Activities calendar

01 March 2017

21:38 - March 1, 2017

కలకత్తా : పిల్లల అక్రమ రవాణా కేసులో పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు జుహీ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి భారత-నేపాల్ సరిహద్దుల్లో రాష్ట్ర సీఐడీ జుహీ చౌదరిని అదుపులోకి తీసుకుంది. పరారీలో ఉన్న జుహీ చౌదరినీ మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా బటాసియాలో పోలీసులు అరెస్ట్‌ చేసారు. సిఐడి జుహీ చౌదరీని 12 రోజులు కస్టడీలోకి తీసుకుంది. పోలీసుల విచారణలో బిజెపి జాతీయ కార్యదర్శి కైలాష్‌ విజయ్ వర్గియాతో పాటు పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు రూపా గంగూలీ పేర్లు కూడా వెలుగు చూశాయి. చిన్నపిల్లలను అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం మేరకు గతవారం ఉత్తర బెంగాల్‌లోని పిల్లల అనాథాశ్రయం యజమాని చందన చక్రవర్తితో మరో నలుగురిని సిఐడి అరెస్ట్‌ చేసింది. ఈ దత్తత కేంద్రం కార్యకలాపాలను బీజేపీ నేత జుహీ చౌదరి చూసుకుంటున్నట్టు చందన చక్రవర్తి పోలీసు విచారణలో తెలిపారు. చక్రవర్తిని సిలిగురి కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా తాను బిజెపి బడా నేతల పేర్లను వెల్లడించలేదని, జుహీ చెప్పి ఉంటుందని చక్రవర్తి మీడియాతో చెప్పారు. 

21:35 - March 1, 2017

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీహార్ ఎక్సైజ్ మంత్రి, కాంగ్రెస్‌ నేత అబ్దుల్ జలీల్ మస్తాన్ చేసిన వ్యాఖ్యలతో బీహార్ అసెంబ్లీ అట్టుడికింది. అధికార పక్షాలు, విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. కేంద్రం పెద్దనోట్లను రద్దు చేయడంపై ఆందోళన చేస్తున్న ప్రజలనుద్దేశించి-  ప్రధాని మోదీ ఫోటోను చెప్పులతో కొట్టాలంటూ మంత్రి వ్యాఖ్యానించారు. జలీల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సదరు వీడియో లోకల్ టీవీ చానెల్‌లో రావడంతో... బీజేపీ ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తింది. మంత్రి జలీల్‌ మస్తాన్‌ని పదవి నుంచి తొలగించాలంటూ  నితీష్‌ ప్రభుత్వాన్ని బిజెపి డిమాండ్ చేసింది. మంత్రి వ్యాఖ్యలను నితీష్‌కుమార్‌ తప్పు పట్టారు. తన వ్యాఖ్యలపై మంత్రి జలీల్‌ మస్తాన్‌ క్షమాపణ చెప్పారు.

21:32 - March 1, 2017
21:30 - March 1, 2017

హైదరాబాద్ : అధికారుల లంచగొండితనం.. 250 మంది విద్యార్థుల భవిష్యత్తును చీకటిమయం చేసిందా..? ఏడాదంతా చదివినా వారు పరీక్షలు రాయకపోవడానికి, ఇంటర్‌ బోర్డు అధికారుల లంచగొండితనమే కారణమా..? ఈ ప్రశ్నలకు అవునేమోనన్న సందేహమే వ్యక్తమవుతోంది. 
ఈ కాలేజీ ఎక్కడుందో తమకు తెలియదని అధికారులు చెబుతుంటే, తెలియనిదే తొలి విడత తనిఖీ ఎలా చేశారంటూ సాక్ష్యాలతో సహా.. కాలేజీ యాజమాన్యం ప్రశ్నిస్తోంది. కారణాలేవైనా, కాలేజీ నిర్వాహకులు, అధికారుల మధ్యలో.. 250 మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. 

ప్రశ్నార్థక పరిస్థితిలో 250 మంది విద్యార్థులు.. 
హైదరాబాద్‌ వనస్థలిపురంలోని శ్రీవాసవి జూనియర్‌ కాలేజీలో చదివిన సుమారు 250 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. తోటి పిల్లలందరూ పరీక్షలు రాస్తుంటే, వీరందరూ, పరీక్షకు దూరమై, న్యాయం కోసం రోడ్డెక్కారు. ఈ పరిస్థితికి కళాశాల నిర్వాహకుల నిర్లక్ష్యమే  ప్రధాన కారణమని అధికారులు చెబుతుంటే, బోర్డు అధికారుల లంచగొండితనమే తప్ప, తమ తప్పేమీ లేదని కాలేజీ యాజమాన్యం కవర్‌ చేసుకుంటోంది. 

ఏం జరిగింది?
శ్రీవాసవి కళాశాలకు గుర్తింపు లేకున్నా, విద్యార్థులను చేర్చుకుని, వారి భవిష్యత్తును అంధకారం చేశారని కాలేజీ యాజమాన్యంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, బోర్డు అధికారులు అందరూ కాలేజీనే తప్పుబట్టారు. అయితే, బుధవారం ఈ వ్యవహారంలో కొత్త కోణం ఆవిష్కృతమైంది. ఇంటర్‌ బోర్డు అధికారులకు లంచం ఇవ్వని కారణంగానే, తమ విద్యార్ధులకు హాల్‌టిక్కెట్లు జారీ చేయలేదని, కాలేజీ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ ఆరోపించారు. గత ఏడాది జూన్‌లోనే గుర్తింపు కోసం ఇంటర్‌ బోర్డుకు దరఖాస్తు చేశామని, అధికారులు అనుమతి కూడా ఇచ్చారని, అయితే, అఫిలియేషన్‌ ఇచ్చేందుకు లంచం డిమాండ్‌ చేశారన్నారు. అక్కడికీ తాము రెండు లక్షల రూపాయలు అధికారులకు లంచం ఇచ్చానని... మరో 5 లక్షలు డిమాండ్‌ చేశారన్నారు. ఆ మొత్తం ముట్టజెప్పనందుకే తమను ఇలా అధికారులు వేధించారని, జూన్‌ నుంచి బోర్డు చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. 

ఎక్కడా కాలేజీ..
ఇంటర్‌ బోర్డు అధికారులు మాత్రం శ్రీనివాస్‌ ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు.  అసలు ఈ కాలేజీ ఎక్కడుందో కూడా తెలియదంటున్నారు. సడన్‌గా వెలుగులోకి వచ్చిందన్నారు. తప్పంతా కాలేజీ యాజమాన్యానిదేనని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ అన్నారు. 

ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. 
అధికారుల వాదనను వాసవీ కాలేజీ యాజమాన్యం తప్పుబట్టింది. తమ కాలేజీకి అనుమతి లేదని చెప్తోన్న ఇంటర్ బోర్డు అధికారులు...  గతేడాది తమ కాలేజీలో ఎందుకు తనిఖీలు నిర్వహించారో చెప్పాలని యాజమాన్య ప్రతినిధులు ప్రశ్నించారు. వీరి వాదప్రతివాదనల నడుమే, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేశారు. ఈ 250 మంది విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని, ఎంసెట్‌కు కూడా వీరిని అనుమతిస్తామని తెలిపారు. శ్రీవాసవి కాలేజీ యాజమాన్యంపై  క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
ఏది నిజం.. 
ఈ వ్యవహారంలో పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్‌బోర్డు అధికారులు చెబుతున్నట్లు, ఈ కాలేజీకి నిజంగానే గుర్తింపు లేనప్పుడు, ఇంతకాలం ఎలా కొనసాగనిచ్చారు..? దాన్ని అప్పుడే సీజ్‌ చేసి యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదు..? ఏదిఏమైనా, ప్రస్తుతం విద్యార్థులు పరీక్షలు రాయకపోవడానికి, కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం ఎంతుందో.. బోర్డు అధికారుల ఉదాసీనతా అంతే ఉంది. కారణాలేవైనా, తోటి విద్యార్ధులంతా పరీక్ష రాస్తోంటే, ఈ 250 మంది మాత్రం దీనంగా అధికారుల దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూస్తూ.. రోడ్డెక్కారు. రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నా ఇంటర్‌ బోర్డు అధికారులు సానుకూలంగా స్పందించక పోవడంతో, వీరు పరీక్ష రాయలేక పోయారు. దీంతో తమ భవిష్యత్‌ ఏంటని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్ధులకు న్యాయం చేయాలని విద్యార్ధి సంఘాలు కోరుతున్నాయి. ఈ వ్యవహారంలో తప్పు ఎవరిదో త్వరగా తేల్చి, భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి తప్పు చేయని రీతిలో, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ అనుభవం ద్వారా ఇకనైనా కఠిన చర్యలు తీసుకుంటుందా..? లేక ఎప్పట్లాగానే చేతులు దులిపేసుకుంటుందా..? వేచి చూడాలి.  

21:25 - March 1, 2017

విజయవాడ : దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటన.. ఏపీ రాజకీయాల్లో కాకను పెంచుతోంది. ఈ అంశంపై పాలక, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబును సెంట్రల్‌ జైలుకు పంపుతానన్న జగన్‌పై.. సీఎం చంద్రబాబుతో పాటు ఐఎఎస్‌ అధికారుల సంఘం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సెంట్రల్‌ జైలు పదాన్ని ఉచ్చరించడం విపక్షనేతకు బాగా అలవాటైపోయందని సీఎం ఎద్దేవా చేస్తే, జగన్‌పై చర్యలను కోరుతూ ఐఏఎస్‌ అధికారుల సంఘం సీఎంకు విజ్ఞప్తి చేసింది. 

రాజకీయ రంగు.. 
మంగళవారంనాడు, కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద, జరిగిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం.. రాజకీయ రంగు పులుముకుంది. ప్రమాద బాధితులను పరామర్శించే సందర్భంలో విపక్ష నేత జగన్‌ ప్రదర్శించిన దూకుడు, అధికారులపై విరుచుకుపడ్డ వైనాన్ని, సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. జగన్‌ మానసిక పరిస్థితి అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అధికారులను జైలుకు పంపుతాననడం సరికాదని హితవు పలికారు. ముళ్లపాడు ప్రమాదానికి కృష్ణాజిల్లా కలెక్టరుకుగానీ, పోలీసులకు గానీ ఏమైనా సంబంధం ఉందా..? అని ప్రశ్నించారు. 

టీడీపీ ఫైర్.. 
కృష్ణా జిల్లా ముళ్లపాడు రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత జగన్‌... నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యవహారించిన తీరును టీడీపీ నాయకులు కూడా తీవ్రంగా తప్పుపట్టారు. జగన్‌ శవరాజకీయాలు చేస్తున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్‌, జగన్‌.. ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ప్రతినాయకుడిగా మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి ఫైర్‌ అయ్యారు. జగన్‌ అధికారులపై రౌడీయిజం చేస్తున్నారని బుద్దావెంకన్న ఆరోపించగా, జగన్‌కు వ్యతిరేకంగా పులివెందులలోనే మైనారిటీలతో కలసి ఉద్యమిస్తానని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ హెచ్చరించారు. 

వైసీపీ కౌంటర్.. 
అయితే పాలకపక్షం నేతల విమర్శలను, విపక్ష వైసీపీ తీవ్రంగా తప్పుబట్టింది. టీడీపీ ఎంపీల బస్సులు ప్రజల ప్రాణాలు తీస్తుంటే.. తాము చూస్తూ ఊరుకోవాలా ? అని పార్టీ నేతలు ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేశారు
ఐఏఎస్ లు సీరియస్.. 
మరోవైపు, కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాబుపై జగన్‌ చేసిన వ్యాఖ్యలను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు తీవ్రంగా తప్పుపట్టారు. ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసొసియేషన్‌ అధ్యక్షులు ఫరీదా అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. జగన్‌పై సీఎం చంద్రబాబు, సీఎస్‌ అజేయ్‌ కల్లంకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. 
 మొత్తంగా ముళ్లపాడు ఘటన టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య రాజకీయ రంగు పులుముకుంది. రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఎంతవరకూ ఎంతవరకూ వెళ్తుందో చూడాలి. 

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం..

వైజాగ్ : ఉత్తరాంధ్ర అభివృద్ధే తన ప్రధాన అజెండా అని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి అజ శర్మ అన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటు సమస్యను మండలిలో లెవనెత్తి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 

20:47 - March 1, 2017
20:44 - March 1, 2017

ఏ లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి.. ? ఏ ప్రయోజనాలాశించి ఈ వివాదాలు రేపుతున్నారు? కొందరిపై దేశద్రోహులంటూముద్రవేస్తూ , తాము అపర దేశభక్తులమని ఎలా చెప్పుకుంటున్నారు? ఎవరు దేశభక్తులు.. ఎవరు ద్రోహులు..  యూనివర్సిటీలు వికాసాన్నిపెంపొందించే విద్యాలయాలుగా వికసించాలి. మేథస్సును పెంపొందించే  ఆవరణలుగా ఎదగాలి. కానీ సంకుచిత భావనలకు, మలతం కేంద్రంగా సంస్కృతి, దేశభక్తి పేరుతో జరిగే ఆగడాలకు అడ్డాలుగా మారుతున్నాయా?  పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

20:32 - March 1, 2017

ఇండ్లళ్ల సంసారం ఎల్లి ఎల్లక సతమతమైతున్నోళ్లు బాగ జూడాలే ఈ ముచ్చట.. పిట్రోల్, డీజిల్ ధరలు పెంచి పెంచి పెంచి ధమ్మొచ్చినట్టుంది ఆయిల్ కంపినోళ్లకు.. ఇప్పుడు జనం సమురు దీస్తందుకు గ్యాస్ బుడ్ల ధరలు వెంచిండ్రమ్మా..? అచ్చేదిన్ కోసం ఎదురు సూస్తుంటిరిగదా.?. ఇగో వంటింట్లదాకొచ్చింది అచ్చేదిన్ అందుకోండ్రి మరి.. మరిన్ని ఘరం ఘరం మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

20:16 - March 1, 2017

కడప : జిల్లాలో రెవెన్యూ అధికారులు భూ బకాసురుల అవతారమెత్తారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జా చేస్తున్నారు. బంధువుల పేరుతో ప్రభుత్వ భూములను గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన వారే కబ్జా చేస్తూ.. ఎకరాల చెప్పున రేటుకట్టి  అమ్మేసుకుంటున్నారు. కడపజిల్లాలో రెవెన్యూ అధికారుల భూ కబ్జా బాగోతంపై టెన్‌టీవీ ఫోకస్‌ ..

రెవెన్యూ అధికారుల భూకబ్జా..
కడప జిల్లాలో రెవెన్యూ అధికారులు కబ్జాకోరుల  అవతారమెత్తారు. ప్రభుత్వ పెద్దల అండతో కాపాడాల్సిన భూముల్నే తెగనమ్మకుఉంటున్నారు.  పుల్లంపేట మండలంలో  రెవెన్యూ అధికారులు భూఆక్రమణలకు అడ్డేలేకుండా పోయింది. పుల్లంపేట మండలం కొత్తఅగ్రహారంలోని సర్వే నెంబర్415, 437ల్లో దాదాపు 75 ఎకరాలను.. సుండుపల్లె తహశీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి.. తమ్ముడు రమాకాంత్ రెడ్డి కబ్జా చేశారు. ఆక్రమించిన భూమికి ఫెన్సింగ్ వేసి పండ్లతోటలు సాగు చేస్తున్నారు. ఈ కబ్జాలపై స్థానిక రెవెన్యూ అధికారులు సైలెంట్‌గా ఉండటంతో రోజురోజుకూ కబ్జా చేస్తున్న భూమి విస్తీర్ణం పెరుగుతోంది. గతంలో ఇది ప్రభుత్వ భూమి అని  రెవెన్యూ అధికారులు ప్రకటించినా.. ఆ భూమి తమదేనంటూ సుబ్రమణ్యంరెడ్డి బంధువులు గొడవకు దిగుతున్నారు. జిల్లాలోని కొందరి నేతల అండతో తహీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి బంధువులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానిక రైతులు అంటున్నారు. 

కాజేసింది తమ్ముడే.. 
పుల్లంపేటలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది సుండుపల్లె తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యం రెడ్డి తమ్ముడేనని స్థానిక రెవెన్యూ అధికారులు కూడా అంటున్నారు. దీనిపై ఇప్పటికే తాము కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామంటున్నారు. సర్వేనంబర్‌ 437,415 ల్లోని భూమిని తర్వలో స్వాధీనం చేసుకుంటామని పుల్లంపేట ఎమ్మార్వో గౌరీశంకర్‌ స్పష్టం చేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇంత క్లియర్‌గా చెబుతున్నా.. సుండుపల్లె తహశీల్దార్‌ మాత్రం కబ్జాల బాగోతంలో తన ప్రమేయం లేదని తప్పించుకుంటున్నారు. 

దొంగ పాసుపుస్తకాలతో..
అటు  పుల్లంపేట మండలంలోని కొత్తపల్లె అగ్రహారం వీఆర్వో  వెంకటయ్య గ్రామంలోని కొందరు రైతులను నిండా ముంచేశారు. ప్రభుత్వ భూమికి  రైతుల పేరుతో దొంగ పాసుపుస్తకాలు ఇచ్చి ఎకరాకు 2లక్షలు రూపాయలు తన జేబులో వేసుకున్నాడు. అంతేకాదు ఇద్దరు ముగ్గురు రైతులకు ఒకే భూమిపై పాసుపుస్తకాలు ఇచ్చి అందినకాడికి దండుకున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిపై పట్టాలు పొందిన రైతులు బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకున్నారు. ఏపీ సర్కార్‌ అందిస్తున్న డ్రిప్‌ ఇరిగేషన్‌ ను కూడా తమ పొలాల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇంత జరిగిన తర్వాత తాజాగా అదే వీఆర్వో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ మళ్లీ నోటీసులు ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. 

దొంగ పట్టాపుస్తకాలతో..
బంధువుల పేరుతో సుండుపల్లి తాహశీల్దారు అటవీ భూమికి ఎసరు పెడితే.. దొంగపాసుపుస్తకాలు సృష్టించి కొత్తపల్లె అగ్రహారం వీఆర్‌వో వెంకటయ్య ప్రభుత్వ భూమికి దొంగపట్టాలు సృష్టించాడు. ఇంత జరుగుతున్నా... పుల్లంపేట ఎమ్మార్వో మాత్రం నోరు మెదపడంలేదు. దీంతో రెవెన్యూ అధికారులంటేనే  అవినీతిపరులని కడపజిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు.  ఇప్పటికైనా కబ్జాకోరులైన రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  కడపజిల్లా ప్రజలు కోరుతున్నారు. 

20:04 - March 1, 2017

వైజాగ్ : విశాఖలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. వేసవి ప్రారంభంలోనే భానుడు విజృంభిస్తున్నాడు. గతేడాది కన్నా ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.  41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశముందంటున్నారు. సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగడమే దీనికి కారణం చెబుతున్న ఓష్ణోగ్రఫి విభాగధిపతి ఎస్‌విఎస్ రామకృష్ణతో 10లీవీ  ఫేస్ టూ ఫేస్. వీడియోలో చూడండి..

20:01 - March 1, 2017

విజయవాడ : ఉత్తరాంధ్ర అభివృద్ధే తన ప్రధాన అజెండా అని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి అజ శర్మ అన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటు సమస్యను మండలిలో లెవనెత్తి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటూ మాయమాటలు చెబుతున్న నాయకులెవరో ప్రజలు గుర్తించాలన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడేందుకు తనకు అవకాశం కల్పించాలన్నారు. ఆయన మాటలు వీడియోలో వినండి. 

19:58 - March 1, 2017

నెల్లూరు : జిల్లాలో ఆత్మకూరులో ఫేక్‌ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. ఈజీమనీ వేటలో తప్పటడుగు వేసిన ముగ్గురు విద్యార్థుల బండారం బయటపడింది. కొత్త 2 వేలు, 500 నోట్లను కలర్‌ జిరాక్స్ సాయంతో ముద్రించి పాళెంలో చలామణికి యత్నించిన కొండూరు రాజా, తోట వినయ్‌, ఉరిమి నితిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  వారి నుంచి లక్షా 90 వేల విలువైన నకిలీ కరెన్సీ, కంప్యూటర్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీడియో చూడండి.

19:56 - March 1, 2017
19:26 - March 1, 2017

విజయవాడ : ముళ్లపాడు ఘటనపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబుతో వైసీపీ అధినేత జగన్‌ వ్యవహరించిన తీరును ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. విజయవాడలో అత్యవసరంగా సమావేశమైన అధికారులు జగన్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం, సీఎస్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఐఏఎస్‌ అధికారుల విధులకు ప్రజాప్రతినిధులు అడ్డుతగలడం సరికాదని చెబుతున్న ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఫరీదాతో 10టీవీ న్‌ ఫేస్‌ టూ ఫేస్ నిర్వహించింది. ఫరీదా జగన్ పై, సంఘటనపై ఏం మాట్లాడారో వీడియోలో చూడండి..

19:23 - March 1, 2017

విజయవాడ : వైసీపీ అధినేత జగన్‌ శవాలమధ్య రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కామినేని విమర్శించారు. నందిగామ ఆస్పత్రిలో జగన్‌ ప్రవర్తన సరికాదని మంత్రి తప్పుబట్టారు. నిజాయితీగాపనిచేస్తున్న అధికారుల్ని జైలుకు పంపుతానంటూ హెచ్చరించడమేంటని ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎంతోమంది ఐఏఎస్ అధికారుల్ని జగన్‌ జైలుకు పంపారని ఆరోపించారు.

జగన్ పై కలెక్టర్ల ఫైర్..

విజయవాడ :  ఐఏఎస్ అధికారుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫరీదా మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ బాబుతో జగన్ వ్యవహరించిన తీరు ఏ మాత్రం సమంజసనీయం కాదని విమర్శించారు. పొలిటికల్ లీడర్లు ఆఫీసర్లతో కలిసి పనిచేయాలని కోరారు. జగన్ పై యాక్షన్ తీసుకోవాలని  ముఖ్యమంత్రి చంద్రబాబుకు, సీఎస్ కోరనున్నట్లు తెలిపారు.  

శవాల మధ్య రాజకీయాలు..

విశాఖ : వైసీపీ నేత జగన్ శవాల మధ్య రాజకీయాలుచేస్తున్నారని మంత్రి కామినేని విమర్శించారు. కలెక్టర్ ను జైలుకు పంపిస్తాననడం సమంజసం కాదని అన్నారు. జగన్ నాన్న గారు అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్లను జైలుకు పంపించిన చరిత్ర వారికే ఉందని కామినేని విమర్శించారు. 

జాతివిద్వేష కాల్పులపై ట్రంప్ మొదటిసారి..

అమెరికాలో జరుగుతున్న జాతివిద్వేష కాల్పులపై ఎట్టకేలకు ట్రంప్‌ స్పందించారు. అమెరికా కాంగ్రెస్‌ నుద్దేశించి తొలిసారిగా ట్రంప్‌ ప్రసంగించారు. జాతి వివక్షతో కూడిన దాడులకు అమెరికాలో చోటు లేదని అమెరికా పౌరులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని ట్రంప్‌ స్పష్టం చేశారు. దేశంలో చెలరేగుతున్న ఆందోళనలకు ఒబామానే కారకుడని ట్రంప్‌ ఆరోపించారు. అమెరికన్ల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని ట్రంప్‌ పేర్కొన్నారు.

హైదరాబాద్ లో లక్ష ఇళ్లు..

హైదరాబాద్ : తెలంగాణలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామనిమంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణం దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రకటించినవిధంగా లక్ష ఇళ్లను కట్టిస్తామని స్పష్టం చేశారు. నగరాన్ని మురికివాడల రహితంగా మార్చేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని కేటీఆర్‌ వివరించారు.

సూర్యపేటలో మహాజనపాదయాత్ర..

సూర్యాపేట : జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. పల్లెపల్లెన కొనసాగుతున్న పాదయాత్ర బృందానికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు రామన్నగూడెం, కుంచమర్తి, తిమ్మాపురం రాజానాయక్‌ తండా, సూర్యాపేటలో పాదయాత్ర జరుగుతోంది. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. 

17:54 - March 1, 2017

హైదరాబాద్ :  సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు అమలవుతాయా? తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? టిఆర్ఎస్ నాయకుల కుమ్ములాటలు వారసత్వ ఉద్యోగాల భవిష్యత్ ను ప్రభావితం చేయబోతున్నాయా? ఇదే అంశంపై సింగరేణి బెల్టులో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలంటూ కార్మికులు కదం తొక్కుతున్నారు. మరోవైపు హైకోర్టులో మార్చి 6న విచారణ జరగబోతోంది. 

ప్రాణాలతో చెలగాటం..
బొగ్గు గనుల్లో వారసత్వ ఉద్యోగాల వెనక సుదీర్ఘ పోరాటాలున్నాయి. సింగరేణిలో 1981 నుంచి మొదలైన వారసత్వ ఉద్యోగాలకు 1998లో బ్రేక్ పడింది. 1975లో ఏర్పాటైన బొగ్గు పరిశ్రమల సంయుక్త సంప్రదింపుల కమిటీ వారసత్వ ఉద్యోగాలకు ప్రాణం పోసింది. సింగరేణి సంస్థకు కార్మికులే వెన్నెముక.  సింగరేణిలో ఉద్యోగమంటే ప్రాణాలతో చెలగాటం. నల్లబంగారాన్ని వెలికితీస్తూ, దేశానికే వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికుల జీవితాల్లో అంతులేని బాధ వేదన వుంటాయి. అనుక్షణం వీరిని ప్రమాదాలు వెన్నాడుతూ వుంటాయి. బొగ్గు గనుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణాలు పోతుంటాయి. సింగరేణి గనుల్లో పనిచేసేవారిని అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఇంతకష్టం వుంది కాబట్టే బొగ్గు పరిశ్రమల్లో వారసత్వ ఉద్యోగాలు ప్రవేశపెట్టారు. వారసత్వ ఉద్యోగాల కోసం ఎన్నెన్నో పోరాటాలు జరిగాయి. బొగ్గు పరిశ్రమల సంయుక్త వేతన సవరణ ఒప్పంద కమిటీలో కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం 1981 నుంచి వారసత్వ ఉద్యోగాలు అమలులోకి వచ్చాయి. 
దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఒకే విధమైన వేతనాలతో పాటు హక్కులు, సౌకర్యాలు కల్పించేందుకు బొగ్గు పరిశ్రమల సంయుక్త సంప్రదింపుల కమిటీ జెబిసిసిఐ ఏర్పాటయ్యింది. ఈ కమిటీ 1975లో ఏర్పాటయ్యింది. 

ఒప్పందంలో ఏముంది?
మొదటి వేతన ఒప్పందం ముగిసిన తర్వాత రెండో వేతన ఒప్పందం చేసుకుంటున్న సమయంలో వారసత్వ ఉద్యోగాలు లభించాయి. బొగ్గు గని కార్మికులు వైద్యపరంగా ఉద్యోగానికి అనర్హులని తేలితే వారి వారసులకు ఉద్యోగమివ్వాలన్నది ఆనాటి ఒప్పందం సారాంశం. 1979 ఆగస్టు 11న యాజమాన్యాలకూ, కార్మిక సంఘాలకు మధ్య ఈ  ఒప్పందం కుదిరింది. అప్పటి కోల్ ఇండియాలో వారసత్వ ఉద్యోగాలు అమలవుతున్నాయి. దీని ఆధారంగానే 1981 జనవరి 29న యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు కుదిరిన ఒప్పందం ప్రకారం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 1998లో వీటికి బ్రేక్ పడింది. 

వారసత్వ ఉద్యోగాలు  ఎందుకు రద్దయ్యాయి? 
1998 నాటికి సింగరేణి సంస్థ నష్టల్లోకి కూరుకుపోయింది. ఖాయిలాపడ్డ పరిశ్రమల జాబితాలో చేరింది. సంస్కరణల యుగం ప్రారంభమైంది. సింగరేణిలో ఉద్యోగ నియామకాలు నిలిపివేస్తూ 1998లో నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. దాంతో వారసత్వ ఉద్యోగాలకు బ్రేక్ పడింది. కొత్త ఉద్యోగాల నియామకాలు నిలిపివేసిన యాజమాన్యం ఉద్యోగుల కుదింపు మీద దృష్టి పెట్టింది. యాంత్రీకరణ పెంచారు. కొత్తకొత్త పథకాలు ప్రవేశపెట్టారు. కార్మిక వ్యతిరేక విధానాలూ తెర మీదకు వచ్చాయి. మరోవైపు కార్మిక సంఘాల్లో ఐక్యత లోపించిన కాలమది. వందకు పైగా కార్మిక సంఘాలుండేవి. కార్మిక సంఘాల మధ్య గుర్తింపు ఎన్నికల విధానాన్ని యాజమాన్యం తీసుకొచ్చింది. గుర్తింపు ఎన్నికల్లో గెలిచిన సంఘాలనే పరిగణలోనికి తీసుకుంటూ, ఇతర సంఘాల ప్రాధాన్యతను యాజమాన్యం తగ్గిస్తూ వచ్చింది. దీంతో కార్మిక సంఘాల సంఖ్య 17కు తగ్గిపోయింది. కార్మికుల హక్కులకు కత్తెరలు వేయడం మొదలుపెట్టింది యాజమాన్యం. కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో కార్మికుల మెడ మీద క్రమశిక్షణ  కత్తి వేలాడుతుండేది. గుర్తింపు ఎన్నికల్లో ప్రాబల్యం చాటిన సంఘాలు వారసత్వ ఉద్యోగాల కోసం గట్టిగా పట్టుబట్టిన దాఖలాలు లేవు. ఎవరైనా కార్మికులు అనారోగ్యం పాలైతే, మెడికల్ బోర్డు కి పంపంచి అన్ ఫిట్ అంటూ ప్రకటించి, ఉద్యోగాలు తీసేసిన చరిత్ర కూడా సింగరేణిలో భయభ్రాంతులు సృష్టించింది.  మెడికల్ బోర్డులో అవినీతి పెరిగిపోయింది. మెడికల్ బోర్డు కుంభకోణాలు వెలుగుచూస్తుండడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిన సందర్భంలో, సకల జనుల సమ్మె సందర్భంలో వారసత్వ ఉద్యోగాలు మరోసారి తెరమీదకు వచ్చాయి.

ఎన్నికల టైంలో టీఆర్ఎస్..
ఎటువంటి షరతులు లేకుండానే వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలన్నది ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ వినిపించిన డిమాండ్. గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలోనూ ఆ పార్టీ అనుబంధం కార్మిక సంఘం ఇదే అంశాన్ని ప్రచారంలో పెట్టింది. కానీ, వారసత్వ ఉద్యోగాల కోసం ఆశపడుతున్న కార్మికుల కుటుంబాలను నిబంధనలు వెక్కిరిస్తున్నాయి. ఈ నిబంధనలెందుకంటూ సింగరేణి కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యమిస్తున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడంతో సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగాల డిమాండ్ మరోసారి గట్టిగా వినిపించారు. ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా వారసత్వ ఉద్యోగాల హక్కు గురించి మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో టిఆర్ ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వారసత్వ ఉద్యోగాల మీదనే హామీలిచ్చింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా తండ్రీ కొడుకుల వారసత్వ ఉద్యోగాలు సాధిస్తామంటూ ప్రచారం సాగించారు. కార్మికుడి రిటైర్మెంట్ కి ఒక్క రోజే గడువున్నా వారసత్వ ఉద్యోగానికి అర్హులేనంటూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రచారం సాగించింది. 
ఉద్యమం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సిఐటియు తో పాటు వివిధ కార్మిక సంఘాలు వారసత్వ ఉద్యోగాల హక్కు కోసం ఉద్యమించాయి. సమ్మెలు చేశాయి. ఎట్టకేలకు ముఖ్యమంత్రి కెసిఆర్ 2016 అక్టోబర్ 6న వారసత్వ ఉద్యోగాల మీద ప్రకటన చేశారు. వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు సింగరేణి బోర్డు కూడా వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఆదేశాలిచ్చారు. దీంతో సింగరేణి కార్మికుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. కానీ అది కొంతకాలమే. ఎటువంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న టిఆర్ఎస్, దాని అనుబంధ గుర్తింపు కార్మిక సంఘం మాటతప్పాయి. 
షరతులు.. దిగ్భ్రాంతి..
కొత్త షరతులకు, నిబంధనలకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు ఉద్యమబాట పట్టారు. గుర్తింపు యూనియన్ నాయకులకు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ నిరసన సెగలు తగిలాయి. సరిగ్గా నెల క్రితం జనవరి 28న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ వేడుకులకు హాజరైన ఎమ్మెల్యేను కార్మికులు అడ్డుకున్నారు. వారసత్వ ఉద్యోగాల నిబంధనలపై నిలదీశారు. వాగ్వాదం జరిగింది. కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి నిబంధనల సడలింపు ప్రకటన కోసం సింగరేణి కార్మికులు ఎదురుచూస్తున్నారు. 
హైకోర్టులో.. 
ఓ వైపు వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు పోరాడుతున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన సెగలు ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఓ నిరుద్యోగి వారసత్వ ఉద్యోగాలను ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించడం మరో ఆసక్తికర విషయం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కి చెందిన సతీష్ అనే నిరుద్యోగి వారసత్వ ఉద్యోగాలను ప్రశ్నిస్తూ హైకోర్టులో పిల్ వేశారు. దీంతో వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ వుంటుందా? నిలిచిపోతుందా? అన్న ఆందోళన సింగరేణి కార్మికుల్లో మొదలైంది. సంస్థలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకే ఉద్యోగాలిస్తే, తమలాంటి నిరుద్యోగుల పరిస్థితి ఏమిటన్నది అతని ప్రశ్న. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తెలంగాణ సర్కార్ కు, సింగరేణి సి అండ్ ఎండి శ్రీధర్ కు నోటీసులు జారీ చేసింది. సింగరేణి యాజమాన్యం ప్రతినిధిగా అడ్వకేట్ జనరల్ ను నియమించగా, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తమ ప్రతినిధిగా న్యాయవాదిని నియమించుకుంది. మార్చి 6న ఈ కేసు హైకోర్టులో విచారణకు వస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, విధుల్లో పాల్గొనేందుకు అనర్హులని తేలిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలివ్వడం సబబే అయినా, వారసులందరికీ ఒకేసారి ఉద్యోగాలివ్వడం సరికాదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. తుది తీర్పు మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, వారసత్వ ఉద్యోగాలు సాధించి తీరుతామంటూ టిఆర్ఎస్ అనుబంధ గుర్తింపు సంఘం చెబుతోంది. 
అధికారపార్టీలో ఆదిపత్యపోరు.. 
అయితే, టిఆర్ఎస్ లో ఆధిపత్య పోరు వారసత్వ ఉద్యోగాలను ప్రశ్నార్ధం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. పెద్దపల్లి ఎంపి బాల్కసుమన్, మాజీ ఎంపి వివేక్ మధ్య ఆధిపత్య పోరు బహిరంగ రహస్యమే.  వారసత్వ ఉద్యోగాల విషయంలో వీరిద్దరూ చెరో వ్యూహంతో వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఏ వరాలు ప్రకటించినా అది మాజీ ఎంపి వివేక్ చలువేనంటూ ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. దీంతో సుమన్ వర్గీయులే కోర్టును ఆశ్రయించారన్న ప్రచారం గుప్పుమంటోంది. అయితే, గుర్తింపు సంఘం ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలను అమలు చేస్తుందా? అటకెక్కుస్తుందా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తమకు గతంలో వున్న వారసత్వ ఉద్యోగాల హక్కును పునరుద్ధరించాలన్నది సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక డిమాండ్. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందన్నదే ఆసక్తికరం. 

17:44 - March 1, 2017

సూర్యాపేట : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న మహాజన పాదయాత్ర సూర్య పేట జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన తమ్మినేని ఏడు శాతం ఉన్న అగ్రకుల ఆధిపత్యంలో బడుగు, బలహీన వర్గాలు ఇంకెన్ని రోజులు కొనసాగడానికి వీలు లేదన్నారు. పల్లెపల్లెన కొనసాగుతున్న పాదయాత్ర బృందానికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు రామన్నగూడెం, కుంచమర్తి, తిమ్మాపురం రాజానాయక్‌ తండా, సూర్యాపేటలో పాదయాత్ర జరుగుతోంది. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. 

17:39 - March 1, 2017

రంగారెడ్డి : జిల్లాలో ఆమనగల్లు మండలం చింతలపల్లికి చెందిన సుక్క భానుశ్రీ అనే ఇంటర్‌ విద్యార్ధిని గుండెలనిండా బాధను నింపుకుని పరీక్షకు హాజరయ్యింది.  భానుశ్రీ తండ్రి రాములు ఈ ఉదయం చనిపోయాడు. తండ్రి మరణంతో కన్నీరుమున్నీరయ్యింది. ఆ బాధనంతా కడుపులో దాచుకుని పరీక్షకు హాజరయ్యింది. బాధనంతా దిగమింగుకుని ఎగ్జామ్‌ రాసింది.  పరీక్ష అనంతరం ఇంటికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొంది. భానుశ్రీ తల్లి కూడా గతంలోనే చనిపోయింది. దీంతో   భానుశ్రీతోపాటు తోబుట్టువులు ఇద్దరూ అనాథలయ్యారు. వీడియో చూడగలరు.

17:38 - March 1, 2017

హైదరాబాద్ : తెలంగాణలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రకటించినవిధంగా లక్ష ఇళ్లను కట్టిస్తామని స్పష్టం చేశారు.. నగరాన్ని మురికివాడల రహితంగా మార్చేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని కేటీఆర్‌ వివరించారు. నగరంలో మౌళిక వసతుల ప్రాజెక్టులను త్వరగా చేపట్టేలా ప్రణాళికలు తయారుచేశామని గుర్తుచేశారు. వచ్చే రెండేళ్లలో స్కైవేలు పూర్తిచేసేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణంపై ఇప్పటికే సిమెంట్‌ కంపెనీలతో చర్చలు పూర్తయ్యాయని కేటీఆర్‌ అన్నారు. నగర శివారుప్రాంతాల్లో మరో 600 ఎకరాలను డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి గుర్తించామని తెలిపారు. పెద్ద ఎత్తున ఒకేచోట కట్టే ప్రాంతాల్లో విద్య, వైద్య ఇతర సామాజిక మౌళిక వసతులను కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి హడ్కో నిధులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మున్సిపల్ ప్రాంతాలు, హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం అమలు తీరుపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచలు చేశారు..

17:35 - March 1, 2017

కరీంనగర్‌ : జిల్లాలో డీజీధన్‌ కార్యక్రమంలో ప్రొటోకాల్‌ వివాదం నెలకొంది. కలెక్టర్‌పై ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, రసమయి  బాలకిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో ఎంపీ వినోద్‌కుమార్‌ ఫొటో పెట్టలేదని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యేలపై కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఈటెల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. పూర్తి వివరాలు వీడియోలో చూడొచ్చు. 

17:32 - March 1, 2017

అమెరికాలో జరుగుతున్న జాతివిద్వేష కాల్పులపై ఎట్టకేలకు ట్రంప్‌ స్పందించారు. అమెరికా కాంగ్రెస్‌ నుద్దేశించి తొలిసారిగా ట్రంప్‌ ప్రసంగించారు. జాతి వివక్షతో కూడిన దాడులకు అమెరికాలో చోటు లేదని.... అమెరికా పౌరులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని ట్రంప్‌ స్పష్టం చేశారు. దేశంలో చెలరేగుతున్న ఆందోళనలకు ఒబామానే కారకుడని ట్రంప్‌ ఆరోపించారు. అమెరికన్ల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని ట్రంప్‌ పేర్కొన్నారు.
శ్రీనివాస్ హత్యపై.. 
అమెరికాలోని కాన్సస్‌లో కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్యపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎట్టకేలకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ స్పందించారు. శ్రీనివాస్‌ది జాతి వివక్షతో కూడిన హత్యేనని వైట్‌హౌజ్‌ అంగీకరించింది. విద్వేషపూరిత దాడులకు అమెరికాలో తావు లేదని, అమెరికా పౌరులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని ట్రంప్‌ స్పష్టం చేశారు.  అమెరికాలో చెలరేగుతున్న ఆందోళనలకు మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, డెమొక్రాటిక్‌ ప్రతినిధులే కారణమని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్‌ విమర్శించారు. ఒబామా పాలన కారణంగానే దేశంలో ఉగ్రవాదుల దాడులు పెరిగాయన్నారు. ఉగ్రవాదాన్ని అణచడమే తమ లక్ష్యమని ట్రంప్‌ చెప్పారు. జాతీయ భద్రతకు సంబంధించిన విలువైన సమాచారాన్ని సైతం ఒబామా వర్గీయులు లీక్ చేస్తున్నారని ఆరోపించారు. దేశ భద్రత కోసం బడ్జెట్‌లో 10 శాతం నిధులు పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

మా ప్రయోజనాలే..
అమెరికా ప్రయోజనాలే తనకు అత్యంత ముఖ్యమని చెప్పిన ట్రంప్‌...ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. 94 మిలియన్ల అమెరికన్లు నిరుద్యోగులుగా ఉన్నారని...అమెరికన్లకు ఉద్యోగాలు దక్కేలా చర్యలు చేపట్టామన్నారు. ఇమ్మిగ్రేషన్‌ చట్టాల్లో మార్పు తీసుకు రావడం ద్వారా వేతనాలు పెరగనున్నాయని, నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు దక్కుతాయని ట్రంప్‌ చెప్పారు. దేశ సరిహద్దులను బలోపేతం చేస్తామన్న ట్రంప్ అమెరికా-మెక్సికో మధ్య గోడ కట్టితీరుతామని స్పష్టం చేశారు. దేశంలోకి అక్రమంగా ఎవరూ చొరబడకుండా త్వరలోనే గోడ నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. కేన్సస్ కాల్పుల ఘటన బాధితులకు సంతాపం తెలిపిన యూఎస్ కాంగ్రెస్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.

17:27 - March 1, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలో నక్కావారి పాలెంలో డ్వాక్రా మహిళలు బెల్ట్‌ షాపులకు వ్యతిరేకంగా కదం తొక్కారు. గ్రామంలోని బెల్ట్ షాపులపై దాడి చేసి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. బెల్ట్‌ షాపుల్లో మద్యం సేవించి స్థానికులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని.. అందుకే గ్రామంలో మద్యం విక్రయించరాదని తాము డిమాండ్ చేస్తున్నట్లు మహిళలు తెలిపారు. మరిన్ని వివరాలు వీడియోలో చూడొచ్చు.

17:25 - March 1, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. దేవుడి పేరుతో కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చండీయాగం, మొక్కుల గురించి ప్రశ్నిస్తే.. కమ్యూనిస్టులవి కాలం చెల్లిన సిద్ధాంతాలు అని చవకబారు విమర్శలు చేస్తున్నారన్నారు. ఆయన ఘాటైన మాటలు వీడియోలో చూడండి.. 

17:23 - March 1, 2017

హైదరాబాద్ :  విద్యుత్‌ చార్జీల పెంపుపై తెలంగాణ సర్కార్‌ దోబుచులాడుతోంది. చార్జీల పెంపుపై అధికారులు గడువు మీద గడువు కోరడంతో విద్యుత్ నియంత్రణ మండలి  మొట్టికాయలు వేసింది. మరోవైపు ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్‌ఆర్ రిపోర్టులో స్పష్టత లోపించిందన్న వాదనలు వినిపిస్తోంది. 

మల్లగుల్లాలు.. 
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొత్త ఆర్ధిక సంవత్సర విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రతి ఏటా నవంబర్ 30లోగా ఈఆర్సీకి సమర్పించాలి. డిస్కాంల ప్రతిపాదనలకు అనుగుణంగా డిసెంబర్ - జనవరిలో ప్రజాభిప్రాయ సేకరణ  పూర్తి చేసి, ఫిబ్రవరి నెలాఖరకు కొత్త ఆర్ధిక సంవత్సర చార్జీలను ఈఆర్సీ ప్రకటిస్తుంది. ఈ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే కొత్త చార్జీల పెంపుపై డిస్కంలకు, ఈఆర్సీ మూడు సార్లు గడువు ఇచ్చింది. అయినప్పటికి చార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వకపోవడంపై ఈఆర్సీ మండిపడింది. చార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వలేకపోతే తామే విద్యుత్ చార్జీల పెంపు ప్రకటన చేస్తామని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. దీంతో అప్రమత్తమైన డిస్కం అధికారులు వచ్చే నెల 5లోపు కొత్త చార్జీల ప్రతిపాదనలు సమర్పిస్తామని మరోమారు ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు.

స్పష్టతలేదా?!
ఇది ఇలా ఉంటే గత నవంబర్‌ 30న ఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో విద్యుత్ పంపిణీ సంస్థల  రూ.9 కోట్ల 82లక్షల 4వేల లోటు చూపించారు.  ఈ నివేదికలోనే కొత్త చార్జీల పెంపు ప్రతిపాదనలు కూడా ఇవ్వాల్సి ఉంది. అయితే చార్జీలపై గడువు మీద గడువులు కోరుతున్న అధికారులు.. ఇప్పటి వరకు  స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. మొత్తం లోటు బడ్జెట్‌లో ప్రభుత్వం నుంచి సబ్సిడీ కింద రూ.7కోట్ల 8లక్షలు అడిగేందుకు డిస్కంలు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం విద్యుత్ రంగానికి ఇంత పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనైనా విద్యుత్ చార్జీల పెంపును ధైర్యంగా చేపడతారా..! అనేది ప్రశ్నగా మారింది. మరోవైపు ఏపి సమర్పించిన ఏఆర్‌ఆర్‌ రిపోర్టుకు తెలంగాణ సమర్పించిన గణంకాలకు భారీ తేడా ఉండటం కూడా కొత్త చార్జీల పెంపు ఆలస్యానికి మరో కారణమనే వాదన వినిపిస్తోంది.

ఎటూ తేల్చుకోలేక..
మరోవైపు విద్యుత్ చార్జీల పెంపుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న డిస్కంలకు ఈఆర్సీ కొత్త మెలిక పెట్టింది. ఈ సారి కూడా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వలేకపోతే లోటుగా ఉన్న మొత్తం చార్జీల పెంపుకు అనుమతి ఇస్తామని హెచ్చరించింది. అదే జరిగితే విద్యుత్ చార్జీలు చరిత్రలో లేనంతగా భారీగా పెరగడం ఖాయమని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కార్పొరేట్లకు కొత్త ఛైర్మన్లు..

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆఆర్ 10 కార్పొరేట్లకు ఛైర్మన్లను ప్రకటించారు. నేడు జరిగిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా నూతనంగా ఛైర్మన్ పదవులు వరించిన నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. 

 

జియా ఆఫర్ నేటి నుంచే..

హైదరాబాద్ : రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్ షిప్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. జియో 4జీ సిమ్‌లు వాడుతున్న యూజర్లు తమ తమ ఫోన్లలోని మై జియో యాప్ లేదా జియో వెబ్‌సైట్ లేదా రిలయన్స్ స్టోర్స్‌కు వెళ్లి తమ జియో సిమ్‌లను ప్రైమ్ మెంబర్‌షిప్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. దీనికోసం వినియోగదారులు రూ .99 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రీఛార్జీతో ఒక సంవత్సరంపాటూ వినియోగదారులకు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం ఉంటుంది. 

16:30 - March 1, 2017

హైదరాబాద్ : తన నెలరోజుల పాలనలో కొత్త జాబులు సృష్టించడంలో ముందడుగేశానని  అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ ఢంకా బజాయించుకున్నారు. అద్యక్షపదవి చేపట్టాక అమెరికన్‌ కాంగ్రెస్‌ను ఉద్దేశించి తొలిసారి  ఆయన మాట్లాడారు. దేశంలో తిష్టవేసిన డ్రగ్స్‌ మాఫియాకు చెక్ పెట్టే చర్యలు చేపపట్టామన్నారు. దేశంలో జాతివిక్షను కొనసాగడాన్ని అనుమతించమని.. ట్రంప్‌ అన్నారు. ముస్లీందేశాలతో తాము స్నేహాన్నే కోరుకుంటున్నామని వెల్లడించారు. తమ మిత్రులయిన ముస్లీం దేశాలతో కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటామన్నారు. అంతకు ముందు సభ ప్రారంభంలో దేశంలో జాత్యహంకార దాడిలో మృతిచెందిన శ్రీనివాస్‌ కూచిబొట్లకు సభ సంతాపం తెలిపింది. కాంగ్రెస్‌ సభ్యులు రెండు నిముషాలు మౌంనం పాటించారు. 

16:19 - March 1, 2017

కృష్ణా : జిల్లాలోని  పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ చేయాలని వైసీపీ నేత పార్థసారథి డిమాండ్‌ చేశారు. ప్రమాదం నుంచి కొంతమంది అధికార పార్టీ నాయకులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ లాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. జగన్‌పై అక్రమ కేసులు పెట్టి బాధించాలని చూస్తున్నారని అన్నారు. ఎవరూ ప్రశ్నించినా.. ప్రభుత్వం వారిపై కేసులు పెడుతోందని అన్నారు. 

16:16 - March 1, 2017
15:39 - March 1, 2017

న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇంటర్నేషనల్‌ రేర్‌ డిసీజ్‌ డే జరిగింది. మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన ఈ  కార్యక్రమానికి అరుదైన వ్యాధులతో బాధపడుతున్న బాలబాలికలు, యువతీయువకులు హారజర్యారు. మ్యూకో పాలీసక్రర్టైజ్‌ వ్యాధితో బాధపడతున్న హైదరాబాద్‌కు చెందిన రమ్య శ్రీ కూడా ఇంటర్నేషనల్‌ రేర్‌ డిసీజ్‌ డే లో పాల్గొన్నారు. తన బాధను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు.

'చదువులతల్లికి' వింత వ్యాధి..
ఈ యువతి పేరు రమ్య శ్రీ. హైదరాబాద్‌కు చెందిన ఈమె అరుదైన మ్యూకో పాలిసక్రర్టైజ్‌ టైప్‌-2 వ్యాధితో బాధపడుతున్నారు. పద్నాలుగు ఏళ్ల వయస్సులో ఈ మాయదారి రోగాన్ని గుర్తించారు. అయితే సరైన వైద్యచికిత్స, మందులు అందుబాటులో లేకపోవడంతో ఈ వ్యాధి  రోజు రోజుకు  ముదురుతోంది. మ్యూకో పాలిసక్రర్టైజ్‌ వ్యాధితో రమ్య శ్రీ బాధపుడుతున్నా చదువును మాత్రం అశ్రద్ధ చేయలేదు. టెన్త్‌, ఇంటర్‌ మంచి మార్కులతో పాసయ్యారు. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ లో బీఏ చదువుతున్నారు. ఐఏఎస్‌ లక్ష్యంగా సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధం కావాలని  లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ వ్యాధికి మన దేశంలో మందులు పెద్దగా అందుబాటులో లేవు.  విదేశాల నుంచి తెప్పించుకోవాలి. ఖర్చు ఎక్కువ. ఈవిషయంలో ప్రభుత్వం ఆదుకోవాలని రమ్య శ్రీ కోరుతున్నారు. 
శక్తికి మించి.. 
ఈ వ్యాధి చికిత్సకు ఖర్చును భరించడం కష్టంగా ఉన్న తల్లిదండ్రులు అప్పో పప్పోచేసి మందులు ఇప్పిస్తున్నారు. శక్తికి మించి వ్యయం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అరుదైన వ్యాధులతో  బాధపడుతున్న రమ్య శ్రీ లాంటి ఎందరినో ఎస్‌ఎస్‌డీఎస్‌ఎస్‌ స్వచ్చంధ సంస్థ అక్కున చేర్చుకుంది.. సరైన వైద్యం అందిస్తే వీరు కోలుకుని సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంది. మందుల దిగుమతులకు ప్రభుత్వ అనుమతి కావాలి. మ్యూకోపాలీసక్రర్టైజ్‌ వ్యాధిగ్రస్థులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సహాయ, సహకారాలు అందిచాలని సంస్థ ప్రతినిధులు కోరతున్నారు. మ్యూకోపాలీసక్రర్టైజ్‌ వంటి అరుదదైన వ్యాధులతో బాధపడేవారికి ప్రత్యేక చికిత్స కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధిని ఏర్పాటు  చేయాలని కోరుతున్నారు. 

15:32 - March 1, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని తుందుర్రులో ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ.మధు డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వం నిర్ణయం వెనక్కు తీసుకోకుంటే. మార్చి 8న 33 గ్రామాల మహిళలతో  ఆక్వాఫుడ్‌ పార్క్‌ను ముట్టడిస్తామని మధు హెచ్చరించారు. ఈ సందర్భంగా మధు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన అన్న మాటల్ని వీడియోలో చూడొచ్చు. 

15:20 - March 1, 2017

2012-13 నంది అవార్డులను ప్రకటించారు. 2012 ఉత్తమ చిత్రంగా ఈగ ఎంపికయ్యింది. ఉత్తమ హీరో గా నాని, హీరోయిన్ గా సమంత ఎంపికయ్యింది. ఉత్తమ రెండవ చిత్రం 'మినుగురులు' ఎంపియ్యింది. ఉత్తమ ప్రతి నాయకుడుగా సుదీప్, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి ఈగ చిత్రానికి గానూ వచ్చింది. ఉత్తమ సంగీత దర్శకుడు కాంపిటేషన్ లో టై ఏర్పడటంతో ఇలయరాజ (ఎటో వెళ్లిపోయింది మనసు), కీరవాణి (ఈగ) ఎంపికయ్యారు. బెస్ట్ డైలాగ్ రైటర్ తనికెళ్ల భరణి (మిథునం) ఎన్నికయ్యారు. 
2013 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రంగా మిర్చి, ఉత్తమ హీరోగా ప్రభాస్, ఉత్తమ హీరోయిన్ అంజలి ఎంపికయ్యారు. 

2012 నంది అవార్డులు
ఉత్తమ చిత్రంగా ఈగ
ఉత్తమ రెండో చిత్రంగా మిణుగురులు
ఉత్తమ మూడో చిత్రంగా మిథునం
ఉత్తమ పాపులర్‌ చిత్రం -జులాయి
ఉత్తమ నటుడిగా నాని (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ నటిగా సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ ప్రతినాయకుడు సుదీప్‌
ఉత్తమ దర్శకుడు రాజమౌళి
బెస్ట్‌ స్ర్కీన్‌ప్లే రైటర్‌ రాజమౌళి (ఈగ)
ఉత్తమ సంగీత దర్శకులు  ఇళయరాజా (ఎటో వెళ్లిపోయింది మనసు), కీరవాణి (ఈగ)
బెస్ట్‌ డైలాగ్స్‌ రైటర్‌ తణికెళ్లభరణి (మిథునం)
ఉత్తమ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ నేపథ్య గాయని, గీతామాధురి (గుడ్‌మార్నింగ్‌)
2013వ సంవత్సరానికి..
ఉత్తమ చిత్రంగా మిర్చి
రెండో ఉత్తమ చిత్రంగా నా బంగారు తల్లి
మూడో ఉత్తమ చిత్రంగా ఉయ్యాల జంపాల
ఉత్తమ కుటుంబకథా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు
ఉత్తమ నటుడు ప్రభాస్‌
ఉత్తమ హీరోయిన్‌ అంజలీ పాటిల్‌ (నా బంగారు తల్లి)
ఉత్తమ సహ నటుడు ప్రకాశ్ రాజ్
ఉత్తమ దర్శకుడు దయానంద్‌ కొడవగంటి
ఉత్తమ విలన్‌ సంపత్‌ రాజ్ (మిర్చి)
సప్త వ్యసనాలు
ఉత్తమ ఎడ్యుకేషనల్ మూవీ విన్నర్‌
ఉత్తమ కమెడియన్‌ తాగుబోతు రమేశ్ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌)
ఉత్తమ తొలిచిత్రం దర్శకుడు కొరటాల శివ (మిర్చి)
ఉత్తమ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఉత్తమ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ (అత్తారింటికి దారేది)
''2012 అవార్డుల ఎంపిక కమిటీకి ఛైర్మన్ గా జయసుధ, 2013 నంది అవార్డుల కమిటీ ఛైర్మన్ గా కోడి రామకృష్ణ వ్యవహరించారు.'' మరింత విశ్లేషణ వీడియోలో చూడగలరు. 

14:15 - March 1, 2017

విజయవాడ : జగన్ ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణ జిల్లా నందిగామలో కలెక్టర్ ను బెరించారని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ ప్రోత్సహించింది రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అని విమర్శించారు. 

14:05 - March 1, 2017

సూర్యాపేట : జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. పల్లెపల్లెన కొనసాగుతున్న పాదయాత్ర బృందానికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు రామన్నగూడెం, కుంచమర్తి, తిమ్మాపురం రాజానాయక్‌ తండా, సూర్యాపేటలో పాదయాత్ర జరుగుతోంది. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో ప్రజా పాలన సాగాలని ఆకాంక్షించారు. 

 

14:03 - March 1, 2017

హైదరాబాద్ : ఇంటర్‌ బోర్డు అధికారుల అవినీతి వల్లే 250 మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని వాసవి కాలేజీ యాజమాన్యం ప్రతినిధి శ్రీనివాస్‌ ఆరోపించారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. కాలేజీకి అనుమతి లేకపోతే.. అధికారులు ఎలా తనిఖీలు నిర్వహించారని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్‌ బోర్డు అధికారుల వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. లంచం ఇవ్వనందుకే తనను దోషిగా నిలబెట్టారని పేర్కొన్నారు. ఇంటర్‌ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. 

 

13:59 - March 1, 2017

హైదరాబాద్ : టీడీపీ ఎంపీల బస్సులు ప్రజల ప్రాణాలు తీస్తుంటే.. ప్రతిపక్షం చూస్తూ ఊరుకోవాలా ? అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి వెళ్తే తప్పేంటని ఆమె అడిగారు. జగన్‌ వెళ్తే అధికారుల, ప్రజాప్రతినిధుల కుట్ర బయటపడుతుందనే అందరూ భయపడుతున్నారని విమర్శించారు. బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులే కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

13:56 - March 1, 2017

గుంటూరు : నదుల అనుసంధానమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. సీతానగరంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాజధాని నిర్మాణానికి రైతులు ముందుకొచ్చి భూములు ఇస్తే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 

 

13:53 - March 1, 2017

ఢిల్లీ : చమురు కంపెనీలు సామాన్యులపై మరింత భారం మోపాయి. రాయితీ, రాయితేతర గ్యాస్‌ సిలిండర్ల ధరలను భారీ స్థాయిలో పెంచాయి. గృహ వినియోగదారుల సిలిండర్‌ ధర రూ.90 మేర పెంచారు. గ్యాస్‌ సిలెండర్‌ రూ. 738 నుంచి 828కి పెంచారు. వాణిజ్యవినియోగదారుల సిలిండర్‌ ధర రూ.148.50 పై పెరిగింది. నేటి నుంచే పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. 

భారీ పెరిగిన రాయితీ, రాయితేతర గ్యాస్‌ సిలిండర్ల ధరలు

ఢిల్లీ : చమురు కంపెనీలు సామాన్యులపై మరింత భారం మోపాయి. రాయితీ, రాయితేతర గ్యాస్‌ సిలిండర్ల ధరలను భారీ స్థాయిలో పెంచాయి.

 

13:40 - March 1, 2017

యంగ్ హీరో లు హిట్ కొట్టాలంటే సీనియర్స్ ని సపోర్ట్ అడగాలి అని తెలుసుకున్నట్టు ఉన్నారు నయా ట్రెండ్ హీరోలు . కామిడి టచ్ తో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా లు ఇండస్ట్రీ లో సేఫ్ జోన్స్ గా మారాయి. మంచు మనోజ్ హీరో  గా వస్తున్నసినిమా గుంటూరోడు. ఎస్ కే సత్య డైరెక్టర్ గా తెరెకెక్కుతున్న ఈ  సినిమా లో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది .ఈ సినిమా యూత్ఫుల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని సినిమా యూనిట్ చెప్తుంది  .రీసెంట్ గా రిలీజ్ ఐన   ఈ చిత్ర ట్రైలర్ కి, ఆడియో కి యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ రెస్పాన్స్ రావడం విశేషం. ఈ సినిమా కి మెగా ఎట్రాక్షన్ ఒకటి ఆడ్ అయింది .ఈ సినిమా లో ఒక వాయిస్ ఓవర్ వినిపించబోతుందట ఆ వాయిస్ ఓవర్ విశేషాలు గుంటూరోడు టీం తెలియచేసారు. 
మల్టి టాస్కింగ్ లో మెగాస్టార్ బిజీ  
ఒక వైపు హిట్ సినిమా తో రీ ఎంట్రీ ,మరో వైపు టివి ఛానల్ లో రియాలిటీ షోస్ ఇలా మల్టి టాస్కింగ్ లో బిజీ అయిపోయాడు మెగాస్టార్ .సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని ఫిక్స్ ఐన ఈ మెగాస్టార్ ఈ మధ్య చాల ఫ్రీ గా మూవ్ అవుతున్నాడు . హాలీవుడ్ స్టైల్ మేకింగ్ తో ఆడియన్స్ మైండ్ లో ఎక్సపెక్టషన్స్ క్రేయేట్ చేసిన రీసెంట్ ఫిలిం ఘాజి  .ఘాజి సినిమాలో ఒక స్పెషల్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది ఆ వాయిస్ మెగాస్టార్ చిరంజీవిది .గతం లో చిరంజీవి  తన గొంతును ఇచ్చి   సినిమా హైప్ పెంచిన సందర్భాలు ఉన్నాయ్ .హనుమాన్ అనే యానిమేటెడ్ ఫిలిం కి వరుడు ,రుద్రమ దేవి ప్రస్తుతం హిట్ కొట్టిన  ఘాజి.. ఈ సినిమాలకి తన వాయిస్ ఇచ్చాడు చిరంజీవి .
గుంటూరోడు సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ 
ఇప్పుడు మంచు మనోజ్ నటిస్తున్న గుంటూరోడు సినిమా కి కూడా చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.ఫస్ట్ ఈ వాయిస్ ఓవర్ కోసం రామ్ చరణ్ తేజ్ ని అనుకున్నా రామ్ చరణ్ అవైలబుల్ గా లేదని చిరంజీవితో వాయిస్ ఓవర్ చెప్పించినట్టు సినీ ఇన్ఫర్మేషన్ .సినిమా స్వర్ణోస్త్సవ వేడుకలనుండి కూడా చిరంజీవికి మోహన బాబుకి మధ్య వీలు దొరికినప్పుడల్లా  మాటల యుద్ధం అవుతూ ఉంది . మోహన్ బాబు కి చిరంజీవికి మధ్య విబేధాలు అప్పుడప్పుడు బయటపడుతున్న గాని అవేమి లేవు మేము ఎప్పటికైనా మిత్రులమే అని చెప్పటానికి ఇదో ఎగ్జామ్పుల్ అనుకోవచ్చు .సినిమా ఇండస్ట్రీ లో యూనిటీ అనేది పెంచడానికి చిరు ఇలా స్టెప్ వేశాడా అనేది డిస్కషన్ పాయింట్ అయింది .ఏది ఏమైనా ఎప్పటినుండో మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న మంచు ఫామిలీకి ఈ సరైన గుంటూరోడు హిట్ ఇస్తాడో లేదో చూడాలి .   

13:35 - March 1, 2017

ఫిలిం వాల్యూస్ అనే మాట కొంచం పక్కన పెట్టి ప్రాఫిట్ మోటోగ సినిమాలు నిర్మిస్తున్నారు కొందరు ప్రొడ్యూసర్స్. కానీ వారికి బిన్నంగా  సినిమా రంగం లో  ప్రొడ్యూసర్ అంటేనే డబ్బులు ,డబ్బులు అంటేనే ప్రొడ్యూసర్ అనే విజన్ మారిపోయింది .స్టోరీ లో కొత్తదనం కోసం తాపత్రయపడుతూ ,స్క్రీన్ మీద కొత్తగా ఏదో చూపించాలి అనే ఆలోచనలతో ఉన్న ప్రొడ్యూసర్స్ వస్తున్న రోజులివి .లాభాలు  ,నష్టాలు అనే ప్లానింగ్ లేకుండా ప్రొడ్యూసింగ్ లోకి ఎంటర్అవ్వరు.ఎంత ప్లానింగ్ ఉన్న కొన్ని సార్లు ఆడియన్స్ జడ్జిమెంట్ కి తలవంచాల్సిందే .ఎన్నో సినిమాల్లో కమెడియన్ గ నటించి ప్రొడ్యూసర్ గ మారిన బండ్లగణేష్ రీసెంట్ టైం లో మంచి హిట్స్ ఇచ్చాడు.
ప్రొడ్యూసర్ గా మారి 8  సినిమాలు 
నటుడిగా రాణించాలని ఎప్పుడో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వచ్చి కొన్ని సినిమాల్లో కమెడియన్ గా, హీరో ఫ్రెండ్ గా చిన్న, పెద్ద  పాత్రల్లో మెప్పించిన నటుడు బండ్ల గణేష్ .ప్రొడ్యూసర్ గా మారి 8  సినిమా లు తీసి అందులో మూడు సినిమా లు సూపర్ హిట్స్ అందించాడు .ఆల్మోస్ట్ మెగా ఫామిలీ ని తన సినిమా లతో కవర్ చేసి హిట్ సినిమాలతో టాప్ డైరెక్టర్ లిస్ట్ లో జాయిన్ అయ్యాడు ఈ యాక్టర్ కం ప్రొడ్యూసర్ . పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ కలక్షన్స్ రికార్డ్స్ తో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా తో బండ్ల గణేష్ సినిమాలు ఒక రేంజ్ లో ఉంటాయి అనే హైప్ క్రియేట్ చేసుకున్నాడు .
బండ్ల గణేష్... ఈ మధ్య స్లో
ఇలా ఒక దశలో విరామం లేకుండా సినిమాలు తీస్తూ దూసుకెళ్లిన బండ్ల గణేష్ ఈ మధ్య స్లో అయ్యాడు. దాదాపు రెండేళ్లుగా అతడి నుంచి సినిమానే రాలేదు. ‘టెంపర్’ హిట్టు తర్వాత కూడా అతను ఇంత గ్యాప్ తీసుకోవడం ఫిలిం వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది .అయితే బండ్ల గణేష్ మాత్రం ఈ విషయం అసలు పట్టించుకునే టైం లేదు అంటున్నాడంట.   ఒకేసారి ఐదు సినిమాలకు తాను సన్నాహాలు చేస్తున్నట్లుగా బండ్ల  గణేష్ చెప్తున్నాడు .చిన్న సినిమాలు తియ్యడానికి రెడీ గా లేను అని పెద్ద సినిమాల మీదే ఫోకస్ పెట్టానని చెప్తున్నాడు ఈ ఫేమస్  ప్రొడ్యూసర్. సినిమాలు తియ్యడానికి డబ్బులు అవసరం లేదు పెద్ద హీరోల డేట్స్ ఉంటె చాలు అని చెప్తున్నాడు బండ్ల గణేష్ .మరి ఇతను నిర్మాతగా చెయ్యబోయే ఆ ఐదు సినిమాలు ఏంటో ..అందులో హీరోలు ఎవరో తెలుసుకోవడానికి మాత్రం వెయిట్ చెయ్యాల్సిందే .. 

 

13:29 - March 1, 2017
13:25 - March 1, 2017

కృష్ణా : నందిగామ పీఎస్‌లో వైఎస్‌ జగన్‌పై కేసు నమోదు అయ్యింది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఫిర్యాదు మేరకు.. జగన్‌పై 353, 503, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు జగన్‌ ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఐఏఎస్‌ అధికారిపై జగన్‌ను తీరును ఐఏఎస్‌ల సంఘం ఖండించింది.

 

13:24 - March 1, 2017
13:20 - March 1, 2017
13:14 - March 1, 2017

విజయవాడ : కేంద్ర మాజీ మంత్రి , బీజేపీ మహిళా మోర్చా నేత పురంధేశ్వరి వైసీపీలో చేరనున్నారా...? బీజేపీలో ఆశించినంత ప్రాధాన్యత లేకపోవడం వల్లే పార్టీ మారాలని చిన్నమ్మ డిసైడ్ అయిపోయారా.. 
పురంధేశ్వరి...
పురంధేశ్వరి... మాజీ కేంద్ర మంత్రి.. దివంగత సీఎం ఎన్టీఆర్ తనయ... ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా, మహిళా మోర్చా నేతగా కొనసాగుతున్నారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఓ వెలుగు వెలిగిన చిన్నమ్మ.. 2014 ఎన్నికల సమయానికి బీజేపీలో చేరిపోయారు. విభజనను సాకుగా చూపుతూ.. కాంగ్రెస్‌లో ఉంటే భవిష్యత్తు ఉండదనే అభిప్రాయంతో అదే విభజనకు సహకరించిన బీజేపీలో చేరిపోయారు.. అయితే ఆమెకున్న పలుకుబడితో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఎంపీగా గెలిస్తే హడావుడి చేసేవారెమో కానీ... ఆమె ఓటమి పాలయ్యారు. బీజేపీలో ఉన్న మహిళా మోర్చా పదవి దక్కినా.. ఆమెకు ఆశించినంత ప్రాధాన్యత లభించకపోవడం ఒక వైపు, బీజేపీ ఏపీలో బలపడకపోవడం మరోవైపు వెరసి ఇప్పుడు పురంధేశ్వరీ పక్క పార్టీల వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.. 
వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం..? 
ఎలాగూ టిడీపీలో చేరలేరు కాబట్టే.. పరుంధేశ్వరి ప్రతిపక్ష పార్టీ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో విశాఖ ఎంపీగా పనిచేసిన అనుభవంతో .. 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై విశాఖ వ్యవహారాలను దగ్గరుండి చూస్తున్న విజయసాయి రెడ్డి తో ఇప్పటికే పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.  అయితే పురంధేశ్వరి విషయాన్ని వైసీపీ అధినేత జగన్  పెండింగ్ లో పెట్టారన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. పురందేశ్వరీ విశాఖ నుంచి పోటీ లోకి దించితే పార్టీ కి లాభమా నష్టమా.. ఖర్చుకు సంబంధించి కూడా ఆమె బాధ్యత వహిస్తారా లేదా .. ఉత్తరాంధ్రపై ప్రభావం పాజిటివ్ గా ఉంటుందా అనే అంశాలపై జగన్ శిబిరం ఆలోచిస్తోందట.. 
2014 ఎన్నికల్లో విశాఖ నుంచి వైఎస్ విజయమ్మ పోటీ 
2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ విశాఖ నుంచి పోటీ చేశారు.. కానీ ఓటమి చవి చూశారు. కుటుంబ సభ్యుల కంటే న్యూట్రల్ క్యాండిడేట్ ఉంటే మంచిదనే అభిప్రాయానికి జగన్ వచ్చారని.. పురంధేశ్వరి వస్తే ఖచ్చితంగా ఆ సీటు గెలుస్తామనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ గతంలో విశాఖ ఎంపీగా పోటీ చేసినప్పుడు పురందేశ్వరీ అంతగా అభివృద్ది చేయలేదని.. ప్రజలకు ఆమె అనుకున్నంతగా అందుబాటులో ఉండరనే టాక్ విశాఖ వాసుల్లో ఉంది... మరి విశాఖ ప్రజల నాడి ఇప్పుడెలా ఉందో తెలుసుకునే పనిలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. 
విశాఖ నుంచి వైసీపీకి బలమైన అభ్యర్థి లేరు.. 
తాజా పరిస్థితులు చూస్తే.. విశాఖ నుంచి వైసీపీకి బలమైన అభ్యర్థి లేరు.. గతంలో ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించిన బొత్స లాంటి నేతలు ఇప్పుడు వైసీపీలో ఉన్నా.. ఆయన ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు కూడా ఎంపీ గా పోటీ చేయడానికి అంత ఆసక్తి కనబర్చడం లేదు.. దీంతో చిన్నమ్మ కు లైన్ క్లియర్ అయినట్టేనంటున్నారు కొందరు వైసీపీ నేతలు. పురంధేశ్వరితో పాటు మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు కూడా వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.

 

12:55 - March 1, 2017

కృష్ణా : విజయవాడలో పరీక్ష కేంద్రాన్ని ఏపీ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈమేరకు ఆమె టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

 

12:51 - March 1, 2017

యాదాద్రి : నిమిషం ఆలస్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌ పరీక్షకు మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చారని ఐదుగురు విద్యార్థులను అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించ లేదు. మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని అధికారులు పరీక్షకు అనుమతించ లేదు. విద్యార్థులు ఎంత వేడుకున్నా అధికారులు కనికరించకపోవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు.

 

12:43 - March 1, 2017

హైదరాబాద్ : వనస్థలిపురం వాసవి కాలేజీ నిర్వాకంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఇంటర్‌ బోర్డు స్పందించింది. కాలేజీ యాజమాన్యంపై చర్యలకు ఆదేశించింది. మరోవైపు విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మరియు ఎంసెట్‌ రాసేందుకు అనుమతి ఇస్తామని కడియం శ్రీహరి భరోసా ఇచ్చారు. ఇదిలావుంటే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిన కాలేజీ యాజమాన్యం బోర్డుకు ఫీజు చెల్లించలేదని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. ఇప్పటికే కాలేజీ యాజమాన్యంపై చర్యలకు ఆదేశించామన్నారు. 

12:39 - March 1, 2017

హైదరాబాద్ : విద్యుత్‌ చార్జీల పెంపుపై తెలంగాణ సర్కార్‌ దోబుచులాడుతోంది. చార్జీల పెంపుపై అధికారులు గడువు మీద గడువు కోరడంతో విద్యుత్ నియంత్రణ మండలి  మొట్టికాయలు వేసింది. మరోవైపు ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్‌ఆర్ రిపోర్టులో స్పష్టత లోపించిందన్న వాదనలు వినిపిస్తోంది. 
అధికారులు మల్లగుల్లాలు
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొత్త ఆర్ధిక సంవత్సర విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రతి ఏటా నవంబర్ 30లోగా ఈఆర్సీకి సమర్పించాలి. డిస్కాంల ప్రతిపాదనలకు అనుగుణంగా డిసెంబర్ - జనవరిలో ప్రజాభిప్రాయ సేకరణ  పూర్తి చేసి, ఫిబ్రవరి నెలాఖరకు కొత్త ఆర్ధిక సంవత్సర చార్జీలను ప్రకటిస్తుంది ఈఆర్సీ. ఈ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే కొత్త చార్జీల పెంపుపై డిస్కంలకు, ఈఆర్సీ మూడు సార్లు గడువు ఇచ్చింది. అయినప్పటికి చార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వకపోవడంపై ఈఆర్సీ మండిపడింది. చార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వలేకపోతే తామే విద్యుత్ చార్జీల పెంపు ప్రకటన చేస్తామని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. దీంతో అప్రమత్తమైన డిస్కం అధికారులు వచ్చే నెల 5లోపు కొత్త చార్జీల ప్రతిపాదనలు సమర్పిస్తామని మరోమారు ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు.
రూ.9 కోట్ల 82లక్షల 4వేల లోటు 
ఇది ఇలా ఉంటే గత నవంబర్‌ 30న ఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో విద్యుత్ పంపిణీ సంస్థల రూ.9 కోట్ల 82లక్షల 4వేల లోటు చూపించారు.  ఈ నివేదికలోనే కొత్త చార్జీల పెంపు ప్రతిపాదనలు కూడా ఇవ్వాల్సి ఉంది. అయితే చార్జీలపై గడువు మీద గడువులు కోరుతున్న అధికారులు.. ఇప్పటి వరకు  స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. మొత్తం లోటు బడ్జెట్‌లో ప్రభుత్వం నుంచి సబ్సిడీ కింద రూ.7కోట్ల 8లక్షలు అడిగేందుకు డిస్కంలు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం విద్యుత్ రంగానికి ఇంత పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనైనా విద్యుత్ చార్జీల పెంపును ధైర్యంగా చేపడతారా..! అనేది ప్రశ్నగా మారింది. మరోవైపు ఏపి సమర్పించిన ఏఆర్‌ఆర్‌ రిపోర్టుకు తెలంగాణ సమర్పించిన గణంకాలకు భారీ తేడా ఉండటం కూడా కొత్త చార్జీల పెంపు ఆలస్యానికి మరో కారణమనే వాదన వినిపిస్తోంది.
ఈఆర్సీ కొత్త మెలిక 
మరోవైపు విద్యుత్ చార్జీల పెంపుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న డిస్కంలకు ఈఆర్సీ కొత్త మెలిక పెట్టింది. ఈ సారి కూడా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వలేకపోతే లోటుగా ఉన్న మొత్తం చార్జీల పెంపుకు అనుమతి ఇస్తామని హెచ్చరించింది. అదే జరిగితే విద్యుత్ చార్జీలు చరిత్రలో లేనంతగా భారీగా పెరగడం ఖాయమని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

12:31 - March 1, 2017

అమెరికా : తన నెలరోజుల పాలనలో కొత్త జాబులు సృష్టించడంలో ముందడుగేశాన్నన్నారు అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌. అధ్యక్షపదవి చేపట్టాక అమెరికన్‌ కాంగ్రెస్‌ను ఉద్దేశించి తొలిసారి ఆయన మాట్లాడారు. దేశంలో తిష్టవేసిన డ్రగ్స్‌ మాఫియాకు చెక్ పెట్టే చర్యలు చేపపట్టామన్నారు. దేశంలో జాతివిక్షను కొనసాగడాన్ని అనుమతించమని.. ట్రంప్‌ అన్నారు. ముస్లీందేశాలతో తాము స్నేహాన్నే కోరుకుంటున్నామని .. తమ మిత్రులయిన ముస్లీం దేశాలతో కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటామన్నారు. అంతకు ముందు సభ ప్రారంభంలో దేశంలో జాత్యహంకార దాడిలో మృతిచెందిన శ్రీనివాస్‌ కూచిబొట్లకు సభ సంతాపం తెలిపింది. కాంగ్రెస్‌ సభ్యులు రెండు నిముషాలు మౌంనం పాటించారు. 

 

11:46 - March 1, 2017

సూర్యపేట : మహాజన పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. గ్రామ గ్రామనా ప్రజలు స్వచ్ఛందంగా యాత్రలో పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడంలో పాదయాత్ర సక్సెస్‌ అయిందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం వామపక్షాలేనని స్పష్టం చేశారు.

 

11:42 - March 1, 2017

కృష్ణా : జిల్లాలో దోపిడి దొంగలు దారుణానికి పాల్పడ్డారు. కంకిపాడు మసీదు సెంటర్‌లో ఓ ఇంట్లో చోరీకి వచ్చి..  కర్రి శ్రీదేవి అనే మహిళను దారుణంగా హతమార్చారు. అర్ధర్రాతి ఇంట్లోకి దూరిన దొంగలు.. ఒంటరిగా ఉన్న మహిళను గొంతుకోసి చంపేశారు. 70కాసుల బంగారంతోపాటు 4లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన  పోలీసులు.. నిందితుల కోసం వేట మొదలు పెట్టారు. 

 

11:33 - March 1, 2017

ట్రావెల్స్ సంస్థలు భద్రాత ప్రమాణాలు పాటించడం లేదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించని చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత గౌతంరెడ్డి, సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి భావనారాయణ, టీడీపీ నేత దినకర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నందిగామ పీఎస్ లో జగన్ పై కేసు నమోదు

కృష్ణా : నందిగామ పోలీస్ స్టేషన్ లో వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదు అయింది. విధులకు ఆటకం కలిగించారని కేసు నమోదు అయింది. 

 

11:23 - March 1, 2017

నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ డివైఎఫ్ఐ నాయకులు శ్రీనివాస్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మార్చి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. మార్చి 13న బడ్జెట్ ప్రవేశపెడతారు. గత బడ్జెట్ లో యువతకు ప్రాధాన్యతనిచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకుంది. యువత సాధికారిత,  నైపుణ్య కల్పన, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రమోషన్, క్రీడల అభివృద్ధికి కలిపి  యువతకు దాదాపు  888 కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం. అయితే, ఈసారి బడ్జెట్ ఎలా వుండబోతోంది? యువతకు ఎలాంటి పథకాలు ప్రకటించబోతున్నారు? టిడిపి ఎన్నికల ప్రణాళికలో వాగ్ధానం చేసినట్టుగా ఈసారైనా నిరుద్యోగ భృతి ప్రకటిస్తారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం యువతరం ఎదురుచూస్తోంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి యువత ఏమి ఆశిస్తోంది? బడ్జెట్ లో యువతకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి? అంశాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:18 - March 1, 2017

అనంతపురం : జిల్లాలో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. రాయదుర్గం మండలం ఆవులదట్ల వద్ద లారీ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు.  మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు .. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. 

11:15 - March 1, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇంటర్నేషనల్‌ రేర్‌ డిసీజ్‌ డే జరిగింది. మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన ఈ  కార్యక్రమానికి అరుదైన వ్యాధులతో బాధపడుతున్న బాలబాలికలు, యువతీయువకులు హారజర్యారు. మ్యూకో పాలీసక్రర్టైజ్‌ వ్యాధితో బాధపడతున్న హైదరాబాద్‌కు చెందిన రమ్య శ్రీ కూడా ఇంటర్నేషనల్‌ రేర్‌ డిసీజ్‌ డే లో పాల్గొన్నారు. తన బాధను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. 
అరుదైన మ్యూకో పాలిసక్రర్టైజ్‌ టైప్‌ 2 వ్యాధి 
ఇక్కడ కనిపిస్తున్న ఈ యువతి పేరు రమ్య శ్రీ. హైదరాబాద్‌కు చెందిన ఈమె అరుదైన మ్యూకో పాలిసక్రర్టైజ్‌ టైప్‌-2 వ్యాధితో బాధపడుతున్నారు. పద్నాలుగు ఏళ్ల వయస్సులో ఈ మాయదారి రోగాన్ని గుర్తించారు. అయితే సరైన వైద్యచికిత్స, మందులు అందుబాటులో లేకపోవడంతో ఈ వ్యాధి  రోజు రోజుకు  ముదురుతోంది. 
చదువును అశ్రద్ధ చేయలేదు.. 
మ్యూకో పాలిసక్రర్టైజ్‌ వ్యాధితో రమ్య శ్రీ బాధపుడుతున్నా చదువును మాత్రం అశ్రద్ధ చేయలేదు. టెన్త్‌, ఇంటర్‌ మంచి మార్కులతో పాసయ్యారు. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ లో బీఏ చదువుతున్నారు. ఐఏఎస్‌ లక్ష్యంగా సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధం కావాలని  లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ వ్యాధికి మన దేశంలో మందులు పెద్దగా అందుబాటులో లేవు.  విదేశాల నుంచి తెప్పించుకోవాలి. ఖర్చు ఎక్కువ. ఈవిషయంలో ప్రభుత్వం ఆదుకోవాలని రమ్య శ్రీ కోరుతున్నారు. ఈ వ్యాధి చికిత్సకు ఖర్చును భరించడం కష్టంగా ఉన్న తల్లిదండ్రులు అప్పోచొప్పోచేసి మందులు ఇప్పిస్తున్నారు. శక్తికి మించి వ్యయం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 
ఎందరినో అక్కున చేర్చుకున్న ఎస్‌ఎస్‌డీఎస్‌ఎస్‌ 
అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రమ్య శ్రీ లాంటి ఎందరినో ఎస్‌ఎస్‌డీఎస్‌ఎస్‌ స్వచ్చంధ సంస్థ అక్కున చేర్చుకుంది.. సరైన వైద్యం అందిస్తే వీరు కోలుకుని సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంది. మందుల దిగుమతులకు ప్రభుత్వ అనుమతి కావాలి. మ్యూకోపాలీసక్రర్టైజ్‌ వ్యాధిగ్రస్థులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సహాయ, సహకారాలు అందిచాలని సంస్థ ప్రతినిధులు కోరతున్నారు. మ్యూకోపాలీసక్రర్టైజ్‌ వంటి అరుదదైన వ్యాధులతో బాధపడేవారికి ప్రత్యేక చికిత్స కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధిని ఏర్పాటు  చేయాలని కోరుతున్నారు. 
 

11:08 - March 1, 2017

హైదరాబాద్ : అభివృద్ధి పేరుతో తెలంగాణ సర్కార్‌ ప్రజల నుంచి వివిధ రూపాల్లో ముక్కు పిండి  పన్నులు వసూలు చేస్తోంది. దీనిపై ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి. సిటీలో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి కృషి చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటిస్తే.. హెచ్‌ఎండీఏ అధికారులు మాత్రం చట్టంలో లేని నాలా పన్ను భారాన్ని ప్రజలపై మోపుతున్నారు.  మరోవైపు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్లియరెన్స్‌ కూడా ఆలస్యమతుండటంతో హెచ్‌ఎండీఏ చర్యలను సిటిజన్లు వ్యతిరేకిస్తున్నారు.
నాలా పన్నుపై నిరసన 
లే అవుట్‌ రెగ్యూలరైజేషన్‌ స్కీమ్‌ అమలు విషయంలో జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీ పరిధిలో ద్వంద విధానంపై నగర వాసులు ఆ్రగహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ల‌క్షలాది మంది లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తు దారులున్నారు. ఈ ప‌థ‌కం అమ‌లు గ‌తంలో 2008 నుంచి 2013 వరకు జ‌రిగింది. అప్పుడు  జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో వివిధ దశల్లో ఎలాంటి నాలా పన్ను లేకుండా  లక్షకు పైగా దరఖాస్తులు పరిష్కరించారు. ఆ తర్వాత కొన్ని దరఖాస్తులు వివిధ కారణాలతో ఆగిపోయాయి. వీటిలో పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తుల‌కు నాన్ అగ్రిక‌ల్చరల్ లాండ్ అసెస్‌మెంట్ టాక్స్  కట్టాలని హెచ్ఎండీఏ అధికారులు మెలిక పెట్టారు. 
నాలా ప‌న్ను వ‌సూలు 
అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 3 శాత‌మే నాలా ప‌న్ను వ‌సూలు చేయాలి. కానీ 4.5శాతం ప‌న్నును హెచ్‌ఎండీఏ వ‌సూలు చేస్తోంది. దీంతో ప్రధాన కార్యాల‌యం ముందు ధర్నాకు దిగారు హైద‌రాబాద్ జిందాబాద్ సంస్థతోపాటు, కాల‌నీస్ అండ్ అపార్ట్ మెంట్ అసోసియేషన్‌  నేతలు. రియ‌ల్ ఎస్టేట్ సంస్థలు అక్రమంగా లే అవుట్లు చేసి వాటిని అమ్ముకుని సోమ్ము చేసుకున్నప్పుడు ప‌ట్టించుకోని అధికారులు.. ఇప్పుడు వాటిని కొన్న ప్రజలపై భారం వెయ్యడం దారుణమని ప్రశ్నిస్తున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం లక్ష 66 వేల దరఖాస్తులు
హెచ్‌ఎండీఏ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం లక్ష 66 వేల దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిని క్లియ‌ర్ చెయ్యడంలో అధికారులు అల‌స‌త్వం వ‌హిస్తున్నారంటున్నాయి ప్రజా సంఘాలు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలించి, పరిష్కరించే పనిని వేగంగా చేస్తున్నామని అధికారులు చెప్పుకొస్తున్నారు. మూడు దశల్లో చేపడుతోన్న ఈ క్లియరెన్స్‌లో టైటిల్‌ పరిశీలిన,  సాంకేతిక పరిశీలిన, సైట్‌ విజిట్‌ చేసి డబ్బులు చెల్లించాల్సిన వివరాలు దరఖాస్తుదారులకు చెబుతామంటున్నారు. అయితే ఇప్పటి వ‌ర‌కు లక్షా 13వేల 599 ద‌ర‌ఖాస్తులు టైటిల్స్‌ ప‌రిశీల‌న చేశామ‌ని.. వాటిలో 92 వేల దరఖాస్తులు సాంకేతిక పరిశీలన పూర్తి చేశారు. మరో  36 వేల ద‌ర‌ఖాస్తుల‌కు సైట్ విజిట్ పూరైందని అధికారులు చెబుతున్నారు.  32 వేల వ‌ర‌కు పరిష్కరించామని,  అందులో 25వేల దరఖాస్తులు ఫీజులు చెల్లింపుతో పాటు ఇత‌ర విషయాల‌ వ‌ల్ల తిరస్కరణకు గురయ్యాయంటున్నారు హెచ్‌ఎండీఏ  క‌మిష‌నర్ చిరంజీవులు.
అంతా అన్ లైన్‌లో 
ఇక గ‌తంలో జ‌రిగిన స‌మ‌స్యలు ఈ సారి లేకుండా చూస్తామంటున్నారు క‌మిష‌న‌ర్. ఎలాంటి అవినీతికి తావు లేకుండా అంతా అన్ లైన్‌లో చేస్తున్నామంటున్నారు. దరఖాస్తు వివ‌రాలు ఎప్పటిక‌ప్పుడు దరఖాస్తుదారులకు తెలిసేలా ఏర్పాటు చేశామన్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారుల‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని ఇప్పటికే ముగ్గురు అధికారుల‌పై చ‌ర్యలు తీసుకున్నామ‌న్నారు.

 

11:00 - March 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణా రాహిత్యం రోజు రోజుకు  పెరిగిపోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది పార్టీకి నష్టం కల్గిస్తోందని నేతలు ఆవేదన చెందుతున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై ఆదిలోనే చర్యలు తీసుకోపోతే ఎలా.. అని పీసీసీ చీఫ్‌ను ప్రశ్నిస్తున్నారు. యాక్షన్‌ తీసుకునేందుకు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సిద్ధమవుతున్న తరుణంలో ఢిల్లీ పెద్దలు వెయిట్‌ చేయండంటూ వెనక్కి లాగుతున్నారు. దీంతో క్రమశిక్షణా రాహిత్యంపై చర్యల విషయంలో ఊగిసలాట తప్పడంలేదు. 
వేటుపై ఊగిసలాట 
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు క్రమశిక్షణా రాహిత్యం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. నేతల ధిక్కార స్వరాలు పెరిగిపోయాయి. పార్టీ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ కొందరు నేతలు ఎవరికివారుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిలో కోమటిరెడ్డి సోదరులు ముందు వరుసలో ఉన్నారు. ఇతనిపై చర్యలు తీసుకోవడం ద్వారా క్రమశిక్షణా రాహిత్యానికి ఫులిస్టాప్‌ పెట్టాలని భావిస్తున్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దూకుడుకు కాంగ్రెస్ అధిష్టానం కెళ్లం వేస్తోంది. దీంతో ఏంచేయాలో పాలుపోక తలబాదుకోవడం టీపీసీసీ అధ్యక్షుడి వంతైంది. 
కోమటిరెడ్డి బ్రదర్స్‌పై కోపంతో ఉన్న ఉత్తమ్‌ 
రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిపై నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసిన వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు ఇప్పుడు పీసీసీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అధిష్టానం సర్దిచెప్పడంతో గొడవ సమసిపోయిందనుకుంటున్న తరుణంలో... సీఎల్పీ నేత జానారెడ్డే  వచ్చే ఎన్నికలకు తమ సీఎం అభ్యర్థి అంటూ  ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఆధిపత్య పోరులో భాగంగా కోమటిరెడ్డి సోదరులు తనను తక్కువ చేసి చూస్తున్నారన్న బాధతో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఉన్నారు.  కోమటిరెడ్డి బ్రదర్స్‌పై కోపంతో రగిలిపోతున్నారు. పార్టీకి నష్టం కలించే వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, చేసిన తప్పును తెలుసుకుని క్రమశిక్షణతో మసలుకుంటాని  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నా... కోమటిరెడ్డి సోదరుల్లో ఏమాత్రం పశ్చాతాపం భావం కనిపించడంలేదు. దీంతో వీరి వ్యవహారాన్ని మళ్లీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో టీ పీసీసీ చీఫ్‌ ఉన్నారు.
ఉత్తమ్‌ చేయించిన సర్వేలో నిజం లేదన్న వెకంట్‌రెడ్డి
రాష్ట్రంలో ఇప్పిటికప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 75 సీట్లు వస్తాయని తన సర్వేలో తేలిందని పీసీసీ సమావేశంలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చేసిన ప్రస్తావనన కోమటిరెడ్డి వెంకటరెడ్డి విపరీత వ్యాఖ్యలు చేశారు. ఈ సర్వేలో నిజంలేదని వెంకటరెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేయడాన్ని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీని ధిక్కరించి వ్యవహరిస్తున్న వారిపై వేటు వేయాలని ఒత్తిడి తెస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ పార్టీకి క్రమశిక్షణకు వ్యతిరేకంగా  వ్యవహరించిన తీరుపై ఆధారాలు సహాతో అధిష్టానానికి నివేదిక పంపినట్టు సమాచారం. ఇప్పటికైనా వీరిపై వేటు వేయకపోతే పార్టీకి నష్టమని కూడా నివేదించినట్టు తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. 
రాష్ట్రంలో ఒడిడొడుకుల్లో ఉన్న కాంగ్రెస్‌ 
అయితే కోమటిరెడ్డి సోదరుల విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో రాజకీయంగా పార్టీ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో వేటు మంచిదికాదన్నది ఏఐసీసీ నేతల భావన. తెలంగాణలో బలమైన సామాజికవ వర్గానికి చెందిన నేతలపై వేటు వేస్తే అది పార్టీకి చేటు తెస్తుందన్న ఆందోళనతో కాంగ్రెస్‌ అధిష్టానం ఉంది. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సవాల్‌ చేసిన తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకుని హీరో నిలిచారు.  దీంతో ఈయనప వేటుకు ఐఏసీసీ మొగ్గుచూపడంలేదని భావిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ కుమార్‌రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ రాష్ట్రానికి రానున్నారు. ఈ పంపాయితీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

 

10:57 - March 1, 2017

గుంటూరు : జిల్లాలోని కొండవీటి వాగు ముంపు నివారణకు రాష్ర్ట ప్రభుత్వం శాశ్వత పరిష్కారమార్గాన్ని చూపబోతోంది. కొండవీటి వాగు వరద నీటిని ఎత్తిపోసేందుకు సీతానగరం వద్ద 237 కోట్లతో ఎత్తిపోతల పథకానికి ఈ  ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 16 గేట్లతో పట్టిసీమ తరహాలోనే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

అనంతపురం : జిల్లాలోని రాయదుర్గం ఆవులదట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీ.. నలుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. రాయదుర్గం ఆస్పత్రికి తరలించారు. 

10:38 - March 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి గులాబీ పార్టీతో కలిసి ఉద్యమంలో పాల్గొన్న నేతలకు అసలు పరీక్ష ఇప్పుడు మొదలైంది. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేతలకు ఎంత మందికి పదవులు దక్కుతాయో అన్న అనుమానాలు నేతలను వెంటాడుతున్నాయి. వీలైనంత త్వరగా పదవుల భర్తీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకోవడం నేతల్లో ఆందోళన పెరుగుతోంది. 
నేతల్లో పదవులపై ఆశలు 
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు గులాబీ పార్టీలో కొనసాగుతున్న నేతలకు పరీక్ష కాలం మొదలైంది. సర్కార్‌ ఏర్పాటు తర్వాత దాదాపు మూడేళ్లకు నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేతల్లో పదవులపై ఆశలు పెరిగాయి. మరో వైపు సగం మంది నేతలకు అనుమానాలు పెరుగుతున్నాయి.  క్షేత్ర స్థాయిలో జెండా మోసిన తమకు గుర్తింపు దక్కుతుందా... లేదా... అనే ఆందోళన నేతల్లో రోజురోజుకు పెరుగుతోంది.
పదవులు ఇచ్చేందుకు జాబితాలు రెడీ...
నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టి పదవులు ఇచ్చేందుకు జాబితాలు రెడీ చెయ్యాలని నేతలను సీఎం ఆదేశించారు. మార్చిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పదవులు దక్కనున్నాయి. దేవాలయాల కమిటీలు, జిల్లా  గ్రంథాలయాల సంస్థల చైర్మన్లు, మార్కెట్‌ కమిటీలు, పార్టీలో గ్రామ కమిటీలు, జిల్లా కమిటీలు, జిల్లా స్థాయిలో అధికారికంగా ఉండే అన్ని పదవులు ఈ విడతలో పంపిణీ చేయాలని పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. దీంతో పదవులు దక్కించుకునేందుకు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. 
అయోమయంలో నేతలు 
కానీ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన నేతల పరిస్థితి మరోసారి అయోమయంలో పడింది. తెలంగాణ వ్యాప్తంగా సగానికి పైగా నియోజకవర్గాల్లో ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు ఉద్యమ సమయంలో గులాబీ పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించిన నేతలే. వీరంతా  ఉద్యమకారుల నుంచి  తెలంగాణ ఉద్యమ సెగను ఎదుర్కొన్న వారే.
నేతల్లో కొత్త అయోమయం
పదవులు కోరుకుంటున్న ఉద్యమకారులు ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న నేతల ఆశీస్సులు పొందితే తప్పా ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ సీనియర్ కార్యకర్తలకు పదవులు దక్కని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. రాష్ట్ర స్థాయి పదవులు  కీలక నేతల గుర్తింపుతో దక్కుతున్నా జిల్లా, నియోజకవర్గ పదవులు దక్కాలంటే మాత్రం వలస వచ్చిన నేతలు తమ వర్గాన్ని కాదని ఉద్యమకారులకు పదవులు కేటాయిస్తారా అన్న అనుమానాలు నేతల్లో కొత్త అయోమయానికి తెరలేపుతున్నాయి.

 

10:32 - March 1, 2017

హైదరాబాద్ : ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు పరిశీలిన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 3వ తేదీ చివరి రోజు. కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికల్యే అవకాశం ఉంది. అనివార్యమైన జిల్లాల్లో ఈ నెల 20న పోలింగ్‌ నిర్వహిస్తారు. ఏపీలో స్థానిక సంస్థల నుంచి శాసనమండలిలోని తొమ్మిది స్థానాలకు జరుగుతున్న ఎన్నికల నామినేషన్ల పర్వం పూర్తైంది. ఆయా పార్టీల అభ్యర్థులు కోలాహలంగా వెళ్లి నామిషనేషన్లు వేశారు. 
అనంతపురం... టీడీపీ అభ్యర్థిగా దీపిక్‌ రెడి నామినేషన్‌ 
అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్థిగా దీపిక్‌ రెడి అట్టహాసంగా నామినేషన్‌ వేశారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండిపెండెంట్‌గా పైలా నర్సింహులు నామినేషన్‌ వేశారు. 
చిత్తూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు 
ఎమ్మెల్సీ నామినేషన్ల సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అభ్యర్థిగా బీఎన్‌ రాజసింహులు నామినేషన్‌ వేశారు. అయితే ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేసుందుకు వచ్చిన కొందరు అభ్యర్థులపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. 
కర్నూలు.. టీడీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్‌ 
కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్‌ వేశారు. పార్టీ నేతలు,  ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. -
పశ్చిమగోదావరి..టీడీపీ అభ్యర్థులగా ఎమ్మెల్యే రామ్మోహన్‌రావు, మంతెన
పశ్చిమగోదావరి జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థులగా ప్రస్తుత ఎమ్మెల్యే అంగర రామ్మోహన్‌రావు, మంతెన సత్యనారాయణ రాజు నామినేషన్లు వేశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
శ్రీకాకుళం..టీడీపీ అభ్యర్థిగా శత్రుచర్ల విజయరామరాజు నామినేషన్‌ 
శ్రీకాకుళం జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థిగా శత్రుచర్ల విజయరామరాజు నామినేషన్‌ వేశారు. ఈ ఎన్నిక ఏకగ్రీమం అవుతుందని భావించిన తెలుగుదేశం నేతలకు ప్రతిపక్ష వైసీపీ షాక్‌ ఇచ్చింది. చివరి నిమిషంలో తమ అభ్యర్థిని రంగంలోకి దింపింది. మామిడి శ్రీకాంత్‌తో ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసింది. దీంతో పోటీ అనివార్యమైంది. 
తూర్పుగోదావరి..టీడీపీ అభ్యర్థిగా చిక్కాల రామచంద్రరావు నామినేషన్‌ 
తూర్పుగోదావరి జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు నామినేషన్‌ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ వాకాటా నారాయణరెడ్డి నామినేషన్‌ వేశారు. శ్రీకాకుళంతోపాటు కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల నుంచి మండలికి జరిగే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు బరిలో  ఉన్నారు. 
ఇవాళ నామినేషన్ల పరిశీలిన 
ఇవాళ నామినేషన్ల పరిశీలిన జరుగుతుంది. ఉపసంహరణకు ఈనెల 3 వ తేదీ వరకు  గడువు ఉంది. కొన్ని జిల్లాల్లో ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేసిన వారితో ఉపసంహరింప చేసేందుకు టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇందుకు ఒప్పుకోని అభ్యర్థులను నయానో, భయానో లొంగతీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తూర్పు, పశ్చమగోదారి జిల్లాలతోపాటు అనంతపురంలో టీటీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే  అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ ఉన్న స్థానాల్లో ఈనెల 20 పోలింగ్‌ నిర్వహిస్తారు. 

 

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 19వరకు పరీక్షలు జరుగునున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే.. విద్యార్థులంతా అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు తరలిరావాలని అధికారులు సూచిస్తున్నారు. గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.

09:47 - March 1, 2017

వాషింగ్టన్ : కూచిభొట్ల శ్రీనివాస్ హత్యకు యూఎస్ కాంగ్రెస్ సంతాపం తెలిపారు. రెండు నిమిషాలపాటు మైనం పాటించారు. శ్రీనివాస్ హత్యను జాత్యహంకార దాడిగా వైట్ హౌస్ అంగీకరించింది. అమెరికన్ కాంగ్రెస్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసాగిగా ప్రసంగించారు. 

09:44 - March 1, 2017

విజయవాడ : ఏపీలో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉదయలక్ష్మీ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ.. ఉదయలక్ష్మీ తెలిపారు. ఈమేరకు ఆమె టెన్ టివితో మాట్లాడారు. నేటి నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1445 సెంటర్ల ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు 8.30 గంలకు సెంటర్లలలో ఉండాలన్నారు. రాష్ట్రంలో 10.23లక్షల మంది పరీక్ష రాస్తున్నారని చెప్పారు. ఫాల్స్ రూమర్స్ సృష్టించి విద్యార్థులు, తల్లిండ్రులు, టీచర్స్ ను ఆందోళన గురిచేయొద్దన్నారు. భద్రతా పరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

 

09:37 - March 1, 2017

హైదరాబాద్ : వనస్థలిపురం శ్రీవాసవి కాలేజీ మోసానాకి పాల్పడింది. వేలకు వేలు ఫీజులు దండుకుని విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వలేదు. పరీక్ష ప్రారంభమైనా విద్యార్థులకు హాల్ టిక్కెట్లు అందలేదు. కాలేజీ యాజమాన్యం 300 విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వలేదు. దీంతో న్యాయం చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ ఇక్కడికి రావాలని... తమకు సమాధానం చెప్పాలన్నారు. న్యాయం జరిగే వరకూ ధర్నా ఆపేది లేదన్నారు. ఎస్ ఎఫ్ ఐతోపాటు పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత వాతావారణం నెలకొంది.
జగదీష్.. ఎస్ ఎఫ్ ఐ...
'ముందు నుంచి చెబుతున్నా.. హాల్ టిక్కెట్లు ఇవ్వకపోవడం దారుణం. పోలీసులు, అధికారులు, ప్రభుత్వం కలిసి నాటకాలు ఆడుతున్నాయి. విద్యార్థుల జీవితాలను యాజమాన్యం చెలగాటం ఆడుతోంది. విద్యార్థులకు అన్ని పరీక్షలు రాసేందుకు వీలు కల్పించాలి' అని అన్నారు.

09:35 - March 1, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 19వరకు పరీక్షలు జరుగునున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే.. విద్యార్థులంతా అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు తరలిరావాలని అధికారులు సూచిస్తున్నారు. గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి నిరాకరించనున్నారు. ఏపీలో 1,435, తెలంగాణలో 1,291 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో 10.31 లక్షల మంది, తెలంగాణలో 9.76లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. హైటెక్ కాపీయింగ్ నివారణకు సెంటర్లపై జీపీఎస్ తో నిఘా పెంచారు. పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల చుట్టూ ఉన్న జిరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్షలకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

09:13 - March 1, 2017

హైదరాబాద్ : నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. ఈనెల 19వరకు పరీక్షలు జరుగునున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే.. విద్యార్థులంతా అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు తరలిరావాలని అధికారులు సూచిస్తున్నారు. గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి నిరాకరించనున్నారు. ఏపీలో 1,435, తెలంగాణలో 1,291 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో 10.31 లక్షల మంది, తెలంగాణలో 9.76లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. హైటెక్ కాపీయింగ్ నివారణకు సెంటర్లపై జీపీఎస్ తో నిఘా పెంచారు. పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల చుట్టూ ఉన్న జిరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్షలకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు

09:08 - March 1, 2017

హైదరాబాద్ : తెలంగాణలో  నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి.  నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్‌ హాల్‌లోకి అనుమతించే ప్రసక్తే లేదని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి అశోక్ స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలను సులువుగా గుర్తించేందుకు ఈసారి ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించారు. 
మార్చి 1 నుంచి 19వరకు పరీక్షలు 
మార్చి 1 నుంచి 19వ తేదీ వరకూ జరిగే ఇంటర్‌ పరీక్షలకు రాష్ర్ట ప్రభుత్వం  పకడ్బందీగా  ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 12వందల 91 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9లక్షల 76వేల 631 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్ష సెంటర్ల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌ కారణంగా 9వ తేదీన జరగాల్సిన మ్యాథమెటిక్స్ బి, జువాలజీ, హిస్టరీ పరీక్షలు 19వ తేదీన నిర్వహిస్తారు. 
హాల్‌టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా... పరీక్షకు అనుమతి
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌టికెట్‌పై కాలేజీ ప్రిన్సిపల్ సంతకం లేకున్నా... పరీక్షకు అనుమతి ఇవ్వనున్నారు. కాలేజీ యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వడంలో విద్యార్ధులను ఇబ్బంది పెడితే www.tsbie.cgg.gov.in  సైట్‌లో హాల్‌టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాలేజీ యాజమాన్యాల నుంచి ఇబ్బందులు తలెత్తితే... 040-24601010, 24732369 నెంబర్లకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఇంటర్‌ బోర్డు తెలియజేసింది. 
పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు 
ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు చేశారు. ఈసారి పరీక్షల్లో అడిషనల్‌  ఆన్సర్‌ షీట్‌లు ఉండవు. దానికి బదులు 24 పేజీలున్న ఆన్సర్‌ బుక్‌లెట్‌ను ఇవ్వనున్నారు. మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఈచర్యలు తీసుకున్నారు. దీంతోపాటే, పరీక్ష కేంద్రం వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌నూ రూపొందించారు. 'టీఎస్‌బీఐఈ ఎగ్జాం సెంటర్‌ లొకేటర్‌' యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ సంఖ్యను నమోదు చేస్తే.. పరీక్ష కేంద్రం వివరాలు క్షణాల్లో తెలుస్తాయి. విద్యార్థి ఉన్న చోటు నుంచి పరీక్ష కేంద్రం ఎంత దూరంలో ఉందో... దగ్గరి మార్గంలో ఎలా వెళ్లవచ్చో... ప్రయాణానికి ఎన్ని నిమిషాలు పడుతుందో కూడా ఈ యాప్‌ తెలియజేస్తుంది. మొత్తానికి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు, అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఇంటర్‌ బోర్డు ఓ ప్రకటనలో తెలియజేసింది. 

 

నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు

హైదరాబాద్ : నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. ఈనెల 19వరకు పరీక్షలు జరుగునున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి నిరాకరించనున్నారు. గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఏపీలో 1,435, తెలంగాణలో 1,291 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో 10.31 లక్షల మంది, తెలంగాణలో 9.76లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. హైటెక్ కాపీయింగ్ నివారణకు సెంటర్లపై జీపీఎస్ తో నిఘా పెంచారు. 

ఏపీలో నేటి ఇంటర్ పరీక్షకు సెట్ 3 ప్రశ్నాపత్రం

హైదరాబాద్ : ఏపీలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. ఇవాళ జరుగబోయే ఇంటర్ పరీక్షకు సెట్ 3 ప్రశ్నాపత్రం ఎంపిక చేయనున్నారు. మంత్రి గంటా శ్రీనివాస్ ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. 

తెలంగాణలో నేటి ఇంటర్ పరీక్షకు సెట్... సీ ప్రశ్నాపత్రం

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. నేటి ఇంటర్ పరీక్షకు సెట్... సీ ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. 

Don't Miss