Activities calendar

12 March 2017

21:33 - March 12, 2017

అంజలి..టాలీవుడ్ లో తనదైన నటన..అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటు వెళుతున్న 'అంజలి' మరో విభన్నమైన చిత్రంలో నటించింది. ‘చిత్రాంగద' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ భామ. ‘అంజలి' నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ సందర్భంగా 'అంజలి' తో టెన్ టివి ముచ్చటించింది. ‘చిత్రాంగద' సినిమా హర్రర్ మూవీ కాదని పేర్కొంది. ఇంకా ఎమి మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

మంగళవారం ఎంపీ కవిత జన్మదినం..

హైదరాబాద్ : నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సోమవారం పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా కవిత పుట్టిన రోజును పురస్కరించుకొని ఒడిశాలోని పూరిలో కవిత సైకత శిల్పాన్ని వరంగల్‌ అర్భన్‌ జాగృతి అధ్యక్షులు కొరబోయిన విజయ్‌ తయారు చేయించారు. ప్రఖ్యాత సైకత శిల్పి జితేందర్‌ సాహు చేతుల్లో కవిత సైకత శిల్పం రూపుదిద్దుకుంది.

21:31 - March 12, 2017

హైదరాబాద్ : నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సోమవారం పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా కవిత పుట్టిన రోజును పురస్కరించుకొని ఒడిశాలోని పూరిలో కవిత సైకత శిల్పాన్ని వరంగల్‌ అర్భన్‌ జాగృతి అధ్యక్షులు కొరబోయిన విజయ్‌ తయారు చేయించారు. ప్రఖ్యాత సైకత శిల్పి జితేందర్‌ సాహు చేతుల్లో కవిత సైకత శిల్పం రూపుదిద్దుకుంది.

21:30 - March 12, 2017

హైదరాబాద్ : ఈనెల 19న తలపెట్టిన మహాజన పాదయాత్ర ముగింపు సభా వేదికను సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియానికి మార్చినట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి. వెంకట్‌ తెలిపారు. నిజాం కాలేజీలో సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతోనే అనివార్య పరిస్థితుల్లో వేదికను సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియానికి మార్చినట్టు చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలాంటి మతోన్మాద శక్తులతో ప్రభుత్వం కుమ్మక్కై బహిరంగ సభకు అనుమతి నిరాకరించిందని ఆరోపించారు. మహాజన పాదయాత్రను అడ్డుకోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిస్తే... జనం మాత్రం అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయడంలో కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.

21:28 - March 12, 2017
21:27 - March 12, 2017

హైదరాబాద్ : అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందన్నారు తెలంగాణ ఆర్దికమంత్రి ఈటల రాజేందర్‌. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్‌కు రూపకల్పన చేశామన్నారు. మరోవైపు సాయంత్రం క్యాంప్ ఆఫీస్‌లో భేటీ అయిన తెలంగాణ మంత్రిమండలి... బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో.. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ అయ్యింది. ఈ భేటీలో పలు అంశాలు చర్చకొచ్చాయి. మొదటగా కేబినెట్‌ రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. అనంతరం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ సహచర మంత్రులతో చర్చించారు. సభలో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. ఇందుకోసం పూర్తి సమాచారంతో మంత్రులు సభకు హాజరుకావాలన్నారు. మైనార్టీ, గిరిజన రిజర్వేష్లపైనా కేబినెట్‌ చర్చించింది.

వ్యవసాయం, చేతివృత్తులకు చేయూత..
ఈసారి బడ్జెట్‌లో సంక్షేమానికే పెద్దపీట వేయనున్నట్టు ఆర్దికమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అణగారిన వర్గాలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. సంక్షేమానికి బడ్జెట్‌లో మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆ తర్వాత వ్యవసాయం, చేతివృత్తులకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శలను ఈటల రాజేందర్‌ కొట్టిపారేశారు. ప్రతిపక్షాలకు అవగాహనలేకే విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే అప్పులు తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. అప్పుగా తీసుకొచ్చిన నిధులను ప్రజల సంక్షేమం కోసం ఖర్చుచేస్తున్నామని చెప్పారు. గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి బడ్జెట్‌ గొప్పగా ఉంటుందన్నారు ఈటల. ప్రజలకు విశ్వాసాన్ని కలిగించేలా బడ్జెట్‌కు రూపకల్పన చేశామన్నారు. మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బడ్జెట్‌ ఏమేరకు ప్రతిబింబిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాల్సిందే.

21:25 - March 12, 2017

ఉత్తరప్రదేశ్ : అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటమిపై ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ స్పందించారు. పార్టీ ఓటమికి అఖిలేష్ యాదవ్‌‌ను ఒక్కరినే బాధ్యుడ్ని చేయడం సరికాదన్నారు. అది పార్టీ వైఫల్యమేనని, ప్రతి ఒక్కరూ బాధ్యులేనని అన్నారు. ప్రజాతీర్పును ఎవరైనా గౌరవించాల్సిందేనని, బీజేపీ ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చిందని, వాటిని ఎలా నెరవేరుస్తారో చూడాలని అన్నారు. గెలుపు ఓటములు జీవితంలో సహజమేనని, గతంలోనూ సమాజ్‌వాదీ పార్టీ ఓటమిని చవిచూసి తిరిగి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మరిచిపోరాదని ములాయం పేర్కొన్నారు

21:23 - March 12, 2017

ఢిల్లీ : యూపీ, ఉత్తరాఖండ్‌లో బీజేపీ విజయఢంకా మోగించిన సందర్భంగా ఢిల్లీలో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. విజయోత్సవ ర్యాలీకి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ పాదయాత్ర ద్వారా ప్రజలకు అభివాదం చేసుకుంటూ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్ నాధ్ సింగ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు, నేతలు ప్రధాని మోదీని సత్కరించారు. ఈ సందర్భంగా పేదల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని మోదీ అభివర్ణించారు. 125 కోట్ల భారతీయుల బలంతో అభివృద్ధే మంత్రంగా సరికొత్త భారతదేశాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

21:22 - March 12, 2017

మణిపూర్‌ : ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడడం లేదు. అధికారం కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ పోటాపోటీగా వ్యూహం రచిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఇబోబిసింగ్‌ అధికారం ఏర్పాటు దిశగా మంతనాలు జరుపుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గవర్నర్‌ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని విజ్ఞప్తి చేయాలని యోచిస్తున్నారు. రేపు ఆయన గవర్నర్‌ను కలిసే అవకాశముంది. మరోవైపు బీజేపీ కూడా అదే ప్రయత్నాలు చేస్తుండడంతో ఎవరికి అధికారం దక్కుతుందన్న ఉత్కంట నెలకొంది.

21:21 - March 12, 2017

గోవా : ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. బీజేపీయే మళ్లీ అధికారం చేపట్టనుంది. బీజేపీకే గోవా ఫార్వర్డ్‌ పార్టీ, ఎంజీపీతోపాటు ఇండిపెండెంట్లు మద్దతు ప్రకటించారు. అయితే కేంద్రమంత్రి పారికర్‌ మరోసారి గోవా సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. ఈనెల 14న ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలందరితో కలిసి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తమకు మద్దతిస్తోన్న గోవా ఫార్వర్డ్‌ పార్టీకి 3మంత్రి పదవులు కట్టబెట్టే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది.

21:19 - March 12, 2017

ముగిసిన బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం..

ఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం ముగిసింది. నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించారు. 16న యూపీ అభ్యర్ధిని ప్రకటించాలని కమిటీ నిర్ణయించింది. ఇక మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపైనా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.

21:18 - March 12, 2017

కర్నూలు : జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన భూమా నాగిరెడ్డి మృతి రాజకీయాల్లో తీరని లోటు అనే చెప్పాలి. రుద్రవరం కోఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన భూమా.. జిల్లాలో రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన భూమా నాగిరెడ్డి 1964 జనవరి 8న దొర్నిపాడు మండలంలోని ఓ మారమూల గ్రామం కొత్తపల్లిలో జన్మించారు. భూమా తల్లిదండ్రులు భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మలకు భూమా చిన్న కుమారుడు. ఫ్యాక్షనిజం గాలి సోకకూడదన్న కారణంతో తండ్రి బాలిరెడ్డి.. తన కుమారుడు భూమా నాగిరెడ్డిని చెన్నైలోని సీబీఎస్ఈ చేర్పించారు. అక్కడ ఇంటర్‌వరకు చదివిన నాగిరెడ్డి.. వైద్య విద్యకోసం బెంగళూరు వెళ్లారు. అంతలోనే తండ్రి బాలిరెడ్డి హత్యకు గురవడంతో తిరిగి భూమా సొంతూరుకు వచ్చేశారు. తండ్రి మృతి తర్వాత ఆయన జీవితమే మారిపోయింది. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణిని వివాహం చేసుకున్న నాగిరెడ్డి ఆ తర్వాత పూర్తి స్థాయి నేతగా మారారు.

1987లో రాజకీయ ప్రవేశం..
1987లో రాజకీయ ప్రవేశం చేసిన భూమా నాగిరెడ్డి... నరసాపురం సింగిల్‌ విండో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1988లో ఆళ్లగడ్డ MPPగా గెలుపొందారు. 1992లో జరిగిన ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో MLAగా గెలుపొందారు. 1996లో నంద్యాల లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1994, 2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా.. 1996, 1998, 1999లో ఎంపీగా గెలుపొందారు. మొత్తం రెండు సార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా పనిచేసిన నాగిరెడ్డి కర్నూలు జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. 1996లో అప్పటి ప్రధాని పీవీ నరసింహరావుపై నంద్యాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన భూమా నాగిరెడ్డి అప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చారు. వరుసగా 11, 12, 13 లోక్‌ సభ ఎన్నికల్లోనూ ఎన్నికైన భూమా కర్నూలు జిల్లాలో కీలక నేతగా చక్రం తిప్పారు.

21:16 - March 12, 2017

కర్నూలు : జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నంద్యాల టిడిపి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఊహించని ఘటనతో భూమా కుటుంబసభ్యులు, అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. భూమా నాగిరెడ్డి మృతివార్త విన్న టీడీపీ నేతలు దిగ్భాంత్రికి గురయ్యారు. రేపు ఆళ్లగడ్డలో అధికార లాంఛనాలతో జరిగే భూమా అంత్యక్రియలకు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు హాజరుకానున్నారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆళ్లగడ్డలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. ఊహించని ఈ ఘటనతో భూమా కుటుంబసభ్యులు, అనుచరులు, కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. శోభానాగిరెడ్డి మృతికి సంబంధించిన చేదు గుర్తులు చెరిగిపోక ముందే భూమా కూడా మరణించడంతో అనుచరులు షాక్‌కు గురయ్యారు.

పలువురు సంతాపం..
నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఆకస్మిక మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు..తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టిడిపి కుటుంబ సభ్యుడిగా భావించే నాగిరెడ్డి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు అన్నారు. భూమా కూతురు అఖిలప్రియకు ఫోన్‌చేసి చేసి ఓదార్చిన చంద్రబాబు..ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని..కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నంద్యాలలోని ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూసిన తర్వాత భూమా పార్ధీవదేహాన్ని..నంద్యాలలోని టీడీపీ ఆఫీసుకు తరలించారు. నంద్యాల నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం పార్టీకార్యాలయానికి తరలించడంతో అక్కడకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చి కడసారి నివాళులర్పించారు. భూమా ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేని అభిమానులు భోరున విలపించారు. భూమా నాగిరెడ్డి అకాల మృతితో కర్నూలు జిల్లా గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆయన బావమరిది, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.

నివాళులు..
ఆ తర్వాత భూమా నాగిరెడ్డి పార్థీవదేహాన్ని ప్రత్యేక వాహనంలో ఆళ్లగడ్డకు తరలించారు. భూమా పార్ధీవదేహం ఆయన నివాసానికి చేరుకోవడంతో..భూమా ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేని ఆళ్లగడ్డ ప్రజలు, అభిమానులు భోరున విలపించారు. కడసారి ఆయన పార్థీవదేహాన్ని చూసేందుకు అభిమానులు, స్థానికులు, ప్రముఖులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివస్తున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ఆళ్లగడ్డకు చేరుకొని భూమా పార్ధీవదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అటు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా ఆళ్లగడ్డకు చేరుకొని భూమా నాగిరెడ్డి పార్ధీవదేహానికి నివాళులర్పించారు. టిడిపిలో ఉన్నప్పుడు భూమాతో పాటు తాను కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.

సోమవారం అంత్యక్రియలు..
భూమా నాగిరెడ్డి అంత్యక్రియులు సోమవారం ఆళ్లగడ్డలో అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. భూమా సతీమణి శోభానాగిరెడ్డి ఘాట్‌ పక్కనే అంత్యక్రియలు జరుగనున్నాయి. భూమా అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు, మంత్రులు వెళ్లనున్నారు. భూమా నాగిరెడ్డి మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇటు భూమా మృతిపై ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్‌ చక్రపాణి, రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సంతాపాన్ని తెలిపారు. నాగిరెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటన్న పవన్‌కల్యాణ్‌..ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసినప్పుడు ఆయన నాయకత్వ లక్షణాలు తనను ఆకట్టుకున్నాయన్నారు. వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌, ఆయన తల్లి విజయలక్ష్మి భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతిపై సంతాపాన్ని తెలియచేస్తూ..ఆయన మరణంతో కుటుంబసభ్యుడిని కోల్పోయామన్నారు.

మంత్రి పదవి ఖాయం..
మరికొద్ది రోజుల్లో జరిగే ఏపీ మంత్రివర్గ విస్తరణలో భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం కూడా జరిగింది. దురదృష్టవశాత్తూ మంత్రిపదవి దక్కకుండానే ఆయన అకాల మరణం చెందడం అందరిని కలిచివేచింది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్రవేసి..ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చిన భూమానాగిరెడ్డి ఇక లేరన్న వార్తను జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. భూమా నాగిరెడ్డి నిత్యం జనం హితం కోరే నేతగా జిల్లా రాజకీయాల్లో ముద్ర వేయడంతో..చనిపోయిన తర్వాత కూడా ఆయన కళ్లు నలుగురికి ఉపయోగపడాలన్న ఉద్దేశ్యంతో భూమా నాగిరెడ్డి కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు.

20:21 - March 12, 2017

గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధం..

గోవా : రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమౌతోంది. బీజేపీకి గొవా ఫార్వర్డ్ పార్టీ, ఎంబీపీ మద్దతు తెలియచేశాయి. గోవా ఫార్వర్డ్ పార్టీకి మూడు కేబినెట్ పదవులు, ఎంబీపీకి రెండు మంత్రి పదవులు, బీజేపీకి స్పీకర్, డిప్యూటి స్పీకర్, నాలుగు మంత్రి పదవులు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

గోవా గవర్నర్ తో బీజేపీ ఎమ్మెల్యేలు..

గోవా : గవర్నర్ మృదులా సిన్హాను బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో గవర్నర్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ 17, బీజేపీ 14, ఎంజీపీ 3, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించాయి. కావాల్సిన మెజార్టీ 21గా ఉంది.

గోవా గవర్నర్ తో బీజేపీ ఎమ్మెల్యేలు..

గోవా : గవర్నర్ మృదులా సిన్హాను బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో గవర్నర్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ 17, బీజేపీ 14, ఎంజీపీ 3, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించాయి. కావాల్సిన మెజార్టీ 21గా ఉంది.

హోలీ వేడుకల్లో అపశృతి..

హైదరాబాద్ : సైదాబాద్ హోలీ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సింగరేణి కాలనీలో గుడిసెల ప్రాంతంలో రంగు నీళ్లు అనుకుని కిరోసిన్ చల్లడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

గురుకుల పాఠశాలలో ఆకతాయి వేధింపులు..

నెల్లూరు : సంగం గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అర్ధరాత్రి సమయంలో పాఠశాలలోకి దూరి విద్యార్థినులను వేధిస్తున్నాడు. విద్యార్థినులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా విషయాన్ని యాజమాన్యం దాచిపెట్టింది. పాఠశాల వద్ద విద్యార్థినులు..తల్లిదండ్రులు ఆందోళన చేశారు.

19:38 - March 12, 2017

నటుడు 'ఉత్తేజ్' కుమార్తె 'చేతన' హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘చిత్రం' సినిమాలో 'కుక్క కావాలి' అంటూ బాగా పాపులరైన సంగతి తెలిసిందే. శశిభూషణ్ దర్శకత్వంలో సంజీవ్, నందు, కారుణ్య ముఖ్యపాత్రల్లో శ్రీవత్స క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న 'పిచ్చిగా నచ్చావ్' చిత్రం ద్వారా వస్తోంది. ఈనెల 17వ తేదీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా టెన్ టివి ‘చేతన’తో ముచ్చటించింది. బాలతారగా ‘చిత్రం’ సినిమాతో తాను పరిచయమయ్యానని నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. ‘పిచ్చిగా నచ్చావ్' చిత్ర విశేషాలు..తండ్రి 'ఉత్తేజ్'..ఇతరత్రా విషయాలపై ఆమె మాట్లాడారు. సందడి సందడి చేస్తూ మాట్లాడిన 'చేతన' గురించి మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

19:23 - March 12, 2017

టాలీవుడ్ లో తనదైన స్టైల్ లో నటించే 'ఉత్తేజ్' కూతురు 'చేతన' కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆమె పరిచయమవుతున్న చిత్రం 'పిచ్చిగా నచ్చావ్'. శశిభూషణ్ దర్శకత్వంలో కుమల్ కుమార్ పెండెం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'చేతన'తో టెన్ టివి ముచ్చటించింది. చిత్ర విశేషాలతో పాటు పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా స్నేహితులు గొంతు మార్చి మాట్లాడడంతో 'చేతన' కొంత కన్ ఫ్యూజ్ కు గురయ్యారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

18:53 - March 12, 2017

హైదరాబాద్ : రంగుల కేళీ హోలీ.. మరోసారి తెలంగాణలో సందడి చేసింది. చిన్నపిల్లల దగ్గరి నుంచి ముసలివారి వరకు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. రాజ్‌ భవన్‌లో జరిగిన సంబరాల్లో గవర్నర్ దంపతులతో పాటు... నేతలు పాల్గొని సందడి చేశారు. రాజ్‌భవన్‌లో హోలీ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు ప్రారంభించారు. గవర్నర్‌ అందరికీ రంగులు జల్లుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్‌ దంపతులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో హోలీ వేడుకలు కలర్‌ఫుల్‌గా సాగాయి. యువతీయువకులు సహజసిద్దమైన రంగులు పూసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నృత్యాలు చేస్తూ.... ఆటపాటలతో సందడిగా గడిపారు. ఇక టీఆర్‌ఎస్‌ ఎంపీ మల్లారెడ్డి హోలీ వేడుకల్లో మునిగితేలారు. రంగులు చల్లుకుంటూ, డప్పులు వాయిస్తూ ఉత్సాహంగా గడిపారు.

మెదక్..సంగారెడ్డి..సిద్ధిపేట..
మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో హోలీ ఆనందాలు వెల్లివిరిశాయి. సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ హోలీ ఆడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. కాంగ్రెస్‌ సీనియర్‌నేత జగ్గారెడ్డి హోలీ సంబరాల్లో మునిగితేలారు. రామ మందిర్‌ ఏరియాలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన అందరికీ రంగులు పూస్తూ ఆనందంగా గడిపారు.

కరీంనగర్ లో..
కరీంనగర్‌ జిల్లాలో హోలీ వేడుకలు మిన్నంటాయి. యువతీయువకుల కేరింతలతో అదరహో అనిపించాయి. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ స్టేడియంలో హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల.. జిల్లా ప్రజలకు హోలీ శుభకాంక్షలు తెలిపారు.

జగిత్యాల..
జగిత్యాల జిల్లాలో హోలీ సంబరాలు హోరెత్తాయి. క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ అనంతశర్మ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. చెడును వదిలి మంచి మనసుతో సమాసమజ నిర్మాణం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ శరత్‌ కోరారు.

ఖమ్మం..కొత్తగూడెం..
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోనూ హోలీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. తెల్లవారుజాము నుంచే చిన్నాపెద్దా రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకున్నారు. డప్పుల దరువుకు లయబద్దంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా హోలీ జరుపుకున్నారు. కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంతు, ఎస్పీ అంబర్‌కిషోర్‌ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ లో..
మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందరికీ రంగులు పూస్తూ ఎంజాయ్‌ చేశారు.

18:49 - March 12, 2017

కృష్ణా : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. చేసిన తప్పులకు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మాజీ విప్ సామినేని ఉదయభాను తండ్రి విశ్వనాథం మృతికి నివాళులు అర్పించారు. చట్టవిరుద్ధంగా రాజధాని నిర్మాణం, అక్రమంగా ప్రాజెక్టుల విలువ పెంచడం, సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతితో.. చంద్రబాబు.. రాబోయే రోజుల్లో జైలుకెళతారని జోస్యం చెప్పారు. టీడీపీకి సొంత అజెండా అంటూ లేదని.. బీజేపీ ఏం చెబితే అదే చేస్తున్నారని రఘువీరా ఆరోపించారు.

18:48 - March 12, 2017

విజయవాడ : 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయంపై ప్రధాని మోదీని విపక్షాలు సైతం అభినందిస్తున్నాయని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి అన్నారు. ఏపీలో కూడా బీజేపీని బలోపేతం చేసేందుకు అధిష్టాన ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని ఆమె తెలిపారు. అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏది అడిగినా..కేంద్రం అందిస్తుందన్నారు.

18:45 - March 12, 2017

యాదాద్రి : సామాజిక న్యాయమే లక్ష్యంగా చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 148వ రోజుకు చేరుకుంది. యాదాద్రి జిల్లాలో సాగుతున్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పాదయాత్ర బృందానికి పల్లెపల్లెన ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఇవాళ వెల్లంకిలో మొదలైన పాదయాత్ర జైకేసారం, నేలపట్ల, మందాలగూడెం, లింగారెడ్డిగూడెం మీదుగా చౌటుప్పల్‌కు చేరుకోనుంది. ఈ రోజు పాదయాత్రలో కేరళ మాజీ మంత్రి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.ఏ. బేబి పాల్గొంటారు.

18:39 - March 12, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న 'కాటమరాయుడు' రికార్డులు నెలకోల్పోతుంది. ఇటీవలే చిత్ర టీజర్ కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర పాటలను రెండు రోజులకొకసారి యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా మూడో పాటను విడుదల చేశారు. ‘రాజులైనా, బంటులైనా.. కూలి అయినా, యాపారులైనా’..అని సాగే ఈ పాట మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. డాలీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 4న యూట్యూబ్‌లో విడుదలైన ఈ టీజర్‌ ఆదివారానికి కోటి వ్యూస్‌ను క్రాస్‌ చేయగా, 2.52 లక్షల మంది లైక్‌లు పొందింది. పవన్‌కల్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధిక వ్యూస్‌ సాధించిన టీజర్‌గా ఇది నిలిచినట్లు సమాచారం. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. శివ బాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, అలీ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ర్యాలీలో పాల్గొన్న మోడీ..

ఢిల్లీ : దేశ రాజధానిలో బీజేపీ ర్యాలీ ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఈ ర్యాలీలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. విజయం సాధించినందుకు కార్యకర్తలకు అభినందనలు తెలియచేయనున్నారు. అనంతరం పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది.

18:07 - March 12, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్ నిర్మించిన అనంతరం కేబినెట్ తొలిసారి సమావేశం కానుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దశ..దిశా నిర్ధేశం చేయనున్నారు. సోమవారం ఉదయం 11.30గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటెల బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. గవర్నర్ ప్రసంగం మధ్యలో నిరసన వ్యక్తం చేసిన టిడిపి సభ్యులు రేవంత్..సండ్రలను బడ్జెట్ సెషన్ వరకు సస్పెండ్ చేయడం పట్ల విపక్షాలు చేస్తున్న విమర్శలపై కేబినెట్ చర్చించనుంది. వీరిని సస్పెండ్ చేయడం పట్ల ప్రభుత్వంపై అపవాదు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఎంబీసీలకు ఫైనాన్స్ కార్పొరేషన్ పై చర్చించనుంది.

17:23 - March 12, 2017

హైదరాబాద్ : బడ్జెట్ లో సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఈటెల పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా మంత్రి ఈటెలతో టెన్ టివి ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా బడ్జెట్ లో పొందుపరుస్తున్న అంశాలు..రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడారు. కొత్త రాష్ట్రమైనా అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్నామని, సంక్షేమ కార్యక్రమాల కోసం ఎఫ్ఆర్ బీఎంకు లోబడే అప్పులు తీసుకున్నట్లు తెలిపారు. విపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని కొట్టిపారేశారు. ఓర్వలేకనే విపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నారని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం రియల్ ఎస్టేట్ రంగంపై కొంత ప్రభావం కనిపిందని చెప్పుకొచ్చారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం వీడియో క్లిక్ చేయండి.

భూమా పార్థివ దేహం తరలింపు..

కర్నూలు : టిడిపి కార్యాలయం నుండి నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పార్థివ దేహాన్ని తరలించారు. ఆళ్లగడ్డలోని ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని ఉంచనున్నారు. రేపు అంత్యక్రియలు జరుగనున్నాయి.

16:32 - March 12, 2017
16:31 - March 12, 2017

'సమరసమ్మేళనం' సభ వేదిక మార్పు - వెంకట్..

హైదరాబాద్ : అనివార్య పరిస్థితుల వల్ల సమర సమ్మేళనం వేదిక మార్పు చేసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్ వెల్లడించారు. సరూర్ నగర్ అవుట్ డోర్ గ్రౌండ్ లో పాదయాత్ర ముగింపు సభ ఉంటుందని, సుందరయ్య పార్క్ నుండి సభా స్థలం వరకు ముగింపు యాత్ర జరుగుతుందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, టీఆర్ఎస్ లు కుమ్మక్కై సభ అనుమతిని రద్దు చేశారనే అనుమానం కలుగుతోందన్నారు. ఈ సభ అభ్యుదయవాదుల ఐక్య సంఘటనకు నాంది అని, ప్రజలు భారీగా తరలివచ్చి ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు 95 శాతం అమలు కాలేదన్నారు.

16:14 - March 12, 2017

నంద్యాల : ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం పట్ల కుటుంసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన ఇక లేరనే మాటను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో భూమా కన్నుమూసిన సంగతి తెలిసిందే. భూమా మృతి చెందారన్న వార్త దావానంల వ్యాపించింది. ఆయన పార్థివదేహాన్ని నంద్యాల టిడిపి కార్యాలయానికి తరలించారు. అక్కడ నేతలు..కార్యకర్తలు నివాళులర్పించారు. అభిమానులు కన్నీళ్లపర్యంతమయ్యారు. సోమవారం నాడు జరిగే అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రులు..ఎమ్మెల్యేలు..నేతలు పాల్గొననున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

రేపు ఆళ్లగడ్డకు సీఎం చంద్రబాబు..

విజయవాడ : నంద్యాల ఎమ్మెల్యే భూమ నాగిరెడ్డి అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఈ అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

భూమా మృతిపై చిరు సంతాపం..

హైదరాబాద్ : టీడీపీ నేత భూమా నాగిరెడ్డి మృతి చెందడం, ఏపీ రాజకీయాలకు పెద్దలోటు అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు చిరంజీవీ అన్నారు. భూమా మృతిపై తన సానుభూతి వ్యక్తం చేశారు.

శరణం గచ్చామి ఆడియో వేడుకలు..

హైదరాబాద్ : శరణం గచ్చామి ఆడియో వేడుకలు నగరంలో జరిగాయి. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, ప్రతిపక్ష నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

15:34 - March 12, 2017

హైదరాబాద్ : 'శరణం గచ్చామి' ఆడియో ఫంక్షన్ వేడుకలు జరిగాయి. ఈ వేడుక కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ఇతరులు హాజరయ్యారు. సెన్సార్ బోర్డు బ్యాన్ చేసే పద్ధతిలో చేయడం జరిగిందని, విద్యార్థులు ఒక ఉద్యమంలా తీసుకొచ్చారో అప్పటి నుండి ఒక కదలిక ప్రారంభమైందని ఒక వక్త పేర్కొన్నారు. పోరాటం ద్వారానే సాధ్యమైందన్నారు. తెలంగాణ రిలవెన్స్..కులం యొక్క రిలవెన్స్ ఉందని, ప్రేమ్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించి సందేశంతో కూడుకున్న సినిమా రూపొందించడం అభినందనీయమన్నారు. రిజర్వేషన్ విషయాన్ని ఇందులో ప్రస్తావించారని తెలిపారు. మరింత విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

హోలీ వేడుకల్లో విషాదాలు..

భద్రాచలం : హోలీ వేడుకల్లో విషాదం నెలకొంది. హోలీ అనంతరం గోదావరి నదిలో స్నానానికని వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. జగిత్యాలలోని పెగడపల్లిలో ఎల్ఆర్ఎస్పీ కాలువలోకి స్నానానికని వెళ్లి ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. మహబూబాబాద్ తొర్రూఉ మండలం ఫతేపురంలో చెరువులో స్నానానికని వెళ్లి నరేష్ అనే యువకుడు మృతి చెందాడు. నల్గొండ ఉదయసముద్రంలో హోలీ అనంతరం ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు.

కూతురుని చంపేసిన తండ్రి..

హైదరాబాద్ : జూబ్లిహిల్స్ పీఎస్ పరిధిలోని రోడ్ నెంబర్ 23లో ఓ తండ్రి కుమార్తె కీర్తి (3)ను కొట్టి చంపాడు. తల్లి ఫిర్యాదు మేరకు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సౌరశక్తి విద్యుత్ కేంద్రంలో ఫైర్ ఆక్సిడెంట్..

నిర్మల్ : ముథోల్ మండలం చించాల వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న సౌరశక్తి విద్యుత్ కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలతో రూ. 30 వేల కోట్ల విలువైన సౌరపలకలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

15:12 - March 12, 2017

కర్నూలు : నంద్యాల ఎమ్మెల్యేల భూమా నాగిరెడ్డి భౌతికకాయాన్ని చూసేందుకు అభిమానులు..నేతలు..భారీగా తరలివస్తున్నారు. ఆదివారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో భూమా నాగిరెడ్డి ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. భూమా ఇకలేరన్న విషయం టిడిపి శ్రేణులు దిగమింగులేకపోతున్నారు. భూమ నాగిరెడ్డి మృతికి పలువురు సంతాపం తెలియచేస్తున్నారు. కాసేపటి క్రితం ఆసుపత్రి నుండి నంద్యాల టిడిపి కార్యాలయానికి తరలించారు. ప్రజలు..టిడిపి నేతలు..కార్యకర్త సందర్శనార్థం తరలించారు. భారీగా అభిమానులు తరలిస్తుండడడంతో పార్టీ కార్యాలయ ప్రాంతం కిక్కిరిసిపోయింది. పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భూమాకు నివాళులు అర్పించేందుకు..వారి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ నంద్యాలకు రానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఆయన స్వగృహానికి తరలించి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రయలకు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు.

14:57 - March 12, 2017

మిరియాలు..అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఇంగువ వంటి వాటిని ఆహార పదార్థాల తయారీలో తప్పనిసరిగా ఉపయోగించాలి. వీటిని తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్ వంటి ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు.
గ్లాసు గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకోని తాగడం వల్ల జలుబు, గొంతునొప్పి వంటి రాకుండా ఉంటాయి.
క్రమం తప్పకుండా నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
ఫైబర్ తో పాటు పోషకాలు అధికంగా లభించే పాలకూర, మెంతికూర, అరటికాయ, సోరకాయ వంటి వాటిని తీసుకోవడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి దోహద పడుతాయి.

భూమా మృతిపై వెంకయ్య సంతాపం..

ఢిల్లీ : భూమా నాగిరెడ్డి మృతి పట్ల కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సంతాపం తెలియచేశారు. జిల్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన నేత అని వెంకయ్య పేర్కొన్నారు.

16న అమరీందర్ సింగ్ ప్రమాణం..

అమృత్ సర్ : కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా మార్చి 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆరోగ్యం..విద్యపై దృష్టి సారిస్తానని అమరీందర్ సింగ్ మీడియాకు తెలిపారు.

14:14 - March 12, 2017

విజయవాడ : సిట్టింగ్ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి అకాలమరణంతో టిడిపిలో విషాదం నెలకొంది. ఆదివారం ఉదయం భూమాకు తీవ్రమైన గుండె పోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. దీనితో కర్నూలు జిల్లా ప్రజలు, భూమా కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. భూమా కుమార్తె అఖిల ప్రియకు ఫోన్ చేసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఎల్లుండికి వాయిదా పడనున్నాయి. ఆ సమయంలో విజయవాడలో అసెంబ్లీ స్ట్రాటజీ సమావేశం జరగుతోంది. ఒక్కసారిగా షాక్ తిన్న టిడిపి శ్రేణులు స్ట్రాటజీ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. రేపు జరగబోయే భూమ అంత్యక్రియలకు టిడిపి శ్రేణులు కదలి రానున్నారు. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. శనివారం భూమా నాయకత్వంలో సీఎం చంద్రబాబు నాయుడిని పలువురు నేతలు కలిశారు. భవిష్యత్ లో మంత్రివర్గంలో తీసుకోవాలని బాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ అతని మృతితో బాబు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.

14:04 - March 12, 2017

ప్రముఖ హీరోలతో నటించే ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు కదా..వారితో నటిస్తే మంచి పేరు..మంచి అవకాశాలు వస్తాయని పలువురు ఆశ పడుతుంటారు. కొంతమందికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంటుంది. ఇందులో ప్రముఖంగా హీరోయిన్స్ ఉంటుంటారు. అగ్ర కథానాయకులతో నటించాలని వీరు తాపత్రయ పడుతుంటారు. కానీ బాలీవుడ్ ముద్దుగుమ్మ 'కంగనా రనౌత్' రూటే సపరేట్ అంటోంది. ముక్కుసూటిగా తన అభిప్రాయాలను చెప్పేస్తుందని టాక్. తాజగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. తన కెరీర్ ఉన్నతంగా ఉందని, గతంలో 'ఖాన్' త్రయంతో నటించాలని ఆశించినట్లు పేర్కొంది. కానీ 'తను వెడ్స్ మను' సినిమా అనంతరం తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని, ‘ఖాన్ల' త్రయంతో నటించిన తరువాత వచ్చే క్రేజ్ తనకవసరం లేదని కుండబద్ధలు కొట్టింది. హీరో ’షారూఖ్' అంటే తనకు అభిమానమని ఆయనతో నటించే అవకాశం వచ్చినా చేయనని చెబుతానని 'కంగానా' స్పష్టం చేసింది.

13:51 - March 12, 2017
13:48 - March 12, 2017

గుంటూరు : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి సంతాపంగా రేపు ఏపీ శాసన సభ, మండలికి ప్రభుత్వం సెలవు ప్రకటించింది.. రేపు ప్రవేశపెట్టాలనుకున్న బడ్జెట్‌ను వాయిదావేసింది.. మంగళవారం అసెంబ్లీ, మండలి సమావేశం కానున్నాయి.. సభలో భూమా కన్నుమూతపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.. ఆ తర్వాత సభను వాయిదావేయనున్నారు.. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు.. బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీని బీఏసీలో చర్చించి నిర్ణయించనున్నారు.

 

13:47 - March 12, 2017

కర్నూలు : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. ఇవాళ ఉదయం అహోబిలం నుంచి ఆళ్లగడ్డకు వస్తుండగా ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు భూమాను హుటాహుటిన ఆళ్లగడ్డ ఆస్పత్రిలో చేర్పించారు.. అక్కడ ప్రథమ చికిత్స అందించాక నంద్యాల ఆస్పత్రికి తరలించారు.. సురక్షా ఆస్పత్రిలో నాగిరెడ్డికి వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితంలేకుండా పోయింది.. రేపు ఆళ్లగడ్డలో భూమా భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. మరోవైపు భూమా మృతిపట్ల చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు..
హృద్రోగ సమస్యతో బాధపడుతున్న నాగిరెడ్డి 
నాగిరెడ్డి 20ఏళ్లక్రితంనుంచి హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారు.. ఇప్పటికే ఆయనకు రెండుసార్లు గుండెపోటు వచ్చింది.. గతంలో ఒకసారి బైపాస్‌ సర్జరీకూడా చేశారు.. మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది.. రెండోసారి గుండెపోటు సమయంలో బైపాస్‌ సర్జరీ చేశారు.. ఇవాళ మూడోసారి రావడంతో వైద్యులు ఆయన్ని కాపాడలేకపోయారు..
1964 సం.లో నాగిరెడ్డి జననం.. 
భూమా నాగిరెడ్డి 1964 జనవరి 8న దొర్నిపాడు మండలంలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు.. తల్లిదండ్రులు భూమా బాలిరెడ్డి... ఈశ్వరమ్మలకు భూమా చిన్నకుమారుడు... అక్కడ ఫ్యాక్షనిజం కారణంగా తండ్రి బాలిరెడ్డి.... తన కొడుకు భూమాను దూర ప్రాంతంలో ఉంచి చదివించాలనుకున్నాడు.. చెన్నైలోని సీబీఎస్ ఈలో చేర్పించాడు.. అక్కడ ఇంటర్‌వరకూ చదువుకున్న నాగిరెడ్డి... వైద్య విద్యకోసం బెంగళూరు వెళ్లాడు.. ఇంతలో తన తండ్రి హత్యకు గురికావడంతో తిరిగి సొంతూరుకు వచ్చేశాడు.. తండ్రి మృతి తర్వాత ఆయన జీవితమే మారిపోయింది.. మాజీ మంత్రి ఎస్ వీ సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణిని వివాహం చేసుకున్నాడు... వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.. 
1987లో రాజకీయ ప్రవేశం 
పూర్తి రాజకీయ నేతగా మారిన భూమా అంచెలంచెలుగా ఎదిగాడు. 1987లో రాజకీయ ప్రవేశం చేశాడు.. నరసాపురం సింగిల్‌ విండో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.. 1988లో ఆళ్లగడ్డ ఎంపీపీగా గెలుపొందాడు.. 1992లో జరిగిన ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు.. 
రెండుసార్లు ఎమ్మెల్యేగా... మూడుసార్లు ఎంపీగా 
ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న నాగిరెడ్డి సోదరుడు భూమా శేఖర్‌ రెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఆ స్థానంలో పోటీచేసి గెలుపొందాడు. 1996లో నంద్యాల లోక్‌సభకు పీవీ నరసింహరావు రాజీనామా చేయడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి.. అప్పుడు టీడీపీ నుంచి పోటీచేసిన భూమా.. రంగయ్య నాయుడిపై 4లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.. రెండుసార్లు ఎమ్మెల్యేగా... మూడుసార్లు ఎంపీగా పనిచేశాడు.. 1994, 2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డనుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.. 1996, 1998, 1999లో నంద్యాలనుంచి టీడీపీ తరపున లోక్‌సభకు పోటీచేసి గెలుపొందాడు.. 
భూమా మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి  
భూమా నాగిరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమా కుటుంబ సభ్యులకు చంద్రబాబు సంతాపం తెలిపారు. భూమా మృతి పార్టీకి, కర్నూలు జిల్లా ప్రజలకు తీరని లోటు అని అన్నారు. టీడీపీతో భూమా కుటుంబానికి దశాబ్ధాల అనుబంధం ఉందని చంద్రబాబు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి భూమా ఎంతో కృషి చేశారన్నారు. 

 

రేపు ఆళ్లగడ్డలో భూమా భౌతిక కాయానికి అంత్యక్రియలు

కర్నూలు : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. ఇవాళ ఉదయం అహోబిలం నుంచి ఆళ్లగడ్డకు వస్తుండగా ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు భూమాను హుటాహుటిన ఆళ్లగడ్డ ఆస్పత్రిలో చేర్పించారు.. అక్కడ ప్రథమ చికిత్స అందించాక నంద్యాల ఆస్పత్రికి తరలించారు.. సురక్షా ఆస్పత్రిలో నాగిరెడ్డికి వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితంలేకుండా పోయింది.. రేపు ఆళ్లగడ్డలో భూమా భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. మరోవైపు భూమా మృతిపట్ల చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు..

 

13:37 - March 12, 2017

విశాఖ : కొండకోనల్లో నివసించే ఆదివాసీలకు కష్టమొచ్చింది. ఆకులు, అలముల మధ్య బతికే గిరిపుత్రులు నీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మండుటెండలకు తమ గొంతులు ఎండిపోతున్నాయని గిరిపుత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తూర్పు ఏజెన్సీ ప్రాంత ఆదివాసీల తాగునీటి కష్టాలపై 10టివి స్పెషల్‌ ఫోకస్‌....!  
నీటి కోసం ఆదివాసీల చెలమల బాట
గుక్కెడు నీటి కోసం ఆదివాసీల చెలమల బాట.. మండు వేసవిలో నీళ్ల కోసం మైళ్ల దూరం నడక...కొండకోనల్లో నీరు తాగి అనారోగ్యం పాలవుతున్న గిరిజనం... చుక్క నీటి కోసం తూర్పు ఏజెన్సీ ప్రాంతం అల్లాడుతోంది. గుక్క తడుపుకొనేందుకు ఆదివాసీ జనం విలవిల్లాడుతున్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలలో పాటు గిరిజనుల నీటి కష్టాలూ పెరుగుతున్నాయి. అనేక మంది గిరిజన మహిళలు చెట్లు పుట్టల మధ్య.. రాళ్లు రప్పల మధ్య మైళ్ల దూరం నడిచి కడివెడు నీళ్ల కోసం నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఎక్కడో సుదూర ప్రాంతాల్లోని అడవిలో చెలమల నుంచి నీరు తోడుకోవాల్సి వస్తోంది. అంతదూరం వెళ్లినా చివరికి మంచినీరు దొరక్క..  చెలమల నీళ్లు తాగి అడవి బిడ్డలు అనారోగ్యం పాలవుతున్నారు.   
అలంకార ప్రాయంగా ప్రభుత్వ పథకాలు 
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని 7 మండలాలు 120 పంచాయతీల్లో 428 మంచి నీటి పథకాలు ఉన్నా...గిరిజన గూడేల్లో ఈ పథకాలు సగానికి పైగా అలంకార ప్రాయంగా మిగిలిపోయాయి. రక్షిత మంచినీటి పథకాలు లేని 354 కాలనీల్లో 3799 చేతి పంపులుండగా అందులో సగానికి పైగా పని చేయడం లేదు. దీంతో కొండవాగుల్లో చెలమలు తవ్వి తాగునీరు తెచ్చుకుంటున్న ఆదివాసీలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. కొండకోనల్లో, రాతినేలల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో కాలువలు, చెరువులు ఎండిపోయి మూగజీవాలు సైతం తాగునీటికి అల్లాడుతున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ విభాగం, చిన్నతరహా తాగునీటి ట్యాంకులు నిధులు లేక చతికిల పడ్డాయి. కోట్లాది రూపాయలతో నిర్మించిన భూపతిపాలెం, సూరంపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు, చెరువులు, చెక్‌డ్యాంలో నిర్వహణా లోపంతో మనుషులకే కాదు.. కనీసం పశువులకు కూడా నీటి చుక్క దొరకని పరిస్థితి నెలకొంది.  
మరమ్మతులు లేక బోసిపోయిన చెరువులు, చెక్‌ డ్యాంలు   
చిన్న నీటితరహా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 394 చెరువులు, 224 చెక్‌ డ్యాంలు మరమ్మతులు లేక బోసిపోయాయి.  ప్రతిఏటా నిధులు విడుదలవుతున్నా... చెరువుల్లో పూడిక తీయడం లేదు. మరమ్మతుల కోసం కేటాయిస్తున్న నిధులను అధికారులే మింగేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో వేసవి రాకుండాలే మన్యం ప్రజలు మంచినీటి సమస్యతో సతమతమవుతున్నారు. 
ప్రతిఏటా తాగునీటి సమస్య 
పోలవరం ముంపు మండలాలైన వీఆర్‌ పురం, కూనవరం, చింతూరు, ఎట్టపాక మండలాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడి ఆదివాసీలు ప్రతిఏటా తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నారు. కొండకోనలు, గూడాలు, మారుమూల ప్రాంతాల్లో జీవించే గిరిపుత్రుల గొంతులెండి పోతున్నా.. వారికి సమస్యను తీర్చిన నాథలే కరువయ్యారు. అక్కడక్కడ ఉన్న కాలువలు, వాగులు ఎండిపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి రాళ్ల మధ్య నిల్వ ఉన్న నీటిని తాగి అనారోగ్యం బారిన పడుతున్నారు గిరిజనులు. చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ సుదూరన గల గోదారి నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. కొండల మధ్య నీటిని తోడుకోవడానికి వందల అడుగుల లోతుకు దిగాల్సి వస్తోందని గిరిపుత్రులు తమ గాధను వెలిబుచ్చుతున్నారు.  
బిందెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాలి : స్థానికులు 
మోటార్లు మొరాయిస్తున్నా... బోర్లు పనిచేయకుండా పోయినా.. అధికారులు, పాలకులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆదివాసీలు వాపోతున్నారు. బిందెడు నీటి కోసం కిలోమీటర్లు దూరం నడవాల్సి వస్తోందని తమ బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా తమకు మంచినీటిని అందించాలని, తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని తూర్పు గోదావరి ప్రాంత ఆదివాసీలు కోరుతున్నారు.   

 

13:29 - March 12, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి అధికారం తమదేనని ధీమాతో బరిలోకి దిగిన ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌కు పరాభవం తప్పలేదు. కుటుంబ కలహాల నేపథ్యంలో అఖిలేష్‌ యాదవ్‌కు ప్రజాదరణ బాగా పెరిగినప్పటికీ విజయం మాత్రం ఆయనను వరించలేదు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి ఓటమికి కారణాలేంటి? 
ఎస్పీలో నెలకొన్న కుటుంబ కలహాలు
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిఎం రేసులో అఖిలేష్‌ యాదవ్‌ అందరికన్నా ముందున్నట్లు ఒపినియన్‌ పోల్స్‌లో వెల్లడైంది. సమాజ్‌వాది పార్టీలో కుటుంబకలహాలు తారాస్థాయికి చేరుకున్నా...అఖిలేష్‌కు మాత్రం ప్రజాదరణ చెక్కు చెదరలేదు. కాంగ్రెస్‌తో జతకట్టడం మాస్టర్‌ స్ట్రోక్‌గా భావించారు. ఎన్నికల ప్రారంభంలో అఖిలేష్‌ ఇమేజ్‌ ఎంత పెరిగిందో  రాను రాను తగ్గుతూ వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న కుటుంబ కలహాలు ఓటమికి కారణమంటున్నారు.   అఖిలేష్‌ యాదవ్‌, రాంగోపాల్‌ యాదవ్‌ ఓ వైపు, ములాయం, శివపాల్‌ యాదవ్‌ మరోవైపు పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ సింబల్‌ కోసం ఇరువర్గాల మధ్య పోరు ఈసీ వరకు వెళ్లింది. ఈ పోరులో అఖిలేష్‌ వర్గం పేచేయి సాధించినప్పటికీ... పోరు పార్టీ ఐక్యతను దెబ్బతీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎస్పీలో టికెట్ల పంపకాల్లో విభేదాలు 
సమాజ్‌వాది పార్టీ టికెట్ల పంపకాల్లో కూడా విభేదాలు పొడసూపాయి. శివపాల్‌ యాదవ్‌ ఓ లిస్టు ప్రకటిస్తే...అఖిలేష్‌ మరో లిస్ట్‌ ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో  అఖిలేష్‌  తన జాబితానే ఫైనల్‌ చేశారు. అయితే కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు ఇచ్చినందుకు పార్టీలో అసంతృప్తి పెరిగింది.
పాలనలో అఖలేష్ కు అనుభవం తక్కువ
ముఖ్యమంత్రిగా అఖిలేష్‌ యాదవ్‌కు ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్నప్పటికీ పాలనలో అనుభవం తక్కువ. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, అవినీతి, అత్యాచార ఆరోపణలు  వెలుగు చూశాయి. ఉద్యోగుల పట్ల భేదభావం చూపినట్లు ఆరోపణలున్నాయి. ప్రతిష్టాత్మక ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష పత్రాలు లీక్‌ కావడం లాంటి అంశాలు యువత ఆగ్రహానికి కారణమయ్యాయి. 
అఖిలేష్‌ అంచనా తారుమారు
కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో అఖిలేష్‌ చేయి కలపడం వల్ల 3 వందల సీట్లు సాధించొచ్చని అఖిలేష్‌ అంచనా కూడా తారుమారైంది. ఒకరి ఓట్లు మరొకరి ట్రాన్స్‌ఫర్‌ అవుతాయనుకుంటే అది బెడిసికొట్టింది. కాంగ్రెస్‌ తరపున రాహుల్‌ తప్ప ఇతర నేతలెవ్వరూ ప్రచారం చేయలేదు. అఖిలేష్‌-రాహుల్‌ జోడి ప్రచారం యువతను ఆకట్టుకున్నా ఓట్లను మాత్రం రాల్చలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మాయావతి వంద మంది ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం కూడా ఎస్పీని దెబ్బతీసింది. మైనారిటీ ఓట్లు ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి, బిఎస్పీల మధ్య చీలిపోవడం బిజెపికి లాభం చేకూరిందని విశ్లేషకులు చెబుతున్నారు.  

 

13:27 - March 12, 2017

ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు 'దిల్' రాజు సతీమణి 'అనిత' (46) కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో శనివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో 'దిల్' రాజు అమెరికాలో ఉన్నారు. ‘ఫిదా' సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన అక్కడున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ నటులు సంతాపం ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర నిర్మాణ సంస్థను స్థాపించిన 'దిల్' రాజు పలు విజయమంతమైన చిత్రాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తొలి చిత్రం 'దిల్' తో అద్భుత విజయాన్ని అందుకున్న అప్పటి నుండి తన పేరును 'దిల్ రాజు' గా మార్చుకున్నారు. దిల్ రాజు, అనిత దంపతులకు ఇటీవలే కుమార్తె హన్హిత రెడ్డి వివాహం జరిపిన సంగతి తెలిసిందే.

13:18 - March 12, 2017

భారత జట్టుకు ప్రముఖ క్రికేటర్ 'ద్రవీడ్' కోచ్ గా రానున్నారా ? ప్రస్తుతం కోచ్ గా ఉన్న 'అనీల్ కుంబ్లే' కు పదోన్నతి ఇస్తారా ? టీమ్ ఇండియా డైరెక్టర్ గా 'కుంబ్లే' ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోందని టాక్. గత కొన్ని రోజులుగా టీమిండియా విజయపథంలో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ జట్టును కుంబ్లే..జూనియర్ జట్టును ద్రవీడ్ చక్కగా నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనను మరింత పటిష్టపరచాలని, వీరిద్దరికీ కీలక బాధ్యతలు అప్పచెప్పాలని బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) ఆలోచిస్తోందని సమాచారం.
గత ఏడాది జూన్ లో ప్రధాన కోచ్ గా 'కుంబ్లే' నియమితులైన సంగతి తెలిసిందే. కోచ్ గా వచ్చిన అనంతరం టీమిండియా జట్టు పలు విజయాలను సొంతం చేసుకుంది. 2–0తో వెస్టిండీస్‌పై, 3–0తో న్యూజిలాండ్‌పై, 4–0తో ఇంగ్లండ్‌పై, 1–0తో బంగ్లాదేశ్‌పై ఘనవిజయాలు నమోదు చేసింది.

13:13 - March 12, 2017

భూమా నాగిరెడ్డి మృతి పట్ల జగన్ సంతాపం

కర్నూలు : నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి పట్ల వైసీపీ అధినేత జగన్ సంతాపం తెలిపారు. భూమా మృతి బాధాకరమన్నారు. 

భూమా నాగిరెడ్డి మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

కర్నూలు : నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. భూమా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భూమా మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని బాబు అన్నారు. 

13:04 - March 12, 2017

కాస్ట్లీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించే దర్శకుల్లో 'శంకర్' ఒకరు. తాజాగా నిర్మిస్తున్న 'రోబో 2.0’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘రోబో' కు ఇది సీక్వెల్. ఈ చిత్రంలో 'రజనీకాంత్' ప్రధాన పాత్ర పోషిస్తుండగా బాలీవుడ్ హీరో 'అక్షయ్ కుమార్' విలన్ గా..’ఏమీ జాక్సన్' ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్ర టీజర్ కు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ లో టీజర్ విడుదల చేయాలని భావిస్తోందని తెలుస్తోంది. టీజర్ అనంతరం దసరా సందర్భంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేయాలని 'శంకర్' యోచిస్తున్నారని టాక్. తెలుగు..తమిళ..హిందీ భాషల్లో చిత్రం తెరకెక్కుతోంది. భారీ తారాగణం..భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఎంత మేరకు ప్రజాదరణ పొందుతుందో చూడాలి.

కాసేపట్లో నంద్యాల టీడీపీ కార్యాలయానికి ఎమ్మెల్యే భూమా భౌతికకాయం

కర్నూలు : కాసేపట్లో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి భౌతికకాయాన్ని నంద్యాల టీడీపీ కార్యాలయానికి తరలించనున్నారు. కార్యకర్తలు, అభిమానులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. 

 

12:43 - March 12, 2017

కర్నూలు : నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇకలేరు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన అస్తమించారు. తీవ్ర గుండెపోటు రావడంతో భూమా నాగిరెడ్డి మృతి చెందారు. భూమా నాగిరెడ్డి గుండోపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం ఆయన్ను ఆళ్లగడ్డ రామలింగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం నంద్యాల సురక్ష ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించారు. ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి  విషమించడంతో మృతి చెందారు. ఇప్పటికే భూమాకు రెండు సార్లు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం మూడో సారి భూమాకు గుండెపోటు వచ్చింది. కుమార్తె అఖిలప్రియ నంద్యాలకు వెళ్లి తండ్రి భూమా వెంటనే ఉన్నారు. అయితే అంతకముందు ఆయన ఆరోగ్య వార్త విన్న సీఎం చంద్రబాబు భూమాను హెలికాప్టర్ లో అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా భూమాను హైదరాబాద్ కు తరలించే యోచన చేశారు. శంషాబాద్ నుంచి నంద్యాలకు ప్రత్యేక హెలికాప్టర్ పంపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భూమాను హెలికాప్టర్ లో హైదరాబాద్ తరలించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కానీ పరిస్థితి విషమించడంతో భూమా మృతి చెందారు. భూమా మృతితో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగారు. గతంతో ఆయన భార్య భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 24 ఏప్రిల్ 2104సం.లో జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభ దుర్మరణం చెందారు. 
1964 జనవరి 8న భూమా నాగిరెడ్డి జననం 
1964 జనవరి 8న భూమా నాగిరెడ్డి జన్మించారు. కర్నూలు జిల్లా దొర్నపాడు మండలం కొత్తపల్లిలో జన్మించారు. నాగిరెడ్డి తల్లిదండ్రులు భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మ. భూమా నాగిరెడ్డికి ముగ్గురు పిల్లలున్నారు. జిల్లాలో భూఆ తిరుగులేని నేతగా ఉన్నారు. 

 

భూమా నాగిరెడ్డి అస్తమయం

కర్నూలు : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇకలేరు. తీవ్ర గుండె పోటుతో మృతి మృతి చెందారు. నంద్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

12:23 - March 12, 2017
12:15 - March 12, 2017

సంగారెడ్డి : రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం భావించినా.. అధికారుల తీరుతో ఆ ఆశయం నెరవేరడం లేదు. రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాల్సిన అధికారులు.. దళారులతో కుమ్మక్కై రైతులకు మొండి చేయి చూపిస్తున్నారు. దీంతో రైతులు రోజుల తరబడి మార్కెట్‌యార్డులోనే ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. 
కొత్తగా గోదాంల నిర్మాణం
ఇది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మార్కెట్‌ యార్డు. ఇది మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. నియోజకవర్గంలో కొత్తగా గోదాంలు నిర్మించిన సర్కార్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే సదుద్దేశంతో కందుల కొనుగోలు విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 
రైతులకు ప్రయోజనం లేకుండాపోయిన విక్రయ కేంద్రం 
అయితే.. ఇక్కడ వరకు బాగానే ఉంది. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో కందుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా... రైతులకు ప్రయోజనం లేకుండాపోతుంది. రైతుల వద్ద సరుకు కొనుగోలు చేయాల్సిన అధికారులు దళారులతో కుమ్మక్కై.. వారి వద్ద నుంచే సరుకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో అనేక ప్రాంతాల నుంచి కందులు తీసుకొచ్చిన రైతులు మార్కెట్‌ యార్డులో రోజుల తరబడి ఉంటున్నారు. 
మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పట్టించుకోవడం లేదని వాపోతున్న రైతులు 
రోజుల తరబడి వేచి చూస్తున్నా తమకు టోకెన్లు ఇవ్వని అధికారులు.. దళారులు, వ్యాపారులకు మాత్రం వెంటనే టోకెన్లు ఇచ్చి సరుకు కొనుగోలు చేస్తున్నారని రైతులంటున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దళారుల వద్ద సరుకు కొంటే.. మా పరిస్థితి ఏంటని రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని కందులను కొనుగోలు చేసేలా చూడాలని కోరుతున్నారు. 

 

12:10 - March 12, 2017
12:08 - March 12, 2017

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. గవర్నర్‌ దంపతులు హోలీ సంబరాల్లో మునిగితేలారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్‌ దంపతులు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. 
జగిత్యాలలో...
జగిత్యాల జిల్లాలో హోలీ సంబరాలు హోరెత్తాయి. అంగరంగ వైభవంగా జరిగాయి. క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ అనంతశర్మ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. చెడును వదిలి మంచి మనసుతో సమాసమజం నిర్మాణం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. 

 

12:04 - March 12, 2017

నల్గొండ : ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య తదితర హామీలను నెరవేర్చేవరకు సీఎం కేసీఆర్‌ను ఎర్రజెండా పార్టీ వదిలిపెట్టదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. బడుగులు, అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సబ్‌ప్లాన్‌ చట్టం తేవాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. 
సామాజిక న్యాయం ద్వారానే పేదలకు న్యాయం : తమ్మినేని
దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం తదితర హామీలను నెరవేర్చే వరకు కేసీఆర్‌ ఎర్రజెండా పార్టీ వదిలిపెట్టదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీల అభివృద్ధికి సబ్‌ప్లాన్‌ చట్టాలు తెచ్చి వారిని అభివృద్ధి చేయాలని తమ్మినేని సూచించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం సబ్‌ ప్లాన్‌ చట్టం బిల్లు పెట్టకపోతే సీఎం కేసీఆర్‌పై సీపీఎం దండయాత్ర తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో సామాజిక న్యాయం ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని తమ్మినేని అన్నారు. 
జనాభా దమాషాలో బడ్జెట్‌లో వాటాలు కేటాయించాలి : జాన్‌వెస్లీ 
వేల సంవత్సరాలుగా అట్టడుగు వర్గాలకు భూమి లేకుండా అగ్రకుల వర్గాలు, భూస్వాములు కుట్రలు చేస్తున్నారని, నిరుపేదలకు భూమిని పంచేందుకు ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పాదయాత్ర బృందం సభ్యులు జాన్‌వెస్లీ ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జనాభా దమాషాలో బడ్జెట్‌లో వాటాలు కేటాయించాలని జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. 
మహాజన పాదయాత్రకు ఘన స్వాగతం 
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంతో సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 147 రోజులు పూర్తి చేసుకుంది. యాదాద్రి జిల్లా.. రామన్నపేట వద్ద తమ్మినేని బృందానికి సీపీఎం శ్రేణులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రామన్నపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తమ్మినేని బృందానికి స్థానికులు తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఇవాళ  తమ్మినేని బృందం నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట, నీరునెమ్ల, బోగారం, సిరిపురం గ్రామాల్లో 3900 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.  ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య, సినీ నటుడు మాదాల రవి పాదయాత్రకు మద్దతు తెలిపారు.  నల్గొండ జిల్లాలో గ్రామీణ నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. 

 

11:59 - March 12, 2017

హైదరాబాద్ : వాణ్నిచూసి నేర్చుకోరా..! ఇది.. చదువులోనో, పనిపాటల్లోనో వెనుకబడిన కుమారుడికి తండ్రిచేసే ఉపదేశం. కచ్చితంగా ఇదే చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ప్రజాసేవలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యను ఫాలో అవండని గులాబీపార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్‌. ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వేలో సున్నం రాజయ్య ప్రజాసేవకు తెలంగాణ సీఎం ముగ్ధుడయ్యారు. 
సున్నం రాజయ్యను చూసి నేర్చుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం హితవు
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల పనితీరుపై సర్వే నిర్వహించిన  ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? అనే కోణంలో సాగిన ఈసర్వేలో అవిభాజ్య ఖమ్మం జిల్లాకు చెందిన పది నియోజకవర్గాలున్నాయి. ఈ రెండు సర్వేల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన మార్కుల్లో మార్పులు కనిపించాయి. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ నిత్యం ప్రభుత్వం పని తీరును ప్రశ్నిస్తున్న  భద్రాచలం ఎంఎల్ఏ సున్నం రాజయ్యే ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచారు. రాజయ్యను చూసి మీ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని ఖమ్మంజిల్లా ఎంఎల్ఏలకు, ఎంఎల్ సీలకు దిశానిర్ధేశం చేశారు సీఎం. 
సున్నం రాజయ్యతో పోటీలో నిలవలేకపోయిన  మంత్రి తుమ్మల
ప్రజల మనన్నలు పొందటానికి అధికారం, పదవులు అవసరం లేదని  రాజయ్యలా మీరు కూడా పని చేయాలని.. చెప్పకనే తమపార్టీ నేతలకు చెప్పేశారు  సీఎంకేసీఆర్‌.  అధికారం , మంత్రి పదవి , ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా..  అధికారం అర్థబంల లేని సీపీఎంపార్టీకి చెందిన  భద్రాచలం ఎంఎల్ ఏ సున్నం రాజయ్యతో సరితూగలేకపోయారు. ఇదే విషయం సీఎం నిర్వహించిన సర్వేలో నిరూపితమైంది. ప్రతిపక్షాలు విమర్శించిన విధంగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పని విధానం ఉందని సర్వే తేటతెల్లం చేసింది.
ఎమ్మెల్యేలుగా సీనియర్‌ నేతలు, యువ నేతలు ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో కొలువుదీరిన శాసనసభలో జిల్లాకు చెందిన పలువురు సీనియర్‌ నేతలు, యువ నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఐదేళ్ల పదవీకాలంలో 33 నెలల కాలం ముగిసింది. మళ్లీ 2019 సాధారణ ఎన్నికలకు అంతా సిద్ధం కావాల్సిందే. రాష్ట్రంలోని 119 స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే మళ్లీ అధికారంలోకి వచ్చే వీలుంది. ఈనేపథ్యంలో జిల్లాల వారీగా తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్వే నిర్వహించారు. విడివిడిగా రెండు సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. నిర్దేశిత ప్రశ్నావళితో నియోజకవర్గాల వారీగా సర్వే చేశారు. సదరు నివేదికలను తెరాస శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. ఇదేక్రమంలో జిల్లాల వారీగా సమావేశమై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులతో చర్చించారు. సర్వేలో దిగువ స్థాయిలో ఉన్న వారి విషయంలో సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. పనితీరు బాగాలేని వారు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని సూచించినట్లు తెలిసింది. ప్రజలకు చేరువలో ఉండి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తే జనం అక్కున చేర్చుకుంటారని.. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యను ఉధహరిస్తూ   సీఎం గులాబీపార్టీ ఎమ్మెల్యేలకు ఒక రకంగా క్లాసుపీకినట్టు సమాచారం.  

 

11:43 - March 12, 2017

కృష్ణా : జిల్లాలోని కలిదిండి మండలం కొరుకొల్లులో దారుణం జరిగింది. యువకుడిని కాళ్లు, చేతులు కట్టేసిన వీఆర్‌వో అతన్ని చితకబాదాడు. బాలిక వద్ద నుంచి సైకిల్‌ తాళం తీసుకున్నాడంటూ దాడి చేశాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:38 - March 12, 2017
11:37 - March 12, 2017

ప్రకాశం : మారుమూల గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌలభ్యాలను అనుసంధానిస్తామని ప్రభుత్వాలు గొప్పలు చెప్తున్నాయి. కానీ అవన్నీ వాగ్థానాలే.. వాస్తవాలు కాదు. అక్కడెక్కడో రాజస్థాన్‌, రాంచీ వంటి ప్రాంతాల్లో ఒకప్పుడు బస్సులపై ప్రయాణం చూసి అమ్మో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ తరహా ప్రయాణం తిప్పలు మన పిల్లలూ ఎదుర్కొంటున్నారు. నిత్యం డీలక్స్‌, సూపర్‌ డీలక్స్, గరుడ, ఇంద్ర ఏసీలంటూ డప్పుకొట్టుకునే ఏపీఎస్‌ఆర్‌టీసీ తలదించుకోవాల్సిన ఘటనలు మూలనున్న పల్లెల్లోనే కాదు ప్రధాన రహదారులపైనా దర్శనమిస్తోన్న వైనం గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది.
ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి  
ఈ సన్నివేశాలు రాష్ట్ర రవాణా శాఖమంత్రి శిద్దారాఘవరావు సొంత జిల్లా అయిన ప్రకాశం జిల్లా గిద్దలూరు బెస్తవారిపేట మధ్య నిత్యం కన్నిస్తూనే వుంటాయి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు స్థానికులు ఊపిరి బిగపట్టి చూస్తుంటారు. సడెన్ బ్రేక్‌ కొట్టాల్సి వచ్చినప్పుడు, ఏవైనా విద్యుత్ లైన్లు ఎదురైనప్పుడు పరిస్థితేంటనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక విద్యార్థులకు ఈ పరిస్థితి నిజంగా ప్రాణ సంకటమని చెప్పుకోవచ్చు. ఇలా బస్ టాప్ సర్వీస్‌లను ప్రోత్సహిస్తోన్న ఆర్టీసీ యాజమాన్యం వైఖరి ఎంత నిర్లక్ష్యమో ఇట్టే అర్థమవుతోంది. బెస్తవారిపేట నుంచి గిద్దలూరు వెళ్లాలన్నా... గిద్దలూరు నుంచి బెస్తవారిపేట రావాలన్నా ఇదే పరిస్థితి. ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ఈ రూట్లో నడిచే ఆర్టీసీ బస్సులు రైతులు, కూలీలు విద్యార్థులతో కిటకిటలాడుతుంటాయి. బస్సులోపల ఊపిరాడకుండా ప్రయాణీకులను సిబ్బంది కుక్కి కుక్కి ఎక్కించుకుంటారు. బస్సులో ఖాళీ లేకపోతే బస్సుపైకి తరలిస్తారు. స్కూలు విద్యార్థుల నుంచి కాలేజీ విద్యార్థుల వరకు ఇదే పరిస్థితి. అమ్మాయిల పరిస్థితి మరీ ఘోరం. గాలి చొరబడని బస్సులో ఎక్కాలంటే నరకం. దిగాలంటే అంతకుమించిన నరకం. ఒక్కొక్క సారి అమ్మాయిలు అని కూడా చూడకుండా సిబ్బంది బస్ టాప్ సర్వీస్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఇలా టికెట్ లెక్కల్లో మునిగిపోతున్న సిబ్బంది భద్రతను మాత్రం గాలికొదిలేస్తున్నారు. బస్ టాప్ సర్వీస్ కు తోడు సమయభావం పాటించని ఆర్టీసీ వైఖరి విద్యార్థులకు సమస్యగా మారింది.
అధికారులకు ఎంతగా చెప్పినా పట్టించుకోలేదన్న కండక్టర్ 
కాగా ఇందుకు సంబంధించి బస్సు కండెక్టర్‌ను టెన్‌ టీవీ ప్రశ్నించింది. అధికారులకు ఎంతగా చెప్పినా పట్టించుకోలేదని కండక్టర్ వివరణ ఇవ్వగా.. ఈ విషయంలో తక్షణ చర్యలకు ఉపక్రమిస్తామని ఆర్టీసీ ఆర్‌ యం స్పష్టం చేశారు. సర్వే  నిర్వహించి అదనపు బస్సులు అవసరమైన రూట్లలో వేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.
మంత్రి సొంత జిల్లాలో సంఘటనలు దురదృష్టకరం..  
మంత్రి శిద్దా రాఘవరావు సొంత జిల్లాలో ఈ తరహా సంఘటనలు జరగడం నిజంగా దురదృష్టం. నిత్యం హైదరాబాద్‌, బెంగళూరులకు ఏసీ బస్సులు కొత్తగా నడుపుతున్నామని చెప్పే మంత్రి సొంతింటి వ్యవహారాలను పూర్తిగా విస్మరించినట్టు కన్పిస్తోంది. సొంత జిల్లాలో టాప్ సర్వీస్ లు ప్రాణ సంకటంగా మారుతున్నా మంత్రి ఆర్టీసీ రూట్ల గురించిన ఆదేశాలు చేయకపోవడం నిజంగా శోచనీయం. కనీసం జిల్లాలో ఏ రూట్లలో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో... ఏ రూట్లలో విద్యార్థులు సమస్యలెదుర్కొంటున్నారో కనీసం తెలుసుకునే ప్రయత్నాలే మంత్రి  చేయలేదు. నిత్యం రాజకీయాలతో తలమునకలవుతూ వ్యాపారాలను చక్చబెట్టుకుంటోన్న మంత్రి జిల్లాలో ప్రజా రవాణా స్థితిగతులపై ఇకనైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రయివేట్ బస్సులకు ప్రోత్సాహమందించే అమాత్యులు ఇకనైనా ప్రజా రవాణాను చక్కదిద్దాల్సి వుంది.

11:17 - March 12, 2017

గుంటూరు : సేద్యం చేసేందుకు లక్షల్లో పెట్టుబడి కావాలి. తీరా శ్రమించి పంట పండిస్తే అమ్ముకునేందుకు దిక్కే ఉండదు. మార్కెట్‌లో పలికే ధరతో కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితే కూడా కనిపించడం లేదు. గిట్టుబాటు ధర లేక చేసిన అప్పులు తీర్చే మార్గం లేక గుంటూరు జిల్లా మర్చి రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 
గిట్టుబాటు ధర కోసం.. 
ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు.. దానిని అమ్ముకునేందుకు వెళ్తే  గిట్టుబాటు ధర పలకపోవడంతో కళ్లు చెమర్చుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మిర్చి రైతులు ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పత్తి, వరిలాంటి పంటల సాగుకు నీటి కొరత, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఈ ఏడాది మిర్చిపంటను విస్తారంగా సాగు చేశారు. విత్తనాలను అత్యధిక ధరలకు కొనుగోలు చేసి మరీ పంట పండించారు. మిర్చి నారు మొదలు, కోతల వరకు ఎకరానికి 50 నుంచి 60 వేల రూపాయల వరకు ఖర్చు చేశారు. రైతుల కష్టానికి 28 నుండి 30 క్వింటాళ్ల మిర్చి దిగుబడి వచ్చింది. పంట బాగా పండిందన్న ఆనందంలో ఉన్న రైతులకు.. ఆ ఆశ అంతలోనే ఆవిరైపోయింది. నెలరోజుల క్రితం వరకు మేలైన రకం మిర్చికి 14 వేల రూపాయల ధర పలకగా.. ప్రస్తుతం అది 6 వేలకు పడిపోయింది. దీంతో మిర్చి రైతులు దిగాలు పడిపోతున్నారు. అప్పులు తెచ్చి మరీ సాగు చేస్తే.. ఇప్పుడు వడ్డీలకు డబ్బులు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మిర్చి ధరలు తగ్గిపోవడంతో గుంటూరు మార్కెట్‌ యార్డు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్‌చేస్తున్నారు. 
మందకొడిగా క్రయ విక్రయాలు 
మిర్చి ధరలు పడిపోవడానికి అధిక దిగుబడే కారణమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఏపీతో పాటు.. కర్నాటక, మధ్యప్రదేశ్‌లలోనూ విస్తారంగా మిర్చి పండించడంతో పంట ఉత్పత్తి ధరలు పడిపోయాయంటున్నారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు ప్రభావం కూడా ఉందంటున్నారు. ఇదిలావుంటే.. ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఎగుమతి, కొనుగోళ్లు చూపేందుకు అనేకమంది ఆసక్తి కనబరచకపోవడం.. ప్రతి కొనుగోలు లెక్కలు చూపాల్సి ఉండడంతో క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయని రైతులంటున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మిర్చి రైతులను ఆదుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసేలా చూడాలని కోరుతున్నారు. 

11:09 - March 12, 2017

కర్నూలు : నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భూమా నాగిరెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆయన్ను ఆళ్లగడ్డ రామలింగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భూమాకు రెండు సార్లు గుండెపోటు వచ్చింది. కుమార్తె అఖిలప్రియ నంద్యాలకు బయల్దేరారు. భూమాను హెలికాప్టర్ లో హైదరాబాద్ తరలించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భూమాకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శంషాబాద్ నుంచి నంద్యాలకు ప్రత్యేక హెలికాప్టర్ ను పంపించే ఏర్పాట్లు నారా లోకేష్ చేస్తున్నారు. 

10:58 - March 12, 2017

హైదరాబాద్ : బల్దియా ఖజానా వెలవెలబోయిందా..? ఆర్థిక ఇబ్బందుల్లో జీహెచ్‌ఎంసీ కొట్టుమిట్టాడుతోందా..? అప్పులు చెయ్యకుంటే రోజులు గడవవా..? ఆభివృద్థి పనులు పట్టాలెక్కాలంటే లోన్‌ తీసుకోవాల్సిందేనా..? అంటే అవుననే అంటున్నాయి బల్దియా వర్గాలు. పన్నులు పెంచొద్దంటారు.. అయినా  పైసా విదల్చరు. ఇది సర్కార్‌ తీరు. మరోవైపు భారీ ప్రాజెక్టులు రూప‌క‌ల్పన చేసి.. అమ‌లు చేయాలంటూ జీహెచ్‌ఎంసీకి హుకూం జారీ చేస్తుంది. దీంతో అప్పుల బాట ప‌ట్టింది బ‌ల్దియా.
బల్దియాకు బతుకు భారం
బల్దియా త‌ల‌కు మించిన భారం ఎత్తుకుంది. ప్రభుత్వ ప‌థ‌కాల అమ‌లు బాధ్యత‌ను మోస్తుంది కార్పొరేష‌న్. అస‌లే ఆర్థిక  ప‌రిస్థితి అంతంత‌గా ఉంది. గ‌డిచిన కొద్ది నెల‌లుగా రోజువారి మెయింటెనెన్స్‌ క‌ష్టంగా మారింది. నెల చివ‌రి నాటికి ప‌న్నులు వ‌సూలు కాకుంటే జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరింది. దీంతో ఇంత‌కాలం ఉన్న డిపాజిట్లు క‌రిగిపోయాయి. దీనికి తోడుగా వేల కోట్ల రూపాయ‌ల అభివృద్ధి ప‌నులు కార్పొరేష‌న్‌కు పెనుభారంగా మారాయి. అధికార పార్టీ ఎన్నిక‌ల హామీల్లో భాగ‌మైన స‌మ‌గ్ర రోడ్డు డెల‌వ‌ల‌ప్‌మెంట్ ప‌థ‌కం, డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల భారాన్ని ప్రభుత్వం బ‌ల్దియాకు బ‌దిలీ చేసింది. దీంతో ఈ ప్రాజెక్టులు జిహెచ్ఎంసికి  మోయలేని భారంగా మారాయి.
స‌త‌మ‌త‌మౌతున్న కార్పోరేష‌న్ 
ఇటు ప్రభుత్వ పెద్దల ఆదేశాల‌ను కాద‌న లేక‌, అటు చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులు వ‌దులుకోలేక స‌త‌మ‌త‌మౌతుంది కార్పోరేష‌న్. ఈ ప్రాజెక్టుల‌ను గ‌ట్టెక్కించేందుకు అప్పులే శ‌ర‌ణ్యం అంటుంది బ‌ల్దియా. 3వేల 500కోట్ల అప్పు చేసేందుకు సిద్ధమైంది. అంత‌ర్జాతీయ స్థాయి ఆర్థిక సంస్థల‌ నుంచి అప్పులు రాబ‌ట్టడ‌మే ల‌క్ష్యంగా క్రిస్టిల్ అనే ఏజెన్సీతో రేటింగ్ చేయించింది. ఏప్లస్ రేటింగ్ రావ‌డంతో ప‌లు అర్థిక సంస్థలు బ‌ల్దియాకు అప్పు ఇచ్చేందుకు సుముఖ‌త‌ చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మున్సిప‌ల్ బాండ్ల ద్వారా వెయ్యి కోట్లు, రూపి ట‌ర్మ్ లోన్ ప‌ద్దతిలో 2 వేల 500కోట్లు సేక‌రించాల‌ని డిసైడ్ చేశారు అధికారులు. ఇందుకోసం ప్రముఖ  బ్యాంకుల ప్రతినిధుల‌తో పాటు అర్థిక సంస్థల ప్రతినిదులతో స‌మావేశం అయ్యారు. త‌క్కువ నిర్వహ‌ణ భారం ఉండే వాటికే ప్రాధాన్యత ఇవ్వాల‌ని ఆలోచిస్తోంది బ‌ల్దియా.
అప్పుల కోసం అర్రులు చాస్తున్న జిహెచ్ఎంసి  
ఒక‌ప్పుడు ఆర్థిక స్వావ‌లంబ‌న‌తో ప‌రిపుష్టిగా ఉన్న జిహెచ్ఎంసి ప్రస్తుతం అప్పుల కోసం అర్రులు చాస్తోంది. మోయ‌లేని ప్రాజెక్టులు కార్పోరేష‌న్ నెత్తిన పెట్టి, త‌న హామీల‌ను అమ‌లు చేయ్యమంటుంది ప్రభుత్వం. ఇప్పటికైనా భారీ ప్రాజెక్టుల‌కు ప్రభుత్వం చేయుత‌నివ్వకుంటే బ‌ల్దియా భారం న‌గ‌ర‌వాసుల‌పై ప‌డే రోజులు ద‌గ్గర్లోనే ఉన్నాయంటున్నారు విశ్లేష‌కులు.

 

10:53 - March 12, 2017

ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో భారీస్థాయిలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సూక్మా జిల్లా బెజ్జి ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గురు జవాన్లను రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఉదయం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న 219వ బెటాలియన్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై.. మావోయిస్టులు నలువైపులా విరుచుకుపడ్డారు. ముందుగా ఐఈడీ పేల్చిన మావోయిస్టులు... తరువాత కాల్పులకు దిగారు. 

 

10:49 - March 12, 2017

హైదరాబాద్ : వసంత రుతువు ఆగమనానికి గుర్తుగా ప్రజలు నిర్వహించుకునే హోలీ పండుగా వచ్చేసింది, ప్రకృతిలో సహజంగా లభించే రంగులతో నిర్వహించుకోవాలనే అలోచనతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం హోంసైన్స్ విభాగం సహజమైన రంగుల్ని తయారు చేస్తోంది. పర్యావరణ హిత పద్ధతులలో బంతిపూలతో పసుపు రంగు, బీట్రూట్‌తో పింకు కలర్, అనాటోసీడ్స్‌తో ఆరేంజ్ కలర్ నీలిచెట్టు పూల నుంచి బ్లూ కలర్ ఉత్పత్తులతో రంగుల్ని తయారు చేస్తున్నారు.
ప్రకృతి పండగ..హోలీ
హోలీ పండగ రానే వచ్చేసింది. రంగులు చల్లుకొని ఆనందంగా జరుపుకునే కలర్‌ ఫుల్‌ ఫెస్టివల్‌ అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగులు కొత్త కొత్త పద్ధతులు తెరపైకి వస్తున్నాయి. కానీ సహజ సిద్ధ రంగులతో జరిగే ప్రయోజనాలపై రోజు రోజుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. రసాయన వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు.
సహజ రంగులు తయారీ
ప్రకృతిలో సహజంగా లభించే రంగులతో నిర్వహించుకోవాలనే అలోచనతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం హోంసైన్స్ విభాగం సహజమైన రంగుల్ని తయారు చేస్తోంది. పర్యావరణ హిత పద్ధతులలో బంతిపూలతో పసుపు రంగు, బీట్రూట్‌తో పింకు కలర్, అనాటోసీడ్స్‌తో ఆరేంజ్ కలర్ నీలిచెట్టు పూల నుంచి బ్లూ కలర్ ఉత్పత్తులతో రంగుల్ని తయారు చేస్తున్నారు. రసాయన అవషేశాలు లేని పర్యావరణ హిత రంగులు చల్లుకుంటే చర్మారోగాల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు ఈకో కలర్ ప్రాజెక్ట్ ప్రిన్స్ పాల్ ఇన్వెస్ట్‌గేటర్‌ డాక్టర్ ఆర్ గీతరెడ్డి.
సహజ రంగుల మీద పరిశోధనలు
గత పది సంవత్సరాలుగా సహజ రంగుల మీద పరిశోధనలు జరుగుతున్నాయని ఈ పరిశోధనలను గుర్తించి ఇంక ముందుకు తీసుకపోవడానికి తెలంగాణ రాష్ట్ర పొలిషన్ కంట్రోల్ బోర్డు గత సంవత్సరం ఒక కోటి రూపాయల ఆర్థిక సహయం అందించడం ద్వారా 40 లక్షలతో మిషనరీలు ఏర్పాటు చేశామని తెలిపారు. గత సంవత్సరం వినాయక విగ్రహాలకు సహజ రంగులను తయారు చేశామన్న ఆమె..  ఈ హోలీ పండుగకు ఐదు రకాల రంగులను రెండు టన్నులు తయారు చేసి రెండు కౌంటర్ల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని గీతరెడ్డి సూచించారు. సహజ రంగులతో హోలీ పండగ జరుపుకోవడం వల్ల మనకే కాదు. ప్రకృతికి మేలు చేసిన వాళ్లం అవుతాం. రసాయనాలను దూరం చేసి సహజ రంగులను ప్రొత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

10:41 - March 12, 2017

కృష్ణా : విజయవాడలోని భవానీ ద్వీపం ప్రైవేట్ కు అప్పగించేందుకు పావులు కదుపుతున్నారు. విశాఖలోని రుషికొండ, అనంతగిరి రిసార్టులూ కూడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రైవేటు టూరిజానికి అప్పనంగా 100 ఏళ్లపాటు కారుచౌకగా లీజుకు ఇచ్చే ప్రయత్నాలు వేగవంతం చేశారు. 
భవానీద్వీపం పర్యాటకులు, సామాన్య ప్రజలకు దూరం 
విజయవాడలోని భవానీద్వీపం పర్యాటక ప్రియులతో పాటు సామాన్య ప్రజలకు దూరం కాబోతోంది. ఏపీలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తానని, సింగపూర్‌లోని సెంతోషా తరహాలో భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేసి తీరుతామని ఇది యథార్థమంటూ గతంలో సీఎం చంద్రబాబు బహిరంగంగానే మాట ఇచ్చారు. ఇప్పుడా మాటలను తుంగలోకి తొక్కుతూ ఏకంగా భవానీ ద్వీపాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించే ప్రయత్నం చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
ప్రైవేట్ దిశగా రుషికొండ, అనంతగిరి రిసార్ట్స్‌లు
అలాగే విశాఖలోని రుషికొండ, అనంతగిరి రిసార్ట్స్‌లను సైతం ప్రైవేట్ దిశగా మార్చేయాలని చూస్తున్నారు. వాస్తవంగా గిరిజన ప్రాంతంలో ఉన్న అనంతగిరి రిసార్ట్స్ ను ప్రైవేటీకరించడానికి అవకాశం లేకపోయినా యథావిధిగా నిబంధనలను పక్కనపెట్టి మరీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయవాడలోని బరంపార్క్ లో 28, భవానీ ద్వీపంలో 28 రిసార్ట్స్ ఉన్నాయి. బరంపార్క్ రిసార్ట్స్ ను ఫైవ్ స్టార్ హోటల్ గా అభివృద్ధి చేసేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ మార్చి 1 ఒకటో తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో రిసార్ట్స్ అభివృద్ధి చేయాలంటూ సూచించారు. టెండర్ దాఖలు చేయడానికి మార్చి 20వ తేదీ వరకు గడువిచ్చారు. ప్రస్తుతమున్న వాటితో పాటు ఫైవ్ స్టార్ హోటల్ స్థాయికి తగ్గట్టు 100 గదులు నిర్మించాలని, గ్రీనరీతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. టెండర్ దక్కించుకున్న వారికి 66 ఏళ్ల పాటు లీజుకిస్తామని, మరో 33 ఏళ్లు దీన్ని పొడిగించే ఛాన్స్ ఉంటుందని నోటిఫికేషన్‌లో సూచించినట్టు తెలుస్తోంది. ఇక భవానీ ద్వీపంలోని రిసార్ట్స్ కు ఇంచుమించు ఇదే విధంగా టెండర్లు పిలిచారు.
భవానీ ద్వీపం 133 ఎకరాల్లో విస్తరణ 
విజయవాడలోని భవానీ ద్వీపం మొత్తం 133 ఎకరాల్లో విస్తరించి ఉంది. పచ్చని ఎత్తైన చెట్లతో పర్యాటకులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇప్పుడు ఈ దీపాన్నంతటినీ ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న భవానీ ద్వీపంలోని కాటేజీలను ప్రైవేట్ పరం చేయటానికి పర్యాటక శాఖ సంసిద్ధమవడమే కాకుండా పీపీపీ విధానంలో పర్యాటక శాఖ టెండర్లు పిలిచింది. ప్రైవేట్ సంస్థ వైపే పర్యాటక శాఖ మొగ్గుచూపడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. 
మరో 100 ఎకరాలకు పైగా నిరుపయోగం 
భవానీ ద్వీపంలోని కాటేజీలను పొందిన కాంట్రాక్ట్ సంస్థ 100 వరకు స్టార్ హోటల్స్ స్థాయిలో కాటేజీలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. భవానీ ఐలాండ్ లో మరో 100 ఎకరాలకు పైగా నిరుపయోగంగా ఉండగా, అభివృద్ధి చేసిన కాటేజీలను అప్పగించటంపై విమర్శలకు తావిస్తోంది. మొత్తం 28 కాటేజీలున్నాయి. వీటిలో 6 నాన్ ఏసీ, మిగిలినవి ఏసీ కాటేజీలుగా ఉన్నాయి. నాలుగు ట్రీ టాప్ కాటేజీలు, 24 జీ ఫ్లస్ 1 కాటేజీలుగా ఉన్నాయి. కాటేజీలో నిరంతరం 85 శాతం ఆక్యుపెన్సీతో ఉంటున్నాయి. ద్వీపంలోని కాటేజీలు పర్యాటకాభివృద్ధి సంస్థకు పెద్ద మొత్తంలోనే ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. రెండు రెస్టారెంట్లు, నాలుగు ట్రీ టాప్ కాటేజీలు, 24 జీ ఫ్లస్-1 కాటేజీలు, వినోద ప్రదర్శనలు, బోటింగ్ ద్వారా భారీవృద్ధిని సాధిస్తున్నాయి. 
పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థకు 
భవానీ ద్వీపంలో ప్రస్తుత రెండు రెస్టారెంట్స్, కాన్ఫరెన్స్ హాల్, నాలుగు ట్రీ టాప్ కాటేజీలు, 24 జీ ఫ్లస్ 1 కాటేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థకు కట్టబెడతారు. వీటి నిర్వహణతో పాటు భవానీద్వీపంలోనే మరో 100 వరకు కాటేజీలను ఆ సంస్థ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. టోటల్ గా వీటిని స్వాధీనం చేసుకునే సదరు ప్రైవేట్ సంస్థ భవానీ ద్వీపం మొత్తం వ్యవహారాలన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అభివృద్ధితో పాటు ప్రజలకు తక్కువ ధరలకే చేరువ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తే పర్యాటకానికి పర్యాటక ప్రియులు దూరమయ్యే అవకాశం ఉంటుంది. 

 

ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి అస్వస్థత

కర్నూలు : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆయన్ను ఆళ్లగడ్డ రామలింగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. 

 

09:47 - March 12, 2017

హైదరాబాద్ : తెలంగాణలో సుధీర్‌ కమిటీ సిఫారసులు అమలు చేయాలని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రభుత్వానికి సూచించారు. సుధీర్‌ కమిటీ సిఫారసుల అమలు ద్వారా వివక్షకు గురైన కులాలకు మేలు జరుగుతుందని చెప్పారు. కుల, మతాలకు అతీతంగా తెలంగాణ ఏర్పాటైందని గుర్తుచేశారు. అన్నివర్గాలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని కోదండరాం తెలిపారు. వరంగల్‌లో జేఏసీ సమావేశానికి కోదండరాం హాజరయ్యారు. 

 

09:41 - March 12, 2017

ఢిల్లీ : యూపీ, ఉత్తరాఖండ్‌లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇవాళ బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించనుంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి జరిగే ఈ యాత్రలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో యూపీ, ఉత్తరాఖండ్‌ సీఎంలను నిర్ణయించడంతో పాటు... గోవా, మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాట్లపై కూడా చర్చించనుంది. 

 

09:39 - March 12, 2017

హైదరాబాద్ : బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించిన దాంట్లో ఒక్క తప్పు ఉన్నా..ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్‌ ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో భాగంగా సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్‌..ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. అంతకు ముందు తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలినందుకు టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యను ఈ సమావేశాల వరకు వేటుపడింది. 
రేవంత్‌, సండ్ర వెంకటవీరయ్యలపై వేటు 
తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు రెండోరోజు వాడీవేడిగా సాగాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరహింసహన్‌ ప్రసంగించిన సమయంలో.. ప్రసంగానికి అడ్డుతగిలారన్న కారణంతో టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యపై వేటు పడింది. గవర్నర్ ప్రసంగాన్ని వీరిద్దరూ అడ్డుకున్నందుకు రేవంత్, సండ్రను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసినట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. 
టిడిపి సభ్యుల సస్పెండ్‌ను తప్పుబట్టిన ప్రతిపక్షాలు 
అయితే టిడిపి సభ్యుల సస్పెండ్‌ను ప్రతిపక్షాలు తప్పుబేట్టాయి. ప్రసంగానికి అడ్డుతగిలారన్న కారణంగా సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేయడం సరైంది కాదని విపక్షాలు విమర్శించాయి. సస్పెన్స్‌పై పునరాలోచన చేయాలని స్పీకర్‌కు ప్రతిపక్ష నేత జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే టిడిపి సభ్యుల సస్పెన్స్‌పై ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. కాంగ్రెస్‌పార్టీ వాకౌట్‌ చేసింది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు అంశంపై చర్చ 
ప్రతిపక్షాల వాకౌట్‌ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ ప్రారంభమైంది. దీంట్లో భాగంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌..అసెంబ్లీలో ప్రతిపక్షాలు వ్యవహరించే తీరు బాధాకరంగా ఉందన్నారు. 
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే రుజువు చేయాల్సిందే అని లేకపోతే..వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్‌ 
గవర్నర్ ప్రసంగం మొత్తం తప్పుల తడక అన్న ప్రతిపక్షాల విమర్శలను సీఎం కేసీఆర్‌ తిప్పికొట్టారు. గవర్నర్ ప్రసంగంలో ఒక్క తప్పు ఉన్నా..ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న ఎన్నికల హామీని ఆరునూరైనా 2019లోపు ఇస్తామన్నారు.   
సభ రేపటికి వాయిదా
ఇక బడ్జెట్ సమావేశాల్లోనే ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్ బిల్లును పాస్ చేయబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి సుధీర్ కమిటీ రిపోర్టును బీసీ కమిషన్‌కు ఇచ్చామన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగం తర్వాత సభను సోమవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సోమవారం 2017-18 బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రవేశపెట్టనున్నారు. 

 

09:30 - March 12, 2017

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపి చరిత్ర సృష్టించింది. త్రిబుల్‌ సెంచరీతో యూపీలో రాజకీయ సునామీని సృష్టించింది. ఓ వైపు మోదీ వాక్‌చాతుర్యం..మరోవైపు అమిత్‌షా రాజకీయ చతురత..ఈ రెండు కలిసి ఉత్తరప్రదేశ్‌ను ఇప్పుడు శాసించబోతున్నాయి. ఇంతటీ ఘనవిజయం సాధించిన యూపీలో... బీజేపీ ఎవరిని సీఎం పీఠంపై కూర్చోబెట్టనుంది..? 
యూపీలో రాజకీయ సంచలనం 
ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజేపి ప్రభంజనం సృష్టించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే, అసెంబ్లీ ఎన్నికల్లోనూ రికార్డ్ స్థాయిలో సీట్లు గెలుచుకొని విపక్షాలకు దడపుట్టించింది. ఎగ్జిట్‌పోల్స్‌, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు సైతం అందకుండా బిజేపి సాధించిన ఈ ఘన విజయం అందరి దృష్టినీ ఆకర్షించింది. 
యూపీ సీఎం రేసులో ఐదుగురు 
త్రిబుల్‌ సెంచరీతో యూపీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపి..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీని ఎవరు అధిష్టింపబోతున్నారనే విషయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. సీఎం రేసులో ప్రధానంగా ఐదుగురు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, గోరఖ్‌పూర్‌ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌, బీజేపి యూపీ అధ్యక్షుడు కేశవ్‌ప్రసాద్‌ మౌర్య, ఘాజీపూర్‌ ఎంపీ మనోజ్‌ సిన్హా, బీజేపి  ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతిధిగా ఉన్న శ్రీకాంత్‌ శర్మల పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. అయితే, ఇప్పటివరకు కేంద్రంలో కీలక బాధ్యతల్లో ఉన్న రాజ్‌నాథ్‌సింగ్‌ యూపీ సీఎం బరిలో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనూ యూపీ సీఎంగా చేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చే అంశం. రాజ్‌నాథ్‌తో పాటు..గోరఖ్‌పూర్‌ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ రేసులో ఉన్నారు. ఇక పార్టీ బలోపేతం నుంచి ప్రచార కార్యక్రమాలన్ని చూసుకున్న బీజేపి యూపీ అధ్యక్షుడు కేశవ్‌ప్రసాద్‌ మౌర్యకు కూడా అవకాశాలు లేకపోలేదు. వీరితో పాటు రాష్ట్ర బీజేపీలో గట్టిపట్టున్న ఘాజీపూర్‌ ఎంపీ మనోజ్‌ సిన్హా, పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతిధిగా ఉన్న శ్రీకాంత్‌ శర్మల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

09:26 - March 12, 2017

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నడకదారి భక్తులకు పది గంటల సయమం పడుతుంది. శ్రీవారి దర్శనానికి పది గంటల సమయం పడుతుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి పది గంటల సమయం పడుతుంది.  నడకదారి భక్తులకు పది గంటల సయమం పడుతుంది.

 

మాతా సుందరీ కాలేజీ సమీపంలో అగ్నిప్రమాదం

ఢిల్లీ : మాతా సుందరీ కాలేజీ సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ మార్కెట్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 30 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. 

నాగర్ సోల్...తిరుపతి ఎక్స్ ప్రెస్ లో దోపిడీ

మహారాష్ట్ర : నాగర్ సోల్...తిరుపతి ఎక్స్ ప్రెస్ లో దోపిడీ జరిగింది. దొంగలు నగదు, సెల్ ఫోన్లు అపహరించారు. షరిడీ నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

08:46 - March 12, 2017

ఢిల్లీ : అంతా బాగుంటే... ముఖ్యమంత్రి సీట్లోనే కూర్చుందామనుకున్నారు..... వారి ఆశలకు గండికొడుతూ... ఓటర్లు షాకిచ్చారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కొందరు తలరాతలు తలకిందులయ్యాయి. కీలక నేతలు, ఓటమి ఎరుగని అభ్యర్థులకూ భంగపాటు తప్పలేదు. 
హరీష్‌ రావత్‌ ఓటమి
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పలువురు కీలక నేతలకు చేదు అనుభవాలను మిగిల్చాయి.. ఓడిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రులూ ఉన్నారు.. ఉత్తరాఖండ్‌ సీఎం, కాంగ్రెస్‌ అభ్యర్థి హరీష్‌ రావత్‌ను దురదృష్టం వెంటాడింది. పోటీ చేసిన రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. హరిద్వార్, కిచ్చా నియోజకవర్గాల్లో పోటీచేసిన రావత్‌...  రెండుచోట్లా బీజేపీ  అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. కిచ్చాలో కేవలం 92 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.. 
అమరీందర్‌ సింగ్‌కు ఒక్క చోటే విజయం
ఇక రెండుచోట్ల పోటీచేసిన  పంజాబ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అమరీందర్‌ సింగ్‌కు ఒక్క చోటే విజయం దక్కింది. లంబి నియోజకవర్గంలో అకాళీదళ్‌ నేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ చేతిలో పరాజయం పొందారు.. పాటియాలా అర్బన్‌ నుంచి 52వేల 375 ఓట్లతో గెలుపొందారు. హక్కుల కార్యకర్త ఇరోం షర్మిలకూ  ఘోర పరాభవం తప్పలేదు. తౌబల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి దయానంద్‌ రఘునాథ్‌ సోప్టే చేతిలో పరాజయం పొందారు. మణిపూర్‌లో సైనిక దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ 16 ఏళ్లుగా షర్మిల నిరాహారదీక్ష చేశారు. పీజేఆర్‌జేఏ  పార్టీని స్థాపించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.. షర్మిలకు కేవలం 85 ఓట్లు మాత్రమే వచ్చాయి..
ఆప్‌ సీఎం అభ్యర్థి ఎల్విస్‌ గోమ్స్‌ ఓటమి 
ఆమ్‌ ఆద్మీ పార్టీ విషయానికివస్తే గోవాలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. పార్టీ సీఎం అభ్యర్థిఅయిన ఎల్విస్‌ గోమ్స్‌కే ఓటమి తప్పలేదు.. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో ఎస్‌పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబసభ్యురాలికీ ఓటమి తప్పలేదు... ఆయన కోడలు, ప్రతీక్‌ యాదవ్‌ భార్య   అపర్ణా యాదవ్‌ లక్నో కంటోన్మెంట్‌ స్థానంనుంచి ఓడిపోయారు.. ఆ స్థానంలో   కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన రీటా బహుగుణ జోషి విజయం సాధించారు...   అపర్ణ కోసం ములాయం, సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ ప్రత్యేకంగా పోటీచేసినా ఫలితం లేకుండా పోయింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో మహామహులకూ ఓటమి తప్పలేదు. తమకు నచ్చకపోతే అభ్యర్థి ఎవ్వరైనా సరే ఇదేరకంగా సమాధానం ఇస్తామని ఓటర్లు తమ తీర్పుద్వారా చెప్పకనే చెప్పారు. 

 

08:38 - March 12, 2017

ఉత్తరాఖండ్ : 3 రాష్ట్రాల్లో ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికార పగ్గాల్ని చేజిక్కించుకోగా.. మణిపూర్‌, గోవాలో హంగ్ తప్పలేదు. కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్రమైన గోవాలో చాలా మంది ఓటర్లు నోటా మీటా నొక్కినట్లు ఈ ఫలితాల్లో వెల్లడైంది. 
ఉత్తరాఖండ్‌ లో బీజేపీకి భారీ మెజారిటీ 
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా తుడిచిపెట్టుకుపోయింది.  మొత్తం 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 57 సీట్లు గెలుపొంది.. భారీ మెజారిటీ సాధించింది. కాంగ్రెస్‌ 11 స్థానాలతో రెండో స్థానాన్ని పదిలపరుచుకుంటే.. బీఎస్పీ ఒక్క సీటు కూడా సొంతం చేసుకోలేక చతికిల పడింది. కాగా మరో 2 స్థానాలు ఇతరులు దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ పోటీచేసిన రెండుచోట్లా -హరిద్వార్‌ రూరల్‌, కిచ్చా ఓడిపోవడం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఓటమి అనంతరం... రావత్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత తనదేనని, తన నాయకత్వ లోపం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చి ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. రావత్‌ ప్రభుత్వం చాలావరకు వివాదాల్లో కూరుకుపోవడం, కాంగ్రెస్‌ సర్కారుపై ప్రజావ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోవడంతో ఉత్తరాఖండ్‌లో బీజేపీ సునాయస విజయాన్ని సాధించిందని విశ్లేషకుల అంచనా. 
మణిపూర్‌ లో కాంగ్రెస్‌ ముందంజ 
మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చివరి వరకూ సాగిన హోరాహోరీగా పోరులో బీజేపీని వెనక్కి తోసి కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో నిలిచింది. మొత్తం 60 నియోజవర్గాలకు గానూ కాంగ్రెస్‌ పార్టీ 27 అసెంబ్లీ సీట్లతో తొలి స్థానంలో నిలవగా, బీజేపీ 21 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.  ఇతరులు 11 స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు.
గోవాలో బీజేపీకి ఎదురు దెబ్బ
అటు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీఎం అభ్యర్థి లక్ష్మీకాంత్ పర్సేకర్‌ను చిత్తుగా ఓడించిన కాంగ్రెస్... బీజేపీకి గట్టి షాకిచ్చింది. మాంద్రేమ్ నుంచి పోటీ చేసిన పర్సేకర్‌... దాదాపు 4 వేల ఓట్లకు పైగా వెనకబడి ఓటమి పాలయ్యారు. ఫలితాల వారిగా చూస్తే.. 40 స్థానాల్లో 18 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. అధికార బీజేపీ 14 స్థానాలతోనే సరిపెట్టుకుంది. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ సహా 
ఇతరులకు 8 సీట్లు దక్కాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ కాలికి బలపం గట్టుకుని ప్రచారం చేసినా ఓటర్లు మాత్రం స్పష్టమైన తీర్పు ఇవ్వడం గమనార్హం. అయితే.. గోవాలో చాలా మంది ఓటర్లు ఏ అభ్యర్థికి ఓటు వేయకుండా.. నోటా మీట నొక్కారు. తొలిసారి ఇక్కడ పోటీ చేసిన ఆప్ బోణి కొట్టలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఇక్కడ కూడా స్వతంత్ర అభ్యర్తులే కీలకం కానున్నారు. 

 

08:30 - March 12, 2017

ఛండీగఢ్ : పంజాబ్‌లో అకాలిదళ్‌ పదేళ్ల పాలనకు తెరపడింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు.... హస్తం నేతల వ్యూహాత్మక ప్రచారం.. కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. మొత్తానికి 75వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కాంగ్రెస్ నేత కెప్టెన్‌ అమరీందర్ సింగ్‌కు.. రాష్ట్ర ప్రజలు బర్త్‌డే గిఫ్ట్ అందించారు. 
తిరిగి అధికారానికి కాంగ్రెస్ 
పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ విజయం నమోదు చేసింది. పదేళ్ళ బాదల్‌ పాలనకు చెక్‌ పెట్టిన కాంగ్రెస్‌- అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకుంది. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్‌ 77 స్థానాలను గెలుచుకుంది. అధికార అకాలిదళ్‌-బిజెపి కూటమికి 18, ఆప్‌కు 20 స్థానాలు దక్కాయి. 
అకాలిదళ్‌కు వ్యతిరేక పవనాలు 
పంజాబ్‌లో అధికార పార్టీ అకాలిదళ్‌కు వ్యతిరేక పవనాలు వీయడంతో కాంగ్రెస్‌కు లాభించింది. దీనికి తోడు కెప్టెన్‌ అమరిందర్‌సింగ్‌ నేతృత్వం కూడా కాంగ్రెస్‌ కలిసి వచ్చింది. పార్టీలో అంతా తానై ప్రచారాన్ని నిర్వహించారు. తన 75వ పుట్టినరోజు సందర్భంగా ఇంతటి భారీ విజయాన్ని అందుకుంటానని  కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ ఊహించి ఉండరు. 
కాంగ్రెస్ కు కాస్త ఊరట
2014 ఎన్నికల తర్వాత వరుసగా అపజయాలు మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు పంజాబ్‌లో భారీ గెలుపు ద్వారా కాస్త  ఊరట కలిగింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన ఆప్‌ అంచనాలు తారుమారు య్యాయి. అధికారం కలలు కల్లలు కాగా... ఆప్‌ ఓట్లు చీలి అకాలిదళ్‌-బిజెపి కూటమికి పడడంతో కాంగ్రెస్‌ లాభపడింది.
గ్రామీణ ఓట్లను కొల్లగొట్టిన కాంగ్రెస్‌ 
కాంగ్రెస్‌ గ్రామీణ ప్రాంతాల ప్రచారం బాగా కలిసొచ్చింది. పంజాబ్‌లో 85 అసెంబ్లీ స్థానాల్లో గ్రామీణ ప్రాంతాలే అధికం. నగర ప్రాంతాల్లో కేవలం 32 స్థానాలే ఉన్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించడం ద్వారా గ్రామీణ ఓట్లను కాంగ్రెస్‌ కొల్లగొట్టింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ సిఎం అభ్యర్థిని ప్రకటించ లేదు..దీంతో పంజాబ్‌ ప్రజలు కెప్టెన్‌ అమరిందర్‌సింగ్‌ను విశ్వసనీయత నేతగా గుర్తించారు. 'కెప్టెన్‌ అంటే కాంగ్రెస్...కాంగ్రెస్‌ అంటే కెప్టెన్‌' నినాదం హస్తానికి విజయం సాధించి పెట్టింది.
కెప్టెన్‌ అమరిందర్‌సింగ్‌ ను నమ్మిన ప్రజలు  
పంజాబ్‌, హర్యానాల మధ్య రగులుతున్న సాగు నీటి వివాదం అంశంలో కూడా ప్రజలు కెప్టెన్‌ అమరిందర్‌సింగ్‌నే నమ్మారు. ఈ అంశంలో కేజ్రీవాల్‌ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం కూడా ఆప్‌ను దెబ్బతీసింది. కెప్టెన్‌ ఈ అంశాన్ని ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. పంజాబ్‌ నుంచి ఒక్క నీటి బొట్టు కూడా వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ కాంగ్రెస్‌లో చేరడం కూడా ఆ పార్టీకి కలిసివచ్చింది. సిద్ధూ వల్ల మాఝా ప్రాంతంలో కాంగ్రెస్‌కు బలం చేకూరింది.  ఆప్‌కు గ్లామర్‌ నేత లేకపోవడం ఆ పార్టీకి నష్టం కలిగించింది. 

 

08:20 - March 12, 2017

లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాన్ని కైవసం చేసుకుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి కమలం భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 325 సీట్లను దక్కించుకుంది. మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ యూపీలో పాగా వేసినప్పటికీ... సీట్లు మాత్రం తగ్గాయని చెప్పక తప్పదు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 71 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది. ఆ దామాషాతో పోలిస్తే... 360కి పైగా అసెంబ్లీ స్థానాలు రావాలి.
బీఎస్పీకి మరోసారి పరాజయం 
అతిపెద్ద రాష్ట్రం... అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం. అందరి కళ్లూ ఆ రాష్ట్రంపైనే. దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో కమలం వికసించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించిపోతూ.. 15 ఏళ్ల తరువాత యూపీ పీఠం దక్కించుకుంది. మోదీ నాయకత్వంలో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకొని... చరిత్ర సృష్టించింది. ఇక బీఎస్పీకి మరోసారి పరాజయం తప్పలేదు. శనివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజ వేసింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో... బీజేపీ 324 స్థానాల్లో విజయ దుందుభి మ్రోగించింది. ఎస్పీ 54 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీఎస్పీ 20 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు మరో ఐదు స్థానాలను కైవసం చేసుకున్నారు. 
రెండో స్థానంలో ఎస్పీ 
ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థులు మొదటి నుంచి తమ ప్రత్యర్థులపై ఆధిక్యం ప్రదర్శించారు. రెండో స్థానంతోనే ఎస్పీ సరిపెట్టుకుంది. యూపీ కే లడకే అంటూ రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌ గురించి హస్తం నేతలు ప్రచారం చేసినా ఓటర్లను ఆకట్టుకోలేకపోయారు. దత్త పుత్రుడని, వృద్ధుడని నరేంద్ర మోదీని విమర్శించినప్పటికీ ఓటర్లు పట్టించుకోలేదు.   
బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు 
ఉత్తరప్రదేశ్ పీఠం దక్కడంతో... బీజేపీ శ్రేణులు ఆనందోత్సవాల్లో మునిగిపోయాయి. యూపీ ప్రజలు కులమతాలకు అతీతంగా, అభివృద్ధి ఎజెండాకు ఓటు వేశారని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం కలసి వచ్చాయని  రాజకీయ విశ్లేషకుల అంచనా.  ప్రస్తుత ఫలితాల సరళిని పరిశీలిస్తే 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 324 సీట్లు దక్కించుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. యూపీలో అధికార సమాజ్‌వాదీ పార్టీ ఓటమిని అంగీకరించింది. అఖిలేష్‌ యాదవ్  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  

 

బస్సులో చెలరేగిన మంటలు

హైదరాబాద్ : మియాపూర్ పరిధిలోని అల్విన్ కాలనీ చౌరస్తాలో బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందికి దించాడు. పెను ప్రమాదం తప్పింది. బస్సు హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్తోంది. 

కృష్ణా జిల్లాలో దారుణం..

కృష్ణా : కలిదిండి మండలం కొరుకొల్లులో దారుణం జరిగింది. వీఆర్ వో ఓ యుకుడి కాళ్లు, చేతులు కట్టేసి చితకబాదాడు. బాలిక వద్ద నుంచి సైకిల్ తీసుకున్నాడంటూ యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. 

 

నేడు నిజాపట్నంలో ముద్రగడ పర్యటన

పశ్చిమగోదారి : నేడు నిజాపట్నంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పర్యటించనున్నారు. కాపు ఉద్యమానికి బీసీ సంఘాల మద్దతు కోరనున్నారు. 

 

నేడు వైఎస్సార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్ : నేడు వైఎస్సార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ఆ పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. 
 

Don't Miss