Activities calendar

10 February 2017

21:31 - February 10, 2017

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి తొలిదశ ఎన్నికలు రేపు జరగనున్నాయి. 15 జిల్లాల్లో 73 అసెంబ్లీ సీట్లకు పోలింగ్‌ జరగనుంది. 839 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2 కోట్ల 60 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలిదశ ఎన్నికల కోసం ఈసీ 26 వేల 823 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సమాజ్‌వాది-కాంగ్రెస్‌ కూటమి, బిజెపి, బిఎస్పీ, ఆర్‌ఎల్డీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. బిఎస్పీ, బిజెపి మొత్తం 73 సీట్లకు పోటీ చేస్తుండగా...ఎస్పీ 51, కాంగ్రెస్ 24 సీట్లలో బరిలో నిలిచాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సయ్యద్‌ నసీం అహ్మద్‌ జైదీ తెలిపారు. యూపీలో మొత్తం 403 సీట్లకు గాను ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

21:24 - February 10, 2017

చెన్నై: తమిళనాడులో సంక్షోభానికి తెరదించేదిశగా గవర్నర్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతానికి ఆపద్దర్మ సీఎంను కొనసాగించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. అలాగే ఎమ్మెల్యేల భద్రతపైకూడా రాజ్‌భవన్‌ ఆరా తీస్తోంది..

 

21:23 - February 10, 2017

చెన్నై: మరోవైపు ఉదయం నుంచి... తమిళనాడులో రాజకీయ సమీకరణలు క్షణ క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. శశికళ ఎమ్మెల్యేలను గోల్డెన్‌ రిసార్ట్స్‌లో బలవంతంగా బంధించారని పన్నీర్‌ సెల్వం వర్గం ఆరోపిస్తోంది. తాము స్వేచ్ఛగానే ఉన్నామని శశికళ వర్గం చెబుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ నిర్ణయం కీలకంగా మారింది.

ఆధిపత్యపోరు...

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. పార్టీ ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని వారిని గోల్డెన్‌ బే రిసార్ట్‌లో బలవంతంగా నిర్బంధించారని, ఫోన్లు, సామాజిక మాధ్యమాలు అందుబాటులో లేకుండా చేశారన్న ఓపిఎస్ వర్గం ఆరోపణలపై శశికళ వర్గం స్పందించింది. తాము స్వేచ్ఛగానే ఉన్నామని తమను ఎవరూ బంధించలేదని 11 మంది ఎమ్మెల్యేలు మీడియా ముందు స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శశికళ గోల్డెన్‌ బే రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడారు. గవర్నర్‌తో భేటి వివరాలను వెల్లడించారు.

శశికళ నిర్బంధంలో...

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నిర్బంధంలో ఉంచారని వస్తున్న ఆరోపణలపై మద్రాస్‌ హైకోర్టు విచారణ జరిపింది. ఈ అంశంపై అఫిడవిట్‌ ఫైల్‌ చేసి నివేదిక అందజేయాలని చెన్నై పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేల నిర్బంధంపై పన్నీర్‌సెల్వం వర్గీయుల నుంచి వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో డీజీపి టీకే రాజేంద్రన్‌ గవర్నర్‌తో సమావేశమయ్యారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలన్న గవర్నర్‌ ఆదేశం మేరకు డిజిపి గోల్డెన్‌ రిసార్ట్‌కు వెళ్లారు.

అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్‌ మధుసూదన్‌ వేటు..

గురువారం పన్నీర్‌ సెల్వం గూటికి చేరిన అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్‌ మధుసూదన్‌పై శశికళ వేటు వేశారు. ఆయన స్థానంలో ప్రిసీడియం ఛైర్మన్‌గా సెంకోటయ్యన్‌ను నియమించారు. మధుసూదన్‌ శశికళపై ఈసీకి ఫిర్యాదు చేశారు. శశికళ పార్టీ ప్రధానకార్యదర్శిగా కొనసాగడానికి వీల్లేదని ఈసీకి రాసిన లేఖలో మధూసుదన్‌ పేర్కొన్నారు.

సుప్రీం లో శశికి ఊరట..

సుప్రీంకోర్టులో శశికళకు ఊరట లభించింది. సీఎంగా ఆమె ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసు తీర్పు వెలువడేంత వరకు శశికళను సిఎం కాకుండా ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

20:37 - February 10, 2017

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా ఆవిర్భవించిన బల్దియాకు ఏడాది కాలం పూర్తయ్యింది. మేయర్ గా పదవి చేపట్టి ఏడాది అయ్యింది. ఈ ఏడాది కాలంలో జీహెచ్ ఎంసీ ఎలాంటి ప్రగతి సాధించింది? నిజానికి జీహెచ్ ఎంసీ ముందున్న లక్ష్యాలు ఎంత వరకు సాధించగల్గింది?... ఇక ముందు సాధించాల్సినవి ఏవి? లక్ష్య సాధన దిశగా ఈ ఏడాది సాగిందా? ఈ అంశాలపై రాంమ్మోహన్ తో లైవ్ షో నిర్వహించింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

అన్నాడీఎంకేను ఎవరూ హైజాక్ చేయలేరు:సెల్వం

చెన్నై: అన్నాడీఎంకేను ఎవరూ హైజాక్ చేయలేరని తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీసెల్వం ప్రకటించారు. ఆయన తన నివాసం నుంచి మరో సారి తన మద్దతుదారులతో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని చీల్చే కుట్రను సాగనివ్వమని చెప్పారు. త్వరలోనే శుభవార్త వింటారని పేర్కొన్నారు.

20:07 - February 10, 2017

చెన్నై: అన్నాడీఎంకేను ఎవరూ హైజాక్ చేయలేరని తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీసెల్వం ప్రకటించారు. ఆయన తన నివాసం నుంచి మరో సారి తన మద్దతుదారులతో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని చీల్చే కుట్రను సాగనివ్వమని చెప్పారు. త్వరలోనే శుభవార్త వింటారని పేర్కొన్నారు.

20:03 - February 10, 2017

హైదరాబాద్: తెలంగాణ మంత్రులంతా ప్రజాబాట పట్టారు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యం జనాల్లోనే ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు.. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.. మంత్రుల్లో ఈ మార్పుకు కారణమేంటి? స్పెషల్ స్టోరీ...

గ్రామాల్లో... పట్టణాల్లో వరుస పర్యటనలు..

తమ శాఖలపై పట్టు సాధించేందుకు తెలంగాణ మంత్రులు కృషి చేస్తున్నారు.. గతంలోకంటే భిన్నంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. బడ్జెట్‌ రూపకల్పనపై అధికారులతో సమీక్షలు చేస్తూనే ఇతర కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటున్నారు..

స్థానిక సమస్యలు, ప్రజల ఇబ్బందులపై దృష్టి...

ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకువెళ్లేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారు.. స్థానిక సమస్యలు, ప్రజల ఇబ్బందులపైకూడా దృష్టిపెట్టారు. పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా కృషిచేస్తున్నారు. నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తున్నారు. పార్టీలో చేరికలు, సభ్యత్వ నమోదును కూడా జోరుగా చేస్తున్నారు.. నిత్యం ఏదో ఓ కార్యక్రమంతో ప్రజల మధ్య ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.. ప్రతిపక్షాల విమర్శలను కూడా తిప్పికొడుతున్నారు..

కొందరు మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్‌ క్లాస్‌ ...

గత మంత్రివర్గ సమావేశంలో కొందరు మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్‌ క్లాస్‌ పీకారని సమాచారం. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా తమ తమ శాఖలపై పట్టుసాధించలేక... ప్రతిపక్ష సభ్యుల విమర్శల్ని ఎదుర్కోలేకపోతున్నవారిపై సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.. ఇలాగైతే వచ్చేఎన్నికల్లో సమస్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.. సీఎం ఇలా ఆగ్రహించడంతో మంత్రుల తీరులో మార్పువచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సచివాలయం వదిలి మంత్రులు ప్రజాబాట పట్టారు. రెండున్నరేళ్లలో తాము చేసిన కార్యక్రమాల్ని వివరిస్తున్నారు..

20:00 - February 10, 2017

నల్గొండ : సాగు, త్రాగునీరు లేక నల్గొండ జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణావాటర్‌ ద్వారా వెంటనే జిల్లాకు త్రాగునీటిని సరఫరా చేయాలని మంత్రి హరీష్‌రావును కోరినా మంత్రి సరిగా స్పందించలేదన్నారు కోమటిరెడ్డి. వారంరోజుల్లోగా నీటిని సరఫరా చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలను చేస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.

19:59 - February 10, 2017

హైదరాబాద్: ఇంటికో ఉద్యోగం, లక్ష ఉద్యోగాల నియామకాలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాళ్లే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం నడిచిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ అవి అమలుకాకపోతే సిద్దించిన తెలంగాణకు అర్ధంలేదన్నారు. టీజేఏసీ ఈనెల 22న తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి మద్దతుగా ఓయూలో సమావేశం జరిగింది. అన్ని విద్యార్ధి సంఘాల నేతలతో భేటీ అయిన కోదండరాం... ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. నిరుద్యోగ నిరసన ర్యాలీకి ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ర్యాలీని జరిపితీరుతామని స్పష్టం చేశారు.

19:55 - February 10, 2017

చెన్నై: తమిళనాడు పాలిటిక్స్‌ క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. చెన్నై పోయెస్‌గార్డెన్‌లో అన్నాడీఎంకే ఎంపీలతో శశికళ భేటీ అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. గవర్నర్‌ నుంచి సరైన స్పందన రానిపక్షంలో ఎంపీలను రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. అంతకుముందు రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఆమె సంభాషించారు. శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలను విడిపించేందుకు కేంద్ర బలగాలను దింపే యోచనలో పన్నీర్‌ సెల్వం ఉన్నారు. శశికళ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమే అన్నారు ప్రిసిడియం చైర్మన్‌ మధుసూదనన్‌.

19:54 - February 10, 2017

హైదరాబాద్: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ ...విరాట్‌ కొహ్లీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో CONSISTENCY కి కేరాఫ్‌ అడ్రెస్‌లా మారాడు. ఉప్పల్‌ టెస్ట్‌లోనూ యాంగ్రీ యంగ్‌ గన్‌ అదరగొట్టాడు.తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన కొహ్లీ తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. గత రెండేళ్లుగా విరాట్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడం మాత్రమే కాదు...బ్యాట్స్‌మెన్‌గానూ కొహ్లీ రికార్డ్‌ల మోత మోగిస్తూనే ఉన్నాడు.

ఆరంభంలో ఆచితూచి ఆడిన కొహ్లీ....

ఆరంభంలో ఆచితూచి ఆడిన కొహ్లీ....హాఫ్‌ సెంచరీ పూర్తయ్యాక స్కోర్‌ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు. మురళీ విజయ్‌తో కలిసి హాఫ్ సెంచరీ, రహానేతో కలిసి సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన కొహ్లీ...భారత్‌ను తిరుగులేని ఆధిక్యంలో నిలిపాడు.

తొలి ఇన్నింగ్స్‌లో అసలు సిసలు కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడి సూపర్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మురళీ విజయ్‌తో కలిసి హాఫ్ సెంచరీ, రహానేతో కలిసి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన కొహ్లీ...భారత్‌ను తిరుగులేని ఆధిక్యంలో నిలిపాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన విరాట్‌....ట్రేడ్‌మార్క్ మార్క్‌ షాట్లతో అలరించాడు. పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో బంతిని బౌండరీ దాటించి ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు.

బంగ్లాదేశ్‌ బౌలర్లతో ఆటాడుకున్న విరాట్‌.....

బంగ్లాదేశ్‌ బౌలర్లతో ఆటాడుకున్న విరాట్‌..... కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్నాడు. ఏ మాత్రం తడబడకుండా బ్యాటింగ్‌ చేసిన విరాట్‌....130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 54వ టెస్ట్‌ ఆడుతోన్న విరాట్‌ టెస్టుల్లో 16వ సెంచరీ నమోదు చేశాడు. 28 ఏళ్ల విరాట్‌ కెరీర్‌లో ఇది ఓవరాల్‌గా 43వ అంతర్జాతీయ సెంచరీ కావడం మరో విశేషం.రెండో రోజు ఆటలోనూ చెలరేగిన విరాట్‌.....239 బంతుల్లో డబుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్‌లో నాలుగో డబుల్‌ సెంచరీ నమోదు చేసిన విరాట్‌....టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు.

వరుసగా నాలుగు టెస్ట్‌ సిరీస్‌ల్లో నాలుగు డబుల్‌ సెంచరీలు..

వరుసగా నాలుగు టెస్ట్‌ సిరీస్‌ల్లో నాలుగు డబుల్‌ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా కొహ్లీ చరిత్రను తిరగరాశాడు. ఇప్పటివరకూ 3 బ్యాక్‌ టు బ్యాక్‌ సిరీస్‌ డబుల్‌ సెంచరీలతో టాప్‌ ప్లేస్‌లో ఉన్న డాన్‌ బ్రాడ్‌మన్‌, రాహుల్‌ ద్రావిడ్‌లను విరాట్‌ వెనక్కు నెట్టాడు. టెస్ట్‌ ఫార్మాట్‌లో కొహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా 2016 సీజన్‌లో ఎంతలా ఆధిపత్యం ప్రదర్శించిందో అందరికీ తెలిసిందే.2017 సీజన్‌ ఆరంభ టెస్ట్‌లో బంగ్లాదేశ్‌పై నెగ్గితే....విరాట్‌ భారత కెప్టెన్‌గా చరిత్రను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. 28 ఏళ్ల వయసులోనే అన్ని ఫార్మాట్లలో కలిపి 43 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేసి ప్రస్తుత జెనరేషన్‌లో తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. మరి యాంగ్రీ యంగ్‌ గన్‌ ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో ఇదే స్థాయిలో చెలరేగితే మరిన్ని రికార్డ్‌లు బద్దలవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

19:49 - February 10, 2017

చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు తమ మద్దతు ఉంటుందని మీడియాతో డీఎంకే నేత స్టాలిన్ తెలిపారు.. చెన్నై రాజ్ భవన్ లో స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్ రావు తో భేటీ అయ్యారు. పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో వచ్చి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన ఆయ‌న‌.. రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌పై చర్చించినట్లు సమాచారం. దీంతో సీఎం పన్నీర్ సెల్వంకు ఊరటకల్గించే అంశం కాగా శశికళకు మరో ఎదురు దెబ్బ తగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించిన స్టాలిన్

చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు తమ మద్దతు ఉంటుందని మీడియాతో డీఎంకే నేత స్టాలిన్ తెలిపారు.. చెన్నై రాజ్ భవన్ లో స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్ రావు తో భేటీ అయ్యారు. పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో వచ్చి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన ఆయ‌న‌.. రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌పై చర్చించినట్లు సమాచారం. దీంతో సీఎం పన్నీర్ సెల్వంకు ఊరటకల్గించే అంశం కాగా శశికళకు మరో ఎదురు దెబ్బ తగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గవర్నర్ తో స్టాలిన్ భేటీ...

చెన్నై: త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష డీఎంకే నేత స్టాలిన్ గవర్నర్ తో భేటీ అయ్యారు.పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో వచ్చి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన ఆయ‌న‌.. రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌పై చ‌ర్చిస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్‌తో స్టాలిన్ భేటీ అవ‌డం మ‌రోసారి ఆస‌క్తిగా మారింది.

ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక కాలేదు:మధుసూధనన్

చెన్నై: పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక కాలేదని అన్నాడీఎంకే సీనియర్ నేత మధుసూదనన్ తెలిపారు. పార్టీ నిబంధనలకు అనుగుణంగా శశికళ ఎన్నిక జరగలేదన్నారు. త్వరలో పార్టీకి కొత్త జనరల్ సెక్రటరీలను ఎన్నుకుటామన్నారు. పార్టీలో తాత్కాలిక ప్రధాన కార్యదర్ఇశ అనే పోస్టు ఏమీ లేదన్నారు. మమ్మల్ని తొలగించే అధికారం శశికళకు లేదన్నారు. నేనే శశికళ బృందం నుంచి బయటకు వచ్చానని, మేం శశికళను తొలగిస్తామని, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం మాకుందని, మధుసూధనన్ స్పష్టం చేశారు.

కేంద్ర బలగాల సహకారం కోరే యోచనలో సీఎం సెల్వం

చెన్నై:శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేను విడిపించేందుకు కేంద్ర బలగాల సహకారం కోరే యోచనలో సీఎం పన్నీర్ సెల్వం ఉన్నట్లు సమాచారం.

ఏఆర్ కానిస్టేబుల్ రాజయ్య నిర్వాకం

కరీంనగర్: ఏఆర్ కానిస్టేబుల్ రాజయ్య నిర్వాకం బయటపడింది. పోలీస్ హెడ్ క్వార్టర్ లో హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళ నుంచి రూ.2లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో డబ్బులు ఇవ్వాలన్న బాధితురాలు భాగ్యలక్ష్మి, భర్త సంపత్ లపై రాజయ్య దాడి చేశాడు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు. వన్ టౌన్ పీఎస్ లో కేసు నమోదు చేశారు.

18:57 - February 10, 2017

అన్నమయ్య శ్రీ రామదాసు లాంటి చరిత్రలో నిలిచిపోయే భక్తిరస చిత్రాలను రూపొందించిన దర్శకుడు రాఘవేంద్రరావు చివరి సినిమా అంటూ ఓం నమో వెంకటేశాయను తెరకిఎక్కించారు. నాగార్జున రాఘవేంద్రరావు ల సక్సస్ఫుల్ కాంబినేషన్ లో మహేష్ రెడ్డి నిర్మించిన ఓం నమో వెంకటేశాయ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది .

కధ విషయానికి వస్తే శ్రీవారి పరమ భక్తుడు హాథీరాం బావాజీ జీవిత చరిత్రను తెరకెక్కించారు అయితే అయన చరిత్రకు సంబంధించిన నిజానిజాలు ఆధారాలు తక్కువగా ఉండటం తో ఎక్కువ భాగం కల్పితం గా మలచాల్సి వచ్చింది .హాథిరామ్ బావాజీ చిన్న తనం నుండి దేవుడిని చూడాలని గురువు దగ్గర విద్యను అభ్యసించి కఠోర తపస్సు చేస్తాడు అయితే ఆ తపస్సుకి మెచ్చి వచ్చిన వెంకటేశ్వర స్వామి ని గుర్తించలేక వెళ్లిపొమ్మంటాడు ..తరువాత జరిగిన తప్పు తెలుసు కొని తిరుమలకు తిరిగి వెళతాడు .కానీ అతని అవతారం ఆహార్యం చూసి పిచ్చోడిగా అందరూ భ్రమపడతారు కానీ కృష్ణమ్మా మాత్రం అతనిలోని భక్తుడిని గుర్తించి ఆశ్రయం కలిపిస్తుంది .ఆ తరువాత హాథిరామ్ బావాజీ తిరుమలలో ఎం చేసాడు .శ్రీవారికి ఎందుకంత ప్రియభక్తిడిగా మారాడు, శ్రీ వారితో పాచికలాట వెనక పరమార్ధం ఏంటి ? చివరికి ఏమయ్యాడు అనే మూల కధని ఆసక్తికరంగా తనదైన శైలిలో చెప్పాడు డైరెక్టర్ రాఘవేంద్రరావు.

టీనటుల విషయానికి వస్తే ఈ సినిమా కర్త కర్మ క్రియ నాగార్జున అనే చెప్పాలి.మొద్దని ఫ్రేమ్ నుండి క్లైమాక్స్ వరకు ఎక్కడ నాగార్జునని చూస్తున్నామని ఫీలింగ్ కలగాకుండా హాథిరాంబావాజీ నే చూస్తున్నామని అనిపించేలా పాత్రలో ఒదిగిపోయాడు .ఆహార్యం ,డైలాగ్ డెలివరీ ఇలా ప్రతివిషయం లో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు .ఇక అనుష్క విషయానికి వస్తే పూర్తిగా కల్పిత పాత్ర కావడం తో చాలా షేడ్స్ చూపించడానికి ట్రై చేసారు .అనుష్క కూడా పాత్రకు పూర్తి న్యాయం చేసింది .ఆమె నటనలో కానీ ఎక్స్ప్రెషన్స్ లో కానీ ఎక్కడ వంక పెట్టడానికి లేదు కాకపోతే ఆమె శరీరం లోని భారీతనం ఆమెకు కూడా భారంగా నే తయారైంది . ప్రజ్ఞ జైస్వాల్ జగపతిబాబులు పాత్ర పరిధిమేరకు బాగానే చేసారు .ఇక శ్రీవారిగా నటించిన సౌరబ్ జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి .అతను పలికించిన హావభావాలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దిగివచ్చాడా అన్నట్టు అనిపించాడు.శ్రీదేవి భూదేవి గా నటించిన విమల రామన్, అస్మిత పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు .రావు రమేష్ తన మేనరిజానికి పూర్తి విరుద్ధంగా విభిన్నమైన పాత్రను పోషించారు .మిగతా సీనియర్ నాటినటులంతా ఆకట్టుకున్నారు .

టెక్నిషన్స్ విషయానికి వస్తే సినిమా కి ప్రాణం గా నిలిచాడు సంగీత దర్శకుడు కీరవాణి .పాటలపరంగా కొంత మేరకే ఆకట్టుకున్న కీరవాణి ఆర్ ఆర్ పరంగా 100 శాతం న్యాయం చేసాడు ముక్యంగా క్లైమాక్స్ సీన్స్ అయితే అతని ఆర్ ఆర్ వలన ప్రతి ప్రేక్షకుడి కంట్లో నీళ్లు తిరుగుతాయి. కెమెరామన్ ఎస్ గోపాల్ రెడ్డి కష్టం నిజాయితీ ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది. కష్టమైన లొకేషన్స్ లో కూడా చాల వైవిధ్యమైన ఫ్రేమింగ్ తో అలరించాడు ముఖ్యంగా విశ్వరూప దర్శనం వంటి ఫ్రేమ్ లలో గోపాల్ రెడ్డి ప్రతిభ ఎంత గొప్పదో అర్ధం అవుతుంది. అలానే ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ చాల రియలిస్టిక్ సెట్టింగ్స్ తో నాలుగు వందల సంవత్సరాల క్రితం తిరుమల ఎలా ఉండేదో అలానే చూపించారు. దానివల్ల సినిమాకి మంచి ఫీల్ వచ్చింది. ఇక ఇరవై నాలుగు విభాగాలను అనుసంధానం చేస్తూ తన మొత్తం ఎక్సపీరియన్సు ను అంత వాడి టెక్నికల్ గా కూడ అప్డేట్ అయ్యి రాఘవేంద్రరావు గారు తెరకు ఎక్కించిన ఈ సినిమా అయన గత చిత్రాలతో పోలిస్తే ఒక అద్భుత దృశ్య కావ్యం గా నిలిచిపోయింది

ఓవర్ అల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఫీల్ పరంగా అన్నమయ్యను కూడా దాటేసింది అనే ఒప్పుకోవాలి అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు అతిశయోక్తి అనిపించే సన్నివేశాలు ఉన్న కూడా ఓవర్ అల్ గా మాత్రం ప్రతి ప్రేక్షకుడికి భక్తి రసాత్మక అనుభూతిని ఇస్తుంది ఓం నమో వెంకటేశాయ ..

 

ప్లస్ పాయింట్స్

నాగార్జున

డైరెక్షన్

కెమెరా పనితనం

బ్యాగ్రౌండ్ మ్యూజిక్

నిర్మాణ విలువలు

 

మైనస్ పాయింట్స్

కొన్ని కల్పిత దృశ్యాలు

ఎలివేట్ కాని కామెడీ ట్రాక్

 

రేటింగ్ 3/5

18:26 - February 10, 2017

హైదరాబాద్: నీలోఫర్‌లో బాలింతలమృతిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. 9రోజుల వ్యవధిలో.. ఐదుగురు బాలింతలు చనిపోవడంతో... ఆస్పత్రి సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంవోపై బదిలీ వేటు పడింది. బాలింతల మృతిలో ఈ ఇద్దరు అధికారుల నిర్లక్ష్యం ఉందని సర్కారుకు... హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా సమర్పించిన నివేదికలో ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది.

18:23 - February 10, 2017

చెన్నై: తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రముఖ నటుడు రజనీకాంత్ కొత్త పార్టీ స్థాపిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త గురుమూర్తి ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రజనీకాంత్, బీజేపీ మధ్య తాను సయోధ్య కుదురుస్తున్నానంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

18:20 - February 10, 2017

హైదరాబాద్‌ : పాతబస్తీలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. షాయినాయత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ట్రాఫిక్‌కు విరుద్ధంగా బైక్‌పై ఓ ఆటోకు ఎదురు వచ్చాడు. మహిళ చీరకొంగు ఆటోకు తగులుకోవడంతో ఆమె కిందపడిపోయింది. దీంతో రెచ్చిన ఆ వ్యక్తి ఆటోలోని యువకులపై విరుచుకుపడ్డాడు. వారికి చితకబాదడంతోపాటు ఆటోను ధ్వంసం చేశాడు. సీసీ టీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆటోడ్రైవర్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

నీలోఫర్ సూపరింటెండెంట్, ఆర్ఎంవోల బదిలీ

హైదరాబాద్: నీలోఫర్ లో గర్భిణీల మరణంపై ప్రభుత్వం చర్చలు జరిపింది. నీలోఫర్ సూపరింటెండెంట్, ఆర్ ఎంవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సూపరింటెండెంట్, ఆర్ ఎంవోలను వైద్య విద్యా సంచాలకులకు అప్పగించారు. నీలోఫర్ సూపరింటెండెంట్ గా కోఠీ మెటర్నిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శైలజ ను నియమించారు.

17:35 - February 10, 2017
17:34 - February 10, 2017

ఖమ్మం: తెలంగాణ వచ్చినా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పూ రాలేదని... సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.. కొత్త రాష్ట్రం ఏర్పాటైనా ఇంకా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. నిరుద్యోగులు అలాగే ఉన్నారని... కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు పర్మినెంట్‌ కాలేదని ఆరోపించారు.. ఖమ్మం జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది.. పలు గ్రామాల్లో పర్యటించిన పాదయాత్ర బృందానికి స్థానికులు ఘనస్వాగతం పలికారు..

17:24 - February 10, 2017

45 పి అంటే ఏమిటీ ? భూమి ధ్వంసం కావడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ సోషల్ మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 45 పి పేరిట పిలిచే తోక చుక్క ఒకటి శనివారం ఉదయం అంతర సౌర కుటుంబం మీదుగా ప్రయాణించనున్నట్లు, భూమికి అంత్యంత సమీపంగా దూసుకెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తోకచుక్క ఢీ కారణంగా ఏదైనా నక్షత్ర శకలం భూమిని ధ్వంసం చేస్తుందా అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నట్లు టాక్. దాని గమనంపై కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. ఓ తోక చుక్క భూమికి ఇంత దగ్గరగా ప్రయాణించడం ఇదే తొలిసారి అని మైనర్ ప్లానెట్ సెంటర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. బైనాక్యులర్స్ తో 45పి ని స్పష్టంగా చూడవచ్చని పేర్కొన్నారు. తూర్పు ఆకాశంలో అధికంగా ఉండే హెర్క్యూలస్ నక్షత్ర మండలం మీదుగా తోకచుక్క ప్రయాణం చేయనున్నట్లు, సౌర మండలంలో అత్యంత దగ్గరగా వస్తున్న కారణంగా దాని పరిమాణం కూడా పెద్దగా ప్రకాశిస్తూ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. శనివారం ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వేచి చూడాలి. 

గవర్నర్ ప్రకటనపై ఉత్కంఠ..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో ఓ ప్రకటన విడుదల చేస్తారని ప్రచారం జరుగుతున్నా అలాంటి ప్రకటన మాత్రం వెలువడడం లేదు. దీనితో శశికళ, పన్నీర్ సెల్వం వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆయన ప్రకటన చేసే అవకాశం ఉంది. 

ప్రకాశం జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాస..

ప్రకాశం : జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఎంపీడీవోలు అవమానిస్తున్నారని ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఆందోళన చేపట్టారు. స్థానిక ఎంపీడీవోలు ప్రొటోకాల్ పాటించకుండా అవమానించడానికి స్థానిక ఎమ్మెల్యేలే కారణమని ఆరోపించారు. పోడియం వద్ద ఛైర్మన్ హరిబాబు బైఠాయించారు. 

16:54 - February 10, 2017

పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన నోట్ల సంక్షోభం నుండి ఇంకా గట్టెక్కలేదు. దీనిని క్యాష్ చేసుకోవాలని అనుకొనే వారు నకిలీ నోట్లు ముద్రిస్తున్నారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా...కొత్తనోట్లను అచ్చుగుద్దినట్లు తయారు చేస్తున్నారు. నకిలీ..అసలో తేల్చుకోలేక పోతున్న అమాయకులకు అంటగడుతున్నారు. కానీ ఈ నోట్ల తయారీ చేసినా ..చలామణీ చేసినా..మార్కెట్ లోకి తీసుకెళ్లినా...చివరకు జేబులో ఉన్నా సరే..ఎలాంటి శిక్షలు పడుతాయో 'మీకు తెలుసా'...ఎలాంటి శిక్షలు పడుతాయో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

16:45 - February 10, 2017

కోతలు గోసుట్ల మన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రాలు తర్వాతనే ఎవ్వలైనా..? అమెరికాకు వొయ్యి అమరావతిని గిట్లనే జేస్తాంటడు.. జపానుకు వొయ్యి అమరావతిని టోక్యో జేస్తాంటడు శ్రీలంకకు వొయ్యి శ్రీలంక టెక్నాలజీ వాడుతాంటడు.. ఇంట్ల ఇత్తులేదు కంటికి నిద్రలేదన్నట్టు.. ఇగ ఆ సారు అన్ని అంతర్జాతీయ ముచ్చట్లే మాట్లాడ్తడు గని..? ఆయన రాష్ట్రంల పరిపాలనను మాత్రం అస్సలే వట్టిచ్చుకోడు..అనడానికి ఒక చిన్న ఉదహారణ. తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

16:44 - February 10, 2017

అమరావతి: సారా ఉద్యమ నేత దూబగుంట రోశమ్మ ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు పని చేయాలని ఎంపి కవిత అన్నారు. అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. పురాణాల్లోని అమ‌రావ‌తి వైభ‌వాన్ని సాధించాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. దేశంలో మహిళలు ఎద‌గడానికి అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఇందిరా గాంధీ, రాణీ రుద్ర‌మ‌దేవీ వంటి ఎంతో మంది మ‌హిళ‌లు ఎన్నో విజ‌యాలు సాధించి స్త్రీ శ‌క్తిని చూపించారని ఆమె అన్నారు. గాంధీజి ఇచ్చిన పిలుపుతో ఇదే విజ‌య‌వాడ‌లో వంద‌ల మంది మ‌హిళ‌లు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైళ్ల‌కు కూడా వెళ్లార‌ని కవిత అన్నారు. భార‌త మ‌హిళ‌ల‌కు లీడ‌ర్ షిప్ కొత్త‌కాదని చెప్పారు. కొత్త విష‌యం ఏంటంటే మ‌హిళల ప‌ట్ల పెరుగుతున్న వివ‌క్ష అని చెప్పారు.

16:42 - February 10, 2017

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీకి సంబంధించి సవరణలు చేయాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో నియమించిన కమిటీలు సమావేశమయ్యాయి. ఇప్పటికి మూడుసార్లు కమిటీలు సమావేశమయ్యాయి. ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ...చట్టాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క. అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తే బాగుంటుందంటున్న భట్టి స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

16:41 - February 10, 2017

రామాయణం, మహాభారతం రెండింటిని.. రోట్లేశి నూరితె తయ్యారైందే తమిళనాడు రాజకీయం అంత అద్భుతంగ నడుస్తున్నది ఆడ యవ్వారం..మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు సీఎం గాకముందుకు గడ్కోపారి జెప్తుండే తెలంగాణ రాష్ట్రం ఎందుకు గావాలె అంటే..? నీళ్లు నిధులు నియామకాలు అని..తెలంగాణల ఏడనన్న కొత్తగ కరెంటి తయ్యారు జేస్తున్నరా అంటే.. ఏడగూడ ఒక్క యూనిట్ తయ్యారు జేస్తలేరు.. కోతలు గోసుట్ల మన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రాలు తర్వాతనే ఎవ్వలైనా..?మామూల్గనైతె పోలీసోళ్లు ఎప్పుడో ఒక్కపారి మంచి పనిజేస్తుంటరు.. ఆదిలాబాద్ జిల్లా పోలీసోళ్లు ఇప్పుడు జేశిండ్రు.. గుడిలె శఠగోపం, దేవుండ్ల పెయ్యిమీదున్న నగలను దోసుడుగాదు.. ఏకంగ దేవున్నే లేపి అవుతలేశిండ్రు..మేడారం జాతర మళ్ల సుర్వైందిగదా..? అగో రెండేండ్లకు ఒక్కపారొస్తది..?...సుట్టు ముట్టు అడ్విల మన్సులు ఎవ్వలు లేరు..అసోంటి యాలకు రెండూ చిర్తపులులు ఆ అడ్విలున్నయి..గిసొంటి ముచ్చట్ల కోసం మల్లన్న ముచ్చట్లు సూడుండి..

16:39 - February 10, 2017

హైదరాబాద్:ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టానికి తూట్లు పొడిచేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్రపన్నుతోందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. పోరాడి సాధించుకున్న సబ్‌ప్లాన్‌ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తే.. ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. సబ్‌ప్లాన్‌ చట్టం కోసం మరో ఉద్యమానికి సిద్ధమని ప్రకటించారు. దళిత, గిరిజన , ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నా నిర్వహించారు. ఇందుల్లో పాల్గొన్న సున్నం రాజయ్య...ఎస్సీ,ఎస్టీల నిధుల మళ్లింపు ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఇదే ధర్నాలో పాల్గొన్న సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌.. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ స్పూర్తిగా విరుద్దంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ ధర్నాలో దళిత, గిరిజన నేతలతోపాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

16:37 - February 10, 2017

హైదరాబాద్:తమిళనాట మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లో రానున్నట్లు సోషల్ మీడియా, మీడియాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అందుకోసం ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతకర్త తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. మరో వైపు బిగ్ బీ అమితాబచ్చన్ మాత్రం రాజకీయాల్లోకి రావద్దని రజనీకి సూచించినట్లు సమాచారం. జయలలిత మృతి చెందినప్పటి నుంచి రజనీకాంత్ తో బిజెపి సంబంధాలు నెరుపుతున్నట్లు తెలుస్తోంది.

16:33 - February 10, 2017

రాజకీయాల్లో కి రజనీకాంత్ ?

చెన్నై : ప్రముఖ నటుడు రజనీకాంత్ రాజకీయాల్లో వస్తున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. సొంతపార్టీ పెడుతారని ప్రచారం జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఒకరు రజనీతో చర్చించినట్లు, రాజకీయాల్లోకి రావద్దని బిగ్ బి అమితాబ్ సూచించినట్లు తెలుస్తోంది. 

16:23 - February 10, 2017

సెంటిమెంట్స్ కి అతీతుడు తాను పట్టిన కుందేలుకి కళ్ళేలేవు వీల్ చైర్ లో తిరుగుతుంది అని చెప్పే క్రియేటివ్ డైరెక్టర్. చిన్న చిన్న కెమెరాలతో పెద్దసినిమాలు తీసే సినీ టెక్నాలజీ తెలిసిన దర్శక జీవి. తన పుట్టిన రోజుకి తానే గిఫ్ట్ ఇచ్చుకుంటున్నాడు ..ఆ గిఫ్ట్ ఏంటో ఆ జీవి ఎవరో చూద్దాం. భారత సినీ ఇండస్ట్రీ లో భీష్ముడు లాంటి వాడు అమితాబచ్చన్. 74 సంవత్సరాల వయస్సులో కూడా నటన మీద మక్కువతో యాక్టింగ్ లో కంటిన్యూ అవుతున్న అమితాబచ్చన్ ఈ మధ్య చేస్తున్న సినిమాలు ఎంతో వైవిధ్యంగా ఉంటున్నాయి. హిందీ లో బ్లాక్, పా, పీకు, పింక్ వంటి డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తూనే ఇటు పరభాషా చిత్రాల్లో గెస్ట్ రొలెస్ కూడా వేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నటించిన 'మనం' సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేసి మరొక్కసారి తనకి తెలుగు ఇండస్ట్రీ మీద అభిమానాన్ని చాటుకున్నారు.

హిట్ ఫిలిం సర్కార్..
అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన బాలీవుడ్ హిట్ ఫిలిం సర్కార్. మహారాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో తెరకెక్కిన సర్కార్ సినిమా బాక్స్ ఆఫీసుల్ని కాసులతో నింపేసింది. అటు అమితాబచ్చన్ కి ఇటు రాంగోపాల్ వర్మకి మంచి పేరు తెచ్చిపెట్టిన ఈ సినిమా బచ్చన్ సాబ్ ని ఆర్ జి వి నీ మంచి మిత్రులుగా కూడా మార్చేసింది. 2005 లో రిలీజ్ ఐన 'సర్కార్' మంచి కలెక్షన్లతో దూసుకెళ్లింది. అదే ఫ్లో నీ కంటిన్యూ చేస్తూ 2008 లో సర్కార్ సినిమాకి సీక్వెల్ గా 'సర్కార్ రాజ్' సినిమాని తీశాడు. అనుకున్న స్థాయిలో 'సర్కార్ రాజ్' సినిమా ఆడియన్స్ ని రీచ్ అవ్వలేదు.

వర్మలో సాధారణ జీవి ? 
'అమితాబచ్చన్' తో ఎనిమిది సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ ఈసారి 'సర్కార్ 3' తో వస్తున్నాడు. 'సర్కార్ 3' లో యాంగ్రీ ఆడియన్స్ మెచ్చే స్థాయిలో అమితాబచ్చన్ న్ను ప్రెజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు సెంటిమెంట్స్ ఉండవ్ అని చెప్పుకునే రాంగోపాల్ వర్మ ఈ 'సర్కార్ 3' సినిమాని తన బర్త్ డే ఏప్రిల్ 7 న రిలీజ్ చేస్తున్నట్లు అని చెప్పడం, రీసెంట్ గా జరిగిన వంగవీటి ఫంక్షన్ లో ఒట్టు..ప్రామిస్ లు అనడం చూస్తుంటే ఆర్ జివి సాధారణ జీవి అవుతున్నాడా అని అనుమానం రాకమానదు. 'సర్కార్ 3' సినిమా చూడాలంటే మాత్రం ఏది ఏమైనా 'రాంగోపాల్' వర్మ బర్త్ డే ఏప్రిల్ 7 వరకు ఆగాల్సిందే..

అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు - ఎంపీ కవిత..

విజయవాడ : జాతీయ మహిళా పార్లమెంటేరీయన్ల సదస్సు జరుగుతోంది. సహాయ నిరాకరణ ఉద్యమంలో మహిళలు జైలుకెళ్లారని, దేశం కోసం మహిళలు త్యాగం చేశారని ఎంపీ కవిత తెలిపారు. దేశానికి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యిందని, అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు.

 

పార్లమెంటేరీయన్ల సదస్సు వద్ద డ్రైవర్ల ధర్నా..

విజయవాడ : అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటేరీయన్ల సదస్సు వద్ద డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెట్టలేదంటూ ధర్నాకు దిగడంతో అధికారులు స్పందించారు. వెంటనే వారికి భోజన సౌకర్యం కల్పించారు. 

మీడియాతో మాట్లాడిన శశికళ వర్గం ఎమ్మెల్యేలు..

చెన్నై : గోల్డెన్ బే రిసార్ట్ లో మీడియాతో 11 మంది శశికళ వర్గం ఎమ్మెల్యేలు మాట్లాడారు. శశికళ, సెల్వం అధిపత్య పోరుతో విసిగిపోయామని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. శశికళ, పన్నీర్ సెల్వం ఆరోపణలు..ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. 

అంధుల టి.20 ప్రపంచకప్..ఫైనల్ లో భారత్..

హైదరాబాద్ : అంధుల టీ 20 ప్రపంచకప్ ఫైనల్ లోకి భారత్ ప్రవేశించింది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంక 168 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 13 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆదివారం బెంగళూరులో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ విజయంతో వరుసగా రెండో సారి భారత్ ఫైనల్ లోకి ప్రవేశించినట్లైంది. రేపు ఇంగ్లండ్ - పాకిస్థాన్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

విమానంలో సేఫ్టీ డోర్ ఓపెన్ చేసిన ప్రయాణీకుడు..

ముంబై : ఓ విమాన ప్రయాణీకుడు చేసిన చర్య వల్ల విమానం నిలిచిపోయింది. ముంబై నుండి ఛండీగడ్ వెళుతున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణీకుడు సేఫ్టీ డోర్ ఓపెన్ చేశారు. టేక్ ఆఫ్ సమయంలో చేయడంతో విమానం నిలిచిపోయింది. సదరు ప్రయాణీకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

15:49 - February 10, 2017

చెన్నై: అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ గా మధుసూదనన్ కు శశికళ ఉద్వాసన పలికారు. ఆయన స్థానంలో సెంగొట్టయ్యన్ నియమిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాదు, అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా ఆయనను తొలగించారు. శశికళ వర్గం నుంచి బయటకు వచ్చిన మధుసూదనన్ నిన్ననే పన్నీర్ సెల్వం శిబిరంలో చేరారు. ఎంజీ రామచంద్రన్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించే సమయంలో మధుసూదనన్ కీలకపాత్ర పోషించారు. అనంతరం జయలలితకు కూడా నమ్మకస్తుడిగా ఉన్నారు.

15:44 - February 10, 2017

హైదరాబాద్: కేంద్రంలో సీఎం కేసీఆర్ ను కాగితం పులి అనుకుంటున్నారని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ అన్నారు. రేపటి నుండి తెలంగాణ లో ప్రజా పోరు కార్యక్రమాన్ని నిర్వహించ బోతున్నారు. ఈ సందర్భంగా ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ..ఎన్నికల సందర్భ:గా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు కాబట్టి 2017 బడ్జెట్ లో పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ఫీజురీఇంబర్స్ మెంట్, కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ ఉచిత విద్య, మైనార్టీలు, గిరిజనులు హక్కులు, మహిళలను మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఇలాంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యింది. వాటిన్నింటి మీద ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా పోరు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్, ప్రజా సమస్యలపై టిడిపి ఆందోళనలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. టిడిపి, టిఆర్ ఎస్ కలసి 2019లో పోటీ చేయనున్నారు అన్న ప్రశ్న కు రేవంత్ సమాధానం ఇస్తూ ఐఎస్ఐ ఏజెంట్ తో కలిసి ఎవరైనా పని చేస్తారా అంటే కేసీఆర్ ఐఎస్ఐ లాంటి వాడు అలాంటి వారితో కలిసి ఎలా పని చేస్తాం అని చలోక్తులు విసిరారు.

15:40 - February 10, 2017
15:39 - February 10, 2017

సినిమా ఇండస్ట్రీ అంటేనే అవకాశాల కోసం ఎదురుచూడటం .ఒక్క చిన్న ఛాన్స్ వస్తే చాలు తామేంటో నిరూపించుకోవాలని ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరు అనుకుంటారు. పట్టు విడువకుండా అవకాశాల కోసం పరిగెడుతుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ డం ఉన్న హీరో పిలిచి అవకాశం ఇస్తే కాదన్నాడు ఒక అప్కమింగ్ రైటర్. పవన్ కళ్యాణ్ ...సినిమా హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా క్రేజ్ ఉన్న హీరో. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే స్థాయిలో ఉన్న హీరో. అటు రాజకీయంగాను ఇటు హీరోగాను తానేంటో చూపిస్తున్న పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ట్రైలర్ తో యూట్యూబ్ రికార్డులకు రీచ్ అయ్యాడు. సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఒక ట్రైలర్ కి ఆ రేంజ్ లో వ్యూస్ రావడం గొప్ప విషయం. కబాలి ట్రైలర్ తరువాత అదే స్థాయిలో వ్యూస్ వర్షం కురిపించిన ట్రైలర్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ట్రైలర్. 

అమృతం సీరియల్...
కాటమరాయుడు సినిమాతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు టీఎన్ నీశన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. తమిళ హిట్ ‘వేదాలం’కు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆల్రెడీ ప్రారంభోత్సవం కూడా జరిపారు. తమిళ్ లో సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వేదలమ్' సినిమా లో అజిత్ నటించారు. ఈ సినిమాకి యాక్షన్ సన్నివేశాలు ఎంత ముఖ్యమో మాటలు కూడా అంతే ముఖ్యం దానికోసం రీసెంట్ గా హిట్ సినిమాలకి మాటలు రాసిన డైలాగ్ రైటర్ తో పవన్ మాట్లాడాడు ఆ రైటర్ మాత్రం నో అని చెప్పేసాడు. 'పవన్ కళ్యాణ్' లాంటి పెద్ద హీరో అవకాశం ఇస్తే ఎవరన్నా వద్దంటారా? అమృతం సీరియల్ తో యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ టర్న్డ్ రైటర్ హర్షవర్ధన్ మాత్రం ఆ అవకాశాన్ని వద్దనుకున్నాడు.

డైరెక్టర్ అవ్వాలని..
ఇష్క్.. గుండెజారి గల్లంతయ్యిందే.. మనం లాంటి సినిమాలతో రచయితగా మంచి పేరు సంపాదించిన హర్షవర్ధన్ డైరెక్టర్ అవ్వాలని కొన్ని సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నాడు. అతడి ప్రయత్నం ఎట్టకేలకు ఈ ఏడాదే ఫలించింది. కొన్ని రోజుల కిందటే దర్శకుడిగా హర్షవర్ధన్ తొలి సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. ఐతే ఈ సినిమా సన్నాహాల్లో ఉండగానే.. హర్షవర్ధన్ కు పవన్ కళ్యాణ్ సినిమాకు రాసే అవకాశం వచ్చిందట. డైరెక్టర్ అవ్వాలని ఆశతో ఉన్న హర్ష వర్ధన్ పవన్ కళ్యాణ్ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసాడు. ప్రస్తుతం హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ఒక డిఫరెంట్ జోనర్ లో వెళ్తుందట. ఈ సినిమాలో యాంకర్ శ్రీముఖి తో పాటు మరో మెయిన్ లీడ్ గా హర్షవర్ధన్ నటిస్తుండడం విశేషం.  

తెలంగాణలో అదనంగా 22,001 పెన్షన్లు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అదనంగా 22,001 పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వృద్ధాప్య ఫించన్లు 6204, వితంతు 10వేలు, వికలాంగులు 2998, గీత కార్మికులు 355, చేనేత 156, హెచ్ ఐవీ బాధితులకు 2308 ఫించన్లను మంజూరు చేశారు. వచ్చే నెల నుండి లబ్దిదారులకు ఈ ఫించన్లు అందనున్నాయి. అర్హులందరికీ ఫించన్లు అందేలా చూడాలని మంత్రి జూపల్లి ఆదేశాలు జారీ చేశారు. 

భారత్ 687 డిక్లేర్డ్..

హైదరాబాద్ : బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో 687 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది.  ఈ క్రమంలో భారత్ ఆరు వికెట్లను కోల్పోయింది. కోహ్లీ (204), విజయ్ (108), సాహా (106), పుజారా (83), రహానే (82), అశ్విన్ (34) పరుగులు చేశారు. 

15:23 - February 10, 2017

సినిమా ఇండస్ట్రీలో లాభ నష్టాలను పట్టించుకోకుండా పనిచేస్తుంటారు. ఇక్కడ మన తన అనే టాపిక్స్ ఉండవు. బ్లడ్ రిలేషన్స్ అయినా డబ్బుల దగ్గర స్ట్రాంగ్ గానే ఉంటారు. ఇక్కడ ప్రతి సంబంధాలు ఆర్ధిక సంబంధాలే. ఒక సినిమాకి వర్క్ చేసామంటే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకోవాలి ఆ సినిమా హిట్ ఐనా ఫెయిల్ ఐన సంబంధం ఉండదు. నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా ప్రొడ్యూసరే భరించాలి. ప్రొడ్యూసర్ ఒక సినిమాకి పెట్టె ఖర్చులో మేజర్ పార్ట్ నటీనటులకే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులను బట్టి హీరో, హీరోయిన్స్, మిగతా కాస్ట్ కు రెమ్యూనరేషన్ డిసైడ్ చేస్తారు. అనుకున్న టైం లో సినిమా మంచి కధతో రెడీ అవ్వాలి. డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ గా ఉండాలి. హిట్ టాక్ రావాలి..కలక్షన్స్ ఫ్లో బాగుండాలి..శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవాలి.. ప్పుడు ప్రాఫిట్ జోన్ లోకి వెళ్తాడు ప్రొడ్యూసర్. ఇవన్నీ జరిగి ప్రొడ్యూసర్ లాభాల్లో ఉండాలంటే అన్నిటికన్నా ఫస్ట్ స్టెప్ సినిమా రిలీజ్ అవ్వాలి. ప్రెజెంట్ ఉన్న మార్కెట్ లో సినిమా తియ్యడం కంటే తీసిన సినిమాని రిలీజ్ చేసుకోవటం చాల కష్టంగా మారింది.

రెమ్యూనరేషన్..
తనవల్ల ప్రొడ్యూసర్స్ నష్టపోకూడదు అని అనుకున్నాడేమో తాను తీసుకున్న రెమ్యునరేషన్ ని వెనక్కి ఇచ్చేసాడు లారెన్స్ రాఘవ. ఎన్నో ఛారిటీలకు తనవంతు సాయం చేసే ఈ హీరో తాను నటించిన 'మొట్ట శివ కెట్ట శివ' అనే తమిళ్ సినిమా ప్రొడ్యూసర్ కి తనవంతు సాయం చేసాడు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు సినిమా రంగం మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ టైం లో సినిమా రిలీజ్ కొంచం కష్టం గా మారింది అని చెప్పొచ్చు. తెలుగు లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న పటాస్ సినిమాని తమిళం లో లారెన్స్ హీరోగా మెట్ట శివ కెట్ట శివగా రూపొందించారు. సినిమా నిర్మించి ఆరునెలలు అవుతున్నా ఫైనాన్షియర్స్ ప్రాబ్లెమ్ వల్ల రిలీజ్ ఆగిపోయింది. ప్రొడ్యూసర్ ని నష్టాల్లోకి నెట్టే పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న లారెన్స్ ఈ సినిమాకి గాను తాను తీసుకున్న రెమ్యునరేషన్ ను తిరిగి ప్రొడ్యూసర్ కి ఇచ్చేసాడు. లాభనష్టాలతో సంబంధం లేని ఈ ఇండస్ట్రీ లో సిచువేషన్ ని అర్ధం చేసుకొని ప్రొడ్యూసర్ కి సపోర్ట్ చేసిన లారెన్స్ కైండ్ హార్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

15:19 - February 10, 2017

పెళ్లి అంటే నూరేళ్ళ పంట. కానీ ఆ హీరోయిన్ కి మాత్రం పెళ్లి మాటంటే వొళ్ళు మంట. పెళ్లి మీద కోపమో ? పెళ్లి గురించి అడిగేవాళ్ళమీద కోపమో ? తెలియదుగాని పెళ్లి మాట ఎవరెత్తిన కోపంతో సమాధానం చెప్తుంది. హీరోయిన్స్ అంటే కెరీర్ అంతా ఐన తరువాత పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఫారెన్ లో సెటిల్ అయిపోతారు అనేది పాత మాట. రోజుకో న్యూస్ తో అప్డేటెడ్ గా ఉండే సినీ ఇండస్ట్రీ లో సెలెబ్రెటీస్ పెళ్లి గురించి తెలుసుకోవాలని అందరికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. 'లక్ష్మీ కళ్యాణం'తో తెలుగు తెరకు పరిచయమైన సూపర్ హీరోయిన్ 'కాజల్ అగర్వాల్'. తన నటనతో అందరి మనసుల్ని కొల్లకొట్టి కోలీవుడ్ లో కూడా పాగా వేసింది ఈ ముప్పై ఒక్క సంవత్సరాల ముంబై లేడీ. 'ఖైదీ నెంబర్ 150'తో మంచి హిట్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయిన అందాల హీరోయిన్ కాజల్ అగర్వాల్. గత కొన్ని రోజులుగా ఈ అమ్మడి పెళ్లి పైన రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉందని కొన్ని రూమర్స్, ముంబై కి చెందిన తన సీక్రెట్ లవర్ ని పెళ్లి చేసుకుంది అని కొన్ని రూమర్స్ ఇలా రూమర్స్ అన్ని కాజల్ చుట్టూ రౌండప్ చేసాయి. ఇన్ని రూమర్స్ తనపై వచ్చిన తరువాత కామ్ గా కూర్చోడానికి కాజల్ కి నచ్చలేదు. అందుకే తన పెళ్ళికి ఇప్పుడేం అంత తొందరలేదని..సినిమా ఇండస్ట్రీ లో కెరీర్ ని ప్లాన్ చేసుకోవడంలో బిజీ గా ఉన్నానని ఇప్పుడప్పుడే పెళ్లి అనే టాపిక్ తన లైఫ్ లో లేదని తెగేసి చెప్పింది కాజల్ అగర్వాల్. అలానే తనను ఎవరైనా పెళ్లి గురించి అడిగితే తనకు నచ్చదని, తనకు ఇంకా పర్ఫెక్ట్ పర్సన్ దొరకలేదని పెళ్లి అనేది గ్రాండ్ గా చేసుకునే సెలెబ్రేషన్ అది అందరికి తెలిసేలా చేసుకుంటా అని చెప్పేసింది కాజల్ .

15:14 - February 10, 2017

టాలీవుడ్ అయినా..బాలీవుడ్ అయినా..ఇండస్ట్రీ ఏదైతేనేంటి ఐటెం సాంగ్స్ తప్పనిసరి అయిపోయింది. స్టోరీలు లేకపోయినా సినిమాలు తీస్తున్నారు గాని ఐటెం సాంగ్ లేనిదే సినిమా కష్టం అనే పరిస్థితి కొంతమంది డైరెక్టర్స్ లో కనిపిస్తుంది. ఇదే ట్రెండ్ కి ప్రొడ్యూసర్స్ కూడా ఓకె అనేస్తున్నారు. కధ ఏదైనా, కథనం ఎలా ఉన్న ఒక ఐటెం నెంబర్ పడాల్సిందే. ఐటెం సాంగ్స్ అంటే పాపులారిటీ, క్రేజ్, పబ్లిసిటీ ఏ సెంటర్ నుండి సి సెంటర్ వరకు ఆడియన్స్ ని ఎంటెర్టైన్ చేసే మాస్ బాంబ్స్ ఈ ఐటెం సాంగ్స్. సినిమా ఇండస్ట్రీ లో ఇంతకుముందు స్పెషల్ గా ఐటెం సాంగ్స్ లో నటించి, నర్తించడానికి డాన్సర్స్ యాక్ట్రెస్ ఉండే వారు. వారికి ఓన్లీ ఫర్ ఐటెం స్పెషల్స్ గా బ్రాండ్ ఉండేది రాను రాను ట్రెండ్ మారింది. కెరీర్ స్ట్రాంగ్ గా ఉన్న టాప్ హీరోయిన్స్ కూడా ఐటెం నంబర్స్ కి ఓకె చెప్తున్నారు. యాక్టింగ్ లో నెంబర్ వన్ అనిపించుకుంటూనే తమని అభిమానించే ఫాన్స్ కి ఐటెం సాంగ్స్ రూపంలో థాంక్స్ చెప్పుకుంటున్నారు. ఐటమ్స్ సాంగ్స్ తో వచ్చే రీచింగ్ కొన్నిసార్లు కేరక్టర్స్ వేసిన రాదూ అనే ఒక థాట్ కూడా ఉంది.

టాప్ హీరోయిన్స్ సైతం..
ఒక సినిమాలో కనీసం ఐదు పాటలు ఉంటె అందులో ఒక పాట కచ్చితంగా ఐటెం సాంగ్ అవ్వాలన్నది రూల్ లా మారిపోయింది. ఫేమస్ హీరోయిన్ల ఐటెం సాంగ్స్ అంటే ఫాన్స్ కి పండగే. బి సి సెంటర్స్ లో టిక్కెట్స్ తెగే ఫార్ములాలో ఐటెంసాంగ్ కూడా ఒకటి. పాటలో ఊపు, స్టెప్పుల్లో స్పీడ్, ఫుల్ ఎనర్జీతో ఉండే ఐటెం సాంగ్స్ కి సినిమాలో స్పెషల్ ప్లేస్ ఉంది అని ఒప్పుకోవాల్సిందే. ఐటమ్స్ సాంగ్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన రీసెంట్ హీరోయిన్స్ లో శృతిహాసన్, తమన్నా, అంజలి లాంటివారు ఉంటే, జనతా గ్యారేజీ సినిమాతో కాజల్ కూడా ఐటెం నెంబర్లోకి ఎంట్రీ ఇచ్చింది.

అనసూయ..
ఇలా హీరోయిన్స్ తో ఐటెం సాంగ్ చేయించటం ఒక ఫార్ములా అయితే ఇప్పుడూ టివి యాంకర్లతో స్టెప్పులు వేయించడం నయా ట్రెండ్ గా మారింది. యాంకర్ ఉదయభాను, యాంకర్ రేష్మి ఆల్రెడీ తమ సత్తా చూపించేశారు. అదే వే లో వచ్చిన అనసూయ కూడా సోగ్గాడే చిన్నినాయనా లో నాగ్ తో కలిసి స్టెప్పులు వేసిన నలుగురు హీరోయిన్స్ లో కలిసిపోయింది తప్ప సోలోగా సాంగ్ చేసే ఛాన్స్ రాలేదు. కానీ ఇప్పుడూ సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న 'విన్నర్' సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోంది యాంకర్ అనసూయ. సాంగ్ కూడా తన పేరుతోనే మొదలవ్వటం ఈ సాంగ్ ని మరో టివి యాంకర్ సుమ పాడటం సినీ వర్గాల్లో స్పెషల్ టాపిక్ గా మారింది.

కాసేపట్లో విద్యాసాగర్ ప్రకటన ?

చెన్నై : తమిళనాడు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు రాష్ట్ర పరిస్థితులపై ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీఎం పీఠం కోసం అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ మధ్య పోరు కొనసాగుతోంది. 

టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ రికార్డు..

హైదరాబాద్ : టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ రికార్డు సృష్టించింది. వరుసగా 3 టెస్టు మ్యాచ్ ల్లో 600లకు పైగా భారత్ స్కోరు సాధించింది. 

మధుసూధన్ తొలగింపు...

చెన్నై : ప్రొసీడియం ఛైర్మన్ గా మధుసూధన్ ను తొలగిస్తున్నట్లు శశికళ ప్రకటించారు. ఆయన స్థానంలో సెంగొట్టయ్యన్ ను శశికళ నియమించింది. అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఈ ప్రకటన చేశారు. పన్నీర్ సెల్వం మద్దతుదారుడిగా మధుసూధన్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

పది రోజుల పాటు నిరసనలు - పొన్నాల..

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పది రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు టి.కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. 19న వికారాబాద్ లో కార్యక్రమానికి దిగ్విజయ్ హాజరవుతారని, ధరల నియంత్రణలో మోడీ ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. నోట్ల రద్దుతో దేశాన్ని అథోగతి పాలు చేశారని, తెలంగాణలో దౌర్భాగ్యపు పాలన సాగుతోందని విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన మాటలను తప్పిన తొలి సీఎం కేసీఆర్ అని, కేసీఆర్ దళిత వ్యతిరేకి అని పేర్కొన్నారు. 

మంత్రి చందూలాల్ నేతృత్వంలో కమిటీల సమావేశం..

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లపై డిప్యూటి సీఎం కడియం మంత్రి చందూలాల్ నేతృత్వంలోని కమిటీల సమావేశం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, భట్టి, సంపత్ తదితరులు హాజరయ్యారు. సబ్ ప్లాన్ పై ఉన్న 10 ఏళ్ల నిబంధనను తొలగించాలని, ప్రగతి పద్దును నిరంతరం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. 

టీఆర్ఎస్ కు ప్రజాస్వామ్య స్పూర్తి లేదు - మల్లు భట్టి..

హైదరాబాద్ : టీఆర్ఎస్ కు ప్రజాస్వామ్య స్పూర్తి లేదని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సబ్ ప్లాన్ పై అఖిలపక్షాన్ని సమావేశపరచాలని సూచించారు. దారి మళ్లిన నిధులపై స్పష్టతనివ్వాలని, కొత్త చట్టాన్ని అంగీకరించేది లేదన్నారు. ఇప్పటి వరకు నిధులు కేటాయించని, ప్రభుత్వంపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. 

కోదండరాం మాటలు నమ్మొద్దు - సుమన్..

హైదరాబాద్ : నిరుద్యోగులు కోదండరాం మాటలు నమ్మొద్దని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, మరిన్ని నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పూర్తి చేయని ప్రాజెక్టులను తాము పూర్తి చేయడం జరుగుతోందని, టీఆర్ఎస్ ను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని పేర్కొన్నారు. 

హోం గార్డు అక్రమ వసూళ్లు..

పెద్దపల్లి : గోదావరిఖనిలో హోం గార్డు రాధాకృష్ణ అక్రమ వసూళ్లు బయటపడ్డాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారి నుండి వసూళ్లకు పాల్పడుతూ మీడియాకు హోంగార్డు రాధాకృష్ణ చిక్కాడు. ట్రాఫిక్ సీఐ వద్ద రాధాకృష్ణ హోం గార్డుగా పనిచేస్తున్నాడు. గతంలోనూ రాధాకృష్ణపై ఆరోపణలు వచ్చాయి. 

14:36 - February 10, 2017

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ భేటీ అయింది. సబ్‌ప్లాన్‌ పై ఉన్న 10ఏళ్ల నింబంధనను తొలగించడంతోపాటు ప్రగతిపద్దును నిరంతరం కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు గీతారెడ్డి , మల్లు భట్టి విక్రమార్కతోపాటు నల్లాల ఓదేలు , రసమయిబాలకిషన్‌ హారైయ్యారు. వీరితోపాటు ఎంపీలు సీతారంనాయక్‌, బాల్కసుమన్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

14:35 - February 10, 2017

విశాఖ : ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్రత్యేక హోదా సాదన సమితి ఆధ్వర్యంలో విశాఖలోని జీవీఎంసీ వద్ద రెండోరోజు దీక్ష కొనసాగుతోంది. 72 గంటలపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రత్యేక హోదా సాదన సమితి సభ్యలు చలసాని శ్రీనివాస్‌కు వామపక్షనేతలు మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చలసాని శ్రీనివాస్‌ అన్నారు. కేంద్రం మెడలు వంచైనా..ప్రత్యేక హోదాను సాధిస్తామని చలసాని శ్రీనివాస్‌ స్పష్టం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా విశాఖ ప్రతినిధి జార్జ్‌ అందిస్తారు.

14:33 - February 10, 2017

చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. శశికళ వర్గంలో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భద్రతపై గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆరా తీస్తున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు రాష్ట్ర డీజీపి గవర్నర్ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. శశకళ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలంతా సురక్షితంగా ఉన్నారా లేదా అన్నది చూడాల్సి ఉందని డిజిపికి గవర్నర్ సూచించారు. శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల భద్రతపై నిన్న పీఎంకే మద్రాసు హైకోర్టులో పిటీషన్‌ వేసింది. పిఎంకే పిటీషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర పోలీసుశాఖను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో డీజీపీతో గవర్నర్‌ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గవర్నర్ ఆదేశాలతో డిజిపి కాసేపటిక్రితమే శశికళ వర్గం ఎమ్మెల్యేలున్న ప్రాంతం దగ్గరకు వెళ్లేందుకు సన్నద్దమయ్యారు. చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్డెన్‌బె రిసార్ట్స్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరిని శశికళ బంధించింది. ఒక్కో రిసార్టులో 30 మంది ఎమ్మెల్యేల చొప్పున..మొత్తం నాలుగు రిసార్ట్స్‌లో ఎమ్మెల్యేలను దాచిపెట్టి వారు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాదు ఒక్కో ఎమ్మెల్యేకు ఇద్దరు చొప్పున బాడీగార్డులను కూడా ఏర్పాటుచేసింది. ఎమ్మెల్యేల దగ్గరున్న సెల్‌ఫోన్లను ఇప్పటికే లాక్కున్న శశికళవర్గం..వారికి న్యూస్‌ పేపర్లు, టీవీలను కూడా అందుబాటులో లేకుండా చేసింది. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు శశికళకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. భోజనం చేయకుండా రిసార్ట్స్‌లోనే ఆందోళన చేస్తున్నట్లు సమాచారం.

14:32 - February 10, 2017

చెన్నై: చిన్నమ్మ శశికళపై పన్నీరు సెల్వం మరో బడా అస్త్రాన్ని ప్రయోగించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికపై సవాల్‌ చేస్తూ పన్నీరు సెల్వం ఈసీకి ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదంటూ,.ఆ ఎన్నికను పరిగణలోకి తీసుకోవొద్దని ఈసీకి ప్రిసీడియం ఛైర్మన్‌ లేఖ రాశారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావాలంటే పార్టీ సభ్యత్వం తీసుకొని ఐదేళ్లు నిండిన వారై ఉండాలి. అయితే శశికళ 2012లో పార్టీసభ్యత్వం తీసుకున్నారని సభ్యత్వం తీసుకొని ఐదేళ్లు పూర్తికాలేదని..దాంతో ఆమె ఎన్నిక చెల్లదని ప్రిసీడియం ఛైర్మన్‌ ఈసీని కోరారు.

14:12 - February 10, 2017

మహిళా వార్తల సమాహారం మానవి న్యూస్... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

14:09 - February 10, 2017

భద్రాద్రికొత్తగూడెం : జిల్లాలో మహాజన పాదయాత్ర జోరుగా సాగుతోంది. 117వ రోజుకు చేరుకున్న యాత్రలో వామపక్షాల కార్యకర్తలు, దళితసంఘాల నేతలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటికే 24జిల్లాల్లో పూర్తయిన యాత్రలోప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

14:03 - February 10, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. శశికళ వర్గంలో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భద్రతపై గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆరా తీస్తున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు రాష్ట్ర డీజీపి గవర్నర్ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. శశకళ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలంతా సురక్షితంగా ఉన్నారా లేదా అన్నది చూడాల్సి ఉందని డిజిపికి గవర్నర్ సూచించారు. శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల భద్రతపై నిన్న పీఎంకే మద్రాసు హైకోర్టులో పిటీషన్‌ వేసింది. పిఎంకే పిటీషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర పోలీసుశాఖను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో డీజీపీతో గవర్నర్‌ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గవర్నర్ ఆదేశాలతో డిజిపి కాసేపటిక్రితమే శశికళ వర్గం ఎమ్మెల్యేలున్న ప్రాంతం దగ్గరకు వెళ్లేందుకు సన్నద్దమయ్యారు. చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్డెన్‌బె రిసార్ట్స్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరిని శశికళ బంధించింది. ఒక్కో రిసార్టులో 30 మంది ఎమ్మెల్యేల చొప్పున..మొత్తం నాలుగు రిసార్ట్స్‌లో ఎమ్మెల్యేలను దాచిపెట్టి వారు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాదు ఒక్కో ఎమ్మెల్యేకు ఇద్దరు చొప్పున బాడీగార్డులను కూడా ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేల దగ్గరున్న సెల్‌ఫోన్లను ఇప్పటికే లాక్కున్న శశికళవర్గం..వారికి న్యూస్‌ పేపర్లు, టీవీలను కూడా అందుబాటులో లేకుండా చేసింది. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు శశికళకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. భోజనం చేయకుండా రిసార్ట్స్‌లోనే ఆందోళన చేస్తున్నట్లు సమాచారం. 

 

13:57 - February 10, 2017


హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై చర్చించేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సబ్‌కమిటీ చైర్మన్‌ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులు జగదీశ్‌రెడ్డి, చందూలాల్‌తో పాటు ఎస్సీ, ఎస్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు, ఇతర అంశాలపై సబ్‌కమిటీ చర్చిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:45 - February 10, 2017

భద్రాద్రి కొత్తగూడెం : యాదవులకు గొర్రెలను పంపిణీ చేస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం.. ముందుగా వాటికి సంబంధించిన గైడ్‌లెన్స్‌ విడుదల చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. మూగజీవాలు గడ్డి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం మహాజన పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది. గిరిజనుల సమస్యలను తమ్మినేని బృందం అడిగి తెలుసుకుంది.
గైడ్‌లైన్స్‌ విడుదల చేయాలి తమ్మినేని 
గొర్రెల పెంపకం దార్లకు గొర్రెలు ఇస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం.. ముందుగా కమిటీ వేయాలని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. గొర్రెల పంపణీకి సంబంధించిన గైడ్‌లైన్స్‌ విడుదల చేయాలని తమ్మినేని కోరారు. గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడుభూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న తమ్మినేని.. ప్రభుత్వం తన చర్యలను మానుకోవాలని హితవు పలికారు.
నల్ల మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలి : తమ్మినేని
సింగరేణి కార్మికులను ఇళ్ల స్థలాల పేరుతో మోసం చేసిన నల్ల మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కార్మికుల సొమ్ముతో విద్యా వ్యాపారం చేస్తున్న నల్ల మల్లారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలని కోరారు. డెవలప్‌మెంట్‌ కోసం కార్మికులు చెల్లించిన మొత్తాన్ని వడ్దీతో సహా తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. 
ఇల్లందు నియోజకవర్గంలోకి 
సీపీఎం మహాజన పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఇల్లందు నియోజకవర్గంలోకి చేరుకుంది. జిల్లాలోని చాతకోట, ఎర్రకుంట, నవభారత్‌ నగర్‌, మంచికంటి నగర్‌, ఇల్లందు క్రాస్‌రోడ్డు అనిశెట్టి పల్లి, బొమ్మన పల్లి, తులానగర్‌, టేకులపల్లి గ్రామాల్లో పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగింది. ఇప్పటి వరకూ సుమారు 3 వేల 70 కిలో మీటర్ల మేర యాత్ర పూర్తి చేసుకుంది. పాదయాత్ర బృందానికి కాంగ్రెస్‌, టీడీపీ నేతలతో పాటు వివిధ సామాజిక సంఘాల నేతలు అపూర్వ సాగతం పలికి.. పాదయాత్రలో పాల్గొన్నారు. అన్ని వర్గాల వారు తమ సమస్యలను పాదయాత్ర బృంద సభ్యులకు చెప్పుకుంటున్నారు.
మరింత ఉత్సాహంగా ముందుకు 
ఇప్పటికే 11 వందలకు పైగా గ్రామాల్లో సాగిన యాత్ర మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. దళితులు, గిరిజనుల పోడుభూములపై ప్రభుత్వ తీరును పాదయాత్రలో నాయకులు ఎత్తిచూపుతున్నారు. ప్రజలను చైతన్య పరుస్తూ కొనసాగుతున్న సీపీఎం పాదయాత్ర 116 రోజులు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో 10టీవీ ఎండీ వేణుగోపాల్‌, సీవోవో సజ్జాప్రసాద్‌ పాల్గొన్నారు. 

 

13:36 - February 10, 2017

కృష్ణా : మహిళలను గౌరవిస్తేనే అన్నింటికి శ్రేయస్కరమని దలైలామా అన్నారు. విజయవాడలో జరుగుతున్న జాతీయ మహిళ పార్లమెంట్ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడారు. బాల్యం నుంచే ఆడ పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. విద్యతోపాటు అన్ని రంగాల్లో అండగా ఉండాలన్నారు. లింగ వివక్ష వదిలేసి మానవత్వంపై ఆలోచించాలని చెప్పారు. 

ఎస్సీ, ఎస్టీ కమిటీల కీలక సమావేశం..

హైదరాబాద్ : నాంపల్లి సర్వ శిక్షా అభియాన్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ కమిటీల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు చందూలాల్, జగదీష్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. సబ్ ప్లాన్ రూప కల్పన, చట్ట సవరణపై చర్చించనున్నారు.

13:17 - February 10, 2017

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థుల సదస్సు కోసం పవన్ అమెరికా చేరుకున్న సంగతి తెలిసిందే. ఐదు రోజుల పాటు అక్కడ ఆయన పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే ప్రొఫెసర్ స్టీవెన్ జార్డింగ్ తో రెండు గంటల పాటు పవన్ ఏకాంతంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార పార్టీగా ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు స్టీవెన్ సలహాలు ఇస్తున్నారని జనసేన పేర్కొంది. స్టీవెన్, పవన్ భేటీ అయిన తీసిన ఫొటోలను కూడా పోస్టు చేసింది. భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.

పవన్ షెడ్యూల్..
శుక్రవారం మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు అమెరికా కాంగ్రెస్ సభ్యులు..సెనేటర్లు, అమెరికా న్యూక్లియర్ పాలసీ రూపకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారని జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. 2గంటల అనంతరం హ్యాంప్ షైర్ గవర్నర్ తో భేటీ, 3.30గంటలకు నార్త్ హ్యాంప్ షైర్ లోని నషువా సిటీ చేరుకుని అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలితో భేటీ కానున్నారు. సాయంత్రం 4గంటలకు నషువాలోని రివర్ యూనివర్సిటీ దగ్గర భారతీయ సంతతి వారు నిర్వహించే కారు ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్లీకు చెందిన సెనేటర్లు, నషువా మేయర్, ఎన్నారైలను ఉద్ధేశించి పవన్ ప్రసంగిస్తారని జనసేన పేర్కొంది.

గవర్నర్ విద్యాసాగర్ రావుతో డీజీపీ భేటీ..

చెన్నై : గవర్నర్ విద్యాసాగర్ రావుతో రాష్ట్ర డీజీపీ భేటీ అయ్యారు. తమిళనాడులో నెలకొన్న శాంతి భద్రతలపై చర్చించారు. ఎమ్మెల్యేలు బస చేసిన ప్రాంతాలకు భారీ పోలీసు బందోబస్తు మధ్య డీజీపీ వెళుతున్నట్లు తెలుస్తోంది.

 

12:53 - February 10, 2017

హైదరాబాద్ : భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడు. విండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ లపై సెంచరీలు చేశాడు. వరుసగా నాలుగు సీరీస్ లలో డబుల్ సెంచరీలతో కోహ్లీ రికార్డు సృష్టించాడు. 

12:51 - February 10, 2017

తమిళనాడు : ఎమ్మెల్యేలంతా తన వెంటే ఉన్నారని పన్నీరు సెల్వం తెలిపారు. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు తన దగ్గరకు వచ్చారని తెలిపారు. ఎన్ని దుష్టశక్తులు వచ్చినా సెల్వాన్ని ఏమీ చేయలేరని సెల్వం వర్గం చెబుతున్నారు. సెల్వం ఉంటే ఉన్నవారే పార్టీ శ్రేయోభిలాషులని అంటున్నారు. ఎమ్మెల్యేలను బంధించడం బాధాకరమని చెబుతున్నారు. శశికళకు ఎమ్మెల్యేల మద్దతు లేదని చెబుతున్నారు. పార్టీని కాపాడే శక్తి సెల్వానికే ఉందని ఆయన మద్దతుదారులు అంటున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:50 - February 10, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. జంగారెడ్డిగూడెంలోని విద్యావికాస్ జూనియర్ కళాశాలలో స్వప్న నాయక్ అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ స్వప్న నాయక్ కళాశాల ఐదో అంతస్తుపై నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలు కావడంతో విద్యార్థిని మృతి చెందింది. తమ కూతురు మృతికి యాజమాన్యం వేధింపులే కారణమని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విద్యార్థిని మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని కాలేజీ యాజమాన్యం అంటుంది. తనలో తనే ఏదో ఆలోచన చేస్తూఉండేదని చెబుతున్నారు. అయితే ఈ కేసు తమపైకి రాకుండా ఉండేందుకే యాజమాన్యం విద్యార్థిని మృతికి ప్రేమ వ్యవహారం కారణమని చెబుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

మిషన్ కాకతీయ మూడో దఫా పనులపై హరీష్ సమీక్ష..

హైదరాబాద్ : సచివాలయంలో మిషన్ కాకతీయ మూడో దఫా పనులపై మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

విరాట్ మరో డబుల్ సెంచరీ..

హైదరాబాద్ : కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో డబుల్ సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో 203 పరుగులు సాధించాడు. వరుసగా నాలుగు సిరీస్ లలో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. విండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లపై ఈ ఘనత సాధించాడు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ కు భూమి పూజ..

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు డీజీపీ అనురాగ్ శర్మ భూమి పూజ చేశారు. ఆధునాతన రీతిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం చేపడుతామని, 19 నెలల్లో 20 అంతస్తుల నాలుగు టవర్ల నిర్మాణం అవుతుందన్నారు. అన్ని శాఖలను కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయనున్నట్లు, హైదరాబాద్ తో సహా ఇతర జిల్లాల సీసీ కెమెరాల దృశ్యాలను చూసే అవకాశం ఉందన్నారు.

12:28 - February 10, 2017

ఒక హీరో చిత్రంలో మరో హీరో నటించడం సర్వసాధారణం. అంతేగాకుండా ఆ హీరో సినిమాకు మరో హీరో డబ్బింగ్ కూడా చెబుతుంటుంటారు. ఇలా టాలీవుడ్..బాలీవుడ్ ..ఇతర వుడ్ లలో జరుగుతూ ఉంటుంది. కానీ టాలీవుడ్ లో మాత్రం కొందరు స్టార్స్ చిత్రంలో ఇతర హీరోలు కనిపించడం జరగదు. కానీ అలా వస్తే మాత్రం ఇరు హీరోల అభిమానుల సంతోషానికి అవధులు ఉండవు. తాజాగా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రంలో ప్రిన్స్ 'మహేష్ బాబు' నటించాడని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవలే 'కాటమరాయుడు' చిత్ర టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లోని ఓ ఫైట్ సన్నివేశంలో రైలు డోర్ పగలగొట్టుకుని ఓ వ్యక్తి ఫ్లాట్ ఫాం పైన పడిపోతాడు. అతనితో ఫైట్ చేసిన వ్యక్తి..డోర్ దగ్గర నిలబడిన వ్యక్తి 'మహేష్ బాబు' అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక టీజర్ విషయానికి వస్తే విడుదలైన 57 గంటలలో 5 మిలియన్ వ్యూస్ సాధించి అందరికి షాక్ ఇచ్చింది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తోండగా ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

లింగవివక్షను వదిలేయాలి - దలైలామా..

విజయవాడ : మహిళలను గౌరవిస్తేనే అన్నింటికి శ్రేయస్కరం అని ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా వెల్లడించారు. బాల్యం నుండే ఆడపిల్లలను ప్రోత్సాహించాలని, విద్యతో పాటు అన్ని రంగాల్లో అండగా ఉండాలన్నారు. లింగవివక్షను వదిలేసి మానవత్వంపై ఆలోచించాలన్నారు.

సత్తా చాటుతున్న మహిళలు - వెంకయ్య..

విజయవాడ : మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, తొలిసారిగా భారత్ కు ఒలింపిక్ పతకాన్ని సాధించారని, మహిళల్లో వృద్ధి లేకుండా ప్రపంచాభివృద్ధి లేదని వివేకానంద చెప్పారని తెలిపారు.

శశికళకు ఎమ్మెల్యేల మద్దతు లేదు - పన్నీర్..

చెన్నై : శశికళకు ఎమ్మెల్యేల మద్దతు లేదని రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోసారి పేర్కొన్నారు. కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. తన వెంటనే ఎమ్మెల్యేలున్నారని, నేనే సీఎం కావాలని అమ్మ కోరుకురన్నారనిః వెల్లడించారు.

పన్నీర్ మీడియా సమావేశం..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.

12:12 - February 10, 2017

ఢిల్లీ : శశికళపై దాఖలైన పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం పిటిషన్ పై విచారణ చేపట్టలేమని చెప్పారు. సీఎంగా శశికళ ప్రమాణం చేయకుండా ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషనర్ పై సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది.

 

క్యాంపు రాజకీయాలపై గవర్నర్ ఆరా ?

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో నెలకొంటున్న క్యాంపు రాజకీయాలపై గవర్నర్ విద్యాసాగర్ రావు ఆరా తీసినట్లు తెలుస్తోంది. 70 కిలో మీటర్ల దూరంలో 30 మంది చొప్పున నాలుగు రిసార్ట్స్ లో వీరిని శశికళ వర్గం ఉంచినట్లు తెలుస్తోంది. వీరు బస చేసిన ప్రాంతానికి డీజీపీ వెళుతున్నారని సమాచారం.

12:04 - February 10, 2017

విజయవాడ : దేశ అర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలోనూ మహిళలదే కీలక పాత్రని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విజయవాడలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని అన్నారు. మహిళల్లో వృద్ధి లేకుండా ప్రపంచ అభివృద్ధిలేదని వివేకానంద చెప్పారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:54 - February 10, 2017

విజయవాడ : మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని కోరింది టిడిపియేనని, రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడుతానని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటేరీయన్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహిళా సాధికారిత సాధించే వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. విద్యా, ఉద్యోగాల్లో మహిళలకు 33 రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. ఒకే ఏడాదిలో రెండు పుష్కరాలు ఘనంగా నిర్వహించామని చెప్పారు. ఈ సదస్సుకు అందరి దీవెనలు ఉన్నాయన్నారు. అమరావతికి చారిత్రక వారసత్వం ఉందని, ఇక్కడి నుండే శాతవాహనులు పరిపాలన, బౌద్ధమతం విస్తరించిందని చెప్పారు. ఈ సదస్సుకు అందరి దీవెనలున్నాయన్నారు. మహిళలకు విద్య అవశ్యకతను ఎన్టీఆరే గుర్తించారని, స్థానిక సంస్థల్లో ఎన్టీఆరే మహిళలకు అవకాశం కల్పించారని తెలిపారు. జూన్ నాటికి 100 శాతం గ్యాస్ కనెక్షన్లు పూర్తి చేస్తామని వెల్లడించారు.

 

11:48 - February 10, 2017

విజయవాడ : మహిళల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. విజయవాడలో ప్రారంభమైన జాతీయ మహిళ పార్లమెంట్ సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. అవకాశాలను వినియోగించుకోవడంలో మహిళలు ముందున్నారని తెలిపారు. సదస్సుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, దలైలామా, శిరిన్ షర్మిన్, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు పలువురు హాజరయ్యారు. మూడు రోజులపాటు సదస్సులు కొనసాగనున్నాయి. అతిథులను స్పీకర్ కోడిల శివప్రసాద్ వేదికపైకి ఆహ్వానించారు. వందేమాతరం, మా తెలుగు తల్లి గీతాలపలన అనంతరం సదస్సు ప్రారంభం అయింది. 
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరు అయ్యారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

మహిళా సాధికారిత సాధించడానికి కృషి - బాబు..

విజయవాడ : మహిళా సాధికారిత సాధించే వరకు విశ్రమించనని, విద్య ఉద్యోగాల్లో మహిళలకు 33 రిజర్వేషన్లు కల్పించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటేరీయన్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఒకే ఏడాదిలో రెండు పుష్కరాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఈ సదస్సుకు అందరి దీవెనలు ఉన్నాయన్నారు. అమరావతికి చారిత్రక వారసత్వం ఉందని, ఇక్కడి నుండే శాతవాహనులు పరిపాలన, బౌద్ధమతం విస్తరించిందన్నారు. ఈ సదస్సుకు అందరి దీవెనలున్నాయన్నారు. మహిళలకు విద్య అవశ్యకతను ఎన్టీఆరే గుర్తించారని, స్థానిక సంస్థల్లో ఎన్టీఆరే మహిళలకు అవకాశం కల్పించారని తెలిపారు.

11:30 - February 10, 2017
11:26 - February 10, 2017

చెన్నై : క్యాంప్‌ రాజకీయాలతో తమిళనాడు పాలిటిక్స్‌ మరింత వేడెక్కాయి. సీఎం పదవిని చేపట్టేందుకు శశికళ..తమ వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతుంది. చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్డెన్‌బె రిసార్ట్స్‌లో ఎమ్మెల్యేలందరిని దాచింది. ఒక్కో రిసార్టులో 30 మంది ఎమ్మెల్యేల చొప్పున..మొత్తం నాలుగు రిసార్ట్స్‌లో ఎమ్మెల్యేలను దాచిపెట్టి వారు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాదు ఒక్కో ఎమ్మెల్యేకు ఇద్దరు చొప్పున బాడీగార్డులను కూడా ఏర్పాటుచేసింది. ఎమ్మెల్యేల దగ్గరున్న సెల్‌ఫోన్లను ఇప్పటికే లాక్కున్న శశికళవర్గం..వారికి న్యూస్‌ పేపర్లు, టీవీలను కూడా అందుబాటులో లేకుండా చేసింది. తమకు మొత్తం 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని..తమకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే గవర్నర్ విద్యాసాగర్‌రావును శశికళ కోరింది. అయితే శశికళ వర్గంలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని పన్నీరు సెల్వం వర్గం ధీమాగా చెప్తోంది. అసెంబ్లీలో బలం నిరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను ఇప్పటికే పన్నీరు సెల్వం కోరారు. అయితే గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి స్టెప్స్‌ తీసుకోవాలన్న దానిపై న్యాయనిపుణులతో గవర్నర్ విద్యాసాగర్‌రావు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎమ్మెల్యేల మద్దతు శశికళకే ఉంది కాబట్టి..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శశికళను ఆహ్వానిస్తారా ? లేక బలం నిరూపించుకునేందుకు పన్నీరు సెల్వానికి అవకాశం ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా గవర్నర్ విద్యాసాగర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

11:19 - February 10, 2017

నిమ్మరసం..పరిగడుపన తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. కానీ చాలా మంది సేవించడానికి వెనుకాడుతుంటారు. ఇందులో విటమిన్ సితో పాటు శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలు కూడా నిమ్మ వల్ల మనకు లభిస్తాయి. సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడే నిమ్మ ఆరోగ్యకరపరంగా ఉపయోగపడుతుంది. మరి నిమ్మకాయ రసం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం...

  • జీర్ణ సమస్యలను తగ్గించడంలో నిమ్మకు మించినది మరొకటి లేదు.
  • శరీరంలోని లవణ శాతాన్ని పెంచి, వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
  • గోరువెచ్చని నీటిలో కూడా సేవించవచ్చు. ఇందులో కొన్ని అల్లం ముక్కలు, ఒక నిమ్మకాయ రసం, టీ స్పూన్ తేనె కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
  • చర్మానికి మేలు చేసే విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. దీనివల్ల వ్యాధికారక క్రీముల తాకిడికి చర్మం తట్టుకుంటుంది.
  • చర్మంపై ఏర్పడే ముడతల సమస్యలు దూరం చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా నిమ్మరసం పనిచేస్తుంది.
  • క్యాన్సర్ కణాల వృద్ధి ఆగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి.
  • కిడ్నీల్లో ఉండే రాళ్లు కరిగిపోతాయి. రాళ్లు ఏర్పడేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది.
  • బరువు తగ్గాలనుకునే వారికి మెరుగైన ఫలితాలను ఇస్తుంది. కొవ్వును కరిగించే గుణాలు నిమ్మలో ఉన్నాయి.
  • అల్కాహాల్ తీసుకోవడం ద్వారా లివర్ పై ప్రభావం పడుతుంది. ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకోవడం ద్వారా లివర్ ను ఆ ప్రభావం నుండి తప్పించి లివర్ ఫంక్షన్ ను వేగవంతం చేస్తుంది.

తమిళనాడులో క్యాంపు రాజకీయాలు..

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఒక్కో ఎమ్మెల్యే ఇద్దరు బార్డీగార్డులు మోహరించారు. వారి వద్దనున్న సెల్ ఫోన్ లు లాక్కొన్నట్లు, పేపర్ లు..టివిలు దూరం చేసినట్లు తెలుస్తోంది. 70 కిలో మీటర్ల దూరంలో 30 మంది చొప్పున నాలుగు రిసార్ట్స్ లో వీరిని శశికళ వర్గం ఉంచినట్లు తెలుస్తోంది.

11:08 - February 10, 2017

తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బీజేపీ నేత కుమార్, టీడీపీ నేత రామ్ శర్మ లు పాల్గొని, మాట్లాడారు. గవర్నర్ కేంద్రప్రభుత్వం, బీజేపీకి అనుగుణంగా వ్యవరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగానికి కట్టుబడి గవర్నర్ విద్యాసాగర్ రావు నడుచుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:04 - February 10, 2017

జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం మొదలెట్టేశాడు. 'టెంపర్’, 'నాన్నకు ప్రేమతో’, 'జనతా గ్యారేజ్’ హిట్ లు సాధించిన 'ఎన్టీఆర్' మరో హిట్ పై కన్నేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మాణంలో రూపొందుతున్న సినిమాలో 'ఎన్టీఆర్' హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ముహూర్తపు సన్నివేశానికి 'ఎన్టీఆర్' క్లాప్ కొట్టగా నందమూరి రామకృష్ణ, దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా చిత్ర దర్శకుడు బాబీ స్క్రిప్ట్ అందుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
ఈ మూవీలో త్రిబుల్ రోల్ చేస్తున్న 'ఎన్టీఆర్' కోసం ముగ్గురు హీరోయిన్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పక్కా లోకల్ పక్కా లోకల్ అంటూ 'జనతా గ్యారేజ్' సినిమాకి 'కాజల్ అగర్వాల్' తన వంతు గ్లామర్ హంగులు అద్దింది. ఇప్పటికే 'ఎన్టీఆర్' తో మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త సినిమా కోసం యంగ్ టైగర్ తో మరోసారి జోడి కట్టబోతుందట. 'కాజల్' తో పాటు మరో ఇద్దరు కేరళ కుట్టిలు 'నివేదా థామస్', 'అనుపమా పరమేశ్వరన్' 'ఎన్టీఆర్' తో నటించే బంఫర్ ఛాన్స్ లు కొట్టేశారట.

11:02 - February 10, 2017

ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తోంది.  లోక్ సభలోని 62 మంది మహిళా ఎంపిలు, రాజ్యసభలోని 20 మంది మహిళా ఎంపిలతో పాటు  వివిధ రాష్ట్రాలకు చెందిన 405 మంది  మహిళా ఎమ్మెల్యేలు ఈ సదస్సులో పాల్గొంటారని సమాచారం. దాదాపు 1200మంది దేశ విదేశీ ప్రతినిధులను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు జరుగుతున్న సందర్భంలో స్త్రీలు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలు సహజంగానే చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఏపి శ్రామిక మహిళా సమన్వయ కమిటీ నాయకులు స్వరూపారాణి గారితో 10టీవీ ఇంటర్వ్యూ నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:55 - February 10, 2017

ఢిల్లీ : మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో రగడ జరిగింది. ప్రధాని మోది క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్‌ చేసింది. నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని ఎంత వెలికి తీశారని ప్రభుత్వాన్ని సిపిఎం నిలదీసింది. బడ్జెట్‌ తొలివిడత సమావేశాలు ముగిశాయి. పార్లమెంట్‌ ఉభయ సభలు మార్చి 9కి వాయిదా పడ్డాయి.
రాజ్యసభలో దుమారం 
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు చివరి రోజున మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగింది. యూపీఏ హయాంలో ఎన్నో స్కామ్‌లు వెలుగు చూసినా, మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్‌కు మాత్రం మ‌చ్చప‌డలేద‌ని.... రెయిన్‌కోట్‌తో స్నానం చేయ‌డం మన్మోహన్‌కి తెలుసని ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  ప్రధాని మోదీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. మరోవైపు త‌మిళ‌నాడు గ‌వ‌ర్నర్ వేగ‌వంతంగా చ‌ర్యలు తీసుకోవాల‌ని చైర్మన్‌ పోడియం వద్ద దూసుకెళ్లి నినాదాలు చేశారు. కాంగ్రెస్‌, అన్నాడీఎంకే ఎంపీలు గంద‌ర‌గోళం సృష్టించ‌డంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. 
నల్లధనం ఎంత వెలికి తీశారు : ఏచూరి  
సిపిఎంకు చెందిన దివంగత నేతల పేర్లను ప్రధాని ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధమని రాజ్యసభలో ఏచూరి అభ్యంతరం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు తర్వాత నల్లధనం ఎంత వెలికి తీశారని ప్రభుత్వాన్ని సిపిఎం నిలదీసింది. నల్లధనానికి వ్యతిరేకంగా తాము అప్పుడు ఇప్పుడూ పోరాడుతూనే ఉన్నామని స్పష్టం చేసింది. నోట్ల రద్దు తర్వాత  బ్యాంకుల్లోకి ఎంత ధనం చేరిందన్న దానిపై ప్రభుత్వం ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని ఏచూరి ధ్వజమెత్తారు. 
లోక్‌సభలో కాంగ్రెస్‌ నిరసన
మన్మోహన్‌పై ప్రధాని మోది చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలోనూ కాంగ్రెస్‌ నిరసన వ్యక్తం చేసింది. ఈ అంశంపై మాట్లాడడానికి స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ కాంగ్రెస్‌ నేత ఖర్గేకు అనుమతించలేదు. జనవరి 31న పార్లమెంట్‌ ఉభయ సభల నుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్‌ ఉభయసభలు మార్చి 9కి వాయిదా పడ్డాయి.

 

రెండో రోజు ఆట ప్రారంభం..

హైదరాబాద్ : భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోర్ 356/3 తో భారత్ బరిలోకి దిగింది. విరాట్ 115, రహానే 47 క్రీజులో ఉన్నారు.

మెరీనా బీచ్ లో బందోబస్తు..

చెన్నై : మెరీనా బీచ్ లో పోలీసులు భారీగా మోహరించారు. తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతూ ఆందోళనలు..ఉద్యమాలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు మెరీనా బీచ్ లో బందోబస్తు చేపట్టారు.

10:47 - February 10, 2017

కృష్ణా : విజయవాడలో జాతీయ మహిళ పార్లమెంట్ సదస్సు ప్రారంభం అయింది. సదస్సుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, దలైలామా, శిరిన్ షర్మిన్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తోపాటు పలువురు హాజరయ్యారు. మూడు రోజులపాటు సదస్సులు కొనసాగనున్నాయి. అతిథులను స్పీకర్ కోడిల శివప్రసాద్ వేదికపైకి ఆహ్వానించారు. వందేమాతరం, మా తెలుగు తల్లి గీతాలపలన అనంతరం సదస్సు ప్రారంభం అయింది. 
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరు అయ్యారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రాహుల్ తో తమిళనాడు కాంగ్రెస్ నేతల భేటీ..

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తమిళనాడు నాడు కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

10:39 - February 10, 2017

హైదరాబాద్ : నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేస్తున్న సెల్‌ టవర్లపై సీపీఎం ఆందోళన బాట పట్టింది. బల్దియాకు రావాల్సిన ఆదాయానికి గండిపడడంతో జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. దీంతో దిగొచ్చిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌.. సెల్‌ టవర్ల అక్రమాలపై విచారణకు ఆదేశించారు. 
నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు 
హైదరాబాద్‌ నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న సెల్‌ టవర్ల నిర్మాణంపై సీపీఎం ఆందోళన బాట పట్టింది. జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నిబంధనలకు నీళ్లు వదిలి సెల్‌ టవర్లకు అనుమతులు ఇస్తున్నారని సీపీఎం నేతలు మండిపడ్డారు. అధికారుల పర్యవేక్షణలోపంతో విచ్చలవిడిగా సెల్‌ టవర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. నగరంలో కేవలం 969 టవర్లకు మాత్రమే లైసెన్స్‌ ఉండగా.. అనధికారికంగా 6 వేల సెల్‌ టవర్లు నిర్మించారన్నారు. 
బల్దియా అనుమతి తప్పనిసరి 
సెల్‌ టవర్ ఏర్పాటు చేయాలంటే బల్దియా అనుమతి తప్పనిసరి. బిల్డింగ్‌ యజమాని పర్మిషన్‌తో పాటు ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా అనుమతులు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి అనుమతి కోసం లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. కొన్ని సెల్‌ కంపెనీలు 10 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తామంటూ స్టే తెచ్చుకుని ఇష్టారీతిగా టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ స్టేను వెకేట్‌ చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు. 
బల్దియా ఆదాయానికి గండి 
ఎలాంటి అనుమతులు లేకుండా సెల్‌ టవర్లు ఏర్పాటు చేయడంతో బల్దియాకు ఆదాయం రాకుండా పోతుందంటున్నారు. అధికారుల చర్యలతో ఇప్పటివరకు 50 కోట్ల మేర నష్టం జరిగిందంటున్నారు. అదేవిధంగా సెల్‌ టవర్ల నుండి ఆస్తిపన్ను వసూలు చేయకపోవడంతో.. ఖజానాకు భారీ గండి పడుతుందని సీపీఎం నేతలంటున్నారు. 
స్పందించిన కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి
సీపీఎం ఆందోళనపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి స్పందించారు. సెల్‌ టవర్లపై విచారణకు ఆదేశించారు. టౌన్‌ ప్లానింగ్‌ చీఫ్‌ దేవేందర్‌రెడ్డిని విచారణాధికారిగా నియమించారు. నగరంలోని అన్ని సెల్‌ టవర్ల వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఇందుకోసం రెవెన్యూ విభాగం నుండి.. టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల నుంచి రెండు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇష్టారీతిని వెలుస్తున్న సెల్‌ టవర్ల నిర్మాణాలకు ఇప్పటికైనా అడ్డుకట్ట పడుతుందో.. లేదో కొద్దిరోజుల్లో తేలనుంది. 

 

10:34 - February 10, 2017

హైదరాబాద్‌ : ప్రపంచ స్థాయి వేడుకలకు సిద్ధమవుతోంది. ఈనెల 11వ తేదీ నుంచి ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు చేస్తోంది.
ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఫెస్టివల్‌
భాగ్యనగరం మరో ప్రపంచస్థాయి వేడుకలకు వేదిక కాబోతుంది. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న రవీంద్రభారతి ఈ వేడుకలకు వేదిక కానుంది. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్‌ భావిస్తోంది. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను మరింత పెంచేందుకు ఈ వేడుకలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందులాల్‌తో సహా అధికారులు ఆవిష్కరించారు. 
టూరిజం అభివృద్ధికి చర్యలు : మంత్రి చందూలాల్
టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి చందూలాల్‌ అన్నారు. ప్రపంచస్థాయి వేడుకలు హైదరాబాద్‌కు రావడం దీనికి నిదర్శనమన్నారు. 
ప్రపంచ దేశాల నుండి ప్రతినిధులు హాజరు 
రేపటి నుంచి ఆరు రోజులపాటు జరిగే వేడుకలకు ప్రభుత్వం ప్రపంచ దేశాల నుండి ప్రతినిధులు హాజరు కానున్నారు. దేశ విదేశాలకు చెందిన అనేక నాటకాలను ప్రదర్శించనున్నారు. దీంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. 

 

10:30 - February 10, 2017

అమెరికా : అప్పీల్స్ కోర్టులో ట్రంప్‌కు షాక్‌ తగిలింది. ట్రావెల్ బ్యాన్ అమలుకు కోర్టు నిరాకరించింది. కోర్టు తీర్పుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. న్యాయస్థానాలు దేశభద్రతను పణంగా పెడుతున్నాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

జాతీయ మహిళా పార్లమెంటేరీయన్ల సదస్సు ప్రారంభం..

విజయవాడ : అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంటేరీయన్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా, బంగ్లాదేశ్ స్పీకర్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్, మంత్రులు తదితరులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

10:26 - February 10, 2017

కృష్ణా : నేటి నుంచి విజయవాడలో జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సదస్సులో తెలంగాణ ఎంపీ కవిత ప్రసగించనున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రముఖలు విజయవాడ చేరుకున్నారు. సదస్సుకు 4వేల మందితో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

కడియంను కలిసిన 10 వామపక్ష నేతలు..

హైదరాబాద్ : డిప్యూటి సీఎం కడియం శ్రీహరిని పది వామపక్ష సంఘాల నేతలు కలిశాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట సవరణపై అఖిలపక్షాన్ని సమావేశపరచాలని, దళిత, గిరిజన సంఘాలు, మేధావులతో చర్చించాలని, బడ్జెట్ లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం నిధులు కల్పించాలని డిమాండ్ చేశారు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సబ్ ప్లాన్ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రతిపాదనను నిధులు సకాలంలో ఖర్చు చేయని అధికారులను శిక్షించేలా చట్టంలో పొందుపరచాలని పది వామపక్ష నేతలు కోరారు.

10:23 - February 10, 2017

హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నాయి. గంట గంటకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నిన్న రాత్రి సన్నీరు సెల్వం, శశికళ వేర్వేరుగా గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి తమకే సీఎం పదవి అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తులు అందచేశారు. దీంతో ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు గవర్నర్‌ కోర్టుకు చేరినట్లైంది. అయితే ఇప్పటిప్పుడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇదే పరిస్థితిని మరో రెండు రోజుల పాటు సాగదీసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై కేంద్రానికి గవర్నర్ విద్యాసాగర్ రావు నివేదిక సమర్పించారు. మరోవైపు శశికళ సీఎం పదవి చేపట్టొద్దంటూ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైంది. అక్రమాస్తుల కేసులో శశికళ నిందితురాలిగా ఉందని..సీఎం పదవి చేపట్టవద్దంటూ పిల్‌ వేశారు. అయితే ఇవాళ దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

 

భారతీ ట్రావెల్స్ కు తప్పిన ప్రమాదం..

హైదరాబాద్ : భారతి ట్రావెల్స్ బస్సు (ఎపి 28 టిఎ 6599) కు ప్రమాదం తప్పింది. పెద్ద అంబర్ పేట వద్ద డివైడర్ ను బస్సు ఢీకొట్టి వెళ్లిపోయింది. బస్సును ఆర్టీఏ అధికారులు వెంబడించి నిలిపివేయించారు. డ్రైవర్ యాదగిరి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. అతడిని పీఎస్ కు తరలించారు. భద్రాచలం నుండి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అప్పీల్స్ కోర్టులో ట్రంప్ కు షాక్..

అమెరికా : అప్పీల్స్ కోర్టులో డొనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. ట్రావెల్ బ్యాచ్ అమలు చేసేందుకు కోర్టు నిరాకరించింది. కోర్టు తీర్పుపై అమెరికన్ సివిల్ లిబర్టీన్ సంఘాల హర్షం వ్యక్తం చేసింది. అప్పీల్స్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని ట్రంప్ పేర్కొంటున్నారు. న్యాయస్థానాల తీర్పులపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభద్రతను న్యాయస్థానాలు ఫణంగా పెట్టాయని ట్రంప్ పేర్కొంటున్నారు.

10:20 - February 10, 2017

హైదరాబాద్ : దశాబ్దాలుగా తెలంగాణలో మంచినీటికి నోచుకోని వేలాది గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రారంభించిన మిషన్‌ భగీరథ పనులను ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.   ప్రతి ఆవాసానికి రక్షిత మంచినీరు  అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి పైపులైన్ల ద్వారా మంచినీరు అందించేందుకు వీలుగా పనులు  పూర్తి చేయాలని తెలంగాణ మంచినీటి సరఫరా సంస్థ  ఉపాధ్యాక్షుడు వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. 
మిషన్‌ భగీరథ కార్యాచరణ ప్రణాళిక
ఏళ్లతరబడి మంచినీటి కోసం పరితపిస్తున్న తెలంగాణలోని వేలాది గ్రామాలకు తాగునీరు అందించే మిషన్‌ భగీరథ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన తెలంగాణ మంచినీటి సరఫరా సంస్థ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్‌రెడ్డి... మిషన్‌ భగీరథ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. 
అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళికలు
ఇంటింటింకి  మంచినీరు అందించే లక్ష్యంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోని ఒక్కో మండలంలో అంతర్గత పైపులైన్ల నిర్మాణ పనులను  ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రణాళికలను సిద్ధం చేయాలని  ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అయ్యే వాస్తవిక ఖర్చులను అంచనా వివరాలను వారంలోగా పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వచ్చేనెల చివరికి నాటికి ఇన్‌టేక్‌ వెల్స్‌ పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని కోరారు. మిషన్‌ భగీరథలో కీలకమైన నీటిశుద్ధి కర్మాగారాలను ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. నిర్నీత గడవులోగా పనులు పూర్తి చేసేందుకు వీలుగా  కాంట్రాక్ట్‌ సంస్థలతో మాట్లాడి, కార్మికుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రశాంత్‌రెడ్డి  ఆదేశించారు. 
వ్యవసాయ భూముల్లో పైపులైన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి 
పైపులైన్ల నిర్మాణ పురోగతిపై రోజువారీ నివేదికలను తన కార్యాలయానికి పంపాలని  ప్రశాంత్‌రెడ్డి కోరారు.  దీనిపై వారానికి ఒకసారి సమీక్షించాలని నిర్ణయించారు. వ్యవసాయ భూముల్లో పైపులైన్ల పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. దీనిపై వారానికి ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.  మొత్తంమీద ప్రతిష్ఠాత్మక మిషన్‌ భగీరథ పనులను  సకాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది.

ఇంటర్ విద్యార్థిని సూసైడ్..

పశ్చిమగోదావరి : జంగారెడ్డిగూడెంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యావికాస్ జూనియర్ కళాశాల ఫస్టియర్ విద్యార్థిని స్వప్న నాయక్ దూకి బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. యాజమాన్య వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

10:14 - February 10, 2017

ఉద్యోగం..సమాజంలో ఎన్నో రకాలైన ఉద్యోగాలు ఉంటాయి. ఒక్కో రంగాన్ని ఎంచుకుంటూ అందులో స్థిరపడుతూ ఉంటుంటారు. మరికొందరు ఒక జాబ్ వదిలేసి మరొక జాబ్ లోకి జంప్ అవుతుంటుంటారు. చాలా మంది జాబ్ కోసం అన్వేషణ చేస్తుంటారు. కానీ ఇలాంటి ఉద్యోగం కూడా ఉంటుందా అనే సందేహం కలుగక మానదు. అదే 'వాసన చూసే ఉద్యోగం'.. వీరికి లక్షల్లో జీతాలు ఉంటాయంట. బాడీ స్ప్రే సంబంధించిన కంపెనీలో వీళ్లు ఉద్యోగాలు చేస్తుంటారు. తాము చేసిన బాడీ స్ర్పే మంచిదా ? కాదా ? చెడు వాసన వస్తుందా ? మార్పులు ఏమైనా చేయాలా ? అనే దానిని నిర్ధారించడానికి పలువురిని నియమించుకుంటుంటారు. స్ప్రే చేసిన అనంతరం వీరు వాసన చూసి పలు సూచనలు, సలహాలు అందచేస్తారు. ఇలాంటి ఎన్నో మనకు తెలియని ఉద్యోగాలు ఉన్నాయి.

09:48 - February 10, 2017

సన్ అప్పుడే మొదలెట్టేశాడు..ఫిబ్రవరి మొదటి వారం నుండే భానుడు ప్రతాపం మొదలైనట్లు వాతావరణ మార్పులు స్పష్టం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత బాగా తగ్గిపోయి అదే క్రమంలో ఎండ వేడిమి పెరుగుతోంది. కానీ శివరాత్రికి చలి వెళ్లిపోతుందని ప్రజల నమ్మకం. ఈ నెలాఖరుకు శివరాత్రి ఉండగా ఫిబ్రవరి నెల మొదట్లోనే చలి తీవ్రత తగ్గిపోయింది. గత సంవత్సరం కంటే భానుడు భగభగలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయంత్రం వేళలు..తెల్లవారు సమయాల్లో కూడా చలి తగ్గుముఖం పట్టింది. గతేడాది మార్చి మొదటి వారంలో తీవ్రత పెరిగిన ఎండలు ఈసారి ఫిబ్రవరిలోనే ప్రతాపం చూపుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఏప్రిల్‌, మే నెలల్లో ఎండ తీవ్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. చలికాలం ఫోబియా నుంచి బయటికొచ్చేసి వేసవి కాలం ఉపశమన చర్యలకు ఉపక్రమించాల్సిన తరుణం రానే వచ్చిందని గమనించాలన్న మాట.

09:37 - February 10, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై ముందడుగు పడింది.. సానుకూల నిర్ణయాల దిశగా రెండో భేటీ సాగింది.. ఇబ్బందులులేని అంశాలను ముందు పరిష్కరించాలని రెండు రాష్ట్రాల త్రిసభ్య కమిటీ సభ్యులు నిర్ణయించారు.. మరోసారి ఈ నెల 26న మరోసారి భేటీ కావాలని తీర్మానించారు..
తెలుగు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు గవర్నర్‌తో సమావేశం 
రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల త్రిసభ్య కమిటీ సభ్యులు గవర్నర్‌తో మరోసారి సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి హరీష్‌, జగదీష్‌, వివేక్... ఏపీ నుంచి యనమల, అచ్చన్న, కాల్వ శ్రీనివాసులు సమావేశానికి హాజరయ్యారు.. ఈ కార్యక్రమాలో పలు అంశాలపై చర్చించారు.. ఈనెల 2న జరిగిన భేటీలో తీసుకున్ననిర్ణయాల అమలుపై కూడా సమీక్షించారు.. సులువుగా పరిష్కారమయ్యే సమస్యలపై ముందు దృష్టిపెట్టాలని రెండు రాష్ట్రాల మంత్రులు నిర్ణయించారు.. 
విడతల వారీగా సమస్యల పరిష్కారం
91 కార్పొరేషన్లలో విభజనకు అనుకూలంగా ఉన్న 9 కార్పొరేషన్లపై దృష్టిపెట్టాలని రెండు రాష్ట్రాల ప్రతినిధులు నిర్ణయించారు. ఈ కార్పొరేషన్లలో బ్యాంక్ అకౌంట్స్‌లాంటి సమస్యలను విడతల వారీగా పరిష్కారించేందుకు అంగీకరించారు. తెలంగాణలో పనిచేస్తున్న 12వందల 50మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీకి మార్చేందుకు అంగీకారం కుదిరిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ఖాళీ భవనాలపై దృష్టి పెట్టిన తెలంగాణ
అటు తెలంగాణ ప్రభుత్వం ఈ సమవేశంలో ప్రధానంగా ఖాళీగా ఉన్న భవనాలపై దృష్టిపెట్టింది.. తెలంగాణలో ఏపీ ప్రభుత్వ ఆధీనంలోఉన్న భవనాలు నిర్వహణ లేక పాడైపోతున్నాయని హరీశ్ రావు అన్నారు.. తాళాలు వేసిన భవనాలకు ప్రజల సొమ్ముతో పన్నులు కట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.. ఈ భవనాల్ని తమకు అప్పగిస్తే ప్రజా అవసరాలకు ఉపయోగిస్తామని సమావేశంలో కోరారు.. అలాగే హైకోర్టు విభజన విషయం కూడా చూడాలని విజ్ఞప్తి చేశారు..
టీ.మంత్రుల విజ్ఞప్తిపై సానుకూల స్పందన
తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిపై ఏపీ మంత్రులు సానుకూలంగా స్పందించారు.. సీఎం చంద్రబాబును సంప్రదించాక తమ నిర్ణయం చెబుతామని ప్రకటించారు.. మొత్తానికి ఈ సమావేశంలో సానుకూల ఫలితాలు రావడం హర్షనీయమని రెండు రాష్ట్రాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో మిగతా సమస్యలన్నీ సామరస్య పూర్వకంగా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

09:32 - February 10, 2017

తన అందాలతో..యువతరాన్ని మతెక్కించిన నటీమణుల్లో 'బిపాషా బసు' ఒకరు. అంతేగాకుండా హర్రర్ క్వీన్ గా బాలీవుడ్ లో 'బిపాషా' గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ నిర్ణయం తీసుకొందంట. ఇకపై తాను హర్రర్ చిత్రాల్లో నటించనని తేల్చిచెప్పేసింది. గతంలో 'రాజ్', ‘రాజ్ 3డీ', ‘ఆత్మ', ‘ఎలోన్' వంటి హర్రర్ చిత్రాల్లో 'బిపాషా' నటించిన సంగతి తెలిసిందే. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ప్రేక్షకులను భయపెట్టింది. ‘డర్ సబ్ కో లగ్తా హై' హర్రర్ టివి సీరియల్ లో నటించింది. తాజాగా మరో హర్రర్ టీవీ సీరియల్ నటించే అవకాశం 'బిపాషా'కు వచ్చింది. కానీ అందులో నటించేందుకు బిపాషా సుముఖత చూపించలేదు. ఇకపై హర్రర్ పాత్రల్లో నటించకూడదని డిసైడ్ చేసుకున్నట్లు, హర్రర్ జోన్ తప్ప మిగిలిన చిత్రాల్లో నటించేందుకు ప్రాధాన్యమిస్తానని 'బిపాషా' పేర్కొంది.

09:31 - February 10, 2017

హైదరాబాద్ : నిరుద్యోగుల ఆందోళనలతో తెలంగాణ సర్కార్‌ ఎట్టకేలకు దిగొచ్చింది. గురుకుల ఉద్యోగాల భర్తీ నిబంధనలను సడలించింది. డిగ్రీ, బీఈడీ, టెట్‌ అర్హత ఉన్నవారందరికీ  గురుకుల పరీక్షకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్‌ టీఎస్‌పీఎస్సీని ఆదేశించారు.  ప్రభుత్వ నిర్ణయంతో  నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
గురుకుల ఉద్యోగాల భర్తీ నిబంధనలు సవరింపు
నిరుద్యోగుల ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. గురుకుల టీచర్స్‌ భర్తీ నిబంధనలను సవరించాలన్న నిరుద్యోగుల ఆందోళనలతో దిగొచ్చింది. నిరుద్యోగులు తమ ఆందోళనలతో హోరెత్తిస్తుండడంతో  ముఖ్యమంత్రి కేసీఆర్‌  అధికారులతో సమీక్ష నిర్వహించారు.   నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ గతంలో అనుసరించిన విధానాలు, న్యాయస్థానాల తీర్పులను అనుసరించి మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు.
డిగ్రీలో 60శాతం మార్కులు ఉండాలన్న నిబంధన మార్పు
గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాలకు 60శాతం మార్కులు ఉండాలని టీఎస్‌పీఎస్సీ నిబంధన పెట్టింది. దీనిపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.  దీంతో ఈ నిబంధనను సవరించాలని కేసీఆర్‌ ఆదేశించారు. 50శాతం మార్కులు ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు.  ఇక పీజీటీ అభ్యర్ధులకు మూడేళ్ల బోధనా అనుభవం ఉండాలని కూడా పబ్లిక్‌  సర్వీస్‌ కమిషన్‌ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. దీనిపైనా అధికారులతో కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చించారు. ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం మూడేళ్ల బోధనా అనుభవం ఉండాలన్నది తప్పనిసరి కాదని.. అందుకే ఆ నిబంధనను పూర్తిగా ఎత్తివేయాలని ఆదేశించారు. ఈ రెండు నిబంధనలు తొలగిస్తే ఎక్కువ మంది నిరుద్యోగులకు పరీక్ష రాసే అవకాశం కలుగుతుందనన్నారు. డిగ్రీ, బీఈడీ, టెట్‌ అర్హత ఉన్న వారందరికీ అవకాశం కల్పించాలని ఆదేశించారు.
ఆంగ్లంలోనే గురుకుల టీచర్స్‌ ఎగ్జామ్‌
నిరుద్యోగుల మూడో డిమాండైన తెలుగు మీడియంలోనే పరీక్ష నిర్వహించాలన్న దానిపైనా సీఎం సమీక్షించారు.  ఎన్‌సీటీఈ మార్గదర్శకాలు, గతంలో న్యాయస్థానాల తీర్పులనూ పరిశీలించారు. దీని ప్రకారం ఏ మీడియం కోసమైతే నియామకాలు జరుగుతాయో... అభ్యర్ధులంతా అదే మీడియంలో పరీక్షలు రాయాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలనూ పరిశీలించారు. దీంతో ఇంగ్లీష్‌ మీడియం కోసం నియామకాలు జరుగుతున్నందున అభ్యర్ధులంతా ఆంగ్లములోనే పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై... నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 

 

09:07 - February 10, 2017

తన కోరిక నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఉందని నటి ఆదితిరావు పేర్కొన్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 'చెలియా' చిత్రంలో 'కార్తీ' సరసన 'ఆదితి' నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘మణిరత్నం' సార్ తో కలిసి చేయాలనేది తన కోరిక అని అది ఇప్పుడు నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న 'చెలియా' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంతో పాటు 'పద్మావతి' చిత్రంలో కూడా 'ఆదితి రావు' నటిస్తోంది. ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మది కీలక పాత్ర అని తెలుస్తోంది. సంజయ్ లీలా లాంటి మరో డ్రీమ్ డైరెక్టర్ తో కలిసి పనిచేయడం చాలా ఎగ్జైంట్ గా ఉందని, మణిసార్ సెట్ నుండి సంజయ్ సెట్ కు వెళ్లడం చాలా ప్రత్యేకంగా అనిపిచ్చిందని పేర్కొన్నారు. ‘పద్మావతి' చిత్రంలో దీపికా పదుకొనె, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ లు నటిస్తున్నారు. వీరితో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఏకకాలంలో డిఫరెంట్ ప్రాజెక్టుల్లో నటించడం మధురానుభూతినిస్తోందని 'ఆదితి రావు' తెలిపింది.

09:02 - February 10, 2017

ఇప్పటి వరకు పెళ్లి పనుల్లో బిజీ బిజీగా గడిపిన 'సమంత' ఇక సినిమాలపై దృష్టి సారించింది. టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య'తో 'సమంత' ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'సమంత' దూకుడు పె పెంచేసింది. తెలుగులో ఓ భారీ ప్రాజెక్టులో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్ తేజ' హీరోగా 'సుకుమార్' దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో 'సమంత' నటించనున్నట్లు తెలుస్తోంది. 'సమంత' పాత్ర పూర్తి వైవిధ్యంగా ఉంటుందని సమాచారం. ఇక ఈ చిత్రానికి 'రేపల్లెలో రాధాగోపాలం' అనే టైటిల్ ను నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు 'నాగార్జున'..’ఓం కార్' కాంబినేషన్ లో రూపొందే 'రాజుగారి గది 2’లో  'సమంత' కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్. గతంలో 'మనం' సినిమాలో 'నాగార్జునతో 'సమంత' నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే 'నాగ చైతన్య' నిర్మాతగా మారి తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేసే 'యు టర్న్' చిత్రంలోనూ నటిస్తోంది. తమిళ చిత్రంలో కూడా నటించేందుకు శ్యామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏమైనా 'జనతా గ్యారేజ్' హిట్ అనంతరం సమంత ఏకంగా నాలుగైదు సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం..ఆమె అభిమానులకు సంతోషం కలిగిస్తోంది.

నేడు అంధుల టీ.20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లు

హైదరాబాద్ : నేడు అంధుల టీ.20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. శ్రీలంక... భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ లు జరుగనున్నాయి.

శశికళపై దాఖలైన పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ

ఢిల్లీ : శశికళపై దాఖలైన పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ జరుగనుంది. సీఎంగా శశికళ ప్రమాణం చేయకుండా ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు అయింది. 

తమిళనాడులో ఉత్కంఠ రేపుతున్న రాజకీయాలు

చెన్నై : తమిళనాడులో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై పన్నీరు సెల్వం, శశికళ వర్గాలు గవర్నర్ ను కలిశాయి. తనకే మెజారిటీ పన్నీర ఉందని సెల్వం అంటున్నారు. కాగా రాజ్యాంగబద్ధంగా తమకే అవకాశం ఉందని శశికళ వర్గం చెబుతోంది. న్యాయ నిపుణులతో గవర్నర్ విద్యాసాగర్ రావు చర్చిస్తున్నారు. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

08:39 - February 10, 2017

చెన్నై : తమిళనాడులో అధికార అన్నా డీఎంకేలో సంక్షోభం తీవ్రమవుతోంది. శశికళ వర్గం నుంచి కొందరు ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వం వైపు వస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఇద్దరు నేతలూ ముందుకు వస్తున్న నేపథ్యంలో అధికారం ఎవరికి దక్కుతుందన్న అంశంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఎవరికి అవకాశం ఇస్తారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
రసకందాయంలో తమిళ రాజకీయాలు
తమిళనాడులో అన్నా డీఎంకే రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. శశికళ, పన్నీరు సెల్వం వేర్వేరుగా ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో  గవర్నర్‌ తీసుకునే  నిర్ణయం కీలకంగా మారనుంది. పరిపాలనా పగ్గాలు ఎవరికి అప్పగించాలన్నది గవర్నర్‌ చేతుల్లో ఉంది. 
గవర్నర్‌ ముందు నాలుగు ప్రత్యామ్నాయాలు 
ముఖ్యమంత్రి పీఠం కోసం శశికళ, పన్నీరు సెల్వం పోటీ పడుతున్న తరుణంలో గవర్నర్‌ ఎటువైపు మొగ్గు చూపుతారన్న అంశంపై ఆసక్తి  నెలకొంది. గవర్నర్‌ ముందు నాలుగు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని నిపుణలు సూచిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు వచ్చే వారంలో తీర్పు వెలవడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కేసులో శశికళ కూడా నిందితురాలు ఉన్నందున చిన్నమ్మను వేచిచూడమని చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తనవైపే ఉన్నరని శశికళ చెబుతున్న తరుణంలో, ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించి, ఆ తర్వాత అసెంబ్లీలో బలం నిరూపించుకోమని కోరే చాన్స్‌ ఉంది. 
శశికళ సమర్పించిన ఎమ్మెల్యేల జాబితాలో ఫోర్జరీ సంతకాలు 
అన్నా డీఎంకే ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తనకే మద్దతు ఇస్తున్నారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చెబుతున్నారు. శశికళ గవర్నర్‌కు అందజేసిన ఎమ్మెల్యేల జాబితాలోని సంతకాల్లో చాలా వరకు ఫోర్జరీవేని  వాదాన్ని సెల్వం వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటానని సెల్వం ప్రకటించిన నేపథ్యంలో మరో అవకాశం ఇచ్చి, అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోమని కోరే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. అన్నా డీఎంకేలో సంక్షోభం సమసిపోయే మార్గాలు కనిపించకపోతే రాష్ట్రపతి పాలనను ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ నాలుగు మార్గాల్లో గవర్నర్‌ దేన్ని ఎంచుకుంటారన్న అంశంపై ఉత్కంఠత నెలకొంది. 

 

08:31 - February 10, 2017

చెన్నై : పన్నీర్‌సెల్వం శశికళపై పోరాటాన్ని ఉధృతం చేశారు. ఆపధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్‌ సెల్వం ఆమెకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. తన రాజకీయ చతురతను ప్రదర్శించి శశికళ వర్గంలో గుబులు పుట్టిస్తున్నారు. అన్నాడిఎంకేలో నెంబర్‌ టూగా భావించే మధుసూదనన్‌ మద్దతు ప్రకటించడంతో పన్నీర్‌సెల్వం పార్టీలోనూ పట్టు సాధిస్తున్నారు.
తారాస్థాయికి శశికళ, పన్నీర్‌సెల్వం మధ్య పోరు  
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ, పన్నీర్‌సెల్వం మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఓవైపు బలపరీక్షలకు సన్నద్ధమవుతూనే మరోవైపు ఆపధర్మ ముఖ్యమంత్రిగా  తనకున్న అధికారాలతో పన్నీర్‌ సెల్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్రమంగా ప్రజల మద్దతు కూడగడుతున్న పన్నీర్‌ సెల్వం- శశికళను ఇరకాటంలో పెట్టడానికి ఏ అవకాశాన్ని వదలడం లేదు. 
డీజీపీ, సీఎస్ లతో సెల్వం సమావేశం
సిఎం హోదాలో డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమయ్యారు. శశికళకు మద్దతుగా ఉన్న చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌ జార్జ్‌ను బదిలీ చేయాలని పన్నీర్‌సెల్వం ఆదేశించారు. దీంతోపాటే, దివంగత జయలలిత నివాసమైన పోయెస్‌ గార్డెన్‌ను అమ్మ స్మారక ప్రదేశంగా మార్చాలని పన్నీర్‌సెల్వం ఆదేశించారు. ఈ నిర్ణయంతో, పోయెస్‌గార్డెన్‌లో ఉంటోన్న శశికళ ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శశికళను ఇరుకున పెట్టే నిర్ణయం తీసుకున్న సెల్వం
పార్టీలోనూ శశికళను ఇరుకున పెట్టే నిర్ణయాన్ని పన్నీర్‌ సెల్వం తీసుకున్నారు. తానే కోశాధికారిని కాబట్టి, తన అనుమతి లేకుండా పార్టీ ఖాతాల్లో నిధులు వాడడానికి ఎవరినీ అనుమతించొద్దని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ మేనేజర్లకు లేఖలు పంపించారు. అన్నాడీఎంకే పార్టీకి తానే కోశాధికారినని తెలిపారు. శశికళ పన్నీర్‌ సెల్వంను కోశాధికారి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. పార్టీ నిబంధనల ప్రకారం తన తొలగింపు అక్రమమని పన్నీర్‌ పేర్కొన్నారు. 
2012లో పోయెస్ గార్డెన్ నుంచి శశికళ గెంటివేత 
2012లో శశికళను, ఆమె బంధువులను జయలలిత పోయెస్‌ గార్డెన్‌ నుంచి బయటకు గెంటివేశారు. ఆ సమయంలో తనను క్షమించాలంటూ శశికళ జయలలితకు రాసిన లేఖను పన్నీర్‌ సెల్వం ఇపుడు బయటపెట్టారు. తన పేరును వాడుకుని పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా బంధువులు అక్రమాలకు పాల్పడ్డ విషయాన్ని శశికళ లేఖలో పేర్కొన్నట్టుగా ఆయన చదివి వినిపించారు. రాజకీయాల్లోకి రావాలని లేదనీ, పార్టీ పదవులను తాను కోరుకోవడం లేదని.. తన జీవితాన్ని జయ కోసమే అర్పించానంటూ ఆ లేఖలో శశికళ పేర్కొన్నారని పన్నీర్‌ సెల్వం తెలిపారు. . 
సెల్వంకు పెరుగుతోన్న మద్దతు  
పార్టీలో కూడా పన్నీర్‌సెల్వంకు క్రమంగా మద్దతు పెరిగుతోంది. తాజాగా అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్‌ మధుసూదనన్‌తో పాటు మరో కీలక నేత ఓంశక్తి సాగర్‌లు పన్నీర్‌ సెల్వంకు మద్దతు తెలిపారు. శశికళ వీరిని కూడా బెదిరించారని... పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పన్నీర్‌సెల్వం ఈ సందర్భంగా అన్నారు. ఇప్పుడు పోరాడకపోతే అమ్మ ఆత్మ తనని ఎప్పటికీ క్షమించదన్నారు.
శశికళ సీఎం అయితే ప్రజాస్వామ్యానికే మచ్చ : సెల్వం 
శశికళ ముఖ్యమంత్రి అయితే అది ప్రజాస్వామ్యానికే మచ్చ అని, ఆమె సీఎం కాకుండా సర్వశక్తులు ఒడ్డుతామని పన్నీర్‌ సెల్వం అన్నారు. పదవి కోసం శశికళ చెత్త రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మొత్తానికి పన్నీర్‌ సెల్వం తీసుకున్న నిర్ణయాలు.. శశికళ శిబిరంలో గుబులు రేపుతోంది. 

టీడీపీలో చేరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు

గుంటూరు : కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు టీడీపీలో చేరనున్నారు. నేడు మండలి చైర్మన్ కు ఆయన రాజీనామా చేయనున్నారు. 

 

నేటి నుంచి మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు

విజయవాడ : నేటి నుంచి మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు జరుగనుంది. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. దలైలామా, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. 

 

Don't Miss