Activities calendar

09 March 2017

21:29 - March 9, 2017

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలకు సర్వం సిద్ధమైంది.. శుక్రవారం ఉదయం 10గంటలకు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.... సమావేశాల్లో ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించనున్నారు.. దాదాపు 45 నిమిషాలపాటు గవర్నర్‌ స్పీచ్‌ ఉంటుంది..

గవర్నర్‌ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం.....

గవర్నర్‌ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు.. ఇందులో సమావేశాల ఎజెండా నిర్ణయించనున్నారు.. సభను ఎన్నిరోజులు జరపాలో బీఏసీ తర్వాత స్పష్టత రానుంది.. అలాగే ఏయే రోజు ఏయే అంశాలపై ఎంతసేపు చర్చించాలో కూడా బీఏసీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు..

ఈ నెల 13కు వాయిదాపడనున్న సభ......

బీఏసీ సమావేశం తర్వాత స్పీకర్‌ సభను ఈ నెల 13కు వాయిదా వేయనున్నారు.. శని, ఆదివారాలు సెలవుకావడంతో సోమవారం మళ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి.. అదేరోజు మంత్రి ఈటెల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు..

నిరుద్యోగ సమస్య, ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌......

ఈసారి సమావేశాల్లో ప్రధానంగా నిరుద్యోగ సమస్య, ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌తోపాటు పలు అంశాలపై హాట్‌ హాట్‌ చర్చ జరిగే అవకాశముంది.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండట్టేందుకు ఇప్పటికే ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలను రెడీ చేసుకున్నాయి.. వీటికి ధీటుగా సమాధానమిచ్చేందుకు అధికారపక్షం కూడా సిద్ధమైంది. మొత్తానికి అధికార, ప్రతిపక్షాల వ్యూహ, ప్రతివ్యూహాలతో ఈ సమావేశాలు మరింత వాడివేడిగా జరిగే అవకాశముంది.. అటు ఈ సమావేశాలకు పోలీసులు గట్టి భద్రత ఏర్పాటుచేశారు.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసెంబ్లీ చుట్టూ పోలీసుల్ని భారీగా మోహరించారు..

20:13 - March 9, 2017

హైదరాబాద్: ఇందిరాపార్క్ ధర్నా చౌక్ కు బొంద..నిరసన హక్కుకు సర్కార్ సమాధి, ఏక్ దమ్ పెరిగిపోయిన లోకేశం ఆస్తులు... ఆంధ్రప్రదేశ్ లో ఇంకా తీరని జనం పస్తులు, సీఎం చెంప పగలగొడతం అంటున్న రేవంతం...వద్దు బాబు నీవు చేయకు ఆ పంతం, బ్యాలెట్ పేపర్లో మారిపోయిన ఫోటోలు...టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆగంఆగం, ఏప్రీల్ కంటే ముందే ఫూల్స్ అయితున్న సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ చేసి సిగ్గు తీసుకుంటున్న సంస్థలు, ఉత్తర ప్రదేశ్ కాడా ట్రాఫిక్ పోలీసోళ్ల పైత్యం...కాళీ గొలుసులకు ఏలాడబడ్డ ఏనుగులు ఇలాంటి అంశాలను 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు తీసుకొచ్చాడు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:11 - March 9, 2017

హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల ప్రకారం అధికార బిజెపికి ఎదురు దెబ్బేనని చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. యూపీలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుందని ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. బీజేపీ కూటమికి 185, ఎస్పీ కాంగ్రెస్‌ కూటమికి 120, బీఎస్పీకి 90, ఇతరులకు 8 సీట్ల వచ్చే అవకాశముందని తెలిపింది. అటు ఇండియా టుడే సర్వే పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టింది. కాంగ్రెస్ 62 నుంచి 71 సీట్లు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి 42 నుంచి 51 సీట్లు, అకాలీదళ్‌, బీజేపీకి 04-07, ఇతరులు 2 సీట్లు వస్తాయని సర్వే వివరాలు వెల్లడించింది. ఇదే అంశంపై 'హెడ్ లైన్ షో' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీపీఎం నేత వి.శ్రీనివాస్, కాంగ్రెస్ నేత బెల్లానాయక్, బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:47 - March 9, 2017

హైదరాబాద్: యూపీలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుందని ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. బీజేపీ కూటమికి 185, ఎస్పీ కాంగ్రెస్‌ కూటమికి 120, బీఎస్పీకి 90, ఇతరులకు 8 సీట్ల వచ్చే అవకాశముందని తెలిపింది. అటు ఇండియా టుడే సర్వే పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టింది. కాంగ్రెస్ 62 నుంచి 71 సీట్లు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి 42 నుంచి 51 సీట్లు, అకాలీదళ్‌, బీజేపీకి 04-07, ఇతరులు 2 సీట్లు వస్తాయని సర్వే వివరాలు వెల్లడించింది.

ఇండియా న్యూస్ సర్వే ప్రకారం...

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి హవా ఉన్నట్లు ఎక్జిట్‌పోల్స్‌ అంచనాకు వచ్చాయి. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలకు గాను ఇండియా న్యూస్‌ సర్వే ప్రకారం బిజెపికి 185, ఎస్పీ-కాంగ్రెస్ 120, బిఎస్‌పికి 90, ఇతరులు 8 స్థానాలను కైవసం చేసుకుంటారని పేర్కొంది. టైమ్స్‌ నౌ అంచనా ప్రకారం బిజెపికి 190 నుంచి 210 సీట్లు, ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమికి 110-130 సీట్లు, బిఎస్పీకి 57-74 సీట్లు, ఇతరులు 8 స్థానాలు గెల్చుకుంటారని తెలిపింది.

పంజాబ్‌లో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కడతారని...

పంజాబ్‌లో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కడతారని... ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది.. పంజాబ్‌లో 117 సీట్లకుగాను... కాంగ్రెస్‌ 62నుంచి 71 సీట్లు కైవసం చేసుకుంటుందని సర్వే తెలిపింది.. రెండో స్థానంలో ఆప్‌ నిలుస్తుందని... ఆ పార్టీకి 42నుంచి 50సీట్లు వస్తాయని సర్వే తేల్చింది.. అకాళీదళ్‌, బీజేపీ కూటమి కేవలం 2నుంచి 4సీట్లుమాత్రమే సాధిస్తుందని ప్రకటించింది..

మణిపూర్‌లో బీజేపీ హవా...

మణిపూర్‌లో బీజేపీ హవా సాగుతుందని ఇండియా టీవీ సర్వే తేల్చింది.. మొత్తం 60సీట్లకుగాను... బీజేపీకి 25నుంచి 31సీట్లు వస్తాయని సర్వే స్పష్టం చేసింది.. కాంగ్రెస్‌కు 7నుంచి 23 సీట్లు.. ఇతరులకు 9నుంచి 15సీట్లు వస్తాయని సర్వేలో తేలింది..

గోవా లో హంగ్....

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ దక్కబోదని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు అంచనా వేస్తున్నాయి. ఎన్డీటీవీ సర్వే ప్రకారం...బీజేపికి 15 నుంచి 21, కాంగ్రెస్‌కు 12-18, ఆమ్‌ఆద్మీపార్టీకి 4, ఇతరులకు 2నుంచి 8 స్థానాలు దక్కనున్నాయి. అలాగే సీఎన్ ఎన్ న్యూస్ నిర్వహించిన సర్వే ఫలితాల ప్రకారం...బీజేపికి 15, కాంగ్రెస్‌కు 10, ఆమ్‌ఆద్మీ పార్టీకి 7, ఇతరులకు 08 స్థానాలు దక్కనున్నాయి. ఇక న్యూస్‌ ఎక్స్‌-ఎమ్మార్సీ సర్వే ప్రకారం 40 స్థానాలున్న గోవాలో బీజేపీకి 15 స్థానాలు, కాంగ్రెస్‌కు 10 స్థానాలు, ఆప్‌కు 7 స్థానాలు, ఇతరులకు 6 స్థానాలు దక్కనున్నట్టు అంచనా వేసింది. గోవాలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశముందని, ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో ఆప్‌, ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

18:41 - March 9, 2017

హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ జరిగిన హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌ రద్దైంది. ఈనెల 19న మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఇవాళ ఉదయం 8గంటలకు పోలింగ్‌ ప్రారంభం అయితన తర్వాత..టీచర్‌ ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న యూటీఎఫ్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డి ఫోటో తీవ్ర గందరగోళానికి దారితీసింది. బ్యాలెట్‌ పేపర్లో 9వ నెంబర్లో ఉన్న యూటీఎఫ్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డి ఫోటోను..మూడోవ నెంబర్‌లో ముద్రించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. తప్పును వెంటనే గ్రహించిన యూటీఎఫ్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డి..ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎన్నికను వెంటనే రద్దు చేసి..రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన ట్యాంక్‌బండ్‌ వద్ద దీక్షకు దిగారు. అయితే దీనిపై స్పందించిన ఈసీ..రీపోలింగ్‌కు ఆదేశించింది.

ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల

ఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్‌డీటీవీ నిర్వహించిన సర్వేలో యూపీ, మణిపూర్‌, గోవాలో భాజపా కూటమి అధికారం చేజెక్కించుకొనే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ రద్దు

హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో అభ్యర్థుల ఫోటోలు మార్పు కారణంగా పోలింగ్ రద్దు చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రింటింగ్ ప్రెస్ లో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి.. ఒకరికి మెమో ఇచ్చారు. ఈనెల 19న మండలి ఎమ్మెల్సీ ఎన్నికకు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

17:43 - March 9, 2017

హైదరాబాద్: ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కలిశారు. హైదరాబాద్‌లో రోడ్ల అభివృద్ధి, ఫ్లైఓవర్ల నిర్మాణం, రోడ్ల విస్తరణతో పాటు పలు అంశాలపై వారు గడ్కరీతో చర్చించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో కేటీఆర్‌తో పాటు ఎంపీ బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.

కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ కొనసాగుతోంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత కేసీఆర్... నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

17:40 - March 9, 2017

హైదరాబాద్‌ : గాంధీభవన్లో సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌, పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ఇతర ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే సీఎల్పీ సమావేశానికి కోమటిరెడ్డి బ్రదర్స్‌ డుమ్మాకొట్టారు. బడ్జెట్‌ సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై సమావేశంలో చర్చిస్తున్నారు.

17:39 - March 9, 2017

హైదరాబాద్: ఎన్నో లక్షలాది ఉద్యమాలు... అన్యాయమైనా, దాష్టీకమైనా.. హక్కుల అణిచివేత అయినా.. ప్రభుత్వ శాఖలు స్పందించకపోతే.. కచ్చితంగా బాధితులు, వారికి మద్దతుగా నిలిచేవారు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కు చేరుకుంటారు. తమ గొంతు వినిపిస్తారు.. ఆమరణ దీక్ష అయినా... ఆందోళన అయినా... ర్యాలీ అయినా ఇక్కడే టెంట్‌ వేసుకొని తమ నిరసన తెలియజేస్తారు. సమస్యలపై సమర శంఖారావం పూరిస్తారు.

ప్రశ్నించే తత్వాన్ని సహించని పాలకులు.....

ఇక నుంచి ధర్నా చౌక్ లో ఈ దృశ్యాలు కనిపించవు... ప్రశ్నించే తత్వాన్ని సహించని పాలకులు ఈ తరహా ధర్నాలకు, ఆందోళనలకు చరమగీతం పాడాలనుకుంటున్నారు.. ఏకంగా ధర్నా చౌక్ నే ఎత్తేయాలని నిర్ణయించేశారు.

లుంబిని పార్క్ స్థలంలోనే ధర్నా చౌక్....

రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు సచివాలయానికి ఎదురుగా... లుంబిని పార్క్ స్థలంలోనే ధర్నా చౌక్ ఉండేది.. సచివాలయం ముందు ధర్నాలతో శాంతిభద్రతల సమస్యలు వస్తున్నాయంటూ... 2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు.. ఇందిరా పార్క్ సమీపానికి ధర్నా చౌక్‌ మార్చారు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకు దాదాపు 5 నుంచి 6 ఆందోళనలు అక్కడ కొనసాగుతున్నాయి.. కాల్పులకు దారితీసి సంచలనంరేపిన.. విద్యుత్ ఉద్యమ ర్యాలీకూడా ఇందిరా పార్క్ నుంచే ప్రారంభమైంది... డ్వాక్రా మహిళలు ఇక్కడే ఆందోళన చేసి.. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినప్పుడు అప్పటి పాలకులు గుర్రాలతో తొక్కించిన చరిత్రకు ధర్నా చౌక్ సజీవ సాక్ష్యం.. ఇలా ఒకటేమిటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి రిక్షాపుల్లర్ల సమస్యల వరకు.... ఉద్యోగులు హక్కుల నుంచి స్త్రీ హక్కుల వరకు అన్ని నిరసనలు ఇదే వేదికగా నడిచాయి.. ఎన్నో అరాచక పాలన ప్రభుత్వాలకు చరమగీతం పాడిన చరిత్ర ధర్నా చౌక్ ఉద్యమాలకు ఉంది...

అన్నాహజారే, మేథాపాట్కర్ , వందనాశివ.....

అన్నాహజారే, మేథాపాట్కర్ , వందనాశివ, సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్, బృందాకరత్, ఎబి బర్దన్, సురవరం సుధాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డిలాంటి నేతలతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రైతు సమస్యలపై ఇక్కడే ఆందోళన బాట పట్టారు.. ముఖ్యంగా ఇక్కడ లెప్ట్ పార్టీలు చేసిన ఉద్యమాలు ప్రభుత్వాలను కదిలించడమే కాదు.. సానుకూల నిర్ణయాలు తీసుకునే పరిస్థితిని కల్పించాయి.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు - చట్టబద్దత, డ్వాక్రా, మున్సిపల్ కార్మికులు, ఉపాధ్యాయిలు, ఆటో వర్కర్స్ ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉద్యమాలకు ప్రభుత్వం స్పందించిన సందర్బాలు ఎన్నో.. అలాగే పోలీసుల లాఠీలు కూడా ఇక్కడ కరాళ నృత్యం చేసిన సందర్భాలూ ఉన్నాయి....

స్వయంగా ధర్నాలుచేసిన సీఎం కేసీఆర్‌..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ధర్నా చౌక్ ది అత్యంత కీలకపాత్ర... ప్రత్యేక రాష్ట్ర అవసరంపై జేఏసీలు, ప్రజా, విద్యార్థి సంఘాలు చేసిన ఆందోళలను ఒక ఎత్తయితే... ప్రస్తుత సీఎం కేసీఆర్ కూడా స్వయంగా ధర్నాలు చేయడమే కాకుండా.. ఎన్నో నిరసనలకు సంఘీభావం ప్రకటించారు.. అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే.. అసలు ధర్నా చౌక్ అవసరమే ఉండదంటూ ప్రకటన కూడా చేశారు.

కేసీఆర్ సర్కార్ కు జేఏసీ సెగ ...

ఈ మధ్య కాలంలో కేసీఆర్ సర్కార్ కు జేఏసీ సెగ తగిలింది. నిరుద్యోగుల ర్యాలీ ఇందిరా పార్క్ దగ్గర నిర్వహిస్తామని జేఏసీ చెప్పడం.. అక్కడ కాకుండా వేరే చోటుకు మార్చాలంటూ ప్రభుత్వం సూచించడం .. జేఏసీ ససేమిరా అనడమూ జరిగింది.. ఈ పరిణామాల తర్వాత ధర్నా చౌక్ ఎత్తివేయాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, జేఏసీలు ఉద్యమాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న సమయంలో ఈ ఆదేశాలిచ్చింది.. గురువారం నుంచి ఎలాంటి ఆందోళనలకు అనుమతి ఇవ్వొద్దంటూ ఉత్తర్వులు జారీచేసింది.. దీంతో బుధవారం ధర్నా చౌక్‌లో ఆందోళనకు ప్రయత్నించిన సెర్ప్‌ ఉద్యోగులను వెనక్కి పంపించేశారు.

నగరం నాలుగు వైపులా ధర్నా చౌక్‌లు...

ధర్నా చౌక్‌లో నిరసనలు వద్దన్న ప్రభుత్వం.... నగరం నాలుగు వైపులా ధర్నా చౌక్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. వరంగల్‌ జాతీయ రహదారిలోని ఘట్‌కేసర్‌ సమీపంలోని పర్వతపురం, కాప్రా సమీపంలోని జవహర్‌నగర్‌, శంషాబాద్‌, గండిమైసమ్మ రహదారుల్లో ధర్నాలకు అనుమతి ఇవ్వనుంది. సచివాలయం, అసెంబ్లీకి సమీపంలో ధర్నాచౌక్‌ ఉండడం... అదీ నగర నడిబొడ్డున కావడంతో ట్రాఫిక్‌ జామ్‌లు అవుతు ఉన్నాయని... అందుకే ప్లేస్‌ మార్చేస్తున్నామని చెబుతోంది.. సర్కారు సమాధానంపై ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి.. ఇప్పటికే కొందరు కోర్టు మెట్లు కూడా ఎక్కారు.. ధర్నా చౌక్ లో ధర్నాలు చేసేవారు.. ధర్నా చౌక్ ఉండాలంటూ ధర్నాలకు దిగుతున్నారు.. దీనిపై కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో వేచిచూడాలి.

17:35 - March 9, 2017

ఆదిలాబాద్‌ : నగరంలోని శ్రీరామ జిన్నింగ్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం స్థానికులను టెన్షన్‌ పెట్టింది.. ఫ్యాక్టరీలో పత్తి నిలువకు అంటుకున్న మంటలు వేగంగా వ్యాపించాయి. ఫైర్‌ సిబ్బంది ఈ మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పటికే ఐదు క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతైంది. మరో నాలుగు క్వింటాళ్ల పత్తికి కూడా నష్టం సంభవించింది.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..

సీఎల్పీ మీటింగ్ కు కోమటిరెడ్డి బ్రదర్స్ డుమ్మా..

హైదరాబాద్ : గాంధీభవన్ కాసేపటి క్రితం సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిగ్విజయ్ సింగ్ నేతలకు దశా..దిశ నిర్దేశం చేయనున్నారు. అయితే ఈ సమావేశానికి కోమటిరెడ్డి బ్రదర్స్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. 

గూడూరులో భారీ వర్షం..నిలిచిన పోలింగ్..

నెల్లూరు : గూడూరులో ఉరుములు..మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. పంచాయతీ రాజ్, ఎంపీడీవో కార్యాలయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిలిచిపోయింది. 

 

వేతనాలు పెంచాలని కార్మికుల ధర్నా..

తూర్పుగోదావరి : కాకినాడ సెజ్ లోని బొమ్మల పరిశ్రమలో వేతనాలు పెంచాలని కార్మికులు ఆందోళన చేపట్టారు. మహిళా కార్మికులను కంపెనీ లోపల దిగ్భందించి ఫ్యాక్టరీ గేటుకు యాజమాన్యం తాళం వేసింది. సమాచారం అందుకున్న సీఐటీయూ నేతలు గేటు ఎదుట ధర్నా చేపట్టింది.

16:57 - March 9, 2017

హైదరాబాద్: గిరిజన హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమ బాట పడుతుందని ఆ పార్టీ నాయకులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, బట్టి విక్రమార్క తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. వారి సంక్షేమానికి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 9వ తేదీన ఖమ్మం జిల్లాలో గిరిజన గర్జన కార్యక్రమాన్ని, ఏప్రిల్‌ 13వ తేదీన నల్గొండ జిల్లా.. దామర్లచర్లలో మీటింగ్‌ను నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు.

16:47 - March 9, 2017

మహిళా దినోత్సవం రోజునే మహా దారుణం..మహిళపై ప్రజాప్రతినిధి దాష్టీకం..చిన్న గొడవను పెద్దది చేసి అరాచకం..కొడుకులతో కలిసి మహిళపై దాడి..

మహిళా దినోత్సవాలు అబ్బో...చాలా ఘనంగా జరిగాయి. ఎందరో ప్రజాప్రతినిధులు లెక్చరర్లు దంచి దంచి కొడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఓ ప్రజాప్రతినిధిని చితక్కొట్టాడు. తనతో పాటు కుమారులను తీసుకెళ్లి రౌడీలా మారాడు. పట్టపగలు దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుండారం..శాస్త్రీనగర్ లో చోటు చేసుకుంది. సర్పంచ్ శ్రీనివాస్ కు..మహిళకు మధ్య రెండు నెలల క్రితం పొలం వద్ద బోరు విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:44 - March 9, 2017

హైదరాబాద్: ఎస్ ఎల్ బి సి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు. ఈ ప్రాజెక్టు మూడు దశాబ్దాల కల. ఇప్పటికీ నెరవేరలేదు. ఎప్పటికి పూర్తవుతుందో తెలవదు. ఎస్ ఎల్ బిసి ప్రాధాన్యతను తెలంగాణ ఉద్యమనాయకుడిగా వున్న రోజుల్లోనే గుర్తించారు కెసిఆర్. ఉద్యమ కాలంలో ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఆయన ఎస్ ఎల్ బిసి గురించి ఖచ్చితంగా ప్రస్తావించేవారు. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలు సస్యశ్యామలం కావలన్నా, ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కావాలన్న ఎస్ ఎల్ బిసి నిర్మాణమే శరణ్యమంటూ కెసిఆర్ పదేపదే చెప్పేవారు. 2014 ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, కాల్వ గట్టు మీద కుర్చీ వేసుకుని మరీ ఎస్ ఎల్ బిసి ప్రాజెక్టును పూర్తి చేయిస్తామన్నారు కెసిఆర్. ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, ఎస్ ఎల్ బిసి పూర్తి కాలేదు.

ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలను...

ఎస్ ఎల్ బిసి ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు. దీని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఇది. ఎప్పుడో పుష్కరకాలం క్రితం ప్రారంభమైన ఎస్ ఎల్ బిసి సొరంగం పనులు నత్తనడకనే సాగుతున్నాయి. ఈ పన్నెండేళ్ల కాలంలో 70శాతం పనులు కూడా పూర్తి కాలేదు. పనులు ఇలాగే నత్తనడకన సాగితే, మరో పదేళ్లకైనా దీనిని పూర్తి చేయడం సాధ్యమా? అన్న అనుమానం కలుగుతోంది.

1983లోనే ఎస్‌ఎల్‌బిసికి రూపకల్పన.....

1983లోనే ఎస్ఎల్ బిసి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. లిఫ్టా? సొరంగమా? అంటూ ఏళ్లకు ఏళ్లు కాలక్షేపం చేశారు. 2005లో మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం మన్యవారిపల్లి దగ్గర సొరంగం పనులు ప్రారంభించారు. 2010 కల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. దాదాపు 44 కిలోమీటర్ల సొరంగం తవ్వేలా దీనిని డిజైన్ చేశారు. 44 కిలోమీటర్లుండే మొదటి సొరంగం మార్గం ద్వారా డిండి సమీపంలోని నక్కలగండి తండా దగ్గర రిజర్వాయర్ లో కలుపుతారు. అక్కడి నుంచి 7.21 కిలోమీటర్ల పొడవైన రెండో సొరంగం నిర్మిస్తారు. నేరేడుగొమ్మ మండల కేంద్రం వరకు రెండో సొరంగ మార్గం వుంటుంది. అక్కడ నుంచి మూడున్నర కిలోమీటర్ల దూరంలో వున్న పెండ్లిపాకల రిజర్వాయర్ కి ఓపెన్ కెనాల్ తవ్వాలి. పెండ్లిపాకల రిజర్వాయర్ నుంచి మరో 14 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను చేరుతుంది. అక్కడ నుంచి అయిటిపాముల చెరువు మీదుగా, కనగల్, నల్లగొండ ఉదయ సముద్రం రిజర్వాయర్ మీదుగా మూసీలో కలుస్తుంది. 44 కిలోమీటర్ల సొరంగంలో 2005 నుంచి ఇప్పటి దాకా తవ్వింది కేవలం 27.62 కిలో మీటర్లే. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలవదు. 2016 నవంబర్ వరకు ఈ ప్రాజెక్టు కోసం 1294 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఎప్పటికప్పుడు అంచనా వ్యయాలు పెరుగుతున్నాయి తప్ప ప్రాజెక్టు నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు.

సొరంగం ద్వారా 3 లక్షల ఎకరాలు....

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎస్ ఎల్ బిసి పనులు చకచకా సాగిపోతాయని చాలామంది ఆశపడ్డారు. ఉద్యమ సమయంలోనూ, ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఈ అంశానికి ఇచ్చిన ప్రాధాన్యత చూసిన్నప్పుడు అందరిలోనూ ఇలాంటి ఆశలు సహజంగానే చిగురించాయి. కానీ, పరిస్థితి ఎప్పటి లాగే వుంది. ఆశ పడ్డవారికి నిరాశే మిగులుతోంది. ఎస్ ఎల్ బిసి సొరంగం ద్వారా మూడు లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. సొరంగం ఆధారంగానే మరో రెండు లిఫ్టు పథకాలను నిర్మించాలని నిర్ణయించారు. ఉదయ సముద్రం రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ద్వారా లక్ష ఎకరాలకు వెయ్యి క్యూసెక్కుల నీరు అందించాలంటూ సంకల్పించారు. దాదాపు 700 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పనులు చేసి, మధ్యలో ఆపేశారు. దీంతోపాటు ఎస్ ఎల్ బిసి సొరంగం పైనే నక్కలగండి డిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా రూపకల్పన చేశారు. దీని ద్వారా 3.5 లక్షల ఎకరాలకు సాగునీరిందించాలన్నది లక్ష్యం. అయితే, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ ఎల్ బిసి సొరంగాన్ని పక్కనబెట్టింది. పాలమూరు నుంచి డిండి వరకు లిఫ్ట్ పథకాన్ని రూపొందించింది. ఎస్ ఎల్ బిసి సొరంగాన్ని వదిలేస్తే, నల్లగొండ జిల్లాలో ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రాకుండా బీళ్లుగా మారే ప్రమాదం వుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎస్ ఎల్ బిసిని ఏకెబీఆర్ గా మార్చి ....

ఎస్ ఎల్ బిసిని ఏకెబీఆర్ గా మార్చి హైదరాబాద్ తాగునీటికే పరిమితం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి మూడు లిఫ్టుల ద్వారా రెండు పైపులైన్లతో 360 క్యూసెక్కుల నీటిని హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నారు. నాగార్జునసాగర్ లో పుష్కలంగా నీళ్లుంటే, అప్రోచ్ చానల్ నుంచి 1800 క్యూసెక్కులొస్తాయి. సగటున 550 క్యూసెక్కుల చొప్పున మూడు పంపులు కలిసి 1650 క్యూసెక్కుల నీళ్లను తోడేస్తున్నాయి. ఇందులో హైదరాబాద్ 360 క్యూసెక్కుల నీళ్లిస్తుండగా, నల్లగొండ జిల్లాలోని 700 ఫ్లోరైడ్ గ్రామాలకు 100 క్యూసెక్కులిస్తున్నారు. మూడో పైప్ లైన్ వేసి , మిగిలిన నీళ్లను హైదరాబాద్ కే తరలిస్తున్నారు. ఇప్పటికే ఎస్ ఎల్ బిసి నిర్మాణం విషయంలో చాలా ఆలస్యం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నిర్మాణం పనులు వేగం పుంజుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాగు తాగు నీటి సమస్యల పరిష్కారం కోసం, పెండింగ్ ప్రాజెక్టుల సత్వర నిర్మాణం కోసం సిపిఎం పోరుబాటపడుతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నత్తనడకనే పనులు....

ఎస్ఎల్ బిసి కరువుపీడిత ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఎస్ఎల్ బిసి నిర్మాణం పూర్తికాకపోవడం నల్లగొండ జిల్లా రైతాంగాన్ని నిరాశపరుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా వేగం పెంచాలి. ఇదే ఇవాళ్టి స్పెషల్ ఫోకస్.

వందకు సీట్లకు పైగా మావే - కేసీఆర్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వందకు పైగా సీట్లు తమకే వస్తాయని, త్వరలో సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. 15 రోజుల్లో సభ్యత్వాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టవద్దని, రాష్ట్ర అభివృద్ధి ఊహించినదానికంటే ఎక్కువగా ఉందన్నారు. జిల్లాల వారీగా ప్రత్యేకంగా భేటీ కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

16:38 - March 9, 2017

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. డబ్బుల కోసం అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. దాదాపు 100 రోజుల తర్వాత ఆ కష్టాలు నెమ్మదిగా తగ్గినా.. ఆ తర్వాత చాలా ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అయితే.. ఈ మధ్య మళ్లీ ఆ పరిస్థితులు మరింత ఎక్కువయ్యాయి.

రద్దు చేసిన స్థానంలో కొత్త నోట్లు వచ్చినా..

ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పడం లేదు. పెద్ద నోట్లు రద్దు చేసిన స్థానంలో కొత్త నోట్లు వచ్చినా.. అవి ఇంకా బ్యాంకులకు చేరకపోవడంతో ఈ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ నుంచి క్యాష్‌ అందకపోవడంతో ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయని బ్యాంక్‌ అధికారులంటున్నారు. మరోవైపు ఎస్‌బీఐ కొత్త నిబంధనలు విధిస్తున్నాయని వార్తలు రావడంతో.. కస్టమర్లు తమ ఖాతాల నుంచి క్యాష్‌ విత్‌డ్రా చేసుకుంటున్నారు. దీంతో ఏటీఎంలలో క్యాష్‌ వెంట వెంటనే అయిపోవడం కూడా దీనికి కారణమంటున్నారు.

ప్రధాన నగరాలకే కాకుండా అన్ని ప్రాంతాల్లో....

ఇక జీతాల సమయంలో ఏటీఎంలలో క్యాష్‌ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య ప్రధాన నగరాలకే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, బ్యాంకు అధికారులు స్పందించి ఏటీఎంలలో క్యాష్‌ అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

16:35 - March 9, 2017

ఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని నేతలు కేంద్ర మంత్రిని కోరారు. ఇందుకు అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ సమావేశానికి ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ కూడా హాజరయ్యారు.

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 27.19 పాయింట్లు లాభపడి 28929.13 పాయింట్ల వద్ద స్థిరపడగా, నిఫ్టీ 2.70 పాయింట్లు లాభపడి 8927 పాయింట్లకు చేరింది. 

16:33 - March 9, 2017

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ కొనసాగుతోంది. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలన్న దానిపై టీఆర్‌ఎస్‌ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి ఎంపీల ను కూడా ఆహ్వానించారు. సాగునీటి ప్రాజెక్టుల పై వివరణ ఇచ్చి సభలో విపక్షాల విమర్శలకు తాళం వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

16:31 - March 9, 2017

'లాగే...లాగే మనసు లాగే..నీవైపు లాగే..' అంటున్నాడు 'కాటమరాయుడు'.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్ర పాటలు రెండు రోజులకొకసారి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలు ఆడియో వేడుకలు నిర్వహించకుండా ఒక్కో పాటను ఒక్కో రోజు యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కూడా అదే బాటను అనుసరిస్తున్నారు. 'సరైనోడు’, 'ధృవ’, 'ఖైదీ నెం 150’, 'విన్నర్' చిత్రాలు ప్రీ రిలీజ్ వేడుకని జరుపుకొని మంచి విజయాలు సాధించడంతో 'కాటమరాయుడు' టీం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే 'మిర..మిర..మీసం' అంటూ మొదటి పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం 4గంటలకు 'లాగే.లాగే..మనసు లాగే..నీ వైపు..లాగే' పాటను విడుదల చేశారు. విడుదల చేసిన గంటల్లోనే వేల మంది వీక్షించడం విశేషం. శరత్ మరార్ నిర్మాణంలో 'గోపాల..గోపాల' ఫేండ డాలీ డైరెక్షన్ లో సినిమా రూపొందుతోంది. పవన్ కు జంటగా శృతి హాసన్ నటించారు. పవన్ తమ్ముళ్లుగా శివబాలాజీ, కమల్ కామరాజు, అజయ్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. 

16:24 - March 9, 2017

హైదరాబాద్:తన ఆస్తులపై చర్చకు సిద్ధమని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ. తన ఆస్తులపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. దేశంలోనే ఆస్తులను స్వచ్ఛందంగా ప్రకటించే తొలి రాజకీయ కుటుంబం తమదేనని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా 6 సంవత్సరాల నుండి మా కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. తమ ఆస్తుల వివరాలను 3 సార్లు శాసనసభకు సమర్పించామన్నారు.నేను శాసనమండలిలో అడుగుపెడుతున్నందునే నా పై దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. 1993 నుంచి మేము హెరిటేజ్‌ షేర్లు కొంటున్నాం. 1999లో నాన్నగారి పేరుతో ఉన్న హెరిటేజ్‌ వాటా నాకు రాసిచ్చారు. ఈసీ నిబంధనల ప్రకారం ఇప్పటి ధరను ప్రకటించాలి. 2010లో హెరిటేజ్‌ షేర్‌ ధర రూ.110, ఇప్పుడు ఆ ధర రూ.1100కు పైనే. హెరిటేజ్‌లో నాకు 25లక్షల షేర్లు ఉన్నాయి. ఆస్తుల ప్రకటనప్పుడు ఆస్తులు కొన్నధరలే ప్రకటించాం. స్టాక్‌ మార్కెట్‌లో షేర్ల ధరల వ్యత్యాసం తెలిసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హెరిటేజ్‌ షేర్ల ధరలు పెరిగాయి. దేశంలోని అన్ని డెయిరీ కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. 16 నెలలు జైలులో ఉండి.. 11 ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్న జగన్‌ పత్రిక నాపై ఆరోపణలు చేస్తోంది.జగతి పబ్లికేషన్లులో ఉత్పత్తి ప్రాంభం కాకముందే రూ.10షేర్ ని రూ.14 పెంచుకున్నారని పేర్కొన్నారు. 12 కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉండి 15 నెలలు జైల్లో ఉన్న జగన్‌ ఏనాడైనా తన ఆస్తులను ప్రకటించారా? అని లోకేశ్‌ ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి ఏ తప్పు చేయని నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బ్రహ్మణీకి శాలరీ కమిషన్ ద్వారా ఏడాదికి రూ.4.5 కోట్లు వస్తుందని తెలిపారు.

అంతా దుష్ర్పచారమే - నారా లోకేష్..

హైదరాబాద్ : ఆస్తుల వివాదంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వివరణనిస్తున్నారు. శాసనమండలిలో అడుగు పెడుతున్నందునే దుష్ర్పచారం చేస్తున్నారని, ఏ తప్పు చేయని తనపై ఎందుకు బురద చల్లుతున్నారని పేర్కొన్నారు. ఎవరు అడగకున్నా గత ఆరు ఏళ్లుగా ఆస్తులను ప్రకటిస్తున్నామని, ఏ ధరకైతే షేర్లు కొన్నామో వాటినే ప్రకటించడం జరుగుతుందన్నారు. హెరిటేజ్ లో నాన్న వాటా తనకు ఇచ్చారని, దీనితో తన వాటా 230 కోట్లు చేరుకుందన్నారు. హెరిటేజ్ షేర్ లు ఆల్ టైం హైక్ కు చేరాయని, టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ షేర్ పెరిగిందన్నారు.

సాయంత్రం టిడిపి పార్లమెంటరీ పార్టీ భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సుజనా చౌదరి అధ్యక్షతనలో టిడిపి పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలి - రామ్మోహన్ నాయుడు..

ఢిల్లీ : ఏపీకి రైల్వే జోన్ ని ప్రకటించే బాధ్యత కేంద్రంపై ఉందని, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అమెరికాలో భారతీయులపై దాడులు పునరావృతం కాకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, దాడులపై పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 

16:06 - March 9, 2017

నాలుగు నెలలుగా ఆ ఇంట్లోనే ఉంటున్నా...అవమానించారు..హేళన చేశారు..నాకు కావల్సింది భర్త..అందుకే భరించా...ఒక్కోసారి ఒక్కసారే భోజనం పెట్టేవారు..

ఆమెను దూరంగా ఉంచడం...ప్రత్యేకంగా అన్నం పెట్టడం..వేరే గదిలో పడుకోబెట్టడం..ఇలా దూరం దూరం పెడుతున్న అత్తారింట్లో వారి నరనరాన కుల వివక్ష కనిపిస్తుస్తోంది. ఇలాగే ఓ రోజు అన్నం తిన్న ఆమె ఆసుపత్రి పాలైంది. ఈమెనే సునీత...ఓ దళిత ఆడబిడ్డ ప్రేమ పెళ్లి చేసుకోవడం నేరమా ? పాపమా ? ఆమె కోలుకున్న అనంతరం నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనలను బయటపెట్టింది. కులం పేరిట తనను దూషించే వారని..నానారకాలుగా హింసించే వారని వాపోయింది. నాకు భర్త కావాలనే ఇవన్నీ భరించానని తెలిపింది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేస్తోంది. తనపై విష ప్రయోగం జరిగిందని, న్యాయం జరగాలని వేడుకొంటోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి అరెస్టు..

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ లో బ్యాలెట్ పేపర్ లో యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి ఫొటో తారుమారు కావడంతో గందరగోళం నెలకొంది. వెంటనే ఎన్నిక నిలిపివేయాలని కోరినా అధికారులు స్పందించకపోవడంతో ఆయన ఆందోళన నిర్వహించారు. 

15:48 - March 9, 2017

రాగి...వెనుకటి రోజుల్లో ఎక్కడ చూసినా రాగి పాత్రలే కనిపించేవి. ప్రస్తుతం సమాజం మారుతుండడం..ఆధునిక పరికరాలు వస్తుండడంతో రాగి పాత్రలు కనిపించడం లేదు. కానీ కొందరి ఇళ్లలో మాత్రం ఇప్పటికీ రాగి పాత్రలు కనిపిస్తుంటాయి. అప్పట్లో రాగి పాత్రలు ఇంట్లో ఉంటే రోగాలు రావు అనేవారు. ఇంతకు రాగినే ఎందుకు అన్నారో తెలుసా! రాగికి ఆంటి బ్యాక్టీరియల్ నేచర్ ఉంటుందంట. మరి రాగి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది. చదవండి..

  • శరీరంలోని వివిధ అయవాల పనితీరు మెరుగుపడేందుకు కూడా ఇది సహకరిస్తుంది.
  • ఈపాత్రలోని నీటిని తాగితే కడుపులో మంట తగ్గుతుంది. అల్సర్లు తగ్గడానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవడానికి ఇది సహకరిస్తుంది.
  • గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. శరీరం లోపల..ముఖ్యంగా కడుపులో ఏర్పడిన పుండ్లను మానడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
  • వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది.
  • థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగపడుతుంది. ఆర్థరైటిస్ రాకుండా కీళ్ల నొప్పుల బారిన పడకుండా చూస్తుంది.
15:43 - March 9, 2017
15:41 - March 9, 2017

హైదరాబాద్‌ : నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుంది. ఈ మేరకు అధికారులు పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:39 - March 9, 2017

ఢిల్లీ: మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఏఐఆర్ టిడబ్ల్యుఎఫ్ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. 18 రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మోటార్‌ వెహికల్‌ సవరణ బిల్లు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం పెంపుదల, రవాణా చార్జీల పెంపుదల అంశాలపై చర్చించారు. రవాణా వ్యవస్థను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం సవరణ బిల్లు తెస్తుందని ఏఐఆర్ టిడబ్ల్యుఎఫ్ వర్కింగ్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య ఆరోపించారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:34 - March 9, 2017

హైదరాబాద్‌ :హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. బ్యాలెట్‌ పేపర్‌లో ఒక అభ్యర్థి స్థానంలో మరో అభ్యర్థి పోటీ పెట్టారు. బ్యాలెట్‌ పేపర్‌ సీరియల్‌లో తొమ్మిదో నంబర్‌లో ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్‌రెడ్డి ఫోటోను మూడో నంబర్‌లో ముద్రించారు. మూడో నంబర్‌ నంబర్‌లో ఉన్న ఆదిలక్ష్మయ్య ఫోటోను తొమ్మిదో నంబర్‌లో ముద్రించారు. దీనిపై యూటీఎఫ్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తప్పు జరిగిందని గమనించినా పోలింగ్ ను ఆపకపోవడంతో యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి తో సహా పలువురు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రభుత్వం వవహరించడం దారుణమన్నారు. ఇప్పటికై ఈసీ చొరవ తీసుకుని సరైన బ్యాలెట్ పత్రాలతో ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూటీఎప్ నేత చావా రవి, తదితరులు పాల్గొన్నారు.

15:34 - March 9, 2017

ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళ ఎవరంటే ఠక్కున 'ఇమాన్ అహ్మద్' అని అంటారు కదా. కానీ ఈమె ప్రస్తుతం బరువు తగ్గుతోంది. 500 కిలోల బరువుతో ఉన్న ఈమె చికిత్స నిమిత్తం ముంబైకి వచ్చిన సంగతి తెలిసిందే. కార్గో విమానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచంలో ఇరాన్ నుండి ముంబైకు చేరుకుంది. అనంతరం సైఫీ ఆసుపత్రి వైద్యుడు బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలా బృందం ఈమెకు శస్త్ర చికిత్సలు చేస్తోంది. 25 రోజుల అనంతరం ఏకంగా వంద కిలోల తగ్గిందని వైద్యులు వెల్లడించారు. బరువు తగ్గడంపై ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లేచి కూర్చోగలుగుతోందని, తనంటత తానుగా నిలబడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిజియోథెరపీ, ద్రవాహారం తీసుకోవడం ద్వారా ఆమె శరీరంలోని అదనంగా ఉన్న నీటిని తొలగించగలిగామని వైద్యులు పేర్కొంటున్నారు. బేరియాట్రిక్ సర్జరీకి సిద్ధమయ్యారని.. త్వరలోనే సర్జరీ చేస్తారని తెలుస్తోంది. 

15:25 - March 9, 2017

విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఆక్వాఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత ప్రజలు చేసిన ఉద్యమాలపై ప్రభుత్వం పోలీసుల ద్వారా దమనకాండను ప్రదర్శిస్తోందని సీపీఎం నేత మధు మండి పడ్డారు. ఆ దమనకాండకు నిరసనగా విజయవాడలో అఖిల పక్షం ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం నేత మధు '10 టివి' తో మాట్లాడుతూ... 14న తుందుర్రు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు అఖిపక్షం పర్యటిచంనుందని తెలిపారు. సీఎంకి అన్ని పార్టీ ఆధ్వర్యంలో లెటర్ రాయాలని తీర్మానించినట్లు చెప్పారు. పోలీసుల దమనకాండను ఖండిస్తూ దళిత సంఘా, పౌర సంఘాలు తుందర్రు గ్రామ పజలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారని తెలిపారు. తుందర్రు పరిసరాల్లో పోలీసుల నిర్బంధం, నిరంకుశత్వం సాగనీయమని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించినట్లు తెలిపారు. అఖిలపక్షం పర్యటన అనంతరం ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఆశిస్తున్నామని.. లేని పక్షంలో రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్వాఫుడ్ పార్క్ ను అడ్డుకుని తీరుతామని తెలిపారు.

గడ్కరిని కలిసిసన మంత్రి కేటీఆర్..

ఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కలిశారు. ఆయనతో పాటు ఎంపీ బూర, ఢిల్లీ ప్రతినిధి రామచంద్ర తెజావత్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులున్నారు. హైదరాబాద్ లో జాతీయ రహదారుల అభివృద్ధి, ఫ్లై ఓవర్ల నిర్మాణం అంశాలపై కేటీఆర్ చర్చించారు. 

టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం..

హైదరాబాద్ : రేపటి నుండి అసెంబ్లీ సమావేశాల ప్రారంభ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దశా..దిశ నిర్ధేశం చేయనున్నారు. 

ఏపీ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం..వివరాలు.

ప్రకాశం : మధ్యాహ్నం 2గంటల వరకు పట్టభద్రుల పోలింగ్ 37 శాతం, టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ 67 శాతం పోలింగ్ నమోదైంది. కడప జిల్లాలో పట్టభద్రుల పోలింగ్ 38 శాతం, టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ 68 శాతం, నెల్లూరులో పట్టభద్రుల పోలింగ్ 34.76 శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 60.74 శాతం పోలింగ్ నమోదైంది. 

ట్యాంక్ బండ్ వద్ద యూటీఎఫ్ నిరసన..

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ వద్ద యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు నేతలు కూడా ఉన్నారు. ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ లో బ్యాలెట్ పేపర్ లో యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి ఫొటో తారుమారు కావడంతో గందరగోళం నెలకొంది. వెంటనే ఎన్నిక నిలిపివేయాలని కోరినా అధికారులు స్పందించకపోవడంతో ఆందోళన నిర్వహించడం జరగుతోందని మాణిక్ రెడ్డి వెల్లడించారు. 

పుల్వామాలో కొనసాగుతున్న కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామాలో దాక్కున్న ఉగ్రవాదులను పట్టుకొనేందుక భారత బలగాలు ప్రయత్నిస్తున్నాయి. భారత బలగాలకు..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. 

హిమాచల్ ప్రదేశ్ లో భూ ప్రకంపనలు..

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలో ని చంబా ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 3.5గా నమోదైంది. 

ధర్నా చౌక్ తరలించడానికి వ్యతిరేకం - ఉత్తమ్..

హైదరాబాద్ : ధర్నా చౌక్ ను తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ వెల్లడించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, కేసీఆర్ సర్కార్ మూడేళ్లుగా గిరిజనులను మోసం చేస్తోందన్నారు. గిరిజనుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని ఇందుకు ఏప్రిల్ 9న ఖమ్మంలో గిరిజన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 23న నిజాం కాలేజీ, 30న ఆదిలాబాద్ లో సభలు నిర్వహిస్తామన్నారు. గిరిజనులపై జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి గవర్నర్ ఎందుక నివేదిక ఇవ్వలేదని ప్రశ్నించారు. 

14:43 - March 9, 2017

చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్‌ నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 12వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 15వ తేదీన కౌంటింగ్‌ నిర్వహించి.. ఫలితాన్ని విడుదల చేయనున్నారు. ఈ నెల 23 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. జయలలిత మృతితో ఆర్కేనగర్‌ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

14:41 - March 9, 2017

తిరుపతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర అవకతవకలకు పాల్పడుతున్నారని తూర్పు రాయలసీమ పీడీఎఫ్ పట్టభద్రుల అభ్యర్థి యడవల్లి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నిన్న రాత్రి నుంచి డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:38 - March 9, 2017

ఢిల్లీ: అమెరికాలో భారతీయులు లక్ష్యంగా జరుగుతున్న జాత్యహంకార దాడులపై లోక్‌సభలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కేన్సస్‌లో హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్‌ కూచిభొట్ల శ్రీనివాస్‌ను... శ్వేతజాతీయుడు ప్యూరింటన్‌ కాల్చి చంపడాన్ని వివిధ పక్షాల సభ్యులు ఖండించారు. జాత్యహంకార దాడులపై లోక్‌సభ జరిగిన చర్చలో వివిధ పక్షాల సభ్యులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత జాత్యహంకర దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాత్యహంకార హత్యలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై లోక్‌సభలో సమగ్ర పకటన చేయడానికి ప్రభుత్వం అంగీరించింది.

14:30 - March 9, 2017

'అమ్మాయిలు టెక్నికల్ గా ముందుండాలి' అనే అంశంపై మానవి వేదిక నిర్వభహించిన చర్చాకార్యక్రమంలో సైకాలజిస్టు రవికుమార్, పనినయ మహా విద్యాలయ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ వసుంధరాణి పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వారు పలు అసక్తికరమైన అంశాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

14:18 - March 9, 2017

ఢిల్లీ : అమెరికాలో జరుగుతున్న జాత్యంహకార దాడులపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ డిమాండ్ చేశారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యంహకార దాడులపై లోక్ సభలో చర్చ జరిగింది. అమెరికాలోని కెన్సాస్ లో కూచిభొట్ల శ్రీనివాస్ హత్యను వివిధ పక్షాల సభ్యులు ఖండించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ అమెరికాలో లక్షలాది మంది భారతీయులు ఉన్నారని తెలిపారు. ఐటీ, ఇంజనీరింగ్ రంగాల్లో భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. భారతీయులు  అమెరికాలో డాక్టర్లుగా రాణిస్తున్నారని చెప్పారు. 

 

14:06 - March 9, 2017

నల్గొండ : సీపీఎం మహాజన పాదయాత్ర నల్లగొండ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. నేటితో పాదయాత్ర 145వ రోజుకు చేరుకుంది. బుడిమర్లపల్లి, కనగల్‌, ధర్వేసిపురం, కొత్తపల్లిలో పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు తమ బాధలను పాదయాత్ర బృంద సభ్యులకు చెప్పుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం నల్లగొండలో తలపెట్టిన బహిరంగసభకు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ హాజరుకానున్నారు. 

 

14:03 - March 9, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పరిపాలన కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. ఈమేరకు ఆయన 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేసీఆర్ ఉద్యమాలను అణచివేస్తూ తన ఓటమిని తానే కొనితెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఇందిరాపార్క్ దగ్గర నుంచి ధర్నాచౌక్‌ను తరలించడం సరికాదన్నారు. 

 

14:00 - March 9, 2017

ఢిల్లీ : కేంద్రం నుంచి తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్‌ నిధులను మార్చి 31వ తేదీ లోపు ఇవ్వాలని కేంద్ర మంత్రులను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ విజ్ఞప్తి చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రం తెలంగాణ రాష్ర్టానికి అదనపు నిధులు ఇస్తే మరింత వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ర్టానికి రావాల్సిన సీఎస్టీ బకాయిలు 10 వేల కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థికమంత్రిని మరోసారి కోరుతామని చెప్పారు. 

 

13:57 - March 9, 2017

నెల్లూరు : జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో తమ ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఓట్ల గల్లంతుపై హైకోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. 

13:54 - March 9, 2017

విజయవాడ : తుందుర్రులో ఆక్వా మెగా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనపై పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తూ... విజయవాడలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్వ్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఎం, సీపీఐ, వైసీపీ పార్టీల నుంచి నాయకులు హాజరై... ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. తుందుర్రులో ఆక్వా మెగా ఫుడ్‌ పార్క్‌ నిర్మించవద్దని గ్రామస్తులు, రైతులు పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ఫుడ్‌ పార్క్‌ ముట్టడికి బయలుదేరిన రైతులు, మహిళల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. 

 

కాసేపట్లో టి.టీచర్ ఎమ్మెల్సీ రీ పోలింగ్ పై ఈసీ నిర్ణయం..

హైదరాబాద్ : తెలంగాణ టీచర్ ఎమ్మెల్సీ రీ పోలింగ్ పై మధ్యాహ్నం 02.30 గంటలకు ఈసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ లో గందరగోళం నెలకొంది. అభ్యర్థుల ఫొటోల తారుమారుపై భన్వర్ లాల్ కు యూటీఎఫ్ నేతలు ఫిర్యాదు చేశారు.

13:47 - March 9, 2017
13:39 - March 9, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. బ్యాలెట్‌ పేపర్‌లో ఒక అభ్యర్థి స్థానంలో మరో అభ్యర్థి పోటీ పెట్టారు. బ్యాలెట్‌ పేపర్‌ సీరియల్‌లో తొమ్మిదో నంబర్‌లో ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్‌రెడ్డి ఫోటోను మూడో  నంబర్‌లో ముద్రించారు. మూడో నంబర్‌ నంబర్‌లో ఉన్న ఆదిలక్ష్మయ్య ఫోటోను తొమ్మిదో నంబర్‌లో ముద్రించారు. దీనిపై యూటీఎఫ్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నిక రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫోటోల తారుమారును నిరసిస్తూ ఆందోళన చేసిన యూటీఎఫ్  నేతలను పోలీసులు అరెస్టు చేసి, గాంధీనగర్‌ స్టేషన్‌కు తరలించారు. బ్యాలెట్‌ పేపరులో ఫోటోల తారుమారుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌ నిర్లక్ష్యంతో యూటీఎఫ్ అభ్యర్థికి నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన  వ్యక్తం చేశారు. పొరపాటును సరిదిద్దే వరకు ఎన్నిక నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. 

 

13:38 - March 9, 2017

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' నటిస్తున్న 'టైగర్ జిందా హై' న్యూ లుక్ విడుదలైంది. 'ఆన్ ఇండియన్ ఏజెంట్..ఏ పాకిస్తాన్ స్పై..అగెనెస్ట్ ఏ కామన్ ఎనిమి' సబ్ టైటిల్ పెట్టారు. ఇటీవలే వచ్చిన 'సుల్తాన్' తో 'సల్మాన్' మరో ఘన విజయం అందుకున్నాడు. ఈ చిత్రం దర్శకుడు 'అలీ అబ్బాస్ జాఫర్' సల్మాన్, కత్రినా లతో చేస్తున్నాడు. ఈ సినిమా గతంలో 'సల్మాన్', 'కత్రినా' జంటగా నటించిన సూపర్ హిట్టు మూవీ 'ఏక్తా టైగర్' కి సీక్వెల్ కావడం విశేషం. ఈ చిత్రాన్ని 'యష్ రాజ్ ఫిల్మ్స్' బ్యానర్ పై 'ఆదిత్య చోప్రా' నిర్మిస్తున్నాడు. 1962 ఇండో చైనా యుద్ధ నేపథ్యంగా కథ సాగుతుందని, ఆసమయంలో ఓ చైనా అమ్మాయితో ప్రేమలో పడిన వ్యక్తిగా సల్మాన్‌ పాత్ర ఉంటుందని టాక్. మరి ఈ జంట ప్రేక్షకులను ఎలా అలరిస్తారో వేచి చూడాలి.

13:35 - March 9, 2017

విజయనగరం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ విజయనగరంలో ప్రశాంతంగా జరుగుతుంది. జిల్లాలో 34, 634 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 30 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 

 

13:32 - March 9, 2017

విశాఖ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుఖాయమని పీడీఎఫ్ అభ్యర్థి అజశర్మ ధీమా వ్యక్తంచేశారు. విశాఖలో తన ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

విద్యార్థుల మృతి ఘటనపై మాజీ ఎమ్మెల్యే అరెస్టు..

కర్నాటక : ఓ బోర్డింగ్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనలో యజమాని, మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఆర్కే నగర్ లో పోలింగ్ ఏప్రిల్ 12..

తమిళనాడు : రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఖాళీగా ఏర్పడిన ఆర్కే నగర్ స్థానానికి ఏప్రిల్ 12వ తేదీన పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ ఏప్రిల్ 17వ తేదీన చేయనున్నారు.

ఆస్తులపై తప్పుడు ప్రచారం - నారా లోకేష్..

విజయవాడ : తన ఆస్తులపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రజలను తప్పుడు దోవ పట్టించేందుకు ప్రతిపక్షం యత్నిస్తోందని, ఆస్తులకు సంబంధించిన మార్కెట్ ధర ప్రకటించాలనేది ఈసీ నిబంధని అని తెలిపారు. ఈసీ నిబంధనను ప్రతిపక్షం కావాలనే విస్మరిస్తోందని, ఆస్తులను స్వచ్ఛందంగా ప్రకటించే తొలి రాజకీయ కుటుంబం తమదేనన్నారు.

పోలింగ్ ప్రశాంతం - భన్వర్ లాల్..

హైదరాబాద్ : ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాలెట్ లో అభ్యర్థుల ఫొటోలు మారాయని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని పేర్కొన్నారు.

భన్వర్ లాల్ ను కలిసిన యూటీఎఫ్ నేతలు..

హైదరాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ లో గందరగోళం నెలకొంది. అభ్యర్థుల ఫొటోల తారుమారుపై భన్వర్ లాల్ కు యూటీఎఫ్ నేతలు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ వెల్లడించారు.

కేసీఆర్ తీరు అప్రజాస్వామికం - సీపీఐ..

ఢిల్లీ : సీఎం కేసీఆర్ తీరు అప్రజాస్వామికమని సీపీఐ నేత నారాయణ వెల్లడించారు. ఇందిరాపార్కు వద్ద ధర్నాలు నిషేధించడం అన్యాయమని, ఉద్యమాలను అణిచివేయడం కాదని సమస్యలు పరిష్కరించాలని హితవు పలికారు. నిరసనలు తెలిపే హక్కు ప్రజలకుందన్నారు.

టి.కేబినెట్ సబ్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. డిప్యూటి సీఎం కడియం, మంత్రి హరీష్ రావులు హాజరయ్యారు.

బాబు అధ్యక్షతనలో ప్రత్యేక కేబినెట్ సమావేశం..

విజయవాడ : అమరావతిలో ఈనెల 13వ తేదీన వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో ప్రత్యేక కేబినెట్ సమావేశం జరగనుంది. 16న మూడు గంటలకు మరోసారి ప్రత్యేక కేబినెట్ సమావేశం జరగనుంది.

కొకకోలా, పెప్సీలపై నిషేధం..

ఢిల్లీ : కేరళలో కొకాకోలా, పెప్సీ డ్రింక్ లపై నిషేధం విధించారు. 14 నుండి కొకాకోలా, పెప్సీ డ్రింక్ లపై బ్యాన్ విధించారు. నీటి కొరత వల్లే నిషేధం విధించినట్లు ట్రేడర్స్ పేర్కొన్నాయి.

పాదయాత్రకు కోమటిరెడ్డి మద్దతు..

నల్గొండ : సీపీఎం మహాజన పాదయాత్ర కనగల్ కు చేరుకుంది. టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్రకు మద్దతు తెలిపారు.

 

ధర్నా చౌక్ ను తరలించడం దారుణం -వీహెచ్..

హైదరాబాద్ : ఇందిరాపార్కు నుండి ధర్నా చౌక్ ను తరలించడం దారుణమని టి.కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని, ఉద్యమాలను చూసి కేసీఆర్ భయపడుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ రాజ్ దర్బార్ పాలన చేస్తున్నారని విమర్శించారు.

12:54 - March 9, 2017

హైదరాబాద్ : బాలకృష్ణ 101వ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. పూరీ జగన్నాథ్‌ దర్వకత్వంలో బాలయ్య 101వ చిత్రం రూపుదిద్దుకోనుంది. బాలయ్య, పూరీ క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. భవ్య క్రియేషన్స్‌ నిర్మాణంలో ఈ  సినిమా తెరకెక్కుతోంది.

 

12:52 - March 9, 2017

హైదరాబాద్ : ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు  పోలింగ్‌ కొనసాగనుంది. ఈ నెల 20వ తేదీన ఓట్లను లెక్కించి.. ఫలితాలను విడుదల చేస్తారు. ఏపీలోని మూడు పట్టభద్రుల స్థానాలైన అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఇటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పట్టభద్రుల స్థానానికి పోలింగ్‌ జరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ పట్టభద్రుల స్థానానికి కూడా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. 

 

12:50 - March 9, 2017

కడప : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కడపలో ప్రశాంతంగా జరుగుతుంది. మొత్తం 82వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పటిష్ట భద్రత నడుమ కొనసాగుతున్న పోలింగ్ కొనసాగుతుంది. 

 

12:47 - March 9, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. బ్యాలెట్‌ పేపర్‌లో ఒక అభ్యర్థి స్థానంలో మరో అభ్యర్థి పోటీ పెట్టారు. బ్యాలెట్‌ పేపర్‌ సీరియల్‌లో తొమ్మిదో నంబర్‌లో ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్‌రెడ్డి ఫోటోను మూడో నంబర్‌లో ముద్రించారు. మూడో నంబర్‌ నంబర్‌లో ఉన్న ఆదిలక్ష్మయ్య ఫోటోను తొమ్మిదో నంబర్‌లో ముద్రించారు. దీనిపై యూటీఎఫ్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నిక రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫోటోల తారుమారును నిరసిస్తూ ఆందోళన చేసిన యూటీఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేసి, గాంధీనగర్‌ స్టేషన్‌కు తరలించారు. బ్యాలెట్‌ పేపరులో ఫోటోల తారుమారుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌ నిర్లక్ష్యంతో యూటీఎఫ్ అభ్యర్థికి నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన  వ్యక్తం చేశారు. పొరపాటును సరిదిద్దే వరకు ఎన్నిక నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. 
-

12:41 - March 9, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన గందరగోళంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఎన్నికల ప్రధాన అధికారి భన్వరలాల్‌ తెలిపారు. తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తీర్పు ప్రకారం తదుపరి చర్య తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గందరగోళంపై యూటీఎఫ్ నేతలు భన్వరలాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. లేదంటే అన్ని పోలింగ్ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చిరించారు. 

 

యూపీ దాడి ఘటనపై రాజ్ నాథ్ ప్రకటన..

ఢిల్లీ : లోక్ సభలో యూపీ ఉగ్రదాడి ఘటనపై రాజ్ నాథ్ ప్రకటన చేశారు. కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోందని, యూపీ ఏటీఎస్ పోలీసుల సహకారంతో విచారణ జరుగుతోందన్నారు. ఘటనాస్థలిలో మూడు సెల్ ఫోన్లు, రెండు సిమ్ కార్డులు లభించాయని వెల్లడించారు.

12:25 - March 9, 2017

ఢిల్లీ : నెల రోజుల విరామం తర్వాత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ పునఃప్రారంభమవుతున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగంతో జనవరి 31న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు, గత 9 వరకు  కొనసాగాయి.  ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2017-18 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. దీనిపై సాధారణ చర్చ ముగిసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఉభయ సభలు ఆమోదించాయి.  వివిధ మంత్రిత్వ శాఖలకు బడ్జెట్‌లో  చేసిన నిధుల కేటాయింపులపై పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో చర్చ కోసం  నెల రోజులపాటు విరామం ప్రకటించారు.  ఇవాళ పునఃప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు వచ్చే నెల 12 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను ను  అమలు చేయాలని కేంద్రం, రాష్ట్రాలు నిర్ణయించిన తరుణంలో జీఎస్ టీ బిల్లును ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలకు అస్త్రశస్త్రాలతో అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి.
 

12:24 - March 9, 2017

నెల్లూరు : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్నది. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ కోసం విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల నియోజకవర్గంలో 65,547 మంది ఓటర్లు, ఉపాధ్యాయుల స్థానంలో 5,927 మంది ఓటర్లు ఉన్నారు. కంట్రోలు రూముతో పోలింగ్‌ కేంద్రాలను అనుసంధానం చేశారు. జిల్లా కలెక్టర్‌ పోలింగ్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. 

 

12:14 - March 9, 2017

రంగారెడ్డి : హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. బ్యాలెట్‌ పేపర్‌లో ఒక అభ్యర్థి స్థానంలో మరో అభ్యర్థి పోటీ పెట్టారు. బ్యాలెట్‌ పేపర్‌ సీరియల్‌లో తొమ్మిదో నంబర్‌లో ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్‌రెడ్డి ఫోటోను మూడో  నంబర్‌లో ముద్రించారు. మూడో నంబర్‌ నంబర్‌లో ఉన్న ఆదిలక్ష్మయ్య ఫోటోను తొమ్మిదో నంబర్‌లో ముద్రించారు. దీనిపై యూటీఎఫ్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 

 

12:09 - March 9, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో మొదలైన కష్టాలు ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. పరిస్థితి కుదుటపడుతుందనుకుంటున్న సమయంలో.. మళ్లీ అవే కష్టాలువెంటాడుతున్నాయి. ఏటీఎంలకు వెళ్తున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. 
ఏటీఎంలలో దర్శనమిస్తున్న నో క్యాష్‌ బోర్డులు  
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. డబ్బుల కోసం అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. దాదాపు 100 రోజుల తర్వాత ఆ కష్టాలు నెమ్మదిగా తగ్గినా.. ఆ తర్వాత చాలా ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అయితే.. ఈ మధ్య మళ్లీ ఆ పరిస్థితులు మరింత ఎక్కువయ్యాయి.
ప్రజలకు మళ్లీ కష్టాలు 
ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పడం లేదు. పెద్ద నోట్లు రద్దు చేసిన స్థానంలో కొత్త నోట్లు వచ్చినా.. అవి ఇంకా బ్యాంకులకు చేరకపోవడంతో ఈ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ నుంచి క్యాష్‌ అందకపోవడంతో ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయని బ్యాంక్‌ అధికారులంటున్నారు. మరోవైపు ఎస్‌బీఐ కొత్త నిబంధనలు విధిస్తున్నాయని వార్తలు రావడంతో.. కస్టమర్లు తమ ఖాతాల నుంచి క్యాష్‌ విత్‌డ్రా చేసుకుంటున్నారు. దీంతో ఏటీఎంలలో క్యాష్‌ వెంట వెంటనే అయిపోవడం కూడా దీనికి కారణమంటున్నారు. 
క్యాష్‌ అందుబాటులో ఉండేలా చూడాలంటున్న ప్రజలు 
ఇక జీతాల సమయంలో ఏటీఎంలలో క్యాష్‌ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య ప్రధాన నగరాలకే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, బ్యాంకు అధికారులు స్పందించి ఏటీఎంలలో క్యాష్‌ అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

 

12:08 - March 9, 2017

హైదరాబాద్ : ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో అత్యధికంగా 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 20న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు నిరాకరించారు. 

12:07 - March 9, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మొత్తం 126 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 23 వేల 789 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు ఎలక్ర్టానిక్‌ వస్తువులను తీసుకురాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 20వ తేదీన హైదరాబాద్‌ విక్టరీ ప్లే గ్రౌండ్‌లో కౌంటింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు ఎన్నిక ఫలితాలు తెలుపుతారు. హైదరాబాద్ లోని పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థుల ఫొటో మారింది. అభ్యర్థుల ఫొటోలు తారుమారయ్యాయి. 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు గురువారం ప్రారంభమయ్యాయి. లోక్ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలను విపక్షాలు అడ్డుకున్నాయి. అమెరికాలో భారతీయుల దాడుల అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి.

ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ శాతం..

విజయవాడ : తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో ఉదయం 10గంటల వరకు నమోదై పోలింగ్ శాతం వివరాలు - ప్రకాశం 11 శాతం, నెల్లూరు 6.65 శాతం, చిత్తూరు 10.35 శాతం పోలింగ్ నమోదైంది.

ఏపీ టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం..

విజయవాడ : తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో ఉదయం 10గంటల వరకు నమోదై పోలింగ్ శాతం వివరాలు - ప్రకాశం 11 శాతం, నెల్లూరు 10.06 శాతం, చిత్తూరు 16.07 శాతం పోలింగ్ నమోదైంది.

రాజ్యసభ శుక్రవారానిక వాయిదా..

ఢిల్లీ : రాజ్యసభ సమావేశాలు గురువారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. మణిపూర్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మృతి చెందడం కారణంగా రాజ్యసభలో సంతాపం తెలిపి వాయిదా పడింది.

 

యూటీఎఫ్ నేతల అరెస్టు..

హైదరాబాద్ : బ్యాలెట్ పేపర్ లో ఫొటోల మార్పులకు నిరసిస్తూ యూటీఎఫ్ ఆందోళన చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 9వ నెంబర్ లో ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి ఫొటోకి బదులు మరో అభ్యర్థి ఫొటో పెట్టారు. దీనితో యూటీఎఫ్ నేతలు ఆందోళన చేశారు. వీరిని అరెస్టు చేస్తూ గాంధీనగర్ పీఎస్ కు తరలించారు.

10:43 - March 9, 2017

నల్గొండ : ఈ సమావేశాల్లో బీసీ, ఎంబీసీ అభివృద్ధికి బిల్లు పెట్టాలని లేకపోతే కేసీఆర్‌ సర్కార్‌పై పోరాటం ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. మార్చి 19 న జరిగే సీపీఎం బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రజలు పొల్గొని కేసీఆర్‌కు వినపడేలా గర్జించాలని తమ్మినేని పిలుపునిచ్చారు. 
సమాన అవకాశాలు వచ్చినప్పుడే సామాజిక న్యాయం : తమ్మినేని 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు వచ్చినప్పుడే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యమవుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రతి కులాన్ని అభివృద్ధి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. ఎంబీసీలు, బీసీలకు తగిన గుర్తింపు ఇచ్చి రక్షణ చట్టాన్ని తేవాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా అసెంబ్లీలో బిల్లు పెట్టాలని, లేకపోతే మార్చి 19 న జరిగే సభలో భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని తమ్మినేని తెలిపారు. 
తెలంగాణలో నియంతృత్వ పాలన : జూలకంటి 
తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. కనీసం ప్రజల సమస్యల మీద మాట్లాడే అవకాశం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో చేతి, కుల వృత్తులు నిర్వీర్యమయ్యాయని అనేక వృత్తుల వాళ్లు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జూలకంటి ఆవేదన వ్యక్తం చేశారు. 
యురేనియం తవ్వకాలను విరమించుకోవాలి  : తమ్మినేని
సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 143 రోజులు పూర్తి చేసుకుంది. ఇవాళ నల్లగొండ జిల్లాలోని రాందాస్‌తండా, నర్సింహులగూడెం, తుమ్మలపల్లి, చండూరు, పొనుగోడు స్టేజ్‌, కురంపల్లి, జి.ఎడవల్లి గ్రామాల్లో పాదయాత్ర కొనసాగింది. తుమ్మపల్లిలో పార్టీ జెండాను  తమ్మినేని వీరభద్రం ఎగురవేశారు. అనేక మంది గ్రామస్థులు తమ్మినేని బృందానికి తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, పీఏపల్లి, పెద్దావురా ప్రాంతాల్లో తలపెట్టిన యురేనియం తవ్వకాలను విరమించుకోవాలని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు.  జనావాసాలున్న ప్రాంతాల్లో జీవవైవిధ్యం దెబ్బతినకుండా ఉండాలంటే... యురేనియం తవ్వకాల యోచనను ఉపసంహరించుకోవాలని తమ్మినేని లేఖలో డిమాండ్‌ చేశారు. 

హాస్టల్ లో ఫుడ్ పాయిజన్..విద్యార్థుల మృతి..

కర్నాటక : ఓ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. ముగ్గురు స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

భన్వర్ లాల్ కు తమ్మినేని లేఖ..

నల్గొండ :రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎనిన్కల బ్యాలెట్ పేపర్ లో ఫొటోల తారుమారుపై ఆయన లేఖ రాశారు. బ్యాలెట్ పేపర్ లో 9వ సీరియల్ లో ఉన్న మాణిక్ రెడ్డి ఫొటోను మూడో సీరియల్ లోకి మార్చారని తెలిపారు. దీనిని సరిచేయకుండా ఎన్నిక నిర్వహిస్తే తమ అభ్యర్థికి నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పొరబాటును సరిదిద్దే వరకు ఎన్నిక నిలిపివేయాలని సూచించారు.

అసెంబ్లీలో నిలదీస్తాం - లక్ష్మణ్..

భువనగిరి : ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పటిస్తోందని, ఇచ్చిన హామీలను పక్కన పెట్టిందని విమర్శించారు.

10:35 - March 9, 2017

పరిశ్రమలకు వ్యతిరేకంగా కాదు..కానీ కలుషితమైన పరిశ్రమలు పెట్టొద్దని వక్తలు అన్నారు. 'ఆక్వాఫుడ్ పార్కు నిర్మాణం' అనే అంశంపై నిర్వహించిన ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, కాంగ్రెస్ నేత రాంశర్మ, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు నేత సీహెచ్ బాబురావు పాల్గొని, మాట్లాడారు. జనం చేసే ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెప్పారు. ప్రజలకు ఇష్టం లేకున్న ఆక్వాఫుడ్ పార్కు నిర్మాణం చేపట్టం సరికాదని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:33 - March 9, 2017

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘనవిజయం సాధించిన అనంతరం 101 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరో అనే దాని ఉత్కంఠకు కొద్ది రోజుల క్రితం తెరపడిన సంగతి తెలిసిందే. బాలయ్య 101వ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించనున్నారు. గురువారం ఉదయం తులసీవనం టెంపుల్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో చిత్రానికి సంబంధించిన పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజా కార్యక్రమంలో బాలకృష్ణ, పూరి జగన్నాథ్, మరో దర్శకుడు బోయపాటి శ్రీను, కమేడియన్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. స్ర్కిప్టును వెంకటేశ్వరుడి పాదాల చెంత ఉంచి స్వామ ఆశీర్వాదం పొందారు.
పూరి - బాలయ్య కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా పవర్‌ఫుల్‌ మాస్‌ అండ్‌ యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ అని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే యమా క్రేజ్‌ నెలకొంది. బాలకృష్ణ పవర్‌ఫుల్‌ యాక్షన్‌కీ, పూరి జగన్నాథ్‌ పెన్‌ పవర్‌కీ తెలుగు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, అగ్ర సంస్థల్లో ఒకటిగా దూసుకెళుతోన్న భవ్య క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం 'రోగ్' సినిమాతో బిజీ గా ఉన్న 'పూరి' ఇంత త్వరగా మరో సినిమాని ఓకే చేసాడు అంటే మళ్ళీ పూరి ఫామ్ లోకి వచ్చినట్టే తెలుస్తుంది.

నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

ఢిల్లీ : నేటి నుండి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 1వ తేదీన వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. నెల రోజుల పాటు విరామం ప్రకటించిన అనంతరం ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 12వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో జులై 1 నుండి జీఎస్టీ అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. మణిపూర్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మృతి చెందడం కారణంగా రాజ్యసభలో సంతాపం తెలిపి వాయిదా పడనుంది.

నెల్లూరు పలు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు గల్లంతు..

నెల్లూరు : పలు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు గల్లంతయ్యాయి. డీకేడబ్ల్యూ కాలేజీ, జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు గల్లంతయ్యాయి.

విక్టోరియా స్కూల్ లో అధికారుల అత్యుత్సాహం..

హైదరాబాద్ : ఎల్బీనగర్ విక్టోరియా స్కూల్ లో ఎన్నికల అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పాస్ లున్నా మీడియాను లోనికి అనుమతించడం లేదు. బ్యాలెట్ లో తప్పులు ఉన్నాయని ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని సక్రమంగానే ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. తప్పులుంటే ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు.

 

ముషిరాబాద్ పోలింగ్ బూత్ లో గందరగోళం..

హైదరాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, యూటీఎఫ్ మాణిక్ రెడ్డి ఫొటో బదులు ఇతరుల ఫొటో ప్రచురణ కావడంతో గందరగోళం నెలకొంది. దీనిపై యూటీఎఫ్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీలో కొనసాగుతున్న పోలింగ్..

విజయవాడ : ఏపీలో 3 పట్టభద్రులు, 2 టీచర్ ఎమ్మెల్సీల స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 నుండి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది.

 

పుల్వామాలో దాక్కున్న తీవ్రవాదులు..

p { margin-bottom: 0.25cm; line-height: 120%; }

జమ్మూ కాశ్మీర్ : పుల్వామాలో పడ్గాంపారాలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఓ ఇంట్లో దాక్కున్న ముగ్గురు తీవ్రవాదుల కోసం భద్రతాబలగాలు గాలింపులు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు..భద్రతాబలగాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

పాదయాత్ర 144రోజు..

నల్గొండ : సీపీఎం మహాజన పాదయాత్ర 144కి రోజుకు చేరుకుంది. బుడిమర్లపల్లి, కనగల్, ధర్వేసిపురం, కొత్తపల్లి, నల్గొండలో పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం నల్గొండలో జరగనున్న బహిరంగసభకు బృందాకరత్ హాజరు కానున్నారు.

ముషిరాబాద్ పోలింగ్ బూత్ లో గందరగోళం..

హైదరాబాద్ : ముషీరాబాద్ పోలింగ్ బూత్ లో బ్యాలెట్ లో ఒకరి పేరు దగ్గర మరొకరి ఫొటో ప్రచురించారు. ఎన్నికల అధికారులకు పోలింగ్ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు.

 

10:23 - March 9, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో టీజాక్ తరపున కీలకంగా వ్యవహరించిన అసంతృప్త నేతలు అయోమయ పరిస్థితుల్లో పడ్డారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరాంపై విమర్శలు చేస్తూనే..తమ కార్యాచరణపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదనే చెప్తున్నారు. మరి టీ జాక్‌ నుంచి బయటకు వచ్చిన అసంతృప్త నేతలు..వేరు కుంపటి పెడతారా ? అసలు వారి దారెటు ?  
కోదండరాంకు వ్యతిరేకంగా గళం విప్పిన దూరమైన నేతలు 
తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఏకతాటిపైకి తెచ్చిన టీజాక్ నేతల్లో ఒక్కసారిగా విబేధాలు భగ్గుమన్నాయి. దాదాపు మూడు నెలలుగా నానుతూ వస్తున్న ఈ వ్యవహారం ఇటీవలే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీజాక్ కార్యక్రమాలపై కూడా సభ్యులు ఏకాభిప్రాయానికి రాని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల నిర్వహించిన ఉద్యోగుల ర్యాలీ సందర్భంగా టీజాక్‌లో ఉన్న అసంతృప్తి నేతలు జేఏసీ చైర్మన్‌ కోదండరాంకు వ్యతిరేకంగా గళం విప్పారు.
టీఆర్‌ఎస్‌ రాగాన్ని అందుకున్న అసంతృప్తి నేతలు  
రాజకీయ పార్టీలతో కలిసి ఉండరాదన్న నిర్ణయాన్ని కోదండరాం వ్యతిరేకిస్తున్నారనే టీఆర్‌ఎస్‌ రాగాన్ని అసంతృప్తి నేతలు అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రిని కలిశారా లేదా అన్న స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే..రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన టీజాక్ రాజకీయ పార్టీలతో కలిసి అడుగులు వేయడాన్ని తాము తప్పబడుతున్నామని జాక్‌కు దూరమైన నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
టీజాక్ వ్యవహారాన్ని తప్పుబడుతున్న అసంతృప్త నేతలు..
టీజాక్ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న అసంతృప్త నేతలు..తమ కార్యాచరణను మాత్రం ఇంకా రూపొందించుకోలేదని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఇప్పుడే దృష్టి సారించామంటున్నారు. టీ జాక్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం వ్యవహారాన్ని తప్పుబడుతున్న ఈ మాజీ నేతలు.. ప్రభుత్వ వ్యవహారంపై ఆచి తూచి స్పందిస్తున్నారు. కోదండరాం రాజకీయ పార్టీ  పెట్టి తన బలాన్ని నిరూపించుకోవాలని సవాల్ చేస్తున్నారు.

 

09:26 - March 9, 2017

ప్రేమకు స్నేహమే తొలి అడుగు. ఆ మాటకొస్తే నిజమైన స్నేహితులు అతి తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే.. స్నేహమనేది చాలా విలువైనది. జీవితపు ప్రతి మలుపులోనూ వెన్నంటి నిలిచే బంధం. ఇలా ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి స్నేహితుడి చివరి కోరిక తీర్చడం కోసం ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా వారణాసికి వచ్చాడు. మంగళవారం వారణాసికి చేరుకున్నాడు. ఈ విషయం తెలవడంతో స్టీవ్ వాను మీడియా చుట్టుముట్టింది. తన స్నేహితుడు స్టీఫెన్ ఇస్కాన్ టెంపులో కన్నుమూశాడని, అతని చివరి కోరిక మేరకు ఆస్థికలను గంగలో కలిపేందుకు తాను ఇక్కడకు రావడం జరిగిందని తెలిపాడు. ఒక గైడ్ సహాయంతో దశాస్వమేద్ ఘాట్ కు చేరుకున్న స్టీవ్ వా ఆటోలో మణికర్నిక ఘాట్ కు చేరుకుని గంగలో స్టీఫెన్ ఆస్థికలను గంగలో నిమజ్జనం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ బూతుల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

నారాయణ విద్యాసంస్థల జోనల్‌ కార్యాలయం వద్ద వామపక్షాల ఆందోళన

చిత్తూరు : ఇవాళ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తిరుపతిలో ఓటర్లకు డబ్బులు పంచేందుకు టీడీపీ నేత సిద్ధమయ్యారంటూ వామపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి డబ్బులు పంచేందుకు టీడీపీ అభ్యర్థి ఏర్పాట్లు చేసుకున్నారన్న సమాచారంతో నారాయణ విద్యాసంస్థల జోనల్‌ కార్యాలయానికి చేరుకుని.. ధర్నా చేపట్టారు. టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పట్టాభిరామిరెడ్డి గెలుపు కోసం యాజమాన్యం డబ్బులు పంపిణీ చేస్తుందని ఆరోపిస్తున్నారు. 

నేడు పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు

ఢిల్లీ  : నేడు పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు జరుగనున్నాయి. పలు అంశాలపై చర్చించనున్నారు. 

08:52 - March 9, 2017

ఎలాంటి ఆందోళన, హడావిడి లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ కు వెళ్లాలని మ్యాథ్స్ టీచర్ టివి.నాగేశ్వర్ రావు తెలిపారు. మ్యాథ్స్ లో అత్యధిక మార్కులు స్కోర్ చేయడంల ఎలా అనే అంశంపై ఇవాళ్టి జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పదో తరగతి పరీక్షల తేదీ సమీపిస్తోంది. పదో తరగతి విద్యార్థులకు అత్యంత కీలకమైన పేపర్ మ్యాథ్స్. అత్యధిక మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం వున్న పేపర్ ఇది. టెంత్ మ్యాథ్స్ లో అత్యధిక మార్కులు సాధించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎగ్జామ్స్ దగ్గర కొచ్చిన సమయంలో మ్యాథ్స్ సబ్జక్టులో ఎక్కువ కాన్షన్ ట్రేషన్ చేయాల్సిన అంశాలేమిటి? ఇదే అంశంపై ఆయన మాట్లాడారు. పలు సలహాలు, సూచనలు చేశారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం..

08:42 - March 9, 2017

విజయవాడ : పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల కోసం తానే ముందుండి నాయకత్వం వహిస్తానని... సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో ప్రతి మహిళా పదివేల రూపాయలు సంపాదించేలా పలు పథకాలను అమల్లోకి తెచ్చామని గుర్తుచేశారు. ఆడ పిల్లలకు ఎదురుకట్నం ఇచ్చి వివాహం చేసుకునే రోజులు త్వరలో ఉన్నాయని చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు అవార్డులు అందజేశారు. 
జూన్‌ 2లోపు ప్రటి ఇంటికీ వంట గ్యాస్‌ : సీఎం 
ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల మహిళల కోసం ప్రవేశపెట్టిన కొత్త పథకాలపై ప్రకటన చేయలేకపోతున్నామని చంద్రబాబు అన్నారు. జూన్‌ 2లోపు ప్రటి ఇంటికీ వంట గ్యాస్‌ ఇస్తామని ప్రకటించారు. ప్రతి మహిళ నెలకు పదివేల రూపాయలు సంపాదించేలా
పలు పథకాలను అమలులోకి తెచ్చామని చెప్పారు. పార్లమెంట్‌లో మహిళాబిల్లు పాస్‌ చేయించేందుకు తానే ముందుండి నాయకత్వం వహిస్తానని సీఎం స్పష్టం చేశారు. మహిళల ఎదుగుదలకు అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు 
మహిళా దినోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వందేమాతరం గీతానికి అంబిక చేసిన నృత్యం కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచింది. అంబిక డ్యాన్స్‌ అద్భుతంగా ఉందని చంద్రబాబు ప్రశంసించారు. ఆమెను యూత్‌ అంబాసిడర్‌ ఫర్‌ కూచిపూడిగా నియమిస్తున్నామని చెప్పారు.

 

08:39 - March 9, 2017

సినిమా రిలీజ్ అంటే క్యూరియాసిటీ క్రియేట్ చెయ్యాలి అలా చెయ్యాలంటే హైప్ పెంచాలి. సినిమా హైప్ పెంచే మేజర్ ఎలిమెంట్స్ ట్రైలర్స్, టీజర్స్, ఫస్ట్ లుక్స్ ..వీటితో పాటు సాంగ్ ప్రీ రిలీజ్ లు కూడా ఫిలిం ఎక్స్ పెక్టషన్స్ ని పెంచేస్తున్నాయి. తాజాగా మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలు ఆడియో వేడుకలు నిర్వహించకుండా ఒక్కో పాటను ఒక్కో రోజు యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కూడా అదే బాటను అనుసరిస్తున్నారు. 'సరైనోడు’, 'ధృవ’, 'ఖైదీ నెం 150’, 'విన్నర్' చిత్రాలు ప్రీ రిలీజ్ వేడుకని జరుపుకొని మంచి విజయాలు సాధించడంతో 'కాటమరాయుడు' టీం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఆయన నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్ర పాటలను రెండు రోజులకొకసారి యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. ‘మిర మిరా మీసం..’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. తాజాగా మరో పాటను సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. 'లగే..లగే' తో పాటను విడుదల చేయనున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మాణంలో 'గోపాల..గోపాల' ఫేండ డాలీ డైరెక్షన్ లో సినిమా రూపొందుతోంది. పవన్ కు జంటగా శృతి హాసన్ నటించారు. పవన్ తమ్ముళ్లుగా శివబాలాజీ, కమల్ కామరాజు, అజయ్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. మరి రెండో పాట ఎలా ఉందో వినాలంటే సాయంత్రం 4గంటల వరకు వేచి ఉండాల్సిందే.

08:35 - March 9, 2017

విశాఖ : ఆనందపురం మండలం గుడిలోవ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్‌ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీలో ఉన్న మొత్తం 306 సిలిండర్లు పేలిపోయాయి. భారీ శబ్ధాలతో పేలుళ్లు జరగడంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. సంఘటనాస్థలానికి ఫైర్‌ సిబ్బంది చేరుకుని మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. 

08:34 - March 9, 2017

వరుస పరాజయాలు..కసిగా హిట్ కొట్టాలని 'పూరి' ఆలోచిస్తున్నాడంట. తన తాజా చిత్రం 'రోగ్' పై 'పూరి జగన్నాథ్' ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇషాన్ కథానాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కింది. కొంచెం సోషల్ మెస్సేజ్ తో సినిమాలు ట్రై చేసి అవి అటు ఇటు అవ్వడంతో తన రీసెంట్ ఫిలిం 'రోగ్' తో తాను నమ్మిన పాత ఫార్ములానే కొత్తగా చూపించబోతున్నాడు ఈ ట్రెండీ డైరెక్టర్. తన చిత్ర ప్రచారాన్ని కూడా వేగవంతం చేశారు. అందులో భాగంగా చిత్ర ఆడియో వేడుక బెంగళూరులో ఘనంగా నిర్వహించాలని, ఇందుకు కన్నడ సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు టాక్. ఆడియో వేడుకను మరింత హైలెట్ చేయాలనే ఉద్ధేశ్యంతో 'సన్నిలియోన్'ను ఆహ్వానిస్తున్నారని సోషల్ మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బద్రి, ఇడియట్‌, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, టెంపర్‌ వంటి డిఫరెంట్‌ క్యారెక్టర్‌ బేస్‌డ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను రూపొందించిన డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం 'రోగ్‌'. టాలీవుడ్ లో డాషింగ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కొంత గాప్ తీస్కొని మళ్ళీ లవ్ సబ్జెక్ట్ తో యూత్ ని టార్గెట్ చేసి రాబోతున్నాడు. 'రోగ్' 'మరో చంటి గాడి ప్రేమకథ' అనే లైన్ తో రాబోతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ ఐ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. బ్యూటీ ఫ్రెష్ లుక్స్ ఏంజెలా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు లవ్ ఎలెమెంట్స్ కావలిసినంత కనిపిస్తున్నాయి. ఈ 'రోగ్' సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పూరి చాలా హొప్ఫుల్ గా కనిపించాడు. తనకు ఇషాన్ చాలా నచ్చాడని చెప్పాడు. 'రోగ్' కథ కంటే హీరోను చూడ‌గానే ఎగ్జ‌యిట్ అయ్యాడని, హీరో లక్షణాలు అన్ని ఉన్న హీరో ఇషాన్ అని, ఫ్యూచర్ లో ఇషాన్ పెద్ద స్టార్ అవ్వడం ఖాయం అని చెప్పాడు పూరి. మరి ఆడియో వేడుకకు సన్ని లియోన్ వస్తుందా ? లేదా ? అనేది కొన్ని గంటల్లో తేలనుంది.

లారీలో ఒక్కసారిగా మంటలు....

విశాఖ : ఆనందపురం మండలం గుడిలోవ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్‌ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీలో ఉన్న మొత్తం 306 సిలిండర్లు పేలిపోయాయి. భారీ శబ్ధాలతో పేలుళ్లు జరగడంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. సంఘటనాస్థలానికి ఫైర్‌ సిబ్బంది చేరుకుని మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. 

08:28 - March 9, 2017

హైదరాబాద్ : నీటిపారుదల ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒవైపు కేంద్ర జలసంఘం, నిపుణుల కమిటీ కాళేశ్వరం కాప్రాజెక్టులపై అనుమనాలు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా... ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోతున్న రిజర్వాయర్లకు అనుమతులు మంజూరు చేస్తూ కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు రాని అనుమతులు
అనుమతుల్లేని ప్రాజెక్ట్‌ల కోసం తెలంగాణ సర్కార్‌ తెగహడావిడి చేస్తోంది. కేంద్రజలసంఘం నుంచి క్లారిటీ రాకుండానే కోట్లరూపాయల ప్రజాధనాన్ని మట్టిలోపోస్తోంది. 
ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో నానా హంగామా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌కే పేరు మార్చేసి కాళేశ్వరం ఎత్తిపోతలను చేపడుతున్నట్టు ప్రకటించారు. కాని.. ఇంతవరకు కేంద్ర జలసంఘం నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు రాలేదు. అయినా.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదే దూకుడును ప్రదర్శిస్తోంది. ఇది గతంలో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టేనని.. కేవలం చిన్న చిన్న మార్పులు చేసి ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నామని.. అందుకే  అనుమతులు ఇవ్వడానికి పెద్దగా అభ్యంతరం పెట్టవలసిన అవసరం లేదని కేంద్ర జలసంఘంతోపాటు ఎక్స్‌పర్ట్స్‌ కమిటీనీ  టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కోరుతోంది. 
రిజర్వాయర్ల నిర్మాణంపై  టీ.సర్కార్‌ పరిపాలనా అనుమతులు 
అనుమతుల విషయం ఇంకా పెండింగ్ లోనే వున్నప్పటికీ, ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోయే రిజర్వాయర్ల నిర్మాణాలకోసం కేసీఆర్‌ సర్కార్‌ మొండిగానే ముందుకు వెళ్లుతోంది. రీడిజైనింగ్‌  తర్వాత పెంచిన నీటినిల్వ సామర్థ్యాలు, నిర్మాణ ఖర్చులకు సంబంధించి పరిపాలన అనుమతులను  జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా ఇమంబాద్ వద్ద రంగనాయకసాగర్ ను  మొత్తం 496.50కోట్ల రూపాయలతో మూడు టీఎంసీల కెపాసిటీతో నిర్మించనుంది. అటు  వివాదాస్పద  మల్లన్న సాగర్ ను 7249.52 కోట్లరూపాయలతో నిర్మించాలని  నిర్ణయించారు. ఇక మర్కూక్ మండలం పాములపర్తి వద్ద  కొండపోచమ్మ రిజర్వారయర్ ను   519.720కోట్లతో, యాదాద్రి జిల్లా బస్వాపూర్  లో 1751.00కోట్లతో 11.39టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ ను నిర్మించనున్నారు. అటు  గందమల్ల వద్ద 9.86టీఎంసీల రిజర్వాయర్ ను 860.25 కోట్లతో నిర్మించనున్నారు. ప్రస్తుతం నిర్మంచబోయే మల్లన్నసాగర్  ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు సంబంధించిన ప్యాకేజ్ 12లో వుండగా, కొండపోచమ్మ రిజర్వాయర్ ప్యాకేజీ14లో, బస్వాపూర్ రిజర్వాయర్  ప్యాకేజీ 16లో అంతర్బాగంగా వున్నాయి.  
కేంద్రం నుంచి అనుమతులు మరింత ఆలస్యం..!
అయితే... ప్రాజెక్టుల అనుమతుల విషయంలో మరింత జాప్యం  జరిగే అవకాశం ఉండడం, భవిష్యత్ లో కోర్టులు కూడా జోక్యం చేసుకునే చాన్స్‌ ఉందన్న అనుమానంతో  ప్రభుత్వం పరిపాలన అనుమతుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. కేంద్రం నుండి ప్రాజెక్టులకు అనుమతులు రాత్రికిరాత్రి వచ్చే అవకాశం ఎలాగు లేదు. కానీ ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్, పనులు ఆలస్యం కాకుండా... అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవసరమైతే... తానే స్వయంగా వెళ్లి, ప్రధాని మోడీతో చర్చించి.. అనుమతులు తెచ్చుకుంటామన్న ధీమాలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపే... భూసేకరణతో పాటు, పునరావాసం లాంటి కీలకమైన అడ్డంకులు తొలిగిపోతే, ప్రాజెక్టల అనుమతులకు  ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకోవచ్చని రాష్ట్ర నీటిపారుదలశాఖ భావిస్తోంది. 
ఈనెల 20 కాళేశ్వరంపై కేంద్ర జలసంఘంలో చర్చ 
ఇదిలావుంటే ఈనెల 20న కాళేశ్వరంప్రాజెక్టుపై కేంద్రం జలసంఘం వద్ద పంచాయితీ ఉన్న నేపథ్యంలో..టీ సర్కార్ మొండిగా పరిపాలన అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకోవటంపై  భిన్నాభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి.  

 

08:19 - March 9, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 23 వేల 789 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు...126 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 20న హైదరాబాద్‌ విక్టరీ ప్లే గ్రౌండ్‌లో కౌంటింగ్‌ నిర్వహించి... ఫలితాలు ప్రకటించనున్నారు. 

08:18 - March 9, 2017

చిత్తూరు : ఇవాళ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తిరుపతిలో ఓటర్లకు డబ్బులు పంచేందుకు టీడీపీ నేత సిద్ధమయ్యారంటూ వామపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి డబ్బులు పంచేందుకు టీడీపీ అభ్యర్థి ఏర్పాట్లు చేసుకున్నారన్న సమాచారంతో నారాయణ విద్యాసంస్థల జోనల్‌ కార్యాలయానికి చేరుకుని.. ధర్నా చేపట్టారు. టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పట్టాభిరామిరెడ్డి గెలుపు కోసం యాజమాన్యం డబ్బులు పంపిణీ చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో జోనల్ కార్యాలయంలో ఈసీ తనిఖీలు చేపట్టింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

హైదరాబాద్  : తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 23 వేల 789 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు...126 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

 

08:03 - March 9, 2017

చిత్తూరు : ఇవాళ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తిరుపతిలో ఓటర్లకు డబ్బులు పంచేందుకు టీడీపీ నేత సిద్ధమయ్యారంటూ వామపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి డబ్బులు పంచేందుకు టీడీపీ అభ్యర్థి ఏర్పాట్లు చేసుకున్నారన్న సమాచారంతో నారాయణ విద్యాసంస్థల జోనల్‌ కార్యాలయానికి చేరుకుని.. ధర్నా చేపట్టారు. టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

08:00 - March 9, 2017

హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీగా సర్కార్‌పై దూకుడు ప్రదర్శిస్తున్న టీ.కాంగ్రెస్‌.. అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే స్పీడ్‌ను కొనసాగించనుందా ? పార్టీకి సీఎల్పీకి,... ఎమ్మెల్యేలు, శాసనసభాపక్ష నేతకు మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చేందుకు అధిష్టానం సిద్ధమైందా ? ఈరోజు జరుగుతున్న సీఎల్పీ భేటీకి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ హాజరుకానుండడమే దీనికి కారణమా ? 
అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు కసరత్తు 
తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై హస్తం పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఈరోజు శాసనసభా పక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ హాజరుకాబోతున్నారు. సీఎల్పీ సమావేశానికి దిగ్విజయ్‌సింగ్‌ హాజరుకావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 
సీఎల్పీ భేటీకి దిగ్విజయ్‌సింగ్‌
సీఎల్పీ భేటీకి దిగ్విజయ్‌సింగ్‌ రావాల్సిన అవసరం ఏమొచ్చింది. రాష్ట్రస్థాయిలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఢిల్లీ డైరక్షన్‌ అవసరమా ? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. శాసనసభా పక్షంలో ఎమ్మెల్యేలందరిదీ ఒకదారైతే.. సీఎల్పీ లీడర్‌ ఒక్కడిది ఒకదారిగా సాగుతోంది. దీంతో ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా... ఎమ్మెల్యేల దూకుడుకు జానా కళ్లెం వేస్తున్నారనే చర్చపార్టీలో హీట్‌ రాజేస్తోంది. గతంలో జానా తీరుపై ఎన్నిసార్లు అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఆయనలో ఎలాంటి మార్పు లేదు. దీంతో నేరుగా హస్తిన నేతలే రంగంలోకి దిగుతున్నారు. 
సీఎల్పీ, పీసీసీ మధ్య సమన్వయ లోపం
మరోవైపు సీఎల్పీ, పీసీసీ మధ్య కూడా సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీ అనేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే.. జానారెడ్డి ఆ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే అంశాన్ని పార్టీ కేడర్‌ అనేక సందర్భాల్లో ప్రస్తావించిన సందర్భాలున్నాయి. అలాగే ప్రభుత్వాన్ని పార్టీ బయట ఎంత ఎండగట్టినా... అసెంబ్లీలో ఆ దూకుడు కొనసాగించకపోతే పార్టీకి నష్టం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటిపై ఢిల్లీ పెద్దలకు అనేకమంది ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎల్పీ సమావేశానికి దిగ్విజయ్‌సింగ్‌ హాజరవుతున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. 
ఎమ్మెల్యేలు.. జానారెడ్డికి మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చే ప్రయత్నం.. 
ఇక నేతలంతా కలిసి ఉండాలని ఇప్పటికే కో ఆర్డినేషన్‌ కమిటీలో ఆదేశించిన డిగ్గీ.. ఇప్పుడు పార్టీకి.. సీఎల్పీకి.. ఎమ్మెల్యేలు జానారెడ్డికి మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా రైతు, విద్యార్థి గర్జనలతో పాటు అనేక సమస్యలపై ఆందోళనలతో జనానికి దగ్గరవుతున్నామన్న భావనలో ఉన్న హస్తం నేతలు.. ఇక అదే స్పీడ్‌ను అసెంబ్లీలో కూడా చూపాలనే ఆశతో ఉన్నారు. మరీ దీనికి దిగ్విజయ్‌ మంత్రాంగం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. 

 

07:53 - March 9, 2017

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభా సమావేశాలకు గులాబి దళం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ  శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఇవాళ భేటీ కాబోతున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.. గురువారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు భేటీ కానున్నారు.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.. 
విమర్శల్ని తిప్పికొట్టేందుకు టీఆర్‌ఎస్‌ నేతల కసరత్తు
మరోవైపు సభలో ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు... లేవనెత్తే సమస్యలకు ధీటుగా సమాధానమిచ్చేలా గులాబీ నేతలు రెడీ అవుతున్నారు.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని సభలోనే తిప్పికొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.. ఈసారి సమావేశాల్లో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, భూసేకరణ అంశాలపై ఎక్కువగా చర్చ జరిగే అవకాశముందని భావిస్తున్నారు..
సర్కారును ఇరుకునపెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు
అటు ప్రతిపక్షాలుకూడా సమావేశాలకు ముందుగానే ప్లాన్‌ చేసుకుంటున్నాయి.. ప్రతిపక్షాలన్నీ ఏకమై సర్కారును ఇరుకునపెట్టేందుకు రెడీ అవుతున్నాయి.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.. సభలో ఈ అంశంపై ప్రశ్నల వర్షం కురిపించాలని చూస్తున్నాయి.. అయితే దీనిని ముందుగానే అంచనావేసిన టీఆర్‌ఎస్‌ నేతలు.. పార్టీలన్నీ మూకుమ్మడిగా విమర్శలవర్షం కురిపించినా ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు.. విమర్శలకు చెక్‌ పెడుతూనే... సభలో ప్రభుత్వ విధానాలను స్పష్టంగా చెప్పాలని గులాబీ దళం నిర్ణయించింది.
ప్రభుత్వ కార్యక్రమాల్ని వివరించాలని అధికారపార్టీ నేతలు ఆలోచన 
సభలో ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానమిస్తూనే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని స్పష్టంగా వివరించాలని అధికారపార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అత్యంత వెనకబడిన తరగతులకోసం వెయ్యికోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు విషయాన్ని సభా వేదికగా ప్రకటించాలని చూస్తున్నారు.. ప్రభుత్వ పథకాలు సక్రమంగా నడవడం, డబుల్‌ బెడ్‌ రూం పనులు వేగవంతం చేయడంతో పెద్దగా ఇబ్బందులుండవని గులాబీ నేతలు అంచనావేస్తున్నారు. మొత్తానికి సభలో అనుసరించాల్సిన వ్యూహంపై గురువారం సమావేశంలో నేతలు చర్చించనున్నారు.

 

ఎపీలో 5 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు

హైదరాబాద్ : నేడు ఎపీలో 5 స్థానాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఉపాధ్యాయ కోటాలో ప్రకాశం..నెల్లూరు..చిత్తూరు, కడప...కర్నూలు...అనంతపురం పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. పట్టభద్రుల కోటాలో శ్రీకాకుళం.. విజయనగరం.. విశాఖ పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయి. 

కడప, అనంతపురం, కర్నూల్‌ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు

అనంతపురం : కడప, అనంతపురం, కర్నూల్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల అధికారి కోనశశిధర్‌ తెలిపారు. మూడు జిల్లాలకు కలిపి పట్టభద్రుల ఓటర్లకు 339 పోలింగ్‌ సెంటర్లు.. ఉపాధ్యాయుల ఓటర్లకు సంబంధించి 171 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.

 

నేడు తెలంగాణలో ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు

హైదరాబాద్‌ : నేడు తెలంగాణలో ఉపాధ్యాయుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 12 మంది బరిలో ఉన్నారు. 23 వేల 789 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 126 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 20న హైదరాబాద్‌ విక్టరీ ప్లే గ్రౌండ్‌లో కౌంటింగ్‌ నిర్వహించి... ఫలితాలు ప్రకటించనున్నారు. 

 

07:33 - March 9, 2017

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌ కేంద్రాలతో పాటు..గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎమ్మెల్సీ  ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. సాయంత్రం ఆరు గంటల తర్వాత వచ్చే వారికి ఓటు వేసే హక్కు ఉండదని ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ చెప్పారు. అలాగే పోలింగ్‌ కేంద్రాలకు ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకురాకూడదని సూచించారు.
హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు
హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 23 వేల 789 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు...126 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 20న హైదరాబాద్‌ విక్టరీ ప్లే గ్రౌండ్‌లో కౌంటింగ్‌ నిర్వహించి... ఫలితాలు ప్రకటించనున్నారు. అలాగే కడప, అనంతపురం, కర్నూల్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల అధికారి కోనశశిధర్‌ తెలిపారు. మూడు జిల్లాలకు కలిపి పట్టభద్రుల ఓటర్లకు 339 పోలింగ్‌ సెంటర్లు.. ఉపాధ్యాయుల ఓటర్లకు సంబంధించి 171 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.
ఉత్తరాంధ్రలో అంతా సిద్ధం
ఉత్తరాంధ్రలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు అంతా సిద్ధం చేశారు. ఐదు పార్లమెంట్‌ స్థానాలు, 34 అసెంబ్లీ స్థానాలు పరిధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి.  ఈ మేరకు విశాఖపట్నంలో పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ పేపర్లు పంపే ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ స్థానానికి 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో మొత్తం 224 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 54 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్‌ చెప్పారు. అలాగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని పట్టభద్రుల ఓటర్లకు 283 పోలింగ్‌ కేంద్రాలు,  ఉపాధ్యాయుల ఓటర్లకు 175 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 
పోలింగ్‌ కేంద్రాల వద్ద జాగ్రత్తలు 
పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టాయిలెట్స్‌, తాగునీటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు సూచనలు ఇచ్చారు. 

ఆ ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ లీవ్..

హైదరాబాద్ : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు స్పెషల్ లీవ్ ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందికి సెలవు వర్తిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు విధుల వేళల్లో మార్పు చేయాలని యాజమాన్యాలకు సూచించారు. 

 

ఆ రైతు భూములను గ్రీన్ బెల్ట్ కింద ప్రకటించాలని సీఎ చంద్రబాబు నిర్ణయం

గుంటూరు : రాజధాని భూ సమీకరణకు ముందుకు రాని రైతు భూములను గ్రీన్ బెల్ట్ కింద ప్రకటించాలని సీఎ చంద్రబాబు నిర్ణయంచారు. ఆ భూముల్లో వ్యవసాయం మినహా రియల్ ఎస్టేట్ చేసుకునేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని సీఆర్ డీఏ సమీక్షలో సీఎం వెల్లడించారు. 

 

నేడు జరగాల్సిన ఇంటర్ పరీక్షలు ఈనెల 19 కి వాయిదా

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా నేడు జరగాల్సిన ఇంటర్ పరీక్షలు ఈనెల 19 కి వాయిదా వేశారు. 

నేడు ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్ : నేడు ఏపీ, తెలంగాణలో టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లు నిరాకరించారు. 20న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

Don't Miss