Activities calendar

21 February 2017

21:31 - February 21, 2017

హైదరాబాద్: ఉద్దేశ పూర్వకంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జేఏసీ నిరుద్యోగ ర్యాలీని అడ్డుకుంటుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి మద్దతునిస్తున్నామని ఆయన అన్నారు. అలాగే నీటి పారుదల ప్రాజెక్ట్‌ల విషయంలో ప్రజలను మభ్య పెడుతుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. 500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్‌లను కూడా ప్రభుత్వం పక్కన పెడుతుందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తే గత ప్రభుత్వాలకు పేరొస్తుందనే అధికార పక్షం ఆలస్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.

21:29 - February 21, 2017

హైదరాబాద్: తెలంగాణాలో బడుగు బలహీన వర్గాలను సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ విధానాల వల్ల రాష్ట్రంలో బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. వెనుకబడిన వారిని మరింత వెనక్కి నెట్టేస్తున్నారని వంశీచంద్ రెడ్డి ఆరోపించారు.

21:28 - February 21, 2017
21:26 - February 21, 2017

హైదరాబాద్: ఏపీ, తెలంగాణాల్లోని 10 శాసనమండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రెండు రాష్ట్రల్లోని ఎమ్మెల్యే , స్థానికసంస్థల ఎమ్మెల్సీ లకు మార్చి 29తో పదవీకాలం ముగుస్తోంది. ఏపీలో 7, తెలంగాణాలో 3 స్ధానాలకు షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఫిబ్రవరి 28 న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 7, మార్చి 8 న నామినేషన్ల పరిశీలన, పదిన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఈసీ తెలిపింది. మార్చి 17న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటలవరకు పోలీంగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని.. మార్చి 20తో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

 

21:24 - February 21, 2017

హైదరాబాద్: ఏది ఏమైనా నిరుద్యోగ ర్యాలీ నిర్వహించడం తథ్యమని టీ-జేఏసీ ప్రకటించింది. ముందుగా అనుకున్న ప్రకారమే తమ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేసింది. నిరుద్యోగులను ర్యాలీకి రానీయకుండా పోలీసులు.. ఎక్కడికక్కడ నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరామ్ అరోపించారు. స్వరాష్ట్రంలో.. స్వపరిపాలనలో.. ఈ నిర్బంధమేంటని ఆయన సర్కారును నిలదీశారు. మరోవైపు.. నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో, పోలీసులు రాజధానిలో భద్రతావలయాన్ని ఏర్పాటు చేశారు.

మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెగని ఉత్కంఠ..

నిరుద్యోగుల ర్యాలీపై.. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెగని ఉత్కంఠ కొనసాగింది. ఓవైపు పోలీసులు.. మరోవైపు టీజేఏసీ నేతలు.. నడుమ న్యాయస్థానం..! ర్యాలీ, బహిరంగ సభావేదికల గురించి ఈ మూడు వర్గాల మధ్యా దఫదఫాలుగా చర్చలు సాగాయి. చివరికి, న్యాయస్థానం, నాగోల్‌ మెట్రో గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించుకోవచ్చని జేఏసీ నేతలకు సూచించింది. అయితే, దీనికి అంగీకరించని జాక్‌ నేతలు, ర్యాలీకి అనుమతి కోరుతూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

ఈనెల ఒకటో తేదీనుంచి ఉత్కంఠ కొనసాగుతూనే ...

నిరుద్యోగుల నిరసన ర్యాలీ కోసం ఈనెల ఒకటో తేదీనుంచి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. టీ-జేఏసీ నేతల విజ్ఞప్తిపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించక పోవడంతో, వారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం ఉదయం నుంచి కోర్టులో వాద-ప్రతివాదనలు జరిగాయి. ర్యాలీ నేపథ్యంలో విధ్వంసం జరిగే అవకాశముందని.. పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే.. ర్యాలీ నిర్వహించేవారిలో చాలామందిపై అనేక కేసులు ఉన్నాయని.. నగరంలో ర్యాలీ నిర్వహిస్తే ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతాయని నివేదించారు. నగర శివారులో ఎక్కడైన సభ నిర్వహించుకుంటే తమకు అభ్యంతరం లేదని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై టీ-జేఏసీ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలో ఎక్కడైనా అనుమతి ఇవ్వాలని కోరారు.. ఉదయం నుంచి మూడు సార్లు విచారణను వాయిదా వేసి, పోలీసులు, జాక్‌ నేతల అభిప్రాయాలను తీసుకున్న న్యాయస్థానం.. నాగోల్‌ మెట్రో గ్రౌండ్‌లో సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తామంది. దీనిపై అసంతృప్తి చెందిన టీ-జేఏసీ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

కోర్టు తీర్పుపై టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరాం ...

కోర్టు తీర్పుపై టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పందించారు. తమ కార్యాచరణలో ఎలాంటి మార్పులేదని.. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే చాలాప్రాంతాల్లో అరెస్టులు జరుగుతున్నాయని.. అయినా భయపడేది లేదన్నారు. అరెస్టులకు భయపడితే.. తెలంగాణే వచ్చేది కాదన్నారు కోదండరాం బుధవారం ఎట్టి పరిస్థితిల్లోనూ ర్యాలీ నిర్వహిస్తామని విద్యార్థి సంఘాల నేతలూ స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే.. మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అటు, విపక్షాలు, ప్రజాసంఘాలు కూడా టీ-జేఏసీకి సంఘీభావం ప్రకటించాయి.

ఎవరూ నగరానికి తరలిరావద్దంటూ పోలీసులు హెచ్చరికలు...

మరోవైపు, టీ-జేఏసీ ర్యాలీకి అనుమతి లేదని.. ఎవరూ నగరానికి తరలిరావద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ర్యాలీలో పాల్గొనేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. నిరుద్యోగుల నిరసన ర్యాలీకి అనుమతి లేకపోవడంతో.. ఇందిరాపార్క్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా.. ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరుద్యోగ ర్యాలీ జరిపితీరాలని జేఏసీ, అడ్డుకుని తీరాలని ప్రభుత్వం పట్టుదలతో ఉండడంతో.. బుధవారం ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ సర్వత్రా నెలకొంది.

20:36 - February 21, 2017

హైదరాబాద్: ఒకప్పుడు స్పీచ్ లు దంచేవారు...హామీలు ఇచ్చేవారు, పాలసీలు చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు సీన్ మారింది. గాడిదలకు ప్రచారం, నీది ఈ రాష్ట్రం కాదంటే..నీది ఈ రాష్ట్రం కాదంటే అని కౌంటర్లు, సమస్యలన్నీ పక్కకు పోయాయి, ప్రజల బాధలు మాటవరసకు కూడా రావు, 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా జరుగుతున్న ప్రచారం తీరు చూస్తే వీళ్లా మన నేతలు... వీళ్లకా మనం ఓటు వేయాల్సింది? అన్న సందేహాలు రాక మానవు. ఇదే అంశంపై నేటి వైడాంగిల్. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

20:08 - February 21, 2017

హైదరాబాద్ : హైకోర్టు ఆంక్షల నడుమ నిరుద్యోగుల ర్యాలీ...ఆగం ఆగం చేయకుండా చేయాలి ఖాళీ, ఏడుకొండల వాడా అందుకో కానుకలు...అమరుల గోత్రాల మీద దీవినార్తలు పెట్టు, ప్రజాస్వామ్యాన్ని రేప్ చేసిన చంద్రాలు...ఆరోపణలు రుజువు చేసిన కే.రామచంద్రాలు, బాబుగారి ఇజ్జత్తు తీస్తున్న వర్లరామయ్య....గోటితోని పోయే పంచాయతీ గొడ్డలితో తెచ్చే, మీరే ముఖ్యమంత్రులు అయితే మరి మేము...బహుజనుల సంగతేంటన్న వీహెచ్, రణరంగం అయిన శరణం గచ్చామి రణం....సెన్సార్ ఆఫీసు మీద దళితుల దాడి ఇత్యాది అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాలను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

20:00 - February 21, 2017

హైదరాబాద్: ఆటో రిక్షా డ్రైవర్‌ కొడుకు మహమ్మద్‌ సిరాజ్‌...జాక్‌ పాట్‌ కొట్టాడు.దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తోన్న హైదరాబాదీ ఫాస్ట్‌ బౌలర్‌ సిరాజ్‌ను, ఐపీఎల్‌ 10వ సీజన్‌ వేలంలో సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ 2 కోట్ల 60 లక్షల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తానని మహ్మద్ సిరాజ్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:56 - February 21, 2017

హైదరాబాద్: జియో ప్రారంభించిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లు చేరడం సంతోషంగా ఉందని రిలయన్స్‌ సంస్థల ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ అన్నారు. ముంబయిలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 100 రోజుల్లో సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియోలో చేరారని... టెలికాం రంగంలోనే ఇదో విప్లవమన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి జియో టారిఫ్‌ అమలు చేయనున్నట్లు ముఖేశ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్‌ సేవలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి రోమింగ్‌ ఛార్జీలు.. బ్లాక్‌ అవుట్‌ డేస్‌ ఉండవన్నారు. టారిఫ్‌ అమలు పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. అందుబాటు ధరల్లో అత్యుత్తమ సేవలు అందించడమే టార్గెట్‌ పెట్టుకున్నామన్నారు. మొదటిగా చేరిన 10 కోట్ల మంది జియో వినియోగదారులే జియో బ్రాండ్‌ ప్రచారకర్తలన్నారు. వినియోగదారుల కోసం ఏడాదికి రూ.99తో జియో ప్రైమ్‌ పేరుతో ప్రత్యేక ప్లాన్‌ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

19:54 - February 21, 2017

హైదరాబాద్: కొంతమంది వ్యక్తులు కావాలనే మనల్ని వేధిస్తున్నారని ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా ఉద్యోగులకు లేఖ రాశారు. ఇజ్రాయెల్ సాఫ్ట్‌వేర్ సంస్థ వనయా కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగలేదని వివరణ ఇచ్చారు. కంపెనీపై వస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని సిక్కా తెలిపారు. పనయా కంపెనీ డీల్‌కు సంబంధించి రోజుకో కొత్త ఆరోపణ వస్తుందని వాటిలో ఏ మాత్ర వాస్తవం లేదన్నారు. పనయా కంపెనీని 1250 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తున్నామని 2015 ఫిబ్రవరిలో ఇన్ఫోసిస్ ప్రకటించింది.

19:53 - February 21, 2017

యూపీ :రాహుల్‌, అఖిలేశ్‌ సభలో అపశృతి చోటు చేసుకుంది. అలహాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన.. వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఎన్నికల ప్రచారంలో రోడ్‌షో నిర్వహిస్తున్న రాహుల్‌.. కాసేపట్లో వేదికపైకి రావాల్సి ఉంది. ఈలోపే ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యకర్తలు ఒక్కసారిగా వేదికపైకి రావడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు కార్యకర్తలకు గాయాలైనట్లు తెలుస్తోంది.

19:50 - February 21, 2017

హైదరాబాద్: టీ-జేఏసీ నేతలు నగర సీపీ మహేందర్‌రెడ్డిని కలిశారు. రేపు ఉస్మానియా వర్సిటీలో ర్యాలీ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని మహేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

19:48 - February 21, 2017

హైదరాబాద్: రేపు నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో... హైదరాబాద్‌లో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇందిరాపార్క్‌, ఓయూలో భారీగా పోలీసులను మోహరించారు. యూనివర్సిటీలో... విద్యార్థి నేతలను అరెస్టు చేసిన పోలీసులు... ఇందిరాపార్క్‌ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పోలీసులను నగరానికి తరలిస్తున్నారు.

19:46 - February 21, 2017

యాద్రాద్రి : ఆలేరు వద్ద పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న గరుడ బస్సులో వెనక భాగంలో... అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన ప్రయాణికులు.. డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే డ్రైవర్ బస్సును పక్కకు ఆపడంతో... ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

19:44 - February 21, 2017

హైదరాబాద్: తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో మేథోమథన సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా సంపాదకులు హాజరయ్యారు. ప్రాథమిక పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టాలని తెలుగు యూనివర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ కోరారు. మైసూర్‌లోని ప్రాచీన విశిష్ట భాషా కేంద్రాన్ని హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. చాలా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా కోర్సులు లేవని, విశిష్ట భాషా కేంద్రం ద్వారా ఈ కోర్సులు ప్రారంభించే అవకాశం ఉందని ఎస్వీ సత్యనారాయణ అన్నారు.

శాస్త్రీయ పద్ధతిలో తెలుగు నేర్చుకునేలా...

శాస్త్రీయ పద్ధతిలో తెలుగు నేర్చుకునేలా విద్యావిధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ సూచించారు. తెలుగు భాషాభిమానులు, పాలకులు ఈదిశగా కృషి చేయాలన్నారు. భాష బలోపేతం కావాలంటే.. మాండలికాలను కూడా ప్రాంతీయ భాషల్లోకి చేర్చి వాడాలని ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అభిప్రాయపడ్డారు. మాతృభాషను రక్షించుకోవడంతో పాటు భాష అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

మాతృభాషకు తమిళులు ఇచ్చినంత ప్రాధాన్యత తెలుగువారు ఇవ్వడం లేదని..

మాతృభాషకు తమిళులు ఇచ్చినంత ప్రాధాన్యత తెలుగువారు ఇవ్వడం లేదని టెన్‌ టీవీ అసోసియేట్‌ ఎడిటర్‌ శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. మాతృభాష సముజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందన్న భావన విద్యార్థుల్లో ఏర్పడినప్పుడే.. తెలుగు భాష పరిఢవిల్లుతుందన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా తెలుగు భాషాను వినియోగించాలని ఆయన సూచించారు. విద్యార్థులు, విద్యాసంస్థలు, భాషాభిమానులతో పాటు పరిపాలకులు కూడా మాతృభాష పరిపుష్టికి కృషి చేయాల్సిన అవసరం ఉందని వక్తలు సూచించారు.

19:40 - February 21, 2017

కరీంనగర్ : సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల వార్ నడుస్తోంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏడాది గడువుతో ఉద్యోగాలను ఇప్పిస్తోంది. దీంతో వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:30 - February 21, 2017
19:18 - February 21, 2017

హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ వుందని.. రేపు జరపతలపెట్టిన నిరుద్యోగుల ర్యాలీ యధావిధిగా కొనసాగుతుందని ప్రొ.కోదండరామ్ స్పష్టం చేశారు. ఆయన '10టివి'తో మాట్లాడుతూ..ప్ర‌భుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో రిజ‌ర్వేష‌న్లు, స్వ‌యం ఉపాధి అవ‌కాశాల విస్త‌ర‌ణ కోసం తాము ఈ ర్యాలీకి పిలుపునిచ్చామని తెలిపారు. నిరుద్యోగుల నిరసన ర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సిగ్గు చేటని మండి పడ్డారు. ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేశారని... మాకు అరెస్టులు కొత్త కాదని.. అరెస్టులకు భయపడే వారిమే అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చి వుండేది కాదని స్పష్టం చేశారు. అరెస్టు చేసినా ఎక్కడికక్కడ శాంతియుతంగా నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. రేపు సుందరయ్య పార్క్ నుండి ముందుకు అనుకున్న విధంగా నిరసన ర్యాలీ చేపడతామని స్పష్టం చేశారు. పర్మిషన్ కోసం వెళితే కేసులు వున్నాయని, ఉగ్రవాదులని ప్రభుత్వ వాదన వింతగా ఉందని మండిపడ్డారు. మా వెంబడి ఉన్న నిరుద్యోగులు తీవ్రవాదులా? ఎల్బీ స్టేడియంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నపుడులేని ట్రాఫిక్ జామ్.. నిరుద్యోగులు నిరసన తెలిపితే అవుతుందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఏకం కావడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. నిరసన ర్యాలీ నిర్వహించడంలో ఎటువంటి రాజకీయపరమైన ఉద్దేశాలు లేని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

రేణిగుంట కు సీఎం కేసీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తుడా మాజీ చైర్మన్ శంకర్‌రెడ్డి, ఏపీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి సీఎం కేసీఆర్ తిరుమలకు బయలుదేరారు.

గోపన్‌పల్లిలో రోడ్డు ప్రమాదం:ఒకరి మృతి

హైదరాబాద్: నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్‌పల్లిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఓ లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో రవికుమార్ అనే వ్యక్తి మృతిచెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

18:43 - February 21, 2017

అమరావతి :ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ను మార్చి 13న ఆర్థికమంత్రి సభలో ప్రవేశపెడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో శాఖాధిపతులతో సీఎం సమావేశమయ్యారు. మార్చి 6 నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా బడ్జెట్ రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రణాళిక శాఖ.. వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రజెంటేషన్‌ సమర్పించింది.

 

18:42 - February 21, 2017

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల తీరుతెన్నులపై ఏపీ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గడువులోగా ప్రాజెక్ట్‌ పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, నిర్మాణ సంస్థలతో సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం సూచించారు. పనుల ఆలస్యంపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ అధికారి రమేష్‌బాబును చంద్రబాబు నిలదీశారు. అయితే.. యంత్రసామాగ్రి పూర్తిగా చేరకపోవడం, చిల్లింగ్ ప్లాంట్లు రాకపోవడంతో పనులు ఆలస్యం అవుతున్నాయని రమేష్‌బాబు సీఎంకు వివరించారు.

జాప్యాన్ని ఇక సహించేది లేదని చంద్రబాబు స్పష్టం...

పోలవరం పనుల్లో జాప్యాన్ని ఇక సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని, పనుల్లో నిర్లక్ష్యం, జాప్యం చోటుచేసుకుంటే వేటు తప్పదని చంద్రబాబు సీరియస్‌గా హెచ్చరించారు. పర్యవేక్షణ అధికారి రమేష్ బాబు, కన్సల్టెంట్ మేనేజర్ తో పర్యవేక్షణలో ప్రతిరోజు సీఎం కార్యాలయంతో సమన్వయం చేసుకునేలా అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు.

ఎల్‌ అండ్‌ టీ బావర్‌ గొంతెమ్మ కోర్కెలతో ...

మరోవైపు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారు సంస్థ ఎల్‌ అండ్‌ టీ బావర్‌ గొంతెమ్మ కోర్కెలతో ప్రభుత్వానికి, అధికారులకు తలనొప్పిగా మారింది. దీనికి సంబంధించి ఎల్‌ అండ్‌ టీ కంపెనీపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. సమస్యలుంటే పరిష్కరించి పనుల్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.

18:39 - February 21, 2017

విజయవాడ : మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్‌ మీడియట్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి.. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 14 శాతం మంది విద్యార్థులు అధికంగా ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మార్చి 9న జరగాల్సిన పరీక్షలను మార్చి 19వ తేదీకి వాయిదా వేశామని మంత్రి చెప్పారు.

18:37 - February 21, 2017

అమరావతి : ఏపీ రాష్ట్ర మంతివర్గ విస్తరణ అటు తెలుగుతమ్ముళ్లలోనూ, ఇటు వలసవచ్చిన వైసీపీ నేతల్లోనూ ఆశలు పెంచుతోంది. ఇదే అంశం కొందరు నేతల్లోనూ ఆందోళన పుట్టిస్తోంది. మూడు నెలలుగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, కేబినెట్ లో ఉన్న కొందరు పదవులు కోల్పోతారని, కొత్తవారికి ముఖ్యంగా వైసీపీ నుంచి వలసవచ్చిన ఎమ్మెల్యేలకు స్థానం దక్కుతుందని భావిస్తున్నారు. అందరికన్నా ముందు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మంత్రిపదవి చేపడతారంటూ ప్రచారం జరుగుతోంది. లోకేష్‌కు కేబినెట్‌లో బెర్త్‌ ఖరారు అన్న విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే రెండుసార్లు ప్రకటించారు.

ఊరిస్తూ వస్తున్న అధినేత...

ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ వస్తున్న అధినేత ఇంకా మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోవడంపై అటు తెలుగు తమ్ముళ్లలోనూ.. ఇటు వలస వచ్చిన నేతల్లోనూ ఆందోళన పట్టుకుంది. అయితే.. మార్చి మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణ ఉండొచ్చని.. ఏడుగురు మంత్రులకు ఉద్వాసన..మరో 13 మందికి కొత్తగా కేబినెట్‌లో స్థానం లభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కొత్తగా తీసుకునే వారిలో వైసీపీ నుంచి వచ్చిన నేతలకే అత్యధిక అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కొన్ని రోజులుగా సీఎం చంద్రబాబు సైతం ఈ అంశంపై సన్నిహితుల దగ్గర చర్చించినట్లు సమాచారం.

లోకేష్‌ను పూర్తిస్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి...

2019 ఎన్నికల నాటికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను పూర్తిస్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపాలని అధినేత చంద్రబాబు తలపోస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ అంతర్గత వ్యవహారాలు, మంత్రులు, ఎమ్మెల్యేలుల పనితీరు, ఆయా శాఖల్లో జరుగుతున్న కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరిస్తున్న లోకేష్‌.. ఆ సమాచారారన్ని క్రోడీకరించి ఆయా శాఖలు, మంత్రుల పనితీరును మెరుగుపర్చేలా చూస్తున్నారు. పార్టీలో అంతర్గతంగా రెండోస్థానంలో నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. కానీ.. ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయల్లో గానీ, ప్రజలతో నేరుగా సంబంధాలు గానీ లోకేష్‌కు లేవు. అయితే 2019 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు యోచిస్తున్నట్లు, అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశపెట్టేందుకు లోకేష్‌ను కేబినెట్‌లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. అమరావతి రాజధాని నిర్మాణం, ఏపీ సీఆర్డీఏ, పట్టణాభివృద్ధి, ఐటీ వంటి కీలక బాధ్యతలను నారా లోకేష్‌కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.

మంత్రివర్గ విస్తరణ జరిగితే తమకూ అవకాశం వస్తుందన్న ...

మంత్రివర్గ విస్తరణ జరిగితే తమకూ అవకాశం వస్తుందన్న ఆశతో టీడీపీ సీనియర్‌ నేతలు ఉన్నారు. ముఖ్యంగా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్దప్రసాద్‌ వంటి వారు కూడా కేబినెట్‌లో బెర్త్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరితోపాటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినవారిలో చాలా మంది మంత్రిపదవులు ఆశిస్తున్నారు. కులాలు, ప్రాంతాల ప్రాతిపదికన కేబినెట్‌లో స్థానం కోసం పోటీ పడుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డిని కేబినెట్ లోకి తీసుకునే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఉన్నారు. అయితే దీన్ని ఆ జిల్లాకే చెందిన శిల్పా బ్రదర్స్‌ వ్యతిరేకిస్తున్నారు. వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం.

బొబ్బిలి ఎమ్మెల్యే సుజనకృష్ణ రంగారావు పేరు కూడా...

విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజనకృష్ణ రంగారావు పేరు కూడా చంద్రబాబు పరిశీలనలో ఉంది. కానీ.. అదే జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యే సుజనకృష్ణను కేబినెట్‌లోకి తీసుకోవద్దని అభ్యంతరం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ముస్లింల కోటాలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పేరు కూడా సీఎం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన వారిని కేబినెట్ లోకి తీసుకునే అంశం గురించి అధినేత ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వారికి మంత్రి పదవులిచ్చి పార్టీలో అనాధిగా ఉన్న సీనియర్లను దూరం చేసుకోవాల్సి వస్తుందేమోనన్న యోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

18:33 - February 21, 2017

విజయవాడ : ఇప్పటికీ సమాజంలో ఆడవాళ్ల పట్ల చిన్నచూపు ఉందని.. అది పోయినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని కృష్ణాజిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ అన్నారు. విద్యారంగంలో రాణిస్తే భవిష్యత్తులో బాలికలకు తిరుగుండదన్నారు. విజయవాడలో కోరమాండల్ ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలోని బాలికలను ప్రోత్సహించేందుకు కోరమాండల్ ఇంర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ముందుకురావడం అభినందనీయమని డాక్టర్ సీఎల్ రావు అన్నారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థునులకు సంస్థ తరపున బహుమతులు ప్రదానం చేశారు.

17:44 - February 21, 2017
17:41 - February 21, 2017

పెద్దపల్లి : రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేస్తున్నామని, రైతులకు వేసవిలో కూడా తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ను అందించడానికి సిద్ధంగా ఉన్నామని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని కొత్తగా నిర్మాణం చేపట్టే 8, 9 యూనిట్లను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో అన్ని కేటగిరిలకు విద్యుత్‌ అంతరాయం కలగకుండా చూస్తున్నామని... కొత్తగా 5,800 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం సీఎస్సార్‌ నిధులతో కొనుగోలు చేసిన 20 సైకిళ్లను స్కూల్‌ విద్యార్థులకు పంపిణీ చేశారు.

17:40 - February 21, 2017

సిద్ధిపేట :యువత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏదైనా సాధించవచ్చని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. పట్టణంలో 200 మంది నిరుద్యోగులకు పోలీస్ శిక్షణ ఇస్తే అందులో 66 మంది కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారన్నారు. ప్రభుత్వం రంగం కన్నా ప్రైవేట్ రంగంలోనే భవిష్యత్ బాగుంటుందని హరీష్‌ సూచించారు.

17:38 - February 21, 2017

హైదరాబాద్: సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో దారుణం జరిగింది. రెండు షాపుల యజమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్ణణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుని పేరు హనుమంతరావు.. వయస్సు 65 సంవత్సరాలు ఉంటాయి. శ్రీనివాసరావు అనే వ్యక్తి హనుమంతరావును గుమ్మడికాయతో కొట్టి చంపాడు. నిందింతుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్...7గురు నక్సల్స్ హతం

ఛత్తీస్‌గఢ్: ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో గల అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో భద్రతా సిబ్బంది పలు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. నక్సల్స్ ఆచూకీ కోసం పోలీసులు-భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది.

మార్చి 1 నుండి ఇంటర్ పరీక్షలు..

అమరావతి: మార్చి1 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ విధానం అమలు చేస్తామని ఆయన తెలిపారు. ల్యాబ్ సౌకర్యం కల్పించని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. సమస్యాత్మక పరీక్షాకేంద్రాలు, స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మార్చి 9న జరగాల్సిన పరీక్ష 19కి వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు.

17:33 - February 21, 2017
17:31 - February 21, 2017
17:26 - February 21, 2017

హైదరాబాద్: నగరంలో నిరుద్యోగ నిరసన ర్యాలీకి అనుమ‌తి కోరుతూ టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం, అధికార ప్రతినిధి జి.వెంకటరెడ్డిలు హైకోర్టులో వేసిన‌ పిటిష‌న్ నేప‌థ్యంలో న్యాయ‌స్థానం నుంచి త‌మ‌కు అనుకూలంగా తీర్పురాక‌పోవ‌డంతో టీజేఏసీ మ‌రోసారి భేటీ అయింది. ఈ సందర్భంగా కోర్టులో టీజేఏసీ పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ... అనుమతి నిరాకరించడం దారుణమన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

17:14 - February 21, 2017

హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల దాదాపు 60 వేల మంది నిరాశ్రయులవుతారన్న అంచనాలున్నాయి. 39 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీరికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌తో సిపిఎం జిల్లాలో అనేక ఉద్యమాలు నిర్వహించింది. కోర్టుల్లో న్యాయ పోరాటాలూ సాగించింది.

10 లక్షల ఎకరాలకు సాగు నీరు...

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మూడు జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామంటోంది ప్రభుత్వం. అయితే, ఈ ప్రాజెక్ట్ కారణంగా భూములు కోల్పోతున్నవారి సంఖ్య ఎక్కువగానే వుంది. నార్లాపూర్, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్, ఏదులపూర్ రిజర్వాయర్ల పరిధిలో 39 గ్రామాలను ముంపు సమస్య పీడిస్తోంది. 27 వేల ఎకరాలు సేకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 60 వేల మందికిపైగా నిర్వాసితులవుతారు.

2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం...

2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది. ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ ఈ ప్రాంతంలో సిపిఎం అనేక పోరాటాలు చేసింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కాకుండా, 123 జీవో ద్వారా భూములు సేకరించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను భూ నిర్వాసితుల పోరాట కమిటీ హై కోర్టులో సవాలు చేసింది. దీంతో 123 జీవో ను హై కోర్టు కొట్టివేసింది. దీంతో భూ నిర్వాసితుల పక్షాన సిపిఎం సాగించిన పోరాటం ఫలించినట్టైంది.

పునరావాసం చూపించే విషయంలో అలసత్వం.....

ముంపు గ్రామాలవారికి పునరావాసం చూపించే విషయంలో ప్రభుత్వం, అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు లేవంటున్నారు నిర్వాసితులు. తమకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించేంత వరకు ఉన్న ఊరిని వదిలి వెళ్లేది లేదంటున్నారు నిర్వాసితులు. అయితే, వీరి సమస్యలను పట్టించుకోని అధికారులు బలవంతంగా భూములు, ఇళ్లు ఖాళీ చేయిస్తుండడం తీవ్ర వివాదస్పదమైంది.

17:08 - February 21, 2017

హైదరాబాద్: దేశం డిజిటల్‌వైపు పరుగులు తీస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరికీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అవసరమన్నారు గవర్నర్‌ నరసింహన్‌. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో టాలెంట్‌ స్మార్ట్‌ క్యాంపస్‌ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని పెంచుకోడానికి ఈ టాలెంట్‌ స్ర్పింట్‌ క్యాంప్‌ ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టాలెంట్‌ స్ప్రింట్‌ ఫౌండర్‌ శాంతన్‌పాల్‌ తదితరులు పాల్గొన్నారు.

17:04 - February 21, 2017

హైదరాబాద్: తెలంగాణ లో నిరుద్యోగుల ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం అని ప్రొ.కోదండరాం మండిపడ్డారు. నిరసన తెలపడం అనేది మా ప్రజాస్వామ్య హక్కు అని....అనుకున్న విధంగా ఇందిరా పార్క్ నుండి నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. ఆయన నిరుద్యోగుల ర్యాలీపై హైకోర్టు లో పిటిషన్ ను ఉపసంహరించుకున్నామని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్ర‌భుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో రిజ‌ర్వేష‌న్లు, స్వ‌యం ఉపాధి అవ‌కాశాల విస్త‌ర‌ణ కోసం తాము ఈ ర్యాలీకి పిలుపునిచ్చామని తెలిపారు. ఫిబ్ర‌వ‌రీ 1నే ఇందుకోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నామని అన్నారు. దీనిపై ప్ర‌భుత్వ త‌మ‌తో చ‌ర్చ‌లు కూడా జ‌ర‌ప‌లేదని అన్నారు. నేరుగా డీసీపీ వ‌ద్ద‌కు వెళ్లి అనుమ‌తి ఇవ్వాల‌ని కోరామ‌ని, వారి నుంచి కూడా స్పంద‌న రాలేదని అన్నారు. చివ‌రికి కోర్టుకు వెళ్లామ‌ని చెప్పారు. అప్ప‌టి నుంచి త‌మ‌పై వేధింపులు మొద‌ల‌య్యాయని కోదండ‌రాం అన్నారు. ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తోందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మె, సాగర్ మార్చ్, వంటి ఉద్యమాల్లో విధ్వంసానికి పాల్పడ్డారని అందుకే ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు పేర్కొన్నారు. మొత్తం ఉద్యమాన్ని హింసగా చిత్రీకరించే ప్రయత్నిం చేస్తున్నారు. నా పై ఉన్న కేసులతో పాటు సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు. ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని చెప్పి ఆరు స్థలాలను సూచించారు. ప్రజలందరికీ మా డిమాండ్స్ తెలియజేసేందుకే ఒక వేదిక. ఈ ర్యాలీకి హైదరాబాద్ లోనే జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరినా పోలీసులు అనుమతి ఇవ్వడంలేదు. నిరసన అనేది మా రాజ్యాంగ హక్కు. ఇప్పటి వరకు 600 మంది అరెస్టు అయినట్లు సమాచారం. అక్కడ అరెస్టులు చేస్తే అక్కడే శాంతి యుతంగా నిరసన తెలియజేయాలని సూచించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిద్దామని పేర్కొన్నారు. చేతనైన మేరకు నిరసన తెలియజేస్తాం. ఇందిరా పార్క్ నుండే నిరసన కార్యక్రమం చేపడతాం అని స్పష్టం చేశారు.

16:28 - February 21, 2017

హైదరాబాద్: నీలోఫర్ ఘటన మరవకముందే గాంధీలో మరో దారుణం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణీలు మృతి చెందారు. సర్జరీ సమయంలో ఎక్కువ రక్తస్రావం కావడంతో జాబినా బేగం, లక్ష్మి అనే గర్భిణీలు మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా వైద్యులు గోప్యంగా ఉంచారు.

16:26 - February 21, 2017

హైదరాబాద్: టీజేఏసీ ర్యాలికి కోర్టు అనుమతి నాగోలు వద్ద మెట్రో రైల్వే గ్రౌండ్ లో ర్యాలీ నిర్వహించుకోవాలని కోర్టు సూచించింది. రేపు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు అనుమతి ఇచ్చింది. సుదీర్ఘమైన వాదోపవాదాలు జరిగాయి. పిటిషనర్ అడ్వకేట్ కేవలం ఉస్మానియా, ఎల్బీస్టేడియం, నిజాం కాలేజీ గ్రౌండ్ లో ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరాం. కానీ నాగోల్ లో రైల్వే గ్రౌండ్ లో జరుపుకోవాలని సూచించింది. గవర్నమెంట్ దేనికోసం భయపడుతుంది. ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తోంది. గతంలో జరిగిన ఉద్యమాలన్నీ సిటీ సెంటర్లో జరిగాయి. ఇప్పుడు ఎందుకు అనుమతించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. మరో వైపు పిటిషన్ ను వెనక్కు తీసుకున్నారు. ర్యాలీ అంశంపై స్టీరింగ్ కమిటీలో నిర్ణయం తీసుకుని ఈ సాయంత్రానికి వెల్లడిస్తామని స్పష్టం చేశారు. మరో వైపు మొదట నిర్ణయించుకున్న చోట నుండే ర్యాలీ నిర్వహించాలని టి.జేఏసీ పై నిరుద్యోగులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

గాంధీలో ఇద్దరు గర్భిణీలు మృతి

హైదరాబాద్: నీలోఫర్ ఘటన మరవకముందే గాంధీలో మరో దారుణం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణీలు మృతి చెందారు. సర్జరీ సమయంలో ఎక్కువ రక్తస్రావం కావడంతో జాబినా బేగం, లక్ష్మి అనే గర్భిణీలు మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా వైద్యులు గోప్యంగా ఉంచారు.

టీజేఏసీ ర్యాలీకి కోర్టు అనుమతి

హైదరాబాద్: టీజేఏసీ ర్యాలికి కోర్టు అనుమతి నాగోలు వద్ద మెట్రో రైలు గ్రౌండ్ లో ర్యాలీ నిర్వహించుకోవాలని కోర్టు సూచించింది.

వెయ్యి నోట్ల ముద్రణ ప్రారంభించిన ఆర్బీఐ

ఢిల్లీ: త‌్వ‌ర‌లోనే రద్ద‌యిన వెయ్యి నోట్ల స్థానంలో కొత్త‌వి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వీటిని ప్ర‌వేశ‌పెట్ట‌డంపై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్ర‌భుత్వం తుది ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించిన‌ట్లు ఓ ప్ర‌భుత్వ అధికారి వెల్ల‌డించార‌ని ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ప‌త్రిక తెలిపింది. అయితే వీటిని ఎప్పుడు మార్కెట్‌లోకి తెస్తారో తెలియ‌దుగానీ.. ఆర్బీఐ మాత్రం కొత్త వెయ్యి నోట్ల‌ను ముద్రించ‌డం ప్రారంభించింది. నిజానికి గ‌త జ‌న‌వ‌రిలోనే కొత్త వెయ్యి నోట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని భావించినా..

ఎమ్మెల్యే రోజాపై మంత్రి పీతల ఫైర్

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు తలదించుకునేలా ఆమె వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. సీఎంపై న్యాయ‌పోరాటం చేస్తామంటున్న రోజా అది ఎందుకో ప్రజలకు తెలపాలన్నారు. సొంత తమ్ముడిని కాదని ఆమెకు గ‌తంలో చంద్రగిరి సీటు ఇచ్చినందుకు చంద్రబాబుపై న్యాయపోరాటం చేస్తావా? అని రోజాను ప్రశ్నించారు. మహిళా ఐఏఎస్ లను జైలుకు పంపిన జగన్ పై న్యాయపోరాటం చేయాలని సూచించారు. జగన్, రోజాలకు ప్రజా సంక్షేమం కన్నా ప‌బ్లిసిటీపైనే మోజు అని వ్యాఖ్యానించారు.

బాలేపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కూబింగ్

కడప: రైల్వేకోడూరు మండలం బాలేపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ కూబింగ్ లో కోటి రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను తరలిస్తున్న లారీని సీజ్ చేయగా ముగ్గురు స్మగర్లను అరెస్ట్ చేశారు.

తిరుపతి బయలుదేరిన సీఎం కేసీఆర్ బృందం

హైదరాబాద్: బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతికి రెండు విమానాల్లో సీఎం కేసీఆర్ బృందం బయలుదేరింది. మొదటి విమానంలో స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, పద్మారావు, పోచారం తదితరులు,మరో ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లనున్నారు.

శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు భేటీ

అమరావతి: శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. 2 బడ్జెట్ లు పూర్తి చేసుకుని మూడో బడ్జెట్ ప్రవేశపెట్టామని, రెండేళ్లలో ఆదాయం పెంచుకోగలిగామని తెలిపారు. సమస్యలు అధిగమించాగలిగామని పేర్కొన్నారు. ప్రభుల్దవ ప్రయోజనాలన్నీ ఆధార్ తో అనుసంధానంతో పారదర్శకత వచ్చిందని, వర్షపాతం తక్కువగా ఉండడంతో రిజార్వాయర్లలో నీళ్లు లేవని పేర్కొన్నారు. విద్యుత్ కొరతను అధిగమించినట్లు తెలిపారు.

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం ల్యాండింగ్ లో ఫైలెట్ తప్పిదం వల్ల విమానం మరోసారి గాలిలోకి ఎగిరి తిరిగి ల్యాండయ్యింది. సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

ప‌ది కోట్ల‌కు చేరిన జియో యూజర్ల సంఖ్య: ముఖేష్ అంబానీ

హైదరాబాద్: త‌మ‌ జియో యూజ‌ర్ల‌ సంఖ్య ప‌ది కోట్ల‌కు చేరిన సంద‌ర్భంగా రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఈ విజ‌యం ప్ర‌తి వినియోగ‌దారుడి సొంతమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జియో వినియోగ‌దారుల‌కు మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు అందించ‌నున్న‌ట్లు తెలిపారు. వెల్‌క‌మ్ ఆఫ‌ర్ల‌లో ఉన్న సౌక‌ర్యాల‌న్నీ ఇక‌పై నెల‌కు రూ.303 రీఛార్జ్‌తో ఏడాది పాటు అందుకోవ‌చ్చని తెలిపారు. త‌మ వినియోగ‌దారుల‌కు 24 గంట‌లూ అత్యుత్త‌మ సేవ‌ల‌ను అందించ‌డమే త‌మ‌ ల‌క్ష్యమ‌ని చెప్పారు.

డీజీపీ అనురాగ్ శర్మ పదవీకాలం పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరిలో ముగియనుండంతో ఆయన పదవీకాలాన్ని నవంబర్ వరకు పొడగించారు.

మంత్రి యనమలతో ఉద్యోగసంఘాల జేఏసీ భేటీ

అమరావతి : మంత్రి యనమలతో అశోక్ బాబు నేతృత్వంలోని ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీ అయ్యింది. గత ఏడాదిలో ఇచ్చిన డిమాండ్స్ పై చర్చించినట్లు అశోక్ బాబు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలపై పెంపుపై 2నెల 28న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందుని స్పష్టం చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దుపై సీఎంను కలవమని మంత్రులు సూచించారని తెలిపారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని కోరారు.

రోజా పిటిషన్ పై విచారణ వాయిదా

కృష్ణా : గన్నవరం అదనపు జూనియర్ సివిల్ కోర్టులో ఎమ్మెల్యే రోజా పిటిషన్ పై విచారణ జరిగింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 3కి వాయిదా వేసినట్లు ప్రకటించారు.

పోలీస్ కమిషనర్ కార్యాలయానికి జాక్ నేతలు

హైదరాబాద్ : పోలీస్ కమిషనర్ కార్యాలయానికి జాక్ ప్రతినిధుల బృందం సంధ్య, వెంకట్ రెడ్డి, రఘు చేరుకున్నారు. ఓయూ లో ర్యాలీకి అనుమతి ఇవ్వాలని జాక్ నేతలు కోరనున్నారు.

'తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమిద్దాం'

హైదరాబాద్: కోదండరాం నివాసంలో జేఏసీ స్టీరింగ్ కమిటి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ జేఏసీ నేతలు భారీగా చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ నిర్వహించాలని జేఏసీ పై వారు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఓయూ కేంద్రంగా తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమిద్దామని సూచించినట్లు తెలుస్తోంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జేడీ అరెస్ట్

ఢిల్లీ:ఒక అవినీతి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ జేపీ సింగ్‌తోపాటు మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసింది. వీరిలో సంజయ్‌కుమార్‌ అనే అధికారి కూడా ఉన్నట్లు సమాచారం.

14:41 - February 21, 2017

హైదరాబాద్: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. చార్‌సద్దా కోర్టు ఆవరణలో ముగ్గురు ఉగ్రవాదులు ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులతో సహా మరో నలుగురు మృతి చెందారు. వరుస బాంబు పేలుళ్లతో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కోర్టు ఆవరణలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు.

14:39 - February 21, 2017

అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. పశ్చిమలో తోడి తూర్పు గోదావరి జిల్లా సరిహద్దులను దాటించేస్తున్నారు. రాజకీయ నాయకుల అండ, ఇసుక మాఫియా మామూళ్లతో రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు నిద్ర మత్తులో జోగుతున్నారు. దీంతో కోట్లు విలువైన ఇసుక జిల్లా సరిహద్దులు దాటేస్తోంది. అక్రమ ఇసుక దందాపై పూర్తి వివరాల కోసం ఈ వీడియో ను క్లిక్ చేయండి...

14:37 - February 21, 2017

హైదరాబాద్: మహరాష్ట్రలో దొంగ ఓట్లు వేసేందుకు మాయగాళ్లు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. నకిలీ వేళ్లను తయారు చేసి వాటితో ఒకటికి రెండు సార్లు ఓటు వేసేందుకు ప్లాన్‌ వేశారు. నిజమైన వేళ్లను పోలి ఉన్న ప్లాస్టిక్‌ వేళ్లతో దొంగ ఓట్లు వేసేందుకు స్కెచ్‌ వేశారు. నాసిక్‌లో పోలీసులు తనిఖీల్లో నకిలీ వేళ్లు బయటపడ్డాయి. నకిలీ వేళ్ల తయారీ ముఠాను పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

13:34 - February 21, 2017
13:33 - February 21, 2017

హైదరాబాద్ : ‘బుద్ధం శరణం గచ్చామి' సినిమా విడుదల చేయాలని చేపడుతున్న ఆందోళన తీవ్రతరమవుతోంది. ఈ చిత్రం పూర్తయి రోజులు గడుస్తున్నాయి. కానీ కేంద్ర సెన్సార్ బోర్డు మాత్రం అనుమతినివ్వలేదు. దీనితో చిత్రం విడుదల కావడం లేదు. దీనితో వివిధ సంఘాల నేతలు సెన్సార్ బోర్డు తీరును గర్హిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పలు సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఉందని సెన్సార్ బోర్డు పేర్కొంది. కానీ ఒక వర్గం వారి వత్తిడి మేరకు సెన్సార్ బోర్డు ఇలా చేస్తోందని, దీనిపై ఇతర నిబంధనలు పెట్టే అవకాశం ఉన్నా చిత్రాన్ని మొత్తాన్ని నిషేధించడం సబబు కాదన్నారు. తాజాగా దళిత, గిరిజన సంఘాల నేతలు కవాడిగూడలో ఉన్న కేంద్ర సెన్సార్ బోర్డు కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్..అద్దాలను ధ్వంసం చేశారు. బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న 30 మంది విద్యార్థులను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. ఓయూ దళిత, గిరిజన విద్యార్థి సంఘాలు పాల్గొన్నట్లు సమాచారం.

13:32 - February 21, 2017

ఖమ్మం : ఎంబీసీల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సంతోషకరమైన విషయమని ఎంబీసీ నేతలు అన్నారు. తెలంగాణలో సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 128వ రోజుకు చేరింది. ఖమ్మం జిల్లాలో అడుగుడుగున పాదయాత్ర బృందానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చెన్నారం, గోదులబండ, ముండ్రాజుపల్లి, రాజేశ్వరపురం, ముఠాపురం, మల్లేపల్లి, గట్టుసింగారం, గంగబండతండా, కూసుమంచి, పాలేరులో పాదయాత్ర కొనసాగుతోంది. బీసీ వర్గీకరణ చేయాలని ఎంబీసీ నేత ఆశయ్య టెన్ టివికి తెలిపారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:31 - February 21, 2017

విశాఖపట్టణం : జిల్లా గంజాయి అక్రమ రవాణాకు కేంద్రమైందా ? కొత్త కొత్త దారులు ఎంచుకుంటూ గంజాయిని తరలిస్తున్నారా ? ఇందుకు అవును అనే సమాధానం వస్తోంది. బుధవారం విశాఖ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్, జిల్లా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పాడేరు మండలం చింతలవీధి వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆయిల్ ట్యాంకర్ లో అరలు ఏర్పాటు చేసిన గంజాయిని తరలిస్తున్నారు. పోలీసులకు అనుమానం రావడంతో తనిఖీలు నిర్వహించారు. ట్యాంకర్ లోపల ఏర్పాటు చేసిన అరల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 1800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ లో రూ. 2 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

13:29 - February 21, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ ర్యాలీ జరుగుతుందా ? కోర్టు సూచనలతో ర్యాలీని వాయిదా వేస్తారా ? అనే ఉత్కంఠ నెలకొంటోంది. నిరుద్యోగ ర్యాలీకి పోలీసులు అనుమతినివ్వకపోవడంతో ప్రొ. కోదండరాం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు జరిగాయి. జేఏసీపై 31 కేసులున్నాయని, శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు సూచించారు. శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లదని, నిజాం కాలేజీలో నిర్వహించే సభ ద్వారా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాదని ప్రొ.కోదండరాం తరపు న్యాయవాది వాదించారు. చివరకు ఈ తీర్పును మధ్యాహ్నం 12గంటకు వాయిదా వేసింది. దీనితో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో అనుమతినివ్వాలని జేఏసీ పట్టుబట్టడం..అక్కడ ట్రాఫిక్ సమస్యల తలెత్తుందని కోర్టు పేర్కొంది. చివరకు ఓయూలో సభ నిర్వహిస్తామని, ఇక్కడ నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగదని కోదండరాం తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇక్కడ సభ నిర్వహణ అనుమతి కోసం డీజీపీతో చర్చించాలని సూచించింది. అక్కడ సమస్య ఏర్పడితే కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇందుకు మధ్యాహ్నం మూడు గంటల సమయం గడువు విధించింది. దీనితో జేఏసీ స్టీరింగ్ కమిటీ అత్యవసరంగా భేటీ అయ్యింది. ర్యాలీ..అనుమతుల విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. మధ్యాహ్నం 3.30గంటలకు కోర్టు తుది తీర్పునివ్వనుంది.

విశాఖలో అక్రమ గంజాయి పట్టివేత..

విశాఖ పట్టణం : జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

సెన్సార్ బోర్డు కార్యాలయంపై దాడి..

హైదరాబాద్ : కవాడీ గూడలో ఉన్న సెన్సార్ బోర్డుపై దాడి జరిగింది. శరణం గచ్చామి విడుదల చేయాలంటూ పలు సంఘాలు కార్యాలయంపై దాడి చేశారు.

ఓయూలో సభ..కోర్టు సూచనలు..

హైదరాబాద్ : నిరుద్యోగ జేఏసీ ర్యాలీకి అనుమతి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆదివారం సభ నిర్వహించుకోలేమని జేఏసీ హైకోర్టుకు తెలిపింది. రేపు ఓయూలో సభ నిర్వాహణకు అనుమతినివ్వాలని జేఏసీ కోరింది. ఓయూలో అనుమతి కోసం తాజాగా పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని జేఏసీకి సూచించింది. తాజా దరఖాస్తుపై మధ్యాహ్నం 3గంటల్లోపు నిర్ణయం తీసుకోవాలని పోలీసులకు కోర్టు సూచించింది. తదుపరి విచారణ మధ్యాహ్నం 3.30కి వాయిదా వేసింది.

12:58 - February 21, 2017

ఈ మధ్యకాలంలో విద్యార్థినుల ఆత్మహత్యలు అధికమౌతున్నాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు మానసిక వత్తిడి..మరోవైపు ఆకతాయిలు వేధింపులు..కారణమైదైనా అంతిమంగా బలైపోతోంది ఆడపిల్లలే. అసలు ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్న కారణాలేంటీ ? ఇందులో విద్యా సంస్థలు..ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ? విద్యార్థినుల ఆత్మహత్యలు ఆగాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటీ ? ఈ అంశంపై మానవి 'వేదిక' ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రా మహిళా సభ కాలేజీ రిటైర్డ్ ప్రిన్స్ పల్ డా.దుర్గ, సైకాలజిస్టు శైలజలు పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:56 - February 21, 2017

చెన్నై : సంచలనం సృష్టించిన మళయాళ నటి భావన కిడ్నాప్, లైంగిక దాడి ఆరోపణల కేసు ఇంకా వీడక ముందే మరో తమిళ నటి తనపై లైంగిక దాడి జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి.. తనపై ఓ టీవి చానల్‌ ప్రొగ్రాం హెడ్‌ అసభ్య వ్యాఖ్యలు చేశారని ట్విట్టర్ వేదికగా చెప్పారు. రెండు రోజుల క్రితం నటి భావనపై జరిగిన లైంగిక దాడి చిత్రపరిశ్రమలో చర్చకు దారితీసింది. తాజాగా తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి తనపై జరిగిన వేధింపుల గురించి ట్విట్టర్‌లో వెల్లడించింది. అసలు ఈ సమాజంలో ఏం జరుగుతోంది..? మహిళల భద్రత అనేది జోక్‌గా మారిందని తమిళ నటుడు శరత్‌ కుమార్‌ కూతురు వరలక్ష్మి విరుచుకుపడ్డారు. లైంగిక దాడులకు పాల్పడే వారిని ఉరి తీయాలన్నారు. మళయాళ నటికి మద్దతు పలుకుతున్నానన్న ఆమె.. తనకు ఎదురైన అనుభవాన్ని కూడా ట్వీట్ చేశారు.

టీవీ చానెల్ ప్రోగ్రాం హెడ్..
ఒక ప్రముఖ టీవి చానల్‌ ప్రొగ్రాం హెడ్‌ తనతో అసభ్య వ్యాఖ్యలు చేశారని వరలక్ష్మి చెప్పారు. తాను ఓ సమావేశంలో ఉండగా ప్రొగ్రాం హెడ్‌ బయట కలుద్దామని అడిగాడని వివరించింది. ఏదైనా పని కోసమా అని అడగ్గా కాదు ఇతర విషయాల కోసమని అసభ్య వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీకి తాను శరీరాన్ని అమ్ముకోడానికి రాలేదని తనకు నటన అంటే ఇష్టమని వరలక్ష్మి వెల్లడించారు. పురుషులు మహిళలను అగౌరవపరచడం మానుకోవాలని ట్విట్టర్‌ వేదికగా వరలక్ష్మి వార్నింగ్‌ ఇచ్చారు. తాను ఒక నటినని, వెండితెర మీద గ్లామరస్‌గా కనిపించినంత మాత్రాన తన గురించి ఎలా పడితే అలా మాట్లాడతానంటే కుదరదని వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చిన్న విషయమని, ఏమీ జరగలేదని అనుకునేవాళ్లు కూడా ఉంటారని, అయితే ఇది టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ మాత్రమేనని తెలిపారు.

మౌనాన్ని వీడాలి..
మహిళల భద్రత అనేది కేవలం ఒక కలగా మిగిలిపోయిందని, మన సమాజం నుంచి 'రేప్' అనే పదం ఎప్పటికీ తొలగిపోదా అని వరలక్ష్మి ప్రశ్నించారు. తాను మౌనంగా ఊరుకునేది లేదని, తన స్నేహితులు, చెల్లెళ్లు కూడా మౌనాన్ని వీడాలని తెలిపారు. వాళ్లు ఒంటరి కారని.. తాను అండగా ఉంటానని వరలక్ష్మి స్పష్టం చేశారు.

12:53 - February 21, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరాలైన విజయవాడ, గుంటూరు ప్రాంతాల రహదారులకు మహర్దశ పట్టనుంది. విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు 11 జిల్లాల నుంచి తక్కువ వ్యవధిలో రోడ్డుమార్గం ద్వారా త్వరితగతిన గమ్యస్థానాలు చేరేలా ఏపీ ప్రభుత్వం రహదారులను విస్తరించనుంది. అందులో భాగంగానే అత్యంత ఆధునిక రీతిలో రాయలసీమ నుంచి అమరావతికి హైవేను నిర్మించాలని నిర్ణయించింది. దీంతో రాయలసీమ ప్రజలు తక్కువ సమయంలో అమరావతి చేరుకునే వీలుకలుగుతుంది.

కడప..అనంతపురం..కర్నూలు..
ఏపీలో అత్యంత వేగంగా ప్రయాణించడానికి రోడ్డు మార్గాలను విస్తరించే పనిలో పడింది ప్రభుత్వం. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల వాసులు అమరావతికి చేరుకోవడానికి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను ప్రభుత్వం నిర్మించనుంది. ఆరు, నాలుగు లేన్ల ఈ రహదారిని 598 కిలోమీటర్లు నిర్మిస్తారు. ప్రస్తుతం అనంతపురం నుంచి అమరావతి వెళ్లాలంటే 472 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కర్నూలు నుంచి 311, కడప నుంచి 371 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉంది. నూతన రహదారి ఏర్పాటుతో ఈ దూరం తగ్గనుంది. అనంతపురం నుంచి 101 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 28, కడప నుంచి 74 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఈ మార్గం ఏర్పాటుకు అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 26890 ఎకరాల భూమి, అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లోని 1,518.75 హెక్టార్ల అటవీ భూమిని ప్రభుత్వం సేకరించనుంది.

భూసేకరణకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం..
గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరుతో చేపట్టే రహదారితో రాజధాని నుంచి నాలుగైదు గంటల్లో సీమ జిల్లాలకు చేరే అవకాశముంది. కడప, కర్నూలు నుంచి వచ్చే రహదారుల అనుసంధానం అయ్యాక.. ప్రకాశం జిల్లా నుంచి ఆరు వరుసలుగా రహదారిని నిర్మిస్తారు. 29,557 కోట్లతో అత్యాధునిక రీతిలో ఆరు. నాలుగు లేన్లుగా ఈ రహదారిని నిర్మించనున్నారు. రెండు మూడేళ్లలో ఈ మార్గాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే భూ సేకరణకు చర్యలు చేపట్టారు. ఈ మార్గం గనుక పూర్తయితే రాజధాని అమరావతి నుంచి తక్కువ సమయంలో రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చేరుకోనే వీలుకలుగుతుంది.

రూ. 5434.40 కోట్లు ఖర్చు..
అనంతపురం జిల్లాలో 72.850 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు. ఇందుకోసం 1268 ఎకరాల భూమి, 86 హెక్టార్ల అటవీ భూమి అవసరం అవుతుంది. ఇందుకు 5434.40 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక కిలోమీటర్‌కు 42.06 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నట్టుగా లెక్కగట్టారు. ఈ రహదారిలో ఏడు ఆర్వోబీలను నిర్మించనున్నారు.

కడప జిల్లాలో 104 కిలోమీటర్ల రహదారి నిర్మాణం..
కర్నూలు జిల్లాలో 78.60 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణానికి 920.25 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. ఆరు వంతెనలు, ఒక ఆర్వోబీ, టన్నెళ్లను నిర్మించనున్నారు. ఈ జిల్లాలో రహదారి నిర్మాణానికి 7139.13 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనావేశారు. ఈ జిల్లాలో కిటోమీటర్‌ రహదారి నిర్మాణానికి 53.95 కోట్లు ఖర్చుగా అధికారులు అంచనా వేశారు. కడప జిల్లాలో 104 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనున్నారు. ఇందుకోసం 2,968 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టారు. 824.25 హెక్టార్ల భూమితోపాటు.. 108 హెక్టార్ల అటవీ భూములు సేకరించాల్సి ఉంది. దీంతో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని కడప, కర్నూలు, అనంతపురం జిల్లా వాసులు అతృతతో ఎదురుచూస్తున్నారు.

12:50 - February 21, 2017

హైదరాబాద్‌ : జేఎన్టీయూ. ఇదో పెద్ద యూనివర్శిటీ.. లోపల మాత్రం అంతా అయోమయం... గందరగోళం.. ఎంసెట్‌లో టాప్‌ ర్యాంకులొచ్చినా... ఇక్కడమాత్రం 35 మార్కులు రావడంలేదు.. పరీక్ష ఎంత బాగారాసినా పాస్‌ కావడమే గగనంగా మారింది. దీనికి కారణమేంటి? తెలుసుకోవాలంటే చదవండి.. హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో అడుగడుగునా నిర్లక్ష్యం తాండవిస్తోంది.. అధికారుల తప్పులతో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. పరీక్షల నిర్వహణ నుంచి సర్టిఫికెట్ల జారీవరకూ అన్ని ఎక్కడ చూసినా లోపాలే దర్శనమిస్తున్నాయి.. తాజాగా కొందరు ఉద్యోగులపై ఏసీబీ దాడులు యూనివర్శిటీ నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి.

అంతంత మాత్రంగా మార్కులు..
ఎంసెట్‌లో మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులకే జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో సీటు లభిస్తుంది. అంతటి టాలెంట్‌ ఉన్న విద్యార్థులకు యూనివర్శిటీలోకి వచ్చాక పాస్‌ మార్కులు కూడా రావడంలేదు. పరీక్ష ఎంత బాగారాసినా అత్తెసరు మార్కులే పడుతున్నాయి. దీనివెనక మరో కారణముందన్న వాదన వినిపిస్తోంది. గత ఏడాది బీటెక్‌ పైనల్ ఇయర్ పస్ట్ సెమిస్టర్‌ పరీక్షలకు దాదాపు 61 వేల మంది హాజరయ్యారు. ఇందులో కేవలం 24 వేల 5వందల మంది మాత్రమే పాసయ్యారు.. ఉత్తీర్ణత శాతం 40.46గా ఉంది.... ఇక బీటెక్ మూడో సంవత్సరం పస్ట్ సెమిస్టర్‌లో 35.89శాతం ఉత్తీర్ణత నమోదైంది.. ఎంసెట్‌లో టాప్‌ ర్యాంకులు సాధించిన వారూ ఫెయిల్‌ కావడం సందేహాలను పెంచుతోంది.. బాగా చదివేవారికి కనీసం పాస్‌ మార్కులు కూడా రాకపోవడంతో విద్యార్థుల్లో ఆగ్రహం పెంచింది. కావాలనే కొందరు విద్యార్థులను ఫెయిల్‌ చేస్తున్నారంటూ స్టుడెంట్స్ ఆందోళనకు దిగారు.

రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు..
ఇంటర్‌లో 960 మార్కులు సాధించిన విద్యార్థులు జేఎన్‌టీయూలోకి వచ్చాక మార్కుల్లో వెనకబడిపోతున్నారు.. పైగా బీటెక్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల్లో 80శాతం మార్కులువచ్చినవారూ థర్డ్ ఇయర్‌లో గట్టెక్కలేకపోతున్నారు.. అసలు కారణమేంటో తెలుసుకోవాలంటే రీవాల్యుయేషన్‌ ఒక్కటే మార్గంగా ఉంది.. ఆర్థికంగా భారం అయినా ఒక్కో పేపర్‌కు వెయ్యి రూపాయలు కట్టి రీవాల్యుయేషన్‌కు అప్లై చేసుకున్నారు.

అనుభవంలేని వారితో వాల్యుయేషన్‌..
ఒక్క గత ఏడాదేకాదు.. ప్రతిసారీ యూనివర్శిటీలో మార్కుల గారడీ విద్యార్థులకు అంతులేని వేదన మిగులుస్తోంది.. విద్యార్థులను సెమిస్టర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ చేయడం... ఆ తర్వాత రీవాల్యుయేషన్‌లో పాస్‌ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే పరీక్షాపత్రాల్ని అనుభవం లేని వారితో దిద్దించడం వల్లే ఇలా జరుగుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వాల్యుయేషన్‌లో నిర్లక్ష్యంగాఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బిటెక్ చేసిన ఎందరో విద్యార్ధులు సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేక రోడ్లపై తిరుగుతున్నారు.. ఇప్పుడు మార్కులు కూడా అంతంత మాత్రంగా వేస్తే తమ భవిష్యత్తేంటంటూ విద్యార్థులు రోడ్డెక్కారు.. అనుభవంలేని ఫ్యాకల్టీవల్ల నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర సెన్సార్ బోర్డు కార్యాలయం ధ్వంసం

 హైదరాబాద్ : కేంద్ర సెన్సార్ బోర్డు కార్యాలయం ధ్వంసం అయింది. ఓయూ విద్యార్థి విభాగం, యువజన ఐకాస, దళిత, గిరిజన సంఘాలు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి, గాంధీనగర్ పీఎస్ కు తరలించారు. 

నిరుద్యోగర్యాలీకి షరతులతో కూడిన అనుమతులు..?

హైదరాబాద్ : టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతులకు హైకోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది. ర్యాలీని రేపు కాకుండా ఆదివారం చేపట్టాలని హైకోర్టు సూచించింది. ర్యాలీకి అనుమతి ఇవ్వకపోతే పిటిషన్ ను వెనక్కి తీసుకునే యోచనలో జేఏసీ ఉంది. నిరుద్యోగ ర్యాలీపై ప్రొ.కోదండరామ్ నిర్ణయం ఉత్కంఠగా మారింది. 

12:09 - February 21, 2017

రామ్ గోపాల్ వర్మ టేకింగ్ తో ఆడియన్స్ దెయ్యాల సినిమాలు అంటే వణికిపోయే స్థితికి వెళ్లిపోయారు. ఆ భయం నుండి బయటకు తీసుకువచ్చిన సినిమా ప్రేమకథ చిత్రం. ప్రేమకథ చిత్రం తెలుగు లో ఒక ట్రెండ్ సెట్టర్ ఫిలిం అని చెప్పొచ్చు .భయపడాల్సిన దెయ్యాలతో కామెడీ చేయించి .దెయ్యాలాకి అంత సీన్ లేదు అని చెప్పిన ఈ సినిమాని ఆదర్శంగా  చేసుకొని దాదాపు అరడజను సినిమాలు హారర్ కామెడీలుగా వచ్చాయి .ఈ సినిమా లు చూసి  భయపడకుండా పిచ్చ పిచ్చగా  నవ్వుకొని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు .
నయనతార మెయిల్ లీడ్ లో మయూరి 
ఇలాంటి హర్రర్ కామెడీలకు కాలం చెల్లిపోయినట్టు కనిపిస్తుంది. స్క్రీన్ మీద దెయ్యం సినిమాలు చూసి చాలాకాలం అయిందని ఫీల్ అవుతున్న ఆడియన్స్ కి గత సంవత్సరం రిలీజ్ ఐన మయూరి సినిమా హారర్ టచ్ అంటే ఎలా ఉంటుందో మళ్ళీ చూపించింది. నయనతార మెయిల్ లీడ్ గ చేసిన మయూరి సినిమా తమిళ తెలుగు భాషల్లో రిలీజ్ ఐ మంచి టాక్ తో హిట్ అయింది. చూస్తున్న ప్రేక్షకుడిని  స్క్రీన్ ప్లే  తో కట్టి పడేసి థియేటర్ లో నిశ్శబ్దాన్ని నింపింది. బాక్స్ ఆఫీస్ లని కలెక్షన్లతో నింపింది మయూరి సినిమా.
పాత్రను పర్ఫెక్ట్ గ ప్రెజెంట్ చేసే నయనతార 
తనకు ఇచ్చిన పాత్రను పర్ఫెక్ట్ గ ప్రెజెంట్ చేసే నటి నయనతార తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక టైం లో టాప్ మోస్ట్ యాక్టర్స్ అందరితో నటించింది .ఆ తరువాత కొంత గాప్ తరువాత మళ్ళీ మయూరి సినిమాతో తెలుగు స్క్రీన్ ని టచ్ చేసిన నయన్ ఇప్పుడు కూడా హారర్ సినిమా తోనే మళ్ళీ రాబోతుంది. డి రామస్వామి డైరెక్షన్ లో వస్తున్న డోరా సినిమా ఇప్పుడు నయనతార ఫోకస్డ్ మూవీ గ తెలుస్తుంది .ఈ డోరా సినిమా ట్రైలర్ రీసెంట్ గ యూట్యూబ్  లో రెజీజ్ అయ్యి ఆడియన్స్ కి న్యూ హారర్ ఫీల్ ఇస్తుంది. 

 

12:08 - February 21, 2017

హైదరాబాద్ : బుధవారం జరిగే నిరుద్యోగ ర్యాలీపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాం నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. నిరుద్యోగ ర్యాలీ నిర్వహించాలని జేఏసీ తలపెట్టిన సంగతి తెలిసిందే. కానీ దీనికి పోలీసులు అనుమతినివ్వలేదు. దీనితో ప్రొఫెసర్ కోదండరాం హైకోర్టు మెట్లు ఎక్కారు. సోమవారం దీనిపై వాదనలు జరిగాయి. మంగళవారం దీనిపై తుది తీర్పు వెలువడాల్సి ఉంది. ఉదయం దీనిపై వాదనలు జరిగాయి. తీర్పు ఇవ్వలేదు కానీ కొన్ని వ్యాఖ్యలు చేసింది. షరతులతో కూడిన అనుమతులిస్తామని, ఆదివారం నిర్వహించాలని అనుకుంటే అనుమతినిస్తామని..పోలీసులు సూచించిన మైదానాల్లో నిర్వహించాలని కోర్టు సూచించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని, తాము సక్రమంగా ర్యాలీ..సభను నిర్వహిస్తామని కోదండరాం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.
కోర్టు చేసిన వ్యాఖ్యలతో జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశమయినట్లు తెలుస్తోంది. పిటిషన్ ను విత్ డ్రా చేసుకుని ఎస్వీకే నుండి ఇందిరా పార్కు వరకు ర్యాలీ నిర్వహించాలని జేఏసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

12:04 - February 21, 2017

సినిమాలు రెండు రకాలుగా డివైడ్ చేస్తే అవి ఒకటి కమర్షియల్ సినిమాలు, రెండు అవార్డు సినిమాలుగా మనకి దర్శనం ఇస్తాయి. కానీ అవార్డు వచ్చిన సినిమాలు కొన్ని కమర్షియల్ గా హిట్ ఐన సందర్భాలు ఉన్నాయ్. కధ బాగుంది ,కధనం కట్టిపడేసింది. నటీనటుల యాక్టింగ్ పీక్స్ లో ఉంది, ఇంకేం కావలి ఒక సగటు సినిమాని సగటు ప్రేక్షకుడి దగ్గరకు చేర్చడానికి. ఇలా తెలుగు ఆడియన్ కి రీచ్ ఐన సినిమాలు నేటివిటీ టచ్ ని తుడిచేసి హిందీ లో రీమేక్ అవుతున్నాయి. అలాంటి సినిమా ఒకటి హిందీ లో ఎంట్రీ కోసం రెడీ గ ఉంది. 
రెండు నంది అవార్డులు, రెండు ఫిలిం ఫేర్ అవార్డులు 
2010  లో రిలీజ్ ఐన ఒక తెలుగు సినిమా రెండు నంది అవార్డులను, రెండు ఫిలిం ఫేర్ అవార్డులను గెలుచుకుంది అదే దేవా కట్ట డైరెక్షన్ లో వచ్చిన ప్రస్థానం అనే సినిమా. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో స్టోరీ లో డెప్త్ మైంటైన్ చేస్తూ సాగిన ఈ సినిమా  శర్వానంద్ కెరీర్ ది బెస్ట్ ఫిలిం అనిపిచ్చుకుంటే, సాయికుమార్ నట ప్రస్థానంలో మైలు రాయిగా నిలిచింది. దేవాకట్టా మాటలు ఎమోషన్స్ కి సరిపడా ఉన్నాయ్. ఒక కుటుంబకథకు రాజకీయ నేపధ్యం కల్పించి తెరకెక్కించిన ఈ సినిమా క్రిటిస్ నుండి కూడా పాజిటివ్ రిపోర్ట్ తో వచ్చింది .
రీమేక్ లో సంజయ్ దత్  
తెలుగు ఆడియన్స్ కి నచ్చిన ఈ మూవీ ని హిందీ లో రీమేక్ చేయాలనీ ఎప్పటినుండో దేవాకట్టా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇంతకాలానికి తన ప్రయత్నాలు నెరవేరయని తెలుస్తుంది. తాజాగా ప్రస్థానం మూవీని సంజయ్ దత్ రీమేక్ చేయబోతున్నాడని సమాచారం. తెలుగులో ఈ చిత్రాన్ని చూసిన సంజయ్ దత్ బాగా ఇంప్రెస్స్ అయినట్టు, దేవా కట్ట కూడా రీమేక్ కు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అంతేగాక స్వయంగా ఆయనే ఈ మూవీ ని నిర్మిస్తారని అంటున్నారు. ప్రస్థానం తరువాత దేవకట్టకు సరైన హిట్ లేకపోవడం తో హిందీ లో ఈ సినిమా ని రీమేక్ చెయ్యాలని గట్టిగ ట్రై చేస్తున్నాడు.

 

11:56 - February 21, 2017

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో  హీరోయిన్ ఎవరైనా మార్కెట్ జరిగేది మాత్రం హీరో పేరు మీదనే. అడపాదడపా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చిన పెద్దగా రీచ్ ఐన సందర్భాలు చాల తక్కువ. తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ పాటలకి మాత్రమే పరిమితం అవుతున్నారనే భావన ఉండనే ఉంది. అలంటి టైంలో నెంబర్ వన్ పొజిషన్స్ అంటూ ఏమి వర్కౌట్ కావు. తన  కెరీర్ ని చిన్న సినిమాతో మొదలు పెట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు పెద్ద స్టార్ హీరోలందరితో జత కట్టి తెలుగు స్క్రీన్ ని సెట్ చేసుకుంది. అటు తమిళ్, హిందీ సినిమాల్లో కూడా బిజీ అయిపోతుంది ఈ ఢిల్లీ భామ.
కన్నడ సినిమాతో తెరపైకి రకుల్  
కన్నడ సినిమా తో తెరపైకి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తరువాత కాలం లో టాప్ లెవెల్ కి వెళ్ళిపోయింది .నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ జాగర్తగా అడుగులు వేస్తుంది.అటు నటనని ఇటు గ్లామర్ ని కావలసినంత వాడుతూ ఆడియన్స్ కి దగ్గరయింది రకుల్ ప్రీత్ .తన గ్లామర్ సీక్రెట్ ఫిట్నెస్ అంటూ హైదరాబాద్ లో జిమ్ కూడా పెట్టేసింది .మెగా ఫ్యామిలీ తో సర్రైనోడు, ధ్రువ ,బ్రూస్ లి సినిమాలో ఆక్ట్ చేసిన రకుల్ నెక్స్ట్ జెనెరేషన్ కిడ్ ధరమ్ తేజ్ తో విన్నెర్ సినిమా లో స్క్రీన్ పంచుకుంది .
సూర్య సరసన రకుల్ 
ఇలా వరసపెట్టి తెలుగు హీరోలతో యాక్ట్ చేసిన రకుల్ ప్రీత్ నెక్స్ట్ స్టెప్ తమిళ్ స్టార్ తో ప్లాన్ చేసుకుంది .ఆల్రెడీ హిందీ లో కొన్ని సినిమా లు చేసిన రకుల్, తమిళ్ ఇండస్ట్రీ లో కూడా సినిమాలు చేసి బెస్ట్ పెరఫార్మెర్ అనిపించుకుంది. అలాంటి రకుల్ నెక్స్ట్ సినిమా తమిళ్ లో యాక్షన్ హీరో అండ్ యముడు సీక్వెల్  సినిమాల హీరో సూర్య తో నటించబోతుంది. మంచి నటనతో అటు క్లాసు ఇటు మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన సూర్య తో నటించడమంటే మాస్ ఆడియన్స్ కి స్ట్రైట్ గ దగ్గరవ్వడమే.
సెల్వరాఘవన్ డైరెక్షన్ లో సూర్య సినిమా
సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ సూర్య హీరో ఓ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటి సినిమాలు తెరకెక్కించడంలో సెల్వరాఘవన్ స్పెషలిస్టు. సూర్యతోనూ ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని ప్లాన్ చేశాడు సెల్వ. ఈ చిత్రం కోసం హీరోయిన్ గా రకుల్ ని ఫైనల్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

 

11:52 - February 21, 2017

నిజామాబాద్ : మార్కెట్‌కు గత నెల రోజులుగా రైతులు పసుపు తీసుకొస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి పసుపు విక్రయించడానికి వచ్చిర రైతుకు మార్కెట్‌లో నిరాశే మిగులుతోంది. గతేడాది క్వింటాల్‌కు 10వేల నుంచి 11వేలు పలికిన పసుపు ఇప్పుడు కేవలం 8 వేల రూపాయలకు మించి ధర రావడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని ఉందన్నట్టుగా నిజామాబాద్‌ పసుపుకు మంచి మార్కెట్‌ ఉండి, నాణ్యతలో పేరున్నా మంచి ధరమాత్రం లేదు. నిజామాబాద్‌ మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి పసుపు రైతును నిలువుగా దోపిడీ చేస్తున్నారు. రకరకాల సాకులు చూపెడుతూ తక్కువ ధరకే పసుపును కొనుగోలు చేస్తున్నారు.

నిలువునా మోసం..
కాడిరకం పసుపుకు 5 వేల నుంచి 8 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇక గోళ రకం పసుపుకు 4500 నుంచి 7000, పాత పసుపుకు కాడిరకానికి 7 వేల నుంచి 7800 ధర పలుకుతోంది. గత ఏడాది 10వేల వరకు పలికిన పసుపు ఇప్పుడు 8వేలకు మించి ధర పలకడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని వాపోతున్నారు. పసుపుకు కేంద్రం మద్దతు ధర ప్రకటించకపోవడంతో వ్యాపారులు తమకు ఇష్టమొచ్చిన రేటుకు కొనుగోలు చేస్తుండడంతో అన్నదాతలు నిలువునా మోసపోతున్నారు. కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు కలిసి పసుపు రైతును దగా చేస్తున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లి మార్కెట్‌లో పసుపుకు 8 వేల నుంచి 11 వేల ధర పలుకుతుండగా... ఇక్కడ వ్యాపారులు 8వేలకు మించి కొనుగోలు చేయడం లేదు.

మార్కెట్ యార్డును సందర్శించిన జేఏసీ నేతలు..
పసుపు రైతుకు జరుగుతున్న అన్యాయంపై జేఏసీ నేతలు మార్కెట్‌ యార్డును సందర్శించారు. క్వింటాలుకు 10వేల మద్దతు ధర కల్పించాలని మార్కెట్‌ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో జరుగుతున్న దళారుల దందాపై టీడీపీ, సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌ యార్డును సందర్శించి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్నారు. పసుపుకు గిట్టుబాటు ధర కల్పించడకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించకుంటే పసుపు రైతుకు అండగా పోరాడుతామని హెచ్చరించారు. పసుపుకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

11:48 - February 21, 2017

హైదరాబాద్ : ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌కు త్వరలోనే ముగింపు పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఆ దిశగా మొగ్గు చూపుతున్నాయి. ఇకపై ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు ఒకే పరీక్ష విధానం అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించాయి. 2017-18లో నిర్వహించేదే చివరి ఎంసెట్‌ అయ్యే ఛాన్స్‌ కన్పిస్తోంది. 2018-2019 విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్‌ను ఎత్తివేయాలని తెలుగు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే వచ్చే 2017-18 విద్యా సంవత్సరంలో నిర్వహించే పరీక్షే చివరి ఎంసెట్ కానుంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్షను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడంతో తెలుగు రాష్ట్రాలు ఆ దిశగా అడుగులేస్తున్నాయి. 2017-18 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నీట్ నిర్వహణకు 2016 లోనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇదే తరహాలో ఇంజనీరింగ్ 2018-19 నుంచే ఒకే పరీక్షను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించగా, స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి ఎంసెట్ రద్దు చేయాలంటే రెండేళ్ల ముందుగానే ప్రకటించాలనే నిబంధన ఉందని అధికారులు చెబుతున్నారు.

నీట్ తరహాలో..
కొన్ని రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌కు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంటే, ఇతర రాష్ట్రాలు మాత్రం ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించని రాష్ట్రాల్లోని విద్యార్థులను ఏ విధంగా సిద్ధం చేస్తారనేది ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఎంసెట్‌కు ఇంటర్ మార్కుల్లో 25 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. ఈ వెయిటేజీ జాతీయ అర్హత పరీక్షలో ఉంటుంటా..? అదే విధంగా ఒకే అర్హత పరీక్షను నిర్వహించిన అనంతరం జాతీయ, రాష్ట్రస్థాయిలో ఒకే ర్యాంక్‌ను ప్రకటిస్తారా.. వేర్వేరుగా ఇస్తారా..? అనే అంశాలపై స్పష్టత లేదు. మరోవైపు ఇంజనీరింగ్ కోసం నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష దాదాపుగా నీట్ తరహాలోనే నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది.

జాతీయ స్థాయి పరీక్షను ఎదుర్కొంటారా ?
నీట్ ప్రకారం పరీక్షలో ఉత్తీర్ణులు కానివారికి ఎలాంటి ర్యాంకులు ఇవ్వరు. డీమ్డ్ వర్సిటీల్లో ప్రవేశాలు కూడా నీట్ ర్యాంకుల ఆధారంగానే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఏం చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ కు జాతీయస్థాయిలో ఒకే పరీక్ష నిర్వహిస్తే ఐఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈని కూడా రద్దు చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ప్రస్తుతం జేఈఈకి సిద్ధమవుతున్న వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. రాష్ట్రస్థాయిలో మాత్రం సాధారణంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ఇంజనీరింగ్ సీటు కోసం ప్రయత్నించే విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షను ఎలా ఎదుర్కొంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఏపీ బడ్జెట్ కసరత్తుపై సీఎం చంద్రబాబు సమీక్ష

గుంటూరు : 2017...18 ఏపీ బడ్జెట్ కసరత్తుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక శాఖ అధికారులు హాజరయ్యారు.

కన్నకూతురిపై తండ్రి హత్యాయత్నం

నెల్లూరు : జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కూతురిని కడ తేర్చేందుకు యత్నించాడు. కులాంతర వివాహం చేసుకుందని కూతురిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నరసింహకొండ దొడ్లడెయిరీ సమీపంలో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు ఆమెను కాపాడారు. 

11:43 - February 21, 2017

విశాఖపట్టణం : ఏయూలో ద్రవ్యాల వినియోగంపై స్పందించిన రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు యూనివర్సిటీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. వర్సిటీలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు దారి తప్పడానికి వర్సిటీ అధికారులు, సిబ్బంది తప్పిదం కూడా ఉందని మంత్రి అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు మాదక ద్రవ్యాలను సేవించి వసతి గృహంలో వీరంగం సృష్టించిన ఘటనపై స్పందించారు. వసతి గృహాల వద్ద భద్రతా గురించి మత్రి ఆరా తీశారు. అనంతరం ఇంజినీరింగ్‌ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. తాజా ఘటనకు బాధ్యులైన విద్యార్థుల గదుల్ని మంత్రి పరిశీలించారు.

గదుల్లో తనిఖీలు..
యూనివర్సిటీ వసతి గృహాల్లోని గదులను పరిశీలించిన మంత్రి.. వర్సిటీ సెక్యూరిటీ చీఫ్‌తోనూ మాట్లాడారు. గుర్తింపు కార్డులు లేకుండా బయటి విద్యార్థులను ఎలా లోనికి అనుమతిస్తారని ఈ సందర్భంగా మంత్రి గంటా ప్రశ్నించారు. హాస్టళ్లలోని కొన్ని గదులు గబ్బిలాలు తిరిగేలా ఉన్నాయని, మరికొన్ని గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటి వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. చీఫ్‌ వార్డెన్లతో పాటు అధికారులు తరచూ తనిఖీలు చేసి పరిస్థితులను మెరుగు పరచాలని మంత్రి సూచించారు. మద్యం, ధూమపానం అలవాటున్న కొంతమంది విద్యార్థులు చివరి ఏడాదికొచ్చే సరికి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని కొంతమంది మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

మంత్రి ఆవేదన..
వర్సిటీలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహాల్లోకి వచ్చి వెళ్లే విద్యార్థల వివరాలను సేకరించకపోవడం దురదృష్టకరమని, ఏయూలోని ఇంజినీరింగ్‌ హాస్టల్స్‌పై వర్సిటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. పూర్వ విద్యార్థుల రాకపోకలను కూడా అడ్డుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఉన్నత చదువులకు నెలవైన వర్సిటీలో మాదక ద్రవ్యాల వినియోగం వంటి అనైతిక చర్యలకు పాల్పడటం దారుణమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వర్సిటీ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని విద్యారంగం నిపుణులు కోరుతున్నారు.

11:40 - February 21, 2017

విశాఖపట్టణం : చక్కగా చదువుకుని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారు. విలువలను కాపాడాల్సిన విశ్వవిద్యాలయంలోనే చెడు కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వయస్సులో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రతిష్టాత్మక ఆంధ్రయూనివర్సిటీలో తాజాగా చోటు చేసుకున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాము విద్యార్థులమన్న విషయాన్నే పక్కన పెట్టి యూనివర్సిటీలో చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు సేవించి లేడీస్‌ హాస్టల్‌లోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఏయూలోని కొందరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గంజాయి సేవించి హాస్టల్‌లోని చొరబడటం, అక్కడ అసభ్యంగా ప్రవర్తించడం విద్యార్థులు, అధ్యాపకులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది.

ఇంజనీరింగ్ విద్యార్థులు..
కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్న కొందరు విద్యార్థులు ఇటీవల గంజాయి సేవనానికి అలవాటు పడ్డారు. శుక్రవారం రాత్రి పూటుగా గంజాయి సేవించిన నలుగురు విద్యార్థులు మత్తులో జోగుతూ ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. లేడీస్‌ హాస్టల్‌ గార్డు అడ్డుకున్న ఆగకుండా లోనికి దూసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు. ఒంటిపైన బట్టలు తీసేసి మరీ హంగామా సృష్టించారు. గంజాయి మత్తులో లేడీస్‌ హాస్టల్‌లోనే నానా హంగామా సృష్టించిన విద్యార్థులను ఎట్టకేలకు సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపించడంతో విద్యార్థినులు ఊపిరి పీల్చుకున్నారు.

అనైతిక కార్యకలాపాలు..
కొంతకాలంగా విశ్వవిద్యాలయంలో అనైతిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. హాస్టల్‌ గదుల్లో మద్యం సేవించడం, బయటి వ్యక్తులు యూనివర్సిటీలోకి వచ్చి గంజాయి వంటి మత్తు పదార్థాలను వినియోగిస్తున్నా హాస్టల్‌ వార్డెన్‌లు, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరస్తున్నారన్న విమర్శలున్నాయి. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో రాత్రిపూట బయట వ్యక్తులు మద్యం సేవిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కొందరు విద్యార్థులు గంజాయి మత్తులో జోగుతూ లేడీస్‌ హాస్టల్‌లో చొరబడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

అధ్యాపకుల్లో ఆందోళన..
కొంత కాలంగా ఏయూలో విద్యార్థులు గంజాయి సేవనానికి అలవాటు పడటం విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. లేడీస్‌ హాస్టల్‌లోకి చొరబడ్డ నలుగురు విద్యార్థులు కెమికల్ ఇంజినీరింగ్‌ మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు అధికారులు గుర్తించారు. తాజా ఘటనతో ఉలిక్కిపడ్డ వర్సిటీ అధికారులు సంబంధిత నలుగురు విద్యార్థులను సస్పెండ్‌ చేశారు. వర్సిటీలో పరిస్థితులు కూడా విద్యార్థులు తప్పు దారి పట్టేలా ఉన్నాయని స్వయంగా మంత్రి అంగీకరించారు. కోర్సులు పూర్తయినా కొందరు విద్యార్థులు హాస్టళ్లలో ఉండటం, పూర్వ విద్యార్థులు తరచూ వర్సిటీలోకి రాకపోకలు సాగించడం విద్యార్థులు పక్కదారి పట్టడానికి కారణమన్న వాదనలూ ఉన్నాయి. వీటితో పాటు వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

11:35 - February 21, 2017

విజయవాడ : చలో అమరావతి అంటున్నారు ఏపీ అసెంబ్లీ ఉద్యోగులు.. ఈ నెల 25లోగా రాజధానికి రావాలన్న సర్క్యులర్‌తో ఏపీ బాటపట్టారు.. వచ్చే నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. పరిపాలనలో ఏపీ సర్కార్‌ మరో కీలకమైన ముందడుగు వేయబోతోంది. మార్చి మొదటివారంలో అమరావతి నుంచి అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించబోతోంది. ఈ సమావేశాలకు ముందే అసెంబ్లీ సిబ్బంది అమరావతికి రావాలంటూ శాసనసభ కార్యదర్శి సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ నెల 25నాటికి అడ్మినిస్ట్రేషన్‌ మొత్తం రాజధాని నుంచి సాగాలని అందులో తెలిపారు.

నిబంధనల ప్రకారం..
హైదరాబాద్‌లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు గత ఏడాది సెప్టెంబర్‌ మొదటివారంలో జరిగాయి. నిబంధనల ప్రకారం ఈ ఏడాది మార్చిలోపు ఏపీ అసెంబ్లీ మరోసారి సమావేశం కావాల్సిఉంది. ఈ సమావేశాల్ని ఎలాగైనా సొంత రాష్ట్రంలోనే జరిపేలా సర్కారు పక్క ప్రణాళికతో వ్యవహరించింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం భవనాల పక్కనే ఆరో బ్లాక్‌ను అసెంబ్లీ భవనాలకోసం ఏర్పాటు చేసుకుంది. అనుకున్న సమయానికి నిర్మాణాలను పూర్తిచేసింది. అసెంబ్లీ తరలింపునకు అడ్డంకిగాఉన్న విభజన సమస్యలు వేగంగా పరిష్కారమయ్యేలా స్పీకర్‌ కోడెల ప్రత్యేక దృష్టిపెట్టారు.

మూడో వారం..
తెలంగాణ ప్రభుత్వంతో యుద్దప్రాతిపదికన చర్చలు జరిపి సమస్యను ఓ కొలిక్కితెచ్చారు.. దీంతో 120మంది సిబ్బంది తరలింపు అంశం పరిష్కారమైంది. విభజన ప్రక్రియ పూర్తవడంతో... ఈ నెల మూడోవారంలోగా అసెంబ్లీ సామాగ్రిని తరలించాలని మొదట స్పీకర్‌ కార్యాలయం నుంచి సర్క్యులర్‌ జారీ అయింది. అసెంబ్లీ నిర్మాణ పనులు కాస్త ఆలస్యంకావడంతో ఈ నెల 25వరకూ వాయిదాపడింది. మొత్తానికి భవన నిర్మాణం పూర్తికావడంతో ప్రస్తుతం అమరావతి బాటపట్టారు ఏపీ అసెంబ్లీ ఉద్యోగులు..

11:31 - February 21, 2017

సూపర్ రజనీ కాంత్ తో నటించాలని ఎంతో మంది నటీమణులు, హీరోలు సైతం ఆసక్తి చూపుతుంటారు. కనీసం ఒక్క షాట్ లోనైనా నటిస్తే బాగుంటుందని అనుకుంటుంటారు. 'రజనీ'తో ఏదైనా పాటలో ఒక స్టెప్ వేయాలని హీరోయిన్స్ యోచిస్తుంటారు. కొంతమంది మాత్రమే ఈ అవకాశం దక్కుతూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ లో వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ ముందుకు దూసుకెళుతున్న 'విద్యా బాలన్' కు ఈ అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ‘రజనీ' హీరోగా వచ్చిన 'కబాలి' చిత్రం అనంతరం తమిళంలో మరో చిత్రం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కబాలి' రూపొందించిన 'పా రంజిత్' దర్శకత్వంలో చిత్రం తెరకెక్కనుందని, ‘కబాలి'కి సీక్వెల్ మాత్రం కాదని సమాచారం. 'రజనీ' కి వ్యతిరేకంగా ఉండే పాత్రలో 'విద్యా' నటించనుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన డేట్స్ గురించి చిత్ర యూనిట్ 'విద్యా'తో చర్చించినట్లు సోషల్ మాధ్యమల్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 'విద్యాబాలన్' పలు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డేట్స్ కుదిరిన అనంతరం దీనిపై అధికారికంగా ఓ ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఇక 'రజనీకాంత్' ‘శంకర్' కాంబినేషన్ లో 'రోబో 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మాణం అవుతున్న ఈ చిత్రం వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ హీరో 'అక్షయ్ కుమార్' కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

డీఎంకే వేసిన పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

చెన్నై : డీఎంకే పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. మద్రాసు హైకోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. బలపరీక్షపై ప్రతిపక్ష పార్టీ డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. విపక్షం లేకుండానే బల పరీక్ష నిర్వహించారని డీఎంకే పిటిషన్ వేసింది. విశ్వాస పరీక్ష చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.

 

పెద్దిరెడ్డిని ర్యాలీకి మద్దతు కోరిని కోదండరాం

హైదరాబాద్ : రేపటి ర్యాలీకి పార్టీ మద్దతు కూడగట్టేందుకు కోదండరామ్ ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నేత పెద్దిరెడ్డిని కలిసి...రేపు జరిగే ర్యాలీకి మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పెద్దిరెడ్డి అన్నారు. కోదండరామ్ పిటిషన్ పై మరికాసేపట్లో హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. 

 

11:16 - February 21, 2017

చెన్నై : తమిళనాడు శాసనసభలో ఈనెల 18న నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రతిపక్షం డీఎంకే మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టులో నేడు విచారణ జరగాల్సి ఉంది. కానీ అనూహ్యంగా రేపటికి వాయిదా పడింది. ఇటీవల పళని సెల్వం విశ్వాస పరీక్ష సమయంలో అసెంబ్లీలో విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. ఓటింగ్ సమయంలో రెండుసార్లు సభను వాయిదా వేయడం..చివరికి ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయడం వంటి అంశాలను డీఎంకే కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రతిపక్షం లేకుండా విశ్వాస పరీక్ష నిర్వహించడం సబబు కాదని, దీనిపై సరియైన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అందులో భాగంగా న్యాయపోరాటం చేయాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా కోర్టును ఆశ్రయించారు. అంతేగాకుండా 23వ తేదీన రాష్ట్రపతిని స్టాలిన్ కలువనున్నట్లు తెలుస్తోంది. విశ్వాస పరీక్షపై కోర్టు ఎలా తీర్పునిస్తుందో చూడాలి.

 

గన్నవరం కోర్టులో ఎమ్మెల్యే రోజా పిటిషన్

విజయవాడ : గన్నవరం కోర్టులో ఎమ్మెల్యే రోజా పిటిషన్ వేశారు. మహిళా పార్లమెంట్ సదస్సుకు తనను ఆహ్వానించి విమానాశ్రయంలో అక్రమంగా నిర్బంధించారని..ఎమ్మెల్యే అని గౌరవం లేకుండా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు వేశారు.

 

11:11 - February 21, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ ర్యాలీ పై కోర్టు తీర్పుపై అంతటా ఉత్కంఠ నెలకొంది. నిరుద్యోగ ర్యాలీ నిర్వహించడానికి జేఏసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. బుధవారం నిర్వహించతలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతినివ్వలేదు. దీనితో ప్రొ.కోదండరాం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం వాదనలు పూర్తయ్యాయి. మంగళవారం దీనిపై కోర్టు తుదితీర్పునివ్వడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. షరతులతో కూడిన అనుమతినిస్తుందని ప్రచారం జరుగుతోంది.
షరతలుతో కూడిన అనుమతినిస్తామని, ఆదివారం నిర్వహిస్తే బాగుంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. కానీ దీనికి జేఏసీ అంగీకరించలేదు. సభకు సన్నాహాలు చేసుకోవడం జరిగిందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. సభకు 11 నుండి సాయంత్రం 3 గంటల వరకు అనుమతినివ్వాలని కోరారు. కానీ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందని కోర్టు పేర్కొంది. సమస్యలు రాకుండా చూసుకుంటామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణనను కోర్టు ఎదుట పెట్టాలని సూచించింది. దీనితో మధ్యాహ్నం వెలువడే తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

నిరుద్యోగర్యాలీకి అనుమతి పిటిషన్ పై మ.12 గం.లకు హైకోర్టు తీర్పు

హైదరాబాద్ : నిరుద్యోగ ర్యాలీకి అనుమతివ్వాలన్న పిటిషన్ పై మధ్యాహ్నం 12 గంటలకు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ప్రజలకు ఇబ్బందికలగకుండా ర్యాలీ ఎలా నిర్వహిస్తారో తెలపాలని పిటిషనర్ ను కోర్టు అడిగింది. 

 

10:42 - February 21, 2017

చెన్నై : తమిళనాడు శాసనసభలో ఈనెల 18న నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రతిపక్షం డీఎంకే నిన్న మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రతిపక్షం లేకుండా నిర్వహించిన విశ్వాస పరీక్ష చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌లో కోరింది. శాసనసభ నుంచి డీఎంకే సభ్యులను బలవంతంగా గెంటేసిన విషయాన్ని ప్రస్తావించింది. విశ్వాస పరీక్షలో రహస్య ఓటింగ్‌ పెట్టాలని కోరినా సభాపతి పట్టించుకోలేదని, మార్షల్స్‌ దాడి చేశారని వెల్లడించింది. ఈ కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

10:40 - February 21, 2017
10:38 - February 21, 2017

ప్రకాశం : జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని టీడీపీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరుతో అధినేత తల పట్టుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాలని పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే గొట్టిపాటి, కరణం బలరామ్‌ల మధ్య నెలకొన్న అధిపత్య పోరుతో ప్రజా సమస్యలు ఎక్కడికక్కడే తిష్టవేశాయి. పాలనలో పూర్తిగా స్తబ్దత నెలకొంది. ప్రకాశం జిల్లాలోని టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, కరణం బలరామ్‌ల మధ్య దశాబ్దాలుగా అంతర్గత పోరు నడుస్తోంది. ఈ ఇద్దర్నీ కలపాలన్న అధినేత ప్రయత్నాలు కూడా బెడిసికొడుతున్నాయి. ప్రకాశం జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. అద్దంకి నియోజకవర్గం అంటేనే పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు. ఈ మధ్య జరిగిన టీడీపీ పార్టీ కార్యక్రమాలను కూడా మొక్కుబడిగా నిర్వహించారు పార్టీ నేతలు. అద్దంకిలో జన చైతన్య యాత్ర, జన్మభూమి మాఊరు కార్యక్రమాలకు గొట్టిపాటి రవికుమార్‌గానీ, కరణం బలరామ్‌గానీ హాజరుకాలేదు.

పాలనలో నెలకొన్న స్తబ్దత..
అద్దంకి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండానే మొక్కుబడిగా సాగాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడే ప్రజా సమస్యలు తిష్టవేశాయి. ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, పింఛన్‌ సమస్యలు కొన్నాళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. అధికారిక, రాజకీయ కార్యక్రమాలు తాను చెప్పే వరకూ నిలుపుదల చేయాలంటూ అధినేత చంద్రబాబు చెప్పడంతో... అద్దంకి నియోజకవర్గంలోని పార్టీలోనూ, పాలనలోనూ పూర్తిగా స్తబ్దత నెలకొంది. ఇక రెండు వర్గాల నడుమ అధికార గణం దినదిన గండంగా గడపాల్సిన పరిస్థితి. కరవమంటే కప్పకు కోపం విడువమంటే పాముకు కోపమన్న విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల పరిస్థితి కనిపిస్తోంది. స్థానికంగా పార్టీ బాధ్యతలు అప్పజెప్పడంలోనూ చంద్రబాబు చేస్తున్న తాత్సారం అసలుకే ఎసరుతెచ్చేలా ఉంది. మొదటి నుంచి పార్టీలోనే ఉన్న కరణం బలరామ్‌కు ప్రాధ్యానత్య ఇవ్వాలా..? లేక వైసీపీ నుంచి వచ్చిన గొట్టిపాటి రవికుమార్‌ను ప్రోత్సహించాలా..? అనే విషయంలో చంద్రబాబు సందిగ్ధంలో పడ్డారు.

రెండు వర్గాల సయోధ్య..
జిల్లాలో బలరామ్‌ను కాదనుకునే పరిస్థితి రాకూడదని చంద్రబాబు భావించడమే నాన్చుడు ధోరణికి కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడానికి గతంలో పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వలేదు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా.. అద్దంకిలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి అధినేత తెరదించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు చొరవ తీసుకుని అద్దంకి నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ చిక్కుముడులు విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు.

10:36 - February 21, 2017

హైదరాబాద్ : చేపట్టిన ప్రాజెక్టులు వెక్కిరిస్తున్నాయి. పూర్తైన పనులకు చెల్లింపులు కష్టంగా మారాయి. ఉన్న నిధులు నిండుకోవడంతో రోజువారీ ఆఫీసు నిర్వహణకే కనాకష్టంగా మారింది. ఆదాయం పెంపుకోసం బల్దియా అధికారులు చేపట్టిన చర్యలు ఫలితాలనిస్తాయా..? కొత్త ప్రాజెక్టులు పట్టాలకెక్కుతాయా..? జీహెచ్‌ఎంసీ ఆర్థిక కష్టాలపై 10టీవీ స్పెషల్‌ ఫోకస్‌..! నిత్యం కాసులతో గళగళలాడే గ్రేటర్‌ హైదరాబాద్ కార్పొరేషన్‌ ఖజానా ఇప్పుడు ఖాళీ అయ్యింది. సిబ్బంది జీతాలు, ఆఫీసుల నిర్వహణ చాలా కష్టంగా మారింది. బల్దియా ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. గత ఆర్థిక సంవత్సరం వరకు 600 కోట్ల రూపాయలతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు బల్దియాకు ఉండేవి. దానిపై వడ్డీ రూపంలోనే వంద కోట్ల వరకు ఆదాయం వచ్చేది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం జీహెచ్‌ఎంసీకి ఇప్పటి వరకు 1939 కోట్ల ఆదాయం మాత్రమే రాగా ఖర్చుమాత్రం 2,330 కోట్లుగా ఉంది. అంటే... జీహెచ్‌ఎంసీ ఏకంగా 391 కోట్లు లోటు బడ్జెట్‌తో విలవిల్లాడుతోంది.

ఈసారి రూ.250 కోట్లు వచ్చినా గొప్పే..!
గ‌త ఆర్థిక సంవ‌త్సరం ఆస్తిప‌న్నుద్వారా బ‌ల్దియా ఖ‌జానాకు 582కోట్లు వ‌సూలు కాగా...., ఈ ఏడాది 825 కోట్లు వ‌సూలయ్యాయి. అంటే 243కోట్లు అద‌నం. ట్రెడ్ లైసెన్స్‌ల్లో గ‌తంతో పోలిస్తే 16కోట్లు ఎక్కువ‌గా వ‌సూలయ్యాయి. ఇక ఎల్ అర్ఎస్ ద్వారా మ‌రో 116 కోట్ల ఆదాయం బ‌ల్దియా ఖ‌జానాలో చేరింది. గ‌తంతో పోలిస్తే 257కోట్ల ఆదాయం అద‌నంగా వ‌స్తే ఖ‌ర్చులు మాత్రం 391కోట్లు అధికం అయ్యాయి. ఆస్తి ప‌న్ను, ట్రెడ్ లైసెన్స్ ఫీజుల వ‌సూళ్లలో మొద‌టి ద‌శ‌లోనే ప్రోత్సహ‌కాలు ఇచ్చి అవ‌కాశం ఉన్న మేర‌కు ప‌న్నుల‌ను రాబ‌ట్టారు. అయితే... ప్రతి ఏడాది ఫిబ్రవ‌రి, మార్చిలో పెద్దమొత్తంలో ప‌న్నులు వ‌సూలవుతాయి. కానీ, గత ఏడాది మార్చిలో 370కోట్లు రాగా.. అది ఈ సారి 250కోట్లకు మించితే గొప్ప అంటున్నాయి బల్దియా వ‌ర్గాలు.

ఆదాయంపై ఫోకస్‌ పెట్టిన బల్దియా అధికారులు..
జీహెచ్‌ఎంసీలో ప్రతి నెలా మెయింటెనెన్స్‌ ఖ‌ర్చు 150 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇందులో 95 నుండి 100కోట్లు జీతాలు, పెన్షన్ల కోసం చెల్లిస్తే.. ప్రతి నెల 14కోట్ల రూపాయలను విద్యుత్‌ చార్జీలుగా చెల్లిస్తోంది బల్దియా. వీటికి తోడు వాహనాలు, కార్యాలయాలతో పాటు ఇతర మెయింటెనెన్స్ కోసం 15 నుండి 20కోట్ల వరకు ఖర్చవుతుంది. వీటికి తోడు ఈ ఏడాది చేసిన ప‌నుల‌కు బిల్లులు పూర్తిస్థాయిలో చెల్లించాల్సి వ‌స్తే.. బ‌ల్దియాకు పెద్దక‌ష్టమే వ‌చ్చిప‌డుతుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గ‌ట్టెక్కడానికి ఆదాయంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. ట్రెడ్ లైసెన్స్, ఆస్తిపన్ను వసూళ్లపై ఎప్పటి కప్పుడు జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు రివ్యూలు నిర్వహించి.. వంద శాతం వసూళ్లు చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఆస్తిప‌న్ను డిమాండ్‌ను పెంచేందుకు... త‌క్కువ ప‌న్ను చెల్లిస్తున్న వారి ఆస్తుల‌ను రీఅసెస్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. పౌరులకు తమ ఆస్తుల రీ అసెస్‌కు మరో అవకాశం ఇవ్వాలని బల్దియా యోచిస్తోంది. ఆర్ధిక కష్టాల నుంచి బయటపడేందుకు బల్దియా అధికారులు వేస్తున్న కొత్త ప్లాన్స్‌ ఏమేరకు సక్సెస్‌ అవుతాయో వేచి చూడాలి.

10:33 - February 21, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌ ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా... ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామిని నెరవేర్చలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్‌.. నిరుద్యోగుల వెతల్ని పట్టించుకోకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని తమ్మినేని దుయ్యబట్టారు. కాంట్రాక్టు వర్కర్లను పర్మినెంటు చేయకపోతే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. మార్చి 19లోగా గిరిజనులకు పోడు భూముల పట్టాలివ్వాలని, లేకపోతే సీపీఎం పోరాటాన్ని ఉధృతం చేస్తోందని తమ్మినేని హెచ్చరించారు. రాష్ట్రం బాగుండాలని, అట్టడుగు వర్గాల హక్కులు పరిరక్షించాలని సీపీఎం పాదయాత్ర చేపట్టిందని తమ్మినేని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ఎత్తివేసే కుట్రను మానుకుని, చట్టాన్ని అమలు చేయాలని తమ్మినేని అన్నారు.

127వ రోజు..
దున్నుకోవాల్సి వారి చేతుల్లో సెంటు భూమి కూడా లేదని, మన చేతుల్లోకి భూమిని తెచ్చుకునేందుకే ఈ లడాయి జరుగతోందని టఫ్‌ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ మోదీతో కుమ్మక్కై ప్రజలను దోచుకుంటున్నారని విమలక్క విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడగడమే నేరమవుతోందని ఆమె అన్నారు. సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా పర్యటిస్తున్న తమ్మినేని పాదయాత్ర 127వ రోజుకు చేసుకుంది. ఖమ్మం జిల్లాలోని కల్లంపాడు, ఎడవల్లి, లక్ష్మిపురం, ముదిగొండ, వెంకటాపురం, గోకినేపల్లి, నేలకొండపల్లి గ్రామాల్లో పర్యటించింది. తమ్మినేని పాదయాత్రకు మద్దతుగా తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షురాలు విమలక్క పాదయాత్రలో పాల్గొన్నారు. మహాజన పాదయాత్ర పర్యటనకు గుర్తుగా ఖమ్మం రూరల్‌ మండలం తెలిదరాపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌అంబేద్కర్‌ విగ్రహాన్ని విమలక్కతో కలిసి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు.

10:28 - February 21, 2017
10:19 - February 21, 2017

విజయవాడ : మెంటాడులో విషాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాద ఘటనలో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఇందులో ఓ మహిళ సజీవదహనమైంది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇంట్లోని వస్తువులు..నిత్యావసర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. లక్ష్మమ్మ అనే మహిళ ఓ పూరిళ్లులో నివాసం ఉంటోంది. ఈమె అనారోగ్యంతో బాధ పడుతోంది. కదలలేని స్థితిలో ఉండడం..ఎవరూ లేకపోవడంతో లక్ష్మమ్మ సజీవ దహనమైంది. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం ఘటనాస్థలికి చేరుకుంది. కానీ అప్పటికే పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకొనేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

జమ్మూకాశ్మీర్ లో ఎదురు కాల్పులు...

జమ్మూకాశ్మీర్ : రాజౌలి జిల్లా కేరి సెక్టార్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యారు. 

చంద్రబాబు...మహిళా వ్యతిరేకి : రోజా

విజయవాడ : సీఎం చంద్రబాబు...మహిళా వ్యతిరేకి అని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఈమేరకు విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనపై పోరాటం చేయాల్సినవసరం ఉందన్నారు. తనకు జరిగిన అవమానంపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. 

09:31 - February 21, 2017

విజయవాడ : తన ట్రాక్ రికార్డు చూసి అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారని తన ట్రాక్ రికార్డు ఏంటో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే రోజాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దానిపై మళ్లీ రోజా ప్రభుత్వంపై గళమెత్తారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనపై అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయపోరాటం చేస్తానని, మహిళలు భయపడకుండా తిరగబడాలని పిలుపునిచ్చారు. తానేమన్నా విధ్వంసాలు చేశానా ? వైస్రాయ్ హోటల్ లో గుమికూడి ప్రభుత్వాన్ని కూల్చేశానా ? ఎలాంటి ట్రాక్ రికార్డు ఉందో తెలుపాలని సూటిగా ప్రశ్నించారు. దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన సాగుతుందా ?అని ప్రశ్నించారు. ప్రతిపక్షం మీద..పోలీసులను అడ్డం పెట్టుకుని నడిపిస్తున్నారని, ఇందుకు తానే ఉదాహరణ అని తెలిపారు. పార్లమెంట్ సదస్సుకు ఆహ్వానం పలికి తనను అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. దీనిని చూసి దేశం నివ్వెర పోయిందని, హక్కులకు కలిగిన భంగం న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న మహిళలు భయ పడకుండా తిరగబడి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ సదస్సులో మహిళా మంత్రుల ఫొటోలు కూడా లేవని, సదస్సులో ప్రజాప్రతినిధుల సతీమణులు మాత్రమే ఉండాలా ? మల్లు స్వరాజ్యం, బృందా కారత్ తదితర మేధావులను పిలవలేదని విమర్శించారు. కామన్ మహిళా సదస్సా ? అని జనాలు ఆశ్చర్యపోయారని తెలిపారు. మహిళా హక్కులకు పోలీసులు భంగం కలిగిస్తున్నారని, విమర్శించారు. ఓటుకు నోటు కేసులో బాబు ఇరుక్కపోయారని, ఇందులో ఓ పోలీసు అధికారిపై చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. బాబు..డీజీపీ ఇక్కడున్న తరువాత ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయో గతంలో జరిగిన ఘటనలు చూస్తే తెలుస్తుందన్నారు. మహిళలపై జరుగుతున్న హింసలు కనిపించడం లేదా అని డీజీపీని ప్రశ్నించారు.

మహిళా హక్కులకు భంగం కల్గిస్తున్న పోలీసులు : రోజా

విజయవాడ : మహిళా హక్కులకు పోలీసులు భంగం కల్గిస్తున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఈమేరకు విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతున్నారు. డీజీపీ చంద్రబాబుకు బానిసలా పని చేస్తున్నారు. డీజీపీ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 
 

09:30 - February 21, 2017

భానుడు అప్పుడే మొదలేట్టేశాడు..శివరాత్రి సమయానికి శివ శివా అంటూ చలి వెళ్లిపోతుందని ఓ నానుడి ఉంది. కానీ శివరాత్రికంటే ముందుగానే సమ్మర్ షురూ అయిపోయింది. భానుడి ప్రతాపం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇందుకు సోమవారమే ఉదహారణ. హైదరాబాద్ లో సోమవారం పగలు అత్యధికంగా 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఒక్కసారిగా ఐదు డిగ్రీల వరకు పెరగడంతో నగర ప్రజలు కొంత ఉక్కిరిబిక్కిరయ్యారు. నగరంలో గత పదేళ్లలో ఫిబ్రవరి నెలలో అత్యధిక ఉష్ణోగ్రత 2009 ఫిబ్రవరి 26న 39.1 డిగ్రీలుగా నమోదైనట్లు రికార్డులో ఉన్నట్లు తెలుస్తోంది. శీతాకాలం ముగిసి వేసవి ప్రవేశించిందని పలువురు పేర్కొంటున్నారు. పగలే కాకుండా రాత్రి వేళ సైతం అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంటోందని టాక్. నల్గొండలో సోమవారం తెల్లవారుజామున 14, ఖమ్మంలో 16 డిగ్రీలు నమోదయ్యాయి. సో..ఎండాకాలం..కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగడం లేదు : రోజా...

విజయవాడ : రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగడం లేదని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఈమేరకు విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతున్నారు. మహిళా సదస్సుకు ఆహ్వానించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీ చంద్రబాబుకు బానిసలా పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

 

 

08:53 - February 21, 2017

వీకెండ్స్..శనివారం..ఆదివారాల కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ఆదివారం రోజున చాలా మంది ప్లాన్స్ చేసుకుంటుంటారు. ఆదివారం సరదాలకు, సంతోషాలకు వేదికగా నిలిచే రోజుగా పేర్కొంటుంటారు. సామాన్య మానవుడి నుండి స్టార్స్ వరకు సండేను గొప్పగా మలుచుకోవాలని అనుకుంటుంటారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నటీమణుల్లో ఒకరైన 'సమంత' కూడా సండేను బాగా సెలబ్రేట్ చేసుకుందంట. సండే బీ పర్ ఫెక్ట్ అంటూ 'సమంత' సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంది. ప్రియుడు నాగచైతన్య కూడా పక్కనే ఉన్నాడు. వీరివురికీ ఇటీవలే వివాహ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే వీరు ఒక్కటి కాబోతున్నారు. ఆదివారం సరదాగా గడిచిపోయిందని సమంత చెబుతోంది. కుక్కపిల్లను తన ఒడిలో కూర్చొబెట్టుకొని ఆనందపరవశరాలువుతున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. 'సమంత' షేర్ చేసిన ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

08:13 - February 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితికి టీ-జాక్ భయం పట్టుకుంది. జాక్ కార్యాచరణ అధికార పార్టీ నేతల్లో కొత్త గుబులు రేపుతోంది. రేపు తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీని కోదండరాం విరమించుకోవాలని గులాబీ నేతలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతున్న టీ-జాక్ ప్రత్యక్ష ఉద్యమాల్లో దూకుడు పెంచేందుకు నిర్ణయించడం గులాబీ నేతలకు ఏ మాత్రం రుచించడం లేదు. ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల నిరసన ర్యాలీకి టీ జాక్ రెడీ కావడంతో టీఆర్‌ఎస్‌ నేతలు పోటీ పడి మరీ కోదండరాంపైనే కాకుండా టీ-జాక్‌ నేతలపై విమర్శలు చేస్తున్నారు. నిరసన ర్యాలీ చేపట్టి... నిరుద్యోగుల్లో గందరగోళాన్ని సృష్టించవద్దంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక వర్గాలన్నీ ఒక్కొక్కటీ ర్యాలీకి మద్దతు తెలుపుతుండటం గులాబీ నేతల్లో మరింత గందరగోళానికి తెరలేపుతోంది. ఉద్యోగాల భర్తీపై పెద్దగా నోరుమెదపని అధికార పార్టీ నేతలు గత వారం రోజులుగా ఇదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే వేలాది ఉద్యోగాలు భర్తీచేశామని, త్వరలో మరికొన్ని ఉద్యోగాలను భర్తీకి తాము సిద్ధంగా ఉన్నా....కోదండరాం నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విప్‌ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

ఆచితూచి స్పందిస్తున్న టీజాక్..
మరో వైపు టీ-జాక్ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వ్యవహారంపై అనుమానంతో దాదాపు 20 రోజుల క్రితమే ర్యాలీకి అనుమతి కోరుతూ.... కోర్టు తలుపు తట్టింది. తమ నిరసన ర్యాలీ ఏ ఒక్కరి కోసం కాదని, నిరుద్యోగుల గళం వినిపించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీజాక్ చెబుతోంది. ర్యాలీలో పాల్గొనే నిరుద్యోగులు శాంతి యుతంగా నిరసన తెలపాలని టీ-జాక్ ఛైర్మన్ కోదండరాం విజ్ఙప్తి చేస్తున్నారు. టీ-జాక్ అనుసరిస్తున్న వ్యూహం అధికార పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేస్తోంది. ఉద్యోగాల భర్తీ చేశామని ప్రకటనలు చేస్తున్న అధికార పార్టీ నేతలు టీ-జాక్‌తో బహిరంగ చర్చకు మాత్రం ఆసక్తి చూపకపోవడం దేనికన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.

08:01 - February 21, 2017

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు. తిరుపతి శ్రీవారి దర్శించుకుని మొక్కులను చెల్లించుకోనున్నారు. ఉద్యమం జరుగుతున్న కాలంలో ఆయన మొక్కులు మొక్కుకున్నారంట. ఇప్పటికే వరంగల్‌ భద్రకాళీ అమ్మవారికి మూడు కోట్లతో 11.7 కిలోల బంగారు కిరీటం చేయించారు. వీటితో పాటు ముక్తిశ్వరస్వామి, శుభానందదేవికి 34 లక్షల రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. అజ్మీర్‌ దర్గాకు ఐదు కోట్ల రూపాయలతో పూల చద్దర్‌ను సమర్పించారు. తాజాగా శ్రీవారికి కూడా కానుకలను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో 5 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను ఆయన టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో కేరళలోని జొస్ అలుక్కాస్ ఆభరణాల దుకాణంలో శ్రీవారి కోసం ప్రత్యేకంగా నగలను డిజైన్ చేయించి తయారు చేయించారు. శ్రీమూలవర్ణ కమలం నమూనాలో 14.2 కేజీల సాలగ్రామ హారంతో పాటు 4.65 కేజీల విలువైన బంగారంతో ఐదు పేటల కంఠాభరణాన్ని తయారు చేయించారు. ఓ ముక్కుపుడకను కూడా తయారు చేయించారు. ఈ కానుకలను రేపు ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీవారికి సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో 5 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను అందించనున్నారు. టిటిడి బోర్డు ఆధ్వర్యంలో కేరళలోని జొస్ అలుక్కాస్ ఆభరణాల దుకాణంలో ఆభరణాలు తయారయ్యాయి. శ్రీమూలవర్ణ కమలం నమూనాలో 14.2 కేజీల సాలగ్రామ హారంతో పాటు 4.65 కేజీల విలువైన బంగారంతో ఐదు పేటల కంఠాభరణాన్ని తయారు చేయించారు. ఓ ముక్కుపుడకను కూడా తయారు చేయించారు. ఈ కానుకలను బుధవారం ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీవారికి కేసీఆర్ దంపతులు సమర్పించనున్నారు.
కేసీఆర్‌ బృందం ప్రత్యేక విమానంలో తిరుపతి వెళ్లనున్నారు. ఈ పర్యటనలోమంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌, పద్మారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్సీ సింగ్‌, సీఎంవో అధికారి భూపాల్‌రెడ్డితో పాటు మొత్తం 60 మంది బృందం వెళ్లనున్నట్టు సమాచారం. ఈ మేరకు దేవస్థానంలో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో తిరుమలలో జరిగే పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఇంట్లో జరిగే వివాహా కార్యక్రమంలో సీఎం పాల్గోనున్నారు.

ప్రారంభమైన బీఎంసీ ఎలక్షన్..

ముంబై : బీఎంసీ ఎలక్షన్స్ ప్రారంభమయ్యాయి. పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకోంటున్నారు. కాసేపటి క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భారత్ మహిళ విద్యాలయలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

07:49 - February 21, 2017

నీళ్లు..నిధులు..నియామకాల కోసం పోరు జరిగింది. కొన్నేళ్ల ఉద్యమాలు..పోరాటాలు..ఆందోళనల తరువాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆనాడు ఇచ్చిన హామీలు పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆందోళన నెలకొంది. ఇందుకు ప్రతిపక్షాలు పోరుబాట పడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యపై ప్రొ.కోదండరాం ఆందోళన చేపట్టారు. 22వ తేదీన నిరుద్యోగ ర్యాలీ జేఏసీ చేపట్టింది. అందులో భాగంగా ఓ పాటను విడుదల చేశారు. ఈ పాట ఎలా ఉందో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

07:34 - February 21, 2017

పవన్ కళ్యాణ్ రాకతో గుంటూరు జిల్లా చినకాకాని జనసంద్రంగా మారింది. చేనేత సత్యాగ్రహ దీక్షకు పవన్‌ కల్యాణ్ హాజరయ్యారు. నిరాహారదీక్ష చేస్తున్న నేత కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. చేనేతల సమస్యలపైవారితో కాసేపు మాట్లాడారు. నేతన్నలతోకలిసి మగ్గం నేశారు. నూలు వడికారు.. వస్త్రాలు ఎలా నేస్తారో కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన సభావేదిక నుంచి చేనేతల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బ్రహ్మం చౌదరి (ఏపీ టీఎన్ఎస్ఎఫ్ నేత), కరణం ధర్మశ్రీ (వైసీపీ), రామారావు (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

హైకోర్టును ఆశ్రయించిన డీఎంకే..

చెన్నై : తమిళనాడు శాసనసభలో ఈనెల 18వ తేదీన నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సోమవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జి.రమేష్, జస్టిస్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును మంగళవారం విచారణకు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

07:28 - February 21, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'పవన్' సరసన 'శృతి హాసన్' హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మాధ్యమాల్లో విడుదల చేస్తున్నారు. ఈ ఫొటోలకు అభిమానుల నుండి భారీ స్పందన వ్యక్తమౌతోంది. ‘పవన్' ఈ చిత్రంలో స్టైలిష్ గా కనిస్తున్నారు. తమ్ముళ్ల కోసం అన్నయ్య చేసిన త్యాగమే 'కాటమరాయుడు' కథ అని తెలుస్తోంది. దీనికి రాయలసీమ ఫ్యాక్షన్ జోడించారని తెలుస్తోంది. పవన్‌కి నలుగురు తమ్ముళ్లుగా కమల్ కామరాజు, విజయ్ దేవరకొండ, శివబాలాజీ, అజయ్‌లు నటించారు. తమ్ముళ్ళు తమ పెళ్లిళ్ల కోసం అన్నయ్యని ప్రేమలోకి దించే ప్రయత్నాలు చేస్తారని టాక్. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

07:20 - February 21, 2017

ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం స్పూర్తికే తూట్లు పడుతున్నాయి. 2013 ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని మార్చేందుకు దళిత, గిరిజన ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కెసిఆర్ కమిటీ ఏర్పాటు చేయడం తీవ్ర వివాదస్పదమైంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని రక్షించుకునేందుకు వివిధ దళిత, గిరిజన సంఘాలు ఉద్యమ బాట పడుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేత బి. ప్రసాద్ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

06:52 - February 21, 2017

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 10వ సీజన్‌ వేలంలో పెద్ద సంచలనాలే నమోదయ్యాయి. ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ జాక్‌ పాట్ కొట్టగా.. భారత క్రికెటర్లలో కరణ్‌ శర్మ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్‌ సృష్టించాడు. 10వ సీజన్‌ వేలంలో ఇంగ్లండ్‌ క్రికెటర్లను సొంతం చేసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అందరూ ఊహించినట్టుగానే బెన్‌ స్టోక్స్‌ అత్యధిక ధర పలకగా స్పీడ్‌ గన్‌ టైమల్‌ మిల్స్‌ ధర 12 కోట్లు దాటడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆక్షన్‌లో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడటం కొత్తేమీ కాదు. అందరూ ఊహించినట్టుగానే ఇంగ్లీష్‌ ఆల్‌ రౌండర్‌...బెన్‌ స్టోక్స్‌ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఐపీఎల్‌ 10వ సీజన్‌ వేలంలో బెన్‌ స్టోక్స్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌లా నిలవగా లెగ్‌ స్పిన్నర్‌ కరణ్‌ శర్మ రికార్డ్‌ ధర పలికిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. అనూహ్యంగా ఇంగ్లండ్‌ స్పీడ్‌ గన్‌ టైమల్‌ మిల్స్‌ను అదృష్టం వెంటాడింది. కగిసో రబడ, ట్రెంట్ బౌల్ట్‌ ,క్రిస్‌ ఓక్స్‌ ,ప్యాట్‌ కమిన్స్‌ వంటి మెరుపు ఫాస్ట్‌ బౌలర్లను సొంతంచేసుకోవడానికి సైతం ఫ్రాంచైజీలు తహతహలాడాయి. ఐపీఎల్‌ 10వ సీజన్‌
వేలంలో అత్యధిక ధర పలికిన టాప్‌ టెన్‌ క్రికెటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

 • బెన్‌ స్టోక్స్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌ 14.5 కోట్లు
 • టైమల్‌ మిల్స్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 12 కోట్లు
 • ట్రెంట్ బౌల్ట్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 5 కోట్లు
 • కగిసో రబడ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 5 కోట్లు
 • ప్యాట్‌ కమిన్స్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 4.5 కోట్లు
 • క్రిస్‌ ఓక్స్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 4.2 కోట్లు
 • రషీద్‌ ఖాన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 4 కోట్లు
 • కౌల్టర్‌ నైల్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 3.5 కోట్లు
 • కరణ్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ 3.2 కోట్లు
 • నటరాజన్‌ పంజాబ్‌ కింగ్స్‌ 3 కోట్లు

కోటికి పైగా ధర పలికిన ఆటగాళ్లు వివరాలు ఇలా ఉన్నాయి....

 • వరుణ్‌ ఆరోన్‌ పంజాబ్‌ కింగ్స్‌ 2.8 కోట్లు
 • అనికెత్‌ చౌదరీ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 2 కోట్లు
 • మిషెల్‌జాన్సన్‌ ముంబై ఇండియన్స్‌ 2 కోట్లు
 • ఓయిన్‌ మోర్గాన్‌ పంజాబ్‌ కింగ్స్‌ 2 కోట్లు
 • ఏంజెలో మాథ్యూస్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 2 కోట్లు
 • కోరీ యాండర్సన్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కోటి
 • పవన్‌ నెగీ చాలెంజర్స్‌ బెంగళూర్‌ కోటి
 • క్రిస్టియన్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌ కోటి

ఐపీఎల్‌ 10వ సీజన్‌ వేలంలో ఓవరాల్‌గా ఇంగ్లండ్‌ క్రికెటర్లే జాక్‌ పాట్‌ కొట్టారు. మరి కోట్లు పెట్టి కొనుకున్న క్రికెటర్లు... టోర్నీలో ఏ స్థాయిలో రాణిస్తారో చూడాలి. ఎన్నో ఆశలు పెట్టి సొంతం చేసుకున్న క్రికెటర్లపై ఫ్రాంచైజీలు మాత్రం భారీగా అంచనాలు పెట్టుకుంటాయనడంలో అనుమానమే లేదు.

06:47 - February 21, 2017

గుంటూరు : మార్చి మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలన్న స్పీకర్‌ ప్రకటనతో వెలగపూడిలో హడావుడి మొదలైంది.. అమరావతిలో అసెంబ్లీ భవనాల్ని స్పీకర్‌ కోడెల, డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ద ప్రసాద్‌, మండలి చైర్మన్‌ చక్రపాణి, డీజీపీ సాంబశివరావు పరిశీలించారు.. భవనాల పురోగతి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా మిగిలిఉన్న పనులపై అధికారులతో చర్చించారు.. బీఏసీ హాల్‌లో పోలీసు ఉన్నతాధికారులు, సీఆర్‌డీఏ, జీఏడీ అధికారులతో స్పీకర్‌ సమీక్ష నిర్వహించారు. మార్చి 3నుంచి సమావేశాలు ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నామని స్పీకర్‌ తెలిపారు. అధికారులతో సమీక్ష తర్వాత అసెంబ్లీ ప్రాంగణాన్ని డీజీపీ పరిశీలించారు. వీఐపీల వాహనాల పార్కింగ్‌కు ఇంత తక్కువ స్థలం ఎలా సరిపోతుందని అధికారులపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మరింత స్థలాన్ని ఎంపిక చేయాలని ఆదేశించారు.. ధర్నాలు, ఆందోళనలకు ప్రత్యేకంగా ధర్నా చౌక్‌ సిద్ధం చేస్తున్నామని సాంబశివరావు ప్రకటించారు.. అసెంబ్లీ సమావేశాలకు రూట్‌మ్యాప్‌ను ఈ నెల 26న విడుదల చేస్తామని తెలిపారు. అమరావతిలో తొలి అసెంబ్లీ సమావేశాలకు అంతా సిద్ధమవుతోంది.. అనుకున్న సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా అధికారులు శరవేంగా పనులు చేస్తున్నారు.
 

06:46 - February 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరుపతి వెంకన్నను దర్శించుకోనున్నారు. ఐదున్నర కోట్ల రూపాయల ఆభరణాలను శ్రీవారికి సమర్పించనున్నారు. మంగళవారం సాయంత్రం సతీ సమేతంగా 60 మందితో కలిసి సీఎం కేసీఆర్‌ తిరుమల వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే వివిధ ఆలయాల్లో దేవుళ్లకు ఆభరణాలు చేయిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొక్కుకున్నారు. 2015 జనవరిలో జరిగిన క్యాబినెట్‌లో వీటిపై నిర్ణయం తీసుకున్నారు. ఆలయాలలో దేవుళ్ల విగ్రహాలకు ఎటువంటి ఆభరణాలు తయారు చేయాలనే దానిపై ప్రత్యేకంగా ఓ కమిటీ కూడా నియమించారు. ఇందులో భాగంగా వరంగల్‌ భద్రకాళీ అమ్మవారికి మూడు కోట్లతో 11.7 కిలోల బంగారు కిరీటం చేయించారు. వీటితో పాటు ముక్తిశ్వరస్వామి, శుభానందదేవికి 34 లక్షల రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. అజ్మీర్‌ దర్గాకు ఐదు కోట్ల రూపాయలతో పూల చద్దర్‌ను సమర్పించారు.

ఐదున్నర కోట్లు..
తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామి మొక్కును తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఐదున్నర కోట్లతో చేయించిన స్వర్ణాభరణాలను స్వామివారితో పాటు పద్మావతి అమ్మవారికి, తిరుచానురు అమ్మవారికి సమర్పించనున్నారు. దీనికోసం కేసీఆర్‌ బృందం ప్రత్యేక విమానంలో తిరుపతి వెళ్లనున్నారు. ఈ పర్యటనలోమంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌, పద్మారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్సీ సింగ్‌, సీఎంవో అధికారి భూపాల్‌రెడ్డితో పాటు మొత్తం 60 మంది బృందం వెళ్లనున్నట్టు సమాచారం. ఈ మేరకు దేవస్థానంలో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో తిరుమలలో జరిగే పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఇంట్లో జరిగే వివాహా కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.

06:45 - February 21, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకం గందరగోళంగా మారింది. తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం ఎలా ఇచ్చారంటూ అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనుమానాలను నివృత్తి చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో, మెరిట్‌ లిస్ట్‌తో పాటు కటాఫ్‌ మార్కులను వెబ్‌ సైట్‌లో ఉంచుతామని పోలీస్‌ నియామకం బోర్డు చైర్మన్‌ పూర్ణచందర్‌ హామీ ఇచ్చారు. ఓపెన్‌ ఛాలెంజ్‌లో ఫిర్యాదు చేసి వివరాలను పొందాలని సూచించారు. తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల పరీక్షా ఫలితాలు గందరగోళానికి దారి తీశాయి. 60 వేల మంది అభ్యర్ధులు 11 వేల కానిస్టేబుల్‌ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో 10 వేల కానిస్టేబుళ్ల నియామకాల కోసం ఫలితాలను విడుదల చేశారు. అయితే ఇందులో నేరుగా రిజిస్ట్రేషన్ నెంబర్ అధారంగా ఫలితాలు రావడంతో మార్కులను లెక్కలోకి తీసుకోలేదని ఉద్యోగాలను అమ్ముకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

గిరిజిన విద్యార్థి వాయిస్ సంచలనం..
తనకు తక్కువ మార్కులు వచ్చినా క్వాలిఫై అయ్యానంటూ వెలువడిన అదిలాబాద్‌కు చెందిన ఓ గిరిజన విద్యార్థి పంపిన వాయిస్ సంచలనం రేపింది. దీంతో 50 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉన్నతాధికారులు వచ్చి అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. రెండు సంవత్సరాలుగా కష్టపడి చదివితే తోటి అభ్యర్థులకు ఎలాంటి ప్రత్యేక ఆర్హత లేకున్నా, తక్కువ మార్కులు వచ్చినా ఎలా ఎంపికయ్యారని వారు ప్రశ్నించారు. పోలీస్ నియామకాల బోర్డు చైర్మన్ పూర్ణచందర్ రావు అభ్యర్థుల అనుమానాల నివృత్తికి ప్రయత్నించారు. మహిళల రిజర్వేషన్‌తో సాప్ట్ వేర్‌లో మూడు రకాల మెరిట్ లిస్ట్‌ తీయాల్సి వచ్చిందన్నారు. అదిలాబాద్ అభ్యర్థికి రిజర్వేషన్ ఉండడంతో తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా ఎప్పుడు లేని విధంగా ఫలితాలు వచ్చిన తర్వాత ఓపెన్ చాలెంజ్ విధానం పెట్టామని అనుమానాలన్నింటిని నివృతి చేస్తామని స్పష్టం చేశారు. ఎవరు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.

డీజీపీ స్పందన..
కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనపై డీజీపీ కూడా స్పందించారు. వారి అనుమానాలన్నింటిని లిఖిత పూర్వకంగా ఇస్తే వివరణ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్ని రకాల మెరిట్, కట్ ఆఫ్ మార్కుల వివరాలు పూర్తి చేయకుండానే త్వరగా ఫలితాలు విడుదల చేయాలనే తొందరపాటే చేటు తెచ్చినట్లు తెలుస్తోంది. ఒత్తిడి ఉండటం వల్లే మొదటగా ఫలితాలు ఇచ్చామని ఎక్కడా అక్రమాలు జరగలేదని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే, ఈ వ్యవహారంలో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

06:43 - February 21, 2017

హైదరాబాద్ : సమాజంలో అత్యంత వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఎంబీసీ అభివృద్ధికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఎంబీసీల కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా చీకట్లోనే మగ్గిపోతున్నారన్న కేసీఆర్‌. వారికి బడ్జెట్‌లో నిధులు కేటాయించి కార్పొరేషన్‌ ద్వారానే ఖర్చు చేస్తామని హామీనిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రగతి భవన్‌లో ఎంబీసీల సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎంబీసీ సంఘాలకు చెందిన ప్రతినిధులు, పలువురు మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఎంబీసీల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. బీసీ కార్పొరేషన్‌ను కొనసాగిస్తూనే.. ఎంబీసీ అభివృద్ధికీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంబీసీలకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు. కేటాయించిన నిధులను కార్పొరేషన్‌ ద్వారానే ఖర్చు చేస్తామన్నారు. రాజకీయ జోక్యం లేకుండా కార్పొరేషన్‌ పనిచేసేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ఎంబీసీలకు ప్రత్యేక శిక్షణ అందిస్తామన్న కేసీఆర్‌..
ఎంబీసీల్లో ఎక్కువ మంది నేటికీ కులవృత్తులపై ఆధారపడే జీవిస్తున్నారని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఇంకా మనుగడ సాగిస్తున్న కులవృత్తులను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఎంబీసీల కులవృత్తిని ఆధునీకరించడానికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే వారికి ప్రత్యేత ట్రైనింగ్‌ కూడా ఇస్తామన్నారు. కులవృత్తి నశించి... ఆర్దికంగా చితికిపోయిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు అన్వేషిస్తామని స్పష్టం చేశారు. వృత్తులులేని కులాలకు ఆయా ప్రాంతాల్లోని అవసరాలను బట్టి వారికి ఉపాధి మార్గం చూపెడుతామన్నారు. అత్యంత వెనుకబడిన తరగతుల్లోని ఏ కులానికి ఏ అవసరం ఉందో, ఏ కుటుంబానికి ఏ సమస్యలున్నాయో.. వారి కులవృత్తిని ప్రోత్సహించేందుకు ఏమి చేయాలో మార్గాలు అన్వేషించాలని ఎంబీసీ ప్రతినిధులకు కేసీఆర్‌ సూచించారు. ఎంబీసీ కులాలు సంతృప్తి చెందినప్పుడే తనకూ సంతృప్తి అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఎంబీసీ తరగతుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎంకు ఎంబీసీ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఎంబీసీలు బాగుపడతారని చెప్పారు.

06:41 - February 21, 2017

గుంటూరు : జనసేనాని మరోసారి గర్జించారు. చేనేత సమస్యలపై గొంతెత్తారు. నేతన్నా... నేనున్నా అంటూ అండగా నిలిచారు.. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన చేనేత సత్యాగ్రహ దీక్షలో తనదైన శైలిలో పంచ్ డైలాగులు వదిలారు. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, పీడిత ప్రజల పక్షాన పోరాడడం కోసం వచ్చానని స్పష్టం చేశారు. మంగళగిరి వేదికగా, చేనేత సమస్యలతో పాటు, హోదా అంశాన్నీ జనసేనాని ప్రస్తావించారు. జనసేనాని రాకతో గుంటూరు జిల్లా చినకాకాని జనసంద్రంగా మారింది.. చేనేత సత్యాగ్రహ దీక్షకు పవన్‌ కల్యాణ్ హాజరయ్యారు.. నిరాహారదీక్ష చేస్తున్న నేత కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.. చేనేతల సమస్యలపైవారితో కాసేపు మాట్లాడారు.. నేతన్నలతోకలిసి మగ్గం నేశారు.. నూలు వడికారు.. వస్త్రాలు ఎలా నేస్తారో కార్మికులను అడిగి తెలుసుకున్నారు.

మంగళగిరిలో..
మంగళగిరిలో ఏర్పాటు చేసిన సభావేదిక నుంచి చేనేతల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. చేనేత కళాకారుల కష్టాలు తనకు చిన్నప్పటినుంచి తెలుసని పవన్‌ స్పష్టం చేశారు.. పవర్‌లూమ్స్‌ రాకతో నేతన్నలు భారీగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు.. తన అభిమానులు వారానికోసారైనా నేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. చేనేత వృత్తివారిని కార్మికులుగా చూడరాదని, వారిని చేనేత కళాకారులుగా పిలవాలని పవన్‌ సూచించారు. అలాగే, ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి నేతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అందుకే రాజకీయాల్లో..
కష్టాలు, సమస్యల్లో ఉన్న వారికి సాయంగా ఉండేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్‌ స్పష్టం చేశారు. యుద్ధట్యాంకులు ఎదురొచ్చినా నిలబడే నాయకులు తనకు కావాలన్నారు.. పోరాట పటిమ కలిగిన, నిస్వార్థ నేతలకోసం తాను ఎదురుచూస్తున్నానని ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిస్తున్న రాజకీయ నేతలు... అధికారంలోకివచ్చాక ఒక్కటికూడా అమలుచేయడం లేదని పవన్‌ ఆరోపించారు. తనకు ఒక్కరు ఓటువేసినా... కోటిమందివేసినా ప్రజల తరఫున నిలబడతానని స్పష్టం చేశారు.. దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడే రాజకీయ నేతల్ని ప్రజలు శిక్షించాలని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై జనసేన విధానాలు రూపొందిస్తుందని, దానికోసం యూత్‌ నుంచి సలహాలు స్వీకరిస్తామన్నారు పవన్‌కల్యాణ్‌. ప్రజలు ఇచ్చిన సలహాలను 2019 ఎన్నికలకుముందు జనసేన మ్యానిఫెస్టోలో చేరుస్తామని తెలిపారు.

హోదా..మరోసారి గళం...
ప్రత్యేక హోదాపైకూడా పవన్‌ మరోసారి గళమెత్తారు.. ఎన్నికలముందు హోదా ఇస్తామని ఏపీకివచ్చి హామీ ఇచ్చారని గుర్తుచేశారు.. ఆ తర్వాత ప్యాకేజీ అన్నారని విమర్శించారు.. ప్యాకేజీకి చట్టబద్దత ఇస్తామని ముందు చెప్పారని ఇప్పుడు అవసరంలేదంటున్నారని మండిపడ్డారు.. ఇలా రోజుకోమాట ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చేనేతల సమస్యలు, హోదాను ప్రస్తావిస్తూనే 2019 ఎన్నికల్లో జనసేన పోటీపై మరోసారి స్పష్టత ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌. చేనేతలతో పాటు, స్వర్ణకారుల సంక్షేమానికీ తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొత్తమ్మీద పవన్‌ కల్యాణ్‌ మంగళగిరి పర్యటన.. స్థానిక చేనేత కళాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

భూపాలపల్లి జిల్లాకు కిషన్ రెడ్డి..

భూపాలపల్లి జిల్లా : నేడు బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. సింగరేణి గనుల ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

నెల్లూరులో కసాయి తండ్రి ఘాతుకం..

నెల్లూరు : జిల్లాలో కసాయి తండ్రి ఘాతుకం వెలుగుచూసింది. కులాంతర వివాహం చేసుకున్నదని కూతురిని హత్య చేసేందుకు ఓ తండ్రి యత్నించాడు. బాధితురాలు సల్మా కేకలు వేయడంతో స్థానికులు కాపాడారు. నరసింహకొండ దొడ్లడెయిరీ సమీపంలో హత్యకు యత్నించాడు. కూతురు సల్మా సమక్షంలో తండ్రిని పోలీసులు విచారించారు.

గుంటూరులో స్వైన్ ఫ్లూ కేసు నమోదు..

గుంటూరు : ప్రభుత్వాసుపత్రిలో స్వైన్ ప్లూ కేసు నమోదు కావడం కలకలం రేగింది. ప్రకాశం జిల్లా బొబ్బేపల్లికి చెందిన జుబేదా అనే చిన్నారికి స్వైన్ ఫ్లూ సోకినిట్లు వైద్యులు నిర్ధారించారు.

 

బాబుతో మంత్రుల గంటా..అయ్యన్నల భేటీ..

విజయవాడ : సీఎం చంద్రబాబుతో మంత్రులు గంట, అయ్యన్నల భేటీ ముగిసింది. ఇద్దరు మంత్రుల మధ్య నెలకొన్న విబేధాలపై బాబు చర్చించారు. విబేధాలు వీడకుంటే పార్టీ నష్టపోతుందని, విశాఖలో పార్టీ బలంగా ఉన్నా అంతర్గత విబేధాల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని బాబు ఇరువురికి సూచించారు. పార్టీ శ్రేయస్సు కోసం కలిసి పనిచేస్తామని, గంటా నియోజకవర్గంలో పాల్గొంటానని అయ్యన్న పేర్కొన్నారు. అయ్యన్న కార్యక్రమాలకు తాను హాజరౌతానని మంత్రి గంటా పేర్కొన్నారు.

నేడు తిరుమలకు సీఎం కేసీఆర్...

చిత్తూరు : నేడు సీఎం కేసీఆర్ తిరుమలకు వెళ్లనున్నారు. సాయంత్రం 4గంటలకు ప్రత్యేక విమానంలో కేసీఆర్ బయలుదేరనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లనున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్న కేసీఆర్ మరుసటి రోజు ఉదయం 8గంటలకు శ్రీవారిని దర్శించుకుని కానుకలను సమర్పించనున్నారు.

Don't Miss