Activities calendar

06 March 2017

21:30 - March 6, 2017

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ చివరి విడత ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఏడు జిల్లాల్లోని 40 అసెంబ్లీ స్థానాలకు మార్చి 8న పోలింగ్‌ జరగనుంది. మొత్తం 535 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కోటి 40 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకో 14 వేల 458 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రధాని మోది నియోజకవర్గం వారణాసితో పాటు గాజీపూర్‌, జౌన్‌పూర్, చందౌలీ, మిర్జాపూర్, భదోహి, సోన్‌భద్ర్‌ జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గాను ఎస్పీ 23, బిఎస్పీ 5, బిజెపి 4, కాంగ్రెస్‌ 3 స్థానాలు దక్కించుకున్నాయి. మణిపూర్‌ రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో 22 సీట్లకు గాను మార్చి 8న పోలింగ్‌ జరగనుంది. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

21:28 - March 6, 2017

హైదరాబాద్: మిషన్‌ కాకతీయ పనుల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు.... జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం.. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లోనూ ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని విమర్శించారు.. కాంట్రాక్టులను చిన్న మొత్తంలో ఇవ్వడం ద్వారా అవినీతిని అరికట్టొచ్చని సూచించారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టు రీ డిజైనింగ్‌ అంశంపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోదండరాం హాజరయ్యారు.. ప్రాజెక్టులపై వామపక్ష ప్రజాసంఘాలు చేస్తున్న ఉద్యమంపై జేఏసీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు..

21:26 - March 6, 2017

హైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రతినిధులు, అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల మంజూరు బాధ్యత తాను తీసుకుంటానని... వాటి అమలు బాధ్యతను స్వీకరించాలని కోరారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కార బాధ్యతల్ని శాఖలవారీగా అధికారులకు అప్పగించారు.

విద్యుత్, రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణం...

ప్రగతి భవన్‌లోని జనహితలో నియోజకవర్గంలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు.. విద్యుత్, రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రజారోగ్యం, విద్యాసంస్థల నిర్మాణం, శ్మశాన వాటికలు, వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్ల ఏర్పాటు, వ్యవసాయంపై కేసీఆర్‌ సమీక్షించారు.. గ్రామస్థాయిలోని సమస్యలను తెలుసుకున్న అనంతరం.. కొన్నింటిని అప్పుడే పరిష్కారం చేశారు..

శాఖల వారీగా అధికారులకు బాధ్యతలు...

గజ్వేల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు.... అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు.. అవి సక్రమంగా అమలై ప్రజలకు చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి సంబంధించిన బాధ్యతలను శాఖలవారీగా అధికారులకు సీఎం అప్పగించారు. ఊరికి దూరంగా, ఎత్తైన ప్రాంతాల్లోని ఇళ్లకు కూడా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందించాలని ఆదేశించారు. అలాగే మరుగుదొడ్ల వినియోగం పరిపూర్ణంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.. వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి ప్రజలు 25 కమిటీలు వేసుకుని గ్రామాన్ని వారే అభివృద్ధి చేసుకుంటున్నారని గుర్తుచేశారు.. ఆ తరహాలో గ్రామ కమిటీలను వేసుకోవాలని సూచించారు. గంగదేవిపల్లిలో అభివృద్ధి జరుగుతున్న తీరును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శ్మశానవాటిక ...

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శ్మశానవాటిక నిర్మించాలని సీఎం స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట కొత్త రోడ్లు నిర్మించాలని చెప్పారు. రెండు రోజుల క్రితం గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.. సోమవారం ఈ పనులను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, ఇతర అధికారులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు పాల్గొన్నారు..

21:23 - March 6, 2017

అమరావతి:రాష్ట్రం కరవుతో అల్లాడుతుంటే.. అభివృద్ధిలో దూసుకుపోతోందని గవర్నర్‌ ప్రసంగంలో చంద్రబాబు అసత్యాలు చెప్పిస్తున్నారని ప్రతిపక్ష నేత జగన్‌ విమర్శించారు. వెన్నుపోట్లు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని.. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారని వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు.

గవర్నర్‌ నోట అబద్ధాలు చెప్పించడం బాధాకరం..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర గవర్నర్‌ నోట అబద్ధాలు చెప్పించడం బాధాకరమని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రత్యేక హోదా అన్నది మార్చి నుంచి వెళ్లిపోతుందని గవర్నర్‌తో చెప్పించడం అత్యంత దారుణమని జగన్‌ విమర్శించారు. రాష్ట్రంలో కరవు కాటకాలతో ప్రజలు అల్లాడుతుంటే.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పించడం మరీ దారుణమని జగన్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది రాసిస్తుందో అదే గవర్నర్‌ చదువుతారని జగన్‌ అన్నారు.

గవర్నర్‌ ప్రసంగం అంతా ప్రజల్ని మోసగించేలా

గవర్నర్‌ ప్రసంగం అంతా ప్రజల్ని మోసగించేలా ఉందని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్నే గవర్నర్‌ చదివి వినిపించారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య, కరవుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ప్రసంగంలో లేదని శ్రీధర్‌రెడ్డి అన్నారు. వెన్నుపోట్లు పొడవడం చంద్రబాబుకు వెన్నెతో పెట్టిన విద్య అని, ప్రత్యేక హోదాను తుంగలోతొక్కి రాష్ట్ర ప్రజల్ని మరోసారి వెన్నుపోటు పొడిచారని శ్రీధర్‌రెడ్డి అన్నారు.

గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబు అబద్ధాల పుట్టను చదివించారు...

గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబు అబద్ధాల పుట్టను చదివించారని, అందులో పేజిన్నర వరకు నీతి, న్యాయాల గురించి రాశారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. రైతుల రుణమాఫీ, మహిళలకు రుణాలు, ఇంటికో ఉద్యోగం అంశంపై గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించకపోవడం బాధాకరమని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం హామీ ఇచ్చిన చంద్రబాబు తన కుటుంబంలో మాత్రం నాలుగు ఉద్యోగాలిచ్చారని చెవిరెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తొక్కేస్తూ.. చంద్రబాబు కుటుంబం మాత్రం ముందుకు పోతోందని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. మూడేళ్లుగా ప్రజల్ని మభ్యపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కూడా గవర్నర్‌ ప్రసంగంతో మరింత మభ్యపెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం ప్రజామోద యోగ్యమైన పరిపాలన చేయాలని వైసీపీ నేతలు సూచించారు.

జగన్ వి అసత్య ఆరోపణలు: మంత్రి పల్లె

అమరావతి: గవర్నర్ ప్రసంగంపై జగన్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. గవర్నర్ హోదాను తగ్గించడం తగదని మంత్రి పల్లె అన్నారు. రాజధానిలో ఇల్లు ఉండాలనే న్యాయబద్ధంగా స్థలం కొన్నామని మంత్రి పల్లె తెలిపారు. టీడీపీ వారికి మాత్రమే కాదు ..అన్ని పార్టీల వాళ్లు స్థలాలు కొన్నారని పల్లె చెప్పారు. జగన్ లాగా అన్యాయంగా సంపాదించాల్సిన అవసరం తమకు లేదని మంత్రి స్పష్టం చేశారు.

20:42 - March 6, 2017

హైదరాబాద్: ఒకప్పుడు స్పీచ్ లు దంచేవారు, హామీలు ఇచ్చేవారు. ఆ తరువాత విమర్శలు... ఎదురు దాడులు చేసే కాలం ఒకటొచ్చింది. ఇప్పుడు సీన్ మారింది. సమస్యలన్నీ పక్కకు పోయాయి... ప్రజల బాధలు మాటవరసకు కూడా రాలేదు. గాడిదలకు ప్రచారం చేయొద్దని ఒకరు, మీది ఈ రాష్ట్రం కాదంటే అస్సలు మీది ఈ దేశమే కాదంటూ మరొకరు కౌంటర్లు. ముస్లిం రాకపై ఆంక్షలు విధించాలని మరో నేతాశ్రీ ఇలా దూషణల పర్వంలో లెక్కా పత్రం లేకుండా విపక్షాలను నిందించే పర్వంలో ప్రచారం యావత్తు సాగింది. ముగిసిన ఎన్నికల ప్రచారంలో ఓటర్లు ఎవరి స్పీచ్ లకు పట్టకట్టబోతున్నారు. చివరి అంకానికి చేరిన మినీ ఎలక్షన్లు ఏమి తేల్చనున్నాయి. ఇదే అంశంపై నేటి వైడాంగిల్ విశ్లేషణ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

20:40 - March 6, 2017

హైదరాబాద్: అమరావతి కాడ సురువైన అసెంబ్లీ.... గడ్డపారలేసి తొవ్విన గవర్నర్, ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిన లోకేశం...మంత్రి పదవి ఇచ్చుడు ఒకటే ఆలస్యం, ముంగటపడని మూడెకరాల భూమి...నిలబెట్టుకుంటుందా సర్కార్ హామీ, పని కాకముందే పాలాభిషేకాలు...పెంచాల్నంట కింది కార్మికుల జీతాలు, గిరిజనులను గిచ్చుతున్న సర్కార్.. అమ్మబెట్టదీ.. అడుక్కోనీయదీ అన్నట్టే, కోతుల బాధతోని కొండంగితో మందు...నిమ్మలంగ తిని చేసుకుంటున్నది విందు ఇత్యాది అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న చెప్పిన మాటలు మీరూ వినాలనకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

వెనక్కు తీసుకోవాలని ఎస్ బీఐ ని కోరిన కేంద్రం

ఢిల్లీ: మినిమమ్ బ్యాలన్స్ లేకపోతే పెనాల్టీ విధించే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఎస్ బీఐ ని కేంద్ర ప్రభుత్వం కోరింది.

దంపతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎస్సై బదిలీ

పెద్దపల్లి : దంపతుల పట్ల ఎస్సైల ప్రవర్తన తీరుపై సీపీ విక్రమ్ జిత్ దుగ్గల్ సీరియస్ అయ్యారు. ఎస్సై హరిబాబును హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మా అసోసియేషన్ అధ్యక్షుడిగా శివాజీరాజా ఎన్నిక

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శివాజీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతే కాకుండా జనరల్ సెక్రటరీగా సీనియర్ నటుడు నరేష్ ఎన్నికయ్యారు.

18:44 - March 6, 2017

నెల్లూరు : ఉపాధ్యాయుల కొత్త పెన్షన్‌ విధానాన్ని అడ్డుకుని తీరుతామని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. పెద్దలసభ ఎన్నికల్లో అధికార పార్టీ జోక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తనకు మరో అవకాశం కల్పిస్తే ఉపాధ్యాయుల సమస్యలపై మండలిలో గళమెత్తుతానంటున్న బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

18:42 - March 6, 2017

విశాఖ : ఉత్తరాంధ్ర పీడీఎఫ్ అభ్యర్థి అజా శర్మకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ స్పష్టం చేశారు.... ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి కి ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు.. అందువల్లే ఇద్దరు కేంద్రమంత్రులు, ఆరుగురు రాష్ట్ర మంత్రులు తమ పార్టీ అభ్యర్థి కోసంప్రచారం చేస్తున్నారని చెప్పారు.. వెంకయ్య నాయుడు వాలకం చూస్తుంటే ఆయన కేంద్రానికి మంత్రో... జిల్లాకు మంత్రో తెలియకుండా ఉందని వ్యంగ్యంగా విమర్శించారు..

18:41 - March 6, 2017

అనంతపురం : బకాయిలు చెల్లించలేదంటూ అనంతపురం జిల్లా కదిరి గ్యారేజీ గేట్లకు మున్సిపల్‌ అధికారులు తాళాలు వేశారు.. దీంతో లోపలున్న కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.. గ్యారేజీలోకి బస్సుల రాకపోకలు ఆగిపోయాయి.. పలు బస్సులు ఆలస్యంగా నడిచాయి.. అయితే తాము పన్ను చెల్లించామని చెబుతున్నా వినకుండా అధికారులు గ్యారేజ్‌ సీజ్‌ చేశారని డిపో సూపరిండెంట్‌ చెబుతున్నారు.. డిపోలోని ఖాళీ స్థలానికి పన్ను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని... ఆ స్థలాన్ని మున్సిపల్‌ అధికారులు చెత్తవేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని స్పష్టం చేశారు..

18:39 - March 6, 2017

అనంతపురం : రాయలసీమ అభివృద్దిని చర్చనీయాశంగా మార్చి, అన్ని వర్గాల ప్రజలను సమీకరించి ప్రభుత్వంపై ఉద్యమం చేయడమే ప్రధాన ఎజెండా అన్నారు పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గేయానంద్. రాయలసీమకు సాగు, త్రాగునీరు అందించడంలో, ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య దోరణిపై పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగభృతి కోసం విధ్యార్థి యువజనులతో కలిసి ఉద్యమిస్తానన్నారు. ఈనెల 9తేదీన జరగనున్న పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని గేయానంద్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

18:38 - March 6, 2017

అమరావతి: ఏపీ అసెంబ్లీ మళ్లీ ఎమ్మెల్యే రోజాను సస్పెన్షన్‌ చేస్తారన్న వార్తలపై ప్రభుత్వ చీఫ్ విప్‌ కాల్వ శ్రీనివాసులు స్పందించారు. ఆయన '10టివి'తో మాట్లాడుతూ.. సస్పెన్షన్‌కు సంబంధించి ప్రివిలేజ్‌ కమిటీ రిపోర్టుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు.. ఎమ్మెల్యే అనితకు రోజా క్షమాపణ చెప్పాలని... దీనిపై అనిత సంతృప్తి వ్యక్తంచేస్తే స్పీకర్‌ ఆలోచించే అవకాశం ఉందని సమాధానమిచ్చారు..

ముగిసిన చివరి విడత ఎన్నికల ప్రచారం

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌, మణిపూర్‌లో జరగనున్న చివరి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 8న యూపీలో చివరి విడత 40 స్థానాలకు, మణిపూర్‌లో 22 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. 11న ఉత్తరప్రదేశ్‌ సహా మణిపూర్‌, పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

యూపీ మంత్రి ప్రజాపతికి సుప్రీంలో చుక్కెదు

ఢిల్లీ: అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీ మంత్రి గాయత్రి ప్రజాపతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన అరెస్ట్‌పై స్టే విధించడానికి కోర్టు నిరాకరించింది. అలాగే ఈ విషయంపై సంబంధిత కోర్టును ఆశ్రయించాల్సిందిగా ఆదేశించింది. అత్యాచారం కేసులో ప్రజాపతిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా రాజకీయ రంగు పులమడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది.

జయపై ఎలాంటి కుట్ర జరగలేదు: తమిళసర్కార్

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలితకు అందించిన చికిత్సపై వైద్య నివేదికను తమిళనాడు సర్కార్ విడుదల చేసింది. జయపై ఎలాంటి కుట్ర జరగలేదని, సెప్టెంబర్ 22న రాత్రి 10 గంటలకు జయను ఆసుపత్రికి తీసుకువచ్చి 72 రోజుల పాటు జయలలితకు చికిత్స అందించామని పేర్కొంది. డిసెంబర్ 4న గుండెపోటు రావడంతో జయ మృతి చెందారని సర్కార్ పేర్కొంది.

జర్నలిస్టులపై దాడులను ఉపేక్షించేదిలేదు:చినరాజప్ప

అమరావతి: వెలగపూడిలో హైపవర్ కమిటీ భేటీ అయ్యింది. చీరాలలో జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై జరిగిన దాడిపైనివేదిక ఇవ్వాలని అధికారులకు డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆదేశించారు. జర్నలిస్టులపై దాడులను ఉపేక్షించేంది లేదని, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో జర్నలిస్టులపై దాడుల నివారణకు కమిటీలు వేస్తున్నామని, ప్రతి ఆరు మాసాలకొకసారి హైపవర్ కమిటీ భేటీ అవుతుందని తెలిపారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో జగన్ భేటీ

విజయవాడ: ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైసీపీ నేత జగన్ సమావేశం అయ్యారు. రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చిస్తున్నట్లు సమాచారం.

18:14 - March 6, 2017

ఢిల్లీ: బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియ‌ర్ నేత‌ ఎల్‌కే అద్వానీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. అద్వానీ, కేంద్ర మంత్రి ఉమాభారతితో పాటు మరో 13 మందిపై ఉన్న కుట్ర కేసును పున‌రుద్ధరించే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. అద్వానీతోపాటు ఇత‌ర నేత‌ల‌పై ఉన్న కేసుల‌ను కింది కోర్టు ఎత్తివేయ‌డాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో స‌వాలు చేసింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయస్థానం... సాంకేతిక కార‌ణాలు చూపుతూ అద్వానీపై కేసు ఎత్తివేయ‌డం ఆమోదయోగ్యం కాద‌ని స్పష్టం చేసింది. బాబ్రీ విధ్వంసం కేసును రెండు వేర్వేరు కోర్టులలో బదులు ఒకేచోట సంయుక్త విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మార్చి 22న దీనిపై తుది తీర్పు ఇవ్వనుంది.1992, డిసెంబ‌ర్ 6న అయోధ్యలోని బాబ్రీ మ‌సీదును కూల్చివేసిన విష‌యం తెలిసిందే.

17:34 - March 6, 2017

హైదరాబాద్: హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణకు వచ్చింది. ఇక నుంచి ప్రతి సోమవారం అగ్రిగోల్డ్‌ కేసు విచారిస్తామని ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. కస్టమర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ముఠాతో.. యాజమాన్యానికి సంబంధం లేదని కర్నూలు ఎస్పీ నివేదిక ఇచ్చారు. మరోవైపు విజయవాడ, రంగారెడ్డి జిల్లా కీసరలో సంస్థకున్న ఆస్తుల అమ్మకానికి.. అన్ని ఏర్పాట్లు చేశామని సీఐడీ తెలిపింది.

17:31 - March 6, 2017

నిర్మల్: ఆత్మహత్య చేసుకునేందుకు కెనాల్‌లోకి దూకిన మహిళను కాపాడారు జగిత్యాల పోలీసులు.... ఇబ్రహీంపట్నంకు చెందిన జల్ల లక్ష్మి శ్రీరాంసాగర్‌ కెనాల్‌లోకి దూకేసింది.. స్థానికుల ద్వారా ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ మాడవి ప్రసాద్‌, రైటర్‌ మహేశ్‌లు కెనాల్‌కు చేరుకున్నారు.. అందులోకి దూకి కిలోమీటర్‌ దూరంలో అపస్మారక స్థితిలోఉన్న మహిళను గుర్తించారు.. తాళ్ల సహాయంతో ఆమెను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు.. తమ ప్రాణాలకుతెగించి మహిళను కాపాడిన పోలీసుల్ని స్థానికులు అభినందించారు..

17:29 - March 6, 2017

పెద్దపల్లి : జిల్లాలో పోలీసుల అరాచకంపై బాధితురాలు శ్యామల కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది... రెండు రోజులక్రితం భర్త, పిల్లలతో కలిసి పొలం దగ్గరకి వెళ్లివస్తుండగా తమపై ఎస్ఐ దాడి చేశాడని ఆరోపించింది.... పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి మరో ఎస్ఐతో కలిసి అసభ్య పదాలతో దూషించారని కలెక్టర్‌కు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్‌ వర్షిణి... ఈ విషయంపై కమిషనర్‌ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌కు ఫోన్‌ చేశారు.. ఈ ఘటనపై విచారణ జరిపి ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని సూచించారు..

17:25 - March 6, 2017

నల్గొండ: తెలంగాణలో సామాజిక న్యాయం జరిగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం కోసమే సీపీఎం మహాజన పాదయాత్రను మొదలుపెట్టిందని..అది సాధించేవరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు తమ్మినేని. నల్గొండ జిల్లాలో జరుగుతున్న మహాజన పాదయాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. సామాజిక న్యాయమే లక్ష్యంగా చేపట్టిన మహాజన పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ యాత్రకు మద్దతు తెలుపుతున్నారు.

హైకోర్టుకు చేరిన కానిస్టేబుల్ రాత పరీక్షల అవకతవకలు...

హైదరాబాద్: కానిస్టేబుల్ రాత పరీక్షల్లో అవకతవకలు జరిగాయని 9 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ సీసీ క్యాటగిరిలో జనరల్ కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు చూపినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు. కోర్టును ఆశ్రయించిన వారిని మెడికల్ టెస్టులకు అనుమతించాలని, వారంలోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొంది.

బొగ్గు కుంభకోణం కేసు విచారణ 24కు వాయిదా

ఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు స్కాంలో జరిగిన కుంభకోణం కేసు విచారణను ఈనెల 24కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది.

'మధ్యాహ్న భోజన పథకానికి ఆధారతో అనుసంధానం తగదు'

కేరళ: మధ్యాహ్న భోజన పథకానికి ఆధారతో అనుసంధానం చేయడం తగదని కేరళ సీఎం పినరాయ్ విజయన్ హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

గజ్వేల్ ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దాలి:కేసీఆర్

హైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. ప్రగతి భవన్‌లోని జనహితలో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. గజ్వేల్‌ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలై ప్రజలకు ఉపయోగపడేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.

16:38 - March 6, 2017

అమరావతి: పార్లమెంటుతోపాటు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఆంధప్రదేశ్‌ సానుకూలంగా స్పందించింది. ఇదే సమయంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన ఏడాదిలోగా రాష్ట్రాల్లో పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ స్థానిక సంస్థల క్రతువుగా కూడా ముగిసేలా చర్యలు తీసుకోవాలని అమరావతిలో ప్రారంభమైన శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో సూచించింది. 2029 నాటికి ఏపీని అన్ని రంగాల్లో అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీ, మండలి సంయుక్త భేటీలో గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. బీసీల రిజర్వేషన్లకు నష్టం కలుగకుండా కాపు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

16:35 - March 6, 2017

అమరావతి: బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రాకపోవడాన్ని టీడీపీ తప్పుపట్టింది. జగన్‌కు ప్రజా సమస్యల పట్ల ఏ మేరకు శ్రద్ధ ఉందో అర్ధమవుతుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రజాసమస్యలు చర్చించేందుకు టీడీపీ వెనక్కి పోతుందన్న వైసీపీ వాఖ్యలను కాల్వ శ్రీనివాసులు ఖండించారు. సభలో తాము ప్రజాసమస్యలన్నింటినీ చర్చించేందుకు సిద్ధమన్నారు.

16:31 - March 6, 2017

అమరావతి:రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ఓ పెద్ద స్కాం అని వైసీపీ నేత జగన్ విమర్శించారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.... రాజధాని రైతులకు సీఎం చంద్రబాబు అన్యాయం చేశారని, ఆయన ఆనుయాయులకు మాత్రం మంచి ప్లాట్లు కేటాయించారని ఆరోపించారు. ఇంత వరకు ఎంత మంది రైతులకు ప్లాట్లు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఖరీదైన స్థలాలను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కు కేటాయించడం ధర్మమేనా అని ప్రశ్నించారు. కరువపై ప్రజలు అల్లాడుతుంటే రాష్ట్రం అభివృద్ధి చెందిందని సీఎం చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా వుందని జగన్ మండిపడ్డారు. వరుసగా మూడు సంవత్సరాలు కరువు... కరువు. రైతులు అల్లాడుతా వుంటే అభివృద్ధి రేటు 12.3 శాతం అభివృద్ధి సాధించిందట. దేశంకన్నా రాష్ట్రం 5.5 శాతం అభివృధ్ధి చెందిందని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం అని తెలిపారు. రాష్ట్ర అభివృధ్ధి, ప్రజా సమస్యలపై రేపటి అసెంబ్లీ మాట్లాడతా అని చెప్పారు. గవర్నర్ తో సీఎంచంద్రబాబు అబద్ధాలు చెప్పించడం బాధాకరమని తెలిపారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు చెప్పాల్సిన మాటలు గవర్నర్ తో మాట్లాడించడం మరింత దారుణం అన్నారు.

థానే మేయర్ గా మీనాక్షి షిండే

హైదరాబాద్: థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన పార్టీ అత్యధికంగా డివిజన్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఇవాళ పార్టీ తరపున మేయర్ అభ్యర్థి ఎన్నిక జరిగింది ఈ ఎన్నికలో పార్టీ నేత మీనాక్షి షిండే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తెలంగాణ అసెంబ్లీ వెబ్‌సైట్‌ ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వెబ్‌సైట్‌ ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. స్థానిక భాషలైన తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ వెబ్‌సైట్‌ తీర్చిదిద్దారు. స్థానిక భాషల్లో వెబ్‌సైట్‌ను ప్రారంభించుకోవడం శుభపరిణామమని స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. చట్టసభల చరిత్రలోనే ఇదో మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించుకోవడం సంతోషకరమని మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. ప్రజలు ఈ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి..

15:46 - March 6, 2017

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వెబ్‌సైట్‌ ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. స్థానిక భాషలైన తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ వెబ్‌సైట్‌ తీర్చిదిద్దారు. స్థానిక భాషల్లో వెబ్‌సైట్‌ను ప్రారంభించుకోవడం శుభపరిణామమని స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. చట్టసభల చరిత్రలోనే ఇదో మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించుకోవడం సంతోషకరమని మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. ప్రజలు ఈ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి.. తమ ఎమ్మెల్యేలకు సమస్యలను మెయిల్‌ చేయవచ్చని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు సూచించారు.

15:44 - March 6, 2017

హైదరాబాద్: సీపీఎం మహాజన పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. మార్చి 19న సామాజిక, సమర సమ్మేళనం పేరుతో నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. దీనికి కేరళ సీఎం పినరయి విజయన్‌ హాజరవుతారన్నారు. కేరళ సీఎంను అడ్డుకొని.. పోటీగా సభ పెడతామన్న బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యలను రాఘవులు ఖండించారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని.. సభ జరిపి తీరితామంటున్న బీవీ రాఘవులు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:42 - March 6, 2017

గుంటూరు: ఏపీ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులందరికీ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.. అడగ్గానే రైతులంతా వెంటనే స్పందించి రాజధానికోసం తమ భూముల్ని త్యాగం చేశారని ప్రశంసించారు.. వెలగపూడిలో ఎమ్మెల్యేలు, మంత్రులకు రాజధాని ప్రాంత రైతులు భోజనాలు ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి బాలయ్య హాజరయ్యారు.

అన్నిట్లోనూ నిర్దోషిగా కోర్టులు తేల్చాయి: చంద్రబాబు

అమరావతి: పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న వారికే ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇచ్చామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతిభ, సమర్ధత కలిగిన వారినే అభ్యర్థులుగా ఎంపిక చేశామన్నారు. అందులో భాగంగానే నారా లోకేష్‌కు టిక్కెట్ ఇచ్చినట్టు స్పష్టం చేశారు. అమరావతిలో మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్న చంద్రబాబు... తనకు కేసులేమీ కొత్తకాదన్నారు. గతంతోనూ తనపై అనేక కేసులు వేశారని.. వాటిల్లో నిర్దోషిగా బయటకొచ్చానన్నారు. ఓటుకు నోటు కేసులోనూ నిర్దోషిగా నిరూపించుకుంటానన్నారు.

బీఏసీ నిర్ణయం వైసీపీ అసంతృప్తి

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 13 రోజులు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. అయితే దీనిపై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సమావేశాలను మరో పది రోజులైనా పొడగించాలని కోరింది. దీనికి ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసిందని వైసీపీ నేతలు ఆరోపించారు. ప్రజాసమస్యలపై చర్చించకుండా నూతన అసెంబ్లీ నిర్మాణం గురించి మాట్లాడుకోవడం సరికాదని వైసీపీ నేతలు శ్రీకాంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

గవర్నర్‌ ప్రసంగం నిరాశజనకం: పి.మధు

అమరావతి: ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం నిరాశజనకంగా ఉందని..రైతు సమస్యలపై మాట్లాడకపోవడం విచారకరమన్నారు సీపీఎం ఏపీ కార్యదర్శి పి. మధు. రాష్ట్రంలో కరవు సమస్యతో ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నా..ఆ విషయంపై ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. పోలవరం,పట్టిసీమ, వృద్ధిరేటు అంటూ గవర్నర్‌ పాతపాటే పాడారే తప్ప రైతు సమస్యలు, తాగునీటి సమస్యపై మాట్లాడకపోవడం విచారకరమన్నారు.

15:38 - March 6, 2017

అమరావతి: ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం నిరాశజనకంగా ఉందని..రైతు సమస్యలపై మాట్లాడకపోవడం విచారకరమన్నారు సీపీఎం ఏపీ కార్యదర్శి పి. మధు. రాష్ట్రంలో కరవు సమస్యతో ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నా..ఆ విషయంపై ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. పోలవరం,పట్టిసీమ, వృద్ధిరేటు అంటూ గవర్నర్‌ పాతపాటే పాడారే తప్ప రైతు సమస్యలు, తాగునీటి సమస్యపై మాట్లాడకపోవడం విచారకరమన్నారు.

15:37 - March 6, 2017

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 13 రోజులు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. అయితే దీనిపై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సమావేశాలను మరో పది రోజులైనా పొడగించాలని కోరింది. దీనికి ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసిందని వైసీపీ నేతలు ఆరోపించారు. ప్రజాసమస్యలపై చర్చించకుండా నూతన అసెంబ్లీ నిర్మాణం గురించి మాట్లాడుకోవడం సరికాదని వైసీపీ నేతలు శ్రీకాంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

15:34 - March 6, 2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు 14 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 17వ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శాసనసభకు సెలవు ప్రకటించారు. 25, 27 తేదీల్లో సభ రెండు పూటలా నిర్వహించనున్నారు. సమావేశాలను మరో వారం పాటు పొడిగించాలని ప్రతిపక్షం కోరింది. ప్రశ్నోత్తరాలను కచ్చితంగా నిర్వహించి తీరాలని BJP శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రావు ప్రభుత్వానికి సూచించారు.

పెద్దపల్లి ఎస్సై శ్రీనివాస్, హరిబాబులపై మహిళ ఫిర్యాదు

పెద్దపల్లి: ఎస్పై శ్రీనివాస్, హరిబాబులపై కలెక్టర్ వర్షిణికి శ్యామల అనే మహిళ ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి పొలం దగ్గరకు వెళ్లి తిరిగి వస్తుండగా తమ దంపతులపై ఎస్సైలు దాడి చేసి దూషించారని ఫిర్యాదు చేశారు. విచారించి ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ కు కలెక్టర్ వర్షిణి ఫోన్ లో సూచించినట్లు తెలుస్తోంది.

 

'మధుకోడా, శశికళకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుంది'

హైదరాబాద్: కేసీఆర్ కు జైలు తప్పదని బిజెపి నేత నాగం జనార్థన్ రెడ్డి అన్నారు. మధుకోడా, శశికళకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని, కేసీఆర్ అవినీతిపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని నాగం డిమాండ్ చేశారు. అర్హత లేని టెండర్లు రద్దు అయ్యే వరకు నా పోరాటం ఆగదని, కేసీఆర్ అవినీతితో బర్బాద్ తెలంగాణగా మార్చుతున్నారని నాగం విమర్శించారు.

15:03 - March 6, 2017

చెడ్డపేరు మాత్రం తీసుకురాను:నారా లోకేష్

అమరావతి: రాజకీయాల్లో మంచిపేరు తెచ్చుకోలేకపోయినా... తాత, తండ్రికి మాత్రం చెడ్డపేరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురానని నారా లోకేశ్‌ అన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా చేరిన ఐదు సంవత్సరాలకే తనకు ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వం దక్కడం ఆనందంగా ఉందని లోకేశ్‌ అన్నారు. తాను ఇక్కడి వరకు రావడానికి కారణం పార్టీ కార్యకర్తలేనని అన్నారు. అతితక్కువ కాలంలో తనకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు, కళా వెంకట్రావులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆదేశాల ప్రకారమే తాను ఎమ్మెల్సీ పదవికి పోటీ చేస్తున్నట్లు చెప్పారు.

14:43 - March 6, 2017

అమరావతి: చిన్నవయస్సులో...ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పార్టీకి కృతజ్ఞతలు , టీడీపీ కార్యకర్తలందరికీ లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీని పదవిగా చూడటం లేదని.. బాధ్యతగా చూస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి.. పార్టీకి అనుసంధానం చేసే బాధ్యత తనపై ఉందని అన్నారు. ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామని చెప్పారు. కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, క్షేత్ర స్థాయి నుంచి కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని లోకేష్‌ అన్నారు.

14:39 - March 6, 2017

అమరావతి: పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న వారికే ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇచ్చామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతిభ, సమర్ధత కలిగిన వారినే అభ్యర్థులుగా ఎంపిక చేశామన్నారు. అందులో భాగంగానే నారా లోకేష్‌కు టిక్కెట్ ఇచ్చినట్టు స్పష్టం చేశారు. అమరావతిలో మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్న చంద్రబాబు... తనకు కేసులేమీ కొత్తకాదన్నారు. గతంతోనూ తనపై అనేక కేసులు వేశారని.. వాటిల్లో నిర్దోషిగా బయటకొచ్చానన్నారు. ఓటుకు నోటు కేసులోనూ నిర్దోషిగా నిరూపించుకుంటానన్నారు.

9న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం..

హైదరాబాద్: ఈనెల 9న తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరుగనుంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కొనసాగనుంది.

అమెరికాలో దాడులపై బాబు స్పందన..

విజయవాడ : అమెరికాలో తెలుగు వారిపై జరుగుతున్న దాడులపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించారు. ప్ర‌పంచానికే లీడ‌ర్‌గా ఉన్న అమెరికా లాంటి దేశంలో ఇవ‌న్నీ జ‌ర‌గ‌డం విచార‌క‌రమ‌ని, ఒక‌ప్పుడు అమెరికాలో ఎంతో భ‌ద్ర‌త ఉండేదన్నారు.

13:34 - March 6, 2017

ఢిల్లీ : ఓటుకు నోటు కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ కేసులో సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటీ ? అనే దానిపై సమగ్రంగా విచారణ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం సోమవారం విచారణ చేపట్టింది. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. సీఎం చంద్రబాబు నాయుడికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఈసందర్భంగా పిటిషన్ దాఖలు చేసిన వారి తరపు న్యాయవాది టెన్ టివితో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు వాయిస్ అవునా ? కాదా ? అనేది నిర్ధారించలేదని, సక్రమంగా జరగడం లేదని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయగా చంద్రబాబు ప్రమేయం మీద ఇన్వేస్టిగేషన్ చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. కానీ వారు హైకోర్టును ఆశ్రయించగా విచారణ ఆపివేయాలని కోర్టు పేర్కొనడం జరిగిందన్నారు.
నామినెటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ రవీంద్ర ఓటును కొనుగోలు చేయడానికి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేసిన వీడియోలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో సీఎం చంద్రబాబు నాయుడు వాయిస్ కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఏసీబీ విచారణ జరిపింది. అంతేగాకుండా హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా తీర్పుపై టిడిపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

13:31 - March 6, 2017

విజయవాడ : విభజన హామీ చట్టంలో హామీ ప్రకారం విశాఖకు రైల్వే జోన్ కోసం ప్రభుత్వం కృషి చేయడం జరుగుతోందని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. అమరావతిలో ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన ఉభయసభలనుద్ధేశించి ప్రసంగించారు. రైల్వే జోన్ కోసం కేంద్రంపై వత్తిడి తీసుకరావడం జరుగుతుందని గవర్నర్ తెలిపారు.

13:25 - March 6, 2017

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తేల్చేశారు. అమరావతిలో ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన ఉభయసభలనుద్ధేశించి ప్రసంగించారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం హోదా కుదరదని కేంద్రం తేల్చిచెప్పిందని తెలిపారు. ప్రత్యేక హోదా స్థానంలో కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి మద్దతివ్వడం జరిగిందన్నారు.

13:13 - March 6, 2017

విజయవాడ : గవర్నర్ ప్రసంగంలో స్పష్టమైన విజన్ ఇవ్వడం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నేడు ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడిన అనంతరం మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా తాము ముందుకెళుతున్నామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనూ రాజీపడబోనని తేల్చిచెప్పారు. 2029లో ఏపీని అగ్రగామిగా నిలబెడుతామని, పారదర్శక పాలన కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ లు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. మన గడ్డ మీద శాసనసభ నిర్వహించుకోవడం ఒక చరిత్ర అని, ప్రజల్లో అనైక్యత తేవాలని కొంతమంది ప్రయత్నించారని పేర్కొన్నారు. పదేళ్లు హైదరాబాద్ ను రాజధానిగా వినియోగించుకోవచ్చు...కానీ అమరావతి నుండే పాలన చేయాలని అనుకున్నట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో స్పష్టమైన విజన్ ఇవ్వడం జరిగిందని, ల్యాండ్ పూలింగ్ ను ఒక మోడల్ గా తయారు చేసినట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు, రాజధాని నిర్మాణానికి రైతులు సహకరించారని తెలిపారు. విభజన వల్ల ఇంకా సమస్యలు వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి పాటుపడే వారికి మాత్రమే ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరూ కూడా ఇంట్లో డబ్బులు పెట్టుకోకుండా బ్యాంకుల వద్దకు రావాలని, దీనివల్ల లాభం జరుగుతుందన్నారు.

కేసీఆర్ సర్కార్ పై ఉత్తమ్ విమర్శలు..

హైదరాబాద్ : పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు గ్లోబల్ టెండర్లను పిలవలేదని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రాజెక్టు అంచనాలు రూ. 50 వేల కోట్లు పెంచడం సరికాదని, ప్రజలను తాకట్టుపెట్టి బ్యాంకుల నుండి అప్పులు తెస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ అవినీతిపై పోరాడుతామన్నారు. కేసీఆర్ సర్కార్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నామని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.

కేసీఆర్ రాష్ట్రాన్ని దోపిడి చేస్తున్నారు - డీకే అరుణ...

హైదరాబాద్ : ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ రాష్ట్రాన్ని దోపిడి చేస్తున్నారని, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను మంత్రి హరీష్ రావు ప్రారంభించడం సిగ్గు చేటని పేర్కొన్నారు.

అమరావతి నుండే పాలన - బాబు..

విజయవాడ : మన గడ్డ మీద శాసనసభ నిర్వహించుకోవడం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో అనైక్యత తేవాలని కొంతమంది ప్రయత్నించారని, పదేళ్లు హైదరాబాద్ ను రాజధానిగా వినియోగించుకోవచ్చు...కానీ అమరావతి నుండే పాలన చేయాలని అనుకున్నట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో స్పష్టమైన విజన్ ఇవ్వడం జరిగిందని, ల్యాండ్ పూలింగ్ ను ఒక మోడల్ గా తయారు చేసినట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు, రాజధాని నిర్మాణానికి రైతులు సహకరించారని తెలిపారు. విభజన వల్ల ఇంకా సమస్యలు వెంటాడుతున్నాయని పేర్కొన్నారు.

అమెరికాలో తెలుగు యువతిపై కాల్పులు..

అమెరికా : కాలిఫోర్నియాలో తెలుగు యువతిపై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. యువతి చేతికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

రాజాసింగ్ బెదిరింపులకు భయపడం - రాఘవులు..

హైదరాబాద్ : మహజన పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పేర్కొన్నారు. ఈనెల 19వ తేదీన పాదయాత్ర హైదరాబాద్ కు చేరుకుంటుందని, ఆ రోజు నిర్వహించే బహిరంగసభ ప్రత్యామ్నాయ రాజకీయాలకు ప్రారంభ వేడుకగా ఉండనుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించేలా ఉన్నాయన్నారు. రాజాసింగ్ బెదిరింపులకు భయపడమని తేల్చిచెప్పారు. బీజేపీ హింస దేశ వ్యాప్తంగా కొనసాగుతోందని తెలిపారు.

12:52 - March 6, 2017
12:50 - March 6, 2017

పాలనురుగు వంటి కాన్వాస్ పై రంగులతో రాగ రంజితం చేస్తూ కుంచెతో చిత్రీకరణ చేయడం అంటే మాటలు కాదు. ఓ చిత్రానికి రూపునివ్వడం అంటే మనస్సులోని మెరుగును దిద్దుకుని ఊహకు రూపునివ్వడమే. ఓ ఆలోచనను..సందేశాన్ని నూతనంగా తెలియచేయడమే అటువంటి చిత్రీకరణలో హరివిల్లుల రంగులతో చిత్రలేఖనంలో ప్రతిభను చాటుతోంది ఓ అతివ. మరి ఆ అతివ ఎవరు ? విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

12:37 - March 6, 2017

విజయవాడ : ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నామినెటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ రవీంద్ర ఓటును కొనుగోలు చేయడానికి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేసిన వీడియోలు సంచలనం సృష్టించింది. ఆ వీడియోలో అందులో సీఎం చంద్రబాబు నాయుడు వాయిస్ కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఏసీబీ విచారణ జరిపింది. అంతేగాకుండా హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం విచారణకు స్వీకరించింది. సీఎం చంద్రబాబు నాయుడికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసును త్వరగతిన విచారిస్తామని కోర్టు పేర్కొంది. వీలైంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.

 

12:26 - March 6, 2017
12:25 - March 6, 2017

చెన్నై : ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రానున్నారా ? రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోమవారం కమల్ అభిమాన సంఘాలతో అత్యవసరం భేటీ అయ్యారు. దీనితో ఒక్కసారిగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. జయ మరణం తరువాత తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలపై ట్విట్టర్ వేదికపై కమల్ పలు ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో తామే సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొంటున్నారు. దీనితో ఆయన రాజకీయాల్లో వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

జయ మరణం అనంతరం..
జయ మరణం అనంతరం రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోవడం..డీఎంకే బలంగా తయారు కావడం వంటివి చోటు చేసుకున్నాయి. జాతీయ పార్టీలు నామమాత్రం కావడంతో సినీ రంగం నుండి రావాలని పలువురిపై వత్తిడి పెరుగుతోంది. అంతేగాకుండా సినీ రంగానికి చెందిన వారు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ దీనిపై రజనీ మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. తాజాగా కమల్ పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో చూడాలి.

తెలంగాణ శాసనసభ వెబ్ సైట్..

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ వెబ్ సైట్ ఆవిష్కృతమైంది. తెలుగు, ఉర్దూ భాషల్లో ఉన్న ఈ వెబ్ సైట్ ను స్పీకర్ మధుసూధనచారి ఆవిష్కరించారు. మంత్రి హరీష్ రావు, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

డీకే అరుణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

హైదరాబాద్ : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో లోపాలపై డీకే అరుణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఉత్తమ్, దామోదర, నాగం, రామకృష్ణ, ఇంజినీర్లు హాజరయ్యారు. ప్రాజెక్టుపై డీకే అరుణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

ఓటుకు నోటు సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : ఓటుకు నోటు కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

12:04 - March 6, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించారు. 2017-18 బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ శాసనసభ నాలుగో సంయుక్త సమావేశాల్లో ప్రసంగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అతి స్వల్పకాలంలో నిర్మించిన నూతన అసెంబ్లీ భవనాల్లో మొదటిసారిగా జరుగుతున్న సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకొని ఏపీ అభివృద్ధి దిశగా ముందుకెళుతోందన్నారు. సమాజ వికాసం..కుటుంబ వికాసం..కీలక సూత్రాల ఆధారంగా అభివృద్ధి జరుగుతోందని, ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లతో ఏపీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

2020 కల్లా..
2020 కల్లా దేశంలోని మొదటి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఉంటుందని, 2050 కల్లా విదేశీ పెట్టుబడుల్లో కీలక స్థానంగా ఏపీ ఉంటుందని తెలిపారు. గత రెండున్నరేళ్లలో ఎన్నో సానుకూల విజయాలు సాధించినట్లు, రెండంకెల వృద్ధి రేటు సాధించడమే లక్ష్యమన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా 2015-16లో రెండంకెల వృద్ధి రేటు ప్రభుత్వం సాధించిందని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 24 శాతం వృద్ధి సాధించిందని, తక్కువ వర్షపాతం ఉన్నా వ్యవసాయంలో వృద్ధి సాధ్యమైందన్నారు. పారిశ్రామిక వృద్ధి రేటు 9.58 శాతంగా నమోదైందని, సేవారంగంలో మరింత వృద్ధి, ఉపాధి అవకాశాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రైతులకు రాయితీలపై యంత్రాలు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

ప్రాజెక్టులు పూర్తి..
పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీరందించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన జరుగుతున్నాయని, 2019 కల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్ఈడీ దీపాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, డయా ఫ్రం వాల్, స్పిల్ ఛానల్ పనులు వేగంగా జరగుతున్నాయన్నారు. తోటపల్లి, గండికోట ప్రాజెక్టులు నిర్దేశిత కాలంలో పూర్తవుతాయని, వెలుగొండతో సహా పలు ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రత్యేక విత్తన చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు.

665 కంపెనీల పెట్టుబడులు..
నగరవనం, పల్లెవనం ద్వారా పచ్చదనం పెంపునకు కృషి చేస్తోందని, భాగస్వామ్య సదస్సులో 665 కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయన్నారు. రూ. 10 లక్షల కోట్ల మేర అవగాహన ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని, విద్యుత్, ఐటీ రంగాల్లో 5 జాతీయ అవార్డులు సాధించిందని పేర్కొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాలో లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. విద్యుత్ సరఫరా పంపిణీ నష్టాలను కనిష్టస్థాయికి తీసుకరావడానికి ప్రభుత్వం కృషి చేయడం జరిగిందన్నారు. ఉద్యానవన రంగాన్ని ప్రధాన రంగంగా ప్రభుత్వం పరిగణిస్తోందని, పర్యాటక రంగాన్ని అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.

విజ్ఞాన రాష్ట్రంగా..
విద్యార్థుల్లో నైపుణ్యత పెంపొందించడానికి కృషి చేయడం జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే విజ్ఞాన రాష్ట్రంగా చేయాలన్నదే తమ లక్ష్యమని, 104వ సైన్స్ కాంగ్రెస్ తిరుపతిలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాలలో డిజిటల్ తరగతులు, బయోమెట్రిక్ హాజరు అమలు చేసినట్లు తెలిపారు. బడి మానేసే పిల్లల సంఖ్య తగ్గించేందుకు సైకిళ్లను పంపిణీ చేయడం జరుగుతుందని, నిరుద్యోగులకు ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. విజయవాడ, రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టును విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. పాడి ద్వారా ప్రతి రైతు కుటుంబానికి నెలకు రూ. 10 వేలు సంపాదించేలా చర్యలు తీసుకుంటున్నట్లు, నగరవనం, పల్లెవనం ద్వారా పచ్చదనం పెంపునకు కృషి చేస్తోందన్నారు.

తెలుగు భాషా ప్రాదికార సంఘం..
తెలుగు భాషాభివృద్ధికి తెలుగు భాషా ప్రాదికార సంఘం ఏర్పాట్లు చేయనుందని, తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలో తెలుగు భాషను ఉపయెగించాలని సూచించారు. అమరావతిని గ్రీన్ ఫిల్డ్ రాజధానిగా తీర్చిదిద్దేందుకు వినూత్న భూ సేకరణ జరిగిందన్నారు. ఏపీ లాజిస్టిక్ హబ్ గా తీర్పు తీరానికి సంహద్వారమని, బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా దేశంలోనే ఏపీ మొదటిస్థానం సంపాదించిందని తెలిపారు. విజయవాడ, విశాఖలో త్వరలోనే మెట్రో రైల్ వాస్తవిక రూపంలో వస్తుందన్నారు. మానవ అభివృద్ధి లో ఆరోగ్యం కీలకమైందని, విజయవాడ ఐటీ పార్కులో 8 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిపారు.

అద్భుత రాజధాని..
నగదు రహిత డిజిటల్ లావాదేవీలను ప్రోత్సాహిస్తామని, వచ్చే రెండేళ్లలో పది లక్షల గృహాలు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 974 కి.మీటర్ల తీర ప్రాంతంలో ఓడరేవు ఆధారిత అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖ ఎయిర్ పోర్టుల్లో రద్దీ పరంగా అత్యధిక వృద్ధి సాధించిందన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పేదలు, అణగారిన వర్గాలకు ఆశ్రయమివ్వనున్నట్లు, గతంలో జరిగిన అవినీతి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న గృహాలకు జియో ట్యాగింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో ఎదురైన సమస్యలను అధిగమించడం జరిగిందని, 2029 నాటికి దేశంలో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ ఆవిర్భావం చెందిందన్నారు. అమరావతి ప్రపంచంలోనే అద్భుత రాజధాని అని కొనియాడారు. ఏపీ రాజధానిలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయలు కల్పించడం జరుగుతుందన్నారు.  

గవర్నర్ స్పీచ్ కోసం వీడియో క్లిక్ చేయండి.

ఏపీ అసెంబ్లీ..గవర్నర్ ప్రసంగం హైలెట్స్ 6..

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించారు.

ఏపీ అసెంబ్లీ..గవర్నర్ ప్రసంగం హైలెట్స్ 5..

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించారు.

  • విద్యార్థుల్లో నైపుణ్యత పెంపొందించడానికి కృషి చేయడం జరుగుతోందన్నారు.
  • ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే విజ్ఞాన రాష్ట్రంగా చేయాలన్నదే తమ లక్ష్యమని, 104వ సైన్స్ కాంగ్రెస్ తిరుపతిలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.
  • పాఠశాలలో డిజిటల్ తరగతులు, బయోమెట్రిక్ హాజరు అమలు చేసినట్లు తెలిపారు.
  • బడి మానేసే పిల్లల సంఖ్య తగ్గించేందుకు సైకిళ్లను పంపిణీ చేయడం జరుగుతుందని, నిరుద్యోగులకు ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

ఏపీ అసెంబ్లీ..గవర్నర్ ప్రసంగం హైలెట్స్ 4..

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించారు.

ఏపీ అసెంబ్లీ..గవర్నర్ ప్రసంగం హైలెట్స్ 3

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించారు.

గవర్నర్ ప్రసంగం హైలెట్స్ 1

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించారు. 2017-18 బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ శాసనసభ నాలుగో సంయుక్త సమావేశాల్లో ప్రసంగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అతి స్వల్పకాలంలో నిర్మించిన నూతన అసెంబ్లీ భవనాల్లో మొదటిసారిగా జరుగుతున్న సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.

సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయి - గవర్నర్..

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించారు. 2017-18 బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ శాసనసభ నాలుగో సంయుక్త సమావేశాల్లో ప్రసంగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అతి స్వల్పకాలంలో నిర్మించిన నూతన అసెంబ్లీ భవనాల్లో మొదటిసారిగా జరుగుతున్న సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.

అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్..సీఎం బాబు..

విజయవాడ : నూతనంగా నిర్మాణం అయిన ఏపీ అసెంబ్లీకి ఉభయ రాష్ట్రాల గవర్నర్, సీఎం చంద్రబాబు నాయుడులు చేరుకున్నారు. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.

అసెంబ్లీకి వచ్చిన రోజా..

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా నూతన అసెంబ్లీకి చేరుకున్నారు. ఏడాది సస్పెన్షన్ అనంతరం రోజా సభ వద్దకు వచ్చారు. జగన్ కు అనుకూలంగా వైసీపీ నినాదాలు..ప్రతిగా టిడిపి నేతలు నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

అసెంబ్లీకి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

విజయవాడ : వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో పాటు జగన్ కూడా ఉన్నారు. ఆర్ అండ్ బి అతిథి గృహంలో వైసీపీఎల్పీ సమావేశం జరిగింది. అనంతరం అసెంబ్లీకి బస్సులో బయలుదేరారు.

రోజా అంశంపై రేపు మాట్లాడుతా - అనిత..

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా అంశంపై తాను రేపు మాట్లాడడం జరుగుతుందని టిడిపి ఎమ్మెల్యే అనిత పేర్కొన్నారు. టెన్ టివితో ఆమె మాట్లాడారు. మంచి పండుగ వాతావరణంలో అయిపోయిన విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తారని ఎదురు ప్రశ్నించారు.

అసెంబ్లీకి చేరుకున్న బాబు..లోకేష్..

విజయవాడ : ఏపీ అసెంబ్లీ ప్రాంగణానికి సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేరుకున్నారు. అంతకంటే ముందు వెంకటాయపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఇరువురూ నివాళులర్పించారు.

10:41 - March 6, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీ, శాసనసమండలి సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐజీ సంజయ్ టెన్ టివితో మాట్లాడారు. చారిత్రాత్మకమైన సెషన్ అని, తగినంత పోలీసు ఫోర్స్ ఇవ్వడం జరిగిందన్నారు. సుమారు రెండు వేల మంది పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు, మీడియా..లాబీలు..ఇతర ప్రాంతాల్లో పోలీసు ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించడం జరిగిందని, స్పీకర్ ఆదేశాల మేరకు పోలీసులు నడుస్తారని పేర్కొన్నారు. అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన పలు గేట్ల గుండా ఎవరెవరు రావాలో నిర్ణయించినట్లు..అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సభ రూల్స్..సబాధిపతి ఆదేశాల ప్రకారం..లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు.

10:34 - March 6, 2017

యూపీలో రోడ్డు ప్రమాదం..

ఉత్తర్ ప్రదేశ్ : జాతీయ రహదారి 2 పై రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటక బస్సు ఓ ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 20 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.

వెంకటయ్యపాలెంలో బాబు..

విజయవాడ : వెంకటాయపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరితో పాటు మంత్రులు..ఎమ్మెల్యేలున్నారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరారు.

10:26 - March 6, 2017

విజయవాడ : ప్రజా సమస్యలే ప్రధాన ఏజెండాగా తీసుకోవాలని వైసీపీఎల్పీ నిర్ణయం తీసుకుంది. నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆర్ అండ్ బి అతిథి గృహంలో వైసీపీఎల్పీ సమావేశం జరిగింది. జగన్ అధ్యక్షతనలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం..ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం పేర్కొన్న ఎన్నికల హామీలు పూర్తి కాలేదని, మరికొన్ని హామీలు అసంతృప్తిగానే చేస్తున్నారని పేర్కొంటూ తీర్మానం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు..వ్యవసాయ రంగం..నిరుద్యోగ సమస్య..ప్రాజెక్టుల పనితీరు..అవినీతిపై సభలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ బస్సులో అసెంబ్లీకి బయలుదేరారు. ఉండవల్లి, పెనుబాక ప్రాంతాల మీదుగా బస్సు వెళ్లనుంది. ఆయా మార్గాల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి జగన్ నివాళులు అర్పిస్తూ అసెంబ్లీకి వెళ్లనున్నారు.

10:18 - March 6, 2017

లోకేష్ పార్టీకి కృషి చేస్తున్నారు - బాలకృష్ణ..

విజయవాడ : నారా లోకేష్ మొదటి నుండి పార్టీ కోసం కృషి చేయడం జరుగుతోందని, ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన్ను కేబినెట్ లో తీసుకుంటారో తనకు తెలియదన్నారు. చలనచిత్ర పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వంతో చర్చిస్తామని పేర్కొన్నారు.

10:15 - March 6, 2017

విజయవాడ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కు ఎమ్మెల్సీ గా నామినేటెడ్ చేయడం పట్ల సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. నేటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన వెలగపూడికి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా జరగని రీతిలో తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం జరిగిందని, భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. లోకేష్ మొదటి నుండి పార్టీ కోసం కృషి చేయడం జరుగుతోందని, ఆయన్ను కేబినెట్ లో తీసుకుంటారో తనకు తెలియదన్నారు. చలనచిత్ర పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వంతో చర్చిస్తామని, ప్రజా సమస్యలు పరిష్కరించుకొనే ఒక వేదిక అని, అధికార పక్షం, ప్రతిపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.

బస్సులో బయలుదేరిన జగన్..

విజయవాడ : తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వైసీపీ అధ్యక్షుడు జగన్ అసెంబ్లీకి బస్సులో బయలుదేరారు. అంతకంటే ముందు ఆర్ అండ్ బి అతిథి గృహంలో వైసీపీఎల్పీ సమావేశం జరిగింది.

09:59 - March 6, 2017

విజయవాడ : మంచి ఆశయాలు..మంచి సిద్ధాంతాలు..తాత గారి అడుగుజాడలు..తండ్రి గారి నడవడికలో నారా లోకేష్ మంచి ఆశయాలతో ముందుకొస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. ఏపీ అసెంబ్లీ ప్రారంభం సందర్భంగా వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించనున్నారు. ఆయనతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ కూడా నివాళులర్పించనున్నారు. నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్సీ నామినేషన్ వేయడానికి లోకేష్ నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు..ఎమ్మెల్యేలు..నేతలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో టెన్ టివితో ప్రత్తిపాటి మాట్లాడారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ అందరి మన్ననలు పొందారని, రాష్ట్ర ప్రజల ఆశయాలు నెరవేర్చేందుకు ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారనే నమ్మకం తమలో...ప్రజల్లో నెలకొందన్నారు. మంత్రివర్గంలో కూడా లోకేష్ రావాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.

బస్సులో బయలుదేరిన జగన్..

విజయవాడ : తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వైసీపీ అధ్యక్షుడు జగన్ అసెంబ్లీకి బస్సులో బయలుదేరారు. అంతకంటే ముందు ఆర్ అండ్ బి అతిథి గృహంలో వైసీపీఎల్పీ సమావేశం జరిగింది.

09:46 - March 6, 2017

ముగిసిన వైసీపీఎల్పీ సమావేశం..

విజయవాడ : కాసేపటి క్రితం వైసీపీఎల్పీ ముగిసింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశాలు నెల రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేయాలని నిర్ణయించారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా అంశంపై స్పీకర్ కు నివేదిక అందినట్లు..దీనిపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

కాసేపట్లో లోకేష్ నామినేషన్..

గుంటూరు : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కాసేపట్లో ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. వెలగపూడిలోని అసెంబ్లీలో నామినేషన్ పత్రాలను అందచేయనున్నారు. వెంకటాపురంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన అసెంబ్లీకి వెళ్లనున్నారు.

09:26 - March 6, 2017

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజాను చూసి తాము భయపడమని, మతిస్థిమితం లేని వ్యక్తి అని ప్రభుత్వ విప్ యామిని బాల పేర్కొన్నారు. ఈ రోజు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతేగాకుండా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వెంకటాపురంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం అసెంబ్లీకి వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా వెంకటరాపురంలో సందడి నెలకొంది. యువ నేతలు..ఇతరులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో విప్ యామిని బాల మాట్లాడారు. నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు యోచిస్తున్నారని, అందులో భాగంగా ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేయడం జరుగుతోందని ప్రభుత్వ విప్ యామిని బాల పేర్కొన్నారు. యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించడంలో భాగంగా లోకేష్ అభ్యర్థిగా ఖరారు చేశారన్నారు. స్పీకర్..మంత్రులు..ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు ఎవరూ మరిచిపోవడం లేదని, చట్టం తనపని తాను చేసుకవెళుతుందన్నారు.

09:14 - March 6, 2017

విజయవాడ : అమరావతిలో నేటి నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సొంత రాష్ట్రంలో సమావేశాలు జరుగుతుండడంతో ఏపీ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అధికార..ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అననున్నాయి. ఉదయం 11.06 నిమిషాలకు సభలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభంలో సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సొంత రాష్ట్రంలో నిర్వహించుకోవాలనే ఉద్ధేశ్యంతో లక్ష ఎకరాల్లో తాత్కాలిక అసెంబ్లీని ఏర్పాటు చేశారు. 15 అంశాలను అధికార పక్షం..28 అంశాలతో వైసీపీ అజెండాలను తయారు చేసినట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. దీనితో సభను రేపటి వరకు వాయిదా వేసే అవకాశం ఉంది. 13వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

వైసీపీఎల్పీ సమావేశం..
ఇదిలా ఉంటే బడ్జెట్ సందర్భంగా సభలో ఎలాంటి వ్యూహం అనుసరించాల్సిన దానిపై వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే వెలగపూడికి చేరుకున్న జగన్..పార్టీ ఎమ్మెల్యేలు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యారు. జగన్ అధ్యక్షతన వైసీపీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ప్రజా సమస్యలపై గళం విప్పాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కరవు..వ్యవసాయ రంగంలో లో నెలకొన్న సంక్షోభం..నిరుద్యోగ సమస్య..నీటి ప్రాజెక్టులు..నియోజకవర్గాల వారీగా ప్రధాన సమస్యలపై మాట్లాడాలని వైసీపీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సభలో చర్చిస్తామని ఓ ఎమ్మెల్యే టెన్ టివికి తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ లో భూ ప్రకంపనాలు..

జమ్మూ కాశ్మీర్ : నార్త్ వెస్ట్రన్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో సోమవారం ఉదయం భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 4.8గా నమోదైంది.

08:50 - March 6, 2017
08:50 - March 6, 2017
08:48 - March 6, 2017

దక్షిణాది అగ్ర కథానాయకల్లో 'కాజల్' ఒకరు. తన అభినయం..అందం..నటనతో అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్..ఇతర వుడ్ లలో అగ్ర హీరోల సరసన నటిస్తోంది. మూడు పదుల వయస్సు దాటుతున్నా ఇంకా పెళ్లి చేసుకోని ఈ ముద్దుగుమ్మపై ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే 'కాజల్' పెళ్లి పీటలెక్కనుందని టాక్. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో కొంతకాలంగా ఈ అమ్ముడు ప్రేమాయణం సాగిస్తోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. అతడినే వివాహం చేసుకోవాలని 'కాజల్' నిర్ణయించుకోవడం..కుటుంబసభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ వివాహం చేసుకోవడానికి కొంత సమయం కావాలని 'కాజల్' భావిస్తున్నారని, దీనికి కుటుంసభ్యులు అంగీకరించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మూడు పదుల వయసు దాటడంతో పెళ్లికి ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దని ఆమె కుటుంబ సభ్యులు తొందరపెడుతున్నారట. దీనితో తాను ఒప్పుకున్న సినిమాలన్నింటినీ పూర్తి చేసి పెళ్లికి సిద్ధం కావాలని 'కాజల్' నిర్ణయించుకున్నట్లు టాక్. మెగాస్టార్ 'చిరంజీవి' తో 'ఖైదీ నెంబర్ 150’ సినిమాలో 'కాజల్' నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'రాజు నేనే మంత్రి' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ పెళ్లి వార్తలు నిజమైనా ? కాదా ? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

08:47 - March 6, 2017

టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకరైన 'వెంకటేష్' విభిన్నమైన కథలు ఎంచుకుంటూ అభిమానులు సొంతం చేసుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'గురు' షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన 'గురు' ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్ గా 'వెంకటేష్' నటిస్తున్నారు. సుధకొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘రితికా సింగ్' మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే ఈ చిత్రం కోసం 'వెంకటేష్' తొలిసారిగా పాట పాడడం విశేషం. ఇప్పటికే పలువురు అగ్ర కథానాయకులు అడపాదడపా పాటలు పాడుతున్న సంగతి తెలిసిందే. హిందీ సినిమా 'సాలా ఖడూస్' ని రీమెక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మార్పులు లేకుండా తమిళ మాతృకనే తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయనున్నారు.

నేడు వైసీపీ శాసనసభాపక్షం సమావేశం..

విజయవాడ : తొలి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. విజయవాడలో పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో అజెండాను ఖరారు చేయనున్నారు.

08:46 - March 6, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తన తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. డాలీ (కిషోర్ కుమార్ పార్ధసాని) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవలే 'కాటమరాయుడు' పోస్టర్స్ విడుదలయ్యాయి. తాజాగా 'మిరా..మిరా మీసం మెలి తిప్పుతాడు' అంటూ ఓ సాంగ్ ను యూ ట్యూబ్ లో విడుదల చేశారు. రికార్డు స్థాయిలీఓ హిట్స్ పొందుతోంది. ప్రస్తుతం ఓ పాట కోసం చిత్ర యూనిట్ ఇటలీకి వెళ్లింది. అక్కడ అందమైన లోకేషన్ లలో శృతి హాసన్..పవన్ కళ్యాణ్ లపై ఓ పాటను చిత్రీకరించనున్నారు. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి మార్చి 24వ తేదీన చిత్రం విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

08:45 - March 6, 2017

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈసారి సరికొత్త చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలవబోతున్నాయి. నేటి నుంచి జరిగే ఏపీ బడ్జెట్‌ సమావేశాలు..ఇకపై స్వరాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించుకున్న సరికొత్త భవనంలో తొలిసారిగా జరుగబోతున్నాయి. సొంత రాష్ట్రంలో జరుగుతోన్న తొలి సమావేశాలు కావడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. మరొక వైపు నగదుపై పలు బ్యాంకులు ఆంక్షలు విధించడం..ఈ అంశాలపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో మధు(సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి), ఆనంద్ రావు (టిడిపి), గౌతమ్ రెడ్డి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో చూడండి.

06:45 - March 6, 2017

విద్యార్థులకు పదో తరగతి అత్యంత కీలకం. పబ్లిక్ ఎగ్జామ్ ను మొదటిసారిగా రాసేది పదో తరగతిలోనే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది రోజుల్లో పదో తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. తెలంగాణలో మార్చి 14 నుంచి, ఆంధ్రప్రదేశ్ లో మార్చి 17 నుంచి టెంత్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. రెండు వారాల పాటు నెలాఖరు దాకా పరీక్షలు కొనసాగుతాయి. పరీక్షల నిర్వహణలో ఈ సారి మరింత కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. పరీక్షలకు కొద్ది రోజుల సమయమే మిగిలి వుంది. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఈ కొద్ది రోజులు పాటించాల్సిన నియమాలేమిటి? పదో తరగతి రాస్తున్న విద్యార్థులకు ఇంట్లో అమ్మానాన్నలు అందించాల్సిన సహకారం ఏమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అయోధ్య పలు సలహాలు..సూచనలు అందించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

06:41 - March 6, 2017

విశాఖపట్టణం : ఇద్దరు కేంద్ర మంత్రులు.. ఐదుగురు రాష్ట్ర మంత్రులు.. ముగ్గురు ఎంపీలు.. వీరేకాక పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు. ఏంటా ఈ లెక్కంతా అనుకుంటున్నారా ? పీడీఎఫ్ కంచుకోట అయిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో పాగా వేసేందుకు అధికార బీజేపీ, టీడీపీ కూటమి మోహరింపు. తమ పాలనను ప్రశ్నించేవారు చట్టసభలలో ఉండకూడదని అధికార పక్షం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఉత్తరాంధ్రలో కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పట్టు సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ మద్దతుతో తప్ప ఎప్పుడూ స్వతంత్రంగా గెలవని కాషాయం నేతలు.. ఎలాగైనా పట్టభద్రుల నియోజకవర్గంలో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో విశాఖ-1 నుంచి ఎంపీగా కంభంపాటి హరిబాబు, విశాఖ ఉత్తరంలో ఎమ్మెల్యేగా విష్ణుకుమార్‌రాజు పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వైజాగ్‌పై దృష్టి సారించడంతో తమ బలం పెరిగిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో మాజీ ఎంపీ పీవీ చలపతిరావు కుమారుడు పీవీ మాధవ్‌ను అభ్యర్థిగా బరిలోకి నిలిపింది.

2007, 2011 ఎన్నికల్లో విడివిడిగా
గతంలో 2007, 2011 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన టీడీపీ, బీజేపీలు కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు. ఆ రెండు ఎన్నికల్లోనూ పీడీఎఫ్ అభ్యర్థి ఎంవీవీఎస్ శర్మనే విజయం సాధించారు. అంతేకాకుండా.. శర్మ ఇతర పీడీఎఫ్‌ సభ్యులతో కలిసి అనేక అంశాలపై మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. రెండున్నర సంవత్సరాలలో అనేకసార్లు తన గళం లేవనెత్తారు. అయితే..ప్రస్తుతం ఆయన పోటీ చేయకున్నా.. కార్మికనేతగా, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ అజాశర్మ పోటీకి దిగారు. ప్రజాసమస్యలపై పీడీఎఫ్‌ వారసత్వాన్ని కొనసాగిస్తానని అజాశర్మ స్పష్టం చేస్తున్నారు.

టీడీపీ-బీజేపీలు వ్యూహాలు..
మరోవైపు తమ అభ్యర్థి గెలుపు కోసం టీడీపీ-బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇరు పార్టీలకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావులు ఏకంగా విశాఖలోనే మకాం వేసి మంత్రాంగం నడుపుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతలు కళా వెంకట్రావు, అశోక్‌గజపతిరాజు, అచ్చెన్నాయుడు మాదవ్‌ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇక కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా రంగంలోకి దిగి.. రెండున్నరేళ్లుగా తమ ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

సీపీఎం విమర్శలు..
అభివృద్ధిపై వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలను సీపీఎం నేతలు విమర్శిస్తున్నారు. విశాఖకు రైల్వేజోన్‌ ఇవ్వకుండా ఉత్తరాంధ్ర ద్రోహం చేసింది బీజేపీ కాదా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నర్సింగరావు అంటున్నారు. విశాఖ అంటే అభిమానమని వెంకయ్యనాయుడు ఉత్తుత్తి మాటలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారంటున్నారు. మరోవైపు పీడీఎఫ్‌ అభ్యర్థి అజాశర్మకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. దీంతో టీడీపీ, బీజేపీలు తమ అభ్యర్థి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ.. అవకాశం ఉన్న ప్రతి ఒక్క నేతను ప్రచారంలోకి దింపుతున్నారు. మరి అధికార పార్టీ నేతల శ్రమ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.

06:38 - March 6, 2017

చిత్తూరు : అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే టీటీడీ శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తోంది. అయితే.. ఇకపై భక్తులు కూడా ఇందులో పాలుపంచుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. టీటీడీకి అయ్యే వ్యయాన్ని భరిస్తే.. వారి పేరును అన్నదానం చేసే కొత్త పథకాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. తిరుమల కలియుగ వేంకటేశ్వరుడు కొలువుదీరిన స్థలం. ఇక్కడకు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ ఉచితంగా అన్నదానం చేస్తోంది. తరిగొండ అన్నప్రసాద వితరణ కేంద్రంలోనే కాకుండా.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లు, ఇంకా చాలా ప్రాంతాల్లో అన్నదానం, అల్పాహారాలు అందజేస్తోంది. అయితే.. ఈ కార్యక్రమాన్ని భక్తులు స్వామివారికి సమర్పించిన విరాళాలతో కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు అన్నదానం ట్రస్ట్‌కు భక్తులు సమర్పించిన విరాళాలు 800 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. వీటిపై వచ్చే వడ్డీతో ఈ కార్యక్రమం చేస్తున్నారు.

85 కోట్లు..
ప్రతి యేటా అన్నప్రసాద నిర్వహణకు 85 కోట్లు వ్యయం అవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. విరాళాలపై వచ్చిన వడ్డీ 65 కోట్లు మాత్రమే వస్తుండడంతో.. టీటీడీ నిధుల నుంచి 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. విరాళాలు వెయ్యి కోట్లకు చేరుకుంటే.. ఈ భారం తప్పనుంది. ఇది తీరేందుకు మరో రెండేళ్లు పట్టే సమయం ఉంది. దీంతో టీటీడీ కొత్త ఆలోచన చేస్తోంది. పెళ్లి రోజులు, పుట్టిన రోజులు జరుపుకునే వారు తిరుమలకు విచ్చేసే భక్తులకు అన్నదానం చేసే గొప్ప అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఒక్కో భక్తునికి 25 రూపాయల చొప్పున చెల్లిస్తే.. టీటీడీ వారి పేరు మీద అన్నదానం చేయనుంది. ఈ కార్యక్రమానికి వెయ్యి మందికి తగ్గకుండా.. అన్నదానం చేయాల్సి ఉంటుంది. స్వామివారి ప్రాంగణంలో ఇలాంటి గొప్ప అవకాశం కల్పించినందుకు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ చేసే గొప్ప కార్యంలో అవకాశం కల్పించినందుకు టీటీడీకి భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

06:36 - March 6, 2017

హైదరాబాద్ : సామాజిక న్యాయం కోసం సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్రకు మద్దతుగా హైదరాబాద్‌ బాలాజీనగర్‌ డివిజన్ సభ్యులు రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ డివిజన్‌ కన్వీనర్‌ కృష్ణనాయక్‌, హైదరాబాద్ జిల్లా నాయకులు సంజీవరావు ఇతర నాయకులు పాల్గొన్నారు. పొలికేక పేరుతో ఈనెల 19న నిజాం కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సంజీవరావు కోరారు.

 

06:33 - March 6, 2017

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం శరవేగంగా కొనసాగుతుండడంతో.. విజయవాడ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. నగరంలోని రోడ్లపై నీళ్లు నిలవకుండా డ్రైనేజీలు మరమ్మతులు చేసేందుకు సిద్ధమయ్యారు. 461 కోట్ల నిధులతో నగర రోడ్లను సుందరంగా తీర్చేదిద్దేందుకు నగర పాలక సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. విజయవాడ రూపురేఖలు మార్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీళ్లు నిలిచి చెరువుల్లా మారే అవస్థలను దూరం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 461 కోట్ల రూపాయలతో రోడ్లను సరికొత్త హంగులతో నిర్మించేందుకు నగర పాలక సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులు మార్పులు, చేర్పులపై చర్చిస్తున్నారు.

59 డివిజన్లు..
బెజవాడలోని 59 డివిజన్ల పరిధిలో 302 కిలోమీటర్ల మేర మైనర్‌, 142 కిలోమీటర్ల మేర మేజర్‌ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టనున్నారు.డిజైన్‌, పర్యవేక్షణ బాధ్యతలను పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ పర్యవేక్షించనుంది. నగరాన్ని కృష్ణా బేసిన్‌, బందరు కెనాల్‌ బేసిన్‌, రైవస్‌ కెనాల్‌ బేసిన్‌, ఏలూరు కెనాల్‌ బేసిన్‌, బుడమేరు డ్రెయిన్‌ ఉత్తరం, బుడమేరు డ్రెయిన్‌ దక్షిణం, కృష్ణా డ్రెయినేజి బేసిన్‌ అంటూ ఏడు బేసినట్లు విభజించి నిర్మాణాలు చేపట్టనున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల బెజవాడ అభివృద్ది చెందకుండా పోయిందని ఎంపీ కేశినేని అన్నారు. 460 కోట్ల రూపాయలతో నగరంలోని రోడ్లపై నీళ్లు నిలవకుండా ఏర్పాటు చేస్తున్నామని... పనులు ఎల్‌అండ్‌టీకి అప్పగించినట్లు తెలిపారు. త్వరలోనే పనులను ప్రారంభించి రెండేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. విజయవాడను గ్లోబల్‌ సిటీగా మార్చడమే తమ లక్ష్యమంటున్నారు కేశినేని. నగరంలో వందేళ్ల వర్షపాతాన్ని పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ వీరపాండ్యన్‌ తెలిపారు. పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొత్తానికి చిన్నపాటి వర్షంతో ఇబ్బందులు పడే నగరవాసులకు కొత్త ప్రాజెక్ట్‌తో ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. అయితే ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

06:29 - March 6, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈసారి సరికొత్త చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలవబోతున్నాయి. నేటి నుంచి జరిగే ఏపీ బడ్జెట్‌ సమావేశాలు..ఇకపై స్వరాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించుకున్న సరికొత్త భవనంలో తొలిసారిగా జరుగబోతున్నాయి. సొంత రాష్ట్రంలో జరుగుతోన్న తొలి సమావేశాలు కావడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించుకున్న సరికొత్త భవనంలో,.ఏపీ అసెంబ్లీ తొలిసారిగా భేటీ కాబోతోంది. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం.. సోమవారం ఉదయం 11గంటల 6 నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సొంత రాష్ట్రంలో జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో అధికారులు అన్ని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. అసెంబ్లీకి ఎవరు ఎటువైపు నుంచి వెళ్లాలో ఇప్పటికే రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు. అసెంబ్లీ పరిసరాలు కొత్త కావడంతో, సమావేశాలకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అధికారులు రెండు ప్రధాన మార్గాలను సిద్ధం చేశారు. విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా అసెంబ్లీకి వచ్చే మార్గం ఇందులో ఒకటి. ఈ మార్గం వెంబడే సీఎం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. కరకట్ట, వెంకటపాలెం చెక్‌పోస్ట్‌, మందడం, మల్కాపురం జంక్షన్‌ మీదుగా సీఎం చంద్రబాబు అసెంబ్లీకి చేరుకుంటారు.

రూట్ మ్యాప్..
ఇక అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం పోలీసులు వేరే రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఉండవల్లి నుంచి మంగళగిరి మీదుగా కృష్ణాయపాలెం దగ్గర బై పాస్ రహదారిపై వీరంతా అసెంబ్లీకి రానున్నారు. అలాగే కృష్ణాయపాలెం మీదుగా వచ్చే నేతలు గేట్‌ నెంబర్‌ 3ద్వారా అసెంబ్లీలోకి చేరుకోవచ్చు. ఆ పక్కనే ఏర్పాటుచేసిన స్థలంలో వాహనాలు పార్క్‌ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే మందడం ప్రధాన సెంటర్‌ మీదుగా మల్కాపురం జంక్షన్‌ మీదుగావెళ్లే ప్రధాన మార్గం ఇరుకుగా ఉంది.. ఈ దారి 29 గ్రామాలను కలిపేదారి కావడంతో అవస్థలు తప్పేలా లేవు. రహదారుల భద్రతతోపాటు..అసెంబ్లీ దగ్గర పార్కింగ్‌ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. గేట్ నెంబర్ 1 ద్వారా సిఎం, స్పీకర్, మండలి చైర్మన్‌ల కాన్వాయ్‌లను మాత్రమే అనుమతిస్తారు.. గేట్ నెంబర్ 2 ద్వారా మంత్రులు, ప్రతిపక్ష నేత కాన్వాయ్‌కు ప్రవేశం ఉంటుంది. అక్కడే పార్కింగ్ సదుపాయం కూడా కల్పించబోతున్నారు. ఇక గేట్ నెంబర్ 4 ద్వారా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వెళ్లాల్సి ఉంటుంది. గేట్ నెంబర్ 3 ద్వారా మీడియా ప్రతినిధులు, వీఐపీ పాస్ ఉన్నవారితోపాటు..సందర్శకులను అసెంబ్లీలోకి పంపుతారు..గేట్ నెంబర్ 5 ద్వారా ఐఏయస్ అధికారులు, అసెంబ్లీ సిబ్బందికి ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రంలో తొలిఅసెంబ్లీ సమావేశాలు కావడంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు..అన్ని మార్గాలకు సబంధించి రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసిపెట్టుకున్నారు.. ఎలాంటి ఇబ్బందివచ్చినా వెంటనే పరిష్కరించేలా ముందే ప్లాన్‌ చేసుకున్నారు.
అయితే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఉభయ సభలనుద్దేశించి ప్రసగించనున్న గవర్నర్ నరసింహన్‌..ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఏపీ బడ్జెట్‌ సమావేశాలు హాట్‌ హాట్‌గానే సాగే సూచనలు కన్పిస్తున్నాయి. వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ వ్యవహారం, కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం, ప్రత్యేక హోదా వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నాయి.

నేడు కింగ్ పిషర్ ఎయిర్ లైన్స్ ఆస్తుల వేలం..

ముంబై : నేడు కింగ్ పిషర్ ఎయిర్ లైన్స్ ఆస్తులు వేలం జరగనుంది. ముంబైలోని కింగ్ పిషర్ హౌస్, గోవాలోని కింగ్ పిషర్ విల్లాలను వేలం వేయనున్నారు. విజయ్ మాల్యా రుణాలు చెల్లించడం లేదని ఆస్తులను వేలం వేయనున్నారు.

నేటి నుండి ఏపీ అసెంబ్లీ..

విజయవాడ : ఉదయం 11.06 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం బీఏసీ సమావేశం జరగనుంది.

వేమన వర్సిటీలో సాంబారులో బల్లులు..

కడప : యోగి వేమన యూనివర్సిటీ హాస్టల్ లో సాంబారులో బల్లులు ప్రత్యక్షమయ్యాయి. అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

విజయవాడ : ఎమ్మెల్యే కోటా కింద టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. బచ్చుల అర్జునుడు (కృష్ణా), డొక్కా మాణిక్యవరప్రసాద్ (గుంటూరు), కరణం బలరాం (ప్రకాశం), పోతుల సునీత (ప్రకాశం), నారా లోకేష్ (చిత్తూరు), పోలీసు హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఛైర్మన్ గా నాగుల్ మీరాను నియమితులు చేశారు. ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

నేడు టిడిపి నేత, పీఎస్ టీస్ అధ్యక్షుడు మురళి అంత్యక్రియలు..

కృష్ణా : నేడు చాట్రాయి మండలం జనార్ధన్ వరంలో టిడిపి నేత, పీఎస్ టీస్ అధ్యక్షుడు మురళి అంత్యక్రియలు జరగనున్నాయి.

నామినేషన్ వేయనున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు..

హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Don't Miss