Activities calendar

03 March 2017

22:15 - March 3, 2017

పెరుగుతున్న పోలీసుల ఆత్మహత్యలు..భార్యను కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న ఎస్సై, బాలల హక్కుల సంఘం అధికారుల చెంపచెల్లుమనిపించిన మహిళ, సీఎం చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ప్రసాదించాలని యజ్ఞయాగాలు, టీటీడీ హుండీలో పాత నోట్లు.. తిరుమల ఎంకన్న అరెస్టుకు రంగం సిద్ధం..? ఆగిన చైల్డ్ మ్యారేజీ... 13 ఏళ్ల అమ్మాయికి పెళ్లి..ఆ ఊరి పిల్లను ఆ ఊరి పిల్లగానికే ఇస్తరంట... ఊర్లో పెళ్లి సందడి, ఆడి పాడిన తాటికొండ రాజన్న..ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం..

 

22:02 - March 3, 2017

ఢిల్లీ : సొంతగడ్డపై టీమిండియా అసలు సిసలు టెస్ట్‌కు సన్నద్ధమైంది.పూణేలో ఎదురైన పరాభవానికి బెంగళూర్‌లో బదులు తీర్చుకోవాలని కొహ్లీ అండ్‌ కో పట్టుదలతో ఉంది. టెస్టుల్లో టీమిండియా,ఆస్ట్రేలియా జట్ల ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌ ఓ సారి చూద్దాం...
సెకండ్‌ టెస్ట్‌కు కౌంట్‌డౌన్‌ 
టీమిండియా, ఆస్ట్రేలియా సెకండ్‌ టెస్ట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనున్న రెండో  టెస్ట్‌కు ఇరు జట్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయి.  
విజయమే లక్ష్యంగా బరిలోకి విరాట్‌ ఆర్మీ  
తొలి టెస్ట్‌లో తేలిపోయిన విరాట్‌ ఆర్మీ రెండోటెస్ట్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. పూణేలో ఎదురైన పరాభవానికి బెంగళూర్‌లో బదులు తీర్చుకోవాలని కొహ్లీ అండ్‌ కో పట్టుదలతో ఉంది. 
2017 సీజన్‌ ఆరంభ టెస్ట్‌లోనూ జైత్రయాత్ర
2016 సీజన్‌లో  పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌... బంగ్లాదేశ్‌పై సింగిల్‌ టెస్ట్‌లో నెగ్గి  2017 సీజన్‌ ఆరంభ టెస్ట్‌లోనూ జైత్రయాత్ర కొనసాగించింది. కానీ ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఏ మాత్రం అంచనాల్లేని ఆస్ట్రేలియా అనూహ్య విజయం సాధించి ఓటమెరుగని టీమిండియా ఆధిపత్యానికి చెక్‌ పెట్టింది. 19 టెస్టుల్లో  ఓటమంటూ  లేకుండా 15 మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్‌పై సంచలన విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది.
అయోమయంలో భారత్‌ 
నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో శుభారంభం చేస్తుందనుకున్న భారత్‌....ఘోర పరాభవంతో ఒక్కసారిగా అయోమయంలో పడింది. ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం టీమిండియా టాప్‌ ర్యాంక్‌లో ఉండగా...ఆస్ట్రేలియా జట్టు రెండో స్థానంలో ఉంది. ఇక  ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో మాత్రం ఇండియాపై ఆస్ట్రేలియాదే పై చేయిగా ఉంది. టెస్ట్‌ ఫార్మాట్‌లో టీమిండియాపై ఆధిపత్యం ప్రదర్శించిన జట్లలో ఆస్ట్రేలియా ముందు వరుసలోనే ఉంది.
భారత్‌ 24 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం 
టెస్టుల్లో ఇప్పటివరకూ ఇరు జట్లు 91 మ్యాచ్‌ల్లో పోటీపడగా.....ఆస్ట్రేలియా  41 టెస్టుల్లో నెగ్గింది. భారత్‌ 24 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.  
రెండో టెస్ట్‌లో టీమిండియా ఏ స్థాయిలో రాణిస్తుందో..? 
తొలి టెస్ట్‌ ఓటమితో ఢీలా పడిన టీమిండియా...రెండో టెస్ట్‌లో ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి. టీమిండియాపై తిరుగులేని ట్రాక్ రికార్డ్‌ కలిగిన ఆస్ట్రేలియాను ఓడించాలంటే కొహ్లీ అండ్‌ కో అంచనాలకు మించి రాణించాల్సిందే. 

 

21:56 - March 3, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ఆరో విడత ఎన్నికలు, మణిపూర్‌ తొలి విడత ఎన్నికలకు రేపు పోలింగ్‌ జరగనుంది. యూపీలోని ఏడు జిల్లాల్లోని 49 అసెంబ్లీ స్థానాలకు మార్చి 635 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం కోటి 72 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లుండగా... రేపు 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. యూపీలో ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి, బిజెపి, బిఎస్పీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మణిపూర్‌లో గత 15 ఏళ్లుగా కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఎన్నికల కమిషన్‌ రెండు రాష్ట్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటీవల జరిగిన అల్లర్ల నేపథ్యంలో మణిపూర్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

 

21:54 - March 3, 2017
21:53 - March 3, 2017

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా  దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 70 వేల కోట్ల నల్లధనాన్ని వెలికితీశామని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ డిప్యూటీ చైర్మన్ జస్టిస్ అరిజిత్ పసాయత్ వెల్లడించారు. ఇందులో 16 వేల కోట్లు నల్లధనం విదేశాల్లో గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.  నల్లధనంపై ఏప్రిల్‌ మొదటివారంలో సుప్రీంకోర్టుకు ఆరో మధ్యంతర నివేదిక సమర్పించనున్నట్టు చెప్పారు. కటక్‌లో ఆర్థిక శాఖకు సంబంధించిన పలు ప్రభుత్వ సంస్థల అధికారులతో జస్టిస్ పసాయత్ సమావేశమయ్యారు. నల్లధనాన్ని నిర్మూలించడానికి గత రెండేళ్లుగా సిట్ మధ్యంతర నివేదికల ద్వారా పలు ప్రతిపాదనలు చేయగా...కేంద్రం చాలా వరకు వీటిని ఆమోదించిందని పసాయత్‌ అన్నారు.

 

21:50 - March 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్‌ ఖరారు అయ్యింది. ఈనెల 10 నుంచి  సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 13న ప్రభుత్వం సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబించేలా బడ్జెట్‌కు  ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది.
ఈనెల 10 నుంచి బడ్జెట్‌ సమావేశాలు
తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలకు రంగం సిద్దమైంది. ఈనెల 10నుంచి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం
నిర్ణయించింది. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ 13వ తేదీన సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 15 రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో అనేక మార్పులు జరిగే అవకాశముంది.  సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన జరుగుతున్నట్టు ఆర్దికమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు మరింతగా అందేలా ఈ బడ్జెట్‌ ఉండబోందని చెప్పారు.
ప్రతిపక్షాలకు ఈటల కౌంటర్‌
తెలంగాణ ప్రభుత్వం  అప్పులు ఎక్కువగా తీసుకొస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఈటల ఘాటుగా స్పందించారు. సంక్షేమం, నీళ్లు, చదువు, కరువు వంటి సమస్యలు అధిగమించేందుకే  అప్పులు తీసుకొచ్చామన్నారు. రుణపరిమితికి లోబడే అప్పులు తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 60ఏళ్లు తెచ్చిన అప్పులకంటే రెండున్నర ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఎక్కువయ్యాయని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే అప్పులు తేక తప్పదని తేల్చి చెప్పారు.
సబ్‌ప్లాన్‌ నిబంధనలకు లోబడే దళిత, గిరిజనలకు నిధుల కేటాయింపు: ఈటల
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం సరికాదన్నారు ఈటల. సబ్‌ప్లాన్‌ నిబంధనలకు లోబడే బడ్జెట్‌లో దళిత, గిరిజన వర్గాలకు పూర్తి స్థాయి నిధులను  కేటాయిస్తామని చెప్పారు. మొత్తానికి ఈసారి బడ్జెట్‌లో భారీ పథకాల కంటే సంక్షేమ కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

 

21:45 - March 3, 2017

విజయ దేవరకొండ హీరోగా, పూజా జవేరి హీరోయన్ గా శ్రీనివాస రవీంద్ర రచించి, దర్శకత్వం వహించి తెరకెక్కించిన చిత్రం 'ద్వారక'..ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రద్యుమన్న చంద్రపాటి, గణేష్ పెనుబోతు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మరి సినిమా ఎలా ఉంది...? ప్రేక్షకులు ఫీలింగ్స్ ఏమిటీ...? సినిమా రేటంగ్ వంటి వివరాలను వీడియోలో చూద్దాం...

21:41 - March 3, 2017

జోకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ప్రజ్ఞాజైస్వాల్ హీరోయిన్ గా నటించిన సత్య డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం గుంటురోడు ఇవాళ విడుదలైంది. సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులు ఫీలింగ్స్, రివ్యూ, రేటింగ్ వివరాలను వీడియోలో చూద్దాం...

21:34 - March 3, 2017

నెల్లూరు : జిల్లాలో మంత్రి రావెల కిషోర్ బాబు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై నారాయణ మెడికల్ కాలేజీలో గురుకుల పాఠశాల సిబ్బందితో రావెల రహస్య భేటీ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వేంరెడ్డి పట్టాభి రాంరెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని రావెల సూచించినట్లు సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్ : నగరంలో  ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈఘటనలో ప్రియురాలు మృతి చెందారు. ముషీరాబాద్ రిసాలగడ్డలో మెదక్ జిల్లాకు చెందిన అభిలాష్, సంయుక్త అనే ప్రేమికులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకున్నారు. ప్రియురాలు సంయక్త మృతి చెందింది. ప్రియుడు అభిలాష్ పరిస్థితి విమషంగా ఉంది.
 

21:23 - March 3, 2017

హైదరాబాద్ : నగరంలో  ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈఘటనలో ప్రియురాలు మృతి చెందారు. మెదక్ జిల్లాకు చెందిన అభిలాష్, సంయుక్త అనే ప్రేమికులు ముషీరాబాద్ రిసాలగడ్డలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకున్నారు. ప్రియురాలు సంయక్త మృతి చెందింది. ప్రియుడు అభిలాష్ పరిస్థితి విమషంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:14 - March 3, 2017

చెన్నై : సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు హీరో ధనుష్‌కి మద్రాస్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ కేసులో న్యాయవిచారణను నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ధనుష్ తమ కొడుకు అంటూ మధురై కోర్టులో పిటిషన్
సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు హీరో ధనుష్‌కి మద్రాస్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. మదురై జిల్లా మేలూర్‌ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ కొడుకు అంటూ మధురై కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు స్కూల్ సర్టిఫికెట్లను సమర్పించాలని ఆదేశించింది. ఆ మేరకు సర్టిఫికెట్ కాపీలను ధనుష్ న్యాయవాది ఇటీవల కోర్టుకు సమర్పించారు. 
కదిరేశన్ దంపతులు ప్రవేశపెట్టిన టీసీలో పుట్టుమచ్చలు 
అయితే కదిరేశన్ దంపతులు కోర్టులో ప్రవేశపెట్టిన టీసీలో పుట్టుమచ్చలు ఉన్నాయని పేర్కొనగా.. ధనుష్ తరఫు లాయర్ సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు పేర్కొనలేకపోవడం గమనార్హం. దీంతో ధనుష్ పుట్టుమచ్చలు వెరిఫికేషన్ కొరకు ఫిబ్రవరి 28 లోగా కోర్టుకు హాజరు కావాలని మదురై కోర్టు సూచించించడంతో ధనుష్ మధురై కోర్టుకు హాజరయ్యారు. అతనికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని మేలూరుకు సమీపంలోని మేజిస్ట్రేట్‌ కోర్టు తదుపరి విచారణను మార్చి 9కు వాయిదా వేసింది.  
విచారణపై హైకోర్టు స్టే 
మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ ధనుష్‌ హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యాన్ని పరిశీలించిన జస్టిస్‌ జి.చొక్కలింగం విచారణపై స్టే విధించారు. కదిరేశన్ దంపతులు మాత్రం ధనుష్ తమ కుమారుడే అని డిమాండ్ చేస్తూ, నెలకు 60 వేల భృతిని ఇవ్వాలని వారు కోరుతున్నారు. ధనుష్‌కి డీఎన్ ఏ పరీక్షలు కూడా జరపాలని కదిరేషన్ దంపతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే డీఎన్ఏ పరీక్షపై హైకోర్టు ఏం తేల్చకపోవడం విశేషం. 

21:11 - March 3, 2017

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మడం సిగ్గుచేటన్నారు. MP కవిత. తెలంగాణ ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రకటన వచ్చాక చంద్రబాబు తన ఎమ్మెల్యేలను రాజనామా చేయించి రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిజామాబాద్‌లోని ప్రగతి భవన్‌లో విజిలెన్స్ మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి కవిత హాజరయ్యారు.

 

ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 10 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 13న ఆర్థిక మంత్రి ఈటెల.. బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 

21:07 - March 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:05 - March 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 10 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 13న ఆర్థిక మంత్రి ఈటెల.. బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

21:01 - March 3, 2017

హైదరాబాద్ : ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాల్లో  ప్రతిపక్ష వైసీపీ వైఖరిని ఎండగట్టాలని తెలుగుదేశం వ్యూహ కమిటీ నిర్ణయించింది. సభలో వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేంది లేదని భేటీకి అధ్యక్షత వహించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. ఈనెల 6  నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌  సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చంద్రబాబునాయుడు అధ్యక్షతన తెలుగుదేశం వ్యూహ కమిటీ సమావేశమైంది. అసెంబ్లీలో అనుసరించాలన్ని విధానంపై చర్చించారు. 
రోజా అంశం ప్రధానంగా చర్చకు
వ్యూహ కమిటీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. గతేడాది జరిగిన బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అనిత పట్ల  రోజా అనుచింతగా ప్రవర్తించిన అంశం ప్రస్తావనకు వచ్చింది. అనితే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆనాటి గొడవ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు  ఏడాదిపాటు హాజరు కాకుండా రోజాను సస్పెండ్‌ చేశారు. దీనిపై రోజు న్యాయస్థానాలు ఆశ్రయించినా, చివరికి ఈఅంశం మళ్లీ అసెంబ్లీకే చేరింది. దీంతో రోజా ఆనాటి గొడవపై విచారం వ్యక్తం చేస్తానంటూ, తన సస్పెన్షన్‌కు ఎత్తివేయాలని స్పీకర్‌ కోడుల శివప్రసాదరావుకు లేఖ రాసిన అంశాన్ని అనిత ప్రస్తావించారు. రోజా విషయాన్ని స్పీకర్‌ చూసుకుంటారని చంద్రబాబు వ్యూహ కమిటీ దృష్టికి తెచ్చారు. రోజా లేఖలో ఏమాత్రం ప్రశ్చాతా భావం కనించిలేదని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం. తనకు బహిరంగ క్షమాపణ చెప్పకుండా రోజా సభలోకి అనుమంచివద్దని అనిత కోరారు. అంతిమంగా ఈ విషయాన్ని స్పీకర్‌ నిర్ణయానికే  విడిచెట్టాలని తీర్మానించారు. 
అసెంబ్లీ జరిగినన్ని రోజులు వ్యూహ కమిటీ భేటీ 
సభలో వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచించారు. ప్రతిపక్షం రెచ్చగొట్టినా సాధ్యమైనంత వరకు సంయమనం పాటించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ సాయంత్ర గంటపాటు వ్యూహ కమిటీలో భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆరోజు సమావేశాలను సమీక్షిచండంతోపాటు, మరుసటి రోజు అనురించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తారు. మొత్తం 28 అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని చంద్రబాబు పార్రటీ నేతలను ఆదేశించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేందిలేదని హెచ్చరించారు. 

 

20:54 - March 3, 2017

విజయనగరం : వాణిజ్యపన్నుశాఖ టార్గెట్‌కు చిరువ్యాపారులు విలవిల్లాడుతున్నారు. టీకొట్టు , పాన్‌షాప్‌ ఇలా దేనినీ  అధికారులు  వదలడంలేదు. కోట్ల టర్నోవర్‌ ఉన్న బడావ్యాపారులను వదిలేసి.. బతుకుదెరువు కోసం నానా అగచాట్లు పడుతున్న వారికి వడ్డింపులు మొదలు పెట్టారు.  విజయనగరం జిల్లాలో వాణిజ్యపన్నులశాఖ అధికారుల దూకుడుపై టెన్‌టీవీ స్టోరీ.  
వాణిజ్యపన్నుల అధికారులు కొరడా 
విజయనగరం జిల్లాలో వాణిజ్యపన్నుల అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. వీరి ప్రతాపానికి చిరువ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. మార్చి నెల కావడంతో వసూళ్ల టార్గెట్‌ మెడపై కత్తిలా వేలాడుతుండటంతో క్షేత్రస్థాయిలో ఒడ్డింపులు మొదలు పెట్టారు. 
చెలరేగిపోతున్న వాణిజ్యపన్నుల అధికారులు
మార్చి నెల...ఆర్థిక సంవత్సరం గడువు ముగుస్తుండటంతో లక్ష్యాల సాధనలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెలరేగిపోతున్నారు. టార్గెట్లను భర్తీచేసేందుకు చిరు వ్యాపారులపై ప్రతాపం చూపిస్తున్నారు. టీ దుకాణం, పాన్ షాప్ అన్న తేడా లేకుండా ఇష్టానుసారంగా వేలాది రూపాయల్లో పన్నులు, జరిమానాలు విధిస్తున్నారు. ఈ నెలాఖరి కల్లా 4 కోట్ల రూపాయల లక్ష్యం చేరాలన్న ఒకేఒక్క కారణంతో ఇష్టానుసారంగా పన్నులు వడ్డిస్తున్నారు. వాస్తవానికి ఏ వ్యాపార సంస్థ అయినా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే, సాధారణంగా రోడ్డు పక్కన ఉండే టీకొట్లు, పాన్ షాపులు, కిరాణా, కూరగాయల  దుకాణాలు లాంటి  చిరు వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేయించుకోరు. ఈ దుకాణాదారులకు  పన్నుల కట్టేంత లాభాలు కూడా  రావు. కాని, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వీటిని కూడా వదలడం లేదు. రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని, బకాయిలు చెల్లించలేదంటూ పెద్ద మొత్తంలో పన్నులు వడ్డించడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. 
పన్ను వసూళ్లలో అధికారుల చేతివాటం
వసూళ్ల హడావిడిలో కొందరు అధికారులు చేతివాటం చూపిస్తున్నారు. స్వామికార్యం...స్వకార్యం అన్నట్లు ఇటు పన్నులు...అటు మామ్మూళ్ల వసూళ్లతో  జేబులు దండిగా  నింపుకుంటున్నారనే ఆరోపణలొస్తున్నాయి.    
జరిమానాలు విధింపు విషయంలో కొద్దిపాటి సడలింపు ఇచ్చేందుకు భారీ ఎత్తున లంచాలు మొక్కుతున్నారని స్థానికులు అంటున్నారు.  వాణిజ్య పన్నుల శాఖ అంటే...లంచాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందన్న విమర్శలు జిల్లావ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇటీవల పార్వతీపురం వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీటీవోగా పనిచేసిన ఓ అధికారి  ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.  అయినా మామూళ్ల మత్తు మాత్రం వదలడంలేదు.  మామూళ్లు ఇవ్వని వ్యాపారులపై బెదిరింపులకు దిగడం, అధిక మొత్తంలో జరిమానాలు, పన్నులు విధించడం వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.  బడా వ్యాపారులను వదిలిపెట్టి .. తమపై జులం చూపిస్తున్నారని చిరువ్యాపారులు వాపోతున్నారు. 
వసూళ్లను సమర్థించుకుంటున్న అధికారులు  
అయితే ఈ వసూళ్లను అధికారులు సమర్థించుకుంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున లక్ష్యాల సాధనలో భాగంగానే పన్నులు వసూలు చేస్తున్నామని చెబుతున్నారు. బతుకుదెరువుకోసం తిప్పలు పడుతూ .. కుటుంబాన్ని అతి కష్టంపై నెట్టుకొస్తున్న తమపై  పన్నుల దందా ఏంటని చిరువ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. వాణిజ్యపన్నుల దందాతో తాము ఉపాధి కోల్పోయే పరిస్థి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాక్స్‌నుంచి తమను మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

 

20:49 - March 3, 2017

చిత్తూరు : రద్దైన వెయ్యి, 5వందల నోట్లను భక్తులు శ్రీవారి హుండీలో వేయడం ఇకనైనా మానుకోవాలని టీటీడీ ఈవో సాంబశివరావు కోరారు. పాతనోట్ల మార్పిడికి గడువు ముగిసినా భక్తులు ఇంకా వాటినే హుండీలో వేస్తున్నారని చెప్పారు. డిసెంబర్‌ 31 నుంచి  ఇప్పటి వరకు భక్తులు హుండీ ద్వారా 8.29 కోట్ల రూపాయలు సమర్పించారని చెప్పారు. ఈ నగదును తీసుకోవడానికి ఆర్బీఐ నిరాకరిస్తోందన్నారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో ఇవాళ డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...భక్తులు ఇకనైనా పాతనోట్లను   హుండీలో వేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

20:47 - March 3, 2017

విశాఖ : జిల్లాలోని పరవాడ మండలంలోని జవహర్‌ లాల్‌ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది.  ఫార్మాసిటీకి చెందిన 50 ఎకరాల ఖాళీ ప్రదేశంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి.  సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది 4 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫార్మాసిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. 

20:46 - March 3, 2017

కృష్ణా : విజయవాడ రోడ్లపై చుక్క వర్షపునీరు నిల్వకుండా చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎంపీ కేశినేని నాని అన్నారు. 461 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. డ్రైన్ల నిర్మాణంపై విజయవాడ కౌన్సిల్‌హాల్‌లో కార్పొరేటర్లు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బెజవాడను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. రోడ్లపై వర్షపునీరు నిల్వకుండా చేసే పనుల కాంట్రాక్ట్‌ను ఎల్‌ అండ్‌ టీకి అప్పగించామని చెప్పారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామన్నారు. 

 

20:42 - March 3, 2017

కృష్ణా : విజయవాడ రోడ్లపై చుక్క వర్షపునీరు నిల్వకుండా చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎంపీ కేశినేని నాని అన్నారు. 461 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. డ్రైన్ల నిర్మాణంపై విజయవాడ కౌన్సిల్‌హాల్‌లో కార్పొరేటర్లు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బెజవాడను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. రోడ్లపై వర్షపునీరు నిల్వకుండా చేసే పనుల కాంట్రాక్ట్‌ను ఎల్‌ అండ్‌ టీకి అప్పగించామని చెప్పారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామన్నారు. 

 

20:40 - March 3, 2017

విజయవాడ : అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీలో ప్రతిపక్షపార్టీలు సిద్ధమయ్యాయి. ఈనెల 6న విజయవాడలో అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల పరిష్కారం కోరుతూ దీక్ష చేయాలని నిర్ణయించాయి. ఈ దీక్షలకు  ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మద్దతు ప్రకటించారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేయాలని ఆయన కడపలో డిమాండ్‌ చేశారు. లేకపోతే  ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  

 

20:35 - March 3, 2017

విజయవాడ : ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షనేత జగన్‌పై అక్రమంగా కేసులు పెడుతోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన...  అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తక్షణమే అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. జగన్‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని తాము శాంతియుతంగా ధర్నా చేస్తే అరెస్ట్‌లు చేశారని మండిపడ్డారు.  ప్రభుత్వ మెప్పుపొందేందుకు  పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

20:32 - March 3, 2017

హైదరాబాద్ : హాట్‌ హాట్‌ విమర్శలు... వాద, ప్రతివాదాలు, చర్చలు, రచ్చలకు ఏపీ అసెంబ్లీ రెడీ అయింది.. మార్చి 6నుంచి తొలిసారి సొంత రాష్ట్రంలో సమావేశాలు జరగబోతున్నాయి.. సమావేశాల్లో చర్చలకు అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి.. అయితే ఈ సమావేశాల్లో టీడీపీకి రోజా మరోసారి టార్గెట్‌ కాబోతున్నారా? ఏడాది సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీకి వస్తున్న రోజాను అడ్డుకోవడానికి టీడీపీ వ్యూహాం రచిస్తోందా.. వాచ్‌ దిస్ స్టోరీ, 
టీడీపీ, వైసీపీల మధ్య పొలిటికల్ వార్ 
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీల మధ్య పొలిటికల్ వార్ తారా స్థాయికి చేరింది.. బస్సు ప్రమాదం తర్వాత విమర్శల జోరు పెంచిన పాలక, ప్రతిపక్ష పార్టీలు.. ఇక అసెంబ్లీలో నువ్వా నేనా అన్నట్లు తలపడబోతున్నాయి... ఇప్పటికే నందిగామ ఆస్పత్రిలో కలెక్టర్‌, ఇతర అధికారులతో ప్రతిపక్ష నేత జగన్‌ దురుసుగా ప్రవర్తించారంటూ ఏపీ ప్రభుత్వం కేసులుకూడా నమోదు చేయించింది..  అటు ఐఏఎస్ అధికారుల సంఘం , ఇటు పోలీసు అధికారుల సంఘంతో వరుస ప్రెస్ మీట్లు పెట్టించి మరీ జగన్ తీరును ఎండగట్టే ప్రయత్నం చేసింది.. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయకుండా తీవ్రత పెంచాలని ఏపీ క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పినట్లు సమాచారం..
ఏడాది సస్పెన్షన్‌ తర్వాత సమావేశాలకు వస్తున్న రోజా
విమర్శలమీద విమర్శలతో విరుచుకుపడుతున్న రోజాను అసెంబ్లీలో ఎలా ఆపాలన్నదానిపై కేబినెట్‌లో చర్చ నడిచినట్లు తెలుస్తోంది.. ఏడాది సస్పెన్షన్‌ తర్వాత ఈ నెల 6నుంచి ప్రారంభంకానున్న శాసనసభ సమావేశాలకు రోజా హాజరుకాబోతున్నారు...  ఈ మధ్య తరచూ సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌తోపాటు మంత్రులతీరుపై ఈ ఫైర్‌బ్రాండ్‌ మరింత విరుచుకుపడుతున్నారు.. ఇలా రోజుకోరకంగా నిప్పులు కక్కుతున్న రోజాను అసెంబ్లీలో టార్గెట్‌ చేయాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.. ఎమ్మెల్యే అనితపై రోజా వివాదాస్పద వ్యాఖ్యలను సభలో మళ్లీ చర్చకు తేవాలని టీడీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.. అనితతో రోజాపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేయించాలన్న ఆలోచనలో తెలుగుదేశం నేతలు ఉన్నారు.. అప్పుడు రోజా కచ్చితంగా దీనిని వివాదం చేస్తారని... ఇదే సాకుతో అమెను బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకూ అసెంబ్లీకి రాకుండా సస్పెండ్‌ చేయొచ్చన్నది టీడీపీ ప్లాన్‌గా తెలుస్తోంది..
ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకపోతే తెలుగు తమ్ముళ్లపై నెగటివ్‌ ఇమేజ్‌ 
మరోవైపు కొత్త అసెంబ్లీ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాన్ని ఆహ్వానించలేదన్న విమర్శలు టీడీపీని ఇరుకునపెట్టాయి.. రాష్ట్ర రాజకీయాలతో సంబంధం ఉన్న కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, జనసేన  నేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం టీడీపీ వర్గాల నుంచి కూడా వ్యక్తమైంది.. ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీపై మరింత ఎక్కువ ఎదురుదాడి చేస్తే తమకే ఇబ్బందని సైకిల్‌ పార్టీ నేతలు యోచిస్తున్నారు.. ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకపోతే తెలుగు తమ్ముళ్లపై నెగటివ్‌ ఇమేజ్‌ పడుతుందని పార్టీలో పలువురు నేతలు సూచిస్తున్నారు.. అందుకే ఈసారి సమావేశాల్లో వైసీపీకి కొంతవరకూ మాట్లాడే అవకాశం కల్పిస్తూ.... రోజాను టార్గెట్ చేయాలని మంత్రి యనమలతో పాటు పలువురు మంత్రులకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం.. 
అసెంబ్లీ సమావేశాలకు దీటుగా సిద్ధమైన వైసీపీ   
టీడీపీ వ్యూహం ఇలా ఉంటే వైసీపీకూడా దీటుగానే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది.. మంత్రులపై అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యేల దందాలు, టీడీపీ నేతల ప్రైవేటు ట్రావెల్స్ బిజినెస్‌పై ఎదురుదాడికి ప్రతిపక్షంకూడా రెడీ అంటోంది.. మొత్తానికి అధికార ప్రతిపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలతో ఈ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలున్నాయి. 

 

20:25 - March 3, 2017

సూర్యాపేట : జిల్లాల్లో నిమ్మ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.. పెట్టిన పెట్టుబడిఅయినా తిరిగిరాక నిమ్మకాయల్ని చెట్టుపైనే వదిలేస్తున్నారు రైతన్నలు.. వందల కిలోమీటర్ల దూరంలోఉన్న మార్కెట్‌కు పంట తరలించలేక... ఆ ఖర్చులు భరించలేక కన్నీరు పెట్టుకుంటున్నారు. జిల్లాలో నిమ్మ రైతుల దీనావస్థపై టెన్ టివి స్పెషల్ రిపోర్ట్. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

20:08 - March 3, 2017

హైదరాబాద్ : రాష్ట్ర విభజన దురదృష్టకరమన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ తప్పుపట్టారు. తెలంగాణపై చంద్రబాబు విషంకక్కుతున్నారని మండిపడ్డారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని చూసి చంద్రబాబు ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణతో అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు. కుట్రలు, కుతంత్రాలు చేయడంలో పోటీ పడవద్దని హితవు పలికారు.

 

20:07 - March 3, 2017

మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈరోజు మధ్యాహ్నం తన నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌లో పర్యటించారు. నియోజకవర్గంలో జరుగుతున్న మిషన్ భగీరథ, రైతు బజార్‌ నిర్మాణాలతో పాటు.. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కేసీఆర్ హామీ ఇచ్చారు. అనంతరం.. అధికారులతో... రివ్యూ నిర్వహించారు.

19:58 - March 3, 2017

మహబూబ్‌ నగర్‌/నిజామాబాద్‌ : మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌ జిల్లా ఏదైనా పరిస్థితి ఒక్కటే. మహబూబ్‌ నగర్‌ ఒకప్పుడు కెసిఆర్‌ ప్రాతినిథ్యం వహించిన జిల్లా. నిజామాబాద్‌ ఆయన కుమార్తె కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. కానీ ఏం లాభం? మహబూబ్‌ నగర్‌ లో రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్‌ శంఖుఃస్థాపన చేసినా, నిజామాబాద్‌  ఏడాది కవిత శంఖుఃస్థాపన చేసినా అవే మాటలు. అవే కథలు. అవే వ్యధలు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టిస్తున్నామంటూ, వున్న ఇళ్లను కూల్చేశారు. వున్న ఇల్లు కూల్చుకుని రేకుల షెడ్డుల్లో తలదాచుకుంటున్నారు లబ్ధిదారులు. మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో డబుల్‌ బెడ్‌ రూంలపై క్షేత్ర స్థాయి వాస్తవాలే ఇవాళ్టి స్పెషల్‌ ఫోకస్‌. 
మహబూబ్ నగర్ లో
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పరిస్థితి. మహబూబ్ నగర్ పట్టణంలో కొన్ని ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన్నప్పటికీ, పనులు నత్తనడకన సాగుతున్నాయి. అవి ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి.
లక్షల్లో దరఖాస్తులు
మహబూబ్ నగర్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారి సంఖ్య లక్షకు పైగా వుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలకు కలిపి 5600 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. స్టేట్ రిజర్వ్ కోటా కింద నాగర్ కర్నూలుకు మరో 400 ఇళ్లు మంజూరయ్యాయి. 
3560 ఇళ్లకు పరిపాలనా అనుమతులు 
జిల్లాల విభజన అనంతరం రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గం ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లాలో కలిసింది. ఈ జిల్లాకు 4440 ఇళ్లు మంజూరవ్వగా, 3560 ఇళ్లకు పరిపాలనా అనుమతులు లభించాయి. అంతే. అంతకుమించి మరేమీ జరగలేదు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తప్ప మరెక్కడా ఇళ్ల నిర్మాణం మొదలవ్వలేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల మీద ఆశలు పెట్టుకున్నవారిలో అసహనం పెరుగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో చిక్కుకున్నారు. 
ఇసుక సమస్య 
జిల్లాలో ఇసుక సమస్య తీవ్రంగా వుండడంతో కాంట్రాక్టర్లెవ్వరూ ముందుకు రావడం లేదు. మహబూబ్ నగర్ పట్టణంలో కొన్ని ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టిన్నప్పటికీ అవి పూర్తికాలేదు. మార్చి నాటికి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరేలా లేదు. దీంతో డబుల్ బెడ్ రూం దరఖాస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా పాదయాత్రలో పాల్గొన్న సిపిఎం బృందం ముందు తమగోడు వెళ్లబోసుకున్నారు. 
డబుల్‌ బెడ్‌రూం కట్టేదెప్పుడు?
నాలుగు నెలల్లో దావత్ చేసుకుందాం. ఎక్కడికెళ్లినా ఇదే మాట చెప్పే ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబ్ నగర్ మురికివాడలవాసులకూ ఇదే మాట చెప్పారు. నాలుగు నెలలు కాదు 26 నెలలైంది. కానీ దావత్ జరగలేదు. ఆయన శంకుస్థాపన చేసిన  డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇన్నాళ్లయినా పూర్తికాలేదు. 
శిథిలమవుతున్న శిలాఫలకం
26 నెలల క్రితం 2015 జనవరి 8న ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబ్ నగర్ మురికివాడల్లో పర్యటించారు. మురికివాడల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామంటూ కాలనీలలో కొబ్బరికాయలు కొట్టి, శంఖుస్థాపనలు చేశారు.  ఐదు నెలల్లో ఇళ్ల నిర్మాణ పూర్తి చేసి, దావత్ చేసుకుందామంటూ అందరికీ చెప్పినట్టే మహబూబ్ నగర్ వాసులకు కూడా కెసిఆర్ ఎక్కడలేని ఆశలు పెట్టారు. 
26 నెలలైంది..
నాలుగు నెలలు కాదు 26 నెలలైంది. నాలుగు నెలల్లోనే దావత్ అన్న ముఖ్యమంత్రి కెసిఆర్ మళ్లీ మహబూబ్ నగర్ మురికివాడల వైపు కన్నెత్తి చూడలేదు. ముఖ్యమంత్రి డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టిస్తున్నామంటూ చెప్పిన మాటలు నమ్మి వున్న ఇళ్లను కూలగొట్టుకున్నవారి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. అప్పులు చేసి రేకుల షెడ్డులు వేసుకోవాల్సి వచ్చింది. కెసిఆర్ చెప్పనట్టు నాలుగు నెలల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తికాలేదు. వున్న ఇల్లు లేకుండా పోయింది. తలదాచుకోవడానికి అప్పు చేయాల్సి వచ్చింది.
రేకుల షెడ్డుల్లోనే కాలం వెళ్లదీత
తాత్కాలికంగా వేసుకున్న రేకుల షెడ్డుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు  రేకులు ఎగిరిపోయాయి. మొన్నటి చలిగాలులకు రేకుల షెడ్డుల్లో గజగజ వణికిపోయారు. మార్చి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాబోయే కాలంలో ఈ రేకుల షెడ్డులలో ఎలా బతకాలంటూ ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు నమ్మి, ఉన్న ఇళ్లను కూల్చుకున్నవారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకెంతకాలం ఈ కష్టాలంటూ ప్రశ్నిస్తున్నారు. సిపిఎం చేపట్టిన మహాజన పాదయాత్రలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు తమగోడు వెళ్లబోసుకుంటూ అనేక మంది దరఖాస్తులు అందజేశారు.
శిలాఫలకానికి ఏడాది పూర్తి
మంత్రి జూపల్లి కృష్ణారావు ఏడాది క్రితం తలకొండకోపల్లి మండలం చెల్లంపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శిలాఫలం వేశారు. ఇప్పుడది శిథిలమవుతోంది. ఇళ్ల నిర్మాణం మాత్రం మొదలుకాలేదు. దీంతో విసిగిపోయిన జనం శిలాఫలకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒక రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి, జిల్లాకు చెందిన మంత్రి శంకుస్థాపన చేసిన చోటనే పరిస్థితి ఇలా వుంటే, ఇక మిగిలిన చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యెదెన్నడు? దావత్ లు చేసుకునేదెప్పుడు? 
నిజామాబాద్ జిల్లాలో...
ఎంపి కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలోనూ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో ఏ మాత్రం పురోగతి లేదు. 82 వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికి 1300 మంది అర్హులను మాత్రమే గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక కవిత శంఖు:స్థాపన చేసిన చోట ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు.
82000 దరఖాస్తులు
అది 2015 అక్టోబర్ 22. అదే రోజు ఎంపి కవిత, రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి శంఖు:స్థాపన చేశారు. అవి ఇప్పటికీ పూర్తికాలేదు. ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దాదాపు 82వేల దరఖాస్తులొచ్చాయి. అయితే, మంజూరైనవి ఇందులో పదో వంతు కూడా లేవు. నిజామాబాద్ జిల్లాకు 4990 ఇళ్లు, కామారెడ్డి జిల్లాకు 2675 ఇళ్లు మంజూరైనట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తం 120 గ్రామాల్లో 7665 ఇళ్లను మంజూరు చేశారు. కానీ, లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు. ఇప్పటి దాకా పరిశీలించిన దరఖాస్తుల్లో కేవలం 1305 మంది అర్హులనే మాత్రమే గుర్తించినట్టు తెలుస్తోంది.
కొలిక్కిరాని టెండర్ల ప్రక్రియ 
మరోవైపు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం టెండర్ల ప్రక్రియ కొలిక్కిరావడం లేదు. రోడ్లు భవనాల అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు దొరకడం లేదు. ఇంతకు ముందు నిర్మాణ పనులు చేసిన అనుభవం లేని ముంబైకి చెందిన ఓ సంస్థ టెండర్లు దాఖలు చేయగా, తొలుత అధికారులు ఆ సంస్థను ఫైనల్ చేద్దామనుకున్నారు. ఒప్పందం కోసం రావాలంటూ ఆ సంస్థకు లేఖ కూడా రాశారు. నిబంధనలు పక్కాగా అమలు చేయాలంటూ ఉన్నతస్థాయి అధికారులు ఆదేశించడంతో ముంబై సంస్థను ఫైనల్ చేయలేదు. జిల్లాలో పరిస్థితిని వివరిస్తూ జిల్లా కలెక్టర్ యోగితారాణా అధికారులకు నివేదిక పంపినట్టు తెలుస్తోంది.  కోటగిరి మండలం దొమలెడ్డి గ్రామంలో 40 డబుల్ బెడ్ రూంలు నిర్మిస్తుండగా, మరెక్కడా పనులు ప్రారంభం కాలేదు. జిల్లాలో క్షేత్రస్థాయి వాస్తవాలు చూస్తుంటే ఇప్పట్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ప్రజా ఉద్యమం నిర్వహించేందుకు సిపిఎం వ్యూహరచన చేస్తోంది. 
ఇచ్చిన మాట నిలుపుకోన్నప్పుడు ప్రజాగ్రహం 
ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఎవరైనా సరే ఇచ్చిన మాట నిలుపుకోన్నప్పుడు ప్రజాగ్రహం వెల్లువెత్తుతుంది. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఉద్యమాలు ఉదయిస్తాయి. పోరాటాలు పదునెక్కుతాయి. అధికార పార్టీలు మాట నిలుపుకోకపోతే, ప్రజలు పోరాడే శక్తుల వెంట సమీకృతులవుతారు. ఈ విషయం ముఖ్యమంత్రి కెసిఆర్‌ కి తెలియంది కాదు. ఇప్పుడు డబుల్‌ బెడ్‌ రూంల కోసం  ప్రజలు నినదిస్తున్నారు. . మహాజన పాదయాత్ర నిర్వహిస్తున్న సిపిఎం బృందానికి వెల్లువెత్తిన దరఖాస్తులే ఇందుకు నిదర్శనం.  

 

19:55 - March 3, 2017

ఢిల్లీ : యూనవర్శిటీల్లో వివక్షతలేని విద్య అందించాలంటూ ఎస్ ఎఫ్ ఐ నిరసన కార్యక్రమం చేపట్టింది. మండి హౌస్‌ దగ్గర బతుకమ్మ ఆడి విద్యార్థులు నిరసన తెలిపారు. అందరికీ సమాన విద్య అందించాలని డిమాండ్ చేశారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైనవారిపై చర్యకు డిమాండ్ చేశారు. 

 

19:13 - March 3, 2017

నెల్లూరు : జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్ధులు ఇవాళ... కాటమరాయుడు షూటింగ్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉన్న పవన్‌ను కలిశారు. వర్సిటీ సమస్యలు, అక్రమాలపై పవన్‌కు వివరించారు. వర్సిటీలో జరుగుతున్న అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా  ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని  వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్‌ వారికి హామీనిచ్చారు. 

 

మరోసారి ఎమ్మెల్సీ స్థానానికి నారా లోకేష్ నామినేషన్

హైదరాబాద్ : మరోసారి ఎమ్మెల్సీ స్థానానికి నారా లోకేష్ ఈనెల 6న నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా నారా లోకేష్‌ నామినేషన్ వేయనున్నారు. సంఖ్యా బలం బట్టి టీడీపీకి 5, వైసీపీకి 2 స్థానాలకు అవకాశం ఉంది. రెండు స్థానాలకు వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింంది. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించనుంది. 

19:06 - March 3, 2017

హైదరాబాద్ : మరోసారి ఎమ్మెల్సీ స్థానానికి నారా లోకేష్ ఈనెల 6న నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా నారా లోకేష్‌ నామినేషన్ వేయనున్నారు. సంఖ్యా బలం బట్టి టీడీపీకి 5, వైసీపీకి 2 స్థానాలకు అవకాశం ఉంది. రెండు స్థానాలకు వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింంది. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించనుంది. మార్చి 7న నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఏపీలో 6 స్థానాల్లో టీడీపీ ఏకగ్రీవం

హైదరాబాద్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. 9 స్థానిక సంస్థల ఎన్నికల్లో 6 స్థానాల్లో టీడీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మంతెన సత్యనారాయణ, అంగర రామ్మోహన్....శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శత్రుచర్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక అనంతలో టీడీపీ అభ్యర్థి దీపక్‌ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అభ్యర్థి చిక్కాల రామచంద్రరావు...చిత్తూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థి దొరబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ నెలకొంది.

18:55 - March 3, 2017

హైదరాబాద్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. 9 స్థానిక సంస్థల ఎన్నికల్లో 6 స్థానాల్లో టీడీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మంతెన సత్యనారాయణ, అంగర రామ్మోహన్....శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శత్రుచర్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక అనంతలో టీడీపీ అభ్యర్థి దీపక్‌ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అభ్యర్థి చిక్కాల రామచంద్రరావు...చిత్తూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థి దొరబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బెదిరింపులు రావడం వల్లే నామినేషన్‌ ఉపసంహరించుకున్నానని స్వతంత్ర అభ్యర్థి శ్రీకాంత్‌ తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:50 - March 3, 2017

హైదరాబాద్ : బాలకార్మిక వ్యవస్థకు తాను వ్యతిరేకమని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతారావు అన్నారు. ఈమేరకు ఆయనతో 10టివి ముఖాముఖి నిర్వహించింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సం.ల నుంచి పిల్లల హక్కుల కోసం పోరాడుతున్నానని చెప్పారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...
'ఇలాంటి దాడులు జరగడం సహజంగా భావిస్తున్నాను. ఇండ్లళ్లో పని చేస్తున్న ఆడ పిల్లల సంగతేంటనీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాల కార్మిక వ్యవస్థకు నేను వ్యతిరేకం. ఇండ్లళ్లో పని చేస్తున్న 830 మందికి విముక్తి కలగించాం. ఆదివారం, పండుగ దినాల్లో చిన్నారి కార్మికులకు సెలువులు లేవు. ఆదివారం, పండుగ దినాలల్లో అధికంగా పని చేయిస్తారు. ఎలాంటి వేతన ఉండదు. చిరిగిపోయిన బట్టలు, బానీన్ వేసుకుని ఉంది. ఓనర్..పుష్పపై తాము చేయచేసుకోలేదని, తిట్టలేదన్నారు. అనురాధ, లేబర్ డిపార్ట్ మెంట్ డి అరుణ, వినిత, ఆర్ ఐలు కలిసి వెళ్లాం. నాపై దాడి జరిగిందని రాచకొండ కమిషనర్ కు చెప్పాం. ఒక చిన్నారి అనంతపురం నుంచి మరొకరు మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలనే ఉద్దేశం లేదు. సమస్యలపై చిత్తశుద్ధి లేదు. ఓనర్ తమ ముందే చిన్నారిపై దాడికి పాల్పడింది. సెక్సవల్ ఆరాస్ మెంట్ కు పాల్పడుతున్నారు. చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు' అని తెలిపారు. 

రెసిడెన్షియల్ జోన్ లో పేదలకు ఇళ్లు కట్టివ్వాలి : మంత్రి ఈటెల

హైదరాబాద్ : 19 జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు అన్నీ హౌసింగ్ టెండర్లలో పాల్గొని కట్టినవే.. కానీ పూర్తి కాలేదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రెసిడెన్షియల్ జోన్ లో పేదలకు ఇళ్లు కట్టివ్వాలన్నారు. కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మబడ్డాయని తెలిపారు. 

 

నాచారంలో చిన్నారులతో వెట్టి చాకిరి

హైదరాబాద్ : బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుపై దాడి జరిగింది. పిల్లలతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ఓ మహిళ, ఆయనపై దాడికి తెగబడింది. ఈ ఘటన హైదరాబాద్‌ నాచారంలోని కార్తికేయనగర్‌లో జరిగింది. కార్తికేయనగర్‌లోని శ్రీసాయి నివాస అపార్ట్‌మెంట్‌లోని 201, 202 ఫ్లాట్లలో చిన్నారులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్‌ అచ్యుత్‌రావు శ్రీసాయి నివాస అపార్ట్‌మెంట్‌కు చేరుకుని... వెట్టిచాకిరి నుంచి పిల్లలకు విముక్తి కల్పించారు. అయితే.. పిల్లలను తీసుకెళ్లవద్దంటూ అచ్యుత్‌రావుపై ఇంటి యాజమానులు అడ్డుకున్నారు.

16:29 - March 3, 2017

హైదరాబాద్ : బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుపై దాడి జరిగింది. పిల్లలతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ఓ మహిళ, ఆయనపై దాడికి తెగబడింది. ఈ ఘటన హైదరాబాద్‌ నాచారంలోని కార్తికేయనగర్‌లో జరిగింది. కార్తికేయనగర్‌లోని శ్రీసాయి నివాస అపార్ట్‌మెంట్‌లోని 201, 202 ఫ్లాట్లలో చిన్నారులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్‌ అచ్యుత్‌రావు శ్రీసాయి నివాస అపార్ట్‌మెంట్‌కు చేరుకుని... వెట్టిచాకిరి నుంచి పిల్లలకు విముక్తి కల్పించారు. అయితే.. పిల్లలను తీసుకెళ్లవద్దంటూ అచ్యుత్‌రావుపై ఇంటి యాజమానులు అడ్డుకున్నారు. మీడియా ఎదుటే అచ్యుత్‌రావుపై దాడి చేశారు. 

 

16:27 - March 3, 2017

ఆగ్రా : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ మరోసారి ఇబ్బందులకు గురయ్యాడు. ఆగ్రాలో  'భూమి' సినిమా షూటింగ్‌ సందర్భంగా సంజయ్‌ దత్‌ సెక్యూరిటీ సిబ్బంది చెలరేగిపోయారు. స్థానికులతో ఘర్షణకు దిగారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  విలేకరుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు సంజయ్‌దత్‌పై కేసు నమోదు చేశారు.  సెక్యూరిటీ సిబ్బంది తరపున సంజయ్‌దత్‌ స్థానికులకు క్షమాపణ చెప్పారు.

 

16:22 - March 3, 2017

రంగారెడ్డి : తూర్కయాంజిల్‌లో జరిగిన గుంటి రాజేష్ హత్య కేసులోని ప్రధాన నిందింతులను అరెస్టు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే రాజేష్‌ హత్య జరిగిందన్నారు. తన కూతురు అనూష ఆత్మహత్యకు ప్రతీకారంగా శ్యాంసుందర్ రెడ్డి, అతని స్నేహితులు, కిరాయి హంతకులతో కలిసి రాజేష్‌ను హతమార్చారని చెప్పారు. 

16:15 - March 3, 2017

హైదరాబాద్‌ : ఎల్‌బీనగర్‌లో జరిగిన క్యాబ్‌లో యువతిపై ఆత్యాచారం కేసులోని నిందింతులు వేణు, ఇమ్మానుయేల్‌ ను అరెస్టు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. నిందింతులపై నిర్భయ కేసు నమోదు చేశామన్నారు. యువతి మాదాపూర్‌లో హెయిర్ స్టెలిష్ట్‌గా పనిచేస్తుందని.. తరచుగా క్యాబ్‌ల్లో విజయవాడకు వెళ్లడం యువతికి అలవాటని కమిషనర్ చెప్పారు. యువతిని ఆమె స్వస్థలం గుంటూరుకు తరలించామన్నారు. నిందింతుల్లో ఒకరైన ఇమ్మానుయేల్ ఇటీవలే సైబరాబాద్ వీఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడని భగవత్ వెల్లడించారు. క్యాబ్ లో యువతిపై వేణు, ఇమ్మానుయేల్‌ ఆత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. 

15:55 - March 3, 2017

సిద్దిపేట : దుబ్బాకలో ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సర్వీస్‌ రివాల్వర్‌తో భార్యను కాల్చి తాను కూడా కాల్చుకున్నాడు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా..  ఎస్‌ఐ చిట్టిబాబు పరిస్థితి విషమంగా ఉంది. చిట్టిబాబును ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ప.గో జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం

పశ్చిమగోదావరి : జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణతో టీడీపీ అభ్యర్థులు అంగర రామ్మోహన్, పాండువ శ్రీను ఏకగ్రీవం అయింది. ఇప్పటికీ శ్రీకాకుళం, అనంతపురం, తూర్పుగోదావరి, చిత్తూరులో టీడీపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. కడప, కర్నూలు, నెల్లూరులో మాత్రమే టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నెలకొంది. 

 

దుబ్బాక ఎస్ ఐ చిట్టిబాబు ఆత్మహత్య

సిద్దిపేట : దుబ్బాక ఎస్ ఐ చిట్టిబాబు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యను సర్వీస్ రివాల్వర్ తో కాల్చి చంపి అనంతరం తానూ కాల్చుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిట్టిబాబు మృతి చెందాడు. ఉన్నతాధికారుల వేధింపులే కారణమని బంధువులు అంటున్నారు. అవినీతి ఆరోపణలో చిట్టిబాబు సస్పెండ్ అయ్యారు. ఎస్సై చిట్టిబాబు కడప జిల్లాలకు చెందిన వాడు.

అమరావతి రాజధాని పర్యావరణ అనుమతులపై వాదనలు

ఢిల్లీ : అమరావతి రాజధాని పర్యావరణ అనుమతులపై ఎన్ జీటీలో ఏపీ తరపు న్యాయవాది గంగూళీ వాదనలు వినిపించారు. ఏపీ రాజధాని ఎంపికపై కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమించిందని ఏపీ న్యాయవాది కోర్టు కు వివరించారు. శివరామకృష్ణన్ కమిటీ అధ్యయనం చేసి అన్ని ప్రాంతాల కన్నా అమరావతి ఉత్తమమని సూచించిందని 
ఏపీ ప్రభుత్వం తెలిపింది. 

భద్రతా బలగాలపై దాడి..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామాలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు గ్రైనేడ్ దాడి జరిపారు. సీఆర్పీఎఫ్ మొబైల్ బంకర్ పై దాడి జరిపారు. ఓ సాధారణ పౌరుడు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి.

ఇసుక వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు..

నిర్మల్ : జైపూర్ ఇసుక వ్యాపారి శ్రీను ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. రూ. 2 కోట్ల అక్రమాస్తులున్నట్లు గుర్తించింది.

13:34 - March 3, 2017

నల్గొండ : జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు గోరెంకలపల్లి, మామిడాల స్టేజి, ఇండ్లూరు, తిప్పర్తి, కొత్తగూడెం, మాడుగులపల్లి, వేములపల్లిలో పాదయాత్ర కొనసాగుతోంది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. పేదల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేయడం లేదని.. అందరికీ సామాజిక న్యాయం కోసమే మహాజన పాదయాత్ర చేస్తున్నామన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

13:32 - March 3, 2017

విజయవాడ : పక్కా రిజిస్ట్రేషన్‌ ఉంది.. అయినా.. కబ్జారాయుళ్లను అవి అడ్డుకోలేదు. కష్టపడి కొనుకున్న ప్లాట్‌లను వదిలేసి పోవాలని హుకుం జారీ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. దీంతో ప్లాట్ల యజమానులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అధికారం మాది..అడిగేదెవడ్రా అంతా మాఇష్టం.. అంటున్నారు.. విజయవాడలోని అధికారపార్టీ నాయకులు. వీరికి పోలీసులు కూడా వంతపాడ్డంతో .. రిజిస్ట్రేషన్‌ ఉన్నా.. తమ ప్లాట్లను ఎలా దక్కించుకోవాలో తెలియక.. బాధితులు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.

సర్వే నెంబర్ 59/1H..లో..
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్ ఫ్లై ఓవర్ పక్కనే ఉన్న ఇందిరానగర్ లోని.. సర్వే నెంబర్ 59/1Hలో ఉన్న లాండ్‌ను 2001లో సీతారామయ్య అనేవ్యక్తి వద్ద 18 మంది కొనుగోలు చేశారు. ప్లాట్లుగా విభజించి వీరందరికీ పక్కాగా రిజిస్ట్రేషన్లు చేశారు సీతారామయ్య. అప్పట్నుంచి వీరంతా ఆ స్థలాల్లో ఉంటున్నారు. అయితే 2011లో చింతపల్లి సాంబశివరావు అనేవ్యక్తి ఆభూమి తనదని అడ్డం తిరిగాడు. సీతారామయ్య తన మామ అని, అతను చనిపోయే ముందు వీలునామా ద్వారా తనకు ఆస్తిని రాసిచ్చారని చెబుతూ అనుచరులతో వచ్చి ఈ స్థలాల్లో ఉంటున్న వారిని బెదిరించాడు. ఆ తర్వాత ఆ స్థల యాజమానులు పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన రెవెన్యూ అధికారులు 59/1H సర్వే నెంబర్లలోని స్థలాలు ఇప్పుడుంటున్న వారివేనని సర్టిఫికెట్లు జారీ చేశారు.

అధికారంలో టిడిపి..
ఆ తర్వాత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్లీ బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సోదరుడు బొండా శ్రీనివాసరావు, అతని అనుచరులు తిరిగి మళ్లీ ఆ స్థలాలను ఆక్రమించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 24న పొక్లెయినర్లతో వచ్చి ప్రహరీ గోడలను కూల్చివేశారు. దీంతో బాదితులు మళ్లీ పోలీసులనాశ్రయించారు. కానీ ఈసారి పోలీసుల తీరు మారింది. బాధితులకు అండగా నిలవాల్సింది పోయి.. కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే సోదరునికి వత్తాసు పలుకుతున్నారు. దీంతో పోలీసుల తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు బాధితులు. ఎమ్మెల్యే సోదరుడి దౌర్జన్యాలను అరికట్టాలని కోరుతున్నారు. మరోవిశేషం ఎంటంటే.. బాధితుల్లో ఓ రిటైర్డ్ డీఎస్పీ సైతం కూడా ఉన్నారు. తానెప్పుడో కొనుగోలు చేసిన స్థలాన్ని ఇపుడు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారని.. ఆ మాజీ అధికారి వాపోతున్నారు.

వామపక్షాలు..వంగవీటి మద్దతు..
మరోవైపు వామక్షాలతోపాటు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ బాధితులకు అండగా నిలుస్తున్నారు. గత మూడేళ్లుగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేదప్రజల ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వంగవీటి రాధాకృష్ణ ఆరోపిస్తున్నారు. నాలుగు వేల గజాల విలువైన స్థలాన్ని నకిలీ వీలునామాతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సహకరించటం, వారి అనుచరులు నేరుగా బెదిరింపులకు దిగడం, బాధితులు ప్రాణభయం ఉందంటూ తమకు రక్షణ కల్పించాలని మీడియాను, పోలీసులను ఆశ్రయించటం.. ఈవిషయాలన్ని చూస్తే.. రాజధాని నగరంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గూండాగిరి చేస్తున్న అధికారపార్టీ నేతలు, వారి అనుచరులను కట్టడిచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

13:28 - March 3, 2017

విజయవాడ : రెండున్నరేళ్ల పాలనపై రెఫరండానికి ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారా..? ఉపఎన్నికల ద్వారా ప్రజల రెస్పాన్స్ ను తెలుసుకునేందుకు రెడీఅయ్యారా...? ఫిరాయింపులపై ప్రతిపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బాబు వేస్తోన్న మాస్టర్ ప్లాన్ ఏంటి..? ఇప్పటికిప్పుడు ఉపఎన్నికలెలా సాధ్యం..? రాజీనామా చేయనున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలెవ్వరు...? ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ఇంతవరకు ఎన్నికల హామీలను సీఎం చంద్రబాబు నెరవేర్చలేదని ప్రతిపక్ష పార్టీలన్ని ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని ఎండగడుతున్నాయి. దీంతో ప్రభుత్వ పనితీరుపై నేరుగా ప్రజల నుంచే అభిప్రాయసేకరణకు సిద్ధమవుతున్నారు.

మంత్రివర్గ విస్తరణ..
త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తీరణలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వనున్నారు. వారిలో కర్నూలు జిల్లా నుంచి సీనియర్‌గా ఉన్న భూమా నాగిరెడ్డి, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి, విజయనగరం జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. అయితే వారిచేత ఎమ్మెల్యేలగా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజామోదం పొందాలని బాబు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూమా నాగిరెడ్డి.. మంత్రి పదవి పొందే వారిలో మెదటి స్ధానంలో ఉన్నారు. రాజకీయాల్లో సీనియర్ కావడంతో పాటు సామాజిక సమీకరణాల దృష్యా కర్నూల్ జిల్లాలోనే కాక మొత్తం రాయలసీమలో పట్టు సాధించవచ్చని బాబు భావిస్తున్నారు. ఇక రాయలసీమ ప్రాంతానికే చెందిన మరో సీనియర్ నేత చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌ రెడ్డికి కూడా మినిస్టర్ గిరి తధ్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్య కారణాల వల్ల తనను మంత్రి పదవి నుంచి తప్పించాలని కోరుతున్నారు. దీంతో అమరనాథ్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది.

ఉత్తరాదిన..
ఉత్తరాదిన పట్టు సాధించాలనే కారణంతో విజయనగరం జిల్లా బొబ్బిలి నియెజకవర్గ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు సైతం మంత్రిపదవి దక్కనున్నట్లు సమాచారం. ఇటీవల టీడీపీలో చేరిన సుజయ స్థానికంగా అత్యధిక ప్రజాధరణ కలిగిన నేత. ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కిమిడి మృణాళిని తన పదవి నుంచి వైదొలుగుతుండటంతో సుజయకు మంత్రి పదవి దక్కనుంది. వీరితో పాటు ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, తూర్పు గొదావరి జిల్లా నుంచి జ్యోతుల నెహ్రూల పేర్లు రేసులో ఉన్నప్పటకీ స్థానికంగా ఉన్న ప్రత్యేక పరిస్తితుల దృష్ట్యా మంత్రి పదవులు దక్కే అవకాశం తక్కువగా ఉంది.

మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?
తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విషయంలో ఎదురైన సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా భూమా నాగిరెడ్డి, అమర్ నాథ్‌ రెడ్డి, సుజయకృష్ణ రంగారావుల చేత రాజీనామా చేయించి మంత్రి పదవులు కేటాయించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం ఉపఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం కోరాలని టీడీపీ అధినేత ఆలోచనగా ఉంది. మరి బాబు మాస్టర్ ప్లాన్ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

పవన్ తో వర్సిటీ విద్యార్థులు..

హైదరాబాద్ : రామోజీ ఫిలిం సిటీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్థులు కలిశారు. వర్సిటీలో జరుగుతున్న అక్రమాలు, సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థులకు అండగా ఉంటానని పవన్ హామీనిచ్చారు. యూనివర్సిటీలో అక్రమాలు, సమస్యలపై వెంటనే ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ వేయాలని, యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను మంత్రి గంటా శ్రీనివాస్ యాదవ్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

13:10 - March 3, 2017

నాంపల్లి కోర్టుకు మై హోమ్స్ అధినేత..రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ : మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు వేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టుకు టిటిడిపి నేత రేవంత్ హాజరయ్యారు. కానీ రామేశ్వరరావు తరపు న్యాయవాది ఆలస్యంగా కోర్టుకు వచ్చారు. తన సమయం వృధా చేశారంటూ రామేశ్వరరావుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేట్ మెంట్ రికార్డుకు రామేశ్వరరావు సమయం కోరారు. తదుపరి విచారణ ఈనెల 31కి వాయిదా వేసింది.

12:55 - March 3, 2017

ప్రస్తుత సమాజంలో మహిళల పట్ల దాడులు జరుగుతున్నాయి. హింస అనేక రూపాల్లో జరుగుతోంది. ఎవరు ఎక్కడి నుండి హానీ తలపెడుతారో..దాడులు చేస్తారో తెలియని సమాజంలో ఉంటున్నాం. మరి ఒకరి కోసం ఎదురు చూడకుండా ఆత్మరక్షణ పద్ధతులు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:50 - March 3, 2017

47 ఏళ్ల తరువాత ఓ ఆడపిల్లకు వివాహం జరుగబోతోంది. అంగన్ వాడీ కార్యకర్తలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు..గర్భిణీలకు అవసరం లేకుండానే సిజేరియన్ చేస్తున్నారు..యువతిపై జరిగిన దాడి కేసులో శిక్ష తప్పించడంపై సుప్రీంకోర్టు విస్మయం..ట్రంప్ నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులు..ఆస్కార్ అవార్డులో మెరిసిన అతివలు..నిరుపేద అతివ ఘనత...తొలి మహిళ ఐపీఎస్ రిటైర్ మెంట్..మహిళా ప్రపంచ చెస్ తెలుగు తేజం ద్రోణవల్లి హరిక ఆశ నెరవేరలేదు..సైనా నెహ్వాల్ కు కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది..పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి..

12:28 - March 3, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కదం తొక్కారు. విద్యారంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆందోళన చేపట్టింది. మండి హౌస్ నుండి పార్లమెంట్ స్ట్రీట్ వరకు ఎస్ఎఫ్ఐ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్నారు. యూనివర్సిటీలో జరుగుతున్న దాడులను ఖండించింది. మోడీ అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేస్తోందని విమర్శించారు. బడ్జెట్ లో విద్యారంగానికి నిధులు కేటాయించాలని, విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తోంది. విశ్వవిద్యాలయాల్లో ఆర్ఎఉస్ఎస్ ఏజెండా అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని, పలు రకాలుగా తాము ఆందోళనలు చేయడం జరిగిందన్నారు. విద్యారంగాన్ని కాపాడడమే కాకుండా బడ్జెట్ లో విద్యారంగానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎజెండా మార్చుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు.

12:19 - March 3, 2017

హైదరాబాద్ : ఎట్టకేలకు వాసవి కాలేజీ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడంపై విద్యార్థులు..తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం సాయంత్రం శ్రీనివాస్, శ్యాం సుందర్ లను అరెస్టు చేశారు. వాసవి కాలేజీలో 250 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైనా విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం హాల్ టికెట్లు అందచేయలేదు. దీనితో న్యాయం చేయాలంటూ విద్యార్థులు..తల్లిదండ్రులు కాలేజీ ఎదుట, ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ కుమార్ తో పాటు అధికారులు లంచాలు అడిగారని, అందుకనే హాల్ టికెట్లు జారీ చేయలేకపోయామని కళాశాల యాజమాన్యం పేర్కొంటోంది. మరి విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి.

అధికారులతో వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశం..

హైదరాబాద్ : మిషన్ భగీరథ పనుల పురోగతిపై అధికారులతో వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశమయ్యారు.

12:10 - March 3, 2017

హైదరాబాద్ : అనేక స‌మ‌స్యలు...సవాళ్ళ మ‌ధ్య కాంగ్రెస్ కోఆర్డినేష‌న్ క‌మిటీ భేటీ జరుగుతోంది. దిగ్విజ‌య్ సింగ్‌ నేతృత్వంలో నిర్వహించబోయే స‌మావేశంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలు కలవరం రేపుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను స‌మీక్షించుకుని.. భవిష్యత్‌ కార్యాచరణకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయ‌నుంది హస్తం పార్టీ. 6 నెల‌ల త‌ర్వాత సమావేశం కాబోతున్న తెలంగాణ కాంగ్రెస్‌ సమన్వయ కమిటీకి సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. గాంధీభ‌వ‌న్‌లో శుక్రవారం ఉద‌యం సమావేశం ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజ‌య్ సింగ్, క‌మిటి స‌భ్యులు హాజ‌రయ్యారు. కానీ కోమటిరెడ్డి, రేణుకా చౌదరి, రాపోలు, సర్వే, షబ్బీర్ ఆలీలు డుమ్మా కొట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో తాజాగా నెల‌కొన్న ప‌రిణామాలపై కోఆర్డినేషన్‌ కమిటీలో చర్చించే అవకాశం ఉండటంతో.. పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.

ఢిల్లీలో ఎస్ఎఫ్ఐ ర్యాలీ..

ఢిల్లీ : మండి హౌస్ నుండి పార్లమెంట్ స్ట్రీట్ వరకు ఎస్ఎఫ్ఐ ర్యాలీ నిర్వహించింది. బడ్జెట్ లో విద్యారంగానికి నిధులు కేటాయించాలని, విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తోంది. వర్సిటీల్లో జరుగుతున్న దాడులను ఎస్ఎఫ్ఐ ఖండించింది.

టిపిసిసి సమన్వయ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : గాంధీభవన్ లో టిపిసిసి సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కలు హాజరయ్యారు.

ఎస్ పీడీసీఎల్ లో ఉద్రిక్తత..

చిత్తూరు : తిరుపతి ఎస్ పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ చేపట్టింది. ఛార్జీల పెంపు తగదని కమిషన్ ఎదుట వామపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. రెగ్యులేటరీ కమిషన్ ఛైర్ పర్సన్ జస్టిస్ భవానీ ప్రసాద్ తో వాగ్వాదం జరిగింది.

శ్రీవారికి రూ.8.29 కోట్లు చెల్లని నోట్లు..

తిరుమల : ఈనెల 8 నుండి 12 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి హుండీకి డిసెంబర్ 31 నుండి ఇప్పటి వరకు రూ. 8.29 కోట్ల చెల్లని నోట్లు సమర్పించారని టిటిడి ఈవో వెల్లడించారు. నిత్యన్నదాన పథకానికి రూ. 800 కోట్లు విరాళాలు వచ్చాయని, కార్పొరేట్ కంపెనీలు విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తే వారికి శ్రీవారి దర్శనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

11:46 - March 3, 2017

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్ మెన్స్ ఎవరంటే ఆస్ట్రేలియా నవతరం క్రికేటర్స్ యాంగ్రీ యంగ్ గన్ మెన్ 'విరాట్ కోహ్లీ' కే ఓటు వేశారు. ఈ సందర్భంగా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. టీ20లో మాత్రం సఫారీస్ సూపర్ మ్యాన్ డివిలియర్స్ కు ఓటు వేశారు.

11:27 - March 3, 2017

చిత్తూరు: ‘ఛార్జీలు పెంచొద్దు..భారీలు మోపోద్దు' అంటూ వామపక్ష నేతలు..రైతు సంఘం నేతలు నినదించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో బహిరంగ విచారణ జరిగింది. ఛార్జీల పెంపు తగదని కమిషన్ ఎదుట వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. రెగ్యులేటరీ కమిషన్ ఛైర్ పర్సన్ జస్టిస్ భవానీ ప్రసాద్ తో వాగ్వాదానికి దిగారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:14 - March 3, 2017
11:11 - March 3, 2017

హైదరాబాద్ : వనస్థలిపురంలో ఉన్న వాసవి కాలేజీ విద్యార్థులకు న్యాయం జరుగుతుందా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హాల్ టికెట్లు అందకపోవడం వల్ల నష్టపోయామని విద్యార్థులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వాసవి కాలేజీలో చదువుతున్న 250 విద్యార్థులకు హాల్ టికెట్లు రావకపోవడంతో రోడ్డెక్కారు. విద్యా సంవత్సరం కోల్పోతారన్న భయంతో విద్యార్థులు..వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. దీనితో ప్రభుత్వం దిగొచ్చి కేసులు నమోదు చేయడం జరిగిందని, సప్లిమెంటరీ పరీక్షల్లో వీరికి అవకాశం కల్పిస్తామని హామీనిచ్చింది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు అధికారుల తప్పిదంతోనే హాల్ టికెట్లు రాలేదని ప్రిన్స్ పాల్ శ్రీనివాస్ టెన్ టివికి తెలిపారు. దీనిపై ఇంటర్ బోర్డు అధికారులు భిన్నమైన వ్యాఖ్యలు వినిపించారు. ఇంటర్ బోర్డు అధికారులు లంచం తీసుకున్నారని శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం ప్రిన్స్ పాల్ శ్రీనివాస్ ను అరెస్టు చేశారు. అప్పటికే 406, 420 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటర్ బోర్డుపై కూడా కేసులు నమోదు చేశారు. కానీ విద్యార్థులకు మేలు జరుగుతుందా ? అనేది చూడాలి.

వాసవి కాలేజీ ప్రిన్స్ పాల్ అరెస్టు..

హైదరాబాద్ : వనస్థలిపురం వాసవి కాలేజీ ప్రిన్స్ పాల్ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా మోసం చేసిన సంగతి తెలిసిందే.

10:58 - March 3, 2017

టెస్ట్‌ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా....ఆస్ట్రేలియాతో అసలు సిసలు సమరానికి సన్నద్ధమైంది.టెస్టుల్లో తిరుగులేని విజయాలతో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌...తొలి టెస్ట్‌ ఓటమితో ఢీలా పడింది. పక్కా గేమ్‌ ప్లాన్‌తో కంగారూలకు చెక్‌ పెట్టాలని కొహ్లీ అండ్‌ కో పట్టుదలతో ఉండగా..... సెకండ్‌ టెస్ట్‌లోనూ నెగ్గి సిరీస్‌పై పట్టు బిగించాలని ఆస్ట్రేలియన్‌ టీమ్‌ తహతహలాడుతోంది. సొంతగడ్డపై టీమిండియా అసలు సిసలు టెస్ట్‌కు సన్నద్ధమైంది. బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో భారత్‌,ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. సెకండ్‌ ర్యాంకర్‌ ఆస్ట్రేలియాకు టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా సవాల్‌ విసురుతోంది. ట్రెడిషనల్‌ ఫార్మాట్‌లో తిరుగులేని విజయాలతో ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా...తొలి టెస్ట్‌లో మాత్రం ఢీలా పడింది. పూణే టెస్ట్‌ ఓటమితో ఒక్కసారిగా డైలమాలో పడింది. తొలి టెస్ట్‌కు ముందు అన్ని విభాగాల్లోనూ ఆస్ట్రేలియా కంటే పటిష్టంగా కనిపించిన టీమిండియా రెండున్నర రోజుల్లోనే తేలిపోయింది. బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమవ్వడంతో పాటు స్పిన్నర్లు అంతగా ప్రభావం చూపలేకపోవడంతో పూణే టెస్ట్‌లో భారత జట్టుకు భంగపాటు తప్పలేదు.

భారత్ బ్యాటింగ్..బౌలింగ్..
విరాట్‌ కొహ్లీ,రాహుల్‌, మురళీ విజయ్‌, చటేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే వంటి ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్‌తో భారత జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉందనడంలో అనుమానమే లేదు. కానీ సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ బాధ్యతాయుతంగా ఆడి భారీ స్కోర్లు రాణించడం మీదనే భారత జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. టాప్‌ క్లాస్‌ స్పిన్నర్లు, పదునైన పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌తో భారత బౌలింగ్‌ విభాగం పవర్‌ఫుల్‌గా ఉంది. నిలకడగా బౌలింగ్‌ చేస్తోన్న ఉమేష్‌ యాదవ్‌తో పాటు స్పిన్‌ ట్విన్స్‌ అశ్విన్‌, జడేజా బంతితో మ్యాజిక్‌ చేస్తే భారత్‌కు తిరుగుండదు. మొదటి టెస్ట్‌లో విఫలమైన ఇషాంత్‌ శర్మ, జయంత్‌ యాదవ్‌ స్థానాల్లో భువనేశ్వర్‌ కుమార్‌, కరుణ్‌ నాయర్‌కు రెండో టెస్ట్‌లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జోరు మీదున్న కంగారు టీమ్..
మరో వైపు కంగారూ టీమ్‌ జోరు మీదుంది.అనామక జట్టుగా భారత్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు తొలి టెస్ట్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పూణే టెస్ట్‌తో భారత్‌ జైత్రయాత్రకు ఫుల్‌స్టాప్‌ పెట్టిన కంగారూ టీమ్‌ సెకండ్‌ టెస్ట్‌లోనూ నెగ్గి సిరీస్‌పై పట్టు బిగించాలని తహతహలాడుతోంది. స్టీవ్‌ ఒకీఫ్‌, నాథన్‌ లయోన్‌ మరోసారి స్పిన్‌ మ్యాజిక్‌తో భారత బ్యాట్స్‌మెన్‌కు చెక్‌ పెట్టాలని ప్లాన్‌లో ఉన్నారు. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో ఆస్ట్రేలియా జట్టు ధీమాగా ఉంది. సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌,షాన్‌ మార్ష్‌, స్పీడ్‌ గన్ మిషెల్‌ స్టార్క్‌ సైతం చెలరేగితే ఆస్ట్రేలియాను అడ్డుకోవడం కష్టమే.
తొలి టెస్ట్‌ ఓటమితో షాక్‌లో ఉన్న టీమిండియా సెకండ్‌ టెస్ట్‌లో నెగ్గి తీరాలని పక్కా గేమ్‌ ప్లాన్‌తోనే సమాయత్తమవుతోంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోన్న విరాట్‌ ఆర్మీకి....ఆస్ట్రేలియాను ఓడించడం పెద్ద సవాలే అనడంలో అనుమానమే లేదు. మరి బెంగళూర్‌ టెస్ట్‌లో నెగ్గి భారత్‌ సిరీస్‌ను సమం చేయగలదో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై అత్యాచారయత్నం..

హైదరాబాద్ : ఎల్బీనగర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ - పంతంగి టోల్ ప్లాజా సమీపంలో క్యాబ్ డైవర్లు ఉద్యోగిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. యువతి కేకలు వేయడంతో డ్రైవర్లు పరారయ్యారు. చౌటుప్పల్ పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. నిందితులు నికోలస్, మహేష్ లను పోలీసులు అరెస్టు చేశారు.

బాలయోగికి బాబు నివాళులు..

విజయవాడ : అమరావతిలో లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి 15వ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. బాలయోగి తనకెంతో ఆప్తుడని, ఆయనలోని ప్రతిభను గుర్తించే లోక్ సభ స్పీకర్ ను చేయడం జరిగిందన్నారు. దళితుడిని తొలిసారి లోక్ సభ స్పీకర్ ను చేసిన ఘనత టిడిపిదేనని తెలిపారు.

శ్రీకూర్మంలో విషాదం..

శ్రీకాకుళం : గార మండలం శ్రీకూర్మంలో విషాదం చోటు చేసుకుంది. శ్వేత పుష్కరిణిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు విజయనగరం వాసులు అభిరామ్, నవీన్ లుగా గుర్తించారు.

ప్రైవేటు కాలేజీ బస్సు డ్రైవర్ కు గుండెపోటు..

హైదరాబాద్ : నారాయణగూడలో బీవీఆర్ఐటీ కాలేజీ బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. బస్సులోని విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు.

 

10:44 - March 3, 2017

మహబూబ్ నగర్ : కరవు జిల్లా పాలమూరు ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. జిల్లాకు వరప్రదాయినిగా పేరొందిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. దీంతో జూరాలపై ఆధారపడిన జలాశయాలు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి. రోజురోజుకు పడిపోతున్న నీటిమట్టం జిల్లా వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్‌లో నీటి కష్టాలను ఊహించుకుని జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు. పాలమూరు జిల్లా ప్రజల గొంతెండుతోంది. అసలే ఉపాధి కోసం వలస బాట పడుతున్న ఇక్కడి వారికి ఇప్పుడు తాగునీటి సమస్య బెంగ పట్టుకుంది. మార్చి మొదట్లోనే ఎండలు మండుతుండటంతో.. చుక్కనీరు దొరకని దుస్థితి నెలకొంది. మూగ జీవాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. బయట ఎక్కడ కూడా చుక్క నీరు దొరక్క పశువులు బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. బావులు, బోర్లు ఎండిపోయి.. జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులకోసారి కూడా నీళ్లు అందకపోవడంతో... ఈ ఏడాది వేసవిని ఊహించుకుని మరింత బెంబేలెత్తుతున్నారు. తాగునీటి కోసం రానున్న రెండు మూడు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన స్థానికుల్లో పట్టుకుంది.

బీకే ఉప్పునుంతల..
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న బీకే ఉప్పునుంతల గ్రామస్థులకు కిలోమీటర్ల దూరంలో గల నీళ్లబావే ఆధారం. నిజాం కాలంలో నిర్మించిన ఈ బావి నుంచే ఇప్పటికీ నీళ్లు తోడుకుని దాహాన్ని తీర్చుకుంటున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న జనాభా, మారుతున్న వాతావరణ పరిస్థితుల క్రమంలో ఇప్పుడీ బావిలో కూడా నీరు లేక జనం అల్లాడుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడి నీటి ఎద్దడి సమస్యను మాత్రం తీర్చడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో దూరాన ఉన్న బావి నుంచి చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు నీళ్లు తెస్తున్నా.. అవి అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదని... తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ఇతర గ్రామాల ప్రజలు తమ ఊరికి పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఏదైనా చిన్న శుభ కార్యం చేయాలన్న.. ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇంటికి చుట్టమొస్తే గ్లాసెడు మంచినీళ్లు ఇవ్వలేదని దుస్థితి. వారం రోజుల క్రితం గ్రామంలోని ఓ చేతి పంపునకు మోటర్ బిగించారు. అయినా.. ఆ చేతిపంపు నుంచి నీళ్లు సరిగ్గా రావడం లేదు. అరకొరా నీళ్లు వచ్చినా..అవి ఎవరికీ సరిపోవడం లేదని.. నీటి ఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని బీకే ఉప్పునుంతల గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

అడుగంటుతున్న భూగర్భ జలాలు..
వేసవిలో నీటి కొరత నివారణకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏ మాత్రం సరిపోవడం లేదు. ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా సరఫరా చేస్తున్న నీరు ప్రజల అవసరాలను తీర్చడం లేదు. నీటికోసం పలుచోట్ల అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. మునిసిపల్‌ కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. రక్షిత మంచినీటి పథకాలు అధికారుల నిర్లక్ష్యం నీడలో నిర్వీర్యమై పోతున్నాయని పాలమూరు జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పెట్టి నీటిని కొనుక్కోవాల్సి వస్తోందని, నీరు లేకుంటే రోజులు గడిచేదెలా అని స్థానిక మహిళలు ప్రశ్నిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న భానుడి భగభగలు.. అడుగంటుతున్న భూగర్భ జల వనరులు.. పాలమూరు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చాల్సిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చేతులెత్తేస్తుండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. పాత పాలమూర్‌ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో తాగునీటి కష్టాలు తారా స్థాయికి చేరుతున్నాయి. నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల్‌, వనపర్తి ప్రాంతాల్లో గొంతెండిపోయి దాహార్తి కేకలే వినిపిస్తున్నాయి. ముదురుతున్న ఎండలంతో మనుషులకే కాదు.. మూగజీవాలకు సైతం గొంతు తడుపుకోవడం కష్టంగా మారుతోంది. తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చి పల్లెలు, పట్టణాలు విలవిల్లాడుతున్నాయి.

సమస్యను తీర్చాలంటున్న గ్రామస్తులు..
గ్రామాల్లో పశువుల నీటి తొట్టెలు లేక.. మూగజీవాల గొంతెండి బిక్కుబిక్కుమంటున్నాయి. చెరువులు, కుంటల్లో నీరున్నా.. చుట్టుపక్కల పంటలు అడ్డుగా ఉండటంతో మూగజీవాలకు నీరు లభించడం గగనంగా మారింది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తొట్టిల నిర్మాణాలను చేర్చినా.. వాటిని పర్యవేక్షించే నాథుడే కరువయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వం పశువుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఇంటింటికి రక్షిత మంచినీరు అందించాలని సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకున్నా.. పాలమూరు జిల్లాలో దానికి సంబంధించిన పనుల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. పనుల్లో సాంకేతిక సమస్యలతో పాటు కాంట్రాక్టర్ల జాప్యం కూడా గడువులోగా పనులు పూర్తి కాకపోవడానికి కారణమవుతోంది. నీటి ఎద్దడి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాలమూరు జిల్లా వాసులు.. రానున్న ఏప్రిల్‌, మే నెలల్ని ఊహించుకుని మరింత బెంబేలెత్తిపోతున్నారు. అధికారులు మంచినీటి పథకాల నిర్వహణను సక్రమంగా నిర్వహిస్తే సమస్యను కొంతైనా తీర్చినవారవుతారని చెబుతున్నారు.

రెండు మంచినీటి పథకాలున్నా..
రెండు మంచినీటి పథకాలున్నా... వనపర్తి పట్టణానికి నీటి గోస తప్పడం లేదు. ప్రణాళిక లేమి.. నేతల మందకొడి వైఖరి తాగునీటి సరఫరాపై ప్రభావం చూపుతోంది. రెండు పథకాల్లో ఒకటి పడకేసి ఏడాదైంది. రెండో దానికి ఎప్పుడూ ఏదో సమస్య. దీంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన రామన్‌పాడు పాత స్కీం ఏడాది కాలంగా నిరుపయోగకంగా మారింది. ఇంటెక్విల్, ఎర్రగట్టు, కానాయపల్లి వద్ద పనిచేయాల్సిన మూడు మోటార్లు చెడిపోయినా అవి మరమ్మతులకు నోచుకోవడం లేదు. నాసిరకం పైపులు వేసి అధికారులు చేతులు దులుపుకొన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, షాద్‌నగర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, అయిజ, కల్వకుర్తి మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వివిధ వాటర్ స్కీంల ద్వారా నీటి సరఫరా అవుతోంది. జూరాల, రామన్ పాడు, కోయిల్ సాగర్ రిజర్వాయర్ల ద్వారా మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి, జములమ్మ రిజర్వాయర్‌తో గద్వాల మున్సిపాలిటీకి, రామన్‌పాడు రిజర్వాయర్‌ ద్వారా వనపర్తితో పాటు నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట నగర పంచాయతీలకు నీటి సరఫరా అవుతోంది. అయితే.. నారాయణపేట, కల్వకుర్తి, షాద్ నగర్ మున్సిపాలిటీలకు మాత్రం బోర్లే దిక్కు. కానీ ఆ బోర్లు కూడా ఎండిపోవటంతో తాగునీటి ఎద్దడి తీవ్రమవుతోంది.

పడిగాపులు..
అయిజ మున్సిపాలిటీలోని 35 వేల జనాభాకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినా.. అవి సరిపోవడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర్లోనే ఉన్నా.. కృష్ణానది పక్కనే పారుతున్నా... అచ్చంపేటకు నీటి సరఫరా కావడం లేదు. ప్రైవేట్ వాటర్ ప్లాంటు నిర్వాహకులు ఫిల్టర్ నీటి పేరుతో కలుషిత నీటిని విక్రయిస్తూ.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. జడ్చర్ల మండలం వల్లూరులో రాత్రీ పగలూ తేడా లేకుండా తాగునీటి కోసం పొలాలు, బోర్లు, నల్లాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో 14 బోర్లు వేసినా నీళ్లు పడక, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని చాలా గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు చాలానే ఉన్నాయి. నీటి ఎద్దడి ఇంత తీవ్రంగా ఉన్నా...గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు పకడ్బంది చర్యలకు పూనుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్‌, మే నెలల్లో నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందోనని పాలమూరు జిల్లా ప్రజలు భయపడుతున్నారు.

కేసీఆర్ హామీ నెరవేరుతుందా ?
ఇక 2019 నాటికి ఇంటింటికీ తాగునీరు అందిస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ మహబూబ్‌నగర్‌ జిల్లాలో నెరవేరే దాఖలాలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే.. జిల్లాలో ఇప్పటికీ.. క్లస్టర్లే మొదలు కాలేదు. పైపులైన్ల పనులు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. సాంకేతికంగా ఎదురవుతున్న ఆటంకాలతో వాటర్‌ గ్రిడ్‌ ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, స్ట్రక్షర్లు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మోటార్ల మెకానిక్‌ పనులు, లింకు పనులు ఇంకా జరగాల్సి ఉంది. ఇన్ని సమస్యల తరుణంలో జిల్లా ప్రజలకు ఇంటింటికి తాగునీరు అందించడం ఎప్పటిలోగా పూర్తవుతోందన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని వాటర్‌ గ్రిడ్‌ పనులు వేగిరంగా పూర్తి చేయాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

10:22 - March 3, 2017

హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు తుదిరూపు తీసుకువచ్చింది. ఈసారి గతానికి భిన్నంగా ప్రణాళిక, ప్రణాళికేతర విభాగాలను తొలగిస్తూ.. ప్రగతి నిర్వహణ పద్దులను చేర్చింది. బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో మార్పులు, చేర్పులపై కసరత్తు పూర్తిచేసింది. శాఖల వారీగా, అంశాల వారీగా దేనికెంత కేటాయింపులు చేయాలనే విషయంపై ప్రభుత్వం స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు సమాచా రం. రాష్ట్రంలో 32 ప్రభుత్వ శాఖలు, దాదాపు 190విభాగాల అధిపతుల నుంచి వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలకు సమప్రాధాన్యం కల్పిస్తూ.. సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్‌కు తుదిరూపు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంక్షేమ పథకాలకు రూ. 49వేల కోట్లు..
అయితే గతానికి భిన్నంగా బడ్జెట్ కొత్త రూపుదిద్దుకుంటోంది. బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు లేకుండా ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులను బడ్జెట్‌లో పొందుపరచనుంది. ప్రగతి పద్దులో అణగారిన, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది. విద్య,వైద్యం, ఇతర సంక్షేమపథకాలకు ప్రభుత్వం దాదాపు 36వేల కోట్లు ఖర్చు చేస్తుండగా.. ఈసారి మరో 10వేల కోట్ల రూపాయల వరకు కేటాయింపులు పెరిగి.. మొత్తం 46 వేల కోట్లకు చేరుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి బడ్జెట్‌లో కొన్ని ప్రాజెక్టులకు అధిక కేటాయింపులను కొంతవరకు తగ్గించి సంక్షేమ కార్యక్రమాలకు వాటా పెంచే అవకాశముంది. సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడానికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్లు తెలుస్తొంది. ఒంటరి మహిళలకు నెలకు 1,000 రూపాయలు జీవనభృతి ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మరోవైపు, అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమానికి వేయి కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నారు.

బడ్జెట్ పుస్తకం..
ఇక బడ్జెట్‌లోని ప్రగతి పద్దులో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు బదులు ఎస్సీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను చేరుస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద మొత్తం బడ్జెట్‌లో 16 శాతం, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 9.28 శాతం నిధులను కేటాయిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు ఉపప్రణాళికల కింద 16,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. కొత్త బడ్జెట్‌లో ఈ నిధులూ కూడా పెరగనున్నాయి. కనీసం 15 శాతం పెరుగుదల ఉంటుందని అధికారవర్గాల సమాచారం. ఇక సామన్యులకు సైతం అర్ధమైయ్యేలా... రాష్ట్ర బడ్జెట్ గురించి సరళమైన రీతిలో వివరించేలా పుస్తకాన్ని రాష్ట్రప్రభుత్వం ముద్రించనున్నట్లు సమాచారం. అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజలు, భిన్నవర్గాలకు అర్థమయ్యేలా పుస్తకంలో అన్ని పద్దుల వివరాలను పేర్కొననున్నారు. సులువైన రీతిలో అన్ని పద్దులకూ కలిపి 120 పేజీలతో ఒకే బడ్జెట్ పుస్తకాన్ని రూపొందించటానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

10:18 - March 3, 2017

చిత్తూరు : వైసీపీ అధినేత జగన్‌మ్మోహన్‌రెడ్డి అంటే టీడీపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో జగన్ తీరును ఖండించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేబినెట్‌లో దివాకర్ ట్రావెల్స్‌పై కేసు పెట్టాలని.. బస్సు ప్రమాదంలో చనిపోయిన 10 మంది కుటుంబాలకు న్యాయం చేయాలని ఎందుకు తీర్మానించలేదని రోజా ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నేతలు కలెక్టర్లపై చేసిన దౌర్జన్యాలు ఐఏఎస్ అధికారుల సంఘానికి కనిపించడంలేదా అని ఆమె ప్రశ్నించారు.

10:16 - March 3, 2017

నల్గొండ : అన్ని కులాలకు..అన్నింట్లో సమాన వాటా, సమాన గౌరవం వచ్చినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు కాబట్టే టీఆర్‌ఎస్‌ పాలకులు తమతో చర్చలకు రాలేదని తమ్మినేని విమర్శించారు. ప్రజా సమస్యలపై, అభివృద్ధిపై చర్చించడానికి రావాలని కోరితే టీఆర్‌ఎస్ పాలకులు తోక ముడిచారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీలు నెరవేర్చలేదు కాబట్టే టీఆర్‌ఎస్‌ నేతలు చర్చలకు రాలేదని తమ్మనేని విమర్శించారు. సీపీఎం పాదయాత్ర వల్లనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగాయని, ఇలాంటి మంచి పనులు చేస్తే అందరూ సంతోషిస్తారని ఆయన అన్నారు. అయితే... ప్రతి కార్మికుడికి కనీస వేతనం ఇచ్చేంతవరకు సీపీఎం పోరాటం కొనసాగుతోందని తమ్మినేని తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావొస్తున్నా... పేదలు, బడుగు, బలహీన వర్గాల జీవితాలు ఏ మాత్రం మారలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వాటా కావాలని డిమాండ్‌ చేసినందుకు పాదయాత్రను అడ్డుకోమని సీఎం అనడం సిగ్గుచేటని పాదయాత్ర బృందం సభ్యుడు జాన్‌వెస్లీ విమర్శించారు. ఎర్రజెండా ప్రజల్లోకి వెళితే తన పీఠం కదులుతోందన్న భయంతోనే కేసీఆర్‌ విపరీతమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎర్రజెండాను అడ్డుకునే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని ఈ సందర్భంగా జాన్‌వెస్లీ అన్నారు.

137వ రోజు..
137వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర సూర్యాపేట నుంచి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది. ఉప్పలపాడు స్టేజి వద్ద తమ్మినేని బృందానికి సీపీఎం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సూర్యాపేట ప్రజల తాగునీటి సమస్య, జిల్లా కేంద్రంలో డిగ్రీ కాలేజీ, సూర్యాపేటలో పీజీ సెంటర్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. సూర్యాపేటలో ట్రామ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటివరకు పాదయాత్ర 3630 కిలోమీటర్లు పర్యటించింది.

10:08 - March 3, 2017

హైదరాబాద్ : పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో బస్సు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. దివాకర్ ట్రావెల్స్ బస్సు కల్వర్టులో పడిపోవడంతో 11 మృతి చెందిన సంగతి మరచిపోకముందే మరో మూడు బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీనితో తెలంగాణ ఆర్టీఏ అధికారులు మేల్కొన్నారు. శుక్రవారం ఉదయం బెంగళూరు హైవేపై రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 60 బస్సులను ఆపి తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించలేని 19 బస్సులను సీజ్ చేశారు. రెండో డ్రైవర్ లేకపోవడం..ఎక్కువ సీట్లు ఉండడం..తదితర కారణాలతో బస్సులను సీజ్ చేశారు. ప్రమాదాలు జరిగిన తరువాత తనిఖీలు నిర్వహించడం..అనంతరం మరిచిపోతారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ శివారులో ఆర్టీఏ అధికారుల చెకింగ్ లు..

హైదరాబాద్ : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా ఝులిపించారు. నిబంధనలు పాటించని 19 బస్సులపై కేసులు నమోదు చేశారు.

ఫ్లై వుడ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

ఉత్తర్ ప్రదేశ్ : హపూర్ లోని ఫ్లై వుడ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రూ. 50 లక్షల ఆస్తినష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.

కేరళలో సీపీఎం పార్టీ ఆఫీస్ కు నిప్పు..?

కేరళ : విష్ణుమంగళం ప్రాంతంలో ఉన్న సీపీఎం కార్యాలయానికి నిప్పు పెట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

దివాకర్ ట్రావెల్స్ పై చర్యలేవీ - రోజా..

విజయవాడ : దివాకర్ ట్రావెల్స్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. బస్సు ప్రమాద మృతులకు ఎందుకు నివాళులర్పించలేదని, పోస్టుమార్టం రిపోర్టులు తారుమారుకు ప్రయత్నించారని తెలిపారు. కేబినెట్ సమావేశంలో పరిహారంపై తీర్మానం చేయలేదని, సీఎస్ అజేయ కల్లంను చంద్రబాబు అవమానించారని పేర్కొన్నారు. ఒక సీఎస్ ఉండగానే మరొక సీఎస్ ను ఎలా నియమిస్తారని తెలిపారు. ఉద్యోగులను జగన్ ఏనాడూ పల్లెత్తు మాట అనలేదని తెలిపారు.

09:11 - March 3, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తన తాజా చిత్రం 'కాటమరాయుడు' చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? టీజర్ ఎప్పుడు చూస్తామా అనే ఉత్కంఠ నెలకొంది. చిత్ర ఆడియో...వేడుకలు వినూత్నంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోకే 'కాటమరాయుడు' కూడా చేరుతోంది. ఆడియో వేడుకలను నిర్వహించకుండా డైరెక్ట్ గానే విడుదల చేస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ 'చిరంజీవి' చిత్రం 'ఖైదీ నెంబర్ 150’, 'సాయి ధరమ్ తేజ'..’విన్నర్' చిత్రాలు ఒక్కో సాంగ్ ఒక్కో రోజు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘కాటమరాయుడు' చిత్ర సాంగ్స్ కూడా ఇలాగే విడుదల కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 4గంటలకు పాటను విడుదల చేయనున్నారు. ‘మిరా మిరా మీసం..మెలి తిప్పాడు జనం కోసం' అంటూ సాగే పాట విడుదల కానుంది. ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రచించారు. ప్రతి రెండు రోజులకు ఒక పాట విడుదల కానుందని చిత్ర బృందం పేర్కొంది. పాటలు విడుదలైన అనంతరం ఈనెల 18వ తేదీన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. 24వ తేదీన 'కాటమరాయుడు'ను ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు.
డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'పవన్' సరసన 'శృతి హాసన్' నటిస్తోంది. ఇందులో శివ బాలాజీ, అజయ్, కమల్ కామరాజులు పవన్ సోదరులుగా నటిస్తున్నారు.

టి.శాసనసభ సమావేశాలపై నేడు నిర్ణయం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాససభా సమావేశాలపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభించే తేదీ ఆధారంగా 16 రోజుల పాటు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం శుక్రవారం తీసుకోనున్నారు.

08:58 - March 3, 2017

ఎండాకాలం వచ్చేసింది. ఫిబ్రవరి నెలాఖరులోనే సూర్యుడు మండిపోతున్నాడు. మార్చి..ఏప్రిల్..మే నెలలో ఇంకా ఎండలు ఉండనున్నాయో ప్రజలు భయపడిపోతున్నారు. దీనితో ఉక్కపోత నుండి ఉపశమనం పొందేందుకు కూలర్లు..ఏసీలను వాడుతుంటారు. ఏసీలు..కూలర్ల విక్రయాలు అధికంగా జరుగుతుంటాయి. కానీ ఏసీలు కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

 • ఏసీ ఏర్పాటు చేయాలని అనుకొనే గది పరిణామం ఎంతుంటుంది. ఎంత సామర్థ్యం కావాలనే దానిని అంచనా వేసుకోవాలి. ఇతరుల సూచనలు..సలహాలు తీసుకోవాలి.
 • ఎక్కువ రేటింగ్ ఉండే ఏసీల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ 3 స్టార్ ఆపైన రేటింగ్ ఉండే ఏసీలను తీసుకోవడం బెటర్.
 • ప్రధానంగా ఏసీ కాయిల్స్ తుప్పు పడుతుంటాయి. కోటింగ్ రక్షణ ఉందా ? లేదా ? అనేది తెలుసుకోవాలి. ఇందుకు బ్లూ ఫిన్ కండెన్సర్ లేదా మైక్రో చానల్ కండెన్సర్ అయితే బెటర్. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో మెరుగైన చల్లదనాన్ని అందిస్తాయి.
 • ఇన్వర్టర్‌ టెక్నాలజీ ఉన్న ఏసీలు ఎంచుకోవడం ఉత్తమని పలువురు సూచిస్తున్నారు. దీనివల్ల 50 శాతం మేరకు విద్యుత్‌ ఆదా అవుతుందంట.
 • ఏసీల్లో ఆటో క్లీన్‌ మోడ్‌ ఉంటుంది. దానివల్ల తరచూ శుభ్రం చేయాల్సిన పని తప్పుతుంది. ఇలాంటి వాటిని ఎంచుకోవడం ఉత్తమం.

సీపీఎం మహాజన పాదయాత్ర 139వ రోజు..

నల్గొండ : సీపీఎం మహాజన పాదయాత్ర 139వ రోజుకు చేరుకుంది. నేడు గోరెంకలపల్లి, మామిడాల స్టేజి, ఇండ్లూరు, తిప్పర్తి, శిలార్ నియాగూడెం, కొత్తగూడెం, మాడుగులపల్లి, కుక్కడం, బుగ్గబావిగూడెం, వేములపల్లిలో పర్యటించనుంది.

కొనసాగుతున్న హైనా దాడులు..

సిద్ధిపేట : అక్కనపేట మండలం మోత్కులపల్లిలో హైనా దాడులు కొనసాగుతున్నాయి. రైతు వెంకటయ్యకు చెందిన లేగదూడను హైనా చంపేసింది. దీనితో ఇప్పటి వరకు 35 లేగ దూడలను చంపేసినట్లైంది. రైతులు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు.

08:24 - March 3, 2017

అందం..ఒక్క సౌందర్య సాధనాలతోనే కాకుండా కొన్ని పద్ధతులను ఉపయోగిస్తూ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. వాతావరణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. సహజ పద్దతులతో చేసుకొనేది ఏదైనా సరే సహజ ఫలితాలనే అందిస్తుంది. అందులో ప్రధానమైంది 'ఆవిరి'..ఆవిరి పట్టడం వల్ల చర్మంలోని రంధ్రాలు తెరుచుకుని చర్మం లోపలి నుండి శుభ్ర పడుతుంది. ఆవిరి పట్టించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

 • నీళ్లు మరీ వేడిగా మసులుతున్నప్పుడు ఎక్కువ సమయం ఆవిరి పట్టకూడదు. అలా చేస్తే చర్మం ఎర్రగా కందిపోతుంది.
 • ముఖం మీద విపరీతంగా మొటిమలున్నవారు ఆవిరికి దూరంగా ఉండటం మంచిది.
 • ముఖ చర్మంలో రక్తకణాలు ఉత్తేజితమవుతాయి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
 • చర్మ కణజాలానికి సరిపడా ప్రాణవాయువు అందుతుంది.
 • ఎండలో తిరగడం వల్ల చర్మం కమిలిపోతుంది. దీనివల్ల చర్మం నిర్జీవంగా మారతుంది. ఈ సమయంలో ఏదైనా క్రీమ్‌తో మృదువుగా మర్దన చేసుకుని ఆవిరి పట్టాలి.
 • ఆవిరి పట్టడానికి ముందు తప్పనిసరిగా ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ముఖానికి మేకప్‌ ఉన్నా దానిని తొలగించుకున్నాకే ఆవిరిపట్టాలి.
 • శరీరంలోని వ్యర్థాలను తొలగించుకోవాలంటే ఆవిరి స్నానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అందుబాటులో లేనప్పుడు కనీసం ముఖానికైనా ఆవిరి పడితే మేలు.
08:13 - March 3, 2017

టాలీవుడ్..బాలీవుడ్..ఏ వుడ్ లోనైనా నటించే హీరోయిన్లకు బంపర్ ఆఫర్లు అప్పుడప్పుడు వస్తుంటాయి. ప్రముఖ హీరోలతో నటించి గుర్తింపు పొందాలని హీరోయిన్లు అనుకుంటుంటారు. కానీ వారి ఆశ నెరవేరడానికి టైం పడుతుంది. కానీ తక్కువ టైంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లను 'అమీ జాక్సన్' అందిపుచ్చుకొంటోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్, విజయ్, రామ్ చరణ్ హీరోలతో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ 'రజనీ కాంత్' సరసన నటిస్తోంది. శంకర్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రోబో 2’ లో నటిస్తోంది. తాజాగా మరో బంపర్ ఆఫర్ ఈమె చేతికి వచ్చింది. బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' సరసన నటించే అవకాశం వచ్చిందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా 'అమీ జాక్సన్' కూడా ధృవీకరించింది. మార్చి 5వ తేదీన సర్ ఫ్రైజ్ న్యూస్ చెప్పబోతున్నా అంటూ ట్వీట్ చేసింది. ఆ రోజు మాత్రం 'రోబో 2.0’ చిత్ర టీజర్ విడుదల కానుంది. ‘సల్మాన్' తో సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్.

08:02 - March 3, 2017

సీఎం పినరయి విజయన్ పై ఆర్ఎస్ఎస్ నేత చంద్రకాంత్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. పినరయి తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా వ్యాఖ్యానించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, వెంటనే అతడిని అరెస్టు చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (నవ తెలంగాణ ఎడిటర్), శ్రీనివాస్ యాదవ్ (టి.కాంగ్రెస్) పాల్గొన్నారు. ఆలస్యంగా బీజేపీ నేత రాకేష్ రెడ్డి పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి.

 

07:02 - March 3, 2017

కొంతకాలంగా ఎంబీసీలు సాగిస్తున్న ఉద్యమాలకు ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. ఎంబిసి నాయకులతో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయించారు. దీనికి వెయ్యి రూపాయల నిధిని సమకూర్చే యోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వుంది. ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటు వల్ల ఎంబిసిలకు ఎలాంటి మేలు జరిగే అవకాశం వుంది? ఎంబిసి కార్పొరేషన్ విధివిధానాలు ఎలా వుండాలి? రాబోయే బడ్జెట్ లో ఎంబిసిల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది? ఈ అంశంపై జనపథంలో ఎంబిసి సిద్ధాంతకర్త కోప్రా మాట్లాడారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి.

07:00 - March 3, 2017

కృష్ణా : గుంటూరు-విజయవాడ నగరాల మధ్య రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్ధించుకుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ సిఫారసుల ఆధారంగానే స్థలాన్ని ఎంపిక చేసినట్టు జాతీయ హరిత న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. అమరావతి నిర్మాణానికి మంజూరైన పర్యావరణ అనుమతులను సవాల్‌చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏపీ న్యాయవాదులు తమ వాదనలు విపించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై జాతీయ హరిత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై విచాణ జరిగింది. ఎన్జీటీ చైర్మన్‌ ఏకీ గంగూలీ నేతృత్వంలోని ట్రైబ్యునల్‌లో అటు పిటిషన్లు, ఇటు ప్రభుత్వ న్యాయవాదలు తమ వాదనలు వినిపించారు.

శివరామకృష్ణన్ కమిటీ..
అమరావతి నిర్మాణానికి మంజూరైన పర్యావరణ అనుమతులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిగణలోకి తీసుకోవద్దని ఏపీ న్యాయవాదులు ఎన్జీటీ దృష్టికి తెచ్చారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ చేసిన సిఫారసులను పరిగణలోకి తీసుకుని అమవావతిని ఎంపిక చేసిన విషయాన్నిప్రస్తావించారు. చెన్నై-కోల్‌కతా, విజయవాడ-హైదారబాద్‌ జాతీయ రహదారులు, నీటి లభ్యత వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని స్థల నిర్ణయం జరిగిందని జాతీయ హరిత న్యాయస్థానికి వివరించారు. ప్రమాదాలు, ఇతరితర నష్టభయాలు లేని విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాను పరిశీలించిన తర్వాతే అన్ని ప్రాంతాలకు అనువుగా ఉన్న అమరావతిని ఎంపిక చేశామని ప్రభుత్వ న్యాయవాదులు ఎన్జీటీ దృష్టికి తెచ్చారు.

హుద్ హుద్ తుఫాన్..
ప్రజా రవాణావ్యవస్థ కూడా అమరావతికి అనుకూలంగా ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని స్థల నిర్ణయం జరిగిన విషయాన్ని జాతీయ హరిత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. విజయవాడ, గుంటూరు రైల్వే జంక్షన్లుగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. విజయవాడ విమానాశ్రయం విస్తరణ అమరావతికి మరింత అనుకూలించే అంశమని ఎన్జీటీ దృష్టికి తెచ్చారు. శివరామకృష్ణన్‌ కమిటీ సూంచిన విశాఖపట్నం 2014 అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్‌ తుపానుకు భారీగా నష్టపోయిన విషయాన్ని గుర్తు చేశారు. పైగా విశాఖ నగరం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు దూరంగా ఉన్న అంశాన్ని ప్రస్తావించారు. శివరామకృష్ణన్‌ కమిటీ సూచించిన మరో ప్రాంతం అనంతపురం జిల్లాలో నీటి లభ్యత తక్కువగా ఉన్న అంశాన్ని జాతీయ హరిత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. రవాణాపరంగా అనుకూలమైన ప్రాంతం కాదని వివరించారు.

అభ్యంతరాలు..
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణ ఆవశ్యకతను ప్రభుత్వ న్యాయవాదులు ఎన్జీటీ దృష్టికి తెచ్చారు. ఎటువంటి ముందుజాగ్రత్తలు లేకుంగా ఒక్కసారిగా రాష్ట్రాన్ని విభజించడంతో ఉత్పన్నమైన ఆర్థిక సమస్యలను వివరించారు. రాజధాని నిర్మాణ భూసేకరణకు అవసరమైన నిధులు ప్రభుత్వ వద్ద లేకపోయినా.. భూసమీకరణ విధానాన్ని అనుసరించిన విషయాన్ని ప్రస్తావించారు. హరిత రాజధాని నిర్మిస్తున్నామన్న ఏపీ వాదనలపై పిటిషన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవాళ జరిగే విచారణలో పిటిషనర్ల సందేహాలన్నింటీ నివృత్తి చేస్తామని ఏపీ న్యాయవాది ఏకే గంగూలీ జాతీయ హరిత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

06:55 - March 3, 2017

నెల్లూరు : విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్ధులు ఆందోళనబాట పట్టారు. తమ సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిసేందుకు రెడీ అయ్యారు. నెల్లూరు జిల్లా నుంచి పాదయాత్రగా హైదరాబాద్‌కు పయనమయ్యారు. నేడు పవన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకోనున్నారు. నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్ధులు తమ సమస్యలను జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు వివరించాలని నిర్ణయించారు. దీంతో ఫిబ్రవరి 22న యూనివర్సిటీ నుంచి 10మంది విద్యార్ధులు హైదరాబాద్‌కు పాదయాత్రగా బయలుదేరారు. ఎప్పటికప్పుడు పాదయాత్రకు సంబంధించిన వివరాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. శుక్రవారం పవన్‌ కల్యాణ్‌ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను పవన్‌కు వివరించనున్నారు. యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా ఉన్న శివశంకర్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్ధులు కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. విద్యార్ధుల వసతి, తరగతి గదులు, పరిపాలన కోసం భవనాల నిర్మాణానికి 25 కోట్లు కేటాయించారు. కేవలం 5కోట్లతో నాశిరకంగా బిల్డింగ్స్‌ నిర్మించినట్టు విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. నిర్మించిన కొన్ని రోజులుకే అవి పెచ్చులూడుతున్నాయని వాపోయారు. విద్యార్ధుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన 7కోట్ల నిధులనూ రిజిస్ట్రార్‌ కాంట్రాక్ట్‌లకు ఇచ్చారని విద్యార్దులు చెబుతున్నారు. పీజీ కాలేజీ కోసం కేటాయించిన భూమిలో 3 ఎకరాలను బయటి వ్యక్తులతో కబ్జా చేయించారన్న ఆరోపణలు కూడా రిజిస్ట్రార్‌పై ఉన్నాయి.

పవన్ స్పందన ఎలా ఉంటుంది..
హాస్టల్‌ భవనం నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిర్మించడం, దాన్ని కూడా మూడు నెలల నుంచి ప్రారంభించకపోవడం విద్యార్ధుల ఆగ్రహానికి ఆజ్యం పోసింది. ప్రస్తుతం ఉంటున్న హాస్టల్స్‌లో సరైన వసతులు లేక.. కొద్దోగొప్పో వసతులతో నిర్మించిన భవనాలు ప్రారంభించకపోవడంతో విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. అధికారులు మాత్రం సీఎం రాకకోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. బుధవారం రిజిస్ట్రార్‌ను నిర్బంధించిన విద్యార్ధులు హాస్టల్‌, మెస్‌ సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీంతో పోలీసులు ముగ్గురు విద్యార్ధులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. విద్యార్ధులపై క్రిమినల్‌ కేసులు నమోదు కావడంతో విద్యార్దులు ఆందోళన మరింత ఉధృతం చేశారు. వీసీ కార్యాలయం దగ్గర కేసులు ఎత్తివేయాలంటూ ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ అధికారులు విద్యార్ధుల భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధుల ఆందోళనపై స్పందించిన వీసీ వీరయ్య.... కొంతమంది విద్యార్ధులు యూనివర్సిటీలో అనవసరరాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వస్తేనే నూతన భవనం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు పాదయాత్రగా బయలుదేరిన యూనివర్సిటీ విద్యార్ధులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం తమ సమస్యలను పవన్‌తో మొరపెట్టుకోనున్నారు. మరి ఇప్పటికే అనేక సమస్యలపై తనదైన శైలిలో స్పందించి ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చిన పవన్‌... విక్రమ సింహపురి విద్యార్ధుల సమస్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

06:52 - March 3, 2017

విజయవాడ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను వైసీపీ ఖరారు చేసింది. మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా తమ సంఖ్యాబలం ఆధారంగా ఇద్దరు అభ్యర్ధులను బరిలో నిలపాలని నిర్ణయించింది. మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని, గంగుల ప్రభాకర్‌రెడ్డికి టిక్కెట్లు కేటాయించారు. అభ్యర్ధుల గెలుపుకోసం జగన్‌ వ్యూహరచనలో మునిగిపోయారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్‌ కొనసాగుతోంది. తమ అభ్యర్ధుల గెలుపు కోసం పార్టీల నేతలు వ్యూహరచనలో బిజీబిజీగా ఉన్నారు. టీచర్స్‌, గ్రాడ్యుయేట్స్‌, స్థానిక సంస్థలతోపాటు ఎమ్మెల్యే కోటాల్లో మొత్తం 22 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిల్లో వైసీపీకి ఎమ్మెల్యే కోటాలో రెండు సీట్లు దక్కే అవకాశముంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి 22మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయి. వైసీపీకి ప్రస్తుతం 46 మంది శాసనసభ్యులు ఉన్నారు. దీంతో వైసీపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకునే అవకాశముంది.

సుదీర్ఘ కసరత్తు..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అధినేత సుదీర్ఘ కసరత్తు తర్వాత అభ్యర్ధులను ఖరారు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్లనానితోపాటు... కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన గంగుల ప్రభాకర్‌రెడ్డికి టిక్కెట్లు కేటాయించారు. అభ్యర్ధులిద్దరి విషయంలోనూ సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను జగన్‌ పరిగణనలోకి తీసుకున్నారు. గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ టికెట్‌ కేటాయించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవచ్చని జగన్‌ భావిస్తన్నారన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రాయలసీమలోని రెడ్డి వర్గాన్ని ఆకర్షించేందుకు గంగుల ప్రభాకర్‌రెడ్డికి వ్యూహాత్మకంగా టికెట్‌ ఇచ్చారని చెబుతున్నారు.

9 స్థానాలు..
స్థానిక సంస్ధల కోటాలో మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా... వైసీపీ తరపున మూడు జిల్లాల్లోనే అభ్యర్ధులు బరిలోకి దిగారు. కడప జిల్లా నుంచి జగన్‌ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి, కర్నూలు నుంచి గౌరు వెంకట్‌రెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. వీరి గెలుపునకు జగన్‌ వ్యూహరచన చేస్తున్నారు. అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ఐక్యం చేస్తున్నారు. పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్ధులను బరిలోకి దించింది. కానీ వైసీపీ తన పార్టీ నుంచి అభ్యర్ధులను పోటీకి పెట్టలేదు. పీడీఎఫ్‌ అభ్యర్ధులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.

06:50 - March 3, 2017

హైదరాబాద్ : అనేక స‌మ‌స్యలు...సవాళ్ళ మ‌ధ్య కాంగ్రెస్ కోఆర్డినేష‌న్ క‌మిటీ భేటీకి సన్నద్ధమవుతోంది. దిగ్విజ‌య్ సింగ్‌ నేతృత్వంలో నిర్వహించబోయే స‌మావేశంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలు కలవరం రేపుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను స‌మీక్షించుకుని.. భవిష్యత్‌ కార్యాచరణకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయ‌నుంది హస్తం పార్టీ. 6 నెల‌ల త‌ర్వాత సమావేశం కాబోతున్న తెలంగాణ కాంగ్రెస్‌ సమన్వయ కమిటీకి సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. గాంధీభ‌వ‌న్‌లో శుక్రవారం ఉద‌యం 10.30 గంటలకు ప్రారంభం కానున్న స‌మావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజ‌య్ సింగ్, క‌మిటి స‌భ్యులు హాజ‌రుకానున్నారు. పార్టీలో తాజాగా నెల‌కొన్న ప‌రిణామాలపై కోఆర్డినేషన్‌ కమిటీలో చర్చించే అవకాశం ఉండటంతో.. పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.

డిగ్గీ రాజా ఎలా దిశా నిర్ధేశం చేస్తున్నారు..
ఇటీవ‌ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాలపై స‌మావేశంలో సమీక్షించనున్నారు. ముఖ్యంగా రైతు గ‌ర్జన, విద్యార్థి గ‌ర్జన, జ‌న ఆవేదన స‌మ్మేళనాలు, ఇందిర‌మ్మ ఇళ్ల బిల్లుల కోసం క‌లెక్టరేట్ల ఎదుట ధర్నాలు, భూసేకరణకు వ్యతిరేకంగా చేప‌ట్టిన ఆందోళనలపై చర్చించనున్నారు. ఇక‌నుంచి ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై మ‌రింత ఒత్తిడి పెంచే విధంగా పోరాట కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు నేత‌ల కుమ్ములాట‌లు స‌మావేశంలో మ‌రింత కాకపుట్టించే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై కోమ‌టిరెడ్డి బ్రదర్స్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్న ఉత్తమ్‌.. కోమ‌టిరెడ్డిపై క్రమశిక్షణ కొరడా ఝుళిపించాల‌ని త‌హ త‌హ లాడుతున్నారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ వ్యాఖ్యలపై సమావేశంలో హాట్ హాట్‌గా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. అయితే నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు డిగ్గీ రాజా ఎలా దిశానిర్దేశం చేస్తార‌న్నది చర్చనీయాంశంగా మారింది. పీసీసీ చీఫ్‌కు ప్రాధాన్యత పెంచేలా చర్యలు తీసుకుంటారా లేక సర్దుకుపోమ్మని చెబుతారా తేలాల్సి ఉంది.

06:47 - March 3, 2017

ఖమ్మం : తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య రోజు రోజుకు కీచులాటలు పెరుగుతున్నాయి. నేతలు గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. బహిరంగ వేదికల పైనే దూషించుకుంటున్నారు. నువ్వెంతంటే నువ్వెంత.. .అంటూ సిగలు పట్టుకుంటున్నారు. టిపిసిసి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కూచుమంచిలో జరిగిన జన ఆవేదన సభలో రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుంధాకర్‌రెడ్డి వర్గాల మధ్య దిగ్విజయ్‌ సింగ్‌ సమక్షంలో జరిగిన గొడవే ఇందుకు నిదర్శనం. ఖమ్మం జిల్లా కూసుమంచిలో టీపీసీసీ ఏర్పాటు చేసిన జన ఆవేదన సభలో కాంగ్రెస్‌ నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి భగ్గు మన్నాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌, ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియాల సమక్షంలోనే కాంగ్రెస్‌ నేతలు దూషించుకున్నారు. నానా దుర్భాషలాడుకున్నారు. ఫ్లెక్సీలను చించివేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతల తీరుచూసి దిగ్విజయ్‌సింగే అసంహనం వ్యక్తం చేశారంటే పార్టీ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

పొంగులేటి అభ్యంతరం..
కూసుమంచి జన ఆవేదన సభలో రేణుకాచౌదరి వర్గానికి చెందిన ఎడవల్లి కృష్ణను వేదిక పైకి ఆహ్వానించారు. దీనిపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తీవ్ర అభ్యరంతం వ్యక్తం చేయడంతో గొడవ మొదలైంది. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి తిరిగి పార్టీలో చేరిన వారికి వేదికపైకి ఆహ్వనించినప్పుడు కష్ణ వస్తే తప్పంటేని రేణుకా చౌదరి ఆగ్రహంతో ఊగిపోతూ ప్రశ్నించడంతో వివాదం ముందిరింది. దీంతో దిగ్విజయ్‌సింగ్‌ జోక్యం చేసుకుని అటు పొంగులేటికి, ఇటు రేణుకాచౌదరితోపాటు, గొడవకు దిగిన ఇరువురి అనుచరులకు సర్దిచెప్పారు. పొంగులేటి ప్రసంగించేందుకు మైకు తీసుకున్న సమయంలో కూడా రేణుకాచౌదరి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఏకవచన సంభోదనలతో అసహనం వ్యక్తం చేస్తూ కూర్చిండిపోయారు. ఆ తర్వాత ప్రసంగించే అవకాశం వచ్చినా వద్దని భీష్మించుకుని కూర్చున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న తనను సభావేదికపైనే అవమానించారంటూ దిగ్విజయ్‌కి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అటు రేణుకాచౌదరి, ఇటు పొంగులేటి సుధాకర్‌రెడ్డి వర్గీయులపై తీరుపై మండిపడ్డారు. ఇలా అయితే ప్రజల్లో మరింత పలుచనవుతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పుడు సంకేతాలు..
జన ఆవేదన సభలోను బహిరంగంగా దూషించుకున్న కాంగ్రెస్‌ నేతల ప్రవర్తనపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిన నేతలు కుమ్ములాటలకు దిగితే ఎలా అని ప్రశ్నించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు నేతలు, కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. పార్టీ నేతల మధ్య నెలకొన్న వర్గ విభేదాలను పరిష్కరించేందుకు హైదరాబాద్‌ గాంధీభవన్‌లో టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీకి ఒకరోజు ముందు ఖమ్మం జిల్లా కూసుమంచి జన ఆవేదన సభలో గొడవతో కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్న కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

06:44 - March 3, 2017

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిల మధ్య గ్యాప్ పెరుగుతోందా.. క్రమంగా కేఈ ప్రాధాన్యతను సీఎం తగ్గిస్తున్నారా... తాజా డిప్యూటీ సీఎం అధికారాల్లో కోత విధించేలా జారీ చేసిన జీవో నెం 28 టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయ్యింది. కేఈ కృష్ణమూర్తి.. సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం.. కర్నూలులో పార్టీకి కీలక నేత. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో రెవిన్యూ శాఖను ఆయన చూస్తున్నారు.. అయితే ఆయన శాఖ పరిధిలోకి వచ్చే.. డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాన్ని సాధారణ పరిపాలన శాఖకి అప్పగిస్తూ ఏపీ సర్కార్ జీవో నెం 28ని విడుదల చేసింది... ఈ పరిణామం పై కేఈ అనుచరులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కేబినెట్‌లో అత్యంత సీనియర్ అయిన కేఈ అధికారాలను సీఎం కావాలనే తగ్గిస్తూ వస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కేఈ ఆగ్రహం..
గతంలో డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ ల బదిలీల సందర్భంగా రెవిన్యూ మంత్రి హోదాలో కేఈ తీసుకున్న నిర్ణయాలను సీఎం నిలిపేశారనే ప్రచారం జరిగింది.. అలాగే ఆర్డీఓల బదిలీల సందర్భంగా చాలా జిల్లాల్లో మంత్రుల మధ్య తగాదాలకు దారి తీసింది. విశాఖలో ఓ ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా బహిరంగంగానే విమర్శించుకున్నారు. అలాగే కొత్త రాజధాని భూములు, నిర్మాణం, భూ కేటాయింపుల్లో కూడా రెవిన్యూ మంత్రిగా ఉన్న కేఈ కి ఎక్కడా భాగస్వామ్యం కల్పించకపోవడంపై అప్పట్లోనే చర్చనీయాంశమైంది. భూ కేటాయింపులపై వేసిన సంఘంలో కూడా రెవిన్యూ మంత్రిగా ఉన్న కేఈకి స్థానం దక్కలేదు. అయితే తాజాగా జీవో నెం 28 జారీ చేసి మరీ అధికారాల్లో కోత వేయడంపై కేఈ కూడా ఆగ్రహాంగా ఉన్నట్లు సమాచారం.

కొత్త వివాదం..
2014 లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లో జరిగిన కర్నూలు జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశంలో కేఈ సీఎంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మన జిల్లా నుంచి కేవలం 3 సీట్లు మాత్రం గెలిపించుకోగలిగాం. అందుకే సీఎం చంద్రబాబు మనపై చిన్న చూపు చూస్తున్నారు. కర్నూలు జిల్లా కూడా అభివృద్ది కావాలి కదా అంటూ వ్యాఖ్యానించారు.. మరికొన్ని సందర్బాల్లో కేఈ సోదరుడు ప్రభాకర్ నేరుగా టీడీపీ హైకమాండ్ పైనే రుసరుసలాడారు. దీంతో అప్పట్నుంచి సీఎం కు డిప్యూటీ సీఎంకు మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోందనే ప్రచారం ఉంది. తాజాగా అధికారాల్లో కోత.. ఇద్దరి మధ్య కొత్త వివాదానికి కారణమయ్యేలా ఉందనే వాదన వినిపిస్తోంది.

06:42 - March 3, 2017

విజయవాడ : ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాల్లో ప్రతిపక్ష వైసీపీ వైఖరిని ఎండగట్టాలని తెలుగుదేశం వ్యూహ కమిటీ నిర్ణయించింది. సభలో వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేంది లేదని భేటీకి అధ్యక్షత వహించిన టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు.

బహిరంగ క్షమాపణకు పట్టుపడుతున్న అనిత..
వ్యూహ కమిటీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. గతేడాది జరిగిన బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అనిత పట్ల రోజా అనుచింతగా ప్రవర్తించిన అంశం ప్రస్తావనకు వచ్చింది. అనితే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆనాటి గొడవ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఏడాదిపాటు హాజరు కాకుండా రోజాను సస్పెండ్‌ చేశారు. దీనిపై రోజు న్యాయస్థానాలు ఆశ్రయించినా, చివరికి ఈఅంశం మళ్లీ అసెంబ్లీకే చేరింది. దీంతో రోజా ఆనాటి గొడవపై విచారం వ్యక్తం చేస్తానంటూ, తన సస్పెన్షన్‌కు ఎత్తివేయాలని స్పీకర్‌ కోడుల శివప్రసాదరావుకు లేఖ రాసిన అంశాన్ని అనిత ప్రస్తావించారు. రోజా విషయాన్ని స్పీకర్‌ చూసుకుంటారని చంద్రబాబు వ్యూహ కమిటీ దృష్టికి తెచ్చారు. రోజా లేఖలో ఏమాత్రం ప్రశ్చాతా భావం కనించిలేదని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం. తనకు బహిరంగ క్షమాపణ చెప్పకుండా రోజా సభలోకి అనుమంచివద్దని అనిత కోరారు. అంతిమంగా ఈ విషయాన్ని స్పీకర్‌ నిర్ణయానికే విడిచెట్టాలని తీర్మానించారు.

సభలో 28 అంశాలు చర్చకు వచ్చే అవకాశం..
సభలో వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచించారు. ప్రతిపక్షం రెచ్చగొట్టినా సాధ్యమైనంత వరకు సంయమనం పాటించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ సాయంత్ర గంటపాటు వ్యూహ కమిటీలో భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆరోజు సమావేశాలను సమీక్షిచండంతోపాటు, మరుసటి రోజు అనురించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తారు. మొత్తం 28 అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేదిలేదని హెచ్చరించారు.

06:41 - March 3, 2017

విజయవాడ : కల్తీ విత్తనాల బెడద నివారణకు ఆంధ్రప్రదేశ్‌ విత్తచ చట్టం-2017కు చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈనెల 6 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త విత్తన చట్టం బిల్లును ప్రవేశపెడతారు. దీనికి ముందు రైతులు, రైతు సంఘాల నేతలో ఈ బిల్లులోని అంశాలపై చర్చిస్తారు. మరోవైపు మద్యం విధానంలో మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగి ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా కొత్త విత్తన చట్టం గురించి చర్చించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 1996 విత్తన చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తారు. విత్తన చట్టం-2017కు చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం తీర్మానించింది.

కల్తీ విత్తనాలు..
కల్తీ విత్తనాలు తయారుచేసి విక్రయించే వారికి కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టంలో నిబంధనలు ఉన్నాయి. పంటనష్టపోయిన రైతులకు సంబంధిత కంపెనీ లేదా వ్యక్తులు నుంచి పరిహారం బడతారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయించిన కనీన విత్తన న్యాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ చట్టం తీసుకొస్తున్నారు. రైతులకు విక్రయించే విత్తనాలకు గరిష్ట చిల్లర ధరలు నిర్ణయిస్తారు. నాణ్యతలేని విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలు, వ్యక్తులకు 50 వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు జరిమానాతోపాటు మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. బెయిలుకు ఆస్కారం లేకుండా విత్తన చట్టంలో నిబంధనలు చేర్చారు.

విమనాశ్రయాల పేరు మార్పు..
తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల పేరు మార్పు ప్రతిపానదలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తిరుపతి ఎయిర్‌పోర్టునుశ్రీవెంకటేశ్వర వినాశ్రయంగా, విజయవాడ ఎయిర్‌పోర్టును నందమూరి తారకరామారావు అమరావతి విమానాశ్రయంగా పేర్లు నిర్ణయించారు. ఈప్రతిపాదలను కేంద్ర ఆమోదం కోసం పంపుతారు. కర్నూలు జిల్లా ఓవర్వకల్లు, విశాఖ జిల్లా భోగాపురం విమానాశ్రాయాల నిర్మాణంపై చర్చించారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భోగాపురం విమాశ్రయ కమిటీకి 630 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. డిపాజిటర్ల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షన చట్టం -1999 సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు కృష్ణా జిల్లా నందిగామ వద్ద జరిగిన దివాకర్‌ గ్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో పదిమంది ప్రాణాలు క్పోల్పోయిన ఘటనపై మంత్రివర్గం విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ప్రతిపక్ష నేత జగన్‌ వ్యవహరించిన తీరుపై కూడా చర్చించారు. నందిగామ ఆస్పత్రిలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబుపై జగన్‌ దురుసగా ప్రవర్తించడాన్ని మంత్రివర్గం ఆక్షేపించింది.

గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పర్యటన..

హైదరాబాద్ : నేడు గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను కేసీఆర్ పరిశృలించనున్నారు.

నేటి నుండి ఆదిరంగ్ కార్యక్రమం..

హైదరాబాద్ : లలితాకళాతోరణంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో ఆదిరంగ్ మహోత్సవ్ జరగనుంది. నేటి నుండి మూడు రోజుల పాటు ఆదిరంగ్ కార్యక్రమం జరగనుంది. వివిధ రాష్ట్రాల గిరిజన కళాకారులు పాల్గొననున్నారు.

టి.పిసిసి సమన్వయ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : నేడు గాంధీభవన్ లో టి.పిసిసి సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దిగ్విజయ్, ఆర్ సీ కుంతియా, ఉత్తమ్, భట్టి విక్రమార్కలు హాజరు కానున్నారు.

Don't Miss