Activities calendar

15 February 2017

22:46 - February 15, 2017

హైదరాబాద్ : జల వివాదాలను తెలుగు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ అంశంపై కోర్టుల చట్టూ తిరగడం కన్నా సామరస్యపూర్వకంగా, శాంతియుత వాతావరణంలో తరుణోపాయం కనుక్కోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. రైతుల ప్రయోజనాలే మిన్నగా భావించి తెలంగాణ, ఏపీ కలిసి  పనిచేయాలన్న అభిప్రాయాన్ని బజాజ్‌ కమిటీతో జరిపిన భేటీలో ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. 
కృష్ణా, గోదావరి జలాల సద్వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. 
జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా.. తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏటా సముద్రం పాలవుతున్న నాలుగు వేల క్యూసెక్కుల కృష్ణా, గోదావరి జలాల సద్వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఏకే బజాజ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీకి వెల్లడించింది. వివాదాలు సృష్టించుకోవడం మంచిదికాదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.. 
జల వివాదాలు వాంఛనీయం కాదన్న కేసీఆర్‌
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు వాంఛనీయం కాదన్న అభిప్రాయాన్ని కేసీఆర్‌ వ్యక్తం చేశారు.  రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్‌ అన్నారు. కృష్ణాతో పోలిస్తే గోదావరిలో నీటి లభ్యత ఎక్కువని,ఈ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు తమ ప్రభుత్వం చేస్తున్నప్రయత్నాలను ఆయన కమిటీ దృష్టికి తెచ్చారు. ఏపీ ప్రభుత్వం కూడా గోదావరి జిలాలను దక్షిణ కోస్తాతోపాటు, రాయలసీమకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. నీటి పంపకాల్లో వివక్ష కారణంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అరవై ఏళ్ల గోసకు తెరదించుతూ గోదావరి జలాల్లో తమ వాటాను వాడుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నఅంశాన్ని ప్రస్తావించారు. 
పులిచింతల, పోతిరెడ్డిపాడు ఏపీ అక్రమ నిర్మాణాలు
ఉమ్మడి ఏపీ పాలకులు అనుసరించిన వివక్షపూరిత విధానాలతో తెలంగాణకు నష్టం జరిగిందని బజాజ్‌ కమిటీకి వివరించారు కేసీఆర్‌. సాగర్‌ డిజైన్‌ మార్పు వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందన్న కేసీఆర్‌. బీమా ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల జాప్యానికి గత ఆంధ్రాపాలకులే కారణమని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే.. ఈ ప్రాజెక్టులకు మోక్షం లభించిందన్నారు. అయితే ఆంధ్రా పాలకులు అక్రమంగా పులిచింతల, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులను నిర్మించారని, తాజాగా ముచ్చుమర్రి ప్రాజెక్టునూ అక్రమంగా కడుతున్నారని బజాజ్‌ కమిటీ దృష్టికి తెచ్చారు. 
బతకాలి, బతకనివ్వాలన్నదే తెలంగాణ ధ్యేయం 
సుముద్రంలో కలుస్తున్న వేలాదీ టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవడాన్ని విడిచిపెట్టి, 25-50 టీఎంసీ నీటి కోసం తగవులాడుకోవడం మంచిది కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రంతో పాటే.. పొరుగు రాష్ట్రం హితాన్నీ కోరుతున్నామన్న కేసీఆర్‌.. వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణా, గోదావరి నదుల ప్రవాహాన్ని ఆపడం వల్ల దిగువ రాష్ట్రాలు ఎదుర్కొనే సమస్యలను బజాజ్‌ కమిటీ దృష్టికి తెచ్చారు. నీటి లభ్యత విషయంలో రాష్ట్రాలు వాడుకోవాల్సిన నీటిపై స్కీం-1, స్కీం-2 అమలు చేయాలని సూచించారు. మంచినీటికి ప్రాధాన్యత ఇస్తూ, అక్రమ ప్రాజెక్టులకు నీరు విడుదల చేయకుండా చూడాలని బజాజ్‌ కమిటీ దృష్టికి విజ్ఞప్తి చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కష్ణా  బేసిన్‌కు తరలిస్తున్న దృష్ట్యా... కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను పెంచాలని కేసీఆర్‌ కోరారు.  

22:37 - February 15, 2017

గుంటూరు : తప్పు చేసిన వారెవ్వరూ తప్పించుకోలేరన్న సత్యాన్ని.. శశికళ విషయంలో న్యాయస్థానం నిరూపించిందని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్‌ శశికళకన్నా ఎక్కువ అవినీతికి పాల్పడ్డారని, అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ చెంగల్రాయుడును పార్టీలోకి స్వాగతిస్తూ.. చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 
టీడీపీలో చేరిన చెంగల్రాయుడు 
కడప జిల్లా రైల్వే కోడూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు టీడీపీలో చేరారు. రాజధాని అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.  చెంగల్రాయుడుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు, విద్యార్థి దశ నుంచీ అనుబంధమున్న ఆయన టీడీపీలోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శశికళ కంటే అత్యంత అధికంగా అవినీతికి పాల్పడిన జగన్‌కు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా అని ప్రజలను ప్రశ్నించారు. 
వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపైనా చంద్రబాబు ఛలోక్తులు 
రాజకీయాలను అడ్డుపెట్టుకొని ఆస్తులు సంపాదించడంపై సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసిందని, ప్రజలు మంచి నాయకులను ఆదరించి, గౌరవించాలని అన్నారు. దీర్ఘ కాలిక ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చేందుకే.. ప్రజా ప్రతినిధులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపైనా ఆయన ఛలోక్తులు విసిరారు. అమరావతిలో అసెంబ్లీని వారి దూకుడును నిలువరించేలా నిర్మించామన్నారు. ఈకార్యక్రమంలో కడప జిల్లా ఇంచార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు, ఆజిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

 

22:31 - February 15, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాలు క్లైమాక్స్‌ దశకు చేరుకున్నాయి. తమిళనాడు ఇంచార్జ్‌ గవర్నర్ విద్యాసాగర్‌రావుతో కాసేపటి క్రితమే పన్నీరు సెల్వం బృందం భేటీ అయింది. ఈ భేటీ ఇంకా కొనసాగుతోంది. అంతకుముందు గవర్నర్‌తో పళనిస్వామి బృందం భేటీ అయింది. ఇరువర్గాలు గవర్నర్‌ను వేర్వేరు సమయాల్లో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. అయితే బలనిరూపణపై గవర్నర్‌కు రాజ్యాంగనిపుణుల భిన్న సలహాలు సూచిస్తున్నారు. శాసనసభలోనే ఇరువర్గాలకు ఒకేసారి బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కొందరు రాజ్యాంగ నిపుణులు సలహాలు ఇస్తున్నారు. సభలో ఎవరివైపు మెజారిటీ సభ్యులు ఉంటే వారే విజయం సాధించినట్లు అవుతుందని వారి వాదన. అయితే బలనిరూపణపై గవర్నర్ విద్యాసాగర్‌రావు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 

 

22:27 - February 15, 2017

భారతి రోధసి పరిశోధనల్లో మైలు రాయి.. అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతం.. భారత సాంకేతిక ప్రగతి సాధించిన అపూర్వ విజయమిది. ఒకే సారి 104 ఉపగ్రహాలు నింగికెగసి చర్రిత సృష్టించాయి. పీఎస్ ఎల్ వీ సీ37 వాహక నౌక ప్రయోగం విజయవంతం కావడం.. ఇస్రో పరిశోధనలో అతి పెద్ద అచీవ్ మెంట్ గా నిలిచింది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

22:25 - February 15, 2017
22:19 - February 15, 2017

ఇండియా ఇజ్జతు నిలవెట్టిన ఇస్రో... నిప్పులు జిమ్మి నింగికెగిసిన ఖ్యాతి, ఇరవై ఏండ్ల కింద అగ్నిరాజేసిన సుబ్రమణ్యం....అమ్మల భరతం పట్టిన పుణ్యాత్ముడు ఒక్కడే, అంబాసిడర్ కార్ల ఇర్కిన సమంత... చేనేత చేయూత మీద షబ్బీర్ పంచాదీ, మన పార్టీలున్నప్పుడు మంచోడు... మంది పార్టీల చేరంగనే జూపల్లి చెడ్డోడు, కలాస్ మిరపనారు వోస్తే మీరు కల్లాస్... ఒంగోలు కాడ నిండ మునిగిన మిర్చి రైతులు, లవర్స్ డే పండుగ జేసిన హిందూ సంఘాలు...మర్చిపోయిన జనాలకు మళ్ల యాదిజేసుడు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.....

 

22:08 - February 15, 2017

అనంతపురం : జిల్లాలోని కనేకల్‌లో దారుణం జరిగింది. అడ్వకేట్‌ సునీతను కొందరు గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. అయితే లాయర్‌ సునీత హత్య వెనకాల భూ తగాదాలే కారణమని పోలీసులు చెప్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు..దుండగుల కోసం గాలిస్తున్నారు. 

22:02 - February 15, 2017

ఖమ్మం : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో 122వ రోజు ఖమ్మం జిల్లాలో మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం 24వ జిల్లా ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న పాదయాత్ర బృందానికి వివిధ సమస్యలపై ప్రజల నుండి భారీగా వినతులు అందుతున్నాయి. అయితే నిత్యం ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖలు రాస్తున్న తమ్మినేని వీరభద్రం..తాజాగా రుణమాఫీ అంశంపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అధికారంలోకి వస్తే..రైతులందరికి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌...అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లైనా..రుణమాఫీని పూర్తి చేయలేదని తమ్మినేని వీరభద్రం వివరించారు. మధిర, వైరా ప్రాంతాల్లో దాదాపు 10వేల మంది రైతులకు విడతలవారీగా రుణమాఫీ వర్తించడంలేదని..వెంటనే వారందరికి రుణమాఫీ వర్తింపచేయాలని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పాత రుణంతో సంబంధంలేకుండా కొత్త రుణాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను తమ్మినేని వీరభద్రం కోరారు. 

 

21:56 - February 15, 2017

శశికళకు ఖైదీ నెంబర్‌ 10711 కేటాయింపు

కర్నాటక : బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో లొంగిపోయిన శశికళకు జైలు అధికారులు 10711 ఖైదీ నెంబర్‌ను కేటాయించారు. అలాగే శశికళతో పాటు జైలులో లొంగిపోయిన ఇళవరసికి 10712, దినకర్‌న్‌కు 10713 నెంబర్లను జైలు అధికారులు కేటాయించారు. 

 

21:51 - February 15, 2017

కర్నాటక : బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో లొంగిపోయిన శశికళకు జైలు అధికారులు 10711 ఖైదీ నెంబర్‌ను కేటాయించారు. అలాగే శశికళతో పాటు జైలులో లొంగిపోయిన ఇళవరసికి 10712, దినకర్‌న్‌కు 10713 నెంబర్లను జైలు అధికారులు కేటాయించారు. అయితే ఇక తనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని కోరుతూ..శశికళ పెట్టుకున్న పిటీషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. ప్రత్యేక గది, ఏసీ, టీవీ, పేపరు వంటి సౌకర్యాలను కల్పించాలని శశికళ తన పిటిషన్‌లో కోరారు. అయితే ప్రత్యేక ఖైదీగా పరిగణించడం కుదరదని..శశికళకు సాధారణ ఖైదీగానే పరిగణించాలని జైలు అధికారులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. తొలుత న్యాయమూర్తి ఎదుట లొంగిపోయిన శశికళకు..జైలు అధికారులు ప్రత్యేక వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత పరప్పన అగ్రహార జైలుకు శశికళను జైలు సిబ్బంది తరలించారు. 

 

21:47 - February 15, 2017

చెన్నై : గవర్నర్ విద్యాసాగర్‌రావుకు పళనిస్వామి తాజాగా లేఖరాశారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆలస్యం చేయొద్దని..ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలంటూ పళనిస్వామి గవర్నర్‌ను లేఖలో కోరారు. అయితే మరికాసేపట్లో గవర్నర్‌ను పళనిస్వామి కలవనున్నారని సమాచారం.  

 

21:43 - February 15, 2017

సిద్దిపేట : జిల్లాలోని గజ్వేల్‌ వేదికగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార టీఆర్ ఎస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించింది. ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వహించిన  ప్రజా పోరు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు మార్పు,  బలవంతపు భూసేకరణ, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌, ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ, డబులె బెడ్‌ రూము ఇళ్ల నిర్మాణం వంటి అంశాల్లో ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను తెలుగుదేశం నేతలు ఎండగట్టారు. 
 

శశికళ జైలు పాలు

కర్నాటక : అక్రమాస్తుల కేసులో శశికళ జైలు పాలయ్యారు. బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో శశికళ లొంగిపోయారు. జైలులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. శశికళ ప్రత్యేక కోర్టు ముందు లొంగిపోగా ఆమె వాగ్మూలాన్ని రికార్డు చేశారు. శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్‌ కోర్టులో లొంగిపోయారు. జైలు ప్రాంగణం పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్ల వద్ద అన్నాడీఎంకే కార్యకర్తలను పో

21:38 - February 15, 2017

కర్నాటక : అక్రమాస్తుల కేసులో శశికళ జైలు పాలయ్యారు. బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో శశికళ లొంగిపోయారు. జైలులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. శశికళ ప్రత్యేక కోర్టు ముందు లొంగిపోగా ఆమె వాగ్మూలాన్ని రికార్డు చేశారు. శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్‌ కోర్టులో లొంగిపోయారు. జైలు ప్రాంగణం పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్ల వద్ద అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో కార్యకర్తల వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు శశికళ వర్గం వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. రాళ్లు రువ్వింది సెల్వం వర్గీయులేనని శశికళ వర్గీయులు ఆరోపించారు. 

తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి తెర పడే అవకాశం....

చెన్నై : తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి తెర పడే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గవర్నర్ పిలుపుకోసం పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గం ఎదురు చూపులు చూస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎవరిని పిలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. పళనిస్వామిని గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పళనిస్వామికి అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. 

17:41 - February 15, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి తెర పడే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గవర్నర్ పిలుపుకోసం పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గం ఎదురు చూపులు చూస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎవరిని పిలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. పళనిస్వామిని గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పళనిస్వామికి అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:31 - February 15, 2017

కర్నాటక : శశికళ బెంగళూరు చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్, తంబదొరై కోర్టు వద్దకు చేరుకున్నారు. పరప్పణ కోర్టులో శశికళ లొంగిపోయింది. జైలు వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ కేడ్ల వద్ద అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో అన్నాడీఎంకే కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. జైలు ప్రాంగణం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 144 సెక్షన్ అమలు చేశారు. పరప్పణ సెంట్రల్ జైలుకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

 

బెంగళూరుకు చేరుకున్న శశికళ

కర్నాటక : శశికళ బెంగళూరు చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్, తంబదొరై కోర్టు వద్దకు చేరుకున్నారు. భారీ కేడ్ల వద్ద అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో అన్నాడీఎంకే కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. 

17:16 - February 15, 2017
17:09 - February 15, 2017

నెల్లూరు : గగనతంలో ఇస్రో అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. పీఎస్‌ఎల్‌వీ -సీ37 విజయంతో సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్ర దేశాల సరసన భారత్‌ను నిలిపింది. ఇదే ఊపుతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఇస్రో భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రయోగాలపై 10టీవీ కథనం...
అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సరికొత్త రికార్డు
ఇస్రో అంతరిక్షంలో విజయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఆర్యభట్టతో తన ప్రయోగాల పరంపరను ప్రారంభించింది ఇస్రో. నాటి నుంచి నేటి వరకు ఎన్నో వాహన నౌకలను నింగిలోకిపంపి అప్రతిహత విజయాలను సాధించింది.  ఆర్ధిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌ను.. సాంకేతికంగా తిరుగులేని దేశంగా తీర్చిదిద్దే బాధ్యతను ఇస్రో తన భుజస్కందాల మీద వేసుకుంది.  ఆ ప్రయత్నంలోనే  అంతరిక్ష విజ్ఞానంలో అగ్రదేశాలకు ధీటుగా నిలబెట్టేందుకు అనేక ప్రయోగాలు చేపట్టింది. భవిష్యత్‌లోనూ మరిన్ని ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతోంది. 
చంద్రయాన్‌ 2 ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రో
చంద్రమండలంవైపు ఇస్రో అడుగులు పడ్డాయి. ఇప్పటికే చంద్రయాన్‌ 1 ప్రయోగాన్ని చేపట్టింది. ఆ పరిశోధనను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రయాన్‌ -2 ప్రయోగాన్ని ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది మొదట్లో గానీ చేపట్టే ఆలోచనలో ఉంది.
ఆదిత్య 1 ప్రాజెక్టుకు రెడీ అవుతోన్న ఇస్రో
సౌర వ్యవస్థ అధ్యయనం ఇప్పటికే ఇస్రో నింగిలోకి రాకెట్లను పంపింది. కానీ సూర్యుడికి అతి సమీపంలో ఉపగ్రహాల్ని ప్రవేశపెట్టలేకపోయింది. నాసా, ఈసాలు మాత్రమే సూర్యుడికి అతి సమీపంలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టాయి. ఇదే వరుసలో నిలిచేందుకు ఇస్రో ఆదిత్య 1 ప్రాజెక్టు సిద్ధం అవుతోంది. 
అంగారక గ్రహంపై లోతైన అధ్యయనానికి ఇస్రో రెడీ
అంగారక గ్రహంపై లోతైన అధ్యయం చేయడానికి కూడా ఇస్రో రెడీ అయ్యింది. మంగళయాన్‌ -2 ద్వారా ఈ అధ్యయనం చేపట్టాలని నిర్ణయించింది. 2020 సంవత్సరాన్ని  ఇందుకు లక్ష్యం పెట్టుకుంది. ఇక పర్యావరణంలో వచ్చే మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌, సముద్ర నీటి మట్టాల్లో తేడాలు, గ్రీన్‌హౌస్‌ వాయువులు అధ్యయనానికి త్వరలోనే ఓ ఉపగ్రహం పంపించనుంది ఇస్రో.
నాసాతో కలిసి పనిచేయడానికి ఇస్రో రెడీ
అమెరికా అంతరిక్ష సంస్థ సానాతో కలిసి పనిచేయడానికి ఇస్రో సిద్ధమైంది. ఇస్రో, నాసా సంయుక్తంగా రాడార్‌ను అభివృద్ధి చేయనున్నాయి. భూకంపాలు, సునామీల వంటి ఉత్పాతాలను ఇది విశ్లేషించనుంది.  జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ -3ను పంపడానికి కూడా ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది.  దీని ద్వారా నాలుగు టన్నులూ, అంతకంటే ఎక్కువ బరువైన ఉపగ్రహాలను అంతరిక్షానికి పంపవచ్చు. ఇందులో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్‌ ఇంజిన్‌ను వినియోగించనున్నారు. ఇదే కనుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఖరీదైన వాహకనౌకలను తప్పించే అవకాశం ఉంది. హైత్రోపుట్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో ప్రణాళికలు రచిస్తోంది. దీని ద్వారా సమాచార , సాంకేతిక పరిజ్ఞానం మనకు మరింత చేరువకానుంది.
మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలకు ఏర్పాట్లు
ఇప్పటిదాకా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపిన అనుభవం ఇస్రోకు లేదు. ఆ లోటూ త్వరలోనే తీర్చనుంది ఇస్రో.  మానవసహిత అంతరిక్ష కార్యక్రమాల కోసం వ్యోమగాముల ఎంపిక ప్రక్రియా మొదలైపోయింది. ఇస్రో, భారత వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఇది. ఈ ప్రాజెక్టుతో రష్యా, అమెరికా, చైనాల సరసన మనమూ చేరనున్నాం. 

17:04 - February 15, 2017

హైదరాబాద్‌ : నగరంలో స్వైన్‌ ఫ్లూ మరోసారి విరుచుకుపడింది. స్వైన్‌ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాంధీ అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు స్వైన్‌ ఫ్లూతో మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరింది. మరో 10 మంది బాధితులు గాంధీలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరికి స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. 

 

గోల్డెన్‌ బే రిసార్ట్‌ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత

చెన్నై : గోల్డెన్‌ బే రిసార్ట్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్పీ ఆధ్వర్యంలో రిసార్ట్‌ను చుట్టు ముట్టిన పోలీసులు.. 50 ఉన్నతాధికారుల బృందం రిసార్ట్‌లోకి ప్రవేశించింది. రిసార్ట్‌లోని ఒక్కొక్క ఎమ్మెల్యేను విడివిడిగా పోలీసులు విచారిస్తున్నారు. శరవణన్‌ తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో రిసార్ట్‌ లో తనిఖీలు ముమ్మరం చేశారు. 

16:58 - February 15, 2017

చెన్నై : గోల్డెన్‌ బే రిసార్ట్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్పీ ఆధ్వర్యంలో రిసార్ట్‌ను చుట్టు ముట్టిన పోలీసులు.. 50 ఉన్నతాధికారుల బృందం రిసార్ట్‌లోకి ప్రవేశించింది. రిసార్ట్‌లోని ఒక్కొక్క ఎమ్మెల్యేను విడివిడిగా పోలీసులు విచారిస్తున్నారు. శరవణన్‌ తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో రిసార్ట్‌ లో తనిఖీలు ముమ్మరం చేశారు. మరోవైపు శశికళ వర్గం పోలీసులను అడ్డుకొవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడు సంక్షోభంపై సాయంత్రం గవర్నర్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:47 - February 15, 2017

నెల్లూరు : అంతరిక్ష పరిశోధనల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో...మరో మైలు రాయిని దాటింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి అంతరిక్ష చరిత్రలో భారత్‌ కీర్తిపతాక  రెపరెపలాడేలా చేసింది. పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ సరికొత్త ప్రయోగంతో అగ్రదేశాలను భారత్‌ అధిగమించింది. 
ఒక్క రాకెట్టుతో 104 ఉపగ్రహాలు కక్ష్యలోకి 
భారత్‌ అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో మరోసారి తన సత్తాను చాటింది. ఒక్క రాకెట్టుతో 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి చ‌రిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ రీసెర్చ్‌  సెంటర్ నుంచి ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి అగ్ర దేశాలకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ  కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ37 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 
నింగిలోకి మోసుకెళ్లిన పీఎస్ ఎల్ వీ సీ37రాకెట్‌ 
అన్ని దశల‍్లోనూ పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది. నాల‍్గవ దశలో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడుతూ రాకెట్‌ పయనించింది. మొత్తం 524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యావర్తన కక్షలోకి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది. 17.31 నిమిషాలకు కార్టోశాట్‌-2 ఉపగ్రహాన్ని.. ఆ తర్వాత  ఐఎన్‌ఎస్‌-1ఎ, ఐఎన్‌ఎస్‌-1బి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు, ఇజ్రాయెల్‌, కజకిస్థాన్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, యూఏఈ  దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించాయి. 28.42 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. వీటికి సంబంధించి మారిషస్‌లోని ఇస్రో కేంద్రానికి తొలి సంకేతాలు  అందాయి.
భారత్‌కు చెందిన 3 ఉపగ్రహాలు 
భారత్‌కు చెందిన మూడు ఉపగ్రహాల్లో కార్బోశాట్‌ 2.....714 కేజీలు కాగా.. ఐఎన్‌ఎస్‌ 1 ఏ, ఐఎన్‌ఎస్‌ 1 బి ఉపగ్రహాలు ఒక్కొక్కటి 15 కేజీల బరువు ఉన్నాయి. మిగతా దేశాలకు  చెందిన ఉపగ్రహాల బరువు 834 కిలోలు. కార్టోశాట్‌-2డి అత్యాధునిక కెమెరాలతో భూమికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని అందించనుంది.
ఆనందంలో ఇస్రో శాస్త్రవేత్తలు 
పీఎస్‌ఎల్‌వీ-సీ37 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. షార్‌ కేంద్రంలో ప్రయోగాన్ని ఉత్కంఠగా వీక్షించిన శాస్త్రవేత్తలు... ప్రయోగం ముగిసిన  వెంటనే ఒకరికి ఒకరు అభినందలు తెలుపుకున్నారు. ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. 
ఇస్రోకు ప్రశంసల వెల్లువ 
పీఎస్‌ఎల్‌వీ-సీ37 ప్రయోగం విజయవంతమవడంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించిన  ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రయోగం దేశానికి, మన అంతరిక్ష పరిశోధన రంగానికి గర్వకారణమని కొనియాడారు. మన శాస్త్రవేత్తలకు దేశం సెల్యూట్‌ చేస్తోందని మోదీ ట్వీట్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో పాటు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌ ఇస్రో సైంటిస్టులకు అభినందనలు తెలిపారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2013లో 29 ఉపగ్రహాలను...2014లో రష్యా ఏకంగా 39 ఉపగ్రహాలను పంపించి అగ్రస్థానాల్లో ఉండగా.. నేడు భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ ఏకంగా 104 ఉపగ్రహాలను పంపించడంతో సరికొత‍్త రికార్డు సాధించింది. 

 

16:38 - February 15, 2017

చెన్నై : జైలు జీవితం గడిపేందుకు చిన్నమ్మ గొంతెమ్మ కోరికలు కోరింది. జైలులో తనకు ప్రత్యేక సెల్‌ తో పాటు మినరల్‌ వాటర్‌, ఇంటి భోజనం, టీవిని ఏర్పాటు చేయాలని కోర్టును కోరింది. షుగర్‌ వ్యాధి ఉన్నందున ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:32 - February 15, 2017

చెన్నై : గోల్డెన్‌ బే రిసార్ట్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రిసార్ట్‌ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే శరవణన్‌ తనను కిడ్నాప్‌ చేసి వేధింపులకు గురి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు గోల్డెన్‌ బే రిసార్ట్‌ను చుట్టు ముట్టారు. రిసార్ట్‌లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల తనిఖీలను శశికళ వర్గం అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో ఇద్దరు మృతి

హైదరాబాద్ : నగరంలో మరోసారి స్వైన్ ఫ్లూ విజృంభించింది. స్వైన్ ఫ్లూతో మరో ఇద్దరు మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

15:57 - February 15, 2017

చెన్నై : ఓ ఘట్టం ముగిసింది. తమిళనాడు సంక్షోభం ముగింపు దశకు చేరుకుంది. అయితే.. సీఎం పదవి కోసం మాత్రం పోటీ తగ్గలేదు. అన్నాడీఎంకేలోని ఇరు వర్గాలు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. అయితే.. ఈ బంపర్‌ ఆఫర్‌ ఎవరికీ దక్కుతుందోనన్న టెన్షన్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎవరికి వారు గవర్నర్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూనే ఉన్నారు. అయితే.. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఎవరనే అంశం గవర్నర్‌ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. 
తమిళనాడులో కొత్త సమీకరణాలు
తమిళనాడులో కొత్త సమీకరణాలు మొదలవుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు శిక్ష పడడంతో.. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అనంతరం పళనిస్వామి.. పది మంది మంత్రులతో గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలుసుకున్నారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేశారు. తనను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు. 
దూసుకెళ్తున్న పన్నీర్‌ సెల్వం  
ఇక శశికళ వర్గం తాజా వ్యూహాలకు అనుగుణంగా పన్నీర్‌ సెల్వం కూడా దూసుకెళ్తున్నారు. మరోవైపు శశికళకు కోర్టు శిక్ష విధించడంతో పన్నీరు శిబిరంలో సంబరాలు జరుపుకున్నారు. ఇక శశికళ వర్గంలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పన్నీర్‌ గూటికి చేరారు. మరికొంత మంది కూడా వస్తారని పన్నీర్‌ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక పన్నీర్‌సెల్వం వర్గీయులు మైత్రేయన్‌, పాండ్యన్‌ గవర్నర్‌ను కలిసి అసెంబ్లీలో బలపరీక్షకు ఆహ్వానించాలని కోరారు.
పన్నీర్‌ వర్గంలో చేరిన జయలలిత దీప 
ఇక మొదటినుంచి శశికళపై గుర్రుగా ఉన్న జయలలిత మేనకోడలు దీప తాజాగా పన్నీర్‌ వర్గంలో చేరారు. జయ సమాధి వద్దకు పన్నీర్‌ సెల్వంతో కలిసి వచ్చి నివాళులర్పించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని.. పన్నీర్‌ సెల్వంతో కలిసి పార్టీ కోసం పని చేస్తానని ఆమె ప్రకటించారు. అనంతరం పన్నీర్‌ సెల్వం ఇంటికి వెళ్లిన దీప.. ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఎవరికి అవకాశమిస్తారోనన్న టెన్షన్‌ నెలకొంది. 

 

అన్నాడీఎంకేకి కరుప్పస్వామి పాండ్యన్‌ రాజీనామా

చెన్నై : అన్నాడీఎంకే పార్టీలో ముసలం పుట్టింది. పార్టీ పదవికి అన్నాడీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి కరుప్పస్వామి పాండ్యన్‌ రాజీనామా చేశారు.  దినకరన్‌కు డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ పదవి ఇవ్వడంతో కరుప్పస్వామి పాండ్యన్‌ అలకబూనారు.  సీనియర్లకు సరైన న్యాయం జరుగడంలేదంటూ ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారు.  శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు బయలుదేరి వెళ్లగానే ఈ పరిణామం చోటుచేసుకుంది. 

15:50 - February 15, 2017

చెన్నై : అన్నాడీఎంకే పార్టీలో ముసలం పుట్టింది. పార్టీ పదవికి అన్నాడీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి కరుప్పస్వామి పాండ్యన్‌ రాజీనామా చేశారు. దినకరన్‌కు డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ పదవి ఇవ్వడంతో కరుప్పస్వామి పాండ్యన్‌ అలకబూనారు.  సీనియర్లకు సరైన న్యాయం జరుగడంలేదంటూ ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారు.  శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు బయలుదేరి వెళ్లగానే ఈ పరిణామం చోటుచేసుకుంది. శశికళ బెంగళూరుకు బయలుదేరి వెళ్లడానికి ముందు జయ సమాధి దగ్గర నివాళులు అర్పించారు. పార్టీని రక్షించుకునేందుకు మూడు శపథాలు చేశారు.   ఇక పోయెస్‌ గార్డెన్‌ వెలవెలబోతోంది. మరోవైపు శశికళ, పళనిస్వామిపై కిడ్నాప్‌ కేసు నమోదైంది. గోల్డెన్‌ బే రిసార్ట్స్‌ నుంచి పారిపోయి సెల్వం చెంతకు చేరిన శరవణన్‌ ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

13:37 - February 15, 2017

ఖమ్మం: సామాజిక తెలంగాణ కోసం తన భర్త తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేస్తున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు తమ్మినేని వీరభద్రం సతీమణి ఉమా. ప్రజా ఉద్యమాల్లోనే ఎక్కువ సమయం గడిపే తమ్మినేని వీరభద్రం.. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించరని, అయినా ఆయన మహాసంకల్పం ముందు ఇవన్నీ చిన్నవేనని తమ్మినేని ఉమ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

సీఆర్డీఏ పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: సీఆర్డీఏ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగతవంగా పూర్తిచేయాలి, వేగం, నాణ్యతలను అధికారులు ప్రమాణాలుగా పెట్టుకోవాలన్నారు. ఎక్కడా రాజీపడకుండా రాజధాని నిర్మాణం సాగించాలని తెలిపారు. యువ ప్రతిభావంతులను నియమించుకోవాలని స్పష్టం చేశారు.

12:52 - February 15, 2017

చెన్నై: అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ న్యాయస్థానం వద్ద లొంగిపోవడానికి చెన్నై నుంచి బెంగళూరు బయల్దేరిన ఆమె మెరీనా బీచ్‌లో జయలలిత సమాధి వద్ద నివాళులర్పిస్తూ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికిగురిచేసింది. పూలతో నివాళులర్పించిన తర్వాత శశికళ జయ సమాధి మీద గట్టిగా మూడు సార్లు చేత్తో చరిచి మరీ ఏదో శపథం చేశారు. వూహించని ఈ పరిణామానికి అందరూ బిత్తరపోయారు. సమాధి మధ్య భాగంలో తగిలేలా వంగి మరీ మూడు సార్లు అరచేత్తో గట్టిగా చరిచారు శశికళ. ముఖంలో విచారం, బాధ కనిపిస్తున్నా ఎరుపెక్కిన కళ్లల్లో కోపాన్ని ప్రదర్శించిన శశికళ తదుపరి టార్గెట్ ఎవరన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది. జయ సమాధి సాక్షిగా శశికళ ఏదో శపథం చేశారని ఆ దృశ్యం చూసినవారికి అర్థమవుతోంది. దాంతో శశి ఏమని శపథం చేసివుంటారన్న విషయం నిమిషాల్లోనే చర్చనీయాంశమైపోయింది. అనంతరం తిరిగి కారెక్కి బెంగళూరువైపు రోడ్డు మార్గంలో బయల్దేరారు.

టీఎస్ సచివాలయ ముట్టడికి జైభీం కార్యకర్తల యత్నం

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం ముట్టడికి జై భీమ్ కార్యకర్తలు యత్నించారు. శరణం గచ్చామి సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు పలువురి అదుపులోకి తీసుకున్నారు.

12:36 - February 15, 2017

హైదరాబాద్: న్యాయపరమైన సలహాలు, సూచలను అందించే మైరైట్ కార్యక్రమంలో నేటి అంశం 'కంపల్సరీ రిజిస్ట్రేషన్ వివాహ చట్టం' వేదికలో ప్రముఖ న్యాయవాది పార్వతి అందించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

జైలుకు బయలుదేరిన చిన్నమ్మ

చెన్నై: చిన్నమ్మ జైలుకు బయల్దేరింది. లొంగిపోయేందుకు గడువును సుప్రీం నిరాకరించడంతో శశికళ కోర్టులో లొంగిపోయేందుకు పోయెస్‌ గార్డెన్‌ నుంచి బయటకు వచ్చింది. నేరుగా మెరీనా బీచ్‌కు వెళ్లి జయ సమాధి దగ్గర నివాళులర్పించింది. అందే కాదు అమ్మ సమాధిపై మూడుసార్టు గట్టగా కొడుతూ శపథం చేసింది. జయ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసింది. అనంతరం బెంగళూరు కోర్టుకు రోడ్డు మార్గం గుండా బయల్దేరింది.

12:23 - February 15, 2017

చెన్నై: చిన్నమ్మ జైలుకు బయల్దేరింది. లొంగిపోయేందుకు గడువును సుప్రీం నిరాకరించడంతో శశికళ కోర్టులో లొంగిపోయేందుకు పోయెస్‌ గార్డెన్‌ నుంచి బయటకు వచ్చింది. నేరుగా మెరీనా బీచ్‌కు వెళ్లి జయ సమాధి దగ్గర నివాళులర్పించింది. అందే కాదు అమ్మ సమాధిపై మూడుసార్టు గట్టగా కొడుతూ శపథం చేసింది. జయ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసింది. అనంతరం బెంగళూరు కోర్టుకు రోడ్డు మార్గం గుండా బయల్దేరింది.

12:21 - February 15, 2017

చెన్నై: అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు శశికళకు షాకుల మీద షాకులు ఇవ్వడంతో ఆమె లొంగిపోయేందుకు సిద్ధమైంది. జయ సమాధి దగ్గర నివాళుర్పించిన అనంతరం శశికళ రోడ్డు మార్గం గుండా బెంగళూరు వెళ్లనుంది. ఇవాళ బెంగళూరు సెషన్స్‌ కోర్టులో శశికళ లొంగిపోనుంది.

మెరీనా బీచ్ కు బయలుదేరిన శశికళ

చెన్నై: పోయేస్ గార్డె నుండి జయలలిత నిశ్చెలి శశికళ మెరీనా బీచ్ కు బయలుదేరారు. మెరీనా బీచ్ లో జయలలిత సమాధివద్ద నివాళులర్పించి అనంతరం బెంగళూరులోని సిటీ కోర్టులో లొంగిపోనున్నట్లు సమాచారం.

11:33 - February 15, 2017

విజయవాడ: రోహిత్‌ వేముల బీసీ అంటూ గుంటూరు కలెక్టర్‌ ధృవీకరణపత్రం ఇవ్వడం దారుణమని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. ఎస్సీ ధృవీకరణ పత్రంతోనే రోహిత్‌ హెచ్‌సీయూలో చేరారని గుర్తు చేశారు. రోహిత్‌ వేముల దళితుడని అందరికీ తెలుసన్నారు. బీజేపీ, టీడీపీ ఒత్తిడిలోనయ్యే కలెక్టర్‌ బీసీ సర్టిఫికెట్‌ ఇచ్చారన్నారు. తక్షణమే రోహిత్‌ వేముల చట్టాన్ని తీసుకొచ్చి.. కుల వివక్షను రూపుమాపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

11:32 - February 15, 2017

విజయవాడ: ఏపీలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆరోపించారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి దొంగ ఓట్లను నమోదు చేయిస్తున్నారని మండిపడ్డారు. అధికార టీడీపీ గెలుపుకోసం అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఎమ్మెల్సీ ఓట్ల నమోదుపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

11:29 - February 15, 2017

శ్రీహరికోట : భారత్‌ అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో మరోసారి తన సత్తాను చాటింది. ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. సరికొత్త ప్రయోగంతో అగ్రదేశాలను భారత్‌ అధిగమించింది. వాహకనౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. బుధవారం ఉదయం 9.28 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ37 వాహకనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇది మొత్తం 524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యావర్తన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. 28.42 నిమిషాల్లో రాకెట్‌ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌, ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌,గవర్నర్‌ నరసింహన్‌ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌పై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం అంతరిక్ష యానంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని సైంటిస్టులు కొనియాడారు.

11:24 - February 15, 2017

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో శశికళ బంధువర్గం పెత్తనం కొనసాగుతోంది. 2011లో జయలలిత దూరం పెట్టిన టీటీవీ దినకరన్, ఎస్. వెంకటేశ్ లకు పార్టీలో పదవులు ఇచ్చారు. దినకరన్ ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. తన కుటుంబంలోని వ్యక్తుల చేతుల్లోనే పార్టీ పగ్గాలు ఉండాలని భావించిన శశికళ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, శశికళ నేడు బెంగళూరులో కోర్టు ఎదుట లొంగిపోనున్న సంగతి తెలిసిందే

11:21 - February 15, 2017

చెన్నై: శశికళకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. చిన్నమ్మకు సుప్రీం కోర్టు మరోసారి షాక్‌ ఇచ్చింది. కోర్టులో లొంగిపోయేందుకు గడువు ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. వెంటనే కోర్టులో లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది. సాయంత్రంలోపు కోర్టులో శశికళ లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ శశికళ కోర్టులో లొంగిపోకపోతే ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

శశికళకు సుప్రీంలో మరోసారి చుక్కెదురు

ఢిల్లీ : సుప్రీం కోర్టు శశికళకు మరో సారి చుక్కెదురయ్యింది. లొంగిపోయేందుకు గడువు ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది.

శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

హైదరాబాద్ :శ్రీహరికోట : పీఎస్ ఎల్ వీ సీ37 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. నిప్పులు చిమ్ముతూ పీఎస్ఎల్ వీ- సీ37 104 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లి.. మొదటి దశను విజయవంతం గా నిర్దేశించిన తన లక్ష్యం దిశగా పయనిస్తోంది. ఇస్రో చరిత్రాత్మక అంతరిక్ష ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ సెంటర్‌(షార్‌) వేదికైంది. శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.

10:02 - February 15, 2017

శ్రీహరికోట : పీఎస్ ఎల్ వీ సీ37 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. నిప్పులు చిమ్ముతూ పీఎస్ఎల్ వీ- సీ37 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో చరిత్రాత్మక అంతరిక్ష ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ సెంటర్‌(షార్‌) నుండి ఈ ప్రయోగం జరిగింది. ఈ రోజు ఉదయం 9.28 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ కేంద్రం నుంచి 104 ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్‌వీ-సీ37 వాహకనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్తోంది. తనతో పాటు తీసుకెళ్లిన 104 ఉపగ్రహాలనూ విజయవంతంగా వాటి వాటి కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఇస్రో అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయిందని తెలిపారు. మొత్తం 524 కిలోమీటర్ల దూరాన్ని 22 నిమిషాల్లో ప్రయాణించిన రాకెట్ అన్ని ఉపగ్రహాలను విడిచిందని, వాటి నుంచి భూమిపై వివిధ ప్రాంతాల్లో ఉన్న సెంటర్లకు సిగ్నల్స్ అందుతున్నాయని చెప్పారు. ఈ ప్రయోగం విజయంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.  ప్రపంచ దేశాలకు ఓ శాంతి సందేశాన్ని పంపుతూ.. అగ్రదేశాల సరసన భారత్ నిలిచింది.

నింగిలోకి దూసుకెళ్తోన్న పీఎస్ ఎల్వీ -సి37

శ్రీహరికోట : ఇస్రో చరిత్రాత్మక అంతరిక్ష ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ సెంటర్‌(షార్‌) నుండి కొద్ది సేపటి క్రితం పీఎస్ ఎల్ సి -|37 దూసుకెళ్తోంది. ఈ రోజు ఉదయం 9.28 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ కేంద్రం నుంచి 104 ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్‌వీ-సీ37 వాహకనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్తోంది

09:26 - February 15, 2017

ఖమ్మం: మిషన్‌ కాకతీయ కాంట్రాక్టర్లు, టీఆర్‌ఎస్‌ నేతలు తప్పా రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రైతులందరూ కష్టాలో ఉంటే ... వారంతా దావత్‌లు చేసుకుంటున్నారని కేసీఆర్‌ అనడం విడ్డూరమని తమ్మినేని విమర్శించారు. రెండు గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టి రాష్ట్రమంతా ఇళ్లు కట్టినట్లు ప్రకటనలిస్తున్నారని ఆయన ఆరోపించారు.

అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు....

కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్‌ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి హామీలు ఎక్కడ పోయాయని తమ్మినేని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైందని, స్కూళ్లలో టీచర్లు, కాలేజీల్లో అధ్యాపకులు కూడా లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని తమ్మినేని అన్నారు. రైతులందరూ కష్టాల్లో ఉంటే.. రైతులు సంతోషంగా ఉన్నారని కేసీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందని, మిషన్‌ కాకతీయ కాంట్రాక్టర్లు, టీఆర్‌ఎస్‌ నేతలు సంతోషంగా ఉన్నారు తప్పా ప్రజలు సంతోషంగా లేరని తమ్మినేని అన్నారు.

ఖమ్మం జిల్లాలో....

సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో పర్యటిస్తోంది. ఇప్పటికే 121 రోజులు పూర్తి చేసుకున్న తమ్మినేని బృందానికి ఖమ్మం జిల్లాలో అపూర్వ స్వాగతం లభిస్తోంది. బోనకల్ మండలంలో తమ్మినేని బృందానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు కాగడాలతో అద్భుత స్వాగతం పలికారు. రెండున్నరేళ్లు దాటినా కేసీఆర్‌ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు తీరడం లేదని సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్‌ అన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వల్లే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకే సీపీఎం ఈ పాదయాత్ర చేపట్టిందని ఆయన అన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమం కోసం కుల సంఘాలు, వామపక్షాలు కలిసి రావాలని పాదయాత్ర బృందం సభ్యుడు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. రాబోయో రోజుల్లో అన్ని సంఘాలను కలుపుకొని సామాజిక న్యాయం కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.

121 రోజుకు పాదయాత్ర....

121 వ రోజు పాదయాత్ర బృందం ఖమ్మం జిల్లాలోని పల్లిపాడు, వైరా, సోమవరం, తాటిపుడి, రెప్పవరం, గొల్లపూడి, బోనకల్‌, పాలడుగు, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో పర్యటించింది. తమ్మినేని బృందానికి ప్రజలు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు.

కాసేపట్లో పీఎస్ ఎల్ వీ సి37 ప్రయోగం

నెల్లూరు: కాసేపట్లో పీఎస్ ఎల్ వీ సి 37 ప్రయోగం జరగనుంది. చారిత్రాత్మక అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమైంది. ఒకే సారి కక్ష్యలోకి 104 ఉపగ్రహాలు పంపి చరిత్ర సృష్టించనుంది. 104లో 101 విదేశీ, 3 స్వదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. 104 ఉపగ్రహాల్లో అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు, ఇస్రాయిల్, కజకిస్థాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ చూఏఈ ఉపగ్రహాలు ఉన్నాయి. భారత్ కు కార్డోశాట్ -2, ఐఎన్ ఎస్ -ఏ1, ఐఎన్ ఎస్ -1బి ఉన్నాయి.

టి.సర్కార్ కు శశికళ పన్ను బకాయి

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి, రాధిక కాలనీలో శశికళ పేరిట ఓ ఇల్లు ఉండగా, దానికి గత రెండేళ్ల నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదు. పన్ను బకాయిలను నూరు శాతం వసూలు చేయాలని సంకల్పించిన కేసీఆర్ సర్కారు, ఈ మేరకు శశికళ పేరిట నోటీసులు కూడా జారీ చేశారు.

09:09 - February 15, 2017

హైదరాబాద్: గత ఏడాది హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేముల కుల వివాదం మరో మలుపు తిరిగింది. రోహిత్‌ దళితుడు కాదని, అతను బీసీ వర్గానికి చెందినవాడని ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధరించింది. అయితే.. కేసును తప్పుదోవ పట్టించడానికే రోహిత్‌ కులంపై కేంద్రం కుట్ర చేస్తోందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎస్ సిగా ఆధారాలుంటే 15 రోజుల్లో చూపాలి, లేదంటే అన్ని కులధ్రువీకరణ పత్రాలు రద్దు, గుంటూరు కలెక్టర్ షోకాజ్ నోటీసు, రోహిత్ మృతికి కారకులను రక్షించేందుకు కుట్ర జరుగుతోందా? ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్ 'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిపిసిసి అధికార ప్రతి శోభన, బిజెపి నేత ఎస్ కుమార్, కేవిపిఎస్ నేత నటరాజన్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

రోహిత్‌ వేముల కుల వివాదంలో మరో మలుపు

హైదరాబాద్: గత ఏడాది హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేముల కుల వివాదం మరో మలుపు తిరిగింది. రోహిత్‌ దళితుడు కాదని, అతను బీసీ వర్గానికి చెందినవాడని ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధరించింది. అయితే.. కేసును తప్పుదోవ పట్టించడానికే రోహిత్‌ కులంపై కేంద్రం కుట్ర చేస్తోందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

వెనక్కు తగ్గిన తెలంగా ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తన మొండి పట్టుదలను కాస్త సడలించింది. భూసేకరణకు ఉద్దేశించిన జీవో నంబర్ 123కు సవరణ చేస్తూ నూతనంగా జీవో 38ను విడుదల చేసింది. జీవో నంబర్ 123 కింద జరిపే భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాల్లోని స్వంతభూమిలేని పేదలు, వ్యవసాయం, అనుబంధ రంగాల మీద ఆధారపడ్డ వారి పునరావాసం కోసం ప్రభుత్వం కొత్త జీవోను జారీచేసింది. 123 జీవోకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించడంతోపాటు కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు ఇవే

అమరావతి : ఏపీ క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళలపట్ల గౌరవ మర్యాదలు పెరిగేలా చర్యల తీసుకోడానికి అమ్మకు వందనం పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకురావాలని నిర్ణయం జరిగింది. చంద్రన్నబీమా పథకాన్ని మరింత సమర్థంగా నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించింది. మంత్రిమండలి నిర్ణయాలను మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి సమగ్రంగా వివరించారు.

సీఎం పదవిపై కొనసాగుతున్న టెన్షన్‌

చెన్నై: ఓ ఘట్టం ముగిసింది. తమిళనాడు సంక్షోభం ముగింపు దశకు చేరుకుంది. అయితే.. సీఎం పదవి కోసం మాత్రం పోటీ తగ్గలేదు. అన్నాడీఎంకేలోని ఇరు వర్గాలు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. అయితే.. ఈ బంపర్‌ ఆఫర్‌ ఎవరికీ దక్కుతుందోనన్న టెన్షన్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎవరికి వారు గవర్నర్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూనే ఉన్నారు. అయితే.. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఎవరనే అంశం గవర్నర్‌ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

06:57 - February 15, 2017

చెన్నై: శశికళ అరెస్టుపై టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది. నిన్న ఉదయం నుంచి గోల్డెన్‌ బే రిసార్ట్స్‌ వద్ద హైడ్రామా కొనసాగింది. శశికళను ఎప్పుడైనా అరెస్ట్‌ చేయవచ్చునని వార్తలు ఊపందుకున్నాయి. అయితే రాత్రి వరకు రిసార్ట్స్‌లోనే ఉండి వ్యూహ రచన చేసిన చిన్నమ్మ.. రాత్రి 10 గంటల సమయంలో పోయెస్‌ గార్డెన్‌కు వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యేలంతా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి శశికళను అరెస్ట్‌ చేస్తారని ప్రచారం జరిగినా.. అలాంటిదేమీ జరగలేదు. మరోవైపు ఆమె ఈరోజు బెంగళూరు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అదేసమయంలో ఢిల్లీలో ఆమె తరపు న్యాయవాదులు లొంగిపోయేందుకు కొంత సమయం కోరే అవకాశం ఉంది. ఇక రాత్రి మీడియాతో మాట్లాడిన చిన్నమ్మ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఐక్యంగానే ఉన్నారని.. తనకు వచ్చిన సమస్య తాత్కాలికమే అన్నారు. తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె... సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటానన్నారు. ఏదైనాసరే చిన్నమ్మ అరెస్ట్‌పై టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది.

06:55 - February 15, 2017

చెన్నై: తమిళనాడులో కొత్త సమీకరణాలు మొదలవుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు శిక్ష పడడంతో.. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అనంతరం పళనిస్వామి.. పది మంది మంత్రులతో గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలుసుకున్నారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేశారు. తనను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు.

ఎత్తుకు పై ఎత్తులో ఇరువర్గాలు...

ఇక శశికళ వర్గం తాజా వ్యూహాలకు అనుగుణంగా పన్నీర్‌ సెల్వం కూడా దూసుకెళ్తున్నారు. మరోవైపు శశికళకు కోర్టు శిక్ష విధించడంతో పన్నీరు శిబిరంలో సంబరాలు జరుపుకున్నారు. ఇక శశికళ వర్గంలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పన్నీర్‌ గూటికి చేరారు. మరికొంత మంది కూడా వస్తారని పన్నీర్‌ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక పన్నీర్‌సెల్వం వర్గీయులు మైత్రేయన్‌, పాండ్యన్‌ గవర్నర్‌ను కలిసి అసెంబ్లీలో బలపరీక్షకు ఆహ్వానించాలని కోరారు.

పన్నీరుకు దీప మద్దతు...

ఇక మొదటినుంచి శశికళపై గుర్రుగా ఉన్న జయలలిత మేనకోడలు దీప తాజాగా పన్నీర్‌ వర్గంలో చేరారు. జయ సమాధి వద్దకు పన్నీర్‌ సెల్వంతో కలిసి వచ్చి నివాళులర్పించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని.. పన్నీర్‌ సెల్వంతో కలిసి పార్టీ కోసం పని చేస్తానని ఆమె ప్రకటించారు. అనంతరం పన్నీర్‌ సెల్వం ఇంటికి వెళ్లిన దీప.. ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఎవరికి అవకాశమిస్తారోనన్న టెన్షన్‌ నెలకొంది.

ఆధిపత్య పోరుతో తమిళ రాజకీయాల్లో క్షణానికో ట్విస్ట్‌

చెన్నై: క్షణక్షణం మలుపులు తిరుగుతూ.. సర్వత్రా ఆసక్తిని పెంచిన తమిళ రాజకీయాలు సుప్రీం తీర్పుతో ఓ కొలిక్కి వచ్చినట్లయింది. ఇంతకాలం సీఎం కుర్చీపై ఫోకస్‌ పెట్టిన శశికళ..అక్రమాస్తుల కేసును అంతగా పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది. అమ్మకు వీర విధేయుడైన పన్నీర్‌ అనూహ్యంగా తిరుగుబాటు చేయడంతో పరిస్థితిని అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో ఉండగానే, సుప్రీం తీర్పు ఆమెకు ప్రతికూలంగా వచ్చింది. దీంతో శశికళ ఊహలన్నీ తలకిందులయ్యాయి. మొత్తానికి చిన్నమ్మ లైఫ్‌ జర్నీ.. ఎన్నెన్నో ట్విస్టులతో ఓ సినిమానే తలపించింది....!

ఒకేసారి అంతరిక్షంలోకి 104 ఉపగ్రహాలు

హైదరాబాద్: చరిత్రాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఒకటి కాదు..రెండు కాదు...10 కాదు...20 కాదు....ఏకంగా 104 ఉపగ్రహాల ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. పిఎస్‌ఎల్‌వీ సీ- 37 ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపడం ద్వారా ప్రపంచంలోనే భారత్‌ సరికొత్త రికార్డ్‌ సృష్టించనుంది. నిన్నటి నుంచి కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌ నేటితో ముగిసి.. ఉదయం 9 గంటల 28 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.

06:48 - February 15, 2017

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ మంత్రిమండలి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది.

మహిళ పట్ల గౌవరం పెరిగేందుకు కొత్త కార్యక్రమం....

సమాజంలో మహిళ పట్ల గౌరవ మర్యాదలు పెరిగేలా కొత్త కార్యక్రమాలు చేపట్టాలని ఏపీ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మాతృమూర్తిపై మమకారం పెంచేందుకు ప్రాధమిక విద్యశాఖ 'అమ్మకు వందనం' అనే కార్యక్రమాన్ని అమలు చేయడానికి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

వృద్ధాశ్రమాల్లో సూపరింటెండెంట్‌ పోస్టులు ....

రాష్ట్రంలోని పలు పట్టణాల్లో వృద్ధాశ్రమాల్లో 3 సూపరింటిండెంట్‌ పోస్టులను మంజూరు చేసేందుకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ఈపోస్టులను భర్తి చేయనున్నారు. అటు ఎస్ టీ, ఎస్ సీ కమిషన్‌లో 8 పోస్టులను మంజూరు చేస్తూ కూడా మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

చంద్రన్న బీమా పథకంలో పరిహారం రెట్టింపు ....

నిర్మాణరంగ కార్మికులకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చంద్రన్నబీమాపథకంలో పరిహారాన్ని డబుల్‌ చేయడానికి కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అటు అందరికీ నివాసం నినాదంతో అమలవుతున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పట్టణపేదలకు లక్షా ఇరవైవేల ఇళ్లు నిర్మించాడానికి త్వరలో టెండర్లు పిలవడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలంపై క్యాబినెట్‌ సమీక్ష.....

అటు అగ్రిగోల్డ్ సమస్యపైకూడా మంత్రి మండలి చర్చించింది. ఆ సంస్థకు సంబంధించి మొత్తం 8 వాణిజ్య ఆస్తులపై వేలం ప్రక్రియను వేగవంతం చేసేలా కోర్టును అభ్యర్థించాలని నిర్ణయం తీసుకున్నారు.

సైబర్‌ సెక్యూరిటీ పాలసి- 2017కు ఆమోదం....

ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2017 కి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దాంతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచి సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, మెషిన్ లెర్నింగ్, ఫిన్‌టెక్ తదితర కోర్సులను ప్రవేశపెడుతూ ప్రస్తుత పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి విద్యాశాఖను ఆదేశించారు.

ఎస్టీ విద్యార్థులకు విజయవాడలో 'సెస్‌' సెంటర్‌ కు ఆమోదం.....

రాష్ట్రంలోని ఎస్టీ విద్యార్థులకు రీసెర్చ్ స్టడీస్ కోసం విజయవాడలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ లో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దాంతోపాటు ఉన్నతవిద్యను బలోపేతం చేసేందుకు ..ప్రైవేట్‌ యూనిర్సిటీలకు మరింత సహకారం ఇవ్వాలని కా్యబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్ర పునర్ విభజన చట్టం-2014 తదనంతరం రాష్ట్రం వెలుపల తలెత్తిన సమస్యల పరిష్కారానికి సంబంధించి మంత్రుల గ్రూపుకు బదులుగా కమిటీని ఏర్పాటు చేస్తూ జనవరి 18న జారీ చేసిన జీవో 118కి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

అందరకికీ ఆరోగ్యంపై కేబినెట్‌ చర్చ...

ఇక అందరికీ ఆరోగ్యం' కార్యక్రమం అమలు తీరుపైకూడా మంత్రిమండలి చర్చించింది. దాంతోపాటు రానున్న వేసవిలో రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గానికి సీఎం చంద్రబాబు సూచించారు.

06:47 - February 15, 2017

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తన మొండి పట్టుదలను కాస్త సడలించింది. భూసేకరణకు ఉద్దేశించిన జీవో నంబర్ 123కు సవరణ చేస్తూ నూతనంగా జీవో 38ను విడుదల చేసింది. జీవో నంబర్ 123 కింద జరిపే భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాల్లోని స్వంతభూమిలేని పేదలు, వ్యవసాయం, అనుబంధ రంగాల మీద ఆధారపడ్డ వారి పునరావాసం కోసం ప్రభుత్వం కొత్త జీవోను జారీచేసింది. 123 జీవోకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించడంతోపాటు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును దృష్టిలో ఉంచుకొని భూమి స్వంతదారులకు కల్పించిన రీతిలోనే భూమిలేని ఇతరులకు కూడా పునరావాస ప్యాకేజీలను వర్తింపచేస్తూ జీవో 38ని తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్‌.

06:44 - February 15, 2017

 

తిరుమల : 2017-18 వార్షిక బడ్జెట్‌లో టీటీడీ వినూత్న ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పాలక మండలి ఆమోదముద్ర వేసింది. టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

2017-18 టీటీడీ వార్షిక బడ్జెట్‌ రూ.2858.48 కోట్లు

వివిధ రూపాల్లో టీటీడీకి వచ్చే ఆదాయాన్ని, నిర్వహణకు అయ్యే వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని వార్షిక బడ్జెట్‌ రూపొందించారు. మొత్తం 2858.48 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ ప్రతిపాదనలు తయారు చేశారు. హుండీ ఆదాయం 1110 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా వేశారు. బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడంతో టీటీడీకి ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. అమెరికాకు చెందిన శ్రీవారి భక్తుడు రామలింగరాజు ఇచ్చిన 11 కోట్ల విరాళంతో సహస్రనామం కాసుల ఆభరణాలు తయారు చేయించాలని సమావేశం నిర్ణయించింది. టీటీడీకి ఆస్తులు రాసి ఇచ్చే దాతలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

సర్వదర్శనం భక్తుల కోసం రూ.5 కోట్లతో క్యూ కాంప్లెక్స్‌....

భక్తుల సౌకర్యాల కోసం బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. తిరుమలలో సర్వదర్శనం కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే తిరుమలలోని వీధీ దీపాలతో పాటు, అన్ని కాటేజీల్లో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటుకు నాలుగున్నర కోట్ల రూపాయలతో బడ్జెట్‌ ఆమోదించారు. హర్యానాలోని కురుక్షేత్రలో 12 కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి పాలక మండలి ఆమోదముద్ర వేసింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీదపల్లిలో ఆంజనేస్వామి ఆలయ రిపేర్లకు 22 లక్షల రూపాయలు కేటాయించారు. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుచ్చి మకరతోరణం బంగారు తాపడం పనుల కోసం 3.80 కోట్లు మంజూరు చేశారు. ఖమ్మం జిల్లా పురుష్తోత్తపట్నం సీతారామచంద్రస్వామి ఆయలయంలో వసతి గృహం నిర్మాణానికి బడ్జెట్‌లో 3.53 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో కల్యాణ మండలం నిర్మాణానికి 20 కోట్లు ప్రతిపాదనలకు ధర్మకర్తల మండలి ఆమోదముద్ర వేసింది. పేరూరుబండ దగ్గర వకుళామాత ఆలయ నిర్మాణం కోసం రెండు కోట్లు ఖర్చుచేయనున్నారు. దీనికి వచ్చే నెల 5న శంకుస్థాపన చేయాలని పాలకమండలి నిర్ణయిచింది. జీడిపప్పు, యాలకులు, వంటనూనెలు, ఎండుద్రాక్ష, పేపర్‌పేట్ల కొనుగోలు ప్రతిపాదనలకు కూడ ఆమోదముద్ర వేసింది. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ దగ్గర సర్వదర్శనం భక్తుల కోసం సకల సౌకర్యాలతో కొత్త క్యూ కాంప్లెక్స్‌ నిర్మించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది.

06:43 - February 15, 2017

హైదరాబాద్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాఖండ్‌లో 69 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరగనుండగా... యూపీలో రెండో విడత పోలింగ్‌లో 11 జిల్లాల పరిధిలోని 67 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. యూపీ ఎన్నికల్లో 720 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 సీట్లుండగా 69 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ 10 వేల 685 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 75 లక్షల 13 వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. కర్ణప్రయాగ్‌ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. 69 అసెంబ్లీ స్థానాల కోసం 628 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌-బిజెపిలు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా... బిఎస్పీ 68, ఉక్రంద్‌ కె 53, ఎస్పీ 21, వామపక్షాలు పది స్థానాల్లో పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్‌, బిజెపిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

06:42 - February 15, 2017

హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్ల భవిష్యత్ అయోమయంగా మారింది. గురుకుల పాఠశాలల్లో 7306 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో పది పదహారేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్ల భవిష్యత్ పై బెంగ పెట్టుకున్నారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసి, తమకు అన్యాయం జరగకుండా చూడాలంటూ కోరుతున్నారు. భవిష్యత్ పై తీవ్ర ఆందోళనతో వున్న గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ టీచర్స్ కొద్ది రోజుల క్రితం మసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ దగ్గర ఆందోళన నిర్వహించారు. గురుకుల పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో కాంట్రాక్ట్ టీచర్ల సమస్యలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు అనీషగారు, కిరణ్మయి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss