Activities calendar

05 March 2017

పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ

విజయవాడ : తన నివాసంలో పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తున్నారు. ఈ రాత్రికే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

 

22:07 - March 5, 2017
22:06 - March 5, 2017

బెంగళూరు : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిక్యం దిశగా సాగుతోంది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దాంతో ఆసీస్‌కు 48 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తొలి రోజు ఆటలో తొలుత ఆసీస్ తడబడినట్లు కనిపించినప్పటికీ..తిరిగి గాడిలో పడింది. భారత్‌ మాత్రం.. వికెట్లు తీయడంలో ఘోరంగా విఫలమైంది.
మరింత దూకుడుగా ఆసీస్ 
బెంగళూరులో జరుగుతున్న భారత్‌, ఆస్ర్టేలియా రెండో టెస్టులో..ఆస్ట్రేలియా ఆధిక్యం దిశగా సాగుతోంది. 40/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినా.. ఆ తర్వాత పుంజుకొని మరింత దూకుడును ప్రదర్శించింది. ఓవర్‌నైట్‌ స్కోరు ఆరంభంలో ఆసీస్ ఓపెనర్ వార్నర్‌ను అశ్విన్ అద్భుతమైన బంతితో పెవిలియన్ పంపించాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన వార్నర్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత కాసేపటికి కెప్టెన్ స్మిత్ కూడా అవుట్ కావడంతో లంచ్ సమయానికి ఆసీస్ రెండు వికెట్లను నష్టపోయింది. అయితే ఓపెనర్ రెన్ షా- షాన్ మార్ష్ల జోడి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ ఆసీస్ స్కోరు బోర్డును నడపించారు.  
రెండో సెషన్‌లో కష్టాల్లో పడిన ఆసీస్ 
తొలి సెషన్‌లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆసీస్.. రెండో సెషన్‌లో మాత్రం మరో మూడు కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్ 33, కెప్టెన్‌ స్టీవ్ స్మిత్ 8, రెన్‌షా 60, హ్యాండ్ స్కాంబ్ 16, మిచెల్ మార్ష్ 0 పరుగులు చేయకుండానే స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. ఆ తర్వాత షాన్ మార్ష్ 66 పరుగులకు ఆరో వికెట్‌గా అవుటయ్యాడు. ఆసీస్ కోల్పోయిన ఆరు వికెట్లలో జడేజా మూడు వికెట్లు సాధించగా... అశ్విన్, ఉమేశ్ యాదవ్, అశ్విన్లకు తలో వికెట్ లభించింది. 
రెండో రోజు...ఆసీస్ 237/6
ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దాంతో ఆసీస్‌కు 48 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 

21:59 - March 5, 2017

ఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్ గవర్నర్‌ పదవి నుంచి తప్పుకోవాలంటూ ఉర్జిత్‌ పటేల్‌కు బెదిరింపు మొయిల్‌ పంపిన వ్యక్తిని నాగ్‌పూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉర్జిత్‌ పటేల్‌ ఆర్‌బీఐ గవర్నర్‌ పదవి నుంచి తప్పుకోవాలని.. లేకపోతే ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు హాని కలిగిస్తానని బెదిరిస్తూ ఓ వ్యక్తి మెయిల్‌ పంపాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు... నాగ్‌పూర్‌లోని సైబర్‌ కేఫ్‌ నుంచి ఈ మెయిల్‌ పంపిన నిందితుడు వైభవ్‌ను అరెస్ట్ చేశారు. వైభవ్‌ను.. నాగ్‌పూర్‌ కోర్టులో హాజరు పరచగా మార్చి 6 వరకు నిందితుడికి కస్టడీ విధించింది. విదేశాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన నిందితుడు వైభవ్... ప్రస్తుతం ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో నిరాశతోనే అతడు సందేశం పంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

21:57 - March 5, 2017

యూపీ : అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ సమాజ్‌వాది పార్టీ నేత గాయత్రి ప్రజాపతి ఇంకా మీ కేబినెట్‌లో ఎందుకని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్‌ రామ్‌ నాయక్‌ లేఖ రాశారు. ఇప్పటికీ ఆయనను ఎందుకు కేబినెట్‌లో కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తూ వివరణ కోరారు. దీనికి సంబంధించి వివరణ కోరుతూ ఆయన అఖిలేశ్‌ కు లేఖ పంపించినట్లు కూడా రాజ్‌భవన్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. లైంగిక దాడి కేసులో గాయత్రి ప్రజాపతిపై ఇప్పటికే అరెస్టు వారెంట్‌ జారీ అయింది. ఆయన తప్పించుకు తిరుగుతుండటంతో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ కూడా ఇష్యూ అయింది. ఆయన పాస్‌పోర్టును నాలుగువారాల పాటు సీజ్‌ చేయడంతో పాటు లుకౌట్‌ నోటీసులు కూడా అంటించారు. ఈ నేపథ్యంలో ఇంకా కేబినెట్‌లో కొనసాగించడంపై గవర్నర్‌ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

21:54 - March 5, 2017

నిజామాబాద్ : తెలంగాణలోని పలు అంశాలపై ప్రతిపాదనలు తయారుచేస్తామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలిపారు. నిజామాబాద్‌లో సుధీర్‌ కమిటీ రిపోర్ట్‌పై చర్చా కార్యక్రమానికి కోదండరాం హాజరయ్యారు. జేఏసీతో కలిసివచ్చిన వారందరి అభిప్రాయాలను తీసుకొని ప్రతిపాదనలు, సూచనలు రెడీ చేస్తామన్నారు. వీటిని అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లాలన్న ఆలోచన ఉందని స్పష్టం చేశారు. 

 

ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని పెంచిన కేంద్రం

ఢిల్లీ : కేంద్రప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని పెంచింది. కరవు భత్యం 2 శాతం నుంచి 4 శాతానికి పెంచారు. జనవరి నుంచి పెరిగిన కరవు భత్యం అమల్లోకి రానుంది. 

 

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై లోకేష్ తో సీఎం చంద్రబాబు కసరత్తు

విజయవాడ : టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై లోకేష్ తో కలిసి సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ రాత్రికే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 

21:33 - March 5, 2017

'ద్వారకా' మూవీ టీమ్ తో 10 టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రం డైరెక్టర్ శ్రీనివాస్, హీరో విజయ దేవరకొండ, హీరోయిన్ పూజా జవేరి మాట్లాడారు. సినిమా విశేషాలు తెలిపారు. సినీ అనుభవాలను వివరించారు. పలు అసక్తికర విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:25 - March 5, 2017

హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేర రహిత నగరం కోసం హైదరాబాద్‌లో షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్‌ నిర్వహించారు. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా నుంచి ఈ రన్‌ ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన 5కే ర‌న్‌ను డీజీపీ అనురాగ్ శ‌ర్మ ప్రారంభించారు. స్పెష‌ల్ అట్రాక్షన్‌ గా హీరోయిన్స్ తాప్సీ, అమ‌ల నిలిచారు. 
పోలీస్ శాఖ ప‌లు కార్యక్రమాలు 
అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజులపాటు హైదరాబాద్ వ్యాప్తంగా పోలీస్ శాఖ ప‌లు కార్యక్రమాలు చేపట్టింది.  ఇందులో భాగంగా నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో సిటీ షీటీమ్స్ పోలీసులు 5kర‌న్ నిర్వహించారు.  పీపుల్స్ ప్లాజా నుంచి తెలంగాణ డీజీపీ అనురాగ్ శ‌ర్మ 5కే, 2కే ర‌న్ ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో సినీతారలు అక్కినేని అమల, తాప్సితో పాటు పలువురు సెలబ్రిటీలు, యువతీ యువకులు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం అందుతోంది : స్వాతి లక్రా  
షీటీమ్స్ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం అందుతోంద‌ని షీటీమ్స్ ఇంఛార్జ్‌ స్వాతి ల‌క్రా తెలిపారు. మ‌హిళ భ‌ద్రతకు పెద్ద పీట వేస్తూ.. బాధితుల జీవితాల్లో షీ టీమ్ పోలీసులు వెలుగు నింపుతున్నారని ప్రశసించారు.   
షీ టీమ్స్ కార్యక్రమాలను అభినందిస్తున్నా : అక్కినేని అమల 
మహిళల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటుచేసిన షీ టీమ్స్ కార్యక్రమాలను అభినందిస్తున్నానని సినీ నటి అక్కినేని అమల పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని నెక్లెస్ రోడ్‌లో జరిగిన రన్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... మహిళల్లో ఆత్మ విశ్వాసం పెరగాల్సి ఉందన్నారు. అలాగే షీ టీమ్స్‌పై అవగాహనకు రన్ నిర్వహించడం సంతోషదాయకమన్నారు.
రన్ లో పాల్గొనడం ఆనందంగా ఉంది : తాప్సి
షీ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైన రన్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని సినీ హీరోయిన్ తాప్సి పేర్కొన్నారు. ఆదివారం నెక్లెస్ రోడ్‌లో జరిగిన రన్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... మహిళా భద్రత కోసం షీ టీమ్స్ కృషి బాగుందన్నారు. అలాగే షీ టీమ్స్ అవగాహన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని తాప్సి పేర్కొన్నారు.
నృత్యాలతో అలరించిన యువత  
రన్‌లో పాల్గొన్న యువత నృత్యాలతో అలరించారు. ప్లాష్ మెబ్ డాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన‌డం చాలా హ్యాపీగా ఉందని పలువురు స్టూడెంట్స్ తెలిపారు. మున్ముందు మ‌రెన్నో ప్రోగ్రాముల‌ను పోలీసులు కండ‌క్ట్ చేయాల‌ని కోరుతున్నారు. వారం రోజులపాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీస్ శాఖ హైదరాబాద్ క్రైం ఫ్రీ సిటీగా మార్చాలనే ట్యాగ్ తో ర‌న్ ను విజయవంతం చేశారు. 

 

20:52 - March 5, 2017

వాషింగ్టన్ : అమెరికన్ల జాత్యహంకారాన్ని.. మరో భారతీయురాలు బయటపెట్టింది. తెల్లజాతి దురహంకారం... ఎలా కొనసాగుతూ వస్తోందో వివరించింది. సిక్కు మతాచారం ప్రకారం తలపాగా ధరించినందువల్ల 103 ఏళ్ల క్రితం వర్ణభేదంతో... తన తాత కేఆర్‌ సింగ్‌ను అక్కడి అధికారులు నిర్బంధించంగా... సెప్టెంబర్‌ 11 ఘటన తర్వాత తన అంకుల్‌ హత్యకు గురయ్యాడని  అమెరికాలో జాతి విద్వేషానికి వ్యతిరేకంగా 15 ఏళ్లుగా పోరాడుతున్న లాయర్‌, ఫిల్మ్‌ మేకర్‌ వలేర్‌ కౌర్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
'కేఆర్‌ సింగ్‌ శరీరం రంగు చూసి తెల్ల జాతీయులు అనుమానించారు. విదేశీయుడని అనుమానించి నిర్బంధించారు. హెన్రీ మార్షల్‌ అనే ఓ అమెరికన్‌ లాయర్‌  హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌తో మా తాతను విడిపించారు. అమెరికన్ల జాతి విద్వేషంతో మా తాత చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. సెప్టెంబర్‌ 11 ఘటన తర్వాత మా అంకుల్‌ కూడా హత్యకు గురయ్యాడు. అయినా అన్ని బాధల్ని భరించి ఓ లాయర్‌గా నిలదొక్కుకున్నాను. 15 ఏళ్లుగా ఫిల్మ్‌, క్యాంపెనింగ్‌ల ద్వారా జాతి వివక్షపై చైతన్యం కలిస్తున్నాను. నా కొడుకు గోధుమ వర్ణంతో పుట్టాడు. వాడికి ఈ దేశంలో రక్షణ ఉంటుందా..? వాడి మత విశ్వాసాల ప్రకారం స్వేచ్ఛగా జీవించే వీలు ఉంటుందా..? కొందరు జాత్యంహకారులకు నలుపు రంగు శరీరాలు వికృతంగా కన్పిస్తున్నాయి. గోధుమ రంగు, నలుపు శరీరాలు కొందరికి చట్టవ్యతిరేక శక్తులుగా కనిపిస్తున్నాయి. మహిళా గర్భంలో ఉండగానే శిశువు చీకటిలో ఉంటాడు. వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా సమాధిలో చీకటిలో ఉంటారు. చివరికి మనం కళ్లు మూసుకుని ప్రార్థన చేసినా చీకటే ఉంటుంది. నలుపన్నా, చీకటి అన్నా ఈ తెల్లజాతీయులకు ఎందుకంత వివక్ష...? మన జాతిని రక్షించుకునేలా మనమంతా పోరాడాలి' అని చెప్పింది.

 

20:46 - March 5, 2017

వాషింగ్టన్ : అమెరికాలో జాతి విద్వేషం మళ్లీ బుసలు కొట్టింది. వంశీచంద్ రెడ్డి, శ్రీనివాస్‌ కూచిభొట్ల హత్య, గుజరాత్‌ వ్యాపారీ హర్నీష్‌ పటేల్‌ ఘటన నుంచి తేరుకోకముందే.. మరో భారతీయుడిపై దుండగులు కాల్పులు జరిపారు. అయితే అదృష్టవశాత్తూ దుండగుల కాల్పుల్లో భారతీయుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మా దేశం నుంచి వెళ్లిపోండి అన్న నిందితుడి మాటలను బట్టి... అక్కడి వారి జాతివిద్వేశం అర్థమవుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఈ దాడులతో.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. 
ఆగని భారతీయుల హత్యలు  
అమెరికాలో... భారతీయుల హత్యలు ఆగడం లేదు. వంశీచంద్ రెడ్డి, శ్రీనివాస్‌ కూచిభట్ల, గుజరాత్‌ వ్యాపారీ హర్నీష్‌ పటేల్‌ హత్యల ఘటనల నుంచి తేరుకోకముందే..అక్కడ మరో భారతీయుడిపై దుండగుడు కాల్పుల ఘటన కలకలం రేపింది. కెంట్‌లో ఉంటున్న 39 ఏళ్ల భారతీయ సిక్కు యువకుడు దీప్‌రాయ్‌పై ఓ దుండగుడు మెరుపువేగంతో వచ్చి కాల్పులు జరిపి పరారయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి వాషింగ్టన్‌ రాష్టంలోని కెంట్‌ నగరంలో శ్వేతజాతీయుడు.. గో బ్యాక్ టు యువర్ కంట్రీ అంటూ భారతీయ సిక్కు యువకుడు దీప్ రాయ్‌పై..కాల్పులు జరిపాడు. బాధిత వ్యక్తి ఇంటి బయట కారు వద్ద ఉండగా..శ్వేతజాతి వ్యక్తి ఆయనతో వాదనకు దిగాడు. దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఉన్మాదంతో అరుస్తూ దుండగుడు కాల్పులు జరపగా,..దీప్ రాయ్ చేతిలో బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో బాధితుడిని చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ కాల్పుల్లో గాయపడ్డ సిక్కు యువకుడు దీప్‌రాయ్‌..ప్రస్తుతం ఆసుపత్రిలో నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ ఘటనను  తీవ్రంగా పరిగణిస్తున్నామన్న FBI.. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
భారతీయ సిక్కు యువకునిపై దాడులు 
తాజాగా జరిగిన జాత్యహంకార దాడిపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. దీప్‌ రాయ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు ఆమె తెలిపారు. బాధితుడి తండ్రి సర్దార్ హర్‌పాల్ సింగ్‌తోనూ తాను మాట్లాడానని సుష్మా తెలిపారు. తన కుమారుడి చేతిలో బుల్లెట్‌ దిగిందని..వెంటనే చికిత్స కోసం వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని..బాధితుని తండ్రి తనకు ఫోన్లో వివరించినట్లు సుష్మా ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యల ప్రభావంతోనే భారతీయులపై దాడులు జరుగుతున్నాయని కెంట్‌లో ఉంటున్న బాధితుడి తండ్రి హర్‌పాల్‌సింగ్‌ వ్యాఖ్యానించినట్లు సుష్మా తెలిపారు. మరోవైపు భారతీయు సిక్కు యువకుడు దీప్ రాయ్‌పై జరిగిన దాడి విషయంలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారతీయ దౌత్య కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దౌత్యాధికారి ఒకరు మాట్లాడుతూ దీప్‌రాయ్ మాట్లాడగలుగుతున్నట్లు తెలిపారు. ఆయనకు సాధ్యమైనంత సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే భారతీయులపై జరుగుతున్న కాల్పులపై కాన్సస్‌ గవర్నర్‌ శామ్‌బ్రౌన్‌ స్పందిస్తూ..ఇలాంటి కాల్పులు జరగడం సిగ్గుచేటన్నారు. వరుసగా జరుగుతున్న కాల్పులకు తాను సిగ్గుపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రవాస భారతీయుల్లో భయం
నెలరోజులుగా వరుసగా జరుగుతున్న దాడులు భారతీయులను భయపెట్టిస్తున్నాయి. తొలుత వరంగల్‌ నగరానికి చెందిన వంశీతో మొదలైన జాత్యాహంకార దాడులు ఆ తర్వాత కాన్సస్‌లో ఉంటున్న కూచిభట్ల శ్రీనివాస్‌ను పొట్టనబెట్టుకున్నాయి. ఈ రెండు ఘటనలు మర్చిపోకముందే..మూడు రోజుల క్రితం అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు హర్నీష్‌పటేల్‌ హత్య జరిగింది. ఈ ఘటన జరిగి రెండు రోజులు కాకముందే.. తాజాగా కెంటీలో ఉంటున్న భారతీయ సిక్కు యువకుడు దీప్‌రాయ్‌పై కాల్పులు జరిపి మరోసారి తమ జాతి విద్వేషాన్ని బయటపెట్టారు. అమెరికాలో తాజాగా జరిగిన దాడితో అక్కడి ప్రవాస భారతీయులు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక భయంతో బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు. 

 

20:38 - March 5, 2017

గుంటూరు : రేపటి నుంచి ప్రారంభమయ్యే ఏపీ బడ్జెట్‌ సమావేశాలకు అమరావతిలో నిర్మించిన కొత్త అసెంబ్లీ భవనం సిద్ధంగా ఉంది. కొత్త భవనంలో తొలిసారిగా సమావేశాలు కావడంతో.. సరికొత్త చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతిలో అత్యాధునిక హంగులతో అసెంబ్లీ నిర్మించారు. శాశ్వత అసెంబ్లీ నిర్మాణం జరిగే వరకు ఇందులోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. సభ్యులు మైకులు విరగ్గొట్టకుండా మైక్రోఫోన్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. సభ్యులు స్పీకర్‌ పోడియం వైపు దూసుకు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరిన్ని విషయాలను వీడియోలో చూద్దాం...

 

20:33 - March 5, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. తెలంగాణలో టీఆర్ ఎస్ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించగా... ఏపీలో టీడీపీ ఇంకా పేర్లు ఖరారు చేయలేదు. ప్రతిపక్ష వైసీపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను పోటీలో నిలపబోతోంది. ఈ నెల 7వరకూ ఎన్నికలకు నామినేషన్లు వేసే అవకాశముంది. 
అభ్యర్థుల పేర్ల ప్రకటించిన టీఆర్‌ఎస్‌ 
తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా కింద మూడు స్థానాలకు... స్థానిక సంస్థల కోటా కింద ఒక స్థానానికి... ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఒక స్థానానికి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎమ్మెల్యే కోటా కింద స్థానాలకు వుల్లోల గంగాధర్‌ గౌడ్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు పేర్లను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. 
త్వరలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ 
ఎమ్మెల్యే కోటాతో పాటు గవర్నర్‌ కోటాకింద కూడా త్వరలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి.. ఈ స్థానాలకూ కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించింది. డీ రాజేశ్వరరావు, ఫారూఖ్‌ హుస్సేన్‌ పేర్లను ప్రభుత్వం తరఫున ప్రతిపాదించాలని సీఎం నిర్ణయించారు.. ఇక స్థానిక సంస్థల కోటా నుంచి ఎంఐఎంకు చెందిన సయ్యద్‌ అమీనుల్‌ అసద్‌ జాఫ్రీకి టీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చింది.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కాటేపల్లి జనార్ధన్‌ రెడ్డిని ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానాలకు కులాల వారీగా అభ్యర్థులను చూస్తే ముస్లిం సామాజిక వర్గానికి రెండు, రెడ్డి సామాజిక వర్గానికి రెండు, క్రిస్టియన్లకు ఒకటి, బీసీలకు ఒకటి, వెలమ సామాజిక వర్గానికి ఒక స్థానం దక్కినట్లయింది.. 
సోమవారం నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు
కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి సుభాష్ రెడ్డి పేరును కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం సీఎం పరిశీలించారు. సామాజిక సమీకరణలు కుదరకపోవడంతో ఇది సాధ్యం కాలేదు.. మళ్లీ ఎమ్మెల్సీ ఖాళీలు ఏర్పడినప్పుడు సుభాష్‌రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.. టీఆర్‌ఎస్‌నుంచి పోటీచేసే ఎమ్మెల్సీ అభ్యర్థులంగా సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.. ఈ ఎన్నికలకు సమన్వయకర్తలుగా హోంమంత్రి నాయిని , మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యదర్శి మాదాటి రమేశ్‌ రెడ్డిలను సీఎం ప్రకటించారు..
ఏపీలోనూ ఎమ్మెల్సీ హడావుడి 
అటు ఏపీలోనూ ఎమ్మెల్సీ హడావుడి కొనసాగుతోంది.. మొత్తం ఏడు ఖాళీల్లో ఐదు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను నిలపనుంది.... ముందు ఆరు స్థానాల్లో పోటీ చేయాలని సీఎం చంద్రబాబు భావించినా... చివరకు 5 స్థానాలకే ఓకే చేశారు.. ఎమ్మెల్యే కోటాకింద ఇప్పటికే లోకేశ్ పేరు ఖరారైంది.. ఆదివారం రాత్రివరకు మిగతా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.. ఈస్థానాల్లో బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీతోపాటు మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.. 
సోమవారం నామినేషన్‌ వేయనున్న టీడీపీ అభ్యర్థులు
 ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు కూడా సోమవారం నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. ఉదయం 10గంటల 39 నిమిషాలకు లోకేశ్ నామినేషన్‌ వేయనున్నారు.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ నామినేషన్లు వేసేందుకు ఈ నెల 7వరకూ సమయం ఉంది.. రెండు స్థానాలకు వైసీపీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించింది.. 

 

20:27 - March 5, 2017

కర్నూలు : ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన మంత్రి రావెల కిషోర్‌ బాబుపై ఎన్నికల అధికారులు కేసు నమోదు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేజీ రెడ్డిని గెలిపించుకునేందుకు మంత్రి అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్‌ను లెక్కచేయకుండా నగరంలోని ప్రధాన కూడళ్లలో కేజీ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ఎవ్వరూ పట్టించుకోవడంలేదని విమర్శించారు.

 

20:09 - March 5, 2017

నువ్వలరేవులో ఏకమవుతున్న వంద జంటలు

శ్రీకాకుళం : వజ్రపు కొత్తూరు మండలం నువ్వలరేవులో వంద జంటలు ఏకమవుతున్నాయి. ఈ రాత్రి 11.31 నిమిషాలకు శుభ ముహూర్తం. వధూవరులు ఒకే గ్రామానికి చెందిన వారు. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 

​దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ లో 30 కేజీల గంజాయి పట్టివేత

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ లో 30 కేజీల గంజాయి పట్టుకున్నారు. నలుగురు అరెస్టు చేశారు. 

19:19 - March 5, 2017
19:17 - March 5, 2017

గుంటూరు : నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు కమ్మ కులస్తులు చాలా కృషి చేశారని... చంద్రబాబు సీఎం అయ్యాక వేరే కులస్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పదవులన్నీ ఇతర కులస్తులకే కట్టబెడుతున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఐఏఎస్ లకు పదవులు ఇస్తున్నారని.. దీంతో పార్టీకోసం రాత్రింబవళ్లు కష్టపడ్డ కేడర్‌ రోడ్లమీద తిరుగుతున్నారని మండిపడ్డారు. తాను జూనియర్‌ని కావడంతో ముఖ్యమంత్రిని ప్రశ్నించలేకపోతున్నానని... సీనియర్‌ నేతలు ఈ అంశంపై చంద్రబాబును నిలదీయాలని కోరారు.

 

 

ఎంపీ రాయపాటి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు

గుంటూరు : నర్సారావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మ కులస్తులను చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. కమ్మ కులస్తులకు న్యాయం చేయాలని అడగాలన్నారు. ఇతర కులస్తులకు పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. సీనియర్ నేతలు చంద్రబాబును నిలదీయాలని సూచించారు. 

18:37 - March 5, 2017

ఆదిలాబాద్ : పంటను అమ్ముకుందామని మార్కెట్ యార్డ్‌కు వెళ్తున్న కంది రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. అధికారులు, వ్యాపారులు కుమ్మకై రైతుల రక్తాన్ని పీల్చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కంది రైతులు పడుతున్న కష్టాలపై ప్రత్యేక కథనం.. 
రైతుల కష్టాన్ని జలగలా పీల్చేస్తున్న దళారులు 
ఇది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్. ఇక్కడ పంటను అమ్ముకుందామని కంది రైతులు యార్డ్‌కు వస్తుంటారు. అయితే ఇలా వచ్చిన రైతుల కష్టాన్ని దళారులు జలగలా పీల్చేస్తున్నారు. పంటను కొనకుండా అందరికీ అన్నం పెట్టే రైతుల కడుపుమాడుస్తున్నారు. దీంతో ఎవరైనా పంట కొనకపోతారా అనే ఆశతో ఐదారోజులు మార్కెట్ యార్డ్‌లోనే రైతులు నిరీక్షిస్తున్నారు. 
పంటను కొనుగోళ్లు చేయమని వేడుకోలు  
పంటను కొనుగోళ్లు చేయమని కనిపించిన వారినల్లా వేడుకుంటున్నారు. యార్డ్ సిబ్బంది మాత్రం కందులు నింపడానికి గన్ని సంచులు లేవని..  సంచులు వచ్చేవరకు  రైతులదే కందుల బాధ్యత అని చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు ప్రైవేట్ వ్యాపారులు తీసుకువచ్చిన కందులను మాత్రం క్షణాల్లో కొనుగోలుచేస్తున్నారని రైత్తన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 
రైతును నట్టేట ముంచుతున్నారు 
ప్రైవేట్ వ్యాపారులకు పట్టని నిబంధనలను రైతులకు వర్తింపజేస్తూ వారిని మానసికక్షోభకు గురిచేస్తున్నారు. తేమ,పొట్టు వంటిసాకుతో తూకంలో కోత విధిస్తూ రైతును నట్టేట ముంచుతున్నారు. 
మామూళ్ల మత్తులో అధికారులు 
రైతులను ఆదుకోవాల్సిన అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో దళారులకు వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి అక్రమాలు జరుగుతున్న జిల్లా అధికారుల దృష్టికి రాకపోవడం వారి పని తీరును అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా కందులు కొనుగోళ్లు చేసి మద్దతు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

 

18:30 - March 5, 2017

శ్రీకాకుళం : వంద జంటలు అందరూ ఒకే ఊరి వారు.. అందరికి ఒకే రోజు.. ఒకే ముహుర్తంలో సామూహికంగా పెళ్లిళ్లు కానున్నాయి. ఇలా అన్ని పెళ్లిళ్లన్ని ఒకే చోట జరగవు.. ఎవరి పెళ్లి వారి ఇంటిముందే జరుగుతుంది. వరుడు, వధువు ఇద్దరు తాళి కట్టించుకుకోవడం ఇక్కడి విశేషం. దశాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారానికి శ్రీకాకుళం జిల్లాలోని నువ్వులరేవు గ్రామం సన్నద్ధమైంది. ఈ వింత ఆచారాల గురించి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.. 
సామూహిక వివాహాల సందడి 
శ్రీకాకుళం జిల్లాలోని నువ్వులరేవులో సామూహిక వివాహాల సందడి నెలకొంది. ఆదివారం రాత్రి 11:31 నిమిషాలకు గ్రామంలో వంద జంటలకు సామూహికంగా వివాహాలు జరిపించనున్నారు. దీంతో ఆగ్రామంలో సందడి నెలకొంది. ప్రతి మూడేళ్లకోసారి సామూహిక వివాహాలు నిర్వహిచడం గ్రామంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ గ్రామంలో దశాబ్దాలుగా సామూహిక వివాహాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. 
ఆ ఊరి వారిని తప్ప బయటవారిని పెళ్లిచేసుకోరు..
ఇప్పుడు గ్రామంలో ఎటు చూసినా వివాహాల సందడే కనిపిస్తోంది. అలాగే వివాహాలు చేసుకునే వారు, వారి బంధువులతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ ఊరి వారిని తప్ప బయటవారిని పెళ్లిచేసుకోకపోవడం.. వరుడు, వధువు ఇద్దరు తాళి కట్టించుకుకోవడం.. గర్భదానం ఒకే ముహూర్తాన జరుపుకోవడం ఇక్కడి ఆచారం. 
దురాచారాలకు పుల్ స్టాప్ 
గతంలో బాల్యవివాహాలు జరిగేవి.. పెద్దలు, అధికారులు, గ్రామస్తుల అవగాహన, అంగీకారం మేరకు ఇప్పుడు అలాంటి దురాచారాలకు పుల్ స్టాప్ పెట్టారు. మూడేళ్ల క్రితం ఈ విధంగా నూట అరవై జంటలకు వివాహాలు జరిగితే.. ఇప్పుడు మళ్లీ వంద జంటలకు వివాహాలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. 
సర్పంచ్, ఎంపిటిసిలు ఏకగ్రీవ ఎన్నిక                              
ఇంకొక విశేషమేమిటంటే సర్పంచ్, ఎంపిటిసిలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గ్రామస్తుల ఐక్యతకు అద్దంపడుతోంది. అలాగే మద్య నిషేధం లాంటి కార్యక్రమాలు సైతం అమలవుతున్నాయి. మొత్తం మీద నువ్వులరేవు గ్రామం సామూహిక వివాహాల పుణ్యమా అని ఎంతో ప్రత్యేకత సంపాదించుకుంటోంది

 

18:22 - March 5, 2017

సోమాలియా : కేవలం 48 గంటలు..! నూటా పది మంది ప్రాణాలు బలి..!! ఈలెక్కలు, క్షామపీడిత సోమాలియాలోని ప్రస్తుత దుర్భరస్థితిని ప్రపంచానికి చెబుతున్నాయి. సోమాలియాలో మళ్లీ ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. అరచి, అరచి అలసిన జనం.. నిస్సత్తువతో మృత్యుఒడికి చేరుతున్నారు. ఆకలిచావుల నివారణకు అక్కడి ప్రభుత్వం చేపడుతోన్న చర్యలు ఏమూలకూ చాలడం లేదు. దీంతో, ప్రజలు ఆకలికి తాళలేక వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చిన్నారులు, మహిళల సంఖ్యే అధికం.
ఆకలికి చిరునామాగా సోమాలియా 
సోమాలియా..! ఆఫ్రికా ఖండానికి చెందిన ఈ దేశం తీవ్ర దుర్భిక్ష్యానికి, ఆకలికి చిరునామాగా నిలుస్తోంది. దశాబ్దాలుగా అక్కడ ఆకలి కేకలు.. ఆకలి చావులు.. కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో వివిధ దేశాలు, ఐక్యరాజ్యసమితి చొరవ, సహకారంతో కాస్తంత తగ్గినట్లు కనిపించిన ఆకలి చావులు, ఇటీవల మళ్లీ పెరిగాయి. కేవలం గడచిన 48 గంటల వ్యవధిలోనే, 110 మంది ఆకలిచావులకు గురయ్యారు. దేశంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించిన తర్వాతనే ఈ మరణాలు సంభవించడం గమనార్హం. సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ అలీఖైర్‌ స్వయంగా  ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. దీన్ని బట్టి.. సోమాలియాలో క్షామం ఎంతలా విజృంభిస్తోందో అర్థమవుతోంది. 
సోమాలియాలో క్షామం విలయతాండవం
సోమాలియాలో క్షామం విలయతాండవం చేస్తోంది. దీని ఫలితంగా దేశ ప్రజలంతా తినేందుకు ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్నారు.  ప్రజల ఆకలికేకలు,  ఆర్తనాదాలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. బుక్క ముద్ద కోసం  ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. తిండి దొరకక చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎముకల గూళ్లుగా తయారవుతున్నారు. అక్కడి విషాద దృశ్యాలు చూస్తే ఎలాంటి హృదయమైనా ద్రవించక మానదు. తిండి కోసం ప్రజల మధ్య కొట్లాటలు, దౌర్జన్యాలు నిత్యకృత్యమైపోయాయి.
మూగజీవాల పరిస్థితి మరింత దుర్భరం 
మనుషుల పరిస్థితితే ఇలా ఉంటే మూగజీవాల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. మేతలేక, నీరు దొరకక అవీ నిలుచున్నచోటనే ప్రాణాలు వదిలేస్తున్నాయి. కన్నబిడ్డల్లా పెంచుకుంటున్న మూగజీవాలు కళ్లెదుటే ప్రాణాలు వదులుతుంటే, బతికించుకునే దారిలేక వాటి యజమానులు, తల్లడిల్లిపోతున్నారు. 
దుర్భరస్థితిపై స్పందించిన ఐరాస
సోమాలియాలోని దుర్భరస్థితిపై ఐక్యరాజ్యసమితి కూడా స్పందించింది. ఆదేశంలోని సుమారు 50 లక్షల మందికి తక్షణ ఆహారసాయం అవసరమని ఐరాస ప్రకటించింది. ప్రస్తుతం, సోమాలియా ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. కళ్లముందే ఎప్పుడు ఎవరి ఉసురు ఆగుతుందో.. అయినవాళ్లలో ఎవరు ముందు ప్రాణాలు వదులుతారో.. అర్థం కాక, వారిని కాపాడుకునే దారే లేక.. సోమాలియా ప్రజలు ప్రత్యక్షనరకాన్ని చూస్తున్నారు. ప్రపంచ దేశాలు మళ్లీ చేయీ చేయీ కలిపి, సోమాలియాలోని క్షామంపై సమరభేరీ మోగించి, ఆపన్నులకు అండను ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. అక్కడి ప్రజలు కూడా చేయూతను అందించే వారి కోసం కళ్లల్లో ప్రాణాలు నిలుపుకొని ఎదురు చూస్తున్నారు.

 

18:14 - March 5, 2017

విజయనగరం : ఏపీలో మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంతో విజయనగరం జిల్లాలో తెలుగుదేశం రాజకీయాలు వేడెక్కాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు, సినియారిటీ.. ఇలా అన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. జిల్లాలోని రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మెజారిటీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయా వర్గాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో విలక్షణ రాజకీయాలు
విజయనగరం జిల్లా విలక్షణ రాజకీయాలు, సామాజిక సమీకరణలకు నెలవు. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికార టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారు తెరవెనుక ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
జిల్లాలో బీసీలు ఎక్కువ.. 
జిల్లాలో బీసీలు ఎక్కువ. తూర్పుకాపు, కొప్పలవెలమ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంస్థానాదీశుల కాలం నుంచి జిల్లాలో రాజరిక రాజులకే పదువులు దక్కుతున్నాయి. విజయనగరంలోపాటు, కురుపాం, బొబ్బిలి, నెల్లిమర్ల నియోజవర్గాల్లో రాజవంశీయుల ప్రభావం ఎక్కువ. బీసీలు అధికంగా ఉన్నప్పటికీ మైనారిటీ వర్గంగా రాజు సామాజిక వర్గానికే ఇప్పటి వరకు పదవులు దక్కుతూ వస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలో బొబ్బిలి  స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎన్నికైన సుజయ కృష్ణరంగారావు గత ఏడాది టీడీపీలో చేశారు. విజయనగం జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిమిడి మృణాలిన్ని తప్పించి, రంగారావుకు స్థానం కల్పించే అవకాశం ఉందని  ప్రచారం జరుగుతోంది. దీనిపై బీసీలు నిరసన గళం విప్పుతున్నారు. 
జిల్లాలో  తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు 
జిల్లాలో  తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో  ఆరు స్థానాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం నుంచి తూర్పుకాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్‌ కోట నుంచి కొప్పలవెమల సామాజిక వర్గానికి చెందిన కోళ్ల లలిత కుమారి గత ఎన్నికల్లో గెలుపొందారు. తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన కిమిడి మృణాళిని తొలగిస్తే ఇదే సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్‌ వస్తోంది. తూర్పుకాపు సామాజిక వర్గాన్ని రాజులు ప్రభావితం చేస్తుండటాన్ని నిరసిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తూర్పుకాపులను ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోడాన్ని ఈ వర్గం నేతలు తప్పుపడుతున్నారు. గతంలో టీడీపీ ఇలాంటి తప్పుచేసి పదేళ్లపాటు అధికారానికి దూరమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 
మంత్రి పదవి కోసం కోళ్ల లలితకుమారి యత్నం 
ఇక తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, గజపతినగరం శాసనసభ్యుడు కేఏ నాయుడు మంత్రివర్గంలో స్థానం కోసం  ప్రయత్నిస్తున్నారు. ఎనిమిదిసార్లు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించిన తనను విస్మరించరాదని సతివాడ నారాయణస్వామినాయుడు కోరుతున్నారు. కొప్పల వెలమ సామాజికవర్గానికి చెందిన ఎస్‌ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రేసులో ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్‌ మంత్రివర్గంలో స్థానం కోసం యత్నిస్తున్నారు. ఎస్టీ సామాజికవర్గం నుంచి గుమ్మడి సంధ్యారాణి రేసులో ఉన్నారు. ఇలా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రాజు, తూర్పుకాపు, కొప్పలవెలమ, ఎస్టీ సామాజికవర్గాల్లో ఏ వర్గానికి మంత్రి పదవి దక్కుతుందో చూడాలి.

 

ఇకపై ఎస్ బీఐలో కొత్త రూల్స్..

హైదరాబాద్ : ఇకపై ఎస్ బీఐలో కొత్త రూల్స్ రానున్నాయి. నగుదు డిపాజిట్లు, ఏటీఎంలలో నగదు విత్ డ్రాపై ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ 3 సార్లు దాటితే రూ.20 చార్జీ అవుతుందని చెప్పింది. ఎస్ బిఐ ఏటీఎలలో నగదు ఉపసంహరణ 5 సార్లు దాటితే రూ.10 చార్జీ పడనుంది. 

మంత్రి రావెలపై చర్యలు తీసుకోవాలి : ఎంఎ.గఫూర్

కర్నూలు : ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి రావెల కిషోర్ బాబుపై చర్యలు తీసుకోవాలని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ డిమాండ్ చేశారు. నిన్న అధికారులతో రావెల సమావేశం నిర్వహించడం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. 

 

తేనెటీగల దాడిలో కార్మికుడు మృతి

భద్రాద్రి : సారపాకలోని బీపీఎల్ పరిశ్రమలో విషాదం నెలకొంది. కాంట్రాక్ట్ కార్మికుడు నాగరాజుపై తేనెటీగలు దాడి చేయి. కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందాడు.

 

బెంగళూరు టెస్టు.. ముగిసిన రెండో రోజు ఆట

బెంగళూరు టెస్టు : భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. రెండు రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్ 237/6. భారత్ తొలి ఇన్నింగ్స్ 189 పరుగుగలకు ఆలౌట్ అయింది. జడేజాకు 3 వికెట్లు, ఇషాంత్, ఉమేష్, అశ్విన్లకు తలో వికెట్ పడింది. ఆస్ట్రేలియా 48 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

నయీమ్‌తో నాకు ఫ్రెండ్‌ షిప్ ఉందన్న నేతి విద్యాసాగర్

హైదరాబాద్ : నయీమ్ కేసులో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారించింది. నేతిని సిట్ ఇప్పటికే రెండుసార్లు విచారించింది. నయీమ్‌తో తనకు ఫ్రెండ్‌ షిప్ ఉందని నేతి అంగీకరించారు. ఈ మేరకు నేతి విద్యాసాగర్ స్టేట్‌మెంట్ సిట్ రికార్డ్ చేసింది. నయీమ్ భార్య ఫర్హానాతో కలిసి నేతి విద్యాసాగర్ భార్య ల్యాండ్ కొన్నట్లు కూడా సిట్ గుర్తించింది. నాగేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై సిట్ బృందం నేతిని విచారించింది. 

17:06 - March 5, 2017

హైదరాబాద్ : నయీమ్ కేసులో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారించింది. నేతిని సిట్ ఇప్పటికే రెండుసార్లు విచారించింది. నయీమ్‌తో తనకు ఫ్రెండ్‌ షిప్ ఉందని నేతి అంగీకరించారు. ఈ మేరకు నేతి విద్యాసాగర్ స్టేట్‌మెంట్ సిట్ రికార్డ్ చేసింది. నయీమ్ భార్య ఫర్హానాతో కలిసి నేతి విద్యాసాగర్ భార్య ల్యాండ్ కొన్నట్లు కూడా సిట్ గుర్తించింది. నాగేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై సిట్ బృందం నేతిని విచారించింది. 

 

16:57 - March 5, 2017

కృష్ణా : విజయవాడలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నిబంధనలు పాటించని వాహనదారులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినవారు, మద్యం సేవించినవారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మైనర్లతోపాటు వారి తల్లిదండ్రులకూ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్

హైదరాబాద్ : ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటా కింద వుల్లోల గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంప్లలి హన్మంతరావును ఎంపిక చేసింది. స్థానిక సంస్థల కోటా స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది. ఎంఐఎం అభ్యర్థి బరిలో నిలుస్తున్న అమీనుల్ అసద్ జాఫ్రీకి టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇక ఉపాధ్యాయ కోటా నుంచి కాటేపల్లి జనార్దన్ పేరును టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు గవర్నర్ కోటా విభాగంలో 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటికి కూడా కేసీఆర్ పేర్లను ముందుగానే ప్రకటించారు. ఈ కోటాలో డి.రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్‌లకు అవకాశం దక్కింది.

16:38 - March 5, 2017

హైదరాబాద్ : ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటా కింద వుల్లోల గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంప్లలి హన్మంతరావును ఎంపిక చేసింది. స్థానిక సంస్థల కోటా స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది. ఎంఐఎం అభ్యర్థి బరిలో నిలుస్తున్న అమీనుల్ అసద్ జాఫ్రీకి టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇక ఉపాధ్యాయ కోటా నుంచి కాటేపల్లి జనార్దన్ పేరును టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు గవర్నర్ కోటా విభాగంలో 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటికి కూడా కేసీఆర్ పేర్లను ముందుగానే ప్రకటించారు. ఈ కోటాలో డి.రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్‌లకు అవకాశం దక్కింది. సోమవారం ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 

 

15:52 - March 5, 2017

వరంగల్ : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు వ‌రంగ‌ల్ న‌గ‌రంలో ఉత్సహంగా సాగుతున్నాయి. క‌రీమాబాద్ రంగ స‌ముద్రంలో నిర్వహించిన ప‌డ‌వ‌ల పోటీల‌ను సీపీ సుధీర్ బాబు ప్రారంభించారు.  డ‌బుల్, సింగిల్స్ విభాగాల్లో పోటీల‌ను నిర్వహించారు. ఈ పోటీల‌ను తిల‌కించేందుకు నగ‌ర వాసులు పెద్దసంఖ్యలో తరలిచ్చారు. జిల్లా కలెక్టర్ అమ్రపాలితో పాటు సీపీ సుధీర్‌బాబు ప‌డ‌వపై కాసేపు విహ‌రించారు. 

15:51 - March 5, 2017

తిరుపతి : తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నిక పోరు ఈ సారి రసవత్తరంగా మారింది. పీడీఎఫ్‌ బలపరిచిన అభ్యర్థి సుబ్రహ్మణ్యం, టీడీపీ అభ్యర్థిల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో ఈ సారి కార్పొరేట్‌ శక్తుల జోక్యం పెరిగిపోయిందని పీడీఎఫ్‌ అభ్యర్థి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఓటర్ల లిస్టును తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సారి రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. ఎన్నికల్లో రాజకీయ శక్తులకు ప్రమేయం ఇవ్వొద్దని సూచించారు.

 

బాధితుడికి అన్ని విధాలా సాయం చేస్తాం : భారత విదేశాంగ శాఖ

వాషింగ్టన్ : అమెరికాలో కాల్పుల్లో గాయపడిన దీప్ రాయ్ కోలుకుంటున్నాడని భారత విదేశాంగ శాఖ తెలిపింది. బాధితుడికి అన్ని విధాలా సాయం చేస్తామని చెప్పారు. వాషింగ్టన్ లో దీప్ రాయ్ పై దుండగులు కాల్పులు జరిపారు. భారత్ వెళ్లిపోవాంటూ దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. 

15:45 - March 5, 2017

ఢిల్లీ : అమెరికాలో దుండగుడు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దీప్ రాయ్‌ కోలుకుంటున్నాడని భారత విదేశాంగశాఖ తెలిపింది. దీప్ రాయ్‌కి అన్ని విధాలా సహకరిస్తామని వెల్లడించింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి వాషింగ్టన్‌ రాష్టంలోని కెంట్‌ నగరంలో శ్వేతజాతీయుడు .. భారత్‌కు వెళ్లిపో అంటూ దీప్ రాయ్‌ అనే వ్యక్తిపై... ఆయన ఇంటి బయటే కాల్పులు జరిపాడు. బాధిత వ్యక్తి ఇంటి బయట కారు వద్ద ఉండగా  శ్వేతజాతి వ్యక్తి ఆయనతో వాదనకు దిగాడు. దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఉన్మాదంతో అరుస్తూ దుండగుడు కాల్పులు జరపగా, దీప్ రాయ్ చేతిలో బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. దుండగుడు ఆరడుగుల పొడవున్నాడని, ముఖానికి మాస్క్ ధరించాడని బాధితుడు తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని కెంట్ పోలీస్ అధికారి చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు భారతీయులపై జాత్యంహకార కాల్పులు జరిగాయి.  గత రెండు వారాల్లో ఇది మూడో ఘటన.  

రేపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్

హైదరాబాద్ : ఏపీలో రేపు ఉదయం 10.39 నిమిషాలకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

 

ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

బెంగళూరు టెస్టు : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టుమ్యాచ్ లో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 163 పరుగుల వద్ద మార్ష్ డకౌట్ అయ్యాడు.

 

13:36 - March 5, 2017

నల్గొండ : సీపీఎం మహాజన పాదయాత్ర 140వ రోజుకు చేరుకుంది. సాగర్ చౌరస్తాలో కొనసాగుతోంది. అన్ని వర్గాల నుండి మహాజన పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. ముకుందాపురం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. బీకే పహాడ్, నర్సింహులగూడెం, నిడమనూరు, 14వ మైలురాయి, ఆలీనగర్, హాలియా, అనుముల, లింగంపల్లి, పెద్దవూరలో పాదయాత్ర కొనసాగుతోంది.

13:10 - March 5, 2017

హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరిని దింపాలనే దానిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న బాబు నేడు సాయంత్రం అమరావతికి బయలుదేరనున్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికపై సీనియర్ నేతలతో చర్చించనున్నారు. అర్ధరాత్రిలోగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఐదు స్థానాలు టిడిపికి వచ్చే అవకాశం ఉంది. కానీ ఆరో అభ్యర్థిని కూడా బరిలో దింపాలని సీనియర్ నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ ఒక్క అభ్యర్థిని మాత్రం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా 20 మంది టికెట్లు ఆశిస్తున్నట్లు, ఇందులో ఏడుగురు పేర్లతో షార్ట్ లిస్టును చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నుండి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఎవరికి టికెట్లు వస్తాయో..రావో అన్న దానిపై ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

జేసీ బ్రదర్స్ పై నారాయణ ఫైర్..

విజయవాడ : జేసీ బ్రదర్స్ పై ఏపీ సీపీఐ నేత రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో జేసీ బ్రదర్స్ ఆగడాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోయిందని బస్సు ప్రమాదంలో 11 మంది మృతి చెందితే, పశ్చాత్తాపపడాల్సింది పోయి, విమర్శలు చేయడం దారుణమన్నారు.

సోమవారం ఏపీ బీఏసీ మీటింగ్..

విజయవాడ : వెలగపూడిలో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రారంభం..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 11:06 గంటలకు ప్రారంభం కానున్నాయని అధికారులు వెల్లడించారు. ఆపై ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు.

12:54 - March 5, 2017

'బాహుబలి 2’ చిత్రం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. చిత్రానికి సంబంధించిన విషయాలను బయటకు పొక్కకుండా రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో ఫొటోలు..ఇతరత్రా విషయాలకు బయటకు రాలేదు. ఇటీవలే చిత్ర షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టిన సంగతి తెలిసిందే. చిత్రాలకు సంబంధించిన విషయాలు..ఫొటోలను అప్పుడప్పుడు చిత్ర యూనిట్ సోషల్ మాధ్యమాల్లో విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ఓ వీడియోను ట్విట్టర్ పోస్టు చేసింది. చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్ లను వీడియోలో పొందుపరిచారు. అంతేగాకుండా అందులో ఇంటర్వ్యూ కూడా ఉంది. ఇదిలా ఉంటే అన్ని హంగులతో ట్రైలర్ విడుదల చేసేందుకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్స్ చేస్తున్నారు. మార్చి 6వ తేదీన 'బాహుబలి 2’ టీజర్ విడుదల కానున్నట్లు వినిపిస్తోంది. ‘బాహుబలి 2’ టీజర్ ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

12:50 - March 5, 2017

తెలంగాణా అంటేనే గేయ రచయితలు గుర్తుకొస్తారు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్న గేయ రచయితలెందరో తెలంగాణాలోనే ఉండటం ఆశ్చర్యమనిపిస్తుంది. అలాంటి వారిలో వడ్డెముద్దంగుల ఎల్లన్న ఒకరు. ఆయన ఎన్నో ప్రజాసమస్యలపై గేయాలు రాశారు. సబ్బండనాదం పేరుతో ఒక పాటల పుస్తకాన్ని వెలువరించారు.

12:44 - March 5, 2017

గానుగెద్దు జీవితంలో సంపాదనకు, అప్పులకు, ఆస్తులు కూడబెట్టటానికి... వృత్తి జీవితానికి కాలం గడిచిపోతుంది. ఇది సాధారణ వ్యక్తుల జీవితం. కానీ, అతికొద్ది మంది వృత్తిని, ప్రవృత్తిని బ్యాలెన్స్ చేస్తూ, చుట్టూ ఉన్న అనేకానేక సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ కథారచయిత్రి , సంఘ సేవకురాలు ఆలూరి విజయలక్ష్మి ఒకరు. ఆమె చేసేది వైద్య వృత్తి. కాని ఆమె నిరంతరం ప్రజలకోసం కలం యుద్దం చేస్తుంది. సమాజంలోని అనేకానేక విషయాలకు స్పందించి రచనలు చేస్తుంది. ఓ పక్క మహిళల జీవిత సమస్యలకు, మరోపక్క వారి ఆరోగ్య సమస్యలకోసం కలాన్ని కదిలిస్తుంది. అలా ఆమె ఎన్నో నవలలు కథాసంపుటాలు, ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలను వెలువరించారు. ప్రముఖ కథారచయిత్రిగా, నవలాకారిణిగా, వైద్యురాలిగా ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్న డాక్టర్. ఆలూరి విజయలక్ష్మి విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

12:41 - March 5, 2017

గుంటూరు : ఇప్పుడున్న పెట్టుబడిదారి వ్యవస్థ నుంచి భవిష్యత్తులో సోషలిస్టు వ్యవస్థలోకి రావడం ఖాయమన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీ. వీ రాఘవులు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీపీఎం సీనియర్‌ నాయకులు సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీ. వీ. రాఘవులు, సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి పీ. మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా సింహాద్రి శివారెడ్డి సేవలను రాఘవులు కొనియాడారు. ప్రజా ఉద్యమాల్లో శివారెడ్డి అలుపెరగకుండా పోరాటం చేశారని అన్నారు.

12:39 - March 5, 2017

గుంటూరు : అమరావతిలో నిర్మించుకున్న సరికొత్త భవనంలో, ఏపీ అసెంబ్లీ తొలిసారిగా భేటీ కాబోతోంది. రాష్ట్ర విభజన తర్వాత, ఇంతకాలం, ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇకపై, స్వరాష్ట్రంలోనే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం, సోమవారం ఉదయం 11గంటల 6 నిమిషాలకు సమావేశాలకు శ్రీకారం చుట్టనున్నారు. సొంత రాష్ట్రంలో జరుగుతోన్న తొలి సమావేశాలు కావడంతో అధికారులు జాగ్రత్తగా ఏర్పాట్లు చేశారు.. అసెంబ్లీకి ఎవరు ఎటువైపునుంచి వెళ్లాలో ఇప్పటికే రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై 10 టివి ప్రత్యేక కథనం..

స్వరాష్ట్రంలో..
ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయంతో పాటు, శాసనసభా భవనమూ సమకూరింది. స్వరాష్ట్రంలో నిర్మించుకున్న ఈ శాసనసభా భవనంలో, సభ్యులు, సోమవారం నాడు తొలిసారిగా సమావేశం కానున్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందరికీ ఈ ప్రదేశం.. ముఖ్యంగా అసెంబ్లీ పరిసరాలు కొత్త కావడంతో, సమావేశాలకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అధికారులు రెండు ప్రధాన మార్గాలను సిద్ధం చేశారు. విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా అసెంబ్లీకి వచ్చే మార్గం ఇందులో ఒకటి. ఈ మార్గం వెంబడే సీఎం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. కరకట్ట, వెంకటపాలెం చెక్‌పోస్ట్‌, మందడం, మల్కాపురం జంక్షన్‌ మీదుగా సీఎం అసెంబ్లీ చేరుకుంటారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీల కోసం పోలీసులు వేరే రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఉండవల్లి నుంచి మంగళగిరి మీదుగా కృష్ణాయపాలెం దగ్గర బై పాస్ రహదారిపై వీరంతా అసెంబ్లీకి రానున్నారు. కృష్ణాయపాలెం మీదుగా వచ్చే నేతలు గేట్‌ నెంబర్‌ 3ద్వారా అసెంబ్లీలోకి చేరుకోవచ్చు.. ఆ పక్కనే ఏర్పాటుచేసిన స్థలంలో వాహనాలు పార్క్‌ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

అవస్థలు తప్పవా ?
అయితే మందడం ప్రధాన సెంటర్‌ మీదుగా మల్కాపురం జంక్షన్‌ మీదుగావెళ్లే ప్రధాన మార్గం ఇరుకుగా ఉంది.. ఈ దారి 29 గ్రామాలను కలిపేదారి కావడంతో అవస్థలు తప్పేలా లేవు. దారుల భద్రతతోపాటు.. అసెంబ్లీ దగ్గర పార్కింగ్‌కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. గేట్ నెంబర్ 1 ద్వారా సిఎం, స్పీకర్, మండలి చైర్మన్‌ల కాన్వాయ్‌లను మాత్రమే అనుమతిస్తారు.. గేట్ నెంబర్ 2 ద్వారా మంత్రులు, ప్రతిపక్ష నేత కాన్వాయ్‌కు ప్రవేశం ఉంటుంది.. అక్కడే పార్కింగ్ సదుపాయం కూడా కల్పించబోతున్నారు.. ఇక గేట్ నెంబర్ 4 ద్వారా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వెళ్లాల్సి ఉంటుంది. గేట్ నెంబర్ 3 ద్వారా మీడియా ప్రతినిధులు, విఐపీ పాస్ ఉన్నవారితోపాటు... సందర్శకులను అసెంబ్లీలోకి పంపుతారు.. గేట్ నెంబర్ 5 ద్వారా ఐఏయస్ అధికారులు, అసెంబ్లీ సిబ్బందికి ప్రవేశం కల్పిస్తారు.. రాష్ట్రంలో తొలిఅసెంబ్లీ సమావేశాలు కావడంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.. అన్ని మార్గాలకు సబంధించి రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసిపెట్టుకున్నారు.. ఎలాంటి ఇబ్బందివచ్చినా వెంటనే పరిష్కరించేలా ముందే ప్లాన్‌ చేసుకున్నారు.

12:37 - March 5, 2017

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ పై టిడిపి నేత బోండా ఉమ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నాయకులపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర్‌రావు ఘాటు విమర్శలు చేశారు. హత్యా రాజకీయాల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు. వంగవీటి రంగా పేరు ఎత్తే అర్హత కూడా లేదన్నారు. తన ఫ్యామిలీ గుట్టును జేసీ బ్రదర్స్‌ బయటపెడుతుంటే జగన్‌ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. రోజా అసెంబ్లీకి వస్తే అటెండర్‌ కూడా భయపడడు అని అన్నారు. భూములు కబ్జా చేశానని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

12:20 - March 5, 2017

కబ్జాలపై అసత్య ఆరోపణలు - బోండా ఉమ..

విజయవాడ : హత్యా రాజకీయాల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదని ఎమ్మెల్యే బోండా ఉమ పేర్కొన్నారు. బస్సు ప్రమాద బాధితులను ప్రభుత్వం, జేసీ ట్రావెల్స్ ఆదుకుంటుందన్నారు. అధికారులను జైలుకు పంపడం కాదని, త్వరలో జగన్ జైలుకు వెళుతారని ఉమా పేర్కొన్నారు. భూములు కబ్జా చేశానని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కబ్జాలు, కల్తీలు చేసే సంస్కృతి తమది కాదన్నారు.

ఇద్దరు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కాశ్మీర్ : ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు డీజీపీ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత భద్రతా బలగాలు ఆపరేషన్ జరిగిందని, హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్ కు చెందిన వాడని పేర్కొన్నారు.

సీనియర్ నేతలతో భేటీ కానున్న బాబు..

విజయవాడ : సాయంత్రం ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులపై సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు.

11:49 - March 5, 2017
11:46 - March 5, 2017

ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగి..ఆ తరువాత ఏదో సాధించాలనే తపనతో బయటకు వచ్చి ఒక చిన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా తన కెరీర్ ను ప్రారంభించి నేడు స్టెర్లింగ్ పంప్స్ సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ గా ఎదగడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈయన ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేగాకుండా సమాజానికి తనవంతు కృషి చేయాలన్న ఆలోచనతో తన తండ్రి పేరిట ఒక మెమోరీయల్ ట్రస్టును స్థాపించి ఎంతో మందికి సేవ చేస్తున్నారు. తన గ్రామాన్ని మరిచిపోకుండా గ్రామాభివృద్ధికి సంబంధించి తనవంతు కృషి చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే..ఎలాసన కృష్ణ..ఆయన జీవిత విశేషాలు..ఇతర వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

11:35 - March 5, 2017

పండుగలు..పలు వివాదాలను సృష్టిస్తుంటాయి. తేదీల విషయంలో గందరగోళాన్ని సృష్టిస్తుంటాయి. గతంలో పండుగల విషయంలో..గోదావరి పుష్కరాలు, నిన్నటి కృష్ణాపుష్కరాల తేదీల్లో కూడా ఇలాంటి తేడాలు వచ్చాయి. తాజాగా 'ఉగాది' పండుగపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పండితులు, పంచాంగకర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో పంచాంగం రూపొందించారు. దీంతో పండగల తేదీల్లో తేడాలొచ్చాయి. కొన్ని పంచాంగాలు, క్యాలెండర్లు మార్చి 28న శ్రీహేవళంబి నామ సంవత్సర ఉగాది అని..మరికొన్ని మార్చి 29 ఉగాది అని పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు మార్చి 29న ఉగాది సెలవు ప్రకటించాయి. అయితే పలు పంచాంగాలు, క్యాలండర్లలో మార్చి 28న ఉగాది అని పేర్కొన్నాయి. తాజాగా శ్రీనివాస గార్గేయ కూడా 28నే ఉగాది అని ప్రకటించారు. దీంతో ఏ తేదీన ఉగాది జరుపుకోవాలనే అంశంపై ప్రజల్లో అయోమయం నెలకొంది. పాడ్యమి తిథి సూర్యోదయం తరువాత కనీసం 144 నిముషాలు ఉండాలని..కానీ, 29వ తేదీ కేవలం 58 నిముషాలే ఉంటుందని..అందుకే, 28వ తేదీనే ఉగాది జరుపుకోవాలి అని పలువురు పేర్కొంటున్నారు. పూర్వ సిద్ధాంతాన్ని అనుసరించి పంచాంగాన్ని రూపొందించే సిద్ధాంతులు, ఛాయార్క, కరణార్క దృక్‌ సిద్ధాంత పద్ధతిని అనుసరించాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవు తేదీని మారుస్తుందా ? లేదా ? చూడాలి.

11:08 - March 5, 2017

ఏంటీ పెళ్లి కొడుకు..పెళ్లి కూతుర్ల కోసం సంతా ? అని నోరెళ్లబెడుతున్నారా ? కూరగాయల సంత..చేపలు..బొమ్మలు..ఇతరత్రా విక్రయించడానికి సంతలు పెడుతుంటారు. గిదేమీ సంత అని ఆశ్చర్యపోకండి..కానీ ఇది నిజం. భారతదేశంలో కాకుండా చైనాలో ఈ పరిస్థితి నెలకొంది. షాంఘై నగరంలో ప్రతి వారంతం సంత జరుగుతుంది. ఇందులో వరుడు..వధువులను వెతుక్కుంటారు. ఇక్కడ పెళ్లీడుకు వచ్చిన యువతీ యువకుల తల్లిదండ్రులు, నాయనమ్మలు, అమ్మమ్మలు వందలాదిగా ఇక్కడకు వస్తుంటారు. కొంత మంది తమ అమ్మాయి లేదా అబ్బాయి గుణగణాలను సూచిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తారు. వివరాలను పరిశీలిస్తూ కొంత మంది రాసుకుంటారు. అబ్బాయి..అమ్మాయి ఫొటోలు..ఉద్యోగ వివరాలు..ఇష్టాలు..అయిష్టాలు..ఆస్తిపాస్తులు..జాతకం..ఎత్తు..బరువు ఇలా వివరాలు రాసి ఉంటాయి. ఇంట్లో వాళ్లందరికీ ఒకే అయితే తరువాత ఇంకేముంది..వారి వారి ఆచారాల ప్రకారం పెళ్లి జరుగుతుంది.

10:46 - March 5, 2017

పుచ్చకాయలో ఉండే లైకోపీస్ గుండె..చర్మ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. సపోటా పళ్లు మలబద్ధకాన్ని నివారిస్తాయి. అనాసపళ్లలో బ్రొమిలిస్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల వాపులను తగ్గిస్తుంది. ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. పచ్చిజామకాయలో ఉండు టానిస్ మాలిక్ ఆమ్లాలు దుర్వాసనను పొగొడుతాయి. టమాటలో ప్రొస్టైట్ క్యానసర్ సోకకుండా అడ్డుకుంటుంది. సంత్రా పండు తినడం వల్ల న్యుమోనియా వ్యాధి తగ్గుతుంది. ఆవాలని క్రమం తప్పకుండా వంటల్లో వాడడం వల్ల ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. క్యారెట్ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. చేపలు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పంటి నొప్పి సమస్యకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిసుంది. అంతేగాకుండా మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. మునగకాయలు ఆకలిని పెంచుతాయి. రోజు ఒక తులసి ఆకును తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుంది. రోజు ఒక కప్పు పాలు తాగడం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. ప్రతి రోజు ఓ కప్పు ఉడకబెట్టిన బీన్స్ లేదా పప్పు ధాన్యాలు ఖచ్చితంగా తీసుకోవాలి.

10:28 - March 5, 2017

సంగారెడ్డి : వేసవి రాకముందే తాగునీటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ వేసవిలో నీటి ఎద్దడి ఉండదంటూ అధికారులు ఏటా చెప్పే మాటలే ఈ ఏడూ చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం.. ఇంటింటికి సురక్షిత మంచినీరందిస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలే అవుతున్నాయి. ప్రతి వేసవిలో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ప్రజలు తీవ్ర తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. వేసవికి ముందు యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామంటూ.. ఎవరూ తాగునీటి కోసం ఇబ్బంది పడకుంటా చూస్తామంటూ అధికారులు చెప్పే మాటలూ ఆచరణకు నోచుకోవడం లేదు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయినా చేస్తారా అంటే అదీ లేదు. ఇక మిషన్‌ భగీరథ పథకం కింద ఇప్పట్లో మంచినీరు వచ్చే పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు. రోడ్ల పక్కన పైపులు పరిచి పనులు చేస్తున్నారన్న వాతావరణాన్ని కల్పించినా.. ఆ పనుల్లో వేగం లేక ఎక్కడి పనులు అక్కడే ఉంటున్నాయి. ఉన్న పథకాలు పనిచేయక.. కొత్త పథకాలు అమలుకు నోచుకోక ప్రజలు ఎప్పటిలాగే నానా తంటాలు పడాల్సి వస్తోంది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అన్నది దైవాధీనంగా మారిందని సంగారెడ్డి జిల్లా ప్రజలు వాపోతున్నారు.

నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో..
నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో, నారాయణఖేడ్‌ పట్టణంలో ఈ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని మంత్రి హరీష్‌రావు ఆదేశాలిచ్చారు. కానీ.. ఇక్కడ నీటి ఎద్దడి లేకుండా ఉండాలంటే బోరంచ వద్ద బోరంచ స్కీం ఫేజ్‌ - 2 ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ.. ఇంతవరకు ఆ పథకం పనులు ఓ కొలిక్కి రాలేదు. ఇక జహీరాబాద్‌ నియోజకవర్గంలో బేరాన్‌పల్లిలో మూడు కాలల్లో తాగునీటి ఎద్దడి ఉంటోంది. ప్రజలకు తాగునీటిని అందించడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఎప్పుడూ ఇక్కడి వారికి నీటి కష్టాలే మిగులుతున్నాయి.

2 వేల 438 గ్రామాల్లో నీటి ఎద్దడి..
మూడు జిల్లాల్లోని మొత్తం 2 వేల 438 గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంటుందని అధికారులు గుర్తించారు. ఇందుకు 2016-17 సంవత్సరానికి గానూ భారీ ఎత్తున నిధులు విడుదలయ్యాయి. కానీ పనుల్లో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. జిల్లా కేంద్రాలను అనుకుని ఉన్న గ్రామాల్లోనూ నీటి ఎద్దడి తిప్పలు తప్పడం లేదు. ఇప్పుడే ఇలా నీటి సమస్య తలెత్తితే.. ఇక మండు వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడపా దడపా ట్యాంకర్లతో నీటి సరఫరా చేసినా అవి తమ అవసరాలకు సరిపోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2 వేల 706 ఆవాస ప్రాంతాలు..
సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట మూడు జిల్లాల్లో కలిపి 2 వేల 706 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో కేవలం 562 ఆవాస ప్రాంతాలకు మాత్రమే రోజుకు ఒక్కొక్కరికి 40 లీటర్ల తాగునీరు అందుతోంది. 1972 ఆవాస ప్రాంతాల్లో పాక్షికంగానే తాగునీటిని సరఫరా చేస్తున్నారు. సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా 492 ఆవాస ప్రాంతాల్లోనూ, పీడబ్ల్యూఎస్ ద్వారా 1418 ఆవాస ప్రాంతాల్లోనూ, ఎంపీడబ్యూఎస్ ద్వారా 756 ఆవాస ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. మొత్తం 46 మండలాల్లో దాదాపు 10 వేల చేతిపంపులుంటే.. వాటిలో చాలా పంపులు వినియోగంలో లేకుండా పోయాయి. సమస్య తీవ్రంగా ఉండి మంచినీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే.. అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టకుండా కేవలం కార్యాలయాలకే పరిమితమై సమీక్షలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, అధికారులు చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి పొంతన లేదని ప్రజాసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. నీటి ఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంటింటికి నల్ల నీళ్లిస్తామని చెబుతున్న ప్రభుత్వం బీరు కంపెనీలకు నీళ్లిస్తోంది కానీ..ప్రజలకు తాగునీరందించడం లేదని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
ఎక్కడ చూసినా తీవ్ర నీటి ఎద్దడితో తాగునీటి సమస్య తలెత్తినా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ట్యాంకర్ల ద్వారా నీరందించినా కొంతలో కొంతైనా ఉపశమనం కలుగుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా మంచినీళ్లు అందించండి మహోప్రభో అంటూ వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

10:24 - March 5, 2017
10:23 - March 5, 2017

చిత్తూరు : భవిష్యత్ తరాలకు మన చరిత్రను తెలియజేయాల్సిన అవసరముందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. తిరుపతిలోని పేరూర్‌లో వెలిసిన వకుళమాత ఆలయ పునరుద్ధరణ పనుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిపూర్ణానందతో పాటు టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే చెవిరెడ్డి పాల్గొన్నారు. వకుళమాత ఆలయంలో పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఇటీవలే హైకోర్టు ఆదేశించింది.

10:21 - March 5, 2017

నల్గొండ : టీఆర్‌ఎస్‌ పాలనలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏ జిల్లాలోనూ రైతులు సంతోషంగా లేరని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రైతులు ఆనందంగా ఉన్నారని సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తమ్మినేని ఆరోపించారు. రాష్ట్రం రాకముందు ఒకమాట.. రాష్ట్రం వచ్చాక ఒకమాట.. ఇలా అనేక అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలని తమ్మినేని అన్నారు. సీపీఎం పార్టీకి మాట తప్పే అలవాటు లేదని, సీఎం కేసీఆరే వందల సార్లు మాట తప్పారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీయడం కోసమే ఈ మహాజన పాదయాత్ర చేస్తున్నామని తమ్మినేని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా రాష్ట్రంలో నెలకొన్ని సమస్యలు అంతకుముందు ఎలా ఉన్నాయో.. ఇప్పుడలానే ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య, యూనివర్సిటీ విద్య పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని, నిరుద్యోగ సమస్యపై కేసీఆర్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తమ్మినేని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతుల సమస్యలు అధికమయ్యాయని... అన్ని జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు.

139వ రోజు..
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా కేసీఆర్‌ ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానన్న కేసీఆర్‌ దళితులకు తీరని ద్రోహం చేశారని పాదయాత్ర బృందం సభ్యుడు జాన్‌వెస్లీ విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీటూ పీజీ ఉచిత విద్య, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్‌.. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కి వంచన చేశారని జాన్‌వెస్లీ విమర్శించారు. పేదల బతుకులు బాగుపడాలన్న ఉద్దేశంతో సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్రకు నల్గొండ జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే 139 రోజులు పూర్తి చేసుకున్న తమ్మినేని బృందం మిర్యాలగూడలో జరిగిన భారీ బహిరంగ సభలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ్మినేని బృందానికి అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పిస్తున్నారు. రాష్ట్రంలో రైస్‌ మిల్లు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రమాదంలో ఉన్న రైస్‌మిల్లు ఇండస్ట్రీని ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. 139వ రోజు తమ్మినేని బృందం నల్గొండ జిల్లాలోని వేములపల్లి, చెట్టిపాలెం, మిర్యాలగూడ, వెంకటాద్రిపాలెం, తుంగపహాడ్‌, త్రిపురారం, ముకుందపురం గ్రామాల్లో పర్యటించింది.

09:57 - March 5, 2017

ప్రెజెంట్ వస్తున్న సినిమా లు కొన్నిటిని చూస్తుంటే ఆడియన్స్ కి ఫిలిం మేకింగ్ మీదనే అనుమానాలు వస్తున్నాయి. ఒక చిన్న లవ్ స్టోరీ, నాలుగు కామెడీ సీన్స్ రెండు ఫైట్స్ ఇంతకంటే ఎక్కువ తియ్యలేకపోతున్నారా ప్రెజెంట్ డైరెక్టర్స్ ?.కాదు అని సమాధానం తప్పకుండ వస్తుంది. ఫిలిం మేకింగ్ లో స్టైల్ మారింది. కొత్తగా వస్తున్న వాళ్ళు వండర్స్ క్రేయేట్ చేస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచి ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యబోతున్నారు. చిన్న సినిమాలు పెద్ద హిట్ కొట్టినప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసిన కాస్ట్ అండ్ క్రూ మొత్తం లైట్ లోకి వస్తారు. ఆలా చిన్న సినిమా సినిమా ఇండస్ట్రీ లో పెద్ద హిట్ తెచ్చుకున్న సినిమా 'ఉయ్యాల జంపాల'.

కెరీర్ స్పీడ్..
ఉయ్యాల జంపాల సినిమా తో మరో సారి చిన్న సినిమాల జోరు మొదలయింది. ఈ సినిమాలో హీరోగా చేసిన రాజ్ తరుణ్ ప్రెజెంట్ యూత్ హీరోగా మారిపోయాడు. తనకంటూ స్పెషల్ యాక్టింగ్ స్టైల్ ని క్రియేట్ చేసుకుని ఆడియన్స్ కి దగ్గరైయ్యాడు ఈ యంగ్ హీరో. తరువాత రాజ్ తరుణ్ చిన్న ప్రొడ్యూసర్స్ కి మంచి సోర్స్ గా వరుస విజయాలతో కెరీర్ స్పీడ్ పెంచాడు. ఆడో రకం వీడియో రకం సినిమాతో మల్టి స్టార్ సినిమా చెయ్యడానికి కూడా తాను సిద్ధం అని హింట్ ఇచ్చాడు రాజ్ తరుణ్. తన మొదటి సినిమా 'ఉయ్యాలా జంపాల'కి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వారు బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డు కూడా ఇచ్చారు.

రంజని డైరెక్షన్..
తాను హీరోగా చేస్తూనే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే హీరో నాగార్జున. రాజ్ తరుణ్ హీరోగా పరిచయం ఐన 'ఉయ్యాలా జంపాల' సినిమాకి నాగార్జున సపోర్ట్ కూడా చాల ఉంది. అన్నపూర్ణ స్టూడియో, సురేష్ ప్రొడక్షన్స్ వారు కంబైన్డ్ గా నిర్మించిన సినిమా ఉయ్యాలా జంపాల. మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ తో రీసెంట్ ఫిలిం చేస్తున్నాడు హీరో రాజ్ తరుణ్. ఈ సినిమాని 'రంజని' అనే లేడీ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తుంది. ప్రేమకథల్ని లేడీ డైరెక్టర్స్ చాల సున్నితంగా డీల్ చేస్తారు అనే టాక్ ఆల్రెడీ ఇండస్ట్రీ లో ఉంది. మరి ఈ యంగ్ హీరో ని రంజని ఏ స్టైల్ లో ప్రెజెంట్ చేస్తుందో చూద్దాం.

09:52 - March 5, 2017

నిర్మాతలు అన్న తరువాత కధని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సినిమా అయిన తియ్యాలి. కథ నచ్చిన తరువాత హీరో డేట్స్ కోసం ప్రయత్నించే నిర్మాతలు ఇండస్ట్రీ లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి భిన్నంగా వెళ్తున్నాడు ఈ నిర్మాత. ఆల్రెడీ కొంతమంది పెద్ద హీరోలతో చేసి కొంచం గ్యాప్ తీసుకున్న ఈ నిర్మాత రీ ఎంట్రీ గురించి ఏమన్నాడో చూడండి. ఫిలిం వాల్యూస్ అనే మాట కొంచం పక్కన పెట్టి ప్రాఫిట్ మోటో గా సినిమాలు నిర్మిస్తున్నారు కొందరు ప్రొడ్యూసర్స్. కానీ వారికి భిన్నంగా సినిమా రంగంలో ప్రొడ్యూసర్ అంటేనే డబ్బులు, డబ్బులు అంటేనే ప్రొడ్యూసర్ అనే విజన్ మారిపోయింది. స్టోరీ లో కొత్తదనం కోసం తాపత్రయపడుతూ, స్క్రీన్ మీద కొత్తగా ఏదో చూపించాలి అనే ఆలోచనలతో ఉన్న ప్రొడ్యూసర్స్ వస్తున్న రోజులివి. లాభాలు, నష్టాలు అనే ప్లానింగ్ లేకుండా ప్రొడ్యూసింగ్ లోకి ఎంటర్అవ్వరు. ఎంత ప్లానింగ్ ఉన్నా కొన్ని సార్లు ఆడియన్స్ జడ్జిమెంట్ కి తలవంచాల్సిందే. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గ నటించి ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్ రీసెంట్ టైం లో మంచి హిట్స్ ఇచ్చాడు.

8 సినిమాలు..
నటుడిగా రాణించాలని ఎప్పుడో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వచ్చి కొన్ని సినిమాల్లో కమెడియన్ గా, హీరో ఫ్రెండ్ గా చిన్న, పెద్ద పాత్రల్లో మెప్పించిన నటుడు బండ్ల గణేష్. ప్రొడ్యూసర్ గా మారి 8 సినిమాలు తీసి అందులో మూడు సినిమాలు సూపర్ హిట్స్ అందించాడు. ఆల్మోస్ట్ మెగా ఫామిలీని తన సినిమాలతో కవర్ చేసి హిట్ సినిమాలతో టాప్ డైరెక్టర్ లిస్ట్ లో జాయిన్ అయ్యాడు ఈ యాక్టర్ కం ప్రొడ్యూసర్. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ కలక్షన్స్ రికార్డ్స్ తో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ సినిమాలు ఒక రేంజ్ లో ఉంటాయి అనే హైప్ క్రియేట్ చేసుకున్నాడు.

హీరోలు ఎవరో ?
ఇలా ఒక దశలో విరామం లేకుండా సినిమాలు తీస్తూ దూసుకెళ్లిన బండ్ల గణేష్ ఈ మధ్య స్లో అయ్యాడు. దాదాపు రెండేళ్లుగా అతడి నుంచి సినిమానే రాలేదు. ‘టెంపర్’ హిట్టు తర్వాత కూడా అతను ఇంత గ్యాప్ తీసుకోవడం ఫిలిం వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే బండ్ల గణేష్ మాత్రం ఈ విషయం అసలు పట్టించుకునే టైం లేదు అంటున్నాడంట. ఒకేసారి ఐదు సినిమాలకు తాను సన్నాహాలు చేస్తున్నట్లుగా బండ్ల గణేష్ చెప్తున్నాడు. చిన్న సినిమాలు తియ్యడానికి రెడీ గా లేను అని పెద్ద సినిమాల మీదే ఫోకస్ పెట్టానని చెప్తున్నాడు ఈ ఫేమస్ ప్రొడ్యూసర్. సినిమాలు తియ్యడానికి డబ్బులు అవసరం లేదు పెద్ద హీరోల డేట్స్ ఉంటె చాలు అని చెప్తున్నాడు బండ్ల గణేష్. మరి ఇతను నిర్మాతగా చెయ్యబోయే ఆ ఐదు సినిమాలు ఏంటో అందులో హీరోలు ఎవరో తెలుసుకోవడానికి మాత్రం వెయిట్ చెయ్యాల్సిందే.

09:45 - March 5, 2017

ఢిల్లీ : జులై ఫస్ట్‌ నుంచి జిఎస్‌టి అమలు కానుంది. ఈ మేరకు కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఓ అవగాహన కుదిరింది. జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌లో సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ చట్టాలకు మెజార్టీ ఆమోదం లభించింది. ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 16 మరోసారి భేటీ కావాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. జీఎస్టీ అమలులో భాగంగా నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌లో ఒక పెద్ద ముందడుగు పడింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన జరిగిన జిఎస్‌టి సమావేశంలో సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ చట్టాలకు మెజార్టీ ఆమోదం లభించింది. జులై ఫస్ట్‌ నుంచి అమలు కానున్న ఈ చట్టంపై కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఓ అవగాహన కుదిరింది. కానీ దీనికి తుది ఆమోదం మాత్రం మార్చి మధ్యలో రావచ్చని భావిస్తున్నారు.

అక్రమాలకు అడ్డుకట్ట - ఈటెల..
జీఎస్టీ అమలు వల్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్రాలు పూర్తి అవగాహనతో పనిచేస్తేనే జీఎస్టీతో సత్ఫలితాలు వస్తాయని తెలిపారు.. గ్రోత్‌ రేట్‌ 14శాతంకంటే తక్కువగాఉన్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం GST నష్టపరిహారాన్ని ఇస్తుందన్నారు. 16కంటే ఎక్కువగా ఉన్న తెలంగాణకు నష్టపరిహారం వచ్చే అవకాశం లేదని ఈటెల తెలిపారు. టాక్స్‌ చెల్లింపులకు GST కొత్త విధానమని... దీనిపై డీలర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే జీఎస్టీ బిల్లులో రాష్ట్రాలు సూచించిన 26 మార్పులను కేంద్రం చేసింది. రాష్ట్రాల మధ్య సరిహద్దులో చెక్‌పోస్టులను ఎత్తివేస్తారు. వాహనాలలోని సరుకుల తనిఖీలపై నియంత్రణ హక్కు రాష్ట్రాలకే ఉంటుంది. తీర ప్రాంతానికి 12 నాటికల్‌ మైళ్ల లోపు సరుకు రవాణా, చేపల వేటపై రాష్ట్రాలకే హక్కు ఉంటుంది. దాబాలు, చిన్న రెస్టారెంట్లకు మినహాయింపు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. వీటిపై కేవలం 5శాతం మాత్రమే పన్ను విధిస్తారు. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేసే జీఎస్టీపైనే సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రాలు అమలు చేసే జీఎస్టీపై చర్చ జరగలేదు. మిగిలిన విషయాలపై చర్చించేందుకు ఈ నెల 16 మరోసారి భేటీ కావాలని జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయించింది.

16న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్..

ఢిల్లీ : జులై ఫస్ట్‌ నుంచి జిఎస్‌టి అమలు కానుంది. ఈ మేరకు కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఓ అవగాహన కుదిరింది. జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌లో సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ చట్టాలకు మెజార్టీ ఆమోదం లభించింది. ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 16 మరోసారి భేటీ కావాలని కౌన్సిల్‌ నిర్ణయించింది.

09:23 - March 5, 2017

వకుళామాత ఆలయ జీర్ణోద్దర పనులు ప్రారంభం..

చిత్తూరు : తిరుపతి పేరూరు కొండపై వకుళామాత ఆలయ జీర్ణోద్దర పనులు ప్రారంభమయ్యాయి. స్వామి పరిపూర్ణనంద, టిటిడి ఛక్ష్మర్మన్ చదలవాడలు హాజరయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వకుళామాత ఆలయాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు ముమ్మరమయ్యాయి.

09:12 - March 5, 2017

మీ ఖాతాలో కనీస నగదు నిల్వలు లేవా ? అయితే మీరు జరిమాన చెల్లించాల్సిందే. అవును ఖాతాదారులకు ఎస్ బీఐ చేదు వార్త వినిపించింది. ఏప్రిల్ 1 నుండి పొదుపు ఖాతాదారులు నెలవారి సగటు నిల్వ నిర్వహణలో విఫలమైతే పెనాల్టీ విధించనున్నట్లు ఎస్ బీఐ వెల్లడించింది. కస్టమర్లను పెంచుకునేందుకు ఎస్‌బీఐ ఈ జరిమానా నిబంధనను జూలై 2012లో ఎత్తివేసింది. కానీ నిర్వహణ, కార్యకలాపాల వ్యయాలను కొంతైనా తగ్గించుకునేందుకు ఈ చార్జీలను మళ్లీ ప్రవేశపెడుతున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ప్రాంతాన్ని బట్టి ఎంఏబీ పరిమితి, విధించే పెనాల్టీ మారుతుందని తెలుస్తోంది. వ్యత్యాసం 50-75 శాతం మధ్యలో ఉంటే జరిమాన రూ. 75 ఆపై రూ. 100 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్ బీఐ అనుసరించిన ఈ బాటను ఇతర బ్యాంకులు కూడా అనుసరిస్తారా ? లేదా ? చూడాల్సి ఉంటుంది.

 

09:06 - March 5, 2017

ఢిల్లీ : అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులు గజ గజ వణికిపోతున్నారు. గత కొన్ని రోజులుగా జాత్సంహకార దాడులు పెరిగిపోతున్నాయి. ప్యురింటన్ జరిపిన కాల్పులకు కూచిబొట్ల శ్రీనివాస్ మృత్యువాత పడ్డారు. సౌత్ కరోలినాలో భారత సంతతికి చెందిన హర్నీష్ పటేల్ అనే వ్యాపారిని కూడా కాల్చి చంపేశారు. ఈ ఘటనలు మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ సిక్కు వ్యక్తిపై ఓ దుండగుడు కాల్పులు జరిపారు. అమెరికా విడిచి స్వదేశం వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశాడు. అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన అనంతరం దాడులు పెట్రోగిపోతున్నాయి. దీనితో అమెరికాలో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ దాడులపై భారత ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు తీవ్రమౌతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో బిజీ బిజీగా గడుపుతున్న నేతలు దాడులపై స్పందించాలని, భారతీయులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. తాజా ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఉగ్రవాది హతం..

జమ్మూ కాశ్మీర్ : ట్రాల్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ పోలీసులు వీరమరణం పొందగా ఉగ్రవాది హతమయ్యాడు.

శంషాబాద్ లో తనిఖీలు..

హైదరాబాద్ : శంషాబాద్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. 16 మందిపై కేసు నమోదు చేశారు. 9 కార్లు, లారీ, 6 బైక్ లను సీజ్ చేశారు.

08:27 - March 5, 2017
08:05 - March 5, 2017

విశాఖపట్టణం : మితి మీరిన వేగం వద్దు...ప్రమాదాలను కొని తెచ్చుకోకండి..అని ఎంత చెబుతున్నా కొంతమంది వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. దీనితో పలు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా విశాఖలోని బీవీకే కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని ఆసుపత్రికి తరలించారు. మూడు పల్టీలు కొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఇరుక్కపోయిన మృతదేహాలను బయటకు తీశారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తోంది.

 

07:54 - March 5, 2017

అమెరికాలో, భారతీయుల హత్యలు ఆగడం లేదు. శ్రీనివాస్‌ కూచిభొట్ల హత్య నుంచి తేరుకోకముందే.. అక్కడ మరో భారతీయుడిని అక్కడి దుండగులు పొట్టనపెట్టుకున్నారు. సౌత్‌ కరోలినాలో భారత సంతతికి చెందిన హర్నీష్‌ పటేల్‌ అనే వ్యక్తిని దుండగులు కాల్చి చంపారు. మరో వైపు సోమవారం నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అంశంపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో చర్చ కార్యక్రమం జరిగింది. ఈ చర్చలో శివాజీ (పిసిసి), రమేష్ (వైసీపీ), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి) పాల్గొన్నారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో చూడండి.

07:35 - March 5, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ‘మిరా..మిరా..మీసం' అంటున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'కాటమరాయుడు' చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మాణంలో 'గోపాల..గోపాల' ఫేండ డాలీ డైరెక్షన్ లో సినిమా రూపొందుతోంది. ఇటీవలే చిత్రానికి సంబంధించిన పలు లుక్స్ సోషల్ మాధ్యమాల్లో విడుదల చేశారు. తాజాగా ఓ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలు ఆడియో వేడుకలు నిర్వహించకుండానే చిత్రానికి సంబంధించిన పాటలను ఒక్కోటి విడుదల చేస్తున్నారు. అనంతరం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. 'సరైనోడు’, 'ధృవ’, 'ఖైదీ నెం 150’, 'విన్నర్' చిత్రాలు ప్రీ రిలీజ్ వేడుకని జరుపుకొని మంచి విజయాలు సాధించడంతో 'కాటమరాయుడు' టీం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ‘మిరా మిరా మీసం' అనే పాట విడుదల కావడం పట్ల పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూ ట్యూబ్ లో అత్యధికులు వీక్షించారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ అందించారు. పవన్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా, పవన్ తమ్ముళ్లుగా శివబాలాజీ, కమల్ కామరాజు, అజయ్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.

షీటీమ్ ఆధ్వర్యంలో 5కే రన్..

హైదరాబాద్ : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నెక్లెస్ రోడ్డులో షీటీమ్ ఆధ్వర్యంలో 5కే రన్ జరిగింది. డీజీపీ అనురాగ్ శర్మ, స్వాతిలక్రా, అమల, తాప్సీలు పాల్గొన్నారు.

06:55 - March 5, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్‌ వాయిదా పడనుందా? అన్ని సెట్ల తేదీల్లో మార్పులకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందా? తాజా పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత నెలలో విడుదల కావాల్సిన ఎంసెట్ నోటిఫికేషన్‌పై ఎక్కడా ప్రస్తావనేలేదు. సర్వీస్ ప్రొవైడర్లపై ప్రభుత్వానికి క్లారిటి లేదు. ఇవన్నీ చూస్తే సెట్ల తేదీల్లో మార్పులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం మే 12న ఎంసెట్‌ జరగనుంది. ఎంసెట్‌ షెడ్యూల్‌ జనవరిలో వచ్చినా..ఇంతవరకూ నోటిఫికేషన్‌ విడుదలకాలేదు. ముందుగా ప్రకటించిన తేదీదాటిపోయినా ఆ ఊసే ఎత్తడంలేదు. ఆన్‌లైన్‌లో ఎంసెట్‌ ఉంటుందని ఇప్పటికే స్పష్టంచేసిన ఉన్నత విద్యామండలి..ఇంతవరకూ సర్వీస్ ప్రొవైడర్లను ఎంపిక చేయలేదు. ఇందుకుసంబంధించిన ఏర్పాట్లపైకూడా అధికారులు పెదవి విప్పడంలేదు. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఐసెట్‌ నోటిఫికేషన్‌ను కాకతీయ యూనివర్శిటీ జారీ చేసినా ఈ ప్రక్రియకూడా మందుకు సాగలేదు. దరఖాస్తుల స్వీకరణ వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించి తమ చేతులు దులుపుకున్నారు.

సర్వీస్ ప్రొవైడర్ల టెండర్లపై రాని క్లారిటీ..
గతేడాది వరకూ సెట్స్ కన్వినర్లు తమకు నచ్చిన సర్వీస్‌ ప్రొవైడర్లకు బాధ్యతలు అప్పగించేవారు. గతేడాది ఎంసెట్‌ లీకేజీ తర్వాత సర్కారు నిర్ణయం మార్చేసింది. ప్రభుత్వమే స్వయంగా ఈ బాధ్యతలు చూసేందుకు సిద్ధమైంది. ఇంతవరకూ బాగానేఉన్నా అసలు పనినిమాత్రం పట్టాలెక్కించడంలేదు. దీంతో గత నెల 27న ఎంసెట్ ..28న ఈసెట్ నోటిఫికేషన్లు విడుదలకావాల్సిఉండగా..ఇంతవరకూ ఆ విషయమే ప్రస్తావించడంలేదు.. సర్వీస్ ప్రొవైడర్ల టెండర్లపై ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు.

ఉన్నత విద్యామండలి చైర్మన్‌, అధికారుల టూర్లు..
ఈ ఏడాది ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ ప్రకటించిన ఉన్నతవిద్యామండలి..వాటికి చైర్మన్లు, కన్వీనర్లనుకూడా నియమించింది. సర్వీస్‌ ప్రొవైడర్ల విషయం చూసుకోవాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ అందుకున్న ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌. ఆచార్య... ఈ అంశంపై అంతగా దృష్టిసారించలేదు. అటు ఈ పరీక్షల విషయం చూడాల్సిన మంత్రి కడియం మొన్నటిదాకా విదేశీ టూర్లలో బిజీ బిజీగా ఉన్నారు..ఉన్నత విద్యామండలి చైర్మన్‌, అధికారులుకూడా ఇతర రాష్ట్రాల్లో పర్యటించారు.. వీరి టూర్లతో పరీక్షల విషయంపై స్పష్టతరాకుండా పోయింది. ఎంసెట్‌, ఈసెట్‌ నోటిఫికేషన్ల ఆలస్యంపై ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి ఈ బాధ్యత తమదికాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.. సర్వీస్‌ ప్రొవైడర్లపై ప్రభుత్వానికి తాము లేఖ రాశామని, ఈ విషయాన్ని తేల్చాల్సింది సర్కారేనని అధికారులు చెబుతున్నారు... నోటిఫికేషన్ల జారీలో ఆలస్యమైనా పరీక్షలు అనుకున్న సమయానికే జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.. అయితే ఇది సాధ్యమయ్యే పని కాదని విద్యావేత్తలు అంటున్నారు.

కొన్ని మార్పులు..
ప్రకటించిన తేదీల్లో పరీక్షలు జరగాలంటే కొన్ని మార్పులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 7 నుంచి 20వరకూ ఎంసెట్‌ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అధికారులు అవకాశ మిచ్చారు. ఈ ప్రక్రియను 14 రోజుల నుంచి వారానికి కుదించే అవకాశం ఉంది. అలాగే ఫైన్ తో దరఖాస్తుల స్వీకరణ గడువును కుదించే ఛాన్స్ ఉంది. ఇలా తేదీలు మార్చినా అనుకున్న ప్రకారం పరీక్ష నిర్వహణ కష్టమే అంటున్నారు విద్యారంగనిపుణులు. కారణాలేమైనా ఎంట్రన్స్ టెస్టుల నోటిఫికేషన్ల విషయం ఎటూ తేలక విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. ఏపీలో నోటిఫికేషన్లు జారీ కావడం, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో తెలంగాణ విద్యార్థుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు మొద్దునిద్రమాని పరీక్షల విషయాన్ని చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

06:52 - March 5, 2017

హైదరాబాద్ : మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు..అన్న చందంగా ఉంది హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారం. మెట్రో రైలు ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందా.. అంటూ ఎదురు చూస్తున్న జంటనగరాల ప్రజల ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశాలు కనిపించడంలేదు. నత్తనగడకన సాగుతున్న పనులు ఊపందుకుంటే మరో పది నెలల తర్వాతే మెట్రో పరుగులు తీసే చాన్స్‌ ఉంది. లేకపోతే మరింత జ్యాపం తప్పదని భావిస్తున్నారు. మెట్రో రైలు ప్రయాణంపై జంటనగరాల ప్రజలు పెట్టుకున్న ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశం కనిపించడలేందు. ప్రాజెక్టు పనులు నత్తనడన సాగుతున్నాయి. జాప్యంతో మెట్రో రైలు ఇప్పట్లో కూతపెట్టే అవకాశాలు లేవు. మెట్రో రైలు వస్తే ట్రాఫిక్‌ కష్టాలు గెట్టెక్కుతాయనుకుంటున్న వాహనచోదకుల ఎదురు చూపులు మరింతకాలం తప్పదని భావిస్తున్నారు.

గత ఏడాది జూన్‌ 2న ప్రారంభింస్తామన్న ప్రభుత్వం..
దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం.. పీపీపీ.. పద్ధతిలో సాగుతున్న మొదటి ప్రాజెక్టు హైదరాబాద్‌ మెట్రో రైలు. మెట్రో రైలు నిర్మాణం చేస్తున్న ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జులై నాటికి మూడు కారిడార్లలో 72 కిలో మీటర్లు మెట్రో రైలు పరుగులు తీయాల్సి ఉంది. కానీ జరుగుతున్న పనులను పరిశీలిస్తే ఒక్కమార్గంలో మెట్రో ప్రయాణించే అవకాశాలు కనిపించడంలేదు. ప్రారంభంలో వేగంగా జరిగిన మెట్రో పనులు..వివిధ కారణాలతో ఆ తర్వాత మందగించాయి. సుల్తాన్‌ బజార్‌, పాతబస్తీ, మొజాంజాహీ మార్కెట్‌, అసెంబ్లీ వంటి ప్రాంతాల్లో అలైన్‌మెంట్‌ మార్పులు, నిర్మాణానికి అవసవమైన భూసేకరణ జరగకపోవడం వంటి కారణాలతో నడకనసాగుతోంది. ప్రభుత్వంతో ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే పనులు చేపట్టాని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయించినా...పనులు వేగం పుంజుకోలేదు. పనులు పూర్తైన మియాపూర్‌-ఎస్‌ఆర్‌ నగర్‌, నాగోలు-మెటుగూడ మార్గాల్లో గత ఏడాది జూన్‌ 2 నాటికే మెట్రో రైళ్లను నడపాలనుకున్నా అదీ నెరవేరలేదు.

పాతబస్తీలో..
పూర్తైన మార్గాల్లో మెట్రో రైళ్లను నడిపే విషయంలో అధికారులు ఇప్పుడు మరో ప్రజలకు ఆశలు కల్పిస్తున్నారు. ముందుగా మియాపూర్‌-ఎస్‌ఆర్‌ నగర్‌ మధ్య 11 కి.మీ. మార్గాలన్ని ప్రారంభిస్తామంటున్నారు. నాగోలు-శిల్పారామం మార్గం బేగంపేట వరకు పూర్తి చేసిన 16 కి మీ.మార్గాన్ని రెండో దశలో మెట్రో రైళ్లను నడపాలని ప్రతిపాదిస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం సమీపంలోని ఆలుగడ్డబావి వద్ద ఆర్వోబీ, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓలిఫెంటా బ్రిడ్జి దగ్గర స్టీలు బ్రిడ్జి నిర్మాణ పనులు జాగుతున్నాయి. అయితే నాగోలు-బేగంపేట మార్గంలో జరుగుతున్న పనులను పరిశీలిస్తే అధికారులు చెబుతున్న విధంగాఈ ఏడాదిలోగా మెట్రో రైలు కూతపెట్టే అవకాశంలేదని జనం భావిస్తున్నారు. ఇక మూడో కారిడార్‌ ఫలక్‌నుమా-జేబీఎస్‌ మార్గంలో మెట్రో రైళ్లు ఎప్పుడు నడిచేది ఎవరూ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొనివుంది. పదిహేను కిలో మీటర్ల ఈ మార్గాన్ని ఈ ఏదాడి జనవరి నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా, మరో రెండేళ్లలో కూడా కంప్లీటయ్యే అవకాశాలు లేవు. పాతబస్తీలో మెట్రో మార్గం నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఇంకా పూర్తికాలేదు. రైట్‌ ఆఫ్‌ వే ఇవ్వకుండా పనులు చేపట్టలేమని ఎల్‌ అండ్‌ టీ నిర్మాణ సంస్థ అధికారులు చెబుతున్నారు. జాప్యానికి ప్రభుత్వమే కారణమంటూ ఇందుకు పరిహారం కూడా చెల్లించాలన్న వాదాన్ని నిర్మాణ సంస్థ లేవనెత్తుతోంది. ఈ కారణంగా ఒప్పందం గడువును కూడా వచ్చే ఏడాది డిసెంబర్‌ వరకు ప్రభుత్వం పొడిగించింది. హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులు చెబుతున్నట్టు ఈ ఏడాదిలో మెట్రో కూతపెడితే మంచిదేనని ప్రజలు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఎల్‌ అండ్‌ టీ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

06:48 - March 5, 2017

విజయనగరం : ఏపీలో లో మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంతో విజయనగరం జిల్లాలో తెలుగుదేశం రాజకీయాలు వేడెక్కాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు, సినియారిటీ.. ఇలా అన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. జిల్లాలోని రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మెజారిటీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయా వర్గాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలో బీసీలు ఎక్కువ. తూర్పుకాపు, కొప్పలవెలమ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంస్థానాదీశుల కాలం నుంచి జిల్లాలో రాజరిక రాజులకే పదువులు దక్కుతున్నాయి. విజయనగరంలోపాటు, కురుపాం, బొబ్బిలి, నెల్లిమర్ల నియోజవర్గాల్లో రాజవంశీయుల ప్రభావం ఎక్కువ. బీసీలు అధికంగా ఉన్నప్పటికీ మైనారిటీ వర్గంగా రాజు సామాజిక వర్గానికే ఇప్పటి వరకు పదవులు దక్కుతూ వస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలో బొబ్బిలి స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎన్నికైన సుజయ కృష్ణరంగారావు గత ఏడాది టీడీపీలో చేశారు. విజయనగం జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిమిడి మృణాలిన్ని తప్పించి, రంగారావుకు స్థానం కల్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై బీసీలు నిరసన గళం విప్పుతున్నారు.

9 అసెంబ్లీ నియోజకవర్గాలు..
జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆరు స్థానాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం నుంచి తూర్పుకాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్‌ కోట నుంచి కొప్పలవెమల సామాజిక వర్గానికి చెందిన కోళ్ల లలిత కుమారి గత ఎన్నికల్లో గెలుపొందారు. తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన కిమిడి మృణాళిని తొలగిస్తే ఇదే సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్‌ వస్తోంది. తూర్పుకాపు సామాజిక వర్గాన్ని రాజులు ప్రభావితం చేస్తుండటాన్ని నిరసిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తూర్పు కాపులను ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోడాన్ని ఈ వర్గం నేతలు తప్పుపడుతున్నారు. గతంలో టీడీపీ ఇలాంటి తప్పుచేసి పదేళ్లపాటు అధికారానికి దూరమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఎవరికి దక్కేనో..
ఇక తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, గజపతినగరం శాసనసభ్యుడు కేఏ నాయుడు మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎనిమిదిసార్లు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించిన తనను విస్మరించరాదని సతివాడ నారాయణస్వామినాయుడు కోరుతున్నారు. కొప్పల వెలమ సామాజికవర్గానికి చెందిన ఎస్‌ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రేసులో ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్‌ మంత్రివర్గంలో స్థానం కోసం యత్నిస్తున్నారు. ఎస్టీ సామాజికవర్గం నుంచి గుమ్మడి సంధ్యారాణి రేసులో ఉన్నారు. ఇలా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రాజు, తూర్పుకాపు, కొప్పలవెలమ, ఎస్టీ సామాజికవర్గాల్లో ఏ వర్గానికి మంత్రి పదవి దక్కుతుందో చూడాలి.

నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్..?

హైదరాబాద్ : ఎమ్మెల్సీ నామినేషన్లు వేసే గడువు కూడా పూర్తి కావస్తుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ముఖ్యనేతలతో సమావేశం అయి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

06:42 - March 5, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు గంట గంటకు రసవత్తరంగా మారుతున్నాయి. సీనియర్లకు పెద్ద పీఠవేయాలన్న అభిప్రాయంతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడు స్థానాలను భర్తీ చేసే అంశంపై కూడా గులాబీబాస్ దృష్టి సారించినట్లు సమాచారం. తెలంగాణాలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సభ్యుల ఎన్నిక విషయంలో సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న మూడు స్థానాలను..తమ పార్టీ నేతలతో భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. ఓ స్థానాన్ని ఎంఐఎంకు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం జరిగినా హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానాన్ని మిత్ర పక్షానికి వదిలి వేయాలన్న నిర్ణయం గులాబీబాస్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆ స్థానం ఎన్నిక కూడా ఏకగ్రీవంగా పూర్తయింది. ఇదే సమయంలో శాసనసభ్యుల కోటాలో కూడా మూడు స్థానాలు భర్తీ చేయాల్సి ఉండడంతో..ఆ స్థానాలపై నేతలు భారీగా ఆశలు పెంచుకున్నారు.

ఇద్దరు అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారు..
పార్టీలో సీనియర్లతో పాటు..సామాజిక సమీకరణలను కూడా దృష్టిలో ఉంచుకుని మూడు స్థానాలను భర్తీ చేయాలనే నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చారని పార్టీ నేతలు అంటున్నారు. ఖాళీ అవుతున్న మూడు స్థానాల్లో ఒక స్థానం మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి గులాబి గూటికి చేరుకున్న గంగాధర్ గౌడ్‌కు మరో సారి అవకాశం కల్పించాలనే నిర్ణయం జరిగిందని పార్టీ నేతలు అంటున్నారు. మరో రెండు స్థానాలకోసం పార్టీలో కసరత్తు జరుగుతోంది. అయితే ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించినా...ఆ తర్వాత తెరమరుగైనట్లు సమచారం. అదే జిల్లాలకు చెందిన పార్టీలో సీనియర్ నేత ఎలిమినేటి కృష్ణారెడ్డికి ఓ స్థానాన్ని కేటాయించేందుకు లైన్ క్లియర్ అయిందని..పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. మరో స్థానం విషయానికి వస్తే ఎస్సీ వర్గానికి అవకాశం కల్పించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణాలో ప్రభావవంతమైన గౌడ, రెడ్డి వర్గాలతో పాటు దళిత నేతకు చాన్స్ దక్కనుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దళిత కోటాలో ఎర్రోళ్ల శ్రీనివాస్..పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విద్యార్థి నేతగా గులాబి పార్టీ కనుసన్నల్లో నడిచిన ఎర్రోళ్లకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు. అయితే హరీష్ వర్గంగా గుర్తింపు పొందిన ఎర్రోళ్లకు ఈ విడతలో మండలి సభ్యుడిగా అవకాశం కల్పించాలని మంత్రి హరీష్‌రావ్ కూడా పట్టు పడుతున్నట్లు సమాచారం. నామినేషన్లు వేసే గడువు కూడా పూర్తి కావస్తుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ముఖ్యనేతలతో సమావేశం అయి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

06:39 - March 5, 2017

విజయవాడ : ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ హోరా హోరీగా మారింది.. టీడీపీ - బిజెపి కూటమిని ఓడించడానికి మిగతా పక్షాలు పీడీఎఫ్ అభ్యర్థులను బలపరచడానికి ముందుకొచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో పీడీఎఫ్‌ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అభివృద్దిని పరుగులు పెట్టిస్తామని, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రెవిన్యూ లోటు భర్తీ, ఉద్యోగాల భర్తీ అంటూ టీడీపీ - బిజెపీల కూటమి ఊదరగొట్టింది. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ఈ రెండు పక్షాలూ ఘోరంగా విఫలమయ్యాయన్న విమర్శలు మూటగట్టుకున్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతూ, నిర్వాసితులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళల హక్కుల కోసం పోరాడుతున్న వామపక్ష పార్టీలు బలపరుస్తున్న ప్రొగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్.. పీడీఎఫ్ అభ్యర్థులకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది.

వైసీపీ మద్దతు..
ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ..తాము పోటీ చేస్తున్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానం మినహా మిగతా స్థానాల్లో పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల పీడీఎఫ్ తరపున ఎమ్మెల్సీలు ఎంవీవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వర్రావు...వైసీపీ అధినేత జగన్‌ను కలిసిన సందర్భంగా.. కచ్చితంగా మద్దతిస్తామని ప్రకటించారు.. దీంతో వైసీపీ పోటీ లేని చోట.. పీడీఎఫ్ అభ్యర్థులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ప్రకటించాలని ఇప్పటికే ఆయా పరిధిలోని జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలకు వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

జనసేన..లోక్ సత్తా..సీపీఎం..సీపీఐ..
మరోవైపు పీడీఎఫ్ అభ్యర్థులకు సీపీఎం, సీపీఐ పార్టీలు మద్దతు ప్రకటించాయి.. అటు లోక్ సత్తా కూడా పీడీఎఫ్ అభ్యర్థులకే ఓటు వేయాలని తమ పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలు పంపింది... ఇంకోవైపు జనసేన కూడా పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఓ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు కోట్లు గుమ్మరించినా గ్రాడ్యుయేట్లు, టీచర్లు పీడీఎఫ్ అభ్యర్థులనే గెలిపించారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో పీడీఎఫ్ అభ్యర్థి రాము సూర్యారావును ఓడించడానికి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సుమారు 26 కోట్లు ఖర్చుపెట్టారనే వార్తలు దుమారం రేపాయి. అయినా ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేస్తూ రాము సూర్యారావుని అక్కడి ఓటర్లు గెలిపించడం సంచలనమైంది.. గత ఎన్నికల్లో ఒక్క గుంటూరు మినహా మిగతా స్థానాల్లో పీడీఎఫ్ అభ్యర్థులు విజయడంకా మోగించారు. ఈ సారి కూడా మెజార్టీ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతుతో పీడీఎఫ్ ప్రభంజనం సృష్టిస్తుందని పీడీఎఫ్‌ మద్దతుదారులు భావిస్తున్నారు.

06:33 - March 5, 2017

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటి అయ్యారు. దాదాపు 2గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనతో పాటు అమెరికాలో తెలుగు వాళ్లపై జరుగుతున్న దాడులు, రాష్ట్ర విభజనపై ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ గవర్నర్‌కి వివరించినట్లు సమాచారం. ఈనెల 10వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటి అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటిలో బడ్జెట్‌ సమావేశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. వీటితో పాటు అమెరికాలో తెలుగువాళ్లపై జరుగుతున్న జాత్యహంకార దాడులపై కేంద్రంతో చర్చించాలని గవర్నర్‌ను కేసీఆర్‌ కోరినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు చేపట్టే విధంగా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని గవర్నర్‌ను కోరినట్లు సమాచారం.

భవనాల అప్పగింతలు...
విభజన చట్టం ప్రకారం 9, 10వ షెడ్యుల్‌లో ఉన్న భవనాల అప్పగింతపై ఇరు రాష్ట్రాల కమిటీల చర్చలు, ప్రతిపాదనలపై కూడా గవర్నర్‌కు కేసీఆర్‌ వివరించినట్లు తెలుస్తోంది. తాజాగా వెలగపూడిలో ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఏపీ అసెంబ్లీని తక్షణమే తమకు అప్పగించేలా చూడాలని గవర్నర్‌ను కేసీఆర్‌ కోరినట్లు సమాచారం. ఒకవేళ హైదరాబాద్‌లోని ఏపీ అసెంబ్లీని తమకు అప్పగిస్తే... అందులో శాసనమండలి సమావేశాలను నిర్వహించుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వెంటనే ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. వీటితో పాటు వివిధ కార్పొరేషన్లకు పాలక మండళ్లను ప్రకటించడం, కొత్తగా ఏర్పాటు చేసిన ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ర్ట విభజనపై ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల స్నేహా సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉందని, వాటిని అదుపు చేసేలా చంద్రబాబుకు సూచించాలని కూడా కోరినట్లు సమాచారం.

06:30 - March 5, 2017

విజయవాడ : అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆశలు మరో ఏడాది నెరవేరే అవకాశం కనిపించడంలేదు. రోజాపై విధించిన సస్పెన్షను మరో సంవత్సరం పాటు కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అసెంబ్లీ సభా హక్కుల కమిటీ ఈ మేరకు స్పీకర్‌కు సిఫారసు చేసినట్టు సమాచారం. గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోజా ప్రవర్తించిన తీరును అధికారపక్షం ఆక్షేపించింది. తనను వ్యక్తిగతంగా దూషించడంతోపాటు, లేనిపోని నిందలు మోపారంటూ అనిత అసెంబ్లీ సమావేశాల్లోనే కన్నీటి పర్యంతమయ్యారు. రోజా అనుచిత ప్రవర్తనతో సభాపతి స్పీకర్‌ సహా అందరూ నొచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను ఇంటా బయట సమర్ధించుకున్న రోజా వ్యవహార శైలిని శాసససభ తప్పుపట్టింది. రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అప్పట్లో ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

అసెంబ్లీలోనే తేల్చుకోవాలన్న న్యాయస్థానాలు..
సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు అసెంబ్లీ వేదికగా పోరాడినా ఫలితలేకపోయింది. సస్పెన్షన్‌ ఎత్తివేయాలంటూ గాంధీ విగ్రహం వద్ద ధర్నాలు చేసినా ఫలితంలేకపోయింది. రోజా కూడా న్యాయపోరాటం చేశారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాడినా చివరికి ఈ అంశం మళ్లీ అసెంబ్లీకే చేరింది. శాసనసభలో జరిగిన సస్పెన్షన్‌ వ్యవహారాన్ని అక్కడే తేల్చుకోవాలంటూ కోర్టు ఆదేశించడంతో చేసేదేమీలేకపోయింది. రోజా తన హక్కులకు భగం కల్గించారంటూ అనిత సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని పంపిన నోటీసులను రోజా బేఖాతరుచేశారు. ఒకసారికాదు..రెండుసార్లుకాదు.. ఏకంగా మూడుసార్లు కమిటీ భేటీకి గైర్హాజరయ్యారు. ఈ విషయంలో రోజా వైఖరిని తప్పుపడుతూ సభా హక్కుల కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో వ్యవహారం బెడిసికొట్టేలా ఉందని గ్రహించిన రోజా..అనారోగ్య కారణాలతో హాజరు కాలేకపోయానని వివరణ ఇచ్చారు. నాల్గొవసారి జరిగిన సమావేశానికి హాజరైన రోజా..ఇదే విషయాన్ని కమిటీ దృష్టికి తెచ్చారు. అయితే రోజా ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగాలేదని ప్రివిలేజ్‌ కమిటీ భావించింది. ఎమ్మెలే అనితకు భేషరతుగా క్షమాపణ చెప్పకపోవడాన్ని కమిటీ సభ్యులు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోజాను మరో ఏడాదిపాటు సస్పెండ్‌ చేయాలని సభా హక్కుల కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ప్రివిలేజ్‌ కమిటీ నివేదికను ఈనెల 7న అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నేడు..రాజ్ భవన్ సిబ్బంది క్వార్టర్స్ ప్రారంభం..

హైదరాబాద్ : ఉదయం 9గంటలకు రాజ్ భవన్ సిబ్బంది క్వార్టర్స్ ప్రారంభ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొననున్నారు. పాతగృహాల స్థానంలోనే కొత్త గృహాలతో పాటు పాఠశాల, కమ్యూనిటీ హాల్, సెక్యూర్టీ బరాక్ నిర్మాణం జరగనుంది.

ఇంద్రకీలాద్రిపై ఆలయ జీర్ణోద్దరణ..

విజయవాడ : నేడు ఇంద్రకీలాద్రిపై ఆలయ జీర్ణోద్దరణ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12గంటలకు కుంభస్థాపన, స్పటికలింగ స్థాపన జరగనుంది.

ముంబై ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం..

ముంబై: ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్స్ వద్ద ఉన్న టాయిలెట్ డస్ట్ బిన్‌లో బంగారాన్ని గుర్తించారు.

కూచిబొట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన బాబు..

హైదరాబాద్ : బాచుపల్లిలో కూచిబొట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయనతో పాటు రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, సుజనా చౌదరిలున్నారు. అమెరికాలో జాత్యహంకార దాడిలో శ్రీనివాస్ మృతి చెందిన సంగతి తెలిసిందే.

Don't Miss