Activities calendar

08 March 2017

పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

ఛత్తీస్ గఢ్ : గాయా అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరి నుంచి పోలీసులు ఏకే 47, గన్ స్వాధీనం చేసుకున్నారు. 

 

ఆ రైతుల భూములను గ్రీన్ బెల్ట్ కింద ప్రకటించాలని బాబు నిర్ణయం

గుంటూరు : రాజధాని భూ సమీకరణకు ముందుకు రాని రైతుల భూములను గ్రీన్ బెల్ట్ కింద ప్రకటించాలని బాబు నిర్ణయించారు. ఆ భూముల్లో వ్యవసాయం మినహా రియల్ ఎస్టేట్ చేసేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని సీఆర్ డీఏ సమీక్షలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలు... ఓటు హక్కు వినియోగించుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు స్పెషల్ లీవ్

హైదరాబాద్ : ఏపీలో రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు స్పెషల్ లీవ్ ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందికి సెలవు వర్తిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు విధుల వేళల్లో మార్పు చేయాలని యాజమాన్యాలకు సూచించారు. 

సాంస్కృతిక యువ రాయబారిగా కుమారి యామిని

అమరావతి : మహిళా దినోత్సవం సందర్భంగా కూచిపూడి నృత్య కళాకారిణి కుమారి యామినిని సాంస్కృతిక యువ రాయబారిగా చంద్రబాబు నియమించారు.

ప్రజాధనాన్ని దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబం : రేవంత్ రెడ్డి

కరీంనగర్ : టీఆర్ ఎస్ నేతలపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. హుజురాబాద్ లో నిర్వహించిన టీడీపీ ప్రజాపోరుకు ఆయన హాజరై, మాట్లాడారు. కేసీఆర్ చేసే దోపిడీకి ఈటెల రాజేందర్ సజీవ సాక్షి అని అన్నారు. సంతకాలతో వేల కోట్ల ప్రజా ధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. రాష్ట్రాన్ని తాగుబోతు సీఎం చేతుల్లో పెట్టడం వల్లే ప్రభుత్వ ఖర్చులకు లెక్క లేకుండా పోతోందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాకపోతే కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హుజురాబాద్ లో టీడీపీ ప్రజా పోరు

కరీంనగర్ : హుజురాబాద్ లో టీడీపీ ప్రజా పోరు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ ఎస్ నేతలపై రేవంత్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ చేసే దోపిడీకి ఈటెల రాజేందర్ సజీవ సాక్షి అని అన్నారు. 

 

21:30 - March 8, 2017

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు గుజరాత్‌లో ఓ మహిళా సర్పంచ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అది కూడా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో కావడం విశేషం. ఉమెన్స్‌ డే సందర్భంగా గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న స్వచ్చ్‌ శక్తి 2017 కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు యూపీ నుంచి మహిళా సర్పంచ్‌ షాలిని రాజ్‌పుత్‌ వచ్చింది. అయితే వేదిక సమీపానికి చేరుకోగానే..అక్కడున్న కొందరు సిబ్బంది అమెను పక్కకు లాగిపడేశారు. తాను యూపీ నుంచి వచ్చిన సర్పంచ్‌నని చెప్పినా..భద్రతా సిబ్బంది పట్టించుకోకుండా వేదిక నుంచి దూరంగా ఈడ్చుకెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానంపై మహిళా సర్పంచ్ షాలిని రాజ్‌పుత్ మీడియాతో మాట్లాడుతూ..మహిళా సర్పంచ్ అయినప్పటికీ తాను యూపీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను,..ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని ఎంతో ఆశతో వచ్చానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : భన్వర్ లాల్

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈమేరకు భన్వర్ లాల్ మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రంలో ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డిగ్రీ ధృవ పత్రాల్లో ఏదైనా ఒకటి చూపించాలని, లేకపోతే ఓటింగ్‌కు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఓటర్లు మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావద్దని కోరారు.  

21:24 - March 8, 2017

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 13 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 24 మంది మహిళలకు అవార్డులు అందించింది. లలితా కళాతోరణంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మహిళలకు పౌరుషానికి ప్రతీకలని ఎంపీ కవిత అన్నారు. ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర పోషించారని అన్నారు. మహిళల విద్య, ఉపాధి, ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని.. ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని కవిత చెప్పారు. అలాగే మంత్రులు... ప్రభుత్వ అధికారులు పాల్గొని పురస్కార గ్రహీతలకు, మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

21:22 - March 8, 2017

పశ్చిమగోదావరి : తుందుర్రులో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆక్వా ఫుడ్‌ పార్క్‌ వద్దంటూ స్థానిక రైతులు నిరసనకు దిగారు. వీరికి పలు పార్టీలు మద్దతు తెలిపాయి. ఆందోళనకారులతో పాటు పార్టీ నేతలను అడ్డుకుని.. అరెస్ట్‌ చేశారు. నిర్బంధాలతో తమ ఉద్యమాన్ని ఆపలేరని ఈ సందర్భంగా ఆందోళనకారులు హెచ్చరించారు.

తుందుర్రులో పోలీసుల నిర్బంధం......

అక్వాఫుడ్‌ పార్క్‌ అన్యాయమంటూ అన్నదాతలు కదం తొక్కారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న ఫుడ్‌ పార్క్‌ను రద్దు చేయాలని పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో స్థానికులు ఆందోళన బాట పట్టారు. ప్రజాశ్రేయస్సును పరిగణనలోకి తీసుకోని ప్రభుత్వం మాత్రం రైతులు, గ్రామస్థులపై కేసులు పెడుతూ అరెస్ట్‌ల పర్వం కొనసాగిస్తోంది. గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించి ప్రజల గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తోంది. అయినా రైతులు, గ్రామస్థులు సీపీఎం, వైసీపీ పోరుబాట పట్టారు. అక్వా ఫుడ్‌ పార్క్‌ ముట్టడికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముట్టడికి బయలుదేరిన రైతులు, ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్వా ఫుడ్‌ పార్క్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన పలువురు సీపీఎం, వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ప్రపంచమంతా మహిళలను గౌరవిస్తూ..

ప్రపంచమంతా మహిళలను గౌరవిస్తూ.. వారి సేవలను, ఖ్యాతిని, కీర్తిస్తుంటే... ఏపీలో మాత్ర అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే అక్వా ఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళలను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం ఎంత నిర్బంధం విధించినా...ఫ్యాక్టరీని అడ్డుకుని తీరుతామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. రెండు రోజులుగా పోలీసులు గ్రామాల్లో మోహరించి ప్రజలను ఇళ్లనుంచి బయటకు రానీయని పరిస్థితి ఉంది. ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా.. ప్రభుత్వం మాత్రం నిర్బంధకాండను కొనసాగిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు హాని తలపెట్టే అక్వాఫుడ్‌ ఫ్యాక్టరీని అడ్డుకుంటామని ఆందోళనకారులు చెబుతున్నారు.

అక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా..

కొంతకాలంగా అక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫుడ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న తుందుర్రు పరిసర గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్‌ విధించి... భారీగా పోలీసులను మోహరించింది. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపి వేసి.. గుర్తింపు కార్డులు లేని వారిని తుందుర్రులోనికి అనుమతించడం లేదు. రైతులు, గ్రామస్తులను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తాళాలు వేసి మరీ ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అక్వాఫుడ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్థానికులు, ప్రజలు హెచ్చరిస్తున్నారు.

వైభవంగా ప్రారంభమైన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుమల : శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా తెప్పపై రాముల వారు ఊరేగుతోన్నారు. 

మనం సాధించిందేమీ లేదు : పవన్ కళ్యాణ్

విజయవాడ : రేపు ప్రపంచ కిడ్నీ వ్యాధి నివారణ దినోత్సవం. 21 ఏళ్లుగా కిడ్నీ వ్యాధి నివారణ దినోత్సవం జరుపుకుంటున్నా.... మనం సాధించిందేమీ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతం, ప్రకాశం జిల్లా కనిగిరిలో కిడ్నీ వ్యాధి ప్రజల ప్రాణాలను హరిస్తోందన్నారు. ఈ వ్యాధితో ఇప్పటికే 50 వేల మంది ప్రజలు మంచానపడ్డారని తెలిపారు. వేలాది మంది విగత జీవులయ్యారని ఆవేదన చెందారు. రెక్కాడితేగాని డొక్కాడని ఈ వ్యాధి బారిన పడి ప్రతి నెల రూ.8 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇన్నాళ్లకు సర్కార్ స్పందించడం సంతోషమన్నారు.

20:36 - March 8, 2017

హైదరాబాద్: మహిళా శక్తిని విశ్వమంతా విస్తరిస్తున్నారు. విజయవంతమైన మహిళలుగా దూసుకుపోతున్నారు. నేరగాళ్ల ఆటలను కట్టిస్తూ మహిళలకు కొండత అండగా నిలుస్తూ ఎంతో మంది యువతకు, మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు పోలీసు శాఖలో ఉన్నతమైన పదవుల్లో కొనసాగుతున్న ఆముగ్గురు మహిళా పోలీసు అధికారులు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని '10టివి' స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఏసీపీ, షీటీమ్స్ ఇంఛార్జ్ స్వాతిలక్రా, నార్త్ జోన్ డీసీపీ సుమతి,షీటీమ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కవిత పాల్గొన్నారు. పర్సనల్ లైఫ్ తో ప్రొఫెషనల్ లైఫ్ ను ఎలా లీడ్ చేస్తున్నారు. వారి హాబీలు ఏమిటి ఇత్యాది అంశాలను వారు ప్రస్తావించారు. మరి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:34 - March 8, 2017

హైదరాబాద్: కథ మొదటికి వచ్చిందా? మళ్లీ నో క్యాష్ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏటీఎంలు, బ్యాంకులు ఎందుకు ఖాళీ అయ్యాయి? సర్కార్ ప్లాన్ బెడిసికొట్టిందా? అవసరాలకు సరిపడినంత క్యాష్ అందుబాటులో లేదా? అంతా సర్ధుమణిగింది అనుకున్నంతలోనే మళ్లీ బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది? అసలు ఏం జరుగుతోంది? ఇదే అంశంపై నేటి వైడాంగిల్ లో స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

అనంతపురం : సింగనమల మండలం రాచేపల్లిలో విషాదం నెలకొంది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు సురేష్ (21), నరేష్ (22) గా గుర్తించారు. 

ప్రధాని మోడీకి కాన్సస్ గవర్నర్ లేఖ

ఢిల్లీ : భారత ప్రధాని మోడీకి కాన్సస్ గవర్నర్ లేఖ రాశారు. అమెరికాలో భారతీయులపై దాడుల పట్ల కాన్సస్ గవర్నర్ బ్రౌన్ బ్యాక్ విచారం వ్యక్తం చేశారు. కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబం వేదన వర్ణనాతీతమన్నారు. అమెరికాలో జాత్యహంకార దాడులకు చోటు లేదని పేర్కొన్నారు.

 

మహిళా దినోత్సవం రోజు దళిత సర్పంచ్ కు అవమానం

భద్రాద్రి : అశ్వారావుపేట మండలం పేరాయిగూడెంలో మహిళా దినోత్సవం రోజు దళిత సర్పంచ్ కు అవమానం జరిగింది. కిందిస్థాయి ఉద్యోగులను సన్మానించి తనను వేదికపైకి కూడా పిలవలేదని సర్పంచ్ సత్యవతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని సత్యవతి అన్నారు. 

లలిత కళాతోరణంలో మహిళా దినోత్సవ వేడుక

హైదరాబాద్ : లలిత కళాతోరణంలో మహిళా దినోత్సవ వేడుక జరుగుతోంది. విశిష్ట మహిళలకు తెలంగాణ ప్రభుత్వ పురస్కారాల ప్రదానం చేస్తున్నారు. ఈ వేడుకకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్, మంత్రులు, నాయిని నర్సింహ్మారెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ కవిత, విప్ గొంగుడి సునీత, ఎమ్మెల్సీ లలిత, నిరంజన్ రెడ్డి, పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు. 

 

వాణిజ్య పన్నుల శాఖపై ఆధారపడి పని చేస్తోన్న ఆర్థికశాఖ : మంత్రి ఈటెల

హైదరాబాద్ : రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాల అన్వేషణపై కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ సదస్సు నిర్వహించింది. మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని, మాట్లాడారు. ఆర్థిక శాఖ వాణిజ్య పన్నుల శాఖపై ఆధారపడి పని చేస్తోందని మంత్రి అన్నారు. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంలో వాణిజ్య పన్నుల శాఖదే కీలక పాత్ర అన్నారు. మార్చిలో కమర్షియల్ ట్యాక్స్ ద్వారా రూ.3,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా ఉందని తెలిపారు. 

20:08 - March 8, 2017

హైదరాబాద్: టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పైసల పంపకం.. అనంతపురంలో అడ్డంగా దొరికిన బచ్చల, బాధపడుతున్న అన్న బొడిగ శోభక్క.. అక్కను సముదాయించుతున్న సర్పంచ్, మురిగిపోయిన కోళ్లతోనే చికెన్ పకోడీ... గుంటూరు కాడ బయటపడ్డ గలీజ్ దందా, ఆడామెను మోసం చేసిన రసమయి...ఇస్తానన్నది ఇయ్యలేదని రాజీనామా, నేటి బాలలే భావి బానిసలు... విద్యార్థులతో ఎంఈఓ తమాషా, పంది కడుపల ఏనుగు పిల్ల పుట్టిందట...హుజూర్ నగర్ కాడ కాన్పు జాతర ఇలాంటి హాట్ హాట్ విషయాలతో నేటి మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చాడు. మరి ఆ ముచ్చట్లను మీరూ వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

మహిళా కమిషన్ కు నిధుల్లేవ్, ఆఫీసు లేదు : నన్నపనేని

రాజమండ్రి : మహిళా కమిషన్ ను ఏర్పాటు చేసి సంవత్సరం దాటినా నేటికీ నిధులు లేవు, ఆఫీసూ లేదని నన్నపనేని రాజకుమారి విమర్శించారు.

విందు భోజనం తిని 15 మందికి అస్వస్థత

అనంతపురం : పరిగి మండలం గాన్లపర్తిలో విందు భోజనం తిని 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలించారు. 

మహిళా మావోయిస్టు నేతల మహిళ దినోత్సవ వేడుకలు

ఛత్తీస్ గఢ్  : సుకుమా అటవీ ప్రాంతంలో మహిళా మావోయిస్టు నేతలు మహిళ దినోత్సవ వేడుకలు జరిపారు. సుకుమా అటవీ ప్రాంతంలో గిరిజన మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మహిళా మావోయిస్టులపై జరుగుతోన్న ప్రభుత్వాల కర్కశ హత్యలను నిలిపి వేయాలని, దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను నిలుపుదల చేయాలని మావోయిస్టుల నేతలు డిమాండ్ చేశారు. 

18:50 - March 8, 2017

హైదరాబాద్: రేపు ఏపీ, తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 6 గంటలవరకు పోలింగ్‌ జరుగుతుందని భన్వర్‌లాల్‌ స్పష్టం చేశారు. 6 గంటల తర్వాత పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతి ఉండదన్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు తీసుకురావద్దని సూచించారు. ప్రతిఒక్క ఓటరు నియమనిబంధల ప్రకారం ఓటు వేయాలని సూచించారు.

18:47 - March 8, 2017

పశ్చిమగోదావరి : తుందుర్రులో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆక్వా ఫుడ్‌ పార్క్‌ వద్దంటూ స్థానిక రైతులు నిరసనకు దిగారు. వీరికి పలు పార్టీలు మద్దతు తెలిపాయి. ఆందోళనకారులతో పాటు పార్టీ నేతలను అడ్డుకుని.. అరెస్ట్‌ చేశారు. నిర్బంధాలతో తమ ఉద్యమాన్ని ఆపలేరని ఈ సందర్భంగా ఆందోళనకారులు హెచ్చరించారు.

గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించి ప్రజల గొంతులు నొక్కే ప్రయత్నం...

అక్వాఫుడ్‌ పార్క్‌ అన్యాయమంటూ అన్నదాతలు కదం తొక్కారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న ఫుడ్‌ పార్క్‌ను రద్దు చేయాలని పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో స్థానికులు ఆందోళన బాట పట్టారు. ప్రజాశ్రేయస్సును పరిగణనలోకి తీసుకోని ప్రభుత్వం మాత్రం రైతులు, గ్రామస్థులపై కేసులు పెడుతూ అరెస్ట్‌ల పర్వం కొనసాగిస్తోంది. గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించి ప్రజల గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తోంది. అయినా రైతులు, గ్రామస్థులు సీపీఎం, వైసీపీ పోరుబాట పట్టారు. అక్వా ఫుడ్‌ పార్క్‌ ముట్టడికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముట్టడికి బయలుదేరిన రైతులు, ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్వా ఫుడ్‌ పార్క్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన పలువురు సీపీఎం, వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఒకపక్క మహిళలను గౌరవిస్తూ....

ప్రపంచమంతా మహిళలను గౌరవిస్తూ.. వారి సేవలను, ఖ్యాతిని, కీర్తిస్తుంటే... ఏపీలో మాత్ర అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే అక్వా ఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళలను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం ఎంత నిర్బంధం విధించినా...ఫ్యాక్టరీని అడ్డుకుని తీరుతామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.

ప్రజలను ఇళ్లనుంచి బయటకు రానీయని పరిస్థితి ...

రెండు రోజులుగా పోలీసులు గ్రామాల్లో మోహరించి ప్రజలను ఇళ్లనుంచి బయటకు రానీయని పరిస్థితి ఉంది. ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా.. ప్రభుత్వం మాత్రం నిర్బంధకాండను కొనసాగిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు హాని తలపెట్టే అక్వాఫుడ్‌ ఫ్యాక్టరీని అడ్డుకుంటామని ఆందోళనకారులు చెబుతున్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అక్వాఫుడ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపేయాలని...

కొంతకాలంగా అక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫుడ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న తుందుర్రు పరిసర గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్‌ విధించి... భారీగా పోలీసులను మోహరించింది. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపి వేసి.. గుర్తింపు కార్డులు లేని వారిని తుందుర్రులోనికి అనుమతించడం లేదు. రైతులు, గ్రామస్తులను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తాళాలు వేసి మరీ ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అక్వాఫుడ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్థానికులు, ప్రజలు హెచ్చరిస్తున్నారు.

తుందుర్రులో కొనసాగుతోన్న ఉద్రిక్తత

పశ్చిమగోదావరి : తుందుర్రులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ర్యాలీగా వెళ్లిన మహిళలను పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. మొగల్తూరు ఎస్ ఐ గురవయ్య ఓ రైతును దుర్బాషలాడుతూ కొట్టుకుంటూ తీసుకెళ్లాడు.

 

కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈనెల 14న సర్టిఫికెట్ల పరిశీలన

హైదరాబాద్ : తెలంగాణ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 14న సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది. 

బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ

హైదరాబాద్ : బీజేఎల్పీ ఆఫీసులో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చిస్తున్నారు. 

జయలలిత మృతిపై న్యాయ విచారణ జరిపే వరకు పోరాటం : పన్నీరు సెల్వం

చెన్నై : 7 కోట్ల మంది ప్రజల ఆదరణ తమకున్నదని పన్నీర్ సెల్వం అన్నారు. శశికళ వర్గం నుంచి పార్టీని విడిపించి జయలలిత మృతిపై న్యాయ విచారణ జరిపే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. 

 

దళిత దంపతులపై పోలీసులు దాడి

పెద్దపల్లి : బోంపల్లిలో దళిత దంపతులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, న్యాయవాదుల బృందం బాధితులను పరామర్శించి, వివరాలు సేకరిస్తోంది. 
 

ఐదు రాష్ట్రాల్లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 11న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి.
 

రేపు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ : భన్వర్ లాల్

హైదరాబాద్ : రేపు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కేంద్రానికి ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్టులు తెచ్చుకోవాలన్నారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూ, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని తెలిపారు. వికలాంగులు రిటర్నింగ్ అధికారికి సర్టిఫికెట్ చూపాలన్నారు. 

మల్లన్నసాగర్ సహా ఇతర పనులకు పరిపాలనా పరమైన అనుమతులు

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ సహా ఇతర పనులకు పరిపాలనా పరమైన అనుమతిలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్యాకేజీ 11, 12, 14, 15, 16 పనులకు అనుమతులు లభించాయి. మల్లన్నసాగర్, బస్వాపూర్, కూరేలిగ్రావిటి కెనాల్, గంధమల్ల, కొండ పోచమ్మ, రంగనాయక రిజర్వాయర్లకు అనుమతిచ్చారు. 7249 కోట్లతో మల్లన్నసాగర్, 1751 కోట్లతో బస్వాపూర్, 519.70 కోట్లతో కొండపోచమ్మ, 860.25 కోట్లతో గందమల్ల, 496.50 కోట్లతో రంగనాయక సాగర్ జలాశయాల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు లభించాయి. 

జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు హిజ్బుల్ తీవ్రవాదుల అరెస్టు

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు హిజ్బుల్ తీవ్రవాదులను అరెస్టు చేశారు. 

ఎన్ ఐఏ కోర్టులో అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసు విచారణ

రాజస్థాన్ : ఎన్ ఐఏ కోర్టులో అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసు విచారణ చేపట్టారు. ఎన్ ఐఏ ప్రత్యేక కోర్టు ముగ్గురిని దోషులుగా తేల్చింది. సాక్ష్యాలు లేవని స్వామి అసిమానందను నిర్ధోషిగా ప్రకటించింది. 2007 సం.లో జరిగిన అజ్మీర్ దర్గా పేలుళ్లలో ముగ్గురు మృతి చెందారు. 

 

17:45 - March 8, 2017

హైదరాబాద్: పటాన్‌చెరువులోని ముత్తంగి కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్‌ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ స్పందిస్తూ..ప్రతి సంవత్సరం విద్యా వ్యవస్థలో వచ్చే మార్పులను గ్రహించి ఎప్పటికప్పుడు విద్యార్థులకు పాఠాలు చెప్తున్నామన్నారు.

17:43 - March 8, 2017

రంగారెడ్డి : తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం కనీసం ప్రజల సమస్యల మీద మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 143వ రోజుకు చేరుకుంది. ఇవాళ నల్లగొండ జిల్లాలోని రాందాస్‌తండా, నర్సింహులగూడెం, తుమ్మలపల్లి, చండూరు, పొనుగోడు స్టేజ్‌, కురంపల్లి, జి.ఎడవల్లి గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతోంది. తుమ్మపల్లిలో పార్టీ జెండాను తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎగురవేశారు. తమ సమస్యలను పరిష్కరించేలా కృషిచేయాలని తమ్మినేనికి గ్రామస్తులు వినతిపత్రులు అందజేశారు..

17:41 - March 8, 2017

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లలో ఏబీసీడీ కేటగిరి పెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎంబీసీలకు వెయ్యి కోట్లతో కార్పొరేషన్‌ ప్రకటించారని..అమల్లోకి వస్తుందో లేదో అన్న అనుమానం కూడా తమకు ఉందన్నారు. ఏఏ కులాలు ఎంబీసీలో వస్తాయో అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పించాలన్నారు. బీసీ కమిషన్‌తో గుర్తింపు నివ్వాలన్నారు.

17:40 - March 8, 2017

హైదరాబాద్: గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల నిర్మాణం ఒక అడుగు ముందుకు... రెండ‌డుగులు వెన‌క్కి అన్నచందంగా త‌యారైంది. డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి టెండ‌ర్లు క‌రువ‌వుతున్నాయి. ఏడాదిలో ల‌క్ష ఇళ్లు నిర్మిస్తామ‌న్న ప్రభుత్వం ల‌క్ష్యానికి మాత్రం దూరంగా ఉంది. దీంతో ఏకంగా మంత్రి కేటిఆర్ రంగంలోకి దిగి బిల్డర్లతో స‌మావేశం పెట్టారు.

హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు విజయం...

హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు విజయం అందించిన అంశాల్లో ముఖ్యమైంది డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు. ఇళ్లు లేని వారందరికి మురికి వాడల్లో నివసిస్తున్న వారికి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాల తర్వాత ఈ ఏడాదిలోనే ల‌క్ష ఇళ్లు నిర్మిస్తామ‌ని ప్రక‌టించారు. అందుకు త‌గ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని అటు ప్రభుత్వం ఇటు జీహెచ్‌ఎంసీ చెబుతోంది. అయితే ఈ ప‌రిస్థితిలో మాత్రం పెద్దగా పురోగ‌తి క‌నిపించ‌డం లేదు. ఇప్పటి వ‌ర‌కు వేలాది ఇళ్లకు ప‌రిపాల‌న అనుమ‌తులు మంజూరు చేసింది ప్రభుత్వం. కానీ సిటిలో మాత్రం డ‌బుల్ బెడ్ రూం ప్రాజెక్టు ట్రబుల్స్ ఎదుర్కోంటోంది.

ముందుకు రాని కాంట్రాక్టర్లు...

ఇక డ‌బుల్ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి సైట్ క్లియ‌రెన్స్ వ‌చ్చిన వాటికి వ‌చ్చిన‌ట్లుగా బల్దియా టెండర్లు ఆహ్వానిస్తోంది. పలు మార్లు టెండ‌ర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావ‌డం లేదు. ఏడాది కాలంగా టెండ‌ర్లు పిలుస్తున్నా ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం 15 ప్రాంతాల్లో 5వేల 996 ఇళ్లకు మాత్రమే టెండ‌ర్లు ఫైన‌ల్ అయ్యాయి. ఇప్పటి వ‌ర‌కు 5చోట్ల మాత్రమే నిర్మాణానికి ప్రైమ‌రీగా ప‌నులు చేపట్టగా మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ముగిసిన త‌ర్వాత ప‌నులు చేస్తామంటున్నారు అధికారులు. టెండ‌ర్లు రాకపోవ‌డంతో మున్సిప‌ల్ శాఖ మంత్రి రంగంలోకి దిగి సిటిలోని బిల్డర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పేద‌ల‌ కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టులో అందరూ భాగ‌స్వాములు కోరడంతో 26 ప్రాంతాల్లో నిర్మాణ సంస్థలు టెండ‌ర్లు దాఖ‌లు చేశాయి.

15 సైట్లలో సింగిల్ టెండ‌ర్లు దాఖ‌లు...

అయితే ఇప్పుడు కూడా 15 సైట్లలో సింగిల్ టెండ‌ర్లు దాఖ‌లు అయ్యాయి. 9 ప్రాంతాల్లో డబుల్ టెండ‌ర్లు దాఖ‌లు కాగా రెండు ప్రాంతాల్లో త్రిబుల్ టెండ‌ర్లు దాఖ‌లు అయ్యాయి. ఇప్పుడు పిలిచిన టెండ‌ర్లలో చాలా టెండ‌ర్లు మూడు,నాలుగు సార్లు టెండ‌ర్లు ఆహ్వానించడంతో ఈ సారి వ‌చ్చిన సింగిల్ టెండ‌ర్లకు ప‌నులు క‌ట్టబెట్టాల‌ని ఆలోచ‌న‌ల్లో ఉన్నారు అధికారులు. అయితే వీరు టెక్నిక‌ల్ బిడ్‌లో ఫైనాన్సియ‌ల్ బిడ్‌లో క్వాలీఫై కావాల్సి ఉంది. అప్పుడు మాత్రమే వీరికి ప‌నులు అప్పగిస్తారు.

ఏడాదిలోనే ల‌క్ష ఇళ్లు నిర్మిస్తామ‌ని ...

ఇక ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే ల‌క్ష ఇళ్లు నిర్మిస్తామ‌ని ప్రక‌టించింది. అయితే వాటి నిర్మాణానికి అవ‌స‌రం అయిన స్థలాలు సిటిలో ల‌భించడం లేదు. సిటిలో ఉన్న వంద‌లాది ఎక‌రాల ప్రభుత్వ భూముల‌పై కోర్టు కేసులు ఉండ‌టంలో అక్కడ క్లియ‌రెన్స్ రావ‌డం లేదు. మ‌రోవైపు చాలా ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల‌ను బ‌డాబాబులు క‌బ్జా చేశారు. అందువ‌ల్లే వారి జోలికి పోకుండా కేవ‌లం పేద‌లు ప్రస్తుతం నివ‌శిస్తున్న ప్రాంతాల్లో వారిని ఖాళీ చేసి అక్కడే ఇళ్ల నిర్మాణం చేప‌డుతున్నారు. అక్కడ ఉన్నవారికి మాత్రమే కాకుండా 9 అంత‌స్తులు నిర్మిస్తుండ‌టంతో కూడా చాలా ప్రాంతాల్లోని ప్రజ‌లు ఇళ్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో ల‌క్ష ఇళ్ల నిర్మాణ ల‌క్ష్యం నెర‌వేరుతుందా లేదా అనే అంశంపై ఇప్పటి మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నగానే మిగిలింది.

ఇళ్ల నిర్మాణానికి క‌ట్టుబ‌డి ఉన్నామంటున్నారు మేయ‌ర్ ...

ఇదిలావుంటే తాము మాత్రం ఇళ్ల నిర్మాణానికి క‌ట్టుబ‌డి ఉన్నామంటున్నారు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్. ఇప్పటికి ప‌లు మార్లు రెవిన్యూ అధికారుల‌తో బ‌ల్దియా స‌మావేశం నిర్వహించినా భూములు మాత్రం ఫైన‌ల్ కావ‌డం లేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు కంప్లిట్ అవుతుందో ఇటు బ‌ల్దియా అధికారులు కానీ అటూ ప్రభుత్వం కానీ క్లియ‌ర్‌గా చెప్పే ప‌రిస్థితుల్లో లేదని ప్రతిపక్షాలు విమర్శిసున్నాయి.

17:36 - March 8, 2017

హైదరాబాద్: టీ జేఏసీ నుంచి తమను సస్పెండ్‌ చేయడం అన్యాయమని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌పై ఫైర్‌ అయ్యారు జేఏసీ నుంచి సస్పెండ్‌ అయిన పిట్టల రవీందర్‌. జేఏసీ లక్ష్యాలను సవరించుకోవాలని 2014లోనే సూచించానని..అప్పటి నుంచే తనను జేఏసీ నుంచి తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరామ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జేఏసీ నుంచి సస్పెండ్‌ అయిన ప్రహ్లాద్‌ విమర్శించారు. ప్రశ్నించినంత మాత్రాన ప్రభుత్వ ఏజెంట్లమా అని ప్రహ్లాద్ నిలదీశారు. టీ జేఏసీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని జేఏసీ నేత తన్వీర్ సుల్తానా ఆవేదన వ్యక్తం చేశారు.

17:35 - March 8, 2017

హైదరాబాద్: దళితులకు మూడు ఎకరాల భూమి. ఇది టిఆర్ఎస్ ఎన్నికల వాగ్ధానం. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అంతే. ఆ ఒక్క రోజు సంబరంతోనే సరిపెట్టింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని అటకెక్కించింది. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే, ప్రయివేట్ భూమి కొనైనా సరే, ఒక్కొక్క దళిత కుటుంబానికి మూడేసి ఎకరాల చొప్పున పంపిణీ చేస్తామంటూ టిఆర్ఎస్ నాయకులు చెప్పుకొచ్చారు. కానీ, ఆచరణలో అది కనిపించడం లేదు. ప్రభుత్వం నిజంగా మూడు ఎకరాల భూమి ఇస్తుందని ఆశ పడ్డ దళితులు ఇప్పుడు భంగపడ్డారు. సిపిఎం నిర్వహించిన మహాజన పాదయాత్రలో అనేకమంది దళితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇదే ఇవాళ్టి స్పెషల్ ఫోకస్.

మూడెకరాల భూమి ఇచ్చిన దాఖలాలు కనిపించవు....

కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ఎక్కడకెళ్లినా దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిన దాఖలాలు కనిపించవు. పాత కరీంనగర్ జిల్లాలో దాదాపు లక్షా 20 వేల మంది దళిత కుటుంబాలకు భూమి లేనట్టు అధికారులు గుర్తించారు. కానీ, వీరిలో 300 కుటుంబాలకు మాత్రమే భూ పంపిణీ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఎక్కడ లక్షా 20 వేలు ఎక్కడ మూడొందలమంది? ఈ లెక్కన భూమిలేని దళితులందరికీ మూడు ఎకరాల భూమి ఇవ్వాలంటే ఎన్ని దశాబ్ధాలు పడుతుందో ఊహించుకోవచ్చు.

అసలు సెంటు భూమి కూడా లేని దళితులకు...

అసలు సెంటు భూమి కూడా లేని దళితులకు మూడు ఎకరాల చొప్పున , ఎకరం వున్న వారికి రెండెకరాల చొప్పున, రెండెకరాలున్నవారికి ఎకరం చొప్పున ఇస్తామంటూ ఎన్నెన్నో వాగ్ధానాలు చేశారు కెసిఆర్. తామిచ్చిన భూములను సాగుకు యోగ్యంగా తీర్చిదిద్దేందుకు ఏడాదిపాటు వ్యవసాయ ఖర్చుల కూడా భరిస్తామంటూ మరెన్నో మాటలు చెప్పారు. కెసిఆర్ మాటలు నమ్మి చాలామంది ఆయన ఫోటోలకు పాలాభిషేకాలు చేశారు. ఇక తమ జీవితాలు మారిపోతాయంటూ మురిసిపోయారు. కానీ చివరకు నిరాశే మిగిలింది. కెసిఆర్ ప్రభుత్వం దళితులకు భూమి పంచిందీ లేదు. దుక్కి దున్నిందీ లేదు.

20 వేల దళిత కుటుంబాలకు భూమి లేదన్నది అధికారుల సర్వేల సారాంశం...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షా 20 వేల దళిత కుటుంబాలకు భూమి లేదన్నది అధికారుల సర్వేల సారాంశం. వీరందరికీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే 3 లక్షల 60 వేల ఎకరాల భూమిని పంచాల్సి వుంటుంది. కానీ, ఇప్పటి వరకు మూడు వందల కుటుంబాలకు పంపిణీ చేసింది కేవలం 755 ఎకరాల 9 గుంటలు. పంపిణీ చేసిన భూమిలో ప్రభుత్వ భూమి 103 ఎకరాల 20 గుంటలు కాగా, ప్రయివేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసింది 651 ఎకరాల 29 గుంటలు. మిగిలిన దళిత కుటుంబాలకు భూమి పంచేదెప్పుడు? రెండేళ్లలో కేవలం 755 ఎకరాల భూమి పంచిన ప్రభుత్వం మరో వందేళ్లకైనా ఆ పని పూర్తి చేయగలదా? ఇదే ప్రశ్న సంధిస్తున్నాయి దళిత సంఘాలు. కరీంనగర్ జిల్లా విడిపోక పూర్వం అప్పటి జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన ప్రయివేట్ భూములు కొనుగోలు చేసేందుకు సర్వే చేపట్టిన్నప్పటికీ అడుగు ముందుకు కదలలేదు. ఇప్పట్లో దళితులకు మూడు ఎకరాల కల సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దళితులకు మూడు ఎకరాల భూమి పథకం అమలు కోసం పోరాడేందుకు సిపిఎం సమాయత్తమవుతోంది.

 

మహబూబ్ నగర్ జిల్లాలో....

పాలమూరు జిల్లాలో దళితుల ఆశలు అడియాలవుతున్నాయి. మూడు ఎకరాల భూమి పథకం తూతూ మంత్రంగా సాగడంతో దళితులు తీవ్రంగా నిరాశచెందుతున్నారు. భూములు దొరకడం లేదన్న వంకతో ఈ పథకాన్ని అటకెక్కిస్తున్నారు. భూములు అందుబాటులో వున్నా , వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు.

స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా ప్రారంభమైన...

స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా ప్రారంభమైన దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ కార్యక్రమం ఆరంభ అట్టహాసంగానే మిగిలిపోతోంది. పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటి దాకా పంపిణీ చేసింది కేవలం 889 ఎకరాలు మాత్రమే. 303 కుటుంబాలకు మాత్రమే పంపిణీ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.

సిపిఎం మహాజన పాదయాత్రలో ...

సిపిఎం మహాజన పాదయాత్రలో మహబూబ్ నగర్ జిల్లాలో అనేకమంది దళితులు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మూడు ఎకరాల భూమి సమస్యపై వినతిపత్రాలు సమర్పించినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి వందల మంది నిత్యం వలసపోతుంటారు. దళితులకు మూడు ఎకరాల చొప్పున భూమిని పంచి, వలసలను అరికడతామంటూ టిఆర్ఎస్ నాయకులు ఎన్నెన్నో మాటలు చెప్పారు. కానీ అవేవీ వాస్తవ రూపం దాల్చడం లేదు. దళితులకు మూడు ఎకరాల భూమి పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలంటే ఎంత భూమి కావాలి? అన్న విషయంలో అధికారుల దగ్గర స్పష్టమైన సమాధానం దొరకని పరిస్థితి కనిపిస్తోంది. భూములను గుర్తించే విషయంలో అంతులేని అలసత్వం కనిపిస్తోంది.

పంచిన కొద్ది పాటి భూమి విషయంలోనూ కొన్ని వివాదాలు...

పంచిన కొద్ది పాటి భూమి విషయంలోనూ కొన్ని వివాదాలు నెలకొన్నాయి. ధన్వాడ మండలంలో అధికారుల నిర్వాకం వివాదస్పదమైంది. ఒకరి భూమిని మరొకరికి పంచడం పంచాయితీకి కారణమైంది. పాత మహబూబ్ నగర్ జిల్లాలో బంజరు, సీలింగ్, దేవాలయం, ఇనాం భూములు కలిపితే, ఏడు లక్షల ఎకరాలకు పైగా భూమి వుంది. దీన్నిబట్టి భూమి కొరతలేదన్న విషయం స్పష్టమవుతోంది.

ఆగస్టు 15న నాడు పట్టాలిచ్చిన దళితుల్లో కొందరికి ...

ఆగస్టు 15న నాడు పట్టాలిచ్చిన దళితుల్లో కొందరికి ఇప్పటికీ భూములు చూపించలేదు. కొన్ని సర్వే నెంబర్లలో రాళ్లు, తుప్పలున్నాయి. అవి సాగుకి అనుకూలంగా లేవు. దళితులకు మూడు ఎకరాల భూమి పథకాన్ని అమలు చేయాలంటూ మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు మమబూబ్ నగర్ జిల్లా సిపిఎం నేతలు.

17:29 - March 8, 2017

చెన్నై: మహిళా దినోత్సవం సందర్భంగా సేవ్‌ శక్తి నినాదంతో నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ చెన్నైలో సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు. వేధింపులకు గురవుతున్న బాధిత మహిళలకు అండగా నిలవాలనే లక్ష్యంతో సేవ్‌ శక్తి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తాలుకా స్థాయిలో మహిళా కోర్టు ఏర్పాటు చేయాలని.. 6 నెలల్లో తీర్పు ప్రకటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

17:27 - March 8, 2017

నెల్లూరు: జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలు రసాభాసగా మారాయి.. జిల్లా కార్యాలయంలో ఏర్పాటైన ఈ వేడుకలకు మంత్రి నారాయణ హాజరయ్యారు.. కేక్‌ కట్‌ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమం పూర్తికాగానే మహిళా ఆర్థిక సహకార సంఘం డైరెక్టర్‌ మల్లి నిర్మల అక్కడే హంగామా చేశారు.. రాష్ట్ర స్థాయి పదవిలోఉన్న తనకు జిల్లాలో ఎవ్వరూ ప్రాధాన్యత ఇవ్వడంలేదంటూ బోరున విలపించారు.. కనీసం ప్రెస్‌ మీట్‌ పెట్టేందుకైనా అనుమతి ఇవ్వడంలేదని పార్టీ నాయకురాలు అనురాధపై పరోక్షంగా విమర్శలు చేశారు..

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి...

హైదరాబాద్ : రంగారెడ్డి, మహబూబ్‌నగర్,హైదరబాద్ నియోజవకర్గం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. గురువారం జరగబోయే ఎన్నికలకు 126 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 23,789 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.

కంచిలి పీచు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

శ్రీకాకుళం: కంచిలి పీచు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారి మీదుగా వెళ్తున్న త్రీఫేస్‌ విద్యుత్‌ తీగలు తెగి పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. మంటలకు గాలి తోడవ్వడంతో సమీపంలో ఉన్న పీచు ఫ్యాక్టరీలోకి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో పీచుకు నిప్పంటుకొని భారీగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీ వద్ద ఉన్న కొబ్బరిడొక్క, పీచుతోపాటు ఫ్యాక్టరీలోని యంత్రాలు కాలిపోయాయి. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని సతీష్‌ తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సోంపేట, మందస మండలాలకు చెందిన అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది మంటలను అదుపు తెచ్చేందుకు రంగంలోకి దిగారు.

కాళేశ్వరం వద్ద జలాశయాల నిర్మాణానికి అనుమతి

హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు కింద వివిధ జలాశయాల నిర్మాణానికి టీ సర్కార్ అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

16:47 - March 8, 2017

మహిళలు అన్ని రంగాల్లో రాటుదేలుతున్నారు. కొంచెం ప్రోత్సహిస్తే చాలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. అలాగే బ్యాడ్మింటన్ రంగంలో కంట్రీ మోస్ట్ె సక్సెస్ ఫుల్, డబుల్ స్పెషలిస్టుగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ వున్న గుత్తా జ్వాల. నేషనల్, ఇంటర్నేషనల్ వేధికగా ఎన్నో మెడల్స్ సంపాదించి భారతదేశ కీర్తి పాతకాన్ని రెపరెపలాడించి జ్వలించిన జ్వాల. యూత్ ఐకాన్ గా వున్న గుత్తా జ్వాల తో స్పెషల్ ఇంటర్వ్యూ. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

16:38 - March 8, 2017

p { margin-bottom: 0.21cm; }

హైదరాబాద్: అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీసాయి విద్యానికేతన్ వ్యవస్థాపకురాలు శ్రీసాయిగీత మహిళల అభివృద్ధి కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని ఎనుములపల్లి గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, నారాయణమ్మ దంపతుల మొదటి కుమార్తైన సాయిగీత పేదరికంలో పుట్టినా స్వయంకృషితో ఉన్నతవిద్యను అభ్యసించి పైకి ఎదిగారు. అయితేనేం తన మూలాలను మాత్రం ఆమె మర్చిపోలేదు. అందుకే విద్యాభ్యాసం కోసం తన లాగా మరెవ్వరూ కష్టాలు పడకూడదని వందల మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అమ్మాయిలకే ప్రాధాన్యత ఇస్తూ మహిళల అభివృద్ధికి ....

పుట్టపర్తిలో తన సోదరులు, విదేశీయుల సహకారంతో 2000వ సంవత్సరంలో అరవై మంది విద్యార్థులతో శ్రీసాయి విద్యానికేతన్ విద్యాసంస్థను నెలకొల్పారు. ఇప్పుడు ఆ సంఖ్య 600 మందికి చేరింది. కో ఎడ్యూకేషన్ అయినా అమ్మాయిలకే ప్రాధాన్యత ఇస్తూ మహిళల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఆత్యాధునిక సౌకర్యాలతో, కార్పోరేట్ విద్యాసంస్థల తరహాలో విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. పేదరికంలో ఉన్న పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు తన వంతు కృషిచేస్తున్నారు.

పిల్లలకు ఆస్తులు కాదు చదువు ముఖ్యం..

పిల్లలకు ఆస్తులు అంతస్తులు ఇస్తున్నామని ముఖ్యం కాదని.. చదువు ఇస్తున్నామా లేదా అన్నదే ముఖ్యమని సాయిగీత చెబుతున్నారు. జన్మనిచ్చే ఆడపిల్లల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరుతున్నారు. పేద పిల్లలకు అందులోనూ ముఖ్యంగా ఆడపిల్లలకు ఉచిత విద్యనందిస్తూ శ్రీ సాయిగీత తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

16:18 - March 8, 2017

ప్రేమించి పెళ్లి చేసుకున్న డైరెక్టర్..అమ్మాయి కుటుంబం ఎదురు దాడి..పోలీస్ స్టేషన్ కు చేరిన నవ వధూవరులు..ఠాణా ముందు సినీ ఫక్కీలో దాడులు..

ప్రేమ పెళ్లి గొడవకు దారి తీసింది. ఆ యువతి తల్లిదండ్రులు పెళ్లిని అంగీకరించలేదు. పైగా పీఎస్ ఎదుటే దాడికి తెగబడ్డారు. ఇదంతా ఓ సిని ఫక్కీలో జరిగినా ఆ ప్రేమ పెళ్లి చేసుకుంది ఎవరో కాదు. సినీ దర్శకుడే. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినీ దర్శకుడు విజయ్.. ప్రేమ..పెళ్లి వివాదం పీఎస్ కు చేరింది. ఈ వార్త గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

16:12 - March 8, 2017

పిల్లలు స్కూలుకు వెళ్లాలి..పెద్దలు పనికి వెళ్లాలి..ఇది తెలిసిందే. కానీ పిల్లలను పనిలో పెట్టి వెట్టిచాకిరీ చేయిస్తుంటే చట్టాలు చూస్తూ ఊరుకోవు. పిల్లలను పని మానిపించి బడిబాట పటిస్తున్నారు. కడప జిల్లాలో మాత్రం స్కూలులో చదువుతున్న పిల్లలతో పని చేయిస్తున్నారు. ఎవరో కాదు విద్యాశాఖాధికారులే. ఇక్కడ పని చేయిస్తున్న వారిలో పోలీసులు కూడా ఉండడం గమనార్హం. ఎలా పనిచేయిస్తున్నారో వీడియోలో చూడండి..

టిడిపి మహిళా నేతల వాగ్వాదం..

నెల్లూరు : జిల్లాలో నిర్వహించిన మహిళా దినోత్స వేడుకలు రసాభాసాగా మారాయి. టిడిపి ఆర్థిక సహకార సంస్థ డైరెక్టర్ మల్లి నిర్మల, నేత అనురాధ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లాలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నిర్మల భోరున విలపించారు. పార్టీ పెత్తనమంతా అనురాధ చేతుల్లో ఉందని ఆరోపించారు. 

16:06 - March 8, 2017

దళిత దంపతులపై దాడి చేసిన ఎస్ఐ..యాక్షన్ లోకి దిగిన కమిషనర్..పోలీసు పేరు చెడగొడుతున్నారని సీరియస్..మరో ఎస్ఐపై విచారణ షురూ...ప్రత్యేక దర్యాప్తు అధికారిగా ఏసీపీ సింధుశర్మ..

తప్పు చేసిన ఎంతటి వారైనా శిక్ష తప్పదు. ఇది పోలీసులు చెబుతున్న..చెప్పే మాటలు. వారి విషయంలో కూడా అదే వర్తిస్తుంది కదా. కానీ వర్తించదని అనుకున్నారో ఏమో..ఖాకీ డ్రెస్ వేసుకున్నామన్న కండకావురమా ? పెద్దపల్లిలో దంపతులపై దాడి చేసిన ఘటనలో ఓ సబ్ ఇన్స్ పెక్టర్ పై వేటు పడగా మరో ఎస్ఐ పై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:59 - March 8, 2017

రంగారెడ్డి :మొయినాబాద్‌ (మం) తొల్కట్ట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బోరుమోటర్‌ స్టార్టర్‌కు ఫ్యూజ్‌ వేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగిలి తండ్రీకొడుకులు మృతిచెందారు. బొలిగిద రవికుమార్‌, అతని కొడుకు ఫ్యూజ్‌ సరిచేస్తుండగా ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌ తగిలింది. దీంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.

15:58 - March 8, 2017

పశ్చిమ గోదావరి : తుందుర్రులో ఉద్రిక్తత నెలకొంది. అక్వాఫుడ్‌ పార్కు ముట్టడికి భారీ సంఖ్యలో ర్యాలీగా బయల్దేరిన రైతులు, సీపీఎం, వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకుని.. అరెస్ట్‌ చేశారు. ప్రపంచమంతా మహిళను గౌరవిస్తూ... వారిని సేవలను, ఖ్యాతిని, కీర్తిని పొగుడుతూ ఉంటే.. ఏపీ రాష్ర్టంలో మాత్రం మహిళలను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. అక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తుందుర్రు పరిసర గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించి 144 సెక్షన్ విధించారు. 3 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. గుర్తింపు కార్డులు లేని వారిని తుందుర్రులోకి అనుమతించడం లేదు. రైతులను ఇళ్లనుంచి బయటకు రానివ్వడం లేదు. మరోవైపు ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక పోరాటసమితి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆక్వాఫుడ్ వ్యతిరేక ఉద్యమానికి సీపీఎం, వైసీపీ, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.

రెండో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 98 పాయింట్లు నష్టపోయి 28,902 వద్ద సెన్సెక్స్ ముగియగా 23 పాయింట్లు నష్టపోయి 8924 వద్ద నిఫ్టీ ముగిసింది. 

దాసరిని పరామర్శించిన జగన్..

హైదరాబాద్ : కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావును వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. గత కొంతకాలంగా దాసరి అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. 

ఓయూలో ఏబీవీపీ నిరసన..

హైదరాబాద్ : ఓయూలో ఏబీవీపీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. శతాబ్ది ఉత్సవాలకు రూ. వెయ్యి కోట్లు విడుదల చేస్తూ యూనివర్సిటీ సమస్యలను పరిష్కరించాలని వారు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. 

ఓయూలో ఏబీవీపీ నిరసన..

హైదరాబాద్ : ఓయూలో ఏబీవీపీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. శతాబ్ది ఉత్సవాలకు రూ. వెయ్యి కోట్లు విడుదల చేస్తూ యూనివర్సిటీ సమస్యలను పరిష్కరించాలని వారు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. 

15:36 - March 8, 2017

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని తెలుగుమహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి విమర్శించారు. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలుగుమహిళా నాయకులు నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

15:24 - March 8, 2017

టాప్ హీరోయిన్ గా హిట్ సినిమాలు ఇచ్చిన హీరోయిన్స్ టైం లైన్ లో ఫేడ్ అవుట్ అవ్వడం కామన్. అలా ఆల్మోస్ట్ స్క్రీన్ మీద వానిష్ అయిపోతుంది అనుకున్న టైం లో ఒక ఫేమస్ హీరోయిన్ మళ్ళీ తన సత్తా చూపించడానికి రెడీ అయ్యింది. చిన్న పెద్ద హీరోలు అన్న తేడా లేకుండా పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్స్ ని సెలెక్ట్ చేసుకుంటుంది నయనతార. ఫ్లాష్ బ్యాక్ లో టాప్ మోస్ట్ హీరోస్ అందరితో యాక్ట్ చేసిన ఈ కేరళ కుట్టి, రీసెంట్ హీరోయిన్స్ కాంపిటీషన్ లో కొంచెం వెనకపడిందని టాక్ కూడా ఉంది. వెంకటేష్ తో నటించిన బాబు బంగారం తెలుగు లో లాస్ట్ అండ్ పెద్ద సినిమాగా చెప్పవచ్చు.  స్క్రీన్ మీద దెయ్యం సినిమాలు చూసి చాలాకాలం అయిందని ఫీల్ అవుతున్న ఆడియన్స్ కి గత సంవత్సరం రిలీజ్ అయిన 'మయూరి' సినిమా హారర్ టచ్ అంటే ఎలా ఉంటుందో మళ్ళీ చూపించింది.

మయూరి..
నయనతార మెయిన్ లీడ్ గా చేసిన 'మయూరి' సినిమా తమిళ తెలుగు భాషల్లో రిలీజ్ అయి మంచి టాక్ తో హిట్ అయింది. చూస్తున్న ప్రేక్షకుడిని స్క్రీన్ ప్లే తో కట్టి పడేసి థియేటర్ లో నిశ్శబ్దాన్ని నింపింది ఈ 'మయూరి' సినిమా. తనకు ఇచ్చిన పాత్రను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసే నటి 'నయనతార' తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక టైం లో టాప్ మోస్ట్ యాక్టర్స్ అందరితో నటించింది. ఆ తరువాత కొంత గాప్ తరువాత మళ్ళీ 'మయూరి' సినిమాతో తెలుగు స్క్రీన్ ని టచ్ చేసిన నయన్ ఇప్పుడు కూడా హారర్ సినిమాతోనే మళ్ళీ రాబోతుంది. డి రామస్వామి డైరెక్షన్ లో వస్తున్న 'డోరా' సినిమా ఇప్పుడు నయనతార ఫోకస్డ్ మూవీ గా తెలుస్తుంది. ఈ 'డోరా'సినిమా ట్రైలర్ రీసెంట్ గా యూట్యూబ్ లో రెజీజ్ అయ్యి ఆడియన్స్ కి న్యూ హారర్ ఫీల్ ఇస్తోంది.

చేతులు కలిపిన శివసేన..బీజేపీ..

ముంబై : బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో శివసేన..బీజేపీలు చేతులు కలిపాయి. వేర్వేరుగా పోటీ చేయడంతో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనితో ఇరువురు చేతులు కలిపారు. శివసేనకు మేయర్ పదవిని బీజేపీ బహుమానంగా ఇచ్చింది. శివసేన కార్పొరేటర్ విశ్వనాథ్ మహదేశ్వర్ ముంబై నగర కొత్త మేయర్ గా ఎన్నికయ్యారు.

15:14 - March 8, 2017

అసలే మార్చి నెల.. అందులోనూ ఇంటర్మీడియట్ పరీక్షలు. అయినా.. ఈ వారాంతంలో ఏకంగా దాదాపు పది సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. ఇంతకీ కారణం ఏంటంటే .. పెద్ద సినిమాల విడుదల సమయంలో థియేటర్లు దొరక్క చిన్న సినిమాలు రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకోవలసి వచ్చింది అన్నమాట. ఆల్రెడీ విజయ్ దేవరకొండ నటించిన 'ద్వారకా', 'మంచు మనోజ్' నటించిన 'గుంటూరోడు', 'రాజ్ తరుణ్' నటించిన 'కిట్టు ఉన్నాడు జాగర్త' లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి.

డి 16
ఇదే ఫ్లో ని కంటిన్యూ చేస్తూ ఈ నెల చిన్న సినిమాలన్నీ తెలుగుతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అయ్యాయి. తమిళ సీనియర్ యాక్టర్ రెహమాన్ ప్రధాన పాత్రలో నటించిన డబ్బింగ్ మూవీ ‘డి 16’. మంచి యాక్షన్ థ్రిల్లర్ తో రూపొందిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ రిలీజ్ ఐన ట్రైలర్ ఆడియన్స్ లో మంచి ఇంటరెస్ట్ ని జెనెరేట్ చేసింది. సస్పెన్సుతో సాగే కథ, ఆసక్తికరమైన కథనంతో తయారైన ఈ 'డి 16' సినిమా ట్రైలర్ సినిమా మీద ఎక్స్ పెక్షన్స్ పెంచేసింది.

వెళ్లిపోమాకే..
పెద్ద పెద్ద సినిమాలను చేస్తూ బిజీ గా ఉన్న స్టార్ ప్రొడ్యూసర్ లలో 'దిల్' రాజు ఒకరు. యాకూబ్ అలీ దర్శకత్వంలో ‘వెళ్లిపోమాకే’ చిన్న సినిమా రూపొందింది. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఆడియోని ఇటీవలే హైదరాబాద్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇప్పుడు మార్చి 17 న విడుదల చేయాలనీ నిర్ణయించారు. ట్రైలర్ చూస్తే కథ.. పాత్రల పరంగా మామూలుగా అనిపిస్తూనే.. ఈ కథను చెప్పడంలో దర్శకుడు ఏదో ప్రత్యేకత చూపించినట్లే అనిపిస్తోంది. మంచి ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది ‘వెళ్లిపోమాకే’.

మంచు లక్ష్మీ..అంజలి..
తెలుగు ఇండస్ట్రీ లో లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. పవర్ ఫుల్ న్యాయమూర్తి పాత్రలో 'మంచు లక్ష్మి' నటించిన ‘లక్ష్మీబాంబు’ సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతుంది. ఆల్రెడీ ట్రైలర్ తో పాటు యూట్యూబ్ లో 'లక్ష్మి బాంబ్' పాటలు కూడా విడుదలై ప్రేక్షక ఆదరణ పొందుతున్నాయి.
'షాపింగ్ మాల్', 'జర్నీ' లాంటి తమిళ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు స్క్రీన్ కి పరిచయమైన తెలుగు అమ్మాయి 'అంజలి'. 'డిక్టేటర్' సినిమాతో టాప్ హీరో 'బాలకృష్ణ' తో కూడా నటించింది. 'అల్లు అర్జున్' 'సరైనోడు' సినిమాలో ఐటెం సాంగ్ తో మెరిసిన 'అంజలి' తన హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం ‘చిత్రాంగద’ సినిమాతో థియేటర్స్ కి రాబోతుంది. ఆల్రెడీ 'గీతాంజలి' సినిమాతో మెప్పించిన 'అంజలి' ఇప్పుడు 'చిత్రాంగద' తో ఆఫ్టర్ లాంగ్ టైం సోలో ఎంట్రీ ఇవ్వబోతుంది.

సందీప్ కిషన్..
తెలుగు, తమిళ్ రెండు ఇండస్ట్రీలు కలిపి సుమారు పద్దెనిమిది సినిమాలు చేసిన సందీప్ కిషన్ కెరీర్ లో గుర్తుండి పోయే సినిమా మాత్రం 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' అనే చెప్పాలి. కామెడీ టైమింగ్, యాక్టింగ్ లో మెచూరిటీ ఉండి కూడా సరైన హిట్ పడక వెనకబడి పోయాడు సందీప్ కిషన్. ఎంతోకాలం గా ఒక్క మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సందీప్ కిషన్ తన న్యూ ఫిలిం 'మానగరం'తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు . ఈ నగరం సినిమాతో తమిళంలో తెలుగులో సందీప్ కిషన్-రెజీనా మళ్ళి స్క్రీన్ పంచుకుంటున్నారు. ఈ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

పలు సినిమాలు..
కొత్త టాలెంట్ ఇండస్ట్రీ లో చొచ్చుకు వస్తుంది. కొత్త వాళ్ళతో చేసిన సినిమాలు ఆల్మోస్ట్ హిట్ టాక్ తో ఆడియన్స్ ని రీచ్ అవుతున్నాయి. అంతా కొత్తవాళ్లే నటించిన 'ఆకతాయి' సినిమాకి మణిశర్మ మ్యూజిక్ తో రామ్ బిమాన డైరెక్షన్ లో రాబోతుంది. ‘పిచ్చిగా నచ్చావ్’ అనే సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ‘మెట్రో’ - ‘నోటుకు పోటు’ అనే డబ్బింగ్ సినిమాలు కూడా ఈ నెల షెడ్యూల్ అయ్యాయి. పెద్ద చిత్రాల పోటీ లేని సమయంలో వస్తున్న ఈ చిన్న సినిమాలనల్నీ ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తాయో చూడాలి.

కోదండరాంపై పిట్టల ఫైర్..

హైదరాబాద్ : టీజేఏసీ ఛైర్మన్ కోదండరాంపై పిట్టల రవీందర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. జేఏసీ నిబంధనలకు వ్యతిరేకంగా కోదండరాం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డిమాండ్లన్నీ ఎక్కడికో పోయాయని కానీ కోదండరామ్ అరెస్ట్ మాత్రం హైలైట్ అయిందని విమర్శించారు. జేఏసీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా కోదండరాం వ్యవహరిస్తున్నారని తెలిపారు. 

14:36 - March 8, 2017

విజయవాడ: ఇంట్లో పనులను తీర్చిదిద్దడంలో కానీ.. ఆర్థికవిషయాల్లో రాణించడం కానీ మహిళల పాత్ర గొప్పదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్త్రీ పురుషుల సమానత్వానికి అందరూ సహకరించాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని.. మహిళలు ఆర్థికంగా రాణించేందుకు చేయూతనివ్వాలని బాబు పిలుపునిచ్చారు. మహిళలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించామన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళాదినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

13:59 - March 8, 2017

సౌదీలో మరణశిక్ష..లింబాద్రికి పునర్జన్మ..

ఒకటి కాదు..రెండు కాదు..పదేండ్లు...దేశం కాని దేశం..ఆపై మరణశిక్ష..కానీ అతనికి పునర్జన్మ లభించింది. సౌదీ అరేబియాలో మరణశిక్ష..కానీ ఇతనికి పునర్జన్మ లభించింది. ఒకటికి పది సార్లు ఆలోచించి అక్కడకు వెళ్లాలని 'లింబాద్రి' పేర్కొన్నాడు. గల్ఫ్ నుండి మృత్యుంజయుడుగా తిరిగి వచ్చిన అతడితో టెన్ టివి మాట్లాడింది. ఆయనతో పాటు సతీమణి, రక్షించడానికి చర్యలు తీసుకున్న యాదయ్య గౌడ్ కూడా మాట్లాడారు. తాను పనిచేస్తున్న స్థలం వద్ద గడ్డి కోయడానికి తండ్రి..కొడుకులు వచ్చారని, దీనికి తాను అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగిందన్నారు. వాగ్వాదం జరిగిందని తనను కొట్టడంతో ప్రాణాన్ని రక్షించుకోవడానికి తాను వారిని ఎదుర్కోవడం జరిగిందన్నారు. కానీ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడని వాపోయారు. చివరకు పోలీసులు జైలుకు పంపి మరణశిక్ష విధించారని పేర్కొన్నారు. యాదయ్యగౌడ్, ఇతరుల సహాకారంతో తాను బయటపడ్డాడని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

పనిచేసే ఏకైక వ్యక్తి మహిళ - బాబు..

విజయవాడ : స్త్రీ, పురుష సమానత్వానికి అందరూ సహకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చేయూతనివ్వాలని, ఇంట్లో మహిళలే అన్ని పనులు చక్కబెడుతారని పేర్కొన్నారు. కుటుంబం ఆనందంగా ఉండాలని పనిచేసే ఏకైక వ్యక్తి మహిళ అని తెలిపారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిందని, ఆర్టీసీ కండక్టర్లుగా మహిళలు బాగా పనిచేస్తున్నారని తెలిపారు.

శాఖల అధికారులతో ఎస్పీ సింగ్ సమావేశం..

హైదరాబాద్ : సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎస్ ఎస్పీ సింగ్ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ ఏర్పాట్లపై చర్చించారు.

హైకోర్టులో కానిస్టేబుళ్ల నియామకాలపై పిటిషన్..

హైదరాబాద్ : తెలంగాణలో కానిస్టేబుళ్ల నియామకాల్లో అవకతవకలు జరిగాయని వేసిన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కానిస్టేబుళ్ల నియామకం ప్రక్రియ సాగాలంటే మరో నాలుగు వారాలు పడుతుందని స్పెషల్ జీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. మహేందర్ రెడ్డి స్టేట్ మెంట్ రికార్డు చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

13:37 - March 8, 2017
13:34 - March 8, 2017
13:32 - March 8, 2017

నల్గొండ : తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం కనీసం ప్రజల సమస్యల మీద మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 143వ రోజుకు చేరుకుంది. ఇవాళ నల్లగొండ జిల్లాలోని రాందాస్‌తండా, నర్సింహులగూడెం, తుమ్మలపల్లి, చండూరు, పొనుగోడు స్టేజ్‌, కురంపల్లి, జి.ఎడవల్లి గ్రామాల్లో పాదయాత్ర కొనసాగనుంది. తుమ్మపల్లిలో పార్టీ జెండాను తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎగురవేశారు. తమ సమస్యలను పరిష్కరించేలా కృషిచేయాలని తమ్మినేనికి గ్రామస్తులు వినతిపత్రాలు అందజేశారు..

13:30 - March 8, 2017

విశాఖపట్టణం : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. స్త్రీ పురుషులు సమానావకాశాలు పొందాలన్న లక్ష్య సాధనకు కృషి చేస్తామని.. మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న బ్యాంకింగ్ రంగంలో ఇప్పటికే సమానావకాశాలు లభిస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. మహిళలకు గౌరవం ఇవ్వాలని, సమాజంలో వారు సగభాగమని గుర్తు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

13:28 - March 8, 2017

విజయవాడ : ఇంట్లో పనులను తీర్చిదిద్దడంలో కానీ.. ఆర్థికవిషయాల్లో రాణించడం కానీ మహిళల పాత్ర గొప్పదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్త్రీ పురుషుల సమానత్వానికి అందరూ సహకరించాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని.. మహిళలు ఆర్థికంగా రాణించేందుకు చేయూతనివ్వాలని బాబు పిలుపునిచ్చారు. మహిళలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించామన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళాదినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

13:26 - March 8, 2017

విజయవాడ : దేశంలోనే మొట్ట మొదటిసారిగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని ఏపీ మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళలకు పురుషులతో పాటు స్ర్రీలకు ఆస్తిలో సమానవాటా ఇవ్వడం, మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆమె తెలిపారు.

13:08 - March 8, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా తుందుర్రులో ఉద్రిక్తత నెలకొంది. అక్వాఫుడ్‌ పార్కు ముట్టడికి భారీ సంఖ్యలో ర్యాలీగా బయల్దేరిన రైతులు, సీపీఎం, వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకుని.. అరెస్ట్‌ చేశారు. ప్రపంచమంతా మహిళను గౌరవిస్తూ... వారిని సేవలను, ఖ్యాతిని, కీర్తిని పొగుడుతూ ఉంటే.. ఏపీ రాష్ర్టంలో మాత్రం మహిళలను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. అక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తుందుర్రు పరిసర గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించి 144 సెక్షన్ విధించారు. 3 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. గుర్తింపు కార్డులు లేని వారిని తుందుర్రులోకి అనుమతించడం లేదు. రైతులను ఇళ్లనుంచి బయటకు రానివ్వడం లేదు. మరోవైపు ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక పోరాటసమితి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆక్వాఫుడ్ వ్యతిరేక ఉద్యమానికి సీపీఎం, వైసీపీ, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.

13:03 - March 8, 2017
  • నీళ్లు కాచి చల్లార్చి తాగే అలవాటుందా ? అయితే ఆ నీళ్లలో కాస్త సొంపు వేసి కాచి వడగట్టి తాగండి. దాహం తీరడంతో పాటు అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.
  • రోజు గోధుమ జావ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.
  • అల్లం తింటే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.
  • చెవిపోటు వస్తే చెవిలో రెండు మూడు చుక్కల వెల్లుల్లి రసం వేసి చూడండి.
  • రోజు పెరుగు తినాలి. తినడం వల్ల కొన్ని అనారోగ్యాలు దరి చేరవు. చిగుళ్ల వ్యాధులు రావు.
  • తులసి ఆకుల్ని నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే నోటి దుర్వాసన తగ్గుతుంది.
  • ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
  • రోజుకు మూడు లీటర్ల నీరు తాగిన వారికి రోగాలు దరిచేరవు.
  • రోజూ ఒక గ్లాస్ నిమ్మరం తాగితే వేడి తొలుగుతుంది.
12:59 - March 8, 2017

మార్చి 8...అంతర్జాతీయ మహిళా దినోత్సవం...1800లో దినోత్సవం రావడం జరిగిందని లాయర్ పార్వతి పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మానవి 'మై రైట్' లో జరిగిన చర్చా వేదికలో లాయర్ పార్వతి పాల్గొన్నారు. మహిళలకు సరైన ఉద్యోగాలు లేక..వేతనాలు హెచ్చుతగ్గులు..పని గంటలు తగ్గించాలని అనే డిమాండ్స్ పై ఆందోళనలు జరిగాయని తెలిపారు. 1908లో న్యూయార్క్ లో 1500 మంది మహిళలు మార్చ్ ఫాస్ట్ చేశారని తెలిపారు. అప్పటి నుండి మహిళా దినోత్సవానికి నాంది పలికినట్లు చెప్పుకోవచ్చు. శ్రామికవర్గం మొదట బయటకొచ్చారని, 1909లో ఒక సామాజిక కార్యకర్త ప్రతొక్క మహిళలు బయటకు రావాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. అలాగే వివిధ న్యాయ సందేహాలకు..సమస్యలకు లాయర్ పార్వతి సలహాలు...సూచనలు అందచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

తల్కతోరాలో అంతర్జాతీయ యోగా సమ్మేళనం..

ఢిల్లీ : తల్కతోరాలో అంతర్జాతీయ యోగా సమ్మేళనం జరిగింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఆరోగ్యగమే మహాభాగ్యమని, మహాభాగ్యమే ఆరోగ్యమన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే మానవ మనుగడ ఉంటుందని, మానవ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని వెంకయ్య సూచించారు.

షీటీమ్స్ రెండో వార్షికోత్సవం..

హైదరాబాద్ : శిల్పకళా వేదికలో షీటీమ్స్ రెండో వార్షికోత్సవం జరిగింది. ముఖ్యఅతిథిగా డీజీపీ అనురాగ్ శర్మ సతీమణి మమతా అనురాగ్ శర్మ, హీరోయిన్ గా ప్రగ్వా జైస్వాల్ లు హాజరయ్యారు. జంట నగరాల కమిషనర్లు, కాలేజీ విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీలో 7గురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం..

విజయవాడ : టిడిపి నుండి లోకేష్, కరణం బలరాం, పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్, బచ్చుల అర్జునుడు, వైసీపీ నుండి గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లనానిలు ఏక్రగీవమయ్యారు. రేపు ధృవీకరణ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి అందచేయనున్నారు.

రైతులను ఆదుకుంటామన్న పోచారం..

హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న కురిసిన వడగళ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి పోచారం హామీనిచ్చారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

12:49 - March 8, 2017

'బాహుబలి 2’ సినిమా విడుదల కోసం ఉత్కంఠ నెలకొంది. సినిమా ట్రైలర్ కొద్ది రోజుల్లో విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొనడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే చిత్ర ట్రైలర్ తాను చూడడం జరిగిందని, గుండెలు అదిరిపోయాయని మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణ రమణ వ్యాఖ్యానించడం మరింత ఆసక్తిని పెంచింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. సినిమాతో సంబంధం లేకుండా ఇది కూడా విడిగా 100 రోజులు ఆడుతుందని, రికార్డులు బద్ధలు కొడుతుందని పేర్కొనడంతో ట్రైలర్ ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ట్వీట్స్ కు విశేషమైన స్పందన వస్తోంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణరమణ సౌండ్ సూపర్ వైజర్ గా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే 'బాహుబలి 2’ ట్రైలర్ ఎప్పుడు విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో 'బాహుబలి 2’ ట్రైలర్ పై వర్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న 'బాహుబలి 2’ ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

12:47 - March 8, 2017

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు..ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలిచే 'రాంగోపాల్ వర్మ' మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆయన పురుషుల దినోత్సవంగా మార్చివేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘ఉమెన్స్ డే'ని 'మెన్స్ డే' అని పిలవాలని ట్వీట్ లో పేర్కొన్నారు. మహిళలను పురుషులు సంతోష పెట్టనంతగా..పురుషులను మహిళలు సంతోష పెట్టలేరని వ్యాక్యానించారు. పురుషుల అందరి తరపు నుండి తాను మహిళలకు పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ఏడాదిలో ఒక రోజు మాత్రం పురుషులు మహిళల దినోత్సవంగా జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కనీసం ఈ రోజైనా మహిళలు వారిపై (పురుషుల) పై అరుపులు..కేకలు వేయకూడదని పేర్కొన్నారు. వర్మ చేసిన ట్వీట్ పై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

12:45 - March 8, 2017

హైదరాబాద్‌‌ :  మహిళా హక్కుల సాధనకై ఐద్వా, యూటీఎఫ్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌, మల్లు స్వరాజ్యం పాల్గొన్నారు.

 

12:44 - March 8, 2017

విశాఖపట్టణం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో మహిళలు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఏయూ క్యాంపస్‌లో మహిళలే సొంతంగా స్టాల్స్‌ ఏర్పాటు తాము తయారుచేసిన వస్తువులను విక్రయిస్తున్నారు. భవిష్యత్‌లో సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది ఆదర్శంగా నిలుస్తుందని నిర్వాహకులంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. మహిళలు స్వయంగా తయారుచేసిన వస్తువులను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. మెుత్తం 24 మహిళ స్టాల్స్ ఎర్పాటు చేసి కళ్లు చేదిరిపోయే ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. మహిళ శక్తి ఏంటో ఈ ప్రదర్శన చూస్తే అర్ధమవుతుందని నిర్వాహకులంటున్నారు.

సొంతంగా వ్యాపారం..
బిజినెస్‌లోకి ప్రవేశించాలనుకునే వారికి ఈ ఎగ్జిబిషన్‌ ఎంతో ఉపయోగపడుతుందని స్టాల్స్‌ ఏర్పాటు చేసిన విద్యార్థినులంటున్నారు. భవిష్యత్‌లో సొంతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో వస్తువులను తయారు చేస్తున్నట్లు ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న హరిక చెబుతోంది. సోషల్‌ మీడియా ద్వారా తాను తయారుచేసిన వస్తువులు విక్రయిస్తున్నట్లు తెలుపుతోంది. తనకు స్నేహితులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉందంటుంది.  ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మహిళలతోనే ఎగ్జిబిషన్‌..
మహిళలతోనే ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహించడం బాగుందంటున్నారు ఏయూ ఉమెన్‌ స్టడీస్‌ విభాగ హెడ్‌ రత్నకుమారి. మహిళలు ఎందులోనూ తీసిపోరని ఈ ఎగ్జిబిషన్‌ నిరూపిస్తుందన్నారు. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా.. సొంత కాళ్ల మీద నిలబడేవిధంగా ఈ ఎగ్జిబిషన్‌ స్ఫూర్తిగా నిలుస్తుందంటున్నారు. ఒక వినూత్న ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌.. భవిష్యత్‌లో వ్యాపారం నిర్వహించుకోవాలనుకునే వారికి వేదికగా మారింది. ఈ ఎగ్జిబిషన్‌ మరెంతమంది స్త్రీలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నిర్వాహకులంటున్నారు. మరోవైపు మహిళా దినోత్సవం రోజున మహిళల కోసం మహిళలే నిర్వహిస్తున్న ఈ స్టాల్స్‌కు అనేకమంది బారులు తీరి.. వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.

12:39 - March 8, 2017

కొత్తగూడెం : చిన్న వయస్సులోనే కుటుంబానికి పెద్దదిక్కుగా మారింది. క్షౌరవృత్తిని కొనసాగిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక పక్క పని చేసుకుంటూ బతుకును వెళ్లదీస్తుంది.. మరో పక్క చదువును సాగిస్తూ భవిష్యత్తును కాపాడుకుంటుంది. మంచం పట్టిన తండ్రికి ఊరటగా నిలిచినా.. బిందుప్రియపై ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం..మొండికుంటలో కులవృత్తినే ఆధారం చేసుకుని.. కుటుంబాన్ని పోషిస్తుంది ఓ చిట్టితల్లి.. క్షౌరశాలను నిర్వహిస్తూ.. అందరినీ అబ్బురపరుస్తుంది బిందుప్రియ. తండ్రి మేడిచర్ల రాజేష్‌ మెదడుకు సంబంధించిన వ్యాధితో మంచం పట్టాడు. ముగ్గురు బిడ్డల్లో ఒక కూతురుకు పెళ్లిచేసి పంపించాడు. అప్పులపాలయ్యాడు. ఇంతలోనే అనారోగ్యం పాలై కొంతకాలపాటు కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు కూడా ఏమి చేయలేమని తేల్చి చెప్పేశారు. ఆ సమయంలో చిన్న కూతురైన బిందుప్రియ ఇంటి బాధ్యతను నెత్తినేసుకుంది. తండ్రి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని...ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు కులవృత్తినే ఎంచుకుంది. ఒక పక్క పాఠశాలకు వెళ్తూ.. మరోపక్క క్షౌరశాలను నిర్వహిస్తుంది. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తుంది.

కనువిప్పు..
గ్రామంలో బిందుప్రియ ధైర్యాన్ని చూసి అందరూ అబ్బురపడుతున్నారు. ఇంత చిన్నవయస్సులో ఆమెకున్న ఆత్మస్థైర్యాన్ని చూసి స్నేహితులు.. సన్నిహితులు గర్వపడుతున్నారు. కూతురే.. కొడుకులా మారిందని.. కుటుంబాన్ని ఆదుకుంటుందని అనారోగ్యం నుంచి బయటపడిన తండ్రి రాజేష్‌ చెప్పారు. సెలవురోజుల్లో ఇంటిదగ్గరే ఉండి తనకు కూడా సేవలు చేసిందని.. తన చదువు కొనసాగేలా చేయూతనివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కన్నవాళ్ల కోసం బాధ్యతనెత్తుకుని మొక్కవోని దీక్షతో ముందుకు వెళ్తున్న బిందుప్రియ ఎంతోమంది ఆడపిల్లలకు ఆత్మస్థైర్యానిచ్చింది. కొడుకే కావాలనుకునే మరెంతోమందికి కనువిప్పు కూడా మారింది.

12:25 - March 8, 2017

తూర్పుగోదావరి : తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర ప్రాంతాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కానీ అక్కడ మాత్రం మహిళలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తుందుర్రులో మహిళలపై నిర్భందాన్ని ప్రయోగించారు. అక్వా ఫుడ్ పార్క్ వద్దని వారు ఆందోళన చేయడమే ఇందుకు కారణం. గత కొన్ని రోజులు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు సీపీఎం, వైసీపీ, ఇతర ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఫ్యాక్టరని ముట్టడిస్తామని ఆందోళనకారుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో దాదాపు రెండు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోరాట సమితి కన్వీనర్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయన తల్లి ఆరేటి సత్యవతిని కూడా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈసందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. మహిళలను విచక్షణారహితంగా లాక్కొంటూ వ్యాన్ లలో పడేశారు. ఆరేటి సత్యవతి..సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాంతో సహా 60 మందిని అరెస్టు చేశారు. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

12:18 - March 8, 2017

తూర్పుగోదావరి : తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర ప్రాంతాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కానీ అక్కడ మాత్రం మహిళలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తుందుర్రులో మహిళలపై నిర్భందాన్ని ప్రయోగించారు. అక్వా ఫుడ్ పార్క్ వద్దని వారు ఆందోళన చేయడమే ఇందుకు కారణం. గత కొన్ని రోజులు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు సీపీఎం, వైసీపీ, ఇతర ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఫ్యాక్టరని ముట్టడిస్తామని ఆందోళనకారుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో దాదాపు రెండు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోరాట సమితి కన్వీనర్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయన తల్లి ఆరేటి సత్యవతిని కూడా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈసందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. మహిళలను విచక్షణారహితంగా లాక్కొంటూ వ్యాన్ లలో పడేశారు. ఆరేటి సత్యవతి..సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాంతో సహా 60 మందిని అరెస్టు చేశారు. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

12:09 - March 8, 2017

నల్గొండ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీపీఎం తెలంగాణ కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవం రోజు సాధికారత గురించి మాట్లాడటం, ఆ తర్వాత మరచిపోవడం పాలకులకు రివాజు మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కంటే మహిళ సమస్యలు ఇప్పుడు ఎక్కువైన విషయాన్ని ప్రస్తావించారు. మహిళా సమస్యల పరిష్కారం కోసం క్రియశీలక ఉద్యమాలు నిర్మిస్తామని తమ్మినేని వీరభద్రం చెబుతున్నారు.

తుమ్మపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

విజయవాడ : తుమ్మపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు.

తుమ్మపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

విజయవాడ : తుమ్మపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు.

పన్నీర్ సెల్వం నిరహార దీక్ష..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిరహార దీక్ష చేపట్టారు. అమ్మ జయలలిత మృతిపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎగ్మోర్ రాజరత్నం స్టేడియంలో సెల్వం దీక్ష చేపట్టారు.

తుందుర్రులో ఇంటికి తాళాలు..

పశ్చిమగోదావరి : తుందుర్రులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ నిర్భందాలు ప్రయోగిస్తున్నాయి.

11:16 - March 8, 2017

పశ్చిమగోదావరి : తుందుర్రు రణరంగం మారిపోయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మహిళలను నిర్భందించారు. అక్పాఫుడ్ వల్ల తమ జీవితాలు బలైపోతాయని ఉద్యమాలు చేస్తున్న వారిపై పోలీసులు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. తుందుర్రులో నిషేధాజ్ఞాలు..144 సైక్షన్..హెచ్చరికలు ఎన్ని జారీ చేసినా రైతులు..మహిళలు..పార్టీలు..ప్రజా సంఘాలు వినిపించుకోలేదు. తమ గ్రామాలను కాపాడుకుంటామని ముందుకు కదిలారు. కానీ భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఏ మాత్రం కనికరించకుండా మహిళలను ఇష్టమొచ్చినట్లు లాక్కొంటూ వ్యాన్ లలో పడేశారు. పోలీసుల తీరును ప్రజలు ఆక్షేపించారు. ఇదిలా ఉంటే ఈ పోరాటానికి టిడిపి ఎంపీటీసీ మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొనడం గమనార్హం. గ్రామాలను కాపాడుకుంటామని, ఆరోగ్యవంతంగా ఉండాలని అనుకుంటున్నట్లు టిడిపి ఎంపీటీసీ పేర్కొన్నారు. పదవుల కోసం కాదని, 30 గ్రామాలను కాపాడుకోవడానికి ముందుకెళుతామన్నారు.

తుందుర్రులో తీవ్ర ఉద్రిక్తత..

పశ్చిమగోదావరి : తుందుర్రులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్వాఫుడ్ పార్కు ముట్టడికి భారీ ర్యాలీ బయలుదేరింది. రైతులు, సీపీఎం, వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇళ్లలో నుండి రైతులను పోలీసులు బయటకు రానివ్వడం లేదు. పోలీసులపై రైతులు తిరగబడుతున్నారు.

టి.పోలీసులు సమాచారం అందించారు - దల్జిత్..

లక్నో : ఐసీస్ ఉగ్రవాది సైఫుల్లా హతమయ్యాడని డీజీపీ దల్జిత్ పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు అందించిన సమాచారం మేరకు సైఫుల్లా ఇంటిపై ఏటీఎస్, పోలీసులు దాడి చేయడం జరిగిందన్నారు. 13 గంటల పాటు శ్రమించి ఉగ్రవాదిని మట్టుబెట్టడం జరిగిందని, ఉగ్రవాది ఇంటి నుండి 8 పిస్టోళ్లు, రైల్వే మ్యాప్ లు, బాంబు తయారీ సామాగ్రీ, కరెన్సీ, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

10:49 - March 8, 2017

మహబూబ్ నగర్ : తెలిసీ, తెలియని వయసులో జోగినిగా మారిన ఆ అమ్మాయి.. ఇప్పుడు ఓశక్తిగా మహిళలకోసం పోరాడుతోంది. సమాజం పశుబలంతో వేసిన సంకెళ్లను తెంచుకుని తనలాంటి అభాగ్యులకు అండగా నిలుస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఉట్కూరు గ్రామానికి చెందిన హాజమ్మ జోగిని వ్యవస్థపై అలుపెరగని పోరాటం చేస్తోంది. పాలమూరుజిల్లాలోని మారుమూల పల్లెల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ఈ దురాచారంపై గళమెత్తిన హాజమ్మ పై మహిళా దినోత్సవం సందర్భంగా టెన్‌టీవీ స్పెషల్ స్టోరీ. మూఢనమ్మకాలు బలంగా ఉన్న పాలమూరు జిల్లాలో దురాచారంపై కసిగా గళమెత్తారీ మహిళ. సమాజంలో మార్పుకోసం తాను సమిధగామారి అనేక మంది ఆడపిల్లలను జోగిని వ్యవస్థలోకి వెళ్లకుండా.. అడ్డుకున్న ధీశాలి ఈ మహిళా మణి.

జోగినీ వ్యవస్థపై కన్నెర్రజేసిన ఉద్యమకారిణి..
ఘనమైన సంస్కృతి, సంప్రదాయాలు.. అంటూ గొప్పగా చెప్పుకునే మన సమాజం..ఆడపిల్లల జీవితాలను మాత్రం వివక్షలఊబిలోకి దించేస్తోంది. పసితనంలోనే జోగినిగా మార్చి.. తరతరాలుగా పేదింటి ఆడపిల్లలపై కసిని తీర్చుకుంటోంది. అలాంటి విక్షల కట్టుబాట్లపై కన్నెర్రజేశారీ ఉద్యమకారిణి. ఈమెపేరు హాజమ్మ. ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం . పసితనంలో జోగినిగా మార్చబడి.. ఆ ఊబినుంచి బయటపడిన విజేత ఈమె. జోగిని, బసివినీ , దేవదాసీ లాంటి దురాచారానికి ఇక ఏ బంగారు తల్లీ బలికాకుండా 15ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారీమె.

మహబూబ్ నగర్ లో..
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే జోగినీ దురాచారాన్ని ఎక్కువగా పాటిస్తున్నారు. జోగిని వ్యవస్థను రూపు మాపేందుకు ప్రభుత్వాలు ఎన్నిక చట్టాలు, పథకాలు అమలు చేస్తున్నా.. ఈ దుష్టసంప్రదాయాన్ని మన సమాజం వదిలించుకోవడంలేదు. ఇప్పటికీ అక్కడక్కడ పడగవిప్పుతున్న ఈ దురాచారం.. ఆడపిల్లలను కసిగా కాటేస్తూనే ఉంది. అలాంటి సామాజిక వాతావరణంలో ఓ జోగినీ ఇంట జన్మించింది హాజమ్మ. చిన్ననాడు జోగినీ అంటే కేవలం.. భగవంతుని పూజకోసం నియమించనిన ఓ పవిత్రమైన వ్యక్తి అనుకునేది. కాని.. తన జీవితాన్ని సమూలంగా మింగేసిన తర్వాతగాని ఈ దురాచారపు అసలురూపం అర్థంకాలేదు అంటుంది హాజమ్మ. ఈ ఆచారాలకు దూరంగా పారిపోబిడ్డా అని అమ్మ హెచ్చరించిన సందర్భాలనూ ఈమె గుర్తు చేసుకుంటారు. 5వ తరగతి చదువుతున్న తను తాళ్లితో బడికి వెళ్లి ..హేళనకు గురైన సందర్భలాను హాజమ్మ బరువెక్కిన హృదయంతో గుర్తుచేసుకుంటారు.

1989లో సొంతూరికి..
బతుకుదెరువు కోసం కొంతకాలం ముంబైవెళ్లిన హాజమ్మ.. 1989లో సోంతూరికి తిరిగి వచ్చింది. మళ్లీ పెళ్లి చేసుకోడానికి నిర్ణయించుకుంది. చిన్ననాడు తాను అనుభవించిన అవమానాలకు సమాధానంగా మళ్లీ పెళ్లి చూసుకుని దుష్ట సంప్రదాయాలకు బుద్ధి చెప్పాలని నిర్ణియించుకుంది. కాని ఊరి పెత్తందారులు అందుకు ఒప్పుకోలేదు. జోగిని మళ్లీ పెళ్లి చేసుకుంటే ఊరికి అరిష్టమని ..పెళ్లి చేసుకోడానికి వీల్లేదని హూంకరించారు. హాజమ్మ ఇంటిపై దాడికి కూడా దిగారు. హాజమ్మ పెళ్లికి ఎవరు వెళ్లానా వెయ్యిరూపాయల జరిమానా విధిస్తామని ఊరిలోచాటింపు వేయించారు. అయినా హాజమ్మ వారిని ధైర్యంగా ఎదుర్కొంది. స్వయంగా దేవుడే దిగివచ్చి నన్ను తన భార్య అని చెప్పినా ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అప్పటి ఆర్డీవో అనితారామచంద్రన్‌ అండతో , తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడారు హాజమ్మ. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన అదేఊళ్లో మళ్లీ పెళ్లి చేసుకుని దురాచారానికి నిలువులోతు పాతరవేసి మహిళాపోరాటాలకు స్ఫూర్తిగా నిలిచారు హాజమ్మ.

జస్టిస్‌ పురుషోత్తమరావు కమిటీ నివేదిక...
మరోవైపు హాజమ్మలాంటి వారు ఎంత పోరాటం చేస్తున్నా.. తరతరా లనుంచి వస్తున్న ఆచారాలను వదులుకోడానికి ఇంకా కొన్ని గ్రామాలు సిద్ధపడటంలేదు. ఇప్పటికీ పాలమూరు జిల్లాలో 2500 మంది జోగినీలు ఉన్నారని ప్రభుత్వ లెక్కలే తేల్చి చెబుతున్నాయి. వీరికి సమాజం నుంచి ఎదురవుతున్న విక్షపై హాజమ్మ గళం విప్పడంతో ప్రభుత్వం జీఓ నంబర్‌ 139ని జారీ చేసింది. దాని ప్రకారం స్కూల్‌ సర్టిఫికెట్లలో తండ్రి పేరుకు బదులు తల్లి పేరు నమోదు చేసుకునే వీలు కలిగింది. అటు కర్ణాటకలో జోగిని వ్యవస్థ నిర్మూలనకు, వారి సంక్షేమానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసింది. మన దగ్గర కూడా అలాంటి ప్రయత్నం జరగాలని హాజమ్మ కోరుతున్నారు. కనీసం ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ అయినా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా జోగినిలకు ప్రత్యేక కోటా ద్వారా పింఛన్లు ఇవ్వాలని, వారి కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లతోపాటు పిల్లలకు ఉచిత విద్య ఉపాధికి ప్రత్యేక పథకాలు అమలు చేయాలంటున్నారు. జోగిని వ్యవస్థపై నియమించిన జస్టిస్‌ పురుషోత్తమరావు కమిటీ నివేదికను అమలు చేయాలని హాజమ్మ కొరుతున్నారీ ఉద్యమకారిణి.

10:46 - March 8, 2017

నల్గొండ : 10...12 వేల కోట్లతో బీసీ బడ్జెట్‌ ప్రవేశపెడతామని కేసీఆర్‌ చెబుతున్నారని.. ఇది సీపీఎం మహాజన పాదయాత్ర దెబ్బకు మాట్లాడుతున్న మాటలు తప్ప మరొకటి కాదన్నారు తమ్మినేని. మూడేళ్లలో 6 వేలు కేటాయించినా..అందులో సగం కూడా బీసీల కోసం వెచ్చించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా ప్రజల బతుకులేమీ మారలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అట్టడుగు వర్గాల బతుకులు మార్చిన పరిపాలన ఇప్పటివరకు జరగలేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, అధికారులు సంపన్నులుగా మారడానికి పరిపాలన ఉపయోగపడుతుందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతుల సమస్యలు అధికమయ్యాయన్నారు. సామాజిక న్యాయం అమలుజరిగితేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు తమ్మినేని. తెలంగాణలో నేటికీ దళితులు అంతరానితనం, కులవివక్షకు గురవ్వుతున్నారని పాదయాత్ర బృందం సభ్యుడు జాన్‌వెస్లీ అన్నారు. అనేక గ్రామాల్లో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించడం లేదని.. మహిళలను కనీసం బతుకమ్మ కూడా ఆడనివ్వడం లేదని ఆరోపించారు. దేశంలో ఉన్న రైతులు, కార్మికులకు సీపీఎం మహాజన పాదయాత్ర ఒక స్ఫూర్తినిచ్చిన పోరాటమని రైతు సంఘం ఆలిండియా ఉపాధ్యక్షుడు విజు కృష్ణన్‌ అన్నారు.

లేఖ..
పేదల బతుకులు బాగుపడాలన్న ఉద్దేశంతో సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్రకు నల్గొండ జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే 142 రోజులు పూర్తి చేసుకున్న తమ్మినేని బృందం నల్లగొండ జిల్లాలో పర్యటించింది. పాదయాత్ర బృందానికి అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పిస్తున్నారు. 142వ రోజు తమ్మినేని బృందం కొత్తగూడెం, ముష్టిపల్లి, బండ సింగపురం, తుంకిశాల, ఫకీరుపురం, మేళ్లవాయి, సల్లవారికుంట, తిరుమలగిరి, నాంపల్లి గ్రామాల్లో పర్యటించింది. ఇక సీఎం కేసీఆర్‌కు తమ్మినేని 2 లేఖలు రాశారు. స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయించాలని.. 73, 74 రాజ్యాంగ సవరణలు అమలు చేస్తామని ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఆశావర్కర్లతో పాటు పట్టణ ప్రాంతంలో పనిచేస్తున్న మేప్మా రిసోర్స్‌ ఉద్యోగులను పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని మరో లేఖలో డిమాండ్ చేశారు.

10:42 - March 8, 2017

ఢిల్లీ : తమిళనాడులో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దీక్షకు కూర్చొంటున్నారు. జయ మరణంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జయ మరణం తరువాత కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సీఎంగా పళనీ స్వామి ప్రమాణ స్వీకారం చేయడం..సీఎం కావాలని ఆలోచించిన శశికళ జైలుకు వెళ్లడం జరిగిన సంగతి తెలిసింద. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం నిరహార దీక్షకు పూనుకున్నారు. అమ్మ జయలలిత మృతిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎగ్మోర్ రాజరత్నం స్టేడియంలో సెల్వం దీక్ష చేయనున్నారు. జయది సహజమరణం కాదని..ఉద్ధేశ్య పూర్వకంగా మరణానికి దగ్గర చేశారని..సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

10:38 - March 8, 2017

పశ్చిమగోదావరి : ఈమె కోసం ఇంతమంది పోలీసులు మోహరించాలా ? అసలు ఈమె ఎవరు ? ఈమె చేసిన తప్పేంటి ? తుందుర్రులో అక్వాపార్క్ కు వ్యతిరేకంగా ఈమె పోరాడుతోంది..ఈ ఆందోళనపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. తమ జీవితాలను ఛిద్రం చేసే ఇలాంటి ఫ్యాక్టరీలు వద్దని మొత్తుకుంటున్నా సర్కార్ వినిపించుకోవడం లేదు. ఫలితంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టులు చేస్తోంది. తాజాగా ఆక్వాఫుడ్ పార్క్ ను ముట్టడిస్తామని ఉద్యమకారులు హెచ్చరించడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఫ్యాక్టరీకి వెళ్లే దారుల్లో పోలీసులు మోహరించి ఐడీ కార్డులు లేనిదే లోనికి వెళ్లనీయడం లేదు. రైతులు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుందుర్రు అక్వాపార్క్ పోరాట సమితి కన్వీనర్..ఆరేటి సత్యవతి తనయుడిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆరేటి సత్యవతిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఆమె ఇంటి వద్ద మోహరించారు. దీనిపై టెన్ టివితో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఊరును కాపాడుకోవడానికి శాంతియుతంగా ఆందోళన చేపడుతుంటే సీఎం చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నారని ఆందోళన చెందారు. తన కొడుకును ఎక్కడ పెట్టారో తెలియడం లేదని కన్నీళ్లు పెట్టారు.

10:35 - March 8, 2017

మహబూబ్ నగర్ : మానవ సేవే మాధవసేవ అంటారు. కానీ మహిళల సేవే అమ్మ సేవ అంటున్నారు కర్ర జయసరిత. ప్రభుత్వం నుంచి సాయం అందని మహిళలను చేరదీస్తూ అండగా ఉండడమే కాకుండా.. సొంత డబ్బుల నుంచి పెన్షన్‌ అందిస్తోంది. రోగులకు ఉచిత వైద్యం అందించి అందరి మనస్సు గెలుస్తోంది. తాను మంచి పొజిషన్‌లో ఉండడమే కాదు.. నలుగురికి చేయూత ఇవ్వాలనేది ఆమె లక్ష్యం. న్యాయవాది వృత్తిని చేసుకుంటూ.. సమాజ సేవను ప్రవృత్తిగా ఎంచుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కర్ర జయ సరిత. గత రెండేళ్లుగా ఎందరో అభాగ్యులైన మహిళలకు ఆసరాగా నిలుస్తున్నారు. ప్రభుత్వం నుండి సాయం అందని మహిళలు, వృద్ధులు, వితంతువులను గుర్తించి తన వంతు సాయమందిస్తున్నారు. తాను సంపాదించే దాంట్లో కొంత మేర వారికి ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకు 50 మంది మహిళలకు ప్రతి నెల మందులు ఇతర ఖర్చులకు ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున సాయమందిస్తున్నారు.

అభినందనలు..
ఇదేకాకుండా.. రోగాలతో బాధపడుతున్నవారికి ఆమె అండగా నిలుస్తున్నారు. గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి వారికి వైద్యసాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతో మందికి ఉచితంగా కళ్ల ఆపరేషన్‌ చేయించి.. కళ్లద్దాలను అందిస్తున్నారు. తాను చేస్తున్న సేవకు కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా ఉందంటున్నారు సరిత. తాను సంపాదిస్తున్న దాంట్లో కొంత మేర ఈ విధంగా ఖర్చు చేయడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. ఎప్పుడెళ్లి ఇంటి తలుపుతట్టినా.. కష్టమనుకోకుండా సరిత సాయం అందిస్తుందంటున్నారు స్థానికులు. ఈమె మాకు అండగా ఉండడంతో ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. సేవాగుణానికి మారుపేరుగా నిలుస్తూ కష్టాల్లో మహిళలకు అండగా నిలుస్తున్న సరితకు 10 టీవీ అభినందనలు అందిస్తోంది.

భోపాల్ కు చేరుకున్న ఎన్ఐఏ టీం..

భోపాల్ : ఎన్ఐఏ టీం భోపాల్ కు చేరుకుంది. భోపాల్ - ఉజ్జయిని రైలు పేలుడు ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టనుంది. ఇప్పటికే ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులను ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

10:25 - March 8, 2017

టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన 'ఘరానా మొగుడు'..'కొదమసింహం'..చిత్రాల్లో నటించిన 'వాణీ విశ్వనాథ్' గుర్తుండే ఉంటుంది కదా...తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించిన ఈ గ్లామర్ తార కొన్నాళ్లుగా చిత్రాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఈమె కెమెరా ముందుకొస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ 'వాణీ'ని సంప్రదించారని తెలుస్తోంది. ఒకే చెప్పడంతో బ్యాంకాక్ లో జరిగిన ఓ షెడ్యూల్ లో ఆమె నటించారు. ఇందులో వాణీ విశ్వనాథ్, జగపతి బాబు, శరత్ కుమార్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని సమాచారం. ‘రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఆరేటి సత్యవతి వద్ద పోలీసుల మోహరింపు..

పశ్చిమగోదావరి : ఆక్వా ఫుడ్ వ్యతిరేకపోరాట సమితి కన్వీనర్ తల్లి ఆరేటి సత్యవతిని అరెస్టు చేసేందుకు పోలీసులు మోహరించారు. దీనితో ఆమె ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే సమితి కన్వీనర్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఊరిని కాపాడుకోవాలనే ఉద్ధేశ్యంతో తాము శాంతియుతంగా పోరాటం చేస్తున్నామని, తన దగ్గర 200 మంది పోలీసులు మోహరించారని టెన్ టివితో వాపోయారు.

09:22 - March 8, 2017

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. నేడు మణిపూర్ లో తుది దశ, ఉత్తర్ ప్రదేశ్ లో ఏడో - తుదిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. అయితే యూపీలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన సొనెభద్ర, మీర్జాఊర్, చందౌలీలతో పాటు వారణాసి, ఘాజీపూర్, జౌన్ పూర్, బదోహి జిల్లాలో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది. నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసితో పాటు ఏడు జిల్లాల పరిధిలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలు, మణిపూర్ లో తౌబాల్ తో సహా ఐదు జిల్లాల్లోని 22 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ తుది దశ పోలింగ్ మార్చి 8..ఎన్నికలు జరిగే స్థానాలు 40
వారణాసి, సోన్ భద్ర, మిర్జాపూర్, చందౌలి, ఘాజిపూర్, జవున్ పూర్, భదోహి జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. 14188233 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ , మాజీ ఎంపీ అజయ్ రాయ్, సిగ్జతుల్లా అన్సారీ, సీమా సింగ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇతరులు 238 ఉండగా స్వతంత్రులు 139 బరిలో ఉన్నారు.

మణిపూర్ లో రెండో దశ పోలింగ్ మార్చి 8..ఎన్నికలు జరిగే స్థానాలు 22
చందేల్, ఇంఫాల్ తూర్పు, సేనాపతి, తామెంగ్లాంగ్, తౌబాల్, ఉఖ్రూల్ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. 7.80 లక్షల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజీపీ 24, కాంగ్రెస్ 22, సీపీఐ 2, స్వతంత్రులు 9, ఇతరులు 14 మంది బరిలో ఉన్నారు.

09:12 - March 8, 2017

పశ్చిమగోదావరి : తుందుర్రు మరోసారి వార్తల్లోకెక్కింది. అక్కడ పోలీసుల బూట్ల చప్పుడు వినిపిస్తోంది. మెగా అక్వాఫుడ్ పార్కు నిర్మాణంపై గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరి ఆందోళనలకు సీపీఎం, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. తుందుర్రు అక్వాపుడ్ పార్కు ముట్టడికి ఉద్యమకారుల పిలుపుతో ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. దీనితో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆందోళనపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. తుందుర్రు మొత్తం పోలీసులు మోహరించారు. 1500 మందికి పైగా పోలీసులు మోహరించారు. వీరిలో 300 మంది మహిళా పోలీసులు కూడా ఉన్నారు. ఫ్యాక్టరీకి చేరుకొనే ఎనిమిది రహదారులపై పోలీసులు మోహరించి ఐడీ కార్డులు లేనిదో లోనికి అనుమతించడం లేదు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నాయకులను గృహ నిర్భందం చేశారు. వ్యతిరేకపోరాట సమితి కన్వీనర్ ను అరెస్టు చేశారు. అతడి అమ్మను ఆరేటి సత్యవతిని కూడా అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 3 కి.మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. కంసాలబేతపూడి, మత్స్యపురి, వెంపా రహదారుల్లో ప్రత్యేక చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. రైతులు ఇళ్ల నుండి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

08:50 - March 8, 2017

ఈ ఫొటో చూడండి..నల్ల చీర కట్టుకుని..ఓర చూపులు చూస్తోంది..ఎవరో కాదు..సమంత..టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య'తో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం కొన్ని సినిమాలకు 'సమంత' సైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అందులో 'రాజు గారి గది 2’ ఒకటి. డైరెక్టర్ గా మారిన 'ఓం కార్' ‘రాజు గారి గది'కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో 'నాగార్జున' ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘సమంత' కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఆమెతో షూటింగ్ కూడా మొదలు అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను 'సమంత' ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసింది. 'రాజు గారి గది 2 లోని ఫొటో ఇదీ' అని పేర్కొంది. ఈ ఫొటోపై 'వావ్’, 'పిక్చర్ పర్ఫెక్ట్’, 'ఆసమ్’, 'లవ్ యు ఎస్ఆర్పీ’... అంటూ పేర్కొంది. మరి ఈ చిత్రంలో 'సమంత' పాత్ర ఎలాంటిదో తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యే వరకు చూడాల్సిందే.

08:42 - March 8, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఆక్వాఫుడ్ పార్క్ ముట్టడికి పోరాటసమితి పిలుపు ఇవ్వడంతో తుందుర్రులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుందుర్రు పరిసర గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించి 144 సెక్షన్ విధించారు. గ్రామాల్లో తనిఖీలు చేస్తూ గ్రామస్తులను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. మరోవైపు ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక పోరాటసమితి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆక్వాఫుడ్ పార్క్‌కు వెళ్లే మార్గాలన్ని పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. ఆక్వాఫుడ్ వ్యతిరేక ఉద్యమానికి సీపీఎం, వైసీపీ, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. కాగా తాజా అక్కడి పరిస్థితి ఎలా ఉందో.. పోలీసుల మోహరింపు ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? లాంటి విషయాలను వీడియోలో చూడొచ్చు. 

సోమ్ నాథ్ ఆలయానికి రానున్న మోడీ..

గుజరాత్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు సోమ్ నాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడనున్నారు. ఈసందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

08:36 - March 8, 2017

భద్రాద్రి : తమకోసమే బతికేవారు చాలామంది ఉంటారు. కాని సాటి మనుషుల కోసం జీవించేవారు కొందరే ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో ఓ మహిళ.. అభాగ్యులకు అమ్మగా మారింది. పేదరికంలో మగ్గుతున్నా.. వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ.. అనాధవృద్ధులను కడుపున పెట్టుకుని కాపాడుతోంది. కడుపు పుట్టినోళ్లు కాదని రోడ్డున పడేశారు.. ఏ బంధుత్వం లేని ఈ షహనాజ్‌బేగం మానవత్వాన్ని చాటుతున్నారు. చేతగాని వయసులో ఊతకర్రలా మారింది ఈ షహనాజ్‌బేగం. 
'ఆరిఫా అండ్‌ రోష్ని' వృద్ధాశ్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మాగారిపల్లికి  చెందిన ఉస్మాన్‌ కు  నలుగురు కుమార్తెలు. తండ్రిలాగానే ఈ కూతుళ్లకు కూడా సమాజసేవ, దిక్కులేనివారి పట్ల అమితమైన ప్రేమ. అనాధవృద్ధులకు  ఆశ్రయం కల్పించాలని  ఆలోచనతో   2010లో ఆరిఫా అండ్‌ రోష్ని పేరుతో వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారు.  అప్పటి నుంచి సుమారు రెండేళ్లు అందరూ కలిసి  ఆశ్రమాన్ని నడిపించారు. కుటుంఆర్ధిక పరిస్థితులతో ముగ్గురు చెల్లెళ్లు  ఆశ్రమ  నిర్వహణ నుంచి తప్పుకన్నారు.  కాని.. షహనాజ్‌ బేగం మాత్రం సహనంతో  ఆశ్రమ నిర్వహణను  కొనసాగిస్తున్నారు. ఈమెకు తన భర్త సహకారంకూడా తోడవడంతో నీడలేని వారికి గూడును కల్పంచారు. 

సొంతంగానే భరిస్తూ.. 
షహనాజ్‌బేగం సేవలను గుర్తించిన హైదరాబాద్‌లోని  కుల్‌హిందూ కల్చరల్‌ సొసైటీ  సంస్థ .. ఉత్తమ  సంఘసేవా అవార్డును ఇచ్చింది. అంతేకాదు ప్రతి సంవత్సరం సింగరేణిసంస్థతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి కూడా సత్కారాలు అందుకుంటున్నారు షహనాజ్‌బేగం.  ఆశ్రమానికి అవుతున్న ఖర్చును సొంతంగానే భరిస్తున్నారు షహనాజ్‌దంపతులు.  నెలకు 4వేల  రూపాయలు ఖర్చుచేస్తూ అద్దెభవనంలోనే ఆశ్రమం నిర్వహిస్తున్నారు.  
చేయి కలిపితే.. 
సాటి మనిషిపట్ల.. దయతో స్పందిస్తున్న షహనాజ్‌బేగం దంపతులు తాము మరిన్ని సేవలు కొనసాస్తామంటున్నారు. అయితే తమ ఆర్థిక పరిస్థితి కారణంగా సేవలను పరిమితంగానే అందిస్తున్నామంటున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వస్తే.. మరింత మంది అభాగ్యులకు అండగా ఉంటామంటున్నారు. 

నేటి నుండి తిరుమలలో తెప్పోత్సవాలు..

చిత్తూరు : తిరుమల శ్రీవారి సన్నిధిలో నేటి నుండి తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు వార్షిక తెప్పోత్సవాలను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రైలు పేలుడు ఘటనలో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్టు..

భోపాల్ : భోపాల్ -- ఉజ్జయిని రైలు పేలుడు ఘటనలో ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులను ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులు లక్నో నుండి భోపాల్ కు వచ్చినట్లు తెలుస్తోంది.

 

ఐడీ కార్డులు లేనిదే నో ఎంట్రీ...

పశ్చిమగోదావరి : తుందుర్రు ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుందుర్రు వ్యాప్తంగా పోలీసులు నిషేధ ఆజ్ఞలు విధించారు. 3 కి.మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. ఐడీ కార్డు లేనిదే తుందుర్రులోకి అనుమతించడం లేదు. కంసాలబేతపూడి, మత్స్యపురి, వెంపా రహదారుల్లో ప్రత్యేక చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. తుందుర్రు అక్వాపుడ్ పార్కు ముట్టడికి ఉద్యమకారుల నేపథ్యంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. రైతులు ఇళ్ల నుండి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

మహిళా దినోత్సవం స్పెషల్..

హైదరాబాద్ : నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళల హక్కులు, సమాన వేతనాలు అనే నినాదంతో ఈ యేడు మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. నేటి ప్రత్యేకతకు ప్రతిబింబంగా టీవీ ఛానెళ్లు ఉదయం చర్చలను పూర్తిగా మహిళలతో నిర్వహిస్తున్నాయి. మహిళా పోలీసు ఆఫీసర్లు హైదరాబాద్ లో కార్డాన్ సెర్చ్ నిర్వహించి కేక్ కట్ చేసి పంచిపెట్టారు.

చివరిదశ..

హైదరాబాద్ :  నేడు యూపీ, మణిపూర్ లో చివరిదశ ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో 40 స్థానాలకు, మణిపూర్ లో 22 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 11న యూపీ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

తనిఖీలు..

సికింద్రాబాద్ : పోలీసులు అడ్డగుట్లలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి దీనికి ఆధ్వర్యంలో 350 మంది పోలీసులతో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 9 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే మహిళా దినోత్సవం సందర్భంగా డీసీపీ సుమతి కేక్ కట్ చేయడం విశేషం. 

బ్రహ్మోత్సవాలు..

జగిత్యాల : నేటి నుంచి ఈనెల 20 వరకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. 

బీసీసీఐ లేఖ..

హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ల దృష్ట్యా హెచ్ సీఏ పాలకమండలిని నియమించాలని నేడు బీసీసీఐ లిఖిత పూర్వక లేఖను సమర్పించనుంది. 

పన్నీర్ నిరాహార దీక్ష..

 చెన్నై : తమిళానాడులో వాడీ వేడీ రాజకీయాలు కొనసాగుతన్నాయి. నేడు పన్నీరు సెల్వం నిరాహార దీక్షకు పూనుకోనున్నారు. జయలలిత మృతిపై దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 

08:06 - March 8, 2017

'సమాన హక్కులు, సమాన వేతనాలు' నినాదంతో నేటి మహిళ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరూ మహిళా నాయకులతో 10టీవీ ప్రత్యేక న్యూస్ మార్నింగ్ డిబేట్ నిర్వహిచింది. ఈ సందర్భంగా హైకోర్టు అడ్వకేట్ రచనా రెడ్డి, ఐద్వా నాయకురాలు స్వరూపా రాణి, ఉప్పల శారద బీజేపీ నేత,  ఈ డిబేట్ లో పాల్గొన్నారు. మహిళల హక్కులు, మహిళలపై జరుగుతున్న దారుణాలపై చర్చలో చర్చనీయాంశాలను లేవనెత్తారు. అంతర్జాతీయ వ్యాప్తంగా పురుషాధిక్క సమాజంలో కొనసాగుతోందని వ్యక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో మహిళా సాధికారత ఎటువైపు వెళ్తుంది. భద్రత ఏమాత్రంగా ఉంది? లాంటి అంశాలపై రసవత్తరమైన చర్చ జరిగింది. పూర్తి డిబేట్ చూడటానికి వీడియో చూడండి. 

07:59 - March 8, 2017

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇవాళ మహిళలకు ప్రత్యేక సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. మహిళా దినోత్సవానికి రెండు రోజుల ముందు విడుదలైన మోన్ స్టర్ సర్వే గణాంకాలు కొన్ని కీలకమైన ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. మన దేశంలో స్త్రీలు పురుషుల మధ్య ఇప్పటికీ వేతన వ్యత్యాసాలు కొనసాగుతున్న వైనాన్ని కళ్లకు కట్టింది మోన్ స్టర్ సర్వే. ఒకవైపు వేతనాల్లో అన్యాయానికి గురవుతున్న స్త్రీలు ఇటు ఇంటి పని, అటు ఆఫీసు పనిలోనూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న స్త్రీలు ఆరోగ్యపరంగానూ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడో 1910 నుంచే మార్చి 8ని మహిళా హక్కుల దినోత్సవంగా పాటిస్తున్నా , సమాన పనికి సమానవేతనం చెల్లించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఈ వ్యత్యాసాలు ఎందుకు కొనసాగుతున్నాయి? వివిధ రంగాల్లో పనిచేస్తున్న వర్కింగ్ ఉమెన్ ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? మహిళలు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలకు పరిష్కారం లభించేదెప్పుడు? అందుకు మనమేం చేయాలి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ప్రముఖ గైనకాలజిస్ట్‌ , జన విజ్ఞాన వేదిక నేత డాక్టర్‌ రమాదేవిగారు, ఐఎఫ్ టియు నేత ఎస్ ఎల్ పద్మగారు 10టీవీ స్టూడియోకి వచ్చారు. మహిళా దినోత్సవం, మహిళా సాధికారత గురించి అద్భుతంగా మాట్లాడారు. కాలర్స్ అడిగే ప్రశ్నలకు మంచి సమాధానాలు చెప్పారు. పూర్తి సమాచారాన్ని వీడియోలో చూడొచ్చు.

07:52 - March 8, 2017

ఖమ్మం : ఆమె నిరుపేదరాలు.. కానీ, ప్రేమను పంచడంలో గొప్ప మాతృమూర్తి. కష్టాల్లో ఉన్నవారికి అపద్బంధవురాలు. అనాధ వృద్ధులకు అన్ని తానై సపర్యలు చేస్తున్న ఆ మాతృమూర్తి వారందరికీ తల్లిగా మారింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ అమ్మపై 10టీవీ ప్రత్యేక కథనం.. 

అలా మొదలైంది..
భద్రాచలంలోని స్థానిక ఏరియా ఆస్పత్రిలో నాల్గవ తరగతి ఉద్యోగినిగా సరోజనమ్మ పనిచేస్తోంది. మొదటి నుంచి సేవాగుణం ఉన్న సరోజనమ్మ.. తాను పనిచేస్తున్న ఆస్పత్రిలో ఓ వృద్ధురాలిని కన్నకొడుకులు వదిలివెళ్లారు. దీంతో ఆమెను చేరదీసి... ఆరోగ్యం మెరుగుపడేంత వరకూ ఆ వృద్ధురాలికి తానే తల్లి అయ్యింది. అప్పటి నుంచి సరోజనమ్మ అనాధ వృద్ధులను చేరదీస్తూ.. తనకు వచ్చే జీతంతోనే వారిని కన్నబిడ్డల్లా చూసుకుంటోంది. 

ముగ్గురిన నుండి 40 మందికి..
సరోజనమ్మ అనాధ వృద్ధులకు అన్ని తానై సపర్యలు చేస్తోంది. కంటికి రెప్పలా చూసుకుంటోంది. వారికి స్నానం చేయించడం. బట్టలు తొడగం... అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. స్వయంగా తానే వంట చేసి.. వృద్ధులకు కడుపునిండా ప్రేమతో వడ్డిస్తుంది. 8 ఏళ్లు క్రితం ముగ్గురితో ప్రారంభించిన ఈ అనాధశ్రమంలో ప్రస్తుతం 40 మంది వరకూ ఉన్నారు. దాతల సహాయంతో ఇంటిని అద్దెకు తీసుకుని వృద్ధాశ్రమాన్ని నడుపుతోంది. తనకు వచ్చే కొద్దిపాటి జీతంతో వీరిని, కుటుంబాన్ని పోషించాల్సి రావడంతో ఇబ్బందులు పడుతోంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఊపిరి ఉన్నంత వరకూ వృద్ధులకు సేవ చేస్తానని చెబుతోంది సరోజనమ్మ. 

మరో చేయి కలిపితే.. 
వృద్ధులకు సేవ చేయడంలోనే తనకు ఎంతో సంతృప్తి కలుగుతుందని సరోజనమ్మ చెబుతోంది. అనాధ వృద్ధులు మరణించిన తర్వాత కూడా వారికి అన్ని తానై కర్మకాండలు నిర్వహిస్తోంది. సరోజనమ్మ సేవా ధృక్పథాన్ని చూసి.. కొందరు దాతలు ముందుకొచ్చి... ఊడతాభక్తిగా సహాయం చేస్తున్నారు. దీంతో సరోజనమ్మకు కొంత ఊరట లభిస్తోంది. ఇంకా దాతలెవరైనా పెద్ద మనసుతో ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే.. చాలా మంది వృద్ధులకు సేవలు అందించగలుతానని చెబుతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా సరోజనమ్మకు 10టీవీకు శుభాకాంక్షాలు తెలుపుతోంది. 

వడగండ్లు.. కడగండ్లు..

హైదరాబాద్ : తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో జోరుగా వర్షాలు  కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడడంతో మామిడిపంటకు భారీగా నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు యాదాద్రి జిల్లా కొండమడుగు, బొమ్మలరామారంలో వడగాళ్ల వానకు పెద్ద ఎత్తున మామిడి పంట నష్టపోయింది. కరీంనగర్‌, సిరిసిల్ల, యాదాద్రి, మేడ్చల్‌లో జోరుగా వడగళ్లవాన కురిసింది. అటు వేములవాడలోనూ కురిసిన వడగళ్ల వానకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

07:46 - March 8, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలోని తుందుర్రులో మళ్ళీ ఆక్వా ఫుడ్ పార్కు వ్యతిరేక జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇవాళ ఆక్వా ఫుడ్ పార్క్ ముట్టడికి పోరాట సమితి పిలుపునివ్వడంతో.. పోలీసుల నిర్బంధపర్వం అలజడి రేపుతోంది. తనిఖీలు చేస్తూ గ్రామస్తులను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ  హెచ్చరికలు జారీచేస్తున్నారు. వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ ఆరేటి వాసుని అరెస్ట్ చేసిన పోలీసులు..సిపిఎం నేతల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

ఉద్రిక్త వాతావరణం..
తుందుర్రు పోలీసుల బూట్ల చప్పుళ్లతో మార్మోగుతోంది. అడుగడుగునా తనిఖీలు.. ఇంటింటి సోదాలతో పోలీసుల నిర్బంధకాండ  కొనసాగుతోంది. బుధవారం ఆక్వా ఫుడ్ పార్క్ ముట్టడికి పోరాట సమితి పిలుపునివ్వడం.. ఉద్యమకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తుందుర్రులో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణ పనులు మార్చి 7వ తేదీలోపు నిలిపివేయాలని పోరాట సమితి నాయకులు అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే తుందుర్రు, కంసాల  బేతపూడి గ్రామాల్లో పర్యటించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్థానికుల పోరాటానికి బాసటగా నిలిచారు. ఆక్వా ఫుడ్ పార్క్ ముట్టడికి మద్దతు ప్రకటించారు. 

ఇంటింటికీ తనిఖీ చేస్తూ.. 
అక్వాఫుడ్‌ పార్క్‌ ముట్టడికి పోరాట సమితి నాయకుల సన్నాహాలతో అప్రమత్తమైన పోలీసులు తుందుర్రు, కంసాల బేతపూడి సహా 32 గ్రామాల్లో సోదాలు ముమ్మరం చేశారు. మూడు రోజులుగా రాత్రి పగలు ఇంటింటి తనికీలు చేస్తూ.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఆక్వా ఫుడ్  పార్క్ నిర్మాణ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందని.. అక్వాఫుడ్ పార్క్ ప్రాంతంలో నిషేధాజ్ఞలున్నాయని చెబుతున్నారు. అయితే తమను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆక్వా ఫుడ్ పార్క్ ముట్టడించి తీరుతామని తుందుర్రు గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉద్యమకారుల కోసం పోలీసులు అణువణువు గాలిస్తున్నారు. ఇప్పటికే అక్వాఫుడ్‌ పార్క్‌ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ ఆరేటి వాసును అరెస్ట్ చేశారు. సిపిఎం నాయకుల కోసం వారి ఇళ్ల ముందు భారీగా పోలీసులను మోహరించారు. 

07:41 - March 8, 2017

హైదరాబాద్ : తెలంగాణ పోలీసుల అలర్ట్‌నెస్‌తో పెనుముప్పు తప్పింది. లక్నోలో భారీ విధ్వంసానికి జరిగిన కుట్రను భద్రతా బలగాలు వమ్ముచేశాయి. భారత్‌లో తెగబడేందుకు ఐసిస్‌ చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికపుడు నిఘా సంస్థలు విజయవంతంగా అడ్డుకుంటున్నాయి. 

లక్నో కుట్రను..
తెలంగాణ పోలీసులు ఉప్పందించడంతో ఏటీఏస్ పోలీసులు భారీ ఆపరేషన్ మొదలు పెట్టారు. లక్నోలో జరగనున్న కుట్రను మన పోలీసులు ఇట్టే పసిగట్టారు. అవకాశం కోసం వేచిచూసి సరైన సమయంలో సమాచారం చేరవేశారు. పెను ముప్పుకు కుట్రపన్నిన ఉగ్రవాదులపై ఆపరేషన్‌ను విజయవంతంగా ముంగిచాయి భద్రతా దళాలు. 

పాక్ లో ట్రైనింగ్..
పాకిస్థాన్‌ నుంచి ఆర్థిక, ఆయుధ సహాయం పొందిన ఐసిస్‌ ఉగ్రవాదులు భారత్‌లో పేలుళ్లకు  పన్నిన కుట్రను  ముందుగానే గుర్తించిన తెలంగాణ ఇంటలిజెన్స్‌ పోలీసులు.. విషయాన్ని యూపీ పోలీసులకు చేరవేశారు. ఐసిస్‌ ఉగ్రవాది సైఫూల్లాపై గత కొన్ని రోజులుగా నిఘా ఉంచారు.  భారత్‌లో దాడి చేసేందుకు ఇప్పటికే రెండు సార్లు పాకిస్థాన్ కు వెళ్లిన సైఫుల్లా అక్కడ ట్రైనింగ్ కూడా  తీసుకున్నట్టు నిఘావర్గాలు గుర్తించాయి. దేశంలో పేలుళ్లకు కుట్రలు పన్నుతున్న విషయాన్ని తెలంగాణా డీజీపీ ఆఫీసులోని నిఘా విభాగం పసిగట్టింది. ఎపుడు, ఎలా దాడిచేయాలన్న దానిపై ఉగ్రవాదుల మధ్య నడిచిన సంభాషణలను గుర్తించారు.  దీనిపై యూపీలో నిఘా విభాగాన్ని అలర్ట్‌ చేశారు. 

మరో కుట్ర..
పాట్నా వద్ద జరిగిన ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం.. ఉజ్జయిని పాసింజర్ ప్రమాదం లాంటి సంఘటనలు సైఫూల్లా డైరెక్షన్ లోనే జరిగినట్లు ఇంటలిజెన్స్ విభాగం గుర్తించింది. మరోసారి కుట్రకు పాల్పడుతున్నాడని తెలుసుకున్న తెలంగాణ పోలీసులు యాంటీ టెర్రరిస్టు స్కాడ్ కు సమాచారం అందించారు.  లక్నో నగరం ఠాకూర్ ఘంజ్ లోని ఓ ఇంట్లో  ముష్కరులు దాగి ఉన్నట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. భారీ విధ్వంసాన్ని అడ్డుకున్నారు. 

ఇండియాలో పాగా వేసేందుకు..
మరోవైపు సైఫుల్లాకు సహాకరించిన మరో ఇద్దరి టెర్రరిస్టులను కూడా భద్రతా దళాలు  అదుపులోకి తీసుకున్నాయి.  వీరిని విచారించి మరింత సమాచారం రాబట్టనున్నారు. మొత్తానికి ఇటీవల ఐసిస్‌ చెరనుంచి విముక్తిపొందిన డాక్టర్ రామ్మూర్తి వెల్లడించిన విషయాలతోపాటు..  సైఫూల్లా తాజా ప్లాన్స్ చూస్తే.. ఇండియాలో పాగా వేసేందుకు.. భారీగా ప్రాణనష్టం కల్గించేందుకు.. ఐసిస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుందనే విషయం స్పష్టం అవుతోంది.  

దేశవ్యాప్తంగా ప్రశంసలు..
మొత్తానికి దేశంలో ఐసిస్ మూలాలు ఎక్కడ ఉన్న మన తెలంగాణ పోలీసులే ముందుగా పసిగట్టుతున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆపరేషన్ మొదలు పెట్టాలనుకున్న ఐసిస్‌ ముష్కరుల కుట్రలను ముందే పసిగట్టిన మన పోలీసులు.. 7గురు ఉగ్రవాదులను  అరెస్ట్ చేశారు. సమర్థంగా పనిచేస్తున్న తెలంగాణ పోలీసులు నిఘావిభాగానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. 

07:34 - March 8, 2017

లక్నో : దాదాపు11 గంటల పాటు కొనసాగిన టెన్షన్‌కు తెరపడింది. లక్నోలోని ఠాకూర్‌గంజ్‌లో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.  ఉగ్రవాది సైఫుల్లాను ప్రాణాలతో పట్టుకోవాలన్న భద్రతా దళాల ప్రయత్నాలు ఫలించలేదు. ఇంట్లో  దాగిన ఉగ్రవాది  20రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్టు  పోలీసులు తెలిపారు.  పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో టెర్రరిస్ట్‌ అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలం నుంచి ఓ పిస్టల్‌ను, మరో కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాది సైఫుల్లా కు ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు వీడియోలో చూడండి..

ఉగ్రవాది ఎన్ కౌంటర్..

లక్నో : దాదాపు11 గంటల పాటు కొనసాగిన టెన్షన్‌కు తెరపడింది. లక్నోలోని ఠాకూర్‌గంజ్‌లో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.  ఉగ్రవాది సైఫుల్లాను ప్రాణాలతో పట్టుకోవాలన్న భద్రతా దళాల ప్రయత్నాలు ఫలించలేదు. ఇంట్లో  దాగిన ఉగ్రవాది  20రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్టు  పోలీసులు తెలిపారు.  పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో టెర్రరిస్ట్‌ అక్కడికక్కడే మరణించాడు. 

Don't Miss