Activities calendar

11 February 2017

21:32 - February 11, 2017

హైదరాబాద్‌ టెస్ట్‌ మూడో రోజు పోటీలో భారత్‌ జట్టు బంగ్లాదేశ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. తొలి రెండు రోజుల్లో టీమిండియా డామినేట్‌ చేస్తే...మూడో రోజు బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌కు గట్టి పోటీనిచ్చింది. 41 పరుగులకు ఒక వికెట్‌తో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌ జట్టు...తొలి సెషన్‌లో విఫలమైనా రెండో సెషను నుంచి భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు.సకీబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, మెహిదీ హసన్‌ హాఫ్‌ సెంచరీలు నమోదు చేయడంతో బంగ్లాదేశ్‌ జట్టు ఓవర్‌ నైట్‌ స్కోర్‌కు 281 పరుగులు జోడించింది. మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లాదేశ్‌ జట్టు..6 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ ఇంకా 365 పరుగులు వెనుకబడి ఉంది.తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 6 వికెట్లకు 687 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు భారత బౌలర్లు విఫలమైతే, మ్యాచ్‌ డ్రాగా ముగిసే అవకాశాలున్నాయి.

 

21:30 - February 11, 2017

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 57 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ముగిసే సమయానికి 60 నుంచి 65 శాతం జరిగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ యూపీలోని 15 జిల్లాల్లో 73 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది. ఓటర్లు ఉదయం నుంచే ఉత్సాహంగా పోలింగ్‌ వద్ద బారులు తీరారు. 73 నియోజకవర్గాల్లో 2కోట్ల 60 లక్షలమంది ఓటర్లున్నారు. తొలిదశలో మొత్తం 839 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సమాజ్‌వాది-కాంగ్రెస్‌ కూటమి, బిజెపి, బిఎస్పీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. యూపీలో మొత్తం 403 సీట్లకు గాను ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

21:12 - February 11, 2017

చెన్నై: తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు కావాలనే జాప్యం చేస్తున్నారని శశికళ ఆరోపించారు. గోల్డెన్ బే రిసార్ట్ నుంచి పొయెస్ గార్డెన్ కు చేరుకున్న శశికళ మీడియాతో మాట్లాడుతూ, తమ ఎమ్మెల్యేలంతా బాగున్నారని, పార్టీలో కలహాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని, న్యాయ సలహాలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు సూచించినట్లు చెప్పారు. తమిళనాడులో రేపు పరిస్థితులన్నీ తమకే అనుకూలిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ‘ఓపిక పట్టండి.. రేపు మీరే చూస్తారు కదా’ అని శశికళ అన్నారు.

20:39 - February 11, 2017

గన్నవరం :విజయవాడలో ఎమ్మెల్యే రోజాకు జరిగిన అవమానంపై ప్రభుత్వ తీరును ఖండిస్తూ.. సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సదస్సుకు వెళ్తున్న మహిళా ప్రజాప్రతినిధిని ఎలా అడ్డుకుంటారని వైసీపీ నేతలతో సహా విపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రోజాకు జరిగిన అవమానంపై సీఎం చంద్రబాబు, స్పీకర్‌ కోడెల బాధ్యత వహించాలని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు.

20:37 - February 11, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో రెండు అణు విద్యుత్ ప్లాంట్‌లు నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్ కేల్యాణ్‌ అమెరికాలోని న్యూహాంషైర్ రాష్ట్రంలోని సీబ్రూక్ అటామిక్ పవర్ ప్లాంట్‌ను సందర్శించారు. ఏపీలోని శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలలో ప్లాంట్‌లు నిర్మించడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో అణుప్లాంట్‌పై అధ్యయనం చేయడానికి సీబ్రూక్ ప్లాంట్‌ను పవన్ కల్యాణ్‌ సందర్శించారని జనసేన పార్టీ ప్రకటన విడుదలచేసింది.

 

20:35 - February 11, 2017

హైదరాబాద్: ట్రంప్‌ నిర్ణయాలు వాటి పర్యవసానాలు అనే అంశంపై హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ తిరుమలి, ఆర్‌సి రెడ్డి, నంద్యాల నర్సింహరెడ్డి, రఘుపాల్‌, వినయ్‌కుమార్‌,సీపీఎం నేతలు పాల్గొన్నారు. హెచ్‌1 బి వీసాలపై ట్రంప్‌ ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతుండటంతో భారతీయుల్లో ఆందోళన పెరిగిపోతుందని ప్రొఫెసర్‌ తిరుమలి అన్నారు. అమెరికాలో ఉన్న భారతీయుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్‌1 బీ వీసా అర్హతను 60 వేల డాలర్ల నుంచి లక్షా 30 వేల డాలర్లకు పెంచడంతో.. 3 లక్షల మంది విదేశీ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్‌సి రెడ్డి అన్నారు.

20:33 - February 11, 2017

హైదరాబాద్: మీడియా ప్రీమియర్‌ లీగ్‌ లో 10టీవీ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఘనవిజయాన్ని సాధించిన 10టీవీ క్వార్టర్స్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 93 పరుగులు చేసింది. 10టీవీ కెప్టెన్‌ శ్రీనివాస్‌ నాలుగు వికెట్ల్ తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన 10టీవీ 9 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. మ్యాక్జిమమ్‌ సిక్సెస్‌ అవార్డు రోహిత్‌ను వరించగా, వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శ్రీనివాస్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

20:31 - February 11, 2017

అనంతపురం : తమిళనాడు కల్లోలిత జలాల్లో బీజేపీ చేపల వేట సాగిస్తోందని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి ఆరోపించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. జయలలిత అనారోగ్యంతో ఉన్నప్పటి నుండి ఆ రాష్ట రాజకీయలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తొందన్నారు. రాజ్‌భవన్‌ కుట్రల ద్వారా అధికారంలో భాగం పంచుకోవాలని చూస్తోందని ఆరోపించారు.

20:30 - February 11, 2017

చెన్నై: తమిళనాడు రాజకీయాలు గంటగంటకు ఉత్కంఠగా మారుతున్నాయి. గవర్నర్‌తో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి భేటీ అయ్యారు. తమిళనాడు రాజకీయ పరిణామాలపై చర్చించారు. మరోవైపు.. గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన శశికళ.. రాజ్‌భవన్‌ బయలుదేరి వెళ్లారు. పన్నీర్‌సెల్వం వర్గానికి చెక్‌ పెడుతూ.. సీఎం అభ్యర్థిగా కొత్త పేరును శశికళ తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. సెంగొట్టాయన్‌ పేరు ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు పన్నీర్‌సెల్వం వర్గం బలం పుంజుకుంటోంది. తాజాగా మరో ఎంపీ సత్యభామ పన్నీర్‌సెల్వానికి మద్దతు ప్రకటించారు.

యూపీలో తొలి విడత పోలింగ్‌ ప్రశాంతం

హైదరాబాద్: యూపీలో తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 15 జిల్లాల పరిధిలోని 73 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఈ రోజు సాయంత్రం 4గంటల సమయానికి 54శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. యూపీలోని తొలి విడతలో 73 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 839 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తంచేశారు.

19:17 - February 11, 2017

హైదరాబాద్: బల్దియాలో టిఆర్ఎస్ పాలన ఏడాది పూర్తి చేసుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్లుగా యువ నాయకులకు పెద్ద పీట వేసిన ఆ పార్టీ ఎన్నికల హామీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందా? ప్రజల ఆశలు, ఆకాంక్షలు దిశగా పాలన కొనసాగుతుందా? ఇదే అంశంపై '10 టివి' బిగ్ డిబేట్ చేపట్టింది. ఈ చర్చలో సైదాబాద్ టిఆర్ ఎస్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలత, జీహెచ్ ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు బంగారి ప్రకాశ్, కవాడీగూడ టిఆర్ఎస్ కార్పొరేటర్ లాస్య నందిత, పఠాన్ చెరువు కాంగ్రెస్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, అలాగే వివిధ సంఘాల నుండి, వివిధ ప్రాంతాల నుండి పబ్లిక్ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

19:07 - February 11, 2017

హైదరాబాద్: అమరావతిలో ‘జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు నన్ను ఆహ్వానించారు. ఆహ్వానం పంపించి మరీ, నన్ను అదుపులోకి తీసుకున్నారు. అస్సలు నేను చేసిన తప్పేంటని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. కన్నీటి పర్యతం అయ్యారు. 'చంద్రబాబు ప్రభుత్వం, పోలీసులు నాపై దాడి చేశారు. చంద్రబాబు నాయుడు మహిళల వ్యతిరేకి. ఒక శాసన సభయురాలికి ఏపీలో రక్షణ లేదు రాష్ట్ర డీజీపీ మాటలు సిగ్గుచేటు, సదస్సు ఎందుకు పెట్టారయ్యా? బ్రహ్మణి, వెంకయ్య కూతర్ల పబ్లిసిటీ కోసమా? ప్రజలు పన్ను కట్టిన డబ్బును వినియోగించి మహిళాసాధికారత ఎలా సాధించాలి అనే అంశంపై చర్చిస్తారనుకుంటే మీటింగ్‌ కు రానీకుండా అరెస్టు చేయించారు. 

మహిళా సమస్యలపై అవగాహన ఉన్న బృందాకారత్‌, మేధాపాట్కర్‌ వంటి నేతలను జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సుకు ఎందుకు ఆహ్వానించలేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి, వెంకయ్యనాయుడు కూతురుని సదస్సుకు ఆహ్వానించిన ప్రభుత్వం... ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న మహిళా నేతలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. అమరావతిలో అసెంబ్లీ నిర్వహిస్తే.. ప్రతిపక్ష సభ్యుల ప్రాణాలకు రక్షణ ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీ అడుగుపెట్టినప్పటి నుంచీ తనపై కక్ష్య కట్టారని రోజా కన్నీళ్ల పర్యంతమయ్యారు.

సీఎం చంద్రబాబు, స్పీకర్‌ కోడెలకు నేనంటే ఎందుకంత భయం. ప్రతిపక్షం ఎప్పుడూ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటుంది. అసెంబ్లీలో మీ జీవితం మొత్తం నన్ను సస్పెండ్‌ చేయడానికే సరిపోయింది. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌పై రెండు రోజులు మాట్లాడితే ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు. మహిళల పట్ల స్పీకర్ కు ఎంత చిన్నచూపు ఉందో ఈ మాటలు చాలు’ అని రోజా మండిపడ్డారు. అమరావతిలో అసెంబ్లీ జరిగితే ప్రతిపక్ష నేతలకు హాని వుంది.

18:52 - February 11, 2017

మధ్యప్రదేశ్ లో సిమి ఉగ్రవాది అరెస్ట్..

హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో సిమి ఉగ్రవాది పర్వేజ్‌ను పోలీసులు చాక‌చ‌క్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఓ రహస్య ప్రదేశంలో ఉగ్ర‌వాదిని పోలీసు అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.భారత్‌లో సిమి ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉంద‌ని నిఘావ‌ర్గాలు ప‌లు సంద‌ర్భాల్లో హెచ్చ‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

'తమిళనాడు'లో బిజెపి జోక్యం చేసుకోదు:వెంకయ్య

హైదరాబాద్: తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మరోసారి స్పష్టం చేశారు. తమిళనాడులో ఎవరు సీఎం? అనే విషయాన్ని తమ పార్టీ నిర్ణయించలేదని, ఆ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే బాధాకరంగా ఉందని, ఎవరు సీఎం అనే విషయాన్ని వారే తేల్చుకోవాలని ఆయన సూచించారు.

17:31 - February 11, 2017

చెన్నై: గోల్డెన్‌ బే రిసార్ట్స్‌ లో ఉన్న ఎమ్మెల్యేలతో శశికళ చెన్నై రాజ్ భవన్ కు బయలుదేరారు. సీఎం అభ్యర్థిగా సెంగొట్టాయన్ కొత్త పేరు ను శశికళ ప్రతిపాదిస్తున్నారు. దీంతో రాజ్ భవన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ లో అనుమతి లభించక పోతే రాష్ట్రపతి వద్దకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతకుముందు పోయిస్‌ గార్డెన్‌ నుంచి బయల్దేరిన శశికళ మెరీనా బీచ్‌లో జయలలితకు నివాళులర్పించిన అనంతరం గోల్డెన్‌ బే రిసార్ట్స్‌కు బయల్దేరి వెళ్లి అసంతృప్త ఎమ్మెల్యేలను సైతం బుజ్జగించేందుకు శశికళ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

17:28 - February 11, 2017

చెన్నె : తమిళనాట అధికార అన్నాడీఎంకే పార్టీలో రాజకీయ సంక్షోభం తారా స్థాయిలో కొనసాగుతోంది. సీఎం పదవిలో తనను కొనసాగించాలని కోరుతున్న ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ ఇద్దరూ తమ వాదనలను గురువారమే గవర్నర్‌కు విన్పించిన విషయం తెలిసిందే. అయితే, గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారోననే ఉత్కంఠ సర్వతా నెలకొంది. అయితే, గవర్నర్‌ నిర్ణయం పెండింగ్‌లో వుంచడంపై శశికళ శిబిరంలో కలవరం మొదలైంది. పన్నీర్‌ సెల్వం తన పదవికి రాజీనామా చేసి ఏడు రోజులవుతున్నప్పటికీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న తనను ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ఎందుకు ఆహ్వానించడంలేదని పేర్కొంటూ శశికళ గవర్నర్‌కు లేఖరాశారు. ఈ సాయంత్రం ఎమ్మెల్యేలతో కలిసేందుకు అనుమతివ్వాలని, రాజ్‌భవన్‌కు వస్తానని లేఖలో పేర్కొన్నారు. అయితే, గవర్నర్‌ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఇప్పటికే, పోయిస్‌ గార్డెన్‌ నుంచి బయల్దేరిన శశికళ మెరీనా బీచ్‌లో జయలలితకు నివాళులర్పించిన అనంతరం గోల్డెన్‌ బే రిసార్ట్స్‌కు బయల్దేరి వెళ్లారు. అక్కడి ఎమ్మెల్యేలతో సమావేశమై తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై వారితో సమాలోచనలు జరుపుతున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలను సైతం బుజ్జగించేందుకు శశికళ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

రాజ్ భవన్ కు బయలుదేరిన శశికళ!

చెన్నై:గోల్డెన్‌ బే రిసార్ట్స్‌ లో ఉన్న ఎమ్మెల్యేలతో శశికళ చెన్నై రాజ్ భవన్ కు బయలుదేరినట్లు సమాచారం అందుతోంది. రాజ్ భవన్ లో అనుమతి లభించక పోతే రాష్ట్రపతి వద్దకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతకుముందు పోయిస్‌ గార్డెన్‌ నుంచి బయల్దేరిన శశికళ మెరీనా బీచ్‌లో జయలలితకు నివాళులర్పించిన అనంతరం గోల్డెన్‌ బే రిసార్ట్స్‌కు బయల్దేరి వెళ్లి అసంతృప్త ఎమ్మెల్యేలను సైతం బుజ్జగించేందుకు శశికళ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్ కు ఎమ్మెల్యే రోజా

హైదరాబాద్: మ‌హిళా పార్ల‌మెంటు స‌ద‌స్సులో పాల్గొనేందుకు హైద‌రాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఆమెను పోలీసు వాహ‌నంలో ఎక్కించుకొని ఉద‌యం నుంచి తిప్పుతున్న పోలీసులు కొద్దిసేప‌టి క్రితం హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. న‌గ‌రంలోని మ‌ణికొండ‌లో ఉన్న రోజా ఇంటి వ‌ద్ద ఆమెను వ‌దిలి వెళ్లారు.

17:02 - February 11, 2017

అమరావతి: మహిళాశక్తిని సద్వినియోగం చేసుకోవడంలో మనం వెనకబడిఉన్నామని... తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మదుసూధనాచారి అన్నారు.. సమస్యల్ని అధిగమించి మహిళలు ముందుకు సాగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.. వనితలు సృష్టికర్తలని... అమ్మగా, భార్యగా, సోదరిగా ఎన్నో సేవలు అందిస్తున్నారని చెప్పారు..

17:00 - February 11, 2017

అమరావతి: తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంవల్లే ఈ స్థాయికి చేరగలిగానని... జస్టిస్‌ రోహిణి చెప్పారు.. ఏ స్కూల్‌లో మనం చదువుకున్నామన్నదికాదని... మన లక్ష్యం ఏంటనేదే ముఖ్యమని స్పష్టం చేశారు..

16:59 - February 11, 2017

అమరావతి :మహిళలకు కాస్త కాన్ఫిడెన్స్ అందిస్తే చాలు... ఏదైనా చేసి చూపిస్తారని... ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. కుటుంబంలో మహిళల బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ చాలా గొప్పగా ఉంటుందని ప్రశంసించారు.. ఆదాయాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఖర్చుచేస్తూ కుటుంబాన్ని మెయింటెయిన్‌ చేస్తారని చెప్పారు..

16:58 - February 11, 2017

అమరావతి :మహిళా సాధికారత అంటే సమాన అవకాశాలు ఇవ్వడమన్నారు.. గవర్నర్‌ నరసింహన్‌... మహిళలపై దాడులు, అత్యాచారాలక పాల్పడ్డవారికి కఠిన శిక్షలు ఉండాలని అభిప్రాయపడ్డారు.. ఈ కేసుల విచారణ కోర్టుల్లో త్వరగా పూర్తిచేయాల్సిన అవసరముందని చెప్పారు..

16:56 - February 11, 2017

విశాఖపట్నం: విభజన హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 3 రోజుకు చేరుకుంది. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే వరకూ ఉద్యమం ఆపమని స్పష్టంచేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభించిన దీక్షకు పలువులు రాజకీయ నేతలు, మేధావులు, విద్యావేత్తలు మద్దుతు తెలుపుతున్నారు.

16:55 - February 11, 2017

హైదరాబాద్: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌పై మండిపడ్డారు. గతంలో మెదక్‌ జిల్లాకి ఐఐటి మంజూరు చేయిస్తే.. దాన్ని బాసరకు తరలించారన్నారు. చింతా ప్రభాకర్‌కు దమ్ముంటే.. సిద్దిపేటకు తరలి వెళ్తున్న మెడికల్‌ కాలేజీని సంగారెడ్డికి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

16:54 - February 11, 2017

హైదరాబాద్: మహిళా సాధికారత గురించి ఎంపీ కవిత మాట్లాడడం విడ్డురంగా ఉందని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతురావు అన్నారు. తన తండ్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదని.. దీని గురించి ఎప్పుడూ మాట్లాడని కవిత మహిళా పార్లమెంట్ సదస్సులో సాధికారత గురించి మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే రోజాను సదస్సుకు హాజరుకాకుండా అడ్డుకోవడం సరికాదన్నారు.

16:52 - February 11, 2017

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎల్లమ్మబండలోని మహంకాళీ నగర్‌లో ఇంటిగోడ కూలి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు..భోరున విలపిస్తున్నారు. ఇంటిగోడ ఎలా కూలిందన్న దానిపై వివరాలు ఇంకా తెలియరాలేదు.

16:51 - February 11, 2017

హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాడే విషయంలో కాంగ్రెస్‌ ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. ఉప ఎన్నికల్లో వరుస ఓటములు, జీహెచ్‌ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాజయం, టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో మొదటి డీలా పడిన కాంగ్రెస్‌ ఆ తర్వాత తేరుకుది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎప్పడికప్పుడు పోరాడుతున్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల భూసేకరణ, డిజైన్ల మార్పు, రైతుల ఆత్మహత్యలు, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌, సచివాలయం తరలింపు ఉద్యమాలు చేసింది. అయినా జనం తమ వెంటలేరన్న ఆందోళన వీరి ఇప్పుడు పట్టి పీడిస్తోంది.

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హతపై కేసు

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌పై గెలిచి, అధికార పార్టీ ప్రారంభించిన ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ వేదికగా పోరాడింది. సుప్రీంకోర్టులో కేసు వేసింది. అయినా మైలేజీ రాలేదన్న ఆవేదన వీరిని వేధిస్తోంది. కేసీఆర్‌ పవర్‌ పాలిటిక్స్‌ను దీటుగా ఎదుర్కొంటున్నా ఫలితం కనిపించడంలేదన్న అంతర్మథనంతో కుమిలిపోతున్నారు. ప్రాజెక్ట్‌ల పునరాకృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌కు దీటుగా తాము ప్రజెంటేషన్‌ ఇచ్చినా జనం నుంచి స్పందన రాలేదన్న బాధ తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తోంది. మల్లన్నసాగర్‌ భూసేకరణ జీవోకు వ్యతిరేకంగా రోడ్డెక్కినా... రైతుల ఆత్మహత్యలపై భరోసా యాత్రలు చేట్టినా, ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌ కోసం విద్యార్థి గర్జన నిర్వహించినా ప్రజల నుంచి ఆశించిన మేర మద్దతు లభించలేదని మదనపడుతున్నారు.

పోరాటాలు, ఉద్యమాలు,ఆందోళనలు హైదరాబాద్‌కే పరిమితం ....

ఇంత చేసినా... జనం కాంగ్రెస్‌కు దూరంగా ఉండటానికి లోపం ఎక్కడ ఉన్నది అన్న అంశంపై ఇప్పుడు పార్టీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. పోరాటాలు, ఉద్యమాలు, ఆందోళనల్లో ఎక్కువ భాగం హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నాయి. దీంతో కాంగ్రెస్‌ సందేశం దిగువ స్థాయికి చేరడంలేదన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ ముఖ్యనేతల్లో చాలా మంది క్షేత్రస్థాయికి వెళ్లకుండా గాంధీభవన్‌కే పరిమితం అవ్వడం కూడా కాంగ్రెస్‌ ప్రజలకు చేరువకాలేకపోతోందన్న వాదన కూడా కాంగ్రెస్‌ నేతల్లో వినిపిస్తోంది. ఈ విషయంలో తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌, టీ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి బాగా సక్సెస్‌ అయ్యారన్న అభిప్రాయం కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేసి, ప్రత్యర్థులు వ్యూహాలను చిత్తు చేయడంలో ఉద్దండులైన నేతలకు తెలంగాణ కాంగ్రెస్‌లో కొదవలేదు. కానీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు లోపాలు, వైఫల్యాలను ప్రజలకు విడమర్చి చెప్పడంలో విఫలమవుతున్నారన్న వాదనలు ఉన్నాయి. బహిరంగ సభల్లో నేతల ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకునేలా ఉండటంలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీని నడిపించే విషయంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమర్‌కుమార్‌రెడ్డి, సీఎల్ఫీ నేత జానారెడ్డి అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు కూడా పార్టీకి నష్టం కలిగిస్తున్నాయన్న వాదనలు ఉన్నాయి. అందర్నీ కలుపుకుని ముందుకు సాగాల్సిన నేతలే ఎవరి వారే యుమునా తీరే అన్న విధంగా వ్యవరించినంతకాలం కాంగ్రెస్‌ ప్రజాదరణకు నోచుకునే అవకాశాలులేవని విశ్లేషిస్తున్నారు.

మొక్కుబడి తంతుగా ధర్నాలు, ఆందోళనలు.....

కాంగ్రెస్‌ నేతలు చాలా సందర్భాల్లో ప్రజా సమస్యలపై చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు మొక్కుబడి తంతుగా ముగిస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీలోనే లేకపోలేదు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపి, ముందుండి పోరాడాల్సిన నేతలే ఈ విధంగా చేయడం వలన కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి వ్యతిరేక భావాలు వెళ్తున్నాయని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే అది తమకు కలిసొస్తుందన్న కాంగ్రెస్‌ పెద్దల ధోరణితో పార్టీకి నష్టం కలిగే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. ఈ లోపాలను అధిగమించేందుకు పార్టీ నేతలందరూ ఏకతాటిపైకి రాకపోతే తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజలకు చేరువకావడం కష్టమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

16:48 - February 11, 2017

కృష్ణా : పచ్చటి పొలాలు మాయమవుతున్నాయి. పల్లెసీమలు వ్యాపార పోకడకు దారితీస్తున్నాయి. పేద ప్రజలతో పాటు.. మూగ జీవాలు సైతం అంతుబట్టని రోగాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆక్వా సంపద మాటున పేదోడి బతుకు కన్నీటిపర్యంతమవుతోంది. కృష్ణా తూర్పు డెల్టా అన్యాయంగా, అక్రమంగా చేపల చెరువు తవ్వకాలకు నిలయంగా మారుతోంది.

5500 ఎకరాల్లో మాత్రమే సాగు....

ఇది కృష్ణాజిల్లా నందివాడ మండలం. ఇక్కడ భూములన్నీ ఆక్వా చెరువులుగా మారిపోతున్నాయి. దాదాపు 26 వేల ఎకరాల్లో చేపల చెరువులే దర్శనమిస్తున్నాయి. మండలంలో కేవలం 5500 ఎకరాలు మాత్రమే సాగుకు మిగిలాయి. మరోవైపు అక్వా వ్యర్థ జలాలు సాగునీటి కాలువల్లో కలవడంతో పంటలకు ముప్పు వాటిల్లుతుందని వ్యవసాయ అధికారులంటున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో పంటలే పండని పరిస్థితి నెలకొంది.

మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి, కైకలూరు మండలాల్లో విచ్చలవిడిగా చేపల చెరువులు....

ఇక జిల్లాలోని మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి, కైకలూరు మండలాల్లో వేల ఎకరాలు చేపలు, రొయ్యల చెరువులుగా మారిపోయాయి. గత ఐదేళ్లుగా కృష్ణా తూర్పు డెల్టాలో భారీగా ఆక్వా చెరువులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ప్రస్తుతం గుడివాడ మండలంలో క్రమంగా సాగు భూములు పేదోడికి దూరమవుతూ చెరువులుగా మారుతున్నాయి.

కరువైన ఉపాధి ....

పొలం పనుల మీద ఆధారపడ్డ రైతు కూలీల కుటుంబాలకు ఉపాధి కరువై.. ఊరుని వదిలి వేరే ప్రాంతాలకు తరలివెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అంకన్నగూడెం గ్రామంలో ఒకప్పుడు 150 కుటుంబాలు ఉండేవి. అక్కడ ప్రాథమిక పాఠశాల, మైక్రో వాటర్‌ ఫిల్టర్‌, ఊర చెరువు, ప్రార్థన మందిరాలు ఉండేవి. అయితే.. తాజాగా పొలాలన్నీ చేపల చెరువులుగా మారడంతో.. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేని గ్రామస్తులు.. ఉపాధి కోసం ఇతర గ్రామాలకు తరలివెళ్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆ గ్రామంలో నాలుగు కుటుంబాలు మాత్రమే మిగిలాయి. మరో గ్రామమైన గంటావారిపాలెంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దళితులు, పేద ప్రజల భూములను లాక్కొని కొంతమంది బడాబాబులు అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజల పక్షాన అండగా నిలుస్తున్న నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమ చెరువులపై న్యాయపోరాటం చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పలువురంటున్నారు.

రోగాలబారిన పడుతున్న ప్రజలు ....

మరోవైపు ఆక్వా సాగు వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఉప్పు ద్రవం వారి పాలిట ఉపద్రవంగా మారింది. వ్యర్థ జలాలను తాగి పశువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయింది. కనీసం తాగేందుకు మంచినీరు లభించక కొనుక్కోవాల్సి దుస్థితి ఏర్పడిందని ప్రజలంటున్నారు.

అనుమతులు లేకుండానే చెరువుల తవ్వకాలు .....

ఇక ఇక్కడ ఏర్పాటు చేస్తున్న చేపల చెరువుల్లో ఎక్కువ శాతం అనుమతి లేకుండానే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా ఈ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో 20 వేల ఎకరాల్లో అనుమతి లేకుండా చేపల చెరువులు తవ్వినట్లు తెలుస్తోంది. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లాలో అనధికారికంగా లక్ష ఎకరాల్లో చెరువులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా అక్రమ చెరువులపై దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమంగా లాక్కున్న దళితులు, పేదల భూములు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు.

16:45 - February 11, 2017

హైదరాబాద్: కరీంనగర్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఏఎస్సై పదోన్నతి శిక్షణ కోసం వచ్చి కానిస్టేబుళ్లు మృత్యువాతపడుతుండటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. కఠినతరమైన శిక్షణ వల్లే చాలామంది కానిస్టేబుళ్లు అనారోగ్యం బారిన పడటంతో పాటు.. ప్రాణాలు కోల్పోతున్నారని సహచరులు అంటున్నారు. అయితే ఇటీవల చనిపోయిన పోలీసులంతా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ విభాగానికి చెందినవారే కావడంతో పోలీసు శాఖలో వివక్ష కొనసాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

1980 దశకంలో పోలీసుశాఖలో ఏఆర్‌ విభాగంలో ..

1980 దశకంలో పోలీసుశాఖలో ఏఆర్‌ విభాగంలో చేరిన 372 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించడంతో జనవరి 18న కరీంనగర్‌ పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌కు శిక్షణకు వచ్చారు. వీరిలో చాలామంది వయస్సురీత్యా, ఆరోగ్యం సహకరించక రిటైర్మెంట్‌కు దగ్గర ఉన్న హెడ్‌ కానిస్టేబుళ్లు అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే.. ఉన్నతాధికారులు వయస్సును పట్టించుకోకుండా శిక్షణ ఇవ్వడంతో.. పోలీసులు చనిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మధ్యే మీర్జాత్‌ అజ్మత్‌అలీ, మధుతో పాటు.. యాదవ్‌రావు పరేడ్‌ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు వదిలారు. మరికొంత మంది కఠోర శిక్షణ చేయలేక అనారోగ్యం పాలవడం.. ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే.. ఇవేమీ బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు

సివిల్‌ పోలీసులకు లేని నిబంధనలు మాకెందుకు...

అయితే.. సివిల్‌ పోలీసులకు లేని నిబంధనలు మాకెందుకు అని ఏఆర్‌ పోలీసులు వాపోతున్నారు. శాంతి భద్రతల విధులు నిర్వహించని తమకు కఠినతరమైన శిక్షణ ఎందుకు అంటున్నారు. రిటైర్మెంట్‌ వయసు దగ్గరకు వచ్చినా.. హోదా పెరిగితే జీతం పెరుగుతుందనే ఆశతో శిక్షణకు వస్తే.. కఠినతరమైన శిక్షణతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు శిక్షణతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు.

పదోన్నతి కోసం వచ్చే హెడ్‌కానిస్టేబుళ్లకు కఠినతరమైన శిక్షణ...

ఇదిలావుంటే.. పదోన్నతి కోసం వచ్చే హెడ్‌కానిస్టేబుళ్లకు కఠినతరమైన శిక్షణ ఏమీ ఇవ్వడం లేదని పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రిన్సిపాల్‌ అంటున్నారు. వారికి ముందు నుంచే అనారోగ్యం ఉండటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటున్నారు. ఈ మధ్య మృతి చెందిన యాదవరావు.. రన్నింగ్‌ చేస్తూ చనిపోవడంలో వాస్తవం లేదన్నారు. నాలుగేళ్ల క్రితం గుండె ఆపరేషన్‌ చేయించుకున్న యాదవరావు.. ఈ విషయాన్ని దాచిపెట్టి తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించాడంటున్నారు. అయితే.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రిటైర్మెంట్‌కు దగ్గరున్న తమకు.. కఠిన తరమైన శిక్షణ లేకుండా ప్రమోషన్లు కల్పించాలని ఏఆర్‌ కానిస్టేబుళ్లు కోరుతున్నారు.

ఏఆర్‌ కానిస్టేబుళ్లకు ప్రాణం మీదకు వస్తున్న ట్రైనింగ్‌

కరీంనగర్ : పదోన్నతుల కోసం నిర్వహిస్తున్న ట్రైనింగ్‌ ఏఆర్‌ కానిస్టేబుళ్లకు మరణశిక్షగా మారుతోంది. అవసరం లేకున్నా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ విభాగానికి కఠినతర శిక్షణ ఇస్తుండడంతో హెడ్‌కానిస్టేబుళ్లు మృత్యువాతపడుతున్నారు. అయితే ఉన్నతాధికారుల వివక్ష వల్లే కరీంనగర్‌ పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు తలెత్తుతున్నాయి.

16:42 - February 11, 2017

చెన్నై: తమిళనాడులో గంటగంటకూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జయ సమాధిని దర్శించుకున్న అనంతరం శశికళ గోల్డెన్‌ బే రిసార్ట్‌కు చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌ వెళ్లే యోచనలో శశికళ ఉన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాలని శశికళ కోరుతున్నారు.

16:40 - February 11, 2017

కృష్ణా : విజయవాడలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతల్లి బిడ్డపట్ల క్రూరంగా ప్రవర్తించింది. చిన్నారి ఒంటినిండా వాతలు పెట్టింది. విజయవాడ పాత రాజేశ్వరిపేటకు చెందిన అస్మాబేగం, షా వలి దంపతులకు రెండేళ్ల చిన్నారి అస్రిన్‌ ఉంది. తరచూ భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో.. భర్తపై కోపాన్ని చిన్నారి అస్రిన్‌పై తీసింది తల్లి అస్మాబేగం. చిన్నారి ఏడుస్తుండటంతో.. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాప తాత షాజాహాన్‌ ఫిర్యాదు మేరకు తల్లిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అస్మాబేగం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

రోజా అరెస్ట్‌ను ఖండించిన సీపీఎం నేత మధు

విజయవాడ: వైసీపీ ఎమ్మెల్యే రోజా అరెస్ట్‌ను ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రంగా ఖండించారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు ఆహ్వానించి.. చంద్రబాబు ప్రభుత్వం గన్నవరం విమానాశ్రయం వద్ద అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అనుసరిస్తుందనడానికి ఇదొక నిదర్శనమన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు వచ్చిన మధు ఏపీ ప్రభుత్వంపైవిరుచుకుపడ్డారు.

లారీ-కారు ఢీ, ముగ్గురు మృతి

కరీంనగర్ :జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. బొమ్మకల్‌ బైపాస్‌ రోడ్డుపై లారీ-కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో... ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరి మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో.. ఆ మార్గంలో వెళ్తున్న ఇండోర్ కలెక్టర్ నరహరి... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో...సాయం చేశారు.

చెన్నైలో అల్లరిమూకలు ?

తమిళనాడు : చెన్నైలో విధ్వంసం సృష్టించేందుకు అల్లరిమూకల పన్నాగం పన్నినట్లు, గవర్నర్ ప్రకటన వెలువడగానే గొడవ చేసేందుకు ప్లాన్ రచించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 

15:12 - February 11, 2017

చెన్నై: తనకు పూర్తి బలం ఉందని, బలపరీక్షకు తమను ఆహ్వానించాలని కోరుతున్నా... గవర్నర్ పట్టించుకోకపోవడం శశికళ కు అసహనాన్ని పెంరుగుతోంది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం జయలలిత స్మారకం వద్దకు ఆమె బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమయింది. 120 మంది ఎమ్మెల్యేల‌ను ప‌లు రిసార్ట్సుల్లో ఉంచిన చిన్నమ్మ ఈ రోజు నేరుగా మాట్లాడాల‌ని నిర్ణ‌యించుకున్నట్లు సమాచారం. పోయెస్ గార్డెన్‌లోని త‌న నివాసం నుంచి మహాబలిపురం సమీపంలోని కోవత్తూర్‌లో గల గోల్డెన్ బే రిసార్టుకు ఆమె బ‌య‌లుదేరారు. మొద‌ట మెరీనా బీచ్ స‌మీపంలో ఉన్న అమ్మ జ‌య‌ల‌లిత స‌మాధిని ద‌ర్శించుకొని ఆ త‌రువాత ఆమె రిసార్టుకి చేరుకుంటారు.

పోయిస్ గార్డెన్ నుండి బయలుదేరిన శశికళ..

చెన్నై : పోయిస్ గార్డెన్ నుండి శశికళ బయలుదేరారు. ఎమ్మెల్యేలు బస చేసిన ప్రాంతం వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

సూర్యాపేటలో మంత్రి జగదీష్ పర్యటన..

హైదరాబాద్ : మంత్రి జగదీష్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం సూర్యాపేటలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన తన సొంత నిధులతో నిర్మింపజేసిన బీసీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. 

జాతీయ మెగా లోక్ అదాలత్ లు..

హైదరాబాద్ : పలు కోర్టుల ప్రాంగాణాల్లో జాతీయ మెగా లోక్ అదాలత్‌లు నిర్వహించారు. నగరంలోని సిటీ సివిల్ కోర్టు, ఎర్రమంజిల్, రంగారెడ్డి కోర్టు ప్రాంగాణాల్లో లోక్ అదాలత్‌లను ఏర్పాటు చేశారు. 

13:48 - February 11, 2017

భద్రాద్రి కొత్తగూడెం : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న మహాజన పాదయాత్ర..118వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని ఉసిరికాయపల్లి, భాగ్యనగర్‌తండా, కామేపల్లి, బొక్కలతండా, విశ్వనాథపల్లి, కారేపల్లి గ్రామాలగుండా కొనసాగుతోంది. స్థానిక సమస్యలపై గ్రామస్తులు పెద్ద ఎత్తున వినతిపత్రాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు సమర్పిస్తున్నారు. 

 

13:46 - February 11, 2017

చెన్నై : తమిళనాడు గవర్నర్‌కు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ లేఖ రాశారు. ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌కు వచ్చేందుకు అనుమతించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తమిళనాడు శ్రేయస్సుకోసం త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. పన్నీర్‌ సెల్వం రాజీనామాను ఆమోదించారని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని  పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:41 - February 11, 2017

విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్టులో హైడ్రామా చోటుచేసుకుంది. మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సులో పాల్గొనేందుకు రోజా ఎయిర్‌పోర్టుకువచ్చారు. సదస్సులో పాల్గొనేందుకువచ్చిన రోజాను పోలీసులు అడ్డుకున్నారు.. బౌద్దగురువు దలైలామా వస్తున్నారంటూ ఎయిర్‌పోర్టులోని రూంలో రోజాను నిర్బంధించారు. ఈ సదస్సుకు రావాలంటూ రోజాకు ప్రభుత్వం ఆహ్వానపత్రం పాస్‌ను పంపినా..పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారంటూ రోజా పోలీసులను నిలదీసింది. అయినా కూడా పోలీసులు..రోజాను అరెస్ట్‌చేసి బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. అయితే పోలీసులు అరెస్ట్‌చేసి వాహనంలోకి ఎక్కిస్తుండగా..గుంటూరు జిల్లా పేరేచర్ల జంక్షన్‌ దగ్గర రోజా ఒక్కసారిగా కిందపడిపోయింది. రోడ్డు మీదే కూర్చున్న రోజా కన్నీళ్ల పర్యంతమైంది. అయినా కూడా పోలీసులు..ఎమ్మెల్యే రోజాను బలవంతంగా సత్తెనపల్లి వైపు తీసుకెళ్తున్నారు. రోజాను మహిళా సదస్సుకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ, మహిళా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
మహిళల పట్ల గౌరవంలేని చంద్రబాబు : రోజా
చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే..మహిళా సాధికారత సదస్సుకు బృందాకరత్‌, మేధాపాట్కర్‌, వనజాక్షి, రిషితేశ్వరి తల్లిదండ్రులను పిలవాలని వైసిపి ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. మహిళల పట్ల గౌరవంలేని చంద్రబాబు ప్రభుత్వం..పార్లమెంటరీ సదస్సు పేరుతో మహిళలను అవమానిస్తోందని రోజా విమర్శించారు. 

 

పన్నీర్ కు విద్యాశాఖ మంత్రి మద్దతు..

చెన్నై : పన్నీర్ కు విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ మద్దతు పలికారు. కాసేపట్లో పన్నీర్ నివాసానికి పాండ్య చేరుకోనున్నారు.

 

13:28 - February 11, 2017

తొందరపడి కూస్తున్న మీడియా కోకిలలు... అబద్ధాలు తెలుసుకున్న పబ్లిక్కు కిలకిలలు, పిల్లల కడుపుల నత్తలు బైటికి రావాలి... భరతమాత కడుపుల రాజకీయ నత్తలొద్దా, 
సొంత పార్టీని నమ్మనంటున్న తుమ్మల... ఎదుగుదల ఓర్సుకుంటలేరని రుస రుస.. ఇల్లందు దిక్కు తయారైన భూమి పుండు... ఓపెన్ కాస్టులను ఒద్దంటున్న ఊరి జనం.. 
బడికివోయిన పోరనికి బాల్ కటింగ్...కర్నాటక కాడా ప్రైవేట్ బడోని పైత్యం, పిల్లిని సంపుండ్రంటున్న పాఠ్యపుస్తకం.. ఆ రాష్ట్రం నాలుగో తరగతి పాఠం...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

డీజీపీని కలిసిన వైసీపీ నేతలు..

విజయవాడ : ఏపీ రాష్ట్ర డీజీపీని వైసీపీ నేతలు కలిశారు. ఎమ్మెల్యే రోజా పట్ల పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. మహిళా సదస్సుకు ఆటంకంల కలుగకూడదనే తమ అభిప్రాయమని డీజీపీ వెల్లడించారు.

గవర్నర్ కు శశికళ మరో లేఖ..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కు శశికళ మరో లేఖ రాశారు. గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సంక్షోభం మొదలై ఏడు రోజులైందని త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలతో కలిసి కలుస్తానని, అందుకు అనుమతినించాలన్నారు.

 

13:07 - February 11, 2017
13:02 - February 11, 2017

తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకున్న నిర్ణయం వెనుక కేంద్రప్రభుత్వం పాత్ర ఉందని వక్తలు ఆరోపించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, టీకాంగ్రెస్ నేత కైలాష్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. గవర్నర్.... కేంద్రప్రభుత్వం ఏజెంట్ అని చెప్పారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:56 - February 11, 2017

విజయవాడ : మహిళాసాధికారిత అనేది కుటుంబం నుంచే ప్రారంభమవుతుందని.... హెరిటేజ్‌ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ బ్రాహ్మణి అన్నారు.. అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ మహిళలు ముందుకు సాగాలని సూచించారు.. వనితలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నా పనిచేసేచోట శారీరక, మానసిక వేధింపులు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు..

 

12:53 - February 11, 2017

విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్టులో హైడ్రామా కొనసాగుతోంది. మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సులో పాల్గొనేందుకు రోజా ఎయిర్‌పోర్టుకువచ్చారు. సదస్సులో పాల్గొనేందుకువచ్చిన రోజాను పోలీసులు అడ్డుకున్నారు. దలైలామా వస్తున్నారంటూ ఎయిర్‌పోర్టులోని రూంలో నిర్బంధించారు.. ఈ సదస్సుకు రావాలంటూ రోజాకు ప్రభుత్వం ఆహ్వానపత్రం పాస్‌ను పంపింది.
మహిళలను అవమానిస్తోన్న టీడీపీ సర్కార్ : ఎమ్మెల్యే రోజా 
చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే..మహిళా సాధికారత సదస్సుకు బృందాకరత్‌, మేధాపాట్కర్‌, వనజాక్షి, రిషితేశ్వరి తల్లిదండ్రులను పిలవాలని వైసిపి ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. మహిళల పట్ల గౌరవంలేని చంద్రబాబు ప్రభుత్వం..పార్లమెంటరీ సదస్సు పేరుతో మహిళలను అవమానిస్తోందని రోజా విమర్శించారు. 
పుణ్యవతి...
రోజాను అడ్డుకోవడం ఎలా కరెక్టు. 
అంబటి రాంబాబు ...
రోజాను అడ్డుకోవడం దారుణం. దురదృష్టకరమైన పరిణామం. ప్రజాస్వామ్య దేశంలో ఇది సబబు కాదు. కిడ్నాప్ చేసిన పద్ధతిలో వ్యవహిరించారు. రాజకీయంగా కక్ష్య సాధింపు చర్యకు పాల్పడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఆహ్వానం పత్రం ఇచ్చారు.. రాకుండా అడ్డుకున్నారు. మహిళల హక్కులను కాలరాసే విధంగా ఉంది. 
గఫూర్ ...
దలైలామా రావడానికి రోజాను అడ్డుకోవడానికి సబంధం లేదు. అధికార దుర్వినియోగం అవుతుంది. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు. ఇది చాలా అన్యాయం. రోజా అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగు మహిళలు, వారికి మద్దతు పలికే వారిని మాత్రమే అనుమతిస్తున్నారు.
వైసీపీ... పార్థసారథి 
మహిళ సాధికారత తీరు ఇదేనా....? ప్రతిపక్ష నాయకులంటే ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయము... ప్రభుత్వం ఉద్ధేశం ఏంటీ..? 
రమాదేవి... ఐద్వా నాయకురాలు
ఇది ప్రభుత్వ నిరంకుశత్వం ను తెలియజేస్తుంది...
టీడీపీ నేత రామకృష్ణప్రసాద్ 
గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద రోజా రభస చేసేందుకు ప్రయత్నించింది. వ్యక్తిగతంగా గుర్తింపు సాధించుకోవాలని ఆమెకు కోరిక ఉంది.

 

రేషన్ డీలర్ ను హత్య చూసిన మావోయిస్టులు..

ఛత్తీస్ గడ్ : దంతెవాడ జిల్లా పరేమ్ గ్రామంలో మావోయిస్టులు రేషన్ డీలర్ దులరామ్ గొంతుకోసి చంపారు. నలుగురు గ్రామస్తులను కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది.

12:39 - February 11, 2017

యూపీ : ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పశ్చిమ యూపీలోని 15 జిల్లాల్లో 73 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. 73 నియోజకవర్గాల్లో 2కోట్ల 60 లక్షలమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంచుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. తొలిదశలో మొత్తం 839 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7గంటలనుంచి 9గంటలవరకు రికార్డుస్థాయిలో 10.56 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7 గంటలనుంచి 9గంటలవరకు నమోదైన పోలింగ్‌లో ఫిరోజాబాద్‌లోలో 12 శాతం, ముజఫర్‌నగర్‌లో 15 శాతం, అలీఘర్‌లో 10.5 శాతం, బులంద్‌షహర్‌లో 12శాతం, హత్రాస్‌లో 12శాతం, ఘజియాబాద్‌లో 13 శాతం, ఆగ్రాలో 12 శాతం పోలింగ్‌ నమోదైంది. ముజఫర్‌నగర్‌ సహా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటుచేశారు. యూపీలోని 403 నియోజకవర్గాలకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 11న ఫలితాలు విడుదలకానున్నాయి. 

మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు..రాణిస్తున్నారు - జస్టిస్ రోహిణి..

విజయవాడ : మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి పేర్కొన్నారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. మహిళలకు సమాన హక్కులతో పాటు వివక్షను దూరం చేసేలా కార్యక్రమాలు ఉండాలని ఆకాంక్షించారు.

కన్నీళ్లు పెట్టుకున్న రోజా..

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. దలైలామా వస్తున్నారని పోలీసులు రోజాను అడ్డుకుని పేరేచర్ల పీఎస్ కు తరలిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు బలవంతంగా తరలిస్తుండగా రోజా కారు నుండి కిందపడిపోయారు.

కొనసాగుతున్న పోలింగ్..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు తొలిదశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 11గంటల వరకు ఘజియాబాద్ లో 25.71 శాతం, బాఘ్ పట్ లో 26 శాతం పోలింగ్ నమోదైంది.

12:30 - February 11, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. గోల్డెన్‌ బే రిసార్ట్స్‌ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. హైకోర్టు ఆదేశాలతో గోల్డెన్‌ బే రిసార్ట్స్‌కుచేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారుల్ని శశికళ వర్గీయులు అడ్డుకున్నారు.. వెనక్కి వెళ్లిపోవాలంటూ గ్రామస్తులు రాళ్లు రువ్వారు... హైకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేల వాంగ్మూలం తీసుకునేందుకు పోలీసులు రిసార్ట్‌కువచ్చారు.. కార్యకర్తలను చెదరగొట్టి రిసార్ట్‌లోకివెళ్లారు.. అక్కడ  ఎమ్మెల్యేల వాంగ్మూలం తీసుకుంటున్నారు.. ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ ద్వారా రికార్డు చేస్తున్నారు..  ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రిసార్ట్‌కువచ్చారా? ఒత్తిడితో వచ్చారా అని ఆరా తీస్తున్నారు.. మరోవైపు అన్నా డీఎంకుచెందిన మరో ఇద్దరు నేతలు సెల్వం టీంలో చేరిపోయారు.. కృష్ణగిరి, నామక్కల్‌ నియోజకవర్గాల ఎంపీలు అశోక్‌ కుమార్‌, సుందరం... సెల్వం గూటికి వచ్చేశారు.. 

ముంబై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం..

ముంబై : ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణీకుడి వద్ద 18 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

రోజాను నిర్భందించడం అప్రజాస్వామికం - పార్థసారధి..

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజాను నిర్భందించడం అప్రజాస్వామికమని పార్టీ నేత పార్థసారధి పేర్కొన్నారు. సదస్సుకు ఆహ్వానించి దౌర్జన్యానికి దిగడం తగదన్నారు. ఈ వ్యవహారంపై డీజీపీని కలుస్తామన్నారు.

 

పోలీసులపై రోజా ఆగ్రహం..

విజయవాడ : పోలీసుల చర్యపై ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఆపుతున్నారంటూ రోజా వాగ్వాదానికి దిగారు. సదస్సుకు ప్రభుత్వమే ఆహ్వానం పలికి అడ్డుకోవడం ఏంటీ అని ప్రశ్నించారు.

12:23 - February 11, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు, రెవెన్యూ అధికారులు గోల్డెన్‌ బే రిసార్ట్స్‌కు చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేల వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ ద్వారా రికార్డు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

రాహుల్..అఖిలేష్ మీడియా సమావేశం..

లక్నో : రాహుల్..అఖిలేష్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధికి పది సూత్రాల ఎజెండా విడుదల చేస్తున్నట్లు, హామీల అమలులో మోడీ సర్కార్ విఫలం చెందారని, తమ ఎన్నికల వాగ్ధానాలను నెరవేరుస్తామన్నారు. యూపీ అభివృద్ధికి ఈ ప్రణాళిక పునాదులు వేస్తోందని, యువతకు ఉద్యోగాలిస్తామని, రైతులకు తోడ్పాటు అందిస్తామన్నారు.

మహిళా పార్లమెంట్ సదస్సు వద్ద మంత్రి నారాయణ ఆగ్రహం..

విజయవాడ : మహిళా పార్లమెంట్ సదస్సు వద్ద పారిశుధ్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవెంట్ మేనేజ్ మెంట్ విఫలమైందని, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు పారిశుధ్య బాధ్యతలను అప్పగించారు.

జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో నారా బ్రాహ్మణి..

విజయవాడ : జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. సదస్సులో మహిళల సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఉందని, మహిళలకు విద్య అవశ్యకతను ఎన్టీఆర్ గుర్తించారన్నారు. ఎన్టీఆర్ వల్లే మహిళలకు రాజకీయాల్లో అగ్రస్థానం వచ్చిందని, కుటుంబాల నుండే మహిళా సాధికారిత ప్రారంభం కావాలన్నారు.

జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో నారా బ్రాహ్మణి..

విజయవాడ : జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. సదస్సులో మహిళల సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఉందని, మహిళలకు విద్య అవశ్యకతను ఎన్టీఆర్ గుర్తించారన్నారు. ఎన్టీఆర్ వల్లే మహిళలకు రాజకీయాల్లో అగ్రస్థానం వచ్చిందని, కుటుంబాల నుండే మహిళా సాధికారిత ప్రారంభం కావాలన్నారు.

అమరావతిలో గవర్నర్ నరసింహన్..

విజయవాడ : అమరావతిలో రెండో రోజు జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు గవర్నర్ నరసింహన్, జస్టిస్ రోహిణి తదితరులు హాజరయ్యారు.

118వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర..

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో 118వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఉసిరికాయలపల్లి, భాగ్యగనర్ తండా, కామేపల్లి, బొక్కలతండా, విశ్వనాథపల్లి, కారేపల్లిలో పాదయాత్ర కొనసాగనుంది.

బాలింతల సర్జరీలు చేయడం జరగదు - డా.శైలజ..

హైదరాబాద్ : నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డా.శైలజ బాధ్యతలు స్వీకరించారు. బాలింతల మృతిపై పూర్తి నివేదిక వచ్చే వరకు సర్జరీలు చేయడం జరగదని, బాలింతల మృతికి కారణాలు తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఆలోచిస్తామన్నారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని శైలజ పేర్కొన్నారు.

10:54 - February 11, 2017

హైదరాబాద్‌ : మలక్‌పేటలో రాత్రి ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి హేమంత్‌రెడ్డి హల్‌చల్‌ చేశాడు. ఎయిర్‌గన్‌ను చూపించి ఓ ఐస్‌క్రీమ్‌ బండి వ్యక్తిని బెదరించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు..విద్యార్థి హేమంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు ఎయిర్‌గన్‌, రెండు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:51 - February 11, 2017

హైదరాబాద్‌ : పాతబస్తీలోని మాదన్నపేటలో నకిలీ పాలు తయారు చేసే కేంద్రంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రంలోకి వెళ్లిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు..500 కేజీల నకిలీ పాలపౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పాలను తయారు చేస్తున్న పాల కేంద్రం నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

10:48 - February 11, 2017

భద్రాద్రికొత్తగూడెం : సీఎం కేసీఆర్‌ తెలంగాణను బొందలగడ్డగా మారుస్తున్నారని విమర్శించారు సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కార్పొరేట్‌ శక్తులకు వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చేందుకే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడం లేదని పాదయాత్రలో విమర్శించారు. రాష్ర్ట ప్రభుత్వం దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తోందన్నారు సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. మాటల గారడీ చేస్తూ.. ప్రజలను మభ్య పెడుతోందని విమర్శించారు. 117వ రోజుకు చేరుకున్న సీపీఎం మహాజన పాదయాత్ర తమ్మినేని ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు తమ్మినేని. సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధించేవరకూ సీపీఎం ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు తమ్మినేని. 
ప్రభుత్వానికి తమ్మినేని లేఖ 
తమ్మినేని వీరభద్రం ప్రభుత్వానికి లేఖ రాశారు. బీసీలకు కేటాయించిన స్థానిక సంస్థల రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టాలని లేఖలో ప్రభుత్వాన్ని తమ్మినేని కోరారు. దాదాపు మూడువేల కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సీపీఎం మహాజన పాదయాత్ర ఇల్లందుకు చేరుకుంది. 9వ మైలు తండా, బొజ్జాయిగూడెం, ఇల్లందులో పాదయాత్ర బృందం ఉత్సాహంగా పర్యటించింది. కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ, దళిత సంఘాల నేతలు యాత్రకు అపూర్వ స్వాగతం పలికి.. పాదయాత్రలో పాల్గొన్నారు. అన్ని వర్గాల వారు తమ సమస్యలను పాదయాత్ర బృంద సభ్యులకు చెప్పుకుంటున్నారు.

 

10:42 - February 11, 2017

హైదరాబాద్ : టీఆర్ ఎస్ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌ పోరాడుతోంది. ప్రజలకు తమ వాదాన్ని వినిపిస్తున్నారు. కానీ జనం నుంచి మాత్రం తగినంత స్పందన రావడం లేదంటూ కాంగ్రెస్‌ నేతలు బాధపడుతున్నారు. ఇంతకీ లోపం ఎక్కడ ఉంది ? పార్టీలోనా..  కాంగ్రెస్‌ నాయకత్వంలోనా.. ఇప్పుడు ఈ  విషయాలు టీపీసీసీలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాడే విషయంలో కాంగ్రెస్‌ ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. ఉప ఎన్నికల్లో వరుస ఓటములు, జీహెచ్‌ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాజయం, టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో మొదటి డీలా పడిన కాంగ్రెస్‌  ఆ తర్వాత తేరుకుది. 
జనం వెంటలేరన్న ఆందోళన 
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎప్పడికప్పుడు పోరాడుతున్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల భూసేకరణ, డిజైన్ల మార్పు, రైతుల ఆత్మహత్యలు, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌, సచివాలయం తరలింపు ఉద్యమాలు చేసింది. అయినా జనం తమ వెంటలేరన్న ఆందోళన వీరి ఇప్పుడు పట్టి పీడిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌పై గెలిచి, అధికార పార్టీ ప్రారంభించిన ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ వేదికగా పోరాడింది.  సుప్రీంకోర్టులో కేసు వేసింది. అయినా మైలేజీ రాలేదన్న ఆవేదన వీరిని వేధిస్తోంది. కేసీఆర్‌ పవర్‌ పాలిటిక్స్‌ను దీటుగా ఎదుర్కొంటున్నా ఫలితం కనిపించడంలేదన్న అంతర్మథనంతో కుమిలిపోతున్నారు. ప్రాజెక్ట్‌ల పునరాకృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌కు దీటుగా తాము ప్రజెంటేషన్‌ ఇచ్చినా జనం నుంచి స్పందన రాలేదన్న బాధ తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తోంది. మల్లన్నసాగర్‌ భూసేకరణ జీవోకు వ్యతిరేకంగా రోడ్డెక్కినా... రైతుల ఆత్మహత్యలపై భరోసా యాత్రలు చేట్టినా, ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌ కోసం విద్యార్థి గర్జన నిర్వహించినా  ప్రజల నుంచి ఆశించిన మేర మద్దతు లభించలేదని మదనపడుతున్నారు. 
కాంగ్రెస్‌కు దూరంగా జనం  
ఇంత చేసినా... జనం కాంగ్రెస్‌కు దూరంగా ఉండటానికి లోపం ఎక్కడ ఉన్నది అన్న అంశంపై ఇప్పుడు పార్టీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. పోరాటాలు, ఉద్యమాలు, ఆందోళనల్లో ఎక్కువ భాగం హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నాయి. దీంతో కాంగ్రెస్‌ సందేశం దిగువ స్థాయికి చేరడంలేదన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ ముఖ్యనేతల్లో చాలా మంది క్షేత్రస్థాయికి వెళ్లకుండా గాంధీభవన్‌కే పరిమితం అవ్వడం కూడా కాంగ్రెస్‌ ప్రజలకు చేరువకాలేకపోతోందన్న వాదన కూడా కాంగ్రెస్‌ నేతల్లో వినిపిస్తోంది. ఈ విషయంలో తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌,  టీ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి బాగా సక్సెస్‌ అయ్యారన్న అభిప్రాయం  కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేసి, ప్రత్యర్థులు వ్యూహాలను చిత్తు చేయడంలో ఉద్దండులైన నేతలకు తెలంగాణ కాంగ్రెస్‌లో కొదవలేదు. కానీ ప్రభుత్వ  ప్రజా వ్యతిరేక విధానాలు లోపాలు, వైఫల్యాలను ప్రజలకు  విడమర్చి చెప్పడంలో విఫలమవుతున్నారన్న వాదనలు ఉన్నాయి. బహిరంగ సభల్లో నేతల ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకునేలా ఉండటంలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీని నడిపించే విషయంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమర్‌కుమార్‌రెడ్డి, సీఎల్ఫీ నేత జానారెడ్డి అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు కూడా పార్టీకి నష్టం కలిగిస్తున్నాయన్న వాదనలు ఉన్నాయి. అందర్నీ కలుపుకుని ముందుకు సాగాల్సిన నేతలే ఎవరి వారే యుమునా తీరే అన్న విధంగా వ్యవరించినంతకాలం కాంగ్రెస్‌ ప్రజాదరణకు నోచుకునే అవకాశాలులేవని  విశ్లేషిస్తున్నారు. 
మొక్కుబడి తంతుగా ధర్నాలు, ఆందోళనలు 
కాంగ్రెస్‌ నేతలు చాలా సందర్భాల్లో ప్రజా సమస్యలపై చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు మొక్కుబడి తంతుగా ముగిస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీలోనే లేకపోలేదు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపి, ముందుండి పోరాడాల్సిన నేతలే ఈ విధంగా చేయడం వలన కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి వ్యతిరేక భావాలు వెళ్తున్నాయని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై  ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే అది తమకు కలిసొస్తుందన్న కాంగ్రెస్‌ పెద్దల ధోరణితో పార్టీకి నష్టం కలిగే  అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. ఈ లోపాలను అధిగమించేందుకు పార్టీ నేతలందరూ ఏకతాటిపైకి రాకపోతే తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజలకు చేరువకావడం కష్టమేనన్న ఆందోళన  వ్యక్తమవుతోంది. భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. 
 

10:32 - February 11, 2017

హైదరాబాద్ : తమ ప్రభుత్వ హయంలో తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని...  కేసీఆర్ సర్కారు నీరుగార్చాలని చూస్తోందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. చట్టంలో మార్పులు చేసే బదులు ఏకంగా కొత్త చట్టం తేస్తేనే బాగుంటుందని అధికార పార్టీ అభిప్రాయపడింది. 
టీ.ప్రభుత్వంపై క్రిమినల్ కేసు 
రెండున్న సంవత్సరాలుగా సబ్ ప్లాన్ కి నిధులు కేటాయించని టిఆర్ఎస్ ప్రభుత్వంపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందేనని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పేరు మారిస్తే సహించేది లేదని స్పష్టం చేస్తోంది. ఉప ప్రణాళిక చట్టంలో సవరణల ప్రతిపాదనలపై నియమించిన కమిటీ సమావేశానికి హాజరైన నేతలు పలు సూచనలు, సలహాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పేరు మార్పు గానీ, సవరణ గానీ చేయాల్సి వస్తే... దానికి దళిత, గిరిజన స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌గా పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. 
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టానికి సవరణలు 
వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టానికి సవరణలు చేపట్టాలని నిర్ణయించిన రాష్ర్ట ప్రభుత్వం.... రాష్ట్రంలోని దళిత, గిరిజన ప్రతినిధులతో కమిటీలు నియమించింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో సవరణలు చేసే బదులు ఏకంగా కొత్త చట్టం తీసుకొస్తే బాగుంటుందని అధికార పార్టీ నేతలు సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని కాదని... అనవసర మార్పులు తెచ్చినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేలేదని స్పష్టం చేశారు కాంగ్రెస్‌ నేతలు.ప్రభుత్వ పథకాలకు సబ్‌ప్లాన్‌ నిధులను కేటాయించవద్దని సూచించారు. సంక్షేమ పథకాలను పర్యవేక్షించడం కోసం మాజీ సీఎస్‌ ప్రదీప్‌ చంద్ర నేతృత్వంలో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ వేయాలని కాంగ్రెస్‌ నేతలు సూచించారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలోపు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రతిపక్షాలు సూచించాయి. 

 

10:28 - February 11, 2017

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతిలో మహిళా పార్లమెంట్‌ సదస్సు అట్టహాసంగా మొదలైంది. దేశంలోనే తొలిసారి అంతర్జాతీయ మహిళా సదస్సు కావడంతో అమరావతిలో పండుగ వాతావరణం కనిపించింది. దేశ విదేశాల నుంచి వచ్చిన మహిళామణులతో అమరావతి కళకళలాడింది... పలురంగాలకు చెందిన మేధావులు, మహిళా నిపుణులు, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తలు, విద్యార్థినుల రాకతో ఇబ్రహీంపట్నంలోని అంతర్జాతీయ మహిళా సదస్సు ప్రాంగణం సందడిగా మారింది. కృష్ణా, గోదావరి నదుల సంగమందగ్గర జాతీయ మహిళా సాధికారత సదస్సు మొదలైంది.. ఏపీ సీఎం చంద్రబాబు, ఆధ్యాత్మిక గురువు దలైలామా, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల, సినీనటి మనీషా కోయిరాలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.... సదస్సు ప్రారంభంలో జాతీయ గీతం, మా తెలుగుతల్లికి గీతాలు ఆలపించారు.
మహిళల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువ : కోడెల  
మహిళల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని... కోడెల అన్నారు.. అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవడంలో మహిళలు ముందున్నారని ప్రశంసించారు. పార్లమెంట్‌లో మహిళాబిల్లుకు ఆమోదం పొందడానికి ఇలాంటి సదస్సులు  ఉపయోగపడతాయని చంద్రబాబు చెప్పారు.. మహిళా సాధికారత విషయంలో ఏపీ ముందు వరుసలో ఉంటుందని తెలిపారు.
మహిళలు ఎన్నో త్యాగాలు : ఎంపీ కవిత 
దేశంలో మహిళలు ఎన్నో త్యాగాలు చేశారన్నారు.. ఎంపీ కవిత... స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా మహిళలపై వివక్ష కొనసాగుతూనేఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. అమరావతి సకలసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు..
అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో దూసుకెళ్తారు :  వెంకయ్యనాయుడు 
దేశంలో మహిళలకు సంఘీభావం తెలిపేందుకు ఇలాంటి వేదికలు అవసరమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.. ఆడవాళ్లకు అవకాశం ఇస్తే అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తారని చెప్పుకొచ్చారు. మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగితే ఏదైనా సాధించగలరన్నారు బౌద్ధ గురువు దలైలామా. మానసిక ప్రశాంతత లభిస్తే శాంతి చేకూరుతుందని వివరించారు. ఆదివారం వరకూ ఈ సదస్సు కొనసాగనుంది.. మొదటిరోజు అంతా ఉత్సాహభరితంగా సాగింది. 

 

టాటా క్యాన్సర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..

ముంబై : బసెమెంట్ టాటా క్యాన్సర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు ఫైరింజన్ల సహాయంతో సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

పోలింగ్ కేంద్రంలో పిస్టల్ తో బీజేపీ అభ్యర్థి సోదరుడు..

ఉత్తర్ ప్రదేశ్ : తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మీరట్ ప్రాంతంలోని సర్దనా పోలింగ్ కేంద్రంలో గగన్ శ్యామ్ పిస్టల్ తో ఉండంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను బీజేపీ అభ్యర్థి సంగీత్ శ్యామ్ సోదరుడు.

యూపీలో 10.56 శాతం పోలింగ్..

ఉత్తర్ ప్రదేశ్ : తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 15 జిల్లాల్లోని 73 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 10గంటల వరకు 10.56 శాతం పోలింగ్ నమోదైంది. ముజాఫర్ లో 15 శాతం, ఆగ్రా, మధుర, ఆలీఘడ్ ప్రాంతాల్లో 10 శాతం పోలింగ్ నమోదైంది.

రెండో రోజు..జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు...

విజయవాడ : అమరావతిలో రెండో రోజు జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు జరుగుతోంది. గవర్నర్ నరసింహన్, జస్టిస్ రోహిణి, నారా బ్రాహ్మణి, వైసీపీ ఎమ్మెల్యే రోజా హాజరు కానున్నారు.

సమాజాన్ని చదవడం అలవాటు - పవన్..

అమెరికా : న్యూ హాంప్ షైర్ కాన్ఫరెన్స్ కు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని, కానీ సమాజాన్ని చదవడం అలవాటు అని పేర్కొన్నారు. సినిమాల్లో ఎప్పుడూ సౌకర్యంగా ఫీలవలేదని, ప్రజా సమస్యలపై పోరాడటం మొదలు పెట్టినప్పుడే నిజమైన సంతృప్తి పొందినట్లు చెప్పుకొచ్చారు.

మాదన్నపేటలో నకిలీ పాలపొడి కేంద్రంపై దాడి..

హైదరాబాద్ : పాతబస్తీ మాదన్నపేటలో నకిలీ పాలపొడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 500 కిలోల నకిలీ పాలపొడి సీజ్ చేశారు.

మలక్ పేటలో యువకుడు హల్ చల్..

హైదరాబాద్ : మలక్ పేటలో అర్ధరాత్రి యువకుడు హల్ చల్ చేశాడు. ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తిని ఎయిర్ గన్ తో హేమంత్ రెడ్డి బెదిరించాడు. ఇంజనీరింగ్ విద్యార్థి అయిన హేమంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

యూపీలో తొలి దశ పోలింగ్..

ఉత్తర్ ప్రదేశ్ : తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 15 జిల్లాల్లోని 73 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 11న ఫలితాలు విడుదల కానున్నాయి.

బాబు టెలీకాన్ఫరెన్స్...

విజయవాడ : అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్ ఏర్పాట్లపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ మహిళా పార్లమెంట్ ఏపీకి ప్రతిష్టాత్మకమైన సదస్సు అని, సదస్సుకు దేశ, విదేశాల నుండి అనేక మంది ప్రముఖులు వస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఎవరికీ ఎలాంటి లోటుపాట్లు జరగకూడదని ఆదేశించారు.

రిసార్ట్స్ కు చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు..

చెన్నై : గోల్డెన్ బే రిసార్ట్స్ కు ఎమ్మెల్యేలు, రెవెన్యూ అధికారులు చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. వీడియో రికార్డింగ్ నిర్వహిస్తున్నారు.

ప్రశాంతంగా యూపీ తొలిదశ పోలింగ్‌

యూపీ : ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.. పశ్చిమ యూపీలోని 15 జిల్లాల్లో 73 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.. 73 నియోజకవర్గాల్లో 2కోట్ల 6లక్షలమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

09:53 - February 11, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.. పశ్చిమ యూపీలోని 15 జిల్లాల్లో 73 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.. 73 నియోజకవర్గాల్లో 2కోట్ల 6లక్షలమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.. 839 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7గంటలనుంచే ఓటర్లు ఓటువేసేందుకు పోలింగ్‌ కేంద్రాలముందు బారులుతీరారు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటుచేశారు.. ముజఫర్‌నగర్‌ సహా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. యూపీలోని 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 11న ఫలితాలు విడుదలకానున్నాయి..

 

09:51 - February 11, 2017

చెన్నై : తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది.... ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.. కొద్దిరోజులు వేచిచూడాలన్న ధోరణిలో గవర్నర్‌ ఉన్నట్లు తెలుస్తోంది.. మరోవైపు రోజులు గడుస్తున్నకొద్దీ పన్నీర్‌ సెల్వం వర్గం బలపడుతోంది.. శశికళమాత్రం ఇబ్బందుల్లో పడ్డారు.. అటు శశికళ శిబిరంలోఉన్న ఎమ్మెల్యేలను విడిపించేందుకు సెల్వం ప్రయత్నిస్తున్నారు.. అయితే శశికళమాత్రం ఎమ్మెల్యేలను బెంగళూరుకుగానీ, హైదరాబాద్‌కుగానీ తరలించాలని చూస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ

చెన్నై : తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కొద్దిరోజులు వేచిచూడాలన్న ధోరణిలో గవర్నర్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

 

09:48 - February 11, 2017

అమెరికా : ప్రజా సమస్యలపై పోరాడినప్పుడే తాను నిజమైన సంతృప్తి పొందానని... జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నాడు.. ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల తరఫున నిలబడతానని స్పష్టం చేశారు.. అమెరికా టూర్‌లో పవన్‌ బిజీ బిజీగా గడుపుతున్నారు.. న్యూహాంప్‌షైర్‌లో మీట్‌ అండ్‌ గ్రీట్‌కు హాజరయ్యారు.. పవన్‌ ప్రసంగానికి జనసేన కార్యకర్తలు అభిమానులనుంచి అనూహ్య స్పందన లభించింది.

 

09:48 - February 11, 2017

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరో 'అల్లు శిరీష్'...ఇటీవలే 'శ్రీరస్తు శుభమస్తు' వంటి సూపర్ హిట్ చిత్రం చేసిన 'శిరీష్' మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నాడు. మలయాళ సూపర్ స్టార్ 'మోహన్ లాల్ 'తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. 'మోహన్ లాల్' కథానాయకుడిగా ‘1971 బియాండ్ బోర్డర్స్' అనే చిత్రాన్ని రూపొందించనున్నారు. క్రేజీ డైరెక్టర్ మేజర్ రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో 'అల్లు శిరీష్' ట్యాంక్ కమాండర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 1971 కాలంలో ఇండియా, పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నైపథ్యంలో రూపొందింది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది.

09:44 - February 11, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.. పశ్చిమ యూపీలోని 15 జిల్లాల్లో 73 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.. 73 నియోజకవర్గాల్లో 2కోట్ల 6లక్షలమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.. 839 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7గంటలనుంచే ఓటర్లు ఓటువేసేందుకు పోలింగ్‌ కేంద్రాలముందు బారులుతీరారు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటుచేశారు.. ముజఫర్‌నగర్‌ సహా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. యూపీలోని 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 11న ఫలితాలు విడుదలకానున్నాయి.

09:31 - February 11, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తన తాజా చిత్రం 'డీజే' షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రంలో వెరైటీ లుక్ తో 'బన్నీ' రాబోతున్నాడంట. తన లుక్ కు సంబంధించిన ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. హరీష్ శంకర్ దరకత్శంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం సెట్స్ పైన ఉండగానే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. వక్కంతం వంశీ డెబ్యూ...లింగుస్వామి బై లింగువల్ ప్రొడక్ట్ లో చిత్రాలు చేసేందుకు 'అల్లు అర్జున్' ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు 'నా పేరు సూర్య' అనే టైటిల్, 'మన ఊరు ఇండియా' అనేది ట్యాగ్ లైన్ పెడితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడని టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

09:10 - February 11, 2017

బాలీవుడ్ హీరోయిన్ 'కంగనా రనౌత్' వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌పై విరుచుకుపడింది. విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న చిత్రం 'రంగూన్' లో 'కంగనా' నటిస్తున్న సంగతి తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ షెడ్యూల్ సందర్భంగా షాహిద్ తో ఒకే కాటేజిలో కలిసుండడమే తనకు ఎదురైన అతి పెద్ద సమస్య అంటూ పేర్కొంది. ఇటీవలే ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మారుమూల ప్రాంతంలో షూటింగ్ నిమిత్తం వెళ్లడం జరిగిందని, అక్కడ కాటేజీలు పంచుకోవాల్సి వచ్చిందన్నారు. షాహీద్ కు దద్దరిల్లిపోయేలా పెద్ద పెద్ద సౌండ్ చిత్రమైన పాటలు వినడం అలవాటు అని, ఆ మ్యూజిక్ కి అదిరిపడుతూ లేవాల్సి వచ్చిందని వాపోయారు. షాహీద్ తో కాటేజి షేర్ చేసుకోవాల్సి రావడం తనకో పీడకల అని పేర్కొంది. ‘కంగనా' ముక్కుసూటిగా మాట్లాడుతుందని పేరు. ఈమె చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి దుమారం రేగుతుందో చూడాలి.

09:09 - February 11, 2017

తనది నేచురల్ స్పాంటేనియస్ యాక్టింగ్ అని సొట్టబుగ్గల తాప్సీ పేర్కొంటోంది. తెలుగులో పలు సినిమాలలో నటించి ఏకంగా బాలీవుడ్ లోకి దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తోంది. గతేడాది విడుదలైన 'పింక్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అద్భుతమైన నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా తాప్సీ 'ఘాజీ' చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె అనన్య అనే శరణార్థురాలిగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో 'తాప్సీ' మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను నటనపరమైన ట్రైనింగ్ తీసుకోలేదని, చేసిన సినిమాలన్నీ కంఫర్ట్ గా ఉంటాయని పేర్కొన్నారు. కానీ తన గత చిత్రాలు 'బేబీ', ‘పింక్' చిత్రాలు అవుట్ ఆఫ్ ది బాక్స్ లా ఉంటాయని తెలిపారు. ఇందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని, ఇలాంటి పాత్రలు రావడం యాక్టర్ కి గొప్పే అని అన్నారు.
ఈ చిత్రంలో 'రానా' నేవీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇది నీటిలో జరిగే యుద్ధం. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. 1971లో జరిగిన భారత్ - పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అప్పట్లో పాక్ ఉపయోగించిన సబ్ మెరైన్ పీఎన్ఎస్ ఘాజి. ఆ యుద్ధ సమయంలో విశాఖపట్టణం దగ్గర బంగాళాఖాతంలో భారత్ తన ప్రత్యర్థి దేశానికి చెందిన ఈ జలాంతర్గామిని జలసమాధి చేసింది. ఈ చిత్రం ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

08:47 - February 11, 2017

బాలీవుడ్ లో ప్రయోగాలు చేయడంలో దిట్ట అయిన 'అమీర్ ఖాన్' న్యూ లుక్ హల్ చల్ చేస్తోంది. ‘దంగల్' సినిమా కోసం 'అమీర్' బరువు పెరగడం..మళ్లా తగ్గడం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాపీసు వద్ద రికార్డుల మోత మోగించింది. ప్రస్తుతం 'అమీర్' తన తదుపరి చిత్రం 'ఠగ్స్ ఆఫ్ హిందుస్థాన్' పై దృష్టి సారించారు. ఇందుకు తన లుక్ ని మార్చేసుకుంటున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లుక్ అంటూ ఓ ఫొటో సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గుబురు గడ్డం..కోర మీసం..ఎర్రటి తలపాగతో అమీర్ ధరించి ఉన్నాడు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు, ఇందులో బిగ్ బి 'అమితాబ్ బచ్చన్' కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఠగ్' అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం 2018 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

08:46 - February 11, 2017

చెన్నై : తమిళనాడులో చెలరేగిన అనిశ్చితి మరో కొత్త పార్టీకి పురుడు పోస్తోందా? సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నేతృత్వంలో కొత్తపార్టీ ఆవిర్భవించనుందా? కబాలి రాజకీయాల్లోకి రాబోతున్నారా? సీఎం సీటును బాషాకు బీజేపీ ఆఫర్‌ చేసిందా? రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశంపై తమిళ ప్రజలు ఏమంటున్నారు?
సినిమాల్లో అంచెలంచెలుగా ఎదిగిన రజనీకాంత్‌
రజనీకాంత్‌... ఆ పేరే ఒక సంచలనం. క్యారెక్టర్‌ ఆర్టిస్టు నుంచి హీరోగా అంచెలంచెలుగా ఎదిగగాడు రజనీకాంత్‌. రజనీ  తన స్టైల్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రతిసినిమాలో ఆయన చూపించే స్టైల్‌ వేరియేషన్‌తో పిచ్చెక్కిపోయే ప్యాన్స్‌ ఉన్నారు. రజనీ స్టైల్‌, పంచ్‌ డైలాగులకోసమే ఆయన  సినిమాలకు వచ్చే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ముత్తు, బాషా, పెదరాయుడు, నరసింహ మొదలుకొని   కబాలి వరకు ఆయన  చూపించిన స్టైల్స్‌ థియేటర్స్‌లో వైబ్రేషన్స్‌ సృష్టించాయి. తమిళ, తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు కురిపించాయి.
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి
ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో, దళపతి రాజకీయ అరంగేట్రం చేస్తారన్న వార్తలు షికారు చేస్తున్నాయి.  జయలలిత మరణంతో సీఎం కుర్చీకోసం పన్నీర్‌సెల్వం, శశికళ మధ్య పోరు  నడుస్తోంది. ఇదే తరుణంలో తమిళనాట రజనీకాంత్‌ నేతృత్వంలో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోందన్న ప్రచారం జోరందుకుంది. దీనికి సంబంధించి ఆయన సన్నిహితులతో మంతనాలు సాగించినట్లూ సమాచారం. మరోవైపు.. కబాలిని కాషాయదళంలో కలుపుకునేందుకు.. తద్వారా, తమిళనాట పాదం మోపేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని ప్రచారం సాగింది. 
పాలిటిక్స్‌పై తలైవా ఆసక్తి 
అధికారమంటే తనకూ మక్కువేనని కొద్దిరోజుల కిందట రజనీకాంత్‌ ప్రకటించారు. దీంతో పాలిటిక్స్‌పై తలైవా ఆసక్తి చూపుతున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి. అంతలోనే పవర్‌ వ్యాఖ్యలు ఆధ్యాత్మికతకు సంబంధించినవంటూ రజనీ మాట మార్చారు.  అరుణాచలం అన్ని పార్టీలతో సన్నిహితంగా ఉంటారు. బీజేపీతో అయితే కొంచెం ఎక్కువ టచ్‌లో ఉంటారన్న ప్రచారం ఉంది.  గతంలో మోదీ చెన్నై వచ్చినప్పుడు రజనీకాంత్‌ ఇంటికి వెళ్లి కలిశారు.  దీంతో తమిళనాడులో బీజేపీకి రజనీ మద్దతు లభిస్తుందని  ప్రచారం జరిగింది.  కానీ సూపర్‌స్టార్‌ మాత్రం ఎప్పటిలాగే మౌనాన్ని ఆశ్రయించారు. 
రజనీకాంత్‌ పాలిటిక్స్‌లోకి రావాలంటూ ప్యాన్స్‌ కోరిక  
రజనీకాంత్‌  పాలిటిక్స్‌లోకి రావాలంటూ ప్యాన్స్‌ రెండు దశాబ్దాలుగా కోరుతూనే ఉన్నారు. కానీ కబాలి మాత్రం ఏనాడు రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. ఒక్కసారి మాత్రం జయలలితకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ ఎన్నికల్లో జయ ఓటమిపాలయ్యారు. దీంతో ఆ తర్వాత రజనీ ఏ పార్టీకి మద్దుతుగానీ, వ్యతిరేకంగా గానీ మాట్లాడలేదు.  అందరితోనూ సన్నిహితంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
సొంతపార్టీతోనే రావాలని అభిమానుల ఆశ
ముత్తు రాజకీయాల్లోకి వస్తే సొంతపార్టీతోనే రావాలనే అభిమానుల ఆశ.  వేరేపార్టీలో చేరడమనేది తలైవా అభిమానులు జీర్ణించుకోలేని అంశం. అందుకే రజనీ రాజకీయాల్లోకి వస్తే అది సొంత పార్టీ ద్వారానే రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. తమిళనాడులో నెలకొన్న ప్రస్తుత పరిణామాల దృష్ట్యా  రజనీ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
రజినీకి బీజేపీ బంఫర్‌ ఆఫర్‌...!
సూపర్‌స్టార్‌కు బీజేపీ బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చినట్టు కూడా ప్రచారం సాగుతోంది.  రాజకీయాల్లో ఆరంగేట్రంపై ఊగిసలాడుతున్న దళపతిని తమవైపు తిప్పుకునేందుకు కమళదళం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ముత్తుకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్‌ చేసిన్టటు ప్రచారం జోరందుకుంది.  అయితే బీజేపీ ఆఫర్‌పై రజనీ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. తన సన్నిహితులు, మిత్రులతో బీజేపీ ఆఫర్‌పై జరుపుతున్నట్టు కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సీనియర్‌నేత ఎస్.గురుమూర్తి రజనీని పార్టీ పెట్టమని సలహా ఇచ్చారన్న వార్త సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. అయితే, ఆయన ఈ వార్తలను ట్విట్టర్‌ వేదికగా తోసిపుచ్చారు. మరి తమిళుల తలైవర్‌.. రాజకీయ అరంగేట్రం చేస్తారా..? కొత్త పార్టీతో ముఖ్యమంత్రి సింహాసనాన్ని అధిష్ఠిస్తారా..? లేక ఎప్పటిలాగే తూచ్‌ అంటారా..? కాలమే బదులు చెప్పాలి. 

08:34 - February 11, 2017

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై శశికళ పెట్టుకున్న ఆశలు నెరవేరే సూచనలు కనిపించడంలేదు. ఈమెపై ఉన్న కేసులే ఇందుకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. శశికళే కాదు.. ఈమె కుటుంబ సభ్యులపై కూడా చాలా కేసులు ఉన్నాయి. తమిళనాడు ఇన్‌చార్జ్‌  గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు ఈ కేసుల చిట్టా చేరింది.  వీటిని పరిశీలిస్తున్నారు. 
చిన్నమ్మతోపాటు, ఆమె కుటుంబసభ్యులపై కేసులు 
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ. జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై శశికళ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్నమ్మతోపాటు, ఈమె కుటుంబ సభ్యులపై ఉన్న కేసులు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు వీటి వివరాలను సేకరించారు. శశికళతోపాటు ఈమె కుటుంబ సభ్యులపై భూఆక్రమణలు, కిడ్నాప్‌లు, నిర్బంధ వసూళ్లు, మనీ లాండరింగ్‌.... అక్రమ నగదు చెలామణి, విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం ఉల్లంఘన వంటి కేసులు ఉన్నాయి. శశికళతోపాటు ఈమె భర్త నటరాజన్‌, సోదరుడు దివాహరన్‌, మేనళ్లులు దినకరన్‌, భాస్కరన్‌, వెంకటేశ్‌లు కేసుల్లో ఇరుకున్నారు. వీరిపై ఉన్న కేసుల్లో చాలావరకు కోర్టుల్లో  ఇంకా పెండిగ్‌లోనే ఉన్నాయి. దిగువ కోర్టులు కొట్టివేసిన కేసులను హైకోర్టులో అప్పీలు చేయడంతో విచారణ జరుగుతోంది. 
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నిందితురాలు 
జయలలిత 1991-96 మధ్య మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 66 కోట్ల రూపాయల ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. ఈ కేసులో శశికళ కూడా నిందితురాలుగా ఉన్నారు. ఈ కేసులో బెంగళూరు కోర్టు 2014 సెప్టెంబర్‌లో జయలలితను దోషిగా తేల్చి  శిక్ష విధించడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేసి జైలుకు వెళ్లారు. ఆ తర్వాత కర్నాటక హైకోర్టు ఈ కేసులు కొట్టివేయడంతో జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కర్నాటక ప్రభుత్వం ఈ కేసును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడంతో అపరిష్కృతంగా ఉంది. గత ఏడాది జూన్‌ 7న విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. వచ్చే వరకు జడ్జిమెంట్‌ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.  శశికళ కూడా ఈ కేసులో నిందితురాలుగా ఉండటంతో ముఖ్యమంత్రి పీఠంపై చిన్నమ్మ పెట్టుకున్న ఆశలు ప్రస్తుతానికి నెరవేరే అవకాశాలు కనిపించడంలేదు.
శశికళపై కేసులు పెండింగ్‌లో  
శశికళపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. జయ టీవీకి ట్రాన్స్‌పాండర్ల లీజు కేసులో విదేశీమారక ద్రవ్య నియంత్రణ చట్టం.. ఫెరా నిబంధనలను  ఉల్లంఘించారని ఈడీ కేసు పెట్టింది. ట్రాన్స్‌పాండర్ల అద్దెకు అమెరికా, సింగపూర్‌ డాలర్ల చెల్లింపుల్లో 1995-96లో అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ  తేల్చింది. ఈ కేసులో శశికళ 1996లో అరెస్టు కూడా అయ్యారు. విదేశీమారక ద్రవ్య నియంత్రణ చట్ట  ఉల్లంఘన కేసులో దిగువకోర్టు శశికళను నిర్దోషిగా ప్రకటించినా.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ హైకోర్టులో అప్పీలు చేయడంతో ప్రస్తుతం విచారణలో ఉంది. అప్పట్లో జయ టీవీకి శశికళ చైర్‌పర్సన్‌గా ఉండగా, ఈమె బంధువు వీ భాస్కరన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, మేనల్లుడు వీఎస్‌ సుధాకరన్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 
ఫెరా నిబంధనల ఉల్లంఘన
తమిళనాడు నీలగిరి జిల్లాలో కోదండ టీ ఎస్టేట్‌ కొనుగోలులో  జరిగిన గోల్‌మాల్‌ కేసులో శశికళ నిందితురాలుగా ఉన్నారు. ఈ కేసులో చిన్నమ్మ విదేశీ మారకద్రవ్య చట్టం నిబంధనలు ఉల్లంఘించారు. ఈ కేసులో అన్నా డీఎంకే మాజీ ఎంపీ టీవీవీ దినకరన్‌  కూడా నిందితుడుగా ఉన్నారు. చెన్నై ఎగ్మోర్‌లోని అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు శశికళతోపాటు దివాకరన్‌లకు  విముక్తి కల్పించినా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ హైకోర్టులో అప్పీలు చేసింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. 
భూఆక్రమణ కేసుల్లో శశికళ భర్త నటరాజన్‌ 2012లో అరెస్టు 
శశికళ భర్త ఎం నాటరాజన్‌తోపాటు సమీఫ బంధువులపై కూడా కేసులు ఉన్నాయి. భూ ఆక్రమణల కేసులో శశికళ భర్త నటరాజన్‌ 2012లో అరెస్టయ్యారు. అలాగే నేరాలను ప్రోత్సహించిన కేసుల్లో కూడా నిందితుడుగా ఉన్నారు. శశికళ దగ్గర బంధువు ఆర్‌వీ రవణన్‌పై కిడ్నాప్‌లు, నిర్బంధ వసూళ్లు, నేరపూరిత కుట్ర, పారిశ్రామికవేత్తకు కోటి రూపాయల ఎగవేత వంటి కేసుల్లో చిక్కుకున్నారు. శశికళ సోదరుడు వీ దివాహరన్‌ ఇసుక అక్రమ రవాణ, డీఎంకే  నేత ఇల్లు కూల్చివేత కేసుల్లో నిందితుడు.
అక్రమ నగదు చెలామణి కేసులో శశికళ మేనల్లుడు టీవీవీ దివాహరన్‌ 
శశికళ మేనల్లుడు టీవీవీ దివాహరన్‌కు అక్రమ నగదు చెలామణి కేసుల్లో చిక్కుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  కోర్టు 25 కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది. టీవీవీ భాస్కరన్‌... శశికళ మరో మేనల్లుడు. చీటింగ్‌ కేసులో 2013లో అరెస్టు అయ్యారు. ఫెరా కేసు పెండిగ్‌లో ఉంది. డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్‌ కూడా  శశికళ మేనల్లుడు. భూ ఆక్రమణ కేసులో 2013లో అరెస్టయ్యాడు. శశికళతోపాటు, ఈమె కుటుంబ సభ్యుల కేసులన్నీ ఇప్పుడు తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు దగ్గరకు చేరాయి. ఈ కేసులు శశికళ ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు పెడుతున్నాయి.

 

08:18 - February 11, 2017

చెన్నై : తమిళనాడులో సీటు ముడి వీడటం లేదు. ముఖ్యమంత్రి పీఠం కోసం జరుగుతున్న పోరులో నాటకీయ పరిణామాలు చకచకా చోటుచేసుకుంటున్నాయి. పన్నీర్‌సెల్వం, శశికళ వర్గాల మధ్య రాజకీయ పోరు తారాస్థాయికి చేరింది. క్యాంపు  రాజకీయాలతో చిన్నమ్మ వేడిపుట్టిస్తుంటే.. ఆ వ్యూహాలకు చెక్‌ పెట్టేందుకు సెల్వం పావులు కదుపుతున్నారు. రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను విడిపించేందుకు కేంద్ర బలగాలను దింపితే ఎలా ఉంటుందన్న యోచనలో.. పన్నీరు సెల్వం ఉన్నారు. 
శశికళ క్యాంపు రాజకీయాలు హైడ్రామా
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు శశికళ క్యాంపు రాజకీయాలు హైడ్రామాను తలపించాయి. ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించారన్న వార్తలు వెలికి రావడంతో.. ఆమె శిబిరం, తక్షణ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ఐదుగురు ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం  నిర్వహించి.. తమను ఎవరూ నిర్బంధించలేదనీ...స్వేచ్ఛగా తిరుగుతున్నామని వారితో చెప్పించింది. అదేసమయంలో.. పోయెస్‌గార్డెన్‌ లో పార్టీ ఎంపీలతో భేటీ అయిన శశికళ భవిష్యత్‌ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. గవర్నర్‌ నుంచి సరైన స్పందన రాకుంటే, ఎంపీలను రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లాలని ఆమె యోచిస్తున్నారు. అంతకుముందు రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో శశికళ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 
చిన్నమ్మ శిబిరాన్ని హడలెత్తించిన సెల్వం
శశికళ వ్యూహానికి ప్రతివ్యూహాలతో పన్నీర్‌ సెల్వం.. చిన్నమ్మ శిబిరాన్ని హడలెత్తించారు. పార్టీ ప్రెసీడియం ప్రెసిడెంట్‌ మధుసూదనన్‌ను బహిష్కరించడాన్ని సీరియస్‌గా పరిగణించిన సెల్వం శిబిరం.. ఏకంగా, శశికళ పదవిపైనే అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. పార్టీ నియమావళి ప్రకారం ఐదేళ్ల సభ్యత్వం లేని శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక అవడం చెల్లదని ఏకంగా ఈసీకే లేఖ రాశారు. దాంతో పాటే, శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలను విడిపించేందుకు కేంద్ర బలగాలను దింపే యోచనలో పన్నీర్‌ సెల్వం ఉన్నారు.     
గవర్నర్‌ను కలిసిన స్టాలిన్ 
ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే నేత స్టాలిన్‌ తమ పార్టీ నేతలతో వెళ్లి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పన్నీర్‌ సెల్వం వర్గానికి స్టాలిన్‌ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనతో ఏ పని జరగడం లేదని..సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. తాజా పరిణామాలన్నింటిపైనా పన్నీర్ సెల్వం స్పందించారు. గవర్నర్‌కు శశికళ తప్పుడు జాబితా ఇచ్చిందని ఆరోపించారు. 
ఎపిసోడ్‌కు ముగింపు పలికేందుకు గవర్నర్‌ సమాయత్తం 
ఇక తమిళనాడు ఎపిసోడ్‌కు ముగింపు పలికేందుకు గవర్నర్‌ సమాయత్తమయ్యారు. న్యాయపరంగా ఎలా ముందు కెళ్లాలన్న అంశంపై కసరత్తు ముమ్మరం చేశారు. మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను రాజ్‌భవన్‌కు పిలిపించుకుని సమాలోచనలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తీసుకునే నిర్ణయం.. సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు కేంద్రం..తమకు తమిళనాడు గవర్నర్ నుంచి ఎలాంటి నివేదిక రాలేదని ప్రకటించింది. 

 

08:08 - February 11, 2017

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై శశికళ పెట్టుకున్న ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశాలు లేవు. పన్నీరు సెల్వం నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వాన్నే మరికొంతకాలం కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. జయలలితపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నిందితురాలుగా  ఉన్నారు. వచ్చే వారంలో ఈ కేసులో తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న తరుణంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పాలనను మరికొన్ని రోజులు కొనసాగించే చాన్స్‌ కనిపిస్తోంది. 
రాజకీయ అనిశ్చితి 
తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఇప్పట్లో తొలగిపోయే సూచనలు కనిపించడంలేదు. మరికొన్ని రోజులు ఇలానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర  రాజకీయాలు, పాలన విషయాల్లో ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పన్నీరు సెల్వం నేతృత్వంలోని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పాలనను కొద్ది రోజులు కొసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
ఆ కేసులో శశిశకళ నిందితురాలు 
దివంతగ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశిశకళ నిందితురాలుగా ఉన్నారు. ఈ కేసు తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. వచ్చే వారం జడ్డిమెంట్‌ రావొచ్చని భావిస్తున్నారు. తీర్పు ఎలా ఉంటుందో ఎవరూ ఊహిచలేరు. అందువల్ల గవర్నర్‌ విద్యాసాగర్‌రావు వేచిచూసే ధోరణ అవలంభిస్తున్నారు. అన్నాడిఎంకే ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మద్దతు తనకే ఉందని, ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని శశికళ కోరినా... విద్యాసాగర్‌రావు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. పైగా శశికళ ఎమ్మెల్యేకానీ,  ఎమ్మెల్సీకానీ కాదు. రాజ్యాంగలోని 164(1) ఆర్టికల్‌ ప్రకారం చట్ట సభల్లో సభ్యత్వంలేని వారిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి, అసెంబ్లీలో బలం నిరూపించుకునే అవకాశంలేదు. అయితే ఆర్టికల్‌ 164 (4) ప్రకారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఆరు నెలల్లోగా చట్ట సభలకు ఎన్నిక కాకపోతే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.  ప్రభుత్వ ఏర్పాటుకు నేతలను ఆహ్వానించే విషయంలో ఇలాంటి  ధర్మ సంకటం గతంలో ఎదురైన సందర్భాలులేవని న్యాయ నిపుణులు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంక్టిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.  అలాగే తనకే బలం ఉందని  ఇంతకు ముందు చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటానని, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని  ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం విన్నవించినా దీనిపై కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు.  ఈ విషయాల్లో చాలా కోర్టు తీర్పులతోపాటు, రాజ్యాంగ నిబంధనలను గవర్నర్‌ పరిశీలిస్తున్నారు. న్యాయ నిపుణులు సలహా తీసుకుంటున్నారు. 
శశికళ దోషిగా తేలితే పదవిలో ఉండకూడదు  
ప్రభుత్వం ఏర్పాటుకు శశికళను ఆహ్వానిస్తే... ఆస్తుల కేసులో దోషిగా తేలితే పెద్ద ప్రమాదమని గవర్నర్‌కు రాజ్యాంగ నిపుణలు సూచిస్తున్నారు. శిక్ష ఖరారైతే శశికళ పదవిలో ఉండకూడదు. నాలుగేళ్లు శిక్ష పడితే ఎన్నికల్లో పోటీకి అనర్హురాలు అవుతారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు శశికళను ఆహ్వనించడం కన్నా  వేచిచూడటమే మంచిదన్న న్యాయ నిపుణుల సూచనలకు అనుగుణంగా విద్యాసాగర్‌రావు నడుచుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పన్నీరు సెల్వంను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మరికొన్ని రోజులు కొనసాగమని కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కేంద్రానికి నివేదిక పంపినట్టు వచ్చిన వార్తలను రాజభవన్‌  అధికారులు తోసిపుచ్చారు. ఏ నివేదిక పంపలేదని స్పష్టం చేశారు.  
శశికళ వీడియో కాన్ఫరెన్స్‌ 
బే రిసార్ట్స్‌లో ఉంటున్న తన వర్గం ఎమ్మెల్యేలతో పోయెస్‌ గార్డెన్‌ నుంచి శశికళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. జరుగుతున్న పరిణామాలు వీరి దృష్టికి తీసుకెళ్లి, ఆత్మస్థైర్యం కోల్పోవద్దని భరోసా కల్పించారు. అంతా అనుకూలంగా ఉందని వివరించారు. పన్నీరు సెల్వం కూడా వర్గీయులతో రెండుసార్లు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. క్షణం క్షణం మారుతున్న తమిళనాడు పరిణామాలు ఏం జరుగుతుందో చూడాలి. 

 

యూపీలో కొనసాగుతోన్న తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

లక్నో : ఉత్తరప్రదేశ్ లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 15 జిల్లాలోని 73 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వచ్చే నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి. 

 

ఉత్తరప్రదేశ్ లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

లక్నో : ఉత్తరప్రదేశ్ లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. మొత్తం 73 స్థానాలకు 664 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 

ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

ఖమ్మం : జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

 

నేడు ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య రెండో సెమీ ఫైనల్

హైదరాబాద్ : అంధుల టీ.20 ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. 

 

నేడు రెండో రోజు మహిళా పార్లమెంట్ సదస్సు

గుంటూరు : నేడు రెండో రోజు మహిళా పార్లమెంట్ సదస్సు జరుగనుంది. మహిళలు ఎదుర్కొంటున్న పలు అంశాలపై చర్చించనున్నారు.

 

నేడు ఉత్తరప్రదేశ్ లో తొలి దశ ఎన్నికల పోలింగ్

లక్నో : నేడు ఉత్తర ప్రదేశ్ లో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మొత్తం 73 స్థానాలకు 893 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2.6 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

Don't Miss