Activities calendar

20 February 2017

21:25 - February 20, 2017

హైదరాబాద్: తమిళ రాజకీయం రసవత్తరంగా మారింది. శనివారం నాడు అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన పళనిస్వామి, సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆవెంటనే 5 సరికొత్త సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తూ... ఫైళ్లపై సంతకాలు చేశారు. నిరుద్యోగ భృతిరెట్టింపు, గర్భిణీస్త్రీలకు ప్రస్తుతం ఇస్తున్న 12 వేల రూపాయలను 18 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉద్యోగాలు చేసే లక్ష మంది మహిళలకు 50 శాతం సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, 85 కోట్లతో మత్స్యకారులకు 5 వేల ఇళ్లు నిర్మించే పథకాల ఫైళ్లపైనా పళనిస్వామి సంతకాలు చేశారు. దీంతోపాటే, రాష్ట్రవ్యాప్తంగా మరో 500 ప్రభుత్వ మద్యం దుకాణాల మూసివేసే పథకంపై సంతకం చేశారు. ఈదఫా జయలలిత ముఖ్యమంత్రి కాగానే, రాష్ట్రంలోని ఐదు వందల మద్యం దుకాణాలను రద్దు చేసే ఫైలుపైనే తొలి సంతకం చేయడం విశేషం. తానుకూడా జయలలిత చూపిన సంక్షేమ బాటలోనే సాగుతానని సీఎం పళని స్వామి తెలిపారు.

పళనిస్వామికి వ్యతిరేకంగా డీఎంకే పావులు

అధికారాన్ని చేజిక్కించుకున్న పళనిస్వామిని ఇబ్బందులు పెట్టేందుకు, డిఎంకే సోమవారం కూడా పావులు కదిపింది. శనివారం నాటి బలనిరూపణ చెల్లదని వాదిస్తోన్న డిఎంకే.. దీనిపై మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ప్రతిపక్షాన్ని బయటకు గెంటేసి నిర్వహించిన బలపరీక్ష చట్టబద్ధతను పిటిషన్‌ ద్వారా ప్రశ్నించింది. రహస్య ఓటింగ్‌ద్వారా బలపరీక్ష చేపట్టాలని కోరినా.. స్పీకర్‌ ధన్‌పాల్‌ పట్టించుకోలేదని, మార్షల్స్‌తో తమపై దాడికి పాల్పడ్డారని పిటిషన్‌లో ఆరోపించారు. తమ పిటిషన్‌ను అత్యవసరంగా స్వీకరించాలని డీఎంకే తరపు న్యాయవాది కోరగా.. మంగళవారం విచారణ చేపడతామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. మరోవైపు, గవర్నర్‌ విద్యాసాగరరావు ఆదేశాల మేరకు, అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌, శనివారం నాటి అసెంబ్లీ వ్యవహారాల తీరుపై సమగ్ర నివేదిక అందించారు. మొత్తం ప్రక్రియకు సంబంధించిన పత్రాలు, వీడియో ఫుటేజీలను గవర్నర్‌కు సమర్పించారు.

తమిళనాడుకు వెళ్లేందుకు శశికళ వ్యూహాలు

ఇంకోవైపు, బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంటోన్న శశికళ.. స్వరాష్ట్రానికి వెళ్లే వ్యూహాలు రచిస్తున్నారు. కర్నాటకలో తనకు ప్రాణహాని ఉందని, వాతావరణం సరిపడడం లేదని కారణాలు చూపుతూ.. తనను చెన్నై లేదా వేలూరు జైళ్లకు తరలించాల్సిందిగా జైలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆమె పిటిషన్‌ను పరిశీలిస్తున్న అధికారులు, చెన్నై సెంట్రల్‌ జైలు అధికారులకు లేఖరాయాలని భావిస్తున్నట్లు సమాచారం. చిన్నమ్మ చెన్నై వచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. ఆమె భర్త నటరాజన్‌, మేనల్లుడు దివాకరన్‌లు కొత్త చిక్కుల్లో కూరుకుపోతున్నారు. 1994లో విదేశీ కారు లెక్సస్‌ను దిగుమతి చేసుకునే క్రమంలో, దాన్ని సెకండ్‌ హ్యాండ్‌ కార్‌గా పేర్కొని, పన్ను ఎగ్గొట్టినట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసులో నటరాజన్‌ ఫెరా నిబంధనలను ఉల్లంఘించారనీ ఈడీ కేసు వేసింది. ఈ కేసులు ఈనెల 27న తుది విచారణకు రానుంది.

పన్నీర్‌ వర్గ ఎమ్మెల్యేలపై వేటు వేయాలా..? వద్దా..? డైలమాలో అన్నాడీఎంకే

మరోవైపు మాజీ సీఎం పన్నీర్‌ సెల్వానికి మద్దతు పలికిన 11 మంది ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు వేయాలా వద్దా.. అనే అంశంపై అన్నాడీఎంకే వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పార్టీ విప్‌ను ధిక్కరించిన పన్నీర్‌ వర్గ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని శశకళ వర్గం పట్టుబడుతోంది. అయితే వీరిని తొలగిస్తే ఖాళీ అయిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న సందేహంలో పార్టీ శ్రేణులున్నారు. అంతేకాదు, త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో ఆ ఫలితాలను బట్టే అడుగులు వేయాలని రెండాకుల పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పన్నీర్‌ వర్గంపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవచ్చని భావిస్తున్నారు. ఇక, పన్నీర్‌ సెల్వం కూడా, అమ్మ జయలలిత జయంతి రోజునుంచి పళని స్వామికి మద్దతిచ్చిన 122 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. మొత్తమ్మీద, తమిళనాట, రోజురోజుకీ పెరిగిపోతున్న రాజకీయ కాక, భవిష్యత్తులో మరెన్ని మలుపులు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

21:20 - February 20, 2017

హైదరాబాద్: నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం.. పోరాటానికి దిగిన జేఏసీకి ఆదిలోనే ఆటంకం ఎదురైంది. జేఏసీ ర్యాలీకి..సభకు నగర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో జేఏసీ నాయకుడు కోదండరామ్‌ కోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్‌ పోలీసులు జల్లికట్టు తరహాలో ఇక్కడ కూడా విధ్వంసం జరిగే అవకాశం ఉందని కోర్టుకు నివేదిక అందించారు. దీనిని బలపరుస్తూ ఇ‌ప్పటికే జేఏసీపై 31 క్రిమినల్‌ కేసులున్నాయని.. 131 ప్రాంతాల్లో తిరిగి జనాన్ని పోగేశారని పోలీసుల తరపున అడ్వకేట్‌ జనరల్ నివేదించారు. అయితే ఎవరేంటో తమకు తెలుసనని అనవసరపు వ్యతిరేక ప్రచారం చేయవద్దని జస్టీస్‌ రామలింగేశ్వరరావు అభ్యంతరం తెలిపారు.

నగర శివార్లలోని మైదానాలలో జరుపుకోవాలన్న పోలీసులు...

నగరంలో కాకుండా నగర శివార్లలో ఉన్న మైదానాలలో ఎక్కడ నిర్వహించుకున్నా తమకు అభ్యంతరం లేదని పోలీసులు చెప్పారు. అయితే ప్రజాస్వామ్యంలో శాంతియుత ర్యాలీకి అనుమతి ఇవ్వాలని .. ర్యాలీకి అనుమతి ఇవ్వపోయినా ఎన్టీఆర్ మైదానం, నిజాం కాలేజ్ గ్రౌండ్, ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించుకునేందుకైనా అవకాశం ఇవ్వాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టును వేడుకున్నారు.

కార్యక్రమాన్ని ఆదివారానికి వాయిదా వేసుకోవాలని కోర్టు సూచన...

దీంతో నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జరపుకోవచ్చని కోర్టు తెలిపింది. నిజాం కాలేజ్‌ యాజమాన్యం వర్కింగ్‌ డేస్‌లో అనుమతి ఇవ్వదని.. అడ్వకేట్ జనరల్ చెప్పారు. దీంతో సభను ఆదివారానికి వాయిదా వేసుకోమని కోర్టు సూచించింది. అయితే ఎన్నో రోజులుగా అనుకున్న కార్యక్రమాన్ని ఇప్పుడు వాయిదా వేసుకోలేమని పిటిషనర్‌ తరపు న్యాయవాది చెప్పారు. అయినా దీనిపై జేఏసీ నిర్ణయాన్ని మంగళవారం తెలియజేయాలని కోరుతూ... న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

20:39 - February 20, 2017

హైదరాబాద్: ఖమ్మం టూటౌన్ ఎస్సై విజయ్ అరెస్టు అయ్యాడు. వివాహేతర సంబంధం కారణంతో విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేస్‌బుక్‌లో విజయ్‌కు హైదరాబాద్‌కు చెందిన వివాహిత పరిచయమైంది. వివాహిత ఇంట్లో ఉన్న విజయ్‌ను రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆమె భర్త పట్టుకుని హైదరబాద్ ఎస్ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద ఎస్ఐ విజయ్‌ను అరెస్టు చేశారు.

20:36 - February 20, 2017

హైదరాబాద్: నిప్పులు చెరిగే బౌలింగ్... దుమ్ముదులిపే బ్యాట్, కేరింతలు కొట్టే అభిమానులు.. మొత్తంగా 4 గంటల్లో అద్బుతమైన ఆనందం. కానీ అనంతమైన ఆరోపణలు, ఆటను భ్రష్టు పట్టించారనే ఆరోపణలు, వ్యాపారంగా మార్చారనే విమర్శలు, వీటన్నింటి మధ్య 9 సీజన్లు ముగిసి 10వ సీజన్ వచ్చేంది. మరి ఐపీఎల్ క్రికెట్ మేలు చేసిందా? లేక నష్టాన్ని కలిగిస్తోందా? సంప్రదాయ క్రికెట్ మీద ఐపీఎల్ ఇంపాక్ట్ ఎంత? ఈ రోజు వైడాంగిల్ విశ్లేషణ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:05 - February 20, 2017

హైదరాబాద్: దుమ్మురేపుతోన్న నిరుద్యోగుల ర్యాలీ పాట...గట్టుమీదకొస్తున్న అన్ని సంఘాలోళ్లు, చేనేత కార్మికులకు పవనాలు చేయూత....మంగళగిరికాడ గర్జించిన జనసేన నేత, మళ్ల తిరుమలకొండెక్కిన గవర్నర్... గడికోపారి రావాలని బుద్ధి కలుగుతున్నదట, ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్న ఆంజనేయులు...పాలకొల్లుదిక్కు పనిమంతుని యవ్వారం, పలకా,బలపం పడుతున్న పండు ముసలోళ్లు... మహారాష్ట్రలో అమ్మమ్మలకు సపరేట్ బడి, అనంతపురం జిల్లాలో బోరుబావి వింత....ఎగబడి చూస్తున్నరు పబ్లికంతా ఇత్యాది అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు కార్యక్రమం'లో మల్లన్న చెప్పిన ముచ్చట్లు ఏంతో చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

19:55 - February 20, 2017

హైదరాబాద్: ప్రభుత్వాలు చేపట్టే చర్యలు చేనేత కార్మికులను ఆదుకుంటాయా? గుంటూరులో చేనేత సత్యాగ్రహ దీక్ష కు జనసేన అధినేత పవన్ మద్దతు ప్రకటించారు. మరో వైపు చేనేత కార్మికుల పట్ల తెలుగు రాష్ట్రాలు సానుకూలంగా మాట్లాడుతున్నాయి. అవి ఎంత వరకు ఉపయోగపడుతున్నాయి? చేనేత అంటే ఏంటి? పవర్ లూం అంటే ఏమిటి? ఇదే అంశంపై 'హెడ్ లైన్ షో'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, కాంగ్రెస్ నేత కొనగాల మహేష్, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్, కాంగ్రెస్ ఎంపి రాపోలు ఆనంద్ భాస్కర్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావనకు తెచ్చారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

19:44 - February 20, 2017

హైదరాబాద్: చేనేత కార్మికుల సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు... హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో హ్యాండ్లూమ్‌, పవర్‌లూమ్‌ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, తుమ్మల, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్‌ శర్మ, సలహాదారు వివేక్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ పీ సింగ్‌, ఇతర అధికారులు, సిరిసిల్ల నుంచి వచ్చిన పవర్‌లూమ్‌ పరిశ్రమకుచెందిన దాదాపు 40మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చేనేత కార్మికుల సమస్యలపై చర్చించిన సీఎం....

చేనేత కార్మికుల పేదరిక నిర్మూలనపై సీఎం చర్చించారు.. నేత కార్మికుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. వరంగల్‌లో ఏర్పాటు చేయబోయే టెక్స్‌టైల్‌ పార్క్‌ ద్వారా కార్మికుల జీవితాల్లో చాలా మార్పు వస్తుందని సీఎం చెప్పారు.. షోలాపూర్‌లో చద్దర్లు, సూరత్‌లో చీరలు, తిర్పూరులో ఇతర వస్తువుల తయారీ పెద్ద ఎత్తున జరుగుతుందని కేసీఆర్‌ గుర్తుచేశారు.. ఈ మూడింటి సమాహారంగా వరంగల్‌ పార్క్‌ ఉంటుందని ప్రకటించారు.. ఈ పార్క్‌ను దేశంలోనే నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.. సిరిసిల్ల పవర్‌లూమ్స్‌ను వరంగల్‌ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు అనుసంధానం చేస్తామని చెప్పారు..

సిరిసిల్లలో అపెరల్‌ పార్క్‌ ఏర్పాటు......

అలాగే సిరిసిల్లలో అపెరల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.. నేత కుటుంబాల్లోని మహిళలకు అవసరమైన శిక్షణ ఇచ్చి రెడీమేడ్‌ దుస్తులు తయారు చేయిస్తామన్నారు. సిరిసిల్లకు త్వరలో రైల్వే లైన్‌ వస్తుందని... ఇక్కడ తయారైన వస్త్రాలను వరంగల్‌ పార్క్‌కు పంపొచ్చని చెప్పారు.. పవర్‌లూమ్‌ కార్మికులు తమ వస్త్రాలను నిల్వ చేసుకునేందుకు సిరిసిల్లలో నాలుగు గోదాములు నిర్మిస్తామని ప్రకటించారు.. ఇందులో స్టాక్‌ పెట్టుకునే యజమానులకు సహకార బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం ఇస్తామని హామీ ఇచ్చారు. పవర్‌లూమ్‌కు రుణ సౌకర్యం కల్పించేందుకు మొదటి ఏడాది వందకోట్లు సిద్ధంగా ఉంచాలని సహకార బ్యాంకులను సీఎం ఆదేశించారు.

నూలు, రసాయనాలపై ప్రభుత్వం సబ్సిడీ....

తెలంగాణ ఉద్యమ సమయంలో చేనేత కార్మికుల దీనావస్థను చూసి చాలా సార్లు దుఃఖపడ్డానని సీఎం చెప్పారు.. నేత కార్మికులంతా మంచి జీవితం గడిపేందుకు అవసరమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని ప్రకటించారు.. నేతవస్త్రాల తయారీ కోసం వాడే నూలు, రసాయనాలపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని ప్రకటించారు.. అయితే మగ్గాలు ఒకేరకం వస్త్రాలు తయారుచేయడంవల్ల పోటీ ఎక్కువగా ఉంటోందని చెప్పారు.. అందుకే మగ్గాలను ఎంచుకునే క్రమంలో వైవిధ్యం ఉండాలని సూచించారు.. వేర్వేరు రకాల వస్త్రాలు, వేర్వేరు సైజులు, వేర్వేరు డిజైన్లు ఉండేలా వర్గీకరణ చేసుకోవాలని సూచించారు..

ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్న పద్మశాలీలు....

నేతవృత్తి కుటుంబాలను పోషించే పరిస్థితి లేకపోవడంతో చాలామంది పద్మశాలీలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారని కేసీఆర్‌ చెప్పారు. పద్మశాలీలు ప్రత్యామ్నాయ ఉపాది చూసుకుంటే వారికి అవసరమైన ప్రోత్సాహం అందివ్వాలని సీఎం అధికారులకు సూచించారు.. చేనేత మగ్గాలపై పనిచేస్తున్నవారు, పవర్‌లూమ్‌ కార్ఖానాల్లో కూలీలుగా పనిచేస్తున్నవారు, నేతవృత్తిని వదిలి వేరే ఉపాది చూసుకున్నవారు ఇలా మూడు విధాలుగా పద్మశాలీలున్నారని సీఎం తెలిపారు.. వీరి కోసం త్రిముఖ వ్యూహం అమలు చేస్తామని ప్రకటించారు.. నేత పరిశ్రమకు చెందిన ప్రతినిధుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి సావధానంగా విన్నారు. నేత కార్మికులకు నెలకు దాదాపు 15 వేల ఆదాయం రావడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు... ఇందుకోసం పవర్ లూములు నడిపే యజమానులకు అవసరమైన చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు..

నయీం కేసులో విచారణ వేగవంతం:ఐజీ

హైదరాబాద్: నయీం కేసులో విచారణ వేగవంతం చేశామని, ఇప్పటి వరకు 197 కేసు నమోదు చేశామని,125 మందిని అరెస్ట్ చేసినట్లు ఐజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. పీటీ వారెంట్ పైనా 330 మందిని తీసుకొచ్చామని తెలిపారు. 878 మంది సాక్షులను విచారించి, 18 కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసి 14 మందిపై పీడీయాక్ట్ ప్రయోగించాం అని అని పేర్కొన్నారు.

18:45 - February 20, 2017

గుంటూరు : సత్యం అంటే నిజం.. ఆగ్రహం అంటే కోపం. సత్యాగ్రహం అంటే నిజంతాలూకూ కోపం అని జనసేన అధినేత పవన్ కల్యాన్ తెలిపారు. చేనేత సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న నేతలకు నిమ్మరసం ఇచ్చి వారి దీక్షను విరమింపచేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.... చేనేత కార్మికులను గౌరవించడం అంటే బట్టను గౌరవించడం కాదని, దేశ సంస్కృతి, సంప్రదాయమని ఆయన చెప్పారు. నేను చేనేతకు అంబాసిడర్ గా ఉంటానంటే కొందరు నన్ను కించపరిచారు. తాను పలు సంస్ధలు, వస్తువులకు కమర్షియల్ బ్రాండింగ్ చేస్తే కోట్ల రూపాయలు తన అకౌంట్ లోకి వస్తాయని అన్నారు. కానీ తనకు కోట్లు అక్కర్లేదని, అందులో ఆనందం లేదని ఆయన పేర్కొన్నారు. చేతి వృత్తులు ఆధారపడిన మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చేనేతను ప్రోత్సహించాలని ఆయన చెప్పారు.

హామీలపై మోనటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి...

పవర్ ల్యూమ్ పేరుతో చట్టాలను ఖూనీ చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చేనేతకు అండగా ఉంటామని చెప్పారని, అయితే ఇల్లు అలకగానే పండగ కాదని ఆయన గుర్తు చేశారు. హామీ ఇవ్వగానే పని పూర్తికాదని, దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. రాజకీయనాయకులిచ్చిన హామీలపై మోనటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ సంఘాలు నిష్పాక్షికంగా ప్రభుత్వాలు తమకు ఏం చేశాయో చెప్పాలని సూచించారు. చీర నేసే కష్టాన్ని తాను ఇప్పుడే చూశానని, అద్భుతమైన ప్రతిభ దాగి ఉన్న చేనేతను ప్రోత్సహించాలని ఆయన చెప్పారు. ఈ మేరకు నగదు బహుమతులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

బలహీనుల, చేనేతల గొంతుకలను అసెంబ్లీలో వినిపించేలా..

రాజకీయాల్లోకి అధికారం ఆసించి రాలేదు.. సోషల్ ట్రాన్స్ఫార్మర్ ఆశించి వచ్చాను. ప్రజల కష్టాలను తీర్చడానికే రాజకీయాల్లోకి వచ్చాను. 2019లో ఖచ్చితంగా పోటీ చేస్తా. బలహీనుల, చేనేతల గొంతుకలను అసెంబ్లీలో వినిపించేలా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఒక రోజు అందరూ చేనేతను కట్టాలి. అన్నంపెట్టే రైతు, బట్టను ఇచ్చే చేనేతలు కన్నీళ్లు పెడితే దేశం సుభిక్షంగా ఉండదు. అందుకే వారికి అండగా ఉంటా. చేనేత కార్మికులకు ఆధునికనైపుణ్యం అందించాలి.

దమ్మున్న నాయకులకోసం ఎదురుచూస్తున్నా...

జనసేన పార్టీ స్థాపించి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కార్యకర్తలు ఉన్నారు... కానీ నాయకులు లేరు. చిత్తశుద్ధి కలిగిన నేతలు కావాలి. దమ్మున్న నాయకులు, ప్రజాసమస్యలపై పోరాడే నాయకులు కావాలి. అలాంటి వారి కోసం ఎదురు చూస్తున్నాను. చేనేత కార్మికులనుండి ఓ నేతను జనసేన పార్టీకి పంపండి అని అడుగున్నారు. వారసత్వ నాయకత్వం మీద వ్యతిరేకత లేదు. పోరాట పటిమ, నిస్వార్థంగా ఉన్న నాయకుల కోసం ఎదురు చూస్తున్నా. ప్రతి కూల పరిస్థితుల్లో వాళ్ల నైజం ఏంతో తెలుస్తుందన్నారు. జనసేన పార్టీ వెబ్ సైట్ ప్రారంభించబోతున్నాను. ఆ సైట్ లో అనేక అంశాలు, సమస్యలు తెలియజేయాలని తెలిపారు. రాజకీయనాయకుల తల్లులు తల్లులేనా? చేనేత కార్మికుల తల్లులు తల్లులు కాదా? అని ప్రశ్నించారు.

తప్పు చేస్తే నా సొంతపార్టీ నేతలనైనా ప్రశ్నిస్తా-పవన్‌

కొద్దిపాటి ఉండేలు దెబ్బలకే పారిపోయే వాళ్లు కాదు కావాల్సింది... యుద్ధట్యాంకులు ఎదురైనా.. వెన్నుచూపని వీరులు జనసేనకు కావాలన్నారు పవన్‌ కళ్యాణ్‌. ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేసేందుకు జనసేనతో కలిసి రావాలని యూత్‌కు పిలుపునిచ్చారు జనసేనాని.

హోదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు- పవన్‌

చేనేతల సత్యాగ్రహ వేదిక నుంచే.. ప్రత్యేక హోదా గురించి పవన్‌ మళ్లీ ప్రశ్నించారు. హోదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.. ఎన్నికలకు ముందు హోదా ఇస్తామని హామీ ఇచ్చారని... అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ అన్నారని గుర్తుచేశారు.. ఇచ్చిన ఆ ప్యాకేజీకి చట్టబద్దత కల్పిస్తామన్నారని... మళ్లీ అవసరం లేదని మాట మార్చారని విమర్శించారు.. ఎందుకిలా రోజుకోమాట మాట్లాడుతున్నారని నిలదీశారు..

మాకు ఒక్కరు ఓటేసినా, కోట్లమంది ఓటేసినా..

తనకు ఒక్కరు ఓటేసినా... కోట్లమంది ఓటేసినా.. ప్రజల పక్షాన్నే పోరాడతానని... పవన్‌ స్పష్టం చేశారు. రాజకీయాలనే మురికి కాలువలోకి దిగొద్దని సన్నిహితులు, కుటుంబసభ్యులు హెచ్చరించారని చెప్పారు. ప్రజాధనాన్ని సంరక్షించేవాళ్లే నేతలని... భక్షించేవాళ్లు కాదన్నారు. భక్షించే నేతలపై పోరాటం చేస్తామని... వారిపైనే పోటీ చేస్తామని ప్రకటించారు..

చేనేత వృత్తి కళ-పవన్‌ కళ్యాణ్‌....

నేతన్నల్ని బతికించుకునేందుకు వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పవన్‌ తన అభిమానుల్ని కోరారు. చేనేతలకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. చేనేతలకు ఆఖరి శ్వాస వరకు అండగా ఉంటామని ప్రకటించారు.. వారితోపాటే, స్వర్ణకారుల సంక్షేమానికీ తాను కట్టుబడి ఉన్నానని పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు.

చేనేతసత్యాగ్రహ దీక్ష విరమింపచేసిన పవన్

గుంటూరు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేనేత సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. అనంతరం చేనేత కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా తాను వ్యవహరిస్తానని పవన్‌ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చేనేత సత్యాగ్రహ దీక్షకు హాజరైన పవన్‌కు చేనేత కార్మికులు ఘన స్వాగతం పలికారు.

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ లో ఎంసెట్ షెడ్యూల్ విడుదలయ్యింది. 27న ఎంసెట్ నోటిఫికేషన్, మార్చి3 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఫూన్ తో మే 8 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 12న ఎంసెట్, మే 22న ఫలితాలు విడుదల కానున్నాయి.

17:44 - February 20, 2017

హైదరాబాద్: నిరుద్యోగ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని.. కోదండరాం వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరా పార్క్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్న నిర్వాహకుల విజ్ఞప్తికి పోలీసులు అంగీకరించలేదు. నాగోల్, శంషాబాద్, అబ్దుల్లాపూర్ మెట్, కీసరలో ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించారు. అయితే తాము నిర్ణయించిన ప్రాంతాల్లోనే ర్యాలీకి అనుమతివ్వాలని నిర్వాహకులు కోరారు. దీంతో హైకోర్టు విచారణను రేపు ఉదయం పదిన్నరకు వాయిదా వేసింది.

17:43 - February 20, 2017

కామారెడ్డి : ప్రజా సమస్యలు .. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ముఖ్యమంత్రి అసమర్థ పాలనపై తెలుగుదేశం పార్టీ ప్రజాపోరును చేపట్టిందని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా.. బిక్కనూరు టోల్‌ ప్లాజా వద్ద రేవంత్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ విధానాలను..ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుపై నిప్పులు చెరిగారు.

17:41 - February 20, 2017

ఖమ్మం: సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా పర్యటిస్తున్న తమ్మినేని పాదయాత్ర 127వ రోజుకు చేసుకుంది. ఇవాళ పాదయాత్ర బృందం ఖమ్మం జిల్లాలోని కల్లంపాడు, ఎడవల్లి, లక్ష్మిపురం, ముదిగొండ, వెంకటాపురం, గోకినేపల్లి, నేలకొండపల్లి గ్రామాల్లో పర్యటించింది. తమ్మినేని పాదయాత్రకు మద్దతుగా తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షురాలు విమలక్క పాదయాత్రలో పాల్గొన్నారు. మహాజన పాదయాత్ర పర్యటనకు గుర్తుగా ఖమ్మం రూరల్‌ మండలం తెలిదరాపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని విమలక్కతో కలిసి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు. దున్నుకోవాల్సి వారి చేతుల్లో సెంటు భూమి కూడా లేదని, మన చేతుల్లోకి భూమిని తెచ్చుకునేందుకే ఈ లడాయి జరుగతోందని టఫ్‌ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. కాంట్రాక్టు వర్కర్లను పర్మినెంటు చేయకపోతే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. మార్చి 19లోగా గిరిజనులకు పోడు భూముల పట్టాలివ్వాలని, లేకపోతే సీపీఎం పోరాటాన్ని ఉధృతం చేస్తోందని తమ్మినేని హెచ్చరించారు.

17:39 - February 20, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందని... అందరికీ విద్య అందేలా ఉద్యమాలు చేపట్టాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. విద్యా పోరాట యాత్రలో భాగంగా విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్‌ వద్ద బహిరంగ సభ జరిగింది. విద్యారంగానికి బడ్జెట్‌లో కోతలు పెట్టారని, యూనివర్సిటీలకు వీసీలు, అధ్యాపకులు లేరని హరగోపాల్‌ అన్నారు. ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగ పరిరక్షణకు అందరూ పోరాడాలని అన్నారు.

17:36 - February 20, 2017

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలోనే వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజన్న దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచేకాక... ఇతర రాష్ట్రాల నుంచీ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా ఆలయంలోని పవిత్రమైన ధర్మగుండంలో స్నానాలు చేస్తారు. ఆ తర్వాత స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

భక్తజనం ఎంతో పరమ పవిత్రంగా భావించే ధర్మగుండం నీళ్లులేక....

భక్తజనం ఎంతో పరమ పవిత్రంగా భావించే ధర్మగుండం నీళ్లులేక వెలవెలబోతోంది. ధర్మగుండంలో నీళ్లు అడుగు భాగానికి చేరాయి. ఎక్కువ నీరు లేకపోవడంతో భక్తుల స్నానాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ధర్మగుండంలో గోదావరి నీళ్లు నింపుతామని మంత్రి హరీశ్‌రావు ఆరునెలల కిందట ఇచ్చిన హామీలు నీటి మూటలే అయ్యాయి.

భక్తుల స్నానాలకు తీవ్ర అసౌకర్యం ...

ధర్మగుండంలో నీరు అడుగంటిపోవడంతో భక్తుల స్నానాలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. వ్యయ ప్రయాసలకోర్చి స్వామి వారి దర్శనానికి వస్తే.. కనీసం ధర్మగుండంలో నీళ్లు లేవని వారు వాపోతున్నారు. రాజన్న ఆలయంలోని ధర్మగుండాన్ని ఆనుకొని ఊరి చెరువు ఉండేది. ఆలయ విస్తరణలో ఆ చెరువు సగభాగాన్ని పూడ్చారు. దీంతో ఆ చెరువులో నీరు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పైపుల ద్వారా గోదావరి నీరు తీసుకొచ్చి ధర్మగుండం నింపి భక్తుల దైవభక్తిని పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. ఈనెల 23 నుంచే మహాశివరాత్రి ఉత్సవాలు ఈ ఆలయంలో ప్రారంభంకానున్నాయి. కానీ ఇప్పటి వరకు ధర్మగుండం నింపడానికి ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాలకు సుమారు 5లక్షల మందికిపైగా భక్తులు రానున్నారు. వీరంతా ధర్మగుండంలో ఎలా స్నానం చేయాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు మేల్కొని ధర్మగుండంలో నీళ్లు నింపాలని భక్తులు కోరుతున్నారు.

ముగిసిన ఐపీఎల్-2017వేలం

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2017 ఆటగాళ్ల వేలం ముగిసింది. మొత్తం 351 మంది ఆటగాళ్లకు గాను 66 మందిని ఎనిమిది ఫ్రాంచైజీలు వేలంలో దక్కించుకున్నాయి. వీరిలో 27 మంది విదేశీ ఆటగాళ్లు కాగా, 39 స్వదేశీ క్రికెటర్లు. వీరిలో 30 మంది ఇంకా జాతీయ జట్టులోకి అరంగేట్రం చేయని కుర్రాళ్లే. పదో ఎడిషన్ మునుపటి కంటే ఆసక్తికరంగా ఉంటుందన్న ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలిపారు.

కాసేపట్లో మంగళగిరికి పవన్

విజయవాడ: మంగళగిరిలో చేనేత కార్మికులు తమ సమస్యలపై చేస్తున్న చేనేత సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు కాసేపట్లో మంగళగిరి వెళ్లనున్నారు. గతంలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే నాగార్జున వర్శిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో చేనేత కార్మికులు దీక్ష ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి చేనేత సంఘాలు తరలి వచ్చాయి.

 

17:04 - February 20, 2017
17:03 - February 20, 2017
16:56 - February 20, 2017

ఢిల్లీ: శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం కేసును... రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఆచారాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వాదించింది. న్యాయం, మతాచారాలు విభిన్నమన్న సుప్రీంకోర్టు.. ఈ కేసులో రాజ్యాంగ ప్రశ్నలు తలెత్తాయని... అందువల్ల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది.

16:54 - February 20, 2017

హైదరాబాద్: కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయన్న అభ్యర్థుల ఆందోళనతో తెలంగాణ పోలీస్‌ శాఖ .. క్లారిటీ ఇచ్చింది. తక్కువ మార్కులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలతో వందలాది మంది అభ్యర్థులు హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీస్‌కు తరలి రావడంతో .. పోలీస్‌ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సెలక్షన్‌ ప్రాసెస్‌లో ఎక్కడా తప్పు జరగలేదని.. అపోహలు నమ్మవద్దని సెలక్ట్‌ కాని అభ్యర్థులకు సూచించారు. సెలక్ట్‌ కాని అభ్యర్థులకు ఛాలెంజ్‌ ఆప్షన్‌ ఇస్తున్నట్టు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్.. అడిషనల్ డీజీపీ పూర్ణచంద్రరావు తెలిపారు. దీంతో తాము ఎందుకు సెలక్ట్‌ కాలేదో కునేందుకు అవకాశం వస్తుందన్నారు. ఆన్‌లైన్‌ ఛాలెంజ్‌ ఆప్షన్‌ ఈనెల 24నుంచి అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్ర రిక్రూట్‌ మెంట్‌ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఛాలెంజ్‌ ఆప్షన్ ఇవ్వలేదని.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుకోవాలని అడిషనల్‌ డీజీపీ అభ్యర్థులకు సూచించారు.

16:52 - February 20, 2017

అమరావతి : ఈ వారంలోనే ఏపీ అసెంబ్లీ ఉద్యోగులు అమరావతికి రానున్నట్లు స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్‌ చెప్పారు. వెలగపూడిలోని అసెంబ్లీ భవనాన్ని పరిశీలించిన ఆయన... డిప్యూటీ స్పీకర్‌, మండలి చైర్మన్‌, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మరో పది రోజుల్లో అసెంబ్లీ పనులు మొత్తం పూర్తి అవుతాయని అధికారులు స్పీకర్‌కు వివరించారు. ప్రజా సమస్యల పరిష్కరించే విధంగా అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని స్పీకర్‌ కోడెల అన్నారు.

16:50 - February 20, 2017

గుంటూరు : అవినీతి నిరోధానికి, తీవ్రవాదాన్ని అరికట్టేందుకు నగదురహిత లావాదేవీలు అత్యవసరమని... ఏపీ మంత్రి రావెల కిశోర్‌ బాబు అన్నారు.. క్యాష్‌లెస్‌ లావాదేవీల్ని వందశాతం అమలుచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పారు.. గుంటూరులో డీజీ ధన్‌మేళాను మంత్రి ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించారు..

16:48 - February 20, 2017

హైదరాబాద్: ఈ నెల 22న టీజాక్ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీని విజయవంతం చేస్తామని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేతలు ప్రకటించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ర్యాలీ ఆపేది లేదన్నారు. సర్కారు అనుమతి ఇవ్వకున్నా మిలియన్‌ మార్చ్‌ తరహాలో ఆందోళన చేస్తామని తెలిపారు.. ఓయూ ఆర్ట్స్‌ కళాశాలలో పలు విద్యార్థి సంఘాల నేతలు సమావేశమయ్యారు.. ఈ నెల 22లోపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

16:46 - February 20, 2017

నిజామబాద్: కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభ.. జన ఆవేదన సభ కాదని.. కాంగ్రెస్‌ ఆవేదన సభ, జానారెడ్డి ఆవేదన సభ అని ఎంపీ కవిత ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలం జన్నపల్లి గ్రామంలో 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణాలోనూ తన అస్తిత్వాన్ని కోల్పోతుందని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని కాంగ్రెస్‌ ఓర్చుకోలేకపోతోందని కవిత విమర్శించారు.

16:45 - February 20, 2017

తూ.గో : రాజమహేంద్రవరం.. జయకృష్ణాపురంలో ఇళ్ల తొలగింపు వివాదానికి దారితీసింది. పందిరి మహాదేవుడు సత్రానికి సంబంధించిన స్థలంలో ఇళ్లను తొలగిస్తుండగా.. స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇళ్లను తొలగించవద్దని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు చెప్పినా వినకుండా ఈరోజు బలవంతంగా ఇళ్లు కూల్చివేయడంతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

16:43 - February 20, 2017

విజయవాడ: కార్పొరేషన్‌ నిరంకుశ విధానాలను నిరసిస్తూ విజయవాడలోని సింగ్‌నగర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ ప్లాంట్‌ సమీపంలో ఉన్న డంపింగ్‌యార్డ్‌లో వస్తున్న పొగను అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

పవన్ కల్యాన్ తో రాజధాని ప్రాంత రైతుల భైటీ

గుంటూరు: పవన్ కల్యాన్ తో రాజధాని ప్రాంత రైతుల భైటీ అయ్యారు. ఈ భేకిలో ఉండవల్లి, పెనుమాక, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం లంక భూముల రైతులు పాల్గొన్నారు.

టీజేఏసీ నేతలను కలిసిన పోలీసులు..

హైదరాబాద్ : టీజేఏసీ నేతలను పోలీసులు కలిశారు. ఇందిరా పార్క్ కాకుండా మరో చోట ర్యాలీ నిర్వహించాలని పోలీసులు సూచించారు. ఇందిరా పార్క్ కు ప్రత్యామ్నాయాలను పోలీసులు సూచించారు. చర్చించి నిర్ణయం చెబుతామని జేఏసీ నేతలు తెలిపారు.

ఎలాంటి అవకతకలు జరగలేదు: పూర్ణచందర్ రావు

హైదరాబాద్: కానిస్టేబుళ్ల నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ పూర్ణచందర్ రావు తెలిపారు. కానిస్టేబుళ్ల నియామాకాల్లో కటాఫ్ మార్కులు ఏ జిల్లాని ఆ జిల్లాకే వర్తిస్తాయన్నారు. ఓ బెటాలియన్ కటాఫ్ మార్కులు మరో బెటాలియన్ కు వర్తించవన్నారు. అభ్యంతరాలను ఈనెల 24 తర్వాత పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ ww.tslprb.in లో తెలపాలన్నారు.

శ్రీనిధి బ్యాంక్ ద్వారా రూ.40 కోట్ల రుణాలు:మంత్రి జూపల్లి

హైదరాబాద్: శ్రీనిధి మహిళా సంఘాలతో మంత్రి జూపల్లి సమావేశం అయ్యారు. పాడిగేదెలు,గొర్రెల యూనిట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీనిధి బ్యాంక్ ద్వారా రూ.40 కోట్ల రుణాలు ఇస్తామన్నారు. శ్రీనిధి బ్యాంక్ కు వచ్చే ఏడాది రూ.100 కోట్లు విడుదల చేస్తామన్నారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి రూ. కోటి, మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉపాధి పనులను సక్రమంగా ఉపయోగించుకోవాలన్నారు.

15:44 - February 20, 2017
15:43 - February 20, 2017

హైదరాబాద్: నిరుద్యోగుల ర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ కోదండరాం వేసిన పిటిషన్‌పై.. హైకోర్టుకు సమావేశం ఇచ్చే విషయమై... డీజీపీ అనురాగ్ శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో 10 వేల మందితో సమావేశం పెట్టడానికి అనుమతి లేదన్న డీజీపీ సమావేశంలో చెప్పినట్టు సమాచారం. సైబరాబాద్‌లో గాని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ పరిధిలో సభ పెట్టుకునేందుకు.. తమకు అభ్యంతరం లేదని... హైకోర్టుకిచ్చే నివేదికలో డీజీపీ పేర్కొనే అవకాశముంది.

15:41 - February 20, 2017

p { margin-bottom: 0.21cm; }

హైదరాబాద్: దేశ సుస్థిరతకు, దేశ సమగ్రతకు భంగం కలిగించే ఎలాంటి ప్రచారం చేసినా సంఘవిద్రోహ చర్య అవుతుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. హక్కు ఉందని ఇష్ట వచ్చినట్టు వ్యవహరిస్తే జైలు పాలు కాక తప్పదని హెచ్చరించారు. ఎలాంటి వివాదాలకు పూనుకున్నా కఠిన చర్యలు ఉంటాయని కర్నె అన్నారు. సోషల్‌ మీడియాలో అసాంఘీక పోస్టులు పెడితే చర్యలు తప్పవన్నారు.

15:40 - February 20, 2017

అమరావతి : నీట్‌ ప్రవేశ పరీక్ష క్వాలిఫైయింగ్‌ మార్కులను తగ్గించాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్‌... కేంద్ర మంత్రి జేపీనడ్డాను కోరారు. నీట్‌ అర్హత మార్కులు తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా మెడికల్‌ విద్యార్థులు లాభపడతారని మంత్రి అన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్‌, నెల్లూరులో ట్రామాకేర్‌ సెంటర్‌, గుంటూరులో వైరాలజీ లాబ్‌లు ఏర్పాటు చేయాలని కూడా కోరామని మంత్రి తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి పీఎంఎస్ ఎస్ వై పథకం కింద నిధులు మంజూరు చేయాలని కూడా కేంద్ర మంత్రికి కామినేని విజ్ఞప్తి చేశారు.

15:37 - February 20, 2017

గుంటూరు : న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయాలకు తెగబడుతున్నారు.. గుంటూరు జిల్లా కోసూరు ఎస్ఐ సందీప్‌ తనను నమ్మించి మోసం చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది.. ఏడేళ్లపాటు తనతో సహజీవనం చేశాక ఎస్‌ఐ మొహం చాటేశాడని ఆరోపించింది.. మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేసినా ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడింది.. తనకు బెదిరింపు ఫోన్‌ కాల్స్ వస్తున్నాయని విజయవాడలో వాపోయింది.. గుంటూరు పోలీసులు సందీప్‌ను కాపాడుతున్నారని బాధితురాలు ఆరోపించింది..

చెన్నై జైలుకు పంపండి... శశికళ

బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్న కేసులో బెంగ‌ళూరులోని ప‌ర‌ప్ప‌ణ అగ్ర‌హార జైలులో నాలుగేళ్ల‌ శిక్ష అనుభ‌విస్తోన్న శ‌శిక‌ళ ఈ రోజు పరప్పణ అగ్రహార జైలు అధికారుల‌కు లేఖ రాశారు. త‌న‌కు ఈ జైలులో ప్రాణ హాని ఉంద‌ని, త‌న‌ను చెన్నైలోని జైలుకి పంపించాల‌ని ఆమె ఆ లేఖ‌లో పేర్కొన్నారు. ఈ విన‌తిపై స్పందించిన స‌ద‌రు జైలు అధికారులు ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తామ‌ని అన్నారు.

15:32 - February 20, 2017

అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో ఎదురులేని శక్తిగా ఎదుగుతున్న భారత దేశం ఇప్పుడు రోదసి ప్రయోగాల్లో మరో ముందగుడు వేసింది. పీఎస్‌ఎల్‌వీ-సీ-37 రాకెట్‌ ద్వారా 104 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టి, చరిత్ర సృష్టించిన ఇస్రో... ఇప్పుడు భారీ ఉపగ్రహాల ప్రయోగాలకు అవసరమయ్యే క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ను సొంతంగా అభివృద్ధి చేసింది. ఈ విషయంలో మన దేశం అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, చైనాతోపాటు జపాన్‌ సరసన చేరింది.

పీఎస్‌ఎల్‌వీ ద్వారా 1600 కిలోల ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం.....

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ... ఇస్రో చరిత్రలో ఎన్నో మైలురాళ్లు, మరెన్నోగీటురాళ్లు... అయినా ఏదో లోపం. అదే భారీ ఉపగ్రహాలు, మానరహిత అంతరితక్ష యాత్రలు చేపట్టే సామర్థ్యం లేకపోవడం.తర్వలోనే ఈ లోటు కూడా తీరనుంది. క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ను భారతీయ శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ వాహకనౌక ద్వారా 1600 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించే వీలుంది. ఇన్సాట్‌ వంటి భారీ సమాచార ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యంలేదు. వీటిని ప్రయోగిచేందుకు మనం ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో భారీగా విదేశీమారక ద్రవ్యం ఖర్చు అవుతోంది. ఈలోటు తీర్చేందుకు ఇస్రో రెండు దశాబ్దాల పాటు శ్రమించి క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ అభివృద్ధి చేసింది. జియో సింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌--జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 రాకెట్లు క్రయోజెనిక్‌ ఇంజిన్‌తోనే పనిచేస్తాయి.

తమిళనాడులోని మహేంద్రగిరి రాకెట్‌ ప్రొపల్షన్‌ సెంటర్‌లో పరీక్ష .....

ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ను తమిళనాడు మహేంద్రగిరిలో ఉన్న రాకెట్‌ ప్రొపల్షన్‌ సెంటర్‌లో విజయవంతగా పరీక్షించారు. సీ-25 క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ను 640 సెకన్ల పాటు భూమి మీద మండించారు. ఇది చివరి పరీక్ష కావడంతో క్రయోజెనిక్‌ ఇంజిన్‌తో వచ్చే ఏప్రిల్‌లో అంతరిక్ష ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతోంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 రాకెట్‌లో దీనిని నాల్గవ దశలో అమర్చుతారు. దీని ద్వారా3,200 కిలోల బరువున్న జీశాట్‌-19 ఉప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు.

క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో మండించే ప్రతి కిలో ఇంధనానికి అదనపు శక్తి .....

క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అతిశీతల ఇంధనాలను కొన్ని వందల డిగ్రీల సెల్సియస్‌ వద్ద మండించి, శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సాధారణ ద్రవ, ఘన ఇంధనాలతో పోలిస్తే, క్రయోజెనిక్‌ ఇంజిన్ల ద్వారా మండించే ప్రతి కిలో ఇంధనానికి చాలా అదనపు శక్తి వస్తుంది. తద్వారా అంతరిక్షంలోకి అధిక బరువు ఉన్న ఉపగ్రహాలను మోసుకెళ్లగలుగుతుంది. దీనిలో ద్రవ రూపంలో ఉండే ఆక్సిజన్‌, హైడ్రోజన్‌లను వాడతారు. ఆక్సిజన్‌ మైనస్‌ 183 డిగ్రీల సెంటీగ్రేడు వద్ద, హైడ్రోజన్‌ మైనస్‌ 253 డిగ్రీల సెంటీగ్రేడు వద్ద ద్రవ రూపంలో మారతాయి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ప్రత్యేక ట్యాంకులు, ట్యూబులు, పంపులు వాడారు. రెండు వేర్వేరు ట్యాంకుల్లో 27.8 టన్నుల ఇంధనాన్ని మోసుకెళ్తుందీ రాకెట్. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్‌ సెంటర్‌లో క్రయోజెనిక్‌ ఇంజిన్లకు అవసరమైన ఇంధనాని నిల్వచేసే ఏర్పాట్లు చేశారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 రాకెట్ల సామర్థ్యాన్ని నాలుగువేల టన్నుల నుంచి మరింత పెంచేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది విజవంతమైతేనే ఇన్సాట్‌ వంటి సమాచార ఉపగ్రహాలను స్వదేశీగడ్డ నుంచి ప్రయోగించే సామర్ధ్యాన్ని భారత్‌ సంతరించుకుంటుంది.

పవన్ కల్యాణ్ ను కలవనున్న రాజధాని రైతులు

గుంటూరు : చేనేత సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాన్ ను హాయిల్యాండ్ లో రాజధాని రైతులు కలవనున్నారు. ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమర్రు కు చెందిన రైతుల భూసేకరణకు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని పవన్ ను కోరనున్నట్లు సమాచారం.

ముదిగొండకు చేరిన సీపీఎం మహాజనపాదయాత్ర

ఖమ్మం: ముదిగొండ కు సీపీఎం మహాజనపాదయాత్ర చేరుకుంది. అమరవీరుల స్తూపం వద్ద తమ్మినేని వీరభద్రం పాదయాత్ర బృందం నివాళులర్పించారు. అభ్యుదయ కళాకారిణి విమలక్క వారికి సంఘీభావం తెలిపారు.

వివాహేతర సంబంధంతో ఖమ్మం ఎస్ఐఅరెస్టు

హైదరాబాద్: ఖమ్మం టూటౌన్ ఎస్సై విజయ్ అరెస్టు అయ్యాడు. వివాహేతర సంబంధం కారణంతో విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేస్‌బుక్‌లో విజయ్‌కు హైదరాబాద్‌కు చెందిన వివాహిత పరిచయమైంది. వివాహిత ఇంట్లో ఉన్న విజయ్‌ను రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆమె భర్త పట్టుకుని హైదరబాద్ ఎస్ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద ఎస్ఐ విజయ్‌ను అరెస్టు చేశారు.

కానిస్టేబుళ్ల ఉద్యోగాల్లో అక్రమాలు.. ఆందోళన

హైదరాబాద్: కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు తెలంగాణ డీజీపీ ఆఫీసు భారీగా తరలివచ్చారు. తక్కువ మార్కులు వచ్చని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.

14:46 - February 20, 2017

హైదరాబాద్: కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు తెలంగాణ డీజీపీ ఆఫీసు భారీగా తరలివచ్చారు. తక్కువ మార్కులు వచ్చని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవేందర్‌ అందిస్తారు.

14:44 - February 20, 2017

.గో :ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు చిల్లబోయిన ఆంజనేయులు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండల మట్టావానిచెరువు గ్రామస్థుడు. వృత్తి రీత్యా వ్యవసాయదారుడు. ప్రవృత్తి మాత్రం నిత్య పెళ్లి కొడుకు. వయస్సు తక్కువేమీలేదు. యాభైఐదేళ్లు. ఇతను ఇప్పటికే ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ లేటు వయసులో తొమ్మిదో పెళ్లికి సిద్ధమై అడ్డంగా దొరికిపోయాడు.

7గురిని పెళ్లిళ్లు చేసుకుని, విభేదాలతో అందర్నీ...

చిల్లబోయిన ఆంజనేయులు మొదటి భార్యను, కుటుంబ కలహాల కారణంగా వదిలేశాడు. పెద్దమనుషుల సమక్షంలో ఈ వ్యవహారాన్ని సెటిల్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత పోడూరు, రాయపాడు, పుల్లేటికూరు, కాజ గ్రామాలను చెందిన మహిళలను మనువాడాడు. ఇలా ఒకరికి తెలియకుండా మరొకర్ని.. ఏడుగురిని పెళ్లాడాడు. పెళ్లిళ్లు చేసుకుని, విభేదాలతో అందర్నీ విడిచిపెట్టాడు. ఎవరితో కూడా చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదు. గ్రామ పెద్దల పంచాయితీల్లో రాజీ చేసుకున్నాడు. ఇటు గ్రామ పెద్దలతోపాటు, అటు సెటిల్‌ చేసుకున్న భార్యలకు అంతో ఇంతో ముట్టచెప్పి తన జోలికి రాకుండా చేసుకున్నాడు.

పురుడు పోసుకునేందుకు పుట్టింటికి వెళ్లిన లక్ష్మి .....

చివరిగా 2015లో లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు రెండోపెళ్లని చెప్పాడు. మొదటి భార్య చనిపోయిందని నమ్మబలికాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న లక్ష్మి చిల్లబోయిన ఆంజనేయులు చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మి పెళ్లి చేసుకుంది. పురుడు పోసుకోడానికి పుట్టింటికి వెళ్లింది. బాబు పుట్టిన తర్వాత ఏడాదిన్నర తర్వాత కూడా పుట్టింటి నుంచి తనను తీసుకెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన లక్ష్మి ఆంజనేయులు వ్యవహారంపై ఆరా తీసింది.

ఏడుగురు మహిళ జీవితాలతో ఆటలాడుకుని.....

ఏడుగురు మహిళ జీవితాలతో ఆటలాడుకుని, ఏడుగురు మహిళ జీవితాలతో ఆటలాడుకుని, ప్రయత్నించిన ఆంజనేయులు, తన గుట్టు బట్టబయలైందని తెలిసి పరారయ్యాడు. మొదటి భార్య సంతానం ద్వారా, మనుమలు, మనవరాళ్లు కూడా ఉన్న ఆంజనేయులు.. మహిళలను మోసం చేస్తున్న తీరు తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆంజనేయులుతో పాటు, ఈ నిత్య పెళ్లి కొడుకుకు సహకరించిన పెద్దలను కటకటాల వెనక్కి నెట్టాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇతగాడి చేతిలో మరో మహిళ మోసం పోకుండా చూడాలని కోరుతున్నారు. ఆంజనేయులు చేతిలో మోసపోయానని గ్రహించిన లక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అంజనేయులు కోసం గాలిస్తున్నారు. ఇతనికి ఏడు పెళ్లిళ్లు చేసుకునేందుకు సహకరించిన గ్రామ పెద్దల కోసం ఆరా తీస్తున్నారు. పంచాయితీల్లో రాజీచేసిన పెద్ద మనుషులపై దష్టి పెట్టారు. మొత్తానికి, ఈ నిత్య పెళ్లి కొడుకు చిల్లబోయిన ఆంజనేయులు కథను పోలీసులు ఏ మజిలీకి చేరుస్తారో, గ్రామ పెద్దలకు ఎలాంటి శిక్షలు పడేలా చేస్తారో వేచి చూడాలి.

కొనసాగుతున్న ఐపీఎల్-2017 వేలం

ముంబై : ఐపీఎల్-2017 వేలం ఆసక్తికరంగా కొనసాగుతోంది. వేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్‌, మిల్స్ జాక్ పాట్ కొట్టారు. బెన్‌ స్టోక్స్‌ను 14. 50 కోట్లకు పుణె జట్టు కైవసం చేసుకోగా.. మిల్స్‌ను 12 కోట్లకు బెంగళూరు జట్టు దక్కించుకుంది. సౌతాఫ్రికా బౌలర్ రబాడాను ఢిల్లీ జట్టు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్‌ను నాలుగున్నర కోట్లకు ఢిల్లీ కైవసం చేసుకుంది. ఇక ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను రెండు కోట్ల రూపాయలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. భారత దేశీయ ఆటగాడు పవన్ నేగిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోటి రూపాయలకు దక్కించుకున్నాయి.

'అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం'

అమరావతి: సెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్కింగ్ ప్రాంతాలను డీజీపీ సాంబశివరావు పరిశీలించారు. వీఐపీ పార్కింగ్ స్థలం తక్కువగా ఉండడం పై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విఐపీ పార్కింగ్ కోసం మరికొంత స్థలాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఏపీలో జరుగుతున్న సమావేశాలకు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపి మీడియాకు తెలిపారు. ధర్నాలు, ఆందోళనలు చేయడానికి ధర్నా చౌక్ ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ సమస్య, ఇతర విషయాలపై ఈనెల 26న స్పష్టత వస్తుందని డీజీపి తెలిపారు.

13:55 - February 20, 2017

అనంతపురం : 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడం ఖాయమని పుట్టపర్తి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని ప్రతి ఇంటి వెళ్లి ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నారు. మూడేళ్లలో అభివృద్ధి ఏం జరగలేదని.. రాష్ట్రంలో ఆరాచక పాలన జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. 

13:51 - February 20, 2017

ఖమ్మం : తెలంగాణ వచ్చినా పేదల బతుకులు బాగుపడలేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ రంగాలకు కొమ్ముకాయడం తప్ప.. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీపీఎం మహాజన పాదయాత్ర 127వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఖమ్మం జిల్లాలోని తళ్లంపాడు, ఎడవల్లి, లక్ష్మీపురం, ముదిగొండ, వెంకటాపురం, గోకినేపల్లి, గువ్వలగూడెం, నేలకొండపల్లిలో పాదయాత్ర బృందం పర్యటించనుంది. ముదిగొండలో జరిగే సభకు విమలక్క హాజరుకానున్నారు.

13:43 - February 20, 2017
13:42 - February 20, 2017

మన చుట్టూ జరిగే సంఘటనలు మనకు అనేక అనుభవాలను పంచుతాయి. అటువంటి అనుభవాలు మనలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఆలోచనలు కొత్త కార్యచరణకు నాంది పలుకుతాయి. అవి నలుగురిలో భిన్నంగా నిలబడుతాయి. నలుగురికి చేయూతనందించేలా చేస్తాయి. అలా భిన్నంగా ఆలోచించి మలి సంధ్యలో ఉన్నవారికి చేయూత అందిస్తున్న మగువ డా.విజయలక్ష్మీ కథనంతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి. వృద్ధుల కళ్లల్లో వెలుగులు నింపుతుంది. ఆమె చేస్తున్న సేవలు, చేయూతకు సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.....

13:32 - February 20, 2017

టాలీవుడ్ అప్డేట్స్, ఫిల్మ్య్ వరల్డ్ గాసిప్స్, స్పెషల్ స్టోరీస్ ..టోటల్ గ తెలుగు సినిమా న్యూస్ అండ్ ఈవెంట్స్ తో మీ ముందుకి వచ్చింది టుడే టెన్ మాక్స్ ...ఆ వివరానలు ఇప్పుడు చూద్దాం... పెద్ద సినిమాలంటే పెద్ద బడ్జెట్ సినిమాలు. ఈ పెద్ద బడ్జెట్ సినిమాలకి పెద్ద స్టార్స్ కలిస్తే ఇక బడ్జెట్ కి అడ్డు అదుపు ఉండదు. కథను నమ్మి బడ్జెట్ పెట్టె ప్రొడ్యూసర్స్ , తాను నమ్మిన కధని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద చూపించగలిగే డైరెక్టర్ వీరి కాంబినేషన్ లో వస్తున్న ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ సినిమా విశేషాలు ఏంటో చూద్దాం 
ప్రిన్స్ మెస్మరైజ్ 
మహేష్ బాబు న్యూ మూవీలో మెనీ స్పెషల్స్ ఉండబోతున్నాయి. ప్రిన్స్ ఇలాంటి స్పెషల్స్ తో మెస్మరైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ కి రెడీ అవుతోంది.ఈ సినిమా ట్రైలర్ చాల స్పెషల్ గా ఉండబోతుందట ..మరి ఆ స్పెషల్ ఏంటో మనమూ చూద్దాం . 
ఎన్టీఆర్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. డైరెక్టర్స్ విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకునే ఎన్ టి ఆర్ ఈ సినిమా కి బాబీ ని డెరెక్టర్ గా సెలెక్ట్ చేసుకోడం ఆసక్తిని కలిగిస్తుంది .సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాకి డైరెక్టర్ గా చేసిన బాబీ తన నెక్స్ట్ స్టెప్ చాలా స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకున్నాడు .ఆ కథేన్తో ఇప్పుడు చూద్దాం.
విజయ్ ఆంటోని తెలుగులోమంచి మార్కెట్ ఫామ్ 
తమిళ నటుడు విజయ్ ఆంటోని తెలుగులో కూడా మంచి మార్కెట్ ఫామ్ చేసుకున్నాడు. తాను నటించిన బిచ్చ గాడు సినిమా మంచి రెస్పాన్స్ తో హిట్ టాక్ తెచ్చుకుంది. తరువాత వచ్చిన సినిమా కమర్షియల్ గా అడ్డాగా పోయిన విజయ్ ఆంటోని డిఫరెంట్ స్టోరీస్ ని టచ్ చేస్తాడు అనే ఫీల్ ఇచ్చింది. ఇప్పుడు అదే ఫ్లో లో వస్తుంది యమన్ అనే సినిమా. ఫస్ట్ లుక్, పోస్టర్, ట్రైలర్ తో ఈ యమన్ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. 
బాలీవుడ్ లో హర్రర్ కామెడీ తో సినిమా 
బాలీవుడ్ లో హర్రర్ కామెడీ తో ఒక సినిమా రాబోతుంది. ఫిలోరి అనే టైటిల్ తో అనుష్క శర్మ మెయిన్ లీడ్ గ రాబోతున్న ఈ సినిమా లో ఒక లవ్ స్టోరీని కూడా ఇన్సెర్ట్ చేసాడు డైరెక్టర్ అన్షై లాల్ .ప్రేమ విఫలమై చనిపోయిన తరువాత ఆత్మగా మారిన ఒక వెరైటీ కధని చూపించే ప్రయత్నమే ఈ ఫిలోరి సినిమా .ఈ మధ్య రిలీజ్ ఐన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

 

13:24 - February 20, 2017
13:22 - February 20, 2017

ఢిల్లీ : సేవింగ్స్ ఖాతాదారులకు ఆర్ బీఐ శుభవార్త అందించింది. విత్ డ్రా పరిమితి పెంచింది. ఇవాళ్లి నుంచి రూ.50 వేలు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. వచ్చే నెల 13 నుంచి విడ్ డ్రాపై పరిమితులను ఎత్తవేయనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:20 - February 20, 2017

హైదరాబాద్ : నిరుద్యోగుల ర్యాలీకి అనుమతి ఇవ్వాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. నిర్ణయం ఎందుకు వెల్లడించలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. సాయంత్రంలోగా తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని సీటీ సీపీ తెలిపారు.

సేవింగ్స్ ఖాతాదారులకు శుభవార్త

ఢిల్లీ : సేవింగ్స్ ఖాతాదారులకు ఆర్ బీఐ శుభవార్త అందించింది. విత్ డ్రా పరిమితి పెంచింది. ఇవాళ్టి నుంచి రూ.50 వేలు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. వచ్చే నెల 13 నుంచి విత్ డ్రాపై పరిమితులను ఎత్తవేయనుంది. 

 

నిరుద్యోగుల ర్యాలీకి అనుమతి ఇవ్వాలన్న పిటిషన్ పై హైకోర్టు విచారణ

హైదరాబాద్ : నిరుద్యోగుల ర్యాలీకి అనుమతి ఇవ్వాలని కోదండరాం వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. నిర్ణయం ఎందుకు వెల్లడించలేదని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. తదుపరి విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు.

 

12:24 - February 20, 2017

డీజీపీ ఆఫీస్ కు బారులు తీరిన కానిస్టేబుల్ అభ్యర్థులు

హైదరాబాద్ : డీజీపీ ఆఫీస్ కు కానిస్టేబుల్ అభ్యర్థులు బారులు తీరారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. పోస్టులను అమ్ముకున్నారని మండిపడ్డారు. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని...తమకు వారి కంటే ఎక్కువ మార్కులు వచ్చినా ఎంపిక చేయలేదని ఇవ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  తమకు ఎన్ సీసీ సిర్టిఫికేట్స్ ఉన్నా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

12:20 - February 20, 2017

హైదరాబాద్ : డీజీపీ ఆఫీస్ కు కానిస్టేబుల్ అభ్యర్థులు బారులు తీరారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. పోస్టులను అమ్ముకున్నారని మండిపడ్డారు. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని...తమకు వారి కంటే ఎక్కువ మార్కులు వచ్చినా ఎంపిక చేయలేదని ఇవ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  తమకు ఎన్ సీసీ సిర్టిఫికేట్స్ ఉన్నా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:08 - February 20, 2017

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్షపై మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బలపరీక్ష చెల్లదంటూ ప్రతిపక్ష డీఎంకే పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై రేపు విచారణ జరుగుతుంది. బలపరీక్ష సందర్భంగా నెల 18న అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనలను పిటిషన్‌లో ప్రస్తావించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:58 - February 20, 2017

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు ప్రసాద్ తనయుడు కోనేరు ప్రదీప్‌ ఇంటిపై ఢిల్లీ సీబీఐ అధికారులు దాడిచేశారు. ఏకకాలంలో హైదరాబాద్, చెన్నైలోని ఆఫీసు, ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:54 - February 20, 2017

ఢిల్లీ : ఐపీఎల్ 2017 వేలం ఆసక్తికరంగా కొనసాగుతోంది. వేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్‌, మిల్స్ జాక్ పాట్ కొట్టారు. బెన్‌ స్టోక్స్‌ను 14. 50 కోట్లకు పుణె జట్టు కైవసం చేసుకోగా.. మిల్స్‌ను 12 కోట్లకు బెంగళూరు జట్టు దక్కించుకుంది. సౌతాఫ్రికా బౌలర్ రబాడాను ఢిల్లీ జట్టు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్‌ను నాలుగున్నర కోట్లకు ఢిల్లీ కైవసం చేసుకుంది. ఇక ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను రెండు కోట్ల రూపాయలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. భారత దేశీయ ఆటగాడు పవన్ నేగిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోటి రూపాయలకు దక్కించుకున్నాయి. వేలంలో ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్‌పై ప్రాంఛైజీలు ఆసక్తిచూపలేదు. 

11:45 - February 20, 2017

హైదరాబాద్‌ : మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. సొహైల్‌ అనే వ్యక్తి గుర్రం స్వారీ చేస్తూ ఎదురుగా వేగంగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని వట్టేపల్లికి చెందిన అమిత్‌షాగా గుర్తించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సొహైల్‌ పరారీలో ఉన్నాడు. 

 

11:43 - February 20, 2017

ఢిల్లీ : ఐపీఎల్-2017 వేలం ప్రారంభమైంది. ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను కనీస ధర రెండు కోట్ల రూపాయలను కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. భారత దేశీయ ఆటగాడు పవన్ నేగీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోటి రూపాయలకు దక్కించుకున్నాయి. వేలంలో కివీస్ ప్లేయర్స్ గప్టిల్‌, రాస్ టేలర్‌కు నిరాశే ఎదురైంది. మొత్తం 351 మంది ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. 

11:40 - February 20, 2017

ఢిల్లీ : మరికాసేపట్లో ఐపీఎల్‌ 10 వేలం జరగనుంది. బరిలో 357 మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే వీరిలో 76 మందికే అవకాశం దక్కనుంది. ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు సన్నద్ధమయ్యాయి. పదేళ్ల ఐపీఎల్‌ అంకం ముగిసిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి ఫ్రాంచైజీలు, ఆటగాళ్లలో పూర్తి స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయి. అందువల్ల తమ జట్టులో మిగిలిన స్థానాల కోసం ఈ ఒక్క ఏడాదికే జట్లు క్రికెటర్లను సొంతం చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-10 కోసం ఇవాళ జరిగే వేలం ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు కనీస ధరతో ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. 2 కోట్ల కనీస ధరతో ఏడుగురు ప్రధాన ఆటగాళ్లు  ఉన్నారు. వేలంలో తొలిసారి ఐదుగురు ఆఫ్ఘానిస్థాన్‌ ఆటగాళ్లు కూడా పోటీ పడుతుండటం విశేషం. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలను కేవలం ఆటగాళ్ల ప్రదర్శన, స్ట్రైక్‌రేట్, ఎకానమీలాంటివే కాకుండా ఇతర అంశాలు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఈసారి కూడా వేలంలో అనూహ్య ఎంపికలు ఉండవచ్చు.

 

కోనేరు ప్రదీప్ ఇంటిపై ఢిల్లీ సిబిఐ దాడులు

హైదరాబాద్ : కోనేరు ప్రదీప్ ఇంటిపై ఢిల్లీ సిబిఐ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్, చెన్నైలోని ఇళ్లు, ఆఫీసులపై దాడులు నిర్వహించారు. 

11:33 - February 20, 2017

గుంటూరు : మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం కార్యక్రమం ప్రారంభం అయ్యింది. చేనేత సమస్యల పరిష్కారమే అజెండాగా  ఆంధ్రప్రదేశ్‌ పద్మశాలీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దాదాపు లక్షన్నర మంది ఈ సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. జనసేన అధినేత పవన కల్యాణ్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 

11:19 - February 20, 2017

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌ క్రికెట్ మాజీ కెప్టెన్ , ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 1996లో కెన్యాపై ఆరంగ్రేటం చేసిన ఆఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. దూకుడుకు మారుపేరుగా ఖ్యాతి పొందిన ఆఫ్రిది వన్డేల్లో 351 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 1996లో శ్రీలంకపై 37 బంతుల్లోనే శతకం బాది అత్యధిక వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. 2010లో టెస్టులకు, 2015లో వన్డేలకు రిటైర్మ్‌ట్ ప్రకటించాడు. 

11:17 - February 20, 2017

ఖమ్మం : తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వాగతించారు. అయితే మద్దతు ఇవ్వాలా ? లేదా ? అంశాన్ని కోదండరామ్‌ పెట్టే  పార్టీ సిద్ధాంతాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈనెల 22న కోదండరామ్‌ హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి మద్దతు ఇస్తామని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఖమ్మం జిల్లా 
తమ్మినేని స్వగ్రామం తెల్దారుపల్లిలో జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించారు.

 

కొనసాగుతోన్న ఐపీఎస్ 2017 వేలం

ఢిల్లీ : ఐపీఎస్ 2017 ఆట గాళ్ల వేలం కార్యక్రమం కొనసాగుతోంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టారు. బెన్ స్టోక్ ను రూ.14.5 కోట్లకు కొనుగోలు చేశారు. రూ.12 కోట్లకు మిల్స్ ను కొనుగోలు చేశారు. 

10:59 - February 20, 2017

ఢిల్లీ : హస్తినలో దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డు మీద తుపాకీతో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు పిస్తల్‌తో యువకుడిపై పాయింట్ బ్లాంక్ నుంచి కాల్పులు జరిపి పరారయ్యారు. కాల్పుల్లో యువకుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. ఈ హఠాత్తుపరిణామంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డు అయింది. 

 

10:53 - February 20, 2017
10:49 - February 20, 2017

ఢిల్లీ : ఐపీఎల్ 10 వేలానికి సమయం ఆసన్నమైంది. వేలంలో కొందరు ప్లేయర్స్‌కి ఫుల్ డిమాండ్ నెలకొంది. తొలి పదేళ్ల సైకిల్‌లో ఇదే చివరి వేలం కానుంది. ఈ సారి మొత్తం 351 మంది ప్లేయర్స్ వేలంలోకి రానుండగా..  76 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది. 
వేలంలో 351 మంది ప్లేయ‌ర్స్ 
ఐపీఎల్ 2017 వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. రేపు ఉదయం ఆటగాళ్ల వేలం ప్రారంభం కానుంది. ఈసారి మొత్తం 351 మంది ప్లేయ‌ర్స్ వేలంలో పాల్గోనున్నారు. ఇందులో 76 మంది ఆటగాళ్లను మాత్రమే ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వేలంలో కొంత మంది ఆటగాళ్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. 
పదేళ్లకు ఓసారి ఆటగాళ్లందరికీ వేలం
ఐపీఎల్ ప్రారంభమై ఈ సంవత్సరంతో పదేళ్లు పూర్తికానుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లందరూ పదేళ్లకు ఓ సారి వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో ఈ ఏడాది ఇదే చివరి వేలం కానుంది. వచ్చే సంవత్సరం నుంచి ప్లేయర్స్ అందరూ మరోసారి వేలంలోకి రానున్నారు. 
వేలంలో ఇంగ్లండ్ ఆట‌గాళ్లదే హవా
ఈసారి వేలంలో ఇంగ్లండ్ ఆట‌గాళ్లదే హవాగా కనపడుతోంది. దీంతో ఫ్రాంచైజీలు వారి కోస‌ం తీవ్రంగా పోటీపడే అవ‌కాశాలు ఉన్నాయి. ఈసారి అందరి దృష్టి ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్‌ మీదే పడింది. వేలంలో అంద‌రి క‌న్నా ఎక్కువ ధ‌ర ప‌లికే అవ‌కాశం ఉన్న ప్లేయ‌ర్‌గా ఈ ఇంగ్లిష్ ఆల్‌రౌండ‌ర్ నిలుస్తాడ‌ని భావిస్తున్నారు. ఇతని క‌నీస ధర రూ.2 కోట్లు.. 
ప్రాంఛైజీలను ఆకర్సిస్తోన్న ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ 
ఇక ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షిస్తోన్న మ‌రో ఇంగ్లిష్ ప్లేయ‌ర్ జేస‌న్ రాయ్‌. ఇటీవల ఇండియాతో జరిగిన వన్డేలు, ట్వంటీలలో ఓపెనర్‌గా దూకుడైన ఆట ప్రదర్శించాడు. ఇత‌ని క‌నీస ధ‌ర రూ.కోటి. వేలంలో వీరిద్దరికీ మంచి ధ‌ర పలికే చాన్సుంది. అలాగే ఇంగ్లండ్ ప్లేయ‌ర్ క్రిస్ జోర్డాన్ కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీ ప‌డే అవ‌కాశం ఉంది. డెత్ ఓవ‌ర్లలో మెరుగ్గా బౌలింగ్ చేసే సామ‌ర్థ్యం జోర్డాన్ సొంతం. ఇత‌ని క‌నీస ధ‌ర రూ. 50 ల‌క్షలు. 
ప్రాంఛైజీల లిస్ట్‌లో సౌతాఫ్రికా బౌలర్ రబాడా
ఇటీవల కాలంలో బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు సౌతాఫ్రికా బౌలర్ రబాడా.. టీ20ల్లో పదునైన బౌలింగ్ చేయడం రబాడా ప్రత్యేకత. ఇప్పటివరకు ఐపీఎల్లో ఆడిన అనుభవం లేదు. ఇత‌ని క‌నీస ధ‌ర రూ. కోటి. ఈసారి వేలంలో ప్రత్యేక ఆకర్షణగా ఆఫ్ఘనిస్థాన్ వికెట్ కీప‌ర్ మ‌హ్మద్ షెహ‌జాద్ నిలుస్తున్నాడు. అసోసియేట్ టీమ్స్ నుంచి వేలంలో ఉన్న అతి త‌క్కువ మంది ప్లేయ‌ర్స్‌లో ఒకడు. దూకుడైన ఆట షెహజాద్ సొంతం. ఇత‌ని క‌నీస ధ‌ర కూడా రూ.50 ల‌క్షలు. 
అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఇషాంత్ శర్మ
ఇక ఇండియా త‌ర‌ఫున ఇషాంత్ శ‌ర్మ త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకోనున్నాడు. గ‌తేడాది పుణె జట్టు ఇషాంత్‌ని 3.8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినా.. ఈసారి అత‌న్ని వ‌దులుకుంది. ఈ వేలంలో ఇషాంత్ క‌నీస ధ‌ర రూ. 2 కోట్లు. మొత్తమ్మీద వేలంలో ఏ ఆటగాడికి ఎక్కువ ధర పలుకుతుందో.. ఏ ఆటగాడికి మొండిచేయి మిగులుతుందో సోమవారం తేలిపోనుంది. 

 

10:42 - February 20, 2017

చేనేత కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత విజయకుమార్, వైసీపీ నేత అమర్ నాథ్, బీజేపీ నేత శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. చేనేత కార్మికులకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. చేనేత కార్మికులను అప్పుల నుంచి ప్రభుత్వం విముక్తి కలిగించాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:34 - February 20, 2017

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారించాలని టిఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఇందే అంశంపై నిర్వమించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో బస్ భవన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. రేపు  చేపట్టే చలో  బస్ భవన్ కార్యక్రమం గురించి ఇప్పటికే ఈయూ నేతలు విభిన్న రూపాల్లో ప్రచారం నిర్వహించారు. రేపు చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించడంతో పాటు అన్ని డివిజనల్ మేనేజర్స్  కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేపట్టేందుకు ఈయు నాయకులు సిద్ధమవుతున్నారు. రేపు చలో బస్ భవన్ నిర్వహించడానికి కారణం ఏమిటి? ప్రభుత్వం ముందు ఎంప్లాయీస్ యూనియన్ పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:28 - February 20, 2017

సిరిసిల్ల రాజన్న : అదో పవిత్రమైన పుణ్యక్షేత్రం. అక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు 5 లక్షలకుపైగా భక్తులు తరలివస్తుంటారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఆ ఆలయంలోని ధర్మగుండం నీరులేక వెలవెలబోతోంది. భక్తుల మనోభావాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. నీరులేక అడుగంటిన వేములవాడ రాజన్న ఆలయ ధర్మగుండంపై 10టీవీ కథనం...
శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత 
తెలంగాణ రాష్ట్రంలోనే వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజన్న దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచేకాక... ఇతర రాష్ట్రాల నుంచీ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా ఆలయంలోని పవిత్రమైన ధర్మగుండంలో స్నానాలు చేస్తారు. ఆ తర్వాత స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
నీళ్లులేక వెలవెలబోతోన్న ధర్మగుండం   
భక్తజనం ఎంతో పరమ పవిత్రంగా భావించే ధర్మగుండం నీళ్లులేక వెలవెలబోతోంది.  ధర్మగుండంలో నీళ్లు అడుగు భాగానికి చేరాయి. ఎక్కువ నీరు లేకపోవడంతో  భక్తుల స్నానాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ధర్మగుండంలో గోదావరి నీళ్లు నింపుతామని  మంత్రి హరీశ్‌రావు ఆరునెలల కిందట ఇచ్చిన హామీలు నీటి మూటలే అయ్యాయి.
భక్తుల స్నానాలకు తీవ్ర అసౌకర్యం  
ధర్మగుండంలో నీరు అడుగంటిపోవడంతో భక్తుల స్నానాలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. వ్యయ ప్రయాసలకోర్చి స్వామి వారి దర్శనానికి వస్తే.. కనీసం ధర్మగుండంలో నీళ్లు లేవని వారు వాపోతున్నారు. రాజన్న ఆలయంలోని ధర్మగుండాన్ని ఆనుకొని ఊరి చెరువు ఉండేది. ఆలయ విస్తరణలో ఆ చెరువు సగభాగాన్ని పూడ్చారు. దీంతో ఆ చెరువులో నీరు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పైపుల ద్వారా గోదావరి నీరు తీసుకొచ్చి ధర్మగుండం నింపి భక్తుల దైవభక్తిని పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. ఈనెల 23 నుంచే మహాశివరాత్రి ఉత్సవాలు ఈ ఆలయంలో ప్రారంభంకానున్నాయి. కానీ ఇప్పటి వరకు ధర్మగుండం నింపడానికి ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాలకు సుమారు 5లక్షల మందికిపైగా భక్తులు రానున్నారు. వీరంతా ధర్మగుండంలో ఎలా స్నానం చేయాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు మేల్కొని ధర్మగుండంలో నీళ్లు నింపాలని భక్తులు కోరుతున్నారు.  

 

మైలార్ దేవ్ పల్లిలో విషాదం

హైదరాబాద్ : మైలార్ దేవ్ పల్లిలో విషాదం నెలకొంది. గుర్రపు స్వారీ చేస్తూ బైక్ ను ఢీకొనడంతో సోహైల్, హమీద్ అనే వ్యక్తులు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు.

మరికాసేపట్లో చేనేత సత్యాగ్రహ దీక్ష

గుంటూరు : మరికాసేపట్లో చేనేత సత్యాగ్రహ దీక్ష ప్రారంభం కానుంది. ఏఎన్ యూ ఎదుట ప్రాంగణంలో దీక్ష చేపట్టనున్నారు. చేనేత సత్యాగ్రహ దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

08:46 - February 20, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ పార్టీకి సవాల్‌గా మారడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత అనుభవాల దృష్ట్యా ముందుచూపుతో ఎన్నికలు ఎదుర్కొనేందుకు  పావులు కదుపుతోంది గులాబీ పార్టీ. కీలక నేతలకు బాధ్యతలు అప్పగించి మద్దతు ఇచ్చిన అభ్యర్థి విజయం కోసం కసరత్తు చేస్తోంది.   
సత్తా చాటేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాలు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గులాబీపార్టీ వ్యూహాత్మకంగా వ్యహరిస్తోంది. పైకి చూస్తే అన్నీ అనుకూలంగానే ఉన్నా.. గత అనుభవాలతో గులాబీపార్టీ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీకి  సవాల్‌గా మారాయి. బరిలో  అభ్యర్థులు భారీగానే ఉన్నా...మెజార్టీ సాధించేందుకు వ్యూహాలకు పదునుపెడుతోంది. 
గెలుపు కోసం శ్రమిస్తున్న హరీష్‌ 
నామినేషన్ల ఘట్టం పూర్తి కాకముందే సన్నాహాక సమావేశాలు నిర్వహించి నేతలను సిద్ధం చేసిన గులాబి పార్టీ కీలక నేతలు....  ఇప్పుడు స్వయంగా వారే రంగంలోకి దిగారు. మూడు జిల్లాల్లో 23,013 ఓటర్లు  ఉన్నారు. వీరిలో అత్యధిక ఓటర్లు రంగారెడ్డి జిల్లాలోనే ఉండడంతో..... ఈ జిల్లాపై కారు పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఉపాధ్యాయ సంఘం నేతగా సుదీర్ఘ అనుభవం ఉన్న చీఫ్ విప్  సుధాకర్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది. అధినేత కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి హరీశ్‌రావు స్పీడ్‌ పెంచారు. ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులతోపాటు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు బాధ్యతలు అప్పగించడంతో పాటు.. ప్రతి వందమంది ఓటర్లను డీల్‌ చేసేందుకు ఒక టిఆర్ ఎస్ నేతను ఇంచార్జ్ గా నియమించారు. 
కాటేపల్లి జనార్ధన్ రెడ్డిపైనే టీఆర్‌ఎస్‌ భారీగా ఆశలు 
సిట్టింగ్ మండలి సభ్యుడిగా మరోసారి పోటీ చేస్తున్న కాటేపల్లి జనార్ధన్ రెడ్డిపైనే టీఆర్‌ఎస్‌ భారీగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పీఆర్ టీయూ సంఘం సభ్యుడు కావడం....అధికార పార్టీ మద్దతు ఉండడం ఆయన గెలుపునకు ప్లస్‌ పాయింట్‌ అవుతుందని భావిస్తోంది. మరోవైపు అభ్యర్థి గతంలో వ్యవహరించిన తీరుపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. ఈ వ్యతిరేకత ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్న అనుమానాలు గులాబీ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. దీంతో పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి విజయం కోసం పనిచేయాలంటూ అభ్యర్థిపై వ్యతిరేకతను బయటపడకుండా చూసే  ప్రయత్నాలు చేస్తున్నారు.

 

08:40 - February 20, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో నేతన్నలు ఉద్యమబాట పట్టారు. చేనేత సత్యాగ్రహం పేరుతో సమస్యలపై గళమెత్తడానికి సిద్ధమయ్యారు. వీరికి  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మద్దతు తెలుపనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగే ఈ సభలో పవన్‌ పాల్గొంటున్నందున ప్రాధాన్యత ఏర్పడింది.
నేతన్నల పోరుబాట 
చేనేత రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమానికి రంగం సిద్దమైంది.  ఏపీలో పద్మశాలీ కులస్థులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని , చేనేతను ఆదుకోవాలని కోరుతూ సత్యాగ్రహ దీక్షకు రెడీ అయ్యారు.  గుంటూరు జిల్లా మంగళగిరి ఇందుకు వేదికైంది.  ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నేతన్నల దీక్షకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హాజరుకానున్నారు. 
సత్యాగ్రహ దీక్షలో పాల్గొననున్న పవన్‌ కల్యాణ్‌
ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేనేత సత్యాగ్రహ దీక్ష జరుగనుంది. 75 మంది పద్మశాలీయులు ఈ సత్యాగ్రహ దీక్షలో కూర్చుంటారు. వీరికి జనసేన అధినేత పవన్‌ మద్దతు తెలుపడానికి మంగళగిరికి వస్తున్నారు.  సాయంత్రం సత్యాగ్రహ దీక్షలో పాల్గొని చేనేత నాయకులతో  దీక్ష విరమింపచేస్తారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు.   సీమాంధ్రలోని పవన్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు.
మాకు రాజకీయ ప్రాధాన్యం లేకుండా పోయిందన్న పద్మశాలీ నేతలు
రాష్ట్ర జనాభాలో చేనేత కులాల జనాభా 13శాతం ఉన్నా... అందుకు తగిన స్థాయిలో రాజకీయ ప్రాధాన్యం లేకుండా పోయిందని పద్మశాలీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తక్షణమే చేనేత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి.. ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని, మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పవన్‌ తన ప్రసంగంలో చేనేతకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని వారు కోరుతున్నారు.
కార్మికుల ఆకలిచావులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు 
చేనేత కార్మికుల ఆకలిచావులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  పద్మశాలీలు కోరుతున్నారు.  సహకార సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, రంగులు, నూలు, రసాయనాలపై సబ్సిడీ అందజేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

08:35 - February 20, 2017

నిజామాబాద్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. తెలంగాణలో ఫీజురీఎంబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయడంతో పాటు నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన జన ఆవేదన సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. 
కాంగ్రెస్‌ జన ఆవేదన సభ 
పెద్ద నోట్ల రద్దు, ప్రజా సమస్యలపై నిజామాబాద్‌ కలెక్టరేట్‌ మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ జన ఆవేదన సభ నిర్వహించింది. సదస్సుకు ఏఐఐసీసీ  నేతలు దిగ్విజయ్‌సింగ్‌, కుంతియా,రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్‌ తదితరులు  హాజరయ్యారు.  ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. మోదీ, కేసీఆర్‌ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని దిగ్విజయ్‌ అన్నారు. మోదీతో కేసీఆర్‌ సెటిల్‌మెంట్‌  చేసుకున్నారని..నోట్ల రద్దుపై మాటమార్చారని దిగ్విజయ్ విమర్శించారు. కేసీఆర్‌కు కుటుంబ  ప్రయోజనాలే ముఖ్యమని దిగ్విజయ్‌ ఆరోపించారు. నోట్ల రద్దుతో  చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని దిగ్విజయ్‌ విమర్శించారు. ఇప్పటివరకు ఎంత నల్లధనం తీసుకొచ్చారో మోదీ ప్రకటించాలని  దిగ్విజయ్ డిమాండ్ చేశారు. 
ఫీజురీఎంబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయని సర్కార్ : ఉత్తమ్ 
టీఆర్‌ఎస్ సర్కార్‌ ఫీజురీఎంబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయడం లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ ఆరోపించారు. గల్ఫ్‌ బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ఉత్తమ్ అన్నారు. 
టీసర్కార్ పాలనలో ప్రజలకు అవస్థలకు : జానారెడ్డి 
తెరాస ప్రభుత్వ పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని జానారెడ్డి ధ్వజమెత్తారు. నోట్ల దర్దు నిర్ణయంతో కేంద్రం ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని.. పని లభించక కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని జానారెడ్డి మండిపడ్డారు. 

 

08:25 - February 20, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 70 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వేలేరుపాడు మండలం కట్కూరులో అర్ధరాత్రి ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు పక్కనున్న గుడిసెలకు అంటుకున్నాయి. 70 పూరిళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఇంట్లో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఇళ్లన్ని తగలబడ్డాయి. అందరూ నిరాశ్రయులయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:19 - February 20, 2017

కృష్ణా : గన్నవరంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలనువ వీడియోలో చూద్దాం...

గన్నవరంలో అలుముకున్న పొగమంచు

కృష్ణా  : గన్నవరంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

పశ్చిమగోదావరి జిల్లాలో అగ్నిప్రమాదం

పశ్చిమగోదావరి : వేలేరుపాడు  మండలం కట్కూరులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంటల్లో 70 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.

08:03 - February 20, 2017

చెన్నై : బల పరీక్షలో పళనిస్వామి గెలిచినా తమిళ రాజకీయ వేడి చల్లారలేదు. రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. బలపరీక్ష సందర్భంగా సభలో తలెత్తిన పరిణామాలపై నివేదిక ఇవ్వాలంటూ గవర్నర్‌ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.  కేంద్ర హోంశాఖకు గవర్నర్‌ ఓ నివేదిక పంపినట్టు కూడా తెలుస్తోంది.  మరోవైపు  పళనిస్వామి  డీఎంకే నేతలపై ఒత్తడి తెస్తుంటే... స్టాలిన్‌ వర్గం ఆందోళనలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇటు పళనీస్వామి, అటు స్టాలిన్‌ ఒకరిపై ఒకరు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో తమిళ పాలిటిక్స్‌  మరింత రసకందాయంలో పడ్డాయి.
అగ్నికి ఆజ్యం పోసిన అసెంబ్లీ రభస 
పళనిస్వామి విశ్వాస పరీక్షలో గట్టెక్కినా తమిళ పాలిటిక్స్‌లో హీట్‌  ఏమాత్రం తగ్గలేదు. అసెంబ్లీలో జరిగిన  రభస  డీఎంకే, అన్నాడీఎంకే మధ్య మరింతగా అగ్గిరాజేసింది. దీంతో ప్రత్యర్థి వర్గాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం.. డిఎంకే నేత స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యూహాల అమలుకు శ్రీకారం చుట్టింది.  మెరీనా తీరంలో డీఎంకే ఎమ్మెల్యేలు అనుమతి లేకుండా ధర్నా చేశారంటూ.. స్టాలిన్‌ సహా ఎమ్మెల్యేలందరిపైనా పళనిస్వామి సర్కార్‌  కేసులు నమోదు చేసింది. అంతేకాదు.. ఇదే విషయమై.. ముఖ్యమంత్రి పళనిస్వామి, గవర్నర్‌ విద్యాసాగరరావును కలిసి స్టాలిన్‌పై ఫిర్యాదు కూడా చేశారు. 
పళనిస్వామి తీరుపై డీఎంకే కన్నెర్ర
అధికారపక్షం తీరుపై డీఎంకే కన్నెర్రజేసింది. ముఖ్యమంత్రి పళనీస్వామి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ స్టాలిన్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిశారు. అసెంబ్లీలో జరిగిన ఘటనల పూర్వపరాలను వివరించారు.  సీఎంతోపాటు స్పీకర్‌ తీరుపైనా స్టాలిన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.  విపక్షాలను బలవంతంగా బయటికి పంపేసి.. బలం నిరూపించుకోవడం రాజ్యంగా విరుద్ధమని.. దీనిపై చర్యలు తీసుకోవాలని  వినతిపత్రం అందించారు. శాంతియుతంగా దీక్ష చేసిన తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గవర్నర్‌కు కంప్లైంట్‌ చేశారు. అనంతరం స్టాలిన్‌ బృందం సమావేశమై ప్రభుత్వంపై ప్రత్యక్ష ఆందోళనలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈనెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరాహారదీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.
అసెంబ్లీ రభసపై  దృష్టి సారించిన గవర్నర్‌ 
అటు అన్నాడీఎంకే, ఇటు డీఎంకే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడంతో గవర్నర్‌ బలపరీక్ష సందర్భంగా అసలు అసెంబ్లీలో ఏం జరిగిందో తెలుసుకునే దానిపై దృష్టి పెట్టారు. ఆ రోజు అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వాలంటూ అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌ను ఆదేశించారు.  వాస్తవాలను తెలియజేస్తూ త్వరగా నివేదిక అందజేయాలన్నారు. ఈ నివేదిక ఆధారంగా గవర్నర్‌ చర్య తీసుకునే అవకాశముంది.
అమ్మాడీఎంకే పేరుతో కొత్త పార్టీ?
మరోవైపు పన్నీర్‌ సెల్వం శిబిరం భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించింది. తమ వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో భేటీ అయిన పన్నీర్‌ సెల్వం, అసెంబ్లీలో మరోసారి బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇంకోవైపు, అన్నాడిఎంకే విప్‌ను ఉల్లంఘించిన తమపై అనర్హత వేటు పడుతుందని భావిస్తోన్న పన్నీర్‌ శిబిరం, కొత్తపార్టీ స్థాపించే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొత్తపార్టీకి  'అమ్మాడీఎంకే' అని పేరు కూడా ఖరారు  చేసినట్టు ప్రచారం జరుగుతోంది. 
స్వరాష్ట్రానికి తరలివచ్చే ప్రయత్నాల్లో శశికళ
అక్రమాస్తుల కేసులో కర్ణాటక జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కూడా, స్వరాష్ట్రానికి తరలివచ్చే ప్రయత్నాల్లో మునిగితేలుతున్నట్లు  తెలుస్తోంది.  ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న శశికళ, తమిళనాడులోని చెన్నై లేదా వేలూరు జైలుకు తనను బదిలీ చేయాలంటూ.. న్యాయవాదుల ద్వారా పిటిషన్‌ వేయిస్తున్నట్లు అన్నాడిఎంకే వర్గాలు తెలిపాయి. మొత్తానికి.. నిన్నటిదాకా పన్నీర్‌ వర్సెస్‌ పళనిస్వామిగా ఉన్న రాజకీయ పోరు ఇపుడు.. పళని వర్సెస్‌ స్టాలిన్‌గా  మారింది. ఈ పరిణామం భవిష్యత్తులో మరెన్ని పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

 

నంగనూరులో విషాదం

సిద్ధిపేట : నంగనూరులో విషాదం నెలకొంది. మూడు రోజుల పసికందు సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులే వారి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. 

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన షాహిద్ ఆఫ్రిది

ఇస్లామాబాద్ : అంతర్జాతీయ క్రికెట్ కు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది రిటైర్మెంట్ ప్రకటించారు. 2010లో టెస్ట్, 2015లో వన్డేల నుంచి ఆఫ్రిది వైదొలిగారు. 27 టెస్టులు, 398 వన్డేలు, 98 టీ20 మ్యాచ్ లు ఆడారు. 

నేడు గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో డిజిధన్ మేళా

గుంటూరు : నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో డిజిధన్ మేళా నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి గజపతి రాజు, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. 

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న గవర్నర్ నరసింహన్ దంపతులు

చిత్తూరు : నేడు గవర్నర్ నరసింహన్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.  

నేడు పరిగిలో కాంగ్రెస్ జన ఆవేదన సభ

వికారాబాద్ : నేడు పరిగిలో కాంగ్రెస్ జన ఆవేదన సభ జరుగనుంది. దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమారెడ్డి హాజరుకానున్నారు. 

 

Don't Miss