Activities calendar

13 February 2017

21:29 - February 13, 2017

ట్రెడిషనల్‌ ఫార్మాట్‌ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియాకు....హైదరాబాద్‌ టెస్ట్‌లోనూ పోటీనే లేకుండా పోయింది.సింగిల్‌ టెస్ట్‌లో భారత్‌ దూకుడు ముందు బంగ్లాదేశ్‌ టీమ్‌ తేలిపోయింది. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత్‌... 2017 సీజన్‌ ఆరంభ టెస్ట్‌లోనూ జైత్రయాత్ర కొనసాగించింది.సిరీస్‌కు ముందు కొహ్లీ అండ్‌ కో జోరుకు చెక్‌ పెడతామని సవాల్‌ విసిరిన బంగ్లాదేశ్‌ జట్టు....పోరాడి ఓడింది. టాప్‌ ర్యాంకర్‌ టీమిండియాకు....హైదరాబాద్‌ టెస్ట్‌లోనూ పోటీనే లేకుండా పోయింది. సింగిల్‌ టెస్ట్‌లో భారత్‌ దూకుడు ముందు బంగ్లాదేశ్‌ టీమ్‌ తేలిపోయింది. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత్‌... 2017 సీజన్‌ ఆరంభ టెస్ట్‌లోనూ జైత్రయాత్ర కొనసాగించింది.

చెక్ పెడుతామన్న బంగ్లా..
సిరీస్‌కు ముందు కొహ్లీ అండ్‌ కో జోరుకు చెక్‌ పెడతామని సవాల్‌ విసిరిన బంగ్లాదేశ్‌ జట్టు పోరాడి ఓడింది. ఉప్పల్‌ టెస్ట్‌ చివరి రెండు రోజుల్లో భారత బౌలర్ల జోరు ముందు బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. 3 వికెట్లకు 103 పరుగులతో 5వ రోజు ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌ జట్టు మరో 65 ఓవర్ల పాటు పోరాడింది. కానీ ఆఖరి రోజు అశ్విన్‌, జడేజా స్పిన్‌ మ్యాజిక్‌తో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించారు. ఇద్దరూ కలిసి పోటీలు పడి మరీ వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్‌ జట్టుకు ఓటమి తప్పలేదు. 208 పరుగుల భారీ తేడాతో నెగ్గిన భారత జట్టు సింగిల్‌ టెస్ట్‌లో విజేతగా నిలిచింది. డబుల్‌ సెంచరీతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీకే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.

15వ విజయం..
టెస్టు ఫార్మాట్‌లో గత 19 మ్యాచ్‌ల్లో ఓటమంటూ లేకుండా విరాట్‌ సారధ్యంలోని భారత జట్టు సాధించిన 15వ విజయం కావడం విశేషం. టాప్‌ ర్యాంకర్‌ టీమిండియాకు టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగేలేదని బంగ్లాదేశ్ టెస్ట్‌తో మరోసారి రుజువైంది. మరి కొహ్లీ అండ్‌ కో ఇదే జోరు కొనసాగిస్తే టెస్టుల్లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

21:27 - February 13, 2017

హైదరాబాద్‌ : ఇందిరా పార్క్‌ వద్ద ఈనెల 22న నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని తెంలగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. కరీంనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన నిరుద్యోగ సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. లక్ష ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్‌ క్యాలెండర్‌ను రూపొందించి అమలు పరచాలని ఆయన డిమాండ్‌ చేశారు.

21:23 - February 13, 2017

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈనెల 19 నుంచి 28 వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనోద్యమాలు చేపడతారు. మొదటి సభలో ఈనెల 19న నిజామాబాద్‌లో ప్రారంభించాలని టిపిసిసి సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో విఫలమయ్యాయని ఆరోపిస్తూ, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిపిసిసి ప్రతిపాదించింది. పెద్ద నోట్ల రద్దు, నిరుద్యోగం, రైతాంగ సమస్యలపై జనచైతన్యం కోసం నిరసనోద్యమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. రెండున్నరేళ్ల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాను కప్పిపుచ్చుకుంటూ, గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించింది.

21:21 - February 13, 2017

విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలని కోరారు. వారం ఆలస్యమైనా ఆ ప్రభావం మొత్తం ప్రాజెక్ట్‌పై పడుతుందని అధికారుల దృష్టికి తెచ్చారు. అవసరమైతే వారం రోజులు పోలవరంలోనే మకాంవేసి ప్రాజెక్ట్‌ పనులను ప్రత్యక్షంగా పరిశీలించే యోచన చేస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. పోలవరం నిర్మాణం కోసం విదేశాల నుంచి తెచ్చిన యంత్రపరికరాలను ఓడరేవుల నుంచి తరలించేందుకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్టీలు, సిమెంటు కొరత లేకుండా చూసేందుకు ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరపాలని కోరారు. పోలవరంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రాజెక్ట్‌ దగ్గర ఎగ్జిబిషన్‌, మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు.. ఈ బాధ్యతలను ప్రభుత్వం సలహాదారు పరకాల ప్రభాకర్‌కు అప్పగించారు.

21:19 - February 13, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తాజా పరిస్థితిపై సమావేశమైన డీఎంకే కీలక సమావేశం ముగిసింది. 11 తీర్మానాలను ఆమోదించిన డీఎంకే పార్టీ.. రాష్ట్రంలో సంక్షోభంపై గవర్నర్‌ తక్షణమే స్పందించాలని తీర్మానించారు. పన్నీరు సెల్వంకు మద్దతుపై ఎలాంటి తీర్మానం చేయలేదన్న స్టాలిన్‌.. తమిళనాడులో కరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

21:18 - February 13, 2017

చెన్నై : తమిళ రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తూ.. ఆసక్తిగా మారుతున్నాయి. ఏదేమైనా సీఎం అయి తీరతానంటున్న శశికళ.. అన్నట్లుగానే రెండోకోణాన్ని చూపడం మొదలు పెట్టారు. గవర్నర్‌ తీరును ఆక్షేపిస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పనిలో పనిగా.. పన్నీరు సెల్వం శిబిరంపైనా దూకుడును పెంచారు. వీటితోపాటే.. మద్దతుదారులు చేజారకుండా మచ్చిక చేసుకునే పనులూ కొనసాగించారు. వీటన్నింటి నేపథ్యంలోనే శశికళకు కొత్త ఆందోళన వచ్చి పడింది. అక్రమాస్తుల కేసులో తుది తీర్పు రేపు వెలువడే అవకాశం ఉందన్న సంకేతాలతో.. తమ రాజకీయ భవితవ్యం ఏమవుతుందోనని శశికళ శిబిరం కలవర పడుతోంది.

ట్విస్టులు..
తమిళ రాజకీయాలు క్షణానికో ట్విస్టుగా సాగుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గాల మధ్య పోటాపోటీ వాతావరణం తారాస్థాయికి చేరుకుంటోంది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, సామాన్య నెటిజన్ల నుంచి.. పన్నీర్‌ సెల్వంకు మద్దతు పెరుగుతున్న వేళ.. శశికళ, ఇంతకుముందే చెప్పినట్లు, సోమవారం దూకుడును పెంచారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోకుండా తనను గవర్నర్‌ నిలువరిస్తున్నారని గట్టిగా నమ్ముతున్న శశికళ.. సోమవారం, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల బలం తనకుందని ఆమె సుప్రీంకోర్టులోను, మద్రాసు హైకోర్టులోనూ పిటిషన్‌ దాఖలు చేశారు. అదే సమయంలో, ప్రభుత్వ యంత్రాంగం నుంచి శశికళకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఆమె తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. అయితే, రిసార్ట్స్‌లో ఎమ్మెల్యేలు బందీలుగా ఉన్నారన్న అభియోగంపై.. తమిళనాడు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు, విచారణ జరిపిన ప్రధాన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. శశికళకు మద్దతుగా 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అఫిడవిట్లు సమర్పించినట్లు కోర్టుకు నివేదించారు. ఈ లెక్కన.. శశికళ శిబిరం నుంచి మరో ముగ్గురు బయటకు వస్తే.. ఆమెకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దూరమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

విమర్శల జోరు..
మరోవైపు.. శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంపై విమర్శల జోరును పెంచారు. సెల్వం నమ్మకద్రోహి అని పార్టీ శ్రేణులకు నిరూపించే ప్రయత్నాలు చేశారు. పన్నీరు సెల్వం అమ్మకు ద్రోహం చేశారని, అమ్మ అంతిమసంస్కారాల్లో తానుంటే.. సెల్వం పార్టీని చీల్చేందుకు కుట్ర పన్నారని శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని కాపాడేందుకే తాను సీఎం పదవిని ఆశించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. 33 ఏళ్లుగా అమ్మతో పాటు తాను ఎన్నో పోరాటాలు చేశానని, అమ్మ జయలలితకు ఎదురైన అవమానాలే తనకూ జరుగుతున్నాయని అన్నారు. ఓవైపు న్యాయపోరాటం, మరోవైపు సెల్వంపై దూకుడును పెంచిన శశికళ.. మద్దతుదారులు చేజారకుండా సోమవారం కూడా వారిని కలిశారు.

కంట తడి..
తాను సింహం లాంటి వ్యక్తినని, తానెవరికీ భయపడనని శశికళ ప్రత్యర్థి శిబిరాన్ని ఉద్దేశించి అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అవసరమైతే తన ప్రాణాలిచ్చైనా పార్టీని కాపాడుకుంటానని ఆమె తెలిపారు. తానెవరినీ నిర్బంధించలేదని, ఎమ్మెల్యేలంతా స్వేచ్ఛగా ఉన్నారని, తనకు మద్దతునిస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను శశికళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. తమిళనాడులో ఏం జరుగుతున్నదో, దాని వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసని శశికళ వ్యాఖ్యానించారు. తన వెంట ఉన్న ఎమ్మెల్యేలలో ఐక్యతను చూసి చలించి పోతున్నానంటూ శశికళ కంటతడి పెట్టుకున్నారు.

జైలుకెళుతారా ?
ఇంకోవైపు... కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో గవర్నర్‌ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ఎవరి బలం ఎంతో తేల్చాలని అటార్ని జనరల్‌ తమిళనాడు గవర్నర్‌కు సూచించారు. మెజారిటీ ఉన్నవారికే ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని సూచించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. శశికళ శిబిరాన్ని ఇప్పుడు సరికొత్త కలవరం వేధిస్తోంది. శశికళ, జయలలితపై ఉన్న అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించే అవకాశం ఉందన్న సమాచారం రాష్ట్ర రాజకీయాలనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. శశికళ రాజకీయ భవితవ్యాన్ని తేల్చే ఈ తీర్పు ఏరీతిగా ఉండబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ కేసులో శశికళ కనుక నిర్దోషిగా తేలితే.. ఇక ఆమె ముఖ్యమంత్రి కావాడాన్ని ఏ శక్తి ఆపలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ సుప్రీం తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆమె జైలుకెళ్లక తప్పదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

21:16 - February 13, 2017

చెన్నై : పన్నీరు సెల్వంకు గూటికి ఎమ్మెల్యే శరవణన్‌, ఎంపీ గోపాలకృష్ణన్‌ లు చేరారు. శాసన సభ్యుల్ని బంధించారని దుష్పచారం చేస్తున్నారని శశికళ ఆరోపించారు. గోల్డెన్‌ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆమె.. అమ్మ ఇప్పటికీ ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారన్నారు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు అందరూ సంతోషంగా వెళ్తారన్న శశికళ.. అందుకే తాను కూడా ఈరోజు రాత్రి రిసార్ట్‌లో బస చేస్తున్నట్లు చెప్పారు. డీఎంకే అంచనాలు తలకిందులవుతాయని శశికళ ధీమా వ్యక్తం చేశారు.

సోమేష్ కేసులో హైకోర్టు నోటీసులు..

హైదరాబాద్ : ఐఏఎస్ సోమేష్ కుమార్ కేసులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, సోమేష్ కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 6వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. సోమేష్ ను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు కేంద్రం అప్పీల్ చేసింది.

కరుణ ఇంట్లో దుండగుడి ప్రవేశం..

చెన్నై : కరుణానిధి ఇంట్లోకి ఓ దండగుడు తుపాకితో ప్రవేశించాడు. నేరుగా కరుణానిధి సతీమణి తలకు తుపాకి గురిపెట్టి విలువైన వస్తువులు ఇవ్వాలని దుండగుడు బెదిరించాడు. భద్రతా సిబ్బంది దేహశుద్ధి చేసి దుండగుడిని పోలీసులకు అప్పగించారు.

సదస్సు విజయవంతం - బాబు..

విజయవాడ : జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు విజయవంతంగా నిర్వహించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. సదస్సుపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని, స్కూళ్లు, కాలేజీల్లో అమ్మకు వందనం కార్యక్రమం చేపడుతామని, సదస్సులో 54 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయన్నారు. రాజకీయాలకతీతంగా సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. జాతీయస్థాయిలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు రావాలని, మహిళల సమస్యలన్నింటికీ పరిష్కారం చెప్పే దిశగా సదస్సు నిర్వహించినట్లు తెలిపారు.

పన్నీర్ సెల్వంకు పెరుగుతున్న మద్దతు..

చెన్నై : అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతోంది. తాజాగా మదురై ఎంపీ గోపాలకృష్ణన్, మదురై సౌత్ ఎమ్మెల్యే శరవణనన్ లు మద్దతు పలికారు.

పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. రజౌరి జిల్లాలోని సుందర్బని సెక్టార్‌లో భారత ఆర్మీ శిబిరాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరిపింది.

గోల్డ్ బే రిసార్ట్ లోనే శశికళ బస..

చెన్నై : గోల్డ్ బే రిసార్ట్స్ లో శశికళ బస చేయనున్నారు. రేపు ఉదయం 10.30 నిమిషాలకు అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న సంగతి తెలిసిందే.

20:45 - February 13, 2017

ఓ ఎమ్మెల్యే స్వయంగా ఓ మహిళపై దాడిచేస్తాడు.. న్యాయం కావాలన్న మహిళల ఉద్యోగాలు పీకేస్తారు.. ప్రశ్నించిన మహిళను అక్రమంగా జైల్లో పెడతారు..ఇంకా మాట్లాడితే బూతులు తిడతారు.. రోడ్డుపై ఈడ్చి కొడతారు. కానీ, వేదికలపై మాత్రం మహిళా సాధికారత అంటూ కబుర్లు ఘనంగా చెబుతారు. మహిళల హక్కులను కాలరాస్తున్న సర్కారు తీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ప్రత్యేక కథనం..దేశంలో మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఈనాటికీ అసమానతలు, వివక్షత ఏయే రూపాల్లో కొనసాగుతున్నాయో ఆ ఊసు లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు.. లేని గొప్పలు.. మాటల కోటలు.. హంగు ఆర్భాటాలు.. పైన పెటారం లోన లొటారం.. ఇంతకు మించి ఏమైనా ఉందా?

వేధిస్తారు..అరెస్టె చేస్తారు..
ఎన్ని దాడులు ఎన్ని ఉదాహరణలు.. ఓ ఎమ్మెల్యే నోటికిచ్చినవన్నీ వాగుతాడు.. మరో ప్రముఖుడు మహిళలకు నిబంధనలు నిర్దేశిస్తాడు.. మరో ఎమ్మెల్యే అనుచరులు దారుణమైన దాడులకు తెగబడతాడు.. ఓ పక్క ఇవన్నీ యధేచ్చగా సాగుతుంటే కాస్తకూడా పట్టని సర్కారు ఇప్పుడు మహిళా సాధికారత.. సదస్సులు అంటూ చేసిన హడావుడి హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీస వేతనాలడిగితే వేధిస్తారు.. ఉద్యోగభద్రత కావాలంటే అరెస్టులు చేసి భయపెడతారు..సొంత నియోజకవర్గాల్లో అరాచకం సృష్టిస్తారు. అడుగడుగునా మహిళా వ్యతిరేక విధానాలు అవలంబిస్తారు. కానీ, సాధికారత పేరుతో వేదాలు వల్లిస్తారు. అన్నీ ఒట్టి మాటలేనా? చెప్పుకోటానికి మాత్రమేనా? నినాదాలన్నీ గాల్లో అరుపులేనా? చేతల్లో కొచ్చేసరికి అంతా ఒకటే అని రుజువు చేసుకుంటున్నారా? మొక్కుబడి వ్యవహారంగా తేల్చేస్తున్నారా? అసలు మహిళలకు రాజకీయ పార్టీలిస్తున్న ప్రాధాన్యత ఎంత? ఎంతమందికి టికెట్లిస్తున్నాయి? చట్టసభల్లో ఎందరికి ఎంట్రీ దొరుకుతోంది? ఇలాంటి పరిస్థితుల్లో సాధికారత సాధ్యమేనా?

మహిళలపై హింస..
ఎక్కడ చూసినా మహిళలపై హింస తాండవిస్తోంది. అడుగడుగునా లైంగిక వేధింపులు.. ఎక్కడ చూసినా అంతులేని గృహహింస.. ప్రేమ పేరుతో అఘాయిత్యాలు.. విద్యావకాశాల్లో వివక్ష.. పనిప్రదేశాల్లో వేధింపులు.. వీటన్నిటికంటే ముందు పుట్టుకనే నిరోధిస్తూ, పిండాన్నే చిదిమేస్తున్న దారుణాలు.. ఒకటా రెండా.. మహిళా లోకంపై జరుగుతున్న దాడులు..అనేకం. ఈ వివక్షను, ఈ దాడుల్ని నిరోధించి ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడిననాడే నిజమైన సమానత్వానికి, సాధికారతకు బాటలు పడతాయి. స్వాతంత్ర్య ఫలాలు అందుకున్నామని సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టి, ఆరు దశాబ్దాలు గడిచింది. మహిళల కోసం అనేక చట్టాలు చేశామని ప్రభుత్వాలు పదే పదే వల్లెవేస్తున్నాయి. మహిళల సంక్షేమమే తమ అజెండా అని ప్రతి పార్టీ నినదిస్తోంది. కానీ, ఆచరణలో మాత్రం ఆ నిబద్ధత శూన్యమని పదే పదే రుజువవుతోంది. మహిళల హక్కులే మానవ హక్కులు అని తీర్మానాలు నినదిస్తున్నాయి.. మహిళలు, పిల్లల మీద జరుగుతున్న హింసను ప్రతిఘటిద్దాం అంటోంది ఐక్యరాజ్యసమితి. అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం మహిళల హక్కు అని ఘోషిస్తున్నాయి అంతర్జాతీయ సదస్సులు. ఇప్పటికైనా వేదికలపై హడావుడికంటే వాస్తవంలో చేతలు మొదలు పెడితే ఫలితం ఉంటుంది. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

20:42 - February 13, 2017

నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఒక వింతరోగమున్నదట.. అసొంటి రోగం ఇగ ఈ భూమ్మీద ఏ పార్టీ లీడర్కు గూడ ఉండదంటున్నడు మన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరన్న.. ఆ రోగ లక్షణాలు ఎట్లుంటయ్?.. మరి దానికి ఏమన్న ట్రీట్ మెంట్ ఉన్నదా..? అట్లనే ఇడ్సిపెడ్తె ఇతరుకు ఆ వ్యాది సోకే అవకాశం గూడ ఉన్నదా..ఇతరత్రా విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

20:40 - February 13, 2017

అందరం తమిళ నాడుల రాజకీయం ఇట్లైతున్నది.. అట్లైతున్నది.. చిన్నమ్మ చిన్నయ్య అని అనుకుంటున్నంగని..? అసలు తెలంగాణల రాజకీయం ఎట్లైతున్నదో సూస్తున్నమా..శ్రీక్రిష్ణ భగవానుడు ఎట్లుంటడో సూశిండ్రా మీరు..? గది దెల్వదా మస్తుగ జూశ్నం పోట్వలళ్ల అనేరు..నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఒక వింతరోగమున్నదట..బీహార్ షేర్ లాలూ ప్రసాద్ యాదవ్ ను ఒకాయిన ప్రశ్న అడ్గిండట.. బాత్ రూం పయ్యకాన గట్టెతందుకు దర్కాస్తు వెట్టుకుంటే భర్త సచ్చిపోయిన పించిన్ మంజూరు జేశ్న అధికారులను జూశిండ్రా మీరు ఎన్నడన్నా..? ఎవ్వడన్న తాగి తప్పుజేశిండనుకో..? అప్పుడు తప్పు ఎవ్వలిదైతది..? మన్సులనే గాదు.. సీసీ కెమేరాలను గూడ మర్డర్ జేస్తన్నరు దొంగలు..కామరెడ్డి డిఎస్పి మేడం వాళ్ల సైన్యాని ఎంటవెట్టుకోని అటోని వట్కోని పోలీసు టౌన్లకు తీస్కవొయ్యింది.. గిసొంటి ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి..

20:05 - February 13, 2017

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సజావుగా సాగుతుందా ? లక్ష్యం ఏంటీ ? జరుగుతున్నది ఏంటీ ? అనే దానిపై దళిత్ శోషణ్ మంచ్ జాతీయ కన్వీనర్ వి.శ్రీనివాసరావుతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా విస్తుగొలిపే వాస్తవాలు ఆయన తెలియచేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లక్ష్యం కేవలం 27 శాతం మాత్రమే ఉంటుందని, జనరల్ పేరిట మిగతా వాటికి మళ్లిస్తున్నారని తెలిపారు. ఇందులోనూ మహిళలకు ఉద్ధేశించబడుతోంది 1 శాతం మాత్రమేనన్నారు. తాజా కేంద్ర బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రణాళిక..ప్రణాళికేతర వ్యయం..రెండు కలిపేయడంలో నష్టం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రణాళిక వ్యయం కింద వచ్చేదని, అయినా నిధుల ఖర్చు తక్కువే ఉండేదన్నారు. ఇప్పుడు మొత్తం బడ్జెట్ లో కలిపేయడంతో సబ్ ప్లాన్ కు తూట్లు పొడిచారని తెలిపారు. మొన్నటి బడ్జెట్ లో కేటాయించింది రూ. 52వేల కోట్లు అని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం కేటాయించాల్సింది ఎస్సీలకు 16.6 శాతం, ఎస్టీలకు 8.6 శాతం..కానీ మొన్న కేటాయించిన మొత్తం కేవలం 2.4 శాతం మాత్రమేనని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్ పాలన్ అమలును ప్రణాళిక సంఘం చూసేదని, అమలులో లోపాలుంటే ఎత్తి చూపేది..హెచ్చరించేది కానీ ఇక నుండి నీతి ఆయోగ్ సబ్ ప్లాన్ అమలును పర్యవేక్షిస్తుందన్నారు. నీతి ఆయోగ్ అనేది ఒక అధ్యయన కమిటీ మాత్రమేనని, ప్రణాళిక సంఘం లా ప్రశ్నించే అధికారాలు లేవన్నారు. మొత్తం బడ్జెట్ లో కలిపేయడం వల్ల ఇక ఎవ్వరూ ప్రశ్నించలేమని స్పష్టం చేశారు. ఇక కేంద్రం దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడాలని ఎంత ఇస్తే అంతే తీసుకోవాలన్నారు. మొన్నటి వరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అనేది హక్కు ఇక నుండి హక్కు కాదన్నారు. ఈ విషయంపై పార్టీలు కలిసి రావాలని కేంద్రం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పేరే మార్చేసిందని, క నుండి వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అంటారని పేర్కొన్నారు. 1974, 1979లో ఎస్సీ, ఎస్టీ కాపోనెంట్ ప్లాన్ లక్ష్యానికే తూట్లు పొడిచారని, కేంద్రాన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో చట్టం ఉన్నా అమలు విషయంలో నిర్లక్ష్యం ఉందని ఇక్కడ కూడా పేరు మారుస్తారని తెలుస్తోందన్నారు. ఏపీలో పరిస్థితి ఆశాజనకంగా లేదని తేల్చిచెప్పారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:34 - February 13, 2017

హైదరాబాద్ : గురుకులాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం విధించిన నిబంధనలపై నిరుద్యోగులు మండిపడ్డారు. పెద్దఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. టీఎస్ పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకుని...అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలన్నీ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసి, గురుకులాల్లో... నియామకాలపై నిబంధనలు తొలగించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ ఇతర విద్యార్థి సంఘాలు టీపీఎస్సీని ముట్టడించేందుకు యత్నించాయి. అయితే ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుని.. బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు.. విద్యార్థి నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట జరిగి పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.

నిరసనలు ఆగవన్న నిరుద్యోగ యువత..
రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని.. తక్షణమే ఖాళీలన్నీ భర్తీ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. అలాగే గురుకుల టీచర్‌ పోస్టుల విద్యార్హతలపై అనేక అసంబద్ధ నిబంధనలు పెట్టారని వాటిని ఉపసంహరించుకోవాలన్నారు. 23 వేల ఖాళీలుంటే కేవలం 7వేల 3 వందల 6 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారని అన్నారు. తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నేతలు కోరారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రోజుకో నిబంధన, పూటకో ప్రకటనలతో నిరుద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకునే వరకు నిరసనలు ఆగవని యువత హెచ్చరించింది.

లాహోర్ లో బాంబు పేలుడు..

పాకిస్తాన్ : లాహోర్ లోని మాల్ రోడ్డులో బాంబు పేలడంతో ఏడుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. 12 మందికి గాయాలయ్యాయి.

19:23 - February 13, 2017

'చూడాలని ఉంది' అంటూ మెగా స్టార్ కి మెలోడీ హిట్ అందించి, 'నర్సింహా నాయుడు' తో 'బాలకృష్ణ' కి సూపర్ సాంగ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ 'మణిశర్మ' ని ఈ మధ్య కంప్లీట్ గా ఎవరు వాడుకోవట్లేదు అని తెలుస్తుంది. అడపాదడపా సినిమాలు వస్తున్నా అవి 'మణిశర్మ' స్థాయిలో రాలేకపోతున్నాయి. రీసెంట్ గా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో టాలీవుడ్ ని ఆకట్టుకున్న దర్శకుడు వీఐ ఆనంద్.. త్వరలో అల్లు శిరీష్ హీరోగా ఓ మూవీ చేయబోతున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనుండడం విశేషం. ఇది మెగా క్యాంప్ లోకి 'మణిశర్మ' రీ ఎంట్రీగా చెప్పచ్చు. గతేడాది 'నాని' మూవీ 'జెంటిల్మెన్'కి సంగీతం అందించి.. తనలో స్టాండర్డ్స్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు మణిశర్మ. గతంలో పూరీ-'పవన్ కళ్యాణ్' ల కాంబినేషన్ లో వచ్చిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు’ మెగా క్యాంప్ లో మణిశర్మ చేసిన చివరి మూవీ. అంతకు ముందు 'రామ్ చరణ్' తో 'రచ్చ’.. 'పవన్' తో 'తీన్ మార్’.. 'అల్లు అర్జున్' కి 'వరుడు’..చెర్రీ లాంఛింగ్ మూవీ 'చిరుత’.. మెగాస్టార్ తో 'ఇంద్ర’.. 'అంజి’.. ఇలా చెప్పుకుంటూ పోతే మెగా హీరోలతో 'మణిశర్మ' చేసిన సినిమాలు చాలానే ఉంటాయి. ఇప్పడు మెగా హీరో 'అల్లు శిరీష్' కి ఈ సీనియర్ కంపోజర్ సంగీతం అందించనుండడం.. కచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని చెప్పాల్సిందే.

19:17 - February 13, 2017

పరభాషా చిత్రాల్లో ఉండే స్పోర్టివ్నెస్ మన తెలుగు సినిమాలో ఎందుకు కొరవడుతోంది అంటే మన స్టార్ డం ఉన్న హీరోలు అటుగా ప్రయత్నం చెయ్యకపోటమే అని చెప్పాలి. ఆడియన్స్ యాక్సప్ట్ చెయ్యరనో లేక కమర్షియల్ గా ఆడవనో తెలియదు కానీ మొత్తానికి ఆ ఆటల చిత్రాలవైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ తో వచ్చిన సినిమాలు కమర్షియల్ గా కూడా హిట్ అవుతాయి.

గురుగా వెంకీ..
పెద్ద హీరోలతో మంచి ఇన్సిపిరేషన్ మూవీస్ ఎప్పుడొస్తాయా అని వెయిట్ చేసే ఆడియన్స్ కి 'గురు' సినిమా మంచి ఫీల్ ఇవ్వటానికి రెడీ గా ఉంది. తన సినిమాలు ఎప్పటికప్పుడు డిఫరెంట్ గా ఉండాలి అని కోరుకునే హీరో 'వెంకటేష్' 'గురు' సినిమాలో హీరో గా నటిస్తున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'గోపాల గోపాల' లో సినిమాలతో కధ బాగుంటే మల్టీ స్టారర్ సినిమాలు చెయ్యటానికి కూడా సిద్ధం అని చెప్పిన వెంకటేష్ తాను చేసే పాత్రకి వందశాతం న్యాయం చేస్తాడు. తమిళ్, హిందీ భాషలలో సూపర్ హిట్ సినిమా 'సాలా కూడూస్' ని డైరెక్టర్ చేసిన సుధా కొంగర తెలుగులో 'గురు' అనే టైటిల్ తో హీరో 'వెంకటేష్' ని పవర్ఫుల్ బాక్సింగ్ కోచ్ గా చూపించబోతున్నారు. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు.

19:11 - February 13, 2017

ఇండస్ట్రీలో జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టుగా జగ్గూభాయ్ విలన్ ఎంట్రీతో సిల్వర్ స్క్రీన్ కి పర్ఫెక్ట్ విలన్ లుక్ దొరికింది. సెట్టిల్డ్ యాక్టింగ్ తో బెస్ట్ విలన్ గా మార్కులు కొట్టేస్తున్నాడు జగపతిబాబు. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్స్ అయిన జగపతిబాబు స్టోరీ సెలక్షన్ లో తడబడి హీరోగా కొంచెం వెంబడిన మాట వాస్తవమే అయినా తన సెకండ్ ఇన్నింగ్స్ ని విలన్ గా స్టార్ట్ చేసి కంప్లీట్ యాక్టర్ గా మారిపోయాడు. తెలుగు నటుడు కావడం వాళ్ళ డైలాగ్ లో డెప్త్ ని కరెక్ట్ గా అర్ధం చేసుకొని ఎక్స్ప్రెషన్స్ ని బాలెన్స్ గా పలికించే టాప్ విలన్ గా మారిపోయాడు. పులిమురుగం సినిమాకి గాను బెస్ట్ నెగిటివ్ రోల్ అవార్డు అందుకున్న జగపతిబాబు 'నాన్నకు ప్రేమతో' సినిమా లో విలన్ గా తన యాక్టింగ్ తో జూనియర్ ఎన్ టి ఆర్ కు గట్టి పోటీ ఇచ్చాడు జగ్గూభాయ్. ఇలా ఫ్యామిలీ హీరో జగపతి బాబు విలన్ గా మారి బిజీ అయిపోయాడు. అదే దారిలో తన యాక్టింగ్ లో మరో కోణాన్ని చూపించడానికి సిద్ధం అయ్యాడు మరో ఫ్యామిలీ స్టార్ 'శ్రీకాంత్'. శ్రీకాంత్ తన కెరీర్ ని మొదట విలన్ గానే స్టార్ట్ చేసాడు. ఇప్పుడు తన వారసుడు కూడా నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా మారిపోయి స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. రీసెంట్ సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ చేసిన శ్రీకాంత్ తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న చిత్రంలో విలన్ గా నటించనున్నాడు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ విలన్ గా మారుతుండటంతో జగపతిబాబుకి పోటీ అవుతాడేమో చూడాలి.

కేసీఆర్ కు తమ్మినేని 96వ లేఖ..

ఖమ్మం : సీఎం కేసీఆర్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 96వ లేఖ రాశారు. రాష్ట్రంలో 24వేల మంది వీఆర్ఏలు చాలీ చాలని జీతాలతో బతుకులీడుస్తున్నారని తమ్మినేని పేర్కొన్నారు. వీఆర్ఏలకు గుజరాత్ లో రూ. 15వేలు..కర్నాటక..తమిళనాడు రాష్ట్రాల్లో రూ. 10,500 వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. వీఆర్ఏ జీతాలను రూ. 18వేలకు పెంచి 010 పద్దు ద్వారానే వేతనాలు ఇవ్వాలని కోరారు. వారికి వారసత్వ ఉద్యోగాల సౌకర్యం కల్పించాలన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకొంటోంది - ఉత్తమ్..

హైదరాబాద్ : కాంగ్రెస్ పుంజుకొంటోందని 119 అసెంబ్లీ స్థానాల్లో సర్వే చేయించడం జరిగిందని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 55 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడించారు. 25 నియోజకవర్గాల్లో కొంత బలహీనంగా ఉందని గతం కంటే ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ బలహీన పడిందని చెప్పుకొచ్చారు.

ముగిసిన డీఎంకే సమావేశం..

చెన్నై : స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశం ముగిసింది. తమిళనాడులో అభివృద్ధి కుంటుపడిందని, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ చర్య తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తాము ఎవరికీ మద్దతివ్వడం లేదని ప్రకటించారు.

18:35 - February 13, 2017

అనంతపురం : శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ రాజగోపాల్‌ ప్రారంభించారు. ఈ పోటీల ద్వారా విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయని వీసీ అభిప్రాయపడ్డారు. ఈ పోటీలలో 9 డిపార్ట్‌మెంట్‌లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ టీమ్‌లు పాల్గొంటున్నాయని ఆయన చెప్పారు. ఆలాగే ముందు ముందు కూడా ఈ పోటీలను నిర్వహిస్తామని అన్నారు.

18:34 - February 13, 2017

అనంతపురం : నగర శివార్లలోని నేషనల్ హైవే దగ్గర్లోని స్క్రాప్ గోడౌన్ అగ్నికి అహుతైంది. ఈ ప్రమాదంలో దాదాపు 50 లక్షల రూపాయలు అస్తి నష్టం జరిగిందని సమచారం. నగరానికి చెందిన మహ్మాద్ వలి.. గత పదేళ్లుగా... స్క్రాప్ గోడౌన్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో ఒక్కసారిగా ఆంటుకోవడంతో స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు సుమారు 3 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

18:33 - February 13, 2017

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల కాంట్రాక్టుల్లో ఎక్కువ భాగం ఏపీ కాంట్రాక్టర్లకే అప్పగించారన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ డిజైన్ల మార్పులో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. కమిషన్లకు ఆశపడి మంత్రి జూపల్లి... డిజైన్ మార్పులకు సహకరించాలని వంశీచంద్ రెడ్డి ఆరోపించారు.

జూపల్లి ఆగ్రహం..
పాలమూరు-రంగారెడ్డి పోత్తిపోతల పథకం డిజైన్ల మార్పు వ్యవహారంలో ముడుపులు చేతులు మారాయంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి చేసిన ఆరోపణలను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తిప్పికొట్టారు. అవినీతి కాంగ్రెస్‌ నేతల నైజమని విమర్శించారు. స్వచ్ఛమైన పాలన అందిస్తున్న టీఆర్ఎస్ ను వేలెత్తి చూపే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని కృష్ణారావు మండిపడ్డారు.

18:30 - February 13, 2017

మెదక్ : సంగారెడ్డి జిల్లాలో.. పటాన్‌ చెరువు ఇక్రిశాట్‌లో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్‌ హబ్‌ను మంత్రులు కేటీఆర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం కేటీఆర్‌ ఇక్రిశాట్‌ను సందర్శించి.. అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని పోచారం అభిప్రాయపడ్డారు. ఇక్రిశాట్‌ , ఇన్నోవేషన్‌ హబ్‌ సంయుక్తంగా పరిశోధనలు మంచి ఫలితాలు సాధిస్తాయని.. టెక్నాలజీతో రైతులకు మేలు జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

18:29 - February 13, 2017

విజయవాడ : ప్రత్యేక హోదా రాజకీయ అంశమని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మెకు దిగే స్థితిలో లేరని ఏపీ ఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఏపీ ఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్లీ అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా ఎం. చంద్రశేఖర్‌ఖరెడ్డిలు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా ఏర్పడిన నూతన కమిటీ మూడు సంవత్సరాలు కొనసాగనుంది. కమిటీలోని సభ్యులతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఉద్యోగుల సమస్యల కోసం నిరంతరం పోరాడుతామని అశోక్‌ బాబు స్పష్టం చేశారు.

హెచ్ సీయూ గొడవలపై హైకోర్టులో వీహెచ్ పిటిషన్..

హైదరాబాద్ : హెచ్ సీయూలో గొడవలకు వీసీ అప్పారావే కారణమని హైకోర్టులో వీహెచ్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల జాబితాలో రాష్ట్రపతి పేరును ఎందుకు చేర్చారని కోర్టు ప్రశ్నించింది. వీసీని నియమించింది రాష్ట్రపతే కాబట్టే జాబితాలో చేర్చామని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. వచ్చే సోమవారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతి వాదులకు హైకోర్టు సూచించింది.

చుడీబజార్ లో చోరీ..

హైదరాబాద్ : బేగంబజార్ లోని చుడీబజార్ లో చోరీ జరిగింది. జ్యోతినాయక్ అనే వ్యాపారి ఇంట్లో కిలోన్నర బంగారం, రూ. 2 లక్షల నగదు అపహరించారు. షాయినాత్ గంజ్ పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ రామ్ నాయక్ లు పరిశీలించారు.

తమిళనాడు గవర్నర్ కు ఏజీ సలహా..

చెన్నై : వారంలోపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని, సభలో బలపరీక్ష పెట్టి ఎవరికి మెజార్టీ ఉంటుందో వారినే ముఖ్యమంత్రిని చేయాలని గవర్నర్ కు ఏజీ సలహా ఇచ్చింది.

ప్రేమ జంట ఆత్మహత్య..

వికారాబాద్ : బోమ్రాపేట్ (మం) దుద్యాలలో విషాదం నెలకొంది. ప్రియురాలికి మేనమామతో పెళ్లి నిశ్చయించడంతో అంకిల (35), మధు (32) లు పురుగుల మందును సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఎయిర్ పోర్టులో 4కిలోల బంగారం స్వాధీనం..

ముంబై : ఎయిర్ పోర్టులో 4 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. బెల్ట్ లో అమర్చి తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

17:40 - February 13, 2017

ఢిల్లీ : శశికళ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో శశికళ వర్గంలో తీవ్ర టెన్షన్ మొదలైంది. తీర్పు అనుకూలంగా వస్తుందా ? వ్యతిరేకంగా వస్తుందా ? అనే చర్చ మొదలైంది. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్న సంగతి తెలిసిందే. జయ మరణానంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టి..ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేందుకు శశికళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీర్పు ఎలా ఉంటుందనేది తెలియరావడం లేదు. శశికళకు వ్యతిరేకంగా వస్తే ముఖ్యమంత్రి పీఠం చేజారినట్టేనని..అనుకూలంగా వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలుకుతారని విశ్లేషకుల అభిప్రాయం.

 • జయ మొదటిసారిగా సీఎం అయిన సమయంలో అక్రమాస్తులు కూడబెట్టుకున్నారంటూ 1996లో డీఎంకే కోర్టును ఆశ్రయించింది.
 • 18 సంవత్సరాల పాటు విచారణ జరిగింది.
 • బెంగళూరు ప్రత్యేక కోర్టు 2014 సెప్టెంబరు మాసంలో తీర్పు వెలువరించింది.
 • రూ.66.65 కోట్లు అక్రమాస్తులు కలిగివున్నారని నిర్ధారించిన న్యాయమూర్తి జయకు, ఆమె సహచరులైన వీకే శశికళ, ఆమె మరదలు జె.ఇళవరసి, బంధువు వీఎన్ సుధాకరన్‌లకు భారీగా జరిమానా, జైలుశిక్ష విధించారు.
 • జయ మధ్యలోనే సీఎం పదవి నుండి తప్పుకున్నారు.
 • జయ నెల రోజుల పాటు జైలు జీవితం గడిపారు.
 • బెంగళూరు హైకోర్టు నుంచి జయ బృందం బెయిల్ పొందింది.
 • ఆ కోర్టు జరిపిన విచారణలో నిర్దోషులుగా బయటపడ్డారు.
 • పలు తర్జనభర్జనల అనంతరం కాంగ్రెస్‌ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
 • అక్కడ కూడా విచారణ పూర్తయింది.
 • 2016 సెప్టెంబరు 16వ తేదీన కోర్టు తీర్పును రిజర్వులో వుంచింది.
17:33 - February 13, 2017

హైదరాబాద్ : ప్రజా సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ ఏఈపై కమిషనర్ జనార్ధన్ రెడ్డి వేటు వేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలనే నేపథ్యంలో జీహెచ్ంఎసీ మై యాప్ రూపొందించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నగర ప్రజలు పలు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా వీధి లైట్లు..డ్రైనేజీ తదితర సమస్యలను అందులో పోస్టు చేస్తున్నారు. సమస్యకు సంబంధించిన ఫొటో పోస్టు చేయడంతో ఆ ఫొటో ఏ ప్రాంతానిదో అధికారులకు తెలిసిపోతుంది. స్ట్రీట్ లైట్ విషయంలో 24 గంటలు..లేదా 48 గంటల్లోగా అధికారులు పరిష్కరించాల్సి ఉంటుంది. తాజాగా స్వయంగా కమిషనర్ జనార్ధన్ రెడ్డి ట్యాంక్ బండ్ పై లైటు వెలగడం లేదంటూ జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. కానీ మూడు రోజులైనా సంబంధిత అధికారి స్పందించలేదు. అంతేగాక సమస్య పెట్టింది ఎవరు ? ఎవరు ఫోన్ చేశారు ? అని ఎలక్ట్రికల్ ఏఈ రమేష్ ఫోన్ చేయడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయన్ను విధుల నుండి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.

రేపే శశికళ అక్రమాస్తుల కేసులో తుది తీర్పు !

చెన్నై : శశికళ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇది తుది తీర్పు అని తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాలు ఎలా మారిపోతాయో వేచి చూడాలి.

ఎలక్ట్రికల్ ఏఈపై వేటు..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ ఏఈ రమేష్ పై వేటు పడింది. మూడు రోజులైనా స్పందించకపోవడంతో కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్యాంక్ బండ్ పై లైట్ వెలగడం లేదని మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా స్వయంగా కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మూడు రోజులైనా స్పందించకపోవడంతో ఏఈపై కమిషనర్ జనార్ధన్ రెడ్డి వేటు వేశారు.

17:14 - February 13, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సీఎం పదవి కోసం శశికళ..పన్నీర్ సెల్వం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను శశికళ గోల్డెన్ బే రిసార్ట్ లో బస కల్పించారు. ఇప్పటికే ఆమె రెండు పర్యాయాలు భేటీ అయ్యారు. తాజాగా మరోసారి సోమవారం సాయంత్రం రిసార్ట్ కు బయలుదేరారు. అంతకంటే ముందు మీడియాతో..మద్దతుదారునుద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె పన్నీర్ సెల్వంపై పలు విమర్శలు గుప్పించారు. తాను సీఎం పదవి కోసం ఎందుకు పోటీ పడాల్సి వస్తుందో వివరించే ప్రయత్నం చేశారు. అంతేగాకుండా శశికళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 24గంటల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా తమకు ఆహ్వానం పలికేలా గవర్నర్ కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

సచివాలయానికి పన్నీర్..స్టాలిన్..
మరోవైపు పన్నీర్ సెల్వం కూడా వ్యూహాలు రచిస్తూ ముందుకెళుతున్నారు. రాజీనామా చేసిన అనంతరం సచివాలయానికి తొలిసారిగా ఆయన వెళ్లారు. అక్కడ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలు..పాలన వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాకముందే సచివాలయానికి డీఎంకే నేత స్టాలిన్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ కొద్దిసేపే ఉన్న స్టాలిన్ అనంతరం వెళ్లిపోవడం గమనార్హం.

అధికారం చేజిక్కించుకోవడానికి డీఎంకే వ్యూహాలు..
ఇక అధికారంలోకి రావడానికి డీఎంకే కూడా ఉత్సాహం చూపుతోంది. అందులో భాగంగా పార్టీకి సంబంధించిన నేతలతో ఆ పార్టీ నేత స్టాలిన్ సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. త్వరలోనే అధికారంలోకి వస్తామని, అందరూ జాగ్రత్తగా ఉండాలని భావనతో స్టాలిన్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. డీఎంకే పార్టీకి 97 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 117 చేరుకోవాలంటే 20 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. అన్నాడీఎంకే కు చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు..ఇతరులతో స్టాలిన్ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

డీఎంకే మీటింగ్ ప్రారంభం..

చెన్నై : డీఎంకే సమావేశం ప్రారంభమైంది. ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కీలక నేతలు రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. భేటీకి సంబంధించిన వివరాలు భేటీ అనంతరం తెలిసే అవకాశం ఉంది.

గోల్డెన్ బే రిసార్ట్ కు బయలుదేరిన శశికళ..

చెన్నై : తమిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకునే ప్ర‌య‌త్నంలో దూకుడు పెంచిన శ‌శిక‌ళ తాజాగా మ‌రోసారి గోల్డెన్ బే రిసార్టుకు బ‌య‌లుదేరారు. ఇప్ప‌టికే ఆమె రెండు సార్లు అక్క‌డకు వెళ్లి త‌మ ఎమ్మెల్యేల‌తో మంత‌నాలు జ‌రిపిన విష‌యం తెలిసిందే.

వంశీరెడ్డి కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన సుష్మా స్వరాజ్..

ఢిల్లీ : అమెరికాలోని కాలిఫోర్నియాలో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వరంగల్ అర్బన్ జిల్లా వంగపహాడ్ కు చెందిన వంశీరెడ్డి కుటుంబాన్ని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఫోన్ లో పరామర్శించారు. జరిగిన ఘటన చాలా బాధాకరమని ఈ సందర్భంగా ఆమె అన్నారు.

16:39 - February 13, 2017

కడప : జలదీక్ష పేరిట పొద్దుటూరులో తాగునీటి కోసం మహిళలు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఈ ఆందోళన జరిగింది. ఎమ్మెల్యే ఎన్నికల నేపథ్యంలో ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. చివరకు ఆందోళనకారులను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు.

16:35 - February 13, 2017

ఖమ్మం : సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలను అమలు చేయలేకపోతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దళితులకు భూమి, డబుల్ బెడ్ రూం నివాసాలు అమలుకు నోచుకోవడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థ నిరుపయోగంగా మారిందని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు కేసీఆర్ శత్రువులయ్యారని అదే ఉద్యమ విరోధులు మిత్రులుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. మత విధ్వేషాలు రెచ్చగొడుతున్న ప్రధాని తిన్నది కక్కిస్తానని పేర్కొంటూ ప్రజల పేగులు కక్కిస్తున్నారని పేర్కొన్నారు.

16:30 - February 13, 2017

ఏపీ అసెంబ్లీ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. 15 ఎకరాల్లో విశాలొంగా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. మార్చి 3వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆధునిక టెక్నాలజీతో కలర్ ఫుల్ గా అసెంబ్లీ బిల్డింగ్స్ తయారవుతున్నాయి. విశాలమైన హాలు నిర్మాణం..సౌకర్యవంతంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. లైటింగ్, సౌండ్ సిస్టమ్ లో హైటెక్ హంగులు దర్శనమిస్తున్నాయి. ఫైర్ స్టేఫీ కోసం ప్రత్యేక జాగ్రత్తలతో నిర్మాణం చేశారు. ఆకుపచ్చ..పింక్ కలర్స్ లో సభాహాళ్లు మెరిసిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఏడు అడుగుల ఎత్తులో స్పీకర్ పోడియం నిర్మాణం అవుతుండడం..సింహం బొమ్మలతో స్పీకర్ ఛైర్ ఆకర్షణగా నిలుస్తోంది. వివిఐపీల వాహనాలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణం చేపట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:19 - February 13, 2017
15:37 - February 13, 2017

హైదరాబాద్ : విజయవాడలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు కోసం ఏపీ ప్రభుత్వం పదమూడున్నర కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేసిందని వైసీపీ ఆరోపించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి ఈ సదస్సులో స్థానం కల్పించకపోవడాన్ని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి తప్పుపట్టారు. ఎమ్మెల్యే రోజాకు జరిగిన అన్యాయాన్ని వేలెత్తి చూపారు. రోజా కన్నీటిలో మహిళా సాధికార సదస్సులో పన్నీరు చల్లుకున్నారని కరుణాకర్‌రెడ్డి విమర్శించారు.

15:35 - February 13, 2017

ఉత్తరప్రదేశ్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎస్పీ జతకట్టడంపై ప్రధాని నరేంద్రమోది మండిపడ్డారు. లఖీంపూర్‌ ఎన్నికల సభలో మాట్లాడుతూ సమాజ్‌వాది పార్టీ కాంగ్రెస్‌ను శరణు వేడుకుందని విమర్శించారు. కుర్చీ వ్యామోహంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడిన రాంమనోహర్‌ లోహియాను ఎస్పీ అవమానించిందన్నారు. రైతుల బకాయిలను ఎందుకు మాఫీ చేయలేదని అఖిలేష్‌ ప్రభుత్వాన్ని మోది ప్రశ్నించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని అమలు చేసినా ఒక్క సీటు రాలేదని, ఇపుడు మూడో విడత ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ప్రకటించిన 10 అంశాల ఎజెండాతో ఒరిగేదేమి లేదన్నారు.

15:34 - February 13, 2017

ఢిల్లీ : మధ్యప్రదేశ్‌ను కుదిపేసిన వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 2008-12 మధ్య కాలంలో ఎంబిబిఎస్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 268 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కొట్టేసింది. 643 మంది విద్యార్థులు తమ డిగ్రీ పూర్తి చేశాక ఐదేళ్ల పాటు ఆర్మీలో వేతనం లేకుండా ఉచిత సేవలు అందించాలని విచారణ సందర్భంగా జస్టిస్‌ చలమేశ్వర్‌ సూచించారు. ఐదేళ్ల తర్వాత విద్యార్థులకు పట్టా ఇవ్వాలని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు వ్యాపం నిర్వహించిన పలు పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తేలింది. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టగా పదుల సంఖ్యలో సాక్షులు, నిందితులు మృత్యువాత పడ్డారు. ఈ విషయం ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

 

15:23 - February 13, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో క్షణక్షణానికి రాజకీయాలు మారుతున్నారు. శశికళ ప్రత్యర్థి వర్గంపై స్వరం పెంచారు. విమర్శలు..ఆరోపణలతో విరుచకపడుతున్నారు. సీఎం పదవిని చేజిక్కించుకోవడానికి శశికళ..పన్నీర్ సెల్వం వ్యూహాలు రచిస్తున్నారు. రాజీనామా చేసిన అనంతరం సోమవారం తొలిసారిగా సచివాలయానికి పన్నీర్ సెల్వం చేరుకున్నారు. అక్కడ ఉన్నతాధికారులతో భేటీ అయి పాలనపై చర్చించారు. దీనికంటే ముందు డీఎంకే నేత స్టాలిన్ సచివాలయానికి రావడం..కేవలం పదిహేను నిమిషాల అనంతరం స్టాలిన్ అక్కడి నుండి వెళ్లిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు మద్దతదారులను ఉద్ధేశంచి శశికళ మాట్లాడారు. పన్నీర్ సెల్వంపై విమర్శలు..తాను సీఎం పదవి చేపట్టేందుకు గల కారణాలు తెలియచేశారు. ఇలాంటి సంక్షోభాల సమయంలో ఎలా వ్యవహరించాలో జయ నుండి నేర్చుకున్నానని, తనను ఎవరూ ఏమి చేయలేరని తేల్చిచెప్పారు. జయ మరణం అనంతరం సీఎం కావాలని పలువురు కోరడం జరిగిందని, అందులో పన్నీర్ సెల్వం కూడా ఉన్నారని తెలిపారు. మొదటి నుండి కూడా పన్నీర్ సెల్వం విధేయుడు కాదని, తాత్కాలిక సీఎం అయిన తరువాత పార్టీ వ్యతిరేకులు..జయ వ్యతిరేకులతో పన్నీర్ మాట్లాడడం..తిరగడం చూసిన నాయకులు తనకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. పార్టీని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారని విచారణలో వెల్లడైన అనంతరం తాను తెరపైకి రావడం జరిగిందని, తాను ఎలాంటి రాజకీయపరమైన ఆలోచనలు చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక సీఎం పదవి ఆలోచన అనేది తన మనస్సులోకి అసలు రాలేదని కార్యకర్తలకు తెలియచేశారు.

15:20 - February 13, 2017

అశ్విన్ ఆఫ్ స్పిన్ లోతో అదరగొట్టిన వేళ..ఉప్పల్ లో భారత్ ఘన విజయం సాధించింది. కోహ్లీ సారథ్యంలో వరుస విజయాలతో పరుగులెడుతోంది. వరుసగా ఆరో సిరీస్ విజయంతో భారత్ రికార్డు సృష్టించింది. శ్రీలంకపై 2-1, దక్షిణాఫ్రికాపై 3-0, వెస్టిండీస్ పై 2-0, న్యూజిలాండ్ పై 3-0, ఇంగ్లండ్ పై 4-0 తేడాతో భారత్ సిరీస్ లను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ వేదికగా బంగ్లాదేవ్ తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో సైతం భారత్ తన దూకుడును ప్రదర్శించింది. వరుసగా ఆరో టెస్టు సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ కోహ్లీ వరుసగా నాలుగో సిరీస్ లో డబుల్ సెంచరీ సాధించడం విశేషం.
బంగ్లాదేశ్ పై 208 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 459 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆలౌట్ అయ్యింది. కేవలం 250 పరుగులకే బంగ్లా క్రీడాకారులు పెవిలియన్ బాట పట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 687/6, రెండో ఇన్నింగ్స్ లో 159/4 చేయగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 338, రెండో ఇన్నింగ్స్ లో 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జడేజా, అశ్విన్ లకు తలో నాలుగు వికెట్లు, ఇషాంత్ కు రెండు వికెట్లు తీశారు. బంగ్లా బ్యాటింగ్ లో మహ్మదుల్లా 64, సర్కార్ 42, హక్ 27, రహీం 23 పరుగులు చేశారు.

అనంతపురం ఎన్ హెచ్ హైవేపై భారీ అగ్నిప్రమాదం..

అనంతపురం : ఎన్ హెచ్ హైవే సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్ర్కాబ్ తగలబడుతోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

జగదల్ పూర్ లో దారుణం..

ఛత్తీస్ గడ్ : జగదల్ పూర్ లో దారుణం చోటు చేసుకుంది. భార్య సహా ఇద్దరు పిల్లలను భర్త హతమార్చాడు. భార్యపై అనుమానమే కారణమేనని స్థానికులు పేర్కొంటున్నారు.

 

కొందరు కుట్రలు చేశారు - శశికళ..

చెన్నై : అమ్మ మరణం తరువాత పార్టీని విచ్చిన్నం చేయాలన్న కొందరి కుట్ర కారణంగానే తాను తెరపైకి రావడం జరిగిందని శశికళ పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేకులతో పన్నీర్ సెల్వం సన్నిహితంగా ఉండడంపై పలువురు నాయకులు తనకు ఫిర్యాదు చేశారని తెలిపారు. పార్టీని కాపాడాలనే సీఎం పదవిని ఆశించడం జరిగిందన్నారు. పార్టీని విచ్చిన్నం చేసే శక్తి ఎవరికీ లేదని, ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొవాలో తనకు తెలుసన్నారు.

14:56 - February 13, 2017

గత కొన్ని సంవత్సరాలుగా 'బాహుబలి' చిత్రానికే అంకితమై పోయిన 'ప్రభాస్' కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. యూవీ క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. ప్రభాస్ కోసం రెండున్నరేండ్లుగా ఎదురు చూసిసన సుజిత్ సోమవారం ఎలాంటి హంగుఆర్భాటాలు లేకుండా పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. ప్రభాస్, దర్శకుడు సుజిత్, నిర్మాతలు వంశీ, ప్రమోద్ మరికొందరు టీం టెక్నీషియన్లు పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్ తో పూర్తి యాంక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఇంకా హీరోయిన్ మాత్రం ఎంపిక చేయలేదు. మే నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అప్పటి వరకు బరువు తగ్గి..న్యూ స్టైలిష్ లుక్ లోకి మారిపోవాలని ప్రభాస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరింత సమాచారం తెలియనుంది.

14:31 - February 13, 2017

చెన్నై : శశికళ స్వరం పెంచేశారు. పన్నీర్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు. తాజాగా మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో పన్నీర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంక్షోభానికి కారణం డీఎంకే, బీజేపీ పార్టీలు అంటూ అక్కసు వెళ్లగక్కారు. తాను పదవుల కోసం ఆశించలేదని, ప్రతి ఒక్కరికి నిజం తెలియాలన్నారు. ఆ రెండు పార్టీల సూచనలతోనే బలనిరూపణనను గవర్నర్ వాయిదా వేస్తున్నారని పేర్కొన్నారు. జయ మృతిపై దుష్ర్పచారం మానుకోవాలని హితవు పలికారు. అన్నాడీఎంకేను చీల్చడానికి జరిగే ప్రయత్నాలను సాగనివ్వనని, అమ్మ అంతి సంస్కారాల్లో తాను ఉన్నప్పుడే పార్టీకి వ్యతిరేకంగా కొందరు కుట్ర చేశారని విమర్శించారు. జయ చనిపోయిన అనంతరం తాను సీఎం అయ్యేదానినని, కానీ అలా చేయలేదన్నారు. జయకు ఆనాడు ఎదురైన ఇబ్బందులే ప్రస్తుతం తనకు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. సీఎంగా అయ్యేందుకు సరిపడా మద్దతు తనకుందని తెలిపారు. పన్నీర్ సెల్వం కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. పార్టీకి ఎప్పుడూ పన్నీర్ సెల్వం విధేయుడిగా ఉండలేదన్నారు. అంతేగాక అన్నాడీఎంకే సిద్ధాంతాలకు పన్నీర్ కట్టుబడి లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

14:29 - February 13, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గంట గంటకు రాజకీయాలు మారుతున్న సంగతి తెలిసిందే. సీఎం పదవి కోసం శశికళ..పదవిని చేజారిపోకకుండా పన్నీర్ సెల్వం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకెళుతున్నారు. తాజాగా శశికళ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మరో ట్విస్టు చోటు చేసుకుంది. 24గంటల్లోగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్ ను ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతున్నా గవర్నర్ తమను ఆహ్వానించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. మరోవైపు రిసార్ట్స్ లో బస చేసిన ఎమ్మెల్యేల వాంగ్మూలాలపై మద్రాసు హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఎమ్మెల్యేల నుండి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

భారత్ ఘన విజయం..

హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఒక టెస్టు మ్యాచ్ లో భారత్ 208 పరుగుల తేడాతో గెలుపొందింది. జడేజా, అశ్విన్ చెరో నాలుగు వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 687/6, రెండో ఇన్నింగ్స్ లో 159/4 చేయగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 388 రెండో ఇన్నింగ్స్ లో 250 పరుగులు మాత్రమే చేయగలిగింది.

సుప్రీంను ఆశ్రయించిన శశికళ..

చెన్నై : సుప్రీం హైకోర్టును శశికళ ఆశ్రయించారు. 24గంటల్లోగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్ ను ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతున్నా గవర్నర్ తమను ఆహ్వానించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.

'త్వరలో లోటస్ పాండ్..బెంగళూరు ప్యాలెస్ ఈడీ అటాచ్'..

హైదరాబాద్ : జగన్ ఆస్తులన్నీ ఈడీకి అటాచ్ అయ్యాయని వర్ల రామయ్య వెల్లడించారు. త్వరలోనే లోటస్ పాండ్, బెంగళూరు ప్యాలెస్ లు స్వాధీనం అవుతాయని జోస్యం చెప్పారు. ఆస్తుల స్వాధీనం అంటే పాక్షికంగా అవినీతి నిర్ధారణే అని, జగన్ కేసులో సీబీఐ విచారణ అసంతృప్తిగా ఉందన్నారు. విదేశాల్లో ఉన్న జగన్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్ బెయిల్ పై సందేహాలను సీబీఐ నివృత్తి చేయాలని పేర్కొన్నారు.

అమరావతిలో వైసీపీ ఎమ్మెల్యేల పర్యటన..

విజయవాడ : రేపు అమరావతిలో వైసీపీ ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. వెలగపూడిలో నూతన అసెంబ్లీ భవనాలను పరిశీలించనున్నారు.

ట్రాఫిక్ పుకార్లు నమ్మవద్దు - ఎస్పీ పరిమళ..

సూర్యాపేట : దురాజ్ పల్లి జాతర వద్ద ట్రాఫిక్ జామ్ పుకార్లను నమ్మొద్దని ఎస్పీ పరిమళ వెల్లడించారు. భారీ వాహనాలను దారి మళ్లించామని పేర్కొన్నారు.

13:52 - February 13, 2017
13:51 - February 13, 2017
13:50 - February 13, 2017

ఒకప్పుడు ఆమె జాతీయ ఆర్చరీ ఛాంపియన్. సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో ఎన్నో పతకాలు సొంతం చేసుకుంది. కానీ పరిస్థితి తలకిందులైంది. ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. మరోవైపు అనారోగ్యం..దీనితో ఆటలో కొనసాగలేదు. కుటుంబ పోషణ కోసం వీధుల వెంట తిరుగుతూ నారింజ పళ్లు అమ్మడి ప్రారంభించింది. ఆమెనే అసోం బోడో తెగకు చెందిన బులి బసుమాత్రి. ఏ టోర్నీకి వెళ్లినా పతకంతో తిరిగొచ్చేది. 2005లో అజ్మీర్ లో ఆడిన తొలి సబ్ జూనియర్ చాంపియన్ షిప్ లో రెండు స్వర్ణాలు, రజతం గెలిచి తన సత్తా ఏమిటో చాటి చెప్పింది. ఇలా ఎన్నో పథకాలు సాధించింది. ఆర్చరీలో ఒకప్పటి జాతీయ ఛాంపియన్ అయిన బసుమాత్రి దీనగాధ అక్కడి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. క్రీడా శాఖ మంత్రి ఆమెను అసోం ఆర్చరీ జట్టుకు కోచ్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. దీనితో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటానని బసుమాత్రి నిర్భయంగా చెబుతోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:40 - February 13, 2017

నిజామాబాద్ : ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్న ఈ సమయంలో.. ఆ ఊరి సర్కారు దవాఖానా మాత్రం కార్పొరేట్ ఆస్పత్రిని తలపిస్తోంది. ఒకప్పుడు పోస్టుమార్టాలకే పరిమితమైన ఆ దవాఖానా ఇప్పుడు పురుడు పోయడంలో తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఆస్పత్రిగా నిలిచింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని ప్రభుత్వాసుపత్రి ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా నిలుస్తోంది. ఈ దవాఖానాలో ఒకప్పుడు కేవలం పోస్టుమార్టాలు మాత్రమే జరిగేవి. అసలు మండలంలో ప్రభుత్వాసుపత్రి ఉందా అనే అనుమానాలు ఉండేవి... అలాంటిది ఇప్పుడు ఏ రోగమొచ్చినా ప్రజలు ఈ ఆస్పత్రి వైపే పరుగెడుతున్నారు.

జనవరిలో 200 ప్రసవాలు..
అంతలా అభివృద్ధి చెందడానికి కారణం జిల్లా కలెక్టర్ యోగతా రాణా.. తెలంగాణ ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రభుత్వాస్పత్రుల మార్పు పథకంలో భాగంగా ఆర్మూరు ఆస్పత్రిని ఎంపిక చేశారు. వెంటనే ఇక్కడ పనిచేసే వైద్యులను ప్రక్షాళన చేసి ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలను కల్పించారు. ముగ్గురు గైనకాలజిస్టులను నియమించడంతో అత్యంత ఆధునాతన వైద్యపరికరాలను అందుబాటులోకి తెచ్చారు. 2015 సంవత్సరంలో కేవలం 16 ప్రసవాలు జరగగా.. 2016 మే నెల నాటికి ప్రసవాల సంఖ్య 50 దాటింది.. 2016 డిసెంబర్ నాటికి సంవత్సరంలో 995 ప్రసవాలు జరిగాయి. ఈ సంవత్సరం జనవరిలో 200 ప్రసవాలు జరిగాయంటే సగటున నెలకు 83 ప్రసవాలు జరుగుతున్నాయి. దవాఖానా పరిస్థితిని చూసిన గ్రామస్తులు ప్రసవాల కోసం ఇక్కడికే వస్తున్నారు. ప్రసవాలలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఆస్పత్రిగా ఆర్మూర్ ఆస్పత్రి నిలిచింది. ఈ ఆస్పత్రిలాగే ప్రతి ప్రభుత్వాస్పత్రిపైనా అధికారులు, ప్రభుత్వం శ్రద్ధ పెడితే ప్రజలెవరూ ప్రైవేట్ ఆస్పత్రి వైపు కన్నెత్తిచూడరని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

13:37 - February 13, 2017

హైదరాబాద్ : గతవారం అనారోగ్యంతో పోలెండ్‌లో మృతిచెందిన విద్యార్థిని నాగశైలజ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించకుండా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సిబ్బంది నిలిపివేసింది. నాగశైలజకు పాస్‌పోర్టు లేదంటూ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో పోలెండ్‌ నుంచి వచ్చిన గిరిజన విద్యార్థిని మృతదేహం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే నిలచిపోయింది. తమ కూతూరు మృతదేహాన్ని ఇవ్వాలని నాగ శైలజ కుటుంబ సభ్యులు కోరినా... పాస్‌పోర్టు లేనందున మృతదేహాన్ని ఇవ్వమని కార్గో అధికారులు తేల్చి చెబుతున్నారు.

మచిలీపట్నం..
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లా మచిలీపట్నంకు చెందిన వెంకటేశ్వర్లు, విజయలక్ష్మీ కూతురు నాగ శైలజ. కొన్నాళ్ల క్రితం మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌లోని చందానగర్‌కు వచ్చి.. అక్కడే ఉంటున్నారు. 2012లో మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో నాగ శైలజ బీటెక్‌ పూర్తి చేసింది. 2013లో మిథానిలో ఒక ఏడాది పాటు అప్రెంటీస్‌ చేసిన నాగశైలజ.. ఎంఎస్‌ చదవడం కోసం 2014లో పోలెండ్‌ దేశానికి వెళ్లింది. వచ్చే జూన్‌లో చదువు పూర్తి చేసుకుని.. హైదరాబాద్‌ రావాల్సిన ఉన్న నాగ శైలజ.. 10 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ వారం క్రితం నాగ శైలజ చనిపోయింది. కుటుంబ సభ్యులు, పోలెండ్‌లో ఉన్న స్నేహితుల సహాయంతో నాగ శైలజ మృతదేహాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తెప్పించుకోగలిగారు. అయితే.. నాగ శైలజ మృతదేహం తీసుకొచ్చిన ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది కారణంగా ఇప్పుడు మృతదేహం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే ఉంది. నాగ శైలజకు సంబంధించిన పాస్‌పోర్టు, ఇతర డాక్యుమెంట్లను అందజేయకపోవడంతో కార్గో అధికారులు మృతదేహాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో నాగ శైలజ కుటుంబ సభ్యులో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

13:35 - February 13, 2017

ఖమ్మం : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా ఖానాపురంలో 120వ రోజు పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని బృందం.. టేకులపల్లి, శ్రీలక్ష్మినగర్‌, ఇల్లందు క్రాస్‌రోడ్డు,..రోటరినగర్‌, వెంకటయ్యపాలెం, తనికెళ్ల, కొణిజర్ల, పల్లెపాడులో పర్యటించనుంది. ప్రజల బతుకుల్లో మార్పు వచ్చే విధంగా విధానాన్ని మార్చాలని తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అన్నారు.

ఉత్తర కాలిఫోర్నియాకు వరద ముప్పు..

వాషింగ్టన్ : ఉత్తర కాలిఫోర్నియాకు వరద ముప్పు పొంచి ఉంది. భారీ వరదల కారణంగా వోవర్ విల్లే డ్యామ్ పొంగి పొర్లుతోంది. వరద ముప్పు ప్రాంతాల ప్రజలను అధికారులు తరలిస్తున్నారు. డ్యామ్ స్పిల్ వే ఏ క్షణంలోనైనా కొట్టుకపోవచ్చని హెచ్చరికలు జారీ చేశారు.

13:19 - February 13, 2017

హైదరాబాద్ : వామపక్ష విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీపై నిలదీశాయి. వెంటనే నిబంధనలు తొలగించాలని నినదించాయి. సోమవారం ఉదయం టీఎస్ పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పది వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా భారీగా వచ్చిన విద్యార్థులు కార్యాలయాన్ని దిగ్భందించేందుకు యత్నించారు. కానీ అక్కడనే మోహరించిన పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. చివరకు విద్యార్థి నేతలను బలవంతంగా ఈడ్చుకుంటూ వ్యాన్ లలో పడేశారు. గురుకులాల్లో టీచర్ పోస్టులకు నిబంధనలు తొలగించాలని ఉద్యోగ నియామకాలు త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు.

13:14 - February 13, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం పదవి కోసం శశికళ..పదవిని దక్కించుకోవడానికి పన్నీర్ సెల్వం పోరు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గవర్నర్ మాత్రం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం లేదు. దీనితో గంట గంటకు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. సోమవారం మధ్యాహ్నం అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సచివాలయానికి బయలుదేరారు. ఆయనకంటే ముందుగానే డీఎంకే నేత స్టాలిన్ చేరుకోవడం గమనార్హం. నేడు డీఎంకే కీలక సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికంటే ముందుగానే కీలక నేతలతో పన్నీర్ సెల్వంతో భేటీ కావడానికి స్టాలిన్ నిర్ణయించుకోవడంతో రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. కానీ పన్నీర్ తో భేటీ కాకుండానే స్టాలిన్ వెళ్లిపోవడం విశేషం. సచివాలయంలో ఉన్నతాధికారులు పన్నీర్ సెల్వంతో భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పాలన..ఇతరత్రా సమస్యలను పన్నీర్ దృష్టికి తీసుకరానున్నారు. మరోవైపు రిసార్ట్ కు వెళ్లి ఎమ్మెల్యేలతో భేటీ కావాలని శశికళ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేలతో సమావేశమైన సంగతి తెలిసిందే. నేడు జరిగే భేటీ కీలకంగా మారనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ రోజు భేటీ అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ లేదా జయ సమాధి వద్దకు శశికళ వెళ్లనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు గవర్నర్ నుండి ఎలాంటి కీలక ప్రకటన మాత్రం వెలువడడం లేదు.

సచివాలయం నుండి వెళ్లిపోయిన స్టాలిన్..

చెన్నై : కాసేపటి క్రితం సచివాలయానికి చేరుకున్న డీఎంకే నేత స్టాలిన్ కొద్దిసేపటి క్రితం తిరిగి వెళ్లిపోయారు. అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో భేటీ కావడానికే వచ్చారని తెలుస్తోంది. కాన్నీ పన్నీర్ సెల్వం రాకముందే స్టాలిన్ వెళ్లిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

12:58 - February 13, 2017

ఎన్నో కష్టాల్లోనే ఆమె పుట్టుక ఉంది...మరెన్నో సమస్యల్లో ఉన్న కుటుంబంలో ఆమె పెరిగింది..కష్టాలు వారిని వదలడం లేదు..చుట్టూ ఉన్న సమస్యలే ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పెరిగి పెద్దవుతున్న కూతుర్లను చూసుకుంటున్న కన్నవారిలో బతుకుభయం పుడుతోంది. అయినా ఏమి చేయలేని విధి వంచితులు. రెక్కల కష్టాన్నే నమ్ముకున్న ఆ కుటుంబం ఉన్నంతలో హాయిగా ఉంటున్నా విధి వారిని వెంటాడుతూనే ఉంది. ప్రతి క్షణం కన్నీటితోనే తడుస్తూ కాలంతో పాటు పరుగులు తీయాల్సిన ఆ కుటుంబానికి ముద్ద దొరకడం ఒకటైతే అది గొంతులోకి దిగడం కూడా కష్టమే. అలాంటి విశాఖలోని ఓ కుటుంబంలో నిశబ్దంగా ఉన్న అలల తుఫాను మందుకు కొట్టుకొచ్చినట్లు వచ్చి కన్నీటి సునామి పుట్టించాయి. వారి వేదనను తీర్చింది..టెన్ టివి..వారి సమస్యకు మార్గం చూపించింది.. దగా పడిన చెల్లి...పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:29 - February 13, 2017

హైదరాబాద్: ఎంబీబీఎస్‌ మాదిరిగా పీజీ సీట్లనూ నీట్‌ ద్వారానే నింపాలని భారతీయ వైద్య మండలి నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేసింది. పీజీ మెడికల్‌ ఎంట్రెన్స్‌లో టాపర్‌కు వచ్చిన మార్కుల్లో సగాన్ని కటాఫ్‌ మార్క్‌గా నిర్ణయించింది. దీని ప్రకారం ఓపెన్‌ విభాగంలో 705.9, దివ్యాంగులకు 680, ఎస్సీ,ఎస్టీ అభ్యర్ధులకు 655 పాయింట్లు లభిస్తేనే ఈసారి పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌కు అర్హత లభిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో నీట్‌ పరీక్ష రాసిన 14వేల మంది విద్యార్థులు...

తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య పీజీ ప్రవేశాల కోసం నీట్‌ పరీక్షను ఈసారి 14వేల మంది రాశారు. ఇందులో 8070 మంది విద్యార్ధులు ఎంసీఐ నిర్దేశించిన కటాఫ్‌ మార్కులు దాటారు. పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌కు ఏపీలో 6562 మంది.. తెలంగాణ నుంచి 1508 మంది విద్యార్ధులు అర్హత సాధించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2947 వైద్యసీట్లు ఉన్నాయి. ఎంసీఐ తన మార్గదర్శకాల ప్రకారం 1:5 నిష్పత్తిలో సీట్ల కేటాయింపు జరుపుతోంది. ఒక సీటుకు కనీసం ఐదుగురు విద్యార్థులు పోటీపడితేనే నాణ్యమైన వైద్యులు అందుబాటులోకి వస్తారన్నది ఎంసీఐ యోచన. నీట్‌ కటాఫ్‌ మార్కుల వల్ల ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ లెక్క తప్పింది. 1:2.5 నిష్పత్తిలో మాత్రమే పోటీ నెలకొంది. ఇది ఎంసీఐ మార్గదర్శకాలకు భిన్నం. ఫలితంగా క్లినికల్‌ కంటే నాన్‌ క్లినికల్‌ కోర్సుల్లో సీట్లు మిగిలే అవకాశముంది.

ఉత్తమ ర్యాంకు విద్యార్థులు క్లీనికల్‌ సీట్లు ఎంచుకునే చాన్స్‌...

ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులంతా సాధారణంగా క్లినికల్‌ సీట్లవైపే మొగ్గుచూపుతారు. నాన్‌ క్లినికల్‌ సీట్లలో ఆ తర్వాత ర్యాంకర్లు చేరుతారు. సీట్ల కోసం పోటీపడే విద్యార్ధులు 1:2.5 మాత్రమే ఉన్నారు కాబట్టి... వీరు క్లినికల్‌ సీట్లను ఎంచుకునే అవకాశముంది. నాన్‌ క్లినికల్‌ సీట్లలో చేరడానికి విద్యార్ధులు సరిపోను ఉంటారా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈసారి నాన్‌ క్లినికల్‌ సీట్లు మిగిలిపోయే అవకాశమే ఎక్కువగా ఉంది. గతంలో అయితే మిగిలిపోయిన సీట్లను ఆయా కళాశాలలు ఎన్‌ఆర్‌ఐ కోటాలోకి మార్చుకుని భర్తీ చేసుకునేవి. ఈ ఏడాది నుంచి ఆ అవకాశం లేకుండా పోయింది. నీట్‌ ద్వారా అర్హత సాధించిన వారితోనే నింపాలని ఎంసీఐ నిబంధన పెట్టింది. దీంతో పీజీ వైద్యసీట్లు ఈ సారి మిగిలిపోయే అవకాశముంది. కటాఫ్‌ మార్కులు తగ్గిస్తే మరికొంత మంది పోటీలోకి వస్తారు. దీంతో సీట్లు నిండే అవకాశముంది.

ఇన్‌ సర్వీస్‌ కోటాలో పీజీ చేసే వారికి ఇబ్బందిగా మారిన కటాఫ్‌ నిబంధనలు...

మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యలుగా పనిచేస్తూ ఇన్‌ సర్వీస్‌ కోటాలో పీజీ చేయాలనుకునే వారికీ కటాఫ్‌ నిబంధనలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరికి క్లినకల్‌ కోర్సుల్లో 30శాతం, నాన్‌ క్లినికల్‌ కోర్సుల్లో 50శాతం సీట్ల కోటా ఉంటుంది. అయితే మామూలు విద్యార్ధులతో పోటీపడి వీరు నీట్‌లో కటాఫ్‌ పాయింట్లను సాధించడం కాస్త ఇబ్బందే. నీట్‌లో కటాఫ్‌ మార్కులు సాధించకపోతే వీరికి కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. ఫలితంగా ప్రభుత్వ కళాశాలల్లోని సీట్లు మిగిలిపోయే ఆస్కారముంది. మెడికల్‌ కాలేజీల్లో ప్రమాణాలు నానాటికి పడిపోతున్నాయని విద్యావేత్తలు, పలువురు రాజకీయనేతలు విమర్శిస్తున్నారు. మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా బోధనా సిబ్బంది ఉండడం లేదని మండిపడుతున్నారు.

కటాఫ్‌ మార్కులు తగ్గించాలని కేంద్రాన్ని కోరిన ఏపీ....

నీట్‌ కటాఫ్‌ మార్కులను తగ్గించాలని కేంద్రాన్ని కోరినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. ఎంసీఐ మార్గదర్శకాలను అనుసరించి సీట్ల భర్తీ 1:5లో విద్యార్ధులు ఉండాలని, ప్రస్తుత కటాఫ్‌ అందుకు అనుగుణంగా లేదన్నారు. నిర్దేశిత మార్కులను తగ్గించాలని మరోసారి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని కలువనున్నట్టు తెలిపారు.

'ప్రత్యేక హోదా'ఏపీ సర్కార్ విఫలం: చలసాని

విశాఖ: ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రత్యేక హోదా ఉద్యమనేత చలసాని శ్రీనివాస్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అడుగులకు చంద్రబాబు మడుగులొత్తుతున్నారని ధ్వజమెత్తారు. పదవుల కోసం టీడీపీ నేతలు పాకులాడుతున్నారని ఆరోపించారు. ఎంపీలకు రాష్ట్ర ప్రయోజనాలకంటే పదవులే ముఖ్యమా అని ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఎంపీలంతా పోరాటానికి సిద్ధమవ్వాలని కోరారు. లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనపై త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి

చెన్నై: తమిళనాడులో రాజకీయ సమీకరణాలు గంటగంటకు మారిపోతున్నాయి. గవర్నర్‌ నిర్ణయం ప్రకటించకపోవడంపై శశికళ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జాప్యం తమకు లాబిస్తుందని పన్నీర్ సెల్వం వర్గం భావిస్తోంది. గవర్నర్‌ వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్టాలిన్‌ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న నేటి డీఎంకే ఉన్నతస్థాయి సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. మద్రాస్‌ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రిసార్ట్‌లో ఎమ్మెల్యేల వాంగ్మూలం సేకరించారు. గవర్నర్‌ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులో కేసు వేస్తాని సుబ్రమణ్యస్వామి హెచ్చరిస్తున్నారు.

12:23 - February 13, 2017

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు ముట్టడించేందుకు యత్నించాయి. నాంపల్లి టీఎస్ పీఎస్సీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీ నిబంధనలను నిరసిస్తూ 10 వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గురుకులాల్లో టీచర్ పోస్టులకు నిబంధనలు తొలగించాలని ఉద్యోగ నియామకాలు త్వరగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి భారీగా అభ్యర్థులు, విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థులకు పోలీసుల మధ్య తోపులాట జరగడంతో.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థినేతలను అరెస్ట్ చేసి గోషామహల్‌ పీఎస్‌కు తరలించారు.

12:05 - February 13, 2017

వ్యాపం కుంభకోణంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్: మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2008-12 మధ్య 500 మంది ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియను సుప్రీం కోర్టు రద్దు చేసింది.

ఇక్రిశాట్ లో ఇహబ్ ను మంత్రులు కేటీఆర్, పోచారం

సంగారెడ్డి : పటాన్ చెరువులోని ఇక్రిశాట్ లో ఇహబ్ ను మంత్రులు కేటీఆర్, పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు.

నాంపల్లి టీఎస్ పీఎస్సీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: నాంపల్లి టీఎస్ పీఎస్సీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీ నిబంధనలను నిరసిస్తూ 10 వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గురుకులాల్లో టీచర్ పోస్టులకు నిబంధనలు తొలగించాలని ఉద్యోగ నియామకాలు త్వరగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు నాయకులకు గాయాల్యయి.

11:44 - February 13, 2017
11:40 - February 13, 2017

హైదరాబాద్: ఉత్తర కాలిఫోర్నియాలోని వోవర్‌ విల్లే డ్యామ్‌ ప్రమాదం అంచున ఉంది. దీంతో ఉత్తర కాలిఫోర్నియాలోని వేలమంది ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. భారీగా వచ్చిన వరదల కారణంగా ఈ డ్యామ్‌ పొంగి పొర్లుతోంది. ఈ డ్యామ్‌ స్పిల్‌వే ఏ క్షణానైనా బద్దలు కావొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లోని వారిని అధికారులు తక్షణమే ఖాళీ చేయిస్తున్నారు. ఏళ్ల తరబడి కరవు తర్వాత ఇటీవల కాలిఫోర్నియాలో భారీగా హిమపాతం, వర్షాలు కారణంగా నీరు వచ్చిచేరుతోంది. 50ఏళ్లలో తొలిసారి ఈ డ్యామ్‌ ప్రమాదకర స్థాయిలో నిండిపోయింది. ఇప్పటికే సెకనుకు లక్ష క్యూబిక్‌ అడుగుల మేరకు నీటిని స్పిల్‌వే నుంచి వదులుతున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.

11:38 - February 13, 2017

హైదరాబాద్: గతవారం అనారోగ్యంతో పోలెండ్‌లో మృతిచెందిన విద్యార్థిని నాగశైలజ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించకుండా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సిబ్బంది నిలిపివేసింది. నాగశైలజకు పాస్‌పోర్టు లేదంటూ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సిబ్బంది నిరాకరిస్తున్నారు. విమాన సిబ్బంది నిర్లక్ష్యంగానే పాస్‌పోర్టు మిస్సింగ్‌ అయ్యిందంటున్నారు నాగ శైలజ కుటుంబ సభ్యులు.

11:37 - February 13, 2017

హైదరాబాద్: ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌ దగ్గర తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై ఉప్పల్‌ ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా తిరుతున్న 10 బస్సులను సీజ్‌ చేశారు. మరో 10 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రయాణీకుల క్షేమమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

11:35 - February 13, 2017

ఇల్లెందు : బొగ్గుకు పుట్టినిల్లయిన ఇల్లందు మనగడ ప్రశ్నార్థకంగా మారనుంది. ఒక్కొక్కటిగా భూగర్భ బొగ్గుగనులు మూతపడుతుండటంతో ఇల్లందు భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. ఒకప్పుడు బొగ్గుట్టగా వెలసిల్లిన ఇల్లందు..భూగర్భ గనుల మూసివేతతో ఇప్పుడు వెలవెలబోతుంది. ఇల్లందుతో పాటు పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు అపారంగా ఉన్నప్పటికీ సింగరేణి యాజమాన్యం కొత్త భూగర్భ గనుల వెలికితీతకు ఆసక్తి చూపడం లేదు. ఇల్లందులో ఉన్న 21 పిట్‌ భూగర్భగని మరో మూడు నెలల్లో మూసివేసేందుకు యాజమాన్యం సమాయత్తమైంది. దీంతో ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది.

భూగర్భగనుల స్థానంలో ఉపరితల గనులు ...

భూగర్భగనుల స్థానంలో ఉపరితల గనులు తెచ్చేందుకు సింగరేణి యాజమాన్యం వడివడిగా అడుగులు వేస్తోంది. రోంపేడలో ఓపెన్‌ కాస్ట్‌ మైన్‌ ప్రారంభించేందుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. ఈ ప్రాంతంలో ఉపరితల గని ప్రారంభమైతే బొగ్గుకు పుట్టినిల్లయిన ఇల్లందు బొందలగడ్డగా మారడం ఖాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఇల్లందుకు కూతవేటు దూరంలో ఉన్న కొత్తపూసపల్లి, పాతపూసపల్లి గ్రామాలు వాటి స్వరూపాన్ని కోల్పోయి గుంతలమయం కానున్నాయి. ఓపెన్‌కాస్ట్‌ గనితో వందల ఎకరాల వ్యవసాయ భూములు కోల్పోవలసి వస్తుంది. దీంతో ఉపరితల గనుల ఏర్పాటును రైతులు, స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కేసీఆర్ ఇచ్చిన హామీ..బుట్టదాఖలుఉ...

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపరితల గనులు మూసివేయిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ..బుట్టదాఖలైందని సీఐటీయూ నాయకులు ఆరోపిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్ట్‌ గనుల ఏర్పాటును ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇల్లందులో ఉపరితల గనులు ప్రారంభించకుండా.. భూగర్భగనులను పునరుద్ధరించాలని స్థానిక బొగ్గు గని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

11:33 - February 13, 2017

అనంతపురం : జిల్లాలో కరవుకు పెట్టింది పేరు. ఏడాదంతా కరవు కాటకాలతో అల్లాడుతుంది. ఇక వేసవి వస్తుందంటే చెప్పనక్కర్లేదు. తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని రుద్రంపేట పంచాయితీలో తాగునీటి సమస్య అధికమైంది. పంచాయితీ పరిధిలో 24బోర్లు వుంటే, వాటిలో పద్దెనిమిది బోర్లు ఎండిపోగా, కేవలం ఆరు బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయి.

1.25కోట్ల రూపాయలతో వాటర్ సంపును ..

దీంతో ప్రభుత్వం 1.25కోట్ల రూపాయలతో వాటర్ సంపును ఆగమేఘాల మీద నిర్మిస్తోంది. అయితే ఇప్పట్లో ఈ సంపు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. ఇక చేసేదేమీ లేక ప్రైవేట్ ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. ఆ నీరు తమకు చాలడం లేదంటూ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

శివారు ప్రాంతాల్లో...

పంచాయితీ పరిదిలోని చంద్రబాబు నగర్,రుద్రంపేట,అజయ్ ఘోష్ కాలనీ, మదర్ థెరిసా కాలనీ లాంటి శివారుప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఈ కాలనీల్లో నివసించే ప్రజలు ఉదయం కూలీపనికి వెళ్లి సాయంత్రం ఇళ్లకు చేరుకుంటారు. ప్రజలు ఇళ్ల దగ్గర ఉన్నప్పుడే నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి శివారు పంచాయతీలకు పిఏబిఆర్ నీటిని అందించకపోతే మిగిలిన పంచాయతీలైన నారాయణపురం,కక్కలపల్లి కాలనీ,ఆకుతోటపల్లి,అనంతపురం రూరల్‌లో రోజురోజకు పరిస్థితి దిగజారిపోయే అవకాశాలున్నాయి. ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని లేదంటే రానున్న వేసవి కాలంలో చుక్క నీరు కూడా దొరకదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు .

11:30 - February 13, 2017

హైదరాబాద్: ప్రతిష్టాత్మక 59వ గ్రామీ పురస్కారాలను అమెరికా లాస్‌ఏంజెల్స్‌లో ప్రకటించారు. డేవిస్‌ బోవి అత్యధికంగా 4 పురస్కారాలు దక్కించుకున్నాడు. ఉత్తమ రాక్‌ సాంగ్‌, ఉత్తమ ప్రత్యామ్నాయ సంగీత ఆల్బమ్‌, ఉత్తమ రికార్డింగ్‌ ప్యాకేజ్‌, ఉత్తమ రాక్‌ పర్మార్మెన్స్‌ విభాగాల్లో ఆయనకు ఈ గ్రామీ పురస్కారాలు దక్కాయి. ద బీటిల్స్‌ ఉత్తమ సంగీత చిత్రంగా నిలిచింది. ఉత్తమ పాప్‌, గ్రూప్‌ ఫర్మార్మెన్స్‌ అవార్డును ట్వంటీ వన్‌ పైలట్స్‌ దక్కించుకుంది. ఇక ఉత్తమ సంగీత వీడియోగా బీవన్స్‌ ఫార్మేషన్‌..ఉత్తమ పాప్‌ వోకల్‌ ఆల్బమ్‌గా అడెలె..ఉత్తమ అమెరికన్‌ ఆల్బమ్‌గా విలియమ్‌ బెల్‌ దిస్‌ ఈజ్‌ వేర్‌ ఐ లివ్‌ గ్రామీ పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. ఉత్తమ రాక్‌ ఆల్బమ్‌గా కేజ్‌ ద ఎలిఫెంట్‌, ఉత్తమ హాస్య ఆల్బమ్‌గా పటాన్‌ ఓస్వల్ట్‌, ఉత్తమ దృశ్య మాధ్యమ సౌండ్‌ ట్రాక్‌ జాన్‌ విలియమ్స్‌ అవార్డులు దక్కించుకున్నారు.

రిసార్ట్ లోని ఎమ్మెల్యేల వాంగ్మూలాల సేకరణ

చెన్నై : మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు రిసార్ట్ లోని ఎమ్మెల్యేల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. నేడు ఎమ్మెల్యేల వాంగ్మూలాలను పోలీసులు హైకోర్టుకు అందజేయనున్నారు. మరో వైపు నేడు సన్నీర్ సెల్వం సచివాలయానికి వెళ్లనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు పై గవర్నర్ జాప్యం పై బిజెపి ఎంపి కోర్టులో కేసు వేస్తానని సుబ్రమణ్యస్వామి హెచ్చరిస్తున్నారు.

జీడిమెట్ల బౌరంపేటలో విషాదం

హైదరాబాద్ : జీడిమెట్ల బౌరంపేటలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు సాయికుమార్, జయప్రకాశ్ గా గుర్తించారు.

పాతబస్తీలో ప్రాణం తీసిన స్నేక్ ల్యాడర్ గేమ్

హైదరాబాద్: పాత బస్తీలో స్నేక్ ల్యాడర్ గేమ్ ఓ చిన్నారి ప్రాణం తీసింది. గేమ్ లో ఓడిపోయిన తనను కించపరిచాడని ఓ బాలుడిపై మరో బాలుడు పిడిగుద్దులు గుద్దాడు. ఆసపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు ఖాలేద్ మృతి చెందాడు. మీర్ చౌక్ పీఎస్ లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడిని జువైనల్ కోర్టుకు అప్పగించారు.

నక్సల్స్ కాల్పులు ... ఇద్దరి మృతి

హైదరాబాద్: జార్ఖండ్‌లో బెల్వగటి గ్రామంలో గ్రామ పంచాయతి సర్పంచ్ ఇంటిపై నక్సల్స్ కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో 11మంది నక్సలైట్లు పాల్గొన్నట్లు సమాచారం.

09:55 - February 13, 2017

శ్రీకాకుళం : లక్షల రూపాయలు వెచ్చించారు. భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. కాని..ప్రారంభోత్సవాన్ని మాత్రం మరిచిపోయారు. పుష్కరంన్నర కాలం గడిచినా.. దుకాణసముదాయం అందుబాటులోకి రాలేదు. లక్షల రూపాయల ప్రజాధనం సిమెంట్‌ గోడల్లో కరిగిపోగా.. బిల్డింగ్‌ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో పాలకుల నిర్లక్ష్యాన్ని నిలువెత్తున వెక్కిరిస్తోంది.. ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ .. పాలకుల నిర్లక్ష్యం.. ఇలా జనం ముక్కుపుటాలు అదరగొడుతోంది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఊరి నడిబొడ్డున దిష్టిబొమ్మలా నిలిచిందీ దుకాణసముదాయం.

2001లో రూ. 40లక్షల ఖర్చుతో బిల్డింగ్‌ నిర్మాణం.....

2001 లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ... నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు... 16ఏళ్ల క్రితమే 40 లక్షల రూపాయలు వెచ్చించి.. ఘనమైన లక్ష్యంకోసం నిర్మించిన ఈ బిల్డింగ్‌.. అధికారులు, ప్రజాప్రతినిధుల తోలుమందం తీరుకు ఆనవాలుగా ప్రజలను వెక్కిరిస్తోంది. దాదాపు 50 షాపులు ఏర్పాటు చేసుకునే విధంగా రెండు అంతస్తుల్లో గదులను నిర్మించారు. ఒకే ప్రాంగణంలో మార్కెట్ ఉండాలన్న ధ్యేయంతో ఆర్ అండ్ బి శాఖ ఈ షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించింది. కాని నిర్మాణం పూర్తి అయ్యి దశాబ్దంన్నర గడిచినా .. ఇంతవరకు ఒక్క షాపు కూడా ఓపెన్‌కాలేదు.

16ఏళ్లుగా ఖాళీగా ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ ....

దశాబ్దన్నర కాలంగా ఖాళీగా వదిలేయడంతో భవనం శిథిలావస్థకు చేరుకుంది. పొత్తులోసొమ్ము.. ఇష్టార్యాజ్యంగా వాడుకోవచ్చనుకున్నారో ఏమో.. బిల్డింగ్‌ను కొందరు స్థానికులు ఇలా .. మరుగుదొడ్లలా మార్చేశారు. ఇక రాత్రయిందంటే.. ఈ ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందని.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదహారు ఏళ్లుగా నిరుపయోగంగా పడిఉన్న ఈ బిల్డింగ్‌కు ఇప్పటికైనా మరమ్మత్తులు చేసి.. ఉపయోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

 

09:51 - February 13, 2017

ఖమ్మం: పంటలు బాగా పండటంతో రైతులు పండగ చేసుకుంటున్నారన్న కేసీఆర్‌.. ఒక్క సారి రైతుల మధ్యకు రావాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. తెలంగాణలో సీపీఎం పార్టీ తలపెట్టిన మహాజన పాదయాత్ర 119వ రోజు కొనసాగింది. 31 జిల్లాల్లో ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా తమ్మినేని చేపట్టిన పాదయాత్రకు ఖమ్మం జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది.

సామాజిక న్యాయమే లక్ష్యంగా....

సామాజిక న్యాయమే లక్ష్యంగా తెలంగాణలో సీపీఎం మహాజన పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ సుదీర్ఘ పాదయాత్ర 119వ రోజు ఖమ్మం జిల్లాలో కొనసాగింది. అడుగడుగునా పాదయాత్ర బృందానికి రైతులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. డబ్బు దరువులతో గ్రామాల్లోని కళాకారులు బృందానికి ఘన స్వాగతం పలికారు. రైతులు తమ సమస్యలను వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

అసత్య ప్రచారం చేస్తోన్న ప్రభుత్వం...

పంటలు బాగా పండి రైతులు యాటలు కోసుకుంటున్నారని కేసీఆర్‌ చెబుతున్నారు.. కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి లేదన్నారు తమ్మినేని వీరభద్రం. రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊతవాగు ప్రాజెక్టు నిర్మించాలని తమ్మినేని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

ఖమ్మం జిల్లాలోని ...

ఖమ్మం జిల్లాలోని జాస్తుపల్లి, తాతానుగూడెం, పండితాపురం, బుడిదెంపాడు , మంచుకొండ, రఘునాథపాలెం, పాండురంగాపురం, ఖానాపురం, హవేలిలో పాదయాత్ర బృందం పర్యటించింది. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న సీపీఎం నాయకులు... ఎండిపోయిన పంటలను పరిశీలించారు. మిరప పంట వేసి తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహాజన పాదయాత్రకు 10 టీవి బృందం మద్దతు తెలిపింది. తమ్మినేనితో కలిసి ఉద్యోగులు పాదయాత్రలో పాల్గొన్నారు.

09:46 - February 13, 2017

చెన్నై:

చెన్నై: తమిళనాట రాజకీయ అస్థిరత నెలకొనడంతో తాము అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఉన్న అవకాశాలపై చర్చించేందుకు సాయంత్రం ఐదింటికి పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేసింది. జయలలిత మరణానంతరం శాసనసభలో ముఖ్యమంత్రి పన్నీరుకు డీఎంకే పలు అంశాల్లో మద్దతుగా నిలుస్తూ వచ్చింది. జల్లికట్టుకు చట్టబద్ధత విషయంలో పూర్తి సహకారం అందించింది. మారిన పరిస్థితుల్లోనూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం పక్షానే ఆ పార్టీ నిలిచింది. శాసనసభలో బలపరీక్ష జరిగితే పన్నీరుకు మద్దతు ఉంటుందని ఇటీవలే ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఈ ప్రకటనను పార్టీ అధిష్ఠానం ఖండించినప్పటికీ ముఖ్యమంత్రి విషయంలో పార్టీ నేతలు సానుకూలంగానే ఉన్నారు. అన్నాడీఎంకే విషయంలో ఎవరూ మాట్లాడకూడదంటూ పార్టీ నేతలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో డీఎంకే ప్రభుత్వం ఏర్పడనుందని స్టాలిన్‌ కార్యకర్తలకు లేఖలు రాయడం చర్చనీయాంశమైంది. భవిష్యత్తు కార్యాచరణపై నేడు ప్రధానంగా చర్చించే అవకాశాలున్నాయి.

ఆర్టీఏ తనిఖీలు- 10 బస్సులు సీజ్

హైదరాబాద్: హయత్ నగర్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు.

ప్రారంభమైన పెద్దగట్టు లింగమంతుల జాతర

సూర్యాపేట: పెద్దగట్టు లింగమంతుల జాతర ప్రారంభం అయ్యింది. కేసారం నుంచి దేవరపెట్టెను పూజాదులు తరలించారు. కేసారం యాదవులకు దేవరపెట్టెను అందించి లింగమంతుల జాతరను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. రెండేళ్లకోసారి 5 రోజుల పాటు వైభవంగా ఈ జాతర జరగనుంది. చివ్వెల మండలం దురాజ్ పల్లికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్- విజయవాడ హైవే పై వాహనాలను దారి మళ్లించారు.

ఎయిర్ పోర్టు కు నాగశైలజ మృతదేహం

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు కు విద్యార్థిని నాగశైలజ మృతదేహం చేరుకుంది. గతవారం పోలాండ్ లో అనారోగ్యంతో శైలజ మృతి చెందింది. పాస్ పోర్ట్ లేదంటూ మృతదేహాన్ని ఇచ్చేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టు సిబ్బంది నిరాకరించారు. పాస్ పోర్టు తప్పిపోవడానికి విమాన సిబ్బందే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

లాస్ ఏజంఎల్స్ 59వ గ్రామీ పురష్కారాలు

హైదరాబాద్: లాస్ ఏజంఎల్స్ 59వ గ్రామీ పురష్కారాలను ప్రకటించారు. ఉత్తమ రాక్ సాంగ్ -డేవిడ్ బోబీ(బ్లాక్ స్టార్), ఉత్తమ పాప్, గ్రూప్ పర్ఫార్మెన్స్ -ట్వంటీవన్ ఫైలట్స్ (స్టెన్డ్ ఔట్), ఉత్తమ సంగీత వీడియో -జీవన్స్ (ఫార్మేషన్), ఉత్తమ పాప్ వోకల్ ఆల్బమ్-ఆడెలె.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

p { margin-bottom: 0.25cm; line-height: 120%; }a:link { }

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

ఆర్బీఐ అధికారులతో బీఎస్ ఎఫ్ చర్చలు..

కోల్‌కతా : భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి అక్రమంగా తరలివస్తున్న నకిలీ కరెన్సీని గుర్తించేందుకు సైనికులకు శిక్షణ ఇవ్వాలని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) యోచిస్తున్నది. ఇందుకు ఆర్బీఐ అధికారులతో బీఎస్‌ఎఫ్ చర్చలు జరుపుతున్నది.

నేడు డీఎంకే కీలక సమావేశం

చెన్నై: తమిళడులో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొనడంతో తాము అనుసరించాల్సిన వ్యూహంపై అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఉన్న అవకాశాలపై చర్చించేందుకు సాయంత్రం ఐదింటికి పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేసింది.

08:55 - February 13, 2017

హైదరాబాద్: తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం పన్నీర్‌ సెల్వం, శశికళ మధ్య పోరు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో రాజకీయ సమీకరణలు కూడా అదే స్థాయిలో మారుతున్నాయి. పన్నీర్ సెల్వం మద్దతుదారుల సంఖ్య రోజురోజుకూపెరుగుతుండటం..శశికళ వర్గానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యం గరవ్నర్ ఏం చేయబోతున్నారు? మరో వైపు డీఎంకే నేత స్టాలిన్ మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. విజయవాడలో జరిగిన ఉమెన్ పార్లమెంటరీ సదస్సుతో సాధికారత సాధించినట్లేనా? ఎమ్మెల్యే రోజాను సదస్సుకు ఎందుకు రానివ్వలేదు? అస్సలు సాధికారత అంటే ఏమిటి? ఇత్యాది అంశాలపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిడిపినేత దినకర్, బిజెపి అద్దేపల్లి శ్రీధర్, సీపీఎం నేత శ్రీదేవి, సీనియర్ రాజకీయ విశ్లేషకులు నగేష్, వైసీపీ నేత పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

06:56 - February 13, 2017

చెన్నై: తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం పన్నీర్‌ సెల్వం, శశికళ మధ్య పోరు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో రాజకీయ సమీకరణలు కూడా అదే స్థాయిలో మారుతున్నాయి. పన్నీర్ సెల్వం మద్దతుదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం..శశికళ వర్గానికి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 10 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పన్నీర్ సెల్వంను కలిసి మద్దతు ప్రకటించారు. పన్నీర్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య సైతం ఏడుకు చేరింది. ఇదే వలసల పర్వం కొనసాగి మరో 11 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ గూటికి చేరితే శశికళ సీఎం పీఠంపై ఆశలు వదులుకోవాల్సిందే. సెల్వంకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 18కి చేరితే శశికళ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాళం ఉండదు.

ఇక పన్నీర్ సెల్వం నివాసం ఆయన మద్దతుదారులతో పోటెత్తుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలు చెన్నై తరలివస్తున్నారు. దీంతో పన్నీర్‌ సెల్వం ఇంటికి నేతలు, కార్యకర్తల తాకిడితో కోలాహలం నెలకొంది.

పన్నీర్‌ సెల్వంకు మద్దతు పెరుగుతుండటంతో శశికళ తన వర్గంలోని ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పన్నీరు సెల్వం గోల్డెన్‌ బే రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను కలుస్తారని ప్రచారం జరగడంతో శశికళ అలెర్ట్ అయ్యారు. పొయెస్ గార్డెన్‌లో పార్టీ నేతలు, సినీ ప్రముఖులతో శశికళ సమావేశమయ్యారు. తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఆమె చర్చించారు. తనకు 133 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తనతో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. గవర్నర్‌కు తాను ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీని చీల్చేందుకు కొందరు కుట్ర పన్నారని, ఆ కుట్ర పన్నింది ఎవరో అందరికీ తెలుసని అన్నారు.

ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు శశికళ తీవ్ర ప్రయత్నాలు

ఆ తర్వాత కాంచీపురం జిల్లాలోని గోల్డెన్ బే రిసార్ట్‌లో తన ఎమ్మెల్యేలతో శశికళ భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులపై మంతనాలు జరిపారు. రాజకీయాల్లో మహిళ కొనసాగడం ఎంతో కష్టమని..ఇలాంటి కష్టాలెన్నింటినో జయలలిత అధిగమించారని శశికళ అన్నారు. పూర్తి ఐదేళ్లపాటు తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

సోమవారం డీఎంకే పార్టీ ఉన్నతస్థాయి సమావేశం ...

మరోవైపు ప్రతిపక్ష డీఎంకే సైతం తాజా పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం డీఎంకే పార్టీ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. తమిళనాడులో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఏదీ ఏమైనా అధికార పీఠం కోసం సెల్వం, శశికళ ఆధిపత్య పోరులో ఎవరు పై చేయి సాధిస్తారన్నది తమిళనాట ఉత్కంఠ రేపుతోంది.

ఎత్తుకు పై ఎత్తులు...

ముఖ్యమంత్రి పదవిని పొందేందుకు చిన్నమ్మ, పన్నీర్‌ సెల్వం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పరస్పర ఆరోపణలు సైతం చేసుకుంటున్నారు. శశికళ ఎప్పటికీ జయలలిత కాలేదని పన్నీరు ఆరోపించారు. ఇదిలావుంటే.. గవర్నర్‌ తీరును నిరసిస్తూ శశికళ వర్గం ఆందోళనకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

మాటలయుద్ధం...

శశికళ, పన్నీరు సెల్వం మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరోవైపు సీఎం పదవి చేపట్టేందుకు ఇరు వర్గాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ అందరినీ వెంటాడుతోంది.

శశికళ చేసిన ఆరోపణల పట్ల తీవ్రంగా స్పందించిన పన్నీరు సెల్వం

తనపై శశికళ చేసిన ఆరోపణల పట్ల పన్నీరు సెల్వం తీవ్రంగా స్పందించారు. శశికళ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. తనపై బురద చల్లినా ఎలాంటి ప్రయోజనం ఉండదని.. నా బలమేంటో అసెంబ్లీలో నిరూపించుకుంటానని పన్నీరు సెల్వం తెలిపారు. గోల్డెన్‌ బే రిస్టార్ట్‌కు శశికళ ఎందుకు వెళ్లారని పన్నీరు ప్రశ్నించారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేల చుట్టూ నలుగురైదుగురు గుండాలను కాపలాగా పెట్టినట్లు మిగతా ఎమ్మెల్యేలు చెప్పినట్లు పన్నీరు సెల్వం అన్నారు. ఆమె ఎన్ని వేషాలు వేసినా.. జయలలిత కాబోరన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. తాను ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించలేదని.. వాళ్లే స్వయంగా వస్తున్నారన్నారు పన్నీరు సెల్వం.

రోజురోజుకు పన్నీకు పెరుగుతున్న మద్దతు...

ఇదిలావుంటే.. రోజురోజుకు పన్నీరు సెల్వంకు మద్దతు పెరుగుతుండడంతో శశికళ వర్గంలో ఆందోళన మొదలైంది. దీంతో ఆమె అసహనానికి గురవుతున్నారు. మరోవైపు గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు గవర్నర్‌కు లేఖ రాసిన శశికళ.. గవర్నర్‌ తీరును నిరసిస్తూ జయలలిత మెమోరియల్‌ దగ్గర దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈరోజు నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రదర్శనలు చేపట్టబోతున్నారు.

శశికళకు అనేక అడ్డంకులు...

మొత్తానికి ఓవైపు పన్నీరుకు మద్దతు పెరుగుతుండగా.. శశికళకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇంత ఉత్కంఠ పరిస్థితిలోనూ గవర్నర్‌ నిర్ణయం తీసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమిళనాడు సంక్షోభంపై ఈరోజు గవర్నర్‌ నిర్ణయం తీసుకోకపోతే... రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 కింద రిట్‌ పటిషన్‌ దాఖలు చేయనున్నట్లు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రకటించారు. రాజ్యాంగ ప్రకారం శశికళకు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశముందన్నారు. మొత్తానికి తమిళనాడు అనిశ్చితి పరిస్థితికి వారం గడుస్తున్నా ఇంకా పరిష్కారం లభించకపోవడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ అందరినీ వెంటాడుతోంది.

06:51 - February 13, 2017

p { margin-bottom: 0.21cm; }

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సీఎం.. పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన సచివాలయం, ప్రభుత్వం భవనాలు, క్వార్టర్ల అప్పగింత అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. భవనాలను అప్పగించాలని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. మంత్రుల కమిటీ సమావేశంలో మరోసారి ఆ విషయాన్ని తెలిపింది. ఈ నెల 26న జరగనున్న తదుపరి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌, సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ సమావేశంలో బడ్జెట్‌ సమావేశ నిర్వహణతో పాటు.. ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

06:48 - February 13, 2017

హైదరాబాద్: తెలంగాణలో గురుకుల పాఠశాలల ఉద్యోగ నోటిఫికేషన్ వివాదం ఇంకా రాజుకుంటోంది. గత వారం ఇదే అంశంపై జనపథం నిర్వహించిన రోజే ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా విద్యార్థుల సమస్యలపై ఒకింత సానుకూల దృక్పథంతో స్పందించారు. గురుకుల టీచర్ పోస్టుల భర్తీ విషయంలో డిగ్రీలో 60శాతం మార్కుల నిబంధనను సిఎం కూడా వ్యతిరేకించారు. అయితే, పాత నోటిఫికేషన్ ను సవరిస్తూ మరో కొత్త నోటిఫికేషన్ జారీ కావాల్సి వుంది. అయితే, నిరుద్యోగులు, విద్యార్థి యువజన సంఘాలు ఈ నోటిఫికేషన్ లో సవరించాల్సిన అంశాలు మరికొన్ని వున్నాయంటున్నారు. తమ డిమాండ్లను వినిపిస్తూ ఇవాళ వివిధ విద్యార్థి యువజన సంఘాలు టిఎస్ పిఎస్సీ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చాయి. విద్యార్థి యువజన సంఘాలు టిఎస్ పిఎస్సీ ముట్టడికి పిలుపునివ్వడానికి కారణం ఏమిటి? టిఎస్ పిఎస్సీ ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? గురుకుల పాఠశాలల ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో వున్న లోపాలేమిటి? విద్యార్థి యువజన సంఘాలు సూచిస్తున్న సవరణలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మాట్లాడేందుకు ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

06:46 - February 13, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టి సారించారు.. నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే నివేదిక అందుకున్నారు.

సీపీఎం పోరాటాలతో దిగివచ్చిన సర్కార్‌ ...

ప్రాజెక్టుపై నిర్వాసితులు తమగోడును వెళ్లబోసుకున్న ప్రభుత్వం నుంచి ఇసుమంతైనా స్పందనలేదు. సీపీఎం బాధితుల పక్షాన నిలిచి పోరాటాలు ఉధృతం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి 43 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మరో 150కోట్ల రూపాయలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఖాతాలో జమ చేసి.. సర్వే నివేదికల ఆధారంగా నిర్వాసితులకు పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చింది.

116 మందితో యూత్‌ ప్యాకేజీ....

అయితే ఈ నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొత్తూరు మండలం కృష్ణాపురం నిర్వాసిత గ్రామంలో 116 మందిని యూత్ ప్యాకేజీకి ఎంపిక చేయగా ఇందులో 41 మంది అనర్హులు ఉన్నట్లు విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో నిర్వాసితులు నిరసనలను ఉధృతం చేశారు.

2005లో పునాదిరాయి.....

వాస్తవానికి వంశధార ప్రాజెక్ట్ కు 2005 కాంగ్రెస్ హయాంలో పునాది రాయి పడినా.. నిర్మాణ సమయంలో ఎదురైన ఆటంకాలు, నిధుల లేమి సమస్యలతో ప్రాజెక్ట్ మరుగున పడింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు దృష్టిసారించారు. అయితే పరిహారం విషయంలో ప్రభుత్వానికి, నిర్వాసితులకు మధ్య సమరం మొదలైంది. 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు.

జీవో.416 ద్వారా మోసం చేస్తున్నారని ఆరోపణ....

జీఓ 416 ద్వారా తమను మోసం చేస్తున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. ఈ అంశాలన్నింటిని ఒక నివేదిక రూపంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ జనసేనాని దృష్టికి తీసుకువెళ్ళింది. ప్రస్తుం అమెరికా పర్యటనలో ఉన్న పవర్ స్టార్ హైదరాబాద్‌కు రాగానే వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపై స్పందిస్తారని ట్రస్ట్ చైర్మన్ ప్రసాదరావు తెలిపారు.ఇదిలా ఉంటే అమెరికా పర్యటనలో పవన్ కల్యాణ్‌ అణు నిపుణులతో సమావేశమవడాన్ని శ్రీకాకుళం జిల్లా వాసులు స్వాగతిస్తున్నారు.. రణస్థలం మండలంలోని కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ముప్పుపై జనసేనాని నిజాయితీగా వాస్తవాలు ప్రకటించాలని కోరుతున్నారు.. మొత్తమ్మీద జిల్లాలోని కొవ్వాడ అణు ప్రాజెక్ట్, వంశధార నిర్వాసితుల విషయంలో పవన్ స్పందన ఏ విధంగా బాధితులకు న్యాయం చేస్తుందో వేచి చూడాలి.

06:45 - February 13, 2017

అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానానికి టిడిపిలో పోటీ తీవ్రంగా ఉంది. అనంతపురం జిల్లాలో మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్సీ సీటు ఖాళీ అవుతున్న నేపథ్యంలో.. ఆ పదవికి అధికారపార్టీ నేతల మధ్య తీవ్రపోరు నెలకొంది. తనకే మరోసారి అవకాశం కల్పించాలంటూ మెట్టు గోవిందరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు రాయదుర్గం నియోజకవర్గం నుంచి దీపక్ రెడ్డి, అనంతపురం నుంచి టీడీపీ సీనియర్‌ నేత గడ్డం సుబ్రమణ్యం ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు అనేది అధినేత చంద్రబాబు ఫైనల్‌ చేయనున్నారు.

ఎమ్మెల్సీ సీటు కోసం టీడీపీలో తీవ్ర ప్రయత్నాలు.....

అధికార పార్టీలో ఎమ్మెల్సీ సీటు వ్యవహారం అనంతపురం నాయకుల మధ్య మరోసారి చిచ్చు రేపనుంది. రాయదుర్గానికి చెందిన నేతల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. అన్నిస్థానాలు వారికే ఇస్తారా అంటూ జిల్లాలోని ఇతర నేతలు కూడా అభ్యంతరం చెబుతున్నారు. ఇప్పటికే చీఫ్‌ విప్ కాలువ శ్రీనివాసులతో పాటు, తాజాగా చమన్ స్థానంలో జెడ్పీ ఛైర్మన్‌గా పూల నాగరాజును ఖరారు చేశారు. మళ్ళీ అదే నియోజకవర్గానికి చెందిన దీపక్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికిపోటీగా టీడీపీ సీనియర్‌ నేత, పరిటాల వర్గంలో కీలక నాయకుడిగా ఉన్న గడ్డం సుబ్రమణ్యం కూడా తనకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలంటూ పట్టుబడుతున్నారు. దీంతో అనంతపురంలో సమస్య కొలిక్కి రాకపోవటంతో ముఖ్యమంత్రి వద్దకు పంచాయతీ చేరింది. దీంతో చంద్రబాబు జిల్లా నేతలతో చర్చించి.. అభ్యర్థిని ఫైనల్‌ చేయనున్నారు.

ఎమ్మెల్సీ సీటు కోసం జేసీ బ్రదర్స్‌పై దీపక్‌రెడ్డి ఒత్తిడి....

దీపక్ రెడ్డి తన స్థానాన్ని కాలువ శ్రీనివాసులుకు అప్పగించిన నేపథ్యంలో తనకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీటు కేటాయించాలంటూ... తన మామలైన జేసీ బ్రదర్స్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అప్పట్లో చంద్రబాబు కూడా పదవిపై తనకు హామీ ఇచ్చారని చెబుతున్నారు దీపక్‌రెడ్డి. మరోవైపు పార్టీ అధినేత ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలో పనిచేస్తున్నానని, అందుకే తన స్థానంలో ఖాళీ అయ్యే సీటును తనకే కేటాయించాలంటూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి. వీరేకాదు.. టీడీపీలో చాలామంది నేతలు ఎమ్మెల్సీ సీటు కోసం ముఖ్యమంత్రికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇక గడ్డం సుబ్రమణ్యానికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని పలువురు నేతలు ప్రతిపాదిస్తున్నప్పటికీ... సామాజిక సమీకరణలో ఆయనకు ఎమ్మెల్సీ సీటు రావడం కొంచెం అనుమానంగానే ఉంది. మొత్తంగా ఎమ్మెల్సీ సీటును అధినేత చంద్రబాబు ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Don't Miss