Activities calendar

27 February 2017

సుష్మస్వరాజ్ కు వైఎస్ జగన్ లేఖ

హైదరాబాద్ : సుష్మస్వరాజ్ కు వైఎస్ జగన్ లేఖ రాశారు. మెరికాలో భారతీయులపై వరుస దాడుల నేపథ్యంలో హైలెవల్ కమిటీని అమెరికాకు పంపాలని జగన్ కోరారు. లాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని వినతి చేశారు.

అధికారులతో మంత్రి జూపల్లి వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీసీ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచేలా దిశా నిర్ధేశం చేశారు. మార్చి 31 లోగా రోడ్ల నిర్మాణం పూర్తి కావాలన్నారు. పరిపాలన అనుమతులు ఇచ్చిన రోడ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పారు. 

21:55 - February 27, 2017
21:54 - February 27, 2017

కృష్ణా : ప్రశ్నించే గొంతును అణగదొక్కుతున్నారు. సమస్యను పరిష్కరించమంటే లాఠీలతో సమాధానమిస్తున్నారు. న్యాయం చేయమని అడిగితే.. నిర్దాక్ష్యణ్యంగా అణిచివేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో దళితులపై పోలీసులు రెచ్చిపోయారు. భూస్వాములు ఆక్రమించుకున్న భూములను .. తమకు అప్పగించాలని కోరినందుకు లాఠీలతో చెలరేగిపోయారు. ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలపై ఖాకీలు విరుచుకుపడ్డారు. అనంతరం వారిని అరెస్ట్‌ చేసి.. పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. 
నిరుపేదలపై ఖాకీల కాఠిన్యం
ఉద్యమకారులపై విరిగిన లాఠీలు...నిరుపేదలపై ఖాకీల కాఠిన్యం...దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదిన పోలీసులు...మహిళలని కూడా చూడకుండా.. ఈడ్చుకుంటూ వెళ్లిన ఖాకీలు... కృష్ణాజిల్లా గుడివాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద దళితులు, వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల నేతలపై పోలీసులు ప్రవర్తించిన అత్యుత్సాహమిది. 
ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి పిలుపు
కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్‌ పరిధిలోని నందివాడ మండలం, ఇలవర్రు గ్రామాల్లో భూ స్వాముల అక్రమణలో ఉన్న దళితుల భూములను దళితులకే కేటాయించాలంటూ.. వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. స్థానిక నెహ్రూచౌక్‌ సెంటర్‌ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లారు. తాము శాంతియుతంగానే నిరసన తెలపడానికి వచ్చామని ఉద్యమకారులు స్పష్టం చేసినా.. పోలీసులు వినిపించుకోకుండా.. లాఠీచార్జీ చేయడం మొదలుపెట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. రోడ్డుపైనే బైఠాయించి.. నిరసన తెలిపారు. దీంతో పోలీసులు రెచ్చిపోయి.. దొరికినవారిని దొరికినట్లుగా చితకబాదారు. చితకబాదడమే కాకుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి.. వాహనాల్లో పడేశారు. ఆ తర్వాత ఆందోళనకారులను వన్‌టౌన్‌, పెదపారుపూడి, పామర్రు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. పోలీసుల అత్యుత్సాహం కారణంగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. సీపీఎం కృష్ణాజిల్లా కార్యదర్శి ఆర్‌. రఘును పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఎం నేతలు, సీహెచ్‌ బాబురావు సహా ఇతర నాయకులను అరెస్ట్‌ చేశారు. దీంతో గుడివాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
బడాబాబులకే కొమ్ముకాస్తోన్న ప్రభుత్వం : వామపక్ష నేతలు                 
భూ స్వాములు ఆక్రమించుకున్న భూములు దళితులకే చెందుతాయని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం బడాబాబులకే కొమ్ముకాస్తోందని అంటున్నారు వామపక్ష నేతలు. టీడీపీ నేత, రాజ్యసభ సభ్యురాలైన సీతామహాలక్ష్మి ఆక్రమించుకున్న భూముల్లో ఇలవర్రు దళితులకు చెందిన 27 ఎకరాల భూమి ఉందన్నారు. అంతేకాకుండా నందివాడ మండలంలో ఇలవర్రు, పోలుకొండ, అనమనపూడి, వెన్ననపూడి, కుదరవల్లి, తదితర గ్రామాల్లో ఉన్న సుమారు 5వేల ఎకరాలు భూ స్వాముల చేతిలోనే ఉన్నాయని, వాటిపై కూడా తాము పోరాటం చేస్తామని వామపక్ష నేతలు, దళిత సంఘాల నేతలు స్పష్టం చేశారు. అరెస్ట్‌లతో ఉద్యమాలను ఆపలేరని వ్యవసాయ కార్మిక సంఘాలు నేతలు స్పష్టం చేశారు. 
ఉద్యమాన్ని అణిచివేసేందుకు కుట్ర 
సామాజిక సమస్యలపై వామపక్ష నేతలు పోరాడుతుంటే.. దానిని శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించిన రాష్ర్ట ప్రభుత్వం.. పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేసేందుకు కుట్ర చేసిందని విరుచుకుపడ్డారు. దళితుల కోసం తాము ఎన్ని లాఠీఛార్జీలైనా భరిస్తామని, అక్రమ అరెస్ట్‌లకు భయపడే ప్రసక్తే లేదని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. 

 

21:48 - February 27, 2017

హైదరాబాద్ : తెలంగాణలో అంగన్‌వాడీలపై వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్‌. అంగన్‌వాడీ టీచర్ల జీతాన్ని 10 వేల 500కు, హెల్పర్ల జీతాన్ని 6వేలకు పెంచారు. గర్భిణీలు, చిన్నారులకు కూడా శుభవార్త అందించారు. గర్భిణీలకు మూడు విడతలుగా 12వేల రూపాయలు అందిస్తామని ప్రకటించారు.. వచ్చే నెలనుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్నబియ్యం అన్నం వడ్డిస్తామని తెలిపారు. 
అంగన్‌వాడీలకు వేతనాలు పెంపు
అంగన్‌వాడీలకు తీపి కబురు అందించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.. అంగన్‌వాడీ టీచర్ల జీతాన్ని 7 వేల నుంచి 10 వేల 500రూపాయలకు పెంచారు. ఇక మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, అంగన్‌వాడీ హెల్పర్ల జీతం 4వేల 500ల నుంచి 6వేల రూపాయలకు పెంచారు. కేసీఆర్‌ తాజా నిర్ణయంతో 35 వేల 700 కేంద్రాల్లో పనిచేస్తున్న 67వేల 411మంది సిబ్బందికి ప్రయోజనం కలగనుంది.. 
అంగన్‌వాడీలకు సూపర్‌వైజర్లుగా పదోన్నతి
జీతం పెంపుతోపాటు అర్హత ఉన్న అంగన్‌వాడీలకు సూపర్‌వైజర్లుగా పదోన్నతి కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.. అంగన్‌వాడీల్లో టీచర్లు, హెల్పర్లకు బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.. అలాగే ఇళ్లు లేని అంగన్‌వాడీ కార్యకర్తలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. 
మాతాశిశు సంక్షేమానికి ప్రాధాన్యం
తెలంగాణలో మాతాశిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. వచ్చే నెలనుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణీలు, పిల్లల భోజనానికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.. మేలో ఎండలు బాగా ఉంటాయని... ఆ సమయంలో పోషకాహారాన్ని గర్భిణిలు, బాలింతల ఇంటికే పంపుతామని చెప్పారు.. గర్భిణీగా ఉన్నప్పుడు పూటగడవక పేదలు కూలీలకు వెళుతున్నారని... ఇది చాలా బాధ కలిగించే విషయమని సీఎం అన్నారు.. ఈ కూలీ డబ్బునుకూడా ఇచ్చేలా సర్కారు భావిస్తోందని కేసీఆర్‌ అన్నారు.. 
గర్భిణీలకు రూ. 12వేల సాయం 
ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం అయ్యే గర్భిణీలకు మూడు విడతలుగా 12వేల రూపాయల సాయం అందిస్తామని కేసీఆర్‌ వివరించారు.. అమ్మాయిపుడితే ఆడబిడ్డకు ప్రోత్సాహంగా మరో వెయ్యి రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు.. ఏప్రిల్‌ 1నుంచి ఈ కార్యక్రమం అమలు చేస్తామన్నారు. మాతా శిశు సంరక్షణకోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ స్కీంలను విజయవంతం చేసేందుకు సహకరించాలని అంగన్‌వాడీలను కోరారు.

 

21:37 - February 27, 2017

హైదరాబాద్ : కూచిభొట్ల శ్రీనివాస్‌ మృతదేహం హైదరాబాద్ కు చేరుకుంది. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో శ్రీనివాస్ భౌతికకాయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకుంది. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపేందుకు ప్రభుత్వం తరపున మంత్రి మహేందర్‌రెడ్డి వచ్చారు. అమెరికాలో జాత్యహంకార దాడిలో శ్రీనివాస్ మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

21:22 - February 27, 2017

అక్కడ బాబొస్తే జాబొస్తుందన్నారు.. ఇక్కడ లక్షా ఇరవై వేల ఉద్యోగాలన్నారు...నిరుద్యోగులు ఆశగా చూశారు. ప్రభుత్వాలేర్పడి మూడేళ్లు గడుస్తున్నాయి.. కానీ తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులకు ఒరిగిందేమిటీ..? లక్షల ఉద్యోగాలంటూ ప్రభుత్వాలే చెప్పేది కాకిలెక్కలేనా...? నిరుద్యోగుల ఆశలు నెరవేరేదెప్పుడు...? చూద్దాం...ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీలో. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. 

 

హైదరాబాద్ కు చేరుకున్న కూచిబొట్ల శ్రీనివాస్ మృతదేహం

హైదరాబాద్ : కూచిబొట్ల శ్రీనివాస్ మృతదేహం హైదరాబాద్ కు చేరుకుంది. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో శ్రీనివాస్ భౌతికకాయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అమెరికాలో జాతి అహంకార దాడిలో శ్రీనివాస్ మృతి చెందారు.

 

20:59 - February 27, 2017

అమెరికా : ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ గెలవాలని హాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అన్ని సినిమా పరిశ్రమలకు చెందినవారు ఎన్నో కలలు కంటారు. అలాంటిది అవార్డ్ గెలిచినా తనకు అక్కర్లేదంటూ ఓ దర్శకుడు ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌ను బహిష్కరించారు. అందుకు కారణం ఎవరో తెలుసా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. 
ట్రంప్ నియంతృత్వ పోకడల పట్ల వ్యతిరేకత 
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నియంతృత్వ పోకడల పట్ల వ్యతిరేకత ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి కూడా తగిలింది. అవార్డ్ తీసుకోవడానికి ది సేల్స్‌మెన్ దర్శకుడు అస్ఘర్ ఫర్హదీ విముఖత చూపించారు. ముస్లిం దేశాలపై డోనాల్డ్  ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్‌ను నిరసిస్తూ ఆయన ఈ  కార్యక్రమాన్ని బహిష్కరించారు. ట్రంప్ విధానాలతో అగౌరవపడిన ప్రజలకు సంఘీభావంగా తాను ఆస్కార్ ఫంక్షన్‌కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.  
ఉత్తమ విదేశీ చిత్రంగా ది సేల్స్‌మెన్ ...
ఉత్తమ విదేశీ చిత్రంగా ఇరానీ చిత్రం ది సేల్స్‌మెన్ ఎంపికైంది. అయితే అవార్డును తీసుకోవడానికి దర్శకుడు ఫర్హద్ కార్యక్రమానికి వెళ్లలేదు. తన తరపున ఓ సందేశాన్ని పంపారు. ఫర్హాదీ పంపిన సందేశాన్ని ఇరాన్‌లో పుట్టి, అమెరికాలో ఇంజనీర్‌, వ్యోమగామి  అయిన అనౌషే అన్సారీ ఆస్కార్ వేదికపై చదివి వినిపించారు. ఈ యుద్ధాలు ప్రజాస్వామ్యాన్ని, మానవహక్కులను హరిస్తాయని కూడా ఫర్హాదీ అన్నారు. అస్ఘర్ ఫర్హాదీకి విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు  ఆయన 2011 సంవత్సరంలో 'ఎ సెపరేషన్' అనే సినిమాకు కూడా అవార్డు పొందారు. మొత్తమ్మీద ట్రంప్‌ నిర్ణయాల పట్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రవ్యతిరేకత ఎదురవుతోంది. 

 

20:52 - February 27, 2017

నాలుగు వేల నామినేటెడ్ పోస్టుల భర్తీ... అందుకోరి కారు కార్యకర్తలు జల్దీ, ఎమ్మెల్సీ కావోతున్న చంద్రాలు కొడుకు..సూడాలె ఎట్లుంటదో లోకేష్ సారు ఉడుకు, పాలమూరు జిల్లాల నీళ్ల కటకట సురువు....గొంతు తడపకుంటే ఉంటదా సర్కారు పరువు, ఆస్కార్ అవార్డు ఇచ్చుడు కాడ ఆగమాగం...నవ్వించవోయి నవ్వుల పాలైన యాంకర్లు, చంద్రాలు ఇలాకాల దయ్యాల పంచాదీ...బాబు గారి ఊరికి జేరని లేటెస్టు టెక్నాలజీ, మూసీ నదిలో ఈతగొడుతున్న మొసలి పిల్ల... అరెస్టు జేసిన చంద్రాయన గుట్ట పోలీసులు.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:39 - February 27, 2017

విజయవాడ : ఏపీ ప్రభుత్వతీరుపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. టీడీపీలో ఎంతోమంది సీనియర్‌ నేతలున్నా లోకేశ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమేంటని విమర్శించారు. ఎన్నికలకు ముందు టీడీపీ వివిధ కులాలకు 124 హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటివరకూ ఒక్క వాగ్దానమూ నెరవేర్చలేదని రఘువీరా విమర్శించారు. రజకులను ఎస్సీలో చేరుస్తామని చెప్పారని... ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తడంలేదని మండిపడ్డారు.. ఉపాది హామీ పథకాన్ని తెలుగు తమ్ముళ్లు పందికొక్కుల్లా దోచుకొని తింటున్నారని విజయవాడలో మండిపడ్డారు.

 

20:36 - February 27, 2017

గుంటూరు : వైైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ మండిపడ్డారు. స్పీకర్ కోడెలకు అసెంబ్లీ మొదటి రోజే లేఖ రాయడం జగన్ బాధ్యతా రాహిత్యమన్నారు. సీఎం హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని ఆరోపించడం జగన్‌కు తగదని.. ఆయన తీరు చూస్తుంటే.. దొంగే దొంగ అన్నట్టు ఉందని కాల్వ ఎద్దేవా చేశారు.

గుడివాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

కృష్ణా : జిల్లా గుడివాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నందివాడ మండలంలో అన్యాక్రాంతమైన భూములను..ఇప్పించాలని కోరుతూ.. సీపీఎం ఆధ్వర్యంలో దళితులు ఆందోళనకు దిగారు. ఆర్డీవో కార్యాలయం ముట్టడికి యత్నించడంతో... పోలీసులు.. కేవీపీఎస్‌, సీపీఎం కార్యకర్తలపై లాఠీఛార్జి చేసి అరెస్టు చేశారు. స్టేషన్‌లో.. పోలీసులు తమతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని దళితులు ఆరోపించారు. దళితులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఎం నేతలు సీహెచ్‌ బాబూరావుతో పాటు ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 

20:31 - February 27, 2017

కృష్ణా : జిల్లా గుడివాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నందివాడ మండలంలో అన్యాక్రాంతమైన భూములను..ఇప్పించాలని కోరుతూ.. సీపీఎం ఆధ్వర్యంలో దళితులు ఆందోళనకు దిగారు. ఆర్డీవో కార్యాలయం ముట్టడికి యత్నించడంతో... పోలీసులు.. కేవీపీఎస్‌, సీపీఎం కార్యకర్తలపై లాఠీఛార్జి చేసి అరెస్టు చేశారు. స్టేషన్‌లో.. పోలీసులు తమతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని దళితులు ఆరోపించారు. దళితులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఎం నేతలు సీహెచ్‌ బాబూరావుతో పాటు ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 

 

20:29 - February 27, 2017

విజయవాడ : ఏపీ కొత్త సీఎస్‌గా అజయ్‌ కల్లం నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కల్లం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సెలక్టయ్యారు. 1983వ బ్యాచ్‌కు చెందిన అజయ్‌ కల్లం మార్చి చివరికి పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న టక్కర్‌ పదవీ కాలం రేపటితో ముగియనుంది. 

 

20:26 - February 27, 2017

అమెరికాలోని భారతీయుల్లో అభద్రతా భావం నెలకొందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు, అమెరికాలోని హరికాసుల స్కైప్ లో పాల్గొని, మాట్లాడారు. ఎవరికి వారు కాకుండా ఐక్యమత్యంగా పోరాడాలని సూచించారు. వారు మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

కల్వకుర్తి సమీపంలోని కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం

నాగర్ కర్నూలు : కల్వకుర్తి మండలం మార్చాలలోని కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. టనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. 

20:16 - February 27, 2017

వాషింగ్టన్ : అమెరికాలో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ మృతి మరవక ముందే.. మరో భారతీయ మహిళపై జాతివివక్ష ఘటన వెలుగుచూసింది. న్యూయూయార్క్‌లోని మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న మహిళ పట్ల ఇద్దరు నల్లజాతీయులు జాతి వివక్ష చూపారు. అమెరికాకు ఎందుకు వచ్చావంటూ.. తిరిగి మీ దేశానికి వెళ్లండి అంటూ అసభ్యంగా ప్రవర్తించారు. నల్ల జాతీయుల ప్రవర్తనతో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న వారు కూడా అవాక్కయ్యారు. కనీసం పక్కనే ఉన్న వారు కూడా బాధితురాలికి బాసటగా నిలవలేకపోయారు. ఈ ఘటన అమెరికాలో ఉంటున్న భారతీయుల ప్రాణాల భద్రతపై అనేక అనుమానాలను రేకేతిస్తోంది.

 

20:11 - February 27, 2017

విశాఖ : జీవీఎంసీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జీవీఎంసీ ముందున్న గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు.. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ... నగర పరిధిలోని భూముల్ని ఆక్రమించుకుంటున్నారని నేతలు ఆరోపించారు. ఓడిపోతామన్న భయంతోనే సర్కారు ఎన్నికలు జరపడంలేదని విమర్శించారు. ఈ నిరసనలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

20:08 - February 27, 2017

విశాఖ : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న అజా శర్మకు మద్దతివ్వాలని ఉద్యోగసంఘాలు తీర్మానించాయి. విశాఖలోని సీఐటీయూ కార్యాలయంలో స్టీల్‌ప్లాంట్‌, షిప్‌యార్డ్, బీహెచ్ ఈఎల్, హెచ్ సీఎల్ డాక్ యార్డు, పాలిమర్స్, విశాఖ పోర్టు, ఎన్ టిపిఎస్, డ్రిగ్జింగ్‌ కార్పొరేషన్‌, బీఎస్ ఎన్ ఎల్, ఎల్ ఐసీ, పోస్టల్‌, కోరమండల్‌ ఫెర్టిలైజర్, బ్యాంకులు, జీవీఎంసీ సంస్థలకు చెందిన కార్మిక నేతలు అజాశర్మకు తమ పూర్తి మద్దతు తెలిపారు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే ప్రశ్నించే అజాశర్మలాంటి నేతల్ని ఎన్నుకోవాల్సిన అవసరముందని కార్మికవర్గ నేతలు అన్నారు.

 

20:05 - February 27, 2017

నెల్లూరు : జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా ఆనం విజ‌య్‌ కుమార్ రెడ్డిని జ‌గ‌న్ ఓకే చేశారు. ఈ మేర‌కు ఒంగోలులో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రక‌ట‌న చేశారు. దీంతో గ‌త వారం రోజులుగా నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు వైసీపీ తెర‌దించింది. వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలో చేరిన వారంతా మ‌ళ్లీ వైసీపీలోకి రావాల‌ని వైవీ సుబ్బారెడ్డి కోరారు. తెలుగుదేశం పార్టీ మీద రివేంజ్ తీర్చుకునే టైం వచ్చింద‌ని ఆయ‌న అన్నారు. జంప్ జిలానీలు వైసీపీకి ఓటెయ‌్యకుంటే న్యాయప‌ర‌మైన చిక్కులు త‌ప్పవ‌ని హెచ్చరించారు. మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఆశీర్వాదం తోనే తాను బ‌రిలోకి దిగుతున్నాని ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వైసీపీ త‌ర‌పున త‌న‌కు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖ‌రారు చేసిన జ‌గ‌న్‌కు ఆయన కృత‌జ్ఞత‌లు తెలిపారు.

 

20:00 - February 27, 2017

హైదరాబాద్ : నగరాన్ని అందంగా తీర్చిదిద్దే గ్రేటర్ కార్మికుల ఆరోగ్య పరిస్థితిని జీహెచ్ ఎంసీ గాలికొదిలేసింది. కార్మికులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలను కల్పించడంలో బల్దియా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో కార్మికులు అనారోగ్యపాలవుతున్నారు. తెల్లవారుజామునే నిద్రలేచి వీధులన్నీ శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే జీహెచ్‌ఎంసీ కార్మికుల ఆరోగ్యాన్ని పాలకులు చిన్నచూపు చూస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా.. పారిశుద్ధ్య కార్మికులు ధరించాల్సిన కనీస వస్తువులు ఇవ్వడం లేదు. 
పనిముట్లు అందించడంలో అలసత్వం
చెత్త తరలింపునకు కావాల్సిన చీపుర్లు, రేకులు, గంపలు, రిక్షాలు.. దుమ్ము, దూళి, వాసన నుంచి రక్షణ కోసం మాస్క్ లు, అలాగే చెప్పులు, బూట్లు, చేతుల పరిశుభ్రత కోసం సబ్బులు, నూనె, రోడ్డుపై పని చేస్తున్న వారు వాహనదారులకు కనిపించే విధంగా రేడియం జాకెట్లు అందజేయాలి. కానీ అధికారులు ఇవన్ని అందించడంలో అలసత్వం వహిస్తున్నారు. డెటాల్ సబ్బు, ప్యారాశుట్ కొబ్బరినూనె, బాటా కంపెనీ షూలు పంపిణీ చేయాలని 2011-12లో వివిధ కార్మికుల సంఘాలతో బల్దియా ఒప్పందం కుదుర్చుకుంది. రెండేళ్లపాటు కార్మికులకు పంపిణీ చేసి తర్వాత చేతులు దులుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బల్దియా పీఠం టీఆర్‌ఎస్ సొంతం కాగానే ఆగమేఘాల మీద కార్మికుల వస్తువుల పంపిణీపై టెండర్లను పిలిచారు. అయితే గతంలో పంపిణీ చేసిన వస్తువులను కాక వేరే వస్తువులను కార్మికులకు అంజేస్తున్నారు. దీని వెనక పెద్ద కుంభకోణం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. బల్దియాలోని ఉన్నతస్థాయి ఇంజనీరు టెండర్లను తన బంధువులకు కేటాయించారని సమాచారం. 
కార్మికులకు నాసిరకం వస్తువులు పంపిణీ 
ఇదిలా ఉంటే కార్మికులకు పంపిణీ చేస్తున్న వస్తువులన్ని పూర్తిగా నాసిరకం వస్తువులు.. ఊరు పేరు లేని బ్రాండ్‌లను కార్మికులకు అందిస్తూ వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం వస్తువులు పంపిణీ చేస్తున్నారని కార్మికసంఘాలు మండిపడుతున్నాయి. 
అక్రమార్కుల‌పై విచారణ జరపాలి...                                 
త‌మ‌కు అందిన స‌రుకులనే కార్మికుల‌కు పంపిణీ చేశామంటున్నారు మెడిక‌ల్ అధికారులు. అయితే ధ‌ర‌ల నిర్ణయంలోనూ, క్వాలిటీలోనూ త‌మ‌కు సంబంధం లేద‌ని చెబుతున్నారు. క‌నైనా అక్రమార్కుల‌పై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

19:54 - February 27, 2017

వరంగల్ అర్బన్‌ : జిల్లాలో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను... తెలంగాణ అసెంబ్లీ హౌస్ కమిటీ ఇవాళ పరిశీలించింది. ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన భూములు... మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆక్రమించాడనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. పొన్నాలకు చెందిన తిరుమల హెచరీస్ భూములను కమిటీ పరిశీలించింది. రాష్ట్రంలో అన్యాక్రాంతం అయిన అసైన్డ్ భూములను పరిశీలించి.. స్పీకర్‌కు.. నివేదిక సమర్పించనున్నట్లు సభా కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు.

 

19:51 - February 27, 2017

రంగారెడ్డి : జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో స్టూడెంట్స్‌ ఆందోళనకు దిగారు. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో  వందలమంది విద్యార్థులు ధర్నాకు దిగారు. విద్యార్థినుల పట్ల ఫ్యాకల్టీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ ముందు పోలీసులు భారీగా మోహరించారు. 

 

19:47 - February 27, 2017

సూర్యపేట : జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర ఉత్సహంగా సాగుతోంది. ఆత్మకూరు ఎస్‌ మండలంలో పలు గ్రామాలు, తండాల్లో యాత్ర కొనసాగుతోంది. వట్టికంపాడు, లక్ష్మణ్‌నాయక్‌ తండా, నాచారం, ఆత్మకూర్‌ఎక్స్‌రోడ్డు, దుబ్బగూడెం, నిమ్మికల్‌, దబ్బకంద గ్రామాలతోపాటు పాతర్లపాడు ఎక్స్‌రోడ్డు , గుండ్లసింగారం, నూతనక్లు, చిల్పకుంట్ల గ్రామాల్లో యాత్ర కొనసాగుతోంది. ప్రతి గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తూ.. యాత్రలో అడుగులు కలుపుతున్నారు. 

19:45 - February 27, 2017

హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివశంకర్ కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. శివశంకర్ అంత్యక్రియలు రేపు ఉదయం జరగనున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివశంకర్ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 

 

19:41 - February 27, 2017

నిజామాబాద్ : ధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. తన భూ సమస్యను పరిష్కరించడం లేదని తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కమ్మర్‌పల్లి గ్రామానికి చేందిన ఎలేటి గంగాధర్ అనే వ్యక్తి నిజామాబాద్ కలెక్టరేట్ ప్రగతిభవన్ లో కలెక్టర్‌ యోగితారాణా ముందు పురుగుమందు తాగి అత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కమ్మర్ పల్లి ఎస్ఐ, మోర్తాడ్ ఎస్‌ఐ, ఎంఅర్ఒలు తనను వేధిస్తున్నారని గంగాధర్‌ అవేదన వ్యక్తం చేశాడు. కమ్మర్ పల్లి గ్రామంలో ఉన్న తన సొంత భూమిలో చౌట్‌పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం కాలువ పనులు చేపట్టారని... దానికి అధికారులు కూడా వంత పాడుతున్నారని గంగాధర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమిలోంచి పైప్‌ లైన్ నిర్మాణ పనులు చేపడితే.. ఎలా వ్యవసాయం చేసుకోవాలని బాధితులు ఆవేదన చెందుతున్నాడు. 

 

19:35 - February 27, 2017

వాషింగ్టన్ : తాజాగా అమెరికా గడ్డపై ఓ అథ్లెట్‌ సాధించిన ఘనత అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.  హైదరాబాద్‌కు చెందిన మన్మథ్‌ రెబ్బా అల్ట్రామ్యాన్‌ 2017 టైటిల్‌ కైవసం చేసుకుని అమెరికా గడ్డపై తెలుగు కీర్తి ప్రతిష్టల్ని రెట్టింపు చేశారు. అల్ట్రామ్యాన్‌ ఫ్లోరిడా  అనే రేసులో పాల్గొన్న ఆయన అత్యంత కఠినమైన మూడు ఈవెంట్లలో విజయం సాధించి ఫైనల్‌గా అల్ట్రామ్యాన్‌ 2017 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. అల్ట్రామ్యాన్‌ 2017 అనేది మూడు రోజుల ఈవెంట్‌. మొదట 146 కిలోమీటర్లు సైక్లింగ్‌ ఈవింట్‌ పూర్తి చేశాక.. అనంతరం 10 కిలోమీటర్ల స్విమ్మింగ్‌ ఈవెంట్‌ ఉంటుంది. రెండో రోజు డబుల్ మారథాన్‌గా పిలవబడే 84 కిలోమీటర్ల ఈవెంట్‌, 275 కిలోమీటర్ల సైక్లింగ్‌ ఉంటాయి. ఈ ఈవెంట్‌లో 21 దేశాలకు చెందిన 44 మంది అథ్లెట్ల్స్‌ పాల్గొన్నారు. ఇంత కఠినమైన ఈవెంట్‌లో 31 గంటల 43 నిమిషాల్లో 517.4 కిలోమీటర్ల మేర పూర్తి చేసి మన్మథ్‌ విజేతగా నిలిచారు. అంతేకాదు...అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికన్‌ ప్రెసిడెంట్‌ అవార్డు- 2016 ను కైవసం చేసుకున్నారు.  

19:33 - February 27, 2017

కరీంనగర్ : నిర్వాసితుల కష్టాలు ఎక్కడైనా ఒకేరకంగా వుంటున్నాయి. అదిరించో బెదిరించో మాటలతో మభ్య పెట్టో భూములు తీసుకుంటున్న ప్రభుత్వాలు పరిహారం చెల్లించే సమయంలో ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పునరావాస కాలనీలు ఏర్పాటులో తీవ్ర జాప్యం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఇందుకు తిరుగులేని ఉదాహరణ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలు. 
ముంపు బాధితుల ఆవేదన
ఇది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితుల ఆవేదన. ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై పదేళ్లయ్యింది. కానీ నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందని ద్రాక్ష పండు మాదిరిగానే వెక్కిరిస్తోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్ల తొమ్మిది గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. మంచిర్యాల మండలంలోని గుడిపేట, నంనూర్, చందనాపూర్, కొండపల్లి, రాపల్లి, కర్ణమామిడి, పడ్తనపల్లితో పాటు లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, సూరారం పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ఈ తొమ్మిది గ్రామాల్లో 3646 ఇళ్లు మునిగిపోతున్నాయి. ఇంత వరకూ ఏ ఒక్క గ్రామానికీ పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదు. ఒక వైపు ప్రాజెక్టులో నీటి నిల్వను పెంచుతూ మరోవైపు తమకు పరిహారం చెల్లించడం లేదని ఆవేదన చెందుతున్నారు తొమ్మిది గ్రామాల నిర్వాసితులు. 
ప్రాజెక్టులో 148 మీటర్ల వరకు నిల్వ 
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 148 మీటర్ల వరకు నిల్వ చేసే అవకాశం వుంది . ఇటీవల కాలంలో 142 మీటర్ల వరకు నీరు నిల్వ చేశారు. దీంతో నంనూర్, కర్ణమామిడికి చెందిన పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. సుమారు 200 ఎకరాల్లో పంట నీట మునిగి, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రాజెక్టు వల్ల 6034 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం వున్నట్టు అధికారులు  చెబుతున్నారు. 
పునరావాసం కల్పనలో నిర్లక్ష్యం
ముంపు గ్రామాల వారికి పునరావాసం కల్పించే విషయంలో నిర్లక్ష్యమే కనిపిస్తోంది. తొమ్మిది గ్రామాలు ముంపు బారినపడుతుంటే, ప్రస్తుతం నాలుగు గ్రామాలకు మాత్రమే పునరావాసం పనులు ప్రారంభించారు.  నిర్వాసితులకు ముంపు బాధితులకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలంటూ సిపిఎం పోరాడుతోంది. 
సమస్యల వలయంలో గుడిపేట, నంనూర్ 
గుడిపేట, నంనూర్ లకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేసిన్నప్పటికీ, అవి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. తాగు నీరు లేదు. డ్రైనేజీ లేదు. రాపల్లిలో పునరావాస కాలనీ పనులు ఇంకా పూర్తి కాలేదు. రోడ్లు, డ్రైనేజీ పనుల్లో నాణ్యత లోపిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండపల్లి పునరావాస కాలనీ ఏర్పాటు చేసిన్నప్పటికీ, పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించలేదు. పిచ్చిమొక్కలతో కాలనీ నిండిపోతోంది. కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాలకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేయలేదు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలను ఇప్పటికైనా ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. 

 

19:28 - February 27, 2017

నిజామాబాద్ : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ప్రదేశం ఏదైనా నిర్వాసితుల కష్టాలు ఒక్కటే. తీసుకున్న భూములకు నష్ట పరిహారం చెల్లించకపోవడం, పునరావాసం కల్పించకపోవడం, ఒకవేళ పునరావాస కాలనీలు నిర్మించినా సౌకర్యాలు కల్పించకపోవడం లాంటి సమస్యలు వెన్నాడుతున్నాయి. అందుకే ఎక్కడికక్కడ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలంటూ పోరాటం సాగిస్తున్నారు. భూ నిర్వాసితుల సమస్యలను ఎజెండా మీదకు తీసుకురావడంలో సిపిఎం ముందుంటోంది. ఇదే ఇవాళ్టి స్పెషల్‌ స్టోరీ.
నాడు ధనిక రైతులు..నేడు కూలీలు
2013 భూ సేకరణ చట్టం ఆవశ్యకతను సోన్ పేట్ గ్రామం కళ్లకు కడుతోంది. ఎప్పుడో కొన్ని దశాబ్ధాల క్రితం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కోసం సర్వం సమర్పించుకున్న సోన్ పేట్ గ్రామస్తులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. దీంతో నాడు ధనిక రైతులుగా పేరొందిన కుటుంబాలు ఇప్పుడు కూలీలుగా జీవితం వెళ్లదీయాల్సి వస్తోంది
సర్వస్వం త్యాగం చేసిన సోన్ పేట్
ఇదీ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ముంపు బాధితుల ఆవేదన. ఉత్తర తెలంగాణ వర ప్రదాయినిగా పేరొందిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కోసం తమ భూములను త్యాగం చేసినవారికి చివరకు కన్నీళ్లే మిగిలాయి. లక్షలాది ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సోన్ పేట్ గ్రామస్తులు సర్వస్వం త్యాగం చేశారు. 
నామరూపాల్లేకుండా పోయిన సోన్ పేట్ గ్రామం 
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో సోన్ పేట్ గ్రామం నామరూపాల్లేకుండా పోయింది. వందలాది కుటుంబాలు నిలువ నీడ కోల్పోయాయి. ఇళ్లు, పొలాలు ఈ ప్రాజెక్టులో మునిగిపోయాయి. ఆనాడు  పెద్ద రైతులుగా గౌరవ ప్రదం జీవితం గడిపినవారు ఇప్పుడు కూలీలుగా మారిపోయారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మించకముందు సోన్ పేట్ గ్రామం పచ్చగా వుండేది. అప్పట్లోనే ఇక్కడి పొలాలకు కాలువలు వుండేవి. అయితే, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో సోన్ పేట్ ముంపుబారిన పడింది. ఈ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వం తీసుకుంది. కానీ వీరికి నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో 1957లోనే నిర్వాసితులు భారీ ఉద్యమాలు నిర్వహించారు.  జలాశయం నిర్మాణం పూర్తయిన తర్వాత వేరే ప్రాంతంలో భూములు కేటాయిస్తామంటూ అప్పట్లో అధికారులు చెప్పేవారు. అవసరమైతే వేరే ప్రాంతంలో భూములు కొనైనా ఇస్తామన్నారు. కానీ, నిర్వాసితులకు న్యాయం జరగలేదు. ఎక్కడా భూములివ్వలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన నాటి నుంచి నేటి వరకు వారిని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. అప్పట్లో బాగు బతికిన కుటుంబాలవారు ఇప్పుడు కూలీలుగా జీవితాలు వెళ్లదీస్తున్నారు. 
పోరాటాల ఫలితంగా 2013 భూ సేకరణ చట్టం 
సోన్ పేట లాంటి వందలాది గ్రామాలకు ఎదురైన అనుభవాలు, నిర్వాసితుల చేసిన పోరాటాల ఫలితంగా 2013 భూ సేకరణ చట్టానికి ప్రాణం పోసింది. సోన్ పేట లాంటి నిర్విసిత గ్రామాలకు 2013 భూ సేకరణ చట్టమే రక్షణ కల్పిస్తుందని సిపిఎం అంటుంది. 

 

19:17 - February 27, 2017

హైదరాబాద్ : హిళా డాక్టర్ల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నరాల బలహీనత, కీళ్ల నొప్పులతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పీఎస్‌ పరిధిలోని పిర్జాదిగూడ స్పార్క్‌ ఆస్పత్రితో జరిగింది. నగాం జిల్లా పెంబర్తి గ్రామానికి చెందిన సరిత అనే మహిళ కీళ్లు, వెన్నెముకలో నరాల సమస్యలతో ఈనెల 25వ తేదీన పిర్జాదిగూడలోని స్పార్క్‌ ఆస్పత్రిలో చేరింది. అయితే.. సర్జరీ చేసిన డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా వాంతులు చేసుకుని సరిత చనిపోయిందని బాధితులు ఆరోపించారు. ఆస్పత్రికి నడుచుకుంటూ వచ్చిన సరిత సడెన్‌గా ఎలా చనిపోతుందని బాధితులు ప్రశ్నించారు. సరిత మృతితో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. ఆస్పత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సరిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఆస్పత్రి వద్ద పరిస్థితిని శాంతింపజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

19:15 - February 27, 2017

చెన్నై : డీఎంకే పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎంగా పళనిస్వామి ఎన్నిక చెల్లదని కోర్టులో స్టాలిన్‌ పిల్‌ వేశారు. స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

19:10 - February 27, 2017
19:09 - February 27, 2017

హైదరాబాద్ : అంగన్‌వాడీ కార్యకర్తలపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ఆరు వేల జీతాన్ని 10 వేల 500లకు పెంచారు. సహాయకుల జీతాన్ని 6 వేలకు పెంచారు. వచ్చే సంవత్సరం మరింత జీతం పెంచుతామన్నారు. ఇళ్లు లేని అంగన్‌వాడీ కార్యకర్తలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకంలో గృహాలు నిర్మించి ఇస్తామన్నారు. అర్హత ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలను సూపర్‌వైజర్లుగా నియమిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 

 

19:02 - February 27, 2017

హైదరాబాద్ : నీరా ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి..గీత కార్మికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, పలువురు ప్రముఖులు సూచించారు. ఎన్నో ఔషధగుణాలున్న నీరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. 
పొట్టి హైబ్రిడ్‌ మొక్కల రూపకల్పనపై దృష్టి సారించాలి : స్వామి గౌడ్‌
ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేరళలోని సెంట్రల్‌ ప్లాంటేషన్‌ క్రాప్స్‌, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌  ఆధ్వర్యంలో తాటి నీరా, వాటి ఆధారిత ఉత్పత్తులపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తాటిలో పొట్టి హైబ్రిడ్‌ మొక్కల రూపకల్పనపై శాస్త్రవేత్తలు దృష్టి నిలపాలని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌ అన్నారు. అలాగే తాటినీరా శుద్ధిపై దృష్టి పెడితే మంచి లాభాలు పొందవచ్చని అన్నారు.
నీరా ఉత్పత్తుల వల్ల వ్యాధులకు దూరం
నీరా ఉత్పత్తుల వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని... ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా నీరాను మార్కెటింగ్‌ చేయడం సులభమవుతుందని..భువనగిరి పార్లమెంట్  సభ్యులు బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. కల్లు దుకాణాలకు ప్రత్యామ్నాయంగా నీరాహబ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఐదు కోట్ల ఈతమొక్కలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారని... దాని వల్ల రాష్ట్రంలో ఏటా సుమారు 20 వేల కోట్ల మేర వ్యాపారం జరగుతుందని అన్నారు. ఆన్‌లైన్‌లోనూ  నీరా ఉత్పత్తులు విక్రయించే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. గీత కార్మికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
క్యాన్సర్ల నివారణకు నీరా దోహదం
దేశంలో 120 మిలియన్ల  తాటిచెట్లు ఉన్నాయని, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లలో అధికంగా ఉన్నాయని సెంట్రల్‌ ప్లాంటేషన్‌ క్రాప్స్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌  డైరెక్టర్‌ డాక్టర్‌  చౌడప్ప అన్నారు. క్యాన్సర్ల నివారణకు నీరా దోహదం చేస్తుందన్నారు. తాటినీరా ద్వారా ఆరోగ్యకరమైన పానియాన్ని తయారుచేయడమే కాకుండా బెల్లం, చక్కెర, చాక్లెట్‌లను తయారుచేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్‌ శాసన సభ్యుడు ప్రకాష్‌ గౌడ్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రవీణ్‌రావు,  హార్టీకల్చర్‌ యూనివర్సిటీ డీన్‌ డాక్టర్‌ విజయ.. గీత కార్మికులు పాల్గొన్నారు.

18:58 - February 27, 2017

వాషింగ్టన్ : ట్రంప్ పుణ్యమా అంటూ అమెరికాలో భారతీయుల పరిస్థితి దయనీయంగా మారింది. భారతీయులు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కొలరాడాలో పోస్టర్లు వెలిశాయి. ఓ భారతీయుడి ఇంటిపై పోస్టర్‌ అతికించడమే కాదు...కోడిగుడ్లు విసరడం, కుక్కల అశుద్ధం పూస్తూ తమ అక్కసును వెళ్లగక్కారు.
పెరిగిపోయిన జాతి విద్వేష దాడులు 
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత జాతి విద్వేష దాడులు పెరిగిపోయాయాయి. కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాల్చి చంపి, అలోక్‌రెడ్డిని తీవ్రంగా గాయపరిచిన ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే... జాతి విద్వేషాన్ని వెళ్లగక్కిన మరో ఘటన కొలరాడోలో వెలుగు చూసింది.  తాజాగా అమెరికాను వదిలిపోవాలని హెచ్చరిస్తూ పోస్టర్లు వెలిశాయి.
భారతీయుడి ఇంటిపై దాడి 
దక్షిణ కొలరాడాలోని పీటన్ నగరంలోని ఓ భారతీయుడి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటికి పేపర్ పోస్టర్లు అతికించడంతో పాటు, గోడల మీద కోడిగుడ్లు విసిరికొట్టారు...  గోడలకు కుక్కల అశుద్ధం పూయడం లాంటి దారుణాలకు పాల్పడ్డారు. 
ఇండియన్లు వెళ్లిపోవాలని పోస్టర్లు...
తలుపు మీద, కిటికీల మీద, కారు అద్దాల మీద కూడా పోస్టర్లు అతికించారు. ఇండియన్లు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అర్థం వచ్చేలా సందేశాలు పోస్టర్లలో రాశారు. దాడికి గురైన భారతీయుడు మాత్రం తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడలేదు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే అలా ఉన్నారు తప్ప అమెరికన్లంతా అలాంటివాళ్లు కారని చెప్పారు. తన ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఇంటి గోడలను శుభ్రం చేసి సహకరించారని తెలిపారు. మళ్లీ దాడి చేస్తారేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు..
దాడిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు 
దక్షిణ కొలరాడోలో జరిగిన ఈ దాడిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. ఒకరిద్దరు దాడి చేయలేదని, పెద్ద గుంపే వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

18:54 - February 27, 2017

హైదరాబాద్ : ఏపీ నూతన అసెంబ్లీలోకి పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలను రాకుండా అడ్డుకోవాలని.. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. ప్రజాప్రతినిధుల కొనుగోలులో అడ్డంగా ఆడియో, వీడియో సాక్ష్యాలతో దొరికిన చంద్రబాబు.. హైదరాబాద్‌ అసెంబ్లీని హుటాహుటిన అమరావతికి తరలించారన్నారు. ఆ తర్వాత ..తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోబపెట్టి టీడీపీలో కలుపుకోవడం దొంగసొత్తుతో సమానమన్నారు. వాళ్లను అనర్హులుగా ప్రకటించాలని జగన్‌ లేఖలో డిమాండ్‌ చేశారు. చర్యలు తీసుకోకపోతే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. 

 

18:40 - February 27, 2017

వాషింగ్టన్ : అమెరికా..నిన్నా మొన్నటి వరకు ప్రపంచదేశాలకు పెద్దన్న. ఏరంగంలో చూసినా..అమెరికా ప్రపంచదేశాలకు మార్గదర్శిగా..పెద్దన్నగా వ్యవహరిస్తూ వచ్చింది. కానీ అదే అమెరికా ఇప్పుడు ప్రపంచదేశాలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎప్పుడూ లేనంత జాత్యాహంకారం ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో పెచ్చరిల్లుతోంది. దీంతో ఏ క్షణంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంతో వణికిపోతున్నారు ఎన్నారైలు. ఏ సందులోంచి ఏ బుల్లెట్‌ దూసుకొస్తుందో తెలియక భారతీయ ఎన్నారైలు బిక్కు బిక్కు మంటూ భయంతో బ్రతుకుతున్నారు.  
భయం భయం..
క్షణ క్షణం...భయం భయం..  క్షణంలో ఏం జరుగుతోందో తెలియదు..ఏ సందులోంచి ఏ బుల్లెట్‌ దూసుకొస్తుందో తెలియదు. క్కడ ఏ మాట మాట్లాడితే..ఏం జరుగుతుందో అంతకంటే తెలియదు. వే భయాలు ఇప్పుడు అమెరికాలో ఉంటున్న ప్రవాసీలను వేధిస్తున్నాయి. ఉద్యోగాలకే కాదు..ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది ఇప్పుడు. 
ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది.. 
లక్షల్లో జీతాలు,..విలాసాల జీవితాలు..చదువుకైనా, ఉద్యోగానికైనా ఎవరైనా కలలుగనే అవకాశాల ఆవలిగడ్డ అమెరికా. కానీ ఇదంతా గతం. నిన్నా మొన్నటి వరకు అమెరికాలో ఏ చీకూ చింతా లేకుండా జీవితాలు గడిపిన ప్రవాసులు ఇటీవలకాలంలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలతో ఉద్యోగ భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారగా..మొన్న వంశీచందర్‌రెడ్డి, నిన్న కూచిబొట్ల శ్రీనివాస్‌ మరణాలతో ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయిందని ప్రవాస భారతీయులు వాపోతున్నారు. 
అమెరికాలో పెరిగిపోతున్న జాత్యాహంకారం 
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఆ దేశంలో జాత్యహంకారం రోజు రోజుకు పెచ్చరిల్లుతోంది. కూచిబొట్ల శ్రీనివాస్‌ హత్య తర్వాత..అమెరికాలోని ప్రవాస భారతీయులు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఒకవేళ వచ్చినా మాతృభాషలో మాట్లాడలేపోతున్నారు. మాతృభాషలో మాట్లాడితే ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక భయంతో వణికిపోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కలుసుకున్నప్పుడు హిందీలోగానీ, ఏదైనా ఇతర భారతీయ భాషలో మాట్లాడుకోవద్దు,.దానివల్ల తీవ్ర ఇబ్బందులు రావచ్చు. కాన్సస్‌ కాల్పుల ఘటన నేపథ్యంలో అమెరికాలోని భారతీయులు ఒకరికొకరు సోషల్‌ మీడియా ద్వారా పంపుకొంటున్న సందేశం ఇది. ఈ మెసేజ్‌ వారిలోని ఆందోళనకు అద్దంపడుతోంది. ఇదొక్కటే కాదు..భారతీయులు సురక్షితంగా ఉండాలంటే..మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి విక్రమ్‌ జంగమ్‌ సూచిస్తున్నారు. 
స్థానికులతో వాదనకు దిగొద్దు 
తెల్లవారైనా, ఆఫ్రికన్‌ అమెరికన్లయినా స్థానికులతో వాదనకు దిగొద్దన్నది విక్రమ్‌ జంగమ్‌ సూచన. ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా.. ఎదురు మాట్లాడకుండా అక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోయే ప్రయత్నం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో ఇంగ్లీష్‌లో మాట్లాడితే మంచిదని అంటున్నారు. పక్కన అమెరికన్స్‌ ఉండగా.. మాతృభాషలో మాట్లాడుకుంటే వారు అవమానంగా ఫీలవుతారని, నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడంగానీ..అక్కడ ఒంటరిగా ఉండటంకానీ చేయవద్దని విక్రమ్‌ సూచిస్తున్నారు. పరిస్థితి అనుమానాస్పదంగా అనిపిస్తే...అప్రమత్తమై..వీలైతే త్వరగా అక్కడి నుండి దూరంగా వెళ్లిపోయే ప్రయత్నం చేయాలని విక్రమ్‌ జంగమ్‌ సూచిస్తున్నారు. 
విదేశీయులపై మరింత ద్వేషం పెంచుకున్న అమెరికన్లు 
అమెరికాలో గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. తెలుగు రాష్ట్రాల ప్రజలు 12 లక్షల మంది ఇక్కడున్నారు. అయితే ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్లో కొట్టొచ్చినట్లు మార్పులు కన్పిస్తున్నాయి. విదేశీయులను వెనక్కి పంపుతామంటూ ట్రంప్‌ చేస్తున్న ప్రచారం వల్ల అమెరికన్లలో నేర స్వభావం ఉన్నవాళ్లు విదేశీయులపై మరింత ద్వేష భావంతో రగిలిపోతున్నారు. ఇదంతా ట్రంప్‌ రెచ్చగొట్టడం వల్లే జరుగుతోందన్నది పరిశీలకుల అంచనా. తెలుగువాళ్లు రాత్రిపూట ఎక్కడికైనా వెళ్లినా..రెస్టారెంట్లలో భోజనం చేసేటప్పుడు అమెరికన్లు రెచ్చగొడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో రెచ్చిపోకుండా సానుకూలంగా ఉండేలా ప్రవాస భారతీయులు జాగ్రత్తలు తీసుకోవాలని తానా సభ్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే విద్య ఉపాధి, ఉద్యోగాల కోసం అమెరికా వచ్చేవారు కాస్తా ఆలోచించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో నిబంధనలు మరింత కఠనతరమయ్యే సూచనలున్నాయి. 3 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారనే ట్రంపే స్వయంగా ప్రకటించారు. స్థానిక చట్టాల ప్రకారం..వారికి ఇబ్బందులు తప్పవు. మరోవైపు వలస విధానంపై ఉక్కుపాదం మోపేందుకు ట్రంప్‌ నిర్ణయించడంతో గ్రీన్‌కార్డు హోదా , వీసాల జారీపైనా ప్రభావం పడనుంది. 
శ్రీనివాస్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు  
ఇదిలా ఉంటే కాన్సస్‌ కాల్పుల్లో మృతిచెందిన శ్రీనివాస్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు తానా టీమ్‌ స్క్వేర్‌ అధ్యక్షుడు నన్నపనేని మోహన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూయార్క్‌ నుంచి భారతకాల మానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1.30కు శ్రీనివాస్ మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో తీసుకురానున్నారు. సోమవారం రాత్రికి మృతదేహం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకునే అవకాశాలున్నాయని తెలిపారు. 

తెలుగు గంగ ప్రాజెక్టు కార్యాలయంపై ఏసీబీ దాడి

కడప : తెలుగు గంగ ప్రాజెక్టు కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ూ.20 వేలు లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ దుర్గాబాబు, జూనియర్ అసిస్టెంట్ అనిల్ పట్టుబడ్డారు. 

 

ఏపీ సీఎస్ గా అజయ్ కల్లం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా అజయ్ కల్లం నియమితులయ్యారు. కాసేపట్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రేపు ఏపీ సీఎస్ టక్కర్ పదవీ విరమణ చేయనున్నారు. 

 

రాష్ట్రపతిని కలిసిన గవర్నర్ నరసింహన్

ఢిల్లీ : ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఇరు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను ఆయన రాష్ట్రపతికి వివరించారు. 

17:53 - February 27, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీలు హాట్‌ టాపిక్‌గా మారాయి. నిజాయితీగా పనిచేసే సిన్సియర్‌ అధికారుల విషయంలో గత ప్రభుత్వాలకు... ప్రస్తుత టీఆర్ ఎస్ సర్కారుకు ఎలాంటి తేడాలేదంటూ విమర్శలొస్తున్నాయి. ఏసీబీ ఇంచార్జ్ చారుసిన్హా బదిలీ ఈ విషయాన్ని రుజువుచేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. 
ఏసీబీ అంటే అవినీతిపరుల గుండెళ్లో రైళ్లు
ఏసీబీ ఈ పేరు చెబితే చాలు.. అవినీతిపరుల గుండెళ్లో రైళ్లు పరుగెడతాయి.. అంతటి పవర్‌ఉన్న సంస్థ.. అధికారుల అవినీతిని కంట్రోల్ చేయలేని శాఖగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమూ మిగతా సర్కారుల్లాగే ఏసీబీనీ వాడుకుంటోందన్న వాదన వినిపిస్తోంది. సిన్సియర్‌గా పనిచేస్తున్న అధికారుల ట్రాన్స్‌ఫర్లు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఏసీబీని స్వార్థరాజకీయాలకు వాడుకుంటున్న ప్రభుత్వాలు
ఏసీబీ స్వయం ప్రతిపత్తిగల సంస్థ... సీఎం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది..... అలాంటి ఏసీబీని ప్రభుత్వాలు, తమ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకోవడం సర్వసాధారణమైపోయిందన్న వాదన వినిపిస్తోంది. తమకు వ్యతిరేకంగా పనిచేసేవారిని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు చాలా ప్రభుత్వాలు ఏసీబీని వాడుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి.. గతంలో సంచలనం సృష్టించిన లిక్కర్‌ సిండికేట్‌ వ్యవహారం ఇందుకు ఒక ఉదాహరణఅన్న అభిప్రాయాలూ ఉన్నాయి.. అప్పట్లో లిక్కర్‌ దందాపై ఏసీబీ జరిపిన దాడులవల్లే...  బొత్స సత్యనారాయణ... సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డితో రాజీకి వచ్చారన్న ప్రచారం జరిగింది.... ఈ కేసులో హడావుడిచేసిన అధికారులు.. ఇందులో పదిమంది ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు, విలేఖరులు, పోలీసుల పాత్ర ఉందని తేల్చారు.. కేసు నమోదుచేసి అరెస్టులూ చేశారు. ఈ చర్యతో, కొరకరాని కొయ్యలు తమ దారికి రావాలన్న అభీష్టం నెరవేరాక, ప్రభుత్వాధినేతలు, అధికారులను బదిలీచేసి కేసును నీరుగార్చారు..   
ఏసీబీ ద్వారా టీడీపీపై టీఆర్‌ఎస్‌ మొదటిదెబ్బ 
కాంగ్రెస్‌ హయాంలోనే కాదు.. కేసీఆర్‌ జమానాలోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదంటున్నారు. కేసీఆర్‌ వచ్చాక ఏపీ సీఎం చంద్రబాబు, రేవంతరెడ్డిలపై ఓటుకు నోటు తెరపైకివచ్చింది.. కేసును వేగంగా దర్యాప్తుచేసిన ఏసీబీ.. ఆడియో రికార్డులు, వీడియో ఫుటేజీ ఆధారంగా పలువురిని అరెస్ట్ చేసింది.. ఈ కేసువల్లే చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలి ఏపీ వెళ్లిపోయారని ఇప్పటికీ కొందరు నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యమున్న కేసు ఆ తర్వాత పెద్దగా ముందుకుసాగలేదు.. అసలు నిందితులను పట్టించే సాక్ష్యాల్ని ఏసీబీ సేకరించలేదు.. ఇలా ఏసీబీ ద్వారా టీఆర్‌ఎస్‌ టీడీపీపై తన మొదటిదెబ్బ వేసిందన్నది పరిశీలకుల వాదన. 
ఏకే ఖాన్‌ హయాంలో అధికారుల్ల ఉత్సాహం 
ఏసీబీ డీజీగా పనిచేసిన ఏకే ఖాన్‌ హయాంలో కొంతవరకూ అధికారులు ఉత్సాహంగా పనిచేశారు.. గత ఏడాది డిసెంబర్‌లో ఏకే ఖాన్‌ పదవీవిరమణ పొందారు.. ఆ స్థానంలో ఇంచార్జిగా ఐజీ చారుసిన్హ నియమితులయ్యారు.. సాధారణంగా ఏసీబీ డైరెక్టర్‌గా డీజీ స్థాయి అధికారి ఉండాలి.. అధికారులు అందుబాటులోలేక ఆ స్థానంలో ఇంచార్జ్‌గా చారుసిన్హకు అవకాశం ఇచ్చారు.. ఐజీ చారుసిన్హా ఎవరి మాట వినరు.. అన్యాయం అక్రమం జరుగుతుందని తెలిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించే తత్వం కాదని డిపార్ట్‌మెంట్‌లో చెప్పుకుంటారు.. ఏసీబీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాక చారుసిన్హ... అవినీతి ప్రక్షాళనపై సీరియస్‌గా దృష్టిపెట్టారు.. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, కమర్షియల్‌ టాక్స్‌, రెవెన్యూ శాఖల్లో దాడులు పెంచారు.. ఈ దాడుల్లో నల్లగొండ జిల్లాలో కమర్షియల్‌ టాక్స్‌ అధికారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.. 
రాజకీయ నేతల దగ్గరకు అధికారులు...?
కమర్షియల్‌ టాక్స్‌ అధికారి ఏసీబీ దొరికిపోవడంతో జిల్లాలోని పలువురు అధికారులు రాజకీయ నేతల దగ్గరకు వెళ్లారని సమాచారం.. ఉద్యమంలో పనిచేసిన తమను ఏసీబీ వేధిస్తోందంటూ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.. ఇదే సమయంలో కొందరు అధికారుల్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక పంపింది.. ఏసీబీ దాడులు ఇలాగే కొనసాగితే అధికారులకు ఇబ్బందితప్పదంటూ.. చారుసిన్హను ప్రభుత్వం అకస్మికంగా బదిలీ చేసిందని తెలుస్తోంది.. 
ఏసిబిలో పనిచేయాలంటే ప్రభుత్వం చెప్పిందే చేయాలి..
మొత్తానికి ఏసిబిలో పనిచేయాలంటే ప్రభుత్వం చెప్పిందే చేయాలి.. సమాజంలో మార్పు... అవినీతి అంతంకోసం పనిచేస్తే బదిలీలు తప్పవని ప్రభుత్వాల చర్యలు స్పష్టం చేస్తున్నాయి.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందో... ఇప్పుడూ అలాగే కొనసాగుతోందని ఈ ట్రాన్స్‌ఫర్లు రుజువుచేస్తున్నాయన్నది పరిశీలకుల మాట. అవినీతి అంతంఅంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఊదరగొట్టే ఉపన్యాసాలు మాటలకే పరిమితమన్నది స్పష్టమవుతోందన్నది జనం మాట. మొత్తానికి అవినీతి నిరోధక శాఖ కాస్త.. అధికార పక్షం నియంత్రణ శాఖగా మారిందన్న వాదనలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఈ శాఖ చిత్తశుద్ధిని శంకించేలా చేస్తున్నాయి. 

 

17:45 - February 27, 2017

విజయవాడ : ఏపీలో వైసీపీ పుంజుకుంటుందా..? అధికార టీడీపీ.. ఎదురు దాడులు తట్టుకోలేక వెనకబడుతుందా..? వచ్చే 2019 ఎన్నికల సమయానికి వైసీపీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతోంది..? 2014 ఎన్నికల్లో ఎదురైన అనుభవాల నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ బయటపడ్డారా..? టీడీపీ, వైసీపీల మధ్య తాజా రాజకీయ వాతావరణం చూస్తే వీటన్నింటికి బలం చేకూరుతోంది. 
పుంజుకుంటున్న వైసీపీ  
2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ పుంజుకుంటున్న దాఖలాలు కన్పిస్తున్నాయి. టీడీపీ, వైసీపీల మధ్య ఇప్పుడున్న హోరాహోరీ పోరాట పరిస్థితులే వచ్చే ఎన్నికల్లోనూ ఉండేలా కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అడుగు పెట్టే పరిస్థితి లేదు. అలాగే కాంగ్రెస్‌ రాష్ట్ర విభజన తర్వాత నామరూపాల్లేకుండా పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారం కోసం తలపడేది వైసీపీ, టీడీపీలేనన్న వాదనతో తన పరిధిని పెంచుకుంటోంది. 
వైసీపీని బలహీన పరిచేందుకు చంద్రబాబు వ్యూహాలు    
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీని బలహీన పరిచేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలను అమలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తనవైపు తిప్పుకుని వైసీపీ బలహీన పడిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అటు కేంద్రంతో మైత్రి బంధాన్ని కొనసాగిస్తూ... రాబోయే ఎన్నికల నాటికి జగన్‌ను ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న వాదనా లేకపోలేదు.  
వైసీపీ పట్ల ప్రజల్లో సానుకూలత     
గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ మృతి పట్ల సానుభూతి ఉన్నప్పటికీ.. అది పూర్తి స్థాయిలో వైసీపీకి మెజారిటీని కట్టబెట్టలేకపోయింది. తాజాగా వైఎస్‌ జగన్‌ విశాఖలో విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక హోదా కార్యక్రమానికి మద్దతు తెలపడం, పోలీసులు అడ్డు తగలడం, ఎయిర్‌పోర్టు నుంచి జగన్‌ను పోలీసులు హైదరాబాద్‌కు పంపడం ఆ పార్టీకి ప్రజల్లో కొంత సానుభూతిని తెచ్చిపెట్టిందనే చెప్పాలి. అదే విధంగా అంతర్జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించడం, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచే ఆమెను బలవంతంగా తరలించడం కూడా వైసీపీకి కొంత మేలు చేసిందని చెప్పవచ్చు. గుంటూరులో జగన్‌ నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో విద్యార్థులను వేధించడం కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను.. అదే సమయంలో వైసీపీ పట్ల సానుకూలతను పెంచింది.
టీడీపీ, వైసీపీలకు 2019 ఎన్నికలు ప్రతిష్టాత్మకం 
2019 ఎన్నికలు అటు టీడీపీ.. ఇటు వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీని అంతర్మథనంలో పడేసేందుకు ఎదురు దాడికి దిగుతూనే ఉంది. అదే కోవలో ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే అమరావతి రాజధానిపై కూడా ప్రశ్నల్ని సంధించనుంది. రుణమాఫీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు భూ సమీకరణ వంటి అంశాలపై వైసీపీ టీడీపీని ప్రశ్నించేందుకు సన్నద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ప్రజలకు చేరువ చేసి.. ప్రజా సమస్యలపై విస్తృత పోరాటాలు చేస్తేనే పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా వైసీపీ కార్యాచరణ రూపొందించే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

17:39 - February 27, 2017

న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రాంజస్‌ కళాశాలలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం జరిగిన  హింసాత్మక ఘటనలకు నిరసనగా ఏబివిపి జాతీయా జెండాతో ప్రదర్శన జరిపింది. ఎఐఎస్‌ఏ విద్యార్థుల ఆజాదీ నినాదాలకు వ్యతిరేకంగా... వందే మాతరం నినాదాలు చేస్తూ క్యాంపస్‌లో ఏబివిపి మార్చ్‌ నిర్వహించింది. కళాశాలలో ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు. రాంజస్ కళాశాలలో నెలకొన్న పరిస్థితులపై స్పందించిన కాంగ్రెస్‌- హింస పరిష్కారం కాదని కేంద్రాన్ని హెచ్చరించింది. రాంజస్‌ కాలేజీలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష జరుపుతున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. గతవారం ఓ సెమినార్‌లో పాల్గొనడానికి రాంజస్‌ కళాశాలకు వచ్చిన జెఎన్‌యు విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ను ప్రసంగించకుండా ఎబివిపి అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఎబివిపి, ఎఐఎస్‌ఏ ల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.

 

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పిన్షనర్స్ అసోసియేషన్ వార్షికోత్సం

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ పిన్షనర్స్ అసోసియేషన్ 40 వార్షికోత్సంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. 

 

అంగన్ వాడీల వేతనాలు పెంపు

హైదరాబాద్ : అంగన్ వాడీ కార్యకర్తలకు సీఎం కేసీఆర్ జల్లు కురిపంచారు. అంగన్ వాడీ హెల్పర్ల వేతనం 4500 నుంచి 6 వేలకు పెంచారు. అంగన్ వాడీ కార్యకర్తల వేతనం రూ.10,500లకు పెంచారు. వచ్చే ఏడాది మరింత వేతనాలు పెంచుతామని చెప్పారు. సొంత గ్రామాల్లో ఇళ్లు లేని అంగన్ వాడీలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అర్హతలు ఉన్నవారికి సూపర్ వైజర్లుగా పదోన్నతి కల్పిస్తామన్నారు. 

 

అంగన్ వాడీ కార్యకర్తలతో కేసీఆర్ ముఖాముఖి

హైదరాబాద్ : అంగన్ వాడీ కార్యకర్తలతో కేసీఆర్ ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. పిల్లల ఆరోగ్యం విషయంలో రాజీ పడొద్దని తెలిపారు. అంగన్ వాడీల్లో పిల్లలకు తిన్నంత అన్నం పెట్టాలని సూచించారు. 

శివశంకర్ భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు

హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ భౌతికకాయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు నివాళులర్పించారు. వీరితోపాటు జానారెడ్డి, అసుద్దీన్ ఒవైసీ, ఉత్తమ్, షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు. 

సీఎంగా పళనిస్వామి ఎన్నికపై హైకోర్టులో స్టాలిన్ పిటిషన్

చెన్నై : సీఎంగా పళనిస్వామి ఎన్నికపై హైకోర్టులో స్టాలిన్ పిటిషన్ వేశారు. మార్చి 10 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, సీఎంకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బలపరీక్ష సమయంలో అసెంబ్లీలో జరిగిన దృశ్యాలను తమకు ఇవ్వాలని హైకోర్టు కోరింది. 

చంద్రబాబు నివాసం ఎదుట టీడీపీ కార్యకర్తల ఆందోళన

అమరావతి : టీడీపీలో ఎమ్మెల్సీ టిక్కెట్ల లొల్లి మొదలైంది. చంద్రబాబు నివాసం ఎదుట టీడీపీ కార్యకర్తల ఆందోళన చేపట్టారు. తూర్పుగోదావరికి చెందిన నెక్కంటి బాలకృష్ణకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని మద్దతుదారులు నిరసన తెలిపారు. టీడీపీ నేత సాంబశివరావు చంద్రబాబును కలిశారు. ఎమ్మెల్యే లేదా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరారు.

13:36 - February 27, 2017

హైదరాబాద్ : ‘నేను బచ్చానే..కానీ లుచ్చా' మాత్రం కాదని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. తనపై కేసులు పెడితే భయపడడని తనకు వెంట్రుకతో సమానమన్నారు. పంగనామ పెట్టి పక్కపార్టీలోకి వెళ్లే ఇంద్రకిరణ్ కి మాట్లాడే హక్కు లేదన్నారు. ఆయన బతుకెందో నిర్మల్ లో చెప్పి వచ్చానన్నారు. దీనిపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. హౌసింగ్ జేవీ ప్రాజెక్టులో పేదల ఇళ్లను రద్దు చేసి మంత్రి భారీ అవినీతికి పాల్పడ్డారని రేవంత్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. మంత్రి వర్గం ఉపసంఘ నివేదిక బయటపెట్టాలని, గతంలో నివేదిక కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హౌసింగ్ శాఖ 17 శాఖలతో జాయింట్ వెంచర్ ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

13:35 - February 27, 2017

సూర్యాపేట : సీపీఎం మహాజన పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఆత్మకూరు ఎస్ మండలంలోని పలు గ్రామాలు..తండాల్లో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. వట్టికంపాడు, లక్ష్మణ్ నాయక్ తండా, నాచారం, ఆత్మకూరు ఎక్స్ రోడ్డు, దుబ్బగూడెం, నిమికల్, దబ్బకంద గ్రామాలతో పాటు పాతర్లపాడు ఎక్స్ రోడ్డు, గుండ్ల సింగారం, నూతనకల్ ప్రాంతాల్లో పాదయాత్ర జరుగుతోంది. పాదయాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. పాదయాత్ర బృందానికి పలువురు సమస్యలు తెలియచేస్తున్నారు.

ఇంద్రకిరణ్ పై రేవంత్ విమర్శలు..

హైదరాబాద్ : అక్రమ కేసులకు భయపడమని, తన వెంట్రుకతో సమానమని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డిపై ఆయన పలు విమర్శలు గుప్పించారు.

13:26 - February 27, 2017

ఇంట్లో అత్యంత ముఖ్యమైన భాగాల్లో వంటిల్లు కూడా ఒకటి. వంటిల్లు నుండే ఘుమఘుమలు వెళుతుంటాయి. కానీ వంట చేసే సమయం..ఇతరత్రా వాటిపై కొన్ని చిట్కాలు పాటిస్తే సమయం..శ్రమ రెండూ కలిసి వస్తాయి. అంతేగాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తాయి.

  • ఐస్ క్రీమ్ కొని డీప్ ఫ్రీజ్ లో పెట్టడం వల్ల గడ్డ కడుతుంటే ఐస్ క్రీమ్ బాక్స్ ను ఓ కవర్ లో చుట్టి పెట్టి చూడండి..
  • చేపలు గ్రిల్ చేసే సమయంలో నిమ్మకాయ ముక్కలను పరచాలి. దానిపై చేప ముక్కలను పెట్టి గ్రిల్ చేస్తే చేపకు మంచి రుచి వస్తుంది.
  • నిమ్మ పండుని కోసేముందు బలంగా చేతులతో నలిపి... ఆ తరువాత కోసి పిండితే రసం సులువుగా వస్తుంది.
  • గుడ్లు బాగున్నాయా ? పాడైపోయాయా ? అనేది తెలుసుకోవాలంటే ఓ జగ్గులో నీళ్లు నిండా వేయాలి. తరువాత గుడ్డుని ఆ నీటిలో వేయాలి. గుడ్డు తేలిందో అది చాలా రోజులు నిలవచేసినదని అర్థం. అలా కాకుండా అది నీటి అడుగుకు చేరి అడ్డంగా పడితే ఆ గుడ్డు తాజాదని అర్థం.
  • కరివేపాకుని ఎండపెట్టి పొడి చేసి, బద్రపరుచుకుని నిత్యం కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వొస్తుంది.
  • ఫ్లాస్క్ ని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తుందా ? అయితే మజ్జిగతో కడిగి చూడండి.
  • బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మరసం చల్లితే జిగురు ఉండదు.
  • సాంబార్లో ఉప్పు ఎక్కువై ఇబ్బందులు పడుతున్నారు. అందులో ఉడికించిన బంగాళ దుంపలు వేస్తే సరి.
  • అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని తరిగాక మజ్జిగలో వేస్తే సరి.
13:21 - February 27, 2017

కృష్ణా : జిల్లాలోని గుడివాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టిడించేందుకు దళితులు, పేదలు యత్నించడం..పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇలపర్రు లో పేదల భూములను ఆన్యాక్రాంతం చేశారని, భూములను అప్పగించాలని దళితులు, పేదలు కోరారు. కానీ ఆన్యాక్రాంతమైన భూముల విషయంలో అధికారులు..ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై దళితులు...పేదలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ నేతలు మద్దతు పలికారు. ఆరో తేదీ నుండి పోరాటం చేస్తున్నా ప్రభుత్వాధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీనితో గుడివాడ ఆర్డీవో కార్యాలయాన్ని సోమవారం ముట్టడించేందుకు నిర్ణయించారు. ముట్టడిలో భాగంగా వస్తున్న నేతలను మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. తమ భూములను తమకు అప్పగించాలని ఆందోళన చేయడం జరుగుతోందని దళితులు పేర్కొన్నారు. కానీ పోలీసులు ఏమాత్రం వినిపించుకోలేదు. ముందుకు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మహిళలని చూడకుండా లాగిపడేశారు. పోలీసుల తీరుపై దళితులు నిరసన వ్యక్తం చేశారు.

13:16 - February 27, 2017

విజయవాడ : ఇప్పటి వరకు హైదరాబాద్ లో విధులు నిర్వర్తించిన ఏపీ అసెంబ్లీ ఉద్యోగులు అమరావతిలో అడుగు పెట్టారు. సోమవారం 180 మంది ఉద్యోగులు వెలగపూడిలో నిర్మితమైన తాత్కాలిక అసెంబ్లీకి చేరుకున్నారు. వీరికి స్పీకర్ కోడెల, మంత్రులు యనమల, ప్రత్తిపాటి, రాజధాని రైతులు స్వాగతం పలికారు. వెలగపూడిలోనే పనిచేయాలని ప్రభుత్వ ఆదేశాలతో వీరంతా తరలివచ్చారు. ప్రస్తుతం వీరు ఇంకా విధుల్లోకి ఇంకా హాజరు కాలేదు. స్పీకర్ మాత్రం బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఉద్యోగులకు వీలైన సదుపాయాలు కల్పిస్తామని స్పీకర్ కోడెల వెల్లడించారు.

6 నుండి అసెంబ్లీ..
మార్చి 6వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి యనమల ప్రకటించారు. మార్చి 13వ తేదీన సాధారణ బడ్జెట్ తరువాత వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఉగాదిలోపు బడ్జెట్ ఆమోదించి సమావేశాలు వాయిదా వేయాలని అనుకుంటున్నట్లు, మార్చి 6వ తేదీన బీఏసీలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

సొంతిల్లే నయం..
అమరావతిలో శాసనసభను నిర్ణీత సమయంలో ఆధునిక హంగులతో నిర్మించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. 146 మంది ఉద్యోగులు ఇక్కడకు రావడం జరిగిందని ఇందులో 47 మంది మహిళలున్నారని వీరందరికీ స్వాగతం పలికినట్లు తెలిపారు. కొత్త ప్రాంతం కావడంతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు.

సుప్రీంలో ఉమ్మడి హైకోర్టు న్యాయాధికారుల నియామకాల విచారణ..

ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు న్యాయాధికారుల నియామకాల కేసును సుప్రీంకోర్టు విచారించింది. రిజైండర్ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణ విజ్ఞప్తికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

మార్చి 6 నుండి ఏపీ అసెంబ్లీ..

విజయవాడ : మార్చి 6వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి యనమల ప్రకటించారు. మార్చి 13వ తేదీన సాధారణ బడ్జెట్ తరువాత వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఉగాదిలోపు బడ్జెట్ ఆమోదించి సమావేశాలు వాయిదా వేయాలని అనుకుంటున్నట్లు, మార్చి 6వ తేదీన బీఏసీలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

 

కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కన్నుమూత..

హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శివశంకర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.

టిడిపి పొలిట్ బ్యూరోకు లోకేష్ ధన్యవాదాలు..

విజయవాడ : టిడిపి పొలిట్ బ్యూరోకు లోకేష్ ధన్యవాదాలు తెలియచేశారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీగా తనను ప్రతిపాదించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, ప్రజలకు సేవ చేయడానికి ఇదొక మంచి అవకాశమన్నారు.

ఛత్తీస్ గడ్ లో మావోయిస్టుల దుశ్చర్య..

ఛత్తీస్ గడ్ : మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. సుకుమా - కుంటలో రహదారిపై మందుపాతర పేల్చడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మద్దేడు పీఎస్ పరిధిలోని పొగడపల్లిలో రోడ్డు నిర్మాణానికి ఉపయోగిస్తున్న యంత్రాలను మావోయిస్టులు దగ్ధం చేశారు.

 

పోలవరం పనులపై బాబు సమీక్ష..

విజయవాడ : పోలవరం పనులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రతి సోమవారం పోలవరం పనులపై బాబు సమీక్ష చేయనున్న సంగతి తెలిసిందే.

అసెంబ్లీ సిబ్బందికి స్పీకర్, మంత్రుల స్వాగతం..

విజయవాడ : అసెంబ్లీ సిబ్బంది తాత్కాలిక అసెంబ్లీకి చేరుకున్నారు. వీరికి స్పీకర్ కోడెల, మంత్రులు యనమల, ప్రత్తిపాటి, రాజధాని రైతులు స్వాగతం పలికారు.

12:57 - February 27, 2017
12:53 - February 27, 2017

కళలకు పుట్టినిల్లు మన భరతఖండం..ఎందరో రాజపోషకులు కళలను పోషించారు ఒకప్పుడు. కళ మనస్సులను పరవశింప చేస్తుంది. స్వాంతన కలిగిస్తుంది. భారతీయ సాంప్రదాయక, పాశ్చాత్య చిత్ర కళా మెళుకవుల సంగమానికి 'రవివర్మ' చిత్రాలు మచ్చుతునకలు. ఆయన వారసత్వాన్ని వణికిపుచ్చుకుని సప్తవర్ణాలతో రాగరంజితంగా చిత్ర కళా ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుని అంతర్జాతీయ ఖ్యాతీని సొంతం చేసుకున్న చిత్ర కళాకారిణి 'లుక్మీ రవివర్మ'. మానవి 'స్పూర్తి' లో 'లుక్మీ రవివర్మ' గురించి మరింత తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:48 - February 27, 2017
12:34 - February 27, 2017

కృష్ణా : ఆన్యాక్రాంతమై పోయిన భూములను తమకు అప్పచెప్పాలని దళితులు నినదిస్తున్నారు. జిల్లాలో నందిగామ మండలంలో ఉన్న వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. దీనిపై అధికారులు సర్వే చేశారు. దళితులు..భూములు ఆన్యాక్రాంతమయ్యాయని వారు గుర్తించారు. కానీ భూములను మాత్రం దళితులకు అప్పగించలేదు. దీనితో దళితులు ఆందోళన బాటపట్టారు. వీరి ఆందోళనకు సీపీఎం, వ్యవసాయ రైతు కార్మిక సంఘం, కేవీపీఎస్ మద్దతు పలికాయి. సోమవారం గుడివాడ ఆర్డీవో కార్యాలయం ముట్టడించాలని యోచించారు. అనంతరం పేదలు..దళితులు కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. అక్కడనే ఉన్న పోలీసులు వీరిని అడ్డుకొనే యత్నం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. చివరకు పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. దీనితో పలువురు మహిళలు సొమ్మసిల్లిపడిపోయారు. దళితుల భూములు దళితులకే అప్పగించాలని..ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు ఉచితంగా అందచేయాలని..పంట పొలాలను చేపల చెరువులుగా మార్చడంపై విచారణ చేయాలని..సీల్డ్ కో ఆపరేటివ్ సొసైటీ భూములు లబ్దిదారులకు అప్పగించి కొల్లేరు భూములపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

12:29 - February 27, 2017

కడప : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయంగా వేడెక్కింది. టిడిపి అభ్యర్థి బిటెక్ రవి నామినేషన్ వేశారు. వైసిపిలో గెలిచి టిడిపిలో చేరిన కౌన్సిలర్లు ఎలా తీసుకెళుతారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. వాగ్వాదం చిలికిచిలికి గాలి వానలా మారింది. టిడిపి..వైసిపి నేతలు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఎంపీ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిలు విషయం తెలుసుకుని ఘటనా ప్రదేశానికి చేరుకోవడంతో పరిస్థితి ఇంకా ముదిరింది. ఇరువర్గాలు దాడులకు పాల్పడ్డారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ఇరువురు పార్టీల నేతలతో ముచ్చటిస్తున్నారు.

12:25 - February 27, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టక్కర్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీనితో కొత్త సీఎస్ కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది. సీఎస్ టక్కర్ పదవీకాలం గతంలోనే ముగిసినా ప్రభుత్వం పదవీకాలాన్ని పొడిగించింది. సీఎస్ పదవి కోసం మరో ఇద్దరు పోటీ పడుతున్నారు. 1983లో సీనియర్ ఐఏఎస్ అధికారులుగా ఉన్న అజయ్ కల్లం, దినేష్ కుమార్, అనీల్ చంద్ర పునేఠ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీరిలో అజయ్ కళ్లెం వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ అజయ్ కల్లం పదవీ కాలం మార్చిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అజయ్ కల్లం పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రాన్ని అభ్యర్థించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

12:21 - February 27, 2017

మరో రెండు రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. అమ్మానాన్నలు కూడా టెన్షన్ పడడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. తాము చదివింది సరిగ్గా సమయానికి గుర్తుకు రాక కొంతమంది విద్యార్థులు తికమకపడుతుంటారు. కొంతమంది విద్యార్థులు రాత్రంతా చదువుతూనే వుంటారు. మరికొంతమంది ఎగ్జామ్ సెంటర్ కి చేరుకున్న తర్వాత కూడా చదువుతూనే వుంటారు. పరీక్షల నేపథ్యంలో టెన్ టివి 'జనపథం'లో సైకాలజిస్టు డాక్టర్ టిఎస్ రావు పలు సూచనలు..సలహాలు అందించారు. పరీక్షల సీజన్ లో విద్యార్థులతో పాటు వారి పరీక్షలు రాయబోతున్న పేరెంట్స్ కి సలహాలు అందచేశారు. అలాగే చదువుకున్నది గుర్తుకు రావాలంటే పాటించాల్సిన చిట్కాలు..ఎగ్జామ్స్ రాసేవారు రిలాక్సవ్వడానికి అనుసరించాల్సిన చిట్కాలేమిటి? తదితర సూచనలు అందించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:12 - February 27, 2017

పశ్చిమగోదావరి : మెట్రో ప్రాంతాలు..నగరాలను దాటిన 'రేవ్' పార్టీ పల్లెలకు పాకింది. జిల్లాలో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. నిడమర్రు మండలం ఫత్తేపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నమూర్తి రాజు గెస్ట్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించారు. 16 మంది యువకులు, 10 మంది యువతులున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేశారు. అశ్లీలంగా నృత్యాలు చేస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను విజయవాడ నుండి రప్పించినట్లు తెలుస్తోంది. కానీ ప్రముఖుల పిల్లలను తప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదుపులోకి తీసుకున్న వారిలో విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రేపటితో ముగుస్తున్న ఏపీ సీఎస్ పదవీకాలం..

విజయవాడ : ఏపీ సీఎస్ టక్కర్ పదవీకాలం రేపటితో ముగియనుంది. దీనితో కొత్త సీఎస్ కోసం ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎస్ పదవి రేసులో దినేష్ కుమార్, అజయ్ కళ్లెం కూడా ఉన్నారు.

సిక్కోలు టిడిపిలో ముసలం..

శ్రీకాకుళం : జిల్లా టిడిపిలో ముసలం పుట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వకపోవడంపై టిడిపి సీనియర్ నాయకుడు కోళ్ల అప్పలనాయుడు అలకబూనారు. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

నిడమర్రులో రేవ్ పార్టీ..

పశ్చిమగోదావరి : నిడమర్రు మండలం ఫత్తేపురంలో రేవ్ పార్టీ జరిగింది. చిన్నమూర్తి రాజు గెస్ట్ హౌస్ లో 16 మంది యువకులు, 10 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లా లా ల్యాడ్ చిత్రానికి ఆరు ఆస్కార్ అవార్డులు..

లాస్ ఏంజిల్స్ : లా లా ల్యాండ్ చిత్రానికి ఆరు ఆస్కార్ అవార్డులు దక్కాయి. ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఒర్జినల్ స్కోర్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఒర్జినల్ సాంగ్ కేటగిరిల్లో అవార్డులు దక్కాయి.

11:46 - February 27, 2017

గుడివాడ ఆర్డీవో కార్యాలయం ముట్టడి..ఉద్రిక్తత..

కృష్ణా : గుడివాడ ఆర్డీవో కార్యాలయం ముట్టడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నందివాడ మండలంలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి ఇప్పించాలని ఆర్డీవో ఆఫీసు ముట్టడికి దళితులు యత్నించారు. పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. వీరి ఆందోళనకు సీపీఎం, కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మద్దతు పలికారు.

11:37 - February 27, 2017

తాత్కాలిక అసెంబ్లీని సందర్శించిన స్పీకర్..యనమల..

విజయవాడ : అమరావతిలోని వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీని స్పీకర్ కోడెల, మంత్రి యనమలలు పరిశీలించారు. వీఐపీ పార్కింగ్ ను పరిశీలించిన యనమల పలు సూచనలు చేశారు.

11:33 - February 27, 2017

చిత్తూరు : జిల్లాలోని రేణిగుంట మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వృద్ధ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. సభ్యసమాజం తలదించుకొనేలా వృద్ధురాలిపై కామాంధులు అత్యాచారం జరిపారు. ఈ ఘటన కుమ్మరపల్లిలో చోటు చేసుకుంది. వృద్ధ దంపతులు శీనయ్య, ఇంద్రమ్మ లు ఓ పొలం వద్ద పని చేస్తుంటారు. సమీపంలోనే ఓ చిన్న గదిలో వీరు నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి ప్రతి రోజులాగానే పడుకున్నారు. సోమవారం ఉదయం వృద్ధులు రక్తపు మడుగుల్లో ఉండడం స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. వృద్ధురాలిపై అత్యాచారం జరిపి ఇనుపరాడ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేగింది. మద్యం మత్తులో యువకులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వృద్ధ దంపతులు అనంతపురం జిల్లాకు చెందిన వారుగా తెలుస్తోంది.

11:28 - February 27, 2017

లాస్ ఏంజెల్స్‌లో ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమం ముగిసింది. ఉత్తమ చిత్రంగా మూన్‌లైట్ ఎంపికైంది. అయితే అవార్డ్ ఎంపికలో చిన్న పొరపాటు జరిగింది. మూన్‌లైట్ చిత్రానికి బదులు లా లా ల్యాండ్ చిత్రం ఎంపికైనట్లు వ్యాఖ్యాతలు ప్రకటించారు. దీంతో కాస్త గందరగోళం నెలకొంది. మరోవైపు లా లా ల్యాండ్ చిత్రానికి అవార్డుల పంట పడింది. మొత్తం ఏడు అవార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమనటి వంటి ముఖ్యమైన అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ నటుడిగా కేసే ఎఫ్లెక్ ఎంపికయ్యాడు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ట్రంప్‌ దెబ్బ తగిలింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపికైన ది సేల్స్‌మెన్ దర్శకుడు అస్ఘర్ ఫర్హదీ అవార్డు అందుకోవడానికి ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ముస్లీం దేశాలపై ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్‌కు వ్యతిరేకంగా ఈ ప్రోగ్రామ్‌కు హాజరుకాలేదని ఫర్హదీ తెలిపారు.

11:26 - February 27, 2017

విజయవాడ : ఏపీలో అధికార టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి తారాస్థాయికి చేరింది. ఒక్కఛాన్స్‌ అంటూ ఆశావహులు టిక్కెట్ల కోసం పాట్లు పడుతుంటే.. ఏ స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలన్న మీమాంసలో పార్టీ అధిష్ఠానం ఉంది. ఇవాళ్టి పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే.. యథావిధిగా, అభ్యర్థుల ఎంపిక నిర్ణయాధికారాన్ని అధినేత చంద్రబాబుకి కట్టబెడుతూ.. పొలిట్‌బ్యూరో తీర్మానం చేసింది. ఇప్పుడిక అధినేత ఎవరిని కరుణస్తారో అన్న ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ఆశలు పెంచుకున్నవారితో.. ఏపీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం సందడిగా మారింది. చివరి నిమిషంలోనైనా అధినేతను ప్రసన్నం చేసుకోవాలని ఆశావహులు ఆపసోపాలు పడుతున్నారు. పొలిట్‌బ్యూరో సమావేశం ఓవైపు జరుగుతుంటే.. మరోవైపు, ఆశావహులు తమదైన శైలిలో వ్యూహాలు అమలు చేయడంలో బిజీగా ఉన్నారు. పార్టీ అభ్యర్థుల జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారని తెలియడంతో.. వీరంతా చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

తూర్పుగోదావరి..
తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ ఎవరికి టికెట్‌ ఇస్తుందన్న అంశం సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠకు తావిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పదవీకాలం మార్చి 27తో ముగియనుంది. అయితే..ఈ స్థానానికి మళ్లీ తనకే అవకాశం కల్పిస్తారని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో పార్టీ అధినేత ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. బాబు మదిలో ఏముందో తెలియక ఆశావహులు ఉత్కంఠకు గురవుతున్నారు.

పశ్చిమగోదావరి..
ఇక పశ్చిమలో కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేరు ప్రచారంలో ఉంది. అయితే, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ రాజు కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. దీంతో పశ్చిమలో సీట్ల సర్దుబాటు అయ్యాకే.. తూర్పులో సీట్ల అంశాన్ని తేల్చాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. తూర్పుగోదావరిలో మాజీ మంత్రి, కాపు సామాజిక వర్గానికి చెందిన చిక్కాల రామచంద్రారావు, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు తనయుడు, కాకినాడ ఎంపీ తోట నరసింహం బావమరిది మెట్ల రమణబాబు, ఏలేరు నీటిసంఘం ఛైర్మన్‌గా ఉన్న జ్యోతుల చంటిబాబు కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. మరోవైపు రాజమండ్రి రూరల్‌ ప్రాంతానికి చెందిన గంగుమళ్ల సత్యనారాయణ, యర్రా వేణుగోపాలరాయుడు, వెలుగుబంటి ప్రసాద్‌లు కూడా సీటు ఆశిస్తున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీ, చైతన్య విద్యాసంస్థల అధినేత కేవీవీ సత్యనారాయణ కూడా ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది.

కోనసీమకు ఎమ్మెల్సీ..
అమలాపురం డివిజన్‌ మొత్తం మీద ఒక్క కాపు ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో కోనసీమకు ఎమ్మెల్సీ ఇస్తే ఎలా ఉంటుందున్న కోణంలోనూ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహులు, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థికమంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడుపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. అయితే... ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలనేది చంద్రబాబు నాయుడే చూసుకుంటారని ఈ నేతలిద్దరూ చెబుతున్నారు. అయినా, యనమల, చినరాజప్పలను కాదని, చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్న ఉద్దేశంతో, ఆశావహులు, వీరిద్దరూ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో నారా లోకేశ్‌ పోటీ చేస్తానంటే అందరూ కలిసి స్వాగతించేందుకు కూడా పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్లు లోకేశ్‌ను తూర్పు నుంచి పోటీ చేయాలని కోరినట్లు సమాచారం.

శ్రీకాకుళం..
ఇక శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హంగామా ఊపందుకుంది. జిల్లా నుంచి ఇరవై మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా.. స్థానికేతరులు సైతం ఇదే సీటుపై కన్నేసి పైరవీలు చేస్తుండటంతో.. ఆశావహుల జాబితా అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావుతో పాటు.. ఇతర జిల్లాల నేతలు పలువురు చంద్రబాబును కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా జిల్లా నుంచి ఏడుగురు సీనియర్లతో పాటు..పలువురు ఆశావహులు సీటు కోసం ప్రయత్నిస్తున్నారని, ఆశావహుల జాబితాను పార్టీకి సమర్పిస్తామని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష స్పష్టం చేశారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా... జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నిర్ణయం మేరకే తమ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామని ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ స్పష్టం చేశారు. ఓ వైపు నామినేషన్ల దాఖలుకు గడువు దగ్గర పడుతుంటే.. పార్టీ నేతల్లో ఏకాభిప్రాయం లేకపోవడం అధిష్ఠానానికి తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఏదేమైనా... ఆశావహుల్లో అన్నివిధాల అర్హులైనవారిని గుర్తించి, వారి విజయానికి పార్టీ కృషి చేస్తోందన్న ఆశాభావంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

11:21 - February 27, 2017

అమెరికాలో ట్రంప్‌ నింపిన విద్వేషం కొనసాగుతూనే ఉంది. శ్వేత జాతీయుడు కాకుంటే.. అడుగడుగునా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ముస్లింల పరిస్థితి దారుణంగా ఉంది. అమెరికాలోకి వచ్చే వారు ఎంతటివారైనాసరే.. ముస్లిం అయితే చాలు.. ఇమిగ్రేషన్‌ అధికారులు సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తున్నారు. ట్రంప్‌ తీరుకు నిరసనగా.. వైట్‌హౌజ్‌లోని ముస్లిం ఉద్యోగులు రాజీనామాబాట పడుతున్నారు. అమెరికన్లు కానివారిని సహించలేని పరిస్థితి అక్కడి ప్రజల్లో నెలకొంది. ఇదే ట్రెండ్‌ లోకల్‌ అధికారుల్లోనూ వ్యక్తమవుతోంది. నాన్‌ అమెరికన్లు.. ముఖ్యంగా ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించడానికి వీలే లేని విధంగా.. రకరకాల ఆంక్షలు విధిస్తూ.. ప్రశ్నాస్త్రాలతో వేధిస్తున్నారు. తాజాగా.. ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన సిరియా సినిమాటోగ్రాఫర్‌కూ.. ఇమిగ్రేషన్‌ అధికారుల కారణంగా చేదు అనుభవం ఎదురైంది.

ఖతీబ్ కు వేధింపులు..
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన 'ద వైట్‌ హెల్మెట్స్‌' సినిమాటోగ్రాఫర్ ఖలేద్‌ ఖతీబ్‌ అమెరికాలోకి ప్రవేశించే సమయంలో.. ఇమిగ్రేషన్‌ అధికారులు నానా హంగామా చేశారు. ఆస్కార్‌ వేడుకలకు ఒక రోజు ముందే యూఎస్‌కు చేరుకోవాల‌నుకున్న ఖతీబ్‌ను.. విమానాశ్రయంలోనే అడ్డుకుని రకరకాల ప్రశ్నలతో వేధించారు. ఈ వ్యవహారం విమర్శలకు దారితీయడంతో, భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందునే ఖలేద్‌ను అడ్డుకున్నామ‌ని అనంతరం, వివరణ ఇచ్చారు. ఇటు డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరిపై వైట్‌హౌస్‌ ఉద్యోగులూ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా ముస్లిం ఉద్యోగులు.. ట్రంప్‌ తీరును జీర్ణించుకోలేక పోతున్నారు. వైట్‌హౌజ్‌లో నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లో పనిచేస్తున్న, బంగ్లాదేశ్‌ మూలాలున్న రుమానా అహ్మద్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2011 నుంచీ శ్వేతసౌధంలో పనిచేస్తున్న రుమానా.. ట్రంప్‌ వచ్చాక, అక్కడి వాతావరణమే పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. మొత్తానికి, అమెరికాలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే, ట్రంప్‌ వికృత నిర్ణయాలు.. స్థానికుల్లో విద్వేషాన్ని, ప్రవాసుల్లో అభద్రతను పెంపొందించాయన్నది తేటతెల్లమవుతోంది.

11:19 - February 27, 2017

అమెరికాలోని లాస్‌ఎంజెల్స్‌లో 89వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానం జరుగుతోంది. ఉత్తమ విదేశీచిత్రంగా సేల్స్‌మ్యాన్‌ , డాక్యుమెంట‌రీ ల‌ఘు చిత్రంగా ద వైట్ హెల్మెట్స్‌ ఇన్సీడెల్‌, ఉత్తమ ఎడిటింగ్‌ చిత్రంగా హాక్సా రిడ్జ్‌ ఎంపికైంది. ఉత్తమ‌ విజువ‌ల్ ఎఫెక్ట్‌ అవార్డ్ ది జంగిల్ బుక్‌ చిత్రాన్ని వరించింది. ఉత్తమ సహాయనటుడిగా మూన్‌లైట్ చిత్రంలో నటించిన మహేర్షల అలీ.. ఉత్తమ సహాయనటిగా ఫెన్స్‌స్‌ చిత్రంలో నటించిన వయోలా డేవిస్‌ ఎంపికయ్యారు. ఉత్తమ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్‌ చిత్రంగా సూసైడ్ స్క్వాడ్ , ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఓజే మేడిన్ అమెరికా, బెస్ట్ కాస్ట్యూమ్ చిత్రంగా ఫెంటాస్టిక్ బీస్ట్‌, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ చిత్రంగా అరైవల్ సినిమాలు ఆస్కార్ అవార్డులు అందుకున్నాయి. ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి ముస్లిం నటుడిగా మహేర్షాల అలీ నిలిచాడు. దీంతో భారత నటుడు డేవ్ పటేల్‌కు నిరాశే ఎదురైంది.

11:11 - February 27, 2017

హైదరాబాద్ : విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిసున్న ఫ్యాకల్టీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. భారీగా విద్యార్థులు ఆందోళన చేపడుతుండడం..వీరి ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలపడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. హయత్ నగర్ పీఎస్ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ లో బ్రిలియంట్ గ్రామర్ కాలేజీ ఉంది. కాలేజీ ఫ్యాకల్టీ విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిసున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినా యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడంతో మరింత రెచ్చిపోయారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థిని పట్టుకుని అసభ్యకరంగా మాట్లాడడానే సంగతి బయటకు రావడం..విషయం తల్లిదండ్రులకు తెలిసింది. అంతేగాకుండా మార్కులు తక్కువగా వేయడం..ఆబ్సేంట్ వేయడం వంటివి చేస్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీనితో సోమవారం ఉదయం విద్యార్థులు..తల్లిదండ్రులు కాలేజీ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు విద్యార్థినులకు మద్దతు పలికారు. ఫ్యాకల్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. ఫ్యాకల్టీతో చర్చలు జరిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ధర్నా..

హైదరాబాద్ : అబ్దుల్లాపూర్ మెట్ లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. విద్యార్థినుల పట్ల ఫ్యాకల్టీ అసభ్యంగా ప్రవరిస్తున్నారని వందలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ ముందు భారీగా పోలీసులు మోహరించారు.

ఎర్రగుంట్లలో టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ..

కడప : ఎర్రగుంట్లలో టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసిపి నుండి టిడిపిలో చేరిన కౌన్సిలర్ల విషయంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఒడిశాలో రెచ్చిపోయిన మావోయిస్టులు..

ఒడిశా : మావోయిస్టులు రెచ్చిపోయారు. ఏకంగా గడ్చిరోలీ జిల్లా రొంపెల్లి గ్రామంలో ఫారెస్టు డిపోకు నిప్పు పెట్టారు.

10:22 - February 27, 2017

ఒడిశా : మావోయిస్టులు రెచ్చిపోయారు. ఫారెస్టు డిపోకు నిప్పు పెట్టడం కలకలం సృష్టించింది. ఈ ఘటన గడ్చిరోలీ జిల్లా రొంపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సుమారు 70 మంది మావోయిస్టులు గ్రామానికి చేరుకుని డిపోకు నిప్పు పెట్టారు. దీనితో వందల సంఖ్యలో ఉన్న కలప దుంగలు కాలిబూడిదయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ హంట్ ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వాల్ పోస్టర్లు అతికించారు. గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చారు. భారత్ బంద్ కు మద్దతివ్వాలని గ్రామంలో ప్రదర్శన కూడా నిర్వహించారు. రోడ్లపై చెట్లు నరికివేయడంతో రాకపోకలు స్తంభించాయి.

10:15 - February 27, 2017

అమెరికా : ఉన్మాది చేతిలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం ఈ రోజు హైదరాబాద్‌కు రానుంది. రాత్రి 8:45 గంటలకు శ్రీనివాస్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటుంది. బొల్లారం ఖాజీపల్లిలోని శ్రీనివాస్ స్వగృహానికి మృతదేహం తరలిస్తారు. మంగళవారం ఉదయం 11గంటలకు మహాప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
జాతివివక్ష తలకెక్కిన తెల్లజాతీయుడు ఆడం పురింటన్‌ విచక్షణ రహిత చర్యకు.. తెలంగాణ వాసి శ్రీనివాస్‌ కూచిభొట్ల బలయ్యాడు. మరొకరు గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. హైదరాబాద్‌ జెఎన్‌టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్‌, అమెరికాలోని టెక్సాస్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశాడు. కాన్సాస్‌ రాష్ట్రంలోని ఒలాతేలో ఉన్న గార్మిన్‌ కంపెనీలో ఏవియేషన్‌ ఇంజనీర్‌గా చేరాడు.

09:50 - February 27, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' తదుపరి చిత్రం ఏమై ఉంటుందా ? ఎవరు హీరోయిన్ ? ఎవరు నిర్మాత..ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై అభిమానులు తెగ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నార. చాలా రోజులకు 'చిరంజీవి' రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఖైదీ నెంబర్ 150’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులను అలరించారు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద చక్కటి వసూళ్లను సాధించింది. అనంతరం 151వ సినిమాపై చిరు దృష్టి పెట్టారు. ఈ చిత్రానికి సురేంద్ రెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్ర హీరోయిన్ గురించి సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. తొలుత 'చిరు' సరసన 'అనుష్క'ను సెలక్ట్ చేశారని పుకార్లు షికారు చేశాయి. తాజాగా 'శృతి హాసన్' హీరోయిన్ గా నటిస్తోందని టాక్? గతంలో మెగా హీరోలైన 'రామ్ చరణ్' తో 'ఎవడు', ‘పవన్ కళ్యాణ్' తో 'గబ్బర్ సింగ్', ‘అల్లు అర్జున్' తో 'రేసుగుర్రం' చిత్రాల్లో 'శృతి' నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'పవన్' నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రంలో 'శృతి హాసన్' నటిస్తోంది. మరి చిరు సరసన శృతి నటిస్తుందా ? ఇది వట్టి పుకారేనా అనేది రానున్న రోజుల్లో తెలియనుంది.

89వ ఆస్కార్ విజేతలు..

లాస్ఏంజిల్స్ : 89వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ, మహారథులు వేడుకలో పాల్గొని సందడి చేశారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మెరిశారు.

గుడివాడ ఆర్డీవో కార్యాలయం ముట్టడి..

కృష్ణా : గుడివాడ ఆర్డీవో కార్యాలయాన్ని కేవీపీఎస్ నాయకులు, దళితులు ముట్టడించనున్నారు. దళితుల భూములు దళితులకే అప్పగించాలని..ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు ఉచితంగా అందచేయాలని..పంట పొలాలను చేపల చెరువులుగా మార్చడంపై విచారణ చేయాలని..సీల్డ్ కో ఆపరేటివ్ సొసైటీ భూములు లబ్దిదారులకు అప్పగించి కొల్లేరు భూములపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కొనసాగుతున్న ఐదో దశ పోలింగ్..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 10.77 శాతం పోలింగ్ నమోదైంది. ఐదో దశలో 11 జిల్లాల పరిధిలో 51 అసెంబ్లీ నియోజవకర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

09:34 - February 27, 2017

అమెరికాలోని లాస్‌ఎంజెల్స్‌లో 89వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానం జరుగుతోంది. ఉత్తమ సహాయనటుడిగా మూన్‌లైట్ చిత్రంలో నటించిన మహర్షాలాఅలీ.. ఉత్తమ సహాయనటిగా ఫెన్స్‌స్‌ చిత్రంలో నటించిన వయోలా డేవిస్‌ ఎంపికయ్యారు. ఉత్తమ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్‌ చిత్రంగా సూసైడ్ స్క్వాడ్ , ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఓజే మేడిన్ అమెరికా, బెస్ట్ కాస్ట్యూమ్ చిత్రంగా ఫెంటాస్టిక్ బీస్ట్‌, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ చిత్రంగా అరైవల్ సినిమాలు ఆస్కార్ అవార్డులు అందుకున్నాయి.

 

09:33 - February 27, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, ఈ కుటుంబ పాలనతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. యూనివర్సిటీలు, కళాశాలల్లో అధ్యాపకులు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, కేసీఆర్‌ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందని తమ్మినేని విమర్శించారు. బీసీ, మైనారిటీలకు సబ్‌ప్లాన్‌ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ధనిక ప్రభుత్వం నడుస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావొస్తున్నా... రాష్ట్రంలో పేదల బతుకులు బాగుపడడం లేదని.. సామజిక న్యాయం జరగట్లేదని విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందని, యూనివర్సిటీలు, కాలేజీల్లో కనీస అధ్యాపకులు కూడా లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు, మైనారిటీలకు న్యాయం జరిగేలా సబ్‌ ప్లాన్‌ చట్టాలను రూపొందించి అమలు చేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు.

133 రోజులు..
తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, ఈ కుటుంబ పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రం మరింత నాశనమవుతోందని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ముదనష్టపు పాలన నడుస్తోందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే కేసీఆర్‌ తన పాలన తీరును మార్చుకోవాలని తమ్మినేని సూచించారు. సీపీఎం మహాజన పాదయాత్ర 133 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ పొట్లపాడు, పెన్‌పహాడ్‌, సింగిరెడ్డిపాలెం, జానారెడ్డినగర్‌, హెచ్‌పీసీఎల్‌, దురాజ్‌పల్లి, కాశీంపేట, చివ్వెం గ్రామాల్లో తమ్మినేని బృందం పర్యటించింది. కొత్తగా ఏర్పడ్డ నగర పంచాయతీలు, విలీన గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరగడం లేదని, వెంటనే సదరు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిర్వహించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

09:33 - February 27, 2017

అమెరికా : లాస్‌ఎంజెల్స్‌లో 89వ ఆస్కార్‌ పండుగ ఘనంగా ప్రారంభమైంది. లాస్‌ఎంజెల్స్‌ లోని కొడాక్‌ థీయేటర్‌ కు తారాలోకం దిగివచ్చింది. ఈసారి ఉత్తమ సహాయనటుడిగా మహేర్షలా అలీకి ఎంపికకయ్యారు. మూన్‌లైన్‌ చిత్రంలో తండ్రిలేని యువకుడిగా జువాన్‌ పాత్రలో ఆయన నటనకు గానూ ఈ అవార్డును దక్కించుకున్నారు. ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్న తొలి ముస్లిం వ్యక్తిగా కూడా అలీ ఘనత సాధించారు. ఈ చిత్రానికి బెర్రీ జెకిన్స్‌ దర్శకత్వం వహించారు. గతేడాది ఉత్తమ సహాయనటిగా అవార్డును సొంతం చేసుకున్న అలికా చేతుల మీదుగా నడుడుఅలీ ఈ అవార్డును అందుకున్నారు. అటు ప్రారంభ కార్యక్రమంలో బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకాచోప్రా ప్రారంభ స్పెషనల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రెడ్‌ కార్పెట్‌పై వెండిరంగుల డ్రెస్‌లో వొయ్యారంగా నిడిచిన ప్రియాంక అలరించింది.

09:22 - February 27, 2017
08:14 - February 27, 2017

ఎమ్మెల్సీ అభ్యర్థులపై నాలుగ్గంటల పాటు చర్చించిన టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు తుది నిర్ణయాన్ని మాత్రం అధినేత చంద్రబాబుకే వదిలేశారు. దీంతో అభ్యర్థుల ఎంపికపై మరింత ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల కోటాలో ఎంపిక చెయాల్సిన ఎనిమిది మంది అభ్యర్థుల పేర్ల పైనా.. అదేవిధంగా ఎమ్మెల్యే కోటాలో టీడీపీకి వచ్చే ఐదు సీట్లకు అభ్యర్థుల ఎంపిక పైనా సమావేశంలో చర్చించారు. ఈ అంశంతో పాటు విద్యుత్ ఛార్జీల పెంపుపై జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), రామశర్మ (ఏపీపీసీసీ), దినకర్ (టిడిపి), నాగార్జున (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి.

07:39 - February 27, 2017

సినిమా భవిషత్ "నెట్ ఇంట్లో" అన్నట్టు మారింది పరిస్థితి. ఇంతకు ముందు ఆడియో ఫంక్షన్స్ మాత్రమే పండగల జరిపేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. నెట్ యూజర్స్ పెరిగారు. తమ అభిమాన హీరో సినిమా స్టార్ట్ అయిన దగ్గరనుండి ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ వచ్చిన వెంటనే నెట్ సెర్చ్ లో టాప్ లో ఉండేలా ప్లాన్స్ వేస్తున్నారు. మొన్నటికి మొన్న రిలీజ్ అయిన 'కాటమరాయుడు' టీజర్ విపరీతమైన హైప్ తో యూట్యూబ్ లో టాప్ వ్యూస్ తో అదరకొట్టేస్తుంది. 'పవన్ కళ్యాణ్' ఫాన్స్ ఈ టీజర్ రిలీజ్ ని ప్రేస్టీజియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే 'కబాలి', 'ఖైదీ నెంబర్ 150’ టీజర్ రికార్డ్స్ ని బ్రేక్ చేసే పనిలో ఉన్నారు.

డీజే టీజర్..
'అల్లు అర్జున్' ఫాన్స్ ఎదురుచూస్తున్న 'డీజే' టీజర్ వచ్చేసింది. అంచనాలకు తగ్గట్లుగానే పక్కా బ్రాహ్మిన్ గెటప్ లో కుమ్మేశాడు అల్లు అర్జున్. మరోవైపు హరీష్ శంకర్ కి టీజర్ కట్ చేయడంలో ఓ ట్రేడ్ మార్క్ స్టైల్ ఉంది. ఒకే ఒక్క డైలాగ్ తో టీజర్ ను ఇవ్వడం.. అభిమానులని మెప్పించడం హరీష్ శంకర్ స్టైల్. "ఇలా ఇలా ముద్దులు పెట్టేసి.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని' అంటూ బన్నీ పేల్చిన ఒకే ఒక పంచ్ మినహా.. మరో మాట వినిపించే ఛాన్స్ లేదు. అసలు హరీశ్ శంకర్ స్టయిల్ అదే. అతని గత సినిమాల టీజర్లను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన రామయ్యా వస్తావయ్యా టీజర్స్ తో ఎట్రాక్ట్ చేశాడు.

ఎవరి పని..?
అల్లు అర్జున్ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయ్యాక సంచలనం అవుతుంది అనుకున్న ఫాన్స్ కి ఎదురుదెబ్బ తగిలింది. అనూహ్యంగా ఈ డి జె టీజర్ కు రికార్డు స్థాయిలో డిస్లయిక్స్ రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోతోంది. యూట్యూబ్ లో ఉన్న ఫ్రీడమ్ కారణంగా నచ్చితే లైక్స్ కొడతారు నచ్చకపోతే డిస్ లైక్స్ కొడతారు. అల్లు అర్జున్ మీద మరి ఎవరి ఫాన్స్ వ్యతిరేకత ఉందో కానీ ఈ డీజే టీజర్ కి డిస్ లైక్స్ వర్షం పడుతున్నాయి. ఎన్ని లైక్స్ పడ్డాయో అదే స్థాయిలో డిస్ లైక్స్ కూడా పడుతున్నాయి. అయితే ఈ డిజ్ లైక్స్ అన్నీ యాంటీ ఫ్యాన్స్ పనికట్టుకొని చేస్తున్నవని అందులో కొందరు బన్నీ చేసిన పాత్ర ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాబట్టి కొందరు నచ్చక డిజ్ లైక్ చేస్తుంటే.. కొందరు మాత్రం చెప్పను బ్రదర్ అంటూ డిజ్ లైక్ ను కొట్టేస్తున్నారు బ్రదర్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

యూపీలో ఐదో దశ ఎన్నికల ప్రారంభం..

ఉత్తర్ ప్రదేశ్ : అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. సోమవారం ఐదో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదో దశలో 11 జిల్లాల పరిధిలో 51 అసెంబ్లీ నియోజవకర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 607 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

06:42 - February 27, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల 11వ తేదీతో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై దృష్టి పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రపతి పదవి కోసం నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, జార్ఖండ్‌ గవర్నర్‌ ద్రౌపది ముర్ము రేసులో ఉన్నట్టు కమలదళంలో ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ అగ్రనేత అద్వానీ పేరు మాత్రం వినిపించడంలేదు.

14న రాష్ట్రపతి ఎన్నికలు..
మన దేశ 14 వ రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పడమూడవ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలంల ఈ ఏడాది జులైలో ముగుస్తుంది. ప్రణబ్‌ స్థానంలో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఐదు రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్‌ దీనిపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. బీజేపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, జార్ఖండ్‌ గవర్నర్‌ ద్రౌపది ముర్ముపేర్లు రాష్ట్రపతి పదవి కోసం వినిపిస్తున్నాయి. అయితే ఈ రేసులో బీజేపీ అగ్రనేత అద్వానీ లేకపోవడం విశేషం. వచ్చే నెల 11తో ముగియనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ రాష్ట్రపతి అభ్యర్ధి నిర్ణయంపై ఆర్‌ఎస్ఎస్‌, బీజేపీ నేతలు చర్చిస్తున్నారు. వచ్చే నెల 11తో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇదే అంశాన్ని తీసుకునే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థిత్వం ఖరారుపై సంఘ్‌ పరివార్‌, కమలనాథులు తరచు మంతనాలు జరుపుతున్నారు.

మురళీ మనోహర్ జోషి..
రాష్ట్రపతి పదవి కోసం బీజేపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 1991లో బీజేపీ అధ్యక్షుడుగా పని చేశారు. 1996-98, 1998099 మధ్య కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఉద్యమించారు. 1992లో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఏక్తా యాత్ర చేసి, ప్రజల దృష్టికి ఆకర్షించారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో రిపబ్లిక్‌ డే రోజు జాతీయ జెండా ఎగురవేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అరెస్టు అయ్యారు. ఇందిరిగాంధీ అత్యవర పరిస్థితి విధించినప్పుడు 19 నెలల పాటు జైల్లో ఉన్నారు.

సుస్మా స్వరాజ్..
విదేశాంగ మంత్రి సుస్మా స్వరాజ్‌ పేరు కూడా రాష్ట్రపతి పదవి కోసం విపినిస్తోంది. సుష్మకు ఆర్‌ఎస్‌ఎస్‌తో మంచి సంబంధాలున్నాయి. ఇద్ది కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇతర పార్టీల నేతలతో సంత్సబంధాలు కలిగి ఉన్నారు. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా రాష్ట్రపతి పదవి రేసులో ఉన్నారని బీజేపీలో ప్రచారం జరుగుతోంది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో కొంతకాలం మంత్రిగా పని చేశారు.జార్ఖండ్‌ గవర్నర్‌ ద్రౌపది ముర్ము కూడా గవర్నర్‌ రేసులో ఉన్నారు. ఈమె ఒడిశాకు చెందిన గిరిజన మహిళ. 1997లో మున్సిపల్‌ కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి, అంచలంచలుగా ఎదిగారు. ఒడిశా బీజేపీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. ఇంతవరకు గిరిజనుల నుంచి రాష్ట్రపతి ఎన్నికల కాలేదు. వచ్చే నెల 15 తర్వాత రాష్ట్రపతి అభ్యర్ధిత్వంపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు దృష్టి పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

06:37 - February 27, 2017

హైదరాబాద్ : అత్యాధునిక హంగులతో సైబరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రారంభమైంది. టాలెంట్‌ ఉండి ఆర్థికంగా వెనకబడిన కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ కేంద్రంలో.. ఎన్నో మెరుగైన వసతులున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని కళాకారులందరూ ఉపయోగించుకోవాలన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. సుద్దాల హనుమంతు పేరు మీదుగా నిర్మించిన యాంపీ థియేటర్‌ను ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం, వట్టికోట ఆళ్వారుస్వామి పేరు మీద ఏర్పాటు చేసిన మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ఫలహారశాలను సినీ నటులు మాదాల రవి ప్రారంభించారు.

అవకాశాలేవీ - బ్రహ్మానందం..
ప్రస్తుత రోజుల్లో టాలెంట్‌ ఉన్నవారికి అవకాశాలు రావడం లేదని... డబ్బు, పెద్దల అండదండలు ఉన్నవారే మనుగడ సాగిస్తున్నారన్నారు బ్రహ్మానందం. టాలెంట్‌ ఉండి.. ఆర్థికంగా వెనకబడిన కళాకారులను ప్రోత్సహించేందుకు యాంపీ థియేటర్‌ ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. గరికపాటి రాజారావు స్థాపించిన ప్రజా నాట్యమండలి ఎంతో మంది కళాకారులను తయారు చేసిందని.. వారిలో చాలామంది సినీ రంగంలో కూడా రాణిస్తున్నారన్నారు. సమాజంలో ఆకలి, అసమానతలు ఉన్నంతవరకు ప్రజానాట్యమండలి ఉంటుందన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు..
ప్రజల్లో చైతన్యం కోసం ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం తెచ్చిన గొప్ప వ్యక్తి వట్టికోట ఆళ్వార్‌స్వామి అని.. అలాంటి గొప్ప వ్యక్తి పేరు మీద ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్‌ హాల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు చుక్కా రామయ్య. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫలహారశాలను సినీ నటులు మాదాల రవి ప్రారంభించారు. పేద కళాకారులకు తోడ్పాడు అందించేందుకు ఫిలిం ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక ఈ కేంద్రంలో ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి సినిమా తరగతులు నిర్వహించనున్నట్లు ఎస్వీకే కార్యదర్శి వినయ్‌కుమార్‌ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, కళాకారులకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఎస్వీకే ట్రస్ట్‌ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

06:35 - February 27, 2017

హైదరాబాద్‌ : అజంపురాలోని నాలా ఒడ్డున మొసలి పిల్ల ప్రత్యక్షమైంది. మొసలి పిల్లను చూసి స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే చాదర్‌ఘాట్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన జూ అధికారులు... మొసలిపిల్లను పట్టుకుని "జూ''కు తరలించారు. అయితే.. నాలాలో మొసలి పిల్ల బయటపడడంతో ఇంకా మొసళ్లు ఉండొచ్చుననే అనుమానం స్థానికులను వెంటాడుతోంది.

06:34 - February 27, 2017

కృష్ణా : జిల్లా నందివాడ మండలంలో అన్యాక్రాంతమైన దళితుల భూములను తిరిగి దళితులకే అప్పగించాలన్న డిమాండ్‌తో సీపీఎం చేస్తున్న ఉద్యమం ఉధృతమైంది. భూబాధితులతో కలిసి పార్టీ నేతలు, కార్యకర్తలు ఇవాళ గుడివాడ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. అన్యాక్రాంతమైన వేలాది ఎకరాల భూమిని దళితులకు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని సీపీఎంతోపాటు ప్రజా సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు. ఈ నెల 6న ఇలపర్రులో భూపోరాటం చేసిన సీపీఎం నేతలు, సమస్యల పరిష్కారం కాకపోవడంతో గుడివాడ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించారు.

వేలది ఎకరాల భూములు..
నందివాడ మండలంలోని వివిధ గ్రామాల్లో దళితులు, బలహీనవర్గాలకు చెందిన వేలాది ఎకరాల భూములను ధనికులు ఆక్రమించుకున్నారు. ఇలపర్రు గ్రామంలో అన్యాక్రాంతమైన భూములు దళితులవేనని జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవో జరిపిని విచారణలో తేలింది. అయినా భూమిని దళితులకు స్వాధీనం చేయలేదు. అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అండ చూసుకుని ఆక్రమించుకున్న భూములను యథేచ్చగా అనుభవిస్తున్నారు. సీపీఎంతో పాటు ప్రజా సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

వలసల బాట..
దళితుల భూములను ఆక్రమించుకున్న భూస్వాములు చేపలు, రొయ్యల చెరువులు తవ్వారు. దీంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దయనీయ పరిస్థితి దాపురించింది. జలకాలుష్యం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉపాధిలేక ఊళ్లోని పేదలు వలసల బాటపట్టారు. అన్యాక్రాంతమైన తమ భూములను తిరిగి అప్పగించాలన్నడిమాండ్‌తో ఆందోళన చేస్తున్న దళితులపై పోలీసులు ఉక్కుపాదం మోపడాన్ని ప్రజా సంఘాల నాయకులు తప్పుపడుతున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్న సీపీఎం నేతలతోపాటు ప్రజా సంఘాల నాయకులను నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూఆక్రమణపై కలిసివచ్చే రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని సీపీఎం నిర్ణయించింది. ధనికుల ఆక్రమణల్లో ఉన్న తమ భూములను అప్పగిస్తే సాగుచేసుకుని జీవితాలను మెరుగుపరుచుకుంటామని బాధితులు చెబుతున్నారు.
అన్యాక్రాంతమైన దళితుల భూములను తిరిగి వీరికి అప్పగించాలన్న డిమాండ్‌తో ఆర్టీవో కార్యాలయాన్ని ముట్టడించాలని సీపీఎంతోపాటు ప్రజా సంఘాలు నిర్ణయించిన నేపథ్యంలో గుడివాడంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

06:29 - February 27, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు... ప్రజా సమస్యల చర్చకు వేదిక కావాలన్నారు పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి. సభలో అధికార, విపక్ష సభ్యులు.. తమ పొలిటికల్ మైలేజీని పక్కన పెట్టి.. ప్రజలకు జవాబుదారీతనంగా నడుచుకోవాలని సూచించారు. సమావేశాలు తూతూమంత్రంగా కాకుండా... 30 రోజులు నిర్వహించి... అన్ని ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని రఘువీరా డిమాండ్ చేశారు.

06:27 - February 27, 2017

కర్నూలు : కాపులకు రిజర్వేషన్‌ కల్పించేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.. కాపు ఓట్లతో అధికారంలోకివచ్చిన సీఎం చంద్రబాబు.. మాట తప్పారని ఆరోపించారు.. సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని ముద్రగడ తేల్చిచెప్పారు. కర్నూలులో కాపు సత్యాగ్రహదీక్ష చేపట్టారు.. కాపులకు రిజర్వేషన్‌ సాధించేవరకూ నిద్రపోవద్దని... సీఎం చంద్రబాబును నిద్రపోనివ్వొద్దని కాపులకు సూచించారు.. ఈ ఉద్యమంలో చావోరేవో తేల్చుకోవాలన్నారు. కాపు ఓట్లతో కుర్చీ ఎక్కిన చంద్రబాబు... ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆరోపించారు.. ఓవైపు కాపులకు ఉయ్యాల ఊపుతూనే... మరోవైపు బీసీలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.. తనకు ఊపిరి ఉన్నంతవరకూ కాపు జాతికోసమే పనిచేస్తానని ప్రకటించారు. కర్నూలు నగరంలో జరగిన ఈ సత్యాగ్రహ దీక్షకు పలువురు కాపు, బలిజ నేతలు మద్దతు తెలిపారు.. ఉదయం 9గంటలనుంచి సాయంత్రం 6గంటలవరకూ ముద్రగడ దీక్ష కొనసాగించారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మరిన్ని పోరాటాలు చేసేలా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ముద్రగడ ప్రకటించారు.

06:25 - February 27, 2017

విజయవాడ : పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే ఎమ్మెల్సీ టెకెట్లు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికతో పాటు 17 అంశాలపై చర్చించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులపై నాలుగ్గంటల పాటు చర్చించిన పొలిట్‌బ్యూరో సభ్యులు తుది నిర్ణయాన్ని మాత్రం అధినేత చంద్రబాబుకే వదిలేశారు. దీంతో అభ్యర్థుల ఎంపికపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఇటీవల అమెరికాలో తెలుగు వారిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించింది. అమెరికాలో తెలుగు వారికి రక్షణ కల్పించాలని కేంద్రానికి లేఖ రాయాలని సమావేశం నిర్ణయించింది.

కేంద్రంపై వత్తిడి..
గడిచిన ఎన్నికల్లో నిరుద్యోగుల‌కు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. రాష్ట్ర విభ‌జ‌న హామీల అమ‌లుతో పాటు నియోజ‌క‌ర్గాల పున‌ర్‌వ్యవస్థీకరణ అంశాల‌పై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని తీర్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్ల పరిధిలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చెయ్యాల‌ని నిర్ణయించారు. వీధి బాల‌ల సంర‌క్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఎన్టీఆర్ హ‌యాంలోని మూడంచెల స్థానిక సంస్థల వ్వవస్థను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు పొలిట్‌బ్యూరో నిర్ణియించింది. ఏక కాలంలో ఎన్నిక‌లు జరిపే అంశంపై కేంద్రం ఆలోచ‌న‌కు మ‌ద్దతు ఇవ్వాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.

లోకేష్ కు టికెట్..
త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై పొలిట్‌బ్యూరో సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. అయితే.. పార్టీ కోసం కష్టపడ్డ వారికే ఎమ్మెల్సీ సీట్లు ఇస్తానని చంద్రబాబు సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల కోటాలో ఎంపిక చెయాల్సిన ఎనిమిది మంది అభ్యర్థుల పేర్ల పైనా.. అదేవిధంగా ఎమ్మెల్యే కోటాలో టీడీపీకి వచ్చే ఐదు సీట్లకు అభ్యర్థుల ఎంపిక పైనా సమావేశంలో చర్చించారు. ప్రాంతాలు, కులాల వారిగా సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని ఎంపికపై చర్చ జరిగింది. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయాన్ని అధినేత చంద్రబాబుకే అప్పగించారు పొలిట్‌బ్యూరో సభ్యులు. ఎమ్మెల్యే కోటాలో మాత్రం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు టికెట్టు ఇవ్వాలని తీర్మానించి.. ఆ ప్రతిని చంద్రబాబుకు అందించారు. ఈ సారి కచ్చితంగా లోకేశ్‌ శాసనమండలికి వస్తారని పొలిట్‌బ్యూరో సభ్యులు ధీమా వ్యక్తం చేశారు. అయితే.. మంగళవారంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ గడువు ముగియనుండటంతో.. అంతకుముందే అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి.

06:23 - February 27, 2017

హైదరాబాద్ : నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగువేల పోస్టులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. వీటి భర్తీ కోసం జిల్లాల వారీగా ప్రతిపాదనలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయా మంత్రులకు సూచించారు. బడ్జెట్‌ సమావేశాలలోపే ఈ పదవులను భర్తీ చేసేందుకు గులాబీ దళపతి కసరత్తు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలను ఎంతోకాలంగా ఊరిస్తున్న నామినేటెడ్‌ పదవులు భర్తీకి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ ఏడాది జూన్‌ 2 వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తవుతుంది. ఆలోగా అన్ని నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో గుర్తించిన పదవుల భర్తీకి చర్యలు తీసుకోవాలని క్యాంపు కార్యాయంలో మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

అన్ని స్థాయిల్లో దేవాలయ కమిటీ ఏర్పాటు..
రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లతోపాటు, జిల్లా స్థాయిలో ఉన్న నామినేడెట్‌ పోస్టులన భర్తీ చేస్తారు. ఇప్పటికే కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన కేసీఆర్‌, మిగిలిన వాటిని కూడా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఖాళీగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లను కూడా నిమియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో జిల్లా గ్రంథాయల సంస్థల చైర్మన్లను నియమిస్తారు. అలాగే దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని దేవాలయాలకు కమిటీలను నియమిస్తారు. వీటిన్నింటిలో దాదాపు నాలుగువేల వరకు పదవులు ఉన్నట్టు గుర్తించారు.

జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు..
నామినేటెడ్‌ పోస్టు భర్తీకి జిల్లాల వారీగా ప్రతిపానదలను తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంబంధిత మంత్రులను కోరారు. పార్టీ కోసం పని చేసిన వారిలో సమర్ధులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సమయంలో సామాజిక సమీకరణలను కూడా పరిశీలించాలని కోరారు. ఎవరినీ నిరుత్సాహపరచకుండా అందరి నుంచి ప్రతిపాదనదలు తీసుకుంటే, పరిశీలించి ఎంపిక చేయవచ్చని కేసీఆర్‌ సూచించారు. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. నామినేటెడ్‌ పోస్టుల్లో ఎక్కువ భాగం బడ్జెట్‌ సమావేశాలలోపు భర్తీ చేయాలని భావిస్తున్నారు. అయితే.. కొన్ని పోస్టులు మాత్రం రాష్ట్రావతణ దినోత్సవం జూన్‌ 2 లోగా పూర్తి చేసే అవకాశాలున్నాయి. నామినేటెడ్‌ పోస్టుల భర్తీతోపాటు పార్టీ కమిటీల నియామకంపై కూడా కేసీఆర్‌ ధృష్టి పెట్టారు. రాష్ట్ర , జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీ ఏర్పాటు ద్వారా పార్టీని పటిష్టపరి 2019 అసెంబ్లీ ఎన్నికలకు సమాయాత్తం చేయాలని భావిస్తున్నారు.

నేటి నుండి యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు..

యాదాద్రి : యాదాద్రి బ్రహ్మోత్సవ సంబురాలు సోమవారం నుండి 11 రోజుల పాటు జరగనున్నాయి. 6వ తేదీన జరిగే కళ్యాణోత్సవానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ హాజరు కానున్నారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

నేడే..యూపీలో ఐదో దశ ఎన్నికలు..

ఉత్తర్ ప్రదేశ్ : అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. సోమవారం ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఐదో దశలో 11 జిల్లాల పరిధిలో 51 అసెంబ్లీ నియోజవకర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

మంగళవారం బ్యాంకు ఉద్యోగుల సమ్మె..

హైదరాబాద్ : బ్యాంకు ఉద్యోగులు మంగళవారం సమ్మెకు దిగనున్నారు. దీనితో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించే అవకాశం ఉంది.

షార్ లో ఫైర్ ఆక్సిడెంట్...

నెల్లూరు : సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘన ఇంధనం..ఇంధన వ్యర్థాలను నిల్వ ఉంచి భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు.

ఏపీ కొత్త అసెంబ్లీలో విధులు ప్రారంభం..

విజయవాడ : అసెంబ్లీ భ‌వ‌నంలో సిబ్బంది సోమవారం నుండి విధులు ప్రారంభించ‌నున్నారు. ఉద‌యం 11.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు సభాపతి కోడెల శివ‌ప్ర‌సాద్ రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొంటారు. వ‌చ్చేనెల‌ రెండో తేదీన ఉదయం 11:25 గంటలకు రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీని ప్రారంభించనున్నారు.

భవత జూ.కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్..

సూర్యాపేట : భవత జూనియర్ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని బాలాజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

హైదరాబాద్ లో కరీంనగర్ వైద్యుడు ఆత్మహత్య..

హైదరాబాద్ : అత్తాపూర్ లో జనప్రియ అపార్ట్ మెంట్ లో కరీంనగర్ కు చెందిన వైద్యుడు శివ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Don't Miss