Activities calendar

17 February 2017

22:24 - February 17, 2017

ఖమ్మం : ప్రజల బతుకుల్లో మార్పు వచ్చినప్పుడే నిజమైన అభివృద్ధి అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్ర 124 రోజులు పూర్తి చేసుకుంది. తమ్మినేని బృందానికి అడుగడుగునా అపూర్వ స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ చదువుకున్న వారికి ఉద్యోగం రావాలని, పేద పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. టీఆర్ ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలు సంతోషంగా లేరని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయినా కేజీ టూ పీజీ అమలు కాలేదని ఎద్దేవా చేశారు. ఖమ్మం టౌన్ లో 5 వేల మందికి ఇళ్ల స్థలాలు చూపించలేదన్నారు. 

 

22:12 - February 17, 2017
22:06 - February 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారుస్తున్నారని... పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు... అప్పుల కోసమే ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.. ఇలా రుణాలు తీసుకుంటూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.. 

 

22:04 - February 17, 2017

నెల్లూరు : జీజీహెచ్‌లో విధులకు డుమ్మా కొట్టి ప్రైవేటు క్లీనిక్‌ నడుపుతున్న ఆరుగురు డాక్టర్లను మంత్రి కామినేని సస్పెండ్‌ చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆయన.. విధులకు హజరుకాకుండా ప్రైవేటు ప్రాక్టీస్‌ చేస్తున్న డాక్టర్లపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు ప్రైవేటు హస్పటల్స్‌ ఉంటే రాజీనామా చేయాలని కామినేని అన్నారు. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యుల చిట్టా తన వద్ద ఉందని మంత్రి తెలిపారు. 

 

21:50 - February 17, 2017

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఘాజీ సినిమా ఇవాళా విడుదలైంది. ఈ చిత్రాన్ని మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్ మరియు పీవీపీ సంస్థలు నిర్మించాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:43 - February 17, 2017

ఃఅప్పులు అరవై.. గొప్పలు నూటిరవై... బంగారు తెలంగాణల బరువైన పైకం, నిరుద్యోగుల ర్యాలీకి కదులుతున్న యూత్.. అన్ని జిల్లాలల్ల అంటుకున్న మంటలు, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు...బ్యాటరీ కారెక్కిన తిరిగిన యువరాజు, ముంగటికెళ్లిచ్చి..ఎనుకటికెళ్లి తీసుకునుడు.. సర్కారు ఉద్యోగాలతోటి ప్రభుత్వం ఆట, సిరిసిల్ల కాడ సీతువలైతున్న పోలీసొల్లు.. పోరని చెయ్యిఇరగొట్టిన కాఖీ బలుపు, బంగ్లాలకు జొర్రిన చిరుత పులి.. ఇంట్లున జనానికి పుట్టింది సలి.... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:59 - February 17, 2017

తమిళనాడు : స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశం జరిగింది. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ కూడా పళనికి వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం ఉందని స్టాలిన్ అన్నారు. అసెంబ్లీలో విపక్షాల బలం డీఎంకే సభ్యులు 89, కాంగ్రెస్ సభ్యులు 8, ఇతరులు 1 గా ఉన్నాయి. విపక్షాల బలం 108కి చేరింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:13 - February 17, 2017

వరంగల్‌ : కాంట్రాక్ట్‌ లెక్చరర్ల నిరవధిక సమ్మె నాలుగోరోజుకు చేరింది.. ఇవాళ వంటావార్పు చేసి లెక్చరర్లు నిరసన వ్యక్తం చేశారు.. ప్రభుత్వంనుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకూ సమ్మె విరమించబోమని స్పష్టం చేస్తున్నారు.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:11 - February 17, 2017

నెల్లూరు : 20 ఏళ్లుగా ఒకే జిల్లాలో పాతుకుపోయారు...వివిధ హోదాల్లో పనిచేశారు...పదోన్నతులు వచ్చినకొద్దీ అధికారం పెరిగింది..అందులో ధనదాహం కూడా...సింహపురిలో ఉన్నతాధికారిగా ఉంటూ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన రాంరెడ్డి అక్రమ సంపాదన బయపడింది...ఏసీబీ తవ్వినకొద్దీ బయటపడుతున్న వాటిని చూసి కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. అధికారాన్ని అడ్డుపెట్టుకున్నాడు..తనకున్న పరిచయాలను క్యాష్ చేసుకున్నాడు...ఎక్కడ పనిచేసినా అక్కడ దొరికింది దోచేశాడు...ఒకటి కాదు..రెండు కాదు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడు ఆఫీసర్....అధికారి అవినీతిపై నజర్ పెట్టిన ఏసీబీ ఒక్కసారిగా దాడులు నిర్వహించింది..అయితే ఏసీబీ ఊహించినదాని కంటే ఎక్కువనే ఆస్తులు బయటపడ్డంతో షాక్‌ తినడం ఆఫీసర్ల వంతు అయింది...ఆ ఆఫీసర్ ఎవరో కాదు..సింహపురిలో జిల్లా పరిషత్‌ సీఇఓ, నగరపాలక సంస్థ ఇన్‌చార్జిగా ఉన్న రామిరెడ్డి...
హైదరాబాద్‌లోనూ భారీగా ఆస్తులు...
నెల్లూరు జిల్లాలో సుదీర్ఘం కాలం పని చేస్తున్న జిల్లా పరిషత్‌ సీఈవో, నగర పాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్‌ బి.రామిరెడ్డి నివాసాల పై ఏసీబీ దాడులు నిర్వహించింది...నాలుగు ప్రాంతాలలో ఏక కాలంలో 14 చోట్ల రామిరెడ్డి ఆస్తుల పై ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి రామిరెడ్డి ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు, కొందరు అనుచరులు, మరికొందరు బినామీల ఇళ్లల్లో హైదరాబాద్‌, గుంటూరు, నెల్లూరు, తిరుపతి పట్టణాలలోని 14 చోట్ల ఈ దాడులు చేపట్టారు.
పదోన్నతులతో పాటే పెరిగిన ఆదాయం..
నెల్లూరు జిల్లాలో తాహసీల్దారు నుంచి ఆర్డీవో, డీఆర్వో, జడ్పీ సీఈవో వరకు 20 ఏళ్లకు పైగా రామిరెడ్డి వివిధ హోదాలలో పని చేశారు...ప్రస్తుతం ఉన్నతాధికారిగా పనిచేస్తున్న రామిరెడ్డిపై వచ్చిన ఆరోపణలతో ఏసీబీ రంగంలోకి దిగింది...నగరంలోని చిల్డడ్రన్స్‌ పార్కు, బి.వి.నగర్‌, మాగుంట లేఅవుట్‌, సరస్వతీ నగర్‌ ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది. ఆయనతో పాటు ఒకరిద్దరు ఉపాధ్యాయులు, అదే శాఖలో పనిచేసే మరో దిగువ స్థాయి ఉద్యోగి ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ భారీగా అక్రమాస్తులున్నట్లు గుర్తించింది. 
ఇప్పటికే బయటపడ్డ మూడు కోట్ల ఆస్తులు..
నెల్లూరు, గుంటూరు, తిరుపతి పట్టణాలలో రామిరెడ్డి, ఆయన అనుయాయుల పేరుతో ప్లాట్లు, స్థలాలు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నట్లు గుర్తించింది. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కు వద్ద రామిరెడ్డి ఉన్న డూప్లేక్స్‌ ఇళ్లు అందులో పలు కీలక రికార్డులు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు...రామిరెడ్డి నివాసాల పై చేసిన తనిఖీలలో ఇప్పటి వరకు రెండున్నర కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించామని బహిరంగ మార్కెట్‌లో దీని విలువ పదిరెట్లు వుంటుందని అధికారులు చెబుతున్నారు..బ్యాంకు లాకర్లను ఓపెన్‌ చేయాల్సి వుంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన రామిరెడ్డి లాంటి అధికారులు ఎందరో తమ అధికారాన్ని అడ్డుపెట్టుకున్నవారే..వారికి కొందరు రాజకీయుల సహకారం ఉండడంతో తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు దోచేశారు...
హైదరాబాద్‌లో కూడా ఆస్తులు 
నెల్లూరు జడ్పీ సీఇఓ రాంరెడ్డి ఆస్తులు హైదరాబాద్‌లో కూడా ఉన్నాయి...వీటిని గుర్తించిన ఏసీబీ అధికారులు తెలంగాణా ఏసీబీకి సమాచారం అందించారు..వెంటనే హైదరాబాద్‌ టీం కూకట్‌పల్లిలో సోదాలు చేసింది.. ఈ దాడుల్లో నెల్లూరు,కావలి ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లు దొరికాయి...
హైదరాబాద్‌ లోనూ దాడులు 
నెల్లూరు జిల్లా పరిషత్‌ సీఇఓ రాంరెడ్డి అక్రమాస్తులపై హైదరాబాద్‌ నగరంలోనూ దాడులు జరిగాయి...ఈ తనిఖీల్లో ఎన్నో ఆస్తులు బయటపడ్డాయి.. ఇంకా కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు..దాదాపు 5 గంటలపాటు కొనసాగిన దాడుల్లో రాంరెడ్డి ఆస్తులను బయటకు తీశారు...
కూకట్‌పల్లిలో దాడులు..
ఏసీబీ దాడులు 
కూకట్‌పల్లిలోని ఆఫీసర్ రాంరెడ్డికి చెందిన ఇంట్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ ఖాదర్‌బాషా బృందం దాడులు చేసింది... ఆ ఇంట్లో సోదాలు చేయగా నెల్లూరు, కావలి ప్రాంతాల్లోని ఇంటి స్థలాల డాక్యుమెంట్లు దొరికాయి..దాదాపు ఐదు స్థలాల విలువ మార్కెట్లో లక్షల్లోనే ఉంటుందని అంచనా... ఇంకా ఎక్కడైనా ఆస్తులున్నాయా..? బ్యాంకు లాకర్లున్నాయన్నదానిపై ఏసీబీ శోధిస్తుంది.

 

19:54 - February 17, 2017

చెన్నై : తమిళనాడులో అటు అన్నాడీఎంకే, ఇటు పన్నీరు సెల్వం వర్గం ఇద్దరూ అమ్మ వారసత్వంపై పోరాటం చేస్తూ..తమిళనాడు రాజకీయాల్ని రక్తి కట్టిస్తున్నారు. శశికళ, సీఎం పళనిస్వామి సహా నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 30 మంది మంత్రులపై పన్నీరు సెల్వం వర్గం పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేసింది. వీరే కాకుండా దినకరన్‌, ఎస్‌ వెంకటేశ్‌లను కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మధుసూదనన్‌ తెలిపారు.  అయితే సీఎం పళనిస్వామి వర్గం నుంచి తాజాగా 17 మంది ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వానికి మద్దతు తెలుపుతున్నామని ప్రకటించడంతో తమిళ రాజకీయాలు మరింత హీటెక్కాయి. రేపే శాసనసభలో బలపరీక్ష ఉండడంతో..ఈ 24 గంటల్లో ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. బల పరీక్ష సందర్భంగా పన్నీరు సెల్వం తాజాగా అసెంబ్లీ స్పీకర్‌తో భేటీ అయ్యారు. రహస్య ఓటింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌ను కోరారు. ఇక శనివారమే బలపరీక్ష ఉండటంతో అన్నాడీఎంకే సభ్యులకు ఆ పార్టీ విప్‌ జారీ చేసింది.  అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పాటు పళనిస్వామికి కూడా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ రాజేంద్రన్‌ విప్‌ జారీ చేశారు.మరోవైపు పన్నీర్‌ వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి.. రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.  మరోవైపు రేపు బలపరీక్ష సందర్భంగా తటస్థంగా ఉండాలని డీఎంకే నిర్ణయించింది. 

 

19:36 - February 17, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని టీజాక్ ఛైర్మన్‌ కోదండరాం కోరారు. ప్రభుత్వ రంగ సంస్ధలో 50వేల వరకు ఖాళీలు ఉన్నాయన్న ఆయన.. కేవలం ఎలక్ట్రిక్‌, సింగరేణిలో మాత్రమే భర్తీ చేస్తే సరిపోదన్నారు. 13 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కోదండరాం అన్నారు. ఇప్పటి వరకు 5వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారని కోదండరాం చెప్పారు. 

19:19 - February 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు 63వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ సందర్భంగా.. టీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రక్త దానం, అన్నదానంతోపాటు  పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని వివిధ సభల్లో వక్తలు ప్రస్తుతించారు. 
కేసీఆర్‌ ఛాయా చిత్రాల ప్రదర్శన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ కూతురు కవిత, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం కేసీఆర్‌ ఛాయా చిత్రాల ప్రదర్శనను కవిత ప్రారంభించారు. తెలంగాణ జాతి పునర్నిర్మాణానికి అందరూ పునరంకితం కావాలని ఆమె పిలుపునిచ్చారు. 
ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్‌ బర్త్‌ డే విషెస్‌ 
కేసీఆర్‌కు ఆయన కుమారుడు కేటీఆర్‌..  ట్విట్టర్‌ ద్వారా బర్త్‌ డే విషెస్‌ తెలిపారు.  తెలంగాణ జన్మనిచ్చిన అతిగొప్ప కుమారుడు కేసీఆర్‌ అని, ఆయన కుమారుడిగా పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నానంటూ పోస్ట్‌ చేశారు.
ప్రగతి భవన్‌లోనూ బర్త్‌డే వేడుకలు 
ప్రగతి భవన్‌లోనూ కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో జరిగిన వేడుకలకు మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. బర్త్‌డే కేక్‌ కట్‌చేసి స్వీట్లు పంచారు.  అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఇక  పెద్దమ్మ గుడిలో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓయూలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆధ్వర్యంలో విద్యార్దులు 2కే రన్‌ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సినీ నిర్మాత సి. కల్యాణ్‌ పాల్గొన్నారు. రాజేంద్రనగర్‌, మల్కాజ్‌గిరి, మలక్‌పేటతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలను టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. 
చైనాలోనూ కేసీఆర్ బర్త్ డే వేడుకలు
కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు చైనాలోనూ ఘనంగా నిర్వహించారు. చైనా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌ కేక్‌ కట్‌ చేశారు. ఇక ఢిల్లీలోనూ కేసీఆర్‌ జన్మదిన వేడుకలు జరిగాయి. అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం.. గుంటూరు జిల్లా తెనాలిలోనూ కేసీఆర్‌ బర్త్‌డే సంబరాలు జరిగాయి. కేసీఆర్‌ అభిమాన సంఘం ఆధ్వర్యంలో కొంతమంది యువకులు  శబరి వృద్ధాశ్రమంలో కేక్‌ కట్‌ చేశారు. వృద్ధులకు అన్నదానం చేశారు. కేసీఆర్‌ క్షేమంగా ఉండాలని... ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు..

 

విశాఖ గోశ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

విశాఖ : గోశ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 

 

స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశం

చెన్నై : స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశం జరుగుతోంది. రేపు అసెంబ్లీలో బల నిరూపణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. 

అంజనాపురం వద్ద రోడ్డు ల్యాండ్ మైన్ గుర్తింపు

భద్రాద్రి : అంజనాపురం వద్ద రోడ్డు ల్యాండ్ మైన్ గుర్తించారు. మావోయిస్టులు అమర్చిన 5 కిలోల ల్యాండ్ మైన్ ను పోలీసులు తొలగించారు.

 

రాజధానిలో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ఏర్పాటు...

అమరావతి : రాజధానిలో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని గ్రంథాలయాల శాఖ డైరెక్టర్ పార్వతి అన్నారు.
గ్రంథాలయాల్లో కొత్త పుస్తకాల కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక మెటీరియళ్లు ఏర్పాటు చేస్తామన్నారు.

 

టీఎస్ కానిస్టేబుళ్ల నియామకం తుది ఫలితాలు విడుదల

హైదరాబాద్ : టీఎస్ కానిస్టేబుళ్ల నియామకం తుది ఫలితాలు విడుదలయ్యాయి. డబ్ల్యుబ్ల్యు.టీఎస్ పీఆర్ బీ.ఇన్ వెబ్ సైట్ లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను పొందుపరిచారు. కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు మొత్తం 10,446 మంది ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో 1,130 మంది మహిళలు ఉన్నారు. 

18:17 - February 17, 2017

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న మేముల రోహిత్‌ దళితుడు కాదంటూ ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఇవ్వడాన్ని మేధావులు తప్పుపడుతున్నారు. రోహిత ఎస్సీ అని ధృవీకరిస్తూ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన తర్వాత దళితుడుకాదని నిర్ధరించడం వెనుక  పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. కులవిక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరుకార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే రోహిత్‌ను బీసీగా ప్రకటించారని వివిధ సంఘాల నేతలు విమర్శించారు. 

18:15 - February 17, 2017

సంగారెడ్డి : జిల్లాలోని గండ్లమాచనూరులో సైరెక్స్‌ కంపెనీ కాలుష్యంపై స్థానికులు తీవ్రస్థాయిలో స్పందించారు. కంపెనీ విస్తరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణలో తమ అభిప్రాయాలను సూటిగా చెప్పారు. ప్రజల ప్రాణాలు తీస్తూ ధనార్జనే ధ్యేయంగా పరిశ్రమల యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రజల తరపున కాకుండా పరిశ్రమల తరపున కాలుష్య నియంత్రణ అధికారులు పనిచేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అభిప్రాయ సేకరణ జరుగుతుండగానే గ్రామస్తులు పరిశ్రమల విస్తరణకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగించారు. పరిశ్రమల కాలుష్యంవల్ల ఇక్కడి అబ్బాయిలతో పెళ్లికి అమ్మాయిలు ముందుకు రావడంలేదని ఆరోపించారు.

 

18:12 - February 17, 2017

హైదరాబాద్‌ : నగరంలో ఇద్దరు ఎస్సైలపై వేటు పడింది. పోలీస్టేషన్‌లోని మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వనస్థలిపురం ఎస్సైలను సీపీ సస్పెండ్‌ చేశారు. ఎస్సై విజయ్‌, మహేష్‌లను సస్పెండ్‌ చేస్తూ రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేత్‌ భగవత్‌ ఆదేశాలు జారీ చేశారు. 

 

18:02 - February 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. జర్నలిస్టు నిధికి ఇప్పటి వరకు రూ. 20 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. జర్నలిస్టు నిధికి మరో రూ. 30 కోట్ల నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామన్నారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన 'జన హిత దర్భార్' కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. మరణించిన జర్నలిస్టుల అమ్మాయిల పెళ్లిళ్లకు రూ.3 లక్షల ఆర్ధికసాయం రేపే మంజూరు చేస్తామన్నారు. గురుకుల పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఏవైనా సమస్యలుంటే ప్రెస్ అకాడమీ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చే బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.30 కోట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఖచ్చితంగా పీఎఫ్, ఈఎస్ ఐ కల్పించాలన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే భావనతో ఓ కార్యక్రమం చేయాలనుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రెస్ అకాడమీ చేపట్టడం అభినందనీయమన్నారు. జనహితం కార్యక్రమంలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ అందచేశారు. జర్నలిస్టులకు ఏ ఇబ్బందులున్నా ఆదుకొనేందుకు ముందుంటామన్నారు. పేద జర్నలిస్టు కుటుంబాలను ఆదుకొనే బాధ్యత తమదేనన్నారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఏ జిల్లా వారికి ఆ జిల్లాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే విధంగా చేసే కార్యక్రమాలను జర్నలిస్టులు ప్రచారం చేయాలని సూచించారు.

 

కానిస్టేబుళ్ల నియామకం తుది ఫలితాలు..

హైదరాబాద్ : కానిస్టేబుళ్ల నియామకం తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల వివరాలు www.tslprb.in వెబ్ సైట్ లో లభ్యం కానున్నాయి. కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు మొత్తం 10,446 మంది ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో 1,130 మంది మహిళలున్నారు.

17:00 - February 17, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగున్న ఎన్నికకు టీఎస్ యూటీఎఫ్ అభ్యర్ధిగా పాపన్నగారి మాణిక్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో మాణిక్‌రెడ్డి నామినేషన్‌ పత్రాలు అందచేశారు. నామినేషన్‌ వేయడానికి ముందు యూటీఎఫ్ కార్యాలయం నుంచి జీహెచ్ ఎంసీ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, ప్రొఫెసర్‌ నాగేశర్వర్‌, యూటీఎఫ్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైతే విద్యారంగం అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తానని మాణిక్‌రెడ్డి హామీ ఇచ్చారు. 

 

16:56 - February 17, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలివచ్చిన ఉద్యోగుల కల నెరవేరబోతోంది. ఉద్యోగులతో పాటు అధికారులు, జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం సొంత ఇళ్లను మంజూరు చేయనుంది. ఇందుకు సంబంధించిన భూ కేటాయింపులపై సీఆర్డీఏ అధికారులకు సూచనలు కూడా చేసింది. 
ఉద్యోగులపై చంద్రబాబు వరాల జల్లు 
ఏపీ రాజధాని అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఉద్యోగులకు అమరావతి ప్రాంతంలో సొంత ఇళ్లు కట్టించనున్నారు. ఉద్యోగులతో పాటు అధికారులు, జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్లాట్లు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం తగిన స్థలం నిర్ణయించాలని సీఆర్డీఏ అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
తక్కువ వ్యయం, ఎక్కువ నాణ్యతతో నిర్మాణం 
ప్రభుత్వం నిర్మించనున్న ఈ గృహ సముదాయాలను అత్యంత తక్కువ వ్యయం, ఎక్కువ నాణ్యతతో నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు.   మొత్తం ఐదు కేటగిరిల్లో జి ప్లస్ 8 విధానంలో అపార్టుమెంట్లు నిర్మించనున్నారు. మొదటి కేటగిరిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జిలు, ఆల్ ఇండియా సర్వీసస్ అధికారులు, రెండు, మూడు కేటగిరిల్లో గెజిటెడ్ అధికారులు, నాలుగవ కేటగిరిలో నాన్ గజిటెడ్ అధికారులు, ఐదవ కేటగిరిలో క్లాస్ ఫోర్ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, డ్రైవర్లకు కేటాయించే విధంగా ప్రతిపాదనలు తయారు చేశారు.  
ఉద్యోగులు పూర్తి స్థాయిలో సంతృప్తి
దీనిపై ఉద్యోగులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయటంలేదు. తమకు సొంత ఇళ్లు నిర్మాంచే వ్యవహారంపై ఇంతవరకు తమతో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చర్చించలేదని ఉద్యోగసంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లు కాకుండా.. ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని కోరుతున్నారు.  ఇప్పటికే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు.. అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా నివాస స్థలం కల్సించాలని ఎన్జీవో నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. 
మళ్లీ లబ్ధి పొందే వారిపై విమర్శలు 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌లోనూ ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో స్థలాలు తీసుకుని లబ్ధి పొందారని.. అలాంటి వారు మళ్లీ అమరావతిలోనూ లబ్ధి పొందే అంశంపై విమర్శలు వస్తుడడంతో దీనిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.

 

'మధుసూధన్ కు తొలగించే అధికారం లేదు'..

చెన్నై : పార్టీ నిబంధనల ప్రకారం శశికళను తొలగించే అధికారం మదుసూధన్ కు లేదని రాష్ట్ర మంత్రి సెంగొట్టయ్యన్ పేర్కొన్నారు. బలపరీక్ష కోసం లీడర్ ఆఫ్ ది హౌస్ గా ఆయన నియమితులైన సంగతి తెలిసిందే.

వెస్ట్ బెంగాల్ లో నకిలీ రూ.2000 వేల నోట్లు..

పశ్చిమ బెంగాల్ : మాల్దా ప్రాంతంలో నకిలీ రూ. 2000 వేల నోట్లను బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల విలువ రూ. 2 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.

16:30 - February 17, 2017

ఢిల్లీ : వాతావరణంలో వస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణం ప్రారంభించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 8 వరకు దేశవ్యాప్తంగా ఈ రైలు ప్రయాణం కొనసాగిస్తుంది.  తెలుగు రాష్ట్రల ప్రజలు కూడా ఈ రైలులోని అంశాలను తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. 

16:18 - February 17, 2017

కృష్ణా : జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామలోని భాస్కర్‌ వాచ్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగి లక్షల విలువ చేసే ఎలక్ట్రానికి గూడ్స్‌ దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. 

 

జర్నలిస్టు నిధికి రూ. 30 కోట్లు - కేసీఆర్..

హైదరాబాద్ : జర్నలిస్టు నిధికి రూ. 30 కోట్ల నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించడం జరుగుతుందని ఇప్పటి వరకు రూ. 20 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే విధంగా చేసే కార్యక్రమాలను జర్నలిస్టులు ప్రచారం చేయాలని సూచించారు.

ప్రగతి భవన్ లో జనహిత దర్బార్..

హైదరాబాద్ : తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే భావనతో ఓ కార్యక్రమం చేయాలని భావించడం జరిగిందని, ఇంత మంచి కార్యక్రమం ప్రెస్ అకాడమీ చేపట్టడం అభినందనీయమన్నారు. జనహితం కార్యక్రమంలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చనిపోయిన జర్నలిస్టు అమ్మాయిల పెళ్లిళ్లకు రూ. 3లక్షల సాయం అందించడం జరుగుతుందని, జర్నలిస్టులకు ఏ ఇబ్బందులున్నా ఆదుకొనేందుకు ముందుంటామన్నారు. పేద జర్నలిస్టు కుటుంబాలను ఆదుకొనే బాధ్యత తమదేనన్నారు.

కాసేపట్లో డీఎంకే ఎమ్మెల్యేల సమావేశం..

హైదరాబాద్ : డీఎంకే ఎమ్మెల్యేల సమావేశం కాసేపట్లో జరగనుంది. రేపు ప్రభుత్వం బలపరీక్ష నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

'తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన నేత కేసీఆర్’..

హైదరాబాద్ : తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన నేత కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను ఇక్కడ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోటి ఎకరాలకు నీళ్లు అందించడమే కేసీఆర్ లక్ష్యమన్నారు.

లీడర్ ఆఫ్ ది హౌస్ గా సెంగొట్టయ్యన్..

చెన్నై : బలపరీక్ష కోసం లీడర్ ఆఫ్ ది హౌస్ గా సెంగొట్టయ్యన్ నియమితులయ్యారు. శనివారం పళనిస్వామి బలపరీక్ష ఎదుర్కొననున్న సంగతి తెలిసిందే.

15:56 - February 17, 2017

దక్షిణకొరియా : ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ శాంసంగ్‌ గ్రూప్‌ చీఫ్‌ జె.వై. లీని దక్షిణకొరియాలో అరెస్ట్‌ చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో లీని దక్షిణ కొరియా పోలీసులు అరెస్ట్‌ చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షునికి 38 మిలియన్‌ డాలర్ల లంచం ఇవ్వజూపేందుకు ప్రయత్నించారని లీపై ఆరోపణలున్నాయి. రెండు కంపెనీల వివాదానికి సంబంధించి దేశ అధ్యక్షుడి మద్దతు కోసం శాంసంగ్‌ చీఫ్‌  లంచాన్ని ఎరగా చూపారు. ఈ  అవినీతి ఆరోపణలు దక్షిణ కొరియాను కుదిపేయడంతో ఆ దేశ అధ్యక్షుడు మహాభియోగాన్ని కూడా ఎదుర్కొన్నారు. దీనిపై తాము కోర్టులోనే తేల్చుకుంటామని శాంసంగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. లీ అరెస్ట్‌తో శాంసంగ్‌ షేర్లు పడిపోయాయి. 

కీచక ఎస్ఐలపై వేటు..

హైదరాబాద్ : ఇద్దరు కీచక ఎస్ఐలపై వేటు పడింది. మహిళా కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తించిన వనస్థలిపురం ఎస్ఐ లు విజయ్, మహేష్ లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు.

జమ్మూలో పాక్ జెండా ప్రదర్శన..

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ లోని జామా మసీద్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పాక్ జెండాను ప్రదర్శించారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పర్యటనను నిరసిస్తూ వారు రాళ్లు రువ్వారు.

వాద్రాలో ఎన్నికల ప్రచారంలో ప్రియాంక..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. వాద్రాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు.

ప్రగతి భవన్ లో జనహిత కార్యక్రమం..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రగతి భవన్ లో జనహిత కార్యక్రమం నిర్వహించారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబ సభ్యులతో కేసీఆర్ సమావేశమయ్యారు. 84 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున చెక్కులను కేసీఆర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయినీ, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు.

స్పీకర్ ను కలిసిన పళనిస్వామి..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర స్పీకర్ ను పళని స్వామి కలిశారు. రేపు బలపరీక్షను ఎదుర్కొననున్న సంగతి తెలిసిందే. దీనితో శుక్రవారం స్పీకర్ ను కలిసిన పళనిస్వామి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని కోరారు. మరో వైపు శశికళ, సీఎం పళనిస్వామి, 30 మంది మంత్రులు, దినకరన్, వెంకటేష్ లను పార్టీ నుండి మధుసూధన్ సస్పెండ్ చేశారు.

14:56 - February 17, 2017

చుండ్రు...ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతుంటారు. ఎవో షాంపులు వాడుతూ జుట్టు సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చుండ్రు సమస్య దూరమయ్యే అవకాశం ఉంది. కొన్ని చిట్కాలు..

 • ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెకు 5-10 చుక్కల ట్రీ ఆయిల్ కలపాలి. అనంతరం దీనిని మాడుకు పట్టించాలి.
 • నిమ్మరసం మాడుకు పట్టించి ఒక నిమిషం అనంతరం స్నానం చేయాలి. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకోవాలి.
 • ముందుగా షాంపు..తక్కువ గాఢతో ఉన్న షాంపూను సెలక్ట్ చేసుకోవాలి. కండీషనర్ రాసుకొనే అలవాటు ఉంటే మాడకు అంటకుండా రాసుకొంటె బెటర్.
 • కొంత వేపాకు తీసుకుని 4-5 కప్పుల వేడి నీటిలో వేయాలి. ఇలా రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటితో తలను కడిగేసుకోవాలి.
 • వేపాకు పేస్టును తలకు పట్టించినా చుండ్రు సమస్య తగ్గుతుంది.
 • పెరుగును తలకు పట్టించాలి. ఓ గంట పాటు అలాగే ఉండాలి. అనంతరం గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కడుక్కోవాలి. ఫలితంగా చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది.

పాదయాత్రతో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి - తమ్మినేని...

ఖమ్మం : సీపీఎం మహాజన పాదయాత్రతో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీపీఎంకు తెలంగాణలో పూర్వవైభవం వస్తుందని, కేసీఆర్ ఈ పాదయాత్రను అడ్డుకోవాలని చెబితే ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. సీపీఎంను వీడిన వారు అధికార పార్టీల్లో గౌరవం దక్కక అవమానపాలవుతున్నారని విమర్శించారు.

14:44 - February 17, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' నటిస్తున్న 'డీజే'..’దువ్వాడ జగన్నాథం' చిత్ర ఫస్ట్ పోస్టర్ రేపు విడుదల కానుంది. ఇందుకు సోషల్ మాధ్యమాల్లో 'అల్లు అర్జున్' ఇప్పటికే ప్రచారం చేపట్టిన సంగతి తెలిసిందే. త్వరలో..టూ డేస్..వన్ డే..అంటూ వివిధ పోస్టర్ లను విడుదల చేస్తున్నారు. ఈచిత్రంలో బన్నీకి సంబంధించిన లుక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవలే ఓ ఫొటో బయటకు రావడం..వెంటనే దానిని డిలీట్ చేయించారు. కానీ తాజాగా ఓ ఫొటో సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ‘డీజే'..సినిమాలో 'అల్లు అర్జున్' బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వెలువడ్డాయి. దీనికి సంబంధించిన ఓ ఫోటో లీక్ అయ్యింది. ఇందులో బన్నీ బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. 'సరైనోడు' వంటి కమర్షియల్ మాస్ హిట్ తరువాత 'బన్నీ’, 'హరీష్ శంకర్' దర్శకత్వంలో 'దువ్వాడ జగన్నాథం (డీజే)' సినిమా రూపొందుతోంది. శనివారం విడుదలయ్యే ఫొటోలో బన్నీ ఎలా కనిపించనున్నాడో..ఈ ఫొటో అందులోదేనా అనేది తెలియనుంది.

కేసీఆర్ అబద్దాల కోరు - టి.కాంగ్రెస్..

హైదరాబాద్ : గిరిజన రణ శంఖారావం క్యాలెండర్ ను ఎమ్మెల్సీ షబ్బీర్, ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఏప్రిల్ 23న హైదరాబాద్ లో గిరిజన రణ శంఖారావ సభ జరుగుతుందని పేర్కొన్నారు. తండాలను పంచాయతీలుగా చేస్తానన్న హామీ ఏమైందని, కేసీఆర్ అబద్దాల కోరు అని..గిరిజనులకు మోసం చేస్తున్నారని వారు విమర్శించారు. ఇప్పటి వరకు గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయలేదని, కేసీఆర్ ప్రభుత్వానికి గిరిజనుల ఉసురు తగులుతుందన్నారు.

ఆటోనగర్ లో టెక్ పార్కు ప్రారంభం..

విజయవాడ : ఆటోనగర్ లో టెక్ పార్క్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. భవిష్యత్ లో విజయవాడను సైబర్ వాడగా మారుస్తానని, భవిష్యత్ లో మరిన్ని కంపెనీలు వస్తాయన్నారు.

 

జీహెచ్ఎంసీలో నిలిచిన కాల్ సెంటర్ సేవలు..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో కాల్ సెంటర్ సేవలు నిలిచిపోయాయి. నిన్న రాత్రి నుండి కాల్ సెంటర్ సర్వర్ పనిచేయలేదు. ఐటీ విభాగం అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

టి.పోలీసుల కొలువుల పోస్టులు..

హైదరాబాద్ : తెలంగాణలో పోలీసుల కొలువుల భర్తీకి ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. 2వేల పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏఆర్ కానిస్టేబుళ్లు 1055, సివిల్ పోలీసు 255, సైబరాబాద్ లో 599 పోస్టులు, వరంగల్ లో 93 పోస్టుల భర్తీకి అనుమతినించింది.

కోమటిరెడ్డికి తప్పిన ప్రమాదం..

యాదాద్రి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. పోచంపల్లి మండలం కొత్తగూడెం వద్ద కోమటిరెడ్డి కారును ట్రాక్టర్ ఢీకొంది. వెనుకభాగంగా స్వల్పంగా కారు దెబ్బతింది. 

13:31 - February 17, 2017

హైదరాబాద్: బెంగళూరులో కాలుష్య తీవ్రత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. బెల్లందూరు చెరువులో రసాయన వ్యర్థాల కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం చెలరేగిన మంటలు అంతకంతకు ఎగసిపడుతున్నాయి. దీంతో సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో రహదారులు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చెరువులో భారీ స్థాయిలో రసాయనాలు కలవడంతో నీటిలో ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

13:29 - February 17, 2017

ఖమ్మం: కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని కేసీఆర్‌ సర్కార్‌ అటకెక్కించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పేద పిల్లలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యపట్ల కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. పేదల జీవితాలలో వెలుగొచ్చినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా తమ్మినేని ఆధ్వర్యంలో సాగుతున్న పాదయాత్ర 124వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఖమ్మం జిల్లాలోని జగన్నాథపురంలో ప్రారంభమైన యాత్ర.. పందిళ్లపల్లి, గాంధీనగర్‌, ధంసలాపురం, అగ్రహారం, ముస్తఫానగర్‌ మీదుగా ఖమ్మం చేరుకుంటుంది. పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలుకుతున్నారు. పల్లెపల్లెనా పూలమాలలతో తమ్మినేని బృందానికి ఘనస్వాగతం తెలుపుతున్నారు. మహిళలు బతుకమ్మలతో ఆహ్వానం పలికారు. చిన్నారుల నృత్యాలు, మహిళల కోలాటం ఆకట్టుకుంది.

13:23 - February 17, 2017

చెన్నై: తమిళరాజకీయాలు గంట గంటకు మారిపోతున్నాయి. క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. అన్నాడీఎంకే పీఠం ఎవరికి దక్కుతుందన్నది. ఇదే అంశంపై సోషల్ మీడియాలో వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. మొత్తాన్ని అనిశ్చితంగా హైటెన్షన్ రాజకీయం నడుస్తోంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

13:22 - February 17, 2017

స్టార్ హీరోల ఫామిలీ నుండి హీరో లు వారసులుగా రావడం చాల కామన్ పాయింట్. కానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ స్టార్ ఫామిలీ హీరోయిన్. ఇక్కడి వరకు ఒకే అసలే తెలుగు ఇండస్ట్రీ లో తెలుగు హీరోయిన్స్ రావట్లేదు అనుకుంటున్నా ఈ టైం లో తమిళ్ సినిమా రంగంలోకి వెళ్తా అంటుంది ఈ స్టార్ ఫామిలీ హీరోయిన్. తెలుగు తెలిసిన అమ్మాయిలు హీరోయిన్స్ గా రావట్లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా టైం లో మెగా మోనాలిసాలా మెరిసింది ఈ ముద్దపప్పు అమ్మాయి. 'ఆవకాయ ముద్దపప్పు' అనే వెబ్ సిరీస్ తో యూట్యూబ్ ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ దగ్గర మార్కులు కొట్టేసింది ఈ మెగా ఫామిలీ హీరోయిన్ నిహారిక కొణిదెల. ట్రెండ్ ని కమేండ్ చేస్తున్న ఇంటర్నెట్ ని బాగా యూస్ చేసుకుంది నిహారిక. ఫస్ట్ తన స్టెప్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ మీద పెట్టి తనకంటూ ఒక గ్రూప్ అఫ్ ఆడియన్స్ ని క్రేయేట్ చేసుకుంది.

ఒక్క సినిమాతోనే..
మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా ఎక్కడ ఫామిలీ సపోర్ట్ తీసుకోకుండా మనసుకి నచ్చిన సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నిహారిక. డైరెక్టర్ రామరాజు సెకండ్ మూవీ 'ఒక మనసు సినిమా'తో 'నాగశౌర్య' పక్కన నటించిన నిహారిక ఈ సినిమా తో యాక్టింగ్ లో మెచ్యూరిటీ లెవెల్స్ ని చూపించింది. నాలుగు పాటలు, ఆరు సీన్లలో మాత్రమే హీరోయిన్ ని చూపించే సినిమాలు వరదలా వస్తున్న టైం లో 'ఒక మనసు లాంటి' హీరోయిన్ ఇంపార్టెంట్ ఉన్న సినిమా చెయ్యడం నిహారిక ఫిలిం సెలక్షన్ ఏ రేంజ్ లో ఉందొ చెప్తుంది .


విజయ్ సేతుపతి..
ప్రస్తుతం తమిళ పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్ సేతుపతి చేస్తున్న కొత్త చిత్రంలో నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు అరుముగ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ మొదలైందని, నిహారిక కూడా షూట్లో పాల్గొంటోందని వినికిడి. అలాగే ఈ చిత్రంలో మరో యంగ్ హీరో మణిరత్నం ‘కడలి’ ఫేమ్ గౌతమ్ కార్తిక్ కూడా నటిస్తున్నాడు. ఇకపోతే నిహారిక ప్రస్తుతం తెలుగులో ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.

13:20 - February 17, 2017

చెన్నై: తమిళనాడులో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అన్నాడిఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళతో పాటు దినకరన్‌, వెంకటేష్‌లను పార్టీ నుంచి పన్నీర్‌ సెల్వం సస్పెండ్‌ చేశారు. దినకరన్‌, వెంకటేష్‌లను శశికళ ఇటీవలే పార్టీలో చేర్చుకున్నారు. దినకరన్‌కు అన్నాడిఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. మరోవైపు డిఎంకె అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

17 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..

చెన్నై : శశికళ క్యాంపులో 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రేపు పళని స్వామి బల నిరూపణ చేసుకోవాల్సిన సంగతి తెలిసిందే. దీనితో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను పళనిస్వామి బుజ్జగిస్తున్నారు. బెంగళూరు పర్యటనను సైతం వాయిదా వేసుకున్నారు. విశ్వాస పరీక్షలో పళనిస్వామికి ఓటు వేయనని ఎమ్మెల్యే నటరాజన్ తేల్చిచెప్పారు. శశికళ శిబిరంలో ఉన్నవారంతా అమ్మ వ్యతిరేకులని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

శశికళ తొలగింపు..

చెన్నై : తమిళనాడులో మళ్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అన్నాడీఎంకే నుండి శశికళ, దినకరన్, వెంకటేష్ లను పన్నీర్ సెల్వం తొలగించారు. అసలు అన్నాడీఎంకే పార్టీ తమదేనని పన్నీర్ పేర్కొంటున్నారు. 

12:59 - February 17, 2017

ఇండస్ట్రీ లో హిట్ కొట్టిన హీరో మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ హిట్ తో ఫామ్ లోకి వచ్చిన హీరో సెకండ్ స్టెప్ ఏంటో చూడాలని అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ఆడియన్స్ లో క్యూరియాసిటీ కింటాల్లెక్కన ఉంటుంది. అలాంటి సిట్యుయేషన్ నే ఒక యంగ్ హీరో ఫేస్ చేస్తున్నాడు. ఆ హీరో ఎవరో అతని బోల్డ్ స్టెప్ ఏంటీ ? మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని తరువాత హీరో గా క్లిక్ అయ్యి వెంట వెంటనే ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ కమర్షియల్ హీరో అయిపోవాలని అనుకుంటుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీ లో హార్డ్ వర్క్ తో పాటు లిటిల్ బిట్ లక్కు కూడా ఉండాలి. లక్కు అనేది ఇక్కడ ఓవర్ నైట్ హీరోలని ఆకాశానికి ఎతేస్తుంది. హీరో గా ఉన్న వాళ్ళని జీరో గా మార్చేస్తుంది. సిక్స్ ఇయర్స్ బాక్ కెరీర్ స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు 'విజయ్ దేవరకొండ' 'నాని'తో 'ఎవడె సుబ్రహ్మణ్యం' సినిమాలో చేసి నటుడిగా మంచి మార్కులు కొట్టేసాడు.

పెళ్లి చూపులు హీరో..
హీరోగా తాను నటించిన 'పెళ్లిచూపులు' సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో 'విజయ్' తన నెక్స్ట్ సినిమా కధల్లో చాల జాగ్రత్త తీసుకుంటున్నాడు. రెగ్యులర్ మూస కథల్లా కాకుండా డిఫరెంట్ జోనర్ లో స్టోరీ సెలక్షన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే తాను నటిస్తున్న రెండు సినిమాల ట్రైలర్స్ సాంగ్స్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇమేజ్‌లో పడిపోకుండా, నటుడిగా తనని ఎలివేట్‌ చేసే కథలకే మొగ్గు చూపుతున్నాడు. అతని తాజా చిత్రం 'అర్జున్‌ రెడ్డి' టీజర్‌ చూస్తే ఎవరైనా షాక్‌ తినాల్సిందే.

ట్రెండీ స్టోరీస్..
'అర్జున్ రెడ్డి' సినిమా ట్రైలర్ రిలీజ్ తరువాత 'విజయ్' ఎంత ట్రెండీగా స్టోరీ సెలెక్షన్స్ చేస్తున్నాడో అర్ధమౌతుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఒక యంగ్ డాక్టర్ కథ అని తెలిసిపోతుంది. సందీప్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్‌కి సోషల్‌ మీడియాలో రెస్పాన్స్‌ బాగుంది. ఇలాంటి బోల్డ్‌ మూవీస్‌ చేసే ధైర్యం బాలీవుడ్‌ హీరోలకే తప్ప మనవాళ్లకి లేదని అనుకునేవాళ్లు ఈ యంగ్ హీరో బోల్డ్ స్టెప్ ని భయంకరంగా అప్రిసియేట్ చేస్తున్నారు. హాలీవుడ్ లో వచ్చిన యాంగర్ మేనేజ్మెంట్ అనే సినిమాని ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా అనేది రిలీజ్ తరువాత చూడాల్సిందే.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం..

ఢిల్లీ : ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. జస్టిస్ సంజయ్ కే కౌల్, జస్టిస్ మోహన్ శాంతనాగౌడర్, జస్టిస్ ఎస్ ఏ నజీర్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ దీపక్ గుప్తాలు ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. 

12:53 - February 17, 2017

హైదరాబాద్: ఇంట్లో అందరికీ అన్నీ సమయానికి సమకూర్చే గృహిణులు ఇంట్లో తమ ఆహార విషయంలో నిర్లక్ష్యం చూపిస్తూ వుంటారు. ఈ నిర్లక్ష్యాన్ని అధిగమించి వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఆహారానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో నేటి' హెల్త్ కేర్' ప్రముఖ న్యూట్రీషినిష్టు తెలిపారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:47 - February 17, 2017

హైదరాబాద్‌ : నగరంలోని నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు.

12:45 - February 17, 2017

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 63వ జన్మదిన వేడుకలు చైనాలోనూ ఘనంగా జరిగాయి. చైనా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి .. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా కేక్‌ను కట్‌ చేశారు. కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కడియంతోపాటు మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ బాల్కసుమన్‌ కేక్‌ కట్‌చేసిన వారిలో ఉన్నారు.

12:44 - February 17, 2017

చెన్నై: తమిళనాడులో నెంబర్‌ గేమ్‌ ఆట మొదలైంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పళనిస్వామి రేపు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మైలాపూర్‌ ఎమ్మెల్యే నటరాజన్‌ పళని స్వామికి షాకిచ్చి పన్నీర్‌ సెల్వం క్యాంపులో చేరారు. తాను పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేస్తానని చెప్పారు.

 

12:42 - February 17, 2017

విజయవాడ : ప్రభుత్వం, పార్టీ సమానంగా నడపాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఉన్నారని హోంమంత్రి చిన రాజప్ప తెలిపారు. విజయవాడలో నిర్వహించిన టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశ లక్ష్యం కూడా ఇదేనన్నారు. గ్రామ కమిటీలు ప్రారంభమయ్యాయని.. త్వరలోనే మండల, జిల్లా కమిటీలు కూడా ఆరంభమవుతాయని చినరాజప్ప స్పష్టం చేశారు.

12:40 - February 17, 2017

కృష్ణా : వీరులపాడు మండలం కొణతాలపల్లిలో పదో తరగతి విద్యార్థినిపై యువకుడి దాడి కలకలం సృష్టించింది. సునీత అనే బాలికపై అదే గ్రామానికి చెందిన తిరుపతి రావు పైశాచికంగా దాడికి తెగబడ్డాడు. బాలిక చదువుతున్న వెల్లంకి పాఠశాల వరకు ఆమెను వెంబడించి స్కూల్‌ ప్రాంగణంలో దాడి చేశాడు. స్పృహతప్పి పడిపోయిన బాలికను చికిత్స కోసం నందిగామ ఆస్పత్రికి తరలించారు.

12:35 - February 17, 2017

హైదరాబాద్: మహిళా వార్తల సమాహారం 'మానవీ న్యూస్' పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

12:32 - February 17, 2017

ఇండస్ట్రీ లో కొన్ని కాంబినషన్స్ హిట్ టాక్ తెచ్చుకుంటాయి. కామన్ గా హీరో, హీరోయిన్ కాంబినేషన్ హిట్ అవ్వడం మామూలే కానీ ఇక్కడ హీరో, కమేడియన్ కాంబినేషన్ హిట్ ట్రాక్ లో ఉంది. ఆ కామెడియన్ ఇన్ వాల్వ్ అయితే కానీ తనకు హిట్టు పడదని ఫిక్స్ ఐనట్టున్నాడు ఈ హీరో. సినిమా హిట్ అనేది ఆ సినిమా లో నటించే యాక్టర్స్ మీద కూడా డిపెండ్ ఐ ఉంటుంది. అలా ఒక సినిమాలో మంచి పెయిర్ అనిపించుకునే ఆర్టిస్ట్ లు చాల తక్కువగా ఉంటారు. ఎప్పటి నుండో ఒక మంచి సోలో హిట్ కోసం వెయిట్ చేస్తున్న 'మంచు విష్ణు'ది కూడా ఇదే పరిస్థితి. తనతో చేసిన కో ఆర్టిస్ట్ లను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేది మాత్రం ఒక్కటే ఉంది. రీసెంట్ టైమ్స్ లో ఎన్నో ఎక్స్ పెరిమెంట్స్ ట్రై చేసిన 'మంచు విష్ణు' అవేమి ఆడియన్స్ ని రీచ్ అవ్వకపోయేసరికి మళ్ళీ తనని హీరోగా నిలబెట్టిన కామెడీ జోనర్నే నమ్ముకున్నాడు.

ఆచారి అమెరికా యాత్ర..
'మంచు విష్ణు' తన తదుపరి చిత్రంలో పూర్తి స్థాయి కామెడీ పాత్ర చేస్తున్నాడు. 'ఆచారి అమెరికా యాత్ర' పేరుతో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో విష్ణు ఒక కామెడీ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. ఇందులో విష్ణుకి పర్ఫెక్ట్ కామెడీ పార్టనర్ ఐన 'బ్రహ్మీ' నటించడం యాడింగ్ పాయింట్ అయింది. బ్రహ్మానందం మంచి కమేడియన్ అయినప్పటికీ ఈ మధ్య వచ్చే సినిమాల్లో అతని కామెడీ సరిగా పండకపోవడం మరికొన్ని సినిమాల్లో మరీ నామమాత్రపు రోల్స్ వెయ్యటం కొంచం ఆలోచించాల్సిన విషయం. అప్పట్లో కామెడీ ట్రెండ్ సెట్టర్ సినిమా ఢీ. 'మంచు విష్ణు' కెరీర్ లో ది బెస్ట్ ఫిలింగా నిలిచిపోయిందీ సినిమా. ఢీ సినిమా లో బ్రహ్మీ, విష్ణు మధ్య వచ్చే సీన్స్ మంచి టైమింగ్ తో ఉంటాయి. 'నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి చారి గారు' అంటూ బ్రహ్మనందం యాక్టింగ్ సినిమాకే ప్లస్ పాయింట్. అంతలా కలిసి వచ్చే బ్రహ్మానందం, విష్ణు కాంబినేషన్ రిపీట్ అవ్వబోతుంది. తన ప్రీవియస్ ట్రాక్ రికార్డు ని కాపాడుకోటానికి మంచు విష్ణు కష్టం ప్రతి సినిమాలో కనిపిస్తున్నా రిజల్ట్స్ మాత్రం అంత ఫెవర్ గా రావట్లేదు. మంచు విష్ణు బ్రహ్మానందం తో రీసెంట్ గా కొన్ని సినిమాలు చేసిన పబ్లిక్ కి రీచ్ అవ్వటం లో ఫెయిల్ అయ్యాయి. ఇక బ్రహ్మానందం కూడా తనని కంప్లీట్ గా వాడుకోవట్లేదు అనే ఫీల్ లో ఉన్నట్టే కనిపిస్తుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'ఆచారి అమెరికా యాత్ర' టైటిల్ తో వస్తున్న ఈ సినిమా విష్ణు, బ్రహ్మీల హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.  

9వ సైన్స్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం..

ఢిల్లీ : 9వ సైన్స్ ఎక్స్ ప్రెస్ ను కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. సెప్టెంబర్ 8వరకు ఈ పర్యటన కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా 68వ ప్రాంతాల్లో 19వేల కి.మీటర్ల మేర పర్యటన కొనసాగనుంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. 

పన్నీర్ కు మరో ఎమ్మెల్యే మద్దతు..

చెన్నై : పన్నీర్ సెల్వంకు మైలపూర్ ఎమ్మెల్యే నటరాజన్ మద్దతు పలికారు. రేపు ఉదయం 11గంటలకు తమిళనాడు ప్రత్యేక అసెంబ్లీలో బలాన్ని సీఎం పళని స్వామి నిరూపించుకోనున్నారు. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేస్తానని నటరాజన్ ప్రకటించారు. 

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జలవిహార్ లో జరిగిన వేడుకల్లో మంత్రులు తలసాని, హరీష్ రావు కేకట్ కట్ చేశారు. క్యాంపు ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి తలసాని నేతృత్వంలో క్యాంపు ఆఫీసుకు ర్యాలీగా సినీ కార్మికులు తరలివచ్చారు. 

బీజాపూర్ లో తప్పిన ప్రమాదం..

ఛత్తీస్ గడ్ : బీజాపూర్ లో ప్రమాదం తప్పింది. ప్రధాన రహదారిపై మావోయిస్టులు అమర్చిన ఎల్ ఈడీ బ్యాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేసే సమయంలో పేలడంతో ఓ పోలీసుకు గాయాలయ్యాయి.

టెన్త్ విద్యార్థినిపై యువకుడి దాడి..

కృష్ణా : టెన్త్ విద్యార్థినిపై యువకుడు దాడి చేశాడు. విద్యార్థిని సృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థిని సునీత వెల్లంకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. స్కూల్ కు వెళుతుండగా తిరుమల రావు అనే యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. 

11:58 - February 17, 2017

హైదరాబాద్: కేసీఆర్‌ పుట్టిన రోజును సందర్భంగా జూబ్లీహిల్స్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలు బైక్‌లతో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో సినీ నిర్మాత సి. కల్యాణ్‌ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.

11:57 - February 17, 2017

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మతల్లి దీవెనలతో కేసీఆర్‌ నిండు నూరేళ్లు జీవించాలని తలసాని అన్నారు.

ఆరుగురు సర్కార్ వైద్యులను సస్పెండ్ చేసిన కామినేని..

నెల్లూరు : ఆరుగురు ప్రభుత్వ వైద్యులను మంత్రి కామినేని శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. నిన్న కలెక్టర్ ముత్యాల రాజు తనిఖీల్లో ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ వైద్యులు పట్టుబడ్డారు. వైద్యుల సస్పెండ్ కు ప్రభుత్వానికి కలెక్టర్ సిఫార్సు చేశారు. 

11:55 - February 17, 2017

విజయవాడ : ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు. 80శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నప్పుడే ఇది సాధ్యమని వివరించారు. టీడీపీ అధికారంలో ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోకపోతే ఏపీ ఇంకా ఎంతో అభివృద్ధి సాధించేందన్నారు. విజయవాడలో టీడీపీ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ప్రారంభోపన్యాసం చేసిన ఆయన... పార్టీకి కార్యకర్తలే బలమని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలవాలన్నా కూడా కార్యకర్తల కృషి ఎంతో అవసరమన్నారు. అందుకే ప్రతి ఒక్క నాయకుడు ఎల్లప్పుడూ కార్యకర్తలతో మమేకం కావాలని సూచించారు. పార్టీ సమర్ధవంతంగా లేకపోతే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలిజేసేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు

11:53 - February 17, 2017

నెల్లూరు : జిల్లా పరిషత్‌ సీఈవో బొబ్బా రామిరెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలతో ఏసీబీ అధికారులు హైదరాబాద్‌, తిరుపతి, ఒంగోలు, నెల్లూరులో ఏకకాలంలో దాడులు చేశారు. నెల్లూరు సహా మొత్తం 15 చోట్ల రామిరెడ్డి బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు 3 కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. కావలిలో రామిరెడ్డి మిత్రుడు మండవ జయరామయ్య ఇంట్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

కొనసాగుతున్న టిడిపి రాష్ట్ర స్థాయి వర్క్ షాప్..

విజయవాడ : టిడిపి రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరుగుతోంది. ఈ సందర్భంగా టిడిపి ప్రజాప్రతినిధులకు చంద్రబాబు నాయుడు దిశానిర్ధేశం చేశారు.

 

10:55 - February 17, 2017

హైదరాబాద్:వాలంటైన్‌ డే రోజున ఆఫీస్‌కంటూ ఇంటి నుంచి బయల్దేరిన యువతి ఆ తర్వాత కన్పించలేదు..సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ఆమె ఆఫీస్ వెళ్లలేదు...ఆ తర్వాత ఎక్కడుందో తెలియదు..కాని మాదాపూర్‌లోని నిర్జన ప్రాంతం నుంచి వస్తున్న కమురువాసన ఆమె జాడ చెప్పింది.. వెతికిన పోలీసులకు ఆ యువతి సజీవదహనమై కన్పించింది..ఈ దారుణం ప్రేమ కోసమా..? లేక పైశాచిక పంజానా..???

ప్రేమించడం లేదని చంపేశారా...

హైదరాబాద్ మాదాపూర్ ఎన్ఐఏ బిల్డింగ్ నిర్జీవ ప్రాంతం ఇది...ఇక్కడికి ఉదయాన్నే పోలీసులు...స్థానికులు పరుగున చేరారు..నిర్జన ప్రాంతంలో కమురు వాసన గుర్తించిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో చేరుకున్నారు.. చెట్లు..రాళ్లు మధ్య సజీవ దహనమైన ఓ యువతి దేహం కన్పించింది...గుర్తించేందుకు వీలులేకుండా ఉన్న ఆ ప్రాంతంలో పోలీసులు వెతికితే దొరికిన ఆధార్‌ కార్డుతో సునీతగా గుర్తించారు...

సికింద్రాబాద్‌ చెందిన సునీత...

మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో టెలికాలర్‌గా పనిచేస్తున్న సునీత సికింద్రాబాద్ బన్సీలాల్ పెట్ బైబిల్ హౌస్ పక్కన నివాసం ఉంటుంది.. సునీతకు తొమ్మిది మంది సోదరులు ఉన్నారు. ఇందులో ఆరుమంది సోదరులలో అన్న నర్సింగరావు ఇద్దరు అక్కలు ఉన్నారు...మిగతావారు వివిధ కారణాలతో మృతిచెందారు...ఉద్యోగం చేస్తున్న సునీత ఆఫీస్‌లో పార్టీ ఉందని ఇంటి నుంచి బయల్దేరింది...

వెళ్లినప్పటి నుంచి నో రెస్పాన్స్..

ఇంట్లోంచి బయల్దేరిన సునీత ఇక ఆ తర్వాత తన ఇంట్లోవారితో మాట్లాడలేదు..పార్టీ ఉందని వెళ్లిన ఆమె ఎవరితో బయటకు వెళ్లిందో..ఏమో...మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ ఆఫీస్‌ వెనకాల ఉన్న నిర్జన ప్రదేశంలో సజీవదహనమైంది....

నలుగురు చంపొచ్చని అనుమానం..

కాలిపోయన స్థితిలో శవాన్ని కనుగొన్న పోలీసులు వివరాలు తెలుసుకున్నారు..నలుగురు వ్యక్తులు చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు..ఇందులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది...

రెండ్రోజులుగా ఆఫీస్ వెళ్లని సునీత...

ఇదిలా ఉంటే సునీత ఈ నెల 14,15వ తేదీల్లోని రెండు రోజులు ఆఫీసుకి రాలేదని ఈ రెండు రోజులు ఎక్కడికి వెళ్లిందని తెలియాల్సి ఉంది..ఆమె ఎవరితో కలిసి ఉంది..ఎక్కడికి వెళ్లింది..ఏం చేసింది..? ఆమెను ఎందుకు చంపారన్న విషయాలు తెలియాల్సి ఉంది..దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు...

పెద్దమ్మతల్లి ఆలయంలో తలసాని పూజలు..

హైదరాబాద్ :సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంత్రి తలసాని జూబ్లిహీల్స్, పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు, ప్రజల దీవెనలతో కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, పరిపాలన ఏ విధంగా ఉండాలో చెప్పిన వ్యక్తి కేసీఆర్ అని కీర్తించారు. 

టిడిపి రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభం..

విజయవాడ : టిడిపి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. టిడిపి ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ప్రజలు మనపై నమ్మకం గెలిపించారని, మెరుగైన సేవలు అందిస్తేనే ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. పార్టీపై విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని, పార్టీకి అన్ని వేళలా కార్యకర్తలు అండగా ఉన్నారని పేర్కొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేయకపోతే బలహీన పడుతామని హెచ్చరించారు.

 

10:43 - February 17, 2017

హైదరాబాద్: టీఎస్ సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు టీఆర్ఎస్ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ కుమార్తె, ఎంపీ కవిత, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలుభారీ కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేసీఆర్‌ జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్‌లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కేసీఆర్‌పై అభిమానంతో ఈ కార్యక్రమం నిర్వహించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌.. అమరవీరుల త్యాగఫలంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్‌ వెంటే ఉన్నారని.. ఎవరెన్ని కుట్రలు పన్నినా కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు.

నగరానికి చేరుకున్న వంశీచంద్ రెడ్డి మృతదేహం..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వంశీచంద్ రెడ్డి మృతదేహం చేరుకుంది. అమెరికాలో జరిగిన కాల్పుల్లో వంశీచంద్ రెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రత్యేక వాహనంలో వరంగల్ జిల్లాకు తరలించారు. 

కుల బహిష్కరణ వ్యతిరేకిస్తూ యువకుల నిరసన..

యాదాద్రి : వలిగొండ (మం) దుప్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాల కమిటీ ఎన్నికల్లో కులపెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకించారని ఇద్దరు యువకులను కుల బహిష్కరించారు. నెలరోజులుగా బహిష్కరణ కొనసాగుతోంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని యువకులు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లా పరిషత్ సీఈవో ఇంటిపై ఏసీబీ దాడులు..

నెల్లూరు : జిల్లా పరిషత్ సీఈవో రామిరెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో సోదాలు నిర్వహించారు. 

తెలంగాణ భవన్ లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు..

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ పుట్టిరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, హోం మంత్రి నాయినీ, ఎంపీ కవిత, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ లు పాల్గొన్నారు. 

కేసీఆర్ కు మోడీ ఫోన్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఫోన్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. 

09:43 - February 17, 2017

టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా సొంత గడ్డపై మరో సమరానికి సన్నద్ధమైంది.ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని రెండు టెస్ట్‌లకు భారత జట్టును బీసిసిఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. టెస్టుల్లో తిరుగులేని కొహ్లీ అండ్‌ కో కంగారూలతో టెస్ట్‌ సిరీస్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.

ఆస్ట్రేలియా తో నాలుగు మ్యాచ్ లు...

ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని రెండు టెస్ట్‌లకు భారత జట్టును బీసిసిఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ ఎంఎస్ కె ప్రసాద్‌ సారధ్యంలోని బీసిసిఐ సెలక్షన్‌ ప్యానెల్‌ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేశారు.

అమిత్‌ మిశ్రాను పక్కన పెట్టిన సెలక్టర్లు ...

గాయపడిన సీనియర్‌ లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రాను పక్కన పెట్టిన సెలక్టర్లు కుల్దీప్‌ యాదవ్‌ను ఎంపిక చేశారు. కుల్దీప్‌ యాదవ్‌ మినహా...బంగ్లాదేశ్‌ సింగిల్‌ టెస్ట్‌లో ఆడిన జట్టునే ఎంపిక చేశారు.తొలి రెండు టెస్ట్‌లకు జట్టులో చోటు దక్కించుకొన్న ఆటగాళ్ళలో విరాట్‌ కొహ్లీ,మురళీ విజయ్‌, కె ఎల్‌ రాహుల్, చతేశ్వర్ పూజారా,అజింక్యా రహానే, కరుణ్‌ నాయర్‌,అభినవ్‌ ముకుంద్‌, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్‌ శర్మ,హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌,రవీంద్ర జడేజా, జయంత్‌ యాదవ్‌,ఉమేష్‌ యాదవ్‌ , భువనేశ్వర్‌ కుమార్‌ ,కుల్దీప్‌ యాదవ్‌ ఉన్నారు.

టెస్ట్‌ ఫార్మాట్‌లో ఎంతలా ఆధిపత్యం ప్రదర్శిస్తోందో ....

టాప్‌ ర్యాంకర్‌ టీమిండియాకు టెస్ట్‌ ఫార్మాట్‌లో ఎంతలా ఆధిపత్యం ప్రదర్శిస్తోందో అందరికీ తెలిసిందే. టెస్టుల్లో కొహ్లీ అండ్‌ కో వరుసగా శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ జట్లపై ఓటమంటూ లేకుండా సిరీస్‌ విజయాలు సాధించింది. టెస్టు ఫార్మాట్‌లో గత 19 మ్యాచ్‌ల్లో ఓటమంటూ లేకుండాభారత జట్టు 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ 23న ఆరంభమవుతుంది. కంగారూలతో మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టెస్ట్ సమరంలో కొహ్లీసేనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

09:33 - February 17, 2017

ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నవ్వు. నవ్వు ఒక భోగం... నవ్వించడం యోగం... నవ్వలేకపోవడం రోగం అన్నారు. నవ్వు గురించి తెలిసిన మహానుభావులు. నవ్వు ఓ మనిషి తనకు తాను తయారుచేసుకునే అద్భుత సౌందర్య సాధనం. నవ్వుకు మరే ఇతర సౌందర్య సాధనమూ సాటి రాలేదు. నవ్వు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. మానసికొల్లాసం..మనస్సుకు విశ్రాంతి కలుగుతుంది.

 • హాస్య సంఘటనల గురించి చర్చించండి. ఎంతటి ఒత్తిడి ఉన్నా సరే..ఇలాగే మాయమై పోతుంది.
 • ఏ విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయో..హాస్యాన్ని అందిస్తాయో వాటిని ఆస్వాదించండి.
 • హాస్య కథలు చదవడం...జోక్స్ చెప్పుకోవడం..వినడం ఇలా చేస్తే ఉత్సాహం కలిగిస్తుంది.
 • నవ్వడం వల్ల ఎండోర్ఫిన్స్‌ విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడతాయి. నవ్వు వల్ల విడుదలయ్యే ఎండోర్ఫిన్స్‌ వల్ల మూడ్‌ లిఫ్ట్‌ అవుతుంది.
 • ఉత్పత్తి పెరుగుతుంది.
 • నవ్వు వల్ల మనుషుల మధ్య ఉండే మనస్పర్థలు తొలగిపోతాయి. దానివల్ల ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది.
 • హాయిగా నవ్వడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. మల్టీ టాస్క్‌ కూడా చేయగల శక్తి లభిస్తుంది.
 • హార్ట్‌రేట్‌ని తగ్గించి శరీరం ఉపశమనం పొందేందుకు తోడ్పడుతుంది. బ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గించడంలో నవ్వు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
 • ఒత్తిడిని తగ్గిస్తుంది.
 • మనస్పూర్తిగా నవ్వే నవ్వు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. నవ్వు సులభంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. 
09:33 - February 17, 2017

చెన్నై: పళని స్వామి తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసినా రాజకీయ ఉత్కంఠ మాత్రం తగ్గడం లేదు. పళని స్వామి ప్రభుత్వాన్ని కూలదోస్తామని మాజీ సీఎం పన్నీరు సెల్వం అన్నారు. జల్లికట్టు ఉద్యమం తరహాలో ఉద్యమించి కూలుస్తామని స్పష్టం చేశారు. ఇక రేపటి బలపరీక్షకు సీఎం పళనిస్వామి సిద్ధమవుతున్నారు. బల పరీక్షలో నెగ్గేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నారు. గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లోనే ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. బల పరీక్షకు రిసార్ట్స్‌ నుంచే నేరుగా అసెంబ్లీకి తరలించనున్నారు.

09:31 - February 17, 2017

హైదరాబాద్: అమెరికాలో దుండగుల కాల్పుల్లో చనిపోయిన వంశీ మృతదేహం రాష్ట్రానికి చేరుకుంది. తెల్లవారుజాము 4.30కు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. వంశీ మృతదేహానికి ఎయిర్‌పోర్టులోనే బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితోపాటు పలువురు నివాళులు అర్పించారు. ఆ తర్వాత డెడ్‌బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రత్యేక వాహనంలో వరంగల్‌ జిల్లా హసన్‌పల్లి మండలంలోని వంశీ స్వస్థలమైన వంగపహడ్‌కు మృతదేహం తరలించారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈనెల 10న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ దుండగుడు కాల్పులు జరుపగా వంశీ చనిపోయాడు.

09:29 - February 17, 2017

హైదరాబాద్‌ : నగరంలోని సింగరేణి కాలనీలో ఈస్ట్‌జోన్‌ పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తెల్లవారుజామున డీసీపీ రవీందర్‌ ఆధ్వర్యంలో సుమారు 300 మంది పోలీసులు ఈ కార్డన్‌సెర్చ్‌లో పాల్గొన్నారు. 3గంటలకు ప్రారంభమైన కార్డన్‌సెర్చ్‌ 6 గంటల వరకు కొనసాగింది. 48 గ్యాస్‌ సిలిండర్లు, 57 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 12మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

09:26 - February 17, 2017

హైదరాబాద్‌ : నగరాన్ని క్రైమ్‌ సేఫ్‌ సిటీగా తీర్చిదిద్దాలంటూ విద్యార్ధులు గళమెత్తారు. క్రైమ్‌ సేఫ్‌ సిటీ కోసం పాటుపడతామంటూ పోలీసులు, విద్యార్ధులు ప్రతిన బూనారు. హైదరాబాద్‌ మహానగరాన్ని క్రైమ్‌ సేఫ్‌ సిటీగా తీర్చిదిద్దాలంటూ సౌత్‌జోన్‌ పోలీసుల ఆధ్వర్యంలో 5కె రన్‌ నిర్వహించారు. చార్మినార్‌ నుంచి బార్కస్‌ వరకు జరిగిన ఈ రన్‌ను ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, బ్యాడ్మింటర్‌ క్రీడాకారిణి పీవీ సింధు ప్రారంభించారు. నగరానికి చెందిన దాదాపు 10వేల మంది విద్యార్ధులు ఈ రన్‌లో పాల్గొన్నారు.

09:24 - February 17, 2017

యాదాద్రి : ఎన్ని చట్టాలు మారినా గ్రామాల్లో సాంఘిక దురాచారం కొనసాగుతూనే ఉంది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం దుప్పలిలో ఇద్దరు కులబహిష్కరణ కలకలం రేపింది. కుల బహిష్కరణకు వ్యతిరేకిస్తూ సెల్‌టవర్‌ ఎక్కి ఇద్దరు యువకులు నిరసన తెలిపారు. పాఠశాల కమిటీ ఎన్నికల్లో కులపెద్దల నిర్ణయాన్ని యువకులు వ్యతిరేకించారన్న ఆరోపణలున్నాయి. యువకులపై నెలరోజులుగా బహిష్కరణ కొనసాగడంతో..నిన్న ఎమ్మార్వో, ఆత్మకూరు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

09:22 - February 17, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తన తాజా చిత్ర ప్రచారం వెరైటీగా నిర్వహిస్తున్నారు. 'డీజే'..దువ్వాడ జగన్నాథం...చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'అల్లు అర్జున్' సరసన 'పూజా హెగ్డే' నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 'దిల్' రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో 'బన్నీ' న్యూ లుక్ లో కనిపించనున్నారని, ఇందుకు సంబంధించిన ఫొటోలు ఏ మాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీజే ఫస్ట్ లుక్ ఈనెల 18వ తేదీన విడుదల కానుంది. మరో రెండు రోజులు..మరో ఒక్క రోజే..అంటూ 'అల్లు అర్జున్' ట్విట్టర్ లో పోస్టర్స్ పోస్టు చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. పోస్టు చేసిన పోస్టర్ లో రుద్రాక్ష ఉండడం..ఓం. అనే అక్షరం ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ జరుగుతోందని, అనంతరం చిత్ర యూనిట్ అబుదాబికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేసవి సెలవుల కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి చిత్ర ఫస్ట్ లుక్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

 

 

09:21 - February 17, 2017

మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తరువాత వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చారు. 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150'తో కనిపించి కనువిందు చేశారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విజయవంతం అయ్యింది. అదే జోష్ తో మరో సినిమాకు కూడా లైన్ క్లియర్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాకు కూడా 'చిరు' తనయుడు 'రామ్ చరణ్ తేజ' నిర్మాతగా వ్యవహరించనున్నారు. దర్శకుడిగా సురేందర్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఏప్రిల్ లో సినిమా లాంచింగ్ చేయనన్నారని, ఒక వేడుకగా దీనిని నిర్వహించాలని భావిస్తున్నారంట. మే నుండి షూటింగ్ ప్రారంభిస్తారని టాక్. ఒక చారిత్రక కథాంశంగా సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. 'ఉయ్యాల వాడ నరసింహారెడ్డి' పేరిట చిత్రం తెరకెక్కిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం నిర్మాణం కోసమే రూ 80 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం తాను ఎంతోకాలం ఎదురు చూస్తున్నానని చిరు చెప్పడం ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇక దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

08:39 - February 17, 2017

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు (63)పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం మీద సీఎం కేసీఆర్ చెరగని ముద్ర వేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా నేటి నుంచి ప్రగతి భవన్ లో జనహిత ప్రారంభం కానుంది. జనహితంలో సీఎం కేసీఆర్ వివిధ వర్గాల ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరిస్తారు. అప్పటికప్పుడే అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ఆదేశాలు జారీ చేశారు. జనహితం ప్రారంభం సందర్భంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులుతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్ 'లో చర్చను చేపట్టింది. ఈచర్చలో టిఆర్ ఎస్ గోవర్థన్ రెడ్డి, టిడిపి నేత విద్యాసాగర్, నవతెలంగాణ ఎడిటర్ ఎస్ వీరయ్య పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

పార్కర్ రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్: పటాన్‌చెరులోని పారిశ్రామిక వాడలో గత రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పార్కర్ రబ్బర్ ఫ్యాక్టరీలో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. రబ్బర్ పరిశ్రమలో డ్రమ్ములు పేలుతుండటంతో పరిశ్రమ చుట్టూ భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.

పేలుళ్ల ప్రధాన సూత్రధారి తారిక్‌ అహ్మద్దార్‌కు 10ఏళ్ల జైలు శిక్ష

ఢిల్లీ : 12 ఏళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో పటియాల కోర్టు తీర్పు వెలువరించింది. పేలుళ్ల ప్రధాన సూత్రధారి తారిక్‌ అహ్మద్దార్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు..- పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆరోపణలు ఎదుర్కొన్న మరో ఇద్దరు మహ్మద్‌ హుసేన్‌ ఫాజిల్, మహ్మద్‌ రఫీక్‌ షాలను నిర్దోషులుగా పేర్కొంది. 2005 అక్టోబర్‌ 29న ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 60 మంది మృతి చెందారు. రెండువందలకు పైగా గాయపడ్డారు.

07:04 - February 17, 2017

ఖమ్మం: కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తమ్మినేని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఎత్తేయాలని కేసీఆర్‌ ప్రభుత్వం పూనుకుంటోందని, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, డబ్బున్న అధికారులే రాష్ట్రాన్ని మేసేస్తున్నారని తమ్మినేని విమర్శించారు. అందరికి సమాన అవకాశాలు కావాలన్నదే సీపీఎం మహాజన పాదయాత్ర ఉద్దేశమని తమ్మినేని అన్నారు. కులవివక్షకు గురైన రోహిత్‌ వేముల కుటుంబానికి న్యాయం చేయకుండా...కేంద్ర మంత్రులను కాపాడేందుకే.. అతని కులాన్ని వివాదస్పదం చేస్తున్నారని తమ్మినేని అన్నారు. రోహిత్‌ వేముల కులాన్ని మార్చేందుకు ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

ప్రతి ఇంటిలో పిల్లలందరిని చదివించినప్పుడే.. ..

ప్రతి ఇంటిలో పిల్లలందరిని చదివించినప్పుడే.. అభివృద్ధి సాధ్యమవుతోందని, కానీ..కేసీఆర్‌ సర్కార్‌ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేసేందుకు పూనుకుందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో విద్యా రంగాన్ని కాపాడేందుకు సీపీఎం పోరాటం చేస్తోందని తమ్మినేని తెలిపారు. సంస్కరణల్లో భాగంగానే మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిందని, ఈ పథకం కోసం అప్పులు చేసి ప్రజలపై మోయలేని భారం వేస్తోందని పాదయాత్ర కోఆర్డినేటర్‌ వెంకట్‌ ఆరోపించారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న కోదండరామ్‌పై కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు అక్కసు వెళ్లగక్కుతోందని ఆయన ప్రశ్నించారు.

సీపీఎం మహాజన పాదయాత్రకు విశేష స్పందన...

సీపీఎం మహాజన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 123వ రోజుకు చేరుకున్న పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఖమ్మం జిల్లాలోని రాయనపేట, ఆళ్లపాడు, బోనకల్లు, ముష్టికుంట్ల, నాగులవంచలో పాదయాత్ర బృందం పర్యటించింది. ముష్టికుంట్ల గ్రామంలో రెండు కిలోమీటర్ల పొడవునా తమ్మినేని బృందానికి పూలవర్షంతో స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు పాదయాత్ర బృంద సభ్యులకు సాదరంగా ఆహ్వానిస్తూ.. యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలు తమ సమస్యలను తమ్మినేని బృందానికి విన్నవిస్తున్నారు. ఇప్పటికే 3వేల 300 కిలోమీటర్ల మేర యాత్రను పూర్తిచేశారు.

సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్‌ డే సందర్భంగా ప్రముఖ కవి త్రినేత్ర రాసిన దటీస్‌ KCR పుస్తకాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఆవిష్కరించారు. కేసీఆర్ జీవిత ప్రస్థానం నుంచి తెలంగాణ పోరాటం వరకు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణ సాధన కోసం చేస్తున్న కృషిని ఈ పుస్తకంలో వివరించారు. కేసీఆర్ జీవితం ఎందరికో ఆదర్శమని ఈ సందర్భంగా ఈటల చెప్పారు. భావితరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పుస్తక రచయిత త్రినేత్రకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

07:00 - February 17, 2017

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్‌ డే సందర్భంగా ప్రముఖ కవి త్రినేత్ర రాసిన దటీస్‌ KCR పుస్తకాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఆవిష్కరించారు. కేసీఆర్ జీవిత ప్రస్థానం నుంచి తెలంగాణ పోరాటం వరకు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణ సాధన కోసం చేస్తున్న కృషిని ఈ పుస్తకంలో వివరించారు. కేసీఆర్ జీవితం ఎందరికో ఆదర్శమని ఈ సందర్భంగా ఈటల చెప్పారు. భావితరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పుస్తక రచయిత త్రినేత్రకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

06:56 - February 17, 2017

హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఈనెల 22న హైదరాబాద్‌లో జరిగే నిరుద్యోగ ర్యాలీకి యువతీ, యువకులు భారీగా తరలిరావాలని టీజేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపు ఇచ్చారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. నిరుద్యోగుల ఆకాంక్షలు-తెలంగాణ భవిష్యత్‌ అన్న అంశంపై నల్గొండలో జరిగిన సదస్సులో కోదండరామ్‌ ప్రసగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ రోడ్‌ నుంచి లయన్స్‌ క్లబ్‌ వరకు జరిగిన బైక్‌ ర్యాలీని ప్రారభించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై పాలకులు కక్షకట్టడం దారుణమని కోదండరామ్‌ విమర్శించారు.

కాంగ్రెస్‌ పోరాటం ఫలితమే: ఉత్తమ్

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్ట్‌లకు భూ నిర్వాసితుల పునరావాసం, పునర్నిర్మాణం విషయంలో కాంగ్రెస్‌ పోరాటం ఫలితంగానే టిఆర్ఎస్ ప్రభుత్వం జిఓ-38 తీసుకొచ్చిందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. జిఓ123 స్థానంలో తీసుకొచ్చిన జిఓ-38లో కూడా సామాజిక, పర్యావరణ ప్రభావం అంచనాలు లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

06:52 - February 17, 2017

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగడంతో ఆశావహుల బెడద అధికార పార్టీని తాకుతోంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబుకు తాము అన్ని విధాలా తోడుగా ఉన్నామని ఆశావహులు చెబుతున్నారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర విజయానికి కృషిచేసిన నేతలు ఇపుడు ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు.

పాదయాత్రలో పనిచేసిన వాళ్లకి ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు...

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రాగానే పాదయాత్రలో తనతోపాటు పనిచేసిన వాళ్లకి ప్రాధ్యానత కల్పించారు చంద్రబాబు. వారిలో గరికపాటి మోహన్ రావును ఎన్నికలకు ముందే రాజ్యసభకు పంపారు. అలాగే కంభంపాటి రామ్మోహన్, పిఆర్ మోహన్, వివివి చౌదరి, టిడి జనార్థన్, గోనుగుంట్ల కోటేశ్వరరావు, జయరామిరెడ్డి, బీద రవిచంద్ర, నన్నపనేని రాజకుమారి లాంటి నేతలకు సముచిత స్థానం కల్పించారు.

ఇప్పటికీ పదవుల కోసం కొంత మంది నేతల ఎదురుచూపులు .....

అయితే కొంత మంది మాత్రం ఇప్పటికి ఎలాంటి అవకాశం రాక పదవుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు అవుతుండటంతో, తమ పేర్లను పరిశీలించాలని అధినేత చంద్రబాబుకు గుర్తుచేస్తున్నారు. మంతెన సత్యనారాయణ రాజు, జేఆర్ పుష్పరాజ్, శోభా హైమావతి, చందు సాంబశివరావు, దాసరి రాజమాస్టార్, కొమ్మినేని వికాస్, పిన్నమనేని సాయిబాబా లాంటి నేతలు ఎమ్మెల్సీ స్థానాలు ఆశిస్తున్నారు.

గతంలో ఎమ్మెల్సీ అవకాశం కోల్పోయిన మంతెన ......

పార్టీకి తాము చేస్తున్న సేవలను కూడా గుర్తుచేస్తున్నారు ఆశావహులు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మంతెన సత్యనారాయణ రాజుకు గతంలో ఎమ్మెల్సీ స్థానం చేజారడంతో మరోసారి అవకాశం కల్పిస్తానని ఇంతకుముందే చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని మంతెన కోరుతున్నారు. ఇక బ్రాహ్మణ కోటాలో టీటీడీ బోర్డు సభ్యుడు ఏవి రమణ ఎమ్మెల్సీ స్థానం ఆశిస్తున్నారు. అదే విధంగా సత్యవాణి, మదిపట్ల సూర్యప్రకాశ్, బ్రహ్మం చౌదరి, పరుచూరి క్రిష్ణా, డాక్టర్ పవన్‌లు కూడా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడుస్తుండడంతో ...

పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడుస్తుండడంతో ఇప్పటికైనా తమకు అవకాశం కల్పించాలని పాదయాత్రలో పాల్గొన్న నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. పదవులు కోరుకుంటున్న నేతలు ఎక్కువగా ఉండటంతో ఎవరికి అవకాశం కల్పించాలన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

టీడీపీకి ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశావహుల బెడద

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలవ్వడంతో అధికార టీడీపీకి అసమ్మతి సెగ తగులుతోంది. 2014 ఎన్నికల ముందు నిర్వహించిన వస్తున్న మీకోసం పాదయాత్రలో చంద్రబాబు వెన్నంటి నిలిచిన నేతలు ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే వారి ఆశలు నెరవేరే పరిస్థితులు కనిపించడంలేదు.

06:49 - February 17, 2017

హైదరాబాద్: తమిళనాడు సెగలు ఏపీనీ తాకుతున్నాయి. శశికళ ఎపిసోడ్‌ను ఎవరికి వారు తమ వ్యతిరేకులపై విమర్శలకు వాడుకుంటున్నారు. శశికళ కంటే పెద్ద అవినీతి పరులంటూ టీడీపీ , వైసీపీలు అధినేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

జగన్ కు ఎన్నాళ్లు శిక్షపడాలో...

66కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన శశికళకు నాలుగేళ్ల జైలు, పది కోట్ల జరిమానా, పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేదం విధిస్తే.. 40 వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డాడంటూ స్వయంగా సీబీఐ యే లెక్క తేల్చిన జగన్ కు ఎన్నాళ్లు శిక్షపడాలో అంటూ చంద్రబాబు.. విమర్శలకు దిగుతతూ వైసీపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ...

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ఇస్తున్నారు వైసీపీ నేతలు. 18 కేసుల్లో స్టేలు తెప్పించుకొని.. ఓటు కు నోటు కేసులో పబ్లిక్ గా దొరికిపోయిన చంద్రబాబు .. ఈ రోజు నీతిసూత్రాలు వల్లిస్తున్నారని జగన్ విమర్శిస్తున్నారు. గుంటూరు జిల్లాలో జరిగిన సభలో జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

అటు వామపక్షాలు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై...

అటు వామపక్షాలు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఇసుక కాంట్రాక్టుల నుంచి ప్రాజెక్టుల నిర్మాణాల్లో కమిషన్ల దాకా చంద్రబాబు ప్రభుత్వం.. అవినీతికి తలుపులు బార్లా తెరిచిందని.. సీపీఎం నేతలు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా.. శశికళ పై సుప్రీం తీర్పు, తమిళనాడు వ్యవహారాల నేపథ్యంలో అవినీతి అనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాఫిగ్గా మారింది. అధికార ప్రతిక్షనేతలు శశికళ ఎపిసోడ్‌ను గుర్తుచేసుకుంటూ రాజకీయాలను రంజుగా మారుస్తున్నారు.

06:45 - February 17, 2017

హైదరాబాద్: శశికళకు ఏమాత్రం తీసిపోని లెవల్లో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంశపథం చేశారు. పళనిస్వామి సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే మెరీనాబీచ్‌లోని జయలలిత సమాధి దగ్గరకు చేరుకున్న పన్నీర్‌.. శత్రువులను ఓడించి అమ్మపార్టీని కాపాడుకుంటానని ప్రతిజ్ఞచేశారు.

ప్రస్తుత ప్రభుత్వానికి ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే...

ప్రస్తుత ప్రభుత్వానికి ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, తనకు ప్రజల మద్దతు ఉందని పన్నీర్‌సెల్వం అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవారెవరూ జయ అనుచరులు కాదని, అన్నాడీఎంకేని శశికళ వారసత్వ పార్టీగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పార్టీలో నిజమైన కార్యకర్తలకు ద్రోహం జరిగిందని పన్నీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి శశకళ లక్ష్యాలు ఏమిటో ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు.

న్నీర్‌సెల్వం కారుకు ఉన్న ఎర్రబుగ్గను తొలగించాలని ఆదేశం....

మరోవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పళనిస్వామి తన అధికారాన్ని పన్నీర్‌పై ప్రయోగించారు. పన్నీర్‌సెల్వం కారుకు ఉన్న ఎర్రబుగ్గను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దాంతోపాటు పన్నీర్‌ సెల్వం ఇంటిదగ్గర భద్రతను కూడా పోలీసులు తగ్గించారు. అధికారం చేజారడంతో సోవమవారం ప్రభుత్వ నివాసగృహాన్ని కూడా పన్నీర్‌సెల్వం ఖాళీచేయనున్నారు. మరోవైపు జయ మరణానికి శశికళే కారణమని మరోసారి ఆరోపించిన ఆయన అమ్మపార్టీని కాపాడుకోడానికి జనంలోకి వెళతానని స్పష్టంచేశారు.

06:41 - February 17, 2017

హైదరాబాద్: ఐసిస్‌ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాకిస్థాన్‌ , ఇరాక్‌ల్లో ఆత్మాహుతి దాడులకు తెగబడి వందల మందిని బలితీసుకున్నారు. పాకిస్థాన్‌లోని సింధ్‌ప్రావిన్స్‌లో ఉగ్రమూకలు బాంబులతో విరుచుకుపడ్డాయి. లాల్‌షెబాజ్‌ సమీపంలోని కలంధర్‌ సూఫీ మసీదులో సూసైడ్‌ అటాక్‌ చేశారు. మసీదులో సూఫీ సంప్రదాయ నృత్యం జరుగుతుండగా ముష్కరులు తమను తాము బాంబులతో పేల్చివేసుకున్నారు. ఈ దాడిలో అక్కడి కక్కడే వందమంది దుర్మరణం పాలయ్యారు. మరో 250 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్టు పాక్‌ పోలీసులు తెలిపారు. ఉగ్రదాడితో సింధ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. రాత్రిపూట దాడి జరగడంతో తక్షణ వైద్యం సహాయం అందక క్షతగ్రాత్రులు చాలా మంది మృత్యువాత పడినట్టు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. అటు ఇరాక్‌లోనూ ఐసిస్‌ మారణహోమం సృష్టించింది. బాగ్దాద్‌ నగరంలో కారుబాంబుపేలి 51మంది చనిపోయారు. కార్లఅమ్మకాలుజరిగే ఆల్‌బయా ప్రాంతంలో ఈ దాడి జరిగింది. దాడికి తామే పాల్పడినట్టు ఐసిస్‌ ప్రకటించింది.

06:40 - February 17, 2017

హైదరాబాద్: నిధులు, నీళ్లు, నియామకాల చుట్టూనే తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లయినా నిరుద్యోగుల ఆశలు ఫలించలేదు. తెలంగాణ రాష్ట్రంలో లక్షకు పైగా పోస్టులు ఖాళీగా వుండగా, ఇప్పటికి భర్తీ చేసినవి నిండా పన్నెండు వేలు కూడా లేవు. సుమారు 31 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. అయితే ఈ రెండున్నరేళ్ల కాలంలో 30 వేల మందికి పైగా రిటైరయ్యారు. దీంతో తెలంగాణ నిరుద్యోగ యువత తీవ్ర నిరాశతో వుంది. ఇంతకాలమూ ఆశగా ఎదురు చూసిన నిరుద్యోగులు పోరుబాట పడుతున్నారు. ఈ నెల 22న తెలంగాణ జెఏసి తలపెట్టిన నిరుద్యోగ ప్రదర్శనకు వివిధ విద్యార్థి యువజన సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ లో నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవకుమార్ చర్చలో పాల్గొన్నారు.  ఈ చర్చలో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss