Activities calendar

26 February 2017

21:29 - February 26, 2017

ఢిల్లీ:దేశవ్యాప్తంగా ఆర్మీలో పలు ఉద్యోగాల నియామకాలకు నిర్వహించాల్సిన ప్రశ్నా పత్రం లీక్ అయింది. ప్రశ్నాపత్రాన్ని లీక్‌ చేసిన 300 మంది విద్యార్థులు, 18 మంది నిందితులను థానె పోలీసులు అరెస్టు చేశారు... వీరంతా పుణె, నాగ్పూర్, నాసిక్ లకు చెందినవారని పోలీసులు తెలిపారు.. పుణెలో ప్రశ్నా పత్రం లీక్ అయినట్టు గుర్తించారు... ప్రశ్నాపత్రం లీకేజీతో దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షను రద్దుచేశారు.. ఆదివారం తెల్లవారుజామున సుమారు 350మంది విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఈ ప్రశ్నాపత్రాన్ని అమ్మాయి... ఈ పేపర్‌ తీసుకున్న ఒక్కొక్క విద్యార్థినుంచి దాదాపు 2లక్షల రూపాయల్ని వసూలుచేశాయి.. పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు... పలు కోచింగ్ సెంటర్ల యాజమానులు, ఆర్మీ ఉద్యోగులను అరెస్టు చేశారు.. ఈ లీకేజీ అసలు సూత్రదారుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు..

21:28 - February 26, 2017

చెన్నై:తమిళనాడు ప్రభుత్వ కార్యాలయాల్లో దివంగత సీఎం జయలలిత ఫోటోల వివాదం రోజురోజుకు ముదురుతోంది. స్టాలిన్‌, పన్నీర్‌ సెల్వం మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో, స్థానిక సంస్థల్లో జయలలిత ఫోటోలు ఉండడం, పథకాలకు ఆమె పేరు కొనసాగించడాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణిస్తోంది. అమ్మ బొమ్మలు, పథకాలకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమైంది. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌తో శనివారం భేటీ అయ్యారు. జయలలిత ఫోటోలు తొలగించాలంటూ ఓ వినతిపత్రాన్ని సమర్పించారు. జయలలితను కోర్టు దోషిగా తేల్చిందని, ఆమె ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచడం చట్టవిరుద్దమని అన్నారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పందిచకుంటే కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు.

డీఎంకే తీరును తప్పుపట్టిన పన్నీరు సెల్వం

ప్రభుత్వ కార్యాలయాల్లో జయలలిత ఫోటోలు తొలగించాలన్న డీఎంకే తీరును మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తప్పుపట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే డీఎంకే ఆందోళన చేస్తోందని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన జయలలిత చిత్రాలను తొలగిస్తే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆఫీసుల్లోంచి జయ ఫోటోలను తొలగించినా ప్రజల మనసుల్లోంచి అమ్మను తొలగించలేరని అన్నారు. ప్రజలు వరుసగా రెండుసార్లు తిరస్కరించినా డీఎంకేకు బుద్దిరాలేదని దుయ్యబట్టారు. తండ్రి కరుణానిధి బాటలోనే స్టాలిన్‌ కూడా నడుస్తున్నారని పన్నీరుసెల్వం ధ్వజమెత్తారు. మరోవైపు అన్నాడీఎంకే కూడా స్టాలిన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా డీఎంకే అనేక కుట్రలు చేస్తోందని.. భాగంగానే అమ్మ ఫోటోల వివాదానని సృష్టిస్తున్నారని దినకరన్‌ మండిపడ్డారు.

వాస్తవానికి దోషిగా ముద్రపడ్డ వారి పేర్లు పథకాలకు ఉపయోగించకూడదు.

వాస్తవానికి దోషిగా ముద్రపడ్డ వారి పేర్లు పథకాలకు ఉపయోగించకూడదు. అలాగే వారి ఫోటోలు ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండరాదు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. దీంతో ఆమె ఫోటోలను తొలగించాలన్నది డీఎంకే డిమాండ్‌. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తాము చెప్పిందే చట్టం అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. అమ్మ పేరిట పథకాలు అలాగే కొనసాగుతున్నాయి. మరికొన్ని పథకాలకు అమ్మ పేరు పెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక జయలలిత జయంతిని కూడా ప్రభుత్వం అధికారిక వేడుక తరహాలో నిర్వహించింది. వీటన్నింటిని డీఎంకే తీవ్రంగా పరిగణిస్తోంది. అమ్మ బొమ్మలకు, పథకాలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సీఎస్‌ను కలిసి జయ ఫోటోలను తొలగించాలని కోరింది. అయితే ఈ చర్య.. రెండు పార్టీల మధ్య తీవ్ర వివాదంగా మారింది. మరి ఈ పరిణామం ఎటువైపు సాగుతుందో వేచి చూడాలి.

21:22 - February 26, 2017

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో విషాదం నెలకొంది. తూతుకోడి జిల్లాలోని మనపాడు సముద్రంలో ఓ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో 10మంది గల్లంతయ్యారు. 12 మందిని స్థానికులు రక్షించారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఏడుగురు ప్రయాణించే పడవలో 30మంది ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

21:21 - February 26, 2017

సూర్యాపేట : మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని ప్రభుత్వం పనిచేయాలన్నారు జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పర్యటించారు. హుజుర్‌నగర్‌లో 6 నెలలుగా రెవెన్యూ డివిజన్‌ సాధన కోసం దీక్ష చేస్తున్న వారిచే దీక్షను విరమింపజేశారు. రెవెన్యూ డివిజన్‌ కోసం 6 నెలలుగా దీక్ష చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. చివరి ఆయకట్టు భూములకు సాగు నీరు అందించి.. రైతులను ఆదుకోవాలని కోదండరామ్‌ కోరారు. ఇక అంతకుముందు మఠంపల్లి మండలంలో నిర్వహించిన సేవాలాల్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

21:19 - February 26, 2017

కరీంనగర్ : సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరని కేసీఆర్‌ ప్రకటించటం అవాస్తవమని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు నాలుగు రోజుల పాటు యాత్ర నిర్వహించానని తెలిపారు. సింగరేణిలో 26 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని అన్నారు. కార్మికులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని కోరారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలన్నారు. సింగరేణిలోని సమస్యలపై సీఎం, సీఎస్, సీఎండీ , గవర్నర్ కు నివేదిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.

21:17 - February 26, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కమిషనర్‌ అశోక్ కుమార్ ప్రకటించారు. మార్చి 1 నుంచి 19 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12వందల 91 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి 12 వరకూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా వచ్చినా.. పరీక్ష హాల్‌లోకి అనుమతించమని చెప్పారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌ కారణంగా మార్చి 9వ తేదీన జరగాల్సిన పరీక్షను 19వ తేదీన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.

21:15 - February 26, 2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్‌-2 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం పది నుంచి పన్నెండున్నరగంటలవరకూ పరీక్ష నిర్వహించారు. నిమిషం ఆలస్యం నిబంధనను అధికారులు అమలు చేశారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షాకేంద్రంలోకి అనుమతించలేదు.. గ్రూప్‌ 2 స్క్రీనింగ్‌ పరీక్షకు ఏపీలో 1376, తెలంగాణలో 86 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు.. 442 ఎగ్జిక్యూటివ్‌, 540 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు..

ప్రకాశం జిల్లాలో పరీక్షాకేంద్రాలకు బస్సులు దొరక్క ..

ప్రకాశం జిల్లాలో పరీక్షాకేంద్రాలకు బస్సులు దొరక్క అభ్యర్థులు నానాకష్టాలు పడ్డారు.. .. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పినా ఎక్కడా అవి కనిపించలేదు.. వాహనాలు దొరక్క ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులకు పోలీసులు సహకారం అందించారు.. తమ వాహనాల్లో అభ్యర్థులను పరీక్షాకేంద్రాలకు తీసుకువచ్చారు.. ఎండలో ఇబ్బందిపడుతున్న అభ్యర్థుల తల్లిదండ్రులు, బంధువులకు ఆశ్రయం కల్పించారు..పరీక్షకుముందు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌కాక అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు.. చివరకు శనివారం రాత్రి హాల్‌టికెట్లు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.. గ్రూప్‌ 2 స్క్రీనింగ్ పరీక్ష ఫలితాల్ని మార్చి నెలాఖరుకు విడుదలచేస్తామని అధికారులు ప్రకటించారు.. మే 20, 21 తేదీల్లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

మనపాడు సముద్రంలో పడవ బోల్తా:8మంది మృతి

చెన్నై: తూతుకొడి జిల్లా మనపాడు సముద్రంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 12 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. మరో 10 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 7గురు ప్రయాణించే పడవలో 30 మంది ప్రయాణించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సంజీవకొండ వద్ద దారి దోపిడీ

గుంటూరు : ఈపూరు మండలం సంజీవకొండ వద్ద దారి దోపిడీ జరిగింది. సంజీవకొండ దేవుడి దర్శనానికి వచ్చిన విజయవాడకు చెందిన గంగాధర్ దంపతలును బెదిరించి 10 సంవర్ల బంగారు ఆభరణాలు, రూ.9వేల నగదును ఆపహరించారు.

గంగదేవిపల్లి రాష్ట్రానికే కాదు.. దేశానికి ఆదర్శం:జూపల్లి

హైదరాబాద్: తెలంగాణ లో స్వచ్ఛ భారత్ అమలును ప్రధాని ప్రశంసించడం సంతోషకరమని మంత్రి జూపల్లి అన్నారు. గంగదేవిపల్లి రాష్ట్రానికే కాదు.. దేశానికి ఆదర్శమైందని పేర్కొన్నారు. పలు జిల్లాల్లో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యిందని, 2018 అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో 100 శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయాలని ప్రణాళిక వేసినట్లు తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం వేగం పెంచేందుకు స్త్రీ నిధి ద్వారా అడ్వాన్స్గా రుణాలు ఇప్పించే కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.

బావిలో దూకి తల్లీకూతరు ఆత్మహత్య

అనంతపురం : నల్లచెరువు మండలం బండువానిపల్లిలో బావిలో దూకి తల్లీకూతరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు హైమావతి(30; విష్ణు ప్రియ(6) గా గుర్తించారు.

28న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

న్యూఢిల్లీ: వేతన సవరణ, ఉద్యోగులకు కంపెన్సేషన్ తదితర డిమాండ్లపై ఈనెల 28న బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) సారథ్యంలో సమ్మెకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. వచ్చే మంగళవారం జరగనున్న సమ్మె ప్రభావం ప్రభుత్వరంగం బ్యాంకుల లావాదేవీలపై పడే అవకాశం ఉంది.

20:04 - February 26, 2017
19:20 - February 26, 2017

విజయనగరం: అక్కడి దేవుడికి నాన్‌వెజ్‌ అంటే మహాఇష్టం. అందులోనూ చేపల కూరంటే మహా ప్రీతి. అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు ఆయనకు నైవేద్యంగా చేపల కూరను సమర్పిస్తారు. భక్తులు అమితంగా కొలిచే ఆ దేవుడెవరు? పండుగ రోజున దేవుడికి చేపల కూరను నైవేద్యంగా పెట్టే వింత ఎక్కడ జరుగుతుంది. తెలుసుకోవాలంటే వాచ్‌ దిస్‌ స్టోరీ...

నాన్‌వెజ్‌ భోజనం భలే...

నాన్‌వెజ్‌ భోజనం భలే లాగించేస్తున్నారు కదా.. వీళ్లేదో పార్టీ చేసుకుంటున్నారని అనికుంటే మీరు పొరపడినట్టే. ఎందుకంటే ఇది పార్టీ కాదు. విందు అంతకన్నా కాదు. ఇది అచ్చంగా దేవుడి సన్నిధిలో జరిగుతున్న తంతు. ఇదేంటి విచిత్రమని అలా ముక్కున వేలేసుకోకండి. ఈ దేవుడికి ఫిష్‌ కర్రీని నివేదించడం.. ఆ తర్వాత దాన్ని మహాప్రసాదంగా భోంచేయడం అనాదిగా వస్తున్న ఆచారం.

దేవునిగుంపలో సోమేశ్వరాలయం...

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కోటిపాం పంచాయతీ పరిధిలోని దేవునిగుంపలో సోమేశ్వరాలయం ఉంది. దీనికి ఎంతో ఘన చరిత్ర ఉంది. నాగావళి, జంఝావతి నదుల సంగం వద్ద ఉన్న సోమేశ్వరాలయం ఉత్తరాంధ్రలో ఎంతో ప్రసిద్ధిగాంచింది.

మహాశివరాత్రి పర్వదినాన దర్శించుకునేందుకు...

సోమేశ్వరాలయంలో వెలసిన ముక్కంటిని మహాశివరాత్రి పర్వదినాన దర్శించుకునేందుకు ఆంధ్రాతోపాటు ఒడిషా నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాదు... ఇక్కడ విచిత్రమేమంలే శివుడికి భక్తులంతా నైవేద్యంగా చేపల కూరను సమర్పిస్తారు. శివరాత్రి రోజున శివుడిని దర్శించుకుని రాత్రంతా జాగారం చేస్తారు. మరుసటి రోజున చేపలను వండి స్వామికి నైవేద్యంగా పెడతారు. అనంతరం సమీపాన ఉన్న తోటల్లో కుటుంబ సభ్యులతో కలిసి భుజించి స్వగ్రామాలకు తిరిగి వెళ్తారు. ఇది పూర్వం నుంచి వస్తున్న వింతైన ఆచారం. ఈ ఏడాది కూడా శివరాత్రికి భక్తులు భారీగా తరలివచ్చి శివుడికి చేప కూరతో నైవేద్యం సమర్పించారు.

గుంప సోమేశ్వరాలయానికి ఎంతో విశిష్టత

గుంప సోమేశ్వరాలయానికి ఎంతో విశిష్టత ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడు గోహత్య దోష నివారణ కోసం శివుడిని ప్రార్థించగా.. నదీ తీరాన ఐదు లింగాలు ప్రతిష్టించాలని హితబోధ చేశారట. బలరాముడు తన నాగలితో దున్నడంతో నాగావళి నది ఏర్పడినట్టు, మార్గమధ్యలో ఆటంకాలు ఎదురైన చోట బలరాముడు శివలింగాలను ప్రతిష్టించినట్టు ప్రతీతి.అలా నది వెంబడి ఒడిశా రాష్ట్రంలోని పాయకపాడులో భీమేశ్వరుడు, దేవుని గుంప వద్ద సోమేశ్వరుడు, వంగర మండలం సంగాం దగ్గర సంగమేశ్వరుడు, శ్రీకాకుళం దగ్గర రుద్రకోటీశ్వరుడు, కళ్లేపల్లి వద్ద శ్రీనాగేశ్వురుడు వెలిసినట్టు చెబుతారు. ఇందులోనూ దేవుని గుంపకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి సోమేశ్వరున్ని దర్శించుకుంటే కాశీ యాత్ర ఫలం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే కార్తీకమాసం, శివరాత్రి పర్వదినాల్లో భక్తులు ఎక్కువగా ఇక్కడికి తరలివస్తుంటారు. పార్వతీపురం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలోని సోమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు ఏడాది పొడవునా వస్తూనే ఉంటారు.

19:15 - February 26, 2017

కడప: అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను తీవ్ర ఖండించారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ. భారతీయులపై దాడులు జరగకుండా.. అమెరికాతో కేంద్రం చర్చించాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమ తీవ్ర కరువుతో అల్లాడుతున్నా... రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగించడం లేదన్నారు. కరవు కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లిన వారిని కలిసేందుకు... మార్చి 3వ తేదీన సీపీఐ ఆధ్వర్యంలో పర్యటిస్తామని రామక్రిష్ణ తెలిపారు.

19:13 - February 26, 2017

విశాఖ : చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి.. ఓర్వలేకనే ప్రభుత్వంపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే రోజాపైనా విమర్శలు చేశారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు, లోకేషలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

19:12 - February 26, 2017

అమరావతి : ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ఆశలు పెంచుకున్నవారితో.. ఏపీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం సందడిగా మారింది. చివరి నిమిషంలోనైనా అధినేతను ప్రసన్నం చేసుకోవాలని ఆశావహులు ఆపసోపాలు పడుతున్నారు. పొలిట్‌బ్యూరో సమావేశం ఓవైపు జరుగుతుంటే.. మరోవైపు, ఆశావహులు తమదైన శైలిలో వ్యూహాలు అమలు చేయడంలో బిజీగా ఉన్నారు. పార్టీ అభ్యర్థుల జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారని తెలియడంతో.. వీరంతా చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

తూర్పుగోదావరి జిల్లా లో...

తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ ఎవరికి టికెట్‌ ఇస్తుందన్న అంశం సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠకు తావిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పదవీకాలం మార్చి 27తో ముగియనుంది. అయితే..ఈ స్థానానికి మళ్లీ తనకే అవకాశం కల్పిస్తారని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో పార్టీ అధినేత ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. బాబు మదిలో ఏముందో తెలియక ఆశావహులు ఉత్కంఠకు గురవుతున్నారు.

ఇక పశ్చిమలో కాపు సామాజిక వర్గానికి చెందిన...

ఇక పశ్చిమలో కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేరు ప్రచారంలో ఉంది. అయితే, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ రాజు కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. దీంతో పశ్చిమలో సీట్ల సర్దుబాటు అయ్యాకే.. తూర్పులో సీట్ల అంశాన్ని తేల్చాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. తూర్పుగోదావరిలో మాజీ మంత్రి, కాపు సామాజిక వర్గానికి చెందిన చిక్కాల రామచంద్రారావు, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు తనయుడు, కాకినాడ ఎంపీ తోట నరసింహం బావమరిది మెట్ల రమణబాబు, ఏలేరు నీటిసంఘం ఛైర్మన్‌గా ఉన్న జ్యోతుల చంటిబాబు కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. మరోవైపు రాజమండ్రి రూరల్‌ ప్రాంతానికి చెందిన గంగుమళ్ల సత్యనారాయణ, యర్రా వేణుగోపాలరాయుడు, వెలుగుబంటి ప్రసాద్‌లు కూడా సీటు ఆశిస్తున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీ, చైతన్య విద్యాసంస్థల అధినేత కేవీవీ సత్యనారాయణ కూడా ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది.

అమలాపురం డివిజన్‌ మొత్తం మీద...

అమలాపురం డివిజన్‌ మొత్తం మీద ఒక్క కాపు ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో కోనసీమకు ఎమ్మెల్సీ ఇస్తే ఎలా ఉంటుందున్న కోణంలోనూ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహులు, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థికమంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడుపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. అయితే... ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలనేది చంద్రబాబు నాయుడే చూసుకుంటారని ఈ నేతలిద్దరూ చెబుతున్నారు. అయినా, యనమల, చినరాజప్పలను కాదని, చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్న ఉద్దేశంతో, ఆశావహులు, వీరిద్దరూ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో నారా లోకేశ్‌ పోటీ చేస్తానంటే అందరూ కలిసి స్వాగతించేందుకు కూడా పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్లు లోకేశ్‌ను తూర్పు నుంచి పోటీ చేయాలని కోరినట్లు సమాచారం.

ఇక శ్రీకాకుళం జిల్లా టీడీపీలో నూ....

ఇక శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హంగామా ఊపందుకుంది. జిల్లా నుంచి ఇరవై మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా.. స్థానికేతరులు సైతం ఇదే సీటుపై కన్నేసి పైరవీలు చేస్తుండటంతో.. ఆశావహుల జాబితా అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావుతో పాటు.. ఇతర జిల్లాల నేతలు పలువురు చంద్రబాబును కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా జిల్లా నుంచి ఏడుగురు సీనియర్లతో పాటు..పలువురు ఆశావహులు సీటు కోసం ప్రయత్నిస్తున్నారని, ఆశావహుల జాబితాను పార్టీకి సమర్పిస్తామని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష స్పష్టం చేశారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా... జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నిర్ణయం మేరకే తమ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామని ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ స్పష్టం చేశారు. ఓ వైపు నామినేషన్ల దాఖలుకు గడువు దగ్గర పడుతుంటే.. పార్టీ నేతల్లో ఏకాభిప్రాయం లేకపోవడం అధిష్ఠానానికి తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఏదేమైనా... ఆశావహుల్లో అన్నివిధాల అర్హులైనవారిని గుర్తించి, వారి విజయానికి పార్టీ కృషి చేస్తోందన్న ఆశాభావంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీ: టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

గుంటూరులో అదృశ్యమైన బాలుడు ఆచూకీ లభ్యం

గుంటూరు: అదృశ్యమైన బాలుడు నిఖిల్ రెడ్డి ఆచూకీ లభ్యం అయ్యింది. క్రోసూరు సమీపంలో ఓ కార్పెంటర్ వద్ద నిఖిల్ రెడ్డి ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. నిఖిల్ రెడ్డిని తెనాలి తీసుకువచ్చేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. కాసేపట్లో నిఖిల్ ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

17:45 - February 26, 2017

హైదరాబాద్: నిరుపేద కుటుంబంలో పుట్టింది...ఆటనే వృత్తిగా మలుచుకుంది. అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణిస్తోంది. ఎన్నో కష్టాలకోర్చి హాకీలో రికార్డులు సాధించింది. ఆమె భారత హాకీ జట్టు వైస్‌ కెప్టెన్‌ యెండల సౌందర్య. క్రీడా పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించి దేశ ప్రతిష్ఠను పెంచింది.

భారత జట్టుకు వైస్‌ కెప్టన్‌గా ప్రాతినిథ్యం.....

నిజామాబాద్ నగరానికి చెందిన సౌందర్య హకీలో అనేక స్వర్ణ, రజత, కాంస్య మెడల్స్‌ను సాధించింది. ఆమె స్టిక్ పట్టిందంటే ఎన్నో గోల్స్... ఎన్నో పతకాలు... మరెన్నో ప్రశంసల జల్లులు. భారత్‌ హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహించి ఎన్నో అంతర్జాతీయ టోర్నీల్లో విజయానికి కీలక పాత్ర పోషించింది. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి తనదైన గుర్తింపును సాధించింది. ఇప్పటి వరకు 98 అంతర్జాతీయ మ్యాచ్‌లు...26 అంతర్జాతీయ టోర్నమెంట్‌లు సౌందర్య ఆడింది. జూనియర్, సీనియర్, వరల్డ్ కప్‌ ఏషీయన్‌ ఛాంపియన్‌ ట్రోఫీలో కూడా పాల్గొంది. 2011లో న్యూజిలాండ్‌లో జరిగిన టెస్ట్‌ సిరిస్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా మొదటిసారి ఎంపికై జట్టును విజయపథంలో నడిపించడంలో భాగస్వామురాలైంది.

క్రీడాకారిణిగా ఎదిగేందుకు కృషి.....

సౌందర్య ఆ స్థాయికి ఎదిగేందుకు చాలా కృషి చేసింది. కెరీర్‌ మొదలుపెట్టిన దగ్గర నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా సౌందర్య నిర్ణయాన్ని మొదట తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అయితే ఆటపై ఆమెకున్న మక్కువ చూసి ప్రోత్సాహం అందించారు. తల్లి బీడీ కార్మికురాలుగా.. తండ్రి కూలిగా పనిచేస్తూ ఆమెను క్రీడాకారిణిగా నిలబెట్టారు.

పోటీల్లో భాగంగా ఆమె ప్రమాదాలకు గురైనా...

పోటీల్లో భాగంగా ఆమె ప్రమాదాలకు గురైనా... హాకీ క్రీడను మాత్రం విడిచిపెట్టలేదు. ఓ సారి యూఎస్‌ఏ టోర్నమెంట్‌లో పాల్గొన్న సౌందర్య ముఖంపై బలమైన గాయం అయింది. ప్రత్యర్థుల స్ట్రిక్ ముఖం పై తగలడంతో ప్లాస్టిక్‌ సర్జరీ కూడా జరిగింది. అయినా ఆమె ఆటను ప్రేమిస్తూ ముందుకే సాగింది. అయినా తన కష్టం వృథాగా పోలేదని.. తెలంగాణ ప్రభుత్వం తన ప్రతిభను గుర్తించిందని సౌందర్య ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తనకు 25 లక్షల రూపాయలను.. ఇల్లు నిర్మించుకునేందుకు స్థలాన్ని కేటాయించారని చెప్పింది. అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగిన సౌందర్య ఈ ప్రాంతంలో ఉంటున్నందుకు కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.

17:38 - February 26, 2017

హైదరాబాద్ : జలాంతర్గామి నేపధ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా పేరు తెచ్చుకొన్న "ఘాజీ" అశేష అభిమానాన్ని చూరగొంది. ఇప్పుడు "ఘాజీ" చిత్రంపై తెలుగు చిత్రసీమకు చెందిన అగ్ర దర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న "ఘాజీ" చిత్రం. ఈ చిత్ర దర్శకులు సంకల్ప్ రెడ్డి తో '10 టివి' చిట్ చాట్ నిర్వహించింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

17:24 - February 26, 2017
17:23 - February 26, 2017

ఫూంచ్ జిల్లాలో బీఎస్‌ఎఫ్ జవాను ఆత్మహత్య

హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో బీఎస్‌ఎఫ్ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. విషయాన్ని గమనించిన ఉన్నతాధికారులు.. జవాన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్య చేసుకున్న జవాన్‌ని ప్రమోద్ కుమార్‌గా గుర్తించారు. జవాన్ ఆత్మహత్యకు గల కారణాలపై బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు

తెలంగాణ లో మార్చి 1 నుండి ఇంటర్ పరీక్షలు..

హైదరాబాద్ : మార్చి 1 నుంచి 19 వరకు పరీక్షలు జరుగుతాయని టీఎస్ ఇంటర్ బోర్డు కమిషనర్ అశోక్ కుమార్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. . రాష్ట్ర వ్యాప్తంగా 1291 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి వస్తువులను అనుమతించమని స్పష్టం చేశారు. ఇప్పటికే హాల్ టికెట్ల పంపిణీ జరిగిందన్నారు. ప్రైవేటు కళాశాలలు ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

16:50 - February 26, 2017

హైదరాబాద్: మేఘాలయలోని వెస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 70 మందితో వెళ్తున్న మినీ లారీ అదుపుతప్పి ఓ చర్చి సమీపంలో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 16 మంది మృతిచెందారు. 50 మంది వ్యక్తులు గాయపడ్డారు. మృతుల్లో తొమ్మిది మంది మహిళలున్నారు. గాయపడ్డ ట్రక్కు డ్రైవర్, సహాయకుడితో పాటు మిగతా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం షిల్లాంగ్ ఆస్పత్రితో పాటు సమీప ఆస్పత్రులకు తరలించారు. స్థానికులు, అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

16:48 - February 26, 2017

హైదరాబాద్: మానవ జీవితంలో శాస్త్ర, సాంకేతికత ఎంతో ప్రాధాన్యమున్న అంశాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. యువతలో శాస్త్ర, సాంకేతిక నైపణ్యాలు పెరగాలని.. దేశానికి మరింత మంది శాస్త్రవేత్తలు కావాలన్నారు. 'మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో భాగంగా ఆయన ఆలిండియా రేడియో ద్వారా దేశ ప్రజలకు సందేశమిచ్చారు. ఒకేసారి 104 ఉపగ్రహాలు ప్రయోగించి అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో చరిత్ర సృష్టించిందని.. ఇలాంటి ప్రయోగం చేసిన తొలిదేశంగా నిలవడం గర్వంగా ఉందన్నారు. ఇస్రో ప్రయోగించిన కార్టోశాట్‌-2జీ ఉపగ్రహంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. నగదు రహిత లావాదేవీల ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములవుతున్నారని మోదీ అన్నారు. సమాజం మొత్తం క్రమంగా సాంకేతిక మార్గం వైపు మళ్లుతోందన్నారు. ప్రజల ప్రోత్సాహంతో నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్నాయని మోదీ తెలిపారు. భీమ్‌ యాప్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని.. యాప్‌ ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో ప్రతి ఒక్కరు కనీసం 125 మందికి అవగాహన కల్పించాలని సూచించారు.

16:46 - February 26, 2017

హైదరాబాద్: ముంబయి నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. మార్చి 9న మేయర్‌ను కార్పొరేటర్లు ఎన్నుకుంటారు.

విభేదాలను క్యాష్ చేసుకునే పనిలో కాంగ్రెస్ ....

శివసేన-బీజేపీల మధ్య నెలకొన్న విభేదాలను క్యాష్ చేసుకునే పనిలో కాంగ్రెస్ పడింది. దీంతో శివసేనకు మద్దతు ఇచ్చే ఆలోచనలో మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అయితే ముంబయి నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్‌ మాత్రం శివసేనకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. మరోవైపు శివసేన అభ్యర్థే మేయర్‌ అవుతారని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌రౌత్‌ చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు నిజం కాదన్నారు. కాంగ్రెస్‌తో బీజేపీకి ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తేల్చిచెప్పారు.

బీఎంసీ మొత్తం సభ్యులు 227...

227 మంది సభ్యులున్న బీఎంసీలో మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు 114 మంది మద్దతు అవసరం. ముగ్గురు స్వతంత్రులు శివసేనకు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ బలం 87కి చేరింది. బీజేపీకి 82 మంది, కాంగ్రెస్‌కి 31 మంది ఉన్నారు. శివసేనతో కలవడం ద్వారా కాషాయం పార్టీని ఇరుకున పెట్టాలని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు పూర్తయ్యేవరకు శివసేనకు బాసటపై అధికారిక ప్రకటన చేయరాదని బీజేపీ నిర్ణయించింది.

ఎన్సీపీ, ఎంఎన్‌ఎస్‌, స్వతంత్రులు మద్దతిస్తే 112కు చేరనున్న బీజేపీ బలం .....

మేయర్‌ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాని అధిష్టానం రాష్ట్ర బీజేపీ నేతలకు స్పష్టంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుగుబాటు అభ్యర్థులు, స్వతంత్ర కార్పొరేటర్లను బుజ్జగించి సంఖ్యా బలం సాధించాలని స్పష్టమైన సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్సీపీ, ఎం.ఎన్‌.ఎస్‌, స్వతంత్రులు బీజేపీకి మద్దతిస్తే ఆ పార్టీ బలం 112కు చేరి మేయర్ పీఠం సొంతమవుతుంది. అలా కాకుండా ఆయా పార్టీలు శివసేనకు మద్దతిస్తే మేయర్‌ పీఠం ఆ పార్టీకి దక్కొచ్చు. ఇలా కాకుండా చెరో రెండున్నరేళ్లు మేయర్‌, ఉప మేయర్‌ పదవుల్ని పంచుకోవడంపై బీజేపీ-శివసేన ప్రస్తుతం దృష్టిసారించాయి.

16:44 - February 26, 2017

హైదరాబాద్: అసోంలో ఓ ఏనుగు తన చర్యతో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. జల్‌పాయ్‌ గురి జిల్లాలోని చంప్రమరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో... రైల్వే లెవల్ క్రాసింగ్‌ గేట్‌ను తనదైన శైలిలో దాటేసింది. మొదటి గేటును మెడవరకు ఎత్తి పట్టాల మీదకు వచ్చిన ఏనుగు.. రెండో గేటును దాటి వెళ్లింది. ఈ క్రమంలో ఏనుగు ధాటికి గేటు విరిగిపోయింది. దాదాపు 15 నిమిషాల పాటు అక్కడే తచ్చాడిన ఏనుగు.. తరువాత అడవిలోకి వెళ్లిపోయింది.

16:43 - February 26, 2017

కడప: అనంతపురం, కడప, కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పీడీఎఫ్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న సిట్టింగ్‌ ఎమ్మెల్సీ , ప్రజావైద్యుడు డాక్టర్‌ గేయానంద్‌ను గెలిపించాలని ఎమ్మెల్సీ సూర్యారావు మాస్టారు కోరారు. శాసనమండలిలో రాయలసీమ ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తోన్న గేయానంద్‌ను మరోసారి గెలిపించాలని గ్రాడ్యుయేట్స్‌కు విజ్ఞప్తి చేశారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన... గేయానంద్‌ గెలిస్తే రాయలసీమకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. గేయానంద్‌తోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తోన్న కత్తి నరసింహారెడ్డిని కూడా గెలిపించాలని కోరారు.

16:40 - February 26, 2017

విజయవాడ: కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని చెప్పి.. అధికారంలోకి రాగానే కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు. విజయవాడ భవానిపురంలోని ఐరన్‌యార్డులో ఆయన ఆటో కార్మికులతో సమావేశం నిర్వహించారు. రోజంతా ఆటో కార్మికులు కష్టపడి సంపాదించిన సొమ్మును ఆర్టీఏ అధికారులు, పోలీసులు జరిమానాల పేరుతో దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 894ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈనెల 28న ఆటోకార్మికుల సమస్యల పరిష్కారానికి సీపీఎం చేపట్టిన మహాధర్నాలో కార్మికులంతా పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

16:39 - February 26, 2017

అమరావతి : చంద్రబాబు సర్కారు.. చెప్పేదొకటి చేసేదొకటిగా తయారైంది. ఇందుకు భవానీద్వీపం ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. ఒకప్పుడు ఈ ద్వీపాన్ని సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేస్తానని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే హామీ ఇచ్చారు. దీనిపై తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదనీ కుండబద్దలు కొట్టారు.

133 ఎకరాల్లో విజయవాడ భవానీ ద్వీపం....

ప్రభుత్వ హయాంలోనే దీన్ని అభివృద్ధి చేస్తామన్న హామీని తుంగలోకి తొక్కి, ద్వీపంపై ప్రైవేటు సంస్థలు కాలుమోపే అవకాశాన్ని ఇస్తోంది. విజయవాడలోని భవానీ ద్వీపం మొత్తం 133 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో మొత్తం 28 కాటేజీలున్నాయి. ఈ కాటేజీలతో పర్యాటకాభివృద్ధి సంస్థకు ఏటా పెద్దమొత్తంలోనే ఆదాయం వస్తుంది. 2016-17 ఆర్థిక సంవత్సరపు భవానీద్వీపం ఆదాయాన్నే పరిగణలోకి తీసుకుంటే.. పర్యాటకం ద్వారా, దాదాపుగా మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరింది. ఇందులో జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు తదితరాలను దాదాపు రూ.2 కోట్లు వ్యయమయ్యాయని భావించినా.. నికరంగా ప్రభుత్వానికి కోటి రూపాయల ఆదాయం సమకూరింది.

పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టేందుకు సిద్ధమైన పర్యాటక శాఖ....

భవానీద్వీపంలోని లాభదాయక కాటేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. ప్రభుత్వ సిబ్బందిని అక్కడి నుంచి తప్పించి, ప్రైవేటు సంస్థ సిబ్బంది ద్వారానే కాటేజీల నిర్వహణను చేపట్టాలన్నది సర్కారు యోచనగా తెలుస్తోంది. ఏటా దాదాపు కోటి రూపాయల నికర లాభం తెచ్చిపెట్టే భవానీద్వీపాన్ని... కారుచౌక ధరలకే అప్పగించడంతో పాటు.. పలు రాయితీలూ కట్టబెడుతోంది సర్కారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా, యాక్సెస్ రోడ్, వాటర్, పవర్ సప్లై, సీవరేజి కనెక్షన్స్‌కి పెట్టుబడిని బట్టి రాయితీలు కల్పిస్తున్నారు. దీంతోపాటు ల్యాండ్ కన్వర్షన్ చార్జీలు, రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ, వ్యాట్ ఐదు శాతం, లగ్జరీ ట్యాక్స్‌, వినోద పన్ను వంద శాతం మినహాయింపును అందించనున్నారు.

ప్రైవేట్‌ సంస్థవైపే మొగ్గు చూపుతున్న పర్యాటకశాఖ.....

ఈ మొత్తం వ్యవహారంలో, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ అధికారులతో చర్చించకుండానే కాటేజీలను అప్పగించేందుకు పర్యాటక శాఖ టెండర్లు పిలిచింది. ప్రైవేట్‌ సంస్థవైపే పర్యాటక శాఖ మొగ్గుచూపడాన్ని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మానుకోవాలని, ప్రభుత్వ ఆధీనంలోనే భవానీ ద్వీప నిర్వహణ ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.

అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగడంతో...

భవానీ ద్వీపాన్ని ప్రైవేటు పరం చేసేందుకు గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. అయితే, అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగడంతో, ప్రభుత్వం మౌనం వహించింది. మళ్లీ ఇప్పుడు, పాత నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రభుత్వం ఇదే మొండిపట్టుదలకే వెళితే, ఉద్యమాలు తప్పవని పర్యావరణ ప్రేమికులు, ప్రజాసంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.

16:33 - February 26, 2017

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్వచ్ఛ ఆటోల నిర్వహణ వ్యవస్థ పడకేసింది. విధుల్లో ఉండాల్సిన ఆటోలు... ఇతర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాల్సిన ఆటోవాలాలు... విధులకు సక్రమంగా హాజరుకావడం లేదు. ప్రతిరోజూ విధుల్లో ఉండాల్సిన 2 వేల ఆటోల్లో... కేవలం 15 వందల ఆటోలు మాత్రమే విధుల్లో కనిపిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బల్దియా స్వచ్ఛ ఆటో సిద్దిపేటలో దర్శనమివ్వడంతో మంత్రి కేటీఆర్‌ అధికారులపై ఫైర్‌ అయ్యారు.

చెత్తను వేరుచేయడానికి అందుబాటులో 2వేల ఆటోలు.....

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తాం... తడి, పొడి చెత్తను వేరుచేయాలంటూ ప్రకటించింది జీహెచ్‌ఎంసీ. ఇంటింటికి రెండు చెత్త బుట్టలను కూడా పంపిణి చేసింది. తడి, పొడి చెత్తను వేరుగా తరలించడానికి 2 వేల ఆటోలను ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటి నుంచి చెత్త తీసుకెళ్లాల్సిన ఆటోలు... పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. వివిధ కారణాలతో వీరి హాజరు శాతం తక్కువగా ఉంటోంది. ప్రతి రోజూ 2 వేల ఆటోలు విధుల్లో ఉండాలి. కానీ, ప్రతిరోజూ 1500 ఆటోలు కూడా విధుల్లోకి రావడం లేదు. కొంతమంది ఇష్టం వచ్చినట్లు విధులకు డుమ్మా కొడుతున్నారు.

ప్రతి నెలా రూ.2 కోట్లకుపైగా ఈఎంఐ చెల్లిస్తున్న బల్దియా.....

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 2000 ఆటోలకు ప్రతి నెలా 2 కోట్లకుపైగా ఈఎంఐ చెల్లిస్తోంది బల్దియా. అయితే... విధులకు సక్రమంగా హాజరు కాని ఆటోవాలాలు... సిటి బయట ఆటోలతో దర్శనమిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. సిద్ధిపేటలో ఒక స్వచ్ఛ ఆటోను గమనించిన మంత్రి కేటీఆర్‌ దానిపై ఆరా తీశారు. స్వయంగా ఆటో నెంబర్ సేకరించి బల్దియా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు కాప్రా సర్కిల్‌కు చెందిన కోటా వెంకటేష్‌ ఆటోగా గుర్తించారు. కిసరగుట్ట వద్ద డ్యూటి వేస్తే... హాజరుకాని వెంకటేష్‌... సిద్ధిపేటకు వెళ్లడంతో ఆటోను సిజ్ చేసి సర్కిల్ కార్యాలయానికి తరలించారు అధికారులు. శానిటేషన్ రక్షణకోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్న బల్దియా.... వాటి సద్వినియోగంపై ఇప్పటికైనా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

15:40 - February 26, 2017

విశాఖ:ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్‌ను సీఎం చంద్రబాబు కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ప్రత్యేక రైల్వేజోన్ కోసం విశాఖ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. విశాఖలో ల్యాండ్ పూలింగ్ పేరుతో మంత్రులు గంటా, నారాయణ రైతుల భూములను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వీరిపై సీబీఐ విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు.

15:36 - February 26, 2017

కర్నూలు: కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ కర్నూల్లో ఒక రోజు సత్యాగ్రహ దీక్షను చేపట్టారు ముద్రగడ పద్మనాభం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్‌ సాధన కోసం న్యాయపోరాటానికీ దిగుతామని ముద్రగడ హెచ్చరించారు.

15:34 - February 26, 2017
15:32 - February 26, 2017

విశాఖ : నగరంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారంతో సందడిగామారింది.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీడీఎఫ్ నుంచి పోటీ చేస్తున్న అజా శర్మ ఆర్కే బీచ్‌లో ప్రచారం చేశారు.. తనకు ఓటు వేసి గెలిపిస్తే స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.. నగరంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.. గతంలో కార్మిక నేతగాఉన్న అజాశర్మ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శిగా పనిచేశారు..

15:30 - February 26, 2017

హైదరాబాద్‌ : ఉప్పల్‌లో నిరుద్యోగులకు ఓ సంస్థ కుచ్చుటోపి పెట్టింది. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి... నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని...ఆ తర్వాత చేతులేత్తేసింది. గెట్‌ మై జాబ్‌ డాట్‌ కమ్‌.. పేరుతో ఉప్పల్‌లోని లిటిల్‌ ఫ్లవర్‌ కాలేజీలో నిర్వహిస్తున్న జాబ్‌మేళా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు 30 కంపెనీలు ఈ జాబ్‌ మేళాలో పాల్గొంటున్నాయని, 200 రూపాయలతో నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో రిజిష్ర్టేషన్‌ చేసుకోవాలని గత 20 రోజులుగా సామాజిక ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేశారు. దీంతో ఆన్‌లైన్‌లో రిజిష్ర్టేషన్‌ చేసుకున్న వారు.. ఇంటర్వ్యూలకు వచ్చారు. తీరా జాబ్‌మేళాలో సంబంధిత గెట్‌ మై జాబ్‌ డాట్‌ కమ్‌ సంస్థ ప్రతినిధులు లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లిటిల్‌ ఫ్లవర్‌ కాలేజీ నిర్వాహకులతో ఆందోళనకు దిగారు. దాదాపు 4వేల మంది నిరుద్యోగులు తార్నాక-ఉప్పల్‌ రహదారిపై బైఠాయించి.. నిరసన తెలిపారు.

15:28 - February 26, 2017

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దారుణమని... కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు విమర్శించారు.. యూఎస్ లో భారతీయులు చనిపోతుంటే ముంబైలో డప్పు చప్పుళ్ల మధ్య కేంద్రమంత్రులు డ్యాన్సులు చేయడం బాధాకరమన్నారు.. శ్రీనివాస్‌ మృతిపై కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్‌, వెంకయ్య నాయుడు వెంటనే అమెరికావెళ్లి సమస్య పరిష్కరించాలని సిద్ధిపేట్‌లో వీహెచ్ డిమాండ్ చేశారు..

15:27 - February 26, 2017

కృష్ణా : విజయవాడలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనం ప్రారంభానికి ముహుర్తం ఖరారుచేశారు. మార్చి 2వ తేదీ ఉదయం 11. 25 గంటలకు అసెంబ్లీ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది ఎంపిక నిర్ణయాన్ని పొలిట్ బ్యూరో చంద్రబాబుకే వదిలేసింది. ఎమ్మెల్యేల కోటాలో లోకేష్‌కు సీటు కేటాయించాలని పొలిట్‌బ్యూరో చంద్రబాబుకు సూచించింది. అమెరికాలో తెలుగువారిపై దాడులను పొలిట్‌బ్యూరో ఖండించింది. తెలుగువారి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

ఆర్మీ ఉద్యోగ నియామక పరీక్ష రద్దు

ఢిల్లీ: ఈ రోజు ఉదయం 9గంటలకు ఈ పరీక్ష జరగాల్సి ఆర్మీ నియామక పరీక్షకు సంబంధించిన పేపర్‌ లీక్‌ కావడంతో దేశవ్యాప్తంగా ఆ పరీక్షను రద్దుచేస్తున్నట్టు ఆర్మీవర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 18 మందిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, గోవాలో ఈ రోజు థానే పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆర్మీ దర్యాప్తు జరిపింది. అనంతరం ఆ పరీక్ష పేపర్‌ లీకైనట్టు నిర్థారించిన అధికారులు... వివిధ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఏపీలో ముగిసిన గ్రూప్-2 ఎగ్జామ్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం జరిగిన గ్రూప్‌-2 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్బంగా ఏపీపీఎస్సీ కార్యదర్శి సాయి విలేకరులతో మాట్లాడుతూ... నిమిషం ఆలస్యంగా వచ్చిన కొందరిని మానవతా దృక్పథంతో పరీక్షహాల్‌లోకి అనుమతించామన్నారు. మార్చి నెలాఖరుకు గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ పరీక్ష ఫలితాలు వస్తాయన్నారు. అలాగే మే 20, 21 తేదీల్లో మెయిన్స్‌ పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు.

మేఘాలయలో ట్రక్ బోల్తా: 16 మంది మృతి

హైదరాబాద్: మేఘాలయలోని వెస్ట్‌ ఖాసి హిల్స్‌ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 16 మంది మృత్యువాత పడ్డారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఓ ట్రక్కులో సుమారు 70 మంది ఓ చర్చికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సహాయబృందాలు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పెద్దల సభకు చిన బాబు:సోమిరెడ్డి

విజయవాడ : పెద్దల సభ(ఎమ్మెల్సీ)కు చిన బాబు నారా లోకేష్ అడుగు పెట్టనున్నట్లు ఆ పార్టీ నేత సోమిరెడ్డి తెలిపారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ... తాము ఈ స‌మావేశంలో 17 అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. టీడీపీ యువ‌నేత‌ నారా లోకేశ్‌ను ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించామని ఆయ‌న చెప్పారు.

ఇద్దరి ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్...

హైదరాబాద్: ఇద్దరు ఐఎస్‌ఐఎస్ గుజరాత్ ఏటీఎస్ పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో రాజ్‌కోట్‌కు చెందిన ఒకరిని అదేవిధంగా భావ్‌నగర్‌కు చెందిన మరొకరిని అరెస్ట్ చేశారు. క్రైం బ్రాంచ్ సీపీ ఐకే భట్ అరెస్ట్‌ను ధ్రువీకరించారు. ఐసిస్ సహకారంతో ఒంటరిగా దాడులకు పాల్పడేందుకు నిందితులు ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

13:03 - February 26, 2017

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కి అనుకున్న టైటిల్ కి యంగ్ హీరో ఫిక్స్ అయిపోయాడు.ఈ టైటిల్ తో స్టార్ట్ చెయ్యాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. వెంకటేష్ కూడా కధ విషయం లో వివాదాలు రావడంతో 'రాధా' సినిమాని చెయ్యట్లేదు అని సమాచారం. గతంలో కరుణాకరన్ వద్ద పని చేసిన టెక్నీషియన్ చంద్రమోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. నూతన దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన కథ శర్వానంద్ కి నచ్చిందట. రొమాన్స్, కామెడీ, యాక్షన్ సమపాళ్ళలో ఈ కధలో ఉన్నాయట. ఈ సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది అని గట్టి నమ్మకం మీద ఉన్నారు డైరెక్టర్. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న హీరో శర్వానంద్. ఇటీవలే 'శతమానం భవతి' తో భారీ హిట్ అందుకున్న శర్వా తాజాగా ''రాధా '' గా రాబోతున్నాడు. ఈ చిత్రంలో శర్వానంద్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు పలు విభిన్నమైన పాత్రలు పోషించాడు శర్వానంద్. అయితే ఈ మధ్య వరుసగా లవర్ బాయ్ పాత్రలు చేస్తూ వస్తున్నాడు. జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టు ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా సరికొత్త కోణంలో కనిపించనున్నాడట శర్వా. సైలెంట్ గా హిట్స్ కొడుతున్న హీరో శర్వానంద్ సినిమా సెలక్షన్ లో చాలా జాగర్త పడుతున్నాడు. సేఫ్ సైడ్ లో స్టోరీ సెలక్షన్ చేసుకుంటూ నాని ని ఫాలో అవుతున్నాడు. ఈ 'రాధ' అనే సినిమా లో 'శర్వ' సరసన 'లావణ్యా త్రిపాఠి' హీరోయిన్ గా చేయబోతుంది. ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. వేసవి సెలవుల్లో, ఉగాది (మార్చ్ 29) రోజున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

వైసీపీ ఎమ్మెల్సీలు ఖరారు..

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్సీల అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరు వెంకట్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిలను ఖరారు చేసినట్లు సమాచారం. వీరు రేపు నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 

కేసీఆర్ వ్యాఖ్యల్లో తప్పు లేదన్న తలసాని..

హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించమని, అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో ఇంటింటికి నల్లానీరు ఇవ్వాలని అనుకోవడం తప్పా అని ప్రశ్నించారు.

12:57 - February 26, 2017

కవులు, రచయితలు, కళాకారులు, ప్రేక్షకుల సహకారంతో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న టెన్ టీవీ అక్షరం 'అక్షరం సమీక్షణం' పేరుతో ఓ వేడుకను నిర్వహించింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన ఈ సెలబ్రేషన్స్ లో ప్రముఖ కవి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె శివారెడ్డితో పాటు సాహితీ ప్రముఖులు ఖాదర్ మొహియుద్దీన్, ప్రసాదమూర్తి, యాకూబ్, స్ఫూర్తి, జి. లక్ష్మీనర్సయ్య, అట్టాడ అప్పల్నాయుడు, శిఖామణి, పసునూరు రవీందర్, ఎండ్లూరి మానస, పసునూరు శ్రీధర్ బాబు, అక్షరం ప్రేక్షకులు పలువురు పాల్గొన్నారు. ఆ కార్యక్రమ విశేషాలు వీడియోలో చూడండి..

12:48 - February 26, 2017

ఓ సాహిత్య కార్యక్రమం ఎలక్ట్రానిక్ మీడియాలో ఇముడుతుందా? ప్రతీ వారం ఇవ్వగలరా? అసలు అక్షరాన్ని విజువల్ గా ఎలా చూపిస్తారు..? ఇప్పటికే కొందరు ప్రయత్నించారు.. విరమించుకున్నారు.. మరి ఈ ప్రయత్నం మాత్రం ఎంతవరకు విజయవంతమౌతుంది? ఇలాంటి ప్రశ్నలు అనేకం వినిపించాయి.. అన్ని ప్రశ్నలకు సమాధానంగా నాలుగేళ్లు... రెండువందల వారాలు.. పూర్తి చేసుకుని .. సరికొత్త ప్రణాళికలతో, మరిన్ని విన్నూత్న కార్యక్రమాలతో మీ ముందుకు రాబోతోంది టెన్ టీవీ అక్షరం.. అక్షరం 200వ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ తో పాటు.. ఈ నాలుగేళ్ల పయనంలోని అనుభవాలతో ఈ వారం అక్షరం ప్రత్యేకంగా మీముందుకొచ్చింది. సమున్నత ఆశయంతో సాగుతున్న టెన్ టీవీ అక్షర ప్రయాణంలో ఓ మైలు రాయి లాంటి సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ నిర్వహించిన చిన్న వేడుక 'అక్షరం సమీక్షణం' పలువురు సాహితీవేత్తల సమక్షంలో జరిగింది.

12:47 - February 26, 2017
12:26 - February 26, 2017

ఇండస్ట్రీ లో హిట్ కాంబినేషన్ సెంటిమెంట్స్ కొన్ని ఉంటాయి .కొంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చెయ్యడానికి హీరోలు కంఫర్ట్ గ ఫీల్ అవుతారు . వరుస విజయాలతో మంచి జోష్ లో ఉన్న హీరో మళ్ళీ సేమ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నాడు .ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు ఈ యంగ్ హీరో .ఆ కధ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఇయర్ స్టార్టింగ్ లో మంచి హిట్ కొట్టిన హీరో నాని. తన స్టోరీ సెలక్షన్ లో ఏ మాత్రం తడబాటు లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న హీరో నాని .వరల్డ్ వైడ్ మార్కెట్ ని క్రేయేట్ చేసుకొని పెద్ద హీరోల సినిమాలకు పోటీ ఇస్తున్నాడు ఈ కుర్ర హీరో. ప్రతి సినిమాలో కామెడీ ఉండేలా చూసుకుంటూ ఎంటర్టైన్మెంట్ ని మిస్ కనివ్వట్లేదు. వరుస విజయాలతో కలక్షన్స్ కుమ్మేస్తున్న ఈ హీరో సినిమా అంటే పెద్ద హీరోలు కూడా భయపడుతున్నారు. 'నేను లోకల్' సినిమా హిట్ తో జోరు మీదున్న హీరో ఇప్పుడు తనకు ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో యాక్ట్ చెయ్యబోతున్నాడు. సున్నితమైన ప్రేమకథలను మంచి స్క్రీన్ ప్లే తో తియ్యగల డైరెక్టర్ హను రాఘవపూడి. తన మొదటి సినిమా 'అందాల రాక్షసి'తోనే అద్భుతంగా ప్రేమ కధలను తెరకెక్కించగలడు అని మంచి పేరు కొట్టేసాడు. ఇద్దరు హీరోలతో ఒక ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ని అద్భుతంగా తీర్చిదిద్ది మ్యూజికల్ హిట్ కూడా ఇచ్చాడు. ఆ తరువాత వచ్చిన 'కృష్ణ గాడి వీరప్రేమకధ' సినిమా లో పిరికి ప్రేమికుడు ప్రేమను గెలుచుకోడం కోసం ఎలా మారాడు అనే కధని కామెడీ ఎక్కడ తగ్గకుండా సగటు ఆడియన్స్ కి అర్ధమయ్యేలా తీసి హిట్ కొట్టాడు.

హనురాఘవపూడి..
నాచురల్ స్టార్ నాని హీరోగా నూతన యువ నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'నాని' హీరోగా 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు 'హనురాఘవపూడి' ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సుప్రసిద్ధ సంగీత దర్శకుడు 'మణిశర్మ' సంగీతం అందిస్తుండగా, 2017 ఆగస్టు నెలలో చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చిత్ర నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి తెలిపారు.ఇది ఇలా ఉంటె నాని ఈ ఇయర్ చెయ్యబోతున్న మరో సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. చిత్రం పేరు 'నిన్ను కోరి'. ఫిబ్రవరి 24 హీరో నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాత డి.వి.వి.దానయ్య నానికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ 'నిన్ను కోరి' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

12:13 - February 26, 2017

వరంగల్ : మంగంపేట (మం) కమలాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. డబుల్ మర్డర్ కలకలం సృష్టించింది. గత నాలుగు రోజుల క్రితం మంగపేట మండలం కమలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళపై కర్రా శ్రీను, కళ్యాణ్ లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై బాధితురాలు మంగంపేటలో పీఎస్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీను, కళ్యాణ్ లు లొంగిపోవడంతో సోమవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మద్యం సేవించిన శ్రీను..కళ్యాణ్ లు శనివారం రాత్రి ఇంటికి వెళుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహిళ కుటుంబసభ్యులు వారిని మట్టుపెట్టాలని నిర్ణయించారు. ఒక ప్రాంతంలో వద్దకు రాగానే శ్రీను..కళ్యాణ్ లపై కారం పొడి చల్లి మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో 8మంది దాక పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనితో శ్రీను..కళ్యాణ్ లు అక్కడికక్కడనే మృతి చెందారు. ఆదివారం ఉదయం ఘటన వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడులకు పాల్పడ్డారు. ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. దారుణంగా హత్య చేసిన వారిని ఎలాగైనా హత్య చేస్తామని ప్రత్యర్థి వర్గం పేర్కొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహించారు. మృతదేహాలను తరలించేందుకు కష్టపడాల్సి వచ్చింది. ఒకనొక దశలో స్వల్ప లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది.
పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి భద్రతను ఏర్పాటు చేశారు. ఏఎస్పీ రంగంలోకి దిగి పోలీసు బలగాలను కంట్రోల్ చేస్తూ బాధితులతో మాట్లాడారు. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ఏఎస్పీ హామీనిచ్చారు. దీనితో పరిస్థితి సద్దుమణిగింది.

12:03 - February 26, 2017

బాలయ్య నెక్స్ట్ సినిమా ఏంటి అని అనుకుంటున్న ఆడియన్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. గౌతమి పుత్ర శాతకర్ణి తో రికార్డ్స్ క్రియేట్ చేసిన బాలయ్య నెక్స్ట్ సినిమా అంటే ఆడియన్స్ లో ఇంటరెస్ట్ పెరిగింది. ఇప్పుడు బాలయ్య ఆల్మోస్ట్ అందరికి షాక్ ఇచ్చారు. ఒక డిఫరెంట్ కాంబినేషన్ కి తెర తీశారు. రీసెంట్ హిట్ తో ఊపు మీద ఉన్న 'బాలకృష్ణ' నెక్స్ట్ సినిమా సెలక్షన్ లో ఎన్నో ట్విస్ట్ లు వినిపించాయి. కృష్ణ వంశితో సినిమా అని అనౌన్స్మెంట్స్ ఆన్ఎయిర్ లో చెక్కర్లు కొట్టాయి. 'రైతు' అనే టైటిల్ కూడా వినిపించింది. తరువాత కొన్ని కారణాలవల్ల ఆ సినిమా పోస్ట్పోన్ చేసినట్టు సమాచారం. తరువాత 'కె ఎస్ రవికుమార్' తో 'బాలయ్య' ఫిలిం ఫిక్స్ అవ్వబోతుంది అని ఊహలు నెట్ కి ఎక్కినా ఆ సినిమా కి ఇంకా టైం ఉంది అని తేలిపోయింది. ఒక్క పర్ఫెక్ట్ హిట్ తో యుఎస్ లో కూడా మార్కెట్ గట్టిగా కొట్టిన బాలయ్య నెక్స్ట్ సినిమా ఒక స్పీడ్ అండ్ ట్రెండీ డైరెక్టర్ తో ఉండొబోతుంది అని ఇండస్ట్రీ వర్గాలు కంఫర్మ్ అయ్యాయి.

కథలను పరిశీలించిన బాలయ్య..
పవర్ఫుల్ కధ కోసం వెతుకుతున్న 'బాలయ్య' కొన్ని కథలని పరిశీలించినా అవి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కి యాప్ట్ అవ్వలేదు అనే టాక్ కూడా ఉంది. కె.ఎస్.రవికుమార్ తో బాలయ్య సినిమా కన్ఫమ్ అవుతుందని భావిస్తున్నా ఈ టైం లో 'పూరి జగన్నాధ్' డైరెక్షన్ లో బాలయ్య సినిమా ఉంటుంది అనే వార్త బయటికి వచ్చింది. స్వయంగా పూరి జగన్నాథ్ తన ట్విట్టర్ లో ఫేస్ బుక్ లో బాలయ్య తో సినిమా చెయ్యబోతున్నా అని పోస్ట్ చేసాడు. ‘‘రాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌. బాలకృష్ణగారు హీరోగా భవ్య క్రియేషన్స్‌ ఆనంద్‌ప్రసాద్‌గారి నిర్మాణంలో నేను సినిమా చేస్తున్నాను’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ ట్వీట్‌ చేశారు.

పూరి జగన్నాథ్..
పూరి బాలయ్య కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా పవర్‌ఫుల్‌ మాస్‌ అండ్‌ యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ అని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే యమా క్రేజ్‌ నెలకొంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా వివరాలను ప్రకటించారు. బాలకృష్ణ పవర్‌ఫుల్‌ యాక్షన్‌కీ, పూరి జగన్నాథ్‌ పెన్‌ పవర్‌కీ తెలుగు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, అగ్ర సంస్థల్లో ఒకటిగా దూసుకెళుతోన్న భవ్య క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం 'రోగ్' సినిమాతో బిజీ గా ఉన్న 'పూరి' ఇంత త్వరగా మరో సినిమాని ఓకే చేసాడు అంటే మళ్ళీ పూరి ఫామ్ లోకి వచ్చినట్టే తెలుస్తుంది.

మన్ కీ బాత్ లో మోడీ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్రసంగించారు. యువతలో శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు పెరగాలని, దేశానికి మరికొంత మంది శాస్త్రవేత్తలు అవసరమన్నారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు వెల్లడించారు.

11:58 - February 26, 2017

సినిమా ఇండస్ట్రీ లో రెగ్యులర్ గా స్క్రీన్ మీద కనిపిస్తేనే హీరోకి గాని హీరోయిన్ కి గాని లైఫ్ ఉంటుంది. కొన్ని రోజులు స్క్రీన్ టచ్ లేకపోతే అటు ఇండస్ట్రీ ఇటు ఆడియన్స్ ఇద్దరు మర్చిపోతారు. ఎన్నో హిట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకులకు రీచ్ అయిన చెన్నై బ్యూటీ రీ ఎంట్రీ కోసం పక్క ప్లాన్ వేసింది. ఇండస్ట్రీ లో హీరో లైఫ్ టైం ఎక్కువ హీరోయిన్ లైఫ్ టైం తక్కువ. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఫ్రెష్ పేస్ కోసం హీరోయిన్స్ ని చేంజ్ చేస్తారు. కానీ హీరోని మాత్రం చాల రేర్ గా చేంజ్ చేస్తారు. ప్రెజెంట్ ట్రెండ్ లో పట్టుమని 5 సినిమాలు చేస్తే చాలు హీరోయిన్ ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి ఉంది. ఒక హీరోయిన్‌కు క్రేజ్ తగ్గిందీ అంటే.. మళ్లీ పుంజుకోవడం కష్టం. హీరోల్లాగా దశాబ్దాలు దశాబ్దాలు కొనసాగడం అన్నది హీరోయిన్లకు అసాధ్యం. ఐతే త్రిష మాత్రం ఇందుకు మినహాయింపులాగా కనిపిస్తోంది.

మొదట్లో సందేహాలు..
తెలుగులో మంచి పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించిన చెన్నై బ్యూటీ రాను రాను తన ఉనికిని కోల్పోతుందా అని అందరూ అనుకున్నారు. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలలు మాత్రమే చేసిన త్రిష ఇక నుంచి డిఫరెంట్ పాత్రలు చేయాలని నిర్ణయించుకుంది. తమిళ తెలుగుతో పాటు సౌత్ ఇండియా లో ఆడియన్స్ కి తెలిసిన మొహం కావడం వల్ల ఇక నుండి చేసే సినిమాలు తెలుగు తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యేలా జాగర్త పడుతుందట. ఇలా మరింత కొంతకాలం పాటు హీరోయిన్ బిజిగా ఉండటానికి త్రిష భలే ప్లాన్స్ వేస్తుందట. త్రిష కొత్త ఛాన్స్ లతో తీరిక లేకుండా ఉంది. అంతేకాదు ప్రస్తుతం ఈ బ్యూటీ అందం కూడా రెట్టింపు అయింది. ఈ విషయం త్రిష లేటెస్ట్ స్టిల్స్ చూస్తే అర్దం అవుతోంది. సౌత్ లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ సినియర్ బ్యూటీ మరో సారి తన రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేసింది. తెలుగు లో వచ్చిన 'నాయకి' సినిమాలో విభిన్నమైన పాత్ర ప్లే చేసిన 'త్రిష' తెలుగు ప్రేక్షకులని అలరించలేకపోయింది. అటు తమిళం లో కూడా అదే పరిస్థితి వచ్చింది ప్రాధాన్యత లేని పాత్రలు పోషించి మమ అనిపించింది త్రిష. ఒక దశలో త్రిష పని అయిపోయింది అని అనుకున్నారు అందరూ.


విక్రమ్ తో..
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దక్కించుకోవాలి అనుకుందేమో 'త్రిష' వరుసగా ఆరు సినిమాల్లో బిజీ అయిపోయింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘సామి-2’ గురించే. 14 ఏళ్ల కిందట విక్రమ్ సరసన త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సామి’. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. ఇందులో విక్రమ్‌నే హీరోగా ఎంచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ త్రిషనే కథానాయికగా తీసుకోవడం మాత్రం ఆశ్చర్యమే. దీంతో పాటుగా మోహని.. గర్జనై.. 1818.. శతురంగ వేట్టై-2.. హేయ్ జూడ్.. 96 అనే ఐదు సినిమాల్లో త్రిష కథానాయికగా నటిస్తోంది. 34 ఏళ్ల వయసులో ఒక సౌత్ హీరోయిన్.. ఇంతటి ఊపు చూపించడం అన్నది మామూలు విషయం కాదు.

ముద్రగడ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం..

కర్నూలు : నేడు మెగాసిరి ఫంక్షన్ హాల్లో ముద్రగడ సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. కాపులను బీసీలో చేర్చాలనే డిమాండ్ తో ఆయన కొంతకాలంగా పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సీపీఎం మహాజన పాదయాత్ర 133వ రోజు..

ఖమ్మం : సీపీఎం మహాజన పాదయాత్ర 133వ రోజుకు చేరుకుంది. నేడు పొట్లపాడు, పెన్ పహాడ్, సింగిరెడ్డిపాలెం, జానారెడ్డినగర్, హెచ్ పీసీఎల్, దురాజ్ పల్లి, కాశీంపేట, చివ్వెంలలో పర్యటించనుంది.

10:21 - February 26, 2017

విజయవాడ : టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల పొలిట్ బ్యూరో సభ్యులు హాజరయ్యారు. నందమూరి హరికృష్ణ కూడా హాజరయ్యారు. 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేయనున్నారు. చిత్తూరు, అనంతపురం, కడప, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం రెండు స్థానాలు ఖాళీలున్నాయి. ఇప్పటివరకు కేవలం కడప జిల్లా అభ్యర్థిగా బీటెక్ రవి పేరును మాత్రమే చంద్రబాబు ఖ‌రారు చేశారు.

ఆశావాహులు..
చిత్తూరు జిల్లాలో దొరబాబు, హేమలత, నరేష్ కుమార్ రెడ్డి పేర్లను పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో నారా లోకేశ్‌కు ఓ ఎమ్మెల్సీ స్థానం ఖరారైనట్లు చెబుతున్నారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను కుల సమీకరణాల ప్రాధాన్యతతో ఎంపిక చేస్తారని సమాచారం. మొత్తం ఏడు స్థానాలకు జరిగే పోరులో సంఖ్యాబలం పరంగా తెలుగుదేశానికి ఐదు, వైసీపీకీ ఒక స్థానం ఖరారు కానుంది

ఎమ్మెల్యేల కోటా నుండి..
ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీ స్థానం కోసం కరణం బలరాం, పుష్పరాజ్, జూపూడి ప్రభాకరరావు, గోనగుంట్ల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, దాసరి రాజా మాస్టర్, దివి శివరాం, బచ్చుల అర్జునుడు, వర్ల రామయ్య, చందు సాంబశివరావు, గొట్టిపాటి రామకృష్ణ, కొమ్మినేని వికాస్ లు పోటీలో వున్నారు. మహిళల కోటాలో పంచమర్తి అనురాధ, శోభా హైమావతి, ముళ్ళపూడి రేణుక, పోతుల సునీతలు తమకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు.

టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభం..

విజయవాడ : టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి నందమూరి హరికృష్ణ హాజరయ్యారు.

10:13 - February 26, 2017

విశాఖపట్టణం : ఒక్క నిమిషం నిబంధన విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వివిధ పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ట్రాఫిక్ లో చిక్కుకపోవడం..ఇతరత్రా సమస్యల వల్ల పరీక్షా కేంద్రాలకు లేటుగా హాజరవుతున్నారు. పరీక్షకు అనుమతించాలని కోరినా అధికారులు కనికరించలేదు. దీనితో వారు భోరున విలపించారు. పరీక్ష తేదీకంటే ముందుగానే అధికారులు పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. 9.45 గంటలకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుందని, ఒక్క నిమిషం నిబంధన కఠినంగా అమలు చేస్తామని విద్యాశాఖాధికారులు హెచ్చరించారు. కానీ విశాఖలోని ఓ పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను లోనికి అనుమతించలేదు. జిల్లా వ్యాప్తంగా 182 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 74వేలకు పైగా విద్యార్థులు రాస్తున్నారు.

విజయవాడలో..
విజయవాడ గ్రూప్ 2 స్ర్కీన్ పరీక్ష ప్రారంభమైంది. 104 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. 5.7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. హాల్ టికెట్ తో పాటు గుర్తింపు కార్డును తీసుకరావాలని అధికారులు సూచనలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించారు.

10 నుండి 12.30 గంటల వరకు పరీక్ష..
ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఏపీతో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోనూ పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 6.57 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష హాజరకానున్నారని ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. హాల్ టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరుకావాలని ఆయన సూచించారు.  14 వందల 62 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

గ్రూప్ 2 స్ర్కీనింగ్ పరీక్ష ప్రారంభం..

హైదరాబాద్ : గ్రూప్ 2 స్ర్కీనింగ్ పరీక్ష ప్రారంభమైంది. ఒక్క నిమిషం నిబంధనను అమలు చేశారు. సమయానికి చేరుకోలేపోయిన పలువురు విద్యార్థులను హాల్ లోకి అనుమతించలేదు.

10:00 - February 26, 2017

రైళ్లు..బస్సులు..ఇతరత్రా వాహనాల్లో నిలబడి ప్రయాణించే వాళ్లని చూస్తుంటాం. కానీ విమానంలో నిలబడి ప్రయాణం చేయడం ఏంటీ ? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా ? కానీ ఇది నిజంగానే జరిగింది. మన భారతదేశంలో మాత్రం జరగలేదు. దాయాది దేశంగా పేర్కొందిన పాకిస్తాన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా ఏడుగురు విమానంలో నిలబెట్టి మరీ తీసుకెళ్లారు. ఇది ఒక రికార్డు అని పేర్కొంటుంటే దీనిపై విచారణ జరగుతోందంట. పాకిస్థాన్ కు చెందిన పాకిస్తానీ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సౌదీ అరేబియాకు వెళుతోంది. ఈ విమానంలో సీట్లు లేవని ఏడుగురు ప్రయాణీకులను ఒక పక్కన నిలబెట్టి వాళ్లను తీసుకెళ్లారు. ఈ విషయం పాక్ కు చెందిన ఓ పత్రికలో వార్తలు వచ్చాయి. కరాచీ నుంచి మదీనా వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగిందని టాక్. దీనిపై స్పందించి అధికార ప్రతినిధి డానియల్‌ గిలానీ విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. మొత్తం సీట్లన్నీ నిండిపోయిన తర్వాత కూడా విమానంలోకి ఏడుగురిని ఎక్కించి తీసుకెళ్లిన మాట వాస్తవమేనన్నారు. చేతితో రాసిన బోర్డింగ్‌ పాస్‌లు ఇచ్చి వాళ్లను విమానం ఎక్కించారని, ఇలా తీసుకెళ్తే చాలా ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. పూర్తి విచారణ జరిపిన అనంతరం వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలా తీసుకెళ్తే చాలా సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

09:45 - February 26, 2017

హైదరాబాద్ : స్థానిక సమస్యలపై గళం విప్పుతూ...జనానికి దగ్గరవుతున్న పవన్‌, పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి సారించారు. క్యాడర్‌తో పాటు పార్టీ కార్యకలాపాలనూ పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో, పనిచేసే సమర్థమైన కార్యకర్తల కోసం చూస్తున్నారు. జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ విధివిధానాలను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మంగళగిరిలో చేనేత సత్యాగ్రహంలో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌ తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడంతో పాటు.. పార్టీ నిర్మాణానికి సంబంధించిన స్పష్టత ఇచ్చారు. మార్చి14వ తేదీకి జనసేన ఆవిర్భవించి మూడు సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో అదేరోజు పార్టీ విధివిధానాలను ప్రకటించడానికి పవన్‌ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే 2019 ఎన్నికల నాటికి మ్యానిఫెస్టో ఎలా ఉండాలో ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు అదేరోజు వెబ్‌సైట్‌ని ప్రారంభించనున్నారు.

జిల్లాల వారీగా సమీక్షలు..
జనసేనను స్థాపించాక ఇప్పటివరకూ దాదాపుగా పార్టీ నిర్మాణంపై పవన్‌ కల్యాణ్‌ దృష్టి సారించలేదు. 2019 ఎన్నికల బరిలో పార్టీ నిలుస్తుందని ఇటీవల మంగళగిరిలో ప్రకటించాక.. పార్టీ నిర్మాణం ఆవశ్యకతను ఆయన గుర్తించారు. అందుకే.. ఇకపై పార్టీ పటిష్ఠతకు ఎక్కువ సమయం కేటాయించాలని పవన్‌ భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పార్టీలో యువతకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై అవగాహన, పోరాట పటిమ ఉన్న యువ నాయకత్వం వైపే ఆయన ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పవన్‌ రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలియక ఆందోళనలో ఉన్న అభిమానులకు.. పార్టీ కార్యకర్తలకు మంగళగిరిలో పవన్‌ ప్రసంగం నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. పార్టీ నిర్మాణంపై పవన్‌ ఇచ్చిన క్లారిటీతో ఫుల్‌జోష్‌లోకి వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

09:43 - February 26, 2017

హైదరాబాద్ : వచ్చే నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులపై దృష్టి సారించారు. ఈ సారి బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరికొద్ది రోజుల్లో నాలుగో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే శాఖల వారీగా చేసిన ప్రతిపాదనలను అధికారులు, మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. ప్రతిపాదనలపై అర్ధికశాఖ అధికారులతో పాటు, సంబంధిత శాఖల మంత్రులు, ఆధికారులతో కేసీఆర్ వరుస సమీక్షలు చేపట్టనున్నారు.

వలసలు ఆరికట్టవచ్చనే యోచన..
గతానికి భిన్నంగా ఈ సారి బడ్డెట్‌లో గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన కులవృత్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించి కుల వృత్తులను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టనున్నారు. దీని ద్వారా వలసలను ఆరికట్టి.. స్వయం ఉపాధి కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై అఖిలపక్షంతో భేటీ..
ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టి పెట్టని సామాజిక వర్గాలు, వివిధ కులాల వృత్తులకు ప్రయోజనాలు కల్పించే పథకాలకు పెద్దపీట వేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే ప్రగతిభవన్‌లోని జనహితలో చేనేత, మరమగ్గాల కార్మికులు, ఎంబీసీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ఎస్సీ సబ్‌ప్లాన్‌కు 15.44 శాతం, ఎస్టీ సబ్ ప్లాన్‌కు 9.34 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. 2015-16 బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం 11,450 కోట్లు కేటాయించింది. ప్రణాళిక పద్దు పెరిగిన దామాషా ప్రకారం వచ్చే బడ్జెట్‌లో ఇది కాస్తా 15 వేల కోట్లకు చేరుతుంది. దీంతో మిగతా 22 వేల కోట్లను ఇతర విభాగాలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అందుకే కొన్ని పథకాలకు బడ్జెట్‌లో ఆర్థిక కేటాయింపుల్లేకుండానే రుణాల సమీకరణ ద్వారా వెసులుబాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

స్వల్పమార్పులు...
ఇది ఇలా ఉంటే.. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన సాగునీటి ప్రాజెక్టులు, డబుల్ బెడ్ రూం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఇందులో ఒక్క సాగునీటి ప్రాజెక్టుల కోసమే ప్రతి ఏడాది బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. ఈ సారి మాత్రం వివిధ ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటూ బడ్జెట్‌ ప్రతిపాదనలను నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి సమర్పించింది. మొత్తంగా 26,700 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యధికంగా 9వేల కోట్లు, పాలమూరు ప్రాజెక్టుకు 4,748 కోట్లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మొత్తానికి బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతున్న కొద్ది ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సారి బడ్జెట్ రూపకల్పనలో స్వల్పమార్పులు కూడా చోటు చేసుకోబోతున్నట్లు సమాచారం.

09:40 - February 26, 2017

హైదరాబాద్ : రంగారెడ్డి, హైదరాబాద్, మహాబూబ్‌నగర్ నియోజకవర్గాల టీచర్ ఎంఎల్‌సి ఎన్నికల్లో యూటిఎఫ్‌ తరుపున ఎంఎల్‌సి అభ్యర్ధిగా పోటి చేస్తున్న పాపన్నగారి మాణిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత 38యేళ్లు గా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ప్రజా ఉద్యమాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాణిక్ రెడ్డి కి ఉపాధ్యాయుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టి విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో తన వంతు కృషి చేస్తానని మాణిక్ రెడ్డి పేర్కొన్నారు.

09:37 - February 26, 2017

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపుకు ఆపార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 5 నెలలు,..4వేల కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్ర మార్చి 19న హైదరాబాద్‌లో నిజాం గ్రౌండ్‌లో ముగింపుగా తెలంగాణ సామాజిక సంక్షేమ సమర సమ్మేళనం పేరుతో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌, వివిధ వామపక్ష, సామాజిక సంఘాల నేతలు 50మందికిపైగా పాల్గొననున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా వివిధ ప్రజాసంఘాల నేతలు కూడా హాజరుకానున్నారు. మార్చి 19న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి పాదయాత్ర ముగింపు కాలినడక ప్రారంభమవుతుంది. పాదయాత్ర ముగింపు సభకు అన్ని వర్గాల ప్రజలు, సామాజిక తరగతులకు చెందిన ప్రజలు హాజరై..విజయవంతం చేయాలని సీపీఎం నేతలు పిలుపునిచ్చారు.

 

09:36 - February 26, 2017

ఖమ్మం : ప్రజాసొమ్ముతో కేసీఆర్‌ మొక్కులు తీర్చుకోవడం నేరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. దేవుడి మొక్కులు తీర్చుతున్న కేసీఆర్‌..ఎన్నికల్లో ప్రజలకు హామీలు నెరవేర్చడం లేదని తమ్మినేని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చలకు రాకుండా టీఆర్‌ఎస్‌ నేతలు తోకముడిచారని తమ్మినేని మండిపడ్డారు. మహాజన పాదయాత్రతో సీఎం కేసీఆర్‌కు వణుకు పుడుతోందని విమర్శ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సామాజిక న్యాయం అంశాలపై చర్చకు వస్తామన్నా..టీఆర్‌ఎస్‌ నేతలు తోకముడిచారని తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందేవరకు సీపీఎం పోరాటం ఆగదని తమ్మినేని అన్నారు. ప్రజా సొమ్ముతో కేసీఆర్‌ తన సొంత మొక్కుల్ని తీర్చుకుంటున్నారని, ప్రజలకిచ్చిన హామీలను మాత్రం నెరవేర్చడం లేదని తమ్మినేని విమర్శించారు.

132 రోజులు..
తెలంగాణ వస్తే తమ సమస్యలు తీరుతాయనుకున్న సకల జనులకు ఈ ప్రభుత్వం మొండిచేయి చూపుతోందని పాదయాత్ర బృందం సభ్యులు నగేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్‌.. ప్రజలను దగా చేశారని నగేష్‌ విమర్శించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న యాత్ర..132 రోజులు పూర్తి చేసుకుంది. నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలంలోని కీతావారిగూడెం నుంచి ప్రారంభమైన యాత్ర అప్పన్నపేట, గరిడేపల్లి, ఎల్బీనగర్‌, నేరేడుచర్ల, రామాపురం, శాంతినగర్‌, కమలానగర్‌, పెంచికల్‌ దిన్నే, కల్లూరు, ముకుందాపురం, దాచారం, నాగులపాటి అన్నారం వరకు సాగింది. నేరేడుచర్ల సిమెంట్‌ పరిశ్రమలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, సిమెంట్‌ పరిశ్రమలో కార్మికులకు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు.

డీఎస్ జీఎంసీ ఎన్నికలు..

ఢిల్లీ : దేశ రాజధానిలోని సిఖ్ గురుద్వార మేనేజ్ మెంట్ కమిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. డీఎస్ జీఎంసీ అధ్యక్షుడు మంజిత్ సింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

 

09:22 - February 26, 2017

జయశంకర్ భూపాపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ మహిళ బంధువులు ఇద్దరు రౌడీషీటర్లను దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటన మంగంపేట (మం) కమలాపూర్ లో చోటు చేసుకుంది. గత నాలుగు రోజుల క్రితం మంగపేట మండలం కమలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళపై కర్రా శ్రీను, కళ్యాణ్ లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కేసు నేపథ్యంలో కర్రా శ్రీను కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే శనివారం రాత్రి రాత్రి మద్యం సేవించి వీరిద్దరూ ఇంటికి వెళుతున్నారు. అకస్మాత్తుగా మహిళ బంధువులు కారం చల్లి మారణాయుధాలతో దాడి చేశారని స్థానికులు పేర్కొంటున్నారు. ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. వివాహేతర సంబంధం బూచిగా చూపెట్టి హత్య చేశారని, ప్రతికారం తీర్చుకుంటామని హత్యకు గురైన కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. ఇరువర్గాలు దాడులకు పాల్పడడడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కమలాపూర్ లో దారుణం..

జయశంకర్ భూపాలపల్లి : మంగంపేట (మం) కమలాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు రౌడీషీటర్లు నర్రా శ్రీను, కళ్యాణ్ లు దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళపై అత్యాచరయత్నానికి వీరిద్దరూ ఒడిగట్టారని ఆరోపిస్తూ మహిళ తరపు బంధువులు హత్య చేశారు.

09:14 - February 26, 2017

హైదరాబాద్ : నేడు ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 స్ర్కీనింగ్‌ పరీక్ష జరగనుంది. ఆటంకాల మధ్య ఈ పరీక్ష జరుగుతోందని చెప్పవచ్చు. వెబ్ సైట్ పనిచేయకపోవడం..హాల్ టికెట్లు డౌన్ లోడ్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి పలువురు విద్యార్థులు రాత్రి 11గంటల వరకు నానా ఇబ్బందులు పడ్డారు. 17వేల మంది విద్యార్థులకు హాల్ టికెట్లు రావాల్సి ఉంటే కేవలం 250 మందికి మాత్రమే కొత్తగా హాల్ టికెట్లను అధికారులు జారీ చేశారు. అప్లై చేసిన దరఖాస్తు..ఏదైనా ప్రూఫ్ తీసుకొంటే పరీక్షకు అనుమతినిస్తామని విద్యాశాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 247 సెంటర్ల పైన ప్రత్యేక నిఘా పెట్టింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఏపీతో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోనూ పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 6.57 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష హాజరకానున్నారని ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. హాల్ టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరుకావాలని ఆయన సూచించారు. 14 వందల 62 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

09:02 - February 26, 2017

కడుపును చాలా సేపు ఖాళీగా ఉంచుతున్నారా ? ఆకలిని నిర్లక్ష్యం చేస్తున్నారా ? వేళకు తినడం లేదా ? వేళ మించాక తింటున్నారా ? అయితే ఇది మీ కోసమే. కడుపును ఖాళీగా ఉంచడం..పూర్తి భర్తీ చేసేయడం రెండూ మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఆకలి విషయంలో పాటించాల్సిన ఆరోగ్య సూచనలు..

  • మరీ ఆకలి పెరిగిపోయే వరకు ఆగకుండి. ఆకలి కాకుండానే తినేయవద్దు. వేళకు తింటూ ఉంటే అదే సమయానికి ఆకలి వేస్తుంది.
  • భోజన సమయంలో వీలైనంత నీళ్లు కూడా తాగవద్దు. భోజనం పూర్తయిన తరువాత నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.
  • ఆకలి తీరినట్లు అనిపించగానే తినడం ఆపేయాలి. భోజనం మంచిగా..రుచిగా ఉందని ఎక్కువగా తినేయడం వల్ల ఇతర అనార్థాలు వచ్చే అవకాశం ఉంది.
  • దోస ముక్కలు, క్యారెట్ ముక్కల వంటి సలాడ్స్ తీసుకోవడం మంచిది. పోషకాలను అందించే ఉడికించిన భోజన పదార్థాలనే తినండి. పాప్‌కార్న్స్, స్నాక్స్, సాఫ్ట్‌డ్రింక్స్ లాంటి చిరుతిండ్లకు దూరంగా ఉండండి.

రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశం వాయిదా..

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆదివారం జరగాల్సిన రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశం వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాల ప్రిపరేషన్‌లో బిజీగా ఉండటం వల్ల సమావేశం వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

08:52 - February 26, 2017

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్స్ లలో 'రవి' ఒకరు. స్టైలిష్ లుక్స్, మేనరిజమ్స్‌తో అలరిస్తున్నాడు. బుల్లితెర నుండి వెండి తెర వైపుగా ప్రయాణం మొదలెడుతున్నాడు. మత్స్య క్రియేషన్స్ పతాకంపై అయోధ్య కార్తీక దర్శకుడిగా 'ఇది మా ప్రేమ కథ' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా యాంకర్ 'రవి' హీరోగా నటించగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమాకి '1 ఈజ్ గ్రేటర్ దెన్ 99' అనే ట్యాగ్ లైన్ ఉంచారు. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందిందని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. ఈ సినిమా ద్వారా అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ ను ఆన్ లైన్లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు నిర్మాతలు. తొలి చిత్రంలో 'రవి' హీరోగా ఎలా కనిపించబోతున్నాడనే దానికి వేసవి వరకు వేచి చూడాల్సిందే.

 

మారథాన్ రన్ లో సచిన్..

ఢిల్లీ : దేశ రాజధానిలో జరిగిన 21 కి.మీ.మారథాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాల్గొన్నారు. ఒక మ్యాచ్ లో పరాజయం పొందిన మాత్రాన ఒరిగిపోయేది ఏమీ లేదని, ఆసీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో టీమిండియా పరాజయపై ఆయన వ్యాఖ్యానించారు.

కేరళలో అగ్నిప్రమాదం..

కేరళ : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పద్మనాభస్వామి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ గౌడోన్, పోస్టాఫీస్ లకు నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

07:50 - February 26, 2017

హైదరాబాద్ : మద్యం తాగి వాహనాలు నడపవద్దూ..నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం..అంటూ నగర పోలీసులు పలు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కానీ మద్యం తాగుతూ పలువురు పట్టుబడడం కామన్ అయిపోయింది. ఇందులో పలువురు మహిళలు పట్టుబడుతుండడం గమనార్హం. తాజాగా శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కు ఓ మహిళ నిరాకరించింది. మహిళతో పాటు మద్యం సేవించిన పలువురిపై కేసు నమోదు చేశారు. 12 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

జూబ్లీహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కు ఓ మహిళ నిరాకరించింది. మహిళతో పాటు మద్యం సేవించిన పలువురిపై కేసు నమోదు చేశారు. 12 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

నగరంలో పింక్ థాన్ రన్..

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డు పీపుల్ ప్లాజా నుండి పింక్ థాన్ రన్ ప్రారంభమైంది. బాలీవుడ్ నటుడు మిలింద్ చౌహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం - బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం రన్ నిర్వహించారు.

07:45 - February 26, 2017

నల్గొండ : జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లకు గుండెపోటు రావడం కామన్ అయిపోయింది. ఆర్టీసీ బస్సు నడుపుతూ పలువురు డ్రైవర్లు గుండెపోటుకు గురయి మృత్యువాత పడుతున్నారు. గత రెండు మూడు నెలల్లో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఏపీ 29 జెడ్ 2113 నెంబర్ గల బస్సు ఖమ్మం నుండి హైదరాబాద్ కు వెళుతోంది. ఈ బస్సును డ్రైవర్ సైదులు నడుపుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున నకిరేకల్ వద్దకు రాగానే సైదులుకు గుండెపోటు వచ్చింది. వెంటనే బస్సును ఓ వైపుకు తిప్పాడు. డివైడర్ ను ఢీకొన్ని బస్సు ఆగిపోయింది. అప్పటికే నిద్రలో ఉన్న వారందరూ ఏమైందని విచారించలోగా సైదులు కన్నుమూశాడు. ఈ విషాద విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు తరలించారు. మృతి చెందిన సైదులు కుటుంబానికి సమాచారం అందచేశారు. దీనితో వారు కన్నీరుమున్నీరయ్యారు. సైదులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి.

 

డ్రైవర్ కు గుండెపోటు..తప్పిన ప్రమాదం..

నల్గొండ : నకిరేకల్ వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ సైదులు మృతి చెందాడు. డివైడర్ ను ఢీకొని బస్సు ఆగిపోయింది. ఖమ్మం -నుండి హైదరాబాద్ కు ఏపీ 29 జెడ్ 2113 బస్సు వెళుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో 35 మంది ప్రయాణీకులున్నారు.

 

07:36 - February 26, 2017
07:34 - February 26, 2017

పూణె : వరుస విజయాలతో ఊపు మీదున్న కోహ్లీ సేనకు షాక్‌ తగిలింది. టీమిండియా జైత్రయాత్రకు ఆసీస్‌ కళ్లెం వేసింది. ఆసీస్‌ స్పిన్‌ మాంత్రికుడు ఒకీఫ్‌ దెబ్బకు భారత్‌.. రెండు ఇన్నింగ్స్‌లలో కేవలం.. 212 పరుగులు మాత్రమే చేయగలిగింది. సొంతగడ్డపై ఓటమి లేకుండా కొనసాగుతున్న భారత్‌ జోరుకు బ్రేక్‌ పడింది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌ జట్లను మట్టికరిపించి స్వదేశంలో తమకు తిరుగులేదని నిరూపించిన టీమ్‌ ఇండియాకు ఆస్ట్రేలియా షాక్‌ ఇచ్చింది. భారత్‌తో పుణెలో జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. స్పిన్‌ మంత్రంతో ఆసీస్‌ ఆతిథ్య జట్టును సునాయాసంగా ఓడించింది. భారత్‌పై 333 ప‌రుగుల తేడాతో ఆసీస్‌ ఘన విజయం నమోదు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత ప్రతిభ కనబర్చిన ఒకీఫ్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తీరు కనబర్చాడు. దీంతో భారత్‌ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. రెండు ఇన్నింగ్స్‌లలో ఒకీఫ్‌ 12 వికెట్లు తీసి.. ఆసీస్‌ ఘన విజయాన్ని అందించాడు. దీంతో ఆసీస్‌ నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

కుప్పకూలిన టీమిండియా టాప్ ఆర్డర్..
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 260 పరుగులు చేయగా... రెండో ఇన్నింగ్స్‌లో 285 రన్స్‌ చేసి.. భారత్‌ ముందు 441 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్‌ అయిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే చేతులెత్తేసింది. ఒకీఫ్‌ దాటికి టీమిండియా టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. ఒకీఫ్‌ కీలకమైన మురళీ విజయ్‌, కోహ్లీ, పుజారా, సాహా, రహానే వికెట్లను తీశాడు. మరోవైపు మాథ్యూ లియన్‌ కూడా మెరుగైన బౌలింగ్‌ చేశాడు. దీంతో భారత్‌లో రాహుల్‌, కోహ్లీ, రహానే మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

గుణపాఠం అన్న కోహ్లీ..
వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు 20 టెస్టుల తర్వాత తొలి పరాజయం ఎదురైంది. మరోవైపు విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా స్వదేశంలో తొలిసారి టెస్ట్‌ మ్యాచ్‌ ఓడిపోయింది. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తమపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిందన్నాడు. ఊహించని విధంగా ఫలితం వచ్చిందన్నాడు. బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యామని.. రెండేళ్లలో ఇది తమ వరస్ట్‌ బ్యాటింగ్‌ అన్నాడు. చేసిన తప్పులను సమీక్షించుకోవాల్సిన అవసరముందని.. జట్టుతో పాటు.. వ్యక్తిగతంగా ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటామన్నాడు కోహ్లీ. స్పిన్‌ మాయాజలంతో ఆసీస్‌కు విజయాన్ని అందజేసిన ఒకీఫ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.

07:26 - February 26, 2017

హైదరాబాద్ : వామ‌ప‌క్షవాదులు, ప్రతిప‌క్షాలు ఎన్ని పోరాటాలు చేసినా.. బీసీల‌కు ప్రత్యేక నిధులు కేటాయించ‌డంలో తెలంగాణ స‌ర్కార్ నిర్లక్ష్య ధోరణి వీడటం లేదు. వెనుక బ‌డిన వ‌ర్గాల అభివృద్ధికి ప్రత్యేక స‌బ్‌ప్లాన్ వేసేందుకు స‌ర్కార్ అల‌స‌త్వాన్ని ప్రద‌ర్శిస్తూనే ఉంది. కుల వృత్తుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయిస్తాం అంటూ.. స‌బ్‌ప్లాన్ అమ‌లును అట‌కెక్కిస్తొంది ప్రభుత్వం. స్వరాష్ట్రం సిద్దించినా రాష్ట్రంలోని వెన‌క‌బ‌డిన వ‌ర్గాల స్థితిగ‌తుల్లో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. బీసీల జీవ‌న ప్రమాణాలు ఏమాత్రం పెర‌గ‌డం లేదు. త‌ర‌త‌రాలుగా వారంతా అభివృద్ధికి అమ‌డ‌దూరంలోనే ఉంటున్నారు. తెలంగాణలో అధిక శాతంగా ఉన్న బీసీ వ‌ర్గాల అభివృద్ధి కోసం బ‌డ్జెట్‌లో ప్రత్యేక ఉప ప్రణాళిక ఉండాల‌ని మేధావులు కోరుతున్నారు. బీసీలకు సబ్‌ప్లాన్‌ ప్రకటించాలని వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. అయితే... ప్రభుత్వం మాత్రం తక్షణం బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించేందుకు ఆసక్తి చూపడం లేదు. కుల వృత్తులకు ప్రత్యేక నిధుల పేరిట సబ్‌ప్లాన్ నినాదాన్ని అట‌కెక్కించే ప‌నిచేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కుల వృత్తులు, వాటి ప్రాధాన్యతను బట్టి నిధుల కేటాయింపు..
ప్రభుత్వం వాదన మరోలా ఉంది. కుల వృత్తులకు పునర్‌వైభవం తీసుకొచ్చేందుకు 2017-18 బడ్జెట్‌లో 3వేల 637 కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించారు ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఈ నిధులను కుల వృత్తుల వారీగా, వాటి ప్రాధాన్యతను, ప్రస్తుత పరిస్థితిని, దానిపై ఆధారపడిన జనాభాను బట్టి కేటాయిస్తారు. తర్వాత దశల వారీగా కులవృత్తుల అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. ప్రతి కులానికి ప్రత్యేకంగా ప్రణాళికలను కూడా తయారు చేస్తున్నారు. రజకులు, నాయి బ్రహ్మణులు, చేనేత, కుమ్మరి వృత్తుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించేట్లు చేస్తారు. ప్రతి కుల వృత్తికి అందుబాటులో ఉన్న సాంకేతికతను జత చేస్తారు. ఇక కుల వృత్తులపై ఆధారపడిన వారు తయారుచేసే వస్తువుల మార్కెటింగ్‌కు సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఇదంతా బాగా ఉన్నా.. బీసీ స‌బ్‌ప్లాన్‌ను అట‌కెక్కించేందుకే స‌ర్కార్.. కుల‌ వృత్తుల‌కు ప్రత్యేక నిధుల కార్యక్రమాన్ని తెరమీదకు తెస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. వెన‌కబ‌డిన వ‌ర్గాల అభ్యున్నతికి ఉప‌ ప్రణాలిక ప్రక‌టించ‌డ‌మే స‌రైన మార్గమ‌ని వామపక్షాలు స్పష్టం చేస్తున్నాయి.

07:23 - February 26, 2017

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్వచ్ఛ ఆటోల నిర్వహణ వ్యవస్థ పడకేసింది. విధుల్లో ఉండాల్సిన ఆటోలు... ఇతర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాల్సిన ఆటోవాలాలు... విధులకు సక్రమంగా హాజరుకావడం లేదు. ప్రతిరోజూ విధుల్లో ఉండాల్సిన 2 వేల ఆటోల్లో... కేవలం 15 వందల ఆటోలు మాత్రమే విధుల్లో కనిపిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బల్దియా స్వచ్ఛ ఆటో సిద్దిపేటలో దర్శనమివ్వడంతో మంత్రి కేటీఆర్‌ అధికారులపై ఫైర్‌ అయ్యారు.

విధులకు సక్రమంగా హాజరుకాని స్వచ్ఛ ఆటోడ్రైవర్లు..
గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తాం... తడి, పొడి చెత్తను వేరుచేయాలంటూ ప్రకటించింది జీహెచ్‌ఎంసీ. ఇంటింటికి రెండు చెత్త బుట్టలను కూడా పంపిణి చేసింది. తడి, పొడి చెత్తను వేరుగా తరలించడానికి 2 వేల ఆటోలను ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటి నుంచి చెత్త తీసుకెళ్లాల్సిన ఆటోలు... పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. వివిధ కారణాలతో వీరి హాజరు శాతం తక్కువగా ఉంటోంది. ప్రతి రోజూ 2 వేల ఆటోలు విధుల్లో ఉండాలి. కానీ, ప్రతిరోజూ 1500 ఆటోలు కూడా విధుల్లోకి రావడం లేదు. కొంతమంది ఇష్టం వచ్చినట్లు విధులకు డుమ్మా కొడుతున్నారు.

ఆటోను సిజ్ చేసి..సర్కిల్ కార్యాలయానికి తరలింపు..
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 2000 ఆటోలకు ప్రతి నెలా 2 కోట్లకుపైగా ఈఎంఐ చెల్లిస్తోంది బల్దియా. అయితే... విధులకు సక్రమంగా హాజరు కాని ఆటోవాలాలు... సిటి బయట ఆటోలతో దర్శనమిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. సిద్ధిపేటలో ఒక స్వచ్ఛ ఆటోను గమనించిన మంత్రి కేటీఆర్‌ దానిపై ఆరా తీశారు. స్వయంగా ఆటో నెంబర్ సేకరించి బల్దియా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు కాప్రా సర్కిల్‌కు చెందిన కోటా వెంకటేష్‌ ఆటోగా గుర్తించారు. కిసరగుట్ట వద్ద డ్యూటి వేస్తే... హాజరుకాని వెంకటేష్‌... సిద్ధిపేటకు వెళ్లడంతో ఆటోను సిజ్ చేసి సర్కిల్ కార్యాలయానికి తరలించారు అధికారులు. శానిటేషన్ రక్షణకోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్న బల్దియా.... వాటి సద్వినియోగంపై ఇప్పటికైనా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

07:20 - February 26, 2017

హైదరాబాద్ : ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 స్ర్కీనింగ్‌ పరీక్ష జరగనుంది. పరీక్షకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఏపీతో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోనూ పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 6.57 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష హాజరకానున్నారని ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. హాల్ టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరుకావాలని ఆయన సూచించారు. 14 వందల 62 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొందరు అర్ధరాత్రి పూట తగిన ప్రణాళికతో దరఖాస్తు చేయడం వల్ల పక్కపక్కనే హాల్‌ టిక్కెట్‌ నెంబర్లు వచ్చాయి. దీనివల్ల కాపీయింగ్‌ జరిగే అవకాశం ఉందని, ఒక మార్కు తేడా వచ్చినా నష్టపోతామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే ఐపీ ద్వారా, ఒకే ప్రాంతం నుంచి వచ్చిన దరఖాస్తులు, సమయాన్ని పరిగణలోకి తీసుకుని.. 247 కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఏపీపీఎస్సీ అధ్యక్షులు ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. మరోవైపు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ కావడం లేదని, రెండు రోజుల నుంచి పలువురు ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ అధికారులు ప్రత్యేక మొయిల్‌ చిరునామా ఇచ్చి... 15 వేల వరకూ వినతులను స్వీకరించి... పరిష్కరించారు.

07:15 - February 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ హస్తం నేతలు రూట్‌ మారుస్తున్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటుంది కాంగ్రెస్‌ ముఠానే అని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగుతున్నారు. ముఖ్యమంత్రి తీరు మార్చుకోకపోతే.. తాము కూడా అదే రేంజ్‌లో విరుచుకుపడతామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు అంతంతమాత్రంగానే ఆరోపణలు చేసుకోగా.. తాజాగా అవి శృతి మించుతున్నాయి. ప్రాజెక్టులను అడ్డుకుంటుంది కాంగ్రెస్‌ ముఠానే అని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్న కాంగ్రెస్‌ నేతలు.. సీఎంనే లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు. ఇకపై తమను ఒక్క మాటంటే.. తాము రెండు మాటలు అంటామంటున్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ప్రాజెక్టులను కాంగ్రెస్‌ అడ్డుకుంటుందంటున్న కేసీఆర్‌.. ఆయనే దోపిడీకి పాల్పడుతూ ఆంధ్రావాళ్లకు ప్రాజెక్టులు కట్టబెట్టారన్నారు ఉత్తమ్‌. ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా.. కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ శాసనమండలి సభా పక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు.మరోవైపు ఎమ్మెల్యే డీకే అరుణ కూడా కేసీఆర్‌ను టార్గెట్‌ చేశారు. కాంగ్రెస్‌ తెలంగాణను ఇవ్వకుంటే.. కేసీఆర్‌ సీఎం అయ్యేవారు కాదన్నారు. మొత్తానికి కేసీఆర్‌ మాటలకు బ్రేక్‌ వేయాలంటే అదే తీరుగా ముందుకు సాగుతామంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. మరి ఈ మాటల యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి !

07:12 - February 26, 2017

హైదరాబాద్‌ : మాదన్నపేట మండిలో అగ్ని ప్రమాదం జరిగింది. సమీపంలోని దుకాణాలకు మంటలు వ్యాపించి తగలబడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మాదన్నపేట కూరగాయల మార్కెట్‌లో ప్రమాదం జరగడంతో మంటల్లో షెడ్లు కాలిపోయాయి. నిల్వ ఉంచిన కూరగాయలు కాలి బూడిదయ్యాయి. ఫైర్‌ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మండీ స్థాపించిన నాటి నుండి ఇంత పెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం జరగడం ఇదే తొలి సారి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరగడంతో తాము నష్టపోయామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

07:10 - February 26, 2017

హైదరాబాద్ : జైల్‌లో ఉన్న ఖైదీలను కలుసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్‌ ఉండేది. జైలు దగ్గరికి వచ్చి, లైన్‌లో గంటలకొద్దీ నిలబడి, దరఖాస్తు చేసుకుంటే తప్ప కలుసుకునే వీలుండేది కాదు. కొన్ని సార్లు అయితే దూరం నుండి వచ్చిన వారికి రోజులు పట్టేవి. కానీ ఇప్పుడు అదంతా అవసరంలేదు అంటున్నారు తెలంగాణ జైళ్ల శాఖ అధికారులు. ఇంట్లో కూర్చునే ములాఖత్‌ టైం తీసుకోవచ్చని చెబుతున్నారు. అదేలాగో తెలుసుకోవాలనుందా.. కాలం వేగంగా మారుతోంది. కాలంతోపాటు మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలతోపాటు మానవ అవసరాలు మారుతున్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా ఇంటర్నెట్‌ చుట్టూ తిరుగుతోంది. పనులన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. ఏం కావాలన్నా, ఏం కొనాలన్నా, లేక అమ్మాలన్నా అన్నీ నట్టింట్లో కూర్చొని ఒక్క క్లిక్‌ చేస్తే చాలు. ఎలాంటి కష్టం లేకుండా ఇంటర్‌నెట్‌ ద్వారా జరిగిపోతాయి.

ఆన్‌లైన్‌ విధానం వైపు మళ్లుతున్న ప్రభుత్వ సేవలు..
నిన్న మొన్నటి వరకు ట్రాఫిక్‌ పోలీస్‌లు చలాన్లను పేపర్‌ ద్వారా రాసేవారు. దీంట్లో అనేక అవకతవకలు జరిగేవి. ఇప్పుడు ఇంటర్‌నెట్‌ సిస్టం ద్వారా ఈ-చలాన్‌ వ్యవస్థ నడుస్తోంది. మాన్యువల్‌గా కంటే కూడా కంప్యూటరైజేషన్‌ చేశాకనే ఆదాయం కూడా పెరిగింది. దీంతో ప్రభుత్వ సేవలన్నీ క్రమంగా ఆన్‌లైన్‌ వైపుగా మళ్లుతున్నాయి. ఇప్పుడు ఇదే కోవలోకి జైళ్లశాఖ కూడా వెళ్తోంది. ఇక మీదట చంచల్‌గూడ జైల్‌లోని ఖైదీలను ఆన్‌లైన్‌ ద్వారా ములాఖత్‌ అవ్వొచ్చు. జైల్‌లో ఉన్న ఖైదీలను ఈజీగా కలుసుకునేలా తెలంగాణ జైళ్లశాఖ చర్యలు చేపట్టింది. ఖైదీల బంధులు , స్నేహితులు వారిని కలుసుకునేందుకు ఈ ములాఖత్‌ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ - ములాఖత్‌ కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రారంభించారు. నేషనల్‌ ప్రిజన్‌ ఇన్ఫర్మేషన్‌ పోర్టల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధంగా తెలంగాణ జైళ్లశాఖ ఇలాంటి సదుపాయం ఏర్పాటు చేయడం గర్వించాల్సిన విషయం అని నాయిని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఏజైళ్లలో లేనివిధంగా ఈ- ములాఖత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మొదటగా పోలీస్‌శాఖపైనే దృష్టిపెట్టింది. వారికి ఆధునిక వాహనాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌, షీటీమ్స్‌ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ-ములాఖత్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఇది భవిష్యత్‌లో ఎలాంటి రిజల్ట్స్‌ ఇస్తుందో చూడాలి.

07:07 - February 26, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగడంతో.. ప్రతిపక్ష వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. శ్రీకాకుళం-విజయనగరం విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు గ్రాడ్యుయేట్స్, అలాగే ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు టీచర్స్ ఎమ్మెల్సీ, కడప-అనంతపురం-కర్నూలు టీచర్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్ధానాల‌కు మార్చి 20న పోలింగ్ జ‌రగనుంది. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ నియోజక వర్గాల్లో వైసీపీ సొంతంగా పోటీ చేయకున్నా.. పోటీలో ఉన్న సత్వంత్ర అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కర్నూలు నుంచి గ్రాడ్యుయేట్‌ అభ్యర్థిగా ఏపీ ఎన్జీవో మాజీ నేత వెన్నపూస గోపాల్‌రెడ్డికి మద్దతును ఇవ్వాలని, వైసీపీ అధినేత జగన్‌ నిర్ణయించారు.

రెండు ఎమ్మెల్సీలు..
ఇక స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం ఉన్నచోటే పోటీ చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా కడప జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి వైఎస్‌ వివేకానంద రెడ్డి ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కూడా పోటీ చేయాలని వైసీపీ భావిస్తోంది. ఇక ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఏడు స్థానాలకు ఒక్కో ఎమ్మెల్సీకి 20 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం వైసీపీకి 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో రెండు ఎమ్మెల్సీలు కచ్చితంగా దక్కుతాయని వైసీపీ భావిస్తోంది.

ఎవరికి దక్కేనో..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల టికెట్‌ కోసం వైసీపీ ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీలోని సీనియర్‌ నేతలు, గత ఎన్నికల్లో ఓడిన వారు తమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత జగన్‌ను కోరుతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ సీటు కోసం పట్టు పడుతున్నట్లు సమాచారం. గతంలో కూడా ఎమ్మెల్సీ టికెట్ ఆశించినా బాలినేని టికెట్ దక్కక మిన్నకుండిపోయారు. మరోవైపు ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ నానికి ఎమ్మెల్సీ సీటు దాదాపు ఖరారు అయినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా టీడీపీని వదిలి, వైసీపీలో చేరిన కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నేత గంగుల ప్రభాకరరెడ్డికి కూడా ఎమ్మెల్సీ సీటు ఇచ్చే ఆవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన వంటి వారు కూడా ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. మరి అధినేత ఎవరికి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారో చూడాలి.

సిరియాలో ఆత్మాహుతి దాడి..51 మంది మృతి..

ఢిల్లీ : జంట బాంబు పేలుళ్లతో సిరియా దద్ధరిల్లింది. అల్‌బాబ్‌ నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 51 మంది మృతి చెందారు. ఉగ్రవాదులు రెండు చోట్ల దాడులు జరిపారు.

సోమవారం యూపీలో ఐదో దశ పోలింగ్..

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఐదో విడత ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 11 జిల్లాల్లో 51 శాసనసభ స్థానాలకు ఈ నెల 27న సోమవారం పోలింగ్‌ జరగనుంది. 9 మంది మంత్రులతో పాటు 618 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం కోటి 84 లక్షల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు

నేడు ఏపీ గ్రూప్ 2 స్ర్కీనింగ్ పరీక్ష..

విజయవాడ : నేడు ఏపీ గ్రూప్ 2 స్ర్కీనింగ్ పరీక్ష జరగనుంది. 1462 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 247 కేంద్రాలపై ప్రత్యేక నిఘా చేయనున్నారు. 6.57 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 9.45 గంటల తరువాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి నిరాకరిస్తామని, హాట్ టికెట్ తో పాటు గుర్తింపు కార్డు ఒరిజనల్ తప్పనిసరన్నారు.

టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం..

విజయవాడ : నేడు టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేయనున్నారు.

 

మాదన్నపేట కూరగాయల మార్కెట్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : మాదన్నపేట కూరగాయల మార్కెట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో షెడ్లు, కూరగాయలు అగ్నికి ఆహుతయ్యాయి.

 

నేడు తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష..

హైదరాబాద్ : నేడు తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 264 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Don't Miss