Activities calendar

16 February 2017

21:56 - February 16, 2017

ఢిల్లీ : 12 ఏళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో పటియాల కోర్టు తీర్పు వెలువరించింది. పేలుళ్ల ప్రధాన సూత్రధారి తారిక్‌ అహ్మద్‌ డార్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు- పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆరోపణలు ఎదుర్కొన్న మరో ఇద్దరు మహ్మద్‌ హుసేన్‌ ఫాజిల్, మహ్మద్‌ రఫీక్‌ షాలను నిర్దోషులుగా పేర్కొంది. 2005 అక్టోబర్‌ 29న ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 60 మంది మృతి చెందారు. రెండువందలకు పైగా గాయపడ్డారు. సీరియల్‌ బాంబు దాడికి కుట్ర పన్నారని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది తారిక్‌ అహ్మద్‌తో మరో ఇద్దరిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

 

21:54 - February 16, 2017

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు సినిమా విదేశీ హక్కులు పెద్ద మొత్తంలో అమ్ముడు పోయాయి. డిస్ట్రీబ్యూటర్లు సినిమా విదేశీ హక్కులను రూ.11.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ కేవలం 24గంటల్లో 5 మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. దీంతో చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. మార్చి 10 నాటికి సినిమా పూర్తవుతుందని చిత్ర బృందం తెలిపింది.

 

21:51 - February 16, 2017

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదాకోసం పోరాటం కొనసాగిస్తామని... వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.. విద్యార్థులపై పీడీ యాక్ట్‌ కింద కేసులుపెడుతున్న చంద్రబాబుపై టాడా చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 
యువభేరీ సదస్సు
గుంటూరు నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు... విద్యార్థులు, యువతీ యువకులు, వైసీపీ నేతలతో సందడిగా మారింది. వైసీపీ చేపట్టిన యువభేరీ సదస్సులో విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ అధినేత జగన్‌... ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ శ్వాస, హక్కు ప్రత్యేక హోదా అని స్పష్టం చేశారు.. 
చంద్రబాబు టీడీపీని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చారన్న జగన్‌ 
చంద్రబాబు టీడీపీని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చారని జగన్‌ ఆరోపించారు.. భాగస్వామ్య సదస్సు ఎంవోయూల సంగతి కేంద్ర ఇండస్ట్రీస్‌ చాంబర్‌ ఆఫ్ కామర్స్‌లో దాఖలైన ఐఈఎమ్ లే చెబుతాయని విమర్శించారు.. కంపెనీలు పెట్టే స్థాయి లేని వ్యక్తులకు సూటు బూటు వేసి వారితో ఎంవోయూలు కుదుర్చుకున్నారని మండిపడ్డారు. సదస్సులో విద్యార్థులు, యువతీయువకులు అడిగిన ప్రశ్నలకు జగన్‌ సమాధానమిచ్చారు.

 

21:48 - February 16, 2017

చెన్నై : జయలలిత సమాధి దగ్గర మరోసారి పన్నీరు సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించిన పన్నీరు సెల్వం..శశికళపై నిప్పులు చెరిగారు. అమ్మ జయలలిత ఆశయాలకు తూట్లు పొడిచే పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేవరకు విశ్రమించను అని పన్నీరు సెల్వం ధ్వజమెత్తారు. ఇప్పుడున్నది జయలలిత ప్రభుత్వం కాదని..శశికళ కుటుంబ ప్రభుత్వమని విమర్శించారు. ఇప్పటినుంచి శశికళ చెప్పిందే వేదం..చేసిందే చట్టంగా మారుతుందని..ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సిందే అని పన్నీరు సెల్వం ప్రకటించారు. పళని వర్గమంతా శశికళకు ఊడిగం చేయాల్సిందే అన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల మద్దతు కోరి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని తరిమికొడతానన్నారు పన్నీరు సెల్వం.  
 

21:34 - February 16, 2017

పెళ్లి ఆడంబరంగా చేసుకోవాలనుకుంటున్నారా...? పెద్ద ఫంక్షన్ హాల్...వేలాది అతిథులు, ఆకర్షణీయమైన కార్యక్రమాలు, లెక్కలేనన్ని ఐటెమ్స్ మెనులు.. పాత మాటల్లో చెప్పాలంటే.. ఆకాశమంత పందిరి, భూలోకమంత పీఠలు వేసి... కళ్లు చెదిరేలా చేయాలనుకుంటున్నారా....? అయితే పన్ను కట్టాల్సిందే.. ! ఈ బిల్లు వడ్డెక్కితే తప్పదు మరి... పెళ్లి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసే వారిపై పన్ను విధించే బిల్లు లోక్ సభ ముందుకు వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ లో ఇదే అంశంపై చూద్దాం.. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి. 

 

21:21 - February 16, 2017

తమిళనాడు పంచాదీకి ముక్కుతాడు... పళనిస్వామి వారే కుర్చి ఎక్కినాడు, తిరిగి తిరిగి మాట్లాడుతున్న ఆనం వివేక... మందలిచ్చి సొట్లు వెట్టొచ్చిన మల్లన్న, లెక్కలు మరిచిపోయిన ఆలేరు ఎమ్మెల్యే... సేవాలాల్ జయంతి నిధులల పరేషాన్, రాత్రి పూట గడుపుకున్న రావెల... సర్కారుకు హాస్టల్ కాడా మంత్రికి మర్యాద, చెప్పులు ఎత్కవోతుంటే దొర్కిర్రు.. అవే చెప్పులు మడతవెట్టి కొట్టిర్రు, స్టేజిమీదికెళ్లి జారిపడ్డ ఎమ్మెల్యే క్యాండేట్.. పబ్లిక్కు మీటింగుల పరువు పోయిన పడుకం..... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:34 - February 16, 2017

కృష్ణా : విజయవాడలో సమగ్ర శిశురక్షణ కార్యక్రమం గందరగోళంగా మారింది. ఈ కార్యక్రమానికి మంత్రి పీతల సుజాత 3గంటలు ఆలస్యంగా హాజరయ్యారు.. ఆ తర్వాత పిల్లల సమస్యలు పరిష్కారంపై అధికారుల్లో అవగాహన పెంచేందుకు ఒక తమిళ సినిమాను ప్రదర్శించారు. ఈ మూవీ ఎవ్వరికీ అర్థం కాలేదు.. సినిమా అయిపోయాక బాల్య వివాహాలపై పీతల సుజాత మాట్లాడారు. బాల బాలికల హక్కుల పరిరక్షణకోసం అందరూ కృషి చేయాలని అధికారులకు సూచించారు.

20:32 - February 16, 2017

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్ట్‌లకు భూ నిర్వాసితుల పునరావాసం, పునర్నిర్మాణం విషయంలో కాంగ్రెస్‌ పోరాటం ఫలితంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం జీవో-38 తీసుకొచ్చింది టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. జీవో-123 స్థానంలో తీసుకొచ్చిన జీవో-38లో కూడా సామాజిక, పర్యావరణ ప్రభావం అంచనాలు లేకపోవడాన్ని తప్పుపట్టారు. 

 

20:28 - February 16, 2017

ఢిల్లీ : ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకంలోని లోపాలను సరిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ పథకంలో  ఒక పంటకు గ్రామాన్ని, మరో పంటకు మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడం వలన రైతులకు మేలు జరగదని వ్యవసాయం శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ దృష్టికి తెచ్చారు. కల్తీ, నాసిరకం మిర్చి విత్తనాల బెడద నివారణకు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త చట్టం తీసుకురానున్నట్టు పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. 

 

20:25 - February 16, 2017

తమిళనాడు : ఉత్కంఠ భరితంగా కొనసాగిన తమిళ రాజకీయాల్లో సస్పెన్స్‌ తొలగిపోయింది. శశికళ విధేయుడికే ముఖ్యమంత్రి పదవి దక్కింది. పార్టీపై ఆధిపత్యం కోసం శశికళతో కొనసాగిన పోరులో పన్నీర్‌ సెల్వం ఓడిపోయినట్లేనా? పన్నీర్‌ సెల్వం భవిష్యత్తు ప్రణాళిక ఏంటి?  
శశికళ వర్గానిదే పైచేయి
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం జరిగిన పోరాటంలో శశికళ వర్గానిదే పైచేయిగా నిలిచింది. బల నిరూపణకు గవర్నర్ తనకు అవకాశం ఇస్తారని, ఆ సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలు తనకు మద్దతిస్తారని భావించిన పన్నీర్‌ సెల్వంకు నిరాశే ఎదురైంది. శశికళ విధేయుడు పళనిస్వామికే పట్టం కట్టారు. 15 రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవాలని అవకాశమిచ్చారు. 
ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడంలో సెల్వం విఫలం  
శశికళను విభేదించి ధైర్యంగా తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. పన్నీర్ సెల్వానికి తొలుత మద్దతుగా నిలిచింది నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు ఎంపీలు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పన్నీర్ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలొచ్చాయి. ఇదే సమయంలో పన్నీర్ సెల్వానికి ప్రజల నుంచి, సినీ తారల నుంచి కూడా అనూహ్యంగా మద్దతు లభించింది. దీంతో అప్రమత్తమైన శశికళ ఎమ్మెల్యేలందరినీ క్యాంపునకు తరలించారు. 125 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతిస్తున్నారని... ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని శశికళ వర్గం గవర్నర్‌కు లేఖను సమర్పించింది.  శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు రప్పించడంలో పన్నీర్‌ సెల్వం విఫలమయ్యారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తన అధికారాలు ఉపయోగించుకుని.. పోలీసులనూ వినియోగించుకున్నా ఫలితం రాలేదు. గవర్నర్‌కు తనకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేల జాబితాను సమర్పించలేక పోయారు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే ఇక ముందు కూడా ఆయన మరింత మంది ఎమ్మెల్యేలను తన వర్గం వైపు తెచ్చుకోగలడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
పన్నీరు సెల్వంను బిజెపి ఆదుకుంటుందా..?
తమిళనాడుపై ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యంతో బిజెపి పన్నీర్‌ను ఎగదోసిందనే ప్రచారముంది. గవర్నర్‌ తగినంత సమయమిచ్చినా అన్నాడీఎంకే నుంచి ఎమ్మెల్యేలను చీల్చలేకపోయిన పన్నీర్‌ను బీజేపీ అసమర్థుడిగానే భావిస్తున్నట్లు సమాచారం. బిజెపి ఇప్పుడు ఆయనను ఆదుకుంటుందా అన్నది అనుమానమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజల మద్దతు కూడగట్టిన సెల్వం  
పన్నీర్‌ సెల్వంకు అన్నాడీఎంకే పార్టీలో, ఎమ్మెల్యేలలో పెద్దగా బలం లేకున్నా..అమ్మ విధేయుడిగా ప్రజల మద్దతును మాత్రం కూడగట్టగలిగారు. గతంలో రెండుసార్లు సిఎంగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో పరిపాలనా బాగా చేశారని పన్నీర్‌కు పేరుంది. ఇటీవలి పరిణామాల మధ్య సోషల్ మీడియాలో కూడా పన్నీర్ కు విపరీతమైన మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో అమ్మ పేరిట పన్నీర్‌ సెల్వం కొత్త పార్టీ పెట్టే అవకాశముందని అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేను చీల్చి కొత్త పార్టీ పెడితే అంతిమంగా డీఎంకేకు లాభమనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. అన్నా డీఎంకేను శశికళ కబంధ హస్తాల నుంచి రక్షిస్తానంటూ తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం కృషి బూడిదలో పోసిన పన్నీరేనా? లేక ముందు ముందు గుబాళిస్తుందా? అన్నది వేచి చూడాలి. 

 

20:12 - February 16, 2017

తమిళనాడు : అందరూ ఊహించిందే జరిగింది. 11 రోజుల పాటు తమిళనాడులో నెలకొన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ రాజకీయ డ్రామాకు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు తెరదించారు. రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేల బలం ఎవరికి ఎక్కువగా ఉందో వారికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇచ్చారు. శశికల నమ్మినబంటు అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత పళనిస్వామికే గవర్నర్ పట్టం కట్టారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. 
సీఎంగా పళనిస్వామి ప్రమాణస్వీకారం 
తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే శాసనసభా పక్షనేత పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 4.30గంటలకు రాజ్‌భవన్‌ దర్బార్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంచార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు..పళనిస్వామితో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత..30 మంది మంత్రులతో గవర్నర్‌ మూకుమ్మడిగా ప్రమాణం చేయించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల సమక్షంలో ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది.
కేబినెట్‌లో నలుగురు మహిళలకు చోటు
పళనిస్వామి కేబినెట్‌లో నలుగురు మహిళలు చోటు దక్కింది. సెంగొట్టియన్‌ మినహా మిగిలినవారంతా జయలలిత మంత్రివర్గంలో కొనసాగిన వారే. శశికళ మేనల్లుడు టి.టి.వి దినకరన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగినా..ఆయనకు చోటు దక్కలేదు. పళనిస్వామి కీలక శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. ముఖ్యమంత్రి, హోంశాఖ, ఆర్థిక శాఖ, నీటిపారుదల, హైవేస్‌, మైనర్‌ పోర్టుల శాఖలతో పాటు మొత్తం 19 శాఖలు తన దగ్గరే ఉంచుకున్నారు. 
కేబినెట్‌లో ...
సి. శ్రీనివాసన్‌ - అటవీశాఖ
కె.ఎ. సెంగొట్టియన్‌ - ప్రాథమిక విద్య, యువజన క్రీడలు 
కె.రాజు - సహకార శాఖ
పి. తంగమణి - విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖ
ఎస్‌.పి. వేలుమణి - మున్సిపల్‌, గ్రామీణాభివృద్ధి 
డి. జయకుమార్‌ - మత్స్యశాఖ
సి.వి. షణ్ముగన్‌ - న్యాయ శాఖ
కె.పి. అంబలాగన్‌ - ఉన్నత విద్యాశాఖ
వి. సరోజ - సాంఘీక సంక్షేమ శాఖ
ఎం.సీ. సంపత్‌ - పారిశ్రామిక శాఖ
కె.సి. కురుప్పణన్‌ - పర్యావరణ శాఖ
ఆర్‌. కామరాజ్‌ - పౌరసరఫరాల శాఖ
ఓ.ఎస్‌. మణియన్‌ - చేనేత, కార్మిక శాఖ
కె.రాధాకృష్ణన్‌ - గృహ నిర్మాణ శాఖ
సి. విజయ భాస్కర్‌ - ఆరోగ్య శాఖ
ఆర్‌.దొరైకన్ను - వ్యవసాయ శాఖ
కదంబుర్‌ రాజు - సమాచార, ప్రసార శాఖ
ఆర్‌.బి.ఉదయ్‌కుమార్ - రెవెన్యూ శాఖ
ఎన్‌. నటరాజన్‌ - పర్యాటక శాఖ
కె.సి. వీరమణి - వాణిజ్య పన్నుల శాఖ
కె.టి. రాజేంద్ర బాలాజీ - పాడి పరిశ్రమల శాఖ  
పి. బెంజమిన్‌ - గ్రామీణ పరిశ్రమలు
నిలోఫర్‌ కఫిల్‌ - కార్మిక శాఖ
ఎమ్‌.ఆర్‌. విజయభాస్కర్‌ - రవాణా శాఖ
ఎం. మణికందన్‌ - ఐటీ శాఖ
వి.ఎమ్‌. రాజ్యలక్ష్మి - గిరిజన శాఖ
జి. భాస్కరన్‌ - ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు
ఎస్‌. రామచంద్రన్‌ - దేవాదాయ శాఖ 
ఎస్‌. వాలర్మతి - బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ
పి. బాలకృష్ణారెడ్డి - పశు సంవర్థక శాఖ 
బలనిరూపణకు 15 రోజుల గడువు
పళనిస్వామి ప్రమాణస్వీకారంతో తమిళనాడులో గత 11 రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. అయితే బలనిరూపణకు పళనిస్వామికి గవర్నర్ విద్యాసాగర్‌రావు 15రోజుల గడువు విధించారు. మరోవైపు సీఎం పళనిస్వామితో పాటు మంత్రులంతా జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించారు. 
జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించిన సీఎం పళనిస్వామి, మంత్రులు 
తమిళనాడు ముఖ్యమంత్రిగా రాజ్‌భవన్లో ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి, సహచర మంత్రులు ప్రమాణస్వీకారం అనంతరం జయలలిత సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. చెన్నైలోని మెరినా బీచ్‌ దగ్గర ఉన్న జయలలిత సమాధి వద్ద సీఎం పళనిస్వామి, 30 మంది మంత్రులు  జయలలితకు పుష్పాలతో నివాళులర్పించారు. 

20:06 - February 16, 2017

నెల్లూరు : జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు పనిచేయని ప్రభుత్వ డాక్టర్లపై కొరఢా ఝళిపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ..పనిచేయకుండా డుమ్మాలు కొట్టే ప్రభుత్వ డాక్టర్లను సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వ డాక్టర్లుగా ఉంటూ ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తున్న,.ఆరుగురు డాక్టర్లఫై  జిల్లా కలెక్టర్ ముత్యాల సస్పెండ్‌ వేటు వేశారు. డ్యూటీ టైంలో కూడా ప్రైవేట్ క్లినిక్ విధులు నిర్వహిస్తున్నారని విమర్శలు రావడంతో జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు..ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న డాక్టర్లపై  నిఘా ఉంచారు. సొంత క్లినిక్‌లు నడుపుతున్నారని సమాచారంతో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి డ్యూటీ టైంలో విధులకు హాజరుకాకుండా ప్రైవేట్ క్లినిక్‌లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లను కలెక్టర్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలు సొంత ప్రైవేట్ క్లినిక్ లో పని చేస్తున్న 6మంది డాక్టర్లను సస్పాండ్ చేసారు.

 

నెల్లూరులో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కలెక్టర్‌ తనిఖీలు

నెల్లూరు : ప్రైవేట్‌ ఆస్పత్రులలో కలెక్టర్‌ తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రి పనివేళల్లో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో.. పనిచేస్తున్న ఆరుగురు ప్రభుత్వ వైద్యులను కలెక్టర్‌ పట్టుకున్నారు. పట్టుబడ్డ ఆరుగురు వైద్యులను సస్పెండ్‌ చేయాలని..ప్రభుత్వానికి కలెక్టర్‌ ముత్యాల రాజు సిఫారసు చేశారు. 

 

హైదరాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖం

హైదరాబాద్ : నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని అల్లం నారాయణ తెలిపారు. 

 

19:46 - February 16, 2017

చిత్తూరు : తూర్పు రాయలసీమ నియోజకవర్గం టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విటపు బాలసుబ్రమణ్యం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా యండపల్లి శ్రీనివాసులు రెడ్డి చిత్తూరులో నామినేషన్లు వేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చొరవతీసుకోవాలని ఎన్నికల అధికారుల్ని కోరారు. అంతకుముందు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులతో కలిసి నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. ఉపాధ్యాయులు, మేధావుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తామని ఇద్దరు అభ్యర్థులు ప్రకటించారు. కార్పొరేట్‌ శక్తుల ప్రవేశంతో భోగస్‌ ఓటర్లను చేర్పించారని... ఈ నెల 20లోపు నకిలీ ఓట్లు తొలగించకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

 

19:44 - February 16, 2017

హైదరాబాద్ : మంత్రి జూపల్లిపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచందర్‌ రెడ్డి. పాలమూర్‌ రంగారెడ్డి పంప్‌హౌజ్‌లో మంత్రి జూపల్లి అవినీతికి పాల్పడ్డారన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. బహిరంగ చర్చకు రావాలన్న తన సవాల్‌కు జూపల్లి తోకముడిచారని విమర్శించారు. వాస్తవాలు నిరూపించేందుకు సిద్ధమని... టీఆర్ ఎస్ నేతలు ఒక్కొక్కరుగా వస్తారో? గుంపులుగా వస్తారో తేల్చుకోవాలని సవాల్‌ విసిరారు.

 

19:42 - February 16, 2017

హైదరాబాద్ : అన్నా డీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళలాగానే... సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌ రావులకు శిక్ష తప్పదని బీజేపీ నేత నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు.. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆధారాలు అందజేశానని స్పష్టం చేశారు.. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టంటూ కోర్టులో అఫిడవిట్‌ వేశారని ఆరోపించారు.. ఈ అఫిడవిట్‌ వల్లే కేవలం తాగునీటికి సంబంధించిన పనులే చేయాలని కోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు.. తాను అవినీతికి వ్యతిరేకమని... ప్రాజెక్టులకు కాదని తేల్చిచెప్పారు..

 

19:38 - February 16, 2017

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సోమవారం అసెంబ్లీని సమావేశపరిచి..బలనిరూపణ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఆలస్యమైతే ఎమ్మెల్యేలు జారిపోతారనే భయం పళనిస్వామిని వెంటాడుతోంది.

 

19:37 - February 16, 2017

చెన్నై : తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే సీనియర్‌నేత పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 4.30గంటలకు రాజ్‌భవన్‌ దర్బార్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ విద్యాసాగర్‌రావు పళనిస్వామితో ప్రమాణం చేయించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల సమక్షంలో ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. పళనిస్వామి 1989లో ఎడప్పడి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1991, 2011, 2016లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001, 2006 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 1990లో సెల్వం పార్టీ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 1999, 2004లో పార్లమెంట్‌ ఎన్నికల్లో పళని ఓటమి పాలయ్యారు. 1998లో ఎంపీగా విజయం సాధించారు. పళనిస్వామి శశికళకు నమ్మినబంటు కావడంతో.. అనూహ్యంగా సీఎం పదవి వరించింది.
ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి, మంత్రులు  
పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, కె.సి. వీరమణి వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పి. తంగమణి విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ప్రమాణం చేయగా, సి.వి. షణ్ముగన్‌ న్యాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా సి. విజయ్‌ భాస్కర్‌, ఆర్‌.బి. రెవెన్యూ శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రితో పాటు మొత్తం 31 మంది ప్రమాణస్వీకారం చేశారు. పళనిస్వామి సీఎం కాగానే ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. రోడ్లపై బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.
కె. పళనిస్వామి - ముఖ్యమంత్రి
సి. శ్రీనివాసన్‌ - అటవీశాఖ
కె.ఎ. సెంగొట్టియన్‌ - ప్రాథమిక విద్య, యువజన క్రీడలు 
కె.రాజు - సహకార శాఖ
పి. తంగమణి - విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖ
ఎస్‌.పి. వేలుమణి - మున్సిపల్‌, గ్రామీణాభివృద్ధి 
డి. జయకుమార్‌ - మత్స్యశాఖ
సి.వి. షణ్ముగన్‌ - న్యాయ శాఖ
కె.పి. అంబలాగన్‌ - ఉన్నత విద్యాశాఖ
వి. సరోజ - సాంఘీక సంక్షేమ శాఖ
ఎం.సీ. సంపత్‌ - పారిశ్రామిక శాఖ
కె.సి. కురుప్పణన్‌ - పర్యావరణ శాఖ
ఆర్‌. కామరాజ్‌ - పౌరసరఫరాల శాఖ
ఓ.ఎస్‌. మణియన్‌ - చేనేత, కార్మిక శాఖ
కె.రాధాకృష్ణన్‌ - గృహ నిర్మాణ శాఖ
సి. విజయ భాస్కర్‌ - ఆరోగ్య శాఖ
ఆర్‌.దొరైకన్ను - వ్యవసాయ శాఖ
కదంబుర్‌ రాజు - సమాచార, ప్రసార శాఖ
ఆర్‌.బి.ఉదయ్‌కుమార్ - రెవెన్యూ శాఖ
ఎన్‌. నటరాజన్‌ - పర్యాటక శాఖ
కె.సి. వీరమణి - వాణిజ్య పన్నుల శాఖ
కె.టి. రాజేంద్ర బాలాజీ - పాడి పరిశ్రమల శాఖ  
పి. బెంజమిన్‌ - గ్రామీణ పరిశ్రమలు
నిలోఫర్‌ కఫిల్‌ - కార్మిక శాఖ
ఎమ్‌.ఆర్‌. విజయభాస్కర్‌ - రవాణా శాఖ
ఎం. మణికందన్‌ - ఐటీ శాఖ
వి.ఎమ్‌. రాజ్యలక్ష్మి - గిరిజన శాఖ
జి. భాస్కరన్‌ - ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు
ఎస్‌. రామచంద్రన్‌ - దేవాదాయ శాఖ 
ఎస్‌. వాలర్మతి - బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ
పి. బాలకృష్ణారెడ్డి - పశు సంవర్థక శాఖ 

 

19:26 - February 16, 2017

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేముల దళితుడు కాదని ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రకటించడాన్ని ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను నిరసిస్తూ సీపీఎంతో పాటు దళిత, గిరిజన సంఘాల నేతలు ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ దగ్గర కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ముందుగా దళితుడని ధృవీకరణ పత్రం జారీ చేసి, ఇప్పుడు బీసీగా ప్రకటించడాన్ని ప్రజా సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రని విమర్శించారు. 

 

19:23 - February 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 11న టీఎస్‌ సెట్‌ను నిర్వహిస్తున్నట్లు సెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన ఉస్మానియా యూనివర్శిటీ వీసీ రామచంద్రన్‌ తెలిపారు. ఈనెల 22 నుంచి మార్చి 20 వరకు ఆన్‌లైన్‌లో సెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఓయూ వీసీ రామచంద్రన్‌ తెలిపారు. 1500 రూపాయల ఫైన్‌తో మార్చి 30వరకు గడువు విధించారు. అలాగే 2వేలు ఫైన్‌తో ఏప్రిల్‌ 6వరకు, 3వేలు ఫైన్‌తో మే1 వరకు గడువు విధించారు. మే 20 నుంచి సెట్‌ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సెట్‌ నిర్వహణకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7 రీజినల్ సెంటర్లను ఏర్పాటుచేశారు. ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

19:17 - February 16, 2017

హైదరాబాద్ : నగరంలోని హోటల్‌ స్వాగత్ గ్రాండ్‌లో ప్రమాదవశాత్తూ లిప్ట్‌ విరిగి పడిన ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హోటల్‌ యాజమాన్యం గాయాలైన విద్యార్థులను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. బుధవారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకోగా..విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

19:15 - February 16, 2017

నల్గొండ : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఈనెల 22న హైదరాబాద్‌లో జరిగే నిరుద్యోగ ర్యాలీకి యువతీ, యువకులు భారీగా తరలిరావాలని టీజేఎసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపు ఇచ్చారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ర్యాలీ నిర్వహించనున్నట్టు  చెప్పారు. నిరుద్యోగుల ఆకాంక్షలు-తెలంగాణ భవిష్యత్‌ అన్న అంశంపై నల్గొండలో జరిగిన సదస్సులో కోదండరామ్‌ ప్రసగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ రోడ్‌ నుంచి లయన్స్‌ క్లబ్‌ వరకు జరిగిన బైక్‌ ర్యాలీని ప్రారభించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై పాలకులు కక్షకట్టడం దారుణమని కోదండరామ్‌ విమర్శించారు. 

19:13 - February 16, 2017

హైదరాబాద్ : సోషల్‌ మీడియా యుగంలో సెల్ఫీ కున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సెల్ఫీ తీసుకోవడం మనుషులే కాదు...రాకెట్లు కూడా తీస్తున్నాయి. బుధవారం 104 ఉపగ్రహాలను మోసుకుపోయిన పీఎస్‌ఎల్‌వీ-సీ37 వాహకనౌక నుంచి సెల్ఫీ వీడియో అందేలా శాస్త్రవేత్తలు  రాకెట్‌కు హై రిజల్యూషన్‌ కెమెరాను అమర్చారు.  శ్రీహరికోట నుంచి రాకెట్‌ లాంచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఆ కెమెరా అద్భుతమైన సెల్ఫీ వీడియోను చిత్రీకరించింది. లాంచ్‌ ప్రారంభమైన 18 నిమిషాల్లోనే మూడు భారతీయ ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరగా, తర్వాత ఆరొందల సెకన్లలో మిగతా 101 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. వీడియోలో ఉపగ్రహాలు విడిపోయిన దృశ్యాలతోపాటు నీలం, తెలుపు రంగుల్లో భూమి కూడా కనిపిస్తుంది.  ఇస్రో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 

 

19:10 - February 16, 2017

చెన్నై : తమిళనాడులో ఎట్టకేలకు రాజకీయ సంక్షోభం ముగిసింది. తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే సీనియర్‌నేత పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 4.30గంటలకు రాజ్‌భవన్‌ దర్బార్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ విద్యాసాగర్‌రావు పళనిస్వామితో ప్రమాణం చేయించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల సమక్షంలో ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. పళనిస్వామి 1989లో ఎడప్పడి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1991, 2011, 2016లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001, 2006 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 1990లో సెల్వం పార్టీ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 1999, 2004లో పార్లమెంట్‌ ఎన్నికల్లో పళని ఓటమి పాలయ్యారు. 1998లో ఎంపీగా విజయం సాధించారు. పళనిస్వామి శశికళకు నమ్మినబంటు కావడంతో.. అనూహ్యంగా సీఎం పదవి వరించింది.
సీఎంతోపాటు 31 మంది ప్రమాణస్వీకారం 
పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, కె.సి. వీరమణి వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పి. తంగమణి విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ప్రమాణం చేయగా, సి.వి. షణ్ముగన్‌ న్యాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా సి. విజయ్‌ భాస్కర్‌, ఆర్‌.బి. రెవెన్యూ శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రితో పాటు మొత్తం 31 మంది ప్రమాణస్వీకారం చేశారు. పళనిస్వామి సీఎం కాగానే ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. రోడ్లపై బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.

 

పాలకొండ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడుల

శ్రీకాకుళం : పాలకొండ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడుల నిర్వహించారు. ఓ రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్వో బాలమురళీకృష్ణను రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. 

సోమవారం అసెంబ్లీలో సీఎం పళనిస్వామి బల నిరూపణ

చెన్నై : తమిళనాడు సీఎం పళనిస్వామి బల నిరూపణకు సిద్ధమయ్యారు. సోమవారం అసెంబ్లీలో బల నిరూపణ 
జరుగనుంది. 

17:13 - February 16, 2017

హైదరాబాద్ : అమెరికాలో కట్టుకున్న భార్యపై ఎన్నారై భర్త వేధింపులకు పాల్పడ్డాడు. 2ఏళ్ల క్రితం ఎన్నారై కీర్తిసాయిరెడ్డితో..హైదరాబాద్‌ రామంతాపూర్‌కు చెందిన యాలల శిరీషతో వివాహం అయింది. అయితే అమెరికా వెళ్లిన తర్వాత..కీర్తిసాయిరెడ్డి భార్యను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. పుట్టిన బిడ్డకు కనీసం పాలు కూడా ఇవ్వకుండా బిడ్డను తల్లి శిరీష నుండి వేరుచేశాడు. అయితే నిత్యం భర్త పెట్టే వేధింపులు భరించలేక శిరీష..నిన్న అర్థరాత్రి అమెరికా నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. అయితే శిరీషతో పాటు..భర్త కీర్తిసాయిరెడ్డి కూడా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. విమానం దిగిన వెంటనే..భార్య శిరీషను వదిలేసి..తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. ఎన్నారై భర్త కీర్తిసాయిరెడ్డి కోసం శిరీష మీడియాను ఆశ్రయించింది. 

 

17:07 - February 16, 2017

హైదరాబాద్ : వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు,  ఒంటరి మహిళలకు జీవన భృతి..లాంటి కార్యక్రమాలు చేపడతున్న తెలంగాణ ప్రభుత్వం..తాజాగా గర్భిణీస్త్రీల కోసం కొత్తపథకం తీసుకురాబోతొంది. రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల మంది గర్భిణీ స్త్రీలకు ఆర్ధిక చేయూత ఇవ్వడానికి కొత్తపథకాన్ని రూపొందిస్తోంది. రాష్ట్రంలో వితంతువులు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు ఆర్ధిక సాయం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా గర్భిణీస్త్రీల కోసం కొత్తపథకం తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది.  
గర్భిణీలకు పోషకాహార లోపం నివరాణకు పథకం
 ప్రేగ్నేస్ని టైంలో మహిళలు ఉఫాది కోల్పోవలసి వస్తోంది. దీంతో పేద మహిళలకు కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోషకాహారం అందక వారు ఆనారోగ్యం పాలవుతున్నారు. పుట్టే బిడ్డలు కూడా రోగాలపాలవుతున్నారు. దీన్నిదృష్టిలో పెట్టుకుని ఇపుడు కొత్త పథకాన్ని తెచ్చేందుకు కేసీఆర్‌ సర్కార్‌ సిద్దం అయింది. 
ఒక్కో గర్భిణీ స్త్రీకి రూ. 15 నుంచి రూ.20వేలు..!
గర్భధారణ అయిన నాలుగు నెలల నుంచి.. కాన్పు తర్వాత నాలుగు నెలల వరకు వారికి ఉపయోగ పడేలా ఆర్ధిక సాయం ను దశల వారిగా అందించాలని ప్రభుత్వం బావిస్తోంది. దీనిపై ఇప్పటికే అధ్యాయనం చేసిన వైద్యఆరోగ్య శాఖ.. ఒక్కో మహిళలకు కనీసం 15 నుంచి 20 వేలరూపాయల వరకు సాయం అందిస్తే బాగుంటుందనే అంచానాకు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ పథకం కేవలం ప్రభుత్వ ఆస్పత్రులనుంచి వైద్యం పొందుతూ.. ప్రభుత్వ హస్పటల్స్ లో డెలివరీ అయ్యే.. బిపిఎల్ కుటుంబాలకే వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ పథకాన్నిఅమలు చేస్తున్న తమిళనాడుప్రభుత్వం అక్కడి  గర్భిణి స్త్రీలకు 16 వేల రుపాయాలు అందిస్తోంది.  ఆ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేయడానికి  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే  ఈ పథకంపై మరింతగా అధ్యయనం చేసి ..బడ్జెట్ రూపకల్పన లోపు  తుదిరూపు ఇవ్వాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.  ఈ పథకం ఇది అమల్లోకి వస్తే రాష్ట్రంలోని  ప్రభుత్వ హస్పటల్స్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రెండున్నర లక్షల మంది గర్భిణి స్త్రీలకు  లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

16:49 - February 16, 2017

చెన్నై : తమిళనాడులో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింంది. తమిళనాడు సీఎం పీఠం పళనిస్వామిని వరించింది. ఎట్టకేలకు తమిళనాడు సీఎంగా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ విద్యాసాగర్ రావు పళనిస్వామి, మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. 

 

తమిళనాడు సీఎంగా పళనిస్వామి ప్రమాణస్వీకారం

చెన్నై : ఎట్టకేలకు తమిళనాడు సీఎంగా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ విద్యాసాగర్ రావు పళనిస్వామి చేత ప్రమాణస్వీకారం చేయించారు.

16:38 - February 16, 2017

చెన్నై : తమిళనాడులో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలన్న సస్పెన్స్‌కు తెరవీడింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామికి అవకాశమిస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. బల నిరూపణ కోసం ఆయనకు 15 రోజుల సమయమిచ్చారు. ఇంతకీ ఈ పళనిస్వామి ఎవరు?
శశికళ వర్గం పైచేయి 
అన్నాడిఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మధ్య జరిగిన పోరులో శశికళ వర్గమే పైచేయి సాధించింది. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు జైలుకు పంపింది. దీంతో శశికళ సిఎం కావాలన్న కలలు కల్లలై పోయాయి. పన్నీర్‌సెల్వంకు అధికారం దక్కకుండా పట్టుదలతో ఉన్న శశికళ అనూహ్యంగా పళనిస్వామి పేరును తెరపైకి తెచ్చారు.
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పళనిస్వామి విజయం
పన్నీరు సెల్వం మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా పళనిస్వామి రహదారులు, ఓడరేవుల శాఖను నిర్వహిస్తున్నారు. సేలం జిల్లాలోని ఎడపాడి నియోజకవర్గం నుంచి 1989లో తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గం నుంచే శాసనసభకు ఆయన నాలుగుసార్లు ఎన్నికయ్యారు. పళనిస్వామి గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. 
శశికళకు పళనిస్వామి నమ్మినబంటు  
జయలలిత బతికున్నరోజుల్లో ఆమెకు వీరవిధేయుడిగా ఉన్న పళనిస్వామి... చిన్నమ్మ శశికళకు కూడా నమ్మినబంటే.  జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వంతో పాటు పళనిస్వామి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. పళనిస్వామినే ముఖ్యమంత్రిని చేయాలని తొలుత శశికళ భావించారు. అయితే, అమ్మకు విశ్వాసపాత్రుడుగా పేరు తెచ్చుకున్న పన్నీరు సెల్వాన్ని కాకుండా పళనిస్వామిని ఎంపిక చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న కారణంతో ఓపిఎస్‌వైపే మొగ్గు చూపారు. పన్నీర్‌సెల్వం తనకు విధేయుడిగా ఉంటాడని నమ్మిన శశికళకు - ఆయన ఎదురు తిరగడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
పన్నీరు సెల్వం అంటే పళనిస్వామికి అస్సలు పడదు 
పన్నీరు సెల్వం అంటే పళనిస్వామికి అస్సలు పడదు. పన్నీరు సెల్వం తిరుగుబాటు చేసిన తర్వాత పళనిస్వామి శశికళ శిబిరంలో చేరిపోయారు. అక్రమ ఆస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో తనకు అత్యంత విధేయుడైన పళనిస్వామి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యే విధంగా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు. శశికళ జైలులో ఉన్నప్పటికీ ఆమె కనుసన్నలలోనే పళనిస్వామి పరిపాలన కొనసాగిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

రాజమండ్రిలో దారుణం

తూర్పుగోదావరి : రాజమండ్రిలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్రియురాలిపై ప్రియుడు కత్తిదాడి చేశాడు. ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. చిక్సిత నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

16:32 - February 16, 2017

తూర్పుగోదావరి : రాజమండ్రిలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్రియురాలిపై ప్రియుడు కత్తిదాడి చేశాడు. రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న గీతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న సతీష్‌ ప్రేమ పేరుతో గత నాలుగు రోజులుగా వేధిస్తున్నాడు. అయితే ఎంతకీ తన ప్రేమను అంగీకరించకపోవడంతో...గీతపై కోపం పెంచుకున్న ప్రియుడు సతీష్‌..ఆటోలో వెళ్తున్న గీతపై కత్తితో దాడిచేశాడు. ఆ తర్వాత వెంటనే తేరుకొని ప్రియురాలిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించి వెంటనే పారిపోయాడు.

 

16:27 - February 16, 2017

హైదరాబాద్ : రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్‌ డే సందర్భంగా ప్రముఖ కవి త్రినేత్ర రాసిన దటీస్‌ కేసీఆర్ పుస్తకాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఆవిష్కరించారు. కేసీఆర్ జీవిత ప్రస్థానం నుంచి  తెలంగాణ పోరాటం వరకు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణ సాధన కోసం చేస్తున్న కృషిని ఈ పుస్తకంలో వివరించారు. కేసీఆర్ జీవితం ఎందరికో ఆదర్శమని ఈ సందర్భంగా ఈటల చెప్పారు. భావితరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పుస్తక రచయిత త్రినేత్రకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

 

16:22 - February 16, 2017

హైదరాబాద్ : టెక్స్‌టైల్‌ పార్కుల పరిశీలన కోసం తమిళనాడు వెళ్లిన మంత్రి కేటీఆర్‌ టూర్‌ బిజీబిజీగా సాగుతోంది. చేనేత టెక్స్‌టైల్‌ రంగానికి చేయూతనిచ్చేందుకు తమిళనాడు తీసుకుంటున్న నిర్ణయాలపై మంత్రి కేటీఆర్‌ బృందం అధ్యయనం చేస్తోంది. తిరుపూరులోని టెక్స్‌టైల్ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. తమిళనాడు రాష్ర్టంలో టెక్స్‌టైల్‌ రంగం పరిస్థితులపై చర్చించారు. వరంగల్‌లో నెలకొల్పబోతున్న టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రణాళికను వారికి మంత్రి కేటీఆర్‌ వివరించారు. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ను సందర్శించి.. యూనిట్లు ఏర్పాటు చేయాలని టెక్స్‌టైల్‌ పారిశ్రామిక వేత్తలను కేటీఆర్‌ ఆహ్వానించారు. 

16:20 - February 16, 2017

ఢిల్లీ : బీఎంఎల్ యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. బీఎంఎల్ విశ్వవిద్యాలయంలో బిటెక్‌ చదువుతున్న రంగ మణిదీప్‌ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగ మణిదీప్‌ స్వస్థలం ఖమ్మం జిల్లా వైరా. మణిదీప్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

16:17 - February 16, 2017

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించాల్సిన సీఎం చంద్రబాబునాయుడే ప్రజా పోరాటాలను అణచివేస్తున్నాడని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు. విశాఖపట్నంలో కొవ్వొత్తుల ర్యాలీకి వెళ్లిన తనని నిర్భధించారని...అన్నారు. ప్రత్యేక హోదా అడిగిన వారిని అణచివేస్తున్నారని ఆరోపించారు. సాధించిన అభివృద్ధిని నిలబెట్టుకుంటూ.. మరింత ముందుకు వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని అన్నారు. ప్రత్యేక హోదా అనే బ్రహ్మాస్త్రంతో ఏపీ అభివృద్ధి సాధ్యమని జగన్‌ అభిప్రాయపడ్డారు.

 

సా. 4.30 గం.లకు సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం

చెన్నై : తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడుతోంది. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బలనిరూపణ కోసం పళనిస్వామికి 15 రోజుల సమయమిచ్చారు గవర్నర్‌. దీంతో శశికళ మద్దతుదారుల్లో సంబరాలు మిన్నంటాయి.

16:11 - February 16, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడుతోంది. కాసేపట్లో సీఎంగా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేయనున్నారు.  ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బలనిరూపణ కోసం పళనిస్వామికి 15 రోజుల సమయమిచ్చారు గవర్నర్‌. దీంతో శశికళ మద్దతుదారుల్లో సంబరాలు మిన్నంటాయి. ప్రస్తుతం పబ్లిక్‌ వర్క్స్‌ హైవేస్, మైనర్‌పోర్ట్స్‌ శాఖల మంత్రిగా ఉన్న పళనిస్వామి.. 1989లో ఎడప్పడి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1991, 2011, 2016లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001, 2006 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 1990లో సెల్వం పార్టీ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 1999, 2004లో పార్లమెంట్‌ ఎన్నికల్లో పళని ఓటమి పాలయ్యారు. 1998లో ఎంపీగా విజయం సాధించారు. 

 

16:04 - February 16, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడుతోంది. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బలనిరూపణ కోసం పళనిస్వామికి 15 రోజుల సమయమిచ్చారు గవర్నర్‌. దీంతో శశికళ మద్దతుదారుల్లో సంబరాలు మిన్నంటాయి. ప్రస్తుతం పబ్లిక్‌ వర్క్స్‌ హైవేస్, మైనర్‌పోర్ట్స్‌ శాఖల మంత్రిగా ఉన్న పళనిస్వామి.. 1989లో ఎడప్పడి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1991, 2011, 2016లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001, 2006 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 1990లో సెల్వం పార్టీ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 1999, 2004లో పార్లమెంట్‌ ఎన్నికల్లో పళని ఓటమి పాలయ్యారు. 1998లో ఎంపీగా విజయం సాధించారు. 

 

16:01 - February 16, 2017

చెన్నై : శశికళ వర్గంలోని పళనిస్వామిని గవర్నర్‌ సీఎంగా ప్రకటించడంపై పన్నీరు సెల్వం స్పందించారు. ధర్మం గెలిచెంతవరకూ యుద్ధం కొనసాగుతోందన్నారు పన్నీరు సెల్వం. చివరివరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. 

 

స్వీట్ షాప్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : బంజారాహిల్స్ ఇంద్రనగర్ లోని ఓ స్వీట్ షాప్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

బీఎంఎల్ యూనివర్సిటీలో విషాదం

ఢిల్లీ : బీఎంఎల్ యూనివర్సిటీలో విషాదం నెలకొంది. యూనిర్సిటీలో బిటెక్ విదార్థి రంగ మణిదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మణిదీప్ రంగ స్వస్థలం ఖమ్మం జిల్లా వైరా. మణిదీప్ ఆత్మహత్యపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

 

13:28 - February 16, 2017

ఖమ్మం: సీపీఎం మహాజన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 123వ రోజుకు చేరుకున్న పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఖమ్మం జిల్లాలోని రాయనపేట, ఆళ్లపాడు, బోనకల్లు, ముష్టికుంట్ల, నాగులవంచలో పాదయాత్ర కొనసాగుతోంది. అన్ని గ్రామాల ప్రజలు పాదయాత్ర బృంద సభ్యులకు సాదరంగా ఆహ్వానిస్తూ.. యాత్రలో పాల్గొంటున్నారు. గ్రామాల్లోని ప్రజలు తమ బాధలను పాదయాత్ర బృంద సభ్యులకు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే 3,300 కిలోమీటర్ల మేర యాత్రను పూర్తిచేశారు. రేపు ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు పాల్గొననున్నారు. 18వ తేదీన వరంగల్‌ క్రాస్‌రోడ్డులో నిర్వహించనున్న సభలో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాష్‌కరత్‌, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పాల్గొంటారు. మార్చి 19న హైదరాబాద్‌లో ముగింపు సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయ్‌ విజయ్‌, సీతారాం ఏచూరి హాజరుకానున్నారు.

13:24 - February 16, 2017
13:17 - February 16, 2017

చెన్నై: అనూహ్య మ‌లుపులు తిరిగిన తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడుతోంది. ఇవాళ సాయంత్రం 4.00 గంటలకు సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బలనిరూపణ కోసం పళనిస్వామికి 15 రోజుల సమయమిచ్చారు గవర్నర్‌. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆయనను ఆహ్వానించినట్టు రాజ్‌భ‌వ‌న్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అధికారికంగా ప్ర‌క‌టన విడుద‌ల చేశారు. దీంతో శశికళ మద్దతుదారుల్లో సంబరాలు మిన్నంటాయి. ప్రస్తుతం పబ్లిక్‌ వర్క్స్‌ హైవేస్, మైనర్‌పోర్ట్స్‌ శాఖల మంత్రిగా ఉన్న పళనిస్వామి.. 1989లో ఎడప్పడి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1991, 2011, 2016లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001, 2006 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 1990లో సెల్వం పార్టీ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 1999, 2004లో పార్లమెంట్‌ ఎన్నికల్లో పళని ఓటమి పాలయ్యారు. 1998లో ఎంపీగా విజయం సాధించారు.

12:48 - February 16, 2017

హైదరాబాద్: దేశంలో మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయరంగాల్లో ఈనాటికీ అసమానతలు, వివక్ష అనేది పలు రూపాల్లో కొనసాగుతూనే వుంది. ఈ విషయంలో పాలకుల ఊకదంపుడు ఉపన్యాసాలు, అరచేతిలో వైకుంఠం చూపే ప్రయత్నాలు, హంగులూ, ఆర్భాటాలు. నేతల మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి. చేతలు కనీసం ఇంటి గడపదాటదు ఈ తీరుగా ఉంది. ఏపీ సర్కార్ చేపట్టిన ఉమెన్ పార్లమెంటరీ సదస్సు ఈ విధంగా ఉంది. ఇదే అంశంపై మానవి 'ఫోకస్ 'విశ్లేషణ చేసింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

12:28 - February 16, 2017

చెన్నై: రాజ్ భవన్ లో గరవ్నర్ తో పళని స్వామి భేటీ ముగిసింది. ఈ భేటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళని స్వామికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా నిరూపించుకునేందుకు పళనిస్వామికి గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రమే 4.30 గంటలకు పళని చేత ప్రమాణస్వీకారం చేయించే అవకాశం కనిపిస్తోంది. దీంతో తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వైపు 15 రోజుల గడువు వెనుక అనేక అనేక బేరసారాలు నడిచి రాజకీయ అస్థిరతకు దారి దీసే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బలనిరూపణకు 15 రోజుల గడువు

చెన్నై: అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా నిరూపించుకునేందుకు పళనిస్వామికి గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రమే 4.30 గంటలకు పళని చేత సీఎం ప్రమాణస్వీకారం చేయించే అవకాశం కనిపిస్తోంది.

12:19 - February 16, 2017

చెన్నై: అన్నాడీఎంకే శాస‌న‌స‌భ ప‌క్ష‌నేత ప‌ళ‌నిస్వామితో రాజ్‌భవ‌న్‌లో ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు భేటీ ముగిసింది. గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చించిన వారిలో ప‌ళ‌నిస్వామితో పాటు సెంగొట్టియ‌న్‌, వేలుమ‌ణి, దిన‌క‌ర‌న్‌, జ‌య‌కుమార్‌, తంగ‌మ‌ణి ఉన్నారు. కాసేప‌ట్లో మీడియాతో గ‌వ‌ర్న‌ర్ మాట్లాడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మరో వైపు గరవ్నర్ ఇదే అంశంపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

సాయంత్రమే పళని స్వామి ప్రమాణస్వీకారం!

చెన్నై: రాజ్ భవన్ కు పళని స్వామి గవర్నర్ తో భేటీ అయ్యారు.ప‌ళ‌నిస్వామితో మ‌రో ఐదుగురు అన్నాడీఎంకే నేత‌లు ఉన్నారు. మ‌రికాసేప‌ట్లో ప్ర‌భుత్వ ఏర్పాటుపై గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్ర‌మే ప‌ళ‌నిస్వామి ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అన్నాడీఎంకే నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

రాజ్ భవన్ కు బయలుదేరిన పళనిస్వామి

చెన్నై: ఈ రోజు 11.30కి త‌న‌ని క‌ల‌వాలంటూ అన్నాడీఎంకే శాస‌న‌స‌భ ప‌క్ష‌నేత ప‌ళ‌నిస్వామికి గ‌వ‌ర్న‌ర్ నుంచి పిలుపువ‌చ్చింది. దీంతో గోల్డెన్ బే రిసార్టులో ఉన్న ప‌ళ‌నిస్వామి అక్క‌డి నుంచి ప‌లువురు మంత్రుల‌తో క‌లిసి రాజ్‌భ‌వ‌న్‌కు బ‌య‌లుదేరారు. ఈ భేటీ త‌రువాత‌ ఇక ప్ర‌భుత్వ ఏర్పాటుపై గ‌వ‌ర్న‌ర్ ఓ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప‌ళ‌నిస్వామికే ఆ అవ‌కాశం ఇస్తార‌ని అంద‌రూ భావిస్తున్నారు.

మాదాపూర్ లో యువతి దారుణ హత్య

హైదరాబాద్:నగరంలోని మాదాపూర్‌ పీఎస్ పరిధిలో ఓ యువతి దారుణహత్యకు గురైంది. భాగ్యనగర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ సమీపంలో ఎన్‌ఐఏ భవనం పక్కన బుధవారం కాలిపోయిన స్థితిలో మృతదేహం పడి ఉంది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతురాలిని సికింద్రాబాద్‌కు చెందిన సునీతగా గుర్తించారు. ఆమె అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు సంస్థలో టెలీకాలర్‌గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. బుధవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన సునీత సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు: ఇద్దరు మృతి

వరంగల్ : నర్సంపేట ధర్మారం రైల్వేగేట్ వద్ద అదుపుతప్పిన ఆర్టీసి బస్సు 3 బైక్ లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి టిప్పర్ ఢీ: యువకుడి మృతి

కామారెడ్డి : టీఆర్ ఎస్ ఎమ్మెల్యేఏనుగు రవీందర్ రెడ్డి కి చెందిన టిప్పర్ ఢీకొని భీమయ్య అనేక యువకుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి ఆదుకోవాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించడంతో ఆందోళనకులకు.. పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. మరో వైపు అన్నారంలో కంకర ఫ్యాక్టరీ మూసివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండండి:స్టాలిన్

చెన్నై: తమిళనాడులో రాజకీయ సంక్షోభం తమకు అనుకూలంగా మారుతుందని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఆశిస్తుంది. మధ్యంత ఎన్నికలు వస్తాయని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని డిఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ సూచించారు.

పళని స్వామికి గవర్నర్ అపాయింట్ మెంట్

చెన్నై: తమిళనాడు రాజకీయ ప్రతిష్టంభనకు మరి కొన్ని గంటల్లో తెరపడే అవకాశం కనిపిస్తోంది. పళని స్వామికి గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. ఈ రోజు ఉదయం 11.30గంటలకు గవర్నర్ ను కలవనున్నారు. తనకు 125 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పళని చెప్పగా.. పన్నీర్ మాత్రం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా చూపించలేకపోతున్నారు. దీంతో గవర్నర్ పళనిస్వామినే పిలిచే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

10:29 - February 16, 2017

చెన్నై: తమిళనాడులో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. గోల్డెన్‌ బే రిసార్ట్‌లో 119 మంది ఎమ్మెల్యేలతో ఉన్న పళనిస్వామి వర్గం.. గవర్నర్‌ పిలుపుకోసం ఎదురుచూస్తోంది. తమకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పళనిస్వామి అంటున్నారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఇప్పటికే గవర్నర్‌కు సమర్పించారు. మరోవైపు రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా డీఎంకే పావులు కదుపుతోంది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. కుదిరితే అధికారం, లేదంటే ఎన్నికలకు వెళ్లే యోచనలో డీఎంకే వ్యూహరచన చేస్తోంది. అయితే పన్నీర్‌ సెల్వంకు మద్దతుపై డీఎంకే నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

10:26 - February 16, 2017

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన స్వరం పెంచేందుకు వైసీపీ సిద్ధమైంది. ఇవాళ గుంటూరులో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆధ్వర్యంలో యువభేరి నిర్వహించనుంది. నల్లపాడు రోడ్డులో యువభేరి నిర్వహిస్తున్నారు. కాసేపట్లో జగన్‌ యువభేరి సభకు చేరుకోనున్నారు.

 

బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం:6గురు మృతి

హైదరాబాద్: బీహార్‌లో ఘోర రోడ్డుప్రమాదంజరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బిహార్‌లోని కతిహార్‌ నగరానికి సమీపంలో గల గ్వాల్‌తొలి మందిర్‌ వద్ద గురువారం ఆలో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

09:43 - February 16, 2017

ఖమ్మం: తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పిన కేసీఆర్‌.. ప్రజల బతుకుల్ని మార్చేవిధంగా పరిపాలన చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. రాష్ట్రంలో చదువు సరిగా లేక విద్యార్థులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా, వైద్యాన్ని జాతీయం చేసి ప్రభుత్వమే నిర్వహించాలని, అప్పుడే సామాజిక న్యాయం అందుబాటులోకి వస్తోందని తమ్మినేని అన్నారు.

122 రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్ర...

పదండి ముందుకు..పోదాం పోదాం.. అంటూ పల్లెపల్లెనూ పలకరిస్తున్న సీపీఎం మహాజన పాదయాత్ర 122 రోజులు పూర్తి చేసుకుంది. 122వ రోజు ఖమ్మం జిల్లాలోని కళకోట, పెరిపురం, కృష్ణాపురం, ఆర్పూర్‌, మధిర, పడుపల్లి, మల్లినగరం, మోటమర్రి గ్రామాల్లో పర్యటించింది. తమ్మినేని పాదయాత్రకు సినీ నటుడు మాదాల రవి సంఘీభావం తెలిపారు.

స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు అయినా..

స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు అయినా..ఇంకా ప్రజలు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కోసమే తపిస్తున్నారని, పేదల అభివృద్ధి పాలకులకు పట్టడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో రెండున్నారేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో బడుగు,బలహీన వర్గాలకు ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీలు అమలు కావడం లేదని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజిక తెలంగాణ సాధించే వరకు సీపీఎం పోరాటం...

సామాజిక తెలంగాణ సాధించే వరకు సీపీఎం పోరాటం చేస్తోందని తమ్మినేని అన్నారు. సామాజిక న్యాయం అందుబాటులోకి రావాలంటే పేదలకు విద్యా, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావాలని, అందుకు విద్యా, వైద్యాన్ని జాతీయం చేసి ప్రభుత్వమే నిర్వహించాలని తమ్మినేని సూచించారు. మధిర ప్రాంతంలో చల్లాడ, కొణిజెర్ల, వైరా గ్రామాలకు సంబంధించి పదివేల మందికి రుణమాఫీ కాలేదని.. వారికి వెంటనే రుణమాఫీ చేయాలని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. వెంటనే మధిర ప్రాంత రైతులకు రుణమాఫీ వర్తింపచేయాలని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పాత రుణంతో సంబంధం లేకుండా కొత్త రుణాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను తమ్మినేని వీరభద్రం కోరారు.

09:41 - February 16, 2017

చెన్నై: తమిళనాడులో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. గోల్డెన్‌ బే రిసార్ట్‌లో 119 మంది ఎమ్మెల్యేలతో ఉన్న పళనిస్వామి వర్గం.. గవర్నర్‌ పిలుపుకోసం ఎదురుచూస్తోంది. తమకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పళనిస్వామి అంటున్నారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఇప్పటికే గవర్నర్‌కు సమర్పించారు. మరోవైపు రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా డీఎంకే పావులు కదుపుతోంది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. కుదిరితే అధికారం, లేదంటే ఎన్నికలకు వెళ్లే యోచనలో డీఎంకే వ్యూహరచన చేస్తోంది. అయితే పన్నీర్‌ సెల్వంకు మద్దతుపై డీఎంకే నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

09:39 - February 16, 2017

హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థి వంశీపై కాల్పులు జరిపిన స్టువర్ట్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐదు రోజుల క్రితం కాలిఫోర్నియాలో కారు తగిలిందని తెలుగు విద్యార్థి వంశీని స్టువర్ట్ కాల్చి చంపాడు. రేపు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వంశీ మృతదేహం చేరుకోనుంది.

శబరిమలలో ఎయిర్ పోర్టుకు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్: విత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటుకు కేరళ రాష్ట్ర కేబినెట్‌లో మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం శబరిమల అయ్యప్పను దర్శించుకోవాలంటే రోడ్డు మార్గమే శరణ్యం. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటైతే భక్తులకు సౌకర్యంగా ఉండడంతో శబరిమలను సందర్శించే వారి సంఖ్య కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

టాస్క్ ఫోర్స్ సిబ్బంది పై రాళ్ల దాడి

తిరుమల: బాకరాపేట అటవీ ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ బృందంపై తమిళ కూలీలు రాళ్ల దాడి చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక తమిళ కూలి అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు: బస్సుడ్రైవర్ మృతి

విజయవాడ: ఓ ప్రైవేట్ బస్సు లారీని ఢీకొంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మృతి చెందగా పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. విజయవాడ నుండి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న అన్నాడీఎంకే సీనియర్లు

చెన్నై: అన్నాడీఎంకే శాసనసభాపక్షం నేతగా ఎంపికైన ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పిలుపు వస్తుందని రాజ్‌భవన్‌ వైపు ఎదురు చూస్తుండగా.. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తిరుగుబాటు నేత పన్నీర్‌సెల్వం శశి శిబిరం నుంచీ ఎమ్మెల్యేలను చెదరగొట్టడానికి వ్యూహాత్మకంగా ముందకు కదులుతున్నారు. మరో పక్క చిన్నమ్మ శిబిరంలోనూ అసమ్మతి మొదలైంది. తమకన్నా జూనియర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు.

 

09:06 - February 16, 2017

హైదరాబాద్: డబ్బులు పంచి ఓట్లు కొనుక్కునే నేతలంతా అవినీతిపరులే అని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న సీపీఎం నేత బాబూరావు స్పష్టం చేశారు. తప్పు చేసిన వారెవ్వరూ తప్పించుకోలేరన్న సత్యాన్ని.. శశికళ విషయంలో న్యాయస్థానం నిరూపించిందని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్‌ శశికళకన్నా ఎక్కువ అవినీతికి పాల్పడ్డారని, అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ చెంగల్రాయుడును పార్టీలోకి స్వాగతిస్తూ.. చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వైసిపి నేత కొండా రాఘవరెడ్డి, సీపీఎం నేత సీహెచ్ బాబూరావు, టిడిపి నేత సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

21,22 తేదీలో తిరుమలకు సీఎం కేసీఆర్

హైదరాబాద్: సీఎంకేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైనట్లు సమాచారం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తన కోరిక సిద్ధిస్తే, తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి ఆయన మొక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ మొక్కు తీర్చుకునేందుకు 21 మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకునే కేసీఆర్, రాత్రికి తిరుమలలో బస చేసి, ఆపై 22న ఉదయాన్నే స్వామి వారిని దర్శించుకుని ఆభరణాలను బహూకరించనున్నారు. ఆపై తిరుపతికి వచ్చి అలివేలు మంగాపురంలో అమ్మవారికి మొక్కులు చెల్లించి, అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.

కొనసాగుతున్న ఉత్కంఠ

చెన్నై: రోజులు గడుస్తున్నా ఇంకా అదే ఉత్కంఠ. అధికార పగ్గాలు చేపట్టేందుకు శశికళ వర్గం.. పన్నీర్‌ సెల్వం వర్గం వ్యూహాలు రచిస్తూనే ఉన్నాయి. ఇరు వర్గాల నేతలు గవర్నర్‌ను విద్యాసాగర్‌రావును కలిసి తమకు అవకాశం ఇవ్వాలని విన్నవించుకున్నారు. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై గవర్నర్‌ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది.

09:00 - February 16, 2017

హైదరాబాద్: ఏవీ శశికళకు జైలు బాట పట్టడంతో...అన్నాడీఎంకేలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు అమ్మ జయలలిత వద్దనుకున్న శశకళ బంధువర్గమే.. ఇప్పుడు పార్టీలో కీలక పదవులు పొందారు. శశికళకు దగ్గరి బంధువులైన ఇద్దరు నేతలు తాజాగా అన్నాడీఎంకే పదవులతో తెరపైకి వచ్చారు. ముఖ్యంగా, జయలలిత బతికున్న రోజుల్లో.. శశికళకు దూరంగా ఉన్న ఆమె భర్త నటరాజన్‌.. తాను శశికళతో టచ్‌లోనే ఉన్నానని తాజాగా స్పష్టం చేశారు. దీన్ని బట్టి.. శశికళ జయలలితను మాయచేశారన్న భావన అన్నాడిఎంకే శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

పోయేస్ గార్డెన్ నుండి శశికళ భర్త నటరాజన్ కూడా...

తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలపై గతంలో పోయస్‌గార్డెన్‌ నుంచి శశికళతో పాటు ఆమె బంధువులను జయలలిత గెంటేశారు. వారిలో శశికళ భర్త నటరాజన్‌ కూడా ఉన్నారు. అయితే శశికళ తన బంధువులతో ఎలాంటి సంబంధాలను కొనసాగించనని, తనను క్షమించాలని అప్పట్లో జయలలితకు శశికళ లేఖ రాశారు. బంధువులతో పాటు భర్త నటరాజన్‌ను కూడా దూరంగా పెట్టాలన్న షరతుకు శశికళ అంగీకరించాకే తిరిగి ఆమెను పోయస్‌ గార్డెన్‌లో అడుగుపెట్టనిచ్చారు.

2011లో శశికళ బంధువులను దూరంగా ఉంచిన జయలలిత....

ఇక 2011లో జయలలిత దూరంగా ఉంచిన శశికళ బంధువులైన టీటీవీ దినకరన్‌, వెంకటేష్‌లను కూడా తాజాగా మళ్లీ అన్నాడీఎంకేలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దినకరన్‌, వెంకటేష్‌లను తిరిగి తీసుకోవడం పార్టీ అభిప్రాయమని, శశికళ వెంటే తామున్నామని నటరాజన్‌ ప్రకటించారు. మొత్తానికి అమ్మ ఆశయాల కోసమంటూ ఇంతకాలం జపం చేసిన శశికళ కటకటాల్లోకి వెళ్లబోతూ.. తన బంధువులకు పార్టీలోను, ప్రభుత్వంలోనూ కీలక పదవులు అప్పజెప్పాలని భావించడంపై.. తమిళ ప్రజల్లో ముఖ్యంగా అన్నాడిఎంకే శ్రేణుల్లో విస్తృత చర్చ సాగుతోంది. అమ్మ వద్దన్నవారికి చిన్నమ్మ పదవులు ఎలా కట్టబెడతారంటూ రెండాకుల పార్టీ వర్గాలు విస్తుపోతున్నాయి.

08:57 - February 16, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష శాసనసభ్యులను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వచ్చే ఎన్నికల్లో అధికారమని వైసీపీ దేనని ఆ పార్టీ అధినేత జగన్‌ చెప్పారు. అధర్మ గెలిచినట్టు కనిపించినా చివరకు నెగ్గేది ధర్మమేనన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన టిడిపి సీనియర్‌ నేత గంగుల ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో జగన్‌ సమక్షంలో వైసీపీ లో చేరారు. ప్రభాకర్‌రెడ్డితోపాటు వైసీపీ లో చేరిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు కండువాలుకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా జగన్‌ విమర్శించారు.

08:55 - February 16, 2017

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతికి తరలివచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి కల నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాజధానికి ఇప్పటికే తరలివచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, భవిష్యత్‌లో అదనంగా వచ్చే వారి కోసం నివాస సముదాయాలు నిర్మించే వీలుగా భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో సిఆర్డీఏ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మొత్తం 5 కేటగిరీల్లో జీ+8 విధానంలో అపార్టుమెంట్లు నిర్మించేలా అధికారులు రూపొందించిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. మొదటి కేటగిరీలో జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆలిండియా సర్వీసు అధికారులను, రెండు, మూడు కేటగిరీల్లో గెజిటెడ్ అధికారులు, నాలుగో కేటగిరీ కింద నాన్ గెజిటెడ్ అధికారులు, ఐదో కేటగిరీలో క్లాస్-4 ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, డ్రైవర్లను చేర్చినట్టు వివరించారు. 2,900 చదరపు అడుగుల నుంచి 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ కేటగిరీల్లో ఫ్లాట్లు నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో 7రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ కొనసాగుతోందని,.ట్విన్ టవర్స్ నిర్మించడానికి డిజైన్లు సిద్ధం

ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని అమరావతిలో అభివృద్ధి...

ఇక నుంచి ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలను అనుకున్న సమయంలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎక్కడా రాజీపడకుండా రాజధాని నిర్మాణం సాగించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల నుంచి యువ ప్రతిభావంతులను నియమించుకోవడం ద్వారా కొత్త ఆలోచనలకు అవకాశం ఇవ్వాలన్నారు. సమీక్షలో మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, సీఎం అదనపు కార్యదర్శి రాజమౌళి, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారధి భాస్కర్, విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్, గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి కల

అమరావతి: ఏపీ రాజధాని అమరావతికి తరలివచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి కల నెరవేర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం ప్రకటించారు. అమరావతిలోని 139 ఎకరాల్లో 9,061 మంది ప్రభుత్వ ఉద్యోగులు, జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫ్లాట్లు నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నెలనెలా చిన్నచిన్న మొత్తాలను ఈఎంఐల రూపంలో చెల్లించేలా రుణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.

 

08:54 - February 16, 2017

హైదరాబాద్: తెలంగాణలోని వృద్ధులు, వితంతువులు, విక‌లాంగుల‌కు అందించే ఆస‌రా పించ‌న్ల పథకం కింద కొత్త ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం అందజేస్తున్న 35.73 లక్షల పింఛన్లకు అదనంగా మరో 25 వేల మందికి పించన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

6204 వృద్ధాప్య, 10 వేల మంది వితంతు....

ప్రభుత్వ తాజా నిర్ణయంతో వచ్చే నెల నుంచి 6204 వృద్ధాప్య, 10 వేల మంది వితంతు, 2998 మంది వికలాంగ, 335 మంది గీత కార్మిక, 156 మంది చేనేత, 2308 మంది హెచ్‌ఐవీ బాధితులకు అదనంగా పింఛన్లు ల‌భించ‌నున్నాయి.. అన్ని అర్హత‌లున్నా.. త‌మ‌కు పించను అంద‌డంలేదంటూ.. రాష్ట్ర వాప్తంగా ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. దీంతో గత ఏడాది నవంబరు, డిసెంబర్‌లో కొత్త వారికి అవ‌కాశం క‌ల్పిస్తూ దరఖాస్తులను ఆహ్వానిచింది స‌ర్కార్. దరఖాస్తుల పరిశీలన అనంతరం 25వేల మందిని అర్హులుగా గుర్తించింది. ప్రభుత్వం నిర్ణయంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

08:53 - February 16, 2017

హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం గులాబీపార్టీ వ్యూహాత్మకంగా వ్యహరిస్తోంది. పైకి చూస్తే అన్నీ అనుకూలంగానే ఉన్నా.. గత అనుభవాలతో గులాబీపార్టీ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

తమది ఎంప్లాయిస్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని...

తమది ఎంప్లాయిస్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని పదే పదే చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. మొదటినుంచి ఉద్యోగవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఉద్యోగవర్గాల్లో ఉన్న సానుకూల వాతావరణం తమకు లాభిస్తుందని భావిస్తున్న సీఎం కేసీఆర్‌ .. మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంకోసం మంత్రిహరీశ్‌ కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులతోపాటు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు బాధ్యతలకు అప్పగించారు. ప్రతి వందమంది ఓటర్లను డీల్‌ చేసేందుకు ఒక టిఆర్ ఎస్ నేతను ఇంచార్జ్ గా నియమించారు. పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా ఉపాధ్యాయులు నివాసం ఉంటుటుడంతో పట్టణప్రాంత నేతలను రంగంలోనికి దించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్..మూడు జిల్లాల్లో కలిపి దాదాపు 24 వేల మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనుండంతో .. గులాబీనేతలు ప్రతిఒక్క ఓటరుతో పర్సనల్‌గా మాట్లాడుతున్నారు.

తమ అభ్యర్థిని అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించక పోయినా..

మరోవైపు తమ అభ్యర్థిని అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించక పోయినా..సిట్టింగ్ శాసనమండలి సభ్యుడు జనార్ధన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలనే నిర్ణయం పార్టీ తీసుకున్నట్టు బహిరంగంగా అందరికీ తెలిసిపోయింది. దాంతో ఈనెల 18న ఆయన నామినేషన్‌ దాఖలుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం అధికారం పార్టీ వ్యూహం

p { margin-bottom: 0.21cm; }

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర సమితి ఉపాధ్యాయ ఎన్నికల్లో విజయం కోసం టిఆర్ ఎస్ పార్టీ పక్కా స్కెచ్ వేసింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో గతంలో చేదు అనుభవం మిగలడంతో.. ఇప్పుడు మంత్రి హరీష్ ఈ స్థానంలో విజయం కోసా పావులు కదుపుతోంది గులాబీపార్టీ.

08:51 - February 16, 2017

హైదరాబాద్: జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా.. తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏటా సముద్రం పాలవుతున్న నాలుగు వేల క్యూసెక్కుల కృష్ణా, గోదావరి జలాల సద్వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఏకే బజాజ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీకి వెల్లడించింది. వివాదాలు సృష్టించుకోవడం మంచిదికాదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు..

రెండు రాష్ట్రాల రైతులు ప్రయోజనాలే ముఖ్యం .....

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు వాంఛనీయం కాదన్న అభిప్రాయాన్ని కేసీఆర్‌ వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్‌ అన్నారు. కృష్ణాతో పోలిస్తే గోదావరిలో నీటి లభ్యత ఎక్కువని,ఈ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు తమ ప్రభుత్వం చేస్తున్నప్రయత్నాలను ఆయన కమిటీ దృష్టికి తెచ్చారు. ఏపీ ప్రభుత్వం కూడా గోదావరి జిలాలను దక్షిణ కోస్తాతోపాటు, రాయలసీమకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. నీటి పంపకాల్లో వివక్ష కారణంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అరవై ఏళ్ల గోసకు తెరదించుతూ గోదావరి జలాల్లో తమ వాటాను వాడుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నఅంశాన్ని ప్రస్తావించారు.

పులిచింతల, పోతిరెడ్డిపాడు ఏపీ అక్రమ నిర్మాణాలు.....

ఉమ్మడి ఏపీ పాలకులు అనుసరించిన వివక్షపూరిత విధానాలతో తెలంగాణకు నష్టం జరిగిందని బజాజ్‌ కమిటీకి వివరించారు కేసీఆర్‌. సాగర్‌ డిజైన్‌ మార్పు వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందన్న కేసీఆర్‌. బీమా ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల జాప్యానికి గత ఆంధ్రాపాలకులే కారణమని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే.. ఈ ప్రాజెక్టులకు మోక్షం లభించిందన్నారు. అయితే ఆంధ్రా పాలకులు అక్రమంగా పులిచింతల, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులను నిర్మించారని, తాజాగా ముచ్చుమర్రి ప్రాజెక్టునూ అక్రమంగా కడుతున్నారని బజాజ్‌ కమిటీ దృష్టికి తెచ్చారు.

కేవలం 25-50 టీఎంసీల నీటి కోసం తగవులు మంచిదికాదు ......

సుముద్రంలో కలుస్తున్న వేలాదీ టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవడాన్ని విడిచిపెట్టి, 25-50 టీఎంసీ నీటి కోసం తగవులాడుకోవడం మంచిది కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రంతో పాటే.. పొరుగు రాష్ట్రం హితాన్నీ కోరుతున్నామన్న కేసీఆర్‌.. వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణా, గోదావరి నదుల ప్రవాహాన్ని ఆపడం వల్ల దిగువ రాష్ట్రాలు ఎదుర్కొనే సమస్యలను బజాజ్‌ కమిటీ దృష్టికి తెచ్చారు. నీటి లభ్యత విషయంలో రాష్ట్రాలు వాడుకోవాల్సిన నీటిపై స్కీం-1, స్కీం-2 అమలు చేయాలని సూచించారు. మంచినీటికి ప్రాధాన్యత ఇస్తూ, అక్రమ ప్రాజెక్టులకు నీరు విడుదల చేయకుండా చూడాలని బజాజ్‌ కమిటీ దృష్టికి విజ్ఞప్తి చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కష్ణా బేసిన్‌కు తరలిస్తున్న దృష్ట్యా... కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను పెంచాలని కేసీఆర్‌ కోరారు.

2017-18 వార్షిక బడ్జెట్‌పై ఏపీ ఆర్థికశాఖ దృష్టి

అమరావతి :2017-18 వార్షిక బడ్జెట్‌పై ఏపీ ఆర్థికశాఖ దృష్టి2017-18 ఆర్థిక బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పలు శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు లైన్ క్లియర్ చేసే పనిలో నిమగ్నమైంది. అయితే ఆయా శాఖలు పంపిన ప్రతిపాదనలను చూసి ఆర్ధిక శాఖ అవాక్కైపోతుంది. వివిధ శాఖలు పంపిన ప్రతిపాదనల ప్రకారం బడ్జెట్ 2.30 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేస్తుంది.

07:03 - February 16, 2017

చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల పోరాటాలు ఉధృతమవుతున్నాయి. మొన్న కపిలతీర్థం నుంచి తిరుమల కొండవరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు వేలాది టిటిడి ఉద్యోగులు ప్రయత్నించారు. దాదాపు 150మంది టిటిడి కార్మికులు అరెస్టయ్యారు. గత నెల 9వ తేదీన కూడా టిటిడి కార్మికులు టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఇంటిని ముట్టడించారు. టిటిడి కార్మికులు ఇలా వరుసగా ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? వీరు టిటిడి పాకలమండలిని కోరుతున్నదేమిటి? టిటిడి పాలకమండలి స్పందన ఎలా వుంటోంది? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు సిఐటియు నాయకులు కందారపు మురళి తిరుపతిలోని 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ చర్చలో మీరు కూడా పాల్గొనవచ్చు.

 

07:01 - February 16, 2017

హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లో రికార్డ్‌ స్థాయిలో పోలింగ్‌ నమోదయ్యింది. పోలింగ్‌ ముగిసే సమయానికి 68 శాతం పోలింగ్ నమోదు కాగా.. తుది అంచనాల్లో ఇది 70 శాతానికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. హరిద్వార్‌ జిల్లాలో అత్యధికంగా 73 శాతం పోలింగ్‌ నమోదైంది. 13 జిల్లాల్లోని 69 అసెంబ్లీ స్థానాల కోసం ఎన్నికలు జరిగాయి. బరిలో ఉన్న 628 మంది అభ్యర్థులు భవితవ్యం ఇవియంలలో నిక్షిప్తమై ఉంది. 75 లక్షల మంది ఓటర్లుండగా....మహిళలు పెద్దఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ డెహ్రాడూన్‌లో ఓటు వేశారు. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా కర్ణప్రయాగ్‌ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. కాంగ్రెస్‌, బిజెపిల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Don't Miss