Activities calendar

02 March 2017

యూపీలో ఆరో విడత ముగిసిన ఎన్నికల ప్రచారం..

ఉత్తరప్రదేశ్‌ :  ఆరవ విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏడు జిల్లాల్లోని 49 అసెంబ్లీ స్థానాలకు మార్చి 4న పోలింగ్‌ జరగనుంది. గోరఖ్‌పూర్‌, మహరాజ్‌గంజ్, కుషినగర్, దేవరియా, ఆజంగఢ్, మవు, బలియా జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

21:33 - March 2, 2017
21:32 - March 2, 2017

మధ్యప్రదేశ్ : మతతత్వ శక్తులకు మతి భ్రమించింది. మధ్యప్రదేశ్‌లో ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఉగ్రవాదిలా రెచ్చిపోయాడు. ఏకంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తలకే వెల కట్టాడు. కేరళ సిఎంను చంపిన వారికి కోటి రూపాయల బహుమానం ఇస్తానని ప్రకటించాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కుందన్‌ వ్యాఖ్యలను సిపిఎం తీవ్రంగా ఖండించింది. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఉగ్రవాదిలా రెచ్చిపోయాడు. ఏకంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తలకే వెల కట్టాడు. కేరళ సిఎంను చంపిన వారికి కోటి రూపాయల బహుమానం ఇస్తామని ఓ వేదికపై ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కుందన్‌ చంద్రవత్ ప్రకటించాడు. ఎవరైతే ఈ పనిచేస్తారో వారికి తనవద్ద ఉన్న కోటి రూపాయలకు పైగా ఉన్న ఆస్తిని ఇచ్చివేస్తానని హూంకరించాడు. కేరళలో 3 వందల మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల హత్యలకు విజయనే కారణమని కుందన్‌ చంద్రవత్ ఆరోపించాడు. హిందువుల రక్తంలో పౌరుషం ఉందని శివాజీ తమకు స్పూర్థి అని దీనిపై ప్రతీకారం తీసుకుంటామని కుందన్‌ పేర్కొన్నాడు. గోద్రాలో 50 మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు చనిపోతే హిందూ సమాజం 2 వేల మందిని స్మశానానికి పంపిందని ఆవేశ పూరిత ప్రసంగం చేశాడు. ఈ వేదికపై బిజెపి ఎమ్మెల్యే, ఓ ఎంపి కూడా ఉండడం గమనార్హం.

ఖండించిన సీపీఎం పొలిట్ బ్యూరో..
చంద్రావత్ వ్యాఖ్యలను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆర్‌ఎస్‌ఎస్‌ బెదిరించడం దారుణమని ట్వీట్‌ చేశారు. ఆర్ఎస్ఎస్ నేత చంద్రావత్‌ వ్యాఖ్యలపై కేరళ సీఎం విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పటికే ఎంతో మంది తలలను తీసుకుందని పేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు హెచ్చరించడాన్ని సిపిఎం పొలిట్‌ బ్యూరో తీవ్రంగా ఖండించింది. గత కొన్ని నెలలుగా కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నట్లు మరోసారి రుజువైందని సిపిఎం పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు హిందుత్వ శక్తులు దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్నాయని గతవారం కేరళ సిఎం విజయన్‌ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ హిట్లర్‌, ముస్సోలిని విధానాలను అనుసరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గోడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవాడని గుర్తు చేశారు. ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులను శత్రువులుగా భావిస్తోందని విజయన్‌ వ్యాఖ్యానించారు.

21:29 - March 2, 2017

హైదరాబాద్ : పెరిగిన వంట గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు కదం తొక్కాయి. కట్టెల పొయ్యి వద్దు.. గ్యాస్ సిలిండర్ ముద్దు అని చెప్పే ప్రధాని మోదీ.. గ్యాస్‌ ధరలు విపరితంగా పెంచి మళ్లీ కట్టెల పొయ్యి వాడాల్సిన పరిస్థితి తెస్తున్నారని ఆరోపించాయి. సామాన్యులపై పెనుభారం మోపారంటూ కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించాయి. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.

ఆందోళనలు..
వంట గ్యాస్‌ ధర పెంపును నిరసిస్తూ తెలుగురాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. హైదరాబాద్‌లో యూత్‌ కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. గాంధీభవన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

విశాఖలో..
విశాఖలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపుతుందని సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు నరసింగరావు విమర్శించారు. ఒక వైపు పెట్రోల్‌ ధరలు ప్రతినెలా పెంచుతున్నారని...దానికి తోడు గ్యాస్‌ ధర ఒకేసారి 90 రూపాయల మేర పెంచడం దారుణమన్నారు. కేజీ బేసిన్‌లో లక్షలాది గ్యాలెన్ల గ్యాస్ నిక్షేపాలను ఎక్కడికి తరలిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వెంటనే గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

కృష్ణా జిల్లాలో..
పెరిగిన గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ... కృష్ణా జిల్లా మైలవరంలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇష్టానుసారం గ్యాస్‌, పెట్రోల్‌ ధరలను పెంచుతుందని సీపీఎం మండల కార్యదర్శి రావూరి రామారావు ఆరోపించారు. ధరలు పెంచి పేద, మధ్య తరగతి కుటుంబాల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారని ఆరోపించారు.

విజయవాడలో..
విజయవాడలో మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు. పెంచిన గ్యాస్‌ ధరలను ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మహిళా నేతలు హెచ్చరించారు. పెరిగిన నిత్యావసారాలతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతుంటే.. వంట గ్యాస్ ధర పెంచి వారిపై మరింత భారం మోపారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.

విజయనగరంలో..
అటు విజయనగరంలోనూ సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో చేపట్టారు. కట్టెల పొయ్యిపై వంటచేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు 21 సార్లు పెంచి ప్రజల నడ్డి విరిచారని సీపీఎం నేతలు ఆరోపించారు.

21:26 - March 2, 2017
21:23 - March 2, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన రాజ్యమేలుతోందని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. అధికార టీడీపీ ... ప్రతిపక్ష నేత జగన్‌పై కక్షకట్టిందని ఆరోపించారు. జగన్‌పై కేసుల నమోదును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ధర్నా, బైఠాయింపు, రాస్తారోకోలతో హడలెత్తించాయి. తక్షణమే జగన్‌పై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్‌ బాబుపై వైసీపీ అధినేత జగన్‌ దురుసు ప్రవర్తన ఏపీలో పొలిటికల్‌ హీట్‌ పుట్టిస్తోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మరో పోరుకు తెరతీసింది. జగన్‌ తీరును అధికార టీడీపీ నేతలతోపాటు ఐఏఎస్‌ అధికారులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి జగన్‌పై కేసు కూడా నమోదు చేసింది. వైఎస్‌ జగన్‌ సహా ఆ పార్టీనేతలు పార్దసారధి, ఉదయభాను, జోగిరమేష్‌, అరుణ్‌కుమార్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఆస్పత్రి సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారంటూ సెక్షన్‌ 353,503,34 కింద కేసులు నమోదు చేశారు. జగన్‌పై కేసుల నమోదును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. విశాఖ జిల్లా అనకాపల్లి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు నిరసనకు దిదారు. కశింకోట తహసీల్దార్‌ ఆఫీస్‌ ముందు వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. భారీగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదిమంది మృతికి కారణమైన దివాకర్‌ ట్రావెల్స్‌పై కేసు ఎందుకు పెట్టలేదని రోజా ప్రశ్నించారు. జగన్‌పై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

కేసులు ఎత్తివేయాలి..
గుంటూరు జిల్లా సత్తెనపల్లి తహసీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీమంత్రి మోపిదేవి నేతృత్వంలో రేపల్లెలో ఆందోళన జరిగింది. ప్రభుత్వం దివాకర్‌ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షనేతను టార్గెట్‌ చేసిందని అంబటి రాంబాబు మండిపడ్డారు. జగన్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. జగన్‌పై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలంటూ కృష్ణా జిల్లాలో వైసీపీ ఆధ్వర్యంలో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. విజయవాడ ధర్నా చౌక్‌ దగ్గర వైసీపీ నేతలు దీక్షకు దిగారు. 144 సెక్షన్‌ అమలులో వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నందిగామలోనూ వైసీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని గాంధీబొమ్మ సెంటర్‌ దగ్గర వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోనూ వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. అటు ప్రకాశం జిల్లా కందుకూరులోని వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. చీరాలలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కడప జిల్లా పులివెందుల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వైఎస్‌ వివేకానందరెడ్డి ఆధ‍్వర్యంలో ధర్నా నిర్వహించారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్‌ ఆధ‍్వర్యంలో నిరసన తెలిపారు. జగన్‌పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

21:20 - March 2, 2017

విజయవాడ : అసెంబ్లీ ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం రాలేదని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... తమ పార్టీ నాయకుడికిగానీ ఎమ్మెల్యేలకుగానీ ఎలాంటి సమాచారం పంపలేదని చెప్పారు.. కనీసం మెసేజ్‌కానీ... వాట్సాప్‌గానీ రాలేదని తెలిపారు.. సీఎం చంద్రబాబు, మంత్రులుమాత్రం బహిరంగ సభలో ప్రతిపక్షాన్ని ఆహ్వానించామని చెప్పుకుంటున్నారని విమర్శించారు.. ప్రతిపక్షం అసెంబ్లీ ప్రారంభానికి రాలేదన్న భావన ప్రజల్లో కలిగించడానికే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.. అసెంబ్లీ ప్రారంభం తర్వాత వైసీపీ నేతలు స్పీకర్‌ను కలిశారు.. ప్రతిపక్ష పార్టీ కార్యాలయం, జగన్‌ చాంబర్‌ ఎక్కడున్నాయో స్పీకర్‌ను అడిగి తెలుసుకున్నారు.

21:19 - March 2, 2017

విజయవాడ : నవ్యాంధ్ర చరిత్రలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. వెలగపూడిలో అత్యాధునిక హంగులతో నిర్మించిన అసెంబ్లీ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. భవిష్యత్‌లో అమరావతి నుంచి ఆదర్శవంతమైన పాలన అందిస్తామన్నారు. ఏపీని అభివృద్ధి చేసుకోవాలనే కసితో ప్రస్థానాన్ని ప్రారంభించామన్న ఆయన.. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తాత్కాలిక అసెంబ్లీ భవన సముదాయాన్ని ఉదయం 11.25 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కార్యాలయ గదులు, హాలు, లాబీలను సీఎం పరిశీలించారు. భవిష్యత్‌లో అమరావతి నుంచి ఆదర్శ వంతమైన పాలన అందిస్తామని చంద్రబాబు అన్నారు. ఏపీని నెంబర్‌వన్‌ స్టేట్‌గా మారుస్తామన్న ఆయన.. 192రోజుల్లో అసెంబ్లీ భవనాన్ని నిర్మించామని తెలిపారు. ఈ అసెంబ్లీలో మైకులు విరగొట్టడం..స్పీకర్‌పై దాడి చేయడం లాంటి ఘటనలకు తావుండందన్నారు. ఆవేశాలు వేరు అసెంబ్లీలో ప్రవర్తన వేరని..అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పవచ్చన్నారు. నేను ఇష్టపడి.. కష్టపడి పనిచేస్తాను.. ఎవరు రెచ్చగొట్టినా ప్రజల కోసం భరిస్తున్నానని చెప్పారు.

ఉద్వేగంగా బాబు ప్రసంగం..
విభజన సమయంలో జరిగిన ఘటనలు గుర్తుచేసుకొని సీఎం చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు. ఏపీ అభివృద్ధి చేసుకోవాలనే కసితో ప్రస్థానాన్ని ప్రారంభించామని చెప్పారు. ఇది తాత్కాలికే అసెంబ్లీ మాత్రమేనని, త్వరలో కొత్త అసెంబ్లీని నిర్మిస్తామన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్న ఏపీ సీఎం..రాయలసీమను కోస్తా కన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. వనరులున్నా అభివృద్ధికి నోచుకోని ప్రాంతం ఉత్తరాంధ్ర అని, ఆ పరిస్థితిని మార్చుతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చట్టసభలంటే రాజ్యాంగానికి మూలస్తంభాలని.. ప్రజల ఆకాంక్షలు చట్టసభల్లోనే నెరవేరతాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అన్నారు. నూతన అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కోడెల పాల్గొన్నారు.

ఎమ్మెల్యేలకు రూ. 50వేలు అదనం..
సచివాలయ ఆవరణలో రెండు ఎకరాల స్థలంలో అసెంబ్లీ భవనం నిర్మించారు. సభాపతి, ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. సభలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధ్వని వ్యవస్థ, సభ్యులకు సౌకర్యవంతంగా ఉండేలా సీట్లు ఏర్పాటు చేశారు. హైటెక్‌ హంగులతో నిర్మించిన అసెంబ్లీ భవన సముదాయం ఈనెల ఆరో తేది నుంచి అమరావతిలో జరగనున్న తొలి బడ్జెట్‌ సమావేశాలకు వేదిక కానుంది. అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా సభ్యుల అదనపు భత్యానికి సంబంధించిన ఫైల్‌పై సీఎం సంతకం చేశారు. క్వార్టర్స్‌ లేనందున సభ్యులకు అదనంగా 50వేల రూపాయల భత్యం ఇవ్వనున్నారు.

21:17 - March 2, 2017

విజయవాడ : వెలగపూడి సచివాలయంలో ఏపీ కేబినెట్‌ సుదీర్ఘంగా సమావేశమైంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. మద్యం పాలసీలో మార్పులకు ఆమోదం తెలిపింది. బస్సు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు మంత్రిమండలి సంతాపం ప్రకటించింది. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ను ఎన్‌టీఆర్‌ అమరావతి ఎయిర్‌పోర్ట్‌గా.. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ను శ్రీవేంకటేశ్వర ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌గా పేరు మార్చాలని తీర్మానించింది. నందిగామ ఆస్పత్రి వద్ద జగన్‌ వ్యవహారంపై వీడియోను కేబినెట్‌లో ప్రదర్శించారు. ఐఏఎస్‌పై జగన్‌ తీరును ఖండిస్తూ కేబినెట్ తీర్మానించినట్లు మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ లో మ్యాచింగ్ ఫిక్సింగ్ వారున్నారు - సర్వే..

ఖమ్మం : కాంగ్రెస్ లో కొంతమంది మ్యాచ్ ఫిక్సింగ్ గాళ్లు ఉన్నారని 2019లో 119కి 100 సీట్లు కాంగ్రెస్ వేనని సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ భేటీ..

విజయవాడ : సీఎం అధ్యక్షతన అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ భేటీ అయ్యింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

అసమర్థత పాలన - ఉత్తమ్..

ఖమ్మం : రెండున్నర ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసమర్థత పాలన చేస్తున్నాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ విమర్శించారు. మోడీ, కేసీఆర్ లు వ్యవసాయాన్ని గాలికొదిలేశారని, కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. వాటర్ గ్రిడ్ కాంట్రాక్టర్లకు వేలకోట్లు ఇస్తున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫికి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. రైతు ఆ

20:30 - March 2, 2017

ఇన్ని రోజులుగా ప్రదర్శించిన మాటల మంటలు అన్నీ చల్లార్చి.. కొత్త కబుర్లు చెప్తున్నాడా? ఇది మార్పా లేక.. అవసారానికి వేసిన ఎత్తా? వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, ట్రంప్ చెప్తున్న మాటలు. జాతి విధ్వేషం గురించి ఇచ్చిన స్టెట్ మెంట్లు.. ఇవన్నీ ట్రంపేనా చెప్తోంది? ఇది నిజమేనా అనిపించిన మాట వాస్తవం.. కానీ, దీని వెనుక నిజాయితీ ఉందా స్ట్రాటెజీ ఉందా? ఈ అంశంపై ప్రత్యేక కథనం. ట్రంపేంటీ? మారటమేంటీ? ఛాన్సేలేదు అనుకుంటున్నారా? నిన్నటిదాకా ట్రంప్ ని తిట్టిన అమెరికన్లు కూడా.. లేటెస్ట్ స్పీచ్ విని మా ట్రంప్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. కానీ, ఎన్ని మాటలు చెప్పినా... అసలే అమెరికా అధ్యక్షుడు.. ఆపై ట్రంప్..అలాంటప్పుడు నమ్మటం కష్టమే.. కాదంటారా? ఇంతకీ ట్రంప్ ఏమన్నాడు? ప్రపంచమంతా పడ్డ చిరాకు ఒక్క స్పీచ్ తో చెరిపేశాడా?

వలసలతో ఏర్పడిన దేశం..
ట్రంప్ ఆలోచనల్లో మార్పు వచ్చిందా? ట్రంప్ విధానాల్లో మార్పు వస్తోందా? నేను నుంచి మనం వరకు ట్రంప్ వచ్చేశాడా? ట్రంప్ మాటలు వినటాకిని బాగానే ఉన్నాయి...కానీ, ఇది ఇన్ని రోజులుగా పెరుగుతున్న గందరగోళాన్ని పోగొడుతుందా? లేక ఇంత కాలం కఠినంగా చెప్పినదాన్ని ఇప్పుడు షుగర్ కోటెడ్ పిల్ లా చెప్తున్నాడా? అమెరికా వైపు చూసే భారతీయుల సమస్య మరింత పెరగనుందా? ఇంకా చెప్పాలంటే అసలు అమెరికన్లు చెదిరిపోయారు.. యూరోపియన్లతో పాటు అనేక ఇతర దేశాల ప్రజలతో కలిసి ఏర్పడిన అతుకుల బొంత లాంటి సమాజం. కానీ, ఇప్పుడు కొత్తగా అమెరికన్ల ప్రయోజనాలు అంటున్నారు. అమెరికన్ల భద్రత అంటున్నారు.

ఆరని మంటలు..
నిన్నటిదాకా గ్లోబల్ అంటూ కబుర్లు చెప్పిన దేశం ఇప్పుడు లోకల్ గా మారుతూ కిటికీలు తలుపులు మూసుకుంటున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సాధ్యాసాధయాలేమిటి? ఆస్ట్రేలియా, కెనడా ఈ రెండు దేశాల పేర్లను ట్రంప్ ప్రస్తావిస్తున్నాడు. అక్కడి ఇమ్మిగ్రేషన్ విధానాలను అమలు చేయాలంటున్నాడు. దీనివల్ల బారతీయులపై ఎలాంటి ప్రభావం పడే అవకాశముంది. వీసాలు, పర్మినెంట్ రెసిడెన్స్ లు కష్టంగా మారతాయా? వీసాల నిబంధనలు సడలించవచ్చేమో.. వలసలకు ఆంక్షలు తీసేయొచ్చేమో.. కానీ, సగటు అమెరికన్ ల మదిలో ట్రంప్ నాటిన జాతీయత, జాతి విద్వేషతా బీజాలను తొలగించటం ఎలా సాధ్యం. ఇప్పటికే జరుగుతున్న ఘటనలు దీన్ని బలపరుస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ తన ఆలోచనలు మార్చుకున్నా, లేకున్నా అమెరికా సమాజానికి ట్రంప్ ఆరని మంటలను అంటించాడంటే సందేహం అనవసరం. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి....

20:25 - March 2, 2017

తెల్గురాష్ట్రాలళ్ల కలెక్టర్లకు గోసనే ఉన్నట్టుంది గదా..? ఎమ్మెల్యేలు కలెక్టర్లను తిడ్తె.. ఈ ఎమ్మెల్యే కరెంటి లైను మెనును తిట్టిండు..ఇగో ఇప్పుడు ఇంకో ఎమ్మెల్యే ఆణిముత్యం దొర్కిండు.. ఆ ఎమ్మెల్యేలు కలెక్టర్లను తిడ్తె.. ఈ ఎమ్మెల్యే కరెంటి లైను మెనును తిట్టిండు.. అరేయ్ ఏమనుకుంటున్నవ్ రా..? అని ఇగ జెప్పలేని బూతులు దిట్టి.. ఎమ్మెల్యే అంటే ఏందో అని మొత్తం ఇవరించిండు సెల్ ఫోన్లనే.. వీడియోలో చూడండి..

20:23 - March 2, 2017

యావత్ ఆంధ్రప్రదేశ్ జనులారా..? ఇగో నవ్వాంధ్ర ప్రదేశ్ నిర్మాణంల మొదటి బంగుళ తయ్యారైంది..తెల్గురాష్ట్రాలళ్ల కలెక్టర్లకు గోసనే ఉన్నట్టుంది గదా..? ఎమ్మెల్యేలు కలెక్టర్లను తిడ్తె.. ఈ ఎమ్మెల్యే కరెంటి లైను మెనును తిట్టిండు.. హయత్ నగర్ కార్పొరేటర్ సారుపై ఓ వృద్ధుడు ఆగ్రహం..కరీంనగర్ జిల్లాల డబుల్ బెడ్రూంల కథ ఇది..ఆడోళ్లకు మంటలేశి ఏం జేశిండ్రో తెలుసా...తెలంగాణల ఇంకొక్క జూపార్కు వెట్టిండ్రు సర్కారోళ్లు..ట్రాక్టర్ జేస్కున్న ఆత్మహత్య ఈ భూమ్మీద నేను బత్కలేనని బాయిలవడి సచ్చిపోయింది...

ముగిసిన కేబినెట్ నిర్ణయాలు..

విజయవాడ : ఏపీ కేబినెట్ కాసేపటి క్రితం ముగిసింది. కలెక్టర్ పై జగన్ వైఖరిని ఏపీ కేబినెట్ ఖండించింది. గన్నవరం, రేణిగుంట ఎయిర్ పోర్టుల పేర్ల మార్పునకు నిర్ణయం తీసుకుంది. గన్నవరం ఎయిర్ పోర్టుకు 'ఎన్టీఆర్ అమరావతి ఎయిర్ పోర్టు', రేణిగుంటకు 'శ్రీ వెంకటేశ్వర ఎయిర్ పోర్టు' గా నామకరణానికి నిర్ణయం తీసుకున్నారు. డిపాజిట్ ఆఫ్ ఫైనాన్షిక్ష్మీల్ ఎస్టాబ్లిస్ మెంట్ కు చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. మదుపర్ల డబ్బులు ఎగవేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నాన్ బెయిలబుల్ కేసులు, ఖాతాదారులకు సత్వరన్యాయం జరిగేటట్లు సవరణకు ఆమోదం తెలిపింది.

పేకాటస్థావరంపై పోలీసుల దాడి..ఒకరు మృతి..

హైదరాబాద్ : కూకట్ పల్లి కేపీహెచ్ బీ పీఎస్ పరిధిలో మూడో ఫేజ్ లో పేకాటస్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. పోలీసుల నుండి తప్పించుకపోయి భవనంపై నుండి పాతబడి శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

19:33 - March 2, 2017
19:30 - March 2, 2017

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలపై సీఎం పినరయి చిరునవ్వుతో స్పందించారు. తనను ఎవరూ ఆపలేరని, విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. సీఎం పినరయి తలకు ఆర్ఎస్ఎస్ నేత చంద్రావత్ వెల కట్టిన సంగతి తెలిసిందే. ఓ కార్యక్రమంలో సీఎం పినరయి తల తెస్తే రూ. కోటి ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజాస్వామ్యయుతంగా సీఎంగా ఎన్నికైన వ్యక్తిపై ఆర్ఎస్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వామపక్షాలు..ఇతర పార్టీలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇటీవలే అధికారంలోకి వచ్చిన అనంతరం పినరయి విజయోత్సవ ర్యాలీపై బాంబు దాడి చేయగా ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. పినరయి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆరుగురు సీపీఎం కార్యకర్తలు మృతి చెందారు. దళితులకు మతతత్వ శక్తులకు మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. సంక్షేమ పథకాలు..ఇతర పథకాలు చేస్తుండడంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ జీర్ణించుకోవడం లేదని తెలుస్తోంది.

19:22 - March 2, 2017

విజయవాడ : వైసీపిలో చిచ్చు రేగింది. వంగవీటి రాధాను నగర అధ్యక్ష పదవి నుండి తప్పించడంపట్ల రాధా వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీలో ఉన్నవారిని పక్కన బెట్టి కొత్తగా వచ్చిన వాళ్లకు నగర అధ్యక్ష పదవి ఇచ్చారంటూ రాధా వర్గం మండిపడుతోంది. వైసీపీ నగర అధ్యక్షుడిగా వెల్లంపల్లి ప్రమాణ స్వీకారానికి రాధా హాజరు కాకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. వెల్లంపల్లికి బాధ్యతలు అప్పగించడంపట్ల రాధా విముఖంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వెల్లంపల్లిమాత్రం నగర నాయకులు అంగీకారంతోనే తాను బాధ్యతలు తీసుకునేందుకు ఒప్పుకున్నానని స్పష్టం చేస్తున్నారు. తాజా పరిణామాలతో తమకు ప్రాధాన్యత తగ్గుతోందని భావిస్తున్న రాధా వర్గం జనసేనవైపు అడుగులు వేసే అవకాశం ఉందనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

19:20 - March 2, 2017
19:18 - March 2, 2017

హైదరాబాద్ : గురుకుల ఉపాధ్యాయుల నోటిఫికేషన్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తాత్కాలికంగా నిలిపివేసింది.. నిబంధనల్లో సవరణలవల్ల గతంలో 6వేల టీచర్‌ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సంబంధిత శాఖలనుంచి సవరణలు వచ్చినతర్వాత మరో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపింది. గురుకుల సొసైటీల్లో టీచర్ పోస్టుల భర్తీకి కొద్దిరోజులక్రితం టీఎస్పీస్సీ తొమ్మిది నోటిఫికేషన్లను వేర్వేరుగా విడుదల చేసింది. అయితే ఉద్యోగాల భర్తీకి సబంధించిన నిబంధనలపై నిరుద్యోగుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు..

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడిన పరిస్థితులు మళ్లీ పునరావృతమౌతున్నాయి. నెల ప్రారంభంలో పలు ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీనితో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

18:40 - March 2, 2017

ఢిల్లీ : కేరళ సీఎం పినరయి విజయన్ పై ఆర్ఎస్ఎస్ నేత చేసిన వాఖ్యలపై సీపీఎం పొలిట్ బ్యూరో తీవ్రంగా స్పందించింది. వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు వెల్లడించింది. సీఎం పినరయి విజయ్ ను చంపితే రూ. కోటి ఇస్తానని మధ్యప్రదేశ్ కు చెందిన ఆర్ఎస్ఎస్ నేత చంద్రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ఓ ముఖ్యమంత్రి తలకు రూ. కోటి వెలకట్టడం దారుణమని పేర్కొంది. ఆర్ఎస్ఎస్ బెదిరింపులకు పాల్పడుతోందని, హింస..బీభత్సం సృష్టించడమే ఆర్ఎస్ఎస్ నైజమని మరోసారి నిరూపితమైందని తెలిపింది. కేరళ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ నేత డా. చంద్రావత్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది. చంద్రావత్ చేసిన వ్యాఖ్యలను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండదించారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్ బెదిరించడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికే ఎంతో మంది తలలను ఆర్ఎస్ఎస్ తీసుకుందని సీఎం విజయన్ పేర్కొన్నారు.

18:23 - March 2, 2017

విజయవాడ : త్వరలో విజయవాడ మెగా గ్రేటర్ సిటీగా అవతరించబోతుంది. 45 గ్రామాలను గ్రేటర్‌లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. తొలుత విజయవాడ రూరల్ మండలంలోని గ్రామాలను విలీనానికి ప్రభుత్వం సుముఖత చూపుతోంది. దీంతో ఇప్పటి వరకు పంచాయతీలుగా ఉన్న గ్రామాలు విజయవాడ నగర హంగులతో సరికొత్తగా రూపుదిద్దుకోబోతున్నాయి. అధికారులు పక్కా ప్లాన్ రచించారు. ప్రస్తుతం విజయవాడ జనాభా 11 లక్షల 97 వేలు. గ్రామాలు విలీనమైతే విజయవాడ నగర జనాభా 15 లక్షలు దాటుతుంది. నగర విస్తీర్ణపరంగా 64 చదరపు కిలోమీటర్లుగా ఉంది. గ్రేటర్‌గా మారితే 403.70 కిలోమీటర్లకు చేరుకుంటుంది.

45 గ్రామాలు..
విజయవాడ గ్రేటర్ సిటీగా మారనున్నడంతో ఇప్పుడు అందరి చూపు గ్రేటర్ పైనే ఉంది. మొత్తం 45 గ్రామాలతో కలిపి విజయవాడ నగరం అతిపెద్ద కార్పొరేషన్‌గా అవతరించబోతోంది. విజయవాడ, గుంటూరు నగరాలను జంట నగరాలుగా చేయాలనే ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. ఈ రెండు నగరాలను కలిపితే దేశంలోనే అతిపెద్ద నగరంగా మారనుంది. ఇదిలా ఉండగానే..విజయవాడను గ్రేటర్ సిటీగా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. విజయవాడ రూరల్, గన్నవరం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు మండలాల పరిధిలోని మొత్తం 32 గ్రామాలను గ్రేటర్ పరిధిలోకి మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీలైనంత మేరకు ఎక్కువ సంఖ్యలోనే గ్రామాలను గ్రేటర్‌లో విలీనం చేయడానికి రెడీ అవుతున్నారు.

భూముల రేట్లు పెరుగుతాయా ?
విజయవాడ రూరల్ మండలంలోని నున్న, పాతపాడు, పి.నైనవరం, అంబాపురం, జక్కంపూడికాలనీ, గొల్లపూడి, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి గ్రామాలు విజయవాడలో విలీనమవుతాయి. కొత్తూరుతాడేపల్లి, పైడూరుపాడు, రాయనపాడు గ్రామాలను జి.కొండూరు మండలంలో కలిపి, రూరల్ మండలాన్ని పూర్తిగా తొలగించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. గన్నవరం, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, బుద్ధవరం, వెదురుపావులూరు, కంకిపాడు, పెనమలూరు, పోరంకి, కానూరు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, ముస్తాబాద, నున్న, పాతపాడు, నైనవరంతోపాటు మరో 28 గ్రామాలను విజయవాడలో విలీనం చేయడం ద్వారా గ్రేటర్ సిటీగా అవతరించనుంది. 30 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో గ్రామాలు గ్రేటర్ విజయవాడలో విలీనమైతే 'రియల్'కు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే నగరపాలక సంస్థకు చేరువలో ఉన్న గ్రామాలలో భూముల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఖాళీ స్థలాలు, అపార్ట్ మెంట్ల కొనుగోళ్ళతోపాటు ఇతర భూ క్రయవిక్రయాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి.

18:16 - March 2, 2017

విజయవాడ : ప్రతిపక్ష నేత జగన్ అసమర్థత నేత అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వెలగపూడిలో నూతన అసెంబ్లీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని టెన్ టివితో మాట్లాడారు. ప్రతిపక్షాలు పాల్గొనకపోవడం దురదృష్టకరమని, ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. అధికారులను, సీఎంను జగన్ దూషిస్తారని, ఆయన తీరు పట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారని తెలిపారు. పార్టీ మొత్తం బయటకు వస్తుందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం..

ఢిల్లీ : ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. మలేషియా ప్రయాణికుడి వద్ద 2.4 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ రూ. 67 లక్షలు ఉంటుందని అంచనా.

రెండో రాజధానిగా ధర్మశాల..

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర రెండో రాజధానిగా ధర్మశాలకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

రూ. 210 కోట్ల నియోజకవర్గాల అభివృద్ధి నిధుల విడుదల..

హైదరాబాద్ : రూ. 210 కోట్ల నియోజకవర్గాల అభివృద్ధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రూ. 1.50కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రేపు తెలంగాణ వర్సిటీ బంద్ కు విద్యార్థుల పిలుపు..

నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీలో వీసీ తీరుకు నిరసనగా బాయ్స్ హాస్టల్ కు విద్యార్థులు తాళం వేశారు. విద్యార్థులను వీసీ సాంబయ్య దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు వర్సిటీ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలను ఖండించిన సీపీఎం పొలిట్ బ్యూరో..

ఢిల్లీ : కేరళ సీఎంపై ఆర్ఎస్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలను సీపీఎం పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ఓ ముఖ్యమంత్రి తలకు రూ. కోటతి వెలకట్టడం దారుణమని పేర్కొంది. ఆర్ఎస్ఎస్ బెదిరింపులకు పాల్పడుతోందని, హింస..బీభత్సం సృష్టించడమే ఆర్ఎస్ఎస్ నైజమని మరోసారి నిరూపితమైందని తెలిపింది. కేరళ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ నేత డా. చంద్రావత్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది.

యోగికొండ అడవిలో మంటలు..

శ్రీకాకుళం : పాతపట్నం యోగికొండ అడవిలో మంటలు చెలరేగాయి. వెదురు బొంగులు తగులబడుతున్నాయి. 70 ఎకరాలకు పైగా దగ్ధమైంది. ఆకతాయిలు మంట వేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.

నలుగురు ఐపీఎస్ లకు పదోన్నతులు..

హైదరాబాద్ : తెలంగాణలో 1986 బ్యాచ్ కు చెందిన నలుగురు ఐపీఎస్ లకు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజీవ్ త్రివేది, ఎం.మహేందర్ రెడ్డి, ప్రభాకర్ అలోకా, టి. కృష్ణ ప్రసాద్ లకు పదోన్నతులు లభించాయి.

ఏపీ కేబీనెట్ సమావేశం ప్రారంభం..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడిపై కేబినెట్ చర్చించనుంది.

 

రాజధాని నిర్మాణంపై సీఎం సమీక్ష..

విజయవాడ : అమరావతి రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. నార్మన్ పోస్టర్ సంస్థ అందించిన కాన్సెప్ట్ ప్లాన్ పై చర్చించారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సీఎం స్వీకరించారు. రాజధాని నిర్మాణంపై అందరి అభిప్రాయాలు తెలుసుకుంటామని, పరిపాలనా నగరంతో పాటు మరో 8 నగరాలు, 27 టౌన్ షిప్ లపై సలహాలు, సూచనలు కావాలన్నారు. నార్మన్ పోస్టర్ సంస్థ ఇచ్చిన కాన్సెప్ట్ ప్లాన్ పై డిబెట్ జరపాలని సూచించారు.

17:35 - March 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ చేదు వార్త అందించింది. ఇటీవలే గురుకుల ఉపాధ్యాయుల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ పట్ల నిరుద్యోగులు కొంత సంతృప్తి చెందారు. దీనివల్లనైనా ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని భావించారు. కానీ గురువారం సాయంత్రం టీఎస్పీఎస్సీ జారీ చేసిన ప్రకటనతో డీలా పడిపోయారు. 9 నోటిఫికేషన్ లు ఉపసంహరించుకుంటున్నట్లు తెలియచేసింది. నాలుగు వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. వివిధ శాఖల నుండి సవరణల కారణంగా ఉపసంహరించుకుంటున్నట్లు, త్వరలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెబుతోంది. ఎంత టైం పడుతుందో క్లారిటీ ఇవ్వడం లేదు.

17:31 - March 2, 2017

పెద్దపల్లి : ఒక్క నిమిషం నిబంధన నూతన వధువును ఏడిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒక్క నిమిషం నిబంధనను అధికారులు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. వివిధ కారణాల వల్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు రోదిస్తున్నారు. తాజాగా ఓ వధువు కూడా రోదించింది. మల్హార్ మండలం పెద్ద తుండ్ల గ్రామానికి చెందిన బొంతుకూరి స్పందనకు బుధవారం వివాహం జరిగింది. ఈమె ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఈమె పరీక్ష రాస్తోంది. వివాహం జరిగిన అనంతరం గోదావరిఖనిలోని అత్తగారింటికి వెళ్లింది. గురువారం పరీక్ష రాసేందుకు కేంద్రానికి వచ్చింది. కానీ రెండు నిమిషాలు ఆలస్యమైంది. నిబంధనలు నిక్కచ్చిగా అమలు చేసే అధికారులు స్పందన పట్ల జాలి చూపలేదు. పరీక్షా కేంద్రానికి అనుమతించలేదు. దీనితో ఆమె రోదిస్తూ భర్తతో అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇంటర్ బోర్డు అధికారుల తీరుపట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

17:22 - March 2, 2017

యాదాద్రి : భువనగిరి జిల్లాలోని బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. కొలనుపాకకు చెందిన కనకరాజు యాదవ్ తో జనగాం జిల్లా నవాబుపేట ప్రాంతానికి చెందిన రేవతికి వివాహాం కుదిరింది. ఆలేరు మండలం కొలనుపాకలో వీరి వివాహా ఏర్పాట్లు చేశారు. కానీ రేవతికి 18 ఏళ్లు నిండలేదని ఐటీడీఎస్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే వివాహం జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని పెళ్లిని ఆపి వేయించారు. దీనిపై రేవతి కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పారు. పెళ్లికి ఎంతో ఖర్చు చేసి ఏర్పాట్లు చేయడం జరిగిందని, వివాహం రద్దు కావడంతో తాము నష్టపోతామని పేర్కొన్నారు. మైనర్ కు వివాహం జరగడం వల్ల కలిగే నష్టాలను అధికారులు వారికి తెలియచేశారు. ఈ వయస్సులో పెళ్లి చేయడం మంచిది కాదని హితవు పలికారు.

17:15 - March 2, 2017
17:14 - March 2, 2017

వరంగల్ : చేనేతల అభివృద్దికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర డిప్యూటి సీఎం కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. పరకాలలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వలసలు వెళ్లిన వారిని తిరిగి రాష్ట్రానికి రప్పిస్తామన్నారు. వరంగల్ జిల్లాలో 1200 ఎకరాల స్థలంలో టెక్స్ టైల్ పార్కును నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. కడియంతో పాటు స్పీకర్ మదుసూధనాచారి, మంత్రులు తుమ్మల, చందూలాల్ లు హాజరయ్యారు.

పీజీ మెడికల్ సీట్లకు కేంద్రం ఆమోదం..

ఢిల్లీ : నాలుగు వేల పీజీ మెడికల్ సీట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2017-18లో వివిధ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో 4వేల పీజీ మెడికల్ సీట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది.

విశాఖలో రూ. 7.36 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం..

విశాఖపట్టణం : జిల్లాలో రూ. 7.36 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 100, రూ. 500, రూ. 2000 నకిలీ నోట్లను తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

16:43 - March 2, 2017

కేరళ : రాష్ట్ర సీఎం పినరయి విజయన్ పై ఆర్ఎస్ఎస్ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా సీఎంను చంపి తలను తీసుకొస్తే రూ. కోటి ఇస్తానని ఆర్ఎస్ఎస్ నేత డాక్టర్ చంద్రావత్ వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలపై టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణసాయిరాం విశ్లేషణ అందించారు. కేరళ రాష్ట్రంలో ఎల్డీఎఫ్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. పినరయ్ ఆధ్వర్యంలో మే నెలలో బాధ్యతలు స్వీకరించింది. కమ్యూనిల్ ఏజెండాతో మతపరమైన భావనలు రెచ్చగొడుతున్న వారిని విజయవంతం అడ్డుకోవడం..హింసాత్మ ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తమకు అడ్డుగా ఉన్నారని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. జమ్మూ కాశ్మీర్ తరువాత ముస్లిం మైనార్టీలు వైవిధ్యభరిత ప్రాంతంగా కేరళ చెప్పుకోవచ్చు. తమ ఆగడాలు కొనసాగడం లేదని భావించి ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

16:40 - March 2, 2017
16:38 - March 2, 2017

హైదరాబాద్ : డబుల్ బెడ్ రూం. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడికి వెళ్లినా చెబుతున్న మాట. ఎక్కడ ఏ సమావేశం జరిగినా, ఏవర్గంతో సమావేశమైనా ఆయా వర్గాలకు డబుల్ బెడ్ రూంలలో కోటా ఇస్తామంటూ ఆశ పెడుతున్నారు. కానీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల విషయంలో క్షేత్ర స్థాయి వాస్తవాలు మరో రకంగా వున్నాయి. ఈ అంశంపై స్పెషల్ ఫోకస్..
కరీంనగర్ లో..
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షా పది వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్క ఇంటికి కూడా ముగ్గు పోయలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు పోటెత్తాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ చెబుతున్నట్టుగా తమకు బెడ్ రూమ్ ఇళ్లు సమకూరుతాయన్న ఆశతో దరఖాస్తుదారులంతా ఎదురుచూస్తున్నారు. కానీ, ఏ రోజుకారోజు వారికి నిరాశే మిగులుతోంది. ఎక్కడా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఇంత వరకు మొదలు కాలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసం లక్షా పది వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. సిరిసిల్ల, జిగిత్యాల, పెద్దపల్లి కొత్త జిల్లాలుగా ఏర్పడకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 6700 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాలకు 4160 కేటాయించారు. పట్టణ ప్రాంతాలకు 2540 మంజూరు చేశారు. వీటికి తోడు ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామం చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరుకు మరో 247 ఇళ్లు మంజూరు చేశారు. మంత్రి కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి స్టేట్ రిజర్వ్ డ్ కోటా కింద అదనంగా 1500 ఇళ్లు కేటాయించారు. ఇవన్నీ కలుపుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంజూరైన డబుల్ బెడ్ రూం ఇళ్ల సంఖ్య 7947. మంజూరైన ఇళ్లకు 415.67 కోట్ల రూపాయలు కేటాయించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి ఒక్క టెండర్ కూడా రాలేదు. ఫిబ్రవరిలో ముగ్గులు పోస్తామంటూ, మార్చిలో నిర్మాణాలు చేపడతామంటూ ఊరించిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు సైలెంటయ్యారు.

కేసీఆర్ దత్తత గ్రామం..
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం బాధ్యతను రోడ్లు భవనాల శాఖలకు అప్పగించారు. ఈ శాఖ తరపున ఒక్కొక్క నియోజకవర్గానికి నాలుగుసార్లు టెండర్లు పిలిచారు. కానీ, ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. దీంతో అయిదోసారి ఫిబ్రవరిలో మరోసారి టెండర్లు పిలిచారు. కెసిఆర్ దత్తత గ్రామం మినహా మరెక్కడా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామం ముల్కనూరులోనూ పరిస్థితి ఏమంత ఉత్సాహంగా లేదు. ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం మొదలైనా, పనులు నత్తనడకన సాగుతున్నాయి.  ముల్కనూరు ఇది చిగురు మామిడి మండలంలోని గ్రామం. ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత తీసుకున్న గ్రామమిది. ఏకంగా కెసిఆరే దత్తత తీసుకోవడంతో తమ గ్రామానికి మహర్ధశ పడుతుందని గ్రామస్తులు ఆశ పడ్డారు. కానీ, అది నిరాశే మిగిలింది. త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని, దావత్ చేసుకుందామంటూ హుషారెక్కించే మాటలు చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇక ఆ తర్వాత గ్రామం వంక చూడలేదు. ఒక్కసారైన వచ్చి పోలేదన్న అసంతృప్తి గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ముల్కనూరు గ్రామానికి 247 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి దత్తత గ్రామం కావడంతో తమ ఇళ్లు శరవేగంగా పూర్తవుతాయంటూ లబ్ధిదారులు ఆశ పడ్డారు. కానీ, ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తారన్న ఆశతో వున్న ఇళ్లనే కూల్చుకున్నట్టైందంటూ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామంలోనే పరిస్థితి ఇలా వుంటే, ఇక మిగిలిన రాష్ట్రంలో డబుల్ బెడ్ రూంల నిర్మాణం పూర్తయ్యేదెప్పుడు? సిఎంతో దావత్ లు చేసుకునేదెప్పుడు?

నాయకుల గుండెల్లో గుబులు..
డబుల్ బెడ్ రూం నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో దరఖాస్తుదారులు, లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రజల్లో అంసతృప్త మేఘాలు కమ్ముకోవడంతో అధికార పార్టీ నాయకుల గుండెల్లో గుబులు మొదలవుతోంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను జీవన్మరణ సమస్యలా వెన్నాడుతోంది. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇచ్చే కాంట్రాక్టు సంస్థలను కాంట్రాక్టర్లను పట్టుకోవడం ప్రభుత్వానికి, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకీ పెద్ద సమస్యగా మారింది. ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లవ్వరూ ముందుకు రావడం లేదు. ప్రజాప్రతినిధులతో కాంట్రాక్టర్లతో జరుపుతున్న చర్చలు ఫలితమివ్వడం లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ ను తక్కువ ధరకు ఇచ్చేలా సిమెంట్ కంపెనీలను ప్రభుత్వం ఒప్పించింది. ఇసుక, ఇటుక, స్టీల్, కంకర తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెబుతున్నారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో 5.04 లక్షల రూపాయలతో, పట్టణ ప్రాంతాల్లో 5.30 లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టడం కష్టమన్న అభిప్రాయంతో వున్న కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కూలీల వేతనాలు, ఇతర ఖర్చులు, ఆదాయపన్ను ఇవన్నీ కలుపుకుంటే తమకు గిట్టుబాటు కాదన్న అభిప్రాయంతో కాంట్రాక్టర్లున్నారు. ప్రభుత్వం ఇవ్వజూపుతున్న తాయిలాల మీద కూడా పూర్తిగా నమ్మకం కుదరడం లేదంటున్నారు కాంట్రాక్టర్లు.  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జోలికి వెళ్లాలంటే కొంతమంది ప్రజాప్రతినిధులు జంకుతున్నారు. దరఖాస్తులు భారీ సంఖ్యలో వుండగా, మంజూరైన ఇళ్లు చాలా తక్కువగా వున్నాయి. దీంతో ఒకరికిచ్చి, మరొకరికి ఇవ్వకపోతే, రాబోయే ఎన్నికల్లో ఇళ్లు రానివారు ప్రతీకారం తీర్చుకుంటారన్న భయం టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వెన్నాడుతోంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరితే, తమ రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందన్న భయం కూడా కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులను వెన్నాడుతోంది. ఇచ్చిన మాట నిలుపుకోవడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతో సిపిఎం పోరాటాలకు సిద్ధమవుతోంది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో నిర్వహించిన పాదయాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం సుదీర్ఘ పోరాటం సాగిస్తామంటున్నారు సిపిఎం నేతలు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం వాగ్ధానం నెరవేర్చేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయకపోతే, ఎన్నికల్లో వికటించే అవకాశం వుంది.

16:32 - March 2, 2017

విజయవాడ : వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్పతో పాటు పలువురు మంత్రులు సమావేశానికి హాజరయ్యారు. ఆరో తేదీన అసెంబ్లీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీలో రచ్చ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలా ? వద్దా ? అనే దానిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించాలా ? వద్దా ? అనే దానిపై మరో ఐదుగురు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించనున్నారు.

16:30 - March 2, 2017

గుజరాత్‌ : హోంమంత్రిపై ఓ వ్యక్తి చెప్పు విసిరడం కలకలం రేపింది. గుజరాత్‌ అసెంబ్లీ వెలుపల ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ చెప్పు హోంమంత్రికి తగలలేదు. చెప్పు విసిరిన వ్యక్తిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోంమంత్రిపై షూతో దాడి చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చెప్పు విసిరిన యువకుడిని పోలీసులు గోపాల్‌గా గుర్తించారు.

ఎలిజబెత్ 2ను కలుసుకున్న కమల్ హాసన్..

లండన్ : విలక్షణ నటుడు కమలహాసన్ ఇంగ్లండ్ రాణి క్వీన్ ఎలిజబెత్-2ను కలుసుకున్నారు. బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఆమె ఏర్పాటు చేసిన 'యూకే-ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్' కార్యక్రమంలో ఆమెతో కమల్ మాట్లాడారు.

15:49 - March 2, 2017

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. ఆయన సతీమణి, కుమార్తె ఆలియా భట్ లను చంపేస్తామని ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫోన్ చేసిన ఆగంతకుడు తనకు రూ. 50 లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించాడు. దీనితో మహేష్ భట్ జుహూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత ఎస్ఎంఎస్, వాట్సప్ మెసేజ్ ల ద్వారా బెదిరించారని, ఆ తరువాత ఫోన్ కాల్ చేసి దబాయించారని భట్ పేర్కొన్నారు. ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యూపీకి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు డాన్ అని పోలీసులు భావిస్తున్నారు.

15:34 - March 2, 2017
15:32 - March 2, 2017

ఢిల్లీ : మతతత్వ శక్తులకు మతి భ్రమించింది. ఆర్ఎస్ఎస్ నేతలు రెచ్చిపోతున్నారు. ఇష్టం వచ్చిన విధంగా పదజాలం వాడుతూ..దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఓ ఆర్ఎస్ఎస్ నేత నోటికి పని చెప్పాడు. ఏకంగా సీఎం తలకు వెల కట్టాడాడు. ఆయన తలకు రూ. కోటి వెల ప్రకటించారు. ఉజ్జయినిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నేత డాక్టర్ చంద్రావత్ పాల్గొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి తల తీసుకొస్తే తన యావదాస్తిని అమ్మేస్తానని, కోటి ఇస్తాననిప్రకటించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు హత్యకు సీఎం పినరయి విజయన్ బాధ్యుడని ఆరోపిస్తూ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసే సమయంలో వేదికపై బీజేపీ ఎమ్మెల్యే, ఓ ఎంపీ కూడా ఉండడం గమనార్హం.

15:20 - March 2, 2017
15:15 - March 2, 2017

హైదరాబాద్ : నగరంలో మరో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జవహార్ నగర్ పరిధిలోని బాలాజీనగర్ లో చోటు చేసుకుంది. భరత్ నగర్ లో జిల్లా పరిషత్ లో కరుణ ఒకటో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం కరుణనను బలవంతంగా తీసుకెళుతుండగా అక్కడనే ఉన్న విద్యార్థులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కానీ వారిని ఎదుర్కొన్న మహిళ ఆటోలో పారిపోయేందుకు ప్రయత్నించింది. వెంటనే ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్స్ పాల్ కు తెలియచేశారు. స్పందించిన ప్రిన్స్ పాల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ కు పాల్పడిన మహిళను పట్టుకొనేందుకు ప్రయత్నించారు. ఆటోను వెంబడించి కిడ్నాప్ కు యత్నించిన మహిళను అదుపులోకి తీసుకుని చిన్నారిని రక్షించారు. ఆమెతో పాటు మరో చిన్నారి ఉన్నాడు. కిడ్నాప్ కు యత్నించిన మహిళ రజిత అని తేలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

15:11 - March 2, 2017

కృష్ణా : జిల్లాలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం తీవ్ర కలకలం సృష్టించింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈఘటన కంకిపాడు ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరులో చైతన్య స్కూల్ లో అనంతపురంకు చెందిన ముఖేష్ గౌడ్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కింగ్ షాలిమ్  పదో తరగతి చదువుతున్నారు. వీరు నిన్న రాత్రి నుండి స్కూల్..హాస్టల్ లో కనిపించడం లేదు. దీనితో ప్రిన్స్ పాల్ తోటి విద్యార్థులను విచారించారు. గురువారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులకు విషయాన్ని తెలియచేశారు. ఇంటికి రాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొనడంతో ప్రిన్స్ పాల్ పోలీసులకు సమాచారం అందించారు. వైజాగ్ వెళ్లే రైలు ఎక్కారని సీసీ టివి ఫుటేజ్ లో దృశ్యాలు నమోదైనట్లు, విశాఖలో విద్యార్థులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనితో విశాఖ జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. అసలు విద్యార్థులు ఎందుకు పారిపోయారు అనే దానిపై వివరాలు తెలియరాలేదు. పదో తరగతి పరీక్షలు ఈనెల నుండి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు భయపడి పారిపోయారా ? లేక ఇతరులు కిడ్నాప్ చేశారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

కృష్ణా లో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం..

కృష్ణా : జిల్లాలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం కలకలం రేగింది. అనంతపురంకు చెందిన ముఖేష్ గౌడ్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కింగ్ షాలిమ్ లు కనిపించడం లేదని చైతన్య స్కూల్ ప్రిన్స్ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంకిపాడు ప్రొద్దుటూరులోని చైతన్య స్కూల్ లో పదో తరగతి చదువుతున్నారు.

చిన్నారి కిడ్నాప్ కు యత్నించిన మహిళ..

రంగారెడ్డి : జవహార్ నగర్ పరిధిలోని బాలాజీనగర్ లో చిన్నారి కరుణ కిడ్నాప్ కు ఓ మహిళ యత్నించింది. కరుణతో ఆటోలో పారిపోతుండగా పోలీసులకు స్కూల్ టీచర్లు సమాచారం అందించారు. ఆటోను వెంబడించిన పోలీసులు కిడ్నాపర్ రజితను పట్టుకున్నారు.

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు..

విజయవాడ : ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డిలను జగన్ ప్రకటించారు.

14:37 - March 2, 2017
14:36 - March 2, 2017

నల్గొండ : సీపీఎం మహాజన పాదయాత్ర 137వ రోజు కొనసాగుతోంది. కాసేపటి క్రితం సూర్యపేట జిల్లా నుండి నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది. ఈసందర్భంగా సీపీఎం నేతలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఉప్పర్ పాడు స్టేజి వద్ద తమ్మినేని బృందానికి పూలతో స్వాగతం పలికారు. పాదయాత్ర ఫలితంగా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొన్ని పనులు చేస్తోందని, ఇంకా అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వంపై వత్తిడి తీసుకరావాల్సినవసరం ఉందన్నారు.

14:30 - March 2, 2017

హైదరాబాద్ : విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వని శ్రీ వాసవి కాలేజీ యాజమాన్యంపై చర్యలు ప్రారంభమయ్యాయి. కాలేజీ యాజమాన్యంపై వనస్థలిపురం పీఎస్ లో కేసు నమోదైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. సెక్షన్ 420, 406 కింద కేసులు నమోదు చేశారు. ఇంటర్ బోర్డు అధికారుల ప్రమేయం ఉందని తెలుస్తోంది. వీరిపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
240 విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వలేదనే సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీనితో ప్రభుత్వం దిగొచ్చింది. ప్రత్యేకంగా సప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో విద్యార్థులు కొంత తగ్గినట్లు తెలుస్తోంది. కానీ పరీక్షల మధ్యలో సప్లిమెంటరీ పరీక్ష రాయడం కుదరదని, జరగబోయే పరీక్షలకు తమను అనుమతినివ్వాలని వారు కోరుతూ ఆందోళన చేస్తున్నారు.

14:27 - March 2, 2017

నెల్లూరు : విక్రమ సింహపురి వర్సిటీలో చోటు చేసుకుంటున్న అక్రమాలు..ఇబ్బందులపై ప్రభుత్వం..అధికారులు స్పందించకపోవడంపై వర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ సమస్యలపై గళం విప్పుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యలను తీసుకరావాలని విద్యార్థులు నిర్ణయించారు. దీనితో గత నెల 22వ తేదీన నెల్లూరు జిల్లా నుండి హైదరాబాద్ కు పాదయాత్రగా పది మంది విద్యార్థులు బయలుదేరారు. విక్రమసింహపురి యూనివర్సిటీలో నెలకొన్న అక్రమాలు..పోస్టింగ్..ఇతరత్రా సమస్యలను పవన్ కు తెలియచేయాలని వారు నిర్ణయించుకున్నారు. నూతనంగా నిర్మించిన భవనాలు నాసిరకంగా ఉన్నాయని, హాస్టల్ లో మౌలిక సదుపాయాలు లేవని..భోజనం నాసిరకంగా పెడుతున్నారని పవన్ దృష్టికి తేనున్నారు. ప్రస్తుతం విజయవాడలోని కోదాడ ప్రాంతం వరకు పాదయాత్ర చేరుకుంది. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పవన్ పాదయాత్రను ఆపి నేరుగా రావాలని విద్యార్థులకు సూచించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో విద్యార్థులు హైదరాబాద్ కు బయలుదేరారు. శుక్రవారం పవన్ తో విద్యార్థులు భేటీ కానున్నారు. విద్యార్థుల సమస్యలపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

14:21 - March 2, 2017

విజయవాడ : నూతన రాజధానిలో ఏపీ అసెంబ్లీ భవనం ప్రారంభమైంది. ఈసెం చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నూతన రాజధానిలో చేపట్టబోయే పనులు..చేపట్టిన పనులు..ఇతర ప్రణాళికలను బాబు వివరించే ప్రయత్నం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సబ్ ప్లాన్ లు పెట్టడం జరిగిందని, అగ్రవర్ణాల్లో కూడా పేద వారులున్నారని అందుకోసం వారిని ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. పేదరికం ఎక్కడుందో అక్కడ ప్రభుత్వం ఉంటుందన్నారు. ప్రకృతితో అనుసంధానం కావాలని అందులో భాగంగా నదుల అనుసంధానం చేయడం జరిగిందన్నారు. పోలవరంను సంవత్సరంలో పూర్తి చేయడం జరిగిందని, నవ్యాంధ్ర రాజధాని అందరికీ తెలియాలని పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. రాయలసీమకు ఎక్స్ ప్రెస్ రోడ్డు రావడం వస్తోందని, దేశంలోనే మొట్టమొదటిసారి ఎక్స్ ప్రెస్ రోడ్డును తీసుకొస్తున్నామన్నారు. అవసరమైతే రైల్వే లైన్ తీసుకొస్తామన్నారు.

సైబరాబాద్ సిటీ..
దేవుడిని తాను ప్రార్థిస్తానని కానీ నిత్యం పూజలు చేస్తూ కూర్చొనని అన్ని మతాల దేవుళ్లు ఆశీర్వదించాలని, అన్నింటికీ మంచి కష్టపడాలన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీలతో పాటు సైబరాబాద్ సిటీగా నామకరణం చేయడం జరిగిందన్నారు. సైబరాబాద్ సిటీకి ప్రచారం కావాలని యోచించి బిల్ క్లింటన్ తో ప్రారంభోత్సవం చేయించడం జరిగిందని కానీ ప్రస్తుతం మన తెలివే మనకు శాపంగా మారిందన్నారు. మనలను ఇగ్నోర్ చేస్తే వాళ్లే నష్టపోతారని, అమెరికాలో భద్రతతో పాటు ఆనందంగా ఉండాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి చొరవతో ఈ సమస్య తొందరగా పరిష్కారమౌతుందని తెలిపారు.

9 సిటీలు..27 టౌన్ షిప్ లు..
9 సిటీలు వస్తున్నాయని, 27 టౌన్ షిప్ లు నూతన రాజధానిలో వస్తాయన్నారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ రోడ్లు నిర్మాణం చేయడం జరుగుతుందని, ఏడు రోడ్లకు ఫౌండేషన్ వేయడం జరుగుతుందన్నారు. సిటీని గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు, ప్రపంచంలోని పలు దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు.

 

నెల్లూరు వన్ టౌన్ సీఐ ఓవరాక్షన్..

నెల్లూరు : వన్ టౌన్ సీఐ కరీం ఓవరాక్షన్ చేశారు. నిన్న విక్రమ సింహపురి వర్సిటీ వీసీని కలిసేందుకొచ్చిన విద్యార్థులను సీఐ అడ్డుకున్నారు. దీనితో విద్యార్థులు ఆందోళన చేశారు. ఇద్దరు విద్యార్థులపై సీఐ క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆందోళన విరమించకుంటే అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడడంతో సీఐ తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రేపు పవన్ తో సింహపురి వర్సిటీ విద్యార్థుల భేటీ..

నెల్లూరు : జిల్లా విక్రమ సింహపురి వర్సిటీలో అక్రమాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వివరించాలని విద్యార్థులు పాదయాత్రగా హైదరాబాద్ కు బయలుదేరారు. కానీ విజయవాడలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పవన్ పాదయాత్రను ఆపి నేరుగా రావాలని విద్యార్థులకు సూచించారు. రేపు హైదరాబాద్ లో విద్యార్థులను పవన్ కలుసుకోనున్నారు.

 

జగన్ వ్యాఖ్యలను ఖండించిన పోలీసు అధికారుల సంఘం..

విజయవాడ : పోలీసులు అవినీతిపరులన్న జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది. పోలీసులు ఏ పార్టీకి తొత్తులు కాదని, చట్టానికి కట్టుబడి ఉంటారని తెలిపింది. ప్రతిపక్ష నాయకుడి హోదాకు తగ్గి ప్రవర్తించకూడదని, తమ సమస్యలపై జగన్ ఏనాడైనా ప్రస్తావించారా అని ప్రశ్నించింది.

శ్రీవాసవి, ఇంటర్ బోర్డులపై కేసు..

హైదరాబాద్ : ఇంటర్‌ విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇవ్వని శ్రీవాసవి కాలేజీ యాజమాన్యంపై వనస్థలిపురం పీఎస్‌లో కేసు నమోదయ్యింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 420, 406 సెక్షన్ల కింద యాజమాన్యం, ఇంటర్‌ బోర్డుపై కేసు నమోదు చేశారు. 

13:54 - March 2, 2017

నల్గొండ : మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని, వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యంమత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను గుర్తించి తక్షణమే ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని తమ్మినేని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల బతుకులు బాగుపడాలని మహాజన పాదాయాత్ర కొనసాగుతోందని ఆయన మరోసారి ఉద్ఘాటించారు.  తెలంగాణ రాకముందు ప్రజల బతుకులు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని తమ్మినేని అన్నారు. 93 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభివృద్ధి జరగకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.  సీపీఎం మహాజన పాదయాత్ర 137వ రోజు కొనసాగుతూ.. సూర్యాపేట నుంచి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది. ఉప్పలపాడు స్టేజి వద్ద తమ్మినేని బృందానికి సీపీఎం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర ఫలితంగా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొన్ని పనులు చేస్తుందని.. ఇంకా అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. 

ఒకవైపు ఆనందం..మరోపక్క బాధ – చంద్రబాబు..

విజయవాడ : తనకు ఒక పక్క ఆనందం..మరో పక్క బాధ ఉందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన ఆయన సభలో మాట్లాడారు. నిన్నటి వరకు పొలాలుగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు చట్టసభగా మారిందని, ఓ చారిత్రాత్మ‌క రోజ‌ని అన్నారు. పొట్టి శ్రీ‌రాములు పోరాటంతో ఆంధ్ర‌రాష్ట్రం వ‌చ్చిందని గుర్తు చేశారు. మ‌ద్రాసుని వ‌దిలి క‌ట్టుబ‌ట్ట‌ల‌తో హైద‌రాబాద్‌ వ‌చ్చేశామ‌ని, మ‌ళ్లీ హైద‌రాబాద్‌ను వ‌దిలి క‌ట్టుబ‌ట్ట‌ల‌తో పాటు అప్పుల‌తో వ‌చ్చామని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

కొత్తది రద్దు చేయాలి..

జంతర్ మంతర్ : కేంద్రం నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం విధానాన్ని రద్దు చేయాలని.. పాత పెన్షన్ విధానానే అమలుచేయాలని అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా జరుగుతోంది. ధర్నాకు అన్ని రాష్ట్రాల ఉద్యోగులు హాజరయ్యారు. 

13:40 - March 2, 2017

దుబాయ్ పీఎస్ లో తెలంగాణ వాసి సూసైడ్..

వికారాబాద్ : పరిగి మండలంలోని ఇబ్రహీంపూర్ తండాలో విషాదం చోటు చేసుకుంది. దుబాయ్ పీఎస్ లో మూడు రోజుల క్రితం ఇబ్రహీంపూర్ తండా వాసి శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుబాయ్ లో రోడ్డు ప్రమాదం కేసులో శ్రీనివాస్ అరెస్టయ్యాడు. శ్రీనివాస్ మృతదేహం భారత్ కు పంపేందుకు సమయం పడుతుందని దుబాయ్ పోలీసులు సమాచారం అందించడంతో మృతుడి కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు.

బాబు విచారం..

విజయవాడ : నేడు జరిగిన వేర్వేరు బస్సు ప్రమాదాలపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నెల్లూరు, ప్రకాశం కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నారు. రాష్ట్రంలో వరస రహదారి ప్రమాదాలపై నివేదిక ఇవ్వాలని సంబంధిత మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు.

ప్రతిపక్ష నేతలు హాజరై ఉంటే బాగుండేది - యనమల..

విజయవాడ : అసెంబ్లీ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాల నాయకులు హాజరై ఉంటే బాగుండేదని మంత్రి యనమల పేర్కొన్నారు. సభలో ఏ పార్టీ అయినా ప్రజలకు అనుకూలంగా మాట్లాడాలని తెలిపారు.

ఆనందంగా ఉంది - కోడెల..

విజయవాడ : సొంతగడ్డపై సభ నిర్వహించాలనే తన కల నెరవేరిందని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. సొంత భవనంలోకి రావడం గర్వంగా..ఆనందంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై సభలో విస్తృతమైన చర్చ జరగాలని సూచించారు.

13:18 - March 2, 2017

కండరాల నొప్పులకు కారణం.? నివారణ చర్యలేమిటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మొదలైన విషయాలపై ఎక్స్ పర్ట్ డాక్టర్ రెండు నిమిషాల్లో చాలా అద్భుతంగా వివరించారు. మీరు ఈ వీడియో చూడకుంటే చాలా మిస్ అవుతారు. డోంట్ మిస్ ఇట్. 

13:16 - March 2, 2017

తల ఎత్తి జైకొట్టు తెలుగోడా.. ఇది ఒకప్పటి పాట. తలదించుకు సిగ్గుపడరా అని పాడుకోవాల్సి వస్తోంది. నిజం ఇది అక్షరాల పచ్చి నిజం. మహిళలపై జరుగుతున్న నేరాల్లో తెలుగు రాష్ట్రాలు ముందు వరసలో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఇది మరీ తీవ్రంగా ఉంది. సాధారణ వేధింపలతో పాటూ ఇంటర్నెట్ లోమహిళలపై జరుగుతున్న వేధింపులో పెరుగుతుండటం రాష్ట్రంలో మహిళల భద్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో మహిళలపై దాడులు అన్ని చోట్ల కంటే ఎక్కువగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాల పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చూడండి. 

13:06 - March 2, 2017

హైదరాబాద్ : మెట్రో రైలు నిర్మాణ పనులతో హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిర్మాణంలో జరుగుతున్న జాప్యంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నిర్మాణ మార్గాల్లో కాంట్రాక్టు సంస్థ ఎక్కడికక్కడ ఇష్టార్యాజ్యంగా రోడ్లను తవ్వేస్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారినపడుతున్నారు. 

కష్టాలు రెట్టింపు.. 
హైదరాబాద్‌ మెట్రో రైలు నిర్మాణం ప్రజలకు కష్టాలను రెట్టింపు చేసింది.  ప్రాజెక్టు పూర్తైతే ట్రాఫిక్‌ సమస్యలు గట్టెక్కే అంశాన్ని పక్కన పెడితే..నిర్మాణం జరుగుతున్న ఈ సమయంలో మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. నిర్మాణానికి అనుగుణంగా రోడ్లను వెడల్పు చేయలేదు. పైగా ఎక్కడికక్కడ తవ్వేస్తున్నారు. మెట్రో రైలు స్తంభాల నిర్మాణం, సెగ్మెంట్ల ఏర్పాట్ల కోసం నడిరోడ్లపైనే బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. 

ప్రాణాలు పోతున్నా..
మెట్రో రైలు నిర్మాణంలో అటు జీహెచ్‌ఎంసీ కానీ, ఇటు నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ అధికారులు కానీ కనీస జాగ్రత్తలు తీసుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి.  పిల్లర్ల కోసం తీసిన గుంతల్లో వాహనలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. వర్షాకాలంలో మెట్రో స్తంభాల పునాదుల్లో  నిలిచిన నీళ్లలో పడి చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం, ఆతర్వాత భద్రతను గాలికి వదిలేయడం  జీహెచ్‌ఎంసీతోపాటు, నిర్మాణ సంస్థలకు రివాజుగా మారింది. 

ఆక్రమణకు గురైన ఫుట్‌పాత్‌లు 
కొన్ని చోట్ల రోడ్ల వెడల్పు కోసం భవనాలను కూల్చి వేశారు. కానీ శిథిలాలను తొలగించకపోవడంతో ముషీరాబాద్‌ కూడలిలో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. మెట్రో రైలు నిర్మాణం కోసం డ్రెయినేజీ లైన్లను పగులుగొడతున్నారు. కానీ మరమ్మతులు చేయకపోవడంతో మురుగునీరు రోడ్లపై పొంగిపొర్లుతోంది. పాదచారులు నడిచేందుకు ఉన్న ఫుట్‌పాత్‌లను చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. ఉన్నవాటిని కూడా మెట్రో రైలు నిర్మాణ సంస్థ తవ్వేస్తుండంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.

మరీ దారుణం.. 
కోఠి-నారాయణగూడ-ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌-సికింద్రాబాద్‌ మార్గంలో ట్రాఫిక్‌ రద్దీగా ఉండేవేళల్లో వాహనచోదకులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. అరగంటలో చేరుకునే గమ్యస్థానాలకు కూడా గంటలు పడుతోంది. సికింద్రాబాద్‌-పంజాగట్టు, అమీర్‌పేట-జూబ్లీహిల్స్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అస్తవ్యస్త నిర్వహణే దీనంతటికీ కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు. 

సమన్వయ లోపం.. 
రోడ్ల వెడల్పు విషయంలో మెట్రో రైలు నిర్మాణ సంస్థ, జీహెచ్‌ఎంసీ, పోలీసు  అధికారుల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ట్రాఫిక్‌ కష్టాలపై  ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకునే దిక్కులేకపోడంతో ప్రజలు నిట్టూర్చుకుంటూనే కష్టాలు భరిస్తున్నారు. ఇకనైనా అధికారులు ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. 

13:05 - March 2, 2017

టాలీవుడ్ స్టామినా ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి తీర్చిదిద్దిన 'బాహుబలి' రికార్డులు సృష్టించింది. దీనికి సీక్వెల్ గా 'బాహుబలి..ది కన్ క్లూజన్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయి పోయింది. కానీ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్లు మాత్రమే చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తూ వస్తోంది. కానీ టీజర్ మాత్రం రిలీజ్ కాకపోవడం పట్ల అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరిగిపోతోంది. టీజర్ ఎలా ఉంటుందానే దానిపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ రెడీ అయ్యిందని..ప్రస్తుతం అది తెరపై ఎలా ఉందనే విషయాన్ని పరిక్షీస్తున్నట్లు చిత్ర సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ట్రైలర్ తయారైందని పేర్కొంటూ పరీక్షిస్తున్న సమయంలో తీసిన ఫొటోను పోస్టు చేశారు. సీవీ రావు, శివకుమార్ లతో కలిసి తెరపై ఎలా కనిపిస్తుందన్న విషయాన్ని చూడడం జరిగిందని తెలిపారు. దీనితో చిత్ర ట్రైలర్ త్వరలోనే విడుదల కాబోతోందని తెలుస్తోంది. చిత్ర ట్రైలర్ ఎలా ఉంటుందో ? తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వరకు వేచి చూడాల్సిందే.

13:01 - March 2, 2017

విశాఖ : పారిశ్రామిక వేత్తలు అయిపోతారన్నారు.. వ్యాపార సామ్రాజ్యం మీదే అంటూ హామీలు గుప్పించారు.. నైపుణ్యాలు, ఆర్థిక సహకారం మేమే ఇస్తామంటూ గొప్పలు చెప్పారు. చివరకు తస్సుమనిపించారు. విశాఖ స్టార్టప్‌ నిర్వీర్యం కావడంతో ఇందులో చేరిన విద్యార్థులు అయోమయంలో పడ్డారు. చదువు మధ్యలో ఆపేసి వచ్చిన స్టుడెంట్స్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది..  

స్టార్టప్ విలేజ్.. 
ఏపీలో ప్రవేశపెట్టిన స్టార్టప్‌ విలేజీ భావన నీరుగారిపోయింది. స్టార్టప్‌ పేరుతో యువ పారిశ్రామికవేత్తల్ని తయారుచేస్తామన్న హామీ మాటలకే పరిమితమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కన్సల్టెంట్‌ బాధ్యతారాహిత్యం విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 2016 జూన్‌లో ప్రభుత్వం స్టార్టప్‌ విలేజ్‌ను ఏర్పాటుచేసింది. విశాఖ మధురవాడలోని ఐటీ హిల్‌ 3లో స్టార్టప్‌ విలేజ్‌ పేరిట భవనాన్ని ఏర్పాటుచేసింది. కాలేజీలో చదువుతున్న విద్యార్థులతో స్టార్టప్‌ సంస్థలు ఏర్పాటుచేయించి వారికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారం అందించేలా ప్లాన్‌ రూపకల్పన చేసింది. కోచిలో విజయవంతంగా స్టార్టప్‌ విలేజ్‌ నడిపిన సంజయ్‌ విజయ్‌ కుమార్‌ను కన్సల్టెంట్‌గా నియమించింది.. 

70 మంది..
స్టార్టప్‌ విలేజ్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలంటూ విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది.. దీనికి స్పందించి దాదాపు 400లకుమందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.. విద్యార్థుల ఆలోచనలను క్షుణ్ణంగా విశ్లేషించి సృజనాత్మకత ఉన్నవారిని ఎంపిక చేయడం సంజయ్‌ కుమార్‌ టీం బాధ్యత... వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన టీం చివరకు 70మందిని స్టార్టప్‌కు ఎంపిక చేసింది. వీరికి విలేజ్‌లో కేంద్రం ఏర్పాటుచేసుకునే అవకాశం కల్పించింది. అలా ఎంపికైన విద్యార్థులు తమ ఆలోచనలకు అనుగుణంగా ఉత్పత్తుల్ని తయారుచేసుకొని మార్కెట్‌ చేసుకోవచ్చు... ఇందుకు అవసరమైన నైపుణ్యాల్ని సంజయ్‌ కుమార్‌ బృందం అందించాలి.. 

లక్షలు వసూలుచేసి..
విద్యార్థులను పారిశ్రామివేత్తలుగా తీర్చిదిద్దుతున్నామంటూ సంజయ్‌ కుమార్‌ బృందం.. ప్రభుత్వంనుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదంటూ విమర్శలొచ్చాయి. బిజినెస్‌ చేసి జీవితంలో స్థిరపడదామనుకున్నవిద్యార్థులకు చివరికి నిరాశే మిగిలింది. వ్యాపారవేత్తగా రాణించాలన్న లక్ష్యంతో చదువును మధ్యలో ఆపేసి స్టార్టప్‌వైపు వచ్చిన స్టుడెంట్స్‌ చివరకు ఎటూకాకుండా పోయారు. స్టార్టప్‌ విలేజ్‌లో యువతీ యువకులు ఎన్నో కొత్త ఆలోచనల్ని ఆచరణలో పెట్టారు.. ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే యాప్‌లను తయారుచేశారు.. వీటిని ఉపయోగించుకుని ఆదాయంమాత్రం పొందలేకపోయారు.. 

మూసివేత దశకు..
ఈ సంస్థను స్థాపించడంవరకూ సీరియస్‌గా దృష్టిపెట్టిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులూ దీనిపై దృష్టిపెట్టలేదు.. అంతా అయిపోయాక జరిగింది తెలుసుకున్న సర్కారు కోచి స్టార్టప్‌ విలేజ్‌ నిర్వాహకుడు సంజయ్‌ విజయ్‌ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించింది. అప్పటికే అతనికి లక్షలాది రూపాయల చెల్లింపులు జరిగిపోయాయి. స్టార్టప్‌ విలేజ్‌ వ్యవస్థ మూసివేత దశకు చేరడంతో అందులోని సంస్థలను బయటకు పంపారు. కొన్నింటిని మాత్రం నాస్కామ్‌ వేర్‌హౌస్‌, గోవిన్‌ క్యాపిటల్‌ సంస్థలకు అప్పగించారు. ఈ సంస్థలు ప్రస్తుత స్టార్టప్‌ విలేజ్‌ భవనంలోనే ఉండి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 

ఉద్యోగాల వేటలో యువత
స్టార్టప్‌ విలేజ్‌లో జాగా దొరికితే తమ దశ తిరిగినట్లేనని భావించిన యువకుల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.. స్టార్టప్‌లో సంస్థలు పెట్టి చేతులు కాల్చుకున్న చాలామంది ఇప్పుడు ఉద్యోగాల వేటలో పడ్డారు... మొత్తానికి సరైన విధి విధానాలు పాటించకపోవడంతో స్టార్టప్‌ విలేజీ కాన్సెప్ట్‌ ఎటూకాకుండా పోయింది.. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టినా ప్రభుత్వం, నిర్వాహకుల నిర్లక్ష్యంతో చివరకు ఏమీ సాధించలేకపోయింది.. 

12:53 - March 2, 2017

హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు డీ.కే అరుణ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారా..? అధికార పార్టీ అదేపనిగా టార్గెట్‌ చేస్తుంటే.. పార్టీ ముఖ్య నేతలెవరూ స్పందించకపోవడం పట్ల ఆమె ఆవేదనలో ఉన్నారా..? పార్టీ కోసమే తాను కష్టపడుతున్నానని చెబుతున్న డీకేకు.. మహిళా కాంగ్రెస్‌ నేతలు ఎందుకు అండగా నిలవడం లేదు. టీఆర్‌ఎస్‌ నేతలపై ఎదురుదాడికి ఎందుకు దిగడం లేదు...? ఇప్పుడు ఇవే ప్రశ్నలు కాంగ్రెస్‌లో చర్చకు వస్తున్నాయి. 

ముఖ్యనేతలెవరూ స్పందించనందుకే..
కాంగ్రెస్‌ నేతలను దొంగల ముఠాతో పోలుస్తూ ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్‌పై హస్తం నేతలు కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌, గువ్వల బాలరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ నేతలతో పాటు డీకే అరుణపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక దశలో అమెపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. టీఆర్‌ఎస్‌ నేతల కామెంట్స్‌పై కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలెవరూ స్పందించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం అధికార పార్టీపై పోరాడుతుంటే... తనపై టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన కామెంట్స్‌పై పార్టీ ముఖ్యనేతలు ఎందుకు ఖండించడం లేదని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. తనతో పాటు కేబినెట్‌లో సహచర మంత్రులుగా పనిచేసిన మహిళా నేతలెవరూ స్పందించకపోవడం పట్ల డీకే అరుణ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. 

సాటి మహిళలు కూడా.. 
మ‌హిళా కాంగ్రెస్ కూడా ఈ అంశాన్ని రాజ‌కీయంగా వాడుకోలేక‌పోయింద‌నే భావ‌న పార్టీ వ‌ర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీలో మొక్కుబ‌డి కార్యక్రమాలు చేస్తున్న మ‌హిళా కాంగ్రెస్ నేతలు... మాజీ మంత్రి, సీనియర్‌ మహిళా నేత డీకే అరుణపై అధికార పార్టీ నాయకులు వ్యక్తగత విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే.. ఎదురుదాడికి ఎందుకు దిగడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్‌లో డైన‌మిక్ లీడ‌ర్‌గా, ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న డీకే అరుణకు మద్దతుగా పార్టీ ముఖ్యులెవరూ స్పందించకపోవడం పట్ల చర్చనీయాంశంగా మారింది. పీసీసీ చీఫ్‌, సీఎల్పీ నేతలైనా ఏ మేరకు జాగ్రత్త పడుతారో చూడాలి. 

12:43 - March 2, 2017

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.  వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని సీఎం చంద్రబాబు రిమోట్‌తో ప్రారంభించారు. సరిగ్గా 11.25 గంటలకు అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రెడ్డి, మండలి ఛైర్మన్ చక్రపాణి, మంత్రులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ అనంతరం అసెంబ్లీ లోపల ఉన్న తన సీట్లో చంద్రబాబు కూర్చుకుని అసెంబ్లీ భవనాన్ని పరిశీలించారు. మైకులు విరగొట్టడానికి వీలులేకుండా సభ్యుల సీట్ల వద్ద సెన్సార్ మైక్ సిస్టమ్ ఏర్పాటుచేశారు. 232 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో ఏడాదిలోనే ఈ భవన నిర్మాణం చేపట్టారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనం నిర్మితమైంది. మరిన్ని విశేషాలు వీడియోలో చూడవచ్చు. 

విశేషాలివే..

అమరావతి : అత్యాధునిక హంగులతో ఏడాదిలోనే ఏపీ అసెంబ్లీ భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు.  భవనంలోకి వెళ్లడానికి నాలుగు ద్వారాలు ఏర్పాటుచేశారు. సీఎం లోపలికి వచ్చేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. 230 మంది కూర్చోవడానికి వీలుగు అసెంబ్లీని నిర్మించారు. 90 మంది సభ్యులు కూర్చునేలా శాసన మండలి భవనం కట్టారు. సచివాలయ ప్రాంగణంలో ఆరో భవనంగా అసెంబ్లీ, మండలి ఏర్పాటు చేశారు. స్పీకర్ ఛైర్ సమావేశ మందిరానికి ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది.

కొత్త అసెంబ్లీలోకి..

అమరావతి : ఏపీ అసెంబ్లీ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. నూతన అసెంబ్లీలోకి అడుగిడిన బాబు.. తనకు కేటాయించిన ఛైర్ పై కూర్చుని ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కొడెల శివ ప్రసాద్, మండలి ఛైర్మన్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. సచివాలయ ప్రాంగణంలో 2 ఎకరాల స్థలంలో అసెంబ్లీ నిర్మించారు. 

12:11 - March 2, 2017
12:09 - March 2, 2017
12:06 - March 2, 2017
12:04 - March 2, 2017

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో మరో మల్టీ నేషనల్ కంపెనీ అడుగుడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఐటీ మినిస్టర్ కేటీర్ ముఖ్య అథితిగా హాజరై ప్రసంగించారు. ఇండియాలో మొట్టమొదటి జెడ్ఎఫ్ డెవలెప్‌మెంట్ సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం హ్యాపీగా ఉందని కేటీఆర్ తెలిపారు. జర్మనీకి చెందిన జెడ్.ఎఫ్ కంపెనీకి చెందిన 'జెడ్ఎఫ్ ఇండియా డెవలెప్‌మెంట్ సెంటర్‌' హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నానక్‌రామ్‌గూడలోని డెవలెప్‌మెంట్ సెంటర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 

నగరంలో జర్మనీ జెడ్ఎఫ్..

హైదరాబాద్‌ : నగరంలో జర్మనీకి చెందిన జెడ్.ఎఫ్ కంపెనీకి చెందిన జెడ్.ఎఫ్ ఇండియా డెవలెప్‌మెంట్ సెంటర్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నానక్‌రామ్‌గూడలోని డెవలెప్‌మెంట్ సెంటర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జెడ్.ఎఫ్ కంపెనీ ఇండియాలో మొట్టమొదటి డెవలెప్‌మెంట్ సెంటర్ హైదరాబాద్‌లో పెట్టడం ఆనందంగా ఉందని కేటీఆర్ తెలిపారు. 

11:57 - March 2, 2017

హైదరాబాద్ : దశాబ్దకాలానికి పైగా లాభాల్లో తిరుగులేకుండా దూసుకుపోయిన సింగరేణి సంస్థ ఈ ఏడాది  భారీ నష్టాలను మూటగట్టుకుంది. 2016 - 17 ఆర్థిక సంవత్సరంలో రూ.353కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. ఆరు డివిజన్లలో ఏకంగా 1572కోట్ల రూయల  నష్టాలు వచ్చాయి. మరో నాలుగు డివిజన్లలో మాత్రం 1219కోట్ల లాభాలు వచ్చాయని సింగరేణి ప్రకటించింది. బొగ్గు ఉత్పత్తి లో వెనుకంజ వేయడం, డిమాండ్‌ తగ్గడమే నష్టాలకు కారణం అంటున్నారు అధికారులు. దాంతోపాటు ఉత్పత్తి వ్యయం అధికంగా ఉండటంవల్లే నష్టాలు వస్తున్నాయంటున్నారు.  12ఏళ్లుగా వరుసగా లాభాలో నడుస్తున్న సింగరేణికి ఈ ఏడాది నుంచి మళ్లీ గడ్డుకాలం దాపురించిందని కార్మికులు అంటున్నారు. 

11:55 - March 2, 2017

తిరుపతి : పది మంది మృతికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ మీద కేసు ఎందుకు పెట్టలేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్‌పై పెట్టిన తప్పుడు కేసులకు వ్యతిరేకంగా తిరుపతిలో వైసీపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు వీడియోలో చూడండి. 

11:50 - March 2, 2017

హైదరాబాద్ : మార్చి మొదట్లోనే ఎండలు మండుతున్నాయి. ఎండలకు చెలిమల్లో నీరు కూడా ఎండి తాగునీటికి తంటాలు పడుతున్నారు గిరిజనులు. గత వర్షాలకు వాగులు, వంకలు నిండినా.. అవన్నీ ఎండిపోయి చెలిమల్లోని కలుషిత నీరే గిరిజనులకు తాగునీరవుతోంది. ప్రభుత్వం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నా.. నీటి సమస్య మాత్రం శాశ్వత పరిష్కారానికి నోచుకోవడం లేదు. గుక్కెడు తాగునీటి కోసం గిరిజన గ్రామాల ప్రజలు పుట్టెడు కష్టాలు పడాల్సి వస్తోంది. బిందెడు నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వస్తోంది. కాలమేదైనా ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకు తాగునీటి కష్టాలు మాత్రం తప్పడం లేదు. !  

అదిలాబాద్ ఏజెన్సీ బాధలు.. 
ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందినవారంతా.. రోజువారి పనుల్ని పక్కనపెట్టి తాగునీటి కోసం మైళ్ల దూరాన ఉన్న చెలిమల బాట పట్టిన గిరిజనులు. గ్రామాల్లో చేతిపంపులు ఉన్నప్పటికీ.. అవి మరమ్మతుకు నోచుకోక  నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం వెళుతున్నారు. అంత దూరం నడిచి వెళ్లినా..వీరికి దొరికేవి మినరల్‌ వాటరో.. సురక్షిత మంచినీరో కాదు. కషాయంలా కనిపించే చెలమల మురికి నీరే వీరికి దక్కేది. 
ఎవ్వరూ పరిష్కరించట్లేదు..
వాగుల్లో చెలిమల్లోంచి తెచ్చుకునే నీరు తాగటం వల్ల అనేక మంది రోగాల బారిన పడుతున్నా..పట్టించుకున్న నాథుడే లేరు. నీటి సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ  సమస్యను పరిష్కరించడం లేదని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు నియోజకవర్గంలోనూ తాగునీటి తిప్పలు తప్పడం లేదు. ప్రాణహిత, పెనుగంగ, పెద్దవాగు నదులున్నా.. ఏడాది పొడువునా మంచినీటి కష్టాలు మాత్రం తీరడంలేదు. బెజ్జూరు మండల కేంద్రంతో పాటు జైహింద్‌పూర్‌, తలాయి, కుష్నేపల్లి గ్రామాల్లో ఎండకాలం ప్రారంభం కాకముందే నీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గుక్కెడు నీటికోసం  కిలోమీటర్ల దూరంలోని వాగులు, వంకల్లో నీరు తోడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 
ఐదు కిలోమీటర్లు నడిచి.. 
కౌటాల మండలం పాత కన్నెపల్లి గ్రామం మొత్తం  సమీపంలో గల ఒకే ఒక్క వ్యవసాయ బావి నుంచి నీరు తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు.  దహేగాం మండలం మొట్లగూడ, రాంపూర్ గ్రామస్థుల పరిస్థితి ఐతే మరీ దారుణంగా ఉంది. మంచి నీటి కోసం స్థానికులు 5 కిలోమీటర్ల దూరం నడిచి పెద్దవాగులోని చెలిమల్లో నీటిని తోడుకోవాల్సి వస్తోంది. ఫిబ్రవరి, మార్చిలోనే మంచినీటి కష్టాలు మొదలైతే వచ్చే వేసవిలో ఇంకెన్ని కష్టాలు పడాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో తాగునీటి బోర్లు వేసినా  అవి పని చేయడం లేదు.  వాగులు, చెలిమల్లోని నీరు తాగుతూ.. రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నా.. వారిని పట్టించుకున్న వారే కరువయ్యారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లక్షలు ఖర్చు పెట్టినా నీటి సమస్య పరిష్కారం కావడం లేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
గిరిజన బాధలు.. 
వేసవి మొదట్లోనే తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక రానున్న మండు వేసవిలో ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనన్న ఆందోళన గిరిజనులను వేధిస్తోంది. ప్రతి ఏటా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నా... ప్రభుత్వం, అధికారులు మాత్రం శాశ్వత పరిష్కారం చూపడం లేదు. మొక్కుబడిగా కాకుండా..ఈసారి తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.  భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోథ్‌  నియోజకవర్గంలో ప్రతిఏటా ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. బోథ్‌, పొచ్చెర, సాకెర, కౌట, అజ్జర్‌-వజ్జర్‌, నాగాపూర్‌, కంటెగాం, నిగిని, అర్కాయి, రాజుల్‌గూడ, పాలవాగు గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటోంది. బోథ్‌ మండల కేంద్రంలోనే 300 బోర్‌వెల్స్‌ ఉండగా, సీజన్‌లో కేవలం 90 మాత్రమే పనిచేస్తాయంటే వాటి పర్యవేక్షణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పొచ్చెరలో ఎడ్లబండ్ల ద్వారా సమీపంలో గల బావిలో నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. అది కూడా ఎండిపోతే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. సాకెర గ్రామస్థులైతే  పక్క గ్రామం నుంచి తాగునీటిని తెచ్చుకుంటూ.. నీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కౌట గ్రామంలో ఒకే ఒక్క బోర్‌ ఉండటంతో.. గ్రామస్థులందరూ దానిపై ఆధారపడాల్సి వస్తోంది. 

గుట్టల్లో చెలిమల్లో.. 
ఇక ఆదిలాబాద్‌ నిజయోకవర్గంలోని తాగునీటి కష్టాలు చెప్పనవసరం లేదు. జిల్లా కేంద్రానికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖండాల, ఖానాపూర్‌ గ్రామాల్లో తాగునీటి సమస్య మరీ దారుణంగా ఉంది. నీటి కోసం రాళ్లు, రప్పలు దాటుతూ.. గుట్టల్లో ఉన్న చెలిమల్లో నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తోంది. మాంగ్లి గ్రామంలో చేతి పంపులు పనిచేయకపోవడంతో.. చెలిమలే ఆధారమవుతున్నాయి. కేబీ కాలనీ, ధర్మగూడలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. కేబీకాలనీలో దాదాపు రెండు వందల కుటుంబాలు  వేసవి వచ్చిందంటే మూడు కిలోమీటర్ల దూరం నడిచి మంచినీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. 

యుద్ధ ప్రాతిపదికన..
ఇక ఊట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నారు. కొమురం భీం జలాశయం నుంచి గిరిజనులకు తాగునీరు అందించేందుకు జాతీయ గ్రామీణ తాగునీటి పథకం ప్రారంభించారు. కానీ... 68 కోట్లతో ప్రారంభించిన ఫిల్టర్‌ బెడ్‌ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. గతేడాది ఫిబ్రవరిలో పూర్తి కావాల్సిన ఈ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ తాగునీటి పథకం పూర్తయితే.. జైనూర్‌, నార్నూర్‌, కెరమెరి, సిర్పూర్‌ (యు) మండలాల్లోని 198 గ్రామాల ప్రజలకు మంచినీరు అందుతోంది. ఇదే పథకం కింద ఊట్నూరు, ఇంద్రవెల్లి మండలాలకు కూడా తాగునీరు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం మరో పది కోట్లు వెచ్చించింది.  నీటి ఎద్దడి నివారణ కోసం ఎన్నిసార్లు అధికారుల చుట్టు తిరిగినా ఎలాంటి ఫలితం ఉండటం లేదని సంబంధిత గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా తమ గొంతులు తడిసేలా తాగునీటి ఎద్దడి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. యుద్ధప్రాతిపదికపై పనులు చేస్తేనే ఈ వేసవిలో గుక్కెడు మంచినీరు దొరికే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

చేరుకున్న చంద్రబాబు..

అమరావతి : వెలగపూడి తాత్కాలిక అసెంబ్లీ ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు నూతన అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. 

ఏపీ అసెంబ్లీ ప్రారంభోత్సవం...

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ ప్రారంభానికి సిద్ధమైంది. ఉదయం 11.25 నిమిషాలకు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం అసెంబ్లీ దగర్గ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొని రాజధాని రైతులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. 

మళ్లీ జరగకుండా చూసుకో..

అమరావతి : కాకినాడలో జంట హత్యలపై సీఎం చంద్రబాబు నాయడు ఆరా తీశారు. డీజీపీ మాట్లాడారు. మున్ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని బాబు డీజీపీకి సూచించారు. 

11:19 - March 2, 2017

ఏపీ అసెంబ్లీ ప్రారంభోత్సవం...

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ ప్రారంభానికి సిద్ధమైంది. ఉదయం 11.25 నిమిషాలకు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం అసెంబ్లీ దగర్గ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొని రాజధాని రైతులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. 

నెల్లూరులోనూ..

నెల్లూరు: జిల్లాలోని వెలవల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీసిటీ సెజ్‌కు చెందిన బస్సును శ్రీవెంకటరమణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో 20మంది ఫాక్స్‌కాన్ కార్మికులకు గాయాలవ్వగా.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నాయుడుపేట ఆస్పత్రికి తరలించారు. 

10:02 - March 2, 2017

అమరావతి : నిత్యం పోలీసుల పహారాతో ఉండే ప్రాంతమది. ముఖ్యమంత్రి, అమాత్యులు కొలువుదీరే సచివాలయంలో ఓ సామాన్య యువకుడు గుర్రంపై స్వారీ చేస్తూ హల్‌చల్‌ చేశాడు. ఎలాంటి అనుమతులు లేకున్నా సచివాలయ ప్రధాన రహదారిపై హడావుడి చేశాడు. వెలగపూడి గ్రామానికి చెందిన అప్పాజీ అనే యువకుడు గుర్రంపై వచ్చి స్వైర విహారం చేశాడు. సచివాలయంలోకి రావాలంటే ముందుగా మెయిన్‌గేట్‌ దగ్గర సిబ్బంది తనిఖీ చేసిన తర్వాతే ఎవరినైనా లోపలికి అనుమతి ఇస్తారు. అలాంటిది ఓ సాధారణ యువకుడు వీవీఐపీలు ఉండే ప్రదేశంలో విహరించాడు. ఎట్టకేలకు గుర్రంపై యువకుడిని గుర్తించిన భద్రా సిబ్బంది యువకుడిని సచివాలయం నుంచి బయటికి పంపేశారు. ఈ సంఘటనతో వెలగపూడి  సచివాలయంలో భద్రతా సిబ్బంది డొల్లతనం బయటపడింది. వీడియో చూస్తే మరింత మజా అర్థం అవుతుంది. 

09:59 - March 2, 2017

నెల్లూరు : జిల్లాలోని వెలవల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీసిటీ సెజ్‌కు చెందిన బస్సును శ్రీవెంకటరమణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో 20మంది ఫాక్స్‌కాన్ కార్మికులకు గాయపడ్డారు.  డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నాయుడుపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వీడియోలో చూడండి. 

09:57 - March 2, 2017

హైదరాబాద్ : ఆ కుర్రాణ్ని చూస్తే పిట్టకొంచెం కూత ఘనం అంటారందరూ.. వయసుకు మించిన టాలెంట్‌తో అబ్బురపరుస్తున్నాడు. నిండా 12ఏళ్లు లేవు.. హైదరాబాద్‌కు చెందిన అగస్త్య జైస్వాల్‌ ఇంటర్‌ ఎగ్జామ్స్‌ రాస్తున్నాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న జైస్వాల్‌ను పలకరిస్తే.. మాటల మాటల ప్రవాహమే.. తాను 9 ఏళ్లకే టెన్త్‌ పాసైయ్యానని గలగలా చెప్పేస్తున్నాడు. తమ కుమారుడి ప్రతిభకు తల్లిదండ్రులు  తబ్బిబ్బవుతున్నారు. ఈ బుడుగు మాటలు వీడియోలో చూడండి. 

09:53 - March 2, 2017
09:52 - March 2, 2017

తూర్పు గోదావరి : కాకినాడలో బుధవారం అర్ధరాత్రి కలకలం రేగింది. ఇద్దరు రౌడీషీటర్లు దారుణ హత్యకు గురైయ్యారు. స్థానిక రామారావుపేటలోని సబ్బయ్యహోటల్లో  డ్రైవర్‌గా పనిచేసే అశోక్‌కుమార్‌ కు, అదే హోటల్‌కు పక్కనే కర్రీపాయింట్‌ నడుపుకునే  బాల, రామస్వామికి మధ్య గతంలో గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోటల్లో కూరగాయలు దొంగతనం చేస్తున్నాడని హోటల్‌ యజమానికి బాల ఫిర్యాదు చేశాడు. దీంతో రౌడీషీటర్‌ బాలపై డ్రైవర్‌ అశోక్‌ కుమార్‌  ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో రాత్రి పదిన్నర సమయంలో  బాల, రామస్వామి టూవీలర్‌పై ఇంటికి వెళుతుండగా  సమయం కోసం కాచుకుని కూర్చున అశోక్‌కుమార్‌.. వ్యాన్‌తో టూవీలర్‌పై ఉన్న వారిని  వెనుక నుంచి  ఢీకొట్టాడు. దీంతో కిందపడిపోయిన బాల, రామస్వామిని జాకీరాడ్‌తో కొట్టి చంపేశాడు అశోక్‌కుమార్‌.  పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.. 

09:50 - March 2, 2017

ప్రకాశం : జిల్లాలోని పీసీపల్లి మండలం పెద్దఅలవలపాడు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా  పడింది. బస్సు కల్వర్టును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో 20మంది విద్యార్థులకు తీవ్రగాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మహానంది, యాగంటి విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను కనిగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులంతా సింగరాయకొండ మండలం కర్రెడులోని జెడ్పీ హై స్కూల్‌కు చెందినవారు. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వరుస ప్రమాదాలపై చంద్రబాబు ఆరా తీశారు. 

నల్గొండ జిల్లాలోకి మహాజన పాదయాత్ర..

నల్గొండ : నేడు సీపీఎం మహాజన పాదయాత్ర నల్గొండ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఉప్పలపాడుస్టేజీ వద్ద ఘన స్వాగతం పలికేందుకు జిల్లా సీపీఎం శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. నేడు కేతెపల్లి, కొర్లపాడు, ఇనుపాముల, నకిరేకల్, కందుపట్ల స్టేజీ, మర్రూరు స్టేజీలో పాదయాత్ర కొనసాగుతోంది. 

09:14 - March 2, 2017

           ​బస్సు ప్రమాదం తదనంతర పరిణామాలపై వాడీ వేడీ చర్చ జరిగింది.  10టీవీ న్యూస్ మార్నింగ్ లో అసలు ఏం జరిగింది. ప్రమాదంకు సంబంధించిన పూర్వాపరాలేంటి. ఈ ఘటనకు కేవలం రాజకీయ రంగు మాత్రమే ఎందుకు అలుముకుంటోంది. జగన్ పై అధికారపార్టీ.. అధికార పార్టీపై వైసీపీ మాటల యుద్ధం చేసుకోవడం వెనక ఉద్ధేశ్యం ఏమిటి? జగన్ కు సొంత పగలున్నాయా? లేదా జేసీ దివాకర్ రెడ్డిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? దీనిపై నేతలు ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ఈ చర్చలో విజయ్ కుమార్ (టీడీపీ), బాబురావు (సీపీఎం), వెస్లీ (వైసీపీ) పూర్తి డిబేట్ వీడయోలో చూడొచ్చు. 

సీఐటీయూ విజయోత్సవం..

సంగారెడ్డి : పెప్సీ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం సాధించింది. 123 ఓట్లతో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు విజయ కేతనం ఎగరవేశారు. రెండువందల అరవై ఏడు ఓట్లకుగాను. 190 ఓట్లను చుక్కా రాములుసాధించారు. సమీప ప్రత్యర్ధి సదానంద గౌడ్‌కు కేవలం 69 ఓట్లు వచ్చాయి. ఈ గెలుపుతో సంగారెడ్డిలో సీఐటీయూ విజయోత్సవ ర్యాలీ చేపట్టింది..

09:10 - March 2, 2017

        ఆంధ్రప్రదేశ్ లో భారీగా విద్యుత్ చార్జీలు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.  విద్యుత్ చార్జీలు 1127 కోట్ల రూపాయలు పెంచాలంటూ ఇప్పటికే డిస్కంలు ప్రతిపాదనలు పంపించాయి. వీటి మీద ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. విజయనగరం, ఏలూరు, గుంటూరులలో పబ్లిక్ హియరింగ్ పూర్తయ్యింది. ఇవాళ కర్నూలులో, రేపు తిరుపతిలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించబోతున్నారు. విద్యుత్ చార్జీల పెంపుదల తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిపిఎం పబ్లిక్ హియరింగ్ జరిగిన ప్రతి చోటా తన వాదనలు వినిపిస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీలు ఏటేటా పెరగడానికి కారణం ఏమిటి? విద్యుత్ చార్జీలు పెంచుతూ పోవడం వల్ల సామాన్యుల మీద, పరిశ్రమల మీద ఎలాంటి ప్రభావం పడుతోంది? విద్యుత్ చార్జీల పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయడానికి వున్న ప్రత్యామ్నాయాలేమిటి? ఇదే అంశంపై నేటి జనపథంలో సిపిఎం నాయకులు సిహెచ్ నరసింగరావుగారు పాల్గొని ప్రసంగించారు. కాలర్లు తమ తమ అభిప్రాయాలను సందేహాలను వెల్లడించారు. కారణాలను, ప్రత్యామ్నాయ మార్గాలను నర్సింగరావు వివరించారు. పూర్తి డిబేట్ ను వీడియోలో చూడొచ్చు. 

09:06 - March 2, 2017

నెల్లూరు : జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పోటీలో ఉన్న అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ అభ్యర్ధులు నువ్వా.. నేనా.. అన్నట్టుగా ఓటర్లను కలుసుకుంటూ తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థి, ప్రస్తుతం ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి  ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఇద్దరూ కూడా ఇప్పటి నుంచే క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. 
రసవత్తరం.. 
నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇద్దరూ కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం తరపున బరిలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తుంటే, ఆత్మప్రభోదంతో ఓటేయాలని వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి అభ్యర్థిస్తున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు బరిలో ఉండటంతో నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల  రాజకీయం రసవత్తరంగా మారింది. ఈనెల 17న పోలింగ్‌ నిర్వహిస్తారు. 20న ఓట్లు లెక్కిస్తారు. జిల్లా వ్యాప్తంగా 853 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 46 మంది జెడ్పీటీసీ సభ్యులు. 583 మంది ఎంపీటీసీలు. 54 మంది మున్సిపల్ కార్పొరేటర్లు. మరో 164 మంది మున్సిపల్‌ కౌన్సిలర్లు ఉన్నారు. పదవీ రీత్యా ఇద్దరు  ఎంపీలు, మరో ఏడుగురు ఎమ్మెల్యేకు ఓటు హక్కు ఉంది. 

బలాబలాలు..  
లెక్క ప్రకారం టీడీపీకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. తెలుగుదేశంకు  483 మంది  ఓటర్లు ఉంటే, వైసీపీకి 346 మంది ఓట్లు ఉన్నాయి. ఇతరులు 15 మంది ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.  ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల్లో వైపీసీకి ఐదు ఓట్లు ఉన్నాయి. 2014లో జరిగిన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 847 స్థానాల్లో 438 సీట్లను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ 352 స్థానాల్లో  నెగ్గితే, కాంగ్రెస్‌ ఇతరులు కలిసి 57 చోట్ల విజయం సాధించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో కొంతమంది వైపీసీని వీడి టీడీపీలో చేరారు. దీంతో తెలుగుదేశం బలపెరిగింది. 

వ్యూహాలు.. 
ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి క్యాంపు రాజకీయాలకు తెర తీశారు. తమ తమ ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా పోలింగ్‌ రోజువరకు తమ ఆధీనంలోనే ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. రెండు పార్టీల నేతలు ప్రత్యర్థి క్యాంపుల్లోని ఓటర్లతో సంప్రదింపులు జరుపుతూ తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ ఓటర్లలో కొందరు వైసీపీ అభ్యర్థి విజయకుమార్‌రెడ్డికి ఓటేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. సీక్రెట్‌ బ్యాలెట్‌ కావడంతో క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశం లేకపోలేదన్న ప్రచారం కూడా ఊపందుకుంది. వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిన కొందరు  జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కొందరు ఫ్యాను కిందకు చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థి విజయ్‌కుమార్‌రెడ్డి గెలిచే చాన్స్‌  ఉందని  విశ్లేషిస్తున్నారు. వాకాటి నారాయణరెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డిల్లో   విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో చూడాలి. 

09:05 - March 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో 10 కార్పొరేషన్లకు  చైర్మన్లను నియమించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేసింది.  సెట్విన్‌ చైర్మన్‌గా మీర్‌ ఇనాయత్‌ అలీ బాఖ్రీ, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌గా  సయ్యద్ అబ్దుల్ అలీమ్ నియమితులయ్యారు. ఇక ఎంపీ కేకే కుమారుడు కె. విప్లమ్‌కుమార్‌ను.. తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ చైర్మన్‌గా నియమించారు. తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు  కొండబాల కోటేశ్వరరావు,  తెలంగాణ స్టేట్ గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు తాటి వెంకటేశ్వర్లు చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్ల నియామకాల్లో మైనార్టీలకు  సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేశారు.

ప్రశ్నపత్రం సెట్ 'ఏ'..

హైదరాబాద్ : మరికొద్ది సేపట్లో ఇంటర్ సెంకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా నేడు జరగబోయే పరీక్షకు సెట్ 'ఏ' ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. పరీక్షకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాటు చేశారు. పరీక్షకు నిమిషం ఆలస్యంగా వచ్చిన పరీక్ష రాయనీయమని గంట ముందే పరీక్ష సెంటర్ వద్ద ఉండాలని అధికారులు విద్యార్థులకు సూచించారు. 

09:01 - March 2, 2017

కొన్ని సార్లు ఫిలిం ఇండస్ట్రీ లో  హిట్ కాంబినేషన్స్ మంచి ఇంటరెస్ట్ ని జెనరేట్ చేస్తాయి. ఆల్రెడీ ఒక సినిమా తో హిట్ కొట్టిన డైరెక్టర్ కొంచం గ్యాప్ తీస్కొని మళ్ళీ అదే హీరో తో సినిమా ఒకే చేసుకున్నాడు. లవ్ సబ్జెక్టు ని ఫామిలీ వాల్యూస్ తో స్క్రీన్ మీద పండించిన ఈ డైరెక్టర్ ఎవరో, అతను రిపీట్ చెయ్యబోయే హీరో ఎవరో  ఇప్పుడు చూద్దాం.

సెకండ్ హ్యాండ్ తో.. 
ప్రెసెంట్ జెనరేషన్ లో లవ్ ఎలా ఉంది, అమ్మాయిలు అబ్బాయిలదగ్గరనుంది ఏమి కోరుకుంటున్నారు, అబ్బాయిలు ఎలా బెహేవ్ చేస్తున్నారు అనే ట్రెండీ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా సెకండ్ హ్యాండ్ .ఈ  సెకండ్ హ్యాండ్ అనే టైటిల్ తో సినిమా తీసి తెలుగు తెరకి పరిచయం ఐన డైరెక్టర్  కిషోర్ తిరుమల.యూత్ కి కనెక్ట్ అయ్యేలా  లవ్ స్టోరీ ని ప్రెసెంట్ చేసి  ఇంప్రెస్స్   చేసాడు కిషోర్. ఈ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని లాస్ట్ ఇయర్ మరో పెద్ద హిట్ ఇచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్ . 

గ్యాప్ ను పూరిస్తూ.. 
హీరో  రామ్ కెరీర్ లో చాల గ్యాప్ తరువాత వచ్చిన హిట్ ఫిలిం నేను శైలజ .ఈ సినిమా తో లక్కీ హీరోయిన్ కీర్తి సురేష్ రామ్ తో జత కట్టింది. మంచి సెంటిమెంట్ ని లవ్ ఫీల్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూపించిన నేను శైలజ సినిమా ని డైరెక్ట్ చేసి రామ్ కి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఈ సినిమా తరువాత హిట్ ట్రాక్ లో పడ్డ కిషోర్ కి మాత్రం నెక్స్ట్ ఛాన్స్ రావడానికి మళ్ళీ టైం పట్టింది .'నేను శైలజ' చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ సాధించిన కిషోర్‌ తిరుమల మలి చిత్రాన్ని వెంకటేష్‌తో చేయాల్సి వుంది. 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే సినిమా అనౌన్స్‌ అయింది, ఆరుగురు హీరోయిన్లుంటారని వార్తలు వచ్చాయి. కానీ వెంకీ ఆ చిత్రం చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో కిషోర్‌ వేరే హీరోల దగ్గరకి వెళ్లాడు.నితిన్ తో కూడా సినిమా అనుకుని మళ్ళీ డ్రాప్ అయ్యేడు కిషోర్. మరి వాట్ నెక్స్ట్ ..??

రిపీట్.. 
ఇప్పుడు హాట్ న్యూస్ గా తిరుమల కిషోర్ ,రామ్ కలిసి మరో సినిమా చెయ్యబోతున్నారు. నేను శైలజ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది.రామ్ తన నెక్స్ట్ ఫిలిం ను  కరుణాకరన్‌తో చేద్దామని డిసైడ్‌ అయ్యాడు.  ఆ సినిమాని పక్కనపెట్టి 'నేను శైలజ' డైరెక్టర్‌ కిషోర్  తోనే సినిమా  చేయడానికి సై అన్నాడు. ఈ చిత్రంలో రామ్‌ సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడు. రామ్‌ పెంచిన గడ్డం, జుట్టుతో పాటు అతను చేసిన సిక్స్‌ ప్యాక్‌కి అనుగుణంగా తన హీరో పాత్రని కిషోర్‌ మలచుకుంటున్నాడట. అలరించే ప్రేమకథతో వచ్చిన ఈ ద్వయం ఈసారి యాక్షన్‌తో దుమ్ము దులపడానికి సిద్ధమవుతోందన్నమాట.ఈ సినిమా కి సంబంధించిన మరి ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చెయ్యాల్సిందే .

08:58 - March 2, 2017

మన సినిమా లు బయట మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యడం మొదలు పెట్టాయి. ఇంతకు ముందులా  లోకల్ సెంటర్స్ తో పాటు ఇప్పుడు అబ్రాడ్ లో కూడా బ్రాడ్ గా బిజినెస్ చెయ్యడం స్టార్ట్ చేసాయి. రీసెంట్ సినిమాలు యు ఎస్ లో కాసులు కురిపిస్తున్నాయి. ఇంకా షూటింగ్ కూడా పూర్తికాని ఒక సినిమా యుఎస్ మార్కెట్ లో మంచి రేట్ పలికింది ఆ సినిమా వివరాలేంటో చదవండి..

నేను లోకల్.. 
తెలుగు స్క్రీన్ లెన్త్ పెరిగింది. అక్కడ ఇక్కడ కాదు ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్ కి రీల్ పాకింది. ఇక్కడ కలెక్షన్లు లెక్కల తో పాటు ఖండాలు దాటుతున్నాయి కలెక్షన్లు. నిన్న మొన్న రిలీజ్ ఐన సినిమాలు కూడా బయట దేశాల్లో బాగానే ఆడుతున్నాయి. నేను లోకల్ సినిమా హిట్ తెలుగు రాష్టాల్లోనే కాకుండా తెల్ల దేశాల్లో కూడా కాసులు కురిపించింది. నాని నాచురల్ యాక్టింగ్, కీర్తి సురేష్ అందం, అభినయం కామెడీ డైలాగ్స్ అన్ని కలిపి ఆడియన్స్ కి ఆనందాన్ని, ప్రొడ్యూసర్ కి డబ్బుల్ని అందించాయి .

నిన్నుకోరి.. 
నేను లోకల్ ఫ్లో ని ఎక్కడ తగ్గనివ్వట్లేదు నాని. ఎంచుకునేవి రొటీన్ కధలే ఐన స్క్రీన్ ప్లే లో తాళింపులు పెట్టి కొత్త సినిమా టచ్ ఇస్తున్నారు ఫిలిం మేకర్స్. ఇప్పటి వరకు వరస హిట్స్ అందుకున్నాడు కాబట్టి ఆ హిట్ మేనియా ని కంటిన్యూ చేస్తూ నాని వారసత్వ హీరోలకు చెమట్లు పట్టిస్తున్నాడు. ఆలా నాని సైన్ చేసిన ప్రాజెక్ట్ లో ఒకటి నిన్ను కోరి. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం  'నిన్ను కోరి`. రీసెంట్‌గా 'నిన్ను కోరి' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతోంది. మార్చి 10 వరకు అమెరికా షెడ్యూల్‌ వుంటుంది. తర్వాత వైజాగ్‌లో జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్త‌య్యేలా ప్లాన్ చేస్తున్నారు.

విదేశాల్లోనూ క్రేజ్..
ఈ సినిమా లో  నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు . ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. ఆల్రెడీ నివేద థామస్ తెలుగు కుర్రకారు ఫోన్స్ లో పిక్స్ ల మారిపోయింది. నాని, నివేద అంటే ఇంటరెస్ట్ తో పాటు యాక్టింగ్ స్కిల్స్ ప్రెజెంటేషన్ అనే ఫీల్ ఉంది. ఇది ఇలా ఉంటె  ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే ఈ సినిమా యు.ఎస్‌. హ‌క్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోయాయి. రెడ్ హార్ట్స్ సంస్థ నిన్ను కోరి సినిమా యు.ఎస్‌. హ‌క్కుల‌ను 3.75 కోట్ల‌కు ద‌క్కించుకుంద‌ని స‌మాచారం. రీసెంట్‌గా నాని నేను లోకల్ సినిమా యు.ఎస్‌లో మిలియ‌న్ డాల‌ర్స్ చిత్రంగా నిలిచింది. ప్ర‌స్తుతం ఉన్న యంగ్ హీరోస్‌లో నానికి ఓవ‌ర్‌సీస్‌లో మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది.ఇండస్ట్రీ లో  నాని ఈగ కాదు విప్లవంలా మారుతున్నాడు .

08:54 - March 2, 2017

హీరోలు జనరల్ గ డైరెక్టర్లకు గిఫ్ట్ లు ఇస్తుంటారు. ఫిలిం సెట్ లో గిఫ్ట్ లు ఇచ్చుకోవడం, బర్త్ డే పార్టీలు జరుపుకోవడం ఇవన్నీ కామనే కానీ ఒక పెద్ద స్టార్ సినిమా షూటింగ్ లో కో స్టార్ ఇచ్చిన గిఫ్ట్ టాక్ అఫ్ ది టౌన్ అయింది. ఆ గిఫ్ట్ ఏంటో, ఆ విశేషాలేంటో ఇప్పుడు చదవండి..

తమ్ముడుగా.. 
సంక్రాంతి, చందమామ సినిమా లో నటించిన శివబాలాజీ మంచి నటుడిగా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఈ హీరో చాలా బిజీ గా సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ హీరో గా షూటింగ్ జరుపుకుంటున్న కాటమరాయుడు లో కూడా శివబాలాజీ నటిస్తున్నాడు. ఈ సినిమా లో శివబాలాజీ పవన్ కళ్యాణ్ కి తమ్ముడి పాత్రలో నటిస్తున్నాడు. నటుడు చైతన్య కృష్ణ కూడా మరో తమ్ముడి పాత్రలో నటిస్తున్నాడు. కాటమరాయుడు సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. అనుకున్న టైం లో రిలీజ్ చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్  కూడా  కాట‌మ‌రాయుడు చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ప‌వ‌న్ అన్న‌గా న‌టిస్తుంటే ప‌వ‌న్‌కు త‌మ్ముళ్లుగా నటిస్తున్న  శివ‌బాలాజీ, చైత‌న్య‌కృష్ణ  తో కూడిన కొన్ని ఆన్ సెట్ పిక్స్ కూడా నెట్ లో రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలో న‌టిస్తున్న శివబాలాజీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఏదైనా గిఫ్ట్ ఇద్దామ‌నుకున్నాడు. 

డెహ్రా డూన్ నుండి.. 
గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు బాగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి గిఫ్ట్ నచ్చుతుంది అనే విషయం లో బాగా అలోచించి    డెహ్ర‌డూన్‌లో ఓ ఆయుధాలు త‌యారుచేసే ఒక వ్య‌క్తిని క‌లిసి ఒక క‌త్తిని, దానిపై జ‌న‌సేన గుర్తు ఉండేలా డిజైన్ చేయించి త‌యారు చేయించాడ‌ట‌. దాన్ని సెట్స్‌లో ప‌వ‌న్‌కు అందించాడ‌ట‌. బంగారు వ‌ర్ణంలోని ఈ క‌త్తిపై సంభ‌వామి యుగే యుగే అనే వ‌ర్డ్స్ కూడా ముద్రించ‌డంతో పాటు జ‌న‌సేన ఆవిర్భావంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రూపును కూడా ముద్రించారు. ఆ గిఫ్ట్ చూసిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎంతో సంతోషించాడ‌ట‌. ఆ కత్తిని పట్టుకొని కాటమరాయుడు సెట్ లో హ్యాపీ గా ఎంజాయ్ చేసాడంట పవన్ కళ్యాణ్. ఏది ఏమైనా మంచి గిఫ్టే ఇచ్చాడు తమ్ముడు.

07:14 - March 2, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్మించిన అసెంబ్లీ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ, మండలి భవన సముదాయాన్ని ఇవాళ ఉదయం 11 గంటల 25 నిమిషాలకు  ప్రారంభించనున్నారు. అద్భుత సౌధంగా ఈ భవనాలను  తీర్చిదిద్దారు. అసెంబ్లీ ప్రారంభోత్సవానికి అంగరంగ వైభంగా ఏర్పాట్లు చేశారు.

నేడే ప్రారంభం..
 ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లీ నిర్మాణం పూర్తైంది. శాసనసభ, మండలి భవన సముదాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ ఉదయం 11 గంటల 25 నిమిషాలకు ప్రారంభిస్తారు. అధునాతన హంగులతో అసెంబ్లీని నిర్మించారు.  అసెంబ్లీ భవన నిర్మాణం మొదలు పెట్టినప్పటి నుంచి అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు  ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయం వద్దే దీనిని అద్భుత కట్టడంగా తీర్చిదిద్దారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో ఇదో మైలురాయిగా నిలుస్తుంది. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీతోపాటు సచివాలయ భవనాలు  విద్యుత్‌ దీపాల ధగధగలతో మెరిసిపోతున్నాయి. ఏపీ అసెంబ్లీలో మైకులను సభ్యులు విరగ్గొట్టకుండా మైక్రోఫోన్‌ ఆడియో సిస్టం ఏర్పాటు చేశారు. 

ప్రారంభోత్సవం ఇలా.. 
అసెంబ్లీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులను రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులను ఆహ్వానించారు. శాసనసభ భవనాన్ని ప్రారంభించిన తర్వాత జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగిస్తారు. అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 800 మంది పోలీసులు నియమించారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటుచేశారు.  
పాస్ లు ఉంటేనే..
మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ భవనాలను సీఆర్‌డీఏ అధికారులు ఈనెల 4న అసెంబ్లీ కార్యదర్శికి అందజేస్తారు. ఆ రోజు నుంచి పాస్‌లు ఉన్నవారినే అనుమతిస్తారు. ఈనెల 6న అసెంబ్లీ, మండలి ఉభయ సభల సంయుక్త  సమావేశంలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించి సభ ఎన్ని రోజులు జరపాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారు. 
 
బందోబస్తు ప్రత్యేక ఏర్పాట్లు.. 
అసెంబ్లీ సమావేశాల బందోబస్తుకు  ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 12 జిల్లాల నుంచి 1200 మంది పోలీసులను రప్పిస్తున్నారు. బందోబస్తును పర్యవేక్షించే అధికారులను ఇప్పటికే అమరావతి రప్పించారు. వీరికి ఈ ప్రాంతంలోని రూట్లపై గత నెల 28  నుంచి అవగాహన కల్పిస్తున్నారు. మిగిలిన  పోలీసు సిబ్బంది ఈనెల 3వ తేదీకి చేరుకుంటారు. విధి నిర్వహణపై వీరికి 4,5 తేదీల్లో రిహార్సల్స్‌ నిర్వహిస్తారు. శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణాలు జరిగే వరకు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ భవనాల్లోనే శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహిస్తారు. 

కాకినాడలో దారుణం..

తూర్పుగోదావరి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాకినాడలోని సుబ్బయ్య హోటల్ వద్ద జంట హత్యలు భయాందోలకు తెరలేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిని ఇనుప రాడ్ తో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి, విచారణ నిర్వహిస్తున్నారు. 

నేడు ఏపీ కేబినెట్..

విజయవాడ : మధ్యాహ్నం 2గం.లకు ఏపీ కేబీనెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. బడ్జేట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. 

70 లక్షల పాతనోట్లు..

నెల్లూరు : 70 లక్షల రూపాయల విలువైన పాత కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. ఈ కరెన్సీ కలిగిఉన్న ఇద్దరు నిందితులు ప్రకాశ్, మధు సూధన్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

 

అడ్డంగా దొరికిన గంజాయి గ్యాంగ్..

కరీంనగర్ : గంజాయి తరలిస్తున్న ఓ గ్యాంగ్ అడ్డంగా దొరికిపోయింది. జిల్లాలోని జమ్మికుంట మండలం కొత్తపల్లి ఆటో స్టాండ్ వద్ద పోలీసులు 8 కిలోల గంజాయి పట్టివేశారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. 

క్యాంపు రాజకీయాలు.. కిడ్నాప్..!

నెల్లూరు  : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపు రాజకీయాల రగడ తెరలేచింది. చింతారెడ్డిపాలెం వద్ద ఇద్దరు ఇండిపెండెంట్ ఎంపీటీసీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  చిట్టమూరు మండలం మల్లామ్ కు చెందిన ఎంపీటీసీలు అశోక్, చంగయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. కాగా ఎంపీటీసీలను వైసీపీ నేతలు కిడ్నాప్ చేరని పోలీసు స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 

మరో బస్సు బోల్తా..

ప్రకాశం : జిల్లాలోని పీసీపల్లి మండలం పెద్ద అవలపాడు వద్ద బస్సు బోల్తా పడింది. స్కూల్ పిల్లల టూర్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులంతా ప్రకాశం జిల్లా కరేడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులుగా గుర్తించారు. మహానంది విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాగా బస్సులో మొత్తం 75 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. 

Don't Miss