Activities calendar

18 February 2017

17:55 - February 18, 2017
17:53 - February 18, 2017

విజయవాడ : ఓ కిలాడీ మహిళ పోలీసుల చేతికి చిక్కింది. భవానీపురంకు చెందిన విజయలక్ష్మీ జల్సాలకు అలవాటు పడింది. చుట్టుపక్కల వారిని నమ్మించి డబ్బులు వసూలు చేసి ఉడాయించేది. భర్త చనిపోవడంతో దొంగతనాలు మొదలు పెట్టింది. ఒంటినిండా నగలు అలంకరించుకుని బయలుదేరేది. ఒంటిరిగా ప్రయాణం చేస్తున్న వృద్ధులను టార్గెట్ చేసేది. దూరపు బంధువనంటూ పరిచయం చేసుకుని మాటల్లో దింపుతుంది. అనంతరం కూల్ డ్రింగ్ తాగించేది. అనంతరం వారు సృహ తప్పి పడిపోయిన అనంతరం నగలతో ఉడాయించేది. ఆసుపత్రులు..శుభాకార్యాలు..బస్టాండ్ల ప్రాంతాల్లో కూడా చోరీ కొనసాగించేంది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈమె దగ్గరి నుండి 360 గ్రాముల బంగారం, పది లక్షల నగదును స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.

17:47 - February 18, 2017

నెల్లూరు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి రాజకీయాలు చేయలేదని, ఎన్నికల్లో డబ్బులు పంచడం లేదని చెప్పగలరా అని నిలదీశారు. ప్రధాని మోడీ ఏపీకి ఇచ్చిన హామీలకు గతి లేదు కానీ యూపీలో రైతు రుణమాఫీ చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

17:44 - February 18, 2017

విశాఖపట్టణం : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టభద్రులకు ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై టిడిపి, బిజెపిలు తర్జనభర్జనలు పడిన సంగతి తెలిసిందే. చివరకు బీజేపీకి కేటాయిస్తున్నట్లు టిడిపి ప్రకటించింది. రాష్ట్ర కార్యవర్గసభ్యులు వి.వి.ఎన్.మాధవ్ కు బీజేపీ బరిలో నిలిపింది. శనివారం ఆయన నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు బీజేపీ, టిడిపి నేతలు భారీగా తరలివచ్చారు.

17:39 - February 18, 2017

నెల్లూరు : తన సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డితో ఎలాంటి విబేధాలు లేవని టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ మధ్య చిచ్చు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. తుది శ్వాస వరకు నెల్లూరును..రాజకీయాలను..తమ్ముడిని వదులుకోనని ఖరాఖండిగా చెప్పారు.

17:35 - February 18, 2017

ఖమ్మం : ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ ప్రజల కోసం సబ్ ప్లాన్ చట్టం చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ డిమాండ్ చేశారు. ఖమ్మంలో కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. బోసు బొమ్మ వద్ద ఏర్పాటు చేసిన బసభలో కారత్ మాట్లాడారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ప్లానింగ్ కమిషన్ ను రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేశారని విమర్శించారు. ప్రధాని మోడీలాగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మొండి వైఖరిని అవలింబిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు.

 

17:31 - February 18, 2017
17:26 - February 18, 2017

నల్గొండ : ఓ బాలికపై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారం జరిపిన వారిలో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ భర్త కూడా ఉన్నాడని బాధితురాలు చెప్పడంతో కలకలం రేగుతోంది. మాయ మాటలు..క్షుద్రపూజల పేరిట తనను తీసుకెళ్లి అత్యాచారం జరిపారని బాధితురాలు పీఎస్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు స్వయంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన నేత ఉండడంతో కేసును గోప్యంగా ఉంచుతున్నారని సమాచారం. అత్యాచారం జరిపిన వారిలో ఎంపీటీసీ భర్త ఉయ్యాల వెంకన్న, వినోద్, రాజు ఉన్నారని, వీరికి ఓ మహిళ సహకరించిందని బాధితురాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

17:18 - February 18, 2017
17:12 - February 18, 2017

చెన్నై : మరోసారి మెరీనా బీచ్ వార్తల్లోకి ఎక్కింది. జల్లికట్టు ఉద్యమంపై యువత భారీ ఎత్తున ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నిరహార దీక్ష చేయడంతో బీచ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పళనిస్వామి విశ్వాసతీర్మానం నేపథ్యంలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్ బయటకు తరలిస్తుండగా చిరిగిపోయిన చొక్కాతోనే స్టాలిన్ గవర్నర్ వద్దకు చేరుకుని మాట్లాడారు. అనంతరం అక్కడి నుండి నేరుగా బీచ్ వద్దనున్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని దీక్షకు కూర్చొన్నారు. విషయం తెలుసుకున్న డీఎంకే అభిమానులు, నేతలు భారీగా చేరుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దీక్షకు అనుమతి లేదని, ఇక్కడి నుండి వెళ్లిపోవాలని స్టాలిన్ కు తెలిపారు. దీనిని వారు వ్యతిరేకించారు. విపక్ష నేతయైన తన విషయంలో సరిగ్గా ప్రవర్తించలేదని, అమానుషంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. స్పీకర్ తీరుపట్ల ఆయన గర్హించారు. అనంతరం స్టాలిన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడున్న 89 మంది ఎమ్మెల్యేలు..అభిమానులను తరలించేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. 

మెరీనా బీచ్ వద్ద ఉద్రిక్తత..

చెన్నై : మెరీనా బీచ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీక్ష చేస్తున్న స్టాలిన్, డీఎంకే నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పోలీసుల ప్రయత్నాలను నేతలు అడ్డుకుంటున్నారు.

స్టాలిన్ నిరహార దీక్ష..

చెన్నై : డీఎంకే నేత స్టాలిన్ నిరహార దీక్షకు దిగారు. మెరీనా బీచ్ వద్ద గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలతో పాటు ఆయన దీక్షలో కూర్చొన్నారు. గవర్నర్ ను కలిసిన అనంతరం ఆయన దీక్షలో పాల్గొన్నారు.

16:20 - February 18, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు..తీవ్ర ఉత్కంఠ మధ్య పళని సెల్వం విశ్వాస పరీక్ష జరిగింది. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే స్పీకర్ ఓటింగ్ నిర్వహించడం..మూజువాణి ఓటుతో పళనీసెల్వం విజయం సాధించినట్లు స్పీకర్ ధన్ పాల్ ప్రకటించడంతో రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లైంది. విజయం సాధించిన అనంతరం బయటకు వచ్చిన పన్నీర్ సెల్వంపై పళని వర్గీయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పన్నీర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు డీఎంకే నేత స్టాలిన్ కూడా స్పీకర్.. జరిగిన పరిణమాలను తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ దగ్గర తేల్చుకుంటామని పన్నీర్..స్టాలిన్ పేర్కొన్నారు.

ఉదయం నుండి జరిగిన పరిణామాలు..

 • సభ ప్రారంభమైన అనంతరం పన్నీర్..పళని వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నాయి.
 • నాటకీయ పరిణామాల మధ్య స్పీకర్ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు.
 • విశ్వాస పరీక్ష తీర్మానాన్ని సభలో పళని స్వామి ప్రవేశ పెట్టారు.
 • రహస్య ఓటింగ్ కు పన్నీరు, డీఎంకే, కాంగ్రెస్ పట్టుబట్టింది.
 • పన్నీర్ సెల్వంకు డీఎంకే మద్దతు తెలుపుతూ ఆందోళన చేపట్టింది.
 • అసెంబ్లీలో సెల్వం వర్గం చీఫ్ విప్ గా సెమ్మలైను ను మధుసూధన్ నియమించారు.
 • ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసిన స్పీకర్ అసెంబ్లీ తలుపులను మూసివేసి మరీ ఓటింగ్ నిర్వహించారు. దీనితో సభను వాయిదా వేశారు.
 • డీఎంకే ఒక్కసారిగా వ్యూహాలు మార్చేసింది.
 • ఒక పార్టీకి ఇద్దరు విప్ లు ఏంటీ ? బలపరీక్ష అంత తొందరగా ఎందుకు చేస్తున్నారని ? సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలని స్టాలిన్ డిమాండ్ చేయడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
 • డీఎంకే...పన్నీర్ వర్గం మధ్య బంధం ఏంటో బయటపడిందని పళని వర్గం ఎదురు దాడి చేసింది.
 • రెండు బృందాల ఓటింగ్ అనంతరం మూడో బృందంతో ఓటింగ్ నిర్వహిస్తుండగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
 • డీఎంకే సభ్యులు రెచ్చిపోయారు. కుర్చీలు..బళ్లలు విసిరేశారు. స్పీకర్ పైకి పేపర్లు విసిరేశారు.
 • ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు.
 • మార్షల్స్ సహాయంతో స్పీకర్ సురక్షితంగా బయటకు వెళ్లిపోయారు.
 • మధ్యాహ్నం 1గంట వరకు వాయిదా వేశారు.
 • డీఎంకే సభ్యుల ప్రవర్తన బాగా లేదని, రాజ్యాంగబద్ధంగానే సభను నడిపినట్లు స్పీకర్ ధన్ పాల్ వెల్లడించారు.
 • స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి కుర్చీలను పలుగగొట్టారు. బెంచీలపైకి ఎక్కి ఆందోళన చేశారు. దీనితో స్పీకర్ తన స్థానం నుండి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 1 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
 • సభ తిరిగి ప్రారంభం కాగానే పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.
 • డీఎంకే సభ్యుల విషయంలో స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 89 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
 • మార్షల్స్ సహాయంతో తరలింపు ఆలస్యం అవుతుందని భావించిన స్పీకర్ సభను 3గంటల వరకు వాయిదా వేశారు.
 • సభ తిరిగి ప్రారంభం కాగానే కాంగ్రెస్, ముస్లిం లీగ్ వాకౌట్ చేసింది.
 • అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు.
 • పళనిస్వామికి అనుకూలంగా 122, వ్యతిరేకంగా 11 ఓట్లు పడ్డాయి. దీనితో పళని స్వామి విజయం సాధించినట్లు స్పీకర్ వెల్లడించారు.
 • ఈ సందర్భంగా స్టాలిన్, పన్నీర్ సెల్వం పలు విమర్శలు గుప్పించారు.

అక్వా చెరువుల ధ్వంసం..

తూర్పుగోదావరి : అక్రమ అక్వా చెరువులపై హైకోర్టు ఆగ్రహంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. తాండవల్లిలో 42 ఎకరాల్లో అక్రమంగా సాగు చేస్తున్న రొయ్యల చెరువులను అధికారులు ధ్వంసం చేస్తున్నారు.

స్పీకర్ ది అప్రజాస్వామికం - పన్నీర్ సెల్వం..

చెన్నై : గవర్నర్, స్పీకర్ లపై పన్నీర్ సెల్వం మండిపడ్డారు. సభలో స్పీకర్ వ్యవహార శైలి సరికాదన్నారు. స్పీకర్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని, అమ్మకు పార్టీ ఎమ్మెల్యేలు ద్రోహం చేశారని, ఇక్కడ జరుగుతున్నదంతా తమిళ ప్రజలు చూశారని పేర్కొన్నారు.

బాలికపై సామూహిక అత్యాచారం..

నల్గొండ : నార్కట్ పల్లి (మం) బాజకుంటలో దారుణం చోటు చేసుకుంది. పని కల్పిస్తామని తీసుకెళ్లి బాలికపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో టీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త ఉయ్యాల వెంకన్న ఉన్నట్లు తెలుస్తోంది.

 

15:30 - February 18, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానం రచ్చ రచ్చ చోటు చేసుకుంది. డీఎంకే ఎమ్మెల్యేల విధ్వంసంతో అసెంబ్లీ రణరంగమై పోయింది. కుర్చీలు..బళ్లాలను విరిచివేశారు. స్పీకర్ ధన్ పాల్ పై పేపర్లు చించివేశారు. దీనితో సభను రెండుసార్లు వాయిదా వేశారు. జరిగిన తీరుపై డీఎంకే సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో తీవ్ర ఉత్కంఠ చెలరేగింది. స్పీకర్ తీరును నిరసిస్తూ అసెంబ్లీలోనే డీఎంకే సభ్యులు బైఠాయించారు. రంగంలోకి దిగిన మార్షల్స్ సభ్యులను బయటకు పంపించారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. దీనిపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరిగిన చొక్కాతో స్టాలిన్ బయటకు రావడం కలకలం రేగింది. అక్కడున్న వారికి అభివాదం చేస్తూ మీడియాతో మాట్లాడారు.

స్టాలిన్ ఆగ్రహం..
స్పీకర్ సభా మర్యాదలను పాటించలేదని విమర్శించారు. రహస్య ఓటింగ్ జరగకుండా సభను నడపాలని స్పీకర్ ప్రయత్నించారని, స్పీకర్ తన చొక్కా తానే చించుకున్నారని ఆరోపించారు. తనపట్ల మార్షల్స్ ఘోరంగా ప్రవర్తించారని, కొట్టి..తిట్టి..బలవంతంగా బయటకు లాక్కెళ్లారని తెలిపారు. తమను లోపల బంధించి చేయి కూడా చేసుకున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలు కొంతమంది గాయపడ్డారని, అసెంబ్లీలో తనను కూడా కొట్టారని తెలిపారు. దీనికి నిరసనగా గవర్నర్ ను కలుస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు.

సభ ప్రారంభం..పళని విజయం..
డీఎంకే సస్పెండ్ అనంతరం సభను స్పీకర్ ధన్ పాల్ ప్రారంభించారు. సభ ప్రారంభం అయిన తరువాత జరిగిన పరిణామాలు, స్పీకర్ చర్యలను నిరసిస్తూ 8మంది సభ్యులున్న కాంగ్రెస్ సభ్యులు, ముస్లీం లీగ్ సభ్యుడు వాకౌట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనితో తామే నెగ్గామని పళనిసెల్వం వర్గీయులు సంతోషం వ్యక్తం చేశారు. ఏకంగా స్వీట్లు కూడా పంచేశారు. సభలో బయట అలాంటి పరిస్థితి నెలకొనగా సభ లోపల స్పీకర్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం ఆరు డివిజన్ లుగా ఓటింగ్ నిర్వహించారు. చివరకు పళనిస్వామికి అనుకూలంగా 122, వ్యతిరేకంగా 11 ఓట్లు పడ్డాయి. దీనితో పళని స్వామి విజయం సాధించినట్లు స్పీకర్ వెల్లడించారు. పళని విజయం సాధించడంతో శశికళ వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం తెరపడినట్లేనని భావిస్తున్నారు.

బలపరీక్షలో నెగ్గిన పళని స్వామి..

చెన్నై : ఉత్కంఠ పరిణామాల మధ్య జరిగిన విశ్వాస పరీక్షలో పళనిస్వామి విజయం సాధించారు. డీఎంకే సభ్యుల సస్పెండ్..కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. విశ్వాస పరీక్షలో పళని స్వామి విజయం సాధించినట్లుగా స్పీకర్ ధన్ పాల్ ప్రకటించారు.

 

తమిళనాడు అసెంబ్లీ..ప్రారంభమైన ఓటింగ్..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ రెండు పర్యాయాలు వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం 3గంటలకు సభ ప్రారంభమైంది. డీఎంకే సభ్యులు లేకుండానే ఓటింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.

చెన్నైలోనే గవర్నర్ !..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ముంబై ప్రయాణం వాయిదా వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన చెన్నై లోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో పలు విధ్వంస ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

తమిళనాడు..కాంగ్రెస్ వాకౌట్..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైంది. డీఎంకే సభ్యులను మార్షల్స్ సహాయంతో బయటకు పంపారు. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

స్టాలిన్ తో స్పీకర్ చర్చలు..

తమిళనాడు : డీఎంకే ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ను స్పీకర్ చర్చకు ఆహ్వానించారు. రహస్య ఓటింగ్ జరపాల్సిందేనంటూ స్టాలిన్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

14:18 - February 18, 2017

చెన్నై : తమిళనాడు అసెంబ్లీ రణరంగాన్ని తలపిస్తోంది. వాయిదా పడిన వెంటనే ప్రారంభమైన అసెంబ్లీలో మరోసారి తీవ్ర గందగోళం నెలకొంది. దీంతో స్పీకర్‌ డీఎంకే ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు విధించారు. అయినా సభలో దుమారం ఆగలేదు. రహస్య ఓటింగ్‌ నిర్వహించాలని పన్నీర్‌ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు, డీఎంకే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. సభ్యుల డిమాండ్‌ను తోసిపుచ్చిన స్పీకర్‌ డివిజన్‌ ఓటింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. దీంతో సభ మరింత వేడెక్కింది. స్పీకర్‌ సభను మూడు గంటల వరకు వాయిదా వేశరు. అయినా డీఎంకే సభ్యులు సభలోనే బైటాయించారు. సభ నుంచి డీఎంకే సభ్యులను ఖాళీ చేయించాలని మార్షల్స్‌ను స్పీకర్‌ ఆదేశించారు. డీఎంకే సభ్యులను సభ నుంచి బయటకు పంపేందుకు మార్షల్స్‌ ప్రయత్నించడంతో.. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సభ నుంచి బయటకు వచ్చిన డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నాకు దిగారు.

స్పీకర్ ఆగ్రహం..
ఇక డీఎంకే సభ్యల ప్రవర్తనపై స్పీకర్‌ ధన్‌పాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానం గురించి ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన చొక్కా చింపి అవమానించారని అన్నారు. నిబంధనల ప్రకారం సభను నడుపుతున్నానని అన్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో సభా సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్‌ పదేపదే విజ్ఞప్తి చేశారు. అయినా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

ఊహించని మలుపులు..
అంతకుముందు కూడా తమిళనాడు అసెంబ్లీ రణరంగంగా మారింది. రహస్య ఓటింగ్‌ జరపాలని డిమాండ్‌ చేస్తూ.. డీఎంకే సభ్యులు, పన్నీర్‌ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు సభలో గందరగోళం సృష్టించారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి కుర్చీలు, మైకులు విరగ్గొట్టారు. కాగితాలు చించి స్పీకర్‌పై విసిరివేశారు. డీఎంకే ఎమ్మెల్యే కె.సెల్వం స్పీకర్‌ కుర్చీలో కూర్చున్నారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో శాసనసభను మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేశారు. సభలో తీవ్ర ఆందోళనలు చోటుచేసుకోవడంతో సభ నుంచి స్పీకర్‌ను మార్షల్స్‌ సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. మొత్తంగా సభలో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి.

పళనిస్వామి సమావేశం..
మొదటిసారి సభ వాయిదా పడగానే తన వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలతో పళనిస్వామి సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలను పన్నీర్‌స్వామిని కలవకుండా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. నలుగురు ఎమ్మెల్యేలను ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పగించారు. ఇటు సభ వాయిదా పడిన సందర్భంలో పళనిస్వామి వర్గానికి చెందిన ఎమ్మెల్యేల మనసు మార్చేందుకు డీఎంకే, పన్నీర్‌ స్వామి వర్గాల ఎమ్మెల్యేలు ప్రయత్నించారు.

రహస్య ఓటింగ్..
సభలో ప్రతిపక్ష నేత స్టాలిన్‌ మాట్లాడేందుకు స్పీకర్‌ అవకాశం ఇచ్చారు. రహస్య ఓటింగ్‌ ద్వారానే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని స్టాలిన్‌ అన్నారు. బల పరీక్షను మరోరోజు నిర్వహించాలని కోరారు. గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు 15 రోజుల గడువు ఇచ్చారని, బలపరీక్షకు ఇప్పుడే అంత తొందర ఎందుకని స్టాలిన్‌ ప్రశ్నించారు. సభ వాయిదా వేయడానికి స్టాలిన్‌ పట్టుపట్టారు. ప్రజాభిప్రాయం తెలుసుకున్న తర్వాతే బలపరీక్ష నిర్వహించాలని పన్నీర్‌ సెల్వం కోరారు. ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లి వచ్చిన తర్వాతే బలపరీక్షను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఓటింగ్‌ ఎలా నిర్వహించాలన్న దానిపై తన నిర్ణయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరని సభ్యులను ఉద్దేశించి స్పీకర్‌ అన్నారు. రహస్య ఓటింగ్‌ ద్వారానే బల పరీక్ష నిర్వహించాలని కోరిన డీఎంకే సభ్యుల డిమాండ్‌ చట్టబద్దత కాదన్నారు స్పీకర్‌. దీంతో స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు డీఎంకే సభ్యులు. దీంతో సభను వదిలివెళ్లారు స్పీకర్‌ ధన్‌పాల్‌. ఒకదశలో అన్నాడీఎంకే, డీఎంకే సభ్యులు బాహాబాహీకి దిగారు.

హై డ్రామా..
తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం హైడ్రామాలో నడిచింది. అసెంబ్లీ ద్వారాలు మూసివేసి మరి బలపరీక్ష నిర్వహించారు. ఇరు వర్గాల ఎమ్మెల్యేల నినాదాల మధ్యే విశ్వాస పరీక్ష ప్రవేశపెట్టారు. స్పీకర్‌ ధన్‌పాల్‌ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి.. సభలో ఓటింగ్‌ జరిపారు. రహస్య ఓటింగ్‌కు పన్నీర్‌ స్వామి, డీఎంకే ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. కానీ, ఇందుకు స్పీకర్‌ ధన్‌పాల్‌ అంగీకరించలేదు. దీంతో సభలో పన్నీర్‌ వర్గం ఎమ్మెల్యేలు, డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సభలో పన్నీర్‌కు మద్దతుగా డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రతిగా పళనీస్వామి ఎమ్మెల్యేలు కూడా నినాదాలు చేయడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. ఇరు వర్గాలను స్పీకర్‌ వారించడంతో సభ్యులు శాంతించారు. శాసనసభలో పళనిస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. 6 బ్లాకుల్లో ఎమ్మెల్యేల లెక్కింపు జరిగింది. ఒక్కో బ్లాకులో 38 మంది సభ్యులు ఉన్నారు. డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలను అసెంబ్లీ కార్యదర్శి లెక్కించారు. మొదటి డివిజన్‌లో పళనిస్వామి మెజార్టీ సాధించారు. ఇక అసెంబ్లీకి 230 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా కరుణానిధి సభకు హాజరుకాలేదు.

మహాజన పాదయాత్రలో పాల్గొన్న కారత్..

ఖమ్మం : బోసుబొమ్మ సెంటర్ వద్ద సీపీఎం మహాజన పాదయాత్రలో సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ వర్గాల ప్రజల కోసం సబ్ ప్లాన్ చట్టం చేయాలని కారత్ సూచించారు. కేంద్రంలో ప్రధాని మోడీ ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి కేంద్రంలో ప్రధాని మోడీ ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. మోడీ లానే కేసీఆర్ కూడా మొండి వైఖరి అవలింబిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.

వడమాలపేటలో ఆక్సిడెంట్..

తిరుపతి : వడమాలపేట బైపాస్ రోడ్డులో లారీ - కారు ఢీకొన్నాయి. ఇద్దరు మృతి చెందగా నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. మృతులు తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా వాసులుగా గుర్తించారు. తిరుపతి నుండి కడలూరు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

13:45 - February 18, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో పళని బల పరీక్ష తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పలు విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏకంగా స్పీకర్ పైకి కుర్చీలు విసరడం..పేపర్లు విసరడం..కుర్చీలు..బళ్లలు ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. పళనిస్వామి బల పరీక్షకు సంబంధించి శనివారం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. రహస్య ఓటింగ్ ను నిర్వహించాలన్న డీఎంకే కోరికను స్పీకర్ ధనపాల్ తిరస్కరించారు. దీంతో పన్నీర్ వర్గం, డీఎంకే ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోయారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్ పైకి కుర్చీలను విసిరారు. స్పీకర్ టేబుల్ పైకి ఎక్కి ఆందోళన చేశారు. స్పీకర్ ను నెట్టివేసే ప్రయత్నం చేశారు. చివరకు మార్షల్స్ వచ్చి ఆయనను సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ సమయంలో కూడా స్పీకర్ చొక్కా పట్టుకుని డీఎంకే ఎమ్మెల్యేలు లాగారు.

విజువల్స్ విడుదల..
అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో జరిగిన ప‌రిణామాల‌పై విజువల్స్‌ విడుద‌ల‌య్యాయి. స్పీక‌ర్ పోడియంలోకి దూసుకువ‌చ్చిన డీఎంకే ఎమ్మెల్యేలు చేసిన హైడ్రామా విజువల్స్ లో దర్శనమిచ్చాయి. ఉన్న స్పీక‌ర్ వద్ద ఎమ్మెల్యేలు ఆందోళన చేయడం..టేబుల్ పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. మార్షల్స్ సహాయంతో స్పీకర్ వెళ్లిపోయారు. అనంతరం స్పీక‌ర్ చైర్‌లో ఎమ్మెల్యేలు కూర్చొన్నారు. ముందుగా స్పీక‌ర్ చైర్‌లో డీఎంకే ఎమ్మెల్యే కువ్వా కూర్చొన్నట్లు, న‌వ్వుతూ వ‌చ్చిన మ‌రో డీఎంకే నేత కూడా స్పీక‌ర్ చైర్‌లో కూర్చున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సభను మధ్యాహ్నం 1గంటకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

తిరిగి సభ ప్రారంభం..
స‌భ‌లో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం చోటు చేసుకోవ‌డంతో స‌భ‌ను ఒంటిగంట‌వ‌ర‌కు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైంది. స‌భ‌లో ర‌హ‌స్య ఓటింగ్ మాత్ర‌మే జ‌ర‌గాల‌ని డీఎంకే, పన్నీర్ వర్గం, కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బీభ‌త్సం సృష్టిస్తుండ‌డంతో మ‌ళ్లీ ఏం జ‌ర‌గ‌బోతోంద‌నే అంశంపై ఉత్కంఠ నెల‌కొంది. ఏర్పడుతున్న ప‌రిస్థితుల దృష్ట్యా అసెంబ్లీ ప్రాంగ‌ణంలో పోలీసులు, సభలో భారీ సంఖ్యలో మార్షల్స్ మోహరించారు.

మళ్లీ గందరగోళం..స్పీకర్ ఆవేదన..
సభ ప్రారంభమైన అనంతరం కూడా డీఎంకే, పన్నీర్ వర్గం ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. దీనిపై స్పీకర్ ధన్ పాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యంగ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే స‌భ నిర్వ‌హిస్తున్న‌ట్లు, తనకు జరిగిన అవమానం ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. తన చొక్కా చింపి తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స‌భ స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న అన్నారు. కానీ సభలో మాత్రం ఆందోళన కొనసాగింది.

స్పీకర్ సంచలన నిర్ణయం..
చివరకు డీఎంకే సభ్యుల విషయంలో స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉన్న ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం..పలు విధ్వంస ఘటనలకు పాల్పడినందుకు సస్పెండ్ చేశారు. స్పీక‌ర్ పోడియాన్ని చుట్టుముట్టి డీఎంకే నేత‌లు ఆందోళ‌న తెలుపుతున్నారు. స‌భను ఖాళీ చేయాల‌ని వారికి స్పీక‌ర్ సూచిస్తున్నారు. కానీ వారు ఏమాత్రం వినిపించుకోకుండా ఆందోలన చేపట్టారు. 89 మంది ఎమ్మెల్యేలను ఇక్కడినుండి పంపించి వేయాలని మార్షల్స్ కు స్పీకర్ సూచించారు. తరలింపులో సమయం పడుతుందని భావించిన స్పీకర్ సభను 3గంటల వరకు వాయిదా వేశారు.

తమిళనాడు..అసెంబ్లీ మళ్లీ వాయిదా..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ మధ్యాహ్నం 3గంటల వరకు వాయిదా పడింది. ఉదయం నుండి పలు ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

 

డీఎంకే సభ్యుల సస్పెన్షన్..

చెన్నై : డీఎంకే సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ధన్ పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శనివారం పళనిస్వామి బలపరీక్షలో డీఎంకే ఎమ్మెల్యేలు విధ్వంసానికి పూనుకున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం అనంతరం తిరిగి ప్రారంభం కాగానే డీఎంకే ఆందోళన చేపట్టింది. చివరకు 89 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు.

13:16 - February 18, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏకంగా స్పీకర్ పైకి పేపర్లు విసిరేయడం..స్పీకర్ ను నెట్టివేయడం..ఆయన కుర్చీని పక్కకు తప్పించే ప్రయత్నాలు చోటు చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మీడియాను లోనికి అనుమతించలేదు. అసెంబ్లీలో ప్రత్యక్ష ప్రసారాలను స్పీకర్ నిలిపివేశారు. వాయిస్ ను కూడా కట్ చేశారు. ఉద్రిక్తత అనంతరం మధ్యాహ్నం 1గంట అనంతరం సభ ప్రారంభమైంది. సభలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా ? అనే ఉత్కంఠ నెలకొంది.

 • పళని స్వామి బల నిరూపణ కోసం శనివారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది.
 • రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్..డీఎంకే..కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
 • అసెంబ్లీలో సెల్వం వర్గం చీఫ్ విప్ గా సెమ్మలైను ను మధుసూధన్ నియమించారు.
 • చీఫ్ విప్ ను, ప్రధాన ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వాలని పన్నీర్ వర్గం..డీఎంకే డిమాండ్ చేసింది. దీనికి స్పీకర్ అనుమతినివ్వలేదు.
 • ఇప్పటికే రాజేంద్రనాథ్ విప్ గా ఉన్నారని..విప్ ఎవరో తేల్చుకున్న అనంతరం బలపరీక్ష నిర్వహించాలని డీఎంకే నేత స్టాలిన్ డిమాండ్ చేశారు.
 • రెండు బృందాల ఓటింగ్ అనంతరం మూడో బృందంతో ఓటింగ్ నిర్వహిస్తుండగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
 • డీఎంకే సభ్యులు రెచ్చిపోయారు. కుర్చీలు..బళ్లలు విసిరేశారు. స్పీకర్ పైకి పేపర్లు విసిరేశారు.
 • ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు.
 • మార్షల్స్ సహాయంతో స్పీకర్ సురక్షితంగా బయటకు వెళ్లిపోయారు.
 • మధ్యాహ్నం 1గంట వరకు సభను స్పీకర్ వాయిదా వేశారు.
12:57 - February 18, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో విధ్వంసం చోటు చేసుకుంది. కుర్చీలను..టేబుళ్లను విరిచేశారు..ఇరువర్గాలు బాహాబాహికి దిగారు..ఈ ఘటనలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు..మార్షల్స్ కు గాయాలైనట్లు తెలుస్తోంది. స్పీకర్ పైకి పేపర్లు విసిరేయడం..స్పీకర్ ను తప్పించడం వంటి పరిణామాలతో అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక్కసారిగా డీఎంకే అనుసరించిన వ్యూహంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పళనిస్వామి విశ్వాస పరీక్ష నెగ్గుతారా ? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

సీక్రేట్ బ్యాలెట్ నిర్వహించాలని ఆందోళన..
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. పళనిస్వామి విశ్వాస పరీక్ష ఎదుర్కొంటున్నారు. కానీ అసెంబ్లీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓటింగ్ ముందు..ఓటింగ్ అనంతరం ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పన్నీర్ వర్గం, డీఎంకే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. సీక్రేట్ ఓటింగ్ నిర్వహించాలన్న వినతిని స్పీకర్ ధన్ పాల్ తిరస్కరించారు. వాయిస్ ఓటింగ్ కు అనుమతినించారు. రెండు బృందాల ఓటింగ్ అనంతరం పరిస్థితులు మారిపోయాయి. ఒక్కసారిగా డీఎంకే ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. స్పీకర్ పైకి చించిన పేపర్లు విసిరేశారు. కుర్చీలు..బళ్లలను విరిచేశారు. స్పీకర్ మైక్ ను విరగొట్టారు. రంగ ప్రవేశం చేసిన మార్షల్స్ స్పీకర్ ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనితో ఇద్దరు మార్షల్స్, ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి. వెంటనే అసెంబ్లీ ప్రాంగణంలోకి 108 అంబులెన్స్ తెప్పించి అందులో వారిని తరలించారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షం..అధికార పక్ష సభ్యులు బాహాబాహీకి దిగినట్లు తెలుస్తోంది. చివరకు మధ్యాహ్నం ఒంటి గంటకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. చివరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? పళని విశ్వాస పరీక్ష నెగ్గారని ప్రకటిస్తారా ? అనేది కాసేపట్లో తేలనుంది.

తమిళనాడు అసెంబ్లీలో అంబులెన్స్..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలోకి అంబులెన్స్ చేరుకుంది. ఉదయం జరిగిన ఘటనలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు గాయాలైనట్లు సమాచారం.

తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా పడింది. స్పీకర్ ధన్ పాల్ ను మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు. ఓటింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగింది. ఉదయం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో స్పీకర్ మీదకు డీఎంకే సభ్యులు కుర్చీలను విసిరేశారు. టేబుళ్లు, మైక్ లను డీఎంకే ఎమ్మెల్యేలు ధ్వంసం చేశారు. స్పీకర్ ఛైర్ లో డీఎంకే ఎమ్మెల్యే కె.సెల్వం కూర్చొవడం కలకలం రేగింది. ఓటింగ్ ను మరోరోజు నిర్వహించాలని డీఎంకే పట్టుబట్టింది.

 

12:27 - February 18, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్టాలిన్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టారు. పళనిస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు శనివారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. అప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వని డీఎంకే ఒక్కసారిగా వ్యూహాలు మార్చేసింది. సభలో గందరగోళ పరిస్థితులు సృష్టించింది. ఒక పార్టీకి ఇద్దరు విప్ లు ఏంటీ ? బలపరీక్ష అంత తొందరగా ఎందుకు చేస్తున్నారని ? సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలని స్టాలిన్ డిమాండ్ చేయడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

విప్ ఎవరు అన్న స్టాలిన్..
పళనిస్వామి విశ్వాస పరీక్షలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీలో సెల్వం వర్గం చీఫ్ విప్ గా సెమ్మలైను ను మధుసూధన్ నియమించారు. చీఫ్ విప్ ను, ప్రధాన ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వాలని పన్నీర్ వర్గం..డీఎంకే డిమాండ్ చేసింది. దీనికి స్పీకర్ అనుమతినివ్వలేదు. ఇప్పటికే రాజేంద్రనాథ్ విప్ గా ఉన్నారని..విప్ ఎవరో తేల్చుకున్న అనంతరం బలపరీక్ష నిర్వహించాలని డీఎంకే నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. బలపరీక్షకు 15 రోజులు గడువు ఇచ్చారని, ఇప్పుడే తొందర ఎందుకు అంటూ స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనిపై పళని వర్గం అభ్యంతరం తెలిపింది. డీఎంకే...పన్నీర్ వర్గం మధ్య బంధం ఏంటో బయటపడిందని పళని వర్గం ఎదురు దాడి చేసింది.

కుర్చీలు పగులగొట్టి..బెంచ్ ల పైకి ఎక్కి..
సీక్రేట్ బ్యాలెట్ నిర్వహించాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పన్నీర్ వర్గం..డీఎంకే స్పీకర్ ను కోరింది. స్పీకర్ పోడియం వద్ద చుట్టుముట్టి ఆందోళన చేపట్టింది. ఈ సమయంలో పన్నీర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య వాయిస్ ఓటింగ్ కు స్పీకర్ అనుమతినిచ్చారు. రెండు బృందాలు కూడా పళని స్వామికి మద్దతు పలికినట్లు, మూడో బృందాన్ని లెక్కిస్తుండగా మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా చేయడం పూర్తిగా అప్రజాస్వామికమని పన్నీర్..డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. ఒక్కసారిగా డీఎంకే ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టాయి. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి కుర్చీలను పలుగగొట్టారు. బెంచీలపైకి ఎక్కి ఆందోళన చేశారు. దీనితో స్పీకర్ తన స్థానం నుండి వెళ్లిపోయారు.

మీడియాకు నో..
మరోవైపుఏ రాష్ట్ర అసెంబ్లీలో మీడియాకు ఎలాంటి ప్రవేశం కల్పించకపోవడం తీవ్ర కలకలం రేగింది. వాయిస్ కూడా వినిపించకపోవడం పట్ల మీడియా నిరసన వ్యక్తం చేసింది. ఇది తమ నిర్ణయం కాదని, స్పీకర్ నిర్ణయమని పోలీసులు పేర్కొంటున్నారు.

తమిళనాడు అసెంబ్లీ..ఉద్రిక్తత..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పళని స్వామి బలపరీక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ వర్గం..డీఎంకే ఆందోళన చేపట్టింది. పలువురు ఎమ్మెల్యేలు బెంచ్ లపైకి ఎక్కి ఆందోళన చేస్తున్నట్లు, కుర్చీలు విరగొట్టినట్లు తెలుస్తోంది.

12:05 - February 18, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో హై డ్రామా నెలకొంది. శనివారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. పళనిస్వామి విశ్వాస పరీక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డీఎంకే, పన్నీర్ వర్గాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అసెంబ్లీలో సెల్వం వర్గం చీఫ్ విప్ గా సెమ్మలైను ను మధుసూధన్ నియమించారు. ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసిన స్పీకర్ అసెంబ్లీ తలుపులను మూసివేసి మరీ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రహస్య ఓటింగ్ ప్రతిపాదనను స్పీకర్ ధన్ పాల్ తిరస్కరించారు. రహస్య ఓటింగ్ కు పన్నీరు, డీఎంకే, కాంగ్రెస్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ఓటింగ్ అనంతరం డివిజన్ ల వారీగా అసెంబ్లీ కార్యదర్శి లెక్కించనున్నారు. డివిజన్ల వారి లెక్కింపు అనంతరం స్పీకర్ నిర్ణయం ప్రకటించనున్నారు. పళని స్వామికి తొలి డివిజన్ అనుకూలంగా వచ్చినట్లు తెలుస్తోంది.

పన్నీర్ వర్గం..డీఎంకే..ఆందోళన..
కానీ తమ విప్ ను మాట్లాడనియ్యాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని డీఎంకే కోరింది. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. సీక్రెట్ ఓటింగ్ డిమాండ్ ను తిరస్కరించడంపై డీఎంకే నేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహస్య ఓటింగ్ నిర్వహించాలని, బలపరీక్ష మరో రోజు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ 15 రోజులు గడువు ఇచ్చారని అంత తొందర ఎందుకని నిలదీశారు. రహస్య ఓటింగ్ ద్వారానే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని తెలిపారు.

ప్రజాభిప్రాయం తెలుసుకున్న అనంతరం నిర్వహించాలి - పన్నీర్..
ఎమ్మెల్యేలను కువత్తూరులో ఉంచారని అందరికీ తెలిసిందేనని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకున్న అనంతరం బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ప్రజాభిప్రాయం తెలుసుకున్న అనంతరం నిర్వహించాలి - పన్నీర్..

చెన్నై : ఎమ్మెల్యేలను కువత్తూరులో ఉంచారని అందరికీ తెలిసిందేనని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకున్న అనంతరం బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.

బలపరీక్ష మరో రోజు నిర్వహించాలి - స్టాలిన్..

చెన్నై : బలపరీక్ష మరో రోజు నిర్వహించాలని డీఎంకే నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. గవర్నర్ 15 రోజులు గడువు ఇచ్చారని అంత తొందర ఎందుకని నిలదీశారు. రహస్య ఓటింగ్ ద్వారానే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని తెలిపారు.

కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో పళనిస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నారు. కాసేపటి క్రితం ఓటింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియను స్టాలిన్ అడ్డుకున్నారు. డీఎంకే సభ్యుల ఆందోళనతో కౌంటింగ్ ప్రక్రియను స్పీకర్ కాసేపు నిలిపివేశారు. సీక్రెట్ ఓటింగ్ డిమాండ్ ను తిరస్కరించడంపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహస్య ఓటింగ్ నిర్వహించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.

11:37 - February 18, 2017

తమిళనాడు అసెంబ్లీ..ఓటింగ్..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో పళనిస్వామి విశ్వాస పరీక్ష ఎదుర్కొంటున్నారు. కాసేపటి క్రితం రహస్య ఓటింగ్ ప్రతిపాదనను స్పీకర్ ధన్ పాల్ తిరస్కరించారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. డివిజన్ ల వారీగా ఓట్లను లెక్కిస్తున్నారు.

తమిళనాడు అసెంబ్లీ..కొనసాగుతున్న బలపరీక్ష..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ పళనిస్వామి బలపరీక్ష ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసని స్పీకర్ అసెంబ్లీ తలుపులను మూసివేసి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రహస్య ఓటింగ్ ప్రతిపాదనను స్పీకర్ ధన్ పాల్ తిరస్కరించారు. రహస్య ఓటింగ్ కు పన్నీరు, డీఎంకే, కాంగ్రెస్ పట్టుబట్టింది.

11:26 - February 18, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. పళని స్వామి విశ్వాస పరీక్ష ఎదుర్కొనేందుకు సభను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. జయ మరణానంతరం సీఎం పదవి కోసం శశికళ..పదవిని చేజారిపోకుండా ఉండేందుకు పన్నీర్ సెల్వం పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడం సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం విశ్వాస పరీక్షను పళని ఎదుర్కొననున్నారు. సభ ప్రారంభమైన అనంతరం పన్నీర్..పళని వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య స్పీకర్ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. విశ్వాస పరీక్ష తీర్మానాన్ని సభలో పళని స్వామి ప్రవేశ పెట్టారు. విశ్వాస పరీక్ష బ్యాలెట్ పద్ధతిలో జరపాలని పన్నీర్..స్టాలిన్ వర్గాలు పట్టుబట్టాయి. పన్నీర్ సెల్వంకు డీఎంకే మద్దతు తెలుపుతూ ఆందోళన చేపట్టింది.
బలపరీక్ష నెగ్గేందుకు ఎమ్మెల్యేల సంఖ్య 117గా ఉంది. బల నిరూపణకు 10 ఓట్లు కీలకంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం స్థానాలు 234 గా ఉన్నాయి. కానీ జయ మరణానంతరం ఒక స్థానం ఖాళీగా ఉండగా, అస్వస్థత కారణంగా కరుణానిధి సభకు హాజరు కావడం లేదు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదని ప్రకటించారు. దీనితో 234 స్థానాలు 230కి పడిపోయాయి. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 116గా మారుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి బలపరీక్ష నెగ్గుతారా ? లేదా ? అనేది చూడాలి.

తమిళనాడు..అసెంబ్లీ గందరగోళం..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడంతో సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి.

తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన పళని స్వామి..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని సీఎం పళనిస్వామి ప్రవేశ పెట్టారు. తాము నియమించిన విప్ ను మాట్లాడనివ్వాలని పన్నీర్ వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో గందరగోళం నెలకొన్నట్లు సమాచారం.

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభం..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. కాసేపట్లో పళనీ స్వామి బలపరీక్ష ఎదుర్కొననున్నారు.

10:47 - February 18, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిసేపట్లో బలబలాలు తేలిపోనున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గవర్నర్ కు ఇచ్చిన వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గరిష్టంగా 15 రోజుల టైం ఇచ్చినా ఈ రోజే పరీక్షను ఎదుర్కోవాలని పళని నిర్ణయించారు. పళని స్వామి బలపరీక్షలో నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతుండాలి. అయితే చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరుగుతుందని పన్నీర్ సెల్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పళని వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. అప్పటి వరకు పన్నీర్ వర్గంలో 11 మంది ఎమ్మెల్యేలున్న సంఖ్య 13కి చేరుకుంది. అంటే పళనీ సెల్వం వద్ద 122 ఎమ్మెల్యేల బలం ఉంది. మిగతా ఎమ్మెల్యేల్లో కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగరవేస్తే పళనీ విశ్వాస పరీక్ష ఓడిపోనున్నారు. ఎమ్మెల్యేలకు రహస్య ఓటింగ్ నిర్వహించాలని ఇప్పటికే పన్నీర్ వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరిన సంగతి తెలిసిందే. రహస్య ఓటింగ్ కు అనుమతినిస్తే తమ వైపు వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందని పన్నీర్ వర్గం పేర్కొంటోంది. బలనిరూపణ చేయడానికి ఉండాల్సిన ఎమ్మెల్యేల కంటే కేవలం ఐదుగురు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. పన్నీర్ వైపుకు వచ్చే ఎమ్మెల్యేలు ఎంత మంది ? బలపరీక్షలో పళని స్వామి నెగ్గుతారా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది.

కూలిన షెల్టర్..

హిమాచల్ ప్రదేశ్ : మండి ప్రాంతంలో తాత్కాలికంగా వేస్తున్న షెల్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు కూలీలకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ శివరాత్రి ఉత్సవంలో భాగంగా షెల్టర్ ను నిర్మిస్తున్నారు.

ఐడీబీఐ బ్యాంకుకు రూ. 7 కోట్ల టోకరా..

గుంటూరు : ఐడీబీఐ బ్యాంకుకు మిల్క్ డెయిరీ యజమాని రూ. 7 కోట్ల టోకరా వేశారు. చేపల చెరువుల తవ్వకాల పేరిట ప్రభుత్వ భూములను షూరిటీగా చూపించి బాపట్ల కామాక్షి మిల్క్ డెయిరీ యజమాని మల్లిఖార్జున్ రుణాలు తీసుకున్నారు. ఐడీబీఐ బ్యాంకు ఏజీఎం చంద్రశేఖర్ రావుతో పాటు 38 మంది బ్యాంకు ఉన్నతాధికారుల ఫిర్యాదుతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 2010-12 మధ్య విడతల వారీగా నిందితులు రుణాలు పొందినట్లు తెలుస్తోంది.

వ్యతిరేకంగా ఓటేస్తాం -తమిళనాడు కాంగ్రెస్..

చెన్నై : కాసేపట్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. పళనీస్వామి విశ్వాసపరీక్ష ఎదుర్కొననున్నారు. వ్యతిరేకంగా ఓటు వేస్తామని కాసేపటి క్రితం కాంగ్రెస్ వెల్లడించింది.

10:23 - February 18, 2017
10:19 - February 18, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తాజా చిత్రం 'దువ్వాడ జగన్నాథమ్ (డీజే) ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎదురు చూపులు ఫలించాయి. కాసేపటి క్రితం ఫస్ట్ లుక్ విడుదలైంది. ట్విట్టర్ ద్వారా లుక్ ను 'అల్లు అర్జున్' విడుదల చేశారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో 'బన్నీ' సరసన 'పూజాహెగ్డే' నటిస్తోంది. దేవీ శ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ 'అల్లు అర్జున్' గత చిత్రాలకంటే భిన్నంగా ఉండడం విశేషం. నదుటిన విభూతి ధరించి స్కూటర్ పై కూరగాయలు సంచులతో వస్తున్న లుక్ అదరగొడుతోంది. ఈ చిత్రంలో బ్రాహ్మణ యువకుడిగా నటించనున్నట్లు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ లో 'దిల్' రాజు ప్రొడక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మహాశివరాత్రి సందర్భంగా చిత్ర టీజర్ ను విడుదల చేస్తారని టాక్. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

10:12 - February 18, 2017

చెన్నై : తమిళ రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. ఉదయం 11గంటలకు పళనీ స్వామి సభా విశ్వాసాన్ని కోరనున్నారు. గోల్డేన్ బే రిసార్ట్ లో బస చేసిన ఎమ్మెల్యేలను 35 వాహనాల్లో అసెంబ్లీకి తరలించారు. స్వల్ప మెజార్టీతోనైనా గట్టెకుతామని పళనీ స్వామి ధీమా వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం కూలిపోతుందని పన్నీర్ సెల్వ వర్గం పేర్కొంటోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వాస పరీక్ష నేపథ్యంలో అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా అన్నాడీఎంకేకి 135 స్థానాలు, డీఎంకేకి 89 ఉన్నాయి. అలాగే కాంగ్రెస్‌కి 8 స్థానాలు ఉన్నాయి. అయితే పళనిస్వామి వర్గంలో 123 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. పన్నీర్‌ సెల్వం వర్గంలో 11 మంది మాత్రమే ఉన్నారు. కానీ తాజాగా మరో ఎమ్మెల్యే పన్నీర్ వర్గానికి సపోర్టు చేయడంతో ఆ సంఖ్య 12కి చేరుకుంది. ఇప్పటి వరకు పళనీ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యే అరుణ్ కుమార్ జంప్ అయ్యారు. పళనిస్వామికి అనుకూలంగా తాను ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయబోనని ఆయన బహిరంగంగా ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో ఆయన చేయి కలిపారు. అరుణ్ కుమార్ పన్నీర్ శిబిరంలో చేరడంతో, పళనిస్వామి బలం 122కు పడిపోయింది. బల పరీక్షలో ఆయన నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. రహస్య ఓటింగ్ ద్వారా బల పరీక్ష జరుగుతుందా ? పళనీ నెగ్గుతారా ? లేదా ? అనేది చూడాలి.

10:10 - February 18, 2017

తెలంగాణ ప్రభుత్వం ఏ పనిచేసినా ముందట పడ్తలేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేద్దామంటే నిరుద్యోగులు కోర్టులో కేసు వేసిండ్రు. లాంగ్వేజ్ పండిట్లకు అప్ గ్రేడ్ చేద్దామంటే ఎస్ జీ డీలు కోర్టు మెట్లు ఎక్కిండ్రు. గురుకులాల్ల పోస్టులను భర్తీ చేద్దామంటే.. అర్హతల పంచాయతీ కోర్టుకు చేరింది. ఆఖరుకు సింగరేణి వారసత్వ ఉద్యోగుల ముచ్చట కూడా కోర్టుకు చేరింది. ఇంతకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా ? పంచాయతీ పెడుతుందా ? మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:00 - February 18, 2017
09:27 - February 18, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ? పళనిస్వామి విశ్వాస పరీక్షలో నెగ్గుతారా ? సీఎం పదవిని ఇప్పటికే త్యాగాలు చేసిన పన్నీర్ సెల్వం మళ్లీ ఆ పదవిని చేజిక్కించుకుంటారా ? అనేది కొద్దిసేపట్లో తేలనుంది. నేడు పళనీ స్వామి అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కొనున్నారు. ఇప్పటికే రిసార్ట్ నుండి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు. కానీ పళనీ స్వామి వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల్లో కొంతమంది పన్నీర్ కు మద్దతిస్తున్నారు. దీనిపై టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణసాయిరాం విశ్లేషణ అందించారు. 'సభయొక్క విశ్వాసం..ఆమోదం పొందాలంటే మూడు రకాల పద్ధతులు ఉంటాయి. వాయిస్ ఓటు ద్వారా..డివిజన్ ఆఫ్ ఓటింగ్ ద్వారా...సీక్రేట్ బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తుంటారు. స్పీకర్ విచక్షణమీద ఆధార పడి ఉంది. డివిజన్ ఆఫ్ ఓటింగ్ కు వెళ్లే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఓటింగ్ అనంతరం క్రోడీకరించి లెక్కించాల్సి ఉంటుంది. ఇది కొంత సమయం పట్టే అవకాశం ఉంది. విప్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే కనుక్కోవడం కష్టంగా ఉంటుంది. సభ విశ్వాసం ప్రకటిస్తోంది అనే ఏక వ్యాఖ్యం ద్వారా ఉంటుంది. పళనీ వర్గంలోని కొంతమంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు పన్నీర్ కు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యరీత్యా హాజరు కావడం లేదని కీలకఘట్టంగా పేర్కొనవచ్చు. కీలక నేతలు లేకుండా సభ జరుగుతోంది' అని పేర్కొన్నారు. ఇంకా మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా అన్నాడీఎంకేకి 135 స్థానాలు, డీఎంకేకి 89 ఉన్నాయి. అలాగే కాంగ్రెస్‌కి 8 స్థానాలు ఉన్నాయి. అయితే పళనిస్వామి వర్గంలో 123 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. పన్నీర్‌ సెల్వం వర్గంలో 13 మంది మాత్రమే ఉన్నారు. డీఎంకే ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

 

09:13 - February 18, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం నేటితో తెరపడనుందా ? ఇంకా కొనసాగుతుందా ? అనేది కాసపట్లో తేలిపోనుంది. జయ మరణం అనంతరం రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. సీఎం పదవి కోసం శశికళ..పదవిని దక్కించుకోవడానికి పన్నీర్ సెల్వం పోటీ పడిన సంగతి తెలిసిందే. కానీ అక్రమాస్తుల కోర్టు కేసులో శశికళ జైలుకు వెళ్లడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. అనంతరం వారసుడిగా పళనీస్వామి తెరమీదకు రావడం..సీఎంగా ప్రమాణం చేయడం జరిగిపోయాయి. నేడు అసెంబ్లీలో పళనిస్వామి సర్కార్‌ బలపరీక్ష జరగనుంది. కానీ విశ్వాస పరీక్షలో నెగ్గుతారా ? లేదా ? అనేది తెలియడం లేదు. పళనీస్వామి వర్గంలో 123 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పన్నీర్ సెల్వం వర్గంలో 12 మంది మాత్రమే ఉన్నారు. తాజాగా కోయంబత్తూర్ అరుణ్ కుమార్ శశికళ శిబిరం నుండి మాయమైపోయారు. తనకు రాజకీయాలు వద్దు..అని తటస్థంగా ఉంటానని పేర్కొనడం కలకలం రేగుతోంది. ఈయన పన్నీర్ వర్గంలో చేరితే బలం 13కి చేరుతుంది. మ్యాజిక్ ఫిగర్ 117 గా ఉన్న సంగతి తెలిసిందే. పళిని స్వామి వర్గంలోని ఎమ్మెల్యేలు ఎవరు చేయి ఇస్తారో ? ఎవరు మద్దతిస్తారో తెలియడం లేదు.
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా అన్నాడీఎంకేకి 135 స్థానాలు, డీఎంకేకి 89 ఉన్నాయి. అలాగే కాంగ్రెస్‌కి 8 స్థానాలు ఉన్నాయి. అయితే పళనిస్వామి వర్గంలో 123 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. పన్నీర్‌ సెల్వం వర్గంలో 13 మంది మాత్రమే ఉన్నారు. డీఎంకే ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

8వేల లీటర్ల కల్తీ నెయ్యి స్వాధీనం..

విజయవాడ : సుబ్బరాజునగర్ లో యథేచ్చగా కల్తీ నెయ్యి దందా నడుస్తోంది. శనివారం ఉదయం శ్రీలక్ష్మి దివ్యబాబు ట్రేడర్స్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 8వేల లీటర్ల కల్తీ నెయ్యి, 200 లీటర్ల పామాయిల్, నకిలీ బ్రాండ్ నెయ్యి ప్యాకెట్లు, మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. 8మంది నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

మైనర్ కూతురిపై తండ్రి అత్యాచారం..

కృష్ణా : నూజివీడు అజరయ్య పేటలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఏడాదిగా కన్నతండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాలిక సోదరి గమనించడంతో తండ్రి పరారయ్యాడు. తండ్రిపై పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

శ్రీశైలంలో రెండో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

కర్నూలు : శ్రీశైలంలో రెండో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు భృంగివాహనంపై మల్లిఖార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారు ఊరేగనున్నారు. స్వామి వారికి టిటిడి ఈవో పట్టువస్త్రాలు సమర్పించారు.

08:35 - February 18, 2017

ఖమ్మం : కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయినా కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీ అమలుకు నోచుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు ఈ పాలనలో కష్టాలు తప్పా.. ఒరిగిందేమీ లేదని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు విద్య అందుబాటులోకి వచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలు సంతోషంగా లేరని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని కేసీఆర్‌ సర్కార్‌ అటకెక్కించిందని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పేద పిల్లలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యపట్ల కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. పేదల జీవితాలలో వెలుగొచ్చినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. రెండున్నరేళ్లయినా కేజీ టూ పీజీ విద్య అమలుకు నోచుకోలేదని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు.

124వ రోజు..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన హామీలన్నింటిని ఆచరణ రూపం దాల్చాలని సీపీఎం పాదయాత్ర బృందం సభ్యుడు ఎమ్వీ రమణ అన్నారు. చేనేత, గొర్లకాపరులు, వివిధ కుల వృత్తుల వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన సూచించారు. బడుగుల కోసం కేసీఆర్‌ సర్కార్‌ చేసిందేమి లేదని ఆయన అన్నారు. 124 వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర ఖమ్మం జిల్లాలోని జగన్నాథపురంలో ప్రారంభమై... పందిళ్లపల్లి, గాంధీనగర్‌, ధంసలాపురం, అగ్రహారం, ముస్తఫానగర్‌ మీదుగా ఖమ్మం టౌన్‌ చేరుకుంది. పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పడుతున్నారు. పల్లెపల్లెలో పూలమాలలతో తమ్మినేని బృందానికి ఘనస్వాగతం తెలుపుతున్నారు. మహిళలు బతుకమ్మలతో ఆహ్వానం పలికారు. చిన్నారుల నృత్యాలు, మహిళల కోలాటం ఆకట్టుకుంది. ఖమ్మం టౌన్‌లో ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. కానీ.. ఇళ్ల స్థలాలు చూపించలేదని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

08:32 - February 18, 2017

ఉత్తర్ ప్రదేశ్ : బస్సులో వేధిస్తున్న కీచకునికి ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళ దేహశుద్ధి చేసింది. భాగ్‌పట్‌ బస్సులో నిత్యం వేధిస్తున్న ఓ పోకిరీని యువతి చెప్పుతో చితకబాదింది. నిత్యం తనను వేధిస్తున్న కీచకునికి బుద్ధి చెప్పాలని బస్సుదిగగానే పిడికిలి బిగించిన ఆ మహిళ.. అతని చొక్కాపట్టుకుని నడిరోడ్డులోకి ఈడ్చుకొచ్చి చెప్పుతో చితకబాదింది. విషయం తెలుసుకున్న మిగతా ప్రయాణికులు తలో చెయ్యేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పోకిరీని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

గోల్డెన్ బే రిసార్ట్ నుండి బయలుదేరిన ఎమ్మెల్యేలు..

చెన్నై : నేడు పళనిస్వామి బలనిరూపణ చేసుకోనున్నారు. గోల్డెన్ బే రిసార్ట్ లో బస చేసిన ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. తాము ప్రభుత్వం ఏర్పరుస్తామని, బలపరీక్షలో నెగ్గుతామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గంగదేవిపల్లికి ప్రభుత్వ కార్యదర్శుల బృందం..

వరంగల్ రూరల్ : నేడు గంగదేవిపల్లికి 45 మంది ప్రభుత్వ కార్యదర్శుల బృందం రానుంది. గంగదేవిపల్లి గ్రామాభివృద్ధి పరిశీలన, మరుగుదొడ్ల నిర్వహణపై అధ్యయనం చేయనుంది.

నేడు టీఎస్ పీఎస్సీ భవన్ ముట్టడి..

హైదరాబాద్ : గురుకులాల్లో అవకాశం కల్పించాలని కోరుతూ నేడు టీఎస్ పీఎస్సీ భవన్ ముట్టడికి డీఎడ్ అభ్యర్థులు పిలుపునిచ్చారు.

మహాజన పాదయాత్రలో పాల్గొననున్న కారత్..

ఖమ్మం : సీపీఎం మహాజన పాదయాత్ర 125వ రోజుకి చేరుకుంది. పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. నేడు సీపీఎం మహాజన పాదయాత్రలో సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ పాల్గొననున్నారు.

కాసేపట్లో చెన్నై కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం..

చెన్నై : ఉదయం 9గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ఓటు వేసే అంశంపై సీఎల్పీ నిర్ణయం తీసుకోనుంది.

 

నేటి నుండి బాబు జిల్లాల వారీ సమీక్షలు...

విజయవాడ : అమరావతి నేటి నుండి టిడిపి జిల్లా వారి సమీక్షలను సీఎం చంద్రబాబు నాయుడు చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు అనంతపురం జిల్లా నేతలతో బాబు భేటీ కానున్నారు.

08:13 - February 18, 2017
07:30 - February 18, 2017

హైదరాబాద్: కాసేపట్లో అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణ చేసుకోనున్నారు. అయితే.. పళనిస్వామి ఈ గండం నుంచి గట్టెక్కుతాడా ? లేడా ? అనే సస్పెన్స్‌ మాత్రం కొనసాగుతూనే ఉంది. నిన్న సాయంత్రం వరకు ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించిన డీఎంకే తాజాగా వ్యూహం మార్చుకుంది. ఈ నేపథ్యంలో బిజెపి ఏం చేయబోతోంది? రాజ్యాంగం ప్రకారం గరవ్నర్ పనిచేశారా? తెలంగాణ లో రాబోయే రోజుల్లో ఓ కొత్త పార్టీ అవసరం వుంది అని జేఏసీ నేత కోదండరామ్ తెలిపారు. ఈ అంశాలపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఎస్.వినయ్ కుమార్, రవళి టి.బిజెపి నేత, కాంగ్రెస్ నేత బెల్యానాయక్, టిఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

శశికళకు ఈసీ నోటీసులు

చెన్నై: అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదంటూ పన్నీర్‌ సెల్వం వర్గానికి చెందిన మైత్రేయన్‌ ఎన్నికల కమిషన్‌ వద్ద పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ఈ నెల 28లోపు సమాధానం ఇవ్వాలని శశికళకు ఈసీ నోటీసులు జారీ చేసింది.

శంషాబాద్ లో ఎరువుల దుకాణంలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి : శంషాబాద్ లోని ఓ ఎరువుల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

నేడు పళనిస్వామి బలనిరూపణ

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో గత మూడు నాలుగు నెలలుగా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మొదలైన ఈ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. అన్నాడీఎంకే వారసుడిగా పళనీస్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టినా.. పన్నీర్‌సెల్వం వర్గం ఎదురు తిరగడంతో బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పళనిస్వామికి కావాల్సినంత మెజారిటీ ఉన్నా.. చివరివరకు వారు అండగా నిలుస్తారా ? లేదా ? అనే సందేహం నెలకొంది. దీంతో ఈరోజు జరగనున్న బలనిరూపణ పళనిస్వామి భవిష్యత్‌నే కాదు.. అన్నాడీఎంకే, తమిళనాడు భవిష్యత్‌ను కూడా తేల్చనుంది.

06:44 - February 18, 2017

విశాఖ : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తమ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ.. పార్టీలు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలతో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థిగా రెండుసార్లు విజయం సాధించిన ఎంవీఎస్.శర్మ స్థానంలో ఈసారి కార్మిక నాయకుడు అజాశర్మ పోటీలో నిలిచారు. అటు కార్మిక వర్గాలలోనూ, ఇటు ఉపాధ్యాయ, యువతలోనూ అజాశర్మకు మంచి పట్టు ఉండటంతో.. మరోసారి గెలుపు తనదే అంటున్నారు పీడీఎఫ్‌ నాయకులు. అజా శర్మ గతంలో ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక కార్యదర్శిగా పనిచేశారు..ఆ సమయంలో ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలపై పాదయాత్ర కూడా చేశారు. ఆజాశర్మకు 210 సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో అందరికంటే ముందుగా నామినేషన్‌ వేసిన అజాశర్మ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

వివాదాలకు దిగిన టీడీపీ, బీజేపీలు ఎట్టకేలకు ఒక అవగాహనకు ..

అటు నిన్నటిదాకా ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై వివాదాలకు దిగిన టీడీపీ, బీజేపీలు ఎట్టకేలకు ఒక అవగాహనకు వచ్చాయి. ఎమ్మెల్సీగా బీజీపీ అభ్యర్థికి అవకాశం ఇచ్చి.. భవిష్యత్తులో జరగనున్న గ్రేటర్‌ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి సహకరించేలా రెండుపార్టీలు అంగీకారానికి వచ్చాయి. దీంతో బీజేపీ నేత పీవీ మాధవ్‌ కు సీటు కేటాయించడంతో ఆయన ఆలస్యంగా ప్రచారంలోకి దిగారు.

వామపక్షాలు బలపరుస్తున్న పీడీఎఫ్‌ అభ్యర్థి..

ఓవైపు వామపక్షాలు బలపరుస్తున్న పీడీఎఫ్‌ అభ్యర్థి.. మరోవైపు టీడీపీ బలపరుస్తున్న బీజేపీ అభ్యర్థి రంగంలో ఉండటంతో.. ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన స్థానాన్ని నిలబెట్టుకోడానికి పీడీఎఫ్‌-ఇతర ప్రజాసంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక ఆలస్యంగా బరిలోకి దిగిన టీడీపీ-బీజేపీ అభ్యర్థి విశాఖ నగరంలోని కళాశాలల యాజమాన్యాల ద్వారా ఇప్పటికే పలు ఓట్లను నమోదు చేయించారు. మొత్తం లక్షా అరవై వేల పట్టబద్రుల ఓట్లు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం విశాఖ నగరంలోనే ఉండటంతో.. అందరు అభ్యర్థులు విశాఖపైనే ఎక్కువగా దృష్టిపెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు.

కాంగ్రెఅభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు..

కాంగ్రేస్ పార్టీకూడా విజయనగరం డీసీసీ అద్యక్షుడిగా ఉన్న యడ్ల ఆదిరాజును తమ అభ్యర్ధిగా రంగంలోకి దించింది. ఇదిలావుంటే ఈసారి ఉత్తరాంధ్ర పట్టబద్రుల ఎమ్మెల్సీ బరిలో ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు. వారిలో లీడర్ పత్రిక సంపాదకులు రమణమూర్తి తన విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక..ఇంతవరకు తమ అభ్యర్ధిని ప్రకటించని వైసీపీ .. స్వతంత్రులకు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల కోసం ఉత్తరాంధ్ర జిల్లాల అధికార యంత్రంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంధ్ర రాష్ర్ట ప్రభుత్వాల పనితీరుపై ఈ ఎన్నికలు రెఫరెండం అని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అటు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ-టీడీపీలు తమ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో ఎమ్మెల్సీ పోరు పోటా పోటిగా సాగే అవకాశం ఉంది.

06:41 - February 18, 2017

అమరావతి: దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఏపీ దేవాదాయశాఖ తీపి కబురు అందించింది. అర్చకులకు వయో పరిమితిని 58 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు దేవాదాయశాఖ మంత్రి మణిక్యాలరావు తెలిపారు. అలాగే దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ జారీ చేస్తున్నామన్నారు. అమరావతిలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. వేద పాఠశాలలో ప్రత్యేక నిధుల ద్వారా విద్యార్థులలో స్కిల్ డెవలెప్‌మెంట్‌ను పెంచనున్నామన్నారు.

06:39 - February 18, 2017

హైదరాబాద్: చిటపటల సిచ్యువేషన్‌ ను కంటిన్యూ చేయడానికి టీ -కాంగ్రెస్‌ నేతలు ఒకరిని మించి మరొకరు పోటీపడుతున్నారు. అంతా కలిశామంటూనే మాటలతో మంటపుట్టిస్తున్నారు. నల్లగొండజిల్లా కాంగ్రెస్‌నేత కోమరెడ్డి వెంకటరెడ్డి మరోసారి పీసీసీ అధ్యక్షుడిని టార్గెట్‌ చేశారు. పిసిసి చీఫ్ గా బాధ్యత‌లు చేప‌ట్టిన నాటినుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు కోమటిరెడ్డి. ప‌లుసార్లు ఉత్తమ్ పై బ‌హిరంగ విమ‌ర్శలు చేస్తూ వ‌చ్చారు. ఈవైఖరితో ఒకానొక ద‌శ‌లో పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు అందుకునే ప‌రిస్థితిని కూడా తెచ్చుకున్నారు . అయితే .. మొన్నామధ్య కోదాడలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి జానారెడ్డి, కోమటిరెడ్డి కలిసి భోజ‌నానికి వెళ్లడంతో నేతల మ‌ధ్య విభేదాలు స‌మ‌సిపోయాయ‌ని కార్యకర్తలు సంతోషపడ్డారు. కాని మరోసారి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని టార్గెట్‌చేస్తూ కోమటిరెడ్డి మాటల తూటాలు పేల్చి..పార్టీలో వర్గపోరు కంటిన్యూ అవుతోందన్న విషయాన్ని తేటతెల్లంచేశారు.

పార్టీ కార్యక్రమాలపైనే కాకుండా..

పార్టీ కార్యక్రమాలపైనే కాకుండా.. ఉత్తమ్‌ వ్యక్తిగత విషయాలపైకూడా కామెంట్స్‌ చేసిన కోమటిరెడ్డి.. పార్టీలో అంతర్గత రాజకీయాలను రంజుగా మార్చారు . గడ్డం-మీసం పెంచినంత మాత్రాన ముఖ్యమంత్రి కాలేరంటూ వ్యాఖ్యానించి విమర్శల ఘాటును పెంచారు కోమటిరెడ్డి. పార్టీ గెలుపుపై ఉత్తమ్ చేయించిన స‌ర్వే బోగస్‌ అని కోమ‌టిరెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారాయి. సొంతపార్టీ అధ్యక్షుడిని చులకన చేసి మాట్లాడ్డం సరికాదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సర్వే రిజల్స్‌తో కార్యకర్తల్లో కొత్త జోష్‌ నింపాలని పీసీసీ అధ్యక్షుడు ప్రయత్నిస్తుంటే.. బోగస్‌సర్వే అంటూ కోమటిరెడ్డి లాంటి నేతలు పార్టీని పలుచన చేసేలా మాట్లాడ్డం ఏంటని ఉత్తమ్‌వర్గీయులు మండిపడుతున్నారు.

 

హీటెక్కిన డీఎంకే నిర్ణయం....

చెన్నై: తమిళ రాజకీయాల్లో మరో సంచలనం. తాజాగా డీఎంకే తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఇవాళ జరిగే బలపరీక్షలో పళని స్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. డీఎంకే నిర్ణయంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు సంఖ్య 108కి చేరింది. కాంగ్రెస్‌ కూడా పళనికి వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం అందిందని స్టాలిన్‌ వెల్లడించారు.

06:34 - February 18, 2017

చెన్నై: తమిళనాడులో అటు అన్నాడీఎంకే, ఇటు పన్నీరు సెల్వం వర్గం ఇద్దరూ అమ్మ వారసత్వంపై పోరాటం చేస్తూ..తమిళనాడు రాజకీయాల్ని రక్తి కట్టిస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పన్నీరు వర్గం దూకుడు మరింత పెంచింది. శశికళ, సీఎం పళనిస్వామి సహా గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 30 మంది మంత్రులపై పన్నీరు సెల్వం వర్గం పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేసింది. శశికళతో పాటు సుధాకరన్‌, దినకరన్‌, ఎస్‌ వెంకటేశ్‌లను కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ ప్రిసీడియం ఛైర్మన్‌ మధుసూదనన్‌ తెలిపారు. తమదే అసలైన అన్నాడిఎంకే అని, తానే ఇప్పటికీ ప్రెసీడియం చైర్మన్‌ అని.. ఆ హోదాలోనే తాను, శశికళ వర్గంపై బహిష్కరణ వేటు వేసినట్లు ఆయన తెలిపారు.

పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపిన నటరాజన్...

మరోవైపు.. చెన్నై నగర నడిబొడ్డున గల మైలాపూర్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే నటరాజన్‌.. పళని శిబిరం నుంచి బయటపడి.. పన్నీర్‌ సెల్వం శిబిరాన్ని చేరుకుని మద్దతు ప్రకటించారు. ఇదే దారిలో సీఎం పళనిస్వామి వర్గానికి చెందిన మరో 17 మంది ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వానికి మద్దతు తెలుపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో తమిళనాట రాజకీయ వాతావరణ మళ్లీ వేడెక్కింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. శుక్రవారం బెంగళూరు వెళ్లి శశికళ ఆశీస్సులు తీసుకోవాలని భావించినప్పటికీ.. పార్టీలోని అసమ్మతి కుంపట్ల నేపథ్యంలో.. పర్యటనను రద్దు చేసుకొని.. బుజ్జగింపుల్లో మునిగిపోయారు. పళనిస్వామి చెంతనున్న ఎమ్మెల్యేల్లో మరికొంతమంది తనకు మద్దతుగా నిలుస్తారని భావిస్తున్న మాజీ సీఎం పన్నీర్ సెల్వం.. అసెంబ్లీలో బల నిరూపణ ప్రక్రియను రహస్య ఓటింగ్‌ ద్వారా చేపట్టాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది.

ఓవైపు.. అసంతుష్ట ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూనే..

ఓవైపు.. అసంతుష్ట ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూనే.. తనను ఇరుకున పెడుతోన్న పన్నీర్‌ సెల్వం వర్గంపై.. అనర్హత కత్తిని దూసింది పళనిస్వామి వర్గం. పన్నీర్‌ సెల్వం సహా.. ఎమ్మెల్యేలందరికీ విప్‌ జారీ చేసింది. బలపరీక్ష సందర్భంగా పళనిస్వామికి అనుకూలంగా ఓటు వేయాలని చీఫ్ విప్‌ రాజేంద్రన్‌ విప్‌ జారీ చేశారు. దీన్ని ఉల్లంఘిస్తే వారిపై అనర్హత వేటు వేయించే యోచనలో పళని వర్గం ఉంది. ఇదే సమయంలో.. బలనిరూపణ వేళ తటస్థంగా వ్యవహరించాలని డీఎంకే నిర్ణయించింది. ఈమేరకు, శుక్రవారం, చెన్నైలో స్టాలిన్‌ నేతృత్వంలో సమావేశమైన డిఎంకే ఎల్పీ విస్తృత భేటీ నిర్వహించింది. మొత్తానికి, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. శనివారం నాటి బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఎత్తుకు పైఎత్తులు....

చెన్నై: ఎడతెగని ఉత్కంఠ.. గంట గంటకూ మారుతున్న పరిణామాలు.. ఎత్తుకు పై ఎత్తులు... వ్యూహప్రతి వ్యూహాలకు పదును పెడుతున్న నేతలు. ఇదీ తమిళనాట రసవత్తర రాజకీయ పరిణామం. ఈరోజు బలనిరూపణకు పళనిస్వామి సిద్ధమవుతుంటే.. అతడి శిబిరాన్ని చీల్చే ప్రయత్నాన్ని పన్నీర్‌ వర్గం ముమ్మరం చేసింది. ఈదిశగా అసెంబ్లీలో రహస్య ఓటింగ్‌ జరపాలని ఈ వర్గం స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. అంతేనా.. శశికళ, దినకరన్, వేంకటేశ్‌లను పార్టీ నుంచి డిస్మిస్‌ చేస్తున్నట్లు.. చీలిక వర్గానికి చెందిన మధుసూదనన్‌ ప్రకటించారు. ప్రతీకారంగా, బలనిరూపణలో పాల్గొనాలంటూ.. పళనిస్వామి వర్గం.. సెల్వం సహా..

06:30 - February 18, 2017

హైదరాబాద్: తమిళనాడులో కొన్ని రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడే సమయం దగ్గరపడింది. కాసేపట్లో అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణ చేసుకోనున్నారు. అయితే.. పళనిస్వామి ఈ గండం నుంచి గట్టెక్కుతాడా ? లేడా ? అనే సస్పెన్స్‌ మాత్రం కొనసాగుతూనే ఉంది. నిన్న సాయంత్రం వరకు ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించిన డీఎంకే తాజాగా వ్యూహం మార్చుకుంది. డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తాము ఖచ్చితంగా ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్టాలిన్‌ ప్రకటించారు. దీంతో ఓటింగ్‌ ఆసక్తికరంగా మారింది. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్న పళనిస్వామి.. గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలను చేజారిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అయితే.. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం కూడా పళనిస్వామికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. తాజాగా.. శశికళ వర్గం నుంచి మైలాపూర్‌ ఎమ్మెల్యే నటరాజన్‌ పన్నీర్‌ వర్గంలోచేరారు. దీంతో పన్నీర్‌ వర్గం బలం 11కి చేరింది.

బలం నిరూపించుకోవాలంటే 118 సభ్యుల మద్దతు కావాలి...

మరోవైపు అసెంబ్లీలో పళనిస్వామి బలం నిరూపించుకోవాలంటే 118 సభ్యుల మద్దతు కావాలి. అన్నాడీఎంకే గత ఎన్నికల్లో 135 స్థానాల్లో గెలిచింది. అయితే జయ మరణంతో ఈ సంఖ్య 134కు తగ్గింది. ఇందులో ఇప్పుడు పన్నీర్‌ వర్గంలోకి 11 మంది చేరగా.. ఆ సంఖ్య 123 మాత్రమే ఉంది. కానీ... ప్రభుత్వ ఏర్పాటుకు 118 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. అయితే.. ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. ప్రస్తుతం శశికళ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలలో కూడా చాలామంది కూడా పళనిస్వామి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు పన్నీర్‌కు మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. వీరందరిని శశి వర్గం సీనియర్‌ నేత తంబిదురై బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

పళనిస్వామికి వ్యతిరేకంగా పన్నీర్‌సెల్వం పావులు ...

ఇదిలావుంటే పళనిస్వామికి వ్యతిరేకంగా పన్నీర్‌సెల్వం పావులు కదుపుతున్నారు. తనకు చాలామంది ఎమ్మెల్యేలు మద్దతిస్తారనే ఆశాభావంతో పన్నీర్‌ సెల్వం ఉన్నారు. అందుకే రహస్య ఓటింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌ను కలిసి విన్నవించారు. మరోవైపు కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు కూడా పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సమావేశం అవుతున్న కాంగ్రెస్‌ సభ్యులు దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

పళనీస్వామి వర్గంలో 123 ఎమ్మెల్యేలు ....

మొత్తానికి పళనీస్వామి వర్గంలో 123 ఎమ్మెల్యేలు ఉన్నా.. చివరకు ఎవరు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తిగా మారింది. ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన ప్రభుత్వం పడిపోవడం ఖాయం. మొత్తానికి కాసేపట్లో జరగనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరినీ వెంటాడుతోంది.

Don't Miss