Activities calendar

24 February 2017

21:31 - February 24, 2017

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కంగారు జట్టు గెలుపుపై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 105 పరుగులకే ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ దీటుగానే ఆడుతోంది. భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌పై కంగారు జట్టు పట్టుబిగిస్తోంది. భారత్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్‌.. రెండో రోజు ఆట ఆటముగిసే సరికి రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 143 చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 298 పరుగుల ఆధిక్యం లభించింది.

పేకమేడలా కుప్పకూలిన భారత్‌..
256/9 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్‌ నాలుగు పరుగులు మాత్రమే జోడించి 260 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమిండియా ఇన్నింగ్స్‌ పేకమేడలా కుప్పకూలింది. బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో కేవలం 105 పరుగులకే భారత్ ఆలౌటైంది. ఓపెనర్ లోకేష్ రాహుల్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ అలా వచ్చి ఇలా పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివరి 7 వికెట్లను కేవలం 11 పరుగుల వ్యవధిలో కోల్పోయి అత్యంత చెత్త రికార్డును భారత్ నమోదుచేసింది. ఆసీస్ బౌలర్ ఓకీఫె ఆరు వికెట్లతో భారత్ నడ్డి విరిచాడు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ 104 ఇన్నింగ్సుల తరువాత డకౌట్ అయ్యాడు.

4 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసిన కంగారు జట్టు..
భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆసీస్‌ను ఆదిలోనే భారత బౌలర్లు సమర్థంగా అడ్డుకున్నారు. వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయినా ఆసీస్‌ను కెప్టెన్ స్మిత్ ఆదుకున్నారు. రెండో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. భారత్‌ బౌలర్లలో అశ్విన్‌ 3 వికెట్లు, జయంత్‌ యాదవ్ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండటంతో కోహ్లీ సేనకు సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ టార్గెట్ ఎదురయ్యే అవకాశాలున్నాయి. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టార్గెట్ సాధించడం భారత్‌కు కత్తి మీద సాము లాంటిదనంటున్నారు క్రికెట్ పండితులు.

21:30 - February 24, 2017

ముంబై : స్థానిక ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంపై శివసేన భగ్గుమంది. గెలుపే లక్ష్యంగా డబ్బుతో పాటు ప్రభుత్వ యంత్రంగాన్ని బిజెపి దుర్వినియోగం చేసిందని శివసేన ఆరోపించింది. బిఎంసి పీఠం తమదేనన్న ధీమా వ్యక్తం చేసిన శివసేన- బిజెపితో జతకట్టే ప్రసక్తే లేదని తెలిపింది. అవసరమైతే కాంగ్రెస్‌ మద్దతు తీసుకోవాలని చూస్తోంది. మరోవైపు బిజెపి-శివసేన కలవడం తప్ప మరో మార్గం లేదని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి స్పష్టం చేశారు. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బిజెపి అనూహ్య విజయం సాధించడంపై శివసేన మండిపడుతోంది. స్థానిక ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ధనబలంతో పాటు కేంద్రం అన్నిరకాల సహకారం అందించడంతోనే బిజెపి విజయం సాధించగలిగిందని సామ్నా పత్రికలో శివసేన తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగానే ఓటర్‌ లిస్టులో 12 లక్షల మంది మరాఠీ ఓటర్ల పేర్లను తొలగించారని తెలిపింది. కాంగ్రెస్‌ పాలనలో కూడా తమపై ఇలాంటి కుట్రలు జరగలేదని.... తమను ఓడించడానికి కమలం ఎన్ని ప్రయత్నాలు చేసినా నెంబర్‌ వన్‌గా తామే నిలిచామని శివసేన పేర్కొంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బిజెపిపై తమ పోరు కొనసాగుతుందని బ్రిహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి తమదేనని శివసేన స్పష్టం చేసింది.

227 వార్డులు..
బీఎంసీలోని 227 వార్డులకు గాను శివ సేనకు 84, బిజెపికి 82, కాంగ్రెస్‌కు 31, ఎన్సీపీకి 9, ఎంఎన్‌ఎస్‌కు 7 స్థానాలు దక్కాయి. బీఎంసీ మేయర్‌ పదవి దక్కాలంటే 114 స్థానాలు అవసరం. గత 25ఏళ్లుగా బీఎంసీని ఏలుతున్న శివసేన- ఈసారి కాంగ్రెస్‌ మద్దతుతో తిరిగి మేయర్‌ పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. ఇందుకు కాంగ్రెస్‌ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బిజెపి శివసేనను తమ దారికి తెచ్చేకునే విధంగా పావులు కదుపుతోంది. శివసేన కోసం తమ తలుపులు తెరిచే ఉంచామని.... రెండు పార్టీలు మళ్లీ ఏకం కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రావ్‌సాహెబ్‌ దనవే పిలుపునిచ్చారు. శివసేన పునరాలోచించుకుని తమవైపు మళ్లాలని బిజెపి పేర్కొంది. అయితే బిజెపి ముందు తలవంచడానికి శివసేన ఒప్పుకునే ప్రసక్తే లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. శివసేనకు బదులు ఎన్సీపీ, ఎంఎన్‌ఎంస్ తదితర చిన్న పార్టీల సహకారంలో మేయర్‌ పదవి దక్కించుకునేందుకు బిజెపి పావులు కదుపుతోంది. మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అనూహ్య విజయం సాధించడం ద్వారా శివసేనకు ప్రమాద ఘంటికలు సూచిస్తున్నాయి. 1980-90 ప్రాంతంలో బాలథాకరే సహకారంతో ముంబైలో చిన్నపార్టీగా కొనసాగిన బిజెపి- తమ కోటను బీటలు వారేలా చేస్తుందని శివసేన అస్సలు ఊహించలేదు. మొత్తానికి ముంబై మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.

21:28 - February 24, 2017

చెన్నై : తమిళనాట మరో కొత్త రాజకీయ వేదిక ఆవిర్భవించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 69వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె మేనకోడలు దీప చెన్నైలో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించారు. ఈ వేదికకు 'ఎంజీఆర్‌ అమ్మ దీప పెరవై' అని పేరు పెట్టారు. ఇవాళ్టి నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభమైందని దీప చెప్పారు. తన అత్త నియోజకవర్గం ఆర్‌కె నగర్‌ నుంచి తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అన్నాడిఎంకే కార్యకర్తల మద్దతు తనకుందని దీప చెప్పారు. పన్నీర్‌ సెల్వంతో కలిసి పనిచేయకూడదని ఆమె నిర్ణయించారు.

21:25 - February 24, 2017

గుంటూరు : ప్రజాఉద్యమ జీవితంలో ఏడు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేసిన కామ్రేడ్ సింహాద్రి శివారెడ్డి ఇక లేరు. బడుగు బలహీనవర్గాల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసిన శివారెడ్డి కన్నుమూశారు. స్వాతంత్ర్యకాలం నాటి నుంచి కమ్యూనిస్టు ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసిన శివారెడ్డి.. పలు సందర్భాల్లో జైలు జీవితాన్ని గడిపారు. ఆయన పార్ధివ దేహన్ని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, పలువురు కమ్యూనిస్టు నేతలు సందర్శించి నివాళులు అర్పించారు.

1928లో జననం..
1928వ సంవతర్సం గుంటూరు జిల్లా కాజలో జన్మించిన శివారెడ్డి 1946లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ప్రారంభం నుంచే.. పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం శివారెడ్డి అలుపెరుగని పోరాటం చేశారు. ధనిక రైతు కుటుంబంలో జన్మించిన శివారెడ్డి, కడవరకూ పీడిత ప్రజల పక్షాన నిలిచి, ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలో, బ్రిటిష్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యోద్యమంలో చేరారు. తెలంగాణ సాయుధ పోరాట సమయం, ఎమర్జెన్సీ సమయంలోనూ జైలు జీవితం గడిపారు. కాజ గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పాటు, కూలిపోరాటం, పాలేర్ల సమస్యల పై ప్రదర్శన , రహస్య జీవితాలను గడిపే నాయకులకు ఆశ్రమం ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలకు శివారెడ్డి నాయకత్వం వహించారు. దళాల్లోకి రండి ఆస్తులు అమ్ముకురండి అన్న పార్టీ పిలుపుమేరకు తన వాటా ఆస్తులను అమ్మి దళాల్లోకి చేరారు. మొదటి నుంచి సీపీఎం బలోపేతం కోసం కృషిచేసేవారు. 1958లో పెదకాకాని సమితి పార్టీ కార్యదర్శిగా.. 1964లో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. 1981 నుంచి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు.

శనివారం అంత్యక్రియలు..
సొంత ఆస్తులు అమ్ముకుని కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొన్న గొప్ప నేత శివారెడ్డి అని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సీపీఎంలో శివారెడ్డి లేని లోటు పూడ్చలేనిదని తెలిపారు. శివారెడ్డి జిల్లాలోని పేదల ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాటం చేశారని.. ఆయన మృతి పేద ప్రజలకు తీరని లోటని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, గుంటూరు జిల్లా సీపీఎం కార్యదర్శి పాశం రామారావు అన్నారు. శివారెడ్డి మృతి పట్ల పలువురు నేతలు, కార్యకర్తలు ప్రగాఢ సంతాపం తెలిపారు. శనివారం ఉదయం స్వగ్రామం కాజలో, శివారెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.

21:22 - February 24, 2017

వరంగల్ : శ్రీనివాస్‌ కూచిభొట్ల మృతిని ఆయన కుటుంబం తట్టుకోలేక పోతోంది. ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళితే, జీవితం చీకటిమయమైందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ అలోక్‌ కుటుంబసభ్యులూ.. అమెరికాలోని పరిస్థితుల పట్ల ఆందోళనకు గురవుతున్నారు. అమెరికాలో, జాత్యహంకారి, ఆడం పురింటన్‌, తెలుగువారిపై కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ కాల్పుల్లో మరణించిన శ్రీనివాస్‌ కూచిభొట్ల కుటుంబం.. జరిగిన దారుణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతోంది. హైదరాబాద్‌ జెఎన్‌టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్‌, అమెరికాలోని టెక్సాస్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశాడు. కాన్సాస్‌ రాష్ట్రంలోని ఒలాతేలో ఉన్న గార్మిన్‌ కంపెనీలో ఏవియేషన్‌ ఇంజనీర్‌గా చేరాడు. బుధవారం రాత్రి అనూహ్యంగా.. స్థానిక శ్వేతజాతీయుడు పురింటన్‌ చేతుల్లో దారుణ హత్యకు గురయ్యాడు. తమవాడిని తలచుకుని.. శ్రీనివాస్‌ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
అటు, ఒలాతేలో శ్వేతజాతీయుడి కాల్పుల్లో గాయపడ్డ మరో తెలుగువాడు, అలోక్‌ కుటుంబాన్నీ జరిగిన దారుణం దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్‌లోని వాసవి కాలేజీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి, కన్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరీలో మాస్టర్స్‌ డిగ్రీ పొందిన అలోక్‌ కూడా.. గార్మిన్‌ కంపెనీలోనే పనిచేస్తున్నారు. జరిగిన దారుణంపై.. అలోక్‌ కుటుంబం తీవ్ర కలవరానికి గురైంది. అమెరికాలో జీవించే పరిస్థితులు మృగ్యమవుతున్నాయని, బుధవారం నాటి కాల్పుల ఘటన నిరూపిస్తోందని అలోక్‌ కుటుంబ సభ్యులు అంటున్నారు.
అమెరికాలో జాత్యహంకార దుండగుడు పురింటన్‌ జరిపిన కాల్పుల్లో తెలుగు ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌ కూచిబొట్ల మృతిపట్ల కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబం ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సంతాపం వ్యక్తం చేశారు. అటు శ్రీనివాస్‌ మృతిపట్ల, గార్మిన్‌ కంపెనీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. శ్రీనివాస్‌ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు భారత విదేశాంగ శాఖ, గార్మిన్‌ కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించాయి.

21:18 - February 24, 2017

హైదరాబాద్ : దేవుళ్లకు మొక్కులు సమర్పించే విషయంలోనూ కొందరు విమర్శలు చేస్తున్నారంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విరుచుకుపడ్డారు. మరికొందరేమో ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యమకాలపు మొక్కుల చెల్లింపులో భాగంగా.. ఆయనీరోజు కురవి వీరభద్రస్వామికి బంగారు కోర మీసాలు సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఉద్యమకాలపు మొక్కులను వరుసబెట్టి చెల్లిస్తున్నారు. మొన్నటికి మొన్న, ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో.. తిరుమలేశునికి స్వర్ణ సాలగ్రామ హారం, బంగారు కంటెలను సమర్పించిన కేసీఆర్‌.. శివరాత్రి పర్వదినాన, మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి వీరభద్రస్వామికి, సుమారు 63 వేల రూపాయలతో చేయించిన, బంగారు కోరమీసాలను సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరిన ముఖ్యమంత్రికి.. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోకి చేరిన కేసీఆర్‌, స్వామివారికి మొక్కు చెల్లించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. పూజాకార్యక్రమాల తర్వాత, ముఖ్యమంత్రి స్థానికంగా మాట్లాడుతూ.. మొక్కులపై విమర్శలు చేస్తున్నవారిపై విరుచుకుపడ్డారు.

పార్టీలపై విమర్శలు..
అందరూ బాగుండాలని తలపెట్టిన యాగంపై సురవరం సుధాకరరెడ్డిలాంటి వారు విమర్శలు చేయడం సరికాదన్నారు. మొక్కుల విషయంలో కాలం చెల్లిన కమ్యూనిస్టులు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని వీరభద్ర స్వామిని మొక్కుకున్నానని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులపైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ విరుచుకుపడ్డారు. 40 ఏళ్లు తెలంగాణను పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏమీ చేయలేదన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని.. స్పష్టమైన ఆధారాలతో కాంగ్రెస్ నాయకులను అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ కల్చర్ చీప్ లిక్కర్ పంచే కల్చర్ అని.. కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులని దుయ్యబట్టారు. ఆంధ్రా ముఖ్యమంత్రులకు సంచులు మోసిన చరిత్ర కాంగ్రెస్ నేతలదంటూ ఎండగట్టారు. కురవి వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 5 కోట్లు, డోర్నకల్, మరిపెడ అభివృద్ధికి రూ. కోటి చొప్పున.. డోర్నకల్ నియోజకవర్గంలోని 77 గ్రామపంచాయతీలకు రూ. 25 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో టెక్స్‌టైల్స్ పార్కుకు భూసేకరణ పూర్తయ్యిందని.. త్వరలోనే టెక్స్‌టైల్స్ పార్కుకు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నేలా పాత వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.

21:16 - February 24, 2017

విజయవాడ : అప్పుడు హైదరాబాద్‌కు హైటెక్‌ హంగులు సమకూర్చాను.. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఇపుడు అమరావతిని టెక్నాలజీ హబ్‌గా మారుస్తాన్నన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మేథోసంపత్తి, వాణిజ్యపరమైన అంశాలపై విజవాడలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. టెక్నాలజీ సాయంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం విభాగాల్లో రియల్‌టైం గవర్నెన్స్‌కోసం కృషిచేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచంలోని ఐదు గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతితో పాటు విశాఖ, తిరుపతిలో వాణిజ్య కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. విజవాడలో జరిగిన వర్క్‌షాప్‌లో.. రాష్ట్ర అభివృద్ధిపై ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

పండ్లతోట పెంపకం, ఆక్వా కల్చర్‌ అభివృద్ధికి చర్యలు..
రాష్ట్ర విభజనతో అభివృద్ధిని మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఓవైపు రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నంగరంగా తీర్చిదిద్దుతూనే.. మరోవైపు రాష్ట్రంలోని పేదప్రజల సంక్షేమంకోసం.. ఆర్థిక అభివృద్ధికోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయాధిరితంగా ఉండే పాడి పరిశ్రమతోపాటు, గొర్రెలు, మేకల పెంపకానికి సహకారం అందిస్తామన్నారు. దాంతోపాటు రాష్ట్రంలో ఆక్వాకల్చర్‌ అభివృద్ధికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి.

రూ. 145కే 15mbps స్పీడ్‌తో నెట్‌ ..
హైదరాబాద్‌ను నాలెడ్జ్ ఎకానమీగా.. గ్రాండ్ ఫీల్డ్ సిటీగా తీర్చి దిద్దానని.. అదే ఉత్సాహంతో ఇప్పుడు అమరావతిని గ్రీన్ సిటీగా రూపొందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. డ్రోన్లు, సీసీకెమెరాలు, బయోమెట్రిక్‌ సెన్సర్ల ద్వారా ప్రభుత్వంలోని అన్ని భిభాగాల్లో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కోసం కృషి చేస్తున్నామన్నారు. దీన్లోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ బల్బులను సెన్సార్ల ద్వారా పర్యవేక్షించే ఏర్పాట్లు చేస్తున్నట్టు బాబు చెప్పారు. 2017 ను ప్రగతి సంవత్సరంగా ప్రకటించి.. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్నామన్నారు. ప్రజలందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా కేవంలం 145రూపాయలకే 15ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ అందిస్తామన్నారు. ప్రాచీన కాలంలో అమరావతి నుంచే విదేశాలకు బౌద్ధ ధర్మం వ్యాపించిందని.. అదే స్ఫూర్తితో ఆధునిక అమరావతిని ప్రపంచంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ మదన్ బి.లోకూర్, ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి తదితరులు పాల్గొన్నారు.

21:13 - February 24, 2017

విజయవాడ : సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు అంశాలు సమతూకంగా ఉండేలా కొత్తబడ్జెట్‌ అంచనాలు రూపొందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆర్థిక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్త బడ్జెట్‌ రూపకల్పనలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అన్ని వర్గాలను సంతృప్తి కలిగించేలా ఈ ఏడాది అంచనాలు రూపొందించాలని ఆర్థిక వాఖ అధికారులకు బాబు సూచించారు. 2017-18 బడ్జెట్‌ను ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద విభజించడం లేదని.. దీంతో ఆయా శాఖలు తమ అవసరాలకు అనుగుణంగా సమర్పించిన అంచనాలకు తగ్గట్టు కేటాయింపులు ఉండాలని ఆర్థిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుంటూనే.. ప్రజాసంక్షేమ పథకాలపై తగిన కేటాయింపులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్‌లతో పాటు కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు, మైనారిటీ సంక్షేమంపై తగిన కేటాయింపులు ఉండేలా అధికారులకు సూచించారు చంద్రబాబు. దాంతో పాటు వ్యవసాయం, వైద్య, విద్య రంగాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు.

ప్రగతి లక్ష్యం..
డిసెంబర్‌ 2018 నాటికి అన్నిరంగాల్లో స్పష్టమైన ప్రగతి సాధించాలన్న లక్ష్యం పెట్టుకున్నందున రాబోయే బడ్జెట్‌ రాష్ట్రానికి కీలకం కానుందన్నారు చంద్రబాబు. అటు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు వీలుగా ఏఏ శాఖలకు ఎంత మేర నిధులు కేటాయించాలన్న దానిపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. ఈసారి బడ్జెట్లో యువత- మహిళా సంక్షేమం, అభివృద్ధి పైనే కేటాయింపులు ఉండేలా బాబు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రత్యే ప్రధాన కార్యదర్శులు, సతీష్‌చంద్ర, అజయ్‌కల్లం, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

సర్పంచ్ భర్త నాగిరెడ్డి దురహంకారం..

యాదాద్రి : మోటకొండూరు (మం) కాటేపల్లిలో సర్పంచ్ భర్త నాగిరెడ్డి దురహంకారం ప్రదర్శించాడు. తన మాటను ధిక్కరించి మద్యం టెండర్లలో పాల్గొనలేదని గౌడ్స్ ను గ్రామ బహిష్కరించినట్లు సర్పంచ్ భర్త నాగిరెడ్డి డప్పు చాటింపు చేయించాడు. గ్రామస్తులెవరూ గౌడ్స్ కు సహకరించకూడదని ఆదేశించాడు.

20:48 - February 24, 2017

చలో ఇగ తెలంగాణ ప్రజలారా..? ఇయ్యాళటి నుంచి అంటే శివరాత్రి పొద్దు సంది మీ కష్టాలన్ని తీరిపోయినట్టే.. సర్కారు..సింగరేణి సంస్థ మోసం చేస్తోందా..మా నాయినలు మూడేండ్ల సర్వీసు ఇడ్సిపెట్టి వీఆర్ఎస్ దీస్కున్నరు మరి మా సంగతేందంటున్నరు..మనం అప్పుడప్పుడు పోలీసోళ్లను మస్తు బనాయిస్తుంటం అట్ల జేస్తరు ఇట్ల జేస్తరు అని కని.. పోలీసోళ్లు గూడ అప్పుడప్పుడు మంచిపనులు జేస్తుంటరు..చెయ్యి ఇర్గినోనికి రూపాయి బ్యాండెజి గొన్కొచ్చి కట్టు గడ్తె ఎట్లుంటదో.. అగో సేమ్ ఆదిలాబాద్ జిల్లాల తాగునీళ్ల తన్లాటకు సర్కారు జేస్తున్న ఏర్పాటు గూడ అట్లనే ఉన్నది..దేవస్థానం కాడ గీ రికార్డింగ్ డ్యాన్సులేంటియిరా నాయనా అని పోలీసోళ్లు.. మా ఆత్మగౌరవమని కూసున్నోళ్లు..శివరాత్రినాడు ఒక గుడిలె అయ్యె గమ్మతి ముచ్చట..గిసొంటి ముచ్చట్ల కోసం వీడియోను క్లిక్ చేయండి..

20:40 - February 24, 2017

అమెరికాలో భారతీయులకు భద్రత లేనట్టేనా? పక్కనే ప్రమాదం పొంచి ఉన్నట్టేనా? వరుసగా జరుగుతున్న ఘటనలు ఏం చెప్తున్నాయి? నెత్తికెక్కిన జాత్యహంకారం లక్షలాది భారతీయలు భవితను ప్రశ్నార్ధకంగా మారుస్తోందా? డాలర్ డ్రీమ్స్, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలతో అమెరికా చేరిన ఎందరో తెలుగు వారి పరిస్థితి ఇప్పుడేంటి? భయం గుప్పిట్లో బతకాల్సిందేనా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ.. అంతెత్తున కనిపిస్తుంది. స్వేచ్ఛ సమానత్వం.. అవకాశాలు.. అంటూ నినాదాలు వినిపిస్తాయి. కానీ, అదంతా మాటలకే పరిమితమా? అమెరికా ఇక ఎంత మాత్రం సేఫ్ కంట్రీ కాదా? ట్రంప్ లాంటి వాడి పాలనలో.. జాత్యహంకారం జీర్ణించుకున్న ప్రజలు పెరుగుతున్న సమయంలో అమెరికాలో భారతీయులు ప్రమాదంలో పడినట్టేనా?

రక్త చిందింది..
కాన్సస్ బార్ లో రక్తం చిందింది.. ఇద్దరు తెలుగు యువకులపై కాల్పులు జరిగాయి. ఒకరు మరణించారు.. మరొకరు గాయాలపాలయ్యారు.. నిట్టనిలువునా జీర్ణించుకున్న జాత్యహంకారం తుపాకీ పట్టి రాజ్యమేలుతుంటే అక్కడి తెలుగు వారు గజగజ వణకాల్సిన పరిస్థితి ఏర్పడుతోందా? ఇది మొదటిదేం కాదు.. గతంలో కూడా ఎన్నో ఘటనలు జరిగాయి. ఓ పక్క అమెరికాలో పెరుగుతున్న క్రైమ్ రేట్ .. గన్ కల్చర్ నేరాల సంఖ్య పెరగటానికి కారణం అవుతుంటే, ట్రంప్ వచ్చిన తర్వాత మరో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అసంతృప్త అమెరికన్ వైట్స్ తెగించి దాడులకు దిగుతున్నారు.. తమనెవ్వరేం చేయలేరనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.. వరుస ఘటనలు అనేక భయాలు.. దేశం కాని దేశంలో రక్షణ ఎంత? ప్రజాస్వామ్యం, సమానత్వం, రక్షణ అంటూ నినాదాలిచ్చే అమెరికాలో ఇప్పుడు భారతీయులు టార్గెట్ గా మారారా? ఈ ఘటనలు ఏ సంకేతాలిస్తున్నాయి?

సర్వమానవ సమానత్వమే అంతిమ గమ్యం..
ఏ దేశమైనా, కులం, మతం, వర్ణం, జాతి లాంటి జాడ్యాలను పట్టుకువేలాడితే ఏనాటికీ ముందడుగు వేయలేదు. అది అమెరికా, అయినా భారత్ అయినా సర్వమానవ సమానత్వమే అంతిమ గమ్యం కావాలి. అదే ప్రజాస్వామ్యాన్ని వేయి చేతులతో కాపాడుతుంది. లేదంటే రాతియుగపు ఆనవాళ్లతో ఆ సమాజానికి అధోగతి తప్పదు.. ఇప్పుడు అమెరికాలో జరిగిన ఘటన నేర్పే పాఠాలివే. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

తెలంగాణలో వీఆర్ఏల జీతాలు పెరిగాయి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏల జీతాలను పెంచుతూ టి.సర్కార్ నిర్ణయం తీసుకుంది. 64.61 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జీతం రూ. 6500 నుండి రూ. 10,500లకు పెరగనుంది. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. 19,345 వీఆర్ఏలకు లబ్ది చేకూరనుంది. వీఆర్వో, అటెండర్, డ్రైవర్, ఉద్యోగ నియామకాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. వీఆర్ఏలను వీఆర్ఏ అని మాత్రమే సంబోంధించాలని సూచించారు. వీఆర్ఏలకు సొంత ఊరులోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించనున్నట్లు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయాలని సూచించారు.

కోయంబత్తూరులో ప్రధాని..

తమిళనాడులోని కోయంబత్తూరుకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఈశా యోగ కేంద్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో ఆదియోగి పేరిట 112 అడుగుల భారీ మహాశివుడి ముఖం లోహ విగ్రహాన్ని వెల్లియంగిరి కొండల్లో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆదియోగి విగ్రహం, పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

19:58 - February 24, 2017

అమెరికాలో జాతి వివక్ష మళ్లీ జడలు విప్పుకుంది. ఎన్నికల ప్రచార వేళ.. డొనాల్డ్‌ ట్రంప్‌ నాటిన విద్వేషపు బీజాలు.. అప్పుడే మొగ్గతొడుగుతున్నాయి. జాతివివక్ష తలకెక్కిన ఓ తెల్లజాతీయుడి విచక్షణ రహిత చర్యకు.. ఓ భారతీయుడు బలయ్యాడు. మరొకరు గాయపడ్డారు. మృతుడు, క్షతగాత్రుడూ తెలుగువారు కావడం గమనార్హం. అమెరికాలో నరనరానా జాతి వివక్షతను నింపుకున్న ఓ తెల్లజాతీయుడు.. ఇద్దరు తెలుగువారిపై తూటాలు పేల్చాడు. ఇందులో వరంగల్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ కూచిబొట్ల అక్కడికక్కడే మరణించగా.. అలోక్‌ మాదసాని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కన్సాస్‌ రాష్ట్రం ఓలాతేలో జరిగింది. ఈ అంశంపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో నగేష్ (విశ్లేషకులు), నారాయణ స్వామి (అమెరికాలో స్థిర పడిన తెలుగు వాసి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

19:56 - February 24, 2017

భాను చందర్..అలనాటి హీరో..ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో హీరోగా అనేక సినిమాల్లో నటించిన భానుచందర్ ఆ తర్వాత తన వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తున్నారు. హీరో..హీరోయిన్ల తండ్రి పాత్రల్లోనూ, ప్రత్యేక హోదా కలిగిన పాత్రల్లోనూ అయన నటిస్తున్నారు. 'మిక్చర్ పొట్లాం' అనే చిత్రంలో ఆయన నటిస్తున్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. ఈసందర్భంగా ఆయన పలు విశేషాలను తెలియచేశారు. త్వరలోనే తన డైరెక్షన్ లో ఓ చిత్రం రూపొందుతోందని వెల్లడించారు. మరి ఆయన ఎలాంటి విశేషాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి.

18:41 - February 24, 2017

టుడే అవర్ రీసెంట్ రిలీజ్  "విన్నర్ ’'. 'సాయి ధరమ్ తేజ్'  హీరోగా నటించిన ‘విన్నర్ ’ సినిమా ఇవాళ్టి మన నేడే విడుదల రివ్యూ టైం లో ఉంది. 'పిల్ల నీవు లేని జీవితం' సినిమాతో తన ఫిలిం కెరీర్ ని స్టార్ట్ చేసిన మెగా ఫామిలీ హీరో 'సాయి ధరమ్ తేజ్'.  యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ తో 'విన్నర్' గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మెగా ఫామిలీలో చాల స్పీడ్ గా సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తూ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కి దగ్గరైన హీరో 'సాయి ధరమ్ తేజ్'. 'విన్నర్' సినిమాలో తన ప్రేమను గెలిపించుకునే ప్రేమికుడిగా యాక్ట్ చేసాడు.

డైరెక్టర్ గోపిచంద్..
యాక్షన్ లో లవ్ మిక్స్ చేసి మాస్ ని అట్రాక్ట్ చెయ్యగల డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఇతని  డైరెక్షన్ లో వచ్చిన విన్నర్ వరల్డ్ వైడ్ గా ఇవాళ  రిలీజ్ అయింది. ఎనర్జిటిక్ హీరో సాయిధరమ్ తేజ్, బ్యూటీ టాలెంటెడ్ రకుల్ ప్రీత్ సింగ్, ట్రెండీ విలన్ జగపతిబాబు   నటించిన ఈ సినిమాకి నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మాతలు. ఈ సినిమా కి  థమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళింది. ఒక క్యూట్ లవ్ స్టోరీకి హార్స్ రేస్ ని కనెక్ట్ చేసి ఆడియన్స్ని కట్టిపడేసే ప్రయత్నం చేసాడు డైరెక్టర్.

మంచి రెస్పాన్స్..
ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లోనే పవర్ఫుల్ డైలాగ్స్ ని చూపించిన 'సాయి ధరమ్ తేజ్' మంచి మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 'రకుల్ ప్రీత్ సింగ్' అథ్లెట్ గా నటించిన ఈ సినిమాలో స్క్రీన్ మీద గ్లామర్ ని స్ప్రెడ్ చేసింది. ఈ సినిమాలో జగపతిబాబుతో పాటు అనూప్ ఠాకూర్ మరో విలన్ గా నటించారు. మరి ఈ ‘విన్నర్ ’ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసింది ? ఎంత వరకు రీచింగ్ అయ్యింది ? టెన్ టివి రేటింగ్ ఎంతో వీడియో క్లిక్ చేయండి.

18:29 - February 24, 2017

విశాఖపట్టణం : కాసేపట్లో అమెరికా వెళ్లాల్సిన కొడుకు..సెండాఫ్ ఇవ్వాల్సి తల్లి..వీరిద్దరూ అనుమానస్పదస్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. గొల్లపాలెంలో భాగ్యలక్ష్మీ నివాసం ఉంటోంది. విబేధాల కారణంగా భర్తతో ఆమె విడిగా ఉంటున్నారు. భాగ్యలక్ష్మీ కొడుకు ఫణీకుమార్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. 8 రోజుల క్రితం ఇక్కడకు వచ్చిన ఫణీకుమార్ శుక్రవారం అమెరికాకు వెళ్లాల్సి ఉంది. రాత్రి ఇంటిలో నుండి కేకలు వినిపించడంతో స్థానికులు వారి ఇంటి తలుపులు బద్దలుగొట్టి లోనికి వెళ్లారు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. వారిద్దరూ మంటల్లో కాలిపోయారు. పూజ గదిలో ఫణీకుమార్ మృతదేహం ఉండగా హాల్ లో భాగ్యలక్ష్మీ మృతదేహం ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దీప కొత్త పార్టీ..

చెన్నై : కొత్త పార్టీని జయ మేనకోడలు దీప ప్రకటించారు. కొత్త పార్టీ..లోగోను ఆమె ఆవిష్కరించారు. దీప కొత్త పార్టీ 'ఎంజీఆర్ అమ్మ దీప పేరవై' పేరును ఖరారు చేశారు. ఆర్కే నగర్ నుండి పోటీ చేస్తానని దీప ప్రకటించారు.

17:51 - February 24, 2017

ఎండాకాలం వచ్చేస్తోంది. అంతేగాకుండా పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. పది..ఇంటర్..యూనివర్సిటీ..గ్రూప్స్..బ్యాంక్ వంటి ఇతరత్రా పరీక్షలు ఈ సీజన్ లో జరుగుతున్నాయి. ఏడాది అంతా చదివిన దానికి గీటురాయి. ప్రస్తుతం చలి పూర్తిగా తగ్గి ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. పదోతరగతి నుంచి డిగ్రీ వరకు చదివే పిల్లలు అంటే ఎదిగే వయసులో ఉన్నట్టు లెక్క. పరీక్షల సందర్భంగా చదివేందుకు సరియైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.

 • ఉదయం, మధ్యాహ్నం తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, పిండి పదార్థాలు తప్పనిసరి.
 • గ్లాస్‌ పాలు, నాలుగు బిస్కెట్లు కాకుండా అల్పాహారంలో ఇడ్లీ, దోశ, చపాతి, జొన్నరొట్టె , కిచిడి వంటివి ఉండేలా చూడాలి.
 • అంతేకాదు అల్పాహారంతో పాటు ఫ్రూట్స్‌ , వెజిటేబుల్‌ సలాడ్స్, నానపెట్టిన ధాన్యాలు ఇవ్వాలి.
 • ప్రతి రెండు గంటలకు ఒకసారి కొద్దిగానైనా ఆహారం తీసుకునేలా చూడాలి.
 • పండ్లు ఎక్కువగా ఇవ్వాలి. పిల్లల్లో చురుకుదనం పెంచేందుకు పోషకాహారం ఉపయోగపడుతుంది. మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి.
 • పరీక్షల సమయంలో పిల్లలపై మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనిని జయించాలంటే తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
 • స్ట్రెస్‌గా అనిపించినప్పుడు కాసేపు నడవడం ఎంతో మంచిది. అలసటగా కనిపిస్తే.. ఐదు నిమిషాల పాటు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి.
 • ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర ఎంతో ముఖ్యం.
 • తప్పనిసరిగా రోజుకు ఆరుగంటల పాటు నిద్రపోవాలి. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టకుండా శ్రద్దగా కొద్ది సమయం చదివినా మంచి మార్కులు సాధించవచ్చు.
17:26 - February 24, 2017

సంగారెడ్డి : జిల్లాలోని ఝరాసంగం సంగమేశ్వర ఆలయంలో ఎంపీ బీబీ పాటిల్ దురుసుగా ప్రవర్తించారు. ఆయన ఆలయాన్ని సందర్శించగా పలువురు మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తున్నారు. ఓ మీడియా ప్రతినిధి ఫొటోలు తీస్తుండగా పాటిల్ చేయి చేసుకున్నారు. దీనికి ఆగ్రహించిన మీడియా ప్రతినిధులు ఆలయంలో నిరసన వ్యక్తం చేశారు. ఆలయంలోకి వచ్చిన డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులకు బీబీ పాటిల్ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. గతంలోనూ ఎంపీ బీబీ పాటిల్ ఇదే తరహాలో దురుసు ప్రవర్తన చేశారని పలువురు ఆరోపించారు.

17:17 - February 24, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అప్ర్పుడే ఎండలు మండిపోతున్నాయి. శివరాత్రికి చలి శివ..శివ అంటూ వెళ్లిపోతుందని అనంతరం ఎండలు మెల్లిగా అధికమౌతాయని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి మాసంలోనే ఎండలు అదరగొడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 26-31 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రత శుక్రవారం ఒక్కసారిగా మారిపోయింది. ఫిబ్రవరి నెలాఖరులో పరిస్థితి ఈ విధంగా ఉంటే మే నెలలో ఎండలు ఎలా ఉంటాయోనని ఇప్పటి నుండే ప్రజలు భయపడుతున్నారు. హైదరాబాద్ లో 37 డిగ్రీలు..రాయలసీమ ప్రాంతమైన కర్నూలులో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.
హైదరాబాద్ లో 37 డిగ్రీలు, నిజామాబాద్ లో 36, మెదక్ లో 34 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 35, ఖమ్మం 39, నల్గొండలో 38 డిగ్రీలు, కరీంనగర్ లో 37, సిద్దిపేటలో 36. వరంగల్ లో 37 డిగ్రీలు, విజయవాడలో 36, గుంటూరులో 38, ఏలూరులో 38 డిగ్రీలు, ఒంగోలులో 35, కర్నూలులో 40, అనంతపురంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

17:03 - February 24, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ప్రముఖ డైరెక్టర్ 'ఏ.ఆర్.మురుగదాస్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా 'మహేష్' కనిపించనున్నట్లు టాక్. సామాజిక అంశాలను మేళవించి సినిమాలను 'మురుగ దాస్' రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఓ సామాజిక కోణాన్ని సృశించినట్లు తెలుస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. చిత్ర షూటింగ్ మాత్రం షరవేగంగా జరుగుతున్నా చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఇంకా విడుదల కాలేదు. ఆఖరికి సినిమాకు పేరు కూడా పెట్టలేదు. దీనితో సినిమాపై ఇంకా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. తాజాగా మురుగదాస్ చిత్ర రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు. తమ సినిమాను జూన్ 23న రిలీజ్ చేయనున్నట్టు మురుగదాస్ ఓ ట్వీట్ చేశాడు. జూన్ 23న థియేటర్లలో తమ ఆతిథ్యం స్వీకరించాలని, ఆ రోజు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్టు అందులో పేర్కొన్నాడు.

లండన్ లో టీజర్..
ఇదిలా ఉంటే చిత్ర టీజర్ విషయంలో మురుగదాస్ భారీ కసరత్తులే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిలిం మేకింగ్ లో జాగర్తపడే డైరెక్టర్ మురుగదాస్ ఈ సినిమా టీజర్ కి భారీగానే ఖర్చు పెట్టిస్తున్నారు.ఈ చిత్ర టీజర్ లండన్లో రెడీ అవుతుండటం విశేషం. అక్కడ వీఎఫ్ఎక్స్ నిపుణులతో కలిసి ఓ ప్రత్యేక బృందం టీజర్ తీర్చిదిద్దుతోందట. నిడివి తక్కువే అయినా ఇంపాక్ట్ గట్టిగా ఉండేలా ఈ టీజర్‌ను మలిచే ప్రయత్నంలో ఉన్నారట. కచ్చితంగా ఈ టీజర్ తెలుగు.. తమిళ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. టీజర్ లేటైనా ఎక్కడ స్టాండర్డ్స్ తగ్గకుండా ఉంటుందని ఫిలిం యూనిట్ టాక్.

వీఆర్ఏ సమస్యలపై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : వీఆర్ ఏ సమస్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు మహమూద్ ఆలీ, కేటీఆర్, చందూలాల్, ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు.

ముగిసిన రెండో రోజు ఆట..

పూణె : భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లకు 143 పరుగులు చేసింది. మొత్తంగా 289 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా కొనసాగుతోంది. క్రీజులో స్మిత్ 59, మిచెల్ మార్ష్ 21 ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ కు 3, జయంత్ కు ఒక వికెట్ దక్కింది.

16:31 - February 24, 2017
16:22 - February 24, 2017

కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అసమర్థుడని, మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. సొంత ఊరిలోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేని అసమర్థపు మంత్రి రాష్ట్రమంతా కట్టిస్తాడా అని ప్రశ్నించారు. హౌసింగ్ జేవీ ప్రాజెక్టులో పేదల ఇళ్లను రద్దు చేసి మంత్రి భారీ అవినీతికి పాల్పడ్డారని రేవంత్ ఫిర్యాదు చేశారు.

 

జయ మృతిలో మిస్టరీ లేదు - పళనిస్వామి..

చెన్నై : జయలలిత మృతిలో ఎలాంటి మిస్టరీ లేదని సీఎం పళని స్వామి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కరవుతో నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ఐదు రోజుల్లో అందిస్తామని పేర్కొన్నారు.

15:59 - February 24, 2017

చేపదుంపలు..కూరగాయాల్లో ఒక రకం. కేవలం ఇది రుచికోసమే కాకుండా పోషకాలు కూడా అందిస్తుంది. వేపుడు..పులుసు పెట్టుకొంటే దీని టేస్ట్ వేరేగా ఉంటుంది. కానీ ఇది తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బరువు తగ్గాలనుకొనే వారు చేమ దుంపలకు అధిక ప్రాధాన్యతనివ్వండి. కొవ్వు శాతం తక్కువగా ఉంమే కాకుండా సోడియం శాతం కూడా తక్కువే.

 • కొలెస్ట్రాల్ అసలు ఉండదు. హృద్యోగాలు బాధించవు. రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 • శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఇన్ ఫెక్షన్లను దూరం చేస్తుంది.
 • రక్తలంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
 • శరీరంలో పీచు, యాంటిఆక్సిడెంట్లు మాదిరి పనిచేస్తాయి.

కురవి ఆలయ అభివృద్ధికి రూ. 5 కోట్లు - కేసీఆర్..

హైదరాబాద్ : కురవి ఆలయ అభివృద్ధికి రూ. 5 కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వరంగల్ టెక్స్ టైల్స్ పార్క్ కు త్వరలో శంకుస్థాపన చేస్తామని, 77 గ్రామ పంచాయితీలకు రూ. 25 లక్షల చొప్పున కేటాయిస్తున్నట్లు..సంచార జాతుల అభివృద్ధికి రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతలవి చిల్లర రాజకీయాలు చేస్తోందని, అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలని, చిల్లర రాజకీయాల కోసం రైతుల పొట్ట కొట్టొద్దన్నారు. 40 ఏళ్లు కాంగ్రెస్ నాయకులు పాలించి ఏం ఒరగపెట్టారన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్వాసితులకు రూ.

15:30 - February 24, 2017

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త మూవీ దువ్వాడ జగన్నాథమ్‌ టీజర్‌ విడుదలైంది. మహాశివరాత్రిరోజు విడుదలచేసిన ఈ టీజర్‌లో బన్నీ బ్రాహ్మణుడి గెటప్‌లో సందడి చేస్తున్నాడు.... హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

15:27 - February 24, 2017

హైదరాబాద్ : శివరాత్ని పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగిపోతున్నాయి.

కర్నూలులో..
కర్నూలు జిల్లా శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది... అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగాఉన్న శ్రీశైలం ఆలయం శివనామస్మరణతో మారుమోగుతోంది. ఆలయప్రాంగణంలో శివస్వాములు భక్తిశ్రద్ధలతో ధ్యానం చేసుకుంటున్నారు. తెల్లవారుజామునుంచే భక్తులు ఈ మహాక్షేత్రానికి తరలివచ్చారు. పుణ్యస్నానాలుచేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.

వరంగల్ లో..
వరంగల్‌లో ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, కీర్తినగర్‌లోని కోటిలింగాల ఆలయంలో ఉదయంనుంచి భక్తులు బారులుతీరారు. స్వామివారికి అభిషేకాలు, బిల్వపత్రాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

కాళేశ్వరాలయంలో..
దక్షిణకాశీగా పేరుగాంచిన కాళేశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. త్రివేణి సంగంలో పుణ్యస్నానాలుచేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలనుంచి భక్తులు స్వామివారి దర్శనంకోసం వస్తున్నారు.

విజయవాడలో...
విజయవాడలో శివన్మాసరణతో శివగిరి ఆలయం మారుమోగింది. ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివగిరి ఆలయ విశిష్టత గురించి ఆలయ అర్చకులు టెన్ టివికి తెలియచేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి....

15:20 - February 24, 2017

హైదరాబాద్ : అమెరికాలో నరనరానా జాతి వివక్షతను నింపుకున్న ఓ తెల్లజాతీయుడు.. ఇద్దరు తెలుగువారిపై తూటాలు పేల్చాడు. ఇందులో వరంగల్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ కూచిబొట్ల అక్కడికక్కడే మరణించగా.. అలోక్‌ మాదసాని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కన్సాస్‌ రాష్ట్రం ఓలాతేలో జరిగింది. ఈ కాల్పుల ఘటనపై అలోక్ రెడ్డి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాల్పులు జరిగిన సమయంలో అలోక్ రెడ్డి పరుగెత్తడంతో ప్రాణాలు రక్షించుకున్నాడని, కూచిభొట్ల శ్రీనివాస్ తో పాటు అలోక్ రెడ్డి, మరో మిత్రుడితో కలిసి హోటల్ కు వెళ్లారని తెలిపారు. ఈ సమయంలో ఆడమ్ అనే వ్యక్తితో గొడవ జరిగిందని, మాట్లాడుతుండగానే హఠాత్తుగా అడమ్ కాల్పులుకు తెగబడ్డాడని పేర్కొన్నారు. కాల్పులు జరుపుతున్న వ్యక్తిని అడ్డుకొనే క్రమంలో అమెరికన్ మిత్రుడు యామ్ కూడా గాయపడ్డాడని అలోక్ రెడ్డి బంధువులు వెల్లడించారు. వరుసుగా జరుగుతున్న దాడులతో అమెరికాలోని తెలుగు ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితిని ఐక్యంగా ఎదుర్కొవాలని, దాడుల నుండి తప్పించుకోవడానికి రక్షణ చర్యలు తీసుకోవాలని అలోక్ రెడ్డి బంధువులు కోరుతున్నారు.

శనివారం శివారెడ్డి అంత్యక్రియలు - మధు..

గుంటూరు : రేపు ఉదయం 10గంటలకు కాజ గ్రామంలో శివారెడ్డి అంత్యక్రియలు జరుగనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వెల్లడించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని, కామ్రేడ్ సింహాద్రి శివారెడ్డి గొప్ప కమ్యూనిస్టు యోధుడన్నారు. పార్టీ పిలుపుతో సొంత ఆస్తినే నమ్ముకుని తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసిన నేతల్లో ప్రథముడని తెలిపారు.

తీర్థాల జాతరలో స్తంభించిన ట్రాఫిక్..

ఖమ్మం : తీర్థాల జాతరలో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. భక్తుల తీవ్ర ఇబ్బందులు పడుతుండగా పోలీసులు చేతులెత్తేశారు.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అప్ర్పుడే ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం శివరాత్రి పండుగ రోజున హైదరాబాద్ లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయైంది. నిజామాబాద్ లో 36, మెదక్ లో 34 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 35, ఖమ్మం 39, నల్గొండలో 38 డిగ్రీలు, కరీంనగర్ లో 37, సిద్దిపేటలో 36. వరంగల్ లో 37 డిగ్రీలు, విజయవాడలో 36, గుంటూరులో 38, ఏలూరులో 38 డిగ్రీలు, ఒంగోలులో 35, కర్నూలులో 40, అనంతపురంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సింహాద్రి మృతికి సీపీఎం తెలంగాణ కమిటీ సంతాపం..

ఖమ్మం : సీపీఎం సీనియర్ నేత కామ్రేడ్ సింహాద్రి శివారెడ్డి మృతికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో సింహాద్రి శివారెడ్డి కీలక పాత్ర పోషించారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యాదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

14:30 - February 24, 2017

ఖమ్మం : సూర్యాపేట్‌ జిల్లా హుజూర్‌లో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. హుజూర్‌నగర్‌కువచ్చిన పాదయాత్ర బృందానికి సీపీఎం నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పాదయాత్ర బృందానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మద్దతు తెలిపారు. 131రోజులుగా పాదయాత్ర చేస్తున్న సీపీఎం బృందం ఇవాళ చిలుకూరు, సీతరాంపురం, మాధవరేణిగూడెం, గోపాలపురం, రాయనిగూడెం, కీతవారిగూడెంలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా సీపీఎం, తమ్మినేని జరుపుతున్న పాదయాత్రపై ఉత్తమ్ కుమార్ ప్రశంసలు కురిపించారు.

14:28 - February 24, 2017

గుంటూరు : గుంటూరు జిల్లాకు చెందిన సీపీఎం సీనియర్‌ నేత సింహాద్రి శివారెడ్డి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. గుంటూరు జిల్లా కాజలో 1928లో జన్మించారు. 1944 నుంచి సీపీఎం పార్టీలో ఉంటూ సింహాద్రి శివారెడ్డి ప్రజా సమస్యలపై పోరాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేశారు. సీపీఎం ఏపీ కార్యదర్శి పీ మధు, కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు శివారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
దశాబ్దాలపాటు కమ్యూనిస్టు ఉద్యమానికి, శ్రామికవర్గానికి విశిష్ట సేవలందించారు. సీపీఎం జిల్లా కార్యదర్శిగా, రైతుసంఘం అధ్యక్షులుగా ఎన్నో ఏళ్లపాటు దీక్షతో పట్టుదలతో పనిచేసి ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచారు. గొప్ప సాంస్కృతిక, సాహిత్య చరిత్రకలిగిన కాజగ్రామాన్ని వామపక్ష కేంద్రంగా తీర్చిదిద్దటంలో శివారెడ్డి కృషి ప్రశంసనీయం. శివారెడ్డి కమ్యూనిస్టుగా తనజీవన ప్రస్థానంలోని అనేక విశేషాలను అక్షరీకరించారు. కమ్యూనిస్టు ఉద్యమం తన జీవితానికే వెలుగునిచ్చిందని, ఆ స్ఫూర్తితో జీవిస్తున్నట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

14:26 - February 24, 2017

అమెరికాలో జాతి వివక్ష మళ్లీ జడలు విప్పుకుంది. ఎన్నికల ప్రచార వేళ.. డొనాల్డ్‌ ట్రంప్‌ నాటిన విద్వేషపు బీజాలు.. అప్పుడే మొగ్గతొడుగుతున్నాయి. జాతివివక్ష తలకెక్కిన ఓ తెల్లజాతీయుడి విచక్షణ రహిత చర్యకు.. ఓ భారతీయుడు బలయ్యాడు. మరొకరు గాయపడ్డారు. మృతుడు, క్షతగాత్రుడూ తెలుగువారు కావడం గమనార్హం. అమెరికాలో నరనరానా జాతి వివక్షతను నింపుకున్న ఓ తెల్లజాతీయుడు.. ఇద్దరు తెలుగువారిపై తూటాలు పేల్చాడు. ఇందులో వరంగల్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ కూచిబొట్ల అక్కడికక్కడే మరణించగా.. అలోక్‌ మాదసాని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కన్సాస్‌ రాష్ట్రం ఓలాతేలో జరిగింది. కన్సాస్‌ రాష్ట్రం ఒలాతేలోని గార్నిమ్‌ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్న శ్రీనివాస్‌, అలోక్‌లు, బుధవారం రాత్రి స్థానిక బార్‌కు వెళ్లారు. అక్కడ, అమెరికాకు చెందిన తెల్లజాతీయుడు.. వీరితో గొడవకు దిగాడు. ఆ సందర్భంగా.. మా దేశం నుంచి వెళ్లిపోండి.. ఉగ్రవాదులారా అంటూ జాత్యహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. పరిస్థితి విషమిస్తుండడంతో.. బార్‌ యాజమాన్యం కలుగజేసుకొని.. ఆ వ్యక్తిని బయటకు పంపింది. అయితే.. కాసేపటికే అతను తిరిగి వచ్చి తుపాకితో.. శ్రీనివాస్‌, అలోక్‌లపై కాల్పులు జరిపాడు.

ట్రంప్ వివక్ష..అంశం..
ఈ ఘటనకు కారకుడిగా భావిస్తున్న ఆడమ్‌ పూరింటన్‌ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడచిన 15 రోజుల కాలంలోనే.. అమెరికాలోని దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తెలుగువారు మరణించడం ఆందోళనను కలిగిస్తోంది. ఈనెల 12న కాలిఫోర్నియాలోనే వరంగల్‌కు చెందిన వంశీరెడ్డి.. ఓ యువతిని కాపాడబోయి.. దుండగురి కాల్పులకు బలయ్యారు. తాజాగా శ్రీనివాస్‌ కూచిబొట్ల జాతి వివక్షకు ప్రాణాలు కోల్పోయాడు. అధ్యక్ష ఎన్నికల సమయంలో.. డొనాల్డ్‌ ట్రంప్‌ వివక్ష అంశాన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకున్నాడు. స్థానికుల అవకాశాలను స్థానికేతరులు దోచుకుంటున్నారంటూ అమెరికన్ల మదిలో నాటుకుపోయేలా ఊదరగొట్టాడు. ఫలితంగా.. అమెరికన్లు.. నాన్‌ అమెరికన్‌లపై మండిపడుతున్నారు. ముఖ్యంగా భారతీయులపై తీవ్ర స్థాయిలో అక్కసు వెళ్లగక్కుతున్నారు. దీనికి ఇటీవలి వంశీరెడ్డి, ఇప్పటి శ్రీనివాస్‌ కూచిబొట్ల హత్యలే తార్కాణంగా నిలుస్తున్నాయి.

14:03 - February 24, 2017
14:02 - February 24, 2017
14:01 - February 24, 2017
13:59 - February 24, 2017

పూణే టెస్టు : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 105 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. 11 పరుగుల వ్యవధిలో భారత్ 7 వికెట్లు కోల్పోయింది. భారత జట్టులో 58 పరుగులతో రాహుల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ కు 155 పరుగుల అధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్ స్టీవ్ ఆరు వికెట్లు పడగొట్టి భారత్ నడ్డి విరిచాడు.

 

కేసీఆర్ కానుకల సమర్పణపై కోర్టుకు - శశిధర్ రెడ్డి..

హైదరాబాద్ : తిరుమల వెంకన్నకు సీఎం కేసీఆర్ ఆభరణాలు చెల్లించడం చట్ట విరుద్ధమని టి.కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. కామన్ గుడ్ ఫండ్ నుండి ఆభరణాలకు డబ్బులు తీసుకోవడం చట్ట విరుద్ధమన్నారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. ఇందిరాపార్కు నుండి ధర్నా చౌక్ ను తరలించాలన్న ఆలోచన విరమించుకోవాలన్నారు.

నిరుద్యోగులకు కాంగ్రెస్ అండ - మల్లు రవి..

హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రులపై సర్కార్ నిర్లక్ష్య ధోరణి వీడాలని టి.కాంగ్రెస్ నేత మల్లు రవి వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు.

 

కేసీఆర్ మాటలకు పొంతన లేదు - పొన్నాల..

హైదరాబాద్ : ఉద్యమకారులను సర్కార్ తీవ్రవాదులుగా చూస్తోందని, నీళ్లు..నిధులు..నియామకాల్లో కేసీఆర్ మాటలకు పొంతనలేదని టి.కాంగ్రెస్ నేత పొన్నాల విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంశం అధిష్టాన పరిధిలో ఉందని, జానారెడ్డి సీఎం అవుతారని కోమటిరెడ్డి చెప్పడం ఆయన అవగాహనరాహిత్యమన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినధులే సీఎం అభ్యర్థి ఎన్నుకోవడం కాంగ్రెస్ విధానమని చెప్పుకొచ్చారు.

 

13:49 - February 24, 2017

చెన్నై : తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అవుతోంది. దివంగత  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప ఇవాళ కొట్ట రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. జయలలిత జయంతి సందర్భంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  దీనిలో భాగంగా ఈ ఉదయం నుంచి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చెన్నై టీ నగర్‌లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజకీయ పార్టీ ఏర్పాటు పై ఉదయం నుంచి పలువురు ప్రముఖులతో దీప సంప్రదింపులు జరుపుతున్నారు.  

 

13:46 - February 24, 2017

కడప : ప్రిన్స్ మహేశ్‌ బాబు కొత్త చిత్రాన్ని జూన్‌ 23న రిలీజ్‌ చేస్తామని... మూవీ డైరెక్టర్‌ మురుగదాస్‌ తెలిపారు. సినిమాకు ఇంకా పేరుపెట్టలేదని తెలిపారు. కడపలోని అమీన్‌పీర్‌ దర్గాను ఆయన దర్శించుకున్నారు. దర్గాలో పూల చదార్లనుఉంచి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. మురుగదాస్‌కు స్వాగతంపలికిన దర్గా ప్రతినిధులు... ఆ ప్రాంతం విశిష్టతకు దర్శకునికి వివరించారు. దర్గాకువచ్చినప్పుడు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందని మురుగదాస్‌ తెలిపారు. అంతకుముందు గండికోటలో సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు.

 

పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

విశాఖ : జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. కొయ్యూరు మండలం అన్నవరం అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు నేత జాంబ్రింగ్‌ ఉన్నట్టు అనుమానిస్తున్నారు.  ఘటనా స్థలంలో ఆయుధాలు, కిట్‌బ్యాగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

13:42 - February 24, 2017

విశాఖ : జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. కొయ్యూరు మండలం అన్నవరం అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు నేత జాంబ్రింగ్‌ ఉన్నట్టు అనుమానిస్తున్నారు.  ఘటనా స్థలంలో ఆయుధాలు, కిట్‌బ్యాగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 

13:39 - February 24, 2017
13:38 - February 24, 2017

ప్రముఖ బ్యాడ్మింటెన్ స్టార్ ప్లేయర్ 'పీవీ సింధు' డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహించనున్నారా ? గ్రూప్ 1 హోదాలో ఆమెను ఏపీ ప్రభుత్వం నియమించనుందా ? అంటే ఓ కథనం అవును అంటోంది. ముంబై మిర్రర్ దీనిపై ఆసక్తికరమైన కథనం ప్రచురించింది. 'పీవీ సింధు' బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి అనే సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించి భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించింది. దీనితో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పలు అవార్డులు..రివార్డులు ప్రకటించాయి. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం రూ. 3 కోట్లు నజరానా ప్రకటించడమే కాకుండా రాజధాని అమరావతిలో వేయి గజాల నివాస స్థలం..గ్రూప్ 1 కేటగిరిలో ఆమె ఛాయిస్ కు అనుగుణంగా ఉద్యోగం ఆఫర్ చేస్తున్నట్లుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడలో ఏర్పాటు చేసిన సన్మానసభలోనే సీఎం ప్రకటించారు. ఆ ప్రకటన ప్రకారమే తాజాగా ఏపీ ప్రభుత్వం సింధుకి గ్రూప్ 1 హోదాలో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగ అవకాశాన్ని ఆఫర్ చేసినట్లు కథనంలో పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

13:31 - February 24, 2017

విజయవాడ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అన్ని శాఖల్లో పనితీరు అంచనావేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన 'మేధోసంపత్తి హక్కులపై అంతర్జాతీయ సదస్సుకు ఆయన హాజరై, ప్రసంగించారు. మానవ ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు వస్తున్నాయని... వాటికి తగినట్లుగా ఆయా రంగాల్లో మెరుగైన వృద్ధి సాధిస్తున్నామని చెప్పారు.. ఆక్వా రంగంలో 30శాతం వృద్ధి సాధించామని ప్రకటించారు.. ఒకప్పుడు విద్యుత్ కోతలతో చాలా ఇబ్బందిపడేవాళ్లమని... ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందని గుర్తుచేశారు.. ఈ సమస్యను అధిగమించి మిగులు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సదస్సుకు చంద్రబాబుతోపాటు.. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. 

13:27 - February 24, 2017

వరంగల్ : భద్రకాళి అమ్మవారు, తిరుపతి వెంకటేశ్వరస్వామి మొక్కులు తీర్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు మరో మొక్కు తీర్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కురవికి వెళ్లినప్పుడు ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు మీసాలు సమర్పిస్తామని మొక్కుకొన్న కేసీఆర్‌...ఇవాళ ఆ మొక్కును తీర్చుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి వీరభద్రస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతంరం స్వామివారికి బంగారు మీసాలను సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వదించారు. 

13:23 - February 24, 2017

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 105 పరుగులకు ఆలౌట్

 పుణే టెస్టు : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 105 పరుగులకు ఆలౌట్ అయింది. 

13:19 - February 24, 2017

పండుగలు..హీరో..హీరోయిన్ల జన్మదినాలు..ఇతరత్రా ఫంక్షన్ లకు చిత్ర టీజర్..పోస్టర్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేస్తుంటాయి. శివరాత్రి పండుగ సందర్భంగా పలు చిత్రాల పోస్టర్స్..టీజర్ విడుదలవుతున్నాయి. 'అల్లు అర్జున్' నటించిన 'దువ్వాడ జగన్నాథమ్' (డీజే)..టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. మరొక హీరో 'సునీల్' నటించిన 'ఉంగరాల రాంబాబు' పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 'సునీల్' సరసన 'మియాజార్జ్' కథానాయికగా నటించింది. పోస్టర్ లో 'సునీల్' ఉంగరాలు పెట్టుకుని మంచి జోష్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని, మార్చి రెండొ వారంలో చిత్ర యూనిట్ ఆడియో విడుదల చేయనున్నట్లు పరుచూరి కిరిటీ పేర్కొన్నారు. వేసవి సెలవుల సందర్భంగా 'ఉంగరాల రాంబాబు' విడుదల కానుంది. మరి ఈ ఉంగరాల రాంబాబును ప్రేక్షకులు ఆదరిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

13:17 - February 24, 2017

ఏడుపాయల దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించిన హరీష్ , పద్మాదేవేందర్

మెదక్ : ఏడుపాయల దుర్గాదేవి ఆలయాన్ని మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి సందర్శించారు. మంత్రి హరీష్ రావు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

రాజమండ్రిలో విషాదం

తూర్పుగోదావరి : మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాజమండ్రిలో విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి వెళ్లి వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతి చెందారు. 

13:01 - February 24, 2017
12:59 - February 24, 2017

తూర్పుగోదావరి : మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాజమండ్రిలో విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి వెళ్లి వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతి చెందారు. రాంబాబు అనే వ్యక్తి తన కొడుకును ఎత్తుకుని గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. నీటిలో విద్యుత్ తీగలు తెగిపడటంతో రాంబాబుకు కరెంటు షాక్ తగలింది. వెంటనే తన కొడుకును దూరంగా విసిరేశాడు. కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తన ప్రాణాలు పోతున్న కొడుకు ప్రాణాలు కాపాడాడు. అధికారుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

12:57 - February 24, 2017

టాలీవుడ్ రేంజ్ ఏంటిదో ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'..ఈ చిత్రాన్ని రూపొందించిన 'రాజమౌళి' ఈ సినిమాతో తన సత్తా చాటాడు. దీనికి సీక్వెల్ గా 'బాహుబలి 2' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తయ్యింది. కానీ చిత్రానికి సంబంధించిన టీజర్..ఇతరత్రా విడుదల కాకపోవడం పట్ల అభిమానులు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. కానీ అడపదడపా సోషల్ మాధ్యమాల్లో చిత్ర యూనిట్ పోస్టర్స్ విడుదల చేస్తూ అభిమానులను కొంత సంతోషపెడుతోంది. తాజాగా శివరాత్రి కానుకగా చిత్ర యూనిట్ ఒక న్యూ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో యుద్ధ రంగంలో తొండం పైకి ఎత్తి ఘజరాజు ఘీంకారం చేస్తుంటే నటుడు 'ప్రభాస్' తొండంపైకి ఎక్కి ఒక కాలు ముందుకు పెట్టి ఏనుగును అధిరోహించే వ్యక్తిలా ఉన్నాడు. 'ప్రభాస్' లుక్ పట్ల అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే దానికి సమాధానం లభిస్తుందంట.

12:50 - February 24, 2017

వాషింగ్టన్ : అమెరికాలో దారుణం జరిగింది. కన్సాస్‌ రాష్ట్రంలో ఒలాతేలో తెలుగు వ్యక్తులు లక్ష్యంగా కాల్పులు జరిగాయి. తెల్లజాతీయుడు ఆడమ్‌ పురింటన్‌ జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్‌ ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్‌కు చెందిన మదసాని అలోక్‌ గాయపడ్డాడు. ఇతను ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. కన్సాస్‌ రాష్ట్రం ఒలాతేలోని ఓ బార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఆడమ్‌ పురింటన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరు గార్నియర్‌ కంపెనీలోఇంజినీర్లుగా పని చేస్తున్నారు. జెఎన్ టీయూలో ఇంజినీరింగ్‌ చదివిన కూచిభొట్ల శ్రీనివాస్‌ టెక్సాస్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి  చేశారు. కాల్పుల్లో గాయపడ్డ అలోక్‌ మదసాని హైదరాబాద్‌ వాసవి ఇంజినీరింగ్‌ కాలేజీలో  డిగ్రీ చదివారు.  కన్సాస్‌ యూనివర్సిటీ ఆప్‌ మిస్సోరిలో ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. పదిహేను రోజుల వ్యవధిలో తెలుగు  వ్యక్తుల లక్ష్యంగా అమెరికాలో జరిగిన రెండో  కాల్పుల ఘటన ఇది. ఈనెల 12న కాలిఫోర్నియాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన వంశీరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో తెలుగు  విద్యార్థులు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని తరచు జరుగుతున్న కాల్పులకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం  చేపట్టేందుకు తెలుగు సంఘాలు సమాయత్తమవుతున్నాయి. 

 

12:45 - February 24, 2017
12:44 - February 24, 2017

కృష్ణా : విజయవాడలో మేధోసంపత్తి హక్కులపై అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. ఏ-1 కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. 
 

12:42 - February 24, 2017

పశ్చిమగోదావరి : మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు  క్షీరారామలింగేశ్వరామి దేవాలయం భక్తులతో పోటెత్తింది. క్షీరారామలింగేశ్వరుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అభిషేకాలు చేస్తున్నారు.  ఇవాళ రాత్రికి ఘనంగా కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 

12:40 - February 24, 2017

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో శివరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. పోలవరం మండలంలోని పట్టిసీమ దగ్గర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పట్టిసీమ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది. మరిన్ని వివరాల్ని వీడియోలో చూద్దాం...

 

12:38 - February 24, 2017

రాజన్నసిరిసిల్లా : జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో భక్తులతో పోటెత్తుతోంది. మహాశివరాత్రి సందర్భంగా రాజరాజేశ్వరస్వామి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. గంట గంటకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

12:34 - February 24, 2017

రంగారెడ్డి : కీసరలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పోటెత్తారు. శివరాత్రి వేడుకల్లో జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:27 - February 24, 2017
12:26 - February 24, 2017

హైదరాబాద్‌ : గచ్చిబౌలిలో అత్యాధునిక హంగులతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం రూపుదిద్దుకుంటోంది. నాలుగు ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన  కేంద్రంలో... సుద్దాల హన్మంతు ప్రాంగణం, మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌, లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఇక్కడ పురాతన కాలం నాటి పుస్తకాలతో పాటు.. నేటి కాలానికి సంబంధించిన రెండున్నర లక్షల పుస్తకాలను విజ్ఞానం కోసం అందుబాటులో ఉంచారు. ఈనెల 26న గచ్చిబౌలిలో ప్రారంభం కాబోతున్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం గురించి మరిన్ని విషయాలను వీడియోలో చూద్దాం...

 

12:22 - February 24, 2017

విశాఖ : జిల్లాలో మహాశిరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నగరమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. బీచ్‌ రోడ్‌లోని శివాలయంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక రహస్యంపై బ్రహ్మకుమారి ఈశ్వరియా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటోంది.
కాకినాడలో...
కాకినాడలోనూ శివరాత్రి వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దీనిపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి శంకర్‌ అందిస్తారు.
గుంటూరులో..
గుంటూరులోనూ శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గుంటూరు నగరంలో జరుగుతున్న శివరాత్రి వేడుకలపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:18 - February 24, 2017
12:15 - February 24, 2017
12:14 - February 24, 2017
11:53 - February 24, 2017

రంగారెడ్డి : శివరాత్రి పండుగ పూట శామీర్ పేటలో విషాదం నెలకొంది. శామీర్ పేట చెరువులో నీట మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. చర్లపల్లికి చెందిన సాయి, సికింద్రాబాద్ కు చెందిన విష్ణు వర్ధన్  లు.. మెదక్ జిల్లా గోమారం ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీలో చదువుతున్నారు. నిన్న కాలేజీ అయిపోగానే విద్యార్థులు శామీర్ పేట చెరువులో ఈతకు వెళ్లారు. చెరువులో సాయి, విష్ణువర్ధన్ లోతైన ప్రాంతానికి వెళ్లారు. ఈత రాకపోవడంతో నీటి మునిగి మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కురవి వీరభద్రస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

మహబూబాబాద్ : కురవి వీరభద్రస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. స్వామివారికి సీఎం మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శామీర్ పేట చెరువులో మునిగి ఇద్దరు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని శామీర్ పేట చెరువులో స్నానానికి వెళ్లి... ఇద్దరు మృతి చెందారు. లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లిన ఇద్దరు ఈత రాకపోవడంతో నీటి మునిగి మృతి చెందారు.

11:31 - February 24, 2017

భద్రాద్రి కొత్తగూడెం : శివరాత్రి పుర్వదినాన జిల్లాలో విషాదం నెలకొంది. శివరాత్రి సందర్భంగా పినపాక మండలం చింతూరుబయ్యారం వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు భక్తులు మృతి చెందారు. మూడు మృతదేహాలను వెలికితీశారు. మరో మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:04 - February 24, 2017

భద్రాద్రి కొత్తగూడెం : శివరాత్రి పుర్వదినాన జిల్లాలో విషాదం నెలకొంది. శివరాత్రి సందర్భంగా పినపాక మండలం చింతూరుబయ్యారం వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు భక్తులు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

10:51 - February 24, 2017

సెమినార్ నిర్వహిస్తుంటే ఏబీవీపీ కార్యకర్తలు హాకీ స్టిక్స్ తో దాడి చేయడం కరెక్టేనా.. అని ప్రశ్నించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నత తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బీజేపీ ప్రధాన కార్యదర్శి టి.ఆచారి, టీఆర్ ఎస్ అధికార ప్రతనిధి తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. సెమినార్ ను అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:46 - February 24, 2017

వరంగల్‌ : భద్రకాళి అమ్మవారు, తిరుపతి వెంకటేశ్వరస్వామి మొక్కులు తీర్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి మొక్కు తీర్చుకోనున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆయన కురవికి వెళ్లి వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కురవికి వెళ్లినప్పుడు ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు మీసాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు. ఇవాళ కేసీఆర్‌ మేడ్చల్‌ జిల్లాలోని కీసర రామలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకోనున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో కీసర ఆలయానికి వెళ్తారు. 9 గంటల 30 నిమిషాలకు రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లలో 10 గంటల 10నిమిషాలకు కురవికి వెళ్లి 11 గంటలకు వీరభద్రస్వామిని దర్శించుకొని బంగారు మీసాలు సమర్పిస్తారు. అనంతరం 11 గంటల 20 నిమిషాలకు బస్సులో ఉగ్గంపల్లి తండాలోని డోర్నకల్‌ శాసనసభ్యులు రెడ్యానాయక్‌ ఇంటికి వెళతారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేసి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు కురవి చేరుకుని హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు పయనమవుతారు.

 

10:44 - February 24, 2017

కర్నూలు : శ్రీశైల మల్లన్న పాగా దర్శనానికి ఉన్న విశిష్టత ఏంటి..?  మల్లికార్జునస్వామి పెళ్లి కుమారుడిగా ముస్తాబైనప్పుడు తలపాగా చుట్టేది ఎవరు..? ఇంతకీ మల్లన్న తలపాగా ఎక్కడ తయారవుతుంది..? ఏ వంశస్తులు మల్లన్న తలపాగా తయారు చేస్తున్నారు? శ్రీశైల మల్లన్న తలపాగా తయారీపై 10టీవీ ప్రత్యేక కథనం..! 
శ్రీశైల మల్లన్న పాగా దర్శనానికి ఎంతో విశిష్టత
శ్రీశైలంలోని మల్లన్న పాగా దర్శనానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ దర్శనం ముక్తిదాయకమని వేదపండితులు చెబుతుంటారు. మల్లన్న తలపాగా ధారణను చూసి తరించేందుకు లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు.  మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి సమయంలో లింగోద్బోవం తర్వాత భక్తులు మల్లన్న పాగా దర్శనం చేసుకుని తరిస్తారు.
మల్లన్న తలపాగా తయారు చేస్తున్న పృథ్వీ వంశస్తులు
శ్రీశైల మల్లన్నకు తలపాగా ధరింపచేసేది ఎవరో మీరు తెలుసా. ప్రకాశం జిల్లా చీరాలలోని  జాండ్రపేటకు చెందిన పృథ్వీ వంశస్తులు మల్లన్నకు తలపాగా ధరింపచేస్తారు.  మహాశివరాత్రి పర్వదినాన అర్దరాత్రిపూట దిగంబరంగ ఆలయ శిఖరం నుంచి నవనందులకు చేనేత వస్త్రాన్ని మల్లన్నకు పృథ్వీ వంశస్తులు ధరింపచేస్తారు. ఈ  వంశానికి చెందిన నేటి తరం వారసుడు  వెంకటేశ్వర్లు కుటుంబం ఈ తలపాగాకు ఉపయోగించే తెల్లని వస్త్రాన్ని  తయారు చేశారు. తలపాగా కోసం తయారు చేసే తెల్లని వస్త్రాన్ని సంవత్సరాంతం నియమ నిష్టలతో నేస్తారు. రోజుకు మూర చొప్పున నేస్తారు. ఆ తర్వాత గ్రామంలో అత్యద్భుతంగా, వీనుల విందుగా ఈ తలపాగాను ఊరేగిస్తారు. అక్కడి నుంచి నేరుగా వేటపాలేం మండలం పందిళ్ళపల్లి గ్రామములోని పునుగురామలింగేశ్వరస్వామి దేవస్దానంలో నిద్రచేస్తారు. అక్కడే వేకువ జామున ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడ నుండి శ్రీశైలం  చేరుకుంటారు. 
మగ్గాలపై వస్త్రం నేత 
శ్రీశైల మల్లన్న మిరాశిదారులుగా ఉన్న పృథ్వీ కుటుంబీకులు తరతరాలుగా మగ్గాలపై వస్త్రాన్ని నేస్తున్నారు. అలా నేచిన  వస్త్రాన్ని శ్రీశైలమల్లన్నకు తలపాగా నవనందుల మీదుగా శిఖరం అంచు వరకూ కడతారు.. పృధ్వీ కుటుంబీకులు తలపాగా ధరింపజేసిన తర్వాతే మల్లన్న కళ్యాణం మొదలవుతుంది. శివరాత్రి కార్యక్రమాలూ ప్రారంభమవుతాయి. 
అత్యంత శోభాయమానంగా దర్శనం 
మహదేవుని లింగోద్బోవ సమయంలో శివ పరమాత్మ ఆనందస్వరూపుడై విశ్వవ్యాప్తి చెందుతాడని ప్రతీతి. నిరాకారుడైనా ఆమహాదేవుని పెళ్ళి కుమారునిగా ఆలంకరించడంలో భాగంగా శివనామాలను పోలిన అంచును కలిగిన తెల్లటి నూతన చేనేత వస్ర్తాన్ని ఆలయ శిఖరం నుంచి నవనందులకు తలపాగా గా చుడతారు. తలపాగా ధారణ అనంతరం దేవాలయం అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తుంది. 

 

గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు

భద్రాద్రి : పినపాక మండలం చింతలబయ్యారం వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. 

 

తొలి ఇన్నింగ్స్... ఆస్ట్రేలియా 260 పరుగులకు ఆలౌట్

పూణె టెస్టు : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్...తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 260 పరుగులకు ఆలౌట్ అయింది.

09:48 - February 24, 2017

శ్రీకాకుళం : తూర్పు కనుమల్లో ఎత్తైన మహేంద్ర గిరులు.. అపురూప ప్రాచీన ఆలయాలు.. భిన్న సంస్కృతులు.. సముద్ర మట్టానికి సుమారు అయిదువేల అడుగుల ఎత్తులో ఉండే శిఖరాగ్ర భాగాన శివరాత్రి ప్రత్యేక పూజలు.. ఈ మధురానుభూతి.. శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో నెలవై ఉంది. చారిత్రక శిలా క్షేత్రం మహేంద్రగిరికి శతాబ్దాల చరిత్ర సొంతం. మహా శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు రానున్న దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 
కేవలం మహా శివరాత్రి రోజునే పూజలు  
శ్రీకాకుళం జిల్లా మందస మండలం ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దున ఉన్న మహేంద్ర గిరి ఇది. తూర్పు కనుమలైన ఎత్తైన పర్వతాలలో మహేంద్ర గిరికి ప్రత్యేక స్థానముంది. ఈ కొండలలో పురాతన శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఎత్తైన మహేంద్ర గిరులపై రాజుల కాలం నాటి ఆనవాళ్ళు కలిగిన శైవ క్షేత్రాలు ఉన్నప్పటికీ కేవలం మహా శివరాత్రి రోజునే పూజలందుకుంటాయి. 
ఈ దండకారణ్యంలోనే పాండవులు వనవాసం 
ఈ దండకారణ్యంలోనే పాండవులు వనవాసం చేశారని పంచ పాండవులు ఒక్కో ఆలయంలో ఉండేవారని పురాతనగాథలు చెబుతున్నాయి. అందుకే పాండవుల ఆలయాలుగా వీటిని పిలుస్తారు. మహేంద్ర గిరిపై ధర్మరాజు, కుంతీ ఆలయాలు ఒకే ప్రదేశంలో ఉండగా.. భీమసేనుని ఆలయం ఎత్తైన శిఖరంపై ఉంటుంది. ఇక అర్జునుడు, నకులు, సహదేవుల ఆలయాలు పూర్తిగా శిథిలమయ్యాయి. సముద్ర మట్టానికి అయిదువేల అడుగుల ఎత్తులో ఉండే ఈ శిఖరాలపై పంచ పాండవుల ఆలయాలు ఉన్నప్పటికీ భక్తులు ఏటా మహా శివరాత్రి రోజున ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. 
మహా శివరాత్రి రోజున జాగారం 
ఆంధ్రా- ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో గల మహేంద్ర గిరిలో మహా శివరాత్రి రోజున జాగారం చేసి పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే కాలినడకన కొండలు, లోయలు ధాటి వెళ్లి మరీ దర్శించుకుంటారు. శివరాత్రి ముందు రోజు మధ్యాహ్నం నుండే మహేంద్ర గిరులను ఎక్కేందుకు భక్తులు విచ్చేస్తారు. 
సా.మొదలైన పర్వతారోహణ వేకువజాముకు పూర్తి 
వివిధ రహదారుల ద్వారా కొండ సమీపం వరకూ చేరుకొని సుమారు పది కిలోమీటర్లు ఎక్కి శిఖరానికి చేరుకుంటారు భక్తులు. సాయంత్రం సమయంలో మొదలైన ఈ పర్వతారోహణం వేకువ జాము సమయానికి పూర్తి అవుతుంది. సముద్ర మట్టానికి అయిదు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం నుండి సూర్యోదయాన్ని వీక్షించిన భక్తులు పులకించిపోతారు. రాత్రంతా జాగారం చేసి కొండ ఎక్కిన భక్తులు రోజంతా మహేంద్రగిరులపై ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.
ప్రకృతి సోయగాన్ని వీక్షించడం మధురానుభూతి 
ఇదిలా ఉంటే మహా శివరాత్రి సూర్యోదయాన ఇక్కడ ప్రకృతి సోయగాన్ని వీక్షించడం ఒక మధురానుభూతి. ఎత్తైన కొండపై మబ్బులు తాకుతూ ఉంటాయి. సింధూర వర్ణంలోని ఉదయ భానుడి లేలేత కిరణాలు మబ్బుల చాటున తొలుత ప్రసరించేది మహేంద్ర గిరులపైనే.. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి, పాండవుల ఆలయాలను దర్శించుకోడానికి ఏటా శివరాత్రికి లక్షలాదిమంది భక్తులు కాలినడకన వస్తుంటారు. ఆంధ్రా- ఒడిస్సా రాష్ట్రాల సరిహద్దు వివాదం కారణంగా మహేంద్రగిరిని ఇరు రాష్ట్రాలు పట్టించుకోవడం మానేసినప్పటికీ భక్తులు మాత్రం మహా శివరాత్రి రోజున తప్పక దర్శించుకుంటారు. 

 

అమెరికాలో కాల్పులు.. తెలుగు వ్యక్తి మృతి

వాషింగ్టన్ : అమెరికాలో దారుణం జరిగింది. తెలుగు వ్యక్తులు లక్ష్యంగా తెల్లజాతీయుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 

09:41 - February 24, 2017

వాషింగ్టన్ : అమెరికాలో దారుణం జరిగింది. తెలుగు వ్యక్తులు లక్ష్యంగా తెల్లజాతీయుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ కు చెందిన కూచిటొట్ల శ్రీనివాస్, వరంగల్ కు చెందిన మదసాని అలోక్ అమెరికాలోని గార్నియర్ కంపెనీలో ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. శ్రీనివాస్, వరంగల్ వీరి స్నేహితుడు, స్ధానిక దేశస్తుడితో కన్సాస్ రాష్ట్రం ఒలాతేలోని బార్ కు వెళ్లారు. మరో స్థానిక దేశస్తుడు ఆడమ్ పురింటన్ (51) ఆడం పురింటన్ ముగ్గురిపై 9 రౌండ్ల కాల్పులు జరిపాడు. 'మా దేశం వెళ్లిపోండని నినాదాలు చేశాడు'. ఈ కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన కూచిటొట్ల శ్రీనివాస్ మృతి చెందాడు. వరంగల్ కు చెందిన మదసాని అలోక్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆడమ్ ను పోలీసులు అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ బిఐ దర్యాప్తు కొనసాగిస్తుంది. కాల్పుల ఘటనను తెలుగు సంఘాలు ఖండించాయి. సెనెటర్ ను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

09:35 - February 24, 2017

జయశంకర్‌ భూపాలపల్లి : మహదేవ్ పూర్‌ మండలం కాళేశ్వరంలో దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. మూడు రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ నుంచి భక్తులు ఆలయానికి వస్తుంటారు. దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

 

09:31 - February 24, 2017

కర్నూలు/కరీంనగర్ : మహాశివరాత్రి వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. శివరాత్రి సందర్భంగా కర్నూలులోని శ్రీశైల ఆలయం, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను కల్పించారు.
శ్రీశైలంలో 10రోజుల పాటు శివరాత్రి బ్రహ్మోత్సవాలు 
ప్రతి ఏటా శ్రీశైలంలో పదిరోజుల పాటు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఆంధ్రా, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రా లనుంచి భక్తులు తరలివస్తారు. భక్తులు పాతాలగంగలో పుణ్యస్నానాలు ఆచరించాక శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు. అలాగే అతిపెద్ద శైవ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలోనూ మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర జరుగుతుంది. ఈ జాతరకు మహారాష్ట్ర, చత్తీష్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి దాదాపుగా ఐదు లక్షలకు పైగా భక్తులు తరలివస్తారు. 
విద్యుత్‌ దీపాలంకరణలో దేవాలయాలు
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక టెంట్లు, ప్రత్యేక స్నానాల గదులు, ప్రత్యేక వైద్య శిబిరాలు.. తాగునీటి వసతి కల్పించారు. ఆలయాలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. కొనేరును శుభ్రం చేయాల్సివుంది. కాగా శ్రీశైలంలో కొనేరును శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని.. భక్తులు చెబుతున్నారు. స్నానాల చేయడానికి నీటి సమస్య ఉందని ఆవేదన చెందుతున్నారు. అయితే ఆలయాలలో  వీఐపీ దర్శనాలకంటే సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం సులువుగా అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా... గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు.

09:29 - February 24, 2017

హైదరాబాద్ : మహా శివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ర్టాల్లోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శంభో శంకరా అంటూ దేశమంతటా శివాలయాలు మారుమ్రోగుతున్నాయి. నీలకంఠుడిని దర్శించుకోవడానికి శివాలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో బారులు తీరారు. అభిషేక ప్రియుడికి  ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇటు విజయవాలో శైవ క్షేత్రాలు కూడా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.  భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

 

వేములవాడకు పోటెత్తిన భక్తులు

రాజన్న సరిసిల్ల : మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆర్జిత సేవలను రద్దు చేశారు. టీటీడీ తరపున స్వామివారికి టీటీడీ ప్రధాన అర్చకులు గురురాజ స్వామి పట్టు వస్త్రాలు సమర్పించారు.

 

భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

గుంటూరు : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కోటప్పకొండ, అమరావతి, పెదకాకాని, దయిదా, గుత్తికొండ బిలం, గోవాడ ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.

సూర్యపేట జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు

సూర్యపేట : మహా శివరాత్రి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. మేళ్ల చెరువు, మట్టపల్లి, పిల్లలమర్రి శివాలయాల్లో భక్తులు రద్దీ కొనసాగుతోంది. మేళ్ల చెరువు ఆలయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Don't Miss