Activities calendar

28 February 2017

21:56 - February 28, 2017

ఢిల్లీ : ఆర్‌ఎస్‌ఎస్‌ తన హిందుత్వ ఎజెండాను దేశంపై రుద్దుతోందని సిపిఎం మండిపడింది. తిరంగా జెండా ప్రదర్శించినంత మాత్రాన దేశభక్తులు కాలేరని, అసలు సిసలు జాతీయత మనసులోనే ఉంటుందని పేర్కొంది. మోది సర్కార్‌ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అసహన పరిస్థితులు నెలకొన్నాయని వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో భారీ మార్చ్‌ నిర్వహించాయి.
ఏబీవీపీని వ్యతిరేకిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ర్యాలీ
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీని వ్యతిరేకిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు రాంజస్‌ కళాశాలలో భారీగా మార్చ్‌ నిర్వహించాయి. ఏబీవీపీ ఆగడాలను అరికట్టాలని..ఢిల్లీ యూనివర్సిటీని కాపాడాలని కోరుతూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థుల ర్యాలీకి జెఎన్‌యు టీచర్స్‌ అసోసియేషన్‌ మద్దతు తెలిపింది. యూనివర్సిటీలో ఏబివిపి, గూండాయిజం చేస్తోందని విద్యార్థి సంఘం ఐసా ఆరోపించింది. విద్యార్థులంతా ఆజాదీ నినాదాలతో హోరెత్తించారు.
వామపక్ష విద్యార్థి సంఘాల మార్చ్‌కు ఏచూరీ సంఘీభావం
ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీకి వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహించిన మార్చ్‌కు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంఘీభావం తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తన హిందుత్వ ఎజెండాను దేశంపై రుద్దుతోందని ఏచూరి మండిపడ్డారు. దేశంలో అసలు సిసలైన జాతీయవాదులు తామేనని...  బిజెపి జాతీయత అంటే హిందుత్వ నినాదమని, తమది ఇండియన్‌ వాదమని ఆయన స్పష్టం చేశారు. ఏబివిపి తిరంగా జెండా ప్రదర్శించినంత మాత్రాన జాతీయత కలగదని... జాతీయభావన అనేది మనసులో ఉండాలన్నారు.  కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఏబివిపి గుండాయిజం పెరిగిపోయిందని ఏచూరి ధ్వజమెత్తారు. 
కిరణ్‌ రిజిజు వ్యాఖ్యలను తప్పుబట్టిన ఏచూరి 
గుర్‌మెహర్‌కౌర్‌పై కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఏచూరి తప్పుబట్టారు. చట్టాన్ని కాపాడాల్సిన మంత్రి విద్యార్థినిని బెదిరించడమేంటని మండిపడ్డారు. మరోవైపు, ఏబీవీపీకి వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థులు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.

 

21:51 - February 28, 2017

హైదరాబాద్ : ఏపీలో 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. అధికార టీడీపీ 9 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది. ఇక ప్రతిపక్ష వైసీపీ 4 స్థానాల్లో తమ అభ్యర్ధులను పోటీలో నిలబెట్టింది.  టీడీపీ తరపున శ్రీకాకుళం జిల్లాలో మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు, నెల్లూరులో వాకాటి నారాయణరెడ్డి, తూర్పుగోదావరి జిల్లాలో చిక్కాల రామచంద్రరావు, పశ్చిమ గోదావరి జిల్లాలో  అంగర రామ్మోహన్‌రావు, మంతెన సత్యనారాయణ,కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి బీఎన్‌ రాజసింహులు,  అనంతపురంలో దీపక్‌రెడ్డి , కడప జిల్లాలో బీటెక్‌ రవి నామినేషన్లు వేశారు. ఇక వైసీపీ   కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో తమ అభ్యర్ధులను నిలిపింది.  రేపు నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. మార్చి 3 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు ఏకగ్రీవ స్థానాలను ప్రకటించనున్నారు.
 

21:49 - February 28, 2017

హైదరాబాద్ : ఏపీ కొత్త సీఎస్‌గా ఐఏఎస్ అధికారి అజేయ్ కల్లం బాధ్యతలు తీసుకున్నారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎస్‌ టక్కర్, మంత్రి యనమల సమక్షంలో అజేయ్ కల్లం సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అజేయ్ కల్లంకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. అజేయ్ కల్లం ఈ ఏడాది మార్చి 31 తేదీ వరకూ సీఎస్‌గా కొనసాగనున్నారు. సచివాలయ ఉద్యోగులు కొత్త సీఎస్‌ను కలిసి అభినందనలు తెలిపారు. 33 సంవత్సరాల క్రితం భువనగిరి సబ్ కలెక్టర్‌గా బదిలీపై వెళ్తు... టక్కర్ తనకు బాధ్యతలు అప్పగించారని, మళ్లీ ఇప్పుడు టక్కర్ నుంచే సీఎస్‌గా బాధ్యతలు తీసుకుంటున్నానని అజయ్‌ కల్లం అనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి నెల రోజుల వ్యవధిలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇటు సీఎస్‌గా పదవీ విరమణ చేసిన టక్కర్‌కు ముఖ్యమంత్రి, సచివాలయ ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. 

 

21:47 - February 28, 2017

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, గృహనిర్మాణ, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు హాజరయ్యారు. ఇళ్ల నిర్మాణం, భూమి లభ్యతపై కేటీఆర్‌ చర్చించారు. మార్చి చివరి నాటికి ఎక్కువ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములను ఇళ్ల నిర్మాణానికి కేటాయించేలా చూడాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. 

 

కలెక్టర్ పై జగన్ తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం : కళా వెంకట్రావ్

విజయవాడ : కలెక్టర్ పై జగన్ తీరుని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావ్ అన్నారు. కలెక్టర్ తో ఎలా ఉండాలి అనే జ్ఞానం కూడా జగన్ కి లేదని ఎద్దేవా చేశారు. జగన్ కు రౌడీ లక్షణాలే తప్ప రాజకీయలక్షణాలు లేవని ఘాటు విమర్శలు చేశారు. తక్షమే అధికారులకు జగన్ క్షమాపణ చెప్పాలన్నారు.

 

కలెక్టర్, ఆసుపత్రి వైద్యులతో జగన్ వాగ్వాదం

విజయవాడ : కలెక్టర్, ఆసుపత్రి వైద్యులతో జగన్ వాగ్వాదం దిగారు. బస్సు డ్రైవర్ పోస్టుమార్టం రిపోర్టును డాక్టర్ వద్ద నుంచి జగన్ లాక్కున్నారు. జగన్ వద్ద నుంచి పోస్టుమార్గం నివేదికను కలెక్టర్ తీసుకున్నారు. పోలీసుల నుంచి కలెక్టర్ వరకు అందరూ అవినీతి పరులే అని జగన్ ఆరోపించారు. సెంట్రల్ జైలుకు పంపుతామని కలెక్టర్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. 

21:37 - February 28, 2017

మాములుగా గాలి పీల్చకపోతే చస్తారు..కానీ ఇక్కడ గాలి పీల్చినందుకు చస్తున్నారు..ఇది మామూలు గాలి కాదు.. ఊపిరితిత్తులను రోజుకింత కొరుక్కుతినేస్తుంది. ఇది ఏ ఒక్క ప్రదేశానికో.. నగరానికో పరిమితం కాలేదు. దేశంలోని పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న స్థాయి పట్టణాల వరకు ఇదే పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే వాయు కాలుష్యం అంతులేకుండా పెరుగుతోంది. ప్రాణాంతకంగా మారుతోంది. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ చూద్దాం... మరిన్ని వివరాలను వీడియోలో చూడండి...

21:30 - February 28, 2017
21:27 - February 28, 2017
21:16 - February 28, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ బ్యాంకులకు కొమ్ముకాస్తోందని బ్యాంకు ఉద్యోగులు  ఆరోపించారు.  ఆర్‌బీఐ అవలంభిస్తోన్న విధానాలను తీవ్రంగా ఖండించారు.  తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేపట్టారు.  ఉద్దేశ్యపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టేవారిపై ఖఠిన చర్యలు తీసుకునేలా ఓ చట్టం తీసుకురావాలని కోరారు.  బ్యాంకుల విలీనాన్ని ఆపివేయాలని డిమాండ్‌ చేశారు.  నోట్ల రద్దుతో    బ్యాంకు ఉద్యోగులు అదనంగా పనిచేసినా ప్రభుత్వం ఎలాంటి వేతనం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

 

21:12 - February 28, 2017

ఢిల్లీ : దేశంలోని యూనివర్శిటీల్లో ఏబీవీపీ విద్యార్థులు రెండేళ్లుగా అశాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈమేరకు ఏచూరితో 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేందుకు భరోసా ఇచ్చేందుకే డీయూకి వచ్చానని, రాజకీయాల కోసం కాదన్నారు సీతారాం. బీజేపీది హిందూత్వ రాజకీయమన్నారు. యూనివర్శిటీలలో స్వయం ప్రతిపత్తిని కాపాడుతామన్నారు. యూనివర్శిటీల్లో పరిస్థితులు సరిగా ఉంటేనే.. దేశంలో పరిస్థితులు సరిగా ఉంటాయని తెలిపారు. రాంజస్‌ యూనివర్శిటీలో సేవ్‌ డీయూ ర్యాలీకి సీపీఎం, సీపీఐ, జేడీయూ ఎంపీలు మద్దతు పలికారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:10 - February 28, 2017
20:56 - February 28, 2017

కృష్ణా : జిల్లాలో నందిగామ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముళ్లపాడు బస్సు ప్రమాద బాధితులను జగన్‌ పరామర్శించిన అనంతరం..వైద్యుల వద్ద ఉన్న పోస్టుమార్టం రిపోర్టును తీసుకున్నారు. ఆ తర్వాత జగన్‌ చేతిలో ఉన్న పోస్టుమార్టం నివేదికను కలెక్టర్‌ మళ్లీ తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన జగన్‌ కలెక్టర్‌ను జైలుకు పంపుతానని హెచ్చరించారు. 

 

 

20:49 - February 28, 2017

జనం పాణాలు దీస్తున్న బస్సులు.... సంపాదనే కావాలంటున్న బాసులు, పురిటినొప్పులకు దూరమైన తెలంగాణ.. సిజేరియన్ ఆపరేషన్లల రాష్ట్రమే ఫస్టు, ఏజెన్సిలపొంటి గిరిజనుల కష్టాలు.. ఎండాకాలం రాకముందే నీళ్ల బాధలు, మహిళా సర్పంచిని తిట్టిన గంగాధర ఎస్సై... కమిషనర్ కు కంప్లైట్ చేసిన గ్రామస్తులు, పిన్ లాండ్ పిల్లతోని తెలంగాణ పోరని పెళ్లి... దండలు మార్చుకుని దంపతులైర్రు, దేవున్ని కిడ్నాప్ జేసిన దుండగులు... జగిత్యాల జిల్లాల వినాయకున్ని గోస.... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:40 - February 28, 2017

హైదరాబాద్ : ఏపీ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసమ్మతి నెలకొంది. శ్రీకాకుళంలో శత్రుచర్లకు టికెట్ ఇవ్వడం పట్ల జిల్లా టీడీపీ నేతలు ఆసంతృప్తిగా ఉన్నారు. నెల్లూరు వాకాటి నారాయణరెడ్డి, అనంతపురం దీపక్ రెడ్డి, తూర్పుగోదావరి చిక్కాల అభ్యర్థిత్వాలను స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారిని పార్టీ అధిష్టానం పట్టించుకోలేదని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ టీడీపీలో అసమ్మతి

హైదరాబాద్ : ఏపీ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసమ్మతి నెలకొంది. శ్రీకాకుళంలో శత్రుచర్లకు టికెట్ ఇవ్వడం పట్ల జిల్లా టీడీపీ నేతలు ఆసంతృప్తిగా ఉన్నారు. నెల్లూరు వాకాటి నారాయణరెడ్డి, అనంతపురం దీపక్ రెడ్డి, తూర్పుగోదావరి చిక్కాల అభ్యర్థిత్వాలను స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారిని పార్టీ అధిష్టానం పట్టించుకోలేదని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.

 

గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో మరొకరు మృతి

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో మరొకరు మృతి చెందారు. దోమలగూడకు చెందిన ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆస్పత్రిలో మరో 8 మంది చికిత్స పొందుతున్నారు. 

20:28 - February 28, 2017
20:26 - February 28, 2017

ప్రజ్ఞాజైస్వాల్ తో 10 టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన సినిమా అనుభావాలును తెలిపారు. తన సినీ కెరీర్ గురించి వివరించారు. ఆమె పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆమె తెలిపిన మరిన్ని విశేషాలను వీడియోలో చూద్దాం....

 

20:12 - February 28, 2017

తూర్పుగోదావ‌రి : జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి చిక్కాల రామ‌చంద్రరావు నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కాకినాడ క‌లెక్టరేట్‌లో రిట‌ర్నింగ్ ఆఫీసర్‌కు ఆయ‌న రెండు సెట్ల నామినేష‌న్ ప‌త్రాలు అందించారు. ఆయ‌న వెంట జిల్లా ఇంఛార్జ్ మంత్రి దేవినేని ఉమా, ఎంపీ తోట న‌ర‌సింహం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  పాల్గొన్నారు. గ‌తంలో తాళ్లరేవు నియోజ‌క‌వ‌ర్గంలో నుంచి వ‌రుస‌గా ఐదు సార్లు విజ‌యం సాధించిన ఘ‌న‌త చిక్కాల రామ‌చంద్రరావుకి ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివ‌ర్గాల్లో ఆయ‌న మంత్రిగా కూడా ప‌నిచేశారు. మరోవైపు సిట్టింగ్స్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావుకి టికెట్ ద‌క్కకపోవడంతో... ఆగ్రహంతో ఉన్నారన్న సమాచారంతో.. మంత్రి ప్రత్తిపాటి ఆయనను బుజ్జిగించేపనిలో ఉన్నారు. 

20:08 - February 28, 2017

కర్నూలు : జిల్లా  స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి టీడీపీ అభ్యర్ధిగా శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్‌ వేశారు. మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితోపాటు టీడీపీ కార్యకర్తలు వెంటరాగా.. జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

 

20:06 - February 28, 2017

నెల్లూరు : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల నామినేష‌న్ల ఘ‌ట్టం ముగిసింది. అధికార టీడీపీ త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ రెడ్డి, వైసీపీ త‌ర‌పున ఆనం విజ‌య్ కుమార్ రెడ్డి నామినేష‌న్లు వేశారు. వాకాటి నారాయ‌ణ రెడ్డితో ఇన్‌చార్జి మంత్రి  శిద్దా రాఘ‌వ‌రావు సహా పలువురు ప్రముఖులు వెంటరాగా అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. మ‌రోవైపు ప్రతిపక్ష వైసీపీ కూడా అట్టహాసంగా నామినేష‌న్ దాఖ‌లు చేసింది. నెల్లూరు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్రసాద్, త‌దిత‌రులు వెంట‌రాగా  వైసీపీ అభ్యర్థి విజ‌య్ కుమార్ రెడ్డి  నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఎవ‌రికి వారు త‌మ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. 

20:04 - February 28, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మరో అరుదైన గౌరవం లభించింది. సీఎన్‌బీసీ టీవీ18 అందించే ఇండియా బిజినెస్‌ లీడర్‌ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు  స్టేట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారం లభించింది.  బ్యాంకింగ్‌, పారిశ్రామిక రంగాల జాతీయస్థాయి ప్రముఖుల జ్యూరీ  ఈ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది.  మార్చి 23న పురస్కారం ప్రదానం చేయనున్నారు.  పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబును  ఆహ్వానించారు. 

20:00 - February 28, 2017

కడప : నగరంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన జనవేదన సదస్సు రసాభాసగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సదస్సులోనే బాహాబాహీకి దిగారు. ఒకవర్గంపై మరోవర్గం నేతలు దాడి చేసుకున్నారు.  కడప కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడికి  జనవేదన సదస్సుకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదంటూ ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదస్సును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.   జిల్లా అధ్యక్షుడిపై  బూతు పురాణం అందుకున్నారు.  మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు జోక్యం చేసుకుని సర్దిచెప్పబోయినా వినిపించుకోలేదు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌నేత సి. రామచంద్రయ్య చూస్తూ ఉండిపోయారు. 

19:57 - February 28, 2017

కృష్ణా : జిల్లాలో ముళ్లపాడు ఘటనలో మృతుల కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్‌ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే క్షతగాత్రులకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్‌ మద్యం సేవించాడో లేదో తెలుసుకోవడానికి అతని మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టం చేయలేదని నిలదీశారు. బస్సులో రెండో డ్రైవర్‌ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. ఆ డ్రైవర్‌ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. ఎవరో అనామక వ్యక్తిని తెరపైకి తెచ్చి బస్సుయాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

 

19:54 - February 28, 2017

నల్లగొండ : జిల్లాలో నాగార్జున సాగర్‌ వద్ద ఏపీ, తెలంగాణ ఇరిగేషన్‌ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏపీ కుడి కాలువకు 15.2 టీఎంసీల నీరు విడుదలైందని నీటిసరఫరాను తెలంగాణ అధికారులు నిలిపివేశారు. మరోనైపు ఏపీ అధికారులు మాత్రం 13.2 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేశారని మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల నీటిపారుదల అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇరు రాష్ట్రాల నీటిపారుదల అధికారుల మధ్య వాగ్వాదం

నల్లగొండ : జిల్లాలో నాగార్జున సాగర్‌ వద్ద ఏపీ, తెలంగాణ ఇరిగేషన్‌ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏపీ కుడి కాలువకు 15.2 టీఎంసీల నీరు విడుదలైందని నీటిసరఫరాను తెలంగాణ అధికారులు నిలిపివేశారు. మరోనైపు ఏపీ అధికారులు మాత్రం 13.2 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేశారని మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల నీటిపారుదల అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

19:50 - February 28, 2017

జగిత్యాల : టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవితపై మాజీమంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. కవితకు మహిళల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేసీఆర్‌ కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించేలా కేసీఆర్‌ మాట్లాడాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాలలో జనవేదన సదస్సు నిర్వహించారు. దీనికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.  నిజామాబాద్‌ పసుపు, చెరుకు రైతుల సమస్యల పరిష్కారం కోసం కవిత కృషి చేయాలని శ్రీధర్‌బాబు కోరారు.

 

19:47 - February 28, 2017

హైదరాబాద్ : మార్చి 19న హైదరాబాద్ నిజాం కాలేజీలో జరగనున్న తెలంగాణ సామాజిక సంక్షేమ సమర సమ్మేళనానికి అన్ని రంగాల ఉద్యోగ, సామాజిక సంఘాలు, కార్మికులు తరలిరావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు విజ్ఞప్తి చేశారు. సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా జరుగుతున్న ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సాయిబాబు నిప్పులు చెరిగారు. కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామన్న హామిని తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. 

 

19:43 - February 28, 2017

సూర్యాపేట : జిల్లాలో 135వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. తుంగతుర్తి మండలం అన్నారంలో మహాజన పాదయాత్ర బృందానికి సీపీఎం శ్రేణులు, కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. ఎలకపల్లిలో తెలంగాణ సాయుధ పోరాటంపై 'బండెనక బండి కట్టి' పాట రాసిన యాదగిరి విగ్రహం, స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. నైజాం సర్కార్‌కు వ్యతిరేకంగా యాదగిరి పాట రాసి ప్రజల్లో చైతన్యం నింపారని నేతలు కొనియాడారు. యాదగిరి త్యాగాలు, పోరాటాలు సమాజానికి స్ఫూర్తి నింపాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

 

19:40 - February 28, 2017
19:38 - February 28, 2017

హైదరాబాద్ : ఒంటరి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐద్వా మహిళా సంఘం గళమెత్తింది. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒంటరి మహిళల రాష్ట్ర సదస్సు నిర్వహించింది. ఒంటరి మహిళలకు ప్రభుత్వం వెయ్యి పెన్షన్‌ ప్రకటించడాన్ని ఐద్వా స్వాగతిస్తుందని ఆ సంఘం ఉపాధ్యక్షురాలు జ్యోతి అన్నారు.  సమాజంలో ఒంటరి మహిళల పట్ల ఉన్న చులకన భావం, మూఢనమ్మకాలు రూపుమాపడానికి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మహిళలంతా ఐక్యంగా ఉంటేనే వారి సమస్యలు పరిష్కరమవుతాయని యూటీఎఫ్‌ నాయకురాలు సంయుక్త చెప్పారు.

 

19:37 - February 28, 2017

హైదరాబాద్ : పాల‌మూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ప‌నుల్లో సీఎం కేసీఆర్, మంత్రి హ‌రీష్ రావు 12 శాతం క‌మీష‌న్‌లు దండుకుంటున్నార‌ని బిజేపీ నేత నాగం జనార్దన్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాల‌న అంతా కాంట్రాక్టర్ల రాజ్యంగా మారింద‌ని విమర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిపై కోర్టులో పిల్ వేస్తే కేసీఆర్ ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ప్రశ్నించారు.  

19:33 - February 28, 2017

హైదరాబాద్ : అమెరికాలో జాత్యహంకార దాడిలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్‌ అంత్యక్రియలు అశ్రు నివాళుల మధ్య పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని శ్రీనివాస్‌ నివాసం వద్ద స్నేహితులు, బంధువులు, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో శ్రీనివాస్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
జాత్యహంకార దాడిలో మృతి
దేశంకాని దేశంలో జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీని తలచుకుని.. ఆయన కుటుంబం శోకసంద్రమైంది. శ్రీనివాస్‌ భౌతిక దేహాన్నిఅమెరికా నుంచి హైదరాబాద్‌కు ఆదివారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో తీసుకువచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఎస్కార్ట్‌ నడుమ.. మృతదేహాన్ని శ్రీనివాస్‌ ఇంటికి తరలించారు. మృతదేహం ఇంటికి రాగానే, ఒక్కసారిగా అక్కడి వాతావరణం బరువెక్కింది. బంధువులు, స్నేహితులు శ్రీనివాస్‌ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కష్టసుఖాల్లో వెన్నంటే ఉంటానన్న భర్త కళ్లముందు విగతజీవిగా పడిఉండడాన్ని జీర్ణించుకోలేక శ్రీనివాస్‌ భార్య సునయన తల్లడిల్లిపోయారు. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. 
శ్రీనివాస్‌ను కడసారి చూసేందుకు... 
శ్రీనివాస్‌ను కడసారి చూసేందుకు ఆయన నివాసానికి రాత్రి నుంచే భారీసంఖ్యలో బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సినీనటుడు రాజశేఖర్‌, జీవిత దంపతులు సహా పలువురు ప్రముఖులు శ్రీనివాస్‌ భౌతిక కాయానికి నివాళులర్పించారు.  శ్రీనివాస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. కన్నీటి నివాళులర్పించారు అతని స్నేహితులు. 
అంత్యక్రియలు పూర్తి
ఈ ఉదయం, శ్రీనివాస్‌ మృతదేహాన్ని స్వగృహం నుంచి ప్రత్యేక వాహనంలో మహాప్రస్థానానికి తరలించారు. వందలాది మంది బంధువులు, స్నేహితుల కన్నీటి వీడ్కోలు మధ్య శ్రీనివాస్‌ కూచిభొట్ల అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను పూర్తి చేశారు. శ్రీనివాస్‌కు, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు శోకతప్త హృదయాలతో తుది వీడ్కోలు పలికారు. 

 

18:41 - February 28, 2017

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీసీ నేత పుల్లారావు, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు, టీడీపీ మహిళ అధ్యక్షురాలు సునీత పాల్గొని, మాట్లాడారు. విద్యుత్ మిగులు ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసమేంటని ప్రశ్నించారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని మానుకోవాలని హితవు పలికారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:21 - February 28, 2017

హైదరాబాద్ : మెట్రో నగరం హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ క్రయ విక్రయాలు జ‌రుగుతాయి. అదే స్థాయిలో షాపింగ్ మాల్స్ ఫంక్షన్ హాల్స్ తో పాటు గ‌ల్లి స్థాయి కిరాణాస్టోర్స్‌ వరకు ల‌క్షల్లో ఎస్టాబ్లిస్మెంట్స్ ఉన్నాయి. వీటి ద్వారా బ‌ల్దియాకు లైసెన్స్ ఫీజు రూపంలో 100 కోట్ల వ‌ర‌కు ఖ‌జానాకు చేరాలి. కానీ అధికారుల ధ‌న‌దాహంతో బ‌ల్దియా గ‌ల్లా పెట్టెకు పెద్ద చిల్లు ప‌డుతోంది. అస‌లు గ్రేట‌ర్‌లో ఉన్న ట్రేడ్స్‌ ఎన్ని..? వాటి నుంచి వస్తున్న ఆదాయమెంతో తెలుసా..? వాచ్‌ దిస్ట్‌ స్టోరీ..
అవినీతికి కేరాఫ్ అడ్రస్ బ‌ల్దియా  
బ‌ల్దియా అంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్. ఇది ఎవ్వరో సామాన్యులు చెప్పింది కాదు. ఏకంగా సీఎం కేసీఆర్ ప‌లుమార్లు బ‌హిరంగంగానే అన్నమాట‌లు. క్షేత్రస్థాయి నుండి ఉన్నతాధికారుల వ‌ర‌కు ధ‌న దాహానికి మ‌రిగారు బ‌ల్దియా అధికారులు. వివిధ రూపాల్లో కార్పొరేష‌న్‌కు వ‌చ్చే వంద‌ల కోట్ల ఆదాయానికి గండి కొట్టి త‌మ జోబుల్లోకి మ‌ళ్లిస్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ..ఎంత వీలైతే అంత నొక్కేస్తున్నారు. దీంతో అవినీతి అధికారుల ఆట‌ల‌కు బ్రేకులు లేకుండా పోయాయి. 
రెండున్నర ల‌క్షల క‌మ‌ర్షియ‌ల్ క‌నెక్షన్లు 
అయితే హైద‌రాబాద్ న‌గ‌రంలో విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం రెండున్నర ల‌క్షల క‌మ‌ర్షియ‌ల్ క‌నెక్షన్లు ఉన్నాయి. క‌మ‌ర్షియ‌ల్ టాక్స్ లెక్కల ప్రకారం ల‌క్షా ప‌ది వేల ట్రేడ్స్ ఉన్నాయి. కానీ బ‌ల్దియా ట్రెడ్ లైసెన్స్ విభాగంలో ఇప్పటి వ‌ర‌కు 70వేల 500 ట్రేడ్స్ మాత్రమే ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. 2014 - 15 సంవ‌త్సరంలో 51 వేల ట్రేడ్స్ ఉండ‌గా 33 కోట్ల ఆదాయం వ‌చ్చింది. అయితే అధికారుల చ‌ర్యల కార‌ణంగా 2015- 16 ఆర్థిక సంవ‌త్సరంలో 42 వేల మంది మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఫీజు 28 కోట్లు చెల్లించారు. దీంతో ట్రెడ్ లైసెన్స్ ఫీజుపై ఫోక‌స్ పెట్టిన బ‌ల్దియా క‌మిష‌న‌ర్ విద్యుత్ శాఖ క‌మర్షియ‌ల్ క‌నెక్షన్ల వివ‌రాల‌తో పాటు. క‌మ‌ర్షియ‌ల్ టాక్స్ డిపార్టు మెంట్ నుండి వివ‌రాలు తెప్పించి వాటిని అనుసంధానం చేసి విచారణ ప్రారంభించారు. దీంతో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిన వారి సంఖ్య మ‌రో 20 వేలు పెరిగింది. వీటి లైసెన్స్ ఫీజు, బ‌కాయిలు క‌లిపి దాదాపు 100 కోట్ల వ‌ర‌కు ఉంటుంది.
ఈ ఏడాది 39 కోట్ల ఆదాయం
ఈ ఏడాది ఇప్పటి వ‌ర‌కు 70 వేల‌మంది ట్రేడ్ లైసెన్స్ చెల్లించ‌గా 39 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. మార్చి చివ‌రి నాటికి 20 నుండి 30 వేల ట్రేడ్స్ ఫీజు వ‌సూలు చెయ్యాలని అధికారులు భావిస్తున్నారు. అయితే నిబంధన‌ల ప్రకారం క్షేత్రస్థాయిలో ప‌న్నులు వ‌సూళ్లు చెయ్యడం లేద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. దీంతో బ‌ల్దియాకు రావాల్సిన కోట్లాది రూపాయాల ప‌క్కదారి ప‌డుతున్నాయి. కంచే చేనుమేసిన చందంగా ఉంది బ‌ల్దియాలో ట్రేడ్‌ లైసెన్స్ అధికారుల తీరు. ఇప్పటికైన బల్దియా బాస్ అక్రమాల‌పై దృష్టి సారించి బ‌ల్దియా ఖ‌జానా నింపుతారా లేక‌, ప‌న్నులు చెల్లిస్తున్న వారిపైనే మ‌రింత భారం మోపుతారా అనేది వేచి చూడాలి.

 

18:16 - February 28, 2017
18:11 - February 28, 2017

మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకంగా పోరాటాలు సాగుతున్నాయి. తమకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలంటూ నిర్వాసితులు ఆందోళనలకు దిగుతున్నారు. వీరి పోరాటాల్లో సిపిఎం పాలుపంచుకుంటోంది. 
56.24 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు
మంచిర్యాల జిల్లా పరిధిలోని ఎర్రగుంట్లపల్లి, సింగాపూర్, గుత్తాదార్ పల్లి, రామారావుపేట్ ఈ గ్రామాలన్నింటిలోనూ ఓపెన్ కాస్ట్ విధానంలో బొగ్గును వెలికితీస్తారు. ఈ గ్రామాల్లో 56.24 మిలియన్ టన్నుల మేర బొగ్గు నిల్వలున్నట్టు తెలుస్తోంది. ఓపెన్ కాస్ట్ గనుల కోసం 2083 ఎకరాల భూమిని సేకరించేందుకు ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేశారు. బొగ్గు తవ్వకాల పనులను శ్రీరామ్ పూర్ ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టుకే  అప్పగించారు. ఈ ప్రాజెక్టు వ్యయం 88.47 కోట్ల రూపాయలు. 
23 ఏళ్ల పాటు బొగ్గు నిల్వల వెలికితీత
ఎర్రగుంట్లపల్లి, సింగాపూర్, గుత్తాదార్ పల్లి, రామారావుపేట్ గ్రామాల్లోని బొగ్గు నిల్వలను 23 ఏళ్ల పాటు వెలికితీయవచ్చని భావిస్తున్నారు. తాళ్లపల్లిలో 421 ఎకరాలు, సింగాపూర్ లో 897 ఎకరాలు, గుత్తాదార్ పల్లిలో 281 ఎకరాల ప్రయివేట్ భూమిని సేకరించాలంటూ గతంలోనే ప్రభుత్వం జిల్లా పాలనా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ తవ్వకాల వల్ల సింగాపూర్, గుత్తాదర్ పల్లి, రామారావుపేట్ గ్రామాల్లో 900 కుటుంబాలు నిలువ నీడ కోల్పోతున్నాయి. వీరికి పరిహారం చెల్లింపులో తీవ్ర అన్యాయం జరుగుతోంది. నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా సిపిఎం పోరాడుతోంది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించాలన్నది ఓపెన్ కాస్ట్ నిర్వాసితుల డిమాండ్. 
అంతులేని దు:ఖం.. 
ఓపెన్ కాస్ట్ తవ్వకాలు కొసాగుతున్న సింగాపూర్ ను చూస్తే అంతులేని దు:ఖం కలుగుతుంది. ఈ తవ్వకాల వల్ల చుట్టుపక్కల గ్రామాలన్నీ నాశనమవుతున్నాయి. దాదాపు 19 గ్రామాలను కాలుష్యభూతం ఆవహించింది.
సింగాపూర్ లో జోరుగా తవ్వకాలు
సింగాపూర్ లో బొగ్గు తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడున్న పొక్లైన్ ట్రక్కులకు చూసిన జనం వాటిని రాక్షసులుగా వర్ణిస్తుంటారు. ఇక్కడున్న 10 రాకాసి ట్రక్కులు ఒక క్షణం తీరిక లేకుండా రేయింబవళ్లు తవ్వకాలు కొనసాగిస్తున్నాయి. ఇక్కడ నుంచి తవ్విపోసిన ఇసుక గుట్టలా పేరుకుపోయింది. అది ఆక్రమించిన స్థలంలో ఒక చిన్న గ్రామం నిర్మించవచ్చు.  బొగ్గు తవ్వుతున్నంత కాలం  పాపాల పుట్ట పెరుగుతున్నట్టు ఈ గుట్ట పెరుగుతూనే వుంటుంది. 
తవ్వుతున్నా కొద్ది కాలుష్యం 
300 అడుగుల లోతు వరకు వున్న బొగ్గును వెలికితీసేంతవరకు ఈ తవ్వకాలు కొనసాగుతూనే వుంటాయి. తవ్వుతున్నా కొద్ది కాలుష్యం జడలు విప్పుతుంది. ఇసుక, దుమ్ముతో చుట్టుపక్కల గ్రామాలన్నీ నాశనమవుతున్నాయి. కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. 
సింగాపూర్ లో 880 ఎకరాల్లో తవ్వకాలు
880 ఎకరాల్లో సాగే ఈ తవ్వకాలు దాదాపు 19 గ్రామాలను సర్వనాశనం చేస్తున్నాయి. ఆ గనుల్లో తవ్వి పోయగా వచ్చిన మట్టి  బొందలగడ్డల్లా తయారవుతోంది. సింగపూర్ లో తవ్వకాల కోసం 25 ఏళ్లకు కాంట్రాక్ట్ కుదరగా, ఇప్పటికే 7 ఏళ్ల పాటు తవ్వకాలు కొనసాగాయి. శ్రీరాంపూర్, గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 4000 మంది జనాభా అష్టకష్టాలు పడుతున్నారు. ఇక్కడి పంట పొలాలు, ఖాళీ జాగాలు ఆక్రమించుకుని వారికి చిల్లిగవ్వ పరిహారమైనా చెల్లించలేదు. 
ఓపెన్ కాస్ట్ కి వ్యతిరేకంగా పెద్ద పోరాటం
ఓపెన్ కాస్ట్ కి బలవుతున్న మరో గ్రామం ఎర్రగుంటపల్లె. పాడిపంటలతో కళకళలాడే ఈ గ్రామం విధ్వంసపు అంచుల్లో వుంది. ఓపెన్ కాస్ట్ కి వ్యతిరేకంగా ఇక్కడ పెద్ద పోరాటమే నడుస్తోంది. ఎర్రగుంటపల్లె లో 300 ఇళ్లు వుంటాయి. 900 మంది జనాభా వున్న గ్రామమిది. ప్రతి ఇంటికీ నాలుగు పాడి పశువులుంటాయి. ఒక్కో కుటుంబానికి రెండు నుంచి నాలుగు ఎకరాల భూమి వుంటుంది. పక్క ఊళ్లకెళ్లి పాలు అమ్ముకుంటారు. పచ్చని పొలాలు, పాడిపంటలతో కళకళలాడిన గ్రామమిది. 
మాయమవుతోన్న పచ్చదనం 
ఎర్రగుంటపల్లె పచ్చదనం మాయమవుతోంది. పాడిపశువలకు కష్టకాలమొస్తోంది. ఊరుఊరంతా వలసపోవాల్సిన దౌర్భాగ్యం రాబోతోంది. రాబోయే ప్రమాదాన్ని గుర్తించిన గ్రామ యువకులు పోరుబాట పట్టారు. ఓపెన్ కాస్ట్ వ్యతిరేక కమిటీ గా ఒక్కటయ్యారు. వృద్ధులు, స్త్రీలు అంతా ఇప్పుడు ఓపెన్ కాస్ట్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 2013లోనే సింగరేణి జనరల్ మేనేజర్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. తమ జీవితాలను ధ్వంసం చేసే అభివృద్ధి వద్దన్నదే ఎర్రకుంటపల్లెలో వినిపిస్తున్న నినాదం.
ఎర్రగుంటపల్లెలో ఓపెన్ కాస్ట్ విధ్వంసం
ఎర్రగుంటపల్లి, సింగాపూర్, గుత్తాదార్ పల్లి, రామారావుపేట్, కళ్యాణిఖని ఇలా ఎక్కడికి వెళ్లినా ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేక పోరాటాలే ప్రతిధ్వనిస్తున్నాయి. వేలాది పోలీసుల పహారాలో ప్రజాభిప్రాయ సేకరణ తంతును ముగుస్తున్నారు అధికారులు. 
కళ్యాణిఖనిలో ఓపెన్‌కాస్ట్‌ వ్యతిరేక పోరాటం
కెకె 2 మెగా గా ప్రసిద్ధి చెందిన కల్యాణిఖనిలోనూ ఓపెన్ కాస్ట్ వ్యతిరేక పోరాటం సాగుతోంది. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన వారంతా ఓపెన్ కాస్ట్ వద్దంటే వద్దంటూ మొత్తుకున్నారు. బాధిత గ్రామాల ప్రజలు, కాలుష్యం బారినపడ్డ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అంతా ఒక్కటై కాలుష్య నియంత్రణ మండలి ముందు తమ గోస వినిపించారు. 
3000 మంది పోలీసుల మొహరింపు
పబ్లిక్ హియరింగ్ సమయంలో 3000 మంది పోలీసులను మొహరించారంటే అక్కడ స్థానికంగా ఎంత వ్యతిరేకత పెల్లుబికిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజా సంక్షేమానికి, సామాజిక బాధ్యతలకు పెద్ద పీట వేయాల్సిన ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి ఇప్పుడు ఉత్తర తెలంగాణలో 72 బొగ్గు బావులను ఓపెన్ కాస్ట్ లుగా మార్చడానికి నిర్ణయించింది. సింగరేణి సంస్థ ప్రయివేట్ సంస్థలతో జత కట్టి, 19 గ్రామాల్లో 30వేల మందిని నిర్వాసితులుగా మార్చేందుకు సిద్ధమవుతోంది. అన్ని చోట్ల ప్రజా వ్యతిరేకత పెల్లుబికుతోంది. ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజాపోరాటాల్లో సిపిఎం పాలుపంచుకుంటోంది. 
కొత్తగూడెం జిల్లాలో ఓపెన్ కాస్ట్ విశ్వరూపం 
కొత్తగూడెం జిల్లాలోనూ ఓపెన్ కాస్ట్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలన్నింటినీ ఉల్లంఘించి భూములు సేకరించడం తీవ్ర వివాదస్పదమవుతోంది. భూ నిర్వాసితులకు అండగా నిలబడ్డ సిపిఎం హై కోర్టులో కేసు నడిపించి, 3 కోట్ల రూపాయల పరిహారం సాధించడం విశేషం. 
గిరిజనుల భూముల్లో ఓపెన్ కాస్టులు
టేకులపల్లి ఏజెన్సీ ప్రాంతం. టేకులపల్లి మండలంలో అన్ని చట్టాలను ఉల్లంఘిస్తోంది సింగరేణి. వన్ ఆఫ్ సెవంటీ, పీసా, అటవీ హక్కుల చట్టం ఇలా ప్రతిదీ ఉల్లంఘిస్తూ గిరిజనుల భూముల్లో ఓపెన్ కాస్టులు  చేపడుతున్నారు. కోయగూడెం ఓసి 1 కోసం అందుగలగూడెం, కుంటపల్లి, చుక్కోలబోడు, జెత్యతండ, కొత్తతండ, కోయగూడెం గ్రామాలకు చెందిన 800 ఎకరాల భూమిని 2003లోనే సేకరించింది సింగరేణి. అప్పట్లోనే 120 గిరిజన కుటుంబాలు నిలువ నీడ కోల్పోయాయి. వీరికి నయాపైసా నష్టపరిహారం చెల్లించలేదు. 
కథ పునరావృతం
ఆ తర్వాత 2008లో కోయగూడెం ఓసి 2 పేరుతో ఇదే కథ పునరావృతమైంది. కోయగూడెం, దంతెలతండ, కొత్తతండ, జేత్యతండల్లోని 105 గిరిజన కుటుంబాలకు చెందిన 750 ఎకరాల భూమిని సింగరేణి యాజమాన్యం తీసుకుంది. వీరికీ పరిహారం చెల్లించలేదు. తమకు పరిహారం చెల్లించాలంటూ గిరిజనులు పోరాడారు. హై కోర్టులో న్యాయపోరాటానికి దిగిన సిపిఎం 3 కోట్ల రూపాయల విలువైన పునరావాసం సాధించింది. 
దారపాడు గ్రామాన్ని పూర్తిగా తొలగింపు
కోయగూడెం ఓసి 2, ఫిట్ 1 పేరుతో దారపాడు గ్రామాన్ని పూర్తిగా తొలగిస్తున్నారు. 34 జీవో తో ఉద్యోగాలిస్తామంటూ గిరిజనులను మభ్యపెట్టారు. 2012లో అరకొర పరిహారమిచ్చి భూములు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలంటూ, భూ సేకరణకు అడ్డురావద్దంటూ పోలీసులను రంగంలోకి దింపారు. 
2200 ఎకరాల భూ సేకరణ
కిష్టారం, దారపాడు, కొత్తూరు, లక్ష్మీపురం, కొప్పురాయి, పిఆర్ గుంపు, బోడు కొత్తగూడెం గ్రామాలకు చెందిన దాదాపు 2200 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో పట్టా, ప్రయివేట్, అసైన్ మెంట్, ఆర్ ఓ ఎఫ్ ఆర్, ఫారెస్టు భూములున్నాయి. వన్ ఆఫ్ సెవంటీ యాక్ట్, పీసా, అటవీ హక్కుల చట్టం వీటన్నింటినీ ఉల్లంఘించి ఈ భూములను సింగరేణి సేకరించింది. 
తీర్మానాలు తుంగలో తొక్కారని విమర్శలు
భూ సేకరణ కోసం పీసా గ్రామ సభలను తీర్మానాలను సైతం తుంగలో తొక్కారన్న విమర్శలున్నాయి. ప్రజాభిప్రాయానికి భిన్నంగా తప్పుడు నివేదికలు రూపొందించారన్న ఆరోపణలున్నాయి.  పోడు భూములకు పట్టాలివ్వకుండా, ఫారెస్టు అధికారులు లాగేసుకుంటారంటూ భయపెట్టి, చెక్కులు పంపిణీ చేశారన్న ఫిర్యాదులున్నాయి. తాము కోల్పోతున్న భూములకు నష్టపరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలన్నది ఓపెన్ కాస్ట్ నిర్వాసితుల డిమాండ్. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇవ్వాలంటున్నారు. దారపాడు నిర్వాసిత కాలనీ నిర్మాణ పూర్తి చేసిన తర్వాతే భూ సేకరణ చేపట్టాలన్నది వీరి డిమాండ్. 
ప్రజల్లో వ్యతిరేకత.. 
ఓపెన్‌ కాస్ట్‌లు సృష్టిస్తున్న విధ్వంసానికి ఇవి ఉదాహరణలు మాత్రమే. తెలంగాణలో 72 ఓపెన్‌కాస్టులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికైనా  టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించడం అలవర్చుకోవాలి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి . ఉద్యమ కాలంలో చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకోవాలి. ఇదే ఇవాళ్టి స్పెషల్‌ ఫోకస్‌. మరో ఫోకస్‌ తో మళ్లీ కలుద్దాం. 

17:54 - February 28, 2017

హైదరాబాద్‌ : మహా నగరాభివృద్ధి సంస్థ నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఫలితంగా భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వ‌స్తోంది. హైద‌రాబాద్ మెట్రోడెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీకి జ‌పాన్ ఇంట‌ర్నేష‌న‌ల్‌ కో ఆప‌రేష‌న్ ఏజెన్సీ జైకా.. క‌మిట్మెంట్ చార్జీల క్రింద ఏకంగా 100కోట్లు ఫైన్ వేసింది. ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌నులను సకాలంలో పూర్తిచేయని ఫలితంగా 30 నెలల్లో కావల్సిన పనులు 80 నెలలు దాటినా పూర్తికాక పోవడంతో జైకా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔట‌ర్ రింగ్ రోడ్డు మొద‌టి ఫేజ్  ఆల‌స్యానికి కాంట్రాక్టర్లపై రూ.16.81 కోట్ల ఫైన్‌ వేసింది. జైకా ఫేజ్ 1, 2ల‌లో రూ.82 కోట్ల ఫైన్ వేసింది. జైకా జరిమానాలతో హెచ్ ఎండీఏ మేలుకుంది. ఓఆర్ ఆర్ పనుల జాప్యంపై కాంట్రాక్టర్లకు నోటీసులు
జారీ చేశారు. జైకా తమకు విధించిన పెనాల్టీని కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేయాలని హెచ్ ఎండీఏ యోచిస్తోంది. తాము త‌ప్పుచేయలేదంటూ కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. వేసిన ఫైన్ వ‌సూలు చేయడంలో హెచ్ఎండీఏ నిర్లక్ష్యం వహించింది. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వ‌స్తే హెచ్ ఎండీఏ భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 

 

17:44 - February 28, 2017

విజయవాడ : కృష్ణా జిల్లా ముళ్లపాడు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని... సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు డిమాండ్‌ చేశారు. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న ముళ్లపాడు బస్సు ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. చంద్రన్న బీమా కింద 5 లక్షలు ఇస్తామనడం దారుణమన్నారు.  ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. రవాణా రంగంలో ప్రైవేట్‌ ఆధిపత్యం పెరిగిపోయిందని.. ప్రైవేట్‌ వాహనాలవల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని మండిపడ్డారు.   

17:37 - February 28, 2017

ఢిల్లీ : నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసిందంటూ... క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన ట్వీట్ తనని ఆవేదనకు గురి చేసిందని కార్గిల్‌ అమరవీరుడి కుమార్తె గుర్‌మెహర్‌ కౌర్‌ అన్నారు. చిన్నప్పటి నుంచి తాను ఓ ఆటగాడిగా సెహ్వాగ్‌ను చూస్తున్నానని....ఆయన  ట్వీట్‌ చూసి తన హృదయం ముక్కలైందన్నారు. గుర్‌మెహర్‌ తండ్రి కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధమే చంపిందని రాసిన ప్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను గుర్‌మెహర్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.  గుర్‌మోహర్ వ్యాఖ్యలకు సమాధానంగా సెహ్వాగ్ - 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ ట్వీట్ చేశాడు.  కొందరు వీరూను సమర్థించగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏబివిపి తరపున రేప్‌ చేస్తామని గుర్‌మెహర్‌కు బెదిరింపులు వచ్చాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

17:34 - February 28, 2017

చెన్నై : తమిళ నటుడు ధనుష్‌ తమ కుమారుడని పేర్కొంటూ మదురై జిల్లా మేలూర్‌ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు వేసిన కేసుకు సంబంధించి ధనుష్‌ కోర్టుకు హాజరయ్యారు. సదరు దంపతులు పేర్కొన్న అంశాల్లో నిజాలు లేవనీ, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా ధనుష్‌ కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. ధనుష్‌కు సంబంధించి పుట్టుమచ్చలు తదితర ఆధారాలను కదిరేశన్‌ దంపతులు కోర్టుకు సమర్పించగా...ధనుష్ తరఫు లాయర్ సమర్పించిన టీసీలో పుట్టు మచ్చలు లేవని పేర్కొనడం గమనార్హం. ఈ కేసుపై ఇవాళ విచారణ జరుగుతోంది.

 

17:24 - February 28, 2017

ఢిల్లీ : తమ సమస్యలు పరిష్కరించాలంటూ బ్యాంకు ఉద్యోగులు ఢిల్లీలో కదం తొక్కారు.  యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఆధ్వర్యంలో జంతర్‌ మంతర్‌ దగ్గర ధర్నా చేపట్టారు. ఏడు ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించిన ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

వనస్థలీపురం శ్రీవాసవి కాలేజీ మోసం...

హైదరాబాద్ : వనస్థలీపురం శ్రీవాసవి కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 300 మంది విద్యార్థలకు యాజమాన్యం హాల్ టిక్కెట్లు ఇవ్వలేదు. హాల్ టిక్కెట్లు ఇవ్వాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

 

17:16 - February 28, 2017

హైదరాబాద్ : వనస్థలీపురం శ్రీవాసవి కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 300 మంది విద్యార్థలకు యాజమాన్యం హాల్ టిక్కెట్లు ఇవ్వలేదు. హాల్ టిక్కెట్లు ఇవ్వాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:02 - February 28, 2017

విజయవాడ : రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం అయ్యింది. జంబ్లింగ్ విధానంలోనే థియరీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థులకు హాల్ టిక్కెట్లు, కళాశాలలో నిర్వహించే పరీక్షలకు మౌలిక వసతుల కల్పనకు అధికారులు దృష్టిసారించారు. మార్చి 1న ఇంటర్ ఫస్టియర్ పరీక్షలతో విద్యార్థులకు పరీక్షాకాలం మొదలుకానుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్‌ జరగనుంది. 
మార్చి 1నుంచి 19వరకు పరీక్షలు 
ఏపీలో ప్రరీక్షల సమయం ప్రారంభమైంది. విద్యార్థులు  ఎగ్జామ్స్‌కు రెడీ అయ్యారు.  రేపటి నుంచి 19వరకు ఏపీలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  విద్యార్థులకు కేటాయించిన గదులు, హాల్ టికెట్ నంబర్లు తెలిసేలా నోటీసు బోర్డులో పూర్తి సమాచారం ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. హాల్ టికెట్లు తీసుకున్న విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని  సూచించారు.
ఎగ్జామ్ సెంటర్ల దగ్గర 144 సెక్షన్‌ 
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఎగ్జామ్‌ సెంటర్ల దగ్గర 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది. మాస్‌ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు  ప్లైయింగ్ స్వ్కాడ్ బృందాలతోపాటు సిట్టింగ్ స్క్వాడ్స్‌ బృందాలు ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ (డీఈసీ) నిరంతంరం పరీకక్షలు జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తుంది. పరీక్షలకు సంబంధించి 3 సెట్ల ప్రశ్నాపత్రాలు ఇప్పికే సంబంధిత కేంద్రాల పరిధిలోని పోలీస్ స్టేషన్లకు చేరాయి. ప్రశ్నాపత్రాన్ని నిత్యం ఆయా పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ తరలించటానికి 39 మంది కస్టోడియన్లను నియమించారు.  అటు పరీక్షలు జరిగే ప్రాంతాల్లో  జిరాక్స్ సెంటర్లను మూసివేయాల్సిందిగా ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో బల్లలపై కాకుండా.. విద్యార్థులను  నేలపై కూర్చోపెట్టి పరీక్షలు రాయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. 
పరీక్షలకు హాజరు కానున్న 2, 46, 613 మంది విద్యార్థులు  
రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి  అత్యధికంగా ఇంటర్ పరీక్షలకు.. 2 లక్షల 46 వేల 613 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కృష్ణాజిల్లాలో 1,46,701 మంది విద్యార్థులు, గుంటూరు జిల్లాలో 99,912 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్దమయ్యారు. కృష్ణాజిల్లాలో ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 1,46,701 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 161 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాసేలా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. 
పరీక్షలకు ఏపీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు
పరీక్షల సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. దీనిపై ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు కలెక్టర్లు, ఇంటర్ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి విద్యార్థులను ఆర్టీసీ బస్ సర్వీసుల ద్వారా తీసుకెళ్లాలని, ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండడంతో 8.30 గంటలకే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటలలోపు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య వీలైనన్ని ఎక్కువ బస్ సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. 

16:49 - February 28, 2017

హైదరాబాద్ : అమెరికాలో జాత్యహంకార దాడిలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్‌ అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం స్మశానవాటికలో పూర్తయ్యాయి. ఉదయం బాచుపల్లిలోని శ్రీనివాస్‌ నివాసం వద్ద స్నేహితులు, బంధువులు, రాజకీయప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర కొనసాగింది. హిందు సంప్రదాయ పద్ధతిలో శ్రీనివాస్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి.

 

16:46 - February 28, 2017

విశాఖ : గ్రేటర్‌ విశాఖ నగర పాలక సంస్థ 5 సంవత్సరాలుగా ప్రత్యేక అధికారి పాలనలో మగ్గుతోంది. అధికారంలోకి వస్తే మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న చంద్రబాబు దాని ఊసే మరిచారు. దీంతో రోజురోజుకు సమస్యలు పేరుకుపోతున్నాయి. కేసుల బూచి చూపుతూ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. మరోవైపు దొడ్డిదారిన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఐదేళ్లుగా పాలకమండలి లేక సమస్యలతో సతమతవుతోన్న జీవీఎంసీపై 10టీవీ ప్రత్యేక కథనం. 
జీవీఎంసీకి 5 సంవత్సరాలుగా లేని పాలకవర్గం
మహా విశాఖ నగర పాలక సంస్థకు పాలకవర్గం లేక 5 సంవత్సరాలైంది. ఈ ఐదేళ్లుగా ప్రత్యేక పాలన కిందనే జీవీఎంసీ పనిచేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలే పాలకులై అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. 
విశాఖ గ్రేటర్ పరిధిని పెంచాలనే యోచన 
విశాఖ నగరంలో  మొత్తం 72 వార్డులు ఉన్నాయి. జీవీఎంసీలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలను కూడా కలిపి గ్రేటర్ పరిధిని 100కు పైగా వార్డులను పెంచాలని ప్రభుత్వం  యోచిస్తోంది. ఇదే సమయంలో కే.నగరపాలెం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నడిగట్టు, జేవీ అగ్రహారం లాంటి పంచాయితీలు తాము జీవీఎంసీలో కలువబోమని తీర్మానం చేశాయి. కోర్టు మెట్లూ ఎక్కాయి.  మరోవైపు  విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణ బాబు,  భీమిలి మున్సిపాలిటీ మాజీ ఛైర్ పర్సన్ జి.చిన్ని కుమారీ కూడా కోర్టు తలుపు తట్టారు. 
ప్రజల్లో వ్యతిరేకత కారణంగానే ఎన్నికలు వాయిదా
తాము అధికారంలోకి వస్తే... 100 రోజుల్లోనే జీవీఎంసీకి ఎలక్షన్స్‌ నిర్వహిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీనిచ్చారు. అయినా ఇంత వరకు జీవీఎంసీకి ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. ప్రజల్లో టీడీపీ పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగానే  జీవీఎంసీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోర్టుల్లో ఉన్న కేసులు మరో మూడు నెలల్లో క్లియర్‌ అవుతాయని, ఆ వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ చెప్తున్నారు. జీవీఎంసీలో ప్రభుత్వం తన పెత్తనం చెలాయించడానికే ఎన్నికలు నిర్వహించడం లేదని వామపక్షనేతలు ఆరోపిస్తున్నారు.  
ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు 
ప్రత్యేక అధికారులను అడ్డంపెట్టుకుని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌ పరం చేసే ప్రయత్నాలు కూడా అధికార పార్టీ నేతలు ముమ్మరం చేశారు. విశాఖ నగర నడిబొడ్డున  ఉన్న ప్రహ్లాద కళ్యాణ మండపం, సెంట్రల్ పార్క్‌ను ప్రైవేట్‌పరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అంతేకాదు... జీవీఎంసీ పరిధిలోని 20 డిస్పెన్సరీలను ఇప్పటికే ప్రైవేట్‌పరం చేసింది. విశాఖ నగరం పరిధిలోని కొండలను, టూరిజం పేరిట బీచ్‌ను పూర్తిగా ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తున్నారని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. స్మార్ట్‌ సిటీ పేర ప్రజా సొమ్మును దుబారా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నిర్వహించిన ఫ్లీట్‌ రివ్యూ, భాగస్వామ్య సదస్సులతో జీవీఎంసీ ఖాజానా దాదాపుగా దివాళా తీసే పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం 450 కోట్ల లోటు బడ్జెట్‌లో జీవీఎంసీ నడుస్తోంది. ఇప్పటికైనా జీవీఎంసీకి  ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని విశాఖ నగరవాసులు కోరుతున్నారు.

 

16:02 - February 28, 2017

విజయవాడ : డ్రైవర్ నిద్రమత్తు 11 మంది నిండుప్రాణాలను బలితీసుకుంది. మరికాసేపట్లో స్వస్థలాలకు చేరుతామనుకున్న వారు అనంతలోకాలకు చేరుకున్నారు. ఏం జరుగుతుందోనని తేరుకునేలోపే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 
ఘోర రోడ్డు ప్రమాదం 
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వా బస్సు ఏపీ 02టీసీ 7146 బస్సు కల్వర్టులోకి దూసుకుపోయింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 11  గంటలకు భువనేశ్వర్‌లో బస్సు బయలుదేరింది. 
కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయిన బస్సు..11 మంది మృతి 
ఎన్ హెచ్ 9 జాతీయ రహదారి వంతెనపై డివైడర్‌ను ఢీకొని బస్సు కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృతిచెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు నందిగామ ప్రభుత్వాస్పత్రిలోనూ, తీవ్రంగా గాయపడిన వారు  విజయవాడలోని ఆంధ్రా, హెల్ప్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
బస్సును బయటకు తీసిన సహాయసిబ్బంది 
అతికష్టమీద బస్సును సహాయసిబ్బంది బయటకు తీశారు. గ్యాస్‌ కట్టర్ల సాయంతో బస్సు భాగాలను వేరుచేసి బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు వెలికితీశారు. అధిక వేగం, డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్‌మ్మోహన్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. 
ప్రమాదానికి కారణాలను తెలుసుకున్న మంత్రి కామినేని  
ప్రమాదానికి గల కారణాలను అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని.. మృతదేహాలకు సాధ్యమైనంత త్వరగా శవపరీక్ష నిర్వహించి స్వస్థలాలకు తరలించే ఏర్పాటు చేయాలని అధికారులను కామినేని ఆదేశించారు. ప్రమాద వార్త తెలియగానే నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్‌ తాతయ్య హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలను పర్యవేక్షించారు. 
మృతులు వీరే...
మృతుల్లో డ్రైవర్ ఆదినారాయణరెడ్డి, భార్గవి, ప్రభాకర్‌రెడ్డి , సూర్యాపేటకు చెందిన సోదరులు శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కటక్‌కు చెందిన సింగ్‌, ఒడిశాకు చెందిన మధుసూదన్‌రెడ్డి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పంగా తులసమ్మ, విజయవాడకు చెందిన షేక్ పాషా ఉన్నారు. ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

15:57 - February 28, 2017

న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య వార్‌ కొనసాగుతోంది. ఏబివిపిని వ్యతిరేకిస్తూ ఎన్‌ఎస్‌యుఐ, వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నార్త్‌ క్యాంపస్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు భారీగా మార్చ్‌ నిర్వహించారు. ఢిల్లీ యూనివర్సిటీని కాపాడాలని ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఢిల్లీ యూనివర్సిటీలోని సాధారణ విద్యార్థులంటున్నారు. తామంతా అభద్రతాభావంతో ఉన్నామని వారంటున్నారు. రాంజాస్‌ కాలేజీలో వాతావరణంపై మరిన్ని
వివరాలను వీడియోలో చూద్దాం...

15:35 - February 28, 2017

గుంటూరు : జిల్లాలో ఓ ఉమెన్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థిని అనుమానాస్పద స్థిలో మృతి చెందింది. బుడంపాడు వద్ద గల సెయింట్‌ మేరీస్‌ ఉమెన్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కళాశాల భవనంపై నుంచి దూకడంతో  తీవ్ర గాయాలపాలైన శ్రావణసంధ్యను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె  చనిపోయింది. అయితే విద్యార్థిని ప్రమాదవశాత్తు పడిపోయిందని కాలేజీ యాజమాన్యం చెబుతున్నప్పటికీ .. ఘటనా స్థలం పరిశీలిస్తే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

15:04 - February 28, 2017

గుంటూరు జిల్లాలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

గుంటూరు : జిల్లాలో విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందింది. కళాశాల భవనంపై నుంచి దూకిన ఉమెన్స్ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రమాదవశాత్తు కాలేజీ యాజమాన్యం పడిపోయిందని అంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

6 స్మార్ట్ సిటీలకు రూ. 198 కోట్లు విడుదల..

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్న ఆరు స్మార్ట్ సిటీలకు రూ. 198 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఒక్కో నగరానికి రూ. 33 కోట్లు చొప్పున విడుదల చేశారు. శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.

గుంటూరులో విద్యార్థిని సూసైడ్..

గుంటూరు : బడంపాడు సెయింట్ మేరీస్ ఉమెన్స్ కాలేజీలో డిప్లామా ఫస్ట్ ఇయర్ విద్యార్థిని శ్రావణ సంధ్య ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థినుల మధ్య వివాదాలే కారణమని తెలుస్తోంది. ప్రమాదవశాత్తు పడిపోయిందని యాజమాన్యం పేర్కొంటోంది.

గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస..

కృష్ణా : గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. గతంలో టిడిపి ఛైర్మన్ పై వైసీపీ నేతల దాడికి క్షమాపణలు చెప్పాలని టిడిపి నేతలు పట్టుబట్టారు. వైసిపి - టిడిపి సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

13:36 - February 28, 2017

సూర్యాపేట : జిల్లాలో 135వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. తుంగతుర్తి మండలం అన్నారంలో తమ్మినేని బృందానికి సీపీఎం శ్రేణులు, కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. తెలంగాణ సాయుధ పోరాటంపై 'బండెనక బండి కట్టి' పాట రాసిన యాదగిరి విగ్రహం, స్మారక స్థూపాన్ని ఎలకపల్లిలో ఆవిష్కరించి నివాళులర్పించారు. నైజాం సర్కార్‌కు వ్యతిరేకంగా యాదగిరి పాట రాసి ప్రజల్లో చైతన్యం నింపారని నేతలు కొనియాడారు. యాదగిరి త్యాగాలు, పోరాటాలు సమాజానికి స్ఫూర్తి నింపాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

13:35 - February 28, 2017

ఢిల్లీ : రాంజాస్ కాలేజీలో ఇంకా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం వామపక్ష విద్యార్థి సంఘాలు, ఎన్ఎస్ యు సంఘం ర్యాలీ చేపట్టింది. నార్త్ క్యాంపస్ వరకు ర్యాలీ జరుగుతోంది. భారీస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశద్రోహులు కాలేజీకి వస్తున్నారంటూ ఏబీవీపీ నేతలు పేర్కొనడం..మహిళలపై దాడులు చేస్తామని..రేప్ చేస్తామంటూ ఒక భయానాత్మక వాతావరణం సృష్టిస్తున్నారని విద్యార్థులు పేర్కొంటున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారని, తమ గొంతు నొక్కేస్తున్నారని ఇతర విద్యార్థి సంఘాల నేతలు పేర్కొంటున్నారు. గత వారం రోజులుగా కళాశాలలో తరగతులు కూడా జరగడం లేదు. దీనితో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్‌ ఖలిద్‌ను రాజాంస్‌ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో వివాదం రాజుకుంది. ఉమర్‌ ఖలీద్‌ రాకను వ్యతిరేకిస్తూ మంగళవారం ఏబీవీపీ విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన దిగారు. దేశద్రోహులకు ఆహ్వానాలు అందిస్తున్నారని ఆరోపిస్తూ కాలేజీపై దాడి చేశారు. దీంతో ఉమర్‌ ఖలీద్‌, షెహ్లా రషీద్‌ ఆహ్వానాలను కాలేజీ రద్దు చేసుకుంది. ఏబీవీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు.

13:29 - February 28, 2017
13:27 - February 28, 2017

అనంతపురం : కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై దివాకర్‌ ట్రావెల్స్‌ యజమాని జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. బస్సు ప్రమాదం దురదృష్టకరమన్నారు. అయితే ప్రమాదాలు సహజమని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంతో తన మేనల్లుడికి ఎమ్మెల్సీ సీటు వచ్చిన ఆనందం కూడా ఆవిరైపోయిందన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.

13:21 - February 28, 2017
13:20 - February 28, 2017

ఢిల్లీ : అమెరికాలో జాత్యహంకార దాడిలో తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ మరణించిన నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్‌ స్పందించారు. అమెరికాలో పెరుగుతున్న విద్వేషపూరిత నేరాలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించాలని ఆమె డిమాండ్‌ చేశారు. బెదిరింపులు, జాత్యహంకార నేరాలు పెరుగుతున్నందున ట్రంప్‌ బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరముందని ఆమె ట్వీట్‌ చేశారు. మైనారిటీల రక్షణకు ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు సమాధానం కావాలంటూ శ్రీనివాస్‌ భార్య సునయన మాట్లాడిన వార్తతో పాటు.. హిల్లరీ ఈ ట్వీట్‌ను పోస్ట్‌ చేశారు.

హైకోర్టులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసు..

హైదరాబాద్ : హైకోర్టులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసు విచారణ జరిగింది. బీసీసీఐ కౌంటర్ లో పేర్కొన్న అంశాలపై విచారణ జరిగింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

 

పలువురు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ లు..

విజయవాడ : తూర్పుగోదావరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థిగా చికాక్ల రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే భూమా, మోహన్ రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డిలు పాల్గొన్నారు

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం - జేసీ ప్రభాకర్..

అనంతపురం : కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బస్సు ప్రమాదం ఘటన దురదృష్టకరమని, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, రోడ్డు ప్రమాదాలు సహజమేనన్నారు. తన మేనల్లుడికి ఎమ్మెల్సీ టికెట్ వచ్చిందన్న ఆనందం కూడా లేదన్నారు.

12:49 - February 28, 2017

మార్చి, ఏప్రిల్‌, మే నెలలు ఎండలతోనే కాదు పరీక్షలతో కూడా వేడెక్కిస్తాయి. సరైన ప్రణాళికతో పరీక్షలకు సన్నద్ధం కావడం ఎంతో అవసరం..పిల్లలకు పరీక్షల హడావుడి మొదలవుతోంది. పరీక్షలంటే పిల్లలకే కాదు వారి తల్లదండ్రులు కూడా టెన్షన్ పడే కాలం ఇది. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఏదో ఒక పరీక్ష రాస్తుంటారు. ఇంత కాలం ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలు ఈ దశలో ఏకాగ్రతతో చదివితే కానీ మంచి మార్కులు రావు. ఇటువంటి పరిస్థితిలో ఎలా చదవాలి ? పరీక్షలు ఎలా రాయాలి? వత్తిడికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ? అనే అంశంపై మానవి 'వేదిక'లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో రవి కుమార్ (సైకాలజిస్టు), వసుధారాణి (పననియా మహావిద్యాలయ పబ్లిక్ స్కూల్ ప్రిన్స్ పల్) పాల్గొని సూచనలు..సలహాలు తెలియచేశారు. తెలుసుకోవాంటే వీడియో క్లిక్ చేయండి.

12:28 - February 28, 2017

హైదరాబాద్ : అమెరికాలో జరిగిన జాత్యంహకార దాడిలో హత్యకు గురైన తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్ అంతిమయాత్ర ప్రారంభమైంది. దుండిగల్ లోని బాచుపల్లి నుండి మృతదేహాన్ని వాహనంలో తరలించారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీనివాస్ ను కడసారి చూసేందుకు మంగళవారం ఉదయం నుండి బంధువులు..స్నేహితులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. అంతిమయాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు. అంతిమయాత్రకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో చూడండి.

మధురై కోర్టుకు చేరుకున్న ధనుష్..

చెన్నై : మధురై కోర్టుకు నటుడు ధనుష్ చేరుకున్నారు. ధనుష్ తమ కుమారుడేనంటూ, కదిరేశన్, మీనాక్షి వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. పుట్టుమచ్చల వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి, నేడు ధనుష్ ఒంటిపై వాటిని సరిపోల్చనున్నారు.

ప్రారంభమైన కూచిభోట్ల శ్రీనివాస్ అంత్యక్రియలు..

హైదరాబాద్ : అమెరికా దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన కూచిభోట్ల శ్రీనివాస్ అంత్యక్రియాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. బాచుపల్లి నుండి బూబ్లిహీల్స్ లోని మహాప్రస్తానం వరకు అంతిమయాత్ర జరగనుంది.

12:08 - February 28, 2017

హైదరాబాద్ : అమెరికాలో జాత్యహంకార దాడిలో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఇంకా షాక్ లోనే ఉన్నారు. అమెరికా దుండగుడు జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి 9.45 గంటలకు ఆయన భౌతికకాయం చేరుకుంది. అనంతరం బాచుపల్లికి మృతదేహాన్ని తరలించారు. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు..కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య సునయన ఇంకా షాక్ లోనే ఉన్నారు. శ్రీనివాస్ భౌతికకాయాన్ని సందర్శించేందుకు స్నేహితులు, కుటుంసభ్యులు భారీగా తరలివస్తున్నారు. రాజకీయ నేతలు, ఇతరులు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియచేశారు. జూబ్లిహీల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు.

దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా..మృతుల వివరాలు..

కృష్ణా : పెనుగంచిప్రోలు (మం) ముళ్లపాడులో దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో 11 మంది మృతి చెందారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది విశాఖ వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. మృతులు : ఆదినారాయణరెడ్డి (డ్రైవర్, తాడిపత్రి), ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, సింగ్ (కటక్), పంగా తులసమ్మ (సంతబొమ్మాళి), షేక్ ఫాషా (విజయవాడ), కృష్ణారెడ్డి (సూర్యాపేట), మధుసూధన్ రెడ్డి (ఒడిశా)లున్నారు.

మోడీతో నరసింహన్ భేటీ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. ఉభయ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను వివరించారు.

అన్నారంలో సీపీఎం మహాజన పాదయాత్ర..

సూర్యాపేట : తుంగతుర్తి (మం) అన్నారంలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. టిడిపి, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు.

11:28 - February 28, 2017

విజయవాడ : రవాణా సంఘాల బంద్ కొనసాగుతోంది. జీవో 894 ను రద్దు చేయాలని ఆటో కార్మికులు, రవాణా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా రథం సెంటర్ నుండి లెనిన్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో సీఐటీయూ, సీపీఎం, సీపీఐ, ఏఐటీయూసీ నేతలు ప్రదర్శనలో పాల్గొన్నారు. టీఎన్ టీయూసీ మినహా ఇతర సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా నేతలు టెన్ టివితో మాట్లాడారు. ట్రాన్స్ పోర్టు రంగాన్ని దెబ్బతీయడానికే ఈ బిల్లు తెచ్చారని, పెద్ద ఎత్తున పెనాల్టీలు వేసి జైలుకు పంపించడానికి సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఇది కేవలం విజయవాడ నగరానికి మాత్రమే పరిమితం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. జీవో 894 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, మోటార్ వెహికల్ యాక్ట్ కు సవరణలు చేస్తూ రవాణా రంగాన్ని కుదేలు చేస్తున్నారని విమర్శించారు.

11:26 - February 28, 2017

పశ్చిమగోదావరి : పొట్ట కూటి కోసం కూలీ పనులు చేస్తూ జీవనం గడుపుతున్న ఇద్దరు మహిళలను విధి వక్రీకరించింది. విద్యుత్ వైర్లు మీద పడడంతో మహిళలు మృతి చెందారు. ఈ విషాద ఘటన నిడదవోలు మండలం తాడిమళ్లలో చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం దినసరి కూలీలుగా మహిళలు వెళుతుంటారు. అందులో భాగంగా తాడిమళ్ల ప్రాంతానికి చెందిన మంగతాయారు, మహాలక్ష్మిలు చెరుకు పంటలో పనిచేయడానికి వెళ్లారు. పనులు చేస్తుండగా కిందపడిన విద్యుత్ వైర్లను తాకారు. దీనితో విద్యుత్ షాక్ తగలడంతో మహిళలిద్దరూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వైర్లు తుప్పుపట్టిపోయి ఉన్నాయని, ఈ పరిస్థితి అధికారులకు తెలియచేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

11:17 - February 28, 2017

విజయవాడలో ఆటో కార్మికుల భారీ ర్యాలీ..

విజయవాడ : నగరంలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. జీవో 894 ను రద్దు చేయాలని రవాణా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రథం సెంటర్ నుండి లెనిన్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. సీఐటీయూ, సీపీఎం, సీపీఐ, ఏఐటీయూసీ నేతలు ప్రదర్శనలో పాల్గొన్నారు. లారీలు, ఆటోలు, ట్రాన్స్ పోర్టు వాహనాలు నిలిచిపోయాయి.

రాష్ట్రపతి పాలన విధించాలన్న సెల్వం..

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నారు. కాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆయన కలువనున్నారు.

10:53 - February 28, 2017

దేవుడితో బండ్ల గణేష్ సెల్ఫీ ఏంటీ అనుకుంటున్నారా ? అయితే పక్కనే ఉన్న ఫొటోను చూడండి. అర్థమైంది అనుకుంటున్నాం...అవును పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ను దేవుడితో 'బండ్ల గణేష్' పోల్చుతూ ఉంటుంటారు. ప్రతి సినిమాని బ్లాక్ బస్టర్ చెయ్యాలని తపించే నిర్మాతల్లో బండ్ల గణేష్ ఒకరు. 'బండ్ల గణేష్' ఎప్పుడు నా దేవుడు పవన్ కళ్యాణ్ గారని చెబుతూ ఉంటారు. అంతే కాకుండా ఆయన నిర్మాతగా చేసిన ఐదు సినిమాల్లో రెండు సినిమాలను పవన్ తోనే నిర్మించడం విశేషం. అందులో 'గబ్బర్ సింగ్' ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచిందన్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్ర షూటింగ్ కు 'బండ్ల గణేష్' హాజరయ్యాడు. బండ్ల గణేష్‌ని సాదరంగా ఆహ్వానించిన పవన్.. చివర్లో తనే ఫోన్ తీసుకుని మరీ సెల్ఫీ తీయడంతో గణేష్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడట. ఈ ఫొటోని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘దేవుడితో భక్తుడు సెల్ఫీ’ అంటూ పోస్టు చేశారు. కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ రెండోసారి పవన్ కల్యాణ్‌తో నటిస్తోంది. ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

10:44 - February 28, 2017

ఎప్పుడూ వార్తల్లో ఉండే దర్శకుడు 'రాంగోపాల్ వర్మ' తనదైన మార్క్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు ఓ చిత్రాన్ని తీసుకరానున్నాడు. బాలీవుడ్ బిగ్ బి 'అమితాబ్ బచ్చన్' ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'సర్కార్ 3’ చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ లో 'సర్కార్' సినిమా ఓ ట్రెండ్ ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను వర్మ సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేశారు. మహారాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో తెరకెక్కిన 'సర్కార్' సినిమా బాక్స్ ఆఫీసుల్ని కాసులతో నింపేసింది. అటు అమితాబచ్చన్ కి ఇటు రాంగోపాల్ వర్మకి మంచి పేరు తెచ్చిపెట్టిన ఈ సినిమా బచ్చన్ సాబ్ ని ఆర్ జి వి నీ మంచి మిత్రులుగా కూడా మార్చేసింది. 2005 లో రిలీజ్ ఐన 'సర్కార్' మంచి కలెక్షన్లతో దూసుకెళ్లింది. అదే ఫ్లో నీ కంటిన్యూ చేస్తూ 2008 లో సర్కార్ సినిమాకి సీక్వెల్ గా 'సర్కార్ రాజ్' సినిమాని తీశాడు. అనుకున్న స్థాయిలో 'సర్కార్ రాజ్' సినిమా ఆడియన్స్ ని రీచ్ అవ్వలేదు.

ఏప్రిల్ 7న రిలీజ్..
'అమితాబచ్చన్' తో ఎనిమిది సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ ఈసారి 'సర్కార్ 3' తో వస్తున్నాడు. 'సర్కార్ 3' లో యాంగ్రీ ఆడియన్స్ మెచ్చే స్థాయిలో అమితాబచ్చన్ న్ను ప్రెజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు సెంటిమెంట్స్ ఉండవ్ అని చెప్పుకునే రాంగోపాల్ వర్మ ఈ 'సర్కార్ 3' సినిమాని తన బర్త్ డే ఏప్రిల్ 7 న రిలీజ్ చేస్తున్నట్లు అని పేర్కొన్న సంగతి తెలిసిందే.

పెనుగంచిప్రోలుకు జగన్...

విజయవాడ : వైసీపీ అధినేత జగన్ పెనుగంచిప్రోలకు బయలుదేరనున్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు కల్వర్టులోకి దూసుకెళ్లడంతో 11 మంది మృతి చరెందిన సంగతి తెలిసిందే.

బస్సు ప్రమాదంపై మంత్రుల విచారం..

విజయవాడ : కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, శిద్ధా రాఘవరావులు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

 

10:21 - February 28, 2017

కృష్ణా : జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 'దివాకర్‌' ట్రావెల్స్‌కు చెందిన ఓల్వా బస్సు AP02 TC 7146 బస్సు కల్వర్టులోకి దూసుకుపోయింది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి వంతెనపై డివైడర్‌ను ఢీకొని కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృతిచెందారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

60 మంది ప్రయాణీకులు..
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. పెనుగంచిప్రోలు, నందిగామ పోలీసులు, ముళ్లపాడు గ్రామస్థులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మూడు అంబులెన్స్‌ల సాయంతో క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రి, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. బస్సు కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోవడంతో సహాయచర్యలకు ఆటంకం కలుగుతోంది. పలువురు ప్రయాణికులు ఇంకా బస్సులోనే ఇరుక్కుని ఉండటంతో గ్యాస్‌ కట్టర్ల సాయంతో బస్సు భాగాలను వేరుచేసి వారిని బయటకు వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అతివేగం, డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బస్సు ప్రమాద ఘటనపై జరిగిన ఘటనపై హోం మంత్రి చిన రాజప్ప, మంత్రి శిద్ధారాఘవరావు ఆరా తీశారు. మెరుగైన వైద్య సహాయం అందించాలని, ప్రమాద ఘటనపై నివేదిక సమర్పించాలని రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఆదేశించారు. వెంటనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందచేయాలని సూచించారు.

10:14 - February 28, 2017
10:13 - February 28, 2017

అమెరికా : జాత్సాంహకార దాడిలో తెలుగు వాసి శ్రీనివాస్ ను హత్య చేసిన అడమ్ ప్యూరింటన్ ను కోర్టులో హాజరు పరిచారు. దోషిగా నిర్ధారణ అయితే అతడికి ఉరిశిక్ష పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సోమవారం రాత్రి 9.45 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకున్న శ్రీనివాస్ భౌతికకాయానికి తెలంగాణ ప్రభుత్వం తరుపున రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి శ్రీనివాస్‌ మృతదేహంపై పుష్ఫగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
మరోవైపు జాతి వివక్షతపై జరుగుతున్న దాడులపై కఠినంగా వ్యవహరించాలని ఎఫ్ బీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సాక్ష్యాలు సేకరించడం..ప్రత్యక్ష సాక్షులను విచారించినట్లు తెలుస్తోంది. భారతీయ విదేశాంగ శాఖ కూడా అమెరికా అధికారులపై వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్ లో జరుగుతున్న పరిణామాలు..ఇతరత్రా అంశాలు విదేశాంగ కార్యదర్శి అక్కడి అధికారులతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11..

విజయవాడ : కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు (మం) ముళ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కల్వర్టులోకి దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య 11 మందికి చేరుకుంది.

కోదాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య..

సూర్యాపేట : కోదాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మిక్స్ ఇంజినీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న స్వాతి పురుగుల మందు ఆత్మహత్యకు పాల్పడింది.

'శ్రీనివాస్ ఘటన పునరావృతం కాకూడదు'..

హైదరాబాద్ : అమెరికాలో జాత్యహంకార దాడిలో మృతి చెందిన శ్రీనివాస్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. ఇలాంటి ఘటన మరొక్కసారి జరగకూడదని శ్రీనివాస్ సోదరుడు వి.మాధవ్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. శ్రీనివాస్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.

09:46 - February 28, 2017

'ఉయ్యాలవాడ నరసింహరెడ్డి'గా చిరు..మెగాస్టార్ 'చిరంజీవి' తన 151వ సినిమాపై దృష్టి పెట్టారు. చాలాకాలం తరువాత 'ఖైదీ నెంబర్ 150’ సినిమా ద్వారా 'చిరు' రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాపీసు వద్ద విజయం సాధించింది. అనంతరం తదుపరి చిత్రం ఏమై ఉంటుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 151 సినిమాను సురేందర్ రెడ్డితో తీయనున్నట్లు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 'చిరు' చిత్రంపై హీరో 'శ్రీకాంత్' పలు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓ టీవీ ఛానల్ వారు నిర్వహించిన కార్యక్రమంలో 'శ్రీకాంత్' పలు విషయాలు తెలియచేశారు. 'చిరంజీవి' 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' ఉంటుందని స్పష్టం చేశారు. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ పక్కా స్ర్కిప్ట్ సిద్ధం చేస్తున్నారు. 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ల ముందే బ్రిటీషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు 'ఉయ్యాలవాడ నరసింహరెడ్డి'. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బ్రిటిషు ప్రభుత్వం బహిరంగంగా ఉరితీసింది. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు. మరి ఈ వీరుడి పాత్రలో 'చిరు' ఎలా నటిస్తాడో చూడాలి. దీనిపై మాత్రం అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

09:45 - February 28, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్' ..మణిరత్నంతో ఓ సినిమా చేయనున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘ధృవ' సినిమాతో తన మైండ్ సెట్ ను మార్చుకున్న 'చెర్రీ' కథల విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. తాజాగా 'మణిరత్నంతో' ఓ డిఫరెంట్ సినిమా చేయనున్నాడంట. ఇటీవలే హైదరాబాద్ కు వచ్చిన మణిరత్నం - సుహాసిని దంపతులు 'చిరంజీవి'..’రామ్ చరణ్ తేజ' తో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఓ డిఫరెంట్ స్టోరీ చెప్పడంతో చిరు..చెర్రీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. జూన్ నుండి డేట్స్ ఇవ్వనున్నట్లు టాక్. జూన్ నాటికి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సినిమాను సెట్స్ పైకి తీసుకరావాలని అనుకుంటున్నారంట. కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో 'చెర్రీ' ఓ చెవిటివాడిగా కనిపించనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం 'సుకుమార్' సినిమాలో 'చెర్రీ' నటిస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ..మణిరత్నం కాంబినేషన్ లో చిత్రం ఉంటుందా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తెలియనుంది.

09:33 - February 28, 2017

సూర్యాపేట : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న డిమాండ్‌తోనే ఈ మహాజన పాదయాత్ర కొనసాగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజాభివృద్ధికి ప్రభుత్వం పాటు పడాలనే ప్రజలను చైతన్యం చేస్తున్నామని తమ్మినేని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా తెలంగాణలో ప్రజల బతుకులు మారలేదని, ప్రజా సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా... ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌, టీడీపీ, పాలన పోయి టీఆర్‌ఎస్‌ పాలన వచ్చినా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగలేదని తమ్మినేని మండిపడ్డారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తామన్న కేసీఆర్‌, హరీష్‌రావులు పత్రికల్లోనే నీళ్లు పారిస్తున్నారు తప్పా.. గ్రామాల్లో నీరు రావడం లేదని తమ్మినేని ఆరోపించారు.

134వ రోజు..
కేసీఆర్‌ హామీ ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య వంటి హామీలను కేసీఆర్‌ ఎందుకు నెరవేర్చడం లేదని తమ్మినేని ప్రశ్నించారు. నూటికి 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభవృద్ధికి ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలని తమ్మనేని డిమాండ్‌ చేశారు. సీపీఎం మహాజన పాదయాత్ర 134 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. సూర్యపేట జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర ఉత్సహంగా సాగింది. ఆత్మకూరు ఎస్‌ మండలంలో వట్టికంపాడు, లక్ష్మణ్‌నాయక్‌ తండా, నాచారం, ఆత్మకూర్‌ ఎక్స్‌రోడ్డు, దుబ్బగూడెం, నిమ్మికల్‌, దబ్బకంద గ్రామాలతోపాటు పాతర్లపాడు ఎక్స్‌రోడ్డు, గుండ్లసింగారం, నూతనక్లు, చిల్పకుంట్ల గ్రామాల్లో తమ్మినేని బృందం పర్యటించింది. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరని కేసీఆర్‌ అనడంపై హస్యాస్పదమని, సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని పేర్కొంటూ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

బస్సు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య..

విజయవాడ : కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు (మం) ముళ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కల్వర్టులోకి దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.

బస్సు ప్రమాదంపై మంత్రుల ఆరా..

విజయవాడ : కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు (మం) ముళ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కల్వర్టులోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై మంత్రులు చిన రాజప్ప, శిద్ధా రాఘవరావులు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.

 

09:29 - February 28, 2017

విజయవాడ : దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు మృత్యువాహనంగా మారింది. రెండు బ్రిడ్జీల మధ్యనున్న కల్వర్టులోకి బస్సు దూసుకపోవడంతో 7 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన పెనుగంచిప్రోలు (మం) ముళ్లపాడు వద్ద చోటు చేసుకుంది. స్థానిక గ్రామస్తులు..ఇతరులు సహాయక చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే పలువురు మృతి చెందారు. ప్రస్తుతం ఏడుగురు మృతి చెందినట్లు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విశాఖపట్టణం నుండి హైదరాబాద్ కు దివాకర్ బస్సు వెళుతోంది. విజయవాడలో పలువురు ప్రయాణీకులను ఎక్కించుకున్నారు. కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు (మం) ముళ్లపాడు వద్ద బస్సు అదుపు తప్పి రెండు బ్రిడ్జీల మధ్యలోనున్న కల్వర్టులో పడిపోయింది. స్థానికంగా ఉన్న వారు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. లోతులో చిక్కుపోవడంతో బస్సు కింద కూడా ప్రయాణీకులు ఉంటారని తెలుస్తోంది. మొత్తంగా 45 మంది ప్రయాణీకులు బస్సులో ఉంటారని సమాచారం.
క్షతగాత్రులను నందిగామ ఆసుపత్రికి..విజయవాడ ఆసుపత్రులకు పంపించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై అధికారులు పూర్తి అంచనాకు రాలేదు. బస్సు ప్రమాద ఘటనపై జరిగిన ఘటనపై హోం మంత్రి చిన రాజప్ప, మంత్రి శిద్ధారాఘవరావు ఆరా తీశారు. మెరుగైన వైద్య సహాయం అందించాలని, ప్రమాద ఘటనపై నివేదిక సమర్పించాలని రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఆదేశించారు. వెంటనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందచేయాలని సూచించారు.

09:03 - February 28, 2017

హైదరాబాద్ : నగరంలోని బాచుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికా జాత్సాంహకార దాడిలో హత్య అయిన శ్రీనివాస్ మృతదేహం నగరానికి చేరుకుంది. సోమవారం రాత్రి 9.45 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకున్న శ్రీనివాస్ భౌతికకాయానికి తెలంగాణ ప్రభుత్వం తరుపున రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి శ్రీనివాస్‌ మృతదేహంపై పుష్ఫగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి నేరుగా బాచుపల్లిలోని శ్రీనివాస్‌ నివాసానికి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో తరలించారు. శ్రీనివాస్‌ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. మంగళవారం ఉదయం శ్రీనివాస్ భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో శ్రీనివాస్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ కుటుంబసభ్యులు కోరుతున్నారు.

08:59 - February 28, 2017

కృష్ణా : ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూ నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నాయి. తాజాగా 'దివాకర్' ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈఘటనలో ఆరుగురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి..విశాఖపట్టణం నుండి హైదరాబాద్ కు దివాకర్ బస్సు వెళుతోంది. విజయవాడలో పలువురు ప్రయాణీకులను ఎక్కించుకున్నారు. కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు (మం) ముళ్లపాడు వద్ద అదుపు తప్పింది. రెండు బ్రిడ్జీల మధ్యలో ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణీకులను ఏమి జరిగిందో తెలియరాలేదు. ఆరుగురు అక్కడికక్కడనే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను నందిగామ ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెండు బ్రిడ్జీల మధ్యలో ఉన్న కల్వర్టులో ఇరుక్కపోయిన బస్సును పైకి లేపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్సు కింద ప్రయాణీకులున్నారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిద్ర మత్తులో ఉన్నాడా ? వత్తిడిలో డ్రైవర్ ఉన్నాడా ? అనేది తెలియరాలేదు. పూర్తి వివరాలు తె లియాల్సి ఉంది. బస్సులో మొత్తం 46 మంది ప్రయాణీకులున్నట్లు తెలుస్తోంది. జరిగిన ఘటనపై హోం మంత్రి చిన రాజప్ప, మంత్రి శిద్ధారాఘవరావు ఆరా తీశారు. మెరుగైన వైద్య సహాయం అందించాలని, ప్రమాద ఘటనపై నివేదిక సమర్పించాలని రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఆదేశించారు.

బస్సు ప్రమాదంపై మంత్రుల ఆరా..

విజయవాడ : కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు (మం) ముళ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కల్వర్టులోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై మంత్రులు చిన రాజప్ప, శిద్ధా రాఘవరావులు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.

బస్సు ప్రమాదంపై మంత్రుల ఆరా..

విజయవాడ : కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు (మం) ముళ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కల్వర్టులోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై మంత్రులు చిన రాజప్ప, శిద్ధా రాఘవరావులు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.

బస్సు ప్రమాదంపై మంత్రుల ఆరా..

విజయవాడ : కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు (మం) ముళ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కల్వర్టులోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై మంత్రులు చిన రాజప్ప, శిద్ధా రాఘవరావులు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.

08:20 - February 28, 2017

తెలంగాణలో అంగన్ వాడీలకు జీతాలు పెంపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఏపీ ప్రభుత్వం అంగన్ వాడీలపై వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది ? మరోవైపు అమెరికాలో జాతి విధ్వేషం ఇంకా కొనసాగుతోంది. భారతీయులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలుగువారు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ అంశాలపై టెన్ టివి చర్చా వేదికలో నగేష్ (విశ్లేషకులు), నక్కా ఆనంద్ బాబు (టిడిపి), రఘు (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియోలో క్లిక్ చేయండి.

కోల్ కతాలో అగ్నిప్రమాదం..

కోల్ కతా : బుర్రాబజార్ లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అమ్రటాలా లేన్ ప్రాంతంలోని ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న 20 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

కోల్ కతాలో అగ్నిప్రమాదం..

కోల్ కతా : బుర్రాబజార్ లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అమ్రటాలా లేన్ ప్రాంతంలోని ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న 20 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

కల్వర్టులోకి దూసుకెళ్లిన దివాకర్ బస్సు..

కృష్ణా : జిల్లాలోని పెనుగంచిప్రోలు (మం) ముళ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈఘటనలో నలుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు నందిగామ ఆసుపత్రికి తరలించారు. విశాఖ నుండి హైదరాబాద్ కు వెళుతున్నట్లు తెలుస్తోంది.

07:18 - February 28, 2017

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

06:50 - February 28, 2017

అమెరికా : యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌కు ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలోనూ నిరసనలు తప్పలేదు. సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ఆఖరికి ఆస్కార్‌ వేడుక వ్యాఖ్యత కూడా ట్రంప్‌పై తమ వ్యతిరేకతను బహిరంగంగానే ప్రదర్శించారు. అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌కు మద్దతు తెలిపారు. ఏడు ముస్లిం దేశాల ప్రజలు దేశంలోకి రాకుండా జారీచేసిన ట్రావెల్‌ బ్యాండ్‌ ఉత్తర్వులపై తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌కు మద్దతిస్తూ పలువురు సెలబ్రిటీలు బ్లూ రిబ్బన్‌ ధరించారు. ఐరిష్‌-ఇథోపియన్‌ స్టార్‌ రూత్‌ నెగ్గా, మూన్‌లైట్‌ సినిమా డైరెక్టర్‌ బెర్రీ జెంకిన్స్‌ సహా మరికొందరు ప్రముఖులు కెర్లీ క్లోస్‌, కాసీ అఫ్లెక్‌, మెంజ్‌ పాసెక్‌, లిన్‌-మానుయెల్‌ మిరిండా బ్లూ రిబ్బన్‌తో కనిపించారు.

వేదికపైనే నిరసన..
అకాడమీ అవార్డుల కార్యక్రమ వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్‌ కూడా ట్రంప్‌పై తన వ్యతిరేకతను వేదికపైనే చూపించారు. "ఆస్కార్‌ వేడుక కార్యక్రమం ప్రారంభమై రెండు గంటలవుతోంది.. ఆయన ఇంకా ఏం ట్వీట్‌ చేయలేదు, నాకు ఆందోళనగా ఉందంటూ ట్రంప్‌ తరచూ ట్వీట్లు చేసే అలవాటును జిమ్మీ గుర్తుచేశారు.. వేదికపై ఉండగానే మధ్యలో జిమ్మీ ఫోన్‌ తీసుకుని 'హే డొనాల్డ్‌ ట్రంప్‌ యు అప్‌?' అని ట్వీట్‌ చేశారు. తన ఫోన్‌ స్క్రీన్‌ను అందరికీ కనిపించేలా చేయమని ప్రొడక్షన్‌ బృందాన్ని కోరారు. దీంతో జిమ్మీ ఫోన్‌లో ట్వీట్‌ స్క్రీన్‌పై అందరికీ కనిపించింది. దీంతో చాలా మంది గట్టిగా నవ్వారు. అలాగే ట్రంప్‌ పాలసీలను వ్యతిరేకించిన నటి మెరిల్‌ స్ట్రీప్‌ను గతంలో ట్రంప్‌ తీవ్రంగా విమర్శించారు. అయితే మెరిల్‌కు మద్దతుగా జిమ్మీ 'మెరిల్‌ సేస్‌ హాయ్‌' హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ట్వీట్‌ చేశారు. జిమ్మీ ట్వీట్‌ను అయిదు నిమిషాల్లోనే లక్ష మంది రీట్వీట్‌ చేశారు. ఆస్కార్‌లో ట్రంప్‌పై నిరసనలు ఆయనపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందో రుజువుచేస్తున్నాయి.. సెలబ్రిటీలు ఓ దేశాధ్యక్షుడిపై ఈరకంగా నిరసనబాట పట్టడం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు..

06:45 - February 28, 2017

విజయవాడ : ఏపీలో కరెంటు చార్జీలు పెంచాలన్న విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రతిపాదనలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని రెండు డిస్కంలు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో దాదాపు 2వేల కోట్ల రూపాయల లోటు చూపించాయి. దీనిని భర్తీ చేసుకునేందుకు చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలపై ఈఆర్సీ ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టింది. విజయనగరంలో ప్రారంభమైన ప్రజాభిప్రాయసేకరణలో చార్టీల పెంపు ప్రతిపాదనలపై తీవ్ర వ్యక్తిరేకత వ్యక్తమైంది. ఏపీలో విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ, తిరుపతి కేంద్రంగా ఉన్న ఏపీ దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికల్లో చార్జీల పెంపు ప్రతిపాదించాయి. దీనిపై జస్టిస్‌ భవానీ ప్రసాద్‌ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయం సేకరిస్తోంది. వచ్చే నెల 6 వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇది కొనసాగనుంది. విజయనగరంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో చార్జీల పెంపు ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

పెంపు ఇలా..
విద్యుత్‌ పంపిణీ సంస్థల ఖర్చుకు తగిన విధంగా ఆదాయం రావడంలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 30వేల 69 కోట్ల రూపాయలు ఆదాయం కోసం ఏఆర్‌ఆర్‌ సమర్పించాయి. ప్రస్తుతం ఉన్న చార్జీల ప్రకారం 22 వేల 892 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఆదాయానికి వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని చార్జీల పెంపు ద్వారా భర్తీ చేసుకోవాలని డిస్కంలు నిర్ణయించాయి. లోటు పూడ్చేందుకు కొంతమేర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా, మిగిలిన మొత్తాకి చార్జీల పెంపును ప్రతిపాదించాయి. నెలకు 900 యూనిట్ల విద్యుత్‌ వాడకం వినియోగదారులకు ఈసారి గ్రూపు-బీ కేటగిరిలో చేర్చారు. దీని ప్రకారం 600 యూనిట్ల మించి విద్యుత్‌ వాడుకునే వారంతా గ్రూపు-బీలోకి వస్తారు. ఈ విభాగంలోని వినియోగదారులు మొదటి యూనిట్‌ నుంచే 2.60 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. వంద యూనిట్లు మించి విద్యుత్‌ వినియోగంచే ప్రతి శ్లాబులో కూడా చార్జీల పెంపును ప్రతిపాదించారు. గ్రూపు-ఏ కేటగిరిలో 101 నుంచి 200 యూనిట్ల వరకు విద్యుత్‌ వాడే వారి నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న విద్యత్‌ చార్జీలకు యూనిట్‌కు 3.60 రూపాయల నుంచి 3.64 పైసలకు పెంచాలని వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో చేర్చారు. నెలకు 200 యూనిట్లు మించి విద్యుత్‌ వాడితే ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీలకు యూనిట్‌కు 6.90 రూపాయల నుంచి 6.97 రూపాయలకు పెంచాలని ఏఆర్‌ఆర్‌లో ప్రతిపాదించారు. మూడు వందల మించి విద్యుత్‌ వాడితే ప్రతి యూనిట్‌కు 7.83 రూపాయలు చెల్లించాలని ప్రతిపాదించాయి. నెలకు యాభై యూనిట్ల లోపు విద్యుత్‌ వాడే వినియోగదారులకు గ్రూపు-ఏ లో చేర్చారు. వీరి నుంచి ప్రస్తుతం వున్న1.45 రూపాయలనే వసూలు చేస్తారు. గ్రూపు-సీ కేటగిరి లో వంద యూనిట్ల వరకు యూనిట్‌కు 2.95 రూపాయలు వసూలు చేస్తారు. ఇదే గ్రూపులో 101 నుంచి 200 యూనిట్ల వరకు యూనిట్‌కు ఆరు పైసలు చొప్పున పెంచి, 5.31 రూపాయలు వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. చార్జీల పెంపు ప్రతిపాదనలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

వత్తిడి..
బడా పారిశ్రామికవేత్తలు, తెలుగుదేశం నేతలు విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుని చార్జీలు పెంచే విధంగా ఒత్తిడి తెచ్చారన్న విమర్శలు ఉన్నాయి. లోడ్‌ డిస్పాచ్‌ పేరుతో కిలోవాట్‌కు 50 రూపాయల స్థిర చార్జీ వసూలు చేయాలన్న డిస్కంల ప్రతిపాదన వినియోగదారులు అందరిపై భారం మోపే విధంగా ఉందని ప్రజా సంఘాల నేతల విద్యుత్‌ నియంత్రణ మండలి దృష్టికి తెచ్చారు. :ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఇవాళ విజయవాడలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. చార్జీల పెంపుపై ఈఆర్‌సీ సిఫారసుల  ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పెంచిన చార్జీలు వచ్చే ఏప్రిల్‌ లేదా మే నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

06:41 - February 28, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో సమ్మెకు దిగారు. పెద్దనోట్ల రద్దుతో బ్యాంకులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతున్నారు. వసూలుకాని బ్యాంకు లోన్లకు ఉన్నతాధికారులను బాధ్యులను చేస్తున్న ప్రభుత్వ చర్యను ఉద్యోగులు నిరసిస్తున్నారు. తొమ్మిది సంఘాలు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ పేరు ఒకే గొడుకు కిందకు వచ్చి సమ్మె చేస్తున్నాయి. యుఎఫ్ బీయూకు దేశవ్యాప్తంగా పది లక్షల మంది సభ్యులు ఉన్నారు. దీంతో బ్యాంకు లావాదేవీలపై సమ్మె తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే బీఎంఎస్ అనుబంధంగా ఉన్న నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ వర్కర్స్‌, నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ ఈ సమ్మెలో పాల్గోవటంలేదు. హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ యాక్సిస్‌తో ప్రైవేటు రంగంలోని బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొనడంలేదు.

06:38 - February 28, 2017

విజయవాడ : ఏపీ కొత్త సీఎస్‌గా అజయ్‌ కల్లం నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కల్లం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సెలక్టయ్యారు. 1983వ బ్యాచ్‌కు చెందిన అజయ్‌ కల్లం మార్చి చివరికి పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న టక్కర్‌ పదవీ కాలం ఇవాల్టితో ముగియనుంది. మరోవైపు అజయ్‌కల్లం మార్చి 31తో పదవీకాలం ముగుస్తుండడంతో ఆ తర్వాత సీఎస్‌గా దినేష్‌ కుమార్‌ను నియమించనున్నారు.

 

06:35 - February 28, 2017

ఢిల్లీ : అమెరికాలో ట్రంప్‌ నింపిన విద్వేషం కొనసాగుతూనే ఉంది. శ్వేత జాతీయుడు కాకుంటే.. అడుగడుగునా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అగ్రరాజ్యంలో ఉద్యోగానికే కాదు.. ప్రాణాలకూ భద్రత లేకుండా పోయింది. తాజాగా భారతీయ మహిళపై ఇద్దరు నల్లజాతీయులు జాతి వివక్ష చూపారు. అమెరికాకు ఎందుకు వచ్చావంటూ నిలదీశారు. ఇటు కేన్సస్‌ నగరంలో భారతీయులు శ్రీనివాస్‌ కూచిభొట్లకు నివాళులర్పించారు. అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలో జాతి విద్వేష దాడులు పెరిగిపోయాయి. కోటి ఆశలతో అమెరికాకు చేరిన భారత యువత ప్రస్తుతం భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటోంది. వీసా నిబంధనల్లో పలు మార్పులు తీసుకొస్తుండటంతో అమెరికాలో ఉంటున్న భారతీయులు భయం భయంగా కాలం గడుపుతున్నారు. అమెరికాలో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ హత్య ఘటన మరవక ముందే.. మరో భారతీయ మహిళపై జాతివివక్ష ఘటన వెలుగుచూసింది. న్యూయార్క్‌లోని మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న మహిళ పట్ల ఇద్దరు నల్లజాతీయులు జాతి వివక్ష చూపారు. అమెరికాకు ఎందుకు వచ్చావంటూ.. తిరిగి మీ దేశానికి వెళ్లండి అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. నల్ల జాతీయుల ప్రవర్తనతో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న వారు కూడా అవాక్కయ్యారు. కనీసం పక్కనే ఉన్న వారు కూడా బాధితురాలికి బాసటగా నిలవలేకపోయారు. ఈ ఘటన అమెరికాలో ఉంటున్న భారతీయుల ప్రాణాల భద్రతపై అనేక అనుమానాలను రేకేతిస్తోంది.

కొలరాడోలో..
జాతి విద్వేషాన్ని వెళ్లగక్కిన మరో ఘటన దక్షిణ కొలరాడోలో వెలుగు చూసింది. పీటన్ నగరంలోని ఓ భారతీయుడి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటికి పోస్టర్లు అతికించి.. గోడల మీద కోడిగుడ్లు విసిరికొట్టారు. అమెరికాను వదిలిపోవాలని హెచ్చరిస్తూ పోస్టర్లు అంటించారు. అమెరికా పౌరుడు ఆడమ్‌ ప్యూరింటన్‌ కాల్పుల్లో మృతిచెందిన తెలుగు ఇంజనీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్లకు కేన్సస్‌ నగరంలో నివాళులర్పించారు. శాంతి ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ''మాకు శాంతి కావాలి, మాకు ప్రేమ కావాలి.. ఐకమత్యమే మంచిది.. విడిపోతే పడిపోతాం'' అంటూ నినాదాలు చేశారు. విద్వేష రాజకీయాలకు తాము మద్దతివ్వబోమన్నారు.
శ్రీనివాస్‌ కూచిభొట్ల మృతదేహాన్ని..విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. అటు నుంచి బాచుపల్లిలోని ఆయన స్వగృహానికి చేర్చారు. మొత్తంగా అమెరికాలో ఉంటున్న భారతీయులే కాకుండా ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా ట్రంప్‌ నిర్ణయాలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

06:29 - February 28, 2017

హైదరాబాద్ : అమెరికాలోని కేన్సస్‌లో జరిగిన జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన కూచిభొట్ల శ్రీనివాస్‌ మృతదేహం హైదరాబాద్‌ చేరుకుంది. ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీనివాస్‌ మృతదేహాన్ని అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీనివాస్‌ భార్య సునయనతో పాటు ఆయన సోదరుడు, సోదరుడి భార్య , మరో మిత్రుడు మృతదేహాంతో పాటు కార్గో విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి శ్రీనివాస్‌ మృతదేహంపై పుష్ఫగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి నేరుగా బాచుపల్లిలోని శ్రీనివాస్‌ నివాసానికి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో తరలించారు. శ్రీనివాస్‌ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో శ్రీనివాస్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఓఆర్ఆర్ పై గడ్డి లారీ బోల్తా..

రంగారెడ్డి : రాజేంద్రనగర్ వద్ద ఓఆర్ఆర్ పై గడ్డి లారీ బోల్తా కొట్టింది. మంటలు చెలరేగి లారీ దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ లు సురక్షితంగా బయటపడ్డారు.

ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

విజయవాడ : స్థానిక సంస్థల టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. శ్రీకాకుళం - శత్రుచర్ల, తూ.గో -చిక్కాల రామచంద్రారావు, ప.గో - అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణ రాజు, నెల్లూరు - వాకాటి నారాయణరెడ్డి, అనంతపురం - దీపక్ రెడ్డి, చిత్తూరు - దొరబాబు, కర్నూలు - శిల్పా చక్రపాణిరెడ్డి, ఇప్పటికే కడప స్థానానికి బీటెక్ రవి నామినేషన్ వేశారు.

నిప్పంటుకుని ఐదేళ్ల చిన్నారి మృతి..

మేడ్చల్ : జవహార్ పీఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. చెన్నాపురంలో అగ్గిపుల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దివ్య అనే ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది.

కానిస్టేబుల్ పై దాడి.,.

పశ్చిమగోదావరి : ఏలూరు త్రీ టౌన్ పీఎస్ పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సీతయ్య అనే కానిస్టేబుల్ పై లక్ష్మణ్ రావు అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. లక్ష్మణ్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నేడు శ్రీనివాస్ అంత్యక్రియలు..

హైదరాబాద్ : అమెరికాలో జాత్యహంకార దాడిలో మృతి చెందిన శ్రీనివాస్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. రాత్రి 9.45గంటలకు శ్రీనివాస్ మృతదేహం చేరుకుంది. భార్య సునయనతో పాటు శ్రీనివాస్ సోదరుడు - భార్యలు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక వాహనంలో బాచుపల్లికి మృతదేహం తరలించారు.

Don't Miss