Activities calendar

10 March 2017

21:31 - March 10, 2017

హైదరాబాద్: జర్మనీలోని దుస్సెల్‌దోర్ఫ్ రైల్వే స్టేషన్‌పై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దాడికి సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇది ఉగ్రవాద దాడై ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జర్మనీలో ఉన్న పదివేల మంది ఇస్లామిక్‌ తీవ్రవాదుల్లో 1600 మందికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతలో సంబంధాలు ఉన్నాయని జర్మనీ భద్రతా విభాగం అధికారులు చెబుతున్నారు.

21:27 - March 10, 2017

హైదరాబాద్: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 30 సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామన్నారు. దేశంలోనే మొదటిసారిగా బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయలను అందిస్తున్నామన్నారు.

పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్టు గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూసేందుకు కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేసినట్టు అసెంబ్లీలో చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేశామని గవర్నర్ నరసింహన్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన 6 నెల్లలోనే విద్యుత్ సమస్యను అధిగమించామని.. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామన్నారు.

అభివృద్ధిలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందని గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. స్థూల జాతీయోత్పత్తి కంటే జీఎస్ డిపి ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

పేద ఆడ పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా 51వేల రూపాయలు అందజేస్తున్నామని గవర్నర్ తెలిపారు. దీని ఫలితంగా రాష్ట్రంలో గణనీయంగా బాల్యవివాహాలు తగ్గాయన్నారు. పేద విద్యార్థులు విదేశీ విద్య కోసం 20లక్షల రూపాయలు స్కాలర్ షిప్ అందజేస్తున్నామన్నారు. అలాగే అమరువీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించామన్నారు.

ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని నరసింహన్ అన్నారు. టీహబ్‌ ద్వారా స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇదే ఉత్సాహంతో టీహబ్‌ సెకండ్ ఫేజ్ ఏర్పాటుకు కృషిచేస్తున్నామన్నారు.

దేశంలో కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధి పథంలో, సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతుందని గవర్నర్ తన ప్రసంగం ద్వారా వెల్లడించారు. ప్రభుత్వం తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ నరసింహన్.. ప్రగతి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటూ తెలుగులోనే ప్రసంగాన్ని ముగించారు.

21:24 - March 10, 2017

అనంతపురం : జిల్లాలోని ధర్మవరం తారకరామనగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే వదరాపురం సూరి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలను కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాల వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో.. పరిస్థితి అదుపుతప్పింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సిద్దార్థ పవర్ కేబుల్ కోసం మంత్రి వర్గీయలు పనులు చేసుకుంటున్నారు. అయితే తమ అనుమతిలేనిదే పనులు చేయవద్దని ఎమ్మెల్యే వర్గీయులు అభ్యతరం వ్యక్తం చేశారు. తమకు అన్నీ అనుమతులున్నాయని సునీత వర్గీయులు వారికి తెలిపారు. తమ అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందేనంటూ సూరి వర్గీయులు పనులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.

21:22 - March 10, 2017

p { margin-bottom: 0.21cm; }

హైదరాబాద్: గత రెండు నెలలుగా హోరా హోరీగా సాగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ శనివారం జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం వరకు మొత్తం ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

ఉత్తరప్రదేశ్‌లో 403 నియోజకవర్గాలకు...

ఉత్తరప్రదేశ్‌లో 403 నియోజకవర్గాలకు గాను 75 జిల్లాల్లో 78 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలుండగా... 15 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలకు 54 కేంద్రాలు, గోవాలో 40 స్థానాలు, మణిపూర్‌ 60 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఓట్ల కౌంటింగ్‌ కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి

ఓట్ల కౌంటింగ్‌ కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లను అనుమతించరు. లెక్కింపు కేంద్రాల్లోనికి కేంద్రబలగాలను మాత్రమే అనుమతిస్తారు. స్థానిక పోలీసులు కౌంటింగ్‌ కేంద్రాల ఆవరణలో మాత్రమే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కౌంటింగ్‌ కేంద్రాల వంద మీటర్ల పరిధి వరకు ఎవరిని అనుమతించరు. ఈవీఎంలు ఉన్న గదుల వద్ద సిసిటివి కెమెరాలను అమర్చారు.

ఉత్తరప్రదేశ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌లో బిజెపి ఆధిక్యంలో ...

ఉత్తరప్రదేశ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌లో బిజెపి ఆధిక్యంలో ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండగా, రెండో స్థానంలో ఆప్, అధికారంలో ఉన్న అకాలిదళ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగలనుందని వెల్లడించాయి. ఎక్జిట్‌పోల్స్‌ ఫలితాలు నిజమౌతాయా...తారు మారవుతాయన్నది రేపటివరకు వేచి చూడాలి.

20:38 - March 10, 2017

హైదరాబాద్: ఈ భూమిపై మానవజాతి అడుగులకు ఎన్నేళ్ల వయసు వుంటుంది. దీనికి రకరకాల ఆధారాలు వెతికి అందాజుగా ఓ అంకెను చెప్పగలరు సైంటిస్టులు. మరి మానవజాతి ఈ భూమి మీద ఇంకా ఎంత కాలం బతుకుతుందో చెప్పగలరా? మహా అయితే ఓ వెయ్యేళ్లు మాత్రమే అంటున్నారు సైంటిస్టులు. అవును పక్కలో బాంబు లు పెట్టుకుని పీలిస్తే చచ్చేంత ప్రమాదకర వాయువుల్ని నింపుకుని.. తాకితే నాశనం అయ్యే రసాయనాలను పోగేసుకుని భూమిని వేల సార్లు భస్మీపటలం చేయగల అణ్వాయుధాలతో దేశాన్ని నింపుకుంటుంటే వెయ్యేళ్ల దాకా ఎందుకు ముందే సర్వనాశనం జరగొచ్చు. ఇదే మాట చెప్తున్నారు సైంటిస్టులు. బతకాలనే ఆలోచన ఉంటే ఇంకో గ్రహాన్ని వెతుక్కోమని సలహా కూడా ఇస్తున్నారు. ఇదే అంశం పై నేటి వైడాంగిల్ స్టోరి... పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

తొలి ఏసీ అంబులెన్స్ రైలు ప్రారంభం...

హైదరాబాద్: దేశంలో తొలి ఏసీ అంబులెన్స్ రైలు ప్రారంభమైంది. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే (సీఆర్) ప్రజా సంబంధాల అధికారి నరేంద్ర పాటిల్ తెలిపారు. ప్రమాదం జరిగిన గంటలోపే క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందిస్తే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూడొచ్చని వైద్యుల సలహా మేరకు ఈ అంబులెన్స్ ను రూపొందించామని చెప్పారు.

20:08 - March 10, 2017

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముచ్చట షురువూ... నిలబెడుతున్నదట సర్కారు జనం పరువు, అబద్దాలే చదివిండు అంటున్న కాంగ్రెసోళ్లు...గదేముచ్చట చెప్పకొచ్చిన తతిమోళ్లు, తెర్లు తెర్లు అయితున్న తెలంగాణ యవ్వారం... పట్టిందా ఏంది ప్రభుత్వానికి గ్రహచారం, 16ఏళ్ల పిల్లతోని నడీడోడి లవ్వు... అరెస్టు చేసి కరగదీస్తున్నారట సార్ కొవ్వు, స్వర్ణాంధ్రలో మోసపోయిన బీహార్ దొంగలు... దొరికిచ్చుకోని ఓ మల్కతోమిన జనాలు, భక్తునికి, దేవునికి వచ్చిన నడిమెట్లొచ్చిన తెప్పలు.. కిరణాలు దర్శనం కాక భక్త జనం తిప్పలు ఇలాంటి హాట్ హాట్ అంశాలతో ఈ రోజు మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు కార్యక్రమం'లో మన ముందుకు వచ్చారు. పూర్తి వివరాలను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

ధర్మవరంలో ఉద్రిక్తత

అనంతపురం :ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక తారకరామనగర్ లో మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూర్య నారాయణ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విద్యుత్ కేబుల్ పనుల విషయంలో ఇరువర్గాలు గొడవపడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి, ఇరువర్గాలను చెదరగొట్టారు.

19:59 - March 10, 2017

అమరావతి: వచ్చే ఏడాది 15 శాతం వృద్ధి సాధించేలా అందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగధిపతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న వృద్ధి సాధించాలంటే, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జవాబుదారీతనం ఉంటేనే అనుకున్నది సాధించగలమని ఆయన అన్నారు. అలాగే వ్యవసాయ, ఆక్వా, డెయిరీ రంగాలపై మరింత దృష్టి పెట్టి.. మెరుగైన వృద్ధి సాధించాలని సీఎం అన్నారు.

19:56 - March 10, 2017

విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచిపోయి నిత్యావసరాల ధరలు అధికంగా పెంచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని ముంపు మండలాల పర్యటనకు వెళ్లే ముందు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగిన ఆయన.. పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడో వంతు గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు విపరీతంగా పెంచేశారని ఆరోపించారు. పెంచిన పన్నులు తగ్గించేలా కాంగ్రెస్‌ తరపున ఆందోళన చేపడతామన్నారు.

19:54 - March 10, 2017

విజయవాడ: దేశ ఆర్దికవ్యవస్థను దెబ్బతీసే విధంగా కేంద్రప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఎల్‌ఐసీ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు అమనుల్లాఖాన్‌ అన్నారు. విదేశీ కంపెనీలను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్దికవ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందన్న ఆయన... ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోయాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించుకునేందుకు తమ యూనియన్‌ నికరమైన పోరాటం చేస్తోందన్న అమనుల్లాఖాన్‌స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:48 - March 10, 2017

ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లో పలు మద్యం షాపులకు తాళాలు పడనున్నాయి. రహదారులకు ఆనుకుని ఉన్న మద్యందుకాణాలను దూరంగా నెట్టేయాలన్న సుప్రీం ఆదేశాలను అమల్లో పెడుతున్నారు ఎక్సైజ్‌ అధికారులు. కొత్త రూల్స్‌ అమలు చేస్తే.. రెండు రాష్ట్రాల్లో వేలాది మద్యంషాపులు, బార్లు.. రోడ్లకు అరకిలోమీటరు దూరం జరగనున్నాయి.

బీజీ - గెటౌట్‌ 500 మీటర్స్‌..!

కేవలం మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వాన్ని నడపం..

కేవలం మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వాన్ని నడపం.. మాకు ప్రజల ఆరోగ్యంపట్ల చాలా కమిట్‌మెంట్‌ ఉంది.. మన పాలకులు నిత్యం నెమరువేసే గమ్మత్తైన మాటలు ఇవి. కాని ఇక నుంచి చెప్పేదొకటి ..చేసేది మరొకటిగా ఉంటే కుదరదంటోంది.. దేశ అత్యున్నత న్యాయస్థానం. ఎక్సైజ్‌ చట్టంలో మార్పులకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో.. తెలుగు రాష్ట్రాల్లో పలు మద్యం షాపులు తలుపులు మూతపడనున్నాయి.

మద్యంషాపులను రహదారులకు దూరంగా నెట్టేయాలన్న సుప్రీంకోర్టు....

ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేసి.. మద్యంషాపులు, బార్‌లను జాతీయ, రాష్ట్ర రహదారులకు దూరంగా నెట్టేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2017 మార్చి 31లోపు ఈపని చేయాలని గడువు విధించింది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎక్సైజ్‌శాఖలో కదలిక వచ్చింది. నేషనల్‌, స్టేట్‌ హైవేలపై ఉన్న మద్యం షాపులను.. తీసేయాడానికి కసరత్తు మొదలు పెడుతున్నారు.

మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్ పరిధిలో 156 బార్‌ , 336 మద్యం షాపులు .....

ఏపీలోని కృష్ణాజిల్లా మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్తో పాటు విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో మొత్తం 336 మద్యం షాపులు, 158 బార్ షాపులు ఉన్నాయి. వీటిలో మచిలీపట్నం-విజయవాడ ఇ.ఎస్.ల పరిధిలో మొత్తం 275 మద్యంషాపులు , 105 బార్లు హైవేలకు 500 మీటర్లలోపు ఉన్నట్టు గుర్తించారు. వీటన్నింటికి నోటీసులు జారీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్న ప్రజాసంఘాలు.. రోడ్లవెంబడే కాకుండా.. గ్రామాల్లో, బస్తీల్లో పుట్టగొడుగుల్లా వెలిసిన బెల్టుషాపులను కూడా మూసేయించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

సుప్రీం ఆదేశాల ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి షాపులు క్లోజ్‌..!

అయితే.. తెలుగు రాష్ట్రాల్లో పలు మద్యంషాపులకు ఈ 2017 జూన్‌ 30 వరకు అమ్మకాలకు లైసెన్సులు ఉన్నాయి. కొత్త రూల్స్‌ ప్రకారం ఈనెల 31కే షాపులను తొలగించాల్సి రావడంతో .. లీజు వసూళ్లపై ఎక్సైజ్‌శాఖ కొంత సడలింపు ఇస్తోంది. సాధారణంగా ఏడాదికి మూడు క్వార్టర్లు చొప్పున లీజు వసూళ్లు జరుగుతాయి. ప్రతి నాలుగు నెలలకోసారి శ్లాబ్ ల వారీగా ఈ వసూళ్లు చేస్తారు. దీన్లోభాగంగా మార్చి నుంచి జూన్ వరకు ఆఖరి క్వార్టర్ లో హైవేలకు సమీపంలో ఉన్న షాపులకు మార్చి నెల ఫీజు మాత్రమే వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే షాపుల తరలింపు అనేది ఒక ఫార్స్‌గా మారిపోయే అవకాశం ఉందంటున్నాయి ప్రజాసంఘాలు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా రహదారుల వెంట మందు షాపులను పూర్తిగా తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

జూన్‌30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా సుప్రీంను కోరుతున్న రాష్ట్రాలు.....

అయితే లీజు సంవత్సరం పూర్తయ్యే జూన్‌ 30 వరకు లైసెన్స్ లు కొనసాగించేలా అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును కోరుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్రాల విన్నపాలను పరిగణనలోకి తీసుకుంటే జూన్ వరకు ఈ షాపులు కొనసాగే అవకాశం ఉంది. లేదంటే ఏప్రిల్ 1ఫస్ట్‌నుంచి హైవేల పక్కనున్న షాపులు అరకిలోమీటరు అవతలికి తరలించాల్సిందే. దీనిపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.

19:43 - March 10, 2017

హైదరాబాద్: ఎన్నో ఉద్యమాలకు కన్నతల్లి... బడుగు, బలహీనవర్గాల గొంతుకకు ప్రతీక.. ప్రభుత్వాలను కదిలించిన ఉద్యమ గడ్డ... అదే ఇందిరా పార్క్ ధర్నా చౌక్.. ఇక అది చరిత్రే.. ధర్నా చౌక్ ను ఎత్తేయాలని కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకొంది. LOOK

ఎన్నో లక్షలాది ఉద్యమాలు...

ఎన్నో లక్షలాది ఉద్యమాలు... అన్యాయమైనా, దాష్టీకమైనా.. హక్కుల అణిచివేత అయినా.. ప్రభుత్వ శాఖలు స్పందించకపోతే.. కచ్చితంగా బాధితులు, వారికి మద్దతుగా నిలిచేవారు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కు చేరుకుంటారు. తమ గొంతు వినిపిస్తారు.. ఆమరణ దీక్ష అయినా... ఆందోళన అయినా... ర్యాలీ అయినా ఇక్కడే టెంట్‌ వేసుకొని తమ నిరసన తెలియజేస్తారు. సమస్యలపై సమర శంఖారావం పూరిస్తారు. ఇక నుంచి ధర్నా చౌక్ లో ఈ దృశ్యాలు కనిపించవు... ప్రశ్నించే తత్వాన్ని సహించని పాలకులు ఈ తరహా ధర్నాలకు, ఆందోళనలకు చరమగీతం పాడాలనుకుంటున్నారు.. ఏకంగా ధర్నా చౌక్ నే ఎత్తేయాలని నిర్ణయించేశారు.

లుంబిని పార్క్ స్థలంలోనే ధర్నా చౌక్.....

రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు సచివాలయానికి ఎదురుగా... లుంబిని పార్క్ స్థలంలోనే ధర్నా చౌక్ ఉండేది.. సచివాలయం ముందు ధర్నాలతో శాంతిభద్రతల సమస్యలు వస్తున్నాయంటూ... 2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు.. ఇందిరా పార్క్ సమీపానికి ధర్నా చౌక్‌ మార్చారు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకు దాదాపు 5 నుంచి 6 ఆందోళనలు అక్కడ కొనసాగుతున్నాయి.. కాల్పులకు దారితీసి సంచలనంరేపిన.. విద్యుత్ ఉద్యమ ర్యాలీకూడా ఇందిరా పార్క్ నుంచే ప్రారంభమైంది... డ్వాక్రా మహిళలు ఇక్కడే ఆందోళన చేసి.. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినప్పుడు అప్పటి పాలకులు గుర్రాలతో తొక్కించిన చరిత్రకు ధర్నా చౌక్ సజీవ సాక్ష్యం.. ఇలా ఒకటేమిటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి రిక్షాపుల్లర్ల సమస్యల వరకు.... ఉద్యోగులు హక్కుల నుంచి స్త్రీ హక్కుల వరకు అన్ని నిరసనలు ఇదే వేదికగా నడిచాయి.. ఎన్నో అరాచక పాలన ప్రభుత్వాలకు చరమగీతం పాడిన చరిత్ర ధర్నా చౌక్ ఉద్యమాలకు ఉంది...

అన్నాహజారే, మేథాపాట్కర్ , వందనాశివ....

అన్నాహజారే, మేథాపాట్కర్ , వందనాశివ, సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్, బృందాకరత్, ఎబి బర్దన్, సురవరం సుధాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డిలాంటి నేతలతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రైతు సమస్యలపై ఇక్కడే ఆందోళన బాట పట్టారు.. ముఖ్యంగా ఇక్కడ లెప్ట్ పార్టీలు చేసిన ఉద్యమాలు ప్రభుత్వాలను కదిలించడమే కాదు.. సానుకూల నిర్ణయాలు తీసుకునే పరిస్థితిని కల్పించాయి.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు - చట్టబద్దత, డ్వాక్రా, మున్సిపల్ కార్మికులు, ఉపాధ్యాయిలు, ఆటో వర్కర్స్ ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉద్యమాలకు ప్రభుత్వం స్పందించిన సందర్బాలు ఎన్నో.. అలాగే పోలీసుల లాఠీలు కూడా ఇక్కడ కరాళ నృత్యం చేసిన సందర్భాలూ ఉన్నాయి....

స్పాట్.. పోలీసులు లాఠీ ఝళిపించిన ఘటనలు, ఈడ్చుకెళ్లి వ్యానుల్లో ఎక్కించిన ఘటనలు విజూవల్స్ వాడుకోవాలి....

స్వయంగా ధర్నాలుచేసిన సీఎం కేసీఆర్‌.....

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ధర్నా చౌక్ ది అత్యంత కీలకపాత్ర... ప్రత్యేక రాష్ట్ర అవసరంపై జేఏసీలు, ప్రజా, విద్యార్థి సంఘాలు చేసిన ఆందోళలను ఒక ఎత్తయితే... ప్రస్తుత సీఎం కేసీఆర్ కూడా స్వయంగా ధర్నాలు చేయడమే కాకుండా.. ఎన్నో నిరసనలకు సంఘీభావం ప్రకటించారు.. అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే.. అసలు ధర్నా చౌక్ అవసరమే ఉండదంటూ ప్రకటన కూడా చేశారు.

సెర్ప్‌ ఉద్యోగులను వెనక్కి పంపిన పోలీసులు.....

ఈ మధ్య కాలంలో కేసీఆర్ సర్కార్ కు జేఏసీ సెగ తగిలింది. నిరుద్యోగుల ర్యాలీ ఇందిరా పార్క్ దగ్గర నిర్వహిస్తామని జేఏసీ చెప్పడం.. అక్కడ కాకుండా వేరే చోటుకు మార్చాలంటూ ప్రభుత్వం సూచించడం .. జేఏసీ ససేమిరా అనడమూ జరిగింది.. ఈ పరిణామాల తర్వాత ధర్నా చౌక్ ఎత్తివేయాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, జేఏసీలు ఉద్యమాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న సమయంలో ఈ ఆదేశాలిచ్చింది.. గురువారం నుంచి ఎలాంటి ఆందోళనలకు అనుమతి ఇవ్వొద్దంటూ ఉత్తర్వులు జారీచేసింది.. దీంతో బుధవారం ధర్నా చౌక్‌లో ఆందోళనకు ప్రయత్నించిన సెర్ప్‌ ఉద్యోగులను వెనక్కి పంపించేశారు.

నగరం నాలుగు వైపులా ధర్నా చౌక్‌లు.....

ధర్నా చౌక్‌లో నిరసనలు వద్దన్న ప్రభుత్వం.... నగరం నాలుగు వైపులా ధర్నా చౌక్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. వరంగల్‌ జాతీయ రహదారిలోని ఘట్‌కేసర్‌ సమీపంలోని పర్వతపురం, కాప్రా సమీపంలోని జవహర్‌నగర్‌, శంషాబాద్‌, గండిమైసమ్మ రహదారుల్లో ధర్నాలకు అనుమతి ఇవ్వనుంది. సచివాలయం, అసెంబ్లీకి సమీపంలో ధర్నాచౌక్‌ ఉండడం... అదీ నగర నడిబొడ్డున కావడంతో ట్రాఫిక్‌ జామ్‌లు అవుతు ఉన్నాయని... అందుకే ప్లేస్‌ మార్చేస్తున్నామని చెబుతోంది.. సర్కారు సమాధానంపై ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి.. ఇప్పటికే కొందరు కోర్టు మెట్లు కూడా ఎక్కారు.. ధర్నా చౌక్ లో ధర్నాలు చేసేవారు.. ధర్నా చౌక్ ఉండాలంటూ ధర్నాలకు దిగుతున్నారు.. దీనిపై కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో వేచిచూడాలి.

19:35 - March 10, 2017

హైదరాబాద్: ఎన్నో లక్షలాది ఉద్యమాలు... అన్యాయమైనా, దాష్టీకమైనా.. హక్కుల అణిచివేత అయినా.. ప్రభుత్వ శాఖలు స్పందించకపోతే.. ఖచ్చితంగా బాధితులు, వారికి మద్దతుగా నిలిచేవారు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కు చేరుకుంటారు. తమ గొంతు వినిపిస్తారు.. ఆమరణ దీక్ష అయినా... ఆందోళన అయినా... ర్యాలీ అయినా ఇక్కడే టెంట్‌ వేసుకొని తమ నిరసన తెలియజేస్తారు. సమస్యలపై సమర శంఖారావం పూరిస్తారు.ధర్నా చౌక్‌లో నిరసనలు వద్దన్న ప్రభుత్వం.... నగరం నాలుగు వైపులా ధర్నా చౌక్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. వరంగల్‌ జాతీయ రహదారిలోని ఘట్‌కేసర్‌ సమీపంలోని పర్వతపురం, కాప్రా సమీపంలోని జవహర్‌నగర్‌, శంషాబాద్‌, గండిమైసమ్మ రహదారుల్లో ధర్నాలకు అనుమతి ఇవ్వనుంది. సచివాలయం, అసెంబ్లీకి సమీపంలో ధర్నాచౌక్‌ ఉండడం... అదీ నగర నడిబొడ్డున కావడంతో ట్రాఫిక్‌ జామ్‌లు అవుతు ఉన్నాయని... అందుకే ప్లేస్‌ మార్చేస్తున్నామని చెబుతోంది.. సర్కారు సమాధానంపై ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి.. ఇప్పటికే కొందరు కోర్టు మెట్లు కూడా ఎక్కారు.. ధర్నా చౌక్ లో ధర్నాలు చేసేవారు.. ధర్నా చౌక్ ఉండాలంటూ ధర్నాలకు దిగుతున్నారు.. దీనిపై కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో వేచిచూడాలి. ఇదే అంశం పై 'హెడ్ లైన్ షో' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆప్ నేత పిఎల్. విశ్వేశ్వరరావు, సీపీఎం నేత నంద్యాల నర్శింహారెడ్డి, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాసరావు, పీఓడబ్ల్యు నేత సంధ్య పాల్గొన్నారు. ఈ చర్చను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

కృష్ణా జిల్లాలో పిడుగుపాటుకు మహిళ మృతి

కృష్ణా: జిల్లాలో ఈరోజు సాయంత్రం భారీగా వర్షాలు కురవడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. వీరులపాడు మండలం కోణతాలపల్లి సమీపంలో పిడుగుపడి నరాల సీతారామరెడ్డి (52) అనే వ్యక్తి మృతి చెందాడు. చందర్లపాడు మండలం కాండ్రపాడు పంట పొలాల్లో పిడుగుపడి ఇద్దరు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వీరిని ఆస్పత్రికి తరలించారు. నందిగామ మండలంలోనూ ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.

19:24 - March 10, 2017

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టిఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్‌తో అసత్యాలు పలికించిందని.... కాంగ్రెస్‌ ఆరోపించింది.. అందుకే తాము అసెంబ్లీలో వాకౌట్‌ చేశామన్నారు.. పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. ఈసారి గవర్నర్‌ ప్రసంగంలో ప్రభుత్వ కార్యక్రమాలపై నిర్దిష్టమైన ప్రణాళిక వస్తుందని భావించామని... చివరకు నిరాశే మిగిలిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.... తెలంగాణ పౌరునికి మేలు జరగడంలేదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

19:21 - March 10, 2017

అమరావతి : ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి నారాలోకేష్‌, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఆళ్లనాని ఎన్నికయ్యారు. అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ అధికారిక ప్రకటన విడుదల చేశారు. 

19:20 - March 10, 2017

హైదరాబాద్: ఖమ్మం జిల్లా బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై ప్రత్యేక టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కేంద్ర మంత్రులు చౌదరి బీరేంద్రసింగ్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌తో భేటీ అయిన ఆయన బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు, గ్రామాల్లో తాగునీటి అంశాలపై చర్చించారు. బయ్యారంలో మాగ్నటైట్‌ ఖనిజం ఎక్కువగా ఉందని.. హెమటైట్‌ ఖనిజం తక్కువగా ఉందన్న దత్తాత్రేయ అక్కడ ఎలాంటి ఫ్యాక్టరీ పెట్టాలో టాస్క్‌పోర్స్‌ నివేదిక ద్వారా తేలుతుందన్నారు.

19:17 - March 10, 2017

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై సీపీఎం అసంతృప్తి వ్యక్తం చేసింది.. సర్కారు రాసిఇచ్చిన నోట్‌ను గవర్నర్‌ చదివారని... ఆ పార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించారు.. గవర్నర్‌ ద్వారా అవాస్తవాల్ని చెప్పించారని ఆరోపించారు.. గవర్నర్‌ ప్రసంగంలో ఎన్నో ముఖ్యమైన అంశాల ప్రస్తావనే లేదంటున్న సున్నం రాజయ్య మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

19:15 - March 10, 2017

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు హనుమంతరావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరికి ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్‌కు కొత్త సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

19:14 - March 10, 2017

నల్గొండ :ఎన్నికలకుముందు సీఎం కేసీఆర్ ఎన్నో హామీలిచ్చాడని... అందులో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని... సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.. 14వందల గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులు చూసిన తర్వాతే ఈ విమర్శలు చేస్తున్నామని తెలిపారు.. సీపీఎం పాదయాత్ర వల్లే సర్కారులో కొంత చలనం వచ్చిందని.. గుర్తుచేశారు.. నల్లగొండ జిల్లాలో సీపీఎం పాదయాత్ర 146వరోజు కొనసాగుతోంది.. వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్న పాదయాత్ర బృందం సభ్యులు అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు..  

19:12 - March 10, 2017

మహబూబాబాద్: తెలంగాణ పల్లెల్లో గొంతెండుతోంది. మహబూబాబాద్‌ జిల్లా గార్లలో మంచినీటి కోసం జనం ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రెండో పంటకు నీరివ్వడం వల్లే గ్రామంలో మంచినీటి కొరత ఏర్పడిందన్నారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తామన్న పాలకులు.. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గార్ల ప్రజల మంచినీటి కష్టాలపై పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

19:10 - March 10, 2017

హైదరాబాద్‌: నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం. డల్లాస్‌లా డెవలప్‌ చేస్తాం. ఓల్డ్‌సిటీని ఇస్తాంబుల్‌గా మారుస్తాం. ఇవి గత కొన్నాళ్లుగా హైదరాబాద్‌పై తెలంగాణ సర్కార్‌ చెబుతున్న మాటలు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు మరి అందుకు కార్యాచరణ ప్రారంభించారా? ఫ్లైఓవర్లు, స్వైవేలు నిర్మిస్తామన్న ప్రకటనలు ఎక్కడి వరకు వచ్చాయి? టీఆర్‌ఎస్‌ సర్కార్‌ బల్దియాకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతోందా? జీహెచ్‌ఎంసీకి అవసరమైన నిధులను సర్కార్‌ విడుదల చేస్తోందా? అసలు హైదరాబాద్‌ అభివృద్ధి ఎంతవరకు వచ్చింది? బల్దియాకు ఇచ్చిన కేసీఆర్‌ హామీలపై 10టీవీ కథనం....

హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా మార్చుతామన్న సర్కార్‌

భాగ్యనగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా చెయ్యడానికి చర్యలు చేపడుతున్నట్టు తెలంగాణ సర్కార్‌ పలుమార్లు ప్రకటించింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. హుస్సేన్‌సాగర్‌ను శుద్దిచేయడం దగ్గరి నుంచి స్కైవేస్‌, ఫ్లైఓవర్లంటూ ఊదరగొట్టింది. మూసీని సుందరీకరించి.... దానిపై ఆరులైన్ల రోడ్లు నిర్మిస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనే జరుగలేదని.. వాటన్నిటి కల్పిస్తామని సీఎం మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ప్రకటనలు చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటాయి. ఇటు జీహెచ్‌ఎంసీ పాలకవర్గం కొలువుదీరి సంవత్సరం దాటింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రం ఆచరణకు నోచుకోలేదు. పనుల పురోగతి మాత్రం మూడు అడుగులు ముందుకు... ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.

హైదరాబాద్‌ అభివృద్ధిపై అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం

భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. స్కైవేస్‌, ఫ్లైఓవర్స్, హుస్సేన్‌సాగర్‌ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కార్పొరేషన్‌ పరిధిలో సమగ్ర రోడ్డు డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ ఇలా చాలా హామీలే చేశారు. కానీ హామీల అమలుకు మాత్రం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. కొత్తకొత్త ప్రాజెక్టులకు రూపకల్పన అయితే చేశారుగానీ.... వాటికి అవసరమైన వేలకోట్ల రూపాయలను విడుదల చేయడం లేదు. పోనీ ఆ నిధులను ఎలా తీసుకొస్తారన్నది కూడా ప్రభుత్వం చెప్పడం లేదు. కొత్త ప్రాజెక్టుల సంగతి దేవుడెరుగు... ప్రతి ఏటా ఇచ్చే వాటికి కూడా ప్రభుత్వం కోత పెడుతోంది.

రాష్ట్ర బడ్జెట్‌లో బల్దియాకు భారీగానే కేటాయింపులు

రాష్ట్ర బడ్జెట్‌లో బల్దియాకు ప్రభుత్వం కేటాయింపులు భారీగా చేస్తోంది. కానీ నిధుల విడుదలలో మాత్రం బల్దియాకు మొండిచేయే మిగులుతోంది. రాష్ట్ర బడ్జెట్‌ డబ్బుల అటుంచితే.. గ్రేటర్‌ కార్పొరేషన్‌కు చట్ట ప్రకారం చెల్లించాల్సిన పన్నులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. సిటీలో వృత్తిపన్ను ప్రతిఏటా 300 కోట్లు వసూలవుతోంది. ఇందులో 95శాతం నిదులు జీహెచ్‌ఎంసీకి ఇవ్వవాలి. అంటే 285 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు. వినోదపు పన్నుద్వారా 70 కోట్లు బల్దియాకు రావాల్సి ఉండగా.. 11 కోట్లు మాత్రమే చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భవనాలపై పన్ను 102 కోట్లు చెల్లించాలి. ఇవి కూడా ఒక్క రూపాయి విదల్చలేదు. సిటీలో రోడ్లను నిర్వహిస్తోంది బల్దియానే కాబట్టి... మోటర్‌ వెహికల్‌ ట్యాక్స్‌ 700కోట్లు వసూలైంది. దీనిలో పదిశాతం అంటే... 70 కోట్లు జీహెచ్‌ఎంసీకి రావాలి. కానీ ప్రభుత్వం ఒక్కపైసా కూడా ఇవ్వలేదు. ఇక రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ద్వారా వచ్చే సర్‌చార్జీలు నేరుగా బల్దియా అకౌంట్‌కు చేరాలి. గత ఏప్రిల్‌ మొదటి నుంచి 318 కోట్లు బల్దియాకు రావాల్సి ఉండగా... అందులో 81 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. రాష్ట్ర ప్రభుత్వం న్యాయంగా బల్దియాకు చెల్లించాల్సిన పన్నులు కూడా చెల్లించడం లేదని స్పష్టమవుతోంది. దీంతో నగరాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

మాటలతోనే సరిపెడుతుందా అన్నది వేచి చూడాలి..

హైదరాబాద్‌ అభివృద్ధిపూఐ వారానికి మూడు సమీక్షలు, నెలకు ఆరు మీటింగ్‌లు పెట్టె ప్రభుత్వ పెద్దలు... నిధులు ఇచ్చేందుకు మాత్రం వెనకడుగువేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎలా మారుతుందో పాలకులకే తెలియాలి. ప్రభుత్వం ఇకనైనా మేలుకొని బల్దియాకు నిధులిచ్చి ఆదుకుంటుందా... లేక మాటలతోనే సరిపెడుతుందా అన్నది వేచి చూడాలి..

19:08 - March 10, 2017

సిద్దిపేట : దుబ్బాకలో సినీనటి సమంత సందడిచేశారు. చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను పరిశీలించారు. తాను అధికారికంగా ఇక్కడకు రాలేదన్న ఈ హీరోయిన్‌... కొన్ని చేనేత వస్త్రాలను శాంపిల్‌గా తనవెంట తీసుకువెళ్లారు.. 

ఎమ్మెల్సీలకు ధృవీకరణపత్రాలు అందచేసిన సదారం..

హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన ఎమ్మెల్సీలకు మైనంపల్లి, కృష్ణారెడ్డి, గంగాధర్ లకు అసెంబ్లీ కార్యదర్శి సదారం ధృవీకరణపత్రాలు అందచేశారు. 

16:31 - March 10, 2017

ప్రిన్స్ 'మహేష్ బాబు'..'మురుగదాస్'..కాంబినేషన్ లో తెరెకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి వార్తలు మాత్రం బయటకు పొక్కడం లేదు. కానీ తాజాగా ట్విట్టర్ లో 'మహేష్' ఫొటోను ట్విట్టర్ లో దర్శనమిచ్చింది. ఈ ఫొటోను సంతోష్ శివన్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఇందులో 'మహేష్' కొత్త లుక్ లో కనబడుతున్నారు. షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే గడుస్తోంది. ప్రతి చిత్రంలో సామాజిక అంశాన్ని తెరకెక్కించే 'మురుగదాస్' ఈ చిత్రంలో ఎలాంటి సామాజిక అంశాన్ని సృశించారో తెలియరాలేదు. సినిమా టైటిల్ ఇంతవరకు ప్రకటించకపోవడం గమనార్హం. ఈ సినిమా పేరు 'సంభవామి' అని .'ఏజెంట్ శివ' అని ఎవరికి వారు పేర్కొంటున్నారు. తాజాగా 'మర్మం'అనే పేరును చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం 'మహేష్' సంబంధించిన ఫొటో ఆ చిత్రానికి సంబంధించిందా ? కాదా ? అనేది తెలియరాలేదు. 

16:29 - March 10, 2017

తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త ట్రెండ్ కి డోర్స్ ఓపెన్ చేస్తుంది. ఇంతకాలం మూస ఫార్ములాలు మూస సినిమాలకు ఒకే చెప్పిన స్టార్ హీరోల్లో చలనం కనిపిస్తుంది. వెరైటీ ట్రై చెయ్యకపోతే రీలు గర్భంలో కలిసిపోతాం అనుకున్నారేమో కొత్త కాంబినేషన్స్ ట్రై చేస్తున్నారు. మారుతున్న సిచువేషన్స్ చూస్తుంటే తెలుగు సినిమా క్రేజీ కాంబినేషన్స్ తో కేకలు పెట్టిస్తుంది. రకరకాలుగా కొత్త కధలు, కొత్త పుంతలతో హిట్ మేనియాతో దూసుకెళ్తుంది. లవ్ సబ్జెక్టు లో డెప్త్, వాటి డీలింగ్ లో విజన్ ఉన్న డైరెక్టర్ 'మణిరత్నం' ప్రెజెంట్ క్రెయేషనే చెలియా, 'కాట్రు వెలియడై' అనే తమిళ్ సినిమాని తెలుగులో 'చెలియా' పేరుతో విడుదలకు సిద్ధం చేస్తున్నారు మణిరత్నం. 'చెలియా' ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ ఐన తరువాత విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. చాల తక్కువ డ్యూరేషన్ తో వచ్చిన ఈ ట్రైలర్ అందమైన లవ్ ఫీల్ ని ఆడియన్స్ కి అందించింది.

ధృవతో..
'ధ్రువ' సినిమా తో హిట్ కొట్టి తిరిగి తాను టాప్ స్టార్స్ లో ఉన్నాను అని నిరూపించుకున్న మెగా ఫామిలీ హీరో 'రామ్ చరణ్ తేజ్'. యాక్టింగ్ లో మెచూరిటీ లెవెల్స్ పెంచుకొని బాడీ ని కూడా షేప్ చేసుకున్నాడు చెర్రీ. 'ధ్రువ' సినిమాలో వచ్చే ప్రతి సీన్ రామ్ చరణ్ యాక్టింగ్ స్కిల్స్ కి అద్దం పట్టేదిలా ఉంది. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తయారవుతుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమా కోసం అల్రెడి పాట‌ల‌ను కంపోజ్ చేసేశారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చి 20 నుండి జ‌రగ‌నుంది.

సుకుమార్..రామ్ చరణ్..
సుకుమార్, రామ్ చరణ్ అంటేనే క్రేజీ కాంబినేషన్ అనుకుంటే అంతకంటే పెద్ద క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన వార్త ఒకటి చెక్కర్లు కొడుతుంది. రామ్‌చ‌ర‌ణ్‌, డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రామ్ చర‌ణ్‌, మ‌ణిర‌త్నంలు ఈ సినిమా గురించి చ‌ర్చ‌లు జ‌రిపారు. జూన్ నుండి ఈ క్రేజీ కాంబో మూవీ సెట్స్‌లోకి వెళ్ళ‌నుంది. ప్ర‌స్తుతం సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ జరుగుతుందట. తన ప్రెజెంట్ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌లో బిజీగా ఉన్న మ‌ణిర‌త్నం రామ్ చరణ్ తో సినిమా కి అన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. చూద్దాం అన్ని ఒకే అయితే సూపర్ కాంబినేషన్ సెట్ అవుతుంది మరి. 

ఏపీలో ఎమ్మెల్సీలు ఏకగ్రీవం..

విజయవాడ : ఎన్నికైన ఎమ్మెల్సీలను ప్రకటించిన అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. లోకేష్ (టిడిపి), కరణం బలరాం (టిడిపి), సునీత (టిడిపి), డొక్కా మాణిక్య వరప్రసాద్ (టిడిపి), బచ్చుల అర్జునుడు (టిడిపి), ఆళ్ల నాని (వైసీపీ), గంగుల ప్రభాకర్ రెడ్డి (వైసీపీ) ఏకగ్రీవమయ్యారు. 

వాకౌట్ చేయడం అవమానపరచడమే - తుమ్మల..

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం వినకుండా కాంగ్రెస్ వాకౌట్ చేయడం రాజ్యాంగాన్ని అవమానపరచడమే మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆస్వాదిస్తున్నారని, జనావేదన, ప్రజాపోరు సభలను ప్రజలు పట్టించుకోలేదని పేర్కొన్నారు. పక్కా ఇళ్ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ లేదని, తమ పార్టీ అంతర్గత సర్వేలపై కాంగ్రెస్ కు ఉలికిపాటెందకని ప్రశ్నించారు. గవర్నర్ అబద్ధాలు చెబితే సభలో చెప్పాలని సూచించారు. 

సమావేశాలను కుదించడం దారుణం - చిన్నారెడ్డి..

హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాలను 14 రోజులకు కుదించడం దారుణమని, కాంగ్రెస్ హయాంలో 30 రోజులకు తక్కువ ఎప్పుడూ నిర్వహించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను సభలో ఎండగడుతామని, ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ 70 సీట్లు గెలుస్తుందన్నారు. 

15:13 - March 10, 2017

భానుడి భగభగలకు గొంతెండిపోతోంది. తాగేందుకు కడివెడు నీళ్లు లేక పల్లెలు గొల్లుగొల్లుమంటూ నరక యాతన పడుతున్నాయి. తినడానికి తిండిలేక కూడా దొరక్క పల్లె ప్రజలు వలస బాట పడుతున్నారు. అనంతపురం జిల్లాలో పెరుగుతున్న వలసలపై 10TV స్పెషల్ ఫోకస్‌...! Look.

రైతులు పొట్ట చేత పట్టుకుని...

వరుస కరవులతో సతమతమవుతున్న అనంత రైతులు పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలసబాట పడుతున్నారు. జిల్లాలో కదిరి, పుట్టపర్తి, రాయదుర్గం నియోజకవర్గాల నుంచి రైతులు, రైతు కూలీలు కేరళ, తమిళనాడు, బెంగళూరు ప్రాంతాలుక వలస వెళ్లి ఉపాధి వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా నుంచి అత్యధికంగా కేరళకు వలస వెళుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రైతులు, యువకులు వలసెళ్లిపోవడంతో చాలా గ్రామాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఏ పల్లెలో చూసినా ఇళ్లకు వేసిన తాళాలే దర్శనమిస్తున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలు తప్పా.. మిగిలిన వారందరూ గ్రామాలను విడిచి ఉపాధి కోసం వలసలు వెళుతున్నారు.

ఉపాధి హామీ పథకం నిర్వీర్యం కావడంతో..

గ్రామాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం నిర్వీర్యం కావడంతో... అనేక మంది గ్రామీణులు పొట్ట చేతపట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారు. ఉపాధి హామీ పథకం పనులకు వెళితే రోజుకు వంద రూపాయాలు కూడా రావడం లేదు. పలుగూ, పార చేతబట్టి కష్టపడ్డా కూలీ డబ్బుల్ని కూడా సరిగ్గా చెల్లించడం లేదు. అసలే పనులు లేవు.. ఒకవేళ అరకొరా పనులున్నా వాటిలో స్థానిక రాజకీయ జోక్యం ఎక్కువై ఆ పనులు కూడా సరిగ్గా అందడం లేదని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ, పీజీలు చేసిన యువత స్థానికంగా కూలీ పనులకు వెళ్లలేక.. గత్యంతరం లేని పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాలకు వలస బాట పడుతున్నారు.

వెలగమేకలపల్లి గ్రామంలో ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలే ..

పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలం వెలగమేకలపల్లి గ్రామంలో ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలే దర్శనమిస్తున్నాయి. గ్రామంలో దాదాపు 80 శాతం మంది బెంగళూరు, కొచ్చిన్‌, కోయంబత్తూర్‌, ముంబై వంటి నగరాలకు వలస వెళ్లారు. పిల్లలు, ముసలివాళ్లు తప్పా మిగతా వారంతా వలస బాట పట్టడంతో గ్రామం బోసిపోయి దయనీయంగా మారాయి. వలసల్ని అరికట్టి ప్రత్యామ్నాయ ఉపాధి పనులు చూపాలని.. సీపీఐ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. త్వరలోనే అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని అమరావతి అసెంబ్లీని ముట్టడిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ హెచ్చరించారు.

గ్రామాల్లో ఉపాధి దొరక్క.. కుటుంబాన్ని పోషించడం గగనమై...

గ్రామాల్లో ఉపాధి దొరక్క.. కుటుంబాన్ని పోషించడం గగనమై అనేక మంది దయనీయ జీవితాలను గడుపుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో చాలా మంది తమ కుటుంబంలోని వృద్ధులు, చిన్నపిల్లల్ని ఇళ్లల్లోనే వదిలి పొట్ట పోసుకునేందుకు పయనమవుతున్నారు. దీంతో బస్సులు, రైల్వే స్టేషన్లు వలస బోతున్న వారితో కిక్కిరిసిపోతున్నాయి.

భార్యభర్తలిద్దరూ కూలీ పనులు చేసినా..

ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన తెలుగు వారు... ముఖ్యంగా అనంత వాసుల కష్టాలకు అంతే లేకుండా పోతోంది. భార్యభర్తలిద్దరూ కూలీ పనులు చేసినా.. కనీసం ఒక్కో నెల ఇంటి అద్దె కూడా చెల్లించలేని దయనీయమైన స్థితి. చాలా సందర్భాల్లో పనులు చేయించుకుని డబ్బులు కూడా ఇవ్వకుండా అక్కడి వారు.. తెలుగువారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. వీటికి తోడు మహిళలయితే తరచూ లైంగిక వేధింపులకు గురికావాల్సి వస్తోంది. పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్నా అనేక మంది అనంత జిల్లా వాసులు అక్కడ బస్టాండ్‌లు, ఫుట్‌పాత్‌ల పైనే నిద్రపోతూ దుర్భర పరిస్థితుల్ని అనుభవిస్తున్నారు.

కొచ్చిన్‌లో అనంత వలస కూలీల స్థితిగతులపై సీపీఐ రామకృష్ణ పర్యటన....

కొచ్చిన్‌లో అనంత వలస కూలీల స్థితిగతులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బృందం పర్యటించింది. ఈ పర్యటనలో అనేక చేదు నిజాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో కూలీ గిట్టుబాటు కాకపోవడం, పథకంలో మితిమీరిన రాజకీయ జోక్యం, గ్రామీణ కులీలపై ఏదో ఒక పార్టీ ముద్ర వేయడం వంటి ఘటనలతో చాలామంది ఉపాధి కోసం వలస బాట పట్టినట్లు సీపీఐ పర్యటనలో వెలుగు చూశాయి. రోజురోజుకు వలసలు తీవ్రమవుతున్నా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వలసబోయిన రైతులు, కూలీలను వెనక్కి పిలిపించి సొంతూళ్లలో ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సమస్యలుంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004258554 కు ఫిర్యాదు చేయాలని సూచన ...

మరోవైపు తమిళనాడు, బీహార్, ఒడిస్సా నుంచి వచ్చిన కూలీలు యూనియన్లు ఏర్పాటు చేసుకుని తమని తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే.. తెలుగు వారికి మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి సంఘాలు, యూనియన్‌లు కూడా లేకుండాపోయాయి. దీంతో తెలుగువారు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. గంటలకు గంటలు రెక్కలు ముక్కలు చేసుకున్నా కూలీలకు గిట్టుబాటు కూలీ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో జిల్లా నుంచి వలసబోయిన కూలీలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. అనంత జిల్లాలో రోజురోజుకు వలసలు పెరుగుతున్నా... ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. అయితే ఉపాధి హామీ పనుల్లో సులభతరమైన పనుల్ని చూపిస్తామని, ఏవైనా సమస్యలుంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004258554 కు చేయాలని డ్వామా అధికారులు సూచిస్తున్నారు.

సమావేశాలను కుదించడం దారుణం - చిన్నారెడ్డి..

హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాలను 14 రోజులకు కుదించడం దారుణమని, కాంగ్రెస్ హయాంలో 30 రోజులకు తక్కువ ఎప్పుడూ నిర్వహించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను సభలో ఎండగడుతామని, ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ 70 సీట్లు గెలుస్తుందన్నారు. 

14:36 - March 10, 2017

నౌ ఏ డేస్ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమా ఏదైనా కొంచం ఎంటర్టైన్మెంట్ ఉంటె బెటర్ అనుకుంటున్నారు. మన ఫిలిం మేకర్స్ కూడా ఆడియన్స్ కి ఎం కావాలో అదే ప్రిపేర్ చేస్తున్నారు. వెరీ సూన్ స్క్రీన్ ని టచ్ చెయ్యబోతున్న పెద్ద స్టార్ సినిమా లో కూడా ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కొంచెం గట్టిగానే పెట్టారట. 'సునీల్' లాంటి కమెడియన్ తో సీరియస్ సబ్జెక్టు ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కిషోర్ కుమార్. 'తడాకా' సినిమా తో నాగచైతన్యని, సునీల్ ని మల్టీస్టారర్ చేసి స్క్రీన్ మీద యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఫన్ మిస్ కాకుండా జాగర్త పడ్డాడు కిషోర్ కుమార్. 'తడాకా' సినిమా పోలీస్ డిపార్ట్మెంట్ కి లోకల్ మాఫియాకి జరిగే ఒక యాక్షన్ లైన్. ఇలాంటి లైన్ ని కూడా తెలుగు ప్రేక్షకుల పల్స్ తెల్సుకొని ఎంటర్టైన్మెంట్ ని ఎక్కడ తగ్గకుండా ప్రెజెంట్ చేసాడు ఈ డైరెక్టర్. ఈ సినిమాలో ఫన్ ఆడ్ చెయ్యడానికి 'సునీల్' కు క్రేజ్ కూడా ఆడ్ అయింది.

గబ్బర్ సింగ్..
'పవన్ కళ్యాణ్' లో మంచి హీరోతో పాటు పర్ఫెక్ట్ టైమింగ్ లో కామెడీ ప్రెజెంట్ చెయ్యగల నటుడు కూడా ఉన్నాడు అనడానికి అతని ప్రీవియస్ ఫిలిమ్స్ మంచి ఎగ్జామ్పుల్. 'గబ్బర్ సింగ్' సినిమాలో అన్యాయాన్ని ఎదిరించే పోలీస్ పాత్రలో నటిస్తూనే టైం టు టైం వచ్చే ఎంటర్టైన్మెంట్ సీన్స్ లో కామెడీ టైమింగ్ లో తానేంటో చూపించాడు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో వచ్చే అంత్యాక్షరి సీన్స్ లో విలన్ గ్యాంగ్ తో పాటు బీభత్సమ్ సృష్టించాడు పవర్ స్టార్. ప‌వ‌ర్ స్టార్ 'ప‌వ‌న్ క‌ల్యాణ్‌', 'శ్రుతి హాస‌న్' జంట‌గా న‌టిస్తోన్న `కాట‌మ‌రాయుడు` షూటింగ్ చివ‌రి స్టేజ్ లో ఉంది. ఫ్యాక్ష‌నిస్టు పాత్ర‌లో ప‌వ‌న్ తొలిసారి క‌నిపించ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. టైటిల్ చూసి చాలా సీరియస్ సినిమా అని అందరూ అనుకున్నున్న 'కాటమరాయుడు' సినిమా లో పవన్ కళ్యాణ్ మార్కు ఎంటర్టైన్మెంట్ కచ్చితంగా ఉండబోతుంది అంట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో పవన్‌ క్యారెక్టర్‌ చాలా హుషారుగా వుంటుందని, సెకండాఫ్‌లో వచ్చే కామెడీ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రానికి డాలీకి పూర్తిగా ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చిన 'పవన్‌కళ్యాణ్‌' అతను చెప్పినట్టల్లా చేసాడట. ఏది ఏమైనా డైరెక్టర్లు చెప్పినట్టు వింటే సినిమాలు హిట్టే.

14:36 - March 10, 2017
14:34 - March 10, 2017

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎటిఎంలో 2 వేల నకిలీ నోటు వెలుగు చూసింది. చందన్‌ రాయ్‌ సంగమ్‌ విహార్‌లోని ఐసిఐసిఐ బ్యాంకు ఎటిఎం నుంచి 2 వేలు విత్‌ డ్రా చేయగా నకిలీ నోటు వచ్చింది. 2 వేల నోటుపై చిల్డ్రన్‌ బ్యాంక్‌ అని రాసి ఉంది. అతని అకౌంట్‌ నుంచి రెండు వేలు కట్‌ అయినట్లుగా మెసేజ్‌ వచ్చింది. చందన్‌ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చందన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎటిఎంను సీజ్‌ చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన మార్చి 7న జరిగింది. ఇంతకు ముందు ఎస్‌బిఐ ఎటిఎం నుంచి చిల్డ్రన్‌ బ్యాంక్‌ అని రాసి ఉన్న నకిలీ 2 వేల నోట్లు రావడం తెలిసిందే.

14:33 - March 10, 2017

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష చెల్లదంటూ ప్రతిపక్ష నేత సాల్టిన్‌ చెన్నై హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రతిపక్షం లేకుండా బలపరీక్ష నిర్వహించారని స్టాలిన్‌ తన పిటిషన్‌లో ఆరోపించారు. అయితే నిబంధనల ప్రకారమే బలపరీక్ష నిర్వహించామని తమిళనాడు అసెంబ్లీ కార్యరద్శి న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. రెండు పక్షాల వాదనలు విన్న కోర్టు.. బలపరీక్ష నాటి వీడియో ఫుటేజీని స్టాలిన్‌కు ఇవ్వాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది.

ధర్నా చౌక్ తరలింపు నిర్ణయంపై నిరసన..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ప్రజాఫ్రంట్, ఆప్, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నా చౌక్ తరలించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వీరిని అడ్డుకుని గాంధీ నగర్ పీఎస్ కు తరలించారు. 

టి.అసెంబ్లీ షెడ్యూల్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 14 రోజుల పాటు కొనసాగనున్నాయి. 27వ తేదీ వరకు జరిగే సమావేశాల్లో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. 13న మంత్రి ఈటెల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 15, 16న బడ్జెట్ పై చర్చించనున్నారు. 17న ప్రభుత్వం సమాధానం చెప్పనుంది. 25న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. 12,14,18,26 తేదీల్లో అసెంబ్లీకి సెలవు. 

14:30 - March 10, 2017

హైదరాబాద్: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌పై సుప్రీంకోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం ఎదుట హాజరు కాకపోవడంతో ఈ వారెంట్‌ను జారీ చేసింది. కర్ణన్‌ను అరెస్టు చేసి.. మార్చి 31లోగా సుప్రీంకోర్టు ముందు హాజరుపరచాలని కోల్‌కతా పోలీసులను ఆదేశించింది. రూ. 10వేల పూచీకత్తుపై కర్ణన్‌ బెయిల్‌ తీసుకోవచ్చని కోర్టు తెలిపింది. చీఫ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జస్టిస్‌ కర్ణన్‌ కేసును విచారించనుంది. సుప్రీం ఆదేశాలపై జస్టిస్ కర్ణన్ స్పందించారు. దళితుడిని కాబట్టే నా జీవితాన్ని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు.

13:54 - March 10, 2017

నల్గొండ : తెలంగాణ రాష్ట్రం వస్తే కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ రాష్ట్రం వచ్చిన తర్వాత కళాకారులను మర్చిపోయారని డప్పు కళాకారులు ఆరోపించారు. డప్పు కొడుతూ పాటలు పాడుతూ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న తమను విస్మరించడం దారుణమని చెప్పారు. తమ సమస్యలను పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 146వ రోజుకు చేరుకుంది. ఇవాళ నల్గొండ జిల్లాలోని పానగల్ మీదుగా ఉదయసముద్రం ప్రాజెక్టును సందర్శిస్తారు. అనంతరం దండంపల్లి స్టేజీ, కట్టంగూరు, ముత్యాలమ్మగూడెం,ఏపీ లింగోటం, నార్కెట్‌పల్లిలో పాదయాత్ర బృందం పర్యటించనుంది. 

 

13:51 - March 10, 2017

గుంటూరు : తమ బడ్జెట్‌లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తామని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈమేరకు ఆయనతో 10 టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతతోపాటు అత్యంత వెనుకబడిన తరగతులకూ అధిక నిధులు కేటాయిస్తామన్నారు. యువత కోసం నూతన పథకాలు ప్రారంభించనున్నట్టు చెప్పారు. పరిశ్రమలు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందడంతోపాటు యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే..
'ఈసారి బడ్జెట్‌లో మార్పులు చేశాం. ప్లాన్‌, నాన్‌ ప్లాన్‌ స్థానంలో రెవెన్యూ, క్యాపిటల్‌ ఎక్స్‌పెండేచర్‌గా మార్చాం. సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. యువజన, వెనుకబడిన కులాలకు నిధుల కేటాయింపు చేస్తాం. పెద్దనోట్ల రద్దు ప్రభావం బడ్జెట్‌పై  పెద్దగా ఉండబోదు. పరిశ్రమలు వస్తేనే యువతకు ఉపాధి లభిస్తుంది. పరిశ్రమలు వస్తేనే రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుంది. యువతకు కొత్త పథకాలు ప్రవేశపెడతాం. మా మ్యానిఫెస్టో ప్రకారమే బడ్జెట్‌ కేటాయింపులు ఉంటాయి' అని తెలిపారు.  

 

13:43 - March 10, 2017

ఢిల్లీ : ఢిల్లీ సహా దేశంలోని పలు యూనివర్సిటీల్లో ఏబీవీపీ కార్యకర్తలు చేస్తున్న దాడులపై రాజ్యసభలో ఆందోళన వ్యక్తమైంది. జీరో అవర్‌లో సీపీఐ, సీపీఎం సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండచూసుకునే సంఘ్‌ పరివార్‌ అనుబంధ విద్యార్థి సంఘాలు రెచ్చిపోతున్నాయని వామపక్ష ఎంపీలు విమర్శించారు. యూనివర్సీటీల్లో రోజురోజుకు ఏబీవీపీ దాడులు పెరుగుతున్నాయని రాజా అన్నారు. విద్యాసంస్థల్లో సంఘ్‌ పరివార్‌ అనుబంధ విద్యార్థి సంఘాలు రెచ్చిపోతున్నాయని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి పేర్కొన్నారు. మోదీ వచ్చిన తర్వాత యూనివర్సిటీల్లో అంశాతి పెరిగిందని చెప్పారు. సంఘ్‌ పరివార్‌ విద్యార్థి సంఘాల ఆగడాలను అదుపు చేయాలని రంగరాజన్‌ తెలిపారు.

 

పరిటాల..సూర్యనారాయణ వర్గీయుల ఘర్షణ..

అనంతపురం : ధర్మవరంలో రోడ్డు విషయంలో మంత్రి పరిటాల, ఎమ్మెల్యే సూర్యనారాయణ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. 

13:38 - March 10, 2017

చెన్నై : జయలలిత మృతిపై కొందరు అన్నా డీఎంకే ఎంపీలు రాజ్యసభలో ఆందోళన వెలిబుచ్చారు.  జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు.  ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మరణించే వరకు జయలలితకు అందించిన వైద్యాన్ని రహస్యంగా ఉంచారని  ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణకానీ లేకపోతే సీబీఐ, సిట్‌ దర్యాప్తుకు ఆదేశించాలని అన్నా డీఎంకే ఎంపీ మైత్రేయన్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసి, సభా కార్యక్రమాలను అడ్డుకున్న  అన్నా డీఎంకే మిథిలపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

13:35 - March 10, 2017

కడప : నీటి అవసరాలు వారిని నిద్ర లేకుండా చేస్తున్నాయి. గుక్కెడు మంచినీళ్ల కోసం పెద్దా చిన్నా తేడా లేకుండా నానా అవస్థలు పడుతున్నారు. చాలీ చాలకుండా నీటిని సరఫరా చేయడంతో ట్యాంకర్ల దగ్గర నీళ్ల కోసం నానా రభస జరుగుతోంది. తాగునీటి అవసరాలు తీర్చేందుకు అధికారులు ఎలాంటి ప్రణాళికలు రచించకపోవడంతో కడప జిల్లాలో జనం ఇక్కట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. 
బిందెడు నీళ్ల కోసం గంటల తరబడి పడిగాపులు... 
బిందెడు నీళ్ల కోసం గంటల తరబడి పడిగాపులు... ఇళ్లూ వాకిలి వదలిపెట్టి ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు.. కుళాయిల వద్ద క్యూలు కట్టి చుక్క చుక్కను ఒడిసిపట్టుకుంటున్న మహిళలు...ఇదీ... కడప జిల్లాలో ఎక్కడ చూసిన తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ప్రత్యక్ష తార్కాణం. ఎండాకాలం ముదురుతున్న కొద్దీ..భూగర్భ జలాలు అడుగంటిపోయి... బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. అరకొరా నీటి వనరులు ఉన్నా... అవి ప్రజల అవసరాలకు  ఏ మాత్రం సరిపోవడం లేదు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వృద్ధులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంటిపిల్లల్ని పట్టుకొని నీళ్లు తెచ్చుకోవడం గగనమవుతోందని మహిళలు ఆవేదన చెందుతున్నారు. 
అడుగంటిన భూగర్భ జలాలు  
భూగర్భ జలాలు అడుగంటి.. గుక్కెడు నీరు లేక గొంతులు ఎండిపోతున్న పరిస్థితి జిల్లాలో సర్వసాధరణంగా మారింది. మంచినీటి కొరత, నీటి కాలుష్యం వల్ల జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అనారోగ్యం బారిన పడుతున్న ప్రజలు.. సురక్షిత జలాల కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు.  సురక్షిత జలాలను సరఫరా చేస్తామన్న పాలకుల వాగ్ధానాలు ఎక్కడా ఆచరణ రూపం దాల్చడం లేదు. తాగునీటి సమస్యను తీర్చేందుకు నిధులు కేటాయిస్తున్నామని పాలకులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కానీ అవి ఆచరణ రూపం దాల్చిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.  
తీవ్ర వర్షాభావ పరిస్థితులు 
జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు నీటి సమస్యను మరింత ఉధృతం చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటి బోర్లు, బావులు ఎండిపోయాయి. ప్రభుత్వం చేపట్టిన ఇంకుడు గుంతల కార్యక్రమం సఫలం కాకపోవడంతో నేల మీద పడ్డ చినుకు.. భూమిలోకి ఇంకి వృథాగా పోతోంది. భూగర్భ జల మట్టాలను పెంచేందుకు అనేక కార్యాక్రమాలు చేపడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం... క్షేత్ర స్థాయిలో ఆచరణలో పెట్టడం లేదు.  ఇంటి అవసరాలకు కూడా నీళ్లు అందడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
అక్రమంగా బోర్లు వేసి నీటిని తోడేస్తున్న వ్యాపారులు  
ప్రజల తాగునీటి అవసరాలను, నీటి కొరతను కొందరు సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అక్రమంగా బోర్లు వేసి నీటిని తోడేస్తున్న కొందరు వ్యాపారులు బావుల్లో పైపులు వేసి మరీ నీటిని తోడి అమ్ముకుంటున్నారు.  అనుమతులు లేకుంబా బోర్లు వేసినా అధికారులు  పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నేతల అండదండలు, అధికారుల చూసీ చూడని తనంతో కొందరు వ్యాపారులు  అక్రమ నీటివ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లు కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో ట్యాంకరు ధర 500 నుంచి 1000 రూపాయాలు పలుకుతోంది.
అందని మున్సిపాలిటీ పంపిణీ నీరు      
మ‌రోవైపు మున్సిపాలిటీల్లో పంపిణీ చేస్తున్న నీరు చాలామందికి అందడం లేదు. కొన్ని కాలనీల్లో అప్పుడప్పుడు నీటి సరఫరా చేస్తుంటే.. మరికొన్ని కాలనీల్లో అది కూడా లేదు. నీటి మాఫియా అక్రమ వ్యాపారంతో తమ బోర్లు ఎండిపోతున్నాయని రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. పనిచేయకుండా పోయిన బోర్లను కూడా రిపేర్‌ చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
నీటి మాఫియా ఆగడాలను అడ్డుకోవాలి : స్థానికులు 
నీటి మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని, బోర్లను రిపేరు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. తాగునీటి కోసం మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

 

13:24 - March 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజే సభలో గందరగోళం ఏర్పడింది. గవర్నర్‌ ప్రసంగానికి కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుతగిలారు. కేబినెట్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌నే గవర్నర్‌ చదువుతున్నారంటూ నిరసన తెలిపారు. కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాలు, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ లాంటి వాటిపై గవర్నర్‌ స్పీచ్‌లో లేవని ఆరోపించారు. అనంతరం సభ నుంచి వాకౌట్‌ చేశారు. 

13:18 - March 10, 2017

ఎప్పుడూ సరికొత్త ఐటెమ్స్ ను పరిచయం చేసే సొగసు.. ఈరోజు మరో కొత్త ఐటెమ్ తో మీ ముందుకు వచ్చింది. మోతీస్ తో కీ చైన్ ఎలా తాయారు చేయాలో ఇవాళ్టి సొగసులో తెలుసుకుందాం.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

బాబు ఉన్నతస్థాయి సమీక్ష..

విజయవాడ : అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ముఖ్య కార్యదర్శులు..హెచ్ వోడీలు హాజరయ్యారు. రెండంకెల వృద్ధి రేటు, శాఖల కంప్యూటీకరణపై చర్చించారు. రాష్ట్రం నిర్ధేశించుకున్న సమాజం - కుటుంబం - వికాసంపైన అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. డ్వాక్రా సంఘంలో సభ్యులుగా ఉన్న సుమారు 90 లక్షల మందిని ఆర్థికంగా బలోపేతం చేయాలని, సాంకేతికతను అన్ని శాఖలు వినియోగించుకోవాలన్నారు. 

ఆసీస్ పేసర్ స్టార్క్ దూరం..

ఢిల్లీ : భారత్ తో జరిగే మిగతా రెండు టెస్టు మ్యాచ్ లకు ఆసీస్ పేసర్ స్టార్క్ దూరమయ్యాడు. గాయం కారణంగా సిరీస్ నుండి తప్పుకున్నాడు. 

పోలవరం ప్రాజెక్టు పిటిషన్ పై ఎన్టీటీలో విచారణ..

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు పిటిషన్ పై ఎన్టీటీలో విచారణ జరిగింది. ప్రాజెక్టు మట్టిని గ్రామాల్లో డంపింగ్ పై తనిఖీ చేపట్టాలని ఆదేశించింది. ఈనెల 21లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర అటవీ శాఖ, కేంద్ర పర్యావరణ శాఖకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. 

ఏమవుతుందో చూద్దాం - సోమిరెడ్డి..

విజయవాడ: సీఎం చంద్రబాబుపై వేసిన ఏ కేసు నిలబడలేదని, ఓటుకు నోటు కేసును సుప్రీంకోర్టు స్వీకరించిందని టిడిపి నేత సోమిరెడ్డి పేర్కొన్నారు. ఏమవుతుందో చూద్దామని, చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు భయపడరని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలంతా కేసులో ఉన్నవాళ్లేనని, అదో ముద్దాయిల పార్టీ అని అభివర్ణించారు. 

13:05 - March 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గవర్నర్ ప్రసంగం లేదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. ఈమేరకు ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం తెలంగాణ ప్రజలను పూర్తిగా నిరాశపర్చిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్టునే గవర్నర్ చదివి వినిపించారని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల దారిమళ్లింపు, బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు, దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై గవర్నర్‌ ప్రసంగంలో స్పష్టత లేదన్నారు.

12:55 - March 10, 2017

మహిళా వార్తల సమాహారంతో మానవి న్యూస్ ఇవాళ మీ ముందుకు వచ్చింది. తెలుగు అమ్మాయి లక్ష్మీస్రావ్య అరుదైన ఘనత, ప్రపంచ మహిళా చెస్ చాంపియన్ షిప్ దక్కించుకున్న చైనా అమ్మాయి, తెలుగు రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి పెరిగింది. పరుషులతో పొలిస్తే మహిళలకు తక్కువ వేతనం.. సర్వే వివరాలు, హైదరాబాద్ లో షీ టీమ్స్... స్వాతి లక్రా సారథ్యం, భారత పార్లమెంట్ లో మహిళల ప్రాధాన్యత అంతంత మాత్రమే, ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై ఆగని అత్యాచారాలు, లైంగిక వేధింపులు, కడపలో కామాంధుడికి యావజ్జీవ శిక్ష, సాక్షి మాలిక్... మహిళకు చక్కటి సందేశం, షట్లర్ లో పివి.సింధు, సైనా నెహ్వాల్ లు శుభారంభం, హాకీ సీరిస్... భారత మహిళా జట్టు క్లీన్ స్వీప్ వంటి పలు వార్తలను వీడియోలో చూద్దాం...

 

12:49 - March 10, 2017

హైదరాబాద్ : ఈనెల 27 వ తేదీ వరకు టీ.బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయించింది. మొత్తం 14 రోజులు సమావేశాలు కొనసాగనున్నాయి. బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్ ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం సభ్యులు హాజరయ్యారు. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగనుంది. 13న మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 15, 16న బడ్జెట్ పై చర్చ జరుగనుంది. 17న బడ్జెట్ పై ప్రభుత్వం సమాధానం చెబుతుంది. 25న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్నారు. 12, 14, 19 వ తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. హాలిడే, సండేలు మినహా మిగిలిన రోజుల్లో సమావేశాలు యధావిధిగా కొనసాగుతాయి. రేపు సెకండ్ శనివారం అయినా... సమావేశాలు కొనసాగునున్నాయి. 20 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని విపక్షాల డిమాండ్‌ చేశాయి. 

 

12:47 - March 10, 2017

హైదరాబాద్ : టీఆర్ ఎస్ సర్కార్ పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదన్నారు. ఈమేరకు నేతలు మీడియాతో మాట్లాడారు. గవర్నర్ చేత కేసీఆర్ అబద్ధాలు చెప్పించారని పేర్కొన్నారు. ప్రాధాన్యత కలిగిన అంశాలను టీఆర్ ఎస్ ప్రభుత్వం గాలికొదిలిందని విమర్శించారు. డబుల్ బెడ్ రూ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, బీసీ సబ్ ప్లాన్, మైనార్టీలకు 12 శాతం లాంటి సమస్యలపై గరర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

12:32 - March 10, 2017

రోజు రోజుకు డయాబెటస్ వ్యాధి గ్రస్తులు ఎక్కువవుతున్నారు. దీనితో వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఫలితం కనిపించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతుంటారు. మనం నిత్యం తీసుకొనే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ ను కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది.
డ‌యాబెటిస్ ఉన్న‌వారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకోవాలి.
వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుంది. ఇందులో అలియం సాటివం అనే రసాయనం ఉంటుంది. గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది.
ప‌ర‌గ‌డుపున 8 గ్లాసుల నీటిని తాగాలి. ఓ గంట పాటు వాకింగ్ చేయాలి. .
బీట్‌రూట్ దుంప‌, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, క‌ల‌బంద‌, వేప‌, తుల‌సి వంటి మొక్క‌ల ఆకుల‌ను ఉద‌యం, సాయంత్రం తిని తేడా గమనించండి.
ఉసిరి రసం, లేదా ఉసిరిని ఇతర ఆహార పదార్ధాలలో కలిపి వాడటం కూడా షుగర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
గ్రీన్ టీ బ్లడ్ షుగర్ స్ధాయిని తగ్గించి, శరీరంలోని ఇన్సులిన్ స్ధాయిలను పెంచుతుంది.

14 రోజుల పాటు టి.అసెంబ్లీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయసభలు వాయిదా పడ్డాయి. అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఈనెల 27వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. మొత్తంగా 14 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. 13న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 

12:12 - March 10, 2017

పండ్లు..కూరగాయలు..ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో బొప్పాయి పండు ఒకటి. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బొప్పాయి పండులో బీటా కెరోటిన్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.
కైమోపాపైన్‌, పాపైన్‌ అనే ఎంజైమ్‌లు ఉంటాయి.
పోటాషియం, పీచు ఎక్కువగా ఉంటుంది. ఈ ఫలితంగా హృద్యోగ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువ.
బొప్పాయిలో కోలిన్ అనే పదార్థం ఉండడం వల్ల జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
మదుమేహం వ్యాధి ఉన్న వారికి బొప్పాయి పండు చక్కగా ఉపయోగపడుతుంది. చక్కెర శాతం పెరగకుండా కాపాడుతుంది.
కొవ్వును కరిగిస్తుంది. అలాగే నిద్రలేమికి చెక్ పెడుతుంది.
బొప్పాయిలోని పాపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియకీ దోహదపడుతుంది.
బొప్పాయి గుజ్జుని ఇన్ఫెక్షన్‌ చేరిన ప్రాంతంలో లేదా కాలిన గాయాలమీద పెట్టడంవల్ల అవి త్వరగా తగ్గుతాయి. 

ఎండమావిలా ఉంది - సున్నం రాజయ్య..

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగంపై సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పెదవి విరిచారు. దళితులకు మూడెకరాల భూమి..ఇతర అంశాలను ప్రసంగంలో పొందుపర్చలేదని, ప్రసంగం తీవ్ర నిరాశ పరిచిందన్నారు. 

12:02 - March 10, 2017

టాలీవుడ్..బాలీవుడ్..కోలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా సరే.. పలు చిత్రాలు రూపొందుతుంటాయి. అగ్రకథానాయకుల సినిమా ప్రారంభమౌతుంటే అభిమానుల సంతోషానికి అవధులుండవు. ఆ చిత్ర విశేషాల గురించి ఆరా తీస్తుంటారు. అభిమానుల ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు దర్శక, నిర్మాతలు చిత్ర విషయాన్ని ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త పడుతుంటారు. పలువురు ముందే చిత్ర విశేషాలను తెలియచేస్తుంటారు. తాజాగా ప్రిన్స్ 'మహేష్ బాబు'..'మురుగదాస్' కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే గడుస్తోంది. కానీ ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు కానీ..లుక్స్ కానీ ఇంతవరకు రిలీజ్ కాలేదు. అంతేగాకుండా సినిమా టైటిల్ ఇంతవరకు ప్రకటించకపోవడం గమనార్హం. ఈ సినిమా పేరు 'సంభవామి' అని .'ఏజెంట్ శివ' అని ఎవరికి వారు పేర్కొంటున్నారు. తాజాగా 'మర్మం'అనే పేరును చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు టాక్. ప్రతి చిత్రంలో సామాజిక అంశాన్ని తెరకెక్కించే 'మురుగదాస్' ఈ చిత్రంలో ఎలాంటి సామాజిక అంశాన్ని సృశించారో తెలియరాలేదు. మరి చిత్ర టైటిల్ ఏంటో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే. 

11:51 - March 10, 2017

హైదరాబాద్ : చర్చించే సత్తా లేకే కాంగ్రెస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈమేరకు మంత్రి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యులు స్లోగాన్స్ ఇవ్వడం, నిరసన చేయడం సరికాదని తెలిపారు. కాంగ్రెస్ కు ఎందుకు తత్తర పాటుకు గురవుతుందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు చిలిపి చేష్టలు చేస్తున్నారని పేర్కొన్నారు. రేపు ఏ ఎజెండాపై అయినా, ఎంత సేపైనా మాట్లాడటానికి, చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు. సభ హుందా తనాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండాపై మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత సమావేశాల్లోనే కాంగ్రెస్ క్లీన్ బౌల్డ్ అయిందని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల అమలు ఇష్టం లేకనే కాంగ్రెస్, టీడీపీలు వాకౌట్ చేశాయని ఆరోపించారు. సభ హుందా తనాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు తనకు తానే చర్యలు తీసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:42 - March 10, 2017

హైదరాబాద్ : టీప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అవమాన పరిచిందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయకుండా, గవర్నర్ ప్రసంగం ఆమోదించకుండా డైరెక్ట్ సభలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతిని గవర్నర్ ప్రసంగంలో చదివించి గవర్నర్ వ్యవస్థను అవమాన పరిచారని మండిపడ్డారు. ప్రభుత్వానికి పారదర్శకత లేదని విమర్శించారు. గవర్నర్ కు ఇచ్చిన ప్రతి... ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ లా ఉందని ఎద్దేవా చేశారు. ప్రసంగంలో వేటి గురంచి ప్రస్తావన లేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఫీజు రియింబర్స్ మెంట్, దళితులు, గిరిజనులకు మూడు ఎకరాలు భూమి పథకంతోపాటు పలు హామీలను ప్రస్తావించలేదని చెప్పారు. గవర్నర్‌ టీఆర్‌ఎస్‌ ఒత్తిడికి తలొగ్గారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్టును గవర్నర్‌ యాంత్రికంగా చదివి వినిపించారని విమర్శించారు. గవర్నర్‌తో అబద్దాలు చెప్పించి... గవర్నర్‌ వ్యవస్థనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవమానపర్చిందని ధ్వజమెత్తారు. అవినీతి రహిత పాలన కోసం కృషి చేస్తున్నామంటూ టీఆర్ఎస్‌ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో 30 రోజులు సమావేశాలు జరిగాయి... ఇప్పుడు 13 రోజులు జరుగుతాయో..? 14 రోజులు జరుగుతాయో సందిగ్ధంగా ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

తమ పొత్తే గెలుస్తుందన్న రాహుల్..

ఢిల్లీ : తమ పొత్తే గెలుస్తుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇతర విషయాలు రేపు మాట్లాడుదామన్నారు. 

11:39 - March 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ సభ నుంచి సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలు అవాస్తవం అని ఆరోపించారు. కేబినెట్ రాసిచ్చిన స్ర్కిప్టునే గవర్నర్ చదివారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశామని జానారెడ్డి తెలిపారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

హైకోర్టు జడ్జీకి సుప్రీం వారెంట్ జారీ..

ఢిల్లీ : కలకత్తా హైకోర్టు జడ్జీ సీఎస్ కరణ్ పై సుప్రీం వారెంట్ జారీ చేసింది. ఈ మ‌ధ్యే ప‌లువురు మాజీ, ప్ర‌స్తుత జడ్జీల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు సీఎస్ క‌ర్ణ‌న్‌. దీనిని సుమోటోగా స్వీక‌రించింది సుప్రీం ధ‌ర్మాస‌నం. చీఫ్ జ‌స్టిస్ జేఎస్ ఖేహార్ స‌హా ఏడుగురు సీనియ‌ర్ జ‌డ్జీల ధ‌ర్మాస‌నం ఈ ధిక్క‌ర‌ణ కేసుపై విచార‌ణ జ‌రుపుతున్న‌ది

సత్తా లేదనే వాకౌట్ - హరీష్..

హైదరాబాద్ : సత్తా లేకపోవడంతో కాంగ్రెస్ వాకౌట్ చేసిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గవర్నర్ స్పీచ్ జరుగుతుండగానే మధ్యలోనే వెళ్లిపోయిన కాంగ్రెస్ నేతల తీరున ఆయన తప్పుబట్టారు. గవర్నర్ ప్రసంగంలో ఎవరూ అడ్డు తగలవద్దని బీఏసీలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఏ చర్చకైనా టీఆర్ఎస్ సర్కార్ సిద్ధమని వెల్లడించడం జరిగిందన్నారు. గతంలో విపక్షాల కోరిక మేరిక సభను నిర్వహించడం జరిగిందని, కాంగ్రెస్, టిడిపి వైఖరులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అన్ని అంశాలపై మాట్లాడే అవకాశం ఉందన్నారు.

11:20 - March 10, 2017

నటి భావన గుర్తుండే ఉంటుంది కదా. ఇటీవలే ఓ సినిమా షూటింగ్ లో పాల్గొని వస్తుండగా కొందరు లైంగిక వేధింపులకు పాల్పడడంతో 'భావన' వార్తల్లోకి వచ్చింది. దీనిపై పోరాటం జరిపింది. ధైర్యంగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు పట్టుకున్నారు. భావనకు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు నిలిచారు. తాజాగా ఆమె త్వరలో పెళ్లి పీఠలెకక్కనుంది. గత కొంతకాలంగా నిర్మాత నవీన్..భావనల మధ్య ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. నవీన్..శాండిల్‌వుడ్ ప్రొడ్యూసర్ అనే సంగతి తెలిసిందే. ఐదేళ్ల కిందట భావనతో ‘రోమియో’ అనే ఫిల్మ్‌ని తెరకెక్కించాడు నిర్మాత నవీన్‌. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు ఫ్యామిలీలకు చెందిన బంధువులు, క్లోజ్‌ఫ్రెండ్స్, మలయాళం, కోలీవుడ్ నుంచి కొంతమంది సినీ ప్రముఖులు అటెండయ్యారు.  

ధర్నా చౌక్ ను తరలిస్తే ఊరుకోం - పొంగులేటి..

హైదరాబాద్ : ధర్నా చౌక్ ను తరలిస్తే ఊరుకోమని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. గవర్నర్ స్పీచ్ అంతా తప్పుల తడకగా ఉందన్నారు. ఆందోళనలకు..ధర్నాలకు టి.సర్కార్ భయపడుతోందని, అందుకే ధర్నా చౌక్ ను తరలించడానికి ప్రయత్నాలు చేస్తోందన్నారు. 

గవర్నర్ స్పీచ్..భాజా కొట్టుకున్నారు..

హైదరాబాద్ : గవర్నర్ స్పీచ్ లో అన్ని అబద్ధాలే చెప్పారని టి.కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ ఆరోపించారు. గవర్నర్ స్పీచ్ జరుగుతుండగా మధ్యలోనే టి.కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి లేదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

టి. అసెంబ్లీ..సోమవారానికి వాయిదా..

హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయసభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ నుండి వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభను సోమవారానికి వాయిదా పడింది.

గవర్నర్ ప్రసంగం..వెళ్లిపోయిన కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయసభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ నుండి వెళ్లిపోయారు.

10:39 - March 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో అర్థవంతమైన చర్చలు జరగాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు. సమావేశాలనుద్ధేశించి ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు..ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనే విధంగా చర్చలు ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. 
రాష్ట్రంలో 13.2శాతం వృద్ధి 
రాష్ట్రం 13.2శాతం వృద్ధి చెందిందని, సేవా రంగంలో 14.6 శాతం వృద్ధి సాధించిందని చెప్పారు. ప్రభుత్వం సులభతరం వాణ్యిజ్యం ప్రవేశ పెట్టిందన్నారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. దసరా రోజు ఏర్పడిన కొత్త జిల్లాలు ప్రజల వద్దకు పాలన మరింత చేరువ కావడానికి ఇది ఎంతగానే ఉపయోగపడుతుందన్నారు. సౌలభ్యానికి కొత్త జిల్లాల ఏర్పాటు ఎంతో ముఖ్యమన్నారు. కొత్త రాష్ట్రం తక్కువ సమయంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యుత్ కొరతను అధిగమించడం జరిగిందన్నారు. విద్యుత్ కోతలు లేకుండా చూస్తున్నట్లు, 24గంటల విద్యుత్ సరఫరా చేయడం జరుగుతోందన్నారు. నాణ్యమైన విద్యుత్ తో వ్యవసాయ రంగానికి మేలు జరుగుతోందన్నారు. 
జిల్లాల అభివృద్ధికి ప్రణాళికలు..
జిల్లాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు, ఐదు పోలీష్ కమిషనరేట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో దేశంలో మొదటి స్థానం సాధించడం జరిగిందన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలో రెండోస్థానంలో నిలిచిందని తెలిపారు. పారిశ్రామిక అనుమతులు 15 రోజుల్లో ఇవ్వడం జరుగుతోందని, అవినీతికి తావులేకుండా పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిలో సేవా రంగానికి ఎంతో పాముఖ్యత ఉందని చెప్పారు. 
సింగిల్ విండో సిస్టమ్ తో పరిశ్రమలకు అనుమతులు 
సింగిల్ విండో సిస్టమ్ తో పరిశ్రమలకు అనుమతినిస్తున్నట్లు తెలిపారు. ఆసర పథకం ద్వారా ప్రజలకు భరోసా కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం 50 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అంగన్ వాడీ టీచర్లకు, హెల్పర్లకు వేతనాలు పెంచడం జరిగిందని తెలిపారు. 
త్వరలో 12వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 
టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేయడం జరుగుతోందని, త్వరలోనే 12వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. రాష్ట్ర సాధనలో అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒంటిరిగా నివిసిస్తున్న మహిళలకు రూ. 1000 చొప్పున జీవన భృతి, సంక్షేమ వసతి గృహాలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. 51వేల ఆర్థిక సాయం, విదేశాల్లో చదువుకునే పేద విద్యార్థులకు రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. 
ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్
ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ తో సహా ఆరోగ్య కార్డులు మంజూరు చేసినట్లు, వీఆర్ఏ ల వేతనాలను రూ. 10,500 పెంచామని తెలిపారు. ఏడు ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగిందని, పెండింగ్ లో ఉన్న మరో 14 ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉద్యానరంగం పోత్సాహానికి ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నట్లు, 24 భారీ, 30 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు. 

టి.అసెంబ్లీ గవర్నర్ స్పీచ్ హైలెట్స్..5..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ తో సహా ఆరోగ్య కార్డులు మంజూరు చేసినట్లు, వీఆర్ఏ ల వేతనాలను రూ. 10500 పెంచామని తెలిపారు. ఏడు ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగిందని, పెండింగ్ లో ఉన్న మరో 14 ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉద్యానరంగం పోత్సాహానికి ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నట్లు, 24 భారీ, 30 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు. 

గవర్నర్ ప్రసంగం..కాంగ్రెస్ నేతల నినాదాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించారు. కాసేపటి అనంతరం కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. ఊకదంపుడు ప్రసంగం ఉంటే అడ్డుకుంటామని అంతకుముందే కాంగ్రెస్ నేతలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

10:33 - March 10, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్ తార్నాకలో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ పై నుంచి కింద పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాకు చెందిన సునీల్ అగర్వాల్ మొహక్ అనే విద్యార్థి కొద్ది రోజులు ఢిల్లీలో ఉన్నాడు. అనంతరం హైదరాబాద్ కు వచ్చాడు. నగరంలోని లక్ష్మోజి బిజినెస్ స్కూల్ లో ఎంబిఏ మొదటి సం. చదువుతున్నాడు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. సికింద్రాబాద్ తార్నాకలోని స్టైల్ హోం అపార్ట్ మెంట్ లోని మూడో అంతస్తులో నివాసముంటున్నాడు. ఈనేపథ్యంలో రాత్రి టెర్రస్ పై నిద్రించాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రమత్తులో ప్రమాదవశాత్తు అపార్ట్ మెంట్ పై నుంచి కింద పడ్డాడు. తీవ్రంగా గాయాలవ్వడంతో మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. 

 

టి.అసెంబ్లీ..గవర్నర్ స్పీచ్ హైలెట్స్ 4..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేయడం జరుగుతోందని, త్వరలోనే 12వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. రాష్ట్ర సాధనలో అమరవీరలు కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం..ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. ఒంటిరిగా నివిసిస్తున్న మహిళలకు రూ. 1000 చొప్పున జీవన భృతి, సంక్షేమ వసతి గృహాలకు సన్న బియ్యం సరఫరా..పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. 51వేల ఆర్థిక సాయం..విదేశాల్లో చదుకొనే పేద విద్యార్థులకు రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. 

టి.అసెంబ్లీ..గవర్నర్ స్పీచ్ హైలెట్స్ 3..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. సింగిల్ విండో సిస్టమ్ తో పరిశ్రమలకు అనుమతినిస్తున్నట్లు, ఆసర పథకం ద్వారా ప్రజలకు భరోసా కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు ఇస్తున్నట్లు, జర్నలిస్టుల సంక్షేమం కోసం 50 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, అంగన్ వాడీ టీచర్లకు, హెల్పర్లకు వేతనాలు పెంచడం జరిగిందన్నారు. 

టి.అసెంబ్లీ..గవర్నర్ స్పీచ్..హైలెట్స్ 2

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. జిల్లాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు, ఐదు పోలీష్ కమిషనరేట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో దేశంలో మొదటి స్థానం సాధించడం జరిగిందని, ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలో రెండోస్థానంలో నిలిచిందన్నారు. పారిశ్రామిక అనుమతులు 15 రోజుల్లో ఇవ్వడం జరుగుతోందని, అవినీతికి తావులేకుండా పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

10:21 - March 10, 2017

నల్గొండ : కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గుళ్లు, గోపురాలకు ఖర్చు చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ అన్నారు. ప్రజల భూముల్ని లక్కొంటున్న కేసీఆర్‌ సర్కార్‌ పేదల సంక్షేమాన్ని విస్మరించిందని ఆమె అన్నారు. 
ప్రజల జీవితాలను విచ్చిన్నం చేయడానికే  నోట్ల రద్దు : బృందాకరత్
యూపీ ఎన్నికల్లో మత తత్వ ఎజెండాతో ముందుకు పోతున్న మోదీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ అన్నారు. ప్రజల జీవితాలను విచ్చిన్నం చేయడానికే  మోదీ నోట్ల రద్దు చేశారని ఆమె ఆరోపించారు. తాను ప్రధాని అన్న విషయాన్ని కూడా మరిచి మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో మాట్లాడుతున్నారని బృందా కరత్‌ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోట్ల రూపాయల ప్రజా ధానాన్ని గుళ్లు, గోపురాలకు వృధాగా ఖర్చు చేస్తున్నారని బృందా కరత్‌ విమర్శించారు. ప్రజలకు కోపం వస్తే కేసీఆర్‌ను ఏ దేవుడూ కాపాడలేరని ఆమె హెచ్చరించారు. ప్రజల భూముల్ని లాక్కొంటున్న కేసీర్‌ కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు. 
అప్పుడే సామాజిక న్యాయం సాధ్యం : తమ్మినేని 
సబ్బండ వర్ణాలు, కులాలకు సమాన అవకాశాలు దక్కినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమైనట్లని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్ర మొదలైన తర్వాత ప్రభుత్వంలో చలనం వచ్చిందని తమ్మినేని అన్నారు. సీపీఎం పాదయాత్ర వల్లే కేసీఆర్‌ ఎంబీసీల గురించి ఆలోచిస్తున్నారని తమ్మినేని తెలిపారు. ఎంబీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వాలని మొదట ప్రతిపాదించింది సీపీఎం పార్టీ అని తమ్మినేని తెలిపారు. మాటల గారడీలు చేయడంలో కేసీఆర్‌ దిట్ట అని తమ్మినేని విమర్శించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రయోజనం కలిగేలా బీసీ సబ్‌ప్లాన్‌ చట్టం చేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. 
ఉత్సాహంగా మహాజన పాదయాత్ర 
సీపీఎం మహాజన పాదయాత్ర నల్లగొండ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. నేటితో పాదయాత్ర 145 రోజులు పూర్తి చేసుకుంది. నల్లొండ జిల్లాలోని బుడిమర్లపల్లి, కనగల్‌, ధర్వేసిపురం, కొత్తపల్లి, నల్లగొండలో తమ్మినేని బృందం పర్యటించింది. రాష్ట్రంలోని హమాలీల సమస్యలపై , మర్రిగూడ మండలం చెర్లగూడెం రిజర్వాయర్‌ నిర్వాసితుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. నిర్వాసితుల సమస్యలు తీర్చి వారిని ఆదుకోవాలని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు.

 

టి.అసెంబ్లీ..గవర్నర్ స్పీచ్ హైలెట్స్ 1

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. రాష్ట్రం 13.2శాతం వృద్ధి చెందిందని, సేవా రంగంలో 14.6 శాతం వృద్ధి..ప్రభుత్వం సులభతరం వాణ్యిజ్యం ప్రవేశ పెట్టిందన్నారు. కొత్త జిల్లాలు..కొత్త మండలాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, దసరా రోజు ఏర్పడిన కొత్త జిల్లాలు ప్రజల వద్దకు పాలన మరింత చేరువ కావడానికి ఇది ఎంతగానే ఉపయోగపడుతుందన్నారు. సౌలభ్యానికి కొత్త జిల్లాల ఏర్పాటు ఎంతో ముఖ్యమన్నారు. కొత్త రాష్ట్రం తక్కువ సమయంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

అర్థవంతమైన చర్చలు జరగాలి - గవర్నర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో అర్థవంతమైన చర్చలు జరగాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా నవ తెలంగాణ సంయుక్త సమావేశాలనుద్ధేశించి ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు..ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనే విధంగా చర్చలు ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

11.30గంటలకు బీఏసీ..

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం తరువాత ఉభయసభలు వాయిదా పడనున్నాయి. ఉదయం 11.30 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. 

జర్మనిలో దుండగుడి బీభత్సం..

జర్మని : ఓ రైల్వే స్టేషన్ లో దుండగుడు బీభత్సం సృష్టించాడు. రైల్వేస్టేషన్ లో ఉన్న ప్రయాణీకులపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కాసేపట్లో టి.అసెంబ్లీ సమావేశాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉభయసభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 

09:49 - March 10, 2017

భారతీయులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుకోవాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి రాంచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత టి.ఆచారి పాల్గొని, మాట్లాడారు. దాడులపై భారత ప్రభుత్వం ఖండించకుంటే దాడులు పెరుగుతాయని చెప్పారు. అమెరికా విదేశాంగ శాఖతో చర్చలు జరిపి దాడులు జరగకుండా చూడాలని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:45 - March 10, 2017
09:40 - March 10, 2017

పద్ధతి ప్రకారం చదివితే పరీక్షలు రాయడం చాలా ఈజీ అని టీచర్ నెహ్రూ అన్నారు. ఇవాళ్టి జనపథం కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. 'పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లీష్, మ్యాథ్స్ తో పాటు కీలకమైన మరో సబ్జక్టు సైన్స్. ఈ పేపరులో కూడా మంచి మార్కులు సాధించడానికి అకాశాలు పుష్కలం. అయితే, టెంత్ సైన్స్ పేపర్ ప్రిపరేషన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? సైన్స్ సబ్జక్టును పక్కాగా గుర్తుపెట్టుకోవడానికి అనువైన చిట్కాలేమిటి? సైన్స్ పేపర్ రాసేటప్పుడు పాటించాల్సిన నియమాలేమిటి?  అనే విషయాలపై మాట్లాడారు. వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:40 - March 10, 2017

బాలీవుడ్ నటి 'సన్నీ లియోన్' అడపదడపా తెలుగు చిత్రాల్లో నటిస్తూ అభిమానులు ఉత్సాహ పరుస్తోంది. పాటల్లో నటించడం..లేదా ప్రత్యేక పాత్రలో ఒక మెరుపు మెరుస్తోంది. తాజాగా మరో తెలుగు చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'రాజశేఖర్' కథానాయకుడిగా నటిస్తున్న 'గరుడవేగ' చిత్ర షూటింగ్ కొనసాగుతోంది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరోసారి 'రాజశేఖర్' పోలీసు ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. పూజా కుమార్, శ్రద్ధా దాస్, అదితి అరుణ్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో 'సన్నీ' ఒక ప్రత్యేక పాటలో నర్తించనుందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై ప్రవీన్ సత్తార్ స్పందించారు. సెకాండాఫ్ లో వచ్చే ఒక పాటలో 'సన్నీ' పల్లెటూరి పిల్లగా కనిపిస్తుందని స్పష్టం చేశారు. మరి పల్లెటూరి పిల్లగా 'సన్నీ' ఎలా కనిపించనుందో వేచి చూడాలి. 

జర్మనీలో దుండగుడు దాడి

జర్మనీ : జర్మనీలో దుండగుడు దాడికి పాల్పడ్డాడు. రైల్వే స్టేషన్ లో ప్రయాణికులపై గొడ్డలితో దాడి చేశాడు. ఈఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 

 

09:31 - March 10, 2017

ఢిల్లీ : నిన్నటిదాకా పెద్దనోట్లరద్దుతో సతమతమైన ప్రజలకు ఆర్‌బీఐ మరో షాక్‌ ఇచ్చింది. బంగారం తాకట్టుపై రుణ పరిమితి 20వేలకు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం బంగారంపై బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థలు లక్షరూపాయల వరకు నగదు , అంతకు మించిన రుణాలను చెక్కుల రూపంలో అందిస్తున్నాయి. నగదు లావాదేవీలను తగ్గిడం, ప్రజల్లో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం నగదు పరిమితిని రూ.20వేలకు తగ్గించినట్టు ఆర్‌బీఐ వర్గాలు ప్రకటించాయి. ఆర్బీఐ తాజా నిర్ణయంపై ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఖాతాల నిర్వహణకు పన్నులు చెల్లించాల్సిందేనని ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ప్రకటించడంతో జనం బ్యాంకులంటేనే భయపడే స్థితి వచ్చింది. ఇక ఆర్బీఐ తాజా నిర్ణయంతో అత్యవసర సమయాల్లో బంగారం కుదువపెట్టుకుని అవసరాలు వెళ్లదీసుకునే వారికి దిక్కుతోచని పరిస్థితి వచ్చినట్టైంది. 

09:30 - March 10, 2017

ఢిల్లీ : నెల రోజుల విరామం తర్వాత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అమెరికాలో భారతీయులు లక్ష్యంగా జరుగుతున్న జాత్యహంకార దాడులపై లోక్‌సభలో చర్చ జరిగింది. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత జాత్యహంకర దాడులు పెరిగిపోయాయని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేన్సస్‌లో హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్‌ కూచిభొట్ల శ్రీనివాస్‌ను... శ్వేతజాతీయుడు ప్యూరింటన్‌ కాల్చి చంపడాన్ని ఖండించాయి. అమెరికాలో జాత్యహంకార హత్యలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రతి విషయంపైనా ట్వీట్లు చేసే ప్రధాని మోది...శ్రీనివాస్‌ హత్యపై ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

అమెరికాతో చర్చించాలన్న సీపీఎం..
జాత్యాహంకార దాడులపై అమెరికాతో చర్చించాలని సీపీఎం సభ్యుడు మహ్మద్ సలీం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అమెరికాతో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో డిఫెన్స్‌ కొనుగోళ్లపై తాత్కాలిక ఆంక్షలు విధించడం లాంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. దీంతో అమెరికా దెబ్బకు దిగివస్తుందన్నారు. కూచిబొట్ల శ్రీనివాస్ హత్య జాత్యాహంకారానికి నిదర్శనమని టిఆర్‌ఎస్‌ సభ్యులు జితేందర్‌రెడ్డి అన్నారు. కేన్సస్ ఘటనను అమెరికా ఖండించింది కానీ భారతీయుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

వచ్చే వారం ప్రకటన..
అమెరికాలో భార‌తీయుల‌పై జ‌రుగుతున్న దాడుల‌కు సంబంధించి ప్రభుత్వం వ‌చ్చే వారం ప్రక‌ట‌న చేస్తుంద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభ్యులకు హామీ ఇచ్చారు. రాజ్యసభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీలు పుట్టపాక రాధాకృష్ణ, పి.శివశంకర్, సయ్యద్‌ షాహబుద్దీన్, రవి, ప్రస్తుత ఎంపీ హాజీ అబ్దుల సలీంలకు సభ్యులు నివాళులర్పించారు. అనంతరం ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

09:25 - March 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. విపక్ష..అధికార పక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలో సిద్ధమవుతున్నాయి. తొలుత గవర్నర్ ఉభయసభళనుద్ధేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టెన్ టివితో మాట్లాడారు. గవర్నర్ ఊకదంపుడు ప్రసంగాలు చేయవద్దని ఎమ్మెల్యే సంపత్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున తాము గొంతు వినిపిస్తామని, సర్కార్ చెప్పిన మాటలను నెరవేర్చలేదన్నారు. గవర్నర్ ప్రసంగం వాస్తవాలను ప్రతిబింబిస్తుందా? చూడాలని లేక ఊకదంపుడు ప్రసంగం ఉంటే మాత్రం ప్రసంగాన్ని అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే దొడ్డిదారిన నల్గొండకు జలదోపిడి చేస్తోందని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. నిపుణుల కమిటీ అనేక విషయాలు పేర్కొన్నా కాంట్రాక్టర్ల దోచిపెట్టేందుకు పాలమూరు - రంగారెడ్డి రీ డిజైన్ చేస్తున్నారని విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. 

09:22 - March 10, 2017

హైదరాబాద్ : ప్రజలు చూస్తున్నారు కాబట్టే అర్థంలేని సాహిత్యంతో సినిమాలు వస్తున్నాయని గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి విమర్శించారు. చూసేవారిని దృష్టిలో పెట్టుకునే మూవీలు నిర్మిస్తున్నారని స్పష్టం చేశారు.. ధర్మబద్దమైన సినిమా వ్యాపారం అవకతవకలుగా మారిందని... దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందని తెలిపారు. సినిమారంగం బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొన్నారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. మరిన్ని విశేషాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:19 - March 10, 2017

విజయవాడ : టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హెరిటేజ్‌ ఆస్తులు పెరిగాయని, ఆస్తులకు సంబంధించి చర్చలకు సిద్ధమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమర్పించిన నామినేషన్‌లో లోకేశ్‌ చూపిన ఆస్తుల వివరాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆయన వివరణ ఇచ్చారు. తన తండ్రి తనకు హెరిటేజ్‌ ఆస్తులు రాసిచ్చారని లోకేశ్‌ వెల్లడించారు. ఆస్తుల అంశంపై ప్రతిపక్ష వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ లోకేశ్‌ మండిపడ్డారు. తన ఆస్తులకు సంబంధించి ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే హెరిటేజ్‌ ఆస్తులు పెరిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేషన్‌లో పేర్కొన్న ఆస్తుల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపై లోకేశ్‌ వివరణ ఇచ్చారు. గత ఆరేళ్లుగా తమ కుటుంబం అంతా స్వచ్ఛందంగా ఆస్తుల వివరాలు వెల్లడిస్తూ వస్తోందని, ఏ రాజకీయ పార్టీ కానీ, నాయకుడు గానీ తమలా ఆస్తులు ప్రకటించడం లేదని లోకేశ్‌ అన్నారు. ఆస్తుల విషయంలో తనపై కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని లోకేశ్‌ మండి పడ్డారు. తనకు 23 లక్షల హెరిటేజ్‌ షేర్లు ఉన్నాయని, మార్కెట్‌లో ఆ షేర్ల విలువ పెరగటం వల్లే ఆస్తుల విలువలు క్రమంగా పెరుగుతూ వచ్చాయని లోకేశ్‌ అన్నారు. టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఈ షేర్ల విలువ పెరిగిందని లోకేశ్‌ తెలిపారు. పది రూపాయల షేర్‌ విలువ 20 ఏళ్లలో 2500 రూపాయలకు చేరిందని ఆయన తెలిపారు.

330 కోట్లు..
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అఫిడెవిట్‌ సమర్పించిన లోకేశ్‌ కేవలం ఐదు నెలల్లోనే 23 రెట్లు ఆస్తులు పెరిగాయని పేర్కొన్నారు. మొత్తం 330 కోట్ల ఆస్తులను చూపిన ఆయన.. 273.84 కోట్ల విలువైన హెరిటేజ్‌ షేర్లు, 18 కోట్ల విలువైన స్థిరాస్తులు, మరో 38.52 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. ఇక తన పేరిట 6.27 కోట్ల అప్పులూ ఉన్నట్లు వెల్లడించారు. ఇదే అంశం ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన ఆస్తులపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్దాంతం చేస్తున్నాయని లోకేశ్‌ ఆరోపించారు. తాము షేర్ల ధరలు ఎప్పుడూ చెప్పలేదని, కేవలం కొన్న ధరను మాత్రమే చెప్పామని లోకేశ్‌ అన్నారు. పెరిగిన షేర్ల ప్రకారం తన ఆస్తి 330 కోట్లకు చేరిందని లోకేశ్‌ తెలిపారు. తనకు అక్రమాస్తులు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలను లోకేష్ ఖండించారు.

జగన్ ఆస్తులను ప్రకటించారా ? 
తన తండ్రి చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి అయ్యాక 1999లో ఆయనకు హెరిటేజ్‌లో ఉన్న వాటాను తనకు రాసిచ్చారని లోకేశ్‌ తెలిపారు. ఈసీ నిబంధనలను ప్రతిపక్షం కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. ఆస్తుల ప్రకటనపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఆస్తులను స్వచ్ఛందంగా ప్రకటిస్తున్న తొలి రాజకీయ కుటుంబం తమదేనని ఆయన చెప్పారు. 12 కేసుల్లో ఏ-1 నిందితుడిగా ఉన్న జగన్‌ ఏనాడైనా అతని ఆస్తులు ప్రకటించారా? అని లోకేష్ ప్రశ్నించారు.

09:19 - March 10, 2017

హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ను  కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. బ్యాలెట్‌ పేప‌ర్లో అభ్యర్థుల ఫోటోలు త‌ప్పుగా ప్రింట్ చేసి ఎన్నిక నిర్వహించడంతో.. యూటీఎఫ్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డి అభ్యంత‌రం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం..ఈనెల 19న రీపోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గందరగోళం 
హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ను మ‌ళ్లీ నిర్వహించాలని ఆదేశించింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా..బ్యాలెట్‌ పేపర్‌లో సీరియల్‌లో తొమ్మిదో నంబర్‌లో ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్‌రెడ్డి ఫోటోను మూడో నంబర్‌లో ముద్రించారు. మూడో నంబర్‌లో ఉన్న ఆదిలక్ష్మయ్య ఫోటోను తొమ్మిదో నంబర్‌లో ముద్రించారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. త‌ప్పును గుర్తించిన యూటీఎఫ్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డి, అతని మ‌ద్దతుదారులు ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అయితే తాము చేసేదేం లేదంటూ సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో ఎన్నికను రద్దు చేసి..రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు.  
ఉద్దేశ్యపూర్వకంగానే బ్యాలెట్‌లో తప్పుడు ఫొటోలు : మాణిక్ రెడ్డి
ఉద్దేశ్యపూర్వకంగానే బ్యాలెట్‌లో ఫొటోలు తప్పుగా వేశారని యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్‌రెడ్డి ఆరోపించారు. వెంటనే ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఆయనతో పాటు..మూటీఎఫ్‌ జాతీయ నేత నారాయణ, అధ్యక్ష కార్యదర్శులు చావా రవి, నర్సిరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. అయితే ఆందోళన చేస్తున్న మాణిక్‌రెడ్డిని,.యూటీఎఫ్‌ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 
ఈ నెల 19న మళ్లీ పోలింగ్ : ఈసీ 
ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం..క్షేత్రస్థాయిలో జ‌రిగిన ప‌రిణామాల‌పై నివేదిక తెప్పించుకుంది. బ్యాలెట్ పేప‌ర్లో త‌ప్పు జ‌రిగింద‌ని గుర్తించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం..పోలింగ్‌ను ర‌ద్దు చేసింది. ఈ నెల 19న మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. బ్యాలెట్ పేప‌రు త‌ప్పుడు ముద్రణకు కార‌ణం అయిన ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్ సిబ్బంది ఇద్దరిపై వేటు వేసి మ‌రొకరికి సంజాయిషి కోరిన‌ట్లు తెలుస్తోంది. ఇక త‌ప్పుల‌ను గుర్తించ‌కుండా అదే బ్యాలెట్‌ను అన్ని పోలింగ్ కేంద్రాల‌కు పంపిణీ చేసిన లైజ‌నింగ్ అధికారుల‌పై కూడా చర్యలు ఉంటాయని ఈసీ తెలిపింది.   
బాధ్యులపై క‌ఠిన చ‌ర్యలు : యూటీఎఫ్    
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేసి రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని యూటీఎఫ్‌ స్వాగతించింది. ఇందుకు బాధ్యులైన వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాలని కోరుతుంది. ఇక‌పై ఇలాంటి సంఘ‌ట‌న‌లు పునారావృతం కాకుండా పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌రిపి నిజాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేస్తుంది. అయితే ఇందులో పోటీలో ఉన్న అభ్యుర్థుల పాత్రపై కూడా యూటీఎఫ్‌ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌ను రద్దు చేసి రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకోవడంపై యూటీఎఫ్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

09:14 - March 10, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 9 జిల్లాల పరిధిలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69.70 శాతం పోలింగ్‌ నమోదైంది. విశాఖ నగరంలో 71.1 శాతం, ఏజెన్సీలో 70 శాతం పోలింగ్‌ నమోదైంది. శ్రీకాకుళంలో 68 శాతం, విజయనగరంలో 70 శాతం పోలింగ్‌ రికార్డైంది. చెదురుమదురు ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా ప్రాంతాల్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు పోటిపడ్డారు.

విశాఖలో..
విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నగరంలో తన ఓటు హక్కును పీడీఎఫ్ అభ్యర్థి అజశర్మ వినియోగించుకున్నారు. నర్సీపట్నం మున్సిపాల్టీ ఛైర్మన్‌ చింతకాయల అనిత, వైఎస్‌ ఛైర్మన్‌ చింతకాయల సన్యుజపాత్రుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విజయనగరం..
విజయనగరం జిల్లా పార్వతిపురంలో టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పోలింగ్‌ బూత్‌లోకి ఎమ్మెల్సీ జగదీష్‌ సెల్‌ఫోన్‌ తీసుకెళ్లడంపై ఓటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

శ్రీకాకుళం..
శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి పోలింగ్‌ మందకొడిగా సాగింది. మధ్యాహ్నం నుంచి ఓటర్లు అధిక సంఖ్యలో వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తూర్పు రాయలసీమ..
తూర్పు రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నెల్లూరు జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగాయి. డీకే డబ్ల్యూ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కలెక్టర్‌ ముత్యాలరాజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామ్మూర్తి నగర్‌లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పట్టాభిరామిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రకాశం..
ప్రకాశం జిల్లాలో మందకొడిగా ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికలు.. మధ్యాహ్నానికి పుంజుకున్నాయి. గిద్దలూరులో ఓ టీడీపీ ఎమ్మెల్యే అసిస్టెంట్‌ ఓటర్లకు డబ్బు పంపిణి చేస్తూ కెమెరాకు చిక్కారు. కందుకూరులో మాజీ ఎమ్మెల్యీ దివి శివరాం ఎలక్షన్‌ కోడ్‌ ఉల్లఘించారని పీడీఎఫ్‌ నాయకులు ఆరోపించారు. తమ గ్రామ సమస్యలు పరిష్కరించనందుకు నిరసనగా వెంకటాద్రిపాలెంలో 65 మంది ఓటర్లు ఎన్నికలను బాయ్‌కాట్‌ చేశారు.

తిరుపతి..
తిరుపతిలో టీడీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారని తూర్పు రాయలసీమ పీడీఎఫ్ పట్టభద్రుల అభ్యర్థి యడవల్లి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. 258వ బూత్‌లో అధికార పార్టీ దొంగఓట్లు వేయిస్తుందని ఓటర్ల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. పీడీఎఫ్‌, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

అనంతపురం..
అనంతపురంలో తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిశీలించారు.

కడప..
కడప జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రొద్దుటూరులో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మైదుకూరు, జమ్మలమడుగు, రైల్వే కోడూరులో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

కర్నూలు..
కర్నూలు ప్రకాష్‌ నగర్‌లో టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ కుటుంబ సమేతంగా వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నంద్యాల, ఆదోని డివిజన్‌ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 

08:33 - March 10, 2017

హైదరాబాద్ : గవర్నర్‌ బడ్జెట్‌ ప్రసంగానికి సంబంధించి కేసీఆర్‌ ప్రభుత్వం చట్టసభల నియామాలను ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తూ గవర్నర్‌ నరసింహన్‌కు టీటీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ బడ్జెట్‌ ప్రసంగ ప్రతిని మంత్రివర్గం ఆమోదించిన తర్వాతే గవర్నర్‌ సభలో చదవాల్సి ఉంటుందని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈసారి మంత్రివర్గం సమావేశం నిర్వహించకుండానే గవర్నర్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని సిద్ధం చేశారని.. మంత్రుల ఇళ్ల దగ్గరే సంతకాలు తీసుకుని మంత్రివర్గం ఆమోదం పొదిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రుల దగ్గరికి ఫైళ్లు పంపించి గవర్నర్‌ ప్రసంగాన్ని ఆమోదించుకున్న చరిత్ర కేసీఆర్‌ సర్కార్‌కే దక్కుతుందని ఎల్‌ రమణ విమర్శించారు. 

08:31 - March 10, 2017

హైదరాబాద్ : ఇప్పటివరకూ చాలా సమయం ఇచ్చాం... ఇది ఇలాగే కొనసాగితే మొదటికే మోసం వస్తుంది.. అసెంబ్లీ వేదికగా దూసుకుపొండి... ఇది సీఎల్ పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు దిగ్విజయ్‌ సింగ్ చేసిన దిశానిర్దేశం.. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన భేటీలో డిగ్గీరాజా హస్తం నేతలకు పలు అంశాల్లో విలువైన సూచనలు ఇచ్చారు. 
అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైన కాంగ్రెస్‌ 
అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్‌ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్‌పీ భేటీలో హస్తం నేతలు సీరియస్‌గా చర్చించారు.. దాదాపు నాలుగుగంటలపాటు సాగిన శాసనసభాపక్ష సమావేశంలో అసెంబ్లీ వేదికగా సర్కారుతీరును ఎండగట్టాలని తీర్మానించారు.. 
వాడివేడిగా సాగిన సమావేశం
దిగ్విజయ్‌ సింగ్‌ అధ్యక్షతన ఈ సమావేశం వాడివేడిగా కొనసాగింది.. సభలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.. ప్రజా సమస్యల్ని సభలో గట్టిగా వినిపించినప్పుడే జనాల అభిమానాన్ని పొందగలుగుతామని సూచించారు.. గత సమావేశాల్లో దూకుడు ప్రదర్శించలేకపోయామని విమర్శించారు.. దీనికి కారణం జానారెడ్డే అంటూ పరోక్షంగా సూచించినట్లు సమాచారం.. 
టీఆర్‌ఎస్‌పై మెతక వైఖరి వదిలేయాలన్న దిగ్విజయ్‌
ఎమ్మెల్యేల మాటలన్నీ విన్న డిగ్గీరాజా... టీఆర్‌ఎస్‌పై మెతక వైఖరి వదిలేయాలంటూ జానాకు చెప్పినట్లు తెలుస్తోంది.. పదే పదే గత పంథాలోనే నడిస్తే ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ కోల్పోవాల్సి వస్తుందన్న డిగ్గీ.... సర్కారు తప్పుల్ని గట్టిగా నిలదీయాలని సూచించినట్లు సమాచారం... ఎమ్మెల్యేలు మాట్లాడే విధానంపైనా డిగ్గీ రాజా సూచనలు చేసినట్లు తెలుస్తోంది..
సమన్వయలోపం ఏర్పడకుండా చూసుకోవాలని సూచన
సీఎల్‌పీకి పీసీసీకి మద్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డికి సూచించినట్లు సమాచారం. అలాగే బడ్జెట్‌ పద్దులపై మాట్లాడేటప్పుడు పూర్తిస్థాయి అధ్యయనంచేసి రావాలని నేతలకు చెప్పారు. డిగ్గీ రాజా మంత్రాంగం ఎంతవరకూ ఫలిస్తుందో ఈ సమావేశాల తర్వాత తేలనుంది.. గత సమావేశాలమాదిరిగానే హస్తం నేతలు సభలో ముందుకు సాగుతారా? దూకుడు ప్రదర్శిస్తారా? అనేది వేచి చూడాలి.. 

 

08:23 - March 10, 2017

హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల్లో గులాబి పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కెసిఆర్  దిశా నిర్దేశం చేశారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పలు సూచనలు చేశారు. తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలతో ఆయా నియోజకవర్గాల్లో  పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని.. టీఆర్‌ఎస్‌ఎల్‌పీ భేటీలో గులాబీ నేతలకు  సూచించారు. 
గులాబీపార్టీలో కలవరం 
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. గులాబీపార్టీలో కలవరం మొదలైంది. పలు నియోజకవర్గాల్లో పార్టీ బలం తగ్గుతుందన్న సంకేతాలతో జాగో జాగో అంటు వేకప్‌విజిల్‌ ఊదేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. బలహీనంగా నియోజకవర్గాల్లో బలం పెంచుకోవాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో తాన అంటే తందానా అనకుండా.. నియోజకవర్గాల సమస్యలను సభలో ప్రస్తావించి.. చర్చల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సొంతపార్టీ ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చారు.  
పార్టీ సభ్యత్వ నమోదుపై స్పష్టత ఇచ్చిన కేసీఆర్
పార్టీ సభ్యత్వ నమోదు పై కూడా స్పష్టత నిచ్చారు గులాబీబాస్‌ . త్వరలో మొదలు కానున్న సభ్యత్వ నమోదును  రెండు వారాల్లో పూర్తి చేసి పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా తీర్చి దిద్దాలని సూచించారు. పార్టీ  ప్లీనరీ సమావేశాల నాటికి .. జిల్లాల్లో  కార్యవర్గాల నియామకంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా చేపడుతామని సమావేశంలో కెసిఆర్ వెల్లడించారు. 
ఆయా నేతలకు సర్వేఫలితాల పేపర్ల అందజేత
రెండేళ్ల నుంచి అధికారం అనుభవిస్తూ బేఫికర్‌గా ఉన్న నేతల విషయంలో ఈసారి కాస్త సీరియస్‌గానే స్పందించారు. పార్టీపరిస్థితిపై గతంలో సర్వేలు నిర్వహించినా.. ఫలితాలు మాత్రం బయటికి వెల్లడించాలేదు. కాని తాజాగా నిర్వహించిన సర్వే వివరాలను మాత్రం.. ముఖం ముందు అద్దం పెట్టినట్టు ఆయా నేతలకు సర్వేఫలితాల పేపర్లను అందించారు. మండలాల వారిగా కూడా  బలాబలాలను తయారు చేయించి ప్రజాప్రతినిధులకు అందించారు. దీంతో  నేతలు తమ  పనితీరును మెరుగు పరుచుకోవాల్సిందేనని.. లేదంటే కష్టాలు తప్పవన్నట్టు చెప్పకనే చెప్పేశారు సీఎం కేసీఆర్.  
ఎన్నిలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి : కేసీఆర్ 
ఇక.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా..వందకు పైగా స్థానాలు దక్కుతాయంటూ తమ ప్రజాప్రతినిధులకు చెప్పిన  ముఖ్యమంత్రి.. రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నిలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. లోటు పాట్లను సరిచేసుకుంటూ  నియోజకవర్గాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. మరోవైపు కేంద్రం నుంచి నియోజకవర్గాలు పెంచుతామంటూ వస్తున్న సంకేతాల నేపథ్యంలో .. సిట్టింగ్‌లందరికీ మరోసారి సీట్లు గ్యారెంటీ అని భరోసా ఇచ్చారు. దీంతో పార్టీకోసం నేతలు ఉత్సాహంగా పనిచేస్తారని గులాబీబాస్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

 

08:10 - March 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గత బడ్జెట్‌ కంటే ఈసారి రాష్ట్ర బడ్జెట్‌ మరింత పెరగనుంది. దీంతో ప్రభుత్వం ఎంతమేర బడ్జెట్‌ను పెంచబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. దీంతో ఏఏ వర్గాలకు ఎంత నిధులు కేటాయించనుందోననే చర్చ అన్ని వర్గాల్లో మొదలైంది.
13న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి ఈటెల
శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో 13వ తేదీన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ రాష్ట్ర నాలుగో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 12 నుంచి 15 శాతం బడ్జెట్‌ పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. బడ్జెట్‌ సంఖ్యా పరంగా లక్షా 40 వేల కోట్ల నుంచి 45 వేల కోట్లు ఉండబోతుందని తెలుస్తుంది.
బడ్జెట్‌పై పెరగనున్న వడ్డీల భారాలు
అయితే ఈ బడ్జెట్‌పై రుణ వాయిదాల చెల్లింపులు, వడ్డీల భారాలు కూడా భారీగానే పెరగనున్నట్టు సమాచారం. ఈ సంఖ్య దాదాపు 18 వేల కోట్లకు ఉండవచ్చని అంచనా. వివిధ అవసరాల కోసం కార్పొరేషన్ల ద్వారా సేకరించిన రుణాల చెల్లింపు వాయిదాలు, వాటి వడ్డీ భారాలు విపరీతంగా పెరిగాయని అధికారులు అంటున్నారు. దీంతో మొత్తం అప్పు లక్షా 20 వేల కోట్లు ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు.  అయితే ఈ వడ్డీల భారమంతా ప్రభుత్వ ఖజానాపై పడుతుందని చెబుతున్నారు.  మొత్తం ఈ భారం 65 వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంటున్నారు. 
సంక్షేమ రంగాల బలోపేతానికి కేటాయింపులు
ఈసారి భారీ పథకాలకు భారీ కేటాయింపులు కాకుండా సంక్షేమ రంగాలను బలోపేతం చేసే దిశగా బడ్జెట్‌ రూపకల్పన జరిగినట్టు సమాచారం. ఇందులో వృత్తుల ఆధారంగా ప్రధాన కేటాయింపులున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌కి కూడా అత్యధిక  ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే కేటాయించిన నిధులు సక్రమమమైన పద్ధతుల్లో ఖర్చు చేయడం..వాటిని మానిటిరింగ్‌ కోసం ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.  
రూ.15 వేల కోట్ల కేటాయింపులతో కొత్త ప్రణాళికలు 
ఈసారి మాత్రం సబ్‌ప్లాన్‌లో దారి మళ్లిన 17 వేల కోట్ల రూపాయల విషయం మాత్రం చర్చకు రానీవ్వకుండా...12 నుంచి 15 వేల కోట్ల రూపాయల కేటాయింపులతో కొత్త ప్రణాళికలు అమల్లోకి తెచ్చి విపక్షాలు విమర్శలకు ఛాన్స్‌ లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తుంది.

 

నేడు కార్పొరేషన్స్ ఛైర్మన్లుగా తాటి, కొండబాల, ఎస్ బీ బేగ్ బాధ్యతలు స్వీకరణ

హైదరాబాద్ : నేడు కార్పొరేషన్స్ ఛైర్మన్లుగా తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావు, ఎస్ బీ బేగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Don't Miss