్ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు కలెక్టర్ రాహుల్ బొజ్జా వెల్లడించారు. సూపరింటెండెంట్, ఇతర ఆసుపత్రి వర్గాలతో చర్చించడం జరిగిందని, మృతి చెందిన ఐదుగురు మహిళల కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు సేకరిస్తామని పేర్కొన్నారు. మహిళలకు అందించిన చికిత్స రిపోర్టులు వచ్చిన తరువాత పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు.

 

బీఈడీ విద్యార్థుల ఆందోళన..

హైదరాబాద్ : టీఎస్ పి ఎస్సీ ఎదుట బీఈడీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గురుకుల నోటిఫికేషన్ లో విద్యార్హత మార్పుపై నిరసన వ్యక్తం చేశారు.

యూపీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో..

ఉత్తర్ ప్రదేశ్ : యూపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. ఈ మేనిఫెస్టోలో పలు వరాలు కురిపించారు. రైతుల కరెంటు బిల్లులు 50 శాతం తగ్గిస్తామని..పంచాయతీల్లో మహిళలకు 50 రిజర్వేషన్లు కల్పిస్తామని.. 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేస్తామని వెల్లడించింది.

 

13:38 - February 8, 2017

హైదరాబాద్: మెయిటెన్స్ యాక్ట్ అంటే ఏమిటి? ఈ చట్టం ఎప్పుడు వచ్చింది. మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు? అంశాలపై న్యాయ సలహాలు, సందేహాలపై మానవి 'వేదిక'లో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

130 మంది ఎమ్మెల్యేల మద్దతుంది - శశికళ..

చెన్నై : 130 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని శశికళ పేర్కొన్నారు. అన్నాడీఎంకేను ఎవరూ చీల్చలేరని, విరోధులు, ద్రోహులు కలిసివచ్చినా వారిని ఎదుర్కొంటామన్నారు. ప్రతిపక్షంతో కలిసి పన్నీర్ సెల్వం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత సంక్షోభంలో డీఎంకే హస్తం ఉందని ఆరోపించారు. ఈ విషయంలో రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకోవావలన్నారు. 48గంటల్లోనే పన్నీర్ సెల్వం మాట మార్చారని, ఆయన వెనుక ఎవరున్నారో ప్రజలే గమనించాలన్నారు. ఎన్నో తప్ర్పులు చేసినా సెల్వంకు అమ్మ మరో అవకాశం ఇచ్చారని, తాను కూడా ఆయనకు ఓ అవకాశం ఇచ్చి చూడడం జరిగిందన్నారు.

13:34 - February 8, 2017

తమిళనాడు : త‌న‌కు 130 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌ని శశికళ తెలిపారు. చెన్నైలోని అన్నాడీఎంకే ప్ర‌ధాన‌కార్యాల‌యంలో శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ స‌మ‌క్షంలో నిర్వ‌హించిన ఎమ్మెల్యేల స‌మావేశం ముగిసింది. ఈ సంద‌ర్భంగా శ‌శిక‌ళ మీడియాతో మాట్లాడుతూ... అన్నాడీఎంకేను ఏ శ‌క్తీ విడ‌దీయ‌లేదని వ్యాఖ్యానించారు. పన్నీర్ సెల్వం24 గంటల్లో మాట మార్చారని, పార్టీని చీల్చాల‌ని కొంద‌రు కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. జ‌య‌ల‌లిత బాట‌లోనే తాము అంద‌రం న‌డుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆమె ఆశ‌యాల‌ను నెర‌వేరుస్తామ‌ని చెప్పారు. పన్నీర్ సెల్వం ఎవరు వున్నారో ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

వెంకయ్యను కలిసిన టి.టిడిపి నేతలు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని టి.టిడిపి నేతలు కలిశారు. కేంద్రం ఇచ్చే ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇవ్వడం లేదని టి.టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. వెంకయ్యను కలిసిన వారిలో రమణ, రేవంత్, రావులలున్నారు. 

మా వెనుక అమ్మ శక్తి - శశికళ..

చెన్నై : తమిళనాట రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కాసేపటి క్రితం మీడియాతో శశికల మాట్లాడారు. పన్నీర్ సెల్వం మాటలను ఎవరూ నమ్మరని, 48గంటల్లోనే సెల్వం మాట మార్చారని పేర్కొన్నారు. డీఎంకేతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని అర్థమౌతోందన్నారు. అమ్మ ఆశయాల సాధనకు కట్టుబడి ఉన్నామని, మోసగాళ్లను గుర్తించాలని సూచించారు. 

13:18 - February 8, 2017
13:17 - February 8, 2017

డీమానిటైజేషన్ బిల్లుకు ఆమోదం..

ఢిల్లీ : డీమానిటైజేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. రూ. 500, రూ. 1000 పది కన్నా ఎక్కువగా ఉంటే రూ. 10వేల జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

 

డీమానిటైజేషన్ బిల్లుకు ఆమోదం..

ఢిల్లీ : డీమానిటైజేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. రూ. 500, రూ. 1000 పది కన్నా ఎక్కువగా ఉంటే రూ. 10వేల జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

 

12:56 - February 8, 2017

యూపీ :సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ అలయన్స్, బిజెపి, బిఎస్పీ మధ్య త్రిముఖ పోటీ జరుగుతున్న ఉత్తరప్రదేశ్ లో 30శాతం ఓట్లతో అధికారం సాధించే అవకాశం వుంది. 2007, 2012 అసెంబ్లీ ఎన్నికలలో మాయావతి, అఖిలేష్ యాదవ్ 30శాతం ఓట్లు సాధించి అధికారంలోకి రావడం విశేషం. 2014 లోక్ సభ ఎన్నికల్లో 71 ఎంపి స్థానాలు గెలుచుకుని ఔరా అనిపించిన బిజెపి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా శ్రమిస్తోంది.

బలహీన పార్టీ కాంగ్రెస్..

కాంగ్రెస్ అఖిలేష్ పొత్తు బిజెపిని తీవ్రంగా కలవరపెడుతోంది. నిజానికి ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ చాలా బలహీన పార్టీ. 1989లో ఉత్తరప్రదేశ్ లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఇక ఆ తర్వాత కోలుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పట్టణప్రాంతాల్లో ఫర్వాలేదనిపిస్తోంది. బిజెపికి బలంగా వున్నదీ పట్టణాల్లోనే. కమలనాధులకు అచ్చేదిన్ లేని రోజుల్లోనూ అత్యధిక మున్సిపాల్టీలను గెల్చుకున్న చరిత్ర బిజెపికి వుంది. కాంగ్రెస్ అఖిలేష్ పొత్తుతో చాలా పట్టణ నియోజకవర్గాల్లో బిజెపి విజయావకాశాలు దెబ్బతింటున్నాయి.

పట్టణ ప్రాంత ఎంపి స్థానాల్లో కాంగ్రెస్ రెండో స్థానం...

మోడీ గాలి బలంగా వీచిన 2014 లోక్ సభ ఎన్నికల్లో పట్టణ ప్రాంత ఎంపి స్థానాల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో వుండడం విశేషం. అందుకే కాంగ్రెస్ కి 103 స్థానాలిచ్చేందుకు అఖిలేష్ సిద్ధమయ్యారు. వీటిలో కాంగ్రెస్ 40 స్థానాల మీద గట్టిగా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 11న తొలి విడత పోలింగ్ జరిగే పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని 73 స్థానాలు సమాజ్ వాదీకి అత్యంత కీలకం. అఖిలేష్ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిచి తీరాలి. ముస్లింలు ఎక్కువగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ తో పొత్తు లాభిస్తుందన్న అంచనాతో అఖిలేష్ వున్నారు. ఉత్తరప్రదేశ్ లో ముస్లింలు 17శాతం వుండగా, 70 అసెంబ్లీ స్థానాల్లో 30శాతం కంటే ఎక్కువ మంది వుండడం విశేషం. మరో 70 స్థానాల్లో 20శాతానికి మించి వుంటారు. కాంగ్రెస్ ఎస్పీ పొత్తు ముస్లిం ప్రాబల్యం వున్న వంద స్థానాల్లో బిఎస్పీ, బిజెపి విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న అంచనాలున్నాయి. అయితే, మాయావతి కూడా వ్యూహాత్మకంగా ముస్లింలకు భారీగా టిక్కెట్లిచ్చారు. కాంగ్రెస్, బిఎస్పీ మధ్య ముస్లిం ఓట్లు చీలిపోతే, బిజెపి లాభపడే అవకాశాలూ లేకపోలేదు.

బిజెపి అధిష్టానం టిక్కెట్లు కేటాయించిన తీరు అసంతృప్తులు ..

బిజెపి అధిష్టానం టిక్కెట్లు కేటాయించిన తీరు అసంతృప్తులు రాజేసింది. దాదాపు వంద నియోజకవర్గాల్లో బిజెపికి అసంతృప్తి ప్రధాన సమస్యగా మారింది. కొత్తగా పార్టీలోకి చేరినవారికి 80 స్థానాల్లో టిక్కెట్లిచారు. ఇది పాతకాపుల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. మరో 20 చోట్ల కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోకపోతే, 2019 లో టిక్కెట్లిచ్చేది లేదంటూ ఎంపిలను పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

జాట్ లలో పెరిగిన వ్యతిరేకత...

బిజెపిని కలవరపెడుతున్న మరో అంశం జాట్ లలో పెరిగిన వ్యతిరేకత. నిజానికి 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి రికార్డు స్థాయి సీట్లు రావడానికి కారణం జాట్లు. 70 అసెంబ్లీ స్థానాల్లో జాట్ల ప్రాబల్యం ఎక్కువ. రిజర్వేషన్లు, బడ్జె ట్ లో ప్రోత్సాహకాలు కల్పించకపోవడంతో జాట్లు బిజెపి పట్ల గుర్రుగా వున్నారు. బిజెపికి సంప్రదాయ మద్దతుదారులైన బనియాలు నోట్ల రద్దు తర్వాత వ్యతిరేకంగా మారినట్టు కనిపిస్తోంది.

ఉత్తరప్రదేశ్ గ్రామీణ రాజకీయాల్లో కులాలు ప్రధాన పాత్ర ...

ఉత్తరప్రదేశ్ గ్రామీణ రాజకీయాల్లో కులాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అగ్రవర్ణాలు 22శాతం వుండగా, ఎస్సీ ఎస్టీలు 20శాతం మంది, బిసిలు 40శాతం మంది వుంటారు. బిసిలలో యాదవులు 8శాతంకాగా, 32శాతం మంది యాదవేతరులుంటారు. సమాజ్ వాదీ పార్టీకి యాదవుల మీద తిరుగులేని పట్టు వుంటే, బిజెపి యాదవేతర బీసీలలో 14శాతం మంది మద్దతు లభిస్తోంది.

ఓబీసీల ఓట్లను..

ఓబీసీల ఓట్లను సమాజ్ వాదీ పార్టీ, బిజెపి పంచుకుంటుండగా, ఎస్సీ ఎస్టీ ఓట్లను కాంగ్రెస్, బిఎస్పీ, బిజెపి పంచుకుంటున్నాయి. అగ్రవర్ణాలు బిజెపికి సంప్రదాయ మద్దతుదారులు కాగా, కొన్ని చోట్ల బిఎస్పీ చీల్చుకుంటోంది. ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ ఎస్పీ అలయెన్స్ వైపు మొగ్గుతారా? బిఎస్పీకి జై కొడతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిలంతా ఏదో ఒక పార్టీ వైపు ఏకపక్షంగా మొగ్గే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

12:47 - February 8, 2017

విజయవాడ: నగరంలోని బందరు రోడ్‌లో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని రూ.50 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. నిధుల విడుదలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బహుళ క్రీడలకు వేదికగా దీనిని రూపుదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ స్టేడియం అభివృద్ధి పనులపై దృష్టిసారించారు. హాకీ, ఫుట్ బాల్, రన్నింగ్, కబడ్డీ , క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు అనుగుణంగా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్చి నెలలో నిర్వహించే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ను దృష్టిలో పెట్టుకుని స్టేడియం పనులను నిర్వహిస్తున్నారు. కన్సార్టియం ఆఫ్ కాలేజ్ డిజైన్స్ అండ్ ప్రాజ్ కన్సల్టెన్స్‌ ఆధ్వర్యంలో డీపీఆర్వోను తయారు చేస్తున్నారు.

రెండు ఫేజ్‌లుగా పనుల నిర్వహణ....

స్టేడియం పనులను ఫేజ్-1, 2గా విభజించి... మొదటి ఫేజ్ పనులకు రూ.11 కోట్లను, రెండోదశ పనుల నిమిత్తం రూ.39 కోట్లను కేటాయిస్తున్నారు. మొదటి ఫేజ్ పనులు వారంలోగా ప్రారంభించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. 'డే అండ్ నైట్' మ్యాచ్‌లకు అనుగుణంగా ఆరు కోట్లతో హెచ్‌డీ క్వాలిటీ ఉన్న ఫ్లడ్ లైట్లు, గ్యాలరీలో సీట్లు, రూఫ్ ఏర్పాటు చేయనున్నారు. 1.5 సెంటీమీటర్ ఎత్తు ఉండేలా స్టేడియంలో గడ్డిని పెంచనున్నారు. అలాగే మీడియా గ్యాలరీ, వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబోతున్నారు.

క్రీడాకారులకు అనుగుణంగా సింథటిక్‌ ట్రాక్‌......

క్రీడాకారులకు అనుగుణంగా ఉండే సింథటిక్ ట్రాక్.. సెల్లార్ పార్కింగ్‌తో కలిపి ఐదంతస్తుల నూతన భవనాన్ని నిర్మించనున్నారు. మొదటి మూడంతస్తులను కమర్షియల్ గా కేటాయించి, నాలుగో అంతస్తులో స్పోర్ట్స్ క్లబ్, ఐదో అంతస్తును బహుళ క్రీడలకు కేటాయించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వర్షం కారణంగా అవాంతరాలు ఏర్పడినా 'పిచ్'పై నీళ్లు నిలబడకుండా చర్యలు చేపడుతున్నారు. ప్లేయర్స్ ఫుడ్ కోర్టు, లాంజ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు స్టేడియాన్ని విజయవాడ మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ పరిశీలించారు. వేగంగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరిగితే ప్రపంచస్థాయిలో బెజవాడ కీర్తి ప్రతిష్టలు రెట్టింపవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పాలిటెక్నిక్ విద్యార్థిపై కారు డ్రైవర్ అత్యాచారం..

హైదరాబాద్ : హుమాయిన్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయనగర్ కాలనీలో పాలిటెక్నిక్ విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి కారు డ్రైవర్ లక్ష్మణ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు లక్ష్మణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మణ్ పై ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ పీఎస్ లలో కేసులున్నట్లు తెలుస్తోంది. 

12:38 - February 8, 2017

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బడిబాట పట్టింది. విద్యా ప్రమాణాలను పెంచేందుకు వ్యూహాలు రచిస్తోంది. పాఠశాల విద్యను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటోంది.

ప్రభుత్వ విద్యను కాపాడేందుకు పాలకుల కృషి....

ప్రభుత్వ విద్యను కాపాడేందుకు పాలకులు నడుం బిగించారు. అధికారికంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు. ఎప్పుడూ జూన్‌ 12న ప్రారంభమయ్యే పాఠశాలలు మార్చి 21 నుంచే ప్రారంభించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటి అయ్యి 2017-18 విద్యా సంవత్సరానికి డ్రాఫ్ట్‌ను తయారు చేశారు. అయితే దీనిపై తొమ్మిదో తేదీలోపు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను.. సూచనలు అందజేయాల్సిందిగా ప్రభుత్వం సూచించింది.

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే చర్యలు.....

ఈ ఏడాది ఎలాగైనా విద్యార్థుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అధికారులు ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా రెండు విడతలుగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మార్చి 21 నుంచి 28 వరకు మొదటి విడత, జూన్‌ 1 నుంచి జూన్‌ 9 వరకు రెండో విడత బడిబాటను నిర్వహించనున్నారు. అంతేకాకుండా మార్చి 24న అన్ని పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమానికి ప్రతిపాదనలు చేయబోతున్నారు. మళ్లీ ఏప్రిల్‌ 23 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించి.. జూన్‌ 12న పునఃప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటుంది.

ప్రభుత్వ పాఠశాలలవైపు ఆకర్షించేందుకు కొత్త కార్యక్రమాలు...

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలవైపు ఆకర్షించేందుకు విద్యా శాఖ కొత్తకొత్త కార్యక్రమాలను రూపొందించనుంది. మార్చి21 నుంచి రెగ్యులర్‌ పాఠాలు కాకుండా విద్యార్థులకు వివిధ అంశాల్లో మెలకువలను నేర్పించాలని అనుకుంటోంది. విద్యార్థుల చేతిరాతపై దృష్టి సారించనుంది. ఆటలు, ఆర్ట్‌, క్రాఫ్ట్ క్లాస్‌లను నిర్వహించనుంది. అలాగే ఏడాది సకాలంలో పుస్తకాలు అందించే ఏర్పాట్లు చేస్తుంది.

ముగిసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీ..

చెన్నై : అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. కాసేపట్లో శశికళ మీడియా ముందుకు రానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. 

12:36 - February 8, 2017

చెన్నై: ఎన్నికలకమిషన్‌లో శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. ఆపద్ధర్మ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియ ద్వారానే ప్రధాన కార్యదర్శి నియామకం జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. అన్నాడీఎంకే నియమావళిలో ఆపద్ధర్మ ప్రధాన కార్యదర్శి పదవి లేదని తెలిపింది.

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన..

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వార్డుల్లో మంత్రి కేటీఆర్ అకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వార్డుల్లో సమస్యలను స్థానికులు మంత్రి వాట్సప్ కు పంపడంతో స్పందించి వార్డులను మంత్రి కేటీఆర్ సందర్శిస్తున్నారు. 

12:34 - February 8, 2017

కృష్ణా : జిల్లా జి కొండూరు మండలం కంభంపాడులో విషాదం చోటుచేసుకుంది. గత నెల 26న మధర్‌ థెరిసా అనాధాశ్రమంలో చదువుతున్న విద్యార్థి ప్రవీణ్‌పై హాస్టల్‌ వార్డెన్‌ పెట్రోల్‌ పోసిన నిప్పంటించిన ఘటనలో విద్యార్థి ప్రవీణ్‌ చికిత్స పొందుతూ మృతిచెందాడు. గత నెల 26న విద్యార్థి ప్రవీణ్‌పై వార్డెన్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో..ప్రవీణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే విద్యార్థి ప్రవీణ్‌ను చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రవీణ్‌ మృతిచెందాడు.

12:32 - February 8, 2017

చెన్నై: పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి 130 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పన్నీర్‌సెల్వం వద్ద తనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తిరుగుబావుటాతో అన్నాడీఎంకేలో చీలిక కనిపిస్తున్న సమయంలో శశికళ తన బలాన్ని నిరూపించుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. మరోవైపు శాసనసభ జరిగితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తనకే మద్దతు తెలుపుతారని పన్నీర్‌ సెల్వం చేసిన ప్రకటనతో శశికళ వర్గం కలవరపడుతోంది.

శశికళకు ఎదురు దెబ్బ..

చెన్నై : ఎన్నికల కమిషన్ లో శశికళకు ఎదురు దెబ్బ తగిలింది. అపద్దర్మ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ఈసీ వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ ద్వారానే ప్రధాన కార్యదర్శి నియామకం జరుగుతుందని, అన్నాడీఎంకే నియామవళిలో అపద్దర్మ ప్రధాన కార్యదర్శి పదవి లేదని పేర్కొంది. 

22న నిరసన ర్యాలీ - కోదండరాం

వరంగల్ : నిరుద్యోగుల సమస్యలపై 22న హైదరాబాద్ లో నిరసన ర్యాలీ జరుపనున్నట్లు జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. గురుకుల నోటిఫికేషన్ కు సంబంధించి 60 శాతం మార్కుల నిబంధనపై టీఎస్ పిఎస్పీకి వినతిపత్రం ఇస్తామన్నారు. లక్ష ఉద్యోగాల హామీపై ప్రభుత్వం ముందడుగు వేయలేదని, ఇప్పటి వరకు సరైన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 

మొదలైన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీ..

చెన్నై : ఏఐడీఎంకే ఆఫీసులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి శశికళ, 130 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పన్నీర్ సెల్వం తిరుగుబాటుపై చర్చిస్తున్నారు. 

11:55 - February 8, 2017

హైదరాబాద్: గత రెండు నెలలుగా చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ తను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సీఎం క్యాప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.

11:33 - February 8, 2017

హైదరాబాద్: తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వివాదాస్పద దర్శకుడు సోషల్ మీడియాలో స్పందించారు. పన్నీర్ ధిక్కారం వెనక మోదీ సర్కారు వ్యూహం ఉంది.. మోదీ అండతోనే పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు చెలరేగుతుండగానే..వర్మ ట్విట్టర్‌ ద్వారా మరో ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు.

11:27 - February 8, 2017

చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. మూడు రోజుల క్రితం గవర్నర్ కు ఇచ్చిన రాజీనామాను వెనక్కు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. అమ్మ తనను పార్టీ కోశాధికారిగా నియమించారని, ఇప్పుడున్నవారిలో తనను పదవికి దూరం చేసే ధైర్యం ఎవరికీ లేదని శశికళ పేరు చెప్పకుండానే పన్నీర్ సెల్వం నిప్పులు చెరిగారు. బీజేపీ తనను నడిపిస్తోందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. తనతో పాటు 7 కోట్ల మంది తమిళ ప్రజలకు అమ్మ మరణంపై అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిందేనని ఓ పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. అమ్మ మరణం పై పలు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమ్మ మృతి పై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పన్నీర్ కోరారు. అసెంబ్లీలో తన బలం నిరూపించుకుంటానని సెల్వం స్పష్టం చేశారు. ఎంజీఆర్, జయలలిత చేతుల్లో ఎదిగిన అన్నాడీఎంకే పార్టీని కాపాడుకునేందుకు ఎంతో మంది శ్రమిస్తున్నారని, వారిలో తానూ ఒకడినని పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. చేతనైతే పార్టీని విడదీసి చూపాలని శశికళకు ఆయన సవాల్ విసిరారు. జయలలిత మేనకోడలు, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనమైన దీపా జయకుమార్ మద్దతు తీసుకుంటానని పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్య చేశారు.

జగన్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ..

విజయవాడ : వైఎస్ జగన్ కు చెందిన ఆస్తులను ఈడీ సీజ్ చేశారు. గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని సరస్వతి పవర్ కు చెందిన 903 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. మనీలాండరింగ్ చట్టం కింద భూమిని స్వాధీనం చేసుకున్నట్లు పత్రికల్లో ప్రకటనలిచ్చారు. మాచవరం (మం) తంగెడ, వేవమరం, చెన్నాయపాలెంలో సర్వే నంబర్ల వారీగా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. 

మథర్ థెరిస్సా అనాథాశ్రమ విద్యార్థి మృతి..

కృష్ణా : కంభంపాడు మథర్ థెరిస్సా అనాథాశ్రమం విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెల 26వ తేదీన ప్రవీణ్ పై పెట్రోల్ పోసి అనాథాశ్రమం డైరెక్టర్ వెంకటేశ్వరరావు నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి వద్ద ప్రవీణ్ బంధువులు ఆందోళన చేపట్టారు. 

రాజీనామా ఉపసంహరణకు సిద్ధం - పన్నీర్..

చెన్నై : రాజీనామా ఉపసంహరణకు సిద్ధమని అపద్మర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. జయలలిత మృతిపై కొన్ని సందేహాలున్నాయని, అమ్మ పార్టీని రక్షించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అమ్మ తనను కోశాధికారిగా నియమించిందని, తనను తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. పార్టీకి ద్రోహం చేయలేదని, జయ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామన్నారు. 

రాజీనామా ఉపసంహరణకు సిద్ధం - పన్నీర్..

చెన్నై : రాజీనామా ఉపసంహరణకు సిద్ధమని అపద్మర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. జయలలిత మృతిపై కొన్ని సందేహాలున్నాయని, అమ్మ పార్టీని రక్షించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అమ్మ తనను కోశాధికారిగా నియమించిందని, తనను తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. పార్టీకి ద్రోహం చేయలేదని, జయ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామన్నారు. 

10:21 - February 8, 2017

తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్ చల్..

చిత్తూరు : తిరుమలలో మత్తిస్థిమితం లేని వ్యక్తి హాల్ చల్ చేశాడు. శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో భక్తులపై దాడికి ప్రయత్నించాడు. భయంతో భక్తులు పరుగులు తీశారు. వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

సీపీఎం మహాజన పాదయాత్ర 115వ రోజు..

భద్రాద్రి కొత్తగూడెం : సీపీఎం మహాజన పాదయాత్ర 115వ రోజుకు చేరుకుంది. తుంగారం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. రాఘవాపురం, సుజాతనగర్, వేపలగడ్డ, సర్వారం, పోస్టాఫీస్ సెంటర్, సూపర్ బజార్, లక్ష్మీదేవిపల్లిలో పాదయాత్ర కొనసాగనుంది. 

సత్తా చూపిస్తానన్న పన్నీర్...

చెన్నై : శశికళపై పన్నీర్ సెల్వం ఆరోపణలు గుప్పించారు. తన సత్తా ఏంటో మరికొద్ది గంటల్లో చూపిస్తానని, ఇప్పటిదాక మాట్లాడింది పది శాతమేనని, ఇంకా 90 శాతం మిగిలి ఉందని వ్యాఖ్యానించారు. తనను అవమానించి రాజీనామా చేయించారని మరోసారి స్పష్టం చేశారు. అమ్మను ఆసుపత్రిలో ఒక్కసారి కూడా చూసే అవకాశం ఇవ్వలేదని, ఆమె దగ్గర శశికళ ఒక్కరే ఉన్నారని తెలిపారు. అన్నాడీఎంకే పార్టీకి, అమ్మకు నిజమైన విశ్వాస పాత్రుడిని నేనేనని పేర్కొన్నారు. వేరే పార్టీలో చేరే ఉద్ధేశ్యం లేదన్నారు. 

పన్నీర్ తో డీఎంకే దోస్తీ..!

చెన్నై : అన్నాడీఎంకే తిరుగుబాటు నేత పన్నీర్ సెల్వంతో డీఎంకే దోస్తి కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. చీలిక వస్తే సెల్వంకు మద్దతు ప్రకటించేందుకు డీఎంకే నిర్ణయం తీసుకుంది. తాజా రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు డీఎంకే నేతలు సమీక్షిస్తున్నారు. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 89 మంది, ఏఐడీఎంకే కు134 మంది, కాంగ్రెస్ కు 8 మంది, ఇతరులు ఇద్దరు సభ్యులున్నారు. అన్నాడీఎంకేలో చీలిక అనివార్యమని డీఎంకే నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీలో శశికళ బలనిరూపణ చేయాలని డీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు.

కాసేపట్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం..

చెన్నై : కాసేపట్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలు..పన్నీర్ సెల్వం తిరుగుబాటుపై చర్చ జరగనుంది. ప్రస్తుతం అన్నాడీఎంకేలో 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలంతా తనవైపే ఉన్నారని శశికళ పేర్కొంటున్నారు. పన్నీర్ సెల్వంను సమర్థించే వారిపై పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. బల ప్రదర్శనకు ఎమ్మెల్యేల సమావేశం కానుంది. 

09:48 - February 8, 2017

హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ ఛాంపియన్స్‌గా రంగారెడ్డి రైడర్స్‌ నిలిచారు. ఫైనల్లో గద్వాల గ్లాడియేటర్స్‌పై ఘన విజయం సాధించారు. గద్వాల జట్టు 17 పాయింట్లు సాధిస్తే.. రంగారెడ్డి రైడర్స్‌ 37 పాయింట్లతో అదరగొట్టారు. రంగారెడ్డి రైడర్‌కు చెందిన మునీష్‌ బెస్ట్‌ రైడర్‌ అవార్డ్‌ అందుకున్నారు. బెస్ట్‌ డిఫెండర్‌ అవార్డ్‌ నీలేష్‌కు దక్కింది.మొత్తం టోర్నమెంట్‌లో 107 పాయింట్లు సాధించిన గద్వాల గ్లాడియేటర్స్‌ టీంకు చెందిన మల్లికార్జున్‌కు బెస్ట్‌ రైడర్‌ అవార్డు వరించింది. రంగారెడ్డి రైడర్‌కు చెందిన అమీర్‌కు బెస్ట్‌ డిఫెండర్‌ ఆఫ్‌ టోర్నమెంట్‌ అవార్డు దక్కింది. అవార్డులను రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, వరంగల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ అందించారు.

09:47 - February 8, 2017

విజయవాడ : ఆధునికీకరణ పేరుతో దేశంలోని 27 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే బెజవాడ రైల్వేస్టేషన్ ముందు వరుసలో ఉంది. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను కార్పొరేట్ దిగ్గజాలకు అప్పగించనున్నారు. వీటికి సంబంధించి ప్రీ-టెండర్ బిడ్‌ను సికింద్రాబాద్‌లో నిర్వహిస్తారు.

డెవలపర్‌కు రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులు...

బెజవాడ రైల్వే స్టేషన్‌ను స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో ఒక డెవలపర్‌ను ఎంపిక చేసి.. రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులను అప్పగిస్తారు. ఈ మేరకు రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ ఫాం, సర్క్యులేటింగ్ ఏరియాతోపాటు, స్టేషన్ దగ్గరలోని తారాపేటవైపు ఉన్న కార్ పార్కింగ్ ఏరియా, తూర్పు ద్వారం వైపు ఉన్న పార్కింగ్‌ ప్రదేశాలు, సత్యనారాయణపురంలో ఉన్న రైల్వేస్థలాలను అప్పగిస్తారు. ఈ స్థలాల్లో డెవలపర్‌ మల్టీఫ్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, హోటళ్లు నిర్మిస్తారు. మిగిలిన స్థలాల్లో డెవలపర్స్‌ భవనాలు నిర్మించుకుని అద్దెలకు ఇస్తారు. 45 ఏళ్లపాటు స్టేషన్, రైల్వే స్థలాల్లో నిర్మించిన భవనాలు వారి ఆధీనంలోనే ఉంటాయి. అయితే టెండర్లు పిలిచి వారి టెక్నికల్‌, ఫైనాన్షియల్ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌లను రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలించిన తర్వాత డెవలపర్‌ను ఎంపిక చేస్తారు.

కేంద్రం నిర్ణయంపై ప్రజా సంఘాల ఆగ్రహం....

అయితే రైల్వే స్టేషన్‌ పనులను బహుళజాతి సంస్థలకు అప్పగించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌ పరం చేయడానికే కేంద్రం ప్రయత్నిస్తోందని ఆక్షేపిస్తున్నారు. 45 ఏళ్ల పాటు స్థలాలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తే శాశ్వతంగా ఇచ్చినట్టేనని... రైల్వే ఆస్తుల్ని..ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడంలో భాగంగానే స్విస్ ఛాలెంజ్ పద్ధతిని తెరపైకి తెచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం 250 రైళ్ల రాకపోకలతో, 70 లక్షల రూపాయల ఆదాయం వచ్చే విజయవాడ రైల్వేస్టేషన్‌ను కార్పొరేట్‌కు అప్పగించడం సరికాదనే వాదన బలంగానే విపిస్తోంది.

09:44 - February 8, 2017

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో గత కొంత కాలంగా అంతే అవగాహానతో కలిసి ఉంటోంది. రాష్ట్ర బీజేపీ నేతలతో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకుంటోంది. కానీ ఈ నాలుగైదు రోజుల్లోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వం గులాబీ పార్టీకి మధ్య అగాధం ఏర్పడింది. దీనికి రాష్ట్ర బీజేపీ నేతలే కారణమన్న అనుమానాలు అధికార పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి.

ప్రధాని తీసుకున్న పలు నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు...

కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకపోయినా ప్రధాని తీసుకున్న పలు నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం కేంద్రం వైఖరితో ఒక్క సారిగా రూట్ మార్చింది. తమ ఉద్యమ పంథానే కొనసాగిస్తామన్న సంకేతాలను ఇస్తోంది. తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఏం చేసిందని పార్లమెంట్ లో గళం విప్పింది. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను కూడా ఇప్పటికీ అమలు చేయకుండా తాత్సారం చేస్తోందన్న విమర్శలను టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం పై గులాబీ పార్టీ ఆగ్రహం...

గులాబీ పార్టీ ఆగ్రహనికి కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరే ప్రధాన కారణమని అధికార పార్టీ నేతలు చెప్పకనే చెబుతున్నారు. ప్రధాని మోడీని కలిసేందుకు సమయం కేటాయించినా అకస్మాత్తుగా రద్దు చేయడం గులాబీ పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఈ విషయాన్ని గులాబి దళపతి కూడా సీరియస్ గానే పరిగణిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేంద్రానికి అన్ని రకాలుగా మద్దుతు ఇచ్చినా కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదన్న సంకేతాలు టీఆర్‌ఎస్‌ నేతలు ఇస్తున్నారు. ప్రధా

09:41 - February 8, 2017

పెద్దపల్లి : జిల్లాలో దారుణం జరిగింది. సెంటినరీ కాలనీకి చెందిన ఓ యువతిపై గోదావరిఖనికి చెందిన రాకేశ్‌ అనే యువకుడు బ్లేడుతో దాడిచేశాడు. ఈ దాడిలో యువతి మణికట్టు దగ్గర గాయం అయ్యింది. తీవ్ర రక్తస్రావం కావడంతో..యువతిని గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. అమ్మాయిపై దాడి అనంతరం రాకేశ్‌కూడా తనను తాను గాయపరుచుకున్నాడు. యువతికి రెండురోజుల క్రితమే పెళ్లికుదరడంతో..రాకేశ్‌ ఈ దాడి చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన రాకేశ్‌ను రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

09:33 - February 8, 2017

కరివేపాకులు తినడం వల్ల కొన్ని పోషకాలు అందుతాయనే విషయం తెలిసిందే. తద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని తినడమే కాకుండా అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖానికి..తలకు పట్టించినా కూడా మంచిదే. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కరివేపాకు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.

 • ముఖ వర్ఛస్సును పెంచడమే కాకుండా జుట్టుకి మెరుపుదనాన్ని ఇస్తుంది.
 • మొటిమలు..ఇతరత్రా వల్ల ముఖంపై మచ్చలు ఏర్పడుతుంటాయి. దీనిని నుండి బయటపడాలంటే కరివేపాకులకు కొద్దిగా నీరు చేర్చి మెత్తగా పేస్టు చేయాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ విశ్రమాన్ని మొటిమలు..మచ్చలున్న చోట రాయాలి. మంచి ఫలితం ఉంటుంది.
 • పచ్చి కరివెపాకులను ముద్దలా చేసి అందులో పెరుగు కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. తరువాత షాంపుతో స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు బాధ కూడా తగ్గుతుంది.
 • కొబ్బరినూనెని గోరువెచ్చగా మరగబెట్టి అందులో కరివేపాకులు వేయాలి. తలస్నానం చేసే ముందు ఆ నూనె బాగా తలకి పట్టించి ఓ అరగంట తరవాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చిన్న తనంలో జుట్టు నెరిసిపోయే సమస్య తగ్గుతుంది.
 • కరివేపాకు పేస్టులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి మచ్చలున్న చోట రాయాలి. ఇలా తరచూ చేస్తే మచ్చలు తొలగిపోతాయి.
 • కరివేపాకు పేస్టులో ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి.
08:58 - February 8, 2017

బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా వెలిగిపోతోంది సుమ. ఎంతమంది కొత్త కొత్త యాంకర్స్ వస్తున్నా బుల్లితెరపై ఆమె స్టార్ డమ్ ఏమాత్రం తగ్గడం లేదు. పాపులర్ యాంకర్ గా కొనసాగుతున్న 'సుమ' ప్రముఖులు నటించిన చిత్ర ఆడియో..విజయోత్సవ వేడుకల్లో యాంకర్ గా కూడా సందడి చేస్తోంది. తన అందమైన నటనతో..చలాకీతనంతో ఈ కేరళ అమ్మాయి ఆకట్టుకొంటోంది. తన మాటలతో ఆకట్టుకొనే 'సుమ' పాటలతో కూడా ఆకట్టుకుంటానని అంటోదంట. తొలిసారిగా 'సుమ' పాట పాడింది. గోపిచంద్ మలినేని తీస్తున్న 'విన్నర్' సినిమాకు గాత్రం అందించింది. ఈ సినిమాలో 'సాయి ధరమ్ తేజ' హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హాట్ యాంకర్ గా పేరొందిన 'అనసూయ' ఈ చిత్రంలో ఓ పాటకు నర్తిస్తోంది. 'సుయ..సుయ' అనే పాటనే 'సుమ' పాడింది. ఈ సినిమాలోని పాటలను ఒక్కో స్టార్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటను మంగళవారం సంగీత దర్శకుడు అనిరుథ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు 'విన్నర్' రానుంది. 

08:56 - February 8, 2017

కొత్తగూడెం: సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంతో చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 114వ రోజుకు చేరింది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు నుంచి యాత్ర ప్రారంభమైంది. గిరిజన తండాలైన గుండెపూడి, రామచంద్రాపురం, అనంతారం, గాంధీనగర్‌ తండా, పోకలగూడెం, రావికంపాడు, చంద్రుగొండ, రేపల్లెవాడ, తుంగారంలో తమ్మినేని బృందం పర్యటించింది. గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో సీపీఎం మహాజన పాదయాత్రకు స్వాగతం పలికారు. స్థానిక కాంగ్రెస్ టీడీపీ నేతలు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

పొడుభూముల సమస్యల మీద పెద్ద ఎత్తున వినతులు...

114వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన తండాల్లో పర్యటించిన తమ్మినేని బృందానికి వినతులు వెల్లువెత్తాయి. పొడుభూముల సమస్యల మీద పెద్ద ఎత్తున వినతులు అందాయి. 50 ఏళ్లకు పైగా పోడు వ్యవసాయం చేస్తున్న పట్టాలివ్వడం లేదని ఆవేదన వెల్లిబుచ్చారు.

జనం కోసం పరిపాలన జరగడం లేదని.. కాంట్రాక్టర్లు, నాయకులు, అధికారుల కోసమే జరుగుతుందన్నారు. పొడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులను అడవినుంచి దూరం చేస్తే ఊరుకోమన్నారు తమ్మినేని వీరభద్రం. గిరిజనుల తరఫున తాము పోరాడుతామని హెచ్చరించారు.

ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకోవడం దారుణం..

పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను వారి భూముల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం, ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకోవడం దారుణమని పాదయాత్ర బృందం సభ్యులు ఆశయ్య ధ్వజమెత్తారు. అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లఘించి గిరిజనుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ సర్కార్‌ పేదల మీద నిర్బంధాన్ని కొనసాగిస్తూ అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. పోడు చేసుకుంటున్న గిరిజనులకు ప్రభుత్వం భూమి మీద హక్కు కల్పించాలని పాదయాత్ర బృందం నేతలు డిమాండ్‌ చేశారు. ఎంబీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. రానున్న బడ్జెట్‌లో జనభా ప్రాతిపదికన కేటాయింపులు జరపాలని డిమాండ్ చేశారు.

08:51 - February 8, 2017

చెన్నై: తమిళనాడులో రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. చిన్నమ్మకు వ్యతిరేకంగా ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వం గళం విప్పారు. తనచేత బలవంతంగా రాజీనామా చేయించారని.. ప్రజల కోరికమేరకు మళ్లీ ప్రభుత్వ పగ్గాలు చేపడతానని ప్రకటించారు. దీనికోసం ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రిని కలవడానికి పన్నీర్‌సెల్వం రెడీ అయ్యారు. తాను మళ్లీ మంత్రివర్గం ఏర్పాటు చేస్తానని.. తనకు సపోర్ట్‌ చేస్తున్న 62మంది ఎమ్మెల్యేల వివరాలతో ఆయన ఢిల్లీకి పయనం అవుతున్నారు. పన్నీర్‌ సెల్వం తీరుతో ఖంగుతిన్న శశికళ వర్గం.. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించింది. అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి పన్నీర్‌ సెల్వంను తొలగించారు. కొత్త కోశాధికారిగా శ్రీనివాసన్‌ను నియమించారు. పన్నీర్‌ వెనుక బీజేపీ , డీఎంకే హస్తం ఉందని శశికళ ఆరోపించారు. మరోవైపు డీఎంకే నేత స్టాలిన్‌ కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధానిని కలిసి తమిళనాడు ప్రభుత్వ అనిశ్చితిని వివరించనున్నారు. ఇదిలావుంటే ఇంచార్జ్‌ గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్‌రావు ఇవాళ కూడా ముంబైలోనే ఉండనున్నారు. దీంతో ఆన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరితో శశికళ ఫోన్లలో సంప్రదిస్తూ.. తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

08:50 - February 8, 2017

మధుమేహ పీడితులకు వరం...ఈ వరి అన్నం అంటోంది వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఇటీవలే జరిపిన వ్యవసాయ పరిశోధన విజయవంతమైంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినేందుకు అనుకూలమైన 'వరి' రకాన్ని రూపొందించాలని బెంగళూరులోని వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపక్రమించింది. సాధారణంగా వరిలో ఆరున్నర శాతం నుండి ఏడు శాఇతం వరకు మాంసకృత్తులు ఉంటాయనే సంగతి తెలిసిందే. కానీ కొత్తగా ఆవిష్కరించిన వరిలో మాంసకృత్తులు ఎక్కువగా ఉండాలని శాస్త్రవేత్తలు భావించి విజయం సాధించారు. ప్రస్తుతం ఆవిష్కరించిన వరిలో ఏకంగా 12 శాతం నుండి 13 శాతం మాంసకృత్తులు ఉన్నాయంట. మాంసాహరం ద్వారా లభించే మాంసకృత్తుల కంటే వరిలోని మాంసకృత్తులు తేలిగ్గా జీర్ణమౌతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అదనపు వ్యయం లేకుండానే ఈ రకం వరిని పండించి రైతులు లాభాలు గడించవచ్చని వెల్లడిస్తున్నారు. 

08:45 - February 8, 2017

హైదరాబాద్: సోషల్ మీడియాలో పడ్డ టీజేఏసీ..ఇక చూడాలమనం పోస్టుల కసి, ప్రతిపక్షాల భుజాల మీద ప్రతిపక్షాల తుపాకీ...బదనాం చేసి ఇడిసిపెడుతున్న ప్రభుత్వం, అవినీతి కాగితాలు తెచ్చిన పొన్నం....ఏ ఆఫీసుకేసినవే అన్నా కన్నం, రుణ మాఫీ చేయమంటున్న రైతులు...అప్పుల వ్యవసం ఆగం వుందని ఆవేదన, నాయన మీద సిన్మా తీస్తున్న బాలికాక...కామెడీ సీన్లు కట్ చేయాలో చీచో, పోరగాళ్ల పిల్లపురుగులకు పూజలు... సోషల్ మీడియాలో వీడియో చెక్కర్లు ఇత్యాది అంశాలపై వాడి... వేడి ముచ్చట్లతో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

08:38 - February 8, 2017

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'దువ్వాడ జగన్నాథం' చిత్ర షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 50 శాతానికి పైగానే పూర్తయినట్లు టాక్. ప్రతి సినిమాలో వెరైటీ లుక్ ను ప్రజెంట్ చేయడంలో స్టైలిష్ అనిపించుకున్న 'అల్లు అర్జున్' ఈ చిత్రంలో కూడా వెరైటీగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. తన లుక్ ను బయటికి రాకుండా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా 'పూజా హెగ్డే' నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే చిత్ర టీజర్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ఫస్టు టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'సరైనోడు' సినిమాతో 'అల్లు అర్జున్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల మోత మోగించాడు. ఈ సినిమా సక్సెస్ తో స్టార్ గా 'బన్నీ' రేంజ్ మరింత హెట్స్ కి వెళ్లింది. ఇప్పటి వరకు క్లాస్ టచ్ ఉండే మాస్ పాత్రలు చేసిన 'అల్లు అర్జున్' 'సరైనోడు' మూవీ లో మాత్రం ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ మాస్ లో అదరగొట్టాడు. ఈ భారీ సక్సెస్ ని మిస్ యూజ్ చేసుకోవద్దనే ఉద్దేశ్యంతో బన్నీ ఈ సినిమా విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడంట. మెగా హీరోలతో హరీశ్ శంకర్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. పవన్ తో గబ్బర్ సింగ్, సాయిధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో హిట్స్ కొట్టిన హరీశ్ శంకర్ బన్నీతో కూడా అలాంటి హిట్టుని రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. సక్సెస్ అవుతాడా ? లేడా ? అనేది చూడాలి. 

08:30 - February 8, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పనులన్నీ చకచకా కానిచ్చేస్తున్నారు. ఇటీవలే చిత్ర టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టిల్ విడుదలైంది. ఎడ్ల బండి 'కాడి'పై కూర్చొన్న 'పవన్' స్టిల్ ను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త హెయిర్ స్టైల్ .. కోర మీసకట్టు.. చేతికి కడియంతో ఉన్న 'పవన్' ఆకట్టుకొనేలా కనిపిస్తున్నారు. సినిమాలో తన లుక్ కోసం బాగానే శ్రద్ధ తీసుకున్నట్లు కనబడుతోంది. ఈ సినిమాలో 'పవన్' సరసన 'శృతి హాసన్' నటిస్తోంది. 'సర్దార్ గబ్బర్ సింగ్' తో ప్లాప్ టేస్ట్ చేసిన 'పవన్' తర్వాత సినిమాతో ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో చేస్తున్న సినిమా 'కాటమరాయుడు'. 'డాలి' డైరెక్షన్ లో 'పవర్' స్టార్ హీరోగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఫ్యాక్షన్ అండ్ యాక్షన్ లవ్ స్టోరీగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే అంచనాల్ని పెంచేసిన 'కాటమరాయుడు' పవర్ స్టార్ కు ఏ రేంజ్ హిట్టిస్తుందో చూడాలి.

07:22 - February 8, 2017

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం పదవి చేపట్టాలనుకున్న శశికళకు షాక్‌ ఇస్తూ ఇన్నాళ్లూ ‘అమ్మ’ చాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్‌ సెల్వం మంగళవారం రాత్రి అకస్మాత్తుగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. శశికళ వర్గీయులు తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని సంచలన ప్రకటన చేశారు. ప్రజలు కోరుకుంటే దానిని వెనక్కి తీసుకునేందుకు సిద్ధమేనని చెప్పారు. అస్సలు పన్నీర్ సెల్వాన్ని కేంద్ర ప్రభుత్వం వుందా? తమిళనాడు రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడబోతోందా? ఈ పరిణామాల్లో డీఎంకే ఏం చేయబోతోంది? ఇత్యాది అంశాలపై 'న్యూస్ మార్నింగ్'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిడిపినేత దినకర్, వైసీపీ నేత మదన్ మోహన్ రెడ్డి, నడింపల్లి సీతారామరాజు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:12 - February 8, 2017

హైదరాబాద్: ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీస్తానని..సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. అటు సినీ ఇటు పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడిది హాట్ టాఫిక్‌గా మారింది. సినిమాలో ఏఏ అంశాలు చూపించబోతున్నారు. ఎన్టీఆర్‌కు ఎదురైన అవమానాలుంటాయా? ఈ సినిమాలో విలన్‌గా ఎవరిని చూపబోతున్నారు. ఇంతకీ ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్ర ఉంటుందా? ఉంటే ఆమెను ఎలా చూపించబోతున్నారు?

ప్రముఖహీరోగా.. ప్రజానేతగా మన్ననలు...

తెలుగుచలనచిత్ర రంగంలో ప్రముఖహీరోగా.. ప్రజానేతగా మన్ననలు అందుకున్నారు నందమూరి తారకరామారావు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడన్న యశస్సును పొందారు. ఆ ఆదరణే ఆయన్ను రాజకీయాల్లోనూ హీరోగా నిలబెట్టింది. సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. కానీ చివరికి సొంత పార్టీ నుంచే తిరుగుబాటు..ఎప్పుడూ ఆయన జీవితంలో ఉహించని పరిస్థితుల్లో మరణించారు... అంతటి మహనీయుడి జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ఎన్టీఆర్ నటవారసుడు నందమూరి బాలకృష్ణ సన్నద్ధమవుతున్నారు.

ఎన్టీఆర్ జీవితంలో కష్టపడి ఎదిగిన సన్నివేశాలు ...

బాలయ్య అలా ప్రకటించారో లేదో... అప్పుడే ఎన్టీఆర్ బయోపిక్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్ అయ్యింది... బాలయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితంలో ఎలా కష్టపడి ఎదిగారో చూపుతామన్నారు. మరి ఆయన పతనానికి దారి తీసిన పరిస్థితుల ప్రస్తావన ఉంటుందా లేదా దానిపై బాలయ్య క్లారిటీ ఇవ్వలేదు. అన్ని ప్రశ్నలకు మే 28న ఎన్టీఆర్ జయంతి రోజు సమాధానం చెబుతామంటూ దాటవేశారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఓ రైతు కుటుంబంలో జన్మించారు. కొన్ని రోజులు ఉద్యోగం.. ఆ తర్వాత సిని రంగంలోకి అరంగేట్రం చేశారు. విభిన్నపాత్రల్లో నటించి ఔరా అనిపించారు. ఆ తర్వాత 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పాలనకు నా విజయమే చరమగీతమంటూ ప్రకటించడం.. ఆ తర్వాత పరిణామాల్లో ఇందిరా కనుసన్నల్లో గవర్నర్ రామ్ లాల్ వ్యూహంతో నాదెండ్ల భాస్కరరావు సీఎం అవ్వడం... మళ్లీ ప్రజాస్వామ్య పరిరక్షణంటూ జనంలోకి వెళ్లి ఎన్టీఆర్ తిరిగి ప్రభుత్వాన్ని చేజిక్కుంచుకున్నారు. 1989లో ఓటమి... మళ్లీ 1994లో రికార్డు స్థాయిలో విజయం.. 1995 ఆగస్టు సంక్షోభంతో పార్టీలో తిరుగుబాటు.. 1996 జనవరిలో గుండెపోటుతో మరణం..ఈ అంశాలన్నీ తెరపైకి వస్తాయా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

ఎన్టీఆర్‌ పాత్రలో తానే నటిస్తున్నట్లు చెప్పిన బాలయ్య ...

ఎన్టీఆర్ పాత్రలో నటించేందుకు తనకంటే అర్హుడెవరంటూ ఇప్పటికే బాలయ్య ప్రకటించేశారు. ఇక తనయుడి పాత్రలోనూ బాలయ్యే కనిపించబోతున్నారట. ఇక విలన్ విషయానికొస్తే..లక్ష్మీ పార్వతే విలన్‌ అని టీడీపీ వర్గాలు..అసలు విలన్ చంద్రబాబు అని లక్ష్మీపార్వతి, మిగతా విపక్ష వర్గాలు పరస్పరం ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తీరుపై ఎన్టీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వీడియోలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎంటర్ కావడం..ఆమెకు ఎన్టీఆర్ ప్రాధాన్యత పెంచడం..ఆమె ఒక పవర్ సెంటర్‌గా మారడంతోనే.. టీడీపీని రక్షించుకునేందుకు చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌కు దూరమయ్యారనేది ఇప్పటి చంద్రబాబు అండ్ టీం వాదన.. మరి ఈ వాదనలన్నింటినీ బాలయ్య తెరపై చూసిప్తారా? లేక టీడీపీని రక్షించి తిరిగి అధికారంలోకి తెచ్చిన ఘనత చంద్రబాబుదే అని చెప్పబోతున్నారా... ఎన్టీఆర్ ఆశయాలు సిద్దించాలంటే చంద్రబాబే ఉండాలంటూ స్క్రీన్‌ప్లే హైలైట్‌ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది.

వెన్నుపోటు ఎపిసోడ్‌ను సినిమాలో చూపించాలని లక్ష్మీ పార్వతి...

అయితే ఎన్టీఆర్ జీవితంలో విలన్ చంద్రబాబేనని... వెన్నుపోటు ఎపిసోడ్‌ను సినిమాలో చూపించాలని లక్ష్మీ పార్వతి అంటున్నారు. ఎన్టీఆర్‌ జీవితంలో ఎలాంటి ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నారు.. చివరిదశలో జరిగిన దురదృష్టసంఘటనలు యథాతథంగా తీస్తే అభ్యంతరం లేదని..అలా కాకుండా చంద్రబాబును హీరోగా చూపించే ప్రయత్నం చేస్తే తప్పక కోర్టు మెట్లు ఎక్కుతానని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.

1995 ఆగస్ట్‌ సంక్షోభంలో తండ్రికి దూరంగా ఉన్న హరికృష్ణ ...

ఇక ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా ఆయనతో లేరు.. ఆయన మరో తనయుడు హరికృష్ణ తండ్రికి దూరంగా చంద్రబాబుతో కలిసి పనిచేయడం.. క్యాబినెట్‌లో రవాణా మంత్రిగా చేరడం...చంద్రబాబుతో సంబంధాలు బెడిసికొట్టడంతో అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించడం వంటి హిస్టారికల్ ఎలిమెంట్స్ సినిమాలో చూపిస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్రావు కూడా ఎన్టీఆర్ వెన్నంటే ఉండి రాజకీయాలు నడిపారు..చంద్రబాబు తనను మోసం చేశారని పలు సందర్బాల్లో ప్రస్తావించారు. ఎన్టీఆర్ జీవితంలో అత్యంత కీలకపాత్ర పోషించిన అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రల్లో ఎవరు కనిపిస్తారన్నది చర్చనీయాంగా మారింది. ప్రస్తుతం లక్ష్మీ పార్వతి వైసీపీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దీంతో ఈమూవీ పొలిటికల్‌గానూ హీట్ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి..

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం..

మరోవైపు ఎన్టీఆర్‌ బయోఫిక్‌కు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.. ఆయనే ఈ ఐడియాను బాలయ్యకు వినిపించారంటున్నారు. అయితే బాలయ్య బాడీ లాంగ్వేజ్ తగ్గట్లుగా సినిమా తీసి హిట్ కొట్టడంలో డైరెక్టర్‌ బోయపాటి శీనుది అందెవేసిన చేయి. తాజాగా గౌతమి పుత్ర శాతకర్ణితో దర్శకుడు క్రిష్‌తోనూ బాలయ్య ట్యూన్ అయ్యారు. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారు.. ఏఏ అంశాలతో కథ ఫైనలేజ్ అవుతుందో చూడాలి. ఈ చిత్రానికి నిప్పులాంటి మనిషి అన్న పేరును పరిశీలిస్తున్నట్లు భోగట్టా. గతంలో ఎన్టీఆర్‌తో పాటు బాలకృష్ణ కూడా ఈ టైటిల్‌తో సినిమాలు చేశారు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్‌ మూవీపై.. సినీ, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. మరి బాలయ్య ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తారు? వివాదాలకు కారకులవుతారా..? లేక ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యేంతవరకే చిత్రీకరించి వివాదానికి దూరంగా ఉంటారా..? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం, ఎన్టీఆర్‌ జయంతి మే 28న బాలయ్య చేసే ప్రకటన వరకూ వేచి చూడాల్సిందే.

07:06 - February 8, 2017

తమిళనాడు : చెన్నై మెరీనా బీచ్‌లో జయలలిత సమాధి దగ్గర పన్నీరు సెల్వం మౌనదీక్ష తర్వాత అధికార అన్నా డీఎంకేలో చీలిక అనివార్యంగా భావిస్తున్నారు. శశికళకు వ్యతిరేకంగా పన్నీరు సెల్వం గళం విప్పిన తరుణంలో అసెంబ్లీలో ఉన్న పార్టీల బలాబలాలపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది.

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సీట్లు 235,,,,

 తమిళనాడు అసెంబ్లీలో సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం సీట్లు 235. వీటిలో 234 స్థానాలకు ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంటారు. ఒక ఆంగ్లో-ఇండియన్‌ను నామినేట్‌ చేస్తారు. జయలలిత మృతితో ఆర్‌కే నగర్‌ సీటు ఖాళీ ఉంది. అసెంబ్లీలో అన్నా డీఎంకేకి 135 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 50 మంది పన్నీరు సెల్వంకు మద్దతు తెలుపుతున్నారు. మిగిలిన 85 మంది శశికళకు అనుకూలంగా ఉన్నారు. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు 89 మంది ఉన్నారు. కాంగ్రెస్‌కు ఎనిమిది స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు కావ్సాలని మేజిక్‌ ఫిగర్‌ 118 స్థానాలు. డీఎంకే, కాంగ్రెస్‌ కలిసినా ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఎవరిని ఆహ్వానిస్తారన్న అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

సెల్వకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ......

పన్నీరు సెల్వంను బలపరిచే అన్నా డీఎంకే ఎమ్మెల్యే సంఖ్య పరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి శశికళ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు సెల్వం వైపు వచ్చే ఛాన్స్‌ను రాజకీయ విశ్లేషకులు కొట్టేయడంలేదు. మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తానని ప్రకటించే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు. సెల్వంకు బీజేపీ జాతీయ నాయకత్వంతోపాటు, ప్రధాని నరేంద్ర మోదీ అండగా నిలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు. పన్నీరు సెల్వం రాజీనామా చేసిన తర్వాత శశికళను అన్నా డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అయితే గవర్నర్‌ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగిన జరిగే వరకు ఆపద్ధర్మ సీఎంగా సెల్వం కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి శశికళ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో అర్ధాంతరంగా వాయిదా పడింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. కొద్ది రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది.

శశికళకు వ్యతిరేకంగా, సెల్వంకు అనుకూలంగా నినాదాలు ......

శికళకు వ్యతిరేకంగా పన్నీరు సెల్వం గళం విప్పిన తర్వాత తమిళనాడులో ప్రజలు ఎద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. శశికళకు వ్యతిరేకంగా, సెల్వంకు అనుకూలంగా నినాదాలు చేశారు. రాజ్యాంగేతర శక్తి పాలన తమకొద్దంటూ నినదించారు. ఈ పరిణామాలు పన్నీరు సెల్వంకు అనుకూలంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

07:04 - February 8, 2017

చెన్నై: పన్నీరు సెల్వం తిరుబాటుతో అన్నా డీఎంకే శశికళ వర్గంలో ఆందోళన ప్రారంభమైంది. శశికళపై పన్నీరు సెల్వం చేసిన విమర్శలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద పన్నీరు సెల్వం మౌనదీక్ష చేసి శశికళ వ్యవహార శైలిపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఉత్పన్నమైన పరిణామాలను చర్చించేందుకు అన్నా డీఎంకే శశికళ వర్గం పోయెస్‌ గార్డెన్‌లో అత్యవసర భేటీ నిర్వహించింది.

బలవంతంగా రాజీనామా చేయించారన్న సెల్వం ప్రకటనపై చర్చ,,,,

శశికళ అధ్యక్షత జరిగిన అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల సమావేశంలో సెల్వం దీక్షపై విస్తృతంగా చర్చించారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని, తాను ముఖ్యమంత్రిగా ఉండగానే శిశకళ సీఎం అవుతారని పార్టీ నేతలు బహిరంగ ప్రకటనలు చేశారంటూ పన్నీరు సెల్వం చేసిన విమర్శలపై చర్చించారు. సెల్వం తిరుబాటు వెనుక ఎవరు ఉన్నారన్న అంశంపై ఆరా తీశారు. ప్రతిపక్ష డీఎంకేతోపాటు, బీజేపీ జాతీయ నాయకత్వం ప్రోద్బలంతోనే సెల్వం ఈ విధంగా చేశారన్న వాదాన్ని అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు వినిపిస్తున్నారు.

పార్టీ పదవికి శశికళను వ్యతిరేకించానన్న వాదనలో నిజం లేదు .....

అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్‌ పేరును జయలలిత సూచించినట్టు సెల్వం చెప్పడాన్ని శశికళ వర్గం తప్పుపడుతోంది. ఇందుకు విరుద్ధంగా శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయడాన్ని వ్యతిరేకించానని సెల్వం చేస్తున్న వాదనలో పసలేదన్న అభిప్రాయం వ్యక్తమైందని సమాచారం. సెల్వం విమర్శలు, ఆరోపణలతో అన్నా డీఎంకేలో క్రమశిక్షణ గాడితప్పే అవకాశాలున్నాయని అంశంపై కూడా శశికళ వర్గం చర్చించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా శశికళ ఉండటం జయలలితకు ఇష్టంలేదన్న అర్థం వచ్చే విధంగా సెల్వం చేసిన వ్యాఖ్యలపై ఈమె వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టి ప్రచారం జరుగుతోంది.

పార్టీ అంతర్గత వేదికల్లో మాట్లాడి ఉంటే బాగుండేది ....

పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన నిజాలు వెల్లడించాలని జయలలిత ఆత్మ తనను ఆదేశించిందన్న సెల్వం వాదాన్ని శశికళ వర్గం తోసిపుచ్చింది. ఏదైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికల్లో మాట్లాడి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం శశికళ వర్గం ఎమ్మెల్యేల సమావేశంలో వ్యక్తమైంది. పాలనాపరంగా పలు విజయాలు సాధించినా... ముఖ్యమంత్రి పదవి నుంచి బలవంతంగా తొలగించారన్న సెల్వం వాదాన్ని శశికళ వర్గం తోసిపుచ్చుతోంది. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించినా... ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీతో చర్చించిన ఆర్డినెన్స్‌ తీసుకొచ్చానని సెల్వం చెప్పండపై శశికళ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రజాగ్రహానికి కేంద్రం దిగివచ్చిందన్న వాస్తవాన్ని సెల్వం మరిపోయారన్న వాదాన్ని కొందరు ఎమ్మెల్యేలు లేవనెత్తారు. వర్దా తుపాను, వరదల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ఎన్నో చర్యలు తీసుకున్నారని పన్నీరు సెల్వం చెప్పడాన్ని శశికళ వర్గం తప్పుపడుతోంది. ప్రభుత్వ యంత్రాంగమంతా ఒక్కటై ముందుకు కదిలి సహాయ, పునరావాలస కార్యక్రమాలను ముమ్మరంగా అమస్తే, ఇందంతా తన ఘనతే అని సెల్వం చెప్పుకోడాన్ని తప్పుపట్టింది.

07:01 - February 8, 2017

చెన్నై: తమిళనాడులో రాజకీయ సమీకరణను వేగంగా మారుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం మంగళవారం రాత్రి చెన్నై మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లి అర్థగంట సేపు మౌన దీక్ష చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఇంతకాలం మౌనంగా ఉన్న పన్నీరు సెల్వం మౌనవత్రం ముగించిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై విరుచుకుపడ్డారు. అమ్మ ఆత్మేతనను సమాధి వద్దకు తీసుకొచ్చిందని చెప్పారు. కొన్ని నిజాలను ప్రజలతో పంచుకోవాల్సి ఉందన్నారు.

జయలలితో చివరి భేటీని గుర్తు చేసుకున్న సెల్వం ...

రాష్ట్రాన్ని ,పార్టీని కాపాడాల్సిన బాధ్యతలు, కర్తవ్యాన్ని గురించి జయలలిత తనకు వివరించిన విషయాన్ని సెల్వం ప్రస్తావించారు. తనను సీఎంగా ఉండాలని జయలలిత కోరుతున్నారని చెప్పారు. అమ్మతో తన చివరి భేటీని గుర్తు చేసుకున్నారు. తనపై వచ్చిన ఒత్తిడి కారణంగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్‌ ఉండాలని జయలలిత కోరుకున్న విషయాన్ని వెల్లడించారు. కానీ మధుసూదన్‌కు వ్యతిరేకంగా నిర్ణయం జరిగినప్పుడు నిరసన తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. శశికళను ముఖ్యమంత్రిగా చేయాలని పార్టీలోని ఒక వర్గం భావించినప్పుడు, ఇది తొందరపాటు నిర్ణయం అవుతుందని ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు శశికళ సీఎం అవుతారని ప్రకటించడం తనను బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిణామాలు జయలలిత ఆశయానికి విరుద్ధం ...

ప్రజల ఆమోదం ఉన్న వ్యక్తికే పార్టీ పగ్గాలు, పరిపాలనా బాధ్యతలు కట్టబెట్టాలన్నది జయలలిత ఆశయమని పన్నీరు సెల్వం చెప్పారు. పార్టీలో, ప్రభుత్వంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అమ్మ ఆశయానికి విరుద్ధమన్న వాదాన్ని వినిపించారు. శశికళ విషయంలో తన మనసులో దాసుకున్న ఆవేదననంతా వెళ్లగక్కారు. అయితే తర్వాత చేయబోయేది మాత్రం ప్రస్తావించలేదు. పన్నీరు సెల్వం తీరును పరిశీలిస్తే శశికళను అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే ముఖ్యమంత్రి పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమన్న వాదాన్ని వినిపించారు. అయితే ఇప్పటికే పన్నీరు సెల్వం రాజీనామాను తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఆమోదించారు. ఈ పరిస్థితుల్లో సెల్వం మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా ? అన్నది సందేహం. పైగా అన్నా డీఎంకే ఎమ్మెల్యేల్లో 60 శాతం మంది శశికళ అనుయాయులే ఉన్నారు. పన్నీరు సెల్వంను అసహాయుడ్ని చేసే అంశం ఇది. కేంద్ర ప్రభుత్వం ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు సహాయంతో తమిళనాడులో చక్రం తిప్పేందుకు జరుగుతున్న పరిణామాల్లో భాగంగానే ఇదంతా జరుగుతోందన్న వాదనలు ఉన్నాయి. ఇది ఏదశలో జరుగుతోందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌...

శశికళపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పన్నీర్ సెల్వం...

చెన్నై: అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు చిన్నమ్మ షాక్‌ ఇచ్చారు. పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సెల్వం స్థానంలో శ్రీనివాసన్‌ను కోశాధికారిగా నియమించారు. అయితే పార్టీ నుంచి పన్నీరు సెల్వంను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించలేదు. సస్పెండ్‌ చేస్తే సెల్వం ప్రతిష్ఠ మరింత పెరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో శశికళ ఆచితూచి వ్యవహరించారు. జయలలిత సమాధి వద్ద మౌనదీక్ష తర్వాత శశికళకు వ్యతిరేకంగా సెల్వం గళం విప్పడాన్ని తప్పుపట్టిన పార్టీ నాయకత్వం ఆయనపై వేటు వేసింది.

06:38 - February 8, 2017

హైదరాబాద్: రవాణారంగంలో భారీగా పెంచిన ఫీజులు, జరిమానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో ఆటోలు, లారీలు, కారు, జీవు, ట్రాక్టర్ ,అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులు బంద్ పాటించాయి. సిఐటియు, ఏఐసిటియు, ఐఎఫ్ టియు, వైఎస్ఆర్ టియుసి మొదలైన యూనియన్ లు ఈ బంద్ లో పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ట్రాన్స్ పోర్ట్ రంగం కార్మికులు బంద్ పాటించడానికి కారణం ఏమిటి? రవాణారంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మాట్లాడేందుకు సిఐటియు నాయకులు ముజఫర్ విజయవాడ 10టీవీ స్టూడియో నుండి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss