Activities calendar

11 March 2017

5 స్టేట్స్..ఎన్నికల అప్ డేట్..

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవలే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

21:30 - March 11, 2017

.గోజిల్లా రాష్ట్రాన్ని ఢిపెన్స్ ఏరోస్పేస్ హబ్‌గా తయారుచేస్తున్నామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరులో ఆయన వెమ్ ఏరోసిటీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలకు ఆకర్షితులై పలు కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని బాబు తెలిపారు. ఏరో సిటీలో త్వరలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా యువతకు శిక్షణ అందిస్తామని ప్రకటించారు. ఓర్వకల్లులో డీఆర్డీవో సంస్థ, నాగాయలంకలో మిస్సైల్‌ టెస్టింగ్‌ రేంజ్‌ వస్తోందని... ఈ పరిశ్రమలతో.. రాష్ట్రం డిఫెన్స్‌ ఏరో స్పేస్‌ హబ్‌గా రూపొందుతుందని వివరించారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే.. నిధులు సంపాదించుకుంటామని బాబు స్పష్టం చేశారు. 

 

21:25 - March 11, 2017
20:40 - March 11, 2017

నవ్వు ఒక భోగం. నవ్విచడం ఒక యోగం. సాధారణంగా సినిమాల్లో కామెడీని చూస్తాం. కానీ వార్తల్లో కూడా కామెడీ కోణం ఉంటుందండోయ్. మనం ఆ కోణాన్ని పట్టుకోగలిగినప్పుడు ఆ వార్తల్ని మనం ఎంజాయ్ చేయగలం. వార్తల్లో కామెడీని వెతుక్కోవడమే 'క్రేజీ' న్యూస్ ప్రత్యేకత. ఇక ఈ రోజు మనం చూడబోయే అంశాలు. డియాన్ హిల్లీకి విరాట్ కోహ్లీ మీద రెస్పెక్ట్ పోయిందట, డోనాల్డ్ ట్రంప్ కి ధీటైన మొనగాడు మన భారతదేశంలో కూడా వున్నాడు. ఎవడో ఏంటో తెలుసుకుందా. అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ టీజర్ల మీద పడి కొట్టేసుకుంటున్నారు. ఎందుకు? ఏమిటి? ఎలా? ఈ క్రేజీ క్రేజీ అంశాలను క్రేజీన్యూస్ లో చూద్దాం. వీడియో క్లిక్ చేయండి పండగ చేస్కోండి. వీడియో చూసే ముందు ఒక్క నిమిషం...! ఈ రోజే ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మీ ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వొచ్చండోయ్..

19:59 - March 11, 2017

హైదరాబాద్: అతిపెద్ద రాష్ట్రం... అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం. అందరి కళ్లూ ఆ రాష్ట్రంపైనే. దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో కమలం వికసించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించిపోతూ.. 15 ఏళ్ల తరువాత యూపీ పీఠం దక్కించుకుంది. మోదీ నాయకత్వంలో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకొని... చరిత్ర సృష్టించింది. ఇక బీఎస్పీకి మరోసారి పరాజయం తప్పలేదు. శనివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజ వేసింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో... బీజేపీ 324 స్థానాల్లో విజయ దుందుభి మ్రోగించింది. ఎస్పీ 54 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీఎస్పీ 20 స్థానాల్లో గెలుపొందింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఇదే అంశంపై 'హెడ్ లైన్ షో' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నవతెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, బిజెపి నేతశ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ పాల్గొన్నారు. ఈ చర్చను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

నిర్మాత దిల్ రాజు భార్య మృతి

హైదరాబాద్: నిర్మాత దిల్ రాజు భార్య అనిత(46) గుండె పోటుతో మృతి చెందింది.ఈ విషయం తెలుసుకున్న దిల్ రాజు అమెరికా నుండి హైదరాబాద్ కు బయలుదేరారు.

18:38 - March 11, 2017

హైదరాబాద్: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా లెక్కకు మించి వెంచర్లను పూర్తి చేసుకుని ఎందరో కష్టమర్ల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న సంస్థ సుఖీభవ ప్రాపర్టీస్‌. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా హైదరాబాద్-వరంగల్‌లో కొత్త వెంచర్లతో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 7వ వెంచర్‌ రాయల్‌ నివాస్‌. ఈ వెంచర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సుఖీభవ ప్రాపర్టీస్‌ సంస్థ సీఎండీ రియల్ ఎస్టేట్‌ రంగంలో 25 సంవత్సరాల అనుభవం ఉన్న గురురాజు అనేక వివరాలు తెలియజేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోనుక్లిక్ చేయండి.

18:36 - March 11, 2017

యాదాద్రి : తెలంగాణలో ప్రస్తుత టీఆర్‌ఎస్‌ పాలన వల్ల బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందడంలేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సామాజిక న్యాయమే లక్ష్యంగా సాగుతున్న మహాజన పాదయాత్ర..యాదాద్రి జిల్లాలో కొనసాగుతోంది. రామన్నపేట వద్ద జిల్లాలోకి ప్రవేశించిన సీపీఎం మహాజన పాదయాత్రకు సీపీఎం శ్రేణులు, కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో సాగుతున్న యాత్రకు స్థానికులు తమ సమస్యలను పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా రామన్నపేటలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం..ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. 

18:33 - March 11, 2017

హైదరాబాద్: అతిపెద్ద రాష్ట్రం... అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం. అందరి కళ్లూ ఆ రాష్ట్రంపైనే. దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో కమలం వికసించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించిపోతూ.. 15 ఏళ్ల తరువాత యూపీ పీఠం దక్కించుకుంది. మోదీ నాయకత్వంలో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకొని... చరిత్ర సృష్టించింది. ఇక బీఎస్పీకి మరోసారి పరాజయం తప్పలేదు. శనివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజ వేసింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో... బీజేపీ 324 స్థానాల్లో విజయ దుందుభి మ్రోగించింది. ఎస్పీ 54 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీఎస్పీ 20 స్థానాల్లో గెలుపొందింది.

మొదటి నుంచి తమ ప్రత్యర్థులపై ఆధిక్యం....

ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థులు మొదటి నుంచి తమ ప్రత్యర్థులపై ఆధిక్యం ప్రదర్శించారు. రెండో స్థానంతోనే ఎస్పీ సరిపెట్టుకుంది. యూపీ కే లడకే అంటూ రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌ గురించి హస్తం నేతలు ప్రచారం చేసినా ఓటర్లను ఆకట్టుకోలేకపోయారు. దత్త పుత్రుడని, వృద్ధుడని నరేంద్ర మోదీని విమర్శించినప్పటికీ ఓటర్లు పట్టించుకోలేదు.

బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో...

ఉత్తరప్రదేశ్ పీఠం దక్కడంతో... బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. యూపీ ప్రజలు కులమతాలకు అతీతంగా, అభివృద్ధి ఎజెండాకు ఓటు వేశారని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం కలసి వచ్చాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రస్తుత ఫలితాల సరళిని పరిశీలిస్తే 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 324 సీట్లు దక్కించుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఉత్తరాఖండ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. యూపీలో అధికార సమాజ్‌వాదీ పార్టీ ఓటమిని అంగీకరించింది. అఖిలేష్‌ యాదవ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

యూపీ, ఉత్తరాఖండ్‌తో పాటు గోవా, మణిపూర్‌లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. నోట్ల రద్దును ప్రజలెంతో స్వాగతించారని ఫలితాలను బట్టి తెలుస్తోందన్నారు. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో మూడొంతుల మెజార్టీ సాధించామన్న అమిత్ షా..

స్వాతంత్ర్యం తరువాత ఇది పెద్ద విజయంగా అభివర్ణించారు. ఫలితాలు మోదీ మూడేళ్ల పాలనకు నిదర్శనమన్నారు. దేశం రెండెకల స్థాయిలో వృద్ధి సాధించాలంటే.. యూపీ అభివృద్దే ముఖ్యమన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందిస్తామని అమిత్ షా ప్రకటించారు.

బిజెపి గెలుపు స్వాగతిస్తాన్నం..

యూపీలో బీజేపీ గెలుపును స్వాగతిస్తున్నామన్నారు ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్. ప్రజలు తమ పథకాల కంటే... బీజేపీ భయాందోళనల ప్రకటనలకు ఎక్కువ ప్రభావితులు అయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు. మెరుగైన పథకాలు, ప్రణాళికలతో యూపీ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కాంగ్రెస్‌తో తమబంధం కొనసాగుతుందన్నారు.

ఈవీఎం లో టాంపరింగ్ వల్లే...

ఈవీఎం లో టాంపరింగ్ వల్లే... యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి ఆరోపించారు. ఏ పార్టీకి ఓటు వేసినా.. బీజేపీకే పడేలా.. ముందే ఈవీఎం లలో మార్పులు చేశారన్నారు. మోదీకి దమ్ముంటే.. బ్యాలెట్ పేపర్‌తో ఓటింగ్‌కు రావాలని మాయావతి సవాల్ విసిరారు.

 

18:29 - March 11, 2017

హైదరాబాద్: అసెంబ్లీలో ప్రతిపక్షాలు వ్యవహరించే తీరు బాధాకరంగా ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ప్రతిపక్షాలు అంటేనే విమర్శించాలి అన్న రీతిలో ప్రతిపక్షాలు వ్యవహరించడం మంచిది కాదన్నారు. హేతుబద్ధమైన విషయాలపై విమర్శలు చేస్తే బాగుంటుంది కానీ..ఏదిపడితే దానికి ప్రతిపక్షాలు ఆందోళన చేయడం తగదన్నారు సీఎం కేసీఆర్‌.

గవర్నర్ ప్రసంగంలో ఒక్క తప్పు ఉన్నా సీఎం పదవికి రాజీనామా చేస్తా-కేసీఆర్

గవర్నర్ ప్రసంగంలో ఒక్క తప్పు ఉన్నా..తాను ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్‌ ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. గవర్నర్ ప్రసంగం మొత్తం తప్పులతడక అన్న ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితమని సీఎం కేసీఆర్ అన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న ఎన్నికల హామీని ఆరునూరైనా మాట నిలపెట్టుకుంటామన్నారు. కొంతమంది రాజకీయ నిరుద్యోగులు పనికల్పించుకొని నిరుద్యోగులను ఉసికొల్పి ఉద్యమాలు చేస్తున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు.

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్ని రుజువు చేయాలి-కేసీఆర్

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే రుజువు చేయాల్సిందే అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్ని రుజువు చేయకపోతే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే చట్టాన్ని తీసుకొస్తున్నామని..చట్టం ద్వారా ఆరోపణలు చేసి రుజువు చేయలేని ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు కేసీఆర్.

 

18:26 - March 11, 2017

హైదరాబాద్: మిషన్‌ భగీరథ ముమ్మాటికి కమీషన్‌ భగీరథే అన్నారు టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి. గవర్నర్ ప్రసంగం మొత్తం నూటికి నూరుపాళ్లు అబద్ధాల పుట్ట అని విమర్శించారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇప్పటివరకు 6వేలకుపైగా గ్రామాలకు మంచినీటి సరఫరా చేశామని చెప్తున్న ప్రభుత్వం నిరూపించాలన్నారు. ఈ ఆరోపణలపై తాను కట్టుబడి ఉన్నానని..దమ్ముంటే చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. 

18:24 - March 11, 2017

ఢిల్లీ: గత పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించిన విధంగానే ఈసారి కూడా మతతత్వ ఎజెండా, కులాల సమీకరణ విధానంతోనే బీజేపీ యూపీలో విజయాన్ని సొంతం చేసుకుందని సీపీఎం పొలిట్‌బ్యూరో ఓ ప్రకటనలో తెలిపింది. యూపీలో నాల్గింట మూడొంతుల స్థానాలను కైవసం చేసుకున్న కమలం పార్టీ..తన హిందూత్వ రాజకీయాల ఎజెండాతో దేశాన్ని ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టుతోందని సీపీఎం తెలిపింది. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ను ఓడించిన బీజేపీ.. పంజాబ్‌లో అకాళీ-బీజేపీ కూటమిని మట్టికరిపించిందని, అలాగే గోవా ఎన్నికల్లో మెజారిటీని సాధించడంలో బీజేపీ తీవ్రంగా విఫలమైందని వ్యాఖ్యానించింది.  

17:32 - March 11, 2017

ఉత్తర్ ప్రదేశ్ : ఈవీఎం టాంపరింగ్ వల్లే... యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి ఆరోపించారు. ఏ పార్టీకి ఓటు వేసినా.. బీజేపీకే పడేలా.. ముందే ఈవీఎంలలో మార్పులు చేశారన్నారు. మోదీకి దమ్ముంటే.. బ్యాలెట్ పేపర్‌తో ఓటింగ్‌కు రావాలని మాయావతి సవాల్ విసిరారు. దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

17:30 - March 11, 2017

ఉత్తర్ ప్రదేశ్ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి కమలం భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 300 కు పైగా స్థానాల్లో కమలనాథులు ఆధిక్యతలో నిలిచారు. మునుపెన్నడూ లేని విధంగా యూపీలో పాగా వేసినప్పటికీ... సీట్లు మాత్రం తగ్గాయని చెప్పక తప్పదు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 71 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది. ఆ దమాషాతో పోలిస్తే... 360కి పైగా అసెంబ్లీ స్థానాలు రావాలి.

అతిపెద్ద రాష్ట్రం..
అతిపెద్ద రాష్ట్రం... అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం. అందరి కళ్లూ ఆ రాష్ట్రంపైనే. దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో కమలం వికసించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించిపోతూ.. 15 ఏళ్ల తరువాత యూపీ పీఠం దక్కించుకుంది. మోదీ నాయకత్వంలో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకొని... చరిత్ర సృష్టించింది. ఇక బీఎస్పీకి మరోసారి పరాజయం తప్పలేదు. శనివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజ వేసింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో... బీజేపీ 300 పైగా స్థానాల్లో దూసుకుపోతోంది. ఎస్పీ 36 స్థానాల్లో విజయం సాధించగా మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక బీఎస్పీ 10 స్థానాల్లో గెలవగా.. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. శనివారం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. రెండో స్థానంతోనే ఎస్పీ-కాంగ్రెస్ కూటమి సరిపెట్టుకుంది. యూపీ కే లడకే అంటూ రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌ గురించి హస్తం నేతలు ప్రచారం చేసినా ఓటర్లను ఆకట్టుకోలేకపోయారు. దత్త పుత్రుడని, వృద్ధుడని నరేంద్ర మోదీని విమర్శించినప్పటికీ ఓటర్లు పట్టించుకోలేదు.

ఆనందోత్సహాలు..
ఉత్తరప్రదేశ్ పీఠం దక్కడంతో... బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. యూపీ ప్రజలు కులమతాలకు అతీతంగా, అభివృద్ధి ఎజెండాకు ఓటు వేశారని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం కలసి వచ్చాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రస్తుత ఫలితాల సరళిని పరిశీలిస్తే 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 300కు పైగా సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉత్తరాఖండ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. యూపీలో అధికార సమాజ్‌వాదీ పార్టీ ఓటమిని అంగీకరించింది. అఖిలేష్‌ యాదవ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

17:27 - March 11, 2017

ప్రతిపక్షాలు ప్రజాతీర్పును గౌరవించాలి: వెంకయ్య

హైదరాబాద్: 5 రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన తీర్పును బట్టి ప్రతిపక్షాలు ప్రజాతీర్పును గౌరవించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

17:15 - March 11, 2017

ఢిల్లీ : ప్రజా తీర్పును గౌరవిస్తామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ప్రభావం చెందిన సంగతి తెలిసిందే. బీజేపీ ఇక్కడ విజయం సాధించింది. ఈ సందర్భంగా అఖిలేష్ మీడియాతో మాట్లాడారు. తొలి కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీ చేస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ తో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ ర్యాలీలకు ప్రజాదరణ ఉన్నా ఓట్లుగా మలుచుకోలేకపోయామన్నారు. తమది ట్యూబ్ లెస్ సైకిల్ అని గాలిపోదని చమత్కరించారు. కొత్త ప్రభుత్వం తమకొంటే బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు, మంచి పాలన అందిస్తుందో లేదో చూడాలన్నారు.

ప్రజల తీర్పును సంతోషంగా స్వాగతిస్తున్నా : అఖిలేష్ యాదవ్

యూపీ: గత ఐదేళ్లుగా యూపీ అభివృద్ధికి కృషి చేశానని సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..కొత్త ప్రభుత్వం మాకంటే బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల తీర్పును సంతోషంగా స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవిఎంలపై మాయావతి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాల్సిన బాధ్య ప్రభుత్వంపై ఉందని తెలిపారు.

17:04 - March 11, 2017

పశ్చిమగోదావరి : హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి తన కష్టార్జితం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పేర్కొన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమ సభలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. భవిష్యత్ లో మంచి కంపెనీలు కావాలని హైదరాబాద్ ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కాలి నడకన ప్రతి ఆఫీసుకు వెళ్లి కంపెనీలు అక్కడకు వచ్చే విధంగా ఎంతో శ్రమించడం జరిగిందని, అది తన కష్టార్జితం..కృషి అని తెలిపారు. 160 కి.మీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనాడే శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఏపీ రాష్ట్రం వచ్చినా రాజధాని లేదని..ఆదాయం..కాలేజీలు..మొదటి సంవత్సరం లోటు బడ్జెట్ తో రావడం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో వేరే వారుంటే భయపడుతారని, రెండున్నర సంవత్సరాల్లో ఎవరూ ఆలోచించని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. తొలి సంవత్సరం 8.5 రెండో సంవత్సరం 10.95 వృద్ధి రేటు ఈ సంవత్సరంలో 11.6 శాతానికి ఎగబాకామన్నారు. మనగడ్డ మీద పరిపాలన చేయాలనే ఉద్ధేశ్యంతో తాత్కాలిక సచివాలయాన్ని అతి తక్కువ కాలంలో నిర్మించడం జరిగిందన్నారు. మూడు పంటలు పండే భూమిని రాజధానికి ఇచ్చారని, ఇందుకు రైతులు కూడా లాభపడ్డారన్నారు.

16:54 - March 11, 2017

హైదరాబాద్ : ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారా ? అయితే రుజువు చేయాల్సిందే. లేనిపక్షంలో కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని రూపొందించనుందంట. స్వయంగా ఈ విషయాన్ని శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు రుజువు చేయకపోతే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. త్వరలోనే ఓ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు సభ సాక్షిగా వెల్లడించారు. మిషన్ కాకతీయపై కమిషన్ కాకతీయ..మిషన్ భగీరథ అంటే కమిషన్ భగీరథ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారని పేర్కొన్నారు. ఆరోపణలు చేయవచ్చు..కానీ రుజువు చేయాల్సిందేనన్నారు.

తెలంగాణలో 14 నుండి పదో తరగతి పరీక్ష

హైదరాబాద్: తెలంగాణ లో ఈ నెల 14 నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయి 30వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షకు 5,38,226 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,556 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్న 12.15 నిమిషాల వరకు జరుగుతుంది.

ఈ పోకడలు భవిష్యత్ లో దేశానికి ప్రమాదకరం: సీపీఎం

ఢిల్లీ: కుల, మత సమీకరణ ద్వారా యూపీలో బిజెపి విజయం సాధించింది అని సీపీఎం పొలిట్ బ్యూరో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పోకడలు భవిష్యత్ లో దేశానికి ప్రమాదకరం అని తెలిపింది. పంజాబ్ లో అకాలీదళ్ - బిజెపి కూటమి ఓడిపోయింది. గోవాలో బిజెపి మెజార్టీ సాధించలేకపోయింది.

16:49 - March 11, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రాజీనామా చేస్తానని రాష్ట్ర శాసనసభా సాక్షిగా ప్రకటించారు. కానీ దానికి ఓ షరతు కూడా విధించారు. ఉభయసభలునుద్ధేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగంలో ఒక్క తప్పు కూడా ఉంటే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని శనివారం వెల్లడించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం మధ్యాహ్నం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగం మొత్తం తప్పుల తడక అన్న ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితమన్నారు. లక్ష ఉద్యోగాలిస్తామన్న ఎన్నికల హామీని ఆరు నూరైనా నిలబెట్టుకుంటామన్నారు. కొంతమంది రాజకీయ నిరుద్యోగులను ఉసిగొల్పి ఉద్యమాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

హోంగార్డులందరినీ క్రమబద్దీకరిస్తాం: సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో పని చేస్తున్న హోంగార్డులందరినీ క్రమబద్దీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 22 వేల మంది హోంగార్డులను క్రమబద్దీకరిస్తామన్నారు. ఇప్పటికే ఈ విషయమై డీజీపీతో మాట్లాడానని తెలిపారు. 

జనతా గ్యారేజ్ బైక్ పై కోమటిరెడ్డి షికారు...

హైదరాబాద్: 'జనతా గ్యారేజ్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగించిన బుల్లెట్ పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి షికారు చేశారు. ఈ బైకును నల్గొండ జిల్లా పగిడిమర్రికి చెందిన రాజ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వేలంలో పాడుకున్నాడు. రూ. 10 లక్షల రూపాయలతో ఆయన ఈ బైకును సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో, కోమటిరెడ్డి ఈ బైక్ పై సందడి చేశారు. దొరెపల్లి ఎంపీటీసీ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీకి వచ్చిన కోమటిరెడ్డి ఈ బైకును నడిపి ఎన్టీఆర్ అభిమానులను హుషారు పరిచారు. 

ట్విట్టర్ ద్వారా ప్రజలకు మోదీ ధన్యవాదాలు

ఢిల్లీ: ట్విట్టర్ ద్వారా ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు మాపై విశ్వాసం ఉంచారు. ప్రజలు మాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.

గోవా, మణిపూర్ ల్లో ఏ పార్టీకి దక్కని మెజార్టీ

హైదరాబాద్: గోవా, మణిపూర్ ల్లో ఏ పార్టీకి మెజార్టీ దక్కలేదు. గోవా, మణిపూరుల్లో సర్కార్ ఏర్పాటుకు బిజెపి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ రాష్ట్రాల్లో చిన్న పార్టీలు కీలకంగా మారనున్నాయి.

బిజెపి విజయం సంతోషాన్నిచ్చింది: అమిత్ షా

ఢిల్లీ: బిజెపి విజయం సంతోషాన్నిచ్చిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ సా అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, యూపీ, ఉత్తరాఖండ్ లో మూడొంతుల మెజార్టీ సాధించామని తెలిపారు. స్వాతంత్ర్యం తరువాత ఇది పెద్ద విజయం అని చెప్పారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ విజయమని, మోదీ మూడేళ్ల పాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజల మనసు గెలుచున్న ఏకైక నేతగా మోదీ నిలిచారని తెలిపారు.

15:43 - March 11, 2017

హైదరాబాద్ : ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ గుస్సా అయ్యారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ఏకంగా కాంగ్రెస్ ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోగా టిడిపి నిరసన వ్యక్తం చేసింది. దీనిపై శనివారం సీఎం కేసీఆర్ మాట్లాడారు. టిడిపి, కాంగ్రెస్ పక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టులు కట్టడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని, అందుకనే కోర్టుకు వెళుతోందన్నారు. కేసులు వేసే వారంతా కాంగ్రెస్ వారేనని, స్టేలు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటివని ప్రాజెక్టులు కట్టి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం పేర్కొంటున్న..అమలు చేస్తున్న వాటిని మరోసారి కేసీఆర్ ఏకరువు పెట్టారు. వీఆర్ ఏ లకు వెట్టి అని పేరు పెట్టారని, గౌరవప్రదంగా వీఆర్ఏలు పిలవాలని..అంగన్ వాడీ..వీఆర్ఏ..వీవోఏ.. ఇతరుల జీతభత్యాలు పెంచడం జరిగిందని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయడం జరుగుతోందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయడం జరుగుతోందని కానీ కాంగ్రెస్ అనుబంధ సంఘం కోర్టుకు వెళుతోందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టవద్దా ? అని ప్రశ్నించారు. నీళ్లు వస్తే పుట్టగతులుండవని భావించి కాంగ్రెస్ ఇలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. గ్రీన్ ట్రిబ్యునల్ కు పోవడం ఉద్ధేశ్యం ఏంటీ అని, రైతుల గొంతునొక్కుతున్నారా ? లేక ప్రేమ ఉందా అని ప్రశ్నించారు. పర్యావరణ అనుమతులు రాకపోయేసరికి పలు ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిలిచిపోయాయన్నారు. ఆరు నూరైన సరే..ప్రాజెక్టులు కట్టి తీరుతామన్నారు.

15:38 - March 11, 2017

ఛత్తీస్‌గఢ్‌ : భారీస్థాయిలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లా బెజ్జి ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో తొమ్మిది మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గురు జవాన్లను రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఉదయం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న 219వ బెటాలియన్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాలు ఎదురుకాల్పులకు దిగాయి.

15:36 - March 11, 2017

ఢిల్లీ : పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌ - బీజేపీ దుష్టపాలనకు ప్రజలు చరమగీతం పాడారని కాంగ్రెస్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు వ్యాఖ్యానించారు. అవినీతి, కుంభకోణాలో భ్రష్టుపట్టుకుపోయిన అకాలీదళ్‌-బీజేపీకి ఓటర్లు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత స్వచ్ఛమైన పాలన అందిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌గాంధీ నాయకత్వాన్ని పంజాబ్‌ ప్రజలు బలపరిచారని చెబుతున్నారు.

అమరీందర్ సింగ్ హర్షం..
పంజాబ్‌ కాంగ్రెస్‌లో కాంగ్రెస్‌ విజయం పట్ల ముఖ్యమంత్రి అభ్యర్థి అమరీందర్‌సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అమరీందర్‌సింగ్‌కు పంజాబ్‌ ప్రజలు పుట్టిన రోజు కానుకగా అందిచారు. ఇవాళ అమరీందర్‌సింగ్‌ 75వ జన్మదినోత్సవం. పంజాజ్‌ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని అమరీందర్‌సింగ్ చెబుతున్నారు.

బిజెపి గెలుపు ప్రజాస్వామ్యానికి ముప్పు:మాయావతి

హైదరాబాద్: బిజెపి గెలుపు ప్రజాస్వామ్యానికి ముప్పు అని యూపీ మాజీ సీఎం మాయావతి అన్నారు. యూపీ ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని, మా ఓట్లన్నీ బిజెపికి పడేలా ఈవీఎంలు తయారు చేశారని ఆరోపించారు. దీని పై ఈసీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

15:33 - March 11, 2017

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ సంపూర్ణ ఆధిక్యత దిశగా దూసుకుపోతోంది. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ రెండు స్థానాల్లో ఓడిపోయారు. గోవా, మణిపూర్‌ హంగ్‌ దిశగా పయనిస్తున్నాయి. ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యత వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. గోవా ముఖ్యమంత్రి, బీజేపీ నేత లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ ఓడిపోయారు. మణిపూర్‌లోని థౌబాల్‌ స్థానం నుంచి ఇరోమ్‌ షర్మిళ ఓటడిపోయారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి ఇబోబీసింగ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు.

15:32 - March 11, 2017

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. యూపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ విజయం సాధించే దిశగా ముందుకెళుతుండగా పంజాబ్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. గోవా, మణిపూర్ లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. అవథ్‌, పూర్వాంచల్‌, బుందేల్‌ఖండ్‌, రోహిల్‌ఖండ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో బీజేపీ అధిక్యంలో కొనసాగింది. వారణాసి లోక్‌సభ స్థానంలోని 8 అసెంబ్లీ సీట్లకు గాను ఏడు చోట్ల బీజేపీ గెలుపొందింది. అఖిలేష్‌ మంత్రివర్గంలోని చాలా మంది మంత్రులు మట్టికరుస్తున్నారు. రాంపూర్‌లో యూపీ మంత్రి ఆజాంఖాన్‌, జస్వంత్‌నగర్‌లో ములాయం సింగ్‌ సోదరుడు శివపాల్‌ యాదవ్‌ ఓటమిదిశగా పయనిస్తున్నారు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీ మంత్రి ప్రజాపతి ఓడిపోయారు. ఢిల్లీ శివార్లలోని నోయిడాలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తనయుడు పంకజ్‌ సింగ్‌ గెలుపుకు చేరువలో ఉన్నారు. లక్నో కంటోన్మెంట్‌లో బీజేపీ నాయకురాలు రీటా బహుగుణ విజయం సాధించారు. ఎన్నికలకు ముందే రీటా బహుగుణ కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథి లోక్‌సభ స్థానంలో పరిధిలో బీజేపీ ముందంజలో ఉంది. అమేథి నుంచి బీజేపీ అభ్యర్థి గరీమా సింగ్‌ విజయం సాధించారు. కుందా స్థానంలో యూపీ మంత్రి రాజాభయ్యా ఓటమికి చేరువలో ఉన్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గంలోని 8 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆరు చోట్ల ఆధిక్యంలో ఉంది. ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే సమాజ్‌వాదీ పార్టీని ఓటమిని అంగీకరించింది. ప్రజాతీర్పును శిరసావహిస్తామని పార్టీ నేత శివపాల్‌ యాదవ్‌ ప్రకటించారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ఎన్నికల ఫలితాలపై చర్చించడంతోపాటు, ముఖ్యమంత్రి అభ్యర్థులను నిర్ణయించేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ సాయంత్రం సమావేశమయ్యే అవకాశం ఉంది.

నగరంలో స్వైన్ ఫ్లూ...

హైదరాబాద్ : నగరంలో స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురికి స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అందులో ఇద్దరు చిన్నారులు కూడా వున్నారని... వారి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి స్వైన్ ఫ్లూ నోడల్ అధికారి నరేందర్ తెలిపారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలి: దిగ్విజయ్ సింగ్

ఢిల్లీ: రాహుల్ గాంధీ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం వుందని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ నుంచి పాత నీరు తొలగించాలని, పెద్ద రాష్ట్రాల్లో చావుదెబ్బతిన్న ప్రాంతీయ శక్తులు.. చిన్న రాష్ట్రాల్లో కీలకంగా చిన్న పార్టీలు మారుతున్నాయి. 

ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ ఒటమి

హైదరాబాద్: మణిపూర్ సీఎం ఓక్రమ్ ఇబోబీసింగ్ విజయం సాధించారు. మాంద్రేలో గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓటమి చెందారు. ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ రెండుచోట్ల ఘోర పరాజయం పొందారు. హరిద్వార్, రూరల్, కీంఛ్ నియోజకవర్గాలో రావత్ ఓటమిపాలయ్యారు.

పంజాబ్ లో విజయం కాంగ్రెస్ కు పునర్జన్మ: సిద్ధూ

హైదరాబాద్: పంజాబ్ లో విజయం కాంగ్రెస్ పార్టీ కి పునర్జన్మ లాంటిదని నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొఆన్నారు. పంజాబ్ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని, పంజాబ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని, సోనియాగాంధీకి మాట ఇస్తున్నాని సిద్దూ స్పష్టం చేశారు. బాదల్ రాజకీయ దందాకు పాల్పడ్డారని సిద్దూ ఆరోపించారు.

14:57 - March 11, 2017

ఈ ఫొటో చూశారా ? ఎవరో గుర్తు పట్టండి...టాలీవుడ్..ఇతర వుడ్ లలో నటించిన కొంతమంది హీరోయిన్లు తరువాతి కాలంలో గుర్తు పట్టకుండా తయారవుతారనడానికి ఈ ఫొటో నిదర్శనం. అదే సందర్భంలో మరికొంతమంది హీరోయిన్లు చెక్కు చెదరకుండా అలానే ఉంటారు. కూడా. కానీ ఈ ఫొటోలో ఉన్న నటిని గుర్తు పట్టడం కొంచెం కష్టమే. ఎందుకంటే గతంలో ఉన్న వాటికంటే భిన్నంగా తయారై పోయింది ఈ ముద్దుగుమ్మ. ఒక హింట్...’ఇడియట్' మూవీ గుర్తు ఉందా ? అందులో రవితేజ సరసన 'రక్షిత' నటించింది. తరువాతి కాలంలో ఇతర చిత్రాలు చేయలేదు. కన్నడ నిర్మాత ప్రేమ్ ను వివాహం ఆడిన తరువాత వెండి తెరకు దూరమయ్యారు. ఈ మధ్యన జరిగిన ఒక ఫంక్షన్ వేడుకల్లో హాజరైన 'రక్షిత' ఫొటోలు చూసి అభిమానులు ఆశ్చర్యపోయారంట. స్థూలకాయంతో బాధ పడుతూ సినిమాలకి పూర్తిగా దూరమైన రక్షిత ఇప్పటికీ అనారోగ్యాన్ని జయించలేకపోయిందని టాక్. రక్షిత లెటెస్ట్ ఫొటో ఇది..

పంజాబ్ లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విజయం

హైదరాబాద్: పాటియాలలో పంజాబ్ సీఎం అభ్యర్థి (కాంగ్రెస్) అమరిందర్ సింగ్ గెలుపొందారు. అమృత్ సర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవజ్యోత్ సిద్దూ విజయం సాధించారు.

యూపీకి చాలా కాలం తర్వాత మంచిరోజులు: ఉమాభారతి

ఢిల్లీ:ఉత్తరప్రదేశ్‌కు చాలా కాలం తర్వాత మంచి రోజులు వచ్చాయని కేంద్రమంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. బీజేపీ గెలుపుతో యూపీ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతదని తెలిపారు. బీజేపీ గెలుస్తదన్న నమ్మకం మూడేళ్ల క్రితం లేకుండే అని తెలిపారు. కానీ యూపీలో బీజేపీ గెలుస్తదన్న నమ్మకం ఆరు నెలల క్రితమే ఏర్పడిందన్నారు. గెలుపునకు కుల, మత రాజకీయాలు కారణం కాదన్నారు. ఈ విషయాన్ని రాహుల్, అఖిలేష్ గుర్తించలేకపోయారని తెలిపారు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే విధంగా మోదీ ముందుకెళ్తున్నారని స్పష్టం చేశారు.

యూపీలో సీఎం కుర్చీకి పెరిగిన పోటీ

హైదరాబాద్: యూపీ లో అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఆధిక్యత సాధించడంతో సీఎం కుర్చీకి పోటీ పెరిగింది. సీఎం రేసులో రాజ్ నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, మనోజ్ సిన్హా., బిజెపి అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, కల్ రాజ్ మిశ్రా, సంతోష్ గంగ్వార్, దినేష్ శర్మ పోటీపడుతున్నారు. అయితే బిజెపి అధ్యక్షుడిగా, ఓబిసీకి చెందిన వాడు కావడంతో కేశవ్ ప్రసాద్ మౌర్యకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.

వరుసగా 11 సార్లు విజయం

గోవా: కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతాప్ సింగ్ రానే వరుసగా 11 సార్లు విజయం సాధించారు. గోవా శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న ప్రతాప్ సింగ్, భాజాపా అభ్యర్థి విశ్వజిత్ కే.రానే పై 4,286 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. గోవాలోని పోరియం నియోజకవర్గం నుంచి ఆయన విజయాన్ని నమోదు చేసుకున్నారు. 78 ఏళ్లు ఉన్న ప్రతాప్ సింగ్ 1972 నుంచి పోటీ చేసిన ప్రతి సారి ఎన్నికల్లో గెలుస్తూ ఓటమి ఎరుగని అభ్యర్థిగా రికార్డు సాధించారు. అయితే ప్రస్తుతం గోవాలో అధికార పక్షం భాజాపాను మించి కాంగ్రెస్ ముందంజలో ఉండడం గమనార్హం.

ప్రధాని మోదీ, అమిత్ షా కీలక భేటీ

ఢిల్లీ: బిజెపి ప్రధాన కార్యాలయలంలో ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక భేటీ కానున్నారు. వీరి భేటీలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నారు. యూపీ సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

'ప్రతిపక్షాలు సభా మర్యాదలను గౌరవించాలి'

హైదరాబాద్: ప్రతిపక్షాలు సభా మర్యాదలను గౌరవించాలని తెరాస ఎమ్మెల్యేలు అన్నారు. చేసిన తప్పునకు కనీసం విచారం కూడా వ్యక్తం చేయరా? అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రామలింగారెడ్డి ప్రశ్నించారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. కాంగ్రెస్‌, తెదేపా ఒకే రీతిగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను సభ నుంచి సస్పెండ్‌ చేయడం సబబేనని సమర్థించుకున్నారు. రోజా సస్పెన్షన్‌ను ఏపీలో టీడీపీ మిత్రపక్షంగా ఉన్న భాజపా ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.

యూపీలో వికటించిన ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు

ఢిల్లీ : యూపిలో కాంగ్రెస్-ఎస్పీ పొత్తు వికటించింది. యూపీలో ములాయం, అఖిలేష్ పాచికలు పారలేదు. మరో వైపు బీఎస్పీ ఘోరంగా దెబ్బతింది. యూపీలో కాంగ్రెస్ 10 సీట్లు కూడా సాధించలేకపోయింది. బీఎస్పీ 20 సీట్లకే పరిమితమైంది.

14:24 - March 11, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఔన్నత్యం..హుందాతనం కాపాడుకొనే విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో రాజీ పడబోమని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గవర్నర్ ప్రసంగ తీర్మానంపై శనివారం అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. విపక్ష సభ్యులు చేసిన విమర్శలు..ఆందోళనలపై ఆయన స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో అరాచక పరిస్థితిని.. సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సాగనీయమన్నారు. నిబంధనలు..నియమాలకు అనుగుణంగా సభ నడుస్తుందని, సభ ఎన్ని రోజులైనా జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం జరుగుతోందన్నారు. ఆ విధంగా గతంలో జరిగిన సమావేశాలే నిదర్శనమన్నారు. సభ ఉండేది అరుపులు..కేకలకు వేదికగా కాదని, చర్చలకు సిద్ధంగా ఉంటే లొల్లి ఎందుకు అని పేర్కొన్నారు. సభ హుందాతనాన్ని దెబ్బతీయబోమని, తప్పు అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలు శిక్షిస్తారని తెలిపారు. విద్యుత్ విషయంలో అరుపులు..పెడబొబ్బలు..ఎండిపోయిన వరికంకులు తీసుకరావడం జరిగేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థతి లేదన్నారు. పూర్తిస్థాయి అవగాహనతో నమ్మకం..అనుభవం ఉన్న అధికారుల చేతుల్లో పెట్టామని, ప్రస్తుతం నాణ్యమైన కరెంటు..ఎలాంటి సమస్యలు లేకుండా సరఫరా జరుగుతోందన్నారు.

సీఆర్ పీఎఫ్ జవాన్ల మృతికి మోదీ దిగ్ర్భాంతి

ఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. సంఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ప్రధాని ఆదేశాలతో రాజ్‌నాథ్‌ ఈరోజు సుక్మా వెళ్లనున్నారు.

పంజాబ్ లో కాంగ్రెస్ 38 స్థానాలు కైవసం...

ఛండీగఢ్ : పంజాబ్ లో కాంగ్రెస్ హవా కోనసాగుతోంది. కాంగ్రెస్ 38 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ 12, ఎస్ ఏడీ... బీజేపీ కూటమి 4స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. 
 

యూపీ...బీజేపీ 122స్థానాలు

లక్నో : ఉత్తరప్రదేశ్ లో బీజేపీ జోరు కొనసాగుతోంది. 122స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. 14 స్థానాల్లో ఎస్పీ, కాంగ్రెస్ విజయం సాధించింది. 6 స్థానాల్లో బీఎస్పీ గెలుపొందింది. 

పంజాబ్ లో కాంగ్రెస్ 32స్థానాలు కైవసం

ఛండీగఢ్ : పంజాబ్ లో హవా నడుస్తోంది. కాంగ్రెస్ 32స్థానాలు కైవసం చేసుకుంది. ఆప్ 12, ఎస్ ఏడీ, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి.

13:37 - March 11, 2017

మ. 2 గం.టకు గవర్నర్ ను కలవనున్న అఖిలేష్ యాదవ్

యూపీ : మధ్యాహ్నం 2 గంటలకు అఖిలేష్ యాదవ్ గవర్నర్ ను కలవనున్నారు. గవర్నర్ కు తన రాజీనామా సమర్పించనున్నారు. 

ఉత్తరాఖండ్ లో బీజేపీ జోరు

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్ లో బీజేపీ జోరు కొనసాగుతోంది. బీజేపీ 24 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 4 స్థానాల్లె విజయం సాధించింది. 

ఉత్తరప్రదేశ్...70 స్థానాల్లో బీజేపీ గెలుపు

లక్నో : ఉత్తరప్రదేశ్ లో బీజేపీ హవా నడుస్తోంది. 70 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఎప్పీ...కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలుపొందారు. 

పంజాబ్... కాంగ్రెస్ 20స్థానాలు కైవసం

ఛండీగఢ్ : పంజాబ్ లో కాంగ్రెస్ 20స్థానాలు కైవసం చేసుకుంది. ఆప్ 9, ఎస్ ఏడీ, బీజేపీ సంయుక్తంగా 2 స్థానాల్లో గెలుపొందాయి. 

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్...11 మంది సీర్పీఎఫ్ జవాన్లు మృతి

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లా బెడ్జి అటవీప్రాంతంలో జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది సీర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని రాయ్ పూర్ ఆస్పత్రికి తరలించారు. 5 మృత దేహాలను బెడ్జి క్యాంపుకు తరలించారు.

 

13:02 - March 11, 2017

ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా 'బాహుబలి-2’ ట్రైలర్ విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే విడుదలవుతోంది అంటూ చిత్ర యూనిట్ పేర్కొంటుండడంతో ఉత్కంఠ నెలకొంది. తాజాగా దీనిపై నటుడు 'ప్రభాస్' క్లారిటీ ఇచ్చేశాడు. కాసేపటి క్రితం ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ట్రైలర్ కోసం తాను ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని పోస్టులో పేర్కొన్నారు. మార్చి 16వ తేదీన సెలక్ట్ చూసిన థియేటర్ లలో ట్రైలర్ విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సోషల్ మాధ్యమాల్లో సాయంత్రం 5గంటలకు విడుదలవుతుందని తెలిపారు.
అన్నపూర్ణ స్టూడియోస్ లో 'బాహుబలి 2’ ట్రైలర్ పై వర్క్ జరిగాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న 'బాహుబలి 2’ ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ట్రైలర్ నిడివి సుమారు రెండున్నర నిమిషాలున్నట్లు, అన్ని భాషాల్లోనూ ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుష్క, రానా, తమన్నా కీలక పాత్రలు పోషించారు. ఇక చిత్ర పాటలు ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.

12:22 - March 11, 2017

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధికార పార్టీలకు ఎదురు గాలులు వీచాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో బీజేపీ వికసించగా పంజాబ్ లో కాంగ్రెస్ హావా చూపించింది. మణిపూర్, గోవాలో హోరాహోరి పోరు కొనసాగుతోంది. మణిపూర్ లో బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించగా 4 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ 12 స్థానాల్లో కాంగ్రెస్ 10 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక్కడ 11 మంది స్వతంత్రులు అధిక్యంలో కొనసాగుతుండడం విశేషం. వీళ్లు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. గోవాలో కాంగ్రెస్ ఏడు స్థానాల్లో, బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. ఇక్కడ స్వతంత్రులు ఒకరు గెలుపొందగా ఒకరు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో బీజేపీ స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతోంది. 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 310 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 65 స్థానాల్లో కాంగ్రెస్, బీఎస్పీ 20 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. పంజాబ్ లో మొత్తం స్థానాలైన 117 స్థానాల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించింది. ఉప ముఖ్యమంత్రి పదవి సిద్దూకు కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

 

మణిపూర్ లో కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలుపు

ఇంఫాల్ : మణిపూర్ లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ 5 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 2, ఇతరులు 5 స్థానాలను కైవసం చేసుకున్నారు. 

యూపీలో బీజేపీ 7 స్థానాలు కైవసం

లక్నో : ఉత్తరప్రదేశ్ లో హవా కొనసాగుతోంది. బీజేపీ 7 స్థానాలు కైవసం చేసుకుంది. 301 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. లక్నోలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. 

 

మణిపూర్ లో కాంగ్రెస్ 3, బీజేపీ 1, ఇతరులు 5 గెలుపు

ఇంఫాల్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మణిపూర్ లో కాంగ్రెస్ 3, బీజేపీ 1, ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు. 

 

11:29 - March 11, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జిల్లాల అంశం కలిసివచ్చింది. కొత్తజిల్లాల్లో సిబ్బంది కొరతను తీర్చేందుకు  స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇంతకాలం ట్రాన్స్‌ఫర్స్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేందుకు సర్కార్‌ రెడీ కావడంతో ఏళ్ల తరబడి  బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు సంతోషపడుతున్నారు. 
ఆర్డర్ టూ స‌ర్వ్‌ ప్రకారం సర్దుబాటు
తెలంగాణలో నూత‌న జిల్లాల ఏర్పాటైన నేప‌థ్యంలో ఉద్యోగుల బ‌దిలీల‌..ప్రక్రియ ప్రారంభిస్తొంది తెలంగాణ ప్రభుత్వం. జిల్లాల సంఖ్య 10 నుంచి 31కి అమాతం పెరిగడంతో  ప్రస్తుత ఉద్యోగులందరినీ ఆర్డర్ టూ స‌ర్వ్ ప్రకారం నూత‌న  జిల్లాలకూ తాత్కాలికంగా సర్దుబాటు చేసింది స‌ర్కార్.  కాగా  ట్రాన్స్‌ఫర్స్ పై నిషేధం ఎత్తివేసి, వారి వారి స్ధానిక‌త ఆధారంగా స‌ద‌రు జిల్లాల్లో  ఉద్యోగుల‌ను నియ‌మించేందుకు  ఏర్పాట్లు చేస్తొంది తెలంగాణ ప్రభుత్వం. 
బదిలీలకు గైడ్‌లైన్స్‌ రెడీ
అయితే ఉద్యొగుల శాశ్వత బ‌దిలీల‌కు సంభందించి..స‌ర్కార్ కీల‌క నిర్ణయాలు తీసుకుంటోంది. స్థానికత ప్రాతిపధికగా గైడ్ లైన్స్ సిద్దం చేస్తొంది. ఉద్యోగులకు ఆప్షన్‌ అవకాశం ఇచ్చి , వారు ఎక్కడ పనిచేయడానికి ఇష్టపడతారో తెలుసుకొని , శాశ్వత కేటాయింపులు చేసేలా మార్గదర్శకాలు  రూపొందిస్తొంది స‌ర్కార్. దీంతో ఒక ఉద్యొగి త‌న‌ ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా విధులు నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే ఉమ్మడి జిల్లానుండి విడిపోయి పొరుగు జిల్లాలో కలిసిపోయిన ప్రాంతాల ఉద్యొగులకు శాశ్వత బదిలీ విషయాన్ని మరింత నిషితంగా ప‌రిశీలిస్తొంది. అంతే కాకుండా.. ఉద్యొగుల‌ పిల్లల‌కు భవిష్యత్తులో త‌లెత్తే స్ధానిక‌తాస‌మ‌స్యపై కూడా అధ్యయనం చేస్తోంది. 
రెవెన్యూ , సాధారణ పరిపాలన శాఖలు కసరత్తు
ప్రభుత్వ మార్గధర్శకాలతో రెవెన్యూ , జ‌న‌ర‌ల్అడ్మినిస్ట్రేష‌న్ డిపార్ట్‌మెంట్ క‌లిసి వీలైనంత వేగంగా ఉద్యోగుల శాశ్వత బదిలీల‌పై..మార్గద‌ర్శకాలు సిద్దం చేసేప‌నిలో బిజీగా ఉన్నాయి. కాగా వ‌చ్చే నెల‌లో  బదిలీలకు సంబంధించిన సాధారణ మార్గదర్శకాలను ముందుగా విడుదల చేయడానికి సర్కార్‌ సిద్ధమైంది.ఆ తర్వాత ఉద్యోగసంఘాల నుంచి అభ్యంతరాలు తీసుకుని   శాశ్వత బదిలీలకు మార్గద‌ర్శకాలు రూపొందిస్తామంటున్నారు ఉన్నతాధికారులు.
బదిలీల ప్రక్రియ.. కొందరికి మినహాయింపు 
అయితే ఈ బదిలీల ప్రక్రియలో కొందరకి మినహాయింపులు కూడా ఇస్తోంది సర్కార్‌. మరోఏడాదిలోగా  ఉద్యోగ విరమణ పొందే వారికి, ఉద్యోగ సంఘాల ప్రధాన నాయకులు, వీరితోపాటు  దివ్యాంగులు, భార్యాభర్తలు, దీర్ఘకాలిక వ్యాధి ఉన్న ఉద్యోగులకు  మినహాయింపు ఇవ్వాల‌నీ స‌ర్కార్ బావిస్తొంది. ప్రస్తుతం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. ఎప్రిల్ నాటికి మార్గద‌ర్శాకాలు విడుద‌ల చేసి.. మేలొ బదిలీల ప్రక్రియ పూర్తిచేయాల‌నీ డిసైడ‌య్యింది తెలంగాణ ప్రభుత్వం.

11:27 - March 11, 2017

'బాహుబలి -2’ చిత్ర ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చిత్ర విడుదల తేదీలో క్లారిటీ ఉన్నా ట్రైలర్ ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చిత్రంలో ఎవరు నటించారు ? తదితర వివరాలు బయటకు రావడం లేదనే సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు మాత్రం చిత్రానికి సంబంధించిన విశేషాలు..చిత్ర యూనిట్ సోషల్ మాధ్యమాల ద్వారా విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి వార్త చక్కర్లు కొడుతోంది. పలు భాషల్లో ఈ చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో హీరో 'ప్రభాస్' కు 'శరద్ కేల్కరే' డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలియచేశాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో 'శరద్' విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ హిందీలో విడుదల కాగా ఈ సినిమాలో ‘ప్రభాస్’ కు ఆయన డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు 'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం హిందీ వర్షెన్ కి కూడా 'శరదే' డబ్బింగ్ చెప్పాడు. 'రాజమౌళి'తో కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'బాహుబలి' సినిమాకు పనిచేయటం గౌరవంగా ఫీల్ అవుతున్నానని, రాజమౌళి గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ట్రైలర్ త్వరలోనే వస్తోంది అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

11:23 - March 11, 2017
11:21 - March 11, 2017

గవర్నర్ ప్రసంగంపై హాట్ డిబేట్ జరిగింది. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు విజయ్ కుమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జగన్ లాల్ నాయక్, బీజేపీ సీనియర్ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన, టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు.
వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

మణిపూర్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ

ఇంఫాల్ : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కొనసాగుతున్నాయి. మణిపూర్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. 

11:16 - March 11, 2017

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నిల కౌంటింగ్ కొనసాగుతోంది. అధికార పార్టీలకు ఎదురుగాలి వీచింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనాలు తలకిందులు చేస్తూ కాషాయదళం దూసుకెళ్లింది. ఉత్తరాఖండ్..ఉత్తర్ ప్రదేశ్ లో విజయం దిశగా ముందుకెళుతోంది. పంజాబ్ లో కాంగ్రెస్ హస్తం చేసుకొనే దిశగా వెళుతుండగా మణిపూర్, గోవాలో హోరాహోరీ పోరు కొనసాగుతోంది.

యూపీలో..
యూపీలో బీజేపీ హవా కొనసాగుతోంది. 307 స్థానాల్లో అధిక్యం కొనసాగుతోంది. 68 స్థానాల్లో ఎస్పీ - కాంగ్రెస్ అధిక్యంలో ఉంది. అమేథీ, రాయ్ బరేలీ ప్రాంతాల్లో కాంగ్రెస్ తుడుచుకపెట్టుకపోయింది. కేవలం 10-12 స్థానాల్లో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోందని తెలుస్తోంది. 20 స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు అధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ లో భారీ ప్రక్షాళన జరగాలని నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ శ్ చీఫ్ గా కొనసాగుతున్న వ్యక్తిని సీఎంగా నియమించాలనే చర్చ జరుగుతోంది. మరోవైపు సీఎం అఖిలేష్ యాదవ్ మధ్యాహ్నం 2గంటలకు గవర్నర్ ను కలిసి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

పంజాబ్..లో..
పంజాబ్ లో కాంగ్రెస్ పాగా వేసింది. అమరేందర్ సింగ్ లాంబాలో వెనుకబడినా పోటీ చేసిన మరో ప్రాంతంలో అధిక్యంలో కొనసాగుతున్నారు. ఈయనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. 69 స్థానాల్లో కాంగ్రెస్, 29 స్థానాల్లో బీజేపీ, ఆప్ 22 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి.

ఉత్తరాఖంఢ్ లో..
ఉత్తరాఖండ్ లో బీజేపీ స్పష్టమైన మెజార్టీ దిశగా ముందుకెళుతోంది. 55 స్థానాల్లో బీజేపీ, 13 స్థానాల్లో కాంగ్రెస్, రెండు స్థానాల్లో పోటీ చేసిన హరీష్ రావత్ వెనుకంజలో ఉండడం విశేషం. ప్రభుత్వ వ్యతిరేకతే కారణమని తెలుస్తోంది. సీఎం ఎవరదనేది తెలియాల్సి ఉంది.

మణిపూర్, గోవా రాష్ట్రాల్లో
మణిపూర్, గోవా రాష్ట్రాల్లో విజయం దోబూచులాడుతోంది. మణిపూర్ లో హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. గోవాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. 3 స్థానాల్లో బీజేపీ, 8 స్థానాల్లో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్న సుబాష్ ను బహిష్కరించడం..ఆయన ఓ పార్టీని స్థాపించి పోటీ చేయడంతో ఓట్లలో చీలిక తెచ్చినట్లు అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

సభ నుంచి రేవంత్, సండ్ర సస్పెన్సన్

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలను స్పీకర్ సస్పెండ్ చేశారు. సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.

 

10:54 - March 11, 2017

బాబు బాగా బిజీ..అంటే సీఎం చంద్రబాబు నాయుడు అనుకోకండి..వాస్తవంగా ఆయన నిత్యం బిజీగానే ఉంటారని అనుకోండి..’బాబు బాగా బిజీ' పేరిట ఓ సినిమా రూపొందుతోంది. ‘అవసరాల శ్రీనివాస్' హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రీ లుక్ పోస్టర్ హోలీ సందర్భంగా విడుదలైంది. ఈ పోస్టర్ లో ఒక వైపు రోజా పువ్వు..మరోవైపు అరటిపండు..ఉన్నాయి. దేని తొలుత ఎంచుకోవాలనే దానిపై సంశయంలో హీరో ఉన్నట్లు కనిపిస్తోంది. పోస్టర్‌ సరికొత్తగా ఉండటం.. దీనికి తోడు ‘కుమ్ముడే.. కుమ్ముడు’ అంటూ క్యాప్షన్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'అవసరాల శ్రీనివాస్‌'కి జోడీగా తేజశ్వి, మిస్త్రీ చక్రవర్తి, శ్రీముఖిలను ఎంచుకున్నట్లు టాక్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఫస్ట్‌లుక్, టీజర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

10:51 - March 11, 2017

కొనసాగుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

లక్నో : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ 291, ఎస్పీ...కాంగ్రెస్ 82, బీఎస్సీ 21, ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

అధికార పార్టీలకు ఎదురు దెబ్బ

ఢిల్లీ : యాపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో అధికార పార్టీలకు ఎదురు దెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ కుప్పలకూలింది. కమలం వికసించింది. యూపీలో బీజేపీ, గోవాలో కాంగ్రెస్ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నాయి. యూపీ, ఉత్తరాఖండ్ లలో బీజేపీ దూసుకుపోతోంది. 

 

10:27 - March 11, 2017

ఢిల్లీ : యూపీ రాష్ట్రంలో కాంగ్రెస్ - ఎస్పీ పొత్తు ఫలించలేదు. రాష్ట్రంలో బీజేపీ స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతోంది. పంజాబ్ లో కాంగ్రెస్ అధికారం చేపట్టనుందని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషణ అందించారు. ‘యూపీలో దేశ రాజకీయాలను మలుపుతిప్పుతుందని ఆశించారు. ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుంది..బీఎస్పీ మద్దతిస్తుందా అనే చర్చలు కొనసాగాయి. 2014లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అంతటి విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. సమాజ్ వాదీ పార్టీ తొలి మూడు సంవత్సరాల్లో అనేక కోణాల్లో వెనుకంజలో ఉండడం..ప్రజాకర్షక విధానాల్లో దూసుకెళ్లకపోవడం..కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు కేటాయించడం..తదితర కారణాలు చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ 70 స్థానాలకు పరిమితం కావచ్చు. అధికారంలోకి రావాలని యోచించిన బీఎస్పీ వంద సీట్లకు పైగా మైనార్టీ వర్గానికి కేటాయించింది. 30-35 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. 290-300 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి.
మణిపూర్ లో హోరాహోరీ 27 స్థానాల్లో కాంగ్రెస్, 22 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది.
పంజాబ్ లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో దూసుకెళుతోంది.
ఉత్తరాఖండ్ లో బీజేపీ 55 పైగా కైవసం చేసుకుంటుందని తెలుస్తోంది
గోవాలో బీజేపీ ముందంజలో ఉన్నట్లు కనిపించగా కాంగ్రెస్ ఒక్కసారిగా దూసుకొచ్చింది. 18-22 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, బీజేపీ 15 స్థానాల్లో గెలుపొందుతుందని తెలుస్తోంది’. అని పేర్కొన్నారు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

10:02 - March 11, 2017

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. యూపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ స్పష్టమైన అధిక్యంలో దూసుకెళుతోంది. పంజాబ్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. గోవా, మణిపూర్ లో టఫ్ ఫైట్ కొనసాగుతోంది. గోవాలో ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓటమి చెందారు. హరిద్వార్ రూరల్ లో సీఎం హరీష్ రావత్ వెనుకంజలో కొనసాగుతున్నారు. అమృత్ సర్ లో క్రికెటర్ సిద్ధూ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఆప్ నేత భగవత్ సింగ్ మాన్ ముందంజలో ఉన్నారు. లాంబాలో సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ లీడ్ లో కొనసాగుతున్నారు. పటియాలాలో కెప్టెన్ అమరేందర్ సింగ్ ముందంజలో ఉన్నారు.

యూపీలో బీజేపీ ముందంజ..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కాషాయ కూటమి అధిక్యంలో దూసుకెళుతోంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని స్ఫష్టంగా తెలుస్తోంది. 250 మార్క్ ను దాటేసింది. సమాజ్ వాదీ - కాంగ్రెస్ పొత్తు విఫలం చెందిందని ఫలితాలను బట్టి తెలుస్తోంది. 75 స్థానాల్లో కాంగ్రెస్ కొనసాగుతుండగా 23 స్థానాల్లో బీఎస్పీ అధిక్యంలో కొనసాగుతోంది. యూపీలో బీజేపీ విజయం సాధిస్తుందని సంకేతాలు వెలువడడంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

పంజాబ్ లో..
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది. 58 స్థానాల్లో కాంగ్రెస్ దూసుకెళుతోంది. ఆమ్ ఆద్మీ గట్టిగా పోటీనివ్వలేదు. 24 స్థానాల్లో అకాళీదల్ - బీజేపీ 27 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది.

ఉత్తరాఖండ్..లో..
ఉత్తరాఖండ్ లో కూడా బీజేపీ అధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 50 స్థానాలు, 13 స్థానాల్లో కాంగ్రెస్ దూసుకెళుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.

గోవాలో..
గోవాలో టఫ్ ఫైట్ కొనసాగుతోంది. మొత్తంగా 40 స్థానాల్లో కాంగ్రెస్ 6, బీజేపీ 4 స్థానాల్లో లీడ్ కొనసాగుతోంది. ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా కొనసాగుతోంది. గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓటమి చెందడం గమనార్హం.

మణిపూర్..లో..
మణిపూర్ లో కూడా హోరాహోరీ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 13 స్థానాల్లో కాంగ్రెస్, 5 స్థానాల్లో బీజేపీ అధిక్యంలో కొనసాగుతోంది.

09:46 - March 11, 2017

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఫలితాలు వస్తున్నాయి. యూపీలో మొత్తం స్థానాలు 403 ఉండగా బీజేపీ 220 స్థానాల్లో అధిక్యంలో దూసుకెళుతోంది. ఎస్పీ + కాంగ్రెస్ 70, బీఎస్పీ 29, స్వతంత్రులు 12 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. పంజాబ్ లో 117 స్థానాల్లో కాంగ్రెస్ 46 స్థానాల్లో దూసుకెళుతోంది. ఆప్ 22 స్థానాల్లో కొనసాగుతుండగా ఎస్ఏడీ + బీజేపీ 23 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. 40 స్థానాలున్న గోవాలో 04 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 4 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి.
మణిపూర్ లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ 70 స్థానాల్లో బీజేపీ 48, కాంగ్రెస్ 11 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి.

  • గోవాలో ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓటమి చెందారు.
  • హరిద్వార్ రూరల్ లో సీఎం హరీష్ రావత్ వెనుకంజలో కొనసాగుతున్నారు.
  • అమృత్ సర్ లో క్రికెటర్ సిద్ధూ అధిక్యంలో కొనసాగుతున్నారు.
  • ఆప్ నేత భగవత్ సింగ్ మాన్ ముందంజలో ఉన్నారు.
  • లాంబాలో సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ లీడ్ లో కొనసాగుతున్నారు.
  • పటియాలాలో కెప్టెన్ అమరేందర్ సింగ్ ముందంజలో ఉన్నారు.
09:32 - March 11, 2017

రాజమౌళి రూటే వేరు..ఆయన ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ‘బాహుబలి' చిత్రంతో టాలీవుడ్ సత్తా చూపెట్టిన దర్శకధీరుడు. ప్రస్తుతం 'బాహుబలి 2’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టినా చిత్ర టీజర్ మాత్రం విడుదల కాలేదు. టీజర్ ఎప్పుడు విడుదలువుతుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. కానీ త్వరలోనే చిత్ర టీజర్ విడదలవుతుందని లీక్స్ పంపిస్తున్నాయి. తాజాగా 'రాజమౌళి' సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు చేశారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు 'బాహుబలి' ఫేస్ బుక్ పేజీని మిస్ కావద్దని పోస్టు చేశారు. అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును ఉంచారు. 'బాహుబలి: ది కన్ క్లూజన్'పై లైవ్ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ లైవ్ లో స్వయంగా 'రాజమౌళి' పాల్గొంటారా ? లేదా ? అనేది తెలియరాలేదు. ఇందులోనే చిత్ర టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సో..మధ్యాహ్నం 12గంటల తరువాత ఎలాంటి అంశాలు 'రాజమౌళి' ప్రస్తావిస్తారో చూడాలి.

పంజాబ్ లో హస్తం హవా

పంజాబ్ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పంజాబ్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. హస్తం పార్టీ ముందంజలో ఉంది. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా  ఉత్కంఠ నెలకొంది.  

 

మణిపూర్ లో కాంగ్రెస్ ముందంజ

మణిపూర్ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మణిపూర్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా  ఉత్కంఠ నెలకొంది.  

09:20 - March 11, 2017

గుంటూరు : వచ్చే ఏడాది 15 శాతం వృద్ధి సాధించేలా అందరూ కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న వృద్ధి సాధించాలంటే, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 
వెలగపూడి సచివాలయంలో సీఎం సమావేశం
వెలగపూడి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.  13న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతుండడంతో, అధికారులకు, మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అన్ని రంగాలపై దృష్టి పెట్టి.. వృద్ధి రేటు సాధించేలా కృషి చేయాలని ఆయన సూచించారు. జవాబుదారీతనం ఉంటేనే అనుకున్నది సాధించగలమని అన్నారు.
రాష్ట్ర వృద్ధి రేటు 11.61 శాతం
2016-17 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర వృద్ధి రేటు 11.61 శాతం.. వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో రాష్ట్ర వృద్ధి 9.19శాతం ఉందని సీఎం చెప్పారు. ఆక్వా రంగానికి తక్కువ నిధులే కేటాయించినా 30.9 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. ఉద్యానవన రంగంలో 30 శాతం వృద్ధి సాధించేలా లక్ష్యం పెట్టుకోవాలని అన్నారు. అలాగే సస్టెయినబుల్‌ గ్రోత్‌కు సంబంధించి 17 లక్ష్యాలతో పాటు.. రాష్ట్ర నిర్దేశించుకున్న సమాజం-కుటుంబ వికాసంపైనా అధికారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డ్వాక్రా సంఘంలో సభ్యులుగా ఉన్న 90 లక్షల మందిని ఆర్థికంగా బలోపేతం చేయాలని.. సాంకేతికతను అన్ని శాఖలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. 
డెయిరీ రంగంలో మరింత వృద్ధి సాధించాలి : సీఎం
డెయిరీ రంగంలో మరింత వృద్ధికి అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాల, నియోజకవర్గాల వారీగా జీవీఏలను రూపొందించి వచ్చే నెలలో అందించాలన్నారు. తాగు నీటి సమస్య పరిష్కారానికి రియల్‌ టైమ్‌ గవర్నెస్‌ను వినియోగించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన పరిపాలనా సంస్కరణలపై చర్చ జరగాల్సి ఉందని.. త్వరలో మంత్రుల కమిటీని నియమిస్తామన్నారు. సేవలరంగంపై అధ్యయనానికి, ఆ రంగం అభివృద్ధికి కార్యదర్శులతో కమిటీని నియమిస్తామని చెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాలలో ప్రస్తుతం మనం ఏ స్థానంలో ఉన్నాం.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి లక్ష్యాలు ఏమిటీ అనే దానిపై ఆయా శాఖల అధికారులు  స్పష్టత కలిగి ఉండాలని సీఎం అన్నారు. 

 

కొనసాగుతున్న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గోవాలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మణిపూర్ లో కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అన్నట్లు ఉన్నాయి. రాంపూర్ లో అజంఖాన్ ఆధిక్యంలో ఉంది. లక్నోలో అఖిలేష్ మరదలు అపర్ణ యాదవ్ వెనుకంజలో ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ పోటా పోటీగా ఉన్నాయి.

09:13 - March 11, 2017

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
యూపీలో..మొత్తం స్థానాలు : 403
యూపీలో బీజేపీలో ముందంజలో కొనసాగుతోంది. సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ వెనుకంజలో కొనసాగుతున్నాయి. కానీ బీఎస్పీ మాత్రం కొంత ఆధిక్యంలో కొనసాగుతోంది. కాసేపటి క్రితం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఈవీఎంల లెక్కింపు చేపట్టారు. 120 స్థానాల్లో బీజేపీ అధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్, ఎస్పీ అలయెన్స్ ఫెయిల్ అయినట్లు కనిపిస్తోంది. 30 స్థానాల్లో అధిక్యంలో దూసుకెళుతోంది. బీఎస్సీ 10 స్థానాల్లో కొనసాగుతుండడం గమనార్హం. ఐదు ప్రాంతాల్లో స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతోంది. అవద్, పశ్చిమ యూపీ, ఋందేల్ ఖండ్ లో బీజేపీ కొనసాగుతోంది.

పంజాబ్ లో నువ్వా నేనా..మొత్తం స్థానాలు 117
పంజాబ్ రాష్ట్రంలో నువ్వా నేనా అన్నట్లు పోటీ కొనసాగుతోంది. ఆప్..కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ లో బీజేపీ- అకాళీదళ్ వెనుకంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 8 స్థానాల్లో..ఆప్ 5 స్థానాల్లో అధఙక్యంలో కొనసాగుతున్నాయి. ప్రకాశ్ సింగ్ బాదల్ లీడ్ లో ఉండగా మరొకస్థానంలో పోటీ చేస్తున్న అమరేందర్ సింగ్ ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నాయి.

మణిపూర్ లో..మొత్తం స్థానాలు 60
మణిపూర్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. కాంగ్రెస్ 2, బీజేపీ 1 స్థానంలో అధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇరోం షర్మిల వెనుకంజలో కొనసాగుతున్నారు.

ఉత్తరాఖండ్ లో..మొత్తం స్థానాలు 70
ఉత్తరాఖండ్ లో బీజేపీ అధిక్యంలో కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గోవాలో..మొత్తం స్థానాలు 40
గోవా రాష్ట్రంలో బీజేపీ వెనుకంజలో కొనసాగుతోంది. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది.

మణిపూర్ లో కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా

మణిపూర్ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మణిపూర్ లో కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అన్నట్లు ఉన్నాయి.

 

యూపీ... 12స్థానాల్లో బీఎస్పీ ఆధిక్యం

యూపీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. యూపీలోని 12స్థానాల్లో బీఎస్పీ ఆధిక్యంలో ఉంది. యూపీలో మొత్తం 403 నియోజకవర్గాలున్నాయి. 

 

యూపీ... 16స్థానాల్లో ఎస్పీ, కాంగ్రెస్ ఆధిక్యం

యూపీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. యూపీలోని 16స్థానాల్లో ఎస్పీ, కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. యూపీలో మొత్తం 403 నియోజకవర్గాలున్నాయి. 

 

యూపీ... 35 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

యూపీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. యూపీలోని 35 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. యూపీలో మొత్తం 403 నియోజకవర్గాలున్నాయి. 

 

08:39 - March 11, 2017

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మళ్లీ అఖిలేష్ అధికారం నిలబెట్టుకుంటారా ? బీజేపీ గట్టి పోటీ నిచ్చి అధికారంలోకి వస్తుందా ? అనే ప్రశ్నలకు కాసేపట్లో సమాధానం రానుంది. మొత్తంగా 403 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకైనా 202 సీట్లు రావాల్సింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని, అయితే అధికారానికి ఆమడదూరంలో నిలిచిపోతుందని మెజార్టీ సర్వే సంస్థలు పేర్కొన్న నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో సమాజ్ వాదీ పార్టీ వ్యూహ బృందంలో 'హరికాసుల' చర్చలో పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 2019లో భారత పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో ఎలాంటి శక్తులు పోరాడబోతున్నాయి..బిగ్గెస్ట్ కాంటెస్ట్ లోపల బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తులు ఎదిగేలా చేసేందుకు ప్రధాన ఉద్ధేశ్యమన్నారు. బీహార్ లో 180 సీట్ల లోపు కట్టుదిట్టంగా పరిమితం చేయగలిగితే సాధ్యమన్నారు.

 

పంజాబ్...ఎస్ ఏడీ, బీజేపీ..1, కాంగ్రెస్ 3, ఆప్ 2 స్థానాల్లో ఆధిక్యత

పంజాబ్ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. పంజాబ్ లో ఎస్ ఏడీ, బీజేపీ కూటమి 1 స్థానంలో, కాంగ్రెస్ 3, ఆప్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

 

మణిపూర్ లో ఒక స్థానంలో కాంగ్రెస్ అధిక్యం

మణిపూర్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. ఒక స్థానంలో కాంగ్రెస్ అధిక్యంలో ఉంది.  

08:28 - March 11, 2017

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల్లో ఎవరు పాగా వేస్తారు ? అధికారం నిలబెట్టుకుంటారా ? ప్రతిపక్షం మళ్లీ వికసిస్తుందా ? వీటన్నింటికీ కొన్ని గంటల్లో సమాధానం రాబోతోంది. ఇటీవలే పలు దఫాలుగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రారంభమైంది. ఒకసారి ఆయా రాష్ట్రాల ఎన్నికల సరళి..ఓ లుక్...

పంజాబ్ : మొత్తం స్థానాలు 117
కావాల్సిన మెజార్టీ 59
ప్రస్తుతం అధికారంలో ఉన్నది శిరోమణి అకాళీదళ్ - బీజేపీ కూటమి.
అధికారం కోసం కాంగ్రెస్, ఆప్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ జరగనుంది.
మణిపూర్ : మొత్తం స్థానాలు 60
కావాల్సిన మెజార్టీ 31
ఈ రాష్ట్రంలో పోటా పోటీ నెలకొంది. ఇక్కడ పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా అంతేస్థాయిలో వ్యూహాలు రచించింది. రెండు పార్టీలు మెజార్టీ స్థానాలను పొందకపోతే స్వతంత్రులతో పాటు, ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఉత్తరాఖండ్ : మొత్తం స్థానాలు 70
కావాల్సిన మెజార్టీ 36
ఇక్కడ బీజేపీ అధికారం చేపట్టనుంది ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి...
గోవా : మొత్తం స్థానాలు 40
కావాల్సిన మెజార్టీ 21
పాలకపక్షంగా ఉన్న బీజేపీ మరోసారి అధికారాన్ని సాధిస్తుందని మెజార్టీ సర్వే సంస్థలు పేర్కొన్నాయి. కానీ కాంగ్రెస్ కూడా గణనీయమైన ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొట్టమొదటిసారి పోటీ చేసిన ఆప్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అధికంగా చీల్చే అవకాశాలున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ : మొత్తం స్థానాలు : 403
కావాల్సిన మెజార్టీ : 202
ఈ రాష్ట్రంలో కొత్త సమీకరణాలకు దారి తీస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మ్యాజిక్ మార్క్ చేరుకోవడానికి బీజేపీ ఆమడదూరంలో ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరి ఎవరు అధికారంలోకి వస్తారు ? ఎవరు ప్రతిపక్షంలో కూర్చొంటారనే ప్రశ్నకు కాసేపట్లో సమాధానం రానుంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. 

 

08:13 - March 11, 2017

కాసేపట్లో ఉత్తరాంఖండ్ లో ఎన్నికల కౌంటింగ్

ఉత్తరాఖండ్‌ : కొద్ది సేపట్లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 70 అసెంబ్లీ స్థానాలుండగా... 15 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. 

 

యూపీలో 78 కౌంటింగ్ కేంద్రాలు

లక్నో : కాసేపట్లో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 403 నియోజకవర్గాలకు గాను 75 జిల్లాల్లో 78 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

07:47 - March 11, 2017

హైదరాబాద్‌ : నగరంలో అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ దాడులకు పాల్పడుతున్న పలువురిని టప్పాచబుత్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోసారి ఇలాంటి దాడులు చేయకుండా.. 52 మంది యువకులతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. 

 

07:45 - March 11, 2017

పెద్దపల్లి : జిల్లాలోని పెద్దకల్వల సమీపంలో లారీ దగ్ధమైంది. డీజిల్‌ ట్యాంక్‌ పగలడంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది. రాయపూర్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

 

07:33 - March 11, 2017

వరంగల్‌ : శివారు ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వంచనగిరిలో ఉన్న గోడౌన్‌లో మంటలు చెలరేగి పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

వరంగల్ లో అగ్నిప్రమాదం

వరంగల్‌ : శివారు ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వంచనగిరిలో ఉన్న గోడౌన్‌లో మంటలు చెలరేగి పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. 

 

నేడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌

ఢిల్లీ : నేడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్‌లో 403 నియోజకవర్గాలకు గాను 75 జిల్లాల్లో 78 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలుండగా... 15 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలకు 54 కేంద్రాలు, గోవాలో 40 స్థానాలు, మణిపూర్‌ 60 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. సాయంత్రానికల్లా అన్ని ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఏపీ ఇంటర్ సెకండియర్ పరీక్షకు సెట్ 2 ప్రశ్నాపత్రం

హైదరాబాద్ : ఏపీలో నేడు జరుగబోయే ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షకు సెట్ 2 ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. 

Don't Miss