Activities calendar

14 February 2017

22:12 - February 14, 2017

హైదరాబాద్‌ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్ధి రోహిత్‌ వేముల కుల వివాదం కొత్త మలుపు తిరిగింది. రోహిత్‌ వేముల దళితుడు కాదని ప్రభుత్వం నియమించిన  జిల్లా స్థాయి కమిటీ నివేదించింది. రోహిత్‌ది వడ్డెర కులమని నిర్ధరించింది. ఇదే విషయాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే ధ్రువీకరించారు. రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్న 13 నెలల  తర్వాత కమిటీ నివేదిక సమర్పించింది. 
కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నం : మధు 
రోహిత్‌ వేముల కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. రోహిత్‌ వేముల దళితుడని సర్టిఫికెట్ ఇచ్చిన గుంటూరు జిల్లా కలెక్టర్.. ఇప్పుడు దళితుడు కాదు... అతను బీసీ అని సర్టిఫికెట్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని మధు ప్రశ్నించారు. తక్షణం రోహిత్ చట్టం తీసుకురావాలని, దళితుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
రోహిత్ వేముల ముమ్మాటికి ఎస్సీనే : రాములు  
రోహిత్‌ వేముల  బీసీ సామాజిక వర్గానికి చెందినవాడంటూ... గుంటూరు కలెక్టర్‌ నివేదిక ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని సీపీఎం నాయకులు రాములు అన్నారు. రోహిత్ వేముల ముమ్మాటికి ఎస్సీ కులానికి చెందినవాడేనని, కేంద్రమంత్రులను కేసు నుంచి తప్పించడానికే రోహిత్‌ కులం విషయంలో కేంద్రం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. అలాగే రోహిత్ వేముల కుల ధ్రువీకరణపై సిట్టింగ్‌ జ్జడితో విచారణ చేయించాలని న్యూ డెమోక్రసీ నాయకులు వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. రోహిత్ వేముల దళితుడనే విషయం అందరికీ తెలుసని..ఇప్పుడు ఆయన కులాన్ని బీసీగా ప్రకటించడం అన్యాయమని న్యూడెమోక్రసీ చంద్రన్న పార్టీ నేత గోవర్ధన్‌ అన్నారు. 
గతేడాది జనవరిలో రోహిత్ ఆత్మహత్య 
హెచ్‌సీయూలో రీసెర్చ్‌ స్కాలర్‌ అయిన రోహిత్‌ వేముల గత ఏడాది జనవరిలో తన హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యునివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నారని, వారికో తాడు ఇస్తే ఉరి వేసుకుంటారని ఆత్మహత్యకు ముందు రోహిత్‌ వీసీకి లేఖ రాశారు. 
రోహిత్ మృతి తర్వాత కులంపై వివాదం 
రోహిత్ మృతి తర్వాత అతని కులంపై వివాదం తలెత్తింది. అనంతరం రోహిత్‌ వేముల దళితుడని  గుంటూరు తహసీల్దార్‌ నిర్ధారించిన కుల ధృవీకరణ పత్రాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ అప్పట్లో జాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపారు.  అదే సమయంలో నా పేరు రోహిత్‌ వేముల...నేను గుంటూరుకు చెందిన దళితుడినని అప్పట్లో రోహిత్‌ స్వయంగా మాట్లాడిన వీడియో ఒకటి బయటకొచ్చింది. రోహిత్‌ స్నేహితులు కూడా ఆ వీడియోను బహిర్గతం చేశారు. రోహిత్‌ వేముల బీసీ అంటూ తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించడాన్ని వామపక్షాలు, దళిత సంఘాలు ఖండించాయి. 

 

22:07 - February 14, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్లో మొత్తం 9 అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలను ఏర్పాటుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో కర్నూలు, అనంతపురం, గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. వచ్చే 18నెలల్లో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల్లో లక్షా 20వేల ఇళ్లను సింగిల్‌, డబుల్‌, త్రిబుల్‌ బెడ్‌రూంలుగా నిర్మించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఎన్నికల కోడ్‌లేని జిల్లాల్లో నాలుగు రోజుల్లో టెండర్లను పిలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మద్యం షాపుల లైసెన్స్‌ ఫీజులను తగ్గించడంతో పాటు..సమగ్రమైన మద్యంపాలసీని రూపొందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇక మహిళలను గౌరవించేందుకు అమ్మకు వందనం కార్యక్రమాన్ని  మార్చిలో ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే సైబర్‌ సెక్యూరిటీ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

 

22:03 - February 14, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నాయి. గంట గంటకు ఊహించని మలుపులు తిరుగుతూ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిని రేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి కావాలన్న చిన్నమ్మ కల.. సుప్రీంకోర్టు తీర్పుతో కలగానే మిగిలిపోయింది. దీంతో శశికళ తన వారసుడిగా పళనీస్వామిని ఎంపిక చేశారు. తొలుత సెంగొట్టియన్‌ పేరు తెరపైకి వచ్చినా.. ఆ తర్వాత మళ్లీ చిన్నమ్మ మనసు మార్చుకొని తనకు నమ్మినబంటుగా ఉన్న పళనిస్వామివైపే మొగ్గుచూపింది. ఇంతకీ పళనిస్వామి ఎవరు ? అతనివైపే శశికళ ఎందుకు మొగ్గుచూపింది. వాచ్‌ దిస్‌ స్టోరీ. 
తెరపైకి పళనిస్వామి..?
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యంగా  పళనిస్వామి పేరు తెరపైకి వచ్చింది. శశికళకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకపోవడంతో... అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమెకు నమ్మినబంటూ, వీర విధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. పన్నీరు సెల్వం కేబినెట్‌లో పళనిస్వామి సీనియర్ మంత్రి. ప్రస్తుతం రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రిగా ఉన్నారు. సేలం జిల్లాలోని ఎడపాడి నియోజవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎడపాడి నియోజకవర్గం నుంచి పళనిస్వామి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పళనిస్వామి వరుసగా విజయం సాధించారు. జయలలిత బతికున్న రోజుల్లో ఆమెకు వీరవిధేయుడిగా పళనిస్వామి ఉండేవారు. అలాగే శశికళకు కూడా నమ్మినబంటుగా ఉన్నారు. జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినపుడు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వంతో పాటు పళనిస్వామి పేరు కూడా వినిపించింది. శశికళ..పళనిస్వామినే ముఖ్యమంత్రిని చేయాలని భావించారు. అయితే జయలలితకు విశ్వాసపాత్రుడిగా ఉన్న పన్నీరు సెల్వమే సీఎం పగ్గాలు చేపట్టారు.
పన్నీరు సెల్వం అంటే పళనిస్వామికి పడదు... 
అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అంటే పళనిస్వామికి అసలు పడదు. అన్నాడీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికయ్యాక పన్నీరు సెల్వం తిరుగుబాటు చేశారు. సరిగ్గా అప్పుడే పళనిస్వామి చిన్నమ్మ శశికళకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు శిక్షపడటంతో ముఖ్యమంత్రి పదవికి ఇన్నాళ్లూ తనకు నమ్మినబంటుగా ఉన్న పళనిస్వామిని శాసనసభాపక్షనేతగా శశికళ ఖరారు చేసింది. అయితే అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు గవర్నర్ అవకాశం ఇస్తారా లేదా ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామిని ఆహ్వానిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.

 

22:00 - February 14, 2017

తమిళనాడు : అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు కర్ణాటక ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది. ఈ కేసులో మొత్తం 570 పేజీలతో కూడిన సుదీర్ఘ తీర్పుకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలను ఇపుడు చూద్దాం. అక్రమ ఆస్తులను కూడబెట్టడంలో జయలలిత తీరును కూడా కోర్టు తప్పు పట్టింది.
570 పేజీలతో కూడిన సుదీర్ఘ తీర్పు
అక్రమ ఆస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ధారిస్తూ 570 పేజీలతో కూడిన సుదీర్ఘ తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించింది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. 
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు కొట్టివేత 
ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎ2 నుంచి ఎ4 వరకు ఉన్న ముగ్గురు నిందితులపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును యథాతథంగా అమలుచేయాలని ఆదేశించింది. ఈ కేసులో ఎ1 నిందితురాలంటే జయలలిత, ఎ2 శశికళ, ఎ3 ఇళవరసి ఎ4 సుధాకరన్.
నిందితులకు నాలుగేళ్లు జైలు శిక్ష విధింపు 
ఎ1తో ఎ2 నుంచి ఎ4 వరకు సంబంధాలు ఉన్నప్పటికీ, ఎ1 నిందితురాలు అంటే జయలలిత మరణించినందువల్ల ఆమెకు సంబంధించిన విషయాలను తీసేవేయాల్సి వచ్చిందని తీర్పులో పేర్కొంది. ఎ2 అంటే శశికళ నుంచి ఎ4 అంటే సుధాకరన్ వరకు ఉన్న నిందితులపై అభియోగాలు రుజువయ్యాయి. వారికి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను పునరుద్ధరించాలని.... దాని పరిణామాలను కూడా వారు అనుభవించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఆ ముగ్గురూ ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోవాలని.... మిగిలి ఉన్న శిక్షాకాలాన్ని పూర్తిచేసుకోవాలని తీర్పులో పేర్కొంది. ఈ కేసులో నిందితులకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించగా...ఇంతకు ముందు శశికళ 6 నెలల జైలు శిక్ష అనుభవించారు. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు సరైన ఆధారాలను పొందుపరచ లేదని సుప్రీంకోర్టు తీర్పుపాఠంలో వెల్లడించింది. శశికళ ఆమె బంధువులు చట్టప్రకారం ఆస్తులు కూడబెట్టారని చూపడంలో హైకోర్టు విఫలమైందని కోర్టు పేర్కొంది.
శశికళ అక్రమ సంపాదన 
12 కంపెనీలకు చెందిన లావాదేవీలను బట్టి శశికళ అక్రమంగా డబ్బు సంపాదించినట్లు అర్థమవుతోంది. 1991లో ఆస్తులు 2.1 కోట్లుంటే 1996లో 66.44 కోట్లకు చేరుకుంది. అతి తక్కువ సమయంలో 64 కోట్ల ఆస్తులు కూడబెట్టారని తీర్పులో వెల్లడించింది. ఈ కేసులో దోషులు వివాదస్పద ఆస్తులను అతితక్కువ ధరకు కొనుగోలు చేశారని ట్రయల్‌ కోర్టు తీర్పులో నిజముందని సుప్రీం తెలిపింది. ఈ కుట్రలో జయలలితకు భాగస్వామ్యం ఉంది. తక్కువ ధరకు భూములను అమ్మాలని జయలలిత ఒత్తిడి తెచ్చారు.  ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ముఖ్యమంత్రి నివాసం వద్దే అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ఆదాయానికి మించి అధిక సంపదకు సంబంధించిన గణాంకాలను కర్ణాటక హైకోర్టు తప్పుగా వెల్లడించిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో దోషులు 50 బ్యాంకు ఖాతాలను తెరిచారని...లెక్క లేని అక్రమ డబ్బును అందులో జమ చేసారని పేర్కొంది. ఈ అక్రమ సంపాదనకు కేరాఫ్‌ అడ్రస్‌గా పోయెస్‌ గార్డెన్‌ నిలిచిందని సుప్రీంకోర్టు తీర్పులో వెల్లడైంది. 

21:52 - February 14, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. క్షణం క్షణం మలుపుతిరుగుతున్నాయి. శశికళను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. గోల్డెన్ బే రిసార్ట్స్ లోనే శశికళ ఉంది. రాత్రి శశికళను అరెస్తు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. రిసార్ట్స్ వద్ద భారీగా పోలీసులు భారీ మోహరించారు. రిసార్ట్స్ వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసులతో అన్నాడీఎంకే కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఖైదీలను తరలించే వాహనాలను పోలీసులు సిద్ధం చేశారు. రిసార్ట్స్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాను వీడియోలో చూద్దాం..
 

గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద ఉద్రిక్తత

చెన్నై : గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రిసార్ట్స్ లోనే శశికళ ఉంది. రాత్రి శశికళను అరెస్తు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. రిసార్ట్స్ వద్ద భారీగా పోలీసులు భారీ మోహరించారు. రిసార్ట్స్ వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసులతో అన్నాడీఎంకే కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఖైదీలను తరలించే వాహనాలను పోలీసులు సిద్ధం చేశారు. 

21:26 - February 14, 2017

చిన్నమ్మ గేమ్ నుంచి ఔట్.. ఇరవైయేళ్ల కేసుకు తెరపడింది. శశికళకు మసి అంటింది...కానీ ఈ గేమ్ ఇంకా పూర్తి కాలేదు. ఆట మాంచి రసవత్తరంగా సాగుతోంది. పళనిస్వామిదా కుర్చీ...? లేకా పన్నీరు సెల్వందా...? అనే అంశంపై ఇంకా తేలనేలేదు. తమిళనాడు కుర్చీ కోసం సాగుతున్న పోరులో అంతిమంగా మిగిలేదెవరు...? కుర్చీలాటలో గెలిచేదెవరు..? ఇదే అంశంపై ఈరోజు వైడాంగిల్ స్టోరీ. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...
 

21:16 - February 14, 2017

తారుమారైతున్న తమిళ రాజకీయం.. ఇద్దరు కొట్లాడితే మూడో మనిషికి ఛాన్స్, సర్కారును నిద్రలేపుతా అంటున్న కోదండం సారు.. గా పని జేయిసారు.. జేఏసీకో దండం, డెబ్బై సీట్లు గెలుస్తా అంటున్న కాంగ్రెస్ పార్టీ....జంపింగ్ ల లెక్కజెప్పని ఉత్తమ్ రెడ్డి, రండి బాబు..రండి ఆలస్యం చెయ్యకండ్రీ.. జగిత్యాల పేదోళ్లకు డబల్ బెడ్ రూం దమాకా, పచ్చడి అమ్మేటాయన ఈపు పచ్చడి...మంత్రి పద్మారావు కొడుకుజేసిన ఉద్దార్కం, కొండ నాల్కకు మందేస్తే ఉన్న నాల్కే ఊడింది... నట్టల మందేసిన మంత్రి దావాఖాన్ల పోరలు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...
 

జమ్మూకాశ్మీర్ లో కాల్పులు

జమ్మూకాశ్మీర్ : హంద్వాడలో కాల్పులు ఘటన కలకలం రేపింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆర్మీ మేజర్ కు తీవ్ర గాయాలయ్యాయి.

జంట హత్యల కేసులో ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు

నల్గొండ : జంట హత్యల కేసులో ఐదుగురు నిందితులకు మిర్యాలగూడ 8వ అదనపు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. వెంకట నారాయణ, రంగయ్య, చిన ఆంజనేయులు, సైదయ్య, బత్తిన రమణలకు జీవిత ఖైదుతోపాటు రూ.10వేల జరిమానా విధించారు. 2009 ఆగస్టు 3న ఇద్దరు వ్యక్తులు హత్య గావించబడ్డారు. 

అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న పవన్

వాషింగ్టన్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

 

20:37 - February 14, 2017

హైదరాబాద్‌ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్ధి రోహిత్‌ వేముల కుల వివాదం కొత్త మలుపు తిరిగింది. రోహిత్‌ వేముల దళితుడు కాదని ప్రభుత్వం నియమించిన  జిల్లా స్థాయి కమిటీ నివేదించింది. రోహిత్‌ది వడ్డెర కులమని నిర్ధారించింది. ఇదే విషయాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే ధృవీకరించారు. రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్న 13 నెలల  తర్వాత కమిటీ నివేదిక సమర్పించింది. రోహిత్ దళితుడు కాదని నిర్ధారించిడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 
రోహిత్‌ వేముల కేసును పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం : సీపీఎం నేత మధు
హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కులవివక్షత కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్‌ వేముల కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రోహిత్‌ వేముల దళితుడని సర్టిఫికెట్ ఇచ్చిన గుంటూరు జిల్లా కలెక్టర్.. ఇప్పుడు దళితుడు బీసీ అని సర్టిఫికెట్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని మధు ప్రశ్నించారు. తక్షణం రోహిత్ చట్టం తీసుకురావాలని, దళితుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. కేసును కులం చుట్టూ తిప్పుతున్నారని పేర్కొన్నారు. తల్లి ఏం కులం, ఇతరులు ఏం కులం అనే దానిపై తిప్పుతున్నారని.. ఇది సరికాన్నారు. అసలు సమస్యను పక్కదారి పట్టించి దీన్ని వివాదం చేసేందుకు పూనుకుంటున్నారు. అందరూ వ్యతిరేకించాలని అన్నారు.
రోహిత్‌ వేముల కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం: సీపీఎం నేత రాములు
రోహిత్‌ వేముల  బీసీ సామాజిక వర్గానికి చెందినవాడంటూ... గుంటూరు కలెక్టర్‌ నివేదిక ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని సీపీఎం నాయకులు రాములు అన్నారు. రోహిత్ వేముల ముమ్మాటికి ఎస్సీ కులానికి చెందినవాడేనని అన్నారు. కేంద్రమంత్రులను కేసు నుంచి తప్పించడానికే రోహిత్‌ కులం విషయంలో కేంద్రం కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. 
కుల ధ్రువీకరణపై సిట్టింగ్‌ జ్జడితో విచారణ చేయించాలి : వెంకట్రామయ్య  
అలాగే రోహిత్ వేముల కుల ధ్రువీకరణపై సిట్టింగ్‌ జ్జడితో విచారణ చేయించాలని న్యూ డెమోక్రసీ నాయకులు వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. 
రోహిత్ కులాన్ని బీసీగా ప్రకటించడం అన్యాయం : గోవర్ధన్  
రోహిత్ వేముల దళితుడనే విషయం అందరికీ తెలుసునని..ఇప్పుడు ఆయనకు కులాన్ని బీసీగా ప్రకటించడం అన్యాయమని న్యూడెమోక్రసీ చంద్రన్న పార్టీ నేత గోవర్దన్‌ అన్నారు. 

 

20:08 - February 14, 2017
20:04 - February 14, 2017

రోహిత్ వేముల ఎస్సీ కాదనడం బాధాకరమని విశ్లేషకులు నగేష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేసులో ఉన్న హెచ్ సీయూ వీసీ అప్పారావు, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తమిళనాడు రాజకీయాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

19:48 - February 14, 2017

ఖమ్మం : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. మహాజన పాదయాత్ర బృందానికి మహిళలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలుకుతూ పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న ప్రభుత్వం ఆ హామీని మర్చిపోయిందని మహిళలు విమర్శిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:43 - February 14, 2017

తమిళనాడు : గవర్నర్‌తో పళనిస్వామి భేటీ ముగిసింది. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల లేఖను గవర్నర్‌కు అందజేసిన పళనిస్వామి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరినట్లు సమాచారం. మరోవైపు రాత్రికి గవర్నర్‌ను కలిసే యోచనలో పన్నీర్‌సెల్వం ఉన్నారు. తనకే ముందు బలనిరూపణ అవకాశం ఇవ్వాలని కోరనున్నారని తెలుస్తోంది. 

 

శశికళకు సుప్రీంకోర్టు షాక్

ఢిల్లీ : శశికళకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో శశికళను కోర్టు దోషిగా తేల్చింది. జయ, శశికళ, ఇళవరశి, సుధాకరన్ దోషులుగా నిర్ధారణ చేసింది. 4 ఏళ్ల జైలు శిక్ష రూ.10 కోట్ల జరిమానా విధించింది. కర్నాటర హైకోర్టు తీర్పును సుప్రీకోర్టు కొట్టివేసింది. వెంటనే కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు శశికళ అనర్హురాలు. ఈ కేసులో ఇప్పటికే శశికళ ఆరు నెలల శిక్ష అనుభవించారు. మరో మూడున్నరేళ్లు శిక్ష అనుభవించనుంది.
 

రోహిత్ ది వడ్డేర కులమని నిర్ధారించిన ప్రభుత్వ కమిటీ

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు కొత్త మలుపు తిరుగుతోంది. కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ వేముల దళితుడు కాదని ప్రభుత్వ కమిటీ నిర్ధారించింది. రోహిత్ ది వడ్డేర కులమని విచారణ కమిటీ తేల్చింది. గతేడాది జనవరి 17న రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

18:57 - February 14, 2017

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు కొత్త మలుపు తిరుగుతోంది. కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ వేముల దళితుడు కాదని ప్రభుత్వ కమిటీ నిర్ధారించింది. రోహిత్ ది వడ్డేర కులమని విచారణ కమిటీ తేల్చింది. గతేడాది జనవరి 17న రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుల వివక్ష, వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో రోహిత్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇదిలావుంటే తాజాగా ప్రభుత్వ కమిటీ ప్రకటనపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక వేత్తలు మండిపడుతున్నాయి.
కేసులో ఉన్నవారిని కాపాడేందుకు కుట్ర : భాస్కర్  
రోహిత్ కులం మార్చి...ఆ కేసులో  కేసులో ఉన్నవారిని కాపాడేందుకు పన్నాగం పన్నుతున్నారని కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ అన్నారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులు కలిసి... రోహిత్ దళితుడు కాదని ప్రభుత్వ కమిటీ చేత నిర్ధారింప చేశారని ఆరోపించారు. నరేంద్రమోడీ, చంద్రబాబులు ఆర్ ఎస్ ఎస్ అంటకాగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీవ్రమైన దళిత ప్రతిఘటన ఎదుర్కొనక తప్పదని స్పష్టం చేశారు. దళితుల వైపు నిలబడకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మోడీ, చంద్రబాబులకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇది రాజకీయ దురుద్ధేశపు చర్య : మాల్యాద్రి 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దురుద్ధేశంతో చేస్తున్న చర్యగా ఏపీ కేవీపీఎస్ నేత మాల్యాద్రి అభిర్ణించారు. 
ప్రభుత్వాలు దళితులకు వ్యతిరేకంగా వ్యవహిరించడం సరికాదన్నారు.
దళితులపై వ్యతిరేక క్యాంపెయిన్ : కంచె ఐలయ్య
ప్రభుత్వాలు దళితులపై వ్యతిరేక క్యాంపెయిన్ చేసి.. లబ్ధి పొందాలనుకుంటున్నాయని సామాజికవేత్త కంచె ఐలయ్య అన్నారు. రిజర్వేషన్లు సరిగ్గా అమలు కావడం లేదని తెలిపారు. ఏపీలోని దళితులు సీరియస్ గా ఆలోచించాలని తెలిపారు. ఎక్కడికక్కడే దళితులను అణచివేస్తామంటే ఎలా కరెక్టు అవుతుందన్నారు.
రోహిత్ దళితుడు కాదనడం సరికాదు : బి.వెంకట్
రోహిత్ వేముల దళితుడు కాదని గుంటూరు కలెక్టర్ నిర్ధారణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గం సభ్యులు బి.వెంకట్ అన్నారు. ఇది ఒక వ్యక్తికి జరిగిన ఘటన కాదని.. సమాజానికి జరిగిన ఘటన అన్నారు. కేసు నుంచి తప్పించుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిపారు. రోహిత్ తల్లి రాధికమ్మ దళిత ..మాల కులానికి చెందిన మహిళ అని చెప్పారు. రోహిత్ గత 20 సం. లుగా తల్లి సంరక్షణలో పెరిగాడు. కుల నిర్ధారణ చేసేటప్పుడు గ్రామ ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఈ కేసు విషయంలో బిజెపి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కుట్రలో సీఎం కేసీఆర్, సీఎం చంద్రబాబు పాత్రదారులు అన్నారు. వీరిని దోషులుగా చేల్చాలని చెప్పారు. ఇది చాలా దుర్మార్గమన్నారు. రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. దీన్ని ఉద్యమం లాగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు.
హెచ్ సీయూ విద్యార్థి సంజయ్...
రోహిత్ కేసులో కేంద్రమంత్రి, వీసీ అప్పారావు ముద్దాయిలుగా ఉన్నారు.. వారిపై ఎస్సీ, ఎస్టీ ఎఫ్ ఐఆర్ అయింది.
ఈ కేసు నుంచి వారిని తప్పించేందుకు రోహిత్ దళితుడు కాదని కమిటీ తేల్చిందని చెప్పారు. రోహిత్ కు అన్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  
టీకాంగ్రెస్ నేత మల్లు రవి... 
ప్రభుత్వ కమిటీ వాస్తవ పరిస్థితులను బట్టి నిర్దారించలేదు. పై నుంచి ప్రభుత్వాలు ఆదేశించినట్లు కమిటీ నడుచుకుంది. వేరే కమిటీ చేత నిజ నిర్ధారణ చేయాలి. 

 

17:20 - February 14, 2017
17:14 - February 14, 2017

ఆదిలాబాద్ : దశాబ్దాల పోరాటం తర్వాత ఆదివాసీలు సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం కాలరాస్తోంది. జల్‌ జమీన్‌, జంగిల్‌ కోసం  పోరాడిన నేలపై .. భూమిహక్కులు హరించబడుతున్నాయి. అటవీ భూములను స్వాధీనం చేసుకోడానికి అటవీశాఖ ఆదివాసీ గ్రామాలపై దండయాత్రలు చేస్తోంది. హరిత హారం పేరుతో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొడుతున్నారు. వామపక్షాల నేతృత్వంలో గిరిజనం భూపోరాటానికి కదం తొక్కుతోంది.
పోడు భూముల కోసం...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు  తర తరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములపై సర్కారు కన్ను పడింది. ఈ భూముల్లో మళ్ళీ  మొక్కలు పెంచాలని ప్రభుత్వం ఆదేశించిందంటూ అటవీ శాఖ అధికారులు  హడావుడి చేస్తున్నారు. అటవీ భూములు ఖాళీ చేయాలని ఆదేశిస్తూ  గ్రామాలపై అటవీ శాఖ అధికారులు దండయాత్రలు చేస్తున్నారు.
2006లో అమల్లోకి వచ్చిన అటవీహక్కుల చట్టం
సుదీర్ఘ పోరాటం తర్వాత 2006 లో కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ చట్టాన్ని 2008  నుంచి అమలు చేస్తున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని   అటవీ భూముల్లో ఆదివాసీలు, దళితులు నాలుగు దశాబ్దాలుగా  పోడు వ్యవసాయం  చేసుకుంటూ జీవిస్తున్నారు. పోడు వ్యవసాయం ఈ ఆదివాసీల సంస్కృతిలో భాగం. 
10ఎకరాల పోడుభూమి ఇవ్వడానికి ముందుకురాని ప్రభుత్వం 
ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత..పోడుభూముల గుర్తింపు ప్రక్రియను తెలంగాణ ప్రాంతంలో నామమాత్రంగా చేపట్టింది అప్పటి ప్రభుత్వం. గరిష్ఠంగా పదెకరాల వరకూ  వ్యక్తిగత క్లెయిమ్‌లు ఇవ్వవచ్చని చట్టంలో పేర్కొన్నప్పటికీ.. పదెకరాలు ఇవ్వడానికి  మాత్రం ప్రభుత్వం ముందుకు రాలేదు. అటు అటవీశాఖ కూడా అటవీ హక్కుల గుర్తింపు క్లెయిమ్‌లకు  అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది. అయితే అటవీ హక్కులచట్ట ప్రకారం గ్రామసభకు విస్త్రుతాధికారాలు ఉన్నాయి. గ్రామసభ విధివిధా నాల గురించి కానీ అటవీ హక్కుల చట్టం  నిబంధనల గురించి కానీ గ్రామసభ సభ్యులకు అవగాహన కల్పించక పోవడంతో పూర్తి స్థాయిలో పోడు సాగుదారులకు న్యాయం జరగలేదు. 
ఆదివాసీల హక్కులు హరిస్తున్న హరితహారం
ఇదిలావుంటే.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం. ఆదివాసీల హక్కులను హరించేదిగా మారింది.  పోడుభూముల్లో అడవులు పెంచుతామంటూ అధికారులు  రైతులను వేధిస్తున్నారు. అటవీ హక్కుల కోసం  దరఖాస్తు చేసుకున్నా..పెండింగ్‌ లో ఉన్నా యనే నెపంతో పోడు వ్యవసాయదారులను తమ భూమిలోకి అడుగు పెట్టనివ్వడం లేదు అటవీశాఖ. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీ హక్కుల గుర్తింపు పత్రాలు  పొందిన వారికి కూడా  అధికారులు అడ్డున్నారు. దీంతో ఆదివాసీలు, దళితులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యమ బాట పట్టేందుకు సన్నద్దం అవుతున్నారు.

17:14 - February 14, 2017

టాలీవుడ్..బాలీవుడ్..కోలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా సరే చిత్ర ప్రారంభం నుండి విడుదలయ్యే వరకు చిత్రానికి సంబంధించిన విషయాల్లో గోప్యంగా ఉంచుతుంటారు. ముఖ్యంగా ప్రచార విషయంలో వైవిధ్యాన్ని కనబరుస్తారు. చిత్ర పోస్టర్..టీజర్..ఇలా ప్రతొక్క దానిలో ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ లో 'వీడెవడు' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో హీరో ఎవరు ? అనేది ఎవరనేది తెలియరావడం లేదు. ఇటీవలే 'అక్కినేని అఖిల్' దీనికి సంబంధించిన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో ఎవరనేది చెప్పాలంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. తన స్నేహితుడికి ఆల్ ది బెస్ట్ తెలిపాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో 'ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు... చూడ చూడ రుచులు జాడ వేరు...పురుషులందు పుణ్య పురుషులు వేరయా...విశ్వదాభిరామ వినుర వేమ'..ఒక గేమ్ ఆడుదామా ఆఫీసర్'.. అంటూ డైలాగ్ పలికే వీడియో ఉంది. దీనిపై రానా కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో ట్వీట్.. చేశారు. ఆల్ ద బెస్ట్ 'సచిన్' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనితో 'సచిన్ జోషి' హీరో అని తెలుస్తోంది.

లొంగిపోవడానికి సమయం కోరనున్న శశికళ..

చెన్నై : కోర్టులో లొంగిపోవడానికి తనకు నాలుగు వారాల సమయం కావాలని శశికళ కోరనుంది. అనారోగ్య కారణాలతో బాధ పడుతున్నందునా కొంత సమయం ఇవ్వాలని శశికళ పిటిషన్ లో కోరనున్నారు.

16:55 - February 14, 2017

హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎన్నో ఘనతలు సొంతం చేసుకుంది. ఆర్యభట్ట మొదలుకొని మంగళ్‌యాన్‌ వరకు ఎన్నో ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఇపుడు తాజాగా పిఎస్‌ఎల్వీ ద్వారా104 ఉపగ్రహాల ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఇది విజయవంతమైతే వందకుపైగా ఉపగ్రహాలను పంపిన దేశంగా భారత్‌ ప్రపంచంలోనే సరికొత్త రికార్డు నమోదు చేయనుంది. ఇప్పటివరకు ఇస్రో సాధించిన ఘన విజయాలపై ప్రత్యేక కథనం...
1962లో ఇస్రో ఏర్పాటు 
ఇస్రో అంటే ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్. అంతరిక్షపరిశోధనల కోసం 1962లో భారత ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేసింది. దీని ప్రధాన కేంద్రం బెంగళూరు. విక్రం సారాభాయిని భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణిస్తారు. ఇండియన్‌ నేషనల్‌ కమిటి ఫర్‌ స్పేస్‌ రిసెర్చిను ఏర్పాటు చేసి....పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్‌కు అవసరమయిన అన్నీ విడిభాగాలు మనదేశంలోనే తయారు చేసే విధంగా సారాభాయి కృషి చేశారు.
ఇస్రో మొత్తం 59 ప్రయోగాలు 
ఇస్రో మొత్తం 59 ప్రయోగాలు చేపట్టింది... మన దేశానికి చెందిన 84 ఉపగ్రహాలు, 79 విదేశీ ఉపగ్రహాలనూ విజయవంతంగా నింగిలోకి పంపింది. ఆర్యభట్టతో ఇస్రో తన ప్రయోగాన్ని ప్రారంభించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఇప్పటివరకు 38 సార్లు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపగా 37 విజయవంతమయ్యాయి. అందులో ఒక్కటే గురితప్పింది. చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌లతో పాటు అనేక కీలక విజయాలను అందించిన ఘనత పిఎస్‌ఎల్‌వీ వాహకనౌకకే దక్కుతుంది. మరో వాహకనౌక, జీఎస్‌ఎల్‌వీ నుంచి పది ప్రయోగాలు జరిగినా.. అందులో ఆరు మాత్రమే సక్సెస్‌ అయ్యాయి. 
తుంబ రాకెట్‌ ప్రయోగం...తొలి అడుగు  
1962లో కేరళలోని తుంబ రాకెట్‌ ప్రయోగ కేంద్రంతో అంతరిక్ష పరిశోధనలో తొలి అడుగు పడింది. ముందుగా, వాతావరణ పరిస్థితుల అధ్యయనానికి ఉపకరించే మూడు అడుగుల చిన్న సౌండ్‌ రాకెట్లను- ఆర్‌హెచ్‌-75ను అంతరిక్షానికి పంపింది.
భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట
భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట. 1975లో ఆర్యభట్టను రష్యా సాయంతో భారత్‌ నింగిలోకి  చేరవేసింది. ఆ తర్వాత 1979లో  శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ విఫలమైంది. 1980లో ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ రోహిణిని ఇస్రో విజయవంతంగా గగనానికి చేర్చింది. 1979-81 మధ్యలో భాస్కర ప్రయోగంతో ఇస్రో మరో ముందడుగు వేసింది. శాస్త్ర, సాంకేతిక ఫలితాలను సామాన్య ప్రజలకు చేరవేసే దిశగా సమాచార ఉపగ్రహ ప్రయోగాలనూ ఇస్రో చేపట్టింది. 1975..76లో 'శాటిలైట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ టెలివిజన్‌ ఎక్స్‌పరిమెంట్‌' ను ప్రయోగించింది. సమాచార ఉపగ్రహాన్ని విద్యా బోధన సాధనంగా ఎలా ఉపయోగించుకోవచ్చో ఇది నిరూపించింది. 
1979లో ఆపిల్‌ సమాచార ఉపగ్రహం
ఇస్రో 1979లో ఆపిల్‌ సమాచార ఉపగ్రహాన్ని నింగికి పంపింది. 1982-90 మధ్య విదేశీ రాకెట్ల సాయంతో ఇన్సాట్‌-1ను అంతరిక్షానికి పంపింది. ఈ ఉపగ్రహం ఆకాశవాణి, దూరదర్శన్‌ ద్వారా వినోదం, విజ్ఞానాలతో పాటు విద్యావ్యాప్తికి దోహదపడింది.
2013లో అంతరిక్షంలోకి మంగళ్‌యాన్‌
చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌ తదితర ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకూ ఇస్రో శ్రీకారం చుట్టింది. 2013లో ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన మంగళ్‌యాన్‌ను అంతరిక్షంలోకి పంపింది. అంగారకగ్రహంపై లోతైన అధ్యయనం చేయడానికి మంగళ్‌యాన్‌ టూను 2021...22లో ప్రారంభించనుంది. అందులో భాగంగా అరుణ గ్రహ ఉపరితలంపైకి ఒక రోవర్‌ను దించే వీలుంది. రెండో యాత్రలో మాత్రం ఫ్రాన్స్‌ కూడా భాగమవుతోంది.
శుక్రగ్రహంపై యాత్రకు దృష్టి 
మంగళ్‌యాన్‌ యాత్ర సఫలం కావడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుక్రగ్రహంపై యాత్రకు దృష్టి సారించింది. చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చేఏడాది మొదట్లో గానీ చేపట్టే ఆలోచన ఉంది. పర్యావరణంలో వచ్చే మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌, సముద్ర నీటి మట్టాల్లో తేడాలు, గ్రీన్‌హౌస్‌ వాయువులు... తదితర అంశాల అధ్యయనానికి వాతావరణ్‌-1 పేరుతో త్వరలోనే ఓ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. 4 టన్నులు అంతకన్నా ఎక్కువ బరువైన ఉపగ్రహాలను పంపేందుకు జిఎస్‌ఎల్‌వి మార్క్‌ 3 ని శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. ఇందులో, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను వినియోగించనున్నారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే హైత్రోపుట్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో ప్లాన్‌ చేస్తోంది. దీని బరువు 10 టన్నులు.
75 విదేశీ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి 
ఇస్రో ప్రయోగాలకే పరిమితం కాలేదు. ఆర్థికంగా భారత్‌కు కోట్లాది రూపాయల విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోంది. ఇప్పటి వరకూ 75 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది.  
మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలు.. వ్యోమోగాముల ఎంపిక ప్రక్రియ
ఇప్పటివరకు మానవ రహిత ఉపగ్రహాలను పంపిన ఇస్రో...ఇకపై మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాల కోసం వ్యోమోగాముల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టింది. ఇస్రో-ఎయిర్‌ఫోర్స్‌ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం సక్సెస్‌ అవుతే అమెరికా, రష్యా, చైనా సరసన భారత్‌ కూడా చేరనుంది. ఇస్రో మరిన్ని విజయాలు సాధించడం ద్వారా అంతరిక్ష ప్రపంచంలో భారత్‌ను ఉన్నతస్థితికి చేరుస్తుందని ఆశిద్దాం...

 

పౌరసరఫరా శాఖలో కమాండ్ సెంట్రల్ ఏర్పాటు - ఈటెల..

హైదరాబాద్ : పౌరసరఫరాల శాఖలో అక్రమాల నియంత్రణకు కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. జీపీఎస్ ద్వారా పౌరసరఫరాల సరుకులతో వెళ్లే లారీల కదలికలను గమనిస్తామని, తొమ్మిది ఎంఎల్ఎస్ఎస్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. రెండున్నరేళ్లలో పౌరసరఫరాల శాఖలో అవినీతిని తగ్గించామని వెల్లడించారు. రేషన్ కార్డుల ద్వారా బియ్యం తీసుకోని వారు కార్డులను తిరిగిచ్చేయాలని సూచించారు.

గవర్నర్ వద్దకు పళనిస్వామి..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ను కలిసేందుకు పళనిస్వామి గవర్నర్ నివాసానికి బయలుదేరారు. శశికళ దోషిగా సుప్రీంకోర్టు నిర్దారించడంతో సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ఎంపికయ్యారు.

16:46 - February 14, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాలు గంటగంటకు మారుతున్నాయి. పన్నీర్‌సెల్వంకు క్రమక్రమంగా మద్దతు పెరుగుతోంది. పన్నీర్‌ గూటికి మరో 12 మంది ఎమ్మెల్యేలు చేరారు. దీంతో.. పన్నీర్‌ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 23కు చేరింది. మరోవైపు బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు 4 వారాల గడువు కావాలని శశికళ కోరనున్నట్లు సమాచారం. అనారోగ్య కారణాలవల్ల 4 వారాల గడువు కావాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. అటు కువ్వత్తూరులో పన్నీర్‌సెల్వం వర్గీయులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు కువ్వత్తూరులో 144 సెక్షన్‌ విధించారు. మరోవైపు కువ్వత్తూరు నుంచి పళనిస్వామి రాజ్‌భవన్‌ బయలుదేరారు. సాయంత్రం 5:30కి గవర్నర్‌తో భేటీ కానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:43 - February 14, 2017
16:39 - February 14, 2017

హైదరాబాద్ : ఒకేసారి శ్రీహరి కోట నుంచి 104 శాటిలైట్లను ప్రయోగించడం మనకు ఎంతో గర్వకారణమని ఓయూ వీసీ రామచంద్రన్‌ అన్నారు. జన విజ్ఞాన వేదిక, ఓయూ ఆస్ట్రానమీ డిపార్ట్‌మెంట్‌లు ఓయూలో ఇస్రో రాకెట్‌ శాటిలైట్ల ప్రయోగాలపై సెమినార్ నిర్వహించింది. ఈ సెమినార్‌కు రామచంద్రన్‌ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. శాస్త్రవేత్తల పట్టుదల, నిరంతర కృషితో ఇది సాధ్యమని అన్నారు. శాటిలైట్‌ల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని వీసీ అన్నారు. 

 

16:35 - February 14, 2017

తమిళనాడు : తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. చెన్నైలోని గోల్డెన్‌ బే రిసార్ట్స్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రిసార్ట్స్‌ వద్దకు పన్నీర్‌ సెల్వం మద్దతుదారులు భారీగా చేరుకున్నారు. నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రిసార్ట్స్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:28 - February 14, 2017

చెన్నై : తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతుంది. పన్నీర్‌సెల్వంకు మద్దతు తెలిపిన నేతలపై శశికళ వేటు వేసింది. పాండ్యన్‌, మునుస్వామి, పొన్నాయ్యన్‌లను శశికళ పార్టీ నుంచి బహిష్కరించింది. ఇప్పటికే పన్నీర్‌ సెల్వం ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దు చేసింది. శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. కాసేపట్లో గవర్నర్‌ను పళనిస్వామి వర్గం కలవనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని పళనిస్వామి గవర్నర్‌ను కోరనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:23 - February 14, 2017
16:14 - February 14, 2017

గుంటూరు : ఏపీ రాజధానిలోని వెలగపూడిలో తాత్కాలికంగా నిర్మించిన అసెంబ్లీ భవనాలను వైసీపీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. త్వరలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్‌ సూచన మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా తాత్కాలికంగా నిర్మించిన అసెంబ్లీ భవనాలకు 1200 కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షనేతకు పేషీ ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.  

 

16:11 - February 14, 2017

చిత్తూరు : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలంటూ తిరుపతిలో సీఐటీయూ ఆధ్వర్యంలో టీటీడీ కార్మికులు కదం తొక్కారు. టీటీడీ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి.. వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. టీటీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోందని సీఐటీయూ నేతలు ధ్వజమెత్తారు. టీటీడీ ఛైర్మన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇచ్చి నెలరోజులు గడిచినా నెరవేరలేదన్నారు. 
తిరుపతిలో ఉద్రిక్తత 
టీటీడీ కార్మికుల ధర్నా తిరుపతిలో ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ టీటీడీ కార్మికులు టీటీడీ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చారు. రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు సీఐటీయూ నేతలు సహా టీటీడీ కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. 

 

16:07 - February 14, 2017

చెన్నై : మొత్తానికి శశికళను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధరించింది. దాదాపు ఇరవై ఏళ్ల పాటు విచారణ సాగిన కేసులో ఈరోజు తుది తీర్పు వెలువడింది. ఇంతకీ శశికళపై నమోదైన కేసు ఏంటి..? దానికి సాక్ష్యాధారాలు సమర్పించినది ఎవరు..? వాచ్‌ దిస్‌ స్టోరీ.
రూ. 66.65 కోట్ల విలువైన ఆస్తులు పోగేసుకున్నారని ఆరోపణ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ..  ఆమెపై 1996లో కేసు నమోదైంది.  నాటి జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. 1991 నుంచి 1996 మధ్య తొలిసారిగా  జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా  పని చేసిన సమయంలో ... 66.65 కోట్ల విలువైన ఆస్తులను పోగేసుకున్నారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో జయలలితతోపాటు శశికళ, జె.ఇళవరసి, వి.ఎన్‌.సుధాకరన్‌లను నిందితులుగా పేర్కొంటూ మద్రాస్‌ హైకోర్టులో విచారణ సాగింది. 
2001లో మళ్లీ అధికారంలోకి  అన్నా డీఎంకే
2001లో అన్నాడీఎంకే మళ్లీ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. జయలలిత మరోమారు ముఖ్యమంత్రి అయ్యారు.  దీంతో ఈ కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరుగదంటూ డీఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది.  అయితే 2003 నవంబర్‌లో ఈ కేసు విచారణను కర్ణాటకకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. ప్రత్యేక కోర్టు ఈకేసును విచారించింది.   జయ, శశికళ  సహా నలుగురిని నిందితులుగా పేర్కొంటూ కర్నాటక న్యాయస్థానం 2014 సెప్టెంబర్‌ 27న తీర్పు వెలువరించింది.  నిందితులందరికీ నాలుగేళ్ల చొప్పున కారాగార శిక్ష, కోట్ల రూపాయల జరిమానాను విధించింది. దీంతో జయ తన పదవికి రాజీనామా చేసి, కొంతకాలం బెంగళూరులోని జైల్లో ఉండాల్సి వచ్చింది.
ప్రత్యేక కోర్టు తీర్పును కర్నాటక హైకోర్టులో సవాల్‌ చేసిన నిందితులు
దిగువ కోర్టు తీర్పును కొట్టేసిన హైకోర్టు
ప్రత్యేక కోర్టు తీర్పును ఈకేసు నిందితులు  కర్ణాటక హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై  విచారణ జరిపిన హైకోర్టు 2015 మే 11న దిగువ కోర్టు తీర్పును కొట్టేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. దీనిపై గత ఏడాది ఫిబ్రవరి 23న వాదనలు మొదలయ్యాయి. అక్రమ మార్గంలో సొమ్మును ఆర్జించినట్లు తేలితే తప్పించి ఆదాయానికి మించి ఆస్తులున్నంత మాత్రాన అవినీతి చేసినట్లు కాదని ఒక సందర్భంలో ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణ పూర్తిచేసిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌, జస్టిస్‌ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం.. గత ఏడాది జూన్‌ 7న తీర్పును వాయిదా వేసింది.
20 సం.ల పాటు సాగిన కేసులో తుది తీర్పు 
మొత్తానికి దాదాపు 20 సంవత్సరాల పాటు సాగిన ఈ కేసులో తుది తీర్పు వెలువరించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే.. నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. తుది తీర్పు రూపంలో.. సుప్రీంకోర్టు, ముఖ్యమంత్రి కావాలన్న శశికళ ఆశలపై నీళ్లు జల్లింది.

 

16:00 - February 14, 2017

చెన్నై : సుప్రీం తీర్పుతో తమిళరాజకీయాల్లో అనూహ్యమార్పులు చోటుచేసుకున్నాయి. సెల్వంకు చెక్ పెట్టేందుకు శశికళ మరో అస్ర్తాన్ని ప్రయోగించింది. పన్నీర్‌ సెల్వంకు బద్ధశత్రువైన పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నారు. పళనిస్వామిని అన్నాడీఎంకే శాసనసభాపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు రాజ్‌భవన్‌కు శశికళ లేఖ పంపారు. 129 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పళనిస్వామి అన్నారు.  గవర్నర్‌ను కలిసేందుకు ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌ వెళ్లారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు పళనిస్వామి సమర్పించనున్నారు. 

 

21న టీఎస్ ఐసెట్ 2017 నోటిఫికేషన్..

హైదరాబాద్ : ఈనెల 21వ తేదీన టీఎస్ ఐసెట్ 2017 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఆన్ లైన్ దరఖాస్తుకు తుది గడువు ఎప్రిల్ 6వ తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 24 నుండి హాల్ టికెట్లు డౌన్ లౌడ్ చేసుకోవచ్చు. మే 18 న ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 21న ప్రిలిమినరీ కీ, మే 27 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. మే 30వ తేదీన తుది ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీకి..

విజయవాడ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీని బీజేపీకి టిడిపి కేటాయించింది. బీజేపీ అభ్యర్థి గెలుపుకు కృషి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కష్టపడే వారికి పదవులు..టికెట్లు వస్తాయని తేల్చిచెప్పారు.

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం..

విజయవాడ : కాసేపటి క్రితం ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు..తేదీలు నిర్వాహణపై చర్చించనున్నారు. అలాగే అసెంబ్లీ ప్రారంభోత్సవాల తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉమెన్ పార్లమెంట్ సదస్సు జరిగిన తీరు..మూడు ప్రాంతాల అర్బన్ అథార్టీ ఏర్పాటు..మూడు జిల్లా భూ కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

15:21 - February 14, 2017

మనం తినే ఆహార పదార్థాలు..చెడు వ్యసనాలతో శరీరంలో వ్యర్థాలు పేరుకపోతుంటాయి. ఇవి బయటకు పోకపోవడంతో అనారోగ్యాల బారిన పడుతుంటారు. కానీ కొన్నింటిని తీసుకోవడం వల్ల వ్యర్థాలు బయటకు వెళ్లే అవకాశం ఉంది.

  • సల్ఫ్యూరిక్ కాంపౌండ్స్ సమృద్ధిగా ఉన్న, వెల్లుల్లి మరియు గుడ్లు ఎక్కువగా తీసుకోండి.
  • ఒక గ్లాసు నిమ్మరసం త్రాగండి. మీ శరీరం శుభ్రపరచడానికి మరియు అల్కలైజ్ చేయటంలో సహాయపడుతుంది.
  • సుమారు 8 - 12 గ్లాసుల ప్రతి రోజు నీటిని త్రాగండి. శరీరంలో ఉన్న వ్యర్థాన్నిస్వేద రూపంలో బయటకు తొలగించడానికి సహాయం చేస్తుంది.
  • వాకింగ్, నడవటం, జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి సాధారణ వ్యాయామాలు చేయండి. వ్యాయామాలు మీ శరీరానికే కాదు, మీ మెదడుకు కూడా లాభం చేకూరుస్తాయి.
  • మీ నాసికరంధ్రాలను క్రమంగా శుభ్రపరుచుకోవాలి.
  • దానిమ్మ గింజలు వ్యర్ధాలను తొలగిస్తాయి. గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులూ, మధుమేహం లాంటివి రాకుండా కాపాడతాయి.
  • దుంపలో బి3, బి6లతోపాటూ విటమిన్ సి...ఉంటాయి. ఇవి వ్యర్ధాలను తొలగించేలా చేస్తాయి. కాలేయం పనితీరూ మెరుగుపస్తాయి.

పన్నీర్ అన్నాడీఎంకే నేత కాదు - తంబిదురై..

చెన్నై : ఇకపై పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే నేత కాదని, ప్రభుత్వం ఏర్పాటుకు వచ్చిన ఇబ్బంది ఏదీ లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురై వెల్లడించారు. తమకు కావాల్సిన మెజార్టీ ఉందని పేర్కొన్నారు.

14:42 - February 14, 2017

తెలుగు సినిమా బడ్జెట్ లు పెరుగుతున్నా కానీ కొత్త దర్శకులకి మాత్రం ఫిలిం మేకింగ్ కి ఎక్కువ బడ్జెట్ ఇచ్చే ధైర్యం చెయ్యలేక పోతున్నారు ప్రొడ్యూసర్స్. కామన్ గా బడ్జెట్ ని కథమీద నమ్మకంతో అండ్ డైరెక్టర్ స్టామినాతో ముడిపెట్టి రిలీజ్ చేస్తారు. అంటే బడ్జెట్ ని నిర్ణయించేది డైరెక్టర్ కేపబిలిటీ అన్నమాట . బాహుబలి లాంటి పెద్ద సినిమాలకి బడ్జెట్ ఎక్కువే పెడతారు ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ వెనక ఉంది వరస హిట్స్ తో ఫామ్ లో ఉన్న డైరెక్టర్ రాజమౌళి కాబట్టి. బాహుబలి సినిమా రిలీజ్ తరువాత తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. ఒక్క మనదేశంలోనే కాకుండా అబ్రాడ్ లో కూడా రికార్డులు సృష్టించింది. మంచి కలక్షన్స్ తో ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించిన ఘనత బాహుబలిది. ఆసినిమాతో లాక్ అయిపోయిన ప్రభాస్ సంవత్సరాలు సంవత్సరాలు అదే ప్రాజెక్ట్ కోసం టైం స్పెండ్ చెయ్యాస్లి వచ్చింది. బాహుబలి టు తరువాత ప్రభాస్ తన నెక్ట్స్ ఫిలింని యు వి క్రియేషన్స్ తో ప్లాన్ చేసుకున్నాడు. గతం లో ప్రభాస్ తో మిర్చి సినిమా చేసిన యు వి క్రియషన్స్ మల్లి ప్రభాస్ తో సినిమాకి రెడీ అయ్యారు. ఈ సినిమా కి గాను బడ్జెట్ ని అక్షరాలా 150 కోట్లుగా నిర్ణయించారు.

సుజిత్ డైరెక్షన్ లో..
ఇంత పెద్ద బడ్జెట్ తో సినిమా తీసేది ఏ పెద్ద డైరెక్టర్ అనుకుంటే పొరపాటే. రన్ రాజా రన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రో ఇచ్చిన యంగ్ డైరెక్టర్ సుజిత్. యు వి క్రియషన్స్ తో ఇంతకు ముందు సినిమా రన్ రాజా రన్ డైరెక్ట్ చేసిన సుజిత్ తన నెక్ట్స్ సినిమా స్టోరీని కూడా యు వి వాళ్ళకి వినిపించడం ఆ స్టోరీ ప్రభాస్ కి బాగా నచ్చడంతో ఈ చిన్న డైరెక్టర్ కి పెద్ద బడ్జెట్ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ లో 40 కోట్లతో ప్లాన్ చెయ్యాల్సిన ఈ సినిమా కధలో జరిగిన మార్పుల వాళ్ళ బడ్జెట్ 150 కోట్లకు వెళ్ళింది. షార్ట్ ఫిలింలతో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు 150 కోట్ల బడ్జెట్ సినిమాని డీల్ చెయ్యబోతున్నాడు. అదీ ప్రభాస్ తో. టాలెంట్ కి టైం రావడం అంటే ఇదే. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెయినర్ జోనర్ లో ఈ మూవీ ఉంటుందని అయితే షూటింగ్ ప్రారంభానికి మరో రెండు నెలలు పట్టొచ్చని తెలుస్తోంది.

14:33 - February 14, 2017

అవును..ఓ సినిమా రూపొందుతోంది. ఇందుకు రెండేళ్ల సమయం పడుతుందటం. అలాగే 11 దేశాల్లో సినిమా చిత్రీకరణ చేస్తారంట. ఇందులో ప్రముఖ నటుడు 'కమల్ హాసన్' కూతురు 'శృతి హాసన్' ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..కోలీవుడ్ లో పి.సుందర్ ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'సంఘమిత్ర' అనే టైటిల్ కూడా నిర్ణయించారు. తొలుత ఈ చిత్రంలో విజయ్..మహేష్ బాబులను అని అనుకున్నారు. కానీ వారు ఇంట్రెస్ట్ గా లేకపోయేసరికి 'జయం' రవి, ‘ఆర్య'లను ఎంపిక చేశారు. రెండేళ్లలో 11 దేశాల్లో చిత్రీకరణ జరిగే ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక శృతి హాసన్ 'కాటమరాయుడు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

రేవంత్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : సలహాదారుల పేరిట కేబినెట్ హోదా ఇవ్వడంపై రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కేబినెట్ హోదాలో ఉన్న వారికి ఏ చట్టం ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. జీతాల చెల్లింపులో సంప్రదాయాలే పాటిస్తున్నామని, ఏ చట్టం లేదని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. అనంతరం 23 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

కొనసాగుతున్న టిడిపి సమన్వయ కమిటీ సమావేశం..

విజయవాడ : టిడిపి సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. సమన్వయ కమిటీలో సీఎం చంద్రబాబు పలు వ్యాఖ్యలు చేశారు. తమిళ రాజకీయాలు కూడా చర్చకు వచ్చాయి. రూ. 66 కోట్ల అక్రమాస్తులకే నాలుగేళ్ల జైలు శిక్ష అంటే లక్ష కోట్లు దాచుకున్న వారిని ఏం చేయాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో పొలిటికల్ సీన్ తారమారవుతోందని, అందరినీ కలుపుకుని వెళితేనే గెలుపు సాధ్యమన్నారు. స్పీకర్ కోడెల వ్యాఖ్యలు వక్రీకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, కొందరు మంత్రులు అధికారుల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఏ ఒక్కరూ సరిగ్గా పనిచేయడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల కోసమే జిల్లాల్లో తిరగడం సరికాదని సూచించారు.

గోల్డెన్ రిసార్ట్ కు పన్నీర్ బృందం..

చెన్నై : గోల్డెన్ రిసార్ట్ కు పన్నీర్ సెల్వం మద్దతు దారులు బయలుదేరారు. మంత్రి పాండ్యరాజన్ నేతృత్వంలో రిసార్ట్స్ కు 12 మంది ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. పన్నీర్ సెల్వం ప్రభుత్వం కొనసాగించేలా రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేలను ఒప్పించే ప్రయత్నం చేయనున్నారు.

13:37 - February 14, 2017

హైదరాబాద్: 2012లో ఢిల్లీలో దారుణ అత్యాచారానికి గురైన నిర్భయ జ్ఞాపకార్థం దేశంలోని మహిళల భద్రత కోసం స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యక్రమాల కోసం నిర్భయ నిధి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ప్రతి సంవత్సరం లాగానే 2015-16 సంవత్సరానికి గాను నిర్భయ కు కేటాయించిన నిధుల్లో పైసా కూడా ఖర్చు చేయలేదు. దీనికి గల కారణాలు ఏమిటి? ఇదే అంశంపై 'వేదిక'లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో సామాజిక కార్యకర్త దేవి, మహిళా కాంగ్రెస్ నేత కీర్తి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

13:27 - February 14, 2017

చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం స్పందించారు. ఇది తమిళనాడు ప్రజల విజయమని, ఈ తీర్పుతో ప్రజలకు మరింత భద్రత కలిగిందని పన్నీర్‌ సెల్వం అన్నారు.

ఆసీస్ తో టెస్టు టీమిండియా ఎంపిక..

ఢిల్లీ : కొద్ది రోజుల్లో ఆసీస్ తో జరిగే టెస్టు మ్యాచ్ లకు టీమిండియా సభ్యులను ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా విజయ్, రాహుల్, పుజారా, సాహా, అశ్విన్, జడేజా, ఇషాంత్, భువి, ఉమేష్, కరున్, జయంత్, కుల్ దీప్, ముకుంద్, పాండ్యాలకు స్థానం కల్పించారు. 

13:20 - February 14, 2017

చెన్నై: నగరంలోని గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లో హైటెన్షన్‌ నెలకొంది. గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లో భారీగా పోలీసులు మోహరించారు. శశికళ చుట్టూ వలయంగా ఉన్నారు పోలీసులు. గోల్డెన్‌ బే రిసార్ట్స్‌కు నాలుగు రాష్ర్టాల బలగాలు చేరుకున్నాయి. రిసార్ట్స్‌లో 10మంది రౌడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిసార్ట్స్‌లో ఉన్న వెయ్యి మందికి పైగా శశికళ అనుచరులను ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

13:18 - February 14, 2017

చిత్రంలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా ? గుబురు గడ్డం..నోట్లో సిగరేట్..చేతిలో కత్తి...గళ్ల లుంగీతో కనబడుతున్న ఇతను హీరోయే. కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే అతనెవరో తెలిసిపోతుంది. టాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు అందుకొనే నటుల్లో ఇతను కూడా ఒకరు. రెండు వరుస ఫ్లాపులు పడినా 'జ్యో అచ్యుతానంద'..'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఆయనే 'నారా రోహిత్'. పై ఫొటోలో కనిపిస్తున్నది అతనే. 'కథలో రాజకుమారి' అనే సినిమాలో 'నారా రోహిత్' నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అందంగా కనిపిస్తూ ఉన్న 'నారా రోహిత్' ఫొటో చూసి ఓ లవ్ స్టోరీతో రాబోతున్నాడని అనిపించింది. కానీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ఫొటోను ఆశ్చర్యపోవడం ఖాయం.
లుంగీ కట్టు..గుబురు గడ్డం..చేతిలో కత్తి..నోట్లో సిగరేట్ తో అరవీరభయంకరంగా కనిపించే విధంగా ఉన్న 'నారా రోహిత్' లుక్ చూసి ఆశ్చర్యపోయారు. కాస్త వైవిధ్యమైన కథతో రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నారా రోహిత్ సమర్పికుడిగా వ్యవహరిస్తున్నారు. నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తోంది. 

13:17 - February 14, 2017

చెన్నై: శశికళ వర్గం సీఎం అభ్యర్థిగా పళని స్వామి తెరపైకి వచ్చారు. పళనిస్వామి సేలం జిల్లా ఎడప్పాడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం రహదారులు, ఓడరేవుల మంత్రిగా ఉన్నారు పళని స్వామి. ఇప్పటికే సెంగొట్టయ్యన్‌ను ప్రిసీడియం ఛైర్మన్‌గా శశికళ నియమించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్‌ సెల్వంను శశికళ తొలగించారు. కాసేపట్లో ఎమ్మెల్యేలతో కలిసి పళనిస్వామి గవర్నర్‌ను కలిసే అవకాశాలు ఉన్నాయి. సేలం జిల్లా ఎడప్పాడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పళని స్వామి, ప్రస్తుతం రహదారులు, ఓడరేవుల మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే సెంగొట్టయ్యన్‌ను ప్రిసీడియం ఛైర్మన్‌గా శశికళ నియమించారు. మరో వైపు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్‌ సెల్వం తొలగించినట్లు ప్రకటించారు. మరో వైపు చెన్నైలోని గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లో భారీగా మోహరించిన పోలీసులు హైటెన్షన్‌ నెలకొంది. గోల్డెన్‌ బే రిసార్ట్స్‌కు నాలుగు రాష్ర్టాల బలగాలు వచ్చి శశికళ చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. అంతే కాక రిసార్ట్స్‌లో 10మంది రౌడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిసార్ట్స్‌లో ఉన్న వెయ్యి మందికి పైగా శశికళ అనుచరులకు ఖాళీ చేయాలని ఆదేశం జయలలిత మేనల్లుడు దీపక్‌కుమార్‌కు శశికళ గోల్డెన్‌ బే రిసార్ట్స్‌కు పిలిపించుకున్నారు.

ఎమ్మెల్యేలతో గవర్నర్ ను కలువనున్న పళని స్వామి..

చెన్నై : సీఎం అభ్యర్థిగా పళని స్వామిని శశికళ వర్గం ఎన్నుకుంది. మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను తీసుకుని గవర్నర్ వద్దకు వెళ్లనున్నారు. శశికళను దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. 

పళనిస్వామి సీఎం అభ్యర్థి..

చెన్నై : పళనిస్వామిని తమ సీఎం అభ్యర్థిగా శశికళ వర్గం ఎన్నుకుంది. శశికళను దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. 

మంత్రి పద్మారావు కుమారుడిపై పోలీసులు కేసు నమోదు..

హైదరాబాద్ : మంత్రి పద్మారావు కుమారుడి రామేశ్వర్ గౌడ్ పై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారి మోహిత్ రాథోడ్ పై దాడి ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

12:39 - February 14, 2017

హైదరాబాద్: ఎప్పుడూ రాజకీయంగా బిజీ బిజీగా గడుపుతూ... రాజకీయాల్లో బిజీగా టైం స్పెండ్ చేసే టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క దంపతుల తో వాలెంటైన్స్ సందర్భంగా పొలిటికల్ లైఫ్ ను పక్కనబెట్టి పర్సనల్ లైఫ్ లోని మధు జ్ఞాపకాలను '10టివి'తో షేర్ చేసుకున్నారు. హాట్ హాట్ విషయాలు చెప్పిన ఆ దంపతుల పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

సీఐటీయూ ఆధ్వర్యంలో టీటీడీ కార్మికుల ధర్నా

తిరుపతి : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలంటూ తిరుపతిలో సీఐటీయూ ఆధ్వర్యంలో టీటీడీ కార్మికులు కదం తొక్కారు. టీటీడీ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి.. వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. టీటీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోందని సీఐటీయూ నేతలు ధ్వజమెత్తారు. టీటీడీ ఛైర్మన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇచ్చి నెలరోజులు గడిచినా నెరవేరలేదన్నారు.

12:28 - February 14, 2017

చెన్నై: శశికళ కల చెదిరిపోయింది. చిన్నమ్మకు సుప్రీం కోర్టు షాక్‌నిచ్చింది. జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితులను ద్విసభ్య ధర్మాసనం దోషులుగా నిర్ధారించింది. అంతేకాదు..10 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు సుప్రీం ప్రకటించింది. జయలలిత సహా శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లను సుప్రీం దోషులుగా నిర్ధారించింది. జడ్జీలు జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌, అమితావ్‌లు తీర్పును వెల్లడించారు. నాలుగువారాల్లో లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం సంచలన తీర్పుతో శశికళ శిబిరంలో కలకలం రేగింది. గోల్డెన్‌బే రిసార్ట్స్‌కు పోలీసులు భారీగా చేరుకున్నారు. శశికళను ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో రిసార్ట్స్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బొరున విలపించిన శశికళ...

సుప్రీం కోర్టు తీర్పు వినగానే శశికళ బోరున విలపించారు. ప్రస్తుతం గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లోకి ప్రత్యేక పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగక్కుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శశికళను ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల తమిళనాడు రాష్ర్టంలో శశికళ మద్దతు దారులు ఆందోళనలు చేయకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు పోయెస్‌ గార్డెన్‌ నిర్మానుష్యంగా మారింది.

పన్నీర్ సెల్వం శిబిరంలో సంబరాలు...

సుప్రీం కోర్టు తీర్పుతో పన్నీర్‌ సెల్వం శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. శశికళకు శిక్ష.. తమిళనాడుకు రక్ష అంటూ సెల్వం మద్దతుదారులు నినాదాలతో హోరెత్తించారు. భవిష్యత్‌ వ్యూహంపై ఆంతరంగికులతో సెల్వం మంతనాలు జరుపుతున్నారు. సుప్రీం తీర్పుతో తమిళనాడులో రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. పన్నీర్‌ సెల్వం శిబిరంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. శశికళ శిబిరం నుంచి ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారని పన్నీర్‌ సెల్వం భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో తమిళనాడు శాసనసభలో బల నిరూపణపై ఇవాళ గవర్నర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. అన్నాడీఎంకేలోని పరిణామాలను డీఎంకే నిశితంగా పరిశీలిస్తోంది.

ఈ తీర్పు ఓ గుణపాఠం కావాలి...స్ఠాలిన్...

జయ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ నాయకులకు ఓ గుణపాఠం కావాలని డీఎంకే నేత స్టాలిన్‌ అన్నారు. 20 సంవత్సరాల తర్వాతైనా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పునీయడం సంతోషకరమన్నారు. ఇప్పటికైనా తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని స్టాలిన్‌ కోరారు.

12:27 - February 14, 2017

చెన్నై: సుప్రీం కోర్టు తీర్పు వినగానే శశికళ బోరున విలపించారు. ప్రస్తుతం గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లోకి ప్రత్యేక పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగక్కుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శశికళను ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల తమిళనాడు రాష్ర్టంలో శశికళ మద్దతు దారులు ఆందోళనలు చేయకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు పోయెస్‌ గార్డెన్‌ నిర్మానుష్యంగా మారింది.

12:26 - February 14, 2017

చెన్నై: సుప్రీం కోర్టు తీర్పుతో పన్నీర్‌ సెల్వం శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. శశికళకు శిక్ష.. తమిళనాడుకు రక్ష అంటూ సెల్వం మద్దతుదారులు నినాదాలతో హోరెత్తించారు. భవిష్యత్‌ వ్యూహంపై ఆంతరంగికులతో సెల్వం మంతనాలు జరుపుతున్నారు. సుప్రీం తీర్పుతో తమిళనాడులో రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. పన్నీర్‌ సెల్వం శిబిరంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. శశికళ శిబిరం నుంచి ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారని పన్నీర్‌ సెల్వం భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో తమిళనాడు శాసనసభలో బల నిరూపణపై ఇవాళ గవర్నర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. అన్నాడీఎంకేలోని పరిణామాలను డీఎంకే నిశితంగా పరిశీలిస్తోంది.

12:24 - February 14, 2017

చెన్నై: జయ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ నాయకులకు ఓ గుణపాఠం కావాలని డీఎంకే నేత స్టాలిన్‌ అన్నారు. 20 సంవత్సరాల తర్వాతైనా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పునీయడం సంతోషకరమన్నారు. ఇప్పటికైనా తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని స్టాలిన్‌ కోరారు.

శశికళ అరెస్టుకు రంగం సిద్ధం..

చెన్నై : శశికళ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆమె బస చేసిన గోల్డెన్ బే రిసార్ట్స్ కు భారీగా పోలీసులు చేరుకున్నారు. నాలుగు బస్సులతో సీనియర్ అధికారులు, పోలీసులు తరలివెళ్లారు. 

ముగిసిన ఎన్ కౌంటర్...

జమ్మూ కాశ్మీర్ : గత కొద్దిగంటలుగా జరిగిన ఎన్ కౌంటర్ కాసేపటి క్రితం ముగిసింది. ఉగ్రవాదులు..భారత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఘటనా స్థలం నుండి మారణాయుధాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. 

సీఎం అభ్యర్థిగా జయ మేనల్లుడు ?

చెన్నై : సీఎం అభ్యర్థిగా జయ మేనల్లుడు తెరమీదకు వచ్చారు. శశికళ దోషి అంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీనితో సీఎం అభ్యర్థిగా జయ మేనల్లుడు దీపక్ ను తెరమీదకు తీసుకరావాలని శశికళ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

స్పందించిన స్టాలిన్..

చెన్నై : శశికళ దోషిగా సుప్రీం తీర్పుపై స్టాలిన్ స్పందించారు. సుప్రీం తీర్పు స్వాగతిస్తున్నట్లు, గవర్నర్ వెంటనే సమయోచిత నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాజకీయ అనిశ్చితికి తెరపడే విధంగా నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానిస్తూ వెళ్లిపోయారు. 

పన్నీర్ కు 11 ఎమ్మెల్యేల మద్దతు..

చెన్నై : శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. పన్నీర్ కు మద్దతు పెరుగుతున్న విషయం తెలిసిందే. తీర్పు అనంతరం 11 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలియచేశారు. 

న్యాయం గెలిచింది - సుబ్రమణ్యస్వామి..

చెన్నై : శశికళను సుప్రీంకోర్టు దోషిగా నిర్థారించిన నేపథ్యంలో ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. 20 ఏళ్ల తరువాత న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. సంక్షోభానికి గవర్నర్‌ వెంటనే ముగింపు పలకాలని పేర్కొన్నారు. 

చిన్నమ్మ అరెస్టుకు రంగం సిద్ధం..

చెన్నై: అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అరెస్టు రంగం సిద్ధం అయ్యింది. 35 వాహనాల్లో ఎస్పీ, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు, గోల్డెన్ బే రిసార్టును చుట్టుముట్టి పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

నిశితంగా పరిశీలిస్తున్న డీఎంకే..

చెన్నై : శశికళ దోషి అంటూ సుప్రీంకోర్టు ప్రకటించిన నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పన్నీర్ గా పోటీగా మరొకరిని బరిలోకి దింపాలని శశికళ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్గపోరును నిషితంగా డీఎంకే నిశితంగా పరిశీలిస్తోంది. 

గోల్డెన్ బే రిసార్ట్ లో పోలీసులు..

చెన్నై : గోల్డెన్ బే రిసార్ట్స్ కు పోలీసులు చేరుకున్నారు. కాసేపటి క్రితం శశికళ దోషి అంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. తీర్పు విన్న అనంతరం శశికళ భోరున విలపించినట్లు తెలుస్తోంది. తక్షణమే లొంగిపోవాల్సిందిగా సుప్రీం ఆదేశాల్లో పేర్కొంది.

టిడిపి సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం.

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టిడిపి సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థుల విజయం పట్ల చర్చించనున్నారు. 

పన్నీర్ ఇంట సంబరాలు..

చెన్నై : జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ దోషి అంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడంతో పన్నీర్ సెల్వం ఇంటి వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు. 

శశికళ..తక్షణమే లొంగిపోవాలన్న సుప్రీం..

ఢిల్లీ : జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీం తీర్పును వెలువరించింది. జడ్జీలు పినాకి చంద్ర ఘోష్, అమితవరాయ్ లు తీర్పును వెలువరించారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. తక్షణమే లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. తీర్పు నేపథ్యంలో పదేళ్ల పాటు పోటీ చేసే అర్హతల కోల్పోయినట్లైంది. 

10:43 - February 14, 2017

హైదరాబాద్:జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ-2 ముద్దాయిగా ఉన్న శశికళ దోషేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. వారికి శిక్ష విధించాల్సిందేనని అభిప్రాయపడింది. 4ఏళ్ల జైలు శిక్ష విస్తూ సుప్రీం కోర్టు తేల్చింది. అంతే కాకుండా 4 వారాల్లో లొంగిపోవాలని కోర్టు ఆదేశించినప్పటికీ వెంటనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేశారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ తీర్పును చదువుతూ, ఈ కేసు తీవ్రమైనదని వ్యాఖ్యానించారు. చట్టాన్ని మీరి ప్రవర్తించినట్టు స్పష్టమవుతోందని అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులంతా దోషులేనని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు విధించిన నాలుగేళ్ల శిక్ష, రూ. 100 కోట్ల జరిమానాను చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్, తన తీర్పులో పేర్కొన్నారు. కేసులో ఏ-1 ముద్దాయిగా ఉన్న జయలలిత మరణించిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, మిగతా శశికళ, ఇళవరసి, సుధాకరన్ లు దోషులని, వీరంతా లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువిస్తున్నామని తెలిపారు.  సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనాలుగేళ్ల జైలు శిక్ష తో పాటు పదేళ్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసే అర్హ‌త‌ను కోల్పోయారు. సుప్రీంకోర్టు ఆమెకు నాలుగేళ్ల శిక్ష‌ను విధించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆమె ఇప్ప‌టికే ఆరునెల‌ల శిక్ష‌ను అనుభ‌వించ‌డంతో మ‌రో మూడున్న‌రేళ్లు ఆమె జైలుకి వెళ్ల‌వ‌ల‌సి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మాజీ అడ్వొకేట్ జ‌న‌ర‌ల్‌ బీవీ ఆచార్య మాట్లాడుతూ మ‌న జుడీషియ‌రీ ఎంతబ‌లంగా ఉందో ఈ తీర్పు ద్వారా తెలుస్తుంద‌ని ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నదే అసక్తికరంగా మారింది.

పన్నీర్ కు మేటూరు ఎమ్మెల్యే మద్దతు..

చెన్నై : పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతూనే ఉంది. పన్నీర్ సెల్వంకు మేటూరు ఎమ్మెల్యే సెమ్మలై మద్దతు పలికారు. ఇప్పటి వరకు సెల్వంకు 9మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు.

 

కాసేపట్లో తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు

చెన్నై: తమిళనాడు రాజకీయ వైకుంఠపాళి రసకందాయంగా మారింది. జయలలిత నెచ్చెలి శశికళ.. అన్ని అడ్డంకులను అధిగమించి సీఎం పదవి చేపడతారా ? లేక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలి శిక్షను అనుభవిస్తారా ? ఉత్కంఠ కలిగించే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు కాసేపట్లో సమాధానం దొరకనుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కొద్దిసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది ? ఈ తీర్పుపైనే చిన్నమ్మ భవిష్యత్‌ ఆధారపడి ఉంది.

తమిళనాడులో భారీ బందోబస్తు..

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. చెన్నైలో 15వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పలు ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. రాజ్ భవన్, పోయెస్ గార్డెన్, పన్నీర్ సెల్వం నివాసం, పార్టీ కార్యాలయం, గోల్డెన్ రిసార్ట్స్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

కొనసాగుతున్న పీఎస్ఎల్వీ సీ 37 రాకెట్ కౌంట్ డౌన్..

నెల్లూరు : పీఎస్ఎల్వీ సీ 37 రాకెట్ కౌంట్ డౌన్ కొనసాగుతోంది. 104 ఉపగ్రహాలను రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది. రేపు పీఎస్ఎల్వీ సీ 37 రాకెట్ ప్రయోగం జరగనుంది. 

హెడ్ నర్స్ ఆత్మహత్యాయత్నం..

అనంతపురం : పెనుగొండ (మం) గుట్టూరు పీహెచ్ సీలో హెడ్ నర్స్ గా పనిచేస్తున్న సుమలత ఆత్మహత్యాయత్నం చేసింది. డాక్టర్ రాజశేఖర్ బాబు వేధింపులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

బందిపొరలో ఎన్ కౌంటర్..

జమ్మూ కాశ్మీర్ : హజిన్ బందిపొరలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ ఉగ్రవాది హతం కాగా, 9మంది జవాన్లకు గాయాలయ్యాయి. 

కల్తీ మద్యం సేవించి ముగ్గురి మృతి..

మహారాష్ట్ర : అహ్మద్ నగర్ లో కల్తీ మద్యం కలకలం సృష్టిస్తోంది. రాత్రి కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి చెందగా మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

09:53 - February 14, 2017

మెగాస్టార్ కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో ఒకరు 'సాయి ధరమ్ తేజ'. తనకంటు ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంటూ చిత్రాలు చేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న 'విన్నర్' విడుదలకు సిద్ధంగా ఉంది. 'సాయిధరమ్ తేజ్', 'రకుల్‌ప్రీత్ సింగ్' జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు లు 'విన్నర్' సినిమాను నిర్మించారు. ఈ చిత్రాల్లోని పాటలను ఒక్కో హీరో..ఇతర ప్రముఖులతో విడుదల చేయిస్తున్నారు. ఇటీవలే హీరో మహేష్ బాబు ఒక పాటను విడుదల చేయగా తాజాగా మరో పాటను మాస్ రాజ 'రవితేజ' విడుదల చేయనున్నారు.
'జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ చిత్రం కథకు సరైన టైటిల్' అని ఇటీవలే గోపీచంద్ మలినేని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో పలు విశేషాలు దాగున్నాయి. హాట్ యాంకర్ గా పేరొందిన 'అనసూయ' ఈ చిత్రంలో ఓ పాటకు నర్తిస్తోంది. 'సుయ..సుయ' అనే పాటనే యాంకర్ 'సుమ' పాడం విశేషం. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు 'విన్నర్' రానుంది. 

09:37 - February 14, 2017

చెన్నై: జయలలిత అధికార దుర్వినియోగం, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తుదితీర్పును వెలువరించనుంది. ఈ కేసులో శశికళ ఏ2 నిందితురాలుగా ఉన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో శశికళ భవితవ్యం తేలనుంది. తమిళనాడుతో నెలకొన్న అనిశ్చితికి తెరపడే అవకాశముంది. జయలలిత ఆదాయానికి మించిన కేసులో శశికళ నిర్దోషిగా తేలితే ఆమె పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దోషిగా తేలితేమాత్రం కటకటాల్లోకి వెళ్లనుంది. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంతో తమిళనాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్లర్లు జరిగే అవకాశముండడంతో.. పోలీసులు భారీగా మోహరించారు. దాదాపు 20వేలకుపైగా పోలీసులు మోహరించారు. అనుమానం వచ్చిన ప్రతివారినీ పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

09:35 - February 14, 2017

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రేమ పరిమళాలు వ్యాపిస్తున్నాయి. పూలపరిమళం లాంటి ప్రేమ మాధుర్యాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలనుకుంటున్నారు ప్రేమికులు. ప్రేమ ఊసులకు ఏకాంతం కావాలి. ఉద్యానవనాలు... సాగరతీరాలు.. చెరువులు...అంతకుమించి.. కొంగొత్త ప్రేమ లోగిళ్లు పుట్టుకొస్తున్నాయి. పల్లెల నుంచి పట్టణాల వరకూ అక్కడ నుంచి నగరాలకు ప్రేమాలయాలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు. వాలెంటైన్స్‌ డే సందర్భంగా హైదరాబాద్‌లో ప్రేమ పక్షులు సందడి చేస్తున్నాయి. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. రోడ్లపై అల్లరిమూకలు, ఆకతాయిలు రెచ్చిపోకుండా... షీ టీమ్స్‌ రంగంలోకి దిగాయి. మరోవైపు పార్కుల్లో ప్రేమికుల సందడి నెలకొంది. ఇటు విశ్వహిందూ పరిషత్‌ హెచ్చరికలతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ప్రేమికులపై దాడులు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.

09:15 - February 14, 2017

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకుని చాలాకాలం గడిచినా విడుదలకు నోచుకోలేని చిత్రం 'రోగ్'.. ప్రస్తుతం ఈ సినిమాపై 'పూరి' దృష్టి సారించాడు. చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత సిఆర్ మనోహర్ తనయుడు ఇషాన్ ను పరిచయం చేస్తూ పూరి తెరకెక్కించిన చిత్రమే 'రోగ్'. 'ఇజం' చిత్రం కన్నా ముందే ఈ సినిమాను మొదలు పెట్టినా వివిధ కారణాల వల్ల ఈ చిత్రం వాయిదాలు పడుతూ వస్తోంది. 'ఇజం' నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో 'రోగ్' చిత్రంతో మళ్లీ సక్సెస్ బాట పట్టాలని పూరి యోచిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందులో భాగంగా 'రోగ్' ఫస్ట్ లుక్ విడుదలైంది. టైటిల్ కి క్యాప్షన్ గా మరో చంటిగాడి ప్రేమ కథ అని రాశారు. ఈ చిత్రం 'ఇడియట్'కి సీక్వెల్ ఉంటుందా ? అనే సందేహాలు నెలకొన్నాయి.

09:14 - February 14, 2017

తూర్పుగోదావరి : మ‌న‌సుంటే మార్గముంటుంది. పేదలకు సాయంచేయాలనే సంకల్పం ఉంటే ఎన్ని అడ్డంకులైనా అవి మనముందు చిన్నవిగానే కన్పిస్తాయి. స్వప్రయోజ‌నాల కోసం కాకుండా ఆప‌ద‌లో ఉన్నవాళ్లకు ఆప‌న్నహ‌స్తం అందించే త‌త్వం ఉంటే ఎలాంటి వారినైనా జ‌నం అక్కున చేర్చుకుంటారు. నిత్యం ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న తూర్పు గోదావ‌రి జిల్లా కోరుకొండ‌కు చెందిన రాయపురెడ్డి చిన్నాపై ఓ స్పెషల్ స్టోరీ.

ఉన్నత కుటుంబం నుంచి వ‌చ్చిన‌ప్పటికీ..

రాయ‌పురెడ్డి చిన్నా. ఉన్నత కుటుంబం నుంచి వ‌చ్చిన‌ప్పటికీ..సామాన్యుల‌కు చేదోడుగా నిల‌వాల‌న్న సంక‌ల్పంతో పలు ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఇప్పుడు కోరుకొండ ప‌రిస‌రాల్లో ఎవ‌రికి ఆప‌ద వ‌చ్చినా రాయ‌పురెడ్డి చిన్నానే ఆశ్రయిస్తున్నారు.

ఊళ్లో గుడిక‌ట్టినా..బ‌డి క‌ట్టినా తానున్నానంటూ...

ఊళ్లో గుడిక‌ట్టినా..బ‌డి క‌ట్టినా తానున్నానంటూ శివ ముందుకొస్తూ త‌న దాతృత్వం చాటుకుంటున్నారు. ప‌లు సేవా కార్యక్రమాలు చేప‌డుతున్నారు. ఇటీవలే వృద్ధులకు దుప్పట్లు పంచి వారిబాగోగులు అడిగితెలుసుకున్నారు. అంతేగాకుండా అనాథ పిల్లలు, వికలాంగుల ఆశ్రమాలలో నిత్యం ప‌లు కార్యక్రమాలకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. వారికి అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాలు కొనివ్వడమే కాకుండా, ప‌లు ర‌కాల స‌హాయాలు అందిస్తూ అనాథలకు అండ‌గా నిలుస్తున్నారు.

న‌లుగురికీ ఆద‌ర్శంగా నిలుస్తున్న చిన్నా..

సేవా కార్యక్రమాల ద్వారా న‌లుగురికీ ఆద‌ర్శంగా నిలుస్తున్న చిన్నా.. తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృత‌ ప‌రుస్తాన‌న్నారు. త‌న‌కు అవ‌కాశం ఉన్నంత వ‌ర‌కూ పేద ప్రజలకు సేవచేయడమే..త‌న ల‌క్ష్యమని చిన్నా చెప్తున్నారు. మొత్తంగా కోరుకొండతో పాటు రాజాన‌గ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా ప‌లు సేవాకార్యక్రమాలు చేప‌డుతున్న రాయపురెడ్డి చిన్నాని వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌లు కూడా అభినందిస్తున్నారు.

09:13 - February 14, 2017

p { margin-bottom: 0.21cm; }

ఖమ్మం: నమ్మించి వంచించడంలో కేసీఆర్‌ సిద్ధహస్తుడని, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని కేసీఆర్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. 120వ రోజు సీపీఎం మహాజన పాదయాత్రకు మద్దతుగా ఆయన పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రజల బతుకుల్లో మార్పు వచ్చే విధంగా కేసీఆర్‌ పాలనా విధానాన్ని మార్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు.

సీఎం కేసీఆర్‌ ప్రజలను తీవ్రంగా వంచించారు...

ఎన్నికల్లో ఇచ్చిన హమీలన్నింటిని మరిచిన సీఎం కేసీఆర్‌ ప్రజలను తీవ్రంగా వంచించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సీపీఎం మహాజన పాదయాత్రకు మద్దతుగా ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా.. బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్‌ చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన కేసీఆర్‌ ఇకనైనా సామాజిక న్యాయం దిశగా చర్యలు చేపట్టాలని నారాయణ సూచించారు.

ఏ ఒక్కరూ సంతోషంగా లేరని.....

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలంటూ అధికారంలోకి వచ్చిన ఈ సర్కార్‌ నియామకాలను పూర్తిగా విస్మరించిందని తమ్మినేని ఆరోపించారు. ప్రజల బతుకుల్లో మార్పు వచ్చే విధంగా పాలనా విధానాన్ని మార్చాలని తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అన్నారు. అందరికి సామాజిక న్యాయం అందాలంటే... విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని, విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు.

సామాజిక న్యాయం లక్ష్యంగా ...

సామాజిక న్యాయం లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర.. ఖమ్మం జిల్లా లో కొనసాగుతోంది. ఇప్పటికే 120 రోజులు పూర్తి చేసుకున్న తమ్మినేని పాదయాత్ర... 120 వ రోజు టేకులపల్లి, శ్రీలక్ష్మినగర్‌, ఇల్లందు క్రాస్‌రోడ్డు,..రోటరినగర్‌, వెంకటయ్యపాలెం, తనికెళ్ల, కొణిజర్ల, పల్లెపాడులో పర్యటించింది. తమ్మినేని బృందానికి అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. వీఆర్‌ఏల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. ఏపూరి సోమన్న కళాప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.

09:13 - February 14, 2017

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 'బాహుబలి-2' చిత్ర షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. రెండున్నర సంవత్సరాలకు పైగానే ఈ చిత్రానికే అంకింతమైపోయిన 'ప్రభాస్' కొత్త చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. దర్శకుడు రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందించారు. చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు మాత్రమే బయటకు విడుదల చేశారు. చిత్ర నటీ నటుల ఫొటోలు..వారికి సంబంధించిన స్టిల్స్ ఏ మాత్రం బయటకు రాకుండా చిత్ర యూనిట్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సినిమాకు సంబంధించిన పలు వార్తలు అప్పుడప్పుడు సోషల్ మాధ్యమాల్లో పుకార్లు షికారు చేశాయి. తాజాగా 'బాహుబలి -2' కి సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ బాద్ షా 'షారూఖ్ ఖాన్' కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే 'షారూఖ్' తో రాజమౌళి చర్చలు జరిపినట్లు టాక్. 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు..ఈ చిత్రంలో షారూఖ్ ఉన్నాడా ? లేడా ? అనేది తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

09:12 - February 14, 2017

రాజన్న సిరిసిల్ల : 13గ్రామాల ప్రజల త్యాగంతో నిర్మితమవుతున్న మిడ్ మానేరు ప్రాజెక్టు తెలంగాణకే గుండెకాయలాంటిదని చేనేత జౌళి, ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రైతులకు 9 గంటలపాటు ఉచిత కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. కరవు జిల్లాగా పేరుపొందిన సిరిసిల్లాకు గోదావరి జలాలను తీసుకొచ్చి జిల్లా రూపురేఖలు మార్చేందుకు కృషిచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

09:09 - February 14, 2017

హైదరాబాద్: టెన్షన్‌.. టెన్షన్‌. ఇది తమిళనాడు రాజకీయ వర్గాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న తీరు. ఓవైపు రోజురోజుకు మద్దతు పెంచుకుంటూ పన్నీర్‌ సెల్వం జోష్‌ మీద ఉండగా.. మరోవైపు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చిన్నమ్మ అష్టకష్టాలు పడుతున్నారు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా ఏం జరుగుతుందోనన్న ఆందోళన అందరినీ వెంటాడుతోంది. సీఎం పదవి చేపట్టేందుకు శశికళ, పన్నీర్‌ సెల్వంలు ఎవరికీ వారు పోటీ పడుతుండగా.. మరోవైపు అధికారం చేజిక్కించుకునేందుకు డీఎంకే కూడా పావులు కదుపుతోంది. మరో వైపు గవర్నర్ రబ్బర్ స్టాంప్ అనే అంశాన్ని రుజువు చేస్తున్నారా? ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్ 'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిఆర్ ఎస్ నేత నరేంద్ర గౌడ్,బిజపి నేత ప్రకాష్ రెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

08:53 - February 14, 2017

హైదరాబాద్: చరిత్రాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఒకటి కాదు..రెండు కాదు...10 కాదు...20 కాదు....ఏకంగా 104 ఉపగ్రహాల ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. పిఎస్‌ఎల్‌వీ సీ- 37 ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపడం ద్వారా ప్రపంచంలోనే భారత్‌ సరికొత్త రికార్డ్‌ సృష్టించనుంది. ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఇవాళ ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా కొనసాగుతూ... రేపు ఉదయం 9 గంటల 28 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి...

వరుస విజయాలతో జోరుమీదున్న ఇస్రో మరో రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అనేక ప్రతిష్టాత్మక ప్రయోగాలతో దేశఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు చేర్చిన షార్‌.. ఇప్పుడు ప్రపంచానికే సవాల్‌ విసరబోతోంది. మంగళయాన్‌, చంద్రయాన్‌-1లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు విజయవంతం చేసిన ఆత్మవిశ్వాసంతో ఈ ఏడాది సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైంది. ఈనెల 15న... మరో భారీ ప్రయోగానికి ఇస్రో సన్నద్దమైంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి రికార్డు సృష్టించబోతోంది. ఒకేసారి 37 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రష్యా రికార్డును.. భారత్‌ బద్దలు కొట్టనుంది.

పీఎస్‌ఎల్‌వి - సి37 వాహన నౌక...

పీఎస్‌ఎల్‌వి - సి37 వాహన నౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 15వ తేదీ ఉదయం 9.28కి ఉపగ్రహాలను నింగిలోకి పంపుతారు. ఈ రాకెట్‌లో పంపించే ఉపగ్రహాల్లో భారత్‌కు చెందినవి కేవలం మూడే. మిగిలిన 101 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవే. మన దేశానికి చెందిన 714 కిలోల బరువుగల కార్టోశాట్‌ -2డి ప్రధాన ఉపగ్రహం, 20కిలోల బరువు ఐఎన్‌ఎస్‌ -1ఏ, ఐఎన్‌ఎస్‌ -1బి నానో ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. వీటిలో అమెరికా, ఇజ్రాయిల్‌, కజకిస్తాన్‌, నెదర్లాండ్‌, స్విట్జర్లాండ్‌ ముందుకు రావడంతో 101 ఉపగ్రహాలను గగనతలంలోకి పంపనున్నారు.

90 నిమిషాల పాటు జరుగనున్న ఇస్రో ప్రయోగం....

ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని గంటన్నరపాటు జరుపనుంది. 104 ఉపగ్రహాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. రాకెట్‌ భూమి నుంచి నింగిలోకి ఎగిరిన తర్వాత భూమికి 500 కిలోమీటర్ల దూరంలో ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్‌ను విడవనుంది. అనంతరం అక్కడి నుంచి 630 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత మిగిలిన 101 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి చేరేవిధంగా శాస్త్రవేత్తలు డిజైన్‌ చేశారు. ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నందున ఒక్కొక్క బాక్స్‌లో 25 ఉపగ్రహాలు పెట్టి మొత్తం నాలుగు పెట్టెల్లో అమర్చి ఒకదాని తర్వాత ఒకటి విడిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది మొత్తం జరుగడానికి 90నిమిషాల సమయం పడుతుంది.

48 గంటల ముందే ప్రారంభంకానున్న కౌంట్‌డౌన్‌.......

భూగోళ పరిశోధనల కోసం ఇస్రో ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతోంది. గత ఏడాది జూన్‌ 22న ఒకే రాకెట్‌లో 20 ఉపగ్రహాలను ప్రయోగించి భారత్‌ తన సత్తా చాటింది. అయితే రష్యా మాత్రం 2014లోనే ఏకకాలంలో 37 ఉపగ్రహాలను ప్రయోగించడం ఇప్పటి వరకు అతిపెద్ద రికార్డు. ఇప్పుడు 104 ఉపగ్రహాలను పంపి భారత్‌ ఈ రికార్డును బద్దలు కొట్టబోతోంది. ఈ ప్రయోడానికి 48 గంటల ముందే కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. అయితే వాతావరణ పరిస్థితులను బట్టి చివరి క్షణంలో మార్పులు - చేర్పులు ఉండే అవకాశం ఉంది.

07:05 - February 14, 2017

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎస్పీ జతకట్టడంపై ప్రధాని నరేంద్రమోది మండిపడ్డారు. లఖీంపూర్‌ ఎన్నికల సభలో మాట్లాడుతూ సమాజ్‌వాది పార్టీ కాంగ్రెస్‌ను శరణు వేడుకుందని విమర్శించారు. కుర్చీ వ్యామోహంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడిన రాంమనోహర్‌ లోహియాను ఎస్పీ అవమానించిందన్నారు. రైతుల బకాయిలను ఎందుకు మాఫీ చేయలేదని అఖిలేష్‌ ప్రభుత్వాన్ని మోది ప్రశ్నించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని అమలు చేసినా ఒక్క సీటు రాలేదని, ఇపుడు మూడో విడత ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ప్రకటించిన 10 అంశాల ఎజెండాతో ఒరిగేదేమి లేదన్నారు.

07:03 - February 14, 2017

విశాఖ :ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల నామినేషన్‌కు విశాఖ కలెక్టరెట్ లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నోటిపికేషన్ విడుదల చేసారు. నామినేషన్ కు చివర తేది ఫిభ్రవరి 20,నామినేషన్లు పరిశీలన 21 వ తేది, నామినేషన్లు ఉపసంహరణకు ఈ నెల 23 వ తేది వరకు గడువు ఇచ్చారు..పోలింగ్ తేది మార్చి 9 నిర్వహిస్తున్నట్లు తెలిపారు..పోలింగ్ మార్చి 9 న ఉదయం 8 గంటల నుండి 6 గంటల వరకు జరగుతుందని తెలిపారు విశాఖ కలెక్టర్. ఉత్తరాంధ్రమూడు జిల్లాలకు సంభందించి 224 పోలింగ్ సెంటర్లు ఎర్పాటు చేసామన్నారు. వీటిలొ శ్రీకాకుళం 54 ,విజయనగరం 48,విశాఖ కు 128 కేంద్రాలను ఎర్పాటు చేస్తున్నామన్నారు . నామినేషన్ల నోటిఫికేషన్ రావడంతో అటు రాజకీయ పార్టీలలో జోష్ కనిపిస్తుంది. ఇప్పటికే పీడీఎఫ్ తరుపున అబ్యర్ధిగా ఉన్న అజా శర్మ ఇవాళ నామినేషన్ వెయ్యనున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా యడ్ల ఆదిరాజు ఈ నెల 15 వ తేదిన నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. అటు స్వతంత్ర అబ్యర్ధిగా ఉన్న లీడర్ దినపత్రిక ఎడిటర్ రమణమూర్తి కూడా 15వ తేదీన నామినేషన్ కు రెడీ అవుతున్నారు. మరోవైపు అటు తెలుగుదేశం నుంచి కాని బీజేపీ నుంచి కాని ఇంత వరకూ అబ్యర్ధిని ప్రకటించలేదు.

ఉత్తరాంధ్రలో ఎన్నికల ఫీవర్

విశాఖ : ఉత్తరాంధ్రలో ఎన్నికల ఫీవర్‌ మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలలో జోష్‌ కనిపిస్తోంది. అధికారికంగా విశాఖ కలెక్టర్ నోటిఫికేషన్ జారిచేయడంతో నామినేషన్లకు సర్వం సిద్ధం అయింది.

 

07:00 - February 14, 2017

హైదరాబాద్: 2019 అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సర్వేలు చేయిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 55 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందన్న ఆశాభావంతో టిపిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఉన్నారు. గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఉత్తమ్‌ చెప్పిన ఈ విషయాలు డీలాపడ్డ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

కాంగ్రెస్‌ బలంగానే ఉందన్న సంకేతాలు...

రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనపడిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో పార్టీకి జవజీవాలు కల్పించేందుకు టీపీసీసీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ బలంగానే ఉందన్న సంకేతాలు పంపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనోద్యమం అంశాన్ని చర్చించేందుకు నిర్వహించిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో పార్టీ పరిస్థితిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన విశ్లేషణపై ఆస్తికరమైన చర్చ సాగుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌కు 55 సీట్లు ......

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వస్తాయన్న అంశంపై టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. ఈ విషయంలో తాను చేయించిన సర్వే ఫలితాలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కార్యవర్గం దృష్టికి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 స్థానాల్లో పార్టీ గెలుస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పడం గమనించదగ్గ విషయంగా భావిస్తున్నారు. కేవలం 25 చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ బలహీనంగా ఉందన్న అంశాన్ని ప్రస్తావించారని సమాచారం. మిగిలిన స్ఠానాల్లో కాంగ్రెస్‌కే అనుకూల వాతావరణం ఉందని చెప్పి... పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సహం నింపే ప్రయత్నం చేశారని చర్చించుకుంటున్నారు. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కారు జోరు కాంగ్రెస్‌ అడ్డుకోలేకపోయినా... ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చిందని వివరించినట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ బలహీన పడుతుందని సర్వేలో తేలిందన్న అంశాన్ని ప్రస్తావించి డీలా పడిన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యకర్తలు అలసత్వం వహించకూడదని సూచించారు.

ఈనెల 19 నుంచి 28 వరకు నిరసనోద్యమాలు.....

మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈనెల 19 నుంచి 28 వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనోద్యమాలు చేపడతారు. మొదటి సభలో ఈనెల 19న నిజామాబాద్‌లో ప్రారంభించాలని టిపిసిసి కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో విఫలమయ్యాయని ఆరోపిస్తూ, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిపిసిసి ప్రతిపాదించింది. పెద్ద నోట్ల రద్దు, నిరుద్యోగం, రైతాంగ సమస్యలపై జనచైతన్యం కోసం నిరసనోద్యమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. రెండున్నరేళ్ల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాను కప్పిపుచ్చుకుంటూ, గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని టిపిసిసి ఆరోపించింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పథకంతో అధికార టీఆర్‌ఎస్‌ దూకుడు ప్రదర్శిస్తున్నతరుణంలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సంధించిన సర్వే అస్త్రం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో పార్టీ పరిస్థితిపై సర్వే చేయించిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

హైదరాబాద్: 2019 అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సర్వేలు చేయిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 55 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందన్న ఆశాభావంతో టిపిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఉన్నారు. గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఉత్తమ్‌ చెప్పిన ఈ విషయాలు డీలాపడ్డ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

 

06:56 - February 14, 2017

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నారు. ఇప్పుడు ఈ దూకుడే పార్టీకి ఇబ్బంది కలిగిస్తోందా అనే అనుమానాలు వైసీపీ నేతల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.

రోజా తక్కువ కాలంలోనే సినిమాల్లో తనదైన ముద్ర...

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే పేరు రోజా.. సినీ నటిగా కెరీర్ మొదలు.. అనంతరం రాజకీయాల్లోకి అరంగేట్రం సినీ నటిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన రోజా తక్కువ కాలంలోనే సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. అనంతరం రాజకీయాల్లోనూ అడుగుపెట్టి తన సత్తా చాటుతున్నారు.

వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం ....

తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన రోజా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు. వైసీపీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా కానీ వారందరినీ తన దూకుడుతో ఆమె వెనక్కి నెట్టారు.

రోజా తీరు పార్టీకి నష్టం కలిగిస్తోందనన్న భావనలో నేతలు ...

అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిని ఆమె వైపు తిప్పుకున్నారు. అయితే ఆమె వ్యవహరిస్తున్న తీరు మాత్రం పార్టీకి సమస్యలు సృష్టిస్తోందన్న భావన వైసీపీ నేతల్లో వ్యక్తంఅవుతోంది. అసెంబ్లీలో రోజా తీరు అనంతరం సభ నుంచి సస్పెండ్.. తాజాగా మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరు ఇవన్నీ పార్టీకి ఎలాంటి నష్టం కలిగిస్తుందోనని ఫ్యాన్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. రోజా దూకుడు ఇలాగే కొనసాగితే.... పార్టీ పరంగా లాభమా.... నష్టమా అన్న చర్చ నేతల్లో జరుగుతోంది.

06:50 - February 14, 2017

చెన్నై: తమిళ రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తూ.. ఆసక్తిగా మారుతున్నాయి. ఏదేమైనా సీఎం అయి తీరతానంటున్న శశికళ.. అన్నట్లుగానే రెండోకోణాన్ని చూపడం మొదలు పెట్టారు. గవర్నర్‌ తీరును ఆక్షేపిస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పనిలో పనిగా.. పన్నీరు సెల్వం శిబిరంపైనా దూకుడును పెంచారు. వీటితోపాటే.. మద్దతుదారులు చేజారకుండా మచ్చిక చేసుకునే పనులూ కొనసాగించారు. వీటన్నింటి నేపథ్యంలోనే శశికళకు కొత్త ఆందోళన వచ్చి పడింది. అక్రమాస్తుల కేసులో తుది తీర్పు నేడు వెలువడే అవకాశం ఉందన్న సంకేతాలతో.. తమ రాజకీయ భవితవ్యం ఏమవుతుందోనని శశికళ శిబిరం కలవర పడుతోంది..

పోటాపోటీ వాతావరణం తారాస్థాయికి .....

తమిళ రాజకీయాలు క్షణానికో ట్విస్టుగా సాగుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గాల మధ్య పోటాపోటీ వాతావరణం తారాస్థాయికి చేరుకుంటోంది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, సామాన్య నెటిజన్ల నుంచి.. పన్నీర్‌ సెల్వంకు మద్దతు పెరుగుతున్న వేళ.. శశికళ, ఇంతకుముందే చెప్పినట్లు, సోమవారం దూకుడును పెంచారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోకుండా తనను గవర్నర్‌ నిలువరిస్తున్నారని గట్టిగా నమ్ముతున్న శశికళ.. సోమవారం, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల బలం తనకుందని ఆమె సుప్రీంకోర్టులోను, మద్రాసు హైకోర్టులోనూ పిటిషన్‌ దాఖలు చేశారు. అదే సమయంలో, ప్రభుత్వ యంత్రాంగం నుంచి శశికళకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఆమె తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. అయితే, రిసార్ట్స్‌లో ఎమ్మెల్యేలు బందీలుగా ఉన్నారన్న అభియోగంపై.. తమిళనాడు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు, విచారణ జరిపిన ప్రధాన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. శశికళకు మద్దతుగా 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అఫిడవిట్లు సమర్పించినట్లు కోర్టుకు నివేదించారు. ఈ లెక్కన.. శశికళ శిబిరం నుంచి మరో ముగ్గురు బయటకు వస్తే.. ఆమెకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దూరమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పన్నీర్‌ సెల్వంపై విమర్శల జోరు...

మరోవైపు.. శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంపై విమర్శల జోరును పెంచారు. సెల్వం నమ్మకద్రోహి అని పార్టీ శ్రేణులకు నిరూపించే ప్రయత్నాలు చేశారు. పన్నీరు సెల్వం అమ్మకు ద్రోహం చేశారని, అమ్మ అంతిమసంస్కారాల్లో తానుంటే.. సెల్వం పార్టీని చీల్చేందుకు కుట్ర పన్నారని శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని కాపాడేందుకే తాను సీఎం పదవిని ఆశించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. 33 ఏళ్లుగా అమ్మతో పాటు తాను ఎన్నో పోరాటాలు చేశానని, అమ్మ జయలలితకు ఎదురైన అవమానాలే తనకూ జరుగుతున్నాయని అన్నారు.

ఓవైపు న్యాయపోరాటం, మరోవైపు సెల్వంపై దూకుడు...

ఓవైపు న్యాయపోరాటం, మరోవైపు సెల్వంపై దూకుడును పెంచిన శశికళ.. మద్దతుదారులు చేజారకుండా సోమవారం కూడా వారిని కలిశారు.

తాను సింహం లాంటి వ్యక్తినని, తానెవరికీ భయపడనని శశికళ ప్రత్యర్థి శిబిరాన్ని ఉద్దేశించి అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అవసరమైతే తన ప్రాణాలిచ్చైనా పార్టీని కాపాడుకుంటానని ఆమె తెలిపారు. తానెవరినీ నిర్బంధించలేదని, ఎమ్మెల్యేలంతా స్వేచ్ఛగా ఉన్నారని, తనకు మద్దతునిస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను శశికళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. తమిళనాడులో ఏం జరుగుతున్నదో, దాని వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసని శశికళ వ్యాఖ్యానించారు. తన వెంట ఉన్న ఎమ్మెల్యేలలో ఐక్యతను చూసి చలించి పోతున్నానంటూ శశికళ కంటతడి పెట్టుకున్నారు.

కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో గవర్నర్‌ ప్రత్యేక సమావేశం...

ఇంకోవైపు... కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో గవర్నర్‌ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ఎవరి బలం ఎంతో తేల్చాలని అటార్ని జనరల్‌ తమిళనాడు గవర్నర్‌కు సూచించారు. మెజారిటీ ఉన్నవారికే ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని సూచించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. శశికళ శిబిరాన్ని ఇప్పుడు సరికొత్త కలవరం వేధిస్తోంది. శశికళ, జయలలితపై ఉన్న అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించే అవకాశం ఉందన్న సమాచారం రాష్ట్ర రాజకీయాలనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. శశికళ రాజకీయ భవితవ్యాన్ని తేల్చే ఈ తీర్పు ఏరీతిగా ఉండబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ కేసులో శశికళ కనుక నిర్దోషిగా తేలితే.. ఇక ఆమె ముఖ్యమంత్రి కావాడాన్ని ఏ శక్తి ఆపలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ సుప్రీం తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆమె జైలుకెళ్లక తప్పదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాసేపట్లో తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు

చెన్నై: తమిళనాడు రాజకీయ వైకుంఠపాళి రసకందాయంగా మారింది. జయలలిత నెచ్చెలి శశికళ.. అన్ని అడ్డంకులను అధిగమించి సీఎం పదవి చేపడతారా ? లేక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలి శిక్షను అనుభవిస్తారా ? ఉత్కంఠ కలిగించే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు కాసేపట్లో సమాధానం దొరకనుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కొద్దిసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది ? ఈ తీర్పుపైనే చిన్నమ్మ భవిష్యత్‌ ఆధారపడి ఉంది.

06:42 - February 14, 2017

చెన్నై: ఇవాళ శశికళ భవితవ్యం తేలనుంది. జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో.. ఎలాంటి తీర్పు వస్తుందోనన్న టెన్షన్‌ అందరినీ వెంటాడుతోంది. ఈ కేసులో శశికళ రెండవ నిందితురాలిగా ఉంది.

జయలలిత మొదటి మద్దాయి కాగా..

66 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో జయలలిత మొదటి మద్దాయి కాగా.. శశికళ రెండో ముద్దాయిగా ఉన్నారు. చెన్నై, బెంగళూరుల్లో దాదాపు 18 ఏళ్ల పాటు కేసు నడిచింది. ఈ కేసులో జయకు వంద కోట్ల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష పడింది. శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు తలా 10 కోట్ల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు 2014లో తీర్పునిచ్చింది. కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చారు. తర్వాత బెంగళూరు హైకోర్టులో అప్పీలు చేసి.. నిర్దోషులుగా బయటపడ్డారు. అయితే.. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది, డీఎంకేలు వేర్వేరుగా సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ప్రస్తుతం ఇదే కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఈ కేసులో తీర్పు ఈరోజు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శశికళ దోషిగా తేలితే జైలుకు..

ఇక ఈ కేసులో శశికళ దోషిగా తేలితే జైలుకు వెళ్లాల్సి రావచ్చు. మరోవైపు ఈ కేసులో దోషిగా నిర్దారణ అయితే.. ఆమె ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఫలితంగా అన్నాడీఎంకే శాసనాసభపక్ష నేతగా మరొకరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో ముఖ్యమంత్రి పీఠం కోసం బలపరీక్షకు సిద్ధమవుతున్న ఆమె ఆశలు పూర్తిగా గల్లంతు కావచ్చు. ఇప్పటివరకు ఈ కేసు నేపథ్యంలోనే గవర్నర్‌ విద్యాసాగర్‌రావు.. ఆమెకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ కేసులో శశికళకు శిక్ష పడితే.. మళ్లీ ముఖ్యమంత్రి మార్చాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు గవర్నర్‌ వేచి చూశారు. ఇక ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువడితే.. ఆ తీర్పు ఆధారంగా సీఎం ఎవరనేది తేలిపోనుంది. ఇన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

06:39 - February 14, 2017

హైదరాబాద్:తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలలోని కాంట్రాక్ట్ లెక్చరర్స్ పోరుబాట పట్టారు. ఇప్పటికే విభిన్న రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ రేపటి నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ తమ సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడాతామంటూ స్పష్టం చేశారు. సమాన పనికి సమానవేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ యూనివర్సిటీల కాంట్రాక్ట్ లెక్చరర్స్ పోరాడుతున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలన్న డిమాండ్ తో పాటు పార్ట్ టైం, గెస్ట్ లెక్చరర్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పరిగణించాలని కోరుతున్నారు. తెలంగాణ యూనివర్సిటీల కాంట్రాక్ట్ లెక్చరర్స్ సమ్మె చేయడానికి దారితీసిన పరిస్థితులపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ టి ఎయుసిటిఏ నాయకులు రామేశ్వరరావుగారు, చిట్యాల రాజు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు

హైదరాబాద్: మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. రజౌరి జిల్లాలోని సుందర్బని సెక్టార్‌లో భారత ఆర్మీ శిబిరాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ మోర్టార్లను కూడా భారత శిబిరాలపైకి విసిరింది.

లాహోర్‌లో భారీ బాంబు పేలుడు:16మంది మృతి

పాకిస్థాన్‌: లాహోర్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. పంజాబ్‌ అసెంబ్లీ వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 16మంది మృతిచెందగా, 40మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Don't Miss