Activities calendar

25 February 2017

21:31 - February 25, 2017

ఢిల్లీ: పరువు నష్టం దావా కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీల మధ్య వార్‌ కొనసాగుతోంది. జైట్లీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అరుణ్‌జైట్లీ, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను బయట పెట్టాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌కు ఛైర్మన్‌గా ఉన్నసమయంలో జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. నిరాధారమైన ఆరోపణలతో తన వ్యక్తిత్వానికి భంగం కలిగించారంటూ కేజ్రీవాల్‌తో పాటు ఆప్‌ నేతలపై అరుణ్‌జైట్లీ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మార్చి 25 లోపు హాజరు కావాలని కేజ్రీవాల్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

21:30 - February 25, 2017

హైదరాబాద్: కాంగ్రెస్‌ ముఠా ప్రాజెక్టులను అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పేరుతో టీఆర్‌ఎస్‌ దోపిడీకి పాల్పడుతుందని.. దీన్ని ఊరుకోబోమన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రాజెక్టులను వారికి అప్పగించింది కేసీఆరే అన్నారు. దేశంలోనే నీచమైన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి కేసీఆర్‌ అని అన్నారు ఉత్తమ్‌.

21:28 - February 25, 2017

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ పగ్గాలు చేపట్టాక అక్కడ మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోతోంది. తనకు వ్యతిరేకంగా మీడియా వార్తలు రాస్తోందని ఆరోపణలు చేస్తూవచ్చిన ట్రంప్‌ ఆ దిశగా చర్యలు చేపట్టారు. తాజాగా వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రట‌రీ సీన్ స్పైస‌ర్ నిర్వహించిన మీడియా స‌మావేశాన్ని క‌వ‌ర్ చేసేందుకు వచ్చిన దిగ్గజ మీడియా సంస్థల‌ ప్రతినిధులను అనుమతించలేదు. సిఎన్‌ఎన్‌, న్యూయార్క్‌ టైమ్స్, లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌, బిబిసి, గార్డియన్‌ వంటి పలు మీడియా సంస్థల ప్రతినిధులను సమావేశానికి హాజరు కాకుండా వైట్‌హౌజ్‌ అడ్డుకుంది. ట్రంప్‌తో సన్నిహితంగా ఉండే ద వాషింగ్టన్‌ టైమ్స్‌, వన్‌ అమెరికా న్యూస్‌ నెట్‌వర్క్‌ లాంటి మీడియా సంస్థలను మాత్రమే లోనికి అనుమతించారు.

పైకి మాత్రం తప్పుడు వార్తలు రాసే మీడియాకే తాను వ్యతిరేకమని, పత్రికా స్వేచ్ఛకు, మీడియాకు కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెబుతున్నారు. మంచి వార్తలు చదవడం తనకిష్టమని చదవడానికి ఒక్క మంచివార్త కూడా ఉండడం లేదని సిపిఏసి సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫేక్‌ వార్తలు రాసే మీడియాకు తాను వ్యతిరేకమని చెప్పారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచే ట్రంప్‌ మీడియాతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న కారణంతో తొలి మీడియా సమావేశంలో సిఎన్‌ఎన్‌ రిపోర్టర్‌పై ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఇటీవల ట్రంప్‌ విధానాలు వ్యతిరేకిస్తూ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా అమెరికా ప్రజలకు వ్యతిరేకమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నప్పటికీ మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని దుయ్యబట్టారు. ఏడు ముస్లిం దేశాల ప్రజలను అమెరికాలోకి రాకుండా బ్యాన్‌ చేస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీడియా ఫోకస్‌ చేయడమే ఇందుకు కారణం.

ఇంజినీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్లను దారుణంగా కాల్చిచంపిన ఘటనపై... ట్రంప్ చేసిన కామెంట్స్‌పైనా విమర్శలు వెల్లువెత్తాయి. కన్సర్వేటివ్‌ పొలిటికల్ యాక్షన్‌ కాన్ఫరెన్స్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ -తాను కేవలం అమెరికాకే ప్రతినిధినని.. ప్రపంచానికి కాదన్నారు. అమెరికా ప్రజలకు రక్షణ కల్పించడం, వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చేలా చేయడం తన పని అంటూ విదేశీ వలసదారులపై ట్రంప్ విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు. అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్.. ఇతర దేశస్తులను అమెరికా నుంచి వెళ్ళగొట్టేందుకు సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటూ విదేశీయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ట్రావెల్ బ్యాన్, వీసా రూల్స్, జాబ్ రూల్స్ అంటూ ఏదో రకంగా విదేశీయులను వారి స్వస్థలాలకు పంపించేసి.. దేశ పౌరులతోనే అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని ట్రంప్‌ భావిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలతో, అమెరికాలో ఉంటున్న ప్రవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

21:26 - February 25, 2017

హైదరాబాద్: అగ్ర రాజ్యం అమెరికా జాత్యాహంకారంపై సర్వత్రా నిరసన వెల్లువెత్తుతోంది. ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయులపై జరుగుతున్న దాడులను ప్రతిఒక్కరూ ఖండిస్తున్నారు. భారతీయులపై దాడుల్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ ముందు ఆలిండియా శాంతి సంఘం ఆందోళన చేపట్టింది. తెల్ల జాతీయుల దాడులపై వెంటనే స్పందించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అమెరికాలోని భారతీయులకు రక్షణ కల్పించాలన్నారు. వరుస హత్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రెచ్చగొట్టే ధోరణి మాని అమెరికాలో విదేశీయులపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

అమెరికాలో కాల్పుల ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఘటన తనను బాగా కలిచివేసిందన్న కేటీఆర్... బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు. విదేశాంగ శాఖ సహాయంతో... మృతదేహాన్ని త్వరగా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్ ట్వీట్ చేశారు.

అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన చేపట్టారు. బందర్‌ రోడ్డుల్లోని మాకినేని బసవపున్నయ్య విగ్రహం వద్ద జరిగిన ధర్నాల్లో ట్రంప్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అమెరికా ప్రభుత్వం ఇప్పటికైనా వలస నిబంధనలు వెనక్కి తీసుకోవాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. భారతీయులపై మరిన్ని దాడులు జరగకముందే... ట్రంప్ నిబంధనలు మార్చేలా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని మధు డిమాండ్‌ చేశారు.

అమెరికాలో ఇటీవల తెలుగువారిపై జరుగుతున్న వరుస దాడులు, హత్యలను సీపీఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ట్రంప్‌ పాలన పగ్గాలు చేపట్టాక.. భారతీయులపై దాడులు పెరగడం బాధాకరమని, వలసదారుపై జరగుతున్న దాడులు పునరావృతం కాకుండా.. భారత ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని సీపీఎం కేంద్రానికి సూచించింది.

విజయవాడలో స్లైన్ ఫ్లూ కలకం

విజయవాడ: గుంటూరు ప్రభుత్వాసుపత్లిరో చికిత్స పొందుతూ చైత్ర (3) అనే చిన్నారి స్వైన్ ఫ్లూతో మృతి చెందింది. మృత్యువాత పడిన చైత్ర బాపులపాడు వాసి.

సీపీఐ నేతలతో కోదండరాం భేటీ

హైదరాబాద్: టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొ.కోదండరాం ముఖ్దూం భవన్‌లో సీపీఐ నేతలతో సమావేశమయ్యారు. నిరుద్యోగుల ర్యాలీ పరిణామాలపై సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిలతో చర్చించారు. నిరుద్యోగులు, రైతులు, మహిళల సమస్యలపై చేపట్టనున్న కార్యక్రమాలపై వారితో చర్చించినట్టు సమాచారం.

ఆంధ్రా యూనివర్శిటీలో ఫ్యాషన్ షో

విశాఖ : ఆంధ్రా యూనివర్శిటీలో ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నారు. మరో వైపు ఫ్యాషన్ షోను వ్యతిరేకిస్తూ కొంత మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఓ ప్రైవేట్ బస్సును దగ్ధం చేసిన మావోయిస్టులు

భూపాలపల్లి: మెట్లచెరువు వద్ద ప్రయాణీకులను దించి ఓ ప్రైవేట్ బస్సును మావోయిస్టులు దగ్ధం చేశారు. వెంకటాపురం నుంచి ఛత్తీగఢ్ బీజాపూర్ కు వెళ్తున్న బస్సును మావోలు దగ్ధం చేశారు.

20:03 - February 25, 2017

గుంటూరు: నగరంలోని లక్ష్మీపురంలో విషాదం చోటుచేసుకుంది. లక్ష్మీపురం రోడ్డులోని నీరూస్ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా హోర్డింగ్‌ కడుతుండగా విజయ్‌ అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ప్రమాదంలో జాన్‌సైదా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో క్షతగాత్రుడిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుకాణంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న విజయ్‌ హోర్డింగ్‌ కడుతుండగా.. పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడు పిడుగురాళ్లకు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటనను గుర్తించిన స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

18:43 - February 25, 2017

హైదరాబాద్: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా లెక్కకు మించి వెంచర్లను పూర్తి చేసుకుని ఎందరో కష్టమర్ల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న సంస్థ సుఖీభవ ప్రాపర్టీస్‌. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా హైదరాబాద్-వరంగల్‌లో కొత్త వెంచర్లతో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 7వ వెంచర్‌ రాయల్‌ నివాస్‌. ఈ వెంచర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సుఖీభవ ప్రాపర్టీస్‌  సంస్థ సీఎండీ రియల్ ఎస్టేట్‌ రంగంలో 25 సంవత్సరాల అనుభవం ఉన్న గురురాజు తెలియజేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:39 - February 25, 2017

ఆదిలాబాద్: ఇది ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గురుజ గ్రామం. ఒక్కప్పుడు సంతోషంగా ఉన్న ఇక్కడి ప్రజలను కిడ్నీ వ్యాధి కాటికి పంపిస్తోంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇప్పటి వరకు పాతిక మందిని పొట్టన పెట్టుకుంది. మరో ఇరవై మంది కిడ్నీ వ్యాధితో నరకం చూస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరికి అదే సమస్య. ఇంకొందరిదైతే తమకు వచ్చిన రోగమేమిటో తెలియని దుస్థితి. వేలకు వేలు ఆసుపత్రుల్లో ఖర్చు పెడుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఈ వ్యాధితో నరకం అనుభవిస్తున్నారు.

ముగ్గురు చిన్నారులు కిడ్నీ వ్యాధితో ప్రాణాలు...

ఒకే కుటుంబం నుంచి ముగ్గురు చిన్నారులు కిడ్నీ వ్యాధితో ప్రాణాలు విడిచారు. గురజ గ్రామానికి చెందిన సంజీవ్, పార్వతి బాయి దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు లలిత ఐదేండ్ల వయసుకే కిడ్నీ వ్యాధితో చనిపోగా, కొడుకు విజయ్ 2014లో ఇదే వ్యాధితో 15 ఏళ్ల వయసులో చనిపోయాడు. మూడేళ్ల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మరో కొడుకు నిఖిల్‌ కూడా మూడు రోజుల క్రితం చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

మహమ్మారిలా విజృంభిస్తుందంటే...

ఒకే గ్రామంలో కిడ్నీ వ్యాధి మహమ్మారిలా విజృంభిస్తుందంటే సమాధానం లేదు. వ్యాధి సోకడానికి కారణమేమిటో ఎవరు కనుక్కోలేక పోయారు. నేతలు,అధికారులు గురుజ గ్రామాన్ని ఎన్నోసార్లు సందర్శించారే కానీ పరిష్కారం మాత్రం కనుక్కోలేక పోయారు. నీటి షాంపిల్స్ తీసుకెళ్లారే కానీ ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదు. దీంతో కిడ్నీ వ్యాధి ఎందుకు సోకుతుందో అర్థం కాని పరిస్థితి.

ఇంత జరుగుతున్నా తమ గ్రామాన్ని పట్టిచ్చుకునే నాధుడే కరువు,,

ఇంత జరుగుతున్నా తమ గ్రామాన్ని పట్టిచ్చుకునే నాధుడే కరువయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం లభించకపోతే గ్రామం వల్లకాడులా మారే అవకాశం ఉందని, తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని ఈ వ్యాధికి కారణమేమిటో నిర్థారణ జరిపి చికిత్స అందించాల్సిన అవసరం వుంది.

18:36 - February 25, 2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న 9 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఎమ్మెల్యే, గవర్నర్ కోటా అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. అభ్యర్ధుల ఎంపిక కోసం ఆదివారం టీడీపీ పొలిట్ బ్యూరో ప్రత్యేకంగా సమావేశం కానుంది.

మొత్తం 16 స్థానాలకు గాను 150 దరఖాస్తులు

మొత్తం 16 స్థానాలకు గాను 150 దరఖాస్తులు అధిష్ఠానానికి అందాయి. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలకు ఈ నెల 28 చివరి తేదీ. చిత్తూరు, అనంతపురం, కడప, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం రెండు స్థానాలు ఖాళీలున్నాయి. ఇప్పటివరకు కేవలం కడప జిల్లా అభ్యర్థిగా బీటెక్ రవి పేరును మాత్రమే చంద్రబాబు ఖ‌రారు చేశారు.

చిత్తూరు జిల్లా నుంచి దొరబాబు ,హేమలత, నరేష్ కుమార్ రెడ్డి పేర్లు..

చిత్తూరు జిల్లాలో దొరబాబు, హేమలత, నరేష్ కుమార్ రెడ్డి పేర్లను పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ దృష్ట్యా శిల్పా సోదరులకు ప్రాధాన్యత కల్పించవచ్చని సమాచారం. ఇదే జిల్లా నుంచి సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు.

నెల్లూరు జిల్లా నుంచి వాకాటి నారాయణరెడ్డి, అనం బ్రదర్స్ పేర్లు ...

ఇక నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డితోపాటు ఆనం బ్రదర్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న అంగర‌ రామ్మోహన్ కు మళ్లీ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అక్కడ మరో స్థానానికి మంతెన సత్యనారాయణరాజు పేరు ఖరారుగా కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి చిక్కాల రామచంద్రరావు, జ్యోతుల చంటబ్బాయ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అప్పల‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావులు పోటీప‌డుతున్నారు. అనంత‌పురంలోనూ పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడి నుంచి, దీపక్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, గ‌డ్డం సుబ్రమ‌ణ్యం, అబ్దుల్ ఘ‌నీ, త‌దిత‌రుల పేర్లు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేల కోటా అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం?....

ఇక ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా పొలిట్ బ్యూరో సమావేశంలో అభ్యర్థులను ఖరారుచేసే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో నారా లోకేశ్‌కు ఓ ఎమ్మెల్సీ స్థానం ఖరారైనట్లు చెబుతున్నారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను కుల సమీకరణాల ప్రాధాన్యతతో ఎంపిక చేస్తారని సమాచారం. మొత్తం ఏడు స్థానాలకు జరిగే పోరులో సంఖ్యాబలం పరంగా తెలుగుదేశానికి ఐదు, వైసీపీకీ ఒక స్థానం ఖరారు కానుంది. ఏడో స్థానానికి పార్టీ బలాబలాలను బట్టి చూస్తే వైసీపీ నుంచి 20మందికి పైగా ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో తెలుగుదేశంలో చేరారు. ఏడో స్థానానికి ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోవటంతో రెండో ప్రాధాన్య ఓటు కీలకం కానుంది. దీంతో ఏడో స్థానానికి పోటీ జరుగుతుందా లేక ఏకగ్రీవం కానుందా అన్న అంశం ఆసక్తిగా మారింది.

ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీ స్థానాల కోసం నేతల ఎదురుచూపులు ....

ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీ స్థానం కోసం కరణం బలరాం, పుష్పరాజ్, జూపూడి ప్రభాకరరావు, గోనగుంట్ల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, దాసరి రాజా మాస్టర్, దివి శివరాం, బచ్చుల అర్జునుడు, వర్ల రామయ్య, చందు సాంబశివరావు, గొట్టిపాటి రామకృష్ణ, కొమ్మినేని వికాస్ లు పోటీలో వున్నారు. మహిళల కోటాలో పంచమర్తి అనురాధ, శోభా హైమావతి, ముళ్ళపూడి రేణుక, పోతుల సునీతలు తమకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. మొత్తంమీద తెలుగుదేశం పార్టీ నేతల్లో.. ఇప్పుడంతా ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. అధిష్ఠానం తమ పేర్లను ఖరారుచేస్తుందో లేదోనని ఆశావహులు హైరానాపడుతున్నారు. అంతటితో ఆగకుండా, అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు చివరి ప్రయత్నాలనూ ముమ్మరం చేశారు.

18:34 - February 25, 2017

విశాఖ: ఉత్తరాంధ్ర అభివృద్ధిని పాలకులకు గాలికొదిలేశారని ఎమ్మెల్సీ శర్మ ఆరోపించారు. చట్టబద్ధంగా రావాల్సిన రైల్వే జోన్‌ను కూడా ఇవ్వకుండా ప్రజలను మాయ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడే అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని సమస్యలపై ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కరపత్రం విడుదల చేసింది.

18:31 - February 25, 2017

అమరావతి: ఏపీ లో రాజకీయం వేడేక్కుతోంది.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఏ సంఘటన చోటు చేసుకున్నా.. ఎవరికి వారు మాదే పైచేయి అని చూపించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు నలిగిపోతున్నారు. అమరావతిలో జరిగిన మహిళా సదస్సు సందర్భంగా రోజాను సదస్సు ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకోవడం సంచలనమైంది. తనను ఆహ్వానించి, ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అడ్డుకోవడంపై రోజాతో పాటు , వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అయితే రోజా సదస్సు ఉద్దేశాన్ని నీరుగార్చే విధంగా ప్రవర్తించబోతున్నారనే అనుమానంతోనే ఆమెను అడ్డుకున్నామని డీజీపీ సాంబశివరావు కూడా ప్రకటించారు. అయితే ఆ సమయంలో రోజా వ్యవహరించిన తీరు సరైంది కాదంటూ పోలీసు అధికారుల సంఘం పెదవి విరుస్తోంది.

తమ పట్ల దురుసు ప్రవర్తనతో...

కొందరు నేతలు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. ఒత్తిడికి తలొగ్గి పనిచేయాల్సి వస్తోందని పోలీసు అధికారులంటున్నారు.. తమకు ఎమ్మెల్యే రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఏపీలో 13 జిల్లాల పరిధిలో గన్ మెన్లు ఒక్క రోజంతా.. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నారని సంఘం నేతలంటున్నారు.. డీజీపీపై మాట్లాడితే అందరిపై మాట్లాడినట్లేనని... విమర్శిస్తున్నారు. అయితే.. ఇటీవల పోలీసులను విమర్శించడం ఫ్యాషనైపోయిందని సంఘం నేత శ్రీనివాసరావు మండిపడ్డారు.

పోలీసు అధికారుల తీరుపై మండిపడుతు రోజా..

అయితే.. ఎమ్మెల్యే రోజా మాత్రం పోలీసు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.. పోలీసులపై చింతమనేని ప్రభాకర్‌ దాడి చేసినప్పుడు అధికారుల సంఘం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. పుష్కరాల్లో అనేక మంది మరణిస్తే ఆ తప్పంతా పోలీసుల వైఫల్యమేనని చంద్రబాబు అన్నప్పుడు పోలీసు అధికారుల సంఘం ఏమైపోయిందని ..తనను క్షమాపణ కోరే ముందు రాజధానిలో పోలీసుల అవస్థలపై నిరసన తెలపాలని ఎమ్మెల్యే రోజా అంటున్నారు.

తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ మహిళా నేతలు....

ఇప్పటి వరకు రోజా తీరుపై తీవ్ర స్థాయిలో టీడీపీ మహిళా నేతలు ధ్వజమెత్తారు.. ఇప్పుడు పోలీసులు అధికారుల సంఘం చేత అధికార పార్టీ నేతలే మీడియా సమావేశం నిర్వహించి విషయాన్ని పెద్దది చేసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలంటున్నారు.. దీని వల్ల తమ పార్టీ ఇమేజే పెరుగుతుందని వారంటున్నారు.

తెలంగాణ లో పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ లో పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల అయ్యింది. మే 29 నుంచి జన్ 1 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి రెండో వారాంలో పీజీ ఈసెట్ నోటిఫికేషన్ జారీ కానుంది. పీజీ ఈసెట్ పరీక్షకు ఆన్ లైన్ ద్వారా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించారు. హైదరాబాద్, వరంగల్ లో పీజీ ఈసెట్ ఆన్ లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

 

ఒరిస్సాలో జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు...

హైదరాబాద్: ఒరిస్సాలో మొత్తం 849 జిల్లా పరిషత్తు స్థానాలకు శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టగా 464 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో అధికార బిజూ జనతా దళ్‌ (బిజద)కు 235 స్థానాలు రాగా, భాజపాకు 181 సీట్లు వచ్చాయి. అంతకుముందు 2012లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 36 స్థానాలు మాత్రమే గెల్చుకుంది. మరోవైపు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 36 స్థానాలు మాత్రమే గెలుచుకుని మూడో స్థానానికి పరిమితమైంది. ఇతరులు 12 స్థానాలు గెలుచుకున్నారు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు

హైదరాబాద్: అమెరికాలో శ్వేతజాతీయుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన తెలుగు యువకుడు కూచిబొట్ల శ్రీనివాస్‌ కుటుంబాన్ని పలువురు ప్రముఖులు పరామర్శించారు. శనివారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సహా ఎంపీలు మల్లారెడ్డి, బాల్క సుమన్‌ తదితరులు పరామర్శించారు. శ్రీనివాస్‌ మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు.

కాంగ్రెస్ పార్టీ దొంగల ముఠా: మంత్రి జగదీష్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాసుల పార్టీ అంటూ నిన్న విమర్శించిన సంగతి విదితమే. అయితే, ఈ మాట చాలా చిన్న మాట అని తెలంగాణ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి ఈ రోజు సమర్థిస్తూ మాట్లాడారు. ఈ రోజు తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ ఒక రాజ‌కీయ పార్టీలా కాకుండా ఓ దొంగ‌ల ముఠాలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ‌లో ఎట్టిప‌రిస్థితుల్లోనూ ప్రాజెక్టులు క‌ట్టి చూపిస్తామ‌ని అన్నారు. తెలంగాణ‌లో జ‌రుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్ నేత‌లు అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

16:26 - February 25, 2017

హైదరాబాద్: ఖైదీల్లో మార్పుకోసం జైళ్లలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టామని... తెలంగాణ హోమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి ప్రకటించారు.. జైళ్లలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు.. చంచల్‌గూడా జైలులో ఈ ములాఖత్‌ను మంత్రి ప్రారంభించారు.. ఈ సౌకర్యంద్వారా ఆన్‌లైన్‌లో ఖైదీలను కలుసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి చెప్పారు.. ఈ ములాఖత్ ద్వారా జైళ్లలో పారదర్శకతతోపాటు... అవినీతిని నిర్మూలించవచ్చని మంత్రి వివరించారు..

16:25 - February 25, 2017

 

హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా శంఖు:స్థాపన చేసిన మందాకిని కాలువలో తట్టమట్టి తీసినవారు లేరు. కొన్నింటిని ఇలా శంఖు:స్థాపనలు చేశారు. మరికొన్ని చోట్ల ప్రాజెక్టు కట్టి కాలువలు తవ్వకుండా వదిలేశారు. అసంపూర్తిగా వున్న ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వమూ అలసత్వమే ప్రదర్శిస్తోంది. అందుకే ఆదిలాబాద్ జిల్లాల్లో సాగునీటి ఉద్యమాలు మొదలవుతున్నాయి. సాగునీటి సాధన పోరాటాల్లో సిపిఎం ముందుంటోంది. ఆదిలాబాద్ జిల్లాల్లో సాగునీటి సమస్యలపై ఇవాళ్టి స్పెషల్ ఫోకస్.

నిర్వహణలో నిర్లక్ష్యం....

జలయజ్ఞం, కొత్త ప్రాజెక్టులు, రీ డిజైన్ ల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికే వున్న ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఇందుకు నిదర్శనం కడెం ప్రాజెక్టు. దీని నిల్వ సామర్థ్యం 7.6 టిఎంసిలు. 68 వేల ఎకరాలకు సాగునీరు అందిచాలన్న లక్ష్యంతో దీన్ని నిర్మించారు. కానీ ఏనాడూ 55వేల ఎకరాలకు మించి సాగు నీరందించలేకపోయింది కడెం ప్రాజెక్ట్.

దీని ద్వారా కడెం, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల మండలాల పరిధిలోని ఆయకట్టుకు నీరందుతోంది. కడెం ప్రాజెక్టులో పూడిక పెరుగుతోంది. పేరుకుపోయిన ఒండ్రు మట్టిని తొలగించకపోతే, నీటి నిల్వ సామర్థ్యం మరింత తగ్గిపోయే ప్రమాదం వుంది. కడెం ప్రాజెక్టు ఎత్తు మరో 10 అడుగులు పెంచితే, మరో 3.6 టిఎంసిల నీటిని నిల్వ చేసుకునే అవకాశం వుంది.

కడెం ప్రాజెక్టును వెన్నాడుతున్న నిర్వహణా లోపాలు...

ప్రాజెక్టులు కట్టుకోగానే సరిపోదు. వాటి నిర్వహణ కూడా అంతే ముఖ్యం. తెలంగాణలో గతంలో నిర్మించిన అనేక ప్రాజెక్టులకు నిర్వహణ లోపాలు శాపంగా మారుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదు. 2007లోనే పూర్తి కావాల్సిన మధ్య తరహా ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తవుతాయో అంతుబట్టని పరిస్థితి. మధ్య తరహా ప్రాజెక్టులపై ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాయే నిదర్శనం.

16 మధ్య తరహా ప్రాజెక్టులు.....

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఇంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16 మధ్య తరహా సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. 2005లో చేపట్టిన సాగునీటి పథకాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. జిల్లాలో చేపట్టిన మధ్య తరహా ప్రాజెక్టులతో పాటు భారీ ప్రాజెక్టు అయిన ప్రాణహిత చేవెళ్ల ద్వారా పది వేల ఎకరాలకు సాగునీరందిస్తామంటూ చెప్పారు. గత ఎనిమిదేళ్లలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా సాగునీరందలేదు. పనులు మొదలు పెట్టిన రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ ఒప్పందాలున్నా, అవి అమలు కాలేదు. ప్రభుత్వమూ, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది.

మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణంపై నిర్లక్ష్యం.....

తాంసీ మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టు ది మరో దీనగాధ. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. కానీ ఏం లాభం? కాలువలు తవ్వలేదు. కాలువల పని పూర్తి చేస్తే 13వేల ఎకరాలకు సాగునీరందుతుంది. రైతుల కష్టాలు తీరుతాయి. సాత్నాల ప్రాజెక్టు కాలువల నిర్మాణం పూర్తి చేస్తే 24 వేల ఎకరాలకు సాగునీరందించే అవకాశం కలుగుతుంది. ముదోల్ నియోజకవర్గంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు కాలువలు పూర్తయితే మరో 14 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. 32 ఏళ్లుగా పెండింగ్ లో వున్న పెన్ గంగా ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఇలా ఇన్ని చిన్నచిన్న ప్రాజెక్టులు అసంపూర్తిగా నిలిచిపోయినా, వాటిని పూర్తి చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదు. హామీలతోనే కాలం వెళ్లబుచ్చుతోంది.

నీల్వాయి ప్రాజెక్టు అంచనా వ్యయాలు...

వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో నిర్మిస్తున్న నీల్వాయి ప్రాజెక్టు అంచనా వ్యయాలు ఏయేటికాయేడు పెరుగుతున్నాయే తప్ప నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. పుష్కరకాలం క్రితం 2005 మే నెలలో సోయం కన్ స్ట్రక్షన్ కంపెనీ పనులు ప్రారంభించింది. అప్పట్లో 92 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 13వేల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టు ఇది. 4.5 కిలోమీటర్ల కట్ట తో పాటు 15 కిలోమీటర్ల చొప్పున కుడి ఎడమ కాలువలు నిర్మించాల్సి వుంది. 2007 నాటికే కట్ట నిర్మాణం పూర్తి చేసిన సోయం కన్ స్ట్రక్షన్ కంపెనీ ఆ తర్వాత రివిట్ మెంట్ కాలువ పనులు చేయకుండా నిలిపివేసింది. అప్పటికే 30 కోట్ల రూపాయలకు బిల్లులు పొందిన గుత్తేదారు మూడేళ్ల పాటు పనులు నిలిపివేశారు. గుత్తేదారుకి నోటీసులు జారీ చేసిన నీటి పారుదల శాఖ అధికారులు అతన్ని పనుల నుంచి తొలగించారు. 2011లో మళ్లీ టెండర్లు పిలిచారు. ఆర్ యన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ పనులు ప్రారంభించింది. అయితే, నిర్మాణం పనులు నాశిరకంగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. 4.5కిలోమీటర్ల కట్ట నిర్మాణంలో భాగంగా వాగుమధ్య భాగంలో 200 మీటర్ల మేర దృఢమైన కట్టను నిర్మించాల్సి వుంది. కానీ, అక్కడ అధికారుల పర్యవేక్షణ లోపించింది. పనుల నాణ్యతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాలువలు లేని మత్తడి వాగు ప్రాజెక్టు...

తాంసీ మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టు ది మరో దీనగాధ. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. కానీ ఏం లాభం? కాలువలు తవ్వలేదు. కాలువల పని పూర్తి చేస్తే 13వేల ఎకరాలకు సాగునీరందుతుంది. రైతుల కష్టాలు తీరుతాయి. సాత్నాల ప్రాజెక్టు కాలువల నిర్మాణం పూర్తి చేస్తే 24 వేల ఎకరాలకు సాగునీరందించే అవకాశం కలుగుతుంది. ముదోల్ నియోజకవర్గంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు కాలువలు పూర్తయితే మరో 14 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. 32 ఏళ్లుగా పెండింగ్ లో వున్న పెన్ గంగా ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఇలా ఇన్ని చిన్నచిన్న ప్రాజెక్టులు అసంపూర్తిగా నిలిచిపోయినా, వాటిని పూర్తి చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదు. హామీలతోనే కాలం వెళ్లబుచ్చుతోంది. సాగునీటి సమస్యలతో సతమతమవుతున్న అన్నదాత కష్టాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో, కొత్త కొత్త జీవోలతో రోజుకో వివాదం సృష్టిస్తూ కాలక్షేపం చేయకుండా, తక్షణం పూర్తి చేయగలిగే ప్రాజెక్టుల మీద దృష్టి సారించాలి. ఇదీ ఇవాళ్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్లీ కలుద్దాం.

16:07 - February 25, 2017

చంద్రన్న బీమా పరిహారాన్ని సకాలంలో అందించాలి:సీఎం

విజయవాడ: ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రన్న బీమా పరిహారాన్ని సకాలంలో అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. డ్వాక్రా రంగంపై ఆయన తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చంద్రన్న బీమా చెల్లింపులు మార్చి 30లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. మరణ ధ్రువీకరణ, శవపరీక్ష నివేదికలను జారీచేసే అంశంపై జరుగుతున్న జాప్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించనని ఆయన హెచ్చరించారు. డ్వాక్రా సంఘాలను మరిన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

సివిల్స్-2017 నోటిఫికేషన్‌ విడుదల..

ఢిల్లీ : సివిల్స్-2017 నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేశారు. మొత్తం 980 పోస్టులకుగానూ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టుల భర్తీలో భాగంగా నోటిఫికేషన్‌ను విడుదల చేయగా... మార్చి 17 వరకు www.upsconline.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం జూన్ 18న ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది.

చంచల్‌గూడ జైల్‌లో ఈ-ములాఖత్‌ ప్రారంభం

హైదరాబాద్ : చంచల్‌గూడ జైల్‌లో ఈ-ములాఖత్‌ ప్రారంభమైంది. రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి దీనిని ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా చంచల్‌గూడ జైలులోనే ఈ-ములాఖత్ ను ప్రారంభించారు. ఈ వ్యవస్థ ద్వారా ఖైదీలను కలిసేందుకు ఆన్‌లైన్‌లో సమయం బుక్‌ చేసుకునే సదుపాయం కలగనుంది.

ఏపీ అసెంబ్లీకి అసెంబ్లీ సిబ్బంది...

అమరావతి : సోమవారం హైదరాబాద్ నుంచి వెలగపూడి తాత్కాలిక అసెంబ్లీకి అసెంబ్లీ సిబ్బంది రానున్నారు. సోమవారం ఉదయం 11.30గంలకు ఉద్యోగులు, వారితో పాటు స్పీకర్ కోడెల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల కూడా బాధ్యతలు స్పీకరించానున్నారు.

త్రిపురలో భూకంపం

హైదరాబాద్: త్రిపుర రాష్ట్రంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఏటువంటి నష్టం సంభవించలేదని ప్రభుత్వం పేర్కొంది.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు..

హైదరాబాద్ : ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి స్వల్ప మార్పు చోటు చేసుకున్నది. మార్చి 17న జరగాల్సిన పోలింగ్‌ను అదే నెల 20వ తేదీకి నిర్వహించనున్నారు. మారిన షెడ్యూల్ తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు వర్తించనుంది. ఓట్ల లెక్కింపు కూడా మార్చి 20నే జరగనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ఫిబ్రవరి 28న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 7 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 8న పరిశీలన, 10న ఉపసంహరణ చేపట్టనున్నారు. మార్చి 17న జరగాల్సిన పోలింగ్‌ను 20కి వాయిదా వేశారు.

 

భారత్ ఘోర పరాజయం..

హైదరాబాద్: పూణే వేదికగా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతున్న తొలిటెస్టు మ్యాచులో టీమిండియా ఊహించ‌ని రీతిలో ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు 440 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన విష‌యం తెలిసిందే. ల‌క్ష్య ఛేద‌న‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆది నుంచే త‌డ‌బ‌డుతూ వ‌చ్చి రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 107 ప‌రుగుల‌కే ఆలౌట‌యింది. దీంతో ఆస్ట్రేలియా 333 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం న‌మోదు చేసుకుంది. మొద‌టి ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా 105 ప‌రుగులు మాత్ర‌మే చేసిన విష‌యం తెలిసిందే.

14:53 - February 25, 2017

హైదరాబాద్‌ : నగరంలో మూడు రోజుల పాటు జరగనున్న తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కేరళ రాష్ట్రానికి సంబందించిన ఎగ్జిబిషన్‌ను ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఏకే బాలమ్ ప్రారంభించారు. కాగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల మంత్రులు హజరుకానున్నారు.

14:52 - February 25, 2017

గుంటూరు : మంగళగిరి మండలం ఖాజా గ్రామంలో నిన్న మృతిచెందిన సీపీఎం సీనియర్ నాయకులు సింహాద్రి శివారెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకుముందు ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో..వామపక్షా, ప్రజాసంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతిమయాత్రకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, తెలకపల్లి రవితో పాటు పార్టీ సీనియర్ నేతలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన సంస్మరణ సభలో వామపక్ష నేతలు పాల్గొని శివారెడ్డి చేసిన సేవలను కొనియాడారు. రైతాంగం సమస్యలపై శివారెడ్డి అలుపెరుగని పోరాటం చేశారని సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, నాగిరెడ్డి, చంద్ర రాజేశ్వరరావు లాగే తన సొంత ఆస్తులను సైతం త్యాగం చేసి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం రానున్న రోజుల్లో ఉద్యమాలు సాగిస్తామని మధు తెలిపారు.

14:50 - February 25, 2017

హైదరాబాద్: సిరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. రాజధాని డమాస్కస్‌లోని మిలిటరీ ఇంటలిజెన్స్ బిల్డింగ్ ముందు జంట పేలుళ్లకు దిగారు. ఈ దాడిలో సుమారు 50 మందికి పైగా మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది.

 

14:48 - February 25, 2017

హైదరాబాద్: పదిహేనేళ్లుగా మణిపూర్‌ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ భ్రష్టుపట్టించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. మణిపూర్‌ని తూర్పున ఉన్న స్విట్జర్లాండ్‌ అనేవారని, కానీ అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. ఇంఫాల్‌లో ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ప్రధాని కాంగ్రెస్‌ పాలనను ఎండగట్టారు. బిజెపికి మణిపూర్‌ ఆదరణ పెరిగిందని మోది అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ను గద్దె దింపినట్లే మణిపూర్‌లోనూ కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలని మోది ఓటర్లకు పిలుపునిచ్చారు. మణిపూర్‌ రైతులకు నష్టం కలిగించిన కాంగ్రెస్‌కు అధికారంలో ఉండే అర్హత లేదని విమర్శించారు. గత 6 నెలల్లో కాంగ్రెస్‌ నుంచి పలువురు మంత్రులు, నేతలు బిజెపిలో చేరారు. 60 మంది సభ్యులున్న మణిపూర్‌ అసెంబ్లీకి మార్చి 4, 8 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుంది.

14:45 - February 25, 2017

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఐదో విడత ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. 11 జిల్లాల్లో 51 శాసనసభ స్థానాలకు ఈ నెల 27న సోమవారం పోలింగ్‌ జరగనుంది. మొత్తం కోటి 84 లక్షల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 96 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. మొత్తం 52 అసెంబ్లీ స్థానాలుండగా... అంబేద్కర్‌ నగర్‌లో అలాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న ఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్‌ కనౌజియా మృతి చెందడంతో ఇక్కడ వాయిదా పడింది. 2012 ఎన్నికల్లో 52 స్థానాలకు ఎన్నికలు జరగగా ఎస్పీ 37, కాంగ్రెస్‌, బిజెపిలకు 5 చొప్పున, బిఎస్పీ3, పీస్‌ పార్టీకి రెండు స్థానాలు దక్కాయి. ఐదో విడతలో అమేథితో, బల్‌రాంపూర్‌, గోండా, ఫైజాబాద్, అంబేద్కర్‌ నగర్, సుల్తాన్‌ పూర్, సిద్ధార్థ్‌నగర్‌ తదితర జిల్లాలున్నాయి.

14:44 - February 25, 2017

హైదరాబాద్: ప్రముఖ బాక్సింగ్‌ యోధుడు మహమ్మద్‌ అలీ కుమారుడు జూనియర్‌ అలీకి అమెరికా ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఫ్లోరెడాలోని విమానాశ్రయంలో రెండు గంటలపాటు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అలీని నిర్బంధించారు. ఏ మతానికి చెందినవాడివని అధికారులు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. మీరు ముస్లిమా... మీ పేరులో ఆ పదం ఎలా వచ్చిందన్న ప్రశ్నలతో జూనియర్‌ అలీని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన మహమ్మద్‌ అలీ జూనియర్‌ తన తల్లి కైల్హా కామ్‌చో అలీతో కలిసి ఫ్లొరెడాలోని ఫోర్టు లాడర్డల్‌-హాలీవుడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. వీరి పేర్లలో అరబిక్‌ పదాలు ఉండటంతో అధికారులు పక్కకు లాగేశారు. వీరు జమైకాలో బ్లాక్‌ హిస్టరీ మంత్‌ ఈవెంట్‌లో పాల్గొని తిరిగిస్తుండగా ఈ ఘటన చోటుసుకున్నట్లు వారి కుటుంబ లాయర్‌ క్రిస్‌ తెలిపారు. అలీ చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందిన అధికారులు ఆయన్ను విడుదల చేశారు. ముస్లిం దేశాల నుంచి వచ్చే వారిపై ట్రంప్‌ నిషేధం విధించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అలీ కుటుంబం ఆరోపించింది.

14:42 - February 25, 2017

వరంగల్ : ఆస్పత్రి ఆవరణలో ఓ పసిపాపను వదిలి వెళ్లిన ఘటన వరంగల్‌ నగరంలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎంజీఎం అత్యవసర చికిత్స విభాగం ఆవరణలో రాత్రి ఓ ఆడ శిశువును వదిలివెళ్లారు. అయితే ఏడుపు వినిపించడంతో పాపను గుర్తించి రోగి బంధువులు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం పాప ఎంజీఎం పిల్లల విభాగంలో చికిత్స పొందుతుంది. చీమలు కుట్టడంతో పాప అస్వస్థతకు గురైందని.. చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు.

కాంగ్రెస్ మొసలి కన్నీరును ప్రజలు నమ్మరు: జూపల్లి

సంగారెడ్డి: నారాయణఖేడ్ మండలం ర్యాకల్‌లో రూర్బన్ డెవలప్‌మెంట్ పథకాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు కల్పించడం లేదని ఈజీఎస్ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 20 ఏళ్లు అయినా కాంగ్రెస్ అధికారంలోకి రాదని జ్యోస్యం చెప్పారు. పల్లెటూర్లను అన్ని మౌలికసదుపాయాలతో అభివృద్ధి చేయడమే రూర్బన్ పథకం ఉద్దేశమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. కాంగ్రెస్ మొసలి కన్నీరును ప్రజలు నమ్మరని తెలిపారు.

సిరియాలో ఉగ్రబీభత్సం: 50 మంది మృతి

హైదరాబాద్: సిరియా మరోసారి బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. జంట పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 50 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

13:49 - February 25, 2017

నల్గొండ : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న యాత్ర..132వ రోజు నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలంలోని సీతావారిగూడెం నుండి యాత్ర ప్రారంభమైంది. అక్కడినుండి జిల్లాలోని అప్పన్నపేట, గరిడేపల్లి, ఎల్బీనగర్‌, నేరేడుచర్ల, రామాపురం, శాంతినగర్‌, కమలానగర్‌, పెంచికల్‌ దిన్నే, కల్లూరు, ముకుందాపురం, దాచారం, నాగులపాటి అన్నారంలో యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా.. గరిడేపల్లిలో తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ.. సీపీఎం పాదయాత్రతో సీఎం కేసీఆర్‌కు వణుకు పుడుతోందని విమర్శలు గుప్పించారు. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి సీఎం వివిధ అంశాలపై మాట్లాడుతున్నారని చెప్పారు. సామాజిక న్యాయం అంశాలపై చర్చకు వస్తామన్నా..టీఆర్‌ఎస్‌ నేతలు తోకముడిచారని తమ్మినేని వీరభద్రం ఫైర్‌ అయ్యారు. దేవుడికి ఇచ్చిన మొక్కులను మాత్రం కేసీఆర్‌ తీర్చుకుంటున్నాడని... కానీ జనాలకు ఇచ్చిన మొక్కులను సీఎం కేసీఆర్‌ ఎప్పుడు నెరవేరుస్తాడని ప్రశ్నించారు.

 

13:44 - February 25, 2017

హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత కేసీ శేఖర్‌బాబు కన్నుమూశారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో ఈరోజు ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్‌, ముఠామేస్త్రీ చిత్రాలను నిర్మించారు. శేఖర్‌బాబు మృతిపట్ల పలువురు సినీ నటులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే శేఖర్‌బాబు కూతురు అమెరికాలో ఉన్నందున..రేపు సాయంత్రం ఆమె హైదరాబాద్‌కు చేరుకుంటారని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు నగరంలోని మహాప్రస్థానం స్మశానవాటికలో అంత్రక్రియలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. శేఖర్‌బాబు నివాసం నుంచి ఆయన మృతదేహాన్ని ఫిలించాంబర్‌కు తరలించారు. 

13:41 - February 25, 2017

పెద్దపల్లి : ఇంజక్షన్లు వికటించి మూడు రోజుల్లో ముగ్గురు మృత్యువాత పడిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఇంజక్షన్ల రూపంలో మృత్యువు కబలిస్తోంది. వరుసగా మూడు రోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇంజక్షన్లు వికటిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల ఎదుట మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

 

13:37 - February 25, 2017

అమెరికా : అగ్రరాజ్యంలో జాతి వివక్ష మితి మీరిపోతోంది. ట్రంప్‌ రెచ్చగొట్టే మాటలు.. తెల్లజాతీయుల్ని రాక్షసుల్లా మారుస్తోంది. దీంతో విదేశీయులు అక్కడ క్షణ క్షణం భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితి. అమెరికాలో రోజురోజుకు పెరిగిపోతున్న దాడులతో భారతీయులు హడలెత్తిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు తెలుగు వాళ్లను అమెరికాలో కాల్పి చంపడం.. అక్కడి వివక్షకు అద్దం పడుతోంది. 
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు.. ఎవరు ఎక్కడి నుంచి దాడి చేస్తారో తెలీదు.. ఏ తూటా ఎక్కడి నుంచి దూసుకువస్తుందో తెలీదు.. బయటకు వెళ్లాలంటే భయం.. ఉద్యోగం చేయాలంటే భయం.. కంటి నిండా కునుకు ఉండదు. కడుపు నిండా తినే స్వేచ్చా ఉండదు. అగ్రరాజ్యం అమెరికాలో జాతి వివక్ష తారా స్థాయికి చేరుతోంది. ఎన్నారైలపై తెల్ల జాతీయులు విరుచుకుపడుతున్నారు. నెల వ్యవధిలోనే ఇద్దరు తెలుగు వారు తెల్ల జాతీయుల చేతిలో ప్రాణాలు కోల్పొయారు. 
కారు తగిలిందనే కారణంతో కాల్చి చంపారు 
పది రోజుల క్రితం కాలిఫోర్నియాలో ఇలా కారు తగిలిందనే కారణంతో ఓ తెల్ల జాతీయుడు వరంగల్‌ యువకుడు వంశీరెడ్డిని కాల్చిచంపేశాడు. తాజాగా ఓ బార్‌లో జరిగిన వాగ్వాదం మరొకరిని బలితీసుకుంది. పురింటన్‌ అనే తెల్ల జాత్యాహంకారి హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ కూచిభొట్లను తుపాకీతో కాల్చిచంపాడు. ఇదే ఘటనలో శ్రీనివాస్‌ స్నేహితుడు, దిల్‌సుఖ్‌నగర్‌ కొత్తపేటకు చెందిన అలోక్‌రెడ్డి బుల్లెట్ గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఒకేనెలలో రెండు దుర్ఘటనల్లో ఇద్దరు తెలుగు యువకులు అమెరికాలో ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే భయంలో ఉంటున్నారు.
ఎన్నారైల కుటుంబాల్లో కలవరం 
ఐటీ బూమ్ పుణ్యమా... తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు చాలా మంది వలస వెళ్లారు. మొన్నటి వరకు పరిస్థితి బాగానే కనిపించినా.. ట్రంప్ రాక అనంతరం.. జరుగుతున్న వరుస దాడులతో ఎన్నారైల కుటుంబాల్లో కలవరం మొదలైంది. భారతీయులెందుకు అమెరికాకు వస్తున్నారంటూ కాల్పులకు తెగబడటం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగాలు, ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి కడుపుకోతకు గురవుతున్నారు. ఇది తమ దేశం అని చెప్పుకుంటే... ఇలా బుల్లెట్లతో చంపుతారా అని భారతీయులు ప్రశ్నిస్తున్నారు. తన భర్త మృతికి అమెరికా ప్రభుత్వమే సమాధానం చెప్పాలని మృతిచెందిన శ్రీనివాస్‌ భార్య సునయన డిమాండ్ చేశారు. అమెరికాపై ఉన్న ప్రేమతోనే ఇక్కడ ఉన్నామని..కానీ ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందా అని సునయన ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త శ్రీనివాస్‌ ఎలాంటి తప్పు చేయలేదని.. జాతి వివక్షతోనే కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెచ్‌1బీ వీసాలపై ఆంక్షలు 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనుకున్నంతా జరుగుతోంది. అధికారంలోకి రాగానే హెచ్‌1బీ వీసాలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు తెలుగు వారిని పొట్టపెట్టుకోవడం అనుమానాలకు తావిస్తోంది. తెల్ల జాతీయుల జాత్యాంహకారం మరెంత మంది భారతీయులను పొట్టన పెట్టుకుంటుందోనని NRIలు భయపడుతున్నారు. 

 

వరంగల్‌ ఎస్ ఆర్ కాలేజీలో దారుణం

వరంగల్‌ : నగరంలో దారుణం జరిగింది. ఎస్‌ఆర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థి విజ్ఞేష్‌ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. 

13:18 - February 25, 2017

గుంటూరు : జిల్లాలో చిన్నారి కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది. మారిష్‌పేటకు చెందిన రెండేళ్ల నిఖిల్‌ రెడ్డిని కిడ్నాప్‌ చేశారు. రాత్రి బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా దుండుగులు ఎత్తుకెళ్లారు. కిడ్నాప్‌ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

గుంటూరు జిల్లాలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌

గుంటూరు : జిల్లాలో చిన్నారి కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది. మారిష్‌పేటకు చెందిన రెండేళ్ల నిఖిల్‌ రెడ్డిని కిడ్నాప్‌ చేశారు. రాత్రి బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా దుండుగులు ఎత్తుకెళ్లారు. 

13:10 - February 25, 2017

విజవాయడ : అమెరికాలో భారతీయులను తరిమివేయడాన్ని నిరసిస్తూ... సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన జరుగుతంది. బందర్‌ రోడ్‌లోని మాకినేని బసవపున్నయ్య విగ్రహం వద్ద జరుగుతున్న ఈ నిరసనలో... సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. 

 

13:07 - February 25, 2017

హైదరాబాద్ : శాసనసభ్యుల కోటాలో మండలికి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పదవులపై టీఆర్‌ఎస్‌లో చాలామంది నేతలు కన్నేశారు. ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు ఒక్కఛాన్స్‌ అంటూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి ఛాన్స్‌ ఇస్తారా..? లేక మరెవరికి పదవులు దక్కుతాయి..? అన్న చర్చ అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. 
గులాబీ నేతల్లో కొత్త ఉత్సాహం
శాస‌నస‌భ్యుల కోటాలో శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల కావ‌డంతో గులాబీ నేతల్లో కొత్త ఉత్సాహం
కనిపిస్తోంది. ఉద్యమంలో పాల్గొన్న చాలామంది నేతలు పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ముందు కూడా కేసీఆర్‌ శాసన మండలి సభ్యులుగా అవకాశం కల్పిస్తామని చాలామంది నాయకులకు హామీ ఇచ్చారు. దీంతో వారంతా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. శాస‌న‌స‌భ్యుల కోటా ఎన్నిక‌ల‌కు న‌గ‌రా మోగ‌డంతో ఉద్యమంలో పనిచేసిన వారంతా త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్కుతాయ‌న్న ధీమాతో ఉన్నారు. మార్చిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీలు వి. గంగాధ‌ర్ గౌడ్, మాఘం రంగారెడ్డి, రిజ్వీల ప‌ద‌వి కాలం ముగియ‌నుంది. 
గంగాధ‌ర్ గౌడ్‌కు మ‌రోసారి అవ‌కాశం 
టీడీపీ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన గంగాధ‌ర్ గౌడ్‌కు మ‌రోసారి అవ‌కాశం ద‌క్కనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి స్థానం కూడా  శాస‌న‌స‌భ్యుల సంఖ్య ప్రకారం అధికార పార్టీకే ద‌క్కనుంది. ఈ సీటుపై టీఆర్‌ఎస్‌లోని చాలామంది నేతలు భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక ఎంఐఎం ఎమ్మెల్సీ రిజ్వీ స్థానాన్ని ఆ పార్టీకి అధికార పార్టీ వ‌దులుతుందా..? లేదా చర్చ సాగుతోంది. టీఆర్‌ఎస్‌కు మిత్రప‌క్షంగా ఉన్నఎంఐఎం నుంచి ఇప్పటి వ‌ర‌కూ ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలుస్తోంది. శాస‌న‌స‌భ‌లో పార్టీల బ‌లాబ‌లాల‌ను ప‌రిశీలిస్తే... ప్రతిప‌క్ష పార్టీల‌న్నీ క‌లిసినా ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా వాటికి దక్కే అవకాశం లేదు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎంల అవగాహన ఒప్పందంతోనే మండలి ఎన్నికలు ఏకగ్రీవం కావొచ్చన్న అభిప్రాయం చాలామంది నేతల్లో వ్యక్తమవుతోంది. 

 

13:03 - February 25, 2017

విశాఖ : బీహెచ్‌పివి కంపెనీ టౌన్‌ షిప్‌ గేటును వెంటనే తెరవాలని విశాఖ జిల్లా తుంగ్లం గ్రామ ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నా రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని చెరువులో ప్లకార్డులతో నిరసన తెలిపారు. టౌన్‌ షిప్‌ గేట్‌ మూసివేయడంతో విద్యార్థులు గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

13:01 - February 25, 2017

హైదరాబాద్ : అధికారంలోకివచ్చిన రెండున్నరేళ్లతర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌పై కీలకమైన ముందడుగు వేసింది.. పలు సమావేశాలు, చర్చల తర్వాత చట్టంలో సవరణలకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.. మరో మూడు రోజుల్లో సబ్‌ప్లాన్‌కు కొత్త ప్రతిపాదనలకు తుదిరూపం రాబోతోంది. 
కమిటీ సమావేశాల్లో సుదీర్ఘ చర్చలు 
ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ ప్లాన్‌ చట్ట సవరణలకు సీఎం కేసీఆర్‌ పచ్చ జెండా ఊపారు.. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతంకాకుండా చట్టాన్ని పకడ్బందీగా రూపొందించి, అమలు చేయడంపై సీఎం సీరియస్‌గా దృష్టిపెట్టారు.. ఇప్పటికే  సబ్‌ప్లాన్‌ చట్ట సవరణపై కడియం శ్రీహరి, చందూలాల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీలు.... పలు పార్టీలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించాయి.. మూడుసార్లు ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో సుదీర్ఘ చర్చలు నడిచాయి.. అయితే ఈ సమావేశాల్ని మొదట టీడీపీ, కాంగ్రెస్‌ బహిష్కరించాయి.. తమ ప్రభుత్వ హయాంలో వచ్చిన చట్టాన్ని టీఆర్‌ఎస్‌ తన సొంత చట్టంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని హస్తం నేతలు ఆరోపించారు.. సీపీఎం మాత్రమే  దారిమళ్లిన నిధులు, సబ్‌ప్లాన్‌ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత కావాలని డిమాండ్ చేసింది.
బడ్జెట్‌లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం నిధులు
సబ్‌ప్లాన్‌ చట్టంలో 19 అంశాలను మార్చాలని, సబ్‌ప్లాన్‌ చట్టసవరణ కమిటీ సభ్యులు తీర్మానించారు.. ఇన్ని క్లాజుల్లో మార్పులకుబదులు కొత్త చట్టాన్ని తెస్తే బావుంటుందని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రతిపాదించారు.. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎంలు కూడా సబ్‌ప్లాన్‌ సవరణకు కొన్ని ప్రతిపాదనల్ని ప్రభుత్వం ముందుంచాయి.. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం నిధులను కేటాయించాలని, ఈ నిధులను నోడల్‌ ఏజెన్సీలో పోగు చేయాలని కోరాయి. మూడేళ్లలో దారి మళ్లిన 17వేల కోట్లను వచ్చే బడ్జెట్‌లో పొందుపరచాలని, చట్టంలోని సెక్షన్‌ 11 బీ, సీ, డీ క్లాజులను తొలగించాలని, పథకాల రూపకల్పనపై సంక్షేమ శాఖల నోడల్‌ ఏజెన్సీలకే అజమాయిషీ ఉండేలా చూడాలని సూచించాయి. నిధులు సక్రమంగా ఖర్చు చేయని అధికారులపై చర్యలు తీసుకునేలా చట్టంలో సవరణ ఉండాలని ప్రతిపాదించాయి. చట్ట సవరణపై దళిత, గిరిజన సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పట్టుపడుతున్నాయి.
పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం
ప్రతిపక్షాల సూచనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.. ఇందులో పలు అంశాల అమలుకు అంగీకరించింది. పదేళ్ళ కాలపరిమితి ఎత్తి వేయడంతోపాటు, పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకానికి ఓకే చెప్పింది.. రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో కమిటీ వేయాలని ప్రభుత్వం చూస్తోంది.. నిధులు పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ బాధ్యతలు కూడా ఇవ్వాలని ఆలోచిస్తోంది.. ఇలా అన్ని సలహాలకు ఒప్పుకున్న సర్కారు... సబ్‌ప్లాన్‌కు ప్రగతి పద్దుగా పేరు మార్చాలని తీర్మానించింది..  మరో రెండు మూడు రోజుల్లో  ఈ ప్రతిపాదనలకు తుదిరూపం రానుంది.. ప్రతిపక్షాలు మాత్రం చట్టం స్ఫూర్తిని దెబ్బతీస్తే సహించేదిలేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.. ఏదిఏమైనా ఈ చట్టంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హాట్‌ హాట్‌ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

 

12:57 - February 25, 2017

హైదరాబాద్ : మార్చి కూడా మొదలవకముందే ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే వాతావరణం వేడిక్కెతుండటంతో రాబోయే నాలుగు నెలలు వేసవి భయంకరంగా ఉండబోతుందన్న ఆందోళన అందిరిలో కలుగుతోంది. ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా వడగాల్పులతో పసిపిల్లలు, వృద్ధులు, తీవ్ర ఇబ్బందులకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సర్కార్‌ సూచిస్తోంది. వడగాల్పులను ఎదుర్కొనేందుకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించేందుకు ఎంసీహెచ్‌ఆర్డీలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. 
ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో వర్క్‌షాప్‌ 
వేసవిలో ఎండలు మండే ప్రమాదం ముంచుకొస్తుండటంతో.. వడగాలులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో రెండు రోజుల వర్క్‌షాప్‌ నిర్వహించారు. వడగాల్పులపై కార్యాచరణ ప్రణాళిక అనే అంశంపై విపత్తుశాఖ అవగాహన కల్పించింది. ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని ఎన్‌డీఎంఏ సభ్యులు ఆర్‌కే జైన్‌ తెలిపారు. 
వడగాడ్పులపై ముందస్తు హెచ్చరికలు 
వాతావరణశాఖ సహకారంతో వడగాడ్పులపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటారని, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని వివిధ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు, సూచనలు స్వీకరించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. గతేడాది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించాయని, ఉపాధి హామీ కార్మికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. 
మండుటెండలు, వడగాడ్పులపై అవగాహన 
ముఖ్యంగా మండుటెండలు, వడగాడ్పులపై అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణనష్టం నివారించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వర్క్‌షాప్‌లో చర్చించిన అంశాలు, మిగతా ప్రణాళికతో సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే అవి వేడిగాలులని, మన దేశంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితే వడగాలులుగా పేర్కొంటామని ఎన్‌డీఎంఏ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతల పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం ద్వారా ఎండల బారిన నుంచి కాపాడుకునేలా చేయవచ్చని, ప్రజలు తీసుకోవాల్సిన ఆహారం, ధరించాల్సిన దుస్తులు, జీవన విధానంలో మార్పు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని విపత్తు శాఖ అధికారులు నిర్ణయించారు.

 

12:52 - February 25, 2017

గుంటూరు : జిల్లాలోని మంగళగిరి మండలం ఖాజా గ్రామంలో నిన్న మృతిచెందిన సీపీఎం సీనియర్ నాయకులు సింహాద్రి శివారెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. అంతిమయాత్రకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పార్టీ సీనియర్ నేతలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన సంస్మరణ సభలో వామపక్ష నేతలు పాల్గొని శివారెడ్డి చేసిన సేవలను కొనియాడారు. రైతాంగం సమస్యలపై శివారెడ్డి అలుపెరుగని పోరాటం చేశారని సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, నాగిరెడ్డి, చంద్ర రాజేశ్వరరావు లాగే తన సొంత ఆస్తులను సైతం త్యాగం చేసి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం రానున్న రోజుల్లో ఉద్యమాలు సాగిస్తామని మధు తెలిపారు. 

12:46 - February 25, 2017

హైదరాబాద్ : అమెరికాలో కాల్పుల ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఘటన తనను బాగా కలిచివేసిందన్న కేటీఆర్... బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు. విదేశాంగ శాఖ సహాయంతో... మృతదేహాన్ని త్వరగా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్ ట్వీట్ చేశారు. 

 

12:40 - February 25, 2017

నిజామాబాద్ : ఆరుగాలం శ్రమించి.. పంట పండించే అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. నేల తల్లినే నమ్ముకున్న రైతన్నలు సకాలంలో రుణం చేతికందక నానా తంటాలకు గురవుతున్నారు. రబీ సీజన్‌ ప్రారంభమై నాలుగు నెలలు కావొస్తున్నా.. పంట రుణాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఆశించిన మేర రుణసాయం అందకపోవడంతో పాటు.. జనవరి 10 వరకు ఉన్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం కూడా గడువు ముగిసినా బ్యాంకర్లు మాత్రం కనికరించడం లేదు. దీంతో రైతన్నలు పంటలు ఎలా సాగు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 
రుణ మాఫీకి నోచుకోక దిక్కులు చూస్తున్న రైతన్నలు
అటు పాత రుణం మాఫీ కాదు.. ఇటు కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వవు... ఈ పరిస్థితుల్లో సాగు చేసేదెలా అంటున్నారు నిజామాబాద్‌ జిల్లా అన్నదాతలు. రబీ ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా ప్రభుత్వం ప్రకటించిన రుణమాపీ పథకం అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ససేమిరా అంటుండటంతో హలం పట్టి..పొలం దున్నాలంటేనే గుబులు పుడుతోందని అన్నదాతలు చిన్నబోతున్నారు.
1.7 లక్షల రైతులకు పంట రుణాలు అందాల్సి ఉంది... 
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో దాదాపు 1.7 లక్షల రైతులకు పంట రుణాలు అందాల్సి ఉంది. కానీ సీజన్ మొదలై నాలుగు నెలలు కావస్తోన్నా ఇప్పటి వరకు 41 వేల 18 మంది రైతులకు మాత్రమే రుణాలిచ్చారు. అటు రుణాలు ఇవ్వకపోవడం, ఇటు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం కూడా గడువు ముగియడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న దయనీయ పరిస్థితి నెలకొంది. రబీ రుణాలు ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇచ్చే వీలున్నా సకాలంలో రుణాలు చేతికందకపోతే పెట్టుబడికి ఇబ్బందులుంటాయని రైతులు వాపోతున్నారు. 
రుణం అందక రైతులు ఆందోళన 
జిల్లాలో ఇప్పటికే ఆరుతడి పంటలు వేసిన రైతులు.. పెట్టుబడికి కావాల్సిన రుణం అందక ఆందోళనకు గురవుతున్నారు. కొందరు రైతులు చేసేది లేక వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు రుణాలు  తెస్తున్నారు. ఇక ప్రధాని మోదీ పిలుపు మేరకు జన్‌ధన్‌ ఖాతాలను తెరిచిన సన్న, చిన్నకారు రైతులు సరైన సమయంలో రుణం చేతికందక తీవ్ర కష్టాలు పడుతున్నారు. చేతిలో డబ్బుల్లేక యాసంగి పంటలకు పెట్టుబడి పెట్టే పరిస్థితి కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
అగమ్యగోచర పరిస్థితిలో అన్నదాతలు
జీరో బ్యాలెన్స్‌తో జన్‌ధన్‌ ఖాతాలు తెరిచిన రైతులు.. పెద్ద నోట్ల రద్దుతో వాటిలో పంట అమ్మగా వచ్చిన డబ్బుల్ని కూడా జమ చేసుకోలేని పరిస్థితి ఉంది. ఖరీఫ్‌ పంటలు చేతికి వచ్చినా వ్యాపారులు ఇచ్చిన చెక్కులను ఎక్కడ జమ చేయాలో తెలియని అగమ్యగోచర పరిస్థితిలో అన్నదాతలున్నారు. కేసీఆర్‌ ఇచ్చిన రుణ మాఫీ హామీ నెరవేరక అనేక మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడ్డారని స్థానిక సీపీఎం నేతలు అన్నారు. రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని ఎన్ని లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని, భూముల్ని బలవంతంగా లాక్కుంటున్న కేసీఆర్‌ రైతుల్ని అవమానించే విధంగా మాట్లాడతున్నారని సీపీఎం నేతలు విమర్శించారు. రుణ మాఫీ పథకం అమలు కాకపోవడం వల్ల పురుగుల మందే పెరుగన్నం అవుతోందని, సాగు భారమై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రజాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతు రుణమాఫీకి చర్యలు తీసుకోవాలని రైతులు,  ప్రజాసంఘాల నేతలు కోరుతున్నారు. 

 

12:30 - February 25, 2017

హైదరాబాద్ : ఎమ్మెల్సీ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఎలక్షన్‌ ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మార్చి 7వ తేదీతో ప్రచారం కూడా ముగియనుంది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. 
ముగిసిన నామినేషన్ల పర్వం
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 30 మంది నిలిచారు. నామపత్రాల ఉపసంహరణ పర్వం కూడా ముగియడంతో అభ్యర్థులు ప్రచార అస్త్రాలను పదును పెడుతున్నారు. అధికార టీడీపీ, బీజేపీల తరపున రంగంలోకి దిగిన పీవీఎన్‌ మాధవ్‌కు మద్దతుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. సభలు సమావేశాలు పెడుతూ మాదవ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. 
పోటీలో సీఐటీయూ సీనియర్‌ నాయకుడు అజ శర్మ
ప్రజా, ఉద్యోగ సంఘాల మద్దతుతో పోటీకి దిగిన సీఐటీయూ సీనియర్‌ నాయకుడు అవధానుల అజ శర్మ ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ మద్దతుతో రంగంలోకి దిగిన యడ్ల ఆదిరాజు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మూడు జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్‌ నేతలు, ఐఎన్‌టీయూసీ నాయకులు ఆయనకు మద్దతుగా ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. లోక్‌సత్తా మద్దతుతో పోటీ చేస్తున్న వి.వి.రమణమూర్తి కూడా వివిధ సంఘాల మద్దతుతో జనంలోకి వెళ్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 
అజ శర్మ, మాధవ్‌ల మధ్య ప్రధాన పోటీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి  అజ శర్మ, మాధవ్‌ల మధ్య  ప్రధాన పోటీ కనిపిస్తోంది. మిగలిన వారు అంతంత మాత్రం ఉన్నప్పటికీ ఈ ఎన్నికలు ఉత్తరాంధ్రలో వేడిని పెంచుతున్నాయి. కాగా  మార్చి 9న ఎమ్మెల్సీ ఎన్నిక ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరగనుంది.  తెలుగు అక్షర క్రమం ప్రకారం అభ్యర్థుల పేర్లతో బ్యాలెట్‌ పత్రాలు ముద్రితమవుతున్నాయి. 

12:07 - February 25, 2017

పూణె టెస్టు : భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో 285 పరుగుల  వద్ద ఆస్ట్రేలియా ఆలౌట్ ఆయింది. ఆసిస్ 440 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ విజయలక్ష్యం 441 పరుగులుగా ఉంది. 
 

రెండో ఇన్నింగ్స్ లో 285 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్

పూణె టెస్టు : భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో 285 పరుగుల  వద్ద ఆస్ట్రేలియా ఆలౌట్ ఆయింది. ఆసిస్ 440 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ విజయలక్ష్యం 441 పరుగులగా ఉంది. 

11:33 - February 25, 2017

హైదరాబాద్ : అమెరికాలోని కాన్సాస్‌లో జరిగిన కాల్పుల్లో మరణించిన కూచిభొట్ల శ్రీనివాస్‌, గాయపడ్డ అలోక్‌రెడ్డి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసేందుకు వేలాది మంది ముందుకు వస్తున్నారు. గతంలో వారిద్దరితో కలిసి పనిచేసిన అనేక మంది వారి కోసం విరాళాలు సేకరిస్తోంది. వీటి కోసం రూపొందించిన గోఫండ్‌మి పేజీకి విశేష స్పందన వస్తోంది. గో ఫండ్‌ మీ పేజీ ద్వారా వచ్చిన డబ్బంతా శ్రీనివాస్‌, అలోక్‌రెడ్డి కుటుంబాలకు అందచేస్తామని స్నేహితులు తెలిపారు. 
విరాళాల వెల్లువ 
అమెరికాలోని కాన్సస్‌లో ఓ బార్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు కూచిబొట్ల శ్రీనివాస్‌ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో యువకుడు అలోక్‌ గాయాలతో బయటపడ్డారు. శ్రీనివాస్‌, అలోక్‌ ఇద్దరూ జీపీఎస్‌-గార్మిన్‌ సంస్థలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. కాల్పుల్లో మరణించిన శ్రీనివాస్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు వేలాది మంది పౌరులు ముందుకు వస్తున్నారు. గతంలో శ్రీనివాస్‌తో కలిసి పనిచేసిన కవిప్రియ ముత్తురామలింగం..శ్రీనివాస్‌ కుటుంబం కోసం విరాళాలు సేకరిస్తోంది. విరాళాలు ఇవ్వాలని కోరుతూ ఆమె రూపొందించిన గోఫండ్‌మి పేజీకి విశేష స్పందన లభించింది. కేవలం ఆరు గంటల్లోనే 6,100 మంది స్పందించి దాదాపు 3లక్షల డాలర్లు ఇచ్చారు. లక్షా 50వేల డాలర్ల కోసం ఈ పేజీని రూపొందించగా..ఏకంగా 3 లక్షల డాలర్లకుపైగా వచ్చాయి.
కేవలం 6 గంటల్లోనే 3 లక్షల డాలర్లు సేకరణ  
గోఫండ్‌మీ పేజీ ద్వారా వచ్చిన డబ్బంతా  శ్రీనివాస్‌ భార్య సునయనకు అందజేస్తామని కవిప్రియ తెలిపారు. అమెరికా నుంచి శ్రీనివాస్ మృతదేహాన్ని భారత్‌కు పంపించడానికి ఆయన కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలిపారు. శ్రీనివాస్‌ మృతిపై స్పందిస్తూ.. శ్రీనివాస్‌ చాలా మంచి వ్యక్తి అని.. అందరితోనూ ఎంతో ప్రేమగా, బాధ్యతగా ఉండేవారని గుర్తుచేశారు. శ్రీనివాస్‌ చాలా గొప్ప వ్యక్తి అని కవిప్రియ గో ఫండ్‌మీ పేజీలో పోస్ట్‌ చేశారు. ఇక కాల్పుల్లో గాయపడ్డ అలోక్‌రెడ్డి చికిత్స కోసం,.అలాగే శ్రీనివాస్‌ కుటుంబానికి సహాయం కోసం బ్రియాన్‌ ఫోర్డ్‌ అనే మరో వ్యక్తి ఫండ్‌ పేజీ ఏర్పాటు చేశారు. దానికి కూడా అనేక మంది స్పందించి 32,660 డాలర్లను విరాళంగా ఇచ్చారు. అలాగే ఈ ఇద్దరు యువకులను కాపాడేందుకు అయాన్‌ గ్రిల్లాట్‌ అనే అమెరికన్‌ యువకుడు కూడా ప్రయత్నించి గాయపడ్డ సంగతి తెలిసిందే. అతడి చికిత్స కోసం గ్రిల్లాట్‌ సోదరీమణులు గోఫండ్‌మీ పేజీ ప్రారంభించగా దానికి 99వేల డాలర్లు వచ్చాయి.

 

ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

పుణె టెస్టు : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 258 పరుగుల వద్ద స్టార్మ్ ఔట్ అయ్యాడు. 

సీపీఎం నేత సింహాద్రి శివారెడ్డి అంతిమయాత్ర ప్రారంభం

గుంటూరు : మంగళగిరి మండలం కాజ గ్రామంలో సీపీఎం సీనియర్ నేత సింహాద్రి శివారెడ్డి అంతిమయాత్ర ప్రారంభం అయింది. అంతిమయాత్రలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. 

 

స్మిత్ ఔట్

పూణె టెస్టు : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 246 పరుగుల వద్ద స్మిత్ (109) ఔట్ అయ్యాడు. 

 

11:06 - February 25, 2017

హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత కేసీ శేఖర్‌బాబు కన్నుమూశారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో ఈరోజు ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్‌, ముఠామేస్త్రీ చిత్రాలను నిర్మించారు. శేఖర్‌బాబు మృతిపట్ల పలువురు సినీ నటులు, ప్రముఖులుచ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. 

 

10:55 - February 25, 2017

హైదరాబాద్ : అమెరికాపై తన భర్తకు ఎంతో ప్రేమ ఉందని...కానీ ఇలా జాతివివక్ష కారణంగా తన భర్తను కోల్పోతానని అనుకోలేదని కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్‌ భార్య సునయన ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మృతికి అమెరికా ప్రభుత్వం సమాధానం చెప్పాలని సునయన డిమాండ్ చేశారు. అమెరికాపై ఉన్న ప్రేమతోనే ఇక్కడ ఉన్నామని..కానీ ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందా అని సునయన ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త శ్రీనివాస్‌ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తమ కుటుంబ సభ్యులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు బార్‌కు వెళ్లారని చెప్పారు. 

 

10:51 - February 25, 2017

హైదరాబాద్ : అమెరికాలో జాతి వివక్ష మళ్లీ జడలు విప్పుకుంది. ఎన్నికల ప్రచార వేళ.. డొనాల్డ్‌ ట్రంప్‌ నాటిన విద్వేషపు బీజాలు.. అప్పుడే మొగ్గతొడుగుతున్నాయి.  జాతివివక్ష తలకెక్కిన ఓ తెల్లజాతీయుడి విచక్షణ రహిత చర్యకు.. తెలంగాణ వాసి శ్రీనివాస్‌ కూచిభొట్ల బలయ్యాడు. మరొకరు గాయపడ్డారు. శ్రీనివాస్‌ కూచిభొట్ల మృతిని ఆయన కుటుంబం తట్టుకోలేక పోతోంది.  ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళితే, జీవితం చీకటిమయమైందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 
తెలుగువారిపై కాల్పుల కలకలం..
అమెరికాలో, జాత్యహంకారి, ఆడం పురింటన్‌, తెలుగువారిపై కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ కాల్పుల్లో మరణించిన శ్రీనివాస్‌ కూచిభొట్ల కుటుంబం.. జరిగిన దారుణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతోంది. హైదరాబాద్‌ జెఎన్‌టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్‌, అమెరికాలోని టెక్సాస్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశాడు. కాన్సాస్‌ రాష్ట్రంలోని ఒలాతేలో ఉన్న గార్మిన్‌ కంపెనీలో ఏవియేషన్‌ ఇంజనీర్‌గా చేరాడు. బుధవారం రాత్రి అనూహ్యంగా.. స్థానిక శ్వేతజాతీయుడు పురింటన్‌ చేతుల్లో దారుణ హత్యకు గురయ్యాడు. తమవాడిని తలచుకుని.. శ్రీనివాస్‌ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. 
అలోక్‌ కుటుంబం దిగ్భ్రాంతి 
అటు, ఒలాతేలో శ్వేతజాతీయుడి కాల్పుల్లో గాయపడ్డ మరో తెలుగువాడు, అలోక్‌ కుటుంబాన్నీ జరిగిన దారుణం దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్‌లోని వాసవి కాలేజీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి, కన్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరీలో మాస్టర్స్‌ డిగ్రీ పొందిన అలోక్‌ కూడా.. గార్మిన్‌ కంపెనీలోనే పనిచేస్తున్నారు. జరిగిన దారుణంపై.. అలోక్‌ కుటుంబం తీవ్ర కలవరానికి గురైంది. అమెరికాలో జీవించే పరిస్థితులు మృగ్యమవుతున్నాయని, బుధవారం నాటి కాల్పుల ఘటన నిరూపిస్తోందని అలోక్‌ కుటుంబ సభ్యులు అంటున్నారు. 
శ్రీనివాస్‌ కూచిబొట్ల మృతి పట్ల సుష్మా స్వరాజ్‌ 
అమెరికాలో జాత్యహంకార దుండగుడు పురింటన్‌ జరిపిన కాల్పుల్లో తెలుగు ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌ కూచిబొట్ల మృతిపట్ల కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబం ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సంతాపం వ్యక్తం చేశారు.  అటు శ్రీనివాస్‌ మృతిపట్ల, గార్మిన్‌ కంపెనీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. శ్రీనివాస్‌ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు భారత విదేశాంగ శాఖ, గార్మిన్‌ కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించాయి. 
అయాన్‌ గ్రిల్లాట్‌ పై ప్రశంసలు
అయాన్‌ గ్రిల్లాట్‌..! ఇరవై నాలుగేళ్ల ఈ యువకుడు.. ఇప్పుడు హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. బుధవారం నాడు, అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్రం ఒలాతేలోని బార్‌లో జాతి వివక్షతో ఓ శ్వేతజాతీయుడు జరిపిన కాల్పుల్లో.. అయాన్‌ గ్రిల్లాట్‌ కూడా గాయపడ్డారు. సాటి శ్వేతజాతీయుడు వివక్షతో రగిలిపోతూ.. తెలుగువారిపై తుపాకి ఎక్కుపెట్టినప్పుడు.. అయాన్‌ గ్రిల్లాట్‌ అతణ్ణి నిలువరించేందుకు, తుపాకిని లాక్కునే  ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో, అతడి ఛాతీ, చేతిలోకి తూటాలు దూసుకు పోయాయి. అయితే, ప్రస్తుతానికి అతను కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందో.. అయాన్‌ మాటల్లోనే విందాం. 
ఎవరైనా చేసే పనే నేను చేశాను : గ్రిల్లాట్ 
ఎవరైనా చేసే పనే నేను చేశాను. అతను ఎక్కడివాడు.. ఏంటి అన్నది కాదు. మనమంతా మానవులం. మ్యాగజీన్‌ ఖాళీదని భావించి టేబుల్‌ కింద నుంచి బయటకు వచ్చా. షూటర్‌ ఛాతీ, మెడ, చేతుల్లోకి తొమ్మిది బులెట్లు దించాడు. మెలకువ వచ్చి చూస్తే ఆసుపత్రిలో ఉన్నాను. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఈ కాల్పుల్లో ఓ స్నేహితుణ్ణి కోల్పోవడం చాలా బాధాకరం. 

నా భర్త శ్రీనివాస్ ఎలాంటి తప్పు చేయలేదు : సునయన

హైదరాబాద్ : తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ భార్య సునయన అన్నారు. అమెరికా అంటే తన భర్తకు ఎంతో ఇష్టమన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ ఉండాలా...అని సందేహం వ్యక్తం చేశారు. తన భర్త మృతికి అమెరికా సమాధానం చెప్పాలన్నారు. 

 

10:29 - February 25, 2017
10:28 - February 25, 2017

సూర్యపేట : సామాజిక న్యాయం కోసం అందరూ కలవాల్సిన అవసరముందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం సామాజిక న్యాయం జరిగినప్పుడే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం అన్నారు. సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న సీపీఎం మహాజన పాదయాత్రకు కాంగ్రెస్‌, వైసీపీ, టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలతో సామాన్యులకు ఇబ్బందులు : తమ్మినేని  
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేంద్రంతో విభేదాలు పెట్టుకుంటే.. సమస్యలు ఎదురవుతాయని పెద్ద నోట్ల రద్దు అంశంలో ప్రధాని మోదీకి.. కేసీఆర్‌ మద్దతిచ్చి చిన్న మోదీ అనిపించుకున్నారన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు హామీలిచ్చి మరిచిపోయిన కేసీఆర్‌.. మహాజన పాదయాత్ర సందర్భంగా తమను కలిసిన వర్గాలకు వరాలు ప్రకటిస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ అని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్‌.. సామాన్యులకు చేసిందేమీ లేదన్నారు తమ్మినేని. సామాజిక న్యాయమే ఎజెండాగా అన్ని పార్టీలు కలవాల్సిన అవసరముందన్నారు. సామాజిక న్యాయం ప్రకారం రాజకీయాల్లో అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరముందన్నారు. 
పాదయాత్రకు కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ, సీపీఐ సంఘీభావం 
సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న మహాజన పాదయాత్రకు కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ, సీపీఐ సంఘీభావం తెలిపాయి. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా పాల్గొని తమ్మినేని బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తమ్మినేని పలు సూచనలు చేశారు. 
భారతదేశ చరిత్ర కమ్యూనిస్టులు కీలక పాత్ర : ఉత్తమ్ కుమార్  
భారతదేశ చరిత్ర కమ్యూనిస్టుల కీలక పాత్ర వహించారని.. సమాజంలో వాళ్లు బలంగా ఉండాల్సిన అవసరముందన్నారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. సీపీఎం మహాజన పాదయాత్రకు కాంగ్రెస్‌ నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందన్నారు.
పాదయాత్రకు అపూర్వ స్పందన 
ఇక ఈరోజు సూర్యాపేట జిల్లాలోని కోదాడ, చిలుకూరు, సీతారామపురం, హుజూర్‌నగర్‌, రాయినగూడెం, కీతవారిగూడెంలో కొనసాగిన మహాజన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన కనిపించింది. ఇక తమ్మినేని వీరభద్రం సాగర్‌ ఎడమ కాల్వపై ఉన్న లిఫ్ట్‌లను ప్రభుత్వమే నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.

 

09:34 - February 25, 2017

హైదరాబాద్ : అమెరికాలోని కన్సాస్‌లో ఓ బార్‌లో జరిగిన కాల్పుల్లో మరణించిన కూచిభొట్ల శ్రీనివాస్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు వేలాది మంది ముందుకు వస్తున్నారు. గతంలో శ్రీనివాస్‌తో కలిసి పనిచేసిన కవిప్రియ ముత్తు రామలింగం శ్రీనివాస్‌ కుటుంబం కోసం విరాళాలు సేకరిస్తోంది. వీటి కోసం రూపొందించిన గోఫండ్‌మి పేజీకి విశేష స్పందన వస్తోంది. కేవలం ఆరు గంటల్లోనే 6,100 మంది స్పందించి 3 లక్షల డాలర్లు ఇచ్చారు. గో ఫండ్‌ మీ పేజీ ద్వారా వచ్చిన డబ్బంతా శ్రీనివాస్‌ భార్య సునయనకు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. అమెరికా నుంచి ఆయన మృతదేహాన్ని భారత్‌కు పంపించడం కోసం విరాళాల డబ్బును ఉపయోగించనున్నట్లు తెలిపారు. శ్రీనివాస్‌ చాలా మంచి వ్యక్తి అని..అందరితోనూ ఎంతో ప్రేమగా, బాధ్యతగా ఉండేవారని కవిప్రియ పేజీలో పోస్ట్‌ చేశారు. అలాగే అలోక్‌ చికిత్స కోసం,.బ్రియాన్‌ ఫోర్డ్‌ అనే మరో వ్యక్తి ఫండ్‌ పేజీ ఏర్పాటు చేశారు. దానికి 32,660 డాలర్లు వచ్చాయి. ఈ ఇద్దరు యువకులను కాపాడేందుకు అయాన్‌ గ్రిల్లాట్‌ అనే అమెరికన్‌ యువకుడు ప్రయత్నించి గాయపడ్డ సంగతి తెలిసిందే. అతడి చికిత్స కోసం గ్రిల్లాట్‌ సోదరీమణులు గోఫండ్‌మీ పేజీ ప్రారంభించగా దానికి 99వేల డాలర్లు వచ్చాయి.

 

సినీ నిర్మాత కేసీ శేఖర్ బాబు మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

అమరావతి : సినీ నిర్మాత కేసీ శేఖర్ బాబు మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. అభిరుచి గల నిర్మాతగా మంచి చిత్రాలను అందించారని పేర్కొన్నారు. తెలుగు సినీ ఛాంబర్, నిర్మాతల మండలికి శేఖర్ బాబు విశేష సేవలందించారని చెప్పారు.
 

సినీ నిర్మాత కేసీ శేఖర్ బాబు కన్నుమూత

హైదరాబాద్ : సినీ నిర్మాత కేసీ శేఖర్ బాబు కన్నుమూశారు. జర్నలిస్టు కాలనీలో తన నివాసంలో గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ముఠామేస్త్రీ, రామ్మాచిలకమ్మ, మమత, పక్కింటి అమ్మాయి, సర్దార్, గోపాలరావుగారి అమ్మాయి చిత్రాలను శేఖర్ నిర్మించారు. 

 

08:46 - February 25, 2017

మొక్కుల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం టీ.ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్, టీకాంగ్రెస్ నాయకురాల ఇందిరా బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడే పథకాల మీద ప్రభుత్వం ఖర్చు చేస్తే బాగుండేదన్నారు. అమెరికాలో తెలుగువారిపై కాల్పులు ఘటనపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:40 - February 25, 2017
08:39 - February 25, 2017

హైదరాబాద్ : పెరిగిన జీతం, ప్రభుత్వం ఇచ్చే డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, పబ్లిక్‌ పిలిచే పిలుపుతో వీఆర్‌ఏల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరగడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. తెలంగాణ రాష్ర్టంలోని వీఆర్‌ఏలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి వేతనాలను 65 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. వీఆర్‌ఏ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమై చర్చించారు. 
వీఆర్‌ఏల వేతనాలు 64.61 శాతం పెంపు
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల వేతనాలను 64.61 శాతం పెంచనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ప్రస్తుతం నెలకు 6 వేల 500లుగా ఉన్న వీఆర్‌ఏల వేతనాన్ని 10వేల 500కు పెంచాలని, దీంతోపాటు 200 తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంటును కూడా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. పెరిగిన వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. వారసత్వంగా పనిచేస్తున్న ప్రతీ వీఆర్‌ఏకు స్వగ్రామంలోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టివ్వాలని, దీనికోసం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని, వీఆర్‌ఓ, అటెండర్, డ్రైవర్ తదితర ఉద్యోగ నియామకాల్లో తగిన విద్యార్హతలున్న వీఆర్‌ఏలకు 30 శాతం ఉద్యోగాలు రిజర్వు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ నిర్ణయాల వల్ల్ల, వారసత్వంగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న రాష్ట్రంలోని 19వేల 345 మందికి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీఆర్‌ఏలుగా ఎంపికైన 2వేల 900 మందికి మేలు కలుగుతుంది. 
సేవలకు గుర్తింపుగా వేతనాలు పెంపు 
తెలంగాణ ఉద్యమంలో శాయశక్తులా పాల్గొన్న వీఆర్‌ఏలు, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ వీఆర్‌ఏ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అన్నారు. గ్రామంలో 24 గంటలపాటు అందుబాటులో ఉండి ప్రభుత్వం తరఫున ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ, గ్రామస్థాయిలో అందుబాటులో ఉండి వీఆర్‌ఏలు ప్రజలకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వేతనాలు పెంచామని చెప్పారు. వేతనంతోపాటు వీఆర్‌ఏల గౌరవం కూడా పెరగాల్సి ఉందని, ఇక నుంచి వారిని వీఆర్‌ఏ అని మాత్రమే పిలవాలి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
వీఆర్ ఏలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు..
గ్రామ ప్రజలకు చేసే సేవలకు గుర్తింపుగా వారికి ప్రభుత్వమే డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తుందని, వారసత్వ వీఆర్‌ఏలందరికీ ఇండ్లు మంజూరు చేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, ఇండ్ల నిర్మాణాన్ని సత్వరం ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

 

ఉ.10గం.లకు సీపీఎం నేత సింహాద్రి శివారెడ్డి అంత్యక్రియలు

గుంటూరు : ఉదయం 10 గంటలకు కాజ గ్రామంలో సీపీఎం సీనియర్ నేత సింహాద్రి శివారెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. 

08:30 - February 25, 2017

కర్నూలు : మహా శివరాత్రికి శ్రీశైలం ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఓం నమోః శివాయ నామస్మరణతో శ్రీ గిరి పొంగిపోయింది. భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు నంది వాహనంపై విహరించారు. సాయంత్రం నిర్వహించిన ప్రభోత్సవం అద్యంతం కన్నుల పండువగా సాగింది. పాగాలంకరణతో వరుడైన మల్లన్న కల్యాణోత్సవం అర్ధరాత్రి దాటిన తర్వాత అట్టహాసంగా జరిగింది. 
కన్నుల పండువగా కళ్యాణ మహోత్సవం
మహాశివరాత్రి పర్వదినాన పాగాలంకరణతో వరుడైన ముక్కంటి కళ్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. అశేష భక్తజనం మధ్య నిర్వహించిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ప్రభోత్సవం కనుల పండువగా సాగింది. 
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు 
ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మల్లన్న పాగాలంకరణ ఘట్టాన్ని చూసి తరించేందుకు వచ్చిన వేలాది మంది భక్తజనంతో శ్రీశైలాలయం పోటెత్తింది. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుడికి నిన్న రాత్రి 10గంటల తర్వాత లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకం పంచామృతాలతో జల, క్షీర, ఫలరసాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. 
పాగాలంకరణ
మల్లన్న వరుడయ్యే సమయం ప్రారంభం కావడంతో రోజుకో మూర చొప్పున నియమ నిష్టలతో పాగాను నేసిన పృథ్వీ వెంకటేశ్వర్లు ఒంటిపై నూలుపోగు లేకుండా గర్భాలయ కలశ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ చేసే పాగాలంకరణ ఘట్టాన్ని ఆరంభించారు. రాత్రి 10గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమైన పాగాలంకరణోత్సవంతో మల్లన్న వరుడిగా మారి భ్రమరాంబతో కళ్యాణోత్సవానికి సిద్ధమయ్యాడు. పాగాలంకరణ సాగుతున్నంత సేపు ఆలయ ప్రాంగణంలోని అన్ని విద్యుత్‌ దీపాలను ఆర్పేశారు. ఈ సందర్భంగా భక్తులు తన్మయత్వం చెందుతూ ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ నామ భజన చేశారు.
పుష్పాలంకరణ
ఘట్టం పూర్తవుతుండగానే ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన పెళ్లి వేదిక స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవానికి కనుల పండువగా పుష్పాలంకరణతో సిద్ధమయింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల కల్యాణోత్సవ ఘడియలు రాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యాయి. మహా శివరాత్రి రోజున కల్యాణోత్సవానికి ముక్కోటి దేవతలు వస్తారని.. మహా విష్ణువు కన్యాదానం.. బ్రహ్మ రుత్వికత్వం నిర్వహిస్తాడని శైవాగమం చెబుతోంది. 
శివస్వాములు మాల విరమణ 
శివమాలధారణ.. ఉపవాస దీక్షలు.. భక్తుల పుణ్య స్నానాలు.. పాగాలంకరణ సహిత స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవంతో దీక్ష ముగిసిందని, తమ తనువులు పులకించాయంటూ శివస్వాములు మాల విరమణ చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు.
నందివాహనంపై మల్లికార్జునుడు దర్శనం
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు నందివాహనంపై దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రదక్షిణ చేసి తిరిగి నందివాహన సమేతులైన స్వామి వార్ల ఉత్సవమూర్తులను యథాస్థానానికి చేర్చారు. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

 

08:19 - February 25, 2017

రాజన్న సిరిసిల్ల : మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శించుకుని వస్తుండగా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పొన్నంతోపాటు పలువురు గాయపడ్డారు. మహా శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో మార్గంమధ్యలో వేములవాడ మండలం శంకపల్లి వద్ద మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి కారుకు అడ్డుగా వచ్చాడు. డ్రైవర్ అతన్ని తప్పించబోవడంతో కారు అదుపుతప్పి బోల్తా పడి, మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో పొన్నం, మాజీ జెడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:59 - February 25, 2017

హైదరాబాద్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు బారులు తీరారు. తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. నీలకంఠుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రంతా జాగారం చేస్తూ శివుడి ధ్యానంలో మునిగిపోయారు.
శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు 
తెలంగాణలో శివరాత్రిని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోటిలింగాలలో గోదావరి తీరంలో భక్తజనం 
జగిత్యాల జిల్లా...కోటిలింగాలలో గోదావరి తీరం భక్తజనంతో కిక్కిరిసింది. భక్తులు గోదావరిలో పవిత్ర స్నానమాచారించి.. ఇక్కడ శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబికా దర్భార్‌ బత్తి వారు ఏర్పాటు చేసిన ఏడు అడుగుల ఆరు అంగుళాల అగర్‌బత్తిని వెలిగించారు. 
శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర ఆలయంలో 
కరీంనగర్‌ శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర ఆలయంలోనూ శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కీసరలో శివరాత్రి వేడుకలు  
మేడ్చల్‌ జిల్లాలోని కీసరలో శివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే పోటెత్తిన భక్తులు పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతురామ్మోహన్‌ శివుడిని దర్శించుకున్నారు. 
వరంగల్‌ జిల్లా పరిధిలో
మహాశివరాత్రి పర్వదినాన ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగాయి.  హన్మకొండ వేయి స్తంభాల ఆలయం, ఐనవోలు మల్లిఖార్జునస్వామి ఆలయం, వరంగల్‌ సిద్దేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి.  రుద్రేశ్వర ఆలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు.  సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలోనూ శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 
కేతికి సంగమేశ్వర ఆలయంలో శివనామస్మరణం
కేతికి సంగమేశ్వర ఆలయం శివనామస్మరణతో హోరెత్తింది. ఆలయంలోని శివలింగానికి భక్తులు క్షీరాభిషేకం, గంధపు అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటిలింగేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 
జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో 
మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, నాగర్‌కర్నూలు జిల్లాలు శివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.  ఆలంపూర్‌ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. లింగాల మండలం బౌరాపూర్‌లో చెంచుల జాతర ఘనంగా జరిగింది. 
నల్గొండ, సూర్యపేటలో 
నల్గొండ జిల్లా చెర్వుగట్టులోతపాటు వాడెపల్లి శివాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామిని దర్శించుకుని.. విశేష పూజలు నిర్వహించారు. ఇక సూర్యాపేట జిల్లాలో పలు దేవాలయాలలో స్వామి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. మేళ్ల చెర్వులో శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  ప్రత్యేక పూజలు చేశారు. 
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో...
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోనూ శివరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి.   తీర్ధాల కూడలి జాతరలో సంగమేశ్వర దేవాలయంలో భక్తులు పోటెత్తారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలోనూ భక్తులు శివుడి ఆరాధనతో తరించారు. బూర్గంపాడు మండలం మోతెలోని వీరభద్ర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. 
నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 
నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని దేవాలయాలలో కైలాసనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  సిరికొండ మండలం గడ్కోల్‌లోని లొంకరామేశ్వరాలయంలో శివరాత్రి జాతర కన్నుల పండుగగా జరిగింది.  వేలాదిగా తరలివచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.

07:50 - February 25, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లోని శివాలయాలన్నీ పంచాక్షరీ నామ స్మరణతో మార్మోగాయి. కైలాసనాథుని పరమ పవిత్రమైన  మహాశివరాత్రి రోజున ఆయన దర్శనానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పలు దేవాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. వేకువజామునే భక్తులు దేవస్థానాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు 
మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.  మల్లన్నకు భక్తిశ్రద్ధలతో భక్తులంతా పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 
గుంటూరులో  
గుంటూరు జిల్లా ప్రజలు శివరాత్రిని ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే నీలకంఠుడికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. రాత్రంతా భక్తులు జాగారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభలు అందరినీ ఆకట్టుకున్నాయి.  ఇక  తాళ్లాయపాలెం శైవక్షేత్రంలోని మహా శివుడికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు.
పశ్చిమగోదావరిలో 
పశ్చిమగోదావరి జిల్లాలో పంచరామాలలో ఒకటైన క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలోనూ... భీమవరంలోని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలోనూ అర్చకులు గరళ కంఠుడికి విశేష అభిషేకాలు చేశారు. 
తూర్పుగోదావరిలో 
తూర్పుగోదావరి జిల్లా... పిఠాపురం క్షేత్రం శివభక్తులతో నిండిపోయింది. పండుగ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
కృష్ణాలో 
కృష్ణాజిల్లాలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక ఆలయాలలో లక్షలాది మంది భక్తులు పరమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
అనంతపురంలో 
అనంతపురం జిల్లాలో శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. వేకువజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు శివుడికి విశేష అర్చనలు.. అభిషేకాలు నిర్వహించారు.
కడపలో 
కడప జిల్లాలోని లంకమల్ల అభయారణ్యంలో వెలసిన రామలింగేశ్వరస్వామి ఆలయంలోనూ భక్తులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీసంఘమేశ్వర దేవాలయానికి భక్తులు పోటెత్తారు. పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రకాశంలో 
ప్రకాశం జిల్లాలో చీరాలలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.  మహాశివునికి భక్తులు జల, వీబూధి గంధ, పుష్ప, మారేడు దళాలు, తైలంతో అభిషేకించి తరించారు.  సీఎస్‌ పురం మండలం బైరవకోనలో వెలసిన శివుడికి భక్తులు పూజలు నిర్వహించారు. నెల్లూరులోని ప్రముఖ దేవాలయాలలోనూ ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు.
ఉత్తరాంధ్రలో 
ఉత్తరాంధ్ర వాసులు శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకున్నారు. విజయనగరం జిల్లాలోని ప్రముఖ శివాలయాలలో స్వామివారి దర్శనార్థం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. విశాఖపట్నంలో టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌కే బీచ్‌ దగ్గర  కోటి లింగాలు ఏర్పాటు చేసి మహాకుంభాబిషేకాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని శివాలయాలు భక్తులతో కళకళలాడాయి. 

 

నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన

సంగారెడ్డి : నేడు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి సమీక్ష చేయనున్నారు. 

 

యూపీలో నేటితో ముగియనున్న ఐదో దశ ఎన్నికల ప్రచారం

లక్నో : ఉత్తరప్రదేశ్ లో ఐదో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగియనుంది. 11 జిల్లాల్లోని 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. 

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కారు బోల్తా ...

రాజన్నసిరిసిల్ల : వేములవాడ మండలం శంకపల్లి వద్ద మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పొన్నం, మాజీ జెడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. వేములవాడ రాజన్నను దర్శించుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

Don't Miss