Activities calendar

12 February 2017

21:31 - February 12, 2017

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మ‌రో రికార్డును త‌న పేరిట రాసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌల‌ర్ డెన్నిస్ లిల్లీ పేరు మీదున్న రికార్డును అధిగ‌మించాడు. లిల్లీ 48 మ్యాచుల్లో 250 వికెట్లు తీయ‌గా.. అశ్విన్ కేవ‌లం 45 మ్యాచుల్లో ఈ మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు. గ‌తేడాది టాప్ ఫామ్‌లో ఉన్న అశ్విన్‌.. 12 మ్యాచుల్లో ఏకంగా 72 వికెట్లు తీశాడు. వ‌రుస‌గా రెండో ఏడాది కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా అశ్విన్ నిలిచిన విష‌యం తెలిసిందే. బంగ్లా కెప్టెన్ ముష్ఫిక‌ర్ ర‌హీమ్‌ను ఔట్ చేసిన అశ్విన్‌.. టెస్టుల్లో 250 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు.

 

21:30 - February 12, 2017

బ‌ంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టులోనూ విజయానికి 7 వికెట్ల దూరంలో టీమిండియా ఉంది. ప్రత్యర్థి ముందు 459 ప‌రుగులు భారీ టార్గెట్ ఉంచిన కోహ్లి సేన‌.. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 3 వికెట్లు తీసింది. మ‌రో రోజు ఆట మిగిలి ఉండ‌గా.. విజ‌యానికి ఏడు వికెట్లు తీయాల్సి ఉంది. నాలుగో రోజు 3 వికెట్‌కు 103 ప‌రుగులు చేసిన బంగ్లాదేశ్‌.. ఇంకా 356 ప‌రుగులు వెనుక‌బ‌డే ఉంది. స్పిన్‌కు స‌హ‌క‌రిస్తున్న పిచ్‌పై కూడా బంగ్లా బ్యాట్స్‌మెన్ పోరాడుతున్నారు. భార‌త బౌల‌ర్లలో అశ్విన్ 2, జ‌డేజా ఒక వికెట్ తీసుకున్నారు. ఆట ముగిసే స‌మ‌యానికి ష‌కీబ్ 21, మ‌హ్మదుల్లా 9 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. అయితే భారత స్పిన్నర్లు జోరు మీదుండ‌టంతో... చివ‌రి రోజు.. మొత్తం వికెట్లు పడకుండా.. ఓటమిని తప్పించుకోవడం బంగ్లాకు కష్టమైన పనే అంటున్నారు క్రికెట్ నిపుణులు.

 

21:29 - February 12, 2017

జమ్ము కాశ్మీర్‌ : కుల్గాం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. శ్రీనగర్‌కు 60 కిలో మీటర్ల దూరంలోని ఫ్రిసల్‌ గ్రామంలో ఉగ్రవాదులు-భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది హతమయ్యారు. వీరిలో నలుగురు ఉగ్రవాదులు, ముగ్గురు జవాన్లు, ఒక పౌరుడు ఉన్నారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీనగర్‌లోని సైనిక ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు ఉగ్రవాదులు పరారయ్యారు. ఫ్రిసల్‌ గ్రామంలోని ఓ ఇంట్లో హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు సమావేశంమయ్యారని సమాచారం అందుకున్న భద్రతాదళాలు ఆ గృహాన్ని చుట్టుమట్టాయి. దీనిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో మన జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారు. రెండువర్గాల మధ్య పది గంటలకు పైగా హోరాహోరీ కాల్పులు జరిగాయి.

21:27 - February 12, 2017
21:25 - February 12, 2017

హైదరాబాద్ : అప్పుల బాధతో సికింద్రాబాద్‌లో ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌ కొండయ్య అలియాస్‌ ప్రవీణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. బేగంపేట రసూల్‌పురలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉబర్‌ క్యాబ్స్‌, టాటా ఫైనాన్స్‌ సంస్థల వేధింపులతోనే ప్రవీణ్‌ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతిని భార్య కవిత, ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్‌ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఈ రెండు సంస్థలు 35 లక్షల పరిహారం ఇవ్వాలని అసోసియేషన్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

21:24 - February 12, 2017

వరంగల్ : ఉన్నత విద్య కోసం వెళ్లి యువకుడు విగత జీవిగా మారిపోయాడు. తెల్లజాతీయుల కర్కశత్వానికి బలైపోయాడు. దేశం కాని దేశంలో దుండగుడి చేతిలో ప్రాణాలు వదిలాడు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జాతి వివక్ష చర్యల్లో భాగంగానే ఈ హత్య జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో జరిగిన దాడి తెలుగు ఓ తెలుగు కుటుంబానికి విషాదాన్ని మిగిల్చింది. జాతి అహంకారానికి మామిడాల వంశీ చందర్‌ రెడ్డి బలయ్యాడు. కారుకు అడ్డుగా వచ్చిన గుర్తు తెలియని దుండగుడు అతి సమీపం నుంచి వంశీని కాల్పాడు. దీంతో తెలుగు యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం వంశీ వద్ద డబ్బు, పర్సుని తీసుకొని దుండుగుడు పరారైపోయాడు.

శాన్ ఫ్రాన్సిస్ లో పని..
వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం వంగపాడు గ్రామానికి చెందిన వంశీ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఎంస్ పూర్తి చేశాడు. శాన్‌ఫ్రాన్సిస్‌కో లోని ఓ స్టోర్ లో పనిచేస్తున్న వంశీ.. గత రాత్రి విధులు ముగించుకొని తన గదికి తిరిగివస్తుండగా హత్యకు గురయ్యాడు. డ్రగ్స్ వాడిన ఓ తెల్లజాతి వ్యక్తి వంశీపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై అక్కడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వంశీ చందర్‌ రెడ్డి మృతితో అతని స్వగ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. మృతుని తల్లిదండ్రులు సంజీవరెడ్డి, రమ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అంది వచ్చిన కొడుకు చేయి జారిపోయాడని విలపిస్తున్నారు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తీ చేసిన అనంతరం 2013లో అమెరికా వెళ్లాడని బంధువులు చెప్పారు. మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నట్లు వెల్లడించారు. వంశీ మృతదేహన్ని రప్పించడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చొరవచూపాలని వారు వేడుకుంటున్నారు. వంశీ హత్య తరువాత కొన్ని కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. విదేశీయులను అమెరికా నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలే ఇలాంటి ఘటనలకు కారణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

21:22 - February 12, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసిన తెలంగాణ ఎంపీ కవితకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. "ప్రత్యేక హోదాకు మనస్ఫూర్తిగా మద్దతు పలికిన నిజామాబాద్ ఎంపీ కవిత గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఆంధ్ర, తెలంగాణ కలిసి పనిచేయాలి. ఐకమత్యంగా ఉంటే నిలుస్తాం. విడిపోతే నష్టపోతాం. జైహింద్" అని ట్వీట్ చేశారు.

21:20 - February 12, 2017

విజయవాడ : చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళల హక్కని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చెప్పారు. ఇది పురుషులు దయాదాక్షణ్యాలు, భిక్షపై ఆధారపడిన అంశం కాదని స్పష్టం చేశారు. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో సమాన అవకాశాలు ఉండాల్సిన అవసరం ఉందని విజయవాడలో జరిగిన జాతీయ మహిళ పార్లమెంటు సదస్సులో సుమిత్రా మహాజన్‌ పిలుపు పిచ్చారు.
విధాన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, వీటి అమల్లో మహిళల పాత్ర పెరగాల్సిన అవసరాన్ని సుమిత్రా మహాజన్‌ నొక్కి చెప్పారు. చట్ట సభలతో పాటు, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవహారాల్లో మహిళ భాగస్వామ్యం పెరిగినప్పుడే ఉత్తమ పాలన సాధ్యమైమన్న విషయాన్ని ప్రస్తావించారు. సంఖ్యతో సంబంధం లేకుండా ఉత్తమ విధాన నిర్ణయాల కోసం మహిళలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మహిళా రిజర్వేషన్లు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కొంతరు పురుష ఎంపీలు బిల్లు కాపీలను చించివేసిన విషయాన్ని సుమిత్రా మహాజన్‌ గుర్తు చేశారు. రిజర్వేషన్లు మహిళలకు పురుషులు దానంగా ఇచ్చేవికాదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో పురుషుల వైఖరి మారాలని సుమిత్రా మహాజన్‌ సూచించారు. అన్ని రంగాల్లో పరుషులతో సమానంగా మహిళలకు సమాన అవకాశాలు వచ్చే వరకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. జాతీయ మహిళా పార్లమెంటు స్ఫూర్తితో అమ్మ దీవెన పథకం ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించారు.

వివాదాస్పదం..
మూడు రోజులపాటు జరిగిన జాతీయ మహిళా కాంగ్రెస్ సదస్సులో మహిళా సాధికారత డిక్లరేషన్‌ను ఆమోదించారు. ప్రముఖుల ప్రసంగాలతో రూపొందించిన వీడియో అందర్నీ ఆకట్టుకుంది. మహళా సాధికారత డిక్లరేషన్‌ను ఈ సదస్సులో ఆమోదించారు. చివరి రోజు సినీనటి జయసుధ, ఏపీ మంత్రులు మృణాళిని, పరిటాల సునీత, పీతల సుజాత, ఎంపీ కొత్తపల్లి గీత ప్రముఖులు సందేశాలు ఇచ్చారు. మరోవైపు మహిళా పార్లమెంటు సదస్సుకు రిజిస్ట్రేషన్లు చేయించుకున్న విద్యార్థినులకు సర్టిఫికెట్ల జారీ అంశం వివాదస్పదమైంది. సదస్సుముగిసేలోగా సర్టిఫికెట్లు అందజేస్తామన్న నిర్వాహకులు ఆ తర్వాత మాటమర్చి, కాలేజీలకు పంపుతామని చెప్పడంతో విద్యార్థినుల ఆందోళనకు దిగారు. నిర్వాహకుల తీరును నిరసిస్తూ, చెప్పిందొకటి, చేసేది మరొకటా... అంటూ బైఠాయించి, నిలదీయడంతో సదస్సు ప్రాంగణంలో అలజడి చెలరేగింది. పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థినులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో నిర్వాహకులు దిగరాకతప్పలేదు. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు ప్రాంగణం విడిచివెళ్లేలోగా సర్టిఫికెట్లు ఇస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో చివరిగా శివమణి డ్రమ్స్‌, సంగీత, నృత్య కార్యక్రమాలు, పవిత్ర సంగం వద్ద కృష్ణా హారతితో జాతీయ మహిళ పార్లమెంటు సదస్సు ముగిసింది.

21:17 - February 12, 2017

చెన్నై : తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో నిర్వహించిన జల్లికట్టు తీవ్ర విషాదాన్ని నింపింది. బలుగూరులో జరిగిన జల్లికట్టులో 8 మంది మృతిచెందారు. ఈ ఘటనలో 40 మంది గాయపడగా మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను బలుగూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

21:14 - February 12, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాలు గంటకో మలుపుతిరుగుతున్నాయి. సీఎం పీఠం ఎవరు అధిష్టిస్తారనే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం బలం రోజురోజుకూ పెరుగుతోంది. వడివడిగా మారిపోతున్న పరిస్థితులతో శశికళ వర్గం తీవ్ర కలవరపాటులో పడింది. ఎమ్మెల్యేల తనతోనే ఉన్నారని చెప్పేందుకు.. వారితో మీడియా సమావేశం నిర్వహించింది. తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం పన్నీర్‌ సెల్వం, శశికళ మధ్య పోరు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో రాజకీయ సమీకరణలు కూడా అదే స్థాయిలో మారుతున్నాయి. పన్నీర్ సెల్వం మద్దతుదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం..శశికళ వర్గానికి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 10 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పన్నీర్ సెల్వంను కలిసి మద్దతు ప్రకటించారు. పన్నీర్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య సైతం ఏడుకు చేరింది. ఇదే వలసల పర్వం కొనసాగి మరో 11 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ గూటికి చేరితే శశికళ సీఎం పీఠంపై ఆశలు వదులుకోవాల్సిందే. సెల్వంకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 18కి చేరితే శశికళ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాళం ఉండదు.

పన్నీర్ సెల్వం నివాసం..
ఇక పన్నీర్ సెల్వం నివాసం ఆయన మద్దతుదారులతో పోటెత్తుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలు చెన్నై తరలివస్తున్నారు. దీంతో పన్నీర్‌ సెల్వం ఇంటికి నేతలు, కార్యకర్తల తాకిడితో కోలాహలం నెలకొంది. పన్నీర్‌ సెల్వంకు మద్దతు పెరుగుతుండటంతో శశికళ తన వర్గంలోని ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పన్నీరు సెల్వం గోల్డెన్‌ బే రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను కలుస్తారని ప్రచారం జరగడంతో శశికళ అలెర్ట్ అయ్యారు. పొయెస్ గార్డెన్‌లో పార్టీ నేతలు, సినీ ప్రముఖులతో శశికళ సమావేశమయ్యారు. తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఆమె చర్చించారు. తనకు 133 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తనతో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. గవర్నర్‌కు తాను ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీని చీల్చేందుకు కొందరు కుట్ర పన్నారని, ఆ కుట్ర పన్నింది ఎవరో అందరికీ తెలుసని అన్నారు.

ఎమ్మెల్యేలతో శశికళ భేటీ..
ఆ తర్వాత కాంచీపురం జిల్లాలోని గోల్డెన్ బే రిసార్ట్‌లో తన ఎమ్మెల్యేలతో శశికళ భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులపై మంతనాలు జరిపారు. రాజకీయాల్లో మహిళ కొనసాగడం ఎంతో కష్టమని..ఇలాంటి కష్టాలెన్నింటినో జయలలిత అధిగమించారని శశికళ అన్నారు. పూర్తి ఐదేళ్లపాటు తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే సైతం తాజా పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం డీఎంకే పార్టీ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. తమిళనాడులో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఏదీ ఏమైనా అధికార పీఠం కోసం సెల్వం, శశికళ ఆధిపత్య పోరులో ఎవరు పై చేయి సాధిస్తారన్నది తమిళనాట ఉత్కంఠ రేపుతోంది.

21:11 - February 12, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. శశికళ..పన్నీర్ సెల్వం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాసేపటి క్రితం గోల్డెన్ బే రిసార్ట్ లో ఎమ్మెల్యేలు..మద్దతు దారులతో శశికళ భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తన వెనుక ఎంత మంది ఉన్నారో లెక్క పెట్టుకోండి అని ఆమె మీడియాతో పేర్కొన్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను నిర్బంధించలేదని, ఎమ్మెల్యేలను నిర్బంధించామంటూ పన్నీర్ వర్గం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఎమ్మెల్యేలు స్వేచ్చగా ఉన్నారని, కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వంపై పలు విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ గా పన్నీర్ సెల్వం ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోల్డెన్ బే రిసార్ట్ వద్ద మన్నార్ గుడి మాఫియా రాజ్యం ఏలుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యేల చుట్టూ గూండాలను కాపలాగా పెట్టారని, స్వేచ్చగా వదిలేస్తే తనకు మద్దతిస్తారని తెలిపారు. అంతేగాకుండా ఎమ్మెల్యేలతో బెదిరింపులకు దిగుతున్నారని పన్నీర్ విమర్శించారు.

మీడియా ఎదుట శశికళ బలప్రదర్శన..

చెన్నై : గోల్డెన్ బే రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను శశికళ మీడియా ఎదుట బలప్రదర్శన చేశారు. తన వెనుక ఎంత మంది ఉన్నారో లెక్క పెట్టుకోండి అని ఆమె అన్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను నిర్బంధించలేదని, ఎమ్మెల్యేలను నిర్బంధించామంటూ పన్నీర్ వర్గం దుష్ప్రచారం చేస్తోందన్నారు.

 

ఎమ్మెల్యేల చుట్టూ గూండాలు - పన్నీర్..

చెన్నై : శశికళపై పన్నీర్ సెల్వం ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేల చుట్టూ గుండాలు ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. కాసేపటి క్రితం పన్నీర్ సెల్వంపై శశికళ పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

129 ఎమ్మెల్యేల మద్దతు ఉంది - శశికళ..

చెన్నై : తమకు 129 ఎమ్మెల్యేల మద్దతు ఉందని శశికళ ప్రకటించారు. గోల్డెన్ బే రిసార్ట్ లో ఎమ్మెల్యేలు...మద్దతుదారులనుద్ధేశించి ఆమె ప్రసంగించారు.

భక్తులపై తేనేటీగల దాడి..ఒకరు మృతి..

జగిత్యాల : కతలాపూర్ (మం) సిరికొండలోని మహాలక్ష్మి ఆలయంలో భక్తులపై తేనేటీగలు దాడి చేశాయి. ఒకరు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కూలిన ఆసుపత్రి పై కప్పు..

మహబూబ్ నగర్ : బాల్ నగర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి కప్పు కూలింది. పలువురికి గాయాలయ్యాయి. వీరిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. 30 పడకల ఆసుపత్రి నిర్మాణంలో ఉంది.

ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం - శశికళ..

చెన్నై : తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని శశికళ ప్రకటించారు. గోల్డెన్ బే రిసార్ట్ లో ఎమ్మెల్యేలు...మద్దతుదారులనుద్ధేశించి ఆమె ప్రసంగిస్తున్నారు. ఉద్వేగపూరితంగా ఆమె మాట్లాడారు. పార్టీని ఎవరూ టచ్ చేయలేరని ప్రత్యర్థి పన్నీర్ సెల్వంపై పలు విమర్శలు గుప్పించారు.

20:21 - February 12, 2017

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై 'దిల్' రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న 'డీజే'...’దువ్వాడ జగన్నాథమ్' చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రం స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన గెటప్ వైవిధ్యంగా ఉంటుదని తెలుస్తోంది. అందుకని చిత్రంలో తాను నటించిన ఫొటో బయటకు రాకుండా 'బన్నీ' అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చిత్ర టీజర్..ఫొటో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. తాజాగా చిత్ర న్యూ లుక్ ను విడుదల చేస్తున్నట్లు స్వయంగా 'అల్లు అర్జున్' ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 18వ తేదీన ఫస్ట్ లుక్ విడుదలవుతున్నట్లు తెలిపారు.
'సరైనోడు' సినిమాతో 'అల్లు అర్జున్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల మోత మోగించాడు. ఈ సినిమా సక్సెస్ తో స్టార్ గా బన్నీ రేంజ్ మరింత హెట్స్ కి వెళ్లింది. ఇప్పటి వరకు క్లాస్ టచ్ ఉండే మాస్ పాత్రలు చేసిన అల్లుఅర్జున్ సరైనోడు మూవీ లో మాత్రం ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ మాస్ లో అదరగొట్టాడు. ఈ భారీ సక్సెస్ ని మిస్ యూజ్ చేసుకోవద్దనే ఉద్దేశ్యంతో బన్నీ కొత్త సినిమా విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో బన్నీకి జోడిగా పూజాహెగ్డే నటిస్తోంది.

గోల్డెన్ బే రిసార్ట్ లో శశికళ ప్రసంగం..

చెన్నై : గోల్డెన్ బే రిసార్ట్ లో శశికళ పార్టీ ఎమ్మెల్యేలను, మద్దతు దారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కాసేపటి క్రితం ఇక్కడ బస చేసిన ఎమ్మెల్యేలతో మాట్లాడిన సంగతి తెలిసిందే.

20:05 - February 12, 2017
20:04 - February 12, 2017

నటనలో వైవిధ్యం, పాత్రలు భిన్నం..సహజమైన నటనతో ఆకట్టుకున్న నటుడు..'నవీన్ చంద్ర’..'నేను లోకల్ సినిమాలో 'నాని'కి ఆపోజిట్ గా పవర్ పుల్ పోలీసు పాత్రలో నటించాడు. ఈ చిత్రం విజయవంతం కావడం..’నవీన్ చంద్ర'కు మంచి పేరు తెచ్చింది. 'దిల్' రాజు బ్యానర్లో... 'సినిమా చూపిస్త మావా' సక్సెస్ అందించిన త్రినాథ్ రావ్ దర్శకత్వంలో 'నేను లోకల్' సినిమా రూపొందింది. సర్ ప్రైజింగ్ గా కండలతో గడ్డం తీసేసి మీసాలతో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించి 'నవీన్ చంద్ర' షాక్ ఇచ్చాడు. అది కూడా ఇంటర్వెల్ ట్విస్ట్ తో. సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న నవీన్ చంద్రతో టెన్ టివి ముచ్చటించింది.

 

కేసీఆర్ కు తమ్మినేని 95వ లేఖ..

కొత్తగూడెం : సీఎం కేసీఆర్ కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 95వ లేఖ రాశారు. అధికారంలోకి వస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి రెండేళ్లైనా కామేపల్లి ఊటవాగు ప్రాజెక్టు నిర్మించలేదన్నారు. కామేపల్లి, ఏన్కూర్, ఖమ్మం, అర్బన్ మండలాల్లో వర్షాభవం ఏర్పడితే పంటలు పండే పరిస్థితి లేదన్నారు. ఊటవాగుపై ఆనకట్ట నిర్మించాలని రైతులు కోరుతున్నారని, ఈ ఆనకట్ట ద్వారా ఊటూకూరు చెరువు నిండితే దానికి గొలుసుకట్టుగా ఉన్న 16 చెరువులు నిండుతాయని లేఖలో పేర్కొన్నారు.

సంక్షోభం వెనుక కుట్ర - శశికళ..

చెన్నై : ఇలాంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు జయ పార్టీని నడిపించారని, ఇలాంటి సంక్షోభాలు కొత్తేమీ కాదని, జనరల్ సెక్రటరీగా ఈ సమస్యను ఎలా ఎదుర్కొవాలో తనకు తెలుసన్నారు. తమిళనాడులో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనని, రాష్ట్రంలో సంక్షోభం వెనుక ఎవరి కుట్రుందో అందరికీ తెలుసన్నారు. నాలుగేళ్ల పాటు అన్నాడీఎంకే ప్రభుత్వమే ఉంటుందని, ఎలాంటి బెదిరింపులు వచ్చినా భయపడే ప్రసక్తే లేదన్నారు. పదవుల కోసం పాకులాడే వారికి పార్టీలో స్థానం లేదన్నారు.

18:54 - February 12, 2017

ఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగనతలంలో మరో ఘనతను సొంతం చేసుకోబోతోంది. ఇప్పటి వరకు అనేక రికార్డులు సృష్టించిన ఇస్రో... మరో రికార్డు ప్రయోగానికి సిద్దమైంది. ఈనెల 15న ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నద్దమైంది. దీని ద్వారా రష్యా రికార్డును ఇస్రో బద్దలు కొట్టబోతోంది. వరుస విజయాలతో జోరుమీదున్న ఇస్రో మరో రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అనేక ప్రతిష్టాత్మక ప్రయోగాలతో దేశఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు చేర్చిన షార్‌.. ఇప్పుడు ప్రపంచానికే సవాల్‌ విసరబోతోంది. మంగళయాన్‌, చంద్రయాన్‌-1లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు విజయవంతం చేసిన ఆత్మవిశ్వాసంతో ఈ ఏడాది సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైంది. ఈనెల 15న... మరో భారీ ప్రయోగానికి ఇస్రో సన్నద్దమైంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి రికార్డు సృష్టించబోతోంది. ఒకేసారి 37 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రష్యా రికార్డును.. భారత్‌ బద్దలు కొట్టనుంది.

104 ఉపగ్రహాలు..
పీఎస్‌ఎల్‌వి -సి37 వాహన నౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 15వ తేదీ ఉదయం 9.28కి ఉపగ్రహాలను నింగిలోకి పంపుతారు. ఈ రాకెట్‌లో పంపించే ఉపగ్రహాల్లో భారత్‌కు చెందినవి కేవలం మూడే. మిగిలిన 101 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవే. మన దేశానికి చెందిన 714 కిలోల బరువుగల కార్టోశాట్‌ 2డి ప్రధాన ఉపగ్రహం, 20కిలోల బరువు ఐఎన్‌ఎస్‌ -1ఏ, ఐఎన్‌ఎస్‌ -1బి నానో ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. వీటిలో అమెరికా, ఇజ్రాయిల్‌, కజకిస్తాన్‌, నెదర్లాండ్‌, స్విట్జర్లాండ్‌ ముందుకు రావడంతో 101 ఉపగ్రహాలను గగనతలంలోకి పంపనున్నారు.

గంటన్నర పాటు ప్రయోగం..
ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని గంటన్నరపాటు జరుపనుంది. 104 ఉపగ్రహాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. రాకెట్‌ భూమి నుంచి నింగిలోకి ఎగిరిన తర్వాత భూమికి 500 కిలోమీటర్ల దూరంలో ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్‌ను విడవనుంది. అనంతరం అక్కడి నుంచి 630 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత మిగిలిన 101 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి చేరేవిధంగా శాస్త్రవేత్తలు డిజైన్‌ చేశారు. ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నందున ఒక్కొక్క బాక్స్‌లో 25 ఉపగ్రహాలు పెట్టి మొత్తం నాలుగు పెట్టెల్లో అమర్చి ఒకదాని తర్వాత ఒకటి విడిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది మొత్తం జరుగడానికి 90నిమిషాల సమయం పడుతుంది.

చివరి క్షణంలో మార్పులు..చేర్పులు..
భూగోళ పరిశోధనల కోసం ఇస్రో ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతోంది. గత ఏడాది జూన్‌ 22న ఒకే రాకెట్‌లో 20 ఉపగ్రహాలను ప్రయోగించి భారత్‌ తన సత్తా చాటింది. అయితే రష్యా మాత్రం 2014లోనే ఏకకాలంలో 37 ఉపగ్రహాలను ప్రయోగించడం ఇప్పటి వరకు అతిపెద్ద రికార్డు. ఇప్పుడు 104 ఉపగ్రహాలను పంపి భారత్‌ ఈ రికార్డును బద్దలు కొట్టబోతోంది. ఈ ప్రయోడానికి 48 గంటల ముందే కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. అయితే వాతావరణ పరిస్థితులను బట్టి చివరి క్షణంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.

18:51 - February 12, 2017

హైదరాబాద్ : 'శరణం గచ్చామి' సినిమాకు సెన్సార్‌ అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఎస్‌వికేలో రౌండ్‌ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, కెవిపిఎస్‌ విద్యార్థి సంఘాలు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నాయి. రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలు, రిజర్వేషన్ల ఫలితాలు, అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి అంశాలపై ఈ సినిమాలో చూపించారని కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు అన్నారు. చిత్రం విడుదలకు ఏ అంశమూ అడ్డంకిగా లేదన్నారు. సెన్సార్‌ బోర్డ్ అనుమతి ఇవ్వని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

 

18:49 - February 12, 2017
18:24 - February 12, 2017

విజయవాడ : మరో కసాయి తల్లి దుశ్చర్య బయటపడింది. కన్న కొడుకును చిత్ర హింసలు పెట్టింది. ఈ ఘోరం ఆదివారం వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడంటూ కన్న కొడుకు వాతలు పెట్టింది. ఈ దారుణ ఘటన వనపర్తి శేషగిరి పేటలో చోటు చేసుకుంది. దుర్గాదేవి అనే మహిళ గత కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటోంది. ఈమెకు మణిసతీష్ చిన్నారి ఉన్నాడు. వేరేక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అడ్డుగా వస్తున్నాడన్న కారణంతో చిన్నారికి వాతలు పెడుతూ నరకం చూపించేది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కసాయి తల్లి దుర్గాదేవిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

18:14 - February 12, 2017

చెన్నై : నగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు రాష్ట్రానికి భారీగా తరలివస్తున్నారు. దీనితో పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు శశికళ గోల్డెన్ బే రిసార్ట్ లో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అధైర్య పడవద్దని సూచించారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వంపై పలు ఆరోణలు గుప్పించారు. ఇక పన్నీర్ సెల్వం కూడా వ్యూహాలు రచిస్తున్నారు. గవర్నర్ తో పన్నీర్ మద్దతు దారుడు మైత్రేయన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పన్నీర్ సెల్వంకు భారీగా మద్దతు పెరుగుతోంది.

ముగిసిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు..

విజయవాడ : జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ముగిసింది. ముగింపు రోజున లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్, సీఎం చంద్రబాబు నాయుడులు పాల్గొన్నారు.

ఏపీ ఎన్జీవో ఎన్నికల్లో అశోక్ బాబు, చంద్రశేఖర్ రెడ్డి ప్యానెల్ ఎన్నిక..

విజయవాడ : ఏపీ ఎన్జీవో ఎన్నికల్లో అశోక్ బాబు, చంద్రశేఖర్ రెడ్డి ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. మూడేళ్ల పాటు పదవిలో కొత్త కార్యవర్గం కొనసాగనుంది.

ముగిసిన నాలుగో రోజు ఆట..

హైదరాబాద్ : భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ స్కోర్ మూడు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. హసన్ 21, మహ్మదుల్లా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయం సాధించాలంటే ఇంకా 355 పరుగులు చేయాల్సి ఉంది.

17:46 - February 12, 2017

విజయవాడ : ఒకటి కాదు రెండు కాదు దాదాపు 15 రోజుల నుంచి విజయవాడలోని సింగ్‌ నగర్ చెత్త డంపింగ్‌ యార్డులో మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల వ్యాపిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

17:42 - February 12, 2017

ఖమ్మం : పంటలు బాగా పండి రైతులు యాటలు కోసుకుంటున్నారని కేసీఆర్‌ చెబుతున్నారని కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి లేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రైతులను ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. యాత్రంలో భాగంగా మార్గమధ్యంలో.. ఎండిపోయిన మిర్చి పంటను బృందం పరిశీలించింది. పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణలో పత్తి పంటలు వేయవద్దని సర్కార్‌ ప్రచారం చేస్తోందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

17:40 - February 12, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, దళితులపై దాడులకు సంబంధించి నిజనిర్దారణ కమిటీ నివేదికలను వెంటనే ప్రభుత్వానికి అందజేసి, తగు చర్యలు తీసుకునే విధంగా చూడాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంఘం కోరింది. ఓపీడీఆర్ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిగాయి. ఈ సందర్భంగా ఇందిరాప్కార్‌ నుంచి ఎస్వీకే వరకు ర్యాలీ నిర్వహించారు. ఒడిశాలోని మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌తోపాటు, గిరిజనులు, మహిళలు, దళితులపై జరుగుతున్న దాడులు, రైతుల ఆత్మహత్య పై చర్చించారు.

17:16 - February 12, 2017

చెన్నై : శశికళ సూసైడ్ లెటర్ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై శశికళ స్పందించారు. నకిలీ లేఖ అని మీడియాకు తెలియచేశారు. పోయెస్ గార్డెన్ నుండి గోల్డెన్ బే రిసార్ట్ కు శశికళ చేరుకున్నారు. అక్కడ బస చేసిన ఎమ్మెల్యేలతో ఆమె భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు. అంతకుముందు శశికళ మీడియాతో మాట్లాడారు. శశికళ సూసైడ్ నోట్ పై ఆమె స్పందించారు. నకిలీ లేఖ అని, వ్యతిరేకంగా ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు. ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తే అవమానాలు ఎదురవుతాయని తెలుసని, గతంలో ఇలాగే జరిగిందన్నారు. తాను ఎలాంటి బెదిరింపులకు భయపడడని తేల్చిచెప్పారు. గవర్నర్ స్పందించకపోవడం బాధాకరమని, 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వెల్లడించారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

17:10 - February 12, 2017

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ప్రతి ఏటా తల్లికి వందనం పేరుతో మహిళలను గౌరవిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మహిళ పార్లమెంట్ సదస్సు ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సదస్సులో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ మహిళ పార్లమెంట్ సదస్సు ప్రతి ఏడాది నిర్వహించాలని, రాబోయే రోజుల్లో పాఠశాలల్లో, కళాశాలల్లో 'తల్లికి వందనం' కార్యక్రమం చేపడుతామని ప్రకటించారు. పిల్లలు, తల్లిపాదాలు కడిగి పూజ చేసి ఆశ్వీరాదం పొందాలన్నారు. మహిళలకు సాధికారిత కల్పించడమంటే గౌరవం ఇవ్వడమేనని, మహిళలను గౌరవించినప్పుడు ప్రపంచం అభివృద్ధి చెందుతుందన్నారు. సమాన అవకాశాలు ఉంటే తప్ప మహిళలు ఎదగలేరని పేర్కొన్నారు. తల్లికి గౌరవం లభించినప్పుడు మహిళలకు గౌరవం లభిస్తుందని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై పార్లమెంట్ లో మద్దతిచ్చేందుకు సిద్ధమని వెల్లడించారు.

జమ్మూ కాశ్మీర్ లో కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కుల్గాం జిల్లాలో జరిగిన ఈఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు ఆర్మీ సైనికులు, ఒక పౌరుడు ఈ ఘటనలో వీరమరణం పొందారు.

గోల్డెన్ బే రిసార్ట్ కు చేరుకున్న శశికళ..

చెన్నై : గోల్డెన్ బే రిసార్ట్ కు శశికళ చేరుకున్నారు. అక్కడ బస చేసిన ఎమ్మెల్యేలు, మద్దతుదారులతో ఆమె భేటీ అయ్యారు.

16:56 - February 12, 2017
16:55 - February 12, 2017
16:44 - February 12, 2017

నెల్లూరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యానికి తీరని హాని జరుగుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు.డా.శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో 25 సంవత్సరాల నూతన ఆర్థిక విధానాల అమలు ఉద్యోగులు - కార్మికులు - ప్రజలపై ప్రభావం అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాఘవులు మాట్లాడుతూ... పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందని, మతసౌమరస్యానికి విఘాతం కలుగుతోందన్నారు. ప్రజాస్వామ్యానికి నూతన ఆర్థిక విధానాలు దోహదం చేయడం లేదన్నారు. కార్పొరేట్లకు ఆర్థిక సంస్కరణలు లాభాలు తెచ్చిపెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడీ మరింత దూకుడుగా వెళుతున్నారని విమర్శించారు.

16:38 - February 12, 2017
16:37 - February 12, 2017

చెన్నై : తమిళనాడులో దారుణం జరిగింది. ఏఐఏడీఎంకే కార్యకర్త కనగరాజ్‌ను కొందరు వ్యక్తులు నడిరోడ్డుపై అతికిరాతకంగా నరికి చంపారు. తిరువళ్లూరులోని అరుణాచలం దేవాలయం సమీపంలో స్కూటర్‌ పై వెళుతున్న వ్యక్తిని కిందకి తోసేసి దారుణంగా కొట్టి, గాయపరిచి హత్య చేశారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ హత్య గ్యాంగ్‌వార్‌ను తలపించింది. ఇది డీఎంకే పనై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కిరాతక హత్య వెనుక ఉన్న కారణాలపై పోలీసులు దర్యాప్తు చేశారు. .

 

ఎంపీ కవితకు పవన్ థాంక్స్..

హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపీ కవితకు సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు అభినందనలు తెలియచేశారు. కాసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొన్న ఎంపీ కవిత ప్రత్యేక హోదాకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. హోదాకు మద్దతు పలికినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు పవన్ ట్వీట్ చేశారు.

16:13 - February 12, 2017

చెన్నై : పోయెస్ గార్డెన్ నుండి గోల్డెన్ బే రిసార్ట్ కు రాజకీయాలు మారిపోయాయి. కాసేపటి క్రితం శశికళ ఎమ్మెల్యేలు, మద్దతుదారులతో భేటీ కావడానికి రిసార్ట్ కు బయలుదేరారు. ఎమ్మెల్యేలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు. ఈ సందర్భంగా శశికళ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని,అన్నాడీఎంకేపై పన్నీర్ వర్గం దుష్ర్పచారం చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని పేర్కొన్నారు. గవర్నర్ కు తాను ఎలాంటి హెచ్చరికలు చేయలేదని, సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 130 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించారు. భేటీ అనంతరం శశికళ ఆందోళన బాట పట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలందరినీ తీసుకుని రాజ్ భవన్ కు వెళ్లనున్నట్లు, జయ సమాధి వద్ద శశికళ నిరహార దీక్షకు కూర్చొంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది - శశికళ..

చెన్నై : పోయిస్ గార్డెన్ నుండి గోల్డెన్ బే రిసార్ట్ కు శశికళ బయలుదేరారు. ప్రజాస్వామ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఎమ్మెల్యేలతో భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు. ప్రజాస్వామ్యంపై తనకు నమ్మకం ఉందన్నారు.

15:37 - February 12, 2017
15:34 - February 12, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ స్పందించకపోవడంపై శశికళ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గవర్నర్ పై వత్తిడి తెచ్చేందుకు ఆందోళన మార్గం ఎంచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఎమ్మెల్యేను కలిసిన అనంతరం రాజ్ భవన్ వద్ద ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించాలని శశికళ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ స్పందించకపోతుండడంపై ఏం చేయాలనే దానిపై ఎమ్మెల్యేలు, మద్దతు దారులతో చర్చించనున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు వేచి చూస్తామని శశికళ మద్దతు దారులు పేర్కొంటున్నారు. స్పందించకపోవడంతో ఆందోళన చేయాలని శశికళ భావిస్తున్నట్లు, జయ సమాధి వద్ద నిరహార దీక్ష చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతోంది. నిన్న శశికళను కలిసిన విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ ఈ రోజు ప్లేటు ఫిరాయించారు. 9 మంది ఎంపీలు పన్నీర్ సెల్వంకు మద్దతు పలుకుతున్నారు.

15:31 - February 12, 2017

బెంగళూరు : అంధుల టీ 20 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. పాక్ పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 198 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం ఒక వికెట్ కోల్పోయి 17.4 ఓవర్లలో 200 పరుగులు చేసింది. పాక్ జట్టులో మహ్మద్ జమిల్ 24, బాదర్ 57 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కేతన్ పటేల్, మహ్మద్ జఫర్ చెరో రెండు వికెట్లు తీశారు. భారత బ్యాట్ మెన్స్ లో ప్రకాష జయరామయ్య 99 పరుగులు చేయగా కేతన్ పటేల్ 26 పరుగులు చేశారు.

15:19 - February 12, 2017

వరంగల్ : అమెరికాలో గన్ కల్చర్ కు మరోకరు బలి అయ్యారు. తెలుగు విద్యార్థి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందడం కలకలం రేగింది. గడిచిన రెండు సంవత్సరాల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం గమనార్హం. వరంగల్‌ అర్బన్‌ జిల్లా వంగపాడుకు చెందిన వంశీ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. గత మూడు రోజుల నుండి వంశీ కనిపించడం లేదని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం వంశీ మృతదేహం బయటపడడంతో విషాదం నెలకొంది. దీనితో కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగాల విలపిస్తున్నారు.

మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు - జిల్లా పోలీసు కమిషనర్..
ఈ సందర్భంగా టెన్ టివితో వరంగల్ జిల్లా పోలీసు కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడారు. అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్ తో మాట్లాడడం జరిగిందని, ఐటీ మంత్రి అక్కడి వారితో మాట్లాడారని సుధీర్ బాబు పేర్కొన్నారు. వంశీ మృతదేహాన్ని ఇక్కడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు.

చాలా బాధాకరం - వంశీ బంధువు...
తమకు ఈ రోజు ఉదయం సమాచారం వచ్చిందని, అపార్ట్ మెంట్ వద్ద పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపాడని తెలిసిందని టెన్ టివితో వంశీ బంధువు పేర్కొనారు. దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తి పోలీసు కస్టడీలో ఉన్నట్లు, ఘటనా జరిగిన ప్రదేశానికి తమను వెళ్లనీయడం లేదని స్నేహితులు పేర్కొన్నారని తెలిపారు. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సహాయంతో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. వంశీ మృతి చెందడం చాలా బాధకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఉత్తరాఖండ్ లో రూ. 5 లక్షల 66 వేల నగదు స్వాధీనం..

ఉత్తరాఖండ్ : హరిద్వార్ లో రూ. 5 లక్షల 66 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదులో రూ. 2000 వేల నోట్లున్నాయి. పోలీసులు జరిపిన తనిఖీలో కారు స్టెపినీలో తరలిస్తుండగా పట్టుకున్నారు.

గోల్డెన్ బే రిసార్ట్ కు పన్నీర్ !..

చెన్నై : గోల్డెన్ బే రిసార్టులో శశికళ దాచివుంచిన ఎమ్మెల్యేలను కలవాలని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో రిసార్టు పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

భారత్ డిక్లేర్డ్..

హైదరాబాద్ : బంగ్లాదేశ్ లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్ ను 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో 459 పరుగుల విజయలక్ష్యంతో బంగ్లాదేశ్ బరిలోకి దిగింది.

14:29 - February 12, 2017
14:28 - February 12, 2017

నూతన ఆర్థిక విధానాలతో నష్టం - రాఘవులు..

నెల్లూరు : నూతన ఆర్థిక విధానాలతో ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందని, ప్రజల సంక్షేమం కాకుండా మార్కెట్ లాభాలే ధ్యేయంగా నూతన ఆర్థిక విధానాలున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. అధ్యక్ష తరహా పాలన తెచ్చేందుకు మోడీ కుట్ర చేస్తున్నారని, చట్ట సభలకు శాసనాలను చేసే అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. నోట్ల రద్దుతో పరిశ్రమలన్నీ దివాళా తీశాయని, దేశంలో నల్లధనం ఎక్కువగా బీజేపీ వద్దే ఉందని పేర్కొన్నారు.

బూడిదంపాడులో మహాజన పాదయాత్ర..

ఖమ్మం : బూడిదంపాడులో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. మిర్చితోటను రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సందర్శించారు. క్వింటాల్ మిర్చికి రూ. 10 వేలు ఇవ్వాలని, గిరిజనులను అడవి నుండి దూరం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. పోడు సాగుదారులపై కేసులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు.

 

పెద్ద గట్టు జాతర..ట్రాఫిక్ ఆంక్షలు..

సూర్యాపేట : పెద్దగట్టు జాతర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి, మిర్యాలగూడ మీదుగా కోదాడ మళ్లిస్తున్నారు.

సుప్రీంలో కర్నాటక సర్కార్ అఫిడవిట్..

చెన్నై : అక్రమాస్తుల కేసులో ఏ1గా ఉన్న జయలలిత పేరు తొలగించాలని సుప్రీంకోర్టులో కర్నాటక సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది.

 

సోమవారం డీఎంకుఏ ఉన్నతస్థాయి సమావేశం..

చెన్నై : రేపు డీఎంకే పార్టీ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొనేందుకు సాధ్యసాధ్యాలపై ముఖ్యనేతలతో స్టాలిన్ చర్చించనున్నారు.

సుప్రీంను ఆశ్రయిస్తా - సుబ్రమణ్యస్వామి..

ఢిల్లీ : రేపటిలోగా గవర్నర్ కీలక నిర్ణయం తీసుకోనిపక్షంలో ఆర్టికల్ 32కు భంగం వాటిల్లుతుందని సుప్రీంను ఆశ్రయిస్తానని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వెల్లడించారు.

ఎలాంటి తప్పు జరగలేదు - కోడెల..

విజయవాడ : మహిళా సదస్సు బాగా జరిగిందని మంచి ఫలితాలు భవిష్యత్ లో అందుతాయని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. మహిళా సదస్సుని కొందరు చెడగొట్టే ప్రయత్నం చేశారని, తన దగ్గర నుండి ఎలాంటి తప్పు జరగలేదన్నారు. మహిళల పట్ల తన వైఖరి సానుకూలంగా ఉందని పేర్కొన్నారు.

14:09 - February 12, 2017

చెన్నై : అదే టెన్షన్..అదే ఉత్కంఠ..తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. గత కొన్ని రోజులుగా పన్నీర్ సెల్వం..శశికళ మధ్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీఎం పదవి కోసం శశికళ పోటీ పడుతుండడం...సీఎం పదవి చేజారిపోకుండా అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యూహాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై శశికళ వర్గం తీవ్ర ఆగ్రహంగా ఉంది. మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను శశికళ గోల్డెన్ బే రిసార్ట్స్ లో బస కల్పించింది. వీరి క్షేమ సమాచారాలను తెలుసుకొనేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు ఎమ్మెల్యేల వాంగ్మూలాలను తీసుకున్నారు. తాజాగా వీరిపై పన్నీర్ సెల్వం కన్ను పడినట్లు తెలుస్తోంది. వారు బస చేసిన ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మరో వైపు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలలోపు తేల్చాలని శశికళ డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో జయ సమాధి వద్ద మద్దతుదారులతో శశికళ ఆందోళన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ సాగధీత దోరణిపై ఆందోళనలు కూడా చేయాలని శశికళ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చెన్నై వ్యాప్తంగా హై అలెర్ట్‌ ప్రకటించారు. చెన్నై బీచ్‌ పరిసరాలు, ఇతర ముఖ్య ప్రాంతాలను పోలీసులు నిశితంగా పరిశీస్తున్నారు.
పెద్ద ఎత్తున ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుతుండడంతో పన్నీరు సెల్వం శిబిరంలో ఆనందోత్సావం వెల్లివిరుస్తోంది. పన్నీరు సెల్వం గూటికి తాజాగా ఇద్దరు ఎంపీలు మద్దతు తెలిపారు. వేలూరు ఎంపీ శంగోటన్‌, తూతూకూడి ఎంపీ త్యాగరాజ్‌ నటరాజ్‌ చేరారు. దీంతో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు పన్నీరు సెల్వం గూటికి చేరినట్లైయింది.

 

13:55 - February 12, 2017

సాహిత్యం సముద్రమంత లోతైనది. ఈ విశ్వమంత విశాలమైనది. వేల ఏళ్ల పరిణామంలో తొలి అడుగు నుంచి ఉరుకుల, పరుగుల వేగం వరకు రాజరికం, బానిసత్వం, ఆధిపత్య, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వరకు ఎన్నో మలుపులు  మరెన్నో మైలు రాళ్లు. సమాజాన్ని నడిపించే శక్తుల మూలాలను వ్యక్తిలో, దాని సమూహంలో ఒడిసిపట్టుకుని సాహిత్యం అక్షరీకరిస్తూ ఉంది. ఈ పరిస్థితుల మధ్య సాహిత్య గతి.. అధ్యయనం చాలా ముఖ్యంగా మారింది. రెండే వర్ణాల పేరుతో అనేక సున్నితమైన అంశాలను సూక్ష్మంగా పరిశీలించి కవితలల్లిన సవ్యసాచితోపాటు నడిచే పాట లాంటి కళాకారుడు సాంబరాజు యాదగిరిపై ప్రత్యేక కథనంతో ఈ వారం అక్షరం. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:52 - February 12, 2017

సాహిత్యం సముద్రమంత లోతైనది. ఈ విశ్వమంత విశాలమైనది. వేల ఏళ్ల పరిణామంలో తొలి అడుగు నుంచి ఉరుకుల, పరుగుల వేగం వరకు రాజరికం, బానిసత్వం, ఆధిపత్య, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వరకు ఎన్నో మలుపులు  మరెన్నో మైలు రాళ్లు. సమాజాన్ని నడిపించే శక్తుల మూలాలను వ్యక్తిలో, దాని సమూహంలో ఒడిసిపట్టుకుని సాహిత్యం అక్షరీకరిస్తూ ఉంది. ఈ పరిస్థితుల మధ్య సాహిత్య గతి.. అధ్యయనం చాలా ముఖ్యంగా మారింది. రెండే వర్ణాల పేరుతో అనేక సున్నితమైన అంశాలను సూక్ష్మంగా పరిశీలించి కవితలల్లిన సస్యసాచితోపాటు నడిచే పాట లాంటి కళాకారుడు సాంభరాజు యాదగిరిపై ప్రత్యేక కథనంతో ఈ వారం అక్షరం. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:20 - February 12, 2017

ఆహ్వాన పత్రం పంపి..జాతీయ మహిళ పార్లమెంట్ సదస్సుకు వస్తున్న మహిళ ప్రజాప్రతినిధిని అడ్డుకోవడమేనా..మహిళ సాధికారత అంటే.... అని వక్తలు ప్రశ్నించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు రమాదేవి, వైసీపీ నాయకురాలు పుణ్యశీలి, బీజేపీ నాయకురాలు తుమ్మల పద్మ పాల్గొని, మాట్లాడారు. ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది మహిళలను అవమానించినట్లే అన్నారు. ఆహ్వానం ఇచ్చి అవమానించారని మండిపడ్డారు. మహిళా సాధికారతకు అర్థం ఇదేనా అని అడిగారు. డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు రుణ మాఫీ పేరుతో కుచ్చు టోపీ పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు భజన బృందానికి ఆహ్వానం పలికారని ఎద్దేవా చేశారు. సదస్సులో ప్రకటిత లక్ష్యం, అప్రకటిత లక్ష్యముందని చెప్పారు. ప్రకటిత లక్ష్యం... సాధికారిత అని, అప్రకటిత లక్ష్యం..వాళ్లను వాళ్లు బూస్టప్ చేసుకోవడమే అన్నారు. భిన్నమైన గళాలను వినిపించేవారికి ఆహ్వానించకుండా ప్రభుత్వానికి  మద్దతు తెలిపే మహిళలను మాత్రమే ఆహ్వానించారు. మరిన్ని వివరాలను వీడియోలో చుద్దా....

 

13:04 - February 12, 2017

ఖమ్మం : ఓపెన్‌ కాస్టులతో సింగరేణి ప్రాంతం బొందల గడ్డగా మారిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఓపెన్‌కాస్టులు మూసివేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆయన మండిపడ్డారు. ఓపెన్‌కాస్టుల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని.. వాటిని వెంటనే నిలిపేయాలన్నారు. సీపీఎం ఓపెన్‌ కాస్టులకు వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుండి నడిపిస్తుందన్నారు. 
మహాజన పాదయాత్రకు విశేష స్పందన 
సామాజిక న్యాయమే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్రకు అన్నివర్గాల నుంచి విశేషస్పందన లభిస్తోంది. గిరిజనులకు అడవి మీద హక్కు లేదని కేసీఆర్‌ అసెంబ్లీలో చట్టవిరుద్ధంగా మాట్లాడుతున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కేసీఆర్‌ గిరిజనులకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ వారికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది భూములు పంచే ప్రభుత్వం కాదని.. భూములు లాక్కునే ప్రభుత్వమని తమ్మినేని విమర్శలు గుప్పించారు. 
అప్పుడే  రాష్ట్ర అభివృద్ధి : శోభన్ నాయక్ 
అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు పాదయాత్ర బృందం సభ్యులు శోభన్‌ నాయక్‌. వారి జీవితాలు బాగుపడకుండా రాష్ట్రం అభివృద్ధి చెందడం సాధ్యం కాదన్నారు. 
ఇల్లందులో 118 వ రోజు యాత్ర ప్రారంభం
మహాజన పాదయాత్ర 118వ రోజు ఖమ్మం జిల్లా ఇల్లందులో ప్రారంభమైంది. ఉసిరికాయపల్లిలో సీపీఎం మహాజన పాదయాత్రకు మహిళలు బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. పాదయాత్ర ఉసిరికాయపల్లిలో 3,131 కిలోమీటర్ల మైలు రాయి దాటిన సందర్భంగా గ్రామంలో శిలఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత భాగ్యనగర్‌తండా, కారేపల్లి, బొక్కలతండా, విశ్వనాథపల్లి, కామేపల్లి గ్రామాల మీదుగా యాత్ర కొనసాగింది. ఓపెన్‌ కాస్టులను మూసివేయాలంటూ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని 94వ లేఖ రాశారు. ఇల్లందులో సింగరేణి భూగర్భ గనులను మూసివేసి..ఓపెన్‌ కాస్టులు తెచ్చి స్థానికులకు ఉపాధి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉసిరికాయలపల్లి ఓపెన్‌కాస్ట్ నిర్వాసితులు, మాదారంలోని డోలమైట్‌ నిర్వాసితులకు న్యాయం చేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. 

 

13:01 - February 12, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' చిత్రం కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. తమ అభిమాన నటుడిని చూడాలని వారు తహతహలాడుతున్నారు. ఇటీవలే చిత్ర టీజర్ విడుదలై యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అనంతరం 'పవన్ కళ్యాణ్' 'కాటమరాయుడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'పవన్' సరసన 'శృతి హాసన్' హీరోయిన్ గా నటిస్తోంది. చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే 'పవన్' కు చాలా మందే అభిమానులు ఉంటారు. అందులో టాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. వర్ధమాన నటుడు 'నితిన్' కూడా పవన్ వీరాభిమాని. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో పేర్కొన్నాడు కూడా. 'నితిన్' కి సంబంధించిన సినిమా ఫంక్షన్స్ కి కూడా 'పవన్' వెళ్లారు. తాజాగా 'కాటమరాయుడు' చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులు 'నితిన్' పొందినట్లు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పవన్ సినిమాలు సెట్స్ పై ఉండగానే బిజినెస్ జరిగిపోతూ ఉంటుందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా నైజాం ఏరియాలో 'పవన్' కి మంచి పట్టు ఉంది. అక్కడ రైట్స్ ను దక్కించుకోవడానికి చాలామంది పోటీపడుతుంటారు. అక్కడి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను 'నితిన్' దక్కించుకున్నాడంట.

12:56 - February 12, 2017

హైదరాబాద్‌ : నగరంలో బౌద్ధమత గురువు దలైలామా పర్యటించారు. హైటెక్స్ రోడ్‌లో దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో దలైలామా, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైటెక్స్‌లో 'నీతి విలువలు' అనే అంశంపై దలైలామా ప్రసంగించారు. హత్యలు, ఘర్షణలతో శాంతి చేకూరదని..అహింసతోనే ప్రపంచ శాంతి చేకూరుతుందని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ ఒక్కరే అహింసా సిద్ధాంతాన్ని పాటించారని దలైలామా గుర్తుచేశారు. వందల ఏళ్ల క్రితమే ఎందరో విదేశీయులు భారతదేశ గొప్పతనాన్ని గుర్తించారని..ప్రపంచానికి తత్వశాస్ర్తాన్ని బోధించిన పుణ్యభూమి భారత్‌ అన్నారు. వైదిక మతంతో పాటు ఇస్లాం, బౌద్ధం, క్రైస్తవం, జొరాస్టియన్ మతాలను ఆదరించిన దేశం భారతదేశమన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని మతస్వేచ్ఛ, శాంతి భారత్‌లోనే ఉందని దలైలామా తెలిపారు. 

 

12:54 - February 12, 2017

వాషింగ్టన్ : అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలుగు విద్యార్థి వంశీని దుండగలు కాల్చిచంపారు. ఆఫీస్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా వంశీని దుండగులు కాల్చివేశారు. జాతి వివక్ష చర్యల్లో భాగంగానే హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వంశీరెడ్డి స్వస్థలం వరంగల్‌ అర్బన్‌ జిల్లా వంగపాడు. వంశీరెడ్డి మృతి విషయం తెలియగానే కుటుంబ సభ్యులు షాక్‌లోకి వెళ్లారు. వారంతా ఇప్పుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గంట గంటకు మారుతున్న తమిళ రాజకీయాలు

చెన్నై : తమిళనాడులో గంట గంటకు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పన్నీరు సెల్వం గూడికి పెద్ద ఎత్తున ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుతుండడంతో పన్నీరు సెల్వం శిబిరంలో ఆనందోత్సావం వెల్లివిరుస్తోంది. పన్నీరు సెల్వం గూటికి తాజాగా ఇద్దరు ఎంపీలు మద్దతు తెలిపారు. వేలూరు ఎంపీ శంగోటన్‌, తూతూకూడి ఎంపీ త్యాగరాజ్‌ నటరాజ్‌ చేరారు. దీంతో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు పన్నీరు సెల్వం గూటికి చేరినట్లైయింది.

12:50 - February 12, 2017

కూరగాయాల్లో ఆలుగడ్డ కూడా ఒకటి. ఈ గడ్డను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని వైద్యులు పేర్కొంటున్నారు. ఫ్రై..కుర్మా..ఉడకబెట్టి తిన్నా..జ్యూస్ లాగా తాగిన ఆరోగ్యానికి మేలు అంట. గ్యాస్టిక్ మరియు ఎసిడిటి, అల్సర్ వంటి రోగాలను నయం చేస్తుందంట. కర్రీ చేయడం వలన కొన్ని ప్రోటీన్స్ పోతాయని, జ్యూస్ లాగా తీసుకుంటే మేలు అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.  క్యాన్సర్ తో పోరాడే శక్తిని కలిగి ఉండే లక్షణాలు ఆలుగడ్డలో ఉన్నాయంట. ఫ్రీరాడికల్స్‌ను నియంత్రించడం లో సహాయపడుతుంది. ఆలుగడ్డ జ్యూస్ తాగడం వలన మీ శరీరంలో కొవ్వుని తగ్గిస్తుంది. కొవ్వు తగ్గడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలిసిందే.
 

12:49 - February 12, 2017

చెన్నై : తమిళనాడులో గంట గంటకు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పన్నీరు సెల్వం గూడికి పెద్ద ఎత్తున ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుతుండడంతో పన్నీరు సెల్వం శిబిరంలో ఆనందోత్సావం వెల్లివిరుస్తోంది. పన్నీరు సెల్వం గూటికి తాజాగా ఇద్దరు ఎంపీలు మద్దతు తెలిపారు. వేలూరు ఎంపీ శంగోటన్‌, తూతూకూడి ఎంపీ త్యాగరాజ్‌ నటరాజ్‌ చేరారు. దీంతో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు పన్నీరు సెల్వం గూటికి చేరినట్లైయింది. అయితే మరో ఐదుగురు మంత్రులు ఇవాళ పన్నీరు శిబిరంలోకి వస్తారని సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు శశికళ వర్గం నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు జారుకుంటుండడంతో శశికళ వర్గంలో టెన్షన్‌ మొదలైంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు శశికళ నానా తంటాలు పడుతోంది. మరోవైపు బలనిరూపణకు గవర్నర్ సాగదీత ధోరణిపై శశికళ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంటనే బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అమ్మ సమాధి దగ్గర...నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ సాగధీత దోరణిపై ఆందోళనలు కూడా చేయాలని శశికళ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చెన్నై వ్యాప్తంగా హై అలెర్ట్‌ ప్రకటించారు. చెన్నై బీచ్‌ పరిసరాలు, ఇతర ముఖ్య ప్రాంతాలను పోలీసులు నిశితంగా పరిశీస్తున్నారు.  

 

12:46 - February 12, 2017

హైదరాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీగా బంగారం పట్టుకున్నారు. సింగపూర్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రెండు కిలోల బంగారం, రూ.50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌ఈడీ బల్బుల్లో బంగారం దాచి తెచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:41 - February 12, 2017
12:35 - February 12, 2017

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా యూరిపొరాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని భద్రతా బలగాలు చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. జవాన్ల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

 

అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేత

వాషింగ్టన్ : అమెరికాలో తెలుగు విద్యార్థిని దుండగులు కాల్చిచంపారు. మృతుడు వంశీరెడ్డి వరంగల్ జిల్లా   
వలగపాడు వాసిగా తెలుస్తోంది. 

12:30 - February 12, 2017

చెన్నై : తమిళనాడులో గంట గంటకు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పన్నీరు సెల్వం గూడికి పెద్ద ఎత్తున ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుతుండడంతో పన్నీరు సెల్వం శిబిరంలో ఆనందోత్సావం వెల్లివిరుస్తోంది. పన్నీరు సెల్వం గూటికి తాజాగా ఇద్దరు ఎంపీలు మద్దతు తెలిపారు. వేలూరు ఎంపీ శంగోటన్‌, తూతూకూడి ఎంపీ త్యాగరాజ్‌ నటరాజ్‌ చేరారు. దీంతో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు పన్నీరు సెల్వం గూటికి చేరినట్లైయింది. అయితే మరో ఐదుగురు మంత్రులు ఇవాళ పన్నీరు శిబిరంలోకి వస్తారని సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు శశికళ వర్గం నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు జారుకుంటుండడంతో శశికళ వర్గంలో టెన్షన్‌ మొదలైంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు శశికళ నానా తంటాలు పడుతోంది. మరోవైపు బలనిరూపణకు గవర్నర్ సాగదీత ధోరణిపై శశికళ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంటనే బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అమ్మ సమాధి దగ్గర...నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ సాగధీత దోరణిపై ఆందోళనలు కూడా చేయాలని శశికళ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చెన్నై వ్యాప్తంగా హై అలెర్ట్‌ ప్రకటించారు. చెన్నై బీచ్‌ పరిసరాలు, ఇతర ముఖ్య ప్రాంతాలను పోలీసులు నిశితంగా పరిశీస్తున్నారు.  

 

12:28 - February 12, 2017
12:22 - February 12, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. పోయెస్‌ గార్డెన్‌లో శశికళ మద్దతుదారుల మంతనాలు కొనసాగుతున్నాయి. గవర్నర్‌ నుంచి పిలుపు రాకపోతే ఏం చెయ్యాలనే దానిపై నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు పన్నీర్‌ సెల్వంకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. అటు వ్యవసాయశాఖ మంత్రి దురైకన్ను కనిపించడం లేదంటూ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి రెండు కిలోల బంగారం, రూ.50 లక్ష రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 

11:59 - February 12, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. పన్నీర్‌సెల్వంకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఓ మంత్రి, ముగ్గురు ఎంపీలు, మరో ఇద్దరు సీనియర్‌ నేతలు మద్దతు ప్రకటించారు. మరోవైపు  శశికళ గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లో ఉన్న తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. 
సెల్వంకు పెరుగుతున్న మద్దతు 
తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా  అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యులు పొన్నయ్యన్‌ చేరారు. అమ్మ ఆశయాలను కొనసాగించే శక్తి పన్నీర్‌సెల్వంకే ఉందన్నారు. శశికళ వర్గంలోని చాలామంది ఎమ్మెల్యేలు పన్నీర్‌సెల్వం వైపే వస్తారని...త్వరలోనే సంక్షోభానికి తెర పడనుందని పొన్నయ్యన్‌ తెలిపారు. నిన్నటివరకు శశికళ వర్గంలో ఉన్న ఇద్దరు ఎంపీలు అశోక్ కుమార్, పీఆర్ సుందరం.. పన్నీర్‌సెల్వం వర్గంలో చేరారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ఉండాలని, ఆయనకు తాము మద్దతు ఇస్తామని  ప్రకటించారు. మంత్రి పాండియా రాజన్‌ కూడా ఓపిఎస్‌కు మద్దతు తెలిపారు. 
శశికళ క్యాంపులో గుబులు 
అన్నాడీఎంకేలో చీలికలు తారస్థాయికి చేరుకోవడంతో శశికళ క్యాంపులో గుబులు పుడుతోంది. ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనని ఆందోళన చెందుతున్న శశికళ వర్గానికి తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అంతకుముందు శశికళ గవర్నర్‌కు లేఖరాశారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని  కోరారు. జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించిన శశికళ గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. గంటసేపు వారితో సమావేశమయ్యారు. అమ్మ ఆశయాల కోసం పార్టీ చీలకుండా కలిసికట్టుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 
శశికళ కొత్త ఎత్తుగడ 
అటు తనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో శశికళ కొత్త ఎత్తుగడ వేశారు. తనకు అత్యంత నమ్మకస్తుడైన సెంగొట్టయన్ పేరును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించాలని భావిస్తున్నారు. సెంగొట్టయన్ పేరును మన్నార్ గుడి వర్గం తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. 
గోల్డెన్‌ బే రిసార్ట్‌లో అధికారులు తనిఖీ 
గోల్డెన్‌ బే రిసార్ట్‌లో అధికారులు తనిఖీ చేశారు. అక్కడ కేవలం 95మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టు తేల్చారు. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు పన్నీర్‌ సెల్వానికి మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అసంతృప్త ఎమ్మెల్యేలు జారిపోకుండా శశికళ బుజ్జగిస్తున్నారు.

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

విజయనగరం : జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ వద్ద ఓ బైక్‌ చెట్టున ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. 

 

11:54 - February 12, 2017

విజయనగరం : జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ వద్ద ఓ బైక్‌ చెట్టున ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:50 - February 12, 2017

యూపీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ, కాంగ్రెస్‌ ఉమ్మడి మెనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ, అఖిలేష్‌ యాదవ్‌ ప్రధానిని టార్గెట్‌ చేశారు. ఇతరుల బాత్రూంలలోకి తొంగి చూడడం మోదికి అలవాటని రాహుల్‌ విమర్శిస్తే.... ప్రధాని 'మన్‌ కి బాత్‌' చెబుతారు కానీ 'కామ్‌ కీ బాత్‌' చెప్పరని అఖిలేష్‌ అన్నారు. యువనేతలను చూసి మోది జడుసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్‌, ఎస్పీ పార్టీలు ఉమ్మడి ఎజెండా
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్‌, ఎస్పీ పార్టీలు ఉమ్మడి ఎజెండాను రూపొందించాయి. లక్నోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌ 10 అంశాలతో కూడిన ఎన్నికల మెనిఫెస్టోను విడుదల చేశారు.  
ప్రధాని నరేంద్రమోదిపై యువనేతలు ధ్వజం
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదిపై యువనేతలు ధ్వజమెత్తారు. బాత్‌రూమ్‌లో రెయిన్‌కోట్ స్నానం చేసే క‌ళ మ‌న్మోహ‌న్‌కు తెలుస‌ని, గూగుల్‌లో రాహుల్‌ పేరుమీద సెర్చ్ చేస్తే జోకులు వ‌స్తాయ‌ని మోదీ చేసిన వ్యాఖ్యల‌ను రాహుల్‌గాంధీ  తిప్పికొట్టారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా గూగుల్‌ సెర్చ్‌ చేయడం, ఇతరుల బాత్రూమ్‌లోకి తొంగిచూడడం మోదికి అలవాటని పెట్టాలని ఎద్దేవా చేశారు. నల్లధనం, యువతకు ఉపాధి, నోట్ల రద్దు తదితర అంశాలను ప్రస్తావిస్తూ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ప్రధాని ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని రాహుల్‌ విమర్శించారు.
ప్రధాని జన్మపత్రిక ప్రకటనపై స్పంధించిన అఖిలేష్‌
ప్రధాని జన్మపత్రిక ప్రకటనపై స్పంధించిన అఖిలేష్‌...ఇప్పుడు ఇంటర్నెట్‌లో లభ్యమవుతోందన్నారు. ప్రధాని మన్‌ కి బాత్‌ చెబుతారు కానీ కామ్‌ కీ బాత్‌ చెప్పరని విమర్శించారు. బిజెపికి 70 మందికి పైగా ఎంపీలను ఇచ్చిన యూపీకి మోది ఏమి చేయలేదని, అచ్ఛేదిన్‌ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని సిఎం ఆరోపించారు. ఇద్దరు యువ నేతలను చూసి ప్రధాని జడుసుకుంటున్నారని అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు.
యువత, మహిళలు, రైతులకు పెద్దపీట
ఎస్పీ, కాంగ్రెస్‌ ఎన్నికల మెనిఫెస్టో యువత, మహిళలు, రైతులకు పెద్దపీట వేసింది.  యువకులకు ఉచిత స్మార్ట్‌ఫోన్‌, 20 లక్షల మంది యువతకు ఉపాధి, రైతులకు పన్ను మాఫీతో పాటు ఉచిత విద్యుత్‌, కోటి మంది పేదలకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్, మహిళలకు ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు, ప్రతి గ్రామానికి నీరు.. విద్యుత్‌... రోడ్లు, దళితులు, వెనకబడ్డ తరగతులకు ఉచితంగా పదిలక్షల ఇళ్లు కేటాయింపు, తదితర అంశాలున్నాయి.  అన్నివర్గాల వారిని సంతృప్తి పరచే దిశగా ఎజెండాను రూపొందించాయి. 

 

11:44 - February 12, 2017

హైదరాబాద్‌ : టెస్ట్‌ మూడో రోజు పోటీలో భారత్‌ జట్టు బంగ్లాదేశ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. తొలి రెండు రోజుల్లో టీమిండియా డామినేట్‌ చేస్తే...మూడో రోజు  బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌కు గట్టి పోటీనిచ్చింది. 41 పరుగులకు ఒక వికెట్‌తో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌ జట్టు...తొలి సెషన్‌లో విఫలమైనా రెండో సెషను నుంచి భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు.సకీబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, మెహిదీ హసన్‌ హాఫ్‌ సెంచరీలు నమోదు చేయడంతో బంగ్లాదేశ్‌ జట్టు ఓవర్‌ నైట్‌ స్కోర్‌కు 281 పరుగులు జోడించింది.   మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లాదేశ్‌ జట్టు..6 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ ఇంకా 365 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌  6 వికెట్లకు 687 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు భారత బౌలర్లు విఫలమైతే, మ్యాచ్‌ డ్రాగా ముగిసే అవకాశాలున్నాయి. 

 

11:29 - February 12, 2017

తూర్పుగోదావరి : పచ్చగా మూడు పంటలు పండే పొలాల్లో పైపులైన్లు వేస్తున్నారు. అడ్డొచ్చిన వారిని ఆణచివేస్తున్నారు. చట్టాలను చుట్టాలుగా చేసుకొని భూదందా చేస్తున్నారు. ఇదేదో రాయలసీమలో రౌడీఇజం కాదు. కోస్తాసీమలో సర్కారిజం. పచ్చని పోలాల్లో ప్రశాంతంగా జీవించే తూర్పుగోదావరి జిల్లా రైతుల గుండెల్లో సర్కార్‌ ప్రాజెక్టులు చిచ్చురేపుతున్నాయి. పట్టిసీమ, పురుషోత్తపట్నం పేరుతో ప్రాజెక్టులు పచ్చని పోలాలను మిగేస్తున్నాయి. 
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు సిద్ధం 
2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఏపీ సర్కార్‌ గద్దెనెక్కింది. తెలుగు తమ్ముళ్లతో పాటు ఈ ప్రాజెక్టు కింద బతికే లక్షల మంది అదే మాటను నిజమని ప్రగాఢంగా నమ్ముతున్నారు. కానీ ఈ నేపథ్యంలో ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టింది. అనేక విమర్శలు, అడ్డంకులు వచ్చినా పట్టిసీమను మాత్రం పూర్తి చేసింది. దీనిపై ఉండవల్లి లాంటి వారు కూడా విమర్శలు చేస్తున్నారు. అది పట్టిసీమ కాదు వట్టిసీమ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైన నదుల అనుసంధానం చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు పూనుకుంది. 
పోలాలలో చిచ్చురేపుతున్న ప్రాజెక్టులు 
తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం మండలం అఖండ గోదావరికి ఆనుకుని ఉన్న ప్రాంతం. ఈ మండలంలో ఉన్న పచ్చని పోలాలు ఏడాదికి మూడు పర్యాయాలు పంటనిస్తూ ఉంటాయి. అలాంటి పసిడి పంటలు పండే పోలాలలో ప్రాజెక్టులు చిచ్చురేపుతున్నాయి. పురుషోత్తపట్నం గ్రామంలోని రైతులు గతంలో పుష్కర ఎత్తిపోతలు ఫేజ్ వన్, ఫేజ్ టూ పథకానికి, నేవిగేషన్ ఛానల్ కు, సత్యసాయి వాటర్ పైప్ లైన్ కు ఇలా వివిధ పధకాల కింద భూములను కోల్పోయారు. వీరి నెత్తిమీదే పిడుగు వేసినట్టుగా మళ్లీ భూ సేకరణకు ప్రభుత్వం సిద్ధపడింది.
287 ఎకరాలు భూసేకరణకు ప్రభుత్వ సర్వే 
పురుషోత్తపట్నం మండలంలో పురుషోత్తపట్నం, వంగలపూడి, చినకొండేపూడి, నాగంపల్లి, రామచంద్రాపురం గ్రామాల్లో సుమారుగా 310 మంది రైతుల నుంచి 287 ఎకరాలు భూసేకరణకు ప్రభుత్వం సర్వే చేసింది. ఇప్పటికే ఊరిలో ఉన్న నాలుగు ప్రాజెక్టులకు తోడు ఈ ప్రాజెక్టు కూడా ప్రభుత్వం చేపడితే పురుషోత్తపట్నంలో దాదాపు వ్యవసాయం కనుమరుగవుతుంది. దీనిపై ఆధారపడిన కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తులు, చిన్నవ్యాపారులుతో సహా మొత్తం గ్రామమే తన ఉనికిని కోల్పోతుంది. ప్రభుత్వం తమ పొలాలను లాక్కొనే ప్రయత్నం చేస్తుందని అదే దోరణిని అవలంబిస్తే పొలాల్లోనే చనిపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
రైతులకు అన్యాయం చేయడం దారుణం : కమ్యూనిస్టు నేతలు  
పట్టిసీమకు న్యాయం చేసిన ప్రభుత్వం పురుషోత్తపట్నం రైతులకు అన్యాయం చేయడం దారుణమని కమ్యూనిస్టు నేతలు మండిపడుతున్నారు. గోదావరి ఆవతల చట్టాలను అమలు చేసి గోదావరికి ఇవతల చట్టాల ఊసే ఎత్తడం లేదని సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ తో సహా అందరూ రైతులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఈ ధోరణి మార్చుకోవాలని సూచిస్తున్నారు. రైతులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అన్నం పెట్టే తమ కంట కన్నీరు పెట్టించకుండా ప్రభుత్వం వ్యవహరించాలని రైతులు కోరుతున్నారు. పచ్చని ఊరిని పైపు లైన్లతో నింపద్దని ప్రజలు వేడుకుంటున్నారు.

 

11:12 - February 12, 2017

నిర్మల్ : కొత్తగా ఏర్పడిన నిర్మల్‌ జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు తరలివస్తున్నారు. కొత్త పరిశ్రమల రాకతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో ఎలాంటి పరిశ్రమ అయినా ఏర్పాటు చేసేందుకు సకల సౌకర్యాలు ఉన్నాయని అధికారులంటున్నారు. 
కొత్త పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి 
రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్‌లతో కొత్త కొత్త పరిశ్రమల స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్ధేశంతో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 44, 61 జాతీయ రహదారులను కలుపుకొని ఉన్న కొత్తగా ఏర్పడిన నిర్మల్‌ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన ప్రాంతమని ఇప్పటికే అధికారులు గుర్తించారు.
53 ఎకరాల్లో సౌర విద్యుత్తు ప్లాంట్‌  
ముథోల్‌ మండలంలోని చించాల పంచాయతీ అనుబంధ గ్రామమైన వెంకటాపూర్‌లో సుమారు 53 ఎకరాల్లో సౌర విద్యుత్తు ప్లాంట్‌ ఏర్పాటుకు టీఎస్‌ ఐపాస్‌ అంగీకరించింది. ఈ ప్లాంట్‌ ఏర్పాటుతో రూ.13.25 లక్షల ఆదాయం గ్రామపంచాయతీకి పన్నురూపంలో రానుంది. దాదాపు నాలుగు వందల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశ ఉంది. 
కడెం ప్రాంతంలో మరొక రైస్‌మిల్లు 
ఇక జిల్లాలో 40 రైస్‌ మిల్లులు ఉండగా.. కడెం ప్రాంతంలో మరొక రైస్‌మిల్లు నెలకొల్పబోతున్నారు. అదేవిధంగా భైంసాలో జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లులు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా దిలావర్‌పూర్‌ మండలంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే నిర్మల్‌లో రెడీమెడ్‌ ఫ్యాక్టరీ కోసం ఒక పారిశ్రామికవేత్త దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో కొత్త కొత్త పరిశ్రమల ఏర్పాటుతో అనేకమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 
పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గు 
ముఖ్యంగా నిర్మల్‌ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వనరుల కొదవలేదు. నిర్మల్‌లో భూగర్భ జలాలకు ఇబ్బంది లేదు. గోదావరి కూడా ఉండడంతో నీటికి ఇబ్బంది లేదు. దీంతో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపుతున్నారు. 50 ఏళ్ల క్రితమే ఇండస్ట్రియల్‌ ఏరియాకు సోఫినగర్‌ ప్రాంతంలో 40 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇప్పుడు అక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రోత్సాహం కూడా వీరికి తోడవుతోంది. 
52 వేల ఎకరాల్లో సోయా పంట సాగు 
తాజాగా.. జిల్లాలో 52 వేల ఎకరాల్లో సోయా పంట సాగు చేస్తున్నారు. దీని ద్వారా వచ్చే దిగుబడితో సోయా పాలు, బిస్కెట్లు, సమోసా వంటి తయారు చేసే పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అంతేగాక విత్తనోత్పత్పి కర్మాగారాలు, తేలికపాటి ఇటుకలు కూడా తయారీ చేయవచ్చు. అలాగే నిర్మల్‌లో అనేక రకాల పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికైనా అనువైన ప్రాంతమని అధికారులంటున్నారు. మొత్తానికి నిర్మల్‌ పట్టణం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో.. ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 

11:05 - February 12, 2017

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై స‌ర్కార్ చేస్తున్న ప్రచారాన్ని గ‌ట్టిగా తిప్పికొట్టాల‌ని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్. తాము క‌ట్టిన ప్రాజెక్టుల‌ను టిఆర్ఎస్ నిర్మాణం చేపట్టినట్లు క‌ల‌ర్ ఇస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు రీ డిజైనింగ్‌ల పేరుతో ప్రచారం చేసుకుంటోందని విమర్శిస్తున్నారు. 
స‌ర్కారు విధానాలను ఎండ‌గ‌ట్టేందుకు కాంగ్రెస్‌ ప్రణాళిక 
ఇప్పుడు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రాజెక్టుల వార్‌ నడుస్తోంది. అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైన్‌పై ఎక్కువ ఫోకస్‌ చేసింది ప్రభుత్వం. ప్రాజెక్టులపై తమకే చిత్తశుద్ధి ఉందని ప్రచారం కూడా చేసుకుంటుండటంతో కాంగ్రెస్‌ అలర్ట్‌ అయ్యింది. త‌మ హ‌యాంలో నిర్మించిన ప్రాజెక్టుల‌ను రాష్ర్ట ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోందని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్ట్‌ల‌పై కేసీఆర్‌ చెబుతున్నదొక‌టి... చేస్తున్న దొక‌ట‌ని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. స‌ర్కారు విధానాలను ఎండ‌గ‌ట్టేందుకు కాంగ్రెస్‌ ప్రణాళికతో ముందుకెళ్తోంది. 
ప్రభుత్వ తీరును ఎండగడుతున్న కాంగ్రెస్ 
మిడ్‌మానేరు ప్రాజెక్టు విష‌యంలో గ‌తంలో కేసీఆర్ చెప్పిన మాటలను ఇప్పుడు ఆయన అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లోకి ఇప్పటికే గట్టిగా తీసుకెళ్లారు కాంగ్రెస్‌ నేతలు. ముఖ్యంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీనిపై కాంగ్రెస్‌ నేత సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. పాల‌మూరు..రంగారెడ్డి ప్రాజెక్టులో రంగారెడ్డి జిల్లాకు జ‌రుగుతున్న అన్యాయంపై త్వర‌లోనే ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్‌ కూడా ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి నిర్ణయించుకున్నారు.
పెండింగ్‌లో ప్రాజెక్టులను పూర్తి పూర్తి చేయాలి : డీకే అరుణ 
ఇటు పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీ.కే అరుణ ఉద్యమిస్తూనే ఉన్నారు. తమ హయంలో ప్రారంభించిన ప్రాజెక్టులను.. తామే తీసుకొచ్చామన్నట్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇటు క‌ల్వకుర్తి ఎత్తిపోత‌ల‌ ప్రాజెక్టుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి పోరుబాట పట్టారు. రాష్ర్ట ప్రభుత్వం తమ నియోజకవర్గానికి సాగునీరు రాకుండా కుట్ర చేస్తోందని ఆరోపించారు. వంశీచంద్‌రెడ్డి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు అపసోపాలు పడుతున్నారు. మొత్తంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బలంగా తిప్పికొట్టాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. 

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

విజయనగరం : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గ్రామ జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా బైకు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి.

10:16 - February 12, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఉపాధ్యాయ మండలి ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ వీటిని సీరియస్‌గా తీసుకుంది. అసమ్మతి నేతలను బజ్జగించేందుకు నేతలు దృష్టి పెట్టారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ.. ఎన్నికల ఇంచార్జ్‌గా మంత్రి హరీష్‌ రావును నియమించింది. 
మూడు జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికలు
మూడు జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికలపై అధికార పార్టీ దృష్టి సారించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి ఎన్నికలు వస్తుండడంతో గులాబీ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు ఇప్పటి నుంచే చేపడుతోంది. పట్టభద్రుల స్థానం కోసం ఈ జిల్లాల్లో జరిగిన ఎన్నికలకు గులాబి పార్టీకి చేదు అనుభవమే ఎదురైంది. ఇప్పుడు ఉపాధ్యాయ స్థానంలో మరో సారి అవే ఫలితాలు పునరావృత్తం కారాదన్న అభిప్రాయంతో అధికార పార్టీ నేతలున్నారు. దీంతో పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మంత్రి హరీష్ రావుకే ఈ బాధ్యతలను సీఎం అప్పగించారు.
కాటేపల్లి జనార్ధన్ రెడ్డి అభ్యర్థితత్వం దాదాపు ఖరారైనట్లే..!
ప్రస్తుత సిట్టింగ్ శాసనమండలి సభ్యుడు కాటేపల్లి జనార్ధన్ రెడ్డి అభ్యర్థితత్వం దాదాపు ఖరారైనట్లే. అధికార పార్టీ మద్దతుతో బరిలో ఉంటున్నా ఎన్నో విమర్శలను జనార్ధన్ ఎదుర్కొంటున్నారు. అయినా పార్టీ పరంగా ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి హరీష్ ఇప్పటికే తన పని మొదలు పెట్టారు. కొంత మంది అభ్యర్థులు స్వతంత్రంగా రంగంలో ఉంటారన్న ప్రచారంతో వారి  మద్దతు కూడ గట్టేందుకు గులాబి పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఒక్కరిద్దరు అధికార పార్టీ వత్తిళ్లకు లొంగిపోగా మరికొంత మంది  నేతలు మాత్రం పోటీలో ఉండాలనే స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.
శాసనసభ్యులతో మంత్రి హరీష్‌ రావు భేటీ 
ఎన్నికలు జరగనున్న జిల్లాల శాసనసభ్యులతో మంత్రి హరీష్‌ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యోగుల కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను తెలియచేస్తూనే ఎన్నికల ప్రచార సరళి ఎలా ఉండలాన్న అంశంపై మంత్రి శాసనసభ్యులకు పలు సూచనలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇంచార్జ్ గా వ్యవహరించి పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని సూచించారు.

 

10:11 - February 12, 2017

విజయవాడ : దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఉన్నప్పుడే దేశం మరింత ముందుకెళ్తుందని ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు అన్నారు. విజయవాడలో జరుగుతున్న మహిళా పార్లమెంట్‌ సదస్సు..వేలమంది మహిళలకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. మహిళా పార్లమెంట్‌ సదస్సు 3వ రోజు సందర్భంగా విజయవాడలో 2కే రన్‌ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు స్పీకర్‌ కోడెల. ఇలాంటి సదస్సులు మరిన్ని జరగాలని..మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని బ్యాడ్మింటన్‌ స్టార్‌, ఒలంపిక్స్‌ విజేత పీవీ సింధూ, అంతర్జాతీయ చెస్‌ క్రీడాకారిణి కోనేరు హంపి తెలిపారు.  

 

పోయెస్‌ గార్డెన్‌లో శశికళ మద్దతుదారుల మంతనాలు

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. పోయెస్‌ గార్డెన్‌లో శశికళ మద్దతుదారుల మంతనాలు కొనసాగుతున్నాయి. గవర్నర్‌ నుంచి పిలుపు రాకపోతే ఏం చెయ్యాలనే దానిపై నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు పన్నీర్‌ సెల్వంకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. అటు వ్యవసాయశాఖ మంత్రి దురైకన్ను కనిపించడం లేదంటూ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. 

10:08 - February 12, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. పోయెస్‌ గార్డెన్‌లో శశికళ మద్దతుదారుల మంతనాలు కొనసాగుతున్నాయి. గవర్నర్‌ నుంచి పిలుపు రాకపోతే ఏం చెయ్యాలనే దానిపై నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు పన్నీర్‌ సెల్వంకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. అటు వ్యవసాయశాఖ మంత్రి దురైకన్ను కనిపించడం లేదంటూ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:02 - February 12, 2017

కడప : అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. వధూవరులను ఉరేగింపుగా తీసుకెళ్తున్నారు. అంతలోనే విషాదం నెలకొంది. ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి బృందాన్ని ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పెండ్లిమర్రి మండలం ఎల్లటూరులో వివాహం వేడుక తర్వాత వధూవరులను ఉరేగింపుగా తీసుకెళ్తూ పెళ్లి బృందం  వెళ్తోంది. ఇంతలోనే ఓ టిప్పర్ పెళ్లి బృందాన్ని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మార్గంమధ్యలో పరిస్థితి విషమించి మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమ్తితం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కుల్గామ్ లో ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ : కుల్గామ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. జవానుకు గాయాలయ్యాయి. 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

కడప : జిల్లాలోని పెండ్లిమర్రి మండలం ఎల్లటూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి బృందాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 

08:42 - February 12, 2017

శ్రీకాకుళం : జిల్లాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. హరికృష్ణ అనే వ్యక్తిపై బీఎస్ ఎఫ్ జవాన్ సూర్యనారాయణ కాల్పులు జరిపారు. హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. హరికృష్ణ, సూర్యనారాయణ సోదరులు. సూర్యనారాయణ బీఎస్ ఎఫ్ జవాన్ గా పని చేస్తున్నారు. ఈనేపథ్యంలో పని ఉందంటూ హరికృష్ణను సూర్యనారాయణ బయటికి తీసుకెళ్లారు. భూమి విషయంలో పరస్పరం ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో సూర్యనారాయణ... హరికృష్ణపై కాల్పులు జరిపి, పరారయ్యాడు. హరికృష్ణ కేకలు వేయగా స్థానికులు వచ్చి అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. హరికృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:25 - February 12, 2017

విజయవాడ : ఆడపిల్లల్ని భారంగా భావించే రోజులు పోవాలనీ, ఆడపిల్ల పుడితే గర్వపడే రోజులు రావాలని గవర్నర్‌ నరసింహన్‌ ఆకాంక్షించారు. అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సులో పాల్గొన్న గవర్నర్... తన పూర్తి పేరు లక్ష్మీ నరసింహన్‌ అని వివరించారు. ఎన్టీఆర్‌ వచ్చాకే రాజకీయాల్లో మహిళలకు అగ్రస్థానం లభించిందని కార్యక్రమంలో పాల్గొన్న నారా బ్రాహ్మణి వ్యాఖ్యానించారు. 
నారీమణుల ఆకట్టుకునే ప్రసంగాలు 
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రెండో రోజు జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సు.. నారీమణుల ఆకట్టుకునే ప్రసంగాలతో సాగింది. తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంవల్లే ఈ స్థాయికి చేరగలిగానని... జస్టిస్‌ రోహిణి చెప్పారు.. 
అయితే సమాజంలో స్ర్తీ పురుషుల సమానత్వం ఎక్కడాలేదన్నారు. వేదికలపైనే తప్పా.. క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు లేవన్నారు జస్టిస్‌ రోహిణి.
ఎన్టీఆర్‌ వచ్చాకే రాజకీయాల్లో మహిళలకు అగ్రస్థానం : బ్రాహ్మణి 
ఎన్టీఆర్‌ వచ్చాకే రాజకీయాల్లో మహిళలకు అగ్రస్థానం లభించిందన్నారు నారా బ్రాహ్మణి. జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సుకు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. ఏపీలో కోటి మంది డ్వాక్రా సభ్యులు ఉన్నారని..మహిళా సాధికారత ఇంటి నుంచే ప్రారంభం కావాలని బ్రాహ్మణి ఆకాంక్షించారు.
మహిళా సాధికారిత లేని సమాజం ఎదగదు : డీకే.అరుణ 
రాజకీయ కుటుంబ నుంచి వచ్చినా నిలదొక్కుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక దురాచారాలు, కట్టుబాట్లు మహిళలను ఎదగనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటి రెక్కతో పక్షి ఎగరలేదని, మహిళా సాధికారిత లేని సమాజం ఎదగదని వ్యాఖ్యానించారు. 
మహిళలను గౌరవించినప్పుడే సమాజం పురోగమనం : గవర్నర్ 
మహిళలను మనసా, వాచా, కర్మణా గౌరవించినప్పుడే సమాజం పురోగమనం చెందుతుందన్నారు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌. మహిళలకు ధైర్యలక్ష్మీ, ధనలక్ష్మీగా వివిధ రూపాలున్నాయన్నారు. అత్యాచార కేసుల్ని పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఉండాలని, దోషులకు త్వరగా శిక్షలు పడాలని అన్నారు. అప్పుడే మహిళలపై వేధింపులు తగ్గుతాయన్నారు. 
మహిళలు తలచుకుంటే ఏమైనా సాధించగలరు : సీఎం చంద్రబాబు
మహిళలు తలచుకుంటే ఏమైనా సాధించగలరని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సమాజంలో మహిళలు ఎవరి కంటే తక్కువ కాదని చంద్రబాబు చెప్పారు. ప్రతి ఏటా ఇలాంటి సదస్సులు నిర్వహించడానికి ఈవెంట్స్ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు సదస్సులో చెప్పారు. మహిళా సాధికారత సాధనలో ఏపీ ముందుంటుందని... ఇందుకోసం అమరావతి నుంచే కార్యాచరణ ప్రారంభిస్తామని బాబు ప్రకటించారు. 

 

08:16 - February 12, 2017

విజయవాడ : మహా గొప్పగా మహిళా పార్లమెంట్‌ సదస్సు నిర్వహిస్తున్నామని బీరాలు పోతున్న ఏపీ ప్రభుత్వం.. మహిళా ఎమ్మెల్యే రోజాను అవమానించింది. సదస్సుకు వెళ్తుండగా.. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులోనే పోలీసులు ఆమెను నిర్బంధించారు. ప్రభుత్వం, పోలీసుల తీరును వైసీపీ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మహిళలను చంద్రబాబు ప్రభుత్వం అవమానిస్తోందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 
రోజాను అడ్డుకున్న పోలీసులు 
విజయవాడలో మూడు రోజుల పాటు జరుగుతున్న మహిళా పార్లమెంట్‌ సదస్సుకు అందరి మాదిరిగానే వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ క్రమంలో సదస్సుకు వెళ్లేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రోజాను అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. దలైలామా వస్తున్నారన్న కారణంతో రోజాను ఒక గదిలో నిర్బంధించారు. ఆహ్వానం మేరకే తాను సదస్సుకు వెళ్తున్నానని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసుల తీరును రోజా తీవ్రంగా తప్పుపట్టారు. ఆ తరువాత పోలీసులు రోజాను తమ వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. వాహనంలోనే.. రోజా తన మొబైల్.. జరిగిన ఘటనను వివరించారు.
ఊహాగానాలతో ఎలా అదుపులోకి తీసుకుంటారన్న వైసీపీ ఎమ్మెల్యేలు 
రోజాను అదుపులోకి తీసుకున్నారని విషయం తెలియగానే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, నాయకులు... డీజీపీ కార్యాలయం వరకూ ప్రదర్శనగా వెళ్లారు. డీజీపీని కలిసి వినతి పత్రం అందించారు. మహిళా పార్లమెంట్‌ సదస్సుకు వెళ్తున్న రోజాను ఎందుకు అరెస్ట్‌ చేశారో చెప్పాలని వైసీపీ ప్రజాప్రతినిధులు డీజీపీని కోరారు. సదస్సులో ఆందోళన చేస్తారన్న వచ్చిన  సమాచారంతోనే రోజా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని, సోషల్ మీడియాలో కూడా మెసేజ్‌లు వచ్చాయని వైసీపీ నేతలకు డీజీపీ వివరించారు. ఊహాగానాలతో మహిళా ప్రజాప్రతినిధిని ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యేలు. సదస్సుకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం... రోజాను అవమానించిందని వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. రోజా అరెస్ట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్‌ కోడెల బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

08:08 - February 12, 2017

చెన్నై : ఎత్తులకు పై ఎత్తులు.. మలుపుల మీద మలుపులు.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇది తమిళ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరిస్థితి. బలం నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా.. గవర్నర్‌ స్పందించకపోవడంతో శశికళ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమకు అవకాశం ఇచ్చేవరకు వినూత్న నిరసనలు చేపట్టాలని అన్నాడీఎంకే యోచిస్తోంది. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి తారాస్థాయికి చేరింది. గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఎటూ తేల్చకపోవడంతో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందోనన్న టెన్షన్‌ అందరినీ వెంటాడుతోంది. 
పన్నీర్‌ సెల్వం గూటికి అన్నాడీఎంకే నేతలు 
ఇక పన్నీర్‌ సెల్వం గూటికి అన్నాడీఎంకే నేతలు ఒక్కొక్కరిగా చేరడం.. తమకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు లేఖ రాసినా పట్టించుకోకపోవడంతో శశికళకు అసహనం పెరిగిపోతుంది. తాజాగా పన్నీర్‌ గూటికి చేరిన విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్‌.. మంత్రి పదవి కావాలనుకున్న వారు శశికళ దగ్గర నుంచి వచ్చేయండి అంటూ ప్రకటించారు. దీంతో ఇంకా ఈ వ్యవహారం ముదిరి పాకాన పడుతుండడంతో.. శశికళ ధైర్యం చేసింది. 
గవర్నర్‌కు శశికళ లేఖ 
తమ సహనాన్ని పరీక్షించొద్దు అంటూ గవర్నర్‌కు లేఖ రాసింది. సీఎం పదవికి సెల్వం చేసిన రాజీనామా ఆమోదం పొందినా.. ప్రభుత్వ ఏర్పాటులో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. తమకు ఉన్న బలం నిరూపించుకుంటామంటే ఎందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. గవర్నర్‌ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీలో చీలిక తెచ్చేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే రాజ్‌భవన్‌కు నేరుగా ఎమ్మెల్యేలను తీసుకువచ్చి బలాన్ని నిరూపించుకుంటామని శశికళ హెచ్చరించారు. గవర్నర్‌ తీరును నిరసిస్తూ నేటినుంచి కొత్త తరహాలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అన్నాడీఎంకే నిర్ణయించింది. 
శశికళ లేఖపై గవర్నర్‌ సీరియస్‌
మరోవైపు శశికళ లేఖపై గవర్నర్‌ సీరియస్‌గా ఉన్నారు. రాష్ట్రంలో కేంద్ర బలగాలను దింపారు. రాష్ట్రంలో అల్లరిమూకలు ప్రవేశించాయనే అనుమానంతో రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేశారు. 
సెల్వం వర్గం జోష్‌.. శశికళ వర్గం టెన్షన్ 
మొత్తానికి బలం పెరుగుతుండడంతో పన్నీర్‌ సెల్వం వర్గం జోష్‌ మీద ఉండగా.. ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ శశికళ వర్గాన్ని వెంటాడుతోంది. మరోవైపు బలం ఉన్నా తమను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోవడంతో అన్నాడీఎంకే ఆందోళనలకు సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న తమిళ రాజకీయాలు.. తాజాగా మరింత తారాస్థాయికి చేరాయి. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది. 

 

నేడు జేఎస్ విజ్ఞాన కేంద్రంలో సదస్సు

నెల్లూరు : నేడు జేఎస్ విజ్ఞాన కేంద్రంలో '25 ఏళ్ల నూతన ఆర్థిక విధానాల అమలు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజలపై ప్రభావం' అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సీపీఎం పొలిగ్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు హాజరు కానున్నారు. 
 

నేడు జాతీయ మహిళా పార్లమెంట్ సభలో పాల్గోనున్న స్పీకర్ సుమిత్రా మహాజన్

విజయవాడ : నేడు జాతీయ మహిళా పార్లమెంట్ సభలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పాల్గొన్నారు. 

వ్యక్తిపై జవాన్ కాల్పులు

శ్రీకాకుళం : బూర్జ మండలం గాజులకొల్లివలసలో హరికృష్ణ అనే వ్యక్తిపై జవాన్ సూర్యనారాయణ కాల్పులు జరిపారు. హరికృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. భూ వివాదం విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. 

Don't Miss