Activities calendar

07 March 2017

21:30 - March 7, 2017

నెల్లూరు: తూర్పు-రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం అక్రమాలకు పాల్పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. మంత్రి నారాయణ కనుసన్నల్లోనే జిల్లా రెవెన్యూ యంత్రాంగం నడుస్తోందని ఆయన ఆరోపించారు. దాదాపు 2033 బోగస్‌ ఓటర్లను మంత్రి నారాయణ చేర్పించారని... అంతేకాకుండా నారాయణ విద్యాసంస్థల కార్యాలయాన్ని కలెక్టర్‌ కార్యాలయాలుగా మార్చేశారని మధు ఆరోపించారు. టిడిపి అభ్యర్ధి పట్టాభిరామిరెడ్డి ఉద్యోగాల పేరుతో అవినీతికి పాల్పడ్డారని..అలాంటి వ్యక్తికి ఓట్లు వేయోద్ధని పట్టభద్ర ఓటర్లను మధు కోరారు.

21:28 - March 7, 2017

నెల్లూరు :తూర్పు-రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్టాభిరామిరెడ్డిపై ఆరోపణలు మిన్నంటుతున్నాయి. జెన్‌కోలో ఉద్యోగాలు పేరిట ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి వారిని మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుద్యోగ బాధితులతో పట్టాభిరామిరెడ్డి మాట్లాడిన ఆడియో టేపులను సీపీఎం నేతలు విడుదల చేశారు. ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా పెద్దల సభకు ఎలా పంపుతారంటూ పట్టభద్ర ఓటర్లను సీపీఎం నేతలు ప్రశ్నించారు.

తుందుర్రులో పోలీసుల నిర్బంధం...

పశ్చిమ గోదావరి : తుందుర్రులో మళ్ళీ ఆక్వా ఫుడ్ పార్కు వ్యతిరేక జ్వాలలు ఎగసిపడుతున్నాయి. రేపు ఆక్వా ఫుడ్ పార్క్ ముట్టడికి పోరాట సమితి పిలుపునివ్వడంతో.. పోలీసుల నిర్బంధపర్వం అలజడి రేపుతోంది. తనిఖీలు చేస్తూ గ్రామస్తులను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ ఆరేటి వాసుని అరెస్ట్ చేసిన పోలీసులు..సిపిఎం నేతల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

21:22 - March 7, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసేసరికి పోటీలో ఎవరూ లేకపోవడంతో ఇరు రాష్ట్రాల్లో అభ్యర్థులు దాదాపు ఏకగ్రీవమయ్యారు. తెలంగాణలో మూడు స్థానాల‌కు అధికార పార్టీ ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపింది. విప‌క్ష పార్టీల‌కు త‌గిన సంఖ్యాబ‌లం లేక‌పోవ‌డంతో మండ‌లి ఎన్నికల‌కు దూరంగా ఉన్నాయి. గంగాధ‌ర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి,గ్రేట‌ర్ హైద‌రాబాద్ టిఆర్ ఎస్ అధ్యక్షుడు మైనంప‌ల్లి మంగళవారం నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. అయితే పోటీలో ఎవరూ లేకపోవడంతో ఈ ముగ్గురు ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల పరిశీలన అనంతరం వీరి ఏకగ్రీవం ఖరారు కానుంది. శాస‌న‌మండ‌లి స్థానాలకు ఏకగ్రీవం కావడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలోనూ ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం...

ఏపీలోనూ ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసేసరికి మొత్తం 7 దరఖాస్తులే రావడంతో ఇక ఎన్నిక నిర్వహణ లేనట్లయ్యింది. బుధవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఏకగ్రీవం ఖరారు కానుంది. ఈ నామినేషన్ల దాఖలులో చివరినిమిషంలో హైడ్రామా నడిచింది. నిన్న వైసీపీ తరపున డమ్మీ అభ్యర్ధిగా గంగుల సతీమణి ఇందిరారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. దీనికి పోటీగా టీడీపీ కూడా మరో డమ్మీ నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధపడింది. చివరి నిమిషంలో ఇందిరారెడ్డి తన నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో టీడీపీ ఆ ఆలోచనను విరమించుకుంది. టీడీపీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌, బత్తుల అర్జునుడు, కరణం బలరాం, పోతుల సునీత, డొక్కా మాణిక్యవరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖ‌లు చేశారు. ఈనెల 9వ తేదీ ఉపసంహరణ గడువు ముగిశాక వీరిని ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు.

ఠాకూర్ గంజ్ లో ఏటీఎస్ కొనసాగుతున్న ఆపరేషన్

లక్నో: ఠాకూర్ గంజ్ లో ఏటీఎస్ ఆపరేషన్ కొనసాగుతోంది. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఓ ఇంట్లో దిగి వున్న ఐఎస్ఐ ఉగ్రవాదిని పట్టుకునేందుకు యత్నిస్తున్నామని ఏటీఎస్ ఐజీ తెలిపారు. ఉగ్రవాది సైఫుల్లా ఉన్న ఇంటిని ఏటీఎస్ అధికారులు చుట్టుముట్టారు. ఉగ్రవాది వద్ద భారీగా మారణాయుధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఉ్రగవాదిని లొంగిపోవాలని కోరుతున్నట్లు ఏటీఎస్ ఐజీ తెలిపారు.

ఎమ్మెల్యే కాసాని గోవర్థన్ కు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్: వైసీపీ ఎమ్మెల్యే కాసాని గోవర్థన్ కు హైకోర్టులో చుక్కెదురయ్యింది.. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన కేసులో కాసాని పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.

ఎమ్మెల్యే కాసాని గోవర్థన్ కు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్: వైసీపీ ఎమ్మెల్యే కాసాని గోవర్థన్ కు హైకోర్టులో చుక్కెదురయ్యింది.. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన కేసులో కాసాని పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.

ఏపీడిప్యూటీ సీఎం కుమారుడిపై కేసు.. విచారణ

హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప కుమారుడు శ్యామ్ బాబు హంద్రీనీవాలో ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

20:40 - March 7, 2017

స్వాతంత్ర ఫలాలు అందుకున్నామని సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టి ఏడు దశాబ్దాలు గడుస్తున్నాయి. మహిళల కోసం అనేక చట్టాలు చేశామని ప్రభుత్వాలు పదే పదే వల్లె వేస్తున్నాయి. మహిళా సంక్షేమమే తమ ఎజెండా అని ప్రతి పార్టీ నినదిస్తోంది. కానీ ఆచరణలో మాత్రం ఆ నిబద్ధత శూన్యం అని పదే పదే రుజువు అవుతోంది. మహిళల హక్కులే మానవ హక్కులని తీర్మానాలు నినదిస్తున్నాయ్. మహిళలు, పిల్లల మీద జరుగుతున్న హింసను ప్రతిఘటిద్దామంటోంది ఐక్యరాజ్య సమితి. అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం మహిళల హక్కూ అని ఘోషిస్తున్నాయి అంతర్జాతీయ సదస్సులు. పితృస్వామ్య కుటుంబాలు కూల్చండి... ప్రజాస్వామ్య కుటుంబాలు నిర్మించండి అని డిక్లరేషన్లు చేశారు. కానీ వాస్తవంలో ఏం జరుగుతోంది? మహిళల సమానత్వం సిద్ధించేదెప్పుడు? ఇదే అంశంపై నేటి వైడాంగిల్ విశ్లేషణ. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

పురుగుమందు తాగి 3గురు వీఏవోల ఆత్మహత్యాయత్నం

కరీంనగర్: చొప్పదండి మండలం వెదురుగట్టులో పురుగుల మందు తాగి ముగ్గురు వీఏవోల ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. సర్పంచ్, మహిళా సంఘాల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేదని దుర్భాషలాడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.

20:14 - March 7, 2017
20:12 - March 7, 2017

హైదరాబాద్: మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...ముందుగాలే చెబుతున్నమ్ మరిచిపోయేరని, ఆంధ్రా అసెంబ్లీలో మైకుల మీద మాటా-మంతి...ఘరం, ఘరం ఉండే సభలో నవ్వుల పూలు, కాల్వల దిగి పోరాటం చేసిన కామ్రేడ్ లు.. సెల్పీ దిగి ఏమైందని రంగన్న రగడ, రేవంత్ బొమ్మను నడి బజార్ల ఉరి... సచ్చిన పీనుగ క్షమాపణకు డిమాండ్, తల్లిని అనాధాశ్రమంలో వేసిన కొడుకులు...తండ్రిని కాపాడుకుంటున్న ఆడబిడ్డ, పోలీసు పోస్టుకు వన్నె తెచ్చిన ఎస్సై.....కాల్వల దుంకి కాపాడి సాహసం ఇలాంటి అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మన ముందుకు వచ్చారు. మరి మల్లన్న ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

7 రోజుల సీఐడీ కస్టడీ కి సస్మితా ఘోష్

జల్‌పాయ్‌గురి: పిల్లల అక్రమ రవాణా కేసులో అరెస్టైన శిశు సంరక్షణాధికారిణి (సీడీపీవో) సస్మితా ఘోష్ కి కోర్టు ఏడు రోజుల సీఐడీ కస్టడీని విధించింది. సస్మితా ఘోష్ ఇవాళ కోర్టు ఎదుట హాజరవగా..కోర్టు ఆమెకు కస్టడీని విధించింది. పిల్లల అక్రమ రవాణా కేసులో పశ్చిమబెంగాల్ పోలీసులు నిన్న సస్మితా ఘోష్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

 
 

 

అత్యాచారం కేసులో నిందితునికి జీవిత ఖైదు

కర్నూలు: మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుడు పఠాన్ ఖాజాకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. రూ.2లక్షల 20వేల జరిమానా విధించారు.

పోలీసులకు పట్టుబడ్డ టీడీపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి బచ్చల పుల్లయ్య

అనంతపురం: సప్తగిరి సర్కిల్ లోని బాలాజీ లాడ్జ్ లో ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డారు. టీడీపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి బచ్చల పుల్లయ్య అనుచరుల వద్ద రూ.3లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

18:52 - March 7, 2017

అమరావతి: ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడించింది. పడికట్టు పదాలతో ప్రభుత్వం.. గొప్పలు చెప్పుకుంటోందని జగన్‌ ఆరోపించారు. జాతీయ సగటు కన్నా ఏపీ వృద్ధి రేటు ఎక్కువని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాత్కాలిక రాజధాని, అసెంబ్లీ అంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆర్దికమంత్రి యనమల మండిపడ్డారు. అసెంబ్లీ టెంపరరీ కాదని, వైసీపీయే టెంపరరీ అని ఎద్దేవా చేశారు. వృద్ధిరేటుపై జగన్‌ చేసిన విమర్శలనూ ఆయన తిప్పికొట్టారు.

అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య మాటల తూటాలు....

ఏపీ అసెంబ్లీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పరస్పరం విరుచుకుపడ్డారు. ఎస్టీ, ఎస్టీలకు 50 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ పథకంపై సభలో వాడీవేడీ చర్చ జరిగింది. 50 యూనిట్లు వాడిన ఎస్సీ, ఎస్టీల నుంచి ప్రభుత్వం బిల్లు వసూలు చేస్తోందని వైసీపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు ఎస్సీ, ఎస్టీలకు 50యూనిట్లలోపు విద్యుత్‌ను ఉచితంగానే అందిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అమలుకాకపోతే ఆ వివరాలు ఇవ్వాలని సభ్యులను కోరారు.

ఎస్సీ,ఎస్టీలకు ఉచిత విద్యుత్ అమలు ఎక్కడ?..

ఎస్సీ,ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఎక్కడా అమలు కావడం లేదని జగన్‌ ఆరోపించారు. ఉచిత విద్యుత్ అంటూ ఎస్సీ, ఎస్టీలకు ముష్టి వేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్‌ చేశారు. దీంతో ముష్టి అనే పదాన్ని వెనక్కి తీసుకుని జగన్ సభకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే అనిత డిమాండ్ చేసింది.

గాలేరు-నగరి ప్రాజెక్టుపై .....

ఆ తర్వాత గాలేరు-నగరి ప్రాజెక్టుపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్‌ హయాంలోనే గాలేరు నగరి ప్రాజెక్ట్‌ 80 శాతం పూర్తైందని వైసీపీ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. తెలుగుదేశం మూడేళ్ల కాలంలో మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చుచేసి పులివెందులకు నీళ్లు ఇచ్చామని చెప్పాడాన్ని ప్రతిపక్ష నేత జగన్‌ తప్పుపట్టారు. దీనిపై దేవినేని ఉమ వివరణ ఇచ్చారు.

వాస్తవ పరిస్థితికి, ప్రభుత్వం చెప్పేదానికి పొంతన ఉందా?

రాష్ట్రంలో వాస్తవ పరిస్థితికి, ప్రభుత్వం చెప్పేదానికి పొంతన ఉందా అని జగన్‌ ప్రశ్నించారు. రాజధాని నగరాలు ఉన్న పొరుగు రాష్ట్రాల్లో వృద్ధి రేటు 8శాతం లోపేనని, రాజధాని పూర్తి స్థాయిలో నిర్మితం కాని మనకు 11శాతం వృద్ధిరేటు సాధ్యమా అని జగన్ ప్రశ్నించారు. ఆక్వా రంగంలో వృద్ధి సాధించామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, గత ఏడాదితో పోల్చితే చేపలు, రొయ్యల ఎగుమతి ధర తగ్గిందని జగన్ చెప్పారు. వృద్ధిరేటు ఎక్కువచేసి చూపడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లేని అభివృద్ధిని చూపిస్తే కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ముందుకు వస్తుందా అని ప్రశ్నించారు.

జగన్‌ గ్రోత్‌ రేట్‌పై మాట్లాడుతుండగా జలీల్‌ఖాన్‌ అడ్డు.....

ఇక జగన్‌ గ్రోత్‌ రేట్‌పై మాట్లాడుతుండగా జలీల్‌ఖాన్‌ అడ్డుతగిలారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన జగన్‌... బీకామ్‌లో ఫిజిక్స్‌ చదివిన వారికి తన లెక్కలు అర్ధంకావంటూ చమత్కరించారు. జగన్‌ కామెంట్‌పై స్పందించిన మంత్రి యనమల....స్కూల్‌, కాలేజీలకు వెళ్లకుండానే జగన్‌ ఎకనామిక్స్‌ మాట్లాడుతున్నారని కౌంటర్‌ ఇచ్చారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.

జగన్ పై పల్లె విమర్శలు...

జగన్‌ తనకిష్టమొచ్చినట్లుగా, ఏమీ తెలియకుండా సభలో మాట్లాడుతున్నారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో 320 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, రూ.4,67,575 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని, 9,55,296 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత జగన్‌ ప్రసంగిస్తుండగానే సమయం అయిపోయిందంటూ సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు.

18:48 - March 7, 2017

అమరావతి: ఏపీ శాసనమండలి సమావేశాల్లో రెండొవ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సీ రామచంద్రయ్య వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రసంగం చేస్తున్న రామచంద్రయ్యను మంత్రి పల్లె రాఘునాథ్‌రెడ్డి అడ్డుకున్నారు. రాష్ట్రానికి వచ్చిన ఎంవోయూలు, పెట్టుబడులపై చర్చించే సమయంలో మంత్రి అడ్డుకున్నారంటూ రామచంద్రయ్య ఆరోపించారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:46 - March 7, 2017

గన్నవరం : విజయవాడ నుంచి చెన్నై బయలుదేరిన ట్రూజెట్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. నెల్లూరు దగ్గరకు వెళ్లిన తర్వాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి గన్నవరం విమానాశ్రయంకు చేరుకుంది. విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విమానంలో పొగలు రావడంతో ప్యాసెంజర్స్‌ ఆందోళన చెందారు. సాంకేతిక సమస్య తలెత్తిన సమయంలో విమానంలో మొత్తం 49మంది ప్రయాణికులు ఉన్నారు.

18:44 - March 7, 2017

కృష్ణాజిల్లా: జి.కొండూరు మండలంలో అక్రమంగా పెట్టిన ఇటుక బట్టీలకు వ్యతిరేకంగా స్థానికులు కదం తొక్కారు. బట్టీల యజమానులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనలు అతిక్రమించడంపై నిలదీశారు. బట్టీలను తొలగించాలని హెచ్చరించారు. అయితే యజమానుల మాత్రం మౌనం వహించారు. ఇక్కడ అక్రమ బట్టీలు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయని.. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో 200 ఇటుక బట్టీలు.....

మండలంలో మొత్తం రెండు వందల ఇటుక బట్టీలున్నాయి. ఈ బట్టీల వల్ల ఆయా గ్రామాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. కాలుష్యం బారిన పడి విలవిల్లాడుతున్నారు. బట్టీలు నుంచి వెలువడే బూడిద కారణంగా పంటల దిగుబడి తగ్గిపోతుందని..ఇటుకలు కాల్చే పొగను పీల్చడంతో కాలుష్యం బారిన పడి శ్వాస కోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. రహదారులన్నీ బూడిదమయంగా మారుతున్నాయని.. పొగ వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామ చెరువుల నుంచి పెద్దఎత్తున మట్టిని తరలిస్తున్నారని చెబుతున్నారు. అలాగే బొగ్గు, బూడిద, కలప రవాణా చేస్తున్నారని, విద్యుత్‌ను సైతం అక్రమంగా వాడుకుంటున్నారని గ్రామస్తులు చెప్పారు. బట్టీల యాజమానులు మాఫీయాగా మారి గ్రామాలను నాశనం చేస్తున్నారని వాపోయారు. మండలంలోని కవులూరు, వెలగలేరు, వెల్లటూరు, కుంటముక్కల, చిన నందిగామ వరకు విస్తరించిన ఈ ఇటుక బట్టీలను తక్షణం తొలగించేలా చర్యలు తీసుకోవాలని.. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.

18:42 - March 7, 2017

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం శరవేగంగా కొనసాగుతుండడంతో.. విజయవాడ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. నగరంలోని రోడ్లపై నీళ్లు నిలవకుండా డ్రైనేజీలు మరమ్మతులు చేసేందుకు సిద్ధమయ్యారు. 461 కోట్ల నిధులతో నగర రోడ్లను సుందరంగా తీర్చేదిద్దేందుకు నగర పాలక సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది

461 కోట్ల రూపాయలతో రోడ్లను సరికొత్త హంగులతో ,,,

విజయవాడ రూపురేఖలు మార్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీళ్లు నిలిచి చెరువుల్లా మారే అవస్థలను దూరం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 461 కోట్ల రూపాయలతో రోడ్లను సరికొత్త హంగులతో నిర్మించేందుకు నగర పాలక సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులు మార్పులు, చేర్పులపై చర్చిస్తున్నారు.

బెజవాడలోని 59 డివిజన్ల పరిధిలో 302 కిలోమీటర్ల మేర...

బెజవాడలోని 59 డివిజన్ల పరిధిలో 302 కిలోమీటర్ల మేర మైనర్‌, 142 కిలోమీటర్ల మేర మేజర్‌ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టనున్నారు.డిజైన్‌, పర్యవేక్షణ బాధ్యతలను పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ పర్యవేక్షించనుంది. నగరాన్ని కృష్ణా బేసిన్‌, బందరు కెనాల్‌ బేసిన్‌, రైవస్‌ కెనాల్‌ బేసిన్‌, ఏలూరు కెనాల్‌ బేసిన్‌, బుడమేరు డ్రెయిన్‌ ఉత్తరం, బుడమేరు డ్రెయిన్‌ దక్షిణం, కృష్ణా డ్రెయినేజి బేసిన్‌ అంటూ ఏడు బేసినట్లు విభజించి నిర్మాణాలు చేపట్టనున్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ...

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల బెజవాడ అభివృద్ది చెందకుండా పోయిందని ఎంపీ కేశినేని అన్నారు. 460 కోట్ల రూపాయలతో నగరంలోని రోడ్లపై నీళ్లు నిలవకుండా ఏర్పాటు చేస్తున్నామని... పనులు ఎల్‌అండ్‌టీకి అప్పగించినట్లు తెలిపారు. త్వరలోనే పనులను ప్రారంభించి రెండేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. విజయవాడను గ్లోబల్‌ సిటీగా మార్చడమే తమ లక్ష్యమంటున్నారు కేశినేని. నగరంలో వందేళ్ల వర్షపాతాన్ని పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ వీరపాండ్యన్‌ తెలిపారు. పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొత్తానికి చిన్నపాటి వర్షంతో ఇబ్బందులు పడే నగరవాసులకు కొత్త ప్రాజెక్ట్‌తో ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. అయితే ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

కన్నతల్లి, భార్యపై కత్తితో దాడిచేసి... తానూ

గుంటూరు: కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో దారుణం జరిగింది. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లి, భార్యపై అంజిబాబు అనే వ్యక్తి కత్తితోదాడి చేశాడు. తల్లి, భార్యకు తీవ్రగాయాలు అవ్వడంతో బాపట్ల ఆస్పత్రికి తరలించారు. అనంతరం అంజిబాబు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భద్రాద్రి ఆలయంలో ఉద్యోగుల సస్పెన్షన్

భద్రాచలం: శ్రీసీతారామ చంద్ర స్వామి వారి ఆలయంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఈవో సాలూరి రమేష్‌బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉప ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు, ముఖ్య అర్చకులు శేష గోపాలాచార్యులు, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ కిషోర్‌లను సస్పెండ్‌ చేశారు.

వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పై తీవ్ర ఆరోపణలు

తిరుపతి: తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జన్ కోలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆరుగురి నుంచి రూ.6లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలతో సీపీఎం నేత కందారపు మురళి ఆడియో టేపులను విడుదల చేశారు.

చలో బస్ భవన్ యథాతదం: అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్: ఆర్టీసి అధికారులతో టీఎంయూ చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందాలను ఉల్లంఘించినందున రేపు తలపెట్టిన చలో బస్ భవన్ కార్యక్రమం యథాతంగా జరుగుతుందని, అన్ని డిపోల నుంచి కార్మికులు వేలాదిగా తరలి రావాలని టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు.

చలో బస్ భవన్ యథాతదం: అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్: ఆర్టీసి అధికారులతో టీఎంయూ చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందాలను ఉల్లంఘించినందున రేపు తలపెట్టిన చలో బస్ భవన్ కార్యక్రమం యథాతంగా జరుగుతుందని, అన్ని డిపోల నుంచి కార్మికులు వేలాదిగా తరలి రావాలని టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు.

రోజాకు మళ్లీ శిక్ష చేస్తే న్యాయపోరాటం చేస్తా:జగన్

విజయవాడ: ఎమ్మెల్యే రోజా వ్యవహరంపై వైసీపీ అధినేత స్పందించారు. ఆడపడుచుని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఒక విషయమై శిక్ష అనుభవించాక కూడా మళ్లీ శిక్ష విధించడం సరికాదన్నారు. రోజాకు మళ్లీ శిక్ష చేస్తే న్యాయపోరాటం చేస్తానని జగన్ హెచ్చరించారు.

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం

హైదరాబాద్: తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడడంతో..మామిడిపంటకు భారీగా నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు యాదాద్రి జిల్లా కొండమడుగు, బొమ్మలరామారంలో వడగాళ్ల వానకు పెద్ద ఎత్తున మామిడి పంట నష్టపోయింది. కరీంనగర్‌, సిరిసిల్ల, యాదాద్రి, మేడ్చల్‌లో జోరుగా వడగళ్లవాన కురిసింది. అటు వేములవాడలోనూ కురిసిన వడగళ్ల వానకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో మైనంపల్లి హన్మంత్‌రావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. నామినేషన్లు దాఖలకు ముందు గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులు నివాళులర్పించారు.

17:42 - March 7, 2017

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో మైనంపల్లి హన్మంత్‌రావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. నామినేషన్లు దాఖలకు ముందు గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులు నివాళులర్పించారు.

17:41 - March 7, 2017

హైదరాబాద్: ప్రైవేట్‌ స్కూళ్లో ఫీజుల నియంత్రణ కోసం కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు టీజేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి యాత్రలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి త్వరలో తేదీలు ప్రకటించనున్నారు. అలాగే బడ్జెట్‌ను అధ్యయనం చేసి బలహీన వర్గాలకు కేటాయించిన నిధుల తరలింపును వెలుగులోకి తేవాలని తీర్మానించారు. అలాగే ఉద్యమాలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని జేఏసీ నిర్ణయించుకుంది.

17:39 - March 7, 2017
17:37 - March 7, 2017

హైదరాబాద్: తెలంగాణలో రహదార్ల నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. పెండింగ్‌లో ఉన్న రహదారుల నిర్మాణాలను వేగవంతం చేయడంతోపాటు... 1500 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఇందులో డ్రైపోర్ట్‌ల నిర్మాణంతోపాటు హైదరాబాద్‌కు రెండో రింగ్‌ రోడ్డు నిర్మాణాలు ఉన్నాయి. ఇందుకోసం కేంద్రం నుంచి నిధులు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది టీ సర్కార్‌.

5399 కి.మీ మేర జాతీయ రహదారులను గుర్తించిన కేంద్రం....

ప్రస్తుతం తెలంగాణలో 5399 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను కేంద్రం గుర్తించింది. వాటిలో 2786 కిలోమీటర్ల నూతన హైవేల నిర్మాణాలకు రాష్ట్రం ప్రతిపాదనలు పంపగా... ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనల్లో ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక నుంచి.... ఏటూరు నాగారం మీదుగా కాలేశ్వరం, చెన్నూరు, కౌటాల, సిర్పూర్‌ వరకు 396 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం జరుపనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ పరిసర జిల్లాలను కలుపుతూ రెండో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలని కూడా తెలంగాణ సర్కార్‌ ప్రతిపాదనలు పంపింది. సంగారెడ్డి, నర్సాపూర్‌, తూఫ్రాన్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌, ఇబ్రహీంపట్నం, ఆమన్‌గల్‌, షాద్‌నగర్‌ను కలుపుతూ 338 కిలోమీటర్ల మేర బాహ్యవలయ రహదారి నిర్మాణం జరుపనుంది. జాతీయ రహదార్ల ప్రమాణాలతో ఈ రింగ్‌రోడ్డును నిర్మించేందుకు కేంద్రం కూడా సన్నద్దత తెలిపింది.

1500 కి.మీ రోడ్స్‌ను నేషనల్‌ హైవేగా గుర్తించాలని ప్రతిపాదనలు ....

రాష్ట్రంలో 1500 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇవేకాకుండా ప్రమాదాల నివారణకు, ప్రణాళికాబద్దమైన రవాణా కోసం.... నగరాలకు బైపాస్‌ సదుపాయం కల్పించాలని కోరింది. జాతీయ రహదారుల అనుసంధానమయ్యే సూర్యాపేట ఖమ్మం, కోదాడతోపాటు వరంగల్‌ టూ హైదరాబాద్‌ హైవేలో తక్షణం బైపాస్‌లు ఏర్పాటు చేయాలని విన్నవించింది.

డ్రైపోర్ట్‌ల నిర్మాణంతోపాటు...

డ్రైపోర్ట్‌ల నిర్మాణంతోపాటు... గోదావరినది వెంబడి నిర్మించ తలపెట్టిన సారపాక, సిర్పూర్‌ రహదార్లపైనా సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ పనులకు సంబంధించిన డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను సక్రమంగా మెయింటెన్‌ చెయ్యడంతోపాటు అనునిత్యం కేంద్రంతో మానిటరింగ్‌ చేసుకుంటూ అధిక నిధులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తిచేసి రహదార్ల సాంద్రతలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

17:34 - March 7, 2017

హైదరాబాద్: ఎండాకాలం వచ్చిందంటే హైదరాబాద్ నగరవాసులకు తాగునీటి కష్టాలు తప్పవు. అయితే ఈ సారి మాత్రం తాగునీటి కష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు హైదరాబాద్ జలమండలి సంస్థ పక్కా ప్లాన్ రూపొందించామని చెబుతోంది.

గతేడాది 352 మిలియన్ గ్యాలన్ల తాగునీరు సరఫరా ...

గ‌తేడాది రోజుకు 352 మిలియ‌న్ గ్యాల‌న్ల తాగునీరు స‌ర‌ఫ‌రా అయితే ఈ సారి ఇప్పటికే 372 మిలియ‌న్ గ్యాల‌న్ల తాగునీరు స‌ర‌ఫ‌రా అయిందని.. ప్రస్తుతం నగర అవసరాల కోసం 602 మిలియ‌న్ గ్యాల‌న్ల తాగునీరు అందుబాటులో ఉందని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు.

సమ్మర్‌లో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌....

ఇక‌ స‌మ్మర్‌లో ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించామ‌ని.. ఇందుకోసం 5.81కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. బోర్డు ప‌రిధిలో ఉన్న 900వాట‌ర్ ట్యాంక‌ర్లలో 338 ట్యాంక‌ర్లను నీటి ప్రాబ్లమ్ ఉండే ప్రాంతాల‌కు ప్రతిరోజు 1500 ట్రిప్పులు పంపిణి చేసేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. తాగు నీటిక‌ష్టాలు ఉత్పన్నం కాకుండా 45మంది స్పెష‌ల్ అధికారులను నియ‌మించామని చెప్పారు.

రూ. 1900 కోట్ల హడ్కో రుణంతో చేపట్టిన పనుల్లో పురోగతి.....

శివారు ప్రాంతాలకు తాగు నీటిని అందించ‌డం కోసం 1900కోట్ల రూపాయల హడ్కో రుణంతో చేప‌ట్టిన ప‌నుల్లో పురోగతి ఉందన్నారు. 2600 కిలోమీట‌ర్ల ప‌నుల్లో ఇప్పటి వ‌ర‌కు 908 కిలో మీట‌ర్ల మేర పైపులైన్ ప‌నులు పూర్తి చేశామ‌న్నారు. ఆయా ప్రాంతాల్లో 10వేల న‌ల్లా క‌నెక్షన్‌లకు నూత‌నంగా ఏర్పాటు చేసిన లైన్ ద్వారా నీరు అందిస్తామన్నారు. ఇప్పటి వ‌ర‌కు 19రిజ‌ర్వాయ‌ర్లు పూర్తయ్యాయ‌ని, ఏప్రిల్ నాటికి మ‌రో 15 పూర్తి చేస్తామ‌న్నారు. ప్రతిసారి ఎండాకాలం ముందు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ అధికారులు చెప్పడం మామూలేనని.. ఈసారైనా ఇబ్బందులు లేకుండా చూస్తారో లేదో చూడాలని నగరవాసులు కోరుతున్నారు.

17:32 - March 7, 2017

సిద్ధిపేట : వచ్చేనెల చివరివరకు నాలుగోవిడత రుణమాఫీ పూర్తిచేస్తామన్నారు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు. సాదాబైనామ కార్యక్రమం ద్వారా రైతులకు పైసా ఖర్చు లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో.. రామసముద్రం చెరువు కట్టను మినీ ట్యాంక్‌ బండ్‌గా ఏర్పాటు చేస్తున్న పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో 500మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు.

17:30 - March 7, 2017

హైదరాబాద్: కమ్యూనిస్టులపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేస్తున్న చవకబారు విమర్శలను మానుకోవాలన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సీపీఎం సభ జరగకుండా... కేరళ సీఎంను అడ్డుకుంటామన్నా బీజేపీ నేతల వ్యాఖ్యలను నారాయణ ఖండించారు. ఎలా అడ్డుకుంటారో మేమూ చూస్తామని బీజేపీ నేతలను హెచ్చరించారు.

17:28 - March 7, 2017

హైదరాబాద్: తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడడంతో..మామిడిపంటకు భారీగా నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు యాదాద్రి జిల్లా కొండమడుగు, బొమ్మలరామారంలో వడగాళ్ల వానకు పెద్ద ఎత్తున మామిడి పంట నష్టపోయింది. కరీంనగర్‌, సిరిసిల్ల, యాదాద్రి, మేడ్చల్‌లో జోరుగా వడగళ్లవాన కురిసింది. అటు వేములవాడలోనూ కురిసిన వడగళ్ల వానకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

17:27 - March 7, 2017

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ, దీనిపై మరోసారి ఉద్యమించాలని తెలంగాణ కాంగ్రెస్‌ నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసేందుకు పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని తలపెట్టింది.

టెండర్లలో అవినీతి, అవకతవకలు...

సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే జలదృశ్యం పేరుతో దృశ్యశ్రవణ రూపకాన్ని ప్రదర్శించారు. పార్టీ తరుపున న్యాయపోరాటం చేస్తున్నారు. తాజాగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ల మార్పు, టెండర్లలో అవినీతి, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మరోసారి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఐతో నేతలతోపాటు, వివిధ ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలోని లోపాలను ఎత్తిచూపారు.

గుత్తేదారులకు దోచిపెట్టి, కమీషన్లు దండుకునేందుకే...

గుత్తేదారులకు దోచిపెట్టి, కమీషన్లు దండుకునేందుకే ప్రాజెక్టుల రీడిజైన్‌ చేస్తున్నారని వివిధ పక్షాల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ విషయంలో 50 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నది టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపణ.

రూ. 25 వేల కోట్లతో పాత ప్రాజెక్టులు పూర్తై ఉండేవి ....

గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభించిన పాత ప్రాజెక్టులను పక్కనపెట్టి, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిని నేతలు తప్పుపట్టారు. పాతికవేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పాత ప్రాజెక్టులన్నీ పూర్తై ఉండేవన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యక్తం చేశారు. ఇరవై నుంచి ముప్పై శాతం పూర్తైన ప్రాజెక్టులకు పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన కేసీఆర్‌ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ఈ రెండున్నరేళ్లలో వీటిని పూర్తి చేసి ఉంటే ఇప్పటికే లక్షలాది ఎకరాలకు సాగునీరు వచ్చేదన్న విషయాన్ని ప్రస్తావించారు. పాత ప్రాజెక్టులను పూర్తి చేస్తే గత ప్రభుత్వాలకు పేరు వస్తుందన్న దుర్బుద్ధితోనే కొత్త ప్రాజెక్టులు చేపడుతూ కమీషన్లు దండుకుంటున్నారని డీకే అరుణ ఆరోపించారు.

పంటకాల్వలు నిర్మించకుండా ప్రాజెక్టులు చేపడితే ఉపయోగం ఏంటి?

పంటకాల్వలు నిర్మించకుండా ప్రాజెక్టులు చేపడితే ఉపయోగం ఉండదన్న విషయాన్ని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రస్తావించారు. డిజైన్ల మార్పులో వేల కోట్లు దండుకుంటున్న ముఖ్యమంత్రి , నీటిపారుదల శాఖ మంత్రి జైలుకు వెళ్లక దప్పదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సాగునీటి పథకాల పునరాకృతి గురించి ప్రస్తావించని కేసీఆర్‌, అధికారంలోకి వచ్చిన తర్వాత రీ డిజైనింగ్‌ చేయడంలోని ఆంతర్యం అవినీతే ప్రధాన కారణమన్నది తెలంగాణ తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపణ. పారదర్శకతలేని పాలమూరు-రంగారెడ్డి ఎత్తపోతల పథకం టెంటర్లను రద్దు చేసి, ఈ మొత్తం వ్యవహారంపై శ్వేతపత్రం ప్రకటించాలని వివిధ పార్టీల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఠాకూర్ గంజ్ లో ఓ ఇంట్లో ఐసిస్ ఉగ్రవాది

లక్నో: ఠాకూర్ గంజ్ లో ఓ ఇంట్లో ఐసిస్ ఉగ్రవాది దాగివున్నాడు. ఉగ్రవాది ఉన్న ఇంటిని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాది సైఫుల్లాను బయటకు రప్పించేందుకు ఇంట్లోకి బాష్పవాయువును ఉగ్రవాద నిరోధక దళాలు పంపాయి.

16:30 - March 7, 2017

హైదరాబాద్: అమెరికాలో భారతీయుల పట్ల విద్వేషం తారాస్థాయికి చేరింది. భారతీయులకు చెందిన ఓ విద్వేష వీడియో, కొన్ని ఫొటోలు కలవరపెడుతున్నాయి. ఓహియో రాష్ట్రం కొలంబస్ నగరంలోని ఒక పార్కులో భారతీయ కుటుంబాలు ఆనందంగా గడుపుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఓ అమెరికన్‌ రహస్యంగా చిత్రీకరించిన ఈ దృశ్యాలను వలసదారుల వ్యతిరేక వెబ్‌సైట్‌ ' సేవ్ అమెరికన్ ఐటీ జాబ్స్‌ ఆర్గ్‌'లో పోస్ట్‌చేశాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. కొలంబస్ శివారు ప్రాంతానికి స్వాగతం.. ఇండియన్ పార్క్‌లోకి వెళదాం రండి.. అనే పేరుతో ఈ వీడియోను పోస్ట్‌చేశారు. అమెరికన్ల ఉద్యోగాలను ఎత్తికెళ్లిపోతూ...భారత కుటుంబాలు ఎంత సుసంపన్నంగా ఉన్నాయో చూడండని వీడియో కింద రాసిన వ్యాఖ్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వెబ్‌సైట్‌ను వర్జీనియాకు చెందిన స్టీవ్ పుషర్ అనే 66 ఏళ్ల మాజీ కంప్యూటర్ ప్రోగ్రామర్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ విదేశీయుల సంఖ్యను చూస్తే మతి పోతోందని పుషర్‌ అన్నారు. ఇక్కడ ఉన్నవారందరూ భారతీయులే.. వీళ్లంతా అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని విద్వేషాన్ని వెళ్లగక్కారు. అమెరికాలోని పశ్చిమ-మధ్య ప్రాంతాలను భారతీయులు ఆక్రమించారని మినీ ముంబైని తలపిస్తున్నాయని పేర్కొన్నారు. స్టీవ్ పుషర్ ఈ వీడియోను గత ఏడాది ఆగస్టులోనే తీశారు. అమెరికాలో భారతీయులను వెనక్కి వెళ్లిపోవాలని తాను భావించట్లేదని చెప్పారు. భారత ఐటి దిగ్గజ సంస్థలను మాఫియాగా పేర్కొన్న పుషర్- అమెరికా ఐటీ కార్మికులకు హాని చేస్తున్నాయని ఆరోపించారు. ఈ వీడియో భయభ్రాంతులకు గురిచేసేదిగానే ఉందని న్యూయార్క్‌కు చెందిన ఫాగ్‌క్రీక్ అనే సంస్థకు సీఈవోగా ఉన్న భారతీయుడు అనిల్ దాష్ చెప్పారు.

16:28 - March 7, 2017

తెలంగాణలో బీడీ కార్మికులు జీవితాలు మారలేదు. జీవనభృతి విషయంలో ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఒకరికిచ్చి, మరొకరికి ఇవ్వకుండా, ఇంట్లో ఒకరికుంది కాబట్టి మరొకరికి ఇవ్వనంటూ కుటుంబ సభ్యుల మధ్య అత్తా కోడళ్ల మధ్య గొడవలకు కారణమవుతోంది ప్రభుత్వం. సిపిఎం నిర్వహించిన పాదయాత్రలో ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముందు బీడీ కార్మికులు వెళ్లబోసుకున్న గోడు వీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దంపడుతోంది. బీడీ కార్మికులకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలేమిటి? వాటి అమలు తీరు ఎలా వుంది? బీడీ కార్మికుల కోసం సిపిఎం సాగిస్తున్న పోరాటాలేమిటి? ఇదే ఇవాళ్టి స్పెషల్‌ ఫోకస్‌.

గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీడీ రంగం ...

బీడీ కార్మికుల జీవితాలు రోజురోజుకీ దుర్భరంగా మారుతున్నాయి. పొద్దస్తమానం కష్టపడ్డా ఫలితం ఉండడం లేదు. తెలంగాణలో చేనేత తర్వాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న బీడీ రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తమ జీవితాల్లో మార్పు రాలేదన్న ఆవేదన బీడీ కార్మికుల్లో వ్యక్తమవుతోంది

తెలంగాణలో 8 లక్షల మంది.....

తెలంగాణలో వ్యవసాయం, చేనేత తర్వాత అత్యధిక శాతం మందికి ఉపాధి చూపిస్తోంది బీడీ పరిశ్రమ. తెలంగాణలో 8 లక్షల కుటుంబాలకు ఇది జీవనాధారం. పేదోడి సిగరెట్‌ గా పేరొందిన బీడీ ప్రభుత్వానికి భారీ ఆదాయమే సమకూర్చి పెడుతోంది. గల్ఫ్‌ దేశాల్లో మంచి క్రేజ్ సంపాదించిన మన బీడీలు విదేశీ మారకద్రవ్యమూ ఆర్జించి పెడుతున్నాయి. సెస్‌ రూపంలో ప్రభుత్వాలకు భారీగానే ఆదాయం వస్తోంది.

జబ్బులు తప్ప మరేమీ మిగలడం లేదు....

బీడీలు చుట్టేవారికి జబ్బులు తప్ప మరేమీ మిగలడం లేదు. తలనొప్పి, మెడనొప్పి, భుజం నొప్పి, వెన్నునొప్పి, నడుమునొప్పి, కాళ్ల నొప్పి, టీబీ, కేన్సర్, గర్భకోశ వ్యాధి, శ్వాసకోశ వ్యాధి, ఆస్తమా, జలుబు, దగ్గు, గ్యాస్‌ట్రబుల్‌, నీరసం, నిస్సత్తువ, మలబద్దకం, చికెన్‌ పాక్స్‌, రక్తహీనత, చూపు మందగించడం... ఇలాంటి సవాలక్ష అనారోగ్యాలే వీరు కూడబెట్టుకుంటున్న ఆస్తులు. అయిదారేళ్ల పాటు బీడీలు చుట్టినవారి శరీరమంతా జబ్బుల పుట్టగా మారిపోతుంది.

రోజుకింత చొప్పున ఆరోగ్యాన్ని కుళ్లబొడుచుకోవడమే. ...

బీడీలు చుట్టడమంటే రోజుకింత చొప్పున ఆరోగ్యాన్ని కుళ్లబొడుచుకోవడమే. ఉదయం లేచినదగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా బీడీలు చుట్టడం తప్ప మరే వ్యాపకం వుండదు వీరికి. రోజుకి 12 నుంచి 16 గంటలు శ్రమిస్తే తప్ప ఇల్లు గడవదు. కార్ఖానాలలో పనిచేసేవారికంటే ఇళ్లలో బీడీలు చుట్టేవారే ఎక్కువ. గాలీ వెలుతురు సోకని ఒకే ఒక్క గదిలో కాపురం చేసే కుటుంబాలెన్నో.

బీడీ పరిశ్రమలో 80శాతం మందికి పైగా స్త్రీలే...

బీడీ పరిశ్రమలో 80శాతం మందికి పైగా స్త్రీలే. పాతిక శాతం మంది పిల్లలే. మూడో ఏడు రాగానే అక్షరాభ్యాసం చేసే అదృష్టం బీడీ కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు వుండదు. అంత చిన్న వయస్సులోనే అమ్మకో, అక్కకో బీడీలు చుట్టే సహాయకులుగా వీరు మారిపోతారు. అయిదారేళ్లు రాకముందే కార్ఖానాలో బందీలవుతారు. పనికి ఆలస్యంగా వెళ్లినా, కార్ఖానాలో పక్క పిల్లలతో మాట్లాడినా, టార్గెట్‌ పూర్తిచేయకపోయినా దెబ్బలు తప్పవు. ఇదీ బీడీ కార్మిక కుటుంబాల్లోని బాలల దైన్యం. బీడీలు చుట్టే చాలామంది తల్లులకు తొలికాన్పు గర్భశోకమే మిగిలిస్తుంది. ఎవరింట్లోనైనా తొలి బిడ్డ బతికితే పూర్వజన్మ సుకృతంగా కళ్లకు అద్దుకుంటారు. తమకు పుట్టే శిశువుల బరువు అతి తక్కువగా వుండడం మరో శాపం.

కడుపు నిండా దుఃఖాన్ని నింపుకుని...

ఇన్ని బాధల మధ్య, కడుపు నిండా దుఃఖాన్ని నింపుకుని, రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా వీరికి నెలకు నికరంగా వచ్చే ఆదాయం 1500ల రూపాయలకు మించదు. ఒక్కొక్కరు రోజుకి 800 నుంచి వెయ్యి బీడీలు మాత్రమే చుట్టగలరు. అందుకు వీరికి దక్కే కూలీ వంద రూపాయలు దాటితే అది మహాభాగ్యం. వీరి సంపాదనలో సగం డబ్బులు మాయదారీ రోగాలు, మందు గోళీలే మింగేస్తాయి. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న వీరికి కనీసం ఐడీ కార్డులివ్వడానికి కూడా ప్రభుత్వాలకు మనసొప్పడం లేదు. ఐడీ కార్డులు లేకపోతే, బీడీ కార్మికులకు దక్కాల్సిన సంక్షేమ పథకాలు, వైద్య ఆరోగ్య సేవలు వీరికి అందడం లేదు.

2,70,633 మంది బీడీ కార్మికులు......

నిజామాబాద్ జిల్లా బీడీ కార్మికులకు పెట్టింది పేరు. ఈ జిల్లాలో బీడీ పరిశ్రమలో మహిళల సంఖ్య ఎక్కువ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2,70,633 మంది బీడీ కార్మికులున్నారు. వీరికి ప్రతి నెలా 1000 రూపాయల చొప్పున జీవన భృతి చెల్లిస్తామన్నది టిఆర్ఎస్ ఎన్నికల వాగ్ధానం. కానీ, కేవలం 1,14,208 మందికి మాత్రమే జీవన భృతి అందుతోంది. వీరిలో 35వేలమందికి రకరకాల వంకలు పెట్టి జీవనభృతి నిలిపివేశారు. ఈ లెక్కన జీవన భృతి పొందుతున్నవారి సంఖ్య 80వేలకు మించడం లేదు.

జీవన భృతి పొందుతున్నవారికంటే, పొందలేకపోతున్నవారి సంఖ్యే అధికంగా వుంది.

ఆ నిబంధన బీడీ కార్మికుల పాలిట శాపంగా....

ఇంటిలో ఒకరికే పెన్షన్ , జీవన భృతి చెల్లిస్తామన్న నిబంధన బీడీ కార్మికుల పాలిట శాపంగా మారింది. కుటుంబంలోని వృద్ధులకు ఆసరా పెన్షన్ వుంటే బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వడం లేదు. అత్తగారికి పెన్షన్ వుంటే, కోడలికి జీవన భృతి నిలిపివేస్తున్నారు. దీంతో అత్తాకోడళ్ల మధ్య తగాదాలొస్తున్నాయి. ఆసరా పెన్షన్ లకీ, జీవన భృతికి మెలికపెట్టి, కుటుంబంలో ఒక్కరికే పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వ విధానం అత్తాకోడళ్ల మధ్య మనస్పర్థలు, గొడవలు సృష్టిస్తోంది. ప్రతి నెలా అధికారులు సర్వేలు చేస్తూ, మూడు నుంచి నాలుగు వేల మందికి జీవన భృతి కట్ చేస్తున్నారు. దీంతో టిఆర్ఎస్ ప్రభుత్వం తమను దగా చేస్తోందంటూ బీడీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తాము బీడీ కార్మికులం కాదా? తమ పట్ల ఎందుకీ వివక్ష అంటూ ప్రశ్నిస్తున్నారు. సిపిఎం మహాజన పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సమయంలో అనేక మంది బీడీ కార్మికులు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా జీవన భృతి విషయంలో న్యాయంగా వ్యవహరించాలి. ఏ ఒక్క బీడీ కార్మికురాలికి అన్యాయం జరగకుండా చూడాలి. తెలంగాణలో బీడీ కార్మికులు చాలా ఆవేదనతో వున్నారు. ఆసరా పెన్షన్‌లకీ, బీడీ కార్మికుల జీవన భృతికి మెలికలు పెట్టి, అత్తాకోడళ్ల మధ్య తగవులు పెడుతున్న ప్రభుత్వ విధానాన్ని వారు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తమను ఇలా ఎందుకు అన్యాయం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. వీరి ఆవేదనను ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. జీవనభీతి చెల్లిస్తామంటూ బీడీ కార్మికులకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి.

16:22 - March 7, 2017

హైదరాబాద్: ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాకు మహారాష్ట్రాలోని గడ్చిరోలి కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. మావోయిస్టులతో ప్రొఫెసర్‌ సాయిబాబాకు సంబంధాలున్నాయని నిర్ధారించిన కోర్టు.. ఆయనతో పాటు మరో ఐదుగురిని దోషులుగా నిర్ధారిస్తూ వారికి కూడా జీవితఖైదు శిక్ష విధించింది. సాయిబాబాపై దేశద్రోహం కేసును నమోదు చేసిన పోలీసులు..ప్రొఫెసర్‌ సాయిబాబాతో పాటు ఐదుగురిని ఇవాళ భారీ పోలీస్‌ బందోబస్త్‌ మధ్య గడ్చిరోలి సెషన్‌ కోర్టులో హాజరుపరిచారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ప్రొఫెసర్‌ సాయిబాబాను 2014లో ఢిల్లీలోని ఆయన నివాసంలో అరెస్ట్‌ చేశారు. సాయిబాబాపై యుఎపిఏ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు.

16:20 - March 7, 2017

నెల్లూరు: తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎవరికీ వారు గెలుపు కోసం త్రీవంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఓటర్ల నమోదులో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్టు విమర్శలు వినబడుతున్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

9న తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు

తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు 9న జరగనున్నాయి. 15వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా అధికారపార్టీ అభ్యర్థులు, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్యే జరగనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ నుంచి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి పోటీ పడుతుండగా, ఉపాధ్యాయ స్థానానికి పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం, టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడు పోటీపడుతున్నారు. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నిల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికే ఉత్కంఠ రేపుతోంది.

ఓటర్లు నమోదులో భారీగా అవకతవకలు.....

అయితే ఓటర్లు నమోదు ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. నెల్లూరులోనే 2033 బోగస్ ఓట్లు ఉన్నట్టు ఆధారాలతో సహా బయటపడ్డాయి. తూర్పురాయలసీమ గ్రాడ్యుయేట్ నియోజవర్గానికి సంబంధించి 2లక్షల18వేల 357 మంది ఓటర్లుంటే..వారిలో ఒక్క నెల్లూరు జిల్లాలోనే 67 వేల 547 మంది ఓటర్లున్నారు. కేవలం నెల్లూరు నగరంలోనే 20 వేల 596 ఓట్లున్నాయి. కొన్నిరోజుల క్రితం అధికారులు తొలిసారి గ్రాడ్యుయేట్ ఓటర్ల లిస్టుని విడుదల చేసినప్పుడు వాటిలో ఆన్‌లైన్‌లో నమోదైన ఓట్లలో తొమ్మిది వేల వరకు బోగస్ ఓట్లు ఉన్నట్టు సీపీఎం గుర్తించింది. ఈ విషయాన్ని హైకోర్టు, ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో.. హైకోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో ఆరు వేలకు పైగా ఓట్లను జిల్లా అధికారులు తొలగించారు.

జాబితాలో ఒకే డోర్‌ నెంబర్‌తో అనేక ఓటర్లు

బోగస్‌ ఓట్లన్నీ ఒకే డోర్ నెంబర్‌తో వివిధ ప్రాంతాల్లో ఉండటం, అలాగే ఒకే డోర్‌ నెంబర్‌లో అనేక మంది ఓటర్లు, అదేవిధంగా అడ్రస్ లేని ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇంటి డోర్ నెంబర్‌ చూడండి..25/2/353. ఈ ఇల్లు ఉండేది దర్గామిట్టలోని న్యూమిలటరీ కాలనీలో.. ఈ ఇల్లు చెంచయ్య అనే వ్యక్తిది. ఈయనకు ఓటు ఉంది. ఈ ఇంట్లో ఇతను , ఇతని భార్య ఉంటారు. కానీ ఇదే డోర్ నెంబర్‌ ఇంట్లో 48 మందికి ఓట్లున్నట్లు ఓటర్ల జాబితాలో నమోదైంది. కాని వాళ్లెవరూ లేరక్కడ. అంతేకాదు ఈ ఇంటికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నవాబుపేటలో కూడా ఇదే డోర్ నెంబర్‌తో ఇల్లు ఉన్నట్టు ఆ ఇంట్లో 16 మందికి ఓటు ఉన్నట్టు ఓటర్ల లిస్టులో నమోదైంది.

నారాయణ విద్యా సంస్థల అడ్రస్‌పై 365....

అలాగే నారాయణ విద్యాసంస్థల అడ్రస్ మీద 365, కృష్ణచైతన్య విద్యాసంస్థల అడ్రస్ మీద 251 ఓట్లు నమోదయ్యాయి. ఇవేకాకుండా పప్పులవీధిలోని 25/3/580 డోర్ నెంబర్‌ ఇంట్లో 19 ఓట్లు, నవాబుపేటలోని 25/3/1797 డోర్ నెంబర్‌ ఇంట్లో పది బోగస్ ఓట్లుగా గుర్తించారు. ఇలా రకరకాలుగా బోగస్ ఓటర్లు నెల్లూరులో నమోదయ్యాయి. దీంతో ఈ బోగస్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

జగతి పబ్లికేషన్స్ పిటిషన్ పై విచారణ వాయిదా

హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అన్ని ఛార్జిషీట్లను కలిపి ఒకే కేసు కింద పరిగణించి విచారణ చేపట్టాలని కోర్టులో జగతి పబ్లికేషన్స్ వాదనలు వినిపించింది. గతంలో ఇదే విషయమై జగతి పబ్లికేషన్స్‌ పిటిషన్‌ వేయగా సీబీఐ ప్రత్యేక కోర్టు దాన్ని కొట్టివేసింది. దీంతో జగతి పబ్లికేషన్స్‌ హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం ఈ పిటిషన్‌ విచారణకు రాగా న్యాయస్థానం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

'టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి'

హైదరాబాద్: ఈనెల 9న జరగనున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి తెలిపారు. 23వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 126 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.

మంత్రి గంటా హైకోర్టు నోటీసులు..

హైదరాబాద్: మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రత్యూష రిసోర్స్‌ సంస్థ హామీదారుగా ఉన్నందుకు గాను గంటాకు ఈ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి ఆ సంస్థ ఇండియన్‌ బ్యాంకు నుంచి రుణం పొందిందని పేర్కొంటూ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు గంటా సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఢిల్లీ యూనివర్శిటీ ప్రొ.సాయిబాబుకు జీవిత ఖైదు

హైదరాబాద్: ఢిల్లీ యూనివర్శిటీ ప్రొ.సాయిబాబుకు జీవిత ఖైదు కోర్టు విధించింది. సాయిబాబుతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేశారంటూ ప్రొ.సాయిబాబను గడ్చిరోలి సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ప్రస్తుతం అనారోగ్యం కారణంతో సాయిబాబా బెయిల్ పై ఉన్నారు.

ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

అమరావతి: ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఏడు స్థానాలకు ఏడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు నామినేషన్లను పరిశీలించి 9న ఏకగ్రీవ అభ్యర్థులను ప్రకటించానున్నారు.

టీజేఏసీ భవిష్యత్ కార్యాచరణ ఇదే..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హామీలు నెర‌వేర్చ‌లేక‌పోయింద‌ని విమ‌ర్శిస్తోన్న టీజేఏసీ ఈ రోజు హైద‌రాబాద్‌లో స్టీరింగ్ క‌మిటీ ఏర్పాటు చేసి ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది. త‌మ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ‌ పాలనపై ప్రశ్నించే శక్తులు లేకుండా చేయాలనే కుట్రను తిప్పికొట్టాలని నిర్ణ‌యించింది. అప్రజాస్వామిక ధోరణని ఖండిస్తున్నట్లు తేల్చిచెప్పింది. కుట్రలకు ఊతమిస్తున్న త‌మ స‌భ్యులు పి.రవీందర్‌, ఎన్‌.ప్రహ్లాద్‌ల‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపింది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు కార్యాచరణ చేపట్టాలని నిర్ణ‌యం తీసుకుంది.

15:20 - March 7, 2017

బెంగళూరు: ఆస్ట్రేలియాతో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత బౌలర్ల విజృంభణతో కంగూరూ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు.188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 112 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమైనా.. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి మరుపురాని విజయాన్ని అందించారు. అశ్విన్ 6 వికెట్లతో చెలరేగాడు. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది కోహ్లి సేన. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 35 ఓవర్లలోనే ఆసీస్ కథ ముగిసింది.

బెంగళూరు టెస్టులో భారత్ విజయం

బెంగళూరు: ఆస్ట్రేలియాతో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత బౌలర్ల విజృంభణతో కంగూరూ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనలేక ఒక్కొక్కరుగా వెనుదిరిగారు. ఒత్తిడిని తట్టుకోలేని ఆసీస్ బ్యాట్స్‌‌మెన్ వికెట్లు సమర్పించి పెవిలియన్ చేరారు. భారత్‌కు విజయాన్ని అందించారు. 112 పరుగలకే ఆస్ట్రేలియా వెన్ను విరిచారు. దీంతో భారత్ 75 పరుగుల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించి మొదటి టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 6, ఇషాంత్ శర్మ 1, ఉమేష్ యాదవ్ 2, రవీంద్ర జడేజా 1 వికెట్ పడగొట్టారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరో ప్రతిష్టాత్మక అవార్డు...

హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డు అందుకోనుంది. ప్రపంచంలోనే అత్యుత్త‌మ స‌ర్వీసును అందిస్తోన్న విమానాశ్రయంగా ఆ విమానాశ్ర‌యానికి గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌పంచంలోని మొత్తం 300కి పైగా విమానాశ్రయాలను ప‌రిశీలించిన ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) శంషాబాద్ విమానాశ్ర‌యాన్నే అత్యుత్త‌మ సేవ‌లందించే ఎయిర్‌పోర్టుగా గుర్తించింది. ఐదు పాయింట్ల స్కేలుపై 2009లో 4.4 పాయింట్లు సాధించిన స‌ద‌రు విమానాశ్ర‌యం.. క్ర‌మంగా పాయింట్లు మెరుగు ప‌రుచుకుంటూ వ‌స్తూ 2016లో 4.9 పాయింట్లు సాధించి తొలిస్థానంలో నిలిచింది.

అరకిలో బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అరకిలో బంగారం పట్టుబడింది. నిందితులను విమానాశ్రయ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

సోమవారానికి వాయిదా పడ్డ ఏపీ అసెంబ్లీ

అమరావతి: ఏపీ శాస‌న‌స‌భ సమావేశాలని ఈ నెల 13 కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పేర్కొన్నారు.

14:33 - March 7, 2017

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దూరదృష్టి, దార్శనిక దృక్పథంతోనే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో రెండంకెల వృద్ధి సాధ్యపడిందని టిడిపి ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న నాగేశ్వర్‌రెడ్డి... జీడీపీపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష వైసీపీని తప్పుపట్టారు.

14:31 - March 7, 2017

అమరావతి: ప్రతిపక్ష నేత జగన్‌ ఉయభగోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమలను అడ్డుకుంటున్నారని హోం మంత్రి చినరాజప్ప అసెంబ్లీలో విమర్శించారు. ప్రగతి నిరోధకుడుగా మారారని మండిపడ్డారు.

14:30 - March 7, 2017

అమరావతి: నీటి నిల్వ చేసే సామర్థ్యం లేకుండా కమీషన్ల కోసమే పట్టసీమ ప్రాజెక్టును నిర్మించారని అసెంబ్లీలో జగన్‌ ఆరోపించారు. పట్టిసీమ నుంచి తీసుకొచ్చిన నీటిని ప్రకాశం బ్యారేజీ దగ్గర సముద్రంలో కలుపుతున్నారని విమర్శించారు. పట్టిసీమ నుంచి నీరు తోడేందుకు విద్యుత్‌ బిల్లులకు 135 కోట్ల రూపాయల ఖర్చు అయిందని సభ దృష్టికి తెచ్చారు. జగన్‌ ఆరోపణలపై నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పట్టిసీమను వ్యతిరేకించడం మూర్ఖత్వం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

14:28 - March 7, 2017

పశ్చిమగోదావరి : జిల్లా తుందుర్రులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆక్వా ఫుడ్‌ పార్క్‌ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. రేపు ఆక్వాఫుడ్ పార్క్‌ ముట్టడి సందర్భంగా పోరాట గ్రామంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పోరాటసమితి నాయకుడు ఆరేటి వాసును అరెస్టుచేశారు. పోలీసుల మోహరింపుతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

 

13:37 - March 7, 2017

అల్లంలో ఎన్నో పోషకాలుంటాయి. ఈ పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అంతేగాకుండా ఎన్నో రకాల చిరు జబ్బులను సైతం దూరం చేస్తుంది. మరి అల్లం తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దామా..

 • అల్లంలో పొటాషియం, మెగ్నీషీయం, మ్యాంగనీస్‌, ఫాస్పరస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, సి, ఇ, బికాంప్లెక్స్‌ వంటి ఎన్నో ఖనిజాలు, పోషక విలువలు వుంటాయి.
 • అల్లం టీ ప్రతిరోజూ రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి.
 • కడుపునొప్పి, అజీర్ణం, వికారం, బాడీ పెయిన్‌, ఆర్థరైటిస్‌ నొప్పి, జలుబు, దగ్గుకు అల్లం చక్కగా పనిచేస్తుంది.
 • మలినాలను సైతం అది పూర్తిగా తుడిచిపారేస్తుంది.
 • శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలకు..ఫీవర్‌, పీరియడ్స్‌లో తిమ్మెర్లను నివారించడానికి అల్లం సహాయపడుతుంది.
 • ఆరోగ్యకరమైన విలువలను కలిగిన ఈ అల్లాన్ని రోజువారి డైట్‌ లో వాడితే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.

 

కరవు మండలాల్లో రుణాలు రీ షెడ్యూల్ కాలేదు - జగన్..

విజయవాడ : కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాయని, రుణాలు రీ షెడ్యూల్ అవుతాయని కరవు మండలాల్లో ఉన్న రైతు ఆలోచిస్తారని కానీ కరవు మండలాల్లో రుణాలు రీ షెడ్యూల్ కాలేదని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ చర్చలో జగన్ ప్రసంగించారు. ఒక్క ఇన్ ఫుట్ సబ్సిడీ అమలు చేయలేదన్నారు.

రెయిన్ గన్స్ కు రూ. 160 కోట్ల ఖర్చు - జగన్..

విజయవాడ : కరవు నెలకొన్న సందర్భంలో రెయిన్ గన్స్..వర్షం పై యుద్ధం అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రెయిన్ గన్స్ కోసం రూ. 160 కోట్లు ఖర్చు పెడితే పది రోజుల్లో రెయిన్ గన్స్ వినియోగించుకోవడానికి ఆయా కంపెనీలకు రూ. 103 కోట్లు వెచ్చించారని తెలిపారు. రెయిన్స్ గన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయని ఇందుకు ఐదు లక్షల ట్రాక్టర్లు అందుబాటులోకి రాకపోవడమన్నారు.

ఏపీ సర్కార్ పై జగన్ విమర్శలు..

విజయవాడ : ఏపీ సర్కార్ పై జగన్ విమర్శలు ఎక్కు పెట్టారు. సీఎంగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుండి ఏపీలో కరవు నెలకొందని పేర్కొన్నారు.

13:25 - March 7, 2017
13:24 - March 7, 2017

విజయవాడ : సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో కరవు నెలకొందని ప్రతిపక్ష నేత జగన్ దుయ్యబట్టారు. ఏపీ అసెంబ్లీలో రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న జగన్ ప్రసంగించారు. బాబు పాలన ఎలా ఉందో తెలియచేప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి అయిన తరువాత చేపలకు కూడా కనీస ధర రావడం లేదని విమర్శించారు. గుజరాత్ లో 7.7 శాతం, మహారాష్ట్ర 8 శాతం ఉందని కానీ ఏపీలో మాత్రం 13 శాతం గ్రోత్ రేట్ చూపించారని ఎద్దేవా చేశారు. మూడు సంవత్సరాల్లో సాధారణమైన వర్షపాతం నమోదైందని, రబీలో 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విత్తనం తక్కువ పడిందన్నారు. 2016లో ఖరీఫ్ లో ఆగస్టులో నెలలో పడాల్సిన వర్షాలు పడలేదని, పది లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయిందన్నారు. ఈ సమయంలో రెయిన్ గన్స్..వర్షం పై యుద్ధం అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారని గుర్తు చేశారు. రెయిన్ గన్స్ కోసం రూ. 160 కోట్లు ఖర్చు పెడితే పది రోజుల్లో రెయిన్ గన్స్ వినియోగించుకోవడానికి ఆయా కంపెనీలకు రూ. 103 కోట్లు వెచ్చించారని తెలిపారు. రెయిన్స్ గన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయని ఇందుకు ఐదు లక్షల ట్రాక్టర్లు అందుబాటులోకి రాకపోవడమన్నారు. మొత్తంగా ఏపీలో 664 మండలాలున్నాయని 2015-16 సంవత్సరంలో 235 కరవు మండలాలుగా ప్రకటించారని 15-16లో 359 కరవు మండలాలు..16-17 వచ్చే సరికి 301 మండలాలను కరవు మండలాలుగా డిక్లేర్డ్ చేశారని తెలిపారు.

ఇన్ ఫుట్ సబ్సిడీ ఏదీ ?
కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాయని, రుణాలు రీ షెడ్యూల్ అవుతాయని కరవు మండలాల్లో ఉన్న రైతు ఆలోచిస్తారని కానీ కరవు మండలాల్లో రుణాలు రీ షెడ్యూల్ కాలేదని పేర్కొన్నారు. ఒక్క ఇన్ ఫుట్ సబ్సిడీ అమలు చేయలేదన్నారు. 14-15 1500 కోట్ల రూపాయలు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవాల్సి ఉంటే కేబినెట్ మీటింగ్ పెట్టి దీనిని రూ. 1067 కోట్లకు తగ్గించారని తెలిపారు. మళ్లీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రూ. 692 కోట్లకు తగ్గించారని సభకు తెలిపారు. రూ.692 కోట్లలో కూడా ఇంకా 20-30 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఇక 2015-16 సంవత్సరానికి రూ. 270 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందన్నారు. 16-17 సంబంధించి కరవు వచ్చిందని 265 మండలాల్లో 1700 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ..వర్షాలకు మరో 51 కోట్లు..మొత్తంగా రూ. 1811 కోట్ల రూపాయలు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవాల్సి ఉందని జగన్ పేర్కొన్నారు.

13:01 - March 7, 2017

స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశబ్దాలు దాటినా హక్కులను..చట్టాలను పోరాటాల ద్వారానే సాధించుకున్న మహిళల స్థితిగతులు పెద్దగా మారలేదు. సంఘటిత రంగం..అసంఘటిత రంగం అనే తేడా లేకుండా మహిళా వేతనాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది. పోరాడి సాధించుకున్న వేతనాలు..పనిగంటల విషయంలో ఇంకా ఎన్నాళ్లు మహిళలపై వివక్ష..అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మానవి 'వేదిక'లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో దేవి (సామాజిక కార్యకర్త), అరుణ (ఏల్ఐసీ తెలంగాణ జోనల్ కన్వీనర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి విశేష్లణ కోసం వీడియో క్లిక్ చేయండి.

పార్టీ అభివృద్ధికి మరింత కృషి - మైనంపల్లి..

హైదరాబాద్ : పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబానికి రుణపడి ఉంటానని, ప్రభుత్వం హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తుందని, నగరంలో పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు.

 

మహిళలకు నామినేటెడ్ పదవులు - కేసీఆర్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, మహిళల కోసం ఈ ఏడాది నుండి కొత్త కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెంచాలని, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి...మహిళా అభ్యుదయానికి కృషి చేసిన వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ లతో పాటు ఇతర నామినేటెడ్ పదవులకు అర్హులైన మహిళలను ఎంపిక చేయడానికి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు, కమిటీ సభ్యులుగా పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కవిత, తుల ఉమలుంటారని తెలిపారు.

తెలంగాణ భవన్ లో మహిళా దినోత్సవ వేడుకలు..

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కవితలు పాల్గొన్నారు.
 

12:46 - March 7, 2017
12:43 - March 7, 2017

విజయవాడ : ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ కు అసెంబ్లీ కనీసం మంచీనీళ్లు ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు వివిధ అంశాలపై అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చెవిరెడ్డి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ఉన్న వసతులపై ఆయన మండిపడ్డారు. మంచినీరు దిక్కులేదని, ప్రతిపక్ష నేత నీళ్లు అడిగినా తీసుకరాలేదన్నారు. అటెండర్ ను అందుబాటులో ఉంచలేదని, బయట నుండి నీళ్లు తీసుకెళ్ల వద్దని చెబుతున్నారని తెలిపారు. నీళ్లు కావాలంటే చీప్ విప్, ముఖ్యమంత్రిని అడగాలని పేర్కొంటున్నారని తెలిపారు.

12:42 - March 7, 2017

విజయవాడ : మనుషులు మారుంటారు..పద్ధతులు మారుతాయి..అని అనుకున్నామని, కానీ మనుషులు మారలేదు..వారి పద్ధతులు కూడా మారలేదని వైసీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. బీసీ సంక్షేమంపై ప్రభుత్వం వ్యహరించిన తీరుపై మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. స్వరాష్ట్రంలో నిర్వహిస్తున్నా కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీ సర్కార్ బీసీలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేవలం వారిని ఓటు బ్యాంకు మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. సబ్ ప్లాన్ పై తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

12:33 - March 7, 2017
12:16 - March 7, 2017

విజయవాడ : ఏపీ మంత్రి కాల్వ దొంగతనం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అమరావతిలో ప్రారంభమైన ఈ సమావేశాలకు ఎమ్మెల్యే రోజాను అనుమతినిస్తారా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై నియమించబడిన ప్రివిలేజ్ కమటీ స్పీకర్ కు నివేదిక అందించనుంది. దీనిపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే రోజాను మరో ఏడాది పాటు సస్పెండ్ పొడిగిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్టే మంత్రి యనమల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై రోజా తీవ్రస్థాయిలో స్పందించారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, అనితను తాను అవమానించలేదని పేర్కొన్నారు. స్పీకర్ కార్యాలయం నుండి క్లిప్పింగ్ సీడీలను మంత్రి కాల్వ దొంగిలించి డబ్బింగ్ మిక్స్ చేసి విడుదల చేశారని ఆరోపించారు. తనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, మరొక సంవత్సరం పాటు సస్పెండ్ చేయడానికి ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. మహిళా సమస్యలపై పోరాడుతున్నందునే ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు.

మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు - జగన్..

విజయవాడ : ప్రతిపక్షం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని, శాసనసభలో కనీసం సమయం కూడా ఇవ్వడం లేదని ప్రతిపక్ష నేత జగన్ తెలిపారు. అసెంబ్లీలో అందరికీ ఒకే నియమాలు వర్తిస్తాయని, తమ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

ఏపీని దెబ్బతీసిన అశాస్త్రీయ విభజన..

విజయవాడ : అశాస్త్రీయ విభజన ఏపీని దెబ్బతీసిందని, ఆర్థికంగా నష్టపోయిన ఏపీని సీఎం చంద్రబాబు నాయుడు ముందుండి నడిపిస్తున్నారని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం కృషిపై గవర్నర్ ప్రసంగంలో తెలిపారని పేర్కొన్నారు.

 

ఏపీ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై చర్చ..

విజయవాడ : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేసే తీర్మానాన్ని శాసనసభలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రవేశ పెట్టారు. అశాస్త్రీయ విభజన ఏపీని దెబ్బతీసిందని, ఆర్థికంగా నష్టపోయిన ఏపీని సీఎం చంద్రబాబు నాయుడు ముందుండి నడిపిస్తున్నారని తెలిపారు.

11:55 - March 7, 2017

తెలుగు సినిమాలు సగం హిట్టు కొట్టేది కామెడీ తోనే. ఆడియన్స్ కి ఫన్ కావాలి, సరదాగా కాసేపు నవ్వుకోవాలి, సినిమాని ఎంజాయ్ చెయ్యాలి. ఇలా ఇవన్నీ జరగాలంటే స్క్రీన్ మీద మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ కనిపించాలి. ఎన్నో ఏళ్లుగా బ్రహ్మానందం చేస్తున్న కామెడీ ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది అని రియలైజ్ అయ్యారు ఫిలిం మేకర్స్. కొత్త కమెడియన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫిలిం మేకర్స్ కి కరెక్ట్ టైం లో దొరికాడు సునీల్. కొత్తరకం డైలాగ్ డెలివరీ తో వచ్చాడు, మంచి టైమింగ్ తో కామెడీ పండించాడు, ఆడియన్స్ ని అలరించాడు ఈ ఫన్నీ స్టార్ సునీల్.

సునీల్ హీరోగా ఎంట్రీ..
సునీల్ టాప్ కమెడియన్ గా ఎదుగుతున్న టైం లోనే హీరోగా ఎంట్రీ తీసుకున్నాడు. మల్లి కమెడియన్ కోసం టాలీవుడ్ వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ గ్యాప్ లో చాల మంది కమెడియన్స్ వచ్చినా ఎవరు 'సునీల్' స్థాయిలో మెప్పించలేకపోయారు. టైం కెన్ గివ్ ఆన్సర్ అన్నట్టు వచ్చాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ 'పృథ్వి రాజ్'. ఆ ఒక్కటి అడక్కు అంటూ అప్పుడెప్పుడో స్క్రీన్ మీద కనిపించిన పృథ్వి మళ్ళీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఖడ్గం తో ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నాడు.

విన్నర్ లో ..
ఇప్పుడొస్తున్న సినిమాల్లో 'పృథ్వి' లేకుండా ఉన్న పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువ. మంచి నటుడిగా, టైమింగ్ ఉన్న కమెడియన్ గా పేరు తెచ్చుకున్న 'పృథ్వి' ప్రతి హిట్ సినిమాలో దర్శనం ఇస్తున్నాడు. రీసెంట్ గా అయితే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ వచ్చిన సినిమాలో ఏకంగా హీరో లెవెల్ రోల్ ని ప్లే చేసాడు. సలోని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మంచి వేరియేషన్స్ చూపించాడు. టాలీవుడ్ హీరోలని తన కామెడీ యాంగిల్ తో ఇమిటేట్ చెయ్యగల 'పృథ్వి' సరైనోడు, బాబు బంగారం, రీసెంట్ ఫిలిం విన్నర్ లో కూడా మంచి రోల్స్ తీసుకున్నాడు. ఆడియన్స్ ని నవ్విస్తున్నాడు.

11:29 - March 7, 2017

నెల్లూరు : తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎవరికీ వారు గెలుపు కోసం త్రీవంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఓటర్ల నమోదులో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్టు విమర్శలు వినబడుతున్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు 9న జరగనున్నాయి. 15వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా అధికార పార్టీ అభ్యర్థులు, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్యే జరగనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ నుంచి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి పోటీ పడుతుండగా, ఉపాధ్యాయ స్థానానికి పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం, టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడు పోటీపడుతున్నారు. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నిల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికే ఉత్కంఠ రేపుతోంది.

ఆన్‌లైన్‌లో నమోదైన ఓట్లలో 9 వేల బోగస్‌ ఓట్లు..
అయితే ఓటర్లు నమోదు ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. నెల్లూరులోనే 2033 బోగస్ ఓట్లు ఉన్నట్టు ఆధారాలతో సహా బయటపడ్డాయి. తూర్పురాయలసీమ గ్రాడ్యుయేట్ నియోజవర్గానికి సంబంధించి 2లక్షల18వేల 357 మంది ఓటర్లుంటే..వారిలో ఒక్క నెల్లూరు జిల్లాలోనే 67 వేల 547 మంది ఓటర్లున్నారు. కేవలం నెల్లూరు నగరంలోనే 20 వేల 596 ఓట్లున్నాయి. కొన్నిరోజుల క్రితం అధికారులు తొలిసారి గ్రాడ్యుయేట్ ఓటర్ల లిస్టుని విడుదల చేసినప్పుడు వాటిలో ఆన్‌లైన్‌లో నమోదైన ఓట్లలో తొమ్మిది వేల వరకు బోగస్ ఓట్లు ఉన్నట్టు సీపీఎం గుర్తించింది. ఈ విషయాన్ని హైకోర్టు, ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో.. హైకోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో ఆరు వేలకు పైగా ఓట్లను జిల్లా అధికారులు తొలగించారు.

అడ్రస్‌ లేని ఓటర్లు..
బోగస్‌ ఓట్లన్నీ ఒకే డోర్ నెంబర్‌తో వివిధ ప్రాంతాల్లో ఉండటం, అలాగే ఒకే డోర్‌ నెంబర్‌లో అనేక మంది ఓటర్లు, అదేవిధంగా అడ్రస్ లేని ఓటర్లు ఉన్నారు. ఇంటి డోర్ నెంబర్‌ చూడండి..25/2/353. ఈ ఇల్లు ఉండేది దర్గామిట్టలోని న్యూమిలటరీ కాలనీలో.. ఈ ఇల్లు చెంచయ్య అనే వ్యక్తిది. ఈయనకు ఓటు ఉంది. ఈ ఇంట్లో ఇతను , ఇతని భార్య ఉంటారు. కానీ ఇదే డోర్ నెంబర్‌ ఇంట్లో 48 మందికి ఓట్లున్నట్లు ఓటర్ల జాబితాలో నమోదైంది. కాని వాళ్లెవరూ లేరక్కడ. అంతేకాదు ఈ ఇంటికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నవాబుపేటలో కూడా ఇదే డోర్ నెంబర్‌తో ఇల్లు ఉన్నట్టు ఆ ఇంట్లో 16 మందికి ఓటు ఉన్నట్టు ఓటర్ల లిస్టులో నమోదైంది.

నారాయణ విద్యా సంస్థల మీద..
అలాగే నారాయణ విద్యాసంస్థల అడ్రస్ మీద 365, కృష్ణచైతన్య విద్యాసంస్థల అడ్రస్ మీద 251 ఓట్లు నమోదయ్యాయి. ఇవేకాకుండా పప్పులవీధిలోని 25/3/580 డోర్ నెంబర్‌ ఇంట్లో 19 ఓట్లు, నవాబుపేటలోని 25/3/1797 డోర్ నెంబర్‌ ఇంట్లో పది బోగస్ ఓట్లుగా గుర్తించారు. ఇలా రకరకాలుగా బోగస్ ఓటర్లు నెల్లూరులో నమోదయ్యాయి. దీంతో ఈ బోగస్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

11:26 - March 7, 2017

అప్కమింగ్ సినిమాలకి సంబంధిచిన చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన నెట్ వరల్డ్ సైలెంట్ గా ఉండట్లేదు. ఫస్ట్ లుక్, ట్రైలర్, టీజర్ ..ఇలా ఐటెం ఏదైనా నెటిజన్లకు ఎంటెర్టైన్మెంటే. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు ఫిల్మీ ఇన్ఫోర్మషన్స్ ని పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేస్తున్నారు వ్యువర్స్. రీసెంట్ గా ఒక పెద్ద హీరో సినిమా పాట వ్యూస్ వర్షం కురిపిస్తోంది. సినిమా రిలీజ్ అంటే క్యూరియాసిటీ క్రేయేట్ చెయ్యాలి అలా చెయ్యాలంటే హైప్ పెంచాలి. సినిమా హైప్ పెంచే మేజర్ ఎలిమెంట్స్ ట్రైలర్స్, టీజర్స్, ఫస్ట్ లుక్స్ ..వీటితో పాటు సాంగ్ ప్రీ రిలీజ్ లు కూడా ఫిలిం ఎక్సపెక్టషన్స్ ని పెంచేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కాటమరాయుడు' ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్ కి ఫిల్మీ హింట్ ఇచ్చాడు. కాటన్ బట్టల్లో సింపుల్ మాన్ ల కనిపించి హైప్ పెంచేసాడు ఈ కాటమరాయుడు.

మొన్నామధ్య 'కాటమరాయుడు' ట్రైలర్ రిలీజ్ చేసాడు. యూట్యూబ్ లో సంచలనం గ మారింది. సౌత్ ఇండియన్ ఫిలిం ట్రైలర్స్ వ్యూస్ విషయంలో టాప్ ప్లేస్ లో చేరింది ఈ కాటమరాయుడు ట్రైలర్. 'కబాలి', 'ఖైదీ నెంబర్ 150’ సినిమా ట్రైలర్స్ కి ధీటుగా నిలిచింది ఈ 'కాటమరాయుడు' ట్రైలర్. 'వర్షం'లో పవన్ కళ్యాణ్ గొడుగు కింద హాఫ్ పేస్ తో కనిపించిన ఈ ట్రైలర్ పవర్ స్టార్ ఫాన్స్ లో కొత్త ఎనర్జీ నింపింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కి సహా నటుడు శివబాలాజీ 'కాటమరాయుడు' సెట్ లో కత్తి బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆడియో ఫంక్షన్స్ వివాదాలకు దారితీస్తున్నాయి అనుకున్నారమో మెగా ఫ్యామిలీ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆడియో వేడుక జరపకుండా పాటలని ఒక్కొక్కటిగా విడుదల చేయాలనీ భావించిన చిత్ర నిర్మాతలు 'కాటమరాయుడు' సినిమాకి సంబందించిన టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు.'యూట్యూబ్ లో సాంగ్ రిలీజ్ ఐన 18 గంటల్లోనే 13 లక్షల మంది చూసారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ టైటిల్ సాంగ్ ని రాప్ స్టైల్ మిక్స్ చేసి వదిలాడు. 'మిర మిర మీసం ..మెలితిప్పుతాడు జనం కోసం' అంటూ సాగే ఈ సాంగ్ మంచి ఊపుతో ఆడియన్స్ ని రీచ్ అయింది. ఇక ఈ సినిమా ఈనెల 24న విడుదల కానున్నది. 'కాటమరాయుడు' పెద్దగా అంచనాలు లేకుండా మొదలై చివరికి వందకోట్ల బిజినెస్ చేసే రేంజ్ కి వెళ్లబోతుంది అంటున్నారు సినీ పెద్దలు.

 

11:20 - March 7, 2017

విజయవాడ : బీసీ సంక్షేమంపై ఏపీ శాసనసభలో వైసీపీ పట్టుబట్టింది. ప్రభుత్వం తగిన విధంగా సమాధానం చెప్పలేదని పేర్కొంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. బీసీ సంక్షేమంపై వైసీపీ సభ్యుడు పలు ప్రశ్నలు సంధించారు. దీనికి ప్రభుత్వ తరపున మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం చెప్పారు. గ్రూప్ 1-2లో అనేక మంది విద్యార్థులకు కోచింగ్ నిర్వహిస్తున్నామని, పది కులాలకు సంబంధించిన వారి మేలు కోసం కృషి చేయడం జరుగుతోందన్నారు. రూ. 350 కోట్ల రూపాయలు ఫెడరేషన్ కు ఖర్చు పెడుతున్నామని, బలహీన వర్గాల వారి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రతిపక్ష నేత జగన్ స్పందించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. మధ్యలో స్పీకర్ కల్పించుకోవడం..మైక్ కట్ చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.

11:12 - March 7, 2017

విజయవాడ : గాలేరు-నగరి ప్రాజెక్టుపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి లేవనెత్తిన ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ అట్టుడికింది. కాంగ్రెస్‌ హయాంలోనే ఈ ప్రాజెక్ట్‌ ఎనభై శాతం పూర్తైందని వైసీపీ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. తెలుగుదేశం మూడేళ్ల కాలంలో మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పులివెందులకు నీళ్లు ఇచ్చామని చెప్పడాన్ని ప్రతిపక్ష నేత జనగ్‌ తప్పుపట్టారు. దీనిపై దేవినేని ఉమ వివరణ ఇచ్చారు.

11:09 - March 7, 2017

నల్గొండ : జిల్లాలో బత్తాయి మార్కెట్‌ ఏర్పాటు చేయాలని, బత్తాయి మార్కెట్‌లో దళారి వ్యవస్థను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. బత్తాయి గుజ్జు పరిశ్రమను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని లేఖలో తమ్మినేని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం కేసీఆర్‌ సర్కార్‌ చేసిందేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు, అగ్ర వర్ణ ధనికులకే ఈ ప్రభుత్వం లబ్ధి చేకూర్చుతోందని తమ్మినేని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారని, కేసీఆర్‌ ఆగడాలను అరికట్టడానికే సీపీఎం మహాజన పాదయాత్ర చేపట్టిందని తమ్మినేని అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించేవరకు అన్ని వర్గాలు ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తమ్మినేని పిలుపునిచ్చారు.

హామీలు మరిచారు - ఎస్. రమ..
తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకే, మన ఉద్యోగాలు మనకే అన్న టీఆర్‌ఎస్‌ నేతలు ప్రభుత్వం ఏర్పడ్డాక హామీలన్నింటినీ మరిచారని మహాజన పాదయాత్ర బృందం సభ్యురాలు ఎస్‌ రమ అన్నారు. పాదయాత్రలో ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోందని, మహాజన పాదయాత్రను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారని రమ తెలిపారు. మహిళా కార్మికులు శ్రమకు తగిన వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రమ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా హక్కులను కాపాడాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె తెలిపారు.

141 రోజులు పూర్తి..
సామాజికన్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 141 రోజులు పూర్తి చేసుకుంది. 141వ రోజు తమ్మినేని బృందం నల్గొండ జిల్లాలోని సంగారం, పోతనూరు, రంగారెడ్డిగూడ, ఘనపురం గేట్‌, పొనకమేకలవారి గూడెం, తంగడిపేట, చిలకమర్రి, కొండమల్లెపల్లి గ్రామాల్లో పర్యటించింది. చిలకమర్రి వద్ద పాదయాత్ర బృందానికి సీపీఐ దేవరకొండ నేతలు ఘన స్వాగతం పలికారు. ఏప్రిల్‌ 20 వరకు సాగర్‌ నీళ్లివ్వాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. నల్గొండి జిల్లాలో బత్తాయి మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని, బత్తాయి గుజ్జు పరిశ్రమను ఏర్పాటు చేసి దళారి వ్యవస్థను అరికట్టాలని లేఖలో డిమాండ్‌ చేశారు.

బీసీ సంక్షేమంపై వైసీపీ పట్టు..

విజయవాడ : బీసీ సంక్షేమంపై అసెంబ్లీ వైసీపీ పట్టుబట్టింది. దీనితో సభలో గందరగోళం ఏర్పడడంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు.

11:03 - March 7, 2017

ఒక సినిమా రిలీజ్ ఆగిపోవడానికి పెద్ద సినిమాల తాకిడి, థియేటర్స్ లేకపోవడం, బయ్యర్లు డిస్టిబ్యూటర్స్ ఇంటరెస్ట్ చూపించకపోవడం ఇలా చాలా కారణాలు ఉన్నాయ్. ఇలాంటి కష్టాలన్నీ చిన్న సినిమాలకి, పెద్దగా గుర్తింపు లేని కొత్త వాళ్ళకే అనుకుంటే పొరపాటే. ఎంతో ఫిలిం బ్యాగ్రౌండ్ ఉండి మంచి హిట్స్ ఉన్నా కూడా సినిమా రిలీజ్ డేట్స్ లో డైలమాలో ఉన్నారు మంచు లక్ష్మి అండ్ హీరోయిన్ అంజలి. సినిమా ఇండస్ట్రీ లో పెద్ద తలకాయ మోహన్ బాబు, ఫ్యామిలీ లో ఉన్న నలుగురు టాలీవుడ్ లోనే ఉన్నారు అలాంటి ఫ్యామిలీ కి చెందిన 'మంచు లక్ష్మి' మాత్రం తన సినిమాని రిలీజ్ చేసుకోడంలో డేట్స్ కుదరక తికమకలో ఉంది.

మంచు లక్ష్మీ..
మంచు లక్ష్మి నటించిన 'లక్ష్మి బాంబ్' పేరుతో సినిమా తయారై చాలా రోజులైంది. ట్రైలర్ కూడా ఎప్పుడో వచ్చింది. ఇందులో లక్ష్మి పవర్ ఫుల్ లాయర్ గా నటించింది. ఈ సినిమాకి డైరెక్టర్ వసూల్ రాజా, సాధ్యం అనే సినిమాలతో డైరెక్టర్ గా ఉన్నా కార్తికేయ గోపాల కృష్ణ. ఈ సినిమా రిలీజ్ అవ్వటానికి ముహూర్తం కొన్ని సార్లు అనుకున్నా గాని కారణాలు తెలియక రిలీజ్ ఆగి పోయింది.

అంజలి..
మంచి పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ కి దగ్గరైన హీరోయిన్ అంజలి. పెద్ద హీరోలతో కూడా నటించిన ఈ తెలుగు హీరోయిన్ రిలీజ్ కి రెడీగా ఉన్న రీసెంట్ ఫిలిం 'చిత్రాంగద'. ‘గీతాంజలి’తో అంజలి మంచి క్రేజ్ సంపాదించుకున్న టైంలో మొదలైంది ‘చిత్రాంగద’ సినిమా. ‘పిల్ల జమీందార్’ లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత ‘సుకుమారుడు’తో బోల్తా కొట్టిన అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలు ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్నారు ఇండస్ట్రీ పీపుల్. మళ్ళీ ఈ సినిమాల రిలీజ్ టాక్ ఇప్పుడు తెరమీదకి వచ్చింది. మార్చి 10 తేదీన ఈ రెండు సినిమాలు రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు ఈ సినిమా ఫిలిం మేకర్స్. చూద్దాం ఈ సారన్నా ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో కనిపిస్తాయో లేదో .?

10:55 - March 7, 2017

ట్రెండీ లవ్ సబ్జెక్ట్, అదిరిపోయే యాక్షన్ ఎలెమెంట్స్, టోటల్ ఫ్రెష్ లుక్స్ తో రిలీజ్ అయింది స్టైలిష్ డైరెక్టర్ టీజర్. డిఫరెంట్ కైండ్ అఫ్ లవ్ ట్రీట్మెంట్ తో రాబోతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన షార్ట్ పీరియడ్ లోనే క్లాస్ మాస్ ని ఆకట్టుకుంది. బద్రి, ఇడియట్‌, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, టెంపర్‌ వంటి డిఫరెంట్‌ క్యారెక్టర్‌ బేస్‌డ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను రూపొందించిన డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం 'రోగ్‌'. టాలీవుడ్ లో డాషింగ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కొంత గాప్ తీస్కొని మళ్ళీ లవ్ సబ్జెక్ట్ తో యూత్ ని టార్గెట్ చేసి రాబోతున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్ కొంత కాలం గా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతకు ముందువరకు కొంచం సోషల్ మెస్సేజ్ తో సినిమాలు ట్రై చేసి అవి అటు ఇటు అవ్వడంతో తన రీసెంట్ ఫిలిం 'రోగ్' తో తాను నమ్మిన పాత ఫార్ములానే కొత్తగా చూపించబోతున్నాడు ఈ ట్రెండీ డైరెక్టర్.

ఇషాన్ హీరో..
'పూరి' 'రోగ్' సినిమాతో ఇషాన్ అనే కొత్త హీరోని తెలుగు తెరకు పరిచయం చెయ్యబోతున్నాడు. తన సినిమా లో ఉండే రఫ్ లుక్ తో డిఫరెంట్ మేనరిజం తో హీరో పాత్రని డిజైన్ చేసి రోగ్ ని దిద్దుతున్నాడు పూరి. 'రోగ్' 'మరో చంటి గాడి ప్రేమకథ' అనే లైన్ తో రాబోతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ ఐ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది .బ్యూటీ ఫ్రెష్ లుక్స్ ఏంజెలా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు లవ్ ఎలెమెంట్స్ కావలిసినంత కనిపిస్తున్నాయి. ఈ 'రోగ్' సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పూరి చాలా హొప్ఫుల్ గా కనిపించాడు. తనకు ఇషాన్ చాలా నచ్చాడని చెప్పాడు. 'రోగ్' కథ కంటే హీరోను చూడ‌గానే ఎగ్జ‌యిట్ అయ్యాడని, హీరో లక్షణాలు అన్ని ఉన్న హీరో ఇషాన్ అని, ఫ్యూచర్ లో ఇషాన్ పెద్ద స్టార్ అవ్వడం కాయం అని చెప్పాడు పూరి. రాఘవేంద్రరావు శ్రీదేవిని స్క్రీన్ కి పరిచయం చేసినప్పుడు ఎంత హ్యాపీ గా ఫీల్ అయ్యాడో ఇప్పుడు ఇషాన్ ని తెలుగు తెరకి తాను పరిచయం చెయ్యడం అంత హ్యాపీ గా ఉంది అని చెప్పాడు పూరి. 'రోగ్' సినిమా టీజర్ తో హైప్ క్రేయేట్ చేసిన పూరి సినిమాని ఎంత జోష్ తో తీసాడో టీజర్ చూస్తే తెలుస్తుంది.

అమరవీరుల స్థూపం వద్ద..

హైదరాబాద్ : అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీ అభ్యర్థులు నివాళులర్పించారు. కాసేపట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కృష్ణారెడ్డి, మైనంపల్లి, గంగాధర్ గౌడ్ లు నామినేషన్ లు దాఖలు చేయనున్నారు.

ఏపీ శాసనసభ వాయిదా..

విజయవాడ : అమరావతిలో ఏపీ శాసనసభా సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. వివిధ అంశాలపై ప్రతిపక్ష..అధికారపక్షం వద్ద వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. కాసేపటి క్రితం స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

మీడియాతో డిప్యూటి సీఎం కేఈ చిట్ చాట్..

విజయవాడ : డిప్యూటి సీఎం కేఈ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. తెలంగాణలో మిషన్ భగీరథ తరహాలో రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ పథకం అమలుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయదలిచినట్లు, బోర్డు ఛైర్మన్ గా కేఈ ప్రభాకర్ కు బాధ్యతలు ఇస్తామని సీఎం వెల్లడించారని తెలిపారు. రాయలసీమలో ఒకే కుటుంబానికి సీఎం మూడు పదవులు ఇచ్చారని, ఎన్నికలొచ్చిన ప్రతి సారి ప్రభాకర్ కు నచ్చచెప్పడానికి తాను నిద్రలేని రాత్రులు గడిపినట్లు చెప్పుకొచ్చారు.

రోజా క్షమాపణలు చెప్పాలి - యనమల..

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా క్షమాపణలు చెప్పాలని మంత్రి యనమల పేర్కొన్నారు. ప్రివిలేజ్ కమిటీ నివేదికలో సభలో ఎప్పుడు పెట్టాలనే దానిపై స్పీకర్ దే నిర్ణయమన్నారు.

10:28 - March 7, 2017

విజయవాడ : బీసీ సంక్షేమం గురించి ఆనాడు చెప్పిన మాటలు ఏమయ్యాయని వైసీపీ ఎమ్మెల్యే ముత్యాల నాయుడు ప్రశ్నించారు. ఏపీ శాసనసభలో రెండో రోజు బీసీ సంక్షేమంపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. అంతకంటే ముందు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. 2014-15..2015-16 గాను కేటాయింపులు..ఖర్చులు మంత్రి పేర్కొన్నారని కానీ పొంతన కుదరడం లేదని పేర్కొన్నారు. స్వయంగా మంత్రి ఒప్పుకున్నారని తెలిపారు. బీసీ వర్గానికి అన్యాయం జరుగుతోందని పేర్కొంటూ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ వర్గాల వారికి బడ్జెట్ లో ప్రతి ఏడాది రూ. 10 వేల కోట్లు కేటాయిస్తామని ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. ప్రతి బీసీ విద్యార్థి చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా గతంలో అంతే ఫీజు చెల్లించే వారని పేర్కొన్నారు. ఆధార్ కార్డు అనుసంధానం లేదని, ఇతరత్రా కారణాల వల్ల బీసీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ రావడం లేదన్నారు.

బీసీ సంక్షేమంపై వైసీపీ ప్రశ్నలు..

విజయవాడ : బీసీ సంక్షేమం గురించి ఆనాడు చెప్పిన మాటలు ఏమయ్యాయని వైసీపీ సభ్యుడు ముత్యాల నాయుడు ప్రశ్నించారు. బీసీ సంక్షేమంపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నిక మేనిఫెస్టోలో బీసీ వర్గాల వారికి బడ్జెట్ లో ప్రతి ఏడాది రూ. 10 వేల కోట్లు కేటాయిస్తామని ఆనాడు చెప్పారని గుర్తు చేశారు.

10:15 - March 7, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన వాణిజ్య సదస్సులో ఎన్ని ఎంవోయూలు జరిగాయో తెలియచేయాలని టిడిపి సభ్యుడు ధూళిపాల నరేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ రెండో రోజు ప్రశ్నోత్తరాల్లో ఎంవోయూలపై పలు ప్రశ్నలు వేశారు. ఏపీ అంటే హైదరాబాద్ కాదని..ఏపీ అంటే అమరావతి అని, సభలో ఉన్న ప్రతొక్కరూ అభినందించాలన్నారు. 2016-17లో దాదాపు వేయ్యికి పైగా ఎంవోయూలు సంతకం చేశారని, 15 లక్షల కోట్ల సంతకాలు జరిగాయని ప్రభుత్వం పేర్కొనడం జరిగిందన్నారు. ఇందులో 30 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా ఎంవోయూలు జరిగినట్లు మంత్రి యనమల పేర్కొన్నారని తెలిపారు. మొత్తం 328 ఎంవోయూలు వివిధ స్టేజ్ లో ఉన్నాయని, 4.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని, వివిధ దశల్లో 8.50 లక్షల మందికి ఉపాధి వస్తుందని చెప్పారని తెలిపారు. కానీ ఏ దేశాల నుండి ఎంతమంది ప్రతినిధులు వచ్చారో తెలియచేయాలని, ఏ రంగానికి చెందిన ఎంవోయూలు జరిగాయో చెప్పాలని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రశ్నించారు.

ఏ రంగంలో ఎంవోయూలున్నాయి -ధూళపల్లి

విజయవాడ : ఏపీలో జరిగిన వివిధ సదస్సుల్లో ఏ రంగానికి చెందిన ఎంవోయూలు జరిగాయని టిడిపి ఎమ్మెల్యే ధూళపాల నరేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ రెండో రోజు ప్రశ్నోత్తరాల్లో ఆయన పలు ప్రశ్నలు వేశారు.

09:56 - March 7, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీలో రెండో రోజు ప్రశ్నోత్తరాల్లో అధికార..విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ గృహాలకు విద్యుత్ ఛార్జీల మినహాయింపుపై వైసీపీ పలు ప్రశ్నలను సంధించింది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఈ సమాధానంపై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మైక్ ఆన్ లో ఉందా..లేదో తనకు తెలియడం లేదని, ఏ దిక్కు చూడాలని జగన్ పేర్కొన్నారు. మీరు రాసిచ్చింది చదువుతున్నానని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, 150 రూపాయలు కరెంటు బిల్లు వచ్చి ఉండేదని సీఎం బాబు అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 500 రూపాయల బిల్లు వస్తోందన్నారు. విద్యుత్ 50 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నామంటున్నట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఎస్సీలకు రూ. 58 కోట్లు, ఎస్టీలకు రూ. 18 కోట్లు ఇచ్చి గొప్పగా చెబుతున్నారని విమర్శించారు. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ముష్టి వేసినట్లు వేస్తున్నారని తెలుపుతూ వాకౌట్ చేస్తున్నట్లు జగన్ వెల్లడించారు.

అనిత అభ్యంతరం..
ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్యే అనిత అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిర్వీర్యం చేశారని, ప్రస్తుతం రూ. 10 వేల కోట్లు ఇస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకరావాలని పేర్కొన్నారు. ముష్టి అనే పదాన్ని జగన్ ఉపసంహరించుకోవాలని సూచించారు.

వైసీపీ వాకౌట్..

విజయవాడ : ఎస్సీ, ఎస్టీ గృహాలకు విద్యుత్ ఛార్జీల మినహాయింపుపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై వైసీపీ సంతృప్తి చెందలేదు. దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రతిపక్ష నేత జగన్ వెల్లడించారు.

09:44 - March 7, 2017

గాలేరులో అంతర్భాగం పులివెందుల - జగన్..

విజయవాడ : పులివెందుల అనేది గాలేరు నగరిలో అంతర్భాగమని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. 2014-15-16-17 సంవత్సరాలకు కలిపి రూ. 400 కోట్లు ఇచ్చారని, కానీ వైఎస్ హాయాంలో రూ.4000 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.

ఏపీ శాసనసభలో గందరగోళం..

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గాలేరు - నగరి ప్రాజెక్టుపై వైసీపీ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో వైసీపీ సంతృప్తి చెందలేదు.

గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తి చేస్తాం - దేవినేని..

విజయవాడ : గాలేరు - నగరి ప్రాజెక్టును త్వరతగతిన పూర్తి చేయాలని కృషి చేయడం జరుగుతోందని మంత్రి దేవినేని సభకు తెలిపారు. గాలేరు - నగరి పై వైసీపీ సభ్యుడు వేసిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.

09:16 - March 7, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అధికారంలో వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో నిరంతరంగా కరెంటు సరఫరా చేయడం జరుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గతంలో రోజుకు 18గంటలు కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, చిన్న పరిశ్రమలు ఇక్కట్లకు గురయ్యారని తెలిపారు. ఒక్క నిమిషం కరెంటు పోకుండా 24గంటలూ కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. మూత పడిన పరిశ్రమలను తెరిపించేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. దీనిపై వైసీపీ సభ్యుడు గౌతమ్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని మంత్రి పేర్కొన్నారని అసలు మొదటి ప్లేస్ ఎవరు ఇచ్చారు ? దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా ? అని ప్రశ్నించారు. సదరన్ ప్లస్ గ్రేడింగ్ ఎందుకు తగ్గించారని సూటిగా ప్రశ్నించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు రేటింగ్ ఇచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో దేశానికి ఏపీ ఆదర్శంగా ఉందని, ఎనిమిది అవార్డులు వచ్చాయని దీనిని అభినందించాలి అని పేర్కొన్నారు.

 

09:06 - March 7, 2017

విజయవాడ : ఏపీ శాసనసభలో రెండో రోజు ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రవేశ పెట్టనున్నారు. దీనిని టిడిపి ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి బలపరచనున్నారు. గవర్నర్ ప్రసంగంపై వైసీపీ పలు విమర్శలు గుప్పించింది. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ప్రసంగం ఉందని, గవర్నర్ చేత తప్పులు చెప్పించిందని ఆరోపించింది. దీనిపై జగన్ సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు. ఇక ప్రశ్నోత్తరాల్లో విద్యుత్ ప్రసార పంపిణీ నష్టాలు, ఎస్సీ, ఎస్టీ గృహాలకు విద్యుత్ ఛార్జీల మినహాయింపు, గాలేరు - నగరి, విశాఖ సదస్సు, బీసీ సంక్షేమాలపై సభ్యులు అడిగే ప్రశ్నలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.

గుంటూరు మిర్చియార్డులో నిలిచిన కొనుగోళ్లు..

గుంటూరు : మిర్చియార్డులో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ ట్రేడింగ్ విధానం ఎత్తివేయాలంటూ ఎగుమతి దారులు కొనుగోళ్లు నిలిపివేశారు. దీనితో మార్కెట్ యార్డు ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు.

శాసనసమండలిలో ప్రశ్నోత్తరాలు...

విజయవాడ : శాసనమండలిలో రెండో రోజు ప్రశ్నోత్తరాలు ఈ విధంగా ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలో సౌకర్యాలు, విశాఖ హజరత్ ఇషాక్ మదానీ అలియాస్ దర్గా ఆస్తులు, అనవసర వ్యాధి నిర్దారణ పరీక్షలు, ఆరోగ్య శ్రీ, రైతులకు పాస్ పుస్తకాలు, విజయగనరంలో భూ ఆక్రమణ, పెద్ద నోట్ల రద్దు, రేషన్ షాపులపై ప్రశ్నలున్నాయి.

శాసనసభ ప్రశ్నలు..ఇవే..

విజయవాడ : ఏపీ శాసనసభ రెండో రోజు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలు తొలుత చేపట్టనున్నారు. విద్యుత్ ప్రసార పంపిణీ నష్టాలు, ఎస్సీ, ఎస్టీ గృహాలకు విద్యుత్ ఛార్జీల మినహాయింపు, గాలేరు - నగరి, విశాఖ సదస్సు, బీసీ సంక్షేమాలపై సభ్యులు అడిగే ప్రశ్నలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.

08:23 - March 7, 2017

విజయవాడ : ప్రజా సమస్యలే తమకు ముఖ్యమని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కాసేపట్లో రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 9గంటలకు శాసనసభ, 10గంటలకు శాసనమండలి ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రశ్నోత్తరాలు, అనంతరం వాయిదా తీర్మానాల ప్రస్తావన జరగనుంది. గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాల తీర్మానాన్ని శాసనసభలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రవేశ పెట్టనున్నారు. దీనిని టిడిపి ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి బలపరచనున్నారు. రోజాపై ప్రివిలేజ్ కమిటీ నివేదిక సభ ముందుకు వస్తుందా ? లేదా ? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా టెన్ టివితో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. బీఏసీ సమావేశంలో తాము 43 అంశాలపై చర్చించాలని పేర్కొన్నట్లు, అన్నీ ప్రజా సమస్యలే ఉన్నాయన్నారు. ప్రతి అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పే విధంగా ఉండాలని, ఏదో ఒక ఆరోపణలు చేయడం తగదన్నారు. రోజా అంశం ముగిసిపోయిందని, తప్పించుకొనే ప్రయత్నంలో ఇలాంటివి చేస్తున్నారని తెలిపారు. సంయమనం పాటించాలని అనుకుంటున్నట్లు, ప్రజా సమస్యలు చర్చకు వచ్చే విధంగా చూడాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగం కరపత్రంలా ఉందని..అసత్యాలు పలికించారని, దీనిపై జగన్ మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

రెండో రోజు ఏపీ అసెంబ్లీ..

విజయవాడ : అమరావతిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. 9గంటలకు శాసనసభ, 10గంటలకు శాసనమండలి ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రశ్నోత్తరాలు, అనంతరం వాయిదా తీర్మానాల ప్రస్తావన జరగనుంది. గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాల తీర్మానాన్ని శాసనసభలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రవేశ పెట్టనున్నారు. దీనిని టిడిపి ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి బలపరచనున్నారు. రోజాపై ప్రివిలేజ్ కమిటీ నివేదిక సభ ముందుకు వస్తుందా ? లేదా ? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

08:11 - March 7, 2017

టాలీవుడ్..బాలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా ఒక హీరో నటించే మూవీ సెట్ కు ఇతర హీరోలు వచ్చి సందడి చేస్తుంటారు. ఇలా అడపదడపా జరుగుతుంటాయి. టాలీవుడ్ లో ఈ సందడి అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. యంగ్ హీరోల సినిమా స్పాట్ కు ప్రముఖ హీరోలు హాజరైతే ఆ సందడి అంతా ఇంత ఉండదు. సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుందని ప్రచారం జరుగుతోంది. ప్రిన్స్ 'మహేష్ బాబు' - ‘మురుగదాస్' కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సామాజిక కోణంలో సినిమా తీసే మురుగదాస్ ఈ చిత్రంలో ఓ సామాజిక అంశాన్ని స్పృశించారని తెలుస్తోంది. ఇప్పటి వరకూ టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ.. విడుదల కాలేదు. కనీసం సెట్స్ మీద నుంచి కూడా ఎలాంటి స్టిల్స్ నూ విడుదల చేయలేదు. కానీ ఓ ఫొటో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సినిమా షూటింగ్ సెట్స్ ను మెగాస్టార్ 'చిరంజీవి' సందర్శించినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలో 'మహేష్ బాబు'..’చిరంజీవి'..’మురుగదాస్' లున్నారు. అసలు 'చిరంజీవి' షూటింగ్ స్పాట్ కు వెళ్లారా ? లేదా ? అనేది మాత్రం తెలియరాలేదు.

08:04 - March 7, 2017

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా ఏకగ్రీవంగా కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఎన్నికలకు పోకుండా అందరి సమ్మతితో ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవాలని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు సూచించడంతో ఎన్నికల జోలికి పోలేదు. ఫిల్మ్ ఛాంబర్ భవనంలోని నిర్మాత మండలి హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్త మా కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా శివాజీరాజా, ప్రధాన కార్యదర్శిగా నరేష్ ఎన్నికయ్యారు. 'మా'లో 750 మంది సభ్యులు ఉన్నారు. వారి సంక్షేమానికి కృషి చేస్తా' అని శివాజీరాజా వెల్లడించారు. రెండేళ్లకొకసారి 'మా' అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. నూతన కార్యవర్గం ఇలా ఉంది..

 • అధ్యక్షుడు - జి. శివాజీరాజా
 • కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు - ఎం. శ్రీకాంత్
 • ఉపాధ్యక్షులు- ఎంవీ బెనర్జీ, కె. వేణుమాధవ్‌
 • ప్రధాన కార్యదర్శి- వీకే నరేశ్
 • సంయుక్త కార్యదర్శులు- హేమ, ఏడిద శ్రీరామ్‌
 • కోశాధికారి- పరుచూరి వేంకటేశ్వరరావు
07:41 - March 7, 2017

బాహుబలి 2..చిత్రం గురించి భారీ అంచనాలు నెలకొన్నాయి. యావత్ ప్రపంచం ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. చిత్ర ట్రైలర్ ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ‘బాహుబలి : ది బిగినింగ్' ఎన్ని సంచనాలు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'బాహుబలి : ది కన్ క్లూజన్' చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే గుమ్మడికాయ కొట్టిన చిత్ర యూనిట్ ఇతర పనుల్లో నిమగ్నమైంది. ఏప్రిల్ 28న చిత్రాన్ని విడుదల చేయాలని రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఆలోపు చిత్ర ట్రైలర్ విడుదల చేయాలని రాజమౌళి బృందం రంగం సిద్ధం చేస్తోంది. మార్చి మూడో వారంలో 'బాహుబలి 2’ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు, ఈనెల 15 లేదా 16 గానీ హైదరాబాద్ లో ట్రైలర్ ని ఆవిష్కరించే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ట్రైలర్ నిడివి సుమారు రెండున్నర నిమిషాలున్నట్లు, అన్ని భాషాల్లోనూ ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుష్క, రానా, తమన్నా కీలక పాత్రలు పోషించారు. ఇక చిత్ర పాటలు ఏప్రిల్ మొదటి వారంలో పాటలని విడుదల చేసే అవకాశం ఉంది.

నేడు టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ లు..

హైదరాబాద్ : ఈ రోజు ఉదయం 11గంటలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కృష్ణారెడ్డి, మైనంపల్లి, గంగాధర్ గౌడ్ లు నామినేషన్ లు దాఖలు చేయనున్నారు.

07:30 - March 7, 2017

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. సాధ్యమైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించింది. మరోవైపు జేఏసీపై అధికారపక్షం పలు ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నగేష్ (విశ్లేషకులు), కేష్ (టీఆర్ఎస్), జూలకంటి రంగారెడ్డి (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

06:49 - March 7, 2017

పదో తరగతి పరీక్షల్లో గ్రామీణ విద్యార్థులు ముఖ్యంగా భయపడే సబ్జక్ట్ ఇంగ్లీష్. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఫెయిలయ్యే సబ్జక్ట్ కూడా ఇదే. కాబట్టి, ఇంగ్లీష్ పేపర్ అనగానే చాలామంది విద్యార్థులు భయపడుతుంటారు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి ? పదో తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ పేపర్ ప్రిపరేషన్ లో పాటించాల్సిన సూత్రాలేమిటి? ఇంగ్లీష్ లో మంచి మార్కులు సాధించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఇంగ్లీష్ టీచర్ జాన్సన్ విజయవాడ 10టీవీ స్టూడియో నుండి సలహాలు..సూచనలు అందించారు. ఎలాంటి సూచనలు..సలహాలు అందించారో వీడియో క్లిక్ చేయండి.

నాలుగు ఖండాతర క్షిపణులు ప్రయోగించిన ఉత్తర కొరియా..

ఢిల్లీ : ఉత్తర కొరియా ఒకేరోజు ఏకంగా నాలుగు ఖండాతర క్షిపణులను ప్రయోగించింది. ప్యోంగాన్‌ ప్రావిన్స్‌లోని టాంగ్‌చాంగ్‌-రి ప్రాంతం నుంచి వెయ్యి కిలోమీటర్ల రేంజ్‌లో ఈ ప్రయోగాలు జరిగినట్లు ద.కొరియా రక్షణ శాఖ వెల్లడించింది.

ఐఎన్ఎస్ విరాట్‌కు వీడ్కోలు..

ఢిల్లీ : భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్‌కు వీడ్కోలు చెప్పారు. ఈ నౌక‌ను గుజ‌రాత్‌లోని అలాంగ్‌కు పంపిస్తారు. నేవీ అధికారులు విరాట్‌ను అమ్మకానికి పెడతారు.

యూపీలో ముగిసిన చివరి విడత ఎన్నికల ప్రచారం..

ఉత్తరప్రదేశ్ : అసెంబ్లీ చివరి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏడు జిల్లాల్లోని 40 అసెంబ్లీ స్థానాలకు మార్చి 8న పోలింగ్‌ జరగనుంది. మొత్తం 535 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

06:43 - March 7, 2017

విజయవాడ : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఓ వైపు గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతుంటే.. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు 8 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ తరఫున నారా లోకేష్‌ సహా మొత్తం ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అటు వైసీపీ తరపున 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏపీలో ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఎమ్మెల్సీ నామినేషన్లు దాఖలు చేసేందుకు మంగళవారం చివరి రోజు కావడంతో టీడీపీ అభ్యర్థులుగా నారా లోకేష్, కరణం బలరాం, బచ్చుల అర్జునుడు, పోతుల సునీత, డొక్కా మాణిక్యవరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి దేవినేనితో పాటు భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. మండలి సభ్యత్వం కోసం నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు నేతలు తరలిరావటంతో శాసనమండలి ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.

టిడిపి..వైసిపి..
లోకేష్‌ను ఎమ్మెల్యే బాల‌కృష్ణ అసెంబ్లీ సెక్రటరీ వద్దకు తీసుకెళ్ళారు. కేఈ కృష్ణమూర్తి, క‌ళా వెంక‌ట్రావు,కాలువ శ్రీ‌నివాసులు లోకేష్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలు, విప్‌లు బ‌ల‌ప‌రిచారు. మ‌ర్యాద‌పూర్వకంగా లోకేష్ స్పీక‌ర్‌ని క‌లిశారు. పార్టీలో కష్టపడి ప‌నిచేయ‌డం వ‌ల్లే ఎమ్మెల్సీ ప‌ద‌వి ల‌భించింద‌ని...పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషిచేస్తానని సృష్టం చేశారు లోకేష్. పార్టీఏ బాధ్యత అప్పగించినా.. నిర్వరిస్తానన్నారు. శాసన మండలి సభ్యత్వం కోసం వైసీపీ తరఫున ఆళ్లనాని, గంగుల ప్రభాకర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక డమ్మీగా గంగుల ప్రభాకర్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి కూడా నామినేషన్ వేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయసభలు వాయిదా పడిన తర్వాత వీరు తమ నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శి సత్యనారాయణరావుకు సమర్పించారు. వారి పేర్లను వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ప్రతిపాదించారు.

06:40 - March 7, 2017

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు వ్యవహారం చంద్రబాబును వదిలేలా లేదు. ఈ కేసులో సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. , వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. సాధ్యమైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఓటుకు నోటు వ్యవహారం అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సుప్రీం కోర్టు చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసును సమగ్రంగా విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది.

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..
ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కేసులో తనకు లోకస్ స్టాండ్ లేదని హైకోర్టులో తీర్పు ఇచ్చారని.. అందువల్లే హైకోర్టు నిర్ణయాన్ని తాను సుప్రీంలో సవాలు చేశానని అన్నారు. చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలంటే.. సీఎం పదవికి రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలని ఆర్కే డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. పిటిషనర్ తరఫు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. విచారణ సమయంలో కోర్టుకు వివరాలు సమర్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వడం సాధారణ విషయం కాదని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. ఫోన్‌ టేపుల్లో ఆ గొంతు తనది కాదని చంద్రబాబు ఏ సందర్భంలోనూ చెప్పలేదన్నారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడంపై చంద్రబాబు స్పందించారు. కోర్టుల నుంచి నోటీసులు రావడం సహజమేనని అన్నారు. ఇందులో కొత్తేముందని, చాలాసార్లు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో ఎవరి ఆరోపణల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

06:38 - March 7, 2017

విజయవాడ : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు తొలిసారి నూతన రాజధాని అమరావతిలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి సస్పెండ్‌ అయిన ఎమ్మెల్యే రోజా కూడా హజరయ్యారు. గతేడాది అసెంబ్లీలో రోజా అనుచిత ప్రవర్తనతో స్పీకర్‌ ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు వేశారు. సస్పెన్షన్‌ పూర్తి కావడంతో రోజా తిరిగి అసెంబ్లీ సమావేశాలకు హజరయ్యారు. అయితే రోజాపై మరోసారి సస్పెన్షన్‌ విధించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. స్పీకర్‌ ఏ నిర్ణయంతీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో మళ్లీ అడుగు పెట్టారు. ఆమె అసెంబ్లీ లోపలకు వస్తుండగా ఎవరూ అడ్డుకోలేదు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వైసిపి ఎమ్మెల్యేలు బస్సులో వచ్చారు. పార్టీ అధినేత జగన్‌తో కలిసి ఎమ్మెల్యేలు అంతా బస్సులో అసెంబ్లీకి వచ్చారు. అధినేత జగన్‌తో కలిసి రోజా వచ్చారు. రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్‌ పూర్తి కావడంతో ఆమెను ఏ అధికారి అడ్డుకోలేదు. ఇదిలా ఉండగా, రోజాపై మరో ఏడాది పాటు సస్పెన్షన్ విధించే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రివిలేజ్ కమిటీ స్పీకర్‌కు నివేదిక..
ప్రివిలేజ్ కమిటీ స్పీకర్‌కు నివేదిక ఇచ్చని తర్వాత అసెంబ్లీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. అనుచితంగా ప్రవర్తించిన కారణంగానే రోజాపై ఏడాది పాటు వేటు వేశారని, అలాంటప్పుడు మళ్లీ పొడిగించడం అనే ప్రచారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే అనితను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రోజాపై ఏడాది సస్పెన్షన్ విధించారు. మళ్లీ పొడిగింపు అనడం సరికాదని వైసీపీ నేతలు అంటున్నారు. ఏడాది తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే రోజాపై మరోసారి సస్పెన్షన్‌ తప్పదనే చర్చల నేపథ్యంలో .. స్పీకర్‌ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపైనే ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏడాదిపాటు సభకు దూరంగా ఉన్న రోజా.. అసెంబ్లీలో కొనసాగేది లేనిది ప్రివిలైజ్‌ కమిటీ రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే తేలనుంది.

06:35 - March 7, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్స్‌ నియామకాలపై రభస కొనసాగుతోంది. ఓపెన్‌ చాలెంజ్ విధానాన్ని ప్రవేశపెట్టినా.. అభ్యర్థులు సంతృప్తి చెందడం లేదు. కొందరు అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానం గడప తొక్కారు. మరోవైపు అవకతవకలపై నివేదిక ఇచ్చేందుకు తమకు సమయం కావాలని పోలీస్‌ శాఖ హైకోర్టున కోరింది. ఈనేపథ్యంలో ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన వారికి మెడికల్‌ టెస్టులు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలీస్ కానిస్టేబుల్ నియామకం ఆదిలోనే హంసపాదంలా మారింది. 11 వేల పోస్టులకు ఏడాది క్రితం నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు.. 15 రోజుల క్రితం 10 వేల పోస్టులకు ఫలితాలను విడుదల చేశారు. అయితే ఫలితాల విడుదల్లో ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో తొందర పాటుగా ఫలితాలను విడుదల చేశారనే అరోపణలు ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు కావడం, జేఏసీ నిరుద్యోగ ర్యాలీకి పిలుపునివ్వడంతో పోలీస్‌ రిక్యూట్‌మెంట్‌ బోర్డు కట్‌ ఆఫ్‌ మార్కులను ప్రకటించకుండానే హడావిడిగా కేవలం హాల్‌ టికెట్ల నెంబర్లను ప్రకటించింది.

సంతృప్తి చెందని అభ్యర్థులు..
పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌ హడావిడితో 81 మార్కులు వచ్చిన విద్యార్ధులు ఉద్యోగం రావడం, 120 మార్కులు వచ్చిన వారి పేర్లు ఫలితాల్లో లేకపోవడంతో అభ్యర్థులు ఆగ్రహానికి గురయ్యారు. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలు, అవకతవకలు జరిగాయని అరోపించారు. దీంతో డీజీపీ అనురాగ్ శర్మ ఓపెన్ చాలెంజ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయి. ఎందుకు వారికి ఉద్యోగం రాలేదో.. స్పష్టత ఇస్తామని ఫిర్యాదులు తీసుకున్నారు. అయితే పోలీసులు చెప్పే కారణాలతో అభ్యర్థులు సంతృప్తి చెందలేదు.

120 మార్కులకు కటాఫ్..
ఓపెన్ కేటగిరిలో 120 మార్కులకు కటాప్‌గా నిర్ణయించిన అధికారులు .. ఎన్.సి.సి. కోటాలో అభ్యర్ధుల విషయంలో గందరోళం సృష్టించారు. ఎన్‌సీసీ కోటా వర్తించాల్సిన వారిని కూడా ఓపెన్ కేటగిరి అభ్యర్థులుగానే పరిగణించారు. ఇలా మహిళ రిజర్వేషన్‌లతో సహా ప్రతి కులానికి, వర్గానికి, ఎవరెవరికి ఎంత శాతం రిజర్వేషన్ ఇచ్చారనే స్పష్టతలేకుండా పోయింది. మరోవైపు ఫలితాల్లో రంగారెడ్డి, సైబరాబాద్ ఒకే జిల్లాగా పరిగణలోకి తీసుకున్నా దరఖాస్తు ఫాంలో మాత్రం రంగారెడ్డికి, సైబరాబాద్ కు వేరువేరుగా లోకల్ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో చాలా మందికి లోకల్, నాన్ లోకల్ సమస్య వచ్చింది. ఫలితాల విడుదల 60 వేల మందిని గందరగోళానికి గురి చేసింది. క్లారిటీ ఇవ్వకుండ ఎవరి కోటాలో ఎంత కట్ ఆఫ్ మార్కులు పెట్టారనే స్పష్టత లేకపోవడంతో నియమాకాల్లో ఎదో జరిగిపోయిందనే అపోహాలు అభ్యర్థుల్లో గుప్పుమన్నాయి. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు ఆ తర్వాత పోలీస్ నియామకం బోర్డు చైర్మన్ పూర్ణచందర్ రావు స్పష్టత ఇచ్చారు. అయినా అనుమానాలు నివృత్తం కాకపోవడంతో 9 మంది నల్గొండ జిల్లా అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికొందరు ప్రజాప్రయోజనాల వాజ్యం దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. ఈ నెల 13 నుంచి ఉద్యోగం వచ్చిన అభ్యర్ధులకు మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అందుకు తమని అనుమతించాలని కోరడంతో కోర్టుకు వెళ్లిన వారికి హైకోర్టు అనుమతినిచ్చింది. వచ్చే వారంలోగా అవకతవకలపై పూర్తి నివేదిక సమర్పిస్తామని ప్రభుత్వం విన్నవించుకుంది.

06:31 - March 7, 2017

విజయవాడ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ పంతం నెగ్గుతుందా..? ప్రభుత్వం, పార్టీలో ఉన్న పట్టును నిలుపుకుంటారా..? ఎమ్మెల్సీ బరిలో ఉన్న ఆత్మబంధువును గెలిపించుకుంటారా..? మంత్రి నారాయణకు ఎమ్మెల్సీ ఎన్నికలు అసలైన పరీక్షగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన శిష్యుడు పట్టాభిరామిరెడ్డిని గెలిపించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. బలమైన పీడీఎఫ్‌ అభ్యర్థులను ఎదుర్కొనేందుకు అధికారం అండగా మంత్రి నారాయణ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్న కాలం నుంచి నారాయణ ఆయనకు నమ్మిన బంటుగా ఉన్నారు. ఆ తరువాత ఎమ్మెల్సీ, మంత్రి పదవితో పాటు కీలక బాధ్యతలు చేపట్టడం చక చకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు నారాయణకు పరీక్షగా మారాయి. తన విద్యా సంస్థల బాధ్యతలు చూసే శిష్యుడు పట్టాభిరామిరెడ్డి గ్రాడ్యుయేట్ల స్థానానికి పోటీ పడుతున్నారు. మత్రి నారాయణ ప్రతిష్టకు ఈ ఎన్నికలు అసలైన పరీక్షగా మారాయి. అందుకే ముఖ్యమంత్రి అండతో ఎలక్షన్‌ రాజకీయాలను తనదైన శైలిలో నడుపుతున్నారు నారాయణ. డబ్బు వెదజల్లుతూ తాయిలాల తాంబూలాలను ఎరజూపుతూ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు షురూ చేస్తున్నారనే అరోపణలు గుప్పుమంటున్నాయి.

బూత్ లెవల్ నుండి సమీక్ష..
రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ కనుసన్నల్లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నారు. ఆయన అదుపు ఆజ్ఞల ప్రకారమే కొంత మంది అధికారులు, ఇతర ఉద్యోగులు కూడా ఆదేశాలను అమలు చేయక తప్పడం లేదు. సీఎం చంద్రబాబును ఒప్పించి తీసుకున్న సీటును ఎలాగైన గెలుచుకోవాలన్న పట్టుదలతో నారాయణ రాత్రింబవళ్లు రాజకీయం నడుపుతున్నారు. ఒక వైపు జిల్లాల్లోని తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఒక్కటై పోరాడుతున్నా ఎక్కడో ఉన్న ఓ చిన్న సందేహం ఇప్పుడు నారాయణకు నిద్రపట్టనివ్వడం లేదు. అందుకే బూత్ లెవల్ నుంచి సమీక్ష నిర్వహిస్తున్నారు.

పగలు పనులు..రాత్రి పూట..
మరోవైపు యూటీఎఫ్‌కు ఉన్న సంస్థాగత, సంప్రదాయ బలం ముందు ఎన్ని కార్పొరేట్ ఎత్తులు వేసిన వృధా అనేది కూడా నారాయణకు మింగుడు పడటం లేదు. అయితే డబ్బుతో కొన్ని సాధించొచ్చన్న ఒక్క నమ్మకమే నారాయణను ముందుకు నడుపుతోంది. అంతేకాదు ప్రభుత్వం ఇచ్చే అండతో ఏమైనా చేయోచ్చనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయి. ఎంత చేసినా పీడీఎఫ్ అభ్యర్థులు సొంత బలంతో దూసుకుపోతున్న తీరు నారాయణను పరుగులు పెట్టిస్తోంది. మంత్రి ఈ ఎన్నికలను ఎంత సీరియస్‌గా తీసుకున్నారంటే పగలు రాజధానిలో పనులు చూసుకుని రాత్రి పూట కార్యకర్తలతోనూ, తన సంస్థలోని టీమ్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్నారు.

టెన్షన్..
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నిక పట్టాభిరామిరెడ్డిది కాదని ఈ ఎన్నిక నారయణదే అన్నంతగా సీన్‌ క్రీయేట్‌ అయింది. ఒక వైపు మంత్రిగా, మరో వైపు నారాయణ విద్యా సంస్థల అధినేతగా ఈ విజయం ఈయనకు అత్యవసరమైంది. పార్టీలో, బయట మరింత పట్టు బిగించేందుకు ఈ ఎన్నిక లాభిస్తోందని మంత్రి ఆశిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి పట్టాభిరామిరెడ్డి కంటే నారాయణే ఎక్కువ టెన్షన్ పడుతున్న వాతావరణం కనిపిస్తోంది.

06:26 - March 7, 2017

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక భవనాల్లో శాసనసభ, శాసనమండలి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా రాజధానిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు వెలగపూడి వచ్చిన నరసింహన్‌కు అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్‌ చక్రపాణి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థిక, శానససభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న లోక్‌సభ, అసెంబ్లీల జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ఏపీ మద్దతు ప్రకటించింది. దీని వలన ఎంతో సమయంతోపాటు, ప్రజాధానం ఆదా అవుతుందని సూచించారు. ప్రభుత్వాలు పరిపాలన, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టేందుకు వీలు కలుగుతుందని నరసింహన్‌ ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చారు. ఇదే సమయంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన ఏడాదిలోగా పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ స్థానిక సంస్థలకు కూడా ఎలక్షన్‌ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుందని సూచించారు.

అమరావతి అద్భుత రాజధాని..
కాపుల రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ నరసింహన్‌ ఉభయసభల సంయుక్త సమావేశం దృష్టికి తెచ్చారు. జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ నివేదిక వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాపుల రిజర్వేషన్లతో బీసీలకు నష్టం జరుగదని భరోసా ఇచ్చారు. అమరావతిని అద్భత రాజధాని నగరంగా తీర్చిదిద్దుతున్నామని నరసింహన్‌ ఉభయసభల సంయుక్త సమావేశం దృష్టికి తెచ్చారు. 2029 నాటికి ఏపీ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా అవతరిస్తుందన్న ఆశాభావాన్ని నరసింహన్‌ వ్యక్తం చేశారు. 2050 నాటికి ప్రపంచంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తుందని ఉభయసభల దృష్టికి తెచ్చారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. అభివృద్ధికి శాంతిభద్రతలే కీలనమన్న విషయాన్ని నరసింహన్‌ స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

రెండంకెల వృద్ధి రేటు..
ఆంధప్రదేశ్‌ను దేశంలోనే విజ్ఞాన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న అంశాన్ని నరసింహన్‌ ప్రస్తావించారు. ఇందుకోసం మానవ వనరుల అభివృద్ధికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను వివరించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి రేటు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యసాయం, అనుబంధ రంగాల్లో 24 శాతం, పారిశ్రామికాభివృద్ధిలో 9.5 శాతం వృద్ధి నమోదైన అంశాన్ని ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. డయా ఫ్రం వాల్‌, స్పిల్‌వే రెగ్యులేటర్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న అంశాన్ని ఉభయ సభల సంయుక్త సమావేశం దృష్టికి తెచ్చారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన నరసింహన్‌... ప్రగతి ఫలాలు అందరికీ అందాలంటూ తెలుగులోనే ముగించారు.

ఏపీ అసెంబ్లీలో నేడు..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం జరగనుంది. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ప్రవేశ పెట్టనున్నారు.

మహిళా ఉద్యోగులకు 8న సెలవు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ఈనెల 8న ప్రత్యేక సెలవుగా ప్రభుత్వం పరిగణించింది. స్పెషల్ క్యాజువల్ లీవ్ గా ప్రకటిస్తూ సర్క్యూలర్ జారీ చేసింది.

కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగాల దరఖాస్తుల గడువు పెంపు..

హైదరాబాద్ : తెలంగాణలో కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 25 వరకు పొడిగించారు. గడువును పెంచుతూ టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రావెల్ బ్యాన్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం..

అమెరికా : ట్రావెల్ బ్యాన్ ఆర్డర్ పై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆరు ముస్లిం దేశాల నుండి వలసదారులపై 90 రోజుల పాటు నిషేధం విధించారు. నిషేధం నుండి ఇరాక్ ను మినహాయించారు. మార్చి 16 నుండి ట్రావెల్ బ్యాన్ ఆర్డర్ అమలు కానుంది. నిషేధిత జాబితాలో ఇరాన్, లిబియా, సుడాన్, సోమాలియ, సిరియా, యెమన్ దేశాలున్నాయి.

గోదావరిఖనిలో అగ్నిప్రమాదం..

పెద్దపల్లి : గోదావరిఖని హనుమాన్ నగర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి మూడు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

Don't Miss