Activities calendar

19 February 2017

అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై తమిళ గవర్నర్ ఆగ్రహం

చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై గవర్నర్ విద్యాసాగర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలని కార్యదర్శిని ఆదేశించారు. నివేదిక ఆధారంగా గవర్నర్ చర్యలు తీసుకోనున్నారు. నిన్నటి బల పరీక్ష చెల్లదని ప్రకటించాలంటూ స్టాలిన్ గవర్నర్ కు లేఖ రాశారు. మెరీనా బీచ్ ధర్నా, స్టాలిన్ తీరుపై సీఎం పళనస్వామి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

21:51 - February 19, 2017

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్వీటేశారు.. తన చిన్నతనంలో జరిగిన విషయాలను ట్విట్టర్‌లో ప్రస్తావించారు.. ఏపీకి చెందిన దివంగత కమ్యూనిస్ట్ నేత, రచయిత తరిమెళ్ల నాగిరెడ్డిని పవన్ స్మరించుకున్నారు. తరిమెళ్లకు పవన్ తలవంచి నమస్కరించారు. ఇవాళ తరిమెళ్ల శతజయంతి అని... కామ్రేడ్ తరిమెళ్ల నాగిరెడ్డి శత జయంతి సంవత్సరమంటూ ట్వీట్ చేశారు. చిన్నతనంలో తమ తండ్రి తరిమెళ్ల రచించిన తాకట్టులో భారతదేశం పుస్తకం చదవాలంటూ సలహా ఇచ్చారని పవన్‌ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఆ పుస్తకాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని.. తరిమెళ్ల చెప్పిన విషయాలు అప్పటికీ ఇప్పటికీ సరిగ్గా సరిపోతాయయని పవన్‌ చెప్పారు. ఆయన పేద ప్రజలకు చాలా మేలు చేశారని జనసేనాని ట్విట్టర్‌లో ప్రస్తావించారు.. 

21:49 - February 19, 2017

హైదరాబాద్ : సమస్యలతో సతమతమవుతున్న చేనేత రంగాన్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది.. నేతన్నలకు ఆర్థికంగా సహకారం అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.. నేతన్నలు తయారుచేసిన వస్త్రాలను ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని తీర్మానించారు.
చేనేత కార్మికుల సమస్యలపై కేసీఆర్ దృష్టి  
చేనేత కార్మికుల సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు... హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో హ్యాండ్లూమ్‌, పవర్‌లూమ్‌ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, తుమ్మల, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్‌ శర్మ, సలహాదారు వివేక్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ పీ సింగ్‌, ఇతర అధికారులు, సిరిసిల్ల నుంచి వచ్చిన పవర్‌లూమ్‌ పరిశ్రమకుచెందిన దాదాపు 40మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
చేనేత కార్మికుల సమస్యలపై చర్చించిన సీఎం
చేనేత కార్మికుల పేదరిక నిర్మూలనపై సీఎం చర్చించారు.. నేత కార్మికుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. వరంగల్‌లో ఏర్పాటు చేయబోయే టెక్స్‌టైల్‌ పార్క్‌ ద్వారా కార్మికుల జీవితాల్లో చాలా మార్పు వస్తుందని సీఎం చెప్పారు.. షోలాపూర్‌లో చద్దర్లు, సూరత్‌లో చీరలు, తిర్పూరులో ఇతర వస్తువుల తయారీ పెద్ద ఎత్తున జరుగుతుందని కేసీఆర్‌ గుర్తుచేశారు.. ఈ మూడింటి సమాహారంగా వరంగల్‌ పార్క్‌ ఉంటుందని ప్రకటించారు.. ఈ పార్క్‌ను దేశంలోనే నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.. సిరిసిల్ల పవర్‌లూమ్స్‌ను వరంగల్‌ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు అనుసంధానం చేస్తామని చెప్పారు.
సిరిసిల్లలో అపెరల్‌ పార్క్‌ ఏర్పాటు
అలాగే సిరిసిల్లలో అపెరల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.. నేత కుటుంబాల్లోని మహిళలకు అవసరమైన శిక్షణ ఇచ్చి రెడీమేడ్‌ దుస్తులు తయారు చేయిస్తామన్నారు. సిరిసిల్లకు త్వరలో రైల్వే లైన్‌ వస్తుందని... ఇక్కడ తయారైన వస్త్రాలను వరంగల్‌ పార్క్‌కు పంపొచ్చని చెప్పారు.. పవర్‌లూమ్‌ కార్మికులు తమ వస్త్రాలను నిల్వ చేసుకునేందుకు సిరిసిల్లలో నాలుగు గోదాములు నిర్మిస్తామని ప్రకటించారు.. ఇందులో స్టాక్‌ పెట్టుకునే యజమానులకు సహకార బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం ఇస్తామని హామీ ఇచ్చారు. పవర్‌లూమ్‌కు రుణ సౌకర్యం కల్పించేందుకు మొదటి ఏడాది వందకోట్లు సిద్ధంగా ఉంచాలని సహకార బ్యాంకులను సీఎం ఆదేశించారు.
నూలు, రసాయనాలపై ప్రభుత్వం సబ్సిడీ
తెలంగాణ ఉద్యమ సమయంలో చేనేత కార్మికుల దీనావస్థను చూసి చాలా సార్లు దుఃఖపడ్డానని సీఎం చెప్పారు.. నేత కార్మికులంతా మంచి జీవితం గడిపేందుకు అవసరమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని ప్రకటించారు.. నేతవస్త్రాల తయారీ కోసం వాడే నూలు, రసాయనాలపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని ప్రకటించారు.. అయితే మగ్గాలు ఒకేరకం వస్త్రాలు తయారుచేయడంవల్ల పోటీ ఎక్కువగా ఉంటోందని చెప్పారు.. అందుకే మగ్గాలను ఎంచుకునే క్రమంలో వైవిధ్యం ఉండాలని సూచించారు.. వేర్వేరు రకాల వస్త్రాలు, వేర్వేరు సైజులు, వేర్వేరు డిజైన్లు ఉండేలా వర్గీకరణ చేసుకోవాలని సూచించారు.
ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్న పద్మశాలీలు
నేతవృత్తి కుటుంబాలను పోషించే పరిస్థితి లేకపోవడంతో చాలామంది పద్మశాలీలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారని కేసీఆర్‌ చెప్పారు. పద్మశాలీలు ప్రత్యామ్నాయ ఉపాది చూసుకుంటే వారికి అవసరమైన ప్రోత్సాహం అందివ్వాలని సీఎం అధికారులకు సూచించారు.. చేనేత మగ్గాలపై పనిచేస్తున్నవారు, పవర్‌లూమ్‌ కార్ఖానాల్లో కూలీలుగా పనిచేస్తున్నవారు, నేతవృత్తిని వదిలి వేరే ఉపాది చూసుకున్నవారు ఇలా మూడు విధాలుగా పద్మశాలీలున్నారని సీఎం తెలిపారు.. వీరి కోసం త్రిముఖ వ్యూహం అమలు చేస్తామని ప్రకటించారు.. నేత పరిశ్రమకు చెందిన ప్రతినిధుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి  సావధానంగా విన్నారు. నేత కార్మికులకు నెలకు దాదాపు 15 వేల ఆదాయం రావడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు... ఇందుకోసం పవర్ లూములు నడిపే యజమానులకు అవసరమైన చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.

 

21:43 - February 19, 2017

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ముగిసింది. మొత్తం 61 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడో విడత పోలింగ్‌లో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. లఖ్‌నవూలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, కేంద్ర మంత్రులు ఉమాభారతి, కల్‌రాజ్‌ మిశ్రా, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్‌ జైశ్వాల్‌, బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్‌ తదితరులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 69 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 826 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

 

21:22 - February 19, 2017
21:20 - February 19, 2017
21:12 - February 19, 2017

నల్గొండ : తెలంగాణ రైతులకు మేలు చేసే విధంగా నల్గొండ జిల్లాలో పవర్ ప్లాంట్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఎంపీ కవిత తెలిపారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సరైన సమాధానం లేకుండా కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. మిర్యాలగూడలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి విక్రాంత్ రెడ్డి విహహానికి ఆమె హాజరయ్యారు. 

 

21:09 - February 19, 2017

వికారాబాద్ : కాంగ్రెస్‌ నేతలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శల వర్షం కురిపించారు. హస్తం నేతలు రోజుకోమాట మాట్లాడుతూ ప్రాజెక్టులు పూర్తికాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్‌లపై మహబూబ్‌నగర్‌లో హర్షవర్దన్‌ లాంటి వారితో దావాలు వేయిస్తున్నారని మండిపడ్డారు. గత సీఎంలు వైఎస్‌, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి చేవెళ్ల, ప్రాణహితను ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు.

 

21:05 - February 19, 2017

ముంబై : మహారాష్ట్రలోని భివాండిలో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురి మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. 

 

21:00 - February 19, 2017

యూపీ : ఎస్పీ, బీఎస్పీతో యూపీ అభివృద్ధి ఎప్పటికి కాదన్నారు ప్రధాని మోదీ. కేవలం డబ్బుతోనే.. అధికారంలోకి రావాలన్నది మాయావతి, అఖిలేష్ వ్యూహంగా కనిపిస్తోందని... అయితే అది అసాధ్యమన్నారు. యూపీలో ఫతేపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో యూపీలో అధికారంలోకి వచ్చేది బీజేపీనని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

20:58 - February 19, 2017

కేరళ : మలయాళ నటి భావన కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు.. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు... భావన మాజీ డ్రైవర్‌ సునీల్‌ ప్రధాన నిందితుడని గుర్తించారు.. మిగతా నిందితులకోసం గాలిస్తున్నారు..
భావన కిడ్నాప్‌ ఉదంతం కలకలం
ప్రముఖ నటి భావన కిడ్నాప్‌ ఉదంతం.. కోలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌లోనూ కలకలం సృష్టించింది. శుక్రవారం నాడు, ఓ దుండగుడు, ఆమె కారులోకి బలవంతంగా చొరబడి, కారులోనే ఆమెను తరలించుకు పోతూ.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగు చూడ్డంతో, పోలీసులు రంగప్రవేశం చేశారు. నటి భావన ఫిర్యాదు మేరకు, విచారణ చేపట్టిన పోలీసులు, భావన మాజీ డ్రైవర్‌ సునీల్‌, ఈ కేసులో ప్రధాన నిందితుడని తేల్చారు. అతడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. 
కారులో ఇంటికి వెళుతుండగా అడ్డగించిన దుండగులు
ఎర్నాకుళంలో సినిమా షూటింగ్‌కు హాజరైన భావన కారులో ఇంటికి వెళుతుండగా మధ్యలో కొందరు దుండగులు అడ్డగించారు.. కారును ఆపి అందులోకి చొరబడ్డారు.. దాదాపు 2గంటలపాటు ఆమెను లైంగికంగా వేధించి ఫొటోలు, వీడియోలు తీశారు.. ఆ తర్వాత మరో కారులో పరారయ్యారు.. ఆ తర్వాత షాక్‌నుంచి తేరుకున్న భావన నెడుంబస్సెరిలో పోలీసులకు ఫిర్యాదుచేసింది.. తన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపింది.
భావనకు మద్దతుగా మలయాళ సినీ ఇండస్ట్రీ ఆందోళన
భావన కిడ్నాప్‌ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.. ఆమెకు మద్దతుగా మలయాళ సినీ ఇండస్ట్రీ ఆందోళనకు దిగింది.. దోషులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేసింది.... ఈ కేసుపై వెంటనే స్పందించిన సీఎం విజయన్‌... దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.. 
భావన మాజీ డ్రైవర్‌ సునీల్‌ ప్రధాన సూత్రదారి
అటు ఈ కిడ్నాప్‌ కేసులో భావన మాజీ డ్రైవర్‌ సునీల్‌ ప్రధాన సూత్రదారని పోలీసులు తేల్చారు.. గతంలో తనకు డ్రైవర్‌గాపనిచేసిన సునీల్‌ను భావన ఉద్యోగంనుంచి తొలగించింది.. అసత్య ప్రచారాలు చేస్తున్నాడని అతన్ని బయటకుపంపేసింది.. దీంతో సునీల్‌ భావనపై కోపం పెంచుకున్నాడు.. ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని కుట్రచేశాడు.. కొత్త డ్రైవర్‌ మార్టిన్‌ను మచ్చిక చేసుకున్నాడు.. మరికొందరి సహాయంతో భావనను వేధించాలని ఈ ప్లాన్‌ వేశాడు.... ప్రస్తుతం ఈ ఇద్దరు డ్రైవర్లతోపాటు మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.. సునీల్‌పై ఇప్పటికే పలు క్రిమినల్‌ కేసులున్నాయని పోలీసులు చెబుతున్నారు.. మిగతా నిందితుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు..

 

20:54 - February 19, 2017

చెన్నై : తమిళనాడులో పొలిటికల్‌ హీట్‌ ఇంకా తగ్గలేదు. ముఖ్యమంత్రి పళనిస్వామి, డిఎంకే నేత స్టాలిన్‌లు.. వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయ కాకను తారాస్థాయికి తీసుకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి శిబిరం.. డిఎంకే నేతలపై కేసులతో ఒత్తిడి తెస్తుంటే.. స్టాలిన్‌ వర్గం ఆందోళనతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు.. శనివారంనాడు అసెంబ్లీలో జరిగిన ఘటనలపై ఇరువర్గాలూ.. గవర్నర్‌కు పరస్పరం ఫిర్యాదు చేశాయి. ఇక పన్నీర్‌ సెల్వం కొత్త పార్టీ స్థాపన దిశగాను, శశికళ బెంగుళూరు నుంచి చెన్నై జైలుకు మారే దిశగానూ పావులు కదుపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 
వేడితగ్గని తమిళ రాజకీయం
తమిళనాడులో రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. నిప్పు, ఉప్పులా ఉండే డిఎంకె, అన్నాడిఎంకేలు.. మరోసారి, తలపడుతున్నాయి. అమీతుమీ తేల్చుకునే దిశగా ఈ ప్రత్యర్థి వర్గాలు వ్యూహాలు రచిస్తున్నాయి. శనివారం నాడు అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించి రెండు వర్గాలూ.. పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం.. డిఎంకే నేత స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యూహాల అమలుకు శ్రీకారం చుట్టింది. శనివారంనాడు, మెరీనా తీరంలో అనుమతి లేకుండా ధర్నా చేశారంటూ.. స్టాలిన్‌ సహా ఎమ్మెల్యేలందరిపైనా కేసులు నమోదు చేసింది పళని ప్రభుత్వం. అంతేకాదు.. ఇదే విషయమై.. ముఖ్యమంత్రి పళనిస్వామి, గవర్నర్‌ విద్యాసాగరరావును కలిసి స్టాలిన్‌పై ఫిర్యాదు కూడా చేశారు. 
పళనిస్వామి ప్రభుత్వ చర్యలపై.. డిఎంకె మండిపాటు 
పళనిస్వామి ప్రభుత్వ చర్యలపై.. డిఎంకె మండిపడుతోంది. ముఖ్యమంత్రి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ.. స్టాలిన్‌ నేతృత్వంలోని బృందం.. గవర్నర్‌ విద్యాసాగరరావును కలిసింది. అసెంబ్లీలో జరిగిన ఘటనల పూర్వాపరాలను వివరించింది. ముఖ్యమంత్రి, స్పీకర్‌ తీరుపైనా స్టాలిన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విపక్షాలను బలవంతంగా బయటికి పంపేసి.. బలం నిరూపించుకోవడం రాజ్యంగా విరుద్ధమని.. దీనిపై చర్యలు తీసుకోవాలని  వినతిపత్రం అందించారు. శాంతియుతంగా దీక్ష చేసిన తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
నిరాహార దీక్షలు చేపట్టాలని డిఎంకే నిర్ణయం 
ప్రభుత్వం తమపై కేసులతో ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తోందని భావిస్తోన్న డిఎంకే నేతలు, స్టాలిన్‌ నేతృత్వంలో ఆదివారం చెన్నైలో సమావేశమయ్యారు. ప్రభుత్వంపై ప్రత్యక్ష ఆందోళనలకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈనెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ నేతలు నిరాహార దీక్షలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. స్టాలిన్‌ కూడా చెన్నైలో నిరాహార దీక్ష చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
భవిష్యత్తు కార్యాచరణపై పన్నీర్ దృష్టి 
మరోవైపు, శశికళతో విభేదించి పదవికి దూరమైన పన్నీర్‌ సెల్వం, ఆయన శిబిరం, భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించింది. తమ వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో భేటీ అయిన పన్నీర్‌ సెల్వం, అసెంబ్లీలో మరోసారి బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇంకోవైపు, అన్నాడిఎంకే విప్‌ను ఉల్లంఘించిన తమపై అనర్హత వేటు పడుతుందని భావిస్తోన్న పన్నీర్‌ శిబిరం, కొత్తపార్టీ స్థాపించే యోచన చేస్తున్నట్లు సమాచారం. కొత్తపార్టీకి  'అమ్మాడీఎంకే' అని పేరు కూడా ఖరారు చేశారని, దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.  
సర్వత్రా ఉత్కంఠ  
అటు, అక్రమాస్తుల కేసులో కర్ణాటక జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కూడా, స్వరాష్ట్రానికి తరలివచ్చే ప్రయత్నాల్లో మునిగితేలుతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న శశికళ, తమిళనాడులోని చెన్నై లేదా వేలూరు జైలుకు తనను బదిలీ చేయాలంటూ.. న్యాయవాదుల ద్వారా పిటిషన్‌ వేయిస్తున్నట్లు అన్నాడిఎంకే వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి.. నిన్నటిదాకా పన్నీర్‌ వర్సెస్‌ పళనిస్వామిగా ఉన్న రాజకీయ పోరు ఇపుడు.. పళని వర్సెస్‌ స్టాలిన్‌గా రూపాంతరం చెందింది. ఈ పరిణామం భవిష్యత్తులో మరెన్ని పరిణామాలకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

 

20:48 - February 19, 2017

కృష్ణా : విజయవాడ నగర పాలక సంస్థ బడ్జెట్‌ సమావేశం రసాభాసగా ముగిసింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి 1327 కోట్ల 64 లక్షల రూపాయలతో మేయర్‌ కోనేరు శ్రీధర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కౌన్సిల్‌లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది.
నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశం రసాభాస 
విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశంలో రసాభాస నెలకొంది. ఏడాదికోసారి ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై చర్చ జరగకుండానే ఏకపక్షంగా బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. మేయర్ శ్రీధర్ 1327 కోట్ల 64 లక్షల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతేడాదితో పోల్చితే 900 కోట్ల పైన బడ్జెట్ ను పెంచారు. అయితే ప్రజలపై ఎటువంటి భారాలు మోపకుండా అధికారులతో కలిసి బడ్జెట్ రూపొందించామని ఇది ప్రజా బడ్జెట్ అని మేయర్ కౌన్సిల్ సభ్యులకు వివరించారు. మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ కూడా రెవెన్యూ, ఇతర డిపార్టమెంట్లతో కలిసి చేసిన అభివృద్ధిని సభ్యులకు వివరించారు. 
బడ్జెట్ తప్పులతడక : పుణ్యశీల 
బడ్జెట్ మొత్తం తప్పులతడకని, ప్రజలపై పన్నుల భారాలు మోపుతారో లేదో స్పష్టం చేయలేదని వైసీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల పాలకపక్షాన్ని నిలదీశారు. దీంతో పాలకపక్షం ఖంగుతిని బడ్జెట్ రూపకల్పనలో తప్పులు సహజమని చెప్పుకొచ్చింది. దీంతో పాలక, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. వైసిపి ఫ్లోర్ లీడర్ పుణ్యశీల టిడిపి కార్పొరేటర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కౌన్సిల్ స్తంభించింది. తక్షణమే పుణ్యశీల క్షమాపణ చెప్పాలని టిడిపి కార్పొరేటర్లు పట్టుబట్టడంతో అందుకు ఆమె నిరాకరించారు. దీంతో మేయర్ కోనేరు శ్రీధర్ పుణ్యశీలను సస్పెండ్ చేయడంతో కౌన్సిల్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పుణ్యశీల సస్పెండ్‌కు నిరసగా వైసీపీ వాకౌట్‌ చేసి ఆందోళనకు దిగింది. 
పాలక పక్షంపై విరుచుకుపడ్డ సీపీఎం కార్పొరేటర్ 
సీపీఎం కార్పొరేటర్ ఆదిలక్ష్మి పాలక పక్షంపై విరుచుకుపడ్డారు. నగరంలో అభివృద్ధి అంతంత మాత్రంగా ఉందని, ప్రతి ఏటా బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు కాని అభివృద్ధి మాత్రం జరగడం లేదంటూ మేయర్‌ను నిలదీశారు. ఎన్నడూ లేని విధంగా అధికారులు రూపొందించిన బడ్జెట్‌ను స్థాయి సంఘం సవరణలు కూడా చేయకుండా ఆమోదించడం సిగ్గుచేటని విమర్శించారు. టిడిపి చేస్తున్న బడ్జెట్ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వివరిస్తామని సీపీఎం హెచ్చరించింది.
బడ్జెట్‌ ను ఆమోదం తెలిపిన టీడీపీ
వైసీపీ కార్పొరేటర్ల సస్పెన్షన్‌, సీపీఎం కార్పొరేటర్ వాకౌట్‌ మధ్య 2017.. 18 నగరపాలకసంస్థ బడ్జెట్‌ను టిడిపి ఆమోదించింది. అధికార పక్షం బడ్జెట్‌ను ఏకపక్షంగా ఆమోదించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పూర్తి ప్రజా బడ్జెట్ అని, అప్పుల్లో ఉన్న కార్పొరేషన్‌ను లాభాల బాటలో నడిచేలా చేస్తున్నామని టిడిపి కార్పొరేటర్లు చెప్పుకొస్తున్నా విపక్షాలు మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. పాలకపక్షం కార్పొరేటర్ల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి వారితో తాడో పేడో తేల్చుకుంటామని వైసిపి, సిపిఎం నేతలు  హెచ్చరిస్తున్నారు.

 

మారణాయుధాలతో బెదిరిస్తున్న ఇద్దరి అరెస్టు

రాజన్న జిల్లా : మారణాయుధాలతో పలువురిని బెదిరిస్తున్న తిరుపతి, నాగార్జున్ లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 బొమ్మ పిస్టల్స్, రివాల్వర్ ఎయిర్ గన్ తో పాటు తల్వార్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు సందర్భంగా పోలీసులపై దాడికి నిందితుడు యత్నించాడు.

20:38 - February 19, 2017

కర్నూలు : జిల్లాలోని శ్రీశైలంలో శివభక్తులకు సహకరించేందుకు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎస్పీ రవికృష్ణ ప్రజలను కోరారు. రెడ్‌క్రాస్‌, మానవత స్వచ్ఛంద సంస్థలు శివభక్తులకోసం ఏర్పాటుచేసిన అంబులెన్స్‌ సర్వీసులను రవికృష్ణ ప్రారంభించారు. జిల్లాలో రెడ్‌క్రాస్‌ సేవల్ని విస్తృతం చేయాలన్నారు.

 

20:36 - February 19, 2017

అనంతపురం : జిల్లాలోని వింత చోటు చేసుకుంది. సోమందేపల్లి మండలం తుంగోడు గ్రామంలో ఓ రైతు వేసిన బోరులో నీరు ఉబికి వస్తోంది. కరవు జిల్లాలో అసలు నీళ్లే రానే ప్రాంతంలో... మోటర్ లేకుండానే... నీళ్లు ఉబికి వస్తుండటంతో... స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో 4 బోర్లు వేసినా.. నీరు పడలేదని.. ఇప్పుడు ఇలా దారాళంగా వస్తుండటంతో.. రైతు శ్రీనివాసాచారి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 

 

20:34 - February 19, 2017

విజయవాడ : తెలుగు బాషా దినోత్సవం రెండు రోజుల ముందు మాతృ బాషా మాధ్యమ సత్యాగ్రహ దీక్ష నిర్వహించుకోవడం సిగ్గుచేటని సాహితి వేత్తలు విమర్శించారు. గతంలో మద్రాస్‌ నుంచి తెలుగును పోరాడి సాధించుకుంటే ఇప్పుడు తెలుగు పరిరక్షణ కోసం మరోసారి ఉద్యమం చేయాల్సిన అవసరం దాపురించిందన్నారు. మాతృబాషా మాధ్యమ వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద సాహితి వేత్తలు సత్యాగ్రహ దీక్ష చేశారు. ఇంగ్లీష్‌ ముఖ్యమైతే ఇంగ్లీష్‌ నేర్పాలి కానీ ఇంగ్లీస్‌ మీడియాన్ని ఎందుకు ప్రవేశ పెట్టాలని సాహితి వేత్తలు ప్రశ్నించారు. 

 

20:27 - February 19, 2017

కడప : ఈసారి బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జనాభా ఆధారంగా కేటాయింపులుండాలని... ఎమ్మెల్సీ గేయానంద్‌ ప్రభుత్వానికి సూచించారు. కడప ప్రెస్‌క్లబ్‌లో ప్రజాసంఘాలు ఏర్పాటుచేసిన సదస్సుకు గేయానంద్‌ హాజరయ్యారు. ఎస్టీ, ఎస్టీ సబ్‌స్లాన్‌ నిధులు సక్రమంగా ఖర్చు చేయాలంటూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీప్రకారం సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని గేయానంద్‌ కోరారు. 

 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గరవ్నర్ నరసింహన్

చిత్తూరు : గరవ్నర్ నరసింహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపు కూడా శ్రీవారిని దర్శించుకోనున్నారు.

20:08 - February 19, 2017

హైదరాబాద్‌ : బోయిన్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్‌ పైపుల గోదాంలో భారీగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... .మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.  ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోయినా... భారీగా ఆస్తినష్టం జరిగింది. 

 

19:54 - February 19, 2017

హైదరాబాద్ : చేనేత కార్మికుల సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు. హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో హ్యాండ్లూమ్‌, పవర్‌లూమ్‌ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, సీఎస్ ఎస్పీ సింగ్, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. 

 

19:50 - February 19, 2017

హైదరాబాద్ : పసుపురంగు నుదుటి మీద పొద్దుటి సూర్యుడిని దిద్ది తెలంగాణ ఆడపడుచును దేదీప్యమానంగా ఆవిష్కరించిన అరుదైన చిత్రకారుడు తోట వైకుంఠం. కరీంనగర్ జిల్లా బూరుగుపల్లిలో పుట్టిన ఈ కళాకారుడు తెలంగాణ బతుకుపోరు మూలాలను తన రంగులతో ఆవిష్కరించారు. చిత్రకారుడిగా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న తోట వైకుంఠం చిత్రకళాయాత్ర "భావనాతరంగం- ఎ రెట్రాస్పెక్టివ్" పేరుతో హైదరాబాద్ లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో కొలువుదీరింది. గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ శనివారం నాడు ఈ ప్రదర్శనను ప్రారంభించారు.
ఊరి బతుకుల వైచిత్రిని బొగ్గు గీతలతో ఆవిష్కరణ
ఉగ్గుపాలతో ఒంటపట్టించుకున్న ఊరి బతుకుల వైచిత్రిని బొగ్గు గీతలతో ఆవిష్కరించిన కళాకారుడు. అమ్మ ముఖంలో అద్భుతమైన తెలంగాణ అస్తిత్వాన్ని దర్శించిన భావుకుడు . నలుపు తెలుపుల గీతల్లో తెలంగాణ మూలాలను తవ్వి తీసిన చరిత్రకారుడు. మూల వర్ణాలతో నదురూ బెదురూ లేకుండా వెలుగులు విరజిమ్మే బొమ్మలను ప్రస్ఫుటంగా ప్రతిష్ఠిస్తున్న 
అద్భుత ఘట్టాలు
అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న తోట వైకుంఠం చిత్ర కళాయాత్రలోని అద్భుతమైన ఘట్టాలను పటం కట్ట ఆవిష్కరించింది హైదరాబాద్ లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ పైన్ ఆర్ట్స్. శనివారం నాడు రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ చేతుల మీదుగా ప్రారంభమైన భావనాతరంగం-ఎ రెట్రాస్పెక్టివ్ ప్రదర్శన చిత్రకళాభిమానులకు చిరస్మరణీయ అనుభవాన్ని ప్రసాదించింది. దశాబ్దాల నాటి బొమ్మలతో పాటు తాజాగా విశాలమైన కేన్వాసుల మీద అక్రిలిక్ మెరుపులతో పలకరించే బతుక చిత్రాల నడుమ.. తోట వైకుంఠంతో.. అసిస్టెంట్ ఎడిటర్ పసునూరు శ్రీధర్ బాబు సంభాషించారు.
200 పెయింటింగ్స్ తో ప్రదర్శన
ఈ ప్రదర్శన హైదరాబాద్ కు రావడానికి ముందు ముంబయ్ లోని ప్రఖ్యాత జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో వారం రోజుల పాటు ఘనంగా సాగింది. దాదాపు 200 పెయింటింగ్స్ తో ఆ ప్రదర్శనను నిర్వహించిన ఇండియా ఫైన్ ఆర్ట్ యజమాని మన్విందర్ దావర్ వాటికి మరికొన్ని పెయింటింగ్స్ కలిపి.. మరింత ఘనంగా హైదరాబాద్ లో ఈ షో.. ఏర్పాటు చేశారు. ఊరి బతుకులోని సొగసులు, సౌందర్యాలు, మూలాలు, లోతులను చూడడానికి... పచ్చని నుదుటి మీద ఎర్రని పొద్దుపొడుపుతో వెచ్చగా నిమిరే తెలంగాణ తల్లుల పలకరింపులను వినడానికి ఈ ప్రదర్శనకు వెళ్ళాల్సిందే. తోట వైకుంఠం సృష్టించిన ఈ రంగుల లోకం తలుపులు ఫిబ్రవరి 27 దాకా తెరిచే ఉంటాయి.

 

19:41 - February 19, 2017

హైదరాబాద్ : రోజు రోజుకు పెరుగుతున్న ఖ‌ర్చులు త‌గ్గించుకోవ‌డానికి బల్దియా స‌రికొత్త ప్రణాళిక‌లు రచిస్తోంది. జీహెచ్‌ఎంసీలో దుబారా అవుతున్న విద్యుత్‌ పొదుపుపై దృష్టి సారించింది. ఇందుకోసం గ్రీన్‌ ఎనర్జీ ప్రొడక్షన్‌ను పెంచనుంది. 
ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవ‌డానికి బల్డియా ప్లాన్
రోజు రోజుకు పెరుగుతున్న ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవ‌డానికి బల్డియా ప్లాన్ చేస్తోంది. విద్యుత్ పొదుపు చేసేందుకు సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గ్రేటర్ కార్పొరేష‌న్ ప‌రిధిలో వీధి దీపాల నిర్వహ‌ణ‌, కార్యాల‌యాల నిర్వహ‌ణ‌కు పెద్ద ఎత్తు విద్యుత్ అవ‌స‌రం అవుతుంది. బ‌ల్దియాకు చెందిన 942 భ‌వ‌నాల్లో ప్రతి నెలా 11ల‌క్షల యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. ఇందుకోసం కోటి రూపాయ‌ల వ‌ర‌కు బిల్లులు చెల్లిస్తోంది. ఈ ఖర్చును తగ్గించడంపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా సోలార్ రూప్ టాప్  విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయ్యాల‌ని డిసైడ్ అయ్యింది. 
ఇక నుంచి భ‌వ‌నాల‌పై సోలార్ ప్లాంట్స్ 
ఇక నుంచి త‌మ భ‌వ‌నాల‌పై సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తే 5,83,000యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని భావిస్తుంది. ప్రస్తుతం విద్యుత్ శాఖ‌నుండి ప్రతియూనిట్ కి 9 రూపాయ‌లు చెల్లిస్తుంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రతి నెల 52 ల‌క్షల రూపాయ‌లు ఆదా అవుతాయని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.
ది ఎన‌ర్జీ అండ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ తో ఒప్పందం 
ఇందుకోసం ది ఎన‌ర్జీ అండ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 5మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేయడానికి 10ల‌క్షలు ఖ‌ర్చు చేయనుంది. అయితే మొద‌టిద‌శ‌లో 44భ‌వనాల‌పై సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుకు క‌స‌ర‌త్తు చేస్తుంది. ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే జీహెచ్‌ఎంసీకి పెద్ద మొత్తంలో ఖర్చు ఆదా అవుతుంది. 

 

19:36 - February 19, 2017

వరంగల్‌ : కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తు వరంగల్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది.  పోచమ్మమైదాన్ కూడలి వద్ద జరిగిన  జనఆవేదన సభలో పలువురు నేతలు మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో కేసీఆర్‌ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్‌నేతలు విమర్శించారు.  పెద్ద నోట్ల రద్దు తదితర విధానాలతో పాలకులు ప్రజలను మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

19:34 - February 19, 2017

అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో కసాయి ప్రభుత్వం పాలన చేస్తోందని... ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మండిపడ్డారు.. మేతలేక సగం ధరకే పశువుల్ని అమ్ముతున్నా సర్కారు   పట్టించుకోవడంలేదని ఆరోపించారు.. అనంతపురంలోని మార్కెట్‌ యార్డులో పశువుల సంతను   కాంగ్రెస్‌ బృందం పరిశీలించింది... మార్చి పదిలోపు   జిల్లాలోని    రైతుల సమస్యను పరిష్కరించాలని... లేకపోతే సత్యాగ్రహం చేస్తామని ప్రభుత్వాన్ని  హెచ్చరించారు.

 

18:40 - February 19, 2017

హైదరాబాద్ : ఏపీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు.. ఇకనుంచి అసెంబ్లీ సమావేశాలన్నీ అమరావతిలోనే జరుగుతాయని స్పష్టం చేశారు.. అసెంబ్లీ భవనాల నిర్మాణం దాదాపు పూర్తయిందని ప్రకటించారు.

 

18:35 - February 19, 2017

ఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీకి పెద్ద షాకే ఇచ్చింది ఐపీఎల్ టీమ్ పుణె సూపర్‌జెయింట్స్‌. కెప్టెన్సీ నుంచి ధోనిని తొల‌గిస్తూ సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. అత‌ని స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యత‌లు అప్పగించింది. టీమ్ మేనేజ్‌మెంట్ ధోనీ కెప్టెన్సీపై సంతృప్తిగా లేని కార‌ణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ టీమ్ ప్రక‌టించింది. గతేడాది ఐపీఎల్‌లో పుణె 7వ స్థానంలో నిలిచింది. 

 

18:33 - February 19, 2017

తూర్పుగోదావరి : జిల్లాలో పిచ్చికుక్కులు స్వైరవిహారం చేస్తున్నాయి. గొల్లప్రోలు పట్టణంలో పదిమందిని కరిచాయి. మహిళలు, పిల్లలను కూడా పిచ్చిక్కల భారిన పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారికి  కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పట్టణంలో పిచ్చికుక్కులను నిర్మూలించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చస్తున్నారు. 
 

18:30 - February 19, 2017

యాదాద్రి : మైనర్‌ బాలికను లైంగికంగా వేధించిన ఓ పోకిరీని గ్రామస్తులంతా చితకబాదారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూర్‌ మండలం లక్ష్మీదేవికాలువ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాలికను వేధిస్తుండగా చూసిన స్థానికులు నిందితున్ని పట్టుకున్నారు.. అంతా కలిసి దేహశుద్ది చేసి... పోలీసులకు అప్పగించారు. అయితే  నిందితుడు మాత్రం తనకు ఏ పాపం తెలియని చెబుతున్నాడు.  

18:25 - February 19, 2017

హైదరాబాద్ : వ్యవ‌సాయ రంగం అభివృద్ధికి  తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక‌లు ర‌చిస్తోంది. దేశంలో సూక్షసేద్యం అధికంగా తెలంగాణా రాష్రంలోనే సాగుతుండ‌టంతో... ఆ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయ‌త్నాలు ముమ్మరం చేసింది. 
బిందుసేద్యానికి నిధుల సమీకరణ
రైతు ఆత్మహ‌త్యల‌లో తెలంగాణే టాప్ అంటూ దేశ‌వ్యాప్తంగా... పేరు రావ‌డంతో  వ్యవ‌సాయరంగాన్ని ఆదుకోడానికి  బిందుసేద్యాన్ని అభివృద్ధి పరచడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే.. వ్యవసాయ శాఖలో అధికారుల కొరత ఉండటంతో   వ్యవసాయ విస్తరణాధికారుల పొస్ట్ ల‌ను భ‌ర్తీ చేయ‌డంతో పాటు బ‌డ్జెట్ లో అధిక ప్రాధాన్యతను వ్యవ‌సాయ రంగానికి కేటాయిండానికి కేసీఆర్‌ సర్కార్‌ రెడీ అవుతోంది.  
వ్యవసాయరంగానికి నాబార్డు నిధులు 
రాష్ట్రంలో చిన్న, స‌న్నకారు రైతులే అధికంగా ఉండటంతో వారిని అదుకునేందుకు స‌ర్కార్ ప్రణాళిక‌లు ర‌చిస్తొంది. దీనికోసం నాబార్డ్ నుండి నిధులను సేక‌రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 1000 కోట్లరూపాయల రుణం ఇవ్వడానికి అంగీకరించిన నాబార్డు .. మొదటి విడతగా 874 కోట్లు అందించనుంది.  నాబార్డ్‌ నిధులకుతోడు  మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.126 కోట్లు కలపనుంది. ఫలింతంగా సూక్ష్మసేద్యానికి సుమారు వెయ్యికోట్ల నిధులు సమకూరనున్నాయి.  
నాబార్డుతో వ్యవసాయశాఖ ఒప్పందం
సూక్ష్మసేద్యాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అందుబాటులోకి తెస్తే.. రైతులకు మేలు జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఈ నెల 20న నాబార్డుతో ఒప్పందం చేసుకోడానికి  రాష్ట్ర వ్యసాయశాఖ సిద్ధమైంది. 

 

18:19 - February 19, 2017

నిజామాబాద్ : చట్టమంటే కొందరికి చుట్టం.. ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా.. దున్నపోతుమీద వాన మాదిరిగా.. కొందరు అధికారుల తీరు మారడంలేదు. నిజమాబాద్‌ జిల్లాలో బాలకార్మికుల చట్టాలు చట్టుబండలవుతున్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారుల బాల్యం ఇటుకబట్టీల్లో మసిబారిపోతోంది. ఈ చిట్టి చేతులకు ఎంతకష్టం.. అక్షరాలు దిద్దాల్సిన చేతులతో అలవిగాని చాకిరిచేస్తున్నారీ చిన్నారులు. ఈ పసివాళ్ల బంగారు భవిష్యత్తు ఇలా ఇటుకబట్టీల్లో మసిబారిపోతోంది. 
మారని అధికారుల తీరు 
ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా.. అధికారుల తీరు మారడంలేదు. ఇటుకల తయారీలో  ఈ పసివాళ్లు కష్టపడుతున్నా.. ఏ అధికారికీ ఇది కనిపించడంలేదు. ఒక వేళ కనిపించినా.. బట్టీ కాంట్రాక్టర్లు ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతూ.. చూడనట్లే నటిస్తున్నారు అధికారులు. నిజామాబాదు జిల్లా నవీపేట్ మండలంలోని  ఇటుకబట్టీల్లో . వందల కుటుంబాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ పనిచేయడానికి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కార్మికులు వస్తున్నారు.  జిల్లావ్యాప్తంగా దాదాపు 1200 మంది  కార్మికులు ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నారు. అయితే .. తల్లిదండ్రులు ఇటుకల తయారీలో రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే.. వారి పిల్లలు కూడా ఇలా తల్లిదండ్రులతోపాటు పనిలోకే వెళుతున్నారు. దీంతో బళ్లో ఉండాల్సిన బాల్యం కాస్తా.. ఈ ఇటుకల మట్టిలో మసకబారిపోతుంటే.. ప్రభుత్వాలు చెబుతున్న సర్వశిక్షా అభియాన్‌ పేపర్లకే పరిమితం అవుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. 
నిబంధనలకు విరుద్ధంగా ఇటుకబట్టీలు
నిబంధనలకు విరుద్ధంగా ఈ ఇటుకబట్టీలు నడిపిస్తున్నారు వ్యాపారులు.    ఇటుకబట్టీలు నిర్వహించాలంటే విద్యుత్ శాఖ,  కార్మిక , మైనింగ్ ,రెవెన్యు, పర్యపరణ శాఖల  అనుమతులు తప్పనిసరి. కాని ఇవేవి ఇక్కడ కాంట్రాక్టర్లకు పట్టవు. అధికారులతో దోస్తీ చేస్తే అంతా ఓకే అంటూ.. దందా నడిపిస్తున్నారు.   జనావాసాల మధ్య ఇటుకబట్టీలు  ఎర్పాటు చేసి తమ ఆరోగ్యం తో చెలగాటం అడుతునారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
కార్మికుల బాగోగులు పట్టించుకోని యాజమాన్యాలు 
కార్మికుల బాగోగులను యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీస వేతన చట్టాలు అమలు అనేది ఊసులోకి కూడా లేదు. ఇక  అనారోగ్యం పాలయినా పట్టించుకునే నాథుడే లేడని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ఇప్పటికై  బాలకార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ఇటుకబట్టీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటు బాలకార్మికుల చేత గొడ్డుచాకిరీ చేయిస్తున్నా.. పట్టించుకోని అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని .. ప్రజలు కోరుతున్నారు. 

 

నేత కార్మికుల జీవితాల నుంచి దు:ఖం పోవాలి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : నేత కార్మికుల జీవితాల నుంచి దు:ఖం పోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ లో హ్యాండ్లూమ్, పవర్ లూమ్ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. ఆకలి చావులు, ఆత్మహత్యల నుంచి నేతన్నలను కాపాడుతామని చెప్పారు. నేత కార్మికుల సంక్షేమం, పరిశ్రమల కోసం అవసరమైన విధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు. 

 

తిరుమల చేరుకున్న గవర్నర్ నరసింహన్

చిత్తూరు : గవర్నర్ నరసింహన్ తిరుమల చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు రేపు శ్రీవారిని  దర్శించుకోనున్నారు.

యూపీలో ముగిసిన మూడో విడత ఎన్నికల పోలింగ్

లక్నో : ఉత్తరప్రదేశ్  అసెంబ్లీ మూడో విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదు అయింది.

మహిళల ప్రపంచకప్ అర్హత మ్యాచ్ లో భారత్ గెలుపు

కొలంబో : మహిళల ప్రపంచకప్ అర్హత మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. పాకిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించారు. పాకిస్తాన్ 67 పరుగలకు ఆలౌట్ అయింది. భారత్ మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. 

మహిళల ప్రపంచకప్ అర్హత మ్యాచ్ లో భారత్ గెలుపు

కొలంబో : మహిళల ప్రపంచకప్ అర్హత మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. పాకిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించారు. పాకిస్తాన్ 67 పరుగలకు ఆలౌట్ అయింది. భారత్ మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. 

హ్యాండ్లూమ్, పవర్ లూమ్ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో హ్యాండ్లూమ్, పవర్ లూమ్ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. చేనేత కార్మికుల సమస్యలపై కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారు. ఈ సమావేశానికి సీఎస్ ఎస్పీ సింగ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

17:17 - February 19, 2017

కేరళ : మలయాళ నటి భావన కిడ్నాప్‌ చేసి, లైంగికంగా వేధించిన ఘటనపై కేరళ ప్రభుత్వం స్పందించింది. ఈ కేసును తీవ్రంగా తీసుకుంది. నిందితులను విడిచిపెట్టబోమని,చట్ట ప్రకారం శిక్షిస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హెచ్చరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు సునీర్‌ కుమార్‌ సహా  ముగ్గుర్ని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే అరెస్టు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.  కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని  పోలీసులను  ఆదేశించారు.   

 

17:12 - February 19, 2017

హైదరాబాద్ : కాలుష్య పూరితమైన పరిశ్రమలను అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే దీనిపై కసరత్తు చేసిన సర్కార్‌.. ఫస్ట్‌ ఫేజ్‌లో కాలుష్యపూరిత పరిశ్రమలను తరలించాలని డిసైడ్‌ అయ్యింది. విశ్వనగరంలో భాగంగా కాలుష్యం లేని నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
పౌరుల జీవితాల్లో క్వాలిటీ పెంచేందుకు ప్రయత్నాలు 
నగరంలోని పౌరుల జీవితాల్లో క్వాలిటీ పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను అవుటర్‌ రింగ్‌ రోడ్డు అవతలికి తరలించాలని నిర్ణయం తీసుకుంది. మంత్రి కేటీఆర్‌ గతంలోనే అధికారులతో పరిశ్రమల షిప్టింగ్‌పై వరుస రివ్యూలు చేశారు. మొదటి దశలో ఏఏ పరిశ్రమలను తరలించాలనే దానిపై అధికారులతో చర్చించారు. నగరంలో దాదాపు 1545 ఉన్నట్లుగా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు గుర్తించింది. ఇందులో 385 పరిశ్రమలు ఇప్పటికే అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు తరలింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. మిగతా 1160 పరిశ్రమలను అవుటర్‌కు తరలించాల్సి ఉంది. ఈ పరిశ్రమలను దశల వారీగా తరలించనున్నారు. పరిశ్రమల తరలింపుకు సంబంధించి టీఎస్‌ఐఐసీ స్థలాలను గుర్తించే పనిలో పడింది. నగరానికి కనీసం 100 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తోంది. ేదీనిపై ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశీలన చేసి నివేదిక కూడా ఇచ్చింది. 
పరిశ్రమల తరలింపును సవాల్‌గా తీసుకున్న ప్రభుత్వం  
పరిశ్రమల తరలింపును ప్రభుత్వం సవాల్‌గా తీసుకుంది. 2017 డిసెంబర్ నాటికి కాేలుష్య పూరిత పరిశ్రమలను తరలించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. పరిశ్రమల్లో జీరో లిక్విడ్‌ డిచ్చార్జ్‌ వంటి విధానాలతో జల, వాయు కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించవచ్చని నిర్ణయించారు. ల్యాండ్‌ కన్వర్షన్‌, పన్ను రాయితీలు, పరిశ్రమ అవరణల్లోనే గృహవసరాలకు అనుమతి వంటి ప్రొత్సహాకాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. క్లస్టర్ల ఏర్పాట్లులో హెచ్‌ఎండీఏ వంటి సంస్థలతో కలిసి పని చేయాలని టీఎస్‌ఐఐసీ అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. 
కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వ ప్రయత్నాలు 
నగరంలో కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తరలింపుపై నగరంలోని పరిశ్రమల డైరెక్టర్ల సమావేశం ఏర్పాటు చేయాలని కూడా పరిశ్రమల శాఖ నిర్ణయించింది. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోనే త్వరలోనే ఈ సమావేశం జరగనుంది. 

 

17:06 - February 19, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని అన్నవరంలో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను...ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. సుమారు 20 కేజీల గంజాయిని అన్నవరం కొండపైకి తీసుకెళ్తుండగా...దేవస్థానం సిబ్బంది అడ్డుకున్నారు. లైసెన్స్‌ చూపించాలని సెక్యూరిటీ సిబ్బంది అడగగా..ఆటో డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. అయితే జరిగిన విషయాన్ని ఆలయ సిబ్బంది ఎక్సైజ్‌ పోలీసులకు తెలపగా..వారు గంజాయితో పాటు ఆటోను సీజ్‌ చేశారు. ఆటోల్లోని రెండు బ్యాగుల్లో 20 కిలోల గంజాయి లభించింది. దాంతో పాటు 40వేల రూపాయల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు పోలీసులు.  

 

17:03 - February 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వాగతించారు. అయితే మద్దతు ఇవ్వాలా ? లేదా ? అంశాన్ని కోదండరామ్‌ పెట్టే పార్టీ సిద్ధాంతాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈనెల 22న కోదండరామ్‌ హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి మద్దతు ఇస్తామని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ర్యాలీ కోసం నిరుద్యోగులు, యువతను సమీకరిస్తామన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ర్యాలీ నిర్వహిస్తాననడం మంచిదే అని చెప్పారు. 

17:02 - February 19, 2017

లక్నో : ఉత్తప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని బీఎస్ పీ అధినేత్రి మాయావతి జోస్యం చేప్పారు. కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ విధానాలతో జనం విసిగెత్తిపోయారని విమర్శించారు. యూపీలో అధికారం బీఎస్ పీ దేనని లక్నోలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆశాభావం వ్యక్తం చేశారు.

17:02 - February 19, 2017

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. లక్నోలో ఓటు హక్కు వినియోగించుకున్న అఖిలేశ్‌... అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు పట్టం కడతారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. 

16:56 - February 19, 2017

చెన్నై : తమిళనాడు బలపరీక్ష తీర్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పళనిస్వామి ఎన్నికపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా పన్నీర్‌సెల్వమే ఉండాలని సామాజిక మాధ్యమాల ద్వారా తమ వాణి వినిపిస్తున్నారు. 
పన్నీరు సెల్వానికి మద్దతుగా సినీ తారలు కామెంట్స్‌ 
తమిళనాడులో పళనిస్వామి సీఎం కావడంపై సినీ తారలు సోషల్‌ మీడియాలో స్పందించారు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా బలం నిరూపించుకోవడాన్ని సహించలేకపోతున్నారు. పన్నీరు సెల్వానికి మద్దతుగా కామెంట్స్‌ చేశారు. కమల్ హాసన్, ఖుష్బూ, రాధిక, అరవింద్ స్వామి తమదైన శైలిలో ట్విట్టర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. 
మరో కొత్త ముఖ్యమంత్రి వచ్చినట్లుంది : కమల్‌ హాసన్‌ 
మరో కొత్త ముఖ్యమంత్రి వచ్చినట్టే కనిపిస్తోందని కమల్‌ హాసన్‌ ట్విట్‌ చేశారు. జై డె'మాక్‌'క్రేజీ అంటూ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది అంటూ పోస్ట్‌ చేశారు. ఎమ్మెల్యేలకు తమిళనాడు ప్రజలు సరైన రీతిలో స్వాగతం పలుకుతారని కమల్ వార్నింగ్ ఇచ్చారు. 
ప్రజాభిప్రాయానికి విలువివ్వని ఎమ్మెల్యేలతో బలపరీక్ష :  అరవింద్ స్వామి
ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వని ఎమ్మెల్యేలతో ఈ బలపరీక్షను నిర్వహించార‌ని, దాన్ని ఎవరూ అంగీకరించబోరని మరో నటుడు అరవింద్‌ స్వామి అన్నారు. ఎమ్మెల్యేలు కలువాల్సింది త‌మ ప్రాంత‌ ప్రజలను కానీ, రిసార్టులో పార్టీ నేతలను కాదని ఆయ‌న మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు కవర్‌ చేయకుండా మీడియాను బ్లాక్‌ చేసి.. ఎంచుకున్న దృశ్యాలను మాత్రమే విడుదల చేయడం సిగ్గుచేటు అని అరవింద్‌ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంకెలాటతో ప్రజాస్వామ్యాన్ని మభ్యపెట్టపెట్టలేరన్న గౌతమి
అంకెలాటతో ప్రజాస్వామ్యాన్ని మభ్యపెట్టపెట్టలేరని సినీ నటి గౌతమి ట్విట్టర్‌లో అన్నారు. ప్రజాస్వామం ప్రజల గళమన్న ఆమె.. ప్రజాస్వామ్యాన్ని కాపాడి పన్నీరుసెల్వాన్ని సీఎం చేయాలని కామెంట్స్‌ చేశారు. తాజా ప్రస్తుత పరిణామాలు అవమానకరంగా ఉన్నాయని, గవర్నర్‌ చర్య తీసుకోవాలని మరో సినీ నటి రాధిక కోరారు. ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షమే బలం, ప్రతిపక్ష సభ్యులు లేకుండా బలపరీక్ష నిర్వహించడమేట‌ని ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఖుష్బూ అభిప్రాయ‌ప‌డ్డారు. త‌మిళ‌నాడు అసెంబ్లీలో జ‌రిగిన ప‌రిణామాల‌పై మ‌రికొంత మంది సినీన‌టులు కూడా భిన్న అభిప్రాయాల‌ను వ్యక్తం చేస్తున్నారు.

బోయిన్ పల్లిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : బోయిన్ పల్లిలోని ప్లాస్టిక్ పైపుల గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

తిరుచ్చిలో స్టాలిన్ నిరాహార దీక్ష.....

చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో జరిగిన అవమానానికి నిరసనగా డీఎంకే ఆందోళనలను ఉధృతం చేసింది. ఈ నెల 22న తమిళనాడు వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టాలని డీఎంకే నిర్ణయించింది. నిరాహార దీక్షల్లో డీఎంకే నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని స్టాలిన్ ఆదేశించారు. తిరుచ్చిలో స్టాలిన్ నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. అసెంబ్లీలో జరిగిన పరిస్థితులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్తామని స్టాలిన్ చెప్పారు. 

16:28 - February 19, 2017

చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో జరిగిన అవమానానికి నిరసనగా డీఎంకే ఆందోళనలను ఉధృతం చేసింది. ఈ నెల 22న తమిళనాడు వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టాలని డీఎంకే నిర్ణయించింది. నిరాహార దీక్షల్లో డీఎంకే నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని స్టాలిన్ ఆదేశించారు. తిరుచ్చిలో స్టాలిన్ నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. అసెంబ్లీలో జరిగిన పరిస్థితులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్తామని స్టాలిన్ చెప్పారు. 

 

ఏపీకి అసెంబ్లీకి తరలింపు కొంచెం బాధగానే ఉంది : స్పీకర్ కోడెల

హైదరాబాద్ : మార్చి 3 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరుగనున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. ఏపీకి అసెంబ్లీకి తరలింపు కొంచెం బాధగానే ఉందన్నారు. హైదరాబాద్ నుంచి ఫైల్స్, లైబ్రరీ తరలింపు పూర్తయిందని చెప్పారు. ఈనెల 25లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 

తొలి బోయింగ్ విమానం ప్రారంభం

విజయవాడ : గన్నవరం విమానాశ్రయం నుండి తొలి బోయింగ్ విమానం ప్రారంభం అయింది. గన్నవరం నుండి వారణాసికి ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు విమానం బయల్దేరనుంది. 

రేపు ఎంసెట్ నోటిఫికేషన్ !..

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ పరీక్షకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేస్తారని తెలుస్తోంది. పరీక్ష మే 12న జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.

 

తమిళనాడులో త్వరలో ఎన్నికలు - స్టాలిన్..

చెన్నై : తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వం ఎన్నో రోజుల పాటు అధికారంలో ఉండబోదని, త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని డీఎంకే నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు.

13:33 - February 19, 2017

మెదక్ : వాతావరణంలో మార్పులను పరిశీలించడానికి ప్రయోగించిన శాటిలైట్‌ మెదక్‌ జిల్లా అటవీ ప్రాంతంలో ల్యాండ్‌ అయ్యింది. నర్సాపూర్‌ మండలం గొల్లపల్లిలో ఈసీఐల్‌, టాటా ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ పండమెంటల్‌ ప్రయోగించిన టెలిస్కోప్‌ను నిన్న రాత్రి ఆకాశంలోకి వదిలారు. ప్రయోగ ఫలితాలు పూర్తి అవగానే రిమోట్‌ సహాయంతో గొల్లపల్లి అటవీ ప్రాంతంలో దించారు. తొలుత గ్రామస్తులు ఆందోళన గురయ్యారు. విషయం తెలిశాక పెద్ద ఎత్తున శాటిలైట్‌ను చూసేందుకు తరలివచ్చారు.

13:31 - February 19, 2017

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేంకగా ఇవాళ్టి నుంచి ఈనెల 28 వరకు జరిగే జన ఆవేదన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న దిగ్విజయ్‌కు శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం జన ఆవేదన సభలను ప్రారంభించేందుకు నిజామాబాద్‌ బయలుదేరి వెళ్లారు. పార్టీ నేతల్లో నెలకొన్న అంర్గత స్పర్థలను పరిష్కరించేందుకు నేలందరితో మట్లాడతానని చెప్పారు.

13:28 - February 19, 2017
13:26 - February 19, 2017
13:24 - February 19, 2017

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా లొంగిపోయారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని తెల్దార్ పల్లిలో సీపీఎం రాష్ట్ర కమిటీ భేటీ అయ్యింది. మహాజన పాదయాత్రతో సహా వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే నెల 19వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ముగింపు సభకు జనసమీకరణపై రాష్ట్ర కమిటీ చర్చించింది. అంతేగాకుండ పాదయాత్రలో పార్టీ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కార చర్యలపై సమీక్షించారు. సమావేశం అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడారు. పత్తి వేయవద్దని..రేటు రాదని పేర్కొంటున్నారని, కానీ ప్రస్తుతం రేటు బాగానే ఉందన్నారు. పప్పు ధాన్యాలు పండించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారని, రూ. 12వేలు ఉన్న కంది ప్రస్తుతం మూడు వేలు కూడా పలకడం లేదన్నారు. కంది ఎంత పండింది ? మద్దతు ధరతో ఎంత కొన్నారు ? అనే వివరాలు రావాల్సి ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం చాలానే ఉందని, రైతులు, కూలీలు..ఇతరులపై ప్రభావం చూపించిందన్నారు. పాదయాత్రలో తాము పలువురిని అడిగినప్పుడు వ్యాపారాలు దెబ్బతిన్నాయని పలువురు పేర్కొన్నారని తెలిపారు. పెద్దనోట్ల రద్దు వల్ల తెలంగాణకు రూ. 20వేల కోట్ల నష్టమని లెక్క తీసి చెప్పారని, అయినా కేసీఆర్ పైకి పొగుడుతున్నారే కానీ కేంద్రాన్ని ఒక్క మాట అనడం లేదని తెలిపారు. కారణం ఏదైనా మోడీ తెలంగాణకు ఏమి చేయ లేదన్నారు. విభజన ఒప్పందంలో పేర్కొన్న వాటిని ప్రభుత్వం ప్రశ్నించడం లేదని, మైనార్టీ రిజర్వేషన్ అంటూ పేర్కొన్నారని తరువాత శ్రీధర్ కమీషన్ వేశారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించే సరికి నోర్మూసుకున్నారని, ఇది రాష్ట్రానికి నష్టమని, రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ ఫణంగా పెడుతున్నారని విమర్శించారు.

ప్రతిపక్షం లేకుండా చేసేందుకు..
ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఇందుకు తగిన పద్ధతులు అవలింబిస్తున్నారని తెలిపారు. ఇందుకు ఉదాహరణగా సిన్హా కమిటీ చెప్పుకోవచ్చన్నారు. గవర్నర్ మెంట్ భూములను ఆక్రమించిన వారి వివరాలు వెలికి తీయాలని సిన్హా కమిటీ వేసిందని తెలిపారు. ఖమ్మంలో ఆక్రమించిన ఎమ్మెల్యేలు..ఇతరుల వివరాలు ఈ కమిటీ ఆరా తీసిందని తెలిపారు. కేవలం ఇదంతా సమాచారం కోసమే చేస్తున్నారని, అనంతరం ఎవరిని ఎక్కడ బ్లాక్ మెయిల్ చేయవచ్చో వారికి తెలుస్తుందన్నారు. టీఆర్ఎస్ జెండా పుచ్చుకుంటారా ? అనే బెదిరింపులకు దిగడానికి ఉపయోగించుకుంటున్నారని తమ్మినేని పేర్కొన్నారు.

13:22 - February 19, 2017

తూర్పుగోదావరి : జనాలను రక్షించాలనే ఉత్సాహంతో పోలీసు శాఖలో చేరుతున్న మహిళలకు రక్షణ లేదా ? ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఈ రకమైన అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్న ప్రయత్నాలు కలకలం రేపుతున్నాయి. గతంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసి చివరి నిమిషంలో ప్రాణాలతో బయటపడింది. తాజాగా ఉప్పాడకొత్తపల్లి పీఎస్ మహిళా కానిస్టేబుల్ విజయకుమారి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టిస్తోంది. తెల్లవారుజామున ప్రమాదకరమైన విష పదార్థం సేవించడంతో పరిస్థితి విషమించింది. దీనితో ఆమెను కాకినాడ ట్రస్టు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆసుపత్రి ఆవరణలో పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారని, బంధువులను రాకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై ఆసుపత్రి సిబ్బందిని టెన్ టివి ప్రశ్నించింది. సర్పవరం పీఎస్ కు సమాచారం ఇచ్చామని, పోలీసులు ఇచ్చి వాంగ్మూలం తీసుకున్నారని ఆసుపత్రి సిబ్బంది పేర్కొంటున్నారు. కానీ పోలీసులకు ఆమె ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని సర్పవరం సీఐ పేర్కొన్నారు. విధుల నిర్వాహణలో వివక్ష చూపిస్తున్నారని, ఉన్నతాధికారుల వేధింపులే ఇందుకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

లారీని ఢీకొన్న అంబులెన్స్..

గద్వాల : వేముల సమీపంలో ఎన్ హెచ్ -44 పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి లారీని అంబులెన్స్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..

తూర్పుగోదావరి : ఉప్పాడకొత్తపల్లి పీఎస్ మహిళా కానిస్టేబుల్ విజయకుమారి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అధికార వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.

12:41 - February 19, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల ఆగడాలు రోజు రోజుకు శృతి మించి పోతున్నాయి. వారం రోజుల క్రితం ముగ్గురు యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అందులో ఓ ఆర్మీ జవాన్ కూడా ఉన్నాడు. దీనితో యువకుల చేతులు విరిగిపోయాయి. దీనితో బాధితులు పౌర హక్కుల నేతలను ఆశ్రయించారు. ఘటనకు సంబంధించిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ట్రాఫిక్ ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లను క్రిమినల్ కేసులు నమోదు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేశారు.

12:36 - February 19, 2017

నెల్లూరు : మాగుంట లే అవుట్ లో విషాదం చోటు చేసుకుంది. సమాచార హక్కు జిల్లా కన్వీనర్ భద్రం మృతదేహం రైలు పట్టాలపై కనిపించింది. రెడ్ క్రాస్ లో క్రీయాశీల పాత్ర పోషిస్తున్నాడు. సీపీఐ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. భద్రం ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక ఎవరైనా చంపేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అవినీతిని ప్రశ్నిస్తుండడంతో ప్రత్యర్థులు కక్ష కట్టి చంపేసి మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

12:32 - February 19, 2017

కడప : జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. వేంపల్లె మండలం పిరమిడ్ నగర్ లోని చోడేశ్వరి ఆలయంలో దోపిడికి పాల్పడ్డారు. వెండి కిరీటంతో పాటు హుండీలోని కానుకలను దోచుకెళ్లారు. ఖాళీ హుండీని ఓ ప్రాంతంలో వదిలి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు దేవాలయాన్ని సందర్శించారు. దొంగల కోసం గాలింపులు చేపడుతున్నారు.

విదేశీ పర్యటనకు వెళ్లిన ఉపరాష్ట్రపతి..

ఢిల్లీ : భారతదేశ ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రువాండా, ఉగండా దేశాల్లో ఆయన పర్యటించనున్నారు.

గవర్నర్ ను కలిసి తిరుచ్చి శివ..

చెన్నై : రాష్ట్ర గవర్నర్ ను డీఎంకే నేత తిరుచ్చి శివ కలిశారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. భేటీ అనంతరం మీడియాతో తిరుచ్చిశివ మాట్లాడారు. పరిణామాలపై ఓ నివేదికను గవర్నర్ కు సమర్పించామని, దీనిపై దృష్టి పారిస్తామని గవర్నర్ పేర్కొనడం జరిగిందన్నారు.

12:09 - February 19, 2017

తెలంగాణా అంటేనే పాట వినిపిస్తుంది. ప్రాణం లేచొస్తుంది. హృదయం కంపిస్తుంది. దేహం కదం తొక్కుతుంది. ఉద్రేకం ఉప్పొంగుతుంది. ఉద్యమాలకు పురుడు పోస్తుంది. అంతటి శక్తిమంతమైన పాటలు రాసిన గేయరచయితలు తెలంగాణాలో ఎందరో ఉన్నారు. వారిలో గడ్డం ఉదయ్ ఒకరు. ఈ గేయరచయిత చదివింది పదో తరగతే అయినా సమాజాన్ని బాగా పరిశీలించి మానవాభ్యుదయం కోసం ఎన్నో పాటలు రాశారు. ప్రజాకవి గడ్డం ఉదయ్ గురించి మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

12:07 - February 19, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. స్థానిక సంస్థల కోటాలోని 9 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదల కావడంతో టీడీపీలో ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆశావాహులు క్యూలు కడుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ స్థానాల్లో ఉన్న నేతలు తమకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతుంటే, తమకు ఓ అవకాశం ఇవ్వాలంటూ మరికొంత మంది అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. చిత్తూరు, అనంతపురం, కడప, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం రెండు స్థానాలు ఖాళీలు అయ్యాయి.

9 స్థానాల్లో..
ఖాళీ అయిన ఈ తొమ్మిది స్థానాల్లో తమకు టిక్కెట్‌ కేటాయించాలంటూ టీడీపీలో ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంతోపాటు, విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం చుట్టూ తమ బయోడేటాలతో నేతలు చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే ఆయా స్థానాల్లో రిటైర్ అవుతున్న టిడిపి ఎమ్మెల్సీలు... తమకు మరో అవకాశం కల్పించాలంటూ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు జిల్లాల్లోని సీనియర్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కూడా తమకు ఈసారైనా అవకాశం కల్పించాలంటూ అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతానికి కడప జిల్లా అభ్యర్థిగా బీటెక్ రవి పేరును మాత్రమే చంద్రబాబు ఖ‌రారు చేశారు. చిత్తూరు జిల్లాలో సీనియర్ నేత ఎస్.సి.వి. నాయుడు, రాజసింహ, హేమలత, నరేష్ కుమార్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్ ల పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో మాత్రం ఈ పోటీ ఎక్కువగానే ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్న శిల్పా చక్రపాణి రెడ్డి, మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే ఆయన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డితోపాటు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎన్.ఎం.డి.ఫరూక్ లు కూడా తమకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.

పండుగ వాతావరణం..
ఇక నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డితోపాటు ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న అంగర‌ రామ్మోహన్ కు మళ్లీ అవకాశం కల్పించేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అక్కడ మరో స్థానాన్ని మాత్రం మంతెన సత్యనారాయణరాజు పేరు ఖరారుగా కనిపిస్తోంది. తూర్పుగోదావరిలో బొడ్డు భాస్కరరావు పేరునే మరోసారి పరిశీలిస్తున్న టీడీపీ, ఒకవేళ కాపు నేతలకు ఈ స్థానం కేటాయించాలనుకుంటే మాత్రం చిక్కాల రామచంద్రరావు, జ్యోతుల చంటబ్బాయ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అప్పల‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావులు పోటీప‌డుతున్నారు. అనంత‌పురంలోనూ పోటీ తీవ్రంగా ఉంది. కె.సి నారాయ‌ణ‌, గ‌డ్డం సుబ్రమ‌ణ్యం, నాగ‌రాజు, అబ్దుల్ ఘ‌నీ, త‌దిత‌రులు పేర్లు వినిపిస్తున్నాయి. ఓవైపు స్థానిక సంస్థల కోటాకు ఇలాంటి డిమాండ్ కొనసాగుతుంటే, మరోవైపు ఎమ్మెల్యేల కోటాలో మరో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు, గవర్నర్ కోటాలో మరో రెండు స్థానాలు త్వరలోనే ఖాళీలు కానున్నాయి. దీంతో టీడీపీలో ఎమ్మెల్సీల పండుగ వాతావరణం నెలకొంది.

12:02 - February 19, 2017

సాహిత్యం నేడు సమాజానికి అవసరమా? ప్రపంచీకరణ నేపథ్యంలో మనుషులు వస్తువులగా మారిపోయింది నిజం కాదా? సమస్త మానవ విలువలు, కళలు, సంస్కృతులు రోజురోజుకు కనుమరుగవున్నాయి కదా? మరి ఇలాంటి తరుణంలో సాహిత్యం నిర్వహించే పాత్ర ఏమిటి? ఇలాంటి విషయాల గురించి తీవ్రంగా ఆలోచించేవారే నిజమైన సృజన కారులు. అలాంటి రచయితల్లో రామదుర్గం మధుసూధనరావు ఒకరు. రాయల సీమంటే కరువుకు తోబుట్టువు..ఫ్యాక్షన్ గొడవలకు చిరునామా... అలాంటి సీమలో ఎందరో మంచి కవులు కథా రచయితలు పుట్టుకొచ్చారు. అక్షరాలలో సీమ ప్రజల జీవన దృశ్యాలకు అద్దం పట్టి చూపించారు. అలాంటి వారిలో విలక్షణమైన కథారచయిత రామదుర్గం మధుసూదన రావు. ఆయన సీమ ప్రజల దుర్భర జీవితాలను కథలుగా రాసి మట్టి మనసు, కమాను వీధి కథలు అనే రెండు కథా సంపుటాలు వెలువరించారు. ప్రముఖ కథకులు, సీనియర్ పాత్రికేయులు రామదుర్గం మధుసూధనరావు పై మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

11:58 - February 19, 2017

పోటీ పరీక్షల్లో సక్సెస్ కోసం నేటి యువత పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. కనీసం మన దేశంలోని రాజధానులు ఎన్ని ? నేతల పేర్లు..ఇతరత్రా విషయాలు చెప్పడం కష్టంగా ఉంటుంది. అలాంటిది ఏషియాలోని కంట్రీస్ పేర్లు..టెంపుల్స్..డెస్టింగ్స్..నోబుల్.. ప్రతిదీ అడగానే టకటక మంటూ టూ మినిట్స్ లో చెబుతున్నాడో వండర్ కిడ్.. అతనే యోగిత్...పలు అవార్డులు..మెడల్స్ సాధించాడు. మరి ఆ వండర్ కిడ్ గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

యూపీలో 24.19 శాతం పోలింగ్..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఫేజ్ 3లో 69 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. 11 గంటల వరకు 24.19 శాతం పోలింగ్ నమోదైంది.

11:38 - February 19, 2017

ఉత్తర్ ప్రదేశ్ : అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. లక్నోలో ఓటు హక్కు వినియోగించుకున్న అఖిలేశ్‌... అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు పట్టం కడతారన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

బీఎస్పీ..
ఉత్తప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి జోస్యం చేప్పారు. కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ విధానాలతో జనం విసిగెత్తిపోయారని విమర్శించారు. యూపీలో అధికారం బీఎస్పీదేనని లక్నోలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆశాభావం వ్యక్తం చేశారు.

11:35 - February 19, 2017

ఉత్తర్‌ప్రదేశ్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. పన్నెండు జిల్లాలోని 69 స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు 826 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం రెండు కోట్ల 41 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో 25,603 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు. కొన్ని చోట్ల ఓటింగ్‌ యంత్రాలు మొరాయించడం మినహా పోలింగ్‌ ప్రశాంతంగా కొసాగుతోంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇటావా జిల్లాలోని జస్వంత్‌నగర్‌ నుంచి యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ బరిలో ఉన్నారు. లక్నో కంటోన్మెంట్‌ నుంచి అఖిలేశ్‌ మరదలు అపర్ణా యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ములాయం సింగ్‌ యావద్‌, అఖిలేశ్‌యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వంటి ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

11:34 - February 19, 2017

విజయవాడ : రయ్ రయ్‌మని బైక్‌పై దూసుకెళ్తారు.. స్టంట్స్ చేస్తారు.. నగర వీధుల్లో హల్ చల్ చేస్తారు.. వారి దూకుడుకు అడ్డే ఉండదు.. ప్రస్తుతం ఇది విజయవాడ యువత తీరు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మితిమీరిపోతున్న బైక్ రేసింగ్‌లపై టెన్ టీవీ ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం విజయవాడలో యువత తీరు ఇది. మెట్రో సంస్కృతితో నగరంలో విచ్చలవిడిగా బైక్ రేసింగ్‌లు జరుగుతున్నాయి. కొందరు యువత గ్యాంగ్‌లుగా ఏర్పడి బైక్ రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల స్టంట్స్ చేస్తూ తమ ప్రాణాలకే కాకుండా.. ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారు.

రయి..రయి..
విజయవాడ రాజధాని ప్రాంతం కావడంతో నగరంలో స్పోర్ట్స్‌, లగ్జరీ బైక్స్ విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో బెట్టింగ్‌లు కడుతూ రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. కొందరైతే అమ్మాయిలు, మహిళలే టార్గెట్‌గా బైక్ విన్యాసాలు చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. ప్రధానంగా బెజవాడలో అత్యంత రద్దీగా ఉండే పండిట్ నెహ్రూ బస్టేషన్, బెంజ్ సర్కిల్, బందరు రోడ్, ఏలూరు రోడ్, బీసెంట్ రోడ్, సింగ్ నగర్ ఫ్లై ఓవర్, బీఆర్టీఎస్ రోడ్, కృష్ణలంక, మొగల్రాజపురం వంటి ముఖ్యమైన ప్రాంతాల్లో డేంజర్ డ్రైవింగ్స్ జరుగుతున్నాయి. 20 కాదు 40 కాదు ఏకంగా 120 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్తు తోటి వాహనదారులకు దడపుట్టిస్తున్నారు. తక్షణమే యూత్ దూకుడుకు పోలీసులు కళ్లెం వేయాలని స్థానికులు కోరుతున్నారు.

పోలీసులే షాక్..
యువత బైక్ విన్యాసాలు చూసి పోలీసులే షాక్‌ అవుతున్నారు. బైక్ రేసింగ్‌లను అడ్డుకున్న హోంగార్డ్‌ను యువత కొట్టారని విజయవాడ డీసీపీ పాల్ రాజ్ తెలిపారు. విజయవాడలో గత నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే 2013లో 1523 ప్రమాదాలు జరగ్గా 350 మంది మృతిచెందగా.. 2014లో 1670 ప్రమాదాలు జరిగితే 334 మంది చనిపోగా.. 2016 ఆగస్టు వరకు 1083 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 254 మంది మృత్యువాతపడ్డారని డీసీపీ తెలిపారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వల్లే యువత రెచ్చిపోతున్నారన్నారు. విజయవాడలో ఎవరైనా బైక్ రేసింగ్‌లకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెబుతున్నారు.

11:31 - February 19, 2017

వరంగల్ : తెలంగాణలోని ఓ మారుమూల గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామం అమలు చేస్తున్న పనులను దేశంలోని అన్ని గ్రామాల్లో అమలుచేయాలని నిపుణులు భావిస్తున్నారు. అంతగా ఈ గ్రామంలో ఏం ఉంది అనుకుంటున్నారా..?గంగదేవిపల్లి తెలంగాణలో వరంగల్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం.. ఈ గ్రామం ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామంలో 17 సంవత్సరాల క్రితం చేపట్టిన శానిటేషన్ విధానాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. గ్రామంలో అమలుచేస్తున్న శానిటేషన్ విధానం గురించి తెలుసుకోవడానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రపంచంలోని వివిధ యూనివర్సీటీల ప్రొఫెసర్లు, యూనిస్సెఫ్ సభ్యులు గంగదేవిపల్లికి తరలివస్తున్నారు.

మరుగుదొడ్ల పరిశీలన..
గంగదేవిపల్లిలో శానిటేషన్ కోసం రెండు గుంతల పద్ధతిలో నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. 50 మంది 7 బృందాలుగా విడిపోయి గుంతలలో మలం ఎరువుగా మారినా తీరును పరిశీలించారు. ఈ విధానంను దేశంలోని అన్ని గ్రామాల్లో అమలు చేస్తే వెస్టేజీ నుంచి కూడ సంపదను సృష్టించవచ్చన్నారు కేంద్ర ప్రభుత్వ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ సెక్రటరీ పరమేశ్వరన్ అయ్యర్. ఇది సురక్షితమైన ఆర్గానిక్ మ్యానుర్ అని.. ఎరువును గుంతలోనుంచి తీసుకుని పంట పొలాలకు వాడుకోవచ్చంటున్నారు గ్రామస్థులు. ఈ విధానంను అన్ని గ్రామాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు తెలంగాణ రూరల్ డెవలప్ మెంట్ సెక్రెటరీ నీతూ ప్రసాద్. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లు ఇలాంటి గ్రామాలను తీర్చిదిద్దాడానికి త్వరలోనే కృషి చేస్తామన్నారు.

11:29 - February 19, 2017

కృష్ణా : జిల్లా చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం 108 వాహనంలో నందిగామా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా గ్యాస్‌ సిలిండర్‌ పేలిందని అనుమానిస్తున్నారు.

బీజేపీలో చేరిన యాక్టర్ రవి కిషన్..

ఢిల్లీ : భోజ్ పురి నటుడు, బుల్లితెర నటుడు రవి కిషన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

హర్యానాలో భద్రత కట్టుదిట్టం..

హర్యానా : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘జై బలిదాన్ దివస్' పేరిట శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా సోనిపట్, దౌల్తాబాద్, హసన్ పూర్ ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసులు మోహరించారు.

డీఎంకే ప్రత్యేక సమావేశం..

చెన్నై : డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. నిన్న జరిగిన పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

11:20 - February 19, 2017

హైదరాబాద్ : నగరంలో మళ్లీ స్వైన్ ఫ్లూ పంజా విసురుతోంది. చలికాలం తగ్గుతున్న క్రమంలో వ్యాధి ప్రబలుతుండడంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన ముగ్గురు గాంధీ ఆసుపత్రిలో చేరారు. వీరి చేరికతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 12కి చేరింది. వీరిలో ఆరుగురు చిన్నారులున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారు పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రైవేటు ఆసుపత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

గవర్నర్ ను కలిసిన పళనిస్వామి..

చెన్నై : తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావును సీఎం పళనిస్వామి కలిశారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలను గవర్నర్ దృష్టికి తేనున్నారు.

11:13 - February 19, 2017

చెన్నై : విశ్వాస పరీక్ష ఎదుర్కొని విజయవంతం అయిన సీఎం పళని స్వామి నేడు గవర్నర్ విద్యాసాగర్ రావు ను కలువనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఘటనలపై గవర్నర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని గవర్నర్ సూచించినట్లు, ఈ నేపథ్యంలో సీఎం పళనిస్వామి భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. విశ్వాస పరీక్ష నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీలో విధ్వంస ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. డీఎంకే సభ్యులు కుర్చీలు..బళ్లలు విసిరేయడం..స్పీకర్ స్థానంలో పలువురు సభ్యులు కూర్చొవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అనంతరం సస్పెండ్ చేసిన డీఎంకే సభ్యులను మార్షల్స్ బయటకు పంపారు. ఇలాంటి పరిణామాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన షర్ట్ చించారని, ప్రతిపక్ష నేత అయినా కూడా గౌరవించలేదంటూ డీఎంకే నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిరిగిన చొక్కాతోనే గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి జరిగిన పరిణామాలను వివరించారు. గవర్నర్ తో ప్రస్తుతం సీఎం పళనిస్వామి భేటీ కాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

11:08 - February 19, 2017

ఖమ్మం : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం అలుపెరుగని యాత్ర చేస్తున్న తమ్మినేని వీరభద్రంకు.. ఆయన తండ్రి తమ్మినేని సుబ్బయ్య నుంచే సమాజానికి సేవ చేయాలన్న గుణాలు అబ్బాయని తమ్మినేని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాగా చదివించి వీరభద్రంను డాక్టర్‌ చేయాలనుకున్నామని.. కానీ సమాజానికి సేవ చేసే రాజకీయ నాయకుడయ్యాడని అంటున్నారు. నీతి.. నిజాయితీగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్లపై దుష్ప్రచారాలు సాధారణమే అని పేర్కొన్నారు. తమ్మినేని కుటుంబ సభ్యులు ఇంకా ఏ విషయాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ..

హైదరాబాద్ : నగరంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు వ్యక్తులు ఈ వ్యాధితో చేరారు. మొత్తంగా గాంధీలో 12 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురు బాలికలున్నారు.

11:02 - February 19, 2017

గవర్నర్ ను కలువనున్న పళని స్వామి..

చెన్నై : తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావును సీఎం పళనిస్వామి కలువనున్నారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలను గవర్నర్ దృష్టికి తేనున్నారు.

10:28 - February 19, 2017

'ఎన్ టిఆర్' సినిమాకి ప్రొడ్యూసర్ గా మారిన సోదరుడు 'కళ్యాణ్ రామ్' ఇప్పుడప్పుడే తెరమీద కనిపించే ఛాన్స్ లేదు అని చెప్తున్నాడట .తాను హీరోగా చేసిన 'ఇజం' సినిమా ఆడియన్స్ కి బాగా నచ్చినా కానీ కమర్షియల్ గా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని తెలుస్తుంది. అందుకే 'జనతా గ్యారేజ్' తో ఫామ్ లో ఉన్న యంగ్ టైగర్ తో సినిమా రెడీ చేసాడు. నిర్మాతగా మారాడు. ఆల్రెడీ రెండు కథలు సిద్ధంగా పెట్టుకొని కూడా హీరోగా నటించకుండా కంప్లీట్ ఫోకస్ ప్రొడక్షన్ మీదనే పెట్టాడు కళ్యాణ్ రామ్. 'ఫటాస్' తప్ప ఇటీవల అయన నిర్మించిన సినిమాలేవీ విజయం సాధించలేదు. 'జనతా గ్యారేజ్ ' లాంటి భారీ విజయం తరువాత వస్తున్న సినిమా కావడంతో 'ఎన్టీఆర్' ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. దీనికి తోడు ఫస్ట్ టైం హోం బ్యానర్ లో నటిస్తుండడం, మూడు పాత్రలు చేస్తుండడం వల్ల కూడా ఈ కొత్త సినిమా విషయంలో యంగ్ టైగర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడంట.

రూ. 75 కోట్లు..
ఈ మూడు పాత్రలకు సంబంధించి మూడు భిన్నమైన గెటప్ లు ట్రై చేస్తున్నట్లు వినికిడి. ఓ పాత్రలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతునట్లు సమాచారం. బాబీ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాకి 75 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. బడ్జెట్ లో తీయనున్న ఈ సినిమాలో 'కళ్యాణ్ రామ్' అప్పులన్నీ తీరిపోతాయని, మళ్ళీ నిర్మాతగా నిలదోక్కుకుంటాడు అని అంటున్నారు. ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయ్యేవరకు తన కొత్త సినిమాలు ఏవీ స్టార్ట్ చేయొద్దని 'కళ్యాణ్ రామ్' భావిస్తున్నాడట. ప్రస్తుతానికి కళ్యాణ్‌రామ్‌ ఫ్యూచర్‌ డెసిషన్స్‌ అన్నీ కూడా జై లవకుశతోనే ముడిపడి వున్నాయి. మరి తమ్ముడితో అన్న నిర్మిస్తున్న ఈ చిత్రం ఇద్దరి ఎలాంటి అనుభవం మిగులుస్తోందో చూడాలి.

10:22 - February 19, 2017

'మహేష్ బాబు' న్యూ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ అంటేనే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. వారి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఫై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెల్సిందే. ఆ అంచనాలకు తగట్టే డైరెక్టర్ మూవీని రూపుదిద్దిస్తున్నాడు. తాజాగా ముంబై లో షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. ఇక ఇప్పటివరకు మూవీకి సంబధించిన పోస్టర్స్ కానీ స్టిల్స్ కానీ ఎటువంటి టీజర్ కూడా రిలీజ్ చేయకపోయేసరికి అభిమానులు ఎంతో ఆతృతగా వీటి కోసం ఎదురుచూస్తున్నారు.

కొత్త లుక్..
'మహేష్ బాబు' తన ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్త లుక్ ని చూపిస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తునే ఉన్నాడు. మురుగదాస్ కూడా తన సినిమాల ఫస్ట్ లుక్.. టీజర్ లాంటి విషయాల్లో చాలా శ్రద్ధ చూపిస్తాడు. టీజర్‌తోనే గొప్ప ఇంపాక్ట్ వేయాలని చూస్తాడు. ఇంతకుముందు 'కత్తి’.. 'తుపాకి' లాంటి సినిమాల ట్రైలర్లు ఏ రేంజిలో పేలాయో తెలిసిందే. వీటి ట్రైలర్లు చూడగానే సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు 'మహేష్' సినిమా టీజర్ విషయంలోనూ అంతే శ్రద్ధ చూపిస్తున్నాడు మురుగదాస్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ లుక్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరిలో ఆసక్తి పెరిగింది.

లండన్ లో..
ఫిలిం మేకింగ్ లో జాగర్తపడే డైరెక్టర్ మురుగదాస్ ఈ సినిమా టీజర్ కి భారీగానే ఖర్చు పెట్టిస్తున్నారు.ఈ చిత్ర టీజర్ లండన్లో రెడీ అవుతుండటం విశేషం. అక్కడ వీఎఫ్ఎక్స్ నిపుణులతో కలిసి ఓ ప్రత్యేక బృందం టీజర్ తీర్చిదిద్దుతోందట. నిడివి తక్కువే అయినా ఇంపాక్ట్ గట్టిగా ఉండేలా ఈ టీజర్‌ను మలిచే ప్రయత్నంలో ఉన్నారట. కచ్చితంగా ఈ టీజర్ తెలుగు.. తమిళ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. టీజర్ లేటైనా ఎక్కడ స్టాండర్డ్స్ తగ్గకుండా ఉంటుందని ఫిలిం యూనిట్ టాక్.

10:18 - February 19, 2017

డైరెక్టర్ 'శంకర్' సినిమాల్లో కధ బాగుంటుంది. కథనం ఆసక్తిగా ఉంటుంది. చూస్తున్న ప్రతి ఫ్రేమ్ కొత్తగా ఉంటుంది. ఒక రకంగా 'శంకర్' సినిమా అంటే ఆడియన్స్ కి కన్నుల పండగే. 'రోబో' సినిమాతో ఇటు ప్రపంచ సినిమా ఆడియన్స్ ని అటు 'రజనీ కాంత్' ఫాన్స్ ని అలరించిన డైరెక్టర్ 'శంకర్ షణ్ముగం' రోబో 2.0 స్పెషల్ కేర్ తీసుకుని వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ పై కొత్త సంగతులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మొదటగా ఈ మూవీ బడ్జెట్ గా రూ.350 కోట్లు అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ లెక్క రూ. 450 కోట్లవరకు వెళ్లేలా ఉందంట.

రూ.12 కోట్లు..
కథను మాత్రమే గట్టిగా నమ్మి ఫిలిం మేకింగ్ ని ఒక యజ్ఞంలా చేసే డైరెక్టర్స్ ఉన్నారు. అలా కథానుగుణంగా బడ్జెట్ ని ప్లాన్ చేసి హిట్ కొట్టేస్తుంటారు. ఈ క్రియేటివ్ డైరెక్టర్స్ అందులో శంకర్ ఒకరు. 'రజనీకాంత్‌’, 'అక్షయ్‌కుమార్‌'ల మధ్య వచ్చే ఫస్ట్‌ ఫైట్‌ కావడంతో ఈ ఫైట్ సీన్‌ కోసం శంకర్‌ ఏకంగా పన్నెండు కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాడట. ఆ ఖర్చుతో ఒక మీడియం రేంజ్‌ సినిమా తీసేయవచ్చు. అంత ఖర్చుతో శంకర్‌ ఒకే ఒక్క ఫైట్‌ సీన్‌ తీస్తున్నాడు. ఏ మాత్రం టెక్నికల్ ఎలిమెంట్స్ తగ్గకుండా జాగర్తగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చూడాలి.

10:03 - February 19, 2017

సిద్ధిపేట : అక్కన్నపేట మండలంలో హైనా కలకలం రేపుతోంది. మల్లంపల్లి, మోత్కులపల్లి, కట్కూరు గ్రామాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులు పాడి పశువులను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 23 లేగదూడలను హైనా చంపేసింది. దీనితో రైతులు తీవ్ర కలత చెందుతున్నారు. అటవీశాఖాధికారులు స్పందించి హైనాను బంధించాలని రైతులు కోరుతున్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను కలిసి సమస్యను తెలియచేశారు. వెంటనే దీనిపై స్పందించాలని అటవీశాఖాధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కానీ అటవీశాఖాధికారులు ఏ మాత్రం స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఓటు వేసిన ప్రముఖులు..

ఉత్తర్ ప్రదేశ్ : మూడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు నేతలు, ఇతరులు ఓటు హక్కును వినియోగించుకొంటున్నారు. చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ టి.వెంకటేష్ దంపతులు, బీఎస్పీ అధినేత్రి మాయావతి, బీజేపీ ప్రతినిధి సుదాన్షు త్రివేది, ఇతర పార్టీల అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

శివ్ పాల్ యాదవ్ పై రాళ్ల దాడి ?

ఉత్తర్ ప్రదేశ్ : శివ్ పాల్ యాదవ్ పై రాళ్ల దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. జశ్వంత్ నగర్ లో వెళుతున్న ఆయన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది.

యూపీ..పోలింగ్..కాన్పూర్ నగర్ 7.71 శాతం..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు కాన్పూర్ నగర్ లో 7.71 శాతం, కానజ్ లో 11.65 శౄతం, సితపూర్ లో 11 శాతం పోలింగ్ నమోదైంది.

09:30 - February 19, 2017

వికారాబాద్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లికి కర్కశంగా మారిపోయింది. రూ. 50 రూపాయలు ఎక్కడ పడేశావ్ అంటూ చితకబాదడంతో కొడుకు మృతి చెందాడు. ఈ విషాద ఘటన వికారాబాద్ లో చోటు చేసుకుంది. శివారెడ్డిపేటకు చెందిన అమీనా బేగం ఆలంపల్లిలో నివాసం ఉంటోంది. ఈమెకు ఏడేళ్ల కొడుకు రెహాన్ ఉన్నాడు. రూ. 50 ఎక్కడ పడేశావ్ అంటూ ఇష్టమొచ్చినట్లు చితకబాదింది. దీనితో రెహాన్ తల గోడకు తగలడంతో అక్కడికక్కడనే మృతి చెందాడు. కానీ పోలీసుల కోణం వేరే విధంగా ఉంది. చెప్పిన మాట వినడం లేదని క్షణికావేశంలో కొడుకు రెహాన్ ను తల్లి అమీనాబేగం కొట్టిందని పేర్కొన్నారు. అనంతరం రెహాన్ పడుకున్నాడని, కానీ అర్ధరాత్రి లేచి చూసేసరికి బాలుడు చనిపోయాడని పేర్కొన్నారు. సొంత గ్రామమైన శివారెడ్డికి అమీనాబేగం తరలించిందని, విషయం తెలుసుకున్న వీఆర్ఓ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

అధికారంలోకి వస్తాం - మాయావతి..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు, అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి, రెండు, మూడో దశల్లో జరుగుతున్న పోలింగ్ లో బీఎస్పీ నెంబవన్ స్థానంలో నిలుస్తోందని, మెజార్టీ స్థానాలు దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

09:08 - February 19, 2017
09:03 - February 19, 2017

ఢిల్లీ : ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశ ప్రజల జీవన విధానంపై తీవ్ర దుష్ప్రభావం చూపిందని న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అఖిల్‌ బిల్‌గ్రామి విమర్శించారు. కేంద సర్కారు ప్రచారం కోసం విపరీతంగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోందని హైదరాబాద్‌ కలెక్టివ్‌ సదస్సులో దుయ్యబట్టారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుటోందని మోదీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని ఈయన తప్పుపట్టారు. పెద్ద నోట్ల రద్దుతో అవినీతి తగ్గిందని మోదీ ప్రచారం చేసుకోడాన్ని ప్రొఫెసర్‌ అఖిల్‌ తప్పుపట్టారు.

09:01 - February 19, 2017

ఉత్తర్ ప్రదేశ్ : మూడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 69 అసెంబ్లీ నియోజకవర్గస్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభ స్థానం లక్నో కాగా, ఈ రోజు పోలింగ్ జరుగుతున్న ఇటావా, మైన్‌పురి, కనౌజ్ ప్రాంతాల్లో బీజేపీకి గట్టిపట్టున్నది. ఫరూఖాబాద్, హర్దాయ్, ఔరయ, కాన్పూర్ దెహత్, కాన్పూర్, ఉన్నావ్, బారాబంకీ, సీతాపూర్ వంటి అసెంబ్లీ స్థానాలు 12 జిల్లాల్లో వ్యాపించి ఉన్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన 826 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2.41 కోట్ల ఓటర్లు తేల్చనున్నారు. ఇటావా నుంచి అత్యధికంగా 12 మంది అభ్యర్థులు, బారాబంకీ నుంచి అత్యల్పంగా ముగ్గురే బరిలో ఉన్నారు. మూడో విడత కోసం 25,603 పోలింగ్‌బూత్‌లు ఏర్పాటుచేశారు.

08:59 - February 19, 2017

కామారెడ్డి : ఎవరడ్డుకున్నా..ఎన్ని కుట్రలు చేసినా..ఈనెల 22న హైదరాబాద్‌లో జరిగే నిరుద్యోగ ర్యాలీ చేసి తీరతామన్నారు జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అథిధి గృహంలో..నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే..నీళ్లు,నిధులు, నియామకాల కోసం..కానీ తెలంగాణ వచ్చాకా..నియామకాల ప్రక్రియ జరగడంలేదన్నారు కోదండరామ్‌. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

08:56 - February 19, 2017

ఖమ్మం : ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీల కోసం సబ్‌ప్లాన్‌ చట్టం చేయాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌ ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేసి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని కరత్‌ ఆరోపించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మంలో బోసుబొమ్మ సెంటర్‌ వద్ద సీపీఎం మహాజన పాదయాత్రలో పాల్గొన్న ప్రకాశ్‌కరత్‌.. వరంగల్‌ క్రాస్‌ రోడ్డులో తమ్మినేని సుబ్బయ్య భవనాన్ని ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీల కోసం సబ్‌ప్లాన్‌ చట్టం చేయాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని మోదీ ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేసి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని కరత్‌ ఆరోపించారు. తెలంగాణలో అసమానతలను రూపుమాపాలన్న లక్ష్యంతోనే తమ్మినేని పాదయాత్ర కొనసాగుతోందని ప్రకాశ్‌ కరత్‌ అన్నారు.

కేసీఆర్‌ కూడా మొండి వైఖరి..
ప్రధాని మోదీలాగానే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా మొండి వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మంలోని బోసుబొమ్మ సెంటర్‌ వద్ద సీపీఎం మహాజన పాదయాత్రలో ఆయన పాల్గొన్న ప్రకాశ్‌కరత్‌.. అనంతరం వరంగల్‌ క్రాస్‌ రోడ్డులో తమ్మినేని సుబ్బయ్య భవనాన్ని ప్రారంభించారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం సాధించేవరకు సీపీఎం పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో నంబర్‌వన్‌ అని చెబుతున్న కేసీఆర్‌.. బడుగు, బలహీన వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను పట్టించుకోవడం లేదని తమ్మినేని విమర్శించారు. జనం బతుకులు మార్చడానికి ప్రభుత్వం పనిచేయాలని తమ్మినేని సూచించారు. 125వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర ఖమ్మం టౌన్‌లో పర్యటించింది. 125వ రోజు తమ్మినేని పాదయాత్రకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మద్దతు తెలిపారు.

గ్యాస్ పేలుడు..ఇద్దరికి గాయాలు..

కృష్ణా : చందర్లపాడు మండలం మునగాలపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

అక్కన్నపేటలో హైనా కలకలం..

సిద్ధిపేట : అక్కన్నపేట మండలంలో హైనా కలకలం రేపుతోంది. మల్లంపల్లి, మోత్కులపల్లి, కట్కూరు గ్రామాల్లో ఇప్పటి వరకు 23 లేగదూడలను హైనా చంపేసింది. దీనితో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖాధికారులు స్పందించి హైనాను బంధించాలని కోరుతున్నారు.

 

ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం..

చిత్తూరు : టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధానారాయణ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు.

08:39 - February 19, 2017

కొంతమందికి ఉన్నఊరు కన్నజాతి మీద మస్తు ప్రేముంటది.. వాళ్లు ఎంత ఎత్తుకు ఎదిగినా..? ఏంత గొప్పోళ్లు అయ్యినా సరే.. వాళ్ల మట్టివాసన తల్గంగనే పులకరించిపోతరు.. అగో అట్లనే పులకరించింది మన ఖానాపూర్ ఎమ్మెల్యే గిరిజన ముద్దు బిడ్డ రేఖానాయక్ మేడం.. సేవాలాల్ జయంతి పండుగల డ్యాన్సు జేశి పరవశించింది..మేడం డ్యాన్స్ సూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

08:33 - February 19, 2017

మన్సులకు క్షుద్రపూజలు జెయ్యంగ జూశ్నంగని..? పార్టీలకు జెయ్యంగ సూశిండ్రా మీరు ఎన్నడన్నా..? నేనైతె ఎన్నడు సూడలే..? ఏకంగ కుందూరు జానాలు ఎగిరేశిన కాంగ్రెస్ పార్టీ జెండాకు క్షుద్రపూజలు జేశిండ్రంటే.. సూడుండ్రిగ.. మరి జానాలు పనిజేస్తందుకా..? లేకపోతె జానాలు పార్టీని ఆగం జేస్తందుకా అనేది తెల్వదిగని.. మరి ఎక్కడా..ఎవరు చేసిండ్రు..ఇంకా విషయాలకు వీడియో క్లిక్ చేయుండి.

08:28 - February 19, 2017

మొన్న అమరావతి దిక్కు మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు అయ్యింది...కేసీఆర్ సారు ఇగ మీకు ఢోకనే లేదు సారూ.. రెండువేల పందొమ్మిదిల మళ్ల మీ పార్టీ అధికారంలకొచ్చెతందుకు అన్ని ఏర్పాట్లు జేస్తున్నడు మన నల్లగొండ ఆణిముత్యం కోమటిరెడ్డి ఎంకన్న..నెల్లూరు పట్నాన్ని ఇడ్సిపెట్టె ముచ్చట్నే లేదు.. నేను ఉంటెనే నెల్లూరు ఉండాలే..? మన్సులకు క్షుద్రపూజలు జెయ్యంగ జూశ్నంగని..? పార్టీలకు జెయ్యంగ సూశిండ్రా మీరు ఎన్నడన్నా..కొంతమందికి ఉన్నఊరు కన్నజాతి మీద మస్తు ప్రేముంటది.. వాళ్లు ఎంత ఎత్తుకు ఎదిగినా..? ఏంత గొప్పోళ్లు అయ్యినా సరే.. ర్కారు నౌకరి జేశేటోళ్లకు జీతాలు రావా..? వాళ్ల పెండ్లాం పిల్లలేమన్న రోడ్ల మీద చిప్పలు వట్కోని అడుక్కతింటుంటరా ఏంది అర్థంగాదు..? అర్రే సుమతి శతకం పద్యాలు రాశిన వేమన తాత ఇప్పుడు అస్సలు టైముకు లేడుగని.. ఒక్కొక్క సారి నవ్వులు వొయ్యి నువ్వులైతుంటయ్.. ప్రేక్షకులను నవ్వించాలని సూస్తే.. నటుడే నవ్వుల పాలయ్యె పరిస్థితి వస్తుంటది.. గిసొంటి ముచ్చట్ల కోసం సూడాలంటే వీడియో సూడుండ్రి..

బీజేపీలో చేరనున్న యాక్టర్ రవికిషన్..

ఢిల్లీ : సినిమా నటుడు రవికిషన్ నేడు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వెల్లడించారు.

కొనసాగుతున్న పోలింగ్..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 69 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. 826 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో పురుషులు 721 మంది ఉండగా 105 మంది మహిళా అభ్యర్థులున్నారు.

07:33 - February 19, 2017

ముంబై : ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్‌ సయీద్‌ను ఎట్టకేలకు పాకిస్తాన్‌ ఉగ్రవాదిగా గుర్తించింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద పాక్‌ ప్రభుత్వం సయీద్‌పై కేసు నమోదు చేసింది. ఎటిఎ చట్టం ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు గట్టి నిఘా పెడతారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో హఫీజ్‌ సయీద్‌ హాజరు తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు.... లష్కర్‌ ఎ తోయిబాతో పాటు పలు ఉగ్రవాద సంస్థలను నిషేధించే అవకాశం ఉందని డాన్‌ పత్రిక వెల్లడించింది. హఫీజ్‌ సయీద్‌ను గత నెల జనవరి30న హౌజ్‌ అరెస్ట్‌ చేశారు.

07:31 - February 19, 2017

పాకిస్తాన్ : సూఫీ దర్గాపై ఉగ్ర దాడిని సీరియస్‌గా తీసుకున్న పాకిస్తాన్‌- ఉగ్రవాద ఏరివేత చర్యలు చేపట్టింది. పాక్‌ భద్రతా దళాలు వివిధ ప్రాంతాల్లో జరిపిన ఆపరేషన్‌లో వంద మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు. ఒక్క సింధ్‌ ప్రాంతంలోనే సుమారు 50 మంది ఉగ్రవాదులను పారమిలటరీ దళాలు మట్టుపెట్టాయి. ఖైబర్‌ పక్తూన్‌ఖ్వా ప్రాంతంలో 36 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గురువారం రాత్రి సింధ్‌ ప్రాంతంలోని సూఫీ మత గురువు లాల్‌ షాహబాజ్‌ కలందర్‌ దర్గాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 70 మందికి పైగా మృతి చెందారు. 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ప్రకటించింది. ఆఫ్గనిస్తాన్‌ భూభాగం నుంచి ఉగ్రవాద దాడి జరుగుతోందని ఆరోపించిన పాక్‌-76 మంది మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల లిస్టును ఆ దేశ అధికారులకు సమర్పించింది. ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం సంకల్పించిందని, ఆ దిశగా మరింత వేగంగా చర్యలు చేపడతామని పాక్‌ అధికారవర్గాలు పేర్కొన్నాయి.

07:30 - February 19, 2017

ఉత్తర్ ప్రదేశ్ : ఇవాళ ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. మూడో దశలో 12 జిల్లాల్లోని 69 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. 826 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2 కోట్ల 41 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ 25 వేల 603 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మూడో విడత పోలింగ్‌లో యూపీ రాజధాని లక్నో, కాన్పూర్‌, కనౌజ్‌, ఇటావా తదితర ప్రధాన నగరాలున్నాయి. సిఎం అఖిలేష్‌ యాదవ్‌ బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌, మరదలు అపర్ణాయాదవ్‌, కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరిన రీటా బహుగుణ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

07:13 - February 19, 2017
07:08 - February 19, 2017

ట్రెడిషనల్‌ ఫార్మాట్‌ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియాకు....సొంతగడ్డపై జైత్రయాత్ర కొనసాగిస్తోంది. సింగిల్‌ టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ టీమ్‌ను చిత్తుచేసిన భారత్‌ కంగారూలతో అసలు సిసలు టెస్ట్‌ సమరానికి సన్నద్ధమైంది. టీమిండియాకు....సొంతగడ్డపై టెస్ట్‌ల్లో పోటీనే లేకుండా పోయింది.2016 సీజన్‌లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌... 2017 సీజన్‌ ఆరంభ టెస్ట్‌లోనూ జైత్రయాత్ర కొనసాగించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సింగిల్‌ టెస్ట్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత్‌ భారీ విజయం సాధించి....ప్రస్తుత సీజన్‌కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. విరాట్‌ కొహ్లీ మాత్రమే కాదు నిలకడగా రాణిస్తోన్న టెస్ట్‌ స్పెషలిస్ట్‌లు మురళీ విజయ్‌,చటేశ్వర్‌ పుజారా,అజింక్య రహానే భారత జట్టు బ్యాటింగ్‌ లైనప్‌లో కీలకంగా మారారు. ఇక స్పిన్‌ ట్విన్స్‌ అశ్విన్‌,జడేజా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బంతితో మ్యాజిక్‌ చేస్తూనే బ్యాటింగ్‌లోనూ రాణిస్తున్నారు. ఆల్‌రౌండర్లుగా తమ తమ స్థానాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారు. లోయర్‌ ఆర్డర్‌లో వృద్దిమాన్‌ సాహా కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో పాటుగా వికెట్ల వెనుక కీపర్‌గానూ ఆకట్టుకుంటున్నాడు.

15 మ్యాచుల్లో విజయం..
మిగతా ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉన్నా భారత జట్టు విజయాల్లో విరాట్‌ కొహ్లీ, రవిచంద్రన్‌ అశ్విన్‌లదే కీలక పాత్ర అనడంలో అనుమానమే లేదు. కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్న విరాట్‌ కొహ్లీ బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా రికార్డ్‌ల మోత మోగిస్తూనే ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్ట్‌ బౌలర్‌గా అశ్విన్‌ ఎంతలా మాయ చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ తమ వంతు న్యాయం చేస్తుండటంతో భారత్‌ జట్టు టెస్టుల్లో జైత్రయాత్ర కొనసాగిస్తోంది.టెస్టు ఫార్మాట్‌లో గత 19 మ్యాచ్‌ల్లో ఓటమంటూ లేకుండా విరాట్‌ సారధ్యంలోని భారత జట్టు సాధించిన 15 మ్యాచ్‌ల్లో నెగ్గింది.భారత జట్టు ఆడిన గత ఆరు టెస్ట్‌ సిరీస్‌ల్లోనూ విజేతగా నిలిఇంది. టాప్‌ ర్యాంకర్‌ టీమిండియాకు టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగేలేదనడానికి ఈ రికార్డులే నిదర్శనం.

ఆస్ట్రేలియాతో..
మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న నాలుగు మ్యాచ్‌లో సిరీస్‌లోనూ ఇదే స్థాయిలో రాణించాలని కొహ్లీ అండ్‌ కో పట్టుదలతో ఉంది. కంగారులపై టెస్ట్‌ సిరీస్‌ నెగ్గితే భారత జట్టు...అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించగలగుతుంది. మరి అంచనాలకు మించి అదరగొడుతోన్న టీమిండియా ట్రెడిషనల్‌ టెస్టు ఫార్మాట్‌లో మరిన్ని అరుదైన రికార్డ్‌లు నమోదు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

07:04 - February 19, 2017

వరంగల్ : తెలంగాణ ఏర్పాటు తర్వాత పుంజుకుంటామనుకున్న తెలుగు తమ్ముళ్లు ఉత్తర తెలంగాణలో ఉనికిని కొల్పోతున్నారు. నాడు పోరుగల్లులో వెలుగు వెలిగిన పచ్చ పార్టీ రంగు వెలుస్తోంది. ఒక్కరొక్కరుగా పార్టీ వీడటంతో తమ్ముళ్లు గూడు చెదిరిన పక్షులవుతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బలపడుదామనుకున్న టీడీపీని తదనంతర పరిణామాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. ఉత్తర తెలంగాణ గుండెకాయ లాంటి వరంగల్ జిల్లాలో పుణాదులే లేకుండా పోతున్నాయి. సీనియర్ నేతలు, కార్యకర్తలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వలస వెళ్లడంతో తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద దెబ్బ తగిలింది. ఒక రకంగా వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు, నాయకులు వరుసగా పార్టీని వీడుతుండడం, కొత్తవారెవరూ చేరకపోవడంతో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది.

2014 సాధారణ ఎన్నికలు..
2014 సాధారణ ఎన్నికల తర్వాత జిల్లాలో టీడీపీ బలం వేగంగా తగ్గుతూ వస్తోంది. ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్, సొసైటీ చైర్మన్, వార్డు మెంబర్. ఇలా అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ పదవుల్లో ఉన్న వారు టీడీపీకి దూరమయ్యారు. ప్రజాప్రతినిధులు, కేడర్ సైతం వలస బాట పడుతున్నారు. దశాబ్దం క్రితం వరకు జిల్లాలో బలమైన రాజకీయ పక్షంగా ఉన్న టీడీపీ ఇప్పుడు నామమాత్రంగా మారింది. పార్టీలో ఉన్న వారే తక్కువగా అంటే అందులో గ్రూపుల ఆధిపత్యపోరుతో కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు.

వర్గాలుగా..
టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, జాతీయ నాయకుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణలు వర్గాలుగా విడిపోయిన నాటి నుంచి పార్టీకి దిక్కు లేకుండా పోయింది. దయాకర్ రావు పార్టీ వీడటంతో వరంగల్ జిల్లాలో తెలుగుదేశం నామ మాత్రంగా మారింది. సాధారణ ఎన్నికల తర్వాత జిల్లాలో టీడీపీ బలహీనపడింది. ఆ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నా తర్వాత కొన్ని నెలలకే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీడీపీని వీడారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఆరు జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకోగా, చైర్‌పర్సన్ ఎన్నికల్లో వీరంతా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారు. అలాగే జిల్లాలో 128 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా ప్రస్తుతం ఆ సంఖ్య సింగిల్ డిజిట్ కి పరిమితమైంది. వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలు లేని దుస్థితి నెలకొంది.

వలసలు..
వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌ల ఇన్‌చార్జీలుగా ఉన్న దొమ్మాటి సాంబయ్య, మోహన్ లాల్ ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ నియోజకవర్గంలో జెండా ఎత్తిన నాధుడే లేడు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పరకాల నియోజకవర్గానికి ఇన్‌చార్జీ లేని దుస్థితి నెలకొంది. వరంగల్ తూర్పు ఇన్‌చార్జీగా ఉన్న గుండు సుధారాణి టీఆర్‌ఎస్‌లో చేరారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జీగా వేం నరేందర్‌రెడ్డి ఉన్నా ఇంత వరకు ఏ కార్యక్రమంలోనూ నరేందర్‌రెడ్డి పాల్గొన్న సందర్భం లేదు. ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి వరంగల్ జిల్లాలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ ప్రస్తుతం సంక్షోభం దిశగా పయనిస్తోంది. సీనియర్ నేత కడియం, ఎర్రబెల్లి వెళ్లి పోవడం, మహిళా నేతలు సత్యవతి హ్యాండివ్వడం, టీడీపీ కేడర్ అంతా అధికార పార్టీకి వలస వెళ్లడం టీడీపీకి మింగుడు పడని పరిణామంగా చెప్పవచ్చు.

07:00 - February 19, 2017

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదలవ్వడంతో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాల‌యంలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. మహబూబ్ నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవ్వడంతో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు కార్యకర్తల నడుమ భారీ ర్యాలీ చేస్తూ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి తరలివచ్చారు.

12 నామినేషన్లు..
టీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో కాటేపల్లి జనార్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నాంపల్లి నుంచి జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకు ఊరేగింపుగా వచ్చారు. నామినేషన్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మ‌హ్మద్ అలీతో పాటు మంత్రులు హ‌రీష్ రావు, మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ‌నివాస‌గౌడ్ హాజ‌ర‌య్యారు. ఉపాధ్యాయులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మహ్మద్ అలీ తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో త‌న‌దే గెలుపు అని అభ్యర్ధి కాటేప‌ల్లి జ‌నార్దన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మ‌రోవైపు ప్రతిప‌క్షాల మ‌ద్దతుతో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అభ‌్యర్ధిగా న‌ర్రా భూప‌తిరెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ బలపర్చిన భూపతిరెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తార‌ని బీజేపీ ఎమ్మెల్సీ రామ‌చంద్రరావు ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త‌ర్వాత ఉపాధ్యాయుల ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా త‌యారైందని భూపతిరెడ్డి విమ‌ర్శించారు. ఇప్పటి వ‌ర‌కు మొత్తం 12 నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయి. ఆదివారం రోజు మాత్రమే నామినేషన్లకు గ‌డువు ఉండ‌టంతో అభ్యర్థులు నామినేషన్లు ప్రక్రియను వేగవంతం చేశారు.

06:53 - February 19, 2017

హైదరాబాద్ : కొత్త జిల్లాల్లో ఆర్డర్‌ టూ సర్వ్‌ ద్వారా నియామకం చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగులను పర్మినెంట్‌గా నియామకాలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు నాడు తాత్కాలికంగా అలకేషన్‌ చేశారని అయితే జిల్లాలు ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్నా ఏ ఉద్యోగి ఎక్కడ పని చేయాలనేది ఇంకా తేల్చలేదంటున్నారు ఉద్యోగులు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి కమిటీని సైతం నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను పర్మినెంట్‌గా అలకేషన్‌ చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఉద్యోగులను తాత్కాలిక పద్దతిలో ఆయా జిల్లాలకు ఆర్డర్‌ టూ సర్వ్‌ చేశారు. దీంతో ఒక జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మరో జిల్లాకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రభుత్వం రెండు నెలలు మాత్రమే తాత్కాలిక కేటాయింపులు ఉంటాయని.. ఆ తర్వాత పర్మనెంట్‌గా ఏ ఉద్యోగి ఎక్కడ విధులు నిర్వహించాలో చెప్తామన్నారు. నాలుగు నెలలు దాటినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త జిల్లాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎస్‌ ఎస్పీ సింగ్‌ ను జీఎన్జీవో నేతలు కోరుతున్నారు. మే నాటికి ఉద్యోగుల అలకేషన్స్ పూర్తి చేయాలంటున్నారు. అంతేకాదు కొత్త జిల్లాల ఉద్యోగుల సమస్యలపై మార్చి నాటికి అధికారులతో కూడిన కమిటీని సైతం నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు పర్మినెంట్ విధులు కల్పించడంతో పాటు వారికి హెచ్ఆర్ఏను కూడా ఫైనల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లాల్లో ఉద్యోగుల పర్మినెంట్ కేటాయింపులపై కమలనాథన్ కమిటీ తరహలోనే ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

06:51 - February 19, 2017
06:50 - February 19, 2017

హైదరాబాద్ : చేనేత మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికుల స్థితి గతులేవీ బాగాలేవని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతల బాధలు తొలగించాల్సిన అవసరముందన్నారు. చేనేత కష్టాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌.. చేనేత కార్మికులను ఆదుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం చేనేతలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ సిరిసిల్ల చేనేత కార్మికులతో సమావేశం కావాలని కేసీఆర్‌ నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో నేతన్నలు పడుతున్న అవస్థలు తెలుసుకుని.. వారికి ప్రోత్సాహకాలు, రాయితీలు అందించే అవకాశం ఉంది.

06:48 - February 19, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో టిడిపిని మరింత బలోపేతం చేసే దిశగా ఆపార్టీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. జిల్లా కమిటీలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న చంద్రబాబు,.. అవసరమైతే నాయకత్వాన్ని మార్చటానికి కూడా వెనుకడుగు వేయనంటూ హెచ్చరిస్తున్నారు. ఇటు కేబినేట్‌లో మంత్రివర్గం పనితీరుపై అసంతృప్తిగా ఉన్న బాబు..ఈసారి అలాంటి పొరపాట్లు జరిగితే..ఇంటికే అంటూ మంత్రులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ 30 నెలల కాలాన్ని పూర్తి చేసుకుంది. అయితే ఇటీవల పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలతో కొత్త సమస్యలు తలెత్తాయి. దీంతో ఇకపై పార్టీని ప్రక్షాళన చేసే దిశగా పార్టీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మంత్రి రావెల, అచ్చెన్నాయుడుల వ్యవహారంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారశైలితోనే వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన తెరపైకి వచ్చిందన్న వాదనలతో చంద్రబాబు ఏకభవిస్తున్నారు. అటు మరో మంత్రి రావెల కిషోర్ బాబు,.జడ్పీ చైర్మన్ జానీమూన్‌ల వ్యవహారం కూడా పార్టీ క్రమశిక్షణకు మచ్చ తెచ్చిపెట్టిందని బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పార్టీలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని నేతలను హెచ్చరించారు.

పలు జిల్లాల నేతలతో భేటీలు..
ఏపి టిడిపిలో నెలకొన్న విభేదాలను తొలగించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు చంద్రబాబు. ఇప్పటికే అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు..ఆ తర్వాత విశాఖ, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల నేతలతో కూడా భేటి కానున్నారు. పార్టీ నాయకత్వంలో సమన్వయ లోపం ప్రతిపక్షాలను సరిగా ఎదుర్కోలేక పోతున్నామని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత లేకపోవటం, కర్నూలు జిల్లాలో ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలైనా..ఒకరికొకరికి సరిపోకపోవటం లాంటి సమస్యలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహార శైలిపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న ఎంపి రామ్మోహన్ నాయుడుతో కలిసి పనిచేయలేకపోతున్నారన్న ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో అవసరమైతే నాయకత్వాన్ని మార్చటానికి కూడా తాను సిద్ధమేనన్నట్లుగా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లు సమాచారం.

మార్పు వచ్చేనా ?
కేవలం పార్టీ విషయాలపైనే కాదు..కేబినెట్ విషయంలో కూడా చంద్రబాబు పలుసార్లు తన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్ది మంది మంత్రులు తమ పనితీరు మెరుగుపరుచుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈసారి కేబినెట్‌లో అలాంటి పొరపాట్లు జరగకుండా వార్నింగ్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. అయితే చంద్రబాబు సరికొత్త వ్యూహాలు,..ఇటు పార్టీలోనూ, అటు మంత్రి వర్గంలోనూ ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో వేచి చూడాలి.

06:45 - February 19, 2017

చెన్నై : ఎన్నో ఉత్కంఠలకు తమిళనాడు అసెంబ్లీ వేదిక అయ్యింది. కాకతాళీయమో.. కావాలని చేసిందో తెలియదు కానీ.. 30 ఏళ్ల క్రితం జరిగిన సేమ్‌ సీన్‌ ఇప్పుడు రిపీట్‌ అయ్యింది. అయితే.. పాత్రలు, పాత్రదారులు మాత్రం మారారు. అప్పట్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై దాడి జరిగితే.. ఇప్పుడు డీఎంకే అధినేత స్టాలిన్‌కు ఆ పరిస్థితి ఎదురైంది. తమిళనాడు అసెంబ్లీలో సరిగ్గా 30 ఏళ్ల క్రితం జరిగిన లాంటి ఇన్సిడెంట్‌ మళ్లీ రిపీట్‌ అయ్యింది. ఎంజీఆర్‌ చనిపోయినప్పుడు.. ఆయన భార్య జానకి, రాజకీయ శిష్యురాలు జయలలిత మధ్య ఉత్కంఠ భరిత హైడ్రామా నడిచింది.

సభలో లాఠీచార్జ్‌..
నాడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. అయితే ఎక్కువమంది జానకివైపే మొగ్గు చూపారు. ఇరు వర్గాలు శిబిరాలు నిర్వహించాయి. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న జానకిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌.. బలాన్ని నిరూపించుకోవాలన్నారు. ఆ విశ్వాస పరీక్ష సందర్భంగా సభలో హింస చెలరేగింది. ఇరు వర్గాల ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగారు. స్పీకర్‌ పోలీసులను పిలిపించి లాఠీచార్జీ చేయించిన పరిస్థితి. చివరకు జయ వర్గం ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు వేసి విశ్వాస పరీక్ష నిర్వహించారు.

కేంద్రం జోక్యంతో జానకి ప్రభుత్వం రద్దు..
ఇక ఆనాడు డీఎంకే ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆ విశ్వాస పరీక్షలో జానకి గెలుపొందారు. కానీ.. గవర్నర్‌ ఆ విశ్వాస పరీక్ష చెల్లదని ప్రకటించారు. కేంద్రం జోక్యంతో జానకి ప్రభుత్వం రద్దయ్యింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జానకి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో అన్నాడీఎంకే ఇరువర్గాలు ఏకమయ్యాయి. అయితే.. 1989లోనూ విపక్ష నేతగా ఉన్న అన్నాడీఎంకే అధినేత్రిపై దాడి జరిగింది. అప్పట్లో ఆమె చీరను డీఎంకే సభ్యులు లాగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె సభ నుంచి వెళ్లిపోయి.. సీఎంగానే సభలో అడుగుపెడతానని శపథం చేసింది.. అయితే.. జయలలితపై తాము దాడి చేయలేదని.. తొక్కిసలాట జరిగిందని డీఎంకే చెప్పింది. ఇప్పుడు సభలో విపక్ష నేత అయిన స్టాలిన్‌పై కూడా అదే తీరుగా దాడి జరిగింది.

పునరావృతమైన చరిత్ర..
మరోవైపు సరిగ్గా.. 30 ఏళ్ల క్రితం అన్నాడీఎంకేలో జరిగిన తీరే పునరావృతమైంది. పాత్రలు, పాత్రదారులు మారినా దాదాపు అసెంబ్లీలో అవే సీన్లు రిపీటయ్యాయి. అందరూ అనుకున్నట్లే గతంలో జరిగిన పరిణామాలే రిపీట్‌ అయ్యాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి బల నిరూపణ సందర్భంగా అధికార అన్నాడీఎంకే, చీలికవర్గ అన్నాడీఎంకే, విపక్ష డీఎంకే సభ్యుల సవాళ్లు ప్రతిసవాళ్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది.

డీఎంకే సభ్యులు సస్పెన్షన్‌..
సభ ప్రారంభం నుంచే గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. అనంతరం సభ ప్రారంభం కాగానే... విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి గందరగోళం సృష్టించారు. స్పీకర్‌ చొక్కాను సైతం లాగారు. స్పీకర్‌ సీక్రెట్‌ ఓటింగ్‌కు ఒప్పుకోకపోవడంతో... డీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో డీఎంకే సభ్యులను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. సభలోకి మార్షల్స్‌ వచ్చి సభ్యులను బయటకు తీసుకెళ్లే సందర్భంలో పెనుగులాట జరిగింది. ఈ ఘటనలో విపక్ష నేత స్టాలిన్‌ చొక్కా చినిగిపోయింది. సభ నుంచి బయటకు వచ్చిన స్టాలిన్‌.. అధికార సభ్యులు తనపై దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే చొక్కాతో గవర్నర్‌ వద్దకు వెళ్లిన స్పీకర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలన్నీ గతంలో జరిగినట్లే సేమ్‌ టూ సేమ్‌ జరిగాయి. మరి రాబోయే రోజుల్లో తమిళనాడు అసెంబ్లీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

06:42 - February 19, 2017

చెన్నై : బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో తమకు తీవ్ర అవమానం జరిగిందని డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ మెరీనా బీచ్‌లో నిరసన దీక్షకు దిగారు. డీఎంకే ఎమ్మెల్యేలు, మద్దతుదారులు వేలాదిగా తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో స్టాలిన్‌తో పాటు డీఎంకే ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అసెంబ్లీలో తమను అవమానించి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని స్టాలిన్‌ విమర్శించారు. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు నిరసనగా డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌ మెరీనాబీచ్‌లోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. వేలాది మంది కార్యకర్తలు మెరీనా బీచ్‌కు చేరుకుని స్టాలిన్‌కు మద్దతు తెలిపారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. డీఎంకే శ్రేణులు ఎక్కువగా తరలిరాకముందే పోలీసులు స్టాలిన్‌ను, డీఎంకే నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి మైలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

దీక్ష..
రహస్య ఓటింగ్ జరపాలని డిమాండ్ చేసినందుకే.. తమను కొట్టి, తిట్టి అవమానించారని స్టాలిన్‌ అన్నారు. కనీస సభా మర్యాదలు కూడా పాటించకుండా అన్నాడీఎంకే నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని స్టాలిన్‌ ఆరోపించారు. సభ నుంచి తమని బలవంతంగా బయటకు నెట్టి, ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీలో అపహాస్యం చేశారని స్టాలిన్‌ మండిపడ్డారు. స్పీకర్ తన చొక్కాను తానే చించుకుని డీఎంకే ఎమ్మెల్యేలు చించారని ఆరోపిస్తున్నారని వాపోయారు. అంతకుముందు రాజ్‌భవన్‌కు వెళ్లిన స్టాలిన్ బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలను గవర్నర్‌కు వివరించారు. డీఎంకే పార్టీ పట్ల స్పీకర్ తీరును నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు చెన్నై సహా పలు నగరాల్లో నిరసన కార్యక్రమాలకు దిగారు. ఆర్నీ, అంబూర్, వనియంబడి, రాజీపేట్, అరక్కోణం తదితర ప్రాంతాల్లో స్పీకర్ ధన్‌పాల్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళనలు చేపట్టారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది.

06:38 - February 19, 2017

చెన్నై : తమిళ రాజకీయాల్లో కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తీవ్ర హైడ్రామా నడుమ సాగిన బలపరీక్షలో పళని స్వామే విజేతగా నిలిచారు. సీక్రెట్‌ ఓటింగ్‌కు పట్టుబట్టిన డీఎంకే ఎమ్మెల్యేలను సభనుంచి సస్పెండ్‌ చేసిన స్పీకర్‌.. ప్రతిపక్షం లేకుండానే ఓటింగ్‌ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో పళని స్వామికి అనుకూలంగా 122 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. ఉదయమే.. శశికళ వర్గం ఎమ్మెల్యేలందరూ కూవత్తూరు రిసార్ట్స్‌ నుంచి పలు వాహనాల్లో అసెంబ్లీకి తరలివచ్చారు. సభలో అనుసరించాల్సిన వ్యూహం గురించి, ఉదయం మరోసారి ఎమ్మెల్యేలతో భేటీ అయిన డిఎంకే పక్షం నేత స్టాలిన్‌.. సమావేశానంతరం, సహచరులతో కలిసి అసెంబ్లీకి చేరుకున్నారు. పన్నీర్‌ సెల్వం కూడా తన మద్దతుదారులతో అసెంబ్లీకి హాజరయ్యారు.

సభలో గందరగోళం..
సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష డీఎంకే, పన్నీరు సెల్వం వర్గం సభ్యులు రహస్య ఓటింగ్‌ కోసం పట్టుబట్టారు. తమ డిమాండ్‌కు మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు. సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు. దీంతో స్పీకర్‌ సభను ఒంటిగంటకు వాయిదా వేశారు. ఆందోళనలు తీవ్రం కావడంతో మార్షల్స్‌ స్పీకర్‌ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. సభ తిరిగి ప్రారంభం కాగానే డీఎంకే, పన్నీరు వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. కాగితాలు చించివేసి ఆందోళన తీవ్రం చేశారు. దీంతో స్పీకర్‌ ధనపాల్‌, విపక్ష డిఎంకే సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. సభను రెండోసారి మూడు గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమయ్యేలోపు, మార్షల్స్‌, డిఎంకే సభ్యులను సభ నుంచి బయటకు పంపారు. మూడు గంటలకు సభ సమావేశం కాగానే, ప్రతిపక్ష సభ్యులు లేకుండానే ఓటింగ్‌ నిర్వహించారు. ఈ బలపరీక్షలో పళని స్వామికి అనుకూలంగా 122 మంది సభ్యులు ఓటు వేశారు.

జయకు నివాళి..
అంతకుముందు ఉదయం పళని స్వామి ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. గోల్లెన్‌ బే రీసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు పళనిస్వామి మంత్రులకు ఎమ్మెల్యేల బాధ్యతలను అప్పగించారు. ఒక్కో మంత్రి నలుగురు ఎమ్మెల్యేలకు ఇన్‌ఛార్జ్‌గా ఉండేలా పక్కా ప్లాన్‌ను రూపొందించారు. దఫాల వారిగా ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తరలించి వ్యూహాన్ని ఫలప్రదం చేశారు. బలపరీక్షలో నెగ్గిన పళని స్వామి ఎమ్మెల్యేలతో సహా జయలలిత సమాధి వద్దకు వెళ్లి, ఘనంగా నివాళులు అర్పించారు.

గుంటూరులో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం..

గుంటూరు : జిల్లాలో నేడు ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం కానుంది. 105 సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరు కానున్నారు.

గుంటూరులో నేటి నుండి జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన..

గుంటూరు : నేటి నుండి జాతీయ చేనేత వస్త్ర పదర్శన జరగనుంది. ఈ ప్రదర్శనను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించనున్నారు. 15 రోజుల పాటు ప్రదర్శన జరగనుంది.

తెలంగాణకు రానున్న దిగ్విజయ్ సింగ్..

హైదరాబాద్ : నేడు, రేపు తెలంగాణలో దిగ్విజయ్ సింగ్ పర్యటించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు నిజామాబాద్, రేపు పరిగిలో జరిగే బహిరంగసభల్లో దిగ్విజయ్ సింగ్ పాల్గొననున్నారు.

చేనేత కార్మికులతో సమావేశం కానున్న కేసీఆర్..

హైదరాబాద్ : నేడు సిరిసిల్ల చేనేత కార్మికులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. చేనేత రంగ సమస్యలపై కార్మికులను అడిగి తెలుసుకోనున్నారు.

Don't Miss