Activities calendar

13 March 2017

21:31 - March 13, 2017

ఢిల్లీ: జేఎన్ యూలో ఎంఫిల్ విద్యార్థి రజని క్రిష్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో రజని క్రిష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటూ సమానత్వం లేదంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. రోహిత్ వేముల ఉద్యమ విషయంలో రజని క్రిష్ కీలక పాత్ర పోషించాడు. రజని క్రిష్ స్వస్థలం తమిళనాడులోని సేలం ప్రాంతం.

21:26 - March 13, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా.. వరుసగా నాలుగో వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు... ఈటల రాజేందర్. ఈ బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయానికి స్వస్తి పలికి ప్రగతి పద్దు, నిర్వహణ పద్దును తీసుకువచ్చారు. సబ్‌ప్లాన్‌ల స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. అన్ని వర్గాల్లో విశ్వాసం నింపేలా బడ్జెట్ ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించినట్లు ఆర్థికమంత్రి తెలిపారు.

ఈసారి మొత్తం రాష్ర్ట బడ్జెట్ 1,49,646 కోట్లు కాగా ...

ఈసారి మొత్తం రాష్ర్ట బడ్జెట్ 1,49,646 కోట్లు కాగా అందులో ప్రగతి పద్దు 88,038 కోట్లు, నిర్వహణ వ్యయం 61,607 కోట్లు అలాగే రెవెన్యూ మిగులు అంచనా 4,571 కోట్లుగా నిర్ణయించారు. గతేడాది వాహనాల పన్ను ఆదాయం 2899 కోట్ల అంచనా వేయగా.. వాహనాల పన్ను రూపంలో వసూలైన ఆదాయం మొత్తం 2585 కోట్లు. ఈ ఏడాది వాహనాల పన్ను ఆదాయ లక్ష్యం 3000 కోట్లు కాగా ఇతర రూపాల్లో సమకూర్చుకోనున్న ఆదాయం అంచనా 36,237 కోట్లుగా నిర్దేశించుకున్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల తెలిపారు. దీనికోసం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు నేరుగా నిధులు అందిస్తున్నామని, ఆసుపత్రుల్లో మందుల కొనుగోలు కోసం నిధులు రెట్టింపు చేశామని చెప్పారు. మరో 3 మల్టీ స్పెషాలిటీ అస్పత్రులు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఓయూ సెంటీనరి ఉత్సవాలకు 200 కోట్లు, విదేశాల్లో పేద విద్యార్థుల చదువుకోసం 20 లక్షల కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనం 12,500 లకు, అంగన్‌వాడీ టీచర్లకు 10,500లకు పెంచినట్లు ఈటల చెప్పారు.

సాగు నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం

ఈసారి నిధుల కేటాయింపులో సాగు నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. మొత్తం 23,675 కోట్ల రూపాయలను నీటిపారుదల రంగానికి కేటాయించారు. వ్యవసాయ రంగానికి 5,942 కోట్లు కేటాయించారు. రజక, నాయిబ్రాహ్మణులకు 500 కోట్లు.. అలాగే ఎంబీసీల సంక్షేమం కోసం 1000 కోట్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకం అర్హులకు 51 వేల నుంచి 75,116కు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి జీఎస్‌డీపీ పెరగడం సంతోషంగా ఉందన్నారు మంత్రి ఈటెల. 27 శాతానికి పెరగడం శుభ సూచకమన్నారు. దేశం జీడీపీ 7.1 అయితే తెలంగాణ రాష్ట్రం జీడీపీ 10.1 సాధించిందన్నారు.

ఈ ఏడాది రిజిస్ర్టేషన్ల ఆదాయం లక్ష్యం తగ్గించి...

ఈ ఏడాది రిజిస్ర్టేషన్ల ఆదాయం లక్ష్యం తగ్గించి, 3 వేల కోట్లకు అంచనా వేశారు. ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయం అంచనా 8,999 కోట్లుగా నిర్ణయించారు. వచ్చే రెండేళ్లలో 4 లక్షల యాదవుల కుటుంబాలకు 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయనున్నట్లు, 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ, మూసీ ప్రక్షాళనకు 350 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే కేసీఆర్‌ కిట్‌ కోసం 605 కోట్లు కేటాయింపులు చేశారు.

మహిళా శిశు సంక్షేమం కోసం 1731 కోట్లు...

మహిళా శిశు సంక్షేమం కోసం 1731 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 5,070 కోట్లు, మైనారిటీ సంక్షేమం కోసం 1249 కోట్లు, ఆసరా ఫించన్ల కోసం 5,330 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం 100 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 1939 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ఈటల తెలిపారు. చేనేత కార్మికుల కోసం 1200 కోట్లు, చివరి విడత రైతుల రుణమాఫీకి 4000 కోట్లు, విద్యారంగ అభివృద్ధికి 12, 705 కోట్లు, వైద్య, ఆరోగ్య రంగాలకు 5976 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి ఈటల ప్రకటించారు.

పట్టణాభివృద్ధికి 5,599 కోట్లు...

పట్టణాభివృద్ధికి 5,599 కోట్లు, రహదారుల అభివృద్ధికి 5,033 కోట్లు, శాంతి భద్రతలకు 4,828 కోట్లు, విద్యుత్‌ రంగానికి 4,203 కోట్లు చొప్పున కేటాయించిన ఈటల.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న మిషన్‌ భగీరథకు కేవలం మూడు వేల కోట్లే కేటాయించడం విశేషం. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇప్పిస్తానని, వచ్చే ఎన్నికల్లోపు ఈ హామీ నిలుపుకోకుంటే, ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం కేసీఆర్‌ పదేపదే చెబుతూ వస్తున్నారు. అంతటి ప్రాధాన్య కార్యక్రమానికి మూడువేల కోట్లే కేటాయించడం విస్తుగొలుపుతోంది. దీనికి అవసరమైన నిధులను ఇతరత్రా ఎటువంటి మార్గాల ద్వారా సమీకరిస్తారన్న దానిపై బడ్జెట్‌లో స్పష్టతనీయలేదు.

ఇక, మునిసిపల్‌ కార్పొరేషన్‌ల అభివృద్ధికి..

ఇక, మునిసిపల్‌ కార్పొరేషన్‌ల అభివృద్ధికి ఇతోధికంగా నిధులు సమకూరుస్తున్నట్లు ఆర్థికమంత్రి ఈటల తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పుకొచ్చారు. గ్రేటర్‌ వరంగల్‌ కోసం 300 కోట్లు, మిగతా కార్పొరేషన్లకు 400 కోట్ల కేటాయింపులు జరిపారు. జీహెచ్ఎంసీకి మాత్రం 1000 కోట్లతో సరిపుచ్చారు. పర్యాటక, సాంస్కృతిక రంగానికి 198 కోట్లు, ఐటీ రంగానికి 252 కోట్లు, హరితహారానికి 50 కోట్లు, పారిశ్రామిక రంగానికి 985 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నిర్ణీత కాలావధిలో పథకాల వారీగా 3 నెలలకోసారి నివేదిక సమర్పించాలని మంత్రి ఈటల సూచించారు. ఎస్టీల అభివృద్ధికి 8165.88 కోట్లు, ఎస్సీల అభివృద్ధికి 14,375 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపిన ఈటల, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు నిధులు కేటాయించేందుకు కమిటీ ఏర్పాటు చేశామన్నారు.

19.61 శాతం వృద్ధిరేటు సాధించిందని...

రాష్ట్రం 19.61 శాతం వృద్ధిరేటు సాధించిందని, రెవెన్యూ వృద్ధి గణనీయంగా పెరిగిందని ఆర్థిక మంత్రి ఈటల రాజెందర్‌ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు 26,096 కోట్లుగా అంచనా వేశారు. కేంద్రం ఆదేశాల మేరకు ఏకరీతిన బడ్జెట్ ను రూపొందించినట్లు ఆయన అన్నారు. 2017-18 బడ్జెట్ రూపకల్పనలో భిన్నపద్ధతులు అవలంభించినట్లు తెలిపారు. రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నట్లు, పాత నోట్ల రద్దుతో ఆదాయం తగ్గినప్పటికీ ఇతర పన్నుల ద్వారా ఆదాయం పెరిగిందని, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేశారని మంత్రి ప్రకటించారు. ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, తనపై నమ్మకం ఉంచిన సీఎం కేసీఆర్‌కు ఆర్థిక మంత్రి ఈటల కృతజ్ఞతలు తెలిపారు.

పారికర్‌ ప్రమాణ స్వీకారంపై సుప్రీంకి వెళ్లిన కాంగ్రెస్

హైదరాబాద్: గోవా కొత్త సీఎంగా మనోహర్‌ పారికర్‌ ప్రమాణ స్వీకారంపై స్టే విధించాలంటూ సుప్రీం కోర్టులో కాంగ్రెస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సత్వర విచారణకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మంగళవారం సాయంత్రం 5గంటలకు గోవా ముఖ్యమంత్రిగా పారికర్‌ ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది.

20:41 - March 13, 2017

హైదరాబాద్: ఇంకా ఎంత కాలం...ఇంకా ఎన్ని కష్టాలు...ఎప్పటికి తీరేను ఏటీఎం కడగళ్లు, ఎన్నాళ్లకు దరిచేరేను ఈ కరెన్సీ వాగ్ధానాలు. నాలుగు నెలలుగా ప్రజలు పడుతున్న సమస్య ముగింపుకు వస్తున్నాయనే లోగా, మళ్లీ అదే సీను రిపీటౌతోంది. పదిరోజులుగా ఏటీఎంలు పనిచేయక, కరెన్సీ దొరక్క ప్రజల ఇబ్బందులు వర్ణణాతీతంగా మారుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు? ఇదే నేటి వైడాంగిల్ స్టోరి. పూర్తి వివరాలను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

'ఎన్నడూ లేని విధంగా బీసీలకు బడ్జెట్ కేటాయింపులు'

హైదరాబాద్: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయని మంత్రి జోగు రామన్న తెలిపారు. కులవృత్తులకు, ఎంబీలకు బడ్జెట్ లో పెద్దపీట వేశామన్నారు. రూ.10వేల కోట్ల కేటాయింపులతో బీసీలకు న్యాయం జరుగుతుందని, నెలవారి యాక్షన్ ప్లాన్ తో నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

20:06 - March 13, 2017

హైదరాబాద్: లక్షన్నర కోట్లకు చేరిన తెలంగాణ బడ్జెట్...లక్ష్యం గురితప్పకుండా చూస్తే అదే గ్రేట్, అబద్ధాలమీద నడుస్తున్న అసెంబ్లీ...మండిపడుతున్న తెలంగాణ విపక్షాలు, ఎవ్వరి బర్రెఅయితేనేం మాదొడ్లోనే ఈనాలే...పరువు తక్కువ పని చేసిన బిజేపోళ్లు, హ్యాపీబర్త్ డే టూయూ కవితక్క....ఇసుకలో బొమ్మ గీసిన అభిమానులు, చేతబడి పేరుతోని ఆడామెకు చెప్పుదెబ్బలు...ఏమన్న బుద్ధిజ్ఞానం ఉన్నదా ఆ వూరోళ్లకి, జై భీం అని నినదించిన మంత్రి కేటీఆర్ వంటి అంశాలతో నేటి 'మల్లన్న ముచ్చట్ల'ను మన మల్లన్న మన ముందుకు తీసుకొచ్చారు. అవేంటో మరి మీరూ వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

19:57 - March 13, 2017

హైదరాబాద్: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ 2017-18 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. లక్షా 49 వేల 646 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ ప్రతిపాదనలను రూపొందించారు. దీనిలో నిర్వహణ వ్యయం 61వేల 607.20 కోట్లుగా చూపించారు. ప్రగతి పద్దు కింది 88 వేల 38 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశంపై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో కాంగ్రెస్ నేత, పరిగి ఎమ్మెల్యే రాంమ్మోహన్ రెడ్డి,టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, బిజెపి నేత అల్జాపూర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

ఫ్రెండ్స్ తో కలిసి తన భార్యపై అఘాయిత్యం

కంచన్ బాగ్ : డ్రగ్స్ మత్తులో ఫ్రెండ్స్ తో కలిసి తన భార్యపై అఘాయిత్యానికి ఓ భర్త పాల్పడిన దారుణ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. పాతబస్తీలోని కంచన్ బాగ్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనతో బాధితురాలు కంచన్ బాగ్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త సలీం ఆగడాలపై బాధితురాలు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తన న్యూడ్ ఫొటోలు, వీడియోలను సలీం తన షేర్ చేసే వాడని, వారితో సెక్స్ లో పాల్గొనాలని తన పై ఒత్తిడి తెచ్చేవాడని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. ఈ విషయాన్ని తన అత్తకు చెబితే, సోషల్ స్టేటస్ కోసం ఇటువంటివి సాధారణమేనని ఆమె కొట్టి పారేసిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

18:50 - March 13, 2017

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పాతనోట్లను మారుస్తున్న 10 మంది ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి కోటి 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కమలాపురి కాలనీలో పాత 500, వెయ్యి నోట్లు మారుస్తుండగా.. సమాచారం తెలుసుకున్న పోలీసులు ముఠాను పట్టుకున్నారు. సినీ పరిశ్రమకు చెందిన కిట్టూ... ఫిఫ్టీ-ఫిఫ్టీ బేసిస్‌లో నగదు మారుస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

18:48 - March 13, 2017

విజయనగరంశృంగవరపుకోట మండలం పోతానాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతులు కొర్ర నాగభూషణ్‌, పూడి ఈశ్వర్‌రావుగా గుర్తించారు.

18:47 - March 13, 2017

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తప్పులతడకగా ఉందని కాంగ్రెస్‌ నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. ఆయన '10టివి'తో మాట్లాడుతూ... కేటాయింపులు సరిగాలేవని .. జనాభాలో 52శాతంఉన్న బీసీలకు కేవలం 5వేల కోట్లే ఇచ్చారన్నారు.. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన పథకాలకూ కేటాయింపులు అంతంతమాత్రంగా ఉన్నాయంటున్న భట్టి పెదవి విరిచారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:44 - March 13, 2017

p { margin-bottom: 0.21cm; }

సూర్యాపేట్‌ : అనంతగిరి తహసిల్దార్‌ వేధింపులు భరించలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.. గోండ్రియాలకు చెందిన రాజేంద్ర ప్రసాద్‌ దాదాపు పద్దెనిమిదేళ్లక్రితం తన పొలంలో బోరు వేసుకున్నాడు.. ఆ నీటితో భూమి సాగుచేసుకుంటున్నాడు.. ఈ బోర్‌ను సీజ్‌ చేస్తున్నామంటూ తహసిల్దార్‌ రమణ రైతుకు నోటీసులు పంపాడు.. ఈ విషయంపై ప్రశ్నించేందుకు వెళ్లిన రైతుతో తహసిల్దార్‌ దురుసుగా ప్రవర్తించాడు.. పక్క పొలంలో రైతు లక్ష రూపాయలు ఇచ్చాడని... అలాగే నువ్వూ ఇస్తే బోర్‌ సీజ్‌ చేయనని బెదిరించాడు.. లక్ష ఇవ్వకపోతే చచ్చిపో అంటూ హెచ్చరించాడు.. దీంతో మనస్తాపంచెందిన రాజేంద్ర ప్రసాద్‌ తహసిల్దార్‌ కార్యాలయంముందే పురుగులమందు తాగాడు.. వెంటనే గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు..

గుజరాత్‌ లో భూకంపం

హైదరాబాద్: గుజరాత్‌ లో భూకంపం సంభవించింది. ఈ రోజు మధ్యాహ్నం బనస్కాంత ప్రాంతంలో 3.52 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌ పై 4.5 పాయింట్లుగా నమోదైందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈఘటనలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు తెలియల్సి ఉంది.

అమెరికా 'తలాక్' లపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: అమెరికా నుంచి వాట్సాప్ లో విడాకులు ఇచ్చిన భర్తల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. తమ భర్తల తాలాక్ లపై నూర్, ఫాతిమాలు పిటిషన్ దాఖలు చేశారు. ట్రిపుల్ తలాక్ లో అక్రమ పద్ధతులను అనుసరించకుండా చూడాలని బాధితుల తరపు న్యాయవాది కోరారు. అక్రమ పద్దతిన తలాక్ ఇచ్చే సందర్భాల్లో సంబంధిత ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఖాజీలను నియంత్రిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోర్టును న్యాయవాది కోరారు. తదుపరి వాచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

18:15 - March 13, 2017

కర్నూలు : గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ నేత, నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్య‌క్రియ‌లు శోభాఘాట్ లో అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆయన అంతిమ సంస్కారానికి టిడిపి నేతలు, కార్యకర్తలు, ఆ జిల్లా వాసులు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చారు. ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో ఆయ‌న అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, భూమా నాగిరెడ్డి బంధువులు, అభిమానులు ఆయ‌న‌కు తుది వీడ్కోలు ప‌లికారు.

ఆ గ్రామాల్లో పోలీసుల నిర్భంధాన్ని ఎత్తివేయాలి: అఖిలపక్షం

విజయవాడ: సీఎం చంద్రబాబు నాయుడికి అఖిలపక్షం లేఖ రాసింది. ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా మూడేళ్లుగా రైతులు నిసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగర్వు గ్రామాల్లో పోలీసుల నిర్భంధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

శోభా ఘాట్ లో భూమా అంత్యక్రియలు పూర్తి

కర్నూలు : ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. శోభా ఘాట్ పక్కనే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా టీడీపీ శ్రేణులు, అభిమానులు, పలువురు మంత్రులు హాజరయ్యారు.

 

కన్నడ రచయిత యోగేశ్ మాస్టర్‌పై దాడి

హైదరాబాద్: కన్నడ రచయిత యోగేశ్ మాస్టర్‌పై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. పది బైకులపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు యోగేశ్ మాస్టర్‌ ముఖానికి నలుపు రంగు ఆయిల్‌ను పూయడంతోపాటు దుస్తులపై చల్లారు. యోగేశ్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వివాదాస్పద నవల ‘దుంఢి’ విషయంలో యోగేశ్ మాస్టర్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో 15 నుండి ఒంటిపూటబడులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 15వ తేదీ నుండి ఒంటిపూట బడులు జరగనున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఉదయం 7.45 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒడిజరగనుంది.

కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారు: మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్: ఉద్యోగులకు వైద్యం అందడం లేదని టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ అనడం హాస్యాస్పదం అని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. పథకం పరిశీలనకు దమ్ముంటే నాతో కలిసి రావాలని.. లేదంటే ఉత్తమ్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని లక్ష్మారెడ్డి ఆరోపించారు.

వారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: మంత్రి హరీష్

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతలు రిలీజ్ చేస్తున్న ప్రకటనలు వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంలో లేని వాటి గురించి వారి తెలివి తక్కువ తనానికి నిదర్శనం అని పేర్కొన్నారు.

భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచడం లేదు:టీఎస్ సర్కార్

హైదరాబాద్: తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచడం లేదని తెలంగాణ సర్కార్ హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. రిజిస్ట్రేషన్ చట్టప్రకారం రిజిస్ట్రేషన్ విలువ పెంచాలని పిటీషనర్ అప్పీల్ చేసుకోవాలని హైకోర్టు సూచించింది.

16:47 - March 13, 2017

అనంతపురం : హిందూపురంలోని లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌లో ఒక్క పరిశ్రమా ఏర్పాటు చేయలేదని... సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శించారు.. పరిశ్రమల పేరుతో ఇక్కడ సేకరించిన భూములన్నింటినీ తిరిగి రైతులకు ఇచ్చివేయాలని డిమాండ్ చేశారు.... లేకపోతే నాలెడ్జ్ హబ్‌ భూముల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడే వ్యవసాయం చేస్తామని హెచ్చరించారు..

16:45 - March 13, 2017

హైదరాబాద్: కొండాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్ కూలి ఇద్దరు మహిళా కూలీలు చనిపోయారు. మరో ఇద్దరు కూలీలు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి భవన యాజమాన్యం.. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. ఇదిలాఉండగా భవన సెల్లార్‌ కూలిన ప్రదేశాన్ని మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. ప్రమాదం దురదృష్టకరమన్న మేయర్‌ కారకులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు కార్మిక శాఖ ఇన్సూరెన్స్‌ కింద ఆరు లక్షలు, జీహెచ్ఎంసీ తరపున 2 లక్షలు, భవన యాజమాన్యం నుంచి దాదాపు 10 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామన్నారు.

16:42 - March 13, 2017

ఢిల్లీ: రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారీకర్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రక్షణ శాఖకు ఆయన 28 నెలల పాటు సేవలందించారు. కొత్త రక్షణమంత్రిగా కేంద్రం ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. పారీకర్‌ గోవా ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.

16:40 - March 13, 2017

హైదరాబాద్: జయలలిత వారసురాలిగా తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న ఆమె మేనకోడలు దీపకు వేధింపులు ప్రారంభమయ్యాయి. చెన్నైలోని ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 12న ఉప ఎన్నిక జరుగనుంది. ఆర్కే నగర్‌ సీటు నుంచి పోటీ చేయాలని దీప నిర్ణయించుకున్నారు. ఈ తరgణంలో అధికార అన్నా డీఎంకే నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని దీప ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు గూండాలు వచ్చి బెదిరిస్తుండటంతో ఇంట్లో కూడా ఉండటంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నా డీఎంకేలోని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గం ఈ బెదిరింపులకు దిగుతోందా... లేక ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం హెచ్చరిస్తోందా ... అన్న విషయంలో దీప స్పష్టత ఇవ్వడంలేదు.

16:37 - March 13, 2017
16:23 - March 13, 2017

కర్నూలు: ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఆశయాలను కుమార్తె ఎమ్మెల్యే అఖిల ప్రియ కొనసాగించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. భూమా పార్థివదేహానికి నివాళులు అర్పించిన‌ సీఎంచంద్ర‌బాబు నాయుడు అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ... మంచినేత‌ను కోల్పోయామ‌ని, ఇది చాలా బాధాక‌రమ‌ని అన్నారు. ఆయ‌న మృతిని తాను జీర్ణించుకోలేక పోతున్నానని చెప్పారు. 53, 54 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే ఆయ‌న‌ మృతి చెందారని, ఇది చాలా బాధాక‌ర‌మ‌ని అన్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడంటే ఎలా ఉండాలో ఆయ‌న చూపించారని అన్నారు. ఆయ‌న‌తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని చంద్ర‌బాబు గుర్తు చేసుకున్నారు. ఆయ‌న ఆశ‌యాల‌ను సాధ్యం చేయ‌డానికి కృషి చేస్తామ‌ని చెప్పారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలని అన్నారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలుపుతున్నామ‌ని చెప్పారు.

16:10 - March 13, 2017

భూమా అంతిమయాత్ర ప్రారంభం

ఆళ్లగడ్డ : ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభం అయ్యింది. భూమా నాగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఆళ్లగడ్డ చేరకున్నారు. అయన భూమా నాగిరెడ్డి పార్థివదేహానికి నివాళి అర్పించారు. భూమా మృతితో ఆళ్లగడ్డ కన్నీటి సంద్రమైంది. ఆయన్ను కడసారి చూసేందుకు వేలాది ప్రజలు తరలివస్తున్నారు.

 

మణిపూర్ లో కాంగ్రెస్ కు షాక్

హైదరాబాద్ : మణిపూర్ లో కాంగ్రెస్ కు పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపిని గవర్నర్ ఆహ్వానించారు. 32 మంది ఎమ్మెల్యేల మద్దలు లేఖను బిజెపి గవర్నర్ కు సమర్పించింది.

సెంగరేణి ఓపెన్ కాస్ట్ -3లో ప్రమాదం

పెద్దపల్లి: రామగుండం సెంగరేణి ఓపెన్ కాస్ట్ -3లో ప్రమాదం సంభవించింది. 520 బెల్ట్ వద్ద షార్ట్ సర్క్యూట్ లో మోటార్లు తగలబడి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సింగరేణి భారీ నష్టం వాటినట్లు అధికారులు పేర్కొన్నారు.

15:36 - March 13, 2017

కర్నూలు : గుండెపోటుతో హఠాత్మరణం చెందిన నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు ఆళ్లగడ్డలో కాసేపట్లో జరగనున్నాయి. భూమా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డకు వచ్చారు. భూమా భౌతికకాయానికి నివాళులు అర్పించి... కుటుంబసభ్యులను పరామర్శించారు. భూమా నాగిరెడ్డి కడచూపు కోసం అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

 

15:35 - March 13, 2017

కృష్ణా : విజయవాడ కేదారీశ్వరపేటలో దారుణం జరిగింది. తల్లి, కుమారుడిపై దుండగుడు కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో కుమారుడు మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. వివాహేతర సంబంధమే హత్యాయత్నానికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు కత్తితో దాడి చేసిన దుండగుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఇద్దరు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

అమరావతి: ఏపీలో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అవినీతి నిరోధకశాఖ డీఐజీగా పి.హరికుమార్‌, గ్రేహౌండ్స్‌ డీఐజీగా వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను బదిలీ చేస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

మనోహర్ పారికర్ రాజీనామా కు రాష్ట్రపతి ఆమోదం

ఢిల్లీ: మనోహర్ పారికర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. పారికర్ నిర్వహిస్తున్న రక్షణ శాఖ బాధ్యతలను అరుణ్ జైట్లీకి ప్రధాని మోదీ అప్పగించారు.

హోంగార్డుల నియామాకలు..హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

హైదరాబాద్:హోంగార్డుల నియామాకలు..హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఓపెన్ కోటాలో 40 శాతం కంటే తక్కువ మార్పులున్న 188 మంది హోంగార్డుల నియామాకాలు కాకుండా మిగతా నియామకాలు చేపట్టుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది. 188 మంది లో అర్హులైన హోంగార్డులను ఎస్సీ,ఎస్టీ, బీసీ రిజర్వేషన్లలో తీసుకోచవ్చని కోర్టు తెలిపింది. కానిస్టేబుల్ పూర్తి ఫలితాలను వెబ్ సైట్ లో పెట్టాలని సూచించింది. అంతే కాకుండా 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్నానికి ఆదేశించింది. హైకోర్టు తుదితీర్పుకు లోబమడి ఫలితాలు ఉండాలని కోర్టు తెలిపింది. తప్పిదాలు ఉంటే హైకోర్టుకు రావచ్చని పిటిషనర్లకు సూచించింది.

ఆళ్ళగడ్డకు చేరుకున్న సీఎం చంద్రబాబు

కర్నూలు: ఆళ్లగడ్డ ఎమ్మెల్సీ భూమా నాగిరెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆళ్ల గడ్డ చేరుకున్నారు. భూమా పార్ధీవ దేహానికి పుష్పగుచ్చం వుంచి నివాళులర్పించారు.

విజయవాడలోని కేదారేశ్వరపేటలో దారుణం

కృష్ణా: విజయవాడలోని కేదారేశ్వరపేటలో తల్లీ,కుమారుడిపై ఈరోజు మధ్యాహ్నం హత్యాయత్నం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న తల్లీకొడుకులను కొందరు వ్యక్తులు అడ్డుకుని మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. రహదారిపై వెంబడించి దారుణంగా నరికి అక్కడి నుంచి పరారయ్యారు. తల్లీ, కొడులకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ద్విచక్రవాహనం నంబర్‌ ఆధారంగా బాధితుల వివరాలు కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

'కేసీఆర్ కిట్' లో 30 వస్తువులు

 హైదరాబాద్: రాష్ట్రంలో జరిగే అన్ని ప్రసవాలూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చూడలన్న లక్ష్యంతో, మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తూ, 'కేసీఆర్ కిట్' పేరిట గర్భిణీలకు ఓ కిట్ ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 30 వస్తువులుంటే ఈ కిట్ లో చిన్న పిల్లలకు మూడు నెలలకు సరిపడా వస్తువులు ఉంటాయి.

మంత్రి పదవికి మనోహర్ పారికర్ రాజీనామా

హైదరాబాద్: కేంద్ర రక్షణ శాఖా మంత్రి పదవికి మనోహర్ పారికర్ రాజీనామా చేశారు. ఈ ఉదయం తన రాజీనామా లేఖను ఆయన ప్రధాని కార్యాలయానికి పంపారు. గోవా చేరుకున్న ఆయన, రేపు సాయంత్రం 5 గంటలకు గోవాకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.

13:58 - March 13, 2017

టీ.అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన  అనంతరం స్పీకర్ సభను ఎల్లుండికి వాయిదా వేశారు. 

 

13:50 - March 13, 2017
13:46 - March 13, 2017

నల్గొండ : పదండి ముందుకు.. పదండి పోదాం అంటూ.. సీపీఎం మహాజన పాదయాత్ర సామాజిక న్యాయ సాధన దిశగా సాగుతోంది. ఎర్రజెండా చేతబట్టి పల్లెపల్లెనూ చుట్టేస్తున్న తమ్మినేని బృందం ఇప్పటివరకు 148 రోజుల యాత్రను పూర్తి చేసుకుంది. మార్చి 19 న జరిగే సీపీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. 
ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్న తమ్మినేని 
తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని సమస్యలు తీరుతాయని చెప్పిన కేసీఆర్‌.. ఏ ఒక్క సమస్యను పరిష్కరించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో ప్రజల బతుకులకు భరోసా లేకుండా పోయిందని తమ్మినేని అన్నారు. బడుగు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలను దుర్భర స్థితిని కళ్లారా చూశామని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అని చెబుతున్న సీఎం కేసీఆర్‌.. అబద్ధాలతో, మాటల గారడితో ప్రజలను మభ్య పెడుతున్నారని తమ్మినేని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుతున్నది బంగారు తెలంగాణ కాదని, బతుకు తెలంగాణ అని తమ్మినేని అన్నారు. 
పల్లెల్లో ప్రజా సమస్యలకు పరిష్కారం లేదన్న రమ  
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావొస్తున్నా.. తెలంగాణ పల్లెల్లో ప్రజల సమస్యలకు పరిష్కారం లభించడం లేదని పాదయాత్ర బృందం సభ్యురాలు ఎస్‌ రమ విమర్శించారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్‌ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని ఆమె అన్నారు. రోజురోజుకు నిరుద్యోగ సమస్య జటిలమవుతున్నా.. ఈ పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రమ విమర్శించారు. ఆంధ్ర పాలకుల సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు కూడా అవే సమస్యలతో సతమతమవుతున్నారని ఎస్‌ రమ ఆవేదన వ్యక్తం చేశారు. 
పాదయాత్రకు విశేష స్పందన 
సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 148 రోజులు పూర్తి  చేసుకుంది. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రకు అడుగడుగునా విశేష స్పందన లభిస్తోంది. 148వ రోజు తమ్మినేని బృందం వెల్లంకి, జైకేసారం, నేలపట్ల, మందాల గూడెం, లింగారెడ్డిగూడెం, చౌటుప్పల్‌లో పర్యటించింది.  

 

13:34 - March 13, 2017
13:30 - March 13, 2017

హైదరాబాద్ : మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ 2017 పై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇది పేదల బడ్జెట్ కాదని...పెట్టుబడిదారుల బడ్జెట్ అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ విలాసవంతమైన జీవితం గడిపేందుకు తన నివాసానికి వెయ్యి కోట్లు ఖర్చు చేశారని..కానీ రాష్ట్రంలోని వంద కులాలకు బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించడం దారుణమన్నారు. 

నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెడుతున్నారు. రూ.1,49,446 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు, రెవెన్యూ మిగులు అంచనా రూ.4,571 కోట్లుగా ఉందని ప్రకటించారు. 

రూ.1,49,446 కోట్లతో టీ.బడ్జెట్

హైదరాబాద్:  తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెడుతున్నారు. రూ.1,49,446 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 

12:37 - March 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెడుతున్నారు. రూ.1,49,446 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. తనకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తన అదృష్టమన్నారు. తాము ప్రవేశపెట్టేది పేదల బడ్జెట్ అని అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజల ఆశలు నిలబేట్టలా బడ్జెట్ రూపకల్పన చేశామని చెప్పారు. అన్ని వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమం పట్ల నిబద్దతో ఉన్నామని తెలిపారు. రాష్ట్రాదాయంలో 19.61 శాతం వృద్ధి రేటు సాధించామని పేర్కొన్నారు.
బడ్జెట్ ముఖ్యాంశాలు...
రూ.1,49,446 కోట్లతో తెలంగాణ బడ్జెట్ 
నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా రూ.4,571 కోట్లు
ఎస్సీల అభివృద్ధి కోసం రూ.14, 375 కోట్లు 
ఎస్టీల అభివృద్ధి కోసం రూ.8,165 కోట్లు
పారిశ్రామిక రంగానికి రూ.985 కోట్లు
పర్యాటక, సాంస్కతిక రంగాలకు 198 కోట్లు
హరితహారానికి రూ.50 కోట్లు
పారిశ్రామిక రంగానికి రూ.985 కోట్లు
ద్రవ్యలోటు రూ.26,096 కోట్లు
జీహెచ్ ఎంసీకి రూ.1000 కోట్లు 
శాంతిభద్రతల కోసం రూ.4828 కోట్లు 
మిషన్ భగీరథకు రూ.3000 కోట్లు 
వైద్య ఆరోగ్య రంగానికి రూ.5976 కోట్లు
జర్నలిస్టుల సంక్షేమానికి రూ.30 కోట్లు
రహదారుల అభివృద్ధికి రూ.5,033 కోట్లు, 
మైనార్టీ సంక్షేమానికి రూ.1249 కోట్లు
గ్రేటర్ వరంగల్ కు రూ.300 కోట్లు
పట్టాణాభివృద్ధికి రూ.594 కోట్లు
ప్రగతి పద్దు రూ.88,038 కోట్లు
నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు
ఐటీ రంగానికి రూ.252 కోట్లు
రుణమాఫీకి 4 వేల కోట్లు
సాగునీటి ప్రాజెక్టులకు 25 వేల కోట్లు 
విద్యుత్ రంగానికి రూ.4300 కోట్లు
నేత కార్మికులకు సంక్షేమానికి రూ.1200 కోట్లు 
రహదారులకు రూ.5033 కోట్లు 
రజక, నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.500 కోట్లు
వరంగల్ లో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు
ఆసరా ఫించన్లకు రూ.5330 కోట్లు
ఎంబీసీల సంక్షేమం కోసం రూ.1000 కోట్లు 
కళ్యాణలక్ష్మీ, షాదీముబారకులకు రూ. 75,116 రూపాయలకు పెంపు
ఫీజు రీఎంబర్స్ మెంట్ కు రూ.1939 కోట్లు 
మహిళా, శిశు సంక్షేమానికి రూ.1731 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖకు రూ.14,723 కోట్లు
300 గోముల నిర్మాణానికి రూ.1024 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ.5,070 కోట్లు
పాఠశాల విద్యకు రూ.12705 కోట్లు
మూసీనది పరిరక్షణకు రూ.3060 కోట్లు
పట్టణాభివృద్ధికి రూ.5,599 కోట్లు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు బడ్జెటేతర నిధులు 
వచ్చే ఏడాది నుంచి 119 బీసీ గురుకుల పాఠశాలలు
బ్రాహ్ముణుల సంక్షేమానికి రూ.100 కోట్లు
ప్రభుత్వాస్పత్రులో కాన్పుకు వచ్చే గర్భిణులకు రూ.12 వేలు 
ఆడ పిల్ల పుడితే అదనంగా వెయ్యి రూపాయలు 
నవజాత శిశువుల పథకం కోసం రూ.600 కోట్లు
కేసీఆర్ పేరుతో పురిటిబిడ్డ సంరక్షణకు 16 వస్తువులతో కిట్
మైనార్టీలకు 201 గురుకులాలు
సమాచార ప్రసారశాఖకు రూ.252 కోట్లు
సైనిక సంక్షేమానికి ప్రత్యేక నిధి
ఆసుపత్రుల్లో మందుల కొనుగోళ్లకు నిధుల పెంపు 
హైదరాబాద్ లో మరో 3 మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్
కరీంనగర్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
 

 

12:24 - March 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెడుతున్నారు. రూ.1,45,500 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. తనకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తన అదృష్టమన్నారు. తాము ప్రవేశపెట్టేది పేదల బడ్జెట్ అని అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజల ఆశలు నిలబేట్టలా బడ్జెట్ రూపకల్పన చేశామని చెప్పారు. అన్ని వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

 

12:15 - March 13, 2017

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగంలో  అన్నీ అబద్ధాలే ఉన్నాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. టీఆర్ ఎస్ నేతలు మూడేళ్లుగా పాతపాటే పాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రచారం కోసమే తప్పుడు లెక్కలు చూపెడుతున్నారని చెప్పారు. 

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో తెలంగాణ 2017 బడ్జెట్ ను ప్రవేశపడుతున్నారు. 

12:08 - March 13, 2017

హైదరాబాద్ : వెనుకడిన వర్గాలకు బడ్జెట్ లో పెద్దపీఠ వేశామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజల్లో బడ్జెట్ విశ్వాసం నింపుతుందన్నారు. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పారు.

11:41 - March 13, 2017

హైదరాబాద్ : అసెంబ్లీలో సీఎల్పీ భేటీ అయింది. బడ్జెట్ ప్రసంగం సమయంలో అసెంబ్లీకి రావాలా.. వద్దా..? అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. నిన్నంతా సీనిరయర్లతో జానారెడ్డి సంప్రదింపులు జరిపారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. అసెంబ్లీలో టీడీపీ నేతలు బీజేపీ నేతలను కలవనున్నారు. తమ సభ్యుల సస్పెన్షన్ విషయంలో టీడీపీ నేతలు గవర్నర్ ను కలిసే యోచనలో ఉన్నారు.

11:32 - March 13, 2017
11:30 - March 13, 2017

కర్నూలు : నేడు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. నిన్న గుండెపోటుతో భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. భూమా నాగిరెడ్డి మృతిపై ప్రముఖులు నివాళులర్పించారు. భార్య శోభానాగిరెడ్డి ఘాట్ పక్కనే భూమా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. భూమా మృతితో ఆళ్లగడ్డ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. కార్యకర్తలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కడసారి చూసేందుకు భూమా నివాసానికి జనం పోటెత్తుతున్నారు. 

 

కొండాపూర్ లో విషాదం

హైదరాబాద్ : కొండాపూర్ లో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మృత దేహాలను వెలికితీశారు. శిథిలాల కింద మరో ఇద్దరు కూలీలు ఉన్నట్లు సమాచారం.

11:25 - March 13, 2017

హైదరాబాద్ : కొండాపూర్ లో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మృత దేహాలను వెలికితీశారు. శిథిలాల కింద మరో ఇద్దరు కూలీలు ఉన్నట్లు సమాచారం. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతులు భారతమ్మ (25), కిష్టమ్మ (45) గా గుర్తించారు. భారతమ్మ నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. కిష్టమ్మ భర్త పాపయ్యగా గుర్తించారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:20 - March 13, 2017

హైదరాబాద్ : మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.1.46 లక్షల కోట్లకు మించనుంది. శాసనసభలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ లో సంక్షేమం, సాగునీటికే సింహభాగం వేయనున్నారు. గ్రామీణ వికాసానికీ ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. పన్నుల రాబడి పెరుగనుంది.

బడ్జెట్ ను బహిష్కరించనున్న కాంగ్రెస్...?

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ ను బహిష్కరించే యోచనలో కాంగ్రెస్ ఉంది. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కు నిరసనగా బడ్జెట్ బహిష్కరణ చేయాలని భావించినట్లు తెలుస్తోంది. నిన్నంతా పార్టీ సీనియర్లతో జానారెడ్డి సంప్రదింపులు జరిపారు. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ తమ వైఖరి ప్రకటించనుంది. ప్రాధాన్యత అసవరం లేదని సీనియర్లు అంటున్నారు. 

10:58 - March 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ ను బహిష్కరించే యోచనలో కాంగ్రెస్ ఉంది. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కు నిరసనగా బడ్జెట్ బహిష్కరణ చేయాలని భావించినట్లు తెలుస్తోంది. నిన్నంతా పార్టీ సీనియర్లతో జానారెడ్డి సంప్రదింపులు జరిపారు. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ తమ వైఖరి ప్రకటించనుంది. ప్రాధాన్యత అసవరం లేదని సీనియర్లు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు

కర్నూలు : సాయంత్రం ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. నిన్న గుండెపోటుతో భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. భూమా నాగిరెడ్డి మృతిపై ప్రముఖులు నివాళి అర్పించారు. 

10:55 - March 13, 2017

కర్నూలు : సాయంత్రం ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. నిన్న గుండెపోటుతో భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. భూమా నాగిరెడ్డి మృతిపై ప్రముఖులు నివాళి అర్పించారు. భార్య శోభానాగిరెడ్డి ఘాట్ పక్కనే భూమా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. భూమా మృతితో ఆళ్లగడ్డ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. కార్యకర్తలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కడసారి చూసేందుకు భూమా నివాసానికి జనం పోటెత్తుతున్నారు. 

 

09:43 - March 13, 2017

నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి బాధాకరమని వక్తలు అన్నారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత దినకర్, టీఆర్ ఎస్ నేత కసిరెడ్డి నారాయణ రెడ్డి, కాంగ్రెస్ నేత కొనకళ్ల నాగేష్ కుమార్ పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:38 - March 13, 2017

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేత పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఇవాళ్లి జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు మరోసారి పోరుబాట పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో సమావేశమైన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 19న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించేందుకు యూనియన్ లు పిలుపునిచ్చాయి. తెలంగాణలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ పై భాస్కర్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:33 - March 13, 2017

ఢిల్లీ : నోట్ల రద్దు తర్వాత డబ్బు డ్రా చేసుకునేందుకు జనం నానా కష్టాలు పడ్డారు. అయితే ఇప్పుడు ఆ కష్టాలు తీరే రోజు వచ్చేసిందా.? మార్చి 13నుంచి ఎలాంటి పరిమితులు లేకుండా బ్యాంకులు అడిగినంత డబ్బు ఇవ్వనున్నాయా..? బ్యాంకుల్లో డబ్బుకొరతతో సామాన్యులు అల్లాడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమవుతుందా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. 
మార్చి 13నుంచి నగదు విత్‌డ్రాపై పరిమితి ఎత్తివేత
నగదు విత్‌డ్రా పరిమితి నిబంధన తొలగిపోయే రోజు వచ్చేసింది.. మార్చి 13నుంచి బ్యాంకుల్లో ఖాతాదారులు అడిగినంత సొమ్ము ఇవ్వాల్సిఉంది.. నోట్ల రద్దు తర్వాత ఇప్పటివరకూ ఖాతాలో ఎంత డబ్బున్నా ఒకేసారి అంతమొత్తం తీసుకోలేని పరిస్థితి ఉంది.. రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనల ప్రకారం వారానికి కేవలం 50వేల రూపాయలే డ్రా చేసుకోవాలి.. సోమవారంనుంచి ఈ రూల్‌ను ఎత్తివేయనున్నారు..
డబ్బు దొరక్క ఇబ్బందులు
కావాల్సినంత నగదు తీసుకోవచ్చన్న ప్రకటన వినటానికి బాగానేఉన్నా... ఇది అమలులో సాధ్యమవుతుందా? అన్న ప్రశ్న వస్తోంది.. నోట్ల రద్దు తర్వాత మొదట నగదుకోసం జనాలు చాలా ఇబ్బందులు పడాల్సివచ్చింది.. ఆ తర్వాత పరిస్థితిలో కొద్దిగామార్పు వచ్చినా మళ్లీ కొద్దిరోజులనుంచి సమస్య మొదటికొచ్చింది.. ఏ ఏటీఎంచూసినా నో క్యాష్ బోర్డు దర్శనమిస్తోంది.. రోజువారీ అవసరాలకూ  క్యాష్ దొరక్క ప్రజలు అవస్థలు పడుతున్నారు.. నిబంధనలకు లోబడి మనీ డ్రా చేసుకుందామన్నా ఎక్కడా నగదు దొరక్క కష్టాలు తప్పడంలేదు.. కొద్దిమొత్తంలో డబ్బు కావాలంటేనే దొరకని ఈ సమయంలో అడిగినంత కావాలంటే డబ్బు ఇవ్వడం సాధ్యంకాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. 
అందరికీ చేరువకాని ఆన్‌లైన్‌ వాడకం 
నగదు రద్దు తర్వాత 12లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలోకి వచ్చాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు.. డబ్బు డ్రా చేసుకునేందుకు పెట్టిన నిబంధనలతో చాలామంది తమ దగ్గరున్న కొత్త క్యాష్‌ను బ్యాంకుల్లో వేయడం మానేశారు.. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లంటూ ఊదరగొడుతున్నా అ విధానంలో అంతంతమాత్రంగానే విక్రయాలు సాగుతున్నాయి.. నిరక్షరాస్యులు, ఆన్‌లైన్‌గురించి తెలియనివారు, చిన్న చిన్న వ్యాపారులు ఇంకా నగదుపైనే ఆధారపడుతున్నారు.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు జమలకన్నా, ఉపసంహరణలే ఎక్కువగా ఉన్నాయి.. ఇప్పుడు వారు అడిగినంత డబ్బును బ్యాంకులు సమకూర్చగలవా? అన్న సందేహం వ్యక్తమవుతోంది..
నాలుగైదు లావాదేవీలు మించితే రూ. 20 సేవా రుసుము
50వేల పరిమితి ఉన్నప్పుడే బ్యాంకులు ఒకేసారి డబ్బు ఇవ్వకుండా రెండుమూడుసార్లు ఇస్తున్నాయి. పైగా ఉచితంగా అనుమతించే విషయంలో బ్యాంకులు సేవా రుసుములు సామాన్యులపై పెనుభారం మోపబోతున్నాయి.. నాలుగైదు లావాదేవీలకు మించితే 20 రూపాయల చొప్పున వసూలు చేయబోతున్నాయి..
ఇలా ఇన్ని సమస్యలమధ్య నగదు తీసుకోవాలంటే నరకం చూస్తున్న సాధారణ ప్రజలు.. తమ డబ్బు తీసుకోవాలంటే ఇవేమి రూల్స్‌ అంటూ మండిపడుతున్నారు..
విత్ డ్రాకు పరిమితులు లేవు...
దేశ ఆర్థిక వ్యవస్థకు సవాలు విసురుతున్న నల్లధనం, నకిలీ నోట్ల భరతం పట్టేందుకు నవంబరు 8న కేంద్రం పాత పెద్ద నోట్లను ఉపసంహరించింది... ఆ తర్వాత దాదాపు 14లక్షల కోట్లకుపైగా డబ్బు బ్యాంకుల్లో జమ అయింది.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కొన్ని నిబంధనలు, పరిమితికి లోబడే డబ్బును వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించింది రిజర్వు బ్యాంకు. సోమవారం నుంచి ఇక ఏ పరిమితులు లేకుండా నగదును తీసుకోవచ్చని ప్రకటించింది.. ఇది ఎంతవరకూ అమలుఅవుతుందో వేచిచూడాలి.

 

పూంచ్ సెక్టార్ లో పాక్ రేంజర్లు కాల్పులు

జమ్మూకాశ్మీర్ : మరోసారి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ సెక్టార్ మాల్తి ప్రాంతంలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. 

ఆటో బోల్తా...ముగ్గురు మృతి

కర్నూలు : కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. 

 

08:47 - March 13, 2017

కర్నూలు : నేడు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాగిరెడ్డి మృతిపై ప్రముఖులు నివాళులర్పించారు. అంత్యక్రియలకు సీఎం చంద్రబాబుతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. నిన్న గుండెపోటుతో భూమా నాగిరెడ్డి మృతి చెందారు. భూమా మృతితో ఆయన కుటుంబం, అభిమానులు, కార్యకర్తలు శోకసంంద్రలో మునిగారు. 

08:43 - March 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదుకు ముహూర్తం నిర్ణయించింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి పార్టీకి కొత్త రూపు తెచ్చే విధంగా గులాబీ దళపతి పావులు కదుపుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ శాసనసభ్యులే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు.
రెండేళ్ల క్రితం సభ్యత్వ నమోదు 
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుకు మరోసారి సిద్ధమైంది. గులాబీ పార్టీ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి రికార్డు స్థాయిలో రెండేళ్ల క్రితమే సభ్యత్వ నమోదును చేయించింది. ఈ విడత రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సభ్యత్వ నమోదు చేయించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇటీవల జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ్యులకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు బాధ్యతను ఆయా ఎమ్మెల్యేలే చేపట్టనున్నారు.  జిల్లాల్లో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు ఈ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేసుకోవాలని సూచించారు. శాసనమండలి సభ్యులు ఆయా జిల్లాల్లో మంత్రులు అప్పగించిన బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది.
సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవాళ, రేపు అందజేత
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శాసనసభ్యులకు సభ్యత్వ నమోదు పుస్తకాలను ఇవాళ, రేపు అందచేయాలనే నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల్లో సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని అధినేత కేసీఆర్‌ పార్టీ నాయకులను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి సభ్యత్వ నమోదు పూర్తైన వెంటనే పార్టీ పరంగా జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల ఎంపిక ప్రక్రియను గులాబీ బాస్ చేపట్టనున్నారు. సాధారణ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీని, నేతలను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని గులాబీ బాస్‌ భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ పరంగా కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి భారీగా మార్పులు ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. 

 

08:39 - March 13, 2017

కర్నూలు : భూమానాగిరెడ్డి మృతితో కర్నూలు జిల్లా విషాదంలో మునిగిపోయింది. నాగిరెడ్డి అకాల మరణంతో బంధువులు, అభిమానులు, అనుచరులు షాక్‌లో ఉన్నారు. కర్నూలు జిల్లా రాజకీయ అండను కోల్పోయిందని పలువురు నివాళులర్పించారు. ఇవాళ భూమా అంత్యక్రియలు జరగనుండటంతో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో నంద్యాలకు చేరుకుంటున్నారు. 
అధికారిక లాంఛనాలతో భూమా అంత్యక్రియలు  
కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. మృతదేహాన్ని నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు తరలించడంతో .. కడసారి నివాళులర్పించడానికి భూమా అభిమానులు, నాయకులు భారీగా తరలివస్తున్నారు. 
విషాదంలో కుటుంబ సభ్యులు 
తమ నేత హఠాత్ మరణాన్ని తట్టుకోలే పోతున్నారు భూమా నాగిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు. ఒకరి వెంట మరొకరు తల్లిదండ్రులు కన్నుమూయడంతో భూమా కూమార్తెలు, కుమారుడు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 
అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు హాజరు  
భూమా అంత్యక్రియలను అధికారిక లంఛనాలతో నిర్వహించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆళ్లగడ్డలోని శోభాఘాట్‌లో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. భూమా స్వగృహంనుంచి  అంతిమయాత్ర  ప్రారంభమై పట్టణంగుండా కొనసాగనుంది. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొని భూమాకు కడసారి నివాళుల్పరించనున్నారు. అంత్యక్రియల నేపథ్యంలో ఆళ్లగడ్డతో పాటు కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 
కడసారి చూసేందుకు తరలొస్తున్న అభిమానులు
తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా.. మంత్రి కాకుండానే భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. భూమా పార్ధివ దేహాన్ని కడసారి చూసి నివాళులర్పించడానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆళ్లగడ్డకు తరలి వస్తున్నారు. 

నేడు భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు

కర్నూలు : నేడు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాగిరెడ్డి మృతిపై ప్రముఖులు నివాళులర్పించారు.

ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు

ప్రకాశం : జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరు, అద్దంకి, తాళ్లూరులో భూమి కంపించింది. ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. 

 

ఏపీ ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు సెట్..3 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక

హైదరాబాద్ : ఏపీ ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు సెట్..3 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు.  

మణిపూర్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఇబోబీ సింగ్

ఇంఫాల్ : మణిపూర్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఇబోబీ సింగ్ ఎన్నికయ్యారు. నేడు ఇబోబీ సింగ్ గవర్నర్ ను కలవనున్నారు.

నేడు ఏపీ బడ్జెట్ వాయిదా...

గుంటూరు : నేడు ఏపీ బడ్జెట్ వాయిదా పడింది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి సంతాప సూచకంగా నేడు అసెంబ్లీ సభ, శాసన మండలికి సెలవు ప్రకటించారు. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. అసెంబ్లీ ప్రారంభంకాగానే భూమా మృతి పట్ల సంతాపం తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సంతాప తీర్మానం అనంతరం సభను వాయిదా వేయనున్నారు. 

 

నేడు తెలంగాణ ఎంసెట్ 2017 నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : నేడు తెలంగాణ ఎంసెట్ 2017 నోటిఫికేషన్ విడుదల కానుంది. 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగనుంది. 

 

నేడు భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు

కర్నూలు : నేడు నంద్యాల భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరుగున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు అధికార లాంఛనాలతో భూమా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.  

మధ్యాహ్నం 12 గంటలకు టీ.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి కడియం శ్రీహరి బడ్జెట్ ప్రవేశపట్టనున్నారు.  

Don't Miss